చిన్న అపార్ట్‌మెంట్.. ఇరుకు ఇళ్లకు ఇలాంటి డోర్లే బెస్ట్‌! | Sliding Doors Maximize Space at Home: House Construction Tips | Sakshi
Sakshi News home page

చిన్న అపార్ట్‌మెంట్.. ఇరుకు ఇళ్లకు ఇలాంటి డోర్లే బెస్ట్‌!

Dec 28 2025 12:54 PM | Updated on Dec 28 2025 1:18 PM

Sliding Doors Maximize Space at Home: House Construction Tips

ఇంటికొచ్చే అతిథులకు తలుపులు స్వాగతం పలుకుతాయి. అందుకే ప్రధాన ద్వారం వద్ద తలుపుల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే అడుగు స్థలం కూడా ఖరీదైన మహానగరంలో వెడల్పాటి తలుపుల స్థానంలో స్థలాన్ని ఆదా చేసే డోర్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్లైడింగ్, ఓపెన్, ఫోల్డింగ్‌ డోర్స్‌ జోరు మార్కెట్‌లో కొనసాగుతోంది. విభిన్న రంగులు, డిజైన్లతో లభ్యమవుతుండటంతో యువ కస్టమర్ల నుంచి 
ఆదరణ పెరుగుతోంది.  

మధ్యలో మడతపెట్టి.. 
సాధారణ తలుపుల మాదిరిగా కాకుండా తక్కువ స్థలంలో, మడతపెట్టే వీలుగా ఉండటమే ఈ డోర్స్‌ ప్రత్యేకత. వీటిని కలప, అల్యూమీనియంతో తయారు చేస్తారు. తలుపులు తెరిచినప్పుడు మధ్యలో 1/2 లేదా 1/3 లేదా 2/3 నిష్పత్తిలో మడత పడుతుంది. వీటినే ఫోల్డింగ్‌ డోర్స్‌ అంటారు. రెండు ప్యానెల్స్‌ సమాన పరిమాణంలో ఉండొచ్చు లేదా అసమాన పరిమాణంలో ఒక ప్యానెల్‌ కంటే మరోటి వెడల్పుగా కూడా ఉండొచ్చు. ఎలా ఉన్నా ఒకవైపు తిరగానికి, మధ్యలో ఫోల్డ్‌ కావడానికి వీలుగా స్క్రూలను అమరుస్తారు. కస్టమర్ల అభిరుచి, అవసరాలను బట్టి తలుపులు ఎడమ లేదా కుడి వైపునకు తెరుచుకుంటాయి. ఈ ఫోల్డింగ్, స్లైడింగ్‌ డోర్స్‌కు అద్దాలను జోడించి మరింత అందంగా తయారు చేస్తున్నారు.

గాలి, వెలుతురు సులువుగా.. 
చిన్న సైజు అపార్ట్‌మెంట్లకు, తక్కువ స్థలంలో నిర్మించే వ్యక్తిగత గృహాలకు ఈ తరహా తలుపులు బాగుంటాయి. ప్రధాన ద్వారం వద్ద కాకుండా ఇతర గదులకు ఈ డోర్స్‌ ఏర్పాటు చేసుకుంటే ఇల్లు అందంగా కనిపించడంతో పాటు వంద శాతం స్థలం వినియోగం అవుతుంది. అలాగే కప్‌బోర్డ్‌లు, వార్డ్‌ రోబ్‌లు, కారిడార్లు, వంటగది, బాత్‌రూమ్‌లు ఇతర యూటిలిటీ ప్రాంతాలలో ఈ ఫోల్డింగ్, స్లైడింగ్‌ డోర్స్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. పైగా వీటిని ఇన్‌స్టాల్‌ చేయడం చాలా సులువు. నిర్వహణ కూడా తేలిక. ఫోల్డింగ్, స్లైడింగ్‌ డోర్స్‌తో ఒక గది నుంచి మరో గదిలోకి గాలి, వెలుతురు సులువుగా ప్రసరి
స్తుంది.

కర్టెన్‌ ఉందిగా.. ఇంట్లో వెచ్చగా.. 
నగరంలో రోజురోజుకూ చలి పెరుగుతోంది.. ఉదయం నుంచే ఇంట్లోంచి బయటకు రావాలంటే గజగజలాడాల్సిందే.. సాయంత్రమైతే శీతల గాలులు వణికిస్తున్నాయి. ఈ చలికాలంలోనూ ఇంటి లోపలి వాతావరణం వెచ్చగా ఉండాలంటే కిటికీలకు ఉండే కర్టెన్లే కీలకమని అంటున్నారు కర్టెన్‌ ఇంటీరియర్‌ డిజైనర్లు. అయితే వాటిలోని రకం, రంగులను బట్టి ఇంటి లోపలి వాతావరణం గడ్డకట్టే చలిలోనూ వెచ్చగా ఉంటుందని చెబుతున్నారు.

ఈ కాలంలో కర్టెన్లకు పలుచటి, కాటన్, లెనిన్‌ కర్టెన్లు కాకుండా మందంగా లేదా థర్మల్‌ కర్టెన్లను వెల్వెట్, ఉన్ని, స్వెడ్‌ లేదా థర్మల్‌ లైన్డ్, బ్లాక్‌అవుట్‌ కర్టెన్లను వినియోగించడం ఉత్తమం. ఇంటి లోపల వేడి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంలో కర్టెన్ల రంగులు కూడా కీలకమే. ఎరుపు, నారింజ, పసుపు వంటి రంగులకు వేడిని గ్రహించే గుణం ఉంటుంది కాబట్టి శీతాకాలంలో ఇంటి లోపల వెచ్చగా ఉంచుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement