breaking news
House Construction Tips
-
ఇంటి నిర్మాణం కోసం ఓ మంచి స్థలం: ఎంపిక చేయండిలా..
పేదవారికైనా, ధనవంతులకైనా సొంతంగా ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కల. ఆ కల కోసం చాలా కష్టాలు పడి డబ్బు పోగు చేసుకుంటారు. ఇల్లు కట్టుకోవాలనుకోవడం మంచి ఆలోచనే.. కానీ ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి స్థలం ఎంపిక చేసుకోవాలి?, దానికి అయ్యే బడ్జెట్ ఎంత అనేదానికి సంబంధించిన విషయాలపై కూడా ఓ అవగాహన ఉండాలి.ఇల్లు కట్టుకోవడానికి.. ఓ మంచి స్థలం ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇల్లు ఒక్కసారే ఇష్టపడి కట్టుకుంటారు. కాబట్టి మీ జీవనశైలికి తగిన విధంగా.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. అందుబాటులో ఉన్న వనరుల గురించి తెలుసుకుని స్థలం ఎంచుకోవాలి.స్థలం ఎంచుకోవడానికి ముందు గమనించాల్సిన విషయాలుచేతిలో డబ్బు ఉంది, ఇల్లు కట్టుకుంటాం.. అనుకుంటే సరిపోదు. ఆలా అని తక్కువ ధరలో.. ఎక్కడో మారుమూల ప్రాంతంలో స్థలం కొని ఇల్లు కట్టుకున్నా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కొనే స్థలానికి దగ్గరలో.. స్కూల్, హాస్పిటల్, మార్కెట్స్, రవాణా సదుపాయాలు మొదలైనవి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.స్వచ్ఛమైన వాతావరణం ఉండే ప్రదేశంలో ఇల్లు కట్టుకుంటే.. ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి శబ్దాలు లేకుండా.. స్వచ్ఛమైన గాలి అందుబాటులో వుండే ప్రదేశాలను ఎంపిక చేసుకోవడం మంచిది. మీరు ఉన్న ప్రాంతంలో సెక్యూరిటీ ఉందా?, లేదా? అనేది కూడా ముందుగానే పరిశీలించాలి.ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఎంచుకోవడానికి ముందు.. అది భూకంప ప్రభావానికి గురైన ప్రాంతమా?, వరదలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా?, అనే విషయాలతో పాటు.. మంచినీటి వసతి, డ్రైనేజీ సదుపాయాలు మొదలైనవి ఉన్నాయా? లేదా అని ముందుగానే తెలుసుకోవాలి.బడ్జెట్ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొనుగోలు చేయాలనుకున్నప్పుడే.. ఎంత బడ్జెట్ కేటాయించాలి అనే ప్రశ్న తెలెత్తుతుంది. స్థలం కోసమే ఎక్కువ డబ్బు వెచ్చిస్తే.. ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేయాల్సి వస్తుంది. అప్పు చేసి.. దాన్ని తీర్చడానికి మళ్ళీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని, ప్రణాళికను దెబ్బతీస్తుంది.ఉదాహరణకు.. ఇంటి స్థలం కోసం రూ.10 లక్షలు కేటాయించాలి అని ప్లాన్ వేసుకున్నప్పుడు, ఆ బడ్జెట్లో లభించే స్థలం కోసం వేచి చూడాలి. మీ బడ్జెట్‌కు స్థలం లభించిన తరువాత ముందడుగు వేయాలి. ఇక్కడ కూడా మీకు కావలసిన సదుపాయాలు ఉండేలా చూసుకోవాలి.ఇదీ చదవండి: ఇంటి కోసం ల్యాండ్ కొనేముందు చూడాల్సినవి..ప్రస్తుతం స్థలాల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ ధరలు నగరాల్లో ఒకలా.. నగరాలకు కొంత దూరంలో ఇంకోలా ఉన్నాయి. ఈ విషయాలను ముందుగా తెలుసుకోవాలి. దీనికి నిపుణుల సలహాలు తీసుకోవాలి. కొంతమంది మధ్యవర్తులు మోసం చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇల్లు కట్టుకోవడం అంటే.. గోడలు కట్టి, పైకప్పు వేసుకోవడం కాదు, అది మనసుకు నచ్చేలా.. ప్రశాంతతను ఇచ్చేలా ఉండాలి. ఇది మొత్తం మీ ఎంపిక మీదనే ఆధారపడి ఉంటుందనే విషయం మాత్రం మరచిపోకూడదు. -
ఇంటి కోసం ల్యాండ్ కొనేముందు చూడాల్సినవి..
ఇల్లు కట్టుకోవడం సామాన్యుడి కల. ప్రాథమిక దశలో అందుకోసం ప్లాట్‌ను ఎంచుకోవడం నుంచి చివరకు గృహప్రవేశం వరకు ఎన్నో ఆలోచిస్తారు. ముందుగా ఇల్లు నిర్మించాలనుకునేవారు సరైన ప్లాట్‌ను ఎంచుకోవడం అత్యంత కీలకమైన దశ. ఇది ప్లాట్ ధర లేదా దాని పరిమాణం గురించి మాత్రమే కాదు.. ఒకవేళ అనుకోని కారణాలతో ప్లాట్ తీసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోకపోయినా దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా ఉండేలా జాగ్రత్తపడాలని నిపుణులు చెబుతున్నారు. ఇల్లు నిర్మించేందుకు ప్లాట్ కొనుగోలు చేయడానికి ముందు గుర్తుంచుకోవలసిన కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి.ప్రదేశంప్లాట్ కొనేప్పుడు సమీప పరిసరాల్లో కనీస మౌలిక సదుపాయాలుండేలా చూసుకోవాలి. పాఠశాలలు, ఆసుపత్రులు, కిరాణా దుకాణాలు, ప్రజా రవాణా వంటి నిత్యావసరాలకు దగ్గరగా ఉండాలి. సజావుగా ప్రయాణించడానికి ప్రధాన రహదారులు లేదా రహదారి కనెక్టివిటీ ఉండేలా చూసుకోవాలి. భవిష్యత్తులో ఇన్ఫ్రా ప్రాజెక్టులు రాబోయే ప్రాంతాలు ఆస్తి విలువను పెంచుతాయి.ప్లాట్ ఆకారం, పరిమాణంకొనుగోలు చేసే ప్లాట్ ఆకారం చివరవందరగా, తక్కువ పరిమాణంలో ఉంటే ఇల్లు నిర్మించడం కష్టం అవుతుంది. చతురస్రాకారం లేదా దీర్ఘచతురస్రాకార ప్లాట్లు సరళమైన డిజైనింగ్, నిర్మాణానికి అనువైనవని గుర్తించాలి. సరైన ఆకారం లేని ప్లాట్లు నిర్మాణ ప్రణాళికను క్లిష్టతరం చేస్తాయి. ఖర్చులను పెంచుతాయి. ఇవి సాధారణ ప్లాట్ల కంటే తక్కువ ధరకే లభించవచ్చు. అయితే అన్ని ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. ప్లాట్ పరిమాణం ప్రస్తుత భవన అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే భవిష్యత్తు విస్తరణకు అవకాశం ఉంటే మరీ మంచిది.నేల నాణ్యత, భూగర్భ జలాలుమట్టి నాణ్యతను పరీక్షించడంలో నిర్లక్ష్యం చేస్తే తర్వాత కాలంలో నిర్మాణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. నిర్దిష్ట ప్రదేశంలోని ల్యాండ్ ‘లోడ్ బేరింగ్ సామర్థ్యం(ఎంత బరువును తట్టుకుంటుందని తెసుకుపోవడం)’ను అంచనా వేయడానికి భూసార పరీక్ష నిర్వహించాలి. వదులుగా ఉన్న భూమి లేదా బంకమట్టి ఉంటే ఇది పునాదిని దెబ్బతీస్తుంది. భూగర్భజలాల లభ్యత, నీటి మట్టం లోతును తనిఖీ చేసుకోవాలి.లీగల్ వెరిఫికేషన్భూమిపై పెట్టుబడి పెట్టేటప్పుడు చట్టపరంగా ప్లాట్‌కు స్పష్టమైన టైటిల్ ఉండేలా చూసుకోవాలి. ఆ ల్యాండ్ వివాదరహితంగా ఉండాలి. న్యాయపరమైన వివాదాలు లేకుండా చూసుకోవాలి. స్థానిక మున్సిపల్ అండ్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి అవసరమైన అన్ని అనుమతులు ఉండేలా జాగ్రత్తపడాలి.వాస్తువాస్తు తప్పనిసరి కానప్పటికీ, భారతదేశంలో చాలా మంది కొనుగోలుదారులు వాస్తు సూత్రాలకు అనుగుణంగా ఉండేలా ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. తూర్పు లేదా ఉత్తరం వైపు ఫేసింగ్ ఉన్న ప్లాట్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. శ్మశానవాటికలు, హైటెన్షన్ విద్యుత్ లైన్లు లేదా శబ్దం చేసే పారిశ్రామిక ప్రాంతాలకు సమీపంలో ప్లాట్లకు డిమాండ్ తక్కువగా ఉంటుంది.ఇదీ చదవండి: పెళ్లైన కుమార్తెకు తల్లి ఆస్తిలో వాటా ఉంటుందా?