
ఇదివరకు మనం ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి స్థలం ఎంచుకోవాలి?, ల్యాండ్ కొనేముందు.. గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటి? అనే విషయాలను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ కథనంలో ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన మెటీరియల్స్ ఏవి అనే విషయాన్ని పరిశీలిద్దాం..
ఇల్లు కట్టుకోవడానికి ఏ మెటీరియల్స్ కావాలనే విషయం బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది. అయినప్పటికీ కొంతమంది అవగాహన కోసం ఒకసారి పరిశీలిస్తే.. సిమెంట్, ఇసుక, ఇటుకలు, కంకర, ఇనుము, వాటర్ ప్రూఫ్ మెటీరియన్స్ అవసరమవుతాయి. ఇవి కాకుండా వైరింగ్ కోసం, ప్లంబింగ్ కోసం మెటీరియల్స్, టైల్స్ / మార్బుల్ / గ్రానైట్, ఉడ్, గ్లాస్ వంటివి అవసరం అవుతాయి. ఇంటీరియర్ డిజైన్ కోసం మీ అభిరుచిని బట్టి ఎలాంటి మెటీరియల్స్ కావాలనేది మీ ఛాయిస్.
మెటీరియల్స్ ధరల విషయానికి వస్తే..
ఇల్లు నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్స్ ధరలు ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ధరలు గ్రామీణ ప్రాంతాల్లో ఒకలా.. నగరాల్లో ఇంకోలా ఉంటాయి. అయితే ధరలు ఎలా ఉన్నా.. జీఎస్టీ సవరణల కారణంగా అధిక ధరల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. దీంతో ఖర్చులు కొంత తగ్గుముఖం పడతాయి.
ఇదీ చదవండి: ఇంటి నిర్మాణం కోసం ఓ మంచి స్థలం: ఎంపిక చేయండిలా..
నిర్మాణ సామగ్రిపై కొత్త జీఎస్టీ
➤సిమెంట్, రెడీమిక్స్ కాంక్రీట్(ఆర్‌ఎంసీ): గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా.. 18 శాతానికి తగ్గింది.
➤టైల్స్, ఇసుక, ఇటుకలు: 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది.
➤రంగులు, వార్నిష్: 28 శాతం నుంచి 18 శాతం తగ్గింది.
➤మార్బుల్, గ్రానైట్: 12 శాతం ఉండగా.. 5 శాతానికి తగ్గింది.
రానున్న రోజుల్లో ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించవచ్చు?, వేగంగా ఇల్లు కట్టుకోవడం ఎలా?, ఇల్లు కట్టుకునేటప్పుడు ఖర్చులను తగ్గించుకునే మార్గాలు? వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.