breaking news
Crime
-
ఓడిపోయా.. ఇక డబ్బులు వేస్ట్.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బాగాచదివి, మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని గొప్పగా చూసుకోవాలని ప్రతీ అమ్మాయి, లేదా అబ్బాయి కలగంటారు. ఎంతో పట్టుదలగా తమ కలను సాకారం చేసుకుంటారు. కానీ ఒక టీనేజ్ అబ్బాయి ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. చదువులో రాణించలేకపోతున్నా మీ డబ్బులు దండుగ అంటూ ఏ తల్లిదండ్రీ భరించలేని పనిచేశాడు.గ్రేటర్ నోయిడాలోని హాస్టల్లో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు భిహార్కు చెందిన ఆకాష్ దీప్. ఢిల్లీ టెక్నికల్ క్యాంపస్ (DTC)లో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) మొదటి సంవత్సరం చదువుతున్న అతను మంగళవారం సాయంత్రం ఆకాష్ దీప్ తన గదిలో ఉరి వేసుకుని చనిపోయాడు. తన చదువు కోసం తల్లిదండ్రులు ఇకపై డబ్బు వృధా చేయకూడదనే కారణంతోనే ఈ పని చేసినట్లు ఒక సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. బయటకు వెళ్లి, తిరిగి వచ్చిన రూమ్మేట్ ఆకాష్ దీప్ ఉరి వేసుకోవడాన్ని గమనించి వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించాడు. కానీ అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు ఆకాష్ దీప్ ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.సూసైడ్ నోట్లో ఏం ఉంది?క్షమించండి, అమ్మా నాన్న, మీ కొడుకు బలహీనుడు. నా మరణానికి నేనే బాధ్యుడిని. దయచేసి నా మరణం గురించి ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు. అమ్మా, ఇంటర్లో ఒక ఏడాది వృధా చేశా..రినాలుగేళ్లు బీటెక్ చదివి, డబ్బు వృధా చేయాలనుకోవడం లేదు. తప్పుడు ఆశలు కలిగించడం ఇష్టంలేదు. అందుకే ఇక్కడితో ముగించేస్తున్నా..క్షమించండి." అని రాసుకొచ్చాడు. చదువుల ఒత్తిడి కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి అరవింద్ కుమార్ చహల్ తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందన్నారు. -
హైదరాబాద్‌లో పిల్లల్ని ఎత్తుకెళ్లి విక్రయాలు : ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఘటన కలకలం రేపింది. ఈ కేసులో 12 మంది సభ్యుల ముఠాను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్‌లో ఎనిమిది మంది మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఈ ముఠానుంచి ఇద్దరు చిన్నారులను పోలీసులు రక్షించారు.హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాలైన మియాపూర్,కూకట్పల్లి ఆల్విన్ కాలనీ, బిహెచ్ఎల్ జగదిరిగుట్ట ప్రాంతాలలో ఈ ముఠా కాపుకాసు పిల్లలను అపహరిస్తుంది. ఆ తరువాత ఒక్కో శిశువును రూ. 15 లక్షల చొప్పున విక్రయిస్తుందని పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్ మొత్తం ఎనిమిది ఆసుపత్రులకు ఏజెంట్లుగా పని చేస్తున్నట్టు పోలీసులు గురించారు. అపహరించిన చిన్న పిల్లల్ని రెస్క్యూ హోంకు తరలించారు. -
చపాతి లేట్ అయిందనీ, భార్య, నాలుగేళ్ల కొడుకుపై పెనంతో దాడి
గోరఖ్‌పూర్(యూపీ): ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు.. తాగుబోతుల నిర్వాకాలు ఎటు పోతాయో ఎవరూ చెప్పలేరు. రాత్రి పూట హాయిగా పిల్లాడితో కలిసి నచ్చింది వండుకుని తిందామనుకున్న ఆ ఇల్లాలికి పిడుగులా మీద పడ్డాడు తాగుబోతు భర్త. డ్రైవర్‌గా సంపాదించిందంతా తాగుడుకే నీళ్లగా ఖర్చయిపోగా ఆగమేఘాల మీద క్షణాల్లో చపాతి కావాలంటూ భీష్మించుకు కూర్చుని భార్యకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాడు. మెరుపువేగంతో చపాతి చేయకపోతే పిడిగు ద్దులు ఖాయమని హెచ్చరించి చివరకు అనుకున్నంత పనీ చేశాడు. భార్యతో పాటు నాలుగేళ్ల కుమారుడి రక్తం కళ్లజూశాడు. తాగుబోతు డ్రైవర్ నిర్వాకంపై ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లోని గోరఖ్ నాథ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాస్త్రీనగర్‌లో ఒక్కటే చర్చ జరుగుతోంది. చపాతి ఆలస్యంగా చేసిందన్న చితకబాదుతాడా అంటూ అతడిని తిట్టిపోయని వాళ్లు లేరు. 30 ఏళ్ల భార్యామణి రాధికా సహానీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ భార్యాభర్తల చపాతి గొడవ ఆలస్యంగా వెలుగుచూసింది. డిసెంబర్ 20వ తేదీన ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు, బాధితురాలు తెలిపిన సమాచారం మేరకు.. గత శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో లాల్‌చంద్ సహానీ పూటుగా తాగి ఇంటికొచ్చాడు. లక్నోలో డ్రైవర్‌గా పనిచేయడం వచ్చిన డబ్బులు తాగుడకు తగలేయడం అతనికి దినచర్యగా తయారైంది. శనివారం రాత్రి ఇంటికి రాగానే ‘రోటీ రెడీ చెయ్’ అని హోటల్లో సర్వర్‌కు ఆర్డర్ వేసినట్లు ఆర్డర్ వేశాడు. ఇంట్లో అంట్లు తోమడం వంటి ఇంటి పనులు ముగించుకుని రోటీలు చేసి ఇచ్చింది. రోటీ చేయడానికి ఇంత సమయం పడుతుందా? ఇంత ఆలస్యంగా తీసుకొస్తావా? అంటూ లాల్‌చంద్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. అప్పటికే వంటగదిలో పొయ్యి మీద వేడిమీదున్న పెనం తీసుకుని భార్యను చితక్కొట్టాడు. గొడవతో భయపడి అటుగా వచ్చిన తమ నాలుగేళ్ల కుమారుడి తల మీదా లాల్ చంద్ పెనంతో దాడి చేయడంతో తలకు గాయమై రక్తం ధారగా కారింది. దీంతో భయపడిపోయిన లాల్ చంద్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెల్సిన ఇరుగుపొరుగు వాళ్లు వెంటనే పిల్లాడిని ఆస్పత్రిలో చేర్పించాడు. పారిపోతూ లాల్‌చంద్ భార్యను ‘నిన్ను చంపేస్తా’’ అంటూ అరుస్తూ పరుగెత్తాడని పొరుగువాళ్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు తాగుబోతు భర్త కోసం గాలింపు మొదలెట్టారు. లాల్‌చంద్‌ను వెంటనే పట్టుకుని తగిన బుద్ధి చెప్తామని గోరఖ్‌నాథ్ పోలీస్‌స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శశిభూషణ్ రాయ్ చెప్పారు.ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్ -
కెనడాలో భారత యువతి హత్య.. కీలక వివరాలు వెల్లడి
టొరంటో: కెనడాలోని టొరంటోలో 30 ఏళ్ల భారత యువతి హిమాన్షి ఖురానా దారుణ హత్యకు గురయ్యారు. గత శుక్రవారం రాత్రి ఆమె అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందగా, మరుసటి రోజు ఉదయం ఒక నివాసంలో ఆమె మృతదేహం లభ్యమైంది. దర్యాప్తు చేపట్టిన అధికారులు మృతురాలి భాగస్వామే ఇందుకు కారకుడని ప్రాథమికంగా నిర్ధారించారు.పరారీలో ఉన్న నిందితుడు అబ్దుల్ గఫూరీ(32)ని పట్టుకునేందుకు కెనడియన్ చట్ట అమలు సంస్థలు దేశవ్యాప్త వారెంట్ జారీ చేశాయి. గఫూరీ ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమాచారం అందించాలని అధికారులు ప్రజలను కోరుతూ నిందితుడి ఫోటోను విడుదల చేశారు. ఈ ఘటనపై టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హిమాన్షి ఖురానా మృతిపై విచారం వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కేసును నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని కాన్సులేట్ తెలిపింది. టొరంటో పోలీసుల హోమిసైడ్ యూనిట్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ జరుపుతోంది. కాగా ఈ ఘటన విదేశాల్లోని భారతీయులకు సంబంధించిన భద్రతా పరమైన ఆందోళనలను మరోసారి లేవనెత్తింది.ఇది కూడా చదవండి: నింగిలోకి ఎల్వీఎం3- ఎం6 -
నాన్నా.. మేమేం పాపం చేశాం!
బొమ్మనహాళ్: తండ్రే ఆ చిన్నారుల పాలిట కాలయముడయ్యాడు. దేవాలయానికి తీసుకెళ్తానని ఇద్దరినీ కాలువలో తోసేశాడు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లుకు చెందిన శిల్ప, కల్లప్పకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కల్లప్ప కూలి పనులు చేస్తుంటాడు. కుమార్తెలు సింధు (11), అనూష (9) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6, 5 తరగతులు చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఇంటివద్దే ఉన్న కుమార్తెలను కల్లప్ప ఆలయానికి తీసుకెళ్లాడు. కర్ణాటకలోని సిరిగేరి క్రాస్ వద్ద తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) వద్దకు వెళ్లాక సింధును నీటిలోకి తోసేశాడు. చిన్న కుమార్తె అనూష గమనించి భయంతో పరుగులు తీయగా.. కల్లప్ప వెంబడించి మరీ పట్టుకుని కాలువలోకి విసిరేశాడు. ఏమీ తెలియనట్టు సోమవారం గ్రామానికి చేరుకున్నాడు. పిల్లలు ఏమయ్యారని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా సమాధానం రాలేదు. మంగళవారం ఉదయమైనా పిల్లలు రాకపోయేసరికి బంధువులు, గ్రామస్తులు గట్టిగా నిలదీశారు. దీంతో మద్యం మత్తులో ఉన్న కల్లప్ప సిరిగేరి క్రాస్ వద్ద ఎల్లెల్సీ కాలువలో తోసేశానని ఓసారి.. గ్రామ సమీపంలోని హెచ్చెల్సీలోకి తోసేశానని మరోసారి చెప్పాడు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, కర్ణాటక, ఆంధ్ర పోలీసులు కాలువలో గాలించగా మంగళవారం మధ్యాహ్నం సింధు మృతదేహాన్ని దమ్మూరు సమీపంలోని ఎల్లెల్సీవద్ద గుర్తించి బయటకు తీశారు. చిన్నమ్మాయి అనూష జాడ కోసం గాలిస్తున్నారు. -
లైంగిక దాడులు.. వరకట్న వేధింపులు
సాక్షి, సిటీబ్యూరో: అత్యాచారాలు, హత్యలు, వరకట్నం, లైంగిక వేధింపులు.. ఏదో ఒక రూపంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబరాబాద్‌లో మహిళలపై నేరాలు పెరిగాయి. 2025లో కమిషనరేట్ పరిధిలో మొత్తం 37,243 కేసులు నమోదు కాగా.. ఇందులో 9 శాతం మహిళలపై జరిగినవే కావడం గమనార్హం. ఈ ఏడాది సైబరాబాద్‌లో 1,314 వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి. అలాగే షీ టీమ్‌కు వివిధ మాధ్యమాల ద్వారా 1,043 ఫిర్యాదులు అందగా.. వీటిలో 83 ఎఫ్ఐఆర్లు, 2,964 పెట్టీ కేసులు నమోదయ్యాయి. అలాగే 3,322 మంది పోకిరీలకు కౌన్సెలింగ్ ఇవ్వగా.. డెకాయ్ ఆపరేషన్స్‌తో 3,315 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 103 మానవ అక్రమ రవాణా కేసుల్లో 257 మందిని అరెస్టు చేశారు. మొత్తంగా చూస్తే.. గతేడాదిలో నమోదైన 37,689లతో పోలిస్తే ఈ ఏడాది కమిషనరేట్‌లో కేసులు 1.18 శాతం స్వల్పంగా తగ్గాయి. సైబర్ క్రైమ్‌లు, రోడ్డు ప్రమాదాలు, ప్రాపర్టీ సంబంధిత నేరాలు అత్యధికంగా ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి వార్షిక నివేదికను విడుదల చేశారు. అందులోని పలు కీలకాంశాలివీ.. తగ్గిన సైబర్ నేరాలు.. ఐటీ కంపెనీలు, ఉద్యోగులతో నిండిన సైబరాబాద్‌లో ఈ ఏడాది సైబర్ నేరాలు స్వల్పంగా తగ్గాయి. గతేడాది 11,914 క్రైమ్‌లు నమోదు కాగా.. 2025లో 35.9 శాతం మేర తగ్గి, 7,636లకు పరిమితయ్యాయి. వీటిలో 539 కేసుల్లో 917 మంది నిందితులను అరెస్టు చేశారు. అత్యధికంగా పార్ట్ టైం జాబ్, ట్రేడింగ్, విషింగ్ కాల్, అడ్వర్టయిజ్మెంట్ మోసాలు జరిగాయి. 2025లో సైబర్ నేరాలలో బాధితులు రూ.404 కోట్ల మోసపోగా.. రూ.20.75 కోట్లు బాధితులకు రీఫండ్ చేశారు. పెరిగిన చైల్డ్ పోర్నోగ్రఫీ.. ఐటీ హబ్‌గా పేరొందిన సైబరాబాద్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ పెరిగిపోయింది. పిల్లల అశ్లీల వీడియోలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరిగాయి. గతేడాది సైబరాబాద్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులు కేవలం నాలుగు నమోదు కాగా.. ఈ ఏడాది ఏకంగా 53 కేసులు రిజిస్టరయ్యాయి. అలాగే ఆన్లైన్లో వేధింపులు, బెదిరింపులు (సైబర్ స్టాకింగ్), మ్యాట్రిమోనీ, డేటింగ్ మోసాలు కూడా పెరిగాయి. 2025లో 40 సైబర్ స్టాకింగ్, 34 మ్యాట్రిమోనీ, 13 డేటింగ్ ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి.పెరిగిన డ్రగ్స్ కేసులు.. ఈ ఏడాది సైబరాబాద్‌లో రూ.16.85 కోట్ల విలువ చేసే 1,524 కిలోల మత్తు పదార్థాలు దొరికాయి. 575 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) కేసులు నమోదు కాగా.. 1,228 మందిని అరెస్టు చేశారు. అత్యధికంగా రూ.8.33 కోట్ల విలువ చేసే గంజాయి, రూ.3.30 కోట్ల విలువైన కొకైన్, రూ.4.27 కోట్ల విలువ చేసే హెరాయిన్ వంటివి ఉన్నాయి. అలాగే 2025లో సైబరాబాద్‌లో రూ.25.44 కోట్ల విలువ చేసే 2,730 కిలోల మత్తు పద్దార్థాలను ధ్వంసం చేశారు. స్థిరంగానే కన్విక్షన్లు..ఈ ఏడాది సైబరాబాద్‌లో నేర నిరూపణ (కన్విక్షన్లు) రేటు స్థిరంగానే ఉంది. వరుసగా రెండేళ్లు నేర నిరూపణలు 47 శాతం నమోదయింది. 2025లో మొత్తం 14,369 కేసులు డిస్పోజ్ కాగా.. ఇందులో 22 కేసుల్లో న్యాయస్థానం జీవితకాలం శిక్షలు విధించాయి. 22 కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష, 15 కేసుల్లో 10 ఏళ్ల జైలు, 49 కేసుల్లో ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం శిక్షలు విధించారు. ట్రాఫిక్ జరిమానాలు డబుల్..ఏడాది సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానాల కొరడా ఝుళిపించారు. 2025లో కమిషనరేట్ పరిధిలో 36.20 లక్షల చలాన్లు జారీ చేసిన పోలీసులు.. ఆయా వాహనదారులకు ఏకంగా రూ.239.37 కోట్ల జరిమానాలు విధించారు. గతేడాది 22.60 లక్షల చలాన్లలో రూ.111 కోట్ల ఫైన్లు విధించారు. ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో 4,608 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 803 ఘోరమైన యాక్సిడెంట్లలో 850 మంది మరణించారు. అత్యధికంగా 430 ప్రమాదాల్లో 449 మంది ద్విచక్ర వాహనదారులు మృత్యువాత పడగా.. 283 కేసుల్లో 285 మంది పాదచారులు చనిపోయారు. 15,706 డ్రంకెన్ డ్రైవ్ (డీడీ) కేసులు నమోదయ్యాయి.2025లో 95 ఆర్థిక నేరాలలో 111 మంది నిందితులను అరెస్టు చేశారు. రూ.26.17 కోట్ల సొమ్మును స్తంభింపజేయగా.. రూ.11.50 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. -
‘కొట్టి చంపిన తర్వాతే అతని నిజాయితీ బయటపడింది’
తిరువనంతపురం: కేరళలోని పళక్కాడ్ జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. అనుమానం ఓ వలస కార్మికుడి ప్రాణం తీసింది. పనికోసం వచ్చిన రామనారాయణ్ భగేల్ దొంగతనం చేశాడని భావించి స్థానికులు కొట్టి చంపారు. కానీ ఆ తర్వాతే అతని నిజాయతి బయటపడింది. రామనారాయణ్ దొంగతనం చేయలేదని అమాయకుడని పోలీసులు నిర్ధారించారు.ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రామనారాయణ్ భగేల్ (31) అనే వలస కార్మికుడు. ఇటీవలే కేరళలోని వాలయార్ ప్రాంతానికి పని కోసం వచ్చాడు. ఒక దుకాణం నుంచి ఆహార ప్యాకెట్ దొంగిలించాడని అనుమానంతో స్థానికులు అతనిపై దాడి చేశారు.దాడిలో తీవ్రంగా గాయపడిన రామనారాయణ్‌ను ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న వాలయార్ పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో రామనారాయణ్ దొంగతనం చేయలేదని, అతని వద్ద ఏమీ దొరకలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసి, మరో పదిమందిని అదుపులోకి తీసుకున్నారు.రామనారాయణ్ ఛత్తీస్‌గఢ్‌లోని సక్తి జిల్లాకు చెందినవాడు. నిర్మాణ పనుల్లో రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, తల్లి అతని మీద ఆధారపడి జీవిస్తున్నారు. మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు. -
సంచలన అత్యాచార కేసులో నేరస్తుడికి శిక్ష రద్దు, బెయిల్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార కేసులో సంచలనం పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు, జీవితఖైదు అనుభవిస్తున్న బహిష్కృత బీజేపీ నేత కుల్దీప్ సింగ్ సెంగర్ జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు మంగళవారం రద్దు చేయడం సంచలనంగా మారింది.జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్, హరీష్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం సెంగర్‌కు బెయిల్‌ను మంజూరు చేసింది. 15 లక్షల వ్యక్తిగత బాండ్‌తోపాటు, ముగ్గురు పూచీకత్తులు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. బాధితురాలి ఇంటి నుండి 5 కిలోమీటర్ల పరిధిలోకి రాకూడదని, ఆమెను లేదా ఆమె తల్లిని బెదిరించవద్దని కూడా హైకోర్టు సెంగర్‌ను ఆదేశించింది. వీటిల్లో ఏ షరతును ఉల్లంఘించినా అతని బెయిల్ రద్దు అవుతుందని కోర్టు తెలిపింది.అత్యాచారం కేసులో సెంగర్ తన దోషిగా నిర్ధారించి, జీవిత ఖైదు తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీల్ పెండింగ్‌లో ఉండే వరకు ఆయన శిక్షను హైకోర్టు సస్పెండ్ చేసింది. అత్యాచారం కేసులో డిసెంబర్ 2019 ట్రయల్ కోర్టు తీర్పును సెంగర్ సవాలు చేశాడు. 2019, ఆగస్టులో ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్‌లోని ట్రయల్ కోర్టు నుండి ఢిల్లీకి బదిలీ చేశారు.అసలు కేసు ఏంటి?2017లో బీజేపీ నేతగా ఉన్న కుల్దీప్ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.ఆ తరువాత బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ మరింత ఆందోళన రేపింది. దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలు, విమర్శలు వెల్లువెత్తడంతో బీజేపీ అతణ్ని పార్టీనుంచి తొలగించింది. బాధితురాలి తండ్రి మరణం కేసులో తన దోషిగా నిర్ధారించబడ్డాడు. అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే ఇప్పటికే గణనీయమైన సమయం జైలులోగడిపినందున శిక్షను నిలిపివేయాలని కూడా కుల్దీప్ అప్పీలు చేశాడు. ఇది పెండింగ్‌లో ఉంది. -
యువతికి వేధింపులు : హౌసింగ్ సొసైటీపై రూ.62లక్షల దావా, చివరికి
బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల యువతి తనకు జరిగిన అవమానం, వేధింపులపై పోరాడిన తీరు విశేషంగా నిలిచింది. హౌసింగ్ సొసైటీ బోర్డు సభ్యులపై వేధింపులు, అతిక్రమణ , బెదిరింపులను సహిస్తూ మౌనంగా ఉండిపోలేదు ఆమె. వారిపై చట్టపరమైన చర్యలకు దిగి హౌసింగ్ సొసైటీపై రూ.62 లక్షలు దావా వేసింది. సొసైటీలో ఫిర్యాదు చేసి విజయాన్ని సాధించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలందుకుంది. స్టోరీ ఏంటీ అంటే..బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల యువతి తనకు జరిగిన అవమానం, వేధింపులపై పోరాడిన తీరు విశేషంగా నిలిచింది. హౌసింగ్ సొసైటీ బోర్డు సభ్యులపై వేధింపులు, అతిక్రమణ , బెదిరింపులను సహిస్తూ మౌనంగా ఉండిపోలేదు ఆమె. వారిపై చట్టపరమైన చర్యలకు దిగి హౌసింగ్ సొసైటీపై రూ.62 లక్షలు దావా వేసింది. సొసైటీలో ఫిర్యాదు చేసి విజయాన్ని సాధించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలందుకుంది. స్టోరీ ఏంటీ అంటే..బాధిత యువతి రెడ్డిట్‌లో షేర్ చేసిన వివరాల ప్రకారం అపార్ట్మెంట్లో తన స్నేహితులతో ఏర్పాటు చేస్తున్న మీట్ ఘర్షణ దారితీసింది. అది చివరికి రూ.62 లక్షల సివిల్ దావా, నిందితులైన బోర్డు సభ్యులకు 20వేల జరిమానా, తొలగింపుతో ముగిసింది. తన ఐదుగురు స్నేహితులు ఆమె ఇంటికి వచ్చినప్పుడు వివాదం మొదలైంది. వారు తన ఫ్లాట్‌కి వచ్చినపుడు, ఎలాంటి సంగీత ధ్వనులు లేకుండా, గోల, గందరగోళం లేకుండా, చాలా కామ్‌గా తమ ఇంట్లో ఆమె వంట చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇంతలో ఆ అపార్ట్మెంట్ సొసైటీ సభ్యుడు ఆమె ఫ్లాట్‌కి వచ్చి "బ్యాచిలర్లకు అనుమతి లేదు" అని చెప్పి, ఫ్లాట్ యజమానికి ఫోన్ చేయమని కోరడంతో సమస్య మొదలైంది. తాను తన ఓనర్‌తో మాట్లాడానని, మీ సమస్య ఏంటి అని ప్రశ్నించింది. ఆ తరువాత కొద్దిసేపటికే, నలుగురైదుగురు పురుషులు ఆమె గదిలోకి బలవంతంగా ఎంట్రీ ఇచ్చారు. మద్యం, గంజాయి తాగుతున్నారని ఆరోపిస్తూ నానా యాగీ చేశారు. అంతటితో ఆగిపోలేదు. మరుసటి రోజు ఆమెను ఫ్లాట్ ఖాళీ చేయాలంటూ మళ్లీ గొడవకు దిగారు. దీంతో ఆమె ఫ్రెండ్స్‌లోని జెంట్స్ వారిని బైటికి నెట్టారు. రెచ్చిపోతున్న ఒక సభ్యుడిని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో సొసైటీ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసు అధికారులు వచ్చి ఆమెను యాజమాన్యాన్ని నిరూపించమని అడిగారు. అయితే తాను ఎవరికి ఎలాంటి ఇబ్బందికి కలిగించలేదంటూ అందుకు నిరాకరించింది. అలాగే లివింగ్-రూమ్ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్‌ను చూపించింది.అలాగే ఆమె CCTV ఆధారాలను బిల్డర్చ సొసైటీ ఛైర్మన్‌కు సమర్పించినప్పుడు, నిందితులైన సభ్యులను వెంటనే తొలగించారు ఒక్కొక్కరికి రూ. 20,000 జరిమానా విధించారని మరో పోస్ట్‌లో వెల్లడించింది.మరోవైపు వేధింపులు, అతిక్రమణ, దాడి ఆరోపణలతో హౌసింగ్ సొసైటీ, బోర్డు సభ్యులకు నోటీసులు జారీ చేసింది. రూ. 62 లక్షల పరిహారం చెల్లించాలంటే దావా వేసింది. అలాగే పురుషులు మళ్ళీ తన ఫ్లాట్‌లోకి రాకుండా ఉండేలా శాశ్వత నిషేధాన్ని కూడా ఆమె కోరింది.సోషల్ మీడియా ప్రశంసలుఆమె పోస్ట్‌లు వైరల్ గామారాయి. ఆమె ధైర్యాన్ని , సంకల్పాన్ని నెటిజన్లు కొనియాడారు. ఆ కేసుతో ముందుకు సాగండి—ఎవరూ ఒకరి ఇంట్లోకి చొరబడలేరు” అని ఒకరు ధైర్యం చెప్పారు. -
రాయదుర్గం: ఇద్దరు కూతుళ్లను చంపిన తండ్రి
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. రాయదుర్గం నియోజకవర్గంలో ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇద్దరు కూతుళ్లను చంపిన కసాయి తండ్రి కల్లప్ప.. బళ్లారి సమీపంలోని హైలెవల్ కెనాల్లో తోసేశాడు. చిన్నారుల అనసూయ (9), చంద్రకళ (10) మృతి చెందారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లులో ఘటన జరిగింది.దైవ దర్శనం కోసమని చెప్పి ఇద్దరు కూతుళ్లను చంపిన కల్లప్పకు దేహశుద్ధి చేసిన స్థానికులు.. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
లగ్జరీ హోటల్లో ఫ్లైట్ అటెండెంట్ దారుణ హత్య, మాజీ భర్త అరెస్ట్
దుబాయ్‌లోని లగ్జరీ హోటల్లో యువతి దారుణ హత్య కలకలం రేపింది. ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల యువతిని మాజీ భర్తే కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం దేశం విడిచి పారి పోయాడు.పోలీసులు సమాచారం ప్రచారం రష్యన్ విమానసేవల సంస్థ పోబెడా ఎయిర్ లైన్స్‌లో క్రూ మెంబర్‌గా పనిచేస్తున్న అనస్తాసియా దుబాయ్‌లోని లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్లో శవమై తేలింది. దుబాయ్‌లోని జుమేరా లేక్స్ టవర్స్ ప్రాంతంలోని వోకోబోనింగ్టన్ హోటల్లోని ఒక గదిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమె మెడ, మొండెం, అవయవాలపై 15 కత్తి పోట్లున్నాయని, దర్యాప్తు అధికారులు తెలిపారు. దర్యాప్తు అనంతరం రష్యాలో ఆమె మాజీ భర్తను అరెస్టు చేశారు.ప్రధాన నిందితుడుగా రష్యన్ జాతీయుడు అనస్తాసియా మాజీ భర్త అయిన 41 ఏళ్ల ఆల్బర్ట్ మోర్గాన్ గా గుర్తించారు. యుఎఇ చట్ట అమలు సంస్థల అభ్యర్థన మేరకు, డిసెంబర్ 20న దుబాయ్ నుండి రష్యాలో దిగిన కొద్దిసేపటికే మోర్గాన్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ హత్య డిసెంబర్ 17-18 మధ్య హత్య జరిగిందని భావిస్తున్నారు. హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుబాయ్ పోలీసులు నిందితుడిని గుర్తించారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే దేశం విడిచి పారిపోయాడని భావిస్తున్నారు. మోర్గాన్‌ను అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతుండగా, ఫిబ్రవరి 18 వరకు కనీసం రెండు నెలల పాటు కస్టడీలో ఉంచాలని రష్యన్ కోర్టు ఆదేశించింది.అనస్తాసియా మోర్గాన్ మధ్య విభేదాలు తలెల్తాయి. నిరంతరం ఆమెను అనుమానంతో వేధించేవాడు. దీంతో దాదాపు రెండేళ్ల నుంచీ వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. ప్రస్తుతం నిందితుడు దుబాయయ్లో ఉంటున్నాడు. అయితే నిర్భయంగా ఆమె జీవిస్తున్న తీరుపై అసూయ, అనుమానంతో రగిలిపోయి చివరకు ఈ దారుణానికి ఒడిగట్టాడు భర్త. మరోవైపు ప్రభుత్వ సంస్థ ఏరోఫ్లాట్ యాజమాన్యంలోని పోబెడా ఎయిర్‌లైన్స్ ఈ ఘటనపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది... శివాజీపై నెటిజన్లు ఫైర్ -
మరిది.. నీ భార్యకు వేరొకరితో సంబంధం ఉంది!
తమిళనాడు: తన భార్యతో తరచూ ఘర్షణ పడుతుందనే కారణంతో వదిననూ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన మరిదిని మప్పేడు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ ఇరుళంజేరి గ్రామానికి చెందిన ఇళయరాజ. ఇతడికి అదే ప్రాంతానికి చెందిన శాంతిమేరితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు వున్నారు.కాగా ఇళయరాజ సోదరుడు ఇసైమేగం(29). ఇతడికి పేరంబాక్కం గ్రామానికి చెందిన లావణ్య(24)తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం లావణ్య మూడు నెలల గర్బవతి. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబంగా నివాసం ఉంటున్నారు. కాగా శాంతిమేరికి వివాహమై రెండు సంవత్సరాల తరువాత పిల్లలు పుట్టగా, లావణ్యకు వివాహమైన నాలుగు నెలలకే గర్బం దాల్చింది. ఈ విషయమై శాంతిమేరి తరచూ లావణ్యకు వివాహానికి ముందే వేరొకరితో సంబంధం ఉందంటూ ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది. ఇదే విషయమై ఆదివారం రాత్రి శాంతిమేరికి, లావణ్యకు చిన్నపాటి ఘర్షణ జరగడంతో ఆగ్రహించిన ఇసైమేగం తన భార్యకు అక్రమ సంబందాన్ని అంటగట్టుతున్నారనే ఆగ్రహంతో వదినపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డన శాంతిమేరిని స్థానికులు చికిత్స కోసం తిరువళ్లూరుకు తరలించగా మార్గంమధ్యలోనే మృతిచెందింది. ఈ ఘటన ఇరుళంజేరిలో తీవ్ర సంచనలం కలిగింది. మప్పేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాలువలో మొండెం.. వెలుగులోకి భార్య కిరాతకం
సంభల్: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో వెలుగు చూసిన ఒక దారుణ హత్యోదంతం అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ఒక ఇల్లాలు తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హత్యచేసింది. అంతటితో ఆగకుండా మృతదేహం ఆనవాళ్లు దొరకకూడదని దానిని ముక్కలు ముక్కలుగా నరికి, వేర్వేరు ప్రాంతాల్లో పారేసిన వైనం స్థానికంగా సంచలనంగా మారింది.నవంబర్ 18న తన భర్త రాహుల్ అదృశ్యమయ్యాడంటూ భార్య రూబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హైడ్రామా మొదలైంది. డిసెంబర్ 15న ఇక్కడి ఒక కాలువలో తల, కాళ్లు, చేతులు లేని మొండెం పోలీసులకు లభించింది. ఆ మొండెంపై ఉన్న ‘రాహుల్’ అనే పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులకు రూబీపై అనుమానం కలగడంతో అసలు నిజం బయటపడింది.పోలీసుల విచారణలో నిందితులు చెప్పిన వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. రూబీ, ఆమె ప్రియుడు గౌరవ్ కలిసి రాహుల్‌ను ఇనుప రాడ్డు, రోకలితో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు ఒక చెక్కలు కోసే గ్రైండర్‌ను తీసుకువచ్చి, మృతదేహాన్ని ముక్కలుగా కోశారు. ఒక భాగాన్ని కాలువలో పడేయగా, మిగిలిన శరీర భాగాలను రాజ్‌ఘాట్‌కు తీసుకెళ్లి పవిత్ర గంగా నదిలో కలిపేసి ఏమీ తెలియనట్టు నాటకమాడారు.నిందితులు హత్యకు ఉపయోగించిన గ్రైండర్, ఇనుప సుత్తి మరియు ఇతర పనిముట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రూబీ, గౌరవ్‌లను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మృతదేహం రాహుల్‌దేనని నిరూపించేందుకు అతని పిల్లల డీఎన్ఏ నమూనాలను సేకరించి, ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర: రాహుల్ ఆరోపణ -
పూర్ణిమా..వాడిని వదిలేయ్!
హైదరాబాద్: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య భర్తను కడతేర్చింది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ ఈస్ట్ బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్న వి.జె.అశోక్ (45) ఓ ప్రైవేట్ కళాశాలలో మేనేజర్‌గా పనిచే స్తున్నాడు. భార్య పూర్ణిమ ప్లేస్కూల్ నిర్వహిస్తోంది. వేరేకాలనీ లో ఉన్నప్పుడు నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న పాలేటి మహేశ్ (22)తో పూర్ణిమ కొన్ని సంవత్సరా లనుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంలో అశోక్ గతంలో భార్య ను మందలించాడు. ఈనెల 10వ తేదీన ఇంటిముందు మహేశ్ కనిపించడంతో పూర్ణిమతో భర్త గొడవ పడ్డాడు. దీంతో ఎలా గైనా అశోక్ అడ్డు తొలగించుకోవాలని మహేశ్, పూర్ణిమ పథకం పన్నారు. 11వ తేదీన సాయంత్రం ముందుగా మహేశ్ తన స్నేహితుడు బూక్యా సాయితో కలిసి అశోక్కోసం ఇంట్లోనే వేచి చూస్తున్నారు. అశోక్ ఇంటికి రాగానే ముగ్గురూ మూకుమ్మడిగా అతనిపై దాడికి పాల్పడ్డారు. పూర్ణిమ అశోక్ కాళ్లు పట్టుకోగా, ప్రియుడు, మరోవ్యక్తి మెడకు మూడు చున్నీలను బిగించి హత్యకు పాల్పడ్డారు. అనంతరం అనుమానం రాకుండా మృతుడి ఒంటిపై రక్తపు మరకలున్న దుస్తులను మార్చి, అంబులెన్స్‌లో అశోక్‌ను మల్కాజిగిరి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు తెలిపారు. వాష్‌రూంలో హార్ట్ ఎటాక్ వచ్చి తన భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లాడని పూర్ణిమ బంధువులను నమ్మించింది. ఆసుపత్రి సిబ్బంది మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి ఒంటిపై గాయాలు కనిపించడంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా భార్యను విచారించగా ప్రియుడు, మరోవ్యక్తి సాయంతో హత్యచేసినట్లు ఒప్పుకుంది. ప్రియుడు మహేశ్‌తోపాటు సహకరించిన సాయిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
పశ్చిమగోదావరి జిల్లా: ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర మండలం పోలమూరు గ్రామంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అతివేగంతో రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ప్రమాదంలో పోలమూరు గ్రామానికి చెందిన సత్యనారాయణ (28), అంజిబాబు (25), రాజు (19) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురూ ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.స్థానికుల కథనం ప్రకారం, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం అర్ధరాత్రి 12.30 సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొనడంతో ముగ్గురు యువకులు తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న పెనుమంట్ర పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పంచనామా నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని స్థానికులు చెబుతుండగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సీఐపై కత్తితో యువకుడు దాడి
రాప్తాడురూరల్: అనంతపురం నగర శివార్లలో కాల్పుల మోత సంచలనం కలిగించింది. రెండు హత్యాయత్నాల కేసుల్లో నిందితున్ని పట్టుకోవడానికి వెళ్లిన సీఐపై కత్తితో దాడి చేయడంతో.. ప్రతిఘటించే క్రమంలో సీఐ తన సర్విస్ రివాల్వర్‌తో కాలి్చన సంచలన ఘటన అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి సమీపంలో జరిగింది. వివరాలు.. అనంతపురం నగరం నాయక్‌నగర్‌కు చెందిన చాకలి రాజా, సొహైల్, అక్రం, అజయ్ స్నేహితులు. వీరు ఆదివారం రాత్రి 8.15 గంటల సమయంలో నగరంలోని అరవిందనగర్‌లో అయ్యప్ప కేఫ్ వద్ద మద్యం సేవిస్తుండగా గొడవపడ్డారు. ఈక్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అజయ్ తన స్నేహితుడు చాకలి రాజాను కత్తితో కడుపులో బలంగా పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు అజయ్ కోసం గాలింపు చేపట్టారు. మఫ్టీలో వెళ్లిన పోలీసులపై దాడికి యత్నం.. నిందితుడు అజయ్ సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో టీవీ టవర్ సమీపంలోని షికారు కాలనీలో ఉన్నాడనే సమాచారం అందడంతో ఇన్ఫార్మర్ ఆటోడ్రైవర్ బాబాను వెంట బెట్టుకుని టూటౌన్ సీఐ శ్రీకాంత్, ఎస్ఐ రుష్యేంద్రబాబు, సిబ్బంది మఫ్టీలో వెళ్లారు. పోలీసులు రౌండప్ చేయడాన్ని పసిగట్టిన అజయ్.. తన దగ్గరికి వస్తున్న ఆటోడ్రైవరు బాబాను ఒక్కసారిగా కత్తితో పొడిచాడు. ఆపై వీరంగం సృష్టిస్తూ మహిళలను కత్తితో బెదిరిస్తూ ముళ్లపొదల్లోకి దూరి పారిపోయాడు. చెరుకు తోటలో నక్కి ఉండి.. సీఐపై అటాక్.. వరుసగా దాడులకు పాల్పడుతున్న అజయ్‌ను పట్టుకోవాలని సవాల్‌గా తీసుకున్న పోలీసులకు ఆకుతోటపల్లి సమీపంలోని కందుకూరుకు వెళ్లే దారిలో ఓ చెరుకుతోటలో నిందితుడు దాక్కున్నట్లు సమాచారం రావడంతో చుట్టూ మోహరించారు. చెరుకు తోట ఏపుగా ఉండడంతో సీఐ శ్రీకాంత్ లోపలకు వెళ్లి లొంగిపోవాలని కోరాడు. అయితే సీఐ దగ్గరకు సమీపిస్తుండగా అజయ్ ఒక్కసారిగా కత్తితో దాడి చేయడంతో భుజానికి గాయమైంది. మరోమారు దాడి చేసేందుకు రావడాన్ని గమనించిన సీఐ అప్రమత్తమై తన సర్విస్ రివాల్వర్‌తో రెండు రౌండ్లు కాల్చాడు.ఒక బుల్లెట్ అజయ్ మోకాలిలో దూరి బయటకు రావడంతో అక్కడే పడిపోయాడు. మరోవైపు సీఐ శ్రీకాంత్ గాయపడడంతో అక్కడే ఉండగా సిబ్బంది అక్కడికి చేరుకుని ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అజయ్ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, సీఐ శ్రీకాంత్ పై యువకుడు కత్తితో దాడి చేయడాన్ని ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఓ ప్రకటనలో ఖండించారు. అజయ్‌పై హత్యాయత్నం కేసు: ఎస్సీ జగదీష్ సీఐ శ్రీకాంత్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడు అజయ్‌పై ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. సీఐ శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై రెండు కేసులు నమోదు చేశారు. ఘటనాస్థలాన్ని పరిశీంచిన ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ నిందితుడిపై గతంలోనూ క్రిమినల్ కేసులున్నాయన్నారు. చట్టపరంగా నిందితుడిపై కఠిన చర్యలతో పాటు వారి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. -
సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో అత్యుత్సాహం.. బాలిక ప్రాణం తీసింది
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ కమ్లిబాయ్ పెంటయ్య విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన ప్రమాదంలో సౌజన్య (7) అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.వివరాల్లోకి వెళితే… ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన కమ్లిబాయ్ పెంటయ్య గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సమయంలో చిన్నారి సౌజన్య కారు కిందపడి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన బాలికను వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీలో కారే ప్రమాదానికి కారణమని గ్రామస్థులు ఆరోపించగా, సర్పంచ్ కమ్లిబాయ్ భర్త పెంటయ్య మాత్రం బాలిక కారు కింద పడలేదని వాదిస్తున్నారు. ఈ అంశంపై గ్రామస్థులకు, పెంటయ్యకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో ప్రస్తుతం ఉద్రిక్తత కొంతమేరకు తగ్గినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలిక మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం ఉంచారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. -
రూ. 8.10 కోట్ల మోసం.. తుపాకీతో కాల్చుకున్న మాజీ ఐజీ
పంజాబ్ మాజీ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్ తన నివాసంలో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం అమర్ సింగ్ చాహల్ సోమవారం సెక్యూరిటీ గార్డు రివాల్వర్ ఉపయోగించి తనను తాను కడుపులో కాల్చుకున్నారు. సంఘటనా స్థలం నుండి 12 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పాటియాలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వరుణ్ శర్మ తెలియజేశారు. పంజాబ్‌లోని పాటియాలాలో చాహల్ ఆత్మహత్యాయత్నం విషయం తమ దృష్టికి రాగానే పోలీసు బృందాలు అతని నివాసానికి చేరుకుని, ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్టు ప్రకటించారు. ప్రస్తుతం చాహెల్ పరిస్థితి విషమంగా ఉందని, ఆయనను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.Breaking : Punjab ex-IPS officer Amar Singh Chahal, accused in 2015 Faridkot firing case, critical after alleged 'suicide' attempt pic.twitter.com/7NRdu1hEuh— Gurpreet Garry Walia (@garrywalia_) December 22, 2025సూసైడ్ నోట్ లో ఏముంది?పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంఘటనా స్థలం నుండి ఒక సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు, అందులో చాహల్ ఆర్థిక మోసానికి గురయ్యాడని రాసి ఉంది. ఈ మేరకు చాహల్ పంజాబ్ పోలీస్ డీజీపీ గౌరవ్ యాదవ్‌ను ఉద్దేశించి 12 పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. ఆ నోట్లో రూ.8.10 కోట్ల విలువైన ఆన్లైన్ మోసం కేసు గురించి ప్రస్తావించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ మోసం, తీవ్రమైన ఆర్థిక నష్టాలతో ఒత్తిడికి గురైనట్టు సూసైడ్ నోట్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. చాహల్ ఐజీ పదవి నుండి పదవీ విరమణ చేసినప్పటి నుండి పాటియాలాలో నివసిస్తున్నారు.కోట్కాపుర కాల్పుల కేసులో నిందితుడుకాగా 2015లో ఫరీద్‌కోట్‌లో జరిగిన బెహ్బాల్ కలాన్ ,కోట్కాపుర కాల్పుల కేసు నిందితుల్లో అమర్ సింగ్ చాహల్ కూడా ఒకరు. 2023, ఫిబ్రవరిలో, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎల్.కె. యాదవ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అమర్ సింగ్ చాహల్‌తో సహా పలువురు సీనియర్ పంజాబ్ అధికారులపై ఫరీద్కోట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.కాగా గతంలో కూడా సీనియర్ పోలీసు అధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. హర్యానాలోని సీనియర్ పోలీసు అధికారి వై. పురాన్ కుమార్ చండీగఢ్‌లోని తన నివాసంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆత్మహత్యకు డీజీపీ, ఏడీజీసీ ఎస్పీతో సహా 10 మంది అధికారులను నిందిస్తూ ఆయన ఎనిమిది పేజీల సూసైడ్ నోట్ రాసిన సంగతి తెలిసిందే. -
అనంతపురంలో కాల్పుల కలకలం
సాక్షి, అనంతపురం: జిల్లాలోని ఆకుతోటపల్లిలో సోమవారం కాల్పుల కలకలం రేగింది. ఓ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన టౌటౌన్ సీఐ శ్రీకాంత్‌పై దాడి యత్నం జరిగింది. దీంతో ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా సీఐ కాల్పులు జరపడంతో నిందితుడు గాయపడ్డాడు. స్థానికంగా ఉన్న అజయ్ అనే వ్యక్తి నిన్న మద్యం మత్తులో ఓ యువకుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు కావడంతో అజయ్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్లారు. అయితే నిందితుడు సీఐ శ్రీకాంత్‌పై కత్తితో దాడికి యత్నించగా.. ఆయన తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. దీంతో అజయ్ కాలు నుంచి తూటా దూసుకెళ్లింది. ఈ ఘటనలో సీఐ శ్రీకాంత్‌కు సైతం గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
కులాంతర వివాహం : ఆరునెలల గర్భిణీని హత్య చేసిన తండ్రి
కర్ణాటకలోని హుబ్బళ్లిలో దారుణం చోటు చేసుకుంది. వేరేకులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న దురహంకారంతో కన్నకూతుర్ని హతమార్చాడో తండ్రి. ఆరు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా కన్నబిడ్డను అత్యంత పాశవికంగా చేసిన హత్య ఆధునిక సమాజంలో కూడా వేళ్లూనుకొనిపోయిన కుల అహంకారానికి అద్దం పట్టింది.హుబ్బళ్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ల మాన్య పాటిల్ కులాంతర వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఈ ఏడాది మేలో ప్రేమికుడిని పెళ్లాడింది. చంపేస్తారేమోననే భయంతో స్వగ్రామానికి దూరంగా 100 కి.మీ దూరంలో ఉన్న హవేరి జిల్లాలో భర్తతోకలిసి నివసిస్తోంది. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. ఊర్లో ఉంటున్న అత్తమామల వద్దకు ఆదివారం నాడు వచ్చింది. ఇది పసిగట్టిన ఆ యువతి తండ్రి మరో ముగ్గురితో కలిసి ఆమెపై దాడికి దిగారు. ముందు ఆమె భర్త, మామ వ్యవసాయ పొలంలో ఉన్నప్పుడు వారిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. వారు తప్పించుకోవడంతో, సాయంత్రం 6 - 6:30 గంటల మధ్య, ఇనుప పైపులతో సాయుధులైన దుండగులతో కలిసి బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డాడు తండ్రి. ఆరు నెలల గర్భవతి మాన్యపై దారుణంగా ఎటాక్ చేశారు. దీంతో ఆమె ప్రాణాలొదిలింది. సంఘటనా స్థలంలోనే ఉన్న అత్తమామలు రేణుకమ్మ, సుభాష్ ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు.వారిపై కూడా దారుణంగా దాడి చేశాడు. వారు తీవ్ర గాయాలతో అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ సంఘటనలో పోలీసులుమాన్య తండ్రి ప్రకాష్ ఫక్కిర్గోడా, మరో ఇద్దరు దగ్గరి బంధువులను అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఈ వివాదంలోగతంలఘీ రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదర్చడానికి , ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారించడానికి గతంలో ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. ఇంత జరిగినా చివరికి కన్నబిడ్డనే హతమార్చిన ఘటన తీవ్ర ఆందోళన రేపింది. -
మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, మంచిర్యాల: జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జైపూర్ మండలం ఇందారం వద్ద కూలీలతో వెళ్తున్న బోలెరో వాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆగి ఉన్న లారీని బోలెరో ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
టీచర్‌తో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం..!
నరసరావుపేట టౌన్: సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన కానిస్టేబుల్ దారితప్పారు. తన భార్యతో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం పెట్టుకొని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని, అతని నుంచి రక్షణ కల్పించాలని భర్త తమ పిల్లలతో కలిసి ఫిర్యాదు చేశారు. అధికారులు అందుబాటులో లేరని ఫిర్యాదు ఇచ్చేందుకు మరో రోజు రావాలని సిబ్బంది వెనక్కు పంపారు. పల్నాడు జిల్లా గురజాల సబ్ డివిజన్లోని ఓ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లాలో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ తాను నివాసం ఉండే సమీపంలో ఉంటున్న ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలితో గత కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. విషయం భర్తకు తెలిసి కానిస్టేబుల్‌ను నిలదీయడంతో అతనిపై బెదిరింపులకు దిగారు. దీంతో భర్త తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని శనివారం ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లారు. పిడుగురాళ్లలో నిర్వహిస్తున్న శ్రీనివాస కల్యాణ కార్యక్రమం విధుల నిమిత్తం అధికారులు వెళ్లడంతో స్టేషన్లో అందుబాటులో లేరు. అధికారులను కలిసి ఫిర్యాదు చేసేందుకు భర్త గంటలకొద్దీ వేచి ఉన్నా రాలేదు. మరో రోజు రావాలని సిబ్బంది ఫిర్యాదు స్వీకరించకుండా వెనక్కు పంపారు. దీర్ఘకాలంగా ఒకే స్టేషన్లో పనిచేస్తూ స్టేషన్లో రికార్డు వర్క్ చేస్తున్న ఆ కానిస్టేబుల్‌పై గతంలో కూడా అనేక అవినీతి ఫిర్యాదులు ఉన్నాయి. అయితే అధికారులకు నెలవారీ మామూళ్లు వసూళ్లు చేయటంలో సదరు కానిస్టేబుల్ కీలక పాత్ర పోషిస్తుండటంతో అధికారులు అతని అక్రమాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కానిస్టేబుల్ ఆగడాలపై పల్నాడు జిల్లా ఎస్పీని సోమవారం కలిసేందుకు బాధితుడు సిద్ధమైనట్లు సమాచారం. -
విజయవాడలో మళ్లీ డ్రగ్స్ కలకలం
సాక్షి, అమరావతి: విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. మాచవరం పీఎస్ పరిధిలో డ్రగ్స్ సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు అర్థరాత్రి అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులను నుంచి ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుకు చెందిన మరో నిందితుడు అనూహ్యంగా పోలీసుల అదుపులో నుంచి పరారైనట్లు తెలుస్తోంది. విజయవాడలోని ఓ హోటల్లో నిందితులు ముగ్గురు డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరి నుంచి మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి వారు ఉపయోగించిన కారుతో సహా స్టేషన్‌కు తరలించారు. అయితే కారు పార్కు చేసి రావాలని నిందితుడికే తాళాలు అప్పగించడంతో అతడు పరారైనట్లు తెలుస్తోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయవాడలోని మధురానగర్, సింగ్‌నగర్‌కు చెందిన నిందితులిద్దరూ ఇంటర్ తర్వాత చదువు మానేసి చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. స్నేహితుల పార్టీల్లో వీళ్లకు ఎండీఎంఏ అలవాటైంది. అలా తరచూ బెంగళూరు వెళ్లి అక్కడ కొని విజయవాడ తెచ్చి స్నేహితులతో కలిసి తీసుకునేవారు. ఈనెల 19న కారులో వీరిద్దరూ బెంగళూరుకు బయలుదేరారు. 20న అక్కడకు చేరుకున్నారు. అక్కడ ఓ వ్యక్తి వద్దకు వెళ్లి రూ.36వేలు చెల్లించి 19 గ్రాముల డ్రగ్స్ కొనుగోలు చేశారు.వీరు బెంగళూరు వెళ్లిన విషయాన్ని నిందితుల్లో ఒకడి స్నేహితుడి ద్వారా నెల్లూరుకు చెందిన మరో యువకుడు తెలుసుకున్నాడు. వెంటనే ఫోన్ చేసి తనకు తెలిసిన వ్యక్తి నుంచి 2 గ్రాముల ఎండీఎంఏ తీసుకురావాలని కోరాడు. అయితే.. అప్పటికే బెంగళూరులో ఉన్న నిందితుల్లో ఒకడు పోలీసుల నిఘా ఉందని చెప్పాడు. తర్వాత బతిమిలాడి ఒప్పించి డబ్బులు పంపించాడు. బెంగళూరు నుంచి రెండు గ్రాములు తీసుకుని కారులో బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో నెల్లూరులో దిగి ఎండీఎంఏ ఇచ్చారు. అక్కడవారు కొంత డ్రగ్స్ తీసుకున్నారు. అయితే.. కారు మొరాయించడంతో అక్కడే వదిలేసి, నెల్లూరుకు చెందిన నిందితుడి కారులో ముగ్గురూ విజయవాడ చేరుకుని మాచవరం స్టేషన్ పరిధిలోని ఓ హోటల్లో దిగారు. అక్కడ ముగ్గురూ డ్రగ్స్ తీసుకుని మత్తులో మునిగి తేలారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు హోటల్‌పై దాడి చేసి, వీరిని పట్టుకుని 10 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఎండీఎంఏ అమ్మిన ఇద్దరి కోసం మరో బృందం బెంగళూరు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. నగరంలో ఈ మధ్యకాలంలో ఇలాంటి వ్యవహారాలు తరచూ వెలుగు చూస్తుండడం గమనార్హం. అయినా కూడా మాదకద్రవ్యాలు కట్టడి చేయలేకపోతున్నారంటూ పోలీస్ శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
భార్య కాపురానికి రావడం లేదని..
హవేళిఘణాపూర్(మెదక్): ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో తరచూ గొడవలు పడుతుండటంతో భరించలేని ఆమె తల్లిగారింటికి వెళ్లిపోయింది. అయితే ఆమె తిరిగి కాపురానికి రావ డం లేదనే అక్కసుతో అతను తన కుమారుడిని హత్య చేశాడు. మెదక్ జిలాల్లోని మెదక్ మండలంలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. మెదక్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద బాయి తండాకు చెందిన భాస్కర్ తన భార్య అమీనాపై అనుమానంతో తరచూ గొడవ పడుతుండేవాడు.ఈనెల 19న సాయంత్రం భాస్కర్ తన భార్యను కొట్టడంతో ఆమె పిల్లలను వదిలివేసి తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో తిరిగి కాపురం చేసేందుకు రావడంలేదనే కోపంతో అతను శనివారం రాత్రి నిద్రిస్తున్న తన చిన్న కుమారుడు లక్కీ(3)ని గొంతు నొలిమి చంపాడు. ఈ ఘటనపై తల్లి అమీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్ రూరల్ ఎస్ఐ లింగం తెలిపారు. ప్రస్తుతం చిన్నారి లక్కీ మృతదేహాన్ని మెదక్‌జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. -
భయపెడుతున్న ‘గోస్ట్ పేరింగ్ ఎటాక్’
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తు వేస్తూ మోసాలకు తెరతీస్తున్నారు. తాజాగా నెటిజన్లను లక్ష్యంగా చేసుకుంటూ గోస్ట్ పేరింగ్ ఎటాక్ (వాట్సాప్ టేక్ఓవర్)ను, క్రోమ్ ఎటాక్‌లు మొదలు పెట్టినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) హెచ్చరించింది. క్రోమ్‌లో హానికరమైన, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేస్తే వెంటనే వ్యక్తిగత, బ్యాంకులకు సంబంధించిన సమాచారం చోరీ చేస్తున్నట్టు టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. అదేవిధంగా వాట్సాప్‌లో వచ్చే సందేశాల్లో ఉండే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయగానే సైబర్‌నేరగాళ్లు గోస్ట్ పేరింగ్ ఎటాక్‌కు తెరతీస్తున్నట్టు తెలిపారు. లింక్‌పై క్లిక్ చేయగానే మనకు తెలియకుండానే మన వాట్సాప్ అకౌంట్‌ను సైబర్‌నేరగాళ్లు వారి డివైజ్‌లో లింక్ చేస్తున్నట్టు తెలిపారు. ఇలా వాట్సాప్ లింక్ అయిన తర్వాత మనకు వచ్చే.. మనం పంపే మెసేజ్‌లను, చాట్లను సీక్రెట్‌గా గమనిస్తూ మన నుంచి సమాచారం సేకరిస్తుంటారని చెప్పారు. అయితే గోస్ట్ ఎటాక్ జరిగినప్పటికీ మన వాట్సాప్ సాధారణంగానే పనిచేస్తుందని తెలిపారు. మీ వాట్సాప్ ఇతరులు లింక్ చేసుకున్నట్లు అనుమానిస్తే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చేయకూడనివి..» ఓటీపీ, పిన్, సీవీవీ లేదా వాట్సాప్ కోడ్లు ఎవరికీ ఎప్పుడూ షేర్ చేయొద్దు. » ఎస్ఎంఎస్లు, ఈ–మెయిల్స్‌లో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయొద్దు. » తెలియని వెబ్సైట్లు లేదా పాప్–అప్లలో లాగిన్ కావొద్దు. చేయాల్సినవి..»వాట్సాప్ లింక్ చేసిన పరికరాలను తనిఖీ చేయండి.» ఏదైనా అనుమానాస్పదంగా డివైజ్‌లు లింక్ అయినట్టు కనిపిస్తే వెంటనే వాటిని తీసివేయండి.» వాట్సాప్‌లో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యాక్టివేట్ చేసుకోవాలి. » మీకు సంబంధించిన కీలక సమాచారం. ఫొటోలు, వీడియోలు వేరేచోట కాపీ చేసి పెట్టుకోండి.» అనుమానాస్పద సందేశాలు, లింక్‌లు, పాప్–అప్ల స్క్రీన్షాట్లను తీసుకోండి. » లావాదేవీ ఐడీలు, యూటీఆర్ నంబర్లు, కాల్ లాగ్లను సేవ్ చేయండి.» గూగుల్ క్రోమ్ తాజా వెర్షన్‌ను అప్డేట్ చేయండి.» ఈ–మెయిల్, బ్యాంకింగ్, సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను మార్చండి.» మీ బ్యాంక్‌లకు అనుమానాస్పద లావాదేవీల సమాచారం వెంటనే తెలియజేయండి. » క్రోమ్, ఇతర యాప్‌లను ఎల్లప్పుడూ అప్డేట్ చేస్తూ ఉండాలి. -
దారి తప్పుతున్న యువ ఖాకీలు
ఒకప్పుడు సరదాగా మొదలైన బెట్టింగ్ ఇప్పుడు అనేక మందికి వ్యసనంగా మారింది. అయితే కేవలం సాధారణ పౌరుల జీవితాలను మాత్రమే ఛిన్నాభిన్నం చేస్తోందని అనుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఈ మహమ్మరి కోరల్లో చిక్కుకుని పోలీస్ సిబ్బంది కూడా దారి తప్పుతున్నారు. అందుకు వరుసగా వెలుగుచూసిన ఉదంతాలే కారణం!ఆన్లైన్ బెట్టింగ్తో అప్పులపాలై.. సర్వం కోల్పోయి.. తన దగ్గర గన్‌మెన్‌గా పని చేస్తున్న కృష్ణ చైతన్య ఆత్మహత్యకు ప్రయత్నించాడని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతకు ముందు.. ఈ వలయంలో చిక్కుకున్న ఓ అధికారి(అంబర్‌పేట ఎస్సై భానుప్రకాశ్) దాని నుంచి బయటపడేందుకు ఏకంగా సర్వీస్ రివాల్వర్‌తో పాటు ఓ కేసులో రికవరీ బంగారాన్ని తాకట్టపెట్టాడనే అభియోగాల కింద విచారణ ఎదుర్కొంటున్నారు.ఈ మధ్యలో.. నగరంలోని ఉప్పల్‌లో ఫిల్మ్‌నగర్ పీఎస్‌లో పని చేసే ఓ యువ కానిస్టేబుల్ ఆన్లైన్ బెట్టింగ్‌ల ఉన్న ఇంటిని అమ్మేసుకుని.. విధులకు దూరంగా ఉంటూ వస్తూ.. చివరకు ఒత్తిళ్ల నడుమ మానసికంగా కుంగిపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అలాగే ఆ మధ్య సంగారెడ్డి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పని చేసిన ఓ కానిస్టేబుల్ పిస్టల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఈ భూతమే ఉందనే ప్రచారం నడిచింది. చిన్న మొత్తాలతో ప్రారంభించిన ఆన్లైన్ గేమింగ్ వ్యసనం.. ఆ తరువాత పెద్ద అప్పులకు దారితీస్తోంది. గేమ్‌లలో డబ్బులు కోల్పోయి, సహోద్యోగులు.. స్నేహితుల వద్ద అప్పులు చేసి తిరిగి ఇవ్వలేని స్థితికి పోలీసు సిబ్బంది చేరుకుంటున్నారు. అప్పులు తీర్చమని ఒత్తిడి పెరగడంతో చివరకు.. మానసికంగా తీవ్రంగా కలత చెంది తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.బెట్టింగ్ మహమ్మారి కోరల్లో పోలీసులు.. అందునా యువ సిబ్బంది చిక్కుకుపోతుండడం ఇటు ఉన్నతాధికారులకూ ఆందోళన కలిగిస్తోంది. బెట్టింగ్ వ్యసనం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన ఉండి.. అందునా టెక్నాలజీపై పట్టుఉన్న సిబ్బంది కూడా ఆ వ్యసనంలో మునిగిపోతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అంటున్నారు. దీన్ని అత్యవసరంగా కట్టడి చేసేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం పోలీస్ శాఖలో బలంగా వినిపిస్తోంది. -
గన్‌మెన్ ఆత్మహత్యాయత్నంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పంధన
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్‌లో గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు గన్‌మ్యాన్‌గా పనిచేస్తున్న చైతన్య ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గన్‌మెన్ కృష్ణ చైతన్య ఇంట్లోనే తన వద్ద ఉన్న తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే చైతన్యను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం చైతన్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు చైతన్య ఇటీవలే ఓ బెట్టింగ్ యాప్‌లో భారీగా డబ్బు పోగొట్టుకున్నట్టు సమాచారం. దాంతో ఏర్పడ్డ ఆర్థిక సమస్యలే ఈ అఘాయిత్యానికి కారణంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈ విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. చైతన్య విషయాన్ని సంచలనం చేయవద్దని మీడియాను కోరుతున్నాను. ఈరోజు ఉదయం ఎల్బీ నగర్ కామినేనిలో కానిస్టేబుల్ చైతన్యను కలిశాను. అతని పరిస్థితి విషమంగా ఉంది. అతను ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దాదాపు 2 సంవత్సరాల క్రితం బెట్టింగ్ యాప్‌లు/గేమింగ్ యాప్‌లలో పాల్గొనడం వల్ల అతను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు.అప్పుల కారణంగా అతని జీతంలో ఎక్కువ భాగం కట్ అవుతోంది.ఈరోజు ఉదయం అతను ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతను బతికే ఉన్నాడు. సర్జరీ జరుగుతోంది. బతికే అవకాశాలు మాత్రం చాలా తక్కువ. దాదాపు 3 నెలల క్రితం అతను కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఇంటి నుండి వెళ్లిపోయాడు. దాంతో అప్పుడు హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. అప్పటి నుండి అతను నాడీ సంబంధిత సమస్యలతో (మెదడు గడ్డకట్టడం) బాధపడుతున్నాడు. అయితే అతను విధుల్లో మాత్రం బాగానే ఉన్నాడని రంగనాథ్ తెలిపారు. -
చివరి ఊపిరి… ట్రక్కు కిందే!
చలికాలం.. మిట్ట మధ్యాహ్నాం.. సూర్యుడి వెచ్చని కిరణాల్ని ఆస్వాదిస్తూ తన ఇంటి ముందు ప్రశాంతంగా కూర్చున్నాడు ఆ పెద్దాయన. కానీ, ఒక్క నిమిషంలోనే ఆయన జీవితం తలకిందులైంది. ఈ ఘోరానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో 90 ఏళ్ల గిర్రాజ్ శర్మ అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకున్నారు. ఒక ట్రక్కు కింద నలిగిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీ ద్వారా నెట్టింటకు చేరాయి. డిసెంబర్ 19వ తేదీన మధ్యాహ్నాం 12-1 గంట మధ్య ఈ ఘటన జరిగింది.గిర్రాజ్ శర్మ తన ఇంటి వరండాలో కూర్చుని ఉన్నారు. ఇంతలో కంకర లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు.. ఆయన ఇంటి ముందు నుంచి మలుపు తిరిగింది. అయితే ఆ టర్నింగ్లో రోడ్డు సరిగ్గా లేక టైర్ పేలిపోయింది. ఈ పరిణామంతో వాహనం కంట్రోల్ కాకపోవడంతో.. పక్కకు ఒరిగి గిర్రాజ్ మీదకు ఒరిగిపోయింది. అలా ఊహించలేని దుర్ఘటన ఆ వృద్ధుడి ప్రాణం తీసింది.ఆరోగ్యంగా ఉన్న గిర్రాజ్ ఇలా అనూహ్యంగా ప్రాణం పొగొట్టకోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. స్థానికులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు.. రోడ్డు భద్రత, భారీ వాహనాల నిర్వహణపై ఈ ఘటన మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. 𝑵𝒐 𝒐𝒏𝒆 𝒌𝒏𝒐𝒘𝒔 𝒘𝒉𝒆𝒏 𝒅𝒆𝒂𝒕𝒉 𝒘𝒊𝒍𝒍 𝒂𝒓𝒓𝒊𝒗𝒆…In Gwalior, Madhya Pradesh, 90-year-old Girraj Sharma was simply sitting outside his home, quietly soaking in the winter sun. In a cruel twist of fate, a gravel-laden dumper lost control after a tyre burst and… pic.twitter.com/uAdXECIaxM— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) December 21, 2025 -
ఆత్మహత్యా..? జారి పడ్డారా..?
యాదగిరిగుట్ట రూరల్: నవ దంపతుల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వేస్టేషన్ శివారులో గురువారం అర్ధరాత్రి మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి జారిపడి నవ దంపతులు కోరాడ సింహాచలం (25), కొంగరపు భవాని(19) మృతి చెందారు. చనిపోవడానికి ముందు రైలు లో సింహాచలం, భవాని ఏదో విషయంపై గొడవ పడుతుండగా, తోటి ప్రయాణికులు తీసిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో గొడవ జరిగిన తర్వాతే భార్యాభర్తలిద్దరూ రైలు నుంచి కిందపడిపోయారని తెలుస్తోంది. ముందుగా నిర్ణయించుకొని ఆత్మహత్య చేసుకున్నారా.? లేదా భార్యను సముదాయిస్తున్న క్రమంలో ఇద్దరూ కలిసి జారి పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో ఎవరు చిత్రీకరించారనే దానిపై రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. -
కొడుకులు కాదు.. దుర్మార్గులు
ఆ పెద్దాయన్ని పాము కాటేసింది. స్థానికులు సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. హమ్మయ్యా.. అనుకుంటున్న టైంలో వారం వ్యవధిలోనే మరోసారి పాము కాటుకు గురయ్యాడు. ఈసారి ఆస్పత్రికి వెళ్లడం బాగా ఆలస్యమై ప్రాణం పోయింది. అయితే కొడుకుల దొంగ చూపులు.. పొంతన లేని సమాధానాలు.. వాళ్ల కాల్ డాటా.. తండ్రి ఇన్సూరెన్స్ సొమ్ము కోసం పడ్డ తాపత్రయం.. ఇది పక్కా స్కెచ్చేసి చేసిన హత్య అని బయటపెట్టాయి. తండ్రికి రూ.3 కోట్ల దాకా బీమా చేయించి.. ఆపై పాము కాటుతో చంపించిన అమానవీయ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగింది. రకరకాల వ్యాపారాలు చేసి.. అప్పుల పాలైన ఇద్దరు తనయులు తమ స్నేహితుల సాయంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పోలీసులు నిర్ధారించారు. ఒకసారి స్థానికులు తండ్రిని రక్షించగా.. మరోసారి ఎలాంటి ఆటంకం లేకుండా తమ ప్లాన్‌ను అమలు పరిచారు ఈ దుర్మార్గులు. ఈ ఘోరం వివరాల్లోకి వెళ్తే.. పొదటూర్పేట్ గ్రామానికి చెందిన ఈపీ గణేశన్(56).. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. అక్టోబర్ 22వ తేదీన పాము కాటుతో ఇంట్లోనే ఆయన చనిపోయారు. అయితే.. వారం తిరగకుండానే కుటుంబం ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేయడంతో ఆ కంపెనీ వాళ్లకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఈ విషయం చేరవేయడం.. వాళ్లు దర్యాప్తును ముమ్మరం చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. గణేష్ కొడుకు మోహన్‌రాజ్(26), హరిహరన్(27) ప్రైవేట్ ఉద్యోగులు. అయితే ఆన్లైన్ బెట్టింగ్‌లు, ఇతర విలాసాల కోసం అడ్డగోలుగా అప్పులు చేసి ఉన్నారు. ఈ క్రమంలో తండ్రి పేరిట ఇన్సూరెన్స్‌లు చేయించి హతమార్చాలనే దుర్మార్గపు ఆలోచన చేశారు. దీనికి నలుగురు స్నేహితుల సాయం కోరారు. అక్టోబర్ 15వ తేదీన ఒక పామును గణేశన్ మీదకు వదిలారు. అది కాలి మీద కాటేయడంతో.. ఆయన నొప్పితో అరిచారు. దీంతో స్థానికులు ఆస్పత్రికి తరలించి రక్షించారు. వారం తర్వాత ఈసారి మరింత విషపూరితమైన పామును తెచ్చి మెడ మీద కాటు వేయించారు. ఈసారి ఆయన అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. తలుపులు వేసి ఉండిపోయారు. ఆపై చాలా ఆలస్యంగా ఆస్పత్రికి తరలించారు. దీంతో పాము పగ బట్టి చంపిందంటూ స్థానికంగా ప్రచారం జరిగింది.అయితే.. వారం తిరగకుండానే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కొడుకులు క్లెయిమ్‌కు దిగడంతో ఓ ఇన్సూరెన్స్ కంపెనీకి అనుమానం వచ్చింది. ఏజెంట్‌తో దర్యాప్తు చేయించే క్రమంలో వరుసగా పాము కాటుకు గురికావడం, ఆస్పత్రికి ఆలస్యంగా వెళ్లడం లాంటి విషయాలు తెలిశాయి. దీంతో పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. డిసెంబర్ 6వ తేదీన నార్త్ జోన్ ఐజీ అస్రా గార్గ్.. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఆ ఇద్దరు కొడుకుల ఫోన్ కాల్స్ రికార్డింగులు.. ఆర్థిక లావాదేవీల ఆధారంగా తండ్రిని పాము కాటుతో హత్య చేయించినట్లు నిర్ధారించుకున్నారు. నిందితులిద్దరితో పాటు వాళ్లకు సహకరించిన నలుగురిని శుక్రవారం అరెస్ట్ చేశారు. -
మీర్‌పేట మాధవి కేసులో షాకింగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్‌పేట మాధవి హత్య కేసు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. భర్త గురుమూర్తే ఆమెను కిరాతకంగా హతమార్చాడని పోలీసులు సైంటిఫిక్ ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. ఈ క్రమంలో మరదలితో గురుమూర్తి వివాహేతర సంబంధ వ్యవహారమే ఈ హత్యకు కారణమని నిర్ధారణ అయ్యింది.మీర్‌పేట మాధవి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మరదలితో గురుమూర్తి వివాహేతర సంబంధం నడిపిన గురుమూర్తి.. దానికి అడ్డుపడుతోందనే భార్య మాధవిపై ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ఈ మేరకు కేసు దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలను తాజాగా ఆధారాలతో సహా పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ ఏడాది జనవరిలో.. వెంకట మాధవి(35) అనే మహిళ కనిపించడం లేదని ఆమె తల్లి మీర్‌పేట పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరిపారు. అయితే విచారణలో తన భార్యను తానే చంపినట్లు భర్త పుట్టా గురుమూర్తి అంగీకరించాడు. మాజీ ఆర్మీ జవాన్ అయిన పుట్టా గురుమూర్తి(39).. డీఆర్డీవోలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలోనే భార్య మాధవితో పలుమార్లు గొడవలు జరిగాయి. అయితే చాలాసార్లు పంచాయితీ చేసినప్పటికీ గురుమూర్తి తీరు మారలేదు. ఈ క్రమంలోనే మాధవితో గొడవ పడి.. ఆమెను దారుణంగా హతమార్చాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. వివాహేతర సంబంధం విషయంలో మాధవి-గురుమూర్తి మధ్య గొడవ జరిగింది. మాధవిని గొంతు నులిమి చంపి ఆపై ముక్కలు చేసిన గురుమూర్తి.. శరీర భాగాలను కుక్కర్లో ఉడికించి.. ఎముకలను గ్రైండర్ చేసి జిల్లెలగూడలోని చెరువులో కలిపాడు. మాధవిది హత్యగా తెలిశాక పోలీసులు ఇంటి నుండి స్టౌ, కత్తి, రోలర్, వాటర్ హీటర్, బట్టలు వంటి ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. గురుమూర్తిపై హత్య, ఆధారాలను నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో శరీర భాగాలు దొరకడం కష్టం కావడంతో ఈ కేసు వీగిపోతుందని అంతా భావించారు. అయితే.. అతికష్టం మీద సైంటిఫిక్ ఆధారాలను సేకరించిన పోలీసులు తాజాగా వాటిని కోర్టు ముందు ఉంచారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో.. హత్యకు గల కారణాలపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. చివరకు వివాహేతర సంబంధం కారణంగానే మాధవిని గురుమూర్తి కడతేర్చినట్లు తేలింది. -
సర్పంచ్ విజయోత్సవాల నడుమ దారుణం..
మహబూబ్‌నగర్ జిల్లా: మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగికదాడికి పాల్పడడంతో ఆమె మృతి చెందింది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ యువతి (22) ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. బుధవారం రాత్రి సర్పంచ్ ఎన్నికల విజయోత్సవాలు జరుగుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన విష్ణు మాట్లాడాలని చెప్పి ఆ యువతిని రైతువేదిక వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అధిక రక్తస్రావం కావడంతో ఆ యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే అతను ఇతరుల సాయంతో స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. చుట్టు పక్కల వారు తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె కూడా అక్కడకు వచి్చంది. అప్పటికే ఆ యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికుల సాయంతో అంబులెన్స్‌లో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ యువతి మృతి చెందినట్టు తెలిపారు. మృతదేహాన్ని అదే రోజు రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ఘటనా స్థలాన్ని మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సీఐ రామకృష్ణ, మూసాపేట ఎస్ఐ వేణు పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో గ్రామంలో విచారణ జరిపారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అత్యాచారం, అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ వేణు చెప్పారు. యువకుడు ఒక్కడే అత్యాచారం చేశాడా... ఇతరుల ప్రమేయం ఉందా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
లవ్ మ్యారేజ్ చేసుకుని..కొట్టి చంపేశాడు
తాండూరు టౌన్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అతి కిరాతకంగా కొట్టి చంపిన కేసులో ముగ్గురికి రిమాండ్ విధించినట్లు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. పట్టణంలోని సాయిపూర్‌కు చెందిన పరమేశ్, తన భార్య అనూష (20)ను వరకట్నం తీసుకురావాలంటూ గురువారం కర్రతో కొట్టి దారుణంగా హత్య చేసి పరారైన విషయం విదితమే. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతురాలి భర్త పరమేశ్, అతని తల్లిదండ్రులు లాలమ్మ, మొగులప్పను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కీలకంగా మారిన సీసీ పుటేజీ.. ఈ హత్య కేసులో నిందితుడి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయిన పుటేజీ కీలకంగా మారింది. ఈ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం లావుపాటి కర్రతో అనూష తలపై విచక్షణా రహితంగా దాడి చేస్తున్నట్లు నిక్షిప్తమైంది. Sensitive Content సీసీ ఫుటేజ్.. ప్రేమించి పెళ్లాడిన యువతిని కిరాతకంగా కొట్టి చంపిన భర్తతాండూరులోని సాయాపూర్లో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు..కట్నం తేవాలని దూషిస్తూ, కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అనూష.. చికిత్స మృతియువకుడి… https://t.co/ujX5RCu0jI pic.twitter.com/gnlmskOTnv— Telugu Scribe (@TeluguScribe) December 19, 2025 ప్రేమించి.. పెళ్లి చేసుకుని.. -
ఏనుగుల మందను ఢీ కొట్టి.. అస్సాంలో రైలు ప్రమాదం
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏనుగుల మందను ఢీ కొట్టడంతో ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది ఏనుగులు మృతి చెందినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ప్రయాణికులెవరికీ గాయాలు కూడా కాలేదు.సైరాంగ్ నుంచి న్యూఢిల్లీ బయల్దేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్ (Rajdhani Express) అర్ధరాత్రి 2గం. సమయంలో హొజాయ్ జిల్లా పరిధిలో వెళ్తోంది. ఆ సమయంలో పట్టాలు దాటుతున్న ఏనుగుల మందను రైలు ఢీకొట్టింది. రైలు ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. రైలు ఢీకొనడంతో 8 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఏనుగు గాయపడింది. ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని నార్త్ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.రైల్వే, అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలపై ఏనుగుల మందను చూడగానే లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడని, అయినప్పటికీ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ప్రమాదం కారణంగా ఈ మార్గంలోని రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు రైళ్లను దారి మళ్లించారు.ఈశాన్య రాష్ట్రాల్లో ఏనుగుల మందలు ఇలా పట్టాలు దాటుతూ ప్రమాదాలకు గురవుతుంటాయి. అయితే.. తాజాగా ఘటన జరిగిన హోజాయ్ జిల్లా ప్రాంతం ఎలిఫెంట్ కారిడార్ కాదని రైల్వే అధికారులు చెబుతున్నారు. -
70 ఏళ్లొచ్చినా.. రోజూ లైంగిక వేధింపులే
కర్ణాటక: 70 ఏళ్ల వయసు వచ్చింది, రోజూ సతాయిస్తూ నరకం చూపుతున్నాడు అని భర్త మీద 65 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ప్రిన్సిపాల్ గోవిందరాజనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చెప్పిన మాట వినడం లేదని నేను, నా ఇద్దరు కుమారులు 8 రోజుల్లోగా ఇంటి నుంచి బయటికి వెళ్లాలని భర్త లీగల్ నోటీస్ ఇచ్చాడని తెలిపింది.హత్య బెదిరింపులు..వివరాలు.. బాధితురాలు ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్ పనిచేసి రిటైరయ్యారు. ఆమె మంచి హోదాలో ఉండడం భర్తకు నచ్చేది కాదు. జీతం, గ్రాట్యూటీ, పింఛన్, ఆస్తులను తన పేర మార్చాలని ఒత్తిడి చేసేవాడు. అతడు 1993లో కుద్రేముఖ్‌లో గనులలో ఉద్యోగం చేస్తూ మానేశాడు. అప్పటి నుంచి భార్యను లైంగిక క్రియ కోసం రోజూ వేధిస్తున్నాడు. అయినా సహిస్తూ వచ్చింది. నవంబరు 22 తేదీన బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు, ప్రతిఘటిస్తే గొంతునులిమి, కొట్టి, దూషించాడు. అంతేగాక తన ఇద్దరు కుమారులను హత్యచేస్తానని బెదిరించాడని మహిళ ఫిర్యాదులో తెలిపింది. ఇంటి సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డయినట్లు తెలిపింది. తనకు గుండెకు బైపాస్ సర్జరీ అయ్యిందని, శ్వాసకోశ జబ్బుతో చికిత్స పొందుతున్నానని, భర్తకు ఏమాత్రం జాలి, దయ లేదని వాపోయింది. పోలీసులు విచారణకు హాజరుకావాలని సదరు శాడిస్టు భర్తకు నోటీస్ జారీచేశారు. -
తండ్రి భయంతో బాల్కనీ దాటే ప్రయత్నం..
రామచంద్రాపురం (పటాన్చెరు): ఇంట్లో స్నేహితుడితో ఉన్న సమయంలో అకస్మాత్తుగా తండ్రి రావడం చూసి భయపడిన కూతురు.. తమ బాల్కనీ నుంచి మరో బాల్కనీకి వెళ్లే ప్రయత్నంలో ఎనిమిదో అంతస్తు పైనుంచి కిందపడి మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పరిధిలోని ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ కేసీఆర్ నగర్లో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. కొల్లూరు సీఐ గణేశ్ పటేల్ కథనం ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీలో నివాసముండే యువతి (20) ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. అక్కడ ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ యువతి కుటుంబానికి తెల్లాపూర్ పరిధిలోని ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఇల్లు ఉంది. కాగా గురువారం స్నేహితుడితో కలిసి కేసీఆర్ నగర్ కాలనీలోని 8వ అంతస్తులో ఉన్న తమ ఇంటికి వచ్చింది. వారిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో రేషన్ బియ్యం తీసుకునేందుకు నగరం నుంచి యువతి తండ్రి అక్కడికి వచ్చాడు. తలుపులకు తాళం తీసి ఉండటంతో.. లోపల ఎవరున్నారని అతను గట్టిగా అరిచాడు. తండ్రి మాటలు విన్న యువతి భయంతో ఎనిమిదో అంతస్తు బాల్కనీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పక్క బాల్కనీలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే పట్టుతప్పి ఆమె పైనుంచి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను కొట్టి చంపిన భర్త
ధరూరు: దంపతుల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ చివరకు భార్య హత్యకు దారితీసింది. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం నెట్టెంపాడు గ్రా మానికి చెందిన కుర్వ గోవిందు– జమ్ములమ్మ (28) దంపతులకు ఇద్దరు కుమారులు. గురువారం రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. శుక్రవారం తెల్లవారుజామున వారి మధ్య చిన్నపాటి గొడవ జరి గింది. మాటామాట పెరిగి కొట్టుకునే స్థితికి దారి తీయగా.. పెద్ద కుమారుడు మల్లికార్జున్ సర్దిచెప్పేందు కు ప్రయత్నించగా.. తండ్రి అతడిని కట్టెతో కొట్ట డంతో తీవ్ర గాయాల య్యాయి. ఈ క్రమంలో జమ్ములమ్మ గటిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. భార్య జమ్ములమ్మ బయటకు పరుగులు తీయగా.. గోవిందు జమ్ములమ్మను వెంటాడి అందరి ముందే కట్టెతో కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న రేవులపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గోవిందును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు ధరూరు ఎస్ఐ శ్రీహరి తెలిపారు. -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
పాల్వంచ: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య.. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించింది. పోలీసులకు అందిన ఫిర్యాదుతో విచారణ చేపట్టగా విషయం బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ సతీష్ శుక్రవారం ఆ వివరా లు వెల్లడించారు. పాల్వంచ వెంగళరావుకాలనీకి చెందిన ధరావత్ హరినాథ్ (39) ఈనెల 15న తెల్లవా రుజామున ఇంటి వెనుకభాగంలో స్లాబ్ హుక్కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ఆయ న భార్య శ్రుతిలయ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.అయితే శ్రుతిలయకు మరో వ్యక్తితో వివాహే తర సంబంధం ఉందని, గతంలో పంచాయితీ చేసినా మార్పు రాలేదని హరినాథ్ తల్లి మంగమ్మ పోలీసు లకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు శ్రుతిలయను విచారించగా అసలు విషయం బయటపడింది.అడ్డుగా ఉండడంతో...హరినా«థ్ భార్య శృతిలయ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా ములుగు జిల్లా వెంకటాపురం డివిజన్ పెనుగోలు బీట్‌లో విధులు నిర్వర్తిస్తోంది. ఆమె చర్ల మండలంలో పనిచేసినప్పుడు లింగాపురానికి చెందిన జర్నలిస్టు కొండా కౌషిక్‌తో పరిచయం ఏర్పడి..అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో హరినాథ్‌ను హత్య చేయాలని పథకం పన్నింది. ఈనెల 15వ తేదీన హరినా«థ్ మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తుండగా కౌషిక్‌కు శ్రుతిలయ సమాచారం ఇచ్చింది. ఆయన తనతోపాటు ఏపీలోని ఏటపాక రాయన్నపేటకు చెందిన బంధువు డేగల భాను, చర్లకు చెందిన స్నేహితుడు చెన్నం మోహన్‌ను తీసుకొచ్చాడు. నిద్రలో ఉన్న హరినాథ్ గొంతు నులిమి హత్య చేశాక స్లాబ్ హుక్కు ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారు. పోలీసుల విచారణలో విషయం బయటపడడంతో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ సతీశ్‌కుమార్, ఎస్ఐలు సుమన్, జీవన్‌రాజ్, సిబ్బంది పాల్గొన్నారు. -
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం
విశాఖపట్నం: సింహాచలం సింహపురి కాలనీ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించేలోపే ముగ్గురు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుల గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
పాపం.. ఫుట్బాల్లా తన్నాడు..వైరల్ వీడియో
బెంగళూరులో జరిగిన అనూహ్య సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లితో కలిసి ఆడుకుంటున్న పిల్లవాడిని ఒక వ్యక్తి అమాంతం తోసి వేసిన ఘటన నెట్టింట దిగ్భ్రాంతి రేపుతోంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో వైరల్‌గా మారింది.డిసెంబర్ 14న ఆ బాలుడు నీవ్ జైన్ తన అమ్మమ్మ ఇంటి దగ్గర ఇతర పిల్లలతో ఆడుకుంటుండగా ఈ సంఘటన జరిగింది. త్యాగరాజనగర్ ప్రాంతంలోని ఒక వీధిలో ఐదేళ్ల బాలుడు తోటిపిల్లలతో ఆటుకుంటున్నాడు. తల్లి కూడా అక్కడే ఉంది. ఇంతలో వెనకనుంచి వ్యక్తి ఆ బాలుడిని గట్టిగా కాలితో తన్నాడు. ఊహించని పరిణామానికి బాలుడు బొక్కబోర్లా పడిపోయాడు.A five-year-old boy was allegedly assaulted by a passerby in Bengaluru’s #Thyagarajanagar area, with CCTV footage capturing the incident. Police arrested the accused, who was later released on bail, and further investigation is underway. #Bengaluru #Banashankari pic.twitter.com/eWeZpN9nIC— Madhuri Adnal (@madhuriadnal) December 19, 2025 ఈ సంఘటన సిసిటివిలో రికార్డైంది. బాలుడి తల్లి దీపిక జైన్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, నిందితుడిని అరెస్ట్ చేశారు. తరువాత బెయిల్‌పై విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.తదుపరి దర్యాప్తు జరుగుతోంది. తన కొడుకును "ఫుట్‌బాల్ లా" తన్నాడని, దీంతో కనుబొమ్మల వద్ద గాయం రక్త స్రావమైందని, కాళ్లు, చేతులకు కూడాగాయాలైనాయని తల్లి ఆరోపించింది. మరోవైపు నిందితుడిని అదే ప్రాంతానికి చెందిన రంజిత్‌గా గుర్తించారు. ఇతను మాజీ జిమ్ ట్రైనర్ కూడా అట. ఉద్యోగాన్ని వదిలేసినట్టు సమాచారం. నిందితుడు ఈ ప్రాంతంలో ప్రజలపై దాడి చేయడం, దుర్భాషలాడడం లాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటాడట.ఇవీ చదవండి: ట్వీట్స్‌తో మోత మోగించిన ప్రధాని మోదీబెట్టింగ్ యాప్స్ : యూట్యూబర్ హై-ఎండ్ స్పోర్ట్స్ కార్లు చూసి ఈడీ షాక్! -
విజయవాడలో ‘10 రూపాయల’ హత్య
సాక్షి, విజయవాడ: విజయవాడలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు రూ.10 రూపాయలు ఇవ్వలేదని తాతని మనవడు హత్య చేశాడు. హత్య చేసిన బాలుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. విజయవాడ కొత్తపేట పీఎస్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. రక్తపు మడుగులో ఉన్న వృద్ధుడ్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు.నగరంలో ఈ ఘటన కలకలం రేపింది. మృతుడు తాపీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఆయన స్వస్థలం మంగళగిరి నుకలపేట కాగా ఉపాధి నిమిత్తం విజయవాడలో ఉంటున్నాడని పోలీసులు చెప్పారు.మరో ఘటనలో బందరు లాకులు వద్ద అనుమానాస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతి చెందినవారు యాచకులుగా స్థానికులు చెబతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. -
బెట్టింగ్ యాప్స్ : యూట్యూబర్ హై-ఎండ్ స్పోర్ట్స్ కార్లు చూసి ఈడీ షాక్!
ఆన్లైన్ బెట్టింగ్, గాంబ్లిక్ యాప్‌లతో యూట్యూబర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు కోట్ల రూపాయలు దండుకున్నారనే విషయాన్ని విన్నాం. అక్రమ సంపాదనతో వారు గడిపే విలాసవంతమైన జీవితం గురించి తెలుసుకున్నాం కానీ, ఉత్తర ప్రదేశ్‌లోని ఒక యూట్యూబ్ అక్రమ సంపాదన, లంబోర్గిని మెర్సిడెస్ బెంజ్‌తో సహాలగ్జరీ కార్ల గురించి తెలుసుకుంటే మాత్రం ఔరా అన్నాల్సిందే. ఇంతకీ ఎవరా యూట్యూబర్? తెలుసుకుందాం పదండి.ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ అనురాగ్ ద్వివేది ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జరిపిన సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా హై-ఎండ్ స్పోర్ట్స్కార్లతో నిండిన గ్యారేజ్ చూసి ఈడీ అధికారులే నివ్వెర పోయారు. లంబోర్గిని ఉరుస్, BMW Z4, మెర్సిడెస్-బెంజ్‌తో సహా నాలుగు హై-ఎండ్ కార్లు వీటిల్లో ఉన్నాయి.బ్యాంకు లావాదేవీలు, ఆస్తి పత్రాలు మరియు డిజిటల్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకుంది. దర్యాప్తు సంస్థకు చెందిన 16 మంది సభ్యుల బృందం బుధవారం నవాబ్‌గంజ్, ఉన్నావ్ మరియు లక్నోలోని అనురాగ్ ప్రాంగణాలపై దాడి చేసింది. యూట్యూబ్ ఛానెల్ ద్వారా ద్వివేది బెట్టింగ్, జూదం యాప్‌లను ప్రమోట్ చేశాడు. ఫలితంగా ఎంతో అమాయకులు ఈ యాప్‌లలో చేరారని, దీంతో చట్టవిరుద్ధ కార్యకలాపాల పరిధిని మరింత విస్తరించారని ఈడీ తెలిపింది. భారతదేశంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాల ద్వారా ద్వివేది సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం స్కై ఎక్స్ఛేంజ్, ఇతర యాప్‌ల నుండి వచ్చాయట. ఇలా వచ్చిన ఆదాయాన్ని వివిధ మార్గాల ద్వారా లాండరింగ్ చేసి, ఆపై లగ్జరీ కార్లు, ఇతర ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించారని ఈడీ అధికారులు తెలిపారు. హవాలా ఆపరేటర్లు, మ్యూల్ ఖాతాలు, మధ్యవర్తుల ద్వారా సేకరించిన నగదు డెలివరీల ద్వారా అనేక అక్రమ ఆస్తిని కూడబెట్టాడు. అతని కంపెనీల బ్యాంకు ఖాతాల్లో, అతని కుటుంబ సభ్యుల ఖాతాలలో అక్రమంగా పెద్ద మొత్తంలో డబ్బు జమ అయింది. దీన్నిభారతదేశం వెలుపల, ముఖ్యంగా దుబాయ్‌లో స్థిరాస్తుల కొనుగోలు కూడా చేశాడని ఈడీ గుర్తించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ అధికారులు ఈ సోదాలు చేపట్టారు. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారో, ఎంత డబ్బు అక్రమంగా సంపాదించారో, ఎక్కడ పెట్టుబడి పెట్టారో అనే దానిపై ఈడీ కూపీ లాగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఆస్తులను స్వాధీనం చేసుకోవడం లేదా ఇతర వ్యక్తులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంచనా.పశ్చిమ బెంగాల్ సిలిగురిలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. సోషల్‌మీడియా ఖాతాలు, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో చట్టవిరుద్ధమైన ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సోను కుమార్ ఠాకూర్, విశాల్ భరద్వాజ్ సహా మరికొంతమంది నిందితులను పోలీసులు గుర్తించారు. ఎవరీ అనురాగ్ఉన్నావ్లోని ఖజూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల అనురాగ్ ద్వివేది ఒకప్పుడు సాధారణ జీవితాన్ని గడిపాడు. పదేళ్ల క్రితం, సైకిల్‌పై ప్రయాణించేవాడు. అతని తండ్రి లక్ష్మీనాథ్ ద్వివేది, మాజీ గ్రామ అధిపతి. అనురాగ్ 2017-18లో క్రికెట్ బెట్టింగ్ నెట్‌వర్క్‌లలో చేరాడు , డ్రీమ్ 11 వంటి ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌ల కోసం వీడియోలను రూపొందించడం ప్రారంభించాడు. అతని అంచనాలు మరియు గేమింగ్ కంటెంట్ అతన్ని ప్రజాదరణ పొందేలా చేసింది. అతనికి యూట్యూబ్‌లో 7 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.దుబాయ్‌లో క్రూయిజ్‌లో అట్టహాసంగా పెళ్లి, క్లూ దొరికింది2024 నవంబర్ 22న అనురాగ్ దుబాయ్‌లో లగ్జరీ క్రూయిజ్‌లో లక్నోకు చెందిన తన ప్రియురాల్ని పెళ్లాడాడు. దాదాపు 100 మంది బంధువులను వివాహానికి విమానాల్లో తరలించాడు. వీరి హోటళ్ళు, ఆహారం అన్ని ఖర్చులను అనురాగ్ భరించాడు. పలు బాలీవుడ్ ప్రముఖులు వివాహానికి హాజరయ్యారు. విలాసవంతమైన ఏర్పాట్లను చూసి బంధువులే ఆశ్చర్యపోయారు. ఇదే ఈడీనిదృష్టికి చేరింది. తాజాగా 12 గంటల పాటు భారీ దాడులు నిర్వహించింది సోషల్ మీడియా ప్రభావాన్ని ఉపయోగించి యువతను ఈ యాప్‌ల వైపు ఆకర్షించాడని ED ఆరోపిస్తోంది. అనురాగ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు. విదేశీ పర్యటనలు, అంతర్జాతీయ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. (ఘోర విమాన ప్రమాదం, నాస్కార్ మాజీ డ్రైవర్‌తో సహా ఏడుగురు దుర్మరణం) -
ఊరు మూరెడు.. పురుళ్లు బారెడు
అది ఒక చిన్న గ్రామం.. జనాభా కేవలం 1500. కానీ, మూడు నెలలుగా అక్కడ పుట్టిన పిల్లల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాలా 27,397..! వినడానికి విడ్డూరంగా ఉన్నా, ఇది మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో వెలుగుచూసిన ఒక భారీ కుంభకోణం. ఈ లెక్కలు చూసి సాక్షాత్తూ అధికారులే కంగుతిన్నారు. ఈ ’జనన ధ్రువపత్రాల’ మాయాజాలం వెనుక ఉన్న అసలు కథేంటి?సర్వేలో సైబర్ నేరం బట్టబయలు యావత్మాల్ జిల్లా ఆర్నీ తహసీల్‌లోని షెందురుసాని గ్రామ పంచాయతీలో.. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి నవంబర్ నెలల మధ్య జనన, మరణ ధ్రువపత్రాల తనిఖీ కోసం అధికారులు ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అప్పుడే అసలు బండారం బయటపడింది. జనాభా 1500 దాటని గ్రామంలో, వేల సంఖ్యలో పుట్టినట్లు నమోదైన గణాంకాలను చూసి ఉన్నతాధికారులకు దిమ్మ తిరిగింది. ఇది కేవలం పొరపాటు కాదు.. ఒక వ్యవస్థీకృత సైబర్ నేరమని అర్థమైంది.కుంభకోణంలోని ప్రధానాంశాలు అన్నీ బయటి పేర్లే: ఈ 27,397 మందిలో 99 శాతం పేర్లు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవని బీజేపీ నేత కిరిత్ సోమయ్య వెల్లడించారు. ఐడీ దురి్వనియోగం: గ్రామం పరిధితో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల పేర్లతో జనన ధ్రువపత్రాలు జారీ అయ్యాయి. భారీ నెట్వర్క్: ప్రభుత్వ పథకాల లబ్ధి కోసమో లేదా నకిలీ గుర్తింపు కార్డుల సృష్టి కోసమో ఈ భారీ స్కామ్ జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.దర్యాప్తు ముమ్మరం ప్రస్తుతం భారతీయ న్యాయ సంహిత, ఐటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఒక చిన్న గ్రామం కేంద్రంగా జరిగిన ఈ భారీ సైబర్ నేరం వెనుక ఎవరున్నారు? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్ర కోణం ఏంటి? అనే దిశగా దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఎంత వేగంగా పెరుగుతుందో, దాన్ని అడ్డు పెట్టుకుని జరిగే మోసాలు కూడా అంతే విస్మయం కలిగిస్తున్నాయి. షెందురుసాని గ్రామంలో వెలుగు చూసిన ఈ ’జననాల పెంపు’ కుంభకోణం ఇప్పుడు మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది.ముంబై నుంచి నియంత్రణప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. గ్రామ పంచాయతీకి చెందిన సీఆర్ఎస్ (సివిల్ రిజి్రస్టేషన్ సిస్టమ్) లాగిన్ ఐడీని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ ఐడీని ముంబై నుంచి నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. గ్రామానికి సంబంధం లేని వ్యక్తుల పేర్లతో ఈ ధ్రువ పత్రాలను సృష్టించారు.రంగంలోకి ఉన్నతాధికారులుఈ ఘటనపై జిల్లా పరిషత్ సీఈవో మందార్ పట్కీ ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా ఆరోగ్య అధికారి ఫిర్యాదుతో యావత్మాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో మాట్లాడినట్లు, ఈ నకిలీ రిజిస్ట్రేషన్లన్నింటినీ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసినట్లు బీజేపీ నేత కిరిత్ సోమయ్య తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అల్లుడితో కలిసి భర్తను చంపిన భార్య
నంద్యాల (అర్బన్): అల్లుడుతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ అల్లుడితోనే కలిసి తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన గురువారం నంద్యాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన సుభద్ర, గుర్రప్ప(40) దంపతులు ఐదేళ్లుగా నంద్యాల శివారులోని నందమూరినగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు తువ్వపల్లె గ్రామానికి చెందిన లింగమయ్యతో మూడేళ్ల క్రితం వివాహం చేశారు.ఈ క్రమంలో సుభద్రకు అల్లుడైన లింగమయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి భర్త గుర్రప్ప పలుమార్లు సుభద్రను హెచ్చరించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. రోజూ ఇంట్లో గొడవ జరుగుతుండటంతో గుర్రప్పను హతమార్చాలని సుభద్ర కుట్ర పన్నింది. గురువారం ఇంట్లో పడుకుని ఉన్న గుర్రప్ప మెడకు సుభద్ర, లింగమయ్య తాడు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపారు. గుర్రప్ప తల్లి సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు భార్య సుభద్రను అరెస్ట్ చేయగా, లింగమయ్య పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
బ్యాంక్ దోపిడీకి స్కెచ్
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి రింగ్ రోడ్డులోని కెనరా బ్యాంక్‌లో దోపిడీకి ఏడుగురు ఆగంతకులు స్కెచ్ వేశారు. బ్యాంక్‌ను దోచుకోవడానికి పట్టపగలు తుపాకులతో చొరబడ్డారు. బ్యాంక్ సిబ్బంది అప్రమత్తమై అలారం ఆన్ చేయడంతో భయపడి దుండగులు పరారయ్యారు. వివరాలు.. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అనకాపల్లి రింగ్ రోడ్డులోని కెనరా బ్యాంక్‌కు ఏడుగురు వచ్చారు. అప్పటికే కొంత మంది ఖాతాదారులు బ్యాంకులో ఉన్నారు. వచ్చిన ఏడుగురిలో ఇద్దరు గేటు వద్ద వేచి ఉండగా.. ఐదుగురు లోపలకు ప్రవేశించారు.కొంత సేపు వారు లోపల అన్ని విభాగాలను పరిశీలించారు. వీరిలో ఒకరు బ్యాంక్ మేనేజర్ దగ్గరకు, మరో వ్యక్తి క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి తుపాకులు తీసి బెదిరించారు. ఈ పరిణామంతో బ్యాంకులోని ఖాతాదారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది తేరుకుని సైరన్ మోగించారు. దీంతో దొంగలు వెంట తీసుకొచి్చన ద్విచక్ర వాహనాలపై రైల్వే స్టేషన్ మీదుగా పారిపోయారు. బ్యాంక్ అధికారులు అనకాపల్లి పోలీస్‌లకు సమాచారం అందించారు. పోలీసులు బ్యాంకుకు చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. -
పసి పిల్లలను విక్రయిస్తున్న ముఠా ఆటకట్టు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఢిల్లీ, ముంబైల నుంచి పసి పిల్లలను తీసుకొచ్చి, పిల్లలులేని దంపతులకు విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టుచేశారు. ఏకకాలంలో దాడులు నిర్వహించి పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై నగరంలోని కొత్తపేట, భవానీపురం, నున్న పోలీస్స్టేషన్ల పరిధిలో కేసులు నమోదుచేశారు. నిందితుల నుంచి ఐదుగురు పసిపిల్లలతోపాటు, రూ.3.30 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు గురువారం మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.విజయవాడ సితార సెంటర్‌కు చెందిన బలగం సరోజిని సులభంగా డబ్బులు సంపాదించేందుకు పిల్లల్లేని వారికి అక్రమంగా పిల్లలను విక్రయించడాన్ని ఎంచుకుంది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన కిరణ్‌శర్మ, ముంబైకి చెందిన కవిత, నూరి, సతీష్ ఆమెకు పరిచయమయ్యారు. వారు అక్కడి నుంచి పసిపిల్లలను తీసుకొచ్చి సరోజినికి ఇచ్చేవారు. ప్రతిఫలంగా వారికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వరకూ సరోజిని ఇచ్చేది. ఇలా తీసుకొచ్చిన చిన్నారులను తిరిగి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయించేది. వీరికి విజయవాడలో మరికొందరు కూడా జతకలిశారు. వీరంతా గతంలో అరెస్టయి జైలుకు వెళ్లొచ్చారు. అమ్మకానికి సిద్ధంగా ఉండగా.. ఇక ఢిల్లీకి చెందిన కిరణ్‌శర్మ, భారతిల నుంచి ఇద్దరు పిల్లలను.. ముంబైకి చెందిన కవిత, నూరి, సతీష్ ల నుంచి మరో ముగ్గురు పిల్లలను సరోజిని తీసుకొచ్చి అమ్మకానికి సిద్ధంగా ఉంచింది. అయితే, పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబుకు ఈ విషయం తెలిసింది. టాస్క్ ఫోర్స్ ఏసీపీ కె. లతాకుమారి, పశ్చిమ ఏసీపీ దుర్గారావు, నార్త్ ఏసీపీ స్రవంతిరాయ్ల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్, భవానీపురం, నున్న ఇన్స్పెక్టర్లు ఏకకాలంలో దాడులు నిర్వహించి కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలో ఐదుగురిని, నున్న పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉడా కాలనీలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నలుగురు పిల్లలను, రూ.3.30 లక్షల నగదును స్వా«దీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి విజయవాడలో వివిధ ప్రాంతాలకు చెందిన బలగం సరోజిని (31), గరికముక్కు విజయలక్ష్మి (41), వాడపల్లి బ్లెస్సీ, ఆముదాల మణి, షేక్ ఫరీనా, వంశీకిరణ్కుమార్, శంక యోహాన్, పతి శ్రీనివాసరావు, సత్తెనపల్లికి చెందిన షేక్ బాబావలి, తెలంగాణలోని ఘట్కేసర్కు చెందిన ముక్తిపేట నందిని.. మొత్తం పదిమందిని అరెస్టుచేసినట్లు సీపీ తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కేజీవీ సరిత, ఏడీసీపీలు జి. రామకృష్ణ, ఏసీపీ కె. లతాకుమారి, ఎన్వీ దుర్గారావు, స్రవంతి రాయ్, పలువురు సీఐలు పాల్గొన్నారు. -
ప్రేమించి.. పెళ్లి చేసుకుని..
తాండూరు టౌన్: ప్రేమించి పెళ్లిచేసుకున్న ఓ యువకుడు ఏడాది తిరగకుండానే భార్యను హత్య చేశాడు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్లో గురువారం ఈ ఘటన జరిగింది. డీఎస్పీ నర్సింగ్ యాదయ్య కథనం ప్రకారం.. తాండూరు మండలం కరన్‌కోట గ్రామానికి చెందిన దస్తప్ప, చంద్రమ్మ దంపతుల కూతురు అనూష (20). భర్త మరణానంతరం చంద్రమ్మ తన కుమార్తెతో కలిసి సాయిపూర్లో ఉండేవారు. ఇదే కాలనీకి చెందిన పరమేశ్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఒకే సామాజికవర్గానికి చెందిన పరమేశ్, అనూష మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇరుకుటుంబాల అంగీకారం మేరకు ఈ ఏడాది మార్చి 12న వీరి వివాహం చేశారు. వివాహం జరిగిన మూడు నెలలనుంచే పరమేశ్.. కట్నం, బంగారం తేవాలంటూ తరచూ భార్యను వేధించడం ప్రారంభించాడు. తల్లిదండ్రులు సైతం అతనికే వంతపాడటంతో తరచూ అనూషను కొడుతుండేవాడు. గురువారం కూడా తన కూతురును కొట్టాడని తెలియడంతో కరన్‌కోట్‌లో ఉన్న తల్లి వచ్చి, అనూషను పుట్టింటికి తీసుకెళ్తుండగా మధ్యలో అడ్డుకున్న పరమేశ్ ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ కర్రతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో అనూష తీవ్రంగా గాయపడింది. కుటుంబీకులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పరమేశ్‌తో పాటు అతని తల్లిదండ్రులు పరారయ్యారు. ఆస్పత్రికి చేరుకున్న మృతురాలి తల్లి, బంధువులు విగతజీవిగా పడి ఉన్న అనూషను చూసి బోరున విలపించారు. చంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. -
క్యాబ్‌లో మహిళ నిద్రలోకి : భారత సంతతి డ్రైవర్ ఘాతుకం
అమెరికాలో భారత సంతతికి చెందిన క్యాబ్ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన క్యాబ్‌లో గాఢంగా నిద్రపోయి, స్పృహ కోల్పోయిన 21 ఏళ్ల యువతిపై అత్యాచారం చేశాడు. నిందితుడిని కాలిఫోర్నియాలోని బేకర్స్ఫీల్డ్ నివాసి భారత సంతతికి చెందిన క్యాబ్ డ్రైవర్ సిమ్రంజిత్ సింగ్ సెఖోన్ (35)గా గుర్తించారు. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు.వెంచురా కౌంటీ షెరీఫ్ కార్యాలయం సమాచారం ప్రకారం నవంబర్ 27 తెల్లవారు జామున 1:00 గంటలకు క్యాబ్ బుక్ చేసుకుంది యువతి. క్యాబ్ రైడ్ సమయంలో దిగాల్సిన చోటు వచ్చినా కూడా గమనించలేనంతగా ఆమె నిద్రలోకి జారిపోయింది. దీనికి తోడు మద్యం సేవించి ఉండటంతో అదే అదునుగా భావించిన సెఖోన్ ఆమెను థౌజండ్ ఓక్స్ బార్ నుండి కామరిల్లోలోని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని పరిశోధకులు తెలిపారు. దీనికి సంబంధించిన ఈ ఏడాది నవంబరులో మొదలైంది. ఈ సందర్బంగా సెఖోన్ బాధితుల సంఖ్య ఇంకా ఉండి ఉండవచ్చని డిటెక్టివ్లు అనుమానిస్తున్నారు.బెయిల్ కోసం రూ. 4.52 కోట్లుసెఖోన్ను డిసెంబర్ 15న అరెస్టు చేసి, అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిపై అత్యాచారం చేసినందుకు ప్రీ-ట్రయల్ డిటెన్షన్ ఫెసిలిటీలో కేసు నమోదు చేశారు. బెయిల్ రుసుము రూ. 4.52 కోట్లు (5లక్షల డాలర్లు) గా నిర్ణయించారు. తదుపరి విచారణ డిసెంబర్ 29న జరగాల్సి ఉంది. అయితే ఈ ఆరోపణలను సెఖోన్ ఖండించారు. అయితే నిందితుడు ఏ రైడ్ షేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు, డ్రైవర్ స్థితి తదితర వివరాలను పోలీసులు వెల్లడించలేదు.ఇదీ చదవండి: రూ. 2400 కోట్ల వివాదం, 87 ఏళ్ల వయసులో నాలుగో భార్యతో బిడ్డకాగా భారతీయ సంతతికి చెందిన డ్రైవర్లు అమెరికా, కెనడాలో ట్రాఫిక్ ఉల్లంఘనలు, మాదకద్రవ్యాలు సేవించి డ్రైవింగ్ చేయడంలాంటి అనేక ఆరోపణల మధ్య తాజా వార్త మరింత కలకలం రేపుతోంది. -
కుక్కర్‌తో కొట్టి చంపేశారు..
ఆధునిక సమాజంలో మనుషులు ఉచ్చం నీచం మర్చిపోతున్నారు. మానవత్వానికే మచ్చతెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. రెంట్ అడిగిన పాపానికి ఇంటి యజమానిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో జరిగిన ఈ సంఘటన వెన్నులో వణుకు పుట్టిస్తోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్టెన్షన్ లోని ఆరా చిమెరా నివాస సముదాయంలో ఈ సంఘటన జరిగింది. ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు గత నాలుగు నెలలుగా అద్దె చెల్లించపోవడంతో ఇంటి యజమాని దీప్శిఖా శర్మ (48) వారిని అద్దె బకాయి చెల్లించమని అడిగింది. అంతే మరునాటికి సూట్‌కేస్‌లో శవమై తేలింది.అద్దెకు అడిగినప్పుడు ఇంటి యజమానిని హత్య చేసినందుకు ఒక జంటను అరెస్టు చేశారు. మృతదేహాన్ని అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లోని సూట్‌కేస్ నుండి స్వాధీనం చేసుకున్నారు, ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు.హత్య ఎలా జరిగింది?ఉమేష్ శర్మ వ దీప్శిఖా శర్మ సొసైటీలో రెండు ఫ్లాట్లను కలిగి ఉన్నారు. ఒక ఫ్లాట్‌లో వారు ఉంటూ, మరొకదానిని అద్దెకిచ్చారు. ఇందులో అజయ్ గుప్తా , అకృతి గుప్తా దంపతులు నివసిస్తున్నారు. అజయ్ గుప్తా రవాణా వ్యాపారంలో ఉన్నాడు. నాలుగు నెలలుగా అద్దె చెల్లించలేదు, వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన దీప్ శిఖబుధవారం, గుప్తా దంపతుల ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో, ఆమె భర్త ఇంట్లో లేడు. అయితే దీప్శిఖ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో పని మనిషి మీనా ఆమె కోసం వెతకడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే గుప్తా దంపతుల ఇంటికి వెళ్ళి ఆరా తీసింది. అప్పుడు వారి ప్రవర్తన, సమాధానాలు అనుమానాన్ని రేకెత్తించాయి. మీనా సీసీటీవీ ఫుటేజ్‌లను తనిఖీ చేయించగా, దీప్ శిఖా, గుప్తా దంపతుల ఇంట్లోకి వెళ్లింది గానీ, బయటకు రాలేదని గుర్తించి అప్పుడు పోలీసులకు సమాచారం అందించింది.ఈలోపు విషయం తెలుసుకొని అప్రమత్తమైన గుప్తా దంపతులు మరో పెద్ద ప్లాన్‌వేశారు. కానీ మీనా సమయ స్ఫూర్తితో వారి ఆటలు సాగలేదు. ఒక పెద్ద సూట్ కేసుతో బయటికి రావడం, ఆటోకి ఫోన్ చేయడం చూసి మీనా వారిని అడ్డుకుంది. పోలీసులు వచ్చిన తర్వాత, గుప్తా దంపతుల ఇంటిని సోదా చేయగా, దిగ్భ్రాంతికరమైన విషయం టైటపడింది. బాధితురాలి మృతదేహం సూట్‌కేస్‌లో గుర్తించారు. మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి ఎక్కడో పారవేయాలనే వారి ప్లాన్ . పనిమనిషి వారి ప్లాన్‌ను భగ్నం చేసింది.దీప్ శిఖను ప్రెషర్ కుక్కర్‌తో తలపై కొట్టి, ఆపై దుపట్టాతో గొంతు కోసి చంపారని పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబంపోలీసులకు ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని సీనియర్ పోలీసు అధికారి ఉపాసన పాండే తెలిపారు. -
భార్య కోసం.. కన్నవారిని రంపంతో నరికి..
జౌన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు మతాంతర వివాహం చేసుకోగా, ఆ కోపంతో తల్లిదండ్రులు అతనిని, అతని భార్యను ఇంటిలోనికి రానివ్వలేదు. దీంతో ఆ కుమారుడు తల్లిదండ్రుల ప్రాణాలను తీయడమే కాకుండా, వారి మృతదేహాలను రంపంతో ముక్కలుగా నరికి నదిలో పారవేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతులను పదవీ విరమణ పొందిన రైల్వే ఉద్యోగి శ్యామ్ బహదూర్ (62), అతని భార్య బబితా (60)లుగా పోలీసులు గుర్తించారు.పోలీసుల కథనం ప్రకారం నిందితుడు అంబేష్ ఐదేళ్ల క్రితం ఒక ముస్లిం మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వివాహం ఇష్టం లేని తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. ఈ క్రమంలో ఆ యువ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో వారు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. భార్యకు భరణం కింద రూ. 5 లక్షలు చెల్లించేందుకు అంబేష్ తన తండ్రిని డబ్బు అడగగా, అందుకు ఆయన నిరాకరించారు. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన అంబేష్ బరువైన రుబ్బు రాయితో తల్లి తలపై కొట్టి చంపాడు. అడ్డువచ్చిన తండ్రిని కూడా అదే రీతిలో కొట్టి హతమార్చాడు.హత్య అనంతరం నేరాన్ని కప్పిపుచ్చేందుకు అంబేష్ అత్యంత క్రూరంగా వ్యవహరించాడు. మృతదేహాలను తరలించేందుకు పెద్ద సంచులు దొరక్కపోవడంతో, గ్యారేజీలో ఉన్న రంపంతో తల్లిదండ్రుల శరీరాలను ఆరు ముక్కలుగా నరికాడు. ఆపై వాటిని చిన్న సంచుల్లో నింపి, తన కారు డిక్కీలో వేసుకుని, సమీపంలోని నదిలో పడేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, తన తల్లిదండ్రులు గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోయారని, వారిని వెతకడానికి తాను వెళ్తున్నానని సోదరికి ఫోన్ చేసి చెప్పి, తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు.అయితే వారం రోజులుగా అంబేష్ ఆచూకీ లేకపోవడంతో అనుమానం వచ్చిన అతని సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అంబేష్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అతడు చేసిన ఘోరాన్ని అంగీకరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు నదిలో గాలింపు చేపట్టిన పోలీసులకు తండ్రి శరీరంలోని ఒక భాగం లభ్యమైంది. హత్యకు వాడిన రంపం, రుబ్బురాయిని స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన శరీర భాగాల కోసం గజ ఈతగాళ్ల చేత గాలిస్తున్నామని అదనపు ఎస్పీ ఆయుష్ శ్రీవాస్తవ మీడియాకు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.ఇది కూడా చదవండి: పాక్ మరో దుశ్చర్య.. 40 ఏళ్ల ఆఫ్ఘన్ శిబిరాల మూసివేత -
Hyderabad: వైద్యురాలికి వేధింపులు
బంజారాహిల్స్: రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వహిస్తున్న వైద్యురాలికి అందులోనే పనిచేస్తున్న యువకుడి నుంచి రోజురోజుకు వేధింపులు ఎక్కువ అవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–2లో నివసించే వైద్యురాలు (41) ఓ రిహాబిలిటేషన్ సెంటర్లో పనిచేస్తున్నారు. 2021 సంవత్సరంలో సెంటర్ సూపర్వైజర్గా నామాల వెంకటేష్ వంశీని నియమించుకున్నారు. ఈ క్రమంలో వైద్యురాలితో పరిచయం ఏర్పడగా.. ఆమె ఫోటోలు తీస్తూ నానా రకాలుగా వేధించసాగాడు. గత ఏడాది నుంచి వెంకటేష్ వంశీ బాధిత వైద్యురాలిని అనుసరిస్తూ వేధించడం మొదలుపెట్టాడు. గత అక్టోబర్‌లో ఆమె అపార్ట్మెంట్లోకి కూడా చొరబడి కారును ధ్వంసం చేశాడు. ఆమె అర్ధనగ్న ఫోటోలను, వీడియోలను బంధు మిత్రులకు వాట్సప్‌లో షేర్ చేశాడు. దీంతో తనను వేధిస్తున్న నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. జూబ్లీహిల్స్ పోలీసులు వెంకటేష్‌వంశీపై బీఎన్ఎస్ సెక్షన్ 77, 78 (1)(2), 79, 351 (2), 324 (2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. డీఎస్పీకి గాయాలు.. జగిత్యాలలో పోలీసు కాల్పులు
సాక్షి,జగిత్యాల: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పరిధిలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్-బీజేపీ అభ్యర్థుల మధ్య పంచాయతీ ముదిరి పరిస్థితి అదుపు తప్పింది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో.. పోలీసు సిబ్బందికీ గాయాలు కావడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. పైడిపల్లి గ్రామం బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల మంగ 32 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓటమిని అంగీకరించిన బీజేపీ అభ్యర్థి జక్కుల మమత సంతకం చేసి కౌంటింగ్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అయితే కాసేపటికే బీజేపీ శ్రేణులు మళ్లీ అక్కడకు చేరుకుని.. ఒక బ్యాలెట్ బాక్స్ లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఆందోళనకు దిగాయి. ప్రతిగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు, అధికారులు గాయపడ్డారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీస్ వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కానీ ఉద్రిక్తతలు మరింత పెరగడంతో పోలీసులు గాల్లోకి పది రౌండ్లు కాల్పులు జరిపారు. ఆందోళనకారులు ఎంసీసీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడి.. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసినందుకు పలువురిపై కేసులు నమోదు చేశారు. పైడిపల్లిలో భయాందోళన వాతావరణం నెలకొనడంతో.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నలుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కొనసాగిస్తున్నారు. మరోవైపు.. కట్టుదిట్టమైన పోలీస్ పహారాలో బ్యాలెట్ బాక్సులను తరలించారు. -
యూదులపై కాల్పులు: అక్కడ మ్యారేజ్.. ఇక్కడ నిఖా!
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో యూదులపై కాల్పులు జరిపిన ఐసిస్ ఉగ్రవాది, హైదరాబాదీ సాజిద్ అక్రమ్ రెండుసార్లు వివాహం చేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. 1998 నవంబర్‌లో స్టూడెంట్ వీసాతో ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ 1999లో యూరోపియన్ మహిళ వెనెరా గ్రోసోని వివాహం చేసుకున్నాడు. తొలుత అక్కడ అమలులో ఉన్న సాధారణ పద్ధతిలో పెళ్లి చేసుకున్న ఈ జంట 2000 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ సాజిద్ తల్లిదండ్రుల సమక్షంలో మరోసారి నిఖా జరిగింది. వీరికి 2001 ఆగస్టు 12న నవీద్ జన్మించగా.. అతడి 15వ ఏట తండ్రితో కలిసి హైదరాబాద్ వచ్చాడు. అప్పట్లో కొద్దిరోజులు టోలిచౌకీలో ఉండి దూద్‌బౌలీలో కొన్ని స్థిరాస్తుల్ని విక్రయించి వెళ్లినట్లు తెలిసింది. ఉగ్రవాద బాటపట్టిన సాజిద్, నవీద్ భవిష్యత్తులో ఎదుర్కోబోయే పరిణామాలను ముందే ఊహించి ఉంటారని నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సాజిద్ ఆస్తిపాస్తుల్లో తనకు ఉన్న వాటాలను గత ఏడాది ఫిబ్రవరిలోనే వెనెరాకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. నవీద్ 2019లో సిడ్నీలోని అల్–మురాద్ ఇన్స్టిట్యూట్లో చేరి అరబిక్ నేర్చుకున్నాడు. అక్కడే ఇతడికి పరిచయమైన వారి ద్వారా ఐసిస్‌లో చేరాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీళ్లు ఫిలిప్పీన్స్‌లో ఉన్న మిండానావో ఐలాండ్‌లోని ఐసిస్ శిబిరంలో శిక్షణ తీసుకున్నట్లు ఆస్ట్రేలియా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిలిప్పీన్స్ నుంచి వచ్చినప్పటి నుంచి గత ఆదివారం వరకు వీరి కదలికలను పూర్తిస్థాయిలో తెలుసుకోవడానికి ఆస్ట్రేలియన్ ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి. ఆదివారం ఉదయం వీళ్లు దాదాపు 20 కిమీ ప్రయాణించి బీచ్ వద్దకు చేరుకున్నట్లు ఆధారాలు సేకరించారు. బాండీ బీచ్ మారణహోమంలో పాల్గొన్న ఇరువురిలో సాజిద్ పోలీసుల కాల్పుల్లో చనిపోగా, నవీద్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతడిపై న్యూ సౌత్ వేల్స్ పరిధిలోని బాండీ బీచ్ పోలీసులు మొత్తం 59 నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. వీటిలో 15 హత్యలు, ఒక ఉగ్రవాద చర్యకు సంబంధించినవీ ఉన్నాయి. సాజిద్, నవీద్‌లు వినియోగించిన కార్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. సాజిద్ వినియోగించిన కారులో ఆరు తుపాకులు, రెండు ఐసిస్ జెండాలను కూడా స్వాదీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి చొరబడి మహిళపై హత్యాయత్నం
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): బెజవాడలో గంజాయి బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే రాళ్లు, క్రికెట్ బ్యాట్లు, కారం చేత పట్టుకొని ఏకంగా ఇళ్లల్లోకి చొరబడి ఓ మహిళను హతమార్చేందుకు యత్నించారు. గంజాయి మత్తులో వీరు చేసిన వీరంగంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ లూనాసెంటర్లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గుమ్మళ్ల కుసుమ అనే మహిళ సింగ్‌నగర్‌లోని నార్త్‌జోన్ తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం సమీపంలో 20 ఏళ్లుగా ఉంటోంది. బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో టీవీ చూస్తుండగా గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుడు లోనికి ప్రవేశించాడు. చీరను లాగి ఆమెపై హత్యాయత్నానికి యత్నించాడు. దీంతో ఆమె అతడిని బయటకు తోసేసి తలుపులు వేసింది. విషయాన్ని సమీపంలో ఉన్న తన అన్నయ్య శేఖర్‌కు ఫోను చేసి చెప్పింది. ఇంతలో ఆ వ్యక్తితోపాటు మరో ఇద్దరు గంజాయి బ్యాచ్ సభ్యులు, ఓ మహిళ కూడా వారితోపాటు వచ్చి రాళ్లు, బ్యాట్, కారంతో వీరంగం సృష్టించారు. మహిళను, ఆమె కుమారుడిని చంపేస్తామంటూ ఇంటిపైకి రాళ్లు రువ్వారు. అద్దాలు, తలుపులు, కిటికీలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. వీరి చేష్టలకు భయపడి స్థానికులు ఇళ్లల్లోకి పరుగులు తీశారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులపైనా రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్ పోలీసులపైనా గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. తమకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అండదండలు ఉన్నాయని హూంకరించింది. వారు చెప్పినట్లుగానే స్థానిక టీడీపీ నాయకులు కొందరు గొడవ జరిగిన కాసేపటికే అక్కడకు చేరుకొని నిందితులను రక్షించేందుకు యత్నించారు. వారిపై కేసులు పెట్టవద్దంటూ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. వీడియోల రూపంలో సాక్ష్యాధారాలు ఉన్నా కేసులు కట్టేందుకు పోలీసులు వెనుకాడుతున్నారు. రాజీ పడాల్సిందిగా బాధితులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. విషయం మీడియాకు, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో హత్యాయత్నం కాకుండా చిన్న చిన్న సెక్షన్ల కింద కేసులు కట్టి చేతులు దులుపుకునేందుకు యత్నిస్తున్నట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని తెలిపారు. -
భార్య, ఇద్దరు బిడ్డల్ని చంపి ఇంట్లోనే.. వాళ్లు బతికిపోయారు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని షామ్లిలో దారుణం చోటు చేసుకుంది. స్వల్ప వివాదానికే ఒక వ్యక్తి తన భార్యను, ఇద్దరు చిన్న కుమార్తెలను హత్య చేశాడు. అంతేకాదు ముగ్గురు బాధితుల మృతదేహాలను వారి ఇంటి ప్రాంగణంలోని ఏడు అడుగుల లోతైన గొయ్యిలో పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. తల్లీ పిల్లలు ఆరు రోజులుగా కనిపించకుండా పోవడంతో అందిన ఫిర్యాదు మేరకు జరిగిన విచారణలో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. విచారణలో, ఫరూఖ్ నేరం అంగీకరించాడని తెలుస్తోంది.నిందితుడిని కాంధ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్హి గ్రామానికి చెందిన ఫరూక్‌గా గుర్తించారు. పోలీసుల ప్రకారం, ఫరూక్ తన భార్య తాహిరా (32) బుర్ఖా ధరించకుండా తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చినప్పుడు ప్రారంభమైన వాగ్వాదం తీవ్రమైంది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త తొలుత భార్యను కాల్చి చంపాడు. ఆ తరువాత కుమార్తెలు అఫ్రీన్ (14) , సెహ్రీమ్ (7)కూడా పొట్టనబెట్టుకున్నాడు.ఈ జంటమధ్య గత కొన్ని నెలలుగా తరచుగా గొడవలు ఎదుర్కొంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు. కుటుంబ వివాదాలతో ఫరూక్ తల్లిదండ్రులు దావూద్ ,అస్గారి నుండి విడిగా ఉంటున్నాడు. ఈ దంపతులకు మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు, వారిలో ముగ్గురు సంఘటన సమయంలో లేనందున ప్రాణాలతో బయటపడ్డారు. డిసెంబర్ 9-10 రాత్రి హత్యలు జరిగాయని పోలీస్ సూపరింటెండెంట్ ఎన్ పి సింగ్ తెలిపారు. టీ తయారుచేసే నెపంతో ఫరూఖ్ తన భార్యను నిద్రలేపి, ఆపై ఆమెను , పెద్ద కుమార్తెను కాల్చి చంపాడు. ఈ దారుణాన్ని చూసిన చిన్న కుమార్తె గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత ఇంట్లోనే లోతైన గొయ్యి తవ్వి, మృతదేహాలను పాతిపెట్టి, ఆ ప్రదేశాన్ని ఇటుకలతో కప్పేశాడ. పథకం ప్రకారం ఈ హత్యలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఆర్థిక ఒత్తిడి, తరచుగా వాదనలు, కోపం, అవమాన భారంతోనే ఈ తప్పు చేశానని ఫరూఖ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.Shamli, Uttar Pradesh: A husband allegedly killed his wife and two daughters and buried their bodies in a 9-foot-deep pit at homeSP N.P. Singh says, “On Tuesday evening around 5 PM, the village head of Gaungori Daulat under Kandhla police station informed us that a man named… pic.twitter.com/RITXJLfsCY— IANS (@ians_india) December 17, 2025 -
రణరంగంగా సెంట్రల్ జైలు : సూపరింటెండెంట్ పరిస్థితి విషమం
పంజాబ్‌లోని లూథియానా సెంట్రల్ జైలులో మరోసారి హింస చెలరేగింది. ఖైదీల మధ్య చెలరేగిన ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. వీరిని అదుపు చేయడానికి ప్రయత్నించిన జైలు సూపరింటెండెంట్ తీవ్ర గాయాల పాలు కావడం మరింత ఆందోళన రేపింది.మంగళవారం సాయంత్రం లూథియానాలోని తాజ్పూర్ రోడ్‌లోని సెంట్రల్ జైలులో రెండు గ్రూపుల ఖైదీల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. జైలు అధికారులు, పోలీసు సిబ్బంది వారిని శాంతింప చేసేందుకు ప్రయత్నించినప్పుడు, ఖైదీలు పోలీసు అధికారులపై దాడి చేశారు. ఈక్రమంలో జైలు సూపరింటెండెంట్ కుల్వంత్ సిద్ధూ తలపై ఇటుకతో బలంగా కొట్టడంతో ఆయన స్పృహ కోల్పోయారు. వెంటనే అతన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే జైలు డిఎస్పీ జగ్జీత్ సింగ్ , కొంతమంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బందితో సహా ఇతర సిబ్బంది కూడా ఇటుకల దాడిలో గాయపడ్డారు. ఖైదీలకు అసలు ఇటుకలు ఎలా వచ్చాయనేది ఆరాతీస్తే, జైలులోని గార్డెన్ బెడ్స్ నుంచి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సంఘటన తరువాత పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. అంబులెన్స్‌లు, అదనపు పోలీసు బలగాలను భారీగా తరలించారు. ప్రస్తుతం జైలును మూసివేసి పోలీస్ కమిషనర్ స్వపన్ శర్మ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.200 మందికి పైగా ఖైదీలు దాడిరెండు గ్రూపుల మధ్య గొడవ ఒకవైపు ఇద్దరు, మరోవైపు ముగ్గురుగా ఐదుగురు వ్యక్తుల మధ్య గొడవ మొదలైంది. మత కారణంగా తనను అవమానించారని ఆరోపణలతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు. ఇరు పక్షాలు ఇటుకల విసురుకోవడంతో కొద్దిసేపటికే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సుమారు 200 నుండి 250 మంది ఖైదీలు పోలీసులపై దాడి చేశారని అధికారులు తెలిపారు. ఈ సంఘటన తర్వాత, సెంట్రల్ జైలు వెలుపల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జైలు ఆవరణలో దాదాపు 20 నిమిషాల పాటు సైరన్లు మోతతో దద్దరిల్లినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై జైళ్ల మంత్రి లాల్జిత్ సింగ్ భుల్లార్ జైలు అధికారుల నుండి నివేదిక కోరారు. కాగా 2019, జూన్‌లో ఇదే జైలులో తీవ్ర ఘర్షణ చెలరేగింది. బ్యారక్ల లోపల హింసాత్మక తిరుగు బాటును అణిచి వేసేందుకు పోలీసులు 150 రౌండ్లకు పైగా కాల్పులు జరపవలసి వచ్చింది*A disturbance has broken out at the central jail in Ludhiana. Police have arrived at the scene, and according to sources, there are reports of clashes between inmates and the police.*+*Ludhiana a mini riot as prisoners clash at Ludhiana Central Jail (Tajpur Road) on Tuesday… pic.twitter.com/fEtZUwL4I3— Amit Bhardwaj (@AmmyBhardwaj) December 16, 2025 -
ప్రాణం పోతున్నా పట్టించుకోని జనం
కర్ణాటక: కళ్ల ముందే ప్రాణం పోతున్నా.. గుండెపోటుతో రోడ్డుపై విలవిల్లాడుతున్నా.. సాయం కోసం అతని భార్య చేతులు జోడించి వేడుకుంటున్నా.. జనం పట్టించుకోలేదు. సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో చివరకు ఆ వ్యక్తి మరణించాడు. ఈ విషాద ఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు.. బనశంకరి మూడో స్టేజ్ బాలాజీనగర్‌కు చెందిన వెంకటరామన్(34) మంగళవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యాడు. ఆందోళనకు గురైన భార్య రూప అతనిని వెంటనే స్కూటీపై సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. గుండెపోటు అని నిర్ధారించారు. ప్రథమ చికిత్స చేసి.. జయదేవ హృద్రోగ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ అంబులెన్సు లేకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న రూప.. భర్తను వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు మళ్లీ స్కూటీపైనే బయలుదేరింది. కదిరేనహళ్లి బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి.. వెంకటరామన్ స్కూటీపై నుంచి కిందపడిపోయాడు. దీంతో రూప రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు అడ్డుపడి సాయం కోసం వేడుకుంది. అయినా ఎవరి మనసూ కరగలేదు. ఆ తర్వాత కొద్ది సేపటికి వెంకటరామన్ సోదరి అక్కడకు చేరుకుంది. చివరకు ఇద్దరూ కలిసి క్యాబ్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే వెంకటరామన్ మరణించాడు. సమయానికి ఎవరూ మానవత్వం చూపకపోయినా.. రూప పెద్ద మనసుతో తన భర్త కళ్లను దానం చేసి ఆదర్శంగా నిలిచింది. #Heartbreaking incident in Bengaluru has left many shaken and questioning humanity. Thirty-four-year-old Venkataramanan suffered a sudden cardiac arrest while riding a bike with his wife. Near Kadrihalli Bridge, he collapsed on the road, gasping for life. His wife screamed for… pic.twitter.com/VXSUDWDq8Z— Bharathirajan (@bharathircc) December 17, 2025 -
కన్నతల్లే కర్కశురాలై..
మేడ్చల్ జిల్లా: కుటుంబ కలహాలు..క్షణికావేశం..ఓ చిన్నారి ప్రాణం తీసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే హంతకురాలైంది. తన ఏడేళ్ల బిడ్డను అపార్టుమెంట్ మూడో అంతస్తు పైనుంచి కిందకు విసిరేసి దుర్మార్గానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతపురి కాలనీలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ మేరకు మంగళవారం ఇన్స్పెక్టర్ బి.సత్యనారాయణ తెలిపిన మేరకు..వసంతపురి కాలనీలోని గురుకృప అపార్ట్మెంట్ మూడో అంతస్తులో డేవిడ్, మోనాలిసా దంపతులు నివసిస్తున్నారు. వీరికి పదేళ్ల కుమారుడు, ఏడేళ్ల వయసున్ను కుమార్తె షరోన్ మేరీ ఉన్నారు. మేరీ స్ధానిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నది. మోనాలిసా ఒక మత ప్రచార సంస్ధలో పనిచేస్తుండగా, డేవిడ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఇటీవల ఇంటి వద్దనే ఉంటున్నాడు. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నుంచి వీరిద్దరు గొడవ పడుతున్నట్లుగా తెలిసింది. సోమవారం సాయంత్రం షరోన్ మేరీ తన తల్లి మొబైల్ ఫోన్ చూస్తుండగా ఆగ్రహించిన మోనాలిసా ఒక్కసారిగా బాలికను పైనుంచి కిందకు విసిరేసిందని భర్త డేవిడ్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన మేరీని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. భర్త డేవిడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భిన్న వాదనలు.. చిన్నారి మృతికి భార్యా భర్తల మధ్య కలహాలా..లేక దేవుడిపై నమ్మకం విషయంలో తలెత్తిన విభేదాలా అని స్థానికంగా భిన్నకథనాలు విని్పస్తున్నాయి. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న వారు మాత్రం మోనాలిసా రోజూ డ్యూటీకి వెళ్లి వచ్చేదని, ఆమె మానసిక స్థితి బాగాలేదన్న విషయం తమకు తెలియదంటున్నారు. అప్పుడప్పుడు పిల్లలు ఏమైనా వస్తువులు కిందకు పడేస్తుంటారని, అదే విధంగా ఆదివారం కూడా ఏమైనా పడేశారేమోనని చూస్తే చిన్నారి రక్తం మడుగులో కనిపించందని ఓ వృద్ధురాలు తెలిపింది. ఆమె మానసిక స్థితి బాగాలేదని బంధువులు చెబుతున్నప్పటికీ, కుటుంబ సభ్యులు, భర్త ఫిర్యాదులో ఆ విషయాన్ని తెలియజేయలేదని, దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ఆధార్, పార్సిల్ అంటూ : మహిళా టెకీని బెదిరించి రూ. 2 కోట్ల మోసం
డిజిటల్ అరెస్ట్ మోసానికి బలవుతున్న బాధితులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నకిలీ అధికారుల వలలో పడి బాధితులు కోట్ల రూపాయలను నష్టపోతున్నారు. బాధితుల్లో విద్యాధికులే ఎ క్కువగా ఉండటం మరింత విచారకరం. తాజగా బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి 2 కోట్ల విలువైన ఆస్తులను అమ్ముకున్న వైనం ఆందోళన రేపుతోంది. బెంగుళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ నిపుణురాలు బబితా దాస్ డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో రూ. 2 కోట్లు నష్టపోయింది. నకిలీ పోలీసుల డిమాండ్లను నెరవేర్చేందుకు తను ఉంటున్న ఇంటినీ, మరో రెండు ప్లాట్లను తెగనమ్ముకుంది. బాధితురాలు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ, తన 10 ఏళ్ల కొడుకుతో కలిసి విజ్ఞాన్ నగర్‌లోని ఫ్లాట్‌లో నివసిస్తోంది బబితా. జూన్‌లో, కొరియర్ అధికారిగా నటిస్తున్న ఒక వ్యక్తి నుండి ఆమెకు ఫోన్ వచ్చింది. ఆమె ఆధార్ కార్డుకు సంబంధించిన ఒక అనుమానాస్పద లగేజీని తాము స్వాధీనం చేసుకున్నట్లు నమ్మించాడు.ఆ కాల్‌ను తక్షణమే ముంబై పోలీసు అధికారులుగా చెప్పుకుంటున్న మరో కేటుగాళ్లకు బదిలీ చేశాడు. అరెస్టు చేస్తామని బెదిరించి, ధృవీకరణ పూర్తయ్యేవరకు బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. మోసగాళ్లు ఒక నిర్దిష్ట మొబైల్ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేయాలని బెదిరించారు. తమకు సహకరించి అలా చేయకపోతే, కొడుకువిషయంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. తాము చెప్పినట్టుగా చెల్లింపులు చేసి, ఆ తరువాత పోలీసుల ద్వారా తిరిగి పొందవచ్చని నమ్మబలికారు.చదవండి: గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ : 30 ఏళ్లుగా ఉంటున్నభారత సంతతి మహిళ అరెస్ట్దీంతో బిడ్డ భవిష్యత్తు గురించి భయపడిపోయిన ఆమె వాళ్లు చెప్పినట్టే చేసింది. తక్కువ ధరకే మలూరు లోని రెండు ప్లాట్లను , ఇటు తాను ఉంటున్న విజ్ఞాన్ నగర్ ఫ్లాట్‌ను కూడా అమ్మేసింది. తద్వారా వచ్చిన సొమ్మును ను మోసగాళ్ల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. దీంతో పాటు ఆమె బ్యాంకు నుండి రుణం కూడా తీసుకుని సుమారు రూ. 2 కోట్లు మోసగాళ్లకు చెల్లించింది. ఆ తరువాత మోసగాళ్లు తరువాత డబ్బును తిరిగి పొందడానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లమని చెప్పి, అకస్మాత్తుగా కాల్ కట్ చేశారు. ఆ తర్వాత యథావిధిగానే వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె వైట్‌ఫీల్డ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు డిజిటల్ అరెస్ట్ స్కామ్‌పై దర్యాప్తు ప్రారంభించారు.ఇదీ చదవండి: ఆకు ఉమ్మితేనే భారీ జరిమానా; మనదగ్గర గుట్కా, ఖైనీల పరిస్థితి ఏంటి? -
గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ : 30 ఏళ్లుగా ఉంటున్న భారత సంతతి మహిళ అరెస్ట్
అమెరికాలో గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలో భారత సంతతికి చెందిన 60 ఏళ్ల మహిళకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాలో 30 ఏళ్లుగా నివసిస్తున్నమహిళను గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ చివరి రౌండ్లో అరెస్ట్ చేయడం కలకలం రేపింది. బబ్లీజీత్ కౌర్ అలియాస్ బబ్లీ అనే మహిళ, గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు సంబంధించిన బయోమెట్రిక్ స్కాన్ అపాయింట్మెంట్కు వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ చివరి దశలో ఉండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు తన తల్లిని అదుపులోకి తీసుకున్నారని ఆమె కుమార్తె జోతి మీడియాకు తెలిపారు. 1994 నుండి అమెరికాలో నివసిస్తున్న బబుల్జిత్ "బబ్లీ" కౌర్, పెండింగ్‌లో ఉన్న ఆమె గ్రీన్ కార్డ్ దరఖాస్తు కోసం బయోమెట్రిక్ స్కాన్ అపాయింట్మెంట్ సమయంలో ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 1న తన తల్లి యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కార్యాలయం డెస్క్ వద్ద ఉన్నప్పుడు, పలువురు ఫెడరల్ ఏజెంట్లు భవనంలోకి ప్రవేశించారని జ్యోతి చెప్పింది. ఆ తర్వాత ఫెడరల్ ఏజెంట్లు వెళ్లిన గదిలోకి కౌర్‌ను పిలిచి, ఆమెను అరెస్టు చేస్తున్నట్లు చెప్పారని ఆమె తెలిపింది. కౌర్‌కు తన న్యాయవాదితో ఫోన్లో మాట్లాడే అవకాశం కల్పించినప్పటికీ, ఆమెను నిర్బంధంలోనే ఉంచారని ఆమె కుమార్తె చెప్పింది. కొన్ని గంటల పాటు కౌర్‌ను ఎక్కడికి తీసుకెళ్లారో కుటుంబ సభ్యులైన తమకు తెలపకుండానే, రాత్రికి రాత్రే అడెలాంటోకు బదిలీ చేశారని ఆరోపించారు. మరోవైపు అమెరికా పౌరురాలైన ఆమె మరో కుమార్తె, గ్రీన్ కార్డ్ ఉన్న ఆమె భర్త నుండి ఆమోదించబడిన గ్రీన్ కార్డ్ హోదాలో ఉన్నారని లాంగ్ బీచ్ వాచ్డాగ్ తన కథనంలో వివరించింది.ఎవరీ బబ్లీ కౌర్ కౌర్ కుటుంబం USకి వలస వచ్చిన తర్వాత, మొదట లగున బీచ్‌లో స్థిరపడ్డారు, తర్వాత లాంగ్ బీచ్‌కు వెళ్లారు. తరువాత ఉద్యోగ బాధతలరీత్యా బెల్మాంట్ షోర్ ప్రాంతానికి మారారు. కౌర్‌కు ముగ్గురు పిల్లలున్నారు. 34 ఏళ్ల జోతి, DACA (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్స్) కింద USలో చట్టపరమైన హోదాను కలిగి ఉన్నారు ,ఆమె అన్నయ్య, సోదరి, ఇద్దరూ అమెరికా పౌరులుగా ఉన్నారు.రెండు దశాబ్దాలకు పైగా, కౌర్ , ఆమె భర్త బెల్మాంట్ షోర్‌లోని 2వ వీధిలో నటరాజ్ క్యూసిన్ ఆఫ్ ఇండియా అండ్ నేపాల్ అనే తినుబండారాల ఔట్‌లెట్‌ను నిర్వహిస్తున్నారు. లాంగ్ బీచ్ కమ్యూనిటీలో మంచి ఆదరణను కూడా పొందింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఫార్మసీ చైన్ దాని మిగిలిన స్థానాలను మూసివేసేంs వరకు ఆమె బెల్మాంట్ షోర్ రైట్ ఎయిడ్‌లో దాదాపు 25 సంవత్సరాలు పనిచేసింది. ఇటీవల, ఆమె రాయల్ ఇండియన్ కర్రీ హౌస్‌లో రెస్టారెంట్ పనిలోకి రావడానికి తిరిగి సిద్ధమవుతోంది.బబ్లీ కౌర్‌ను విడుదల చేయాలని పిలుపులాంగ్ బీచ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాబర్ట్ గార్సియా, కౌర్ విడుదల కోసం పిలుపునిచ్చారు. ఆమె కుటుంబం ఆమె కేసు కొనసాగుతున్నందున కౌర్‌ను బాండ్‌పై విడుదల చేయడానికి అనుమతించే అదనపు చట్టపరమైన దాఖలును సిద్ధం చేస్తున్నందున, ఈ విషయంపై అతను ఫెడరల్ అధికారులతో సంప్రదింపులు జరుపు తున్నట్లు ఆయన సిబ్బంది తెలిపారు. -
మానుకోటలో ఉద్రిక్తత..
మహబూబాబాద్ రూరల్: అదనపు కట్నం కోసం భర్త, అత్తామామ, మరిది విచక్షణరహితంగా కొట్టడంతో మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బానోత్ స్వప్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మృతురాలి తండ్రి అర్జున్ ఫిర్యాదు మేరకు స్వప్న భర్త బానోత్ రామన్న, అత్తామామలు కిషన్, బుజ్జి, మరిది నవీన్‌పై మహబూబాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో స్వప్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి పోలీసులు సిద్ధంకాగా మృతురాలి కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు ఆమె ఇద్దరు కూతుళ్లు, కుమారుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మొదట పోస్టుమార్టం గది వద్ద ఆందోళన చేపట్టి అక్కడ నుంచి అండర్ బ్రిడ్జి ప్రాంతంలో రాస్తారోకో చేశారు. సుమారు రెండు గంటలకుపైగా రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. తమకు న్యాయం జరగడంలేదని ఆరోపిస్తూ మృతురాలి స్వప్న తమ్ముడు లింగా, తల్లి కౌసల్య, మరికొంతమంది ఆత్మహత్య చేసుకుంటామని పురుగు మందు డబ్బాలతో ఆందోళన చేయగా బంధువులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పోస్టుమార్టం గది వద్దకు చేరుకుని స్వప్న మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి రోడ్డుపై ఆందోళన చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోస్టుమార్టం గది గేటు తొలగించుకుని ఆగ్రహంతో లోపలికెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో కొంత తోపులాట జరగగా పోలీసులు వారందరినీ ఆపి శాంతింపజేశారు. అప్పటికే మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు స్వప్న కుమార్తెలు సంజన, దక్షిత, కుమారుడు అవిరాజ్ పరిస్థితి ఏమిటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మహబూబాబాద్ రూరల్, టౌన్ సీఐలు సర్వయ్య, మహేందర్ రెడ్డి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పెదమనుషులు వారి డిమాండ్ మేరకు ముగ్గురు పిల్లలకు ఆస్తి, వ్యవసాయ భూమి, బంగారం చెందేలా మాట్లాడి ఒప్పంద పత్రాలు రాయించాక పోస్టుమార్టం ఒప్పుకున్నారు. బయ్యారం సీఐ రవికుమార్, రూరల్, టౌన్, కురవి ఎస్సైలు దీపిక, షాకీర్, సతీశ్, సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.చనిపోయిన మహిళ నోట్లో పురుగుల మందు పోసి... -
ఇండిగో విమానంలో లూత్రా సోదరులు ఇండియాకు
గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం (Goa Nightclub Fire) తరువాత బ్యాంకాక్ పారిపోయిన ప్రధాన ప్రధాన నిందితులు క్లబ్ ఓనర్లు గౌరవ్ (Gaurav Luthra), సౌరభ్ లూత్రా (Saurabh Luthra) థాయిల్లాండ్లో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ఇండిగో విమానంలో (6E1064) తిరిగి తీసుకువస్తున్నారు. బ్యాంకాక్ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 1:45 గంటలకు (IST) బయలుదేరాల్సి ఉంది. ఢిల్లీ చేరిన తరువాత వీరిని ఇద్దరినీ పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరుస్తారు, అధికారులు వారి ట్రాన్సిట్ రిమాండ్ కోరుతున్నారు. అనంతరం వీరిని గోవాకు తరలించాలని యోచిస్తున్నట్టు సమాచారం. గోవాలోని 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. విషాదం జరిగిన కొన్ని గంటల తర్వాత థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు పారిపోయారు. ఈ ఘటన తరువాత లూత్ర సోదరులపై నేరపూరిత హత్య మరియు నిర్లక్ష్యం కేసు నమోదైనాయి. వీరిని అరెస్ట్ చేసే క్రమంలోనే లూత్రా బ్రదర్స్ పాస్‌పోర్టులను కూడా అధికారులు రద్దు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు సిబ్బందినిఅరెస్టు చేశారు, వారిలో మేనేజర్ కూడా ఉన్నారు. క్లబ్ కు పర్మిట్లు, లైసెన్సులు జారీ చేయడంలో పాల్గొన్న అనేక ప్రభుత్వ విభాగాల అధికారులను కూడా విచారిస్తున్నారు. తాను "సైలెంట్ పార్టనర్" అని చెప్పుకున్నప్పటికీ, మూడవ భాగస్వామి అజయ్ గుప్తాను కూడా ఢిల్లీలో అరెస్టు చేశారు. డిసెంబర్ 9న థాయిలాండ్‌లోని తమ హోటల్ నుండి భోజనం కోసం బయటకు వచ్చిన తర్వాత ఇద్దరినీ థాయిలాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. -
వివాహేతర సంబంధం.. అత్తపై కోడలు దాడి
కోనేరుసెంటర్: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న అత్తను ప్రియుడితో కలిసి కోడలు హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. అత్త చనిపోయిందని భావించి ప్రియుడితో కలిసి మూడేళ్ల బాలుడితో మహిళ పరారైంది. అయితే కొన ఊపిరితో ప్రాణాలు నిలబెట్టుకున్న వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన నలపాల సురేష్ లిఖిత భార్యాభర్తలు, వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. సురేష్ తల్లి పార్వతి కొడుకు వద్దే ఉంటుంది. సురేష్ నగరంలోని ఓ పెట్రోల్‌బంకులో పనిచేస్తుంటాడు. సురేష్ ఆదివారం రాత్రి డ్యూటీకి వెళ్లాడు. మూడేళ్ల బాబుతో పరారీ.. అందరూ నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి సురేష్ ఇంట్లోకి చొరబడ్డాడు. గాఢ నిద్రలో ఉన్న పార్వతిపై దాడి చేశాడు. దెబ్బలకు తట్టుకోలేక పార్వతి బిగ్గరగా కేకలు పెడుతూ ఇంట్లో ఉన్న లిఖితను పిలిచింది. లిఖిత ఎంతకీ బయటకు రాలేదు. ఆమెను చంపేందుకు రకరకాలు ప్రయత్నిస్తుండగా పార్వతి అతని దాడిని ప్రతిఘటించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్నట్లు నటించిన లిఖిత కారం తెచ్చి ఆ వ్యక్తి చేతికి ఇవ్వటంతో అత్త కళ్లల్లోకి విసిరాడు. అనంతరం ఇద్దరు ఆమెను అంతమొందించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.చివరికి పార్వతి అపస్మారకస్థితికి చేరుకోగా చనిపోయిందనుకుని భావించిన లిఖిత ఆ వ్యక్తితో కలిసి తన మూడేళ్ల బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది. గాయాలపాలైన పార్వతి సమీపంలో బంధువుల ఇంటికి విషయం చెప్పగా వారు సురేష్‌కు జరిగిన విషయం చెప్పారు. దీంతో సోమవారం చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గుర్తుతెలియని వ్యక్తితో పాటు లిఖిత కోసం గాలిస్తున్నట్లు సీఐ ఎస్కే నబీ తెలిపారు. -
ప్రభాకర్ రావు నాన్ కోపరేషన్.. సిట్‌కు కొత్త తలనొప్పి!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిని కస్టడీ విచారణ జరుపుతున్నారనే పేరుకు తప్పించి.. ఎలాంటి వివరాలు రాబట్టలేకపోతోంది ప్రత్యేక దర్యాప్తు బృందం. గత నాలుగు రోజులుగా ఏమాత్రం సహకరించని ఆయన.. ఐదోరోజైనా నోరు మెదపకపోతారా? అని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు కస్టడీ విచారణ ఐదో రోజు కొనసాగుతోంది. ఆధారాలను ముందుంచి ఆయన్ని పశ్నిస్తోంది సిట్. అయితే ఆయన మౌనంగానే ఉంటున్నట్ల సమాచారం. మాజీ అధికారి ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని జూబ్లీహిల్స్‌లోని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) వర్గాలు చెబుతున్నాయి . సిట్ జరిపిన నాలుగు రోజుల విచారణలో ఎలాంటి పురోగతి లేదని సమాచారం. ఈ కేసులో డిజిటల్ ఆధారాలే కీలకంగా మారడంతో.. ప్రభాకర్ రావుకు సంబంధించిన ఐక్లౌడ్, జిమెయిల్ ఖాతాలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభాకర్ రావు వినియోగించిన 5 ఐక్లౌడ్, 5 జిమెయిల్ ఖాతాల్లోని డేటాను సిట్ పరిశీలించింది. గతంలో ప్రభాకర్ రావు నాలుగు జిమెయిల్ ఖాతాలు, రెండు ఐక్లౌడ్ ఖాతాల పాస్వర్డ్లు అందజేశారు. కానీ, ఆ ఖాతాల్లో డేటా కనిపించకపోవడంతో.. తలలు పట్టుకున్నారు. అటు నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)కు డివైసులను పంపించారు. ఆపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి లభించిన సాంకేతిక నివేదికల ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించారు. అయితే ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సిట్ అధికారుల తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది. వారంపాటు కస్టడీ విచారణ తర్వాత సుప్రీం కోర్టులో ప్రభాకర్‌రావు విచారణ వివరాలను.. ఫోన్ ట్యాపింగ్ కేసు పురోగతిని తెలంగాణ ప్రభుత్వం సమర్పించాల్సి ఉందన్నది తెలిసిందే. -
గుర్రం తన్నడంతో 12 ఏళ్ల బాలుడి మృతి
వరంగల్: సరదా విషాదమైంది. సవారీ చేసేందుకు కట్టేసిన గుర్రం వద్దకు వెళ్లిన బాలుడిని గుర్రం తన్నింది. దీంతో బాలుడికి తీవ్రగా గాయాలు కావడంతో కుటుంబీకులు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో గుర్రం యజమాని నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని సోమవారం సాయంత్రం ఖిలా వరంగల్ ఏకశి చిల్ర్డన్‌పార్క్ గేట్ ఎదుట నిర్వహించారు.గుర్రం యజమాని, పార్కు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిల్స్‌కాలనీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గుర్రం యజమానిపై కేసు నమోదు చేయడంతోపాటు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతుడి బంధువుల ధర్నా విరమించారు. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. వరంగల్ శివనగర్ ఏసీరెడ్డినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ మిర్యాల కృష్ణ కుమారుడు గౌతం(12) ఈనెల 10వ తేదీన ఉదయం బాబాయి రాజేందర్‌తో కలిసి ఏకశిల చిల్ర్డన్ పార్క్‌కు వెళ్లాడు. పార్కులో సవారీ చేసేందుకు సోదరుడు మహేశ్‌తో కలిసి గుర్రం వద్దకు వెళ్లాడు. అంతలోనే గుర్రం వెనుక నుంచి తన్నడంతో గౌతంకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గౌతంను రాజేందర్ హుటాహుటిన ఎంజీఎం తరలించారు. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు విలపించారు. కాగా, శివనగర్‌లోని ఏసీరెడ్డి నగర్ బాలుడి అంత్యక్రియలు నిర్వహించగా కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తరలొచ్చి గౌతం మృతదేహం వద్ద నివాళులరి్పంచారు. -
ప్రియురాలిని బలిగొని.. పెళ్లి పీటలెక్కిన క్రూరుడు!
ఉత్తరప్రదేశ్‌లో ఒక షాకింగ్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సహారన్పూర్కు చెందిన టాక్సీ డ్రైవర్ బిలాల్ తన ప్రియురాలు ఉమ (30)ను దారుణంగా హత్య చేశాడు. సదరు మహిళ తల నరికి మృతదేహాన్ని హర్యానాలోని కలేసర్ జాతీయ ఉద్యానవనం సమీపంలో పడేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.ఘటన వివరాలు.. డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం బిలాల్, ఉమను సహారన్పూర్ నుండి స్విఫ్ట్ కారులో తీసుకెళ్లి దాదాపు ఆరు గంటల పాటు తిరిగారు. అనంతరం ఆమెను లాల్ ధాంగ్ లోయ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేశాడు. అనంతరం తల నరికి మృతదేహాన్ని అడవిలో పడేసి అక్కడి నుండి పారిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన బిలాల్ ఏమీ జరగనట్టుగా ప్రవర్తిస్తూ మరో మహిళతో తనకు కాబోయే పెళ్లి కోసం షాపింగ్ ప్రారంభించాడు.పోలీసులు తెలిపిన వివరాలు.. బిలాల్ మరో స్త్రీని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఉమను తన జీవితంలో నుండి తొలగించడానికి హత్యను ప్లాన్ చేశాడు. ఉమ గతంలో వ్యక్తిగత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సుమారు 15 సంవత్సరాల క్రితం ఆమె తన వివాహానికి ఒక రోజు ముందు ఇంటిని విడిచి తన ప్రియుడితో కలిసి వెళ్లి పోయింది. తరువాత వివాహం చేసుకుంది. ఏడాదిన్నర క్రితం భర్తకు విడాకులు ఇచ్చి, తన కుమారుడిని తండ్రి వద్దే ఉంచింది.కుటుంబం స్పందన.. ఉమ మృతదేహం దొరికిందని సమాచారం అందుకున్న తర్వాతే తన హత్య విషయం తెలిసిందని బంధువులు తెలిపారు. ఉమ సోదరుడు మాట్లాడుతూ.. ఆమె తల నరికివేయబడిందని తెలిసి కుటుంబం తీవ్ర షాక్‌కు గురైందని పేర్కొన్నారు. సంఘటనకు 15 రోజుల ముందు ఉమ తన కుమారుడిని కలుసుకుంది. తనకి కొన్ని బట్టలు ఇచ్చి వెళ్లింది. అతనితో జీవించడం ఇష్టం లేదని ఉమ కుమారుడు పోలీసులకు తెలిపాడు.బిలాల్‌ను అరెస్టు చేసి, ఫోరెన్సిక్ ఫార్మాలిటీలను పూర్తి చేస్తున్నారు. మిగిలిన ఆధారాలను సేకరించి, కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ కేసు ఉత్తరప్రదేశ్ , హర్యానా రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. -
పెళ్లి కాదనే బెంగతో యువకుడి ఆత్మహత్య
గార్లదిన్నె/అనంతపురం సిటీ: కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇక తనకు పెళ్లి కాదనే బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన భీమన్నగారి చిదంబర కుమారుడు ప్రతాప్(31) వ్యవసాయ పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. తన ఈడు పిల్లలందరూ పెళ్లిళ్లు చేసుకొని స్థిరపడగా.. తనకు ఇంకా పెళ్లి కాకపోవడంతో కుంగిపోయాడు. తనకు పెళ్లి చేయాలని ఇంట్లో అడుగుతూ వస్తున్నా... అప్పులు ఎక్కువగా ఉన్నాయని, అవి తీరాక పెళ్లి చేస్తామంటూ కుటుంబ సభ్యులు వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ప్రతాప్ ఆదివారం రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయి గార్లదిన్నె రైల్వేగేట్ సమీపంలో గ్వాలియర్ నుంచి బెంగళూరుకు వెళుతున్న యశ్వంత్‌పూర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్ నుంచి సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ వెంకటేష్ సోమవారం అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
అమ్మా.. ఐశ్వర్య ఎక్కడున్నావ్!
రంగారెడ్డి జిల్లా: తన కూతురు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానానికి వెళుతుందనుకున్న ఆ తండ్రి ఆశలు అడియాశలయ్యాయి. ఆ కుటుంబం కలలు కళ్ళెదుటనే కరిగి పోయాయి. మృత్యు రూపంలో వచ్చిన ఓ కారు వారి ఆశలను చిదిమి వేసింది. రోడ్డును దాటుతున్న తండ్రీ,కూతురును వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో కూతురు అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి తీవ్రంగా గాయడ్డాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కౌడిపల్లికి చెందిన యంసాని పాండు, కళ్యాణిలు హయత్‌నగర్‌లోని వినాయకనగర్ కాలనీలో ఉంటున్నారు. పాండు హయత్‌నగర్‌లో ఓ ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు.వారికి కుమారుడు వంశి, కూతురు ఐశ్వర్య(19) ఉన్నారు. కొడుకు కెనడాలో ఉండగా కూతురు మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశాల హస్టల్లో ఉంటున్న ఆమె ప్రతి శనివారం ఇంటికి వచ్చేది. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో బస్సెక్కించేందుకు తండ్రికూతురును వెంట బెట్టుకుని రాగా హయత్‌నగర్ ఆర్టీసీ కాలనీలో ఇద్దరు జాతీయ రహదారిపై రోడ్డును దాటుతున్నారు. అదే సమయంలో ఎల్బినగర్ వైపు నుంచి వేగంగా వచ్చిన క్రెటా కారు (టీఎస్ 07కెజి 9006) వీరిని ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఐశ్వర్య అక్కడికక్కడే మృతి చెందింది. కాలికి తీవ్ర గాయం అయిన తండ్రిని చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని నీలాద్రి ఆసుపత్రిలో చేరి్పంచారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోధు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఓటేసేందుకు పట్నం నుంచి వచ్చి..
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని తెర్లుమద్దికి చెందిన కొమ్మెట రమేశ్(32) హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఐదు రోజులపాటు బాగానే ఉన్న రమేశ్.. సోమవారం ఉదయం చనిపోతున్నాను సారీ అంటూ సోదరులు చంద్రమోహన్, కిట్టులకు వాట్సాప్ మెస్సేజ్ పెట్టాడు. ఆందోళనకు గురైన వారు రమేశ్‌కు ఫోన్ చేసినా స్పందించలేదు. ఆయన కోసం గాలించగా, గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. హైదరాబాద్‌లో సరైన ఉపాధి లభించక కుటుంబపోషణకు అప్పులు చేశాడని, మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడని సోదరుడు చంద్రమోహన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చిందం గణేశ్ తెలిపారు. -
ప్రియురాలే గెలిచింది
కర్ణాటక: ప్రేమ, పెళ్లి పేరుతో యువత దారి తప్పుతున్న ఉదంతాల నేపథ్యంలో పెళ్లి వేడుకలో ప్రియురాలు రచ్చ చేసి ప్రియున్ని వివాహమాడిన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈనెల 12న నగరంలో రిషభ్‌కు తల్లిదండ్రులు ఓ అమ్మాయితో వివాహం జరిపిస్తున్నారు. ఇన్ స్టాలో చూసి తెలుసుకున్న ప్రేయసి నగరానికొచ్చి పెళ్లిని నిలిపేసింది. రిషభ్ బళ్లారిలో చదువుతున్న సమయంలో కొప్పళకు చెందిన యువతితో ప్రేమాయణం సాగించాడు. ఆమె గర్భం దాల్చగా అబార్షన్ చేయించి, మళ్లీ ఓ గుడిలో మూడుముళ్లు వేశాడు. తాజాగా ఆమెను దూరంగా ఉంచి తల్లిదండ్రులు చెప్పినట్లు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇంతలో కళ్యాణ మంటపానికి చేరుకున్న ప్రియురాలు పోలీసుల సహకారంతో పెళ్లిని నిలుపుదల చేసి, పెద్దల సమక్షంలో తానే వివాహం చేసుకుంది. ఈ తతంగంపై మరో అమ్మాయి తరఫు బంధువులు భగ్గుమన్నారు. ప్రేమ బాగోతాన్ని దాచిపెట్టి మరో పెళ్లి ఎలా చేసుకుంటావు అని నిలదీశారు. -
కుటుంబ కలహాలతో తల్లీబిడ్డ ఆత్మహత్య
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : కుటుంబ కలహాలతో ఓ తల్లి కన్నకొడుకుతో మృత్యుఒడిలోకి చేరింది. ఈ ఘటన ఆదివారం చిత్తూరు మండలం తుమ్మింద గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు... తుమ్మింద గ్రామానికి చెందిన బాబు భార్య కవిత్ర (26)కు అయిదేళ్ల కిందట వివాహం అయింది. ఈ దంపతులకు ముకేష్ (04) అనే కుమారుడు జన్మించాడు. శనివారం ఈ దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన కవిత్ర సాయంత్రం గ్రామ సమీపంలోని బావిలో కుమారుడుతో పాటు దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్య, కుమారుడు ఇంట్లో కనిపించకపోవడంతో భర్త, కుటుంబీకులు ఊరంతా గాలించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఊరికి సమీపంలోని బావిలో శవమై తేలారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మృతదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కుమార్ తదితులున్నారు. -
నైట్‌క్లబ్‌లో దారుణం.. భార్యపై లైంగిక దాడి.. భర్తకు చావు దెబ్బలు
జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో దారుణం చోటుచేసుకంది. ఇక్కడి ఒక నైట్‌క్లబ్ యజమాని తన కోరిక తీర్చలేదని ఒక మహిళను లైంగికంగా వేధించి, ఆమె భర్తపై దాడి చేశాడు. ఈ ఘటన జైపూర్‌లోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘క్లబ్ ఆల్ఫా’లో చోటుచేసుకుంది. బాధితురాలు ఇరామ్ షేక్ తన భర్త నవేద్ ఉస్మానీతో కలిసి క్లబ్‌కు వెళ్లింది. ఇంతలో అక్కడున్న ఒక వెయిటర్.. క్లబ్ యజమాని భరత్ ఆమెను ఒక ప్రైవేట్ గదిలో కలవాలనుకుంటున్నట్లు తెలియజేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. కాగా క్లబ్ యజమాని అభ్యర్థనను ఆమె తిరస్కరించారు.ఆ దంపతులు క్లబ్లో సేదతీరిన కొద్దిసేపటి తర్వాత ఇరామ్ షేక్ వాష్‌రూమ్ వైపు వెళ్లారు. అదే సమయంలో క్లబ్ యజమాని భరత్, మేనేజర్ దీపక్, పలువురు బౌన్సర్లు ఆమెను చుట్టుముట్టి, అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త నవేద్ ఉస్మానీ అక్కడకు పరుగుపరుగున వచ్చాడు. అతను క్లబ్ యజమాని, సిబ్బందిని అడ్డుకున్నాడు. దీంతో భరత్, మేనేజర్ దీపక్, బౌన్సర్లు కలిసి నవేద్ ఉస్మానీపై దాడి చేసి, ఇనుప రాడ్లతో కొట్టారు. ఈ దాడిలో నవేద్ ఉస్మానీ కాలు విరిగింది. అంతటితో ఆగని బౌన్సర్లు బాధిత దంపతుల కారును కూడా ధ్వంసం చేశారు.కొద్దిసేపటి తరువాత బాధితులు ఈ దాడి గురించి పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన నవేద్‌ను ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత దంపతులు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని ఏసీపీ బలరామ్ చౌదరి తెలిపారు. ఘటన జరిగినప్పటి సీసీటీవీ ఫుటేజీని, నిందితుల కాల్ డీటెయిల్ రికార్డులను సేకరిస్తున్నామన్నారు. సేకరించిన ఆధారాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా నైట్‌క్లబ్ యజమాని, సిబ్బంది తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: కెనడా: ఇద్దరు భారతీయులపై కాల్పులు -
న్యాయవాదికి 'సైబర్' వల.. రూ.72 లక్షలు మాయం
బద్వేలు అర్బన్: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన ఓ ప్రముఖ న్యాయవాది సైబరాసురుల వలలో చిక్కి, డబ్బులు పోగొట్టుకున్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పట్టణానికి చెందిన న్యాయవాదికి 3 నెలల కిందట గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను గుజరాత్‌కు చెందిన పోలీసు అధికారినని, మీ ఆధార్ నంబర్‌కు ఓ ఫోన్ నంబర్ లింక్ అయి ఉందని, ఆ నంబర్ ద్వారా అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నందుకు క్రిమినల్ కేసు నమోదైందని న్యాయవాదిని బెదిరించాడు. సుప్రీంకోర్టు నుంచి మీపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయిందని, అందుకు మిమ్మల్ని అరెస్టు చేయాల్సి ఉంటుందన్నాడు. దీంతో న్యాయవాది సమస్యను పరిష్కరించాలని కోరగా.. తొలుత రూ.18 లక్షలు డిపాజిట్ చేయాలని నేరగాడు నమ్మబలికాడు. అనంతరం పలుమార్లు ఫోన్ చేసి వివిధ లావాదేవీల ద్వారా మొత్తంగా రూ.72,68,039 బదిలీ చేయించుకున్నాడు. ఈ విషయం బయటకు రాకూడదని, ఎవరికైనా చెబితే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించాడు. తర్వాత ఇదంతా మోసమని గ్రహించిన న్యాయవాది పట్టణ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మోసపోయిన న్యాయవాది వివరాలను వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు. -
రెండు ప్రమాదాల్లో నలుగురి మృతి
ఆత్మకూరు/అచ్యుతాపురం రూరల్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు, అనకాపల్లి జిల్లాలో శనివారం రాత్రి మోటారు సైకిల్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ల గ్రామానికి చెందిన చవల మాధవ (38), మనోజ (35) దంపతులు. వీరి కుమార్తె ఆత్మకూరులోని ఏపీ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతోంది. ఆదివారం పేరెంట్ మీట్ ఉండడంతో వీరు వెళ్లారు. ఇంటివద్ద నుంచి భోజనం తీసుకెళ్లి కుమార్తెకు తినిపించారు. అక్కడి నుంచి బైక్ మీద ఇంటికి వెళుతుండగా.. నెల్లూరు–ముంబై రహదారిలో ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోకి వచ్చేసరికి బద్వేల్ నుంచి నెల్లూరు వెళుతున్న ఇన్నోవా కారు రాంగ్రూట్లో వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. మంచులో దారి సరిగా కనిపించక.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం జగన్నాథపురం సమీపంలో శనివారం రాత్రి మోటారు సైకిల్ కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో మునగపాక మండలం గణపర్తి గ్రామానికి చెందన ధనువిజయ్ (19), చెర్లోపాలెం గ్రామానికి చెందిన దూలి దుర్గ (20) మరణించారు. ఎస్ఐలు సుధాకర్, వెంకటరావు తెలిపిన మేరకు.. తండ్రి చనిపోవడంతో దూలి దుర్గ అచ్యుతాపురం మండలం చోడపల్లిలో తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి విద్యుత్ లైటింగ్ పనులు చేసుకుంటూ తల్లి నాగమణికి చేయూతగా నిలుస్తున్నాడు. గణపర్తికి చెందిన భోగాది మహేష్, లక్ష్మి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ధనువిజయ్ లైటింగ్ పనులకు సహాయకుడిగా వెళుతున్నాడు. వీరికి జగన్నాథపురానికి చెందిన ఇంటి జగన్ స్నేహితుడు. గణపర్తిలో శనివారం జరిగిన పండుగలో వీరు ఉత్సాహంగా గడిపారు. తరువాత దుర్గను చోడపల్లిలో డ్రాప్ చేయడానికి బైక్‌పై ముగ్గురూ బయలుదేరారు. జగన్నాథపురంలో జగన్ దిగిపోయి, తన బైక్‌ను దుర్గకు ఇచ్చాడు. రాత్రి 11.30 గంటల సమయంలో దుర్గ, ధనవిజయ చోడపల్లి వెళుతుండగా మంచు విపరీతంగా కురవడంతో దారి సరిగా కనిపించక జగన్నాథపురం సమీపంలో రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. గాయపడిన వారిని 108 వాహనంలో అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతిచెందారని వైద్యులు తెలిపారు. -
చనిపోయిన మహిళ నోట్లో పురుగుల మందు పోసి...
మహబూబాబాద్ రూరల్: వారిది ప్రేమ వివాహం.. అయినా కొంతకట్నం ఇచ్చారు. పెళ్లయిన ఏడాదినుంచే అదనపు కట్నం తేవాలంటూ భర్తతోపాటు అత్తామామ, మరిది వేధింపులు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆమెను దారుణంగా కొట్టి చంపి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించేందుకు యత్నించారు. ఈ దారుణం మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, మృతురాలి తల్లి కౌసల్య తెలిపిన వివరాల ప్రకారం... మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన గుగులోత్ అర్జున్, కౌసల్య దంపతుల కూతురు స్వప్న (26) అదే గ్రామానికి చెందిన బానోత్ కిషన్, బుజ్జి దంపతుల కుమారుడు రామన్న ప్రేమించుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో 15 ఏళ్ల క్రితం రూ.3 లక్షల కట్నం, 8 తులాల బంగారం ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి జరిగిన సంవత్సరం నుంచి అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తుండగా పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి, అదనపు కట్నం కింద ఎకరం భూమి కూడా ఇచ్చారు. అయినప్పటికీ అత్తింటివారి వేధింపులు ఆగలేదు. ఈ క్రమంలోనే ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు జని్మంచారు. ఇటీవల మళ్లీ అదనపు కట్నం కావాలంటూ స్వప్నపై వేధింపులు పెరిగాయి. గత మూడు రోజులుగా అత్తామామలు కిషన్, బుజ్జి, భర్త రామన్న, మరిది నవీన్ స్వప్నను చిత్రహింసలుపెట్టి, కిరాతకంగా కొట్టారు. శనివారం రాత్రి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోతుందని భయపడిన వారు చికిత్స నిమిత్తం ప్రభుత్వ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్వప్నను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని చెప్పారు. దీంతో కేసు తమపైకి వస్తుందని భావించిన అత్తామామలు, భర్త, మరిది మళ్లీ స్వప్న మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి ఆమె నోట్లో పురుగుమందు పోసి ఆత్మహత్య చేసుకుని మృతిచెందినట్లు నమ్మించాలని చూశారు. ఈ విషయం మృతురాలి గ్రామస్తులు, తల్లిదండ్రులకు తెలియగానే వారంతా రామన్న ఇంటికి చేరుకుని ఆగ్రహంతో అత్తింట్లో ఫరి్నచర్, టీవీ, ఇతర సామగ్రి ధ్వంసం చేశారు. అప్పటికే మృతురాలి అత్తామామలు, భర్త, మరిది పరారీలో ఉన్నారు. రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆస్ట్రేలియాలో పహల్గామ్ తరహా టెర్రర్ ఎటాక్.. 10 మంది మృతి
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి కలకలం రేపింది. జమ్మూకశ్మీర్ పహల్గాం తరహాలో సిడ్నీ బాండీ బీచ్‌లో ఉగ్రదాడి జరిగింది. బీచ్‌లోని యూదులే లక్ష్యంగా జరిపిన కాల్పుల్లో పదిమందికి పైగా పర్యాటకులు మృతిచెందారు. ముసుగు ధరించిన ఉగ్రవాదులు.. పర్యాటకులపై కాల్పులు జరిపారు.అయితే బీచ్‌లో సరదాగా గడుపుతున్న పర్యాటకులు.. కాల్పుల మోతతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో పరుగులు తీశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీచ్‌లో ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు ఉగ్రవాదుల్ని హతమార్చేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.బీచ్‌లోకి పర్యాటకులను నిషేధించారు. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లొద్దంటూ న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. కాల్పుల తర్వాత ఎనిమిది మందిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.One of the shooters was disarmed and possibly shot by one of the Bondi Beach goers. He is the shooter who the police gave CPR.pic.twitter.com/LS6IP68jlH— Terrible Pics (@TerriblePic) December 14, 2025 -
అమానుషం.. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం
ఉప్పలగుప్తం: కన్న కూతురి చేయి పట్టుకుని విద్యాబుద్ధులు నేర్పించాల్సిన తండ్రి.. ఆమె పైనే కన్ను వేసి, అఘాయిత్యానికి పాల్పడిన అమానుష సంఘటన ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామంలో జరిగింది. ఎస్సై సీహెచ్ రాజేష్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆ వ్యక్తి తన భార్యను ఉపాధి నిమిత్తం కువైట్ పంపించి, 15 ఏళ్ల కుమార్తెతో కలసి ఉంటున్నాడు. కుమారుడిని తన అత్తవారింటి వద్ద ఉంచాడు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న ఆ దుర్మార్గుడు కొంత కాలంగా తన కుమార్తెను బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అమ్మమ్మ గారింటి దగ్గర ఉంటున్న బాలిక సోదరుడికి సమాచారం ఇచ్చారు. తన తండ్రి అఘాయిత్యంపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళా పోలీసు విచారణ అనంతరం బాధిత బాలిక సోదరుడి ఫిర్యాదు మేరకు డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యాన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ ప్రసాద్, అమలాపురం రూరల్ సీఐ డి.ప్రశాంత్ కుమార్, ఎస్సై రాజేష్ పరిశీలించారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
18 ఏళ్ల వేట
కాలం మారినా.. చట్టం మాత్రం నిద్రపోలేదు. తన వేటను ఆపలేదు. సరిగ్గా పద్దెనిమిదేళ్ల క్రితం.. అంటే 2007లో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి, అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారైన నిందితుడి కోసం పోలీసులు సాగించిన సుదీర్ఘ వేట ఎట్టకేలకు ముగిసింది. చిన్నారిపై ‘హత్యాచారం’ తరువాత, నిందితుడు సరిహద్దులు దాటి అదృశ్యమయ్యాడు. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. నేపాల్ అడవుల్లోని అజ్ఞాతం.. యూపీలోని ఇటుక బట్టీలో దాక్కున్న రహస్యం.. ఇవేవీ చట్టం కళ్లుగప్పలేకపోయాయి. ఎట్టకేలకు మీరా భయందర్–వసాయ్ విరార్ (ఎంబీవీవీ) పోలీసులకు కీచకుడు పట్టుబడ్డాడు. క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మదన్ బల్లాల్ తెలిపిన వివరాలివి. అది కాళరాత్రి మాణిక్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ అమానుష ఘటన. 2007 మార్చి 31 రాత్రి, 22 ఏళ్ల నంద్లాల్ అలియాస్ నందు రాందాస్ విశ్వకర్మ అనే యువకుడు ఒక చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి లోబరుచుకున్నాడు. మర్నాడు తెల్లవారుజామున బాలిక ఉసురు తీశాడు. అత్యాచారం, హింసతో పాటు, చివరకు ఉరితాడు బిగించి ఆమెను హత్య చేశాడు. నేపాల్‌కు పరారైన హంతకుడు నేరం చేసిన వెంటనే, నందు విశ్వకర్మ అంతర్జాతీయ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయాడు. అతను చాలా ఏళ్లు అక్కడే అజ్ఞాతంలో గడిపాడు. ఆ కేసు ఫైల్ మాణిక్పూర్ పోలీసుల దగ్గర దుమ్ము పట్టి ఉన్నా, దర్యాప్తు అధికారులు మాత్రం వదిలేయలేదు. అతి ముఖ్యమైన క్లూ.. వేట మొదలు అయితే.. ఇటీవల కేసును మళ్లీ తిరగదోడిన క్రైమ్ డిటెక్షన్ సెల్–2, వసాయ్ బృందానికి ఊహించని క్లూ దొరికింది. నిందితుడు పాత జీవితాన్ని వదిలి, యూపీకి తిరిగి వచి్చ, సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని స్వగ్రామం ఖర్దౌరీలో ఇటుక బట్టీలో కూలీగా దాక్కుని ఉన్నాడని తెలిసింది. దీంతో ఏసీపీ మదన్ బల్లాల్ నాయకత్వంలో, సీనియర్ ఇన్స్పెక్టర్ అవిరాజ్ కుర్హాడే బృందం తక్షణమే కదిలింది. పట్టుబడిన క్షణం నిందితుడి ఆచూకీ పక్కాగా ధ్రువీకరించుకున్నాక.. డిసెంబర్ 10న యూపీలోని ఖర్దౌరీకి చేరుకున్న పోలీసు బృందం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 18 ఏళ్లుగా స్వేచ్ఛా జీవితం గడిపిన విశ్వకర్మ, తన చుట్టూ ఉచ్చు బిగుస్తోందని ఊహించలేకపోయాడు. చివరకు నంద్లాల్ అలియాస్ నందు రాందాస్ విశ్వకర్మను డిసెంబర్ 10న అతని స్వగ్రామం ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని ఖర్దౌరీలో అరెస్టు చేసి మహారాష్ట్రకు తరలించారు. నిజం నిప్పులాంటిది ఎంతకాలం దాచినా, పాపం పండక తప్పదు. న్యాయం ఆలస్యమై ఉండవచ్చు.. కానీ జరిగి తీరుతుంది. చాక్లెట్ ఆశ చూపించి చిన్నారిని చిదిమేసిన హంతకుడికి పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ అజ్ఞాతం తరువాత సంకెళ్లు పడటమే దీనికి నిదర్శనం. చట్టంపై విశ్వాసాన్ని నిలబెడుతూ పోలీసులు సాగించిన వేట నేటితో ముగిసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుంటూరులో మళ్లీ డ్రగ్స్ కలకలం
పట్నం బజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు తల్లీకుమార్తె మధ్య డ్రగ్స్ వివాదం కలకలం రేపింది. కుమార్తె డ్రగ్స్‌కు బానిసగా మారిందని తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాలిక బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు చిన్నబజారుకు చెందిన ఓ మహిళ హైదరాబాద్‌లోని ఒక టీవీ చానల్లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. తండ్రితో కలిసి గుంటూరులోనే ఉంటున్న పెద్ద కుమార్తె (17) ఇక్కడే ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఇద్దరు యువకులు తన కుమార్తెను డ్రగ్స్‌కు బానిసగా మార్చారని తల్లి ఆరోపిస్తున్నారు. డ్రగ్స్ అలవాటు మానుకోవాలని తల్లి చెప్పగా.. శుక్రవారం తల్లీకుమార్తె మధ్య ఘర్షణ తలెత్తగా కుమార్తె తల్లికి ఎదురుతిరిగింది. దీంతో మనస్తాపానికి గురైన తల్లి ఫిట్స్ తగ్గడానికి ఉపయోగించే టాబ్లెట్లను అధికంగా మింగడంతో స్పృహ కోల్పోయింది. ఆమెను చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బాధితురాల్ని కలిసిన పోలీసు అధికారులు మహిళ ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఆమెతో మాట్లాడారు. ఈగల్ ఐజీ రవికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా మైనర్ విద్యారి్థనిని మాదక ద్రవ్యాల ఉచ్చులోకి లాగిన ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తామన్నారు. పూర్తిస్థాయిలో డ్రగ్స్‌కు బానిసైన బాలికకు ఆడిక్షన్ సెంటర్ ద్వారా చికిత్స అందించి సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, ప్రేమ పేరుతో యువతిని వంచించి మాదకద్రవ్యాల మత్తుకు అలవాటు చేసిన వారిని పట్టుకు తీరుతామన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. కుమార్తె తన మాట వినడం లేదని, బాలికను వారించే క్రమంలో తల్లిపై తిరగబడిందని చెప్పారు. దీంతో తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. ఆ బాలికకు డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారనే కోణంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామని చెప్పారు. ప్రత్యేక బృందాల ద్వారా విచారిస్తామన్నారు. కొన్ని కళాశాలల్లోని విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారన్న సమాచారం తమ వద్ద ఉందన్నారు. బాలికకు డ్రగ్స్ అలవాటు చేసిన ఇద్దరు యువకులను త్వరితగతిన అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. -
3 గంటలు స్టేటస్.. 24 గంటలూ సేల్స్!
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ డ్రైవర్‌గా నగరానికి వలసవచ్చి డ్రగ్ పెడ్లర్‌గా మారిన శ్రీకాకుళం వాసి వ్యవస్థీకృతంగా, కొత్త పంథాలో ఈ దందా చేస్తున్నాడు. వర్చువల్ నంబర్ వినియో గిస్తూ.. తన వద్దకు సరుకు వచ్చిన సమాచారాన్ని వాట్సాప్ స్టేటస్ ద్వారా కస్టమర్లకు చేరవేస్తున్నాడు. మాదకద్రవ్యాలను దోశల మాదిరిగా ప్యాక్ చేసి, డెలివరీ బాయ్స్ సహకారంతో ఆర్డర్ ఇచ్చిన వారి వద్దకు పంపిస్తున్నాడు. ఈ వ్యవహారం గుట్టును రట్టు చేసిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు ఐదుగురిని పట్టుకున్నారు. వీరి నుంచి ఐదేసి కేజీల చొప్పున గంజాయి, హష్ ఆయిల్, ద్విచక్ర వాహనం సహా రూ.70 లక్షల విలువైన సొత్తు స్వా«దీనం చేసుకున్నారు. శనివారం విలేకరుల సమావేశంలో డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఈ వివరాలు వెల్లడించారు. సహచరుల కోసం దందా మొదలుపెట్టి.. ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన వైకుంఠ రావు 2017లో హైదరాబాద్‌కు వలసవచ్చి, మాదాపూర్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదనపు ఆదాయం కోసం ధూల్‌పేట నుంచి గంజాయిని కొనుక్కుని వెళ్లి తన సహచర డ్రైవర్లకు విక్రయించే వాడు. లాక్డౌన్లో ఉద్యోగం కోల్పోయి పూర్తిగా మాదకద్రవ్యాల దందా మొదలు పెట్టాడు. తొలుత ధూల్‌పేట నుంచి గంజాయి తీసుకువచ్చి చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఎక్కువ రేటుకు అమ్మేవాడు. 2020 నుంచి ఒడిశా విక్రేతల వద్ద నుంచి గంజాయి, హష్ ఆయిల్ తీసుకువచ్చి విక్రయించడం మొదలు పెట్టాడు. దీనికి సంబంధించి 2021లో సనత్‌నగర్, ఈ ఏడాది జూన్‌లో కొత్తవలస ఠాణాల్లో కేసులు నమోదై జైలుకు వెళ్లాడు. ఆధారాలు చిక్కకుండా పథకం.. జైలు నుంచి బయటకు వచ్చిన వైకుంఠ రావు తన పంథా మార్చేశాడు. ఉనికి బయటపడకుండా దందా చేయడానికి నిర్ణయించుకుని ఒడిశాకు చెందిన హష్ ఆయిల్ తయారీదారుడు పాల్ ఖిలా, సప్లయర్ కృష్ణ జల్లాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు.పాల్ నుంచి గంజాయి, హష్ ఆయిల్ సేకరించే కృష్ట నగరానికి తీసుకువచ్చి మాదాపూర్‌లోని వైకుంఠ రావు ఇంట్లో డెలివరీ ఇచ్చేవాడు. తన గుర్తింపు బయటపడకుండా వర్చువల్ నంబర్ వాడుతున్న వైకుంఠ రావు సరుకు వచ్చిన ప్రతిసారీ మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 వరకు ‘గ్రీన్ అవైలబుల్’అంటూ స్టేటస్ పెట్టేవాడు. దీన్ని చూసే ఇతడి రెగ్యులర్ కస్టమర్లు ఎంతెంత కావాలో వాట్సాప్‌లోనే ఆర్డర్ ఇచ్చేవారు. దానికి అయ్యే మొత్తాన్ని ఆన్లైన్లో వసూలు చేసే వైకుంఠ రావు, సరుకు పంపడానికి తన బంధువులైన బాలాజీ, చైతన్యలను డెలివరీ బాయ్స్‌గా ఏర్పాటుకున్నాడు. గంజాయి, హష్ ఆయిల్ టిన్నులను దోశ మాదిరిగా పేపర్లో ప్యాక్ చేసి, వీరి ద్వారా సరుకు అయిపోయే వరకు 24 గంటలూ సరఫరా చేసేవాడు. బాలాజీ చిక్కడంతో కదిలిన డొంక.. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ జీఎస్ డానియేల్ నేతృత్వంలో టోలిచౌకి వద్ద కాపుకాశారు. అక్కడ ఓ కస్టమర్‌కు గంజాయి డెలివరీ చేయడానికి వచ్చిన బాలాజీని పట్టుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో మాదాపూర్‌లోని వైకుంఠరావు గదిపై దాడి చేశారు. ఈ సందర్భంగా వైకుంఠ రావుతో పాటు అక్కడే ఉన్న పాల్, కృష్ణ, చైతన్యలను అదుపులోకి తీసుకున్నారు. ఆ గది నుంచి హష్ ఆయిల్, గంజాయిని సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును టోలిచౌకి పోలీసులకు అప్పగించారు. వైకుంఠ రావు ఫోన్‌ను తనిఖీ చేసిన పోలీసులు 120 మంది వినియోగదారులను గుర్తించారు. వీరిలో ఐటీ, సినీ రంగానికి చెందిన వారితో పాటు డాక్టర్లు, ఉన్నత విద్యావంతులు కూడా ఉన్నారు. వీరికి కుటుంబీకుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి రీహ్యాబ్‌కు పంపాలని నిర్ణయించామని, ఇలాంటి డ్రగ్స్ దందాలపై సమాచారం ఉంటే 8712661601 నంబర్‌కు ఫోన్ చేసి తెలపాలని డీసీపీ వైభవ్ కోరారు. -
భార్యకు ఉరివేసి.. ఆత్మహత్య
గణపురం: కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి భార్యకు ఉరివేసి.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. గణపురం ఎస్ఐ రేఖ అశోక్ కథనం ప్రకారం.. సీతారాంపురం గ్రామానికి చెందిన రామాచారి (55)కి గతంలో జరిగిన రెండు పెళ్లిళ్లలో ఒక భార్య చనిపోగా, మరొకరికి విడాకులిచ్చాడు. మైలారం గ్రామానికి చెందిన సంధ్యను 20 ఏళ్ల క్రితం మూడో వివాహం చేసుకున్నాడు. వీరి కుమార్తె వైష్ణవి (19) గణపురం మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడిని కులాంతర వివాహం చేసుకుంది. ఈ వివాహానికి సహకరించావంటూ భార్య సంధ్యతో రామాచారి తరచూ గొడవ పడుతున్నాడు. దీంతోపాటు రామాచారికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రామాచారి శనివారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న భార్యకు తాడుతో ఉరివేసి హత్య చేశాడు. అనంతరం ఫోన్లో రికార్డు చేసి స్టేటస్‌గా పెట్టుకుని.. తనూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసిన సంధ్య కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులతో కలసి రామాచారి ఇంటికి వెళ్లి చూడగా సంధ్య, రామాచారిలు మృతి చెంది ఉన్నారని ఎస్ఐ తెలిపారు. మృతురాలి తల్లి సెగ్గోజు భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. -
ఎన్టీఆర్ జిల్లా: బోర్డు తిప్పేసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. విస్సన్నపేటలో ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ అడ్వైజరీ సర్వీసెస్’ బోర్డు తిప్పేసింది. ఒక్కొక్కరిగా బాధితులు బయటకొస్తున్నారు. ఇంటికో మొక్క పెంచితే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఎర వేసిన నిర్వాహకులు.. సంస్థలో డబ్బులు పెడితే మీ భవిష్యత్ మారిపోతుందంటూ ఆశ పెట్టారు. జనం అత్యాశను ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు.ఏజెంట్లను నియమించుకుని టార్గెట్లు పెట్టి మరీ కోట్ల రూపాయలు వసూలు చేశారు. పది వేలు పెడితే ప్రతీ నెలా వెయ్యి రూపాయలు, రూ. ఐదు లక్షలు పెడితే నెలకు రూ.50 వేలు ఇస్తామంటూ టోకరా వేశారు. సుమారు రూ.25 కోట్లకు పైగానే వసూళ్లు చేశారు. డబ్బులు కట్టిన వారు ప్రశ్నించడంతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫౌండర్ దుర్గా ప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గా ప్రసాద్ చనిపోయిన తర్వాత అతని భార్య నండూరి శివానీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మోసపోయామని గ్రహించిన బాధితులు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. -
చిలుకను కాపాడబోయి : తనువు చాలించిన వ్యాపారవేత్త
ఇంట్లో పెంపుడు జంతువులుంటే ఆనందం, మానసిక ఉల్లాసం కలుగుతుందని నమ్ముతారు. అందుకే చాలామంది ఏదో ఒక పెట్‌ను పెంచుకుంటూ ఉంటారు. అల్లారుముద్దుగా చూసుకుంటారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ ఒకోసారి పెంపుడు జంతువులే ప్రాణానికి చేటు తెస్తూ ఉంటాయి. బెంగళూరులో జరిగిన ఒక విషాదం గురించి తెలిస్తే హృదయం ద్రవించకమానదు.బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త అరుణ్ కుమార్ ఎంతోఖరీదైన చిలుకను పెంచు కుంటున్నాడు. మకావ్ రకానికి చెందిన దీని విలువ 2.5 లక్షలరూపాయలు. అది ఉన్నట్టుండి ఇంట్లోంచి ఎగిరిపోయి, సమీపంలోని విద్యుత్ స్తంభంపై వాలింది. దాన్ని పట్టుకుందామని ప్రహరీ గోడపైకి ఎక్కాడు. అలా దాన్ని రక్షించబోయే ప్రయత్నంలో అరుణ్ ప్రమాదవశాత్తు హై-వోల్టేజ్ విద్యుత్ తీగను తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అతను కుమార్ గోడపై నుండి కిందపడి గాయపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతణ్ణి అసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. బెంగళూరులోని గిరినగర్ ప్రాంతంలో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు అసాధారణ మరణంగా కేసు నమోదు చేశారు. అరుణ్ కుమార్‌కి వాహనాల నంబర్ ప్లేట్ల తయారీ వ్యాపారం ఉంది. -
పెళ్లైన మూడు నెలలకే నవవధువు ఆత్మహత్య
హైదరాబాద్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ ప్రాంతంలో నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రొద్దుటూరుకు చెందిన చందన జ్యోతి కొత్తగూడెంకు చెందిన యశ్వంత్‌తో మూడు నెలల క్రితం వివాహం జరిగింది.వివాహానంతరం యశ్వంత్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు వచ్చి, భార్య జ్యోతి కలిసి మూసాపేట్లో నివాసం ఉంటున్నాడు. యశ్వంత్ ఓ ప్రైవేటు సంస్థ అయిన మెడ్‌ప్లస్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.ఇటీవల కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో మనస్తాపానికి గురైన చందన జ్యోతి నిన్న(శుక్రవారం) రాత్రి బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఆత్మహత్యకి పాల్పడింది. ఈ విషయం గమనించిన భర్త యశ్వంత్ 108కి ఫోన్ చేయగా స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు . -
వైరల్: బీజేపీ నేత కుమార్తెకు ఆకతాయిల వేధింపులు
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. సికంద్రారావు నోరంగాబాద్ ప్రాంతంలోని పశ్చిమి ప్రాంతంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కుమార్తె కోచింగ్ సెంటర్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చి ఆమెను వేధించారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దాంతో బాధితులు సదరు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. Molestation in daylight! 🚨⚠️Three youths on a bike molested two girls returning from coaching in Hathras, UP. In the CCTV video, they were seen touching the girls' cheeks inappropriately. Shameful!If Hathras victim had got justice, incidents like this wouldn't happen today. pic.twitter.com/VEihF68JUQ— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) December 12, 2025రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపనున్నట్లు డీఎస్పీ హిమాన్షు మాథుర్ తెలిపారు. ఇంకా పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. సదరు ఘటన స్థానికంగా కలకలం రేపడంతో విద్యార్థినులు, మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
చిలుక తెచ్చిన తంటా
కర్ణాటక: చిలుకను రక్షించబోయి యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందిన సంఘటన బెంగళూరు గిరినగర్‌లోని ఒక అపార్ట్మెంట్లో చోటుచేసుకుంది. అరుణ్‌కుమార్(32) అనే వ్యక్తి ఫారిన్ నుంచి రూ.2 లక్షల విలువైన చిలుకను కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. అది ఎగిరి వెళ్లి అపార్ట్మెంట్ లోపలి నుంచి వేయబడ్డ హైటెన్షన్ విద్యుత్ తంతిపై వాలింది. అరుణ్‌కుమార్ స్టీల్ పైప్‌కి కర్ర కట్టి అపార్ట్మెంట్ కాంపౌండ్ గోడ ఎక్కి చిలుకను రక్షిస్తుండగా విద్యుత్ షాక్‌కి గురై మృతిచెందాడు. గిరినగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
మలయాళ నటి కేసులో ఆరుగురికి 20 ఏళ్ల జైలు శిక్ష
కొచ్చి: కేరళలో 2017లో సంచలనం సృష్టించిన బహుభాషా నటిపై గ్యాంగ్ రేప్ ఘటనలో కోర్టు ఆరుగురికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో మరో నిందితుడ, మలయాళ నటుడు దిలీప్‌కు కోర్టు ఇటీవలే బయటపడటం తెల్సిందే. ఎర్నాకులం జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి హనీ ఎం వర్గీస్ శుక్రవారం సునీల్ ఎన్ఎస్ అలియాస్ పల్సర్ సునీ, మార్టిన్ ఆంటోనీ, మణికందన్, విజేష్, సలీం, ప్రదీప్ అనే వారికి గ్యాంగ్ రేప్‌నకు పాల్పడిన నేరానికి గాను 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. వీరికి వివిధ నేరాలకు పాల్పడినందుకు గాను అదనంగా జైలు శిక్షలు, వేర్వేరు జరిమానాలు సైతం విధించారు. అశ్లీల వీడియోను ఇతరులకు షేర్ చేసిన నేరానికి గాను సునీకి అదనంగా మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా, సాక్ష్యాన్ని నాశనం చేసిన నేరానికి మార్టిన్‌కు మూడేళ్ల జైలు, రూ.25 వేల జరిమానా విధించారు. ఈ శిక్షలను ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని, బెయిల్‌కు ముందు రిమాండ్‌లో కలిపిన కాలాన్ని కూడా శిక్షలో భాగంగానే పరిగణించాలని స్పష్టం చేశారు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారమివ్వాలని, లైంగికదాడి దృశ్యాలున్న పెన్‌డ్రైవ్‌ను విచారణాధికారి కస్టడీలో ఉంచాలని జడ్జి తెలిపారు. నిర్భయ కేసులో సుప్రీంకోర్టు తెలిపిన అంశాలనే ఈ కేసుకు కూడా వర్తింప జేసినట్లు చెప్పారు. ఈ తీర్పు తమకు నిరుత్సాహం కలిగించిందని, దోషులందరికీ కోర్టు యావజ్జీవ కారాగారం విధిస్తుందని భావించామని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అజా కుమార్ చెప్పారు. దీనిపై త్వరలో కేరళ హైకోర్టుకు వెళతామన్నారు. ఈ నెల 8వ తేదీన ఇదే కేసులో నటుడు దిలీప్ సహా నలుగురిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
టీడీపీ నేతల అరాచకం.. నెల్లూరులో కార్పొరేటర్ తండ్రి కిడ్నాప్
చిల్లకూరు: నెల్లూరు జిల్లాలో అధికార టీడీపీ నేతల అరాచకం, దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సొంత గూటికి వెళ్లారన్న అక్కసుతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు బెదిరింపులు మితిమీరాయి. టీడీపీలోనే కొనసాగాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ 34వ వార్డు కార్పొరేటర్ ఫమీదా గురువారం వైఎస్ జగన్ చేతుల మీదుగా వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్న నేపథ్యంలో కొందరు ఆమె తండ్రి సయ్యద్ నజీర్‌ను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. తిరుపతి జిల్లా వాకాడు బీసీ కాలనీకి చెందిన సయ్యద్ నజీర్ వైఎస్సార్సీపీలో చురుగ్గా వ్యవహరించడంతో పాటు బతుకుదెరువు కోసం పొట్టేళ్ల వ్యాపారం చేస్తున్నాడు. కుమారుడు బెంగళూరులో ఉండగా, కుమార్తె ఫమీదాకు పెళ్లి చేసి నెల్లూరు పంపారు. అక్కడ ఆమె వైఎస్సార్సీపీ కార్పొరేటర్‌గా విజయం సాధించింది. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత అక్కడి నాయకుల ఒత్తిడితో ఆమె పార్టీ మారారు. అయితే ఆ పార్టీలో ఇమడలేక రెండు రోజుల క్రితం ఆమె వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో అధికార పార్టీ నాయకులు ఆమెను ఒత్తిడికి గురిచేసే క్రమంలో గురువారం సాయంత్రం మసీద్ నుంచి ఆమె తండ్రి ఇంటికి తిరిగి వస్తుండగా బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. కారులో నలుగురు వచ్చారని, వారిలో ఒకరు పోలీసు దుస్తుల్లో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అంతకు ముందు వారు నజీర్ అనే టీ కొట్టు వ్యక్తిని పట్టుకుని కారులో ఎక్కించుకొని కొన్ని వివరాలు అడిగారు. తాను మీరనుకుంటున్న నజీర్‌ను కాదని చెప్పడంతో అతడ్ని వదిలేసి.. ఫమీదా తండ్రి నజీర్ ఎక్కడున్నాడో కనుక్కుని బలవంతంగా తీసుకెళ్లారు. చీకటి పడినప్పటికీ నజీర్ ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన శుక్రవారం వాకాడుకు చేరుకుని అన్ని రకాలుగా విచారించాక, నజీర్ కిడ్నాప్‌నకు గురయ్యారని సీఐ హుస్సేన్‌బాషాకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి వరకు ఆయన ఆచూకీ తెలియలేదు. -
ప్రియుడు వద్దని.. భర్తే సర్వస్వమని..
కర్ణాటక: ఇటీవలి కాలంలో ఫేస్బుక్, ఇన్‌స్టా తదితర యాప్‌లతో పరిచయాలు పెరగడం, జీవిత భాగస్వాములు వదిలేసి వెళ్లడం మామూలు విషయమైంది. దీనివల్ల గొడవలు జరిగి కుటుంబాలు రోడ్ల పాలవుతుంటే అభం శుభం తెలియని పిల్లల జీవితం ఛిద్రమవుతోంది. బెంగళూరు బన్నేరుఘట్ట పరిధిలో ఇదే మాదిరిగా భర్తను వదిలేసి ప్రియునితో వెళ్లిపోయిన మహిళ.. కొన్ని నెలల తరువాత మళ్లీ భర్త వద్దకు వచ్చేసింది. దీంతో కథ సుఖాంతమైందని స్థానికులు నిట్టూర్చారు.ఏం జరిగింది..సెప్టెంబరు ఆఖర్లో లీల అనే మహిళ భర్త, క్యాబ్‌డ్రైవర్ మంజునాథ్, ముగ్గురు పిల్లలను వదిలేసి ప్రియుడు సంతుతో వెళ్లిపోయింది. మంజు కన్నీరు కారుస్తూ తన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా తిరిగి రావాలని విలపిస్తూ చేసిన వీడియో ప్రచారమైంది. తాను మాత్రం సంతుతోనే ఉంటానని లీల చెప్పింది. సంతు, లీల సరదా ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ బాగోతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.లీలాలో పరివర్తన..నెలన్నర కిందట మంజు కోపం పట్టలేక సంతును వెతికిపట్టుకుని చితకబాదాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఈ కేసులో మంజును అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటీవలే విడుదలై కొత్త ఆటోను కొనుక్కుని పిల్లలను పోషిస్తున్నాడు. ఇంతలో లీల మనసులో ఏం పరివర్తన వచ్చిందో గానీ ప్రియున్ని వదిలేసి భర్త చెంతకు చేరింది. మంజు ఆమెను ఆత్మీయంగా స్వాగతించాడు. బన్నేరుఘట్టలోని అద్దె ఇంట్లో కులాసాగా కాపురం ప్రారంభించారు. త్వరలో ధర్మస్థలలో మళ్లీ పెళ్లి చేసుకుంటామని, అన్నీ మరచిపోయి సంతోషంగా జీవిస్తామని ఈ జంట చెబుతోంది. ఇది చూస్తే నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు అని కొందరు నెటిజన్లు వాపోతే, మరికొందరు దీవించారు. -
జుబీన్ గార్గ్ మరణంపై చార్జిషీట్
గౌహతి: ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ అనుమానాస్పద మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఆర్గనైజర్, వ్యక్తిగత సెక్రటరీ సహా నలుగురు నిందితులపై హత్య అభియోగాలు మోపింది. నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు కల్చరల్ బ్రాండ్ అంబాసిడర్‌గా హాజరయ్యేందుకు సింగపూర్ వెళ్లిన జుబీన్ గార్గ్.. సెపె్టంబర్ 19న అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మృతిపై కుటుంబసభ్యులు, అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. అస్సాంలో 60కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అభిమానుల ఆందోళనల నేపథ్యంలో ఈకేసును దర్యాప్తు చేయడానికి అస్సాం ప్రభుత్వం స్పెషల్ డీజీపీ ఎంపీ గుప్తా నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. దర్యాప్తు, అనేక అరెస్టులు, ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం శుక్రవారం ఉదయం సిట్.. 3500పేజీల చార్జిషీటును కోర్టుకు సమర్పించింది. ఈకేçసులో 300 మందికి పైగా విచారించినట్లు, ఏడుగురిని అరెస్టు చేసినట్లు సిట్ పేర్కొంది. ఈ చార్జిషీట్‌ను నాలుగు పెద్ద ట్రంక్ పెట్టెల్లో కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సమయంలో జుబీన్ అభిమానులు కోర్టు బయట పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘జస్టిస్ ఫర్ జుబీన్’ అంటూ నినాదాలు చేశారు. -
మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు బోల్తా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దుర్గమ్మ.. చినవెంకన్న.. శివయ్య.. దత్తాత్రేయుడు.. సూర్యనారాయణుడు.. సింహాద్రి అప్పన్న.. అందరి దర్శనం చేసుకున్నారు. భద్రాచలం సీతారాముల్ని దర్శించుకునేందుకు బయల్దేరారు. అంతలోనే పొగమంచు పగబట్టింది. రోడ్డు మలుపు మృత్యువుగా మారి 9 మందిని పొట్టనపెట్టుకుంది. తీర్థయాత్ర చివరి ఘట్టానికి చేరుకుంటున్న సమయంలో మృత్యులోకానికి చేరుకున్నారు. నిన్నటివరకూ తమతో ప్రయాణించిన వారు.. ఇప్పుడు విగతజీవులుగా మారిపోయారని తెలిసి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిత్తూరులో మొదలైన ప్రయాణం.. చింతూరు సమీపంలో శాశ్వతంగా ఆగిపోయింది. తులసిపాక ఘాట్ రోడ్డులో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 9 మంది మృతి చెందగా.. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. గాయపడిన వారికి చింతూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. సాయంత్రం మృతదేహాలను, తీవ్రంగా గాయపడిన నలుగురు క్షతగాత్రులను అంబులెన్సులలో చిత్తూరు పంపించారు. మిగతా క్షతగాత్రులను మినీ బస్సుల్లో వారి స్వగ్రామాలకు పంపించారు.రాజుగారి మెట్ట వద్ద..అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో తులసిపాకలోని రాజుగారి మెట్ట వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు అరకు నుంచి భద్రాచలం వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రమాదం సంభవించింది. మొత్తం 37 మంది ప్రయాణిస్తున్న బస్సులో 32 మంది తీర్థయాత్రలకు వచ్చిన వారు కాగా.. ఒకరు ఆర్గనైజర్, ఇద్దరు వంట మనుషులు ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లు కలిపి మొత్తం 37 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇందులో డ్రైవింగ్ చేస్తున్న మొదటి డ్రైవర్‌కు గాయాలు కాగా.. పక్కనే ఉన్న మరో డ్రైవర్‌కు చేయి విరిగింది. వీరిలో 9 మంది మృతి చెందారు. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ఆరుగురు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. మృతులంతా చిత్తూరు జిల్లా వారే. ఘటనా స్థలంలో 3 అంబులెన్స్‌లు, 5 పోలీసు వాహనాలతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 22 మందికి చింతూరు ఆస్పత్రిలో చికిత్స అందించారు. గాయపడిన వారిలో ఒకరికి తలకు గాయం కావడంతో.. మొదట్లో భద్రాచలం ఆస్పత్రికి తరలిద్దామనుకున్నారు. అయితే, ఇబ్బందేమీ లేదని తేలడంతో చింతూరు ఆస్పత్రిలోనే చికిత్స అందించారు.పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చి..చిత్తూరు నగర చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 32 మంది పుణ్యక్షేత్రాల దర్శనం కోసం టూర్ వేసుకునున్నారు. వీరిలో 20 మంది మహిళలున్నారు. ఈ నెల 6న మిట్టూరులోని విఘ్నేశ్వర ట్రావెల్స్‌కు చెందిన ఏపీ 39 యూఎం 6543 నంబర్ బస్సులో బయలుదేరారు. మురకం బట్టుకు చెందిన రామ్మూర్తి అనే ప్రైవేట్ ఏజెంట్ ద్వారా బస్ బుక్ చేసుకున్నారు. తొలుత కోటప్పకొండ, అమరావతి, మంగళగిరి, విజయవాడ కనకదుర్గమ్మ, ద్వారకాతిరుమల, భీమవరం, పాలకొల్లు, అంతర్వేది, ద్రాక్షారామం, పెనుగొండ, సామర్లకోట, పిఠాపురం, కోటిపల్లి, అన్నవరం, అరసవల్లి, శ్రీకూర్మం చూసుకొని గురువారం విశాఖ చేరుకున్నారు. ఇక్కడ సింహాచలం దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత నేరుగా అరకు లోయకు వెళ్లారు. అక్కడ నుంచి గురువారం సాయంత్రం 5 గంటలకు అరకు నుంచి భద్రాచలం వెళుతున్న క్రమంలో దుర్ఘటన జరిగింది. కాగా, హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ దినేష్‌కుమార్, ఎస్పీ అమిత్‌బర్దర్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఘటనాస్థలాన్ని, స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలను పరిశీలించారు. క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం తరఫున రూ 2 లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్లు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ప్రకటించారు. తీవ్రగాయాలైన వారికి రూ.2 లక్షలు, సాధారణ గాయాలైన వారికి రూ. 50 వేలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రంపచోడవరం నియోజకవర్గ ఇన్చార్జి నాగులపల్లి ధనలక్ష్మి క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మృతుల వివరాలుమృతుల్లో చిత్తూరు నగరానికి చెందిన నాగేశ్వరరావు(68), శ్రీకళాదేవి (64), కావేరి కృష్ణ(70), శ్యామల(67), తవణంపల్లె మండలానికి చెందిన దొరబాబు(37), పలమనేరుకు చెందిన దంపతులు శివశంకరరెడ్డి(47), సునంద (45), పెనుమూరుకు చెందిన కృష్ణకుమారి(47), తెనాలి శైలజారాణి(64) ఉన్నారు.అతివేగం.. పొగమంచే కారణంబస్సులో ప్రసాద్, మధు అనే ఇద్దరు డ్రైవర్లుండగా.. మధు బస్సు నడుపుతున్నట్టు క్షతగాత్రులు చెప్పారు. మలుపుల వద్ద కూడా వేగంగా వెళ్తుండగా.. నెమ్మదిగా వెళ్లాలని చెప్పినట్టు బాధితులు తెలిపారు. చాలామంది గాఢ నిద్రలో ఉండగా.. దట్టంగా కురుస్తున్న పొగమంచుతో రోడ్డు కనిపించకపోయినా.. వేగంగా మలుపు తిప్పడంతో తులసిపాక వద్ద మరో మలుపు ఉన్నట్టు డ్రైవర్ గుర్తించలేకపోయాడు. దీంతో బస్సు వేగాన్ని నియంత్రించలేక అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రయాణికులు నిద్ర నుంచి తేరుకునేలోపే 9 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల హాహాకారాలతో ఘాట్‌రోడ్డు విషాదకరంగా మారిపోయింది. కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికులు మాత్రం చిన్న గాయాలతో బయటపడగలిగారు. నడిచేందుకు వీలుగా ఉన్న దారికి అటుఇటుగా ఉన్న సీట్లల్లో కూర్చున్న ప్రయాణికులు మాత్రం వెంటనే కిందపడిపోయారు. బస్సు ఏటవాలుగా బోల్తాపడటంతో ఒక్కసారిగా నిద్ర మత్తులోనే కిందపడి జారుకుంటూ వెనక్కి వెళ్లి గుద్దుకోవడంతో కనీసం ప్రాణాలు కాపాడుకునేందుకు కూడా ప్రయత్నించే అవకాశం లేకుండా పోయిందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి భద్రాచలానికి ఇంకో 2 గంటల్లోగా చేరుకుంటారనేలోగా ఘోర ప్రమాదం జరిగింది.తీరిగ్గా.. తాపీగా..ఈ ఘాట్‌రోడ్డులో ప్రయాణం భయంగానే ఉంటుంది. చురుకైన మలుపులతో పాటు రోడ్డు మధ్య గుంతలతో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. పాడైపోయిన ఈ రోడ్లను బాగు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని స్థానికులు పదేపదే కోరుతున్నా కనీసం గుంతలు కూడా పూడ్చిన పాపాన పోలేదు. గతంలోనూ ఈ ఘాట్‌రోడ్డులో పలు ప్రమాదాలు జరిగాయి. 15 అక్టోబర్ 2019లో కర్ణాటకకు చెందిన ప్రయాణికులు ఇక్కడి రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మారేడుమిల్లి ప్రాంతం పర్యాటకులను బాగా ఆకర్షిస్తోంది. ఇప్పుడు సీజను కూడా. వచ్చే మార్చి నెలాఖరు వరకూ ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయానికి ముందే రోడ్లను బాగు చేయాల్సిన అవసరం ఉంది. అయితే, ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. గత సంక్రాంతి సీజన్‌కే గుంతలు లేని రోడ్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఏడాది దాటి మరో సంక్రాంతి వస్తున్నప్పటికీ రోడ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. తాజా ప్రమాదంతో తీరిగ్గా స్పందించిన ప్రభుత్వం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ భారీ వాహనాలకు ఘాట్ రోడ్డులో అనుమతి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.వైఎస్ జగన్ దిగ్భ్రాంతిఅల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు యాత్రికులు మరణించడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు విచారంబస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తంచేశారు. బస్సు ప్రమాదం గురించి అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారని, పలువురు మృతిచెందగా, గాయపడిన వారిని చింతూరు ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు. అవసరమైన వారిని మెరుగైన వైద్యం కోసం ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. మృతుల్లో 8 మంది చిత్తూరు జిల్లా వాసులేచిత్తూరు అర్బన్: మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో బస్సు లోయలో పడిన దుర్ఘటన పదుల కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. దుర్మరణం పాలైన వారిలో 8 మంది చిత్తూరు జిల్లాకు చెందిన వారు కాగా.. తిరుపతి జిల్లాకు చెందిన మరో మహిళ ఉన్నారు. మరో 24 గంటలు దాటితే ఎవరి ఇళ్లకు వారు చేరుకునేవారు. మృతుల్లో ఒకరైన శ్రీకళాదేవి విశ్రాంత ప్రధానోపాధ్యాయిని. ఆరేళ్ల క్రితం భర్త చనిపోగా.. కొడుకు బసవంత్రెడ్డి యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను వస్తే తప్ప శ్రీకళాదేవి మృతదేహాన్ని చిత్తూరుకు తీసుకొచ్చేవాళ్లు లేరు. మరో మృతుడు నాగేశ్వరరావు చిత్తూరు న్యూట్రిన్ సంస్థలో పనిచేసి రిటైరయ్యారు. భార్య అమ్ములు, బాయ్‌తో కలిసి ఉంటున్నారు. పిల్లలు లేకపోయినా ఈ దంపతులు అన్యోన్యంగా ఉంటూ నాగేశ్వరరావుకు వచ్చే పింఛన్ డబ్బుతో కాలం గడుపుతున్నారు. చిత్తూరు నగరం గిరింపేటకు చెందిన శ్యామల విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. భర్త చనిపోవడంతో హైదరాబాద్‌లో కుమార్తె వద్ద ఉంటున్నారు. చిత్తూరు నగరం మిట్టూరుకు చెందిన కావేరి కృష్ణ సైతం ప్రమాదంలో మృతి చెందారు. ఇతడి కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. తవణంపల్లెకు చెందిన దొరబాబు దాదాపు 20 ఏళ్లుగా వంట పనిచేస్తున్నాడు. పెళ్లయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పూరిగుడిసెలో కాపురముంటున్న ఈ కుటుంబానికి రెక్కాడితేగానీ డొక్కాడదు. మృతుడి భార్య సుమలత సున్నిత మనసు్కరాలు కావడంతో ఆమె భర్త చనిపోయిన విషయం ఇప్పటివరకు చెప్పలేదు. పలమనేరుకు చెందిన శివశంకర్‌రెడ్డి, సునంద దంపతుల ఒక్కగానొక్క కుమారుడు వెంకటసాయి బీడీఎస్ చదువుతున్నాడు. బెంగళూరు కేఆర్ పురంలో స్థిరపడ్డ మరో మహిళ కృష్ణకుమారి స్వగ్రామం పెనుమూరు మండలం బలిజపల్లె. ఈమె భర్త హరినాథరెడ్డి హిటాచీలతో వివిధ పనులు చేయిస్తుంటారు. భార్య మరణవార్త విన్నాక కన్నీటి పర్యంతమైన హరినాథరెడ్డి హుటాహుటిన చింతూరు బయలుదేరాడు. తిరుచానూరు పంచాయతీ టెలిఫోన్ కాలనీకి చెందిన విశ్రాంత అధికారిణి తెనాలి శైలజారాణి ఐదేళ్ల క్రితం గ్రంథాలయ అధికారిణిగా రిటైరయ్యారు. అప్పటి నుంచి టెలిఫోన్ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఒంటరిగా జీవనం సాగిస్తోంది. తరచూ ఆధ్మాత్మిక యాత్రలు, తీర్థయాత్రలకు వెళ్తూ వచ్చేది. వీరంతా ఈ నెల 6న రాత్రి 9 గంటలకు చిత్తూరు నుంచి ట్రావెల్ బస్సులో బయలుదేరారు. వీరంతా 13వ తేదీన మహానంది, అహోబిలం, బ్రహ్మంగారి మఠం, ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం, తాళ్లపాక అన్నమయ్య ప్రాంగణం చూసుకుని చిత్తూరు చేరుకోవాల్సి ఉంది. ఇంతలో రోడ్డు ప్రమాదం జరగడంతో విహార యాత్ర విషాదంగా ముగిసింది. టూర్లో అరకు లేకపోయినా..ఈ యాత్రలో అరకు వెళ్లాలని ఎవరూ అనుకోలేదు. గురువారం ఉన్నట్టుండి అరకు వెళ్లాలని పలువురు పట్టుబట్టారు. దీంతో ఒక్కొక్కరి నుంచి రూ.500 అదనంగా వసూలు చేసి అరకు వెళ్లడం, అటు నుంచి భద్రాచలం వస్తుండగా ప్రమాదం జరిగిందని ప్రయాణికురాలు పద్మజ తెలిపారు.బస్సు ఒకరిది.. ఆపరేటర్ మరొకరుచిత్తూరు రూరల్ (కాణిపాకం): చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారి మెట్ట వద్ద లోయలో పడిన బస్సు చిత్తూరు నగరం మురకంబట్టుకు చెందిన రామ్మూర్తికి చెందినది. ఇతడు 30 ఏళ్లుగా బస్సు సర్వీసులు నడుపుతున్నారు. ఇతనికి ప్రస్తుతం రెండు బస్సులున్నాయి. అందులో ఏపీ 39యూఎం 6543అనే బస్సు అదుపు తప్పింది. ఘోర ప్రమాదానికి కారణమైంది. ఈ బస్సును రెండేళ్ల క్రితం విఘ్నేశ్వర ట్రావెల్స్ సంస్థ రామ్మూర్తి నుంచి అద్దెకు తీసుకుని టూర్స్ నిర్వహిస్తోంది. పన్నీర్ సెల్వం అనే వ్యక్తి విఘ్నేశ్వర ట్రావెల్స్‌ను నడిపిస్తున్నారు. ఇతని ద్వారా దొడ్డిపల్లికి చెందిన వజ్రమణి అనే వ్యక్తి టూరిస్టు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇతని ద్వారా విహార యాత్రలకు వెళ్లే వారి పూర్తి వివరాలు ట్రావెల్స్ నిర్వాహకుల వద్ద ఉండటం లేదు. దీనిపై ట్రావెల్స్ నిర్వాహకులు దృష్టి సారించడంలేదని తెలుస్తోంది.‘ఫిట్నెస్ ఎలా ఇచ్చారో’ప్రమాదానికి గురైన బస్సు 2012లో రిజిస్ట్రేషన్ అయింది. గత నెల 6న ఫిట్నెస్ సర్టిఫికెట్(ఎఫ్‌సీ) చేయించారు. ఈ గడువు 2026 నవంబర్ 7 వరకు ఉంది. చిత్తూరు నగర బంగారుపాళ్యం సమీపంలోని ఆటోమెటిక్ టెస్టింగ్ సెంటర్లో ఎఫ్‌సీ చేయించారు. అక్కడికి బండి వెళ్లకుండానే ఎఫ్‌సీ చేయించారా, లేకుంటే బండి లోపాలను చూడకుండా ఎఫ్‌సీ ఇచ్చారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బండి కండిషన్ ఆధారంగానే ఇచ్చారా అనే అనుమానాలు ఉన్నాయి.డ్రైవర్ల వివరాలు ఇలా..బస్సులో మధు, ప్రసాద్ అనే ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. మధు 2014లో హెవీ లైసెన్స్ తీసుకున్నాడు. ఈ లైసెన్స్ కాలపరిమితి 2030 వరకు ఉంది. ఇతనిపై ఇంతవరకు ఎలాంటి కేసులు, ప్రమాద సమస్యలు లేవని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రసాద్ మరో డ్రైవర్ కూడా 2006లో హెవీ లైసెన్స్ పొందాడు. ఈ లైసెన్స్ గడువు 2026 జూన్ 26తో ముగియనుంది. ఇతడి హయాంలో కూడా ప్రమాదాలు జరగలేదని అధికారులు చెబుతున్నారు.ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథకూతురు, అల్లుడిని కోల్పోయిన వృద్ధురాలు భర్తను కోల్పోయిన రిటైర్డ్ టీచర్ దుర్ఘటనలో కదిలించే ఉదంతాలునేను పోయి వాళ్లు బతికినా బాగుండేది... ‘‘కూతురు సునందన, అల్లుడు శివశంకర్‌రెడ్డి, సమీప బంధువు శ్రీకళ (భర్త మేనకోడలు)తో కలిసి తీర్థయాత్రకు బయల్దేరా. ప్రమాదంలో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. ఎంతో జీవితం ఉన్న వారి బదులు నేను చనిపోయినా బాగుండేది. నా భర్త రామచంద్రారెడ్డి వృద్ధాప్యంతో బాధపడుతున్నాడు. – వరిగపల్లి కుమారిహెల్పర్గా తెచ్చిన వంట మనిషి ప్రాణాలు కోల్పోయాడు మాంసం దుకాణం నడిపే నన్ను వంట మనిషి దొరబాబు రోజు కూలీకి హెల్పర్‌గా రమ్మన్నాడు. ప్రమాదంలో దొరబాబు మృతి చెందగా నా కాలికి గాయాలయ్యాయి. మృతదేహాలు నా మీద పడడంతో ఊపిరి ఆడలేదు. ఎలాగోలా కిటీకి నుంచి బయటకు వచ్చా – చిత్తూరుకు చెందిన సయ్యద్ ఇర్ఫాన్బ్రేక్ పడడం లేదని డ్రైవర్ చెప్పాడు... బస్సు ప్రమాదానికి ముందు నాకు మెలకువ వచి్చంది. బ్రేక్ పడడం లేదని డ్రైవర్ మధు చెప్పాడు. ఈ లోగానే బస్సు ప్రమాదానికి గురైంది. బోల్తా పడడంతో నా చేయి విరిగింది. బస్సు కిందకు దిగి నేను రెండు మృతదేహాలను బయటకు తీశా. – రెండో డ్రైవర్ పోగల ప్రసాద్తుపానుతో ఆగాం.. ప్రమాదం బారినపడ్డాం తీర్థయాత్రలకు గత నెల 23న బయలుదేరాలని భావించాం. ఆ సమయంలో తుపాను రావడంతో ప్రయాణం వాయిదా పడింది. దీంతో ఈ నెల 6న బయల్దేరాం. దుర్ఘటనలో నా తలకు తీవ్ర గాయమైంది. – చిత్తూరుకు చెందిన పద్మజమమ్మల్ని రమ్మన్న స్నేహితులు చనిపోయారు మా వీధిలో ఉంటున్న స్నేహితులు సరదాగా ఆంధ్రా చూసి వద్దాం రమ్మంటే వారితో బయల్దేరా. ప్రమాదంలో మా తలలకు తీవ్ర గాయాలయ్యాయి. విషాదం ఏమంటే.. మమ్మల్ని రమ్మని చెప్పిన నాగేశ్వరరావు, శ్రీకళ మృత్యువాత పడ్డారు. – చిత్తూరుకు చెందిన అక్కాచెల్లెళ్లు షేక్ అష్రఫ్, ముంతాజ్ మనశ్శాంతి కోసం వస్తే నా స్వామి చనిపోయాడు మేం ఇద్దరం రిటైర్డ్ టీచర్లం. కొంతకాలం క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్నా. పిల్లలు లేరనే బాధలో ఉన్న మేము మనశ్శాంతి కోసం తీర్థయాత్రలకు బయల్దేరాం. ఇప్పుడు ప్రమాదంలో భర్తను కోల్పోయా. ఆయన లేని జీవితాన్ని ఊహించుకోలేను. – చిత్తూరుకు చెందిన నాగేశ్వరరావు భార్య అమ్ములుబాయి – చింతూరు/మోతుగూడెం -
దొంగిలించి.. తిరిగి అప్పగించి
చౌటుప్పల్: చోరీ చేసిన బంగారు ఆభరణాన్ని తిరిగి అదే ఇంటిముందు వదిలేసి వెళ్లాడొక దొంగ. దొరికి పోతానని భావించాడో.. మరేదైనా కారణ మో తెలియకపోయినా.. రూ.5 లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణా న్ని మాత్రం బాధితురాలి ఇంటి ముందు వదిలేసి వెళ్లాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని కాట్రేవు గ్రామంలో శుక్ర వారం జరిగిన ఈ సంఘటనపై బాధితురాలు, గ్రామస్తులు తెలిపిన వివరా లివి. గ్రామానికి చెందిన గున్రెడ్డి రంగారెడ్డి, సత్తమ్మ దంపతుల కుమారు లు.. జీవనోపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడే నివసిస్తున్నారు. వృద్ధ దంపతులిద్దరే ఇంటి వద్ద ఉంటున్నారు.ఎప్పట్లాగే బుధవారం ఉద యం 5 గంటలకు రంగారెడ్డి పాలు తీసుకొచ్చేందుకు ఇంటినుంచి బయట కు వెళ్లాడు. సత్తమ్మ ఇంట్లోనే పడుకుంది. ఆ సమయంలో తలుపు లకు గడియ పెట్టకపోవడంతో.. నేరుగా దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు. పడుకు న్న వృద్ధురాలి తలకు దుప్పటి చుట్టి.. కొట్టి.. ఆమె దిండు కింద ఉన్న నాలుగున్న ర తులాల బంగారు పుస్తెలతాడుతో పారిపోయాడు. అయి తే దొంగ చోరీ చేసే ముందు వీధి దీపాలను ఆపేశాడు. ఇంత పకడ్బందీగా చో రీ చేసిన దొంగ కొత్త వ్యక్తి ఏమాత్రం కాదని, తమ గ్రామస్తుడేనని పలు వురు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు.ఘటన జరిగిన రోజు పోలీ సులు గ్రామానికి వచ్చి వివరాలు సేకరించారు. ఇదే సమయంలో పోలీసు లు జాగిలాలు వస్తాయని, దొంగ ఎక్కడున్నా పట్టుకుంటాయని గ్రామంలో చర్చ జరిగింది. ఇలాగైతే తాను దొరికిపోతానని, పరువుపోతుందని భావించిన ఆ దొంగ.. రెండు రోజుల పాటు తీవ్రంగా ఆలోచించి బంగారు ఆభర ణాన్ని తిరిగి బాధితురాలికి చేర్చాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 5గంటల ప్రాంతంలో బాధితురాలి ఇంటి తలుపు వద్ద పుస్తెలతాడు వదిలేసి వెళ్లాడు. పాలు తీసుకొచ్చేందుకు బయటికెళ్తున్న బాధితురాలి భర్త రంగారెడ్డి.. పుస్తెలతాడును గమనించి తీసుకున్నాడు. -
చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం
బంజారాహిల్స్: ట్యూషన్లో చదవడం లేదనే కారణంతో ఓ కసాయి ట్యూషన్ టీచర్ ఒకటో తరగతి విద్యార్థికి గరిటెతో కాల్చి వాతలు పెట్టింది. చిన్నారికి నాలుగు చోట్ల వాతలు పెట్టడంతో తీవ్ర గాయాలుకాగా ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. షేక్‌పేట ఓయూ కాలనీలో నివసించే వి.మానస ఎథిక్ సొల్యూషన్స్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఆరు నెలల క్రితం నుంచి ఆమె ఇంట్లో కళ్యాణి, సత్యబాబు దంపతులు పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కొడుకులు. మానస రోజూ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఉచితంగా ట్యూషన్లు చెబుతోంది. ఇందుకోసం ఇంట్లో పనిచేస్తున్న వారికి జీతం ఇవ్వకుండా ట్యూషన్లు చెబుతున్నానంటూ ఎగ్గొట్టేది. సమీపంలోని కాకతీయ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న తేజానందన్ (6) గురువారం సాయంత్రం అన్నతోపాటు మానస వద్దకు ట్యూషన్‌కు వెళ్లాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తేజానందన్ అన్న ఇంటికి వెళ్లిపోగా, తేజానందన్ చదువుకుంటున్నాడు. అయితే ట్యూషన్లో సరిగా చదవడం లేదంటూ ఆగ్రహానికి గురైన మానస గరిటె కాల్చి చేతులు, తొడలు, వీపుపై వాతలు పెట్టింది. గాయాలతో విలవిల్లాడుతూ చిన్నారి ఏడుస్తుండగా తల్లిదండ్రులు పరిగెత్తుకొచ్చారు. చిన్నారికి గరిటెతో కాల్చినట్లుగా ఒళ్లంతా ఎర్రగా బొబ్బలెక్కింది. దీంతో బాధిత తల్లిదండ్రులు తేజానందన్ను తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మానసపై ఫిర్యాదుచేశారు. పోలీసులు మానసపై బీఎన్ఎస్ సెక్షన్ 324, 75 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాలుడిని చికిత్స నిమిత్తం గోల్కొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.నాకేమీ పశ్చాత్తాపం లేదు: మానస తేజానందన్ సరిగ్గా చదవడం లేదని భయపెట్టడానికే గరిటె కాల్చి వాతలు పెట్టినట్లు మానస వెల్లడించింది. గతంలో రెండుసార్లు ఇలాగే భయపెట్టానని, ఈసారి మాత్రం వాతలు పెట్టానని చెప్పింది. అయితే, తానేమీ పశ్చాత్తాపం చెందడంలేదంది. -
మామను చంపిన అల్లుడు
మహబూబాబాద్ రూరల్: అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్న క్రమంలో అడ్డు వచ్చిన మామ, బావమరిదిపై ఓ వ్యక్తి దాడి చేయడంతో మామ మృతిచెందాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గార్ల మండలం భోజ్య తండాకు చెందిన బానోతు లాలునాయక్ (గార్ల మాజీ ఎంపీపీ), కౌసల్య దంపతుల కుమార్తె శ్రీసాయిలహరిని కురవి మండలం పెద్ద తండాకు చెందిన గుగులోత్ గాంధీబాబుకు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.51లక్షల నగదు, 30 తులాల బంగారం, సుమారు రూ.5 లక్షల విలువగల ఇంటి సామగ్రిని కట్నంగా అందజేశారు. కొన్ని నెలల నుంచి గాంధీబాబు, అతడి తల్లిదండ్రులు సీతారాం, కవిత, అక్క బానోతు మమత కలిసి శ్రీసాయిలహరిని అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను పుట్టింటికి పంపించారు. దీంతో బాధితురాలు శ్రీసాయిలహరి ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో అత్తింటివారిపై వరకట్నం, గృహహింస వేధింపుల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఏడాది ఆగస్టులో పెద్దమనుషుల సమక్షంలో కుటుంబ తగాదాపై పంచాయితీ నిర్వహించారు. అప్పటినుంచి ఆమెను కొట్టకుండా మంచిగా చూసుకుంటానని చెప్పి గాంధీబాబు భార్యను తమ ఇంటికి తీసుకెళ్లాడు. కానీ అతని ప్రవర్తనలో మార్పురాలేదు. పైగా ఆమె పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని, అదనపు కట్నం తీసుకురాలని వేధింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో గురువారం రాత్రి గాంధీబాబు, అతడి తల్లిదండ్రులు కలిసి శ్రీసాయిలహరిని కొట్టి హత్యచేసేందుకు యత్నించారు. ఆమె తప్పించుకుని ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకుని తండ్రి లాలునాయక్, అన్న ప్రదీప్‌కు ఫోన్ చేసి విషయం తెలియజేసింది. వారిద్దరూ వచ్చి మాట్లాడుతుండగానే గాంధీబాబు, అతడి తల్లిదండ్రులు.. ప్రదీప్, లాలునాయక్‌పై దాడిచేసి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన లాలునాయక్‌ను చికిత్స నిమిత్తం కుమార్తె శ్రీసాయిలహరి, కుమారుడు ప్రదీప్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని తెలిపారు. తన తండ్రి మృతికి కారణమైన గాంధీబాబు, అతడి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని ప్రదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు. -
రూ.1,404 కోట్ల అవినీతి, మాజీ బ్యాంకు అధికారిని ఉరి తీసిన చైనా
బీజింగ్ : రూ.1,404 కోట్ల అవినీతి , లంచం తీసుకున్న నేరాలకు సంబంధించిన కేసు చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. దోషిగా తేలిని సీనియర్ బ్యాంకర్‌ను ఉరి శిక్షను అమలు చేసింది.సుప్రీం పీపుల్స్ కోర్టు మునుపటి తీర్పును సమర్థించిన తర్వాత టియాంజిన్‌లో మరణశిక్ష అమలు చేసినట్లు అధికారులు ధృవీకరించారు. బాయి టియాన్హుయ్ వేలకోట్ల అక్రమాలు, దేశంలోని ప్రధాన బ్యాంకుల్లో ఒకటి పాపులర్ ఈ కేసు చైనాలో , అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించింది.చైనా హువారోంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్‌లో మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ బాయి టియాన్హుయ్ 1.1 బిలియన్ యువాన్లకు(దాదాపు రూ.1,404 కోట్లు) పైగా చట్టవిరుద్ధమైన చెల్లింపులు పొందారని కోర్టులు తేల్చిన తర్వాత చైనా అతణ్ని ఉరితీసింది . ఆర్థిక సంస్థలు మరియు రాష్ట్ర-సంబంధిత సంస్థలలో అవినీతికి వ్యతిరేకంగా బీజింగ్ కొనసాగుతున్న ప్రచారంలో భాగంగా ఈ శిక్షను అమలు చేసింది.చైనా గతంలో ప్రధాన కేసుల్లో శిక్షను అమలు చేసినప్పటికీ, అవినీతి కేసుల్లో మరణశిక్షలు అరుదనే చెప్పాలి.చైనా హువారోంగ్ అసెట్ మేనేజ్మెంట్ ఛైర్మన్‌గా పనిచేసిన లై షియోమిన్ 1.79 బిలియన్ యువాన్ల లంచం తీసుకున్నందుకు దోషిగా తేలిన తర్వాత 2021లో ఉరితీశారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్ట్ ప్రకారం సుప్రీం పీపుల్స్ కోర్టు మునుపటి తీర్పును సమర్థించిన నేపథ్యంలో టియాంజిన్‌లో బాయి టియాన్హుయ్ మరణశిక్ష అమలు చేసినట్టు అధికారులు నిర్ధారించారు. అక్రమ డబ్బు పరిమాణం , దేశంలోని ప్రధాన ఆర్థిక సమూహాలలో ఒకదానిలో బాయి ఒకప్పుడు కలిగి ఉన్న స్థానం కారణంగా ఈ కేసు చైనాలో మరియు అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించింది. టియాంజిన్ సెకండ్ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు తొలుత బాయికి 2024 మేలో మరణశిక్ష విధించింది. అతని వ్యక్తిగత ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. బాయి టియాన్హుయ్ అందుకున్న లంచాల మొత్తం , నేరాల స్థాయి చాలా తీవ్రమైనవిగా కోర్టు పరిగణించింది. బాయి ప్రవర్తన దేశప్రయోజనాలను దెబ్బతీయడం తోపాటు, ప్రజలకు హాని కలిగించిందని, చట్టం ప్రకారం అతన్ని కఠినంగా శిక్షించాలని కూడా పేర్కొంది.సుప్రీం పీపుల్స్ కోర్ట్ ఈ పరిశోధనలను ఆమోదించింది సాక్ష్యాలు స్పష్టంగా, నిర్ణయాత్మకంగా ఉన్నాయని అతనికి ఈ శిక్ష "తగినది" అని పేర్కొంది. SCMP ప్రకారం, బాయి 2014 - 2018 మధ్య చైనా హువారోంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్‌లో జనరల్ మేనేజర్ , డిప్యూటీ జనరల్ మేనేజర్‌గాపనిచేశారు. ఆ కాలంలో, అతను ఫైనాన్సింగ్ ఏర్పాట్లు మరియు ప్రాజెక్ట్ సంబంధిత లావాదేవీల ఆమోదం కోసం అక్రమాలకు పాల్పడ్డాడు. ఇది చివరికి 1.1 బిలియన్ యువాన్లకు (రూ. 1,404 కోట్లు) పైగా అక్రమ లాభార్జనకుదారితీసింది. -
ఐబొమ్మ కేసు.. ఇమ్మడి రవికి బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవికి బిగ్ షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి క్రిమినల్ కోర్టు గురువారం తిరస్కరించింది. పోలీస్ కస్టడీ కారణంగా రవి బెయిల్ పిటిషన్ విచారణ ఆలస్యమవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈలోపు.. మూడో దఫా కస్టడీ విషయంలో సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి అప్పీల్‌కు వెళ్లడంతో ఆ విచారణ మరింత ఆలస్యం కావొచ్చని రవి ఆందోళన చెందాడు. అయితే.. ఆ అప్పీల్‌ను విచారిస్తూనే ఇటు రవి బెయిల్ పిటిషన్‌నూ కోర్టు పరిశీలించింది. చివరకు కేసుల తీవ్రత దృష్ట్యా రవి బెయిల్‌కు అనర్హుడని తేల్చేసింది. అదే సమయంలో.. కస్టడీపై రివిజన్ విచారణ చేపట్టిన కోర్టు రేపు తీర్పు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ వైజాగ్‌వాసి అయిన ఇమ్మడి రవి.. ఐబొమ్మ, బప్పం అనే వెబ్సైట్లతో సినీ పైరసీకి పాల్పడ్డాడు. ఇటు పైరసీతో పాటు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి కోట్లకు పడగలెత్తాడు. ఇందుకు కరేబియన్ దీవులను ఎంచుకుని అక్కడి నుంచి సర్వర్లు, థర్డ్ పార్టీ ద్వారా వ్యవహారం నడిపించాడు. మూడు విడతలుగా 8 రోజులపాటు జరిపిన విచారణలో రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్నే రాబట్టారు. సినిమాను బొమ్మగా పిలుస్తారు కాబట్టే ఐబొమ్మ అని పేరు పెట్టానని.. బలపం కాస్త బప్పం అయ్యిందని.. ఇలా ఆసక్తికర సంగతులను వెల్లడించాడు. అలాగే.. స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఓటీటీ కంటెంట్‌ను సైతం పైరసీ చేయగలిగానని తెలిపాడు. కస్టడీ విచారణలో సైబర్ పోలీసులకే రవి అత్యాధునిక టెక్నాలజీ పాఠాలను నేర్పించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. అయితే కీలకమైన ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో రవి నుంచి సమాచారం రాబట్టాల్సి ఉంది. అందుకే పోలీసులు కస్టడీని ఎక్కువ రోజుల కోరుతున్నారు. సీసీఎస్ పోలీసుల కస్టడీ అప్పీల్ గనుక రిజెక్ట్ అయితే మూడు కేసులకుగానూ(ఒక కేసులో కస్టడీని కోర్టు కొట్టేసింది) మూడు రోజులపాటే రవిని పోలీసుల విచారించాల్సి ఉంటుంది. -
పాక్ మాజీ ఐఎస్ఐ చీఫ్‌కు షాక్, 14 ఏళ్ల జైలు
పాకిస్తాన్ సైనిక చరిత్రలో అత్యంత నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఐఎస్ఐ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఫైజ్ హమీద్‌కు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించి మిలిటరీ కోర్టు. రావల్పిండిలో డిసెంబర్ 11 విడుదల చేసిన ISPR (ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్) గురువారం ఈ తీర్పు వెలువరించింది. పాకిస్తాన్ అధికార నిర్మాణ లోపాలు, సైనిక అంతర్గత జవాబుదారీతనం విధానాలపై ఇది తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.ISPR ప్రకారం, దేశ భద్రత, ప్రయోజనాలకు నష్టం కలిగించడంతో పాటు, ప్రభుత్వ వనరులను కూడా ఫైజ్ హమీద్ దుర్వినియోగం చేశారని సైనిక కోర్టు విశ్వసించింది. కోర్టు ప్రతి అభియోగంపై హమీద్‌ను దోషిగా నిర్ధారించింది. దేశంలో రాజకీయ అస్థిరత వ్యాప్తికి సంబంధించిన అంశాలపై ఫైజ్ హమీద్ పాత్రపై దర్యాప్తు ఇంకా ముగియలేదని ISPR తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ కేసులను విడిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. దీని ప్రకారం భవిష్యత్తులో ఆయనపై మరిన్ని చట్టపరమైన కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.చదవండి: ఫస్ట్ నైటే చెప్పేశాడు...కొత్త పెళ్ళి కూతురి విడాకులు పాకిస్తాన్ సైన్యంలో అరుదైన విచారణFGCM చర్యలు ఆగస్టు 12, 2024న పాకిస్తాన్ ఆర్మీ చట్టం కింద ప్రారంభమై 15 నెలలకు పైగా కొనసాగాయి. ప్రాసిక్యూటర్లు నాలుగు ప్రధాన ఆరోపణలను కొనసాగించారు. వీటిలో రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడం, రాష్ట్ర భద్రతకు హానికరమని భావించే విధంగా అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడం, అధికారాన్ని మరియు రాష్ట్ర వనరులను దుర్వినియోగం చేయడం మరియు వ్యక్తులకు తప్పుడు నష్టం కలిగించడం ఉన్నాయి.సుదీర్ఘమైన విచారణల అనంతరం డిసెంబర్ 11, 2025న 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ ప్రక్రియ చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నొక్కి చెప్పింది . అలాగే హమీద్ తన సొంత రక్షణ బృందాన్ని ఎంచుకునే అనుమతి ఉందని అన్నారు. తీర్పుపై అప్పీల్ చేసుకునే హక్కు ఉందని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మహిళలూ వంటింటి ఆయుధాలతో సిద్ధంకండి : మమత సంచలన వ్యాఖ్యలు -
యూఎస్, యూకే కస్టమర్లే టార్గెట్ : రూ. 14 కోట్లకు ముంచేశారు
బెంగళూరు పోలీసులు ఒక అంతర్జాతీయ సైబర్ క్రైమ్ సిండికేట్‌ను ఛేదించారు. మైక్రోసాఫ్ట్ టెక్నికల్ సపోర్ట్ సిబ్బందిగా నటిస్తూ వైట్‌ఫీల్డ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నటిస్తూ వందలాది విదేశీయులను మోసం చేస్తున్నారనే ఆరోపణలతో 21 మంది అనుమానితులను అరెస్టు చేశారు.టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం 21 మంది సిబ్బందిని స్థానిక కోర్టు ముందు హాజరుపరిచి పోలీసు కస్టడీకి తరలించారు. సైబర్ కమాండ్ స్పెషల్ సెల్ మరియు వైట్‌ఫీల్డ్ సైబర్ క్రైమ్ విభాగం నుండి వచ్చిన అధికారులు నవంబర్ 14 - 15 తేదీలలో మస్క్ కమ్యూనికేషన్స్‌పై దాడి చేశారు. డెల్టా భవనం, సిగ్మా సాఫ్ట్ టెక్ పార్క్‌లోని ఆరవ అంతస్తులోని సంస్థ కార్యాలయంలో రెండు రోజుల పాటు జరిగిన ఆపరేషన్‌లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, మొబైల్ ఫోన్లు , ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు కింగ్పిన్లు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. అమెరికా, యూకేలలో 2022 నుండి ఈ దందా కొనసాగిస్తున్నారని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు.ఆగస్టు నుండి ఈ ముఠా అమెరికా, యూకేలలో కనీసం 150 మంది బాధితులను లక్ష్యంగా చేసుకుని, ఒక్కొక్కరిని బిట్‌కాయిన్ ATMలలో దాదాపు పదివేల డాలర్లు (సుమారు రూ. 13.5 కోట్లు) డిపాజిట్ చేయమని బలవంతం చేసినట్టు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. బాధిత కస్టమర్ల బ్యాంక్ వివరాలను సేకరించే ప్రక్రియలో ఉన్నామని ఒక సీనియర్ IPS అధికారి తెలిపారు. నిందితులు మైక్రోసాఫ్ట్ గ్లోబల్ టెక్నికల్ సపోర్ట్ సిబ్బంది అని చెప్పి 'ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) ఉల్లంఘనలను' ఉల్లంఘించారంటూ బాధితులను భయపెట్టారు. ఈ నెపంతో, వారు నకిలీ భద్రతా పరిష్కారాలు , సమ్మతి విధానాల కోసం పెద్ద మొత్తాలను వసూలు చేశారు. ఇదీ చదవండి: ఫస్ట్ నైటే చెప్పేశాడు...కొత్త పెళ్ళి కూతురి విడాకులుమస్క్ కమ్యూనికేషన్స్ ఆగస్టులో నెలకు రూ.5 లక్షలకు 4,500 చదరపు అడుగుల కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అమెరికా వినియోగదారులను లక్ష్యంగా ని హానికరమైన ఫేస్బుక్ ప్రకటనలిచ్చారు.ఇవి ఇతర చట్టబద్ధమైన భద్రతా హెచ్చరికలు లేదా సేవా లింక్‌లాగానే ఉంటాయి. కనిపించకుండా ఎంబెడెడ్ కోడ్ ఉంటుంది. ఒక వినియోగదారు ప్రకటనపై క్లిక్ చేయగానే మైక్రోసాఫ్ట్ గ్లోబల్ టెక్నికల్ సపోర్ట్ నుండి వచ్చినట్లు మెసేజ్ పాప్ అప్ అవుతుంది. నకిలీ హెల్ప్‌లైన్ నంబర్‌కూడా డిస్ప్లే అవుతుందని దర్యాప్తు అధికారులు వివరించారు.బాధితులు ఆ నంబర్‌కు కాల్ చేసినప్పుడు, వారి కంప్యూటర్ హ్యాక్ చేసి, IP చిరునామా,బ్యాంకింగ్ డేటా చోరీ చేస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత వారు బిట్‌కాయిన్ ATMల ద్వారా బాధితులను భారీ మొత్తాలు చెల్లించమని బలవంతం చేశారు.ఇదీ చదవండి: మహిళలూ వంటింటి ఆయుధాలతో సిద్ధంకండి : మమత సంచలన వ్యాఖ్యలుమస్క్ కమ్యూనికేషన్స్ 83 మంది ఉద్యోగలున్నారు. వారిలో 21 మంది సాంకేతిక సిబ్బంది ఈ స్కామ్‌లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. వారికి నెలకు రూ. 15,000 నుండి రూ. 25,000 వరకు జీతాలు చెల్లించారు. ఇదిలా ఉండగా, అహ్మదాబాద్‌కు చెందిన రవి చౌహాన్ అనే వ్యక్తి సుమారు 85 మంది సిబ్బందిని నియమించగా, అతన్ని గత నెలలో అరెస్టు చేయడంతో మొత్తం అరెస్టుల సంఖ్య 22కి చేరింది. -
నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది: కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: తనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందన్న కథనాలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సీరియస్ అయ్యారు. తనకు ఎలాంటి వారెంట్ జారీ కాలేదని.. కోర్టుకు హాజరు కావాలని మాత్రమే కబురు అందిందని స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారామె. ఇదిలా ఉంటే.. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందని తొలుత ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఈ పరిణామం చోటు చేసుకుందన్నది ఆ ప్రచార సారాంశం. ‘‘గురువారం (డిసెంబర్ 11, 2025) ఈ కేసు విచారణకు రాగా, నిందితురాలి గైర్హాజరును న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించారు’’ అని ఆ ప్రచారంలో ఉంది. అయితే దానిని కొండా సురేఖ కాసేపటికి ఖండించారు. ‘‘కోర్టు నాకు ఎన్బీడబ్ల్యూ జారీ చేయలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న కోర్టుకు రావాలని చెప్పింది. నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది’’ అని అన్నారామె. కేసు వివరాల్లోకి వెళితే.. తనపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాయని కేటీఆర్ పరువు నష్టం దాదా వేశారు. ఈ కేసు ప్రస్తుతం (C.C. No. 307 of 2025) విచారణ దశకు చేరుకుంది. గురువారం రోజున విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, నిందితురాలైన కొండా సురేఖ కోర్టుకు రాలేదు. ఆమె గైర్హాజరుకు సంబంధించి న్యాయస్థానానికి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం, మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేయకపోవడాన్ని కోర్టు తప్పుబట్టినట్లు తెలుస్తోంది. -
భార్యను ముక్కలుగా చేసి.. ముద్దలుగా మార్చేసి..
ఆ మధ్య మలయాళంలో సూక్షదర్శిని అనే సినిమా వచ్చింది. అందులో అమాయకంగా కనిపించే తల్లీకొడుకులు.. తమ ఇంటి బిడ్డనే దారుణంగా హతమార్చి.. యాసిడ్‌లో పోసేసి కరిగించేస్తారు. ఆపై ఏం ఎరగనట్లు నాటకాలాడతారు. పరువు హత్య(ఓ సున్నితమైన అంశం) నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ హిట్ అయ్యి.. ఇక్కడ తెలుగు డబ్‌తో ఓటీటీలోనూ అలరించింది. అయితే దాదాపు ఇలాంటి తరహా ఘటనే ఒకటి తెరపైకి వచ్చింది.వింటేనే వెన్నులో వణుకుపుట్టే ఘటన ఇది. తన భార్యను.. ఇద్దరు పిల్లల తల్లిని.. క్షణికావేశంలోనో లేదంటో ఉద్దేశపూర్వకంగానో హత్య చేశాడో భర్త. ఆపై నేరం నుంచి తప్పించుకునేందుకు అతను చేసిన ప్రయత్నమే కిరాతకంగా ఉంది. ఆమెను ముక్కలుగా.. చెక్కలుగా చేసి.. ముద్దగా మార్చేసి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే.. ఆ ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయి దోషిగా తేలాడు.స్విట్జర్లాండ్‌లో హైప్రొఫెషనల్ కేసుగా ఉన్న క్రిస్టియానా జోక్సిమోవిక్(38) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్తే ఆమెను కిరాతకంగా హత్య చేశాడని స్థానిక అధికారులు బుధవారం నిర్ధారించారు. క్రిస్టియానా జోక్సిమోవిక్ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ కావడమే ఈ కేసు అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది.2024 ఫిబ్రవరిలో బిన్నింగెన్‌లోని తన నివాసంలో క్రిస్టియానా జోక్సిమోవిక్ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో వేళ్లన్నీ భర్త థామస్ వైపే చూపించాయి. అయితే తన భార్య తనపై దాడికి ప్రయత్నించిందని.. ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ మరణించిందని.. తాను భయంతో ఆ శవాన్ని మాయం చేసే ప్రయత్నం మాత్రమే చేశానని మొదటి నుంచి అతను వాదించాడు. కానీ, ఆధారాలు అన్నీ అతనికి వ్యతిరేకంగానే ఉన్నాయి.ఆమెను గొంతు నులిమి హత్య చేసిన థామస్.. గర్భాశయాన్ని తొలగించి ఆ తర్వాత పెరట్లోని రంపంతో ముక్కలుగా కత్తిరించాడని.. ఆపై మిక్సర్‌లో వేసి ముద్దగా మార్చేశాడని.. అందులో కొంత భాగాన్ని రసాయనాల్లో వేసి కరిగించేశాడని తెలిపారు. నేరానికి ఉయోగించిన రంపాన్ని, తోలు భాగాన్ని, ఎముకల అవశేషాల్ని పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. ఈ ఘోరాన్ని అతను యూట్యూబ్ వీడియోలు చూస్తూ చేశాడని వెల్లడించారు.శరీరం నుంచి నడుమ జాయింట్లను విరిచేసి.. మెడ, వెన్నెముకను కోసేసి.. చివరకు ఆమె తలను వేరు చేసి శరీరాన్ని ముక్కలుగా చేశాడు. శవపరీక్షలో అత్యంత భయానకమైన ఈ వివరాలు వెల్లడయ్యాయి అని కోర్టుకు దర్యాప్తు అధికారులు సమర్పించిన వివరాల్లో ఉంది.క్రిస్టియానా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఆచూకీ గురించి తీవ్రంగా ప్రయత్నించారు. నెలలు గడిచినా ఆమె ఆచూకీ కానరలేదు. అయితే.. క్రిస్టియానా జుట్టుకు సంబంధించిన అవశేషాలను లాండ్రీ రూమ్‌లో ఆమె తండ్రి గుర్తించడం ఈ కేసును అసలు మలుపు తిప్పింది. ఆ ఘటన తర్వాత ఎలాంటి కంగారు లేకుండా ఉన్నాడని.. అది అతనిలోని క్రూరత్వానికి ప్రతీకగా నిలిచిందని పోలీసులు తమ నివేదికలో వివరించారు. భర్తే హంతకుడిగా తేలడంతో ఈ కేసు ట్రయల్ జరగాల్సి ఉంది.మిస్ నార్త్‌వెస్ట్ స్విట్జర్లాండ్ క్రిస్టియానా జోక్సిమోవిక్.. 2007లో మిస్ స్విట్జర్లాండ్ పోటీల్లో ఫైనలిస్ట్‌తో సరిపెట్టుకుంది. ఆ తర్వత క్యాట్‌వాక్ కోచ్‌గా మారి.. అనేక మంది మోడల్స్‌కు శిక్షణ ఇచ్చింది. పై కేసు చదువుతుంటే.. భార్యను కుక్కర్లో ఉడికించిన కేసు గుర్తొచ్చిందా?.. ఆ కథనమూ చదివేయండి 👉 హైదరాబాద్ మీర్‌పేటలో కిరాతకం -
పోలీసులు అదుపులో లూథ్రా బ్రదర్స్
గోవా అగ్నిప్రమాద ఘటనలో ప్రధాన నేరారోపణలు ఎదుర్కొంటున్న లుథ్రా బ్రదర్స్‌ను ఎట్టకేలకు థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకొని వారికి సంకెళ్లు వేశారు. ఈ రోజు ఊదయం భారత విదేశాంగ శాఖ సౌరవ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలిద్దరి పాస్ పోర్టులను సస్పెండ్ చేసిన కొద్దిసేపటికే వారి అరెస్టు జరిగింది.గత శనివారం గోవాలోని బిర్చ్ బై రోమియో నైట్‌క్లబ్‌లో అగ్రి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే ఈ క్లబ్ యజమానులైన లూథ్రా బ్రదర్స్ థాయిలాండ్ పరారయ్యారు. దీంతో ప్రమాదంపై తీవ్రంగా స్పందించిన గోవా ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో నిందితులను వదలబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వారి ఇద్దరిపై పోలీసులు లూకౌట్ జారీ చేశారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఏజెన్సీ వారిద్దరిపై బ్లూకార్నర్ ఇష్యూ చేసింది. దీంతో థాయిలాండ్ పోలీసులు ఫుకెట్‌లోని ఓ రెస్టారెంట్లో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి బేడీలు వేశారు. కాగా వీరిద్దరిని పట్టుకోవడానికి ఇదివరకే గోవా పోలీసులు థాయిలాండ్‌కు బయిలు దేరినట్లు తెలుస్తోంది.అధికారిక ప్రక్రియ పూర్తయిన అనంతరం వారిద్దరిని గోవా పోలీసులకు అప్పగిస్తున్నట్లు సమాచారం. భారత్- థాయిలాండ్ దేశాల మధ్య 2013లో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ జరిగింది. దీనిప్రకారం ఒక దేశంలో నేరం చేసి మరో దేశంలో తలదాచుకుంటే ఆ నేరస్థులను సంబంధిత దేశానికి అప్పగించాలి. ఈ ఒప్పందానికి అనుగుణంగా ప్రస్తుతం థాయిలాండ్ లూథ్రా బ్రదర్స్‌ను భారత్‌కు అప్పగిస్తుంది. ఈ ఒప్పందం 2015 జున్ 9నుంచి అమలులోకి వచ్చింది. కాగా ఈ శనివారం అర్థరాత్రి గోవాలోని నైట్ రోమియో నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టాగా క్లబ్లో సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో క్లబ్ యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇది వరకే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
లోయలో పడ్డ బస్సు.. 18 మంది కూలీల దుర్మరణం
అరుణాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఓ ట్రక్కు వెయ్యి అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ విషయం 3 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ అన్జా జిల్లా చాగ్లాగాం వద్ద సోమవారం రాత్రి ఈ ఘోరం చోటు చేసుకుంది. హయులియాంగ్-చాక్లా మధ్య 40 నెంబర్ మైలురాయి వద్ద ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పలువురు కూలీలు అక్కడిక్కడే చనిపోయారు. గాయాలతో బయటపడిన ఓ వ్యక్తి.. రెండు రోజుల తర్వాత లోయ నుంచి బయటకు వచ్చి సమీపంలోని ‘బోర్డర్ రోడ్స్ టాస్క్ ఫోర్స్’ (బీఆర్టీఎఫ్) లేబర్ క్యాంప్‌నకు చేరుకున్నాడు. మృత్యుంజయుడైన ఆ వ్యక్తిని బుధేశ్వర్ దీప్‌గా నిర్ధారించారు. అతను ఇచ్చిన సమాచారంతో ఇండియన్ ఆర్మీ సహాయక చర్యలు చేపట్టింది. అతి కష్టం మీద మృతదేహాలను బయటకు తీసింది. మృతులంతా అస్సాంకు చెందిన కూలీలుగా తెలుస్తోంది. తీన్సుకియా నుంచి 22 మంది టీ ఎస్టేట్ పనుల కోసం వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే మరో ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. A truck carrying 22 labourers reportedly fell into a deep gorge between Hayuliang and Chakla, in the remote Chaglagam circle under Anjaw district. A rescue operation is currently underway, and efforts are on to contact authorities to know more about the incident. pic.twitter.com/rPGLnVvVXP— DD News Arunachal (@DDNewsArunachal) December 11, 2025 -
ఫస్ట్ నైటే చెప్పేశాడు...కొత్త పెళ్ళి కూతురి విడాకులు
పెళ్లయిన మూడు రోజులకే నవ వధువు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తర ప్రదేశ్‌లో గోరఖపూర్‌లో ఈ ఘటన జరిగింది. శారీరకంగా అసమర్థుడైన వ్యక్తితో తాను జీవితాన్ని గడపలేను అంటూ కొత్త పెళ్లికూతురు లీగల్ నోటీసు పంపించింది.వరుడు సహజన్వాలోని రైతు కుటుంబానికి చెందిన ఏకైక కుమారుడు. వయస్సు 25. జిఐడిఎలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బేలియాపర్లోని బంధువుల ద్వారా ఈ వివాహం నిశ్చయమైంది. బంధు మిత్రులు సమక్షంలో నవంబర్ 28న వీరి వివాహం జరగింది. సాంప్రదాయం ప్రకారం మరుసటి రోజు అత్తవారింటికి సాగనంపారు. సాధారణంగా పెళ్ళిళ్లలో జరిగే తంతు ప్రకారం డిసెంబర్ 1న మూడో రోజు ఫస్ట్ నైట్ కార్యక్రమానికి ముహర్తం పెట్టారు. కానీ ఆ రాత్రే ఆమెకు చేదు అనుభవాన్ని మిగిలుస్తుందని ఆమె ఊహించి ఉండదు. పెళ్లయిన మొదటి రాత్రి కోటి ఆశలతో గదిలోకి అడుగుపెట్టిన ఆమెకు స్వయంగా భర్తే బాంబు పేల్చాడు. తాను వైవాహిక సంబంధాలకు శారీరకంగా అసమర్థుడిని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో ఆమె హతాశురాలైంది. తరువాత ఇంట్లోని పెద్దలకు అసలు విషయం చెప్పింది. వెంటనే ఆమెను తిరిగి పుట్టింటికి తీసుకువచ్చారు. క్షణం ఆలస్యం చేయకుండా లీగల్ నోటీసు పంపింది.డిసెంబర్ 3న బేలియాపర్లో ఇరుపక్షాలు కలుసుకున్నాయి. వరుడి పరిస్థితిని దాచిపెట్టారని వధువు కుటుంబం ఆరోపించింది. అంతే కాదు ఇది అతని రెండవ విఫల వివాహమని, రెండేళ్ల క్రితం మొదటి వధువు నెల రోజుల్లోనే విడిచిపెట్టి వెళ్లిపోయిందని కూడా వారు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మహిళలూ వంటింటి ఆయుధాలతో సిద్ధంకండి : మమత సంచలన వ్యాఖ్యలుఇరుపక్షాల సమ్మతితో, వరుడికి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు అతడు శారీరంగా అసమర్థుడని, "తండ్రి కాలేడు" అనివైద్యపరీక్షలు కూడా నిర్ధారించాయి. దీంతో పెళ్లి బహుమతులు ఖర్చులన్నింటినీ తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీన్ని వారు తిరస్కరిండంతో వధువు కుటుంబం సహజన్వా పోలీసులను ఆశ్రయించి, అన్ని బహుమతులు మరియు నగదును తిరిగి ఇవ్వాలని కోరింది. పోలీసుల జోక్యంతో, ఇరు పక్షాల మధ్య రాజీ కుదిరింది. వరుడి కుటుంబం రూ. 7 లక్షలు, అన్ని పెళ్లి బహుమతులను ఒక నెలలోగా తిరిగి ఇవ్వడానికి అంగీకరించింది. బంధువుల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారని సహజన్వా ఎస్హెచ్ఓ మహేష్ చౌబే వెల్లడించారు.ఇదీ చదవండి: ఇండిగో బాధితులకు స్వల్ప ఊరట,ఆఫర్ ఏంటంటే.. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
సాక్షి, ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు భారీ షాక్ తగిలింది. ఆయన్ని వెంటనే లొంగిపోవాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. వారంపాటు ఆయన్ని విచారణ జరపొచ్చని సిట్‌కు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ప్రభాకర్‌రావు రేపు సరెండర్ కావాలి. అలాగే ఆయన్ని ఫిజికల్‌గా టార్చర్ చేయొద్దు. థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండానే ఇంటరాగేషన్ చేయండి. వారంపాటు కస్టోడియల్ విచారణ జరిపాక ఆ వివరాలను మాకు తెలియజేయండి’’ అని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇంతకాలం సుప్రీం కోర్టు తాత్కాలిక రక్షణతో ప్రభాకర్‌రావు అరెస్ట్ నుంచి ఊరట పొందుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ్టి విచారణలో.. ‘‘డేటా ఎక్కడుంది?. 36 హార్డ్ డిస్క్ లను ఎలా ధ్వంసం చేస్తారు?. హార్డ్ డిస్క్ లలో డేటా తొలగించాలని మీకు లిఖిత పూర్వక ఆదేశాలు ఎవరైనా ఇచ్చారా?. ఆ ఆదేశాల ప్రతులు చూపండి’’ అని ద్విసభ్య ధర్మాసనం ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే ఆ ఆదేశాలు తమ వద్ద లేవని ఆయన కోర్టుకు తెలిపారు. అందుకే కస్టడీ కోరుతున్నారని జస్టిస్ మహదేవన్ అన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏసీబీ వెంకటగిరి ముందు ప్రభాకర్‌రావు లొంగిపోవాలి. ఫిజికల్ టార్చర్ చేయకుండా ఇంటరాగేషన్ చేయండి. మందులు, ఇంటి నుంచి భోజనం తెచ్చుకునేందుకు ఆయన్ని అనుమతి ఇవ్వండి అని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఈ క్రమంలో.. విచారణ రోజునే కస్టడీ పొడగింపు కోరుతామని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా అన్నారు. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్‌ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు, ఆఖరికి న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురయ్యాయని అభియోగాలున్నాయి. అంతేకాదు.. ఆ ఆధారాలను మాయం చేసే ప్రయత్నమూ జరిగిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు బంధువు, ఇంటెలిజెన్స్‌లో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్‌రావు అరెస్ట్‌తో ట్యాపింగ్ తేనెతుట్టె కదిలింది. ఈ కేసులో ఏ1గా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పేరును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చేర్చింది. ప్రణీత్‌రావు అరెస్ట్ అప్పటి నుంచి ప్రభాకర్‌రావు విదేశాల్లో ఉంటూ వచ్చారు. చివరకు.. సుప్రీం కోర్టు నుంచి మధ్యంతర ఆదేశాలతో అరెస్ట్ నుంచి ఊరట పొందిన ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి పలుమార్లు ఆయన్ని సిట్ విచారణ జరిపింది. అయితే.. అరెస్టు నుంచి ఊరట కావాలంటే దర్యాప్తునకు అన్నివిధాలా సహకరించాలని ప్రభాకర్‌రావుకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయినా కూడా ఆయన ఐక్లౌడ్ అకౌంట్ పాస్వర్డ్ ఇవ్వకుండా డేటాను డిలీట్ చేశారని.. దర్యాప్తులో ఏరకంగానూ సహకరించడం లేదని సిట్ తరఫున తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. దీంతో.. తాత్కాలిక రక్షణను పక్కన పెట్టి లొంగిపోయి విచారణకు సహకరించాలని ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలా ఉంటే.. ఈ కేసులో మాజీ పోలీసు అధికారులు రాధాకిషన్, తిరుపతి రావులు అరెస్ట్ అయ్యారు. రాధాకిషన్ తన కన్ఫెషన్లో మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావన తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. కేసీఆర్‌కు పదేళ్లపాటు ఓఎస్డీగా పని చేసిన పీ రాజశేఖర్ రెడ్డిని ఇటీవలె SIT ప్రశ్నించింది కూడా. ఇప్పుడు ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తాయా? అనే ఆసక్తి నెలకొంది. -
నలుగురు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
అనంతపురం: కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ వసతి గృహంలో ఉండి చదువుతున్న నలుగురు ఇంటర్ విద్యార్థినులు సూపర్ వేస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నకి పాల్పడ్డారు .వివరాల్లోకి వెళ్తే.. వసతి గృహంలో క్రమశిక్షణ ఉల్లంఘన జరిగిందని భావించిన హాస్టల్ వార్డెన్, ఈ విషయం గురించి వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తానని విద్యార్థినులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు మందలిస్తారన్న భయంతో ఆందోళన చెందిన ఆ నలుగురు విద్యార్థినులు సూపర్ వేస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.ఈ విషయం గమనించిన వార్డెన్ వెంటనే వారిని చికిత్స నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం బాలికల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థినుల నుండి మౌఖిక వాంగ్మూలం తీసుకోవడంతో పాటు, హాస్టల్ వార్డెన్ వ్యవహారం, కళాశాల పరిపాలనలో ఉన్న లోపాలపై కూడా విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. -
మరదల్ని ఎందుకు చంపాడంటే!
బౌద్ధనగర్: తనతో పెళ్లికి నిరాకరించిందని యువతిపై కక్ష పెంచుకొని ఆమె కుటుంబ సభ్యుల ముందే దారుణంగా హత్య చేసి పరారైన ప్రేమోన్మాదిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు బుధవరం చిలకలగూడ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీపీ బాల స్వామి వివరాలు వెల్లడించారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మిర్యాపుట్టి మండలం సిరియకంది గొల్లవీధికి చెందిన డుక్క ఉమా శంకర్ కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి రహ్మత్‌నగర్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో దూరపు బంధువు అయిన కాంతారావు, లక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె పవిత్రను తనకిచ్చి పెళ్లి చేయాలని కోరడంతో వారు అంగీకరించారు. ఆరు నెలల క్రితం నిశి్చతార్థం కూడా జరిగింది. అయితే, ఉమా శంకర్‌కు మద్యం అలవాటు ఉంది. తాగిన ప్రతీసారి పవిత్రకు ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించి విసిగించాడు. ఈ నేపథ్యంలో అతడిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పింది. దీంతో కక్షగట్టిన ఉమాశంకర్ గత సోమవారం పవిత్రను ఆమె తల్లిదండ్రుల ముందే గొంతుకోసి హత్యచేసినట్లు వెల్లడించారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీలను పరిశీలించి హంతకుడు ఉమాశంకర్ చిలకలగూడలోని తన సోదరుడి ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. బుధవారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ శశాంక్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి, డీఐ పురేందదర్ రెడ్డి, డీఐ రామకృష్ణ, ఎస్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కూతురుని ప్రేమించాడని.. ఇంటికి పిలిచి.?
పటాన్చెరు టౌన్: ప్రేమ వ్యవహారం బీటెక్ బీటెక్ విద్యార్థిని బలి తీసుకుంది. మాట్లాడదామని ఇంటికి పిలిచి క్రికెట్ బ్యాట్‌తో విచక్షణా రహితంగా దాడి చేయడంతో అతను మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం సీఐ నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన శ్రావణ్ సాయి (19) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో పెదనాన్న వద్ద ఉంటున్నాడు.పటాన్చెరు మైసమ్మగూడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సృజన లక్ష్మీసాయి మెడోస్‌లో ఉండే యువతితో ఇతనికి పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. విషయం తెలియడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. అయినా వీరి వైఖరిలో మార్పు కనిపించలేదు. దీంతో పథకం ప్రకారం మాట్లాడేందుకంటూ మంగళవారం అమ్మాయితో ఫోన్ చేయించి ఇంటికి పిలిపించారు. మాటామాటా పెరిగి..ప్రేమ విషయమై యువతి తల్లి సిరి, సాయి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి కోపోద్రిక్తురాలైన సిరి క్రికెట్ బ్యాట్‌తో సాయిని, కూతురిని కొట్టింది. తల, వీపుపై బలంగా దెబ్బలు తగలడంతో సాయి స్పృహ కోల్పోయాడు. కుమార్తె చేయి విరిగింది. దీంతో తల్లి, సోదరుడు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. బుధవారం వేకువజామున ఇంటికి రాగా.. అప్పటికీ ఇంట్లోనే అపస్మారక స్థితిలో ఉన్న సాయిని చూసి వెంటనే నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. సాయి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
బీఆర్ఎస్ నేత దారుణహత్య
నూతనకల్: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో బీఆర్ఎస్ నేత ఉప్పుల మల్లయ్య (55) దారుణ హత్యకు గురయ్యాడు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఆధిపత్యపోరులో ఈ ఘర్షణ జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. బీఆర్ఎస్ మద్దతుదారుగా మాదాసు వెంకన్న, కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా దేశపంగు మురళి సర్పంచ్ బరిలో నిలిచారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత ఉప్పుల మల్లయ్య కోడలు ఉప్పుల శైలజ 4వ వార్డు నుంచి బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీలో ఉంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఇరు పార్టీల వారు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ప్రచారం ముగించుకొని గ్రామంలోని పార్టీల జెండా దిమ్మెల సమీపంలో కూర్చున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ వారు ఓటర్లను కలిసివస్తున్న సమయంలో.. శైలజకు ప్రత్యర్థిగా ఉన్న ఆకుల రజిత వర్గానికి చెందిన ఉప్పుల సతీశ్, కొరివి గంగయ్య, వీరబోయిన సతీశ్, ఉప్పుల గంగయ్య, ఉప్పుల ఎలమంచి, వీరబోయిన లింగయ్య, కారింగుల రవీందర్, దేశపంగు అవిలయ్యలు గొడవ పడడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చేసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్నా మల్లయ్యపై దాడి చేయగా, అడ్డుకోవడానికి వెళ్లిన ఉప్పుల మల్లయ్యపై కూడా కర్రలతో దాడి చేశారు. దీంతో మల్లయ్య తలకు తీవ్రగాయాలై కిందపడిపోయాడు. ఇదే సమయంలో తలపై బండరాయితో మోపడంతో అపస్మారకస్థితికి చేరుకున్నాడు. అతడిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో సూర్యాపేటకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి ఉప్పుల మల్లయ్య మృతి చెందినట్టు చెప్పారు. ఈ దాడిలో మున్నా మల్లయ్యతోపాటు అతని సోదరుడు లింగయ్య, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మల్లయ్య మృతదేహానికి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం భారీ పోలీస్ బందోబస్తు మధ్య గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, రాజకీయ కక్షలతోపాటు దాయాదుల గొడవలు కూడా ఈ దాడికి కారణమైనట్టు తెలిసింది. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్ఉప్పుల మల్లయ్య హత్య కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు సూర్యాపేట జిల్లా అడిషనల్ ఎస్పీ రవీందర్‌రెడ్డి తెలిపారు. మృతుడి భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దాడికి పాల్పడి, మృతికి కారకులైన ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు వివరించారు. -
సందేశ్‌ఖాలీ కేసు: కీలక సాక్షిపైదాడి,కుమారుడు, డ్రైవర్ మృతి
కోల్‌కతా, సాక్షి : పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన సందేశ్‌ఖలి వివాదానికి సంబంధించిన కేసుల్లో కీలక సాక్షిపై దాడి జరిగింది. ఈ ప్రమాదంలో భోలానాథ్ ఘోష్ తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకోగా, అతని చిన్న కుమారుడు , కారు డ్రైవర్ మరణించారు. ఈ ప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తోంది.ఈకేసుకు సంబంధించి బుధవారం కోర్టుకు వెళుతుండగా ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బోయ్‌ఖలి పెట్రోల్ పంప్ సమీపంలో ఒక ట్రక్కు అమిత వేగంతో వచ్చి అతని వాహనాన్ని ఢీకొట్టింది. ట్రక్కు కారును ఢీకొట్టి, ఈడ్చుకెళ్లి, సమీపంలోని నీళ్లలోకి నెట్టివేసింది. వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఘోష్ చిన్న కుమారుడు సత్యజిత్ ఘోష్ (32), కారు డ్రైవర్ సహనూర్ మొల్లా (27) స్పాట్లోనే మరణించారు. తీవ్రంగా గాయపడిన భోలానాథ్‌ను మెరుగైన చికిత్స కోసం కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రికి తరలించారు.సందేశ్‌ఖాలి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ తనపై దాఖలు చేసిన అనేక కేసుల్లో ఒకదానికి సంబంధించి బసిర్హాట్ సబ్-డివిజనల్ కోర్టుకు హాజరు కావడానికి ఘోష్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చదవండి: మొటిమల చికిత్స కోసం వెళితే, దారుణం: రూ. 31 లక్షల దావాహత్యకు కుట్రఇది ఉద్దేశ పూర్వకంగా చేసిన దాడి అని, తన తండ్రిని హత్య చేసేందుకు పన్నిన పన్నాగమని ఘోష్ పెద్ద కుమారుడు బిశ్వజిత్ ఆరోపించారు. షాజహాన్ జైలు నుండే ఈ పథకం వేశాడన్నారు. 2024 జనవరిలో సందేశ్‌ఖాలిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై జరిగిన దాడిలో, అలాగే షాజహాన్‌కు వ్యతిరేకంగా సమాచారం ఇచ్చిన సంబంధిత సిబిఐ దర్యాప్తులో ఘోష్ ప్రధాన సాక్షులలో ఒకరిగా ఉన్నారు.ఏంటీ సందేశ్‌ఖాలీ కేసుపశ్చిమ బెంగాల్‌లోని ఉత్తే 24 పరగణాల జిల్లాలో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీలో అధికార తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్, లైంగిక వేధింపులు, భూకబ్జాలకు వ్యతిరేకంగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. మహిళలను బంధించి లైంగికంగా హింసించారని ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసు యంత్రాంగం స్పందించలేదని బాధితులు తీవ్ర ఆరోపణలు చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఈ అంశాన్ని కోల్‌కతా హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై ఉత్తర 24 పరగణాల జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. రేషన్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న షాజహాన్ షేక్ నివాసంపై ఈడీ అధికారులు తనిఖీల నిమిత్తం వెళ్లినపుడు షాజహాన్ అనుచరులు దాడి చేశారు. ఈ ఘటన అనంతరం షాజహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.షాజహాన్ అనేక కేసులకు సంబంధించి గతంలో అరెస్టు , కస్టడీలో ఉన్నాడు. మనీలాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దాఖలు చేసిన ED ప్రాసిక్యూషన్ ఫిర్యాదు, భూకబ్జాలు, అక్రమ చేపల పెంపకం మరియు వ్యాపారం, ఇటుక బట్టీలను స్వాధీనం చేసుకోవడం, కాంట్రాక్టుల కార్టలైజేషన్, అక్రమ పన్నులు ,లెవీల వసూలు మరియు భూమి ఒప్పందాలపై కమీషన్లపై కేంద్రీకృతమై ఉన్న నేర సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడో వివరించింది. ఇదీ చదవండి: Indigo Crisis హర్ష్ గోయెంకా నో డిలే, నో డైవర్షన్ వైరల్ వీడియో -
పటాన్ చెరులో పరువు హత్య!
సాక్షి,హైదరాబాద్: ప్రేమ పేరుతో మరో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేస్తామంటూ ఇంటికి పిలిచి ఓ యువకుడిని క్రూరంగా హత్య చేసిన ఘటన పటాన్ చెరులో వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారమే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు.పటాన్ చెరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి శ్రవణ్ అదే ప్రాంత బీబీఏ విద్యార్థిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరి మధ్య స్కూల్ వయస్సు నుంచే ప్రేమాయణం కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రేమ వ్యవహారం సదరు యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. వారి మధ్య ప్రేమ వ్యవహారం బయటపడడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.పెళ్లి చేస్తామని నమ్మించి పోలీసుల ప్రకారం..యువతి కుటుంబ సభ్యులు ముందుగా పక్కా ప్లాన్ వేసుకున్నారు. ‘మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం. ఇదే విషయం గురించి మాట్లాడుకుంది. ఇంటికి రావాలని శ్రవణ్‌ని తమ ఇంటికి పిలిపించారు. పెళ్లి మాట నమ్మిన శ్రవణ్ యువతి ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరుకున్న వెంటనే యువతి కుటుంబ సభ్యులు శ్రవణ్‌పై దాడి దిగారు. క్రికెట్ బ్యాట్లతో విచక్షణారహితంగా కొట్టడంతో శ్రవణ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.పోలీసుల దర్యాప్తు ప్రారంభంసమాచారం అందుకున్న పటాన్ చెరు పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శ్రవణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. యువతి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరువు హత్య కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.స్థానికులు ఆగ్రహం ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ పేరుతో యువకుడి ప్రాణం తీసిన కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
అభాసుపాలైన దేశంలోకెల్లా బెస్ట్ పోలీస్ స్టేషన్!
ప్రశంసలతో మొదలైన ప్రయాణం… అవమానంతో ముగిసింది. దేశంలోకెల్లా బెస్ట్ పోలీస్ స్టేషన్‌గా బిరుదు పొందిన కొద్ది రోజుల్లోనే… ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఇటు కోర్టు ముందు అవమానానికి గురైంది. ఇందుకు కారణం ఆ పీఎస్ సిబ్బంది చేసిన నిర్వాకమే.పోలీస్ వ్యవస్థను కుదిపేసిన సంచలన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మల్హర్‌గఢ్ పోలీస్ స్టేషన్ దేశంలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయితే అమాయకుడైన ఓ స్టూడెంట్ను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నంలో కోర్టులో పరువు పొగొట్టుకుంది.సోహన్ అనే ఇంటర్ విద్యార్థిని ఆగస్టు 29న మల్హర్‌గఢ్ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. అతని నుంచి నిషేధిత మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామంటూ కోర్టులో ప్రవేశపెట్టారు. డ్రగ్స్ అక్రమ రవాణా కేసు నేపథ్యంతో.. కోర్టు అతనికి రిమాండ్ విధించింది. ఈ కేసులో నిందితుడి కుటుంబం డిసెంబర్ 5వ తేదీన మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్‌ను ఆశ్రయించింది. అక్రమ అపహరణ, తప్పుడు అరెస్ట్, నకిలీ సాక్ష్యాలు అంటూ.. కొన్ని ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. అందులో..పోలీసులు చెప్పినట్లు డ్రగ్స్ లేదు. చేజింగ్ లేదు. ఎలాంటి సీజ్‌లు లేవు. బస్సులో వెళ్తున్న సోహాన్‌ను మఫ్టీలో వచ్చిన పోలీసులు బలవంతంగా బయటకు లాక్కెళ్లిన దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. పైగా ఎఫ్ఐఆర్లో అతని అరెస్ట్‌కు సంబంధించిన వివరాలతో పొంతన కుదరలేదు. దీంతో.. కోర్టు ఎస్పీని తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.డిసెంబర్ 9వ తేదీన మాందసౌర్ జిల్లా ఎస్పీ వినోద్ కుమార్ మీనా కోర్టులో చేతులు కట్టుకుని నిల్చోవాల్సి వచ్చింది. సోహాన్‌ను బస్సులోనే సివిల్ డ్రెస్‌లో ఉన్న పీఎస్ సిబ్బంది అరెస్ట్ చేసినట్లు అంగీకరించారు. ఇదంతా ఓ కానిస్టేబుల్ ఆధ్వర్యంలో జరిగిందని.. అరెస్ట్ మొదలు ఏదీ ప్రొసీజర్ ప్రకారం జరగలేదని కోర్టుకు వివరించారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఆరుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైయిరీకి ఆదేశించినట్లు కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ఈ పిటిషన్‌పై ఉత్తర్వులను వాయిదా వేసింది. ఈ కేసు పోలీస్ వ్యవస్థలో హాట్ టాపిక్‌గా మారింది.నిరపరాధులను బలవంతంగా తీసుకెళ్లడం.. తర్వాత తప్పుడు కేసులు నమోదు చేయడం.. CCTVలో ఒకటి ఉంటే.. తప్పుడు సాక్ష్యాలతో మానిఫులేషన్ చేయడం.. పోలీసుల కథనం వాస్తవానికి విరుద్ధంగా ఉండడం.. కుటుంబాలు కోర్టులను ఆశ్రయించడం.. కోర్టు ముందు పోలీస్ అధికారులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి రావడం.. కోర్టులతో ఆక్షింతలు వేయించుకోవడం.. మధ్యప్రదేశ్ ఘటన ఏపీలో జరుగుతున్న అక్రమ అరెస్టుల కేసులను గుర్తు చేస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ये देश के सबसे अच्छे पुलिस स्टेशन में से एक की मल्हारगढ़ की पुलिस है, पिछले महीने गृहमंत्री अमित शाह ने ऐलान किया था, उसी थाने के कर्मचारी हैं एक छात्र को जबरन ड्रग्स तस्करी में फंसाने का आरोप है, हाईकोर्ट ने सवाल पूछे अब जाकर निलंबित हुए लेकिन छात्र को २ महीने जेल में रहना पड़ा! pic.twitter.com/tN3IT6fDpJ— Anurag Dwary (@Anurag_Dwary) December 10, 2025 -
ప్రియుడి మోజులో భర్తను హత్య చేయించిన భార్య
కర్ణాటక: ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్తనే హత్య చేయించిందో భార్య. ఈ కేసులో ఆమెతో పాటు నలుగురిని హోసూరు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు హోసూరు కార్పొరేషన్ పరిధిలోని పార్వతీనగర్‌కు చెందిన శరవణన్ (25). భార్య ముత్తులక్ష్మి(21). గత నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మరొకరితో ప్రేమాయణం ఇంతలో ముత్తులక్ష్మి అదే ప్రాంతానికి చెందిన సూర్య (23)తో పరిచయం పెరిగి అక్రమ సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి శరవణన్ భార్యను నిలదీయడంతో వారి మధ్య తరచూ గొడవలేర్పడుతుండేది. గత కొద్ది రోజుల క్రితం ముత్తులక్ష్మి ఇద్దరు పిల్లలను భర్త ఇంట్లో వదిలి సూర్యతో వెళ్లిపోయింది. బంధువులు ఆమెకు నచ్చజెప్పి భర్త వద్దకు చేర్చారు. కానీ ఇద్దరూ తరచూ గొడవపడేవారు. ఈ సమయంలో ఆమె తన ప్రియునితో కలిసి భర్తను హత్య చేసేందుకు పథకం వేసింది.రెండు రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో సూర్య, మరో ఇద్దరిని తీసుకుని వచ్చాడు. నిద్రిస్తున్న శరవణన్‌ను ముత్తులక్ష్మి సహకారంతో కత్తులతో పొడిచి హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటనపై శరవణన్ తల్లి మంగమ్మ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు విచారణ చేపట్టారు. భార్య ముత్తులక్ష్మి, ప్రియుడు సూర్య, సంతోష్ శక్తిలను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి తీవ్ర విచారణ జరుపుతున్నారు. -
అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
వీరబల్లి : సోమవరం పంచాయతీలోని సోమవరం వడ్డిపల్లిలో దీపిక (16) అనే మైనర్ బాలిక అనుమానాసపద స్థితిలో మంగళవారం మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. దీపిక తల్లిదండ్రులు రెండు నెలల నుంచి సోమవరం వడ్డిపల్లిలో నాగేంద్ర అనే యజమాని దగ్గర ఎనుములు మేపుతూ జీవనం సాగించేవారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం వారు నివాసం ఉంటున్న రేకుల గదిలో అనుమానాస్పద స్థితిలో దీపిక మృతి చెందింది. బాలిక తల్లి లక్ష్మీదేవిది కోడూరు నియోజకవర్గంలోని సిద్దారెడ్డిగారిపల్లి కాగా ఈమె మొదట వివాహం చేసుకున్న భర్తను వదిలేసి వీరబల్లి మండలం, సోమవరం వడ్డిపల్లికి చెందిన నాగరాజును రెండో వివాహం చేసుకుంది. వీరు ఎనుములు మేపుకుంటూ ఉండేవారు. నెల క్రితం సొంత ఊరికి వెళ్లి మొదటి భర్త దగ్గర ఉన్న దీపికను తీసుకు లక్ష్మిదేవి వడ్డిపల్లికి వచ్చింది. ఇంతలోనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ నరసింహారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక..
నల్లగొండ, మర్రిగూడ: పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక ఓ డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం నల్లగొండ పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్లో జరిగింది. టూటౌన్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం కొట్టాల గ్రామానికి చెందిన బుర్ర నర్సింహ, రమణమ్మ దంపతుల కుమార్తె శ్రుతి (20) నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతూ.. స్థానికంగా రవీంద్రనగర్‌లోని బీసీ బాలికల హాస్టల్లో ఉంటోంది. శ్రుతికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండగా, ఆమెకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలుస్తోంది. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పలేక మనస్తాపానికి గురైంది. మంగళవారం ఇంటికి వెళ్తానని హాస్టల్ వార్డెన్‌కు లీవ్ లెటర్ రాసి బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకుంది. బాత్రూమ్లో నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థినులు వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టూటౌన్ ఎస్ఐ సైదులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రుతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
Hyd: కామాటిపురాలో దారుణ హత్య
హైదరాబాద్: పాతబస్తీలోని కామాటిపురా పీఎస్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. నిన్న(మంగళవారం) రాత్రి అరవింద్ మోస్లీ(30) అనే వ్యక్తి సైకిల్‌పై వెళ్తుండగా అడ్డగించి హత్య చేశార పలువురు గుర్తు తెలియని దుండగులు. మోస్లీ తప్పించుకునే ప్రయత్నం చేసిన వెంబడించి మరీ హత్యకు పాల్పడ్డారు. రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య పని ముగించకుని సైకిల్‌పై వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. పాతగొడవలు, వివాహేతర సంబంధం హత్యకు కారణం అయ్యి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు అరవింద్ ఘోస్లే , బియ్యం షాప్‌లో పని చేస్తున్నాడు.. కామాటిపురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్టరీకి తరలించారు..కాగా, నగరంలో వరుసగా రెండు హత్యలు చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అంతకుముందు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో రియల్టర్ దారుణ హత్య తీవ్ర గురయ్యాడు.. గుర్తుతెలియని వ్యక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి వెంకటరత్నం అనే వ్యక్తిని హత్య చేశారు. మల్కాజ్‌గిరిలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్న సాకేత్ కాలనీ ఫోస్టర్ స్కూల్ సమీపంలో సోమవారం ఉదయం రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంను దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. స్కూటీపై వెళ్తున్న వెంకటరత్నంను వెంబడించిన గుర్తుతెలియని వవ్యక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి చంపారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే, వెంకటరత్నంపై ధూల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ నమోదై ఉన్నట్లు గుర్తించారు. జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఆయనను ప్రత్యర్ధులే చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నగరంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. పట్టపగలే హత్యలు, దోపిడీలు జరుగుతుండటంతో ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు. -
అనంతలో అయ్యప్ప మాలధారుడి దారుణ హత్య
బుక్కరాయసముద్రం: ఇద్దరు అయ్యప్ప మాలధారుల మధ్య ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. బుక్కరాయసముద్రం వీర భద్రకాలనీలో నివాసం ఉంటున్న జయమ్మ, ఆంజనేయులు కుమారుడు సాయి చరణ్(20) అదే కాలనీకి చెందిన ధన్‌రాజ్, తాడిపత్రి మండలం బుగ్గకు చెందిన సంతోష్ స్నేహితులు. చరణ్ మేజర్ కాగా, ధనరాజ్, సంతోష్ మైనర్లు. వీరంతా అనంతపురంలోని కూరగాయల మార్కెట్లో రోజువారీ కూలి పనులకు వెళ్తున్నారు. ఇటీవల ముగ్గురూ అయ్యప్ప మాలధారణ చేశారు. ఈ క్రమంలో ఈనెల 6వ తేదీన సంతోష్, ధనరాజ్, చరణ్ ద్విచక్రవాహనంలో రెడ్డిపల్లి సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు స్నానానికి వెళ్లారు. ఆ సమయంలో సాయి చరణ్, సంతోష్ మధ్య వివాదం రేగింది. మాటామాటా పెరిగి ఇద్దరూ ఘర్షణకు దిగారు. దీంతో ధన్‌రాజ్ ఇరువురినీ విడిపించి సర్ది చెప్పాడు. అనంతరం సాయి చరణ్ మరోసారి బావిలోకి దిగగా, సంతోష్ చరణ్‌పై బండరాళ్లు వేశాడు. తీవ్రంగా గాయపడిన సాయిచరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని సంతోష్ బెదిరించడంతో ధనరాజ్ భయపడిపోయాడు. అనంతరం ఇరువురు ఇళ్లకు వెళ్లిపోయారు. మూడు రోజులైనా కుమారుడి ఆచూకీ కనిపించకపోవడంతో సాయిచరణ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కళ్లముందే స్నేహితుడు చనిపోవడంతో తీవ్రంగా మధనపడిన ధనరాజ్ రెండురోజుల తర్వాత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సాయి చరణ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారిని వెంటబెట్టుకుని మంగళవారం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సాయి చరణ్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంతోష్‌ను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. 1500కోట్ల స్కాం : నటుడు సోనూ సూద్, రెజ్లర్ గ్రేట్ ఖలీకి సిట్ నోటీసులు
దుబాయ్ బ్లూచిప్ కేసులో కీలక పరిణామం చేసుకుంది. రూ.1500 కోట్ల కుంభకోణం కేసులో నటుడు సోనూసూద్ , రెజ్లర్ గ్రేట్ ఖలీకి నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పేరు కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఇటీవల అరెస్ట్ అయిన UAEలో అతిపెద్ద పెట్టుబడి మోసానికి పాల్పడిన వ్యాపారవేత్త రవీంద్ర నాథ్ సోనిని 7 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బ్లూ చిప్ కంపెనీల ద్వారా రూ.1500 కోట్ల మెగా స్కాంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణలో భాగంగా నటుడు సోను సూద్ , గ్రేట్ ఖలీ ఇద్దరూ కంపెనీని ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి ప్రశ్నలకు సమాధానాలు కోరుతూ పోలీసులు ఇద్దరికీ నోటీసులు పంపారు. వారు బ్లూ చిప్ కంపెనీని ప్రమోషన్స్, ప్రచారం చేశారా లేదా అనేది స్టేట్మెంట్లను రికార్డ్ చేయమని కోరారు. ఇద్దరూ బ్లూ చిప్ కంపెనీని ప్రోత్సహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనితో పాటు అజారుద్దీన్ పేరు కూడా చర్చనీయాంశమైంది, సోనూ సూద్, రెజ్లర్ ది గ్రేట్ ఖలీ రవీంద్ర సోని కంపెనీ ఈవెంట్లలో పాల్గొన్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోను బాధితులు దుబాయ్ నుండి కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌కు పంపారు. ఈ వీడియోలను పరిశీలించిన అనంతరం అజారుద్దీన్‌కు కూడా నోటీసు పంపవచ్చని పోలీసులు చెబుతున్నారు.ఏడీసీపీ నాయకత్వంలో SITపోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ ఈ భారీ మోసం కేసును దర్యాప్తు చేయడానికి ఒక SITని ఏర్పాటు చేశారు. ADCP అంజలి విశ్వకర్మ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే రవీంద్ర సోనీకి సంబంధించిన ఎనిమిది క్రిప్టో ఖాతాల వివరాలను సేకరించారు. దీనిలో ప్రవాస భారతీయులు, ఇతర పెట్టుబడులు ఉన్నాయి. ఈ విషయంలో ఢిల్లీ , డెహ్రాడూన్‌తో సహా 22 ప్రదేశాలలో ఖాతాలను సిట్ గుర్తించింది. ఈ కేసులో SIT దుబాయ్ పోలీసులతో కూడా సంప్రదిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ పేర్కొన్నారు. ఇప్పటివరకు, రవీంద్ర సోనిపై 17 మంది ముందుకు వచ్చారు. వీరిలో దుబాయ్‌లో నివసిస్తున్న ముగ్గురు బాధితులు కేసులు నమోదు చేశారు.ఇదీ చదవండి: Indigo Crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్అసలేంటీ రవీంద్ర సోనీ కసుఢిల్లీలోని మాల్వియా నగర్‌కు చెందిన సోని కొన్నేళ్ల క్రితం దుబాయ్‌కు మకాం మార్చి 12 షెల్ కంపెనీలను స్థాపించాడు, వాటిలో ఒకటి ‘బ్లూ చిప్ ట్రేడింగ్’ కంపెనీ. హై-ఎండ్ ఫారెక్స్ ట్రేడింగ్ ముసుగులో, 30–40శాతం తక్షణ రాబడి హామీలతో ప్రవాస భారతీయులను ఆకర్షించాడు. భారతదేశంలోనూ, దుబాయ్‌లోనూ వందలాది భారతీయులను మోసాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ స్కాం బహుళ దేశాలకు విస్తరించి ఉందని, క్రిప్టోకరెన్సీ లాండరింగ్, హవాలా మార్గాలు ఉన్నాయని, జాతీయ భద్రతాపరమైన చిక్కులు కలిగి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. కనీసం 400–500 మంది పెట్టుబడిదారులను ఈ కంపెనీ మోసంచేసి దాదాపు రూ. రూ. 1500 కోట్లు వసూలు చేసిందని అనుమానిస్తున్నారు. దుబాయ్‌లో ఒకటి, అలీఘర్, కాన్పూర్ నగర్, ఢిల్లీ,పానిపట్‌లలో ఒక్కొక్కటి సహా అతనిపై ఐదు ఎఫ్ఐఆర్లు ఇప్పటికే నమోదయ్యాయి.ఈ స్కాం ఎలా బయట పడిందిబ్లూచిప్, 18 నెలల పాటు కనీసం 10వేల డాలర్లపై పెట్టుబడిపై నెలకు 3 శాతం - లేదా సంవత్సరానికి 36 శాతం - "గ్యారంటీ" రాబడిని ప్రకటించాడు. మొదటి కొన్ని సంవత్సరాలుగా, క్రమం తప్పకుండా రిటర్న్‌లను చెల్లించి అందర్నీ నమ్మించాడు. అకస్మాత్తుగా నిధులను వ్యక్తిగత ఖాతాలు, క్రిప్టోకరెన్సీలు మరియు ఆఫ్‌షోర్ ఛానెల్‌లలోకి మళ్లించేవాడని ఆరోపించారు. అయితే ఈ కంపెనీ 2024లో దివాలా తీసింది. దీంతో వందలాది ఎన్ఆర్ఐలు భారీ ఎత్తున నష్టపోయారు. దీనిపై జనవరి 5న ఢిల్లీ నివాసి అబ్దుల్ కరీం తనపై దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నవంబర్ 30న, డెహ్రాడూన్‌లో కాన్పూర్ పోలీసులు సోనిని అదుపులోకి తీసుకున్నారు. కాన్పూర్ నగర్‌లోని లా & ఆర్డర్ అదనపు డిప్యూటీ కమిషనర్ అంజలి విశ్వకర్మ సమాచారం ప్రకారం వారు ఆర్డర్ చేసిన ఫుడ్ చిరునామా ఆధారంగా సోని బస చేసిన రహస్య ప్రదేశాన్ని గుర్తించారు. -
కూలిన ట్రైనీ విమానం : తప్పిన ఘోర ప్రమాదం
ఒక పక్క ఇండిగో సంక్షోభం కొనసాగుతుండగా మధ్యప్రదేశ్ లోని సియోనీలో ఓ శిక్షణ విమానం కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. రెడ్ బర్డ్ ఏవియేషన్ అనే విమానయాన సంస్థకు చెందిన ట్రైనీ విమానం తన చివరి దశలో నియంత్రణ కోల్పోయి అకస్మాత్తుగా కూలిపోయింది. ఇద్దరు పైలట్లు ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఘోర ప్రమాదం తృటిలో తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.సోమవారం సాయంత్రం సుక్తారా గ్రామంలోని ఎయిర్‌స్ట్రిప్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే లఖన్వాడ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని అమ్గావ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రెడ్‌బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన ఓ శిక్షణ విమానం సుక్తరా ఎయిర్ స్ట్రిప్ లో ల్యాండింగ్ సమయంలో, 33 KV హై-వోల్టేజ్ లైన్‌కు చిక్కుకుని విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. టేకాఫ్ సమయంలో విమానం ఇంజిన్ అకస్మాత్తుగా వైఫ్యలం కారణంగా పైలట్ అమ్గావ్ సమీపంలోని ఒక పొలంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో పెద్ద శబ్దంతో పొలంలో కూలిపోయింది. శబ్దం విన్న గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకున్నారు. విమానం కాక్‌పిట్ నుండి ఇద్దరు పైలట్లను రక్షించారు. అదృష్టవశాత్తూ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే సుమారు 90 గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. విద్యుత్ శాఖ ఉద్యోగులు కష్టపడి విద్యుత్ సరఫరాను పనరుద్ధరించారు.ఇద్దరు పైలట్లు ప్రైవేట్ ఆసుపత్రిలోఈ ప్రమాదంలో, పైలట్ అజిత్ , ట్రైనీ అశోక్ చావా తల మరియు ముక్కుకు గాయాలయ్యాయి. ఇద్దరినీ బారాపత్తర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. రెడ్ బర్డ్ ఏవియేషన్ కంపెనీ నాగ్‌పూర్ రోడ్డులో ఉన్న సుక్తారా గ్రామంలో ఒక ఎయిర్‌స్ట్రిప్‌ను లీజుకు తీసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులకు ఇక్కడ పైలట్ శిక్షణ అందిస్తుంది.గతంలోనూ ప్రమాదంవిమానయాన కేంద్రం వద్ద భద్రతా ప్రమాణాలను చాలా కాలంగా నిర్లక్ష్యం చేశారని స్థానిక గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో శిక్షణా విమానాలు రన్‌వేపై రెండుసార్లు బోల్తా పడ్డాయనీ కానీ కంపెనీ, అధికారులు ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని సర్పంచ్ ఆరోపించారు. -
హత్య చేసి మృతదేహం పక్కనే కూర్చున్న నిందితుడు
మంచిర్యాల జిల్లా: తనతో సన్నిహితంగా ఉంటూ మరొకరితో తరచూ ఫోన్లో మాట్లాడుతుందన్న కారణంతో ఓ యువకుడు వివాహితను దారుణంగా హత్య చేసిన ఘటన భైంసాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. భైంసా మండలం కుంసర గ్రామానికి చెందిన అశ్విని(28)కి భైంసా పట్టణంలోని పులేనగర్‌కు చెందిన జోంద్లే సంతోష్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం.దంపతుల మధ్య విబేధాల కారణంగా కొన్నేళ్లుగా భర్తతో విడిపోయి తన ఇద్దరు పిల్లలతో కలిసి కుంసరలో తల్లి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో అంబేడ్కర్‌నగర్‌కు చెందిన నాగేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి సంతోషిమాత నగర్లో టీ స్టాల్ నడుపుతున్నారు. సోమవారం ఇద్దరూ టీస్టాల్కు రాగా, అశ్విని మరొకరితో తరచూ ఫోన్లో మాట్లాడుతుందన్న కారణంతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో కోపంతో నాగేశ్ పక్కనే ఉన్న రాడ్‌తో అశ్విని తలపై మోది కత్తితో గొంతుకోయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ జి.గోపినాథ్ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహం వద్దే కూర్చున్న నాగేశ్ తానే హత్య చేశానని ఒప్పుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. భైంసా ఏఎస్పీ రాజేశ్‌మీనా ఆస్పత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి గాయక్వాడ్ భారతిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. -
గుండెపోటు కాదు.. ఆత్మహత్యే
కొండాపూర్(సంగారెడ్డి): కట్టుకున్న భర్తే భార్య ఆత్మహత్యను గుండెపోటుగా చిత్రీకరించాడు. తీరా అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో బంధువులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి కథనం ప్రకారం... మండల పరిధిలోని మల్కాపూర్ చౌరస్తాలోని గీతానగర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ కుటుంబం నివాసం ఉంటోంది. ఉపాధ్యాయుడు శ్రీనివాస్ సంగారెడ్డి మండలం తాళ్లపల్లిలో విధులు నిర్వహిస్తుండగా అతడి భార్య సుచిత(35) బ్యూటీ పార్లర్ నిర్వహిస్తుంది. ఆదివారం ఇద్దరి మధ్యలో మనస్పర్థలు రావడంతో సుచిత ఇంట్లో ఉరివేసుకుంది. కాగా ఈ విషయం బయటకు వెళ్తే ఉద్యోగపరంగా ఇబ్బందులు వస్తాయని, ఆత్మహత్యను కాస్త గుండెపోటుగా చిత్రీకరిస్తూ శ్రీనివాస్ బంధువులకు సమాచారం అందించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు నారాయణ ఖేడ్ మండలం మద్వార్కు తీసుకెళ్లారు. అక్కడ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో మృతురాలి మెడపై మరకలు ఉండడంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్ట్ వచ్చిన అనంతరం ఎస్సై మాట్లాడుతూ సుచితది గుండెపోటు కాదని, ఆత్మహత్య అని ప్రకటించారు. మృతురాలి సోదరుడు ఆశిష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో సీనియర్ అసిస్టెంట్ కుమారి మృతి
కడప జిల్లా: మండలంలోని మడూరు గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో తొండూరు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.కుమారి దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో కుమారి విధులు ముగించుకున్నారు. పులివెందుల వచ్చేందుకు తొండూరు సాయిబాబా ఆలయం వద్ద బస్సు కోసం వేచి ఉండగా, బూచుపల్లెకు చెందిన ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ కనిపించాడు. ఆమె చేయి ఎత్తడంతో తన ద్విచక్రవాహనాన్ని ఆపి ఆమెను ఎక్కించుకుని పులివెందులకు బయలుదేరాడు. మడూరు గ్రామ సమీపంలోకి రాగానే నాలుగు లేన్ల రోడ్డు పనులలో భాగంగా బ్రిడ్జి పనులు జరుగుతున్న ప్రదేశంలో లారీ వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కుమారి లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే స్థానికులు, రెవెన్యూ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ ఘన మద్దిలేటి, రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆర్డీఓ, జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు. మృతురాలు కుమారికి భర్త విశ్వనాథ్(చిన్నా)తోపాటు ఇద్దరు కుమారులు విశ్వనాథ్, నందు, కుమార్తె సిరిచందన ఉన్నారు. కుమారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, రెవెన్యూ సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీడీఓ రామచంద్రుడు, రెవెన్యూ సిబ్బంది కోరారు. -
ఎకరం పొలం అమ్ముకో బిడ్డా.. ధైర్యంగా ఉండు
రాయికోడ్(అందోల్): కొడుకు సర్పంచ్ బరిలో దిగితే ఆ మాతృమూర్తి మురిసిపోయింది. ఊరికి రా‘రాజు’అవుతాడని కలలు కన్నది. అయితే.. ఎన్నికల్లో అన్నీ ప్రతికూల పరిస్థితులు ఎదురవడం.. నమ్మిన వారే నట్టేట ముంచడం.. చేతిలో ఉన్న డబ్బు చూస్తుండగానే కర్పూరంలా కరిగిపోవడం.. ఆఖరుకు తల్లి ధైర్యం చెప్పినా కోలుకోలేని నిస్సహాయస్థితి దాపురించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. రాయికల్ మండలంలోని పీపడ్పల్లికి చెందిన రాజు (35) చురుకైన కాంగ్రెస్ కార్యకర్త. ఆ పార్టీ మద్దతుతో సర్పంచ్ బరిలో నిలిచాడు. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న క్రమంలో ఎన్నికల ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. నమ్ముకున్న పార్టీ నాయకులు ఒక్కొక్కరు పక్కకు జారుకుంటున్నారు. బరిలో దింపిన సీనియర్లే తనకు సహకరించడం లేదని సన్నిహితులు, కుటుంబ సభ్యుల వద్ద రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. చేతిలో ఉన్న డబ్బు అయిపోయింది. తోటి నాయకుల సహకారం లభించడం లేదు.బిడ్డా.. పొలం అమ్ముకో.. ఇక తాను ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోలేనని తల్లికి చెప్పాడు. ఒక్కగానొక్క కొడుకు పడుతున్న బాధలు భరించలేని ఆ తల్లి.. ‘ఎకరం పొలం అమ్ముకో బిడ్డా.. ధైర్యంగా ఉండు’అని చెప్పింది. అన్ని వైపుల నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండడంతో రాజు ధైర్యం కోల్పోయాడు. అయ్యప్ప మాల ధరించిన అతను .. ఉపవాస దీక్షతో పాటు ప్రచారం చేస్తుండటంతో సరైన నిద్ర లేదు. దీంతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో స్నేహితులు రాయికోడ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అనంతరం ఎప్పటిలాగానే శంషొద్దీన్పూర్ గ్రామ శివారులోని అయ్యప్ప సన్నిధానానికి చేరుకున్నాడు. అక్కడే తోటి స్వాములతో కలసి నిద్రించాడు. వేకువజామున ఐదు గంటలకు కాలకృత్యాలకని వెళ్లి సన్నిధానానికి కొంతదూరంలోని చెట్టుకు మెడలోని మాల టవల్‌తో ఉరివేసుకున్నాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో తోటి స్వాములు వెతకగా అప్పటికే ఉరివేసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలం వద్ద ,మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం వివరాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య శ్వేత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్యకిరణ్ తెలిపారు.గ్రామంలో విషాద ఛాయలు మృధుస్వభావి అయిన రాజు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లికి ఒక్కడే కుమారుడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మృతుడి తల్లి, భార్య బంధువుల రోదనలు మిన్నంటాయి. -
రెండు కార్లు ఢీ.. ముగ్గురి మృతి
సాక్షి, తిరుపతి: నగరి తడుకు పేట వద్ద రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు, మరో తమిళనాడు వ్యక్తి మృతి చెందారు. మరో ముగ్గురు తమిళనాడు వాసులకు తీవ్రమైన గాయాలు జరిగినట్టు సమాచారం. నగరి తడుకు పేట వద్ద అతివేగంగా కారు నడపడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మరణించిన వారిలో ఇద్దరు పద్మావతి అమ్మవారి ఆలయం పోటు కార్మికులు శంకర, సంతానంగా గుర్తింపు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. -
బాత్రూమ్ కడితేనే సంసారానికి వస్తా!
కర్నూలు జిల్లా: బాత్రూమ్ సమస్య ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఎదురుపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసు కుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామాని కి చెందిన శివశంకర్ (35), అతని సోదరుడు పక్కపక్కన నివాసముంటున్నారు. రెండిళ్లకు కలసి ఒకే బాత్ రూమ్ ఉంది. కొన్నాళ్ల పాటు సర్దుకుంటూ వచ్చిన శివశంకర్ భార్య శశికళ ఇటీవల వేరుగా బాత్రూమ్ నిర్మించాలని కోరింది. 10 రోజుల క్రితం ఈ విషయంలో దంపతులు ఘర్షణ పడ్డారు. బాత్రూమ్ నిర్మించేంత వరకు ఇంట్లో ఉండనంటూ శశికళ జూపాడుబంగ్లాలోని పుట్టినింటికి వెళ్లిపోయింది. అయితే భర్త శివశంకర్ ఎంత బతిమలాడినా తిరిగిరాలేదు. దీంతో మనస్తాపం చెందిన శివశంకర్ శనివారం రాత్రి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడి తల్లి తేనె భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఎం.రవీంద్రబాబు సోమవారం వెల్లడించారు. -
పాలిటెక్నిక్ విద్యార్థినిపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం
తిరుపతి: నగరంలో మైనర్ పాలిటెక్నిక్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎస్వీ పాలిటెక్నిక్ చదువుతున్న బాధిత విద్యార్థిని ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. ఆమె మరో హాస్టల్‌కు మారుతున్న సమయంలో ర్యాపిడో డ్రైవర్ సాయికుమార్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికే వారి పరిచయం పెరగడంతో విద్యార్థిని ర్యాపిడో డ్రైవర్‌ను ఆర్థిక సహాయం కోరింది. దీంతో అతను ఈ అవకాశాన్ని అలుసుగా తీసుకుని, నమ్మించి తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు విద్యార్థిని తెలిపింది.దీంతో ఆమె తన స్నేహితురాలితో కలిసి అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, నిందుతుల ఆచూకీకై గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నిందితుడు సాయికుమార్ పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు కొనసాగుతున్నట్లు అలిపిరి పోలీసులు తెలిపారు. -
పాతికేళ్ల నాటి పగ!
సాక్షి, సిటీబ్యూరో/జవహర్‌నగర్: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని జవహర్‌నగర్‌లో దారుణ హత్య చోటు చేసుకుంది. పాతికేళ్ల నాటి పగ తుపాకీ, కత్తులతో విరుచుకుపడింది. అప్పట్లో తన తండ్రి మరణానికి ఆయన డ్రైవరే కారణమని భావించిన వ్యక్తి...బంధువుతో పాటు మరికొందరితో కలిసి విరుచుకుపడ్డాడు. కుమార్తెను పాఠశాల వద్ద వదిలి వస్తున్న మాజీ డ్రైవర్‌ను పట్టపగలు, నడిరోడ్డుపై అడ్డగించి చంపేశాడు. నేరుగా నగరంలోని షాహినాయత్‌గంజ్ పోలీసుస్టేషన్‌కు వచి్చన ఆరుగురు నిందితులు లొంగిపోయారు. వీరిని అధికారులు జవహర్‌నగర్ పోలీసులకు అప్పగించారు. అప్పట్లో డాన్‌గా వ్యవహరించిన సుదేశ్ సింగ్... నగరంలోని మంగళ్‌హాట్ ప్రాంతానికి చెందిన సుదేశ్ సింగ్ 1990ల్లో ఓ స్థాయి డాన్‌గా చెలామణి అయ్యాడు. మంగళ్‌హాట్, ధూల్‌పేట, జిర్రా తదితర ప్రాంతాల్లో గుడుంబా వ్యాపారంతో పాటు బెదిరింపు వసూళ్లు, గంజాయి దందాలను తన గుప్పెట్లో పెట్టుకున్న సుదేశ్ సింగ్ పోలీసులనూ పరుగులు పెట్టించారు. ఇతడి వ్యవహారాలు శృతిమించడంతో అప్పటి ఉన్నతాధికారులు కట్టడి చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం 1999లో టాస్‌్కఫోర్స్‌లో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసిన సుదేశ్ సింగ్ తన సన్నిహితులైన అనుచరులతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే ఇతడి ప్రధాన అనుచరుడైన అనిల్ ఆచూకీ కామాటిపుర ప్రాంతంలో గుర్తించిన పోలీసులు పట్టుకోవడానికి ప్రయతి్నంచారు. ఈ నేపథ్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో అనిల్ చనిపోయాడు. వెంకటరత్నంనే ఇన్ఫార్మర్గా అనుమానించి... ఈ ఎన్‌కౌంటర్‌తో మరింత అప్రమత్తమైన సుదేశ్ సింగ్ తర్వాతి టార్గెట్ తానే అని భావించారు. తన ఉనికి ఎక్కడా బయటపడకుండా ఉండేందుకు అనుచరుల్నీ దూరంగా ఉంచారు. అయినప్పటికీ నాటకీయ పరిణామాల మధ్య 2000 ఏప్రిల్‌లో జిర్రా ప్రాంతంలోని గుట్టలపై జరిగిన ఎన్కౌంటర్లో సుదేశ్ సింగ్ చనిపోయాడు. అప్పట్లో నగరానికి చెందిన గంటా వెంకటరత్నం డాన్ సుదేశ్ సింగ్‌కు డ్రైవర్‌గా వ్యవహరించారు. పోలీసులు ఇతడిపై ఒత్తిడి పెంచడంతోనే సుదేశ్ సింగ్ కదలికలపై ఉప్పందించాడని, ఈ కారణంగానే ఎన్కౌంటర్ జరిగిందని మృతుడి కుటుంబీకులు భావించారు. దీంతో కొన్నేళ్లుగా సుదేశ్ కుమారుడు చందన్ సింగ్, సమీప బంధువు కక్షతో రగిలిపోయారు. వెంకటరత్నం ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని సాకేత్ కాలనీలో తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నట్లు గుర్తించారు. పక్కా రెక్కీ చేసి, ఆయుధం సేకరించి... చందన్ తన సమీప బంధువుతో పాటు మరో నలుగురితో కలిసి ముఠా కట్టాడు. సాకేత్ కాలనీలో పక్కాగా రెక్కీ చేసి వెంకటరత్నం కదలికల్ని గమనించారు. ఆపై హత్య పథకాన్ని అమలు చేయడానికి ఓ తుపాకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తన తండ్రి పోలీసు కాల్పుల్లో చనిపోయిన నేపథ్యంలో వెంకటరత్నాన్ని కూడా కాల్చి చంపాలని చందన్ భావించాడు. షాహినాయత్‌గంజ్ ప్రాంతంలో నివసించే చందన్, అతడి సమీప బంధువు కొన్నాళ్లుగా ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఓ తుపాకీ ఖరీదు చేసుకుని వచి్చన ఈ ద్వయం సోమవారం మరో నలుగురితో కలిసి రంగంలోకి దిగింది. తుపాకీతో కాల్పులు జరిపినా తప్పించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కత్తులనూ తమ వెంట తెచ్చుకుంది. ఎప్పటిలాగే వెంకటరత్నం తన కుమార్తెను కాప్రాలోని పాఠశాలలో దింపేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. ఇది గమనించిన చందన్ విషయాన్ని అనుచరులకు సమాచారమిచ్చాడు.కాపుకాసి దారుణంగా హత్య చేసి..నలుగురు ఆటోలు ఇద్దరు స్కూటీపై వచ్చి కాపుకాశారు. తన కుమార్తెను స్కూల్లో దింపిన వెంకటరత్నం తిరిగి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు ఈయన్ను వెంబడిస్తుండగా ఆటోలో నలుగురు మార్గమధ్యంలో కాపుకాశారు. వీళ్లు కాపుకాసిన ప్రాంతానికి వెంటకరత్నం చేరుకున్న వెంటనే అడ్డగించి దాడికి తెగబడిన ముఠా ముందు కాల్పులు జరిపింది. కిందపడిపోయిన వెంకటరత్నం దగ్గరకు వెళ్లి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి పారిపోయింది. ఛాతి, తల, మెడ భాగాల్లో తీవ్ర గాయాలైన వెంకటరత్నం అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు జవహర్‌నగర్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించింది. క్లూస్‌టీం, డాగ్‌స్వాడ్‌లతో హత్యాస్థలిలో ఆధారాలు సేకరించారు. నిందితులు నేరుగా షాహినాయత్‌గంజ్ పోలీసుస్టేషన్‌కు వచ్చి ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. -
తల్లిదండ్రుల ఎదుటే గొంతు కోసి ఘాతుకం
హైదరాబాద్: ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందని కక్ష పెంచుకుని..ఓ యువతిని ఆమె తల్లిదండ్రుల ఎదుటే గొంతుకోసి అతిదారుణంగా హత్య చేశాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీనగర్‌లో జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం శ్రీకాకుళంకు చెందిన కాంతారావు, లక్ష్మి దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి పార్శిగుట్టలోని బాపూజీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (19), రేవతి ఉన్నారు. పవిత్ర ఇంటర్ పూర్తి చేసి కంప్యూటర్ కోర్సు చదువుతుంది. శ్రీకాకుళంకు చెందిన ఉమాశంకర్ (25 )వీరికి దూరపు బంధువు. ఉమాశంకర్‌కు తల్లిదండ్రులు లేరు, యూసఫ్‌గూడలోని సోదరి వద్ద నివాసం ఉంటూ టైల్స్ పనిచేస్తుంటాడు. చిలకలగూడలో ఉండే సోదరుడి దగ్గరకు వస్తూ.. ఇదే ప్రాంతంలోని కాంతారావు ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో పవిత్రపై కన్నేసిన ఉమాశంకర్ ఆమెను ప్రేమిస్తున్నాని, తనకు ఇచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి చేశాడు. సంక్రాంతి తర్వాత పెళ్లి చేస్తామని పవిత్ర తల్లిదండ్రులు చెప్పారు. అయితే మద్యానికి బానిసైన ఉమాశంకర్‌తో పెళ్లిని పవిత్ర తిరస్కరించింది. కాగా ఆదివారం కాంతారావు కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వెళ్లి వచ్చారు. తనకు చెప్పకుండా ఎందుకు విజయవాడ వెళ్లారని ఉమాశంకర్ వారితో గొడవకు దిగాడు. సోమవారం ఉదయం పవిత్ర ఇంటికి వచ్చిన ఉమాశంకర్ మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. ఆ సమయంలో కాంతారావు దంపతులు, పవిత్ర ఆమె చెల్లి అందరూ ఇంట్లోనే ఉన్నారు. పెళ్లి గురించి వీరి మధ్య కొద్దిసేపు వాగ్వవాదం జరిగింది. వెంటనే తీవ్ర ఆగ్రహానికి గురైన ఉమాశంకర్ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో పవిత్ర గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో తల్లిదండ్రుల కళ్లెదుటే పవిత్ర కన్నుమూసింది. వెంటనే సమాచారం అందుకున్న చిలకలగూడ ఏసీపీ శశాంక్‌రెడ్డి, వారాసిగూడ ఇన్స్పెక్టర్ మధుసూదన్‌రెడ్డి, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. తల్లడిల్లిన కుటుంబ సభ్యులు పవిత్ర తనను ఇష్టపడడం లేదని తెలుసుకున్న ఉమాశంకర్ ముందే పథకం ప్రకారం ఆమెను హత్యచేసేందుకు వచ్చాడు. ఇందులో భాగంగానే తనతో పాటు కత్తిని కూడా తీసుకొచ్చిన ..ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా పవిత్రపై దాడికి పాల్పడి చంపేశాడు. ఈ ఘటనతో పవిత్ర తల్లిదండ్రులు, చెల్లి రేవతి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఏమి జరుగుతుందో తెలుసుకునేలోపే దారుణం జరిగిపోవడంతో వారు తల్లడిల్లిపోయారు. తమ కళ్లముందే బిడ్డను చంపేయడంతో ఆ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పవిత్ర కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. -
మద్యం తాగి బీభత్సం, మహిళ మృతి, బెయిల్‌కి రూ.11 కోట్లు
కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన యవకుడు బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో అతివేగంతో లగ్జరీ కారు టెస్లా కారును నడిపి ఒక మహిళ మృతికి కారణ మయ్యాడు. అతనిపై పోలీసులు కేసునమోదు చేశారు. డిటెన్షన్ సెంటర్‌కు తరలించిన అతని బెయిల్ ఫీజు రూ. 10.81కోట్లు( 1.2 మిలియన్ డాలర్లు) గా నిర్ణయించారు.కాలిఫోర్నియాలో 240 కిలోమీటర్ల వేగంతో టెస్లాతో ఎస్‌యూవీని ఢీకొట్టాడు నిందితుడు 28 ఏళ్ల వ్యక్తి బాదల్ ధోలారియా .శనివారం (నవంబర్ 29) ప్రమాదం జరిగినప్పుడునిందితుడు మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు ఆరోపించారు. టెస్లా మోడల్ 3ని కారుతో, ఫోర్డ్ బ్రోంకో అనే ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న 41 ఏళ్ల మహిళా ప్రయాణీకురాలు అలిక్స్ మారి స్పార్క్స్ ని బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. దీంతో అతనపై సెకండ్ డిగ్రీ హత్య మరియు ఇతర నేరారోపణలు మోపబడ్డాయి.డోలారియా అతి వేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఫోర్డ్ బ్రోంకో వెనుక నుంచి ఢీకొట్టాడని శాన్ రామన్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. డోలారియా కస్టడీలో ఉండగా అతని బెయిల్ కోసం ఏకంగా 1.2 మిలియన్ల డాలర్లుగా నిర్ణయించారు. అంతేకాదు "మీరు బలహీనంగా ఉంటే, డ్రైవ్ చేయవద్దు. మీరు జీవితాలతో జూదం ఆడుతున్నారు. మద్యం, గంజాయి, చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాలు లాంటి వాహనాన్ని సురక్షితంగా నడపగల మీ సామర్థ్యాన్ని దెబ్బతీసే ఏదైనా పదార్థం మన రోడ్లపై మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టివేస్తుంది." దీన్ని సహించ బోము అని కాంట్రా కోస్టా కౌంటీ జిల్లా న్యాయవాది డయానా బెక్టన్ తీవ్రంగా హెచ్చరించారు.ఇదీ చదవండి: IndiGo Crisis: హద్దే లేదు రారమ్మంటున్న ఎయిరిండియా -
ముషీరాబాద్ డివిజన్లో దారుణం..
సాక్షి, హైదరాబాద్: నగరంలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. ముషీరాబాద్ డివిజన్లో ఓ యువతి తన ఇంట్లో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బౌద్ధనగర్ పరిధిలోని బాపూజీ నగర్ పవిత్ర(17) అనే యువతి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది. సోమవారం మధ్యాహ్నా సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ యవకుడు ఇంట్లోకి దూరి కత్తితో పొడిచి చంపేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఘటనా స్థలానికి భారీగా జనం చేరుకుంటుండగా.. పోలీసులు వాళ్లను చెదరగొట్టారు. పలు కోణాల్లో కేసును దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే..మేనబావ పనే..!పవిత్రను కిరాతకంగా హత్య చేసింది ఆమె మేన బావే ఉమాశంకరేనని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లికి నిరాకరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కన్నీళ్లు పెడుతున్నారు. టైల్స్ పనిచేసే ఉమా శంకర్ తాగుబోతు కావడంతో పెళ్లికి ఒప్పుకోలేదని.. దీంతో కక్ష పెంచుకొని ఉన్మాదిగా ఈ ఘోరానికి పాల్పడ్డారని తల్లిదండ్రులు అంటున్నారు. ఘటన స్థలంలో ఉమాశంకర్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వంటగదిలో ఉన్న చాకును నేరానికి ఉపయోగించినట్లు ధృవీకరించుకున్నారు. బంధువుల ఫిర్యాదు నేపథ్యంలో పరారీలో ఉన్న నిందితుడి కోసం వారాసిగూడ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. -
భారీగా గంజాయి పట్టివేత
సాక్షి, ఢిల్లీ: రాజధాని విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. మత్తుపదార్థాలను తరలిస్తున్న ఇద్దరిని అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గంజాయి సీజ్ చేశారు. పట్టుకున్న విదేశీ గంజాయి విలువ దాదాపు రూ. 15 కోట్లు ఉంటుందని తెలిపారు.గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న ఫలితం లేకుండా పోతుంది. అధికారులు ఎంతగా కట్టడి చేసినప్పటికీ నిందితులు ఎదో రకంగా మత్తు పదార్థాల స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో మరోసారి భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు విదేశీ గంజాయి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు వారిని పట్టుకున్నారు. కాగా గతంలోనూ ఢిల్లీలో ఎయిర్ ఫోర్టులో పెద్ద మెుత్తంలో గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన స్మగ్లర్ల నుంచి కస్టమ్స్ అధికారులు దాదాపు రూ.47 కోట్ల విలువైన గంజాయి సీజ్ చేశారు. -
మంచు గడ్డలా ప్రియురాలి మృతదేహం : ప్రియుడు ఎంత పనిచేశాడు
వింటర్ చైల్డ్, పర్వత మనిషి తనకు తాను గర్వంగా అభివర్ణించుకున్న ఒక పర్వాతారోహకురాలు అనూహ్య పరిస్థితుల్లో కన్ను మూసింది. ఈ ఘటన పర్వతారోహకుల ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ విషాదానికి ఆమె ప్రియుడే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు ఏం జరిగిందంటే..కెరిస్టీన్ గుర్ట్నర్ అనే33 ఏళ్ల ఆస్ట్రియన్ మహిళ 39 ఏళ్ల ప్రియుడు థామస్ ప్లాంబర్గర్తో ఎత్తైన శిఖరం గ్రాస్గ్లాక్నర్ను అధిరోహించారు. థామస్ అనుభవజ్ఞుడైన గైడ్ కూడా. ఈ జంట అనుకున్న దానికంటే రెండు గంటలు ఆలస్యంగా ఆ అవరోహణను ప్రారంభించారు. -20°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు హరికేన్-పవర్ విండ్స్ లాంటి తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. గుర్ట్నర్ అలసిపోయిన గుర్ట్నర్ 150 అడుగుల దిగువన దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అయితే ఆమెను గైడ్ చేసి సాయం చేయాల్సిన ప్లాంబర్గర్ నిర్లక్ష్యంగా వదిలేశాడు. అత్యవసర దుప్పట్లు లేదా బివౌక్ సంచిని ఉపయోగించలేదని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. కొన్ని గంటల తరువాత గానీ రెస్క్యూ సర్వీసులను సంప్రదించలేదు. పైగా మొదటి కాల్ తర్వాత తన ఫోన్‌ను సైలెంట్లో పెట్టుకున్నాడు. దూర నుంచి ఒక హెడ్టార్చ్తప్ప ఇంకేమీ వెబ్ క్యామ్‌లో కనిపించలేదు.మరోవైపు తీవ్రమైన గాలుల కారణంగా మరుసటి రోజు ఉదయం దాకా రెస్క్యూ బృందాలు గుర్ట్నర్ను చేరుకోలేకపోయాయి. అప్పటికే ఆమె చనిపోయిందని గుర్తించారు. దీంతో ప్లాంబర్గర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.స్నేహితురాలిలా కాకుండా, ఆల్పైన్ హై-ఎలిట్యూడ్ టూర్లతో ఇప్పటికే చాలా అనుభవమున్న వ్యక్తిగా, టూర్‌ను ప్లాన్ చేశాడు కాబట్టి,బాధ్యతాయుతమైన గైడ్‌గా వ్యవహరించాలని ఇన్స్బ్రక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం పేర్కొంది. తీవ్ర నిర్లక్ష్యంతో నరహత్యకు పాల్పడ్డాడని, దోషిగా తేలితే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు దురదృష్టవశాత్తూ జరిగినవిషాదకరమైన ప్రమాదమని ప్లాంబర్గర్ న్యాయవాది వాదిస్తున్నాడు. ఈ కేసును 2026, ఫిబ్రవరి 19న, ఇన్స్బ్రక్ ప్రాంతీయ కోర్టులో విచారించ నున్నారు. గుర్ట్నర్ కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆన్లైన్ స్మారక పేజీని ఏర్పాటు చేశారు. అద్భుతమైన మహిళ అంటూ కెర్స్టిన్ గుర్ట్నర్కు అనేకమంది నివాళులర్పించారు. పలు సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. -
HYD: రియల్టర్ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రియల్టర్ దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి వెంకటరత్నం అనే వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. మల్కాజ్‌గిరిలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్న సాకేత్ కాలనీ ఫోస్టర్ స్కూల్ సమీపంలో సోమవారం ఉదయం రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంను దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. స్కూటీపై వెళ్తున్న వెంకటరత్నంను వెంబడించిన గుర్తుతెలియని వవ్యక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి చంపారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే, వెంకటరత్నంపై ధూల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ నమోదై ఉన్నట్లు గుర్తించారు. జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఆయనను ప్రత్యర్ధులే చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నగరంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. పట్టపగలే హత్యలు, దోపిడీలు జరుగుతుండటంతో ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు. -
అయ్యో పాపం! పుట్టిన వారానికే అనాథైన శిశువు
శ్రీనివాసపురం: పుట్టిన వారానికే పసిగుడ్డు అనాథ అయిన హృదయవిదారక ఘటన కర్ణాటకలోని కోలారు జిల్లా ఉప్పరపల్లిలో ఆదివారం జరిగింది. అస్సాం నుంచి కూలీ పనుల కోసం వలస వచ్చిన ఫరీజా(22), రెహమాన్(28) స్థానికంగా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారంలో 15 రోజుల కిందట చేరారు. వారం క్రితం ఫరీజా ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం శిశువు గట్టిగా ఏడుస్తుండడం గమనించిన స్థానికులు వెళ్లి చూడగా.. ఇంట్లో భార్యాభర్తలు శవాలై పడి ఉన్నారు. పక్కనే పురుగుల మందు సీసా ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం శ్రీనివాసపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. -
ఖరీదైన ఫోను కోసం గొడవ.. బోరు బావిలో దూకి టీనేజర్ ఆత్మహత్య
కచ్: సెల్ ఫోన్ విషయమై తండ్రితో గొడవపడిన ఓ టీనేజర్ బోరుబావిలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గుజరాత్‌లోని కచ్ జిల్లా భుజ్ తాలుకాలో ఘటన చోటుచేసుకుంది. జార్ఖండ్‌కు చెందిన ఓ కుటుంబం కుక్మా గ్రామంలోని ఫాంహౌస్‌లో ఉంటోంది. ఆ కుటుంబానికి చెందిన రుస్తొమ్ షేక్(17) శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఖరీదైన సెల్‌ఫోన్ విషయంపై తండ్రితో గొడవపడ్డాడు. చేతిలోని సెల్‌ఫోన్‌ను విసిరి పారేసి, దగ్గర్లో ఉన్న పడావు పడిన బోరు బావి వద్దకు చేరుకున్నాడు. దానిపైన అడ్డుపెట్టిన బండరాయిని తొలగించి అమాంతం లోపలికి దూకాడు. భూమికి రెండున్నర అడుగుల ఎత్తులో, అడుగున్నర వెడల్పున్న ఆ బావి లోతు 140 అడుగులు. సమాచారం అందడంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఊపిరి అందక రుస్తొమ్ కేకలు వేస్తుండటంతో లోపలికి ఆక్సిజన్‌ను పైపుల ద్వారా పంపించారు. వెంటనే సహాయక చర్యలను మొదలుపెట్టారు. ఎట్టకేలకు అతడిని అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో వెలుపలికి తీయగలిగారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆత్మహత్యగా కనిపిస్తున్నప్పటికీ ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కులం కాటుకు ఎంటెక్ విద్యార్థిని బలి
ఒంగోలు టౌన్: కులం కాటుకు మరో యువతి బలైంది. ప్రేమిస్తున్నప్పుడు అడ్డురాని కులం పెళ్లి చేసుకోవడానికి అడ్డయింది. దాంతో ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి సూసైడ్ నోట్ ప్రకారం వివరాలివీ.. ఒంగోలు నగరంలోని కబాడిపాలెంకు చెందిన మైరాల నళిని, మహేంద్ర నగర్‌కు చెందిన సింగోలు శ్రీనివాస్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు. నీవు లేకపోతే బతకలేనని చెప్పిన శ్రీనివాస్ నళినిని అన్ని విధాలా వాడుకున్నాడు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడు. నీ కులం వేరు నా కులం వేరు.. ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోవడంలేదంటూ ఫోన్ కట్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో శ్రీనివాస్‌తో మాట్లాడదామని శనివారం అతడి ఇంటికి వెళ్లింది. ‘శ్రీనివాస్ మాలలో ఉన్నాడు.. ఇంట్లోకి రావద్ద’ని అతని తల్లిదండ్రులు నళినిని బయట నుంచే పంపించేయడంతో ఇక శ్రీనివాస్‌తో తన పెళ్లి జరగదని ఆందోళనకు గురైన నళిని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించింది. ఆత్మహత్యకు ముందు బాధితురాలు రాసిన రెండు పేజీల సూసైడ్ నోట్ చూపరులను కలచివేస్తోంది. దళిత సామాజికవర్గానికి చెందిన నళిని ఎంటెక్ చదివింది. తండ్రి దేవదానానికి నలుగురు ఆడపిల్లలు ఉండగా వారిలో ముగ్గురికి వివాహమైంది. నళిని మూడో సంతానం. వన్ టౌన్ సీఐ నాగరాజు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు ఆరా తీశారు. దళిత హక్కుల సంఘం నాయకులు నీలం నాగేంద్రం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. నళిని మృతికి కారణమైన శ్రీనివాస్ మీద కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!
హైదరాబాద్: గోవాకు వెళ్లిన ఓ జంట కలిసి ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలను రహస్యంగా తీసి రూ.30 లక్షలు డిమాండ్ చేస్తున్న గోవాకు చెందిన ఓ వ్యక్తిపై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం..సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డకు చెందిన ఓ మహిళ (35) తన వివాహం కాకముందు 2023లో శ్రీనాథరావు అనే వ్యక్తితో కలిసి గోవాకు వెళ్లింది. వీరికి గోవాలోని యశ్వంత్ (40) అనే వ్యక్తి వసతితో పాటు ఇతర ఏర్పాట్లను చేశాడు. అదే సమయంలో ఆ జంట కలిసి ఉన్నప్పటి వీడియోలను రహస్యంగా తీశాడు. ఈ వీడియోలను భద్రపరిచిన యశ్వంత్ తాజాగా శ్రీనాథరావుకు ఫోన్ చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. తనకు రూ.30 లక్షలు ఇవ్వాలని, లేనిపక్షంలో వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. ఇదిలా ఉండగా సదరు మహిళకు గత ఏడాది వేరొకరితో పెళ్లి జరిగింది. ఈ క్రమంలో తనకు వచ్చిన బెదిరింపుల విషయాన్ని శ్రీనాథరావు ఆ మహిళ దృష్టికి తీసుకువచ్చాడు. భయాందోళనకు గురైన బాధితురాలు సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు యశ్వంత్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని గోవాకు పంపినట్లు పోలీసులు తెలిపారు. -
స్పా ముసుగులో వ్యభిచారం
నెల్లూరు(క్రైమ్): నగరంలోని మూడు స్పా సెంటర్లపై ఆకస్మిక దాడులను పోలీసులు శనివారం చేపట్టారు. పది మంది యువతులతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. యువతులను హోమ్‌కు తరలించారు. పోలీసుల వివరాల మేరకు.. నగరంలోని పలు స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు, క్రాస్ మసాజ్‌లు జరుగుతున్నాయని ఎస్పీ అజిత వేజెండ్లకు సమాచారమొచ్చింది. ఆమె ఆదేశాల మేరకు నిప్పో సెంటర్లోని ఎవిరీ డే సెలూన్ స్పా సెంటర్‌పై దాడి చేశారు. ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకొని వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిర్వాహకుడు మహేష పై కేసు నమోదు చేశారు. ⇒బాలాజీనగర్ సమీపంలోని జగదీష్ నగర్లో గల యూనిక్స్ సెలూన్ స్పాపై దాడి చేసి ముగ్గురు యువతులు, ఒక విటుడ్ని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిర్వాహకుడు సు«దీర్పై కేసు నమోదు చేశామని బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు తెలిపారు. ⇒ రామలింగాపురంలోని వీఐపీ స్పాపై దాడి చేసి ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకొని నిర్వాహకురాలు కృష్ణవేణిపై కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ చెప్పారు. పోలీసుల దాడులతో పలువురు నిర్వాహకులు స్పా సెంటర్లకు తాళాలు వేసి పరారయ్యారు. నగర ఇన్చార్జి డీఎస్పీ గిరిధర్ పాల్గొన్నారు. -
పెళ్లైన నెల రోజులకే నవ వరుడు ఆత్మహత్య
అనంతపురం జిల్లా: ఏడడుగుల బంధంతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాల్సిన యువకుడికి ఏం కష్టమొచ్చిందో ఏమో పెళ్లైన 33 రోజులకే జీవితంపై విరక్తి చెంది శెనగ పంటకు వాడే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల మేరకు.. అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరు గ్రామానికి చెందిన జయరాం నాయుడుకు శరత్ కుమార్ నాయుడు(23), లోకేష్ కుమార్ నాయుడు అనే ఇద్దరు కుమారులు. శరత్ కుమార్ నాయుడు మరో వ్యక్తితో కలిసి కొంత కాలంగా బెంగళూరులో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు లోకేష్ కుమార్ నాయుడు నగరూరులో తమ వ్యవసాయ తోటల్లో తండ్రికి చోదోడు వాదోడుగా ఉంటున్నాడు. గత నెల 2, 3వ తేదీల్లో బళ్లారి జిల్లాలోని సుగ్గేనహళ్లి కొట్టాల గ్రామానికి చెందిన సుస్మితతో శరత్ కుమార్ నాయుడికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. 10 రోజుల క్రితం తన భార్య సుస్మితను నగరూరు గ్రామంలో తమ ఇంటి వద్ద ఉంచి శరత్‌కుమార్ బెంగళూరు వెళ్లాడు. ఈ నెల 3వ తేదీన సుస్మిత తన తల్లిదండ్రులతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఏం కష్టం వచ్చిందో కానీ.. శుక్రవారం బెంగళూరు నుంచి వచ్చిన శరత్‌కుమార్ తాడిపత్రి మీదుగా నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో ఉన్న తన స్నేహితుడు హరీష్ ఇంటికి వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో సిమెంట్ ఫ్యాక్టరీకి హరీష్ వెళ్లిన తర్వాత ఇంటిలో ఉన్న శరత్ కుమార్ నాయుడు తన సెల్ఫోన్లో భార్యతో సుమారు గంటసేపు మాట్లాడాడు. 9 గంటల తర్వాత తాను శెనగ గింజలకు వేసే క్రిమిసంహారక మాత్రలు మింగానని శరత్‌కుమార్ హరీష్‌కు ఫోన్ చేశాడు. వెంటనే గదికి వచ్చిన హరీష్ విలవిలలాడుతున్న శరత్‌కుమార్ నాయుడును ఓ వాహనంలో తాడిపత్రికి తరలించాడు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడ వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. శరత్‌కుమార్ నాయుడిని పరీక్షించిన డాక్టర్లు ఇక లేడని తెలిపారు. అనంతపురానికి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు మృతి చెందిన శరత్‌కుమార్ నాయుడిని చూసి కన్నీటి పర్యంత మయ్యారు. శనివారం ఉదయం సమాచారం అందుకున్న మృతుడి భార్య సుస్మిత తన తల్లిదండ్రులతో అనంతపురానికి వచ్చి ఆసుపత్రిలో విగత జీవిగా ఉన్న భర్తను చూసి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. -
మిత్రుల కళ్ల ముందే.. రైలుకు ఎదురెళ్లి..
సికింద్రాబాద్: ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు మిత్రుల కళ్లెదుటే రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కె.కోటేశ్వరరావు చెప్పిన వివరాల ప్రకారం.. సైనిక్‌పురి శివనగర్ కాలనీకి చెందిన విజయభాస్కర్ కుమారుడు రవిశంకర్ (30) ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. మరో కంపెనీలో ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ ఉద్యోగం దొరకలేదు. దీంతో మనస్తాపానికి గురైన రవిశంకర్ శుక్రవారం రాత్రి 9 గంటలకు నేరేడ్మెట్లోని తన స్నేహితుడు శ్రీధర్ ఇంటికి వెళ్లి తనకు ఉద్యోగం దొరకడం లేదని ఆవేదనకు గురయ్యాడు. ఆ తర్వాత ఇరువురు కలిసి అదే కాలనీలో నివసించే మరో మిత్రుడు సాయిప్రశాంత్ ఇంటికి వెళ్లారు. అక్కడికి శైలేష్ జగన్ అనే మరో ఇద్దరు మిత్రులు వచ్చి రాత్రి 12.30 గంటల వరకు కలిసి మాట్లాడుకున్నారు. ఈ సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన రవిశంకర్‌ను ఓదార్చారు. అర్దరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత రవిశంకర్‌ను అతడి ఇంట్లో దింపి వచ్చేందుకు మిత్రులు అందరు ద్విచక్ర వాహనాలపై బయలుదేరారు. మార్గంమధ్యలో వాజపేయినగర్ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద గేట్ పడింది. దీంతో ద్విచక్ర వాహనాలను నిలిన స్నేహితులు గేట్ తెరిచే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో మిత్రుడి ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న రవిశంకర్ ఉన్నఫలంగా దిగిపోయి మిత్రులు చూస్తుండగానే రైలు పట్టాలపైకి చేరుకున్నాడు. అదే సమయంలో వేగంగా వచ్చినన రైలు ఢీ కొట్టిన ప్రమాదంలో అతడి రెండు కాళ్లు తెగిపోయాయి. అంబులెన్స్‌ను రప్పించిన మిత్రులు రవిశంకర్‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు. ఉద్యోగం రావడం లేదని, ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి తప్పు పని చేశానని కొద్ది రోజులుగా రవిశంకర్ మనస్తాపానికి గురవుతున్నట్లు అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కాంగ్రెస్ నేత హత్య
బనశంకరి: చిక్కమగళూరు జిల్లా సఖరాయపట్టణంలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవలో గ్రామపంచాయతీ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు గణేశ్గౌడ (38) హత్యకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి కల్కురుడేశ్వర వద్ద కారులో వెళ్తుండగా సంజయ్, మిథున్ అనే ఇద్దరు బైక్‌తో అడ్డుకుని కొడవలితో దాడిచేసి చంపారు. నిందితులు భజరంగదళ్ కార్యకర్తలని తెలిసింది. సఖరాయపట్టణలో పోలీస్ బందోబస్తు ఏర్పాటైంది. దుండగుల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ విక్రమ్ ఆమ్టె తెలిపారు. ఇద్దరు నిందితులు కూడా ఆసుపత్రిలో చేరారని తెలిపారు. సంజయ్, భూషణ్, మిథున్‌తో పాటు ఐదుమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం: ఎమ్మెల్యే మృతదేహాన్ని ఎమ్మెల్యే ఆనంద్ సందర్శించారు. ఎమ్మెల్యే ఆనంద్ బ్యానర్ తొలగింపు గురించి గొడవ జరిగి హత్యకు దారితీసిందని సమాచారం. కొద్దిరోజులుగా గణేశ్, మరో వర్గం మధ్య విభేదాలున్నాయి. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే హత్య జరిగేది కాదని ఎమ్మెల్యే ఆనంద్ ఆరోపించారు. -
అమ్మ మీ అల్లుడు తేడా.. సంసారానికి పనికి రాడు..!
బెంగళూరు: సంసారం చేయడం లేదు, అలాగే పురుషత్వ పరీక్షకు ఒప్పుకోకుండా పరారైన భర్త ఉదంతం నెలమంగలలో జరిగింది. బెంగళూరు హెసరఘట్ట నివాసి అయిన యువతి (26)కి, నెలమంగలకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అయిన వరునితో (30) గత జూన్ 9న వివాహం జరిగింది. మొటి రాత్రే భర్త అంటీముట్టనట్టుగా ప్రవర్తించినా, గొడవ కాకూడదని ఆమె అలాగే సంసారం నెట్టుకొస్తోంది. ఆరు నెలలు గడిచినా నెల తప్పలేదని అత్తమామలు ఆమెను వేధించడంతో ఆమె వైద్య పరీక్షలు చేయించుకుంది. అన్ని రిపోర్టులు మామూలుగా వచ్చాయి, అయితే భర్త మాత్రం పురుషత్వ పరీక్ష అనగానే ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. భర్త చేత పురుషత్వ పరీక్ష చేయించాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంసారం చేయడం లేదని అడిగినందుకు అదనపు కట్నం పేరుతో భర్త, అత్తమామలు వేధిస్తున్నారని కూడా ఫిర్యాదులో తెలిపింది. -
చంద్రబాబు ప్రభుత్వంలో.. రెచ్చిపోతున్న మృగాళ్లు
ధర్మవరం పట్టణంలో వరుసకు మేనమామ కావాల్సిన ఓ వ్యక్తి బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. మైనర్ గర్భం దాల్చడంతో అసలు విషయం బయట పడింది. తల్లి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సాకే నరసింహ అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం వెలుగు చూసింది.పుట్టపర్తి మండలం బత్తలపల్లి గ్రామంలో వరుసకు పెద్దనాన్న అయిన 60 ఏళ్ల వృద్ధుడు మద్యం మత్తులో 9వ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి యతి్నంచాడు. బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. ఈ ఘటన మూడు నెలల క్రితం వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు ప్రభుత్వంలో బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఒంటరిగా ప్రయాణించాలన్నా భయపడాల్సిన దుస్థితి నెలకొంది. ఇంట్లో ఉండాలన్నా .. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లినా తిరిగి వచ్చే వరకూ ఆలోచించాల్సిన పరిస్థితి. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిద్రావస్థలో ఉండటంతో అల్లరిమూకలు రాజ్యమేలుతున్నారు. అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితుల్లో 70 శాతం మంది మద్యం మత్తులోనే లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. 120కి పైగా పోక్సో కేసులు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కొత్త మద్యం పాలసీ తీసుకురావడంతో వీధి వీధిగా బెల్టు షాపులు వెలిశాయి. రాత్రింబవళ్లూ మద్యం అందుబాటులో ఉంటోంది. ఫూటుగా సేవించిన తర్వాత మత్తులో సైకోలుగా మారి బాలికలు, మహిళలపై లైంగిక దాడులు చేస్తున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నారులు నుంచి పండు ముసలి వరకూ బాధితులుగా ఉన్నారంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఏడాదిన్నర వ్యవధిలో సత్యసాయి జిల్లాలో అత్యాచార ఘటనలు దాదాపు 200 పైగా జరిగాయి. అలాగే 120 పైగా పోక్సో కేసులు నమోదు కావడంతో మహిళల రక్షణ ప్రశ్నార్థంగా మారింది. ఇక.. బయటికి రాని ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు కేసు తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారు కూడా ఉన్నారు. పోలీసుల నిర్లక్ష్యం.. బాలికలు, అమ్మాయిలు, మహిళలకు అల్లరి మూకల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. బయట ఒంటరిగా కనిపిస్తే చాలు లైంగిక వేధింపులకు దిగడం.. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ‘ఏం జరగలేదు కదా’ అని కేసు తీసుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. కేసులు నమోదు చేస్తే ‘మీకే నష్టం’ అంటూ బాధితులతో చెబుతుండటంతో వారికేం చేయాలో కూడా పాలుపోవడం లేదు. దీనికి తోడు నిందితులు సైతం బెదిరింపులకు దిగుతుండటంతో నమోదు కాని కేసుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. వీడియోల పేరుతో బెదిరింపులు మద్యం మత్తులో అఘాయిత్యాలకు పాల్పడిన తర్వాత పదే పదే బెదిరిస్తూ.. సదరు మహిళలపై సామూహికంగా వచ్చి వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. వీడియోలు ఉన్నాయంటూ బెదిరిస్తూ గ్యాంగ్ రేప్‌లకు పాల్పడుతుండటం సంచలనం రేపుతోంది. గంజాయి మత్తులో రోడ్డు పక్కన ఇంట్లోకి చొరబడి గ్యాంగ్‌రేప్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. రాప్తాడు, హిందూపురం నియోజకవర్గాల్లోనే ఇలాంటి ఘటనలు అధికంగా వెలుగు చూస్తుండటం గమనార్హం.మహిళలకు రక్షణ కరువైంది చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మహిళలకు రక్షణ కరువైంది. హోంమంత్రిగా ఓ మహిళ ఉన్నప్పటికీ కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. జిల్లాలో కూడా ఓ మహిళా మంత్రి ఉన్నారు. ఆమె దగ్గర పని చేస్తున్న అనుచరులు సైతం వేధింపులకు గురి చేస్తుండటం సిగ్గుచేటు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి నిందితులను శిక్షించాలి. – ఉషశ్రీచరణ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు -
విద్యార్థినికి అధ్యాపకుడి లైంగిక వేధింపులు
తిరుపతి సిటీ: విద్యార్థినిని అధ్యాపకుడు లైంగికంగా వేధించిన ఘటన తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో జరిగింది. ఒడిశాకి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినిని వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ కుమార్ లైంగిక వేధింపులకు గురిచేసి మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో విద్యార్థినితో డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉంటుండగా ఆ దృశ్యాలను ఆ విద్యార్థినిపై కన్నువేసిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ తన మొబైల్లో రికార్డు చేశాడు. అనంతరం ఆ వీడియోను విద్యార్థినికి పంపించి తన కోరిక తీర్చమని బెదిరించాడు. దీంతో తనను వేధించి గర్భవతిని చేసిన డాక్టర్ లక్ష్మణ్ కుమార్, వీడియో అడ్డుపెట్టుకుని తనను బెదిరిస్తోన్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై వీసీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై వీసీ, రిజిస్ట్రార్ ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. తమ కుమార్తెకు టీసీ ఇస్తే వెళ్లిపోతామని, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కమిటీకి బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు విద్యార్థినికి వర్సిటీ అధికారులు టీసీ ఇచ్చేసి డాక్టర్ లక్ష్మణ్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. వీడియో తీసి బెదిరింపులకు గురిచేస్తోన్న మరో అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై వర్సిటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
భార్య, బిడ్డను కడతేర్చిన భర్త
నరసరావుపేట రూరల్: భార్యతో పాటు ఏడు నెలల చిన్నారిని కాలువలోకి నెట్టి కడతేర్చాడు ఓ కసాయి భర్త. ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారని డ్రామా ఆడి బంధువులు, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసులు తమదైన శైలిలో విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం కొత్తపల్లికి చెందిన కందారపు శ్రీకాంత్‌కు, నాదెండ్లకు చెందిన త్రివేణికి రెండేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడు నెలల వయసుగల కుమారుడు శరత్ ఉన్నాడు. శ్రీకాంత్ పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషీయన్‌గా పనిచేస్తున్నాడు.త్రివేణి గతంలో నర్స్‌గా పనిచేసేది. వివాహం అనంతరం ఇంటికే పరిమితమైంది. శరత్‌కు అనారోగ్యంగా ఉండటంతో శుక్రవారం వైద్యం కోసం దంపతులు నరసరావుపేట తీసుకొచ్చారు. ఆస్పత్రిలో పరీక్షల అనంతరం త్రివేణి, శరత్‌ను బంధువులు ఇంట్లో వదిలి శ్రీకాంత్ డ్యూటీకి వెళ్లాడు. రాత్రి డ్యూటీ ముగిసిన అనంతరం 9.30 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై తమ స్వగ్రామం కొత్తపల్లికి బయలుదేరారు. ఏం జరిగిందో ఏమో కానీ త్రివేణి, శరత్ రావిపాడు సమీపంలోని ఎన్ఎస్పీ కాలువలో పడిపోయారని రాత్రి 10.30గంటల సమయంలో శ్రీకాంత్ బంధువులకు సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టగా ఇక్కుర్రు గ్రామం వద్ద త్రివేణి మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న రూరల్ సీఐ ఎంవి సుబ్బారావు, ఎస్ఐ కిషోర్ ఘటనా స్ధలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఎదురుగా వచి్చన కారు లైటింగ్‌కు రోడ్డు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పిందని, నిలువరించే ప్రయత్నంలో త్రివేణి, శరత్ నీటిలో పడ్డారని శ్రీకాంత్ పోలీసులకు తెలిపాడు. త్రివేణి మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించి శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా త్రివేణి మృతి విషయం తెలుసుకున్న బంధువులు ఏరియా ఆస్పత్రికి వచ్చారు. శ్రీకాంతే భార్య, బిడ్డను కడతేర్చాడని ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట పల్నాడు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వచ్చి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, కాలవలో గల్లంతైన శరత్ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. వివాహేతర సంబంధమే కారణమా? శ్రీకాంత్‌కు తన బంధువైన మరో అమ్మాయితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై శ్రీకాంత్, త్రివేణి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనిపై శుక్రవారం బంధువుల ఇంట్లో కూడా ఇద్దరూ ఘర్షణ పడినట్టు సమాచారం. కొత్తపల్లికి ద్విచ్రవాహనంపై బయలుదేరిన ఇద్దరి మధ్య కాలువ వద్ద తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే త్రివేణిపై దాడిచేయడంతో పాటు, ఏడు నెలల బిడ్డతో సహా ఆమెను కాలువలోకి నెట్టి ప్రమాదం జరిగిందని శ్రీకాంత్ డ్రామా ఆడినట్టు పోలీసులు తెలిపారు. -
తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం
సాక్షి, తిరుపతి: నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ వేధింపులు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినిని బెదిరించి గర్భవతిని చేశాడు. బాధిత విద్యార్థిని.. వైస్ ఛాన్సలర్‌కు ఫిర్యాదు చేసింది. కీచక ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ సస్పెండ్ చేస్తూ వీసీ ఆదేశాలు జారీ చేశారు.యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒడిశాకు చెందిన విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ కన్నేశారు. ఆ విద్యార్థినిని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నారు. విద్యార్థినితో లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలను రికార్డు చేసిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం.లక్ష్మణ్ కుమార్‌పై యూనివర్శిటీ సిబ్బంది.. తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ బాధిత విద్యార్థిని ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. కానీ ఆ విద్యార్థిని సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒడిశాకు వెళ్ళిపోయింది. -
ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ.. బడా మోసం
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఓ కుటుంబాన్ని ముగ్గురు వ్యక్తులు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ నమ్మబలికారు. వారి మాటలకు ఆ కుటుంబం ఆశపడింది. అయితే ఏడు లక్షలు ఇస్తేనే ఆ గుప్త నిధులను వెలికి తీస్తామని మోసగాళ్లు వారికి చెప్పారు. దాంతో వారి మాటలను నమ్మి బాధితులు ఏడు లక్షలు ముట్ట జెప్పారు. అనంతరం రోజులు గడుస్తున్నా గుప్త నిధులు బయటకు తీయకపోవడంతో వారు మోసపోయినట్టు బాధితులు గ్రహించారు. నిందితులు అప్పటికే పరారైనట్టు సమాచారం.వెంటనే బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురు మోసగాళ్లపై కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. -
ఐబొమ్మ కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు ఇమ్మడి రవిని కస్టడీకి తీసుకోకుండానే.. మరోసారి నాంపల్లి కోర్టును సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల ఇవాళ్టి నుంచి మూడు రోజలపాటు రవిని విచారణ జరపాల్సి ఉంది.. అయితే.. చంచల్‌గూడ్ జైలు నుంచి రవిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని సమాచారం. కోర్టు ఇచ్చిన మూడు రోజుల సమయం సరిపోదని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మరింత టైం కావాలని కోరుతూ అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించారు. మరికాసేపట్లో ఈ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లతో సినీ పైరసీకి పాల్పడినట్లు వైజాగ్‌కు చెందిన ఇమ్మడి రవిపై ప్రధాన అభియోగం నమోదైంది. ఈ క్రమంలో మరో నాలుగు కేసులూ నమోదు అయ్యాయి. అయితే రెండు విడతలుగా ఇప్పటికే రవిని 8 రోజులపాటు విచారణ జరిపారు సీసీఎస్ పోలీసులు. ఈ క్రమంలో.. నాలుగు కేసులకు సంబంధించి కస్టడీకి అనుమతించాలని పిటిషన్ వేశారు. అయితే.. ఇందులో ఒక కేసును తోసిపుచ్చిన కోర్టు.. మిగిలిన మూడు కేసులకు ఒక్కో రోజు చొప్పున మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. శనివారం నుంచి రవిని విచారించాలని ఆదేశించింది. గత విచారణలో రవి నుంచి సైబర్‌క్రైమ్ పోలీసులు కీలక సమాచారాన్నే సేకరించారు. అయితే కీలకమైన లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టాల్సి ఉంది. అందుకే మూడో విడత కస్టడీని అత్యంత కీలకంగా భావిస్తున్నారు. నిందితుడికి నిరీక్షణ తప్పదా?ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్ విచారణ కస్టోడియల్ ఎంక్వైరీ కారణంగానే ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల కస్టడీకి ఆదేశించిన సమయంలోనే నాంపల్లి కోర్టు బెయిల్ పిటిషన్ విచారణపై స్పష్టత ఇచ్చింది. సోమవారం ఎట్టి పరిస్థితుల్లో(మూడు రోజుల విచారణ ముగుస్తుంది కాబట్టి) విచారణ జరుపుతామని నిందితుడి తరఫు లాయర్‌కు స్పష్టం చేసింది. అయితే సైబర్ క్రైమ్ పోలీసుల కీలక నిర్ణయంతో ఈ పిటిషన్ విచారణ ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే.. నిందితుడు రవికి షాక్ అనే చెప్పొచ్చు. -
గంజాయి కేసులు పెడతామని బెదిరించారు
విజయవాడ లీగల్: పోలీసులు తనను అరెస్టుచేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలు ఏవీ పాటించకుండా అరెస్టుచేశారని కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఎ–9 నిందితుడు యర్రంశెట్టి రామాంజనేయులు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట ఫిర్యాదు చేశారు. హైవేల మీద ఏలూరు, భీమడోలు వంటి ప్రాంతాల్లో తిప్పారని.. ఒక హోటల్లో బంధించి, అర్ధరాత్రి 11 గంటల తర్వాత కళ్లకు గంతలు కట్టి అక్కడ నుండి మరో ప్రాంతానికి తీసుకెళ్లి తనను ఓ గదిలో బంధించి, కనీసం భోజనం, మంచినీరు కూడా ఇవ్వకుండా హింసించారని ఆయన చెప్పారు. గంజాయి కేసుతోపాటు అనేక కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తూ తప్పుడు స్టేట్మెంట్లు రికార్డు చేసుకుని బలవంతంగా కొన్ని కాగితాలపై తనతో సంతకాలు చేయించుకున్నారని రామాంజనేయులు ఆరోపించారు. అయితే, శుక్రవారం ఉ.11 గంటలకల్లా న్యాయస్థానంలో హాజరుపరచాల్సి ఉండగా, సా.3 గంటలకు న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్లు ఆయన తరఫు న్యాయవాది సత్యశ్రీ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. అంతకుముందు.. ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం రామాంజనేయులును ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు పోలీసులు హాజరుపరిచారు. విచారణాధికారి ఏసీపీ దామోదర్ నుండి వివరణ తీసుకోవాలని న్యాయమూర్తి పి. భాస్కరరావు ఆదేశాలు జారీచేస్తూ, రామాంజనేయులును ఈనెల 15 వరకు రిమాండ్ విధించారు. అనంతరం ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.బలవంతంగా తీసుకెళ్లారు: మరోవైపు.. రామాంజనేయులును గురువారం ఉ.11 గంటలకు కేసరపల్లిలోని ఆయన నివాసానికి కొందరు వ్యక్తులు వచ్చి తాము పోలీసులమని, కేసు విచారణ నిమిత్తం రావాల్సిందిగా అతనిని ఓ ప్రైవేటు వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, వచ్చిన వారి సమాచారం తమకు ఇవ్వకుండా కిడ్నాప్ తరహాలో పట్టుకెళ్లారని వారు చెప్పారు. -
లాడ్జిలో తల్లీకొడుకుల ఆత్మహత్య
సింహాచలం: అడవివరంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో తల్లీకొడుకులు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గోపాలపట్నం సీఐ ఎల్.ఎస్.నాయుడు తెలిపిన వివరాలివి.. నగరంలోని గాజువాకకు చెందిన కుడుపూడి నీలావతి (60), ఆమె కుమారుడు కుడుపూడి గయప్పాంజన్ (40) శుక్రవారం అడవివరం వచ్చారు. వారు స్థానిక పోస్టాఫీసు వీధిలోని సిరిచందన కల్యాణమండపం అనుబంధ గదుల్లో(లాడ్జి) ఒకటి అద్దెకు తీసుకున్నారు. వారు గదిలోకి వెళ్లిన తర్వాత ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో, అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది గోపాలపట్నం పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్న లా అండ్ ఆర్డర్ సీఐ ఎల్.ఎస్.నాయుడు, సిబ్బంది గది తలుపులు తెరిచి చూడగా.. తల్లీకొడుకులు ఉరి వేసుకుని విగతజీవులుగా కనిపించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డుల ఆధారంగా మృతులు పాతగాజువాక శ్రామికనగర్‌కు చెందినవారని, వారిని తల్లీకొడుకులుగా పోలీసులు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కాగా, వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గయప్పాంజన్ టీసీఎస్‌లో పనిచేస్తున్నాడు. ఆయన భార్య 2023లో నాంపల్లి స్టేషన్లో గయప్పాంజన్‌పై కేసు పెట్టింది. -
TN: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ వాసుల దుర్మరణం
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామనాథపురం జిల్లాలో రెండు కార్లు ఢీ కొట్టడంతో ఐదుగురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాకు చెందిన వాళ్లు అని పోలీసులు ప్రకటించారు. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం తర్వాత రామేశ్వరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. శనివారం ఉదయం కీళకరై ఈసీఆర్ వద్ద వీళ్లు ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న కారును వేగంగా వచ్చి బలంగా ఢీ కొట్టింది. మృతుల్లో నలుగురు ఏపీకి చెందినవారని పోలీసులు తెలిపారు. డ్రైవర్ ముస్తాక్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. రెండు కార్లలోనూ అయ్యప్ప భక్తులు ఉన్నారని చెప్పారు.గాయపడిన వాళ్లకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మృతులు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస, మరుపల్లి కి చెందిన వారిగా గుర్తించారు. శబరిమల దర్శనం ముగించుకుని రామేశ్వరం.. అక్కడి నుంచి వస్తుండగా ఈ దుర్ఘటనలో ప్రాణాలు పొగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు. మృతులు వీళ్లే.. 1) వంగర రామక్రిష్ణ(51) కొరప కొత్తవలస2)మార్పిన అప్పలనాయుడు(33) కొరప కొత్తవలస 3)మరాడ రాము(50) కోరప కొత్తవలస4)బండారు చంద్ర రావు(35) మరుపల్లి గ్రామం, గజపతినగరం మండలంమృతుల కుటుంబాలకు తమిళనాడు పోలీసులు ఇప్పటికే సమాచారం అందించారు. పోస్ట్‌మార్టం పూర్తైన తర్వాత మృతదేహాలను అప్పగిస్తామన్నారు. మరోవైపు.. ఈ ఘోర ప్రమాదంతో మృతుల స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.


