రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం | Three youths die in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం

Feb 18 2026 5:38 AM | Updated on Feb 18 2026 5:38 AM

Three youths die in road accident

సాక్షి,పాడేరు: రోడ్డు ప్రమాదంలో ముగ్గు­రు గిరిజన యువకులు మృతి చెందిన ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది. పాడేరు మండలం వంతరపాడు గ్రా­మా­నికి చెందిన గెమ్మెలి రమేష్(25), హుకుంపేట మండలం గొందిరాపకు చెందిన రేగం సూర్యప్రకాష్(28), తడిగిరి పంచాయతీ ముల్లుమెట్ట గ్రామానికి చెందిన సీదరి పౌలు(18) సోమవారం మత్స్యగుండం జాతరకు వెళ్లారు. తిరిగి ముగ్గురు బైక్‌పై బయలుదేరారు. రమేష్‌ వాహనాన్ని నడుపుతుండగా మిగిలిన ఇద్దరు వెనుక కూర్చున్నారు. 

గుత్తులపుట్టు సంతబయలు దగ్గరలోని మలుపు వద్దకు వచ్చేసరికి బైక్‌ అదుపు తప్పి దూసుకుపోయి విద్యుత్‌ స్తంభాల ప్రాంతంలో ప్రహరీని ఢీకొట్టింది. ఈ ఘటనలో రేగం సూర్యప్రకాష్‌ అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన ఇద్దరూ తీవ్రగాయాలతో రోడ్డుపై పడి ఉన్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన యువకులు 108కు సమాచారం ఇవ్వగా క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా..గెమ్మెలి రమేష్‌ మృతి చెందాడు. 

సీదరి పౌలు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పాపినాయుడు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. 

Advertisement
 
Advertisement
Advertisement