Guntur
-
Vishakha: సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
విశాఖ,సాక్షి : విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గోడ కుప్పకూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ విషాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
జనసేన కార్యాలయం వద్ద పీఈటీ అభ్యర్థుల నిరసన
మంగళగిరి టౌన్: మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) అభ్యర్థులు మంగళవారం నిరసన చేపట్టారు. డీఎస్సీలో పీఈటీ పోస్టుల భర్తీ లేకపోవడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ హామీ ఇచ్చి మోసం చేశారని, మీరైనా న్యాయం చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. డీఎస్సీలో ఖాళీ పీఈటీ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. కాన్వాయ్‌లో పవన్ కళ్యాణ్ వస్తున్న సమయంలో పెద్దగా నినాదాలు చేసినా పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ప్రకృతి సాగు.. లాభాలు బాగు
కొరిటెపాడు(గుంటూరు): భూతాపం తగ్గాలన్నా.. భూసారం పెరగాలన్నా.. తినే ఆహారం ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నా రైతులంతా తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం చేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. రసాయనిక ఎరువుల వలన భూసారం క్రమేపీ తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో ఆ భూములను మళ్లీ సారవంతంగా చేయాలంటే రైతులంతా ప్రకృతి వ్యవసాయం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు ఖరీఫ్ సీజన్‌కు ముందే నవధాన్యాల సాగు చేయాలి. ప్రకృతి వ్యవసాయం సిబ్బంది సుమారు 12 కిలోల బరువున్న నవధాన్యాల విత్తనాల కిట్లను రూ.1200లకు అందజేస్తున్నారు. ఈ కిట్‌లో 30 రకాల విత్తనాలు ఉంటాయి. ఇలా మిశ్రమ విత్తనాల సాగువల్ల భూమిలో జీవ వైవిధ్యం పెరిగి భూమి సారవంతం అవుతోంది. గుంటూరు జిల్లాలో గతేడాది 25,475 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం సాగు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 50 వేల ఎకరాల్లో సాగు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. సాగు చేసే విధానం ఇలా.. వేసవిలో దుక్కి దున్ని తొలకరి వర్షాలు పడగానే పొలంలో నవ ధాన్యాలు చల్లు కోవాలి. ఇవి వేసిన 45 రోజుల వ్యవధిలో పూత దశలో దమ్ము చేయాలి. పశువుల మేతకు ఇది ప్రయోజనం. నీటి వసతి కలిగిన ప్రాంతాల్లో వేసవిలో సాగు చేయడం లాభదాయకం. చల్లుకుని కలియదున్నుకోవచ్చు. రసాయన ఎరువులతో తగ్గుతున్న భూసారం ప్రకృతి వ్యవసాయంతో సమస్యలకు చెక్ గుంటూరు జిల్లాకు 52 వేల కిట్లు పంపిణీకి లక్ష్యం నవధాన్యాల సాగుతో ప్రయోజనాలు ఇవే... పొలంలో నవధాన్యాలను కలియదున్నితే భూసారం పెరుగుతుంది. మొక్కలకు నత్రజని, సూపర్ ఫాస్పేట్ అదనంగా అందుతుంది. జింకు, మాంగనీస్, ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మధాతువులు పంటకు చేకూరుతాయి. నేలలో కరగని మూలకాలను పంటకు అనుకూలంగా మారుస్తాయి. నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది. వానపాముల ఉత్పత్తికి దోహదపడుతుంది. నేల భౌతిక స్థితి మెరుగుపడి, భూమి గుల్లగా మారి నేలలోనికి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. నేలలో సేంద్రీయ పదార్ధం వేయడంతో సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. నేలలో సారం పెరగడమే కాక నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకొని ఉత్పాదకత సామర్ధ్యం పెరుగుతుంది. నేలలో లభ్యం కాని రూపంలో ఉన్న అనేక పోషకాలను లక్ష్య రూపంలోనికి మారుస్తాయి. కలుపు మొక్కలు పెరగకుండా నివారించవచ్చు. భాస్వరం, గంధకం వంటి పోషకాల లభ్యత గణనీయంగా పెరుగుతుంది. నాణ్యమైన గింజలు ఉత్పత్తి అవుతాయి. దిగుబడి రెట్టింపు అవుతుంది. -
న్యాయమూర్తుల పరిచయ కార్యక్రమం
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టులో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ అండ్ లేబర్ న్యాయమూర్తి బి.రాములు, చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ (పోక్సో కోర్టు) న్యాయమూర్తి షమీ పర్వీన్ సుల్తానా బేగంల పరిచయ కార్యక్రమం జిల్లా కోర్టు ప్రాంగణంలో మంగళవారం జరిగింది. కార్యక్రమంలో అన్ని కోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తి న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా కోర్టులోని వాహనాల పార్కింగ్ వసతులు సక్రమంగా ఉండేలా చర్యలు చేపడతామన్నారు. జిల్లా కోర్టులోని అన్ని కోర్టులకు కావలసిన వసతులను సమకూర్చి, కోర్టులో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఉన్న అన్ని కోర్టులకు కావలసిన వసతులను సమకూర్చేందుకు చర్యలు చేపడతామన్నారు. జిల్లా కోర్టులో మహిళా న్యాయవాదులకు బార్ అసోసియేషన్‌లో కావలసిన ఏర్పాట్లను సాధ్యమైనంత మేర సమకూర్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని పురాణం కల్యాణ లేడీ రిప్రజెంటివ్ బార్ అసోసియేషన్‌కు 30 కుర్చీలు అందజేశారు. క్రమంలో బార్ కౌన్సిల్ సభ్యుడు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి 50 కుర్చీలకు కావలసిన నగదు చెక్కును ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యంగళ శెట్టి శివ సూర్యనారాయణకు అందజేశారు. బార్అసోసియేషన్ అధ్యక్షుడు యంగళశెట్టి శివసూర్యనారాయణ మాట్లాడుతూ బార్ అండ్ బెంచ్ రిలేషన్‌కు కావలసిన సహాయ సహకారాలు అందించటానికి న్యాయవాదులు తరఫున హామీ ఇచ్చారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ట్రక్కు డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి అనుమతులు
నరసరావుపేట: పల్నాడు జిల్లా కేంద్రంలో స్థానిక రవాణా శాఖ ఆర్టీవో కార్యాలయం పక్కనే ఏర్పాటుచేసిన ట్రక్కు డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి రోడ్డు సేఫ్టీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరుతో జిల్లా రవాణా శాఖ అధికారి సంజయకుమార్ అనుమతులు మంజూరు చేశారని ఆ శిక్షణ సంస్థ మేనేజింగ్ పార్టనర్ కనకదుర్గ పద్మజ వెల్లడించారు. అనుమతి పత్రాన్ని మంగళవారం జిల్లా రవాణా శాఖ అధికారి జి.సంజీవ్‌కుమార్, ఎంవీఐ శివనాగేశ్వరరావు, వంశీల చేతుల మీదుగా తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ వెనుకబడిన పల్నాడు జిల్లా ప్రాంతంలో యువతకు స్వయం ఉపాధి కోసం కారు, హైడ్రాలిక్‌తో కూడిన ట్రక్ డ్రైవింగ్ (ట్రాన్స్‌పోర్టు వాహనం) శిక్షణ, లైసెన్స్, ఉపాధి ప్రాతిపదికన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో జిల్లాలో చదువులేని యువతకు ఉపాధి కొరకు డ్రైవింగ్ శిక్షణ ఇప్పిస్తామని, అదేవిధంగా రోడ్డుసేఫ్టీ ఎన్జీవో స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎస్సీ, ఎస్టీ యువకులకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇస్తామని తెలిపారు. స్వీకరించిన రోడ్డు సేఫ్టీ ప్రతినిధులు -
రైతుల్లో ఆసక్తి పెరిగింది..
ప్రకృతి వ్యవసాయంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఏటా ఈ వ్యవసాయం చేసే రైతుల సంఖ్య పెరుగుతోంది. ప్రకృతి వ్యవసాయంలో నవధాన్యాల సాగు ఎంతో మేలు. ఇది భూసారాన్ని పెంపొందిస్తోంది. రసాయనిక ఎరువుల ద్వారా రానురానూ భూసారం తగ్గిపోతోంది. ఈ ఖరీఫ్‌లో మరింతగా రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుని, ఆ మేరకు రైతులకు సూచనలు, సలహాలు ఇస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. –నున్నా వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి ఎంతో ప్రయోజనం ప్రకృతి వ్యవసాయంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. గత ఖరీఫ్‌లో గుంటూరు జిల్లాలో 30 వేల నవధాన్యాల కిట్లు పంపిణీ చేశాం. ఈ ఖరీఫ్‌లో 52 వేల కిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులు ప్రయోజనం పొందుతున్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా రైతుల్లో చైతన్యం తీసుకువస్తున్నాం. ఈ నవధాన్యాల సాగు ద్వారా 55 రకాల పోషకాలు భూమికి అందుతాయి. – కె.రాజకుమారి, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ● -
విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి
లక్ష్మీపురం: అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న సుభాష్ అనే విద్యార్థి మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్ తెలిపారు. స్థానిక బ్రాడీపేట ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుకోవాల్సిన విశ్వవిద్యాలయాల్లో వరసగా విద్యార్థులు మృతి చెందుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. విద్యార్థి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. విద్యార్థుల మృతుల ఘటనలపై కమిటీ చేసి విచారణ చేయాలని ఆయన కోరారు. విద్యార్థులు వరుసగా మరణిస్తున్నా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏమాత్రం స్పందించడం లేదన్నారు. విద్యార్థులకు వచ్చిన మార్కులను మాత్రం ప్రభుత్వం తాము సాధించిన ఘనతగా ప్రచారం చేసుకుంటూ విద్యార్థులు మరణాలకి వారి తమకేమాత్రం సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి ప్రైవేటు యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు షేక్ సమీర్, నగర కార్యదర్శి ఎ.యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. వర్సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.. లక్ష్మీపురం: రాజధాని అమరావతిలో వున్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థి మృతికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, సమగ్ర దర్యాప్తు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుందని జిల్లా కార్యదర్శి వై.నేతాజీ తెలిపారు. బ్రాడిపేటలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో వున్న ఎస్ఆర్ఎం వర్సిటీలో యాజమాన్యం వేధింపుల కారణంగా విద్యార్థి మృతిచెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్న నేపధ్యంలో దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. కనీసం చనిపోయిన విషయం తల్లితండ్రులకు సకాలంలో సమాచారం ఇవ్వకపోవడం యాజమాన్యం నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రైవేటు యూనివర్సిటీల్లో ఇటీవల కాలంలో విద్యార్థులు మృతి చెందిన పరిస్థితి ఉందని గుర్తు చేశారు. ఆ సందర్భంలో కూడా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయకపోవడం వల్ల ఇటువంటివి పునరావృతం అవుతున్నాయన్నారు. సంఘంటనలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీని వేసి సమగ్రంగా దర్యాప్తు చేయాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కమిటీ డిమాండ్ -
వైఎస్సార్ సీపీ శిలాఫలకం ధ్వంసం
పెదకాకాని: గుర్తు తెలియని వ్యక్తులు అగతవరప్పాడు గ్రామంలో వైఎస్సార్ సీపీ శిలాఫలకం ధ్వంసం చేసిన సంఘటన చోటు చేసుకుంది. పెదకాకాని మండలంలోని అగతవరప్పాడు ఏవీఎన్ కాలనీలో నిర్మించిన సీసీ రోడ్డు, సీసీ డ్రైన్‌ను 2024 జనవరి నెలలో ప్రారంభించారు. సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని అప్పటి ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు ఆవిష్కరించి ప్రారంభోత్సవం చేశారు. ఆ శిలాఫలకాన్ని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శిలాఫలకం ధ్వంసంపై పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకు వెళ్లినట్లు సర్పంచి పిట్టు శివకృష్ణారెడ్డి తెలిపారు. -
రసవత్తరంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు
దాచేపల్లి: రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు మంగళవారం రసవత్తరంగా జరిగాయి. ఆరుపళ్ల విభాగంలో జరిగిన పోటీలో ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం కాజీపురానికి చెందిన వేగనాటి ఓసూరరెడ్డి ఎడ్లజత 5వేల అడుగుల దూరం బండలాగి మొదటిస్థానంలో నిలిచింది. బాపట్ల జిల్లా పంగలూరు మండలం పంగలూరుకి చెందిన చిలుకూరి నాగేశ్వరరావు ఎడ్ల జత 4,952 అడుగుల దూరం బండలాగి రెండో స్థానం, ప్రకాశం జిల్లా అర్ధవీడుకి చెందిన సూర చైత్రరెడ్డి పూజితరెడ్డి ఎడ్ల జత 4,856 అడుగుల దూరం బండ లాగి మూడో స్థానం, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లికి చెందిన కావ్యనంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య ఎడ్ల జత 4,750 అడుగుల దూరం బండలాగి నాల్గవ స్థానం, పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్లకి చెందిన మేక అంజిరెడ్డి ఎడ్ల జత 4,358 అడుగుడుల దూరంబండలాగి ఐదవస్థానం, పల్నాడు జిల్లా గురజాల మండలం అంబాపురంకి చెందిన చుండు అప్పయ్యచౌదరి ఎడ్ల జత 4వేల అడుగుల దూరం బండలాగి ఆరో స్థానం, బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతవరానికి చెందిన పీవీఆర్ బుల్స్, పెడవల్లి బ్రదర్స్ 3,108 అడుగుల దూరం బండలాగి ఏడో స్థానంలో నిలిచాయి. విజేతలైన ఎడ్ల జతల రైతులకు దాతలు బహుమతులు, నగదు ప్రదానం చేశారు. పోటీలకు న్యాయనిర్ణేతగా గూడా శ్రీనివాసరావు వ్యవహరించారు. కమిటీ సభ్యులు కొప్పుల గిరి, యలమల నరేష్, అనిశెట్టి శ్రీనివాసరావు, మునగా నిమ్మయ్య, కానుకొల్లు ప్రశాంత్ తదితరులు పర్యవేక్షించారు. -
భర్తపై భార్య యాసిడ్ దాడి
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు పెదకాకాని: భర్తపై భార్య యాసిడ్‌తో దాడి చేసిన సంఘటన పెదకాకానిలో చోటు చేసుకుంది. విశాఖపట్నం గాజువాకకు చెందిన గండికోట బాలకృష్ణ సొంతగా లారీలు బాడుగకు తిప్పుకుంటున్నాడు. అతనికి గుంటూరుకు చెందిన రమణమ్మతో రెండు నెలల కిందట అడిగొప్పలలో వివాహమైంది. అప్పటికే రమణమ్మకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఈనెల 26వ తేదీన వట్టిచెరుకూరు మండలంలో కుర్నూతల ఉన్న బాలకృష్ణ సోదరి ఇంట్లో శుభకార్యం జరిగింది. ఈ శుభకార్యానికి వెళ్లడానికి వీలులేదంటూ భార్య రమణమ్మ అడ్డుతగలడంతో వెళ్లకుండానే ఆగిపోయారు. ఈ నేపధ్యంలో ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. సోమవారం రాత్రి బాలకృష్ణ గుంటూరు నుంచి మంగళగిరి మండలంలోని కాజ గ్రామంలో ఉన్న స్నేహితుడిని కలిసేందుకు బైక్‌పై బయలు దేరాడు. మార్గమధ్యంలో పెదకాకాని శివారులో జాతీయ రహదారి పక్కనే ఉన్న పల్లాలమ్మ చెరువు వద్దకు మరొక వ్యక్తి సహకారంతో కారులో భార్య రమణమ్మ అక్కడికి చేరుకుంది. రోడ్డుపై వెళుతున్న భర్త బైక్‌ను ఆపి వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను ముఖంపై పోసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ దాడిలో గాయపడిన బాలకృష్ణను స్థానికులు 108 వాహనంలో గుంటూరు తరలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు. ముగిసిన మహా మంజీరనాదం నగరంపాలెం: గత వారం రోజులుగా బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ నిర్వహిస్తున్న 15వ అంతర్జాతీయ నృత్య దినోత్సవాలు (మహా మంజీర నాదం –2025) మంగళవారంతో ముగిశాయి. నటరాజ స్వామి ‘వందన రఘు నందన‘ అనే త్యాగరాజ కీర్తనకు దాదాపు 200 మంది కళాకారులు నృత్యర్చన చేశారు. సాయంత్రం జరిగిన ముగింపు సభకు ఆలయ అధ్యక్షుడు మస్తానయ్య జ్యోతిప్రజ్వలన చేయగా, సంస్థ నిర్వాహకులు భూసురపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. సిరిపుల్ రాజమోహన్ (కేరళ) మోహిని అట్టం, అవిజిత్ కుందు (బెంగళూరు) భరత నాట్యం ప్రదర్శించారు. అనంతరం కళారత్న పురస్కార గ్రహీత డాక్టర్ కాజ వెంకటసుబ్రహ్మణ్యంకు పసుమర్తి కృష్ణమూర్తి స్మారక జీవిత సాఫల్య శత గురు జయంతి పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి, సంస్థ కోశాధికారి వెంకటగిరి నాగలక్ష్మి పాల్గొన్నారు. శిరిగిరిపాడు ఎస్సీ కాలనీలో ఇరువర్గాల ఘర్షణ వెల్దుర్తి: మండలంలోని శిరిగిరిపాడు ఎస్సీ కాలనీలో ఇరువర్గాలు ఘర్షణ పడి రాళ్లు రువ్వుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన ఆరుమళ్ల విజయ్, కొమ్ము బొంగురు మాచర్ల పట్టణంలో సోమవారం రాత్రి పాత కక్షల నేపథ్యంలో ఘర్షణ పడి దాడులు చేసుకున్నారు. వీరు స్వగ్రామమైన శిరిగిరిపాడులో బంధువులకు సమాచారం అందింది. మంగళవారం ఉదయం ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. మధ్యాహ్నం మరోసారి రాళ్లు వేసుకున్నారు. కాలనీలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కాలనీకి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. కాలనీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. -
పెన్షనర్ల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడాలి
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ప్రయోజనాలను కాపాడాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని పెన్షనర్ల బిల్డింగ్‌లో అధ్యక్షులు మానం సుబ్బారావు అధ్యక్షతన మంగళవారం పల్నాడు జిల్లా శాఖ పెన్షనర్ల సంఘ ఏప్రిల్ నెల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. గౌరవాధ్యక్షులు లంకా రంగనాయకులు, కార్యదర్శి సీసీ ఆదెయ్య, కోశాధికారి ఎంఎస్ఆర్కే ప్రసాదు, అసోసియేషట్ ప్రెసిడెంట్ కంచుపర్తి సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి పచ్చల నాగభూషణం, ఉపాధ్యక్షులు చేగిరెడ్డి ఈశ్వరరెడ్డి, పూనాటి సుబ్బారావు పాల్గొన్నారు. కోశాధికారి ఎంఎస్ఆర్కే ప్రసాదు 2024–25 ఏడాదికి పైనాన్స్ స్టేట్మెంట్ను ప్రవేశపెట్టారు. హెల్త్, గుర్తింపు కార్డుల గురించి చర్చించారు. -
హత్య కేసులో నిందితుడికి రిమాండ్
శావల్యాపురం: హత్య కేసులో నిందితుడికి న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు ఎస్ఐ లేళ్ల లోకేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా...మండలంలోని శానంపూడి గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన అమృతపూడి నాగేశ్వరరావు (36) గతేడాది అక్టోబరు 7వ తేదీన కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి మృతుడి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా విచారణ చేపట్టారు. విచారణలో మృతుడు, వినుకొండ మండలం ఎనుగుపాలెం గ్రామానికి చెందిన దావులూరి వీరబ్రహ్మం కలసి మండలంలోని కారుమంచి గ్రామం అద్దంకి బ్రాంచ్ కెనాల్ కట్టపై అక్టోబరు 7వ తేదీన రాత్రి మద్యం తాగుతున్న సమయంలో వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మృతుడు నాగేశ్వరరావును, వీరబ్రహ్మం కాల్వలోకి తోసి పరారయ్యాడు. మార్టూరు సమీపంలో వలపర్ల కొమ్మినేనివారిపాలెం టి.జంక్షన్ వద్ద మృతదేహం లభ్యమైంది. అప్పట్లో మార్టూరు పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. అనంతరం కేసును శావల్యాపురం పోలీసు స్టేషనుకు బదిలీ చేశారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దావులూరి వీరబ్రహ్మంను కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. రైల్వే గ్యాంగ్‌మెన్ ఆత్మహత్య సత్తెనపల్లి: రైల్వే గ్యాంగ్మన్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పట్టణంలోని రైల్వే క్వార్టర్స్‌లో మంగళవారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. రైల్వే గ్యాంగ్‌మన్‌గా పనిచేస్తున్న షేక్ మస్తాన్‌వలి (59) కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో మెడ, చేతికి బ్లేడ్‌తో కోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతుడికి భార్య కరీమూన్, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య కరీమూను ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్య కేసులో జీవిత ఖైదు నరసరావుపేటటౌన్: వ్యక్తిని దారుణంగా హతమార్చటంతోపాటు రూ.380 నగదును దోపిడీ చేసినట్లు నేరం రుజువవడంతో నిందితుడు పట్టణానికి చెందిన తన్నీరు అంకమ్మరావు అలియాస్ ముళ్ల పందికి జీవిత ఖైదు, రూ.15 వేలు జరిమానా విధిస్తూ స్థానిక 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్. సత్యశ్రీ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2023వ సంవత్సరం మే నెల 9వ తేదీ రాత్రి పట్టణంలోని గాంధీ పార్క్ ఎదుట గల బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద నిద్రిస్తున్న 55 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తిని నిందితుడు ఇటుకరాయితో మోది దారుణంగా హతమార్చాడు. అతని వద్ద నుంచి కొంత నగదు తస్కరించాడు. సంఘటన జరిగిన మరుసటి రోజు 18వ వార్డు వీఆర్వో చల్లా చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు అంకమ్మరావును అరెస్టు చేసి ప్రాథమిక దర్యాప్తు అనంతరం అప్పటి సీఐ ఎ.అశోక్‌కుమార్ కోర్టులో అభి యోగపత్రం దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువడంతో హత్య కేసులో జీవిత ఖైదు, రూ.10000 జరిమానా, దోపిడీ కేసులో పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించారు. శిక్షను ఏకకాలంలో అనుభవించేలా తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ ఏపీపీ దేశిరెడ్డి మల్లారెడ్డి నిర్వహించారు. నిందితుడు అంకమ్మరావు పలు హత్య, చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. -
ఎన్జీ రంగా అగ్రి వర్సిటీ వజ్రోత్సవాలు ప్రారంభం
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటై 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రెండు రోజులపాటు నిర్వహించనున్న వజ్రోత్సవాలను మంగళవారం ప్రారంభించారు. గుంటూరు శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలోని వర్సిటీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు వజ్రోత్సవ ఫైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఎన్జీరంగా విగ్రహావిష్కరణ చేశారు. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వర్సిటీ రైతుల కోసం మరిన్ని వంగడాలను తయారు చేయాలని సూచించారు. ఉపకులపతి డాక్టర్ ఆర్.శారదజయలక్ష్మిదేవి సాంకేతిక సదస్సును ప్రారంభించి విశ్వవిద్యాలయ ప్రగతిని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ప్రొఫెసర్ విజయ్పాల్శర్మ, రైతు సాధికార సంస్థ వైస్ చైర్మన్ టి.విజయ్‌కుమార్, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ మర్రిరెడ్డి శ్రీనివాస్ నూతన వంగడాలు, పరిశోధనలపై చర్చించారు. సాంకేతిక నిపుణులు పలు అంశాలపై ప్రసంగించారు. మాజీ ఉపకులపతి డాక్టర్ పి.రాఘవరెడ్డి మాట్లాడుతూ 1964 నుంచి నేటి వరకూ విశ్వవిద్యాలయం సాధించిన అభివృద్ధి, కృషిని అభినందించారు. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జి.రామచంద్రరావు, పరిశోధన సంచాలకుడు డాక్టర్ పీవి సత్యనారాయణ, విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి. శివన్నారాయణ అతిథులను శాలువాలతో సత్కరించారు. విశ్వవిద్యాలయం 60 ఏళ్ళలో సాధించిన ప్రగతికి నిదర్శనంగా ఏర్పాటు చేసిన 150 పరిశోధన, వంగడాలు, ఇతర స్టాళ్లు రైతులు, సందర్శకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే బి.రామాంజనేయులు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవ వేడుకల్లో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.రాజశేఖర్, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, మాజీ చైర్మన్ చింతల గోవిందరాజులు, పి.జె.పి.ఎస్.ఏ.యూ వైస్‌చాన్సలర్ జానయ్య, పశువైద్య విశ్వవిద్యాలయం వీసీ జె.వి.రమణ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కె.గోపాల్, ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ టి.సుగుణ, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు, మాజీ వీసీ డాక్టర్ దామోదర్ నాయుడు,రైతులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పాలక మండలి సభ్యులు, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని సభ ఏర్పాట్లు పరిశీలన
తాడికొండ: ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ మంగళవారం పరిశీలించారు. మే 2వ తేదీ సాయంత్రం 3:20 గంటలకు ప్రధాని మోదీ అమరావతికి వస్తారని మంత్రి చెప్పారు. రాజధాని పనుల పునఃప్రారంభంతో పాటు రూ.43 వేల కోట్ల పనులను ప్రధాని ప్రారంభిస్తారని వెల్లడించారు. నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): రాజధాని ప్రాంతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్న సభకు జిల్లా నుంచి తరలివచ్చే ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్టు రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో ప్రధాని పర్యటనపై అధికారులు, కార్పొరేటర్లు, కూటమి నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. తాడికొండ: ప్రధాని మోదీ మే 2న అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర హోం మంత్రి అనిత మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన బందోబస్తు, ఇతర వివరాలు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్పీ సతీష్‌కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ వివరించారు. గుంటూరు వెస్ట్: అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునః ప్రారంభించే కార్యక్రమానికి హాజరు కానున్న భారత ప్రధాని నరేంద్రమోదీ సభను అధికారులు సమన్వయంతో, పటిష్ట ప్రణాళికతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జేసీ ఎ.భార్గవ్‌తేజతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు వీవీఐపీలు పాల్గొనే సభ విజయవంతానికి అధికారులంతా సమష్టిగా కృషి చేయాలన్నారు. సభకు వచ్చే ప్రజలకు ఆహారం, మంచినీరు లాంటి వసతులు సమకూర్చా లన్నారు. డీఆర్ఓ షేక్ ఖాజావలి పాల్గొన్నారు. -
ఒత్తిళ్లు .. వేధింపులు.. ‘కార్పొరేట్’ హత్యలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కార్పొరేట్ విద్యాసంస్థలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఒత్తిడి విద్యార్థులను చంపేస్తోంది. భారీగా వసూలు చేసే ఫీజులు ఒకవైపు, మరోవైపు మార్కుల కోసం పోటీ విద్యార్థులపై ఒత్తిడి పెంచేస్తోంది. ఇటీవల కాలంలో రాజధాని ప్రాంతంలో ఏర్పాటైన ప్రైవేటు యూనివర్సిటీల్లో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఆ మరణాలను పోలీసులు ఆత్మహత్య కేసులుగా నమోదుచేసి వాటి దర్యాప్తును మరుస్తున్నారు. ఒకవేళ సదరు విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆ విద్యాసంస్థల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పి దర్యాప్తు జరగనీయకుండా అడ్డుకుంటున్నారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఈ మరణాలకు గల కారణాలు తేల్చడంలో పూర్తిగా విఫలం అవుతోంది. ఈ సంవత్సర కాలంలోనే ఈ ప్రాంతాల్లో వున్న పేరుగాంచిన పలు విద్యాసంస్థల్లో ఇలాంటి మరణాలు సంభవించాయి. సంవత్సర కాలంలో ఘటనలు.. తాజాగా ఫీజు చెల్లించలేదని నిలదీయడంతో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన సుభాష్(20) యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తన తండ్రి వచ్చి ఫీజు చెల్లిస్తారని చెప్పినా వినకుండా అవమానించడంతో మనస్థాపానికి గురైన విద్యార్థి 12వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడాడు. ●తాడేపల్లిలో ఒక ప్రైవేటు యూనివర్సిటీ విద్యార్థి విజయవాడలో ఉన్న తన తండ్రికి నేను చనిపోతున్నాను, నన్ను క్షమించండి అంటూ లేఖ రాసి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ●ఇది జరిగిన రెండు రోజులకే వడ్డేశ్వరంలోని ఓ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ●ఇదే వర్సిటీలో అనంతపురానికి చెందిన మరో విద్యార్థి కూడా ఇదేవిధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడి వల్లే..? కొంతమంది విద్యార్థులు మానసిక ఒత్తిడి వల్లే ఇలా జరుగుతుందని, విద్యాసంస్థలు సెమిస్టర్ పరీక్షలు జరిగిన సమయంలో యాజమాన్యం బాగా ఒత్తిడికి గురిచేస్తోందని, మార్కులు తక్కువ వస్తే అదనంగా ఫీజు చెల్లించాల్సి వస్తుందని బెదిరిస్తోందని, ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జరిగిన సంఘటనలపై పోలీసులు, ప్రభుత్వం దర్యాప్తు చేపట్టి, విద్యార్థుల మరణాల పట్ల నిజనిజాలు తేల్చాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు కోరుకుంటున్నారు. ప్రైవేటు యూనివర్సిటీల్లో విద్యార్థుల వరుస మరణాలు ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్న విద్యాసంస్థలు వంతపాడుతున్న పోలీసులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా తూతూ మంత్రంగా దర్యాప్తు వేధింపులే కారణమంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు లాభార్జన కోసం కోర్సులను రుద్దుతున్నారు రాష్ట్రంలో, దేశంలో కంపెనీలకు అనుగుణంగా విద్యాసంస్థలు విద్యను అందించాలి. దానికి విరుద్ధంగా కార్పొరేట్ విద్యాసంస్థలు వారి లాభార్జన కోసం విద్యార్ధులపై తమ కోర్సులను రుద్దుతున్నారు. దాంతో కార్పొరేట్ సంస్థలు ఉద్యోగాలు అందించే సమయంలో పోటీతత్వం ఎక్కువైంది. దానిని తట్టుకునేందుకు కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులపై మానసిక ఒత్తిడి తీసుకువస్తున్నారు. ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీలు నిర్వీర్యమై కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఏర్పడడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రభుత్వాలు ప్రోత్సహించి అవసరమైన కోర్సులలో శిక్షణ ఇచ్చి, విద్యార్థులో వున్న ప్రతిభను గుర్తించి విద్యను అందిస్తే ఆత్మహత్యలు జరగవు. – ప్రొఫెసర్ బూరగ శ్రీనివాసరావు తల్లుల రోదన సైతం పట్టదు.. రాజధానిలో తమిళనాడుకు చెందిన ఓ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వారి తల్లిదండ్రులు కాలేజీకి వచ్చి తమ బిడ్డ మరణానికి కారణం చెప్పాలని, తమ కూతురికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, మీ వేధింపుల వల్లే చనిపోయిందంటూ కాలేజీ వద్ద మృతురాలి తల్లి ధర్నా నిర్వహించారు. అక్కడ వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది బలవంతంగా ఆమెను బయటకు నెట్టివేశారు. కాలేజీలో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను చూపించాలన్నా యాజమాన్యం ఒప్పుకోలేదు. మంగళగిరి రూరల్ పరిధిలో రెండు రోజుల క్రితం తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి తన రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య అని యాజమాన్యం అంటుంటే తల్లిదండ్రులు కాదని వాదించినా ప్రయోజనం లేకుండా పోయింది. పోలీసులు దర్యాప్తు చేపట్టినా ఇప్పటి వరకు ఆ విద్యార్థి ఆత్మహత్య గల కారణాలు తేల్చలేదు. కాకినాడ జిల్లా, రాజోలుకు చెందిన ఓ విద్యార్థిని హోం సిక్‌పై ఇంటికి వెళ్లి, రాత్రికి రాత్రి అక్కడి నుంచి బస్సు ఎక్కి, విజయవాడ బస్టాండ్ నుంచి తాను ఉంటున్న కుంచనపల్లిలో రూమ్‌కు వచ్చే దారిలో ఓ విద్యార్థితో గొడవపడింది. రెండు గంటల అనంతరం ఆ విద్యార్థిని తాను ఉంటున్న అపార్ట్మెంట్లో కిటికీకి ఉరి వేసుకుని మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆ విద్యార్థినితో గొడవపడిన మరో విద్యార్థి ఎవరు? వారి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అతనివల్ల చనిపోయిందా? ఇతర కారణాల వల్ల చనిపోయిందా అన్నది పోలీసులు ఇప్పటి వరకు తేల్చలేదు. ఆ విద్యార్థినికి తండ్రి లేకపోవడంతో తల్లి ఆ కేసు గురించి మొదటి రోజు తన బిడ్డ చావుకు కారణం తేల్చాలని మాట్లాడినా, రెండవ రోజు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగలేమంటూ తేల్చి చెప్పేసింది. -
శ్రీవాసవీ దేవస్థానంపై కూటమి కుట్రలు
తెనాలి: పట్టణ బోసురోడ్డులోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వివాదం తారాస్థాయికి చేరింది. అధికారమే అండగా సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకున్నారు. మరోరోజు పోలీసు బలగాల నడుమ ఏకపక్షంగా తమకు తామే కొత్త కమిటీ ఎన్నికై నట్టు రాసేసుకున్నారు. అసలు కమిటీ సర్వసభ్య సమావేశాన్ని మే నెల నాలుగో తేదీన ఏర్పాటుచేస్తూ సభ్యులకు నోటీసులు పంపింది. ఆలయ కమిటీ వివాదం హైకోర్టులో ఉంది. మరో మూడురోజుల్లో ఉత్తర్వులు రానున్నాయి. ఈలోగానే ఎక్కడ కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తుందనే భావనతో హడావుడిగా ప్రమాణస్వీకారానికి తెగబడ్డారు. మరికొన్ని గంటల్లో ప్రమాణస్వీకారం చేసేందుకు సన్నాహాల్లో ఉన్నారు. స్వయం ప్రకటిత కమిటీ పోకడలతో ఆర్యవైశ్యులు మనోవేదన చెందుతున్నారు. పురాతన దేవాలయం తెనాలిలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రత్యేకమైంది. సువిశాలమైన నాలుగెరకాల విస్తీర్ణంలో 125 ఏళ్లకు పూర్వమే ఇక్కడ నిర్మితమైన శ్రీవాసవీ అమ్మవారి ఆలయం పురోగతి 2004 నుంచి విస్తృతమైంది. దేవస్థానం స్థలంలోనే గీతాభవనం, వైశ్య వ్యాయామశాల, వైశ్యవిద్యార్థి ధర్మనిధి, ఆర్యవైశ్య అపరకర్మశాల ఉన్నాయి. శ్రీరమాసహిత సత్యనారాయణస్వామి ఆలయాన్ని నిర్మించారు. నాలుగు కల్యాణమండపాలు, 20 సూట్లు సమకూరాయి. దేవస్థానం సత్రం కమిటీ దాతల సహకారంతోనే ఇవన్నీ సమకూర్చుకోగలిగారు. ఆలయానికి నెలకు రూ.10 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఆలపాటి అరంగేట్రంతోనే..! రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎమ్మెల్సీగా ఎన్నికవటంతో ఆలయ పాలకవర్గంపై ఆధిపత్యం కోసం టీడీపీ ఆర్యవైశ్య నేతల ఆరాటం మొదలైంది. పాలకవర్గం పదవీకాలం పూర్తవటంతో ఈనెల 13న సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటుచేశారు. టీడీపీకి చెందిన ఆర్యవైశ్య నేతలు సమావేశం జరక్కుండా గందరగోళం సృష్టించారు. ఆర్యవైశ్యులు కాని టీడీపీ నేతలు, అన్య కులస్థులను భారీగా సమీకరించారు. వీరిలో కొందరు రౌడీషీటర్లు కూడా ఉన్నారు. దీంతో విధిలేని స్థితిలో సమావేశాన్ని వాయిదా వేశారు. ఇదే అదనుగా తర్వాత రెండురోజులకు టీడీపీ ఆర్యవైశ్యులు సమావేశానికి పిలుపునిచ్చారు. 15న తమ మద్దతుదారులతో వచ్చారు. అసలు కమిటీ నాయకుల అభ్యంతరాలను ఖాతరు చేయలేదు. అధికారం అండతో తమకు తామే కమిటీని కొత్త పుస్తకాల్లో రాసుకున్నారు. ఆఫీసు రూమ్ తాళాలు పగులగొట్టారు. తిరిగి వెళుతూ జై ఆలపాటి అంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. ఇక అప్పట్నుంచి దూకుడు మొదలైంది. అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘనే అధికారం అండగా రెచ్చిపోతున్న వైనం వివాదం హైకోర్టులో ఉన్నా ఖాతరు చేయని ధిక్కారం గంటల వ్యవధిలో ప్రమాణస్వీకారానికి ముహూర్తం 4వ తేదీ సమావేశానికి చట్టబద్ధ్దత లేదంటూ ప్రచారం స్వయం ప్రకటిత కమిటీ ఆగడాలపై ఆర్యవైశ్యుల ఆవేదన ఏకపక్ష కమిటీ ప్రకటనపై ఆవేదన ఆ తర్వాత అసలు కమిటీ మే నెల 4వ తేదీన సర్వసభ్య సమావేశానికి నిర్ణయించింది. వెయ్యి మంది సభ్యులకు లేఖలను పంపింది. కమిటీ బైలా నిబంధనల ప్రకారం సర్వసభ్య సమావేశంలో నిర్ణయం ప్రకారం ఎన్నిక నిర్వహించాలి. పోటీ ఉన్నట్టయితే మరో తేదీని నిర్ణయించి రహస్య బ్యాలెట్లో ఎన్నికలు జరపాల్సి ఉంది. అవేమీ లేకుండానే ఏకపక్షంగా కమిటీని ప్రకటించటం, పాత కమిటీ రద్దయిందన్న ప్రచారంపై ఆర్యవైశ్యులు నివ్వెరపోతున్నారు. పవిత్రమైన శ్రీవాసవీ అమ్మవారి దేవస్థానం ప్రాంగణాన్ని వివాదాలకు కేంద్రంగా చేయటంపై వారు వేదన పడుతున్నారు. మరోవైపు ఈ వివాదం హైకోర్టులో ఉంది. అసలు కమిటీ హైకోర్టును ఆశ్రయించగా, స్వయం ప్రకటిత కమిటీ తరఫున కేవియట్ వేశారు. మొత్తానికి మే నెల రెండో తేదీన దీనిపై హైకోర్టు స్పష్టత ఇవ్వనుందనే వార్తలు వచ్చాయి. తీర్పు నేపథ్యంలో హడావుడిగా ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు.. దీంతో దృశ్యం మారింది. హడావుడిగా బుధవారం సాయంత్రం స్వయం ప్రకటిత పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఏర్పాటుచేస్తున్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి నాదెండ్ల మనోహర్ అతిథులుగా ఆహ్వాన పత్రికలను సిద్ధం చేశారు. హైకోర్టులో వివాదం ఉన్న నేపథ్యంలో స్వయం ప్రకటిత కమిటీ ప్రమాణస్వీకారం ఏమిటి? ఇందుకు కూటమి మంత్రులు ఎలా వస్తారు? అంటూ పట్టణంలో తీవ్ర చర్చ నడుస్తోంది. పాలకవర్గం ప్రస్తుత అధ్యక్షుడు, ఆలయ అభివృద్ధిలో తనదైన ముద్రవేసిన నూకల వెంకట వేణుగోపాలరావు తీవ్ర అస్వస్థతకు లోనవటంతో ‘మెడికల్ ఎమర్జన్సీ’గా అమెరికా తరలించారు. ఇలాంటప్పుడు ఎన్నడూలేనివిధంగా ఆలయ పాలకవర్గంలో ఆధిపత్యం కోసం టీడీపీ ఆర్యవైశ్య నేతలు నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘించటం, అందుకు మంత్రులు సైతం సై అంటూ వస్తామనటం తీవ్ర విమర్శలకు గురవుతోంది. -
వైఎస్సార్ సీపీ పార్లమెంట్ పరిశీలకులుగా పోతిన మహేష్
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకులుగా పోతిన మహేష్‌ను నియమిస్తూ ఆదేశాలు మేరకు వెలుబడ్డాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పోతిన మహేష్‌ను గుంటూరు పార్లమెంటు నియోజవర్గ పరిశీలకులుగా నియమించారు. 7న కౌన్సిల్ సమావేశం నెహ్రూనగర్: నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశం మే 7వ తేదీన జరగనుంది. ఈనెల 25వ తేదీన జరగాల్సిన కౌన్సిల్ సమావేశం మేయర్ ఎన్నిక కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. వాయిదా పడిన సమావేశాన్ని ఏడో తేదీన నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. అందుకు సంబంధించిన సర్క్యులర్ కాపీలను సభ్యులకు మంగళవారం అందజేశారు. దద్దనాల మిట్ట ఆంజనేయస్వామి తిరునాళ్ల రొంపిచర్ల: మండలంలోని వీరవట్నం సమీపంలో గల దద్దనాల మిట్ట ఆంజనేయస్వామి దేవాలయ వార్షికోత్సవ తిరునాళ్ల మంగళవారం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలవారు అధిక సంఖ్యలో దేవాలయానికి వచ్చి పొంగళ్లు నిర్వహించి స్వామి వారికి నైవేద్యం సమర్పించారు. స్వామికి ఇష్టమైన పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వీర్ల అంకమ్మతల్లికి బోనాలు దాచేపల్లి: వీర్ల అంకమ్మతల్లి కొలుపుల తిరునాళ్ల సందర్భంగా మంగళవారం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో ఉన్న మహిళలు దేవాలయానికి బోనాలతో వచ్చారు. నెత్తిపై బోనాలు పెట్టుకుని మేళతాళాలతో గ్రామ పురవీధుల్లో నుంచి దేవాలయానికి చేరుకుని చుట్టూ ప్రదక్షిణ చేశారు. ప్రత్యేకంగా పూజలు చేసిన తరువాత అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యుడు యలమల నరేష్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. నేడు దుర్గమ్మ సన్నిధిలో శ్రీమహాలక్ష్మి యాగం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అక్షయ తృతీయను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో బుధవారం శ్రీమహాలక్ష్మి యాగాన్ని నిర్వహించనున్నారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో ఉదయం 9 గంటలకు యాగం నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది. యాగాన్ని దేవస్థానం తరఫున ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. గాయత్రీదేవి శక్తి స్థూపం ఆవిష్కరణ కర్లపాలెం: గాయత్రీదేవి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆధ్యాత్మికవేత్త రాజ్యలక్ష్మి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దమ్మనవారిపాలెం గ్రామంలో పి.వెంకట ప్రసూనాంబ, సునందనరావు దంపతుల ఆధ్వర్యంలో గాయత్రీదేవి స్థూపం ఆవిష్కరించారు. ముందుగా స్థూపం వద్ద శాంతిహోమాలు నిర్వహించారు. అనంతరం గాయత్రీ మహామంత్రం జపించి గాయత్రీదేవికి పూజలు చేశారు. ఆధ్యాత్మికవేత్త రాజ్యలక్ష్మి మాట్లాడుతూ భూమి, ఆకాశం, అగ్ని, జలం, వాయువు మొదలగు పంచభూతాల సమూహమే గాయత్రీదేవి అని చెప్పారు. విశ్వశాంతి కోసం గాయత్రీదేవిని పూజించాలని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గురపసాల వెంకటేశ్వరమ్మ, మాజీ ఎంపీపీ తాతా లీలావరప్రసాద్, మాజీ సర్పంచ్ అలపర్తి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు జరిగాయి. పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో పాటు.. సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా సాకే శైలజానాథ్‌ను నియమిస్తూ.. పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వీరే1.శ్రీకాకుళం-కుంభా రవిబాబు (ఎమ్మెల్సీ)2.విజయనగరం- కిల్లి సత్యనారాయణ3.అరకు- బొడ్డేటి ప్రసాద్4.అనకాపల్లి-శోభా హైమావతి (మాజీ ఎమ్మెల్యే)5.విశాఖ-కదిరి బాబూరావు (మాజీ ఎమ్మెల్యే)6.కాకినాడ- సూర్యనారాయణరాజు (మాజీ ఎమ్మెల్సీ)7.అమలాపురం-జక్కంపూడి విజయలక్ష్మి8.ఏలూరు-వంకా రవీంద్రనాథ్ (ఎమ్మెల్సీ)9.రాజమండ్రి- తిప్పల గురుమూర్తిరెడ్డి10.మచిలీపట్నం -జెట్టి గురునాథం11.నరసాపురం- ముదునూరి మురళీకృష్ణంరాజు12.విజయవాడ-మోదుగుల వేణుగోపాలరెడ్డి (మాజీ ఎంపీ)13.గుంటూరు-పోతిన మహేష్14.నరసరావుపేట-డా.పూనూరు గౌతంరెడ్డి15.బాపట్ల-తూమటి మాధవరావు (ఎమ్మెల్సీ)16.ఒంగోలు-బత్తుల బ్రహ్మానందరెడ్డి17.నెల్లూరు-జంకె వెంకటరెడ్డి (మాజీ ఎమ్మెల్యే)18.తిరుపతి-మేడా రఘునాథరెడ్డి (ఎంపీ)19.చిత్తూరు-చవ్వా రాజశేఖర్‌రెడ్డి20.రాజంపేట- కొత్తమద్ది సురేష్‌బాబు (మేయర్)21.కడప-కొండూరి అజయ్‌రెడ్డి22.అనంతరం-బోరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డి( మాజీ ఎమ్మెల్సీ)23.హిందూపురం-ఆర్.రమేష్‌రెడ్డి24.నంద్యాల- కల్పలతారెడ్డి (ఎమ్మెల్సీ)25.కర్నూలు-గంగుల ప్రభాకర్‌రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ) -
హామీల అమలులో ‘కూటమి’ ఘోర వైఫల్యం: మేరుగు నాగార్జున
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ‘వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్’గా వైఎస్సార్సీపీ పని చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించారని మాజీ మంత్రి, పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున వెల్లడించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారుఆ బాధ్యత పార్టీపై ఉంది:రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్దేశించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, ప్రజాసమస్యలపై ఉద్యమించేందుకు సిద్దంగా ఉండేలా పార్టీని సమాయత్తం చేయాలని ఆయన ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమై, ప్రజల గోడు పట్టించుకోని నిర్లక్ష్యం తాండవిస్తోందని, దీనిపై ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని జగన్ గుర్తు చేశారు.వాటిపై దృష్టి సారించాల్సి ఉంది:రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారికి వైఎస్సార్సీపీ అండగా ఉండాలనే కోణంలో సమావేశంలో జగన్ పలు అంశాలు నిర్దేశించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ, కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయడంతో పాటు, పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. నియోజకవర్గ సమన్వయకర్త నుంచి మండల స్థాయి వరకు పార్టీ శ్రేణులు పూర్తి సమన్వయంతో పని చేయాలని కోరారు.హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలి:రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. బాధితులకు అన్యాయం జరుగుతున్న ప్రతిచోటా వైయస్ఆర్సీపీ ఉండాలని వైయస్ జగన్ సూచించారు. ప్రజలకు కూటమి పార్టీలు 143 వాగ్ధానాలను ఇచ్చాయి. సూపర్ సిక్స్ కాస్తా గాలికి వదిలేశారు. గత వైయస్ఆర్సీపీ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు, ప్రజల జీవన ప్రమాణాల్లో తీసుకువచ్చిన మార్పులను మరోసారి గుర్తు చేసుకోవాలి.ఇప్పుడు వాగ్దానాల అమలు అనేది ఎక్కడా లేదు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోంది. సంక్షేమ పథకాలు పేదలకు చేరువ కావడం లేదు. విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పేదలు తమ పిల్లలను చదివించుకోలేక, బడికి పంపాల్సిన పిల్లలను కూలికి పంపుతున్నారు. ఇటువంటి స్థితిలో వైయస్సార్సీపీ వారికి అండగా నిలబడుతుంది.రైతుల్లో భరోసా కల్పించాలి:రైతులను పట్టించుకునే తీరికే కూటమి ప్రభుత్వానికి లేదు. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయంలో రైతేరాజుగా ప్రాధాన్యత ఇచ్చాం. రైతుభరోసా ద్వారా రైతులకు అండగా నిలిచాం. విత్తనం నంచి విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా ఆనాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదుకుంది. నేడు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవలే గుంటూరు మిర్చియార్డ్‌కు వెళ్ళిన వైఎస్ జగన్‌కి మిర్చిరైతులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. దీనిపై వెంటనే సీఎం చంద్రబాబు స్పందించి కేంద్రానికి ఒక లేఖ రాసి, కేంద్రం ద్వారా మిర్చి కొనుగోళ్లు చేయిస్తామంటూ ఒక ప్రకటన చేసి, చేతులు దులుపుకున్నారు. ఆ తరువాత మిర్చి రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.ఇప్పుడు మిర్చి రైతులు కనీస ధరలు లేక, అప్పులపాలై దారుణ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మిర్చి రైతులకు అండగా వైయస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడంతో పాటు, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకంగా మిర్చి రైతులను ఆదుకుంటామో కూడా వారికి ఒక భరోసాను కల్పించాలని వైఎస్ జగన్ నిర్ధేశించారు.పొగాకు రైతుల గోడు కూటమి సర్కార్‌కు పట్టడం లేదు:పొగాకు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పొగాకు రైతులు తమ పంటను వ్యాపారులు కనీస మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయడం లేదని చెబితే, సదరు వ్యాపారుల ఫ్యాక్టరీలకు కరెంట్ తీసేస్తాను అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడారు. పొగాకు రైతులను అప్పటికప్పుడు నమ్మించి పంపి, ఆ తరువాత వారి గోడును కనీసం పట్టించుకోని ఘనుడు చంద్రబాబు.అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పొగాకు రైతుల విజ్ఞప్తులకు స్పందించి వ్యాపారులు తప్పకుండా కొనుగోలు చేయాలని, లేని పక్షంలో మేమే కొనుగోలు చేస్తామని చెప్పి, మార్క్‌ఫెడ్ ద్వారా రూ.200 కోట్లకు పైగా వెచ్చించి మద్దతు ధరకు కొనుగోలు చేయించారు. అదీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ది. ఈరోజు మార్కెట్లో క్వింటా పొగాకు రూ.36 వేలు ధర పలకాల్సి ఉండగా, మార్కెట్లో రూ.22 వేలకు కూడా కొనడం లేదు. అందుకే పొగాకు రైతుల పక్షాన ఉద్యమించడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉండాలని సమావేశంలో వైఎస్ జగన్ నిర్దేశించారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున వివరించారు. -
శ్రీకృష్ణ లీలలు
ఆయన నవ్వాడంటే అక్కడ శత్రుత్వపు బీజాలు పడినట్టే.. ఆయన కరచాలనం చేశాడంటే.. అక్కడ కేడర్ మధ్య అడ్డుగోడలు కట్టినట్టే.. ఆయన ఆలింగనం చేశాడంటే అక్కడ గ్రూపులు ప్రారంభమైనట్టే.. ఆయన అడుగు పెట్టాడంటే అక్కడ పార్టీలో లుకలుకలు మొదలైనట్టే.. ఇదీ నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తీరుపై ఆ పార్టీ నేతలు బాహాటంగా చెబుతున్న అభిప్రాయం. పల్నాడులో శ్రీకృష్ణ‘తలభారం’తో తెలుగుదేశం పార్టీకి బొప్పి కడుతోంది. అమ్మో ఈ ఎంపీ మాకొద్దు బాబోయ్ అంటూ తలలు పట్టుకుంటోంది.సాక్షి, గుంటూరు: పల్నాడు రాజకీయాల్లో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సరికొత్త భాష్యానికి తెర తీశారు. మామూలుగా పల్నాడు రాజకీయాలంటే ప్రతీకారాలు, ప్రత్యక్ష యుద్ధాలు. కానీ శ్రీకృష్ణదేవరాయలు అడుగుపెట్టాక కొత్తకోణాన్ని పల్నాడు రాజకీయాలకు పరిచయం చేశాడు. ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోశాడు. తాను అనుకున్నదే జరగాలనే ఒంటెత్తు పోకడలతో కేడర్ మధ్య చిచ్చు పెట్టారు. ఇలా తన రాజకీయ ప్రస్తానంలో పైకి సౌమ్యుడిలా.. లోన కుట్రపూరితంగా రాజకీయాలు చేస్తున్నారు. వర్గపోరుకు కేరాఫ్.. గతంలో వైఎస్సార్ సీపీ తరఫున నరసరావుపేట ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణ దేవరాయలు పారీ్టలో వర్గ పోరు కొనసాగించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి రజిని, అప్పటి వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో విభేదాలు ఉండేవి. గురజాలలో కాసు మహేష్‌రెడ్డికి పక్కలో బల్లెంలా మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఈ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా గ్రూప్ రాజకీయాలను పెంచి పోషించాడన్న అపవాదు మూటకట్టుకున్నాడు. మిగిలిన నియోజకవర్గ ఎమ్మెల్యేలతోనూ పైకి స్నేహపూర్వకంగా ఉన్నట్టు నటిస్తూ అంటీముట్టనట్లు వ్యవహరించే వారు. తనకంటూ అన్ని నియోజకవర్గాలలో ప్రత్యేక వర్గాన్ని పెంచి పోషించేవారు. అందుకే జగన్ పక్కన పెట్టేశారు..వైఎస్సార్ సీపీలో చేరిన శ్రీకృష్ణదేవరాయలుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. రాజకీయాల్లో యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2019 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ సీటు ఇచ్చారు. అక్కడ గెలుపొందిన శ్రీకృష్ణదేవరాయలు మొదటి నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. జిల్లా వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని, ఎమ్మెల్యేలంతా తన తర్వాతే అనే ధోరణిలో వ్యవహరించే వారు. ఇది అప్పటి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది.ఈ విషయాలపై శ్రీకృష్ణదేవరాయలును వైఎస్ జగన్మోహన్రెడ్డి సున్నితంగా మందలించారని కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి రజిని బహిరంగంగా చెప్పారు. తాము అధికారంలో ఉండగా శ్రీకృష్ణదేవరాయలు ఫోన్ ట్యాపింగ్ చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని మీడియా ముఖంగా మాజీ మంత్రి విడదల రజిని కుండబద్దలు కొట్టారు. దీనిపై స్పందించిన ఎంపీ.. నాలుగు ముక్కలు చెప్పి వేరే విషయాలు మాట్లాడి చేతులు దులుపుకొన్నారని, దీటైన జవాబు ఇవ్వలేకపోయాడని తెలుగుదేశం పార్టీ వర్గాలే పెదవి విరిచాయి. తనను ఎంపీగా గెలిపించిన పార్టీ, ఎమ్మెల్యేలకు మోసం చేయడంతోనే వైఎస్సార్ సీపీ నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి పక్కన పెట్టేశారని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆ తలనొప్పి మాకు తగులుకుందని వాపోతున్నారు.టీడీపీలోనూ అదే పంథా.. కూటమి తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీగా రెండోసారి గెలిచారు. ఎన్నికల సమయంలో ఆయా ప్రాంతాల్లోని ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో గ్రూపు రాజకీయాలు నడిపారు. టీడీపీలోకి చేరే సమయంలోనే ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కొన్ని కండీషన్లు పెట్టిమరి కండువా కప్పుకున్నారని సమాచారం. అందులో భాగంగా గురజాలలో జంగా కృష్ణమూర్తిని ప్రోత్సహించి యరపతినేనికి టికెట్ రానీయకుండా పావులు కదిపారనే ప్రచారం నడిచింది. = నరసరావుపేటలో బీసీ అభ్యర్థి అరవింద్ బాబుకు చివర వరకు బీఫారం రాకుండా అడ్డుకున్నారు. జనసేన నేత జిలాని, కొంతమంది టీడీపీ నేతలతో జట్టు కట్టి అక్కడ కుట్రలకు తెర తీశారు. ఆ సమయంలోనే అరవింద్ బాబు, శ్రీకృష్ణదేవరాయలు మధ్య విభేదాలు పొడచూపి బహిరంగంగా తిట్టుకొనే వరకు వెళ్లాయి. ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వైరం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. అధికారంలోకి వచ్చి సుమారు ఏడాది కావొస్తున్నా నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమం ఒక్కటీ చేపట్టలేదు. ⇒ ఇక చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావును కాదని మర్రి రాజశేఖర్ వర్గాన్ని ఆదరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మర్రి రాజశేఖర్‌కే పేట ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని ఎంపీ హామీ ఇచ్చారన్న ప్రచారంతో పత్తిపాటి వర్గం గుర్రుగా ఉంది. ⇒ వినుకొండలో తనతోపాటు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే మక్కెనను ఎంపీ ప్రాధాన్యత ఇవ్వడంతో స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వర్గం జీరి్ణంచుకోలేకపోతోంది. గతంలో బొల్లాకు ఇలానే తలనొప్పి తెప్పించారని గుర్తుచేసుకుంటున్నారు. ⇒ మాచర్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డికి వ్యతిరేకంగా సొంతపారీ్టలోనే మరో గ్రూపు కడుతున్నారు. ఈ వర్గం ద్వారా బ్రహ్మారెడ్డికి ఇక్కట్లు తీసుకొస్తున్నారు. వైఎస్సార్ సీపీలో వర్గ రాజకీయాలు చేసిన లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరిన తర్వాత అదే పంథా కొనసాగిస్తున్నారు. నచ్చిన వారు ఎన్ని తప్పులు చేసినా అందలమెక్కిస్తారని, నచ్చకపోతే వారిని అధఃపాతాళానికి తొక్కుతారనే విమర్శలు ఉన్నాయి. -
‘లోకేష్ అన్యాయం చేశారు మీరైనా..’ పట్టించుకోని పవన్!
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ తగిలింది. మంగళగిరి జనసేన కార్యాలయంలో ఇవాళ ఆ పార్టీ ఆధ్వర్యంలో పహల్గాం సంతాప సభ జరిగింది. అయితే ఆ సమయంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(PET) అభ్యర్థులు ఆయన కోసం నిరసన చేపట్టారుడీఎస్సీ నుంచి పీఈటీని ఎత్తేయడంపై ఆయన్ని ప్రశ్నించారు. పాదయాత్రలో నారా లోకేష్ తమకు హామీ ఇచ్చి మోసం చేశారని.. కనీసం మీరైనా న్యాయం చేయాలని పవన్‌ను ఉద్దేశిస్తూ ఫ్లెక్సీ, ఫ్లకార్డులు పట్టుకున్నారు. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, దాని ద్వారానే పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.పవన్ కాన్వాయ్ వస్తున్న సమయంలో వాళ్లు తమ నినాదాలను పెంచారు. అయితే పవన్ వాళ్లను కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో వాళ్లు నిరాశ చెందారు. -
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదంటూ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులతో ఆయన సోమవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతాకాదు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్నిరంగాల్లోనూ విద్వంసమే. రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతోంది. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. వీటిని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలి’ అని సూచించారు. జిల్లాలో పార్టీ ఓనర్షిప్ మీదిప్రజా సంబంధిత అంశాల్లో ఒకరి ఆదేశాలకోసం మీరు ఎదురు చూడొద్దు. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్‌ఛార్జితో కలిసి మొదట కదలాల్సిందే మీరే. ప్రజలకు అండగా మీరు చేస్తున్న కార్యక్రమాల వల్ల అది రాష్ట్రస్థాయి దృష్టిని ఆకర్షిస్తుంది. దీనిద్వారానే మీ పనితీరు బయటపడుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మన్ననలు పొందాల్సిన బాధ్యత మీది. సమాజంలో గొంతులేని వారికి బాసటగా నిలిచేది వైయస్సార్సీపీయే. ప్రతి సమస్యలోనూ బాధితులకు తోడుగా నిలిచేది వైఎస్సార్సీపీయే. మే నెలలోపు మండల కమిటీలు పూర్తిచేయాలిజూన్-జులైల్లో గ్రామస్థాయి, మున్సిపాల్టీలల్లో డివిజన్ కమిటీలు పూర్తిచేయాలి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో బూత్ కమిటీలు ఏర్పాటు కావాలి. ఈమేరకు లక్ష్యంగా పెట్టుకోండి. జిల్లా స్థాయి నుంచి పార్టీని గ్రామస్థాయి వరకూ తీసుకువెళ్లే బాధ్యతల్లో మీరు ఉన్నారు. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగాలి. జిల్లా అధ్యక్షుల పాత్ర పార్టీలో చాలా కీలకమైనది. గ్రామస్థాయి బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు అనేది అత్యంత కీలక విధుల్లో ఒకటి. పార్టీలో సమర్థులు ఎవరు, ప్రతిపక్షంలో ఎవరు లీడ్ చేయగలరు అని ఆలోచన చేసి మీకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మీమీ జిల్లాల్లో పార్టీ మీద మీకు పట్టు ఉండాలి. పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషిగా చేయాలి. బాధ్యతల నుంచే అధికారం వస్తుంది.జిల్లాల్లో మీరే సర్వం. మీరే పార్టీ.. పార్టీయే మీరుజిల్లాల్లో అన్నిస్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత మీది. మనసా వాచా కర్మేణా అదే తలంపుతో పార్టీని నడపాలి. జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యత మీది. అది మీ ప్రధాన బాధ్యత. దీనికోసం ఏం చేయాలన్నదానిపై మీరు గట్టిగా పనిచేయాలి. జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ప్రతి కమిటీ బలంగా ఉండాలి. ఏదైనా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పనితీరు బాగోలేకపోతే పిలిచి చెప్పగలగాలి. అప్పటికీ పనితీరు బాగోలేకపోతే ప్రత్యామ్నాయం చూడ్డంలో మీ భాగస్వామ్యం కీలకం. పార్టీలో ఇద్దరి మధ్య వివాదం ఉన్నప్పుడు పిలిచి సమన్వయం చేయాల్సిన బాధ్యత మీది. మీ పరిధిలో 7కు ఏడు గెలిపించాల్సిన బాధ్యత మీది. బాధ్యత, అధికారం రెండూ తీసుకోండి. మీరు సమర్థులని భావించి, మీకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయం చేయడం, జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ కమిటీ నిర్మాణం మీ ప్రధాన బాధ్యత. అలాగే ప్రజా సంబంధిత అంశాల్లో చురుగ్గా ఉండాలి.ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుందిప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుంది. భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్‌మన్ ప్రతిభ బయటపడుతుంది. అప్పుడే ఆ బ్యాట్స్‌మెన్ ప్రజలకు ఇష్టుడు అవుతాడు. ఇదికూడా అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పనులవల్ల మనం ఎలివేట్ అవుతాం. ప్రజల దగ్గర, పార్టీలోనూ గౌరవం పెరుగుతుంది. ఇమేజీ పెరుగుతుంది. మన పనితీరు వల్లే మనం మన్ననలను పొందగలుగుతాం. అందరూ ధోనీల్లా తయారు కావాలి. అప్పుడే మీ జిల్లాల్లో ఏడుకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలవగలుగుతాం. జిల్లాల్లో ఏ జరిగినా మీరు ప్రజల తరఫున నిలబడాలి.కార్యక్రమాలు చురుగ్గాచేయాలి, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రజా వ్యతిరేక అంశాలమీద గట్టిగా పోరాటం చేయాలి. లేదంటే పార్టీపరంగా మనం అవకాశాలను కోల్పోయినట్టే. బాధితులకు మనం అండగా ఉండాలి.మనమంతా రాజకీయ నాయకులంమనమంతా రాజకీయ నాయకులం. మన జీవితాలను రాజకీయాలకోసం పెట్టామనే విషయం మరిచిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెనకడుగు వేయకూడదు. ప్రతిపక్షంగా మనకు వచ్చిన అవకాశాలను వదిలిపెట్టకూడదు. జిల్లాస్థాయిలో ప్రజా సంబంధిత అంశాలను మీరు బాగా వెలుగులోకి తీసుకు వస్తేనే ప్రజలకు దగ్గరవుతాం. మనం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మరింత మంచి చేయగలం. ప్రజలకు మరింత మంచి చేయాలన్న తపన, తాపత్రయం ఉంది కాబట్టే రాజకీయాలు చేస్తున్నాం. నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలనుకున్నాను కాబట్టే నేను రాజకీయాలు చేస్తున్నాను. అలాగే ప్రతి జిల్లాల్లో మీ సేవల గురించి మాట్లాడుకోవాలి.రెండు మూడు సంవత్సరాలు అయితే కాని ప్రభుత్వ వ్యతిరేకత సాధారణంగా బయటకు కనిపించదు. కాని ఏడాదిలోపే ప్రభుత్వంమీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీ నిర్మాణం పూర్తిచేయాలి. దీని తర్వాత పార్టీ పరంగా మీకూ, నాకూ పూర్తిగా పని ఉంటుంది. అందరం కలిసికట్టుగా పార్టీపరంగా కార్యక్రమాలు బలంగా ముందుకు తీసుకెళ్లాలి. అందుకనే పార్టీ పరంగా నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలి. గ్రామస్థాయిలోకూడా కమిటీలు, బూత్ కమిటీల ఏర్పాటు పూర్తిచేస్తే… పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నట్టు అవుతుంది ప్రతి జిల్లాల్లో పార్టీ నిర్మాణం ద్వారా దాదాపు 12వేల మంది పార్టీ కార్యక్రమాలకోసం మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపుగా 1500 మంది ఉంటారు.మద్దతు ధరలు దొరక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్నారువివిధ జిల్లాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల తరఫున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు జిల్లాల్లో రైతులకు అండగా ఉండాలి. రైతుల డిమాండ్లపై పోరాటం చేయాలి. -
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా గాయపడిన మాజీ మంత్రి కేటీఆర్(KTR) త్వరగా కోలుకోవాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బ్రదర్ కేటీఆర్.. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని వైఎస్ జగన్ పోస్టు చేశారు. ఇక, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్‌కు వైద్యులు ఆయనకు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. వైద్యుల పర్యవేక్షణలో రికవరీ అవుతున్నట్లు పేర్కొన్నారు. త్వరగా కోలుకొని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పలువురు నేతలు, అభిమానులు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.Wishing you a speedy recovery, brother. Get well soon! @KTRBRS— YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2025 Picked up a slip disc injury during a gym workout session. Have been advised a few days of bed rest and recovery by my doctorsHope to be back on my feet soon— KTR (@KTRBRS) April 28, 2025 -
సమస్యలకు సత్వర పరిష్కారం
పోలీసు పీజీఆర్ఎస్లో ఏఎస్పీ జీవీ రమణమూర్తి నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు–పరిష్కారాల వేదక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ రమణమూర్తి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదిదారుల సమస్యలకు చట్ట పరిధిలో పరిష్కారం చూపుతామని సూచించారు. మహిళలు, వృద్ధుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని పో లీస్ అధికారులను ఆదేశించారు. నగరంపాలెం పీఎస్ సీఐ నజీర్‌బేగ్, పట్టాభిపురం పీఎస్ సీఐ గంగా వెంకటేశ్వర్లు, సీఐ కృష్ణయ్య కూడా అర్జీలు స్వీకరించారు. -
రైతులను ఇబ్బంది పెడితే చర్యలు
జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు కొరిటెపాడు(గుంటూరు): జూన్ మాసం నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాలని, ఎక్కడ నుంచి ఫిర్యాదు వచ్చినా చర్యలు తప్పవని గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. స్థానిక కృషీ భవన్లో సోమవారం సాయంత్రం విత్తన కంపెనీ ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్స్‌తో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖరీఫ్ సీజన్లో విత్తనాలు సరఫరా చేయాలని సూచించారు. ఎమ్మార్పీకి మించి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కాలం చెల్లిన విత్తనాలు, పురుగు మందులను రైతులకు అంటగడితే కేసులు నమోదు చేస్తామన్నారు. విక్రయ కేంద్రాల వద్ద విధిగా ధరల పట్టికతోపాటు స్టాకు వివరాల బోర్డులు వేలాడదీయాలన్నారు. విత్తన కంపెనీల ప్రతినిధులు మాట్లాడుడుతూ రాబోవు ఖరీఫ్ సీజన్లో అన్ని రకాల పత్తి, మిరప విత్తనాలను అందుబాటులో ఉంచి రైతులకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో గుంటూరు జిల్లాలో 75 వేల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని, దీనికిగాను 2 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని అధికారులు సూచించగా, అంతకన్నా ఎక్కువ ప్యాకెట్లు సరఫరా చేస్తామని విత్తన కంపెనీ ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. గుంటూరు ఏడీఏ తోటకూర శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్లైసిల్(హెచ్‌టీ) పత్తి విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో పొన్నూరు ఏడీఏ వి.రామకోటేశ్వరి, ఏఓ కె.రమణకుమార్, 15 విత్తన కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు. -
అటు మట్టి దందా..ఇటు ఆక్రమణలు
లాంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, అక్రమాలు లాం(తాడికొండ): తాడికొండ మండలం లాం గ్రామంలో ఓ వైపు మట్టి దందా, మరో వైపు స్థలాల వరుస ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ప్రశ్నించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో చెరువును చెరబట్టి రూ.కోట్ల విలువైన మట్టిని అమ్ముకొని జేబులు నింపుకొంటున్న తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆక్రమణల పర్వానికి తెరలేపారు. కొండ పోరంబోకులో మట్టిని తోలి చదును చేసుకొంటున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆక్రమణల పర్వం మరింతగా పెరిగే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. – లాం నుంచి జొన్నలగడ్డ వెళ్లే ప్రధాన రహదారిలో టీడీపీ నాయకులు కొండను మింగేసి మట్టిని తోలి పూడ్చివేసి ఆక్రమణల పర్వానికి తెరలేపారు. టీడీపీ అధికారంలోకి రాగానే కక్షపూరితంగా జానెడు జాగాలో ఇళ్ళు నిర్మించుకొని నివసిస్తున్న పేదల ఇళ్లను 40కి పైగా పొక్లెయిన్లతో కూల్చారు. మరి కొంత మందికి నోటీసులిచ్చి, తమకు సహకరించాలని బెదిరింపులకు గురిచేస్తున్నాడు. వీరి దుర్మార్గ వ్యవహారాలకు సహకరిస్తున్న అధికారులు సామాన్యులను మాత్రం వేధింపులకు గురిచేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణల పర్వానికి తెరదించాలని పలువురు కోరుతున్నారు. అర్జీదారులకు అన్నదానం ఏర్పాటుచేసిన జిల్లా ఆర్యవైశ్య సంఘం నరసరావుపేట: జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లలో అర్జీలు, ఫిర్యాదులు అందజేసేందుకు జిల్లా నలుమూలల నుంచి అనేక సమస్యలతో వచ్చేవారికి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దీనికి శిఖాకొల్లి రాజేష్ (గుణ రాజేష్ ), చితిరాల అనిల్ కుమార్ సహకరించారు. కలెక్టర్ కార్యాలయంలో అన్నదానాన్ని జిల్లా జిల్లా ఫారెస్ట్ అధికారి జి.కృష్ణప్రియ ప్రారంభించగా, ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ఆర్ఐ కృష్ణ ప్రారంభించి దాతలను సన్మానించారు. వారికి నిర్వహణ కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అత్తులూరి సుబ్బారావు, తాడువాయి రామకృష్ణ, గౌరు శ్రీనివాసరావు, రెడ్డి మురళికృష్ణ, వనమా ప్రభాకర్ పాల్గొన్నారు. -
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గుంటూరు ఎడ్యుకేషన్: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థులు, పాఠకులు రోజులో కొంత సమయాన్ని గ్రంథాలయంలో గడిపి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు. సోమవారం బృందావన్ గార్డెన్స్‌లోని మహిళా బాలల గ్రంథాలయలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రంథాలయాల్లో భద్రపర్చిన పురాతన గ్రంథాలు చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయన్నారు. ప్రస్తుతం గ్రంథాలయాలకు వచ్చే విద్యార్థులు, పాఠకుల సంఖ్య తగ్గిపోతోందని, ఇది సమాజానికి మంచిది కాదన్నారు. రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ ఎ.కృష్ణమోహన్ మాట్లాడుతూ వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థులకు పుస్తక పఠనంతో పాటు కథలు చెప్పడం, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, పెయింటింగ్, పేపర్ క్రాఫ్ట్, డాన్స్, జీకే తదితర అంశాల్లో శిక్షణ కల్పిస్తామని తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బారత్నమ్మ మాట్లాడారు. కార్యక్రమంలో ఏవీకే సుజాత, పౌర గ్రంథాలయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సీహెచ్ దీక్షితులు, జిల్లా గ్రంథాలయ సంస్థ సీనియర్ అసిస్టెంట్ మల్లంపాటి సీతారామయ్య, విశ్రాంత గ్రంథ పాలకుడు ఎస్ఎం సుభానీ, అధ్యాపకుడు శివారెడ్డి, మహిళా బాలల గ్రంథాలయ అధికారులు బి.శకుంతల, పి.సత్య శిరీష, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఎఫ్‌సీఐ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర చైర్మన్‌గా ‘బందా’
రవీంద్రనాథ్‌కు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి శుభాకాంక్షలు పట్నంబజారు: పదవీ విరమణ తమ బాధ్యతలు ముగిశాయని అని కాకుండా, సామాజిక సేవతో పది మందికి మేలు చేసేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ అభినందనీయులని ఎమ్మెల్సీ, స్ఫూర్తి ఫౌండేషనన్ వ్యవస్థాపకులు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అందుకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) విశ్రాంత ఉద్యోగుల నడవడికే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఎఫ్‌సీఐ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఛైర్మన్న్గా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్ తిరిగి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు అమరావతి రోడ్డులోని మల్లేశ్వరి ఫంక్షన్ హాలులో సోమవారం జరిగిన రాష్ట్ర సమావేశంలో ఈమేరకు ఎన్నికలు నిర్వహించారు. విశాఖపట్నంకు చెందిన ఆలిండియా వైస్ చైర్మన్ ఏఎస్ రామారావు, తాడేపల్లిగూడెంకు చెందిన కె సుధాకరరావు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. బందా రవీంద్రనాథ్‌తోపాటు రాష్ట్ర వైస్ చైర్మన్న్గా రాజమండ్రికి చెందిన కె.నాగేశ్వరరావు, కార్యదర్శిగా భీమవరానికి చెందిన జి గోపాలరావు, సహాయ కార్యదర్శిగా విజయవాడకు చెందిన ఆర్ సాయిబాబు, కోశాధికారిగా పశ్చిమ గోదావరికి చెందిన డి మురళీమోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా చైర్మన్‌గా పి. యలమంద, కోశాధికారిగా ఎస్.ప్రభాకరరావు ఎన్నికయ్యారు. సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు బందా రవీంద్రనాథ్ మాట్లాడుతూ 1990 నుంచి యూనియన్ వ్యవహారాల్లో చురుకై న పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. అనేక హోదాలలో పనిచేస్తూ 2022లో విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర చైర్మన్‌గా ఎంపికై నట్లు చెప్పారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో తనను తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్న విశ్రాంత ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో యూనియన్ నేతలు నల్లయ్య, నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
మే 3న డీఎస్సీపై అవగాహన సదస్సు
లక్ష్మీపురం: డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మే మూడో తేదీ సాయంత్రం 4గంటలకు గుంటూరు బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో డీఎస్సీపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని, అభ్యర్థులందరూ హాజరై జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు కోరారు. గుంటూరు బ్రాడీపేటలోని డీవైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో అవగాహన సదస్సు పోస్టర్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ ఆందోళన ఫలితంగా డీఎస్సీ నోటిఫికేషన్న్ వచ్చిందన్నారు. నోటిఫికేషనన్పై అభ్యర్థులు 4 ప్రధాన అభ్యంతరాలను తెలుపుతున్నారన్నారు. సదస్సుకు హాజరయ్యే అభ్యర్థులకు ఎడ్యుకేషన్న్సైకాలజీ, ఎస్జీటీ అభ్యర్థులకు గణితంపై కంటెంట్ బుక్ ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ వై.కృష్ణకాంత్ మాట్లాడుతూ పోటీ పరీక్షల నిపుణులు కె.ఎస్.లక్ష్మణరావు, సబ్జెక్ట్ నిపుణులు పాల్గొని వివరిస్తారని తెలిపారు. వివవరాల కోసం 9490099992 నంబర్లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో జిల్లా నాయకులు ఎం.కిరణ్, ఎస్.కె.సమీర్, ఎస్.పద్మ, సుభానీ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులు సత్వరం చెల్లించాలి లక్ష్మీపురం: ఐదు నెలల పెండింగ్ వేతనాలు సత్వరమే చెల్లించాలని డిమండ్ చేస్తూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం గుంటూరులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2024 డిసెంబర్ నుంచి నేటి వరకు జీతాలు, బిల్లులు పడకపోవడం వల్ల మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు పిల్లలకు పౌష్టికాహారం అందించాలని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం, పౌష్టికాహారం అందించడానికి తోడ్పడే మధ్యాహ్న భోజన కార్మికులపై వివక్ష చూపించడం మానుకోవాలన్నారు. ఐదు నెలల నుంచి బిల్లులు రాకపోతే కుటుంబాలు గడుస్తాయని ఆలోచన చేయకపోవడం విచారకరమన్నారు. అనంతరం గ్రీవెన్స్ వినతి పత్రం అందించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు, యూనియన్ నాయకులు చింతల శ్రీనివాసరావు, మర్రి లక్ష్మి, రెడ్డి రమణమ్మ, జ్యోతి, ముక్తేశ్వరమ్మ, సుబ్బాయమ్మ తదితరులు పాల్గొన్నారు. యూబీఐ మెగా ఎంఎస్ఎంఈ క్యాంపు కొరిటెపాడు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం జీటీ రోడ్డులోని యూబీఐ రీజనల్ కార్యాలయంలో మెగా ఎంఎస్ఎంఈ, కాసా అవుట్ రీచ్ క్యాంపు నిర్వహించారు. యూబీఐ జనరల్ మేనేజర్ రేణు నాయర్ చేతుల మీదుగా ఎంఎస్ఎంఈ రుణ గ్రహీతలకు రూ.100 కోట్ల రుణ మంజూరు పత్రాలు అందజేశారు. యూబీఐ జనరల్ మేనేజర్ రేణు నాయర్ మాట్లాడుతూ ఖాతాదారుల సౌకర్యార్థం యూబీఐ సేవలను మరింత విస్తరించనున్నట్లు స్పష్టం చేశారు. మహిళ రుణ గ్రహీతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రుణ గ్రహీతలందరిని బ్యాంకు ద్వారా ప్రోత్సహించడం గర్వనీయమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో యూబీఐ రీజనల్ హెడ్ ఎస్.జవహర్, డెప్యూటీ రీజనల్ హెడ్స్ అశ్వర్ధ నాయక్, ఏ.రాజేష్, ఎంఎల్పీహెడ్ హరేరామ్షా, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. తెనాలిలో ఆటోడ్రైవర్ దారుణ హత్య తెనాలిరూరల్: తెనాలి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి కత్తి, ఇటుకలతో దాడి చేసి హతమార్చారు. మల్లెపాడు పంచాయతీ పరిధిలోని వెలగ్గుంట చెరువులో ఆదివారం రాత్రి ఘటన జరిగింది. సోమవారం మధ్యాహ్నం అటుగా వెళ్లిన వారు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. త్రీ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి మెడ చుట్టూ, తలమీద కత్తులతో పొడిచిన ఆనవాళ్లు ఉన్నాయి. గుంటూరు నుంచి వచ్చిన క్లూస్ టీం ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించింది. మృతుడిని మండలంలోని జగ్గడిగుంటపాలెం పంచాయతీ పరిధిలోని టిడ్కో గృహాల్లో నివసించే గండికోట రాజు(25)గా గుర్తించారు. కుటుంబ కలహాల నేపధ్యంలో హత్య జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో పూర్తి వివరాలు తెలిస్తాయని సీఐ ఎస్.రమేష్‌బాబు తెలిపారు. -
నిత్యాన్నదాన పథకానికి రూ.1,11,116 విరాళం
పెదకాకాని: శివాలయంలో అన్నదాన పథకానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని శివాలయం డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ అన్నారు. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న నిత్య అన్నదాన పథకానికి గుంటూరు కొరిటెపాడుకు చెందిన పూనూరు బసివిరెడ్డి, శైలజ దంపతులు రూ.1,11,116 అందజేశారు. ఈ విరాళం మొత్తాన్ని పూనూరు మాలకొండారెడ్డి జ్ఞాపకార్థం ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్‌కు అందజేశారు. డీసీ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి, నిత్య అన్నదాన పథకానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. దాతలకు ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం చేయించి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటం అందజేశారు. -
ఆశ కార్యకర్తలకు యూనిఫాం పంపిణీ
గుంటూరు మెడికల్: జిల్లాలోని 1195 మంది ఆశ కార్యకర్తలకు ఒక్కొక్కరికి రెండు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన యూనిఫాం(చీరలు) డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి సోమవారం పంపిణీ చేశారు. స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ దాసరి శ్రీనివాసులు, డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇ.అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి రత్నశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ విజయప్రకాష్, డాక్టర్ జయరామకృష్ణ, డాక్టర్ ప్రియాంక, చంద్రశేఖర్, సురేష్ పాల్గొన్నారు. రేపు గుంటూరులో జాబ్‌మేళా గుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్లలోని గుంటూరు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డి.దుర్గాబాయి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్ఆర్ పాలిమర్స్, జెడ్ఎం క్యూర్ కోడ్ సర్వీసెస్, సిగ్నెట్ ఎలక్ట్రికల్స్, అను హాస్పిటల్స్, ఫెయిర్‌డీల్ క్యాపిటల్, సెవెన్ హిల్స్ ఫార్మసీ సంస్థల్లో ఉద్యోగాలకు టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, పీజీ వరకు చదువుకున్న 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు బయెడేటా, రెజ్యూమ్, విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు జరగనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివకాలకు 98668 22697 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. జీడీసీసీబీ చైర్మన్‌గా మక్కెన కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(జీడీసీసీబీ) చైర్మన్‌గా వినుకొండ నియోజకవర్గానికి చెందిన మాజీ శాసనసభ్యుడు మక్కెన మల్లికార్జునరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మల్లికార్జునరావు 2004 నుంచి 2009 వరకు వినుకొండ ఎమ్మెలేగా పనిచేశారు. గుంటూరు జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(జీడీసీఎంఎస్) చైర్మన్‌గా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన వడ్రాణం హరిబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఇరువురు ఒకటి, రెండు రోజుల్లో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లు పరిశీలన తాడికొండ: మే 2వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించేందుకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీర పాండ్యన్, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తదితరులు పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లు, వీవీఐపీలు, ప్రజలు ప్రయాణించే మార్గాలు, వాహనాల పార్కింగ్‌కు సంబంధించిన ప్రాంతాలను పరిశీలించి చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఆర్డీవో కె శ్రీనివాసరావు, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి, రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. రేపటి నుంచి బగళాముఖి అమ్మవారి కొలుపులు చందోలు(కర్లపాలెం): చందోలులో శ్రీ బగళాముఖి అమ్మవారి వార్షిక కొలుపులు(తిరునాళ్ల) ఈనెల 30వ తేదీ నుంచి మే 5 వరకు జరుగుతాయని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, మేనేజర్ నరసింహమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
అర్జీదారులతో మర్యాదగా మెలగండి
డీఆర్ఓ షేక్ ఖాజావలి గుంటూరు వెస్ట్: అర్జీలు ఇచ్చేందుకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డీఆర్ఓ అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ అర్జీల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. అనంతరం వచ్చిన 184 అర్జీలను డీఆర్‌ఓతో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి, డీపీఓ సాయి కుమార్, స్టెప్ సీఈఓ చంద్రముఖి, జిల్లా అధికారులు పరిశీలించారు. ఆదారం లేదు.. ఆదుకోండి నా రెండు కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. తండ్రి లేరు. అమ్మ కుట్టుమిషన్ సంపాదనతో నెట్టుకొస్తున్నాం. రోజులు భారంగా గడుస్తున్నాయి. ఉండడానికి ఇల్లు కూడా లేదు. నాకు చిన్న ఇల్లు ఇప్పించండి. – సీహెచ్ మౌనిక, తల్లి విజయలక్ష్మి, గుంటూరు కాళ్లు విరగ్గొట్టారు.. పౌరహిత్యం చేసుకుని ఉన్నదాంట్లో తింటూ నెట్టుకొస్తున్నాం. ఇంటి నిర్మాణ సమయంలో మెట్ల ఉమాదేవి అనే మహిళ వద్ద నగదును అప్పుగా తీసుకుని 85 శాతానికి పైగా చెల్లించినా ఆమె రౌడీయిజం చేస్తుంది. రెండు రోజుల క్రితం ఇంటిపై దాడికి వచ్చి కాళ్లు విరగ్గొట్టించింది. నా బిడ్డలపైనా చేయిచేసుకున్నారు. పోలీసులు పట్టించుకోవడంలేదు. కాపాడండి – ఘంటసాల పార్వతీ నందన్, కుటుంబ సభ్యులు, పొన్నూరు -
ఇదీ ఓ గెలుపేనా..?
పట్నంబజారు: కేవలం తొమ్మిది నెలల మేయర్ పదవి కోసం నానా గడ్డి కరిచి, కక్కుర్తి పడాల్సిన అవసరం కూటమి నేతలకు వచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేయర్ ఎన్నికకు సంబంధించి అచ్చాల వెంకటరెడ్డిని మేయర్ అభ్యర్ధిగా పార్టీ అధిష్టానం నిర్ణయించిందని, వైఎస్సార్ సీపీకి 27 ఓట్లు రాగా, 34 ఓట్లు వచ్చాయని తెలిపారు. అయితే కేవలం 11 మంది కార్పొరేటర్లు మాత్రమే కూటమికి ఉన్నారని, వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన 17 మందిని అక్రమంగా ప్రలోభాలకు గురి చేసి కొనుగోలు చేసి, ఏకంగా ఎంపీ, ఎమ్మెల్యేలు వెళ్లి వారికి కండువాలు కప్పారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు గైర్హాజర్ కావటంపై అనుమానాలు ఉన్నాయన్నారు. నిస్సిగ్గుగా కొనుగోలు చేశారు.. 2021 ఎన్నికల్లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కేవలం 12 మంది ఉన్న కూటమి, నిస్సిగ్గుగా వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను కొనుగోలు చేసిందన్నారు. ఫ్యాను గుర్తుపై గెలిచి, కూటమితో అంటకాగుతున్న కార్పొరేటర్లు, మీ అవసరం తీరాక వదిలేస్తారన్న విషయాన్ని గుర్తించాలని, గెలిచిన పార్టీని మోసం చేసిన మిమ్మల్ని ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. కూటమిది అనైతిక విజయం విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని, కూటమిది అనైతిక విజయమని, అసలు ఇదీ విజ యమే కాదన్నారు.ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందిన కాండ్రుగుంట గురవయ్య సైతం వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచారని, పార్టీ గుర్తుపై గెలిచిన మీకు ఆ మాత్రం బుద్ధి లేదా అని సూటిగా ప్రశ్నించారు. అనైతిక విజయాన్ని మూటగట్టుకున్న కూటమి ప్రభు త్వం మూల్యం చెల్లించుకోకతప్పదని ప్రశ్నించారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో సైతం ఇదే విధంగా సిగ్గులేకుండా వ్యవహరించారన్నారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించిన కార్పొరేటర్ల అంశాన్ని అధిష్టానం, రీజనల్ కో–ఆర్డినేటర్ దృష్టికి తీసుకుని వెళ్తామని స్పష్టం చేశారు. ప్రలోభాలతో గెలిచారు వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ మరోసారి టీడీపీ జంపింగ్ జపాంగ్‌ల పార్టీ అని నిరూపించుకుందని విమర్శించారు. ప్రలోభాలకు గురి చేసి గెలిచిన గెలుపు ఒక గెలుపేనా అని మండిపడ్డారు. 24 మంది కార్పొరేటర్లు నిజాయితీ, నిబద్ధతతో పార్టీకి అండగా నిలిచారని వారికి అభినందనలు తెలిపారు. మేయర్‌గా పోటీ చేసిన అచ్చాల వెంకటరెడ్డి మాట్లాడుతూ తనను అభ్యర్ధిగా నిలబెట్టిన వైఎ స్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి, తనకు ఓట్లు వేసి ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, కార్పొరేటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, నగర డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు, కార్పొరేటర్లు పడాల సుబ్బారెడ్డి, రామబోయిన అజయ్‌యాదవ్, కాండ్రుగుంట గురవయ్య, ఈచంపాటి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తొమ్మిది నెలల పదవి కోసం ఇంత కక్కుర్తా ? కూటమి విజయం అనైతికం, అప్రజాస్వామికం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
స్పౌజ్ పేరిట కొత్త మెలిక
నెహ్రూనగర్: వితంతువులకు పింఛన్లు మంజూరు చేసి వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాల్సిన కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా చర్యలు చేపట్టింది. వితంతు పింఛన్ల మంజూరును ఓ తంతుగా మార్చింది. స్పౌజ్ కేటగిరీలోనే పింఛన్లు మంజూరు చేసేందుకు ఏర్పాటు చేస్తోంది. ఏదైనా కేటగిరీలో పింఛన్ పొందుతున్న భర్త మృతి చెందితే, అతని భార్యకు మాత్రమే పింఛన్ మంజూరు చేసేలా నిబంధనలు విధించింది. దరఖాస్తులు స్వీకరిస్తే ఒట్టు కూటమి అధికారం చేపట్టిన తరువాత కొత్త పింఛన్లను మంజూరు చేయలేదు. కనీసం అర్హుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించిన పాపాన పోలేదు. తాజాగా స్పౌజ్ కేటగిరీ పేరుతో వితంతు పింఛన్ల మంజూరు అంటూ అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే ఇక్కడా ఓ మెలిక పెట్టింది. ఏదైనా కేటగిరీలో పింఛన్ పొందుతూ భర్త మరణించిన భార్యకు స్పౌజ్ కేటగిరీ పేరుతో పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. అది కూడా నిర్ధిష్ట కాలానికి మాత్రమేనని మెమోలో స్పష్టం చేసింది. ఎవరైనా వ్యక్తి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పొందుతూ డిసెంబర్ 2023 నుంచి అక్టోబర్ 2024 మధ్య చనిపోతే అతని భార్యను స్పౌజ్ కేటగిరీ కింద అర్హురాలిగా గుర్తిస్తారు. అక్టోబర్ తర్వాత భర్త మరణించిన మహిళకు పింఛన్ లేనట్లే. ఇది కూటమి ప్రభుత్వం వితంతు పింఛన్లకు విధించిన షరతు. ఇక సాధారణంగా ఎటువంటి సామాజిక పింఛన్ పొందని వారి కుటుంబాల్లో భర్త చనిపోయినా వారికి వితంతు పింఛన్ మంజూరు ఇప్పట్లో లేనట్లేనని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. 50 ఏళ్లకే పింఛన్ అమలు హుళ్లక్కే! గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 2,52,715 మందికి పింఛన్లు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో సుమారు 7వేల దాకా పింఛన్లు ఆగిపోయాయి. ప్రస్తుతం స్పౌజ్ కేటగిరీ కింద 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య 3,437 మంది పింఛన్‌దారులు చనిపోయారని, వారి భార్యలు స్పౌజ్ కేటగిరీ కింద సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికీ 50 ఏళ్లు నిండిన వారు పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. వారి నుంచి ప్రభుత్వం కనీసం దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. వైఎస్సార్ సీపీ హయాంలో... గత ప్రభుత్వం వలంటీర్, సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిం సంక్షేమ పథకాలను అర్హుల ఇళ్లకే డోర్ డెలివరీ చేసింది. 50 ఇళ్లకో వలంటీర్‌ను నియమించి ఆయా కుటుంబాల్లో అర్హత ఉన్న వారిని పథకాలకు దరఖాస్తు చేయించేవాళ్లు. 35 ఏళ్ల వయస్సు పైబడిన మహిళలకు భర్త చనిపోతే ఆ మరుసటి నెలలోనే వితంతు పింఛన్ అందించేవారు. కూటమి ప్రభుత్వంలో ఇలా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క సామాజిక పింఛన్ కూడా మంజూరు కాలేదు. పది నెలలుగా దరఖాస్తులు కూడా స్వీకరించలేదు. పైగా స్పౌజ్ కేటగిరీ పేరుతో వితంతువులకు నిబంధనలు విధించడంతో అర్హత కలిగిన వితంతువులు పింఛన్లు పొందలేని పరిస్థితి నెలకొంది. పింఛన్ల కోసం దరఖాస్తు చేసేందుకు వారం వారం అర్హులు ప్రభుత్వ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వారికి ఎదురుచూపులు తప్పేలా లేవు వితంతు పింఛన్ అర్థమే మార్చివేసిన కూటమి ప్రభుత్వం ఏ దేనీ పింఛన్ పొందుతూ మృతిచెందిన భర్త స్థానంలోనే భార్యకు పింఛన్ 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య చనిపోయిన వారి భార్యలే దరఖాస్తు చేయాలంటూ మెలిక స్పౌజ్ కేటగిరీ పేరుతో వితంతు పింఛన్లు మంజూరు ఈ నెలఖారులోగా దరఖాస్తు చేసుకోవాలి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం స్పౌజ్ కేటగిరీ కింద 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య 3,437 మంది పింఛన్‌దారులు చనిపోయారు. వారి భార్యలు స్పౌజ్ కేటగిరీ కింద సచివాలయంలో ఈ నెలఖారులోగా దరఖాస్తు చేసుకోవాలి. – విజయలక్ష్మీ, పీడీ, డీఆర్డీఏ -
నగర మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర
● 63 మంది సభ్యులకు 61 మంది హాజరు ● ఇద్దరు వైఎస్సార్ సీపీ సభ్యులు గైర్హాజరు ● కూటమి అభ్యర్థి కోవెలమూడికి 34, వైఎస్సార్ సీపీ అభ్యర్థి అచ్చాల వెంకటరెడ్డికి 27 ఓట్లు నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ 7వ మేయర్‌గా టీడీపీ నుంచి కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం ప్రిసైడింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ తేజ ఆధ్వర్యంలో గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు మేయర్ ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల ప్రత్యేక సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులు కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు చంద్రగిరి ఏసురత్నం, లేళ్ల అప్పిరెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యేలు మహ్మద్ నసీర్, డాక్టర్ బి.రామాంజనేయులు, గల్లా మాధవి, కార్పొరేటర్లు హాజరయ్యారు. ముందుగా ఎన్నికల అధికారి సభ్యుల హాజరు సేకరించారు. సమావేశానికి 61 మంది హాజరవ్వగా, కోరం సగ భాగం ఉన్నందున ప్రిసైడింగ్ అధికారి మేయర్ ఎన్నికకు సంబంధించి టీడీపీ నుంచి కోవెలమూడి రవీంద్ర, వైఎస్సార్ సీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి పోటీలో ఉన్నారని ప్రకటించారు. రవీంద్రకు 34, వెంకటరెడ్డికి 27 ఓట్లు.. కోవెలమూడి రవీంద్రను ప్రత్తిపాడు ఎమ్మెల్యే బి.రామాంజనేయులు ప్రతిపాదించగా 13 డివిజన్ కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు బలపరిచారు. అచ్చాల వెంకటరెడ్డిని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం ప్రతిపాదించగా 45వ డివిజన్ కార్పొరేటర్ యక్కలూరి మారుతి బలపరిచారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోవెలమూడి రవీంద్రకు 34, వైఎస్సార్ సీపీ అభ్యర్థి అచ్చాల వెంకటరెడ్డికి 27 ఓట్లు వచ్చాయి. అత్యధిక ఓట్లు వచ్చిన టీడీపీ అభ్యర్ధిర్థి కోవెలమూడి రవీంద్ర మేయర్‌గా విజయం సాధించినట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించి, ఽధ్రువీకరణ పత్రం అందించి, మేయర్‌గా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం రవీంద్ర మేయర్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, కౌన్సిల్ సెక్రటరి బి.శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ పద్మనాభరావు తదితరులు పాల్గొన్నారు. -
టూడీ.. మళ్లీ రండీ!
గుంటూరుమంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025గుంటూరు మెడికల్: పేదల పెద్ద ఆసుపత్రిగా పేరొందిన గుంటూరు జీజీహెచ్‌లో గుండె జబ్బు నిర్ధారణ పరీక్షల కోసం పేద రోగులు నానా అగచాట్లు పడాల్సి వస్తుంది. అసలే ఓ పక్క గుండె జబ్బు ఉందనే భయం వెంటాడుతుంటే, మరోపక్క వైద్య పరీక్ష నిర్ధారణకు రోజుల తరబడి వేచి చూడాలని వైద్యులు తెలియజేస్తుండటంతో మరింత తీవ్ర ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సుమారు ఏడు జిల్లాలకు చెందిన పేద రోగులు గుండె జబ్బుల చికిత్స కోసం జీజీహెచ్‌కు ఎంతో ఆశతో వస్తుంటే, వారిని తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యేలా వైద్యులు, వైద్య సిబ్బంది పనితీరు ఉంది. రోగుల సహనానికి ‘పరీక్ష’ జీజీహెచ్‌లో గుండెజబ్బు నిర్ధారణకు తొలుత ఈసీజీ పరీక్ష చేసి అనంతరం టూడీ ఎకో పరీక్ష చేస్తారు. ఈ పరీక్ష నివేదిక ఆధారంగానే గుండెజబ్బును నిర్ధారించి మందులు ఇవ్వడమా, లేక యాంజియోగ్రామ్ చేసి మరింత చికిత్స అందించడమా అనేది నిర్ధారిస్తారు. టూడీ ఎకో పరీక్ష కోసం వచ్చే రోగులకు అవస్థలు తప్పడం లేదు. ఇన్ పేషెంట్ విభాగంలో టూడీ ఎకో పరీక్షల కోసం ఏర్పాటు చేసిన గది వద్ద సరిపడా గాలి, వెలుతురు లేకపోవడంతో వేసవి ఉక్కపోతలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సరైన వసతులు లేక, కనీసం నిలబడేందుకు కూడా స్థలం లేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జూనియర్ వైద్యులతోనే సరి! కార్డియాలజీ విభాగంలో విభాగాధిపతి, అసోసియేట్ ప్రొఫెసర్, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మొత్తం ఐదుగురు సీనియర్ వైద్యులు ఉన్నప్పటికీ గుండె జబ్బును నిర్ధారించే అత్యంత కీలకమైన టూడీ ఎకో పరీక్షను కేవలం పీజీ వైద్యులతోనే చేయిస్తూ సీనియర్ వైద్యులు సొంత ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓపీ విభాగంలో దాతల సహాయంతో టూడీ ఎకో మిషన్ ఏర్పాటు చేయించినప్పటికీ దానిని అలంకార ప్రాయంగా ఉంచి, రోగులందరిని ఇన్‌పేషెంట్ విభాగంలోకి తరలిస్తున్నారు. దీంతో అక్కడ తీవ్రమైన రద్దీ ఏర్పడుతోంది. ఏసీలు పనిచేయక అవస్థలు ఒక పక్క గుండె జబ్బు నిర్ధారణకే గంటలు, రోజులు వేచి చూస్తున్న రోగులు అష్టకష్టాలు పడి వార్డులో చికిత్స కోసం చేరితే అక్కడ ఏసీలు పనిచేయక ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఎక్కువ రోజులు చికిత్స పొందుతున్న రోగులు తామే సొంతంగా ఫ్యాన్లు కొనుగోలు చేసుకుని మంచాల వద్ద పెట్టుకుంటున్న దుస్థితి పెద్ద ఆసుపత్రిలో నెలకొంది. సీసీయూ విభాగంలో ఏసీలు పనిచేయక వైద్యులు, వైద్య సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి అధికారులు ఇకనైనా కళ్లు తెరిచి గుండె జబ్బు రోగుల కష్టాలు తొలగించేలా పనిచేయాలని పలువురు రోగులు కోరుతున్నారు. శనివారం ఇన్‌పేషెంట్ విభాగం వద్ద వైద్య పరీక్షల కోసం వేచి చూస్తున్న రోగులు మధ్యాహ్నం వరకే ..7న్యూస్‌రీల్ అలంకారప్రాయంగా ఓపీ విభాగంలోని ఎకో మిషన్ ఇన్‌పేషెంట్ విభాగం వద్ద తీవ్ర రద్దీ పరీక్షలు లేక చికిత్సకు జాప్యం జీజీహెచ్‌లో గుండెజబ్బుల రోగుల అవస్థలు పనిచేయని ఏసీలతో ఇక్కట్లుప్రతిరోజూ వంద మందికి మించి వైద్య పరీక్షలు చేయడం లేదు. అధిక సంఖ్యలో రోగులు వస్తే వారిని మరోరోజు రావాలంటూ డేట్లు ఫిక్స్ చేసి ఇళ్లకు పంపిస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిబంధనల ప్రకారం వైద్యులు పనిచేయాల్సి ఉంటుంది. కానీ కేవలం మధ్యాహ్నం భోజనం సమయం వరకే 2 గంటల్లోపే టూడీ ఎకో పరీక్షలను ఆపేస్తున్నారు. తద్వారా పేద రోగులు కేవలం పరీక్ష కోసమే రోజుల తరబడి, కొన్నిసార్లు ఉదయం వచ్చి మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సి వస్తుంది. ఏళ్ల తరబడి ఈ సమస్య పేద రోగులను వేధిస్తున్నా, ఆసుపత్రి అధికారులు సమస్య పరిష్కారమయ్యేందుకు ప్రణాళికా బద్ధంగా పనిచేయడం లేదని విమర్శలు ఉన్నాయి. గుండె జబ్బుకు నిర్ధారణ చాలా కీలకం కాబట్టి, రోగులకు ఏరోజు కారోజే టూడీ ఏకో పరీక్ష చేసేలా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణను వివరణ కోరగా కార్డియాలజీ విభాగంలో గుండె జబ్బు రోగులకు త్వరితగతిన వైద్య పరీక్షలు జరిగేలా చూస్తామని తెలిపారు. -
డిప్యూటీ కలెక్టర్‌ని.. టీడీపీ కోసం ఎంతో చేశా
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘నేను టీడీపీ సానుభూతిపరుడిని.. పార్టీ కోసం ఎంతో పనిచేశా. అయినా భూ వివాదంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పీఆర్వో మధు బెదిరించారు. అధికారిలా కాదు.. కనీసం మనిషిలా కూడా చూడలేదు’ అంటూ ఓ డిప్యూటీ కలెక్టర్ వాపోయాడు. ఈమేరకు ఓ ఆడియో కలకలం సృష్టిస్తోంది. సదరు డిప్యూటీ కలెక్టర్ గతంలో తాడికొండ ఎమ్మార్వోగా, కలెక్టర్ కార్యాలయంలో ఏవోగా పనిచేశారు.ప్రస్తుతం సెక్రటేరియేట్‌లో పని చేస్తున్నారు. ఆయన సమీప బంధువు విడాకులు తీసుకోవడంతో వారికి సంబంధించిన భూమిపై వివాదం నెలకొన్నట్లు తెలిసింది. చేబ్రోలు మండలంలోని సుమారు రూ.5 కోట్ల విలువ చేసే ఈ భూమి తనకు చెందేలా చూడాలని ఒక మహిళ.. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానిని ఆశ్రయించినట్లు సమాచారం. ఆయన ఆదేశాల మేరకు పీఆర్వో మధు సదరు డిప్యూటీ కలెక్టర్‌ను పెమ్మసాని కార్యాలయానికి పిలిపించుకున్నట్లు తెలిసింది. అక్కడ మధు మరో న్యాయవాదితో కలిసి తనను బెదిరించారంటూ డిప్యూటీ కలెక్టర్ ఓ వ్యక్తితో ఫోన్లో వాపోయారు. మినిస్టరే డీల్ చేయమన్నారంటూ బెదిరించారు! ‘నేను ఐదేళ్లు తాడికొండ ఎమ్మార్వోగా, రెండేళ్లు పెదకాకాని, ఒకటిన్నరేళ్లు వినుకొండ ఎమ్మార్వోగా పనిచేశా. తాడికొండలో ఉన్న టీడీపీ యంత్రాంగం మొత్తానికి నేను తెలుసు. టీడీపీకి ఎంత సేవ చేశానో అందరికీ తెలుసక్కడ. నేను డిప్యూటీ కలెక్టర్ కాకపోయి ఉంటే.. టీడీపీ నాయకులు నన్ను ఎమ్మార్వోగా అక్కడికి తీసుకెళ్లి ఉండేవారు. శ్రావణ్‌కుమార్ నా గురించి చెబుతారు. జీవీ ఆంజనేయులు నరసరావుపేట ఆర్డీవోగా నన్ను వేయాలని ఎన్నో సార్లు లోకేశ్‌ను అడిగారు. నన్ను ఎక్కడా.. ఎవరూ అగౌరవపరచలేదు. కానీ మధు(పెమ్మసాని పీఆర్వో) చాంబర్లో కూర్చోబెట్టి వ్యంగ్యంగా మాట్లాడారు. మినిస్టర్‌గారు ఉంటే ఇలా ఉండేది కాదన్నాను నేను. కానీ మినిస్టరే డీల్ చేయమన్నారంటూ పదేపదే బెదిరించారు. దీంతో నేను ఆ వారమంతా మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యాను.నా హోదాకు గౌరవం ఇవ్వకపోగా.. కనీసం మనిషిలా కూడా చూడలేదు’ అంటూ డిప్యూటీ కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ ఘటన జరిగి చాలా రోజులయ్యింది. కానీ డిప్యూటీ కలెక్టర్ ఆడియో తాజాగా వైరల్ కావడంతో స్థానికంగా కలకలం రేగింది. కేంద్ర సహాయ మంత్రికి తెలియకుండా ఒక చిరుద్యోగి.. డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తిని బెదిరించే అవకాశం లేదని.. అంతా ఆయనకు తెలిసే జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఆడియో టేపు కలకలం సృష్టించడంతో.. ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు పలువురు రంగంలోకి దిగారు. పెమ్మసానికి తెలియకుండా జరిగి ఉంటుందని.. ఆయన సోదరుడు మీతో మాట్లాడతారని.. ఈ విషయాలను మరెక్కడా బయటపెట్టవద్దని డిప్యూటీ కలెక్టర్‌ను కోరారు. ఆడియోలోని వాయిస్ తనది కాదని చెప్పాలంటూ డిప్యూటీ కలెక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. -
ఎల్ఈడీ లైట్లతో ప్రమాదం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): నిబంధనలకు నీళ్ళొదిలేస్తున్నారు.. కనీస ఆలోచన లేకుండా.. ఇతరుల ప్రాణాలకు ముప్పు అని తెలిసినా.. ఎల్ఈడీ లైట్ల వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. ద్విచక్ర వాహనాలు మొదలుకుని.. ఆటోలు, లారీలు, ప్రైవేట్ బస్సుల్లో లైట్ల వినియోగం పెచ్చుమీరుతోంది. అయినా పట్టించుకోవాల్సిన రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆరీ్టఏ) అధికారులు మాత్రం మొద్దు నిద్రపోతున్నారు. కొన్నాళ్ళ క్రితం గుంటూరు రూరల్ మండలం అంకిరెడ్డిపాలెం వద్ద ఒక బస్సులో అగి్నప్రమాదం జరిగింది. అయితే ప్రమాదానికి కారణం తెలిసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. నేరుగా ఇంజిన్ నుంచి ఎల్ఈడీ లైట్లకు వైర్లు అనుసంధానం చేయటం ద్వారానే ప్రమాదం జరిగిందని గుర్తించారు.ఆ ప్రమాదంలో బస్సు దగ్ధమై, ప్రయాణికులు మాత్రం స్వల్ప గాయాలతో బయట పడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాహనాలకు సంబంధించి ఎల్ఈడీ లైట్ల వినియోగాన్ని పూర్తిస్థాయిలో నిషేధిస్తూ.. కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. భారీ ఫోకస్ వచ్చే లైట్లు వినియోగించటం ద్వారా ఎదురుగా వచ్చే వాహనదారులకు కనపడకపోవటంతోపాటు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు 90శాతం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కేవలం కంపెనీల ఫోకస్ లైట్లు ఇచ్చిన వాటి వరకే వినియోగించాలనేది చట్టం. అదనపు ఫిట్టింగ్‌లు చేయకూడదని స్పష్టంగా నిబంధనలు ఉన్నప్పటీకీ.. వాహనదారులు యథేచ్ఛగా దురి్వనియోగం చేస్తున్నారు.వాహనాల చట్టం 1988 (మోటార్ వెహికల్ యాక్ట్) ప్రకారం వాహనాల్లో అనుమతించని మార్పుల్లో ఎల్ఈడీ లైట్లు వినియోగం ఒకటి. ఈ చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం వాహనాల నిర్మాణం, ఫీచర్లలో అనుమతి లేకుండా మార్పులు చేయటం చట్ట విరుద్ధం. ఎల్ఈడీ లైట్లు హాలోజెన్ లైట్ల కంటే అధికంగా ప్రకాశిస్తాయి. తద్వారా ఇతర డ్రైవర్లకు గందరగోళం ఏర్పడటంతోపాటు, అంధత్వాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఆర్టీఏ, ట్రాఫిక్ నిబంధనల ప్రకారం అధికమైన వాట్స్, అన్ అప్రూవ్డ్ లైట్లు నిషేధించిన పరిస్థితులు ఉన్నాయి. కారుల్లో 75 వాట్స్, లారీలకు 100 వాట్స్, బైక్‌లకు 10 వాట్స్‌లోపు మాత్రమే లైట్ల వినియోగం ఉండాలి. జైలు శిక్షకు కూడా అవకాశం ఆర్టీఏ రూల్ ప్రకారం ఎల్ఈడీ లైట్లు వినియోగం చేపడితే వాహనాన్ని సీజ్ చేయటంతోపాటు జరిమానా విధించవచ్చు. జరిమానా రూ.1,000 నుంచి రూ.పదివేల వరకు పడే అవకాశం ఉంది. కొద్ది కాలం క్రితం బెంగళూరుతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కేవలం వారం రోజుల వ్యవధిలో 8వేల కేసులు నమోదు చేశారంటే ఎల్ఈడీ లైట్ల వినియోగం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. లైట్ల వినియోగం ద్వారా ఒక్కోసారి జైలు శిక్షకు దారి తీసే అవకాశాలు లేకపోలేదు.అడ్డగోలుగా అమ్మకాలు..మోటార్ వెహికల్ షాపుల్లో ఎల్ఈడీ లైట్ల విక్రయాలు చేపట్టకూడదని నిబంధనలు చెబుతున్నాయి ఆయా వాహనాన్ని బట్టి దాని వినియోగానికి సరిపడా వాట్స్ కంటే అధిక ప్రమాణాలు ఉండకూడదని నిబంధనలు ఉన్నాయి. రోడ్డు మంత్రిత్వ శాఖ (మినిస్టరీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే లైట్లు వినియోగించాలి. అయితే దీనిపై చర్యలు తీసుకునేందుకు ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసులకు అధికారం ఉంది. అయినా కనీస చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఇటీవల కాలంలో కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు. ఎల్ఈడీ లైట్లు వినియోగిస్తే చర్యలు నిబంధనలకు విరుద్ధంగా హెవీ ఫోకస్ ఉన్న ఎల్ఈడీ లైట్లు వినియోగిస్తే చర్యలు తీసుకుంటాం. కచ్చితంగా కేసులు నమోదు చేయటంతోపాటు, వాహనాలను సీజ్ చేస్తాం. అధిక వెలుగు వచ్చే లైట్లు వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువ. కంపెనీలు అమర్చిన లైట్లు మినహా ఏ ఒక్కరూ విడిగా ఎల్ఈడీ లైట్లు పెట్టుకోకూడదు. ఇష్టానుసారంగా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. –ఎం. రమేష్ (గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ) -
కదంతొక్కిన కోకో రైతులు
కొరిటెపాడు(గుంటూరు): కూటమి ప్రభుత్వ తీరుపై కడుపు మండిన కోకో రైతులు సోమవారం కదం తొక్కారు. వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ధరల ఒప్పంద ప్రకటన చేయకపోవడంపై ఆగ్రహించిన రైతులు గుంటూరులోని ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ మాట్లాడుతూ.. కోకో గింజలు కొనే కంపెనీలు రోజురోజుకూ ధరలు తగ్గిస్తుండడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఈ నెల 3న జరిగిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. ఈనెల 7న కోకో గింజల ధరల ఒప్పంద ప్రకటన వస్తుందని ఎదురు చూశామన్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఒప్పంద ప్రకటన చేయలేదని మండిపడ్డారు. మోండలీజ్ కంపెనీ ప్రతినిధులు కిలో కోకో గింజలను రూ.550కు కొనుగోలు చేస్తామని మంత్రి సమక్షంలో చెప్పి.. అమలు చేయలేదన్నారు. పైగా మరో రూ.50 ధర తగ్గించారని మండిపాడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజల ధర రూ.750కు పైగా ఉందని.. రాష్ట్ర రైతులకు కూడా ఆ మేరకు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. వారం, పది రోజుల్లో మళ్లీ కంపెనీలతో సమావేశం నిర్వహించి.. ధరలు తగ్గకుండా చర్యలు తీసుకుంటామని రైతులకు ఉద్యాన శాఖ రాష్ట్ర అసిస్టెంట్ డైరెక్టర్ హరినాథ్‌రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు వై.కేశవరావు, కె.శ్రీనివాస్, ఎస్.గోపాలకృష్ణ, పానుగంటి అచ్యుతరామయ్య పాల్గొన్నారు. -
గోరంట్ల మాధవ్‌కు ఊరట.. బెయిల్ మంజూరు
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఊరట లభించింది. మాధవ్‌తో పాటు ఆయన అనుచరులకు గుంటూరు కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి 20 వేలుతో కూడిన పూచీకత్తు పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే.. ఐటీడీపీ కార్యకర్త అయిన చేబ్రోలు కిరణ్‌పై దాడికి యత్నించారంటూ నగరంపాలెం పోలీసులు మాధవ్‌ను, ఆయన అనుచరులు ఐదుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తి రిమాండ్ విధించగా తొలుత రాజమండ్రి జైలుకు తరలించారు. అక్కడి ఆయనకు బెయిల్ లభించలేదు. తాజాగా ఆయన మరో పిటిషన్ వేయగా.. బెయిల్ మంజూరు అయ్యింది. -
చంద్రబాబు రోజురోజుకూ దిగజారిపోతున్నారు: అంబటి
గుంటూరు, సాక్షి: టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కారు. 57 డివిజన్లకుగాను మా సంఖ్యా బలం 44. 17 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను బెదిరించి తీసుకుపోయారు. చంద్రబాబు రోజురోజుకూ దిగజారిపోతున్నారు. విప్‌ను ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటాం. -
రేపు పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ భేటీ
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(మంగళవారం) పార్టీ జిల్లా అధ్యక్షులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ చర్చించే అవకాశం ఉంది. -
‘ప్రజాస్వామ్యాన్ని టీడీపీ కూనీ చేసింది’
తాడేపల్లి : ప్రజాస్వామ్యాన్ని టీడీపీ కూనీ చేసిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ఈరోజు(సోమవారం) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. టీడీపీ వైఖరికి ప్రజాస్వామ్య వాదులు సిగ్గు పడుతున్నారని ధ్వజమెత్తారు.‘స్థానిక సంస్థల్లో సజావుగా సాగుతున్న పాలనను చెడగొడుతున్నారు. ప్రజలు మెజారిటీ ఇవ్వనప్పుడు ఎందుకు అధికారం కోసం తాపత్రయం పడుతున్నారు?, తాడిపత్రిలో మా పార్టీకి అధికారం రాకపోయినా గౌరవించాం. మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి సైతం జగన్ ని మెచ్చుకున్నారు. కానీ నేడు ఏం జరుగుతుందో చూసి జనం నవ్వుతున్నారు.చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పంలో ఏరకంగా టీడీపీ గెలుస్తుంది?, మాచర్ల, కుప్పం, తుని, విశాఖపట్నం ఇలా అన్నిచోట్లా వైఎస్సార్ సీపీ సభ్యులే అధికంగా ఉన్నారు. మా సభ్యులను ప్రలోభపెట్టి, బెదిరించి టీడీపీ వైపు తిప్పుకున్నారు. ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారిని టీడీపీ వైపు లాక్కున్నారు. దొడ్డిదారిలో పదవులు కైవసం చేసుకోవటం సిగ్గుచేటు. విప్ ని ధిక్కరించిన వారిపై కోర్టుకు వెళ్తాం. పార్టీ పరంగా చర్యలు తీసుకుంటున్నాం. అడ్డదారిలో గెలవటం కీసం కూటమి నేతలు అనేక కుట్రలు చేశారు’ అని లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. -
లిక్కర్ కేసులో భేతాళ కథలు.. అన్నీ కుట్రలే: మనోహర్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణాన్ని బయట పెట్టినందుకే ఇప్పుడు పోటీగా కేసును పెట్టారని చెప్పుకొచ్చారు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. లిక్కర్ కేసులో భేతాళ కథలు, కుట్రలు తప్ప మరేమీ లేదని ఎద్దేవా చేశారు. దీనిపై ఎల్లో మీడియా అడ్డగోలుగా విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో లిక్కర్ స్కాం అంటూ ఎవరితోనో ఒక లెటర్ రాయించి కేవలం తొమ్మిది రోజుల్లోనే విచారణ చేసినట్టు చూపించారు. అసలు ఆ తొమ్మిది రోజుల్లో ఎవరెవరిని విచారణ చేశారో కూడా చెప్పలేదు. తాము ఇరికించాలనుకున్న వ్యక్తుల పేర్లను లిక్కర్ కేసులో వరుసగా పెట్టేస్తున్నారు. సిట్‌ని ఏర్పాటు చేస్తే దానికంటూ ప్రత్యేకంగా ఒక పోలీసు స్టేషన్ ఉండాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కానీ అవేమీ లేకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారుఅప్పటి ముఖ్యమంత్రిని కూడా కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్‌లోని అధికారులంతా పాలకులు చెప్పినట్టే కేసును నడిపిస్తున్నారు. గౌరవంగా బతికే పారిశ్రామికవేత్తలను కూడా వేధిస్తున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కాంని బయటపెట్టినందుకే పోటీగా ఇప్పుడు కేసును పెట్టారు. నేర అంగీకార పత్రాలపై రాజ్ కెసిరెడ్డి సంతకాలు చేయలేదు. దీన్ని కోర్టు కూడా గుర్తించింది. అయినప్పటికీ ఎల్లో మీడియా అడ్డగోలుగా విష ప్రచారం చేస్తోంది.జగన్ ప్రభుత్వ హయాంలో అత్యంత పారదర్శకంగా లిక్కర్ పాలసీ అమలైంది. చంద్రబాబు హయాంలో స్కాం జరిగినట్టు లెక్కలే తేల్చాయి. 53% మద్యాన్ని నాలుగు కంపెనీల ద్వారా కొనుగోలు చేయటం వెనుక కుట్ర దాగుంది. ఈ అక్రమాలపై విచారణకు కూటమి ప్రభుత్వానికి దమ్ముందా?. సీబీఐతో విచారణకు ముందుకు రాగలరా?. మా సవాల్ స్వీకరించే ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉందా?. జగన్ హయాంలో పారదర్శకంగా లిక్కర్ పాలసీ అమలైనందున అక్రమాలకు అవకాశం లేదు. కానీ మిథున్‌రెడ్డి సహా అనేక మందిని ఇబ్బందులు పెట్టాలని ప్రభుత్వం చూస్తోంది. పోలీసు అధికారులు చట్టప్రకారం చేయాల్సిన పని చేయటం లేదు. పారిశ్రామిక వేత్తల నుండి వైఎస్సార్సీపీ నేతల వరకు అందరినీ బెదిరిస్తున్నారు. తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసి, ఇబ్బందులు పెడుతున్న పోలీసులపై చర్యలు తప్పవు’ అంటూ హెచ్చరించారు. -
టీడీపీ నాయకుడి దురాగతం.. ఆస్తి కోసం అక్క, తల్లిపై దాడి
సాక్షి, చిలకలూరిపేట: ఆస్తి కోసం సొంత అక్క, తల్లిపైనే టీడీపీ యువనాయకుడు కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. వారం రోజుల క్రితం జరిగినదిగా తెలుస్తున్న ఈ ఘటన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చిలకలూరిపేట పట్టణ పోలీసులను ఆశ్రయించినా నిందితుడు స్థానిక ఎమ్మెల్యేకు అనుంగ అనుచరుడు కావడంతో పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటనపై బాధితుల కథనం ప్రకారం.. పట్టణంలోని పండరీపురానికి చెందిన టీడీపీ యువనాయకుడు చుండూరి ఉదయ్ వడ్డీ వ్యాపారం చేస్తాడు. రూ.3కోట్ల విలువ చేసే ఆస్తి వ్యవహారానికి సంబంధించి తల్లి, అక్క నాగలక్షి్మతో ఉదయ్‌కు వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో అతని తల్లి నాగలక్ష్మికి డబ్బు చెల్లించాలని అడిగారు. దీనికి ఉదయ్ అంగీకరించకపోవడంతోపాటు తల్లి, అక్కను కిందపడేసి కాళ్లతో కర్రలతో తీవ్రంగా కొట్టాడు. దీంతో బాధితురాలు నాగలక్ష్మి ఉదయ్ దాడికి పాల్పడిన దృశ్యాలతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగలేదని, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తమ ప్రాణాలు కాపాడాలని సోషల్‌మీడియా వేదికగా వేడుకున్నారు. ఈ విషయంపై అర్బన్ సీఐ పి.రమేష్‌ను ఫోన్లో వివరణ కోరగా బాధితులు పోలీసు స్టేషన్‌కు వచి్చన మాట వాస్తవమేనని అయితే, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వ్యవహారం మాట్లాడి రాజీ చేసుకుంటామని వెళ్లిపోయారని వివరించారు. బాధితులు కేసు నమోదు చేయమంటే నమోదు చేస్తామని వివరించారు. -
గండాలయ స్వామి కొండకు పోటెత్తిన భక్తులు
మంగళగిరి: మంగళాద్రి కొండపై వేంచేసి ఉన్న గండాలయ స్వామికి మొక్కితే ఎంతటి గండాన్నైనా గటెక్కిస్తాడని భక్తుల నమ్మకం. అమావాస్య ఆదివారం పూజలు నిర్వహిస్తే భక్తుల కోర్కెలు ఇట్టే తీరుస్తాడని ప్రసిద్ధి. దీంతో ఆదివారం కొండకు భక్తులు పోటెత్తారు. ఉదయం ఐదు గంటల నుంచే కొండకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. గండ దీపం వెలిగించారు. మంగళగిరి తాడేపల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి భక్తుల రాకతో కొండ కిటకిటలాడింది. బడులు తెరిచే నాటికి పాఠ్య పుస్తకాలు సిద్ధం గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాలలు తెరిచే నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తామని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక తెలిపారు. అమరావతి రోడ్డులోని ప్రభుత్వ పాఠ్య పుస్తక గోదాము నుంచి ఆర్టీసీ బస్సుల్లో మండలాలకు పాఠ్య పుస్తకాలను పంపించే కార్యక్రమాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. డీఈవో మాట్లాడుతూ ముద్రణ సంస్థల నుంచి జిల్లా కేంద్రంలోని పాఠ్య పుస్తక గోదాముకు వచ్చిన పుస్తకాలను మండలాలకు పంపుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా సెమిస్టర్–1లో ఉమ్మడి గుంటూరు జిల్లాకు ఇండెంట్ ప్రకారం 13.24 లక్షల పుస్తకాల్లో ఇప్పటి వరకు 7.50 లక్షల పుస్తకాలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠ్య పుస్తక మేనేజర్ వి. వజ్రబాబు, గుంటూరు ఈస్ట్ ఎంఈవో–1 అబ్దుల్ ఖుద్దూస్, ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం, సిబ్బంది పాల్గొన్నారు. రాహు కేతు పూజలకు భారీగా భక్తులు పెదకాకాని: శివాలయంలో అమావాస్య ఆదివారం సందర్భంగా రాహు కేతువులకు పూజలు జరిపించేందుకు అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలోని రాహుకేతువు పూజల్లో పాల్గొనేందుకు దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు వేకువ జామునే క్యూలైన్లలో బారులు తీరారు. ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం రాహుకాల సమయం వరకు 1,509 టికెట్లు విక్రయించినట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ తెలిపారు. రాహు కేతు పూజల ద్వారా ఆదివారం రూ. 7,54,500 ఆదాయం సమకూరిందన్నారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ పూజలతోపాటు అభిషేక పూజలు, అన్నప్రాసనలు, తలనీలాలు, వాహనపూజలు, అంతరాలయ దర్శనాలు, చెవిపోగులు తదితర ఇతర సేవలు ద్వారా రూ.9,10,000 ఆదాయం వచ్చినట్లు ఉప కమిషనర్ తెలిపారు. వేసవి విజ్ఞాన తరగతులు బ్రోచర్ ఆవిష్కరణ గుంటూరువెస్ట్: జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ వేసవి విజ్ఞాన తరగతులు బ్రోచర్‌ను ఆవిష్కరించారు. సోమవారం నుంచి జూన్ 6 వరకు 40 రోజులపాటు వేసవి విజ్ఞాన తరగతులు నిర్వహిస్తారన్నారు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు జరిగే ఈ తరగతులకు తమ పిల్లల్ని తల్లిదండ్రులు పంపాలన్నారు. ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ, ఉప గ్రంథ పాలకురాలు కె.ఝాన్సీ లక్ష్మి, లైబ్రేరియన్స్ ఎన్.నాగిరెడ్డి, విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
బాస్ లేని జిల్లా ఎస్బీ!
గుంటూరుసోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025తమ్ముళ్ల చెరవు..! ముప్పుతిప్పల ‘స్లాట్’ ఘనంగా అంకమ్మ తిరునాళ్ల రొంపిచర్ల: బుచ్చి బాపన్నపాలెం గ్రామంలోని అంకమ్మ ఆలయ తిరునాళ్ల ఆదివారం ఘనంగా జరిగింది. అమ్మ వారిని ప్రత్యేకంగా అలంకరించారు. మహిళా భక్తులు పొంగళ్లు చేసి మొక్కు చెల్లించుకున్నారు.మహంకాళి అమ్మవారికి విరాళం దుగ్గిరాల: కంఠంరాజు కొండూరులోని మహంకాళి అమ్మ వారికి గుంటూరుకు చెందిన శ్రీ వసుధ డెవలపర్స్ రూ.1,00,116 విరాళం ఆదివారం అందజేసింది.సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 514.40 అడుగుల వద్ద ఉంది. ఇది 139.2626 టీఎంసీలకు సమానం. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారి ఎ.భార్గవ్ తేజ నగరంపాలెం: డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారులు వీఆర్‌లోకి వెళ్లడం.. లేదా ఉద్యోగ విరమణ పొందడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. కొందరు డీఎస్పీలపై విమర్శలు వెల్లువెత్తడంతో సీఐలకు, కింది స్థాయి ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు దిశా నిర్దేశం చేసే వారు కనిపించడంలేదు. కొరవడిన పర్యవేక్షణ.. జిల్లాలోని ఎస్బీ పోలీస్ శాఖకు మనిషికి ఆయువు వంటిది. అటువంటి ఎస్బీలో డీఎస్పీలు ఎక్కువ కాలం విధులు నిర్వర్తించలేకపోతున్నారు. కనీసం ఒక ఏడాదైనా ఉండటం లేదు. మూడు నుంచి ఐదారు నెలల వరకే పరిమితమవుతున్నారు. గతంలో విధుల్లో ఉన్న ఇద్దరు డీఎస్పీల పరిస్థితి అలాగే మారింది. అనధికార మామూళ్లు, సొంత సిబ్బంది నుంచే వసూళ్ల పర్వానికి పాల్పడటంతో అప్పటి ఎస్బీ సీఐ నరసింహారావును సస్పెండ్ చేశారు. డీఎస్పీ సుభాష్‌ను వీఆర్‌లోకి పంపించారు. ఆయన సుమారు ఆరు నెలలు మాత్రమే విధులు నిర్వర్తించారు. అనంతరం డీఎస్పీలుగా టీవీ రత్నస్వామి, పోతురాజు పనిచేశారు. వీరిలో ఒకరు మూడు, మరొకరు ఐదు నెలలు పని చేశారు. అంతలోనే వారిద్దరూ ఉద్యోగ విరమణ పొందారు. ఇక కొద్ది నెలలు డీఎస్పీ పోస్ట్ ఖాళీగా ఉంది. కొన్నాళ్లు సీఐలే జిల్లా అంతటా పర్యవేక్షణ చేపట్టారు. మళ్లీ డీఎస్పీ పోస్టు ఖాళీ కూటమి ప్రభుత్వ హయాంలో గతేడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. ఈ బదిలీల్లో ఎస్బీ డీఎస్పీగా బి.సీతారామయ్యను నియమించారు. ఆయన సుమారు ఎనిమిది నెలలు విధులు నిర్వర్తించారు. ఇటీవల మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్ వ్యవహారంలో తలెత్తిన పరిణామాల దృష్ట్యా డీఎస్పీ సీతారామయ్యను వీఆర్‌కు పంపించారు. ఇందులో డీఎస్పీని వీఆర్‌కు, ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలు, ఏఎస్ఐ, హెచ్‌సీ, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటుంచి డీఎస్పీ పోస్ట్‌కు ఖాళీ అయ్యింది. డీఎస్పీని నియమించాలంటే రాష్ట్ర డీజీపీ ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. దీంతో ఎస్బీలో ఉన్న సీఐలు మాత్రమే ఏఎస్ఐలు, హెచ్‌సీలు, కానిస్టేబుళ్లను పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో.. జిల్లాలో నెలకొన్న పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగే ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు వంటి ముందస్తుగా సమాచారం సేకరించాల్సి ఉంది. ఇవన్నీ ఒక ఎత్తైతే నేరాల నియంత్రణకు సంబంధించి నిరంతర నిఘా ఉండాల్సిందే. వచ్చే నెల 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో వచ్చే వీవీఐపీలు, వీఐపీలు ఇతరత్రా ప్రముఖుల రాకతో మౌలిక సౌకర్యాల కల్పనపై తర్జనభర్జన పడుతున్నారు. ఐపీఎస్ అధికారులు, ఇతరత్రా బలగాలు ఉన్నప్పటికీ ఎస్బీకి సమర్థ డీఎస్పీని నియమించాల్సిన అవసరం ఉంది. పోలీస్ శాఖకు స్పెషల్ బ్రాంచి (ఎస్బీ) కీలకం. ముందస్తు సమాచారం చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంటుంది. ఆ విభాగం వారిచ్చే సమాచారంతో నేరాల నియంత్రణ చేసేందుకు అవకాశాలెక్కువ. పోలీస్ ఉన్నతాధికారులు సైతం నిఘా వ్యవస్థ అందించే సమాచారంతోనే ముందుకెళ్తారు. అటువంటి ఎస్బీ జిల్లాలో అస్తవ్యస్తంగా మారింది. గడిచిన రెండేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. పాలకుల శీతకన్ను.. 7న్యూస్రీల్మేయర్ ఎన్నిక ఏర్పాట్ల పరిశీలన నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికకు సోమవారం జరగనున్న ప్రత్యేక సమావేశానికి సంబంధించి సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ అధికారులను ఆదేశించారు. మేయర్ ఎన్నిక జరిగే నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాట్లను నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, కౌన్సిల్ సెక్రెటరీ బి.శ్రీనివాసరావు, డీఎస్పీ అజీజ్, లాలాపేట సీఐ శివ ప్రసాద్‌లతో కలిసి పరిశీలించారు. పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నిక ప్రత్యేక సమావేశానికి కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఉదయం 10:30 గంటలకు తమ గుర్తింపు కార్డులతో హాజరు కావాలని తెలిపారు. సభ్యులు మినహా ఇతరులను అనుమతించబోమని తెలిపారు. మొబైల్ ఫోన్లకు కూడా అనుమతి లేదన్నారు. సంస్థ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ర్యాలీలు, గుంపుగా రావడానికి వీలు లేదని చెప్పారు. తగిన చర్యలను జీఎంసీ, పోలీసు అధికారులు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. గత రెండేళ్లుగా కానరాని సరైన సారథి వీఆర్లు, ఉద్యోగ విరమణ వైపు మొగ్గు అరకొరగానే ముందస్తు సమాచారం సేకరణ కీలకమైన రాజధాని జిల్లా గుంటూరులో ఇదీ పరిస్థితి ఎస్బీ డీఎస్పీ పరిధిలో గుంటూరు పశ్చిమ, తూర్పు, దక్షిణ, ఉత్తర, తెనాలి, మంగళగిరి సబ్ డివిజన్లు ఉన్నాయి. జిల్లాలో రాష్ట్ర రాజధాని ఉంది. అసెంబ్లీ, హైకోర్టు కూడా ఇక్కడే కొలువుదీరాయి. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, మంత్రులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు ఎక్కువగా ఇక్కడే ఉంటారు. ఇటువంటి తరుణంలో ఎక్కడ ఏం జరుగుతోందనే ముందస్తు సమాచారం సేకరణలో సమర్థమైన గ్రూప్–1 డీఎస్పీని నియమించాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని గుంటూరు పశ్చిమ, తూర్పు సబ్ డివిజన్ డీఎస్పీ పోస్ట్‌లపై ఉన్న మక్కువ ఎస్బీ డీఎస్పీ పోస్ట్‌పై ఉన్నతాధికారులకు లేదు. దీంతో ముందస్తు సమాచారం సేకరణలో కొంతమేర అలస్యమవుతుందనే ఆరోపణలు లేకపోలేదు. -
ఇగ్నో కోర్సులతో ఉద్యోగావకాశాలు పుష్కలం
గుంటూరు ఎడ్యుకేషన్: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) అందిస్తున్న కోర్సులతో పుష్కలమైన ఉగ్యోగావకాశాలు లభిస్తున్నాయని ఇగ్నో ప్రాంతీయ కేంద్ర డైరెక్టర్ డాక్టర్ పి.శరత్చంద్ర పేర్కొన్నారు. పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాల ప్రాంగణంలోని ఇగ్నో అధ్యయన కేంద్రంలో ఆదివారం 2025 జనవరిలో భాగంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇండక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. శరత్చంద్ర మాట్లాడుతూ ఇగ్నో అందిస్తున్న వివిధ రకాల కోర్సుల గురించి వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో ఇగ్నో అందిస్తున్న మెటీరియల్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇగ్నో సైట్లో పొందుపరచి ఉంటుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని చక్కగా చదువుకోవాలని చెప్పారు. ఇగ్నో అధ్యయన కేంద్ర సమన్వయకర్త డాక్టర్ డీవీ చంద్రశేఖర్ మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా చదువుకోవాలనే లక్ష్యం కలిగిన వారు ఇగ్నో ద్వారా వారి ఆశయాన్ని నెరవేర్చుకోవాలని సూచించారు. ఇగ్నో వంటి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో చదవడం ద్వారా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్ట్ బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్స్ గురించి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో అధ్యయన కేంద్ర కౌన్సిలర్ డాక్టర్ ఎంఎస్ నారాయణ, సహాయ సమన్వయకర్తలు డాక్టర్ పి.దేవేంద్ర గుప్త, ఎం.మార్కండేయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
తెనాలి అర్బన్: వారంతా వివిధ రంగాల్లో స్థిరపడిన వారు. తమ మనుమళ్లు, మనుమరాళ్లుతో ఆడుకునే వారు ఒకే వేదికపై కలిసి చిన్ననాటి మధురస్మృతులను నెమరువేసుకుని సందడి చేశారు. తమ జీవితాల్లో జరిగిన కష్టసుఖాలను పాలుపచుకుని ఆనందంగా గడిపారు. దీనికి తెనాలి కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్ వేదికగా మారింది. 1974–75 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఆత్మీయ అలింగనాలు చేసుకున్నారు. ఆనాటి గురువులు పిచయ్య, రూతు, పిచ్చేశ్వరమ్మ, ప్రస్తుత ప్రధానోపాధ్యాయురాలు షేక్ మౌలాబీలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమాన్ని డాక్టర్ దానబోయిన కృష్ణసాయిబాబు, పట్టెల మల్లేశ్వరరావు, అన్నవరపు మధు, సజ్జా మధుసూదనరావు, చిన్నం హేమ చంద్రప్రసాద్, కొల్లిపర శంకరబాబు, గడ్డిపాటి కిషోర్‌లు పర్యవేక్షించారు. -
గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య
మేడికొండూరు: పేరేచర్లలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సేకరించిన సమాచారం మేరకు.. పేరేచర్ల విశ్వ భారతి కళాశాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తిని బండరాయితో తలపై బలంగా కొట్టి హత్య చేశారు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో మేడికొండూరు పోలీసులు సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తున్నారు. మృతుని వయస్సు సుమారుగా 45 – 50 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఆచూకీ తెలిసినవారు మేడికొండూరు పోలీసులను సంప్రదించాలని సీఐ తెలిపారు. ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి మేడికొండూరు: రోడ్డుపై వేగంగా వెళుతున్న ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో వ్యక్తి అక్కడక్కడ దుర్మరణం చెందిన సంఘటన మండలంలోని పాలడుగు అడ్డరోడ్డు వద్ద ఆదివారం జరిగింది. గుంటూరు నల్లకుంటకుకు చెందిన తమ్మిశెట్టి జక్కరయ్య (45) తన భార్యతో కలిసి సత్తెనపల్లి నుంచి గుంటూరుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. మార్గంమధ్యలో ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రయాణిస్తున్న జక్కరయ్య మృతి చెందాడు. ఆయన భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పందిళ్లమ్మ గుడిలో చోరీ వేటపాలెం: మండలంలోని పందిళ్లపల్లి శివారు పంట పొలాల్లో ఉన్న గ్రామ దేవత పందిళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. దొంగలు దేవస్థానం ముందు వైపుగల కటకటాల తాళాలు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. హుండీని కూడా పగలగొట్టి అందులోని నగదు, బీరువాని తెరచి అమ్మవారి నగలు ఎత్తుకెళ్లారని ఎస్ఐ ఎం. వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. చోరీకి గురైన మొత్తం విలువు రూ.30 వేలు ఉంటుందని పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్మాప్తు చేస్తున్నట్లు చెప్పారు. వివాహిత ఆత్మహత్యాయత్నం బల్లికురవ: కుంటుంబ కలహాలతో ఓ వివాహిత ఎలుకల మందు పేస్టు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి మండలంలోని చిన అంబడిపూడిలో జరిగింది. 108 సిబ్బంది, స్థానికుల సమాచారం మేరకు.. చిన అంబడిపూడి బీసీ కాలనీకి చెందిన పల్లపు అనూష ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు పేస్టు తిని అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనూష ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. స్కూటీని ఢీ కొట్టిన లారీ వ్యక్తి మృతి వేటపాలెం: వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీ కొట్టిన సంఘటనలో వ్యక్తి మతి చెందాడు. 216 జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో అక్కాయిపాలెం దగ్గరలో సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీస్ లు తెలిపిన వివరాల మేరకు... చీరాలకు చెందిన రాజు కృష్ణారెడ్డి(61) తన స్కూటీపై వేటపాలెం పని నిమిత్తం వచ్చాడు. పని ముగించుకుని రాత్రి తిరిగి బైపాస్ రోడ్డు మీదగా చీరాల బయలు దేరాడు. అక్కాయిపాలెం జంక్షన్ దగ్గరలో చీరాల వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. త్రీవ గాయాలతో ఉన్న వ్యక్తిని చీరాల ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కానిస్టేబుల్‌పై హత్యాయత్నం కేసులో ముగ్గురు అరెస్ట్
పరారీలో మరో రౌడీషీటర్ తెనాలిరూరల్: పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఇచ్చాడన్న కక్షతో కానిస్టేబుల్‌ను హత్య చేసేందుకు యత్నించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో రౌడీషీటర్ పరారీలో ఉన్నాడు. స్థానిక టూ టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ రాములనాయక్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణ వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కన్నా చిరంజీవిపై ఈ నెల 24న హత్యాయత్నం చేసిన చెంచుపేటకు చెందిన చేబ్రోలు జాన్ విక్టర్, మంగళగిరికి చెందిన షేక్ బాబూలాల్ అలియాస్ కరీముల్లా, అయితానగర్ కు చెందిన దోమ రాకేష్‌ను ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న రౌడీషీటర్ వేము నవీన్ అలియాస్ కిల్లర్ పరారీలో ఉన్నాడు. అయితానగర్‌లో ఉండే కానిస్టేబుల్ చిరంజీవి గతంలో త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించాడు. జాన్ విక్టర్‌పై టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ ఉంది. గంజాయి విక్రయం, దొంగతనం, కొట్లాట కేసులలో నిందితుడు. దోమ రాకేష్ కూడా చెడు వ్యసనాలకు బానిస. పలు కేసులలో నిందితుడు. కానిస్టేబుల్ చిరంజీవి గతంలో త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే సమయంలో గంజాయి సేవిస్తున్నారన్న కారణంగా జాన్ విక్టర్, దోమ రాకేష్‌లను పలు దఫాలు స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చిరంజీవిపై కక్ష పెంచుకున్న నిందితులు, అతనిని అంతమొందించాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితానగర్‌కు చెందిన రౌడీ షీటర్ వేము నవీన్ అలియాస్ కిల్లర్ సహాయం కోరారు. ఈనెల 24న జాన్ విక్టర్, దోమ రాకేష్‌ను అయితానగర్ రావాల్సిందిగా వేము నవీన్ కోరాడు. వారిరువురు కరీముల్లాను వెంటబెట్టుకొని అయితానగర్ చేరారు. నలుగురు కలిసి మద్యం తాగి, కానిస్టేబుల్ విధి నిర్వహణకు వెళ్లే సమయంలో అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. అయితానగర్ అంబేడ్కర్ విగ్రహం రోడ్డులో చిరంజీవి వస్తాడన్న విషయం తెలుసుకున్న నలుగురు రాత్రి 9.30 గంటల సమయంలో అక్కడ మాటు వేశారు. బైక్‌పై వెళుతున్న చిరంజీవిని అటకాయించారు. అతనితో వాగ్వావాదానికి దిగారు. అదే సమయంలో కరిముల్లా, రాకేష్ ఇరువురు చిరంజీవిని గట్టిగా పట్టుకోగా, రౌడీషీటర్ నవీన్ అతనిపై దాడి చేశాడు. జాన్ విక్టర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో చిరంజీవిపై దాడి చేశాడు. పెనుగులాటలో వారి నుంచి తప్పించుకున్న చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తుండగా, వారు లింగారావు సెంటర్లో ఉన్నట్లు తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. రౌడీ షీటర్ నవీన్ పరారయ్యాడు. నిందితుడు ఉపయోగించిన కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేసిన సందర్భంగా ఎస్పీ అభినందించినట్లు సీఐ రాముల నాయక్ తెలిపారు. సమావేశంలో ఎస్ఐ బురాన్షరీఫ్, సిబ్బంది ఉన్నారు. -
డీఎస్సీపై అభ్యర్థుల అభ్యంతరాలను పరిష్కరించాలి
డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న లక్ష్మీపురం: ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో అభ్యర్థుల అభ్యంతరాలను పరిష్కరించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని డీవైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ డీఎస్సీ ప్రకటించాలని చేసిన ఆందోళన ఫలితంగా నోటిఫికేషన్ విడుదల చేయడం అభినందనీయం అన్నారు. ఏడేళ్లుగా నోటిఫికేషన్ విడుదల చేయని కారణంగా వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని, పరీక్షకు సిద్ధమయ్యేందుకు కనీసం 90 రోజులు సమయం కావాలని, ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఉండాలనే అభ్యర్థుల అభ్యంతరాలపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలని కోరారు. ఎప్పుడు లేని మార్కుల పర్సంటేజ్ని తీసుకువచ్చారని అన్నారు. ఇప్పటి వరకు అభ్యర్థుల అభ్యంతరాలపై మాట్లాడకపోవడం చూస్తే మంత్రికి ఉన్న చిత్తశుద్ధి అర్ధమవుతుందని చెప్పారు. ఇప్పటికై నా మంత్రి లోకేష్ స్పందించి వారి అభ్యంతరాలను పరిష్కరించాలని కోరారు. డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ వై.కృష్ణకాంత్ మాట్లాడుతూ అభ్యర్థుల అభ్యంతరాలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే వారితో కలిసి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా నాయకులు పి.భార్గవ్, పి.బాషా, ఎం.ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. నదిలో దూకి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య తాడేపల్లి రూరల్: కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్‌పై నుంచి ఓ వ్యక్తి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై తాడేపల్లి పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ ప్రతాప్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణానది సీతానగరం వైపు ప్రకాశం బ్యారేజ్ 6వ ఖానా వద్ద శనివారం రాత్రి ఓ యువకుడు కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను కృష్ణానది నీటి స్టోరేజ్ కోసం ఏర్పాటు చేసిన గేటుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకుని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతిచెందిన వ్యక్తి వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉంటుంది. మృతుడి శరీరంపై నల్ల జీన్స్ ఫ్యాంట్, నల్లని చొక్కా ధరించి ఉన్నాడు. ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తిస్తే 80084 43915 నంబర్‌కు ఫోన్ చేయాలని ఎస్ఐ కోరారు. -
‘గిన్నిస్’లో చినకాకాని బాలుడికి చోటు
చినకాకాని(మంగళగిరి): నగర పరిధిలోని చినకాకానికి చెందిన బాలుడు గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాడు. ప్రపంచ స్థాయిలో కీబోర్డు ద్వారా క్రిస్టియన్ సంగీతాన్ని ఆప్‌లోడ్ చేసే ప్రక్రియలో ఈ గుర్తింపు లభించింది. ఒక గంట సమయంలో 1,046 వీడియోలను ఇన్‌స్ట్రాగామ్‌లో అప్లోడ్ చేసిన బృందంలో బాలుడు ఇమ్మాన్యేల్ ఉన్నాడు. ఈ మేరకు విజయవాడలో జరిగిన కార్యక్రమంలో తల్లిదండ్రులు పాస్టర్ జేజీసీ పాల్, డాక్టర్ సుజన సమక్షంలో నిర్వాహకులు బాలుడికి అవార్డు అందజేశారు. ఇమ్మాన్యేల్ ఆత్మకూరు నిర్మల స్కూలులో చదువుతున్నాడు. రెడ్డిపాలెం విద్యార్థికి కూడా.. గుంటూరు రూరల్: రెడ్డిపాలెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన పి.లక్ష్మీనరసయ్య, సుజాతల కుమారుడు పడాల శ్రీనాథ్ స్థానిక పాఠశాలో 6వ తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడికి కూడా సంగీత కార్యక్రమానికిగాను నిర్వాహకులు గిన్నిస్ ధ్రువపత్రం అందించారు. -
ఐదో రోజుకు మహా మంజీర నాదం నృత్యాలు
నగరంపాలెం: స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అన్నమయ్య కళావేదికపై 15వ అంతర్జాతీయ నృత్య దినోత్సవంలో భాగంగా మహామంజీర నాదం–2025 ఆదివారం ఐదో రోజుకి చేరాయి. శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో జరగ్గా, నూతలపాటి తిరుపతయ్య జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అనంతరం బాద్షా షేక్(పశ్చిమ బెంగాల్) మణిపురి నృత్యాన్ని, గోకుల్ శ్రీదాస్ (భువనేశ్వర్) ఒడిశా నృత్యాన్ని, డాక్టర్ శరత్చంద్ర (తిరుపతి) భరతనాట్యం ప్రదర్శించారు. సభికులను నృత్యాలు అలరించాయి. ఆరవేటి ప్రభావతి, డాక్టర్ కె.దేవేంద్ర పిళ్లైలకు ప్రముఖ భరత నాట్య గురువు మరంగంటి కాంచనమాల జీవిత పురస్కారం అందించారు. కళాకారులను సంస్థ కార్యదర్శి డాక్టర్ కాజ వెంకటసుబ్రహ్మణ్యం కళాకారులను యువ కళారత్న పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో తిరుపతి ఎస్వీ మ్యూజిక్ అండ్ డాన్స్ కళాశాల పూర్వ ప్రధానచార్యురాలు ఎస్.జానకిరాణి పాల్గొనగా, పఠాన్ మోహిముద్దిన్, వెంకటగిరి నాగలక్ష్మి పర్యవేక్షించారు. -
‘కపిరాజు’ నాటికకు ప్రథమ బహుమతి
మార్టూరు : శ్రీకారం రోటరీ కళాపరిషత్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 24, 25, 26 తేదీల్లో మార్టూరులో నిర్వహించిన తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు శనివారంతో ముగిశాయి. ఇరవై కేటగిరీలకు గాను ఆరింటిలో బహుమతులను కై వసం చేసుకుని న్యూ స్టార్ మోడ్రన్ థియేటర్ విజయవాడ వారి ‘కపిరాజు’ నాటిక అగ్రస్థానంలో నిలిచింది. నాలుగు కేటగిరిల్లో బహుమతులు పొంది కళానికేతన్ వీరన్నపాలెం వారి ‘రుతువులేని కాలం’ నాటిక ద్వితీయ స్థానం, మూడు కేటగిరిల్లో బహుమతులు సాధించి విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారి స్వేచ్ఛ నాటిక తృతీయ స్థానంలో నిలిచింది. కపిరాజు నాటికకు సంబంధించి ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకుడిగా ఎమ్మెస్ చౌదరి బహుమతులు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా పవన్ కల్యాణ్, ఉత్తమ మేకప్ మెన్‌గా దినేష్, పవన్ కుమార్, దిలీప్ రెండు ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. కళానికేతన్ వీరన్నపాలెం వారి ‘రుతువులేని కాలం’ నాటికకు తృతీయ ఉత్తమ ప్రదర్శనతోపాటు ఉత్తమ రచయితగా అగస్త్య, ఉత్తమ హాస్యనటునిగా సురేంద్రబాబు, సురభి పూజిత ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారి ‘స్వేచ్ఛ’ నాటికకు గాను ఉత్తమ నటుడిగా గోవాడ వెంకట్, మంజు భార్గవి ప్రత్యేక బహుమతితోపాటు ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా ఎంపికై ంది. -
ప్రధాని సభకు చకచకా ఏర్పాట్లు
తాడికొండ: మే 2వ తేదీన అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ఆదివారం గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, పలువురు ఐపీఎస్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పర్యటన నిమిత్తం 11 పార్కింగ్ ప్రాంతాలు, 8 రోడ్లు గుర్తించి ఆయా రహదారులలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదిక నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. సోమవారం నుంచి ఎస్టీజీ కమాండోల భద్రతలోకి ఈ ప్రాంతం వెళ్లనున్నట్లు సమాచారం. హెలీప్యాడ్, సభావేదిక, వీవీఐపీల పార్కింగ్ రూట్ మ్యాప్‌లను పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కేటాయించడంతో సంబంధిత అధికారులు దగ్గరుండి మరీ పనులు కొనసాగిస్తున్నారు. ప్రధాని సభకు దాదాపు 120 ఎకరాలు కేటాయించారు. ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 80 శాతం పనులు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
‘జత్వానీ కౌంటర్ కేసు ఒక దుష్ట సంప్రదాయానికి రోల్ మోడల్’
సాక్షి, తాడేపల్లి: కాదంబరీ జత్వానీతో కూటమి ప్రభుత్వం పెట్టించిన తప్పుడు కౌంటర్ కేసు దేశంలో ఒక దుష్ట సంప్రదాయానికే రోల్‌మోడల్‌గా మిగిలిపోతుందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికార దుర్వినియోగానికి ఈ కేసు పరాకాష్టగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో మేజిస్ట్రేట్ ముందు ఏనాడు పోలీసులపై ఫిర్యాదు చేయని జత్వానీతో ఏడు నెలల తరువాత కూటమి ప్రభుత్వం కావాలనే పిలిపించి తప్పుడు ఫిర్యాదు చేయించిందని, దేశంలోనే ఇటువంటి కౌంటర్ కేసు ఇదే మొదటిదని అన్నారు.ఇంకా ఆయనేమన్నారంటే..దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మాత్రమే ఇటు పోలీస్ వ్యవస్థలో, అటు న్యాయ ప్రక్రియ విషయంలో వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముంబైకి చెందిన కాదంబరీ జత్వానీ సినీనటి. దేశ వ్యాప్తంగా ఆమెపై కేసులు ఉన్నాయి. ఏపీలో కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తితో సంబంధం ఏర్పాటు చేసుకుని, ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్, హనీ ట్రాప్‌తో రూ.కోటికి పైగా బ్యాంక్‌ల ద్వారా తన ఖాతాలకు జమ చేయించుకున్నారని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది.దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బ్లాక్ మెయిలింగ్‌కు లొంగకపోవడంతో కుక్కల విద్యాసాగర్ ఆస్థిని కాజేసేందుకు దొంగ సంతకాలతో డాక్యుమెంట్లను సృష్టించి ఇతరులకు అమ్మేందుకు రూ.5 లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు తేలింది. కొనుగోలు చేసిన వ్యక్తులు దీనిపై కుక్కల విద్యాసాగర్‌తో క్రాస్ చెక్ చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.చట్టప్రకారమే జత్వానీ అరెస్ట్కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుపై పోలీసులు చట్టప్రకారం దర్యాప్తు జరిపి, ఇందులో ముద్దాయి కాదంబరీని అరెస్ట్ చేసేందుకు విజయవాడ న్యాయస్థానంలో పిటీషన్ వేసి, సెర్చ్ వారెంట్ తీసుకున్నారు. అనంతరం ముంబై జూహూ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి, స్థానిక పోలీసుల సహకారంతో ముద్దాయిని, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి, అంథేరీ కోర్ట్‌లో హాజరుపరిచారు. అక్కడి న్యాయస్థానం సంతృప్తి చెందిన తరువాత విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. తరువాత ఈ కేసుకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్లు, సిమ్ కార్డ్, సెల్ఫోన్లను మద్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు.అనంతరం మొత్తం ఆధారాలతో ముద్దాయిలను కోర్ట్‌లో హాజరుపరిచారు. దీనిపై కోర్ట్ వారిని రిమాండ్‌కు పంపారు. అనంతరం పోలీసులు తదుపరి విచారణ కోసం పోలీస్ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై అయిదు రోజుల పోలీస్ కస్టడీకి జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రులను అప్పగించారు. కస్టడీలో కూడా వారు అనేక విషయాలను వెల్లడించారు. తరువాత ముద్దాయిలు వేసుకున్న రెండు బెయిల్ పిటీషన్లు కూడా డిస్మిస్ అయ్యాయి. 2024 ఏప్రిల్ 24న ముద్దాయిలు వేసుకున్న కండీషన్ బెయిల్ మంజూరయ్యింది.23 రోజుల తరువాత మోడిఫికేషన్ జరిగి బెయిల్ కండీషన్లను రిలాక్స్ చేశారు. ముంబైలో అరెస్ట్ చేసిన నాటి నుంచి విజయవాడ కోర్ట్‌కు తీసుకువచ్చిప్పడు, పోలీస్ కస్టడీలో విచారణ విషయలో ఎక్కడా పోలీస్ అధికారులపై ఆమె ఫిర్యాదు చేయలేదు. నాతో పోలీస్ అధికారులు చట్టప్రకారమే వ్యవహరించారని, ఎటువంటి ఇబ్బంది పెట్టలేదని మేజిస్ట్రేట్ ముందు చెప్పారు. అలాగే ఎలాంటి ఫిర్యాదు కూడా చేయలేదు. పోలీస్ కస్టడీలో అడ్వకేట్ సమక్షంలోనే పోలీసులు విచారణ జరిపారు. మద్యవర్తులు, అడ్వకేట్ సమక్షంలో పోలీస్ కస్టడీలో జరిగిన విచారణలో జత్వానీ అంగీకరించిన అన్ని విషయాలను మధ్యవర్తులు రాసిన తరువాత దానిపై సంతకం చేసేందుకు ఆమె నిరాకరించారు. మద్యవర్తులు మాత్రం సంతకాలు చేశారు. దీనిని బట్టి ఆమెను ఎక్కడా పోలీసులు నిర్భందం, వత్తిడి చేయలేదు. పోలీసులు సమర్పించిన నివేదికలోనూ ఆమె సంతకం చేసేందుకు నిరాకరించారనే రాసి, కోర్ట్‌లో సమర్పించారు.కుట్రపూరితంగా జత్వానీతో తప్పుడు ఫిర్యాదు చేయించారువిజయవాడ, ముంబై కోర్ట్‌ల్లో తనపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని, తప్పుడు కేసు పెట్టారని జత్వాని ఎటువంటి ఆరోపణలు చేయలేదు. దర్యాప్తు ప్రక్రియ ముందుకు సాగుతున్న తరుణంలో ఆగస్టు 2024 అంటే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత టీవీ5 కి జత్వానీ ఇచ్చిన ఇంటర్వూలో నాపైన తప్పుడు కేసులు పెట్టాయంటూ ఆరోపణలు చేశారు. ఈ ఇంటర్వూ తరువాత ఆన్లైన్ ద్వారా పోలీస్ అధికారులు ఒక ఫిర్యాదు తెప్పించుకున్నారు. దానిని ఎల్లో మీడియాలో ప్రముఖంగా ప్రచురించారు. జత్వానీపై అప్పటి పోలీస్ అధికారులు దురుసుగా ప్రవర్తించి, తప్పుడు కేసులు పెట్టారంటూ కథనాలు రాశారు.ఎల్లో మీడియా వార్తల ఆధారంగా సిటీ పోలీస్ కమిషనర్ ఒక విచారణాధికారిని నియమించారు. తరువాత 2024 సెప్టెంబర్ 5న జత్వానీ విజయవాడకు వచ్చి నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తరువాత కొందరి స్టేట్మెంట్లను కూడా పోలీసులు తీసుకున్నారు. దీనిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకముందే జత్వానీ కేసులో కొందరు పోలీస్ అధికారులు సీఐ నుంచి సూపర్ వైజర్ స్థాయిలో ఉన్న డీజీపీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు వరకు కేసులు పెట్టారు. కుక్కల విద్యాసాగర్‌ను అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 13న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. అంతకు ముందే విచారణాధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు.ఒక కేసులో నేరం చేశారన్న అభియోగాల నేపథ్యంలో చట్టప్రకారం అరెస్ట్ అయి ప్రధాన నిందితురాలుగా ఉన్న కాందబరీ జత్వానీ తనపై ఉన్న కేసుల దర్యాప్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగానే, ఇంకా చార్జ్‌షీట్ కూడా దాఖలు కాని సందర్భంలో, కోర్ట్‌లో ఉన్న కేసులో ఆ ప్రక్రియను నీరుగార్చేలా కేసును డైవర్ట్ చేసి, ఆ కేసులో ఫిర్యాదు ఇచ్చిన కుక్కల విద్యాసాగర్, ఆ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులపైన కౌంటర్ కేసులు పెట్టారు. ఇది దేశ చరిత్రలో ఎక్కడా ఇలా జరగలేదు. కేసు అండ్ కౌంటర్ కేసులంటే ఇరు వర్గాల మధ్య ఘర్షన జరిగిన్పపుడు ఇరు పక్షాలు కేసులు పెట్టుకుంటాయి.జత్వానీకి కూటమి సర్కార్ రాచమర్యాదలుజత్వానీ కేసులో ఏడు నెలల తరువాత ప్రభుత్వం మారగానే కూటమి ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు జత్వానీని విలాసవంతమైన హోటల్లో పెట్టి, ఆమెకు రాచమర్యాదలు చేసి, ప్రోటోకాల్ దర్శనాలు చేయిం, ఆమెతో తప్పుడు ఫిర్యాదులు తీసుకుని కేసు పెట్టారు. ఇది చట్ట ప్రకారం తప్పు. ఇది సెక్షన్ 195 సీఆర్పీసీ ప్రకారం ఆ న్యాయస్థానంలో ఏదైనా తప్పుడు కేసు పెట్టారని, తప్పుడ డాక్యుమెంట్లు చూపించారని, దర్యాప్తులో ఒక వర్గంకు అనుకూలంగా చేశారనే విషయాలు ఉంటే ఏ కోర్టులో ఆ వ్యవహారంలో జరుగుతుందో ఆ కోర్ట్ కొన్ని ఆదేశాలు ఇవ్వవచ్చు. దానిపై దర్యాప్తు చేయమని, బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాలని, డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకోవాలని కోర్ట్ మాత్రమే ఆదేశాలు ఇచ్చే అధికారం ఉంది. కానీ ఈ కౌంటర్ కేసు ఏడు నెలల తరువాత పోలీస్ అధికారులపై కక్ష తీర్చుకోవడానికి ఇలా తప్పుడు కేసు పెట్టారు.చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని, పెద్ద ఎత్తున అల్లర్లు జరగాలని చంద్రబాబు సంకల్పించిన సమయంలో అప్పటి అధికారులు రాజమండ్రి జైలు వరకు ఎటువంటి అల్లర్లు జరగకుండా పకడ్భందీగా బందోబస్త్ నిర్వహించారనే కక్షతోనే వారిపై ఇలా తప్పుడు కేసులు పెట్టించారు. అలాగే సిట్ దర్యాప్తులో స్కిల్ డెవలప్మెంట్ ఇతర స్కాంలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా కొన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. సిట్‌లోని అధికారులపై కక్ష తీర్చుకునేందుకు ఇలాంటి తప్పుడు కేసులు బనాయించారు. అలాగే సిట్‌కు సలహాదారుగా ఉన్న అడ్వకేట్ ఐ.వెంకటేశ్వర్లుపై కూడా కేసు పెట్టడం చాలా దురదృష్టకరం. ఇలాంటి సందర్భంలో ఈ కేసు చట్టం ముందు నిలబడదని తెలిసి, తాత్కాలికంగా అధికారులను వేధించేందుకు జత్వానీ వ్యవహారాన్ని ప్రభుత్వం వాడుకుంటోంది.పోలీస్ అధికారుల మనోస్థైర్యం దెబ్బతీశారుకూటమి సర్కార్ వల్ల కక్షసాధింపులు ఎదుర్కొంటున్న అధికారులు తమ సుదీర్ఘ కెరీర్లో ఒక్క చిన్న మచ్చ కూడా లేదు. వారికి అనేక అవార్డులు, మెడల్స్, ప్రభుత్వాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవస్థలను పతనం చేసేందుకు ఎంతకైనా దిగజారుతోంది. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ఇదే పద్దతి వచ్చే ప్రభుత్వం కూడా అమలు చేస్తే ఏమవుతుంది? సోషల్ మీడియా, పలు తప్పుడు కేసుల్లో పోలీసులు తమపైన బలవంతంగా స్టేట్మెంట్లు తీసుకున్నారని ముద్దాయిలు ఎదురు కేసులు పెట్టే అవకాశం ఉంది. బలవంతంగా మాతో సాక్షాలు చెప్పించారంటూ పోలీసులపై సాక్షులు కేసులు పెట్టే అవకాశం ఉంది.ఒక దుష్ట సంప్రదాయంకు ఆజ్యం పోస్తున్నారు. పోలీసులు కూడా ఆలోచించాలి. పై అధికారుల ఒత్తిడితో ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారు. వచ్చే ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తే, దాని పరిణామాలు ఎలా ఉంటాయి? గూగూల్ టేక్ అవుట్స్, ఫోన్ రోమింగ్ సమాచారం, ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు ఇలా ప్రతి అంశాన్నీ పరిగణలోకి తీసుకుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నట్లుగానే వచ్చే ప్రభుత్వం చేస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పటికే అనేక మంది పోలీస్ అధికారులకు జీతాలు చెల్లించకుండా, రీజనల్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలంటూ వేధింపులకు గురి చేస్తోంది. పోలీస్ అధికారుల సంఘాలు కూడా దీనిపై స్పందించాలి. రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి ఏదో ఒక రకంగా తప్పుడు కేసులు పెట్టి, అధికారులను సంతృప్తి పరిచామంటూ చేతులు దులుపుకుంటే, భవిష్యత్తులో న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా కేసుల్లో పోలీస్ అధికారులు గతంలో అరెస్ట్ చేసిన ముద్దాయిలతో ఎదురు కేసులు పెట్టిస్తున్నారు.మద్యంపైనా ఇదే తరహా కౌంటర్ కేసులుతెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మద్యంలో జరిగిన అక్రమాలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. చంద్రబాబు దీనిలో ముద్దాయిగా ఉన్నారు. ఈ కేసులో వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చారనే కక్షతోనే బేవరేజెస్ కార్పోరేషన్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు పలువురు అధికారులపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కాం అంటూ కౌంటర్ కేసులు పెట్టింది. ప్రభుత్వమే మద్యంను విక్రయించిన నేపథ్యంలో స్కాం అనే దానికే అర్థం లేదు. అలాంటిది రాజకీయంగా వైఎస్సార్సీపీ నాయకులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని లిక్కర్ స్కాం అంటూ కేసులు పెట్టారు.అధికారులను దీనిలో భాగస్వాములు చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాల్లో మద్యం కేసుల్లో ఏ అధికారి ఎవరి ఇంటికి వెడుతున్నారు, ఏ డిస్టిలరీ యజమానితో మాట్లాడారు, ఎవరితో ఏ రకంగా ఫిర్యాదులు చేయిస్తున్నారో అందరికీ తెలుసు. భవిష్యత్తులో వీటిపై పోలీసులు న్యాయస్థానాల ముందు ఇబ్బందులను ఎదుర్కొంటారు. పోలీసులు చట్ట ప్రకారం, న్యాయ ప్రక్రియ ప్రకారం పనిచేయాలి. రాజకీయ విశ్వాసం కోసం కాకుండ ప్రజల విశ్వాసం కోసం పనిచేయాలి. -
‘తల్లికి వందనం అమలు ఎప్పుడు చంద్రబాబూ?’
సాక్షి, తాడేపల్లి: విద్యతోనే పేదరికంను నిర్మూలించాలన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూసిన ఘనత వైఎస్ జగన్‌ది అయితే, విద్యను పేదలకు దూరం చేస్తున్న దుర్మార్గం చంద్రబాబుదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించిన చంద్రబాబు దానిని అమలు చేయడానికి ఖజానా ఖాళీ అంటూ వంకలు వెతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిపిల్లల చదువులపైనా చంద్రబాబు కర్కశత్వం చూపుతున్నారని, విద్యార్ధుల ఉసురుపోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..ఏపీలో కూటమి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగ స్పూర్తికి తిలోదకాలు ఇస్తోంది. పేదల స్థితిగతులు మార్చాల్సిన కూటమి ప్రభుత్వం దానికి భిన్నంగా పనిచేస్తోంది. సామాజిక రుగ్మతలు పోవాలంటే చదువే ప్రామాణికమని ఆనాడు బీఆర్ అంబేద్కర్ చెప్పారు. విద్యతోనే పేదల తలరాతలు మారుతాయని వైయస్ జగన్ నమ్మి, తన పాలనలో దానిని ఆచరణలోకి తీసుకువచ్చారు. సామాజిక మార్పు కోసం విద్యకు పెద్దపీట వేశారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్షేత్రస్థాయి నుంచి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేశారు. ప్రతి తల్లి ఖాతాలో రూ.15వేలను జమ చేయడం ద్వారా రాష్ట్రంలో గొప్ప సంస్కరణలకు ఆద్యుడు అయ్యారు. నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించారు. ఏ కుటుంబంలో అయినా ఎంతమంది పిల్లలు బడికి వెళ్ళేవారు ఉంటే ప్రతి ఒక్కరికీ రూ.15 వేల చొప్పున ఆ పిల్లల తల్లికి ఇస్తామని ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు గొప్పగా ప్రచారం చేసుకున్నాయి.ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు బహిరంగసభల్లో ఏం మాట్లాడారో కూడా ఈ మీడియా సమావేశంలో ప్రజలు గమనించేందుకు వీలుగా ప్రదర్శిస్తున్నాం. అలాగే ప్రస్తుత మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ప్రతి ఇంటికి వెళ్ళి 'నీకు పదిహేను... నీకు పదిహేను వేలు అంటూ' అందరినీ నమ్మించారు. దానికి సంబంధించిన వీడియోను కూడా ప్రజలు చూసేందుకు గానూ ప్రదర్శిస్తున్నాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత తల్లికి వందనం కింద ఇస్తామన్న సొమ్ము ఏమయ్యిందని ప్రశ్నిస్తున్నాం. సీఎం చంద్రబాబు చదువులమ్మ తల్లిని అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.వాయిదాల రూపంలో ఇస్తారా..కూటమి ప్రభుత్వం మిగిలిన అన్ని హామీలతో పాటు తల్లికివందనంను కూడా గాలికి వదిలేసింది. దీనిపై మేం బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రశ్నిస్తుంటే, ఖజానా ఖాళీ అయ్యిందని చంద్రబాబు వంకలు వెతుకుతున్నాడు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తల్లికివందనం కింద ఇచ్చే రూ.15వేలను కూడా వాయిదాల రూపంలో ఇస్తానని మాట మార్చారు. మేం అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తుంటే... 'అమ్మ ఒడి-నాన్న బుడ్డీ' అంటూ కూటమి పార్టీలు అత్యంత హేయంగా విమర్శించారు. ఇప్పుడు కూటమి పాలనలో మంచినీళ్ళు దొరకడం లేదు, కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోంది. విద్యపట్ల, విద్యార్ధుల తల్లులకు ఇచ్చే అమ్మ ఒడి పట్ల చంద్రబాబుకు ఉన్న చిన్నచూపుకు గతంలో ఆయన చేసిన విమర్శలే నిదర్శనం.విద్యారంగానికి పెద్దపీట వేసిన వైఎస్ జగన్‘‘డబ్బు లేక పిల్లలు విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో వైయస్ జగన్ అమ్మ ఒడి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా నాలుగేళ్ల పాటు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. అయిదో ఏడాది కూడా 2024 జూన్ నాటికి ఇవ్వడానికి అన్ని సిద్దం చేసి ఎన్నికలకు వచ్చారు. జగన్ ప్రభుత్వంలో 83 లక్షల మంది పిల్లలకు 44,48,865 మంది తల్లుల ఖాతాలకు రూ. 26,౦67 కోట్లు జమ చేశారు. 57 నెలల్లో విద్య కోసం ఆనాడు వైఎస్ జగన్ జగనన్న విద్యాకానుక కోసం రూ.3366 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం రూ.4417 కోట్లు, మాబడి నాడు-నేడు రెండు దశలకు కలిపి రూ. 13000 కోట్లు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ కోసం రూ.6688 కోట్లు, ఆడపిల్లల నాప్కిన్ల కోసం రూ.32 కోట్లు, విద్యార్ధులకు బైజూన్ కంటెంట్ ట్యాబ్‌ల కోసం రూ.1300 కోట్లు..విద్యాదీవెన కోసం 12610, వసతి దీవెన కోసం రూ.5392 కోట్లు, విదేశీ విద్యాదీవెన కోసం రూ.107 కోట్లు ఇలా వివిధ పథకాల కోసం మొత్తం దాదాపు 72,919 కోట్లు ఖర్చు చేశారు. ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చదువుల కోసం, విద్యాప్రమాణాలను పెంచడం కోసం ఇలా ఖర్చు చేయలేదు. ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి అక్కచెల్లెమ్మల పిల్లలకు మేనమామగా వారి విద్యకు అండగా నిలుస్తానని ఆనాడు వైఎస్ జగన్ ముందుకు వచ్చారు. కానీ నేడు ఆ పరిస్థితిని చంద్రబాబు పూర్తిగా మార్చేశారు. తల్లికి వందనంపై రోజుకో మాట చెబుతూ, విద్యార్ధులను వారి తల్లులను ఏమార్చేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ఎండగడతాం. ఇచ్చిన మాట ప్రకారం తక్షణం తల్లికి వందనం కింద విద్యార్ధులకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. -
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులకు అస్వస్థత
గుంటూరు,సాక్షి: మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యం కోసం పీఎస్ఆర్ ఆంజనేయులును హుటాహుటీన జీజీహెచ్‌కి తరలించారు. ప్రస్తుతం పీఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్‌లో ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగుతోంది. ఈ క్రమంలో.. ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయుల్ని(PSR Anjaneyulu) అరెస్ట్ చేసింది. ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసుకుగానూ ఏపీ సీఐడీ ఆయన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. -
జంతు సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత
గుంటూరు మెడికల్: ప్రజల జీవన విధానంలో భాగమైన జంతువులకు అత్యున్నత స్థాయి సంరక్షణను అందించటంలో పశువైద్యులతో పాటు, ప్రతి ఒక్కరి బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అన్నారు. శనివారం స్థానిక కొత్తపేటలోని జిల్లా పశువైద్యశాలలో జరిగిన ప్రపంచ పశువైద్య దినోత్సవం – 2025లో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. పశువుల ఆరోగ్యం ప్రజల ఆరోగ్యంతో అనుసంధానమై ఉందని చెప్పారు. తన తండ్రి వెటర్నరీ డాక్టర్‌గా మధురై పరిసర ప్రాంతంలో సేవలు అందించారని కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. పశువైద్యంతో తమ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. ఇక్కడ కూడా పశువైద్య సేవలు బాగా అందుతున్నాయని కొనియాడారు. గ్రామంలో పశుసంపద వల్ల ప్రజల జీవనోపాధి మెరుగు పడుతుందన్నారు. పట్టణవాసులు సైతం పెంపుడు జంతువుల పెంపకంపై ఇష్టం చూపుతున్నారన్నారు. పెంపుడు జంతువులతో పాటు వీధి కుక్కలు, పిల్లుల సంరక్షణకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలన్నారు. ప్రభుత్వ పశు వైద్యశాలలో జంతువులకు నాణ్యమైన వైద్యసేవలను అందిస్తున్నారన్నారు. జంతువుల ఆరోగ్య సంరక్షణలో నిరంతరం కృషి చేస్తున్న పశువైద్యులకు, వెటర్నీ పారమెడికల్ సిబ్బందికి, జంతు ప్రేమికులకు, స్వచ్ఛంద సేవ సంస్థలకు అంతర్జాతీయ పశువైద్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పశు సంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు డాక్టర్ ఒ.నరసింహారావు మాట్లాడుతూ నూతన పశువైద్యశాల భవనాలకు జిల్లా కలెక్టర్ రూ.14 లక్షలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద మంజూరు చేయించడం పశు వైద్యులందరికీ ఆనందదాయకమన్నారు. అనంతరం కలెక్టర్‌ను ఘనంగా సన్మానించారు. ప్రపంచ పశు వైద్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన విశ్రాంత పశువైద్యులు డాక్టర్. డి.రజనీకాంత్, డాక్టర్.ఆర్. లక్ష్మీప్రసాద్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డెప్యూటీ డైరెక్టర్లు డాక్టర్ కె.వి.వి.సత్యనారాయణ, డాక్టర్. ఎం.రత్నజ్యోతి, రాష్ట్ర వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ వై.ఈశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎం.వెంకటేశ్వర్లు, ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె.సాంబశివరావు, జిల్లా పశు వైద్య వైద్యులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి -
గుర్తుకొస్తున్నాయి..!
తాడేపల్లి రూరల్: గుంటూరు జేకేసీ కళాశాల పూర్వ విద్యార్థులు ఉండవల్లి కరకట్ట సమీపంలోని రిసార్ట్‌లో ఆత్మీయ సమ్మేళనం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్రా నాగేశ్వరరావు మాట్లాడుతూ గుంటూరు జేకేసీ కళాశాలలో 1989–94 బ్యాచ్ డిగ్రీ, పీజీ విద్యార్థులు ఆత్మీయంగా కలవడం ఆనందంగా ఉందని అన్నారు. పూర్వ విద్యార్థులు తాము చదువున్న రోజుల్లో జరిగిన సంఘటనలను, అనుభవాలను పంచుకున్నారు. రిటైర్డ్ లెక్చరర్ సాంబశివరావు మాట్లాడుతూ అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ధ్యానం, యోగా చేయాలని సూచించారు. అనంతరం నాటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఏలూరు సీటీఓ కోటేశ్వరరావు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈడీ గడ్డిపాటి అనిల్ కుమార్, పతంజలి రాష్ట్ర స్వాభిమాన్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు జొన్నలగడ్డ శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ కాలారి నరసింహారావు, సురేష్, అమెరికన్ బ్లూ క్రాఫ్ట్స్ ఈడీ రఘు, భీమినేని వెంకటేశ్వరరావు, పీఎఫ్ వెంకటేశ్వరరావు, నాగుల్ మీరా, చైతన్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత, అరుణ, స్వాతి, మువ్వా శ్రీను, ప్రసాద్, హైమా తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జేకేసీ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం -
ప్రకృతిలోని జీవరాశులు, పుడమి తల్లిని కాపాడుకోవాలి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : ప్రకృతిలోని జీవరాశులు, పుడమి తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రకృతి కవి జయరాజు (తెలంగాణ) అన్నారు. గుంటూరులోని కొరిటెపాడు వాకింగ్ ట్రాక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ నాగిరెడ్డి సౌజన్యంతో శనివారం ట్రాక్ ఆవరణలో చెట్టు మీద గూడు, చెట్టు కింద నీరు, ఆహారం అందించే కార్యక్రమం నిర్వహించారు. మూగ జీవులు, పక్షుల సౌకర్యార్ధం గూళ్లు, తాగునీరు ఏర్పాటు చేశారు. ప్రకృతి కవి జయరాజు మాట్లాడుతూ వేసవిలో తాగునీరు, ఆహారం కోసం పక్షులు ఎంతగానో విలవిలాడతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లకు దగ్గరలో నీటి సౌకర్యాన్ని కల్పించాలని చెప్పారు. వాకింగ్ ట్రాక్ అధ్యక్షుడు కన్నసాని బాజీ మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకుంటే అది మన అందరిని కాపాడుతుందని అన్నారు. చెట్ల సంరక్షణ కోసం మన వంతుగా చెట్లను పరిరక్షించాలని చెప్పారు. ఏదైనా శుభ కార్యక్రమాల వేళల్లో మొక్కలు నాటాలని తెలిపారు. కార్యక్రమంలో యోగ గురువులు సభాపతి, ధర్మారెడ్డి, ట్రాక్ కార్యదర్శి శివరామకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు ఇమడాబత్తిని కోటేశ్వరరావు. యేళ్ళ రత్తయ్య, వాకర్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. -
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తెనాలి అక్కాచెల్లెలు
తెనాలి: పట్టణానికి చెందిన అక్కాచెల్లెళ్లు యండ్రపాటి నయనశ్రీ, యండ్రపాటి మోనిక గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. గతేడాది డిసెంబరు ఒకటిన హలెల్ మ్యూజిక్ స్కూల్ ద్వారా ప్రపంచస్థాయిలో 18 దేశాల నుంచి 1100 మంది విద్యార్థులు సంగీత ప్రదర్శనలో పాల్గొన్నారు. కీ బోర్డు వాయిద్యంతో ఇచ్చిన ప్రదర్శనలో నయనశ్రీ, మోనికతో పాటు మొత్తం 1046 మందిని ఎంపికచేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేశారు. విజయవాడలోని మెట్రోపాలిటన్ చర్చిలో శుక్రవారం జరిగిన అభినందన సభలో మ్యూజిక్ స్కూల్ నిర్వాహకుడు అగస్టీన్ దండింగ చేతుల మీదుగా వీరిరువురు గిన్నిస్ సర్టిఫికెట్, జ్ఞాపికను అందుకున్నాడు. వీరి తల్లిదండ్రులు యండ్రపాటి రత్నం, సువర్ణ దంపతులు. కీబోర్డ్ ప్లేలో గిన్నిస్ రికార్డు గుంటూరు రూరల్: తమ కళాశాల విద్యార్థులు విద్యతోపాటుగా అన్నిరంగాల్లో ప్రావీణ్యతను పెంపొందించేందుకు అన్నివిధాలుగా తమ కళాశాల సౌకర్యాలను కల్పిస్తుందని విజ్ఞాన్ నిరుల మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రాధిక తెలిపారు. శనివారం పెదపలకలూరురోడ్డులోని కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థిని వై.నయనశ్రీ కీబోర్డ్ ప్లేలో గిన్నిస్ రికార్డు సాధించినట్లు తెలిపారు. హాల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో గత డిసెంబరు 15వ తేదీన ఆన్లైన్ మాధ్యమంలో పోటీ నిర్వహించగా 18 దేశాలకు చెందిన పియానో వాయిద్యకారులు పాల్గొన్నారని, వారిలో కుమారి నయనశ్రీ కేవలం 41 సెకండ్లలో మూడు సరళీ స్వరాలు వాయించినందుకు ఈ అరుదైన రికార్డు లభించినట్లు తెలిపారు. ఈమేరకు ఫలితాలు వెల్లడి చేసి ఈనెల 25వ తేదీన గిన్నిస్ రికార్డు పత్రాన్ని విద్యార్థినికి పంపించారన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, డాక్టర్ జి.సంధ్య, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. -
కంపోస్టు యార్డు నిర్వహణపై మంత్రి అసంతృప్తి
తెనాలి టౌన్: స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని మున్సిపల్ కంపోస్టు యార్డు నిర్వహణపై రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం కంపోస్టు యార్డును ఆయన అధికారులతో కలసి పరిశీలించారు. ముందుగా యార్డులోని వ్యర్థాలను తొలగించే ప్రక్రియను పరిశీలించి పనులు నత్తనడకన సాగడాన్ని గుర్తించి సదరు కాంట్రాక్టర్‌పై మండిపడ్డారు. నెలాఖారులోగా డంపింగ్ యార్డులోని చెత్త మొత్తం తరలించాలని ఆదేశించారు. అనంతరం కొబ్బరిబొండాల నుంచి పీచు తయారీ యంత్రం వద్దకు వెళ్ళారు. గత ఆరు నెలలుగా యంత్ర సేవలు నిరుపయోగంగా ఉన్నాయని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పట్టణంలోని రోడ్ల వెంట ఇష్టారాజ్యంగా కొబ్బరి బొండాలు పడి ఉండటాన్ని తాను చూశానని, మీరంతా ఏమి చేస్తున్నారు అని కమిషనర్, హెల్త్ ఆఫీసర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని అధికారులను హెచ్చరించారు. డంపింగ్‌యార్డు నుంచి వస్తున్న కలుషిత నీరు పక్క పొలాల్లోకి వెవెళ్లడాన్ని గుర్తించి సత్వరం మూడు అడుగుల మేర చుట్టూరా గుంట తీసి వ్యర్థపు నీరు రైతుల పొలాల్లోకి వెళ్ళకుండా చర్యలు చేపట్టాలని అధికారులనుఆదేశించారు. కుక్కల బెడద రూపుమాపాలి.. వీధి కుక్కల సంతానోత్పత్తి నియంత్రణ కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. పట్టణంలో కుక్కల బెడద అధికంగా ఉందని, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు శూన్యమని హెల్త్ ఆఫీసర్‌ను ప్రశ్నించారు. ప్రతి రోజు తెనాలి జిల్లా వైద్యశాలకు కుక్క కరిచిందని బాధితులు వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలసత్వం వీడి కుక్కల బెడద రూపుమాపాలని సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో సరైన రీతిలో చెత్త సేకరణ జరగడం లేదని తెలిపారు. రూ.3.20 కోట్ల నిధులతో డంపింగ్‌యార్డులోని వ్యర్థాలను తొలగిస్తున్నట్లు తెలియజేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, రెవెన్యూ ఆఫీసర్ రాంప్రసాద్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. రైతుల ఆవేదన అధికారులపై మండిపాటు కుక్కల నియంత్రణ ఎక్కడ చేస్తున్నారని ప్రశ్న కొబ్బరి పీచు తయారీ యంత్రం నిరుపయోగంగా ఉండడంపై మండిపాటు కంపోస్టు యార్డు చుట్టూరా దాదాపు15 ఎకరాల మేర పంటలు పండక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యార్డు నుంచి వచ్చే వ్యర్థపు నీరు పంట పొలాల్లోకి చేరడం వల్ల పైరు నాటిన కొద్ది రోజులకే పాడైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు తెలియజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా మొర అలకించడం లేదని గడ్డిపాటి ఉదయశంకర్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు యార్డు తూర్పు భాగాన 4.50 ఎకరాల పొలం ఉందని, పొలంలో పంట పండించి దానిపై ఆదాయం చూసి సంవత్సరాలు గడిచిందని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇప్పుడైనా మంత్రి చెప్పిన విధంగా కంపోస్టు యార్డును ఇక్కడి నుంచి తరలిస్తే రాబోయే రోజుల్లోనైనా పంటలు పండించి దానిపై ఆదాయం చూడాలన్నా ఆశ ఉందని తెలిపారు. -
హోరాహోరీగా అండర్–17 బాలుర వాలీబాల్ పోటీలు
సత్తెనపల్లి: పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ 54వ హైదరాబాద్ రీజియన్ స్థాయి అండర్–17 బాలుర వాలీబాల్ పోటీలు శనివారం హోరాహోరీగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి (రామకృష్ణాపురం)లోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ ఆవరణలో అండర్ –17 బాలుర వాలీబాల్ పోటీలు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహించారు. పోటీల్లో క్రీడాకారులు నువ్వా .. నేనా అన్నట్లు తలపడ్డారు. పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 18 జట్లు హాజరయ్యాయి. శనివారం రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుగులో కూడా పోటీలు కొనసాగించారు. ఎనిమిది జట్లు ఖమ్మం, సత్తెనపల్లి, హక్కింపేట్, విజయవాడ–1, తెనాలి, వెంకటగిరి, వాల్తేరు, కర్నూల్ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఆదివారం క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ పోటీలు నిర్వహించి విజేతలను ప్రకటించనున్నారు. అనంతరం విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం చేపడుతామని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ సత్తెనపల్లి ఇన్చార్జ్ ప్రిన్సిపల్ బి.కిరణ్‌రెడ్డి తెలిపారు. పంజాబ్‌లో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ జట్టును కూడా ఇక్కడ ఎంపిక చేయనున్నారు. అలరించిన ‘మహా మంజీరనాదం’ నగరంపాలెం: స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో అన్నమయ్య కళావేదికపై శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో 15వ అంతర్జాతీయ నృత్య దినోత్సవంలో భాగంగా మహామంజీర నాదం–2025 శనివారం కొనసాగాయి. పాలక మండలి సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేయగా, సంస్థ అధ్యక్షుడు డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అనంతరం సుమంగళ ప్రభు (కర్ణాటక) భరతనాట్యం, దేబ్జనిబసు (కలకత్తా) కథక్, జెపీ కనిష్క (హైదరాబాద్), కూచిపూడి నృత్యం సభికులను అలరించాయి. కళాకారులను సంస్థ కార్యదర్శి డాక్టర్ కాజ వెంకటసుబ్రహ్మణ్యం కళాకారులను యువ కళారత్న పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో వీవీఐటీ విశ్వ విద్యాలయం చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, ప్రముఖ ఆడిటర్ రామరాజు శ్రీనివాసరావు, పచ్చల నాగమహిత, వెంకటగిరి నాగలక్ష్మి పాల్గొన్నారు. గుర్తుతెలియని మృతదేహం తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం పశువుల హాస్పిటల్ బ్రిడ్జి సమీపంలో బకింగ్‌హామ్ కెనాల్లో నీటిలో తేలియాడుతున్న మహిళ మృతదేహాన్ని స్ధానికులు శనివారం గుర్తించారు. తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. ఆమె వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతిచెందిన మహిళకు సుమారు 60 సంవత్సరాలు ఉండవచ్చని, శరీరం నిండా తెల్లమచ్చలు (బొల్లి) ఉన్నాయని, శరీరంపై గోల్డ్ కలర్ చీర, రెడ్ కలర్ లో దుస్తులు, ఎర్ర జాకెట్‌పై గోల్డ్ కలర్ బోర్డరు కలిగి ఉందని, ఈ మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే 08645272186కు సమాచారం ఇవ్వాలని తాడేపల్లి పోలీసులు కోరారు. -
బుద్ధిష్ట్ సర్క్యూట్ వద్ద అగ్ని ప్రమాదం
అమరావతి: ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అమరావతిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బుద్ధ విగ్రహం ఎదురుగా కోట్లాది రూపాయలతో నిర్మించిన బుద్ధిష్ట్ సర్క్యూట్ భవనాల వద్ద శనివారం సాయంత్రం అగ్నిప్రమాద జరిగింది. పర్యాటక శాఖ మేనేజర్ మణికుమార్ అందించిన సమాచారం మేరకు ఓ ప్రైవేటు ఊరేగింపులో కాల్చిన బాణసంచా రవ్వలు బుద్ధిష్ట్ సర్క్యూట్ భవనాల సమీపంలో ఉన్న చెత్తలో పడి రాజుకుని మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు మంటలు అర్పటానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఈ క్రమంలో సత్తెనపల్లి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వటంతో అగ్నిమాపక వాహనంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. కోట్లాది రూపాయల భవనాలకు ఎటువంటి నష్టం జరగలేదు. -
ప్రధాన షాపులకు తగ్గింపు ..
తెనాలి: భక్తులు చిన్న తిరుపతిగా పిలుచుకునే స్థానిక శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి ఆదాయానికి గండిపడింది. ఆలయంలోని వివిధ దుకాణాలకు నిర్వహించే వేలంలో అస్మదీయులపై అపార ప్రేమ చూపారు. స్వామివారికి రూ.7 లక్షల వరకు శఠగోపం పెట్టారు. బినామీల పేర్లతో లాగించేశారు. తెలుగు తమ్ముళ్ల సిఫార్సుపై చూపిన కరుణకు పనిలో పనిగా రూ.లక్షలు చేతులు మారాయి. ఇతరుల దుకాణాలకు మాత్రం రూల్స్ ప్రకారం అద్దె పెంపుదల చేశారు. వైకుంఠపురం దేవస్థానంలోని షాపులకు గతంలో రెండేళ్ల కాలపరిమితితో నిర్వహించే వేలంపాటలను ఈమధ్య కాలంలో ఏడాదికి పరిమితం చేశారు. ఆ ప్రకారం మొత్తం తొమ్మిది షాపులు/ నిర్వహణకు లైసెన్సుల కోసం ఇటీవల ఈ–ప్రొక్యూర్మెంట్ సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలం జరిపారు. గతంలో వేలంలో పాల్గొనేవారి నుంచి కొన్ని షాపులకు రూ.5 లక్షల డిపాజిట్ వసూలు చేసేవారు. ప్రస్తుత సంవత్సరానికి మాత్రం అధికారులు ఆ మొత్తాన్ని రూ.లక్షకు పరిమితం చేశారు. ఆలయ సహాయ కమిషనర్/కార్యనిర్వహణ అధికారికి ఆ విచక్షణాధికారం ఉంటుంది. పేర్లు మాత్రమే బినామీలవి.. రూరల్ మండల గ్రామానికి చెందిన ఓ తెలుగు తమ్ముడి సిఫార్సుతోనే స్వామివారి ఆదాయాన్ని తగ్గించి షాపుల నిర్వాహకులకు లాభం చేకూర్చారని ఆలయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇంతకు ముందు షాపులు నిర్వహించిన యజమానుల పేరిట తగ్గింపు ధరకు పాట రాస్తే, నిబంధనలు అంగీకరించవు...దీనిని దృష్టిలో ఉంచుకుని బినామీ పేర్లతో లాగించేశారని చెబుతున్నారు. ఆ బినామీలు కూడా ఆయా షాపుల నిర్వాహకుల సమీప బంధువులే కావటం గమనించాల్సిన అంశం. పేర్లు మాత్రం బినామీలవి. షాపుల నిర్వహణ మాత్రం పాత అద్దెదారులే చేస్తున్నారు. అద్దె తగ్గించిన షాపులలో ఒక్కో షాపును ఇద్దరేసి నిర్వహిస్తున్నారు. చెరిసగం వార్షిక అద్దెను భరిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన నిజం. ఇప్పుడు షాపు అద్దె మొత్తాన్ని వేలంలో తగ్గించినందున అధికారులకు ఇవ్వటానికని చెప్పి, మొదటి షాపుకు చెందిన ఇద్దరి నుంచి రూ.రెండేసి లక్షలు చొప్పున రూ.4 లక్షలు వసూలు చేశాడో మధ్యవర్తిగా చెప్పుకునే వ్యక్తి. మరో షాపు నిర్వహించుకుంటున్న ఇద్దరి నుంచి చెరొక రూ.75 వేల వంతున రూ.1.50 లక్షలను తీసుకున్నాడు. అవి అధికారులకు ముట్టాయో లేదో తెలీదు. ‘లాభం లేకుండా స్వామివారి ఆదాయానికి మాత్రం ఎలా గండికొడతారు’ అని ఎవరికి వారు ప్రశ్నించుకుంటున్నారు. ఇదే విషయమై వివరణ కోరేందుకు ప్రయత్నించగా, కార్యనిర్వహణాధికారి వి.అనుపమ అందుబాటులో లేరు. వేలం టెండర్లలో గోల్మాల్ రెండు షాపులకు రూ.7 లక్షల తగ్గింపు ఇతరులకు మాత్రం పెంపుదల రూ.4 లక్షలు చేతులు మారిన ఫలితం! దేవదాయశాఖ నింబంధనల ప్రకారం షాపులకు వేలం జరిపిన ప్రతిసారీ నిర్ణీత అద్దె మొత్తం పెంపుదల జరగాల్సిందే. వైకుంఠపురంలోని మొత్తం తొమ్మిదింటికి ఏడు షాపులకు అద్దె మొత్తాన్ని పెంపుదల చేశారు. ప్రధానమైన రెండింటికి మాత్రం తగ్గించేయటమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొబ్బరికాయలు, పూజాద్రవ్యాలు అమ్ముకొనే లైసెన్సు హక్కు గతేడాది రూ.13 లక్షలు ఉండగా 2025–26 సంవత్సరానికి రూ.8.11 లక్షలకు పరిమితం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఫాన్సీ, బొమ్మలు అమ్ముకునే లైసెన్సు హక్కు గత సంవత్సరం రూ.7.50 లక్షలు కాగా, ఈసారి రూ.5.50 లక్షలకు తగ్గించేశారు. అంటే కేవలం రెండు షాపులపై శ్రీవారి వార్షిక ఆదాయానికి రూ.7 లక్షల వరకు గండిపడింది. -
గుంటూరు
ఆదివారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025Iప్రిన్సిపల్ జడ్జిని కలిసిన కలెక్టర్ నరసరావుపేట: స్థానిక కోర్టు ప్రాంగణానికి శనివారం విచ్చేసిన గుంటూరు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి సాయికల్యాణ చక్రవర్తిని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు మర్యాద పూర్వకంగా కలిశారు.తెనాలి: దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక మేధోవికాసానికి గ్రంథాలయాలు తోడ్పడతాయి. గ్రంథాలయోద్యమం స్వాతంత్య్ర ఉద్యమంలో నిర్వహించిన పాత్ర చారిత్రాత్మకం. ప్రస్తుతం అనేక కారణాలతో గ్రంథాలయ వ్యవస్థ ఆదరణ కోల్పోతోంది. దీనిని పునరుజ్జీవింపజేయడం ప్రభుత్వ బాధ్యత. సంరక్షించుకోవటం ప్రజల బాధ్యత. ఈ నినాదంతోనే ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఉద్యమ రాష్ట్ర సదస్సు ఈనెల 27న విజయవాడ గవర్నర్‌పేట లోని ఎంబీ విజ్ఞానకేంద్రంలో జరగనుంది. ఈ సందర్భంగా విజయవాడ కేంద్రంగా జరిగిన గ్రంథాలయ ఉద్యమం, చరిత్రను తెలుసుకుందాం. 1914లోనే అంకురార్పణ గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య సారథ్యంలో 1914లో ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘం ఏర్పడింది. అప్పట్లో రాష్ట్రంలో 200 గ్రంథాలయాలు నడుస్తుండేవి. ఏప్రిల్ 11, 12 తేదీల్లో విజయవాడలో జరిగిన ఆంధ్ర మహాజన సభకు రాష్ట్రంలోని 60 గ్రంథాలయాల నుంచి 200 మందికి పైగా హాజరయ్యారు. సభాధ్యక్షుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం, మోచర్ల రామచంద్రరావు అధ్యక్షులుగా అయ్యంకి వెంకటరమణయ్య, నాళం కృష్ణారావు కార్యదర్శులుగా ఆంధ్ర దేశ గ్రంథ భాండాగార సంఘం ఏర్పడింది. ఇదే సంఘం 1916లో ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘంగా, 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘంగా రూపుదిద్దుకుంది. గ్రంథాలయాల ఆవశ్యతకపై ఊరూరా సభలు, చర్చలు జరిపారు. యువకులు వందలాది గ్రంథాలయాలను స్థాపించారు. మరోవైపు సభలు, సమావేశాలు, యాత్రలతో 1920 నాటికి వందల సంఖ్యలో గ్రంథాలయాలు వెలిశాయి. మూడంచెల వ్యవస్థగా.. క్రమబద్ధమైన గ్రంథాలయ వ్యవస్థ నిర్వహణకు తగిన చట్టం కోసమని ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘం 1948 జనవరి 16న విజయవాడలో మహాసభ జరిపింది. గాడిచర్ల హరిసర్వోత్తమరావు అధ్యక్షుడు. 1950 నుంచి ఆంధ్రప్రాంతంలో మద్రాస్ పౌర గ్రంథాలయ చట్టం అమల్లోకి వచ్చింది. ఇదే నమూనాలో 1955లో హైదరాబాద్ పౌర గ్రంథాలయ చట్టం, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక 1960 నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ చట్టం ఆమోదం పొందింది. మూడంచెల గ్రంథాలయ వ్యవస్థ అంటే ప్రభుత్వ గ్రంథాలయాలు, జిల్లా గ్రంథాలయ సంస్థల గ్రంథాలయాలు, స్థానిక సంస్థల, ఇతర స్వచ్ఛంద గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. వీటి నిర్వహణకు జిల్లా గ్రంథాలయ సంస్థలు వచ్చాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయాలు, 5వేల జనాభాకు మించిన పట్టణాల్లో, గ్రామాల్లో వీలున్నంతవరకు శాఖా గ్రంథాలయాలు నెలకొల్పారు. వెయ్యి జనాభాకు పైబడిన గ్రామాల్లో పుస్తక పంపిణీ కేంద్రాలను తీసుకొచ్చారు. 2011–12 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 22 జిల్లా కేంద్ర గ్రంథాలయాలు, ఒక నగర కేంద్ర గ్రంథాలయం, 1450 శాఖా గ్రంథాలయాలు, 400 గ్రామీణ గ్రంథాలయాలు, 600 పుస్తక పంపిణీ కేద్రాలు పనిచేస్తున్నాయి. తర్వాత కొన్ని మండలాల్లో 634 శాఖాగ్రంథాలయాలు, ప్రతి జిల్లాకు మూడు చొప్పున మరో 69 గ్రంథాలయాలను స్థాపించారు. నేడు నామమాత్రం గ్రంథాలయ చట్టం ప్రకారం మున్సిపాలిటీలు, పంచాయతీలు ప్రజల్నుంచి వసూలుచేసే ఇంటిపన్నులో రూపాయికి ఎనిమిది పైసలు వంతున సెస్సు రూపంలో వసూలుచేసి గ్రంథాలయ నిధికి ఇవ్వాలి. ఈ నిధి నుంచే జిల్లా గ్రంథాలయ సంస్థలు తమ అధీనంలోని గ్రంథాలయాలను నిర్వహిస్తుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతిలో పూర్తికాలపు సిబ్బంది జీతభత్యాలను భరిస్తుంది. 1975 నుంచి వచ్చిన ఈ మార్పుతో జిల్లా గ్రంథాలయ సంస్థలు కాస్త స్థిరపడ్డాయి. అయితే 1986 తర్వాత శాఖాగ్రంథాలయాల స్థాప న జరగలేదు. స్థానిక సంస్థలు సెస్సు జమచేయకపోవటం, ఉద్యోగులకు జీతాల చెల్లింపులో జాప్యం, కొత్త పుస్తకాలు లేక, పఠనం తగ్గిపోవటంతో గ్రంథాలయాలు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. అల వైకుంఠపురంలో... శ్రీవారి ఆదాయానికి గండిన్యూస్రీల్గ్రంథాలయోద్యమ స్ఫూర్తికి నేడు తూట్లు నాడు విజయవాడ కేంద్రంగా గ్రంథాలయ ఉద్యమం ఆ స్ఫూర్తితో ఊరూరా వెలిసిన గ్రంథాలయాలు స్వాతంత్య్రానంతరం తగ్గిన ప్రాభవం.. నేడు మరీ తీసికట్టు నేడు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ రాష్ట్ర సదస్సు బోటు గ్రంథాలయాలు గ్రంథాలయాలను పరిరక్షించుకోవాలి సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, మానసిక వికాసానికి తోడ్పడుతున్న గ్రంథాలయాలు కనీస సౌకర్యాలు లేక దీనావస్థలో ఉన్నాయి. వాటిని పరిరక్షించుకోవాలి. దక్షిణాదిలోని రాష్ట్రాలు గ్రంథాలయాల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంటే, తెలుగు రాష్ట్రాల్లో అందుకు భిన్నంగా జీర్ణావస్థలో ఉన్నాయి. కర్ణాటకలో ఆరువేల గ్రంథాలయాలుంటే, ఇటీవల మరో నాలుగువేల గ్రంథాలయాలను ప్రారంభించారు. గ్రంథాలయాలకు రూ.2 లక్షల చొప్పున పుస్తకాలకు కేటాయించారు. 47 లక్షలమంది పిల్లలను సభ్యులుగా చేర్చారు. పాఠశాలల్లో పిల్లలు పుస్తకాల చదువుకు ప్రత్యేకంగా గంట కేటాయించారు. మన రాష్ట్రంలో ఉన్నవి కేవలం 1400 మాత్రమే. అవికూడా దీనావస్థలో ఉన్నాయి. – వల్లూరు శివప్రసాద్, ఉద్యమ వేదిక కన్వీనర్ గ్రంథాలయ వ్యవస్థలోని యువజనులకు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆర్థికసాయంతో 1920లో విజయవాడలో శిక్షణ శిబిరం నిర్వహించింది. కాశీనాథుని నాగేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ, భోగరాజు పట్టాభి సీతారామయ్య, వేమవరపు రామదాసు పంతులు, చిలుకూరు వీరభద్రరావు, రాయప్రోలు సుబ్బారావు, అయ్యదేవర కాళేశ్వరరావు, సూరి వెంకటనరసింహం తదితరులు అధ్యాపకులుగా వ్యవహరించారు. తర్వాత వివిధ ప్రాంతాల్లో శిక్షణ తరగతులు జరిపారు. వీటిలో బోటు యాత్రలూ ఉన్నాయి. ఇది స్ఫూర్తిగా పాతూరి నాగభూషణం తెనాలి తాలూకాలోని పెదపాలెం సేవాశ్రమ వాణీమందిరం తరఫున 1935లో బకింగ్‌హాం కెనాల్ బ్రాంచి కాల్వపై కొంతకాలం బోటు గ్రంథాలయం నడిపారు. పెదవడ్లపూడి – కొల్లూరు మధ్య, వడ్లపూడి – పిడపర్రు మధ్య, సంగంజాగర్లమూడిలో మద్రాస్ కాల్వపై బోటు గ్రంథాలయం నిర్వహించారు. మద్రారస్ ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వీఎన్ శివసామయ్యర్, స్థానిక సంస్థలు స్వయంగా గ్రంథాలయాలను ప్రారంభించటం, తమ నిధుల నుంచి రిజిస్టరై స్వచ్ఛందంగా నిర్వహించే గ్రంథాలయాలకు గ్రాంటు మంజూరుకు అవకాశం కల్పించారు. -
చేబ్రోలు కిరణ్‌ను పెంచి పోషించేది చంద్రబాబే: అంబటి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఏడాది కాలం పాలనలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏమీ చేయకపోయినా చంద్రబాబును హీరోలా చూపిస్తూ ఆయన అనుకూల మీడియా కథనాలు ప్రసారం చేస్తుందని.. చంద్రబాబు హీరో కాదు.. విలన్’’ అంటూ ఆయన దుయ్యబట్టారు. గతంలోనూ విలన్ లాగే వ్యవహరించారు. సోషల్ మీడియా సైకోల తోక కత్తిరిస్తానంటూ అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టేవారి కోరలు పీకేస్తామన్నారు. పిడి యాక్ట్ పెట్టి తాటతీస్తామన్నారు. చంద్రబాబు అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు’’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.‘‘వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై చాలా దారుణమైన పోస్టులు పెట్టారు. తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చేబ్రోలు కిరణ్‌ను పెంచిపోషించింది చంద్రబాబు కాదా?. చేబ్రోలు కిరణ్ ఎంతో మందిపై చాలా దారుణంగా మాట్లాడాడు. చేబ్రోలు కిరణ్‌ను అరెస్ట్ చేసి వదిలేశారు. చేబ్రోలు కిరణ్ విడుదలైనంత తొందరగా సోషల్ మీడియా కేసులో అరెస్ట్ అయిన వారెవరూ విడుదల కాలేదు. వైఎస్సార్సీపీ నుంచి ఎవరు అరెస్ట్ అయినా వారిని పిటిషన్ వేసి కస్టడీకి తీసుకుంటున్నారు. కానీ చేబ్రోలు కిరణ్‌ను మాత్రం పోలీస్ కస్టడీకి తీసుకోలేదు. చంద్రబాబు పెంచి పోషించాడు కాబట్టే.. చేబ్రోలు కిరణ్ కేసులో 24 గంటల్లో విచారణ పూర్తయిపోయింది..చంద్రబాబు చేయించిన ఏ అరెస్ట్ లోనూ ఇంత త్వరగా విచారణ పూర్తికాలేదు. చంద్రబాబు డైరెక్షన్లో కొన్ని వందల మంది ఐ-టీడీపీలో పనిచేస్తున్నారు. ఎవరిని ఎక్కువ బూతులు తిడితే వారిని అంత పోషిస్తామని చెబుతున్నారు. చంద్రబాబు మాటలన్నీ దొంగమాటలు. స్వాతి రెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్త పేరు స్వాతి చౌదరి. వైఎస్ జగన్ ఫోటోలు మార్ఫింగ్ చేయించేది చంద్రబాబు, లోకేష్‌లే. టీడీపీని మేం ప్రశ్నిస్తే వాళ్లకంటే ముందు సీమ రాజా అనేవాడు స్పందిస్తాడు. వైఎస్సార్సీపీ కండువా వేసుకుని టీడీపీ తరపున మమ్మల్ని తిడతాడు. సీమరాజాపై ఒకసారి కేసుపెట్టా.. మళ్లీ పెడతా. కిరాక్ ఆర్పీ అనేవాడు రోజూ వైఎస్ జగన్‌ను, నన్ను, రోజాను తిడతాడు. చంద్రబాబుతో ఫోటోలు దిగుతాడు. వ్యక్తిత్వ హననం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టి విద్య. ఎన్టీఆర్‌తో మొదలుపెట్టి ఇప్పటికీ ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూనే ఉన్నాడు..వ్యక్తిత్వ హననం చేసి చంద్రబాబు పైశాచికానందం పొందుతున్నాడు. సోషల్ మీడియాలో వారిని పెంచి పోషించేది వారికి డబ్బులిచ్చేది చంద్రబాబే. సోషల్ మీడియాలో పనిచేస్తే పేమెంట్ ఇస్తానని చెప్పింది చంద్రబాబు. ఎవరు బాగా తిడితే వారికి ఎక్కువ పేమెంట్ ఇస్తామని సాక్షాత్తూ చంద్రబాబే చెప్పారు. యూ ట్యూబ్లలో సైతం ఎంతో దుర్మార్గంగా.. దారుణమైన పోస్టులు పెడుతున్నారు. వెంకట కృష్ణ ఒక కీ ఇచ్చే బొమ్మ. వెనకుండి నడిపించేది రాధాకృష్ణ. మార్ఫింగ్ చేసిన పోస్టులు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరు. చేబ్రోలు కిరణ్ వంటి వారిని పెంచి ప్రోత్సహిస్తూ.. మహిళలను ఏదైనా అంటే సహించేది లేదని బిల్డప్ ఇస్తున్నారు...చంద్రబాబుని మోసేది సీమరాజా, కిర్రాక్ ఆర్పీ వంటి వారే. ఇంత నీచమైన స్థితికి టీడీపీ దిగజారిపోవడం బాధాకరం. ఐ-టీడీపీ ద్వారా జరుగుతున్న నీచమైన ప్రచారాలకు చంద్రబాబు చెక్ పెట్టాలి. ఏ ఒక్కరినీ వదలం అందరిపైనా కేసులు పెడతాం. అనిత పేరుకే హోంమంత్రి. హోంశాఖ గురించి ఆమెకు తెలియదు.. హోంశాఖను నడిపించేది లోకేష్. మా ఫిర్యాదులపై పోలీసులు కేసులు రిజిస్టర్ చేయకపోతే న్యాయపరంగా పోరాడతా. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వికృతచేష్టలపై పోరాడతాం’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు. -
‘ఏపీలో స్కీములు లేవు.. అన్నీ స్కాములే’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో స్కీములు లేవు కానీ.. స్కాములు మాత్రం విచ్చలవిడిగా ఉన్నాయంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మండిపడ్డారు. ఇసుక, మట్టి, లిక్కర్, మైనింగ్, రాజధాని పనుల్లో సైతం అవినీతి విలయ తాండవం చేస్తోందన్నారు. ప్రభుత్వంలోని పెద్దలకు వారి సన్నిహితులకు కారుచౌకగా భూములు కట్టబెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కనీసం ఒక టీ కంటే తక్కువ ఖర్చుకు భూములు దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు.అమరావతిలో జి+1 బిల్డింగ్లు కట్టేందుకు అధిక ధరలకు తన అనుంగులకు చంద్రబాబు కట్టబెట్టారు. వారి ద్వారా హైదరాబాద్‌లో ఒక బిల్డింగ్, మంగళగిరిలో పార్టీ కార్యాలయం కట్టించుకున్నారు. టెక్నాలజీ కంపెనీల పేరుతో చంద్రబాబు తన మనుషులకు భూములు దోచిపెడుతున్నాడు. ఊరూ పేరులేని ఉర్సా కంపెనీకి 3 వేల కోట్ల ఖరీదైన భూమిని కట్టబెట్టారు. ఏం అర్హత ఉందని... ఉర్సాకు 59.65 ఎకరాలు కేటాయించారు’’ అంటూ శివశంకర్‌రెడ్డి నిలదీశారు.2024 సెప్టెంబర్ 27వ తేదీన అమెరికాలో ఉర్సా కంపెనీ రిజిస్టర్ అయ్యింది. అక్టోబర్‌లో లోకేష్ పర్యటన తర్వాత పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ ఓ కథ అల్లారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన భారత దేశంలో ఉర్సా కంపెనీ రిజిస్టర్ చేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇంటిలో ఉర్సా కంపెనీ కార్యాలయం ఉంది. పది లక్షల రూపాయల మూలధనం పెట్టుబడితో ఉర్సా కంపెనీ పెట్టారు. అరసెంటు భూమి కూడా కేటాయించే అర్హత కూడా ఉర్సాకు లేదు. ఆఫీస్ కూడా లేని ఉర్సాకు మూడువేల కోట్ల రూపాయలు భూములు కట్టబెడతారా?’ అంటూ శివశంకర్‌రెడ్డి ప్రశ్నించారు.21st సెంచ్యూరీ కంపెనీ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి పారిపోయిన వ్యక్తులు అబ్బూరి సతీష్. ఉర్సా కంపెనీ కేటాయింపులపై ఇంత రచ్చ నడుస్తుంటే ప్రభుత్వం, సీఎం, మంత్రులు ఎందుకు స్పందించరు?. ప్రభుత్వానికి బదులు ఉర్సా కంపెనీ ప్రతిధులు ఎలా సమాధానం చెబుతారు?. ప్రైవేట్ కంపెనీని టీడీపీ పార్టీ ఎందుకు భుజాన వేసుకుంటుంది?. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకోవడం దేనికి?. మూడు వేల కోట్ల రూపాయలు భూములు కేటాయింపులో ఎవరెవరికి ఎంత వాటాలు వెళ్లాయి? ఈ వాటాల లెక్కలు తేలాల్సిందే’’ అని శివశంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఉర్సాకు భూముల కేటాయింపు అతిపెద్ద కుంభకోణం. ఉర్సా భూ కుంభకోణం పై సీబిఐతో విచారణ జరిపించాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. భవిష్యత్తు ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీఎండీసీ 9 వేల కోట్ల రుణంతీసుకున్నారు. రోడ్లను సైతం ప్రైవేట్ పరం చేస్తోంది. రాజధానిలో ప్రజల సొమ్ముతో చంద్రబాబు ఐదెకరాల్లో ఇల్లు కట్టుకుంటున్నారు’’ అని శివశంకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సెలవులకు సెలవ్ !
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు అవలంబిస్తున్న విధానాలకు విద్యార్థులు బలవుతున్నారు. విద్యా సంవత్సరం పొడవునా తరగతి గదులకే పరిమితమవుతున్నారు. వారాంతపు సెలవులు కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన సెలవులు సైతం ఇవ్వకుండా యాజమాన్యాలు వేధింపులకు గురి చేస్తున్నాయి. పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులను సైతం వదలడం లేదు. వేసవి సెలవుల అనంతరం నిర్వహించాల్సిన తరగతులను ఇప్పుడే ప్రారంభించేసి విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. ఇంటర్ తరగతులు ప్రారంభం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో ప్రస్తుతం సీనియర్, జూనియర్ ఇంటర్ తరగతులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. మార్చిలో పరీక్షలు రాసిన ప్రథమ సంవత్సర విద్యార్థులకు సీనియర్ ఇంటర్ తరగతులను ప్రారంభించేశారు. టెన్త్ ప్యాసైన విద్యార్థులను అప్పుడే కళాశాలల్లో చేర్చుకోవడం మొదలు జూనియర్ ఇంటర్ తరగతులను కూడా ప్రారంభించేశారు. తీవ్ర ఆందోళనలో విద్యార్థులు ఏడాది పొడవునా మార్కులు, ర్యాంకుల పేరుతో సెలవుల ఊసే లేకుండా కళాశాలకే పరిమితమైన విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వడం లేదు. రెగ్యులర్‌గా తరగతులను నిర్వహించడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు కళాశాలల యాజమాన్యాలు జేఈఈ అడ్వాన్స్డ్, ఏపీ ఈఏపీసెట్, తదితర ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలకు తరగతులు నిర్వహిస్తున్నాయి. బైపీసీ విద్యార్థులను నీట్‌కు సన్నద్ధం చేస్తూ జూనియర్, సీనియర్ ఇంటర్ తరగతులను సైతం నిర్వహిస్తున్నాయి. అకడమిక్ కేలండర్ ప్రకారం 2025–26 విద్యాసంవత్సరానికి జూన్ ఒకటో తేదీన ప్రారంభం కావాల్సిన తరగతులను వేసవి సెలవుల్లోనే నిర్వహించేస్తున్నాయి. వేసవిలో తీవ్రమైన ఎండల నడుమ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా తరగతుల నిర్వహణతో విద్యార్థులు అల్లాడుతున్నారు. జైళ్లలో ఖైదీలుగా మగ్గుతున్నారు. విద్యార్థులపై చదువుల ఒత్తిడి వేసవి సెలవులకు ఎగనామం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీల ఇష్టారాజ్యం టెన్త్ పాస్ అయిన విద్యార్థులకు జూనియర్ ఇంటర్ తరగతుల నిర్వహణ జూనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు సీనియర్ ఇంటర్ తరగతులు వేసవి ఎండల తీవ్రతతో క్లాస్ రూముల్లో అల్లాడుతున్న విద్యార్థులు ప్రభుత్వ పర్యవేక్షణ లోపంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలు సప్లిమెంటరీ పరీక్షల పేరుతో తరగతుల నిర్వహణ ఇంటర్ పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు మే 12 నుంచి 20 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల పరిధిలో పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు అనుమతి ఇచ్చింది. ఈ ఉత్తర్వులను ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తరగతుల పేరుతో మిగిలిన విద్యార్థులకు సైతం రెగ్యులర్ గా తరగతులను నిర్వహిస్తున్నాయి. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులు మినహా మిగిలిన వారికి సెలవులు నిర్వహించేందుకు వీల్లేదని బోర్డు ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు సెలవులుగా పరిగణించాల్సి ఉందని ఇంటర్మీడియెట్ విద్య ఆర్ఐవో జీకే జుబేర్ స్పష్టం చేశారు. సప్లిమెంటరీకి హాజరయ్యే విద్యార్థులు మినహా మిగిలిన వారికి రెగ్యులర్ తరగతులు నిర్వహించేందుకు వీల్లేదని, ఆ విధంగా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరోవైపు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలపై ప్రభుత్వ పర్యవేక్షణలోపంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. -
ఆద్యంతం నవరసభరితం
రక్తి కట్టించిన ‘జనరల్ బోగీలు నాటిక’ మార్టూరు : మార్టూరులో శ్రీకారం రోటరీ కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీలలో భాగంగా రెండో రోజైన శుక్రవారం రాత్రి ప్రదర్శించిన మూడు నాటికలు ప్రేక్షకులను అలరించాయి. ప్రదర్శనకు ముందు రిలయన్స్ ఫౌండేషన్ ప్రకాశం జిల్లా చైర్మన్ ఏ.వి.బాబూరావు శ్రీకారం రోటరీ కళాపరిషత్ సభ్యుల ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి నాటికలను ప్రారంభించారు. ‘వేదిక‘ సంస్థ అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు ప్రదర్శనలలో పాల్గొన్న నటీనటులకు జ్ఞాపికలు అందజేశారు. సికింద్రాబాద్‌కు చెందిన మీనాక్షి సేతురామన్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ జి.వి.సేతురామన్, వసంత సేతురామన్ దంపతులు కళాకారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎఫర్ట్ సంస్థ డైరెక్టర్ జేవీ మోహనరావు, శ్రీకారం కార్యదర్శి జాష్టి అనూరాధ, మార్టూరు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మద్దుమాల కోటేశ్వరరావు, మాదాల సాంబశివరావు, ఈశ్వర ప్రసాద్, శానంపూడి లక్ష్మయ్య, గరివిడి శ్రీనివాసరావు, ఖాజా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. మనిషిలోని అంతర్లీన కోణాలను స్పృశించిన ‘(అ)సత్యం’ స్వార్థం, నిస్వార్థం,మంచి, చెడు, దైవత్వం, రాక్షసత్వం .. ఏదైనా సరే మనిషి హృదయానికి పరిమితమై ఉంటుంది. ప్రతి సత్యం, అసత్యం వెనుక మనిషి స్వార్థం లేక భయం నిక్షిప్తమై ఉంటుంది. కంటికి కనిపించేదంతా సత్యం కాదు.. అలాగని కనిపించనిదంతా అసత్యం కూడా కాదు. యథార్థం అయినా సరే ఒక చెడుకు దోహదపడితే అది అసత్యం. అబద్ధమైనా సరే అది ఒక మంచికి దోహదపడితే అది సత్యం.. ఏది సత్యం? ఏది అసత్యం? అంటూ ప్రేక్షకులను ఆలోచింపజేసిన నాటిక శ్రీ చైతన్య కళా స్రవంతి ఉక్కునగరం విశాఖ వారి ‘(అ)సత్యం’ నాటిక. ఎం. శ్రీసుధరచించిన ఈ నాటికకు బి.బాలాజీ నాయక్ దర్శకత్వం వహించారు. మహిళల మనోగతాలకు దర్పణం పట్టిన ‘ఋతువు లేని కాలం’ స్వేచ్ఛ పేరిట ఉమ్మడి కుటుంబ వ్యవస్థలను, పురుషాధిక్యతా శృంఖలాలను తెంచుకుంటున్నామంటూ తమకు తామే బానిసలుగా మారుతున్న నేటి మహిళల పోకడను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించిన నాటిక కళానికేతన్ వీరన్నపాలెం వారి ‘ఋతువులేని కాలం’. అపరిమితమైన ఆర్థిక స్వేచ్ఛతో ఆడంబరాలకు, ఫ్యాషన్లకు బానిసలౌతూ సంస్కృతీ సంప్రదాయాలకు వక్ర భాష్యం చెప్పడం, మేము అనే భావన నుండి నేను మాత్రమే అనే భావన పెరుగుతూ ఒంటరితనానికి దగ్గరవుతున్న మహిళల అంతరంగాలను ప్రేక్షకులకు ఆకట్టుకునేలా ప్రదర్శించారు నాటికలోని నటీనటులు. మార్టూరులో రెండవ రోజు అలరించిన పరిషత్తు నాటికలు రైలు ప్రయాణం అందరికీ ఇష్టమైనది, సౌకర్యవంతమైనది. అయితే సామాన్యుడి నుంచి సగటు మధ్యతరగతి ప్రజల వరకు రైలులో జనరల్ బోగీలలో తక్కువ ఖర్చు కారణంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా జనరల్ బోగీలను పెంచాల్సిన రైల్వే శాఖ క్రమేపీ బోగీలను తగ్గిస్తూ ఉండటంతో రైలులోని బాత్రూములు, మరుగుదొడ్లలో సైతం ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణం చేయాల్సిన దుస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. తరచూ సంభవించే రైలు ప్రమాదాలలో జనరల్ బోగీలో ప్రయాణించే ప్రయాణికులు మరణించిన సందర్భాలలో వారి చిరునామాలు రైల్వే శాఖ వద్ద ఉండని విషయం కూడా అందరికీ తెలిసిందే. అలాంటి ప్రమాదంలో తన కొడుకును దూరం చేసుకున్న ఓ తల్లి సావిత్రమ్మ రైల్వే శాఖతోపాటు ప్రజాప్రతినిధులకు ఉత్తరాల ఉద్యమం ప్రారంభించి సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపిందన్న ఇతి వృత్తంతో సాగిన నాటిక శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారు ప్రదర్శించిన‘ జనరల్ బోగీలు‘. పి.టి.మాధవ్ రచించిన ఈ నాటికకు గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు. నాటికలో సావిత్రమ్మ పాత్రధారిగా నటించిన సీనియర్ నటి సురభి ప్రభావతి తన నటనా కౌశలంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. -
దూరవిద్యలో ఉత్తీర్ణత దూరం
గుంటూరు ఎడ్యుకేషన్ : వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారి కోసం ప్రవేశపెట్టిన దూర విద్యా విధానం విద్యార్థులకు సుదూరంగా పోతోంది. సమాజంలో నిరక్షరాస్యతను రూపుమాపేందుకు ప్రవేశపెట్టిన దూర విద్య లక్ష్యానికి చేరలేక పోతోంది. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్ఎస్) ద్వారా టెన్త్, ఇంటర్లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించి, వారికి చదువుకునే అవకాశాలను కల్పించాల్సిన పరిస్థితులు ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి. బుధవారం రెగ్యులర్ టెన్త్ ఫలితాలతో పాటు ప్రకటించిన దూరవిద్య టెన్త్ పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో గుంటూరు జిల్లాలో ఉత్తీర్ణత దారుణంగా ఉంది. ఫలితాల్లో చతికిలపడిన జిల్లా రెగ్యులర్ టెన్త్ ఫలితాల్లో 88.53 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానంలో నిలిచిన గుంటూరు జిల్లా దూరవిద్య టెన్త్ ఫలితాల్లో చతికిలపడింది. 5.86 శాతం ఉత్తీర్ణతతో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. పరీక్షలు రాసిన 939 మంది అభ్యర్థుల్లో కేవలం 55 మందే ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో ఇంతటి దారుణమైన ఫలితాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. రాష్ట్రస్థాయిలో దూరవిద్య టెన్త్ ఫలితాల్లో 37.93 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, జిల్లాలో పడిపోయింది. సొసైటీ నిర్వాకంతో దారుణంగా పడిపోయిన ఉత్తీర్ణత దూరవిద్య టెన్త్ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం పడిపోవడం వెనుక ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వాకమే కారణంగా కనిపిస్తోంది. కోర్సులో చేరిన అభ్యర్థులకు సకాలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడంలో విఫలమైన అధికారులు, ఉత్తీర్ణతా శాతం దిగజారిపోవడానికి కారకులుగా నిలిచారు. రాష్ట్రంలోని నాలుగైదు జిల్లాలు మినహా, మిగిలిన 20 జిల్లాల్లోనూ ఉత్తీర్ణతా గణనీయంగా పడిపోయింది. గుంటూరు జిల్లాలో 5.86 శాతం నమోదు దూరవిద్య టెన్త్ పరీక్షలు రాసిన 939 మంది ఉత్తీర్ణులైన వారు కేవలం 55 మంది ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వాకంతో దారుణంగా పడిపోయిన ఉత్తీర్ణత కోర్సులో చేరిన అభ్యర్థులకు సకాలంలో అందని పాఠ్య పుస్తకాలు పంపిణీలో తీవ్ర జాప్యంతో తప్పిన విద్యార్థులు సకాలంలో అందని మెటీరియల్ గుంటూరు కేంద్రంగా ఉన్న ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ రాష్ట్ర కార్యాలయం ద్వారా టెన్త్, ఇంటర్లో చేరిన అభ్యర్థులకు సకాలంలో మెటీరియల్ అందలేదు. 2024–25 విద్యా సంవత్సరంలో గతేడాది డిసెంబర్ నెలాఖరుకు సైతం పాఠ్య పుస్తకాలు అందలేదు. ఒకవైపు మార్చిలో జరగనున్న పరీక్షలకు ఫీజులు వసూలు చేసిన ఓపెన్ స్కూల్ సొసైటీ తాపీగా పోస్టాఫీసులకు మెటీరియల్ పంపి, చేతులు దులుపుకుంది. గతేడాది డిసెంబరులో గుంటూరు చంద్రమౌళీనగర్‌లోని పోస్టాఫీసులో జిల్లాలకు పంపేందుకు గుట్టలుగా పడవేసిన మెటీరియల్ పార్శిళ్లు వెలుగు చూశాయి. గతంలో దూరవిద్య టెన్త్, ఇంటర్లో ప్రవేశం పొందిన అభ్యర్థులకు అక్కడికక్కడే పాఠ్య పుస్తకాలు అందజేసే విధానాన్ని అధికారులు రద్దు చేశారు. రాష్ట్ర కార్యాలయం నుంచి పోస్టల్ ద్వారా పుస్తకాలు పంపే విధానాన్ని ప్రవేశపెట్టడంతో పంపిణీలో నెలకొన్న జాప్యంతో అభ్యర్థులకు శాపంగా మారింది. -
మనోడిదే.. వదిలేయండి !
తెనాలి: ‘మనోడే పాడుకుంటాడు...మీరు వదిలేయండి!’ దేవదాయ శాఖ పరిధిలోని పట్టణ బోసురోడ్డులోని శ్రీకాకుమాను శంకరుని ధర్మ సత్రానికి చెందిన పాత సత్యనారాయణ టాకీస్ వేలం పాటలో పాల్గొన్న వ్యక్తులకు తెలుగు తమ్ముళ్ల నుంచి వచ్చిన ఫోను ఇది. అప్పటివరకు వచ్చిన పోటీకి మరికొంత పలికించి మనోడికి పాట వచ్చేలా చూశారు. అంతవరకూ బాగానే ఉందనుకున్నా, నిబంధనల ప్రకారం వేలంపాటలో పాల్గొనే ముందు సదరు పాటదారుడు ఇతరుల్లా డిపాజిట్ డబ్బులు చెల్లించలేదు. తన పేరిట పాట కొట్టేశాక, తొలి ఆరు నెలల అద్దె డబ్బులు కూడా చెల్లించలేదు. తెలుగు తమ్ముళ్ల నుంచి ఫోన్లు పట్టణంలోని శ్రీకాకుమాను శంకరుని ధర్మసత్రం స్థలంలో శ్రీ సత్యనారాయణ టాకీస్ సుదీర్ఘకాలం నడిచింది. అది మూతపడ్డాక యథా ప్రకారం దేవదాయ శాఖ వేలం నిర్వహిస్తూ వస్తోంది. కొన్నేళ్లుగా అక్కడ ఫంక్షన్ హాలు నడుస్తోంది. కాలపరిమితి పూర్వవడంతో మూడు రోజుల క్రితం వేలం నిర్వహించారు. అయిదారుగురు హాజరయ్యారు. ప్రస్తుతం నెలకు రూ.95 వేల వరకు అద్దెతో ఉన్న ఆ ఫంక్షన్ హాలు వేలం పాట రూ.1.28 లక్షల వరకు వెళ్లింది. అంతలోనే పాటదారులకు తెలుగు తమ్ముళ్ల నుంచి ఫోన్లు వచ్చాయి. ‘‘మనోడు పాడుకుంటాడు...మీరు వదిలేయండి’’ అన్నారు. దీనితో మిగిలినవారు వదిలేశారు. ధర్మసత్రం ఈవో వేలంపాటను ‘మనోడి’ పేరిట కొట్టేశారు. ఫోన్లు రాకపోయినట్టయితే రూ.1.60 లక్షల వరకు పాట వెళ్లేదని ప్రస్తుతం పట్టణంలో చర్చ నడుస్తోంది. దేవదాయ శాఖ వేలంపాటలో ‘తమ్ముళ్లు’ మనోడికి దక్కేలా చక్రం తిప్పారు డిపాజిట్ లేకుండానే పాటకు అనుమతి ఆరు నెలల అద్దెనూ చెల్లించనిపాటదారుడు పచ్చపాతంతో ఏకపక్షంగా విలువైనఫంక్షన్ హాలు వేలం పాట డిపాజిట్‌కు ఎగనామం -
చానల్ పొడిగింపు పనులు వెంటనే ప్రారంభించాలి
ప్రత్తిపాడు: గుంటూరు చానల్ పొడిగింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నల్లమడ రైతు సంఘం నాయకులు కలెక్టర్‌ను కోరారు. జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహన్ తదితరులు కలసి వినతిపత్రం అందజేశారు. గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో వంద కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. ఇందులో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియకు సంబంధించి నిధులు విడుదల చేసినట్లుగా వార్తాపత్రికల్లో కథనాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పనులను త్వరగా ప్రారంభించాలని ఆయన కోరారు. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి తమ ప్రాంతానికి సాగు, తాగు నీరు ఇప్పించాలని ఆయన కలెక్టర్‌కు విన్నవించారు. ఆయన వెంట పలువురు రైతు సంఘ నాయకులు ఉన్నారు. -
ఇద్దరు చిన్నారులకు గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం
తాడికొండ / తెనాలి : జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారులకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం లభించింది. రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం బోరుపాలెం గ్రామానికి చెందిన 12 ఏళ్ల తోకల సంవేద్ బాబు విజయవాడలోని హల్లేల్ మ్యూజిక్ స్కూల్లో కీబోర్డ్ ప్లేలో శిక్షణ పొందాడు. 2024లో డిసెంబర్ 1న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వారు నిర్వహించిన కీబోర్డ్ ప్లేయింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. 50 సెకన్ల వ్యవధిలో సరళీ స్వరాలను స్పష్టంగా, అత్యంత వేగంగా పలికించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు యాజమాన్యం అవార్డు ప్రకటించి మెడల్, సర్టిఫికెట్ అందజేసింది. గత ఏడాది మే 31న ఇన్ జీనియస్ చాంప్స్ వరల్డ్ రికార్డ్‌లో కూడా సంవేద్ బాబు స్థానం సంపాదించడం విశేషం. ● తెనాలి పట్టణానికి చెందిన తొమ్మిదేళ్ల నిశ్శంకరరావు అభిషేక్ గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. గతేడాది డిసెంబరు ఒకటిన హల్లేల్ మ్యూజిక్ స్కూల్ ద్వారా ప్రపంచస్థాయిలో 18 దేశాల నుంచి 1100 మంది విద్యార్థులు సంగీత ప్రదర్శనలో పాల్గొన్నారు. కీ బోర్డు వాయిద్యంలో అభిషేక్‌తోపాటు మొత్తం 1046 మందిని ఎంపికచేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేశారు. విజయవాడలోని మెట్రోపాలిటన్ చర్చిలో శుక్రవారం జరిగిన అభినందన సభలో మ్యూజిక్ స్కూల్ నిర్వాహకుడు అగస్టీన్ దండింగ నుంచి అభిషేక్ గిన్నిస్ సర్టిఫికెట్, జ్ఞాపికను అందుకున్నాడు. స్థానిక కేకేఆర్ గౌతమ్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. -
ముగిసిన సదరం క్యాంప్
తెనాలి అర్బన్: వికలాంగుల ధ్రువపత్రాల పునః పరిశీలన కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ శుక్రవారంతో ముగిసింది. ఆర్థో, ఈఎన్టీ, సెక్రాటిక్ విభాగాలకు చెందిన వికలాంగులు వైద్యశాలకు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి పర్యవేక్షించారు.మలేరియాను తరిమికొట్టాలిగుంటూరు వెస్ట్: సమాజం నుంచి మలేరియాను తరిమికొట్టడానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మలేరియా అంతం– మనతోనే పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఏ.శ్రావణ్ బాబు, డాక్టర్ సీహెచ్. రత్న మన్మోహన్, డాక్టర్ రత్న, సుబ్బరాయణం పాల్గొన్నారు.● స్వర్ణాంధ్ర–2047కు అనుగుణంగా ప్రతి నియోజకవర్గంలోనూ విజన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా అధికారులు, నియోజకవర్గ విజన్ ప్లాన్ యాక్షన్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధి రేటు 15 శాతం సాధించే లక్ష్యంతో నియోజకవర్గాల్లోనూ శాసన సభ్యులను సమన్వయం చేసుకుంటూ అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని పేర్కొన్నారు.నిత్యాన్నదానానికి విరాళంఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ నిత్యాన్నదానానికి గుంటూరుకు చెందిన ఎం.శశితేజ కుటుంబం రూ. 1,01,116 విరా ళాన్ని అందజేసింది. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.నేడు వేట నిషేధ కాల భృతి పంపిణీబాపట్ల: మత్స్యకారులకు వేట నిషేధకాల భృతి పంపిణీని శనివారం నిజాంపట్నం మండలం కొత్తపాలెంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మత్స్యకారుల వేట నిషేధ కాల భృతి 12,671మందికి రూ.25.34లక్షలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రేపల్లె నియోజకవర్గంలో 7,304 మందికి, బాపట్లలో 1441 మందికి, చీరాలలో 2,836 మందికి, పర్చూరులో 1090 మందికి రూ.20 వేల వంతున పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.గుండ్లకమ్మ వాగులో పడి బాలిక మృతినూజెండ్ల: ప్రమాదవశాత్తు గుండ్లకమ్మ వాగులో జారి పడి బాలిక మృతి చెందిన సంఘటన శుక్రవారం పాత ఉప్పలపాడు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన చీకటి విజయరాజు, కృపావరం దంపతుల సంతానం కీర్తి (10)నాలుగో తరగతి చదువుతోంది. వేసవి సెలవులు కావటంతో సమీపంలోని గుండ్లకమ్మ నది వద్దకు ఆడుకుంటూ వెళ్లింది. వాగులో జారిపడి కాళ్లు పూడికలో కూరుకుపోవడంతో మృతి చెంది ఉంటుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. దుస్తులు ఉతికేందుకు వెళ్లిన స్థానికులు గుర్తించి సమాచారం అందించారు.పాకిస్థాన్ పౌరులు ఉంటే వెళ్లిపోవాలినగరంపాలెం (గుంటూరు వెస్ట్) : పాకిస్థాన్ వీసాలతో జిల్లాలో ఉండే ఆ దేశపౌరులు ఈనెల 27వ తేదీ కల్లా దేశం విడిచిపోవాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశం విడిచివెళ్లకుండా ఎవరైనా అక్రమంగా నివసిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి వారికి ఆతిథ్యం కల్పించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
చింతమనేనిపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలి
నరసరావుపేట: మీడియాపై ప్రజాప్రతినిధులే రౌడీలుగా మారి దాడులు చేయించడం క్షమార్హం కాని నేరమని విశ్రాంత పత్రికా సంపాదకులు, గాంధీ స్మారక సమితి అధ్యక్షుడు ఈదర గోపీచంద్ పేర్కొన్నారు. ఏలూరు సాక్షి కార్యాలయంపై ఈ తరహాలో దాడికి పాల్పడిన చింతమనేని ప్రభాకర్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని శుక్రవారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు. దళితులను కులం పేరుతో దూషించినందుకు, మహిళా ఎమ్మార్వోపై దౌర్జన్యం చేసిన నేరచరిత్ర కలిగిన చింతమనేని తీరును నాడు సభ్యసమాజం తీవ్రంగా నిరసించిందని గుర్తుచేశారు. 1997లో నైతిక విప్లవం మాస పత్రిక సంపాదకులుగా అప్పట్లో ఎన్టీఆర్ తెచ్చిన సంపూర్ణ మధ్య నిషేధాన్ని నీరుగార్చిన చంద్రబాబును, మంత్రి కోడెల శివప్రసాదరావును సంపాదకీయంలో తాను విమర్శించినప్పుడు కోడెల అనుచరులు దాడి చేసి హెచ్చరించారని గుర్తు చేశారు. ఇప్పటికై నా చంద్రబాబు మేల్కొని, చింతమనేనిని మందలించి క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. గాంధీ స్మారక సమితి అధ్యక్షుడు ఈదర గోపీచంద్ -
కూటమిలో ‘మేయర్’ గుబులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కూటమిలో మేయర్ ఎంపిక గుబులు మొదలైంది. ఈ నెల 28న ఎన్నిక ఉండటంతో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు సమావేశమై చర్చించారు. మేయర్ ఎన్నికల్లో పోటీ పడుతున్నట్లు వైఎస్సార్ సీపీ ప్రకటించడంతో ఆ పార్టీలో కలకలం మొదలైంది. పలువురు కార్పొరేటర్లను కొనుగోలు చేసి స్థాయీ సంఘాన్ని దక్కించుకున్న కూటమి మేయర్ ఎన్నికపై దృష్టి పెట్టింది. మేయర్‌గా కావటి మనోహర్‌నాయుడు రాజీనామా చేయడంతో వారు ఈ పదవికి తమ పార్టీ తరఫున కోవెలమూడి రవీంద్ర (నాని)ను బరిలోకి దింపారు. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీలోనే మెజారిటీ కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఇప్పటికే కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఆయన ఖర్చు పెట్టాడు. పార్టీ కోసం పని చేస్తున్న నేపథ్యంలో అధిష్టానం రవీంద్రను అభ్యర్థిగా నిర్ణయించింది. దీన్ని ఎవరూ వ్యతిరేకించవద్దంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. శనివారం నుంచి కార్పొరేటర్లతో క్యాంపు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. తేలని డెప్యూటీ మేయర్ అభ్యర్థి ప్రస్తుతం కూటమికి మద్దతుగా 29 మంది ఉన్నారు. డెప్యూటీ మేయర్ అంశం రెండు పార్టీల్లో కొంత విభేదాలకు దారితీస్తోంది. డెప్యూటీ మేయర్ పదవిని జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, వైఎస్సార్ సీపీ నుంచి జనసేనలో చేరిన నిమ్మల రమణను మేయర్ అభ్యర్థి కోవెలమూడి రవీంద్రతో పాటు మరికొందరు తెలుగుదేశం నాయకులు ప్రోత్సహిస్తున్నారు. దీన్ని జనసేనలో మెజారిటీ వర్గం వ్యతిరేకిస్తోంది. మొదటి నుంచి జనసేనలో ఉన్న వారికే అవకాశం కల్పించాలని పట్టుపడుతున్నారు. దీంతో మేయర్ ఎన్నిక అయిన తర్వాత డెప్యూటీ మేయర్ డైమండ్బాబుపై అవిశ్వాసం పెట్టిన తర్వాత అభ్యర్థి విషయం ఆలోచిద్దామని, తొందరపడవద్దని పెద్దలు సూచించినట్లు సమాచారం. పోటీ చేస్తున్నట్టు ప్రకటించినవైఎస్సార్ సీపీ డెప్యూటీ మేయర్ కావాలంటూ జనసేన పట్టు 28న మేయర్ ఎంపికకునోటిఫికేషన్ ఒక హోటల్లో కూటమి నేతల సమావేశంరవీంద్ర వ్యాఖ్యలపై కేడర్ మండిపాటు శుక్రవారం జరిగిన సమావేశంలో తెలుగుదేశం మేయర్ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారందరికి వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వాలని ఒత్తిడి ఉందని, దీనిపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ కేడర్ మండిపడుతోంది. శుక్రవారం సాయంత్రం వన్‌టౌన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు ఈ విషయమై రవీంద్రను నిలదీసినట్లు సమాచారం. మొదటి నుంచి కష్టపడిన వారిని పక్కన పెట్టి అవసరం కోసం పార్టీలోకి తెచ్చిన వారికి సీట్లు ఎలా ఇమ్మని అడుగుతారంటూ నిలదీశారు. దీంతో కంగుతిన్న రవీంద్ర వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి బయటపడినట్లు తెలిసింది. -
పింఛన్‌దారులతో మర్యాదగా వ్యవహరించాలి
గుంటూరు వెస్ట్: పింఛన్‌దారులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా మెలగాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో ఫించన్ల పంపిణీ సిబ్బందికి శుక్రవారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఆమె మాట్లాడారు. ఐవీఆర్ఎస్ నివేదిక ప్రకారంలో ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన పింఛన్ల పంపిణీలో అనేక లోపాలను గుర్తించారని తెలిపారు. నగదు పంపిణీలో కులమతాలకతీతంగా అందరినీ గౌరవించాలని, వృద్ధులతో మర్యాదపూర్వకంగా మెలగాలని చెప్పారు. అవినీతికి పాల్పడకూడదని తెలిపారు. సిబ్బంది ఇబ్బందులు కలిగించినా, పింఛన్‌దారులతో అమర్యాదగా ప్రవర్తించినా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కౌన్సెలింగ్‌కు హాజరుకాని సిబ్బందికి మెమో జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ టి.వి. విజయలక్ష్మి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన తాడికొండ : వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయంలో ఈనెల 28న జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, అధికారులు పరిశీలించారు. సభా వేదిక ప్రాంగణం, పలు ప్రాంతాలను పరిశీలించారు. వీఐటీ యూనివర్సిటీ వీసీ ఎస్.వి.కోటారెడ్డితో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
రైలు దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్
తెనాలి రూరల్: రైలు ప్రయాణికులపై కర్రతో దాడి చేసి వారి నుంచి నగదు, ఫోన్లు దోచుకుంటున్న ఇద్దరు నిందితులను జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి జీఆర్పీ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్ఐ జి. వెంకటాద్రి వివరాలు వెల్లడించారు. ఈ నెల 21న రాత్రి కాకినాడ–తిరుపతి రైలులో మాచర్ల సంతోష్‌కుమార్ ప్రయాణిస్తున్నారు. రైలు నిడుబ్రోలు స్టేషన్‌కు సమీపానికి రాగానే ఇద్దరు వ్యక్తులు అతనిపై కర్రతో దాడి చేసి గాయపరచి, సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. సంతోష్‌కుమార్ వేరే ఫోన్ నుంచి తన నంబరుకు చేశారు. నిందితులు తాము చెప్పిన నంబరుకు రూ. 20 వేలు పంపాలని డిమాండ్ చేశారు. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. తెనాలి జీఆర్పీ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితులను నిడుబ్రోలుకు చెందిన దేవర సాయి, యర్రంశెట్టి వంశీలుగా గుర్తించి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. గతంలో అపహరించిన మరో సెల్‌ఫోన్ విషయాన్ని నిందితులు చెప్పడంతో వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, నేరాలకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనపర్చుకున్నారు. రైలు ప్రయాణికులపై దాడి చేయడం, దోచుకోవడం చేస్తే సహించేదిలేదని ఎస్ఐ వెంకటాద్రి స్పష్టం చేశారు. నేరాలను నియంత్రించడానికి గస్తీ సిబ్బందితో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. -
కవి కత్తి పద్మారావుకు ఘన సన్మానం
పొన్నూరు: పట్టణంలోని లుంబినీ వనం అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్లో దళిత మహాసభ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ నేతల రమేష్ ఆధ్వర్యంలో కవి డాక్టర్ కత్తి పద్మారావు, మాతా రమాబాయి అవార్డు గ్రహీత కత్తి స్వర్ణ కుమారిలను శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కత్తి పద్మారావు, స్వర్ణ కుమారి అనేక ఉద్యమాలను నీతి, నిజాయతీగా చేసిన త్యాగమూర్తులని కొనియాడారు. కారంచేడు, చుండూరు, పిప్పర, కొత్తకోట, దంతారి, లక్ష్మీపేట వరకు ఎన్నో ఉద్యమాలు చేసిన పోరాట యోధులని పేర్కొన్నారు. దళిత మహాసభ ఆధ్వర్యంలో వారిని సన్మానించడం ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. 1989 ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ తెచ్చిన ఘనత పద్మారావుకే దక్కుతుందన్నారు. దాని వల్ల దళిత బహుజనులకు రక్షణ, సంక్షేమం అందిందని, ప్రత్యేక కోర్టులు ఏర్పడ్డాయని అభినందించారు. కార్యక్రమంలో దళిత మహాసభ ప్రతినిధులు చిగురుపాటి రత్నాకర్‌రావు, నేతలు భలేస్వామి, మాకారపు రాజు, గద్దె అచ్యుతరావు, పీఆర్వోలు గేరా ప్రసన్న కుమారి, శ్యామల, జొన్నలగడ్డ రాణిి పాల్గొన్నారు. -
అధిక రక్తపోటుతో అనేక అనర్థాలు
గుంటూరు మెడికల్: అధిక రక్తపోటు వల్ల అనేక అనారోగ్య సమస్యలతో పాటు శరీరంలోని అనేక అవయవాలు దెబ్బతింటాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అన్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు దారి తీస్తున్న అధిక రక్తపోటును ప్రాథమిక దశలోనే గుర్తించి, అదుపులో పెట్టుకోవడం ద్వారా, ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, గుంటూరుకు చెందిన సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పమిడిముక్కల విజయ సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు భారతీయ విద్యా భవన్లో అధిక రక్తపోటుపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మంది బీపీ, 25 లక్షల మంది షుగర్, బీపీ, షుగర్‌తో 22 లక్షల మంది బాధపడుతున్నట్లు స్క్రీనింగ్ పరీక్షల ద్వారా గుర్తించామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూడేళ్లుగా రాష్ట్రంలో ఎన్సీడీ సర్వేలో భాగంగా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి బీపీ, షుగర్, జ్వరాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని తెలిపారు. ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్‌లో 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. స్టెమీ కార్యక్రమం ద్వారా ఎనిమిది నెలల్లో 2,300 మందికి రూ. 40వేలు ఖరీదు చేసే ఇంజక్షన్ చేసి ప్రాణాలు కాపాడామని తెలిపారు. హార్ట్ ఎటాక్ మాదిరిగానే బ్రెయిన్ స్ట్రోక్ కూడా ప్రాణాలు తీస్తుందని, అధిక రక్తపోటును కంట్రోల్లో పెట్టుకోవాలని ఆయన సూచించారు. బస్సు ద్వారా ఉచిత పరీక్షలు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ మాట్లాడుతూ చెక్ బీపీ – స్టాప్ స్ట్రోక్ క్యాంపెయిన్ – 2025లో భాగంగా తాము ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసి, అన్ని గ్రామాల్లో ఉచితంగా అధిక రక్తపోటు పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. బీపీ పరీక్షల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సును, బీపీ అవగాహన పోస్టర్లను కృష్ణబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో గుంటూరు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, రెడ్‌క్రాస్ ట్రెజరర్ పి.రామచంద్రరాజు, రోటరీ ఇంటర్నేషనల్ రవి వడ్లమాని, రోటరీ క్లబ్ అధ్యక్షుడు జి.సుబ్బారావు, ఐఎంఏ నేతలు, న్యూరాలజిస్టులు, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు బీపీ చెకప్ చేసేందుకు ప్రత్యేక వాహనం ప్రారంభం -
దోమల నివారణతో వ్యాధుల కట్టడి
డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గుంటూరు మెడికల్: దోమకాటుతో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా తదితర వ్యాధులు సోకుతాయని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. దోమల నివారణతో వ్యాధులు కట్టడి చేయవచ్చని చెప్పారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మలేరియా నివారణపై వైద్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మలేరియాపై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ పరస్పర సహకారం, పరిసరాల పరిశుభ్రత, నీటి నిల్వల నివారణ, దోమతెరలు వాడటం, ఫ్రైడే ను డ్రైడే గా పాటించడం ద్వారా దోమకాటు బారిన పడకుండా కాపాడుకోవచ్చని ఆమె సూచించారు. ర్యాలీ డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ప్రారంభమై, నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ వరకు కొనసాగింది. దోమల నివారణ చర్యలపై సిబ్బంది ప్లకార్డులు చేతపట్టి, నినాదాలు చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఏ. శ్రావణ్ బాబు, డాక్టర్ రోహిణి రత్నశ్రీ, డాక్టర్ దాసరి శ్రీనివాసులు, డాక్టర్ లక్ష్మానాయక్, జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం, అసిస్టెంట్ మలేరియా అధికారి రాజు నాయక్, సబ్ యూనిట్ ఆఫీసర్లు ఘంటసాల శ్రీనివాసరావు, నరేంద్ర, ప్రశాంత్, ఆరోగ్య విస్తరణ అధికారులు గణేష్, సాంబయ్య, సూపర్వైజర్లు సుకుమార్, మల్లికార్జునరావు, వెంకటప్పయ్య, మాస్ మీడియా అధికారి ఎన్. వెంకటేశ్వర్లు, హెల్త్ ఎడ్యుకేటర్ ఇస్మాయిల్, ఏఎన్ఎంలు, ఆశాలు, సిబ్బంది పాల్గొన్నారు. -
బాలికల వాలీబాల్ పోటీల విజేత వాల్తేరు
సత్తెనపల్లి: పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ హైదరాబాద్ 54వ రీజియన్ స్థాయి అండర్–17 బాలికల వాలీబాల్ పోటీల్లో వాల్తేరు జట్టు విజేతగా నిలిచింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని (రామకృష్ణాపురం) పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ఆవరణలో రెండు రోజులుగా జరుగుతున్న పోటీలు శుక్రవారంతో ముగిశాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 8 జట్లు పాల్గొన్నాయి. వాల్తేరు, సత్తెనపల్లి, ఖమ్మం జట్లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. అపూర్వ వైద్యశాల అధినేత డాక్టర్ పాలేటి నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఓటమితో కుంగిపోకుండా సాధన చేసి మరింతగా రాణించాలన్నారు. విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు, మెడల్స్ ప్రదానం చేసి అభినందించారు. రిటైర్డ్ పీడీ ఐఎస్ నాగిరెడ్డి, పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ సత్తెనపల్లి ఇన్చార్జ్ ప్రిన్సిపల్ బి.కిరణ్ రెడ్డి, రిఫరీలు తదితరులు పాల్గొన్నారు. శనివారం నుంచి 17 బాలుర జట్లు రెండు రోజులపాటు తలపడనున్నాయి. రెండో స్థానంలో నిలిచిన సత్తెనపల్లి జట్టు -
యార్డులో 1,08,662 బస్తాలు మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,02,336 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,08,662 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.13,200 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.9,800 నుంచి రూ.13,800 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 44,778 బస్తాలు నిల్వ ఉన్నట్లు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.పసుపు ధరలుదుగ్గిరాల: స్థానిక పసుపు యార్డుకు శుక్రవారం 698 బస్తాలు వచ్చాయి. మొత్తం అమ్మకం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కొమ్ములు 520 బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ట ధర రూ.11,200, గరిష్ట ధర రూ.12,250, మోడల్ ధర రూ.11,750 పలికింది. కాయలు 178 బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ట ధర రూ.11,200, గరిష్ట ధర రూ.12,250, మోడల్ ధర రూ.11,750 పలికింది. మొత్తం 523.500 క్వింటాళ్ల అమ్మకాలు జరిగినట్లు యార్డు కార్యదర్శి తెలిపారు.సంగీత కార్యక్రమంతో మహిళకు గిన్నిస్‌లో స్థానంమాచవరం: మండలంలోని మోర్జంపాడు గ్రామ సచివాలయం–1 నందు గ్రామ వ్యవసాయ సహాయకురాలిగా విధులు నిర్వహిస్తున్న గారపాటి మణిదీప్తి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. హల్లెల్ మ్యూజిక్ స్కూల్ (విజయవాడ) వ్యవస్థాపకుడు పాస్టర్ అగస్టీన్ దండిగి ఆధ్వర్యంలో 2024 డిసెంబర్ 1న నిర్వహించిన సంగీత పోటీల్లో 18 దేశాలకు చెందిన సుమారు 1,046 మంది సంగీత కళాకారులు ఆన్లైన్లో గంటపాటు సంగీత సరళి స్వరాలను కీబోర్డుపై ఆలపించి, వీడియోలను ఇన్‌స్ట్రాగామ్‌లో అప్లోడ్ చేశారు. అత్యుత్తమ సంగీత స్వరాలను అందించినందుకు మణిదీప్తికి గిన్నిస్ బుక్ వారు సర్టిఫికెట్‌ను, మెడల్‌ను అందించారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. 14 మంది రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘పవన్.. మీరు సామాన్యులను, దళితులను పట్టించుకోరా?’
తాడేపల్లి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితులను వెలివేస్తే ఆయన అస్సలు పట్టించుకోలేదని, ఇక దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపే కన్నెత్తి చూడలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. వీరయ్య చౌదరిని మద్యం గొడవల్లో చంపేస్తే హెంమంత్రి అక్కడకు పరిగెత్తారని, మీకు డబ్బున్న వారే కనిపిస్తారా? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. మీకు డబ్బున్నవారినే తప్పితే పేదలు, సామాన్యులు, దళితులను పట్టించుకోరా? అని నిలదీశారు. ఇంతకంటే దిగజారిన, దిక్కుమాలిన ప్రభుత్వం మరొకటి ఉంటుందా? అని పేర్ని నాని మండిపడ్డారు. ఈరోజు’(శుక్రవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడారు పేర్ని నాని. కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువఏపీలో కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని, గతంలో తమ ప్రభుత్వ హయాంలో అప్పులపై విషం ప్రచారం చేశారని, ఎల్లో మీడియా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి నానాయాగి చేశారన్నారు. పెద్దపెద్ద మేధావులకే చంద్రబాబు ఆర్థిక పాఠాలు నేర్పురారన్నట్లుగా జాకీలతో లేపారని, ఇప్పుడు చంద్రబాబు రూ. లక్షా 3 వేల కోట్లు అప్పు నేరుగా తెచ్చారన్నారు.‘రూ.44 వేల కోట్లను కార్పొరేషన్ ల ద్వారా తెచ్చారు. ఒక లక్షా 47 వేల కోట్లకు పైనే అప్పు చేశారు. జగన్ చేసిన అప్పులతో పోర్టులు, సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్ల అభివృద్ధి ఇలా అనేక రూపాల్లో కనిపిస్తున్నాయి. జగన్ ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క ఉంది. కానీ చంద్రబాబు చేస్తున్న అప్పులు ఏం చేస్తున్నారో చెప్పటం లేదు. ఎన్నికలకు ముందు ఉత్తరకుమారుడిలా చంద్రబాబు మాటలు చెప్పారు. ఇప్పుడేమో సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలో అర్థం కావటం లేదంటున్నారు. చంద్రబాబు మాటలకు పవన్ కళ్యాణ్ చిడతలు కొడుతున్నారు. తాజాగా లక్షా 91 వేల కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టేశారు.రూ.9 వేల కోట్ల అప్పుల కోసం తాకట్టు పెట్టారు. దీనిమీద ఎల్లోమీడియా ఎందుకు మాట్లాడటం లేదు?, ఆరు మాసాలకు చెందిన కిస్తీలను ముందుగానే బ్యాంకులో వేయాలనే నిబంధన పెట్టటం దుర్మార్గం.అప్పు ఇచ్చిన వారు రిజర్వ్ బ్యాంకులో ఉండే ప్రభుత్వ నిధులను నేరుగా తీసుకోవచ్చని కూడా నిబంధన పెట్టారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? , ఇలాంటి వ్యవహారాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అసలు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలా నిధులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తారు? , ఇంతకంటే బరితెగింపు ఉంటుందా?, జగన్ కంటే ఎక్కువగా సంక్షేమం అందిస్తామనీ, అప్పు చేయకుండా సంపద సృష్టిస్తామని అప్పట్లో తెగ బిల్డప్పులు ఇచ్చారు.ఇప్పుడు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయటం లేదు. రాష్ట్రం అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు అమరావతి ఒక్కటేనా?, ఎన్నికలకు ముందు అద్దె ఆఫీసుల్లో ఉన్నవారు ఇప్పుడు ప్యాలెస్‌లు కడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు కారుపైకి ఎక్కి ప్రయాణించారు. ఇప్పుడు జనానికి కనపడకుండా ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలో తిరుగుతున్నారు. సొంత కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లాలన్నా ప్రత్యేక విమానాలే. రాష్ట్ర ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తారా? , ఈ విమానాలు, హెలికాఫ్టర్లకు ఎవరి డబ్బు ఖర్చు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలి. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రత్యేక విమానాలకు ఖర్చు పెడతారా?’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు. -
ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘‘భారతదేశ అంతరిక్ష చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేశారు. కస్తూరి రంగన్‌కి నివాళులు అర్పిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కస్తూరి రంగన్ గతంలో జేఎన్‌యూ ఛాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈయన పూర్తి పేరు కృష్ణస్వామి కస్తూరి రంగన్. కేరళ ఎర్నాకులంలో కస్తూరిరంగన్ జన్మించారు. ఈయనది విద్యావంతుల కుటుంబం. ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో మాస్టర్స్ చేసిన రంగన్.. అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ లాబోరేటరీ నుంచి 1971లో డాక్టరేట్ అందుకున్నారు. ఖగోళ శాస్త్రం, స్పేస్ సైన్స్ మీద 240 పేజీల థియరీని సమర్పించారాయన.1994 నుంచి 2003 దాకా.. తొమ్మిదేళ్లపాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)కి ఆయన చైర్మన్‌గా పని చేశారు. 2003-09 మధ్య రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు.మోదీ సర్కార్ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్‌తో సత్కరించింది. మొత్తం 27 యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారాయన. ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణన్ మీద దేశద్రోహం ఆరోపణలు వచ్చిప్పుడు ఇస్రో చైర్మన్‌గా ఉంది కస్తూరి రంగనే. 1969లో లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. రంగన్ భార్య 1991లో కన్నుమూశారు.Deeply saddened to learn of the passing of Dr. K. Kasturirangan, former Chairman of #ISRO — an eminent scientist, visionary educator, and passionate environmentalist. He leaves an indelible mark on the annals of India’s space history. My tributes to this legend. May his soul rest… pic.twitter.com/cDEHln1tet— YS Jagan Mohan Reddy (@ysjagan) April 25, 2025 -
పిఠాపురంలో పవన్ ‘రచ్చ’బండ రద్దు
కాకినాడ, సాక్షి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సొంత నియోజకవర్గంలోనే వరుస షాకులు తగిలాయి. రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించకుండానే.. రద్దు చేసుకుని తిరుగుపయనం అయ్యారాయన. అదే సమయంలో ఈ పర్యటనలోనే కూటమిలో విబేధాలు కూడా మరోసారి బయటపడ్డాయి.పవన్ కల్యాణ్ శుక్రవారం పిఠాపురం రచ్చబండలో పాల్గొనాల్సి ఉంది. అయితే.. రైతులు, ఇతర వర్గాల ప్రజలు తమ సమస్యలపై నిరసన తెలిపే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో.. కార్యక్రమాన్ని నిర్వహించకుండానే అర్ధాంతరంగా వెళ్లిపోయారు. మరోవైపు, ఈ పర్యటనలో కూటమిలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. డిప్యూటీ సీఎం, పలు శాఖల మంత్రి హాజరయ్యే కార్యక్రమానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇంచార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ గైర్హాజరయ్యారు. ఇక.. ఉప్పాడలో పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసిన టీటీడీ కళ్యాణ మండపం, సీతారాముల దేవాలయం శంకుస్థాపన శిలాఫలకాల్లో సీఎం చంద్రబాబు పేరు కనిపించలేదు. దీంతో టీడీపీ నేతలు బహిరంగంగానే అక్కడ అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. -
రూటు మార్చిన చంద్రబాబు.. ఏపీలో ఆర్థిక విధ్వంసం
తాడేపల్లి,సాక్షి: దేశంలో ఎప్పుడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వం అప్పుల విషయంలో రాజ్యంగ విరుద్ధమైన విధానాలకు తెగబడింది. సీఎం చంద్రబాబు ఆర్థిక విధానాలపై వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది.ఈ మేరకు ఎక్స్ వేదికగా.. అందకారంగా రాష్ట్ర భవిష్యత్ అంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో ‘వినాశకర ఆర్థిక విధానాలు అప్పులకోసం రాజ్యాంగ ఉల్లంఘనలు. 436 గనులను తాకట్టు పెట్టిన చంద్రబాబు. ఈ గనులన్నీ ఏపీ ఎండీసీకి అప్పగిస్తూ ఉత్తర్వులు. ఏపీఎండీసీ ద్వారా అప్పుల సృష్టి. రూ.1,91,000 కోట్ల విలువైన గనులు తాకట్టుపెట్టి రూ.9వేల కోట్ల అప్పు. భవిష్యత్తు ఆదాయాలను రుణ సంస్థలకు కట్టబెడుతూ నిర్ణయం. రుణాలిచ్చే సంస్థలు నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచే వాయిదాలు తీసుకునే అవకాశం. రుణ సంస్థలకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ఏకైక ప్రభుత్వంగా నిలిచిన చంద్రబాబు సర్కారు. చరిత్రలో ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం తొలిసారి. వినాశ ఆర్థిక విధానాలతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అంటూ’ పేర్కొంది. .@ncbn వినాశకర ఆర్థిక విధానాలు అప్పులకోసం రాజ్యాంగ ఉల్లంఘనలు436 గనులను తాకట్టు పెట్టిన చంద్రబాబుఈ గనులన్నీ ఏపీ ఎండీసీకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఏపీఎండీసీ ద్వారా అప్పుల సృష్టిరూ.1,91,000 కోట్ల విలువైన గనులు తాకట్టుపెట్టి రూ.9వేల కోట్ల అప్పుభవిష్యత్తు ఆదాయాలను రుణ సంస్థలకు… pic.twitter.com/ET5g0nWA2J— YSR Congress Party (@YSRCParty) April 24, 2025 -
ప్రాణం తీసిన ఈత సరదా
మాచవరం: వేసవి సెలవులు కావడంతో సరదాగా ఈతకు వెళ్లి నేల బావిలో కూరుకుపోయి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన మాచవరం మండలంలోని కొత్తపాలెం గ్రామం ఎస్సీ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వేమవరపు శ్రీను కుమారుడు జస్వంత్ (9) స్థానిక దళితవాడలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. పప్పుల ఏసయ్య కుమారుడు యేసురాజు (16) మాచవరం జడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఇరువురు మధ్యాహ్న సమయంలో సైకిల్ పై గ్రామ సమీపంలోని శివాలయం పక్కనే ఉన్న పెద్దబావి వద్దకు వచ్చి, దుస్తులు విడిచి ఈత కొట్టేందుకు బావిలోకి దూకారు. బావి లోతు ఎక్కువగా ఉండడంతో ఊపిరి ఆడక చనిపోయారు. కొంత సమయం తర్వాత గ్రామానికి చెందిన ఓ యువకుడు ఈత కొట్టేందుకు బావిలోకి దూకాడు. బావి అడుగు బాగాన ఇద్దరు చిన్నారులు మృతి చెందడాన్ని గమనించి, విషయాన్ని గ్రామస్తులకు తెలియజేసాడు. అప్పటికే చిన్నారులు కనిపించకపోవడంతో గ్రామంలో వెతుకుతున్న తల్లిదండ్రులకు విషయం తెలిసి ఘటనా స్థలానికి వచ్చి చూడగా దుస్తులు, సైకిల్‌ను గుర్తించి బోరున విలపించారు. గ్రామస్తుల సహాయంతో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. మృత దేహాలను చూసిన తల్లిదండ్రులు, బందువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గురజాల ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ సాయి కర్ణకుమార్ ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ విజయ్ శేఖర్ తెలిపారు. -
ముగిసిన సలహా మండలి సమావేశం
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందు గత రెండు రోజులుగా జరుగుతున్న వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం గురువారంతో ముగిసింది. సమావేశంలో ఆయా పంటల ప్రధాన శాస్త్రవేత్తలు పంటల్లో పరిశోధనలు, సాధించిన ప్రగతి, నూతన టెక్నాలజీ, మినీకిట్లు వంటి అంశాలపై చర్చించి సమాచారాన్ని అందించారు. యాంత్రీకరణపై శాస్త్రవేత్తలతో ప్రత్యేక చర్చా కార్యక్రమం, గెస్ట్ లెక్చర్ నిర్వహించారు. వరి పంటలో బీపీటీ 5204 నాణ్యత కలిగిన సన్నగింజ రకాలు ఎగుమతికి అనువైనవని, 7 మిల్లీ మీటర్ల గింజ పొడవుగల వరి రకాలు, కలర్డ్ వరి రకాలపై పరిశోధనలు చేయాలని, అధిక దిగుబడిని ఇచ్చే తక్కువ ఎత్తుగల మొక్క జొన్న, జొన్న, హైబ్రిడ్స్ అపరాలలో కలుపు యాజమాన్యం, శనగలో పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు, కాండం తొలిచే పురుగులు, గజ్జి తెగులు యాజమాన్యం, తెగుళ్లను తట్టుకునే మినుము రకాలపై పరిశోధనలు చేపట్టాలని పరిశోధన సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ తెలిపారు. పత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యంపై, ట్రాష్ షెడ్డర్ ద్వారా పంట వ్యర్థాల వినియోగం వటి అంశాలపై రైతులకు అవగాహన పెంచాలని విస్తరణ సంచాలకులు డాక్టర్ జి. శివన్నారాయణ తెలిపారు. చెరకు విస్తీర్ణం క్రమేపీ తగ్గిపోతున్న సందర్భంగా డ్రయ్యర్లు రైతులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. చెరకులో యాంత్రీకరణను పెంచి కూలీల ఖర్చు తగ్గించినపుడే పంటలో ఆశించిన లాభం వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆయా జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ఐఎఫ్‌సీ బృందం క్షేత్ర సందర్శన
అమరావతి: మండలంలోని పలు గ్రామాలలో గురువారం అంతర్జాతీయ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) ప్రతినిధుల బృందం రైతులతో వ్యవసాయ క్షేత్ర సందర్శన, గ్రామసభలు నిర్వహించారు. తొలుత ఈ బృందం దిడుగు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించి మిర్చి రైతులను మిర్చి ఉత్పత్తి, మార్కెటింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు అత్తలూరులో నిర్వహించిన వ్యవసాయక్షేత్ర సందర్శనలో మొక్కజొన్న రైతులతో మాట్లాడారు. అనంతరం స్వయం సహాయక మహిళాసంఘాల సభ్యులు, రైతులతో ఆర్థిక అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌సీ బృంద సభ్యులు కె. విజయశేఖర్, హేమేంద్ర మెహర్, యువరాజ్ అహూజా, నవనీత్‌రాయ్, షెనాయ్ మ్యాధ్యు, ఇషాసర్, సీతల్ సోమనిలతో పాటు ఉద్యానవన శాఖ డీపీఎం అమలకుమారి, మండల, వ్యవసాయశాఖాధికారి అహ్మద్, ఉద్యాన అధికారి శ్రీనిత్య, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన నగర కమిషనర్నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్న బి.సాయి కళ్యాణ్ చక్రవర్తిని గురువారం జిల్లా కోర్ట్‌లోని ఆయన కార్యాలయంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు.కొండపాటూరు పోలేరమ్మకు రూ. 22.46 లక్షల ఆదాయంప్రత్తిపాడు: కాకుమాను మండలం కొండపాటూరు పోలేరమ్మకు తిరునాళ్ల సందర్భంగా రూ. 22.46 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో బత్తుల సురేష్‌బాబు తెలిపారు. భక్తులు పోలేరమ్మ తల్లికి సమర్పించిన కానుకలు, హుండీలను తెరిచి ఆలయంలో గురువారం లెక్కించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పాటల ద్వారా రూ. 3.90 లక్షలు, హుండీల ద్వారా 12.76 లక్షలు, టిక్కెట్ల ద్వారా 2.40 లక్షలు, చందాల రూపంలో రూ. 39 వేలు, లడ్డూ ప్రసాద విక్రయాల ద్వారా రూ. 3 లక్షలు చొప్పున మొత్తం 22,46,256 రూపాయల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. లెక్కింపు కార్యక్రమాన్ని దేవదాయశాఖ బాపట్ల ఇన్స్పెక్టర్ ఎం.గోపి, ఈవో బి. సురేష్‌లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ పూజారి మువ్వా రామచంద్రావు, గ్రామపెద్దలు యర్రాకుల దానయ్య, పి. శ్రీనివాసరావు, ఉత్సవకమిటీ సభ్యులు పాల్గొన్నారు.నేటి కౌన్సిల్ సమావేశం వాయిదానెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): ఈ నెల 25వ తేదీన జరగాల్సిన నగర పాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 28న మేయర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలిసింది.యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్యతెనాలిరూరల్: యువకుడి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు గుడివాడ గ్రామానికి చెందిన వివాహిత కామంచి ఆమని(34)ని అదే గ్రామానికి చెందిన పాలపర్తి మహేష్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడే వాడు. ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో ఆమె ఈ నెల 4వ తేదీన పోలీసులను ఆశ్రయించగా 22వ తేదీన నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 23వ తేదీన బెయిలు రావడంతో గ్రామానికి వెళ్లిన మహేష్ తనను పోలీసులు ఏం చేయలేక పోయారని, ఆమె అంతు తేలుస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలిని కుటుంబ సభ్యులు పొన్నూరులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ తెలిపారు. -
మలేరియా..వదలదయ్యా
గుంటూరు మెడికల్: మలేరియా ఈ పేరు చెబితేనే గ్రామాల్లో చాలా మంది ప్రజలు వణికిపోతారు. నెలల తరబడి జ్వరం పీడిస్తూ ఉండటమే కారణం. వ్యాధి సోకిదంటే ఒక పట్టాన త్వరగా శరీరాన్ని వదిలిపోదు. మలేరియా వ్యాధి సోకి అనేక మంది చనిపోతున్నారు. వ్యాధి బారిన పడకుండా మలేరియా పై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 2007లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఏప్రిల్ 25 వ తేదీని వరల్డ్ మలేరియా డే గా నిర్ధారించింది. 2007 నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ 25న దీనిని నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. మలేరియా లక్షణాలు... ఈ వ్యాధి అనాఫిలిస్ దోమకాటు వల్ల వస్తోంది. చలి,వణుకుతో కూడిన విపరీతమైన జ్వరం, ఒళ్ళునొప్పులు, మూత్రం మందగించటం, లివర్, కడుపులో నొప్పి, జ్వరం మూడు రోజులకొకసారి లేదా రెండు రోజులకొకసారి లేదా రోజు మార్చి రోజు వస్తూ ఉండటం ఈ వ్యాధి లక్షణాలు. సరైన వ్యాధి నిర్ధారణ, చికిత్స చేయని పక్షంలో నెలల తరబడి వ్యాధి పీడిస్తోంది. కొందరిలో సెరిబ్రల్ మలేరియా, వైవ్యాక్స్ మలేరియాలు కూడా వస్తాయి. ఈ వ్యాధులు సోకిన వారిలో ప్లేట్లెట్స్ తగ్గిపోవటం, కామెర్లు పెరిగిపోవటం, నిమోనియా, ఫిట్స్, మూత్రపిండాలు చెడిపోవటం, స్పృహకోల్పోవడం జరుగుతుంది. ఈ వ్యాధి మలేరియా ఉన్న వ్యక్తి రక్తం ఎక్కించటం ద్వారా, మలేరియా వ్యాధి ఉన్న వ్యక్తిని కుట్టిన దోమ మనల్ని కుట్టటం ద్వారా సోకుతోంది. నిర్ధారణ.... జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు. రక్తపు పూతలు సేకరించి వ్యాధి నిర్ధారణ జరిగితే క్లోరోక్విన్, ప్రై మాక్సిన్ అనే మాత్రలను ఇస్తారు. ఇవి 14 రోజులు ఆపకుండా తప్పని సరిగా వాడాలి. ఈ మందులన్నీ కూడా ఉచితంగానే అందిస్తారు. కొన్ని సందర్భాల్లో వైద్య సిబ్బంది ఇళ్ళకు వెళ్లి రక్తపు పూతలు సేకరిస్తారు. పూర్వం కేవలం ఐదు రోజుల మందులు వాడితే సరిపోయేది. కాని న్యూడ్రగ్ పాలసీ–2012 ప్రకారం తప్పని సరిగా 14 రోజులు వాడాలి. దోమకాటు ద్వారా వ్యాధి వ్యాప్తి అవగాహనతో మలేరియా బారిన పడకుండా కాపాడుకోవచ్చు నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం జిల్లాలో నమోదైన కేసులు జిల్లా వ్యాప్తంగా 2021లో 2,06,359 మందికి రక్త పరీక్షలు చేయగా, 15 మందికి మలేరియా సోకినట్లు నిర్ధారణ జరిగింది. 2022లో 2,27,905 రక్త నమూనాలు పరీక్షలు చేయగా 24 మందికి మలేరియా సోకినట్లు నిర్ధారణ అయింది. 2023లో 3,82,551 మందికి రక్త పరీక్షలు చేయగా, 21 మందికి మలేరియా సోకినట్లు నిర్ధారణ అయింది. 2024లో 3,52,748 మందికి రక్త పరీక్షలు చేయగా, వీరిలో పది మందికి మలేరియా సోకినట్లు నిర్ధారణ అయింది. 2025 మార్చి వరకు 1,08,880 మందికి రక్త పరీక్షలు చేయగా, ఒకరికి మలేరియా సోకినట్లు నిర్ధారణ అయింది. ఐదేళ్లలో జిల్లాలో మలేరియా మరణాలు ఒక్కటి కూడా సంభవించలేదు. -
భావన్నారాయణ స్వామి దేవాలయం వారసత్వ బైలాస్కు శ్రీకారం
బాపట్ల: శ్రీభావన్నారాయణస్వామి దేవాలయం దేవాలయ కట్టడాల పరిరక్షణకు అవసరమైన వారసత్వ బైలాస్ రూపొందిస్తున్నామని ‘ఇంటాక్,’ (ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్) జాతీయ వారసత్వ డైరెక్టర్ ఎ.విజయ చెప్పారు. గురువారం ఢిల్లీ నుంచి వచ్చిన ఇంటాక్ బృందం దేవాలయాన్ని సందర్శించింది. ఇటువంటి చారిత్రక దేవాలయాల అద్భుత వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆర్కిలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారితో కలిసి కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. దేవాలయం చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఉన్న పలు వారసత్వ కట్టడాలను వారు సందర్శించారు. ఇందులో భాగంగా శ్రీపాద, నోరి, కంభంపాటి, దేశరాజు వారి భవనాలను వారు పరిశీలించారు. దేవాలయంతో పాటు, మిగతావాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆమె వివరించారు. ఇంటాక్ బృందంలో విజయతో పాటు, ఆర్కిటెక్ కన్జర్వేషనిస్ట్ దీప్తి శర్మ, ఇంటాక్ రాష్ట్ర కన్వీనర్ ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, ఆర్కిలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన డి.ఫణీంద్రలు ఉన్నారు. వారికి ఇంటాక్ బాపట్ల జిల్లా కన్వీనర్ డాక్టర్ పీసీ సాయిబాబు స్వాగతం పలికారు. బృందం సభ్యులని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఫోరం సభ్యులు జి.వెంకటేశ్వర్లు, ఎం.నరసింహారావు, దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త దేశిరాజు రమణబాబు, శ్రీరామచంద్రమూర్తి, ఉమాదేవి, రాజేష్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ఓవర్ యాక్షన్
ఫ్లయ్ ఓవర్‌కు మంగళం.. ఆర్ఓబీతోనే సరి !సాక్షి ప్రతినిధి,గుంటూరు: గుంటూరు నగరానికి ఐకానిక్‌గా మారాల్సిన శంకర్ విలాస్ ఫ్లయ్ ఓవర్‌ను కూటమి నాయకులు చిన్న బ్రిడ్జిగా మార్చివేయడం వివాదంగా మారుతోంది. ప్రభుత్వంలో ఉన్నాం. మేం చెప్పినట్లే చేయాలి. మా ఆలోచనలే అమలు కావాలంటూ మొండిగా ముందుకెళుతుండడం ఆందోళన కలిగిస్తుంది. పైగా అడ్డుకుంటే పొక్లెయిన్లు వస్తాయంటూ ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు బెదిరింపులకు దిగుతున్నారు. గతంలో గల్లా జయదేవ్ ఎంపీగా ఉన్నప్పుడు, తాజాగా ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక కూడా ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తామని, అండర్ బ్రిడ్జి కూడా ఉంటుందని ప్రకటించి, ఇప్పుడు కేవలం చిన్న బ్రిడ్జికి పరిమితం చేశారు. తూర్పు, పశ్చిమలకు అనుసంధానం.. శంకర్ విలాస్ సెంటర్ బ్రిడ్జిని 1960లో నిర్మించారు. అప్పడు గుంటూరులో చాలా తక్కువ జనాభా. ప్రస్తుతం గుంటూరు నగర జనాభా 11లక్షలకు చేరింది. రోజూ శంకర్ విలాస్ ఫ్లయ్ ఓవర్ మీదుగా లక్ష వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఎప్పుడో ఆరు దశబ్దాల క్రితం నిర్మించి ఈ బ్రిడ్జి కేవలం రెండు వరుసలు మాత్రమే. గుంటూరులో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య ఎక్కువవుతుంది. దాదాపు 30వేలకు పైగా ఆటోలున్నాయి. స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ బస్సులు వెయ్యివరకూ ఉన్నాయి. ఇక కార్లు, టూవీలర్స్ అయితే చెప్పనక్కర్లేదు. అయితే ఎప్పటినుంచో పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా శంకర్ విలాస్ ఫ్లయ్ ఓవర్ స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ ఉంది. ప్రధానంగా శంకర్ విలాస్ ఫ్లయ్ ఓవర్ గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉంటుంది. బిల్డప్ కోసం జనం బలి! 2014లో గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ వద్ద శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్తది నిర్మించాలని జనం డిమాండ్ గట్టిగా వినిపించారు. దీంతో జయదేవ్ 2017లో పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించాలన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. సింగిల్ పిల్లర్‌తో ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం జరిగేలా డిజైన్ చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.167కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అంబేడ్కర్ సెంటర్ నుంచి హిందూ కాలేజీ సెంటర్ వరకూ 1.46 కి.మీ బ్రిడ్జి నిర్మించాలని డిజైన్ చేశారు. అయితే ఆ ప్రతిపాదన కాగితాలకే పరిమితమయ్యింది. వైఎస్సార్ సీపీ పాలనలో శంకరవిలాస్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ కూడా కేంద్రానికి పంపారు. నిధులు మంజూరయ్యే సమయానికి ప్రభుత్వం మారిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సేతుబంధన్ పథకం కింద కేంద్రం శంకర్ విలాస్ బ్రిడ్జికి రూ.98కోట్లు మాత్రమే మంజూరు చేసింది. వాస్తవానికి 2017లోనే బ్రిడ్జి నిర్మాణానికి రూ.167కోట్లు ఖర్చు అవుతుందని అంచనావేస్తే పెరిగిన రేట్లకు అనుగుణంగా ఇప్పుడు దాదాపు రూ.200కోట్లు ఖర్చు అవుతుంది. కానీ గుంటూరు ఎంపీ పెమ్మసాని తామేదో చేసేస్తున్నామని బిల్డప్ ఇవ్వడానికి సేతుబంధన్ పథకం కింద పెట్టి కేవలం రూ.98కోట్లు మంజూరు చేయించారు. నిధులు సగానికిపైగా తగ్గిపోవడంతో పూర్తిగా డిజైన్ మార్చేసింది. 930 మీటర్లు మాత్రమే.. గతంలో 1.46 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మించాలని డిజైన్ లో ఉంటే ప్రస్తుత డిజైన్ లోమాత్రం కేవలం 930 మీటర్ల దూరం ఉండేలా డిజైన్ చేశారు. దీంతోపాటు గతంలో ఆరులైన్ల డిజైన్ ఉంటే ప్రస్తుతం నాలుగు లైన్ల డిజైన్‌గా మార్చేశారు. పాత డిజైన్ లో ఆర్ఓబితోపాటు ఆర్యూబి. కూడా ఉంది. ఇప్పుడు డిజైన్ మారిపోవడంతో సర్వీస్ రోడ్లు కూడా చిన్నవిగా డిజైన్ చేశారు. కొత్త డిజైన్‌ను ప్రజలు, వ్యాపారస్థులు, మేధావులు వ్యతిరేకిస్తున్నారు. రాజధానికి వెళ్లే బ్రిడ్జి మరో 50ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ఉండాలే తప్ప మాకు వచ్చిన నిధులతోనే నిర్మిస్తాం... సరిపెట్టుకోమంటే మంచి పద్ధతి కాదని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత డిజైన్ ప్రకారమే నిర్మించాలి కొత్త బ్రిడ్జి డిజైన్ పై నగరవాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కోరుకున్నట్లు హిందూ కాలేజీనుంచి అంబేడ్కర్ సెంటర్ వరకూ ఫ్లయ్ ఓవర్ నిర్మాణం చేపట్టాలి. మంజూరైన నిధులతోనే కొత్త డిజైన్ ప్రకారం బ్రిడ్జి నిర్మాణం చేస్తామని చెప్పడం సరికాదు. నగర ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మేం ఉద్యమిస్తుంటే మాపై బురద జల్లాలని చూస్తున్నారు. నగర ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టడాన్ని మేం అంగీకరించం. నగరంలోని 11 లక్షల జనాభా సౌకర్యార్థం బ్రిడ్జి డిజైన్‌లో సవరణలు కోరుతున్నాం నిధులు సరిపోకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అదనపు నిధులు సమీకరించి ఐకానిక్ బ్రిడ్జితోపాటు ఆర్యూబీ కూడా నిర్మించాలి. – ఎల్ ఎస్ భారవి, బెటర్ శంకర్‌విలాస్ ఫ్లయ్ ఓవర్ జేఏసీ భవిష్యత్ అవసరాలకు సరిపోని డిజైన్ శంకర్‌విలాస్ ఫ్లయ్ ఓవర్‌పై వివాదం 2018లో రూ.168 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు నేడు సేతుబంధన్ ప్రాజెక్టు కింద రూ.98 కోట్లతో సరి వ్యతిరేకిస్తున్న గుంటూరు నగరవాసులు అడ్డుకుంటే పొక్లయిన్లు వస్తాయంటూ ఎమ్మెల్యే బెదిరింపులు ఆర్‌యూబీకి అవకాశమున్నా.. దృష్టిపెట్టని వైనం మొదట హిందూ కళాశాల కూడలి నుంచి లాడ్జి సెంటర్ వరకు ఐకానిక్ ఫ్లయ్ ఓవర్, కింద ఆర్యూబీ, సర్వీసు రోడ్లు కనీసం 30 అడుగుల వెడల్పుతో ఉండేలా డిజైన్ చేశారు. 2018లోనే ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.167 కోట్ల అంచనా వేశారు. ఇప్పుడు ఆ అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే దీన్ని కేంద్రమంత్రితో సేతుబంధన్ ప్రాజెక్టు కింద ఆమోదింపచేయడంతో కేవలం రూ. 98 కోట్లు మాత్రమే మంజూరు అయ్యాయి. ఫ్లయ్ ఓవర్ కాస్తా బ్రిడ్జిగా మారిపోయింది. ఆర్యూబీ కూడా సాంకేతికంగా సాధ్యం కాదని చెబుతున్నారు. వాస్తవానికి అధికారపార్టీ చెబుతున్న వాదనలో వాస్తవం లేదు. విజయవాడ సింగ్నగర్తో పాటు పలు ప్రాంతాల్లో ఫ్లయ్ ఓవర్ ఉన్న చోట కూడా తర్వాత అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్‌యూబీలను మంజూరు చేశారు. రోజుకు కనీసం లక్ష వాహనాలు శంకర్‌విలాస్ బ్రిడ్జిపై నడుస్తాయని ఆరేళ్ల క్రితం చేసిన ట్రాఫిక్ స్టడీలోనే తేలింది. ఫ్లయ్ ఓవర్‌ను మంజూరు చేయించాల్సిన చోట తక్కువ బడ్జెట్లో బ్రిడ్జిని మంజూరు చేయించి, ఇప్పుడు తాము చెప్పినట్లే అందరూ వినాలనే ధోరణిలో వారు ఉన్నారు. -
ఆసుపత్రులకు ఫైర్ నిబంధనలను సవరించండి
గుంటూరు మెడికల్: రాష్ట్రంలో క్లినిక్స్, చిన్న, మధ్య తరహా ఆసుపత్రులకు రిజిస్ట్రేషన్ విషయంలో ఫైర్ ఎన్ఓసీ చాలా సమస్యగా ఉందని, ఫైర్ నిబంధనలను కొన్ని సవరించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర శాఖ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్‌ను కోరింది. విజయవాడలోని ఫైర్ సర్వీసెస్ కార్యాలయంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.నందకిషోర్ ఆధ్వర్యంలో గురువారం మాదిరెడ్డి ప్రతాప్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ‘నేషనల్ ఫైర్ సేఫ్టీ వీక్’ సందర్భంగా ఐఎంఏ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్యులకు జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జి. నందకిషోర్, ఐఎంఏ ఫైర్ సేఫ్టీ కమిటీ చైర్మన్ డాక్టర్ సి.శ్రీనివాస రాజు, ఫైర్ ఎన్ఓసీ విషయంలో ఎదురవుతున్న సమస్యలను డీజి దృష్టికి తీసుకువెళ్లారు. క్లినిక్స్, చిన్న, మధ్య తరహా ఆసుపత్రిలో కూడా భారీ అగ్నిమాపక పరికరాలు అమర్చుకోవాలనడం ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. వీటివల్ల ఆర్థిక భారం తప్ప ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు. డీజి ఫైర్ సర్వీసెస్ ,మాదిరెడ్డి ప్రతాప్ మాట్లాడుతూ వైద్యులు ఫైర్ ఎన్ ఓసీ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తప్పక కృషి చేస్తానన్నారు. డీజీని కలిసిన వారిలో ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మోటూరు సుభాష్ చంద్రబోస్, ఐఎంఏజాతీయ యాక్షన్ కమిటీ సభ్యులు డాక్టర్ పి. ఫణిధర్, కోశాధికారి డాక్టర్ టి.కార్తీక్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ టి.సేవకుమార్, డాక్టర్ డి.అమరలింగేశ్వర రావు తదితరులు ఉన్నారు. ఫైర్ డీజీకి ఐఎంఏ విజ్ఞప్తి -
గంజాయితో పట్టుబడిన ఇద్దరు యువకులు
సుమారు 300 గ్రాముల గంజాయి స్వాధీనం మంగళగిరి టౌన్ : మంగళగిరి రైల్వేస్టేషన్ సమీపంలో ఇద్దరు యువకులు గంజాయి కలిగి ఉన్నారని సమాచారం రావడంతో గురువారం ‘ఈగల్’ టీమ్ పట్టణ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ ఆదేశాల మేరకు ఈగల్‌టీమ్ గురువారం మధ్యాహ్నం ఆ యువకులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు 200 నుంచి 300 గ్రాముల వరకు గంజాయిని, గంజాయిని వినియోగించే త్రైస్ అనే పేరు కలిగిన రోల్స్‌ను స్వాధీనం చేసుకుని పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ యువకుల్ని విచారించగా మంగళగిరిలో ఓ యువకుడి వద్ద కొన్నామని, అతని వద్ద సుమారు 4 కిలోల వరకు గంజాయి ఉందనే సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. 26 నుంచి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు రెంటచింతల: రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఎద్దుల బండలాగుడు బల ప్రదర్శన పోటీలు ఈ నెల 26వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్ రెడ్డి తెలిపారు. గురువారం రెంటచింతలలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సూర్యపేట మండలం మఠంపల్లి గ్రామంలో 25వ తేదిన జరిగే శుభవార్త దేవాలయ తిరునాళ్ల సందర్భంగా మాంట్ ఫోర్ట్ స్కూల్ (బ్రదర్స్ స్కూల్) ఆవరణలలో ఈ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి కలిగినవారు ఈ నెల 25వ తేదీలోపు పేరు నమోదు చేసుకుని ఎంట్రీ ఫీజు రూ. 1000 చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 96187 64924, 99896 96953, 99497 62633 ఫోను నంబర్లను సంప్రదించాలని కోరారు. సమావేశంలో యువజన సంఘం సభ్యులు గాదె పవన్‌రెడ్డి, తానం బాలరెడ్డి, కందుల కిరణ్ కుమార్‌రెడ్డి, సలిబండ్ల రాజేష్‌రెడ్డి, కొమ్మారెడ్డి రంజిత్‌రెడ్డి, గోపు అఖిల్‌రెడ్డి, గాదె మనీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి డీఈఓ చంద్రకళ నరసరావుపేట ఈస్ట్: విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో చేరేందుకు అర్హులైన పేదలకు 25 శాతం సీట్లు కేటాయించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ వి.సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన చిన్నారుల తల్లిదండ్రులు ఈనెల 28 నుంచి మే నెల 15వతేది వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను http://creapgov.in వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని వివరించారు. వివరాలకు ఆయా మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. అలాగే జిల్లా కేంద్రంలో డిఈఓ కార్యాలయంలో నోడల్ అధికారిగా సిఎంఓ పి.పద్మారావు, హెల్ప్ డెస్క్‌లో ఏపీఓ శంకరరాజును నియమించినట్టు తెలిపారు. వివరాలకు 4849851047, 9963192485 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
సర్వీస్ బ్లాక్ నిర్మాణానికి ప్రభుత్వంతో ఒప్పందం
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో సర్వీస్ బ్లాక్ నిర్మాణానికి గురువారం ఒప్పందం జరిగింది. డీఎంఈ డాక్టర్ నరసింహం భవన నిర్మాణ దాత ప్రముఖ పారిశ్రామిక వేత్త తులసి రామచంద్రప్రభు తనయుడు తులసి యోగీష్ చంద్రతో ఒప్పందం చేసుకున్నారు. విజయవాడ డీఎంఈ కార్యాలయంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు రూ. పది కోట్ల వ్యయంతో సర్వీస్ బ్లాక్ నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు ముందుకు వచ్చారు. జనవరిలో జీవో విడుదల సర్వీస్ బ్లాక్ నిర్మాణం పూర్తి చేసేందుకు తులసి రామచంద్ర ప్రభుకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జనవరిలో జీవో నెంబర్ 11 ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి అన్ని అనుమతులు పూర్తి చేసుకొని గురువారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ డి ఎస్ వి ఎల్ నరసింహం, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, తులసి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ యోగీష్ చంద్ర విజయవాడ డీఎంఈ కార్యాలయంలో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. సర్వీస్ బ్లాకు నిర్మాణ కార్యక్రమాలు వెంటనే మొదలు పెడతామని యోగీష్ చంద్ర తెలిపారు. భవన నిర్మాణం 18 నెలల్లోగా పూర్తి చేసి అందిస్తామన్నారు. ఈసందర్భంగా యోగీష్ చంద్రను డీఎంఈ డాక్టర్ నరసింహం, డాక్టర్ యశశ్వి రమణ సన్మానించారు. కార్యక్రమంలో గుంటూరు జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ కుమార్, వివేక్ పాల్గొన్నారు. -
గ్రంథాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు
తెనాలి: విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఈనెల 27వ తేదీన జరగనున్న ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస సదస్సును మేధావులు, సాహితీవేత్తలు, ప్రజాఉద్యమ నాయకులు జయప్రదం చేయాలని ‘అరసం’ జాతీయ ప్రధాన కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఇక్కడి ‘ఇస్కఫ్’ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో గ్రంథాలయాలు పూర్వవైభవం సంతరించుకునే ఉద్యమంలో ప్రతిఒకరూ పాలుపంచుకోవాలని సూచించారు. అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమలి సింగారావు అధ్యక్షత వహించారు. ఉద్యమ వేదిక కన్వీనర్ వల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో పాలకులు గ్రంథాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. దక్షిణాదిలోని రాష్ట్రాలు గ్రంథాలయాల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంటే, తెలుగు రాష్ట్రాల్లో అందుకు భిన్నంగా జీర్ణావస్థలో ఉండటం శోచనీయమన్నారు. రాష్ట్రంలో ఉన్నవి 1400 మాత్రమేనని, అవీ దీనావస్థలో ఉన్నాయన్నారు. ప్రజాసాహితీ సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చాక పాఠశాలల్లో గ్రంథాలయాలు అదృశ్యమైనట్టు చెప్పారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు మాట్లాడుతూ గ్రంథాలయాల ఆవశ్యకతను వివరించారు. 27న విజయవాడలో రాష్ట్రస్థాయి పునర్వికాస సదస్సు పోస్టర్ ఆవిష్కరించిన ఉద్యమ నేతలు -
వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోటిరెడ్డి
పట్నంబజారు(గుంటూరుఈస్ట్) : వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన తియ్యగూర కోటిరెడ్డిని గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడిగా సాదం పట్నంబజారు(గుంటూరుఈస్ట్) : వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సాదం వెంకటసత్యనారాయణను పార్టీ జిల్లా ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైద్య కళాశాలలో స్పోర్ట్స్ డే గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు స్పోర్ట్స్ డే సందర్భంగా గురువారం పలు క్రీడలను గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ లాంచనంగా ప్రారంభించారు. వారం రోజులపాటు జరుగనున్న క్రీడల్లో క్రికెట్, షటిల్, చెస్, ఇండోర్, అవుట్డోర్ గేమ్స్ జరుగనున్నాయి. ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులకు క్రీడలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రభాకర్, స్పోర్ట్స్ పీఈటీ రాము, డాక్టర్‌భరత్, తదితరులు పాల్గొన్నారు. గంజాయి కేసులో నిందితులకు మూడేళ్ల జైలు గుంటూరు లీగల్: చందోలు పోలీసులు 2017లో నమోదు చేసిన కేసులో నిందితులకు జైలు శిక్ష విధిస్తూ గుంటూరు 1వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి వి.ఎ.ఎల్. ఔ. సత్యవతి బుధవారం తీర్పు వెలువరించారు. బాపట్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సి.హెచ్.కోటేశ్వరరావుకు చందోలు గ్రామం రసూల్ పేటలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో తన సిబ్బందితో దాడి చేశారు. గంజాయి విక్రయిస్తున్న షైక్ నజీర్ బాషా, కొనుగోలు చేస్తున్న చుండూరు మండలం దుండిపాలెంకు చెందిన మారెడ్డి రోహిత్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు. 520 గ్రాముల గంజాయి, రూ. వెయ్యి నగదు స్వాధీనం చేసుకున్నారు. నజీర్ బాషా ప్రకాశం జిల్లా తిమ్మాసముద్రానికి చెందిన కర్ణం సుబ్బారావు వద్ద గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు తేలడంతో సుబ్బారావు నుంచి 4,050 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయగా, విచారణ పూర్తిచేసి నిందితులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వజ్రాల రాజశేఖర్ రెడ్డి వాదనలు వినిపించారు. -
వైద్య కళాశాలలో వెల్నెస్ క్లీనిక్ ప్రారంభం
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో ఫిజియాలజీ విభాగం వద్ద గురువారం వెల్నెస్ క్లీనిక్‌ను ప్రారంభించారు. గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్, సీనియర్ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి వెల్నెస్ క్లీనిక్‌ను ప్రారంభించారు. వైద్య కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు. కళాశాల అభివృద్ధికి డాక్టర్ సుందరాచారీ చేస్తున్న కృషిని కొనియాడారు. కళాశాలలో వైద్యులు, వైద్య సిబ్బందికి పలు రకాల వైద్య పరీక్షలు, చికిత్సలు ఉచితంగా అందించేందుకు వెల్నెస్ క్లీనిక్ ఏర్పాటు చేశామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారీ తెలిపారు. ప్రతిరోజూ పీజీ వైద్యులు వెల్నెస్ క్లీనిక్‌లో అందుబాటులో ఉండి సేవలందిస్తారన్నారు. ఉచిత క్లీనిక్ సేవలను కళాశాల సిబ్బంది వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రభాకర్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎంతో మేలు చేకూరుస్తుంది...
వాహనాల్లో జీపీఎస్ ఏర్పాటు వల్ల యజమానికి ఎంతో మేలు చేకూస్తుంది. తద్వారా వాహనదారుడికి ఎనలేని భద్రత ఉంటుంది. నేరస్తులు తీసుకు వెళ్ళినా.. ఎక్కడైనా దాచిపెట్టినా.. వాహన కదలికలు మనకు తక్షణమే తెలిసిపోతాయి. ప్రతి వాహనానికి యజమానులు తప్పనిసరిగా జీపీఎస్ పరికరాన్ని అమర్చుకోల్సిన అవసరం ఉంది. మనకు తెలియకుండా ఎవరైనా వాహనం తీసిన వెంటనే సెల్‌ఫోన్‌కు మెసేజ్ రావటంతో పాటు, తక్షణమే మనం అప్రమత్తం అయ్యే అవకాశం ఉంటుంది. వాహనదారులు జీపీఎస్ అమర్చుకోవటం ద్వారా చోరీలను నియంత్రించే అవకాశం కూడా ఉంది. – ఎం. రమేష్, డీఎస్పీ, ట్రాఫిక్, గుంటూరు -
తెగువ చూపారు.. వారందరికీ సెల్యూట్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సమయంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు తెగువ చూపారని.. వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ముందుగా జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారి మృతికి సంతాపంగా వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నాయకులు కాసేపు మౌనం పాటించారు. అనంతరం సమావేశం ప్రారంభించారు. దుర్మార్గమైన రెడ్‌బుక్ పాలనలో..‘ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. యుద్ధ వాతావరణంలో ప్రజలు బతుకుతున్నారు. దుర్మార్గమైన రెడ్‌బుక్ పాలన జరుగుతోంది’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రజావ్యతిరేకతను అణచివేయడం సాధ్యం కాదన్న ఆయన.. మేనిఫెస్టో అమలు చేయకపోతే ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త నిలదీస్తాడని చెప్పారు. ‘‘బలం లేకపోయినా స్థానిక సంస్థల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ప్రజలు ఓడించారు కాబట్టే.. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని విడిచిపెట్టి కుప్పం వెళ్లిపోయాడు. అక్కడ బీసీలు ఉన్నారు.. వారు ఆర్థికంగా ఇతరత్రా బలంగా ఉండరు కాబట్టి, వారిని తొక్కితొక్కిపెట్టవచ్చని చంద్రబాబు కుప్పంలో పాగావేశారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.జై జగన్.. అన్నారని కేసులు పెట్టారు..చంద్రగిరి ఎంపీపీ ఉప ఎన్నికల్లో గెలిచాక జై జగన్, జై వైఎస్సార్సీపీ అన్నారని కేసులు పెట్టారు. గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు తిరిగే ధైర్యంలేదు. తిరిగితే ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసం. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లడాన్ని నరకంగా మార్చేశారు. విద్యా, వైద్య రంగాలు దారుణంగా తయారయ్యాయి. చంద్రబాబుగారు అధికారంలో వచ్చాక 4 లక్షలు పెన్షన్లు తీసేశారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి.రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ....ప్రతి బాటిల్‌పైన రూ.20ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. వైఎస్సార్సీపీలో కన్నా ఇసుక రేటు రెండింతలు పెరిగింది. ఉచితం అని చెప్పి.. దోచుకుంటున్నారు. పైనుంచి కిందిదాకా ముడుపులు చెల్లిస్తేనే మైనింగ్ అయినా, పరిశ్రమ అయినా నడిచేది. అవినీతినుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ టాపిక్స్ ఎంచుకుంటున్నారు. విశాఖపట్నంలో ఊరూపేరు లేని ఉర్సా లాంటి కంపెనీలకు రూ.3,000 కోట్లు ఖరీదు చేసే భూములిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో రెషిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడుతుంది. అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇల్లే. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు హయాంలో ఉర్సా లాంటి ఊరూ పేరు కంపెనీకి రూ.3,000 కోట్ల డబ్బులు దోచిపెడుతున్నారు. విశాఖఫట్నంలో లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు రూ.1500- 2000 వేల కోట్లు ఖరీదు చేసే భూములను.. టెండర్లు లేకుండా కట్టబెట్టారు.జగన్ చేయగలిగాడు.. బాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’..లెఫ్ట్, రైట్, సెంటర్ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అమరావతి నిర్మాణ పనుల్లోనూ దోపిడీ. 2018లో ఐదేళ్ల కిందట చంద్రబాబు హయాంలో టెండర్లు పిలిచినప్పుడు పనుల విలువ రూ. రూ.36,000 కోట్లు. అప్పట్లో ఇప్పటికన్నా స్టీలు, సిమెంట్లు రేట్లు ఎక్కువ. అయినా కూడా ఆ రూ.36,000 కోట్ల విలువ ఈరోజు రూ.78,000 కోట్లకు పెంచేశారు. టెండర్లు రింగ్ ఫార్మ్ చేసి వాళ్ల కాంట్రాక్టర్లకే ఇచ్చుకుంటున్నారు. మొబలైజేషన్ అడ్వాన్వులు కొత్తగా ఇవ్వడం మొదలుపెట్టాడు. 10 శాతం మొబలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వడం, అందులో 8శాతం కమీషన్లుగా తీసుకోవడం.. ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ఎక్కడకు పోతున్నాయో తెలియడంలేదు. గతంలో ఎందుకు జగన్ చేయగలిగాడు.. చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.బాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే డబ్బులు‘‘జగన్ నేరుగా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వేసేవాడు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే పోతున్నాయి. ఇదే విషయాన్ని ఎన్నికల సమయంలో మొత్తుకుని చెప్పాను. చంద్రబాబు నాయుడుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. ఈ రోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. వీటికి సమాధానం చెప్పుకోలేక ప్రతిరోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్ ఆధికార్ల అరెస్టులు అంటూ డైవర్షన్లుఇలాంటి పాలనే రాష్ట్రంలో జరుగుతోంది....కరెంటు బిల్లులు షాక్ కొట్టేలా పెంచారు.. వీటి గురించి అడిగితే.. ఆయన చేసిన లిక్కర్ స్కాంను మరలా ఇంకొకరు మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒక సెన్షేషన్ క్రియేట్ చేసి దాన్నుంచి టాపిక్ డైవర్షన్ చేయడం పరిపాటిగా మారింది. రోమన్ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తుందని గ్లాడియేటర్స్‌ను పెట్టిన గేమ్స్ ఆడించేవాళ్లు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను పెట్టి.. చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటని ప్రజలు చూసేలా చేసి వారిని మభ్యపెట్టి డైవర్ట్ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు ఆ ఆటలు గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతుంది. ఎంతో మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయకుండా, మోసం చేసిన చంద్రబాబు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు..ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్ డిజిట్ రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు.ఆ రోజు వస్తుంది. కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నాను. ఈ రోజు కార్యకర్త ఎంతలా ఇబ్బంది పడుతున్నాడో చూస్తున్నాను’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
పహల్గాం మృతులకు వైఎస్ జగన్ నివాళి
గుంటూరు, సాక్షి: పహల్గాం ఉగ్రదాడి మృతులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) నివాళులర్పించారు. గురువారం పలు జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ భేటీకి ముందు ఆయన మృతుల కుటుంబాలకు సంతాపం తెలపడంతో పాటు నివాళులర్పించారు.సమావేశం ప్రారంభంలో.. జమ్ము కశ్మీర్ పహల్గాం(Pahalgam Attack)లో ఉగ్రవాదులు జరిపిన ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మౌనం పాటించి నివాళులర్పించి సమావేశం ప్రారంభించారు. ఈ భేటీలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఇంతకుముందు.. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన వైఎస్ జగన్.. ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారారాయన. ఈ క్రమంలో.. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఉగ్రదాడిని ఖండిస్తూ.. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ వైఎస్సార్సీపీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాయి కూడా. -
లాం ఫాంలో సలహా మండలి సమావేశం
గుంటూరు రూరల్: కృష్ణ మండలం వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం బుధవారం నిర్వహించారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాంఫాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వ్యవసాయ శాఖలు సంయుక్త ఆధ్వర్యం వహించాయి. నగర శివారుల్లోని లాంఫాం నందున్న సమావేశ మందిరంలో రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశానికి పరిశోధన సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మీదేవి మాట్లాడుతూ రైతుల సలహాలు, సూచనలు దృష్టిలో ఉంచుకుని పరిశోధన ప్రణాళికలు తయారు చేయాలని తెలిపారు. నూతన వంగడాలపై ఫీడ్ బ్యాక్ రైతుల నుంచి తీసుకోవాలన్నారు. సహజ వనరుల పొదుపు, నేల ఆరోగ్యం వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కృష్ణ మండలంలో నిష్ణాతులైన రైతుల ద్వారా సాగు సమస్యలు, సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. విస్తరణ సంచాలకులు డాక్టర్ జి. శివన్నారాయణ మాట్లాడుతూ జిల్లా వనరులు, అవసరాలు, పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని నూతన పరిశోధనలు జరపాలన్నారు. రైతులు విత్తన రకాలపై కాకుండా పంటల్లో యాజమాన్య పద్ధతులపై దృష్టి సారించాలని కోరారు. వివిధ జిల్లాల వ్యవసాయ అధికారులు ఆయా ప్రాంతాల పంటల స్థితిగతులు, పంటల యాజమాన్యం, మినీ కిట్ల పనితీరు గురించి వివరించారు. వచ్చే ఏడాదిలో చేపట్టాల్సిన పరిశోధనలకు దిశానిర్దేఽశం చేశారు. కేవీకే ఘంటశాల, గరికపాడులతో తయారు చేసిన పలు రకాల ప్రచురణలను విడుదల చేశారు. కార్యక్రమంలో 6 జిల్లాల వ్యవసాయ శాఖల అధికారులు, 12 పరిశోధన స్థానాలు, 6 విస్తరణ యూనిట్లు శాస్త్రవేత్తలు, వివిధ పంటల ప్రధాన శాస్త్రవేత్తలు, డీఆర్సీ అధికారులు, 6 జిల్లాల అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. -
ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ
మంగళగిరి టౌన్ : పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా మంగళగిరిలో పలు రాజకీయ పార్టీల నాయకులు బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మృతులకు సంతాపం తెలియజేశారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి మంగళగిరి నగర పరిధిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్, నాయకులు నివాళులర్పించారు. కొవ్వొత్తులతో సంతాపం తెలియజేశారు. పట్టణ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పట్టణంతో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి అమానుషమని, దేశమంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉగ్రదాడిలో పర్యాటకులు మృతి చెందడం విచారకరమని పేర్కొన్నారు. దాడుకు పాల్పడిన ఉగ్రవాదులపై ప్రధాని మోడీ ఉక్కుపాదం మోపుతారని అన్నారు. దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని తెలిపారు. కాశ్మీర్ అభివృద్ధిని ఆపలేరు గుంటూరు మెడికల్: కాశ్మీర్లో అమాయక ప్రజలపై జరిగిన అమానుష దాడికి సంఘీభావంగా బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. లాడ్జి సెంటర్ నుంచి శంకర్ విలాస్ వరకు కొవ్వొత్తులతో ఈ ర్యాలీ సాగింది. పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడుతూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ అమాయక పౌరులపై జరిపిన దాడిని ఖండించారు. పార్టీ సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజు, భీమినేని చంద్రశేఖర్, ఈదర శ్రీనివాసరెడ్డి, చరక కుమార్ గౌడ్, డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, నేరళ్ళ మాధవరావు, మంత్రి సుగుణ, ఏలూరి లక్ష్మీ, మేరీ సరోజినీ, బొల్లాప్రగడ శ్రీదేవి, వాణి వెంకట్, కోలా రేణుకాదేవి, గాయత్రి, రాజేష్ నాయుడు, దార అంబేడ్కర్, దర్శనపు శ్రీనివాస్, కంతేటి బ్రమ్మయ్య, బజరంగ్ రామకృష్ణ, దుర్గా ప్రసాద్, రామచంద్రరావు, తూనుగుంట్ల రాజేష్, మల్లాల లక్ష్మణ్, కామేపల్లి వెంకటేశ్వర్లు, మోతే శేషగిరి, పోతురాజు వెంకటేశ్వర్లు, తానుచింతల అనిల్, సాధు రామకృష్ణ, షేక్ బిలాల్, శ్రీను నాయక్, పద్మనాభం, రాజా అజయ్ కృష్ణ, షేక్ సాంబశివరావు, సురేష్ జైన్, కృష్ణ చైతన్య, పేరుమళ్ల పద్మనాభం, వక్కలగడ్డ తిరుమలరావు సాంబమూర్తి, నాగసాయి, కారం శెట్టి రమేష్, చంద్రశేఖర్, తాడువాయి రామకృష్ణ, సాంబయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు. మృతులకు నివాళి ఏఎన్‌యూ: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశాన్ని తీవ్రంగా కలచివేసిందని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు. ఉగ్రదాడిని నిరసిస్తూ ఏబీవీపీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, పరిశోధకులు పాల్గొని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఈ ఘటన కాశ్మీర్‌లోని శాంతి, సామరస్య స్ఫూర్తికి విరుద్ధమైనదని తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడు ఈ దాడిని ఖండించాలని పిలుపునిచ్చారు. దాడి వెనుక ఉన్న దుష్టశక్తులు, వారికి సహకరించిన ఎంతటివారైనా సరే వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర విశ్వవిద్యాలయాల కన్వీనర్ కె.గంగాధర్ రావు, రాష్ట్ర షోద్ కన్వీనర్ డి. రమాకాంత్, యూనివర్సిటీ శాఖ వైస్ ప్రెసిడెంట్ రాము, ఎస్ఎఫ్డీ కో కన్వీనర్ సి.హెచ్. శివ గణేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గణేష్, విశ్వవిద్యాలయం పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పెదపలకలూరు శ్రీచైతన్య స్కూల్ విద్యార్థుల ప్రతిభ
గుంటూరు రూరల్: పదో తరగతి ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారని పెదపలకలూరు శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్ డైరెక్టర్లు తెలిపారు. బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో కేవీ సౌజన్య అత్యధికంగా 586 మార్కులు సాధించి రాష్ట్ర ర్యాంకును సాధించిందన్నారు. పాఠశాలలో 550 మార్కులకుపైగా సాధించిన విద్యార్థులు 9 మంది, 500 మార్కులకు పైగా సాధించిన వారు 28 మంది ఉన్నారన్నారు. నూరుశాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి పేరు తెచ్చారన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్లు శనగల సాంబిరెడ్డి, ఎం.వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఏరువ శ్రీవేణి, గ్రామస్తులు అభినందించారు. పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య ఫిరంగిపురం: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత కానందుకు మనస్తాపానికి గురై విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పి.వినయకుమార్ (16) స్థానికంగా ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదు. మనస్తాపానికి గురై తన తాత పాపయ్య ఇంటికి వచ్చి ఫ్యాన్‌కు ఉరి వేసుకొన్నాడు. చుట్టు పక్కల వారు గమనించి విద్యార్థిని స్థానికంగా ఉన్న ప్రయివేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు విలపిస్తున్నారు. విద్యార్థిని రక్షించిన పోలీసులు తాడేపల్లి రూరల్ : 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేస్తుండగా బుధవారం తాడేపల్లి పోలీసులు కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. సీఐ కల్యాణ్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన ఓ విద్యార్థికి 10 తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెంది తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుండి వచ్చాడన్నారు. తల్లిదండ్రులు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అక్కడి సీఐ అప్రమత్తమై విద్యార్థి వద్ద సెల్‌ఫోన్ ఆధారంగా లొకేషన్ కనిపెట్టి తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. నాలుగు బృందాలుగా తాడేపల్లి పోలీసులు వెతకగా తాడేపల్లి కృష్ణాకెనాల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు పంపినట్లు సీఐ కల్యాణ్ రాజు తెలిపారు. హైదరాబాద్‌కు ఇంద్ర బస్సులు చిలకలూరిపేటటౌన్: చిలకలూరిపేట డిపో నుంచి హైదరాబాదు – బీహెచ్ఈఎల్ ఏసీ బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు డీఎం ఎస్.రాంబాబు బుధవారం తెలిపారు. డిపో వినియోగదారుల అవసరాలు పరిశీలించి హైదరాబాద్, బీహెచ్ఈఎల్ మార్గాల్లో కొత్తగా రిజర్వేషన్‌ను ప్రారంభించామన్నారు. -
నకిలీ ఉద్యోగాల ముఠాపై ఫిర్యాదు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లిలో జనసేన పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై బుధవారం జనసేన నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జనసేన తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు సామాల నాగేశ్వరరావు, తాడేపల్లి పట్టణ సీనియర్ నాయకుడు అంబటి తిరుపతిరావులు మాట్లాడుతూ ఉండవల్లి సెంటర్లో శివ అనే వ్యక్తి ఒక ఇల్లు అద్దెకు తీసుకుని జనసేన ఎంపీ, మంత్రుల పేర్లు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ దరఖాస్తులు స్వీకరిస్తూ, నగదు వసూలు చేస్తున్నాడని తమ దృష్టికి వచ్చిందన్నారు. పత్రికల్లో దీనిపై వార్తలు వచ్చాయని గుర్తుచేవారు. శివకు, అతని వెనుక ఉన్న ముఠాతో జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోలీసులు కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చల్లాకుల కోటేష్, నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్, ఉండవల్లి గ్రామ అధ్యక్షులు చిగురుశెట్టి రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక రైళ్ల కేటాయింపు
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్ల కేటాయించడం జరిగిందని గుంటూరు డివిజన్ సీనియర్ డీసీయం ప్రదీప్ కుమార్ బుధవారం తెలిపారు. రైలు నంబర్ 08579 విశాఖపట్నం – చర్లపల్లి రైలు ఈ నెల 25 నుంచి మే 30వ తేదీ వరకు నడుస్తుందన్నారు. 08580 చర్లపల్లి – విశాఖపట్నం రైలు ఈ నెల 26 నుంచి మే 31వ తేదీ వరకు నడపనున్నట్లు తెలిపారు. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగా ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. వైభవంగా సీతారాముల విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అమరావతి: మండలంలోని ఎనికపాడు గ్రామంలో హనుమత్, లక్ష్మణ సీతాసమేత రామచంద్రస్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. యాజ్ఞిక బ్రహ్మ పరాశరం రామకృష్ణమాచార్యుల పర్యవేక్షణలో వైఖానసాగమంలో చంచాహ్నికహ్నిక దీక్షతో ఉత్సవాలను నిర్వహించారు. ప్రతిష్టా సుముహుర్తమైన 8గంటలకు తొలుత యంత్ర స్థాపనచేసి యాగశాల నుంచి స్వామివార్లను ఊరేగింపుగా తీసుకుని వచ్చి నూతనంగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్టించారు. అనంతరం అత్యంత వైభవంగా జీవధ్వజ ప్రతిష్టాకార్యక్రమం నిర్వహంచారు. ఈసందర్భంగా మహా పూర్ణాహుతి, కుంభప్రోక్షణ మహా సమారాధన నిర్వహించారు. ఽవిగ్రహ ప్రతిష్ట అనంతరం మొదట ధేను దర్శనం, దిష్టికుంభం, కన్యాదర్శనం అనంతరం ప్రథమార్చన నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం దేవాలయ నిర్వాహకులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిష్టా ఉత్సవాలతో గ్రామం భక్తులతో కళకళలాడింది. భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌లు కుటుంబసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగాకాలనీలో పోలీసుల కార్డెన్ సెర్చ్ సత్తెనపల్లి: సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతురావు మాట్లాడుతూ రంగా కాలనీలో ఇటీవల చోటు చేసుకుంటున్న గొడవల నేపథ్యంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగిందన్నారు. ఉద్దేశపూర్వకంగా ఘర్షణలకు పాల్పడిన వారిని జైలుకు పంపుతామని హెచ్చరికలు చేశారు. ఒక్కసారిగా 100 మందికి పైగా పోలీసులు ఇంటింటి తనిఖీలు చేపట్టడంతో రంగాకాలనీలో ఏదో జరిగిందంటూ కొంత సేపు కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటిని పోలీస్టేషన్‌కు తరలించారు. -
మార్జాలంపై మమకారం!
ఇటీవలి కాలంలో పట్టణాలు, నగరాల్లోనూ పిల్లులపై మోజు పెరుగుతోంది. గతంలో రైతులు, పశుపోషకులు మాత్రమే పిల్లులను ఆదరించేవారు. ప్రస్తుతం అన్ని వర్గాలకు ఇది విస్తరిస్తోంది. పిల్లుల పెంపకం ఓ జీవనశైలి మాత్రమే కాదు, మానవీయ విలువల ఆవిష్కరణగా మారింది. ● జిల్లాలో పెరుగుతున్న పిల్లుల పెంపకం ● అన్ని వర్గాలకూ విస్తరిస్తున్న అలవాటు ● పెంపుడు జాతుల్లో ‘పర్షియన్’దే ఆధిక్యం ● బిల్లీ, మచ్చల పిల్లులకు ఆదరణ -
అట్టహాసంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవం
నగరంపాలెం: స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై బుధవారం సాయంత్రం శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో 15వ అంతర్జాతీయ నృత్య దినోత్సవంలో భాగంగా మహా మంజీరనాదం వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించగా, మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు వేడుకలను ప్రారంభించారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ భూసురుపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అనంతరం మేలట్టూర్ ఎన్.శ్రీకాంత్ నటరాజన్ (కేరళ)ను అక్కిరాజు మణి ప్రియ స్మారక సాత్రాజితి పురస్కారంతో, ఏలూరి జయశ్రీ, దంగేటి సాత్విక (తెలంగాణ)లను సంస్థ కార్యదర్శి కళారత్న డాక్టర్ కాజ వెంకటసుబ్రమణ్యం సత్కరించారు. మేలట్టూర్ శ్రీకాంత్ నటరాజన్ మేలట్టూ సంప్రదాయ నృత్యాన్ని, ఏటూరి జయశ్రీ కూచిపూడి నృత్యాన్ని, దంగేటి సాత్విక ఆంధ్ర నాట్యాన్ని ప్రదర్శించారు. వారి నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమాలను మోదుగుల రవికృష్ణ, అక్కిరాజు శ్రీహరిబాబు, వెంకటగిరి నాగలక్ష్మి (కోశాధికారి), శ్రీఅలేఖ్యరావు పర్యవేక్షించారు. సాత్విక నృత్యం -
చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ఇద్దరు అరెస్టు
గుంటూరు రూరల్: చిరునామా అడుగుతున్నట్లు నటించి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే మామా అల్లుళ్లను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం అడవితక్కెళ్ళపాడులోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్ డీఎస్పీ భానోదయ ఈ కేసుకు సంబంధించిన వివరాలను తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ... పాతగుంటూరు యాదవ బజారుకు చెందిన బాణావత్ బద్రునాయక్, పల్నాడు జిల్లా మాచర్ల మండలం చింతలతండా గ్రామానికి చెందిన కేతావత్ శరత్‌లు మేనమామ, మేనల్లుడు. నగరంలో ఆటోలు నడుపుతూ వ్యసనాలకు బానిసలయ్యారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్‌లను ఎన్నుకున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళుతూ ఒంటరిగా వెళుతున్న మహిళలను అడ్రస్ అడుగుతున్నట్లు నటించి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ పారిపోయేవారు. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన ఇన్నర్ రింగ్‌రోడ్డులో ఓ మహిళ మెడలోని 20 గ్రాముల బంగారు చైన్‌ను ఇదే తరహాలో లాక్కెళ్లారు. నల్లపాడు సీఐ వంశీధర్ కేసు దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం ఉదయం వై జంక్షన్ వద్ద తిరుగుతున్న ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నిందితులు నేరాన్ని అంగీకరించారు. వారి నుంచి పోలీసులు 20 గ్రాముల బంగారం, నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరిచామని డీఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ, సీఐని, ఎస్ఐ వాసు, సిబ్బంది సుబ్బారావు, మస్తాన్‌వలి, నరుల్లాలను జిల్లా ఎస్పీ అభినందించారు. -
చెమటోడుస్తున్నా చల్లనమేదీ?
గుంటూరు జీజీహెచ్‌లో గుండె జబ్బు రోగులకు అవస్థలు తప్పడం లేదు. దీర్ఘకాలిక వ్యాధితో రోజూ ఇబ్బంది పడేవారు కొంత ఉపశమనం కోసం గుంటూరు జీజీహెచ్‌కు వస్తే అక్కడ ఏసీలు పనిచేయక మరిన్ని కష్టాలు పడుతున్నారు. ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి. మరోపక్క ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గదిలో ఏసీలు పనిచేయక నానా అగచాట్లు పడుతున్నారు. రోగులకు సరిపడా గాలి, వెలుతురు లేని పక్షంలో ఊపిరి అందక ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. వారికి సేవలు అందించే వైద్యులకూ ఇబ్బందులు తప్పడం లేదు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. గుంటూరు మెడికల్ : గుంటూరు జీజీహెచ్ గుండె జబ్బుల విభాగం సీసీయూలో చికిత్స కోసం వచ్చే రోగులు రెండు నెలలుగా ఏసీలు పనిచేయక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొద్దో గొప్పో డబ్బులు ఉన్నవారు ఫ్యాన్లు కొనుగోలు చేసుకుని తమ పడకల వద్ద పెట్టుకుంటున్నారు. కొంత మంది ఇళ్ల వద్ద నుంచి తెచ్చుకుంటున్నారు. స్థోమత లేని వారు మాత్రం గాలిక ఆడక, నిద్రపట్టక నానా అగచాట్లు పడుతున్నారు. వేసవికి ముందే ఆసుపత్రిలో ఏసీల నిర్వహణ చూడాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లే నేడు రోగులకు ఇబ్బంది తప్పడం లేదని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏసీల మెయింటెనెన్స్ కాంట్రాక్టును విజయవాడకు చెందిన కంపెనీ వారు దక్కించుకున్నారు. మార్చి ప్రారంభానికి ముందే మరమ్మతులు చేయాల్సి ఉంది. ఐసీయూ, క్రిటికల్ కేర్ యూనిట్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లాంటి అత్యవసర వైద్య సేవల విభాగాల్లో నిత్యం ఏసీల వినియోగం తప్పనిసరిగా ఉంటుంది. వాటి నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు. సదరు కాంట్రాక్టర్‌పై ఆసుపత్రి అధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూడడం విమర్శలకు తావిస్తోంది. రోగులు ఇబ్బంది పడుతున్నప్పుడైనా కాంట్రాక్టర్‌కు బిల్లులు నిలుపుదల చేయడం, లేదా వేరొకరికి కాంట్రాక్టు అప్పగించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆసుపత్రి అధికారులకు సంబంధించిన గదుల్లో మాత్రం ఏసీలు బాగానే పనిచేస్తున్నాయి. వైద్యులు, వైద్య సిబ్బందికీ కష్టాలు హార్ట్ ఫెయిల్యూర్ లాంటి తీవ్ర ప్రాణాపాయ స్థితిలో గుంటూరు జీజీహెచ్ గుండె జబ్బుల వార్డుకు వస్తున్న రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది చెమటోడ్చి సేవలందిస్తున్నారు. ఎక్కువ సేపు వైద్య విభాగంలో సేవలందించేలా ఆసుపత్రి అధికారులు ఏసీలు రిపేర్లు చేయించకపోవడంతో వీరు సైతం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధిక సంఖ్యలో గుండె ఆపరేషన్లు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నా తగిన వసతులు కల్పించకపోవడం అధికారుల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మే నెలలో ఎండ తీవ్రత పెరిగి మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకనైనా ఆసుపత్రి అధికారులు స్పందించి పేద రోగులతోపాటు వైద్య సిబ్బంది బాధలు తీర్చాలని పలువురు కోరుతున్నారు. సమస్య పరిష్కారానికి ఆదేశాలిచ్చాం కార్డియాలజీ సీసీయూ విభాగంలో ఏసీలు పనిచేయని విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణను ‘సాక్షి’ వివరణ కోరగా... సమస్య తమ దృష్టికి వచ్చిందన్నారు. సెంట్రల్ ఏసీ అవడంతో తరచుగా సమస్య ఉత్పన్నం అవుతోందని తెలిపారు. ఏసీలు పనిచేసేలా చూడాలని కాంట్రాక్టర్‌కు ఆదేశాలు ఇచ్చామన్నారు. జీజీహెచ్ గుండె జబ్బుల విభాగంలో పనిచేయని ఏసీలు వైద్యం చేసే సమయంలో డాక్టర్లకు తప్పని అవస్థలు సొంత ఫ్యాన్లు తెచ్చుకుంటున్న రోగులు, సహాయకులు -
రాష్ట్రంలో కూటమి లిక్కర్ మాఫియా
● టీడీపీ నాయకులకే మద్యం దుకాణాలు అప్పగింత ● వేమూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్బాబునగరంపాలెం (గుంటూరు వెస్ట్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక లిక్కర్ మాఫియా కొనసాగుతోందని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు మండిపడ్డారు. గుంటూరు బృందావన్గార్డెన్స్ ౖవైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్టీఆర్ మద్యాన్ని నిషేధించగా, ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి మద్యం పాలసీ తీసుకువచ్చారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో సారాయి, మద్యం ఏరులై ప్రవహిస్తుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సత్వరమే మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేశారని తెలిపారు. టీడీపీ నాయకులకే మద్యం దుకాణాలను అప్పగించారని ఆరోపించారు. అందులో మంత్రులు, ఎమ్మెల్యేలకు 30 శాతం వాటా ఇచ్చి, ఊరుకు ఎనిమిది బెల్ట్ షాప్‌లు, పర్మిట్ రూములను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. రూ.వేల కోట్లు టీడీపీ నేతల చేతులు మారుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు గతంలో బెల్ట్‌షాపులు రద్దు చేస్తామని సంతకం చేశారని, ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో 43 వేల బెల్ట్ షాప్‌లను రద్దు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో సుమారు 4,300 మద్యం దుకాణాలు ఉండగా వైఎస్ జగన్ హయాంలో 33 శాతం తగ్గించారని తెలిపారు. మద్యం దుకాణాలన్నీ టీడీపీ నాయకులకు వచ్చేలా చేశారని, క్వాటర్ బాటిల్‌కు అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. బెల్డు షాప్‌ల ఏర్పాటుకు సైతం లంచం కింద రూ.2 లక్షలు చెల్లిస్తున్నారని తెలిపారు. తద్వారా తాగునీటి సీసాల విక్రయాలు, పర్మిట్లు ఇస్తున్నారని విమర్శించారు. గతంలోని మద్యం పాలసీపై చంద్రబాబు ఏ–3గా ఉన్నారని, ఆ కేసు ఏమైందనేది చూసుకోవాలని అన్నారు. రాజ్ కసిరెడ్డితో పాటు ఆ కేసులో వైఎస్ జగన్‌ను ఇరికించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌లతో బలవంతంగా రాజ్ కసిరెడ్డి పేరు చెప్పించారని ఆరోపించారు. -
‘సాక్షి’పై దాడిని ఖండిస్తున్నాం
గుంటూరు మెడికల్: ఏలూరులో ‘సాక్షి’ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా పేర్కొన్నారు. సాక్షి కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా బుధవారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వరంలో గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట యూనియన్ సభ్యులు నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు. అనంతరం అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) జి.వి.రమణమూర్తిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఎవరైనా రాసిన వార్త తమకు ఇబ్బందికరమని భావిస్తే ప్రెస్ కౌన్సిల్‌ను సంప్రదించవచ్చన్నారు. లేని పక్షంలో కోర్టులను ఆశ్రయించవచ్చని తెలిపారు. అంతేకానీ అప్రజాస్వామికంగా దాడులు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి కె.రాంబాబు, నగర గౌరవ అధ్యక్షుడు శర్మ, నగర అధ్యక్షుడు వి.కిరణ్‌కుమార్, కార్యదర్శి కె.ఫణి, పరసశ్యామ్, సాక్షి బ్యూరో ఇన్చార్జి డి.రమేష్‌బాబు, సాక్షి టీవీ జిల్లా ఇన్చార్జి అశోక్, కెమెరామెన్ బాషా, ఫొటోగ్రాఫర్ రామ్‌గోపాల్‌రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ గోపి, సర్క్యూలేషన్ మేనేజర్ అబ్దుల్లా, సాక్షి అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ ఎంవీడీ సత్యనారాయణ, సాక్షి సిబ్బంది రవి, భగత్, ఎం.సి.హెచ్.కోటిరెడ్డి, మొండితోక శ్రీనివాసరావు, రఘు, షేక్ సుభాని, ప్రకాష్, కృష్ణ, ఎం.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట యూనియన్ సభ్యుల నిరసన -
మెడిసిన్ చదువుతా
తెనాలి: ఇంటర్లో బైపీసీ తీసుకుని మెడిసిన్ చేయాలనుందని పదో తరగతిలో 595 మార్కులు సాధించిన వివేక విద్యాసంస్థల విద్యార్థిని సీహెచ్ పరమేశ్వరి తన లక్ష్యాన్ని వెల్లడించింది. తెనాలి వివేక విద్యాసంస్థల్లో చిన్నప్పటి నుంచి చదవటం, ఉపాధ్యాయుల సూచనలు తనకు ఎంతగానో ఉపకరించినట్లు పేర్కొంది. వారందరికీ రుణపడి ఉంటానని చెప్పింది. తన తండ్రి అనంతరాజు సాధారణ పండ్ల వ్యాపారి కాగా, తల్లి శివలక్ష్మి గృహిణి అని తెలిపింది. తన చదువు కోసం వారు పడిన కష్టం మరువలేనిదని పేర్కొంది. న్యూరో సర్జన్‌గా స్థిరపడాలనేది లక్ష్యమని, అందుకోసం పట్టుదలతో చదువుతానని తెలిపింది. – సీహెచ్ పరమేశ్వరి -
బాలికలు భళా..!
గుంటూరుముగిసిన ప్రతిష్టా వేడుకలు శావల్యాపురం: వేల్పూరు గ్రామంలో వేంచేసియున్న గంగమ్మ, పోతురాజుల, పేర్పిడి ప్రతిష్టా మహోత్సవాలు బుధవారంతో ముగిశాయి. భక్తులు భారీసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. త్రికోటేశ్వర విగ్రహ పునఃజీవ ప్రతిష్ట సత్తెనపల్లి: అమ్మిశెట్టి వారి వీధిలోని త్రికోటేశ్వర స్వామి విగ్రహ పునఃజీవ ప్రతిష్ట, దేవాలయం పునర్ నిర్మాణం, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం బుధవారం జరిగాయి.రెడ్డి పేరంటాలమ్మకు పూజలు నాదెండ్ల: సాతులూరులో రూ.2 కోట్లతో నిర్మించిన రెడ్డిపేరంటాలమ్మ ఆలయంలో విద్యాదాత, గోల్కొండ గ్రూపు సంస్థల చైర్మన్ నడికట్టు రామిరెడ్డి పూజలు చేశారు.గురువారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025గుంటూరు ఎడ్యుకేషన్ : మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన 27,255 మంది విద్యార్థుల్లో 24,129 మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలు రాసిన 14,444 మంది బాలురులో 12,567 మంది ఉత్తీర్ణులు కాగా, 87 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదే విధంగా 12,811 మంది బాలికలు పరీక్షలు రాయగా.. 11,562 మంది ఉత్తీర్ణులయ్యారు. 90.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది 88.14 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 16వ స్థానానికి పరిమితమైన గుంటూరు జిల్లా ప్రస్తుత ఫలితాల్లో 88.53 శాతం ఉత్తీర్ణతతో నాలుగో స్థానానికి ఎగబాకింది. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల నుంచి పరీక్షలు రాసిన పేద కుటుంబాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యార్థులతో పోటీ పడి రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించడంతోపాటు జిల్లాలో టాపర్లుగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావడంతోపాటు అధిక మార్కులు సాధించిన వారు వందలాదిగా ఉండటంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 20,504 మందికి ప్రథమ శ్రేణి జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది ప్రథమ శ్రేణిలో పాసైన వారే ఉన్నారు. పరీక్షలు రాసిన 27,255 మందిలో 24,129 మంది ఉత్తీర్ణత సాధించగా, వారిలో 20,504 మంది ప్రథమ శ్రేణి పొందడం గమనార్హం. మిగిలిన వారిలో 2,512 మంది ద్వితీయ, 1,113 మంది తృతీయశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్లు వీరే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు వచ్చాయి. ● తాడికొండ ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి పఠాన్ మొహమ్మద్ అబ్దుల్ రెహ్మాన్ అత్యధికంగా 592 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచాడు. ● సంగం జాగర్లమూడి జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని మద్దినేని మనోజ్ఞ, తెనాలి కొత్తపేటలోని ఎస్డీఐఎం మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని షేక్ ఉస్నే జహా, పెదకాకాని జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని షేక్ రిజ్వానా, కొల్లిపర మండలం వల్లభాపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని తియ్యగూర పూజితారెడ్డి, మంగళగిరి వీవర్స్ కాలనీలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థి పి.వరుణ్‌సాయి 591 మార్కులు సాధించారు. ● జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులను జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక అభినందించారు. అత్యుత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులను, విద్యార్థులను, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. పదో తరగతిలో జిల్లా విద్యార్థులు మెరిశారు. కన్నవారి కలలు నిజం చేసేలా పలువురు అత్యుత్తమ మార్కులు సాధించారు. మొత్తమ్మీద బాలుర కంటే బాలికలు సత్తా చాటి భళా అనిపించారు. బుధవారం ఎస్సెస్సీ బోర్డు ప్రకటించిన పరీక్షా ఫలితాలలో జిల్లాలో 88.53 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలో ఏడాదివారీగా ఫలితాలు ఇలా.. సంవత్సరం ఉత్తీర్ణత శాతం రాష్ట్రస్థాయిలో స్థానం 2020 ఆల్ పాస్ 2021 ఆల్ పాస్ 2022 68.20 7 2023 77.40 6 2024 88.14 16 2025 88.53 4 3న్యూస్‌రీల్ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో హవా జిల్లాలో 88.53 శాతం ఉత్తీర్ణత రాష్ట్రస్థాయిలో జిల్లాకు 4వ స్థానం గతేడాదితో పోలిస్తే మెరుగైన ర్యాంక్ సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన 20,504 మంది -
ఉగ్రవాదుల దాడి హే యం
పట్నంబజారు: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దుర్ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నేతృత్వంలో బుధవారం పార్టీ శ్రేణులు శాంతి ర్యాలీ చేపట్టాయి. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి బుధవారం ఎన్టీఆర్ స్టేడియం సమీపంలోని సిగ్నల్స్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సరైన బదులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ విచక్షణరహితంగా పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి హేయమన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఉగ్రవాద సంస్థలను అణచివేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఇలాంటి దాడులు చేయడం ఎంతో హేయమైన చర్య అని, ఈ దాడిలో అమాయకులు నిండు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంటు పరిశీలకులు మోదుగుల వేణుగోపాల రెడ్డి మాట్లాడుతూ అసువులు బాసిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కిరాతకులను కఠినంగా శిక్షించాలన్నారు. దేశంలో ఇలాంటివి పునరావృతం కాకుండా, కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరూ గొంతెత్తి నినదించాలన్నారు. తప్పు చేసిన వారిని అణచివేయాలని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ప్రధాని నరేంద్ర మోడీ సరైన జవాబు చెప్పాలన్నారు. దేశం దమ్మును వారికి చాటి చెప్పాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్, తాడికొండ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు, ప్రత్తిపాడు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్, పార్టీ నేతలు మెట్టు వెంకటప్పారెడ్డి, నిమ్మకాయల రాజనారాయణ, మండేపూడి పురుషోత్తం, సీడీ భగవాన్, కొరిటెపాటి ప్రేమ్‌కుమార్, మామిడి రాము, నందేటి రాజేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
నేటి నుంచి టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో సాధారణ బదిలీల కోసం పెట్టుకునే ప్రభుత్వ టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజులపాటు జరుగుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సాధారణ బదిలీ కోసం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ప్రతి ఒక్కరూ జీజీహెచ్ ఆసుపత్రి అభివృద్ధి సంఘం కౌంటర్లో రూ.1,500 ఫీజు చెల్లించాలన్నారు. అభ్యర్థులు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఉద్యోగ గుర్తింపు కార్డు తీసుకుని ఉదయం 9 నుంచి 12 గంటల మధ్యలో కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 99637 66638 ఫోన్ నంబరులో సంప్రదించాలన్నారు. ఘనంగా పోలేరమ్మ ఆలయ వార్షికోత్సవం తెనాలి టౌన్: భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే పోలేరమ్మ కరుణ, కటాక్షాలు ప్రజలందరిపై మెండుగా ఉండాలని ఆలయ ధర్మకర్త వీరయ్య ఆకాంక్షించారు. పట్టణ వైకుంఠపురం రోడ్డులో వేంచేసియున్న పోలేరమ్మ దేవస్థానం 27వ వార్షికోత్సవాలు మంగళ, బుధవారాలు కనులపండువగా నిర్వహించారు. పసుపు, కుంకుమలతో మేళ తాళాలు, కనక తప్పెట్లు, కాళికా వేషధారణలతో పురవీధుల్లో ఉరేగింపు ఉత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. బుధవారం దేవస్థానం వద్ద భక్తులకు అన్న వితరణ చేశారు. విశేష సంఖ్యలో పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమంలో గుంటి వెంకట్, పెద్దలు పాల్గొన్నారు. సూదివారిపాలెం సర్పంచ్‌కు పంచాయతీ రాజ్ అవార్డు ఇంకొల్లు(చినగంజాం): జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా మండలంలోని సూదివారిపాలెం గ్రామ సర్పంచ్ గోరంట్ల జయలక్ష్మికి కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం చేశారు. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన పంచాయతీ రాజ్ దివస్ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఆదర్శ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేస్తున్న రాష్ట్రీయ గౌరవ గ్రామ సభ అవార్డుతో ఆమెను సత్కరించారు. వీరయ్య చౌదరి హత్య కేసులో రేషన్ మాఫియా? ● పోలీసుల అదుపులో వెదుళ్లపల్లి రైస్‌మిల్లు యజమాని ● ఆరా తీస్తున్న పోలీసులు సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసులో రేషన్ మాఫియా పాత్రపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. హత్య కేసును విచారిస్తున్న పోలీసులకు రేషన్ మాఫియాపై అనుమానాలు తలెత్తినట్లు సమాచారం. నాగులుప్పలపాడుకు చెందిన చౌక బియ్యం వ్యాపారితో వీరయ్య చౌదరికి విభేదాలున్నాయి. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి వ్యాపారం చేసిన పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా బాపట్ల నియోజకవర్గంలోని వెదుళ్లపల్లికి చెందిన రైస్‌మిల్లు యజమానిని కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వీరయ్య చౌదరి హత్యలో నిజంగా రేషన్ మాఫియా హస్తం ఉందా? లేక మరేదన్నా కారణమా? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. పోలీసుల అదుపులో ముగ్గురు..? పొన్నూరు: పట్టణంలోని నిడుబ్రోలుకు చెందిన గోపి, అమీర్, అశోక్ అనే ముగ్గురిని ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలో జరిగిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో వీరి పాత్రపై అనుమానంతో తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఈ ముగ్గురు వెదుళ్లపల్లి మిల్లుకు రేషన్ బియ్యం రవాణా చేస్తున్నట్లు, ఈ క్రమంలో వీరి ప్రమేయంపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. -
ఘనంగా విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం
ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి జోగి రమేష్ తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఇప్పటంలో గౌడ పాలెంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామ స్వామి విగ్రహంతోపాటు పలు విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రి జోగి రమేష్, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ముందుగా గ్రామంలోని సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గౌడపాలెంలో శ్రీ కోదండరామస్వామి, శ్రీ గణపతి, శ్రీ గంటలమ్మ, పోతురాజు, హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భారీ అన్నదానం చేశారు. వైఎస్సార్సీపీ రూరల్ అధ్యక్షుడు అమరా నాగయ్య, మంగళగిరి నియోజకవర్గ మాజీ జేసీఎస్ కన్వీనర్ మున్నంగి వివేకానంద రెడ్డి, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 514.60 అడుగుల వద్ద ఉంది. ఇది 139.6134 టీఎంసీలకు సమానం. -
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైఎస్సార్సీపీ స్థానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో రేపు(గురువారం) ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం కానున్నారు.స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా రేపు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైఎస్సార్సీపీ నేతలతో భేటీ కానున్నారు.ఈ సమావేశానికి ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలను ఆహ్వానించారు. వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు. -
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ శాంతి ర్యాలీ
సాక్షి, తాడేపల్లి: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతి ర్యాలీ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రారంభమైంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేస్తున్నారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణమూర్తి, అధికార ప్రతినిధులు కారుమూరి వెంకటరెడ్డి, శివశంకర్, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, మంగళగిరి ఇన్‌ఛార్జి వేమారెడ్డి, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పహల్గాం ఘటన పిరికిపంద చర్య అని.. ఇలాంటి దాడులతో భారతీయ స్ఫూర్తిని చెదరగొట్టలేరన్నారు. వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించామని సజ్జల పేర్కొన్నారు. ‘‘మా ఉక్కు సంకల్పాన్ని కొనసాగిస్తాం. మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరపున సానుభూతి తెలియజేస్తున్నాం.. అందరం సంఘటితంగా నిలపడాల్సిన సమయం ఇది’’ అని సజ్జల చెప్పారు.కశ్మీర్‌లోని పహల్గామ్లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు చేపట్టింది. ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నాయకులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఉగ్రవాదుల దాడిని అమానుష చర్యగా పేర్కొన్న వైఎస్ జగన్.. దేశం అంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. పహల్గాం ఘటనలో పలువురు మరణించండం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం అత్యంత బాధాకరమన్నారు. విజయవాడ నగరంలో..పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఉగ్ర దాడిలో పర్యాటకులు మృతి చెందడం విచారకరమన్నారు. ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఇద్దరు మరణించారని.. వారి కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఉగ్ర వాదంపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలన్నారు.తూర్పుగోదావరి జిల్లాలో..పహల్గాం జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ రాజమండ్రిలో వైఎస్సార్సీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు భారీ శాంతి ర్యాలీ చేపట్టారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు నినదించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రులు తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాన్ని భరత్, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, వెంకటరావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పాల్గొన్నారు.అనంతపురం జిల్లాలో..అనంతపురం జిల్లా: జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా అనంతపురంలో వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్ దాకా నిరసన ప్రదర్శన చేపట్టింది. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని.. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు.వైఎస్సార్ జిల్లాలో..జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడులకు నిరసనగా కడపలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.తిరుపతిలో..జమ్మూకశ్మీర్ పహల్గాం ఘటనకు నిరసనగా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. ఉగ్రవాదులను సమూలంగా ఏరివేయాలని భూమన అన్నారు.విశాఖలో.. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి వైఎస్సార్ పార్కు వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలన్నారు. అమాయకులైన ప్రజల ప్రాణాలను తీసుకోవడం ఉన్మాద చర్యగా ఆయన అభివర్ణించారు. 145 కోట్ల భారతీయులు ఏకతాటిపైకి రావాలని.. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్న మట్టు పెట్టాలన్నారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. -
‘మంత్రి నారా లోకేష్ బినామీలదే ఉర్సా కంపెనీ’
సాక్షి, తాడేపల్లి: విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూములను 99 పైసలకే డొల్ల కంపెనీ ఉర్సా క్లస్టర్స్‌కు కేటాయించడం వెనుక మంత్రి నారా లోకేష్, ఆయన బినామీలే సూత్రదారులని వైఎస్సార్సీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ తన సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను సృష్టించి, వాటికి ప్రభుత్వం ద్వారా కారుచౌకగా విలువైన భూములను కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తానని చెబుతున్న చంద్రబాబు ప్రజల సంపదను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వం విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు దోచిపెడుతోంది. ఊరు, పేరు లేని ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థకు విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని కారుచౌకగా కట్టబెట్టింది. గత వారం రోజులుగా దీనిపై రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ డొల్ల కంపెనీ హైదరాబాద్‌లోని ఒక అపార్ట్మెంట్లో రెండు నెలల కిందటే రిజిస్టర్ అయ్యింది. అటువంటి కంపెనీకి 56 ఎకరాల భూమిని కట్టబెడతారనే దానిపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ అవినీతిపై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా, దీనిపై రాష్ట్రంలోని ఒక్క మంత్రి కూడా ధైర్యంగా ప్రజల ముందకు వచ్చి వివరణ ఇవ్వలేదు.ఎందుకంటే ఇది డొల్ల కంపెనీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరు డైరెక్టర్లు తప్ప ఒక్క ఉద్యోగి కూడా లేని ఈ కంపెనీకి ఎకరం రూ.50 కోట్ల విలవైన భూములు, అంటే దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కేవలం 99 పైసలకే కట్టబెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇటువంటి సూట్‌కేస్ కంపెనీలను పెద్ద ఎత్తున రిజిస్టర్ చేయించడం, వాటికి కారుచౌకగా ఖరీదైన భూములను కట్టబెట్టించడం చేయిస్తున్నారు. ఇది ఒక ఆర్గనైజ్డ్ స్కామ్. ప్రభుత్వమే తమ బినామీలను ముందు పెట్టి, ఆస్తులను దోచేస్తోంది.వైఎస్ జగన్ హయాంలోనే టీసీఎస్‌తో సంప్రదింపులువైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే టీసీఎస్ ప్రతినిధులతో చర్చలు జరిగాయి. తరువాత కోవిడ్ కారణంగా టీసీఎస్ ఏపీకి రావడం ఆలస్యం అయ్యింది. 2022లో టీసీఎస్‌కు చెందిన చంద్రశేఖరన్ ఏపీకి వచ్చి ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యారు. తరువాత ఎన్నికలు రావడంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. టీసీఎస్‌తో ప్రభుత్వ సంప్రదింపులు కొనసాగాయి. టీసీఎస్‌కు విశాఖలో 21.16 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే విక్రయిస్తూ కూటమి ప్రభుత్వం ఈనెల 21వ తేదీన జీవో జారీ చేసింది. ఈ భూముల విలువ వేలకోట్ల రూపాయలు ఉంటుంది. కనీసం వాటి మార్కెట్ విలువపై కొంతశాతం తగ్గించి విక్రయించినా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది.అలా కాకుండా 99 పైసలకు విక్రయించడం చూస్తే, దేశంలో ఎక్కడైనా ఇలా జరిగిందా అనే అనుమానం కలుగుతోంది. ప్రజాసంపదను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే సమయంలో ప్రోత్సహాకరంగా విధానాలు ఉండాలే తప్ప, పూర్తిగా ఉచితంగా దారాదత్తం చేసేలా ఏ ప్రభుత్వమైనా వ్యవహరిస్తుందా? ఇలా 99 పైసలకే భూములను విక్రయించినందుకు ఏపీకి టీసీఎస్ నుంచి ఏదైనా ప్రత్యేకమైన మేలు జరుగుతుందా అని చూస్తే, ఆ సంస్ధ కల్పించే 12వేల ఉద్యోగాల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఉంటారు. వైయస్ జగన్ సీఎంగా ఈ రాష్ట్రంలో ఏర్పాటయ్యే సంస్థలు ఖచ్చితంగా డెబ్బై శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని నిబంధనలు తీసుకువస్తే, ఆనాడు కూటమి పార్టీలు వ్యతిరేకించాయి. ఇప్పుడు టీసీఎస్ కల్పించే ఉద్యోగాల్లో ఓ రెండు వేల మంది ఏపీకి చెందిన వారు ఉంటే, మిగిలిన పదివేల మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉంటారు. అలాంటప్పుడు ఈ కేటాయింపులను ప్రశ్నిస్తే, పరిశ్రమలను, ఐటీ సంస్థలను అడ్డుకుంటున్నారని మాపైన దుష్ర్పచారం చేస్తున్నారు.డొల్ల కంపెనీలకు భూకేటాయింపులుటీసీఎస్ను చూపిస్తూ, ఉర్సా లాంటి డొల్ల కంపెనీలను కూడా ఇదే విధంగా గొప్ప ఐటీ సంస్థలుగా చిత్రీకరిస్తూ భూకేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం తెగబడింది. ఇరవై వేల రూపాయల అద్దె ప్లాట్‌లో నడిచే ఉర్సా సంస్థ ఏకంగా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెడుతుందంటే, ప్రభుత్వం ఎలా నమ్మింది? పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ, ఆమోదం తెలిపిన బోర్డ్‌లు ఏ అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశాయి? ఈ కంపెనీ ప్రమోటర్లు ఎవరు, వారి ఆర్థిక సామర్థ్యం ఎంత, గత అనుభవం ఏమిటీ, ఎంత మంది ఉద్యోగులు దీనిలో పనిచేస్తున్నారనే కనీస వివరాలను కూడా పరిశీలించకుండానే ప్రభుత్వం ఈ సంస్థకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది?ఎందుకంటే ఇది నారా లోకేష్‌కు చెందిన బినామీలకు చెందిన సంస్థ. ఉర్సా ప్రతినిధిలు పెందుర్తి విజయ్‌కుమార్, ఆయన కుమారుడు పెందుర్తి కౌశిక్, మరో వ్యక్తి అబ్బూరి సతీష్. వీరు అమెరికాలోని తన సొంత ఇంట్లో ఒక కంపెనీని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ కంపెనీని చూపించి ఇటీవల దావోస్‌లో తెలంగాణలో అయిదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామంటూ ఎంఓయు చేసుకున్నారు. తరువాత ఎపీలో కూడా ఇదే తరహాలో మరో అయిదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటూ స్కామ్‌ను నడిపించారు. గతంలో ఐఎంజీ భారత్ పేరుతో వేల కోట్ల రూపాయల విలువైన భూములను బిల్లీరావుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ఏరకంగా ప్రయత్నించాడో అందరికీ తెలుసు. ఇప్పుడు లోకేష్ తండ్రిని మించిన తనయుడిగా ఉర్సా సంస్థను తెరమీదికి తీసుకువచ్చారు. ఉర్సాకు చేసిన భూకేటాయింపులకు సంబంధించిన జీఓను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. టీసీఎస్‌కు జీఓ ఇచ్చారు, ఉర్సాకు మాత్రం జీఓను జారీ చేయలేదు. అంటే ఉర్సాకు సంబంధించిన జీఓను రహస్యంగా ఉంచుతున్నారా?ఉర్సా సంస్థ ఫైలు ఉరుకులు పెట్టించారుఉర్సా సంస్థ ప్రతినిధులు పెందుర్తి విజయ్‌కుమార్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక ఉద్యోగి. మరో డైరెక్టర్ అబ్బూరి సతీష్ అమెరికాలో ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీరిద్దరూ కలిసి ఏపీలో రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని చెబుతున్నారు. దీనిని స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఆమోదించడం, వెంటనే కేబినెట్‌కు వెళ్ళడం, కేబినెట్ కూడా కాపులుప్పాడులో 56 ఎకరాలను 99 పైసలకే అమ్మేయాలని నిర్ణయించడం. ఇదంతా ఎంత ప్రణాళికాబద్దంగా స్కామ్‌ను నడిపించారో అర్థం అవుతోంది. గత వారం రోజులుగా దీనిపై వైఎస్సార్సీపీ మాట్లాడుతూ ఉంటే ఎల్లోమీడియాలో పెట్టుబడులను అడ్డుకుంటే రాష్ట్రానికే నష్టం అంటూ సిగ్గులేకుండా తప్పుడు రాతలు రాశాయి.డొల్ల కంపెనీలకు విలువైన భూములను దోచిపెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? వైఎస్సార్సీపీ హయాంలో అనేక కంపెనీలను ప్రోత్సహించాం, మీలా ఉచితంగా భూములను దారాదత్తం చేయలేదు. పలు ఐటీ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి విశాఖలో 161 స్టార్ట్ అప్ ఐటీ కంపెనీలు ఉంటే, వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కొత్తగా 425 కంపెనీలు ఏర్పాటయ్యాయి. తెలుగుదేశం దిగిపోయే నాటికి ఐటీ ఉద్యోగులు ఏపీలో 27643 మంది ఉంటే వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో 75,551 మందికి పెరిగారు. మేం అడ్డుకునే వారిమే అయితే వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కంపెనీలు ఎలా పెరిగాయి, ఉద్యోగులు ఎలా పెరిగారు? ఉర్సా, లులూ వంటి సంస్థలకు కారుచౌకగా భూములను కట్టబెట్టడం ద్వారా, పెద్ద ఎత్తున లబ్ధి పొందాలని చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి విధానాలను ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాం. -
పహల్గాం ఉగ్రదాడి.. శాంతి ర్యాలీకి వైఎస్ జగన్ పిలుపు
తాడేపల్లి,సాక్షి: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శాంతిర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ మేరకు, పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ బుధవారం సాయంత్రం అన్నీ జిల్లా కేంద్రాల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు క్యాండీల్ ర్యాలీ నిర్వహించాలని ఆదేశించారు. వైఎస్ జగన్ పిలుపుతో ఈ రోజు సాయంత్రం పార్టీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీలు నిర్వహించనున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో తెలుగు ప్రజల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగన్.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిఅనంత్నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయ మైదానాల్లో మంగళవారం మధ్యాహ్నాం సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 28 మంది మరణించారు. ఈ ఉగ్రదాడిని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ఖండించారు. Shocked to hear about the terror attack in Pahalgam, condemn this cowardly act of violence. My thoughts are with the victims and their families. Praying for the speedy recovery of those injured.#Pahalgam— YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2025పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి విని షాకయ్యా. ఈ పిరికిపందల హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్లో పేర్కొన్నారు. -
పహల్గాం ఉగ్రదాడి.. ఏపీవాసుల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గుంటూరు, సాక్షి: పహల్గాం ఉగ్రదాడిలో తెలుగు ప్రజల మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగన్.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయ మైదానాల్లో మంగళవారం మధ్యాహ్నాం సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 28 మంది మరణించారు. ఇందులో విశాఖ వాసి చంద్రమౌళి, కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు ఉన్నారు. చంద్రమౌళి ఎస్బీఐ రిటైర్డ్ ఎంప్లాయి కాగా, మధుసూదన్ ఓ సాఫ్ట్వేర్ కంపెఈలో సీనియర్ ఆర్కిటెక్ట్‌గా పని చేస్తున్నారు. ఈ ఇద్దరి మృతిని ధృవీకరించిన కేంద్ర హోం శాఖ.. ప్రత్యేక విమానంలో మృతదేహాలను స్వస్థలాలకు పంపించింది.ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్.. పర్యాటకులను దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలను కేంద్రం ప్రభుత్వం ఆదుకుని ఆండగా నిలవాలని వైఎస్ జగన్ కోరుతున్నారు. -
4న శ్రీవాసవీ దేవస్థానం కమిటీ సర్వసభ్య సమావేశం
తెనాలి: శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం మే నెల 4వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు పాలకవర్గ బాధ్యులు మంగళవారం దేవస్థానం ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. కమిటీ ఉపాధ్యక్షుడు ఆకి అచ్యుతరావు, వుప్పల వరదరాజులు, దేసు శ్రీనివాసరావులు మాట్లాడారు. ముందుగా ఏప్రిల్ 13వ తేదీన సర్వసభ్య సమావేశం జరిపేందుకు నిర్ణయించి, ఆ ప్రకారం వెయ్యిమంది సభ్యులకు నోటీసులు పంపినట్టు గుర్తుచేశారు. దేవస్థానం కమిటీ జనరల్ బాడీలో సభ్యులు కానివారు, అన్య కులస్తులు వచ్చి గందరగోళ పరిస్థితులు సృష్టించిన కారణంగా సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలిపారు. మళ్లీ సర్వసభ్య సమావేశం జరపాలంటే కార్యవర్గం సమావేశమై, తేదీని నిర్ణయించి వెయ్యిమంది సభ్యులకు నోటీసుల ద్వారా తెలియపరచాల్సి ఉందన్నారు. నిర్ణయించిన తేదీన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి, అక్కడ తీసుకునే నిర్ణయం అమలవుతుందని చెప్పారు. ఎవరుపడితే వాళ్లొచ్చి, ఏవేవో పుస్తకాలు పెట్టుకుని సభ్యులు కానివారితో సహా సంతకాలు పెట్టించుకుని తామే కమిటీగా ఎన్నికయ్యాం అంటే చెల్లుబాటు కాదన్నారు. ఈ నెల 13న రసాభాసతో సమావేశం వాయిదా పడిన తర్వాత ట్రైనీ అడిషనల్ ఎస్పీ సుప్రజ వచ్చి బైలా తీసుకెళ్లినట్టు గుర్తుచేశారు. 15 రోజుల సమయం తీసుకుని సమావేశం జరుపుదామని చెప్పినట్టే, వైశ్య కులదేవత శ్రీవాసవీ అమ్మవారి సాక్షిగా మే నెల 4వ తేదీన సర్వసభ్య సమావేశం జరుగుతుందని తెలిపారు. సభ్యులంతా హాజరై తగిన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని చెప్పారు. అంతా ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండాలన్నారు. సభ్యులకు నోటీసులు పంపుతున్నామని, ఆధార్ కార్డు, సమావేశం నోటీసు, ఐడీ కార్డు సహా సభ్యులు సమావేశానికి హాజరుకావాలని సూచించారు. పోలీసు బందోబస్తుతో సభ్యులనే లోనికి అనుమతిస్తారని తెలిపారు. వక్కలగడ్డ గంగాధర్, అన్నవరపు నరసింహారావు, గ్రంధి విశ్వేశ్వరరావు, మాలేపాటి హరిప్రసాద్, మద్దాళి శేషాచలం, గొడవర్తి సాయి హరేరామ్, సుగ్గుల మల్లికార్జునరావు, నూకల భాస్కరరావు, కొల్లా గురునాథగుప్తా తదితరులు పాల్గొన్నారు. -
స్టైల్‌గా వచ్చాడు... చక్కగా కాజేశాడు!
మంగళగిరి టౌన్: ఓ వివాహానికి స్టైల్‌గా హాజరై... బంధువుగా మమేకమయ్యాడు. అందరితో చనువుగా ఉంటూ, భోజనం చేసి సుమారు 4 గంటలకు పైగా వారితో తిరిగాడు. చక్కగా చదివింపులు దోచుకుపోయాడు ఓ దొంగ. ఈ ఘటన మంగళగిరి పట్టణంలో ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి పట్టణం శివాలయం రోడ్డులో నివాసముంటున్న జి. చిన్ని తన కుమారుడు జి. సాంబశివరావు వివాహ వేడుకను ఆదివారం పట్టణ పరిధిలోని మార్కండేయ కల్యాణ మండపంలో నిర్వహించారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి స్టైల్‌గా హాజరై అందరితోపాటు కూర్చున్నాడు. కొంతసేపు అక్కడివారితో మాట్లాడి చదివింపులు దగ్గరకు వెళ్లాడు. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు నటిస్తూ అటూ ఇటు తిరుగతూ హడావిడి చేశాడు. పెళ్లి వారితో కలిసి విందు భోజనం కూడా ఆరగించాడు. చదివింపుల దగ్గర ఓ పాప ఉండడం గమనించి ఈ డబ్బులు లోపల పెట్టు అంటూ గదమాయించాడు. దీంతో ఆ పాప పక్కన ఉన్న రూమ్‌లోకి వెళ్లి అక్కడ పెట్టి వచ్చేసింది. వెంటనే ఆ వ్యక్తి ఆ రూమ్‌లోకి వెళ్లి తలుపు దగ్గరకు వేసి ఆ డబ్బు తీసుకుని బయటకు వచ్చాడు. పాపను చదివింపుల డబ్బు ఎక్కడ అని అడగ్గా, ఓ అంకుల్ లోపల పెట్టమన్నాడని చెప్పడంతో లోపలికి వెళ్లి చూశారు. అక్కడ డబ్బు లేకపోవడంతో కంగుతిన్నారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చదివింపుల నగదుతోపాటు బంధువులు, మిత్రులు కొంతమంది బంగారపు చైన్లు, ఉంగరాలు బహుమతులుగా ఇచ్చారని ఆ ఫిర్యా దులో పేర్కొన్నారు. నగదు సుమారు రూ.3 లక్షలకుపైగా ఉంటుందని కుటుంబ సభ్యులు అంటున్నారు. మంగళగిరి పట్టణ పోలీసులు కల్యాణ మండపంలో సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించి ఆ వ్యక్తి కదలికలకు గుర్తించారు. వినూత్నంగా దొంగతనం పెళ్లిలో చదివింపులు మాయం నిందితుడు -
అనాథలా వదిలేస్తే అక్కున చేర్చుకున్న ఆశ్రమం
తెనాలి: అందరూ ఉండీ అనాథలా ఆసుపత్రికి చేరిన అభాగ్యుడి దయనీయ స్థితిపై ‘మానవత్వమా...నీ జాడెక్కడా’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. తన పేరు, ఊరు చెబుతున్న రాధాకృష్ణమూర్తి అనే అరవై ఏళ్ల వృద్ధుడిని ఎవరో తీసుకొచ్చి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలేసి వెళుతున్నారు. ఒంటిపై దుస్తులు కూడా లేకుండా గొడవ చేస్తున్న అతడిని ఆసుపత్రి సిబ్బంది ఐసోలేషన్ రూములో పడేశారు. ‘హెల్పింగ్ సోల్జర్స్’ సంస్థ బాధ్యులు అతడి పరిస్థితిని చూసి వస్త్రం కప్పి, ఆహారం ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సూచనతో మున్సిపల్ ఆరోగ్య అధికారిణి డాక్టర్ హెలెన్ నిర్మల, మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణితో చర్చించారు. అనంతరం గుంటూరు రూరల్ మండలం గోరంట్లలోని కారుణ్య ఆశ్రమాన్ని సంప్రదించారు. రాధాకృష్ణమూర్తితోపాటు ఆసుపత్రిలోని మరో గుర్తుతెలియని వ్యక్తిని కూడా ఆశ్రమానికి తరలించామన్నారు. -
ఉపాధ్యాయుల కేటాయింపుల్లో అసమానతలు సరిదిద్దాలి
గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపుల్లో నెలకొన్న అసమానతలను సరిదిద్దాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధ్యాయ బదిలీల చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చట్టంలో పొందుపర్చిన అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలను నాలుగు రకాలుగా విభజించిన ప్రభుత్వం, విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తిని వేర్వేరుగా నిర్ణయించడం తగదన్నారు. ఫౌండేషన్ స్కూల్లో 30 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు, మోడల్ ప్రైమరీ స్కూల్లో 20 మంది పిల్లలకు ఒకరు, హై స్కూల్ ప్రైమరీలో 10 మంది పిల్లలకు ఒక్కరు చొప్పున కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. అన్ని పాఠశాలల్లో కేటాయింపులు ఒకే విధంగా ఉండాలని అందరికీ ఒకే రకమైన నాణ్యమైన విద్య అందాలని డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమకుమారి మాట్లాడుతూ యూపీ పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను కేటాయించాలని అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి మోడల్ ప్రాథమిక పాఠశాలకు ఐదుగురు ఉపాధ్యాయులను తప్పనిసరిగా కేటాయించాలని అన్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల లభ్యతను బట్టి విద్యా విధానాన్ని మార్పులు చేయటం తగదన్నారు. దీనికి బుదులుగా ఒక ఉన్నతమైన విద్యా విధానాన్ని రూపొందించి, దానికి తగ్గట్టు ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. అవగాహన సదస్సులో జిల్లా గౌరవ అధ్యక్షుడు పీవీ శ్రీనివాసరావు, జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, వై.నాగమణి, జిల్లా కోశాధికారి ఎండీ దౌలా, జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, కె.సాంబశివరావు, ఎం. గోవిందు, ఎండీ షకీలా వేగం, కె.రంగారావు, బి.ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచండి
గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక అన్నారు. మంగళవారం చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను సందర్శించిన డీఈవో .. 35 మంది విద్యార్థినులకు 6వ తరగతిలో ప్రవేశాలు కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 5వ తరగతి పూర్తి చేసుకున్న వారిని 6వ తరగతిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చేర్పించడంలో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలతోపాటు ఉపాధ్యాయులు, సీఆర్పీలు, విద్యాశాఖాధికారులు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులను తిరిగి చేర్పించే విధంగా తల్లిదండ్రులను నచ్చచెప్పాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వాటిపై అవగాహన పెంచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లో భాగంగా బడి ఈడు పిల్లలను ఆయా గ్రామాల్లోని ఫౌండేషన్, బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచి, ప్రతి పాఠశాలలో పూర్తిస్థాయిలో విద్యార్థుల సంఖ్య చేరేలా ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాఠ శాల ప్రధానోపాధ్యాయుడు షేక్ ఎండీ ఖాసిం మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థినులను ఇతర పాఠశాలలకు వెళ్లే అవసరం లేకుండా తమ పాఠశాలలోనే 6వ తరగతిలో చేరే విధంగా తల్లిదండ్రులకు ప్రేరణ కల్పించినట్లు చెప్పారు. పాఠశాలలో చేరిన విద్యార్థినులు ఆధునిక బోధన, మౌలిక వసతులతో విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. గుంటూరు డీవైఈవో ఏసురత్నం, డీసీఈబీ కార్యదర్శి ఎ. తిరుమలేష్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాబియా బస్రీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లో సమష్టిగా కృషి చేయాలి జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక -
రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన గుంటూరు వైద్యుడు
హెల్త్ యూనివర్సిటీ టాపర్‌గా డాక్టర్ పవన్‌కుమార్ గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల న్యూరో సర్జరీ వైద్య విభాగం పీజీ తృతీయ సంవత్సరం చదువుతున్న డాక్టర్ పోలిశెట్టి జానకీ రామ పవన్‌కుమార్ రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సోమవారం విడుదల చేసిన పీజీ పరీక్షా ఫలితాల్లో న్యూరో సర్జరీ వైద్య విభాగంలో 800 మార్కులకు 511 సాధించి డాక్టర్ పవన్‌కుమార్ వర్సిటీ టాపర్‌గా నిలిచాడు. కాకినాడకు చెందిన డాక్టర్ పవన్‌కుమార్ విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో జనరల్ సర్జరీ పీజీ అభ్యసించారు. గుంటూరు జీజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ పీజీ ఎంసీహెచ్ న్యూరాలజీలో చేరారు. న్యూరో సర్జరీ విభాగంలో రెండు పీజీ సీట్లు ఉండగా, ఒకరు యూనివర్సిటీ టాపర్‌గా నిలవగా, మరొకరు డాక్టర్ యాదరాల కృష్ణుడు యూనివర్సిటీ సెకండ్ ప్లేస్ సాధించారు. 800 మార్కులకు గాను 508 మార్కులు సాధించారు. పరీక్షా ఫలితాల్లో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన డాక్టర్ జానకీ రామ పవన్‌కుమార్, డాక్టర్ యాదరాల కృష్ణుడులను గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ కె.వి.సత్యనారాయణమూర్తి, ప్రొఫెసర్ డాక్టర్ గొల్లా రామకృష్ణ, తదితరులు అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
చేబ్రోలు: ప్రమాదవశాత్తూ రెండు వాహనాలు ఢీ కొన్న సంఘటనలో ఆటో డ్రైవర్ అక్కడక్కడే మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాపట్లకు చెందిన గోదాటి కిరణ్ (35) ఆటోలో గుంటూరులో ముగ్గురు ప్రయాణికులను ఎక్కించుకొని బాపట్లకు బయలు దేరాడు. మార్గ మధ్యలో చేబ్రోలు సినిమా హాలు దాటిన తరువాత వంతెన సమీపంలో ఎదురుగా వస్తున్న టాటా ఇంద్ర వాహనం ఢీ కొట్టింది. ఆటో నడుపుతున్న కిరణ్ తలకు బలమైన గాయవటంతో ఆటోలోనే అక్కడక్కడే మరణించాడు. ఆటోలో ఉన్న మిగిలిన ముగ్గురికి ఎటువంటి గాయాలు కాలేదు. చేబ్రోలు పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కిరణ్ బాపట్ల పట్టణంలోని బేతానీ కాలనీ వాసిగా గుర్తించారు. 26 నుంచి ఏఐఎస్ఎఫ్ శిక్షణ తరగతులు లక్ష్మీపురం: ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఏప్రిల్ 26, 27, 28వ తేదీలలో కడప నగరంలో నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కొత్తపేట మల్లయ్య లింగం భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించి కరపత్రాలు విడుదల చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా బందెల నాసర్‌జీ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలపై తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్థికి రూ. 15వేలు ఇస్తామని హామీ ఇచ్చినా ఈ సంవత్సరం అమలు చేయలేమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రణీత్, వెంకట్, అజయ్, అమీర్, సాయి గణేష్, చందు, కిషోర్, ఏలియా, అశోక్ లైంగిక వేధింపుల కేసులో నిందితుడి అరెస్ట్ తెనాలి రూరల్: వివాహితను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితను అదే గ్రామానికి చెందిన పాలపర్తి మహేష్‌బాబు లైంగికంగా వేధిస్తున్నాడని ఈ నెల 4వ తేదీన పోలీసులకు ఫిర్యాదు అందింది. పరారీలో ఉన్న నిందితుడిని రూరల్ ఎస్సై కె. ఆనంద్ మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిపై గతంలో ఆరు కేసులు ఉన్నాయి. రౌడీ షీట్ తెరుస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ప్రాథమిక విద్య గ్రామంలోనే కొనసాగించాలి అచ్చంపేట: ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తమ గ్రామంలోనే నిర్వహించాలని, పాఠశాలను పక్కగ్రామాలకు తరలిస్తే తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని మండలంలోని ఓర్వకల్లు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. తమ పిల్లలతో కలిసి రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. తమ గ్రామానికి చెందిన పిల్లలు తమ గ్రామంలోనే చదువుకోవాలంటూ నినాదాలు చేశారు. ఓర్వకల్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు వరకు ఉండేవి. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి 1,2 తరగతులను మాత్రమే ఇక్కడ ఉంచి 3,4,5 తరగతుల వారిని పక్క గ్రామమైన రుద్రవరానికి మార్చారు. దీంతో ప్రాథమిక విద్య మొత్తం తమ గ్రామంలోనే నిర్వహించాలంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ధర్నా చేపట్టారు. వెంటనే జిల్లా కలెక్టర్, డీఈఓ, ప్రజాప్రతినిధులు జోక్యంచేసుకుని తమకు న్యాయం చేయాలంటూ మొర పెట్టుకున్నారు. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి రోడ్డుపై బైఠాయించిన వారికి నచ్చచెప్పి ధర్నాను విరమింపచేశారు. -
అందరి కృషితోనే భూ పరిరక్షణ సాధ్యం
గుంటూరు ఎడ్యుకేషన్: భూమితోపాటు భూమిపై పచ్చదనాన్ని కూడా పరిరక్షించడం అందరి బాధ్యతగా గుర్తించాలని ఏపీ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ వైడీ రామారావు అన్నారు. కలెక్టర్ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో మంగళవారం ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా రామారావు మాట్లాడుతూ భూమి పరిరక్షణకు అందరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. జిల్లా అటవీశాఖాధికారి హిమ శైలజ మాట్లాడుతూ విరివిగా మొక్కల పెంపకాన్ని చేపడుతున్నామని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కోశాధికారి పి.రామచంద్రరాజు, కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నజీనా బేగం , ఇంటాక్ గుంటూరు జిల్లా కన్వీనర్ ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రవి వడ్లమాని, పాఠశాల ప్రిన్సిపల్ హేమాంబ, వివిధ పరిశ్రమల ప్రతినిధులు, రెడ్ క్రాస్ వలంటీర్లు పాల్గొన్నారు. -
పత్తి రైతుపై విత్తన భారం
ధరలు పెంచడం బాధాకరం అసలే వ్యవసాయం గిట్టుబాటు కాక నానా ఇబ్బందులు పడుతున్న రైతులపై పత్తి విత్తన ప్యాకెట్ల ధర పెంచడం పుండు మీద కారం చల్లినట్లే. నేను ప్రతి సంవత్సరం 10 ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తుంటాను. సుమారు 30 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరం. అంటే విత్తనాల కోసం అదనంగా రూ.వెయ్యికిపైగానే వెచ్చించాల్సి వస్తోంది. విధిలేని పరిస్థితుల్లో పత్తి పంట సాగు చేస్తున్నాం. ఏటా నష్టాలు చవిచూస్తున్నాం. ఇప్పటికై నా పత్తి విత్తన ధరలను తగ్గించాలి. –వంగా నవీన్‌రెడ్డి, జొన్నలగడ్డ, గుంటూరు రూరల్ మండలం ●కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు, పల్నాడు జిల్లాల్లో రైతులు ఖరీఫ్ సీజన్లో సుమారు 1.22 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేస్తారు. ఇందులో గుంటూరు జిల్లాలో 25 వేల హెక్టార్లు, పల్నాడు జిల్లాలో 97 వేల హెక్టార్లు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో ఇది ప్రధాన పంటల్లో ఒకటి. గుంటూరు, పల్నాడు జిల్లాలకు సుమారు 11 లక్షల విత్తన ప్యాకెట్లు డిమాండ్ ఉంటుందని వ్యవసాయశాఖ అధికారుల అంచనా. 475 గ్రాముల విత్తన ప్యాకెట్ ధర గతంలో రూ.864 ఉండగా, ప్రస్తుతం రూ.901లకు చేరింది. అంటే ప్యాకెట్‌కు రూ.37 పెరిగింది. దీంతో గుంటూరు, పల్నాడు జిల్లాల రైతులపై అదనంగా రూ.4.07 కోట్ల భారం పడనుంది. గత ఏడాది సాగు సమయంలో సరిగా వర్షాలు లేక, తర్వాత అధిక వర్షాలతో దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. ఆ బాధ నుంచి కోలుకోకుండానే ఈ ఏడాది పెట్టుబడి ఖర్చులు పెరగడం ఇబ్బంది కలిగిస్తోంది. -
సివిల్స్‌లో 146వ ర్యాంకు సాధించిన రుద్రవరానికి చెందిన పవన్ కల్యాణ్
అచ్చంపేట: పల్నాడు జిల్లా, అచ్చంపేట మండలం, రుద్రవరం గ్రామానికి చెందిన చల్లా పవన్ కల్యాణ్ ఆల్ ఇండియా స్థాయిలో 146వ ర్యాంకు సాధించాడు. ఈ ఘనతను సాధించిన పవన్ కల్యాణ్‌ను మండల ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు. ప్రాథమిక సహకార సంఘ మాజీ అధ్యక్షుడు చల్లా రమేష్, భువనేశ్వరిల కుమాడుడైన పవన్ కల్యాణ్ ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంచలంచెలుగా తన చదువుకు పదునుపెట్టాడు. చిన్నపటి నుంచి సివిల్స్ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కల్యాణ్ ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుంటూరులోని వెంకటేశ్వర బాలకుటీర్‌లో పూర్తిచేశాడు. పదిలో 10 జీపీఏతో ఉత్తీర్ణత సాధించాడు. గుంటూరు శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివిన పవన్ 987 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. జేఈఈలో మంచి ర్యాంకు సాధించి ఎన్ఐఐటీ, తిరుచురాపల్లిలో సీటు సాధించాడు. బీటెక్ అయిపోగానే కొలిన్స్ ఎయిరో స్పేస్‌లో కాలేజ్ కాంపస్ ప్లేస్మెంట్ సాధించాడు. అయితే సివిల్స్ మీద ఉన్న మక్కువతో వచ్చిన అవకాశాన్ని వదులుకుని, ఢిల్లీ వెళ్లి స్వయం కృషితో పాతకాలం నాటి మెటీరియల్స్ మొత్తం సేకరించి తన మేథస్సుకు పదునుపెట్టి సివిల్స్‌లో ఆల్ ఇండియా 146వ ర్యాంక్ సాధించాడు. -
కష్టపడ్డాడు.. కలలు నెరవేర్చుకున్నాడు
సివిల్స్‌లో 797వ ర్యాంకు సాధించిన సత్తెనపల్లికి చెందిన పెండెం ప్రత్యూష్సత్తెనపల్లి: లక్ష్యం, కృషి, పట్టుదల, ప్రణాళిక ఉంటే అపురూప విజయం సాధ్యమవుతుందని పేద కుటుంబానికి చెందిన విద్యార్థి నిరూపించారు. అందుబాటులోని వనరులను వినియోగించుకొని సివిల్స్ విజేతగా నిలిచారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన పెండెం ప్రత్యూష్. సివిల్స్‌లో జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరిలో ప్రత్యూష్ 797వ ర్యాంకు సాధించారు. సాధారణ దళిత కుటుంబంలో జన్మించిన ప్రత్యూష్ బాల్యం నుంచి ఎంతో ఇష్టంతో చదివారు. ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ విజేతగా నిలిచి ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సత్తెనపల్లి పట్టణంలోని 31వ వార్డు అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పెండెం బాబురావు, యనమాల పద్మ దంపతుల కుమారుడు ప్రత్యూష్. తండ్రి పెండెం బాబురావు న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. తల్లి యనమాల పద్మ గృహిణి. ప్రత్యూష్ రెండు పర్యాయాలు ప్రయత్నించి, మూడవసారి కసితో రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా ఓపెన్ కేటగిరిలో జాతీయస్థాయిలో 797వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రత్యూష్ సత్తెనపల్లిలోని హోలీ ఫ్యామిలీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివి, టెన్త్‌లో 9.7 గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించాడు. ఇంటర్లో 970 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ విద్యనభ్యశించాడు. 2023–24 ఆంత్రోపాలజీ ఆప్షన్‌గా తీసుకొని ఓ పక్క వైద్యుడిగా వైద్య సేవలు అందిస్తూనే మరో పక్క సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూ జాతీయస్థాయిలో ర్యాంక్ సాధించాడు. చదువుకు పేదరికం అడ్డం కాదు చదువుకు పేదరికం అడ్డం కాదు. పేదరికం వేధిస్తున్నా అందుబాటులో ఉన్న పుస్తకాలు, వనరులను వినియోగించుకొని చదువుకోవచ్చు. విద్యార్థి దశ నుంచి ఉన్నతాధికారి కావాలనే లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్య సాధనకు ఎన్ని అవాంతరాలు వచ్చినా తట్టుకోవాలి. ఇంటర్నెట్, గ్రంథాలయాలు, మ్యాగజైన్లు వంటివి చదవాలి. నిత్యం 6–8 గంటల పాటు చదవడం, చదివిన దానిని ఆకలింపు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎటువంటి శిక్షణ తీసుకోకపోయినా పట్టుదలతో చదివితే ఖచ్చితంగా విజయం అందుకోవచ్చు. – పెండెం ప్రత్యూష్ -
గుంటూరు
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025పోలేరమ్మ తిరునాళ్లకు పోటెత్తిన భక్తులు కొండపాటూరు (ప్రత్తిపాడు): భక్తుల కొంగు బంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే జగజ్జననిగా విరాజిల్లుతున్న శ్రీ కొండపాటూరు పోలేరమ్మ తిరునాళ్ల మహోత్సవం మంగళవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. తిరునాళ్లను పురస్కరించుకుని అమ్మ వారిని పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వేకువజాము నుంచే విశేష పూజలు నిర్వహించారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం దేవాలయం సమీపంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అమ్మ వారిని దర్శించుకునేందుకు వీలుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా సిడిమాను.. అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో ప్రధాన ఘట్టం సిడిమాను ఊరేగింపు. ఒక పెద్ద దూలానికి చివరి భాగాన ఒక ఇనుప బోను ఏర్పాటు చేసి అందులో ఒక సిడిపోతును ఏర్పాటు చేశారు. సిడిమానుకు రైతులు పండించిన వివిధ రకాల పంటల దిగుబడులు, ధాన్యాలు కట్టి తమను చల్లగా చూడాలని ప్రత్యేక పూజలు చేశారు. సిడిమానును అమ్మ వారి స్వరూపంగా భావించి శిడిమాను బయలుదేరే సమయంలో సిడిపోతుపైకి భక్తులు జీడికాయలు విసురుతారు. ఆ కాయలు బోనులో ఉన్న మేకపోతుకు తాకితే తమ కోర్కెలు నెరవేరుతాయని అనాదిగా భక్తుల నమ్మకం. అనంతరం సిడిమానుకు గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం గుంటూరు, బాపట్ల, పొన్నూరు, చిలకలూరిపేట డిపోల నుండి ప్రత్యేక బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రంగుల విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.7న్యూస్‌రీల్ వైభవోపేతంగా అమ్మవారి తిరునాళ్ల దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తజనం కనుల పండువగా సిడిమాను ఉత్సవం -
లా అండ్ ఆర్డర్ ఉందా?
అద్దంకి రూరల్: ‘‘అధికారం వచ్చిందని ఏదైనా చేస్తారా.. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి జరిగితే లా అండ్ ఆర్డర్ ఏమైంది. దాడి జరిగిన విషయం అక్కడి ఎస్సైకి తెలియదా... ఎందుకు ఇంతవరకు కేసు కట్టలేదు’’ అంటూ వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ బల్లికురవ మండల కన్వీనర్‌ను స్టేషన్‌కు పిలిపించి బెదిరించటం, వైఎస్సార్ సీపీకి చెందిన వారిపై దాడి జరిగితే ఎస్సై స్పందించడా అని ప్రశ్నించారు. బల్లికురవ మండలం సోమవరప్పాడు గ్రామంలో టీడీపీ సానుభూతిపరుల దాడిలో తీవ్రంగా గాయపడి అద్దంకి వైద్యశాలలో చికిత్స పొందుతున్న గోపిరాజుయాదవ్ను నాగార్జున మంగళవారం పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గోపిరాజు యాదవ్‌పై ఇప్పటికి మూడుసార్లు దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి కొట్టటం, మరోసారి కత్తితో నరకటం, ఇప్పుడు కర్రలతో దాడి చేయడమేమిటని ప్రశ్నించాడు. అతను సోషల్ మీడియాలో పనిచేస్తున్నాడనా, బీసీ కులస్తుడు పేదవాడు ఏమీ చేయలేడనా, దాడి చేశారని ప్రశ్నించారు. అధికారం వచ్చిందని ఏమైనా చేస్తామంటే సరిపోదన్నారు. సోమవారం దాడి జరిగితే ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయకపోవటం ఏమిటని ప్రశ్నించారు. అక్కడ ఎస్సైకి దాడి చేసిన విషయం తెలియదా అన్నారు. దాడి విషయమై తాను ఎస్పీతో మాట్లాడానని, ఆయన వెంటనే స్పందించి కేసు రిజిస్టర్ చేయిస్తామని చెప్పామన్నారు. ఉన్నతాధికారి స్పందించిన విధంగా స్థానిక ఎస్సై, సీఐ ఎందుకు స్పందించలేదని అన్నారు. అక్కడ ఎస్సై ఏమి చేస్తున్నాడన్నారు. వైఎస్సార్ సీపీ పార్టీతోపాటు తామంతా అండగా ఉంటామని ఈ విషయాన్ని మా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కేసు రిజిస్టర్ చేసి సునిశితమైన విచారణతో దాడికి పాల్పడ్డవారిని శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. నాగార్జున వెంట బాపట్ల జిల్లా వైఎస్సార్ సీపీ ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, పానెం హనిమిరెడ్డి సోదరులు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, అద్దంకి పట్టణ వైఎస్సార్ అధ్యక్షడు కాకాని రాధాకృష్ణమూర్తి, బల్లికురవ మండల కన్వీనర్ దేవినేని కృష్ణబాబు, వైఎస్సార్ సీపీ అద్దంకి మండల కన్వీనర్ జగన్మోహన్రెడ్డి, సంతమాగులూరు మండల కన్వీనర్ వుట్ల నాగేశ్వరరావు సర్పంచ్ నగేష్, కోల్లా భువనేశ్వరి, షేక్ అబిదా, వార్డు కౌన్సిలర్లు, ఇన్చార్జిలు, స్థానిక నాయకులు ఉన్నారు. బీసీ సామాజికవర్గీయుడిపై దాడి జరిగితే కనిపించలేదా? వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున -
సివిల్స్‌లో విజయ్‌బాబుకు 681వ ర్యాంక్
ప్రస్తుతం ఐఆర్ఎస్ అధికారిగా చేస్తున్న విజయ్‌బాబు తెనాలి: సివిల్స్‌లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దోనేపూడి విజయ్‌బాబు మరోసారి విజయం సాధించారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఆయనకు 681వ ర్యాంకు లభించింది. ఐఆర్ఎస్ అధికారి దోనేపూడి మధుబాబు, రాజ్యలక్ష్మిల కుమారుడు విజయ్‌బాబు. 2021లోనే సివిల్స్ రాసి అప్పట్లో 682 ర్యాంకు సాధించారు. 22 ఏళ్ల వయసులోనే ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం విజయవాడలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏ కోచింగ్ సెంటరులోనూ శిక్షణ లేకుండా, కేవలం ఇంట్లోనే గడుపుతూ ఆయన తొలి ప్రయత్నంలోనే ఐఆర్ఎస్ సాధించారు. ఐఏఎస్/ఐపీఎస్ సాధించాలన్న పట్టుదలతో ఉద్యోగ బాధ్యతల్లో కొనసాగుతూ సివిల్స్ రాశారు. ప్రస్తుతం 681 ర్యాంకుతో మళ్లీ మెరిశారు. ఈ పర్యాయం ఐపీఎస్ వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. -
సెంట్రల్ జీఎస్టీ కమిషనర్‌గా సుజిత్ మల్లిక్
లక్ష్మీపురం: సెంట్రల్ జీఎస్టీ గుంటూరు కమిషనరేట్‌కు నూతన కమిషనర్‌గా సుజిత్ మల్లిక్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు కన్నవారితోటలోని సెంట్రల్ జీఎస్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయన భువనేశ్వర్ నుంచి గుంటూరుకు ప్రమోషన్‌పై వచ్చారు. రూర్కెలాలోని ఆర్ఈసీ నుంచి బీఈ (మెకానికల్ ఇంజినీరింగ్) పూర్తి చేశారు. ఒడిశాలోని ఆంగుల్లో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌లో పనిచేశారు. ఆయన 2007లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)లో చేరారు. వివిధ హోదాల్లో పనిచేసిన తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్‌కు (సీబీఐసీ) తిరిగి వచ్చారు. తర్వాత ఆయన భువనేశ్వర్ జోన్లో జీఎస్టీ కస్టమ్స్ విభాగాల్లో పనిచేశారు. వివిధ విభాగాలలో సేవలందిస్తూనే, ఆయన సైబర్ లా – సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా పొందారు. -
ప్రధాని పర్యటన ఏర్పాట్లు పరిశీలన
వెలగపూడి(తాడికొండ): తుళ్ళూరు మండలం వెలగపూడి గ్రామంలోని సచివాలయం సమీపంలో మే 2వ తేదీన జరగనున్న అమరావతి తదితర శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొననున్న నేపథ్యంలో ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజలతో కలిసి మంగళవారం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పరిశీలించారు. హెలీప్యాడ్ నిర్మాణం, ప్రధాని రోడ్ షో సాగే మార్గాలు, ప్రధాన వేదిక, పబ్లిక్, వీవీఐపీ, గ్యాలరీల వద్ద ఏర్పాట్లను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏర్పాట్లు నిర్దేశిత సమయం కంటే ముందే వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ ఎం.నవీన్ కుమార్, అడిషనల్ ఎస్పీ సుప్రజ, ఆర్డీవో కె. శ్రీనివాసరావు, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. మేయర్ ఎన్నికకు 28న ప్రత్యేక సమావేశం నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం నెహ్రూ నగర్: గుంటూరు నగర మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ఉత్తర్వులను అనుసరించి, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ ఈ నెల 28వ తేదీన ఉదయం 11 గంటలకు మేయర్ ఎన్నిక నిర్వహించాలని, ఈ ఎన్నికకు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. భార్గవ్ తేజను ఎన్నికల అధికారిగా నియమించారు. ఎన్నికల అధికారి ద్వారా ఈ నెల 24 లోపు గుంటూరు నగర పాలక సంస్థ కార్పొరేటర్లకు, ఎక్స్ అఫిషియో సభ్యులు 28న ప్రత్యేక సమావేశానికి హాజరు కావలసినదిగా నోటీసులు అందనున్నాయి. షెడ్యూలు ప్రకారం ఈ నెల 28న ఉదయం 11 గంటలకు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మేయర్ ఎన్నిక జరుగుతుందని ఎలక్షన్ అథారిటీ, సీడీఎంఏ డాక్టర్ పి. సంపత్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలేరమ్మ వారి వార్షికోత్సవాలు తెనాలి: స్థానిక వైకుంఠపురం దేవస్థానం సమీపంలోని శ్రీ పోలేరమ్మ వారి ఆలయం 27వ వార్షికోత్సవాలు మంగళవారం వైభవంగా జరిగాయి. ఉదయం విశేష పూజలు చేశారు. రాత్రి ఏడు గంటలకు అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. పసుపు, కుంకుమ, విశేష అలంకరణతో మేళతాళాలు, కాళికా వేషం, భాజా భజంత్రీలతో తెనాలి పురవీధుల్లో ఊరేగింపు జరిగింది. ఆలయ ధర్మకర్త వీరయ్య, గుంటి వెంకట్ ఆధ్వర్యంలో వేడుకలను జరిపారు. బుధవారం ఉదయం అన్నప్రసాద వితరణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై చర్చకు వినతి గుంటూరు వెస్ట్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్ బాషా మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మిని కోరారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్లో అసోసియేషన్ నాయకులతో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు పెన్షనర్ల సమస్యలు అనేకం ఉన్నాయన్నారు. జేఎస్సీ సమావేశం ఏర్పాటుతో అనేక అంశాలు చర్చించే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 514.60 అడుగుల వద్ద ఉంది. ఇది 139.6134 టీఎంసీలకు సమానం. -
UPSC CSE 2024:: తెలుగు అభ్యర్థులకు వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 పరీక్షా ఫలితాల్లో విజయం సాధించిన తెలుగు అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. వారు భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు వైఎస్ జగన్. మన రాష్ట్రానికి, దేశానికి గర్వంగా నిలవాలని ఆశిస్తున్నట్లు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Congratulations to all The Telugu Aspirants who have excelled in UPSC Civil Services 2024. Wishing you even greater success in the future and hoping you continue to bring pride to our state and nation.#UPSC— YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2025 -
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన వైఎస్ జగన్
తాడేపల్లి,సాక్షి: జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిని వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు.జమ్మూకశ్మీర్ దుర్ఘటనపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘పహెల్ గామ్‌లో జరిగిన ఉగ్రదాడి గురించి విని షాకయ్యా. ఈ పిరికిపందల హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్లో పేర్కొన్నారు. Shocked to hear about the terror attack in Pahalgam, condemn this cowardly act of violence. My thoughts are with the victims and their families. Praying for the speedy recovery of those injured.#Pahalgam— YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2025టూరిస్టులపై కాల్పులుమంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లా పహెల్ గామ్‌లో బైసరీన్ వ్యాలీని వీక్షించేందుకు వచ్చిన టూరిస్టులను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఇండియన్ ఆర్మీ దుస్తులు ధరించిన ఏడుగురు ఉగ్రవాదులు ఓపెన్ ఏరియాలో టూరిస్టులపై పాయింట్ బ్లాంక్‌లో గన్‌పెట్టి కాల్పులు జరిపారు. ఓపెన్ ఏరియా కావడంతో టూరిస్టులు ఎటూ పారిపోలేకపోయారు. ముష్కరుల తూటాలకు బలయ్యారు. ముష్కరుల జరిపిన కాల్పుల్లో 27మంది టూరిస్టులు మరణించారు. పలువురు టూరిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. -
‘ఆ విషయంపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?’
తాడేపల్లి : లిక్కర్ స్కామ్ ను వైఎస్సార్ సీపీ పై మీద వేసి తాము రాష్ట్రాన్ని దోచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎత్తుగడ వేశారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. అసలు లిక్కర్ స్కామ్ జరిగిందే చంద్రబాబు హయాంలోనని, 2014 19లో లిక్కర్ స్కామ్ జరిగిందని సీఐడీ చంద్రబాబు మీద కేసు పెట్టిన విషయాన్ని టీజేఆర్ ప్రస్తావించారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. ‘ ఆ లిక్కర్ స్కామ్ కేసులో చంద్రబాబు ఏ 3గా ఉన్నారు. దాని గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?, టీడీపీ నేతలకు చెందిన డిస్టిలరీలకు అడ్డదిడ్డంగా కాంట్రాక్టులు ఇచ్చారు. ఇందుకోసం ఎక్సైజ్ పాలసీనే చంద్రబాబు మార్చారు. ప్రభుత్వానికి రావాల్సిన రూ.2,984 కోట్లు తమవారి జేబుల్లోకి వేసుకున్నారు. ఈ పాలసీ ద్వారా ప్రభుత్వానికి నష్టం, టీటీడీ నేతలకు లాభం జరిగింది. ఆ స్కామ్ గురించి మాట్లాడటం లేదు. 2019లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పట్నుంచి పోలింగ్ మధ్యలో అనేక డిస్టలరీలకు ఎందుకు అనుమతులు ఇచ్చారు?, క్యాబినెట్ కు తెలియకుండానే నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారో చెప్పాలి. బార్లకు మేలు చేస్తూ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వెనుక కారణం ఏమిటి?, వీటిన్నంటిపై విచారణ చేస్తే అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నాడంటూ వాసుదేవరెడ్డి మీద నాలుగు కేసులు పెట్టారు. కాగితాలపై సంతకాలు పెట్టించుకుని రిలీవ్ చేయటం వెనుక కారణం ఏంటి?, ఈ అక్రమ కేసులు పెట్టడం ద్వారా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అధికారులు గుర్తుంచుకోవాలి. ఇష్టానుసారం చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి లిక్కర్ పాలసీతో ఏం సంబంధం ఉంది?, చిత్తూరులో చంద్రబాబుకు ప్రత్యర్థిగా ఉన్నందున అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా?, కసిరెడ్డి రాజశేఖరరెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిజంగా కేసిరెడ్డికి లిక్కర్ పాలసీ గురించి తెలిసి ఉంటే బేవరేజ్ కార్పోరేషన్ లో పదవి ఇచ్చేవాళ్లం కదా? , ఆయన ఐటీకి సంబంధించి సలహాదారుడు మాత్రమే. చంద్రబాబు, జగన్ హయాంలో లిక్కర్ పాలసీలపై చర్చకు మేము సిద్ధం. ప్రజలు పడుతున్న కష్టాలపై ఎల్లోమీడియా ఎందుకు చర్చలు పెట్టటం లేదు?పులివెందుల ఎమ్మెల్యే పదవిని రద్దు చేసి తిరిగి గెలిచే దమ్ముందా?, ఎన్నికలలో పోటీ చేసే సత్తా టీడీపీ కి ఉందా?, చంద్రబాబు సాధించిన ఘనత వైన్ షాపులు, పర్మిట్ రూములు పెట్టడమే. అధిక ధరలకు మదగయం అమ్ముతుంటే ఒక్క కేసు కూడా ఎక్సైజ్ శాఖ ఎందుకు నమోదు చేయలేదు? , విజయసాయిరెడ్డి ఎవరితోనో కమిట్ అయ్యారు. అందుకే మాపై ఆరోపణలు చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు టీజేఆర్. -
ఏలూరు సాక్షి కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యం
ఏలూరు,సాక్షి: ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంలో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీరంగం సృష్టించాడు. మంగళవారం తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి సాక్షి ఆఫీస్‌లో దౌర్జన్యానికి పాల్పడ్డాడు. సాక్షి జిల్లా కార్యాలయంలోని కంప్యూటర్లు ధ్వంసం చేశాడు. సోమవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట దాసరి బాబురావు అనే బాధితుడు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేధింపులు తాళలేక బ్లేడుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధితుడి అండగా ‘ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుల రక్త తర్పణం’ అంటూ సాక్షి కథనాన్ని ప్రచురించింది. బాధితుడి పక్షాన వార్త ప్రచురించినందుకు సాక్షిపై చింతమనేని రెచ్చిపోయారు. సాక్షిలో ప్రచురించిన కథనాలకు సంజాయిషీ చెప్పాలంటూ సాక్షి కార్యాలయంలో హడావిడి చేశారు. తాను సంతృప్తి చెందకపోతే సాక్షి పత్రిక, టీవీని జిల్లాలో తిరగనివ్వను. సాక్షి పత్రిక ప్రతులను తాడేపల్లి గూడెం దాటనివ్వను.. ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. బాధితుడు బాబురావును అసలు చూడలేదని దబాయిస్తూనే బాబూరావు వివాదం వివరాలన్నీ చింతమనేని ప్రభాకర్ బయటపెట్టడం గమనార్హం.👉గమనిక: చింతమనేని ఆగడాలపై ‘ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుడి రక్తతర్పణం’ అంటూ రాసిన సాక్షి కథనాన్ని యథాతధంగా ప్రచురిస్తున్నాం ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుడి రక్తతర్పణంకొద్ది నెలల క్రితం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఉసులూరి సత్యనారాయణ, బోస్, నాగబోయిన సత్యనారాయణ కోరారు. అన్ని అనుమతులతో వస్తే అభ్యంతరం లేదని బాబూరావు తెలిపారు.అయితే ఎలాంటి అనుమతులూ లేకుండానే అడ్డగోలుగా నెల రోజుల్లోనే సుమారు 2,000 లారీల గ్రావెల్‌ను తవ్వేశారు. ఇదేమిటని ప్రశి్నంచిన దాసరి బాబూరావు, ఆయన భార్య నాగలక్ష్మిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఈ దారుణంపై దెందులూరు తాహసీల్దార్, మైనింగ్ ఏడీ, ఏలూరు ఎస్పీ, దెందులూరు ఎస్సైలకు మూడు నెలల క్రితమే బాబూరావు ఫిర్యాదు చేశారు. జనసేన, టీడీపీ పార్టీ కార్యాలయాల్లో రెండుసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు.మరోవైపు తమ పార్టీ నేతలతో రాజీ చేసుకోవాలని.. లేకుంటే అంతు చూస్తానని చింతమనేని ప్రభాకర్ నుంచి బాబూరావుకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆందోళన చెందిన బాబూరావు, ఆయన భార్య నాగలక్ష్మి సోమవారం టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. తమకు న్యాయం జరగడంలేదన్న ఆవేదనతో ఒక్కసారిగా ఎన్టీఆర్ విగ్రహం ఎదుట బాబూరావు తన ఎడమ చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆయన భార్య అడ్డుకుని హుటాహుటిన తన భర్తను ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యే శరణ్యం ‘కొద్ది నెలలుగా మా పొలంలో టీడీపీ నేతలు గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. తవ్వకాలను ఆపి న్యాయం చేయండని తహసీల్దార్ నుంచి ఎస్పీ వరకూ మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఏలూరు ఎస్పీ చర్యలు తీసుకోకపోగా మాపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు.. ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి కాగితాలపై సంతకాలు పెట్టాలని ఫోన్లు చేసి వేధిస్తున్నారు. ఎమ్మెల్యే జేసీబీలు, లారీలు అన్నీ మా పొలం వద్దే ఉన్నాయి. మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం.’ – నాగలక్ష్మి, బాబూరావు భార్య -
'చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బట్టబయలు'
సాక్షి, తాడేపల్లి: హామీలు అమలు చేయలేక ప్రజా సమస్యలను డైవర్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు లేనిపోని హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నేతలు ఎవరూ భయపడరని ఆర్కే రోజా అన్నారు.దమ్ముంటే ఫైబర్ నెట్, స్కిల్ స్కామ్‌పై విచారణ జరిపించాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు పెట్టిన మొదటి సంతకం ఎందుకు అమలు కాలేదు?. చంద్రబాబు మొదటి సంతకం చిత్తు కాగితంతో సమానం. గ్రామాల్లోకి టీడీపీ నేతలు వెళ్ళే ధైర్యం ఉందా?. డైవర్షన్ డర్టీ కేసులతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. చంద్రబాబుకు సపోర్ట్ చేసే వాళ్లు భవిష్యత్‌లో జైలులో ఉంటారు. పోలీసు అధికారులకు హైకోర్టు అనేకసార్లు అక్షింతలు వేసింది. రాష్ట్రాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నాడని గతంలో మోదీనే చెప్పారు’’ అని ఆర్కే రోజా గుర్తు చేశారు.‘‘అమరావతిలో 36 వేల కోట్ల టెండర్లు.. 77 వేల కోట్లకు ఎందుకు పెంచారు?. అమరావతి టెండర్ల అంచనాలు పెంచి దోపిడీకి సిద్ధమవుతున్నారు. చంద్రబాబుకు ఆయన మనుషులు తప్పితే ఎవరూ అభివృద్ధి చెందకూడదా?. అమరావతి రాజధాని టెండర్లపై ప్రధాని మోదీ విచారణ జరిపించాలి. రూపాయి కూడా అవినీతి లేకుండా వైఎస్ జగన్ లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చారు. చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రా? తెలంగాణకు ముఖ్యమంత్రా?. చంద్రబాబు పాలనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు’’ అని రోజా ఎద్దేవా చేశారు...చంద్రబాబు మళ్లీ తన నిజ స్వరూపం చూపిస్తున్నారు. డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతున్నారు. రైతుల వెన్నుముక విరిచేశారు. ల్యాండ్, లిక్కర్, మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు డర్టీ డైవర్షన్ పాలిటిక్స్‌కి నిదర్శనం. తప్పు చేయని పీఎస్ఆర్ని అరెస్టు చేయటం దారుణం. కొందరు పోలీసులు తీవ్రమైన తప్పులు చేస్తున్నారు. తప్పులు చేసిన వారెవరినీ వదిలిపెట్టేదే లేదు. అలాంటి వారందరినీ జైలుకు పంపుతాం. స్కిల్ కేసులో అక్రమాలు చేసి చంద్రబాబు అరెస్టు అయ్యారు. ఆయన తప్పులను ఈడీ కూడా గుర్తించి కొందరిని అరెస్టు చేసింది. ఆ కేసును చంద్రబాబు ఎందుకు తొక్కి పెట్టారు?. చంద్రబాబుకు దమ్ముంటే తన కేసులపై సీబిఐ విచారణ జరిపించండి..చంద్రబాబు సంతకాలకు విలువ లేదు. నాలుగోసారి సీఎం అయినా మొదటి సంతకానికే దిక్కులేదు. హామీలు అమలు చేయలేని పాలకులు జనంలోకి వెళ్తే జనం వెంటపడి కొడతారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ మీద విష రాజకీయాలు చేశారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అమరావతిలో గతంలో రూ.36వేల కోట్లతో టెండర్లు వేశారు. ఇప్పుడు అవే పనులకు రూ.76 కోట్లకు ఎలా పెంచారో ప్రధాని గుర్తించాలి. రాజధానిలో ఆయన మనుషులు, ఆయన కులంవారు తప్ప మరెవరూ ఉండకూడదా?. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండకూడదా?. దేశంలోనే అత్యధిక ధనిక సీఎంగా చంద్రబాబు ఎలా అయ్యారో జనానికి తెలుసుకుప్పంలో చంద్రబాబు ఎందుకు ఇల్లు కట్టు కోలేదు?. అమరావతిలో మాత్రమే ఇల్లు కట్టుకోవడం వెనుక కారణం ఏంటో జనానికి చెప్పాలి. వీకెండులో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు?. చంద్రబాబుది విజన్ కాదు.. విస్తరాకుల కట్ట. ఆయనపై ఉన్న కేసులను విచారిస్తే ఎవరు విజనరీనో, నేరస్తుడో తేలుతుంది. ప్రధాని మోదీ.. చంద్రబాబు అక్రమాలపై విచారణ జరపాలి. అమరావతిలో శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధాని.. చంద్రబాబు మీద విచారణకు ఆదేశించాలి. అడ్రెస్ కూడా లేని ఉర్సా కంపెనీకి 60 ఎకరాల భూమిని ఎలా ధారాదత్తం చేశారు?. దావోస్ వెళ్తే ఒక్క కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టటానికి రాలేదు. కానీ ఊరూ పేరు లేని కంపెనీలకు భూములు ఇవ్వటం వెనుక కారణాలేంటి?ఉర్సా భూముల కేటాయింపును వెంటనే ఆపేయాలి. టీటీడీ గోశాలలో 191 ఆవులు చనిపోతే అసలేమీ చనిపోలేదని చంద్రబాబు నిస్సిగ్హుగా మాట్లాడుతున్నారు. గోవుల మృతిపై ఛాలెంజ్‌లు చేసి వెనక్కు వెళ్లారు. తిరుమలలో తాగి మర్డర్లు చేసుకునే పరిస్థితులు తలెత్తాయి. శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోవటం అనర్ధం. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?. తిరుమల, శ్రీకూర్మం ఘటనలపై ఎందుకు నోరు మెదపటం లేదు?. చంద్రబాబు చేస్తున్న తప్పులు బీజేపీకి కనపడటం లేదా?. జగన్ అధికారంలోకి వచ్చాక 43 వేల మద్యం బెల్టుషాపులు తొలగించాం. మద్యం షాపులను బాగా తగ్గించాంమద్యం షాపులు పెంచితే లంచాలు వస్తాయా? తగ్గిస్తే వస్తాయా?. మిథున్‌రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అసలు మద్యం పాలసీకి, మిథున్‌రెడ్డి కి ఏం సంబంధం?. చంద్రబాబు లక్ష కోట్లు రాజధానిలో పెట్టి, కమీషన్లు కొట్టేస్తున్నారు. చంద్రబాబు లిక్కర్ పాలసీ వలనే మహిళలపై ఘోరాలు జరుగుతున్నాయి. రాజకీయాల కోసం భగవంతుడిని వాడుకుంటే కష్టాలు తప్పవని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గ్రహించాలి. పిఠాపురంలో మహిళపై అత్యాచారం జరిగినా పవన్ పట్టించుకోలేదు. దళితులను వెలేసినా పట్టింపులేదు. చంద్రబాబుకు కష్టం, నష్టం వచ్చినప్పుడు మాత్రమే పవన్ బయటకు వస్తారు’’ అంటూ ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. -
విజయసాయిరెడ్డి చంద్రబాబు చేతిలోకి వెళ్లారు: అంబటి
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వ అవినీతి పాలన నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, లిక్కర్ స్కాం అంటూ రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.సూట్‌కేస్ కంపెనీ ఉర్సుకు విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టారని, రాజధాని అమరావతిలో కోట్ల రూపాయల కమిషన్లు విలువైన పనులను కావాల్సిన వారికి కట్టబెట్టి కోట్లాధి రూపాయలు కమీషన్లుగా దండుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై ప్రజల్లో జరుగుతున్న చర్చ నుంచి వారి దృష్టిని మళ్ళించేందుకే ఈ తాజా అరెస్ట్‌ల డ్రామాకు చంద్రబాబు తెరతీశారని మండిపడ్డారు. ఇటువంటి దుర్మార్గాలకు చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంకా ఆయనేమన్నారంటే..తన అవినీతి, అసమర్థ పాలన నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తున్నారు. అరెస్ట్‌లకు ఎవరూ అతీతం కాదని చంద్రబాబు అంటున్నారు. తనకు నచ్చని వారిని ఎవరినైనా సరే అరెస్ట్ చేసేస్తాననే పద్దతిలో ఈ ప్రభుత్వం నడుస్తోంది. తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ పీఎస్ఆర్ ఆంజనేయులును హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఆయన ఏపీలో అనేక చోట్ల పనిచేశారు. నీతీ, నిజాయితీ కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు.పదోన్నతులతో డీజీపీ స్థాయికి వచ్చారు. డీజీపీ కావాల్సిన అధికారిని ఈ కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. గతంలో ఒక కేసులో ఆనాటి ఇన్వెస్టిగేటీవ్ ఆఫీసర్లుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై కూడా ఎదురు కేసులు నమోదు చేశారు. వారిద్దరూ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పీఎస్ఆర్ ఆంజనేయులు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకు వెళ్లలేదు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదు. ఈ రోజు హఠాత్తుగా ఆయనను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.డైవర్షన్ పాలిటిక్స్‌లో చంద్రబాబు సిద్దహస్తుడుఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను అమలు చేయలేకపోతున్నాను, బడ్జెట్ చూస్తుంటే భయం వేస్తోందంటూ మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తూ చంద్రబాబు అబద్దాల కోరు అని జనం చర్చించుకుంటున్నారు. ఒక్క హమీని కూడా నెరవేచ్చని దుర్మార్గమైన పాలన సాగుతోంది. దీనిపై ప్రజల దృష్టిని మళ్ళించేందుకు తాజాగా ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేశారు. ఉర్సు అనే కంపెనీకి విశాఖలో మూడు వేల కోట్ల రూపాయల ఆస్తిని కేవలం 99 పైసలకు ఎకరం చొప్పున ఇచ్చేశారు. ఇది దోపిడీ కార్యక్రమం కాదా?ఇది ప్రజలు చర్చించుకోకుండా పీఎస్ఆర్ ఆంజనేయులు, లిక్కర్ స్కాం అంటూ రాజ్ కసిరెడ్డిలను అరెస్ట్ చేసి, దానిపై పెద్ద హంగామా సృష్టిస్తున్నారు. మరోవైపు రాజధాని పేరుతో విపరీతంగా వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకువస్తున్నారు. ఆ సొమ్ముతో కాంట్రాక్ట్‌లకు ఇస్తూ, వారి నుంచి కమిషన్లు దండుకుంటున్నారు. ఈ పనులకు రెండో తేదీన అమరావతిలో రెండోసారి శంకుస్థాపనకు ప్రధానమంత్రిని ఆహ్వానించారు. విపరీతమైన దోపిడీతో రాష్ట్రం సతమతమవుతోంది.లిక్కర్, ఇసుక, మట్టి పేరుతో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రంలోని టీడీపీ నాయకులు, చంద్రబాబు, నారా లోకేష్‌లు విపరీతంగా దోచుకుంటూ, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కేవలం పదకొండు నెలల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రభుత్వం దేశంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఒక్కటే. ఏపీలో లిక్కర్ స్కాం అంటూ హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంటే, దానిలో కుంభకోణం ఎలా జరుగుతుంది. ఒక్క కొత్త డిస్టలరీకి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. గత ప్రభుత్వం కన్నా తక్కువ రేట్లకే మద్యం విక్రయించాం, బెల్ట్ షాప్‌లను తొలగించాం దీనికి ఎవరైనా లంచాలు ఇస్తారా? పర్మిట్ రూంలు ఎత్తేస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టలరీలకు అర్డర్లు ఇచ్చాం. దీనిలో ఏదో స్కాం జరిగిపోయిందంటూ చంద్రబాబు హంగామా చేస్తున్నారు.రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారుకూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని తప్పుడు కేసులతో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయా? చంద్రబాబే శాశ్వతంగా సీఎంగా ఉంటారా? సీఎంలు మారితే ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయవచ్చా? డీజీపీలుగా పనిచేసిన వారిని కూడా అరెస్ట్‌లు చేయవచ్చా? ఏమిటీ ఈ అన్యాయం? కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గాలపై న్యాయస్థానాలు వాతలు పెడుతున్నా వారికి బుద్ది రావడం లేదు. పోసాని కృష్ణమురళిపై బీఎన్ఎస్ 111 సెక్షన్ పెట్టినందుకు సదరు విచారణాధికారిని కోర్ట్ ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తి మీద ఎక్స్ట్రార్షన్ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే, కోర్టు దానిని తీవ్రంగా ఆక్షేపించింది. అవసరమైతే డీజీపీని కోర్ట్‌కు పిలుస్తామని కూడా హెచ్చరించాయి. కలకాలం చంద్రబాబే సీఎంగా ఉండరని గుర్తుంచుకోవాలి. పరిపాలన చేయలేక, కక్షసాధింపులతో పనిచేస్తున్నారు. కూటమి పార్టీలకు ఓటు వేసిన వారు సిగ్గుపడేలా పరిపాలన చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని పాలన చేయాలనుకున్న వారు ఎవరూ మనజాలలేదు.గోరంట్ల మాధవ్ వ్యవహారంలో పదకొండు మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఇది కక్షసాధింపు చర్యలు కావా? నిజంగా పోలీసులు తప్పు చేశారని నిర్ధారిస్తే దీనికి బాధ్యత వహించి హోమంత్రి రాజీనామా చేయాలి. డీజీపీ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు పోలీసులు ఆలోచించాలి. మీ తోటి అధికారులను కక్షసాధింపుల్లో భాగంగా తప్పుడు కేసులతో మీతోనే అరెస్ట్ చేయించింది. ఇదే పద్దతి కొనసాగితే రేపు ప్రభుత్వాలు మారితే మీమ్మల్ని కూడా అరెస్ట్ చేసేయవచ్చు కదా? ఈ సంప్రదాయం వల్ల ఎవరికి నష్టం జరుగుతోంది? ప్రతి ఐపీఎస్ అధికారి దీనిపై ఆలోచించుకోవాలి.అణిచివేస్తే భయపడతామా?గతంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, ఇందిరాగాంధి, జయలలిత, వైయస్ జగన్ వంటి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ చేసిన ఐపీఎస్ అధికారులపై వారి ప్రభుత్వాలు వచ్చిన తరువాత ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా? చంద్రబాబును అరెస్ట్ చేశారనే కక్షతోనే ఇలా అరెస్ట్‌లు చేసుకుంటూ పోతున్నారు. రేపు చంద్రబాబు, లోకేష్‌లు మాజీలు కాకుండా పోతారా? ప్రభుత్వాలు మారి, మీరు ప్రతిపక్షంలోకి రాకుండా పోతారా? ఎవరు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని అరెస్ట్ చేస్తారా?కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మరింత బలంగా ఈ అక్రమాలపై పోరాడేందుకు ముందుకు వచ్చే పరిస్థితిని కల్పిస్తున్నారు. మా పార్టీ నుంచి బయటకు వెళ్లిన విజయసాయిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఉన్నారు. అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారు. మూడున్నరేళ్ళ పదవీకాలాన్ని విజయసాయిరెడ్డి వదులుకున్నారు. కూటమి కోసం తన పదవిని వదిలేశారు. కూటమికి లాభం చేసే నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వ్యక్తి మాటలకు, సాక్ష్యాలకు విశ్వసనీయత ఏముంటుందీ? వారి మాటలకు, వాదనలకు విలువ ఏముంటుందీ? -
మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దిగజారుస్తున్నారని.. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్ జగన్ మండిపడ్డారు. ముంబై నటి జత్వానీని వేధించారంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయుల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ పీఏసీ మీటింగ్‌లో స్పందించారు. ‘‘రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులును అరెస్ట్ చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట. ఇదే కేసులో మరో ఇద్దరు పోలీస్ అధికారుల పట ప్రభుత్వ తీరును కోర్టు తప్పుబట్టింది. .. మొదటి సారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా. ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్ చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని వ్యవస్థలను దిగజారస్తున్నారు. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారు. ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏం మిగలదు. .. ఎంపీ మిథున్ రెడ్డిని(MP Mithun Reddy) కూడా టార్గెట్ చేశారు. ఎలాగైనా మిథున్‌రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారు. కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదురించారు. కాబట్టే పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు. లేని ఆరోపణలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. బాబు హయాంలో లిక్కర్ స్కాంపైనా గతంలో సీఐడీ కేసు పెట్టింది. మనం తెచ్చిన లిక్కర్ పాలసీ(YSRCP Liquor Policy) విప్లవాత్మకమైంది. ప్రైవేట్ దుకాణాలు తీసేసి ప్రభుత్వమే నిర్వహించింది. లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి..’’ అని పీఏసీ సభ్యులను ఉద్దేశించి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.‘‘విశాఖలో రూ.3వేల కోట్ల భూమిని ఊరు పేరులేని కంపెనీకి రూపాయికే కట్టబెట్టారు. లులూ గ్రూపునకు రూ.1500-2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారు. అప్పటి రేట్లతో పోలిస్తే సిమెంటు, స్టీల్ రేట్లు పెరిగాయి. రూ.36వేల కోట్ల పనులను ఇప్పుడు రూ.77 వేలకు పెంచారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ తీసేశారు. మొబలైజేషన్ అడ్వాన్స్‌లు తీసుకు వచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు. గతంలో అనేకసార్లు నేను చెప్పాను. గతంలో మనం చేసినట్టుగా ఎందుకు బటన్లు నొక్కలేదు అని అడిగాను. బటన్లు నొక్కితే చంద్రబాబు లాంటివారికి ఏమీ రాదు. ప్రజల ఖాతాలకే నేరుగా వెళ్తోంది. అందుకనే చంద్రబాబు బటన్లు నొక్కడంలేదు...రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కాని, దేశవ్యాప్తంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి ఆదాయాలు పెరుగుతున్నాయి. ఏదైనా ముఖ్యమైన ప్రజలకు సంబంధించిన సమస్య బయటకు వచ్చిందంటే, వెంటనే చంద్రబాబు డైవర్ట్ చేస్తున్నాడు. ఏమీలేకపోతే.. జగన్ మీద ఎవరో ఒకర్ని తీసుకు వచ్చి మాట్లాడిస్తున్నాడు. లేకపోతే ఎవరో ఒకర్ని అరెస్టు చేస్తున్నాడు. ప్రజల నోటిలోకి నాలుగేళ్లు ఇప్పుడు ఎందుకు పోవడంలేదు? మన ప్రభుత్వ పథకాలన్నీ ఎందుకు రద్దుచేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయి. ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. రూ.3500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు?..ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలేదు. ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్లు ఇవ్వాలి. ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు బకాయి గత ఏడాది పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది. మళ్లీ ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ కలుపుకుంటే రూ.7వేల కోట్లకు గాను రూ.700 కోట్లు ఇచ్చాడు. ఏ రైతుకు గిట్టుబాటు ధరలేదు. పెట్టుబడి సహాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. వ్యవస్థల్లో పారదర్శకత లేదు. పెన్షన్లు నాలుగు లక్షలు తగ్గించాడు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు. ఎక్కడ చూసినా రెడ్‌బుక్ పాలనే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో PAC గణనీయమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు మమేకం కావాలి. జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసుకోవాలి. పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని అందించాలి. ..పార్టీ అధికారంలోకి వస్తుంది.. మరింతగా ప్రజలకు సేవలందిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పార్టీకి చెందిన ప్రతీ కార్యక్రమాన్ని మనది అనుకుని చేసుకోవాలి. అందర్నీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాలి. మన పార్టీకి పెద్దగా మీడియా లేదు. టీడీపీకి పత్రికలు, అనేక ఛానళ్లు ఉన్నారు. సోషల్ మీడియాలో వారికి ఉన్మాదులు ఉన్నారు. అందుకనే గ్రామస్థాయిలో కార్యకర్తను తయారు చేయాలి. అన్యాయాలను ఎదిరించడానికి, ప్రజల ముందు పెట్టడానికి ఫోన్ అనే ఒక బ్రహ్మాండమైన సాధనాన్ని వాడుకోవాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి...కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చినప్పుడు మనపై ఇప్పటి మాదిరిగానే మనపై తప్పుడు ప్రచారాలు, దుర్మార్గపు ప్రచారాలు చేశారు. కాని ప్రజలు మనల్ని నమ్మారు, ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా చంద్రబాబుపై వ్యతిరేకతను మూసేయడానికి వాళ్ల మీడియా ప్రయత్నిస్తుంది. కాని ప్రజల తీర్పే అంతిమం. వాళ్లిచ్చే నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. రాష్ట్రాన్ని ఒక భయంలో పెట్టి, పాలన కొనసాగించాలన్న చంద్రబాబు నాయుడి ధోరణిపై కచ్చితంగా ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారు. చంద్రబాబు పెడుతున్న కేసులకు ఏమవుతుంది? జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచివేయలేరు. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితులు లేకుండా చేశారు. కానీ ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రభుత్వం ఎన్నికేసులు పెడితే, ప్రజలు అంతా స్పందిస్తారు...కలియుగంలో రాజకీయాలు ఈ రీతిలోనే ఉంటున్నాయి. కాని, భయపడి రాజకీయాలు మానుకుంటారు అనుకోవడం పొరపాటు. ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, పన్నాగాలు తాత్కాలికం. మన పార్టీకి ఉన్న విలువలు, విశ్వసనీయత మనల్ని ముందుండి నడిపిస్తాయి. ప్రజలకు చేసిన మంచి ఇంకా ఆయా కుటుంబాల్లో బతికే ఉంది. ఈ మేరకు పీఏసీ సభ్యులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి. వారిలో స్ఫూర్తిని నింపాలి. కష్టాలనుంచే నాయకులు ఎదుగుతారు. ప్రతిపక్షంలో మనం చేసే పోరాటాలను ప్రజలు గుర్తిస్తారు. ఆశీర్వదిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన చేసే పోరాటాలు, ప్రజా సమస్యలపట్ల స్పందిస్తున్న తీరును ప్రజలు గుర్తిస్తారు. ఒక పార్టీకి నాయకుడిగా వారి పనితీరు కూడా నా దృష్టికి వస్తుంది. ఇంకా టైముందిలే, తర్వాత చూద్దాంలే అన్న ధోరణి వద్దు...పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు స్పందిస్తే, ఆ సంకేతం పార్టీ శ్రేణులకూ వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది. ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రజల్లోకి ఉద్ధృతంగా వెళ్లాలి. ప్రజల తరఫున గట్టిగా ప్రశ్నించాలి.. పోరాటం చేయాలి. ఎలాంటి రాజీపడొద్దు. ప్రతి సమావేశంలోనూ అజెండాను నిర్దేశించుకుని దానిపైన డిస్కషన్ చేయాలి. పార్టీకి సూచనలు చేయాలి. పార్టీ ఐక్యంగా ఉండి, పార్టీ కార్యక్రమాలను బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాలి. ఏ జిల్లాలో ఏ సమస్య వచ్చినా, ఆ సమస్య మనది అనుకుని దాని పరిష్కారం కోసం ప్రయత్నించాలి. వెంటనే కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలి. ఎవరో ఏదో ఆదేశాలు ఇస్తారని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలకు అండగా ఉండడం, పార్టీని బలోపేతం చేయడం అన్నది ముఖ్యం’’ అని వైఎస్ జగన్ చెప్పారు.