
బుద్ధిష్ట్ సర్క్యూట్ వద్ద అగ్ని ప్రమాదం
అమరావతి: ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అమరావతిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బుద్ధ విగ్రహం ఎదురుగా కోట్లాది రూపాయలతో నిర్మించిన బుద్ధిష్ట్ సర్క్యూట్ భవనాల వద్ద శనివారం సాయంత్రం అగ్నిప్రమాద జరిగింది. పర్యాటక శాఖ మేనేజర్ మణికుమార్ అందించిన సమాచారం మేరకు ఓ ప్రైవేటు ఊరేగింపులో కాల్చిన బాణసంచా రవ్వలు బుద్ధిష్ట్ సర్క్యూట్ భవనాల సమీపంలో ఉన్న చెత్తలో పడి రాజుకుని మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు మంటలు అర్పటానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఈ క్రమంలో సత్తెనపల్లి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వటంతో అగ్నిమాపక వాహనంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. కోట్లాది రూపాయల భవనాలకు ఎటువంటి నష్టం జరగలేదు.