breaking news
Guntur District News
-
మహానేతా
జిల్లావ్యాప్తంగా ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు సాక్షి ప్రతినిధి, గుంటూరు: పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మరణం లేని మనిషి దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు కొనియాడారు. మహానేత వైఎస్సార్ వర్ధంతి పురస్కరించుకుని బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కోర్టు, అమరావతి రోడ్డు, ముత్యాలరెడ్డినగర్, కొరిటెపాడు, స్వామి థియేటర్ సెంటర్, లక్ష్మీనగర్, ఆదర్శనగర్, హౌసింగ్ బోర్డుతోపాటు, పలు ప్రాంతాల్లో పర్యటించి వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు. పార్టీ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ పేదల గుండెకు భరోసా కల్పించి, ఎంతటి ఖర్చు అయినా ఆరోగ్యశ్రీ ద్వారా వారికి మేలు చేకూర్చిన ఆరోగ్య ప్రదాత వైఎస్సార్ అని కీర్తించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో.. వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. పొన్నూరు రూరల్ మండలం మామిళ్లపల్లిలో డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం, పొన్నూరు రూరల్ మండలం మునిపల్లె గ్రామం, పొన్నూరు రూరల్ మండలం పచ్చలతాడిపర్రు, పొన్నూరులోని పార్టీ కార్యాలయంలో, పొన్నూరులోని అంబేడ్కర్ సెంటర్ వద్ద, పొన్నూరు రూరల్ మండలం వెల్లలూరు, మంచాల, చేబ్రోలు, నారాకోడూరు, పెదకాకాని గ్రామాల్లో డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో కార్యకర్తలు, నేతలు, అభిమానులు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో.. తాడేపల్లి రూరల్, తాడేపల్లి టౌన్, మంగళగిరి టౌన్, మంగళగిరి రూరల్, దుగ్గిరాలలో దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమాల్లో నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పాల్గొని డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల స్థాయి, గ్రామస్థాయి నేతలు, అభిమానులు పాల్గొన్నారు. తాడికొండ నియోజకవర్గంలో.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు తెలిపారు. మంగళవారం డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పేరేచర్ల డొంక రోడ్డులో వద్దగల డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లూరు వంశీకృష్ణ, పేరేచర్ల గ్రామ అధ్యక్షుడు షేక్ సుభాని, ముత్యాల బాలస్వామి, గండికోట రసూలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో.. తెనాలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కొల్లిపరలో బొంతు వారి గుడి వద్ద వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కొల్లిపర మాయాబజార్ సెంటర్లో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. తూములూరు గ్రామంలో సెంటర్లోని హైస్కూల్ దగ్గర వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. తూములూరు అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. వల్లభపురం గ్రామంలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో శివకుమార్ పాల్గొని వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో.. ప్రత్తిపాడు, ఏటుకూరు బైపాస్‌లోని నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ ఇన్చార్జి బలసాని కిరణ్‌కుమార్ మాతృమూర్తి మణెమ్మ, తనయుడు కౌశిక్ కిరణ్‌లు పాల్గొని డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రూరల్ మండలంలో నల్లపాడు, చల్లావారిపాలెం, మల్లవరం గ్రామాల్లో ఎంపీపీ ఇంటూరి పద్మావతి, అంజిరెడ్డిలు పాల్గొని డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు, చిత్రపటాలకు నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండల కన్వీనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మంగళగిరి టౌన్: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి(50), అతని భార్య సుజాత హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు సోమవారం రాత్రి మంగళగిరి పట్టణ పరిధిలోని తెనాలి ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద బస్సు కోసం వేసి ఉన్నారు. అదే సమయంలో గుర్తు తెలియని తెల్ల రంగు కలిగిన ఓ వాహనం అతివేగంగా భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. బలమైన గాయాలు కావడంతో ఆయనను భార్య సుజాత ఎన్ఆర్ఐ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లింది. శ్రీనివాసరెడ్డిని పరీక్షించిన వైద్యులు మార్గంమధ్యంలో మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి భార్య మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. -
జిల్లా కోర్టులో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టులో వైఎస్సార్ సీపీ జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్పాహార విందును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పాల్గొని మహానేత చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు సిడి భగవాన్, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి, మాజీ గవర్నమెంట్ ప్లీడర్లు పోకల వెంకటేశ్వర్లు, ఎంవీ సుబ్బారెడ్డి, మాజీ ఏజీపీ సౌభాగ్య లక్ష్మి, మాజీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, కాసు వెంకటరెడ్డి, వాసం సూరిబాబు, వజ్రాల రాజశేఖర్ రెడ్డి, మాతంగి శ్రీకాంత్, కేవీ రమణారెడ్డి, సోమసాని ఝాన్సీ, బడి మంజుల, గేర వెంకట సుబ్బారావు, బొడ్డు కోటేశ్వరరావు, బూదాటి సాగర్, లీగల్ సెల్ అధికార ప్రతినిధి సయ్యద్ బాబు, మాజీ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సుధాకర్ రెడ్డి, న్యాయవాదులు కృష్ణారెడ్డి, సుదర్శన క్రాంతి కుమార్ బొమ్మనబోయిన శ్రీనివాస్, నల్లక వెంకట వేణు, సురేష్, నగర యువజన విభాగం అధ్యక్షుడు ఏటి కోటేశ్వరరావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఆర్ఓబీకి ముందే ఆర్యూబీ నిర్మించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: శంకర్‌విలాస్ నూతన ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టే ముందుగానే ప్రజా రవాణాకు వీలుగా రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ)ని చేపట్టాలని బెటర్ శంకర్ విలాస్ ఫ్లయ్ ఓవర్ సాధన జేఏసీ కన్వీనర్ ఎల్ఎస్ భారవి డిమాండ్ చేశారు. మంగళవారం గుంటూరులోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో భారవి మాట్లాడుతూ ఇటీవల జరిగిన నగరపాలకసంస్థ కౌన్సిల్ సమావేశంలో ఫ్లయ్ ఓవర్ నిర్మాణానికి ముందే ఆర్యూబీ నిర్మించాలని చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపి ఆమోదింపచేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్యూబీ నిర్మాణానికి నిధులు తెచ్చిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆర్యూబీ నిర్మాణం దిశగా రైల్వేశాఖను ఒప్పించాలని కోరారు. శంకర్‌విలాస్ ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించే ఆర్నెల్ల పాటు బ్రిడ్జిపై వాహనాలు యధావిధిగా రాకపోకలు సాగించవచ్చని జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రకటించిన రెండు నెలల వ్యవధిలోనే బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభించేశారని చెప్పారు. -
చురుగ్గా రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ
మంత్రి నాదెండ్ల మనోహర్ అత్తోట(కొల్లిపర): రాష్ట్రంలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ చురుగ్గా కొనసాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. మంగళవారం గుంటూరు జిల్లా అత్తోటలో ఆయన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్ల మందికి స్మార్ట్ కార్డ్‌లు అందిస్తున్నట్లు చెప్పారు. చౌక దుకాణాల ద్వారా 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరుకులు అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని చెప్పారు. చౌక దుకాణాలను రానున్న రోజుల్లో మినీ మార్ట్లుగా తీర్చిదిద్దుతామన్నారు. వీటి ద్వారా తక్కువ ధరకే ఆర్గానిక్, నిత్యావసర సరుకులు అందిస్తామని చెప్పారు. రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామన్నారు. త్వరలో సబ్సిడీపై టార్ఫలిన్ పట్టాలు అందిస్తామన్నారు. యూరియా అందడం లేదని రైతుల ఫిర్యాదు తమకు యూరియా అందడం లేదని అత్తోట గ్రామ రైతులు మంత్రి నాదెండ్లకు ఫిర్యాదు చేశారు. ఆయన స్పందిస్తూ.. ఎరువుల విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. -
ఆదివారం అమ్మవారి ఆలయం మూసివేత
దుగ్గిరాల: కంఠంరాజు కొండూరులోని మహంకాళీ అమ్మవారి ఆలయాన్ని ఆదివారం చంద్ర గ్రహణం కారణంగా మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మూసివేయనున్నట్టు ఈవో కె.సునీల ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి సోమవారం సంప్రోక్షణ అనంతరం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కోర్టులో తీర్పు రాజుపాలెం: బాలికను వెంటపడి వేధిస్తున్న యువకుడికి ఆరు నెలలు జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా కోర్టు తీర్పు వెలువరించినట్లు పల్నా డు జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. మండలంలోని అనుపాలెంకు చెందిన పిడతల శ్యామ్ 2021లో 10వ తరగతి చదువుతున్న బాలికను ప్రతి రోజూ వెంటబడుతున్నాడని తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి ఎస్ఐ అమీర్ కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రస్తుత సత్తెనపల్లి డీఎస్పీ ఎమ్ హనుమంతరావు పర్యవేక్షణలో రాజుపాలెం ఎస్ఐ కె.వేణుగోపాల్ ఆధ్వర్యంలో సాక్షులను హాజరు పరుచగా విచారించిన పీవోసీఎస్‌వో గుంటూరు జిల్లా కోర్టు జడ్జి షమీపర్విన్ సుల్తాన్‌బేగం శిక్షను విధించారు. మంగళగిరి టౌన్ : ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన వెనిగళ్ళ సాహిత్యకు పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం చేయూతనిచ్చింది. మంగళగిరి నగర పరిధిలోని దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో ఉన్న పట్టణ పద్మశాలీయ బహుత్తమ కార్యాలయంలో విద్యార్థిని సాహిత్యకు 70 వేల రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా పలువురు సంఘ నాయకులు మాట్లాడుతూ విద్యార్థినిలో ప్రతిభను ప్రోత్సహించడం సంఘం ముఖ్య ఉద్దేశమని అన్నారు. విద్యలో మరింత రాణిస్తూ ఉన్నత స్థాయికి చేరుకుని సమాజానికి, సామాజిక వర్గానికి మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు దామర్ల కుబేరస్వామి, గుత్తికొండ ధనుంజయరావు, రామనాథం పూర్ణచంద్రరావు, రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు జిల్లాలో ఉన్న 110 మద్యం బార్ల నిర్వహణకు గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో కేవలం 43 మద్యం బార్లకు మాత్రమే లాటరీ తీశారు. మిగిలిన వాటికి దరఖాస్తులు రాకపోవడంతో తిరిగి మంగళవారం రీ నోటిఫికేషన్ జారీ చేస్తూ ఎకై ్సజ్ శాఖ కమిషనర్ నిశాంత్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 3వ తేదీ నుంచి 14 వరకు దరఖాస్తుల స్వీకరణ, 15న లాటరీ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. గుంటూరు కొరిటెపాడు రెడ్ల బజార్‌లోని వాయుపుత్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ద్వితీయ గణపతి మహోత్సవాల్లో స్వామివారి లడ్డూను మంగళవారం వేలం నిర్వహించగా, కొరిటెపాడుకు చెందిన కొండమడుగుల సింహాద్రిరెడ్డి అత్యధికంగా రూ.6,05,116లకు దక్కించుకున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు -
గుంటూరు
బుధవారం శ్రీ 3 శ్రీ సెప్టెంబర్ శ్రీ 20257కారెంపూడి: ఎన్ఎస్పీ కాలనీ వినాయకుడి గుడి ఆవరణలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం నిమజ్జన ఉత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,58,320 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 2,43,308 క్యూసెక్కులు వదులుతున్నారు.యడ్లపాడు: కోట గ్రామంలోని గోపీనాథ ఆలయ ప్రాంగణంలో పేకాట జరుగుతుందని తెలిసి ఎస్ఐ టి.శివరామకృష్ణ దాడి చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు. -
డీఆర్ఎం కార్యాలయంలో సోలార్ ప్లాంట్
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ కార్యాలయంలో సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించడం సంతోషదాయకమని డివిజన్ డీఆర్ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యాలంలో రోజు వారీ విద్యుత్ వినియోగంలో గణనీయమైన భారాన్ని తీర్చడానికి సోలార్ ప్లాంట్‌ను రూపొందించడం జరిగిందన్నారు. అనంతరం ప్లాంట్ నిర్మాణం కోసం కృషి చేసిన సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏడీఆర్ఎం ఎం.రమేష్‌కుమార్, డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ ఎం.రవితేజ, సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్, డివిజన్ అధికారులు పాల్గొన్నారు. ప్రారంభించిన డీఆర్ఎం సుథేష్ఠ సేన్ -
పేదల మనిషి డాక్టర్ వైఎస్సార్
గుంటూరు రూరల్: మండలంలోని 41వ డివిజన్నందున్న అడవి తక్కెళ్ళపాడు గ్రామం, రాజీవ్ గృహకల్పలో జరిగిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొని డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గొప్ప మనసున్న మహారాజు, అపర భగీరథుడు, ఆరోగ్యశ్రీ ప్రదాత, ప్రజాసేవలోనే అశువులు బాసిన గొప్ప మహానీయులు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామస్తులు మాజీ మంత్రిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. వైఎస్సార్ సీపీ నాయకులు పిల్లి మేరి, వెంకట్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అమరావతిలో ‘యూనివర్సిటీ ఆఫ్ టోక్యో’ బృందం పర్యటనతాడికొండ: జపాన్‌కు చెందిన ‘యూనివర్సిటీ ఆఫ్ టోక్యో’ బృందం మంగళవారం అమరావతిలో పర్యటించింది. తొలుత ఆ బృందం అమరావతిలోని శాఖమూరు పరిసర ప్రాంతాలను సందర్శించింది. అమరావతిలో యూనివర్సిటీ ఏర్పాటుకు అనుకూలమైన భూములను డ్రోన్, మ్యాప్ సహాయంతో సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ వివరించారు. రాజధాని అమరావతిలో విద్యాసంస్థల ఏర్పాటుకు అనుకూలమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని జపాన్ బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు సీఆర్డీఏ అధికారులు తెలిపారు. అనంతరం బృందం అమరావతిలో విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్‌లను సందర్శించింది. బృందంలో టోక్యో వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ యోషియుకి కజాయో, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ప్రొఫెసర్ హయాషి కయోరి, ప్రాజెక్టు స్పెషలిస్ట్ జేమ్స్ ఫెగాన్ ఉన్నారు. పోలీసుల అదుపులో మట్కా నిందితులు నరసరావుపేటటౌన్: నిషేధిత మట్కా నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేటలో కొన్ని నెలలుగా టీడీపీ నాయకులు నిషేధిత లాటరీ, మట్కా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో యథేచ్ఛగా అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు రావటంతో జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఇన్చార్జి డీఎస్పీ కె.హనుమంతరావు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. పదిరోజులుగా నరసరావుపేటలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి మట్కా జూదం నిర్వహిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. -
అర్ధరాత్రి కారు బీభత్సం
తాడేపల్లి రూరల్: మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ పాత జాతీయ రహదారిలో ఉండవల్లి సెంటర్ నుంచి మంగళగిరి వెళ్లే మార్గంలో సోమవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించి పలుచోట్ల ద్విచక్ర వాహనదారులను, ఒక సైక్లిస్టును ఢీకొట్టి చివరకు ఒక చెట్టును ఢీకొని నిలిచిపోయింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి ఉండవల్లి సెంటర్ నుంచి మంగళగిరి వెళుతున్న పోలీస్ స్టిక్కర్ కలిగి వున్న ఒక కారు సాయిబాబా గుడివద్ద విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తోపాటు భార్యాభర్తలకు స్వల్పగాయాలయ్యాయి. కారు ఆపినట్లు ఆపి మళ్లీ అతివేగంగా వచ్చి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని, ద్విచక్రవాహనంపై వెళుతున్న మరో వ్యక్తికి ఢీకొట్టడంతో వారు కింద పడ్డారు. కారు అదుపు తప్పి ఓ చెట్టును ఢీకొని ఆగిపోయింది. కారులో బెలూన్స్ సైతం ఓపెన్ అయ్యాయి. పూటుగా మద్యం సేవించి ఉన్న ఓ వ్యక్తి కారులోంచి దిగి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కారుపై పోలీస్ అని స్టిక్కర్ ఉంది. ఇది పోలీసులకు చెందిన వాహనమా? లేక ఇంకెవరైనా పోలీస్ స్టిక్కర్ అతికించుకున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి పోలీసులు గోప్యంగా వివరాలు సేకరిస్తున్నారు. -
జాతీయ లోక్‌అదాలత్‌పై సమావేశం
గుంటూరు లీగల్: ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధానన్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి ఆదేశాల మేరకు అన్ని ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్, చిట్ ఫండ్ కంపెనీల ప్రతినిధులతో ఒకటవ అదనపు జిల్లా కోర్టులో మంగళవారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో నాల్గో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్ బాబు, ఒకటో అదనపు జిల్లా జడ్జి వి.ఎ.ఎల్.సత్యవతి, మూడో అదనపు జిల్లా జడ్జి సి.హెచ్ వెంకట నాగ శ్రీనివాసరావు, రెండో అదనపు జిల్లా జడ్జి వై.నాగరాజ పాల్గొని అన్ని ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ ప్రతినిధులు, చిట్‌ఫండ్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. సివిల్, క్రిమినల్ కేసులు ఎక్కువ సంఖ్యలో రాజీ చేసుకోవడానికి తగు సలహాలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా గోకుల్ చిట్ ఫండ్ కంపెనీ చెక్ అమౌంట్లో పది శాతం తగ్గించుకొని కేసును పరిష్కరించుకొనేందుకు అంగీకరించారు. ఇది కక్షిదారులకు మంచి అవకాశమని గోకుల్ చిట్ ఫండ్ వారితో కక్షిదారులు సంప్రదించి వారి కేసులను సత్వరమే రాజీ చేసుకోవచ్చని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ లోక్ అదాలత్‌లో కేసుల సత్వర పరిష్కారానికి తగు సలహాలు ఇచ్చి, సూచనలు చేశారు. -
● లారీలో డీజిల్ దొంగిలిస్తుండగా పట్టుకున్న స్థానికులు ● టూటౌన్ పోలీసులకు అప్పగింత
రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారులు మృతి ఫిరంగిపురం: ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకులు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేరికపూడి గ్రామానికి చెందిన ఆర్.వెంకటేశ్వర్లు(70), కుమారుడు భార్గవ్(23)లు మంగళవారం ద్విచక్రవాహనంపై పెట్రోలు బంకు వద్దకు బయలు దేరారు. మేరికపూడి గ్రామం వద్దకు చేరుకోగానే గుంటూరు నుంచి నరసరావుపేటకు వెలుతున్న ఆర్టీసీ బస్సు వెనకభాగం ద్విచక్రవాహనం హ్యాండిల్‌కు తగిలింది. దీంతో వాహనం అదుపుతప్పి రహదారిపై పడిపోవడంతో భార్గవ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశ్వర్లుకు తీవ్రగాయలు కావడంతో అతడిని చికిత్సకోసం నరసరావుపేట ప్రభుత్వవైద్యశాలకు తరలించి చికిత్స చేస్తుండగా పరిస్థితి విషమించడంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ప్రమాదంపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. డీజిల్ దొంగ అరెస్ట్ నరసరావుపేటటౌన్: ఆగి ఉన్న లారీల్లో డీజిల్ దొంగతనం చేస్తున్న యువకుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన మంగళవారం పట్టణంలో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివసంజీవయ్య కాలనీకి చెందిన కాకాని యశ్వంత్ చిలకలూరిపేట రోడ్డు ముస్లిం శ్మశానవాటిక పక్కన గల పెట్రోల్ బంకు ఆవరణలో నిలిపి ఉన్న లారీలో తెల్లవారుజామున డీజిల్ దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన పెట్రోల్ బంకు సిబ్బంది కేకలు వేయటంతో తన వెంట తెచ్చుకున్న ద్విచక్రవాహనం, 25 లీటర్ల రెండు క్యాన్లు వదిలి పరారయ్యాడు. రెండు గంటల తర్వాత మరో ద్విచక్ర వాహనంపై అతని స్నేహితుడితో కలిసి వచ్చి వదిలి వెళ్లిన వాహనాన్ని తీసుకెళ్లాడు. అప్పటికే యశ్వంత్ కోసం అక్కడ వేచి చూస్తున్న లారీ యజమానులు, పెట్రోల్ బంకు నిర్వాహకులు అతన్ని పట్టుకున్నారు. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ హైమారావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన్ని నెలలుగా లారీల్లో డీజిల్, బ్యాటరీలు అపహరణకు గురవుతున్నాయని లారీల నిర్వాహకులు పోలీసులకు వివరించారు. నిందితుడితోపాటు అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకొని డీజిల్ దొంగతనం చేసేందుకు తెచ్చిన ప్లాస్టిక్ క్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
10న నాయుడమ్మ అవార్డు ప్రదానం
తెనాలి: తెనాలికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డును ఆయన జన్మదినమైన ఈనెల పదో తేదీన ప్రదానం చేయనున్నారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమ వివరాలను మంగళవారం సాయంత్రం ఇక్కడి కుమార్ పంప్స్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఫౌండేషన్ నిర్వాహకులు ఆహ్వానపత్రికను ఆవిష్కరించారు. వివరాలను తెలియజేశారు. తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఆరోజు సాయంత్రం 4.30 గంటలకు జరిగే సభలో భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖలో ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శిగా చేస్తున్న ఐఏఎస్ అధికారి నాగరాజు మద్దిరాలకు నాయుడమ్మ అవార్డును బహూకరిస్తామని ఫౌండేషన్ అధ్యక్షుడు యడ్లపాటి రఘునాధబాబు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీజిష్ణుదేవ్ వర్మ చేతులమీదుగా ఈ అవార్డును ప్రదానం చేస్తామని చెప్పారు. తోలు పరిశ్రమ, ఉత్పత్తుల రంగంలో భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిన ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ పేరిట బహూకరించే అవార్డు ప్రదానోత్సవ సభను జయప్రదం చేయాలని ఉపాధ్యక్షుడు కొత్త సుబ్రహ్మణ్యం కోరారు. డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, కె.అరవింద్, కె.నందకిశోర్ పాల్గొన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధికి సహకారం
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందే ఆర్థిక చేయూత ద్వారా మహిళలు ఆర్థికవృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో డీఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో జీవనోపాధి కార్యక్రమాలు, ప్రణాళిక అమలుపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్వయం సహాయక సంఘాల జీవనోపాధి మెరుగుదల కోసం ప్రభుత్వ శాఖలు ప్రతిష్ట విధానాలు అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాయితీలతో అనేక పథకాలు అందిస్తుందన్నారు. జిల్లాలో వ్యవసాయం, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక శాఖ, పరిశ్రమల శాఖలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు న్యాచురల్ ఫార్మింగ్ తదితర లాభదాయక వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసేలా క్షేత్ర స్థాయిలో అధికారులు మహిళలను ప్రొత్సహించాలన్నారు. ● డీఆర్డీఏ పీడీ పి.వి.విజయలక్ష్మి మాట్లాడుతూ స్వయం సహాయ సంఘాల సభ్యులకు ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న స్కీమ్స్, సబ్సిడీ స్కీమ్‌లపై అవగాహన కల్పిస్తే జీవనోపాధి మరింత మెరుగు పరుచుకునే అవకాశం ఉంటుందన్నారు. కొలకలూరులో ఇండస్ట్రీయల్ పార్కు నిర్మించేందుకు దాత ఎకరం పొలం ఉచితంగా అందించారన్నారు. దీనిలో ఏపీఐఏసీ సహకారంతో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఫిరంగిపురంలో గతంలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ మాదిరిగా మిగిలిన అన్ని మండలాల్లో కూడా మార్ట్లు ఓపెన్ చేస్తామన్నారు. డీఆర్డీఏ ద్వారా జిల్లాలో ఎస్‌హెచ్‌జీ మహిళలు అందించిన ఆర్థిక సహాయంతో సాంఘీక సంక్షేమ నిధికి రూ. 6.41 లక్షల నమూనా చెక్కును అధికారి గుణశీలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు, నాబార్డు డీడీఎం శరత్‌బాబు, డ్వామా పీడీ శంకర్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అయ్యో.. ఎంత కష్టం తల్లీ!
ఒక చేతిలో స్ట్రెచ్చర్.. మరో చేతిలో గ్యాస్ సిలిండర్.. భర్తను బతికించుకునేందుకు ఓ భార్య పడిన పాట్లు ఇవీ. బాబ్బాబూ.. కాస్త వార్డు దాకా లాగండయ్యా.. పుణ్యముంటుంది అని బతిమాలితే.. పుణ్యం కాదు పైసలున్నాయా.. అని చూసే వార్డు బాయ్‌లు.. కదిలిస్తే చాలు.. కయ్యని కసురుకునే ఆయమ్మల నడుమ.. ఇవన్నీ ఎందుకులే అనుకుంటూ భారమైనా.. సత్తువ లేకున్నా.. లాగలేకున్నా.. రొప్పుతూ.. రోడ్చుతూ.. ఎలాగోలా సిలిండర్‌తోపాటు బండి లాగుతూ.. ఓ మహిళ పడిన కష్టమిది. వందలాది మంది సిబ్బంది పనిచేసే సర్వజనాసుపత్రిలో సోమవారం కనిపించిన హృదయ విదారక దృశ్యమిది. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు -
‘పది’ సర్టిఫికెట్లు మాయం.. కలకలం
మంగళగిరి: మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆత్మకూరు జాతీయ రహదారి వెంట నిర్మల హైస్కూలులో సీబీఎస్ఈ 10వ తరగతి సర్టిఫికెట్లు మాయమవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తమ పిల్లల సర్టిఫికెట్లు కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం పాఠశాల యాజమాన్యాన్ని అడగ్గా.. సర్టిఫికెట్లు కనిపించడం లేదంటూ సమాధానం రావడంతో కంగుతిన్నారు. దీంతో వారు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. యాజమాన్యం సర్టిఫికెట్లు మాయం కాలేదని అందరికీ సర్టిఫికెట్లు అందిస్తామని సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలో తల్లిదండ్రులు ఎంఈఓ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేశారు. ● దీనిపై విద్యాశాఖ డిప్యూటీ డీఈఓ శాంతకుమారి, ఎంఈఓ ఉషాకుమారిలు మాట్లాడుతూ జూన్ 23వ తేదీన సర్టిఫికెట్లు పాఠశాలకు రిజిస్టర్ పోస్టులో పంపామని, క్లర్క్ రత్నకుమారి సంతకం చేసి తీసుకున్నట్లు తెలిపారు. డెప్యూటీ డీఈఓ శాంత కుమారి స్కూల్ ప్రిన్సిపాల్ శిరీషను తన కార్యాలయానికి పిలిపించి సర్టిఫికెట్లపై ప్రశ్నించగా జూన్ 23వ తేదీన సర్టిఫికెట్లు వచ్చాయని, తమ క్లర్క్ ఎక్కడో పెట్టి మర్చిపోయిందని నింపాదిగా సమాధానం ఇవ్వడంతో ఆమె ఆగ్రహించారు. జూన్‌లో వచ్చిన సర్టిఫికెట్లు మాయమైతే.. ఇప్పటివరకు తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేయగా ఆర్జేడీ కార్యాలయానికి ఫిర్యాదు చేశామని ప్రిన్సిపాల్ తెలిపారు. ● క్లర్క్ రత్నకుమారి తాను రిజిస్టర్ పోస్టులో సంతకం మాత్రమే చేశానని, సర్టిఫికెట్ల బండిల్ తనకు ఇవ్వలేదని అధికారులకు చెప్పడం విశేషం. ఆర్జేడీ కార్యాలయానికి చేసిన ఫిర్యాదు కాపీతో పాటు సర్టిఫికెట్ల మాయం పూర్తి వివరాలు సేకరించిన డిప్యూటీ డీఈఓ శాంతకుమారి డీఈఓ విజయలక్ష్మికి సమాచారమివ్వగా, డీఈఓ సూచనల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ● పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే సర్టిఫికెట్ల మాయానికి కారణమని, పైగా ఇంగ్లిష్, తెలుగు మీడియంల నిర్వాహకుల మధ్య కొద్దిరోజులుగా అంతర్గత వివాదం కొనసాగుతుందని, ఈ నేపధ్యంలో సర్టిఫికెట్లు మాయమయ్యాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం కల్పించుకుని సర్టిఫికెట్లు త్వరగా వచ్చేలా చూసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల సీబీఎస్ఈ హైస్కూల్లో ఘటన విద్యాశాఖ అధికారులకు తల్లిదండ్రుల ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేసిన డిప్యూటీ డీఈఓ -
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు
గుంటూరు మెడికల్: ఏఆర్టీ, సరోగసి యాక్ట్ అమలుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 27 హాస్పిటళ్లు ఏఆర్టీ, సరోగసి యాక్ట్‌లో రిజిస్టర్ అయి ఉన్నాయన్నారు. చట్టానికి లోబడి ఉండాల్సిన బాధ్యత 27 ఆసుపత్రుల యాజమాన్యాలపై ఉందన్నారు. తనతోపాటు ప్రోగ్రాం ఆఫీసర్లు తరచుగా ఈ ఆసుపత్రులను తనిఖీ చేస్తారని తెలిపారు. ఎక్కడైనా నిబంధనలు పాటించకపోతే వారిపై కేసు నమోదు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రిజిస్టర్ల నిర్వహణ, ధరల పట్టికలు డిస్ ప్లే చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించినట్లు తెలిస్తే ఆయా ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి -
నిమజ్జనానికి తరలిన ‘జెడ్పీ’ గణేశుడు
గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో కొలువైన విఘ్నేశ్వరుడు సోమవారం నిమజ్జనానికి బయలుదేరాడు. ఎనిమిదవ గణపతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన నిమజ్జనోత్సవంలో భాగంగా జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ దంపతులు గణేష్ మండపం వద్ద కొబ్బరికాయ కొట్టి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాయంత్రం మేళతాళాలతో నిమజ్జనానికి విఘ్నేశ్వరుని తరలించారు. వేలంలో నంబూరు నిర్మల భారతి లడ్డూను రూ.45 వేలకు దక్కించుకున్నారు. వేలంను ఉద్యోగులు ఉషాదేవి, అహ్మద్ నిర్వహించారు. జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, పంచాయతీరాజ్ ఉద్యోగుల రాష్ట్ర నాయకుడు డాక్టర్ కూచిపూడి మోహన్, జెడ్పీ పరిపాలనాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధిపై రాజముద్ర
వైఎస్ఆర్.. ఆ పేరే ఒక ప్రభంజనంఎవరూ చెరపలేని, మరువలేని సజీవ సంక్షేమ సంతకంపేదింటి గుండె కోవెలలో నేటికీ ఆయన సజీవంఅన్నదాతల చిక్కటి చిరునవ్వుల్లో ఆయన చిరునామా పదిలండాక్టర్లుగా, ఇంజినీర్లుగా మారిన పేదింటి బిడ్డల హృదయాల్లో ఆయన స్థానం చిరస్మరణీయంఆయనంటే నమ్మకం.. ఆయనుంటే జన సందోహంఉమ్మడి జిల్లాపై మహానేత మమకారం అపూర్వంజిల్లా అభివృద్ధిపై ఆయన ముద్ర శాశ్వతంసాక్షి ప్రతినిధి, గుంటూరు: రైతును రాజును చేయాలని అహర్నిశలు కలలుగన్న రైతుబాంధవుడు దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆ మహానేత ముందుకు వెళ్లారు. జలయజ్ఞంలో భాగంగా పులిచింతల ప్రాజెక్టు రూపకల్పనతో పాటు ఆయకట్టు స్థిరీకరణ కోసం పాటు పడ్డారు. రైతుల బతుకు చిత్రాన్ని మార్చడం కోసం కలలు కన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన పులిచింతల ప్రాజెక్టును ఆయన అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 2004 అక్టోబరు 15వ తేదీన రూ. 680 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు విజయవాడ, గుంటూరు నగర ప్రజల దాహార్తి తీర్చడంతోపాటు కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడానికి ఉపయోగపడుతోంది. ఈ మధ్యకాలంలో వర్షాభావ పరిస్థితులు వచ్చినా సరే కృష్ణా డెల్టాకు నీటి ఇబ్బంది లేకపోవడానికి పులిచింతల ప్రాజెక్టే కారణం అనడంలో అతిశయోక్తి లేదు.జలయజ్ఞంతో సస్య శ్యామలంనాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ కోసం 2008 ఫిబ్రవరి 2న రూ.4,444.41 కోట్లతో నాగార్జున సాగర్ కుడి, ఎడమల కాలువల ఆధునికీకరణకు అనుమతి ఇచ్చారు. దీని ద్వారా నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో 6.74 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. కృష్ణా పశ్చిమ డెల్టాలో కాలువల ఆధునికీకరణ కోసం రూ. 4,573 కోట్లు కేటాయించారు. ఇందులో గుంటూరు జిల్లాకు సంబంధించి రూ.1760.15 కోట్లను కేటాయించారు. ఇందులో రూ.1187 కోట్ల పనులు జరిగాయి. దీని ద్వారా జిల్లాలో 5.22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. మహానేత పదవీకాలంలో ఉమ్మడి జిల్లా వాసులకు ఉపయోగపడే ఎన్నో ప్రాజెక్టులను ఆయన పూర్తి చేసి జిల్లా అభివృద్ధిపై చెరగని ముద్రను వేసుకున్నారు.వైఎస్సార్ చివరి సంతకం చేసిన ఫైల్ కూడా జిల్లాలో మిర్చి రైతులకు వాతావరణ ఆధారిత బీమా కింద ప్రయోజనం చేకూర్చేదే. ఈ బీమాతో జిల్లాలో నాలుగు లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిర్చి రైతులు ఎకరానికి రూ.లక్ష వరకూ నష్టపోయారు. వారిని ఆదుకుంటామని ప్రకటన చేసినా ఇంతవరకూ పైసా కూడా విదల్చలేదు. దీంతో జిల్లా రైతులు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను గుర్తు చేసుకుంటున్నారు.ఉమ్మడి జిల్లాపై చెరగని ముద్ర ● రాష్ట్ర వ్యాప్తంగా రూ. 12వేల కోట్ల రుణమాఫీలో జిల్లా రైతులు దాదాపు 6.07 లక్షల మందికి రూ. 560 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ● ఇందిర ప్రభ పథకం జిల్లాలో ప్రారంభించి ఉమ్మడి జిల్లా రైతులకు పెద్ద పీట వేశారు. ● ఇందిరమ్మ ఫేజ్–2 ఇళ్లను జిల్లాలోనే ప్రారంభించారు. ● రాజీవ్ పల్లెబాట ద్వారా ఎన్నో గ్రామాలకు తాగునీరందించి పల్లె వాసుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. ● గుంటూరు నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ. 6.50 కోట్లతో తక్కెళ్లపాడు రా వాటర్ ప్లాంట్ నుంచి తక్కెళ్లపాడు నీటి శుద్ధి వాటర్ పాంట్ల వరకు రెండో పైపు లైను నిర్మించారు. తమ నీటి కష్టాలు తీర్చిన మహానేతను నగర ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ● 2008, జూన్ 5న ప్రాజెక్టు వద్ద రైతు సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్సార్ పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు, అచ్చంపేట, అమరావతి, క్రోసూరు మండలాల్లో సాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు కృష్ణానది నుంచి సాగునీటిని అందించేందుకు ఒకే సారి 10 ఎత్తిపోతల పథకాల నిర్మాణాలకు రూ.250కోట్ల నిధులు మంజూరు చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఇప్పుడు ఆ పథకాలు మొత్తం పూర్తి కావడం వల్లనే నియోజకవర్గంలో పంట పొలాలు సాగునీటితో కళకళలాడుతున్నాయి. ● రూ.460 కోట్లతో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన తాగునీటి పథకానికి ఆయనే అంకురార్పణ చేశారు. ● విద్యుత్ బకాయిలు మాఫీ చేయడం ద్వారా జిల్లాలో 80 వేల మంది రైతులకు లబ్ధి చేకూరింది. విద్యుత్ బకాయిల మాఫీ ద్వారా జిల్లాలోని రైతులకు రూ. 36 కోట్ల లబ్ధి కలిగింది. ● అమరావతి మండలం నరుకుళ్లపాడు లో లెవెల్ బ్రిడ్జిలో పడి ఎనిమిది మంది మృతి చెందడంపై డాక్టర్ వైఎస్సార్ తీవ్ర మనస్తాపానికి గురై ప్రమాదకరంగా ఉన్న నరుకుళ్లపాడు, ఎండ్రాయి బ్రిడ్జిలను హైలెవెల్ చేసేందుకు నిధులు మంజూరు చేశారు. ఆ రెండు బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తి కావడంతో ఇప్పుడు ఎంత వర్షం పడినా ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ● ఉచిత విద్యుత్ పథకం ద్వారా జిల్లాలోని 80 వేల మంది రైతులకు ఏడాదికి రూ. 281.60 కోట్ల లబ్ధి చేకూరింది. దీంతోపాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నిరుపేదల పాలిట అపర సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీ పథకాన్ని 2008లో గుంటూరు నుంచి ఆయన ప్రారంభించి జిల్లా ప్రజలు మరిచిపోలేని విషయం. ముఖ్యమంత్రి హోదాలో మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జిల్లాలో 57 సార్లు పర్యటించారంటే ఆయనకు జిల్లాపై ఉన్న మమకారం అర్ధం అవుతుంది. -
కుమారుడి మృతిపై అనుమానాలు
నగరంపాలెం: నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదులు – పరిష్కార వేదికలో బాధితుల నుంచి జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), ఏటీవీ రవికుమార్ (ఎల్/ఓ), ఎ.హనుమంతు (ఏఆర్) ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదిదారుల మొరను ఆలకించారు. ఫిర్యాదులకు సంబంధించి పోలీస్ అధికారులతో మొబైల్ ఫోన్లల్లో మాట్లాడారు. తూర్పు సబ్ డివిజనల్ డీఎస్పీ అబ్ధుల్ అజీజ్ కూడా అర్జీలు స్వీకరించారు. పేరేచర్లలోని దుకాణ సముదాయాల ద్వారా వచ్చే అద్దెలతో జీవిస్తున్నాం. అయితే ఓ దుకాణం ఖాళీగా ఉండటంతో మరో కుమారుడితో కలిసి శుభ్రం చేసుకుంటున్నాం. ఈ క్రమంలో నా పెద్ద కుమారుడు, కోడలు, ఆమె బంధువులు మాపై దాడికి యత్నించారు. మా తదనంతరం రాసిన వీలునామాను ఇటీవల రద్దు చేసుకోవడంతో పెద్ద కొడుకు చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా వారిపై ఎటువంటి చర్యల్లేవు. వృద్ధాప్యంలో ఉన్న మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. – చదలవాడ రమేష్, పద్మావతి, పేరేచర్ల కుమారుడి ఆకస్మిక మృతిపై ఏఎస్పీకి తల్లి ఫిర్యాదు పీజీఆర్ఎస్లో అర్జీలు స్వీకరించిన ఏఎస్పీ, ఇతర పోలీసు అధికారులు వ్యవసాయ పనులతోపాటు కారు డ్రైవర్‌గా చేస్తుంటాను. ఈ క్రమంలో కృష్ణాజిల్లా వాసి పరిచమయ్యారు. సకలతంత్ర విద్యలు వచ్చని నమ్మబలికాడు. దీంతో సుమారు ఇరవై రోజులు ఇంటికి వచ్చి, వెళ్లేవాడు. డబ్బులుంటే ఇవ్వాలని పది రెట్లు ఎక్కువ చేసి ఇస్తానని బదులిచ్చాడు. అయితే అతన్ని మొదట్లో నమ్మలేదు. రెండు, మూడుసార్లు ఒంటిపై వస్త్రంలేకుండా, ఒట్టి పేపర్లో లిక్విడ్ పోసి గాల్లో విసిరాడు. గాల్లో విసిరిన ప్రతిసారి రూ.50 వేలు రూ.500 కరెన్సీ కాగితాలు కిందపడ్డాయి. కింద పడిన కరెన్సీ కాగితాలు పరిశీలించగా, నిజమేనని గుర్తించాను. ఈ క్రమంలో మా బంధువుల బ్యాంక్ ఖాతా నుంచి ఈ ఏడాది మే మూడో తేదిన రూ.10 లక్షలు అతనికి జమ చేయించాను. 21 రోజుల్లో రెట్టింపు చేసి ఇస్తానని నమ్మించాడు. అప్పటి నుంచి అదిగి ఇదిగో అంటూ కాలయాపన చేశాడు. ప్రస్తుతం మొబైల్ ఫోన్ పని చేయడంలేదు. న్యాయం చేయగలరు. – బాధితుడు, తుళ్ళూరు మా రెండో కుమారుడు బాలస్వామి (25) గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. ఈ ఏడాది జూలై 15 రాత్రి ఇద్దరు స్నేహితులు ఇంటికొచ్చి, పని ఉందని బయటకు తీసుకెళ్లారు. తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్ చేసి, బాలస్వామి టిడ్కోగృహాల వద్ద మృతిచెంది ఉన్నాడని తెలిపారు. బాలస్వామి మృతదేహానికి శవ పరీక్షలు చేసి అప్పగించారు. అయితే మా కుమారుడి మృతిపై ఇద్దరు వ్యక్తుల మీద అనుమానాలు వ్యక్తం చేశాం. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాల్లేవు. ప్రస్తుతం అనుమానితులు బయట తిరుగుతున్నారు. కేసు రాజీకి రావాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నా కొడుకు ఎలా, ఎందుకు చనిపోయాడనేది ఇప్పటికీ అంతుపట్టడంలేదు. న్యాయం చేయగలరు. – తల్లి సుజాన, పెద్దమ్మ సువార్తమ్మ, సుల్తాన్‌బాద్, తెనాలి ఏడాది క్రితం సంగడిగుంట రెడ్ల బజార్‌కు చెందిన ఓ మహిళ పరిచయమైంది. నెట్వర్క్ మార్కెటింగ్ అని, రూ.2 వేలు చొప్పున వెయ్యి మందితో కట్టిస్తే రూ.3 లక్షల రుణం ఇప్పిస్తానని నమ్మబలికింది. ఈ క్రమంలో ఇతరులతో రూ.12 లక్షలు, సొంతంగా పొలం విక్రయించి రూ.13 లక్షలు ఆమెకు చెల్లించాను. అయితే మోసపోయానని తెలిసి డబ్బులు అడిగితే చెల్లించడంలేదు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేదు. ఈనెల 19న నా భర్తను రెండు ఆటోల్లో కొందరు వచ్చి ఎత్తుకెళ్లి, చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం పోలీసుల జోక్యంతో విడిచిపెట్టారు. మాకు న్యాయం చేయగలరు. – ఓరుగంటి చంద్రలేఖ, కోటిరెడ్డి, 113 తాళ్ళూరు, ఫిరంగిపురం 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నా భార్యకు మహిళా కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం గుంటూరు నగరంలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. కొద్ది రోజులుగా తలెత్తిన వివాదాల కారణంగా దూరంగా ఉంటున్నాం. అయితే ప్రతిసారి 100కు డయల్ చేయడం, ఆ తరువాత పోలీసులతో దాడి చేయించడం చేస్తోంది. ఇప్పటివరకు ఏడుసార్లు కొట్టించింది. న్యాయం చేయగలరు. – ఎన్.శ్రీనివాసరెడ్డి, కృష్ణనగర్ -
అర్జీల పరిష్కారంలో అలసత్వం తగదు
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: అర్జీల పరిష్కారంలో సిబ్బంది అలసత్వం ప్రదర్శించకూడదని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఒకసారి పరిష్కరించే అర్జీలు తిరిగి ఓపెన్ కాకుండా చూసుకోవాలన్నారు. బియాండ్ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లే అర్జీలు రీఓపెన్ అయితే సంబంధిత అధికారులపై క్రమశిక్షణా చర్యలుంటాయన్నారు. అర్జీల పరిష్కారంలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జి.సాయి శ్రీకాంత్, పి.దీపు మార్టిన్‌లకు కలెక్టర్ కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేసారు. అనంతరం వచ్చిన 220 అర్జీలను కలెక్టర్‌తోపాటు జేసీ ఎ.భార్గవ్ తేజ, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు. -
అంతర్ జిల్లాల దొంగలు అరెస్టు
నగరంపాలెం: ఐదు రోజుల క్రితం ఒంటరి వృద్ధురాలిపై దాడికి పాల్పడిన ఇద్దరు అంతర్ జిల్లా దోపిడీ దొంగలను కొల్లిపర పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. వారి నుంచి రూ.13 లక్షల ఖరీదైన బంగారం స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ వివరాలు వెల్లడించారు. కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన 78 ఏళ్ల వృద్ధురాలైన బొల్లిముంత బుల్లెమ్మ ఒంటరిగా నివాసం ఉంటుంది. గతనెల 26న మధ్యాహ్నం నిద్రపోతున్న ఆమైపె గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడ్‌తో దాడికి పాల్పడ్డారు. ఒంటిపై ఉన్న సుమారు రూ.13 లక్షల బంగారపు ఆభరణాలతో ఉడాయించారు. దీనిపై బాధితురాలి కుమారుడు కొల్లిపర పీఎస్‌లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. తెనాలి రూరల్ పీఎస్ సీఐ ఉమేష్ దర్యాప్తులో భాగంగా పరిసరాల్లోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. ఓ బైక్‌పై ఉన్న ఇద్దరు నిందితులను గుర్తించారు. ప్రస్తుతం గుంటూరు బొంగరాలబీడులో ఉంటున్న పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం లెనిన్‌నగర్ ఏడో వీధికి చెందిన కుంచపు దుర్గాప్రసాద్, ప్రస్తుతం గుంటూరు నల్లపాడులో ఉంటున్న పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం లెనిన్‌నగర్ వాసి కొత్తపల్లి ఎలీషాలుగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరితోపాటు బంగారం భద్రపరచడం, సగ భాగం విక్రయించడంలో కీలక పాత్ర పోషించిన కుంచెపు దుర్గాప్రసాద్ భార్య మున్నంగి ప్రియాంకను అరెస్ట్ చేశారు. రెక్కీ.. అనంతరం దాడి నిందితులు ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు.. రాత్రిళ్లు గేదెలు, గొర్రెలు, పొట్టేలు, నిలుపుదల చేసిన బైక్‌లు, ఇళ్ల తాళాలు పగులకొట్టి విలువైన వస్తువులు చోరీ చేయడంలో నేర్పరులు. ఇక వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులతో చెడు వ్యసనాలకు వెచ్చించేవారు. ఈ క్రమంలో అత్తోట గ్రామంలో చోరీ చేసేందుకు వచ్చారు. ఒంటరిగా నిద్రకు ఉపక్రమించిన బొల్లిముంత బుల్లెమ్మను చూసి, కాసేపు రెక్కీ నిర్వహించి, అనంతరం ఇంట్లోకి ప్రవేశించి ఇనుప రాడ్‌తో తలపై మోది ఆభరణాలతో ఉడాయించారు. వీరిద్దరిపై 21కి పైగా కేసులున్నాయి. గుంటూరు జిల్లాలోని అరండల్‌పేట, కొత్తపేట, నగరంపాలెం, పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ, మాచర్ల, వెల్దుర్తి, మాచవరం, కారంపూడి, బెల్లంకొండ, అమరావతి, రాజుపాలెం, రెంటచింతల, భీమడోలు, తణుకు పోలీసు స్టేషన్లలో పలు కేసులున్నాయి. -
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై వివక్ష తగదు
గుంటూరు వెస్ట్: ఎయిడ్స్ బారినపడకుండా ఉండాలని అనుకోని పరిస్థితుల్లో ఈ వ్యాధికి గురైన వారిపట్ల వివక్షత చూపవద్దని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ రూపొందించిన హెచ్ఐవీని చర్చిద్దాం – నిర్మూలిద్దాం పోస్టర్‌ను కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లి నుంచి శిశువుకు, కలుషితమైన సిరంజ్‌లు, రక్తమార్పిడి, జాగ్రత్తలు పాటించని లైంగిక సంబంధాల కారణంగా హెచ్ఐవీ సోకుతుందన్నారు. వ్యాధి సోకినా కూడా ప్రభుత్వం అనేక విధాలుగా రోగులను ఆదుకుంటుందని తెలిపారు. దీని బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. పేదల గృహాలు త్వరగా పూర్తి చేయాలి గుంటూరు వెస్ట్: జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిర్ధేశించిన 11,049 ఇళ్ల నిర్మాణాలను ఈనెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 15వ తేదీకల్లా మూడు లక్షల ఇళ్లు ఒకేసారి గృహ ప్రవేశాలు చేయించాలని నిర్ణయించారన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో ఇప్పటికే 7వేల గృహాలు పూర్తి చేశారని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని, హౌసింగ్ అధికారులు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. లే–అవుట్లలో అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించాలన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం ద్వారా ఇళ్లు నిర్మించుకోవడానికి ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. జేసీ ఎస్.భార్గవ్‌తేజ, డీఆర్వో షేక్ ఖాజావలి, సీపీఓ శేషశ్రీ, హౌసింగ్ పీడీ ప్రసాద్, డ్వామా పీడీ శంకర్, డీపీఓ సాయికుమార్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల సందర్శన
తెనాలి: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు గుంటూరు జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి కె.రాజకుమారి సమక్షంలో వివిధ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సోమవారం సందర్శించి, ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ప్రయోజనాలు, ఫలితాలు, రైతుల అనుభవాలను నేరుగా అవగాహన చేసుకున్నారు. తెనాలి రూరల్ మండలం గ్రామం ఎరుకలపూడిలో రైతు విజయలక్ష్మి వరి పొలంలో ఏర్పాటు చేసిన గట్టు మోడల్ వద్ద, ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ (ఏపీసీఎన్ఎఫ్) తొమ్మిది సార్వత్రిక సూత్రాలను వీక్షించారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి కె.రాజకుమారి ఈ సూత్రాల విశిష్టత, వరి సాగులో గట్టు మోడల్ ప్రత్యేకతను వివరించారు. విజయలక్ష్మి, రంగయ్య తదితర రైతుల పది ఎకరాల వరి పొలం బ్లాక్‌ను పరిశీలించిన శాస్త్రవేత్తలు, ప్రకృతి వ్యవసాయంలో ‘బీఆర్ఐఎక్స్’ విలువలు 12 శాతంగా ఉండగా, రసాయనిక వ్యవసాయంలో 9 శాతమే నమోదైనట్లు గమనించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ బయోరిసోర్స్ సెంటర్‌ను సందర్శించారు. ● కొల్లిపర మండలం దావులూరిపాలెం గ్రామంలో రైతు వసంతమ్మ ఏ–గ్రేడ్ 365 డీజీసీ మోడల్ అరటి తోటను సందర్శించారు. ఇక్కడ బీఆర్ఐఎక్స్ విలువలు ప్రకృతి వ్యవసాయంలో 11 శాతం, రసాయనిక వ్యవసాయంలో 7 శాతం నమోదు కావటాన్ని గమనించారు. అదే గ్రామంలో మాణిక్యమ్మ అరటి–చామగడ్డ మోడల్ పంటను, శ్రీలక్ష్మీ సూర్య మండల మోడల్ పెరటి తోటను పరిశీలించారు. కొల్లిపర గ్రామంలో రాధాకృష్ణ స్వయంసహాయ సంఘ సభ్యులతో సమావేశమై, రైతుల అనుభవాలను విని వారిని శాస్త్రవేత్తలు అభినందించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ఫలితాలను ప్రత్యక్షంగా గమనించిన శాస్త్రవేత్తలు, తమ విజ్ఞానాన్ని రైతు లతో పంచుకుంటూ, ప్రకృతి వ్యవసాయ పరంగా రైతులు సాధిస్తున్న ప్రగతిని ప్రశంసించారు. విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో పాటు ఆర్‌వైఎస్‌ఎస్ సీనియర్ థిమాటిక్ లీడ్ జాకిర్, సీనియర్ అసోసియేట్ వరలక్ష్మి, థిమాటిక్ పాయింట్ పర్సన్ అపర్ణ, జిల్లా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే బలిదానాలకు సిద్ధం
గుంటూరు వెస్ట్: సీపీఎస్, జీపీఎస్‌లను రద్దు చేయకపోతే బలిదానాలకు సైతం తాము సిద్ధమవుతామని గుంటూరు జిల్లా ఐక్య వేదిక చైర్మన్ సయ్యద్ చాంద్ బాషా హెచ్చరించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమీపంలోని ఉద్యోగ సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో చాంద్ బాషా మాట్లాడుతూ సీపీఎస్తోనే సతమతమవుతుంటే జీపీఎస్ కూడా తెచ్చి మమ్మల్ని దారుణంగా దెబ్బతీసారన్నారు. ప్రజలకు దాదాపుగా 40 ఏళ్లు సేవచేస్తే మాపై ఎందుకింత కక్షని ప్రశ్నించారు. ప్రభుత్వం తమ న్యాయమైన కోర్కెలను అంగీకరించకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు పెన్షనర్లు ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఉద్యోగ సంఘ నాయకులు లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, పెదరత్త య్య, సుమిత్రా, పద్మజ, ఆలీసు, షబనా పాల్గొన్నారు. జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా -
13న జాతీయ లోక్‌అదాలత్
గుంటూరు లీగల్: ఈనెల 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేయడానికి ప్రయత్నం చేయాలని నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్.శరత్‌బాబు అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో సివిల్ జడ్జిలకు, పోలీస్ అధికారులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ సోమవారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి వి.ఏ.ఎల్. సత్యవతి, మూడో అదనపు జిల్లా జడ్జి సీహెచ్.వెంకట నాగ శ్రీనివాసరావు, రెండో అదనపు జిల్లా జడ్జి వై.నాగరాజా, ఐదో జిల్లా జడ్జి స్పెషల్ కోర్ట్ ఫర్ ది ట్రయిల్ అఫ్ ఆఫెన్సెస్ అగైనెస్ట్ విమెన్ కె.నీలిమ పాల్గొన్నారు. ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కారానికి తగు సలహాలు, సూచనలు చేశారు.అత్యాధునిక సదుపాయాలతో అంబులెన్స్ గుంటూరు వెస్ట్: వెంటిలేటర్‌తోపాటు అత్యాధునిక సదుపాయాలతో కూడిన అంబులెన్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో అంబులెన్స్‌కు జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అత్యవసర చికిత్స కోసం అందించనున్న 190 వాహనాలలో తొలి వాహనం అందిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 24 అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయని వీటిలో 15 బేసిక్ లైఫ్ సపోర్ట్ ఇచ్చేవి కాగా 9 అడ్వాన్స్ సదుపాయాలు కలిగినవన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి, డీసీహెచ్ఎస్ డాక్టర్ బీవీ రంగారావు, ఎన్టీఆర్ జిల్లా వైద్య సేవా కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ విజయ్ ప్రకాష్, 108 జిల్లా మేనేజర్ పి.బాలకృష్ణ పాల్గొన్నారు.ట్రాఫిక్‌కు అంతరాయం తెనాలిరూరల్: తెనాలి ఓవర్ బ్రిడ్జి వద్ద సోమవారం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గణేష్ నిమజ్జనం కోసం ఉపయోగించిన డీజే సౌండ్ సిస్టంలను తీసుకెళుతున్న ఓ వాహనం బ్రిడ్జి మొదట్లో నిలిచిపోయింది. ఫుట్‌పాత్, డివైడర్‌కు మధ్యలో వాహనం నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. అతికష్టం మీద వాహనాన్ని తొలగించాల్సి వచ్చింది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ అంతరాయంతో సుమారు గంటపాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వంతెనపై వాహన రాకపోకలను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన కాంక్రీట్ దిమ్మెలను పక్కకు జరిపి ఇరుక్కుపోయిన వాహనాన్ని తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.7,026 క్యూసెక్కులు విడుదలదుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి 7,026 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బ్యారేజి వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్‌కి 276, క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 1,760, క్యూసెక్కులు, తూర్పు కాలువకు 479, పశ్చిమ కాలువకు 240, నిజాపట్నం కాలువకు 465, కొమ్మూరు కాలువకు 2,680 క్యూసెక్కులు, బ్యారేజి నుంచి సముద్రంలోకి 3,28,125 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. -
యథావిధిగా పింఛన్ల పంపిణీ
నెహ్రూనగర్: సెర్ప్ సీఈఓ ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ గత నెలలో చేసిన విధంగానే ఈ నెలలోనూ అర్హులైన లబ్ధిదారులందరికీ పంపిణీ చేస్తామని డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.15,000, రూ.10,000, రూ.6,000, రూ.4,000 కేటగిరిల పింఛన్ యథావిధిగానే చేస్తారని తెలిపారు.ఒత్తిళ్ల జీవితంలో ఆధ్యాత్మిక చింతన అవసరంఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ నగేష్బాబుమంగళగిరి టౌన్: ప్రస్తుత ఒత్తిళ్లతో కూడుకున్న జీవితాలలో ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక చింతన అవసరమని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్ నగేష్‌బాబు అన్నారు. మంగళగిరి నగర పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో వినాయక చవితి మహోత్సవాల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు. గణపతి భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాల గణపతి విగ్రహం వద్ద లడ్డూలు, స్వామివారి కరెన్సీ నోట్ల దండలకు బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగేష్‌బాబు మాట్లాడుతూ వినాయకచవితి వంటి ఉత్సవాలు ప్రజల్లో ఐకమత్యానికి దోహద పడతాయని, ప్రతి ఒక్కరూ దైవ భక్తి కలిగి సమాజ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఏ మతమైనా అందరూ బాగుండాలని, ఇతరులకు హాని కలిగించరాదని అన్నారు. అనంతరం భక్త బృంద ప్రతినిధులు కృష్ణారావు, అయ్యప్పరెడ్డి, చిన్న వెంకటేశ్వర్లు కమాండెంట్ నగేష్‌బాబును ఘనంగా సత్కరించారు.అందరి ఆరోగ్యం మన బాధ్యతబాపట్ల: జిల్లాలోని ప్రజలందరి ఆరోగ్యం మన బాధ్యతగా తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టరు విజయమ్మ పేర్కొన్నారు. గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2గా పదోన్నతులు కల్పించేందుకు కృషి చేసిన జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ విజయమ్మను ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు. డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ జిల్లా ప్రతి ఒక్కరికి మెరుగైన ఆరోగ్యం అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని గుర్తు చేశారు. కష్టపడి పని చేసేవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పి.నాగేశ్వరరావు, ఏఎన్ఎంలు, ఎన్జీవో నాయకులు పాల్గొన్నారు. -
స్మార్ట్ కార్డుతో సులభతర సేవలు
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెనాలి టౌన్: కొత్త స్మార్ట్ కార్డుతో రేషన్ కార్డుదారులకు పారదర్శకతతో కూడిన సులభతరమైన సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రూరల్ మండలం నందివెలుగులో ఆదివారం క్యూఆర్ స్కాన్‌తో కూడిన కొత్త స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు ఆయనతో పాటు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి చంద్రశేఖర్ మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మొదటిసారిగా స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తెచ్చి, రేషన్ లబ్ధిదారులకు సులభతరమైన సేవలను తీసుకువచ్చిందని వెల్లడించారు. సచివాలయ సిబ్బంది, డీలర్లు కార్డుదారుల ఇంటికి వచ్చి అందిస్తారని వివరించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 1,44,00000 మందికి స్మార్ట్‌కార్డులు ఇస్తున్నట్లు తెలియజేశారు. జిల్లాలో 5,00000 మందికి, నియోజకవర్గంలో 83,866 మందికి ఇవ్వనున్నట్లు వివరించారు. సబ్సిడీపై రేషన్ దుకాణాల్లోనే మరిన్ని నిత్యావసర సరుకులు అందిస్తామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఆర్గానిక్ ఉత్పత్తులు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 29,762 రేషన్ షాపుల ద్వారా 24గంటలు సేవలు అందించే ప్రక్రియకు శ్రీకారం చుడతామని తెలిపారు. స్మార్ట్ కార్డు స్కాన్ చేస్తే లబ్ధిదారుడి వివరాలు పూర్తిగా వెల్లడవుతాయని, ఎక్కడి నుండైనా రేషన్ పొందవచ్చని తెలిపారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పేదరికాన్ని పారదోలడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహా, ఇన్చార్జి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కంభంపాటి శ్రీనివాస్, తహసీల్దార్ కె.వి.గోపాలకృష్ణ, ఎంపీడీవో అత్తోట దీప్తి, డెప్యూటీ ఎంపీడీవో వై.వి.డి.ప్రసాద్, సర్పంచ్ ధూళిపాళ్ల పవన్‌కుమార్, ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి, నన్నపనేని లింగారావు, పలువురు గ్రామపెద్దలు పాల్గొన్నారు. -
దుర్గమ్మకు పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. గుంటూరు జిల్లా కొత్తూరుకు చెందిన మండవ శ్రీనివాసరావు, ఆదిలక్ష్మి దంపతులు నిత్యాన్నదానానికి రూ. 1,00,001 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఉచిత ప్రసాద వితరణకు .. గుంటూరుకు చెందిన తేగెల రవీంద్రబాబు, డాక్టర్ నాగేశ్వరమ్మలు తమ కుమార్తె మమత శ్రీరంగ పేరిట రూ.1,00,001 విరాళంగా ఇచ్చారు. అనంతరం దాతలకు అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటం అందించారు. -
సందడిగా లడ్డూ వేలం పాటలు
తాడేపల్లి రూరల్: వేలంలో వినాయక లడ్డూ ప్రసాదానికి భారీ ధర పలికింది. తాడేపల్లి రూరల్ ప్రాతూరు, కుంచనపల్లి క్రాస్ రోడ్లో అపర్ణ అమరావతి వన్ అపార్ట్మెంట్ సముదాయంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఆదివారం లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఐదు రోజుల పాటు విశేష పూలందుకున్న వినాయకుడుకి ప్రత్యేక పూజలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని వేలం పాటలో కొండూరి కిరణ్‌రెడ్డి, శ్రీలత దంపతులు రూ. 6,81,003కు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ వేలం పాటలో లడ్డూ ఇంత ధర పలకడం సంతోషదాయకమని తెలిపారు. కార్యక్రమంలో అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ మధుసూదన్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజేష్, సెక్రటరీ రాకేష్, జాయింట్ సెక్రటరీ రత్నసాగర్, ట్రెజరర్ బ్రహ్మారావు, సభ్యులు రఘురాం, షబ్బీర్, కల్యాణ్, అన్నపూర్ణ పాల్గొన్నారు. రూ.3,67,000 పలికిన స్వామి లడ్డూ పట్టణ పరిధిలోని వైఎస్సార్ సెంటర్లో వీసా విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం 31 కేజీల లడ్డూకు వేలం పాట నిర్వహించారు. వైఎస్సార్ సెంటర్‌కు చెందిన మేకా శ్రావణ్‌రెడ్డి కుమార్తె పావని రూ. 3,67,000కు పాటను దక్కించుకున్నారు. 11 కేజీల లడ్డూను కారుమూరి సురేంద్ర రూ. 75,000కు దక్కించుకోగా, కేసరి శ్రీనివాసరెడ్డి మణి హారాన్ని రూ. 1,01,116కు సొంతం చేసుకున్నారు. విగ్రహం వద్ద జరిగిన ప్రత్యేక పూజల్లో వైఎస్సార్ సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి (డీవీఆర్) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం భక్తులకు భారీ అన్నదానాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వీసా విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ సభ్యులు భీమిరెడ్డి శరణ్‌కుమార్ రెడ్డి, గుంటక నితిన్ రెడ్డి, మేకా అంజిరెడ్డి, బద్దిగం సుబ్బారెడ్డి, రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. -
సైక్లింగ్‌తో శారీరక దృఢత్వం
జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ నగరంపాలెం: శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం విధులు నిర్వర్తించే పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ సూచించారు. ‘ఫిట్ ఇండియా– సండ్సే ఆన్ సైకిల్’ ర్యాలీకి ఆదివారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఎస్పీతో పలువురు పోలీస్ అధికారులు సైకిళ్లపై పయనించారు. మూడు బొమ్మల కూడలి మీదగా నగరంపాలెం, మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా కూడలి వరకు వెళ్లి, మరలా జిల్లా పోలీస్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ ఫిట్ ఇండియా ర్యాలీ ద్వారా పోలీస్ అధికార, సిబ్బందిలో చురుకుదనం, ఆరోగ్య స్ఫూర్తిని పెంపొందిస్తామని తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది విధిగా వ్యాయామం, క్రీడలు, సైక్లింగ్ అలవర్చుకోవాలని ఆయన సూచించారు. సైక్లింగ్‌తో శారీరక దృఢత్వం పెరుగుతుందని తెలిపారు. అనంతరం పట్టణ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్పీలు అరవింద్ (పశ్చిమ), శివాజీరాజు (సీసీఎస్), ఏడుకొండలరెడ్డి (ఏఆర్), ఎస్బీ సీఐ అలహరి శ్రీనివాస్, పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
కర్లపాలెం: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఓ రైతు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. కర్లపాలెం ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల మేరకు... కాకుమానుకు చెందిన దొప్పలపూడి చంద్రపాల్(61) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం వరినారు కోసం ద్విచక్రవాహనంపై బాపట్ల మీదుగా కర్లపాలెం వస్తున్నాడు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సమీపంలో వెనుక నుంచి వచ్చిన ట్రక్ ఆటో ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో చంద్రపాల్ తీవ్రంగా గాయపడటంతో అతనిని మొదటిగా బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో చంద్రపాల్ మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుని కుమారుడు అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రవీందర్ తెలిపారు. కొల్లూరు : వేగంగా దూసుకొచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ చిరు వ్యాపారి తీవ్రంగా గాయపడి ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. మండలంలోని బొద్దులూరుపాడుకు చెందిన కొల్లూరు వెంకట నరసయ్య (68) గ్రామంలో కిరాణా షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం కొల్లూరులో సామగ్రిని కొనుగోలు చేసుకొని, మోపెడ్‌పై గాంధీనగర్‌లో నివసిస్తున్న కుమార్తెను చూసేందుకు వెళుతున్నారు. ఈ సమయంలో తెనాలి వైపు నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన ఓ ద్విచక్ర వాహనదారుడు నరసయ్య వాహనాన్ని ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను కుమార్తె 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి నరసయ్య మృతి చెందాడు. వైద్యశాల నుంచి వచ్చిన నివేదిక మేరకు కొల్లూరు పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ జానకీ అమరవర్ధన్ తెలిపారు. కారంచేడు: మార్టూరు నుంచి చీరాలకు సరిహద్దు రాళ్ల లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ నష్టం జరగలేదు. ఆదివారం వాడరేవు–పిడుగురాళ్ల ప్రధాన రహదారిలో.. కారంచేడు అంబేడ్కర్ నగర్ కాలనీ సమీపంలో ఈ ఘటన జరిగింది. ట్రాక్టర్ ట్రక్కు వెనుక టైర్లకు బేరింగ్లు ఊడిపోవడంతో ఒక్క సారిగా తిరగబడింది. ఆ సమయంలో ఇతర వాహనాలు అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ కూడా నిదానంగా ప్రయాణిస్తుండటంతో కేవలం ట్రక్కు మాత్రమే బోల్తా పడింది. దీంతో రాళ్లు ప్రధాన రహదారిలో పడటంతో వాహన ప్రయాణాలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. స్థానిక ఏఎస్ఐ శేషసాయి సిబ్బందితో అక్కడకు చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. తెనాలి రూరల్: డివైడర్‌ను ఢీకొట్టి యువకుడు మృతి చెందిన ఘటన శనివారం అర్ధరాత్రి దాటాక తెనాలిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణ మారిస్‌పేట నిజాంపట్నం కాల్వ కట్టపై నివసించే అన్నపురెడ్డి పవన్(21) బైక్‌పై వెళుతూ కొత్త వంతెన వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
సత్తెనపల్లి: విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలని లయోలా ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ వంశీకృష్ణారెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్ల సమీపంలోని లయోలా ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న 12వ అంతర్ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రమం తప్పని సాధన ముందుకు తీసుకు వెళుతుందన్నారు. రిటైర్డ్ పీడీ దాసరి కోటేశ్వరరావు, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.నరసింహారెడ్డి, గుంటూరు జిల్లా సెక్రటరీ పి. సామంతరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ తిరుపతి, ట్రెజరర్ జనార్దన్ యాదవ్, లయోలా ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ ప్రసంగించారు. అనంతరం విజేతలను అభినందించి, బహుమతులు అందించారు. హోరాహోరీగా పోటీలు... పోటీలు నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీగా సాగాయి. సెమీఫైనల్స్‌లో వైఎస్సాఆర్ కడప, గుంటూరు జట్లు తలపడ్డాయి. 0–5తో గుంటూరు విజయం సాధించింది. విజయనగరం, కృష్ణా జట్లు పోటీ పడగా, 11–2తో విజయనగరం విజేతగా నిలిచింది. ప్రీ ఫైనల్స్‌లో గుంటూరు, విజయ నగరం తలపడ్డాయి. గుంటూరు 3–2తో గెలిచింది. వైఎస్సాఆర్ కడప, కృష్ణా జట్లు తలపడిన పోటీలో 4–2తో వైఎస్సాఆర్ కడప జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్స్‌లో విజయనగరం, వైఎస్సాఆర్ కడప జట్లు తలపడ్డాయి. 8–2తో విజయనగరం విజయం సాధించింది. గ్రాండ్ ఫైనల్లో గుంటూరుపై విజయనగరం 5–4తో గెలిచింది. చాంపియన్‌గా విజయనగరం, రన్నర్స్‌గా గుంటూరు, తృతీయ స్థానం వైఎస్సాఆర్ కడప, నాలుగవ స్థానం కృష్ణా జిల్లా జట్టు కై వసం చేసుకున్నాయి. -
రాజ్యాంగ విశిష్టత పరిరక్షణే ధ్యేయం
నగరంపాలెం: భారత రాజ్యాంగ విశిష్టతను పరిరక్షించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని ఏపీ హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ జి.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. గుంటూరు మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ (ఐఎల్ఏ) రాష్ట్ర 10వ మహాసభ ముగిశాయి. ఆదివారం జరిగిన సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర అధ్యక్షుడు శాంతకుమార్ మాట్లాడుతూ అడ్వొకేట్ వెల్ఫేర్ ఫండ్ స్టాంప్ డ్యూటీని ఏపీ బార్ కౌన్సిల్ పెంపొందించాలని చెప్పారు. అడ్వొకేట్ వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్‌ను దామాషా పద్ధతిలో పెంచకుండా న్యాయవాదులను మోసం చేస్తుందని ఆరోపించారు. హక్కుల సాధనకు రాష్ట్రంలోని న్యాయవాదులంతా ఉద్యమానికి సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నైతికతను కాపాడేందుకు ఐఎల్ఏ ముందుంజలో ఉంటుందని తెలిపారు. న్యాయవాదులకు ఇళ్ల స్థలాలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నూతన కమిటీ ఎన్నిక అనంతరం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా జి.శాంతకుమార్ (గుంటూరు), ప్రధాన కార్యదర్శిగా పి.నరసింహులు, ఉపాధ్యక్షులుగా బి.డేవిడ్ రత్నకుమార్ (విజయవాడ), గుంటి సురేష్‌బాబు (గుంటూరు), మంతిన అప్పారావు (విజయనగరం), జి.రంగనాయకులు (అనంతపురం), కార్యదర్శులుగా యు.విష్ణుకుమార్, వై.నరేష్ (విశాఖపట్నం), కె.శాంతికుమార్ (ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా), జి.ప్రభుదాస్ (కావలి), బి.చంద్రుడు (కర్నూలు), ఎంఈ.గీతావాణి (గుంటూరు), కోశాధికారిగా మొగల్ కాలేషా బేగ్ (గుంటూరు) ఎన్నికయ్యారు. ఏపీ హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ జి.శ్యామ్‌ప్రసాద్ గుంటూరులో ముగిసిన ఐఏల్ఏ రాష్ట్ర 10వ మహాసభలు రాష్ట్ర అధ్యక్షుడిగా శాంతకుమార్ ఎన్నిక -
సౌత్ ఇండియా జోనల్ కరాటే పోటీల్లో సత్తెనపల్లి విద్యార్థుల ప్రతిభ
సత్తెనపల్లి: సౌత్ ఇండియా జోనల్ కరాటే పోటీల్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లి విద్యార్థులు ప్రతిభ చూపారు. బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో ఈనెల 30,31న జరిగిన సౌత్ ఇండియా జోనల్ కరాటే పోటీల్లో సత్తెనపల్లికి చెందిన షికోకాయ్ షిటోరియో కరాటే ఇనిస్టిట్యూట్ విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ చూపి ఐదు గోల్డ్ మెడల్, ఒక బ్రాంజ్ మెడల్‌ను కై వసం చేసుకుని సత్తెనపల్లి పట్టణానికి గుర్తింపు తీసుకొచ్చినట్లు కరాటే మాస్టర్ అనుముల రామయ్య ఆదివారం తెలిపారు. బాలికల కటా విభాగంలో బి అక్షయ్‌రెడ్డి గోల్డ్ మెడల్, బాలుర కటా విభాగంలో బి.టిష్యంత్, ఎంవీ.బాలాజీ, ఎల్ కిరీట్, ఎల్ గెష్ణ్ఆషిత్లు గోల్డ్‌మెడల్స్ సాధించగా .. బి.సత్యనారాయణ బ్రాంజ్ మెడల్ సాధించాడు. ప్రతిభ చూపిన విద్యార్థులను అకాడమీ ఆర్గనైజర్ ఏ.వీరబ్రహ్మం, అడ్వైజర్ ఏ.రాంబాబులు ప్రత్యేకంగా అభినందించారు. -
వెళ్లి రావయ్యా పార్వతి తనయా !
వినాయక నిమజ్జనం అనగానే ఊరూవాడా సందడే.. సందడి! ఐక్యతకు నిర్వచనం !! పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా బొజ్జ గణపయ్యను సాదరంగా సాగనంపడానికి ఉత్సాహం చూపుతారు. వినాయక చవితి సందర్భంగా వాడవాడలా వెలసిన పందిళ్లలో పూజలందుకున్న గణనాథుడు ఆదివారం నిమజ్జనానికి తరలి వెళ్లాడు. వాహనాల మీద ఆశీనుడైన గణనాథుడి ఊరేగింపుల ముందు పిల్లలు, పెద్దలు ఆనందంతో చిందులు వేశారు. డీజే సౌండ్స్ ప్రతిధ్వనించాయి. అనంతరం భక్తిశ్రద్ధలతో విగ్రహాలను గంగమ్మ ఒడిలోకి చేర్చారు. -
104 వాహన సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
లక్ష్మీపురం: 104 మొబైల్ మెడికల్ యూనిట్ ఉద్యోగుల (ఎంఎంయూ) సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని జిల్లా గౌరవాధ్యక్షులు బి. లక్ష్మణరావు తెలిపారు. స్థానిక పాత గుంటూరు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం కె. సత్యరాజు అధ్యక్షతన జరిగిన యూనియన్ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తగ్గించిన వేతనాల సహా ఉద్యోగులకు చెల్లించాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. గత యాజమాన్యం అరబిందో నుంచి రావాల్సిన అన్ని బకాయిలను చెల్లించే విధంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు అమలయ్యే లీవులు, పబ్లిక్ హాలిడేలు, గుర్తింపు కార్డులు, పే స్లిప్పులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వాహనాలకు సరిపడా సిబ్బందిని నియమించాలని, అవసరమైన చోట బఫర్ జోన్ ఉద్యోగులను నియమించాలని కోరారు. వాహనాలకు ఏళ్ల తరబడి మరమ్మతులు చేయక పోవడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, వెంటనే చేయించాలని ఆయన కోరారు. రూ. 10 లక్షల బీమా సౌకర్యాన్ని ప్రతి ఉద్యోగికి కల్పించాలని విన్నవించారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ఈఎస్ఐ పరిధి దాటిన వారికి హెల్త్ కార్డులు ఇవ్వాలని లక్ష్మణరావు కోరారు. డిమాండ్ల సాధనకు నిర్వహించనున్న ఆందోళనలో ఉద్యోగులంతా పాల్గొనాలని ఆయన కోరారు. నూతన కార్యవర్గం ఎన్నిక నూతన అధ్యక్ష, కార్యదర్శిగా గోరంట్ల సురేష్, ఆలూరి శ్రీహర్ష, కోశాధికారిగా ఐ. నాగులు, ఉపాధ్యక్షులుగా కె. సత్తిరాజు, సహాయ కార్యదర్శిగా బి. బాలకృష్ణ, కమిటీ సభ్యులుగా విజయ్ కుమార్, ఏడుకొండలు, సురేష్, సాయిరాం, విజయ్ నియమితులయ్యారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు బి.లక్ష్మణరావు -
నిమజ్జనం వేడుకల్లో నిబంధనలు తప్పనిసరి
జిల్లా అడిషనల్ ఎస్పీ సంతోష్ శావల్యాపురం: వినాయక విగ్రహాల నిమజ్జనం వేడుకల్లో పోలీసు నిబంధనలు అందరూ పాటించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ జి.సంతోష్ అన్నారు. ఆదివారం మండలంలోని పొట్లూరు, వేల్పూరు గ్రామాల్లో జరుగుతున్న వినాయక విగ్రహాల నిమజ్జనం వేడుకలు సందర్భంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వినుకొండ నియోజకవర్గంలో శావల్యాపురం, బొల్లాపల్లి, నూజెండ్ల మండలాల్లో పలు గ్రామాల్లో పర్యటించామన్నారు. వినాయక విగ్రహాలు నిమజ్జనం సమయంలో శాంతిభద్రతలు విఘాతం కల్గుకుండా ఉండటానికి ముందుస్తులో భాగంగా పర్యవేక్షణ చేస్తున్నట్లు వెల్లడించారు. సమస్యాత్మక గ్రామాలుగా ఉండే వాటిపై ప్రత్యేకంగా పోలీసు నిఘా ఉంచామన్నారు. ఐదో రోజు నరసరావుపేట డివిజన్ 397 విగ్రహాలు నిమజ్జనం జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని నిబంధనలు అతిక్రమిస్తే అటువంటి వారిపై కమిటీ సభ్యులను బాధ్యులను చేస్తూ కేసులు నమోదు చేస్తామన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లోని విగ్రహాలు నిమజ్జనం చేసే ఏరియాను పరిశీలించి పోలీసు అధికారులకు సూచనలు చేశారు. ఆయనతోపాటు సీఐ గోపి, ఎస్సై లేళ్ల లోకేశ్వరరావు, ఎస్బి కానిస్టేబుల్ రమేష్, స్టేషన్ రైటరు బాషా పాల్గొన్నారు. -
బీసీలపై వివక్ష చూపుతున్న కూటమి ప్రభుత్వం
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలపై వివక్ష చూపుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర క్రాంతికుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం చుట్టుగుంటలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో బీసీలంతా కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచారన్నారు. బీసీలకు ఇస్తామన్నా హామీలను నెరవేర్చడానికి చిత్తశుద్ధి లేదన్నారు. బీసీలపై కపట ప్రేమ చూపిస్తూ వారిని మభ్య పెట్టాలని చూస్తుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో బీసీలపై అనేక దాడులు జరిగాయన్నారు. వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదిన్నర పాలనలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి నిధులు ఇచ్చిన పాపాన పోలేదని విమర్మించారు. ఎన్నికల సమయంలో చెప్పిన బీసీల రక్షణ చట్టం తెస్తామన్నారు..దానిని గాల్లో పెట్టారన్నారు. కులగణన చేస్తామన్నారు..దానికి అతిగతి లేదన్నారు. తక్షణమే కుల గణన చేపట్టి, బీసీల రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలు ముట్టడి, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కొల్లూరి హనుమంతరావు, గుంటూరు యువజన అధ్యక్షులు తురక రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోలా మణికంఠ పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర క్రాంతికుమార్ -
పారదర్శకత కోల్పోతున్న ఎన్నికల కమిషన్
సిద్ధార్థ లా కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్. దివాకర్ బాబు గుంటూరు ఎడ్యుకేషన్: భారత ఎన్నికల సంఘం గత దశాబ్ద కాలంగా స్వయం ప్రతిపత్తిని కోల్పోవడంతో పాటు పారదర్శకంగా, జవాబు దారీతనంతో వ్యవహరించడం లేదని సిద్ధార్థ లా కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్. దివాకర్ బాబు పేర్కొన్నారు. బ్రాడీపేటలోని బాలానంద కేంద్రంలో ఆదివారం రాజ్యాంగ చర్చా వేదిక అధ్యక్షుడు నడింపల్లి గురుదత్ అధ్యక్షతన ‘‘రాజ్యాంగం – భారత ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి’’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య వక్త దివాకర్‌బాబు మాట్లాడుతూ రాజ్యాంగంపై నమ్మ కం, విశ్వాసం లేని వాళ్లు పాలకులుగా కొనసాగు తూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ త్రిసభ్య కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, ఆ స్థానంలో కేంద్ర మంత్రిని పెట్టడం సబబు కాదని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రను కోల్పోయే విధంగా కేంద్ర ప్రభు త్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా 65 లక్షల ఓట్లను తొలగించడం, ఆధార్ కార్డును పరిగణన లోకి తీసుకోకుండా జనన ధ్రువీకరణ పత్రాలను కోరడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. అత్యధికులు బిహార్ నుంచి వలస కార్మికులుగా పలు రాష్ట్రాలకు పోతున్న స్థితిని ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకోక పోవడం విచారకరమని తెలిపారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌కు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో సొంత సిబ్బంది ఉండాలని అభిప్రాయపడ్డారు. ఓటర్ల జాబితా సక్రమంగా ఉంటే ప్రజా స్వామ్యం వికసిస్తుందని, దాని రూపకల్పనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగ చర్చా వేదిక అధ్యక్షుడు నడింపల్లి గురుదత్ మాట్లాడుతూ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా దాన్ని కాపాడుకోవాలని కోరారు. రాజ్యాంగ చర్చా వేదిక కార్యదర్శి అవధానుల హరి మాట్లాడుతూ కాగ్, యూపీఎస్సీ, ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థల్లో అధికార పార్టీల జోక్యం ఉండరాదని తెలిపారు. రాజ్యాంగ చర్చా వేదిక సంయుక్త కార్యదర్శి డాక్టర్ టి. సేవా కుమార్, ప్రోగ్రెసివ్ ఫోరమ్ అధ్యక్షుడు పి. మల్లికార్జునరావు, అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, సీపీఎం నేత నళినీ కాంత్, సామాజిక విశ్లేషకులు టి. ధనుంజయ రెడ్డి ప్రసంగించారు. -
రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్
గుంటూరు మెడికల్: మొదటి నుంచి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు సామాజిక న్యాయాన్ని చిన్నచూపు చూస్తూ తమ అనుంగ మిత్రుల లాభార్జనకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రతన్‌లాల్ తెలిపారు. స్థానిక బ్రాడీపేటలోని జాషువా విజ్ఞాన కేంద్రంలో ఆదివారం బి.పి. మండల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అధ్యక్షతన ‘భారత రాజ్యాంగం, సామాజిక న్యాయం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ప్రొఫెసర్ రతన్‌లాల్ మాట్లాడుతూ రాజ్యాంగంలో చెప్పిన సామ్యవాద, లౌకిక వాద ఆలోచనలను వ్యతిరేకిస్తూ, దాని స్థానంలో మను ధర్మ శాస్త్రం ఉండాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని చిత్తశుద్ధితో అమలు చేసిన కాంగ్రెస్ ద్వారానే బహుజనులకు సామాజిక న్యాయం అందుతుందని చెప్పారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరుతో పనిచేస్తున్న అనేక పార్టీలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనువాదులతో కలిసి దళితులకు ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. దళిత బహుజనులను అభివృద్ధిలో భాగం చేసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నేడు బహుజనులు అందరి పైనా ఉందని తెలిపారు. దేశంలో ప్రతి పౌరునికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమాన అవకాశాలు అందేలా ప్రభుత్వాలు నడవాలని ఆయన సూచించారు. అనంతరం డాక్టర్ రతన్లాల్ను బి.పి. మండల్సేన అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు దుశ్శాలువతో సత్కరించారు. సమావేశానికి ముందు అమరావతి రోడ్డులోని బీసీ రిజర్వేషన్ల సాధకుడు బి.పి. మండల్ విగ్రహానికి, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ రతన్‌లాల్ -
అవినీతి కాంట్రాక్టర్లు, అధికారుల గుండెల్లో రైళ్లు
నెహ్రూనగర్: సాక్షిలో వచ్చిన కథనంతో నగరపాలక సంస్థ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అభివృద్ధి పనుల టెండరింగ్‌లో పాల్గొనకుండానే బడా కాంట్రాక్టర్లు దొంగ డాక్యుమెంట్స్ పుట్టించి టెండర్లు దక్కించుకున్నారు. పనుల్లో లెస్సు కోట్ చేసి ఆ తరువాత దాన్ని టాంపరింగ్ చేశారు. టెండరింగ్‌లో అవకతవకలపై గత నెల 22న సాక్షి దినపత్రికలో వచ్చిన ‘రూ.కోట్లలో తమ్ముళ్ల లూటీ’ కథనం ఇంజినీరింగ్ విభాగంలోని డ్రాయింగ్ బ్రాంచ్‌లో జరుగుతున్న అవినీతిని వెలుగులోకి తెచ్చింది. అప్పటి నుంచి ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, ఆప్కాస్ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఎక్కడ తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందో అని భయాందోళనలో ఉన్నారు.తూతూమంత్రంగా రిపోర్టుకమిషనర్ ఆదేశంతో ఇంజినీరింగ్ అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. వారం రోజుల తరువాత తూతూమంత్రంగా రిపోర్టు అందజేసినట్లు సమాచారం. సాక్షిలో ప్రచురితమైన కథనంపై టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి, కార్పొరేటర్ వేముల శ్రీరాంప్రసాద్లు కౌన్సిల్ సమావేశంలో అధికారులను నిలదీశారు. వారికి సమాధానం చెప్పలేక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.అడ్డదారిలో వంద పనులుటెండర్లో పాల్గొనకుండా వర్కులు చేసుకున్న జాబితాలో బడా కాంట్రాక్టర్లు(తెలుగు తమ్ముళ్లు) ఉన్నట్లు సమాచారం. ఆదాయం ఉన్న పనులను బ్లాక్ చేసుకుని వాటిని టెండర్ దాకా రాన్వికుండా అడ్డదారిలో దక్కించుకున్నారు. సుమారు వందకు పైగా ఇలా అడ్డదారిలో చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని ద్వారా కార్పొరేషన్‌కు రూ.10కోట్లకు పైగా నష్టం చేకూరిందని సమాచారం. కాంట్రాక్టర్లపై ఆర్ఆర్ యాక్ట్(రెవెన్యూ రికవరీ యాక్ట్) కింద డబ్బులు వసూలు చేసేందుకు కమిషనర్ సిద్ధమైనట్లు సమాచారం. విషయం బడా కాంట్రాక్టర్లకు తెలియడంతో ఎలాగైనా బయట పడేందుకు పావులు కదుపు తున్నారు.ఇంజినీరింగ్ అధికారుల్లో వణుకుఅవకతవకల్లో సంబంధం ఉన్న ఆప్కాస్ ఉద్యోగిని విధుల నుంచి అధికారులు తొలగించారు. మిగతా అధికారులపై కూడా క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. డ్రాయింగ్ బ్రాంచ్‌లో పనిచేసే ఆప్కాస్ ఉద్యోగులను అక్కడ నుంచి వేరే సెక్షన్‌కు బదిలీ చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. 2018 నుంచి నగరపాలక సంస్థలో పనిచేసిన ఎస్ఈలు, హెచ్డీ (డ్రాఫ్ట్స్ మేన్), జేటీఓ, ఏఈలు, డీఈలు, ఈఈలు ఎక్కడ ఈ వ్యవహారం మెడకు చుట్టుకుంటుందోనని అనుక్షణం భయపడుతున్నారు.2018 నుంచి జరుగుతున్న తంతుటెండర్లో పాల్గొనకుండా పనులు చేయడం, లెస్సుల్లో మాయాజాలం చేయడం 2018 నుంచి జరుగుతోంది. గత కమిషనర్ కీర్తి చేకూరి ఈ విషయాన్ని పసిగట్టారు. సదరు వర్కులను నిలిపివేశారు. చేసిన వర్కులకు కాంట్రాక్టర్ల బిల్లులు ఆపేశారు. మరికొంత మంది నుంచి డబ్బులు వసూలు చేశారు. డ్రాయింగ్ బ్రాంచ్‌లో పనిచేసే అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు పలువురికి స్థానం చలనం కల్పించారు. కూటమి ప్రభుత్వం రాగానే వారంతా తిరిగి డ్రాయింగ్ బ్రాంచ్‌కు వచ్చారు. దీనికితోడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ రెచ్చిపోయారు. 2018లో చేసినట్లే ఇప్పుడు కూడా చేశారు. కొంత మంది కాంట్రాక్టర్లు టెండర్లో పాల్గొనకుండా పనులు ఏ విధంగా చేస్తున్నారని ఆరా తీస్తే అవినీతి పర్వం వెలుగులోకి వచ్చింది. గత నెల 22న ప్రచురితమైన కథనానికి కమిషనర్ పులి శ్రీనివాసులు స్పందించారు. గత సంవత్సరం నుంచి జరిగిన పనుల వివరాలతో 24గంటల్లో తనకు పూర్తి స్థాయి నివేదికను అందించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.కేసులు పెడతాంటెండర్ ప్రక్రియలో అవకతవకలకు పాల్పడిన ఆప్కాస్ ఉద్యోగిని విధుల నుంచి తొలగిం చాం. దాంతో పాటు ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్నవారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యాం. సమగ్ర విచారణ చేసి రిపోర్టు ఇవ్వాలని ఎస్ఈని ఆదేశించాను.– పులి శ్రీనివాసులు, నగర కమిషనర్ -
ప్రగతి పనులపై నిరంతర సమీక్షలు
గుంటూరు వెస్ట్: గుంటూరు ప్లారమెంట్ పరిధిలో ప్రారంభమైన అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో నిరంతర సమీక్షలు నిర్వహించి మరింత వేగంగా పూర్తి చేసేందుకు యత్నిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, అధికారులతో రైల్వే ప్రాజెక్టులు, హౌసింగ్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.5 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. పెదకాకాని ఆర్వోబీ నిర్మాణాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులున్నాయని తెలిపారు. స్థానికంగా ఉండే కొన్ని ఇళ్లు తొలగించాల్సి ఉంటుందని, వారి అంగీకారం లభించిన వెంటనే పనులు వేగం పెంచుతామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, నగర మేయర్ కోవెలమూడి రవీంద్రబాబు, డీఆర్వో షేఖ్ ఖాజావలి, డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, రైల్వే ఆర్డీఎం సుదేశ్నసేన్, గతి శక్తి డిప్యూటీ సీఈ నోయల్ పాల్గొన్నారు. – కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ -
సంజీవయ్యనగర్ రైల్వే గేటు మూసివేత
నెహ్రూనగర్: సంజీవయ్యనగర్ రైల్వే గేటు వద్ద పైపులైన్ పనుల నిమిత్తం వచ్చే నెల 2వ తేదీ సాయంత్రం వరకు రైల్వే గేటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. నెహ్రూనగర్ రిజర్వాయర్ నుంచి హెచ్ఎల్ఆర్ (లక్ష్మీపురం) రిజర్వాయర్‌కు తాగునీటిని సరఫరా చేసే 900 ఎంఎం డయా పైపులైన్‌కు నెహ్రూనగర్ పంప్ హౌస్ వద్ద, సంజీవయ్యనగర్ రైల్వే గేటు వద్ద ఇంటర్ కనెక్షన్ పనులు జరగనున్నాయి. ఇవి ఆదివారం నుంచి 2వ తేదీ సాయంత్రం వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గేటు మీదుగా రైల్వే అధికారుల సహకారంతో రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. 2వ తేదీ సాయంత్రం ఇంటర్ కనెక్షన్ పనులు పూర్తయిన తరువాత గేటు తీస్తామని పేర్కొన్నారు. -
ఇద్దరు గంజాయి విక్రేతలు అరెస్టు
2.2 కిలోల సరుకు స్వాధీనం లక్ష్మీపురం: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు నగరంపాలెం సీఐ ఎం.నజీర్‌బేగ్ తెలిపారు. పోలీసు స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్, వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ క్వార్టర్స్ వెనుక ఖాళీ స్థలంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టామన్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరిలో తండ్రి, కొడుకులు చెడు వ్యసనాలకు బానిసలై గంజాయి విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల ప్రాంతం నుంచి గంజాయి తెచ్చి గుంటూరు నగరంలో విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఇద్దర్ని అరెస్టు చేశామని, వారి నుంచి కొనుగోలు చేస్తున్న నలుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నామని వివరించారు. 2.2 కేజీల గంజాయి, ద్విచక్ర వాహనాన్ని, కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
పాఠశాలలకు బహుమతులు
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లాలో స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్–2025కు ఎంపికై న ఐదు పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులను ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక అభినందించారు. శనివారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంబంధిత పాఠశాలల హెచ్ఎం, ఫిజికల్ డైరెక్టర్లను శాలువాతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. ఎంపికై న వాటిలో ప్రథమ స్థానంలో మంగళగిరి మండలం నవులూరు జెడ్పీ హైస్కూల్, తరువాతి స్థానాల్లో వట్టిచెరుకూరు మండలం పల్లపాడు, మంగళగిరి మండలం నూతక్కి, పెదకాకాని మండలం ఉప్పలపాడు, చేబ్రోలు మండలం నారాకోడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలు నిలిచాయి, కార్యక్రమంలో గుంటూరు ఆర్‌ఐపీఈ మహబూబ్ బాషా, ఏపీ పీఈటీ, పీడీ అసోసియేషన్ అధ్యక్షుడు బి. కరీముల్లా చౌదరి, గుంటూరు జిల్లా కార్యదర్శి సీహెచ్ కొండయ్య, గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి మెల్లంపూడి రవి పాల్గొన్నారు. -
రాజధాని రైతుల భూ సమస్యలు పరిష్కరించాలి
గుంటూరు వెస్ట్: అమరావతి రాజధాని పరిధిలోని రైతులకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. శనివారం గుంటూరు కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్‌తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో కలిసి నిర్వహించిన సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ రైతులు అధికారుల దృష్టికి తీసుకొస్తున్న ఇబ్బందులను ఒక పోర్టల్‌లో ఉంచి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మాట్లాడుతున్న కమిషనర్ కన్నబాబు -
పురస్కారమూ పెద్ద ప్రహసనమే!
తెనాలి: సాహిత్య, కళారంగాల్లోని ప్రముఖుల కృషికి తగిన గుర్తింపునిచ్చి ప్రభుత్వం తరఫున అవార్డులతో ప్రోత్సహించడం సంప్రదాయంగా వస్తోంది. రచయితలు, కళాకారులు ఆయా రంగాల్లో వారు చేసిన కృషి సామాజిక వికాసానికి, పురోగమనానికి దోహదపడే స్థాయిని అనుసరించి పురస్కారాలకు ఎంపిక చేస్తుంటారు. ఇందుకోసం గతంలో గౌరవప్రదమైన విధివిధానాలుండేవి. ఆయా రంగాలకు చెందిన ప్రభుత్వ సంస్థలు, సలహా సంఘాలు పనిచేసేవి. సాహిత్య, కళాప్రక్రియల్లోని విశిష్ట రచనలు, ప్రదర్శనలను పరిశీలించి అర్హులను గుర్తించి గౌరవ పురస్కారాలను అందజేసేవారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉగాది, కళారత్న, కందుకూరి వీరేశలింగం, గిడుగు రామమూర్తి, గుర్రం జాషువా పురస్కారాలు ఈ కోవలోనివి. రాజకీయ జోక్యం ఈ పురస్కారాల ప్రదానం కోసం రచయితలు, కళాకారులు, భాషాప్రముఖుల ఎంపికలో పక్షపాతం చూపుతోంది కూటమి సర్కారు. వారి సృజన, కృషి, సేవలు వంటివి పక్కకు పోయాయి. ప్రభుత్వం రాజకీయ అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతిభావంతులైన రచయితలు, కళాకారుల రాజకీయ భావజాలాన్ని, వారి రాజకీయ కార్యాచరణను అధికార పార్టీ కిందిస్థాయి రాజకీయ కార్యకర్తల ద్వారా విచారణ చేయిస్తోంది. అక్కడక్కడా రచయితలు, కళాకారుల ఇళ్లకు వెళ్లి ఇంటర్వ్యూలతో ఆయా వివరాలను సేకరిస్తున్నారు. తర్వాతనే అవార్డులకు ఎంపిక చేస్తున్నారు. ఇవిగో నిదర్శనాలు... ఇంతకుముందు ఉగాది/కళారత్న అవార్డుల ఎంపిక ప్రక్రియల్లో తెనాలికి చెందిన ప్రముఖ కళాకారిణిని అవార్డుకు ఎంపిక చేశారు. ఆమె తండ్రి ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుడనే కారణంగా చివరి నిమిషంలో రద్దు చేసినట్టు అప్పట్లో బహిరంగంగానే విమర్శలొచ్చాయి. అలాగే శుక్రవారం ప్రదానం చేసిన భాషా అవార్డుల విషయంలోనూ ఇదే తీరు కొనసాగింది. రాత్రివేళ ఫోన్లు చేసి, ‘మీరు ఫలానా కదా! మీ రాజకీయ వైఖరి ఏంటి’ అంటూ విచారించినట్టు సమాచారం. పురస్కారానికి ఎంపికై నట్లు చెప్పి, వెంటనే రావాలని ఫోనులో సమాచారం చేరవేస్తున్నారు. నిర్ణీత వ్యవధిలో దూరప్రాంతాల వారు కొందరు అవార్డులను స్వయంగా స్వీకరించలేకపోతున్నారు. ఉగాది/కళారత్న అవార్డులనే కాదు... శుక్రవారం భాషా దినోత్సవ అవార్డుల కార్యక్రమంలోనూ ఇదే పరిస్థితి. రాలేని వారు సంబంధిత కార్యాలయం నుంచి తర్వాత స్వీకరించాలని చెబుతున్నారట! నేతల సిఫార్సులు తాము చేసిన రచనలు, కళలు, కళారూపాల గురించి ప్రముఖులే ఏకరువు పెట్టుకోవాల్సి వస్తోంది. ఆశావహులు తమ దరఖాస్తులకు సంబంధిత ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సు లేఖలను జత చేయిస్తున్నారు. రచయితలకు రచనా ప్రక్రియల్లో, నాటక, నృత్య, సంగీత విభాగాల్లో సంబంధిత ప్రముఖులకే పురస్కారాలను ప్రదానం చేయాలనేది అందరి భావన. కూటమి ప్రభుత్వం వచ్చాక సాహిత్య, కళా రంగాల్లో అవార్డుల ప్రకటన కూడా ప్రహసనంగా మారింది. ఎంపికకు నిర్దిష్ట ప్రక్రియ, విధివిధానాలు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులను గౌరవించటం మాట అలా ఉంచి, అవమానకరంగా వ్యవహరిస్తోందని ఆవేదన చెందుతున్నారు. పక్షపాతం, రాజకీయ జోక్యంతోపాటు అవార్డుల ప్రదానానికి కొద్ది గంటల ముందు వరకు రహస్యంగా ఉంచటం, రాత్రి పొద్దుపోయాక ఫోను సమాచారం ఇవ్వటం వలన ప్రదానోత్సవ సభకు సంబంధిత ప్రముఖులు వెళ్లలేని నిస్సహాయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
‘సహకార’ సమరానికి సిద్ధం
తెనాలి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. షెడ్యూలును ప్రకటించారు. బ్యాంక్ పాలకవర్గ ఎన్నికల్లో ఈ సారి టీడీపీ తరఫున ఇంకా అభ్యర్థులను నిర్ణయించలేదు. ప్రస్తుత చైర్మన్ మళ్లీ ఎన్నికయేలా ఏకగ్రీవం చేసేందుకు యత్నిస్తున్నారు. ఈసారి పోటీ అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కూటమి పార్టీల్లో ఒకటైన జనసేన, ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. తెనాలి: రాష్ట్రంలో సహకార చట్టం వచ్చాక తొలిగా తెనాలిలో ఏర్పాటైన అర్బన్ బ్యాంక్ ఇది. ఏర్పడి శతాబ్దం దాటినా ఇప్పటికీ ఎదుగూ బొదుగూ లేకుండా ఒకే శాఖతో ఉంది. బ్యాంక్ ఎన్నికలు వచ్చే నెల 14న నిర్వహించాలని నిర్ణయించారు. 12 మంది పాలకవర్గ సభ్యుల ఎన్నికను రహస్య బ్యాలెట్లో నిర్వహించనున్నారు. సెప్టెంబరు 7వ తేదీన ఉదయం బ్యాంక్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. 8న పరిశీలన, 9న ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అదేరోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. సాయంత్రం ఎన్నికల చిహ్నాల కేటాయింపు ఉంటుంది. 14న ఉదయం 7 – మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నిక నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. ఎన్నికల అధికారిగా కో ఆపరేటివ్ సొసైటీ విశ్రాంత అసిస్టెంట్ రిజిస్ట్రార్ వ్యవహరిస్తారు. ప్రస్తుతం బ్యాంక్ పాలకవర్గం త్రీమెన్ కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్న మంగమూరి హరిప్రసాద్ మూడోసారి చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ మద్దతు? ప్రస్తుత చైర్మన్ నివాసానికి దగ్గర్లోని మారీసుపేటలో గల ఎన్సీఆర్ఎం హైస్కూలులో ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూలును కనీసం సభ్యులకు కూడా తెలియపరచలేదు. ఒకే పత్రికకు సమాచారం ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా పార్టీ తరఫున బ్యాంక్ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించలేదని అంటున్నారు. ఆయన మద్దతు హరిప్రసాద్కేనన్న వాదన వినిపిస్తోంది. దీంతో అభ్యర్థిని రంగంలోకి దింపే ఆలోచనలో ఆలపాటి రాజా వ్యతిరేక వర్గం ఉందని విశ్వసనీయ సమాచారం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకాధికారి పాలనలో ఉన్న అర్బన్ బ్యాంక్‌కు ప్రభుత్వం ద్వారా త్రీమెన్ కమిటీని నియమించారు. అప్పుడు టీడీపీ నాయకులు ఆ కమిటీ నియామకంపై కోర్టును ఆశ్రయించారు. ఎన్నికలను నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆ కమిటీ రద్దయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ త్రీమెన్ కమిటీని నియమించుకున్నారు. దీనిపై మళ్లీ కోర్టును ఆశ్రయించటంతో ఎన్నిక అనివార్యమైందని చెబుతున్నారు. కూటమి పార్టీల్లో ఒకటైన జనసేన పీఏసీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఏ నిర్ణయం తీసుకుంటారు? ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఎలాంటి వైఖరిని ప్రదర్శిస్తారనే చర్చ పట్టణంలో నడుస్తోంది. బ్యాంకుకు 5 వేల మంది ఓటర్లు వరకు ఉన్నారు. గతంలో పాలకవర్గాలు ఇష్టారాజ్యంగా ఓటర్లను చేర్పించాయి. బ్యాంకు పరిధిలో కాకుండా కొల్లిపర, వేమూరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తుల ఓట్లు ఉన్నాయి. మరికొందరు ఓటర్లకు సంబంధించి పేర్లు ఉన్నప్పటికీ చిరునామాలు లేవు. ఇలాంటి అవకతవకల జాబితా సవరించిందీ లేనిదీ తెలియదు. ఇదే జాబితాలో ఎన్నిక నిర్వహించటంపైనా విమర్శలు వస్తున్నాయి. -
ఆర్బీకేల ద్వారా యూరియా సరఫరా చేయాలి
ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి తాడేపల్లిరూరల్: రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియాను రైతులకు సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం జాతీయ రహదారి వద్ద కౌలు, రైతు సంఘాల నాయకులతో కలసి యూరియా కొరతపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కృత్రిమంగా యూరియా కొరత సృష్టించి, రైతాంగాన్ని ఇబ్బందులు పాలు చేస్తోందని అన్నారు. ఎరువులపై ఇచ్చే సబ్సిడీ తగ్గించేందుకు, విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా యూరియాను కృత్రిమ కొరత సృష్టించడం, రైతులను మోసం చేయడమేనని అన్నారు. జొన్న, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ వంటి పంటలు వేసిన రైతులకు యూరియా తక్షణమే అవసరం ఉందన్నారు. తక్షణమే యూరియాను అందుబాటులో తీసుకువచ్చి రైతులకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులపై చిత్తశుద్ధి ఉంటే నానో యూరియాను కాకుండా రైతులు కోరే యూరియాను సరఫరా చేయాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు, రైతు సంఘం సీనియర్ నాయకులు వై. కేశశరావు, రైతు సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సూర్యనారాయణ, హేమలత, ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకరరావు, రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్, జిల్లా నాయకులు కాజా వెంకటేశ్వరరావు, దొంతిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏఎన్‌యూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
పెదకాకాని (ఏఎన్‌యూ): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జూన్, జూలై నెలల్లో నిర్వహించిన డిగ్రీ 5, 6వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు శుక్రవారం విడుదల చేశారు. 5,454 మంది పరీక్షలు రాయగా 4,292 మంది ఉత్తీర్ణత సాధించారు. రీ వాల్యూయేషన్‌కు సెప్టెంబరు 12లోగా ఒక్కో పేవర్కు రూ.1,490 చెల్లించాలని ఏసీఈ వెంకటేశ్వరరావు తెలిపారు. రెక్టార్ ఆచార్య కె రత్నషీలామణి, రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం, డిగ్రీ పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య ఎన్వీ కృష్ణారావు, ఎ.రాధాకృష్ణ, డాక్టర్ జ్ఞానేశ్వర్‌రెడ్డి, సీఈ శివప్రసాదరావు, నోడల్ ఆఫీసర్ రెడ్డి ప్రకాశరావు, ఏఆర్‌బీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
91 మందికి ఉద్యోగ కల్పన
తాడికొండ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి – శిక్షణ శాఖ సౌజన్యంతో తుళ్లూరులోని సీఆర్డీఏ స్కిల్ హబ్ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాను పలువురు సద్వినియోగం చేసుకున్నారు. 300కి పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ మేళా నిర్వహించగా 301 మంది హాజరయ్యారు. వీరిలో 91 మందికి ఉద్యోగాలు లభించాయని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికై న పలువురు అభ్యర్థులకు ఆయా కంపెనీల హెచ్ఆర్ విభాగ ప్రతినిధులతో కలసి సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆఫర్ లెటర్లు అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ఎస్ఎస్డీసీ ప్లేస్మెంట్ అధికారి అరుణ కుమారి, సీఆర్డీఏ డీసీడీవోఓ బి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో పదవుల నియామకం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా షేక్ ఖాసీంబేగ్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా కొల్లూరు శివప్రసాద్‌రావు, సోషల్‌మీడియా విభాగం అధ్యక్షుడిగా రమేష్‌సాహు, ఐటీ విభాగం అధ్యక్షుడిగా యేరువ ఇన్నారెడ్డిలను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. యువజన విభాగం నగర అధ్యక్షుడిగా కోటేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ యువజన విభాగం గుంటూరు నగర అధ్యక్షుడిగా పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఏటీ కోటేశ్వరావును నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కార్మికులకు న్యాయ విజ్ఞాన సదస్సు గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు అసంఘటిత రంగ కార్మికులకు న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ.. అసంఘటిత రంగంలోని కార్మికులందరూ ఈ– శ్రమ కార్డును కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్డు వలన అత్యవసర సమయంలో వైద్య, ప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించబడి సహాయం పొందుతారని తెలిపారు. ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకొని, పొందవచ్చని వెల్లడించారు. న్యాయపరమైన సూచనలు చేశారు. తాపీ మేసీ్త్రలు, పెయింటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఆటో డ్రైవర్లు, మెకానిక్‌లు, వీధి వ్యాపారులు కార్డుకు అర్హులన్నారు. కార్యక్రమంలో కట్ట కాళిదాసు ప్యానల్ అడ్వకేట్లు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ హనుమత్ సాయి తదితరులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి అవసరం
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: యువతతోపాటు దేశాన్ని నిర్వీర్యం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి మాదకద్రవ్యాల సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బాధితులకు వెంటనే డీ అడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సెలింగ్, చికిత్స అందించాలని సూచించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా జైలులోనూ డీ అడిక్షన్ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకోవాలన్నారు. విక్రేతలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. శివారు ప్రాంతాల్లోని శిథిల భవనాలు కూల్చివేయాలని ఆదేశించారు. ఎవరైనా విక్రేతల సమాచారం తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయాలని కోరారు. దీనికి సంబంధించిన ప్రచార బోర్డులను విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రధాన కూడళ్లలో కూడా ప్రదర్శించాలన్నారు. ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలతో అనర్థాలపై పూర్తి అవగాహన కల్పించేలా వారధి, పల్లె నిద్ర, ఆపరేషన్ నషా ముక్త్ భారత్, సేఫ్ క్యాంపస్ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో గత నెలరోజులుగా ఎనిమిది ఎన్డీపీఎస్ కేసులు నమోదు అయ్యాయని, 53 మందిని అరెస్టు చేశామని తెలిపారు. ఈ నిందితులకు రౌడీషీటర్ల తరహా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, డీఎంహెచ్‌వో డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, ఇంటర్మీడియట్ ఆర్ఐఓ సునీత, ఐసీడీఎస్ పీడీ ప్రసూన, సోషల్ వెల్ఫేర్ డీడీ చెన్నయ్య, అధికారులు పాల్గొన్నారు. -
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
గుంటూరు ఎడ్యుకేషన్ : ఆలిండియా పెన్షనర్స్ కో–ఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం గుంటూరు కృష్ణనగర్ లోని ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) ప్రాంతీయ కార్యాలయం వద్ద పెన్షనర్స్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ గుంటూరు జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. శేషగిరిరావు మాట్లాడుతూ కనీస పెన్షన్ రూ. 9వేలు ఇచ్చి, డీఏ జతపరచాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ ద్వారా వైద్య సదుపాయం కల్పించి, హయ్యర్ పెన్షన్ కోసం హయ్యర్ వేజెస్ దరఖాస్తులను పరిష్కరించాలని కోరారు. రైల్వేలో రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏపీ ఆర్పీఏ గుంటూరు జిల్లా కార్యదర్శి కే.బాబు ప్రసాద్ మాట్లాడుతూ 1995లో ప్రారంభించిన ఈ పీ ఎఫ్ పెన్షన్ ఇప్పటికీ సవరించలేదన్నారు. అనంతరం పీఎఫ్ రీజనల్ కమిషనర్ ప్రభుదత్తా ప్రుష్టిని కలిసి వినతి పత్రం అందజేశారు. సభలో ఎన్ఏ శాస్త్రి రాష్ట్ర ఏపీఆర్పిఏ అధ్యక్షుడు కే. గంగాధరరావు, ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులతో పాటు పోరాటానికి మద్దతు తెలియజేసేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు అధ్యక్షుడు రామచంద్రయ్య, ప్రధాన కార్యదర్శి నరసయ్య , బ్యాంక్ ఎంప్లాయీస్ నాయకులు వి. సాంబశివరావు , జూట్ మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఏ నికల్స్ , ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ జిల్లా కార్యదర్శి బి. నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
కారు ఢీకొని సైకిలిస్ట్ మృతి
భట్టిప్రోలు: అతి వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో సైకిలిస్ట్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం భట్టిప్రోలు వద్ద జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. భట్టిప్రోలు పంచాయతీ పరిధిలోని అద్దేపల్లికి చెందిన రంగిశెట్టి జయచంద్రరావు (55) వేమవరం సమీపంలోని ఎన్‌హెచ్ 216/ఎ జాతీయ రహదారి వెంబడి ఉన్న పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. పొలంలో శుక్రవారం నాట్లు వేస్తున్నారు. కూలీలకు తాగు నీరు తీసుకువచ్చేందుకు ఉదయం 10 గంటల సమయంలో సైకిల్‌పై బయలుదేరాడు. వెనుక నుంచి కారు అతి వేగంగా వచ్చిన కారు సైకిల్‌పై వెళుతున్న జయచంద్రరావును ఢీ కొట్టింది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టుపక్కల వారు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. అక్కడికి చేరుకున్న ఎస్ఐ ఎం. శివయ్య ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని తెలపడంతో ఆందోళన విరమించారు. గుంటూరుకు చెందిన కారు డ్రైవర్ నక్కా సురేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఏఎన్‌యూ దూరవిద్య పీజీ కోర్సులకు నోటిఫికేషన్
అక్టోబర్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ పెదకాకాని(ఏఎన్‌యూ): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ డిస్టెన్న్స్ ఎడ్యుకేషన్ (సీడీఈ) పీజీ దూర విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు సీడీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి సెమిస్టర్ విధానంలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ), డెబ్ (డిస్టెనన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో) నుంచి 23 పీజీ కోర్సులకు అనుమతి లభించిందన్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు అక్టోబర్ 10వ తేదీతో ముగుస్తుందన్నారు. కోర్సుల కాల వ్యవధి, విద్యార్హతలు, ఫీజులు తదితర వివరాలను ఏఎన్‌యూసీడీఈ. ఇన్ఫో అనే వెబ్సైట్లో గానీ, 0863 – 2346222, 98484 77441 ఫోను నెంబర్లను సంప్రదించడం ద్వారాగానీ తెలుసుకోవచ్చు. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలు కూడా... ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు కూడా షెడ్యూల్ విడుదలైంది. దీని ద్వారా రెండేళ్ల కాలపరిమితితో కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ వివరాలను దూర విద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు వెల్లడించారు. తమ్ముడిని హత్య చేసిన నిందితుడి అరెస్ట్ నగరంపాలెం: తమ్ముడిని హత్య చేసిన నిందితుడిని పాతగుంటూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు తూర్పు సబ్ డివిజనల్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. శుక్రవారం పాతగుంటూరు పోలీస్‌స్టేషన్ (పీఎస్)లో సీఐ వెంకట ప్రసాద్‌తో కలసి డీఎస్పీ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. డీఎస్పీ మాట్లాడుతూ... ఎన్టీఆర్నగర్ ఒకటో వీధిలో ఉంటున్న కంచర్ల రమేష్, రామిరెడ్డితోట మూడో వీధికి చెందిన సురేష్ (30) సొదరులని తెలిపారు. ఆటోడ్రైవర్‌గా జీవనం సాగించే సురేష్‌కు సుమారు పదేళ్ల క్రితం మీరాబీతో ప్రేమ పెళ్లైందని అన్నారు. కొన్నాళ్లుగా అన్న, తమ్ముడి మధ్య నగదు పంపిణీ విషయమై గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నెల 22వ తేదీన రాత్రి మణిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపాన ఇద్దరి మధ్య వివాదం నెలకొందని, ఈ క్రమంలో తమ్ముడిపై అన్న రమేశ్ పెట్రోలు పోసి నిప్పంటించాడని తెలిపారు. అతడిని జీజీహెచ్‌లో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మృతుడి భార్య ఫిర్యాదుతో పాతగుంటూరు పోలీసులు కేసు నమోదు చేయగా, శుక్రవారం రమేష్‌ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. పుష్కర ఘాట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం కాపాడిన మత్స్యకారులు తాడేపల్లి రూరల్: ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది దిగువ ప్రాంతంలోని సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద ఓ మహిళ కృష్ణానది వరద నీటిలోకి దిగి శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన మత్స్యకారులు ఆమెను కాపాడి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ భవానీపురంనకు చెందిన నరేంద్రతో ఏడాదిన్నర క్రితం యామినికి వివాహమైంది. గత ఆరు నెలలుగా వారి మధ్య మనస్పర్థలు రావడంతో యామిని భవానీపురంలోని తల్లిదండ్రులు వద్ద ఉంటోంది. భర్త దగ్గరకు వెళ్లగా ఇంట్లో నుంచి బయటకు నెట్టడంతో మనస్తాపం చెంది సీతానగరం పుష్కర ఘాట్ల వద్దకు వచ్చింది. చనిపోవడానికి వరదనీటిలోకి దూకింది. పక్కనే పడవలను భద్రపరుస్తున్న మత్స్యకారులు గమనించి నీటిలోకి దిగి ఆమెను కాపాడారు. సమాచారం అందుకున్న తాడేపల్లి మహిళా పీఎస్ఐ అపర్ణ సంఘటనా స్థలానికి వెళ్లి యామిని తండ్రి శ్రీనివాసరావును పిలిపించారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. రెండు టన్నుల శివ లింగాకారంలో ప్రసాదం తెనాలిరూరల్: వినాయక చవితి వేడుకల్లో భాగంగా భక్తులు తెనాలిలో శివ లింగాకారంలో ప్రసాదం తయారు చేయించారు. విశాఖపట్నం గాజువాకలోని లంకా గ్రౌండ్స్‌లో లక్ష చీరలతో ఏర్పాటు చేసిన 90 అడుగుల శ్రీ సుదర వస్త్ర మహా గణపతి కమిటీ సభ్యులు తెనాలిలోని మిర్చి స్నాక్స్‌లో భారీ లడ్డూ ప్రసాదం చేయించాలని నిర్ణయించారు. ఇందుకు మిర్చి స్నాక్స్ నిర్వాహకుడు వి. కిషోర్ అంగీకరించి రెండు టన్నుల శివలింగాకార లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసి ఇచ్చారు. ఈ ప్రసాదాన్ని శుక్రవారం రాత్రి ఇక్కడ నుంచి గాజువాకకు తరలించారు. -
డీఎంహెచ్ఓకు ఘన సన్మానం
గుంటూరు మెడికల్: కష్టపడి పనిచేసే వారికి పదోన్నతులు కల్పించటం, వారి సమస్యలను పరిష్కరించటం తమ కర్తవ్యమని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. సచివాలయ ఏఎన్ఎంలకు పదోన్నతులు కల్పించిన విజయలక్ష్మి, ఈ ప్రక్రియను వేగవంతం చేయడంలో సహకరించిన ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావులకు సంబంధిత ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయ ఏఎన్ఎంల తరఫున ఉమ్మడి గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర ఉపాధ్యక్షులకు ఆత్మీయ అభినందన సన్మాన సభ శుక్రవారం స్థానిక ఎన్జీవో రిక్రియేషన్ హాల్లో జరిగింది. సన్మాన సభకు జిల్లా ఏపీఎన్జీవో అధ్యక్షుడు, జిల్లా జేఏసీ చైర్మన్ ఘంటసాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. డాక్టర్ కొర్రా విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం విజయలక్ష్మిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్, ఉమెన్ వింగ్ జిల్లా ఉపాధ్యక్షురాలు వాణి, సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యులు సుకుమార్, వెంకట్ రెడ్డి, జానీబాషా, కృష్ణ కిషోర్, విజయ్, సిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్పీఎస్ సూరి, సీహెచ్ కళ్యాణ్ కుమార్, అమరావతి అధ్యక్షుడు నాగేశ్వరరావు, సత్తెనపల్లి అధ్యక్షుడు మణిరావు, బాపట్ల అధ్యక్షుడు నాగేశ్వరరావు, మంగళగిరి అధ్యక్షుడు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
గ్రీన్ గ్రేస్‌లో ఘనంగా భాషా దినోత్సవం
కొరిటెపాడు(గుంటూరు): గిడుగు రామ్మూర్తి జయంతి, తెలుగు భాషా దినోత్సవాలను పట్టాభిపురంలోని భజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలోని గ్రీన్ గ్రేస్ ప్రాజెక్టు ఆవరణలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ పండితులకు పరిమితమైన గ్రాంధిక భాష స్థానంలో సామాన్యులకు సైతం వ్యవహారంలోకి తీసుకొచ్చి తెలుగు భాషను అభివృద్ధి చేసిన ఘనుడిగా గిడుగు రామ్మూర్తి పేరు గడించారని పేర్కొన్నారు. రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించడం అభినందనీయన్నారు. ఆయన చేసిన కృషితో ఆధునిక భాష పండితుల నుంచి పామరుల వరకు విస్తృత ప్రచారంలోకి వచ్చిందని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు పాఠ్యపుస్తకాలు, బోధన, చదువు వాడుక భాషలో ఉండటం వల్ల ఆత్మ విశ్వాసంతో చదువులు సాగించి ఎందరో సామాన్యులు అత్యున్నత పదవులు, దేశ విదేశాల్లో గౌరవాలు సాధించారన్నారు. తదనంతరం రామ్మూర్తికి లభించిన బిరుదులు, వారి సేవలను గుర్తించిన పలువురు ప్రముఖుల మాటలను గుర్తు చేశారు. కార్యక్రమంలో భజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు సిద్దినేని శ్రీనివాసరావు, సమీర్ నందన్, ప్రాజెక్టు మేనేజర్ దురై, ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు. -
కూటమిగా దోపిడీకి ఎత్తులు!
బార్లు దక్కించుకునేందుకు కూటమి నేతల సిండికేట్ కుయుక్తులు గెలిచాయి. మద్యం అమ్మకాలతో పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకుంటున్న సర్కార్.. ఇప్పుడు తమవారికి బార్లను తక్కువ మొత్తానికే కట్టబెట్టేలా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మద్యం దుకాణాలు దాదాపుగా అన్నీ కూటమి నేతల చేతిలో ఉన్నాయి. బార్ల ఏర్పాటులో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టడమే కాకుండా... తమ జేబులు నింపుకొనే పనిలో ఉన్నారు.సాక్షి ప్రతినిధి, గుంటూరు, నెహ్రూనగర్: జిల్లాలో మొత్తం 110 బార్ అండ్ రెస్టారెంట్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. శుక్రవారం గడువు ముగిసేనాటికి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 73గాను 24 బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో 17కుగాను 7 బార్లకు, తెనాలి మున్సిపాలిటీలో 17కుగాను ఒక బార్‌కు, పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలో 3 బార్లకు ఒక్క దరఖాస్తు కూడా దాఖలు కాలేదు. మొత్తగా 32 బార్లకు శనివారం లాటరీ ద్వారా కేటాయింపులు చేయనున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఒక్కో బార్‌కు రూ.75 లక్షలు లైసెన్సు ఫీజు, రూ.5 లక్షలు దరఖాస్తు ఫీజు, రూ.10 వేలు ఎన్రోల్ ఫీజు కింద కట్టాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. బార్‌కు లాటరీ తీయాలంటే కనీసం 4 దరఖాస్తులు రావాలని నిబంధన పెట్టింది. ఇలా 4 దరఖాస్తులకు రూ.5 లక్షల చొప్పున రూ.20 లక్షలు ప్రభుత్వానికి రానుంది. మిగిలిన ప్రాంతాల్లో రూ.55 లక్షలు లైసెన్స్ ఫీజుగా ఖరారు చేసింది.మద్యం వ్యాపారులందరూ సిండికేట్?బార్లలో ఆదాయం పెంచుకునేందుకు ఎత్తుగడ వేసిన కూటమి మద్యం వ్యాపారుల సిండికేట్ బార్లకు దరఖాస్తులు చేసేందుకు ముందుకు రాలేదు. లైసెన్సు ఫీజును మరింతగా తగ్గించుకునేందుకు ఇలా చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ఆగస్టు 18న ప్రభుత్వం జనరల్ కేటగిరీలోని బార్లకు, 20న గీత కార్మికుల బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చింది. 26 తేదీ గడువు ముగిసే నాటికి ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో 29 వరకు గడువు పొడిగించారు. 29వ తేదీ రాత్రి తొమ్మిది గంటల సమయానికి 110 బార్లకు 136, గీత కార్మికులకు కేటాయించిన 10 బార్లకు 58 దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రతి బార్‌కు నాలుగు దరఖాస్తులు కచ్చితంగా ఉండాలనే నిబంధన ప్రకారం చూస్తే కేవలం 32 బార్లకు మాత్రమే లాటరీ అవకాశం వచ్చింది. మిగిలిన వాటికి ఒకటి రెండు దరఖాస్తులే వచ్చాయి. మద్యం వ్యాపారులు ఉద్దేశపూర్వకంగానే బార్లకు దరఖాస్తులు వేయడం లేదని తెలుస్తోంది. ఒక్కో బార్‌కు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రూ.75 లక్షలు, మిగిలిన మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్, తెనాలి, పొన్నూరు మున్సిపాలిటీల్లో ఉన్న రూ.55 లక్షల లైసెన్సు ఫీజును తగ్గించుకునేందుకే మద్యం వ్యాపారులు ఇలా చేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తు సమయం ఉండటంతో వాటి సంఖ్య పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.అధికారులకు తిప్పలుబార్ల దరఖాస్తులు, లాటరీ, లైసెన్సుల వ్యవహారాలను సజావుగా పూర్తిచేసే బాధ్యతలను ప్రభుత్వం ఎకై ్సజ్ అధికారులపై పెట్టింది. సిండికేట్‌గా మారి లైసెన్సు ఫీజు తగ్గించుకోవాలనుకుంటున్న మద్యం వ్యాపారులు ఉద్దేశపూర్వకంగానే బార్లకు దరఖాస్తులు వేయడం లేదు. అన్ని బార్లకు దరఖాస్తులు వచ్చేలా చూడాలని ఇప్పటికే ఉన్నతాధికారులు అల్టిమేటం జారీ చేశారు. దీంతో జిల్లా ఎకై ్సజ్ అధికారులు మాత్రం మద్యం వ్యాపారులను పదేపదే కోరినా స్పందన రాలేదు.ఎమ్మెల్యేల చేతిలో ‘గీత కులాల’ దరఖాస్తులుగుంటూరు జిల్లాలో గీత కులాలకు 10 బార్లు కేటాయించారు. ఇందులో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆరు, మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో రెండు, తెనాలి మున్సిపాలిటీ పరిధిలో రెండు చొప్పున ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో తమ అనుకునే వారే దరఖాస్తు చేసుకునేలా స్థానిక ఎమ్మెల్యేలు పావులు కదిపారు. బయట వ్యక్తులు దరఖాస్తు చేయడానికి ప్రయత్నిస్తే పిలిచి విరమించుకునేలా చేస్తున్నారు. శనివారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉదయం 8 గంటలకు లాటరీ ప్రక్రియ జరగనుంది. -
ఏషియన్ షూటింగ్ పోటీల్లో ముఖేష్‌కు పతకాల పంట
గుంటూరువెస్ట్ (క్రీడలు): కజకిస్తాన్‌లోని షెమ్కెంట్లో జరుగుతున్న ఏషియన్ షూటింగ్ చాంపియన్ షిప్లో గుంటూరుకు చెందిన షూటర్ నేలవల్లి ముఖేష్ పతకాల పంట పండించాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో 50 మీటర్ల ఫ్రీ పిస్టల్, 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ , 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ టీమ్ విభాగాల్లో 3 బంగారు పతకాలు, 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించాడు. భారత్ జూనియర్ జట్టులో సభ్యుడైన ముఖేష్ కొన్ని సంవత్సరాలుగా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా రాణిస్తున్నాడు. రాష్ట్రంలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా అరుదైన రికార్డును సైతం నెలకొల్పాడు. ఈ సందర్భంగా ముఖేష్‌ను రైఫిల్ అసోసియేషన్ ఇండియా అధ్యక్ష, కార్యదర్శులు సలలిత్, రాజ్ కుమార్‌తోపాటు కేఎల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ డీన్ హరికిషోర్‌లు అభినందించారు. -
కాల్పులకూ వెనుకాడం
● గుంటూరు డివిజన్ పరిధిలో నడికుడి రైల్వేస్టేషన్ పరిసరాల్లో దోపిడీలు ● ఇటీవల వరుసగా మూడుసార్లు రైలు ఆపి బంగారం దోచుకెళ్లిన దొంగలు ● సిగ్నల్ ట్యాంపరింగ్ ద్వారా తెగబడుతున్న చోరులు ● రైల్వే అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికుల్లో ఆందోళన ● అదనపు భద్రతా సిబ్బందిని ఈ మార్గంలో నియమించడంలో విఫలం ● ప్రత్యేక చర్యలు తీసుకుంటేనే నేరాలకు అడ్డుకట్ట సాధ్యం ● తాజాగా తాడేపల్లి – మంగళగిరి మధ్య రెండు రైళ్లలో మళ్లీ దోపిడీ రైల్వే ప్రయాణికులకు భద్రత గాలిలో దీపంలా మారింది. రైల్వే, పోలీస్ శాఖకు దోపిడీదారులు, చోరులు సవాల్‌గా మారారు. రైల్వే శాఖలో సిబ్బంది కొరత ఉండటంతో నేరాలను అడ్డుకునేందుకు కనీస చర్యలు కూడా చేపట్టడం లేదు. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఇటీవల కాలంలో మూడు సార్లు ప్రయాణికులను దొంగలు దోచుకున్నారు. తాజాగా ఒకే రోజు రెండు రైళ్లల్లో దొంగతనాలు జరిగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. – పి.అక్కేశ్వరరావు, జీఆర్పీ డీఎస్పీ, గుంటూరు రైల్వే డివిజన్ -
రూ. 6.40 లక్షలు పలికిన ఆనంద్‌పేట లడ్డూ
రెంటచింతల: స్థానిక ఆనంద్‌పేట కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద 90 కేజీల లడ్డూను, 30 గ్రాముల వినాయక స్వామి వారి బంగారు లాకెట్‌ను ఇగుటూరి రాజశేఖర్‌రెడ్డి రూ. 6.40 లక్షలకు వేలంపాటలో దక్కించుకున్నారు. సుమారు రెండు గంటల పాటు ఊరేగింపు కొనసాగింది. ప్రధాన రహదారిపై ఆనంద్‌పేట యువత కేరింతలు పెట్టారు. వందల మంది భక్తులు తరలివచ్చారు. గత ఏడాది లడ్డూను గొంటు ఆదిరెడ్డి రూ. 7.10 లక్షలకు దక్కించుకున్నారు. వెనిగండ్లలో రూ. మూడు లక్షలకు పైగా .. పెదకాకాని: మండలంలోని వెనిగండ్ల గ్రామంలో గురువారం రాత్రి వినాయక లడ్డూ వేలం నిర్వహించారు. వేమారెడ్డి గుడి సెంటర్లో రెడ్డి యూత్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి బుర్రముక్కుల శ్రీనివాసరెడ్డి 25 కిలోల లడ్డూ, తియ్యగూర శ్రీ ప్రియాంక రెడ్డి 20 కిలోల లడ్డూ, పులగం వేమారెడ్డి 11 కిలోల లడ్డూ సమర్పించారు. వేలంలో అబ్బులు(ఆత్మకూరి శేషిరెడ్డి) యువసేన 25 కిలోల లడ్డూను రూ.3,01,116లకు దక్కించుకుంది. 20 కిలోల లడ్డూ రూ.40 వేలకు, 11 కిలోల లడ్డూ రూ.40 వేలకు భక్తులు దక్కించుకున్నారు. అనంతరం వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. -
వైఎస్సార్ సీపీలో పదవుల నియామకం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని పలువురిని పలు పదవుల్లో నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాడికొండ నియోజకవర్గానికి చెందిన సయ్యద్ హబీబుల్లాను పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా, పార్టీ వలంటీర్స్ విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా షేక్ నాసర్‌వలీ, కల్చరల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తమనంపల్లి శాంతయ్య, గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి మైనారిటీ విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా షేక్ అఫ్సర్, క్రిస్టియన్ మైనారిటీ విభాగం కార్యదర్శిగా మద్దు ప్రేమజ్యోతిబాబు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ పి.ముత్యంను క్రిస్టియన్ మైనారిటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. -
గంజాయి వినియోగిస్తున్న ఐదుగురి అరెస్ట్
1.15 కేజీల గంజాయి స్వాధీనం తెనాలి రూరల్: త్రీ టౌన్ పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి వినియోగిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్లో సీఐ ఎస్. రమేష్‌బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.... బాలాజీరావుపేటలో డాక్టర్ మస్తానమ్మకు చెందిన ఖాళీ స్థలంలో కొందరు గంజాయి వినియోగిస్తున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఘటనా స్థలంలో మహేంద్రదేవ్ కాలనీకి చెందిన పాలడుగు బాలకృష్ణ, గంగానమ్మపేటకు చెందిన సయ్యద్ ముజాయిద్, వేమూరు మండలం పెరవలి గ్రామానికి చెందిన పోతార్లంక కార్తీక్, బాలాజీరావుపేటకు చెందిన యలవర్తి శివకుమార్, చెంచుపేటకు చెందిన షేక్ సమీర్ హుస్సేన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.15 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పాలడుగు బాలకృష్ణ, సయ్యద్ ముజాయిద్ ఒడిశా నుంచి గంజాయి తెచ్చి మిగిలిన నిందితులతో కలిసి తెనాలి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. గంజాయికి బానిసలైనట్లు తెలిస్తే తల్లిదండ్రులు వెంటనే పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకొస్తే కౌన్సెలింగ్ నిర్వహించి, అవసరమైతే రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
నగదు రహిత వైద్య సేవలు అందించాలి
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశాలు లక్ష్మీపురం: డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ, ఈహెచ్ఎస్ పేషెంట్లకు నగదు రహిత వైద్యం అందేలా అన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో డీఆర్సీ సమావేశ మందిరంలో గురువారం డిసిప్లినరీ కమిటీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 87 ఫిర్యాదులపై విచారణ జరిపి వైద్యసేవలకు అంతరాయం కలగకుండా చూడాలని ఆసుపత్రుల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పేషెంట్లకు నగదు రహిత వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ఈహెచ్ఎస్ కింద ఉద్యోగులు, పెన్షనర్స్ నెట్వర్క్ ఆసుపత్రులకు వచ్చినప్పుడు వైద్య సేవలు తిరస్కరించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో వైద్యసేవలు పొందే రోగులకు మందులు, పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి అనుసంధానమైన సెంటర్లకు మాత్రమే పంపించాలని సూచించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కె. విజయలక్ష్మి, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పి.రామచంద్రరాజు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సీహెచ్ విజయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
వినాయకా.. పూజలన్నీ నీకే ఇక..!
శ్రీనగర్‌లో.. అంబేడ్కర్‌నగర్‌లో.. కొరిటెపాడులో.. గౌతమినగర్‌లో.. వినాయక చవితి వేడుకలు గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారుల వెంటే కాకుండా వీధి వీధినా గణపతిని కొలువుదీర్చి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఇక ఇళ్లల్లో, బహుళ అంతస్తుల భవనాల ఆవరణలో గణపతి ప్రతిమలను ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు. విశేష అలంకరణలు చేశారు. చిన్నారులు, యువత, మహిళలు పెద్దసంఖ్యలో వేడుకల్లో పాల్గొంటున్నారు. గురువారం నగరంలోని వినాయక మండపాల వద్ద సందడి నెలకొంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు సాకేత్‌పురంలో... ముత్యాలరెడ్డినగర్‌లో.. -
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
నగరంపాలెం: మాదక ద్రవ్యాలు, మహిళలపై నేరాలకు సంబంధించి కేసుల్లో పెండింగ్‌లోని నాన్ బెయిల్‌బుల్ వారెంట్లను అమలు చేయాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశించారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణంలోని హాల్లో జూలై నెలకు సంబంధించి నేర సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. జిల్లాలో నమోదైన పలు నేరాలపై సమగ్రంగా సమీక్ష చేపట్టారు. దర్యాప్తు, నేర నియంత్రణ చర్యలపై పోలీస్ అధికారులకు ముఖ్య సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. నాన్ బెయిల్‌బుల్ వారెంట్లను వెంటనే అమలు చేయాలని చెప్పారు. చిన్నారులు, మహిళల అదృశ్యాల కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. హత్యలు, అత్యాచారాలు, ఆస్తి సంబంధిత నేరాల కేసుల్లో దర్యాప్తును ప్రాధాన్యంగా తీసుకుని చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. వైట్ కాలర్ మోసాలపై ప్రత్యేక దృష్టిసారించాలని అన్నారు. నేర నియంత్రణకు కట్టుదిట్ట చర్యలు చేపట్టాలని చెప్పారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), రవికుమార్ (ఎల్ఓ), డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
కృష్ణా నదిలో వరద ఉద్ధృతి
అమరావతి: ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి బుధవారం రాత్రి సుమారు 3 లక్షల క్యూసెక్కులకుపైగా విడుదల చేయటంతో కృష్ణా నదిలో వరద పెరుగుతోంది. గురువారం ఉదయం నుంచి అమరావతిలో నది నీటిమట్టం గంటగంటకూ పెరగడంతో లోతట్టు పొలాలలో వరద చేరుతోంది. మండల పరిధిలోని పెదమద్దూరు, మునగోడు, అమరావతి,ఽ ధరణికోట, మల్లాది, దిడుగు గ్రామాలలో పంటలు నీట మునిగేలా ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు నది పరివాహక ప్రాంత గ్రామాలలో పంట పొలాలు నీట మనిగాయి. మళ్లీ అదే పరిస్థితి వస్తుండటంతో రైతులకు తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది. పెద మద్దూరు వాగుపై లోలెవల్ చప్టా పూర్తిగా నీట మునిగింది. చప్టాపై మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. విజయవాడ – అమరావతిలకు రాకపోకల నిలిచిపోయాయి. అధికారులు లోతట్టు ప్రాంతాలలో ఉన్న వారిని మళ్లీ అప్రమత్తం చేస్తున్నారు. -
తమ్ముళ్ల లూటీపై కౌన్సిల్లో గరం గరం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: నగరపాలక సంస్థ అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియలో అవకతవకలపై ఈ నెల 22వ తేదీన ‘రూ.కోట్లలో తమ్ముళ్ల లూటీ!’ అంటూ ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనం కౌన్సిల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ అంశంపై తెలుగుదేశం సభ్యులే మున్సిపల్ కమిషనర్‌ను నిలదీశారు. గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి, టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ ఈ అంశాలను చర్చకు తీసుకువచ్చారు. అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లపైనే పశ్చిమ ఎమ్మెల్యే, కార్పొరేటర్ విరుచుకుపడటంపై చర్చనీయాంశంగా మారింది. అడ్డగోలుగా కేటాయిస్తారా? నగరంలో జరిగే అభివృద్ధి పనుల్లో కేటాయింపులు ఎలా జరుగుతున్నాయి? ఒకరికే పదుల సంఖ్యలో టెండర్లు ఏ విధంగా కేటాయిస్తున్నారు? వంటి వాటిపై సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే గళ్లా మాధవి అధికారులను ప్రశ్నించారు. అభివృద్ధి పనుల్లో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని ఆరోపించారు. అర్హత లేని కాంట్రాక్టర్లకు వర్కులు కేటాయించడం ద్వారా పనులు సక్రమంగా జరగడం లేదన్నారు. గత సంవత్సర కాలంలో రూ.వందల కోట్లు పనులు పెండింగ్‌లో ఉన్నాయని.. అయినప్పటికీ పనులు చేయని కాంట్రాక్టర్లకే టెండర్లు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ కాంట్రాక్టర్‌కు ఎన్ని వర్కులు కేటాయించారు? ఏ స్టేజ్‌లో ఉన్నాయి? వంటి వివరాలు తనకు అందజేయాలన్నారు. నాణ్యతకు తిలోదకాలిస్తే ఎలా? టెండర్ ప్రక్రియలో 30 నుంచి 40 శాతం వరకు కొందరు లెస్సులు వేస్తున్నారని, అదీ జీఎస్టీతో కలిపి ఇలా వేయడం ద్వారా నాణ్యత ఏముంటుందని టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్ అధికారులను ప్రశ్నించారు. అర్హత లేని వారికి టెండర్లు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. టెండర్ రిజిస్ట్రేషన్ గడువు పూర్తయిన వారు కూడా పాల్గొంటూ వర్కులు చేసుకుంటూ బిల్లులు కూడా ప్రాసెస్ చేసుకున్నారని ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు. గతంలో మున్సిపల్ కమిషనర్‌గా కీర్తి చేకూరి ఉన్నప్పుడు ఇంజినీరింగ్ సెక్షన్లో అవకతవకలకు పాల్పడే టెక్నికల్ అసిస్టెంట్లను తొలగించారని గుర్తుచేశారు. తిరిగి వారికి అక్కడే ఏ విధంగా విధులు కేటాయిస్తారంటూ నిలదీశారు. స్పందించిన ఇన్చార్జి ఎస్ఈ సుందర్రామిరెడ్డి మాట్లాడుతూ... వర్కులు చేయకుండా పెండింగ్‌లో పెట్టిన వారి 72 వర్కులను క్యాన్సిల్ చేయడం జరిగిందన్నారు. ఇంజినీరింగ్ సెక్షన్లో టెక్నికల్ అసిస్టెంట్ల స్థానంలో వార్డు ఎమినిటీ సెక్రటరీలను విధుల్లోకి తీసుకున్నామన్నారు. మొత్తానికి ‘సాక్షి’ కథనం కౌన్సిల్లో ప్రకంపనలు సృష్టించింది. -
మెరిట్ లేని డీఎస్సీ!
డీఎస్సీ –2025లో ప్రతిభ చాటిన అభ్యర్థులు కూటమి సర్కార్ తీరుతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఏళ్ల తరబడి శ్రమించి, పరీక్షలు రాసిన వారు పోస్టింగు ఆర్డర్లు అందుకోవడం గగనంగా మారింది. కష్టపడి చదివి, పరీక్షలు రాసి మెరిట్లో ఉన్నప్పటికీ విద్యాశాఖ నుంచి కాల్ లెటర్ పంపితేనే ఉద్యోగం అంటూ ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనలతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.గుంటూరు ఎడ్యుకేషన్: డీఎస్సీ–2025 నోటిఫికేషన్ ఆధారంగా పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్, సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ డైరెక్టర్ తదితర పోస్టులకు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల్లో మంచి మార్కులను సాధించి, పోస్టు ఖాయం అనుకున్న అభ్యర్థులు సైతం విద్యాశాఖ విధించిన నిబంధనలతో అయోమయంలో పడ్డారు. పోస్టింగ్ వస్తుందా, లేదా అనే సందేహాలతో సతమతం అవుతున్నారు. కాల్ లెటర్ వస్తేనే ఉద్యోగం, లేకుంటే కొలువు గల్లంతే అనే విధంగా కూటమి ప్రభుత్వం తీరు ఉంది. 19 బృందాలతో పరిశీలన ఉమ్మడి గుంటూరు జిల్లాలో డీఎస్సీ–2025 ద్వారా ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను గురువారం గుంటూరు నగరంలోని ఆంధ్ర క్రైస్తవ (ఏసీ) కళాశాలలో చేపట్టారు. మొత్తం 1,143 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో చూపించారు. సర్టిఫికెట్ల పరిశీలనకు 19 టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంకు కళాశాలలోని ఆడిటోరియంతోపాటు వేర్వేరు గదుల్లో 50 మంది చొప్పున అభ్యర్థులను కేటాయించారు. పాఠశాల విద్యాశాఖ నుంచి కాల్ లెటర్ అందుకున్న అభ్యర్థుల వారీగా డీఎస్సీ సైట్లో సర్టిఫికెట్లను విజయవంతంగా అప్లోడ్ చేసుకున్న వారినే వెరిఫికేషన్‌కు పిలిచారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల డీఈవోలు సీవీ రేణుక, చంద్రకళ, పురుషోత్తం పర్యవేక్షణలో టీమ్‌ల వారీగా నియమించిన అధికారులు సర్టిఫికెట్ల పరిశీలన జరిపారు. పరిశీలకురాలిగా కమిషనరేట్ నుంచి పి.శైలజ హాజరు కాగా, డీఆర్వో ఖాజావలి వెరిఫికేషన్ సెంటర్‌ను తనిఖీ చేశారు.పాఠశాల విద్యాశాఖ నుంచి కాల్ లెటర్ పొందిన అభ్యర్థులకే పోస్టింగ్ అని, లేదంటే పోస్టింగ్ రాదనే కోణంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ మారిపోయింది. పోస్టులకు మెరిట్ కం రోస్టర్ ప్రకారం జాబితాను బహిరంగంగా ప్రదర్శించినట్లయితే అభ్యర్థులు ఎవరికి వారు తమకు వచ్చిన మార్కులు, రిజర్వేషన్ కేటగిరీ, మెరిట్లో తమ కంటే ఎంత మంది ముందు ఉన్నారనే సాధారణమైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉండేది. కాల్ లెటర్లు అందుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు అయ్యారు. మరికొంత మంది కాల్ లెటర్లు రాకపోవడానికి కారణాలు తెలుసుకునేందుకు వచ్చారు. ప్రతి పోస్టుకు మెరిట్ ప్రకారం ఇద్దరేసి అభ్యర్థులను ఎంపిక చేసిన అధికారులు... వెరిఫికేషన్ సెంటర్‌కు వచ్చిన వారి సర్టిఫికెట్లను పరిశీలన జరిపారు. 19 టీమ్‌ల వారీగా 930 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం రాత్రికి పూర్తి చేసేందుకు నిర్ణయించారు. మిగిలిన వారి సర్టిఫికెట్లను శుక్రవారం పరిశీలన చేయనున్నారు. -
డబ్బుకు కక్కుర్తిపడి షిఫ్ట్ ఆపరేటర్ల తొలగింపు
సత్తెనపల్లి: డబ్బుకు కక్కుర్తిపడి విద్యుత్ సబ్స్టేషన్లలో పనిచేసే షిఫ్ట్ ఆపరేటర్లను తొలగించడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న నలుగురిని ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఈ నెల 21 నుంచి మౌఖిక ఆదేశాలతో తొలగించడంతో వారు గురువారం విద్యుత్ సబ్‌స్టేషన్‌కు తాళాలు వేసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. వారికి వైఎస్సార్ సీపీ సంఘీభావం తెలిపింది. మాజీ మంత్రి రాంబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తాను సత్తెనపల్లి శాసనసభ్యుడిగా, మంత్రిగా కొనసాగిన సమయంలో 34 మంది షిఫ్ట్ ఆపరేటర్లను నియమించినట్లు తెలిపారు. తెలుగుదేశం శాసనసభ్యుడు నియమించిన ఏ ఒక్క షిప్ట్ ఆపరేటర్‌ను తొలగించలేదన్నారు. రూ.5 లక్షలు, రూ.10 లక్షలు ఇస్తే వాళ్లను తీసుకువచ్చి కొత్తగా ఇక్కడ వేస్తారన్నారు. 19 మందిని తొలగించారని, అంటే ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు చొప్పున రూ.95 లక్షలు బేరం పెట్టుకున్నారని, స్థానిక శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణను ఈ మొత్తం తీసుకున్నారా? లేదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి మాట్లాడుతూ చిరు ఉద్యోగుల పొట్ట కొట్టవద్దన్నారు. 2023లో నియమితులైన నలుగురు షిఫ్ట్ ఆపరేటర్లను తొలగించడం, కనీసం నోటీసు కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, యువజన విభాగం మాజీ అధ్యక్షుడు కళ్లం విజయభాస్కరరెడ్డి, మాజీ సర్పంచ్ లక్కిరెడ్డి భాస్కరరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, బాధితుల బంధువులు పాల్గొన్నారు.వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
గుంటూరు లీగల్: జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్,జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి పేర్కొన్నారు. ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ల ప్రతినిధులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్‌పై వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన చర్చించారు. ఎక్కువ సంఖ్యలో క్రిమినల్, సివిల్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. దీనికి అందరూ సహకరించాలని పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్, బార్ ప్రెసిడెంట్ వై.సూర్య నారాయణలు స్టేక్ హోల్డర్లకు సలహాలు, సూచనలు ఇచ్చారు. బాల్య వివాహాలతో చేటు బాల్య వివాహాలు, గిరిజన మహిళలలో ఎర్లీ ప్రెగ్నన్సీపై జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు గురువారం గుంటూరు సుగాలికాలనీ విద్యానగర్‌లో సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టపరంగా నేరమని తెలిపారు. త్వరగా పెళ్లి చేస్తే బాలికలకు మానసిక, శారీరకంగా పలు రకాల ఇబ్బందులు కూడా తలెత్తుతాయని గుర్తుచేశారు. తగిన వయస్సు వచ్చేవరకు వారు చదువుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఇక గిరిజనుల్లో ఎర్లీ ప్రెగ్నన్సీకి చదువుకోక పోవడమే ప్రధాన కారణమని గుర్తుచేశారు. అక్షరాస్యత పెంచి వారిని చదువుల బాట పట్టిస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచక పాలన
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ అరాచక పాలన నడుస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.అక్రమ అరెస్టులతో వైఎస్సార్ సీపీ నేతలు ఆసుపత్రులు, జైలులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం సరిపోతోందని తెలిపారు. వినుకొండ నియోజకవర్గం టి. అన్నవరంలో టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి, గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ నేత వెంకట ప్రసాద్‌ను మంగళవారం ఆయన నరసరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు. దాడిలో వెంకట ప్రసాద్ సోదరుడు వెంకటేశ్వర్లుకు అయిన గాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఏజెంట్‌గా వెంకట ప్రసాద్ పని చేయడంతో అతడిని అంతం చేయాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు సింపుల్‌గా 324 కేసు వేశారని తెలిపారు. ఇరుపక్షాలు కేసు తీసుకొని జైలుకు వెళ్లే పని లేకుండా రాజీపడమని నోటీసులు తీసుకునే సింపుల్ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. న్యూట్రల్‌గా ఉండాల్సిన పోలీసులు అధికార పార్టీకి ఏకపక్షంగా పని చేస్తున్నారని ఆరోపించారు. నారా లోకేష్ రెడ్ బుక్ ఎల్లకాలం ఉండడదని, రానున్న రోజుల్లో వేరే బుక్కులు వస్తాయి అనే విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మాచర్లలో రెండు టీడీపీ ముఠాలు కొట్టుకొని హత్యలు చేసుకుంటే, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లోనే వినుకొండలో రషీద్ అనే వైఎస్సార్ సీపీ కార్యకర్తను అతి కిరాతకంగా నరికి చంపారని తెలిపారు. రాష్ట్రంలో ఇంత అరాచకాలు జరుగుతున్నా రాష్ట్ర డీజీపీ, ఎస్పీలు పొల్యూట్ అయి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై పెట్టే అక్రమ కేసులపై న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్ సీపీ నేత వెంకట ప్రసాద్ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే అతడి పైనే కేసు నమోదు చేయడం దారుణమని ఖండించారు. హత్యాయత్నానికి గురైన బాధితుడుపైనే తిరిగి పోలీసులు కేసు నమోదు చేయడం చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత బలంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగిందంటూ వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. -
ఓటరు పరిశీలన సమర్థంగా నిర్వహించాలి
కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: ప్రశాంతమైన, పారదర్శకమైన ఎన్నికలకు ఓటరు పరిశీలన సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని బూత్ లెవల్ అధికారులందరికీ ఎన్నికల సంఘం వద్ద శిక్షణ పొందిన మాస్టర్‌తో శిక్షణ ఇప్పించామని తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం బూత్ లెవెల్ అధికారులందరూ ఓటరు దరఖాస్తులను మరింత మెరుగ్గా పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. మరణించిన వారి ఓట్లను జాబితా నుంచి తొలగించేందుకు స్థానిక సంస్థల నుంచి ధ్రువీకరణ పత్రాలను సేకరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. స్పెషల్ సమ్మరీ రివిజన్–2026పై ఎన్నికల సంఘం మార్గదర్శకాలు వచ్చిన వెంటనే బీఎల్వోలు డోర్ టు డోర్ వెళ్లి ఓటరు జాబితా వెరిఫికేషన్ చేస్తారని తెలిపారు. ఇటీవల సచివాలయం ఉద్యోగుల బదిలీలు జరిగిన నేపథ్యంలో బీఎల్వోల మార్పులు, చేర్పులు ఆన్లైన్లో అప్లోడ్ చేశామని చెప్పారు. రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకుని వివరాలు అందజేయాలని ఆమె కోరారు. రాజకీయ పార్టీలు సహకారం, సూచనలను తప్పకుండా పరిగణలోనికి తీసుకుని అవకాశం ఉన్న వరకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు లోబడి దరఖాస్తులను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీ కుమారి, జీఎంసీ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభం
గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కాలేజీకి 80 ఏళ్ల చరిత్ర ఉందని, ఇక్కడ సీటు రావడం అదృష్టంగా భావించాలని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి అన్నారు. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాలో హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందిన 67 మంది ఫస్ట్ ఇయర్ వైద్య విద్యార్థులకు ఆయన మంగళవారం కాలేజీ అడ్మిషన్ కార్డులు అందజేశారు. వైద్య కళాశాలలో 250 సీట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు. గుంటూరు వైద్య కళాశాలో అభ్యసించిన ఎంతో మంది ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచిన వైద్యులుగా సేవలందిస్తున్నారని చెప్పారు. ఎంతో మంది ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, కలెక్టర్లుగా, ఎంపీలుగా, ఇతర ప్రజాప్రతినిధులుగా, ఉన్నత పదవుల్లో పనిచేసి పద్మశ్రీ , పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులు సైతం పొందారని తెలిపారు. ప్రతిష్టాత్మకమైన వైద్య కళాశాలలో అడ్మిషన్ పొందిన వారంతా కష్టపడి చదివి కన్న తల్లిదండ్రులకు, వైద్య కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని, మంచి వైద్యులుగా సేవలందించాలని ఆయన వెల్లడించారు. వైద్య విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా ప్రతిరోజూ విద్యార్థులను గమనిస్తూ ఉండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, బోధన సిబ్బంది పాల్గొన్నారు. -
మెలియాయిడోసిస్
అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకం గుంటూరు మెడికల్: మెలియాయిడోసిస్ వ్యాధి మన దేశం సహా దక్షిణ ఆసియాలోని ఇతర ఉష్ణమండల ప్రాంతాల్లో వర్షా కాలంలో ఎక్కువగా ప్రబలుతుంది. మన దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. డెంగీ, స్క్రబ్ టైఫస్‌తో పాటు వర్ష కాలంలో మెలియాయిడోసిస్పై అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో నెల రోజుల వ్యవధిలో నలుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాధిపై అవగాహన కలిగి ఉండి, అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మెలియాయిడోసిస్ సోకిన వారిలో జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి టీబీ వ్యాధిని (క్షయ) పోలి ఉండటంతో ఆ పరీక్షలు చేయించాలి. టీబీ అని తేలకపోతే మెలియాయిడోసిస్‌గా గుర్తించాలి. బ్లడ్ కల్చర్ ద్వారా మాత్రమే వ్యాధి నిర్ధారణ అవుతుంది. వ్యాధి సోకే విధానం మెలియోయిడోసిస్ అనేది మనుషులు, జంతువుల్లో వచ్చే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. కలుషితమైన నేల, గాలి లేదా నీటితో సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. తుపానులు, భారీ వర్షాలు, ఇతర తీవ్రమైన వాతావరణ సంఘటనల తర్వాత కేసులు పెరగవచ్చు. ఈ వ్యాధి తరచుగా ఇతర పరిస్థితులతో పోల్చబడటం వల్ల నిర్ధారణ కష్టమవుతుంది. బ్యాక్టీరియా నేల నుంచి చర్మం కోతలు, పుండ్లు, వాటిని పీల్చడం లేదా కలుషితమైన నీటిని తాగడం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. బ్యాక్టీరియా సాధారణంగా మనుషుల నుంచి లేదా జంతువుల నుంచి వ్యాపించదు. త్వరగా చికిత్స చేయకపోతే, ఇన్ఫెక్షన్ శరీరంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించి, సెప్సిస్ (రక్త విషం) వంటి తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది. కొన్నిసార్లు మరణం కూడా సంభవిస్తుంది. పలు అవయవాలపై ప్రభావితం అవయవ వ్యవస్థను ప్రభావితం చేయవచ్చు, ఊపిరితిత్తులు, చర్మం, చర్మాంతర్గత కణజాలాలు, ఎముకలు, కీళ్లు, కాలేయం, ప్లీహము, క్లోమం, మూత్రపిండాలు, మూత్రాశయం, ప్రోస్టేట్, జననేంద్రియ అవయవాలు, మెదడు, మెనింజెస్, పరోటిడ్ గ్రంథులు (ముఖ్యంగా పిల్లలలో), శోషరస గ్రంథులు, పెరికార్డియం పెద్దలపై ప్రభావం మెలియోయిడోసిస్ సాధారణంగా 40 నుంచి 60 సంవత్సరాల వయస్సు వారిలో కొన్ని అంతర్లీన పరిస్థితులతో ప్రభావితం చేస్తుంది. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మెలియోయిడోసిస్ అరుదుగా వస్తుంది. యాంటీబయాటిక్స్‌తో నయం మెలియోయిడోసిస్ను యాంటీబయాటిక్ చికిత్స ద్వారా నయం చేయవచ్చు. అయితే, కొన్ని ఇన్ఫెక్షన్లు త్వరగా తీవ్రమవుతాయి. అన్ని సందర్భాల్లోనూ చికిత్స ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. సకాలంలో తగిన చికిత్స అందించకపోతే మెలియోయిడోసిస్ 10 నుంచి 20 శాతం కేసుల్లో ప్రాణాంతకం అవుతుంది. ఈ వ్యాధికి యాంటీబయాటిక్స్ తప్పనిసరిగా ఐదు నుంచి ఆరు వారాల పాటు వాడాలి. వర్షాకాలంలో కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయి. టీబీ లక్షణాలుగా భావించి వ్యాధిని సక్రమంగా గుర్తించకపోవడం వల్ల తీవ్రత పెరిగి ప్రాణాలుపోయే ప్రమాదం ఉంది. ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి. బ్లడ్ కల్చర్ ద్వారా మాత్రమే నిర్ధారణ జరుగుతుంది. – డాక్టర్ కోగంటి కల్యాణ్ చక్రవర్తి, ఇన్ఫెక్షన్ స్పెషలిస్టు, గుంటూరు -
కక్షతోనే దాడి మాజీ ఎమ్మెల్యే బొల్లా
రాష్ట్రంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం పక్కాగా అమలు జరుగుతోందని, దాని డైరెక్షన్లోనే టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ నేతలపై దాడులకు తెగబుతున్నారని వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో వెంకట ప్రసాద్ వైఎస్సార్ సీపీ ఏజెంట్‌గా పని చేశాడనే కక్షతోనే స్థానిక టీడీపీ గూండాలు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల ప్రోద్బలంతో అతన్ని చంపేందుకు ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆకృత్యాలపై పోలీసులు న్యాయబద్ధంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
చెరువులో గల్లంతైన యువకుడు మృతి
కొల్లూరు: చెరువులో పడి గల్లంతైన యువకుడి మృతదేహాన్ని గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు వెలికి తీయించారు. సోమవారం రాత్రి కొల్లూరు శివారు బోస్‌నగర్‌లో సభావత్తు గోపీనాయక్ (34) గ్రామాన్ని అనుకొని ఉన్న చెరువులో పడి గల్లంతైన విషయం విదితమే. అతని పెద్దమ్మ ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో చెరువులో పడిన వ్యక్తిని గమనించిన మహిళ స్థానికులను అప్రమత్తం చేసింది. స్థానికులు అతని కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో కొల్లూరు పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం రాత్రి పోలీసులు గజ ఈతగాళ్లను చెరువులోకి దింపి గల్లంతైన యువకుడి కోసం గాలించారు. అర్ధరాత్రి సమయంలో మృతదేహం లభ్యమైంది. మృతుడి తల్లి దుర్గమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్ఐ జానకీ అమరవర్ధన్ తెలిపారు. -
పొగాకు కొనుగోలు నిరంతరం జరగాలి
గుంటూరు వెస్ట్: జిల్లాలో రైతుల నుంచి పొగాకు కొనుగోలు ప్రక్రియ నిరంతరం జరగాలని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయనన మాట్లాడారు. ప్రభుత్వంతోపాటు, ప్రైవేటు కంపెనీలు కూడా రైతుల నుంచి కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. జిల్లాలో 3,895 మంది రైతులు పొగాకు సాగు చేయగా, 3,370 మంది రైతులు ప్రభుత్వానికి విక్రయించేందుకు సీఎం యాప్‌లో నమోదు చేసుకున్నారని జేసీ వెల్లడించారు. కొనుగోలు కోసం ఇప్పటి వరకు 1,614 మంది రైతులకు షెడ్యూల్ ఇచ్చారని తెలిపారు. ఏపీ మార్కెట్మార్క్ఫెడ్ ద్వారా 1063 మంది రైతుల నుంచి ప్రభుత్వం 2,200 టన్నులు కొనుగోలు చేసిందని చెప్పారు. ప్రైవేటు కంపెనీలు కూడా 3,500 టన్నులు కొనుగోలు చేశాయని తెలిపారు. ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన 2,800 టన్నుల పొగాకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఇచ్చారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ టి.నరసింహారెడ్డి, పొగాకు రైతులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ -
అక్రమ కేసులతో బీసీల అణచివేతకు కుట్ర
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : కూటమి ఏడాదిన్నర పాలనలో బీసీలు అన్ని రకాలుగా అణిచివేతకు గురవతున్నారని..వారిపై అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కేయాలని చూస్తున్నారని వైఎస్సార్ సీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. గుంటూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీతో కలిసి ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ జలకళ కార్యక్రమంలో భాగంగా ఎంబుక్‌లో ఫోర్జరీ సంతకాలు చేశారని అభాండాలతో వైఎస్సార్ సీపీకి చెందిన పెదకాకాని ఎంపీపీ శ్రీనివాసరావుపై పొన్నూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అక్రమ కేసు పెట్టి జైలుకు పంపించారని తెలిపారు. యాదవులు అంటే మంచితనానికి మారుపేరని..వారు మాట ఇచ్చారంటే దాని మీద నిలబడతారన్నారు. అటువంటి వారిపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని సూచించారు. గత వైఎస్సార్సీపీ పాలనలో బీసీలకు అన్ని రంగాల్లో ప్రథమ స్థానం కల్పించి పైకి తీసుకువస్తే, కూటమి ప్రభుత్వం ఈవీఎంలతో అధికారంలోకి వచ్చి అక్రమ కేసులు పెట్టి వారిని అణగదొక్కాలని చూస్తోందని మండిపడ్డారు. ఎంపీపీ శ్రీనివాసరావు శ్రీకృష్ణుడి విగ్రహం ఏర్పాటు చేయిస్తే దాన్ని కూల్చివేయించిన ఎమ్మెల్యే దూళిపాళ్ల..అదే పొన్నూరు నియోజకవర్గం తక్కెళ్లపాడులో పెద్దఎత్తున వసూళ్లు చేసి శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారని వివరించారు. దీన్ని తీవ్రంగా ఖండించిన తెలుగు రాష్ట్రాల్లోని యాదవులంతా ఏకమై హెచ్చరికలు చేశారన్నారు. అక్కడ విగ్రహాన్ని తొలగించి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. అరాచకంతో, అధికారం ఉందని ఏదైనా చేయగలమని చూస్తే ప్రజలు చూస్తు ఊరుకోరని కారుమూరి చెప్పారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో బీసీలపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినప్పటికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అక్రమాలకు చెక్ పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. -
‘పీఎంవీబీఆర్‌వై’పై అవగాహన సదస్సు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : గుంటూరు రైల్వే డివిజన్ కార్యాలయంలో వివిధ సంస్థల ఉద్యోగులు, యజమానుల ప్రయోజనం కోసం ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కొత్తగా ప్రధాన మంత్రి విక్షిత్ భారత్ రోజ్‌గార్ యోజన(పీఎంవీబీఆర్‌వై)ను ప్రారంభించినట్లు డీఆర్ఎం సుథేష్ట సేన్ తెలిపారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో గుంటూరు అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పి. గోపాల్సింగారు ఆధ్వర్యంలో పీఎంవీబీఆర్వైపై మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యాక్రమంలో ఆమె మాట్లాడారు. పథకం ముఖ్య అంశాలు, ప్రయోజనాలను, ఈపీఎఫ్ఓలో కాంట్రాక్ట్ సంస్థల ఉద్యోగుల నమోదు సంస్థల ద్వారా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) జనరేషన్ గురించి వివరించారు. కొత్త ఉద్యోగుల నియామకం, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడానికి, యజమానులను ప్రోత్సహించడం లక్ష్యంగా పీఎంవీబీఆర్‌వై పెట్టుకుందని వివరించారు. ఈ పథకం కింద, భారత ప్రభుత్వం కొత్త ఉద్యోగులకు, యజమానులకు ప్రయోజనాలను నిర్దిష్ట కాలానికి చెల్లిస్తుందని తెలిపారు. తద్వారా యజమానులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని తెలిపారు. ఈ పథకం ఈనెల 1వ తేదీ నుంచి 2027 జూలై 31 వరకు అమలులో ఉంటుందని ఆమె చెప్పారు. కార్యక్రమంలో రైల్వే డివిజన్ ఉద్యోగులు, పీఎఫ్ సిబ్బంది కె.నాగరాజు పాల్గొన్నారు. -
మారథాన్‌లో పతకాలు అభినందనీయం
జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ నగరంపాలెం: అసాధారణమైన 42 కి.మీ మారథాన్ పరుగును కేవలం ఐదు గంటల్లోనే పూర్తి చేసి, పతకాలు సాధించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ప్రశంసించారు. హైదరాబాద్‌లో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ పరుగు పందెం (2025) పోటీలను ఈనెల 23, 24వ తేదీల్లో నిర్వహించారు. ఇందులో నల్లపాడు పీఎస్ ఏఎస్ఐ కె.రాజశేఖర్ బాబు (4.42 గంటలు), జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) హోంగార్డు జి.కృష్ణకిషోర్ (4.59 గంటలు) పతకాలు సాధించారు. నగరంపాలెంలోని డీపీఓలో మంగళవారం జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ను ఏఎస్ఐ, హోంగార్డు మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన వారిద్దరిని అభినందించారు. భవిష్యత్‌లో మరెన్నో పతకాలు సాధించాలని సూచించారు. చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ నగరంపాలెం: జిల్లాలో వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గణపతి వేడుకలు, నిమజ్జనం కార్యక్రమాల్లో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఉత్సవ నిర్వాహకులకు సూచించారు. జిల్లా ప్రజలకు సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆయన తెలిపారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధిలో ముందడుగు వేయాలని ఎస్పీ ఆకాంక్షించారు. -
ఆర్ఓబీ నిర్మాణంలో ప్రజలను భాగస్వాముల్ని చేయాలి
నెహ్రూనగర్: నగరంలో నిర్మిస్తున్న శంకర్‌విలాస్ ఆర్ఓబీ నిర్మాణంలో అందరినీ భాగస్వామ్యం చేసి ట్రాఫిక్ కష్టాల నుంచి నగర ప్రజలకు విముక్తి కల్పించాలని వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి మోదుగుల వేణుగోపాలరెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం పీజీఆర్ఎస్లో నగర డెప్యూటీ కమిషనర్ డి.శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఆర్ఓబీ నిర్మాణం కారణంగా నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు వివిధ ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారని, వారికి నగర ట్రాఫిక్‌పై పూర్తి అవగాహన ఉండదని, స్థానికులను ఆర్ఓబీ నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని కోరారు. ఇందుకుగాను అన్ని రాజకీయపార్టీ నాయకులు, ఆర్అండ్బీ, ఎలక్ట్రికల్, జీఎంసీ, రైల్వే అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణకు సలహాలు సూచనలు స్వీకరించి దానికి అనుగుణంగా ట్రాఫిక్ రద్దీ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. వైఎస్సార్ సీపీ గుంటూరు,పల్నాడు జిల్లాల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిమోదుగుల వేణుగోపాలరెడ్డి -
గడువులోపు అర్జీలకు పరిష్కారం
జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఐదు రోజుల క్రితం ఇంటికి వెళ్లే క్రమంలో దుకాణం వద్ద ఆగాను. ఈ క్రమంలో టీడీపీ నేత సోదరుడు నా వద్దకు వచ్చి మద్యం ఇప్పించాలని బెదిరించాడు. నా వద్ద నగదు లేదని బదులిచ్చాను. నన్నే బూతులు తిడతావా అంటూ నాపై అతనితోపాటు కొందరు కలిసి దాడికి పాల్పడ్డారు. ఈలోగా నా సోదరి, వారి పిల్లలు రాగా, వారిని సైతం అసభ్య పదజాలంతో ధూషించాడు. ఈ వివాదంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాం. కేసు నమోదు చేసినా, ఇప్పటి వరకు మాపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకుడి సోదరుడ్ని, అనుచరులను అరెస్ట్ చేయలేదు. అదేమని అడిగితే దాడికి పాల్పడిన వారు గుంటూరులో లేరని, పొరుగు రాష్ట్రంలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. మాపై దాడికి పాల్పడిన వారంతా ఇళ్ల వద్దనే ఉంటున్నారు. ఇంకా మమ్మల్ని బెదిరిస్తున్నారు. న్యాయం చేయగలరు. – కె.మరియదాస్, దాసరి విజయ, సీఆర్‌నగర్, దాసరిపాలెం, గుంటూరు రూరల్ సుమారు తొమ్మిదేళ్ల క్రితం మాకు పెళ్లి అయింది. ఇద్దరు సంతానం. నెల రోజులుగా నా భార్యతో స్థానిక జనసేన కార్యకర్త ఫోన్లో మాట్లాడుతున్నాడు. అదేమని అడిగితే నన్ను, ఇద్దరు పిల్లలను చంపుతానని బెదిరించాడు. ఇది మా ప్రభుత్వమని, పోలీసులు తనను ఏం చేయలేరని బెదిరించాడు. గత రెండు రోజుల క్రితం నా భార్యను తీసుకుని వెళ్లిపోయాడు. ఇద్దరు చిన్నారులు తల్లి కోసం రోదిస్తున్నారు. నా భార్యను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి తీసుకెళ్లిన జనసేన కార్యకర్తపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కోరుతున్నా. – బాధితుడు, స్వర్ణభారతినగర్ నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదులు – పరిష్కార వేదికలో బాధితుల నుంచి జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అర్జీలు స్వీకరించారు. బాధితుల గోడు అలకించారు. చట్టపరమైన పరిధిలో నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అదనపు ఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్), మహిళా పీఎస్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఫిర్యాదిదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. గత కొన్నాళ్లుగా దుకాణాలు నిర్వహిస్తున్నాం. ఇంటి యాజమాని 2017లో చనిపోయినా, క్రమం తప్పకుండా అద్దెలు చెల్లించాం. అయితే వ్యాపారం బాగా జరుగుతుందని, అదనపు అద్దె చెల్లించమని మాపై యజమాని కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. లేదంటే దుకాణాలు కూల్చివేస్తామని బెదిరించారు. దీంతో కోర్టులో దావా దాఖలు చేశాం. ఈ ఏడాది నవంబర్ వరకు ఇంజషన్ ఆర్డర్ ఇచ్చారు. అయినప్పటికీ మమ్మల్ని బెదిరిస్తున్నారు. తమ దుకాణాల తాళాలు ఇప్పించాలని కోరుతున్నాం – రామచంద్రరావు, షేక్ ఖాజావలి, గిరి, ఎస్వీఎన్ కాలనీ నేను వైద్య విద్యను విదేశాల్లో అభ్యసించాలని నిర్ణయించుకున్నా. ఈ విషయమై మా ఇంట్లో అద్దెకు ఉండే వారికి ఎనిమిది నెలలు క్రితమే తెలియజేశాం. రెండు, మూడు నెలల్లో ఖాళీ చేస్తామని బదులిచ్చారు. అయితే నెలలు గడిచినా ఖాళీ చేయకపోగా మాపైనే బెదిరింపులకు పాల్పడుతున్నారు. అసభ్య పదజాలంతో ధూషిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జీఎంసీ నోటీసు మేరకు అక్రమంగా ఏర్పాటైన రేకులను తొలగించాం. ఈ క్రమంలో అద్దెకు ఉండే ఓ వ్యక్తి మాపై దాడికి యత్నించాడు. కోర్టులో స్టే లేకపోయినా ఉన్నట్లు హడావుడి స్పష్టిస్తున్నారు. మాకు కోర్టు నుంచి ఎటువంటి నోటీసులు రాలేదు. మాపై దాడికి పాల్పడిన వారిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యల్లేవు. దీనిపై విచారణ జరిపి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – ఫిలిప్స్ రూబెన్ భూమిక, కృష్ణవేణి, ఎస్వీఎన్ కాలనీ -
శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహం తొలగింపు
పెదకాకాని: శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వివాదానికి దారి తీయడంతో నిర్వాహకులు స్వచ్ఛందంగా రాత్రికి రాత్రే ఆ విగ్రహాన్ని తొలగించి వేరే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని తక్కెళ్ళపాడులో ఈనెల 24వ తేదీన శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేస్తున్నట్లు టీడీపీ నాయకులు ప్రకటించారు. సమాచారం అందుకున్న యాదవ సంఘం నేతలు, బీసీవై పార్టీ నేతలు 23వ తేదీన తక్కెళ్ళపాడులో విగ్రహావిష్కరణ వద్దకు చేరుకుని, ఎన్టీఆర్‌ను శ్రీకృష్ణుని రూపంలో ఆవిష్కరించడం అంటే శ్రీకృష్ణుడికి ప్రతి ఇంటా పూజలు చేసే యాదవ కులాన్ని, హిందువులను అవమానించడమేనని ఈ విగ్రహావిష్కరణ నిలిపివేయాలని స్థానికులను కోరారు. అయినప్పటికీ ఆదివారం మండల టీడీపీ, గ్రామ పెద్దలు శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహం నుంచి పిల్లనగ్రోవి, నెమలి పింఛం తొలగించారు. మరోసారి అదే విగ్రహం చేతిలో కత్తి పెట్టారు. అదే రోజు సాయంత్రం నిరసన తెలియజేసేందుకు అక్కడికి చేరుకున్న యాదవ సంఘం నాయకులు, బీసీవై పార్టీ ప్రతినిధులకు టీడీపీ నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అప్పటికే బీసీవై పార్టీ అధినేత సోమవారం ఛలో తక్కెళ్ళపాడు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ పిలుపులో భాగంగా యాదవసంఘ ప్రముఖులు గుంటూరు నగరంలో సమావేశమయ్యారు. అలాగే తక్కెళ్ళపాడు గ్రామంలో టీడీపీ నాయకులు, విగ్రహావిష్కరణ కమిటీ సమావేశం నిర్వహించారు. వివాదాస్పద విగ్రహావిష్కరణ కులాలు, మతాల మధ్య సమస్యగా మారుతుందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు.. ఆదివారం రాత్రి నిర్వాహకులు శ్రీకృష్ణుని రూపంలో ఉన్న విగ్రహాన్ని స్వచ్ఛందంగా తొలగించారు. అదే స్థానంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో వివాదాలకు తెరపడటంతో పాటు శాంతియుత వాతావరణం నెలకొంది. ఎటువంటి వివాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
బాల్య వివాహాల అనర్ధాలపై అవగాహన
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సోమవారం బుడంపాడు ఎస్టీ కాలనీలో బాల్యవివాహాలు, గిరిజన మహిళల్లో ఎర్లీ ప్రెగ్నన్సీ పై వారం రోజుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండని ఆడ పిల్లలకు, 21 సంవత్సరాలు నిండని పురుషులకు వివాహాలు చేయరాదన్నారు. అలా చేయడం చట్టపరంగా నేరమన్నారు. ఆ వయసులో వారు శారీరకంగా, మానసికంగా వివాహాలకు సిద్ధంగా ఉండరని, చదువుకోవడం ముఖ్యమన్నారు. గిరిజన మహిళలు ఎర్లీ ప్రెగ్నెన్సీ వలన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి అవగాహన కల్పించాలన్నారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు, గిరిజన సంక్షేమశాఖ అధికారి రఘునాథ్, మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి విజయకుమార్, అధికారులు పాల్గొన్నారు. -
టెండర్ల వాయిదాల పర్వం
అయినవారి కోసమేనా సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఏపీ సీఆర్డీఏ ఆహ్వానించిన టెండర్లను నిర్ణీత సమయంలో తెరవకుండా మీనమేషాలు లెక్కిస్తూ తమకు అనుకూలురైన కాంట్రాక్టర్ల కోసం ఎదురుచూస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్‌కు బిడ్లు దాఖలైనప్పటికీ సహేతుక కారణాలేవీ లేకుండానే ఫైనాన్షియల్ బిడ్ తెరవకుండా వాయిదా వేస్తుండగా, కొన్ని టెండర్లకు సంబంధించి సాంకేతిక బిడ్లను కూడా ఓపెన్ చేయడం లేదని టెండరుదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమకు అనుకూలురైన బడా కాంట్రాక్టర్లకు పనుకట్టబెట్టడానికే వాయిదాల వ్యవహారాలను ఏపీసీఆర్డీఏ ఉన్నతాధికారుల ద్వారా కూటమిలోని పెద్దలు కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్న, మధ్యతరహా కాంట్రాక్టర్లను పక్కన పెట్టి అన్ని పనులను ఒకటిగా చేసి పెద్దమొత్తంతో టెండరు పిలిచి బడా కంపెనీలకు అప్పజెప్పి భారీస్థాయిలో పర్సంటేజీలు రాబట్టుకోవచ్చనే వ్యూహంలో భాగంగానే వాయిదాల పర్వమని స్పష్టమవుతోంది. పది పనులకు టెండర్లు -
నెత్తురోడిన జాతీయ రహదారి
మంగళగిరి టౌన్: పండుగకు రెండు రోజుల ముందు ఇద్దరు మైనర్లు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఆహ్లాదంగా గడిపిన వారు విగత జీవులుగా ఇంటికి రావడం ఆయా కుటుంబాల్లో పెనుశోకం మిగిల్చింది. తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తాడాల వెంకన్నబాబు కొలనుకొండలో ఓ అపార్ట్మెంట్లో కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. వెంకన్నబాబు కుమారుడు సాత్విక్ (15), అదే అపార్ట్మెంట్లో ఉంటున్న తోట ప్రసాద్ కుమారుడి పుట్టినరోజు వేడుకలకు తన స్నేహితుడు వడ్డే శ్రీనరేన్ (15)తో కలసి బైపాస్‌రోడ్‌లో వున్న అనంత ఫంక్షన్ హాల్‌కు వెళ్లారు. జన్మదిన వేడుకల్లో సందడిగా గడిపి ఫంక్షన్ అయిన వెంటనే సాత్విక్, శ్రీనరేన్లు స్కూటీపై ఇంటికి బయలుదేరారు. ఆదివారం రాత్రి కొలనుకొండ జయభేరి అపార్ట్మెంట్ సమీపంలోకి వచ్చే సరికి గుంటూరు వైపు వెళ్లే మార్గంలో జాతీయ రహదారిపై లారీ ఆగివున్న విషయాన్ని గమనించని బాలురు స్కూటీతో లారీని వెనుక వైపు బలంగా ఢీకొన్నారు. దీంతో నరేన్, సాత్విక్‌లు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు మృత దేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సోమవారం పోస్ట్‌మార్టం అనంతరం మృత దేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాత్విక్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాడేపల్లి పోలీసులు పేర్కొన్నారు. సాత్విక్, శ్రీ నరేన్‌లు 10వ తరగతి చదువుతున్నారు. -
పింఛన్ల రద్దు దారుణం
గుంటూరు వెస్ట్: అన్ని వర్గాలను మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తోంది. కూటమి ప్రజాప్రతినిధులు ప్రతి పనికీ మాకేంటి అంటూ లెక్కలు చూడడమే తప్ప.. ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. సూపర్ సిక్స్ అంటూ ఉదరగొట్టిన ప్రభుత్వం.. వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకపోగా.. ఉన్నవి కూడా తొలగిస్తూ సామాన్యుల నడ్డి విరుస్తుంది. చివరకు దివ్యాంగులను సైతం కూటమి ప్రభుత్వం వదలడం లేదు. పథకాల్లో కోతే లక్ష్యంగా.. అర్హులకు సైతం అన్యాయం చేస్తూ.. ఏళ్లుగా తీసుకుంటున్న వారి పింఛన్లు సైతం తొలగించారు. దీనిపై సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు బొక్క అగస్టీన్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బాధిత దివ్యాంగులు హాజరై, జిల్లా అధికారులకు తమ గోడు వినిపించారు.. కూటమి ప్రభుత్వంపై దివ్యాంగుల ఆగ్రహం వినబడదు.. మాట్లాడలేడు.. పింఛన్ ఆపేశారు ఈ చిత్రంలోని 11 ఏళ్ల బాలుడి పేరు టి.సాయిరామ్, గుంటూరుకు చెందిన ఈ బాలుడికి వినబడదు.. మాట్లాడలేడు. పుట్టుకతోనే ఈ సమస్య ఉంది. ఇతని రెండు చెవులకు రెండు మిషన్లు ఉంటే గానీ కాస్తంత వినబడదు. తల్లిదండ్రులు ఇద్దరూ కూలీలే. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం. గతంలో ఇతనికి వైద్యులు పరీక్ష చేసి 60 శాతం వైకల్యముందని సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడేమో అది 40 శాతమే ఉందని చెబుతున్నారు. దీంతో పింఛన్‌కు అనర్హుడయ్యాడు. గతంలో 69 శాతం.. ఇప్పుడు 40 నేను మరగుజ్జును. గతంలో నాకు 69 అంగవైకల్యముందని సర్టిఫికెట్ ఇస్తే ఇప్పుడేమో 40 శాతముందని అంటున్నారు. వచ్చే పెన్షన్ రూ.6వేలతోనే నా జీవనం కొనసాగుతుంది. అది ఉంటుందో లేదో తెలీడంలేదు. రాదని కొందరంటున్నారు. పెన్షన్ తీసేస్తే నాకు మరో మార్గంలేదు. న్యాయం చేయాలి. – టి.వెంటేశ్వరరావు, గుంటూరు -
సమయపాలన పాటించండి
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా అధికారులు సమయపాలన పాటించడంలేదని, నిర్ణీత సమయానికే అందరూ తప్పక హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ కొందరు అధికారులు తమ ఇష్టం వచ్చిన సమయానికి వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విధానం మార్చుకోవాలన్నారు. అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తి స్థాయి తగ్గుతుందని, ఈ విషయాన్ని గుర్తించి మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రజల నుంచి అందిన 256 అర్జీలను కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, డీఆర్ఓ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు. -
పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలి
పిడుగురాళ్ల: పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని అంబేడ్కర్ ప్రచార సేవా సమితి డేగల అబ్రహం డిమాండ్ చేశారు. ఆదివారం దళిత సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లూరి అమర్ నాథ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దళిత మహాసభ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిల్లి చెన్నారావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కూడా మేము ప్రభుత్వానికి అర్జీలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. జాషువా కళా సమితి అధ్యక్షుడు బత్తుల దాసు మాట్లాడుతూ గుర్రం జాషువా జిల్లా పెట్టాలని దళితుల కోరిక అన్నా రు. 85 శాతం ప్రజల ఆకాంక్ష పల్నాడు జిల్లాకు జాషువా పేరు పెట్టాలని చెప్పారు. పల్నాడు జిల్లా బలహీన వర్గాల ఐక్యవేదిక అధ్యక్షులు నల్లబోతుల రాజు, హ్యూమన్ రైట్స్ పల్నాడు జిల్లా వైస్ చైర్మన్ బి.జీవరత్నం, మాలమహానాడు పాశం శ్యామ్, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధ్యక్షులు జక్కుల కృష్ణయాదవ్, దళిత సేవా దళ్ తళ్లూరి సురేంద్ర పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో భానోజికి తృతీయ స్థానం
సత్తెనపల్లి: రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మాజీ కౌన్సిలర్ పులహరి భానోజి ప్రతిభ చూపారు. సత్తెనపల్లి శక్తి యోగ నిర్వాహకుడు రమేష్ ఆధ్వర్యంలో 6వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ యోగ ఆసనం స్పోర్ట్స్ చాంపియన్‌షిప్– 2025 పోటీలు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించారు. పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ పోటీల్లో సీనియర్ విభాగం 45–55 సంవ్సరాల విభాగంలో స్టేట్ లెవెల్ లో లెగ్ బ్యాలెన్స్ లో సత్తెనపల్లికి చెందిన పులహరి భానోజీ ప్రతిభ కనబరిచి తృతీయ స్థానం దక్కించుకొని బహుమతి, మెడల్‌తో పాటు మెరిట్ సర్టిఫికెట్ అందుకున్నారు. ఫార్వర్డ్బెండ్ విభాగంలో సత్తెనపల్లికి చెందిన వల్లూరి శ్రీనివాసరావు, సుపైని విభాగంలో సత్తెనపల్లికి చెందిన పులికొండ శ్రీనివాసరావు చతుర్థ స్థానం దక్కించుకున్నారు. టెస్టింగ్ విభాగంలో ధనేకుల సాంబశివరావు ఐదో స్థానం కై వసం చేసుకున్నారు. 35–45 సంవత్సరాల విభాగంలో ఫార్వర్డ్బెండులో ఎం.సునీల్ కుమార్ నాలుగో బహుమతి సాధించారు. ఈ సందర్భంగా విజేతలను పలువురు ప్రముఖులు, యోగ అభ్యాసకులు ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు. -
కూటమి ప్రభుత్వంలో దివ్యాంగులకు తీవ్ర అన్యాయం
నరసరావుపేట: కూటమి ప్రభుత్వంలో దివ్యాంగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నిర్వహించిన గుడ్మా ర్నింగ్ నరసరావుపేట కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 14 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షలమంది దివ్యాంగులకు పింఛన్లు తొలగించారని తెలిపారు. నరసరావుపేట నియోజకవర్గంలో 850 మందికి తొలగించారన్నారు. కనీసం వారికి సదరం క్యాంపునకు రమ్మని పిలుపు కూడా ఇంతవరకు లేదని అన్నారు. ఇప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని, తొలగించిన పెన్షన్ల మిగులు డబ్బుతో పెంచిన డబ్బును అందిస్తున్నారని, ఇది దారుణమైన అంశమని విమర్శించారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు దందాలు చేస్తూ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రి అనిత రూ.2 కోట్లు లంచం తీసుకొని జీవిత ఖైదీ అనుభవిస్తున్న శ్రీకాంత్‌ను పెరోల్‌పై విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. ఈ పెరోల్‌కు గూడూరు ఎమ్మెల్యే సునీల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సిఫార్సు లెటర్లు ఇవ్వడం మరింత దారుణమైన అంశమని అన్నారు. శ్రీశైలం, గుంటూరు–2లో మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయని, సౌమ్య అనే కేజీవీబీ స్కూల్ ప్రిన్సిపాల్పె అక్కడి టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులకు పాల్పటం వల్ల ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని, అయినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని తెలిపారు. అనంతపురంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై అక్కడి శాసనసభ్యుడు బూతులు తిడుతూ కామెంట్లు చేశారని, ఆ సినిమాకు వెళ్లొద్దని ప్రజలకు ఆదేశాలు ఇచ్చారన్నారు. సినిమాలు వేరు, రాజకీయం వేరని, ఈ రకంగా శాసనసభ్యుడు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని గోపిరెడ్డి ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి -
కొండవీటి వాగు పొంగి తీరని నష్టం
నగరంపాలెం: ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు కొండవీటి వాగు పొంగి గుంటూరు చానల్ మీదుగా పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని 30 వేల ఎకరాలు నీట మునిగాయని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ తెలిపారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 12న కురిసిన కుంభవృష్టి వల్ల జరిగిన నష్టాన్ని గూగులో మ్యాప్ ద్వారా వివరించారు. కొండవీటి వాగులోని నీరు గుంటూరు చానెల్ ద్వారా రావడంతో కట్టలు తెగి పంట పొలాలు మునిగాయని వివరించారు. రాజధానిపై వస్తున్న విమర్శలను నుంచి కాపాడుకునేందుకు కొండవీగు వాగు నీరు గుంటూరు చానెల్‌కు రాలేదని సత్యదూరమైన మాటలు కూటమి ప్రభుత్వం చెబుతోందని ఆరోపించారు. కొండవీటి వాగు నీరు గుంటూరు చానెల్లో సీతానగర్ వద్ద ప్రత్యక్షంగా, కాజా టోల్గేట్ వద్ద పరోక్షంగా ప్రవహించిందని పేర్కొన్నారు. ఇప్పటికే రెండుసార్లు రైతులు వరి పొలాల్లో వెద పెట్టారని, మూడోసారి పెట్టే అవకాశాల్లేవని తెలిపారు. దీంతో నారుముడి వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అర్భాటంగా ప్రారంభించిన అన్నదాత సుఖీభవ సక్రమంగా అమలు జరగడంలేదని ఆరోపించారు. వెంటనే తాత్కలిక భృతి కింద నారు వేసేందుకు ఈ ప్రాంతంలో ఎకరాకు రూ.10 వేలు, ఉచితంగా ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ శాఖపై అవగాహన లేక మాట్లాడుతున్నారని విమర్శించారు. కొండవీటి వాగు లోతు, వెడల్పు పెంచకుండా రాజధాని ప్రాంతంలో డ్రైనేజీ, వర్షపు నీరు ప్రవహించేలా చేయకుండా నగరాన్ని నిర్మించలేమని చెప్పారు. రాజధాని మునుగుతుందని, అక్కడ నీరు పొన్నూరు నియోజవర్గం వైపు పంపు చేశారని తాను ఎప్పుడు మాట్లాడలేదని వివరించారు. -
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో రభస
పెదకాకాని: శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వివాదానికి దారి తీసింది. పెదకాకాని మండలంలోని తక్కెళ్లపాడులో చెరువు కట్టపై శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం విగ్రహావిష్కరణ నేపథ్యంలో భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్రయాదవ్ శనివారం అక్కడకు చేరుకున్నారు. యాదవులు, హిందువులు ఆరాధ్యదైవంగా భావించి పూజలు చేసుకునే శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయడం అవమానించడమేనని తెలిపారు. దీనిపై పెదకాకాని పోలీసుస్టేషన్లో బీసీవై పార్టీ ప్రతినిధులు, అఖిల భారత యాదవ మహాసభ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్వాహకులు రాత్రి 12 గంటల వరకూ చర్చలు జరిపారు. అదే విగ్రహం చేతిలో ప్లూటు, కిరీటంలో నెమలి పింఛం లేకుండా టీడీపీ మండల స్థాయి నాయకులు ఆవిష్కరించారు. దీంతో ఫిర్యాదుకు సంబంధించి రశీదు పొందేందుకు ఆదివారం సాయంత్రం పోలీసుస్టేషన్‌కు చేరుకున్న బీసీవై పార్టీ ప్రతినిధులు అక్కడ నుంచి తక్కెళ్లపాడు వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామంలో విగ్రహావిష్కరణ సమయంలో ఏర్పాటు చేసిన మైక్ ద్వారా తక్కెళ్లపాడు విగ్రహావిష్కరణ వద్దకు కరాటే కల్యాణి వస్తుందని చెప్పడంతో 300 మంది దాకా అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న బీసీవై పార్టీ నాయకులకు, విగ్రహావిష్కరణ కమిటీ ప్రతినిధులకు వాదోపవాదనలు జరిగాయి. విగ్రహం వద్దకు రాకుండా స్థానికులు, టీడీపీ నాయకులు బీసీవై నాయకులను అడ్డుకోవడంతో వివాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని బీసీవై ప్రతినిధులను అక్కడి నుంచి పంపించి వేశారు. దేవుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం హిందువులను, యాదవులను అవమానించడమేనని బీసీవై నాయకులు తెలిపారు. విగ్రహాన్ని అదే చెరువులో సోమవారం 11 గంటలకు నిమజ్జనం చేద్దామని భారత చైతన్య యువజన పార్టీ అధినేత ‘చలో తక్కెళ్లపాడు’కు పిలుపునివ్వడంతో విగ్రహావిష్కరణ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. తక్కెళ్లపాడులో ఘటన విగ్రహం వద్దకు చేరుకున్న బీసీవై పార్టీ ప్రతినిధులు ప్రతిఘటించిన నిర్వాహకులు పోలీసులు రంగ ప్రవేశం -
ద్విచక్ర వాహనాల చోరీ కేసులో వ్యక్తి అరెస్టు
లక్ష్మీపురం : ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన వాహనాలను చోరీ చేసే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి 10 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు కె.వి.పి కాలనీకి చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్ వాసు దుర్వసనాలకు అలవాటు పడి దొంగతనాలు ప్రారంభించాడు. గుంటూరు నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నాడు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నాడు. ఇటీవల గోరంట్ల గ్రామానికి చెందిన ఏరువ శ్రీదేవి నగరంపాలెం పరిధిలో ద్విచక్ర వాహనం చోరీ అయినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్, నగరంపాలెం సీఐ నజీర్‌బేగ్, పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్ఐలు రాంబాబు, ప్రసన్న, రామాంజనేయులు బృందాలుగా ఏర్పడి తనీఖీలు ముమ్మరం చేశారు. ఆదివారం నగరంలోని చుట్టుగుంట ప్రాంతంలో వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు ఇద్దరు మైనర్లతో కలిసి ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ వెళుతుండగా పోలీసులను చూసి వెనకకు తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించాడు. నగరంపాలెం ఎస్ఐ రాంబాబు వారిని అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారించారు. ఇందులో ద్విచక్ర వాహనాలను చోరీ చేసి కె.వి.పి కాలనీ చివరలో ఒక ప్రదేశంలో పెట్టినట్లు చెప్పారు. దీంతో సిబ్బందితో కలిసి చోరీ చేసిన 10 ద్విచక్రవాహనాలను, ఒక ఆటోను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. చోరీ చేసిన వాహనాల విలువ రూ.7లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ అరవింద్ తెలిపారు. వెంకటేశ్వర్లును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని అభినందించారు. -
బార్లా తెరిచినా రాం..రాం !
సాక్షి పత్రినిధి, గుంటూరు/ నెహ్రూనగర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీతో వ్యాపారస్తులు బార్ షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే గడువు ఉన్నప్పటికీ ఇంత వరకు ఒక్క దరఖాస్తు కూడా అందలేదు. ఒక్కరు కూడా లైసెన్స్ ఫీజు చెల్లించకపోవడం చూస్తుంటే దూరంగా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. దీంతో ఎకై ్సజ్ అధికారులు కిందా మీద పడుతున్నారు. ఎలాగైనా దరఖాస్తులు వచ్చేలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలతో మంతనాలకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పర్మిట్ రూములతో మరింత నష్టం గుంటూరు జిల్లాలో 140 వైన్ షాపులు ఉన్నాయి. వీటికి వచ్చే నెల 1వ తేదీ నుంచి పర్మిట్ రూములు మంజూరు చేయడంతో ఇక బార్లో ఎవరూ మద్యం తాగరని లైసెన్సీలు ఒకింత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో గంట పెంచారు. రాత్రి 11 దాటితే మద్యం తాగే వారు తక్కువగా వస్తారని, సమయం పెంచినా ఎవరికీ ఉపయోగం ఉండదని లైసెన్సీలు వాపోతున్నారు. బార్లో గతంలో చీప్ లిక్కర్ అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు చీప్ లిక్కర్(రూ.99) ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో దరఖాస్తు చేసుకునేందుకు ముందకు రాని పరిస్థితి. ఆదివారానికి 70 మంది మాత్రమే దరఖాస్తుకు ఎనన్రోల్ చేసుకున్నారు. అంటే గుంటూరు జిల్లాలో 120 బార్లు ఉంటే, ఒక్కో బార్‌కు ఒక్క దరఖాస్తు కూడా రాని పరిస్థితి నెలకొంది. అధికారుల వేడుకోలు కొత్త మద్యం పాలసీలో మంచి లాభాలు వస్తాయని ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకోవాలంటూ వ్యాపారస్తులు, లైసెన్సీలను, రియల్‌ఎస్టేల్, పారిశ్రామిక వేత్తలను వేడుకుంటున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్ముకునే అవకాశం ఉందని, మూడేళ్లు వ్యాపారం లాభసాటిగా ఉంటుందని చెబుతున్నారు. బార్ షాపునకు దరఖాస్తు చేసుకునే వారికి ఐటీ మినహాయింపు ఇచ్చిందని, నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించినప్పటికీ దరఖాస్తులు రాని పరిస్థితి నెలకొంది. మద్యం పాలసీపై మరిన్ని సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం బార్ నిర్వాహకులు కోరుతున్నారు. కొత్త పాలసీతో మరింత నష్టాలు? -
కూటమి పాలనలో రాక్షసత్వం
వినుకొండ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తపై హత్యాయత్నం వెంకటప్రసాద్ భార్య శ్రావణితో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ నేతలు అంబటి మురళీకృష్ణ, వనమా బాలవజ్రబాబు, నూరిఫాతిమా మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నగరంపాలెం (గుంటూరు వెస్ట్): కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నడూ లేని విధంగా దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం టి.అన్నవరం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త వెంకట ప్రసాద్, ఆయన కుటుంబసభ్యులపై హత్యాయత్నాన్ని ఖండించారు. జిల్లాలో ఇలాంటి దారుణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ సానుభూతి పరులపై కూడా రాక్షసత్వం చూపుతున్నారని ఆరోపించారు. కొనసాగుతున్న చికిత్స పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం టి.అన్నవరం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త వెంకటప్రసాద్, ఆయన కుటుంబసభ్యులపై శనివారం రాత్రి టీడీపీ మూకలు మరణాయుధాలు, కర్రలతో విచక్షణరహితంగా దాడులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయాలపాలైన ఆయన్ను మెరుగైన వైద్యసేవల నిమిత్తం గుంటూరు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ (పొన్నూరు), షేక్ నూరి ఫాతిమా(గుంటూరు తూర్పు), వనమా బాల వజ్రబాబు (తాడికొండ), నాయకులు ఆదివారం ఆరా తీశారు. వెంకటప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం మారాక సమాధానం ఇస్తాం గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ వినుకొండలో ఇలాంటి ఘటన రెండోదని చెప్పారు. గతంలో రషీద్‌ను ఎలా హత్య చేశారో అందరికీ తెలుసన్నారు. వెంకటప్రసాద్‌పై హత్యాయత్నం దారుణం అన్నారు. మహిళలని కూడా చూడకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేసి మరీ విచక్షణరహితంగా దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం మారుతుందని, అప్పుడు గిఫ్ట్ రూపంలో సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ‘కూటమి’వి హత్యారాజకీయాలు పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ వెంకట ప్రసాద్ ఎన్నికల్లో పార్టీ ఏజెంట్‌గా పనిచేశారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆయన కుటుంబాన్ని బెదిరించడం టీడీపీ సాధారణమైందన్నారు. కూటమి ప్రభుత్వం హత్యా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. వెంకటప్రసాద్‌పై హత్యాయత్నం విషయాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వారికి పార్టీ అండగా ఉంటుందని ఆయన చెప్పారన్నారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బీసీ కుటుంబంపై కక్షసాధింపు తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. వెంకటప్రసాద్ పార్టీ ఏజెంట్‌గా కూర్చోవడం పాపమా ? అని ప్రశ్నించారు. బీసీ కుటుంబంపై కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే వీటిని ప్రోత్సహించడం సరికాదన్నారు. ఇప్పటికై నా టీడీపీ సక్రమ పద్ధతిలో నడవాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు సహించబోమన్నారు. దాడులను ప్రోత్సహిస్తున్న సర్కార్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ వెంకటప్రసాద్‌పై హత్యాయత్నాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. ఇటువంటి దాడులను కూటమి ప్రభుత్వం ప్రోత్సహించడం సరికాదని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని, ప్రభుత్వాలు మారుతుంటాయనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. అనంతరం వెంకటప్రసాద్ భార్య శ్రావణి, సోదరి మాధవి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
పట్టుబట్టి... ‘కొలువు’ కొట్టి..!
పిడుగురాళ్ల రూరల్: ఒక లక్ష్యం పెట్టుకొని దానికోసం నిరంతరం కష్టపడి విజయం సాధించడానికి కొంతమంది మాత్రమే ముందుకు వెళ్తారు. గమ్యం చేరతారు. ఆ కోవకు చెందిన వారే వీరు. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన నాగిరెడ్డి, ఉదయశ్రీ దంపతులు ఈ ఏడాది డీఎస్సీ పరీక్షలు రాశారు. వెలువడిన ఫలితాలలో ఇద్దరూ ఉద్యోగాలు సాధించారు. నాగిరెడ్డి పదో తరగతి తర్వాత ఇంటర్, డిగ్రీ దూర విద్యలో పూర్తి చేశారు. అంతటితో ఆగకుండా బీఈడీ కూడా చదివారు. సచివాలయ ఉద్యోగాలకు పరీక్ష రాసి ఉద్యోగం సాధించారు. అయినా అంతటితో ఆగలేదు. డీఎస్సీకి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. తనతోపాటు భార్యను కూడా విద్య వైపు నడిపించి డిగ్రీ, బీఈడీ పూర్తి చేయించారు. ఇద్దరు ఇటీవల డీఎస్సీ పరీక్షలు రాశారు. స్కూల్ అసిస్టెంట్‌గా సోషల్‌లో 73.72 మార్కులతో నాగిరెడ్డి జిల్లా స్థాయిలో 67వ ర్యాంకును, ఉదయశ్రీ కూడా 74.55 మార్కులతో జిల్లా స్థాయి 50వ ర్యాంక్ సాధించారు. ఒకేసారి నాలుగు పోస్టులకు అర్హత పిడుగురాళ్ల పట్టణానికి చెందిన షేక్ జాకీర్ హుస్సేన్ కూడా డీఎస్సీ పరీక్షలు రాశారు. తాజాగా ప్రకటించిన ఫలితాలలో నాలుగు కేటగిరీలలో ఉద్యోగాలకు అర్హత సాధించారు. ఎస్జీటీలో 90.74 మార్కులతో గుంటూరు జిల్లా స్థాయిలో నాలుగవ ర్యాంకు కైవసం చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్‌లో 77.22 మార్కులతో గుంటూరు జిల్లా 27వ ర్యాంకు, టీజీటీ సోషల్‌లో 73.35 మార్కులతో జోన్ 3లో 16 ర్యాంకు, స్కూల్ అసిస్టెంట్‌గా తెలుగులో 67.07 మార్కులతో జిల్లా స్థాయి 71వ ర్యాంకు సాధించారు. 2012–13 విద్యా సంవత్సరంలో మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన హస్సేన్ ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించారు. పాఠశాల ఉపాధ్యాయులు, నాటి తరగతి స్నేహితులు ఆయన్ను అభినందించారు. మూడు పోస్టులకు... ఫిరంగిపురం: డీఎస్సీ ఫలితాల్లో మండలంలోని వేములూరిపాడు గ్రామానికి చెందిన జూపల్లి రత్నబాబు మూడు పోస్టులకు అర్హత సాధించారు. రాజారావు, మరియమ్మ దంపతుల కుమారుడైన రత్నబాబు ఎంపీపీ పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదివారు. ఆరు నుంచి పది వరకు అమీనాబాద్‌లోని బీఆర్ హైస్కూలులో, ఇంటర్, డిగ్రీ గుంటూరులోని హిందూ కళాశాలలో, బీఈడీ నరసరావుపేటలో పూర్తి చేశారు. ప్రస్తుతం తెలంగాణలోని వరంగల్ ఎస్ఆర్ కళాశాలలో ప్రైవేటు లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో ఎస్ఏ ఇంగ్లిష్‌లో 5వ ర్యాంకు, పీజీటీలో 6వ ర్యాంకు, టీజీటీలో 17వ ర్యాంకు సాధించి యువతకు ప్రేరణగా నిలిచారు. ఈ సందర్భంగా రత్నబాబు మాట్లాడుతూ.. 2024 ఫిబ్రవరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షకు హాజరయ్యేందుకు శ్రమించానని తెలిపాడు. అది రద్దు కావడంతో అప్పటి నుంచి పరీక్షల్లో ఉత్తమ ఫలితం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పాడు. రత్నబాబుకు భార్య రత్నకుమారితో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రత్నబాబు విజయంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. -
ఉత్కంఠ పోరులో పోలీసులదే విజయం!
మేడికొండూరు: నిత్యం విధి నిర్వహణ, ప్రజాసేవలో తలమునకలై ఉండే రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, సిబ్బంది ఒక్కచోట చేరి క్రీడాస్ఫూర్తిని చాటారు. మేడికొండూరు మండలంలోని పేరేచర్ల మినీ స్టేడియం వేదికగా ఈ రెండు శాఖల మధ్య ఆదివారం స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ హాజరై, ఇరు జట్ల ఆటగాళ్లను పరిచయం చేసుకున్నారు. అనంతరం టాస్ వేసి మ్యాచ్‌ను ప్రారంభించారు. హోరాహోరీగా సాగిన పోరు మైదానంలోకి దిగిన ఇరు జట్ల ఆటగాళ్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి పోలీస్ జట్టు, రెవెన్యూ జట్టుపై గెలుపొందింది. అనంతరం, ఎస్పీ విజేతగా నిలిచిన పోలీస్ జట్టుకు ట్రోఫీని అందజేసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. రన్నరప్‌గా నిలిచిన రెవెన్యూ జట్టు ఆటను కూడా ప్రశంసించారు. -
మద్యం పాలసీలో మరిన్ని సడలింపులు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన మద్యం పాలసీలో సడలింపులు తీసుకొచ్చినట్లు ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె.శ్రీనివాస్ తెలిపారు. శనివారం అరండల్‌పేటలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత మద్యం పాలసీపై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. గతంలో బార్ షాపు నిర్వాహణలో ఉన్న అనేక నిబంధనలను సరళీకృతం చేశారన్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి దాటిన తర్వాత పది కిలో మీటర్లు పరిధిలో బార్ పెట్టుకునే అవకాశం ఉందన్నారు. బార్ నిర్వహణ ఉదయం 10 – రాత్రి 12 గంటల వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. 4 కంటే తక్కువ దరఖాస్తులు వస్తే వారు చెల్లించిన ఫీజులను వెనక్కి ఇచ్చే వెసులుబాటు కల్పించామన్నారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సమావేశంలో జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి అరుణ కుమారి తదితరులు ఉన్నారు. -
పోలీసుల కృషితోనే నిందితుడికి సత్వర శిక్ష
నగరంపాలెం: చేబ్రోలులో బాలిక కిడ్నాప్, హత్య కేసులోని రిమాండ్ ఖైదీకి యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ చేసిన కృషి మరువలేమని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శనివారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జిల్లా ఎస్పీని బాలిక తండ్రి దావీదు, కుటుంబ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా ఎస్పీని సత్కరించారు. ఈ కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారని, నాలుగు నెలల్లో నిందితుడిని అరెస్ట్ చేశారని వారన్నారు. ఈ తీర్పు తమ బిడ్డకు ఘన నివాళి అని తండ్రి పేర్కొన్నారు. సత్వర న్యాయం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని చెప్పారు. కార్యక్రమంలో తెనాలి పోలీస్ సబ్ డివిజన్ డీఎస్పీ జనార్దన్‌రావు, చేబ్రోలు పీఎస్ ఎస్ఐ వెంకటకృష్ణ, బాలిక మేనమామ చిలక లక్ష్మయ్య, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
యూరియా.. లేదయా!
కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాతలకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. వరి సాగు మొదలుపెట్టి నాట్లు వేశారో లేదో.. భారీ వానలతో నీట మునిగాయి. మళ్లీ కాస్త తేరుకునేలోపే వరుణుడు కన్నెర్రజేశాడు. ఈసారి ఎక్కువ నష్టం తప్పలేదు. పంట పూర్తిగా నీట మునిగిపోయింది. యూరియా, డీఏపీ వంటి ఎరువులు వేస్తే పంట బతుకుతుందనే ఆశతో కర్షకులు ప్రయత్నాలు చేసినా ప్రభుత్వ నిర్లక్ష్యంతో అవీ అందుబాటులో లేవు. అరకొరగా లభ్యమైనా ధరలు పెరగడంతో రైతులపై ఆర్థికం భారం పడుతోంది.సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో సుమారు 72 వేల ఎకరాల్లో పంట నష్టపోయిన సంగతి తెలిసిందే. జిల్లాలో వర్షాలు తగ్గి మళ్లీ ఎండలు మొదలయ్యాయి. నీటి ముంపునకు గురి అయిన మాగాణి పొలాలను కాపాడటానికి రైతులు యూరియా వాడతారు. వర్షాధారంతో సాగు చేసిన మెట్ట పైరులకు పదును దాటక ముందే 2,3 రోజులలోనే యూరియా వాడాలి. పదును దాటితే వాడినా ఉపయోగం ఉండదు. దీంతో యూరియా వాడకం పెరిగింది. అధికారులు చెబుతున్నవన్నీ కాకి లెక్కలుగానే ఉన్నాయి. ఖరీఫ్‌కి కావాల్సిన ఎరువుల కన్నా తమ వద్ద ఎక్కువే స్టాక్ ఉందని చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. జిల్లాలోని పలు పీఏసీఎస్‌ల వద్ద రైతులు క్యూలో నిలబడాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఆధార్ కార్డు చూపితే.. రెండు రోజుల క్రితం పెదకాకాని మండలం ఉప్పలపాడు వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలోని గోళ్ళమూడి గ్రామంలో లారీ రోడ్డుపై పెట్టి అమ్మకాలు చేపట్టారు. ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి 5 బస్తాల చొప్పున అమ్మకాలు చేశారు. 5 బస్తాలు యూరియా రూ.1,350 చొప్పున విక్రయించారు. తర్వాత రోజున ఆధార్ కార్డు తీసుకువచ్చిన వారికి రెండు బస్తాలు మాత్రమే ఇచ్చారు. చాలాచోట్ల యూరియా అందుబాటులో లేదు. యూరియా, డీఏపీలు రైతు సేవా కేంద్రాలు, సొసైటీలో కూడా ప్రస్తుతం దొరకని పరిస్థితి నెలకొంది. అధిక రేట్లు పెట్టి కొనుగోలు చేయడానికి షాపుల్లో కూడా ఎరువులు ఇవ్వడం లేదు. ప్రత్తిపాడు మండలం ఒక్క వంగిపురం రైతు సేవా కేంద్రానికి మాత్రమే ఇప్పటివరకు 20 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. మిగిలిన 11 రైతు సేవా కేంద్రాల్లో ఎక్కడా యూరియాగానీ, కాంప్లెక్స్ ఎరువులుగానీ అందుబాటులో లేవు. ఒక్కో ఆర్‌ఎస్‌కేకు 20 మెట్రిక్ టన్నుల చొప్పున అన్ని కలిపి ఇండెంట్ పెట్టినప్పటికీ స్టాక్ రాలేదని రైతులు చెబుతున్నారు. ప్రత్తిపాడు మండలంలో మూడు పీఏసీఎస్‌లు ఉన్నాయి. వాటిల్లోనూ ఎరువులు లేవు. కనీసం సొసైటీల్లో ఇండెంట్లు కూడా పెట్టని పరిస్థితి నెలకొంది. యూరియా అందుబాటులో లేకపోవడంతో కట్ట రూ.270కు విక్రయిస్తున్నారు. బ్లాక్‌లో రూ.400లు అమ్ముతున్నారు. ఇలా బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతున్నా జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.ఎరువులు అందుబాటులో ఉంచాలి నందివెలుగులో ఉన్న నాలుగెకరాలు కౌలుకి, ఒక ఎకరం సొంత పొలంలో సాగు చేస్తున్నా. అధిక వర్షాలతో ఎకరాకు రూ.10 వేల వరకు నష్టపోయాం. ఇప్పుడు పొలాల్లోని నీరు బయటకు పోయింది. పైరుకు యూరియా, డీఏపీ ఎరువులు చల్లుతున్నారు. అందుబాటులో ఉంచడంతోపాటు ఉచితంగా ఇవ్వాలి. పంటనష్టం భారీగా జరిగినందున రైతులకు పరిహారం చెల్లించాలి. – తోటకూర కోటేశ్వరరావు, రైతు, నందివెలుగు గ్రామం, తెనాలి మండలం అదనపు ఖర్చు తప్పడం లేదు నేలపాడులో సొంతంగా 5, కౌలుకు 12 ఎకరాలు సాగు చేస్తున్నా. ఎకరాకు రూ.30 వేలు కౌలుకు చెల్లిస్తున్నా. సీజను ఆరంభంలో వరి వెదజల్లాం. ఎకరాకు రూ.2,500 వరకు ఖర్చు అయింది. వర్షాలకు అది దెబ్బతింది. యూరియా వేశాం. ఫర్వాలేదని అనుకునేలోపు భారీ వర్షంతో మళ్లీ పైరు దెబ్బతింది. పైపాటుగా వరి నాటిస్తున్నాం. ఖర్చు తప్పడం లేదు. ఎరువులూ లేవు. – సోమవరపు నాగేశ్వరరావు, రైతు, నేలపాడు గ్రామం, తెనాలి మండలం పంట మొత్తం కుళ్లిపోయింది ఇటీవల కురిసిన భారీ వర్షానికి పంట ముంపునకు గురై మొత్తం కుళ్లిపోయింది. గ్రామంలో ఎకరం రూ.25 వేల చొప్పున చెల్లించి 10 ఎకరాలు కౌలుకు చేస్తున్నా. ఎకరానికి రూ.15 వేలు వరకు పెట్టుబడి పెట్టా. భారీ వర్షాలతో పంట మొత్తం పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు మళ్లీ సాగు చేయాలంటే వరి నారు కొనుగోలుకు, నాట్లు వేయడానికి ఎకరానికి రూ.15 వేలు వరకు ఖర్చు అవుతుంది. – యర్రాకుల వీరాంజనేయరాజు, రైతు, వీరనాయకుని పాలెం, చేబ్రోలు మండలం మంత్రి జోక్యం చేసుకోవాలని వినతితెనాలి: ౖరైతుల అవసరాలకు తగినట్టుగా డీఏపీ, యూరియా సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి డిమాండ్ చేశారు. తెనాలి నియోజకవర్గంలో ఎరువులు అందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారని ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమీపంలోని దుగ్గిరాల, వేమూరులోని మార్కెటింగ్ సొసైటీల ద్వారా మార్కెట్ యార్డుల్లో దొరుకుతున్న ఎరువులు, తెనాలి మార్కెట్ యార్డులో ఎందుకు అందుబాటులో లేవని ఆయన ప్రశ్నించారు. యూరియా ధర కొన్నిచోట్ల రూ.400–450లకు ఉందని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు. కొల్లిపర మండలంలో పర్యటనకు వెళ్లిన మంత్రి నాదెండ్ల మనోహర్‌కు అక్కడి రైతులు ఈ విషయంపై విన్నవించారని గుర్తుచేశారు. మంత్రి పట్టించుకుని తెనాలి, కొల్లిపర మండలాల్లో డీఏపీ, యూరియా అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
అద్దె దుకాణాల కూల్చివేతపై ఆవేదన
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): ప్రతి నెల అద్దెలు చెల్లిస్తూ వస్తున్న వారిపై దుకాణ యజమాని మనవరాలు దౌర్జన్యానికి దిగారు. షాపులను ఖాళీ చేయాలంటూ రౌడీమూకతో కలిసి ఏకంగా జేసీబీ తీసుకొచ్చి షాపులను కూల్చివేయించారు. ఈ ఘటన శనివారం ఎస్.వి.ఎన్. కాలనీలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీ 4వ లైను ప్రధాన రహదారి మార్గంలో విజయవాడకు చెందిన వెంకటయ్య చౌదరి అనే వ్యక్తికి 778 గజాల స్థలంలో ముందు భాగంలో షాపులు, వెనుక ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ 35 సంవత్సరాల క్రితం కాలనీకి చెందిన రామచంద్రరావు షాపు అద్దెకు తీసుకుని సూపర్ మార్కెట్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు బ్యాటరీ దుకాణం, సెలూన్ ఏర్పాటు అయ్యాయి. మూడు కుటుంబాలు ఇక్కడే ఉంటున్నాయి. వెంకయ్య చౌదరికి నెలకు వీరందరూ రూ.35 వేల చొప్పున అద్దె చెల్లిస్తూ వచ్చారు. వీటికి కరెంటు బిల్లులు, మున్సిపాలిటీ పన్నులు తదితరాలను రామచంద్రరావు చెల్లిస్తున్నారు. వెంకయ్య చౌదరికి సంతానం లేకపోవడంతో తూమాటి కృష్ణవేణిని దత్తత తీసుకున్నారు. కృష్ణవేణికి వివాహమై, ఇద్దరు సంతానం ఉన్నారు. వెంకయ్య చౌదరి తన స్నేహితుడైన శ్రీనివాస్, పద్మజలను ఈ ఆస్తికి గార్డియన్లుగా పెట్టారు. 2017లో వెంకయ్య చౌదరి మృతి చెందారు. అప్పటి నుంచి శ్రీనివాస్‌కే అద్దెలు చెల్లిస్తున్నారు. గత జనవరిలో కృష్ణవేణి వచ్చి అద్దెల నగదు తనకు ఇవ్వాలని చెప్పడంతో వారు అదే విధంగా చేస్తున్నారు. సమయం అడిగినా.. రెండు నెలల క్రితం కృష్ణవేణి వచ్చినప్పుడు దుకాణాలు ఖాళీ చేయాలని, ఈ స్థలం విక్రయించామని చెప్పారు. రెండు నెలల్లో ఖాళీ చేయడం కష్టమని, కనీసం ఏడాదైనా టైం కావాలని చెప్పారు. అవేమీ పట్టించుకోకుండా ఎలాగైనా ఖాళీ చేయాలని హుకుం జారీ చేసి వెళ్లారు. అద్దెదారులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. స్థలం విలువ ఎంతో చెబితే తామే కొనుగోలు చేసుకుంటామని వారందరూ కోరారు. ఆలోచించుకుని చెబుతామని కృష్ణవేణి వెళ్లిపోయారు. ఈ నెల 17వ తేదీన మళ్లీ వచ్చి దౌర్జన్యంగా షాపులకు తాళాలు వేశారు. బాధితులు పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండాపోయింది. అద్దెకు ఉన్నవారు ఖాళీ చేయాలని స్టేషన్ అధికారి చెప్పారని బాధితులు వాపోయారు. ఈ నెల 18వ తేదీన జిల్లా ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్‌లోనూ వారు ఫిర్యాదు చేశారు. పట్టాభిపురం పోలీసులు కనీసం స్పందించలేదు. శనివారం మధ్యాహ్నం కృష్ణవేణి కుమార్తెనంటూ భూమిక అనే యువతి మరి కొంత మందితో వచ్చారు. జేసీబీతో షాపులు కూల్చివేయించారు. అడ్డుకునే యత్నం చేసే వారిపై మహిళలు, చిన్నారులు ఉన్నారని కూడా చూడకుండా బెదిరింపులకు దిగారు. బాధితులు ఫోన్ చేయగా పట్టాభిపురం హెడ్ కానిస్టేబుల్ వచ్చి గొడవ జరగలేదుగా అంటూ తిరిగి వెళ్లిపోయారని వారు తెలిపారు. కుటుంబాలతో రోడ్డున పడ్డామని ఆవేదన చెందుతున్నారు. -
● తగ్గని వరద ఉధృతి
అమరావతి: కృష్ణా నదిలో వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. అమరావతి వద్ద శనివారం కూడా కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలలో నిలిచిన నీరు కృష్ణానదిలోకి చేరాల్సి ఉంది. కానీ నదీ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ఎక్కడికక్కడే నీరు నిలిచిపోయింది. అమరావతి–విజయవాడ రోడ్డులో పెదమద్దూరు వద్ద వాగు చప్టాపై ఇంకా రెండు అడుగుల మేర నీరు ప్రవాహిస్తోంది. చప్టా శిథిలావస్థలో ఉండటం వల్ల అధికారులు రాకపోకలు నిలిపివేశారు. అమరావతి నుంచి విజయవాడ వెళ్లే బస్సులు పెదమద్దూరు వరకు నడుపుతున్నారు. విజయవాడ వెళ్లాలంటే ఆటోలో నరుకుళ్లపాడు ఎండ్రాయి, చావపాడు గ్రామాల మీదుగా సుమారు 10 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుండటంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్‌శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
సంతమాగులూరు(అద్దంకి రూరల్): బైకు మీద వెళ్తున్న భార్యాభర్తలను వెనకు నుంచి లారీ ఢీకొట్టటంతో మహిళ మృతి చెందింది. ఈ ఘటన సంతమాగులూరు మండలం రామిరెడ్డిపాలెం గ్రామం వద్ద శనివారం జరిగింది. సంతమాగులూరు ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. వినుకొండ మండలం గోకనకొండ గ్రామానికి చెందిన గద్దల తిరుపతయ్య, అతని భార్య కోటేశ్వరమ్మ (44) బైక్‌పై కొమ్మాలపాడు నుంచి సంతమాగులూరు వైపు వస్తున్నారు. రామిరెడ్డిపాలెంలోని రామాలయం వద్దకు రాగానే వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. కోటేశ్వరమ్మకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలైన తిరుపతయ్యను 108 వాహనంలో నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య చీరాల అర్బన్: ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం బాపట్ల జిల్లా చీరాల ఐక్యనగర్‌లో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఐక్యనగర్‌కు చెందిన డి.వెంకటేశ్వర్లు (36) ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ చేశాడు. హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుని గ్రూప్స్, కానిస్టేబుల్ పోస్టులకు ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు టూటౌన్ ఎస్ఐ నాగశ్రీను తెలిపారు. యువకుడి అదృశ్యంపై ఫిర్యాదు చౌటుప్పల్: ఆఫీసుకు వెళ్లిన యువకుడు ఇంటికి తిరిగిరాకుండా అదృశ్యమయ్యాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శనివారం వెలుగులోకి వచ్చింది. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడు గ్రామానికి చెందిన గడిపూడి మురారి(30) హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం వివాహమైంది. మూడు నెలల క్రితం గొడవ జరిగడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మురారి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని విద్యానగర్‌కాలనీలో నివాసముంటున్న తన అక్క కాంచన వద్దకు వచ్చాడు. రోజూ హైదరాబాద్‌లో ఆఫీస్‌కి వెళ్లి తిరిగి రాత్రికి వస్తుండేవాడు. 18న మురారి ఆఫీస్‌కి వెళ్లాడు. అదేరోజు రాత్రి అక్క ఫోన్ చేయగా.. ‘బస్టాండ్ వద్ద ఉన్నాను.. ఇంటికి వస్తున్నా’ అని చెప్పాడు. కానీ ఇంటికి వెళ్లలేదు. రెండు రోజులు అతడి ఫోన్ ఆన్‌లో ఉన్నప్పటికీ.. సమాధానం ఇవ్వలేదు. ఏదైనా పనిమీద ఉన్నాడేమోనని, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని భావించిన కాంచన అంతగా పట్టించుకోలేదు. 21వ తేదీ నుంచి మురారి సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ అయిపోయింది. ఎంత ప్రయత్నించినా మురారి గురించిన సమాచారం తెలియరాలేదు. దీంతో శనివారం మురారి అక్క కాంచన చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు. -
ఇన్స్పైర్ నామినేషన్లు పెంచండి
బాపట్ల డీఈఓ పురుషోత్తం బాపట్ల అర్బన్: ఇన్స్పైర్ అవార్డుల కోసం నామినేషన్ తప్పనిసరిగా ఉండాలని డీఈఓ పురుషోత్తం తెలిపారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కోసం మండల నోడల్ సైన్స్ ఉపాధ్యాయులకు బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ... ప్రతి ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మూడు, ఉన్నత పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు రిజిస్ట్రేషన్ చేయించాలని అన్నారు. అన్ని యాజమాన్య పాఠశాలలు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రాజెక్టులు నూతన ఆవిష్కరణలకు దారి తీసేలా ఉండాలని, పేటెంట్ హక్కులు పొందే స్థాయి వరకు వెళ్లే విధంగా విద్యార్థులకు తగిన తర్ఫీదు ఇవ్వాలన్నారు. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయడమే ఉపాధ్యాయుల కర్తవ్యం కావాలని పేర్కొన్నారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సెప్టెంబర్ 15వ తేదీలోపు బాపట్ల జిల్లా నుంచి గరిష్టంగా నామినేషన్లు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశానికి హాజరైన నోడల్ సైన్స్ ఉపాధ్యాయులు వెంటనే తమ మండలాల్లోని అన్ని పాఠశాలలు రిజిస్టర్ అయ్యేట్లు చూడవలసినదిగా ఆదేశించారు. జిల్లా సైన్స్ అధికారి మహమ్మద్ సాదిక్, నోడల్ టీచర్లు పాల్గొన్నారు. -
కౌలు రైతులకూ అన్నదాత సుఖీభవ వర్తింపచేయాలి
లక్ష్మీపురం (గుంటూరు): రాష్ట్రంలో 60 నుంచి 70 శాతం కౌలు రైతులే ఉన్నా గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.హరిబాబు ఆరోపించారు. వారికి అన్నదాత సుఖీభవ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడిపేటలోని సంఘం జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వాలంటే భూ యజమాని సంతకం చేయాలనే నిబంధన వల్ల కార్డులు రాలేదన్నారు. పంట రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. స్పందించి వారి సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం. నాగమల్లేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు ఎం.సాంబిరెడ్డి, పి.కృష్ణ, అమ్మిరెడ్డి, వై.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
దుగ్గిరాల: ఎరువుల కొరత ఏర్పడుతుందని అనే అపోహతో రైతులు ఒకేసారి ఎరువులు అధిక సంఖ్యలో తీసుకెళ్లడం ద్వారా కొరత ఏర్పడుతుందని విజిలెన్స్ ఈఓ ఆర్.విజయ బాబు అన్నారు. శనివారం దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో విజిలెన్స్, అగ్రికల్చర్, ఎన్ఫోర్స్మెంట్ శాఖల అధికారులు సంయుక్తంగా ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. విజయబాబు మాట్లాడుతూ యూరియా 58 మెట్రిక్ టన్నులు, డీఏపీ 49 మెట్రిక్ టన్నులు సొసైటీలు, ప్రైవేటు డీలర్స్ వద్ద అందుబాటులో ఉందని గుర్తించామని తెలిపారు. విజిలెన్స్ ఇన్స్పెక్టర్స్ కె.చంద్రశేఖర్, వై.శివన్నారాయణ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. రైలులో బాల కార్మికుల గుర్తింపు రాజుపాలెం/పిడుగురాళ్ల: హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలులో బాలకార్మికులను రైల్వే పోలీసులు, నీడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు శనివారం గుర్తించి, పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో వారిని దించారు. బిహార్ రాష్ట్రం బగల్పూర్ జిల్లా ఏక్ధర గ్రామానికి చెందిన ముగ్గురు బాలకార్మికులు హౌరా – సికింద్రాబాద్ ఎక్స్ప్రెల్ రైలులో అటూ ఇటూ తిరుగుతుండగా రైల్వే పోలీసులు గుర్తించారు. ఆ ముగ్గురు బాల కార్మికులను ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరచగా చిల్డ్రన్ హోంకు తరలించాలని సూచించారు. వెంటనే పోలీసులు మండలంలోని కోటనెమలిపురి పరిధిలో గల కొండమోడు సమీపంలోని వీరమ్మ కాలనీలో దీనమ్మ అండ్ రూరల్ డెవెలెప్మెంట్ సొసైటీ నిర్వహిస్తున్న చిల్డ్రన్ హోంకు తరలించారు. బాలకార్మికుల ద్వారా తల్లిదండ్రుల వివరాలు తెలిసుకుని వారిని రప్పించి అన్ని ఆధారాలతో అప్పజెబుతామని సొసైటీ చైర్మన్ గరికపాటి శంకరరావు తెలిపారు. పిడుగురాళ్ల రైల్వే ఎస్ఐ హుస్సేన్, ఏఎస్ఐ సంతరాజు, నీడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు రవికుమార్, చైల్డ్ ప్రొటెక్షన్ ప్రతినిధి రామకృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛ రేపల్లె సాధనకు సహకరించండి
ఆర్డీవో నేలపు రామలక్ష్మి రేపల్లె: స్వచ్ఛ రేపల్లె సాధనలో పట్టణ ప్రజలు భాగస్వాములు కావాలని ఆర్డీవో నేలపు రామలక్ష్మి కోరారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓల్డ్‌టౌన్ అంకమ్మ చెట్టు సెంటర్లో స్థానికులతో పరిసరాల పరిశుభ్రతపై శనివారం ప్రతిజ్ఞ చేయించారు. ఆర్డీవో మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రమాదం ఉందని, అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురుగు కాలువలలో చెత్తను వేయరాదని, పారిశుద్ధ్య సిబ్బందికి మాత్రమే అందించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కే సాంబశివరావు, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, వైద్య సిబ్బంది, పట్టణ ప్రజలు, వివిధ పాఠశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు వెస్ట్: మైనార్టీల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో పీఎంజేబీకే, సూర్యఘర్, టూరిజం అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ పీఎంజేబీకే పథకం 25 శాతం మైనార్టీలున్న ప్రాంతాల్లోనే సాధ్యమన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం దీనికి ఎంపికై ందని తెలిపారు. సూర్యఘర్ పథకం కింద గుంటూరు పార్లమెంటు పరిధిలో 1.16 లక్షల మంది నమోదు అయ్యారన్నారు. 3,600 మంది ఉపయోగించుకుని లబ్ధి పొందారని పేర్కొన్నారు. జిల్లాలో టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎన్టీఆర్ మానస సరోవరం, పేరేచర్ల వద్ద ఉన్న నందనవనం, ఉండవల్లి గుహలు, ఉప్పలపాడు విదేశీ పక్షుల కేంద్రం తదితరాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు కోరుతామన్నారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, సీపీఓ శేషశ్రీ, జిల్లా టూరిజం అధికారి శ్రీరమ్య, ఎల్డీఎం మహిపాల్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. -
యూరియా కొరత లేదనడం హాస్యాస్పదం
ఫిరంగిపురం: వ్యవసాయ పనులు ప్రారంభమైనప్పటికీ రైతులకు యూరియా అందుబాటులోకి రాలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు పేర్కొన్నారు. మండల కేంద్రంలో శనివారం వ్యవసాయ కార్మికసంఘం సమావేశం నిర్వహించారు. అప్పారావు మాట్లాడుతూ యూరియా కొరతతో రైతులు ఇక్కట్లు పడుతుంటే అధికారులు మాత్రం కొరత లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉపాధి హామీ కూలీలకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. పనులు నిర్వహించి రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వేతనాలు ఇవ్వలేదని తెలిపారు. వ్యవసాయ పనులు లేక వారు నానా ఇక్కట్లు పడుతున్నారని చెప్పారు. సీఐటీయూ మండల కార్యదర్శి షేక్, మస్తాన్‌వలి, ఎ.అంకారావు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. కృష్ణా నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య తాడేపల్లి రూరల్: తాడేపల్లి సీతానగరం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఓ మహిళ కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతానగరం ఘాట్ వద్దకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విజయభార్గవి (28) అనే మహిళ తన కుమార్తె అనేక్యతో కలసి వచ్చింది. భార్గవి కృష్ణానదిలోకి దూకడంతో స్థానికులు గమనించి సమాచారం అందించారని తెలిపారు. పోలీసులు వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. పాప తన తండ్రి పేరు నరేష్ అని మాత్రమే చెబుతోందని, ఊరు పేరు చెప్పలేకపోయిందని తెలిపారు. ఎవరికై నా వివరాలు తెలిస్తే తాడేపల్లి పోలీస్‌స్టేషన్ ఫోను నంబర్లు 86888 31361, 81438 73409, 97034 52206లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ పేర్కొన్నారు. అనేక్యను విజయవాడలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించినట్లు తెలిపారు. -
వైభవంగా కోటి కుంకుమార్చన
అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడ శైవ క్షేత్రమైన శ్రీ గంగాపార్వతి సమేత శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణ బహుళ అమావాస్యను పురస్కరించుకుని శనివారం కోటి కుంకుమార్చన, సామూహిక లలిత పారాయణ మహోత్సవం జరిగింది. కార్యనిర్వాహణాధికారి బి. అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించారు. ప్రధాన అర్చకుడు స్వర్ణ వెంకట శ్రీనివాస శర్మ పూజా కార్యక్రమాలు జరిపారు. 10 లక్షల పారాయణ, కుంకుమార్చన, అమ్మవారికి శ్రీ సూక్త సహిత దేవి ఉపనిషత్తులతో అభిషేకం, కుంకుమార్చన, దేవీ హోమం, కుష్మాండ పూజ, కూష్మాండ బలి పూజా కార్యక్రమాలు జరిగాయి. పైనం రంగారెడ్డి దంపతులు అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో చావలి శ్రీధర్‌శర్మ, మండవ రమేష్, పావులూరి రమేష్, పావులూరి సుబ్బారావు, వరలక్ష్మి, పొన్నపల్లి సత్యన్నారాయణ, జంజనం హేమశంకరరావు, కూచిబొట్ల శ్రీనివాసశర్మ, కళ్యాణ చక్రవర్తి స్వామి, పసుపులేటి కొండలస్వామి, పడమట వెంకటేశ్వరరావు, చింతల మురళీకృష్ణ, మండవ మల్లేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలను కోటి కుంకుమార్చన కమిటీ, సహాయకులు పర్యవేక్షించారు. -
సీనియార్టీ జాబితా రూపకల్పనకు వినతి
నెహ్రూనగర్: గుంటూరు జోనల్ పరిధిలోని ఉద్యోగుల సీనియార్టీ జాబితాను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ కోరారు. ఈ మేరకు శనివారం బ్రాడిపేటలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ రీజినల్ డైరెక్టర్ ఎస్. హరికృష్ణను ఆయన చాంబర్లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డు సచివాలయ ఉద్యోగులందరి సీనియార్టీ జాబితాను జూలై 31వ తేదీ లోపు రూపొందించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. అనేకచోట్ల ఇది అమలు కాలేదని చెప్పారు. పారదర్శకంగా జాబితాను సిద్ధం చేయాలని కోరారు. వచ్చే పది రోజుల్లోపు గుంటూరు రీజియన్‌లోని ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో పనిచేస్తున్న వారి జాబితాను రూపొందించి, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని ఆర్డీ పేర్కొన్నట్లు రజాక్ తెలిపారు. తుది సీనియార్టీ జాబితాను రూపొందించి మున్సిపల్ డైరెక్టర్ కార్యాలయానికి, ఉద్యోగులకు అందిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పార్షా మధు, సంఘ నగర నాయకులు అంకారావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
అపూర్వ ధైర్యశాలి టంగుటూరి
నగరంపాలెం: స్వాతంత్య్ర సమరంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అపూర్వ ధైర్యసాహసాలతో బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు ఎదురు నిలబడ్డారని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మ గౌరవ పతాకదారుడు టంగుటూరి అన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎంగా ప్రజాస్వామ్య పరిపాలనకు బలమైన పునాదులేసి, విశేష సేవలందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ఏడుకొండల రెడ్డి, ఎస్బీ సీఐలు అళహరి శ్రీనివాస్, సీహెచ్ రాంబాబు, ఆర్ఐలు సురేష్, శ్రీహరిరెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్ఫూర్తి ప్రదాత ప్రకాశం పంతులు గుంటూరు ఎడ్యుకేషన్: స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిషు పాలకుల తుపాకీకి ఎదురొడ్డి నిలిచిన టంగుటూరి ప్రకాశం పంతులు తరతరాలకు స్ఫూర్తి ప్రదాత అని జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతిబసు మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టినా రాష్ట్రానికి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని వివరించారు. అత్యంత సాధారణ జీవనాన్ని సాగించిన ఆయన దేశభక్తి నేటి యువతకు మార్గదర్శకం కావాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, పరిపాలనాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం చిత్రపటానికి నివాళులర్పిస్తున్న జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ప్రకాశం పంతులు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న జెడ్పీ సీఈవో జ్యోతిబసు, డిప్యూటీ సీఈవో కృష్ణ, ఉద్యోగులు -
అసెస్మెంట్ బుక్స్ విధానాన్ని రద్దు చేయాలి
డీఈవో కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ నిరసన గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తెచ్చిన అసెస్మెంట్ బుక్స్ విధానాన్ని రద్దు చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షుడు కె. బసవ లింగారావు మాట్లాడుతూ.. ఈ విధానం కారణంగా విద్యార్థులు 50 నుంచి 70 గంటల బోధనా పీరియడ్స్ నష్టపోతున్నారని, ఆగస్టు నెలలో సిలబస్ పూర్తవ్వకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఈ విధానం తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ ఒకటో తరగతి విద్యార్థికి ఓఎంఆర్ షీట్ ఇవ్వడం పనికి రాని చర్య అన్నారు. ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యాంశాల నుంచి ఒక్క ప్రశ్న సైతం ఇవ్వకుండా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తురని పేర్కొన్నారు. ఒక్కో పరీక్షకు ఎనిమిది పేపర్లతో ప్రశ్నపత్రాలను సిద్ధం చేయడం చేయడం ఉపాధ్యాయులకు పెద్ద పరీక్షలా ఉందన్నారు. విద్యార్థుల మార్కులు ఐదు చోట్ల నమోదు చేయాలనడం తగదన్నారు. అనంతరం డీఈవో సీవీ రేణుక, ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా శాఖ నాయకులు పి.లక్ష్మీనారాయణ, పి.పార్వతి, ఎస్ఎస్ఎన్ మూర్తి, జి.దాస్, బి.సాయిలక్ష్మి, వెంకటేశ్వరావు, కిషోర్ షా, రాంమోహన్, శివరామకృష్ణ, రమాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అంధుల క్రికెట్ టోర్నీ విజేత ‘ఆంధ్రా గ్రీన్’
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఏపీ రాష్ట్ర అంధుల క్రికెట్ జట్టు కోసం గత మూడు రోజులుగా స్థానిక అరండల్‌పేటలోని ఏసీఏ క్రీడా మైదానంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఏపీ, విజువల్లీ బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, డిఫరెంట్ డిసేబుల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ సంయుక్తాధ్వర్యంలో జరిగిన పోటీలు శుక్రవారంతో ముగిశాయి. విజేత జట్టుగా ఆంధ్రా గ్రీన్స్ జట్టు నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభ కనబరిచిన 42 మందిని ఎంపిక చేసి ఆంధ్రా బ్లూ, ఆంధ్రా ఎల్లో, ఆంధ్రా గ్రీన్ పేరుతో పోటీలను నిర్వహించారు. ఆంధ్రా గ్రీన్ విజేతగా నిలిచింది. వీసీఈఏ అధ్యక్షుడు జి.రవీంద్ర బాబు ముఖ్యఅతిథిగా జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో క్రికెట్‌కు అండగా నిలుస్తున్న రామకృష్ణ పరమహంస, మోటివేషనల్ స్పీకర్ శ్రీధర్‌బాబు, మాజీ బ్లైండ్ క్రికెటర్, అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి విజేతలకు ట్రోఫీని అందించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రికెటర్లను ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. ఉత్తమ ప్రతిభ చాటిన వారిని జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్రం తరఫున పంపిస్తామని తెలిపారు. పోటీల ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వహకులు కొలగాని శ్రీనివాసరావు, ఎల్వీఆర్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
విత్తన, పురుగు మందుల షాపుల్లో తనిఖీలు
కొరిటెపాడు (గుంటూరు): నగరంలోని పలు విత్తన, ఎరువులు, పురుగు మందుల షాపుల్లో శుక్రవారం వ్యవసాయ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వివిధ కంపెనీలకు చెందిన రూ.4.85 లక్షల విలువ గల అనుమతులు లేని 168 లీటర్ల పురుగు మందులు, 60 కిలోల పౌడర్ల అమ్మకాలను నిలిపివేశారు. ఈ సందర్భంగా గుంటూరు ఏడీఏ ఎన్.మోహనరావు మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలతో పాటు, అనుమతులు లేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు నిల్వ చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టాలకు వ్యతిరేకంగా వ్యాపారాలు చేసే వారి లైసెన్సులను రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఎంఆర్పీ ధరలకు విక్రయించాలని సూచించారు. విధిగా షాపుల ముందు ధరల పట్టిక, స్టాక్ బోర్డులను ప్రదర్శించాలన్నారు. ప్రతి వ్యాపారి రిజిస్టరు నిర్వహించాలని సూచించారు. తనిఖీల్లో వ్యవసాయ శాఖ అధికారులు సుజాత, కిషోర్, సునీత, లక్ష్మి, సుజన బేగం తదితరులు పాల్గొన్నారు. రూ.4.85 లక్షల విలువైన ఉత్పత్తుల విక్రయాలు నిలిపివేత -
యువతులపై గంజాయి మూక దాడి
గుంటూరు రూరల్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత మహిళలపై జరుగుతున్న దారుణాలకు అంతే లేకుండా పోయింది. అదేమంటే గంజాయి, మద్యం తాగొచ్చి ‘చంపేస్తాం’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారం తమది అంటూ రెచ్చిపోతున్నారు. ఇదే తరహా సంఘటన శుక్రవారం రూరల్ మండలంలోని దాసరిపాలెం గ్రామంలో వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... దాసరిపాలెంకు చెందిన కొరబడి మరియదాసు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయనకు కుమార్తె ఉంది. ఆమె గుంటూరులో ఒక దుకాణంలో కూలీ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మరియదాసు ఇంటి నుంచి రోడ్డుకు వచ్చారు. అదే సమయంలో నాని, చిన్న, కార్తిక్, ఆనంద్, మరికొందరు మరియదాసును మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని అడిగారు. లేవని ఆయన చెప్పారు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న రౌడీమూక దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మరియదాసు కుమార్తె, సోదరి దీనిపై ఆ మూకను నిలదీశారు. దీంతో వారిపైనా దాడి చేసి, నోటికి వచ్చినట్లు దుర్భాషలాడారు. ఇంకోసారి కనిపిస్తే చంపేస్తామని బెదిరించారని బాధితులు ఆరోపించారు. మరియదాసును చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తీసుకువెళ్లారు. అనంతరం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాసరిపాలెంకు చెందిన సుధీర్ అనే టీడీపీ నాయకుడు జోక్యం చేసుకుని, నిందితులు తమ పార్టీకి చెందిన వారేనని పోలీసులకు చెప్పారని బాధితులు తెలిపారు. దీంతో పోలీసులు సైతం తమనే తిట్టి వెనక్కి పంపారని, స్థానిక ఎమ్మెల్యే మనిషి సుధీర్ కావడంతో అతడు ఏది చెబితే అదే చేస్తామని పోలీసులు అంటున్నారని ఆరోపించారు. కాపాడాలని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
కదులుతున్న రైలుపైకి భార్యను నెట్టిన భర్త
తాడేపల్లి రూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌పైకి తోసివేసిన ఘటన శుక్రవారం తాడేపల్లి గేటు సెంటర్లో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... నూజివీడుకు చెందిన వెంకటేశ్వరరావు, అతని భార్య అంజలి కొంతకాలంగా తాడేపల్లిలో నివసిస్తున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం విడాకులు కూడా తీసుకుని వేరువేరుగా ఉంటున్నారు. ఇటీవల కలసి జీవనం కొనసాగిస్తున్నారు. అంజలి తాడేపల్లి సలాం సెంటర్ నుంచి శుక్రవారం ఉదయం బైపాస్‌రోడ్‌లో ఉన్న ఓ హోటల్లో పని చేసేందుకు వెళుతోంది. గేటు సమీపంలో భర్త వెంకటేశ్వరరావు తారస పడ్డాడు. అదే సమయంలో రైలు వెళుతుండగా భర్త ఆమె జుట్టు పట్టుకుని వేగంగా వెళుతున్న రైలు మీదకు నెట్టాడు. రైలు ఢీకొనడంతో అంజలి తీవ్ర గాయాలతో అక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు 108కు ఫోన్ చేసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పారిపోతున్న వెంకటేశ్వరరావును పట్టుకుని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి
నగరంపాలెం: వినాయక చవితి పండుగ సందర్భంగా పందిళ్లు, మండపాలు, ఊరేగింపులు నిర్వహించేందుకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి ఎటువంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో విధానం అనుసరించాలని సూచించారు. ఉత్సవాలు నిర్వహించే వారు కమిటీగా ఏర్పడాలని అన్నారు. వెబ్సైట్లో క్లిక్ చేసి అనుమతులు పొందాలన్నారు. తొలుత మొబైల్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తయ్యాక తర్వాత దరఖాస్తు విండో ఓపెన్ అవుతుందని అన్నారు. దరఖాస్తు సమర్పించిన తర్వాత స్థానిక పోలీసులు ప్రాంగణాన్ని పరిశీలించి, అనుమతులు ఇస్తారని వివరించారు. దరఖాస్తులో నమోదు చేయాల్సినవి ●దరఖాస్తుదారుని పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్, చిరునామా, అసోసియేషన్/కమిటీ పేరు. ●గణేష్ మండపం స్థలం, విగ్రహం/మండపం ఎత్తు. ●పోలీస్ సబ్ డివిజన్, పోలీస్‌స్టేషన్ పరిధి ●ఉత్సవ కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు. ●గణేష్ నిమజ్జనం తేదీ, సమయం, వాహనాల వివరాలు. ఎన్ఓసీ/ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసే విధానం కమిటీ సభ్యులు వెబ్సైట్లోకి వెళ్లి మొబైల్ నంబర్ నమోదు చేస్తే నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) పాటించాల్సిన నిబంధనలతో కూడిన క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ ఎన్ఓసీ/క్యూఆర్ కోడ్‌ను ప్రింట్ తీసి, లామినేషన్‌తో మండపంలో ఏర్పాటు చేయాలన్నారు. తనిఖీకి వచ్చే అధికారులు వాటిని పరిశీలిస్తారని వివరించారు. -
ఆచార్యా.. అర్హులను ఎంపిక చేయండి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యంత్రాంగం తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతన్నాయి. ఫార్మసూటికల్ కళాశాలలో అర్హత కలిగిన వారిని ఎంపిక చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో ఆచార్యుని నియామకం కోసం జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేశారు. జూలై 19న ఇంటర్వ్యూలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 మందికి కాల్ లెటర్స్ అందగా, 14 మంది హాజరయ్యారు. సబ్జెక్టులో పీజీ, పీహెచ్డీ తోపాటు 15 సంవత్సరాలు బోధన అనుభవంలో కనీసం ఐదేళ్లు ప్రొఫెసర్ లేదా సీనియర్ ప్రొఫెసర్‌గా అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆ ఇద్దరికి ఉద్యోగాలు ఎలా ఇస్తారు? నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక జరుగుతోందని అభ్యర్థులు ఆందోళన చెందుతూ శుక్రవారం వర్సిటీలోని హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, రిజిస్ట్రార్, వైస్ చాన్సలర్లను కలసి ఫిర్యాదు చేశారు. అర్హులను కాదని ఐదేళ్ల ప్రొఫెసర్ అనుభవం కూడా లేని, పీహెచ్ విద్యార్థిని గైడ్ చేయని మహిళకు ఆ పోస్టు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అధికార పార్టీ సామాజిక వర్గానికే చెందడమే ఆమె అర్హతగా చెబుతున్నారు. మరోవైపు ఒక పోస్టుకు నోటిఫికేషన్ ఇచ్చి రెండు పోస్టులకు భర్తీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కృష్ణాజిల్లా సిద్ధార్థ ఫార్మసీ కళాశాలకు చెందిన దేవినేని హిరణ్మయి, సింగరాయకొండ మలినేని ఫార్మసీ కళాశాలకు చెందిన తేజోమూర్తిని ఎంపిక చేసినట్లు ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై రిక్రూట్మెంట్ కమిటీ నియమించడం జరిగిందని, దాని నిర్ణయమే అంతిమం అని రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. -
మూగ, చెవుడైనా పింఛన్ రద్దు
గుంటూరుకు చెందిన కుమార్ అనే దివ్యాంగుడి తల్లి మాట్లాడుతూ... ‘మా బాబు పుట్టుకతోనే మూగ, చెవుడు కావడంతో ఎన్నో అప్పులు చేసి కాంక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించాం. ప్రస్తుతం బాబుకు రూ.6 వేలు పింఛన్ వస్తోంది. దాంతోనే ట్రీట్మెంట్ జరుగుతోంది. గతంలో వంద శాతం వైకల్యం ఉందని డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు 40 శాతంకంటే తక్కువ ఉందని నోటీసులు ఇచ్చి పింఛన్ ఆపేస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా మమ్మల్ని ఇబ్బందులు పెడితే ప్రభుత్వానికి ఏం ఉపయోగం అని ప్రశ్నించారు. అధికారుల తీరుతో ఆవేదన తప్పడం లేదని వాపోయారు.ఇప్పుడు 40 శాతం కంటే తక్కువట..వందశాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ -
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: పరిశ్రమలు స్థాపించేందుకు వచ్చే వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి మార్గాలు పెరగాలన్నా, ఆర్థిక ప్రగతి కావాలన్నా వ్యవసాయంతోపాటు పరిశ్రమల స్థాపన కూడా ఎంతో ముఖ్యమన్నారు. నూతన పరిశ్రమల స్థాపన కోసం వచ్చే దరఖాస్తులను సింగిల్ విండో విధానంలో పరిష్కరించాలన్నారు. లోటుపాట్లు ఉంటే అధికారులు గైడ్ చేయాలని తెలిపారు. ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అధికారులు త్వరగా చర్యలు చేపట్టాలన్నారు. హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు దేవదాయ శాఖతో సమన్వయం చేసుకుని సంబంధిత భూములను ఏపీఐఐసీకి అందించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రుణాలు మంజూరు కీలకం జిల్లాలో ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం కింద నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వ్యాపార విస్తరణకు అవసరమైన రుణాలు బ్యాంకుల ద్వారా అందించాలని సూచించారు. వాణిజ్య, వ్యాపారవేత్తల నైపుణ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మండల, నియోజకర్గ స్థాయిలో నిర్వహించే ఆర్‌ఏఎంపీ వర్క్‌షాప్‌లో వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. జిల్లాలో పీఎం విశ్వకర్మ పథకం ద్వారా శిక్షణ పొందిన చేతివృత్తిదారులకు టూల్ కిట్స్ అందజేయడంతోపాటు అవసరమైన వారికి వ్యాపార సంస్థల ఏర్పాటుకు రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లాలో ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రోత్సాహకాల కింద 24 క్లెయిమ్స్కుగాను రూ. 1.37 కోట్లు మంజూరు చేస్తూ కలెక్టర్ ఆమోదం తెలిపారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఎ.జయలక్ష్మి, డీడీ మధుసూదనరావు, కమర్షియల్ టాక్స్ డీసీ మనోరమ, డీఆర్డీఏ పి.డి. టీవీ విజయలక్ష్మి, జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి, జిల్లా నైపుణ్య అధికారి సంజీవరావు, ఇతర జిల్లా అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. యువత వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలి గుంటూరు వెస్ట్: యువత వృత్తి నైపుణ్యాలను అందిపుచ్చుకుంటే ఉపాధి మార్గాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ఇండియా స్కిల్స్ కాంపిటేషన్ 2025 పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ 30వ తేదీలోపు పోటీకి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, నిర్మాణం తదితర మొత్తం 63 నైపుణ్య ట్రేడ్లపై పోటీ నిర్వహిస్తారన్నారు. జనవరి 1, 2001 తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సంజీవరావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఎ.జయలక్ష్మి, డీడీ మధుసూదనరావు, కమర్షియల్ టాక్స్ డీసీ మనోరమ, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి తదితరులు పాల్గొన్నారు. -
కూటమి కర్కశం
దివ్యాంగులపైనా దివ్యాంగులనే కనికరం చూపని కూటమి కర్కశత్వానికి నిదర్శనంగా పింఛన్ల రద్దు నిలుస్తోంది. అందరిలా పని చేసుకోలేక అవయవలోపాలతో సతమతం అవుతున్న వారిపైనా నిర్దయగా వ్యవహరిస్తోంది చంద్రబాబు సర్కారు. గతంలో ఇచ్చిన పింఛన్లు రద్దు చేస్తున్నామంటూ మానవత్వం మరిచి మరీ నోటీసులు జారీ చేసింది. ఏం చేయాలో దిక్కుతోచని బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): కూటమి ప్రభుత్వం దివ్యాంగులపై కక్ష గట్టింది. పింఛన్ తీసేశామంటూ వేలాది మంది దివ్యాంగులకు చంద్రబాబు ప్రభుత్వం నోటీసులిచిచ్చింది. ఉరుములేని పిడుగులా ఈ కఠిన చేదు వార్త విని దివ్యాంగుల గుండె పగిలింది. మూడు రోజుల నుంచి జిల్లావ్యాప్తంగా దివ్యాంగులకు వరుసగా నోటీసులు అందుతున్నాయి. పింఛన్లపై ఆధారపడి జీవిస్తున్న వారు ఏం చేయాలో దిక్కుతోచక అధికారులను వేడుకుంటున్నారు. తమ గోడు వినమని కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మంచంపై ఉన్న వారికి కూడా పింఛన్ల తొలగించడంతో దివ్యాంగులు, వారి కుటుంబసభ్యులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. వైకల్య శాతం ఎక్కువ ఉన్నా కూడా డాక్టర్లు తగ్గించి నివేదికలు అడ్డగోలుగా రాశారని వాపోతున్నారు. జిల్లాలో భారీగా తొలగింపు గత ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లాలో 23,459 మంది దివ్యాంగ పింఛన్లు ఉన్నాయి. ఇందులో 2,521 మందికి ప్రస్తుతం తొలగించారు. మంచానికే పరిమితైన దీర్ఘకాలిక రోగులు 479 మంది ఉంటే.. వారిలో 32 మందిని అనర్హులన్నారు. 2,521 మందికి మొండిచేయి చూపారు. రూ.15 వేలు పింఛన్ తీసుకునే దీర్ఘకాలిక రోగుల కేటగిరీ నుంచి 472 మందిని తొలగించి.. దివ్యాంగుల విభాగంలోకి మార్చారు. ఏడుగురికి వృద్ధాప్య పింఛన్ కింద రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. రూ.6 వేలు తీసుకునే 388 మందిని వృద్ధాప్య పింఛన్ కిందకు మార్చి రూ.4 వేలు ఇచ్చేందుకు నోటీసులు జారీ చేశారు. అడ్డగోలుగా పింఛన్ల తొలగింపుతో బాధితుల ఆవేదన -
నృసింహాలయంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం
మంగళగిరి టౌన్: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మంగళగిరి నగరంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేశారు. మహిళలు వేకువజామునే ఇళ్లను, పూజ గదులను శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్‌కుమార్ సమక్షంలో అర్చకులు వ్రతాలను నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి తిరుమంజన సేవ జరిగింది. అనంతరం శ్రీరాజ్యలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకం చేశారు. స్వామి వారి వస్త్రాలు వేలం.... ఆలయంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి భక్తులు సమర్పించిన వస్త్రాలను శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించారు. పట్టుచీరలు 43, ఫ్యాన్సీ చీరలు 387, పంచెలు 37 విక్రయించగా రూ. 91,150 ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.భక్తులతో కిటకిటలాడిన ప్రాంగణం -
శాంతించిన కృష్ణమ్మ
భట్టిప్రోలు: కృష్ణమ్మ శాంతించింది. దీంతో లంక గ్రామాల రైతులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద దిగువకు శుక్రవారం మధ్యాహ్నం 4.32 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. మండలంలోని ఓలేరు, పల్లెపాలెం, పెదలంక కాకుల డొంక వద్ద వరద తగ్గుముఖం పట్టింది. పొలాల్లో నిలిచిన నీరు వెనక్కి వెళుతుండడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు చర్యలు చేపట్టారు. చప్టాలపై నీటి ప్రవాహం తగ్గడంతో రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ముందస్తు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను, నాటు పడవలను అందుబాటులో ఉంచారు. వీఆర్వోలు, ఇన్చార్జి ఆర్ఐ శివరామకృష్ణ, మండ్రు జక్రయ్య, ఎల్.సురేష్‌లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఊపిరి పీల్చుకుంటున్న లంక గ్రామాలు -
సర్వే శాఖ చాంబర్లో త్రుటిలో తప్పిన ప్రమాదం
గుంటూరు వెస్ట్: జిల్లా సర్వే శాఖ ఏడీ పవన్ కుమార్, సిబ్బంది త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సర్వే శాఖ ఏడీ చాంబర్‌లోని పైకప్పు కూలిపోయింది. కొన్ని నిమిషాల ముందు వరకు పవన్ కుమార్‌తోపాటు సిబ్బంది కిషోర్ కుమార్, రవితేజ అక్కడే పలు అంశాలపై చర్చించారు. తర్వాత జేసీ భార్గవ్ తేజను కలిసేందుకు బయటకు వెళ్లారు. ఆ సమయంలో జూనియర్ అసిస్టెంట్ హసన్ షరీఫ్, అంటెండర్ సంతోషమ్మ ఫైలు తీసుకునేందుకు ఏడీ చాంబర్లోకి వెళ్లారు. కొద్దిగా శబ్దం రావడంతో ఇద్దరూ బయటకు వచ్చేశారు. వెంటనే భారీ శబ్దంతో పైకప్పు మొత్తం కూలిపోయింది. సిబ్బంది బయటకు పరుగెత్తారు. ఏడీ చాంబర్‌లోని టేబుల్ సహా చాలా సామగ్రి ధ్వంసమైంది. ఎప్పుడో 115 సంవత్సరాల క్రితం బ్రిటీషు కాలంలో కట్టిన కార్యాలయం కావడంతో సిబ్బంది మరమ్మతుల కోసం విజ్ఞప్తి చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. కార్యాలయంలో కూర్చోవాలంటేనే సిబ్బంది భయబ్రాంతులకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు ఇకనైనా స్పందించి చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘ నాయకులు కోరుతున్నారు. -
గుంటూరు చానల్‌కు మరమ్మతులు
మంగళగిరి: గుంటూరు చానల్‌కు కాజ వద్ద జరుగుతున్న మరమ్మతుల కారణంగా కృష్ణా నది నుంచి నీటిని ఆపారు. ఈ నేపథ్యంలో తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజారోగ్య శాఖ జేఈ ప్రసన్న తెలిపారు. మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థకు తాగునీరు సరఫరా చేసే మంగళగిరి మండలంలోని ఆత్మకూరు వద్ద కల గుంటూరు చానల్‌ను, తాగునీటి పథకాన్ని జేఈ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుంటూరు చానల్ మరమ్మతుల కారణంగా మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థతో పాటు గుంటూరు నగరం, మరికొన్ని ప్రాంతాలకు తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వెల్‌లోని నీటిని వాడుకోవడంతోపాటు సీతానగరం నుంచి గుంటూరు వెళ్లే పైపులైన్ల నుంచి ఎంటీఎంసీకి నీటిని తీసుకుని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. గుంటూరు చానల్‌కు మరమ్మత్తులు దాదాపు పూర్తి కావచ్చినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారని వివరించారు. ఆ పనులు పూర్తయిన వెంటనే చానల్‌కు నీరు సరఫరా అవుతుందని తెలిపారు. ఐదు మండలాలకు ఇదే కీలకం గుంటూరు, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు ఐదు మండలాలకు సాగు, తాగునీటిని గుంటూరు చానల్ ద్వారా అందిస్తున్నారు. కృష్ణా నది వద్ద ప్రకాశం బ్యారేజీ నుంచి 47 కిలోమీటర్ల పొడవున ప్రవహించి సాగు, తాగునీటి అవసరాలను ఈ చానల్ తీరుస్తోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, పెదకాకాని, గుంటూరు కార్పొరేషన్, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు మండలాల ప్రజలు తద్వారా లబ్ధి పొందుతున్నారు. మొత్తం 600 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తుండగా.. వరి, మిరప, పత్తి, అపరాల పంటలు సాగు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజి నుంచి 4 టీఎంసీలు సరఫరా అవుతుండగా.. 3.2 టీఎంసీలు సాగుకు, 1.42 టీఎంసీలను తాగునీటికి వినియోగిస్తున్నారు. ఐదు మండలాల్లోని గ్రామాలలోని ట్యాంకులకు ఈ తాగునీరు అందుతోంది. ఇటీవల వర్షాలకుతోడు కొండవీటివాగు వరదను ఈ చానల్లోకి మళ్లించడంతో గండ్లు పడి వేలాది ఎకరాలోపంట నీటమునిగింది. మరోవైపు గుంటూరు చానల్‌పై కాజ – నంబూరు మధ్య వంతెన సహా పలు చోట్ల ఉన్నవి శిథిలావస్థకు చేరాయి. ఇప్పటికే అంతంత మాత్రంగా సరఫరా అవుతున్న నీరు ఈ వంతెన వద్ద ఏ చిన్న ఘటన జరిగినా పెద్దసంఖ్యలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. -
నగదు కోసం యాచకుడి హత్య
నిందితుడి అరెస్ట్ తెనాలి రూరల్: నగదు కోసం యాచకుడైన వృద్ధుడిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సీఐ ఎస్. రమేష్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. పట్టణ త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో యాచకుడు వెంకటనారాయణ(70) జూన్ 8న రాత్రివేళ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం హత్యకు గురైనట్లు నిర్ధారించి, కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా దర్యాప్తు చేపట్టారు. అవనిగడ్డ మండలం లంకమాన్యం ప్రాంతానికి చెందిన నిందితుడు కొల్లి రాజేష్‌ను అరెస్టు చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని సాయిబాబా గుడి వెనుక ఓ టింబర్ డిపో వద్ద నిద్రించిన వృద్ధుడి వద్ద రూ.3 వేల నగదు ఉంది. ఈ విషయం గమనించిన రాజేష్ అతడిపై దాడి చేసి హతమార్చి నగదుతో పారిపోయాడు. దీంతో అతడిని అరెస్టు చేశారు. సమావేశంలో ఎస్ఐలు ప్రకాశరావు, కరిముల్లా, కానిస్టేబుళ్లు మురళి, జయకర్ బాబు, సురేష్ పాల్గొన్నారు. -
కేఎల్‌యూ డైరెక్టర్‌కు జాతీయ పురస్కారం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్) డైరెక్టర్ పిసిని సాయి విజయ్ శుక్రవారం జాతీయ పురస్కారం అందుకున్నట్లు వర్సిటీ వీసీ డాక్టర్ జి. పార్ధసారథి వర్మ తెలిపారు. హైదరాబాద్‌లోని నియో కన్వెన్షన్‌లో ఈకే ఉపదేశ మీడియా ఆధ్వర్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ నేషనల్ అవార్డ్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ అవార్డు సాయి విజయ్‌కు లభించిందని పేర్కొన్నారు. ఈ అవార్డు కోసం దేశవ్యాప్తంగా అనేక నామినేషన్లు అందినప్పటికీ సాయి విజయ్ ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు. ఆయన్ను వర్సిటీ ప్రో వీసీలు డాక్టర్ ఎన్. వెంకట్రామ్, డాక్టర్ కె. రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగం డీన్ డాక్టర్ కేఆర్ఎస్ ప్రసాద్ తదితరులు అభినందించారు. -
తమ్ముళ్ల లూటీ!
రూ.కోట్లలోసాక్షి ప్రతినిధి, గుంటూరు : గుంటూరు నగరంలో ఏ అభివృద్ధి పనైనా టెండర్ ద్వారా నిర్వహించాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా, ఎవరైనా టెండరు వేయవచ్చు. తెలుగు తమ్ముళ్లు ఈ ప్రక్రియకు ఫుల్స్టాప్ పెట్టారు. వర్కులో బాగా మిగులుతుందని భావిస్తే చాలు టెండరింగ్ (ఈ–ప్రొక్యూర్మెంట్) ప్రక్రియలో పెట్టకుండా.. టెండర్ పాల్గొన్నట్లుగా నకిలీ డాక్యుమెంట్లు పుట్టిస్తున్నారు. దానికి నగర పాలక కమిషనర్ నుంచి ఆమోదం పొంది, వర్క్ ఆర్డర్ తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. ఈ పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు కూడా చకాచకా ప్రాసెస్ చేసినట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ అధికారుల అండదండలు ఉన్నందునే తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారని తోటి కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్థలో ఏ వర్కు తీసుకున్నా అది రూ.50 లక్షల నుంచి రూ.కోటిపైనే ఉంటుంది. ఈ ప్రొక్యుర్‌మెంట్ ద్వారా టెండర్లు నిర్వహించినప్పుడు సదరు వర్కులో లెస్‌కు పాడుకుని కొంతమంది వర్కులు చేస్తుంటారు. ఉదాహరణకు రూ.కోటి విలువైన ఒక పనికి టెండరు పిలిస్తే 20 శాతం లెస్‌కు ఎవరైనా వేస్తే రూ.80 లక్షలతో ఆ పని చేయాలి. కానీ ఇక్కడ విడ్డూరం ఏమిటంటే కావాలనే టెండర్ల ప్రక్రియలో ఎవరూ పాల్గొనకుండా చేసి, తమకు అనుకూలురైన టీడీపీ నేతలతో 20 శాతం లెస్ వేసినట్లు చూపిస్తారు. తరువాత అధికారులకు మామూళ్లను సమర్పించుకుంటున్నారు. ఇక అసలు పని అప్పుడు ప్రారంభం అవుతుంది. ఫైల్ ప్రాసెస్ చేసే సమయంలో 20 శాతం లెస్‌ను కాస్త 2.0 శాతంగా మార్పిస్తున్నారు. టెండర్ డాక్యుమెంట్లో మాత్రం 20 శాతం లెస్ వేసినట్లుగానే ఉంటుంది. అంటే రూ.20 లక్షలు తక్కువగా చూపించాల్సిన వర్కును రూ.రెండు లక్షలకు తగ్గించి చూపించి రూ.కోట్లు దండుకుంటున్నారు. ఇదే తంతు 2014–19 మధ్య కూడా జరిగిందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. దీని వలన కార్పొరేషన్‌కు రూ.10 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని సమాచారం. ఏదైనా టెండర్ ప్రక్రియలో పాల్గొనాలంటే ప్రతి కాంట్రాక్టర్ తప్పనిసరిగా పబ్లిక్ హెల్త్ ఎస్ఈ, పంచాయతీరాజ్ ఎస్ఈ, ఆర్ అండ్ బీ ఎస్ఈ, ఇంజినీరింగ్ అండ్ చీఫ్ నుంచి ఐదేళ్ల కాలపరిమితితో కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అప్పుడే వర్కు చేసుకోవాల్సి ఉంటుంది. నగరంలో ఓ కాంట్రాక్టర్‌కు రిజిస్ట్రేషన్ కాలపరిమితి పూర్తయి ఏళ్లు గడుస్తున్నప్పటికీ పాత సర్టిఫికెట్‌ను ట్యాంపరింగ్ చేసి వర్కుల్లో పాల్గొంటూ, బిల్లులు కూడా చేసుకుంటున్నారు. కొందరు దీనిపై ఫిర్యాదు చేయగా సదరు కాంట్రాక్టర్ చూపిన సర్టిఫికెట్లు ఆయా శాఖలకు చేరాయి. వాటిని తాము ఇవ్వలేదని పై అధికారుల నుంచి సమాధానం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంజినీరింగ్ విభాగంలో అక్రమార్కులు కొత్త దందాలకు పాల్పడుతున్నారు. -
జెడ్పీ చైర్పర్సన్ ఎక్కడ?
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్‌లో నెలకొన్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన చైర్పర్సన్ నాలుగు వారాలుగా వ్యక్తిగత పనులపై విదేశాల్లో ఉన్నారు. 15 రోజులకు పైబడి అందుబాటులో లేకుంటే, వైస్ చైర్మన్‌కు బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నప్పటికీ ఖాతరు చేయడం లేదు. పాలనపై అంతులేని నిర్లక్ష్యం గత నెల 26వ తేదీ నుంచి చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అందుబాటులో లేరు. వ్యక్తిగత పనులపై అమెరికా వెళ్లారు. దీనిపై అధికారికంగా సమాచారం పంపలేదు. ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు వ్యక్తిగత పనులపై విదేశాలకు వెళుతున్నట్లు అధికారికంగా సమాచారం పంపారు. వాస్తవానికి 15 రోజులకుపైగా అందుబాటులో లేకుంటే, వైస్ చైర్మన్‌కు బాధ్యతలు అప్పగించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ నాలుగు వారాలుగా అందుబాటులో లేకుండా దేశం దాటి వెళ్లినప్పటికీ, ప్రభుత్వంతోపాటు ఉన్నతాధికారులు సైతం మిన్నకుండిపోయారు. జెడ్పీలో పరిపాలనకు ఆటంకం కలుగకుండా చూడాల్సిన ప్రభుత్వం, యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జెడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జెడ్పీలో జరుగుతున్న వ్యవహారంపై జిల్లా అధికార యంత్రాగం సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం పరిపాలనలో నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అదే విధంగా తెనాలి జిల్లా కోర్టులో విచారణలో ఉన్న ఓ కేసులో వాయిదాలకు గైర్హాజరవుతున్న కత్తెర హెనీ క్రిస్టినా.. తాము విదేశాల్లో ఉన్నామంటూ కోర్టుకు సమాధానం పంపుతున్నారని తెలిసింది. -
పెండింగ్ కేసుల దర్యాప్తు పూర్తి చేయాలి
నగరంపాలెం: పెండింగ్ కేసుల దర్యాప్తు పూర్తి చేయాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి ఆదేశించారు. గుంటూరు పశ్చిమ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో గురువారం ఆయన వార్షిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయ రికార్డులు, కేసు డైరీలు, క్రైమ్ రిజిస్టర్, పెండింగ్ కేసుల ఫైల్స్, పెండింగ్ దర్యాప్తుల పురోగతి, నిందితుల అరెస్టులు, కోర్టు హాజరు స్థితిగతులను పరిశీలించారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ.. నేర నిరోధక చర్యలను మరింత వేగవంతంగా చేపట్టాలని అన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. నిందితులకు త్వరగా న్యాయస్థానాల్లో శిక్షలు అమలయ్యేలా విధులు నిర్వర్తించాలని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్స్టేషన్ల కార్యకలాపాలలో పారదర్శకత చూపాలన్నారు. క్రమ శిక్షణ, సంక్షేమంపై దృష్టిసారించి, సమస్యలను పరిష్కరించాలని అన్నారు. జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్, పశ్చిమ సబ్ డివిజన్ డీఎస్పీ అరవింద్, పట్టాభిపురం, అరండల్‌పేట, నగరంపాలెం పీఎస్‌ల సీఐలు పాల్గొన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశం -
గంజాయి రవాణా కేసులో ముగ్గురి అరెస్ట్
మర్రిపాలెం (విశాఖ జిల్లా): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన కారులో గంజాయిని గుర్తించిన పోలీసులు, ఆ కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ వెల్లడించారు. ఈ నెల 12న సుభాష్‌నగర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒక కారు ఢీకొని ఏడాదిన్నర చిన్నారి వర్షిత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత కారు డ్రైవర్, తమిళనాడుకు చెందిన అర్జునన్ జెమినీ ఆర్ముగంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్న మరో ముగ్గురు పరారయ్యారు. పోలీసులు ఈ నెల 16న సీజ్ చేసిన కారును తనిఖీ చేయగా.. 21 కిలోల గంజాయిని గుర్తించారు. పరారీలో ఉన్న ముగ్గురినీ అరెస్ట్ చేశారు. వారిని హైదరాబాద్‌లోని హాస్టల్లో ఉంటున్న గుంటూరుకు చెందిన అక్షయ గౌతమి(20), షేక్ మహమ్మద్ జాకీర్ (19), ఒంగోలుకు చెందిన పెర్లి విజయవర్ధన్ రాజు (25)గా గుర్తించినట్లు సీఐ తెలిపారు. వీరు విజయవాడలో కారు అద్దెకు తీసుకుని అరకు వెళ్లి గంజాయి కొనుగోలు చేశారు. తిరిగి వస్తుండగా ఊర్వశి జంక్షన్ సమీపంలోని సుభాష్‌నగర్ వద్ద ప్రమాదం జరిగింది. పెర్లి విజయవర్ధన్ రాజుపై ఇప్పటికే ఒంగోలులో 11 కేసులు ఉన్నాయని, మహమ్మద్ జాకీర్‌పై కూడా గంజాయి కేసు ఉందని పోలీసులు వెల్లడించారు. యువతికి తల్లిదండ్రులు లేరు. విజయవర్ధన్‌కు బంధువు కావడంతో అతనితో ఇలా వెళ్తూ ఉంటుందని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ప్రతిభ చూపించిన ఎస్ఐలు షేక్ సమీర్, రవికుమార్‌లను సీఐ అభినందించారు. -
పింఛన్లు ఇవ్వకుండా ప్రభుత్వం మోసం
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా... ఉన్న దివ్యాంగ పింఛన్లను రీ వెరిఫికేషన్ పేరుతో తొలగించడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు బోక్క ఆగస్టీన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో దివ్యాంగ విభాగం ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి తర్వాత రాష్ట్ర ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురిచేస్తోందన్నారు. ఎన్నికల హామీలో మాత్రం రూ.6 వేలు పింఛను ఇస్తామని చెబితే సంబరపడ్డామని.. ఇప్పుడు నిర్దయగా తీసేస్తున్నారని మండిపడ్డారు. గతంలో 80 శాతం వైకల్యం ఉంటే ఇప్పుడు 40 శాతం ఉన్నట్లు చూపించి పింఛన్లు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత కలిగిన వారికి కూడా మొండిచేయి చూపడం ఎంతవరకు సమంజసం అన్నారు. రీ వెరిఫికేషన్ పేరుతో ఆసుపత్రులకు, ఇతర కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీని వల్ల దివ్యాంగులు కార్యాలయాల మెట్లు ఎక్కలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. నాడు అండగా వైఎస్ జగన్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివ్యాంగులకు అండగా నిలిచారు. 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేసి తమ కష్టాలను తీర్చారని దివ్యాంగులు పేర్కొన్నారు. ఇప్పుడు వలంటీర్ వ్యవస్థ తీసేయడంతో ఏ పని కావాలన్నా కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వారి కోసం సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులతో కలిసి నిరసన చేపడతామన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విధంగానే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దాసరి గణేష్‌బాబు, కొమ్మా లింగరావు, శంకర్, జె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పొగాకు పంటకు ప్రత్యామ్నాయం అపరాలు
అద్దంకి: పొగాకుకు ప్రత్యామ్నాయంగా అపరాలు సాగు చేసుకోవాలని ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయనిర్మల సూచించారు. ‘ఆత్మ’ ప్రకాశం జిల్లా సౌజన్యంతో కొంగపాడులో వివిధ పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులపై గురువారం శిక్షణ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పొగాకుకు ప్రత్యామ్నాయంగా అపరాలు, మొక్కజొన్న, జొన్న పంటలు సాగు చేయాలని సూచించారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మురళీధర్ నాయక్ మాట్లాడుతూ మినుము, కంది, పెసర, శనగ పంటల సాగు, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎం.ఉష మాట్లాడుతూ అపరాల పంటలో విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలని.. రసం పీల్చే పురుగుల నివారణ కోసం విత్తన శుద్ధి చేయాలని సూచించారు. ఉప్పునీటి యాజమాన్యం శాస్త్రవేత్త కె. మృదుల మాట్లాడుతూ అపరాలు.. మొక్కజొన్నలో కలుపు నివారణ చర్యలు గురించి తెలియజేశారు. సహాయ వ్యవసాయ సంచాలకులు బి.ఎఫ్రాయిం మాట్లాడుతూ కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం బర్లీ పొగాకు సాగు చేయవద్దని సూచించారు. మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రతి రైతు ఈ–పంట నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆత్మ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శేషారావు, అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ రామిరెడ్డి, గ్రామ వ్యవసాయ సహాయకులు సాయిబాబు, వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వరరావు, మణికేశ్వరం సొసైటీ అధ్యక్షుడు నర్రా బ్రహ్మానందం, గుడిపూడి బ్రహ్మయ్య, పంచాయతీ కార్యదర్శి ప్రిస్కిల్ల, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. ఆత్మ డిప్యూటీ డైరెక్టర్ విజయనిర్మల -
డిగ్రీ ప్రవేశాలు ప్రారంభర
గుంటూరు ఎడ్యుకేషన్: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రారంభించింది. ఈ నెల 26వ తేదీ వరకు అవకాశం దీనికి కల్పించింది. నూతన జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా సమూల మార్పులతో డిగ్రీ కోర్సులను తీర్చిదిద్దిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఆన్లైన్ అడ్మిషన్స్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎండీసీ) విధానంలోనే 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు అప్లోడ్ చేసిన ధ్రువపత్రాలను హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఆన్లైన్లోనే పరిశీలన చేస్తారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొని కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు, కళాశాలలో చేరికలు వరుస క్రమంలో జరగన్నాయి. 24 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు, బాపట్లలోని మహిళా కళాశాలలు, చేబ్రోలు, రేపల్లె, వినుకొండ, మాచర్లలోని కో–ఎడ్యుకేషన్ కళాశాలలతో పాటు 70 ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. విద్యార్థులు ఇంటర్నెట్ కేంద్రాలతో పాటు డిగ్రీ కళాశాలల నుంచి ఆన్లైన్లో సెట్స్.ఏపీఎస్సీహెచ్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో ప్రాసెసింగ్ ఫీజు రూపంలో ఓసీ విద్యార్థులు రూ.400, బీసీ రూ.300, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు రూ.200 చొప్పున చెల్లించాలి. అన్ని ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన విద్యార్థులు వాటి పరిశీలనకు హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఆప్షన్లు మార్చుకునేందుకు 29న తుది అవకాశం ఉంటుంది. 31న సీట్ల కేటాయించాక సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు 26 వరకు గడువు -
‘అంధ’ంగా ఆడినా అదే వేదన
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఒకవైపు అంధత్వం, మరోవైపు పేదరికం... సమాజంలోనూ చిన్నచూపు.. ఇన్ని ఆటంకాలను ఎదుర్కొంటూ క్రికెట్లో రాణిస్తున్నారు కొందరు అంధులు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారిని ప్రోత్సహించడంలో ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదు. కొన్ని ప్రైవేటు సంస్థల దాతృత్వంతోనే అంధుల క్రికెట్ పోటీలు రాష్ట్రంలో జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. స్థానిక అరండల్‌పేటలోని ఏసీఏ క్రీడా మైదానంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఏపీ, విజువల్లీ బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, డిఫరెంట్ డిసేబుల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ సంయుక్తాధ్వర్యంలో అంధుల క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. మొత్తం 42 మంది 3 జట్లుగా మ్యాచ్‌లు ఆడుతున్నారు. ప్రతిభ చాటిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయనున్నారు. వీరికి మాజీ భారత అంతర్జాతీయ బ్లైండ్ క్రికెటర్, అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి సాయం చేసి, మెంటార్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. వారికి ప్రతిభ చాటే అవకాశ ం కల్పించారు. దేశంలో మనమే టాప్ గత పదేళ్లుగా జాతీయ క్రికెట్లో రాష్ట్ర జట్టు ప్రథమ స్థానంలో నిలుస్తోంది. భారత జట్టుకు కూడా మన రాష్ట్రం నుంచే కెప్టెన్‌గా ఎంపికవుతూ వస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రం వీరిని కనీసం పట్టించుకోవడం లేదు. అంధ క్రికెటర్లు మైదానంలో ప్రతిభ కనబరుస్తున్నారు. వీరి కోసం నిధుల కేటాయింపు కూడా లేదు. గురువారం మ్యాచ్‌లను చూసేందుకు వచ్చిన సంబంధిత శాఖ చైర్మన్ జి.నారాయణ స్వామి మాట్లాడుతూ అంధ క్రికెటర్ల అభివృద్ధికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నేను భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించా. నా జీవితం క్రికెట్‌కే అంకితం. రాష్ట్రం నుంచి గత పదేళ్లలో ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఆడారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ఇంత మంది దేశానికి ఆడితే... ప్రభుత్వం సాయం అందిస్తే చాలామంది ఆడతారు. ప్రస్తుతం రాష్ట్రంలో 150 మంది వరకు ఆడుతున్నారు. వీరి సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నా. కొందరు సాయం అందిస్తున్నారు. ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుంది. – ఐ.అజయ్ కుమార్ రెడ్డి, అంధ క్రికెటర్ల మెంటార్ -
దివ్యాంగులకు ‘సదా’రం కష్టాలు
తెనాలి అర్బన్: కూటమి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు దివ్యాంగుల పాలిట శాపంగా మారుతున్నాయి. రీ వెరిఫికేషన్‌కు హాజరుకాని వారిని గుర్తించి తెనాలి జిల్లా వైద్యశాలకు సచివాలయ ఉద్యోగులు పంపుతున్నారు. అయితే గురువారం లిస్ట్‌లో ఉన్న వారిని కాకుండా అదనంగా 40 మంది దివ్యాంగులను వారు ఇక్కడకు పంపారు. దీంతో గందరగోళం నెలకొంది. సాయంత్రం వరకు వేచి ఉన్నప్పటికీ వైద్యులు మాత్రం వారికి పరీక్షలు చేలేదు. దీంతో సూపరింటెండెంట్ ముందు బాధితులు నిరసన తెలిపారు. చుక్కలు చూపెడుతున్న సర్కార్ తీరు దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం పింఛన్ పంపిణీ చేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారుల్లో చాలామందికి పింఛన్లు ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో కొన్ని నెలల క్రితం రీ వెరిఫికేషన్ చేయించేందుకు తెనాలి జిల్లా వైద్యశాలకు తెనాలి, వేమూరు, మంగళగిరి, రేపల్లె నియోజకవర్గాలకు చెందిన దివ్యాంగులను పంపారు. ఈఎన్టీ, ఆప్తమాలజీ, జనరల్ మెడిసిన్, సైక్రియాటిక్ విభాగాలకు చెందిన వైద్యులు వీరికి పరీక్షలు చేసి సదరం సర్టిఫికెట్లు ఇచ్చారు. ఆ సమయంలో క్యాంప్‌నకు హాజరు కాని వారు బాపట్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎక్కువ మంది ఉన్నారు. వారిని గురువారం తెనాలి పంపారు. అసలు లెక్కే లేదు.. వేమూరు, బాపట్ల నియోజకవర్గాల పరిధిలోని దివ్యాంగులు పెద్ద సంఖ్యలో గురువారం తెనాలి జిల్లా వైద్యశాల ఆవరణలోని డైక్ సెంటర్‌కు వచ్చారు. చీరాల నుంచి వచ్చిన ఈఎన్టీ వైద్యురాలు, నర్సారావుపేట నుంచి వచ్చిన సైక్రియాటిక్ వైద్యులు పరీక్షలు చేసేందుకు ఇక్కడికి వచ్చారు. అధికారులు ఇచ్చిన జాబితాతో ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేశారు. మిగిలిన వారు ఉదయం నుంచి సాయంత్రం అయిన వేచి చూసినా పరీక్షలు చేయకపోటంతో ఆందోళనకు దిగారు. వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణిని కలసి తమ ఆవేదన తెలియజేశారు. కేవలం 25 నుంచి 30 మంది వరకే రోజుకు పరీక్షలు చేసే అవకాశం ఉందని, ఎక్కువ మందిని పంపటం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆమె గుర్తించారు. వెంటనే బాపట్ల డీఆర్డీఏ పీడీతో మాట్లాడి ఇలా ఎక్కువ మందిని పంపొద్దని కోరారు. గురువారం అదనంగా వచ్చిన 40 మందిని రోజుకు 10 మందికి పరీక్షలు చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు దివ్యాంగులకు తెలియజేయడంతో వారు శాంతించారు. -
అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలి
తెనాలిటౌన్: అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గురువారం స్థానిక సీడీపీవో కార్యాలయం ఎదుట ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏవీఎన్ కుమారి మాట్లాడుతూ ఈకేవైసీ, ఫేస్ రికగ్నేజేషన్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన వలన లబ్ధిదారులకు సకాలంలో ఫీడింగ్ ఇవ్వలేకపోతున్నట్లు ఆరోపించారు. 10 ఏళ్ల క్రితం ఇచ్చిన స్మార్ట్ ఫోన్ల వలన నెట్వర్క్ సరిగా పనిచేయక లబ్ధిదారులు ఒకటికి మూడు సార్లు అంగన్వాడీ కేంద్రాలకు రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారులు తమపై అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో లబ్ధిదారులకు ఫీడింగ్ ఇవ్వడం కష్టంగా ఉందన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం సీడీపీవో విజయగౌరికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు షేక్ హుస్సేన్ వలి, కె.రంగపుష్ప, రాధిక, రాజకుమారి, రామలక్ష్మి, రాహెలమ్మ, ఎస్కే ముని, వహీదా, సీహెచ్ శివకుమారి, కె.మాధవి, డి.కళ్యాణి, ఎం.సుజాత, వై.నాగమల్లేశ్వరి, కె.లక్ష్మి , బుల్లెమ్మ, ఎలిజిబెత్ రాణి, రమాదేవి, త్రివేణి, అలిషా బేగం, జ్యోతి, సునీత, రజియా తదితరులు ఉన్నారు. -
అమరావతిలో సూపర్వైజరీ కమిటీ పరిశీలన
తాడికొండ: రాజధాని అమరావతిలో కేంద్ర పర్యావరణం, అటవీ– వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ అమన్దీనప్ గార్గ్ తదితరులు గురువారం పర్యటించారు. తొలుత ఉండవల్లిలోని రివర్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్, కొండవీటి వాగు వరద పంపింగ్ స్టేషనును పరిశీలించారు. సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు, అదనపు కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్‌లు ఇక్కడి ఏర్పాట్లను ఆయనకు వివరించారు. సీఆర్డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్) ఆధ్వర్యంలో అమరావతిలో వరద నిర్వహణ చర్యల నిమిత్తం ప్రస్తుతం అమలవుతున్న, అలాగే భవిష్యత్తులో చేపట్టనున్న కార్యకలాపాలు, ప్రణాళికలపై సూపర్వైజరీ కమిటీ తరఫున విచ్చేసిన అమనన్దీప్ గార్గ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు వారు తెలిపారు. అనంతరం అమరావతి సీడ్ యాక్సిస్ రహదారి సమీపంలోని ట్రంక్ ఇన్నఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం, గ్రీనరీ, ఎల్పీఎస్ జోన్ల అభివృద్ధి పనుల వివరాలను సీఆర్డీఏ కమిషనర్ వివరించారు. అనంతరం అధికారులతో కలసి అమన్‌దీప్ గార్గ్ అమరావతిలోని టిడ్కో గృహ సముదాయాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అధికారుల కోసం నిర్మించిన భవనాల సముదాయాలను సందర్శించారు. నిర్మాణాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలోని ట్రాన్స్లొకేటెడ్ నర్సరీని అమన్‌దీప్ గార్గ్ సందర్శించారు. అనంతరం అమరావతి సచివాలయంలో సూపర్వైజరీ కమిటీతో సీఆర్డీఏ, ఏడీసీఎల్ అధికారులు సమావేశమయ్యారు. కమిటీ సభ్యులలోని మరొక ముగ్గురు అధికారులు ఆన్‌లైనన్ ద్వారా ఈ సమావేశానికి హాజరు అయ్యారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న భవనాల పనులలో పురోగతి, రాజధాని ప్రాంత నివాసితులకు అమలవుతున్న సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణకు చేపట్టిన కార్యకలాపాలు, కార్మికులు, మహిళల భద్రతకు అమలవుతున్న చర్యల గురించి సీఆర్డీఏ అధికారులు వారికి వివరించారు. సమావేశంలో ఏడీసీఎల్ సీఎండీ లక్ష్మీ పార్థసారథి, వివిధ విభాగాల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. -
సాఫ్ట్‌బాల్ బాలికల జిల్లా జట్టు ఎంపిక
సత్తెనపల్లి: ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్‌బాల్ సీనియర్ విభాగంలో జిల్లాస్థాయి బాలికల జట్టు ఎంపికలు సత్తెనపల్లి మండలం కొమెరపూడిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం జరిగాయి. ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 50 మంది బాలికలు హాజరయ్యారు. వీరిలో 15 మందిని జట్టుకు, మరో ఐదుగురిని స్టాండ్బైకు ఎంపిక చేశారు. ఎంపికై న వారిలో పల్లపాడుకు చెందిన సిహెచ్ అనిత, జి.సునందిని, ఎం.శృతి, సిహెచ్ పావని, బి.నందిని, కె.తేజస్విని, కె.చందన, ఇ.చంద్రిక, వి.లిద్య/ఎం.తిరుపతమ్మ, రొంపిచర్లకు చెందిన వి.శ్రీదేవి, పీవీఎన్ చంద్రిక, కొమెరపూడికి చెందిన బి.ప్రసన్న జ్యోతి, వినుకొండకు చెందిన ఆర్.రాగసుధ, క్రోసూరుకు చెందిన కె.దీవెన ఏంజల్, కేఎల్ఎస్ ప్రవల్లికలు ఉన్నారు. స్టాండ్ బైలుగా బి.శ్రీలక్ష్మి (రొంపిచర్ల), కె.సంజన (బ్రాహ్మణ కోడూరు), పి.శైలజ, జె.ధనలక్ష్మి, కె.తన్మయిసాయి (రామకృష్ణాపురం)లు ఎంపికయ్యారు. ఎంపికై న బాలికలు ఈనెల 30, 31 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ జిల్లా సెక్రెటరీ పి.సామంతరెడ్డి, జాయింట్ సెక్రెటరీ నర్రా శ్రీనివాసరావు, ట్రెజరర్ జనార్దన్ రెడ్డి యాదవ్‌లు పాల్గొన్నారు. ఎంపికలకు సెలక్షన్ కమిటీ మెంబర్లుగా పీడీలు సైదయ్య, వెంకటేశ్వరరావు, సుబ్బారావులు వ్యవహరించారు. ఎంపికై న బాలికలకు గురువారం నుంచి కొమెరపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం జరుగుతుందని పాఠశాల హెచ్ఎం బి.విజయ తెలిపారు. -
అంధత్వాన్ని జయించడం అద్భుతం
– రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ గుంటూరు వెస్ట్ (క్రీడలు): అంధత్వాన్ని ఆత్మవిశ్వాసంతో జయించి క్రికెటర్లుగా రాణిస్తున్న యువత ప్రతిభ అద్భుతమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ అభినందించారు. బుధవారం స్థానిక అరండల్‌పేటలోని ఏసీఏ క్రీడా మైదానంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఏపీ, విజువల్లీ బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, డిఫరెంట్ డిసేబుల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న అంధుల క్రికెట్ పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంధులు సమాజంలో ఎవరికీ తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారన్నారు. వీరిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మాజీ బ్లైండ్ క్రికెటర్, అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల తిరుపతిలో జరిగిన జోనల్ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచిన 42 క్రికెటర్లతో మూడు జట్లుగా మూడు రోజులపాటు పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. వీరి నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బ్లైండ్ క్రికెట్ జట్టు ఎంపిక చేస్తామన్నారు. అనంతరం జస్టిస్ కృష్ణమోహన్‌ను అసోసియేషన్ నాయకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంంలో ఏపీ విభిన్న ప్రతిభావంతుల, సీనియర్ సిటిజన్స్ డైరెక్టర్ పి.ప్రకాష్ రెడ్డి, ఐటీసీ వైస్ ప్రెసిడెంట్ వెంకటరామిరెడ్డి, వీసీఏ అధ్యక్షుడు రవీంద్రబాబు, అంధుల క్రికెట్ అసోసియేషన్ జిల్లా ఇన్చార్జి కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
డాక్టర్ విశ్వేశ్వరరావుకు బంగారు పతకం
తెనాలిరూరల్: పట్టణ బోస్రోడ్డులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) హాలులో బుధవారం రాత్రి సమావేశం నిర్వహించారు. సమావేశంలో పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు దివంగత డాక్టర్ కొత్త రవీంద్రబాబు ఽస్మారక ధార్మిక బంగారు పతకాన్ని గుంటూరుకు చెందిన ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ చేబ్రోలు విశ్వేశ్వరరావుకు బహూకరించారు. ఈ సందర్భంగా ‘కామన్ యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ మేనేజ్మెంట్ గైడ్‌లైన్స్’పై డాక్టర్ విశ్వేశ్వరరావు ప్రసంగించారు. ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె. అనిల్‌కుమార్, కార్యదర్శి డాక్టర్ మధుప్రభాకర్బాబు, డాక్టర్ కె. శ్యామ్‌ప్రసాద్, డాక్టర్ పావనిప్రియాంక, డాక్టర్ కొత్త రవీంద్రబాబు కుటుంబసభ్యులు, ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. -
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
పొన్నూరు: సాగులో రసాయన ఎరువులను తగ్గించాలని గుంటూరు బయోలాజికల్ కంట్రోల్ ల్యాబ్ ఏడీఏ సునీత రైతులకు సూచించారు. బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మండలంలోని వడ్డిముక్కల, ఆలూరు గ్రామాల్లో స్థానిక ఏడీఏ రామకోటేశ్వరితో కలిసి ఆమె పంట పొలాలను సందర్శించారు. రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ జీవన ఎరువులైన పాస్ఫరస్ సాల్యుబ్ లైజింగ్ బ్యాక్టీరియాను (పీఎస్బీ)వినియోగించడం వలన పొలంలో భాస్వరాన్ని కరిగించి పంటకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీని వలన ఎరువుల వినియోగం తగ్గించవచ్చని అన్నారు. ఏడీఏ రామకోటేశ్వరి మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ నగదు జమ కానివారు రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో వీఏఏ పి. ప్రసాదు, ఎంపీఈఓ ఎస్. సురేష్‌బాబు, రైతులు పాల్గొన్నారు. -
వ్యవసాయ మెగా క్రెడిట్ ఔట్ రీచ్ క్యాంపు
కొరిటెపాడు: జిల్లాలో వ్యవసాయ మెగా క్రెడిట్ ఔట్ రీచ్ క్యాంప్ ‘లక్ష్య’, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాచురేషన్ క్యాంపు (జనన సురక్ష క్యాంప్)ను నగరంపాలెంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. క్యాంపును కడప రీజియన్ రీజినల్ హెడ్ ఇ. వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. లక్ష్య, ఫైనాన్షియల్ ఇంక్లూజ్ సాచురేషన్ క్యాంపునకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. క్రెడిట్ క్యాంపెయిన్ సమయంలో ఎస్‌హెచ్‌జీ గ్రూపులు, సీకేసీసీ రుణగ్రహీతలకు రుణాలు మంజూరు చేశామని తెలిపారు. కండ్లకుంట బ్రాంచ్ హెడ్ అశోక్‌కుమార్, సిబ్బందితోపాటు ఏపీఎం, ఇతర సీసీఏలు ఈ క్యాంపులో పాల్గొన్నారని చీఫ్ మేనేజర్ బి.కె.ప్రసాద్ తెలిపారు. -
గీత కులాలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల
నెహ్రూనగర్: గుంటూరు జిల్లాలో గీత కులాలకు కేటాయించిన బార్లకు గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు బుధవారం విడుదల చేశారు. జిల్లా పరిధిలోని గుంటూరు నగరపాలక సంస్థలో గౌడకు 4, గౌడ్ 2, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్‌లో గౌడకు 2, తెనాలి మున్సిపాలిటీ పరిధిలో గౌడకు, గౌడ్‌కు ఒకటి చొప్పున బార్లు కేటాయించడం జరిగిందన్నారు. ఆయా వర్గాలకు కేటాయించిన షాపుల్లో వారే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 29వ తేదీ దరఖాస్తులు స్వీకరిస్తామని 30న లాటరీ ద్వారా కేటాయింపు ఉంటుందన్నారు.రైతులు పొగాకు సాగు చేయొద్దు– జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబునరసరావుపేట: జిల్లాలో పొగాకు పంటను రైతులు ఎవరూ సాగుచేయెద్దని, నారుమళ్లు వేయరాదని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు సూచించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 2024–25లో 3124మంది రైతులు 10,954 ఎకరాల్లో బ్లాక్ బర్లీ పొగాకు పంటను సాగుచేశారని, దీని వలన 1,21,010 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు. అధిక దిగుబడితో పొగాకు వ్యాపారులు రైతుల నుంచి పూర్తిస్థాయిలో కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేపట్టిందన్నారు. అందువలన ఈ ఏడాది రైతులు ఎవరూ కంపెనీ వ్యక్తుల నుంచి బాండ్లు తీసుకోరాదని, పొగాకు నారుమళ్లు వేయరాదని కోరారు. పొగాకుకు బదులుగా అధిక దిగుబడిని ఇచ్చే పంటలను సాగుచేయాలని కోరారు. మధ్యవర్తులు ఎవరైనా సాగుకు ప్రోత్సహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతేడాది పండిన పొగాకు నిల్వలను కొనుగోలుచేయకుండా ఈ ఏడాది సాగుచేయాలని ప్రోత్సహించటం క్షమించరాని నేరమన్నారు. రైతులు కంపెనీ వారి మాటలు వినిమోసపోవద్దని సూచించారు. పూర్తి బాధ్యతను గ్రామ, మండల స్థాయిలో వ్యవసాయాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించామన్నారు.రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతివెల్దుర్తి: స్కూల్ బస్సు.. ద్విచక్రవాహనం ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడి మృతిచెందిన సంఘటన మండలంలోని మండాది గ్రామ సమీపంలోని కానాగు వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. మండలంలోని రచ్చమల్లపాడు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేశ్వర్లు (28) రచ్చమల్లపాడు నుంచి మాచర్లకు వస్తుండగా.. మాచర్ల పట్టణానికి చెందిన సెయింటాన్స్ స్కూల్ బస్సు విద్యార్థులను మండాది గ్రామంలో వదిలిపెట్టేందుకు వస్తోంది.. ఈక్రమంలో నేషనల్ హైవే 565 కానాగు బ్రిడ్జి మీద స్కూల్ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బైక్‌పై ఉన్న ఆవుల వెంకటేశ్వర్లు 25 అడుగుల లోతు గల కానాగులో ఎగిరి పడ్డాడు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
గుండెపోటుతో తుళ్ళూరు ట్రాఫిక్ ఏఎస్ఐ మృతి
తాడికొండ: గుండెపోటుతో ట్రాఫిక్ ఏఎస్ఐ మృతి చెందిన ఘటన తుళ్ళూరులో జరిగింది. తుళ్ళూరు ట్రాఫిక్ ఏఎస్ఐగా పనిచేస్తున్న రవీంద్ర (55) విధులు ముగించుకొని కారు నడపుతూ వెళుతుండగా తుళ్ళూరు శివారు సాయిబాబా ఆలయం వద్దకు రాగానే గుండెపోటుకు గురయ్యారు. కారును రోడ్డుపైనే నిలిపి పక్కకు పడిపోయారు. ఉన్నట్టుండి కారు నిలిచిపోవడంతో సమీపంలో ఉన్న ఏపీఎస్పీ సిబ్బంది కారు అద్దాలు పగలగొట్టి రవీంద్రను బయటకు తీసి తుళ్ళూరు పీహెచ్‌సీకి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి తుళ్ళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నవ వధువు ఆత్మహత్య తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లిలో పారాణి ఆరకముందే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ ఖాజావలి తెలిపిన వివరాల ప్రకారం.. ఉండవల్లికి చెందిన రంగనాయకమ్మ (24)కు ఈ నెల 17వ తేదీన ఉండవల్లి సెంటర్లో నివాసం ఉంటున్న జితేంద్రతో వివాహం చేశారు. బుధవారం జితేంద్ర తన భార్య ఉన్న గదిలో నుంచి బయటకు వచ్చాడు. పది నిమిషాల అనంతరం తిరిగి లోనికి వెళ్లేందుకు రాగా గదికి గడియ పెట్టి ఉంది. ఎన్నిసార్లు తలుపులు కొట్టినా తీయకపోవడంతో అత్తకు చెప్పాడు. ఆమె పిలిచినా రంగనాయకమ్మ స్పందించలేదు. పక్కింటి వారి సహాయంతో జితేంద్ర తలుపులు పగలగొట్టగా.. రేకుల గదిలోని ఇనుప రాడ్‌కు చున్నీతో రంగనాయకమ్మ ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దించి వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఏడాదిగా రంగనాయకమ్మకు కడుపునొప్పి ఉండడం వల్లే వివాహానికి నిరాకరించిందని, దానివల్లే ఆత్మహత్య చేసుకుందని తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఖాజావలి తెలిపారు. డీ ఫార్మసీలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు గుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో రెండేళ్ల కాలపరిమితి గల డీఫార్మసీ కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ గడువును సాంకేతిక విద్యాశాఖ ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ జాస్తి ఉషారాణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ రెగ్యులర్, దూరవిద్య ద్వారా బైపీసీ, ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థినులతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డు నుంచి తత్సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు అర్హులని తెలిపారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు అడ్మిషన్ ఫీజులో మినహాయింపుతోపాటు ఉపకారవేతనాలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రవేశం పొందిన విద్యార్థినులకు కళాశాల ప్రాంగణంలోనే హాస్టల్ వసతి ఉందని తెలిపారు. ఆసక్తి గల వారు సర్టిఫికెట్లతోపాటు పాస్‌పోర్ట్ సైజు ఫొటో, దరఖాస్తు రుసుము రూ.400తో కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. 92471 20305, 98480 38769 నంబర్లలో సంప్రదించాలని కోరారు.