నృసింహుడు | - | Sakshi
Sakshi News home page

నృసింహుడు

Feb 27 2026 4:23 AM | Updated on Feb 27 2026 4:23 AM

నృసింహుడు

నృసింహుడు

నేడు చిన్నశేష, సింహ వాహన సేవలు

యాలి వాహనంపై

మంగళగిరి టౌన్‌ : మంగళాద్రిలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారు యాలివాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. వ్యాళి వాహనాన్నే యాలి వాహనం అంటారు. హింసించే స్వభావం ఉన్న క్రూరులను శిక్షించి సాధువులను రక్షించేందుకు తానున్నానని తెలియజేసేందుకు లక్ష్మీనరసింహస్వామికి యాలివాహన ఉత్సవం నిర్వహిస్తారు. యాలివాహన రూఢుడైన స్వామిని దర్శిస్తే దుర్మార్గుల వల్ల కలిగే భయం నశిస్తుందని భక్తుల నమ్మకం. ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్‌కుమార్‌ ఉత్సవాలను పర్యవేక్షించగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన మురికిపూడి పుష్పవేణి, కుమారులు వ్యవహరించగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.

ముత్యాల పల్లకి వాహనంపై....

స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ముత్యాల పల్లకి వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవానికి కై ంకర్య పరులుగా విజయవాడకు చెందిన అంగా ఉపేంద్రవర్మ, తేజస్విని దంపతులు వ్యవహరించారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా నరసింహస్వామి శుక్రవారం ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి ఏడు గంటలకు సింహ వాహనంపై గ్రామోత్సంలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement