కొత్త జంటకు ప్రధాని మోదీ క్షమాపణ.. వైరల్‌ వీడియో | PM Modis surprise apology to newlyweds | Sakshi
Sakshi News home page

కొత్త జంటకు ప్రధాని మోదీ క్షమాపణ.. వైరల్‌ వీడియో

Apr 14 2026 1:29 PM | Updated on Apr 14 2026 1:45 PM

PM Modis surprise apology to newlyweds

సిలిగురి: దేశ ప్రధాని స్థాయి వ్యక్తి, ఒక సామాన్య కొత్త జంటకు స్వయంగా క్షమాపణలు చెప్పడం ఎప్పుడైనా చూశారా? పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో సరిగ్గా ఇదే జరిగింది. ఒక వైపు కట్టుదిట్టమైన భద్రత, మరోవైపు పెళ్లి సందడి.. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

రిసార్ట్‌లో అనూహ్య ఘటన
పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సిలిగురిలోని మయ్‌ఫెయిర్ టీ రిసార్ట్‌కు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడ శ్రేయ, అక్షయ్ అనే యువజంట వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన  కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కారణంగా ఆ పెళ్లి సందడికి కొంత అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని గమనించిన మోదీ, ఊహించని విధంగా ఆ కొత్త జంట వద్దకు వెళ్లి, వారికి కలిగిన అసౌకర్యానికి స్వయంగా క్షమాపణలు తెలియజేశారు.
 

నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
దేశ అత్యున్నత నేత తమ వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పడంతో ఆ జంటతో పాటు అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ తమ అధికారిక ‘ఎక్స్’ఖాతాలో పంచుకోగా, అది క్షణాల్లో వైరల్ అయింది. ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరగనున్న రెండు దశల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ సిలిగురిలో పర్యటిస్తున్నారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. 2021 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాలతో ఘన విజయం సాధించగా, బీజేపీ 77 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది. 

Advertisement
 
Advertisement
Advertisement