విశాఖపట్నం : ఏయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో 2026 వార్షిక చిత్రకళా ప్రదర్శన శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.
విశ్వవిద్యాలయం ఫైన్‌ఆర్ట్స్ విభాగ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ చిత్రకారుడు, విభాగ పూర్వ ఆచార్యుడు వి. రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు.
ఇటీవల జరిగిన శతాబ్ది ఉత్సవాల్లో వారు రూపొందించి ప్రదర్శించిన చిత్రాలు, శిల్పాలు అందరి ప్రశంసలు పొందాయని తెలిపారు.
రెండు రోజులపాటు ఈ ప్రదర్శన నగరవాసులను ఆకట్టుకోననుంది.


