breaking news
Visakhapatnam
-
ఏపీలో సమ్మె సైరన్ మోగించిన జూనియర్ డాక్టర్లు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. అత్యవసర సేవలు మినహా విధులను జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. దీంతో కింగ్ జార్జ్ ఆసుపత్రిలో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. సూపరింటెండెంట్ కార్యాలయం వద్దకు చేరుకున్న జూనియర్ డాక్టర్లు.. స్టైఫండ్ పెంచకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.కాగా, ప్రభుత్వ ఆస్పత్రులను నమ్ముకున్న పేద రోగులకు ‘సమ్మె’ కష్టాలు మొదలయ్యాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు (జూడాలు) మంగళవారం నుంచి నిరవధిక సమ్మెబాట పట్టారు. సోమవారం అమరావతి వైద్య ఆరోగ్యశాఖ వైద్య విద్యా డైరెక్టర్(డీఎంఈ), ఇతర అధికారులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో నిరవధిక సమ్మెలోకి దిగుతున్నట్లు జూడాలు ప్రకటించారు. దీంతో కేజీహెచ్‌తో పాటు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు విఘాతం కలుగుతుంది.సమ్మెలో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓపీ సేవలను జూనియర్ డాక్టర్లు పూర్తిగా నిలిపివేస్తున్నారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే హాజరవుతామని వెల్లడించారు. ఆస్పత్రుల్లో రోజూ వార్డుల నిర్వహణ, శస్త్రచికిత్సలు, పరీక్షలు చేయడంలో పీజీ డాక్టర్లు, హౌస్సర్జన్లదే కీలక పాత్ర. వీరంతా విధులకు దూరం కావడంతో దూర ప్రాంతాల నుంచి ఆస్పత్రులకు వచ్చే వేలాది మంది పేద రోగులు, వృద్ధులు, గర్భిణులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.ఈ ఏడాది జనవరి నుంచి రావాల్సిన స్టైపెండ్ పెంపును వెంటనే విడుదల చేయాలని, చెల్లింపులను క్రమబద్దీకరించాలని జూనియర్ డాక్టర్ల సంఘం నాయకుడు డాక్టర్ శిరాజ్ డిమాండ్ చేశారు. డీఎంఈతో చర్చలు విఫలమవడంతోనే సమ్మెకు దిగామన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి హామీలను అమలు చేయాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఏపీజేయూడీఏ నేతలు హెచ్చరించారు. -
అపార ప్రతిభ.. అకాల మరణం!
ఆంధ్రప్రదేశ్: టేబుల్ టెన్నిస్ బోర్డుపై ర్యాకెట్ పట్టి ప్రత్యర్థులను చిత్తుచేస్తూ.. రాష్ట్రస్థాయి పతకాలు సాధిస్తున్న ఆ చిరుచేతులు ఇక కదలవు. పట్టుదలతో కష్టపడి భవిష్యత్తులో దేశం గర్వించే క్రీడాకారుడిగా ఎదుగుతాడనుకున్న ఆ బాలుడి నవ్వులు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఒక చిన్నపాటి శారీరక లోపాన్ని సరిచేసుకుందామని ఆస్పత్రికి వెళ్తే.. విధి వెక్కిరించడంతో ఆ చిన్నారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. కంటికి రెప్పలా కాపాడుకున్న కంటిపాప కన్నుమూయడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. అంతటి తీరని దుఃఖంలోనూ కుమారుడి నేత్రాలను దానం చేసి మరొకరి జీవితాల్లో వెలుగులు నింపారు.పతకాల రేసులో నిలిచి..బుచ్చిరాజుపాలెంలో నివాసముంటున్న తిరుమలరాజు హరిబాబు, భవానీ దంపతుల కుమారుడు హర్షవర్ధన్‌వర్మ (12) స్థానిక ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చదువుతో పా టు ఆటల్లోనూ ఎంతో చురుగ్గా ఉండే హర్షవర్ధన్.. తనకు ఎంతో ఇష్టమైన టేబుల్ టెన్నిస్‌ను ఎంచుకున్నాడు. క్రమశిక్షణతో సాధన చేస్తూ అండర్–12 విభాగంలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాడు. ఎన్నో పతకాలు సాధించాడు.లోపాన్ని సరి చేసుకోవాలనుకుంటే..బాలుడిలో ఉన్న చిన్నపాటి శారీరక లోపాన్ని సరిచేసేందుకు ఇటీవల ఒక ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించారు. అయితే దురదృష్టవశాత్తు ఆరోగ్యం విషమించడంతో మృత్యువుతో పోరాడుతూ ఆదివారం హర్షవర్ధన్ కన్నుమూశాడు. హర్షవర్ధన్ భౌతికకాయాన్ని తరలించేందుకు బంధువు అశోక్ పెందుర్తిలోని ‘సాయి హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్’ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్‌ను సంప్రదించారు. ఆ సమయంలో శ్రీనివాస్ నేత్రదానం కోసం వివరించగా.. పుట్టెడు శోకంలో ఉన్న తల్లిదండ్రులు హరిబాబు, భవానీ ఏమాత్రం సంకోచించకుండా అంగీకరించారు. -
విశాఖపట్నంలో అల్లు అర్జున్ సందడి (ఫొటోలు)
-
రానున్న మూడు గంటల్లో.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రానున్న మూడు గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ(గురువారం) రాత్రి మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.విశాఖలో వాతావరణం ఒక్కసారిగా మారింది. పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వేడి, ఉక్క పోత వాతావరణంతో అల్లాడుతున్న జనానికి ఉపశమనం కలిగింది. ఎంవిపీ, ఆరిలోవ, ఎండాడ, సాగర్ నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. -
కూటమి ప్రభుత్వంపై బొలిశెట్టి ఫైర్
విశాఖపట్నం: ఏపీలో కూటమి ప్రభుత్వ విధానాలు తిరుగుబాటుకి దారి తీసేలా ఉన్నాయని జనసేన పార్టీ మాజీ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విశాఖలో ప్రకృతి విధ్వంసం చేస్తోందని విమర్శించారు. విశాఖలో జరిగే ప్రకృతి విధ్వంసంపై పోరాటం జరగబోతుందని తెలిపారు. రుషికొండ విషయంలో మాట్లాడిన వారే ఇప్పుడు తప్పులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుషికొండ విషయంలో మాట్లాడిన పెద్దలు ఇప్పుడు కూడా మాట్లాడాలని డిమాండ్ చేశారు.పర్వత ప్రాంతాల్లో డేటా సెంటర్ నిర్మాణం చెయ్యడానికి వీల్లేదని, పర్యావరణ చట్టం ప్రకారం 10 కిలోమీటర్ల దూరం ఉండాలని తెలిపారు. ప్రభుత్వం డేటా సెంటర్లకు కేటాయించిన భూములు కంబాల కొండ అడవులకు దగ్గరలో ఉన్నాయన్నారు. డేటా సెంటర్ నిర్మాణం కోసం సింహాచలం, తర్లువాడ కొండలను తవ్వెస్తున్నారని వాపోయారు. దేశంలో ఉన్న పర్యావరణ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా శంకుస్థాపన ఎలా చేశారని ప్రశ్నించారు. డేటా సెంటర్లు విధ్వంసానికి పాల్పడితే ప్రాణం ఉన్నంతవరకు పోరాటం చేస్తానని బొలిశెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు.డేటా సెంటర్లపై ప్రజల్లో వ్యతిరేకతఅమెరికాలో డేటా సెంటర్లపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని ఎక్స్‌లో పేర్కొన్నారు. డేటా సెంటర్లకు అనుమతి నిలిపివేస్తూ టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ కీలక నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.''టెక్సాస్‌లో డేటా సెంటర్ల నిర్మాణంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో, గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ సోమవారం రాష్ట్ర విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం కోరుతున్న ప్రతిపాదిత డేటా సెంటర్లపై నియంత్రణ సంస్థలు ఆడిట్ పూర్తిచేసే వరకు వాటి అనుమతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆదేశం ప్రకారం, పబ్లిక్ యుటిలిటీ కమిషన్ ఆఫ్ టెక్సాస్ మరియు ఎలక్ట్రిక్ రిలయబిలిటీ కౌన్సిల్ ఆఫ్ టెక్సాస్ (ERCOT) డేటా సెంటర్లపై సమగ్ర తనిఖీ చేయాలి.ఆడిట్లో డెవలపర్లు పొందే పన్ను రాయితీలు, విద్యుత్ వినియోగం, విద్యుత్ ఉత్పత్తి, నీటి వినియోగం, కూలింగ్ విధానాలు, స్థానిక సమాజాలపై ప్రభావాన్ని చర్యలు, అలాగే ఆ సౌకర్యం యాజమాన్యం వంటి విషయాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఆడిట్లో అవసరమైన ప్రమాణాలు తీరని ఏ ప్రాజెక్టునైనా టెక్సాస్ గ్రిడ్‌కు అనుసంధానం చేయకూడదని అబ్బాట్ చెప్పార''ని బొలిశెట్టి సత్యనారాయణ (Bolisetty Satyanarayana) ఎక్స్‌లో పోస్ట్ చేశారు. చదవండి: చంద్రబాబుఉత్తరాంధ్ర జపం అంతా ఉత్తదే -
గాలి బీభత్సం..కూలి పడిపోయిన ఫ్లడ్ లైట్స్
-
పీవీ సింధు నుదుటిపై గాడ్జెట్...ఆసక్తికర చర్చ
విశాఖ : ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన అవయవదానం అవగాహన సదస్సుకు హాజరైన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు నుదుటిపై ఉన్న పింపుల్.. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె నుదుటిపై పెద్ద పులిపిరి కాయ వచ్చిందని కొందరు.. కాదు కాదు.. అది పింపుల్ అని మరికొందరు.. ఇలా చర్చించుకున్నారు. కానీ.. అసలు విషయం ఏంటంటే.. ఆమె ధరించింది.. ఒక గాడ్జెట్. దానిపేరే టెంపుల్.ఇటీవల డెన్మార్క్ వేదికగా జరిగిన ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ మ్యాచ్‌ల్లో సింధు తొలిసారి.. నుదిటి కణతపై ఈ వెండిరంగు పరికరాన్ని ధరించి.. క్రీడాభిమానుల్ని ఆశ్చర్యంలో పడేసింది. టెంపుల్ అని పిలిచే ఈ అధునాతన వేరబుల్ గాడ్జెట్‌ను జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ రూపొందించారు. క్రీడాకారుల మెదడుకు వెళ్లే రక్త ప్రసరణని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం దీని ప్రధాన ఉద్దేశం.ఆట సమయంలో వారి మానసిక ఒత్తిడి హెచ్చుతగ్గులు, నిద్ర సరిపోయిందా లేదా.? రికవరీ స్థాయిలు, మెటబాలిక్ రేటుని కచ్చితంగా అంచనా వేసేందుకు ఇది సహాయ పడుతుంది. తీవ్రమైన ఒత్తిడి జయించి.. బ్యాడ్మింటన్ కోర్టులో మరింత ఏకాగ్రతతో మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు ఈ టెంపుల్... నా బెస్ట్ ఫ్రెండ్‌గా మారిందని సింధు ‘సాక్షి’తో చెప్పారు.ఫొటో : సాక్షిఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
విశాఖ ఆర్కే బీచ్‌లో ఫ్రెండ్షిప్ డే తీపి కిక్కు..(ఫొటోలు)
-
తర్లువాడ.. గుండెదడ..
సాక్షి, విశాఖపట్నం: శరవేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నం నగర దాహార్తిని తీర్చే ప్రధాన సహజ జలవనరుల్లో ఒకటైన తర్లువాడ కొండలు నేడు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. అభివృద్ధి పేరుతో డేటా సెంటర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు పర్యావరణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండా, చట్టాలను పక్కనపెట్టి మరీ కొండలను పిండిచేస్తూ సహజ జలమార్గాలను ధ్వంసం చేయడం పర్యావరణవేత్తలను, స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సాంకేతిక పురోగతి అవసరమే అయినప్పటికీ.. భవిష్యత్ తరాల తాగునీటి మూలాలను బలిపీఠంపై ఎక్కించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని తర్లువాడ కొండలు కేవలం రాతిగుట్టలు మాత్రమే కాదు. ఇవి తూర్పు కనుమల శ్రేణిలో భాగమైన ఈ కొండలు దశాబ్దాలుగా విశాఖ నగరానికి, భీమిలి, మధురవాడ పరిసర ప్రాంతాలకు సహజ జలసేకరణ వ్యవస్థలుగా పనిచేస్తున్నాయి. 1954 నుంచి ఈ ప్రాంత ప్రజల దాహార్తిని తీరుస్తున్న గంభీరం గెడ్డ రిజర్వాయర్‌కు ప్రాణం పోసేది ఈ కొండలే. వర్షాకాలంలో తూర్పు కనుమలపై కురిసే ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి, కోట్లాది లీటర్ల నీటిని గంభీరం రిజర్వాయర్‌కు చేరవేసే ప్రకృతి ప్రసాదించిన జలరక్షణ కవచాలు.. ఛిద్రమైపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇటీవలి కాలంలో డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం ఈ ప్రాంతాన్ని కేటాయించడంతో పరిస్థితి దారుణంగా మారింది. నీటికి కటకటే ఇస్రోకి చెందిన ‘భువన్’ శాటిలైట్ మ్యాపింగ్ యాప్‌లో ఓసారి పరిశీలిస్తే.. తర్లువాడ కొండలపై నుంచి గంభీరం గెడ్డ వైపు నీలిగీతలు (సహజ జలధారలు) స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఈ సహజ జలప్రవాహ మార్గాలను.. డేటా సెంటర్ పనుల కారణంగా భారీగా తవ్వకాలు జరిపి మట్టితో కప్పేస్తున్నారు. ఈ సహజ జలమార్గాలను మూసేస్తే గంభీరం రిజర్వాయర్‌కు నీరుచేరే మార్గాలు శాశ్వతంగా మాయమైపోనున్నాయి. ఫలితంగా భవిష్యత్తులో విశాఖ నగర తాగునీటి సరఫరాపై ఇది తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ప్రజాప్రతినిధులు, పర్యావరణశాఖ అధికారులు ఈ విధ్వంసాన్ని గమనించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 140 ఎకరాల కొండల్లో విధ్వంసం పచ్చని అటవీ సంపదతో, వర్షాధార వృక్షాలతో కళకళలాడే తర్లువాడ కొండల్లో దాదాపు 140 ఎకరాల విస్తీర్ణంలోని అటవీ ప్రాంతాన్ని చట్టబద్ధమైన పర్యావరణ అనుమతులు లేకుండానే ధ్వంసం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొండలను చదును చేసేందుకు చేపట్టిన భారీ తవ్వకాల వల్ల పర్యావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతింటోంది. పనుల తీరు పరిశీలించేందుకు ఎవరు వెళ్తున్నా.. వారిని నిలువరించి అరెస్టు చేసేందుకు సైతం చంద్రబాబు ప్రభుత్వం వెనకాడటం లేదు. విశాఖ ప్రజలు పోరాడాల్సిన సమయం ఈ తర్లువాడ కొండల విధ్వంసంపై జనసేన మాజీ నేత, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ సున్నిత ప్రాంతాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని టీఎన్ గోదావర్మన్ తిరుముల్పాడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణపై స్పష్టమైన తీర్పు ఇచి్చందని చెప్పారు. ఎలాంటి ప్రాజెక్టుకైనా పర్యావరణ అనుమతి లేకుండా పనులు ప్రారంభించడం చట్టవిరుద్ధమన్నారు. పోస్ట్–ఫ్యాక్టో విధానంలో పనులు పూర్తిచేసిన తర్వాత అనుమతులు తెచ్చుకోవచ్చనే విధానాన్ని న్యాయస్థానం ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించదని పేర్కొన్నారు. పర్యావరణ ప్రభావ అంచనా నిర్వహించకుండా కొండలను తొలగించడం, సహజ జలవనరులను పూడ్చేయడం శిక్షార్హమైన నేరమని చెప్పారు. ప్రకృతి వనరులు.. పాలకులు లేదా రాజకీయ శక్తుల సొంత ఆస్తి కాదన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా పోరాడుతున్నారని చెప్పారు. అదే స్థాయి ప్రజా చైతన్యం, పర్యావరణ స్పృహ విశాఖ ప్రజల్లోను రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. -
విశాఖ యారాడ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
సాక్షి, విశాఖపట్నం: స్నేహితుల దినోత్సవం రోజు విషాదం చోటుచేసుకుంది. యారాడ బీచ్‌లో యువతి, యువకుడు గల్లంతయ్యారు. ఫోటోలు తీసుకుంటున్న క్రమంలో సముద్రంలో గల్లంతయినట్లు సమాచారం. యువతి నీతుని రక్షించబోయి మరో యువకుడు రాము గల్లంతయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన న్యూ పోర్టు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.విశాఖ వచ్చే పర్యాటకులు యారాడ బీచ్, ఆర్కే బీచ్, తేన్నేటి పార్క్, సాగర్ నగర్, రుషి కొండ బీచ్, ఐటీ హిల్స్, భీమిలి బీచ్ ప్రాంతాలను ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇక్కడి తీరంలో పెద్ద పెద్ద రాళ్లు ఉండడంతో వాటిపై నిల్చుని సాగరం అందాలను వీక్షిస్తుంటారు. అయితే కొంత మంది సరదాగా స్నానాలు చేసేందుకు, ఫోటోలు తీసుకోవడానికి దిగడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అకస్మాత్తుగా వచ్చే అలలకు బలైపోతున్నారు.విశాఖ తీరం చుట్టూ కొండలు ఉండడంతో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా రిప్ కరెంట్ వల్ల ఒక్కొక్కసారి భారీ అలలు వస్తుంటాయి. ఇలా రిప్ కరెంట్ వల్ల అలలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు వస్తుంటాయి. ఆ సమయంలో తీరంలో ఉన్న వారు వాటికి చిక్కితే క్షణాల్లో కొన్ని కిలోమీటర్ల లోనికి వెళ్లిపోతుంటారు. సాధారణంగా అలలు ఎవరినైనా లోనికి లాగితే కొద్ది దూరంలోనే విడిచిపెట్టేస్తాయి. అటువంటి వారిని లైఫ్‌గార్డ్స్ రక్షించే అవకాశం ఉంటుంది. ఈ రిప్ కరెంట్ వల్ల వచ్చే కెరటాలకు చిక్కితే మాత్రం సురక్షితంగా బయటపడడం అసాధ్యం. -
సాగరగర్భంలో బాహుబలి
సాక్షి, విశాఖపట్నం: దేశరక్షణకు మరో బాహుబలి సిద్ధమవుతోంది. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం చలాయించేలా, చొరబాట్లను అరికట్టేలా, చైనాకు చెక్‌పెట్టేలా అణు జలాంతర్గామి రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే వరుస క్షిపణి ప్రయోగాలతో సత్తా చాటుతున్న ఇండియన్ నేవీ.. శత్రుదేశాల గుండెల్లో గుబులు రేపేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నెక్స్ట్ జెన్ న్యూక్లియర్ సబ్‌మెరైన్‌ను నిర్మిస్తోంది. 13,500 టన్నుల బరువైన ఈ బాహుబలి అణు జలాంతర్గామిలో 190 మెగావాట్ల సామర్థ్యం ఉన్న కాంపాక్ట్ లైట్ వాటర్ అణు రియాక్టర్, 8 వేల కిలోమీటర్లకు పైగా పరిధి ఉన్న కే–6 ఖండాంతర క్షిపణులు ఉంటాయి. విశాఖలోని రాంబిల్లి సమీపంలో ఉన్న రహస్య నేవల్ బేస్ ఐఎన్ఎస్ వర్ష, విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లోను ఎస్–5 ప్రాజెక్టుగా దీని నిర్మాణపనులు మొదలయ్యాయి. డిజైనింగ్ నుంచి నిర్మాణం వరకు దీనికోసం రూ.10 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. డీఆర్డీవో, బార్క్, ఏటీవీ సంయుక్త డిజైన్ అరిహంత్, అరిఘాత్, ఎస్–4, ఎస్–4 స్టార్ వంటి సబ్మెరైన్లను విజయవంతంగా నిర్మించిన భారత్.. ఇప్పుడు అంతకంటే రెట్టింపు సామర్థ్యం గల భారీ సబ్మెరైన్లు నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. 2006 నాటి ఉన్నతస్థాయి శాస్త్రవేత్తల కమిటీ సిఫారసుల ఆధారంగా డీఆర్డీవో, బార్క్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్ (ఏటీవీ) కలిసి.. ఈ ఎస్–5 డిజైన్ని రూపొందించాయి. విశాఖలోనే ఎందుకంటే?ఎస్–5 సబ్‌మెరైన్ నిర్మాణపనులు విశాఖలో చురుగ్గా సాగుతున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన 190 మెగావాట్ల లైట్ వాటర్ రియాక్టర్ తయారీ చివరి దశకు చేరుకుంది. విశాఖపట్నం సమీపంలో ఉన్న రాంబిల్లి వద్ద సముద్రపు లోతు ఎక్కువగా ఉండటం వల్ల జలాంతర్గాములు ఉపగ్రహాలు లేదా శత్రు రాడార్లకు చిక్కకుండా నీటి అడుగున ప్రయాణించి సముద్రంలోకి ప్రవేశించవచ్చు. అదేవిధంగా విశాఖలోని షిప్‌బిల్డింగ్ సెంటర్ దశాబ్దాలుగా అణు జలాంతర్గాముల నిర్మాణంలో అనుభవం సాధించింది. అణు జలాంతర్గాముల నిర్మాణానికి అవసరమైన పరికరాల్ని అందించే బార్క్, ఎల్ అండ్ టీ, బీహెచ్ఈఎల్ దీనికి సమీపంలో ఉన్నాయి. ఈ కారణాలతో ఈ భారీ న్యూక్లియర్ సబ్‌మెరైన్ నిర్మాణానికి విశాఖపట్నాన్ని ఎంపిక చేశారు. సైనిక శక్తిని మార్చేసే సత్తా ఎస్–5 అణు జలాంతర్గామి భారత రక్షణదళ అమ్ములపొదిలో చేరితే.. దేశ సైనికశక్తి దశ దిశ మారిపోతాయి. ఇందులో ఒకేసారి అనేక లక్ష్యాల్ని ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్న కే–6 బాలిస్టిక్ క్షిపణులుంటాయి. వీటిద్వారా శత్రుదేశాల్లోని ఏ మూలనైనా లక్ష్యంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతం(ఐవోఆర్)లో చైనా నౌకాదళ చొరబాట్లను గట్టిగా తిప్పికొట్టవచ్చు. -
మేం ఎంపీ సీఎం రమేష్ మనుషులం..
పెందుర్తి: విశాఖ జిల్లా పెందుర్తి రెవెన్యూ పరిధిలోని చినముషిడివాడలో ఓ ప్రైవేటు స్థలంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మనుషులు దౌర్జన్యకాండకు దిగారు. దశాబ్దాలుగా వివాదంలో ఉన్న సర్వే నెంబర్ 112/1 భూమిలోకి అక్రమంగా చొరబడి నిర్మాణాలను కూల్చివేశారు. స్థల యజమానిని, అతడి సోదరుడు, కుటుంబ సభ్యులపై భౌతికదాడికి దిగి రెచ్చిపోయారు. సీఎం రమేష్ మనుషులం.. ఈ స్థలం మాది అంటూ పేట్రేగిపోయారు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనపై బాధితులు పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. వివరాలివీ..ఎన్ఆర్ఐ బీమరశెట్టి మనోజ్ కుటుంబ సభ్యులు సర్వే నెంబర్ 112/1లో 1979లో 50 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. నాటి నుంచి వారి స్వాధీనంలోనే భూమి ఉంది. అయితే, పినిశెట్టి చంద్రమోహన్ అనే వ్యక్తి తమ కుటుంబ సభ్యులకు వారసత్వ హక్కులు ఉన్నాయంటూ గతంలో భూమిలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో అప్పట్లో వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. అనంతరం దీనిపై రెవెన్యూ కార్యాలయం నుంచి పోలీసులు వివరణ తీసుకోగా.. ఇరువురి పత్రాలు పరిశీలించి ఇది పూర్తిగా సివిల్ తగాదా అంటూ రిపోర్టు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో.. గురువారం ఉదయం పినిశెట్టి చంద్రమోహన్ తన కుటుంబ సభ్యులతో స్థలంలోకి చొరబడ్డారు. ఎంపీ సీఎం రమేష్ మనుషులమంటూ స్థలంలో హడావుడి చేశారు. అడ్డుకున్న మనోజ్ సోదరుడు నితిన్‌పై దాడికి తెగబడ్డారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. ఇరువురి మధ్య బైండోవర్ చేసినట్లు సీఐ సతీష్‌కుమార్ తెలిపారు. బైండోవర్ చేశాక కూడా సీఎం రమేష్ మనుషులు స్థలాన్ని ఖాళీ చేయడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. -
నాడు జగన్ శంకుస్థాపన.. నేడు ‘భోగాపురం’ అందాలు (ఫొటోలు)
-
జగన్ వెంట జన సాగరం
సాక్షి, విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, అరసవల్లి: అడుగడుగునా ఖాకీలను మోహరించి చంద్రబాబు సర్కారు ఎక్కడికక్కడ అడ్డుకున్నా లెక్క చేయకుండా జన సముద్రం పోటెత్తింది! పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాభిమానాన్ని నియంత్రించాలని చూసినా కుయుక్తులు పారలేదు. విశాఖ నుంచి సిక్కోలు దాకా జనవాహిని ఉప్పొంగింది. ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా అపూర్వ ఆదరణ లభించింది. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి చోటా ఘన స్వాగతం పలికారు. అక్రమ కేసులో అరెస్టై శ్రీకాకుళం జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు విశాఖలో ఉదయం 11 గంటలకు బయలుదేరిన వైఎస్ జగన్ కాన్వాయ్ సాయంత్రం 5.30 గంటలకు శ్రీకాకుళం మండలంలోని అంపోలు జైలు వద్దకు చేరుకోగలిగింది. 120 కిలోమీటర్ల దూరానికి ఆరున్నర గంటలు పట్టిందంటే జనం తాకిడి.. జగన్‌పై ఉన్న అభిమానం ఏ స్థాయిలో పోటెత్తిందో అర్థం చేసుకోవచ్చు. తొలుత విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ప్రారంభమైన వైఎస్ జగన్ పర్యటన ఎన్ఏడీ జంక్షన్, గోపాలపట్నం జంక్షన్, అడవివరం, సత్తరువు జంక్షన్, నీలకుండీలు, ఆనందపురం జంక్షన్, తగరపువలస మీదుగా శ్రీకాకుళం వైపు సాగింది. విశాఖ జిల్లాలోనే సుమారు మూడు గంటల పాటు సాగింది. దారి పొడవునా శ్రీకాకుళం దాకా ఎటు చూసినా జనమే. కాన్వాయ్‌ని ముందుకు కదలనివ్వకుండా జన ప్రవాహం కొనసాగింది. మధ్యాహ్నం 1:35 గంటలకు కాన్వాయ్ విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. వైఎస్ జగన్ పర్యటనలో యువత, మహిళలు పెద్ద ఎత్తున కనిపించారు. ఈ సందర్భంగా పలుచోట్ల పోలీసులు కవ్వింపు చర్యలకు దిగారు. రోడ్డెక్కిన ప్రతి ఒక్కరినీ అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లిపోవాలని గదమాయించారు. లాఠీలకు పని చెప్పారు. ఈ క్రమంలో చాలా మందికి గాయాలయ్యాయి. కానీ ఖాకీలు ఎంతగా అడ్డుకున్నా జన ప్రవాహాన్ని నిరోధించలేక చివరకు చేతులెత్తేశారు. వెల్లువెత్తిన వినతులు విశాఖ విమానాశ్రయంలో సుమారు 160 మంది ఎయిర్పోర్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వైఎస్ జగన్‌ను కలసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కాకాణి నగర్ వద్ద విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన కాందిశీకులు వైఎస్ జగన్‌ను కలసి తమ సమస్యలు చెప్పుకున్నారు. అడవివరం జంక్షన్ (భీమిలి) వద్ద పంచగ్రామాల భూ సమస్యపై స్థానికులు మాజీ సీఎంకు వినతిపత్రం అందజేశారు. ఆనందపురం జంక్షన్ వద్ద గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం కోసం తమ వద్ద నుంచి సేకరించిన డీ–పట్టా భూములకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదని ఆనందపురం మండలం తర్లువాడ గ్రామానికి చెందిన బీసీ, ఎస్సీ రైతులు వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పోటెత్తిన మత్స్యకారులు...: మత్స్యకార కుటుంబానికి చెందిన డాక్టర్ సీదిరి అప్పలరాజు రాజకీయాల్లో ఎదగడాన్ని జీరి్ణంచుకోలేక టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేయడంపై మత్స్యకారులు రగిలిపోతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో రణస్థలం, కోష్ట తదితర తీర ప్రాంతాల నుంచి వందలాది మత్స్యకార కుటుంబాలు జగన్ పర్యటనలో పోటెత్తాయి. అంపోలు ప్రాంతానికి గార, శ్రీకాకుళం రూరల్‌తో పాటు ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాలకు చెందిన మత్స్యకారులు స్వచ్ఛందంగా తరలివచ్చి అప్పలరాజుకు మద్దతుగా జగనన్నను కలిసి తమ ఆవేదన తెలియచేశారు. పోలీసుల ఆంక్షలు.. కాలి నడకన నేతలు మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన పొడవునా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించేందుకు యత్నించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను నిరోధించేందుకు యత్నించినా అభిమానం ముందు ఆ ఆంక్షలు నిలవలేదు. రెట్టించిన ఉత్సాహంతో అభిమానులు, నాయకులు నేతలు కాలినడకనే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంబోత్సవం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి రప్పించిన పోలీసు బలగాలను శ్రీకాకుళం జిల్లాకు డంప్ చేశారు. రెండు వేల మందికి పైగా పోలీసులను జాతీయ రహదారి పొడవునా, ప్రతి గ్రామ శివారులో కాపలా పెట్టారు. వైఎస్ జగన్ పర్యటన సాగే శ్రీకాకుళం, రణస్థలం, పైడి భీమవరం, కొత్తరోడ్డు, పెదపాడు వైపు రావద్దని ప్రజలను హెచ్చరించారు. అయినా జనం వెనక్కి తగ్గలేదు. జగన్ వెంటే సాగారు. వైఎస్ జగన్ వారిని నిరాశ పరచకుండా అభివాదం చేస్తూ, కరచాలనాలు అందిస్తూ, వినతులు స్వీకరిస్తూ ముందుకు కదిలారు. ఆయన కేవలం 8 వాహనాల కాన్వాయ్‌తో మాత్రమే వెళ్లి సీదిరి అప్పలరాజును కలిసేందుకు అనుమతించారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా జైలు వద్దకు చేరుకునే సరికి సమయం మించిపోయింది. దీంతో జైలు ఆవరణలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు భార్య శ్రీదేవి, కుమారులు ఆరవ్ వర్మ, అర్నవ్ వర్మ, అప్పలరాజు సోదరుడు త్రినాథరావు, ఇతర కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. అంబులెన్సులు, అంతిమయాత్ర వాహనాలను సైతం అడ్డుకుని..నలుమూలల నుంచి తరలి వస్తున్న పార్టీ శ్రేణులతో పాటు కీలక నేతల కార్లను గురువారం ఉదయం నుంచి పోలీసులు అడ్డుకున్నారు. బస్సులో ప్రయాణించేందుకు సైతం నిరాకరించారు. కొత్తరోడ్డులో అంతిమయాత్ర వాహనాన్ని సైతం పోలీసులు అడ్డుకున్నారు. క్షతగాత్రులను తరలిస్తున్న అంబులెన్స్‌లను అడ్డుకోవడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో విడిచిపెట్టారు. వజ్రపుకొత్తూరు మండలం నరేంద్రపురం వద్ద మహిళలను ఆస్పత్రులకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డగించారు. రాగోలు వద్ద పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు.ఎచ్చెర్ల రోడ్డు నవభారత్ జంక్షన్ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్ వెంట స్థానిక నేతల వాహనాలు వెళ్లకుండా జాతీయ రహదారిని గంట సేపు దిగ్భందించారు. అంపోలు కూడలిలో పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ వెంట శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర నేతలు ఉన్నారు. వీరంతా జగన్‌కు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. -
భోగాపురం విమానాశ్రయం నుంచి విశాఖకు ఆరు లేన్ల హైవేను మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ప్రకటన
-
సింహాచలం: 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ...పరవశించిన భక్త జనవాహిని (ఫొటోలు)
-
సింహాచలం గిరి ప్రదక్షణ వేళ.. అయోమయంలో భక్తులు
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం గిరి ప్రదక్షణ వేళ భక్తుల్లో అయోమయం నెలకొంది. కృత్రిమ తొలి పావంచాలను ప్రభుత్వం ఏర్పాటుచేయగా.. ఇది ఆగమ నియమాలకు విరుద్దమని భక్తులు మండిపడుతున్నారు. పవిత్ర తొలి పావంచాను కృత్రిమంగా ఏర్పాటు చేయడం దారుణమన్న విశ్వ హిందూ పరిషత్.. ఎన్నో ఏళ్లుగా తొలి పావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షణ ప్రారంభించడం ఆనవాయితీగా పేర్కొంది.నచ్చిన కృత్రిమ తొలి పావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రదక్షణ ప్రారంభించవచ్చని హోం మంత్రి అనిత సెలవిచ్చారు. హోం మంత్రి ప్రకటన, ప్రభుత్వ తీరుతో అప్పన్న భక్తుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసింహాచల గిరి ప్రదక్షిణ సందర్భంగా మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు అమల్లో ఉంటాయని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. గిరి ప్రదక్షిణ మార్గంలోకి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించడంతో పాటు భక్తుల వ్యక్తిగత వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నా రు.మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు హనుమంతవాక–అడవివరం మార్గంలో సాధారణ వాహనాల రాక పోకలను నిలిపివేస్తారు. అలాగే వేపగుంట జంక్షన్ నుంచి ఓల్డ్ గోశాల వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు మినహా ఇతర వాహనాలకు అనుమతి ఉండదని వెల్లడించారు. భక్తులు తమ వ్యక్తిగత వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపి, అక్కడి నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు లేదా కాలినడకన గిరి ప్రదక్షిణ ప్రారంభ స్థలానికి చేరుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఆంక్షలు అమల్లో ఉన్న మార్గాల్లో వ్యక్తిగత వాహనాలతో ప్రయాణించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. -
ఏపీ : విశాఖపట్నం దగ్గరలో అద్భుతమైన జలపాతం... ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
విజయవాడ మీదుగా వందేభారత్ స్లీపర్!
భారతీయ రైల్వే రవాణా వ్యవస్థలో వందేభారత్ రైలు సుదూర రాత్రి ప్రయాణాల వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు పగటిపూట నడిచే చైర్ కార్ వెర్షన్లతో ఆదరణ పొందిన వందేభారత్ సిరీస్ రైళ్లను అప్డేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) పరిధిలో ‘వందేభారత్ స్లీపర్’ పేరుతో కొత్త రైళ్లను పట్టాలెక్కించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఎస్సీఆర్ పరిధిలో దీన్ని ముందుగా విజయవాడ డివిజన్లో ప్రారంభించేందుకు భారతీయ రైల్వే కసరత్తు చేస్తోంది. రాబోయే దసరా పండుగ నాటికి విజయవాడ మీదుగా ఈ అత్యాధునిక స్లీపర్ సర్వీసును పట్టాలెక్కించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ మీదుగా బెంగళూరు మార్గంలో ఈ రైలును నడిపే ప్రతిపాదన తుది దశలో ఉన్నట్లు సమాచారం. దేశంలో మొదటి వందేభారత్ స్లీపర్ ఈ ఏడాది జనవరిలోనే హౌరా-కామాఖ్య మధ్య ప్రారంభమైంది. సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్లో మాత్రం ఇంకా ప్రారంభంకాలేదు.విమాన తరహా ప్రయాణ అనుభూతివందేభారత్ స్లీపర్ రైళ్లను విమాన ప్రయాణానికి ఏమాత్రం తీసిపోని విధంగా అత్యున్నత సాంకేతికత, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో డిజైన్ చేశారు. మొత్తం 16 ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లతో రూపొందించిన ఈ రైలులో 1 ఫస్ట్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 11 థర్డ్ ఏసీ బోగీలు ఉంటాయి. ఒకేసారి సుమారు 823 మంది ప్రయాణించేలా సీటింగ్/బెర్త్ అమరిక ఉంది. గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల డిజైన్ వేగం ఉన్నప్పటికీ ప్రస్తుత ట్రాక్ సామర్థ్యానికి అనుగుణంగా 160 కి.మీ/గం ఆపరేషనల్ వేగంతో ప్రయాణిస్తుంది. సెల్ఫ్-ప్రొపెల్డ్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (ఈఎంయూ) సాంకేతికత వల్ల వేగవంతమైన ఆక్సిలరేషన్ సాధ్యమవుతుంది.ప్రత్యేకంగా రూపొందించిన కుషన్ బెర్త్‌లు, శబ్ద కాలుష్యం లేకుండా ఉండే సౌండ్ ప్రూఫ్ క్యాబిన్లు, సాఫ్ట్ ఎల్ఈడీ లైటింగ్, ప్రతి బెర్త్ వద్ద ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్లు, వైఫై కనెక్టివిటీ, ఆటోమేటిక్ సెన్సార్ డోర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. పూర్తిస్థాయి స్వదేశీ ప్రమాద నిరోధక వ్యవస్థ ‘కవచ్’, నిరంతర సీసీటీవీ నిఘా, ఏఐ ఆధారిత కోచ్ కండిషన్ మానిటరింగ్ సిస్టమ్, అత్యవసర సమయాల్లో సిబ్బందితో మాట్లాడే టాక్-బ్యాక్ బటన్లు అందుబాటులో ఉంటాయి. పరిశుభ్రత కోసం బయో వాక్యూమ్ టాయిలెట్లు, సెన్సార్ వాటర్ ట్యాప్‌లు అమర్చారు.రవాణా రంగంలో సరికొత్త అధ్యాయంసాధారణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లతో పోలిస్తే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా ప్యాసింజర్ సేఫ్టీకి ఇవి ప్రాధాన్యత ఇస్తాయి. తెలుగు రాష్ట్రాల మధ్య వ్యాపార, ఐటీ, రవాణా అవసరాలకు విజయవాడ కీలక కేంద్రంగా ఉన్నందున ఈ స్లీపర్ వందేభారత్ అందుబాటులోకి రావడం ఇక్కడి ప్రయాణికులకు ఊరటనివ్వనుంది. త్వరలోనే అధికారిక టైమ్‌టేబుల్, ప్రారంభ తేదీ వివరాలను రైల్వే బోర్డు ప్రకటించనుంది.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
వైఎస్సార్సీపీ ‘చలో పంచదార్ల’ విజయవంతం (ఫొటోలు)
-
అరుణ అసఫ్ అలీ.. ఇక సెలవ్!
సాక్షి, విశాఖపట్నం: సముద్రపు అలల సాక్షిగా.. జాతికి అంకితమైన ఒక సుదీర్ఘ ప్రస్థానానికి సగౌరవ ముగింపు దక్కింది. భారత సాగర తీర భద్రతలో రెండు దశాబ్దాల పాటు అజేయ కవచంగా నిలిచిన ఇండియన్ కోస్ట్‌గార్డ్ నౌక ‘ఐసీజీఎస్ అరుణ అసఫ్ అలీ’ శకం ముగిసింది. కల్లోల సాగరంలో రేయింబవళ్లు అలుపెరగకుండా గస్తీ కాస్తూ, దేశ సముద్ర సరిహద్దులకు నమ్మకమైన నిఘా నేత్రంలా సేవలందించిన ఈ నౌకకు రక్షణ దళం ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికింది. సైనిక లాంఛనాల మధ్య విశాఖలో జరిగిన ఈ డీకమిషనింగ్ వేడుకతో, సాగర రక్షణ చరిత్రలో ఒక అద్భుత అధ్యాయానికి అధికారికంగా తెరపడింది.తూర్పు నౌకాదళ కేంద్రమైన విశాఖపట్నం వేదికగా ఐసీజీఎస్ అరుణ అసఫ్ అలీ డీకమిషనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఏళ్ల తరబడి సముద్ర జలాల్లో దేశానికి అలుపెరగని సేవలందించిన ఈ నౌకకు కోస్ట్‌గార్డ్ అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. కోస్ట్‌గార్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో కోస్ట్‌గార్డ్ కమాండర్ చిన్మయ్దాస్ మహాపాత్రా సమక్షంలో పూర్తి సైనిక లాంఛనాలతో ఈ నౌకను డీకమిషన్ చేశారు. సైనిక వందనాల మధ్య నౌక జెండాను దించి దాని సుదీర్ఘ ప్రయాణానికి అధికారికంగా ముగింపు పలికారు. ఈ సందర్భంగా అధికారులు నౌక అందించిన అసాధారణ సేవలను కొనియాడారు. ఈ ప్రతిష్టాత్మక నౌకలో విధులు నిర్వర్తించిన ప్రతి ఒక్క నావికుడికి, అధికారికి ఇండియన్ కోస్ట్‌గార్డ్ సగర్వంగా సెల్యూట్æ చేసింది. సముద్రపు కఠినమైన వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా, దేశ రక్షణ కోసం అంకితభావంతో పనిచేసిన ఆ సిబ్బంది నిబద్ధత భవిష్యత్తు తరాలకు ఆదర్శనీయమని కితాబిచ్చింది.2006 నుంచి సేవల ప్రస్థానం..భారత సముద్ర సరిహద్దుల రక్షణలో ‘అరుణ అసఫ్ అలీ’ పాత్ర చిరస్మరణీయం. 2006లో కోస్ట్‌గార్డ్‌లో సేవలందించేందుకు ఈ నౌక చేరింది. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అసాధారణ తెగువ చూపిన వీరనారి ‘అరుణ అసఫ్ అలీ’ గౌరవార్థం ఈ నౌకకు ఆమె పేరు పెట్టారు. సముద్ర జలాల పరిరక్షణ, అవాంఛనీయ కార్యకలాపాలను అరికట్టడం, తీరప్రాంత భద్రతను పటిష్టం చేయడంలో ఈ నౌక అత్యుత్తమ సేవలందించింది. దేశ సముద్ర రక్షణ వలయంలో ఒక బలమైన ఆయుధంగా ఏళ్ల తరబడి తన సత్తా చాటుకుంది. కార్యాచరణ నైపుణ్యానికి, దేశ రక్షణపట్ల నిరంతర అప్రమత్తతకు ఈ నౌక నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. సముద్రంలో రేయింబవళ్లు కాపలా కాస్తూ, జాతికి ఒక నమ్మకమైన నిఘా నేత్రంలా, భద్రతా చిహ్నంగా ‘అరుణ అసఫ్ అలీ’ వ్యవహరించింది.ఐసీజీఎస్ అరుణ అసఫ్ అలీ విశేషాలు..నౌక క్లాస్: సరోజినీనాయుడు–క్లాస్ ఫాస్ట్ పెట్రోల్ వెసల్నిర్మాణం: గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్సేవలు ప్రారంభం: 28 జనవరి 2006నౌక పొడవు: 48 మీటర్లుబరువు: 259 టన్నులుగరిష్ట వేగం: గంటకు సుమారు 65 కిమీప్రయాణ సామర్థ్యం: ఏకధాటిగా 1,500 నాటికల్ మైళ్లుఆయుధ సంపత్తి: 30 ఎంఎం సీఆర్ఎన్ 91 నావల్ గన్, నౌకకు ఇరువైపులా రెండు 12.7 ఎంఎం హెవీ మెషిన్ గన్స్సిబ్బంది: 35 మంది -
బాధిత మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
సాక్షి, విశాఖపట్నం: మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. బోటు గల్లంతు ఘటనలో బాధిత కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున చెక్కులను వైఎస్సార్సీపీ నేతలు అందజేశారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, బడుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తదితరులు చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. బోటు ప్రమాద ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తులు ఎవరూ పరామర్శించలేదు. బోటు ప్రమాద ఘటన తెలిసిన వెంటనే వైఎస్ జగన్ స్పందించి ఆదుకుంటామని మాట ఇచ్చారు. కేవలం రూ.10 లక్షలు సాయం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. వైఎస్ జగన్ చెప్పిన మాట ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షలు సాయం చేశారు. బోటు డ్రైవర్ చిన్నాను ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్ జగన్.. చిన్నాతో సహా అందరికీ సాయం అందించారు. మత్స్యకారులను ఆదుకొని జగన్ తన దాతృత్వం చాటుకున్నారు. ఆయన సంతకం చేసి చెక్కులను పంపించారు. బాధిత కుటుంబాలకు చెక్కులు అందించాం.గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. బాధిత మత్స్యకార కుటుంబాలను వైఎస్ జగన్ ఆదుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం స్పందించలేదు. విపత్తు నిర్వహణ శాఖ చూసే మంత్రి కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. సంబంధిత శాఖ మంత్రి వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. మత్స్యశాఖ మంత్రి రోజూ విజయవాడ వెళ్తారు కానీ బాధిత కుటుంబాలను మాత్రం పరామర్శించరు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం అండగా ఉంటాం. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని జగన్ చెప్పమని పంపించారు.మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ.. బోటు ప్రమాద ఘటనలో ఈ ప్రభుత్వం స్పందించిన తీరు దారుణం. మత్స్యకారులంటే ఈ ప్రభుత్వానికి అంటరానితనం. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే మత్స్యకారులకు మంచి జరిగింది. మత్స్యకారులకు సాయం అందించిన వ్యక్తి వైఎస్ జగన్. మత్స్యకారులంటే జగన్‌కు ఎనలేని ప్రేమ. మత్స్యకారుల పెన్షన్ కోసం చంద్రబాబుని అడిగితే కన్నెర్ర చేసేవాడు. డీజిల్ సబ్సిడీ ఇచ్చిన ఘనత జగన్‌ది. బాబు ప్రతీ మ్యానిఫెస్టోలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ పెడతా అని పెట్టారు. అది వైఎస్ జగన్ చేసి చూపించారు..బడుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ.. మత్స్యకారులు గల్లంతయితే ప్రభుత్వానికి స్పందన లేదు. మత్స్యకారుల బాధ, ఆవేదన మాకు తెలుసు. మా పార్టీ తరఫున రూ. 49 లక్షల సాయం బాధితులకు అందించాం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే బాధిత కుటుంబాలకు సాయం అందిస్తాం..ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. బోటు ప్రమాదం దురదృష్టకరం. మత్స్యకారుల గల్లంతు ఘటనలో ప్రభుత్వం స్పందించిన తీరు దారుణం. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కేవలం రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వైఎస్ జగన్ మానవత్వంతో స్పందించారు. మత్స్యకారులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా.. పరామర్శకు ఎందుకు రాలేదంటే కంటి ఆపరేషన్ అంటూ కుంటి సాకులు చెప్తున్నారు అచ్చెన్నాయుడు. హోం మంత్రి కూడా బాధిత కుటుంబాలను పరామర్శించడానికి రాలేదు. -
కొండల్ని కొల్లగొడుతున్నారు.. సీఎం రమేష్‌పై అమర్నాథ్ ఫైర్
సాక్షి, విశాఖ: ఏపీలో కూటమి ఎంపీ సీఎం రమేష్, ఆయన అనుచరులు పంచదార్ల కొండలను దోచుకుంటున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఇలా అక్రమ సంపాదనతో ప్రత్యేక విమానాలు, ఎన్నికల్లో సీట్లు కొంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా మంగళవారం ఛలో పంచదారల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి. అక్రమ సీఎం సంపాదనతో సీఎం రమేష్ విమానాలు, ఎన్నికల్లో సీట్లు కొంటున్నారు. ఒక వైపు పంచదార్ల కొండలను.. మరోవైపు సింహాచలం కొండలను ధ్వంసం చేస్తున్నారు. అక్రమ మైనింగ్ ద్వారా పురాతన ఆలయానికి నష్టం జరుగుతుందని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.కొండపై ఇచ్చిన అనుమతులకు మించి తవ్వకాలు జరిపారు. సీఎం రమేష్, ఆయన అనుచరులు కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. అక్రమ మైనింగ్ వల్ల పంచదార్లలో ఒక దారలో బురద వస్తుంది. వందల ఏళ్ళ నుంచి పంచదార్ల ఉమ ధర్మ లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రవహిస్తున్నాయి.మైనింగ్‌కు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
విశాఖలో 2..చీరాలలో 2
సాక్షి, అమరావతి: బీచ్ బార్ల ఏర్పాటు కార్యాచరణను చంద్రబాబు ప్రభుత్వం వేగవంతం చేసింది. విశాఖ, చీరాల బీచ్‌లలో బీచ్ బార్లను పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో బీచ్ బార్లను ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించింది. బీచ్ బార్ల ఏర్పాటుకు విధి విధానాలను ఖరారు చేస్తూ శనివారం ఉత్తర్వులిచ్చింది. ఇక రెండో దశ కార్యాచరణ దిశగా బీచ్‌బార్ల సంఖ్యను సూత్రప్రాయంగా నిర్ణయించింది. విశాఖ, చీరాలలో పైలట్ ప్రాజెక్టు కింద రెండేసి బీచ్ బార్లను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. విశాఖలోని ఆర్కే బీచ్ సమీపంలో ఒకటి, తొట్లకొండ–రుషికొండ మధ్యలో మరొకటి ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించింది. చీరాలలో కూడా బీచ్ బార్లకు అనువైన రెండు ప్రదేశాలను గుర్తించింది. ఈ మేరకు త్వరలోనే విడుదల చేయనున్న నూతన మద్యం విధానంలో దీనిని అధికారికంగా ప్రకటించనుంది. అనంతరం ఈ బీచ్ బార్ల లైసెన్స్ కేటాయించేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఈపైలట్ ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం 2027 జనవరి నాటికే రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు ఉన్న తీరంలో బీచ్ బార్ల ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. -
ఏపీకి చల్లని కబురు.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. ఏపీలో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో వడగాల్పులు ఉండే ఛాన్స్ ఉందని పేర్కొంది. తీరం వెంబడి గాలులు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.కాగా, జులైలోనూ ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఒడిశా సమీపంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ముఖ్యంగా సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో అక్కడక్కడ చినుకులు పడే అవకాశం ఉండగా.. ఇటు రాజధాని హైదరాబాద్‌లోనూ వర్షం కురిసే అవకాశముదని వాతావరణ శాఖ తెలిపింది.అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వాతావరణం మేఘావృతంగా మారే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశాలున్నాయి. -
బాధిత మత్స్యకార కుటుంబాలకు వైఎస్ జగన్ ఆర్థిక సాయం
విశాఖపట్నం: మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్థిక సాయం ప్రకటించారు. వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు దీని గురించి వివరాలు తెలిపారు.ఒక్కో బాధిత కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున అందిస్తామని కేకే రాజు చెప్పారు. ఈ డబ్బును వైఎస్సార్సీపీ తరఫున అందిస్తామని అన్నారు. ప్రాణాలతో బయటపడ్డ చిన్నా కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని వివరించారు. చిన్నా కుటుంబానికి రూ.7 లక్షల సాయం చేస్తామని చెప్పారు. కాగా, ఇటీవల విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం(జూలై 14వ తేదీ) పరామర్శించారు. అదే ప్రమాదంలో మృత్యువుతో పోరాడి ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా వైఎస్ జగన్ పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇవి కూడా చదవండి: చంద్రబాబు సర్కార్‌కు మానవత్వం ఉందా?: వైఎస్ జగన్విశాఖ పర్యటనలో జగన్‌కు జై కొట్టిన జనం -
చంద్రబాబు సర్కార్‌కు మానవత్వం ఉందా?: వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం: బోటు ప్రమాదం జరిగిన వెంటనే చంద్రబాబు సర్కార్ ఎందుకు స్పందించలేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. విశాఖలోని జబ్బర్తోటలో మత్స్యకార కుటుంబాలను ఆయన ఇవాళ(మంగళవారం) పరామర్శించారు. బోటు ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్‌కు తమ కష్టాన్ని మత్స్యకారులు చెప్పుకున్నారు.. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ నెల 1న ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. కేవలం పది మైళ్ల దూరంలోనే ఘటన జరిగింది. జులైన 4న చిన్నా ఫోన్‌చేసి ఇంటికొస్తున్నామని చెప్పాడు. దురదృష్ణవశాత్తు పోన్ చేసిన కాసేపటికే బోటు ప్రమాదం జరిగింది. ఫిషరీస్ అధికారులు కూడా స్పందించలేదని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బోటు ప్రమాదం జరిగిందని అధికారులకు మెసేజ్ చేశారు. రాత్రి 10:30కి కలెక్టర్, మెరైన్ సీఐకి మెసేజ్ పెట్టారు. వెంటనే స్పందిస్తే గంటల్లోనే మత్స్యకారులు దొరికేవారు. వెంటనే కోస్ట్‌గార్డ్ వచ్చి ఉంటే ఐదుగురైనా బతికేవారు. ఈనెల 5న చైనా బోటు సిబ్బంది చిన్నాను కాపాడారు. తప్పుడు జరిగింది కాబట్టే త్రీమెన్ కమిటీ వేశారు. త్రీమెన్ కమిటీ నివేదిక అంతా తప్పుల తడక. చంద్రబాబు ప్రభుత్వానికి మానవత్వం ఉందా?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.ఘటన జరిగిన వెంటనే ఒక్క అధికారి రాలేదు. ఉత్తరాంధ్ర మంత్రులు ఒక్కరు కూడా రాలేదు. బాధితులను ఫిషరీష్ మంత్రి కూడా పరామర్శించలేదు. బాధితుల వద్దకు మంత్రులను పంపాలని సీఎంకు తెలియదా?. రాత్రికి రాత్రే స్పందిస్తే మత్స్యకారులు బతికేవారు. ఎక్స్ గ్రేషియా కింద అరకొర సాయం చేశారు. బాధితులకు రూ.కోటి చొప్పన ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ఏడుగురు మత్స్యకారులకు కుటుంబాలకు పరిహారం అందాలి.మన ప్రభుత్వం వచ్చాక నెలలోపే ఆదుకుంటాం. గతంలో మా ప్రభుత్వంలో మత్స్యకారులకు భరోసా ఉండేది. 2018 పాదయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన మాట నెరవేర్చాం. పాక్‌లో చిక్కుకున్న మత్స్యకారులను సేఫ్‌గా తీసుకొచ్చాం’’ అని వైఎస్ జగన్ గుర్తు చేశారు.వైఎస్సార్సీపీ హయాంలో మత్స్యకారుల కోసం 10 ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టాం. మరో 6 ఫిష్ ల్యాండ్పనులు కూడా చేపట్టాం. ఈ రోజు ఫిషింగ్ హార్బర్లను స్కామ్‌లతో అమ్మేస్తున్నారు. ఏపీలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. ప్రభుత్వ స్కూల్ పిల్లలకు బుక్స్, యూనిఫాంలు లేవు. రాష్ట్రంలో రైతు రోడ్డెక్కే పరిస్థితి ఉంది. ప్రజలతో బాబు చెలగాటమాడుతున్నారు’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇవి కూడా చదవండి: బాధిత మత్స్యకార కుటుంబాలకు వైఎస్ జగన్ ఆర్థిక సాయంవిశాఖ పర్యటనలో జగన్‌కు జై కొట్టిన జనం -
విశాఖలో వైఎస్ జగన్.. పోలీసుల వింత ఆంక్షలు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖ పర్యటనలో ఉన్నారు. వైఎస్ జగన్ విశాఖ వస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్టు వద్దకు తరలివచ్చారు. దీంతో, విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు వింత ఆంక్షలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. పోలీసుల తీరుపై పార్టీ శ్రేణులు, నెటిజన్లు మండిపడుతున్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖ వస్తున్న సందర్బంగా ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు వింత ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్‌కు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వస్తున్న పార్టీ నేతలు, కార్యకర్తల్ని అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి.. వింత కారణాలు చెబుతూ వాహనాల్ని అనుమతించలేదు. వాహనాలు నిలిపివేశారు. అయితే, పార్టీ అధినేత వస్తుంటే.. నాయకులు, కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకోవడమేంటని నేతలు, అభిమానులు కూటమి ప్రభుత్వం, పోలీసులను ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైయస్ జగన్ గారు వస్తుండటంతో.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు వింత ఆంక్షలు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వస్తున్న వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల్ని అడ్డుకుంటున్న పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి.. వింత కారణాలు చెబుతూ వాహనాల్ని అనుమతించని పోలీసులు పార్టీ… pic.twitter.com/vteu5SYArz— YSR Congress Party (@YSRCParty) July 14, 2026 -
విశాఖ పర్యటనలో జగన్‌కు జై కొట్టిన జనం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ పర్యటన సందర్భంగా నగరంలో సందడి నెలకొంది. ఆయన రాకతో విశాఖ వీధుల్లో భారీగా జనసందోహం కనిపించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు విశాఖకు వచ్చిన వైఎస్ జగన్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మార్గమధ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆయనను కలిసేందుకు ప్రయత్నించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన జగన్.. పలువురి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడిన ఆయన.. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.కాన్వాయ్ దిగి ప్రజలతో మమేకంపర్యటనలో భాగంగా జగన్ పలుచోట్ల కాన్వాయ్ దిగి ప్రజలతో నేరుగా మాట్లాడారు. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యుల నుంచి సమస్యలను విన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. -
మానవత్వం ఉందా.. కోటి పరిహారం ఇవ్వాల్సిందే: వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటనకు సంబంధించి.. -
కప్పరాడ భూదందాపై చర్యలు తీసుకోవాలి
ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం: విశాఖ ఉత్తర నియోజకవర్గం, 49వ వార్డు మురళీనగర్, కప్పరాడ సర్వే నంబర్ 13లోని ప్రభుత్వ భూమిలో జరుగుతున్న ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు డిమాండ్ చేశారు. నిరుపేద బర్మా కాందిశీకుల పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిíÙక్త్ కిశోర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి కనిపించకపోగా, ఉత్తరాంధ్రలో విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణలు, కార్పొరేట్లు, రియల్ ఎస్టేట్ వర్గాలకు విలువైన భూములను కట్టబెట్టే పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న బర్మా కాందిశీకులుబర్మా కాందిశీకుల స్థలాల ఆక్రమణలు బర్మా కాందిశీకుల భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వం గతంలో కేటాయించిన సుమారు 3 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించి అక్రమ నిర్మాణా లు చేపడుతున్నారని ఆరోపించారు. ఆ స్థలాలను రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు విక్రయిస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పలుమార్లు రెవెన్యూ, పోలీ స్ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఫిర్యాదు చేసిన వారిపైనే బెదిరింపులు, ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అక్రమ నిర్మాణాలు తొలగించాలి సర్వే నెం.13లోని అన్ని అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి, ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఆ భూమిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అక్కడ నివసిస్తున్న నిజమైన బర్మా కాందిశీకుల అభిప్రాయాన్ని గ్రామసభ ద్వారా తెలుసుకుని, చట్టబద్ధంగా అర్హులైన వారికి మాత్రమే కేటాయించాలని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో 49వ వార్డు మాజీ కార్పొరేటర్ అల్లు శంకరరావు, నిరుపేద కాందిశీకుల పోరాట ఐక్యవేదిక ప్రతినిధులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. -
కన్నీళ్లు తుడిచేందుకు..
సాక్షి, విశాఖపట్నం: సముద్రం జీవనాధారం.. అదే సముద్రం ఆరుగురు మత్స్యకార కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ప్రమాదం జరిగిన తొలి గంటల్లోనే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న బాధ ఇప్పటికీ తీరప్రాంతంలో వినిపిస్తోంది. సహాయక చర్యల్లో జాప్యం, అధికారుల పరస్పర విరుద్ధ ప్రకటనలు, బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నాలు.. ఇవన్నీ బాధిత కుటుంబాల ఆవేదనను మరింత పెంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలకు అండగా నిలిచేందుకు, వారి బాధను పంచుకునేందుకు, ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించేందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖకు రానున్నారు.జబ్బర్‌తోటకు చెందిన గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డ బోటు డ్రైవర్ కారె చిన్నాను వై.ఎస్.జగన్ ఫోన్లో పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగింది? సముద్రంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తోటి మత్స్యకారులను కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఎలా ఒడ్డుకు చేరుకున్నారు? అనే వివరాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అవసరమైతే తాను స్వయంగా విశాఖకు వస్తానని అప్పుడే భరోసా ఇవ్వగా.. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటూ బాధిత కుటుంబాలను ప్రత్యక్షంగా పరామర్శించేందుకు వస్తున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి జబ్బర్‌తోటకు..వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం 10.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సిరిపురం, జగదాంబ జంక్షన్, టర్నర్ చౌల్ట్రీ, పూర్ణామార్కెట్, ఏవీఎన్ కాలేజీ మార్గం మీదుగా రెల్లివీధి అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడి నుంచి జబ్బరతోట వెళ్లనున్నారు. గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబ సభ్యులను కలుసుకుని వారికి ధైర్యం చెప్పడంతో పాటు వారి సమస్యలను తెలుసుకోనున్నారు.అరకొర సాయం.. ఆదుకుంటుందా..?ఆరుగురు కుటుంబ పెద్దలను కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినా, అది వారి జీవితాలకు ఏమాత్రం సరిపోదని మత్స్యకార సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రమాదానికి బాధ్యులెవరో తేల్చడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సముద్ర భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ బాధ్యత అని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశాలను జగన్ తన పర్యటనలో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ప్రకృతి వైపరీత్యానికి మించి.. ప్రభుత్వ నిర్లక్ష్యంఈ ప్రమాదం కేవలం ప్రకృతి వైపరీత్యం కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టాన్ని మరింత పెంచిందన్న భావన మత్స్యకారుల్లో బలంగా వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన రోజే సమాచారం అందిందని ఒక అధికారి చెబుతుండగా..మరుసటి రోజు ఉదయం వరకూ తమకు తెలియలేదని మరో అధికారి చెప్పడం.. అదే సమయంలో ప్రమాదం జరిగిన రాత్రే హెలికాప్టర్లు వెళ్లాయని ఇంకో ప్రకటన రావడం ప్రభుత్వ సమన్వయ లోపాన్ని బట్టబయలు చేసింది. డీఐజీ గోపీనాథ్ జెట్టి 4వ తేదీ రాత్రి 11.30 గంటలకే సమాచారం అందిందని వెల్లడించగా, మత్స్యశాఖ కమిషనర్ మాత్రం 5వ తేదీ ఉదయం 8.30 గంటలకు తెలిసిందని చెప్పారు. మరోవైపు ఆర్డీవో దిలీప్ చక్రవర్తి మాత్రం ప్రమాదం జరిగిన రాత్రే హెలికాప్టర్ పంపినట్టు ప్రకటించారు. చివరకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ నివేదికలో మాత్రం బాధిత కుటుంబాలు 5వ తేదీ ఉదయం 5 గంటలకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొనడం మరిన్ని సందేహాలకు తావిచ్చింది. విలువైన గంటలు వృథా కావడం వల్లే గల్లంతైన వారిని కాపాడే అవకాశాలు కోల్పోయామని మత్స్యకార కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది.గల్లంతైన ఘటనపై మత్స్యకారుల కుటుంబాలకు జూలై 5వ తేదీ ఉదయం 5 గంటలకు సమాచారం అందినట్లు పేర్కొన్న త్రిసభ్య కమిటీ నివేదికప్రమాదం జరిగిన జూలై 4వ తేదీ రాత్రి 10.30 గంటలకే మత్స్యకార సంఘ నేత వాసుపల్లి జానకీరామ్ వాట్సాప్ ద్వారా జిల్లా కలెక్టర్‌కు సమాచారం.. ‘వెంటనే పరిశీలిస్తాం’ అంటూ కలెక్టర్ స్పందననాడు మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీటముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వై.ఎస్ జగన్ మత్స్యకార సంక్షేమాన్ని ప్రత్యేకంగా ప్రాధాన్యమిచ్చారు. వేట నిషేధ కాలంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి ఏటా రూ.10 వేల భరోసా అందించారు. డీజిల్‌పై అదనపు సబ్సిడీని నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి దాదాపు రూ.3,800 కోట్లతో భారీ ప్రణాళికలు రూపొందించారు. ఆక్వా హబ్‌లు, రిటైల్ చేపల విక్రయ కేంద్రాల ద్వారా అదనపు ఆదాయ అవకాశాలు కలి్పంచారు.గతంలో అండగా నిలిచిన జగన్ ప్రభుత్వంవిశాఖ ఫిషింగ్ హార్బర్లో అగి్నప్రమాదంలో బోట్లు దగ్ధమైనప్పుడు కూడా జగన్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. పూర్తిగా ధ్వంసమైన 49 బోట్లకు రూ.7.11 కోట్ల నష్టపరిహారం అందించడమే కాకుండా బోట్లపై ఆధారపడిన 400 మంది కారి్మకులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున తక్షణ సాయం అందించింది. హార్బర్ ఆధునికీకరణకు రూ.150 కోట్లు కేటాయించి మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.ఏర్పాట్లను పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలువైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన నేపథ్యంలో సోమవారం వైఎస్సార్సీపీ నేతలు ఏర్పాట్లను పరిశీలించారు.పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేశ్‌కుమార్, మొల్లి అప్పారావు, పార్టీ సమన్వయకర్తలు జబ్బర్తోటలో బాధిత కుటుంబాల నివాస ప్రాంతాలను సందర్శించారు. వైఎస్ జగన్ బాధిత కుటుంబాలను కలిసేందుకు అవసరమైన ఏర్పాట్లతో పాటు, విమానాశ్రయం నుంచి జబ్బర్‌తోట వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రూట్‌మ్యాప్‌ను పరిశీలించారు.ఓదార్పునిచ్చే ఆత్మబంధువు రాక కోసం..ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఓదార్పు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రశ్నలు, మత్స్యకారుల సమస్యలపై మరోసారి గళమెత్తడం..ఈ మూడు ప్రధాన అంశాల చుట్టూనే వై.ఎస్ జగన్ విశాఖ పర్యటన సాగనుంది. ఒకవైపు బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూనే, మరోవైపు మత్స్యకారుల హక్కులు, భద్రత, సంక్షేమంపై ప్రభుత్వాన్ని నిలదీయనుండడంతో ఈ పర్యటనపై తీరప్రాంత ప్రజల్లో ఆసక్తి నెలకొంది. తమ కష్టసుఖాల్లో అండగా నిలిచిన నాయకుడు మరోసారి తమ మధ్యకు వస్తుండడంతో విశాఖ తీరప్రాంతం ఆయన రాక కోసం ఎదురుచూస్తోంది. గతంలోనూ ఇదే తీరు..! మత్స్యకారుల సంక్షేమంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జాలర్లు ఆరోపిస్తున్నారు. 2024లో మత్స్యకార భరోసా పథకం అమలు చేయకపోవడంతో పాటు, తర్వాత విడుదల చేసిన సాయాన్ని కూడా సగానికి తగ్గించిందని చెబుతున్నారు. ఇంకా అనేక మంది అర్హులకు భరోసా అందలేదని పేర్కొంటున్నారు. అలాగే, 2025 అక్టోబరులో బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారుల విడుదల విషయంలోనూ ప్రభుత్వం చొరవ చూపలేదని, మత్స్యకార సంఘం నాయకుడు వాసుపల్లి జానకీరాం చేసిన ప్రయత్నాలతోనే వారు విడుదలయ్యారని, చివరి దశలో మాత్రం ప్రభుత్వం ప్రచారం చేసుకుందని విమర్శిస్తున్నారు.ఇన్చార్జినే దిక్కు..!విశాఖ జిల్లా రాష్ట్రంలోనే అతిపెద్ద మత్స్యకార కేంద్రం. వేలాది కుటుంబాల జీవనాధారమైన ఈ జిల్లాలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పోస్టు ఇప్పటికీ రెగ్యులర్‌గా భర్తీ కాలేదు. అనకాపల్లి జేడీ ఎల్బీఎస్ వర్ధన్‌కు ఈ నెల 4న అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో జేడీగా ఉన్న లక్ష్మణ్‌రావును ఎటువంటి కారణం లేకుండానే నెల్లూరుకు బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. స్థానిక పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన లేని ఇన్చార్జి అధికారితోనే శాఖను నడపడం వల్ల బోటు ప్రమాదం అనంతరం సహాయక చర్యల్లో ఆశించిన సమన్వయం కనిపించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి ప్రోటోకాల్ ఖర్చుల పేరుతో ఒత్తిళ్లు ఉండటంతోనే పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించేందుకు అధికారులు ముందుకు రావడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సకాలంలో రెగ్యులర్ జేడీని నియమించకపోవడం పరిపాలనా వైఫల్యమేనని మత్స్యకార సంఘాలు విమర్శిస్తున్నాయి. -
కబ్జాదారులకు ఎమ్మెల్యే అండ?.. జనసేనలో రచ్చ రచ్చ!
డాబాగార్డెన్స్: విశాఖ జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యేపై మాజీ కార్పొరేటర్ సంచలన ఆరోపణలు చేయడం జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోంది. కబ్జాదారులకు మద్దతుగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్.. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణకు సిఫార్సు లేఖ రాశారని ఆ పార్టీ నేత పీతల మూర్తి యాదవ్ బాంబ్ పేల్చారు. నగరంలో సుమారు రూ.150 కోట్ల విలువైన ప్రభుత్వ, జీవీఎంసీ ఆస్తులను కబ్జాదారులకు కట్టబెట్టేందుకు కొందరు అధికారులు తప్పుడు నివేదికలతో ఫైళ్లు కదుపుతుంటే, వారికి మద్దతుగా ఎమ్మెల్యే లేఖలు రాసినట్లు బయటపెట్టడం సంచలనం సృష్టిస్తోంది. సోమవారం జీవీఎంసీలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో మూర్తియాదవ్ ఈ వ్యవహారంపై అధికారులకు వినతిపత్రం అందించి, సొంత పార్టీ ఎమ్మెల్యే తీరును ఎండగట్టడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ స్థలాలపై కబ్జాదారుల కన్ను విశాఖలో కొందరు అవినీతి అధికారుల స్వార్థం వల్ల విలువైన ప్రభుత్వ స్థలాలు ప్రైవేటుపరం అయిపోతున్నాయని మూర్తి యాదవ్ ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆస్తులుగా ఉన్న స్థలాలను కాజేసేందుకు ప్రయతి్నస్తున్న ప్రైవేటు వ్యక్తులకు స్వయంగా కూటమి ప్రజాప్రతినిధి వత్తాసు పలుకుతూ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం దురదృష్టకరమన్నారు. అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డులో దశాబ్దాలుగా జీవీఎంసీ వినియోగంలో ఉన్న సర్వే నెంబరు 6/2 లోని ఎకరా 25 సెంట్ల విలువైన స్థలంపై ప్రైవేటు వ్యక్తుల కన్ను పడిందని, వేలాది మందికి నీరందించే ఓవర్ హెడ్ ట్యాంకులు, కార్యాలయం, సులభ్ కాంప్లెక్స్ ఉన్న ఈ భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర నియోజకవర్గ పరిధిలోని ఈ స్థలం తన సన్నిహితురాలైన ఎన్.వల్లికి చెందినదని, ఆమెకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ నెల 9న మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణకు లేఖ రాయడంపై మూర్తియాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పులను కాదని సిఫార్సులు ఇదే తరహాలో విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఈస్ట్ పాయింట్ కాలనీలో కోర్టు కేసుల్లో గెలిచి జీవీఎంసీ దక్కించుకున్న వాల్తేర్ వార్డు టౌన్ సర్వే నెంబరు 124, 125/2 లోని 3,660 చదరపు గజాల పార్కు స్థలాన్ని సైతం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఎమ్మెల్యే ప్రయతి్నస్తున్నారని మూర్తి యాదవ్ ఆరోపించారు. అక్కడ లెండి వనం, బాబా చావిడి పార్కులు ఉన్నాయని, గతంలో ఈ స్థలం జీవీఎంసీదేనని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ, సదరు స్థలం తనకు తెలిసిన విజయలక్ష్మికి చెందినదంటూ ఎమ్మెల్యే వంశీకృష్ణ మంత్రికి మరో లేఖ రాయడం గమనార్హమన్నారు. ఆ కుటుంబం అమెరికా, జైపూర్‌లో సెటిల్ అయిందని, మానవతా దృక్పథంతో ఆ స్థలాన్ని వారికి అప్పగించడమో లేదా నష్టపరిహారం ఇవ్వడమో చేయాలని ఎమ్మెల్యే కోరడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవాలి ప్రభుత్వ ఆస్తులను, ముఖ్యంగా ఉద్యానవనాలను కాపాడాలని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదే పదే పిలుపునిస్తున్నప్పటికీ, సొంత పార్టీ ఎమ్మెల్యే దానికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటే స్థానిక ఎమ్మెల్యేలు మౌనంగా ఉండటాన్ని కూడా మూర్తి యాదవ్ తప్పుబట్టారు. ఈ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తక్షణమే జోక్యం చేసుకుని, ఎమ్మెల్యేల వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు అడ్డుకట్ట వేసి, రూ.150 కోట్ల విలువైన జీవీఎంసీ స్థలాలను, పార్కులను కబ్జాదారుల బారి నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడిపైనే మాజీ కార్పొరేటర్ ఈ స్థాయిలో బహిరంగంగా తిరుగుబావుటా ఎగరేయడం.. జన సేన పారీ్టలో రేగుతున్న అంతర్గత ముఠా తగాదాలను తేటతెల్లం చేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే సొంత పార్టీ నేతల మధ్యే రూ.150 కోట్ల భూవివాదంపై ఇంతటి తీవ్రస్థాయిలో రచ్చకెక్కడం జిల్లా జనసేన శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. -
'జగనన్న వస్తానన్నారు.. ధైర్యం వచ్చింది'
సాక్షి, విశాఖపట్నం: బోటు ప్రమాదం బాధితులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బోటు డ్రైవర్ చిన్నా.. సాక్షి టీవీతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. జగన్ ఓదార్పు ఎంతో ధైర్యం ఇచ్చిందని అంటున్నారు. బోటు పూర్తిగా దగ్ధమవడంతో జీవనాధారం కోల్పోయా. ఈ ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. ఈ కష్ట సమయంలో జగనన్న నాతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. "నీకు అండగా ఉంటాను.. సాయం చేస్తాను" అని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. ఆయన మాటలతో ఎంతో ధైర్యం వచ్చింది. రేపు ఆయన విశాఖకు వస్తున్నారని తెలిసి సంతోషంగా ఉంది అని చిన్నా అన్నారు. అలాగే..గతంలో కూడా బోటు ప్రమాదాలు జరిగినప్పుడు జగన్ ప్రభుత్వం బాధితులను ఆదుకుందని చిన్నా గుర్తుచేశారు. అప్పట్లో దెబ్బతిన్న బోట్లకు సుమారు 80 శాతం వరకు ఆర్థిక సాయం అందించారని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నామని చెప్పారు.వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు, పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ వర్గాలు చెబుతున్నాయి. -
INS మహేంద్రగిరిని జాతికి అంకితం చేసిన రాజ్ నాథ్ సింగ్..
-
ఏఐతోనే భవిష్యత్ యుద్ధాలు: రాజ్‌నాథ్ సింగ్
విశాఖపట్నం: సముద్ర రక్షణలో విశాఖపట్నం ఒక బలమైన శక్తిగా నిలిచిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. INS మహేంద్రగిరి యుద్ధనౌకను శనివారం ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇండియా నేవీలో మహేంద్ర గిరి ఒక బలమైన శక్తిగా చేరిందని తెలిపారు. భవిష్యత్ యుద్ధాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపుదిద్దుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కానీ విజయం మాత్రం జాతీయ సంకల్పం, శిక్షణ పొందిన సిబ్బంది, బలమైన సైనిక సామర్థ్యాలపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.ఆయన ఇంకా ఏమన్నారంటే..ఫిఫ్త్ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ టెక్నాలజీతో అండర్ వాటర్ టార్పోడో అభివృద్ధి చేస్తున్నాంఆర్టిఫిషీయల్ ఇంటెల్ జెంట్స్, న్యూ టెక్నాలజీ , అడ్వాన్స్ షిప్ తీసుకొస్తున్నాండ్రోన్ టెక్నాలజీ తో, ఫుల్ సర్వ్ లెన్స్‌తో సరికొత్త ఆధునిక యుద్ధ శక్తితో ముందుకు వెళ్తున్నాంకొత్త పరిజ్ఞానం యుద్ధానికి మాత్రమే కాదు ఒకో సారి మరో దేశానికి సహకారంగా కూడా నిలుస్తాంయుద్ధం మా నినాదం కాదు .. శాంతి, సర్వ ప్రపంచ శాంతి మా విధానంఆపరేషన్ సింధూర్ యుద్ధం కాదుమన స్థిరత్వాన్ని బద్దలు కొడితే జరిగే పరిణామం చూపించాంఇండో_పసిపుక్ సముద్ర స్నేహం కొనసాగుతోంది.భారత్ వ్యతిరేక శక్తులకు తగిన సమాధానం ఎప్పటికప్పుడు చెప్తాంమారిటైమ్ విజన్ 2030తో ముందుకు వెళ్తున్నాంమారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ సిద్ధం చేశాంషిప్ బిల్డింగ్ లో మరిన్ని ఎంఎస్ఎంఈలకు స్టార్ట్ప్లకు మేలు చేస్తున్నాంషిప్ బిల్డింగ్, ఇన్నోవేషన్‌లో గ్లోబల్ లీడర్ కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాంవరల్డ్ క్లాస్ మెరిటైం ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాంచదవండి: 25 ఏళ్ల స్నేహం.. 25 వేల అప్పు -
విశాఖ: టెకీ రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ అరెస్టు
ముస్సోరీ: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ హిల్ స్టేషన్ హోటల్లో గత కొన్నిరోజులక్రితం తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి అనుమానస్పద స్థితిలో మరిణించిన విషయం తెలిసిందే.అయితే, ఈ హత్యకు ప్రధాన నిందితుడు తన అల్లుడు శ్రీ చరణే అని మృతిరాలి తండ్రి పలు ఆరోపణలు చేశారు. తండ్రి చేసిన ఆరోపణలతో రంగంలోకి దిగిన పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతం మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుపై భర్త శ్రీచరణ్‌ని డెహ్రాడూన్ పోలీసులు అరెస్టు చేశారు. -
నేడు ఐఎన్ఎస్ మహేంద్రగిరి జలప్రవేశం
భారత నౌకాదళంలోకి మరో అత్యాధునిక యుద్ధనౌక చేరనుంది. స్వ దేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ‘ఐఎన్ఎస్ మహేంద్రగిరి’ వార్‌షిప్ విశాఖపట్నంలో నేడు జలప్రవేశం చేయనుంది. అత్యాధునిక స్టెల్త్ ఫీచర్లు, రాడార్‌కు సులభంగా చిక్కని సాంకేతికత, గాల్లోకి, ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలు, అత్యాధునిక యాంటీ–సబ్‌మెరైన్ వార్ఫేర్ సామర్థ్యాలు ఈ యుద్ధనౌక సొంతమని నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. -
ఏపీ గవర్నర్‌కు బొత్స లేఖ..
సాక్షి, అమరావతి: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ లేఖ రాశారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ గురజాడ-విజయనగరం తొలి స్నాతకోత్సవాన్ని విశాఖపట్నంలో నిర్వహించాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని బొత్స సత్యనారాయణ తన లేఖలో కోరారు.జేఎన్టీయూ గురజాడ తొలి స్నాతకోత్సవంపై బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు బొత్స లేఖ రాశారు. ఈ లేఖలో బొత్స.. స్నాతకోత్సవానికి ఆహ్వానం అందించినందుకు గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, విజయనగరం వంటి వెనుకబడిన జిల్లాలో విద్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవాన్ని అదే జిల్లాలో నిర్వహించడం సముచితమని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో కార్యక్రమం నిర్వహించడం వల్ల విజయనగరం జిల్లా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, నిరసనలు వ్యక్తమవుతున్నాయని లేఖలో తెలిపారు.ఈ నిర్ణయం వల్ల జిల్లా ప్రజల గౌరవం, ఆనందం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగర ప్రజల అభిప్రాయాలను గౌరవించి, జేఎన్టీయూ గురజాడ తొలి స్నాతకోత్సవాన్ని విజయనగరంలోనే నిర్వహించేలా నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని గవర్నర్‌ను కోరారు. విజయనగరం ప్రజల అసంతృప్తి, నిరసనలను ఈ లేఖ ద్వారా గవర్నర్ దృష్టికి తీసుకువస్తున్నట్టు బొత్స తెలిపారు. -
మత్స్యకారుల గల్లంతు ఘటన.. బయటపడ్డ ప్రభుత్వ వైఫల్యం
సాక్షి, విశాఖపట్నం: మత్స్యకారుల గల్లంతు ఘటనలో చంద్రబాబు ప్రభుత్వ ఘోర వైఫల్యం బయటపడింది. 4వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు బోటు ప్రమాదానికి గురికాగా.. రాత్రి 7 గంటల వరకు చూసిన కుటుంబ సభ్యులు.. ఆ తరువాత అధికారులకు సమాచారం ఇచ్చారు. 4వ తేదీ రాత్రి 7 గంటల తరువాత తమకు సమాచారం వచ్చిందని ఆర్డీవో తెలిపారు. అయితే, 5వ తేదీ ఉదయం 5 గంటలకు సమాచారం వచ్చినట్టు రిపోర్టులో త్రీ మెన్ కమిటీ పేర్కొంది.తనకు 5వ తేదీ ఉదయం 10 గంటలకు సమాచారం వచ్చిందని ఫిషరీస్ కమిషనర్ తెలిపారు. తప్పుని కప్పిపుచ్చుకునే క్రమంలో ప్రభుత్వం అడ్డంగా దొరిపోయింది. ప్రభుత్వ తీరుపై మత్స్యకారులు మండిపడుతున్నారు. సమాచారం ఇచ్చిన వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించలేదని మొదటి నుంచి బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. ప్రభుత్వ తీరుపై మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు తాము గల్లంతు అయిన ప్రాంతానికి ఒక్క బోటు, హెలికాప్టర్ కూడా రాలేదని బోటు డ్రైవర్ చిన్నా తెలిపారు.బాధ్యత గల ప్రభుత్వం అంటే.. ఆఖరి ఆశ ఆరిపోయే వరకూ ప్రాణాలను కాపాడేందుకు శ్రమించాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం బాధితుల గొంతు నొక్కేస్తూ, సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. 72 గంటలకు పైగా గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం.. ఏమయ్యారో తెలియకుండానే వారు బతికి లేరని నిర్థారించేసింది. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం పేరుతో రూ.10 లక్షలు అందజేశారు.అది కూడా.. మత్స్య శాఖ నుంచి రూ.5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించడంపైనా విమర్శలొస్తున్నాయి. 2023లో హార్బర్లో బోట్లు అగ్ని ప్రమాదానికి ఆహుతైతే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్కో బోటు, వలలకు రూ.20 లక్షలకు పైగా పరిహారం అందించింది. చిన్న వల కాలిపోయినా.. దానికీ పరిహారం అందించింది. కానీ.. ఒక కుటుంబాన్ని నడిపించే వ్యక్తి కనిపించకపోతే.. గాలించడం వదిలేసి.. కేవలం రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
ఆ ఆరుగురి మత్స్యకారుల పరిస్థితి ఎలావుందంటే.. అక్కడి నుంచి వచ్చిన చిన్నా చెప్పిన విస్తుపోయే నిజాలు
-
సముద్ర సింహం.. జాతిసేవకు సిద్ధం
సాక్షి, విశాఖపట్నం: శత్రురాడార్లకు చిక్కకుండా కడలిలో దూసుకుపోతూ అగ్నిపర్వతంలా విరుచుకుపడే సముద్రపు సింహం.. ఐఎన్ఎస్ మహేంద్రగిరి (INS Mahendragiri) యుద్ధనౌక సమరశంఖం పూరించేందుకు సిద్ధమైంది. బరాక్, బ్రహ్మోస్ వంటి క్షిపణులతో సముద్ర ఉపరితలం నుంచి గగనతలంలోని శత్రువుల్ని చీల్చి చెండాడేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ వార్‌షిప్‌ని ఈ నెల 11న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విశాఖలోని నేవల్ డాక్‌యార్డులో జాతికి అంకితం చేయనున్నారు. మహేంద్రగిరి రాకతో హిందూ మహాసముద్రంలో భారత్ మరింత పట్టుసాధిస్తుందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత నౌకాదళం మరింత ఆధునికీకరణను సొంతం చేసుకుంటోంది. సముద్రజలాల్లో మన సార్వభౌమాధికారాన్ని సవాలు చేసే శత్రుదేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా సరికొత్త యుద్ధనౌకల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా అత్యాధునిక సాంకేతికత, దేశీయ నైపుణ్యాల కలబోతతో రూపుదిద్దుకున్న అద్భుతమైన స్టెల్త్ ఫ్రిగెట్ నౌకకు ఒడిశాలోని తూర్పు కనుమల్లో విస్తరించి ఉన్న పర్వత శిఖరం మహేంద్రగిరి పేరు పెట్టారు. స్వదేశీ స్వావలంబనకు సజీవ సాక్ష్యం రక్షణశాఖ శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్లకు కొనసాగింపుగా ఆత్మనిర్భర్ భారత్‌కి అద్దం పట్టేలా ప్రాజెక్టు–17ఏని చేపట్టింది. ఇందులో భాగంగా మొత్తం 7 నౌకలను నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఆ జాబితాలో చివరి నౌకే ఈ మహేంద్రగిరి. ముంబైకి చెందిన మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మించింది. ఈ నౌక నిర్మాణంలో ఉపయోగించిన పరికరాలు, వ్యవస్థల్లో 75 శాతం దేశీయ ఎంఎస్ఎంఈల నుంచే సేకరించడం విశేషం. ఐఎన్ఎస్ మహేంద్రగిరి నిర్మాణం శత్రువుల కళ్లకు గంతలుకట్టే అధునాతన సాంకేతికతతో సాగింది. శత్రుదేశాల రాడార్లు పసిగట్టలేనంత పకడ్బందీగా దీన్ని రూపొందించారు. ఆధునిక సెన్సార్లు, రాడార్ వ్యవస్థలతో పటిష్టంగా నిర్మితమైన ఈ నౌక యుద్ధాలను ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉంటుంది. హిందూ మహాసముద్రంలో చైనా వంటి దేశాల కదలికలు, వ్యూహాత్మక మార్పుల నేపథ్యంలో మహేంద్రగిరి వార్‌షిప్ భారత నౌకాదళానికి కొండంత బలాన్నిస్తోంది. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా సముద్రంలో నిరంతర నిఘా వేయగల సత్తా దీని సొంతం. సముద్రదొంగల అణిచివేత, సుదూర తీరప్రాంతాల రక్షణ, విపత్తుల వేళ సహాయక చర్యల్లో దీని పనితీరు అత్యుత్తమంగా ఉండనుంది. సముద్రజలాల్లో మన ఉనికిని బలంగా చాటుతూ, భవిష్యత్తు నౌకాదళ అవసరాలకు పూర్తిస్థాయిలో సరిపోయే మహేంద్రగిరి యుద్ధనౌక .. భారత్‌కు తిరుగులేని శక్తిగా మారనుంది. ఐఎన్ఎస్ మహేంద్రగిరి స్వరూపంపొడవు: 149 మీటర్లు వెడల్పు: 17.8 మీటర్లు డ్రాఫ్ట్ : 5.22 మీటర్లు బీమ్: 17.8 మీటర్లు వేగం: గంటకు 28 నాటికల్ మైళ్లు సామర్థ్యం: ఏకధాటిగా 5,500 నాటికల్ మైళ్లు క్షిపణులు: బరాక్–8, సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు జలాంతర్గామి విధ్వంసక శక్తి: నీటి అడుగున పొంచి ఉన్న శత్రు జలాంతర్గాములను పసిగట్టి నాశనం చేయడానికి అధునాతన టార్పెడో ట్యూబ్ లాంచర్లు, యాంటీ–సబ్‌మెరైన్ ఆయుధాలు ఎయిర్‌క్రాఫ్ట్‌లు: 2 హాల్ ధృవ్, సీకింగ్ హెలికాఫ్టర్లు. -
సెర్చ్ ఆపరేషన్ ముగింపు గడియలు.. బాధిత కుటుంబాల్లో ఆందోళన
విశాఖ: బోటు ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారుల గల్లంతుపై ఇప్పటివరకూ ఎటువంటి ఆచూకీ లభించకుండానే సెర్చ్ ఆపరేషన్ ముగిస్తామని ఫిషరీస్ కమిషనర్ ప్రకటించడంతో కూటమి ప్రభుత్వంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వారి ఆచూకీ లభించకుండానే సెర్చ్ ఆపరేషన్ ఎలా ముగిస్తారంటూ బాధిత కుటుంబాలతో పాటు హార్బర్‌లోనే పలువురు మత్య్సకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్ట సమయంలో ఇదేనా ప్రభుత్వం వ్యవహరించే తీరు అంటూ మండిపడుతున్నారు. ఈ విషయంపై ఫిషరీస్ కమిషనర్‌ను గట్టిగా నిలదీయడంతో సెర్చ్ ఆపరేషన్‌ను ఈరోజు(మంగళవారం, జూలై 7వ తేదీ) రాత్రి12 గంటల వరకూ పొడిగించారు. బాధిత కుటుంబాలు హార్బర్‌లోనే ఉండి తమ వారి జాడ ఏమైనా తెలుస్తుందేమోనని కొండంత ఆశతో ఎదురుచూస్తుండగా, ఫిషరీస్ కమిషనర్ సెర్చ్ ఆపరేషన్ ముగింపు వ్యాఖ్యలు తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. తమవారి ఆచూకీ కనిపెట్టాల్సిందేనని మత్స్యకార బాధిత కుటుంబాలు నిలదీయడంతో దాన్ని తూతూ మంత్రంగా రాత్రి 12 గంటల వరకూ పొడిగించారు. ఆ లోపు తమ వారి లభించకపోతే తర్వాత ఏం చేయాలో బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. -
బోటు ప్రమాదంపై ఫిషరీస్ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు
విశాఖ: సముద్రంలో వేటకు వెళ్లిన మత్య్సకారుల బోటు ప్రమాదానికి గురైన ఘటనపై ఫిషరీస్ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బోటు ప్రమాదం జరిగిన విషయం 5వ తేదీ ఉదయం తెలిసిందని, అప్పుడే జిల్లా కలెక్టర్, కోస్ట్ గార్డ్ వాళ్లకు లేఖలు రాశామన్నారు. సెర్చ్ ఆపరేషన్ చేయాలని వారిని కోరినట్లు తెలిపారు. విశాఖ కోస్ట్ గార్డ్ షిప్ రిపేర్‌లో ఉంటే కాకినాడ నుంచి రప్పించామన్నారు. ఇప్పటివరకూ ఏ ఒక్కరి ఆచూకీ లభ్యం కాలేదని,సెర్చ్ ఆపరేషన్ మాత్రం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోటు ప్రమాద ఘటనపై త్రీమెన్ కమిటి వేస్తామన్నారు. కమిటీ నివేదికను బట్టి ముందుకు వెళతామన్నారు. కాగా, రెండు రోజుల క్రితం సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రాకాసి అలల తాకిడికి బోటు బోల్తా పడటంతో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నుంచి కారె చిన్న అనే మత్స్యకారుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా, మిగిలిన ఆరుగురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన మిగిలిన మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలో గాలింపు చర్యలు చేపట్లారు. అయితే ఇప్పటివరకూ ఏ ఒక్కరి ఆచూకీ లభించకపోగా, సెర్చ్ ఆపరేషన్ ఈరోజు(మంగళవారం, జూలై7వ తేదీ) సాయంత్రానికల్లా ముగిస్తామని ఫిషరీస్ కమిషనర్ చెప్పడం మత్స్యకారుల కుటుంబాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. -
‘మరో గంటలో వస్తాం’.. ఆ మాటలే చివరివా?
సాక్షి, విశాఖపట్నం: కడుపు నింపిన కడలమ్మే.. ఇప్పుడు ఆ కుటుంబాల కళ్లలో కన్నీటి సముద్రాన్ని నింపుతోంది. ’మరో గంటలో వచ్చేస్తాం..’ అంటూ ఫోన్లో వినిపించిన మాటలే చివరి మాటలుగా మిగిలిపోతాయేమోనన్న భయం ఆ కుటుంబాలను క్షణక్షణం కుంగదీస్తోంది. గంటలు రోజులుగా మారుతున్నా.. సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ మాత్రం దొరకడం లేదు. ఒకవైపు నేవీ, కోస్ట్‌గార్డ్ బృందాలు సముద్రాన్ని జల్లెడ పడుతుండగా.. మరోవైపు తీరాన కుటుంబ సభ్యులు ఆశ, ఆందోళనల మధ్య ప్రతి అలను చూస్తూ తమవారి కోసం ఎదురు చూస్తున్నారు. అణువణువూ గాలిస్తున్నా.. జూలై 1వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు ప్రతికూల వాతావరణంలో చిక్కుకున్నారు. వారిలో కారె చిన్న మినహా మిగిలిన ఆరుగురు గల్లంతయ్యారు. మిగిలిన ఆరుగురి ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన మత్స్యకారుల కోసం తూర్పు నౌకాదళం, ఇండియన్ కోస్ట్‌గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు సంయుక్తంగా ముమ్మర గాలింపు చేపట్టారు.కోస్ట్‌గార్డ్‌కు చెందిన ఐసీజీఎస్ కనకలతా బారువా, ఐసీజీఎస్ వీరా నౌకలతో పాటు నేవీకి చెందిన మరో రెండు యుద్ధనౌకలు సముద్రంలో గాలిస్తున్నాయి. వీటికి తోడు ఒక డోరిమాన్ విమానం, ఒక సీకింగ్ హెలికాప్టర్, ఒక ఏఎల్‌హెచ్ హెలికాప్టర్ కూడా సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. ఇప్పటికే పలుమార్లు గగనతలం నుంచి గాలించినప్పటికీ గల్లంతైన వారి జాడ లభించలేదు. ఎల్రక్టానిక్ సర్వేలెన్స్తోనూ సముద్రాన్ని అణువణువూ గాలిస్తున్నా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. మత్స్యశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన ప్రభుత్వం, అధికార యంత్రాంగం సకాలంలో స్పందించలేదంటూ మత్స్యకార కుటుంబాలు సోమవారం మత్స్యశాఖ జేడీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించాయి. -
నేను బతికున్నానంటే నా తమ్ముడు పెట్టిన భిక్షే..
విశాఖపట్నం : ‘నేను బతికున్నానంటే అది కేవలం నా తమ్ముడు పెట్టిన భిక్ష.. నన్ను బతకమని తను మునిగిపోయాడు‘ అంటూ విశాఖ తీరంలో బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన భోగాపురం మత్స్యకారుడు కారె చిన్న మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యాడు. ప్రస్తుతం కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఆ నరకప్రాయమైన రోజు సముద్రంలో ఏం జరిగిందో వివరిస్తూ గుండె పగిలేలా రోదించాడు. ఆయన మాటల్లోనే.. 37 మైళ్ల దూరం వెళ్లాం.. ‘మేము జాలై 1వ తేదీన హార్బర్ నుంచి వేటకు బయలుదేరి సముద్రంలో సుమారు 30 నుంచి 37 మైళ్ల దూరం లోపలికి వెళ్లాం. రెండు రోజుల పాటు వేట బాగానే సాగింది. ఇక ఇంటికి తిరుగు ప్రయాణం అవుదాం అనుకుంటుండగా.. తీరానికి మరో 10 మైళ్ల దూరం ఉందనగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తుఫాను గాలులు, రాకాసి అలలు బోటును ముంచెత్తాయి. మేము తేరుకునే లోపే ఒక భారీ అల వచ్చి బోటును బోల్తా కొట్టేసింది. ఆ క్షణంలోనే నా కళ్ల ముందే మా అన్నయ్య కొడుకు (చిన్నయ్య) నీటిలో పడిపోయాడు. మా అన్నయ్య ఏడుస్తూ వెంటనే వాడిని కాపాడటానికి నీళ్లలోకి దూకాడు. అలా వాళ్లిద్దరూ మా కళ్లముందే సముద్రంలో కలిసిపోయారు.బోటు మునుగుతోంది.. రాత్రంతా ఒకే ఫోర్సు పట్టుకుని కూర్చున్నాం.. ‘అప్పటికి బోటు పైన మేం ఆరుగురం మిగిలాం. సమయం గడుస్తున్న కొద్దీ రాత్రి 9 గంటల ప్రాంతంలో బోటు నెమ్మదిగా సముద్రంలోకి మునిగిపోవడం ప్రారంభమైంది. ‘మనం విడిపోతే ఎక్కడో దగ్గర చచ్చిపోతాం.. రాత్రంతా ఆరుగురం కలిసే ఉందాం’ అని ఒకరినొకరు ధైర్యం చెప్పుకున్నాం. రాత్రంతా సముద్రం మధ్యలో ఆ మునుగుతున్న బోటుపై రెండు లైఫ్ బాయ్ ఫోర్సులను (రక్షణ వలయాలు) ఆరుగురం గట్టిగా పట్టుకుని తెల్లవార్లూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాం. కానీ, తెల్లవారేసరికి మాలో ఒక మనిషి కనిపించలేదు. చీకట్లోనే ఎప్పుడు అలల దాటికి కొట్టుకుపోయాడో తెలియదు. అప్పటికి మేం ఐదుగురం మిగిలాం.’ కదిలించిన తమ్ముడి త్యాగం! ‘ఉదయం వెలుతురు వస్తున్న సమయంలో చాలా దూరంలో ఒక చైనా వాణిజ్య నౌక (షిప్) వెళ్లడం కనిపించింది. నేను మా తమ్ముడితో అన్నాను.. ‘తమ్ముడూ.. అక్కడ షిప్ కనిపిస్తోంది.. ఎలాగోలా ఈదుకుంటూ అక్కడికి వెళ్దాం పదా’ అని పిలిచాను. కానీ నా తమ్ముడు నీరసంగా నా వంక చూసి.. ‘నా ప్రాణం ఇక్కడితో అయిపోయింది, ఇక నా వల్ల ఈదడం సాధ్యం కాదు. నేను రాను. నువ్వు నలుగురు పిల్లలున్న వాడివి.. నా మాట విని నువ్వు వెళ్లు.. ఎలాగోలా బతుకు!’ అని నన్ను బలవంతంగా ముందుకు నెట్టాడు. నా తమ్ముడు నన్ను వెళ్లమన్న ఆ మాట నా గుండెను కోసేసింది. వాడు చెప్పినట్లే మేం నలుగురం ఆ షిప్ వైపు ఈదడం ప్రారంభించాం. మేం ఈదుకుంటూ వెళ్తుంటే.. వెనక నుంచి నా తమ్ముడు ’నేను వచ్చేస్తాను.. మీరు వెళ్లండి’ అని ధైర్యం చెప్తూనే ఉన్నాడు. కానీ కొద్దిసేపటికే వాడు కూడా అలల తాకిడికి సముద్రంలో కలిసిపోయాడు.’15 కిలోమీటర్ల ఈత.. చైనా షిప్ లంగర్ పట్టుకుని మృత్యుంజయుడిగా.. ‘నాతో పాటు బయలుదేరిన మిగిలిన ముగ్గురు కూడా మధ్యలోనే అలల వేగానికి కొట్టుకుపోయారు. చివరకు నేను ఒక్కడినే మిగిలాను. దాదాపు 15 కిలోమీటర్ల దూరం మృత్యువుతో పోరాడుతూ ఈదాను. ఎలాగోలా ఆ చైనా షిప్ దగ్గరకు చేరుకుని, దాని ‘లంగర్’ (యాంకర్) గొలుసును గట్టిగా పట్టుకున్నాను. ఆ సమయంలో పెద్ద అల వచ్చి నన్ను కిందకు పడేసింది. చచ్చిపోతాననే భయంతో ’బాబోయ్ కాపాడండి.. కాపాడండి..’ అని గట్టిగా కేకలు వేశాను. నా కేకలు విని షిప్ పైనున్న చైనా సిబ్బంది కిందికి చూశారు. వెంటనే వారు ఒక లైఫ్ జాకెట్, తాడు కిందికి విసిరారు. దాన్ని నడుముకు కట్టుకోగానే నన్ను పైకి లాగారు. నన్ను పైకి తీసుకెళ్లాక దాదాపు రెండు వాటర్ బాటిళ్లు తాగాను. ఆ తర్వాత వాళ్లు నాకు బట్టలు ఇచ్చి, భోజనం పెట్టి ఆదరించారు. నౌకాదళ హెలికాప్టర్ వచ్చేంత వరకు నేను ఆ చైనా షిప్‌లోనే ఉన్నాను’ అని చిన్న కన్నీరు మున్నీరవుతూ ముగించాడు. మిగిలిన వారి కోసం ఉత్కంఠగా గాలింపు తమ కళ్లముందే కుటుంబ సభ్యులు, తోటి మత్స్యకారులు ఒక్కొక్కరుగా సముద్రంలో కలిసిపోతుంటే ఏమీ చేయలేకపోయానన్న చిన్న ఆవేదన అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది. ప్రస్తుతం చిన్న ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ, మానసిక ఆందోళనలో ఉన్నాడు. కాగా, ప్రమాదంలో కొట్టుకుపోయిన మిగిలిన ఆరుగురి కోసం నౌకాదళ హెలికాప్టర్లు, కోస్ట్ గార్డ్ బోట్లు సముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్నాయి. -
తెల్లారితే భార్య సీమంతం.. అంతలోనే
విశాఖపట్నం: మరుసటి రోజు భార్య సీమంతం. ఇంటిల్లిపాదీ ఆనందంగా బంధువులను ఆహ్వానిస్తూ శుభకార్యానికి ఏర్పాట్లు చేస్తోంది. కానీ ఆ ఆనందం ఒక్క క్షణంలోనే విషాదంగా మారింది. పాత పరిచయస్తులను ఆహ్వానించేందుకు వెళ్లిన యువకుడు, స్నేహితులతో జరిగిన చిన్నపాటి వాగ్వాదంలో ప్రాణాలు కోల్పోయాడు. తాటిచెట్లపాలెం సంజీవయ్యకాలనీలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊర్వశి కూడలికి చెందిన బోరా మణికంఠ (26) కుటుంబం గతంలో సంజీవయ్యకాలనీలో నివసించేది. ప్రస్తుతం వేరే ప్రాంతంలో ఉంటున్నప్పటికీ, మణికంఠ భార్యకు శుక్రవారం సీమంతం జరగనున్న నేపథ్యంలో అతని తల్లి పాత పరిచయస్తులను ఆహ్వానించేందుకు సంజీవయ్యకాలనీకి వెళ్లింది. అనంతరం మణికంఠను కూడా అక్కడికి రమ్మని ఫోన్ చేయడంతో అతడు అక్కడికి చేరుకున్నాడు. అక్కడ స్నేహితులతో మాట్లాడుతుండగా ఏదో విషయంపై మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. పాత కక్షల నేపథ్యంలో ఆవేశానికి లోనైన సురేంద్ర అలియాస్ కన్నా మణికంఠపై పిడిగుద్దులతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మణికంఠ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న కంచరపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ కోరాడ రామారావు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం, ఆర్ఎఫ్ఎస్ఎల్ బృందాలు ఆధారాలు సేకరించాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు ‘తెల్లారితే ఇంట్లో పెద్ద పండగ.. అందరికీ బొట్టు పెట్టి పిలిచాం.. ఇంతలోనే నా కొడుకు శవమైపోతాడని అనుకోలేదు’ అంటూ మణికంఠ తల్లి, బంధువులు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. గర్భవతి అయిన భార్య తన భర్త ఇక లేడనే నిజాన్ని నమ్మలేక స్పృహతప్పి పడిపోయింది. -
సింహాచలం కొండపై అపచారం
సాక్షి, విశాఖపట్నం: సింహచలం కొండపై అపచారం జరిగింది. కొండపై టీడీపీ మహిళా నేత కేక్ కట్ చేసింది. సౌజన్య కుమారి కేక్ కట్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అత్యంత పవిత్రమైన క్షేత్రంలో ఆలయ, ఆగమ సంప్రదాయాలు పాటించకుండా కేక్ కటింగ్ చేయడంపై ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
నా వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: తాను మహిళలపై ఎలాంటి అభ్యంతకర వ్యాఖ్యలు చేయలేదని.. తనను రెచ్చగొట్టిన వ్యక్తిపై మాత్రమే విమర్శలు చేశానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉద్ఘాటించారు. తన వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌కు వివరణ ఇచ్చేందుకు మంగళవారం ఉదయం విశాఖపట్నం నుంచి విజయవాడకు బయలుదేరిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఏ పరిస్థితుల్లో తాను ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో మహిళా కమిషన్‌కు పూర్తిగా వివరిస్తానని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసిన ఆయన.. యావత్ మహిళా లోకాన్ని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వ్యక్తినే విమర్శించానని చెప్పారు."ప్రతి మనిషికి ఒక సహనం ఉంటుంది. ఆ సహనం కోల్పోయేలా ఎదుటి వ్యక్తులు మాట్లాడకూడదు. నా వ్యాఖ్యలను మహిళలకు ఆపాదిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో వారే నవ్వులపాలయ్యారు" అని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో మహిళల భద్రతపై కూడా అమర్నాథ్ ప్రశ్నలు సంధించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని, అలాంటి ఘటనలపై మహిళా కమిషన్ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. సాయి కృష్ణ తల్లి వ్యక్తం చేసిన ఆవేదన మహిళా కమిషన్‌కు కనిపించలేదా? అని ప్రశ్నించిన ఆయన.. నడిరోడ్డుపై ఓ మహిళపై జనసేన నేతలు దాడి చేసిన ఘటనపై కూడా మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.తనపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి మహిళా కమిషన్‌కు పూర్తి వివరణ ఇస్తానని, తన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ వివాదంగా మార్చారని అమర్నాథ్ అన్నారు. మహిళా కమిషన్ ఎదుట ఆయన ఇవ్వబోయే వివరణ, అనంతరం కమిషన్ స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
విశాఖపట్నం : క్యాట్‌వాక్‌తో కెవ్వుకేక (ఫొటోలు)
-
కూల్‌డ్రింక్ కంటే.. బీరే మంచిది!
సాక్షి, గాజువాక: కూల్‌డ్రింక్ కంటే బీరే మంచిదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీచ్‌ల్లో ఏర్పాటు చేస్తున్న బీచ్ షాక్స్ (మద్యం షాపులు) మంచివేనని.. అవి చెడ్డవని చెప్పడానికి ఏమీ లేదన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూల్‌డ్రింక్ కంటే బీరులోనే తక్కువ కేలరీలు ఉంటాయన్నారు. బీరుతో పోలిస్తే కూల్‌డ్రింక్‌లోనే చక్కెర ఎక్కువని తెలిపారు. తాను ఇలా మాట్లాడితే బీరు తాగడాన్ని ప్రోత్సహించడానికి మాట్లాడుతున్నానని అనుకుంటారన్నారు. ప్రత్యేక ప్రాంతాల్లో బీచ్ షాక్స్తోపాటు ఇతర పర్యాటక సదుపాయాలు ఏర్పాటు చేస్తే విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించారు. కూల్‌డ్రింకులతో పోలిస్తే బీరులోనే చక్కెర, క్యాలరీల శాతం తక్కువగా ఉంటుందన్నారు. బీచ్‌ల్లో బీచ్ షాక్స్ పేరిట మద్యం షాపులు ఏర్పాటు చేయడం మంచిదేనని, దానివల్ల సంస్కృతి దెబ్బతినదన్నారు. మన సంస్కృతిని పరిరక్షిస్తూనే మోడరన్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. నెటిజన్ల ఆగ్రహం.. ‘ధూమపానం.. మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అని సినిమాకు ముందు ప్రకటన వేస్తుంటారు. బహిరంగ ప్రదేశాల్లో సైతం రాసి బోర్డులు పెడుతుంటారు. కానీ ఇదంతా అబద్ధమని, కూల్ డ్రింక్స్ కంటే బీర్లు మంచివని, మద్యపానాన్ని ప్రోత్సహించేలా బీచ్ సాక్స్ ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదని టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలతో సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ సామాజిక మాధ్యమంలో ప్రజలు చివాట్లు పెడుతున్నారు. ‘కూల్‌డ్రింక్స్ కంటే బీరులో క్యాలరీల శాతం తక్కువగా ఉంటుంది‘ అని టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే మద్యపానాన్ని ప్రోత్సహించేలా బాధ్యాతాయుత పదవిలో ఉన్న వ్యక్తులు మాట్లాడటం వల్ల ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. పోషకాహార గణాంకాల ప్రకారం, 330 మి.లీ. సాధారణ కూల్‌డ్రింక్‌లో 35–40 గ్రాముల చక్కెర ఉండగా, అదే పరిమాణంలో సాధారణ బీరులో 0–3 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది. అంతమాత్రాన బీరు ఆరోగ్యకర పానీయం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫెర్మెంటేషన్ సమయంలో చక్కెరలో అధిక భాగం ఆల్కహాల్‌గా మారిపోవడమే బీర్లో చక్కెర శాతం తక్కువగా ఉండటానికి కారణం. అదే విధంగా 330 మి.లీ. బీరులో సుమారు 140–160 కిలో క్యాలరీలు, 10–13 గ్రాముల కార్బోహైడ్రేట్లు, దాదాపు 5 శాతం ఆల్కహాల్ ఉంటుంది. కూల్‌డ్రింక్‌లో సుమారు 135–145 కిలో క్యాలరీలు ఉన్నప్పటికీ, ఆల్కహాల్ ఏమాత్రం ఉండదు. షుగర్ తగ్గిందని చెబుతున్న ఎమ్మెల్యే, అదే చక్కెర ఆల్కహాల్‌గా మారిన విషయాన్ని ప్రస్తావించకపోవడం ప్రజలకు తప్పుడు సందేశం ఇవ్వడమేనని సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు. ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల కాలేయ వ్యాధులు, అధిక రక్తపోటు, కొన్ని రకాల క్యాన్సర్లు, గుండె సంబంధిత సమస్యలు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న విషయాన్ని కూటమి ప్రజాప్రతినిధులు ఎందుకు దాచిపెడుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. -
ఒకే స్టైల్.. ఒకే స్టెప్.. కవలల ర్యాంప్‌వాక్‌కు ప్రేక్షకుల ఫిదా!
విశాఖపట్నం: చూడటానికి ఒకేలా ఉండే కవలలు.. ఒకే రకమైన ట్రెండీ దుస్తులు ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తూ అదరగొడితే ఆ మజానే వేరు.. సరిగ్గా ఇలాంటి వినూత్న దృశ్యమే శనివారం సాయంత్రం నగరంలోని రిలయన్స్ సెంట్రో వేదికగా ఆవిష్కృతమైంది. కవలల్లో దాగి ఉన్న ప్రతిభను, వారి మధ్య ఉండే ప్రత్యేక అనుబంధాన్ని ప్రోత్సహించేందుకు ‘ది ట్విన్స్ ఎడిట్’ పేరిట నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోకు విశేష స్పందన లభించింది. చిన్నారుల నుంచి యువతీ యువకుల వరకు మొత్తం 15 జతల కవలలు ఈ పోటీలో పాల్గొని సందడి చేశారు. ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ వారు చేసిన ర్యాంప్ వాక్, క్విజ్, ఇతర ప్రదర్శనలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సెంట్రో ఎస్జీఎం వెంకట్ నారాయణ మాట్లాడుతూ.. కవలల మధ్య ఉండే స్టైల్, ప్రత్యేక బంధాన్ని ఈ వేదిక ప్రతిబింబించిందన్నారు. అనంతరం నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవంలో శాన్వి–శైవి ప్రథమ స్థానంలో నిలవగా, శ్రీరమ్య–శ్రీలిఖిత ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పోటీలో పాల్గొన్న కవలలందరికీ గిఫ్ట్ హ్యాంపర్లు అందజేశారు. -
కొత్త జోన్.. కొత్త రూట్లు..
సాక్షి, విశాఖపట్నం : ప్రజల కోరిక మేరకు విశాఖపట్నం నుంచి వివిధ నగరాలకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆధ్వర్యంలో కొత్త రైళ్లన్నింటినీ నడిపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే విశాఖ నుంచి ప్రయాణికులు కోరుకున్న ప్రధాన నగరాలకు కొత్త రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఇటీవలే లాంఛనంగా ప్రారంభం కావడంతో, ప్రయాణికుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖపట్నం డివిజన్లను కలుపుతూ ఏర్పడిన ఈ కొత్త జోన్.. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైలు సర్వీసుల పెంపుపై ప్రధానంగా దృష్టి సారించింది. ప్రస్తుతం విశాఖ నుంచి పలు కీలకమైన వాణిజ్య కేంద్రాలు, రాష్ట్ర రాజధానులు, ప్రముఖ పుణ్యక్షే త్రాలకు నేరుగా సరైన రైళ్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రధాన మార్గాల్లో కొత్త ఎక్స్‌ప్రెస్, ఇంటర్సిటీ రైళ్లను ప్రవేశపెట్టేందుకు జోనల్ అధికారులు వ్యూహాత్మక ప్రణాళికలు రచిస్తున్నారు. రాయలసీమతో బలపడనున్న కనెక్టివిటీ విశాఖపట్నంతో రాయలసీమ ప్రాంతానికి ప్రత్యక్ష రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం ఈ సరికొత్త ప్రణాళికల్లో అత్యంత కీలకమైన అంశం. ఇందులో భాగంగా గుంతకల్లు డివిజన్‌కు చెందిన ఉన్నతాధికారులు.. విశాఖ నుంచి తమ పరిధిలోని ప్రాంతాలకు రైళ్ల సంఖ్యను పెంచాలని జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్‌ని ఇటీవల కోరారు. ముఖ్యంగా ధర్మవరం నుంచి గుంతకల్లు మీదుగా విశాఖకు ఓ కొత్త రైలును నడిపే ప్రతిపాదనకు జోన్ అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో విశాఖ నుంచి బయల్దేరేలా ఈ సర్వీసును ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ రైలు నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే అంతర్గత సర్వే కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ రైలు గనక పట్టాలెక్కితే అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల ప్రజలకు విశాఖతో రవాణా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. దీంతో పాటు ఏపీలోని పలు ఇతర ప్రాంతాల నుంచి వైజాగ్‌కు రోజువారీ రైళ్లను పెంచాలంటూ స్థానికుల నుంచి పెద్దఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. అదేవిధంగా.. వారణాసి పుణ్యక్షేత్రానికి అదనపు రైళ్లు, విజయవాడ–విశాఖపట్నం మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్, చెన్నై మహానగరానికి అదనపు సర్వీసులు వంటి ఎన్నో కీలక ప్రతిపాదనలు ఇప్పటికీ కాగితాలకే పరిమితమయ్యాయి. అయితే తాజా జోనల్ కసరత్తులతో ఈ పాత ప్రతిపాదనలన్నింటికీ త్వరలోనే మోక్షం లభిస్తుందని ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా.. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో, విశాఖ నుంచి రైలు సర్వీసులు రెట్టింపయ్యే రోజులు చాలా దగ్గర్లోనే ఉన్నాయని రైల్వే ఉన్నతాధికారులు సైతం భావిస్తున్నారు. చాంతాడంత జాబితాకు మోక్షం లభించేనా..? ఒకవైపు కొత్త రైళ్ల ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నా.. గతంలో విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రతిపాదించి, ఇప్పటికీ ఆచరణలోకి రాని రైళ్ల జాబితా కూడా చాంతాడంత ఉంది. విశాఖపట్నం నుంచి నంద్యాలకు, అలాగే ఐటీ రాజధాని బెంగళూరుకు రోజువారీ నేరుగా ‘వందేభారత్’ లేదా ‘వందేభారత్ స్లీపర్’ కనెక్టివిటీ రైలు సర్వీసును ప్రారంభించాలనే ప్రతిపాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల బెంగళూరుకు ఒక వీక్లీ ట్రైన్‌ను రెగ్యులరైజ్ చేసినప్పటికీ, నిత్యం ప్రయాణించే వారి కోసం రోజువారీ రైలు ఖచ్చితంగా కావాలన్నది ప్రయాణికుల ప్రధాన వాదన. -
విశాఖలో భీకర వర్షం.. APలో రెండు రోజులు వానలే వానలు
-
అల్లుడే హంతకుడు.. నడిరోడ్డుపై ఉరితీయాలి
సింహాచలం (విశాఖ): ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విశాఖకు చెందిన రాధాగాయత్రిది సాధారణ మరణం కాదని, అది తన అల్లుడు శ్రీచరణ్ చేసిన ప్రీప్లాన్డ్ మర్డర్ అని ఆమె తండ్రి సుధాకర్ ఆరోపించారు. కూతురు మృతిపై న్యాయ పోరాటం కోసం పది రోజులుగా ముస్సోరీలోనే ఉన్న ఆయన.. శుక్రవారం సింహాచలంలో జరిగిన రాధాగాయత్రి 12వ రోజు కర్మకాండకు హాజరయ్యారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీచరణ్ది క్రిమినల్ బ్రెయిన్ అని, తప్పు చేయకపోతే ముస్సోరీ పోలీసులకు దొరకకుండా ఫోన్ స్విచాఫ్ చేసుకుని ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. ఆరోగ్య సమస్యలంటూ తన కూతురిపై లేనిపోని నిందలు వేస్తూ శ్రీచరణ్ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. శ్రీచరణ్ ముస్సోరీ వెళ్లి పోలీసులను కలిశాడని అతని తల్లిదండ్రులు చెబుతున్నదంతా అబద్ధమని, చరణ్ విశాఖలోనే తిరుగుతున్నాడన్నారు. ముస్సోరీలో ఒక లాయర్ని కూడా శ్రీచరణ్ పెట్టుకున్నాడన్నారు. నడిరోడ్డుపై శ్రీచరణ్‌ను ఉరితీయాలని డిమాండ్ చేశారు.రాధాగాయత్రి తల్లిదండ్రులు లేకుండానే మృతదేహాన్ని పంచనామాకు పంపించడం వెనుక శ్రీచరణ్ తల్లిదండ్రుల పాత్రపై కూడా తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని సుధాకర్ కుటుంబసభ్యులు ఆరోపించారు. చదవండి: శ్రీచరణ్ ఎక్కడున్నాడు? -
రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం
సాక్షి, విశాఖపట్నం: రాధా గాయత్రి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సింహాచలంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. శ్రీచరణ్ కుటుంబ సభ్యులను నిలదీసిన రాధా గాయత్రి కుటుంబ సభ్యులు.. శ్రీచరణ్ ఎక్కడున్నాడో చెప్పాలంటూ ఆమె తల్లి పట్టుబట్టింది. శ్రీచరణ్ ముస్సోరి వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నాడని రాధా గాయత్రి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాధ గాయత్రి పెద్ద కర్మ వేదికగా వివాదం రాజుకుంది.శ్రీచరణ్ తల్లిదండ్రులను రాధాగాయత్రి తల్లిదండ్రులు, బంధువులు చుట్టుముట్టారు. శ్రీచరణ్ ఇక్కడే ఉండి డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. శ్రీచరణ్ వచ్చే వరకు అతడి తల్లిదండ్రులను విడిచిపెట్టేది లేదని రాధా గాయత్రి బంధువులు తేల్చి చెప్పారు. అందరి సమక్షంలో శ్రీచరణ్‌కు బంధువులు కాల్ చేయించగా.. ముస్సోరిలో విచారణాధికారిని కలిసిశానంటూ శ్రీచరణ్ చెప్పాడు. ఎంక్వైరీ ఆఫీసర్‌కు స్పాట్లోనే బంధువులు కాల్ చేయగా.. ఇంతవరకు శ్రీచరణ్ తనను కలవలేదంటూ విచారణాధికారి చెప్పినట్లు సమాచారం.కాగా,ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో విశాఖపట్నానికి చెందిన యువతి రాధా గాయత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణంపై ఇప్పటికే భర్త శ్రీచరణ్‌పై హత్య కేసు కూడా నమోదు చేశారు. రాధా గాయత్రి తన తల్లితో మాట్లాడినట్లు చెబుతున్న ఓ ఆడియో క్లిప్ కూడా వెలుగులోకి వచ్చింది. అందులో భర్త ప్రవర్తనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త శ్రీచరణ్‌పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. -
విశాఖపట్నం : వల నిండింది.. పంట పండింది (ఫొటోలు)
-
అనకాపల్లి పరవాడ ఫార్మా సిటీలో ఘోర ప్రమాదం
సాక్షి, అనకాపల్లి: పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ్ ఎనర్జీ పరిశ్రమలో ఈ వేకువ జామున భారీ పేలుడు సంభవించింది. భారీగా మంటలు చెలరేగడంతో ఇద్దరు కార్మికులు సజీవ దహనం అయ్యారు. మంటల్లో చిక్కుకున్న మరికొందరిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలువురికి తీవ్రగాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.మృతి చెందినవాళ్లను.. వెంకటేశ్, త్రినాథ్‌లుగా గుర్తించారు. ఈ ఇద్దరూ అచ్యుతాపురం వాసులుగా తెలుస్తోంది. . ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న కార్మికులు తీవ్రంగా గాయపడగా, సహచరులు, అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. రెండు ఫైరింజన్లను మంటల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మంట్లలో మరికొందరు చిక్కుకుని ఉంటారని భావించి.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించారా? లేదంటే సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనతో ఫార్మాసిటీ పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. -
తప్పు చేస్తే ఇక్కడే ఎందుకుంటాను: రాధా గాయత్రి భర్త
సాక్షి, విశాఖపట్నం: భార్య రాధా గాయత్రి మృతిపై భర్త శ్రీచరణ్ స్పందించారు. నా భార్య రాధా గాయత్రి మరణానికి, నాకు ఎలాంటి సంబంధం లేదని.. పోస్ట్ మార్టం నివేదికలో నిజాలు వెల్లడవుతాయని శ్రీచరణ్ అన్నారు. ‘‘మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. ఒకరిపై ఒకరికి ఇష్టం లేకుంటే, విబేధాలు ఉన్నట్టయితే ముస్సోరి ఎలా వెళ్తాం. హోటల్ ప్యాకేజ్‌లో భాగంగానే మద్యం సప్లయ్ చేశారు’’ అని శ్రీచరణ్ పేర్కొన్నారు.‘‘ఆమె తల్లిదండ్రులు బాధలో ఇలాంటి మాటలు ఆడుతున్నారు. ఇప్పటికీ గాయత్రీ నా భార్య. గాయత్రీ తల్లిదండ్రులు నాకు కూడా తల్లిదండ్రులతో సమానం. ఇది నా ఒక్కడి సమస్య కాదు. మూడు గ్రామాల సమస్య. నాకు బాధ్యత లేకపోతే సంప్రదాయాలు ఎందుకు పాటిస్తాను. నేను తప్పు చేస్తే ఇంకా ఇక్కడే ఎందుకు ఉంటాను’’ అంటూ శ్రీచరణ్ పేర్కొన్నారు.ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో విశాఖపట్నానికి చెందిన యువతి రాధా గాయత్రి అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న గాయత్రి తల్లిదండ్రులు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ (సీపీ) కార్యాలయానికి చేరుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గాయత్రి మృతి సహజ మరణం కాదని, ఈ ఘటన వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తమ అల్లుడి పాత్రపై అనుమానం ఉందని.. పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
పుస్తకాలు ప్రాణం పోసుకుంటున్నాయి
గ్రంథాలయం సమాజానికి హృదయం వంటిది. ఆ గ్రంథాలయంలోని సాహితీ సంపద ఎంత పంచుకుంటే అంత పెరుగుతుంది. డిజిటల్ సముద్రంలో ఈదులాడుతున్న సమూహాలకు మంచినీటి ఊటలా ఇంకా పుస్తకం దాహం తీరుస్తూనే ఉంది. సాహితీ దాహార్తులకోసం మంచి పుస్తకాలను అందించాలనే తపనతో వైజాగ్ నగరంలో బుక్ మ్యాజిక్ రీడింగ్ క్లబ్‌ను నడుపుతున్నారు కొందరు ఔత్సాహికులు. అందరూ ఆధునికపు హంగుల వైపు అడుగులు వేస్తున్న ఈ రోజుల్లో వయసు భేదం లేకుండా పుస్తకం వైపు నడిచేలా చేస్తున్నారు వీరు. ‘ఒకప్పుడంటే గ్రంథాలయాల విలువ తెలిసినవారు ఉండేవారు. ఈ రోజుల్లో ఇది సాధ్యమా..’ అనే వారికి వైజాగ్ వాసులకు చేరువైన బిఎమ్ఆర్సి (బుక్ మ్యాజిక్ రీడింగ్ క్లబ్) సరైన సమాధానం అవుతుంది. వీరు పుస్తకాల ద్వారా ప్రజలకు ఏం చె΄్పాలనుకుంటున్నారు, ఎలా తమ ఆలోచనను ముందుకు తీసుకువెళుతున్నారు.. అనే విషయాలను అడిగితే ఎన్నో విషయాలను మన ముందుంచారు.పిల్లలకు ఆకర్షణీయమైన కథలుబుక్ మ్యాజిక్ రీడింగ్ క్లబ్ రూపకల్పన గురించి ఫౌండర్ హరి మాదాల మాట్లాడుతూ –‘‘మా కథల కార్యక్రమం ఎలా సాగుతుందంటే.. ‘ధైర్యవంతులైన వీరులు, మాట్లాడే జంతువులు, అంతులేని ఊహలతో మా పుస్తకాలయం నిండిపోతుంది’ అన్నారు. హరి సాఫ్ట్వేర్ ఉద్యోగి. నాలుగేళ్ల క్రితం సింగపూర్ నుంచి వైజాగ్ వచ్చేశాక కొన్ని రోజుల్లోనే అక్కడి పట్టణ వాతావర ణంలో ఎవరికి వారే అన్నట్టుగా ఉండటం గమనించారు. తమచుట్టూ ఓ మంచి కమ్యూనిటీని బిల్డ్ చేయాలనుకున్నారు. అందుకు తగినట్టుగా వైజాగ్ ఉక్కునగరంలో పిల్లల కోసం బుక్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. తమ పిల్లలను తీసుకొని వచ్చే తల్లిదండ్రులతో పరిచయాలు ఏర్పడతాయని ఆలోచించారు. ఇంగ్లిష్, తెలుగు సాహిత్యంలో కామిక్స్, ఫిక్షన్ బుక్స్‌ని లైబ్రరీలో ఉంచారు. కేవలం బుక్ రీడింగ్ అంటే అందరికీ ఆసక్తి ఉంటుందో లేదో అని ఆలోచించి పిల్లలకు వారాంతాల్లో కథలు చెప్పడం, ఆర్ట్ వర్క్.. యాక్టివిటీస్ చేయించడం మొదలు పెట్టారు. పెద్దవాళ్లకు రివ్యూస్ప్రైవేట్ కంపెనీలో మేనేజ్మెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కవిత మాట్లాడుతూ–‘‘టీవీ, మొబైల్స్‌తో టైమ్ పాస్ చేసే పెద్దవాళ్లు, గృహిణులు మన ఇళ్లలో ఉంటారు. వారిని రప్పించడానికి బుక్ రివ్యూ ΄్లానింగ్ సక్సెస్ అయ్యింది, వారాంతపు సాయంత్రాల్లో బుక్ రివ్యూ ఉంటుంది. కొంతమంది ఆ వారం తాము ఏ బుక్ గురించి, కథ గురించి చెబుతారో.. ఆ విషయాలు ముందుగానే చెప్పి, పాల్గొంటారు. కొందరు బుక్ రివ్యూస్ వినడానికే వస్తుంటారు’ అని వివరించారు. ‘ఈ బుక్ మ్యాజిక్ క్లబ్ యాక్టివిటీస్‌కి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి, చూసి కొంతమంది తమ ప్రాంతంలో కూడా స్టార్ట్ చేస్తామంటూ ఆసక్తి చూపారు. అలా, గాజువాకలో, స్టీల్ ΄్లాంట్లో బుక్ మ్యాజిక్ క్లబ్‌ను స్టార్ట్ చేశారు కొందరు. చాలా మంది బుక్స్ చదవడం మొదలుపెట్టాక తమ లైఫ్‌లో మార్పులు వచ్చాయని, చాలా ఉపయోగకరంగా ఉంటోందనీ చెబుతున్నారు. అంటే, పుస్తకం విలువ ఎప్పుడూ పెరిగేదే తప్ప, తగ్గదు’ అని వివరించారు బుక్ మ్యాజిక్ రీడింగ్ క్లబ్ మెంబర్ ఉపాసన.సరైన ఎంపిక పుస్తకమే..5 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలు పుస్తకాల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఆ తర్వాత మళ్లీ 30 ఏళ్లు దాటినవారే బుక్ రీడింగ్‌లో కనిపిస్తున్నారు. 12 నుంచి 30 ఏళ్లలోపు వాళ్లు మాత్రం పుస్తకానికి దూరంగా ఉండటం గమనించాం. వారు కాలేజీ చదువులు, ఉద్యోగంలో నిలదొక్కుకోవడంలో బిజీగా ఉంటున్నారు. పిల్లలు ఫాంటసీ, కామిక్స్ అది కూడా బొమ్మల పేజీలలోని చిన్న చిన్న టెక్ట్స్ చదవడానికి ఇష్టపడుతున్నారు. మా చిన్నపాపకు రెండేళ్లు, 150 వర్డ్స్ వరకు చెబుతుంది. ఇమాజినేషన్‌కి, పబ్లిక్ స్పీకింగ్, వకాబులరీ..కి సరైన ఎంపిక పుస్తకమే. కార్పోరేట్రంగంలో టెక్నికల్ స్కిల్స్ కన్నా కమ్యూనికేషన్ స్కిల్స్‌కు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఆ స్కిల్‌ను పుస్తకం నేర్పుతుంది. – హరి మాదాల, బిఎమ్ఆర్సి ఫౌండర్, వైజాగ్రైటింగ్ వర్క్‌షాప్స్..మా గ్రూప్‌లో 80 ఏళ్ల పెద్దావిడ కూడా మెంబర్‌గా ఉన్నారు. పాడ్ కాస్టింగ్ ద్వారా కథలు వింటున్నానని, అది తన ఆలోచనా ధోరణిని మార్చిందని చెబుతారావిడ. ఇప్పుడు మా క్లబ్ నుంచి 100 పుస్తకాలకు పైగా రివ్యూస్ జరిగాయి. గతంలో అనుకున్నది ఇప్పుడు నెరవేరింది. రైటర్స్ క్లబ్లో జరిగే రైటింగ్ వర్క్షాప్స్కూ వెళుతుంటాను. వాటిలో రాసిన కొంతమంది కథలను కలిపి, బుక్‌గానూ తీసుకువచ్చారు. మా బుక్ క్లబ్లో డాక్టర్లు, ఇంజనీర్లు, గృహిణులు, పిల్లలు, టీనేజర్లు, యువత, విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడంతా డిజిటల్ యుగం కదా, పుస్తకాలు ఎవరు చదువుతారు అని చాలామంది అనుకుంటారు. మొదట్లో నెలకు ఒకసారి బుక్ రివ్యూస్ చేసేవాళ్లం. వచ్చేవారి ఆసక్తిని గమనించి రెండువారాలకోసారి ఏర్పాటు చేస్తున్నాం. కానీ, పిల్లల కోసం ప్రతి వారం రివ్యూ ్రపోగ్రాం పెట్టమని అడిగేవారు పెరుగుతున్నారు. – డాక్టర్ ఆండాల్, బుక్ మ్యాజిక్ రీడింగ్ క్లబ్ మెంబర్, వైజాగ్ – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
‘సీఐపై కేసు.. సాయికృష్ణను చంపేశామని సర్కార్ ఒప్పుకుంది’
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో జంగిల్ రాజ్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. సాయికృష్ణను చంపి బూడిద చేశారు. సాయి కృష్ణ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఒక వ్యక్తిని చంపి బూడిద చేసే హక్కు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు.సాయికృష్ణ కేసు విషయమై తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. రెండు మూడు కేసులు ఉంటే చంపి బూడిద చేస్తారా?. చంపి బూడిద చేసే హక్కు ఎవరు ఇచ్చారు?. సీఐ మీద కేసు పెట్టడం ద్వారా సాయికృష్ణను చంపేశామని ప్రభుత్వం ఒప్పుకుంది. సాయికృష్ణ తల్లి శోకం మీ కంటికి కనిపించడం లేదా?. ఆ తల్లి కన్నీరు చూసి రాష్ట్ర ప్రజానీకం తల్లడిల్లిపోతుంది.సాయికృష్ణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాయి కృష్ణ ఉదంతం పోలీసులకు కనువిప్పు కావాలి. సాయికృష్ణ హత్య వ్యవహారంలో A1గా చంద్రబాబును పెట్టాలి. లోకేష్, అనిత, డీజీపీ, సీపీ మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. మన రాష్ట్రానికి చేతకాని సీఎం అధికారంలో ఉన్నారు. లాకప్ డెత్ జరిగితే మేకప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాయి కృష్ణ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. -
అల్లుడిపైనే అనుమానం, రాధా గాయత్రి మృతిపై మరో ట్విస్ట్
-
రాధా గాయత్రి మృతిపై మరో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో విశాఖపట్నానికి చెందిన యువతి రాధా గాయత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న గాయత్రి తల్లిదండ్రులు గురువారం విశాఖపట్నం పోలీస్ కమిషనర్ (సీపీ) కార్యాలయానికి చేరుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గాయత్రి మృతి సహజ మరణం కాదని, ఈ ఘటన వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తమ అల్లుడి పాత్రపై అనుమానం ఉందని, పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.మృతిపై అనుమానాలు ఉన్నాయి..ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గాయత్రి తల్లి సత్యవతి.. తమ కుమార్తె మరణానికి సంబంధించి తమకు అనేక సందేహాలు ఉన్నాయని చెప్పారు. ఘటన జరిగిన తీరుపై స్పష్టత లేదని, అందుకే పోలీసుల జోక్యం కోరుతున్నామని తెలిపారు. తన అల్లుడు శ్రీచరణ్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తమకు అందిన సమాచారం, శ్రీచరణ్ చెప్పిన కారణాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొంటూ ఈ కేసును అన్ని కోణాల్లో విచారించాలని కోరారు. తన కూతురుతో తమ అల్లుడు సరిగా కలిసి ఉండే వారు కాదని అన్నారు. తమ కూతురికి మద్యం సేవించే అలవాటు లేదు. గాయత్రిపై అనుమానంతోనే హత్య చేసి ఉండొచ్చు. రిషికేశ్, హరిద్వార్ వెళ్తున్నామని చివరి సారిగా నాకు చెప్పింది. విహారయాత్ర ముగించుకొని విశాఖకు వస్తానని చెప్పింది. విశాఖకు రాకుండానే నా కూతుర్ని హతమార్చారు. విశాఖకు వచ్చిన తర్వాత రెండు నెలలు వర్క్ ఫ్రం హోం పెట్టి ఇక్కడే ఉంటాను అని చెప్పింది. మాది సాంప్రదాయమైన కుటుంబం అని ఆవేదన వ్యక్తం చేశారుసీపీ కార్యాలయంలో ఫిర్యాదు..గాయత్రి తల్లిదండ్రులు సీపీ కార్యాలయంలో అధికారులను కలిసి తమ అనుమానాలను వివరించినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి, అవసరమైతే సంబంధిత రాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకుని దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ముస్సోరిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. యువతి మృతి వెనుక అసలు కారణాలేమిటి? కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలకు ఆధారాలున్నాయా? అనే అంశాలపై దర్యాప్తు కీలకంగా మారింది. -
ముస్సోరీలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి
ముస్సోరీ: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హోమ్‌స్టేలో ఢిల్లీకి చెందిన ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని పి.రాధా గాయత్రి(27)గా గుర్తించారు. ప్రస్తుతం ఆమె గురుగ్రామ్‌లోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తూ.. ఢిల్లీలోని కిద్వాయ్ నగర్ ఈస్ట్‌లో నివసిస్తున్నారు. ఆమె తన భర్త సౌమ్య శ్రీచరణ్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఆయన కూడా పూణేలో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయత్రి, ఆమె భర్త జూన్ 13న ఢిల్లీ నుండి రిషికేష్‌కు ప్రయాణమై.. మరుసటి రోజు (జూన్ 14) అర్ధరాత్రి దాటిన తర్వాత టిప్రి ధార్‌లోని 'కియానా హోమ్‌స్టే'కు చేరుకున్నారు. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో వారు 'బ్లిస్' అనే పేరున్న గదిలోకి చెక్-ఇన్ అయ్యారు. భర్త తెలిపిన వివరాల ప్రకారం.. ఆ రాత్రి వారిద్దరూ మద్యం సేవించి.. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో నిద్రపోయారు. ఉదయం ఆయన నిద్ర లేచేసరికి.. భర్తకు తన భార్య దుస్తులు లేకుండా.. స్పృహ లేకుండా నేలపై పడి ఉండటం కనిపించింది. ఆమె చుట్టూ మూత్రం, ముక్కు నుండి రక్తం కారుతూ ఉందని తెలిపాడు.రూమ్‌లో ఓ మహిళ స్పృహ లేకుండా పడి ఉందనే సమాచారం సోమవారం ఉదయం ముస్సోరీ పోలీసులకు అందడంతో వారు 108 అంబులెన్స్‌తో సహా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్‌కు చెందిన ఫార్మసిస్ట్ ఆమెను పరీక్షించి.. ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. వీరికి 2025 నవంబర్ 8న వివాహం జరిగింది. గాయత్రి, శ్రీచరణ్ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందినవారని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష నిమిత్తం డెహ్రాడూన్‌లోని ఆసుపత్రికి తరలించారు. -
భారత షిఫ్‌పై అమెరికా దళాలు దాడి.. తెలుగు ఇంజనీర్ మృతి
విశాఖ: ఒమన్ తీరంలో అమెరికా దళాలు జరిపిన దాడుల్లో తెలుగు ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్నంకు చెందిన సురేష్ అనే మెరైన్ ఇంజనీర్ మృతిచెందాడు. భారత్‌కు చెందిన షిప్‌పై ఒమన్ తీరంలో అమెరికా దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో మెరైన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న విశాఖ వాసి సురేష్ మృత్యువాత పడ్డారు. 15 ఏళ్ల క్రితం సురేష వివాహం కాగా, ఇద్దరు కుమారులున్నారు. కొన్నేళ్లుగా మర్చంట్ నేవీలో సురేష్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. దాంతో విశాఖలోని శ్రీహరిపురం శ్రీనివాస నగర్‌లోని సురేష్ ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
విశాఖ : ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతు రుతుపవనాలు ఏపీ మీదుగా చురుగ్గా కదులుతూ ఉండటమే ఇందుకు కారణంగా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నేడు అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావారి, కృష్ణ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షం పడే అవకాశం ఉండటంతో .. ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రేపు అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, నంద్యాల,వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది. భారీ వర్షాలు పడే సమయంలో కోస్తా వ్యాప్తంగా 50-60 కిమీ వేగంతో ఈదురు గాలులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది,. కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని, ఈదురు గాలులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మరొకవైపు కొన్ని జిల్లాల్లో మాత్రం వడగాల్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో తప్పిన పెను ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరోసారి ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని ఎస్ఎంఎస్-1 (స్టీల్ మెల్టింగ్ షాప్-1) విభాగంలో ఉన్న ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్లో ద్రవ ఉక్కు (Molten Steel) ల్యాడిల్ నుంచి నేలపైకి పొర్లిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అత్యంత అధిక ఉష్ణోగ్రత వద్ద ఉండే ద్రవ ఉక్కు ఒక్కసారిగా ల్యాడిల్ నుంచి బయటకు రావడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో కార్మికులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. లేకపోతే భారీ ప్రాణనష్టం సంభవించేదే.ఘటన అనంతరం ప్లాంట్ భద్రతా సిబ్బంది, సాంకేతిక నిపుణులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ద్రవ ఉక్కు లీకేజీకి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు సమాచారం.ఇటీవల కూడా(సోమవారం) స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎంఎస్-2 నుంచి సలసలా మరిగే ఉక్కు ద్రవం మీద పడి 9 మంది కార్మికులు మరణించారు. మరికొందరికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వరుస ప్రమాదాల నేపథ్యంలో.. భద్రతా ప్రమాణాలపై కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటనతో మరోసారి ప్లాంట్‌లో భద్రతా వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
దటీజ్ జగన్..
సాక్షి, విశాఖపట్నం : స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించే విషయంలో అధికార కూటమి నేతలకు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మధ్య వ్యత్యాసం కార్మిక లోకంలో తీవ్ర చర్చకు దారితీసింది. కారి్మక నాయకులు సమస్యలు చెప్పేందుకు ముందుకు రాగా.. ‘మీ కుటుంబ సభ్యులు చనిపోలేదు కదా.. మీకెందుకు?’ అంటూ మంత్రి లోకేష్ అగౌరవంగా మాట్లాడడం కార్మికుల్లో ఆగ్రహం రగిలించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..నాకేం తెలియదు..అవగాహన లేదంటూ వెళ్లిపోయారు. ఇదే సమయంలో విశాఖకు వచ్చిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. కార్మిక సంఘాల నాయకులతో భేటీ అయి, ప్రమాద కారణాలు తెలుసుకుని, వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు. రూ.కోటి పరిహారం కోసం పోరాడతామన్నారు. ప్రభుత్వం ఇవ్వకపోతే వచ్చే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఒక్క నెలలోనే రూ. కోటి పరిహారం అందజేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో జగన్ చూపిన మానవత్వం, చొరవ కార్మికుల మనసు గెలిచింది. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
-
జగన్ రాకతో దద్దరిల్లిన విశాఖ..
-
Exclusive Visuals: విశాఖకు చేరుకున్న వైఎస్ జగన్
-
స్టీల్ ప్లాంట్ ప్రమాదం బయటపడ్డ సంచలన నిజాలు
-
నన్ను వదిలి వెళ్లిపోయావా?
‘నువ్వు వస్తావని ఇంటి డోర్ వద్దే చూస్తున్నా.. ఇలా నన్ను వదిలేసి వెళ్లిపోయావా?’ అంటూ వేరొకరు.. నన్ను వదిలి వెళ్లిపోయావా? డ్యూటీకి వెళ్లిన భర్త ఇంటికి తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న భార్యకు అంతలోనే విషాద వార్త వినాల్సి వచ్చింది. నువ్వు ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్లి.. అక్కడి నుంచి అటుగానే నన్ను వదిలి వెళ్లిపోయావా? స్టీల్‌ప్లాంట్‌లో 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇలా అర్థాంతరంగా వదిలి వెళ్లిపోతారని ఏనాడూ అనుకోలేదు. మావి కూలి బతుకులు. ఇప్పుడు మాకు దిక్కెవరు. – నక్కా జోగమ్మ, మృతుడు రమణ భార్య‘12 ఏళ్ల క్రితం ఉక్కు ద్రవం పడి కాళ్లు గాయపడ్డాయి.. నేడు ఏకంగా ఆ ఉక్కు ద్రవమే నా భర్తను మింగేసింది!’ అని ఒకరు..అప్పుడు కాలు.. ఇప్పుడు శరీరమే మసైపోయింది.. 12 ఏళ్ల కిందట నా భర్త విధి నిర్వహణలో ఉంటుండగానే ఉక్కు ద్రవం పడి కాలు తీవ్రంగా గాయపడింది. ఇప్పుడు ఏకంగా ఆ ఉక్కు ద్రవమే నా భర్తను పొట్టనబెట్టుకుంది. ఏంటి భగవంతుడా మాకీ కర్మ? జీవితంలో ఎన్ని కష్టాలు పడినా పిల్లలిద్దరినీ బీటెక్ చదివించారు. ఇప్పుడు అకస్మాత్తుగా నా భర్తను దూరం చేసి మమ్మల్ని ఇలా రోడ్డున పడేశావు. – గొట్టాపు రాధ, మృతుడు గోట్టాపు త్రినాథ్ భార్య అన్యోన్య దాంపత్యాన్ని చూసి దేవుడికే కన్ను కుట్టి.. ‘పిల్లల్ని బాగా చూసుకో’ అంటూ మధ్యాహ్నం పెట్టిన మెసేజే నా భర్త ఆఖరి మాట అవుతుందనుకోలేదు’ అని మరొకరు.. ‘మాది ప్రేమ వివాహం. 13 ఏళ్ల క్రితం పెళ్లయింది. మాకు ఇద్దరు పిల్లలు ధను‹Ù, లోకేష్ 6, 7 తరగతులు చదువుతున్నారు. సోమవారం విధులకు వెళ్లిన నా భర్త, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఫోన్‌కు మెసేజ్ చేశారు. ‘పిల్లలకు ఒంట్లో బాగోలేదు, వారిని కనిపెట్టుకుని ఉండు’ అని చెప్పారు. ఇంతలోనే ఇంతటి ఘోరవార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. ప్రేమ వివాహం చేసుకుని పిల్లలతో అన్యోన్యంగా ఉన్న తమ కుటుంబాన్ని చూసి భగవంతుడికి కన్ను కుట్టిందనుకుంటా. సాయంత్రం దేవుడి గదిలో దీపం పెడదామనుకుంటే.. ఏకంగా భర్త జీవితమే దీపంలా ఆరిపోతుందని ఊహించలేకపోయాను. –గొందేశి రాజమ్మ, మృతుడు వెంకటప్పారావు భార్య ఇలా మృతుల కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా చేసిన ఆక్రందనలు.. కన్నీటి రోదనలతో కేజీహెచ్ మార్చురీ ప్రాంగణం శోకసంద్రంగా మారిపోయింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సంభవించిన ఘోర ప్రమాదం ఎనిమిది మంది శ్రామికుల ప్రాణాలను బూడిద చేయడమే కాకుండా, వారిని నమ్ముకున్న కుటుంబాల జీవితాల్లో ఎప్పటికీ పూడ్చలేని చీకట్లను నింపింది. బతుకుదెరువు కోసం నిరంతరం స్వేదం చిందించే ఆ కార్మికులపై, సుమారు 1,600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో సలసల మరిగే ఉక్కు ద్రవం మృత్యువులా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది శ్రామికులు సజీవ దహనమై బొగ్గు ముద్దల్లా మారిపోయారు. కేజీహెచ్ మార్చురీ వద్ద మంగళవారం నిర్వహించిన పోస్టుమార్టం ప్రక్రియ, ఆపై తమ వారి మృతదేహాలను చూసి బంధువులు చేసిన ఆర్తనాదాలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించాయి. -
స్టీల్‌ప్లాంట్ బాధితులకు న్యాయం జరగాల్సిందే: వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖ పర్యటనకు సంబంధించి.. -
కార్మికుల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం: బొత్స
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నగరంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్)లో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. వారిలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె రాజు, ఇతర ముఖ్య నాయకులతో కలిసి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆ తర్వాత బొత్స సత్యనారాయణ అక్కడే మీడియాతో మాట్లాడారు.ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోవడం బాధాకరమని బొత్స సత్యనారాయణ అన్నారు. పరిహారంపై బాధిత కుటుంబాలది గొంతెమ్మ కోరిక కాదని చెప్పారు. బాధితుల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించాలని బొత్స సత్యనారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి సర్కారు కుట్రలు చేస్తోందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను తొలగించడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. కార్మికుల సంక్షేమం ప్రభుత్వానికి పట్టదా? అని నిలదీశారు. ప్రైవేటీకరణ కుట్రల వల్లే ప్రమాదాలు స్టీల్ ప్లాంట్ ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగుందని, సంస్థ ప్రైవేటీకరణ కుట్రల వల్లే స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదాలు జరగుతున్నాయని, ఆ విధంగా కార్మికుల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బొత్స ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి సమర్థులైన అధికారులను బదిలీ చేయడం వల్లనే భారీ ప్రమాదం చోటు చేసుకుందన్న ఆయన, ఇకనైనా సంస్థలో ఉద్యోగుల తొలగింపు ఆపాలని తేల్చి చెప్పారు. ప్రమాదంలో దుర్మరణ చెందిన కార్మికుల కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్ తరహాలో కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ పరిహారం కోసం వైయస్సార్సీపీ రాజీ లేని పోరాటం చేస్తుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తారని వెల్లడించారు.‘‘విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన భారీ ప్రమాదం అత్యంత దురదృష్టకరం. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 8 మంది కార్మికులు దుర్మరణం చెందగా, సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో 90 శాతం కాలిన గాయాలతో ఉన్న మరో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కిమ్స్ ఆసుపత్రిలో 40 శాతం గాయాలతో మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వారందరూ కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు పార్టీ తరపున, అధినేత వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తమ తాబేదార్లకు కట్టబెట్టాలనే కుట్రతోనే వ్యవహరిస్తోంది. స్టీల్ ప్లాంట్‌లో సమర్థులైన అధికారులను దొడ్డిదారిన బదిలీ చేయడం వల్లే అనుభవజ్ఞుల కొరత ఏర్పడి, ఈ తరహా భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. మిషనరీ నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. ఇప్పటికే శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగులు అంతా కలిపి దాదాపు 10 వేల మందిని అన్యాయంగా తొలగించారు. ఇకనైనా బలవంతపు వీఆర్ఎస్ చర్యలను ఆపాలి’’ అన్నారు.మంత్రి లోకేశ్ తీరు దారుణం: కురసాల కన్నబాబు బాధితులను పరామర్శించడానికి వచ్చిన మంత్రి నారా లోకేశ్.. సమస్యలపై ప్రశ్నించిన కార్మిక సంఘాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడం, రాజకీయం చేయడం దారుణమని మాజీ మంత్రి కురసాల కన్నాబాబు అన్నారు. ‘‘నాడు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న మేమంతా, సీఎస్‌తో సహా ఇక్కడే ఉండి బాధితులకు అండగా నిలబడ్డాం. కానీ నేడు అధికారంలో ఉన్నవారు కనీస ఓపిక, సహనం లేకుండా కార్మిక నేతలపై నోరు పారేసుకోవడం శోచనీయం’’ అని చెప్పారు.కాగా, స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. భాను కుమార్, కృష్ణ నాగ్, ప్రభాకర్, జీవీ అప్పారావు, నక్క వెంకటరమణ, త్రినాథ్, అప్పలరాజుల మృతదేహాలను బంధువులకు అధికారులు అప్పగించారు. బిహార్‌కు చెందిన గోల్డ్ కుమార్ బంధువుల రాక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. మొత్తంగా 8 మంది మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. -
స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు బొత్స పరామర్శ
-
స్టీల్ ప్లాంట్ ఘటన.. నారా లోకేశ్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద మంత్రి నారా లోకేశ్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికుల ఆగ్రహం, నిరసనల మధ్య ఆయన వ్యవహరించిన తీరు కాస్త అక్కడి వాతావరణాన్ని వేడెక్కించింది. హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి స్టీల్‌ప్లాంట్ వద్దకు చేరుకున్న లోకేశ్‌కు.. కార్మికుల మృతి, నిర్వహణ లోపంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఆయన సహనం కోల్పోయి.. కార్మిక సంఘాల నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్లాంట్‌లో జరిగిన ప్రమాదాలు, కార్మికుల భద్రత అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు.. మంత్రి లోకేశ్ ఎదుటే నిరసనకు దిగాయి. నైపుణ్యం లేని కాంట్రాక్ట్ కార్మికులను ఎలా అనుమతించారన్న ప్రశ్నతో మంత్రిని నిలదీశాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో ఎంపీ భరత్, హోం మంత్రి అనితలు పరిస్థితిని చల్లార్చేందుకు ప్రయత్నించినా, కార్మికుల ఆగ్రహం తగ్గలేదు.ఈ క్రమంలో కార్మికుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయిన లోకేశ్, “స్టీల్‌ప్లాంట్‌ను మేమే కాపాడాము” అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు తీవ్రంగా స్పందించాయి. “అందుకే ఇంతమంది చనిపోయారా?” అంటూ వారు తిరిగి ప్రశ్నించారు.పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో, కార్మికుల ఆవేదనను అర్థం చేసుకోకుండా మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఎందుకు గొడవ పడుతున్నారు.. రాజకీయం చేయడానికి వచ్చారా?” అంటూ లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై కార్మిక సంఘాలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో మరోసారి కలుగజేసుకున్న లోకేశ్.. “మీ కుటుంబ సభ్యులెవరూ చనిపోలేదు కదా?” అంటూ వ్యాఖ్యానించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారాయి. పరామర్శకు వచ్చి అవహేళనగా మాట్లాడారని.. మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని లోకేశ్‌ను ఉద్దేశించి కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనూ ఆయన ‘‘మరి మమ్మల్నెందుకు నిలదీశారు?’’ అంటూ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. మొత్తానికి, పరామర్శగా మొదలైన నారా లోకేశ్ స్టీల్‌ప్లాంట్ పర్యటన కార్మికుల ఆగ్రహం, ప్రశ్నలు, ఎదురుదాడులతో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.నియంతలా లోకేశ్ తీరుస్టీల్ ప్లాంట్ వద్ద పరామర్శ పేరుతో నారా లోకేశ్ చేసిన ఓవరాక్షన్‌పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ‘‘కార్మికుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. అందుకే ఈ ఘోరం జరిగింది. పైగా కార్మిక సంఘాలను, కార్మికులను ఇప్పుడు నారా లోకేశ్ అవమానించారు. నియంతలా వ్యవహరిస్తూ.. ఎవరికీ సమాధానం చెప్పను అన్నట్లు ఉంది ఆయన తీరు. కార్మికులను బెదిరించే విధంగా లోకేశ్ మాట్లాడారు. కార్మిక సంఘాలకు, కార్మికులకు ఆయన క్షమాపణలు చెప్పాలి. బాధిత కుటుంబాలకు రూ కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేజీహెచ్ దగ్గరా.. కేజీహెచ్ వద్ద పరామర్శకు వెళ్లిన మంత్రి లోకేశ్‌కు.. అక్కడా చేదు అనుభవం ఎదురైంది. కుటుంబ సభ్యులను పరామర్శించబోయే సమయంలో వామపక్ష నేతలు అడ్డుకున్నారు. పరిహారం విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలోనూ లోకేశ్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. డబ్బులిచ్చి చేతులు దులుపుకునేందుకు రాలేదు అనడంతో.. వామపక్ష నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడా కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
బిర్యానీ గొడవ.. దంపతుల ఆత్మహత్య
విశాఖపట్నం: రామాటాకీస్ వెనుక వైపున గల శ్రీనగర్‌లో నివాసముంటున్న దంపతులు బలరాం (33), ప్రియాంక (27) ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ద్వారకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కళింగపటా్ననికి చెందిన వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకుని, బతుకుతెరువు కోసం విశాఖ వచ్చి స్థిరపడ్డారు. వెల్డింగ్ పనులు చేసే బలరాం మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తుండటంతో ప్రియాంక గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బలరాం బిర్యానీ కావాలని పట్టుబట్టడంతో ప్రియాంక తల్లి బయటకు వెళ్లగా, ఆమె తిరిగి వచ్చేసరికి దంపతులిద్దరూ ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న నైట్ రౌండ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అయితే బలరామే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ప్రియాంక బలవన్మరణానికి పాల్పడటంతో భయపడి బలరాం ఆత్మహత్యకు ఒడిగట్టాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కళ్లెదుటే తల్లిదండ్రులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడడంతో వారి నాలుగేళ్ల కుమారుడు అనాథగా మిగిలిపోయాడంటూ ప్రియాంక తల్లి రోదించడం స్థానికులను కలచివేసింది. -
విశాఖ ఉక్కు విషాదం.. తప్పు ఎవరిది?
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన తాజా విషాదంపై మరోసారి హై లెవల్ కమిటీని ప్రభుత్వం నియమించింది. అయితే ప్రతి ప్రమాదం తర్వాత విచారణలు, కమిటీలు, నివేదికలతో హడావిడి చేయడం.. కొంతకాలానికి అంతా మరచిపోవడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వరుసగా ప్రమాదాలు పునరావృతమవుతుంటే అసలు బాధ్యులెవరు? తప్పంతా యాజమాన్యానిదేనా? లేక పర్యవేక్షణ బాధ్యత ఉన్న ప్రభుత్వాలకు అసలేం సంబంధం లేదా?? అనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.విశాఖ ఉక్కు కర్మాగారంలో.. ద్రవ ఉక్కు ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఈ ఘటనతో మరోసారి ఒక కీలక ప్రశ్న తెరపైకి వచ్చింది. ప్రతి ప్రమాదం తర్వాత యాజమాన్యాన్ని తప్పుబట్టడం, విచారణ కమిటీలు వేయడం, పరిహారాలు ప్రకటించడం జరుగుతోంది. కానీ వరుసగా ప్రమాదాలు ఎందుకు పునరావృతమవుతున్నాయి? అసలు బాధ్యత ఎవరిపై ఉంది?..విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఉత్పత్తి, నిర్వహణ, భద్రతా ప్రమాణాల అమలు, యంత్రాల సంరక్షణ, సిబ్బంది నియామకాల బాధ్యత ప్రధానంగా యాజమాన్యానిదే. ఇది కాదనలేని విషయం. కానీ, కార్మిక సంఘాలు చాలా కాలంగా ఒకే విషయాన్ని చెబుతున్నాయి. అనుభవజ్ఞులైన శాశ్వత ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోయిందని, వారి స్థానంలో కాంట్రాక్టు సిబ్బందిపై ఆధారపడటం పెరిగిందని. దీంతో భద్రతా ప్రమాణాల అమలుపై ప్రభావం పడుతోందని హెచ్చరిస్తున్నాయి.ఒకప్పుడు 18 వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులు ఉన్న ప్లాంట్‌లో ఇప్పుడు వారి సంఖ్య సగానికి పడిపోయింది. ఉత్పత్తి లక్ష్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరిగిందని, నిర్వహణ వ్యవస్థపై ఒత్తిడి అధికమైందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. పరిశ్రమల్లో భద్రత అనేది కేవలం యంత్రాల మీద ఆధారపడదు. అనుభవం ఉన్న సిబ్బంది, నిరంతర పర్యవేక్షణ, శిక్షణ, క్రమబద్ధమైన నిర్వహణ కూడా అంతే కీలకం. అయితే ఇక్కడితో కథ ముగియదు. తాజా ప్రమాదం తర్వాత.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మొత్తం బాధ్యతను యాజమాన్యంపైనే నెట్టేసి పక్కకు తప్పుకోవాలని చూస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. స్టీల్‌ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడం వాస్తవమే. కానీ రాష్ట్రంలో పనిచేస్తున్న అతిపెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన విశాఖ ఉక్కులో పదేపదే ప్రమాదాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత నుంచి తప్పించుకోగలదా? అనే ప్రశ్న కార్మిక వర్గాలు, పరిశ్రమల నిపుణుల నుంచి వస్తోంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా కూటమి నాయకులు పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు విశాఖ ఉక్కు పరిరక్షణపై పలుమార్లు మాట్లాడారు. కానీ ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలు, సిబ్బంది కొరత, యంత్రాల నిర్వహణ, ప్రమాదాల నివారణ చర్యలపై అదే స్థాయిలో పర్యవేక్షణ జరిగిందా? ఫ్యాక్టరీల శాఖ, కార్మిక శాఖ నిర్వహించిన తనిఖీల్లో ఏమి బయటపడింది? గత ప్రమాదాల తర్వాత ఇచ్చిన సూచనల అమలు ఎక్కడిదాకా వచ్చింది? అనే ప్రశ్నలకు ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని విమర్శకులు అంటున్నారు.ప్రమాదం జరిగిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వ సంస్థ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్కకు తప్పుకోవచ్చా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఫ్యాక్టరీల భద్రతను పర్యవేక్షించే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టరేట్, కార్మిక శాఖ, జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తాయి. ప్రమాదాలకు దారితీసే లోపాలను గుర్తించడం, భద్రతా తనిఖీలు నిర్వహించడం, హెచ్చరికలు జారీ చేయడం వంటి బాధ్యతలు కూడా వాటిపైనే ఉంటాయి.ముఖ్యంగా గత పదిహేనేళ్లలో స్టీల్‌ప్లాంట్‌లో వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2012లో జరిగిన ఘోర పేలుడులో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కూడా పలు ఘటనలు నమోదయ్యాయి. ఇన్ని ప్రమాదాలు జరిగినా భద్రతా వ్యవస్థలపై స్వతంత్ర సమీక్షలు జరిగాయా? గత విచారణల సిఫారసులు అమలయ్యాయా? వాటిని ఎవరు పర్యవేక్షించారు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు కనిపించడం లేదు.ఇక మరో కోణం ప్రైవేటీకరణ వివాదం. విశాఖ ఉక్కును కాపాడతామని, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చాయి. కానీ వాస్తవంగా ప్లాంట్ భవిష్యత్తు, ఆర్థిక పరిస్థితి, సిబ్బంది బలోపేతం, ఆధునీకరణ వంటి అంశాల్లో ఎంత మేర పురోగతి సాధించారన్న ప్రశ్నలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఉక్కు కర్మాగారం గురించి రాజకీయంగా పెద్ద ప్రకటనలు చేసినవారు, కార్మిక భద్రతపై అదే స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారా? అనే ప్రశ్న కూడా కార్మిక వర్గాల నుంచి వినిపిస్తోంది.అందుకే ఈ ప్రమాదాన్ని కేవలం ఒక సాంకేతిక లోపంగా చూడటం సరిపోదని పరిశ్రమల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది యాజమాన్య నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం, సిబ్బంది విధానాలు, ప్రభుత్వాల నిరంతర పర్యవేక్షణ వైఫల్యం వంటి అనేక అంశాల కలయికగా చూడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.ఈ విషాదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవడం అవసరమే. కానీ అంతకంటే ముఖ్యమైనది గత ప్రమాదాల మాదిరిగానే ఈ ఘటన కూడా మరో ఫైల్‌గా మిగిలిపోకుండా చూడటం. స్వతంత్ర విచారణ, భద్రతా ప్రమాణాల సమగ్ర ఆడిట్, సిబ్బంది కొరతపై సమీక్ష, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలపై స్పష్టమైన జవాబుదారీతనం తీసుకొస్తేనే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రతి కొన్నేళ్లకోసారి ప్రాణాలు కోల్పోయేది కార్మికులే.. సంతాప ప్రకటనలు విడుదల చేసేది వ్యవస్థే. -
స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై అడుగడుగునా సర్కార్ నిర్లక్ష్యం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ నిమిత్తం నిపుణులపైన ముగ్గురు సభ్యులతో హైలెవల్ కమిటీ ఏర్పాటైంది. ప్రమాద స్థలిలో ఉన్నత స్థాయి కమిటీ విచారణ చేపట్టనుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు ఉద్యోగులతో పాటు ముగ్గురు కార్మికులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మరో ఆరుగురు తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తాజా అప్డేట్స్.. మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఇప్పటికే 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారుమరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు22 మంది చేయాల్సిన పనిని కేవలం 11 మందితో చేయించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారుఉత్పత్తి సామర్థ్యం పెరిగినా కార్మికుల సంఖ్యను భారీగా తగ్గించడం ప్రమాదాలకు కారణమైందిగత రెండేళ్లుగా వీఆర్ఎస్ పేరుతో అనుభవజ్ఞులైన కార్మికులను బలవంతంగా ఇంటికి పంపించారుఅనుభవం లేని వారితో, తక్కువ జీతాలకు పని చేయించడమే ఈ విషాదానికి కారణంయాజమాన్యం బాధ్యతారాహిత్యం, కక్కుర్తి వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోయారుకార్మిక సంఘాల డిమాండ్ ఇదేస్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలికాలం చెల్లిన యంత్రాలను తొలగించి కొత్త వాటిని నిర్మించాలికార్మికుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలిమృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలిక్షతగాత్రులకు రూ. 50 లక్షల పరిహారం ప్రకటించాలిపవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలుస్టీల్ప్లాంట్ కార్మిక నేతలపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలుస్టీల్ప్లాంట్ ప్రమాదంపై మొదట కార్మిక సంఘాలను నిలదీయాలి అంటూ అనుచిత వ్యాఖ్యలుమృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తిస్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తిభాను కుమార్, కృష్ణ నాగ్, ప్రభాకర్, జీవీ అప్పారావునక్క వెంకటరమణ, త్రినాథ్, అప్పలరాజుమృతదేహాలను బంధువులకు అప్పగించిన అధికారులుబిహార్కు చెందిన గోల్డ్ కుమార్ బంధువుల రాక కోసం అధికారులు ఎదురుచూపుబాధితులను ఓదార్చి ధైర్యం చెప్పిన వైఎస్సార్సీపీ నేతలువిశాఖ కేజీహెచ్‌లో బాధిత కుటుంబాలను పరామర్శించిన బొత్స సత్యనారాయణ, కన్నబాబు, గుడివాడ అమర్న్నాథ్, కేకేప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరం: బొత్సకూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోందిస్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి సర్కార్ కుట్రలుస్టీల్ప్లాంట్ ఉద్యోగులను తొలగించడం ముమ్మాటికీ తప్పేకార్మికుల సంక్షేమం ప్రభుత్వానికి పట్టదా?విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్‌ప్లాంట్ వచ్చింది అడుగడుగునా ప్రభుత్వం నిర్లక్ష్యంవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై అడుగడుగునా ప్రభుత్వం నిర్లక్ష్యంఘోర ప్రమాదం జరిగిన స్పందించని సీఎం చంద్రబాబు, మంత్రులునిన్న సాయంత్రం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది మృతివిజయవాడలోనే ఉన్నా విశాఖపట్నం వెళ్లని సీఎం చంద్రబాబుఈరోజు ఉదయం వరకు ఒక్కరు కూడా వెళ్లని రాష్ట్ర మంత్రులుకేంద్రమంత్రి కుమారస్వామి వచ్చాక వచ్చిన రాష్ట్ర మంత్రులుఈరోజు ఉదయం వెళ్లిన మంత్రి నారా లోకేష్లోకేష్ తర్వాత వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కేంద్రమంత్రి వచ్చేవరకు సంఘటన వైపు కన్నెత్తి చూడని హోంమంత్రి అనితకనీసం పట్టించుకోని జిల్లా మంత్రులు, ఇన్ ఛార్జ్ మంత్రులుఈరోజు కూడా విశాఖకు వెళ్లని సీఎం చంద్రబాబువిజయవాడలోనే సమీక్షలు చేసుకుంటున్న సీఎం చంద్రబాబురేపు విశాఖకు వైఎస్ జగన్స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించనున్న జగన్ఆసుపత్రులలో ఉన్న క్షతగాత్రులకు పరామర్శఏపీలో రెడ్‌బుక్ అరాచకం నడుస్తోంది: గుడివాడ అమర్నాథ్కార్మిక సంఘాలను లోకేష్ అవమానించాడులోకేష్ నియంతలా వ్యవహరిస్తున్నారుఎవరికీ సమాధానం చెప్పను అనే విధంగా లోకేష్ మాట్లాడారుకార్మికులను బెదిరించే ధోరణిలో లోకేష్ మాట్లాడారుబాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలికార్మికుల సంక్షేమాన్ని కూటమి గాలికొదిలేసిందిస్టీల్ ప్లాంట్ వద్ద లోకేశ్‌కు చేదు అనుభవంవిశాఖ స్టీల్ ప్లాంట్ వద్దకు మంత్రి నారా లోకేశ్హోం మంత్రి అనితతో ప్లాంట్ వద్దకు వెళ్లిన లోకేశ్లోకేశ్ ఎదుట నిరసనకు దిగిన కార్మిక సంఘాలులోకేశ్ను నిలదీసిన కార్మిక సంఘాలునైపుణ్యం లేని కార్మికులకు ఎలా అనుమతి లభించిందని ఆగ్రహంఎంపీ భరత్, అనితలు సర్దిచెప్పబోయినా.. వినని కార్మిక సంఘాలుకార్మికులకు సమాధానం ఇవ్వలేకపోయిన లోకేశ్వాళ్ల ఆవేదనను అర్థం చేసుకోని లోకేశ్ఎందుకు గొడవ పడుతున్నారంటూ ఆగ్రహంప్రశ్నించిన కార్మికులపై మంత్రి లోకేశ్ అసహనంలోకేశ్ తీరుపై మండిపడ్డ కార్మికులు👉విశాఖ స్టీల్‌ప్లాంట్ ఘటనాస్థలిని కేంద్రమంత్రి కుమారస్వామి పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులను పరామర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్)–1లో సాయంత్రం 4.15 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.👉150 టన్నుల ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు ఒక్కసారిగా విస్ఫోటనం చెంది పైకి ఎగసిపడింది. దీంతో అందులో ఉన్న సలసల కాగే ఉక్కు ద్రవం నేలపై చెల్లాచెదురుగా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. 8 మందిని బలితీసుకుంది. లాడెల్ నుంచి ద్రవం తుళ్లిన వేగానికి, ఉక్కు ద్రవం వేడికి అక్కడ ఉన్న భారీ క్రేన్ పూర్తిగా దగ్ధమైంది. ఆ ప్రాంతమంతా క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ప్లాంట్ అగ్నిగుండంగా మారింది.👉గత రెండు నెలలుగా లాడెల్స్ నుంచి ద్రవపు ఉక్కు 27 సార్లు లీక్ కాగా పలుమార్లు కార్మికులు పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. సాధారణంగా లాడెల్ నుంచి లీకవుతుందే గానీ పేలుడు ఎక్కడా జరగలేదు. దేశంలోని స్టీల్ ప్లాంట్లలో ఇలా లాడెల్లోని ఉక్కు ఎగసిపడటం ఇదే ప్రథమమని కార్మిక సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ప్రాసెసింగ్ కోసం వాడే రసాయనాలు నాణ్యత లేనివి కావడం వల్లే కెమికల్ రియాక్షన్ జరిగి ఈ తరహా దుర్ఘటన జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
మృత్యువలయంగా విశాఖ స్టీల్ ప్లాంట్..!
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో తాజాగా జరిగిన ప్రమాదం మరోసారి భద్రతా ప్రమాణాలపై చర్చకు దారితీసింది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని దశాబ్దాలుగా ప్లాంట్‌లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ విభాగాల్లో జరిగిన ప్రమాదాల్లో పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. ప్రధానంగా గ్యాస్ లీకేజ్, పేలుళ్లు, ద్రవ లోహం లీకేజ్ వంటి ఘటనలు జరుగుతూనే ఉండటంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికుల భద్రత ప్రశ్నార్థకరంగా మారింది.తాజాగా విశాఖ స్టీల్‌ప్టాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడగా, పలువురు లోపల చిక్కుకున్నట్లు సమాచారం. ఈ దారుణం వెనుక భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఇంతటి దారుణం చోటు చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. 2012లో ఘోర ప్రమాదం.. అయితే ఈ ఘటన 2012లో విశాఖ స్టీల్ ప్టాంట్‌లో జరిగిన ఘోర దుర్ఘటనకు గుర్తుకుతెచ్చింది. సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే జూన్ నెలలో 13వ తారీఖున చోటు చేసుకున్న స్టీల్‌ప్లాంట్ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ ప్లాంట్ వద్ద పేలుడు సంభవించి 19 మంది దుర్మరణం చెందారు. ఆ సమయంలో పలువురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆక్సిజన్ పైప్‌లైన్‌లో ఒత్తిడి ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోవడం వల్ల పైప్‌లైన్ పేలిపోయి, భారీగా మంటలు వ్యాపించాయి. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య ఉండటంతో, అధికారులు మరియు కార్మికులు దానిని పరిశీలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.దాంతో అక్కడే ఉన్న పలువురు ఈ ఘోరం బారిన పడ్డారు. మరణించిన 19 మందిలో ముగ్గురు డిప్యూటీ జనరల్ మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, కన్సల్టెంట్లు మరియు పలువురు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు.తీవ్ర గాయాలు: ఎందరో ఉద్యోగులు తీవ్రమైన శాతంలో కాలిపోయి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అదే సంవత్సరం మే 1వ తేదీన కూడా స్టీల్ ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నెస్-3 లో జరిగిన మరో పేలుడులో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు సజీవ దహనమయ్యారు. .గతేడాది స్టీల్ మెల్టింగ్ మిషన్‌లో షార్ట్ సర్క్యూట్‌తో హైడ్రాలిక్ ఆయిల్ లీకై మంటలు చెలరేగాయి.ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేయడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా ఈసారి ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన మరికొన్ని ప్రమాదాలు..మే 22, 2012: సింటర్ ప్లాంట్‌లో మంటలు చెలరేగడంతో, కొత్త బ్లాస్ట్ ఫర్నేస్‌కు ముడి పదార్థాన్ని తీసుకువెళ్తున్న కన్వేయర్ బెల్ట్ పూర్తిగా కరిగిపోయింది. రూ. 1 కోటి ఉత్పత్తి నష్టం.మే 1, 2012: కొత్తగా ప్రారంభించిన బ్లాస్ట్ ఫర్నేస్ IIIలో జరిగిన పేలుడులో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు సజీవ దహనం కాగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.ఫిబ్రవరి 6, 2012: స్టీల్ మెల్టింగ్ షాప్ లో భారీ పరిమాణంలో వేడి లోహం ఒలికిపోవడం, రూ. 1 కోటి నష్టంఏప్రిల్ 10, 2011: సుమారు 140 టన్నుల ద్రవ ఉక్కును తీసుకువెళ్తున్న లాడిల్ నుండి అది కిందపడటంతో ఎస్ఎంఎస్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది, రూ. 60 కోట్ల నష్టం వాటిల్లింది.ఏప్రిల్ 14, 2011: ఎస్ఎంఎస్లోని కంటిన్యూయస్ కాస్టింగ్ విభాగంలో భారీ పరిమాణంలో వేడి లోహం కింద పడిపోయింది, 140 టన్నుల ద్రవ ఉక్కు నేలపై పడింది. ఏప్రిల్ 17, 2011: ముడి పదార్థాల నిర్వహణ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం, మూడు కన్వేయర్ బెల్టులకు నష్టం, రూ. 20 కోట్ల నష్టంమే 1, 2011: బ్లాస్ట్ ఫర్నేస్‌కు ముడి పదార్థాలను రవాణా చేసే కన్వేయర్ బెల్ట్ మెలితిరగడంతో 48 గంటల పాటు ఉత్పత్తికి అంతరాయంజూన్ 18, 2011: కోక్ డ్రైయింగ్ కూలింగ్ ప్లాంట్‌లోని రెండు కన్వేయర్ బెల్టులలో ఒకదానిపై వేడి కోక్ పడటంతో అగ్నిప్రమాదం సంభవించింది, రూ. 15 లక్షల నష్టం -
మన అద్దాల రైలుకు అరుదైన గుర్తింపు
సాక్షి, విశాఖపట్నం: అద్దాల రైలులో అరుదైన పర్యాటక మార్గం.. సరికొత్త మైలురాయిని అందుకుంది. ప్రముఖ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించిన నేషనల్ టూరిజం సర్వేలోని ‘ఇండియన్ రూట్స్’ ఎడిటర్స్ ఛాయిస్ విభాగంలో విశాఖ–అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే అత్యుత్తమ పర్యాటక రైలు మార్గంగా అగ్రస్థానంలో నిలిచింది. తూర్పు కనుమల ప్రకృతి సోయగాలు, సొరంగ మార్గాలు, పచ్చని లోయలు, జలపాతాల మధ్య ఆహ్లాదకరంగా సాగే ఈ రైలు ప్రయాణం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ అవార్డు దక్కింది. జూన్ 15న గోవాలో జరగనున్న ‘ఇండియా టుడే టూరిజం సమ్మిట్ అండ్ అవార్డ్స్–2026’ కార్యక్రమంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందించనున్నారు. విశాఖ– అరకు మార్గంలో పర్యాటకుల కోసం మొట్టమొదటి విస్టాడోమ్ (అద్దాల బోగీ) కోచ్‌ను 2017 ఏప్రిల్ 16న అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు లాంఛనంగా ప్రారంభించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి విస్టాడోమ్ కోచ్. ఆ తర్వాత పర్యాటకుల నుంచి వచ్చిన విశేష స్పందన, డిమాండ్ మేరకు ఈ మార్గంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విస్టాడోమ్ కోచ్‌ల సంఖ్యను పెంచుతూ వచ్చారు. అనంతరం, పూర్తిస్థాయి అత్యాధునిక ఎల్ హెచ్ బి విస్టాడోమ్ కోచ్‌లతో అప్‌గ్రేడ్ చేసిన రైలు (విశాఖ–కిరండూల్ ఎక్స్‌ప్రెస్)ని 2021 నవంబర్ 22న ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ రైలు మార్గానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి ప్రయాణంలో 100 శాతం ఆక్యుపెన్సీతో ఈ రైలు నడుస్తోందని విశాఖపట్నం డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు. -
చల్లటి కబురు.. ఏపీని తాకిన రుతుపవనాలు
సాక్షి, విశాఖ: ఏపీ ప్రజలకు చల్లటి కబురు అందింది. ఏపీని నైరుతి రుతుపవనాలు తాకినట్టు విశాఖ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. దీంతో, రాయలసీమలో రుతుపవనాలు వేగంగా విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడనుంది. కాగా, ఈనెల 15వ తేదీ నాటికి ఏపీ అంతట రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. మరోవైపు ఎండల తీవ్రత మాత్రం కొనసాగుతోంది. -
భర్త చనిపోయిన బాధలో ఉంటే.. ఆమెపై కన్నేశాడు
విశాఖపట్నం: మరణించిన స్నేహితుడి భార్యను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు జిల్లా మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్.దామోదరరావు శుక్రవారం తీర్పు వెలువరించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.వి.రమణ తెలిపిన వివరాల ప్రకారం.. జ్ఞానాపురంలో కె.ప్రసాద్ అనే వ్యక్తి భార్య లక్ష్మి, పిల్లలతో కలిసి జీవించేవాడు. ప్రసాద్ స్నేహితుడైన ధనాల అరుణ్‌కుమార్ (30) కూడా అదే ప్రాంతంలో నివసించేవాడు. 2019లో ప్రసాద్ అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న లక్ష్మిపై నిందితుడు కన్నేశాడు. తన కోరిక తీర్చాలంటూ వేధించడం ప్రారంభించాడు. బాధితురాలు నిరాకరించడంతో ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. దీనిపై బాధితురాలు 2021 ఏప్రిల్‌లో కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడు అరుణ్‌కుమార్‌కు మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.200 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. -
విశాఖ: 2 గంటల పాటు నిలిచిపోయిన రైళ్లు
సాక్షి, విశాఖపట్నం: దువ్వాడ రైల్వే స్టేషన్ సుమారు రెండు గంటల పాటు రైళ్లు నిలిచిపోయాయి. దువ్వాడలోని రెండో లైన్లో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో నాలుగో నెంబర్ ప్లాటుఫారంపై కాచిగూడ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. మరో ఐదు ట్రైన్లు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 6.15 నుంచి 8.15 వరకు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సాంకేతికపరమైన ఇబ్బందులను తొలగించిన రైల్వే అధికారులు.. రైళ్లు రాకపోకలను పునరుద్ధరించారు.విశాఖ–ఇచ్ఛాపురం సెక్షన్లో జీఎం తనిఖీలుసౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ గురువారం విశాఖ– ఇచ్ఛాపురం సెక్షన్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలను ఆయన పరిశీలించారు. అమృత్ భారత్ పథకం కింద ఎంపికైన సింహాచలం రైల్వే స్టేషన్‌తో పాటు కొత్తవలస, శ్రీకాకుళం రోడ్, నౌపడ, పలాస స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించిన ఆయన.. నిర్దేశిత సమయానికి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం ఇచ్ఛాపురం– విశాఖ మధ్య విండో ట్రైలింగ్ ఇన్స్పెక్షన్ ద్వారా రైల్వే ట్రాక్స్, సిగ్నలింగ్ వ్యవస్థ, బ్రిడ్జిలను పరిశీలించి, ప్రజా సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ పర్యటనలో ప్రిన్సిపాల్ చీఫ్ ఇంజనీర్ బి.ఎస్.కె. రాజ్‌కుమార్, పీసీఎస్‌టీఈ ఓబీ సురేష్‌కుమార్, పీసీవోఎం వినీత్‌కుమార్, సీఏవో అంకుష్ గుప్తా, డీఆర్ఎం లలిత్ బోహ్రా తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో బ్యాంకు దోపిడీకి యత్నం
మర్రిపాలెం: ఓ బ్యాంక్ ఉద్యోగి విశాఖలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో దోపిడీకి యత్నం చేశాడు. అడ్డు వచ్చిన మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్‌పై దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..అనకాపల్లి జిల్లా యలమంచిలిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ మేనేజర్ (ఆపరేషన్స్) ఎల్లా రవికుమార్ విశాఖలోని తన మిత్రుడు మేనేజర్‌గా ఉన్న ఐటీఐ జంక్షన్ వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖకు బుధవారం బ్యాంక్ పనివేళలు ముగిసే సమయానికి వెళ్లాడు. ఆ సమయంలో ఆ బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు క్లోజింగ్ ప్రక్రియలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న బంగారు నగలను అపహరించేందుకు రవికుమార్ ప్రయత్నించాడు. దీన్ని గమనించిన బ్యాంకు మేనేజర్ శివరామరాజు, అసిస్టెంట్ మేనేజర్ రమేష్‌లు రవికుమార్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో రవికుమార్ తనతో తెచ్చుకున్న సుత్తితో వారి తలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లకు గాయాలవడంతో వారు కేకలు వేశారు. స్థానికులు వెంటనే వచ్చి నిందితుడిని పట్టుకుని క్షతగాత్రులను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కంచరపాలెం పోలీసులు ఘటనాస్థలికి వచ్చి నిందితుడిని అరెస్ట్ చేశారు. బ్యాంకులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను స్వాదీనం చేసుకున్నారు.విచారణలో నిందితుడిని అదే బ్యాంక్ యలమంచిలి శాఖలో మేనేజర్(ఆపరేషన్స్)గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. కాగా, నిందితుడు బెట్టింగ్‌లకు బానిసగా మారి అప్పుల్లో కూరుకుపోయాడని, వాటిని ఎలా అయినా తీర్చాలనే ఉద్దేశంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఐటీఐ జంక్షన్ వద్ద ఉన్న ఈ బ్యాంక్ బ్రాంచ్‌లో గోల్డ్ లోన్లు ఎక్కువగా ప్రాసెస్ చేస్తుంటారని తెలుసుకుని ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది. -
బీచ్‌లలో బీరు.. బారు
ఇన్నాళ్లూ.. బీచ్ అంటే షికార్లు.. సరదాలు.. పిల్లలు, కుటుంబంతో సేదతీరే ప్రాంతం! ఇకపై.. బీచ్‌లంటే బీరు, బారు.. మందూ, చిందూ.. ఆకతాయిలు, అసాంఘిక శక్తుల కోలాహలం!! రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న బీచ్‌లను అసాంఘిక శక్తుల అడ్డాగా మారుస్తూ ‘బీచ్ షాక్స్’ పేరుతో మద్యం ప్రవాహానికి చంద్రబాబు సర్కారు తలుపులు బార్లా తెరిచింది! గురువారం మంత్రి మండలి సమావేశంలో అందుకు ఆమోదముద్ర వేసింది. టీడీపీ మద్యం సిండికేట్ మరింత బరి తెగించి దోపిడీకి పాల్పడేలా పచ్చజెండా ఊపింది! కూటమి సర్కారు నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీచ్ షాక్స్ అంటే.. మినీ బార్లే బీచ్‌లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం కోసం చంద్రబాబు ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడ వేసింది. బీచ్ షాక్స్ ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నట్లు తాజాగా మంత్రి మండలి సమావేశంలో తీర్మానించింది. ఇంతకీ బీచ్ షాక్స్ ఏమిటంటే... బీచ్‌లలో చిన్న సైజు బార్లే. వెదురు గానీ చెక్కతోగానీ కుటీరం ఆకారంలో వాటిని ఏర్పాటు చేస్తారు. వాటిలో మద్యం, బీరు, ఇతర పానీయాలు, ఆహార పదార్ధాలు విక్రయిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అవి మినీ బార్లే. పర్యాటక రంగానికి ప్రోత్సాహం ముసుగులో బీచ్‌లలో మద్యం ప్రవాహానికి చంద్రబాబు ప్రభుత్వం గేట్లు ఎత్తింది. మొదటగా విశాఖపట్నం, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు అనుమతినిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీచ్ షాక్స్ నిర్వహించవచ్చని ప్రకటించింది. అంటే బీచ్‌లలో రోజంతా మద్యం ఏరులై పారనుందని స్పష్టం చేసింది. టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి పచ్చజెండా వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా దశలవారీ మద్యం నియంత్రణ లక్ష్యంగా ప్రైవేట్ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. పారదర్శకంగా ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించడమే కాకుండా మద్యం విక్రయ వేళలను కుదించింది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన పరి్మట్ రూమ్‌లను రద్దు చేసింది. 48 వేల బెల్ట్ దుకాణాలను తొలగించింది.కానీ 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి పచ్చజెండా ఊపింది. మద్యం విధానం ముసుగులో దోపిడీకి తెరతీసింది. ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. విచ్చలవిడిగా ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతినిచి్చ.. మొత్తం 4,346 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్‌కు ఏకపక్షంగా కట్టబెట్టింది. ఎల్లో సిండికేట్ రాష్ట్రంలో ఏకంగా 75 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తోంది. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలతో విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతోంది. తీరప్రాంతం ధారాదత్తం.. అయినా చంద్రబాబు ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీ కోసం రాష్ట్రంలో 974 కి.మీ. తీరప్రాంతాన్ని కూడా కట్టబెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే బీచ్ షాక్స్ పేరుతో బీచ్‌లలో బార్లకు అనుమతినిచ్చింది. విశాఖపట్నం, సూర్యలంక బీచ్‌లలో పైలట్ ప్రాజెక్టుగా మినీ బార్ల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది. అనంతరం రాష్ట్రంలోని ఇతర బీచ్‌లలో కూడా వాటిని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బీచ్‌లలో కూడా మినీ బార్లు ఏర్పాటుకు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. త్వరలోనే వాటికి కూడా అనుమతి ఇవ్వనుందని ఎక్సైజ్‌శాఖ వర్గాలు తెలిపాయి. మినీ బార్లను కూడా టీడీపీ సిండికేట్‌కే ఏకపక్షంగా కట్టబెట్టనుందన్నది సుస్పష్టం.ఇక బీచ్‌కు వెళ్లాలంటే భయం భయం..!చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో రాష్ట్రంలో బీచ్‌లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బీచ్‌లకు ఉదయం, సాయంత్రం సమయంలో అధికంగా ప్రజలు వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులతో రద్దీగా ఉంటాయి. ఆ సమయంలోనే బీచ్‌లలో మినీ బార్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దాంతో ఆకతాయిలు, అసాంఘిక శక్తులకు మినీ బార్లు కేంద్ర బిందువుగా మారే అవకాశాలున్నాయి.ఆహ్లాదం, ప్రశాంతత కోసం బీచ్‌కు వచ్చే మహిళలు, బాలికలపై వేధింపులకు పాల్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే గంజాయి బ్యాచ్‌లు రాష్ట్రంలో చెలరేగిపోతున్నాయి. ఇక బీచ్‌లలో కూడా మందు బాబులు, గంజాయి బ్యాచ్‌లు మహిళలపై విరుచుకుపడే ప్రమాదం ముంచుకొస్తోంది. రాష్ట్రంలో బీచ్‌లలో పోలీసు భద్రత కూడా లేదు. మరోవైపు విశాఖపట్నం, సూర్యలంక బీచ్‌లలో ఎందరో యువకులు ఈతకు వెళ్లి దుర్మరణం పాలవుతున్నారు. ఇప్పుడు బీచ్‌లలో మినీ బార్లు ఏర్పాటుతో మద్యం మత్తులో సముద్ర స్నానాలు, ఈతకు దిగి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.బికినీ ఫెస్టివల్ నుంచి బీచ్ షాక్స్ దాకా.. 2014–19 మధ్య టీడీపీ హయాంలో బీచ్‌లలో బార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకోసం 2016లో జీవో నంబర్ 470 కూడా జారీ చేశారు. దాంతోపాటు బీచ్‌లలో బికినీ ఫెస్టివల్ నిర్వహించాలని కూడా సన్నాహాలు చేశారు. అప్పట్లో దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. ప్రధానంగా మహిళా సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. దాంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అనంతరం 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి బీచ్‌లలో బార్ల ఏర్పాటు దిశగా అడుగులు వేసింది. మినీ బార్ల ముసుగులో బీచ్‌లలో మద్యం ప్రవాహానికి తలుపులు తెరచింది. – సాక్షి, అమరావతి -
విశాఖ తీరంపై చంద్రబాబు కన్ను
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ తీర ప్రాంతంలో అభివృద్ధి మాటున రియల్ ఎస్టేట్ సంస్థలకు, అనుయాయ కంపెనీలకు అడ్డగోలుగా భూకేటాయింపులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విశాఖ తీర ప్రాంతంలో అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టి.. కోస్తా తీర ప్రాంతానికి ముప్పు వాటిల్లజేసేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా మధురవాడ నుంచి భీమిలి వరకూ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలను సడలించాలంటూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను కోరాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ మొత్తం ప్రాంతాన్ని ప్రస్తుతం ఉన్న సీఆర్‌జెడ్–3 నుంచి సీఆర్‌జెడ్–2కు మార్చేలా చర్యలు తీసుకోవాలని కోరేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా మే నెల 5న జరిగిన ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏపీసీజెడ్‌ఎంఏ) సమావేశంలో మధురవాడ నుంచి భీమిలి వరకూ సీఆర్‌జెడ్–2 పరిధిలోకి తేవాలంటూ అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వ అటవీ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న కాంతిలాల్ దండే ఏపీసీజెడ్‌ఎంఏకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సమావేశంలో ఆయనతోపాటు మెంబర్ సెక్రటరీగా ఉన్న శరవణన్ (ఐఎఫ్ఎస్), విశాఖ కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, పీసీబీ ఆర్వో తదితరులు హాజరయ్యారు. 2019లో జారీ చేసిన సీఆర్‌జెడ్ నోటిఫికేషన్లో ఈ మేరకు మార్పులు చేయాలంటూ కేంద్ర అటవీ, పర్యావరణశాఖను కోరాలని సమావేశం అభిప్రాయపడింది. తద్వారా మధురవాడ నుంచి భీమిలి వరకు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు స్పష్టమవుతోంది. కోస్టల్ కారిడార్‌కు ముప్పు! వాస్తవానికి 2019లో ఇచ్చిన సీఆర్‌జెడ్ నోటిఫికేషన్ ప్రకారం మధురవాడ నుంచి భీమిలి వరకూ సీఆర్‌జెడ్–3 జోన్ పరిధిలో ఉంది. దీని ప్రకారం ఈ ప్రాంతంలో సముద్ర మట్టం నుంచి 200 మీటర్ల వరకూ ఎలాంటి శాశ్వత నిర్మాణాలూ చేపట్టకూడదు. ఇక్కడ సముద్ర తీరంలో ఉన్న సహజ ఇసుక దిబ్బలు, చిత్తడి నేలలు అలల తాకిడిని, తుపానులను అడ్డుకునే కవచాలుగా ఉపయోగపడుతున్నాయి. సీఆర్‌జెడ్–3 పరిధిలో ఉండటంతో ఇక్కడ శాశ్వత నిర్మాణాలకు అవకాశం లేదు. అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన నేతలు ఈ ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. వీటిని ఇప్పుడు సీఆర్‌జెడ్–2 పరిధిలోకి తీసుకరావడం ద్వారా శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలకు అవకాశం ఏర్పడనుంది. తద్వారా ఇప్పటికే తాము చేపట్టిన నిర్మాణాలను శాశ్వతం చేసుకోవడంతో పాటు తమ అనుయాయులకు భూకేటాయింపులతో రానున్న రోజుల్లో విశాఖ తీరాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మార్చేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమవుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ విధ్వంసం చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విశాఖలోని విలువైన భూములపై కన్నేసింది. మొదటగా తమ బంధువు ఆక్రమించుకున్న 5 వేల కోట్ల విలువైన ఎండాడలోని స్థలాన్ని గీతం పేరిట అక్రమాన్ని సక్రమం చేసేందుకు జీవీఎంసీలో తీర్మానం చేసింది. అం తేకాకుండా విశాఖలో ఉన్న పర్యావరణాన్ని రక్షిస్తున్న పచ్చని కొండలను ఎక్కడికక్కడ గుండు గీయిస్తోంది. ఇది చాలదన్నట్టుగా ఇప్పుడు ఏకంగా సీఆర్‌జెడ్–3 నుంచి సీఆర్‌జెడ్–2లోకి మార్చడం ద్వారా సహజ రక్షణ కవచాలుగా ఉన్న పర్యావరణాన్ని ధ్వంసం చేసేందుకు సిద్ధమవుతోంది. టూరిజం పేరుతో పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోంది. దీనిపై పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. -
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ముగ్గురి మృతి
సాక్షి, విశాఖపట్నం: గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సుఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. పలువురికి గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.కాగా, తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో 34 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి కాకినాడకు బయలుదేరింది.చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులోకి రాగానే బస్సులో కాలిన వాసన వస్తుండటంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు నిలుపుతుండగానే ఇంజన్ నుంచి మంటలు వచ్చాయి. దీంతో డ్రైవర్ నాగరాజు బస్సులోని ప్రయాణికులందరినీ కిందకి దించాడు. ఆగ్నిమాపక వాహనం వచ్చేసరికి బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులను మరో బస్సులో పంపించారు.మూడు రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో ఓ టూరిస్టు బస్సు అదుపు తప్పి బోల్తా పడిపోయిన సంగతి తెలిసిందే. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. -
రైల్వేజోన్‌కు సర్వం సిద్ధం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నమైన ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ఆవిర్భావానికి సర్వం సిద్ధమైంది. విశాఖపట్నం కేంద్రంగా కొత్త జోన్ ప్రారంబోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని రైల్వే బోర్డు భావిస్తోంది. విశాఖ నుంచి ఏదైనా కొత్త రైలు ప్రారంభించినప్పుడు భారీగా ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఒక్క రోజే గడువు ఉండటంతో అనుబంధ జోన్లు, డివిజన్ల పరిధిలో ఆదివారం సెలవుని రద్దు చేసి విధులకు హాజరవ్వాలని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. 1వ తేదీన జరిగే ప్రారంబోత్సవంలో పాల్గొనేందుకు దక్షిణ కోస్తా జోన్ పరిదిలోని డీఆర్ఎంలు విశాఖకు వస్తున్నారు.దీనిపై నేడు డెక్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీఎంల అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయి పనుల్లో రైల్వే ఉద్యోగులు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాట్లలో జాప్యం జరగకుండా ఉండేందుకు రైల్వేబోర్డు ఆయా డివిజన్ల పరిధిలో ఆదివారం సెలవును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఉద్యోగీ విధిగా విధులకు హాజరుకావాలని స్పష్టం చేసింది. పరిపాలన, క్షేత్ర స్థాయి పనులపై పూర్తి దృష్టి సారించింది. ప్రారంబోత్సవానికి సర్వం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో, కొత్త జోన్ పరిధిలోకి వచ్చే గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్ల రైల్వే మేనేజర్లు (డీఆర్ఎంలు) శనివారం విశాఖ జోన్ జీఎం సందీప్ మాథుర్‌తో సమావేశమయ్యారు. మరోవైపు రైల్వే బోర్డు అధికారులకు దక్షిణ కోస్తా, తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే జీఎంలు, డీఆర్ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఆస్తులు విభజనపై ఈ భేటీలో చర్చించారు.కొత్త బోర్డులతో హద్దుల మార్పు జోన్ ప్రారంభానికి సమయం దగ్గరపడటంతో క్షేత్రస్థాయిలో పనులు ఊపందుకున్నాయి. కొత్త జోన్ సరిహద్దులను ఖరారు చేస్తూ, పాత బోర్డుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నంలో ఉన్న రైల్వే కార్యాలయాలు, కల్యాణమండపాలు, ఇతర భవనాల వద్ద ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ స్థానంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ అని మారుస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగుల హడావుడితో జోన్ కార్యాలయంతోపాటు పరిసరాల్లో సందడి నెలకొంది. సీపీఆర్వోగా బాలాజీ కిరణ్మరోవైపు పాలనాపరమైన కార్యకలాపాలను వేగవంతం చేసే దిశగా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ కోస్తా రైల్వే సీపీఆర్వోగా బాలాజీ కిరణ్‌ను నియమించింది. ఒక పక్క క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు, మరోపక్క పరిపాలనా విభాగాల కూర్పుతో జోన్ కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభమయ్యేందుకు అంతా సిద్ధమైంది. రద్దీకి అనుగుణంగా విజయవాడ, గుంటూరు, గుంతకల్లు నుంచి అదనపు రైళ్లు, వందేభారత్ కనెక్టివిటీ పెంచేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. జూన్ 1 నుంచి జోన్ అమల్లోకి రాగానే వైజాగ్ – సికింద్రాబాద్ వందేభారత్‌తోపాటు పలు రైళ్ల నిర్వహణ, అడ్మిని్రస్టేషన్ కంట్రోల్ మొత్తం విశాఖ కేంద్రంగా జరగనుండటంతో ప్రయాణికులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందనున్నాయి.కొత్త రైల్వే జోన్లోకి స్వాగతం!మధిర: ఏపీలోని విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ను నూతనంగా ఏర్పాటు చేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. అంతేకాక దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొనసాగిన విజయవాడ డివిజన్‌ను కొత్తజోన్‌లోకి మార్చారు. అలాగే, ఇన్నాళ్లు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మధిర, తొండల గోపవరం, ఎర్రుపాలెం రైల్వేస్టేషన్లను విశాఖ జోన్, విజయవాడ డివిజన్ పరిధిలోకి బదలాయించారు.ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి రానుండగా.. మధిర మండలం బయ్యారం సమీపాన కొత్త జోన్ పరిధిని సూచిస్తూ సిబ్బంది శనివారం బోర్డు ఏర్పాటు చేశారు. కాగా, ఇన్నాళ్లు రైల్వే ఉద్యోగులు, ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం సికింద్రాబాద్ వెళ్తుండగా.. ఇకపై జీఎంను కలవాలంటే విశాఖకు, ఇతర అధికారులను కలిసేందుకు విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది. తెలంగాణ పరిధిలోని మూడు రైల్వేస్టేషన్ల పరిధి ఉద్యోగులు, ప్రజలు పాలనపరమైన అంశాల్లో ఇబ్బంది ఎదురవుతుందని ఆందోళన చెందుతున్నారు. -
విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్ ఆర్ట్స్ (ఫొటోలు)
-
కూటమి దగా డీఎస్సీపై కదం తొక్కిన వైఎస్సార్సీపీ (ఫొటోలు)
-
వామ్మో.. అలాంటి గాలి పీలుస్తున్నామా?
విశాఖ నగరవాసులు తమకు తెలియకుండానే ప్రమాదకర వాతావరణంలో జీవిస్తున్నారా? రోజురోజుకీ క్షీణిస్తున్న గాలి నాణ్యత నగరాన్ని నెమ్మదిగా “పాల్యూషన్ హాట్‌స్పాట్”గా మారుస్తోందా? అసలు ప్రజలు పీలుస్తున్న గాలి నిజంగానే సురక్షితమేనా? తాజాగా వెలువడిన ఒక నివేదిక ఈ ప్రశ్నలకు ఆందోళనకర సమాధానాలు ఇచ్చింది. విశాఖ ప్రజలు దాదాపు ప్రతి 10 రోజుల్లో 7 రోజులు కలుషితమైన గాలినే పీలుస్తున్నారని ఆ నివేదిక వెల్లడించింది.“రిస్పిరర్ లివింగ్ సైన్సెస్” సంస్థ విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో గత మూడు సంవత్సరాలుగా వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని నివేదిక స్పష్టం చేసింది. గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మానిటరింగ్ స్టేషన్ ఆధారంగా సేకరించిన డేటా ప్రకారం.. 2026 జనవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో 70.68 శాతం రోజుల్లో PM10 స్థాయులు భారత జాతీయ భద్రతా పరిమితిని మించిపోయాయి.PM10.. పీఎంఅంటే గాలిలో తేలే సూక్ష్మ ధూళి కణాలు. ఇవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో గత రెండేళ్లలో నైట్రోజన్ డైఆక్సైడ్ (NO2) స్థాయిలు 34 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. వాహనాల పొగ, పరిశ్రమల ఉద్గారాల వల్లే ఈ పెరుగుదల కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.నివేదికలో మరింత షాకింగ్ అంశం ఏమిటంటే.. 2026లో PM10 వార్షిక సగటు 139.59 మైక్రోగ్రామ్స్/క్యూబిక్ మీటర్‌గా నమోదైంది. ఇది జాతీయ ప్రమాణాల కంటే రెండింతలకు పైగా అధికం. అంతేకాదు, జీవీఎం కార్పొరేషన్ మానిటరింగ్ స్టేషన్ పరిధి వరుసగా మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలోనే అత్యంత కాలుష్య ప్రాంతాల్లో ఒకటిగా నమోదవుతోంది.రాష్ట్రవ్యాప్తంగా కూడా పరిస్థితి మెరుగ్గా లేదని నివేదిక పేర్కొంది. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో PM10 సగటు 67 µg/m³ ఉండగా, 2026 నాటికి అది 84 µg/m³కు పెరిగింది. PM2.5 స్థాయిలు కూడా 33 శాతం పెరిగి జాతీయ పరిమితులను దాటాయి. ముఖ్యంగా చలికాలంలో కాలుష్యం మరింత తీవ్రంగా నమోదైంది. 2025 డిసెంబర్, 2026 జనవరిలో PM10 స్థాయులు 100 µg/m³ దాటినట్లు అధ్యయనం వెల్లడించింది.ఈ కాలుష్యానికి ప్రధాన కారణాలుగా పరిశ్రమల ఉద్గారాలు, పోర్ట్ కార్యకలాపాలు, రిఫైనరీలు, స్టీల్ ప్లాంట్లు, పెరుగుతున్న వాహన రద్దీని నివేదిక స్పష్టంగా గుర్తించింది. ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనాల రద్దీతో పాటు పరిశ్రమల దహన ప్రక్రియల ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నట్లు విశ్లేషణ చెబుతోంది.ఈ పరిస్థితిని నియంత్రించకపోతే ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారిపై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ కోసం పరిశ్రమలపై కఠిన నియంత్రణలు, హైపర్‌లోకల్ ఎమిషన్ మ్యాపింగ్, మరిన్ని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు, రియల్‌టైమ్ హాట్‌స్పాట్ రిపోర్టింగ్ వ్యవస్థలను వెంటనే అమలు చేయాలని “రిస్పిరర్ లివింగ్ సైన్సెస్” సూచించింది. -
విశాఖలో వాన బీభత్సం..
సాక్షి, విశాఖపట్నం: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన విశాఖవాసులకు గురువారం ఉదయం వర్షం ఊరటనిచ్చింది. అయితే కాసేపటికే వరుణుడు తన ప్రతాపం చూపించాడు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోగా.. ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగినట్లు సమాచారం.ఇదిలా ఉండగా విశాఖ నగరానికి సమీపంలో సముద్రం వైపు అకస్మాత్తుగా సీ స్టార్మ్ ఏర్పడినట్లు వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ద్వారకానగర్, మధురవాడ, సీతమ్మధార, జగదాంబ జంక్షన్‌తో పాటు బీచ్‌రోడ్ సమీప ప్రాంతాల్లో వచ్చే 30 నుంచి 40 నిమిషాల్లో మరోసారి వర్షం కురిసే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేశారు.ఈ స్టార్మ్ నెమ్మదిగా కదులుతుండటంతో భారీ వర్షం కంటే ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు. దీంతో ప్రజలు అవసరం లేకుండా బయటకు రావొద్దని, బీచ్ ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ కూడా ఇంకా వర్షాలు కొనసాగొచ్చని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.#Visakhapatnam rains alert - Sudden sea storm development near the city can give a spell of rains across Dwaraka Nagar, Madhurawada, Seethammadhara, Jagadamba and areas close to Beach road (like Mahalakshminagar) during next 30-40 minutes. Slow moving storms and rains will be…— Andhra Pradesh Weatherman (@praneethweather) May 28, 2026 -
విశాఖపట్నంలో గాలివాన బీభత్సం (ఫొటోలు)
-
‘చంద్రబాబు మోసాలపై పుస్తకాలు రాయొచ్చు’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా చెప్పుకోవడానికి ఏమీ లేక ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలం గడిపేస్తున్నారని, ఇవాళ పూతలపట్టులో జరిగిన సభలో ఆయన మాటలే ఇందుకు నిదర్శనమని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, కేకే రాజుతో కలిసి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. చంద్రబాబు రెండేళ్ల పాలనలో చోటు చేసుకున్న అరాచకాల్ని ఒక్కొక్కటిగా వివరించారు. ఆయన ఇంకేమన్నారంటే..:ప్రభుత్వ కార్యక్రమాల్లో చంద్రబాబు.. తాము ప్రజలకు చేస్తున్న మంచి ఏంటో చెప్పుకోవాలి కానీ విపక్ష నేతలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం ఎందుకు? రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వ్యవస్థల మేనేజ్మెంట్, మ్యానిపులేషన్ అన్నీ తెలుసు. నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడూ ఎన్నికలప్పుడు ఎన్నో హామీలిచ్చి , అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క దాన్నీ నిలబెట్టుకోకుండా మోసం చేయడం అందరూ చూశారు.వ్యవసాయం శుద్ధ దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. రుణమాఫీ చేస్తానని మహిళల్ని ఎలా మోసం చేసి మాయ చేశాడో కూడా అందరికీ తెలుసు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయిందని ఇప్పుడు మరో మోసం చేస్తున్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసే ప్రయత్నం చేస్తాననడం వేరు సూపర్ హిట్ అయిందనడం వేరు. రెండింటికీ చాలా తేడా ఉంది. మహిళలకు ఇస్తానన్న ఆడబిడ్డ నిధి ఇచ్చారా, మూడు గ్యాస్ సిలెండర్లు ఇచ్చారా చెప్పాలి. మీ పరిపాలనలో ఏ ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా? అన్ని నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుందా?కోవిడ్ సంక్షోభంలోనూ ప్రజల్ని ఆదుకున్న జగన్:కోవిడ్ సమయంలో రెండేళ్ల పాటు ప్రజలు ఇబ్బంది పడకుండా జగన్‌గారు ఆదుకున్నారన్న విషయం గ్రామాల్లో వెళ్లి అడిగితే అర్దమవుతుంది. ఏమైనా అంటే తప్పించుకుని తిరిగే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ పబ్లిసిటీ, ప్రయాణాలకూ ఎక్కడైనా ఆటంకం ఉందా ? పేదల మనుగడకు, విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, పేదల వైద్యానికీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలకే ఆటంకాలన్నీ. కానీ చంద్రబాబు మాటలు చూస్తే కోటలు దాటి పోతున్నాయి.ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి. చంద్రబాబు ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో, వాటిని ఎంత వరకూ నిలబెట్టుకున్నారో ఆలోచించాలి. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించారా చెప్పాలి. ఇరాన్ యుద్దం వల్ల దేశమంతా రేట్లు పెరిగాయి. కానీ రాష్ట్రంలో పెంచిన ధరల్ని మాత్రం తగ్గించలేరా? రైటు పండించిన పంటకు మాత్రం ధర లేదు. రైతు పరిస్ధితి అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్లుంది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు ఏం చేస్తున్నాయో అర్ధం కావట్లేదు. మా ప్రాంతంలో జొన్నల గురించి రెండేళ్లుగా నేను అడుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోతున్నారు. గత ప్రభుత్వంలా మార్కెట్ అస్దితరపై ఎందుకు జోక్యం చేసుకోలేకపోతున్నారు?పుస్తకాలు అంటూ రాస్తే చంద్రబాబు గురించి రాయాలి. ఏ రకంగా ప్రజాస్వామ్యంలో అవకాశాలు వినియోగించుకుని, మాయ మాటలు చెప్పి, సామాన్య ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ఎలా ఇబ్బంది పెడుతున్నారో అందులో రాయాలి. ప్రజల కష్టాల మీద ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదు. ఎంతసేపూ చట్టాలు చేతుల్లో తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిన్న మెగా డీఎస్సీ అన్నారు. ఓ ఉద్యోగి ఐఏఎస్ టాపర్ వచ్చాడని తెలిసి ఆన్ లైన్ లో పెట్టిన మెరిట్ లిస్ట్ తీసేశారు. ఇదేనా మీ పాలన? విద్యాశాఖ మంత్రి తన శాఖ వదిలి మిగతా శాఖల గురించి మాట్లాడతారు. విద్యార్ధులకు ఇచ్చే పాఠ్యపుస్తకాలు, కిట్లు పేరెంట్స్ టీచర్ మీటింగ్ రోజు ఇస్తామంటున్నారు. కానీ ఆ పీటీఎం ఎప్పుడో మాత్రం చెప్పరు. ఈ ప్రభుత్వంలో పారదర్శకత అంటూ చెప్పుకుంటూ ప్రతీదీ దాపరికమే. నీతిగా పాలన అయినా చేస్తున్నారా అంటే వైజాగ్ గీతం భూముల్ని ఎలా దోచుకుంటున్నారో ప్రజలు చూశారు. ఆంధ్రా యూనివర్శిటీని తాకట్టు పెట్టేలా ప్రభుత్వ తీరు ఉంది. ప్రభుత్వ పెద్దలకు కానీ, వాళ్ల తాబేదార్లకు సంబంధం ఉంటే మాత్రం ఆ అంశాన్ని ఎలా నీరుగార్చాలా అని చూస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం.రెండేళ్లలో పేదలకు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా?:టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లయింది. పేదలు, మధ్య తరగతికి ఇది చేశాం అని పేటెంట్ గా చెప్పుకునే కార్యక్రమం ఒక్కటైనా ఉందా? రైతులకు కానీ, సామాన్యులకు కానీ, విద్యార్ధులకు కానీ ఏమైనా చేస్తే చెప్పండి. లేదా నీతివంతమైన పాలన అందిస్తున్నామని చెప్పుకునే పరిస్ధితి ఉందా చెప్పాలి. మండల స్దాయి కార్యాలయాలకు వెళ్తే ఎంత అవినీతి జరుగుతుందో తెలుస్తుంది. అధికారంలో ఉన్న నాయకులు, అధికారులు కలిసి కింది స్దాయిలో దోచుకుంటున్నారు. దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే అదీ లేదు. ఎంతసేపూ పబ్లిసిటీ పిచ్చి.రాష్ట్రంలో ధరలు కనీసం 15–20 శాతం పెరిగాయి. దానికి తగినట్లుగా రాబడి పెరిగిందా అంటే శూన్యం. ఇంకా ముగ్గుర్ని కంటే 30 వేలు, నలుగురిని కంటే 40 వేలు ఇస్తామంటూ పిచ్చిమాటలు చెప్తున్నారు. ఉన్న వాళ్లకు ఉద్యోగానికి దిక్కులేదు కానీ ముగ్గుర్ని, నలుగురిని కనాలట. అందరూ మీలా ధనవంతుల్లా ఉంటారా, లేక రెండెకరాలు నుంచి ఆస్తులు పెంచుకునే మంత్రాలు మీలా అందరి దగ్గర ఉంటాయా చంద్రబాబు చెప్పాలి. ఇప్పటివరకూ ఎంతమందికి పీ–4 ఇచ్చారో చంద్రబాబు బయటపెట్టాలి.ఈ మాటలతో ఎంత కాలం జనాన్ని మభ్య పెడతారని అడిగితే సమాధానం చెప్పరు. మీకున్న ప్రసార మాధ్యమాలతో బుల్ డోజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పేదల ఆకలిని ఎంతకాలం ఇలా దాచిపెట్టగలరో చూద్దాం. రెండేళ్లయినా ఉద్యోగులకు పీఆర్సీ వేసే దిక్కులేదు. ఇలాంటి పరిస్ధితుల్లో రాష్ట్రంలో ఉండాలంటే కడుపు తరుక్కుపోతోంది. ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా పాలన చేస్తోంది.ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నిస్తూనే ఉంటాం..:ప్రతీవారం అప్పు తీసుకుంటున్న డబ్బుల్ని అవినీతికి ఖర్చు చేస్తున్నారు. అమరావతిలో చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న అవినీతి చూడలేక జగన్ మావిగన్ ప్రతిపాదించారు. దానికి మీకెందుకు బాధ ? ఈ అవినీతి, దోపిడీ చూసి రేపు ఆ ప్రాంతంలోని మచిలీపట్నం, గన్నవరం ప్రజలే మిమ్మల్ని అడుగుతారు.ఏ అంశం చూసినా కుంభకోణం, పక్షపాతమే. ఎక్కడా పారదర్శకత లేదు. విద్యార్ధుల కోసం డీఎస్సీ పెడితే లీకేజ్ జరిగి మెరిట్ లేకుండా స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్ముకున్నారని వార్తలు వస్తున్నాయి. విద్యాశాఖ, పోలీసు శాఖలు ఏం చేస్తున్నాయి? ఎంతసేపూ ఏ రాజకీయ పార్టీ చూసుకుని ప్రయోజనాలు కల్పించడమేనా వీటి పని? ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైంది. ఎక్కడా లీకేజిలు లేకుండా పాలన జరగాలనేది మా ఉద్దేశం. ఆ దిశలో నిరంతరం ప్రయత్నిస్తాం. ప్రశ్నిస్తూనే ఉంటామని, అవసరమైతే చొక్కా విప్పి వీధుల్లో ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. -
నిప్పుల కుంపటిలా భానుడు.. నీటి చుక్క కోసం పక్షుల విలవిల! (ఫొటోలు)
-
పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టకుండానే..!
విశాఖ: విశాఖ వెస్ట్‌లో ఉన్న గోపాలపట్నం కాపు భవన్ ప్రారంభోత్సవానికి ఆ సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు, నాయకులకు ఆహ్వానం అందలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు పనులు పూర్తైన కాపు భవన్‌ను.. రెండేళ్ల తర్వాత ప్రారంభోత్సవం చేశారు ఎమ్మెల్యే గణబాబు. అయితే ఈ కార్యక్రమానికి కాపు నాయకులకు గానీ, ఎమ్మెల్యేలకు గానీ ఆహ్వానం అందలేదు. కాపు భవన్ ప్రారంభోత్సవం సందర్భం కనీసం కాపు నాయకుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టలేదు. కాపు భవన్ ప్రారంభోత్సవాన్ని విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, ఎంపీ భరత్‌లే చేసేశారు. దీనిపై కాపు ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. తమ సామాజిక వర్గ భవన్ ప్రారంభోత్సవానికి కాపు నేతలను ఆహ్వానించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. కనీసం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టకపోవడాన్ని కూడా ఆక్షేపిస్తున్నారు. -
బాబుది పా‘శవ’క పాలన
బీచ్‌రోడ్డు (విశాఖ): మాయమాటలతో అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. అవ్వతాతలకు, వితంతువులకు, దివ్యాంగులకు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు శవపేటికలలో వృద్ధుల మృతదేహాల నమూనాలతో వినూత్న నిరసన చేపట్టారు. ‘చనిపోయిన వృద్ధుల పింఛన్లయినా కొత్త వారికి ఇప్పించండి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. భారీగా హాజరైన కార్యకర్తలు, నాయకుల నినాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది.పేదల పొట్ట కొడుతున్నారు ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 66 లక్షల పైచిలుకు పెన్షన్లు అందజేశారని గుర్తు చేశారు. కానీ, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వకపోగా, కుంటిసాకులతో ఆరు లక్షల మందికిపైగా అవ్వతాతల పెన్షన్లు తొలగించి వారి పొట్ట కొట్టారని మండిపడ్డారు.సూపర్ సిక్స్ పథకాలు చెప్పి ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా, తండ్రీకొడుకులు తెలంగాణలో పండగలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. గత రెండేళ్లలో సహజంగా చనిపోయిన వృద్ధుల స్థానంలోనూ కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ 31వ వార్డు అధ్యక్షుడు దొడ్డి బాపూ ఆనంద్, దక్షిణ నియోజకవర్గ పరిశీలకులు వీసాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అద్దె అడిగితే గొంతు కోశాడు
సూర్యాపేట జిల్లా: అద్దె డబ్బులు అడిగినందుకు కక్ష పెంచుకుని ఒక మహిళను దారుణంగా హత్య చేసి, ఐదు తులాల బంగారు ఆభరణాలు దోచుకుపోయిన నిందితుడిని ఫోర్త్ టౌన్ పోలీసులు కేవలం రెండు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఈ సంచలన కేసు వివరాలను నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర క్రైం డీసీపీ కే. లతామాధురి వెల్లడించారు. కేసు వివరాలిలా.. అక్కయ్యపాలెం, శ్రీనివాసనగర్‌లోని నాగ ఆనంద్ అపార్టుమెంట్లో పిల్లా పార్వతి (53) తన భర్త చంద్రశేఖర్‌తో కలిసి నివసిస్తున్నారు. వీరికి ఉన్న ఒక దుకాణాన్ని తాటిచెట్లపాలేనికి చెందిన గన్నవరపు రాము అద్దెకు తీసుకుని ‘దుర్గా భవానీ హెయిర్ స్టైల్స్’ షాపు నిర్వహిస్తున్నాడు. నిందితుడు రాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో మూడు నెలలుగా షాపు అద్దె బకాయి పడ్డాడు. ఆ అద్దె డబ్బుల కోసం పార్వతి గట్టిగా అడగడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. గురువారం సాయంత్రం పార్వతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి రాము లోపలికి ప్రవేశించాడు. అద్దె విషయంలో ఆమెతో గొడవపడి, అనంతరం ఆమె గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ధరించిన 2.5 తులాల పుస్తెల తాడు, 2.5 తులాల నల్లపూసల దండ, చెవి దిద్దులను అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. సాయంత్రం 6 గంటల సమయంలో భర్త చంద్రశేఖర్ ఇంటికి వచ్చి చూడగా, పార్వతి విగతజీవిగా పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముమ్మర దర్యాప్తు : సమాచారం అందిన వెంటనే ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి, క్రైమ్ డీసీపీ కే. లతామాధురి పర్యవేక్షణలో క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడు రాముగా గుర్తించారు. నిందితుడు దొంగిలించిన బంగారు ఆభరణాలతో హైదరాబాద్‌కు పారిపోవడానికి రైల్వే స్టేషన్ గేటు వద్దకు చేరుకోగా, దర్యాప్తు బృందం అతడిని వెంబడించి చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద నుంచి 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, అతడిని రిమాండ్‌కు తరలించారు. నగరంలో కలకలం రేపిన ఈ కేసును కేవలం రెండు గంటల్లోనే ఛేదించిన ఈస్ట్ జోన్ క్రైమ్ సీఐ, సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తరఫున క్రైమ్ డీసీపీ అభినందించారు. -
అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు
సాక్షి, విశాఖపట్నం: అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు ప్రవేశించాయి. ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. మరో 24 గంటల్లో దక్షిణ అండమాన్‌ను రుతు పవనాలు తాకనున్నాయి. 60 శాతం స్టేషన్లలో 2.5 సెంటీమీటర్ల వర్షపాతం ఆధారంగా నైరుతి ఆగమనాన్ని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ రుతుపవనాలకు సహకరిస్తుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.కాగా, భారత్‌లోకి నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే ఐదు రోజులు ముందే.. అంటే మే 26నే కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ ఇవాళ(శుక్రవారం) ప్రకటించింది. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. దేశంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల కాలానికి ఇదే ఆరంభం. అంతకుముందు నిన్న (మంగళవారం) వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేస్తూ.. ఈ వారాంతానికి దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో నైరుతి రుతుపవనాల రాకకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని పేర్కొంది.సాధారణంగా మే 20 ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవులను తాకే రుతుపవనాలు, ఆ తర్వాత పశ్చిమ దిశగా భారత ప్రధాన భూభాగం వైపు విస్తరిస్తాయి. అయితే, ఈ ఏడాది రుతు పవనాల సీజన్లో భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇందుకు 'ఎల్ నినో పరిస్థితులు ఏర్పడటమే కారణం కావచ్చని పేర్కొంది. ఐఎండీ ప్రకారం... ఈ ఏడాది భారతదేశంలో 80 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. -
బాబూ.. అది పుష్పక విమానం కాదు..
విశాఖపట్నం: సాగర తీరంలో ఈ యువకుల ప్రయాణం చూస్తుంటే.. అది బైకులా కాకుండా అందరూ ఇట్టే ఇమిడిపోయే ‘పుష్పక విమానం’లా కనిపిస్తున్నట్టుంది. నిబంధనల ప్రకారం ఇద్దరికే చోటున్నా, ఏకంగా నలుగురు ఎక్కి ‘చతుర్ముఖ’ ప్రయాణంతో ట్రాఫిక్ రూల్స్‌ను నడిరోడ్డుపై గాలికొదిలేశారు. అటు హెల్మెట్ లేదు.. ఇటు భద్రతా లేదు.. కేవలం సరదా కోసం ప్రాణాలను పణంగా పెడుతూ చేస్తున్న ఈ సాహసం ఏ మాత్రం అదుపు తప్పినా తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తుంది. -
మద్యం మానిపిస్తే ఆత్మహత్య చేసుకుంటా..
విశాఖపట్నం జిల్లా: మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఓ వ్యక్తి, పునరావాస కేంద్రానికి తరలిస్తుండగా నడిరోడ్డుపై హల్చల్ చేశాడు. బలవంతంగా మద్యం మానిపిస్తే బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానని అలజడి సృష్టించాడు. రిహాబిలిటేషన్ కేంద్రానికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో ద్విచక్ర వాహనం పైనుంచి దిగిపోయి, ఆర్టీసీ బస్సు కింద పడుకుని నానా యాగీ చేశాడు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని అదుపులోకి తీసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గోపాలపట్నం సమీపంలోని బాజీ జంక్షన్‌కు చెందిన భార్గవ్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో అతడికి మద్యం మానిపించేందుకు చినముషిడివాడలోని రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలిస్తున్నారు. అయితే సుజాతనగర్ బీఆర్టీఎస్ రహదారిపై ఒక్కసారిగా వాహనం దిగిపోయిన భార్గవ్.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఆపేశాడు. వెంటనే బస్సు కింద పడుకుని, తనను కేంద్రానికి తరలిస్తే ఆత్మహత్య చేసుకుంటానని భీష్మించాడు. దీంతో ప్రయాణికులు పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని స్టేషన్‌కు తరలించారు. అనంతరం కౌన్సిలింగ్ నిర్వహించి, అతడికి మెరుగైన మానసిక చికిత్స అందించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. -
‘బైక్ కావాలి’ అంటూ భార్యను వేధించిన ఇంజినీర్ భర్త!
శ్రీకాకుళం క్రైమ్/గార : వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైపోయింది. ఉరేసుకుని చనిపోయిందని భర్త చెబుతుండగా.. అల్లుడే తమ కుమార్తెను చంపేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గార మండలం శిమ్మపేటకు చెందిన శిమ్మ లక్ష్మీ నారాయణ, శారద దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి కుమారుడు గౌతమ్, డిగ్రీ బీఎస్సీ చదివిన కుమార్తె తేజశ్రీ(22) ఉన్నారు. తేజశ్రీకి శ్రీకాకుళం మండలం రాగోలు సమీప గూడెంకు చెందిన రుప్ప మల్లేషు కుమారుడు సోమేష్‌తో ఈ ఏడాది మార్చి 6న వివాహం జరిగింది. కట్నం కింద రూ. 20 లక్షల నగదు, 20 తులాల బంగారం చెల్లించారు. మొదటి రోజు నుంచే వేధింపులు.. విశాఖపట్నం ఎల్అండ్టీ కంపెనీలో ఇంజినీర్‌గా ఉన్న సోమేష్ నావల్ డాక్‌యార్డ్‌లో ప్రాజెక్టు డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. విశాఖ రామా టాకీస్ సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల ఓ యువతిని సోమేష్ ఇంటికి తేవడంతో తేజశ్రీ భర్తను నిలదీసింది. అది సహించని సోమేష్ రూ.3 లక్షల విలువైన బైక్ కావాలని వేధించడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులకు తేజశ్రీ విషయం చెప్పడంతో నాలుగైదు రోజుల్లోనే బండి కొనిచ్చేశారు. వారం రోజుల తర్వాత పది సెంట్లు భూమి రాయాలని, తులం నల్లపూసలు చేయించాలని మళ్లీ వేధించడంతో పాటు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. పెళ్లి ఆల్బమ్‌లో సగం మొత్తం రూ. 1.50 లక్షలు అడగడంతో రూ.50 వేలు సైతం ఇచ్చారు. గొడవవుతుందని.. ఈనెల 7వ తేదీన ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య సోమేష్, తేజశ్రీల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ తమకు ఫోన్ చేశారని, గొడవ మామూలేనని తేజశ్రీ తమతో చెప్పిందని, ఆ తర్వాత పలు దఫాలు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. 9.30 గంటలకు ఉరివేసుకుని మీ పాప చనిపోయిందని తన ఫ్రెండ్‌తో సోమేష్ ఫోన్ చేయించడంతో ఒక్కసారి హతాశులయ్యామని, వెంటనే విశాఖ బయల్దేరి వెళ్లామని పేర్కొన్నారు. అక్కడికి వెళ్లి చూసేసరికి కుమార్తె బెడ్ మీద విగతజీవిగా ఉందని, మెడ, కాళ్లపై వాతలున్నాయని, సోమేష్ స్నేహితులు ముగ్గురు అక్కడే ఉండటంతో ఆమెను చంపేసి వుంటారని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే విషయమై విశాఖ పట్నం త్రీటౌన్‌లో కేసు పెట్టామని, సోమేష్‌ను అదే రోజు పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. తమ కుమార్తెకు తీరని అన్యాయం జరిగిందని.. అదనపు వరకట్నం కోసం వేధించడమే కాక హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లిదండ్రులు వాపోయారు. -
జనసేన Vs టీడీపీ.. ఫ్లెక్సీలో ఫొటోపై రచ్చ..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో టీడీపీ, జనసేనలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. విశాఖ సౌత్ నియోజకవర్గంలో తాజాగా టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆధిపత్యం కోసం ఇరు వర్గాల నేతలు మాటల దాడి చేస్తున్నారు. దీంతో, ఈ వ్యవహారంలో చర్చనీయాంశంగా మారింది.విశాఖ సౌత్ నియోజకవర్గంలో కనకమహాలక్ష్మి ఆలయ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, ఫ్లెక్సీలో టీడీపీ ఇన్చార్జ్ సీతంరాజు సుధాకర్ ఫొటోలు కనిపించలేదు. జనసేన నేతలు టీడీపీ నాయకుడి ఫొటోలను పెట్టలేదు. దీంతో, రాజకీయ దుమారం రేగింది. జనసేన నేతల వైఖరిపై సుధాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే, విశాఖ సౌత్‌లో గత కొంతకాలంగా జనసేన ఎమ్మెల్యే వంశీ, సీతంరాజు సుధాకర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో జనసేన నేతల తీరుపై టీడీపీ అధిష్టానానికి సుధాకర్ ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా టీడీపీ నేతలు.. జనసేన కేడర్‌పై మండిపడుతున్నారు. జనసేన నాయకులు పొత్తు ధర్మం పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. . -
ఏపీకి అలర్ట్.. రాగల మూడు గంటల్లో..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో అనకాపల్లి, అల్లూరి, పోలవరం, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ రోజు, రేపు(శుక్ర,శని) వానలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మరో వైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుండగా... ఇటు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అధిక వేడి, ఉక్కపోతకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు కొబ్బరినీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు డీ హైడ్రేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుందన్నారు. వీటితో పాటు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవడం ఉత్తమం. బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీతో పాటు కళ్లజోడు తప్పనిసరిగా పెట్టుకోవాలి. మహిళలు గొడుగులు తప్పనిసరిగా ఉపయోగించాలి. కాటన్ దుస్తులు ధరించడం శ్రేయస్కరమని వైద్యులు తెలిపారు. -
విశాఖపట్నం : ఆహ్లాదకర వేళ.. బీచ్‌లో సందడి (ఫొటోలు)
-
‘ఏయూ శతాబ్ధి ఉత్సవాల్లో చారిత్రక తప్పిదం’
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వార్షికోత్సం జరుగుతున్నందుకు సంతోషమే. ఈ సందర్భంలో ఈ యూనివర్శిటీ స్థాపన జరిగిన తీరు, అందుకు కృషి చేసిన మహానుభావులను స్మరించుకోవడం అవశ్యం. లక్షలాది మంది విద్యార్ధులకు విద్యావకాశాలు కల్పించిన ఆంధ్ర యూనివర్శిటీ ఇప్పటికీ సమున్నతంగా వెలుగుతోంది. శతాబ్ది ఉత్సవాలలో ప్రసంగించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు కొన్ని చారిత్రక అంశాలను ప్రస్తావించినట్లు కనిపించలేదు. అందుకే చరిత్ర కొంత గుర్తు చేయడం అవసరం అనిపిస్తోంది..ఈ యూనివర్శిటీని స్థాపించడానికి పానగల్ మహారాజు కారణమని చెప్పాలి. ఈయన గొప్పదనం గురించి అతిధులు మాట్లాడినట్లు కనిపించలేదు. ఆంధ్ర విశ్వ విద్యా పరిషత్తు ను స్థాపించాలని కోరుతూ ప్రఖ్యాత స్వాతంత్ర యోధులు, తెలుగు నేతలు ప్రకాశం పంతులు ,కొండా వెంకటప్పయ్య పంతులు తదితరులు ఆంధ్ర మహాసభల ద్వారా ప్రజలను చైతన్యపరచేవారు. ఆ దశలో పానగల్లు రాజా పానుగంటి వెంకట రాయనం మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా (1925- 28) ఎన్నికయ్యారు. ఆయన చొరవ చూపించి, ఆంధ్ర నేతల డిమాండ్ ను పరిగణనలోకి తీసుకుని ఆంధ్ర యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ ప్రతిపాదనను తమిళ ప్రజా ప్రతినిధులు వ్యతిరేకించినా ఈయన ముందుకు తీసుకువెళ్లారు. ఈ యూనివర్శిటీని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న చర్చ వచ్చినప్పుడు కొంతమంది రాయలసీమను సూచించారు. కాని అన్నిటిని పరిగణనలోకి తీసుకున్న పానగల్ రాజా దీనిని విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం తన రాజకీయ ప్రత్యర్ధి అయిన సర్ సీఆర్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి సహకరించాలని కోరారు. అప్పటికే ప్రముఖ విద్యావేత్తగా పేరొందిన సీఆర్ రెడ్డి అందుకు అంగీకరించడంతో ఈ యూనివర్శిటీ ఏర్పాటు సాధ్యమైంది. తొలి వీసీగా ఉండాలని రాజా కోరడం, సీఆర్ రెడ్డి సిద్దపడడం విశేషం. ఈ సందర్భంగా సీఆర్ రెడ్డి పానగల్ రాజాగారికి ఒక సలహా ఇచ్చారు. యూనివర్శిటీ పెట్టాలంటే కాలేజీలు అవసరం అని.. కాలేజీలకు హైస్కూళ్లు అత్యవసరం అవుతాయని చెప్పారు. ఈ కారణంగా ప్రతి తాలూకా కేంద్రంలో ఒక హైస్కూలును ఏర్పాటు చేయాలన్న సీఆర్ రెడ్డి సలహాను పానగల్ రాజా గారు పాటించారు. (అప్పట్లో కృష్ణా జిల్లాలో బందరు, విజయవాడల్లో హైస్కూళ్లు ఉండేవి. రాజా గారి నిర్ణయం కారణంగా ప్రతి తాలూకా కేంద్రంలో ఒక హైస్కూల్ ఏర్పాటైంది.) ఈ చర్య వల్ల ఆంధ్ర ప్రాంతంలో విద్యావ్యవస్థకు బలమైన పునాది పడింది.తదుపరి 1926లో యూనివర్శిటీ ఏర్పాటు జరిగింది. మౌలిక వసతులు వచ్చేవరకు తాత్కాలికంగా విజయవాడలో నిర్వహించి తదుపరి విశాఖకు తరలించారు. సీఆర్ రెడ్డి తర్వాత ప్రముఖ విద్యా వేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ వైస్ చాన్సలర్‌గా నియమితులై అనన్యమైన సేవలు అందించారు. తదనంతర కాలంలో ఆయన రాష్ట్రపతి అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి మహనీయుల కృషి వల్ల కోస్తా, రాయలసీమలలోని పలు జిల్లాలలో కాలేజీలు హైస్కూళ్లు స్థాపితం అయ్యాయి. ఇందుకు పలువురు జమిందార్ రాజాలు కూడా సహకరించారు. పర్లాకిమిడి జిల్లాలోని జైపూర్ మహారాజు విక్రమ్ దేవ్ విశాఖలో యూనివర్శిటీ భవనాల నిర్మాణానికి ఆర్ధిక సాయం చేశారు. అందుకు కృతజ్ఞతగా యూనివర్శిటీ ప్రాంగణంలో ఆయన విగ్రహం కూడా పెట్టారు. ఆంధ్ర యూనివర్శిటీ స్థాపనకు కారకుడైన పానగల్ మహారాజ తన విగ్రహం వద్దని, విక్రమ్ దేవ్ విగ్రహం పెట్టాలని సూచించడం ఆయన ఔదార్యానికి నిదర్శనం. శతవార్షికోత్సవం సందర్భంగా ఈ చరిత్ర ప్రజలకు తెలియాలని ఆశిస్తున్నాను.:::దేవులపల్లి గోపాలరావు, హైకోర్టు న్యాయవాది -
99 పైసలకు 20 ఎకరాల కేటాయింపు
సాక్షి, అమరావతి: విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన ఎండాడలో ఇన్ఫోసిస్ క్యాంపస్ కోసం సుమారు రూ.1,000 కోట్లకుపైగా విలువ కలిగిన 20 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ లిఫ్ట్ పాలసీ 2024–29 ప్రకారం ఇన్ఫోసిస్ లిమిటెడ్‌కు మొత్తం 20 ఎకరాల భూమిని 99 పైసలకే కేటాయిస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ భూమిలో ఇన్ఫోసిస్ రెండు దశల్లో రూ.750 కోట్ల పెట్టుబడితో క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తుందని తెలిపారు.దీంతోపాటు ఎండాడ వద్ద సర్వే నెంబర్ 175/పీలో మరో 5 ఎకరాల భూమిని భవిష్యత్తు అవసరాలకు ఇన్ఫోసిస్‌కు కేటాయించడానికి ఏపీఐఐసీకి బదలాయించాలని రెవెన్యూశాఖను కోరింది. ఈ క్యాంపస్‌కు అవసరమైన మౌలికవసతులను రూ.79 కోట్లతో ఏపీఐఐసీ, వీఎంఆర్డీఏ కల్పించనున్నాయి.2029 జనవరి నాటికి తొలి దశ పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తం ఆరేళ్లలో రెండు దశలను పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టుకు 100 శాతం గ్రీన్ఎనర్జీని అందించాలని ఇంధన శాఖను ఆదేశించింది. భూమి అమ్మకం ఒప్పందం కుదిరిన 120 రోజుల్లోగా అనుమతుల కోసం కంపెనీ దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
వైజాగ్ ఇన్ఫోసిస్ @ వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఖజానా ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా మాజీ సీఎం వైఎస్ జగన్ విశాఖకు ఇన్ఫోసిస్‌ను తీసుకువస్తే.. ఇప్పటికే అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అదే ఐటీ సంస్థకు రూ.1,000 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే చంద్రబాబు సర్కారు కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వమే రూ.వేల కోట్ల విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు పప్పు బెల్లాలుగా అప్పగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నిలదీసినా చంద్రబాబు సర్కారులో ఎటువంటి మార్పులేదు.రూ.వేల కోట్ల లాభాలను గడిస్తూ... ఒకపక్క తన దగ్గర ఉన్న భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయిస్తున్న ఇన్ఫోసిస్‌కు తాజాగా విశాఖలోని ఎండాడలో అత్యంత ఖరీదైన భూములను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు హైదరాబాద్‌లో వేలం ద్వారా భూములను విక్రయిస్తూ తెలంగాణ ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని పొందుతుంటే, రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు సర్కారు రూ.వేల కోట్ల విలువైన భూములను కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తోంది. తొలిసారిగా టైర్–2 నగరానికి తెచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే తొలిసారిగా ఇన్ఫోసిస్‌ను టైర్–2 నగరానికి తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికే దక్కుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మధురవాడలోని ఐటీ హిల్–2లో ఇన్ఫోసిస్ సొంతంగా ఒక ప్రైవేటు బిల్డింగ్‌లో 1,000 సీట్లతో ఏర్పాటు చేసుకున్న డెవలప్మెంట్ సెంటర్‌ను 2023 అక్టోబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. భవిష్యత్తులో విస్తరణకు సహాయ సహకారాలను అందిస్తామని హామీనిచ్చారు.అయితే అప్పుడు రాష్ట్ర ఖజానాకు ఎటువంటి నష్టం లేకుండా ఐటీ కంపెనీని తీసుకువస్తే.. చంద్రబాబు సర్కారు మాత్రం మూడు నెలలకు ఒకసారి రూ.8,500 కోట్లకుపైగా లాభాలు గడించే ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజానికి 99 పైసలకే విలువైన భూమిని కేటాయించడాన్ని మేధావులు విమర్శిస్తున్నారు. గతేడాది బెంగళూరులో తన వద్ద అదనంగా ఉన్న 53 ఎకరాలను ఇన్ఫోసిస్ రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయించిందని, ఇలా రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములను విక్రయించుకుంటున్న సంస్థకు విశాఖలో రూ.వేల కోట్ల విలువైన భూమిని 99 పైసలకే ఏ విధంగా కట్టబెడతారంటూ ప్రశి్నస్తున్నారు. భూములివ్వడంతోపాటు భవన నిర్మాణానికీ డబ్బులు..! చంద్రబాబు సర్కారు ఇప్పటికే విశాఖలో ఐటీ ముసుగులో అనేక రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములను కేటాయిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తోంది. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలకు 99 పైసలకు భూములు కేటాయించినట్లు చూపిస్తూ అదే సమయంలో రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా భూములను కట్టబెడుతోంది. ఐటీ క్యాంపస్‌లు, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్స్ పేరిట కే.రహేజా, సత్వా, కపిల్ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా భూములను కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.అంతేకాకుండా ఇలా కేటాయించిన భూముల్లో 50 శాతం స్థలం వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతించడాన్ని వీరు తప్పుబడుతున్నారు. అది చాలదన్నట్లు.. ఆ సంస్థలు పెడుతున్న పెట్టుబడిలో 60 నుంచి 70 శాతం ప్రోత్సాహకాల రూపంలో తిరిగి వెనక్కి ఇవ్వడంతోపాటు భవన నిర్మాణాల కోసం ఒక్కో చదరపు అడుగుకు రూ.2,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెల్లిస్తోందంటూ తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
గీతం యూనివర్శిటీ ఎదుట వైఎస్సార్సీపీ నిరసన
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చలో గీతం యూనివర్సిటీకి పిలుపునిచ్చింది. రుషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి గీతం యూనివర్సిటీ వరకు వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గీతం యూనివర్సిటీ ముందు వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ర్యాలీలో వైఎస్సార్సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, మోల్లి అప్పారావు, దేవన్ రెడ్డి, మళ్ల విజయప్రసాద్ పాల్గొన్నారు.గీతం యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గీతం యూనివర్శిటీకి ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పోరాటానికి దిగింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నేతలు నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ నిరసన నేపథ్యంలో గీతం యూనివర్సిటీ ముందు పోలీసులు భారీగా మోహరించారు. -
సింహాచలం : స్వామి నిజరూప దర్శనం.. భక్తులకు అష్టకష్టాలు (ఫొటోలు)
-
గాజువాకలో అగ్నిప్రమాదం
విశాఖ: గాజువాకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకన్య థియేటర్ దగ్గర ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఎలక్ట్రానిక్ షోరూమ్ పై అంతస్తులో మంటలు ఎగిసి పడుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మరొకవైపు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. -
విశాఖపట్నం : ‘కళా సెంటినియల్ సాగా’ చిత్రకళా ప్రదర్శన (ఫొటోలు)
-
విశాఖ నుంచి తొలిసారిగా అంతర్జాతీయ క్రూయిజ్ సేవలు
సాక్షి, విశాఖపట్నం : విహార ప్రపంచానికి విశాఖ నగరం మరోసారి ముస్తాబవుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం పోర్టు అథారిటీలో అందుబాటులోకి వచ్చిన క్రూయిజ్ టెర్మినల్ నుంచి అంతర్జాతీయ విహార యాత్రకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలుమార్లు దేశీయంగా సర్వీసులు నడవగా తొలిసారిగా అంతర్జాతీయ సర్వీసులకు కార్డిలియో విహార నౌక గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిoది. ఈ ఏడాది జూలై 15న విశాఖపట్నం నుంచి సర్వీసు ప్రారంభం కానుందని ఏపీ టూరిజం ఫోరం ప్రతినిధులు వెల్లడించారు. మొత్తం 14 రోజులపాటు సాగే ఈ విహార యాత్ర విశాఖ నుంచి మొదలై చెన్నై మీదుగా థాయ్‌లాండ్‌లోని ఫుకెట్, మలేషియాలోని లంకావి, కౌలాలంపూర్ పట్టణాలను సందర్శిస్తూ చివరకు సింగపూర్ చేరుకోనుందని తెలిపారు. ఈ యాత్రలో భాగంగా ప్రయాణికులు సముద్రం మధ్యలో మూడు రోజులపాటు విహరిస్తూ నౌకలోని విలాసవంతమైన సౌకర్యాలు, వినోద కార్యక్రమాలు, రుచికరమైన భోజనాలు రుచి చూడవచ్చని తెలిపారు. ముఖ్యంగా ఫుకెట్‌లో రెండు రోజులపాటు బస చేసే అవకాశం ఉండటంతో పర్యాటకులు అక్కడి అందమైన తీరాలను, థాయ్‌లాండ్ దేశ సంస్కృతి సంప్రదాయాలను ఆస్వాదించవచ్చని వెల్లడించారు. ఈ యాత్రకు వెళ్లే పర్యాటకులు పాస్‌పోర్ట్ కనీసం ఆరు నెలల కాలపరిమితి కలిగి ఉండేలా చూసుకోవాలని టూరిజం ఫోరం ప్రతినిధులు సూచించారు. థాయ్‌లాండ్, మలేషియా దేశాలకు చేరుకున్నాక అనుమతులు లభిస్తాయని, సింగపూర్ సందర్శనకు మాత్రం ముందే అనుమతి పత్రాలు తీసుకోవాలని పర్యాటక శాఖ అధికారులు స్పష్టం చేశారు. -
నంబరు లేని వాహనంలో హోం మంత్రి ప్రయాణం
విశాఖపట్నం: రాష్ట్ర హోం మంత్రి అనిత శనివారం సాయంత్రం బీచ్‌రోడ్డులో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ ప్రదర్శనలో పాల్గొన్నారు. అయితే, ఆమె నంబరు లేని వాహనంలో ప్రయాణించడం చర్చనీయాంశమైంది. బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తూ కనిపించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వాహనంపై కనీసం తాత్కాలిక (టీఆర్) నంబరు కూడా లేకపోవడం గమనార్హం. -
భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)
-
మౌనిక హత్య కేసులో కొత్త మలుపు
విశాఖపట్నం: గాజువాకలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసులో కొత్తమలుపు చోటుచేసుకుంది. నిందితుడు చింతాడ రవీంద్ర పోలీసులనే తప్పుదోవ పట్టించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మౌనికను వేరే అపార్ట్మెంట్లో హత్య చేసి మృతదేహాన్ని ఒక ట్రాలీ బ్యాగ్‌లో తాను నివాసముంటున్న అపార్ట్మెంట్ ఫ్లాట్‌కు తీసుకొచ్చినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తాను నివాసముంటున్న కీర్తి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో మౌనికను హత్య చేసినట్టు పోలీసుల వద్ద నిందితుడు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఆ రోజు రవీంద్ర ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు మౌనిక వచ్చినట్టు సీసీ కెమెరాలో ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదు. దీంతో అతడిని పోలీసులు తమ కస్టడీకి తీసుకొని విచారించగా, తాను మౌనికను హత్య చేసింది తన అపార్ట్మెంట్లో కాదని, అక్కడికి సమీపంలో ఉన్న మరో అపార్ట్మెంట్లోని తన స్నేహితుడి ఫ్లాట్‌లోనని చెప్పడంతో పోలీసులు ఆ అపార్ట్మెంట్లో సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. అక్కడికి మౌనిక వచ్చినట్టు, ఆమె మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్‌లో తరలించినట్టు సీసీ కెమెరాలో ఫుటేజ్ ద్వారా పోలీసులు నిర్ధారించుకున్నారు. అసలు ఏం జరిగిందంటే? నగరంలోని సంజీవయ్యనగర్‌కు చెందిన మౌనికను నేవీ ఉద్యోగి చింతల రవీంద్ర గత నెల 29న పాతగాజువాకలోని ఎల్వీనగర్లోని ఒక అపార్ట్మెంట్లో పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య అనంతరం అతడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడు చెప్పిన దాని ప్రకారం మౌనికను కీర్తి ఎన్‌క్లేవ్‌లోనే హత్య చేశాడని పోలీసులు సైతం అనుకున్నారు. దాని ప్రకారం అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం పలుమార్లు నిందితుడు నివాసముండే అపార్ట్‌మెంట్‌తోపాటు, తల, చేతులు కాల్చిన ధారపాలేనికి వెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. కీర్తి ఎన్‌క్లేవ్‌లో హత్య జరిగిన రోజుగాని, అంతకుముందు మూడు రోజులుగాని హతురాలు మౌనిక నిందితుడి ఇంటికి వచ్చినట్టు సీసీ కెమెరాలో నమోదు కాలేదు. ఇతర ఆధారాలు కూడా లభించలేదు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. దీంతో పోలీసులు రవీంద్రను తమ కస్టడీకి తీసుకొని పలు కోణాల్లో విచారించారు. ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం.. ఫ్రిజ్‌లో శరీర భాగాలు! మౌనికను తమ అపార్ట్‌మెంట్‌కు సమీపంలో ఉన్న తన స్నేహితుడి అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో హత్య చేసినట్టు నిందితుడు చెప్పినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. రవీంద్ర స్నేహితుడు సురేంద్రతోపాటు మరో ఇద్దరు కలిసి హత్య జరిగిన ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. గత నెల 29న స్నేహితుడు సురేంద్రకు ఫోన్ చేయగా, ఇంట్లో ఎవరం లేమని, డ్యూటీలో ఉన్నామని చెప్పాడు. ఫ్లాట్‌లో ఎవరూ లేకపోవడాన్ని అదనుగా భావించిన రవీంద్ర ప్రియురాలు మౌనికను పథకం ప్రకారం హత్య చేయడానికి స్నేహితుడి ఫ్లాట్‌కు తీసుకువెళ్లాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న క్రమంలో రవీంద్ర ఆవేశంతో మౌనిక నోరు, ముక్కు మూసి ప్రాణాలు తీశాడు. మృతదేహాన్ని ఒక ట్రాలీ బ్యాగ్‌లో పెట్టి తన ఫ్లాట్‌కు తీసుకెళ్లిపోయాడు. అక్కడ మృతదేహాన్ని ముక్కలుగా నరికి కొన్ని భాగాలను రిఫ్రిజిరేటర్లో, మరికొన్ని భాగాలను మంచం కింద ఉంచాడు. తల, చేతులను ఒక గోనె సంచిలో మూటగట్టి అడవివరం దరి ధారపాలెంలోని జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చేశాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు సురేంద్రకు ఫోన్లో చెప్పగా, పోలీసులకు వెంటనే లొంగిపోవాలని అతడు సూచించడంతోపాటు రాజాంలో ఉన్న నిందితుడి సోదరుడికి, గాజువాక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈలోగా రవీంద్రను తమ్ముడు గాజువాక పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించాడు. కాగా, ఈ హత్యపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మౌనికను హత్య చేసింది రవీంద్ర ఒక్కడేనా, ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మౌనిక డబ్బుల కోసం వేధిస్తుండటం వల్లే హత్య చేశానని నిందితుడు చెప్పిన నేపథ్యంలో నిజానిజాలపై పోలీసులు మరింత లోతుగా ఆరా తీస్తున్నారు. -
రనౌట్ వివాదం : అంపైర్‌ను పొడిచి చంపేశాడు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్‌లో రనౌట్ నిర్ణయం అంపైర్ ప్రాణం తీసింది. స్థానిక మ్యాచ్‌లో 21 ఏళ్ల క్రికెట్ అంపైర్‌ను కత్తితో పొడిచి చంపిన వైనం దిగ్భ్రాంతి రేపింది. ఎన్డీటీవీ కథనం ప్రకారం బాధితుడు, డోల అజిత్ బాబు, తన తోటి అంపైర్ బుదుమూరి చిరంజీవితో కలిసి స్థానిక మైదానంలో ఆదివారం క్రికెట్ ఆడారు. మూడు జట్లు పాల్గొంటున్న ఈ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించాడు అజిత్. ఇందులో భాగంగా అఇత్ రనౌట్ నిర్ణయంపై రెండు ప్రాంతాలకు చెందిన ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చెలరేగగా, ఇద్దరు అంపైర్లు దానిని మైదానంలోనే పరిష్కరించారు. అయితే, అంతా సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో 26 ఏళ్ల కాంతా కిషోర్ (ప్రేక్షకుడు) ఆగ్రహానికి గురై అంపైర్లను, ఆటగాళ్లను దూషించడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. మ్యాచ్ ముగిసిన తర్వాత, మాట్లాడుదాం రమ్మంటూ కిషోర్ సమీపంలోని ఒక ప్రదేశానికి అంపైర్లను పిలిపించాడు, అతని అభ్యర్థన మేరకు అజిత్ బాబు, చిరంజీవి, మరికొందరు స్నేహితులు అక్కడికి వెళ్లారు. వారు అక్కడికి వెళ్లగానే మరో సారి వాగ్వాదం చెలరేగింది.దీంతో కిషోర్ అకస్మాత్తుగా కత్తి తీసి ఇద్దరు అంపైర్లపై దాడి చేశాడు,సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు తెలిపారు. ఈ దాడిలో అజిత్ బాబు ఛాతీపై కత్తిపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. పారిపోయే ప్రయత్నంలో చిరంజీవికి తీవ్ర రక్తస్రావ గాయాలయ్యాయని, జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన మరో వ్యక్తి కూడా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్ దోస పిండిగాయపడిన అజిత్ బాబును VIMS ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ డాక్టర్లు అందుబాటులో లేక పోవడంతో, అపోలో ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ వైద్యులు ఆయన మరణించినట్లు ప్రకటించారు. మ్యాచ్‌లో ఆటగాడు కూడా కాని వ్యక్తి పథకం ప్రకారమే ఈ దాడి చేశాడని బాధితుడి సోదరుడు ఆరోపించాడు. పొరుగు కాలనీలోని వినాయక్ నగర్ నివాసి అయిన కిషోర్, ఈ వివాదంలోకి చొరబడి, దుర్భాషలాడి, ఆ తర్వాత మద్యం మత్తులో తిరిగి వచ్చి హత్య చేశాడని అతను చెప్పాడు. ఆ రోజు ఉదయం గ్రామ పెద్దలు ఒకే ఒక్క పరుగు విషయంలో తలెత్తిన విభేదాన్ని ఇప్పటికే పరిష్కరించినా ఈ హత్యకు పూనుకున్నాడని అజిత్ సోదరుడు వాపోయాడు. కిషోర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ తప్పించు కొని పారిపోయాడని అజిత్ సోదరుడు ఆరోపించాడు. మృతుడి తండ్రి డోలా అప్పల రాజు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు కిషోర్‌పై హత్య కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి
విశాఖపట్నం: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఆరిలోవ ఎస్ఐ కృష్ణ తెలిపిన వివరాలివి.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌కు చెందిన షాతక్షి రావు (23), ఆమె స్నేహితుడు చంద్రశేఖర్ మిశ్రా భువనేశ్వర్‌లోని కళింగ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. కళాశాలకు సెలవులు కావడంతో వారిద్దరూ కలిసి సోమవారం విశాఖ పర్యటనకు వచ్చారు. నగరంలో ఒక స్కూటీని అద్దెకు తీసుకుని, పీఎంపాలెం వైపు నుంచి జాతీయ రహదారిపై వస్తుండగా.. ఎండాడ – జూ పార్క్ మధ్యలో వెనుకనే వస్తున్న ఓ బస్సు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ వెనుక కూర్చున్న షాతక్షి రావు తలకు తీవ్ర గాయాలై, అధిక రక్తస్రావం కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఆరిలోవ ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై ఆరిలోవ లా అండ్ ఆర్డర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సును స్టేషన్‌కు తరలించి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
సంద్రాన సమరాంగణం సాగర గర్భంలో సొరంగం
సాక్షి, విశాఖపట్నం: నౌకా దళ రక్షణ రంగంలో సరికొత్త విప్లవానికి విశాఖ నగరం మరోసారి వేదికగా మారనుంది. నౌకా నిర్మాణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా.. భారత్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో ‘లార్జ్ కావిటేషన్ టన్నెల్(ఎల్సీటీ)’ నిర్మాణానికి శంకుస్థాపనతో నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొరేటరీ(ఎన్ఎస్టీఎల్) సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోని అత్యుత్తమ టన్నెళ్లలో ఒకటిగా ఇది నిలవనుంది. సముద్ర గర్భంలోనే యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల సామర్థ్యాన్ని పరీక్షించేలా ఈ సొరంగాన్ని నిర్మించనున్నారు. ఎల్సీటీ పూర్తయితే.. కాన్సెప్ట్ డిజైన్ నుంచి ఫైనల్ టెస్టింగ్ వరకూ ఒకే చోట జరిగే వేదికగా విశాఖ చరిత్రపుటలకెక్కనుంది. రెండు రోజుల క్రితం విశాఖలో పర్యటించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏమిటీ లార్జ్ కావిటేషన్ టన్నెల్.. సాధారణంగా నౌకలు లేదా జలాంతర్గాములు నీటిలో వేగంగా ప్రయాణించేటప్పుడు వాటి ప్రొపెల్లర్ల దగ్గర నీటి ఒత్తిడి తగ్గి, చిన్న చిన్న గాలి బుడగలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియనే శాస్త్రీయంగా ‘కావిటేషన్’ అంటారు. ఈ బుడగలు పేలినప్పుడు విపరీతమైన శబ్దం రావడమే కాకుండా, ప్రొపెల్లర్లను దెబ్బతీస్తాయి. దీనివల్ల.. పరిశోధనలకు విఘాతం కలుగుతుంటుంది. ఈ సమస్యను లోతుగా అధ్యయనం చేసేందుకు, కృత్రిమంగా సముద్ర వాతావరణాన్ని సృష్టించే ఒక భారీ నీటి సొరంగాన్ని ఏర్పాటు చేస్తారు. దీన్నే ‘లార్జ్ కావిటేషన్ టన్నెల్’ అని పిలుస్తారు. విశాఖలో సుమారు 230 మీటర్ల పొడవు ఉండే టన్నెల్‌ని నిర్మించనున్నారు. ఈ టన్నెల్లో నీటి ప్రవాహ వేగాన్ని, ఒత్తిడిని నియంత్రిస్తూ నౌకల నమూనాలను పరీక్షించుకునే అవకాశం ఉంటుంది. ఎల్సీటీ ప్రయోజనాలేంటి.? » యుద్ధ సమయంలో శత్రువుల రాడార్లకు చిక్కకుండా ఉండాలంటే నౌకలు శబ్దం చేయకూడదు. ఈ టన్నెల్ ద్వారా ప్రొపెల్లర్ల శబ్దాన్ని కనిష్ట స్థాయికి ఎలా తగ్గించాలో శాస్త్రవేత్తలు పరిశోధించవచ్చు. » భారీ నౌకలను సముద్రంలోకి దించిన తర్వాత లోపాలు గుర్తిస్తే సరిదిద్దడం కష్టం. కానీ ఎల్సీటీలో నమూనా నౌకలను ఉంచి, వివిధ వేగాల వద్ద అవి ఎలా పనిచేస్తాయో ముందే తెలుసుకోవచ్చు. ఫలితంగా.. లోపాల్ని సులువుగా సరిదిద్దే అవకాశం ఉంటుంది. » ప్రొపెల్లర్ల రూపకల్పనను మెరుగుపరచడం ద్వారా నీటి ఘర్షణను తగ్గించి, ఇంధన వినియోగాన్ని ఆదా చేయవచ్చు. » కేవలం నౌకలే కాదు.. నీటిలోపల ప్రయోగించే క్షిపణులైన టార్పెడోల్ని కూడా ఇక్కడ పరీక్షిస్తారు. టార్పెడో నీటిలో ప్రయాణించేటప్పుడు దాని స్థిరత్వం ఎలా ఉంది, ప్రయాణ మార్గంలో నీటి ఒత్తిడికి అది ఎలా స్పందిస్తోంది అనేది ఇక్కడ కచ్చితంగా లెక్కించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల సరసన ఈ ఎల్సీటీ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతికొద్ది అత్యాధునిక టన్నెళ్లలో ఒకటి. దీని నిర్మాణంతో అమెరికా, రష్యా, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల సరసన ఇప్పుడు భారత్ నిలవనుంది. ఇది కేవలం మన దేశ అవసరాలకే కాకుండా, భవిష్యత్తులో మిత్ర దేశాల నౌకా నమూనాల పరీక్షలకూ వేదికవుతుంది. నౌకాదళానికి, ఎన్‌ఎస్‌టీఎల్‌కు లాభమేంటంటే.? నగరంలో ఉన్న రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అనుబంధ సంస్థ ఎన్ఎస్టీఎల్ ఆధ్వర్యంలో ఈ ఎల్సీటీ సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. గతంలో ఈ తరహా పరీక్షల కోసం రష్యా లేదా యూరప్ దేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మన దేశంలోనే, స్వదేశీ పరిజ్ఞానంతో ఈ పరీక్షలు నిర్వహించుకునే అవకాశం కలుగుతుంది. దీనివల్ల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. అదేవిధంగా.. మన యుద్ధ నౌకల డిజైన్లు, రహస్యాలు ఇతర దేశాలకు తెలియకుండా మన దగ్గరే భద్రంగా ఉంటాయి. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా అత్యాధునిక సబ్మెరైన్లు, టార్పెడోలు, యుద్ధ నౌకల తయారీలో ఎన్ఎస్టీఎల్ శాస్త్రవేత్తలకు ఇది ఒక శక్తివంతమైన ఆయుధంగా మారనుంది. దీని నిర్మాణం పూర్తయితే.. విశాఖ, ఎన్ఎస్టీల్లో నౌకా నిర్మాణానికి సంబంధించి ‘కాన్సెప్ట్ డిజైన్ నుంచి ఫైనల్ టెస్టింగ్ వరకూ అన్నీ ఒకే చోట జరగనున్నాయి. ఇది మన రక్షణ పరిశోధన సంస్థ డీఆర్డీవో శాస్త్రవేత్తల మేధస్సుకు, భారత ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక నిలువెత్తు నిదర్శనమని రక్షణ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
అమరావతిలో ఈ రెండేళ్లు ఏమి చేశారు?: బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం: ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం ఎప్పుడో అభివృద్ధి చెందేదని శాననమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రశ్నిస్తే అది ముగిసిన అధ్యాయమని చెబుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు.విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ ఏమైంది? రెండేళ్లలో అమరావతిలో ఎంత అభివృద్ధి చేశారో చంద్రబాబు చెప్పాలి. అమరావతిలో అగ్నిప్రమాదం జరిగితే వైఎస్సార్సీపీకి ఏం సంబంధం? ఆ అగ్ని ప్రమాదం విషయం ఏమైంది? కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతిలో ఏం చేశారో చెప్పాలి.రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం చేయాల్సిన పని చెయ్యడం లేదు. గిట్టుబాటు ధరలేక రైతులు, ఫీజు రీయింబర్స్మెంట్లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అమరావతి విషయంలో కాంక్రీట్ వేశామని ఫీలింగ్ ఇవ్వడానికి చంద్రబాబు తాపత్రయ పడ్డారు’ అని చెప్పారు.విభజన హామీలు ఏమయ్యాయి? మీడియా కూడా జరుగుతున్న అఘాయిత్యాలను పట్టించుకోకుండా అమరావతి అంశాన్నే చూపిస్తోందని బొత్స సత్యనారాయణ అన్నారు. ‘రాష్ట్రంలో మామిడి పండ్లను కూడా కల్తీ చేసే దుస్థితి నెలకొంది. ఆరోగ్య శ్రీని పూర్తిగా అటక ఎక్కించారు. తీర్మానం చేసి అమరావతి పర్మినెంట్ అనుకుంటున్నారు. నిర్మాణం పూర్తి చేస్తే అది పర్మినెంట్ అవుతుంది. రాష్ట్ర విభజన హామీల విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు? ప్రత్యేక హోదా వస్తే 10 అమరావతిలు వస్తాయి. ముంబై వంటి నగరాలు కూడా వస్తాయి. ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడటం లేదు? మావిగన్ ప్రతిపాదనలో తప్పేముంది? మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చే క్వార్టర్స్ అయినా పూర్తి చేశారా? కరకట్ట రోడ్డు కూడా వెయ్యలేకపోయారు. అమరావతిలో ఈ రెండేళ్లు ఏమి చేశారు? అమరావతి నిర్మాణంలో ఎస్ఎఫ్టీకి రూ.14 వేలు ఎందుకు? ఎవ్వరికైనా ఇదే అనుమానం వస్తుంది.. జగన్ కూడా అదే అడిగారు. ఈ రెండేళ్లలో అమరావతిపై ఎంత ఖర్చు చేశారు? ఎంత పని చేశారు? ఎంత పేమెంట్ ఇచ్చారు? బకాయిలు ఎంత పెట్టారు? ఆ వివరాలను బట్టి ఎన్ని సంవత్సరాల్లో అమరావతి పూర్తి అవుతుందో చెప్తాం. గిరి గీసుకొని అమరావతి మాత్రమే అభివృద్ధి చెయ్యాలని అనుకోని చేస్తున్నారు. మళ్లీ జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా బిల్లు పెట్టించాలి. ప్రభుత్వం మీదే కదా? ప్రత్యేక హోదా బిల్లు పెట్టిస్తే.. చంద్రబాబుని మెచ్చుకుంటాం’ అని బొత్స సత్యనారాయణ అన్నారు. -
విశాఖ చేరుకున్న మరో భారీ ఎల్పీజీ నౌక..
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ కష్టాల నుంచి స్వల్ప ఊరట లభించింది. మరో భారీ ఎల్పీజీ నౌక.. విశాఖ పోర్టుకు చేరుకుంది. పర్షియన్ గల్ఫ్ నుంచి విశాఖకు వచ్చిన 'పైన్ గ్యాస్' ఎల్పీజీ నౌక.. 47 వేల టన్నుల గ్యాస్ మోసుకొచ్చింది. ఒడిశాలోని దమ్రా పోర్టుకు వెళ్లాల్సిన గ్యాస్ నౌకను విశాఖకు మళ్లించారు. తెలుగు రాష్ట్రాలలో గ్యాస్ డిమాండ్, నిల్వలను దృష్టిలో పెట్టుకుని నౌకను విశాఖకు మళ్లించినట్టు సమాచారం.కాగా, వరుసగా క్రూడాయిల్, వంట గ్యాస్ వెసల్స్ రాకతో విశాఖ పోర్టు కళకళలాడుతోంది. ఐదు రోజుల క్రితం(శుక్రవారం) కూడా భారీ స్థాయిలో ముడిచమురు, ఎల్పీజీ నౌకలు విశాఖ పోర్టుకు చేరుకున్నాయి. రష్యా నుంచి ‘ఎమ్టీ జంబో’ భారీ నౌక 1,36,728 మెట్రిక్ టన్నుల ముడిచమురుతో వచ్చింది. మరోవైపు, దేశీయ అవసరాల నిమిత్తం నెదర్లాండ్స్ నుంచి బీడబ్ల్యూ బిర్చ్ వెసల్ 24,000 మెట్రిక్ టన్నుల భారీ ఎల్పీజీ నౌక వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఎమ్టీ సెంచూరియన్–1 వెసల్‌లో ఉన్న లక్ష టన్నుల ముడి చమురును అన్లోడ్ చేశారు. కాగా, అమెరికా నుంచి మరిన్ని గ్యాస్ నౌకలు విశాఖపట్నం రానున్నట్లు పోర్టు అధికారులు వెల్లడించారు.యుద్ధ సంక్షోభం తరువాత నాలుగు ఎల్పీజీ నౌకలు విశాఖ వచ్చాయని విశాఖపట్నం పోర్ట్ చైర్మన్ అంగముత్తు తెలిపారు. లక్ష టన్నుల గ్యాస్ దిగుమతి చేసుకున్నామని.. మరో 3 గ్యాస్ నౌకలు రానున్నాయని తెలిపారు. 13 క్రూడ్ ఆయిల్ నౌకలు వచ్చాయని.. మరో 4-5 క్రూడ్ ఆయిల్ నౌకలు రానున్నాయని పేర్కొన్నారు. విశాఖ పోర్టు.. ముంబై పోర్టుతో సమానంగా కార్గో హ్యాండిలింగ్ చేస్తుందన్నారు. -
అందుకే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేశాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అమరావతికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు.. సాధ్యమవుతుందా.. కాదా అనేది ప్రతీ ఒక్కరూ ఆలోచించాలన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం. ఇందులో స్వార్థం లేదు, ఆచరణాత్మక ధోరణే ఉందన్నారు. ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పులు భారం మోపకుండా ఆలోచన చేశామని వైఎస్ జగన్ తెలిపారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అమరావతి పేరుతో దోపిడీ చేయడమే చంద్రబాబు ప్లాన్. దోపిడీ నుంచి డైవర్షన్ కోసమే అసెంబ్లీలో తీర్మానం చేశారు. అంతఖర్చును తట్టుకోగలమా?. ప్రజలను పెడదోవ పట్టించడం ఎందుకు?. ఇలా చేస్తే రాష్ట్రానికి రాజధాని ఎప్పుడు అవుతుంది?. రాజధానే లేని పరిస్థితి ఉంటుంది: రూ.2 లక్షల కోట్ల ఖర్చును తట్టుకునే స్తోమత రాష్ట్రానికి ఉందా?. అందుకే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను రోడ్డున పడేయకూడదని మేము అనుకున్నాం.అందుకే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. రాష్ట్రంపై భారం పడకూడదని అభివృద్ధి, సంక్షేమం కుంటుపడకూడదని మనం కూడా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం. ఇందులో స్వార్థం లేదు, ఆచరణాత్మక ధోరణే ఉంది. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా పెట్టాలనుకున్నాం. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని నిర్ణయించాం. కానీ, ఆ ప్రణాళిక ముందుకు సాగలేదు. మా ఆలోచనల్లో ఎక్కడా కూడా మేం అమరావతిని నిర్లక్ష్యం చేయలేదు. రైతులకు మరో ఐదేళ్ల పాటు కౌలును పెంచాం, రాజధానిలో పెన్షన్లను రూ.5వేలకు పెంచాం.ఆచరణాత్మక ఆలోచన. ప్రాక్టికల్‌గా సాధ్యమయ్యే ఆలోచనలు మేం చేశాం. మరోవైపు ప్రభుత్వం తన బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన ప్రతి మేలుకూ అడ్డంకులు లేని ఆలోచన చేశాం. ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పులు భారం మోపకుండా ఆలోచన చేశాం. కేవలం రూ.10వేల కోట్లు పెడితే చాలని విశాఖనగరం ఈరోజు ఉన్న ఈ స్థాయి నుంచి గొప్పస్థాయికి ఎదుగుతుందని చెప్పాం. రాష్ట్రానికి ఆదాయాన్ని, మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలను, ఇచ్చే వనరుగా మారుతుందని మేం చెప్పాం. దీని మీద చంద్రబాబు, ఎల్లో ముఠా చేసిన ప్రచారం, చెప్పిన అబద్ధాలు అన్నీ ఇన్నీ కావు. నాకు సంకుచితమైన ఆలోచన ఉండి ఉంటే, రాయలసీమలో రాజధాని ఆలోచన చేసేవాడిని. కానీ, నేను అలా చేయలేదు. రాష్ట్రానికి మంచి చేయాలన్న ఆలోచన చేశాను. ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని నేను అనుకున్నాను. అందుకే ఇలా చేశాను’ అని చెప్పుకొచ్చారు.MAVIGUN ప్లాన్ ఇదే.. పోనీ మేం ప్రాక్టికల్‌గా చేసిన ఆలోచన చంద్రబాబుకు నచ్చలేదు సరే. ప్లాన్-బీ కింద అయినా మేం చెప్పిన ప్లాన్ గురించి చంద్రబాబు ఆలోచించలేదు. మచిలీపట్నం to విజయవాడ, విజయాడ to గుంటూరు 40 కి.మీ. ఈ మొత్తం 110 కి.మీ హైవే ఇప్పటికే ఉంది. ఈ హైవేకు అటు, ఇటు క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేస్తే గ్రోత్ ఇంజిన్ తయారవుతుందని చెప్పాం. మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరు నుంచి GUN తీసుకోండి. MAVIGUN అని పేరుపెట్టి క్యాపిటల్ ఏరియాగా డిక్లేర్ చేయండి. స్కాంలు చేసే బదులు, కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కట్టండని సలహా ఇచ్చాం. అది చేస్తే రూ.1,90,000 కోట్లు మిగులుతాయి కదా?. అమరావతిలో పెట్టాలనుకుంటున్న డబ్బులో 10% ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అని సూచించాం:మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరులో GUN ఈ మూడు కలిస్తే, MAVIGUN ఆనే గ్రోత్ కారిడర్ ఏర్పడుతుంది. ఈ సలహా కూడా ఇస్తే దాన్ని కూడా పట్టించుకోలేదు. విజయవాడ- దాని చుట్టుపక్కల ఇప్పటికే 20 లక్షల జనాభా ఉంది. గుంటూరులో మరో 10 లక్షల జనాభా ఉంది, మచిలీపట్నంలో మరో 3-4 లక్షల జనాభా ఉంది. అదొక మహానగరంగా, గ్రోత్ ఇంజిన్‌గా ఎదుగుతుంది కదా? అని చెప్తే అది కూడా చంద్రబాబుకు నచ్చలేదు. దీనికన్నా లక్ష ఎకరాల్లో రాజధాని, దాంట్లో బేసిక్ ఇన్ఫ్రా కోసమే రూ.2 లక్షల కోట్లు పెట్టడానికి వెళతానంటున్నాడు. అసాధ్యమని తెలిసి కూడా, తన స్కామ్‌ల కోసం, తన బినామీల భూముల రేట్లు కోసం పోతానంటున్నాడు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి, రాష్ట్రాన్ని అంధకారంలోకి, అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. -
‘అమరావతిని వైఎస్ జగన్ ఎన్నడు వ్యతిరేకించలేదు’
విశాఖ: అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకేరాజు మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా వైఎస్ జగన్ వ్యతిరేకించారన్న చంద్రబాబు వ్యాఖ్యలను కేకే రాజు ఖండించారు. ఇది చంద్రబాబు కొత్త డ్రామా అంటూ ధ్వజమెత్తారు. రాజధానిగా అమరావతిని వైఎస్ జగన్ ఎన్నడూ వ్యతిరేకించలేదని, అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతి, దోపిడీని మాత్రమే వ్యతిరేకించారని స్పష్టం చేశారు. మూడు రాజధానుల ద్వారా మూడు ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించిన సంగతిని గుర్తు చేశారు. అమరావతిని వైఎస్ జగన్ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని, అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ జరుగుతోంది. భూములు ఇచ్చిన రైతులను చంద్రబాబు మోసం చేశారు. అమరావతి పేరు చెప్పి చంద్రబాబు రూ. 50 వేల కోట్లు తెచ్చారు. చంద్రబాబు కరకట్ట మీద తన నివాసానికి తప్ప అమరావతిలో ఒక రోడ్డు కూడా వేయలేకపోయారు.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కొండ పోరంబోకు, స్థానిక సంస్థల భూములు విద్యా సంస్థలకు ఇవ్వకూడదని తీర్పు ఉంది. ఆక్రమించిన భూమిలో గీతం యూనివర్సిటీ అక్రమ నిర్మాణాలను చేపడుతోంది. కూటమి పాలనలో విశాఖలో జరిగిన భూ కేటాయింపుపై సీబీఐ విచారణ జరిపించాలి. జోడుగుళ్ళ పాలెంలో రూ. 50 కోట్లు విలువ చేసే 84 సెంట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను పార్కులను కూటమి నేతలు కబ్జా చేస్తున్నారు.’ అని మండిపడ్దారు. -
‘బాబు’ విజనరీని ఛీకొట్టిన కేంద్రం
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు ఇప్పుడు ఆ ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి. గత ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రణాళికలను పక్కనపెట్టి, కేవలం తన మార్కు కనిపించాలన్న తాపత్రయంతో చంద్రబాబు ప్రవేశపెట్టిన ‘డబుల్ డెక్కర్’ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రిత్వ శాఖలు గట్టి షాక్ ఇచ్చాయి. కొత్తగా పంపిన డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపడంతో విశాఖ వాసుల మెట్రో కల మళ్లీ మొదటికి వచ్చింది. వాస్తవానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశాఖ అభివృద్ధిని కాంక్షిస్తూ 76 కిలోమీటర్ల మేర 4 కారిడార్లతో లైట్ మెట్రో ప్రాజెక్టుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. రూ. 14,309 కోట్ల అంచనా వ్యయంతో, పీపీపీ విధానంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2023 డిసెంబర్ 29న ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, విదేశీ డిజైన్లు, డబుల్ డెక్కర్ కారిడార్లంటూ ‘విజనరీ’ పేరుతో కొత్త డీపీఆర్‌ను రూపొందించారు. కేవలం 8 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ కారిడార్ కోసం పూర్తిస్థాయిలో ఉన్న పాత డీపీఆర్‌ను మార్చేయడం ఇప్పుడు విమర్శలకు దారితీసింది. ఈ కొత్త ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం ‘డబుల్ డెక్కర్ వస్తే ఇక మెట్రోతో పనేముంది?’ అని ప్రశి్నస్తూ డీపీఆర్‌ను తిరస్కరించింది. ‘ఇదేం డీపీఆర్ బాబూ?’ అంటూ కేంద్రం అసహనం వ్యక్తం చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సాంకేతిక అడ్డంకులు – కేంద్రం తిరస్కరణ కేంద్ర మంత్రిత్వ శాఖల విశ్లేషణ ప్రకారం.. డబుల్ డెక్కర్ కారిడార్ వల్ల నిర్మాణ సమయం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ సాంద్రత, భూసేకరణ సమస్యలు ఈ కొత్త ప్రతిపాదనతో మరింత జటిలమవుతాయి. ఈ నేపథ్యంలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ డబుల్ డెక్కర్ ప్రతిపాదనను తొలగించి, పాత పద్ధతిలోనే సాధ్యమయ్యే రీతిలో మరోసారి కొత్త డీపీఆర్ తయారు చేయాలని తేల్చి చెప్పింది. దీనివల్ల నెలల తరబడి కష్టపడి చేసిన కసరత్తు అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ముగింపు..మళ్లీ మొదటికే కథ! మొత్తానికి విశాఖ మెట్రో కథ ఇప్పుడు ‘మళ్లీ మొదటికి’ అన్నట్లు తయారైంది. కేంద్రం ఆదేశాల మేరకు కొత్త డీపీఆర్ తయారు చేయాలంటే మళ్లీ కొన్ని నెలల సమయం పడుతుంది. అప్పటివరకు నిధుల కేటాయింపు, టెండర్ల ప్రక్రియ ఆగిపోవాల్సిందే. ప్రభుత్వాల ప్రాధాన్యతలు మారినప్పుడల్లా ఇలా ప్రాజెక్టు నివేదికలు మారిపోతే, సామాన్యుడికి మెట్రో ప్రయాణం ఎప్పటికీ ఒక కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. డబుల్ డెక్కర్తోనే అసలు సమస్య విశాఖ మెట్రో కోసం గత ప్రభుత్వం సిద్ధం చేసిన లైట్ మెట్రో డీపీఆర్ బాగుందని కేంద్రం చెప్పినా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టుబట్టి పంపిన ‘డబుల్ డెక్కర్’ ప్రతిపాదనలు ఇప్పుడు ప్రాజెక్టును గందరగోళంలోకి నెట్టాయి. 12 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిశీలనకు వెళ్లిన ఈ కొత్త డీపీఆర్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా డబుల్ డెక్కర్ కారిడార్ ఉంటే మెట్రోకు రావాల్సిన ట్రాఫిక్ తగ్గిపోతుందని, ఇది ప్రాజెక్టు మనుగడకే ముప్పని కేంద్రం స్పష్టం చేసింది. ‘అసలు ఈ డీపీఆర్ మెట్రో అభివృద్ధి కోసమేనా?’ అని పలు శాఖలు సందేహాలు లేవనెత్తడంతో, ఆశలు చిగురించిన వైజాగ్ మెట్రో కథ మళ్లీ మొదటికి చేరింది. మరోసారి డీపీఆర్‌లో మార్పులకు..! విశాఖ మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కకుండా ప్రభుత్వ ‘విజనరీ’ నిర్ణయాలు అడ్డుపడుతున్నాయి. గత ప్రభుత్వం పంపిన డీపీఆర్‌నే కొనసాగించి ఉంటే ఇప్పటికే పనులు ప్రారంభమయ్యేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం పట్టుబట్టి చేర్చిన 8 కి.మీ. డబుల్ డెక్కర్ కారిడార్‌పై కేంద్ర మంత్రిత్వ శాఖలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీనివల్ల మెట్రోకు రావాల్సిన ట్రాఫిక్ దెబ్బతింటుందని కేంద్రం తేలి్చచెప్పింది. అయినా వెనక్కి తగ్గని ప్రభుత్వం కనీసం 5 కిలోమీటర్ల మేరకైనా డబుల్ డెక్కర్ ఉంచాలని పట్టుబడుతోంది. దీనిపై గత 20 రోజులుగా కేంద్ర ప్రతినిధులతో కలిసి అధికారులు మళ్లీ సర్వే నిర్వహిస్తున్నారు. ఫలితంగా మూడోసారి డీపీఆర్‌లో మార్పులు తప్పనిసరయ్యాయి. ఈ జాప్యం వల్ల వైజాగ్ మెట్రో ప్రాజెక్టు మరోసారి అటకెక్కినట్లయింది.డబుల్ డెక్కర్‌తో ‘డబుల్’ భారంవిశాఖ మెట్రో ప్రాజెక్టులో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులు ఆర్థికంగా, సాంకేతికంగా పెను సవాలుగా మారాయి. గత ప్రభుత్వం 76 కి.మీ మేర రూపొందించిన డీపీఆర్ కంటే.. ప్రస్తుత ‘డబుల్ డెక్కర్’ ప్రతిపాదన వల్ల నిర్మాణ వ్యయం కిలోమీటరుకు 30 నుంచి 40 శాతం అదనంగా పెరిగింది. ఈ భారీ బడ్జెట్‌ను భరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సైతం నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎన్ఏడీ జంక్షన్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న ఫ్లైఓవర్ల మధ్య మళ్లీ డబుల్ డెక్కర్ నిర్మించడం అత్యంత క్లిష్టమని పేర్కొంది. పైపులైన్లు, విద్యుత్ లైన్ల మారి్పడి వల్ల కాలయాపన జరగడమే కాకుండా, మలుపుల వద్ద మెట్రో వేగం తగ్గి ప్రయాణ సమయం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ మొండి పట్టుదల వల్ల వైజాగ్ మెట్రో పట్టాలెక్కడం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. -
విశాఖలో అద్భుత సైకత శిల్పం.. పర్యాటకుల సందడి
విశాఖపట్నం: విశాఖ సముద్ర తీరం మరో అరుదైన ఘటనకు నిలయమైంది. విశాఖలో సరికొత్త సైకత(ఇసుక శిల్పం) శిల్పం పర్యాటకులకు మరింతగా ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ సరికొత్త సైకత శిల్పం ఏంటని అనుకుంటున్నారా?. ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్ ఫుడ్ చైన్ 'కేఎఫ్‌సీ' (KFC)కి చెందిన చికెన్ బకెట్. దీనికి సంబంధించిన భారీ ఆకార శిల్పం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది భారత్‌లోనే అతిపెద్ద ఇసుక నిర్మాణం కావడం గమనార్హం.విశాఖపట్నం నగరంలోని అత్యంత రద్దీగా ఉండే రామకృష్ణ మిషన్ బీచ్‌లో ఇటీవల ఒక అద్భుతమైన ఇసుక శిల్పం వెలిసింది. విశాఖలో కేఎఫ్‌సీ నూతన రెస్టారెంట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఇసుక శిల్పాన్ని ఏర్పాటు చేశారు. దీంతో, కేఎఫ్‌సీ సైకత శిల్పం సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. కాగా, ఈ అద్భుత కళాఖండాన్ని ప్రముఖ స్థానిక సైకత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ తీర్చిదిద్దారు. కేవలం ఇసుకను మాత్రమే ఉపయోగించి తయారు చేసిన ఈ శిల్పం చూడటానికి అచ్చు అసలైన కేఎఫ్‌సీ చికెన్ బకెట్లాగే ఉండటం గమనార్హం.ఇక, ఈ శిల్పంపై కేఎఫ్‌సీ వ్యవస్థాపకుడు కల్నల్ సాండర్స్ ముఖచిత్రాన్ని ఎంతో స్పష్టంగా చెక్కారు. దీనిని రూపొందించడానికి ఆయన సుమారు రెండు రోజుల పాటు నిరంతరంగా శ్రమించారు. ఈ భారీ శిల్పాన్ని "ఇండియాస్ టాలెస్ట్ శాండ్ బకెట్" గా అభివర్ణిస్తున్నారు. బీచ్‌కు వచ్చే పర్యాటకులు ఈ శిల్పం ముందు నిలబడి సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ భారీ ఇసుక శిల్పం ఇప్పుడు నగరవాసులకు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక, ఇది విశాఖపట్నం నగరంలో కేఎఫ్‌సీ 14వ బ్రాంచ్ కావడం విశేషం. సముద్ర తీర వాతావరణానికి అనుగుణంగా, కస్టమర్లకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించేలా ఈ రెస్టారెంట్ ఇంటీరియర్ డిజైన్‌ను రూపొందించారు. -
వంట గది ఖాళీ.. రోడ్డెక్కిన సిలిండర్ల ర్యాలీ
విశాఖపట్నం: నగర శివారు గ్రామాల్లో వంట గ్యాస్ కోసం సామాన్యుడి పాట్లు వర్ణనాతీతంగా మారాయి. గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రం కావడంతో వినియోగదారులు రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. సోమవారం ఉదయం విశాఖ నుంచి భీమిలి వెళ్లే ప్రధాన రహదారిపై ఖాళీ సిలిండర్లు బారులు తీరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వంట గదిలో పనులన్నీ పక్కన పెట్టి, గృహిణులు, కూలీలు గ్యాస్ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక గంటల తరబడి రహదారిపైనే నిరీక్షిస్తున్నారు. చేతిలో పని వదిలేసి, పొయ్యి వెలిగించుకోవడానికి సిలిండర్లు పట్టుకుని రోడ్ల వెంట పరుగులు తీయాల్సిన దుస్థితి ఏర్పడింది. శివారు ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం కావడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారులు తక్షణమే స్పందించి గ్యాస్ కొరతను తీర్చాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. -
విశాఖపట్నంలో సినీ నటి శ్రుతి హాసన్ సందడి (ఫొటోలు)
-
‘ఇనార్బిట్’ చుట్టూ ఇగో పాలిటిక్స్
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రానికి పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగాలే లక్ష్యమని ప్రగల్భాలు పలికే చంద్రబాబు ప్రభుత్వ అసలు రంగు విశాఖ ఇనార్బిట్ మాల్ ప్రారంభోత్సవం వేళ బయటపడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టుపై ఆయన ముద్ర చెరిగిపోలేదన్న కక్షతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి దూరంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాదిలోనే అతిపెద్దదైన ఈ మాల్ పనులు గత ప్రభుత్వ హయాంలోనే 70 శాతం పూర్తయ్యాయి. సుమారు రూ. 600 కోట్లతో 8 వేల మందికి ఉపాధి కల్పించే ఈ మెగా ప్రాజెక్టు క్రెడిట్ ఎక్కడ జగన్‌కు దక్కుతుందోనన్న భయంతోనే విశాఖలోనే ఉన్న లోకేష్ సహా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదని చర్చ జరుగుతోంది. నగరాభివృద్ధి కంటే రాజకీయ వైషమ్యాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ ఘటన నిరూపిస్తోంది. అభివృద్ధిపై ‘చిన్నచూపు’.. లోకేష్ అక్కసు! రాష్ట్ర ఐటీ, పెట్టుబడుల శాఖ మంత్రిగా ఉండి ఇంత పెద్ద ఎత్తున ఉపాధి కలి్పంచే వేదికను ప్రోత్సహించాల్సింది పోయి, దాన్ని చిన్నచూపు చూడటం దారుణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖను గ్లోబల్ సిటీగా మారుస్తామని ప్రగల్భాలు పలికే లోకేష్ .. కేవలం రాజకీయ వైరంతోనే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. కనీసం స్థానిక ఎమ్మెల్యేలను కూడా వెళ్లనివ్వకుండా కట్టడి చేయడం చూస్తుంటే, అభివద్ధి కంటే రాజకీయ స్వలాభం కోసమే ఈ ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తోందన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలు ఎవరూ హాజరుకాకపోవడంతో సోమవారం విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు చేతుల మీదుగా ఇనార్బిట్ మాల్‌ను ప్రారంభించారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రజలకు పూర్తిస్థాయిలో మాల్ అందుబాటులోకి రానుంది. కార్యక్రమానికి రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా, ఇనార్బిట్ మాల్ సీఈవో రజనీష్ మహాజన్, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ రోషిణి అపరాంజి కోరాటి మాత్రమే హాజరయ్యారు. మాల్‌ను ప్రారంభించిన రహేజా గ్రూప్ ప్రతినిధులు, ఇనార్బిట్‌మాల్ సీఈవో రజనీష్ మహాజన్ , పోర్టు చైర్మన్ అంగముత్తు గత ప్రాజెక్టులపై వివక్ష ఈ మాల్ ద్వారా సుమారు 8 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఎన్నికల ముందు ‘జాబ్ క్యాలెండర్’ అంటూ ఊదరగొట్టిన లోకేష్ ఇప్పుడు ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థల పట్ల ఇలాంటి వివక్ష చూపడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది నిరుద్యోగులను వంచించడమే అంటూ నిరుద్యోగులు పెదవి విరస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభమైన ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ తీరు పట్ల పారిశ్రామిక, వ్యాపార వర్గాలు తప్పుబడుతున్నాయి. ఇదే ధోరణితో ప్రభుత్వం ఉంటే.. పెట్టుబడిదారుల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరిస్తున్నాయి. -
‘బీఆర్ నాయుడు భక్తుల మనోభావాలను దెబ్బతీశారు’
సాక్షి, విశాఖపట్నం: భగవద్గీతపై బీఆర్ నాయుడు అహంకారంతో మాట్లాడారని.. భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. తిరుపతి ప్రతిష్టని చంద్రబాబు మంట కలిపారని.. బీఅర్ నాయుడు అసభ్య వీడియోలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయనను ఎందుకు టీటీడీ చైర్మన్‌గా కొనసాగిస్తున్నారంటూ వరుదు కళ్యాణి ప్రశ్నించారు.‘‘చంద్రబాబు తప్పులను టీవీ5 ఛానల్ కప్పిపుచ్చుతుంది. అందుకే బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్‌గా తొలగించలేదు. ఒక చేతగాని వ్యక్తిని టీటీడీ చైర్మన్‌గా చంద్రబాబు నియమించారు. బీఆర్ నాయుడు వైఫల్యం వల్లే క్యూలైన్లో భక్తులు చనిపోయారు. భగవంతుడు అంటే భక్తి లేని వ్యక్తి బీఆర్ నాయుడు. ప్రసాదంలో నాణ్యత లేదని కూటమినేతలే చెప్తుతున్నారు’’ అంటూ వరుదు కళ్యాణి దుయ్యబట్టారు.‘‘మహిళలను మోసం చేసే దుర్మార్గుడిని ఎందుకు టీటీడీ చైర్మన్‌గా నియమించారు. టీటీడీ ఫుడ్ సేఫ్టీ విభాగం వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటు చేశారు.. హిందూ ద్రోహి చంద్రబాబు. విజయవాడ నడిబొడ్డున 40 దేవాలయాలను కూల్చారు’’ అంటూ కళ్యాణి మండిపడ్డారు. -
విశాఖలో గీతం యూనివర్సిటీ బరితెగింపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీ బరితెగించింది.కూటమి ప్రభుత్వంలో గీతం యూనివర్సిటీ యాజమాన్యం అక్రమ నిర్మాణాలు మరో స్టేజ్‌కు చేరుకున్నాయి. అధికార అండతో కోర్టులో కేసు ఉండగానే యాజమాన్యం నిర్మాణాలను ప్రారంభించింది. అయితే, గీతం అక్రమ నిర్మాణాలవైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.వివరాల ప్రకారం.. విశాఖలోని 55 ఎకరాల ఆక్రమిత భూముల్లో గీతం యాజమాన్యం నిర్మాణాలు చేపట్టింది. కోర్టులో కేసు ఉండగానే నిర్మాణాలు ప్రారంభించింది. అధికార అండతో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టింది. ఆక్రమిత భూముల్లో ప్రభుత్వ బోర్డులు తొలగించి మరీ అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక, ఇప్పటికే గీతం కబ్జా భూములను 22-ఏ జాబితా నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఇటీవల 5000 కోట్ల విలువైన భూమి అడ్డదారిలో జీవీఎంసీలో క్రమబద్ధీకరణ జరిగింది. -
విశాఖ జలాల్లోకి రష్యా యుద్ధ నౌకలు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో సముద్ర జలాల్లో అనిశ్చితి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ తరుణంలో ఎలాంటి అనుమానాస్పద ఘటనలు జరిగినా ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇలాంటి తరుణంలో విశాఖ సాగరజలాల్లో రెండు రష్యాయుద్ధ నౌకలు ప్రత్యక్షం కావడం అంతర్జాతీయ చర్చకు దారి తీసింది.రష్యానౌకాదళానికి చెందిన స్టెరెగుష్చి క్లాస్ కార్వెట్స్ అయిన షోవర్షెన్నీ, రెజ్కీ యుద్ధనౌకలు రెండు రోజుల కిందట అనధికారిక విజిట్పేరుతో విశాఖ తీరానికి చేరుకున్నాయి. రష్యా నౌకల్లో వచ్చిన సిబ్బందికి భారతనౌకాదళ అధికారులు ఘన స్వాగతం పలికారు. అయితే ఈ నౌకల రాక వెనుక ఉన్న ఆంతర్యాన్ని ఇండియన్ నేవీ అధికారికంగా ప్రకటించలేదు. ఆ నౌకలు విశాఖకు ఎందుకు వచ్చాయి.. ద్వైపాక్షిక విన్యాసాలు నిర్వహించే అవకాశం ఉందా అనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
సాగరతీరంలో షార్క్‌ల వేట..!
సాక్షి, విశాఖపట్నం: ఎగుమతులపై నిషేధం ఉన్నప్పటికీ, విశాఖ ఫిషింగ్ హార్బర్ సాక్షిగా అరుదైన షార్క్ భారీ అక్రమ రవాణా సాగుతోంది. అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉన్న షార్క్ ఫిన్స్ (మొప్పలు) కోసం మత్స్యకారుల రూపంలో వేటగాళ్లు సాగర గర్భాన్ని జల్లెడ పడుతున్నారు. వీరి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న దళారులు వాటిని కోట్లాది రూపాయలకు విదేశాలకు తరలిస్తున్నారు. షార్క్‌ల అక్రమ రవాణా అరికట్టకపోతే ఇందులో పలు జాతులు అంతరించే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత ప్రభుత్వం షార్క్‌ల వేటను ‘టైగర్æ’ వేటతో సమానంగా పరిగణిస్తున్నా, విశాఖ తీరంలో మాత్రం చట్టం చుట్టంగా మారుతోందనే విమర్శలు వస్తున్నాయి. భారత ప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణ చట్టం (1972) ప్రకారం షార్క్‌ల వేటను, ఎగుమతిని కఠినతరం చేసింది. ముఖ్యంగా 2001లో షార్క్‌లోని కొన్ని అరుదైన జాతులను షెడ్యూల్–1 జాబితాలో చేర్చడం ద్వారా వీటి వేటను పూర్తిగా నిషేధించింది. మత్స్యకారులకు బెదిరింపులు విశాఖ హార్బర్లో వేటకు వెళ్లే మత్స్యకారుల అమాయకత్వాన్ని కూడా దళారులు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. పొరపాటున వలకు చిక్కిన షార్క్‌లను చూపి ‘వీటిని విక్రయించడం నేరం, పోలీసులు పట్టుకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది‘ అని భయపెడుతున్నట్లు తెలుస్తోంది. ఆ భయంలో మత్స్యకారులు వాటిని వదిలించుకోవాలని చూసినప్పుడు, దళారులు అతి త క్కువ ధర చెల్లించి వాటిని కొనుగోలు చేస్తారని సమాచారం. మరికొంతమంది దళారులు ఏకంగా మత్స్యకారుల అవతారమెత్తి.. షార్క్‌ల వేట చేస్తున్నారనే విమర్శలున్నాయి. బయట మార్కెట్లో లక్షల విలువ చేసే షార్క్‌ల విడిభాగాలు, మత్స్యకారుల చేతుల్లో కేవలం కొన్ని వందల రూపాయిలకే దళారుల పరమవుతున్నాయి. అక్రమ రవాణా మార్గం విశాఖ హార్బర్లో దొరికిన షార్క్‌లను హార్బర్‌లోనే రహస్య ప్రాంతాలకు తరలిస్తారని తెలుస్తోంది. అక్కడ నిపుణులైన వ్యక్తులతో ఫిన్స్, కాలేయాన్ని, ఇతర భాగాలను వేరు చేస్తారు. వీటిని ఐస్ బాక్సుల్లో భద్రపరిచి, రవాణా వాహనాల్లో చేపల లోడ్ మధ్యలో దాచి పెడుతున్నట్లు సమాచారం. స్మగ్లర్లు మల్టీలేయర్ రవాణా పద్ధతిలో చిన్న చిన్న ఐస్ బాక్సుల్లో దాచి.. ప్రైవేట్ బస్సుల ద్వారా చెన్నైకి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ నుంచి ఇవి నేరుగా చెన్నైకి చేరుతాయి. అక్కడి నుంచి సముద్ర మార్గం లేదా విమానాల ద్వారా చైనా, థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా, హాంగ్‌కాంగ్ తదితర దేశాలకు అక్రమంగా ఎగుమతి అవుతున్నాయని నిఘా వర్గాల సమాచారం. అధికారుల నిర్లక్ష్యం ఈ అక్రమ రవాణా అంతా మత్స్యశాఖ అధికారుల కళ్లముందే జరుగుతున్నా, వారు కనీసం తనిఖీలు చేయడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కొందరు కింది స్థాయి సిబ్బందికి దళారులతో చీకటి ఒప్పందాలు ఉన్నాయనీ.. అందుకే అక్రమ రవాణా వాహనాలు యథేచ్ఛగా వెళ్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులు చేసినా ‘సాంకేతిక కారణాలు’ సాకుతో కాలయాపన చేస్తున్నారే తప్ప, గట్టి నిఘా పెట్టిన దాఖలాలు లేవనే ఆరోపణలున్నాయి. కేవలం విశాఖలోనే కాకుండా దేశవ్యాప్తంగా.. అనేక సముద్ర తీర ప్రాంతాల్లో షార్క్‌ల వేట సాగుతోంది. వరల్డ్‌వైడ్ ఫండ్–ఇండియా (డబ్ల్యూడబ్ల్యూఎఫ్–ఐ), ట్రాఫిక్ సంస్థల నివేదిక ప్రకారం.. భారత దేశ వ్యాప్తంగా గడిచిన దశాబ్ద కాలంలో 18,000 కిలోల షార్క్ ఫిన్స్ని దళారుల నుంచి స్వా«దీనం చేసుకున్నారు. అక్రమ రవాణాలో ఫిన్స్ వాటా 82 శాతం కాగా.. మిగిలిన 18 శాతంలో షార్క్ దంతాలు, కార్టిలేజ్(మృదులాస్థి), చర్మం ఉన్నాయి. 2025 జనవరిలో విశాఖ తీరానికి సమీపంలో అక్రమంగా సేకరించిన షార్క్ఫిన్స్ని తరలిస్తుండగా ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. సముద్ర పర్యావరణానికి విఘాతం » సముద్ర ఆహార గొలుసులో షార్క్‌లు అగ్రస్థానంలో ఉంటాయి. » ఇవి చనిపోయిన లేదా అనారోగ్యంతో ఉన్న జీవులను తిని సముద్రాన్ని శుభ్రంగా ఉంచుతాయి. » వీటి సంఖ్య తగ్గితే సముద్ర పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. » షార్క్‌లు చాలా నెమ్మదిగా ఎదుగుతాయి. » తక్కువ పిల్లలకు జన్మనిస్తాయి. » విచ్ఛలవిడి వేట వల్ల ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉంది.భారీ డిమాండ్ » షార్క్‌లోని ప్రతి భాగం అంతర్జాతీయ మార్కెట్లో బంగారంతో సమానం. »ముఖ్యంగా ‘షార్క్ఫిన్స్’ (మొప్పలు) కోసం వీటిని వేటాడుతుంటారు. »ఎందుకంటే చైనా, హాంగ్‌కాంగ్, తైవాన్ వంటి ఆగ్నేయాసియా దేశాలలో షార్క్ ఫిన్స్‌తో చేసే సూప్ చాలా ఖరీదైనది. » ఈ సూప్‌ని హోదాకు చిహ్నంగా భావిస్తారు. »హాంగ్‌కాంగ్‌లో ప్లేట్ ఫిన్ సూప్ ధర రూ.8,500 నుంచి రూ.10,000 వరకూ ఉంటుంది. » అదేవిధంగా.. షార్క్ కాలేయం నుంచి తీసే నూనెను (స్క్వాలెన్స్) సౌందర్య సాధనాలు, క్యాన్సర్ మందుల తయారీలో ఉపయోగిస్తారు. » షార్క్ చర్మాన్ని ఖరీదైన లెదర్ వస్తువుల తయారీకి, వెన్నెముక ఎముకలను కొన్ని రకాల చీలమండ నొప్పుల మందుల తయారీ కోసం ఉపయోగిస్తారు. » అంతర్జాతీయ మార్కెట్లో ఒక కిలో ఎండిన షార్క్ ఫిన్స్ ధర నాణ్యతను బట్టి రూ.50,000 నుంచి రూ.70,000 వరకు ఉంటుంది. » షార్క్‌లలో హ్యామర్‌హెడ్, గ్రే రీఫ్, వేల్షార్క్లకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. » విశాఖ సాగర జలాల్లో గ్రేరీఫ్ షార్క్, హ్యామర్‌హెడ్, బ్లాక్‌టిప్, బ్లాక్‌టిప్ రీఫ్, స్పాట్టైల్, వైట్ చీక్, టైగర్, స్పేడ్నోస్, బుల్షార్క్ జాతులు ఎక్కువగా దొరుకుతున్నాయి. -
సెలూన్ ముసుగులో వ్యభిచారం
విశాఖపట్నం: ఎన్ఏడీ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. సెలూన్ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ చీకటి దందాపై బుధవారం సాయంత్రం ఎయిర్పోర్ట్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ సీఐ శంకరనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ఏడీ జంక్షన్ నుంచి మర్రిపాలెం వెళ్లే మార్గంలోని రోబరి హౌస్ ఉన్న భవనంలో హెయిర్ పోర్ట్ సెలూన్ పేరిట ఓ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. అయితే, అక్కడ హెయిర్ కటింగ్ లేదా మసాజ్ వంటి ఎలాంటి సేవలు అందించకుండా, ఆ గదులను కేవలం వ్యభిచారం కోసం విటులకు అద్దెకు ఇస్తున్నారు. బయటి వ్యక్తులకు అనుమానం రాకుండా ఉండేందుకు సెలూన్‌కు వస్తున్నట్లు కలరింగ్ ఇచ్చేవారు. ఈ దందా కోసం ప్రధాన నిర్వాహకుడు.. చంటి అనే సహాయకుడిని నియమించుకున్నాడు. అతడి ద్వారా అమ్మాయిల ఫొటోలను ముందుగానే విటులకు మొబైల్ ఫోన్లలో పంపించేవాడు. ఆ తర్వాత వారితో బేరం మాట్లాడుకుని సెలూన్‌కు రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల దాడుల్లో ముగ్గురు యువతులతో పాటు ఒక విటుడు, అలాగే ప్రధాన నిర్వాహకుడిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించి తదుపరి విచారణ చేపట్టారు. కాగా.. ఎన్ఏడీ జంక్షన్ ప్రాంతం స్పా కేంద్రాల ముసుగులో వ్యభిచార కూపంగా మారుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన వెలుగుచూడటం ఇది రెండోసారి. గతంలో విల్లా కాంప్లెక్స్‌లో ఉన్న ఎలైట్ వెల్నెస్ అండ్ స్పా సెంటర్‌పై కూడా టాస్క్ ఫోర్స్, ఎయిర్ పోర్ట్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిర్వాహకులను పట్టుకున్న విషయం తెలిసిందే. -
ఆ నాలుగేళ్లు విశాఖకు వైభవం
డాబాగార్డెన్స్: విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ(జీవీఎంసీ) పాలకవర్గం గడువు ముగియడంతో వైఎస్సార్ సీపీ హయాంలో విశాఖ సాధించిన ప్రగతి మరోసారి తెరపైకి వచ్చింది. 2021 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకు నాలుగేళ్ల పాటు మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన గొలగాని హరి వెంకటకుమారి హయాంలో నగరం అనేక రంగాల్లో అభివృద్ధిని సాధించింది. ఎలాంటి రాజకీయ పరిజ్ఞానం లేని విద్యావేత్త అయిన బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళను, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగర ప్రథమ పౌరురాలిగా ఎంపిక చేయడం విశాఖ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి నాంది పలికింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టిన పాలకవర్గం, ప్రజలకు అండగా నిలుస్తూనే నగరాన్ని ప్రగతి పథంలో నడిపించింది. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సహకారంతో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. దశాబ్దాలుగా పాతనగరం వాసులను వేధిస్తున్న ఇరుకు రోడ్ల కష్టాలకు చెక్ పెడుతూ, జగదాంబ జంక్షన్ నుంచి పాత పోస్టాఫీసు వరకు రోడ్డు విస్తరణ పనులను విజయవంతంగా పూర్తి చేసి వారి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారు. అంతర్జాతీయ సదస్సులకు వేదికైన విశాఖను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలు, వాటర్ ఫౌంటైన్లతో ఆకర్షణీయంగా మార్చారు. బీచ్‌లను సుందరంగా మార్చారు. రూ.2.3 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో జగదాంబ జంక్షన్లో 20 మీటర్ల క్లాక్ టవర్‌ను నిర్మించారు. పచ్చదనంతో నగరానికి కొత్త అందాలు అద్దారు. మూలకు చేరిన శివాజీ పార్కును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియానికి రూ.16.90కోట్లతో నూతన హంగులు తీసుకురావడం పాలకవర్గ పనితీరుకు నిదర్శనంగా నిలిచాయి. సమగ్రాభివృద్ధే లక్ష్యంగా.. : కేవలం సుందరీకరణకే పరిమితం కాకుండా, ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో జీవీఎంసీ వైఎస్సార్ సీపీ పాలకవర్గం విశేష కృషి చేసింది. మధురవాడ జోన్–2 భూగర్భ మురుగునీటి వ్యవస్థకు ఏకంగా రూ.553 కోట్లు, రోడ్ల నిర్వహణ, గుంతల పూడ్చివేతకు రూ.770 కోట్లు, సామాజిక భవనాల నిర్మాణం, నిర్వహణకు రూ.700 కోట్లు, మురుగునీటి కాలువల నిర్మాణానికి రూ.159 కోట్లు, 24 గంటల మంచినీటి పథకానికి రూ.140 కోట్లు కేటాయించి నగర మౌలిక రూపురేఖలను మార్చారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం నాడు–నేడు ద్వారా నగరంలోని ప్రభుత్వ పాఠశాలలు, పబ్లిక్ హెల్త్ సెంటర్లను కార్పొరేట్ స్థాయిలో ఆధునికీకరించి పేదలకు మెరుగైన విద్య, వైద్యాన్ని చేరువ చేశారు. సింహాచలం వచ్చే భక్తుల కోసం మౌలిక వసతుల కల్పనతో పాటు అడవివరం రోడ్డును విస్తరించారు. ఈ మేరకు భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు అందజేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకున్నారు. పార్టీలకతీతంగా ప్రగతి పరుగులు కుల, మత, పారీ్టలకతీతంగా అందరినీ కలుపుకుపోతూ.. పారిశుధ్య నిర్వహణలో ఎక్కడా రాజీ పడకుండా పగలు, రాత్రి అనే తేడా లేకుండా మేయర్ స్వయంగా పర్యవేక్షించడం నగర స్వచ్ఛతకు ఎంతో దోహదపడింది. నగర ప్రథమ పౌరురాలిగా ఇద్దరు రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులకు, ముఖ్యమంత్రికి ఆతిథ్యం ఇవ్వడంతో పాటు ఐదుగురు కమిషనర్లు, ఒక స్పెషలాఫీసర్‌తో సమన్వయం చేసుకుంటూ హుందాగా పరిపాలన సాగించారు. మొత్తంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గనిర్దేశంలో, మేయర్ హరి వెంకటకుమారి నేతృత్వంలో నగరం ఆ నాలుగేళ్లలో ప్రశాంతంగా.. అభివృద్ధిలో దూసుకుపోయిందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. -
రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ఎమ్మెల్యే వెలగపూడి అనుచరుడు
విశాఖపట్నం: విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు, కరకచెట్టు పోలమాంబ ఆలయ కమిటీ చైర్మన్ మద్ది శ్రీనివాస్ వివాహేతర సంబంధంతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడం కలకలం రేపింది. కొద్ది రోజులుగా టీడీపీ నాయకుల లైంగిక వేధింపుల ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండగా తాజాగా మద్ది శ్రీనివాస్ ఆ జాబితాలో చేరాడు. పోలీసులు, బాధిత మహిళ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...! బుద్ధి చెప్పాల్సింది పోయి.. వెలగపూడి వత్తాసు.. మద్ది శ్రీనివాస్ కొన్నాళ్లుగా భార్య వసుంధరను వదిలించుకోవాలని చూస్తున్నాడు. తాను గర్భవతిగా ఉన్న సమయంలో శ్రీనివాస్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంపై అతడి భార్య న్యాయ పోరాటానికి దిగారు. దీనిపై భీమిలి పోలీసు స్టేషన్‌తో పాటు విశాఖ త్రీటౌన్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అతడి వ్యవహారాన్ని పలు సందర్భాల్లో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దృష్టికి తెచ్చారు. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ప్రాథేయపడ్డారు. అయితే శ్రీనివాస్‌కు బుద్ధి చెప్పాల్సింది పోయి వెలగపూడి అతడిని వెనకేసుకురావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. భార్యా బిడ్డలను పట్టించుకోని శ్రీనివాస్‌ను ప్రసిద్ధ గ్రామ దేవత పోలమాంబ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్‌గా నియమించడం వివాదాస్పమైంది. ఈ వ్యవహారాన్ని శ్రీనివాస్ భార్య ప్రభుత్వం దృష్టికి కూడా తెచ్చినా పట్టించుకోలేదు. శ్రీనివాస్ అనైతిక సంబంధాలను రుజువు చేస్తే ఆలయ కమిటీ చైర్మన్‌గా తొలగిస్తామని ఎమ్మెల్యే వెలగపూడి గతంలో మీడియా సాక్షిగా ప్రకటించారు. అడ్డంగా చిక్కిన శ్రీనివాస్.. కేసులు నమోదైనప్పటికీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, స్థానిక టీడీపీ నాయకుడు పోతన్నరెడ్డి తదితరుల సహకారంతో శ్రీనివాస్ తప్పించుకుని తిరుగుతున్నాడు. తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లి చేసుకుని బరితెగించి తిరుగుతున్నట్లు భార్య పలు దఫాలు వాపోయారు. ఈ క్రమంలో శ్రీనివాస్ శనివారం అర్ధరాత్రి పెదవాల్తేర్‌లోని ఓ ఇంట్లో ఓ మహిళతో కలిసి ఉండగా భార్య వసుంధర రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వాళ్లిద్దరూ ఉన్న గదికి కుటుంబ సభ్యుల సహకారంతో తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శ్రీనివాస్ గది బయట కాపుకాసిన తన భార్యతోపాటు ఆమె కుటుంబ సభ్యులపై తన అనుచరులతో దాడి చేయించాడు. తన అనుచరుల సాయంతో గది తాళం పగలగొట్టించి బయటపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ వారు రాకపోవడంతో శ్రీనివాస్ మరోసారి తప్పించుకున్నాడని, ఓ మహిళతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అతడిపై చర్యలు తీసుకోవాలని వసుంధరతోపాటు ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేయడంతో పోలీసులు అతడిని ఎంవీపీ స్టేషన్‌కు తరలించారు. అయితే ఎమ్మెల్యే వెలగపూడి ఒత్తిడితో పోలీసులు శ్రీనివాస్‌ను విడిచిపెట్టినట్లు తెలిసింది. తాజా ఘటనపై వసుంధర రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై ఎంవీపీ సీఐని వివరణ కోరగా ఎలాంటి కేసు నమోదు చేయలేదని, ఫిర్యాదు అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అక్రమ సంబంధం, రాసలీలల ఘటనలో నేరుగా దొరికినప్పటికీ పోలీసులు, టీడీపీ నాయకులు శ్రీనివాస్‌కు తొత్తులుగా వ్యవహరించారని వసుంధర ఆక్రోశించారు. తనకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటాన్ని ఆపబోనని స్పష్టం చేశారు. వెలగపూడీ.. ఆడబిడ్డ ఉసురు పోసుకోకు.. మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని రుజువుచేస్తే శ్రీనివాస్‌పై కచ్చితంగా చర్యలు తీసుకుంటానని చెప్పిన ఎమ్మెల్యే వెలగపూడి ఇప్పుడు అతడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినా వత్తాసుగా నిలవడంపై వసుంధర మండిపడ్డారు. నీ పార్టీ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఓ ఆడబిడ్డ ఉసురుపోసుకోవద్దంటూ వెలగపూడిపై దుమ్మెత్తిపోశారు. నీ ఇంట్లో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి వస్తే నిందితుడిని ఇలాగే వెనకేసుకొస్తావా..? అంటూ ఆక్రోశించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల జీవితాలను నాశనం చేయవద్దంటూ హితవు పలికారు. సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై కలగజేసుకుని తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
వెలుగుల భారత్‌కు ‘రామన్న’ పవర్
(ఇండోర్ నుంచి సాక్షి ప్రతినిధి) సాక్షి,అమరావతి: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఉన్న రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (ఆర్ఆర్ కాట్) దేశంలోని విద్యుత్ రంగ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన పరిశోధన కేంద్రంగా నిలుస్తోంది. ఈ సంస్థ అణు విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం పెంపు, ఆధునిక శక్తి సాంకేతికతల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. త్వరలోనే విశాఖపట్నంలోనూ కార్యకలాపాలు విస్తరిస్తోంది. సెన్సార్ల ద్వారా రైలు ప్రమాదాలను నివారించడంతోపాటు ప్రతిక్షణం పర్యవేక్షించే సాంకేతికతను తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ కాట్ సాంకేతికత అభివృద్ధి, సహాయం డైరెక్టర్ డాక్టర్ జిష్ణు ద్వివేది, ఆర్ఆర్క్యాట్లో ఆవిష్కరణలు, వ్యాపార ప్రారంభాలను ప్రోత్సహించే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఏఐసీ పీఐఈ హబ్) డైరెక్టర్ డాక్టర్ క్రైస్ట్ ప్రకాష్ పాల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వెళ్లిన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..ఆధునిక సాంకేతికతతో అణు విద్యుత్ ఉత్పత్తి దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఆర్ఆర్ కాట్ ముందంజలో ఉంది. అణు విద్యుత్ కేంద్రాల్లో ఉపయోగించే అధునాతన యాక్సిలరేటర్లు, లేజర్ పరికరాలు, సూపర్ కండక్టింగ్ టెక్నాలజీలను ఈ కేంద్రం అభివృద్ధి చేసింది. ఈ సాంకేతికతలు కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వైద్య రంగాల్లో ఉపయోగపడుతున్నాయి. అణు రియాక్టర్ల పనితీరు మరింత సమర్థవంతంగా మారి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోంది. అలాగే రియాక్టర్ల భద్రతా ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉపయోగించే పరికరాలు అధిక ఉష్ణోగ్రతలు, ఒత్తిడిని తట్టుకోవాలి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ కాట్లో అభివృద్ధి చేసిన మెటీరియల్ సైన్స్, టెక్నాలజీ విద్యుత్ ప్లాంట్ల పరికరాల నాణ్యతను పెంచుతున్నాయి. అత్యాధునిక పదార్థాలతో తయారైన పరికరాలు ఎక్కువ కాలం పనిచేయడమే కాకుండా నిర్వహణ ఖర్చులను కూడా తగ్గిస్తున్నాయి. ముందుగానే లోపాలు గుర్తించే టెక్నాలజీ విద్యుత్ కేంద్రాల్లో పరికరాల లోపాలు ముందుగానే గుర్తించడానికి ఆర్ఆర్ కాట్ రూపొందించిన ఆధునిక లేజర్, డయాగ్నస్టిక్ టెక్నాలజీలు ఉపయోగపడుతున్నాయి. ఈ సాంకేతికతల ద్వారా విద్యుత్ ప్లాంట్లలో జరిగే లోపాలను త్వరగా గుర్తించి సరిచేయడం సాధ్యమవుతుంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. అణు విద్యుత్ మాత్రమే కాకుండా పునరుత్పాదక శక్తి రంగంలో కూడా ఆర్ఆర్ కాట్ పరిశోధనలు కొనసాగిస్తోంది. ముఖ్యంగా సౌర శక్తి ఉత్పత్తి కోసం ఉపయోగించే అధునాతన పరికరాల అభివృద్ధిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.ఈ టెక్నాలజీలు భవిష్యత్‌లో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఆర్ఆర్ కాట్లో అభివృద్ధి చేసిన పలు టెక్నాలజీలు విద్యుత్ రంగానికి సంబంధించిన పరిశ్రమలకు కూడా ఉపయోగపడుతున్నాయి. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, పరికరాల తయారీ, నిర్వహణలో ఈ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు. దేశంలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శక్తి ఉత్పత్తి వ్యవస్థలను మరింత సమర్థంగా నిర్వహించడం చాలా అవసరం. ఈ దిశగా ఇక్కడి కేంద్రంలో జరుగుతున్న పరిశోధనలు దేశ విద్యుత్ భద్రతకు అండగా నిలుస్తున్నాయి. -
వేరే యువతితో ఉండగా ఇంటికి తాళం వేసిన భార్య
సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు మద్ది శ్రీనివాస్ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి.. విశాఖ జిల్లా కరక పాలమాంబ ఆలయ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న మద్ధి శ్రీనివాస్.. భార్యను కాదని మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పెద్ద వాల్తేర్‌లోని కాగితాల వీధిలోని ఓ ఇంట్లో యువతితో మద్ధి శ్రీనివాస్ ఉండగా.. ఆయన భార్య గదికి తాళం వేసింది.గతంలోనూ టీడీపీ నేత మద్ధి శ్రీనివాస్ భార్య ఆందోళనకు దిగింది. మద్ధి శ్రీనివాస్‌పై ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకుంటామంటూ గతంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చెప్పారు. -
ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మద్యం డాన్‌గా చెలరేగిపోతున్నారు. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి ఆయన తన దందాను టాప్ గేర్‌లోకి తీసుకువెళ్లారు. ఎక్సైజ్ శాఖ 125 బార్లకు జారీ చేసిన నోటిఫికేషన్ మొదలు ‘కప్పం కట్టండి...బార్ లైసెన్స్ తీసుకోండి’ అని హుకుం జారీ చేశారు. అందుకు విశాఖపట్నంలో ఎక్సైజ్ శాఖ వత్తాసు పలుకుతుండటంతో అడ్డూ అదుపు లేకుండా ఆయన దందా సాగుతోంది. ఒక్కో బార్ లైసెన్స్‌కు రూ.2 లక్షలు చొప్పున ఇవ్వడంతోపాటు నెలకు రూ.50 వేలు చెల్లించాలన్నది టీడీపీ ఎమ్మెల్యే మాట.తద్వారా బార్ల లైసెన్సుల వ్యవహారంలో ఏకమొత్తంగా రూ.2.50 కోట్లతోపాటు నెలకు రూ.62.50 లక్షల చొప్పున వసూళ్ల దందాకు స్కెచ్ వేశారు. ఇక విశాఖలో ప్రాంతాలవారీగా ప్రజాప్రతినిధులకు వాటాలు ఇస్తుండటంతో వారందరూ సదరు టీడీపీ ఎమ్మెల్యే చెప్పినదానికి సై అంటున్నారు. జిల్లాలో కల్లుగీత కుటుంబాలకు కేటాయించిన బార్ల లైసెన్సుల విషయంలో కూడా ఆయన మాటే చెల్లుబాటు అయ్యే వరకూ లైసెన్సులు ఇవ్వలేదు. ఎక్సైజ్ అధికారికే కప్పం వసూళ్లు, పంపిణీ బాధ్యతలు.. ఇక సదరు టీడీపీ ఎమ్మెల్యే తరఫున కప్పం వసూలు చేసి, వాటాలు పంచే బాధ్యతను ఏకంగా జిల్లాలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి కంటే ద్వితీయ స్థానంలో ఉన్న అధికారికి అప్పగించడం మరో విశేషం. సదరు అధికారి తాను చెప్పినట్టు కప్పం వసూలు చేసే బాధ్యతను కిందిస్థాయి అధికారులకు అప్పగించారు. అందుకు సహకరించని ఇద్దరు ఎక్సైజ్ సీఐలపైనా బదిలీ వేటు వేశారు. కాగా సదరు అస్మదీయ అధికారికి తాజాగా పదోన్నతి లభించింది. పదోన్నతి తీసుకుంటే మరో జిల్లాకు బదిలీ కావాల్సి ఉన్నందున, తనకు పదోన్నతే అక్కర్లేదని ఆయన చెప్పేశారు. మరో జిల్లాలో ఉన్నతాధికారి పోస్టు కంటే విశాఖ జిల్లాలో టీడీపీ మద్యం డాన్‌కు కుడిభుజంగా ఉండటమే ఎక్కువ లాభసాటిగా ఉంటుందన్నది ఆయన ఉద్దేశం. పెద్దల అండదండలు ఉండడంతో ఎక్సైజ్ శాఖ కమిషనరేట్ కూడా చోద్యం చూస్తోంది.మాట వినకపోతే... విశాఖలో మొత్తం 125 బార్లకు తొలుత ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కప్పం చెల్లించేందుకు సమ్మతించిన 55 బార్లకే మొదటి దశలో లైసెన్సులు ఇచ్చారు. రెండోసారి నోటిఫికేషన్ జారీ చేయడంతో మరో 13 బార్లు, మూడోసారి నోటిఫికేషన్‌తో 27 బార్లకు లైసెన్సులకు పచ్చ జెండా ఊపారు. ఇక మిగిలిన బార్లకు ఎక్సైజ్‌శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. కప్పం చెల్లించకుండా ఎవ్వరూ బార్లకు లైసెన్సులు దాఖలు చేయడానికి వీలేదంటూ టీడీపీ ఎమ్మెల్యే వర్గం అడ్డుకుంటోంది. ⇒ తనను ధిక్కరిస్తూ లైసెన్సుల కోసం అప్లికేషన్ దాఖలుకు యతి్నంచినవారిపై టీడీపీ గూండాలతో దాడులు చేయిస్తూ బెదిరిస్తున్నారు. ⇒ తమకు కాదని లైసెన్సు తెచ్చుకున్నా నగరంలో బార్ ఏర్పాటు చేసేందుకు ఎవరూ స్థలాలు, భవనాలు అద్దెకుగానీ లీజుకుగానీ ఇవ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరికలూ జారీ అయ్యాయి. ⇒ సొంత స్థలాలు, భవనాల్లో బార్లను ఏర్పాటు చేయాలని భావిస్తే ఎక్సైజ్ అధికారులను పంపించి తనఖీలతో వేధిస్తామని కూడా బెదిరిస్తున్నారు. ⇒ దాంతో బార్లకు లైసెన్సులు దాఖలు చేసేందుకే ఔత్సాహికులు హడలిపోతున్నారు. -
నో టెన్షన్.. భూగర్బ రహస్య గుహల్లో చమురు నిల్వలు
పశ్చిమాసియా యుద్ధం భారతదేశ చమురు పరాధీనతను కళ్లకు కట్టింది. విదేశాల నుంచి ముడిచమురు, ద్రవరూప పెట్రోలియం గ్యాస్, ద్రవరూప సహజవాయువు దిగుమతులు హఠాత్తుగా ఆగిపోతే భారత్ కష్టాలకడలిలో పడిపోవడం ఖాయమని వార్తలు వినవస్తున్నాయి. ఈ పరిస్థితిని చాన్నాళ్ల క్రితమే ఊహించిన భారత్ ముందుజాగ్రత్తగా భారీ స్థాయిలో పెట్రో ఉత్పత్తులను నిల్వచేసుకునే రహస్య భూగర్భ నిల్వ కేంద్రాలను నిర్మించుకుంది. వీటిల్లో మిలియన్ల మెట్రిక్ టన్నుల కొద్దీ ముడిచమురు ఉత్పత్తులను దాచిపెడుతోంది.భారత్ తన 90 శాతం ముడిచమురు, 60 శాతం ఎల్పీజీ, 50 శాతం సీఎన్జీ (CNG) అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువ సరకును నిల్వచేసుకోవడంపై దృష్టిసారించింది. ఈ కారణంగానే హార్మూజ్ జలసంధి వంటి కీలక చమురు సరఫరా మార్గాలు మూతబడినా వెంటనే కంగారుపడకుండా తన చమురు నిల్వలను ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్ వంటి దేశాలు ఏకంగా లాక్డౌన్ ప్రకటించి చేతులెత్తేసి చేష్టలుడిగి చూస్తున్నాయి.మూడు చోట్ల మహా గుహలు! చమురు ఉత్పత్తుల దిగుమతులు ఆగిపోయాయనే దిగులుతో భారత్ నిద్రలేని రాత్రులు గడపాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు, తమిళనాడులోని పాడూర్‌లో కేంద్రప్రభుత్వం మూడు భూగర్భ రహస్య నిల్వకేంద్రాలను నిర్వహిస్తోంది. ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో పదేళ్ల క్రితమే 4 కోట్ల బ్యారెళ్ల ముడిచమురును నిల్వచేసే భారీ భూగర్భ కేంద్రాన్ని నిర్మించారు.ఇందులోని ముడిచమురు (Crude Oil) పది రోజులపాటు యావత్ భారతదేశ అవసరాలను తీర్చగలదు. బాంబు, డ్రోన్ దాడులను తట్టుకునేలా అత్యంత లోతులో వీటిని నిర్మించారు. ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు, చమురు ఒలికిపోవడం వంటి లీకేజీ సమస్యలూ ఇక్కడ దాదాపు ఉండవు. గతంలోలాగా ఒకటి రెండు దేశాలపై ఆధారపడకుండా ఏకంగా 40 దేశాల నుంచి ముడిచమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఏదో ఒకటి రెండు దేశాలు యుద్ధసంక్షోభంలో చిక్కుకున్నాసరే మిగతా దేశాల నుంచి నిరాటంకంగా దిగుమతులు కొనసాగే ఏర్పాట్లు భారత్ చేసుకుంది.అంతర్జాతీయ చమురు సంక్షోభం తలెత్తకూడదనే ఉద్దేశంతో తాత్కాలికంగా రష్యా చమురును కొనేందుకు భారత్‌కు అమెరికా అనుమతి ఇవ్వడంతో వేగంగా భారత్ పావులు కదిపింది. దక్షిణాసియాలో ఇప్పటికే నౌకల్లోకి ఎక్కించిన 30 మిలియన్ బ్యారెళ్ల చమురును భారత్ కొనుగోలుచేసింది. దీనికితోడు గత పది రోజుల్లోనే ఒక్క అంగోలా నుంచే 34 లక్షల బ్యారెళ్ల ముడిచమురును భారత్ కొనేసింది. రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి మరో 19 లక్షల బ్యారెళ్ల చమురు కొనుగోలుచేసింది. ఇలా వచ్చిన సరకును వీలైనంత వరకు భూగర్భం కేంద్రాల్లో దాచేస్తోంది. ఎల్పీజీ స్టోరేజీ సైతం ఊపందుకుంది.అరకిలోమీటర్ లోతులో..కర్ణాటకలోని మంగళూరులో (Mangaluru) ఏర్పాటుచేసిన స్టోరేజీ సామర్థ్యం ఏకంగా 80,000 టన్నులు. ఇది అరకిలోమీటర్ లోతులో ఉంది. ఇదిగాక విశాఖపట్నంలో మరో ఎల్పీజీ నిల్వకేంద్రం ఉంది. దీని సామర్థ్యం 60,000 టన్నులు. ఇవిగాక మరికొన్ని రహస్య భూగర్భ రాతి గుహలను నిర్మించి మరింత ఎక్కువ చమురును నిల్వచేయాలని కొన్ని నెలల క్రితం పార్లమెంట్లో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను తమిళనాడులోని పాడూర్‌లోనూ దాచేస్తోంది. ఒడిశాలోని ఛందీఖోల్‌లో మరో దానిని నిర్మించనున్నారు.చదవండి: సిలిండర్లు దాచారో.. జైలుకే!భూగర్భ గుహలు అనేవి వ్యూహాత్మకంగా సురక్షితమైనవి. భూమి మీది నిల్వకేంద్రాల నుంచి ఎండాకాలంలో కొంతమేర పెట్రో ఉత్పత్తులు వేడికి ఆవిరవుతాయి. భూగర్భంలో ఆ నష్టభయం ఉండదు. యుద్ధకాలంలో తొలిసారిగా స్వీడన్లో ఈ ప్రణాళికను అమలుచేశారు. తర్వాత ఫిన్లాండ్, జపాన్, దక్షిణకొరియా తదితర దేశాలు ఇదే బాటలో పయనించాయి. 1990లో గల్ఫ్ యుద్ధం నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో భారత్ ఈ అండర్‌గ్రౌండ్ స్టోరేజీలకు అంకురార్పణ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విశాఖపట్నంలో వైభవంగా పైడిమాంబ తొలేళ్ల సంబరం (ఫొటోలు)
-
మూగ బంధం.. అంతులేని మమకారం
విశాఖపట్నం: కుటుంబ సభ్యులను కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతం. అయితే, ఎలాంటి రక్తసంబంధం లేకపోయినా మనకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించే మూగజీవాలు దూరమైనా ఆ వ్యధ అంతకంటే ఎక్కువే ఉంటుంది. విశ్వాసానికి మారుపేరైన శునకాలను కేవలం పెంపుడు జంతువుల్లా కాకుండా, ఇంట్లో బిడ్డల్లా సాకుతున్న ఎందరో విశాఖవాసులు.. ఆ మూగజీవాలపై తమకున్న అంతులేని ప్రేమను కొత్తగా చాటుకుంటున్నారు. సాధారణంగా మనుషులకు సమాధులు కట్టి వారి జ్ఞాపకాలను పదిలపరుచుకోవడం మనం చూస్తుంటాం. కానీ, అప్పుఘర్ పార్క్ సమీపంలో ఉన్న సాగరతీరానికి వెళితే.. హృదయాన్ని హత్తుకునే అరుదైన దృశ్యాలు కనిపిస్తాయి. అక్కడ ఇసుక తిన్నెల్లో పదుల సంఖ్యలో శునకాలకు నిర్మించిన సమాధులు దర్శనమిస్తాయి. ఇంటికి కాపలాగా ఉంటూ, యజమాని చుట్టూ తిరుగుతూ, ఎలాంటి స్వార్థం లేకుండా ఎనలేని ప్రేమను పంచేవి శునకాలు. కొన్ని నెలలో, సంవత్సరాలో తమతో గడిపి, సంతోషాన్ని పంచిన ఆ మూగజీవాలు మరణిస్తే యజమానులు తట్టుకోలేకపోతున్నారు. అవి తమనుంచి దూరమైన తరువాత, వాటికి గౌరవప్రదమైన రీతిలో ఆఖరి మజిలీ నిర్వహిస్తున్నారు. సముద్ర తీరంలో వాటి కోసం ప్రత్యేకంగా సమాధులను కట్టించి తమ శాశ్వతమైన ప్రేమకు రూపమిస్తున్నారు. ఒక్కో సమాధి నిర్మాణానికి సుమారు రూ. 20వేల నుంచి రూ. 25 వేల వరకు ఖర్చవుతోంది. అయినా సరే, తమ కుటుంబంలో ఒకరిగా మెలిగిన జీవులకు ఘనంగా తుది వీడ్కోలు పలకడానికి వారు ఏమాత్రం వెనకాడటం లేదు. సముద్రపు అలల సాక్షిగా వెలసిన ఈ స్మృతి చిహా్నలు.. వ్యక్తులకు, మూగజీవాలకు మధ్య ఉన్న స్వచ్ఛమైన అనుబంధానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్ విశాఖపట్నం -
ఎర్రబుక్లు, పిచ్చిబుక్లు మమ్మల్ని ఏమీ చేయలేవు: అంబటి
సాక్షి, విశాఖపట్నం: తన ఇంటిపై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మానిటర్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పోలీసుల సాక్షిగా తన ఇంటిపై దాడి జరిగిందన్నారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. భగవంతుడి దయ వల్ల తనను చంపలేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో కాపు నేతల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. విశాఖలోని కరణం ధర్మశ్రీ నివాసంలో విశాఖ కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఇటీవల పరిణామాలపై కాపు నేతలు చర్చించారు. అలాగే, కూటమి ప్రభుత్వ అక్రమ కేసులు, అరెస్ట్‌లపై కాపు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు, ఉమ్మడి విశాఖ జిల్లా కాపు నేతలు పాల్గొన్నారు.అనంతరం, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీకి చెందిన వారు నా ఇంటిపైకి వచ్చారు.. కులం పేరుతో దూషించారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు?. గుంటూరు నడి బొడ్డున నా ఇంటిపై దాడి చేశారు. నా ఇంటిపై దాడిని టీవీ చానెల్స్ లైవ్ ఇస్తున్నా ప్రభుత్వం తెలియనట్టుగా ఉంది. భగవంతుడి దయ వల్ల నన్ను చంపలేదు. రెడ్‌బుక్‌ను మా కుక్క లెక్కచేయదంటే లోకేష్‌కు కోపం వచ్చిందేమో.నేను సెంటర్ జైల్లో ఉన్నప్పుడు నా మీద ఎంతో ప్రేమ అభిమానం చూపించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు తరలి వచ్చారు. నా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నాపై దాడి చేసి అక్రమంగా జైలుకు పంపారు. నన్ను 18 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు. నాపై జరిగిన దాడి ఒక కులంపై మరొక కులం చేసిన దాడిగా భావించాలి. చరిత్రలో ఎన్నడు ఎప్పుడు జరగని దాడి నాపై జరిగింది. టీడీపీ గుండాలకు అలుపు వచ్చే వరకు దాడి చేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 12 గంటలకు దాడి జరిగింది. చంద్రబాబు పతనం ప్రారంభమైంది. నాపై చేసిన దాడికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాను. ఎర్రబుక్కులు, పిచ్చిబుక్కులు మమ్మల్ని ఏమీ చేయలేవు.కులాలను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారు. టీడీపీ గూండాలు వంగవీటి రంగాను దారుణంగా చంపారు. పోలీసులు సహకారంతో రంగాను హత్య చేశారు. అదేవిధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని నాపై దాడి చేశారు. కాపులను బీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీ కోసం ముద్రగడ ఉద్యమం చేశారు. కాపుల కోసం ఉద్యమం చేసిన ముద్రగడను జైల్లో పెట్టారు, చంపాలని చూశారు. పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నాడు కాబట్టి కాపులు మా వైపు ఉన్నారనుకుంటే అది మీ భ్రమ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
విశాఖలో వైఎస్ జగన్.. పోటెత్తిన అంతులేని అభిమానం (ఫొటోలు)
-
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
వైఎస్ జగన్ విశాఖ పర్యటన అప్డేట్స్.. 👉విశాఖ దక్షిణ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుటుంబసభ్యులను వైఎస్ జగన్ కలిశారు. విశాఖ రాణాప్రతాప్ నగర్‌లోని ఆయన నివాసంలో ఇటీవల వివాహం జరిగిన వాసుపల్లి గణేష్ రెండో కుమారుడు వాసుపల్లి సాకేత్, శ్రావణిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు.అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుఅరకు వ్యాలీ తుంగల్‌గూడ గ్రామంలోని రాధాక్రిష్ణ ఆలయంలో వివాహా వేడుకవివాహ వేడుకలో నూతన వధూవరులు అశ్వని, చాణక్యలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన వైఎస్ జగన్ వైఎస్ జగన్‌కు స్వాగతం అరకు చేరుకున్న వైఎస్ జగన్అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరు కానున్న వైఎస్ జగన్.గిరిజన సాంప్రదాయ దింసా నృత్యంతో వైఎస్ జగన్‌కు స్వాగతం పలకనున్న మహిళలు..👉విశాఖ బయలుదేరిన వైఎస్ జగన్. 👉వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ వేడుకకు, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు.👉గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం, విశాఖ నుంచి హెలికాప్టర్లో అరకు వ్యాలీ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తంగులగూడ గ్రామంలోని రాధాకృష్ణ ఆలయం వద్దకు వెళ్తారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ రిసెప్షన్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.👉మధ్యాహ్నం అరకు నుంచి హెలికాప్టర్లో తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన మర్రిపాలెం రాణా ప్రతాప్‌నగర్‌కు చేరుకుని అక్కడ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చిన్న కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై ఆశీస్సులు అందజేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరుతారు. -
విశాఖ తీర రక్షణకు తూట్లు!
సాక్షి, విశాఖపట్నం: సుదీర్ఘమైన తీరప్రాంతంపై చంద్రబాబు ప్రభుత్వం పగబట్టింది. అనుయాయులకు లబ్ధి చేకూర్చేందుకు అభివృద్ధి పేరుతో తీరాన్ని విచ్చిన్నం చేసేందుకు కుట్ర పన్నుతోంది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలను సడలించడం, జోన్లు మార్చడం వంటి చర్యలతో తీరప్రాంత సమతుల్యతను దెబ్బతీస్తోంది. పర్యాటక ముసుగులో న్యాయస్థానాల హెచ్చరికల్ని కూడా బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. కావాల్సిన వారికి ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అడ్డదారులు తొక్కుతోంది. గతంలో పర్యావరణవేత్తలు, ప్రజలు పోరాడి కాపాడుకున్న తీరప్రాంతాలను ఇప్పుడు కమర్షియల్ హబ్‌లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. నగరంలోని సాగరతీర ప్రాంతాల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రభుత్వం ఎంతటి మొండివైఖరితో ఉందో అర్థమవుతోంది. తన వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, బడా కాంట్రాక్టర్ల కోసం పర్యావరణ అనుమతులను సైతం వేగవంతం చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యంతరాలను పక్కనపెట్టి అడ్జస్ట్మెంట్లతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. భీమిలి తీరంలో సీఆర్‌జెడ్ మాయాజాలం విశాఖ–భీమిలి తీరప్రాంతంలో సీఆర్‌జెడ్ జోన్ల మారి్పడి (రీక్లాసిఫికేషన్)పై చంద్రబాబు ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం.. సీఆర్‌జెడ్–3 కేటగిరీలో ఉన్న ప్రాంతాలు తక్కువ నిర్మాణాలు కలిగి, ప్రకృతి సిద్ధంగా ఉంటాయి. సముద్రమట్టం నుంచి 200 మీటర్ల వరకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. ఇక్కడి ఇసుకదిబ్బలు, చిత్తడినేలలు వంటివి అలల తాకిడిని, తుపాన్లను అడ్డుకునే సహజ రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. సీఆర్‌జెడ్–2 కేటగిరీలో సముద్రతీరానికి అత్యంత సమీపంలో భారీ కాంక్రీట్ కట్టడాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించుకోవచ్చు.విశాఖ–భీమిలి బీచ్ వెంబడి సీఆర్‌జెడ్–3 పరిధిలో 500 ఎకరాలకుపైగా భూములున్నాయి. వీటిలో భారీ కాంక్రీట్ నిర్మాణాలకు వీలులేదు. ఇప్పుడు ఈ భూముల్ని సీఆర్‌జెడ్–2 పరిధిలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. ఈ భూముల్లో మెజారిటీ వాటా ప్రభుత్వ నేతలదే కావడంతో.. మార్పిడి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విశాఖని గ్లోబల్ సిటీగా మారుస్తామనే సాకుతో తీరప్రాంత మాస్టర్‌ప్లాన్‌పై సమీక్షలు మొదలుపెట్టారు. 2024 అక్టోబర్–డిసెంబర్ మధ్య మాస్టర్‌ప్లాన్ సవరణల పేరుతో అంతర్గత కసరత్తు జరిగింది. ఆ సమయంలోనే సీఆర్‌జెడ్–3లోని భూముల్ని సీఆర్‌జెడ్–2 కిందకు చేర్చి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుగా మార్చాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను కేంద్రానికి పంపించి మార్పులు చేసెయ్యాలని ప్రభుత్వం ఆరాటపడిపోతోంది. పర్యావరణ నిబంధనలు అభివృద్ధికి అడ్డంకి అన్న మంత్రి దుర్గేష్ నిబంధనల్ని పాటిస్తూ పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు అభివృద్ధికి అవే అడ్డంకి అనటం ఆందోళన కలిగిస్తోంది. పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసనసభలో మాట్లాడుతూ పర్యావరణ నిబంధనలు అభివృద్ధికి అడ్డంకి అంటూ వ్యాఖ్యానించారు. ఇక విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి కూడా అసెంబ్లీలో నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధి కోసం కాకుండా.. బీచ్‌రోడ్డుని సీఆర్‌జెడ్–2లోకి తీసుకురావాలని కోరారు. పర్యావరణ కంటే.. ప్రాఫిట్ ముఖ్యంవీటిని పరిశీలిస్తే ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కంటే ప్రాఫిట్‌కే పెద్దపీట వేస్తోందని స్పష్టమవుతోంది. ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటే.. నగరంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. తీరంలో ఇసుక దిబ్బలు, ఖాళీ ప్రదేశాలు సహజ సిద్ధమైన బఫర్ జోన్లుగా పనిచేసి ఉప్పెనలు, తుపాన్ల తీవ్రతను తగ్గిస్తాయి. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో వాణిజ్య విస్తరణకు తెరతీస్తే.. భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలకు విశాఖను బలి చేయడమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం విశాఖ విధ్వంసాన్ని మాత్రమే కోరుకుంటోంది తప్ప.. అభివృద్ధిని కాదంటూ పర్యావరణవేత్తలు, కూటమి పారీ్టల ప్రతినిధులే సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు. ఆత్మహత్యా సదృశ్యమే.. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ముప్పు పొంచి ఉన్న తరుణంలో ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఓవైపు గ్రేట్ గ్రీన్‌వాల్ వంటి కార్యక్రమాలు చేస్తూనే.. మరోవైపు పర్యాటకశాఖ దానికి విరుద్ధంగా వ్యవహరించడం శోచనీయం. కేవలం రూ.4,098 కోట్ల పెట్టుబడులు, 2,800 హోటల్ గదులు వంటి తాత్కాలిక ఆరి్థక ప్రయోజనాల కోసం, శాశ్వత పర్యావరణ రక్షణ కవచాలైన సీఆర్‌జెడ్–3 నిబంధనలను సడలించి తీరాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మార్చాలని చూడటం ఆత్మహత్యా సదృశ్యమే. ఇప్పటికే జీవీఎంసీ, ఏపీపీసీబీ పర్యవేక్షణ లోపంతో సముద్రజలాలు కలుషితమవుతున్నాయి. ఇప్పుడు అదనపు కట్టడాలకు అనుమతినిస్తే విశాఖ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అభివృద్ధి అంటే ప్రకృతిని ధ్వంసం చేయడంకాదు, భావితరాలకు సురక్షితమైన తీరాన్ని అందించడమే. ప్రభుత్వం సీఆర్‌జెడ్ పునర్వర్గీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి. – బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన ప్రతినిధి, పర్యావరణవేత్త తుపాన్లు, ఉప్పెన్ల ముప్పు పెరుగుతుంది విశాఖపట్నం తీరప్రాంతంలో సీఆర్‌జెడ్–3 నిబంధనలను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుండటం గర్హనీయం. కేవలం పర్యాటక అభివృద్ధి, వాణిజ్య విస్తరణ పేరుతో చేస్తున్న ఈ మార్పువల్ల సాగరతీరంలోని ఇసుక దిబ్బలు, చిత్తడి నేలలు వంటి సహజ రక్షణ కవచాలు ధ్వంసమైపోతాయి. భవిష్యత్తులో తుపాన్లు, ఉప్పెన్ల ముప్పు పెరుగుతుంది. ప్రభుత్వం తాత్కాలిక లాభాల కోసం మత్స్యకారుల జీవనోపాధిని పణంగా పెడుతోంది. ఇప్పటికే కాలుష్యంతో అల్లాడుతున్న విశాఖకు ఇది మరో పెద్దదెబ్బ. చట్టబద్ధమైన పర్యావరణ రక్షణలను అడ్డంకులుగా చూడటం బాధ్యతారాహిత్యం. చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాల్సిందే. – వై.రాజే‹Ù, వీఎస్ కృష్ణ, మానవహక్కుల ఫోరం ప్రతినిధులు -
విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మిం కుల దుర్మరణం
పద్మనాభం (భీమిలి): విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఇసకలపాలెంలో ఆదివారం విద్యుదాఘాతానికి ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం గొండయ్యపాలేనికి చెందిన తాపీ మేస్త్రీ కంటుబోతు శ్రీను (34), ఇసకలపాలేనికి చెందిన మరో మేస్త్రీ కాళ్ల సూరీడు (60), ఆయన కుమారుడు సూరిబాబు ఇసకపాలెంలో రేకుల షెడ్డు నిర్మిం స్తున్నారు. కొలతలు తీసుకుంటున్న సమయంలో, అక్కడే అడ్డుగా ఉన్న ఒక పొడవైన ఇనుప పోల్‌ను పక్కకు జరిపేందుకు యత్నించారు.ఈక్రమంలో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్ల నుంచి ఇనుప పోల్‌కు విద్యుత్ ప్రసరించడంతో శ్రీను, సూరీడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించారు. సూరిబాబు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సూరిబాబును 108లో విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించా రు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని మరణంతో వారి కుటుంబం రోడ్డున పడింది. సూరీడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. సూరీడు మరణం, సూరిబాబుకు గాయాలు కావడంతో ఆ కుటుంబ సభ్యులూ కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాగర తీరాన సప్తపది
విజయవాడకు చెందిన రమేష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. విశాఖకు చెందిన అంజలి హైదరాబాద్‌లో ఆర్కిటెక్ట్. వారిద్దరూ తమ వివాహం కేవలం ఒక ఫంక్షన్ హాల్కే పరిమితం కాకుండా కుటుంబ సభ్యులందరితో కలిసి మూడు రోజులపాటు పండుగలా చేసుకోవాలని విశాఖపట్నం తీరాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికగా ఎంచుకున్నారు.సాక్షి, సెంట్రల్ డెస్క్: ఒకప్పుడు ఆకాశమంత పందిరి.. పెళ్లికి నెల రోజుల ముందు నుంచే హడావుడి. పెళ్లి కుమార్తెతో పాటు పెళ్లి కుమారుడి ఇళ్లల్లో ఉరుకులు పరుగులు కనిపించేవి. ఇప్పుడు పెళ్లిళ్ల ట్రెండ్ మారింది. డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు ఆదరణ పెరుగుతోంది. సెలబ్రిటీలు చేసుకుంటున్నట్టుగా బాలి, మాల్దీవులు, రాజస్థాన్, కశ్మీర్ వంటి ప్రాంతాలకు వెళ్లడం లేదు. మన మధ్యే.. మన రాష్ట్రంలోనే ప్రకృతి అందాల మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవడం నయా ట్రెండ్‌గా మారింది. సంప్రదాయబద్ధంగా.. ఆహ్లాదకర వాతావరణంలో వివాహాలు జరిపిస్తున్నారు. వధూవరుల తరఫు సమీప బంధువులతో పాటు అత్యంత ఆత్మీయుల సమక్షంలో పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. వివాహానికి ముందు బ్యూటీ సెషన్లు, స్థానిక సంస్కృతిని తెలుసుకునే వర్క్‌షాప్‌లు వంటి వినూత్న కార్యక్రమాలు 2026లో ట్రెండ్‌గా ఉన్నాయి. సంపన్నులు, మధ్యతరగతి వారు సైతం డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కే జై కొడుతున్నారు. వధువు తరఫున 40–50 మంది.. వరుడి తరఫున మరో 40–50 మందితో ప్రశాంతంగా పెళ్లి వేడుకను ముగిస్తున్నారు. ఆ తరువాత సొంతూళ్లలో బంధుమిత్రుల కోసం రిసెప్షన్లు ఏర్పాటు చేస్తున్నారు.చుట్టూ ప్రకృతి అందాలు.. సెలయేటి సవ్వళ్లు.. పక్షుల కిలకిలా రావాల మధ్య అడుగులో అడుగేస్తూ.. వధూవరుల ‘సప్తపది’ తంతు ఆహా.. అన్నట్టు ఉంటోంది. మొదటి రోజు: పెళ్లి సందడి రుషికొండ సమీపంలోని విలాసవంతమైన రిసార్ట్‌లో బంధువులందరికీ స్వాగతం పలికారు. సాయంత్రం సముద్రపు గాలుల మధ్య జరిగిన ’మెహందీ’ వేడుక కన్నుల పండువగా సాగింది. రెండవ రోజు: పసుపు సంబరం ఉదయాన్నే బీచ్ ఎదురుగా ఉన్న తోటలో ’హల్దీ’ వేడుక జరిగింది. పసుపు రంగు బట్టల్లో అతిథులందరూ ఒకరిపై ఒకరు పూల రెక్కలు, పసుపునీళ్లు చల్లుకుంటూ సందడి చేశారు. సాయంత్రం ‘సంగీత్’ వేడుకలో సముద్రపు అలల హోరు మధ్య డీజే పాటలకు అంజలి, రమేష్ కుటుంబ సభ్యులు నృత్యాలతో హోరెత్తించారు. మూడవ రోజు: కల్యాణ ఘట్టం తెల్లవారుజామున సముద్రపు ఒడ్డున మంటపం పచ్చని మామిడి ఆకులు, మల్లెపూల అలంకరణలతో దివ్యంగా ఉంది. బాలభానుడి కిరణాలు సముద్రాన్ని తాకుతున్న వేళ.. వేద మంత్రాల సాక్షిగా రమేష్ అంజలి మెడలో మూడుముళ్లు వేశాడు. హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహం ఆధునిక డెస్టినేషన్ వెడ్డింగ్ శైలిలో అతిథులకు మర్చిపోలేని అనుభూతినిచి్చంది. ఇలా వీరేకాదు అత్యధికులు ఈ తరహా వివాహాల వైపు మొగ్గు చూపుతున్నారు. పర్యావరణ హితంగానూ.. ప్లాస్టిక్ రహిత అలంకరణలతో స్థానిక కళాకారులు, స్థానిక వంటకాలకు స్థానం కల్పిస్తూ పర్యావరణానికి హాని కలగకుండా వివాహాలు చేసుకోవడం కూడా కొత్త బాధ్యతాయుతమైన ట్రెండ్‌గా మారింది. 2026 నాటికి భారతదేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ మార్కెట్ విలువల 18 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా.. 2033 నాటికి 55 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.ఏపీలోనూ ఆదరణ మన రాష్ట్రంలోనూ డెస్టినేషన్ వెడ్డింగ్స్ పెరిగాయి. విశాలమైన తీర ప్రాంతాలు, కొండకోనల నడుమ రిసార్ట్లు ఇందుకు వేదిక అవుతున్నాయి. బెంగళూరు వంటి ప్రాంతాలకు చెందిన వారు సైతం విశాఖపట్నం, భీమిలి, చీరాల, బాపట్ల వంటి తీరాలతోపాటు దిండి, కోనసీమలోని రిసార్ట్స్, కొండ ప్రాంతాలు, చారిత్రక కట్టడాలను వివాహ వేదికలుగా మార్చుకుంటున్నారు.దోహదం చేస్తున్న అంశాలివీ » జెన్ జెడ్ అభిరుచులకు డెస్టినేషన్ వివాహాలు అద్దం పడుతున్నాయి. » విహార యాత్రలా మాత్రమే కాకుండా.. వధూవరుల కుటుంబాల మధ్య అనుబంధాలను మరింతగా పెనవేస్తాయని జెన్ జెడ్ భావిస్తోంది. » డెస్టినేషన్ వెడ్డింగ్స్‌తో ఏర్పాట్ల కోసం పడే శ్రమ, ఖర్చులను కూడా పరిమితం చేయడంతో పాటు ఆహ్లాదకర వాతావరణంలో వివాహాలు జరిపించి మధురానుభూతి పొందుతున్నారు. » సముద్ర తీరాలు, చారిత్రక కట్టడాలు, కొండ ప్రాంతాల వంటి ప్రకృతి అందాల నడుమ పెళ్లి చేసుకోవడం వల్ల జీవితాంతం గుర్తుండిపోయే సినిమాటిక్ ఫొటోలు, వీడియోలు లభిస్తున్నాయి. » ఆదాయం పెరగడంతో చాలామంది డెస్టినేషన్ వెడ్డింగ్‌ను సామాజిక హోదాకు గుర్తింపుగా భావిస్తున్నారు.మధురానుభూతి గతంలో పెళ్లి అంటే ఎంతో హడావుడి ఉండేది. ఏర్పాట్ల కోసం కుటుంబ సభ్యులంతా హైరానా పడాల్సి వచ్చేది. అందుకే మా అబ్బాయి అమర్ శంకర్ వివాహం విశాఖలోని రిసార్ట్స్‌లో ప్లాన్ చేశాం. ఆత్మీయుల సమక్షంలో చేసిన పెళ్లి మధురానుభూతి ఇచ్చింది. వచ్చిన బంధువులంతా మినీ ట్రిప్‌లా ఎంజాయ్ చేశారు. మేము కూడా అతిథుల మాదిరిగా సరదాగా గడిపాం. – యు.ఉషాదేవి, విజయనగరంబడ్జెట్ ఫ్రెండ్లీగానే.. డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగానే చేసుకోవచ్చు. వధూవరుల అభిరుచి మేరకు అన్ని రకాల ఏర్పాట్లు ఎక్కడైనా సరే మేం చేస్తాం. స్టేజి ఎంపికపైనే ఖర్చు ఆధారపడి ఉంటుంది. ఆర్కెస్ట్రా వంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా సమకూరుస్తున్నాం. – టి.రవళి, తలశిల వెడ్డింగ్ ప్లానర్స్, విజయవాడఅతిథుల్లా వస్తే చాలు వధూవరులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా అతిథుల్లా వస్తే చాలు. వివాహానికి సంబంధించిన అన్ని వస్తువులతో పాటు, నచ్చిన మెనూ, డెకరేషన్, ఫొటో, వీడియో గ్రఫీ, ఘట్టానికి తగ్గట్టు స్టేజి ఏర్పాట్లు చేస్తాం. ప్రస్తుతం అందరూ వివాహాన్ని గ్రాండ్‌గా చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. వారి అభిరుచికి తగ్గట్టు సరీ్వసు అందిస్తున్నాం. – అభి, అభి ఈవెంట్స్ అండ్ ఫుడ్ కేటరర్స్, రాజమండ్రి -
నాటి ప్రణాళికలే.. నేటి ప్రగతికి బాటలు
విశాఖ సిటీ: ఒక నగరం ప్రపంచస్థాయి మెట్రోపాలిటన్‌గా ఎదగాలంటే కేవలం ఆకాశహర్మ్యాలు ఉంటే సరిపోదు, పటిష్టమైన మౌలిక సదుపాయాలు ఉండాలి. సరిగ్గా ఇదే దూరదృష్టితో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చే కీలక ప్రాజెక్టులకు పునాదులు వేయగా, అవే ఇప్పుడు ప్రగతికి దిక్సూచిగా మారాయి. అందులో ప్రధానమైన ‘వైజాగ్ కోస్టల్ హైవే’ ప్రాజెక్టు ఇప్పుడు పట్టాలెక్కడానికి సిద్ధమవుతోంది. విశాఖ ఓడరేవు నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఆరు వరుసల ఎక్స్‌ప్రెస్‌కు అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టు కేవలం ట్రాఫిక్ సమస్యలను తీర్చడమే కాకుండా, పర్యాటక, పారిశ్రామిక రంగాలకు కొత్త ఊపిరి పోయనుంది. సుమారు 55 కిలోమీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో తీరం వెంబడి సాగే ఈ రహదారి అభివృద్ధికి త్వరలోనే అంకురార్పణ జరగనుంది. పట్టాలెక్కనున్న ప్రాజెక్టు ప్రస్తుతం ఈ ప్రాజెక్టు అమలు దశలోకి అడుగుపెడుతోంది. హార్బర్ నుంచి కైలాసగిరి వరకు ఉన్న 30 మీటర్ల రహదారిని 40 మీటర్లకు, అక్కడి నుంచి భోగాపురం వరకు 60 మీటర్లకు విస్తరించనున్నారు. రుషికొండ సమీపంలో ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సముద్ర అందాలకు ఆటంకం కలగకుండా, భూసేకరణ సమస్యలు తలెత్తకుండా దీనిని రూపకల్పన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటికి దీనిపై దృష్టి సారించింది. గతంలో ఉన్న ప్లాన్‌కు చిన్న పాటి సాంకేతిక మార్పులు చేస్తోంది. ముఖ్యంగా ఎలివేటెడ్ కారిడార్ పొడవును పెంచడం, భీమిలిలో నేరేళ్లవలస కొద్దిగా ముందగానే రహదారిని మళ్లిస్తూ డిజైన్లను మార్పు చేసింది. ఈ మార్పుతో ఇంకా కొంత మేర భూ సేకరణ చేపట్టాల్సి వస్తోంది. భీమిలి నుంచి భోగాపురం వరకూ 19.66 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్ట్ కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం సుమారు 350 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. ఈ కోస్టల్ కారిడార్ ప్రాజెక్టు భూసేకరణకు రూ.4,315 కోట్లు, నిర్మాణాలకు రూ.1,974 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టును రెండు లేదా మూడు రీచ్‌లుగా విభజించి పనులు చేపట్టనున్నారు. వైజాగ్ కోస్టల్ హైవే కేవలం ఒక రోడ్డు ప్రాజెక్ట్ మాత్రమే కాదని, ఇది విశాఖను గ్లోబల్ సిటీగా మార్చే క్రమంలో ఒక కీలక అడుగుగా పారిశ్రామికవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఐటీ రంగానికి నిలయమైన రుషికొండ, పర్యాటక ప్రాంతమైన భీమిలి, అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం.. ఈ మూడింటిని కలిపే ఈ రహదారి ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేస్తుందని భావిస్తున్నారు. నాడు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపకల్పనవిశాఖను గ్లోబల్ హబ్‌గా మార్చాలనే సంకల్పంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కోస్టల్ కారిడార్‌కు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ఈ ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళికలో చేర్చింది. విశాఖ నగరం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ‘సిక్స్ లేన్’ డిజైన్లను ఖరారు చేసింది. భారీ వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ విషయంలో గత ప్రభుత్వం సాహసోపేత అడుగులు వేసింది. వీఎంఆర్డీఏ ద్వారా సుమారు 55 కిలోమీటర్ల మేర సాగే ఈ కారిడార్ కోసం ల్యాండ్ పూలింగ్ పద్ధతిని అనుసరించి రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకుంది. క్షేత్రస్థాయిలో అడ్డంకులను తొలగించి ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించడమే కాకుండా, పారదర్శకమైన రీతిలో మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయించింది. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరిపి, రూ. 6,289 కోట్ల వ్యయం అయ్యే ఈ రహదారిని జాతీయ రహదారిగా గుర్తింపజేయడంలో సఫలీకృతమైంది.


