నగరంలో మంగళవారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి భానుడు ఉగ్రరూపం దాల్చడంతో నగర వాసులు తీవ్ర ఉక్కబోత, వడగాడ్పులతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చుర్రుమనిపించే ఎండలు, ఉక్కపోతతో మధ్యాహ్నం వరకు జనం అల్లాడిపోయారు.
సాయంత్రానికి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటుచేసుకుంది. ఆకాశం మేఘావృతమై, చల్లని గాలులు వీచాయి. కొద్ది సేపట్లోనే ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించి జోరువర్షం కురిసింది.
సుమారు 30 నిమిషాల పాటు కురిసిన వర్షంతో నగరం చల్లబడింది. దీంతో నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు.


