హైదరాబాద్ : ఇన్నాళ్లూ ఒకచోట కురిసి మరోచోట మొండిచేయి చూపిన వరుణుడు సోమవారం మాత్రం నగరం అంతటినీ కరుణించాడు.
ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం సాయంత్రానికి మారిపోయింది. పలుచోట్ల కుండపోత వాన కురిసింది.
అర్ధరాత్రి వరకు కూడా వాన ఉధృతి తగ్గలేదు. పాతబస్తీలో సగటున 4 నుంచి 5 సెం.మీ కురిసింది.
గంటల వ్యవధిలో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. రాయదుర్గం, మాదాపూర్, ఐటీ కారిడార్‌లతో పాటు కూకట్‌పల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, దిల్‌సుఖ్‌నగర్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురింది.
పోలీస్ కమిషనర్ సజ్జనర్ సోమవారం రాత్రి మాసబ్‌ట్యాంక్ చౌరస్తాలో ట్రాఫిక్ సరళిని పరిశీలించారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయం ఆవరణ చెరువును తలపించింది.


