హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి(Shri Ujjaini Mahakali Devasthanam) బోనాల ఉత్సవాల్లో రెండో రోజు సోమవారం రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
జోగినుల నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, ఆట పాటలతో ఊరేగింపు ఘనంగా సాగింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ ప్రియాంక అల తదితరులు అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు.


