ఆదిలాబాద్: సోమవారం అర్ధరాత్రి తర్వాత.. రిమ్స్‌లోని పిల్లల వార్డులోని ఏసీ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగింది.
దీంతో ఏసీ పేలి మంటలు చెలరేగడంతో పాటు క్షణాల వ్యవధిలో వార్డు మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది.
ఒక్కసారిగా పొగ కమ్ముకోవడంతో వార్డులో ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చిన్నారులకు ఊపిరి అందక ఇబ్బందులు ఎదురయ్యాయి.
తీవ్ర అస్వస్థతకు గురైన ఓ నవజాత శిశువు అక్కడికక్కడే కన్నుమూసింది. ఈ ఉదయం మరో ఇద్దరు కన్నుమూయడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.


