హనుమాన్ చాలీసా పఠిస్తూ.. వానరానికి అంత్యక్రియలు! | Villagers Give Emotional Farewell to Monkey Recite Hanuman Chalisa | Sakshi
Sakshi News home page

హనుమాన్ చాలీసా పఠిస్తూ.. వానరానికి అంత్యక్రియలు!

Sep 22 2026 8:40 AM | Updated on Sep 22 2026 8:40 AM

Villagers Give Emotional Farewell to Monkey Recite Hanuman Chalisa

మందసౌర్: మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మృతిచెందిన ఓ వానరానికి గ్రామస్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. వానరం మృతదేహాన్ని అలంకరించి, ఊరేగింపు నిర్వహించడంతో పాటు హనుమాన్ చాలీసా పఠిస్తూ ప్రార్థనలు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మందసౌర్ జిల్లా మల్హార్‌గఢ్ తహసీల్ పరిధిలోని బడి గుడ్బేలి గ్రామంలో ఈ ఘటన జరిగింది. కొన్ని రోజులుగా ఆ కోతి గ్రామంలోనే సంచరిస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ కోతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

కోతికి గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలని గ్రామస్తులు నిర్ణయించారు. మృతదేహాన్ని సంప్రదాయబద్ధంగా అలంకరించి.. బ్యాండ్‌ వాయిద్యాలతో గ్రామంలో అంతిమయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పఠించారు. కోతి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. రామకథ ప్రవచనకర్త మానస్ మాధురి సీతా బెహన్  కూడా గ్రామస్తులతో కలిసి అంతిమయాత్రలో పాల్గొన్నారు. వానరం పట్ల గ్రామస్తులు చూపిన సానుభూతి, సేవాభావాన్ని ఆమె అభినందించారు.
 

ఇదీ చదవండి: పాలు.. నేలపాలు.. బకెట్లతో ఎగబడిన జనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement