చరిత్రలో తొలిసారి.. ఒకే జట్టుకు ఆడ‌నున్న మెస్సీ, రొనాల్డో! | Football-History-1st-Time-Messi-Ronaldo-Play-Together-Same-Team | Sakshi
Sakshi News home page

చరిత్రలో తొలిసారి.. ఒకే జట్టుకు ఆడ‌నున్న మెస్సీ, రొనాల్డో!

Sep 8 2026 3:40 PM | Updated on Sep 8 2026 4:02 PM

Football-History-1st-Time-Messi-Ronaldo-Play-Together-Same-Team

Photo Credit: Twitter

ఫుట్‌బాల్ స్టార్ ప్లేయ‌ర్లు లియోన‌ల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇద్ద‌రు దాదాపు ఒకేసారి కెరీర్‌ను ప్రారంభించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌ర‌చుకున్నారు. ప్రత్య‌ర్థులుగా ఈ ఇద్ద‌రు ఎదురుప‌డ్డ సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. 

దిగ్గ‌జాలుగా పేరు పొందిన త‌ర్వాత అస‌లు ఎదురుప‌డిందే లేదు. క‌నీసం ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కూడా వీరి ఆట‌ను ఎంజాయ్ చేసే అదృష్టం అభిమానుల‌కు క‌ల‌గ‌లేదు. 2026 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌యంలోనూ వాళ్లిద్ద‌రికీ ఇదే చివ‌రి ప్ర‌పంచ‌క‌ప్ అని ప్రచారం జ‌ర‌గడంతో ఈసారైనా వాళ్లిద్ద‌రు ఎదురుప‌డితే చూడాల‌ని అభిమానులు భావించారు. కానీ పోర్చుగ‌ల్ ప్రిక్వార్ట‌ర్స్‌కే ప‌రిమితం కావ‌డంతో ఆ అవకాశం ద‌క్క‌లేదు.


Photo Credit: Twitter

అయితే ఎట్ట‌కేల‌కు ఆ అద్భుత ఘ‌ట్టానికి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. మెస్సీ, రొనాల్డో క‌లిసి మైదానంలో మ్యాచ్ ఆడ‌నున్నారు. అయితే ప్ర‌త్య‌ర్థులుగా ఇద్ద‌రు త‌ల‌ప‌డుతున్నార‌నుకుంటే పొర‌పాటే అవుతుంది.  ఈ ఇద్ద‌రు దిగ్గ‌జాలు క‌లిసి ఒకే జ‌ట్టుకు ఆడుతుండ‌డం విశేషం. 

అర్జెంటీనా మాజీ ఆట‌గాడు, మాంచెస్ట‌ర్ యునైటెడ్ ఫార్వార్డ్ ప్లేయ‌ర్‌ కార్లోస్ టెవెజ్ బొకారో జూనియ‌ర్స్ త‌ర‌ఫున‌ వీడ్కోలు మ్యాచ్ ఆడ‌నున్నాడు. కార్లోస్ టెవెజ్ విజ్ఞ‌ప్తి మేర‌కు మెస్సీ, రొనాల్డోలు క‌లిసి ఈ మ్యాచ్ ఆడ‌నున్నారు. ఇద్ద‌రు క‌లిసి ఒకే జెర్సీలో ఒక జ‌ట్టుకు ఆడ‌నున్నారు. డిసెంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న ఫేర్‌వెల్ మ్యాచ్‌కు బ్యూన‌స్ ఎయిర్స్‌లోని లా బాంబోనెరా వేదిక కానుంది. ఇదే విష‌యాన్ని కార్లోస్ టెవెజ్ 'ఎక్స్‌' వేదిక‌గా పంచుకున్నాడు.


Photo Credit: Twitter

"లియోన‌ల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలు ఒకే టీమ్‌కు ఆడుతుంటే చూడాల‌నేది నా క‌ల‌. వాళ్లిద్ద‌రు గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) ఆట‌గాళ్లే. నా ఫేర్‌వెల్ మ్యాచ్ సంద‌ర్భంగా మెస్సీ, రొనాల్డోతో మాట్లాడాను. ముఖ్యంగా క్రిస్టియానోను క‌లిసిన‌ప్పుడు నువ్వు, మెస్సీ నా ఫేర్‌వెల్ మ్యాచ్‌లో ఒక టీమ్‌కు ఆడాల‌నేది నా కోరిక‌. 

చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్న‌ ఈ అద్భుత క్ష‌ణాన్ని ప్ర‌పంచ‌మంతా మ‌రోసారి చూడ‌గ‌లుగుతుంది. నేను చెప్ప‌గానే రొనాల్డో ఒప్పుకున్నాడు. ఆ వెంట‌నే మెస్సీ ఎదుట నా ప్ర‌పోజ‌ల్ పెట్టాను. అత‌డు కూడా ఒప్పుకోవ‌డంతో వీళ్లిద్ద‌రు క‌లిసి ఆడే మ్యాచ్ కోసం నేను చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా" అని కార్లోస్ ట‌వెజ్ పేర్కొన్నాడు.


Photo Credit: Twitter

ఎవరీ కార్లోస్‌ టెవెజ్‌?
2004లో అర్జెంటీనా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన టెవెజ్‌ 76 మ్యాచ్‌లు ఆడి 13 గోల్స్ చేశాడు. 2004 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం, సమ్మర్ ఒలింపిక్స్ గోల్డెన్ బూట్ విజేత అయిన అతను, రెండు ఫిఫా ప్రపంచ కప్‌లు , ఒక ఫిఫా కాన్ఫెడరేషన్స్ క‌ప్‌, నాలుగు కోపా అమెరికా టోర్నమెంట్ల‌లో అర్జెంటీనాకు ప్రాతినిధ్యం వ‌హించాడు. 

అతనికి మూడుసార్లు 'సౌత్ అమెరికన్ ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్' ,రెండుసార్లు 'ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ అర్జెంటీనా' , ఒకసారి 'అర్జెంటీనా స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ది ఇయర్' పురస్కారాలు లభించాయి. జూన్ 2022లో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌కు కార్లోస్ టెవెజ్ వీడ్కోలు ప‌లికాడు. ఇటీవ‌లే మెస్సీ అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్ప‌గా, రొనాల్డో త‌న అంత‌ర్జాతీయ కెరీర్‌పై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

Read: రెచ్చిపోయిన కేకేఆర్ బ్యాట‌ర్‌; 9 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో విధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement