breaking news
Football
-
క్షిపణి కలకలం.. అయినా గోల్‌తో మెరిసిన రొనాల్డో
సౌదీ అరేబియాలో క్షిపణి కలకలం ఫుట్‌బాల్ మ్యాచ్‌పై ప్రభావం చూపింది. రియాద్‌లో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఆడాల్సిన క్లబ్ మ్యాచ్ క్షిపణి దాడుల అప్రమత్తతో గంట ఆలస్యంగా మొదలైంది. ఆసియా ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా నిన్న రాత్రి అల్ నస్ర్, నెఫ్చీ ఫెర్గానా మధ్య జరగాల్సి ఉండింది.ఈ మ్యాచ్‌కు ముందు యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు రియాద్ వైపు క్షిపణులు ప్రయోగించారు. వీటిని సౌదీ సైన్యం అడ్డుకున్నప్పటికీ.. అప్రమత్తతలో భాగంగా రొనాల్డో ఆడాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు.981వ గోల్‌తో రొనాల్డో మెరుపులుక్షిపణి ఘటనతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడినా రొనాల్డో ఆటపై దాని ప్రభావం కనిపించలేదు. తొలి అర్ధభాగం ముగియడానికి కొద్దిసేపటి ముందు ఆయన తన కెరీర్లో 981వ గోల్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో అల్ నస్ర్ 3-1తో విజయం సాధించింది.పోర్చుగల్ జట్టుతో వివాదంమరోవైపు, రొనాల్డోకు తన జాతీయ జట్టు పోర్చుగల్‌తో ఇటీవల వివాదం తలెత్తింది. నేషన్స్ లీగ్‌లో తనకు అవకాశం ఇవ్వలేదంటూ కోచ్ జార్జ్ జీసస్‌పై రొనాల్డో ఆరోపణలు చేశాడు. ఈ వ్యవహారంపై పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య రొనాల్డోపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా అతడిపై తాత్కాలిక నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన గిల్.. ఏకైక క్రికెటర్‌గా రికార్డు -
క్రిస్టియానో రొనాల్డోకు భారీ షాక్
ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకు భారీ షాక్ తగిలింది. జాతీయ జట్టును వీడిన వ్యవహారంలో పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య అతడిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది. ఈ కేసును అత్యవసరంగా పరిగణించిన సమాఖ్య.. తుది నిర్ణయం వెలువడే వరకు రొనాల్డోపై తాత్కాలిక సస్పెన్షన్ విధించినట్లు ప్రకటించింది.నార్వేతో సెప్టెంబర్ 27న జరిగిన మ్యాచ్‌లో రొనాల్డోను బెంచ్‌కే పరిమితం చేశారు. సబ్‌స్టిట్యూట్‌గా ఆడేందుకు సిద్ధమవ్వాలని సూచించినప్పటికీ, అతడికి మైదానంలోకి దిగే అవకాశం రాలేదు. ఆ తర్వాత అక్టోబర్ 1న డెన్మార్క్‌తో మ్యాచ్‌లోనూ తుది జట్టులో చోటు దక్కదని తెలియడంతో అతడు జాతీయ జట్టును వీడాడు. ఈ వ్యవహారమే తాజా వివాదానికి కారణమైంది.శిక్షకు సిద్ధమన్న రొనాల్డోజాతీయ జట్టుకు దూరమయ్యే ఆలోచన లేదని రొనాల్డో స్పష్టం చేశాడు. సమాఖ్య విధించే శిక్షను స్వీకరించేందుకు సిద్ధమని కూడా తెలిపాడు.తన చర్యలకు శిక్ష పడాల్సిందేనని అంగీకరించిన రొనాల్డో.. శిక్ష పూర్తయిన తర్వాత జాతీయ జట్టు తరఫున ఆడేందుకు అందుబాటులో ఉంటానని చెప్పాడు. దేశం తరఫున పోటీపడి విజయాలు సాధించేందుకు ఎప్పటిలాగే సిద్ధంగా ఉంటానని పేర్కొన్నాడు.క్లబ్ తరఫున బరిలోకి దిగి గోల్ఓ పక్క ఈ వివాదం నడుస్తుండగానే రొనాల్డో అల్ నస్ర్ క్లబ్ తరఫున గోల్ చేశాడు. ఈ మ్యాచ్‌లో అల్ నస్ర్ 3-0తో దిరియాపై విజయం సాధించింది.నేషన్స్ లీగ్‌లో పోర్చుగల్‌కు శుభారంభంమరోపక్క నేషన్స్ లీగ్‌లో పోర్చుగల్ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.ఇదీ చదవండి: భారత జట్టుకు ఎంపిక కాకపోతే అది నా నష్టం కాదు..! -
ఐఎఫ్ఏ టైటిల్ నిలబెట్టుకున్న మోహన్ బగాన్
ఐఎఫ్ఏ షీల్డ్ 2026 టైటిల్‌ను మోహన్ బగాన్ సూపర్ జెయింట్ నిలబెట్టుకుంది. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఇవాళ జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి ఈస్ట్ బెంగాల్‌ను 1-0తో ఓడించి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ తొలి అర్ధభాగం ముగిసే సమయంలో సమీర్ జెల్జ్కోవిచ్ చేసిన గోల్ మోహన్ బగాన్‌కు విజయాన్ని అందించింది. సహల్ అబ్దుల్ సమద్ అందించిన అద్భుతమైన పాస్‌ను జెల్జ్కోవిచ్ ఛాతితో నియంత్రించి.. గోల్కీపర్ను తప్పిస్తూ ప్రశాంతంగా బంతిని నెట్లోకి పంపాడు. 45వ నిమిషంలో నమోదైన ఈ గోలే మోహన్ బగాన్‌ను విజేతగా నిలిపింది. రెండో అర్ధభాగంలో ఈస్ట్ బెంగాల్ గోల్ కోసం ప్రయత్నించినా.. మోహన్ బగాన్ రక్షణను ఛేదించలేకపోయింది.22వసారి టైటిల్ఈ విజయంతో మోహన్ బగాన్ 22వసారి ఐఎఫ్ఏ షీల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఒకే సీజన్లో కలకత్తా ఫుట్‌బాల్ లీగ్ (CFL), ఐఎఫ్ఏ షీల్డ్ టైటిళ్లను గెలిచిన ఘనత కూడా సాధించింది.ఇదీ చదవండి: విండీస్‌తో రెండో టీ20కి ముందు వైభవ్ విధ్వంసం -
వీడ్కోలు ప్రసంగం.. మెస్సీ సంచలన వ్యాఖ్యలు!
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ బుధవారం తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. బెనిన్‌తో జరిగిన ఫేర్వెల్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో మెస్సీ ఒక గోల్ చేయడంతో పాటు రెండు కీలక అసిస్ట్‌లు కూడా అందించాడు. మ్యాచ్ అనంతరం తనను చూసేందుకు వచ్చిన అభిమానులనుద్దేశించి సుదీర్ఘమైన వీడ్కోలు ప్రసంగం ఇచ్చాడు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనవుతూనే సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2026 ఫిఫా ప్రపంచకప్ గెలవడం మన దేశంలోనే కొందరికి ఇష్టం లేదని, ఇది రాబోయే తరానికి ఒక హెచ్చరిక లాంటిదని పేర్కొన్నాడు.Photo Credit: Twitter‘అర్జెంటీనా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి అభిమానికీ ధన్యవాదాలు. ఇన్నేళ్లుగా మీరు నాపై చూపించిన ప్రేమ, గౌరవం, మద్దతును జీవితాంతం నా హృదయంలో దాచుకుంటాను. నిజం చెప్పాలంటే.. నేను ఇంత ఎక్కువగా మాట్లాడటం ఇదే తొలిసారి. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి వెళ్లాలని అనుకోవడం లేదు. జీవితాంతం ఇక్కడే, ఈ జెర్సీతోనే మీ ముందు ఆడాలని ఉంది. కానీ కాలం ఎవరి కోసం ఆగదు. నా జీవితంలో నెరవేరాల్సిన కలలు పూర్తయ్యాయి. ప్రపంచకప్ గెలవాలన్న నా కల, మొత్తం దేశం కల నెరవేరింది. చివరి ప్రపంచకప్‌లో మేం ఛాంపియన్లుగా నిలవడానికి చాలా దగ్గరగా వెళ్లాం. దాని కోసం మా శక్తినంతా ఉపయోగించాం. నా సహచరులంతా చివరి వరకు పోరాడారు. కానీ విజయం దక్కలేదు. అయినప్పటికీ అర్జెంటీనా తరఫున ఆడిన ప్రతి మ్యాచ్ ప్రాణం పెట్టి ఆడాను’ వివరించాడు.గెలవడం కొందరికి ఇష్టం లేదు‘మీ మద్దతు లేకుండా కల సాకారం అయ్యేది కాదేమో. ప్రపంచకప్ సహా ఏ టోర్నీలో ఆడినా మీరు మాకు అండగా నిలిచారు. అర్జెంటీనా తరఫున మైదానంలోకి దిగడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఇది నా జీవితంలో, నా కెరీర్లో అత్యంత బాధాకరమైన రోజు ఇదే. ఇదే నా చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో రేపటి నుంచి మిమ్మల్ని చాలా మిస్ అవుతా. Photo Credit: Twitterకానీ మన జట్టు యువ ఆటగాళ్లకు ఎప్పుడూ అండగా ఉంటా. మనం ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటాం. మనం ఐక్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. అత్యున్నత లక్ష్యాలను సాధించాలంటే మనం కలిసే ఉండాలి. ఈ జాతీయ జట్టు గెలవడం కొందరికి ఇష్టం లేదు. అలాంటి వారిని ఎదుర్కోవాలంటే మనం మరింత ఐక్యంగా ఉండాలి. ఒక బలమైన సమూహం లేకపోతే ఏదైనా సాధించడం చాలా కష్టం. మా జట్టు ఎప్పుడూ ఒక కుటుంబంలా ఉంది. అందుకే ఇన్ని విజయాలు సాధించగలిగాం.నేను ఇక్కడి నుంచి వెళ్లాలని అనుకోవడం లేదు. ఈ మైదానాన్ని వదిలి వెళ్లాలని లేదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని చాలా మిస్ అవుతా. నేను ఎప్పటికీ అర్జెంటీనికు చెందిన వాడిగానే ఉంటాను. మీ అందరితో కలిసి నా కలను నెరవేర్చుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది’ అంటూ మెస్సీ తన ప్రసంగాన్ని ముగించాడు.Photo Credit: Twitterవెక్కి ఏడ్చిన మెస్సీ కుటుంబం..కాగా మెస్సీ వీడ్కోలు మ్యాచ్‌కు అతడి కుటుంబం తరలివచ్చింది. మెస్సీ భార్య అంటోనెలా రోకుజ్జో, పిల్లలు వాళ్లకు కేటాయించిన ప్రత్యేక స్టాండ్ నుంచి వీక్షించారు. మెస్సీ గోల్ కొట్టిన సందర్భంలో కుటుంబం మొత్తం ఎగిరి గంతేశారు. ఇక మెస్సీ ప్రసంగం సమయంలో భార్య అంటోనెలా సహా పిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు.ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు అర్జెంటీనా కోచ్ లియోనెల్ స్కలోని.. మెస్సీతో కలిసి జాతీయ గీతం పాడుతూ ఎమోషనలవ్వడం కెమెరాలకు చిక్కింది. మ్యాచ్ ముగిసిన క్షణంలోనూ మెస్సీ.. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకునే ప్రయత్నం చేయగా సహచరులు అతడిని ఓదార్చడం స్టాండ్స్‌లోని అభిమానులను కంటతడి పెట్టేలా చేసింది.🚨🎙️| Messi: “I don’t want to leave. I will miss you all. I’m thankful to God for being Argentine and proud to be Argentine, and to have accomplished this dream with you all.” 🩵🩵 https://t.co/owyywWWSHA— Kalshi FC (@KalshiFC) October 7, 2026ఇదీ చదవండి: ఫేర్వెల్ మ్యాచ్.. వెక్కివెక్కి ఏడ్చిన మెస్సీ -
ఫేర్వెల్ మ్యాచ్.. వెక్కివెక్కి ఏడ్చిన మెస్సీ
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ తన దేశం తరఫున చివరి మ్యాచ్ ఆడేశాడు. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని ఎస్టాడియో మోనుమెంటల్ స్టేడియంలో వేలాది ప్రేక్షకుల మధ్య అర్జెంటీనా, బెనిన్ మధ్య మ్యాచ్ జరిగింది. తన వీడ్కోలు మ్యాచ్‌లో గోల్ సాధించడంతో పాటు రెండు కీలక అసిస్ట్‌లు చేయడం విశేషం. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 తేడాతో బెనిన్‌ను చిత్తు చేసింది. తొలి హాఫ్‌లో ఇరుజట్లు గోల్ నమోదు చేయకపోవడంతో 0-0తో నిలిచాయి. అయితే రెండో సగం ప్రారంభమైన తర్వాత 52వ నిమిషంలో మెస్సీ పాస్ అందించగా, ఒటమెండీ ఎలాంటి మిస్టేక్ చేయకుండా బంతిని గోల్‌పోస్ట్‌కు తరలించడంతో అర్జెంటీనా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆట 61వ నిమిషంలో మెస్సీ తన రెండో అసిస్ట్ చేయగా, బంతిని అందుకున్న నికో పాజ్ మెరుపువేగంతో గోల్‌పోస్ట్‌లోకి తరలించాడు. దీంతో అర్జెంటీనా ఖాతాలో రెండో గోల్ వచ్చి చేరింది. రెండు కీలక పాస్‌లతో అర్జెంటీనా గోల్స్ చేయడంలో కీలపాత్ర పోషించిన మెస్సీ, ఈసారి మాత్రం తానే స్వయంగా గోల్ కొట్టి అభిమానులను అలరించాడు. నిర్ణీత సమయం ముగిసేసరికి అర్జెంటీనా 3-0తో ఆధిక్యంలో నిలిచి విజయం సాధించింది.మెస్సీ కన్నీటిపర్యంతం..ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం మెస్సీ వెక్కి వెక్కి ఏడ్చాడు. 21 ఏళ్లుగా అర్జెంటీనా జట్టును తన భుజాలపై మోసిన క్షణాలు గుర్తుకువచ్చి కన్నీటిపర్యంతమయ్యాడు. అతడిని చూసిన అభిమానులు కూడా ఎమోషనల్ అవ్వడం కనిపించింది. ఆ తర్వాత మెస్సీ గ్రౌండ్ మొత్తం కలియతిరుగుతుంటే.. స్టాండ్స్‌లో నుంచి అభిమానులు పెద్ద ఎత్తున మెస్సీ.. మెస్సీ అంటూ నినాదాలతో స్టేడియాన్ని హోరెత్తించారు. 2005లో ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా కెరీర్ ఆరంభించిన లియోనల్ మెస్సీ అర్జెంటీనా తరఫున 208 మ్యాచ్‌లు ఆడి 126 గోల్స్ చేశాడు. అంతర్జతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా మెస్సీ నిలిచాడు. క్రిస్టియానో రొనాల్డో 146 గోల్స్‌తో తొలి స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయంగా మెస్సీ సాధించిన రికార్డులు..👉126- అర్జెంటీనా తరఫున మెస్సీ చేసిన గోల్స్. జాతీయ జట్టు తరఫున మెస్సీ 208 మ్యాచ్‌లు ఆడాడు.👉21- తాను ఆడిన ఆరు ప్రపంచకప్‌లలో కలిపి మెస్సీ చేసిన గోల్స్.👉2- మెస్సీ గెల్చుకున్న ‘గోల్డెన్ బాల్’ అవార్డులు. 2014 ప్రపంచకప్‌లో, 2022 ప్రపంచకప్‌లో మెస్సీ ఉత్తమ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు.👉1- ఒకే ప్రపంచకప్‌లో (2022) గ్రూప్ దశ, ప్రిక్వార్టర్, క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో గోల్ చేసిన ఏకైక ప్లేయర్ మెస్సీ. ప్రపంచ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు (34) ఆడిన ప్లేయర్ రికార్డు... అత్యధిక మ్యాచ్‌ల్లో (27) కెప్టెన్‌గా వ్యవహరించిన రికార్డు కూడా మెస్సీ పేరిటే ఉంది.👉మెస్సీ అర్జెంటీనాకు 2022 ఫిఫా ప్రపంచ కప్‌తో పాటు 2021, 2024 రెండు కోపా అమెరికా టైటిళ్లను అందించాడు. 2014లో ఒకసారి, 2026లో మరోసారి అర్జెంటీనాను రన్నరప్‌గా నిలిపాడు.La emoción de Lionel Scaloni apenas empezó a sonar el himno. Este tipo ama a Argentina. Ama a Messi. https://t.co/COLCdATGZK— Siempre Con Argentina⭐⭐⭐ (@siempreconargok) October 6, 2026Gol número 126 de Lionel Messi en la Selección Argentina https://t.co/2SqYfH9pld— Siempre Con Argentina⭐⭐⭐ (@siempreconargok) October 7, 2026 Lionel Messi, el mas grande de todos. https://t.co/fiFmL2GbUG— Sudanalytics (@sudanalytics_) October 7, 2026ఇదీ చదవండి: శ్రేయస్ చరిత్ర.. కెప్టెన్‌గా ఎవరికీ సాధ్యం కాని ఫీట్! -
బ్రెజిల్ 4 భారత్ 0
కోల్‌కతా: ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ బ్రెజిల్‌తో జరిగిన అంతర్జాతీయ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో భారత జట్టు పోరాడి ఓడింది. శనివారం సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన పోరులో భారత జట్టు 0–4 గోల్స్ తేడాతో బ్రెజిల్ చేతిలో పరాజయం పాలైంది. 50 వేల మందికి పైగా ప్రేక్షకులతో కిక్కిరిసిన మైదానంలో భారత జట్టు పోరాటం ఫర్వాలేదనిపించింది. తొలి 25 నిమిషాల పాటు ప్రత్యర్థిని గోల్ చేయకుండా అడ్డుకోవడంలో మన డిఫెన్స్ సఫలమైంది. బ్రెజిల్ తరఫున సామ్యూల్ లినో (58వ, 90+5వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... ఎస్టెవో (28వ నిమిషంలో), పెడ్రో (42వ ని.లో) చెరో గోల్ కొట్టారు. ఇటీవల పనామాతో మ్యాచ్‌లో 1–1తో ఆకట్టుకున్న భారత ఆటగాళ్లు బ్రెజిల్‌పై ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయారు. దీంతో బ్రెజిల్ ప్లేయర్లు తమ అత్యుత్తమ ఆటతీరు కనబర్చాల్సిన అవసరం లేకుండానే మ్యాచ్‌ను గెలిచారు. -
భారత ఫుట్‌బాల్ జట్టు అద్భుత ప్రదర్శన
భారత ఫుట్‌బాల్ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో పనామాతో జరిగిన అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. పనామా భారత్ కంటే చాలా మెరుగైన జట్టు. ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఆ జట్టు 44వ స్థానంలో ఉండగా.. భారత్ 138వ ర్యాంక్‌లో ఉంది. పైగా పనామా ఫిఫా ప్రపంచకప్‌లో పాల్గొంది. తమకంటే అన్ని విభాగాల్లో చాలా మెరుగైన జట్టు కావడంతో ఈ మ్యాచ్ భారత్‌కు చాలా ప్రత్యేంగా నిలిచింది. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం భారత్‌కు ఘనతగా చెప్పుకోవాలి.ఈ మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. రియాన్ విలియమ్స్ తొలి అర్ధభాగంలో గోల్ చేసి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. లాంగ్ పాస్‌ను అందుకున్న రియాన్ బాక్స్‌లోకి దూసుకెళ్లి గోల్‌కీపర్‌తో వన్-ఆన్-వన్ పరిస్థితిని సృష్టించాడు. అనంతరం ఎలాంటి తడబాటు లేకుండా బంతిని నెట్లోకి పంపి అద్భుతమైన గోల్‌గా మలిచాడు.రెండో అర్ధభాగంలో పనామా పుంజుకుంది. ఒమర్ వాలెన్సియా అద్భుతమైన గోల్‌తో స్కోరును సమం చేశాడు. బాక్స్ వెలుపల నుంచి ఎడమ కాలితో కొట్టిన అతడి షాట్ నేరుగా టాప్ కార్నర్‌లోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఇరు జట్లు విజయం కోసం ఎంత ప్రయత్నించినా మరో గోల్ నమోదు కాలేదు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.ఇదీ చదవండి: ఏషియన్ గేమ్స్ మారథాన్‌లో భారత్‌కు రతజం -
100 గోల్స్.. చరిత్ర సృష్టించిన మెస్సీ
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మరో ఘనత సాధించాడు. ఇంటర్ మయామీ తరఫున 100 గోల్స్ సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కాంపియోన్స్ కప్ ఫైనల్లో గోల్ చేయడంతో ఈ మైలురాయిని తాకాడు. మెస్సీ గోల్‌తో పాటు కాసెమిరో హెడర్‌తో మరో గోల్ చేయడంతో ఇంటర్ మయామీ 2-0తో క్రజ్ అజుల్‌పై విజయం సాధించి, ఐదోసారి కాంపియోన్స్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.LIONEL MESSI LIFTING HIS 49th CAREER TROPHY 🥹❤️- The Greatest in Sporting history. pic.twitter.com/U21ZbYXbjI— Johns. (@CricCrazyJohns) September 17, 20262023లో ఇంటర్ మయామీలో చేరిన మెస్సీ ఇప్పటివరకు నాలుగు సీజన్లలో కలిపి 115 మ్యాచ్‌లు ఆడి 100 గోల్స్ చేశాడు. 2023లో 11, 2024లో 23, 2025లో 43, 2026లో 23 గోల్స్ సాధించాడు. మెస్సీ కెప్టెన్‌గా ఇంటర్ మయామీకి అందించిన ఐదో టైటిల్ ఇది. ఓవరాల్‌గా మెస్సీ కెరీర్లో ఇది 49వ టైటిల్‌గా నిలిచింది. కాగా, ఈ ఏడాది ఆగస్ట్ 31న మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: రిటైర్మెంట్పై మెస్సీ యూటర్న్! -
చరిత్ర సృష్టించిన రొనాల్డో జట్టు.. 87 ఏళ్ల వరల్డ్ రికార్డు బద్దలు
పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సారథిగా ఉన్న ఆల్ నసర్ క్లబ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా అత్యధిక మ్యాచ్‌లలో గోల్స్ కొట్టిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో అర్జెంటీనాకు చెందిన రివర్ ప్లేట్ క్లబ్ పేరిట ఉన్న 87 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.చారిత్రక గోల్ కొట్టింది ఇతడేసౌదీ ప్రొ లీగ్‌లో భాగంగా అల్ నసర్ తమ తాజా మ్యాచ్‌లో అల్ ఖలీజ్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో అనూహ్య రీతిలో 72వ నిమిషంలో అల్ నసర్ ఫార్వర్డ్ ప్లేయర్, 27 ఏళ్ల అబ్దుల్లా అల్ హమ్దాన్ గోల్ కొట్టాడు. దీంతో అల్ నసర్ ఈ మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది.2023లో మొదలైన ప్రయాణంఈ క్రమంలో అబ్దుల్లా గోల్ కారణంగా.. సౌదీ ప్రొ లీగ్‌లో అల్ నసర్ జట్టు వరుసగా 94వ మ్యాచ్‌లో గోల్ కొట్టిన జట్టుగా నిలిచింది. కాగా 2023లో అల్ హిలాల్ జట్టు చేతిలో (3-0) ఓటమితో లీగ్‌ను మొదలుపెట్టిన అల్ నసర్.. ఆ తర్వాత అల్ రియాద్‌పై 4-1తో గెలిచి.. విజయాల ఖాతా తెరిచింది.అప్పటి నుంచి తాజాగా అల్ ఖలీజ్‌తో మ్యాచ్ దాకా.. వరుసగా 94 మ్యాచ్‌లలో అల్ నసర్ కనీసం ఒక్క గోల్ అయినా కొట్టింది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత నిలకడగా గోల్స్ సాధించిన జట్టుగా చరిత్రకెక్కింది.87 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలుకాగా 1936 -1939 మధ్య అర్జెంటీనాకు చెందిన రివర్ ప్లేట్ క్లబ్ వరుసగా 93 మ్యాచ్‌లలో గోల్స్ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. తాజాగా ఈ రికార్డును అల్ నసర్ బద్దలు కొట్టింది. ఇదిలా ఉంటే.. 2023లో అల్ నసర్ క్లబ్లో చేరిన రొనాల్డో ఇప్పటి వరకు సౌదీ ప్రొ లీగ్‌లో 113 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని.. 105 గోల్స్ కొట్టాడు. ఓవరాల్‌గా అన్ని అధికారిక మ్యాచ్‌లలో కలిపి రొనాల్డో 979 గోల్స్ పూర్తి చేసుకున్నాడు. అధికారికంగా వెయ్యి గోల్స్ క్లబ్లో చేరిన మొదటి ఆటగాడిగా నిలిచేందుకు ఇంకా 21 గోల్స్ దూరంలో ఉన్నాడు. ఇక సౌదీ ప్రొ లీగ్ మ్యాచ్ విషయానికొస్తే.. అల్ ఖలీజ్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నప్పటికీ అల్ నసర్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. అల్ హిలాల్, అల్ ఇతిహాద్ టాప్-2లో కొనసాగుతున్నాయి.చదవండి: ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కిన పాక్ టీ20 కెప్టెన్ -
ఫుట్‌బాల్ చరిత్రలో విచిత్రమైన గోల్ అంటే ఇదే!
క్రీడల్లో విచిత్రాలు అరుదుగా జరుగుతుంటాయి. అయితే ఫుట్‌బాల్ ఆటలో తాజాగా జరిగిన ఒక సంఘటనకు తప్పకుండా ఆ విచిత్రాల్లో చోటు ఇవ్వాల్సిందే. సాధారణంగా ఫుట్‌బాల్‌లో ఆటగాళ్లు గోల్ కొట్టే ప్రయత్నం చేస్తే గోల్‌కీపర్లు వాటిని సమర్థంగా అడ్డుకోవడం చూస్తుంటాం. బ్రెజిల్ సెకండ్ డివిజన్ ఫుట్‌బాల్ లీగ్‌లో భాగంగా స్పోర్ట్ రెసిఫే, నోవోరిజోంటినో జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో నోవోరిజోంటినో జట్టు బంతిని తాకకుండానే ఆట మొదలైన తొలి నిమిషానికే 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవడానికి రెసిఫే డిఫెండర్ అలిసన్ కాసియానో, గోల్ కీపర్ కైక్ ఫ్రాంకాకు పాస్ ఇచ్చాడు.కానీ గోల్ కీపర్ తన పొజిషన్లో లేకపోవడంతో బంతి నేరుగా గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. దీంతో చేసేదేం లేక నోవోరిజోంటినో జట్టుకు గోల్ ఇవ్వాల్సి వచ్చింది. వాస్తవానికి ఇది పాత మ్యాచ్ అయినప్పటికీ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చినట్లు మార్కా పత్రిక తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను ఒకసారి చూసేయండి.ఇక అక్టోబర్ 3న భారత్, బ్రెజిల్ మధ్య స్నేహపూర్వక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఐదుసార్లు ఫిఫా చాంపియన్ అయిన బ్రెజిల్‌తో మ్యాచ్ కావడంతో భారత ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఆన్లైన్లో టికెట్లు పెట్టిన కొద్ది గంటల్లోనే అన్నీ అమ్ముడైపోయాయి.మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల ధరలు రూ.999 నుంచి రూ 15 వేల వరకు ఉన్నాయి. స్టేడియం సామర్థ్యం 67వేలు కాగా.. అందులో 70 శాతం సీట్లను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. బ్రెజిల్‌తో మ్యాచ్‌కు ముందే భారత్ సెప్టెంబర్ 26న బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పనామాతో మ్యాచ్ ఆడనుంది. బ్రెజిల్‌తో మ్యాచ్ అనంతరం అక్టోబర్ 6న ఇదే కోల్‌కతా వేదికగా ఉరుగ్వేతో తలపడనుంది.Meanwhile in Brazil a team took the lead without even touching the ball 😂 pic.twitter.com/rJlab2tUY2— Pulse Sports Nigeria (@PulseSportsNG) September 11, 2026Read: రేపు ఫైనల్.. ఎనిమిదో టైటిల్‌పై కన్నేసిన భారత్ -
చరిత్రలో తొలిసారి.. ఒకే జట్టుకు ఆడనున్న మెస్సీ, రొనాల్డో!
ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్లు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరు దాదాపు ఒకేసారి కెరీర్‌ను ప్రారంభించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ప్రత్యర్థులుగా ఈ ఇద్దరు ఎదురుపడ్డ సందర్భాలు చాలా తక్కువ. దిగ్గజాలుగా పేరు పొందిన తర్వాత అసలు ఎదురుపడిందే లేదు. కనీసం ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కూడా వీరి ఆటను ఎంజాయ్ చేసే అదృష్టం అభిమానులకు కలగలేదు. 2026 ఫిఫా ప్రపంచకప్ సమయంలోనూ వాళ్లిద్దరికీ ఇదే చివరి ప్రపంచకప్ అని ప్రచారం జరగడంతో ఈసారైనా వాళ్లిద్దరు ఎదురుపడితే చూడాలని అభిమానులు భావించారు. కానీ పోర్చుగల్ ప్రిక్వార్టర్స్‌కే పరిమితం కావడంతో ఆ అవకాశం దక్కలేదు.Photo Credit: Twitterఅయితే ఎట్టకేలకు ఆ అద్భుత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మెస్సీ, రొనాల్డో కలిసి మైదానంలో మ్యాచ్ ఆడనున్నారు. అయితే ప్రత్యర్థులుగా ఇద్దరు తలపడుతున్నారనుకుంటే పొరపాటే అవుతుంది. ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి ఒకే జట్టుకు ఆడుతుండడం విశేషం. అర్జెంటీనా మాజీ ఆటగాడు, మాంచెస్టర్ యునైటెడ్ ఫార్వార్డ్ ప్లేయర్ కార్లోస్ టెవెజ్ బొకారో జూనియర్స్ తరఫున వీడ్కోలు మ్యాచ్ ఆడనున్నాడు. కార్లోస్ టెవెజ్ విజ్ఞప్తి మేరకు మెస్సీ, రొనాల్డోలు కలిసి ఈ మ్యాచ్ ఆడనున్నారు. ఇద్దరు కలిసి ఒకే జెర్సీలో ఒక జట్టుకు ఆడనున్నారు. డిసెంబర్లో జరగనున్న ఫేర్వెల్ మ్యాచ్‌కు బ్యూనస్ ఎయిర్స్‌లోని లా బాంబోనెరా వేదిక కానుంది. ఇదే విషయాన్ని కార్లోస్ టెవెజ్ 'ఎక్స్' వేదికగా పంచుకున్నాడు.Photo Credit: Twitter"లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలు ఒకే టీమ్‌కు ఆడుతుంటే చూడాలనేది నా కల. వాళ్లిద్దరు గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) ఆటగాళ్లే. నా ఫేర్వెల్ మ్యాచ్ సందర్భంగా మెస్సీ, రొనాల్డోతో మాట్లాడాను. ముఖ్యంగా క్రిస్టియానోను కలిసినప్పుడు నువ్వు, మెస్సీ నా ఫేర్వెల్ మ్యాచ్‌లో ఒక టీమ్‌కు ఆడాలనేది నా కోరిక. చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్న ఈ అద్భుత క్షణాన్ని ప్రపంచమంతా మరోసారి చూడగలుగుతుంది. నేను చెప్పగానే రొనాల్డో ఒప్పుకున్నాడు. ఆ వెంటనే మెస్సీ ఎదుట నా ప్రపోజల్ పెట్టాను. అతడు కూడా ఒప్పుకోవడంతో వీళ్లిద్దరు కలిసి ఆడే మ్యాచ్ కోసం నేను చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా" అని కార్లోస్ టవెజ్ పేర్కొన్నాడు.Photo Credit: Twitterఎవరీ కార్లోస్ టెవెజ్?2004లో అర్జెంటీనా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన టెవెజ్ 76 మ్యాచ్‌లు ఆడి 13 గోల్స్ చేశాడు. 2004 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం, సమ్మర్ ఒలింపిక్స్ గోల్డెన్ బూట్ విజేత అయిన అతను, రెండు ఫిఫా ప్రపంచ కప్‌లు , ఒక ఫిఫా కాన్ఫెడరేషన్స్ కప్, నాలుగు కోపా అమెరికా టోర్నమెంట్లలో అర్జెంటీనాకు ప్రాతినిధ్యం వహించాడు. అతనికి మూడుసార్లు 'సౌత్ అమెరికన్ ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్' ,రెండుసార్లు 'ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ అర్జెంటీనా' , ఒకసారి 'అర్జెంటీనా స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ది ఇయర్' పురస్కారాలు లభించాయి. జూన్ 2022లో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌కు కార్లోస్ టెవెజ్ వీడ్కోలు పలికాడు. ఇటీవలే మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పగా, రొనాల్డో తన అంతర్జాతీయ కెరీర్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.🚨Carlos Tevez reveals Cristiano Ronaldo and Lionel Messi have agreed to play together in the same team for his farewell game in December 2026 at La Bombonera in Buenos Aires.🗣️Carlos: “It has always been my dream to see Cristiano and Leo playing for one team. They’re the two… pic.twitter.com/WwVZG7ZBkW— Casmir (@wydcasmir) September 6, 2026🚨🎙️ Carlos Tevez:“It has always been my dream to see Cristiano and Leo playing for the same team. They’re the two greatest players of all time. I contacted them, especially Cristiano and told him :‘Cristiano, I want you and Leo on the same side for my farewell. Let the world… pic.twitter.com/aulpzDviSc— TCR. (@TeamCRonaldo) September 7, 2026Read: రెచ్చిపోయిన కేకేఆర్ బ్యాటర్; 9 ఫోర్లు, 5 సిక్సర్లతో విధ్వంసం -
10 ఏళ్లకే టైటిల్ గెలిచిన మెస్సీ తనయుడు
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ పుత్రోత్సాహంతో పొంగిపోతుంటాడు. అతడి రెండో కుమారుడు మటియో మెస్సీ 10 ఏళ్ల వయసులోనే ఇంటర్ మయామి అకాడమీకి నేపుల్స్ కప్ టైటిల్ (కెప్టెన్‌గా) అందించి వార్తల్లో నిలిచాడు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులను ప్రత్యేకంగా ఆకర్శిస్తుంది. ముఖ్యంగా మెస్సీ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటుంది.దీని గురించి తెలిసిన తర్వాత వారు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడంటూ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. నేపుల్స్ కప్ విజయం తర్వాత ట్రోఫీతో మటియో పోజులిచ్చిన వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ట్రోఫీని చేత పట్టుకుని చిరునవ్వుతో కనిపించిన మటియోపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మటియో మెస్సీ సెప్టెంబర్ 11న తన 11వ పుట్టినరోజు జరుపుకోనున్న నేపథ్యంలో ఈ వార్తకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.కాగా, లియోనల్ మెస్సీకి మొత్తం ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు థియాగోకు ప్రస్తుతం 13 ఏళ్లు కాగా, చిన్న కుమారుడు సిరో వయసు 8 ఏళ్లు. మటియో వీరిద్దరి మధ్యవాడు.ఇదిలా ఉంటే, లియోనెల్ మెస్సీ కొద్ది రోజుల కిందటే అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2022లో అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించిన మెస్సీ.. ఇటీవల ముగిసిన 2026 ఎడిషన్‌లో తన జట్టును రన్నరప్‌గా నిలిపాడు. చదవండి: కెవిన్ పీటర్సన్‌కు కీలక బాధ్యతలు -
‘సీఎం సార్ ప్లీజ్ ఒక్క ఫొటో’.. కేరళలో రొనాల్డో సోదరి
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో భారత పర్యటనకు వచ్చింది. 'CR7' బ్రాండ్ డైరెక్టర్ అయిన ఎల్మా అవీరో కేరళ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ (V.D. Satheesan)తో భేటీ అయ్యారు. కోజికోడ్‌లో బాబీ చెమ్మనూర్ ఇంటర్నేషనల్ జ్యువెల్లర్స్ షోరూమ్ "స్పార్కిల్ డైమండ్ ఫెస్ట్" కార్యక్రమానికి హాజరైన ఆమె, తాను బస చేసిన హోటల్లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఇద్దరు కలిసి ఫొటోలకు ఫోజులివ్వడాన్ని ఎల్మా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. విషయం ఏంటని ఆరా తీస్తే.. కేరళ ముఖ్యమంత్రి సతీషన్ రొనాల్డోకు పెద్ద అభిమాని అని తెలిసింది. వ్యక్తిగత పనిమీద భారత్‌కు వచ్చిన ఎల్మా అవీరో కేరళలో రొనాల్డోను విపరీతంగా అభిమానిస్తారన్న విషయం తెలుసుకున్నారు. కోజికోడ్ ప్రైవేట్ కార్యక్రమం ముగించుకున్న ఆమె కేరళ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరారు. స్వతహాగా రొనాల్డోకు వీరాభిమాని కావడంతో ముఖ్యమంత్రి వీడీ సతీషన్ ఎల్మాకు స్వాగతం పలికారు. రొనాల్డోకు కేరళలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, తాను కూడా రొనాల్డోకు వీరాభిమానినని సతీషన్ వెల్లడించారు. కేరళలో ఫుట్‌బాల్‌కు ఇంత ఆదరణ ఉందన్న విషయం తనకు తెలియదని, తన సోదరుడు రొనాల్డోకు ఫ్యాన్ బేస్ ఉండడం ఆశ్చర్యపరిచిందని, ఈ విషయాన్ని రొనాల్డోతో పంచుకుంటానని ఎల్మా అవేరో చెప్పుకొచ్చింది. అనంతరం సతీషన్‌ను.. ‘సీఎం సార్.. ప్లీజ్ ఒక్క ఫొటో’ అని ఎల్మా అడిగింది. దీనికి అంగీకరించిన కేరళ సీఎం ఆమెతో ఫొటోలకు ఫోజిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియా క్లబ్ అల్ నస్ర్‌కు ఆడుతూ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం 978 గోల్స్‌తో ఉన్న రొనాల్డో 1000 గోల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇక పోర్చుగల్ తరఫున ఈ ఏడాది ఫిఫా ప్రపంచకప్‌లో ఆడిన రొనాల్డో జట్టును ఫైనల్ చేర్చడంలో విఫలమయ్యాడు. రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఫిఫా ప్రపంచకప్ ఆడిన రొనాల్డో ప్రస్తుత వయసు 41 కావడంతో అతడు తన చివరి ఫిఫా ప్రపంచకప్ ఆడేసినట్లే. ఫిఫా ప్రపంచకప్పుల్లో ఇప్పటివరకు 11 గోల్స్ కొట్టిన రొనాల్డో వరుసగా ఆరు ప్రపంచకప్పుల్లో గోల్స్ కొట్టిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు.Had a warm interaction with @Cristiano Ronaldo's sister, Elma Aveiro, during her visit to Keralam. Shared with her the boundless passion and love Malayalis have for football and for Cristiano. She graciously promised to convey the warm wishes and affection of Keralam’s football… pic.twitter.com/h39BOrQKix— V D Satheesan (@vdsatheesan) September 2, 2026 Had a warm interaction with @Cristiano Ronaldo's sister, Elma Aveiro, during her visit to Keralam. Shared with her the boundless passion and love Malayalis have for football and for Cristiano. She graciously promised to convey the warm wishes and affection of Keralam’s football… pic.twitter.com/h39BOrQKix— V D Satheesan (@vdsatheesan) September 2, 2026Read: విరాట్ కోహ్లి రికార్డ్‌ను సమం చేసిన సౌతాఫ్రికా స్టార్ -
మరో స్టార్ ఫుట్‌బాలర్ రిటైర్మెంట్
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మరో స్టార్ ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాడు. అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన గంటల వ్యవధిలోనే జర్మనీ స్టార్ డిఫెండర్ ఆంటోనియో రూడిగర్ కూడా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2026 ప్రపంచకప్‌లో జర్మనీ తరఫున చివరిసారిగా ఆడిన 33 ఏళ్ల రూడిగర్, తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 86 మ్యాచ్‌లు ఆడాడు. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు జాతీయ జట్టును వీడుతున్నట్లు రూడిగర్ తెలిపాడు. ఇకపై తన క్లబ్ జట్టు రియల్ మాడ్రిడ్‌పై పూర్తిగా దృష్టి సారించనున్నట్లు రూడిగర్ వెల్లడించాడు.2014లో జర్మనీ తరఫున అరంగేట్రం చేసిన రూడిగర్.. 2017లో కాన్ఫెడరేషన్స్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అలాగే రియల్ మాడ్రిడ్‌తో పాటు చెల్సీ తరఫున కూడా ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లు సాధించాడు. డిఫెండర్ కావడంతో రూడిగర్ తన అంతర్జాతీయ కెరీర్ మొత్తంలో కేవలం మూడే గోల్స్ చేశాడు. చదవండి: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్ బై -
రిటైర్మెంట్ విషయంలోనూ మెస్సీ రికార్డు
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ సోమవారం రాత్రి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు. అయితే కొంతకాలం ఆడుతాడని అభిమానులు భావించినప్పటికీ, తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడ్కోలుకు సంబంధించి లేఖను విడుదల చేసి మౌన మునిలా నిష్క్రమించాడు.అయితే గతంలోనే మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? 2007లో తొలి అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన మెస్సీ 19 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. అయితే మెస్సీ రిటైర్మెంట్ విషయంలోనూ ఎవరికీ సాధ్యం కాని రికార్డు నమోదు చేశాడు. అదేంటంటే.. ఫుట్‌బాల్ చరిత్రలో అంతర్జాతీయ కెరీర్‌కు రెండుసార్లు రిటైర్మెంట్ ప్రకటించిన ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు.Photo Credit: Twitterక్షణికావేశంలో రిటైర్మెంట్2016 కోపా అమెరికా కప్ ఫైనల్లో చిలీ చేతిలో ఓడటం, ఆ మ్యాచ్‌లో ఒక పెనాల్టీ కిక్‌ను స్కోర్ చేయలేకపోవడంతో నిరాశకు లోనైన మెస్సీ క్షణికావేశంలో రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. కానీ ఆ తర్వాత మనసు మార్చుకొని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఒకవేళ 2016లోనే మెస్సీ రిటైర్ అయ్యుంటే మాత్రం అర్జెంటీనా పరిస్థితి వేరుగా ఉండేది. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ను మెస్సీ ఖాతాలో వేసుకునే అవకాశం చేజారేదే. అయితే మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, క్లబ్ ఫుట్‌బాల్‌లో కొనసాగనున్నాడు. ప్రస్తుతం అతను అమెరికాలోని ఇంటర్ మయామి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2028 వరకు మయామి జట్టుతో మెస్సీకి ఒప్పందం ఉంది. శనివారం సీఎఫ్ మాంట్రియల్‌తో జరిగిన మ్యాచ్‌లో మయామి 7–1 తో నెగ్గగా... మెస్సీ 4 గోల్స్ చేయడం విశేషం.Photo Credit: Twitterఅంతర్జాతీయంగా మెస్సీ సాధించిన రికార్డులు..👉125- అర్జెంటీనా తరఫున మెస్సీ చేసిన గోల్స్. జాతీయ జట్టు తరఫున మెస్సీ 207 మ్యాచ్‌లు ఆడాడు.👉21- తాను ఆడిన ఆరు ప్రపంచకప్‌లలో కలిపి మెస్సీ చేసిన గోల్స్.👉2- మెస్సీ గెల్చుకున్న ‘గోల్డెన్ బాల్’ అవార్డులు. 2014 ప్రపంచకప్‌లో, 2022 ప్రపంచకప్‌లో మెస్సీ ఉత్తమ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు.👉1- ఒకే ప్రపంచకప్‌లో (2022) గ్రూప్ దశ, ప్రిక్వార్టర్, క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో గోల్ చేసిన ఏకైక ప్లేయర్ మెస్సీ. ప్రపంచ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు (34) ఆడిన ప్లేయర్ రికార్డు... అత్యధిక మ్యాచ్‌ల్లో (27) కెప్టెన్‌గా వ్యవహరించిన రికార్డు కూడా మెస్సీ పేరిటే ఉంది.END OF AN ERA. 💔You were, you are, and you will always be the "GOAT of Football". 🐐 THANK YOU FOR EVERYTHING, LIONEL MESSI 🥹🤍#Messi | #Goat | #Argentina https://t.co/qtEOp4S1B2 pic.twitter.com/g2pUSIZndg— Mverma_☆ (@AGN_Mv) August 31, 2026చదవండి: తరానికొక్కడు.. అల్విదా లియోనల్ మెస్సీ -
ఫుట్‌బాల్ స్టార్.. మెస్సీ సంపద చూస్తే మతి పోవాల్సిందే!
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ 'లియోనెల్ మెస్సీ' అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికారు. ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి, అతని తండ్రి ఇటీవలి మరణం నేపథ్యంలో ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. అయినప్పటికీ.. మెస్సీ ఇంటర్ మయామి క్లబ్ తరపున ఫుట్‌బాల్ ఆడటం కొనసాగిస్తున్నారు. ఫుట్‌బాల్‌లో సాధించిన విజయాలతో పాటు, తన కెరీర్లో సంపాదించిన భారీ ఆదాయంతో.. మెస్సీ ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రీడాకారుల్లో ఒకరిగా నిలిచాడు. ఈ కథనంలో మెస్సీ సంపద గురించి, లగ్జరీ లైఫ్‌స్టైల్ గురించి వివరంగా తెలుసుకుందాం.ఫుట్‌బాల్ నుంచి సంపాదనమెస్సీ ఆర్థిక సామ్రాజ్యానికి ప్రధాన కారణం ఆయన ఫుట్‌బాల్ కెరీర్. బార్సిలోనా తరఫున ఆడిన సమయంలో బోనస్‌లతో సహా భారీ వార్షిక ప్యాకేజీ ఉండేదని సమాచారం. ఆ తర్వాత అతడు పారిస్ సెయింట్-జెర్మైన్ (PSG)లో కూడా గణనీయమైన వేతనాలు పొందాడు. ప్రస్తుతం ఇంటర్ మియామితో ఉన్న ఒప్పందం కూడా ప్రత్యేకమైనదే. జీతంతో పాటు ఆదాయంలో వాటా, భవిష్యత్తులో క్లబ్లో వాటా పొందే అవకాశం వంటి ప్రయోజనాలు ఇందులో ఉన్నట్లు సమాచారం. మెస్సీకి ఏడాదికి సుమారు 70 నుంచి 80 మిలియన్ డాలర్ల విలువైన ప్యాకేజీ ఉండొచ్చని సమాచారం.ప్రకటనల ద్వారా ఆదాయంమెస్సీకి ఫుట్‌బాల్ ఎంత పేరు తెచ్చిందో, బ్రాండ్ ఎండార్స్మెంట్లు కూడా అంతే సంపదను తెచ్చిపెట్టాయి. అడిడాస్, పెప్సీ, గేటోరేడ్, మాస్టర్‌కార్డ్, బడ్వైజర్ వంటి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. ఫోర్బ్స్ ప్రకారం.. ప్రకటనలు, ఇతర వ్యాపారాల ద్వారా మెస్సీ తన కెరీర్లో 600 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపాదించాడు. సోషల్ మీడియాలో కోట్లాది మంది అభిమానులు ఉండటంతో.. మెస్సీ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ ద్వారా ఒక్కో పోస్ట్‌కు సుమారు 2.7 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.ఆస్తులు, ఇతర వ్యాపారాలుమెస్సీ తన సంపాదనను కేవలం ఖర్చు చేయడానికి మాత్రమే కాకుండా.. ఆస్తులు, వ్యాపారాల్లో కూడా పెట్టుబడిగా పెట్టాడు. బార్సిలోనా, మియామి, అర్జెంటీనాలోని రొసారియో వంటి ప్రాంతాల్లో అతనికి విలాసవంతమైన ఇళ్లు, ఇతర రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నట్లు సమాచారం. వీటి విలువ 200 మిలియన్ డాలర్లకు పైగా ఉండొచ్చని అంచనా. అలాగే MiM హోటల్స్ హాస్పిటాలిటీ బ్రాండ్ ద్వారా కూడా పెట్టుబడులు పెట్టాడు.లగ్జరీ లైఫ్స్టైల్మెస్సీకి ప్రైవేట్ జెట్, ఖరీదైన కార్లు వంటి విలాసవంతమైన వస్తువులు కూడా ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. మెర్సిడెస్ బెంజ్, మసెరటి, రేంజ్ రోవర్, ఆడి వంటి కార్లు కూడా ఆయన వద్ద ఉన్నట్లు సమాచారం.మొత్తం సంపదమెస్సీ సంపద ఒక్క ఫుట్‌బాల్ ఆటద్వారా మాత్రమే వచ్చినది కాదు. ఫుట్‌బాల్ కాంట్రాక్టులు, ప్రకటనలు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, పెట్టుబడులు కలిసి ఆయనను బిలియనీర్‌గా మార్చాయి. 2022 ప్రపంచకప్ గెలవడం కూడా ఆయన ప్రపంచవ్యాప్త బ్రాండ్ విలువను మరింత పెంచింది. ఇప్పుడు అర్జెంటీనా తరఫున ఆడటం ఆపేసినా.. ఇంటర్ మియామి, వ్యాపారాలు, పెట్టుబడులు, బ్రాండ్ ఒప్పందాల ద్వారా మెస్సీ ఆదాయం వస్తూనే ఉంటుంది. ఫోర్బ్స్ అంచనా ప్రకారం మెస్సీ నికర ఆస్తి విలువ సుమారు 1.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.10,450 కోట్లు).ఇదీ చదవండి: NCLT సంచలన నిర్ణయం.. రూ.22 వేల కోట్లకు రూ.6.25 కోట్లేనా? -
ఫుట్ బాల్ కు మెస్సి గుడ్ బై ... ఎందుకో తెలుసుకోండి..!
-
యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)
-
తరానికొక్కడు.. అల్విదా లియోనల్ మెస్సీ
మెస్సీ ఒక ఉత్పాతం, మౌన ముని. ఎన్ని అడ్డంకులు, వివాదాలు ఎదురైనా తన ఆటతోనే సమాధానం చెప్పాడు తప్ప హద్దులు మీరిన సందర్భాలు చాలా తక్కువ. నిజానికి మెస్సీకి కోపం కూడా ఎక్కువే. కానీ దాని అవసరం ఎంతమేర ఉంటుందో అంతే చూపిస్తుంటాడు. కాబట్టే ఇవాళ ప్రపంచంలో ప్రతీ మూలన అభిమానులను సంపాదించుకున్నాడు. గతంలో ఫుట్‌బాల్ పీలే, మారడోనా సహా ఎందరో దిగ్గజ ఆటగాళ్లను అందించినప్పటికీ ఈ తరంలో మాత్రం మెస్సీనే దిగ్గజ ఆటగాడు. ఇంకా చెప్పాలంటే అతడో ఆరాధ్య దైవం.అలాంటి ఈ తరంలో ఫుట్‌బాల్ తెలిసినోడిని నిద్రలో నుంచి లేపి ఒక ఆటగాడి పేరు చెప్పమంటే మొదట వినిపించే పేరు లియోనల్ మెస్సీ. రెండు దశాబ్దాలుగా తన ఆటతో ఫుట్‌బాల్ అభిమానుల గుండెల్లో గుడి కట్టేసుకున్న మెస్సీ చూడాల్సినవన్నీ చూశాడు. ఎనిమిది సార్లు బాలన్ డీ ఓర్ అవార్డు, ఆరుసార్లు యూరోపియన్ గోల్డెన్ షేస్, ఎనిమిది సార్లు ఫిఫా బెస్ట్ ప్లేయర్, అలాగే 2025లో ఆల్‌టైమ్ బెస్ట్ ప్లేయర్‌గాను నిలిచాడు. తన కెరీర్లో లోటుగా ఉన్న ఫిఫా ప్రపంచకప్‌ను కూడా నాలుగేళ్ల కిందట ఖతార్‌లోనే అందుకున్నాడు. అల్విదా మెస్సీ.లియోనల్ మెస్సీ పూర్తి పేరు లియోనల్ ఆండ్రస్ మెస్సీ. 24 జూన్ 1987లో అర్జెంటినాలో జన్మించాడు. తండ్రిపేరు జార్జ్ మెస్సీ, తల్లి మారియా. చిన్నప్పటినుంచే మెస్సీ క్రీడలపై ఆసక్తి చూపేవాడు. మెస్సీని ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా తీర్చి దిద్దడంలో అతని అమ్మమ్మ కీలక పాత్ర పోషించింది. మెస్సీ శిక్షణకు, మ్యాచులకు ఆమె తోడుగా వెళ్లడంతో పాటు, డబ్బులు ఇస్తుండేది. మెస్సీకి పదకొండు సంవత్సరాల వయసున్నప్పుడు ఆమె మరణించింది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆ తర్వాత చాలా ప్రమాదకరమైన వ్యాధితో మెస్సీ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సకాలంలో చికిత్స దొరక్క చాలా ఇబ్బందులు పడ్డాడు. కుటుంబమంతా శ్రమించి అతని వైద్యానికి డబ్బులు సమకూర్చేది. దాదాపు చావు అంచుల్లోకి వెళ్లిన మెస్సీకి.. బార్సీలోనాకు చెందిన కోచ్ సాయం చేశాడు. బదులుగా బార్సీలోనా జట్టుకు మెస్సీ ఆడాల్సి ఉంటుందని కండిషన్ పెట్టాడు. దీనికి మెస్సీతో పాటు కుటుంబం మొత్తం అంగీకరించింది. మెస్సీ కోలుకున్న తర్వాత కుటుంబం మొత్తం స్పెయిన్‌కు షిఫ్ట్ అయింది. 2003లో మెస్సీ తన మొదటి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాడు.2007లో అంతర్జాతీయ అరంగేట్రంమెస్సీ ప్రదర్శనకు అవక్కాయిన సెలెక్టర్లు.. అంతర్జాతీ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం కల్పించారు. 17 ఆగస్టు 2007న మెస్సీ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత మెస్సీ ఎప్పుడూ వెనుదిరిగి చూడలేదు. ఒకదాని తర్వాత ఒకటి సాధించుకుంటూ వెళ్లాడు. రికార్డులు సృష్టించాడు. 2012లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. గిన్సిస్ వరల్డ్ రికార్డులోనూ చోటు దక్కించుకుంటున్నాడు. 2022 ఫిఫా ప్రపంచ కప్, ఒలింపిక్ స్వర్ణం, అనేక క్లబ్, వ్యక్తిగత ట్రోఫీలు గెలుచుకున్నాడు. ఎనిమిదిసార్లు ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డును గెలుచుకున్నాడు.GRACIAS PARA TODA LA VIDA 💙🇦🇷El EMOTIVO video que subió Lionel Messi tras anunciar su retiro de la Selección Argentina. pic.twitter.com/hvFgppoTXF— TyC Sports (@TyCSports) August 31, 2026చదవండి: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్ బై -
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్ బై
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఈతరం ఫుట్‌బాల్ శకంలో దిగ్గజ ఆటగాడిగా పేరు పొందిన మెస్సీ సోమవారం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్లో 207 మ్యాచ్‌లాడిన మెస్సీ 125 గోల్స్ సాధించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆల్ టైమ్ గోల్ స్కోరర్స్ జాబితాలో మెస్సీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవలే ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో అర్జెంటీనా సారథిగా అన్నీ తానై జట్టును నడిపించాడు. ఫిఫా చరిత్రలోనే అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా రికార్డులకెక్కిన మెస్సీ జట్టును ఒంటిచేత్తో ఫైనల్ చేర్చాడు. కానీ కీలకమైన ఫైనల్లో మెస్సీ గోల్ చేయడంలో విఫలమయ్యాడు. ఫలితంగా స్పెయిన్ 1-0తో అర్జెంటీనాను ఓడించి ఫిఫా ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.అప్పటి నుంచే మెస్సీ అంతర్జాతీయ రిటైర్మెంట్పై ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే మెస్సీ మాత్రం వచ్చే ఫిఫా వరల్డ్‌కప్ వరకు ఆడకపోయినప్పటికీ, కొంతకాలం పాటు జట్టు తరఫున ఆడాలని తొలుత భావించాడు. కానీ తన రిటైర్మెంట్కు ఇదే సరైన సమయమని భావించిన మెస్సీ సోమవారం గుట్టుచప్పుడు కాకుండా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. మెస్సీ తన దేశానికి 2022 ఫిఫా ప్రపంచ కప్‌తో పాటు 2021, 2024 రెండు కోపా అమెరికా టైటిళ్లను అందించాడు.“అర్జెంటీనా జెర్సీ కోసం తన శక్తినంతా ధారపోశాను. జట్టుతో కలిసి దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాను. అర్జెంటీనా ప్రజలను గర్వపడేలా చేయడం తనకు ఎప్పుడూ ఆనందమేజ్ఞ. ఈ నిర్ణయం నా హృదయాన్ని ఎంతో బాధించింది. జాతీయ జట్టులో తనకు ఇక ఇవ్వడానికి ఏమీ మిగలలేదు. యువ ఆటగాళ్లు జాతీయ జట్టులోకి రావడానికి ఇదే సరైన సమయం. 20 ఏళ్లుగా అందించిన ప్రేమ, అభిమానానికి అర్జెంటీనా ప్రజలకు కృతజ్ఞతలు. ఇకపై జాతీయ జట్టును బయట నుంచి అభిమానించే సాధారణ అభిమానిగా ఉంటాను. కుటుంబం, కోచ్‌లు, సహచరులు, జట్టు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. జాతీయ జట్టుతో గడిపిన అనుభవాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. సహచరులతో కలిసి అభిమానులకు కలలలాంటి క్షణాలు అందించగలిగినందుకు గర్వంగా ఉంది. నన్ను అర్జెంటీనియన్గా పుట్టించినందుకు దేవుడికి కృతజ్ఞతలు" అని తన రిట్మెర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు.🚨🚨🚨 BREAKING:LIONEL MESSI BECOMES THE FIRST PLAYER EVER TO RETIRE FROM THE NATIONAL TEAM TWICE.pic.twitter.com/B37oHMhpNx— The CR7 Timeline (@TimelineCR7) August 31, 2026Read: సిరీస్ ఓటమి; పాక్ జట్టులో మార్పులు.. కోచ్ పదవి ఊస్ట్! -
మెస్సీ విశ్వరూపం
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. మేజర్ లీగ్ సాకర్-2026లో భాగంగా మాంట్రియల్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సహా 4 గోల్స్ చేశాడు. ఫలితంగా అతడి జట్టు ఇంటర్ మయామీ 7-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్ తొలి గోల్ బ్రెజిల్ స్టార్ కేస్మిరో చేశాడు. ఈ సీజన్లోనే ఇంటర్ మయామిలో చేరిన కేస్మిరోకు క్లబ్ తరఫున ఇదే తొలి గోల్. అనంతరం మాంట్రియల్ 37వ నిమిషంలో గోల్ చేసి 1-1తో స్కోరును సమం చేసింది.🚨 MESSI HAS SCORED 4 GOALS IN A SINGLE MATCH.- The Greatest of all time in Sporting history 🐐 pic.twitter.com/VrCqRYBtPN— Johns. (@CricCrazyJohns) August 30, 2026ఆ తర్వాతే మెస్సీ షో మొదలైంది. అతని ఫ్రీ-కిక్ డిఫెండర్‌కు తగిలి నెట్లోకి వెళ్లడంతో మయామి 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. 52వ నిమిషంలో మెస్సీ మరో అద్భుతమైన గోల్ చేశాడు. పలువురు డిఫెండర్లను తప్పించుకుని, తన బలహీనమైన కాలితో బంతిని నెట్లోకి పంపాడు.80వ నిమిషంలో తన చిరకాల మిత్రుడు లూయిస్ సురెజ్కు మెస్సీ అద్భుతమైన అసిస్ట్ అందించాడు. మరో మూడు నిమిషాలకే గోల్‌కీపర్‌పై చిప్ షాట్‌తో మెస్సీ హ్యాట్రిక్ పూర్తి చేశాడు. దీంతో మయామి గోల్స్ సంఖ్య 5కు చేరింది.కొద్ది సేపటికి యువ ఆటగాడు అలెగ్జాండర్ షా అద్భుతమైన గోల్‌తో మమామి గోల్స్ సంఖ్యను 6కు పెంచాడు. మ్యాచ్ కాసేపట్లో ముగుస్తుందనగా మెస్సీ మరో ఫ్రీ-కిక్ గోల్‌తో తన ఖాతాలో నాలుగో గోల్‌ను నమోదు చేశాడు. చివరకు ఇంటర్ మయామి 7-1 గోల్స్ తేడాతో మాంట్రియల్‌పై భారీ విజయం సాధించింది. చదవండి: Asia Cup 2026: రికార్డు విజయంతో శ్రీలంక బోణీ -
బ్రెజిల్‌కు ముందు మరో ప్రపంచకప్ జట్టుతో భారత్ మ్యాచ్
బ్రెజిల్‌తో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌కు ముందు భారత ఫుట్‌బాల్ జట్టు మరో ప్రపంచకప్ జట్టుతో తలపడనుంది. 2026 ఫిఫా ప్రపంచకప్ ఆడిన పనామాతో భారత్ సెప్టెంబర్ 26న అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) మంగళవారం వెల్లడించింది. ఈ మ్యాచ్‌కు వేదికను ఇంకా ప్రకటించలేదు. భారత్, పనామా జట్లు తలపడటం ఇదే తొలిసారి.ఫిఫా ర్యాంకింగ్స్‌లో 44వ స్థానంలో ఉన్న పనామా, 2026 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, క్రొయేషియా, ఘనా ఉన్న గ్రూప్‌లో ఆడి చివరి స్థానంలో నిలిచింది.పనామాతో మ్యాచ్ అనంతరం భారత్ మరో భారీ సవాల్‌కు సిద్ధం కానుంది. అక్టోబర్ 3న బ్రెజిల్‌తో తలపడనుంది. ఇది భారత జట్టుకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మ్యాచ్‌లలో ఒకటిగా నిలవనుంది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో అగ్రశ్రేణి జట్టైన బ్రెజిల్‌తో తలపడే ముందు పనామాతో మ్యాచ్ ఆడటం భారత ఆటగాళ్లకు మంచి సన్నాహకంగా ఉపయోగపడనుంది.ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం 2026 ప్రపంచకప్‌లో ఆడిన జట్లతో భారత్ మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది.సెప్టెంబర్ 26: పనామా × భారత్అక్టోబర్ 3: బ్రెజిల్ × భారత్నవంబర్ 12: న్యూజిలాండ్ × భారత్నవంబర్ 15: న్యూజిలాండ్ × భారత్- న్యూజిలాండ్ మ్యాచ్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. చదవండి: ఈస్ట్ బెంగాల్ మహిళల ఎఫ్‌సీ ముందంజ -
చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో
ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సౌదీ ప్రో లీగ్‌లో భాగంగా అల్ రియాద్‌తో జరిగిన మ్యాచ్‌లో (అల్ నస్ర్ తరఫున) గోల్ చేయడంతో వరుసగా 25 సీజన్లలో గోల్ చేసిన తొలి ఫుట్‌బాలర్‌గా చరిత్ర సృష్టించాడు.రొనాల్డో 2002-03 సీజన్ నుంచి ఇప్పటివరకు ప్రతి సీజన్లో కనీసం ఒక గోల్ చేశాడు. రొనాల్డోకు ముందు ఈ రికార్డు స్వీడన్ దిగ్గజం జ్లాటన్ ఇబ్రహిమోవిచ్ పేరిట ఉండేది. ఇబ్రహిమోవిచ్ 1999-2000 నుంచి 2022-23 వరకు వరుసగా 24 సీజన్లలో గోల్ చేయగా.. తాజాగా రొనాల్డో ఆ రికార్డును బద్దలు కొట్టాడు.మరో 23 గోల్స్ దూరంలో..!అల్ రియాద్‌పై సాధించిన గోల్ రొనాల్డో కెరీర్లో 977వ అధికారిక గోల్. దీంతో చారిత్రాత్మక 1,000 గోల్స్ మైలురాయికి అతను కేవలం 23 గోల్స్ దూరంలో ఉన్నాడు.రొనాల్డో సాధించిన గోల్స్:* రియల్ మాడ్రిడ్: 450* మాంచెస్టర్ యునైటెడ్: 145* జువెంటస్: 101* స్పోర్టింగ్: 5* అల్ నస్ర్: 130* పోర్చుగల్ (జాతీయ జట్టు): 146మొత్తం: 977 గోల్స్2026-27 సీజన్ తన ప్రొఫెషనల్ కెరీర్లో చివరి సీజన్ కావచ్చని రొనాల్డో ఇటీవల సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో 1,000 గోల్స్ మైలురాయిని అందుకోవాలన్న అతని ప్రయత్నం నెరవేరుతుందో లేదో చూడాలి.కాగా, అల్ రియాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్ నస్ర్ 4-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. తద్వారా సీజన్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. అల్ నస్ర్ తరఫున రొనాల్డోతో పాటు అబ్దులెలాహ్ అల్ అమ్రీ, గాబ్రియేల్ ఏంజెలో, జోవో ఫెలిక్స్ గోల్స్ చేశారు. -
'వెనక్కి తగ్గం.. భారత్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతాం'
బ్రెజిల్, భారత్ మధ్య జరగనున్న ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను బహిష్కరించాలని భారత మాజీ ఫుట్‌బాల్ స్టార్ బైచుంగ్ భూటియా విజ్ఞప్తి చేసిన రోజు వ్యవధిలో బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య (సీబీఎఫ్) స్పందించింది. అక్టోబర్‌లో భారత్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతామని, తమ ప్రణాళికల్లో ఎలాంటి మార్పులు లేవని బ్రెజిల్ స్పష్టం చేసింది. ఎవరో ఏవో వ్యాఖ్యలు చేసినంత మాత్రానా తాము వెనక్కి తగ్గమని, భారత్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి తీరుతామని కుండబద్దలు కొట్టింది. బహిష్కరణ పిలుపుల వల్ల తాము ప్రభావితం కాలేదని బ్రెజిల్ తెలిపింది. ఇటువంటి ప్రతిచర్యలు స్థానిక రాజకీయాల వల్ల ప్రేరేపించబడ్డాయని పేర్కొంది.ఈ నేపథ్యంలోనే గురువారం కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియాన్ని బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య ప్రతినిధి బృందం తనిఖీలు చేసింది. పిచ్‌పై గడ్డి సాంద్రత తక్కువగా ఉందని, దీనివల్ల ఆటగాళ్లకు గాయాలయ్యే అవకాశముందని నివేదికలో పేర్కొంది. తక్షణమే పిచ్‌పై గడ్డి సాంద్రతను పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది.ఐదుసార్లు ఫిఫా చాంపియన్ అయిన బ్రెజిల్‌తో మ్యాచ్ ఆడేందుకు భారత్ ఫుట్‌బాల్ జట్టు సిద్ధమైన తరుణంలో బైచుంగ్ భూటియా చేసిన వ్యాఖ్యలు ఆలోచనలో పడేశాయి. కానీ బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య తాము ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతామని తేల్చి చెప్పడం ఊరటనిచ్చింది. అక్టోబర్‌లో బ్రెజిల్‌తో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న భారత్ ఆ తర్వాత మరో రెండు స్నేహపూర్వక మ్యాచ్‌లు కూడా ఆడనుంది. రెండో ప్రత్యర్థిగా కేప్ వెర్డేను ఎంచుకుంది. ఇక భారత్ ఆడబోయే మూడో ఫ్రెండ్లీ మ్యాచ్‌లో జట్టు ఎవరనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది.భారత్, బ్రెజిల్ మధ్య జరగనున్న ఫ్రెండ్లీ మ్యాచ్‌ను బహిష్కరించాలని భారత మాజీ ఫుట్‌బాల్ స్టార్ బైచుంగ్ భూటియా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. భారత్, బ్రెజిల్ ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహణ కోసం రూ. 60 నుంచి 70 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశముందని, భారీగా ఖర్చు చేయాల్సి వస్తుండడంతో అభిమానులంతా ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌ను బహిష్కరించాలని పేర్కొన్నాడు. Read: నిప్పులు చెరిగిన స్టార్క్.. 64 పరుగులకే కుప్పకూలిన బంగ్లా -
మెస్సీ పునరాగమనం అదిరింది..!
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ తండ్రి మరణం తాలూకా విషాదం నుంచి బయటపడ్డాడు. మేజర్ లీగ్ సాకర్ (MLS)లో భాగంగా ఫిలడెల్ఫియా యూనియన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ గోల్‌తో పాటు ఓ అసిస్ట్ చేసి ఘనంగా పునరాగమనాన్ని చాటుకున్నాడు. తండ్రి జార్జ్ మెస్సీ మరణం తర్వాత మెస్సీ సాధించిన తొలి గోల్ ఇదే. మెస్సీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేసినప్పటికీ.. అతడి జట్టు ఇంటర్ మయామీకి విజయం దక్కలేదు. ఈ మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది.MAGIC from Messi as @InterMiamiCF take the lead over the Union! 🪄 pic.twitter.com/lJ5tpDMUIA— Major League Soccer (@MLS) August 20, 2026కాగా, ఆగస్టు 7న మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ మరణించారు. దీంతో అతడు ఆగస్టు 8న జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. అంత్యక్రియల కోసం అర్జెంటీనాకు వెళ్లిన అతడు ఆగస్టు 12న లియోన్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యామ్నాయ ఆటగాడిగా బరిలోకి దిగి 45 నిమిషాలు ఆడాడు. తాజాగా ఫిలడెల్ఫియాతో పూర్తి మ్యాచ్ ఆడి మునుపటి ఫామ్‌ను చాటుకున్నాడు. తండ్రి మరణం తర్వాత తీవ్ర భావోద్వేగ పరిస్థితుల్లో మైదానంలోకి తిరిగొచ్చిన మెస్సీకి ఈ మ్యాచ్ ప్రదర్శన చాలా ప్రత్యేకమైనది.అద్భుతమైన ఫామ్ఈ సీజన్లో మెస్సీ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. MLSలో 17 మ్యాచ్‌ల్లో 13 గోల్స్, 9 అసిస్టులు నమోదు చేశాడు. ఫిలడెల్ఫియాపై ఆరు మ్యాచ్‌ల్లోనే ఆరు గోల్స్, నాలుగు అసిస్టులు సాధించాడు. -
ఫుట్‌బాల్ చరిత్రలో మరో భారీ డీల్
ఫుట్‌బాల్ చరిత్రలో మరో భారీ బదిలీకి రంగం సిద్ధమైంది. స్పెయిన్ కెప్టెన్, 2024 బాలన్ డి’ఓర్ విజేత రోడ్రీని మాంచెస్టర్ సిటీ నుంచి బార్సిలోనా కొనుగోలు చేయనుంది. సుమారు 65 మిలియన్ పౌండ్లకు (దాదాపు రూ.760 కోట్ల) ఇరు క్లబ్‌ల మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం.30 ఏళ్ల రోడ్రీ బార్సిలోనాతో నాలుగేళ్ల ఒప్పందం చేసుకోనున్నాడు. రానున్న రోజుల్లో బదిలీ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.సిటీతో రోడ్రీ ప్రయాణానికి ముగింపు2019లో అట్లెటికో మాడ్రిడ్ నుంచి మాంచెస్టర్ సిటీలో చేరిన రోడ్రీ.. ఏడు సీజన్లలో క్లబ్ తరఫున 298 మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో 12 ప్రధాన టైటిళ్లు గెలిచాడు.అతని ఖాతాలో నాలుగు ప్రీమియర్ లీగ్ టైటిళ్లు, రెండు ఎఫ్ఏ కప్‌లు, మూడు ఈఎఫ్ఎల్ కప్‌లు, ఒక ఛాంపియన్స్ లీగ్ టైటిల్ ఉన్నాయి.2024-25 సీజన్లో తీవ్రమైన మోకాలి గాయం కారణంగా రోడ్రీ ఎక్కువ కాలం ఆటకు దూరమయ్యాడు. గత సీజన్లో హ్యామ్‌స్ట్రింగ్ సమస్య కూడా అతడిని ఇబ్బంది పెట్టింది.అయితే ఈ వేసవిలో జరిగిన ప్రపంచకప్‌లో రోడ్రీ మళ్లీ తన అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాడు. స్పెయిన్‌ను రెండో ప్రపంచకప్ టైటిల్‌కు నడిపించడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు.తొలి ఆఫర్‌ను తిరస్కరించిన సిటీరోడ్రీ సిటీతో ఒప్పందం చివరి సంవత్సరంలోకి ప్రవేశించబోతున్న నేపథ్యంలో బార్సిలోనా మొదట £38.5 మిలియన్ల ఆఫర్ చేసింది. అయితే సిటీ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది.ఆ తర్వాత బార్సిలోనా తమ ప్రయత్నాలను పెంచడంతో చివరకు సుమారు £65 మిలియన్లకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.రోడ్రీ కోసం రియల్ మాడ్రిడ్ కూడా ఆసక్తి చూపినప్పటికీ, చివరికి బార్సిలోనా రేసులో ముందంజ వేసింది.రోడ్రీ స్థానాన్ని భర్తీ చేయడానికి సిటీ ప్లాన్రోడ్రీ వెళ్లిపోవడంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు మాంచెస్టర్ సిటీ ఇప్పటికే 18 ఏళ్ల అయ్యూబ్ బౌయాదిపై దృష్టి పెట్టింది. లిల్లే తరఫున ఆడుతున్న ఈ యువ మిడ్‌ఫీల్డర్‌కు సుమారు £85 మిలియన్ల ధర ఉండొచ్చని సమాచారం.అదే సమయంలో సిటీకి మిడ్‌ఫీల్డ్‌లో మరిన్ని మార్పులు అవసరం కానున్నాయి. బెర్నార్డో సిల్వా, టిజ్జాని రేయిండర్స్ వంటి ఆటగాళ్లను కోల్పోయిన నేపథ్యంలో కొత్త మిడ్ఫీల్డర్ల కోసం క్లబ్ ప్రయత్నిస్తోంది.చెల్సీకి చెందిన ఎంజో ఫెర్నాండెజ్, బోర్న్మౌత్కి చెందిన అలెక్స్ స్కాట్, లివర్‌పూల్‌కి చెందిన అలెక్సిస్ మాక్ అలిస్టర్ కూడా సిటీ రాడార్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. -
బాంబు పేల్చిన రొనాల్డో.. షాక్‌లో అభిమానులు!
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన రిటైర్మెంట్ విషయమై కీలక ప్రకటన చేశాడు. బహుశా ఈ ఏడాదే తన ఫుట్‌బాల్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడే అవకాశముందని రొనాల్డో స్పష్టం చేశాడు. ఆదివారం లైఫ్‌స్టైల్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రొనాల్డో తన రిటైర్మెంట్ ఎప్పుడనే దానిపై వివరణ ఇచ్చాడు. "బహుశా నా ఫుట్‌బాల్ కెరీర్లో ఇదే చివరి సంవత్సరం కావొచ్చు. వచ్చే ఏడాదిలోగా ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాలనుకుంటున్నా. నా భవిష్యత్తు గురించి నేను పూర్తిగా ప్రణాళిక వేసుకున్నాను. నన్ను తీరిక లేకుండా ఉంచే పనులు చాలా ఉన్నాయి, వాటిలో ఒక్క విషయం చెప్పడం కూడా కష్టం. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత ఫుట్‌బాల్ లోటు నాలో ఒక పెద్ద శూన్యాన్ని సృష్టించగలదు. అందుకే వీడ్కోలు తర్వాత సరదాగా గడపడం, ఎక్కువదూరం ప్రయణాలు చేయాలనుకుంటున్నా. ఎంతో ఇష్టమైన పాడెల్ ఆటను చూడడంతో పాటు జీవితంలో సంపాదించిన వ్యక్తులతో సంతోషంగా జీవించాలనుకుంటున్నా. 25 ఏళ్ల కెరీర్లో మిస్ అయినవన్నీ ఇప్పుడు తనివీతీరా ఆస్వాధించాలనుకుంటున్నా" అని చెప్పుకొచ్చాడు. ఇక రొనాల్డో తన కెరీర్లో ఇప్పటివరకు 976 గోల్స్ సాధించాడు. 1000 గోల్స్ టార్గెట్‌గా పెట్టుకున్న రొనాల్డో ప్రస్తుతం సౌదీ ప్రో లీగ్ క్లబ్ అల్-నస్ర్ తరఫున ఆడుతున్నాడు. పోర్చుగల్ తరఫున రికార్డు స్థాయిలో ఆరు ఫిఫా ప్రపంచకప్‌లు ఆడినప్పటికీ జట్టుకు టైటిల్ అందించడంలో విఫలమయ్యాడు. అయినప్పటికీ 41 ఏళ్ల రొనాల్లోకు క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. ఫిపా టైటిల్ గెలవనప్పటికీ తాను ఆడిన అన్ని ఫుట్‌బాల్ క్లబ్‌లను చాంపియన్‌గా నిలిపాడు. 2002లో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, జువెంటస్, ప్రస్తుత అల్ నసర్ క్లబ్ దాకా అన్ని క్లబ్స్‌కు టైటిళ్లను అందించాడు. అంతేకాదు ఐదుసార్లు ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డును సొంతం చేసుకున్న రొనాల్డో కెరీర్లో పోర్చుగల్‌కు ఫిఫా టైటిల్ అందించలేదన్న లోటు మాత్రం అలాగే మిగిలిపోయింది. ఇక రొనాల్డో ఇటీవలే తన లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్జ్‌ను వివాహం చేసుకున్నాడు. దీంతో పదేళ్ల ప్రేమ ప్రయాణానికి ఫుల్స్టాప్ పెట్టిన ఈ జంట పెళ్లి బంధం ప్రయాణం ప్రారంభించింది. 🚨JUST IN: Cristiano Ronaldo has hinted at retirement:“This will probably be my last year playing football” pic.twitter.com/DiEDFnRXBh— Polymarket Sports (@PolymarketSport) August 16, 2026చదవండి: ‘కామన్సెన్స్ లేదు.. అతడిని పక్కనబెట్టడమే మంచిది’ -
జంషెడ్పూర్ ఫుట్‌బాల్ క్లబ్ స్థానంలో చర్చిల్ బ్రదర్స్
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో టాటా స్టీల్ యాజమాన్యం జంషెడ్పూర్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వాటాలను విక్రయించింది. ఆ జట్టు పూర్తి వాటాలను శుక్రవారం గోవాకు చెందిన ‘చర్చిల్ బ్రదర్స్’ ఫుట్‌బాల్ క్లబ్ కొనుగోలు చేసుకుంది. వచ్చే నెల 4 నుంచి ఐఎస్ఎల్ సీజన్ ప్రారంభం కానుంది.ఇందులో పాల్గొనే అన్నీ క్లబ్‌లు భాగస్వామ్య రుసుము 1 కోటి 10 లక్షలు చెల్లించాలని అఖిల భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) గడువు విధించగా... జంషెడ్పూర్ ఎఫ్‌సీ మినహా మిగిలిన ఫ్రాంచైజీలన్నీ రుసుము చెల్లించాయి. శుక్రవారం జంషెడ్పూర్ ఎఫ్‌సీ స్పోరి్టంగ్ లైసెన్స్‌ను 100 రూపాయల నామమాత్ర ధరకు చర్చిల్ బ్రదర్స్‌కు బదిలీ చేసింది.సెప్టెంబర్ 1 నుంచి జంషెడ్పూర్ ఎఫ్‌సీ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది కాంట్రాక్టులను చర్చిల్ బ్రదర్స్ స్వీకరించనుంది. ‘టాటా స్టీల్, జంషెడ్పూర్ ఫుట్‌బాల్ స్పోరి్టంగ్ ప్రైవేట్ లిమిటెడ్ (జేఎఫ్ఎస్పీఎల్) లోని తమ ఈక్విటీ షేర్లను చర్చిల్ బ్రదర్స్ ఫుట్‌బాల్ క్లబ్‌కు బదిలీ చేశాం’ అని టాటా స్టీల్ ఒక ప్రకటనలో తెలిపింది.ఐఎస్ఎల్ నుంచి తప్పుకున్నప్పటికీ ఫుట్‌బాల్‌కు ప్రోత్సాహం అందించడం... ప్రతిభను గుర్తించి సానబెట్టడం మాత్రం ఆపబోమని టాటా స్టీల్ స్పష్టం చేసింది. 1987లో ప్రారంభించిన టాటా ఫుట్‌బాల్ అకాడమీ ద్వారా ఇప్పటి వరకు 300 మందికి పైగా ప్లేయర్లు శిక్షణ పొందగా... అందులో 150 మంది భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. త్వరలోనే బాలికల కోసం ఒక ప్రత్యేకమైన ఫుట్‌బాల్ అకాడమీ ప్రారంభించనున్నట్లు టాటా స్టీల్ వెల్లడించింది. -
రొనాల్డో, జార్జినా వివాహం వెనుక షాకింగ్ ట్విస్ట్!
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఆగస్టు 11న తన లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్జ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో ఒక ప్రైవేట్ వేడుకలా జరిగింది. అయితే రొనాల్డో, జార్జినా వివాహం వెనుక దాగున్న ఆసక్తికర విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్ధిక నిబంధనలు, షరతులతో రొనాల్డో, జార్జినా వివాహం జరగడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. వివాహ ధృవీకరణ పత్రంలోని వివరాల ప్రకారం, రొనాల్డో, జార్జినాలు 'ఆస్తి విభజన' చట్రం కింద వివాహం చేసుకున్నారు. ఈ లెక్కన వీరిద్దరు తమ వ్యక్తిగత ఆస్తులపై ఎవరికి వారే పూర్తి నియంత్రణ కలిగి ఉంటారని పోర్చుగీసు చట్టం చెబుతోంది.పోర్చుగీసు చట్టం ప్రకారం..పోర్చుగీస్ చట్టం ప్రకారం ఇలాంటి ఏర్పాటు వల్ల వివాహానికి ముందు, లేదా వివాహ సమయంలో ఇరుపక్షాల్లో ఎవరైనా సంపాదించిన ఆస్తులు, సంపాదనపై వారికే పూర్తి హక్కులు ఉండేలా రూపొందించడం జరుగుతుంది. ఒకవేళ భవిష్యత్తులో పెళ్లి చేసుకున్న దంపతులు విడాకులు తీసుకున్నప్పటికీ ఆస్తుల విభజనలో హక్కు మాత్రం ఇద్దరికి సమానంగా ఉంటుంది. ఉదాహరణకు ఒప్పందం ప్రకారం రొనాల్డో తన ఆదాయ వనరుల్లో కాంట్రాక్టులు, ఎండార్స్మెంట్లు, వ్యాపార సంస్థల నుంచి వచ్చే ఆదాయంతో పాటు తాను ఆడుతున్న ఫుట్‌బాల్ క్లబ్ సహా సీఆర్7 హోటల్ చైన్‌లో అతడికి వచ్చే మొత్తం సంపాదన మొత్తంగా అతడికే చెందుతాయి తప్ప జీవిత భాగస్వామి జార్జినాకు పొందే అవకాశం ఉండదు.విడిపోతే నెలకు రూ. కోటి చెల్లింపుఅయితే ఒకవేళ భవిష్యత్తులో రొనాల్డో, జార్జినా విడిపోతే పోర్చుగీసు చట్టంలోని మొదటి నిబంధన ప్రకారం జార్జినాకు రొనాల్డో నుంచి 100,000 యూరో మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 1.10 కోట్లు) ఫించన్ రూపంలో అందుకుంటుంది. మరో నిబంధన ప్రకారం మాడ్రిడ్‌లోని లా ఫింకాలోని రొనాల్డోకు చెందిన విలాసవంతమైన భవనంపై మాత్రం జార్జినా పూర్తి యాజమాన్య హక్కు కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ భవనం ఆస్తి విలువ 5.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 53.50 కోట్లు)గా ఉంది. ఇక రొనాల్డో, జార్జినా వివాహం వారి ఐదుగురు పిల్లలు, కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో సీక్రెట్ వెడ్డింగ్ చేసుకున్నారు. వీరి వివాహానికి రొనాల్డో సహచర ఆటగాళ్లు కానీ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అల్-నస్ర్ క్లబ్ సహచరులు కానీ, సెలబ్రెటీలు ఎవరూ హాజరుల కాలేదు. మరో విషయమేంటంటే, వీరి పెళ్లి జరిగినప్పటికీ, ఈ ఇద్దరు తమ ఇంటిపేర్లను మార్చుకోకూడదని నిర్ణయించుకున్నారు.Read: తొలి టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లతో.. సర్ఫరాజ్‌కు చాన్స్! -
ప్రేయసిని పెళ్లాడిన క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రియురాలు జార్జినా రోడ్రిగెజ్‌తో పదేళ్ల పాటు ప్రేమాయణం నడిపిన రొనాల్డో మంగళవారం కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. తన పెండ్లి విషయాన్ని రొనాల్డో స్వయంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పెళ్లి ఫొటోలను షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. కాగా రొనాల్డో షేర్ చేసిన ఫొటోలో అతడు, జార్జినా ఒకరి చేతిని మరొకరు పట్టుకుని కనిపించారు. ఇద్దరి చేతులకు వివాహ ఉంగరాలు ఉన్నాయి. ఈ ఫొటోతోనే తమ వివాహాన్ని రొనాల్డో అధికారికంగా వెల్లడించారు. 'సీ లవ్స్ జీ' అంటూ ఎమోజీ జత చేసి క్యాప్షన్ ఇచ్చాడు. క్రిస్టియానో, జార్జినా పేర్లలోని తొలి అక్షరాలతో ఈ క్యాప్షన్ రూపొందించాడు. రొనాల్డో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఫుట్‌బాల్ అభిమానులు, ఆటగాళ్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.2016లో చిగురించిన ప్రేమక్రిస్టియానో రొనాల్డో, జార్జినాల మధ్య 2016లో ప్రేమ చిగురించింది. మాడ్రిడ్‌లోని ఒక గూచీ స్టోర్‌లో జార్జినా సేల్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో రొనాల్డో ఆమెను మొదటిసారి కలిశాడు. ఆ తర్వాత ఒక ఫ్యాషన్ ఈవెంట్లో మళ్లీ కలుసుకున్నఈ జంట డేటింగ్ మొదలుపెట్టింది. ఆ తర్వాత క్రమంగా తమ మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టారు. 2017 జనవరిలో జ్యూరిచ్‌లో జరిగిన 'ది బెస్ట్ ఫీఫా ఫుట్‌బాల్ అవార్డ్స్'లో వారు మొదటిసారి అధికారికంగా కలిసి కనిపించారు. ఆ తర్వాత అదే సంవత్సరం ఇన్‌స్టాగ్రామ్‌లో తమ మొదటి జంట ఫోటోను పంచుకున్నారు.2017 నవంబర్‌లో ఈ ప్రేమికులకు కుమార్తె అలనా మార్టినా పుట్టింది. అలనాను పెంచడంతో పాటు, క్రిస్టియానో జూనియర్, ఇవా, మాటియోల పెంపకంలో రోడ్రిగ్జ్ బిజీగా మారిపోయింది. 2022 ఏప్రిల్‌లో, ఈ దంపతులు కవల కుమార్తెలకు స్వాగతం పలికారు. ఇక 2025 ఆగస్టులో జార్జినా రోడ్రిగ్జ్ రొనాల్డో తొడిగిన ఉంగరాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ‘నీ ప్రొపోజల్‌కు అంగీకరిస్తున్నా’ అని క్యాప్షన్ జత చేసి నిశ్చితార్థం జరిగినట్లు ధృవీకరించింది.ఇక రొనాల్డో ఇటీవలే ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ తరఫున ఆడాడు. అయితే జట్టును ఫైనల్ చేర్చడంలో విఫలమయ్యాడు. ఈసారి ప్రిక్వార్టర్స్‌లోనే పోర్చుగల్ వెనుదిరిగింది. రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడిన రొనాల్డో వయసు 41 ఏళ్లు. కాబట్టి రొనాల్డో తన కెరీర్లో చివరి ఫిఫా ప్రపంచకప్ ఆడేసినట్లే.❤️💍 A love story written in the stars. Cristiano Ronaldo and Georgina Rodríguez have officially said “I do.” 🥹✨From years of love and memories to forever together — congratulations to the beautiful couple! 👰🏻♀️🤵🏼♂️❤️Cristiano & Georgina — forever starts now. 🥂💍 https://t.co/5KMHsOO3Xf pic.twitter.com/XibMSyFY2I— Obuasimayor (@obua24) August 11, 2026Cristiano Ronaldo shared this photo on his social media 💍❤️ (via @cristiano) pic.twitter.com/thMTwW6LOU— ESPN FC (@ESPNFC) August 11, 2026 -
‘అతడి జోలికి వెళ్లొద్దు’.. ఫిఫాకు ట్రంప్ వార్నింగ్!
ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో పదవి నుంచి తప్పించాలని ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనకు మద్దతుగా నిలవడం ఆసక్తి కలిగిస్తోంది. ఇన్ఫాంటియానోను పదవి నుంచి తప్పించాలని ప్రపంచ ఫుట్‌బాల్ నియంత్రణ సంస్థ నిర్ణయం తీసుకుంటే అంతకంటే పెద్ద పొరపాటు ఇంకేమి ఉండదని తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ఘాటుగా వ్యాఖ్యానించారు.ఫిఫా వరల్డ్ కప్ వంటి ప్రపంచ స్థాయి టోర్నమెంట్ల వాణిజ్య హక్కులను నిర్వహించేందుకు 20 బిలియన్ డాలర్ల విలువైన ఒక కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలని ఫిఫా యోచిస్తోంది. ఇందులో 20 శాతం వాటాను ప్రైవేట్ పెట్టుబడిదారులకు విక్రయించాలని ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రణాళికను విరమించుకునేంత వరకు ‘ఫిఫా’ అన్నీ టోర్నమెంట్లను బహిష్కరించనున్నట్లు యూరోపియన్ సాకర్ సంస్థ హెచ్చరించింది. ఫిఫా అధ్యక్ష పదవి నుంచి కూడా ఇన్ఫాంటినో తప్పుకోవాలనే డిమాండ్లు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ అతడికి మద్దతు పలకడం గమనార్హం.ఇక ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ఇలా రాసుకొచ్చారు. "ఏ కారణం చేతనైనా, అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినోను తొలగించాలని ఫీఫా కనీసం ఆలోచించినా అది ఒక ఘోరమైన పొరపాటే అవుతుంది. ఆయన అద్భుతమైన వ్యక్తి. ఇప్పటివరకు నిర్వహించిన ప్రపంచ కప్లలోకెల్లా అత్యంత విజయవంతమైన దానిని నాలుగుసార్లు నిర్వహించారు. ఆయన లేకపోయుంటే ఇంత లాభదాయకంగా ఉండేది కాదేమో! ఈ విషయంపై శ్రద్ధ వహించినందుకు ధన్యవాదాలు’’ అని ట్రంప్ పేర్కొన్నారు.2016 నుంచి గియాని ఇన్ఫాంటినో ఫిఫా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. 2019, 2023 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన... వచ్చే ఏడాది మార్చిలో మొరాకో వేదికగా జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో చివరిసారి పోటీ చేయనున్నారు. ‘ఫిఫా’లో మొత్తం 211 సభ్య దేశాలు ఉండగా... యూరప్, దక్షిణామెరికాలోని 90 దేశాలతో పాటు ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్యలోని 46 దేశాలు కూడా ఇన్ఫాంటినో ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది.Read: ఆ ముగ్గురి నుంచి ఫోన్‌కాల్.. అందరికీ ఒకటే సమాధానం! -
‘అందమైన భార్య పక్కనుండగా ఇదేం పాడుపని’
స్పెయిన్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు రోడ్రి చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిఫా ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న రోడ్రి ప్రస్తుతం జీవిత భాగస్వామి, లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్ లారా ఇగ్లేసియాన్తో కలిసి ఇబిజాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇబిజాలో టూరిస్ట్ స్పాట్‌కు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న రోడ్రి, అటు పక్కనుంచి ఒక యువతి బికినీ వేసుకొని ఎదురుగా నడుస్తూ వచ్చింది. Photo Credit: Twitterదీంతో రోడ్రి గర్ల్‌ఫ్రెండ్ పక్కనుండగానే అటుగా వెళ్లున్న బికినీ యువతిని అదే పనిగా చూస్తూ ఉండిపోయాడు. తనను దాటి వెళ్లిపోయినా కూడా రోడ్రి మాత్రం వెనక్కి తిరిగి మాత్రం ఆమె అందాన్ని కనులారా ఆస్వాధిస్తూ ముందుకు సాగడం విశేషం. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాను తెగ ఊపేస్తుంది. చాలా మంది రోడ్రి చర్యను స్పానిష్ ఫోటోగ్రాఫర్ ఆంటోనియో గిల్లెం తీసిన 2015 నాటి ప్రసిద్ధ ‘డిస్ట్రాక్టడ్ బాయ్‌ఫ్రెండ్’ ఫొటోతో పోలుస్తున్నారు. ఆ ఫోటోలో, చొక్కా వేసుకున్న ఒక వ్యక్తి, ఎర్రటి టాప్ ధరించి నడుచుకుంటూ వెళ్తున్న ఒక యువతిని చూడటానికి వెనక్కి తిరుగుతాడు, అదే సమయంలో అతడి పక్కనే ఉన్న తన గర్ల్‌ఫ్రెండ్ మాత్రం అతడి చర్యకు ఆశ్చర్యానికి లోనవుతోంది. Photo Credit: Twitterఈ ఫొటో అప్పట్లో సోషల్ మీడియాను ఊపేసి ఒక మీమ్ మెటిరీయల్‌గా మారిపోయింది. తాజాగా రోడ్రి కూడా తన గర్ల్‌ఫ్రెండ్ పక్కన ఉండగానే బికినీ వేసుకున్న యువతిని అదే పనిగా చూడడాన్ని ‘డిస్ట్రాక్టడ్ బాయ్‌ఫ్రెండ్’ మీమ్ ఫొటోతో పోల్చకుండా ఉండలేకపోతున్నారు. ‘అయినా అంత అందమైన భార్య పక్కనుండగా ఇదేం పాడుపని’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఫిఫా ప్రపంచకప్ 2026 విజేతగా స్పెయిన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాను చిత్తు చేసింది చాంపియన్‌గా నిలిచింది. 16 సంవత్సరాల తర్వాత రెండో ఫిఫా టైటిల్ సాధించిన స్పెయిన్ జట్టులో రోడ్రి సభ్యుడిగా ఉన్నాడు.Rodri really recreated the meme 😭🤣 pic.twitter.com/YXNn25wEVZ— Not Match of the Day (@NOT_MOTD) August 9, 2026Read: ‘రోబోలు కాదు’.. ఆటగాళ్ల గాయాలపై లక్ష్మణ్ ఆగ్రహం! -
మెస్సీ ఇంట తీవ్ర విషాదం
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెస్సీ తండ్రి జార్జ్ హొరాసియో మెస్సీ (68) కన్నుమూశారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. జార్జ్ మెస్సీ అర్జెంటీనాలోని రొసారియోలో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.జార్జ్ మెస్సీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన మృతికి గల ఖచ్చితమైన కారణాన్ని ఎవరూ వెల్లడించలేదు.మెస్సీ కెరీర్లో కీలక పాత్రలియోనెల్ మెస్సీ ఫుట్‌బాల్ ప్రయాణంలో జార్జ్ మెస్సీ పాత్ర ఎంతో కీలకం. చిన్నతనం నుంచే తన కుమారుడి కెరీర్‌ను దగ్గరుండి పర్యవేక్షించిన ఆయన, మెస్సీ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా అతడి ప్రతినిధిగా, సలహాదారుగా వ్యవహరించారు.మెస్సీ చిన్న వయసులోనే స్పెయిన్‌లోని బార్సిలోనాకు వెళ్లిన సమయంలో కూడా జార్జ్ ఆయన వెంట ఉన్నారు. అనంతరం మెస్సీ కెరీర్‌కు సంబంధించిన ఆర్థిక, వృత్తిపరమైన వ్యవహారాల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.జూన్‌లో అనారోగ్యంపై వార్తలుజార్జ్ మెస్సీ అనారోగ్యానికి గురైన విషయం జూన్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ఆయన ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వచ్చినప్పటికీ, కుటుంబం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.2026 ఫిఫా ప్రపంచకప్ సమయంలోనూ జార్జ్ మెస్సీ ఆరోగ్యంపై తప్పుడు మరణవార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కుటుంబం ఆ వార్తలను ఖండించింది.ప్రస్తుతం ఆయన మరణించినట్లు పలు నివేదికలు ధృవీకరిస్తున్నాయి. రొసారియోలోని ఓ ఆసుపత్రిలో దీర్ఘకాలిక అనారోగ్యంతో పోరాడుతూ ఆయన మరణించినట్లు సమాచారం. -
మ్యాచ్ మధ్యలో పిడుగు ఫుట్ బాల్ ప్లేయర్ మృతి
-
లైవ్ మ్యాచ్.. హఠాత్తుగా పిడుగు; ఫుట్‌బాలర్ మృత్యువాత!
దక్షిణ థాయ్‌లాండ్‌లో ఫుట్‌బాల్ ఆటలో విషాదం నెలకొంది. గోలోక్ ఎఫ్ఏ కప్-2026 సెమీఫైనల్ సందర్భంగా లైవ్ మ్యాచ్ జరుగు తుండగా, హఠాత్తుగా మైదానంలో పిడుగు పడింది. ఈ విషాదకర ఘటనలో 24 ఏళ్ల ఫుట్‌బాలర్ సోఫ్వాన్ మృతి చెందగా, మరో 12 మంది ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. పిడుగుపడిన భయానక దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి.పిడుగుపాటుకు మైదానంలోనే కుప్పకూలిన సోఫ్వాన్‌కు సహచర ఆటగాళ్లు, అత్యవసర మెడికల్ బృందం సీపీఆర్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు తేలింది. ఇక పిడుగు పాటుకు గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ప్రమాదంలో గాయపడిన 12 మంది ఆటగాళ్లలో ఒక మలేషియా క్రీడాకారుడు కూడా ఉన్నాడని, ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని స్థానిక పోలీస్ చీఫ్ థున్ సిరిఖుంట్ తెలిపారు. మరణించిన వింగర్ సొఫ్వాన్ అవాయే ఇటీవలే థాయ్ థర్డ్- టియర్ క్లబ్ అయిన 'యాలా ఎఫ్‌సీ'కి సైన్ చేశాడు. అతని హఠాన్మరణం పట్ల యాలా ఎఫ్‌సీ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, అతని కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని ప్రకటించింది. ఇక దక్షిణ థాయ్‌లాండ్ సరిహద్దులో జరిగే ఫుట్‌బాల్ టోర్నమెంట్లలో అతిపెద్ద టోర్నీ ఇదే. ఈ టోర్నీలో థాయ్‌లాండ్ సహా మలేషియా ఆటగాళ్లు కూడా తలపడుతుంటారు. అయితే మ్యాచ్‌కు ముందు భారీ వర్షం కురిసినట్లు తెలుస్తోంది. వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ నిర్వహించామని, ఇలా హఠాత్తుగా పిడుగు మైదానంలో పడుతుందని ఊహించలేకపోయామని, ఎంతో భవిష్యత్తు ఉన్న సోఫ్వాన్‌ను కోల్పోవడం బాధాకరమని గోలోక్ క్లబ్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.🇹🇭 Horrifying moment from Thailand when a freak lightning strike kills a football player and injures 12 others during a match pic.twitter.com/lAwYJxhtUo— Visegrád 24 (@visegrad24) August 5, 2026పిడుగు ప్రమాదాలు కొత్తేమీ కాదుఇక థాయ్‌లాండ్‌లో ఇలాంటి పిడుగుపాటు ప్రమాదాలు జరగడం కొత్తేమీ కాదు. డిసీజ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నివేదిక ప్రకారం.. 2020 నుండి 2024 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 283 మంది పిడుగుపాటుకు గురయ్యారు, వారిలో చాలా మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మే నెలలోనే లంపాంగ్, ఉథాయ్ థానీ ప్రావిన్సులలో వేర్వేరు ఘటనల్లో పిడుగుపడి గర్భిణి సహా ముగ్గురు మరణించారు. Safwan Awae, a player of a Thai League 3 club, has tragically 𝐏𝐀𝐒𝐒𝐄𝐃 𝐀𝐖𝐀𝐘 after being struck by lightning while playing a game in the Kolok FA Cup in Thailand. 💔Our thoughts and prayers go out to his family & friends. 🙏 pic.twitter.com/Rkc11bLflp— CentreGoals. (@centregoals) August 5, 2026Read: టీ20 క్రికెట్లో జోస్ బట్లర్ ప్రపంచ రికార్డు -
ప్రేమకు ఎండ్‌కార్డ్.. గర్ల్‌ఫ్రెండ్‌తో రొనాల్డో పెళ్లి ఎప్పుడంటే?
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో తన లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్వేజ్ను వివాహమాడనున్నాడు. ఆగస్టు 8న వీరి వివాహం రొనాల్డో జన్మించిన పోర్చుగీస్ ద్వీపం మదీరాలో జరగనున్నట్లు సమాచారం. ఫంచల్ కేథడ్రల్‌లో మత పెద్దల సమక్షంలో బైబిల్‌పై ప్రమాణాలు చేసిన అనంతరం రింగులు మార్చుకొని వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. అనంతరం ఫైవ్‌స్టార్ హోటల్ అయిన సావోయ్ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, స్నేహితులకు ఘనంగా విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా రొనాల్డో, రోడ్రిగ్వేజ్ రిసెప్షన్ పార్టీకి భారీ ఎత్తున సెలబ్రెటీలు రానున్నట్లు బ్రిటన్ మీడియా ఒక నివేదికలో తెలిపింది. అయితే వివాహ ప్రకటనను రొనాల్డో జంట అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే మొదట సింట్రాలోని క్వింటా డా రెగరలేరా ఎస్టేట్‌లో వీరి వివాహం జరగనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా రొనాల్డో పుట్టిన ప్రదేశమైన మదీరాలోనే అంరరంగ వైభవంగా పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి వివాహం కోసం ఆగస్టు 8న ఫంచల్ కేథడ్రల్‌ను రిజర్వ్ చేశారని, తమ పెళ్లికి వచ్చే అతిథుల కోసం కేథడ్రల్ పక్కనే ఉన్న పెద్ద హోటల్లో రెండు ఫ్లోర్లలో ఉన్న రూంలను కూడా బుక్ చేసినట్లు సమాచారం.2016లో చిగురించిన ప్రేమక్రిస్టియానో రొనాల్డో, జార్జినాల మధ్య 2016లో ప్రేమ చిగురించింది. మాడ్రిడ్‌లోని ఒక గూచీ స్టోర్‌లో జార్జినా సేల్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో రొనాల్డో ఆమెను మొదటిసారి కలిశాడు. ఆ తర్వాత ఒక ఫ్యాషన్ ఈవెంట్లో మళ్లీ కలుసుకున్నఈ జంట డేటింగ్ మొదలుపెట్టింది. ఆ తర్వాత క్రమంగా తమ మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టారు. 2017 జనవరిలో జ్యూరిచ్‌లో జరిగిన 'ది బెస్ట్ ఫీఫా ఫుట్‌బాల్ అవార్డ్స్'లో వారు మొదటిసారి అధికారికంగా కలిసి కనిపించారు. ఆ తర్వాత అదే సంవత్సరం ఇన్‌స్టాగ్రామ్‌లో తమ మొదటి జంట ఫోటోను పంచుకున్నారు.2017 నవంబర్‌లో ఈ ప్రేమికులకు కుమార్తె అలనా మార్టినా పుట్టింది. అలనాను పెంచడంతో పాటు, క్రిస్టియానో జూనియర్, ఇవా, మాటియోల పెంపకంలో రోడ్రిగ్జ్ బిజీగా మారిపోయింది. 2022 ఏప్రిల్‌లో, ఈ దంపతులు కవల కుమార్తెలకు స్వాగతం పలికారు. ఇక 2025 ఆగస్టులో జార్జినా రోడ్రిగ్జ్ రొనాల్డో తొడిగిన ఉంగరాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ‘నీ ప్రొపోజల్‌కు అంగీకరిస్తున్నా’ అని క్యాప్షన్ జత చేసి నిశ్చితార్థం జరిగినట్లు ధృవీకరించింది. అప్పటి నుంచి వీరి వివాహంపై ఊహాగానాలు వస్తున్న వేళ ఆగస్టు 8న వీరి వివాహం జరగనున్నట్లు వార్తలు రావడం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.ఇక రొనాల్డో ఇటీవలే ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ తరఫున ఆడాడు. అయితే జట్టును ఫైనల్ చేర్చడంలో విఫలమయ్యాడు. ఈసారి ప్రిక్వార్టర్స్‌లోనే పోర్చుగల్ వెనుదిరిగింది. రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడిన రొనాల్డో వయసు 41 ఏళ్లు. కాబట్టి రొనాల్డో తన కెరీర్లో చివరి ఫిఫా ప్రపంచకప్ ఆడేసినట్లే. After So Many Years, They Finally Said “I Do.” 💍❤️After a long journey together, raising kids, and living through life’s biggest highs and lows, Cristiano Ronaldo and Georgina Rodríguez have officially tied the knot 👰🤵✨ pic.twitter.com/WzrIBpTgWO— Molly (@Molly_AFC) August 2, 2026 -
ఇటలీ దిగ్గజ ఫుట్‌బాలర్ కన్నుమూత
ఫుట్‌బాల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఇటలీ దిగ్గజ ఫుట్‌బాలర్ ఫ్రాంకో బరెసి (66) కన్నుమూశారు. ఫుట్‌బాల్‌లో బెస్ట్ డిఫెండర్స్లో ఒకడిగా పేరు పొందిన ఫ్రాంకో బరెసి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1982లో ఫిఫా ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఇటలీ జట్టులో ఫ్రాంకో సభ్యుడిగా ఉన్నాడు. 22 ఏళ్ల వయసులోనే ఇటలీ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికై ఫ్రాంకో బరెసి చరిత్ర సృష్టించాడు.ఇటలీలోని ట్రావగ్లియాటో అనే చిన్న పట్టణంలో 1960 మే 8న జన్మించిన బరేసి, చిన్నతనంలోనే తల్లిందడ్రులను కోల్పోయారు. అనాథగా ఎన్నో కష్టాలను దాటుకొని అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా ఎదిగిన తీరు అందరికి ఆదర్శం. ఇక ఫ్రాంకో ఏడుసార్లు బాలన్ డి'ఓర్‌కు నామినేట్ అయ్యి, 1989లో రెండో స్థానంలో నిలిచారు. 2013లో ఇటాలియన్ ఫుట్‌బాల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు.మూడు ఫిఫా ప్రపంచకప్లుఫ్రాంకో బరేసీ తన మొత్తం ప్రొఫెషనల్ కెరీర్లో ఏసీ మిలాన్, ఇటలీ రెండు జట్లకు మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. ఆయన ఇటలీ తరపున 81 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 1982, 1990, 1994 మూడు ఫిఫా ప్రపంచ కప్‌లలో ఇటలీకి ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా 1994 ప్రపంచ కప్‌లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఫైనల్‌కు చేర్చాడు. అయితే ఫైనల్లో ఇటలీ పోరాడి ఓడిపోయింది. ఫైనల్లో బ్రెజిల్ పెనాల్టీ షూటౌట్లో 3-2తో ఇటలీపై నెగ్గి టైటిల్‌ను ముద్దాడింది.ఒకే ఫుట్‌బాల్ క్లబ్‌కు ప్రాతినిధ్యంఫ్రాంకో బరేసి తన జీవితంలో ఇటలీ జాతీయ జట్టుతో పాటు ఒకే ఫుట్‌బాల్ క్లబ్‌కు ఆడడం విశేషం. వరుసగా 20 సీజన్ల పాటు ఏసీ మిలాన్ క్లబ్‌కే తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ సమయంలో ఆరు సెరీ ఏ (స్కూడెట్టోలు), మూడు యూరోపియన్ కప్‌లు, రెండు ఇంటర్కాంటినెంటల్ కప్‌లు, రెండు యూఈఎఫ్ఏ సూపర్ కప్‌లు, నాలుగు ఇటాలియన్ సూపర్ కప్‌లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 1997లో ఆయన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆయన గౌరవార్థం ఏసీ మిలాన్ ఆయన ప్రసిద్ధ నంబర్ 6 జెర్సీని శాశ్వతంగా రిటైర్ చేసింది. ఆయన 2020 నుంచి క్లబ్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్నారు. తాజాగా ఫ్రాంకో మరణవార్త ఫుట్‌బాల్ అభిమానులను విషాదంలోకి నెట్టివేసింది. ఇక గతంలో నాలుగుసార్లు ఫిఫా చాంపియన్‌గా నిలిచిన ఇటలీ 2026 ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఇటలీ గతంలో 4 సార్లు (1934, 1938, 1982, 2006) ఫిఫా ప్రపంచకప్ టైటిల్స్‌ను కైవసం చేసుకుంది. One of the greatest defenders of all time.Here's Franco Baresi in the 1994 World Cup final at 34-years-old, putting in an incredible performance 24 days after suffering a severe meniscus tear that required surgery. RIPpic.twitter.com/s8sPRil1Rs— 90s Football (@90sfootball) July 31, 2026United in remembrance ❤️In Perth, Rúben Amorim, his staff and the entire team observed a minute of silence in memory of Franco Baresi ❤️ pic.twitter.com/Btbhv017tM— AC Milan (@acmilan) July 31, 2026La Storia del Milan è in lacrime per la scomparsa di Franco Baresi. Il suo esempio e la sua profondità saranno, per sempre come la sua maglia numero 6, parte integrante e fondamentale del DNA e del cammino di tutto il Club. Le condoglianze che AC Milan porge alla famiglia tutta… pic.twitter.com/a8wNOCUc2o— AC Milan (@acmilan) July 31, 2026Read: శతక్కొట్టిన లంక బ్యాటర్.. చిత్తుగా ఓడిన పాకిస్తాన్ -
ఫ్రాన్స్ హెడ్ కోచ్‌గా జిదాన్
దిగ్గజ ఫుట్‌బాలర్ జినెదిన్ జిదాన్‌ను ఫ్రాన్స్ ఫుట్‌బాల్ సమాఖ్య (FFF) తమ జాతీయ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా ప్రకటించింది. 14 ఏళ్ల పాటు జట్టును నడిపించిన డిడియర్ డెషాంప్స్ 2026 ప్రపంచకప్ సెమీఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి అనంతరం పదవి నుంచి తప్పుకున్నాడు.54 ఏళ్ల జిదాన్ 2021లో రియల్ మాడ్రిడ్‌ను విడిచిన తర్వాత మళ్లీ కోచింగ్ బాధ్యతలు చేపట్టలేదు. ఇప్పుడు 2030 ప్రపంచకప్ అర్హత పోటీల వరకు కొనసాగే ఒప్పందంపై ఫ్రాన్స్ జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు.కొత్త బాధ్యతపై జిదాన్ మాట్లాడుతూ.. "ఫ్రాన్స్ జాతీయ జట్టుకు కోచ్‌గా నియమితుడవడం నాకు ఎంతో గర్వకారణం. ఈ జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప బాధ్యత. అత్యున్నత లక్ష్యాలతో ముందుకు సాగుతాను" అని అన్నాడు.డెషాంప్స్ నాయకత్వంలో ఫ్రాన్స్:* 2018 ఫిఫా ప్రపంచకప్ విజేత* 2022 ప్రపంచకప్ రన్నరప్* మొత్తం మూడు ప్రధాన టోర్నీల ఫైనల్స్‌కు చేరింది.జిదాన్ కోచ్‌గా సాధించిన విజయాలు:రియల్ మాడ్రిడ్‌కు కోచ్‌గా:* 3 వరుస UEFA ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లు (2016, 2017, 2018)* 2 లా లిగా టైటిళ్లు* అనేక అంతర్జాతీయ ట్రోఫీలుఛాంపియన్స్ లీగ్ యుగంలో వరుసగా మూడు సార్లు ట్రోఫీ గెలిచిన తొలి కోచ్‌లలో జిదాన్ ఒకరు.ఆటగాడిగా జిదాన్..* 1998 ప్రపంచకప్ విజేత* యూరో 2000 ఛాంపియన్* 1998 బాలన్ డి'ఓర్ విజేత1998 ప్రపంచకప్ ఫైనల్లో బ్రెజిల్‌పై రెండు హెడర్లతో ఫ్రాన్స్‌కు తొలి ప్రపంచకప్‌ను అందించాడు. 2006 ప్రపంచకప్ ఫైనల్లో ఇటలీ ఆటగాడు మార్కో మెటరాజీకి హెడ్‌బట్ చేయడంతో రెడ్ కార్డ్ అందుకోవడం కూడా ఫుట్‌బాల్ చరిత్రలో గుర్తుండిపోయే సంఘటనల్లో ఒకటిగా నిలిచింది.తొలి మ్యాచ్ఫ్రాన్స్ హెడ్ కోచ్‌గా జిదాన్ తన తొలి అధికారిక మ్యాచ్‌ను సెప్టెంబర్ 25న టర్కీతో జరిగే UEFA నేషన్స్ లీగ్ మ్యాచ్ ద్వారా ఆరంభించనున్నాడు. ఫ్రాన్స్ అభిమానులు అతడి నాయకత్వంలో జట్టు మళ్లీ ప్రపంచ ఫుట్‌బాల్‌లో అగ్రస్థానానికి చేరుతుందనే ఆశతో ఉన్నారు. -
ఆటలోనే కాదు ఆ విషయంలోనూ మెస్సీ కింగే!
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ అరుదైన ఫీట్ సాధించాడు. మైదానంలో తన ఆటతో కోట్లలో అభిమానులను సొంతం చేసుకున్న మెస్సీ తాజాగా తన జెర్సీ విషయంలోనూ కింగ్ అని నిరూపించుకున్నాడు. 2026 ఫిఫా ప్రపంచకప్ సమయంలో మెస్సీ 10వ నంబర్ జెర్సీలు అత్యధికంగా అమ్ముడయ్యాయని ఫిఫా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక ఫిఫా 2026లో మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై గెలిచి 16 ఏళ్ల తర్వాత రెండోసారి ఫిఫా ప్రపంచకప్‌ను అందుకుంది. ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సీ అన్నీ తానై అర్జెంటీనాను నడిపించాడు. 8 మ్యాచ్‌లాడిన మెస్సీ 8 గోల్స్‌తో పాటు నాలుగు అసిస్ట్‌లు చేసి టోర్నీలో అత్యధిక గోల్స్ కొట్టిన రెండో ఆటగాడిగా నిలిచి సిల్వర్ బూట్ కైవసం చేసుకున్నాడు. అంతేకాదు ఏడు వరుస ఫిఫా ప్రపంచకప్పుల్లో గోల్ కొట్టిన తొలి ఆటగాడిగాను మెస్సీ రికార్డులకెక్కాడు. 2022లో అర్జెంటీనాను చాంపియన్‌గా నిలిపిన మెస్సీ ఈసారి కూడా అదే రిపీట్ చేయాలని భావించాడు. కానీ ఫైనల్లో స్పెయిన్ చేతిలో చతికిలపడిన అర్జెంటీనా రన్నరప్‌కే పరిమితమైంది. 39 ఏళ్ల మెస్సీ మరో ఫిఫా ప్రపంచకప్ (2030) ఆడేది అనుమానమే. 🚨 FIFA has officially announced that Lionel Messi's jersey was the best-selling jersey of the 2026 FIFA World Cup! 👕🐐🇦🇷 pic.twitter.com/nnLVWtVK7L— FC Barcelona Fans Nation (@fcbfn_live) July 25, 2026Read: హార్దిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ మాస్టర్‌ప్లాన్! -
భారత్‌లో పర్యటించనున్న బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు..?
భారత్‌లో ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ బ్రెజిల్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో ఓ అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ ఆడే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య (CBF) ఇప్పటికే సెప్టెంబర్ 25న టౌన్స్‌విల్లే, సెప్టెంబర్ 29న బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌లు ఖరారు చేసింది. వీటికి అదనంగా అక్టోబర్ తొలి వారంలో భారత్‌లో మరో ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని ESPN Brasil వెల్లడించింది. ఈ మ్యాచ్‌కు ప్రత్యర్థి జట్టును ఇంకా ఖరారు చేయలేదు.ఈ మ్యాచ్‌కు కోల్‌కతా వేదికగా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 2026 ఫిఫా ప్రపంచకప్ సందర్భంగా అమెరికాలో జరిగిన చర్చల తర్వాత ఈ ప్రణాళిక రూపుదిద్దుకుందని సమాచారం.ప్రపంచకప్ సమయంలో కోల్‌కతాలో వేలాది మంది అభిమానులు బ్రెజిల్ జెర్సీలు ధరించి సందడి చేయడం.. నెయ్మార్, వినీసియస్ జూనియర్ చిత్రాలతో నగరం కళకళలాడడం CBF దృష్టిని ఆకర్షించిందని తెలుస్తోంది.అన్ని చర్చలు విజయవంతంగా పూర్తైతే, తుది ఒప్పందంపై సంతకాలు జరిగి బ్రెజిల్ జట్టు భారత్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. దీంతో భారత ఫుట్‌బాల్ అభిమానులకు ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాలను ప్రత్యక్షంగా చూసే అరుదైన అవకాశం లభించనుంది. -
30 ఏళ్లకే వీడ్కోలు.. ఊహించని ట్విస్ట్‌తో మాజీ చాంప్ రీఎంట్రీ!
మాజీ యూఎస్ ఓపెన్ చాంపియన్, ఆస్ట్రియా మాజీ టెన్నిస్ ప్లేయర్ డొమినిక్ థీమ్ మళ్లీ గ్రౌండ్లో అడుగుపెట్టనున్నాడు. కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడే 30 ఏళ్ల వయసులో థీమ్ అనూహ్యంగా టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే రెండేళ్ల తర్వాత మాజీ చాంపియన్ రీఎంట్రీ ఇస్తున్నప్పటికీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఒకటి దాగుంది. అదేంటంటే థీమ్ ఈసారి టెన్నిస్ ప్లేయర్‌గా కాకుండా ఫుట్‌బాలర్‌గా అడుగుపెట్టనుండడమే!Photo Credit: Twitterఆస్ట్రియా ఫుట్‌బాల్ లీగ్‌లో డొమినిక్ థీమ్ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమయ్యాడు. పలు నివేదికలు అందించిన సమాచారం మేరకు డొమినిక్ థీమ్ ఇప్పటికే ఆస్ట్రియాకు చెందిన అమెచ్యూర్ ఫుట్‌బాల్ క్లబ్ అయిన బాడెనర్ ఏసీ తరఫున తన పేరును రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. టెన్నిస్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత తన హోమ్టౌన్ క్లబ్ ఎస్సీ లిచ్టెన్వర్త్ (బాడెనర్ క్లబ్లో జాయిన్ కాకముందు) తరఫున పది మ్యాచ్‌లు ఆడిన డొమినిక్ థీమ్ ఒక గోల్ కూడా చేయడం విశేషం. టెన్నిస్‌లో స్టార్ ఆటగాడి హోదా పొందినప్పటికీ, ఫుట్‌బాల్‌లో మాత్రం ఒక సాధారణ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అందుకే అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫుట్‌బాల్ క్లబ్ కూడా ఇప్పటికీ డ్రెసింగ్ రూమ్‌లో ప్రత్యేక లాకర్ లేదా ఇతర సదుపాయాలు ఇవ్వలేదు.Photo Credit: Twitterవరుస గాయాలతో వీడ్కోలు..2020 యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన డొమినిక్ థీమ్ 2024లో టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటికీ 30 ఏళ్ల వయసు మాత్రమే ఉన్న డొమినిక్ థీమ్ అనూహ్యంగీ వీడ్కోలు పలకడం వెనుక వరుస గాయాలు అతడిని ఇబ్బంది పెట్టడమే. 2020లో యూఎస్ ఓపెన్ గెలిచిన తర్వాత 2021లో ఏడుసార్లు మణికట్టు గాయానికి గురవ్వడంతో రెండేళ్ల పాటు ఆటకు దూరమవ్వాల్సి వచ్చింది. Photo Credit: Twitterకెరీర్లో పీక్ ఫామ్‌లో ఉన్న సమయంలో వరుస గాయాలకు తోడు 2024లో యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే డొమినిక్ థీమ్ ఇంటిబాట పట్టాడు. దీంతో టెన్నిస్‌కు వీడ్కోలు పలకాలని ఆరోజే నిర్ణయం తీసుకున్నాడు. ఇక వియన్నా ఓపెన్‌లో తొలి రౌండ్లో ఇటలీకి చెందిన లూసియానో దార్దేరి చేతిలో రెండు సెట్లలోనే డొమినిక్ థీమ్ పరాజయం చవిచూశాడు. టెన్నిస్‌లో థీమ్‌కు ఇదే ఆఖరి మ్యాచ్ కావడం విశేషం. 30 ఏళ్ల వయసులో పీక్ ఫామ్‌లో ఉన్నప్పుడు వరుస గాయాలు ఇబ్బంది పెట్టడంతో టెన్నిస్‌ను వదిలేసిన డొమినిక్ థీమ్ రెండేళ్ల తర్వాత సరికొత్తగా మారి ఫుట్‌బాల్ ఆటలో అడుగుపెడుతున్నాడు. మరి ఫుట్‌బాల్‌లో డొమినిక్ థీమ్ మెరుస్తాడా లేదా అన్నది చూడాలి.చదవండి: ‘హ్యాండ్‌షేక్’ వివాదం.. రెండు నెలల తర్వాత నోరు విప్పిన హెడ్! -
ప్లాన్ అదిరింది.. మెస్సీ రిటైర్మెంట్ అప్పుడే!
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ రిటైర్మెంట్పై ఒక స్పష్టత వచ్చింది. అర్జెంటీనా జట్టులో స్థిరత్వం వచ్చే వరకు తాను జట్టులో కొనసాగుతానని, ఆ తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నట్లు మెస్సీ తన అభిప్రాయాన్ని అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏఎఫ్ఏ)కు వెల్లడించినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో 2030 ఫిఫా ప్రపంచకప్‌కు తాను అందుబాటులో ఉండనని మెస్సీనే పరోక్షంగా సంకేతాలు ఇచ్చేశాడు. రాబోయే నాలుగేళ్లలో మెస్సీతో పాటు జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లంతా కెరీర్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారు. దీంతో జట్టులో సీనియర్లంతా ఒకేసారి రిటైర్ అయితే ఆ ప్రభావం యువ ఆటగాళ్లపై ఎక్కువగా ఉంటుందని అర్జెంటీనా ఫుట్‌బాల్ తెలిపింది. అందుకోసం మెస్సీని కొంతకాలం పాటు జట్టుతో కొనసాగాలని అతడితో తెలిపినట్లు సమాచారం. దీనికి మెస్సీ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక మెస్సీ వీడ్కోలు మ్యాచ్‌ను కూడా ఘనంగా ప్లాన్ చేసినట్లు అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. త్వరలోనే ఆ వివరాలు బయటికి వెల్లడిస్తామని అర్జెంటీనా ఫుట్‌బాల్ తెలిపింది.ఇక 2026 ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సీ 39 ఏళ్ల వయసులోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 8 గోల్స్ చేయడంతో పాటు 4 అసిస్ట్‌లతో టోర్నీలో రెండో అత్యధిక గోల్ స్కోరర్‌గా నిలిచి సిల్వర్ బూట్ అందుకున్నాడు. 10వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగిన మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా మెస్సీ (21 గోల్స్) రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో ఎంబాపె (ఫ్రాన్స్, 22 గోల్స్) ఉన్నాడు. ఇక రెండు దశాబ్దాల కెరీర్లో 2014 ఫిఫా ఫైనల్లో అర్జెంటీనా ఓటమి తర్వాత మెస్సీ ఆటకు వీడ్కోలు పలకాలనుకున్నాడు. కానీ చిన్న వయసు కావడంతో ఆలోచనను విరమించుకున్న మెస్సీ ఆ తర్వాత అర్జెంటీనాకు అద్భుత విజయాలు అందించాడు. 2021 కోపా అమెరికా కప్‌తో పాటు 2022 ఫిఫా ప్రపంచకప్‌ను అందించి అర్జెంటీనా ఖాతాలో మూడో ఫిఫా టైటిల్‌ను చేర్చాడు. 2024 కోపా అమెరికా కప్‌ను మరోసారి గెలిచిన అర్జెంటీనా 2026 ఫిఫాలో ఫైనల్ చేరినప్పటికీ తుదిమెట్టుపై బోల్తా కొట్టింది. -
FIFA World Cup 2026 : స్పెయిన్ యువ సంచలనం లమీన్ యమాల్ (ఫొటోలు)
-
అర్జెంటీనా చీటింగ్.. కాక రేపుతున్న రొనాల్డో 'లైక్' వివాదం
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్‌లో చేతిలో ఓటమి చవిచూసిన అర్జెంటీనా రన్నరప్‌గా నిలిచింది. అయితే టోర్నీ ఆరంభం నుంచి అర్జెంటీనాకు అనుకూలంగానే వ్యవహరించదన్న విమర్శలు బహిరంగంగా వ్యక్తమయ్యాయి. ఫిఫాలో అర్జెంటీనాతో ఆడిన జట్లలో చాలా జట్లు ఇదే ఆరోపణలు చేశాయి. ఈ వివాదం సోషల్ మీడియాకు కూడా పాకింది. ఫైనల్‌కు అర్జెంటీనా చేరుకునే క్రమంలో ఫిఫా పక్షపాత ధోరణితో వ్యవహరించిందనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపించాయి. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోకు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో లైక్ చేయడమే ఇప్పుడు వివాదానికి దారి తీసింది.దీంతో ఫిఫా వ్యవహారంపై వచ్చిన విమర్శలకు రొనాల్డో కూడా మద్దతు తెలిపాడని అతడి అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రచారంపై జాతీయ మీడియా నిర్వహించిన ఫ్యాక్ట్‌చెక్‌లో భిన్నమైన విషయం వెలుగులోకి వచ్చింది. రొనాల్డో అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియోకు లైక్ చేసిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదని తెలిపింది. అయితే దీనిలో కూడా రెండు అంశాలు దాగున్నాయి. ఒకవేళ రొనాల్డో మొదట లైక్ చేసి ఆ తర్వాత దానిని తొలగించి ఉండొచ్చు. అదీ కాకపోతే మాత్రం ఇది పాత స్క్రీన్‌షాట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.ఈసారి ఫిఫాలో 48 జట్లు పోటీపడితే అర్జెంటీనాకు వ్యతిరేకంగా ఒక్కసారి కూడా వీఏఆర్ (VAR) నిర్ణయం రాలేదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే మెస్సి నాయకత్వంలోని అర్జెంటీనా జట్టుకు ఫిఫా అనుకూలంగా వ్యవహరించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా రౌండ్ ఆఫ్-16లో ఈజిప్ట్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం వీఏఆర్ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తమ జట్టు చేసిన గోల్‌ను అనర్హంగా ప్రకటించడం వల్లే ఓటమి ఎదురైందని మ్యాచ్ ముగిసిన తర్వాత ఈజిప్ట్ కెప్టెన్‌తో పాటు ప్రధాన కోచ్ కూడా ఆరోపించారు. అయితే ఈ విమర్శలను ఫిఫా ఖండిస్తూ, మ్యాచ్‌ల నిర్వహణలో ఎలాంటి పక్షపాతం ప్రదర్శించలేదని స్పష్టం చేసింది.ఇక ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ ప్రయాణం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడిన రొనాల్డోకు ఇదే చివరిదనే ప్రచారం కూడా జరిగింది. ఈసారి ఫిఫాలో రొనాల్డో కూడా పెద్దగా మెరవలేదు. ఇప్పటిదాకా రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించని రొనాల్డో వయసు 41 ఏళ్లు. దీంతో వచ్చే ఫిఫా (2030) నాటికి రొనాల్డో ఆటకు గుడ్‌బై చెప్పే అవకాశముంది.Read: అతడి విషయంలో బీసీసీఐ ఆందోళన.. జట్టు ప్రకటన వాయిదా! -
‘నిజమే సైకోలా ప్రవర్తించాడు కానీ శిక్షించొద్దు’
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత స్పెయిన్, అర్జెంటీనా ఆటగాళ్లు తన్నుకున్న సంగతి తెలిసిందే. అర్జెంటీనా ఆటగాడు లియాండ్రో పరేడెస్ స్పెయిన్ ఆటగాళ్ల మీదకు కోపంతో దూసుకొచ్చాడు. తన ఎదురుగా ఉన్న ఎరిక్ గార్సియాపై పిడిగుద్దులు కురిపించాడు. అడ్డువచ్చిన మరో ప్లేయర్ గావి గొంతు పట్టుకొని అతడిని నేలపై పడేశాడు. విచక్షణ కోల్పోయి పశువులా ప్రవర్తించిన లియాండ్రో పరేడెస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. లియాండ్రోపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తులు కూడా వచ్చాయి. అయితే లియాండ్రోపై ఎలాంటి చర్యలు తీసుకుంటామన్నది ఫిఫా ఇంకా తెలపనప్పటికీ స్పెయిన్ స్టార్ గావి మాత్రం లియాండ్రోను శిక్షించవద్దని పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ‘లియాండ్రో ఓటమి నైరాశ్యంలో సైకోలా మారిపోయి మాపై దాడి చేశాడు. కానీ ఫుట్‌బాల్ ఆటలో ఇలాంటి గొడవలు సహజమని, ఓటమి బాధలో ఒక్కోసారి ఆటగాళ్లు లయతప్పి తాము ఏం చేస్తున్నామో కూడా మరిచిపోతారు. అందుకే లియాండ్రోను కఠినంగా శిక్షించవద్దని కోరుతున్నా. అంతగా శిక్ష వేయాలనుకుంటే అతడు భవిష్యత్తులో ఆడబోయే మ్యాచ్‌ల్లో ఆట మధ్యలో మైదానం నుంచి తొలగిస్తే సరిపోతుంది.’ అని తెలిపాడు. నిజానికి పరేడెస్ హింసాత్మక చర్యకు పాల్పడడం వల్ల అతడు కనీసం మూడు మ్యాచ్‌లు నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.ఇక మ్యాచ్ విషయానికొస్తే ఫైనల్లో ఆట అదనపు సమయం 106వ నిమిషంలో ఫెర్రాన్ టోర్రెస్ కొట్టిన గోల్‌తో, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో నాటకీయ విజయాన్ని అందుకుంది. 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ రెండో ఫిఫా టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఫిఫా చాంపియన్స్‌గా నిలిచిన తర్వాత స్వదేశంలో అడుగుపెట్టిన స్పెయిన్‌కు ఘన స్వాగతం లభించింది. 20 లక్షల మంది అభిమానుల సమక్షంలో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో విజయోత్సవ సంబరాలు జరిగాయి. 💣🇦🇷 GAVI SOBRE LA AGRESIÓN QUE RECIBIÓ DE PAREDES EN LA FINAL ESPAÑA-ARGENTINA:💥 “No creo que deba ser suspendido. Lo lógico hubiese sido expulsarle en el partido”👊🏼 “No es una imagen para los niños pero creo que hay esa parte de fútbol que es un poco más violenta”📹… pic.twitter.com/ZaSrjPUmQm— Zona Mixta (@ZonaMixta__) July 21, 2026Read: హండ్రెడ్ లీగ్‌లో ముంబై, సన్‌రైజర్స్ అరుదైన ఫీట్! -
స్పెయిన్ నంబర్‌వన్.. ర్యాంకింగ్స్‌లో మొరాకో, నార్వే సంచలనం
ఫిఫా ప్రపంచకప్ 2026 టైటిల్ గెలుచుకున్న స్పెయిన్ జట్టు మరోసారి నంబర్‌వన్ ర్యాంకును అందుకుంది. ఫైనల్ మ్యాచ్ తర్వాత ఫిఫా అధికారికంగా ర్యాంకులను విడుదల చేసింది. చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ నంబర్‌వన్ స్థానానికి చేరుకోగా, రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా రెండో స్థానానికి పడిపోయింది. Photo Credit: FIFA Twitterర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు లేనప్పటికీ, ఈసారి ఫిఫాలో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకున్న మొరాకో, నార్వే జట్లు మాత్రం సంచలనం సృష్టించాయి. ఫిఫా చరిత్రలోనే మొరాకో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకుంది. క్వార్టర్స్‌లో ఓడిన మొరాకో ఆరో స్థానంలో నిలిచింది. ఎర్లింగ్ హాలండ్ సారథ్యంలోని నార్వే కూడా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. ఈ ఫిఫాలో క్వార్టర్స్ చేరుకొని చరిత్ర సృష్టించిన నార్వే 12 స్థానాలు ఎగబాకి 19వ స్థానం (టాప్-20)లో నిలిచింది.Photo Credit: FIFA Twitterఇక కాంస్యం గెలిచిన ఇంగ్లండ్ మూడో స్థానంలో, ఫ్రాన్స్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టిన పోర్చుగల్ రెండు స్థానాలు దిగజారి ఏడో స్థానానికి పడిపోగా, అదే సమయంలో బ్రెజిల్ ఐదో స్థానానికి చేరుకుంది. ఇక బెల్జింయం, నెదర్లాండ్స్, మెక్సికో వరుసగా ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలు దక్కించుకున్నాయి. ఫిఫా 2026లో పేలవ ప్రదర్శన కనబరిచిన మాజీ చాంపియన్ జర్మనీ మాత్రం టాప్-10లో చోటు కోల్పోయి 12వ స్థానంలో నిలవగా, క్రొయేషియా 13వ స్థానంలో ఉంది. ఇక ఈసారి ఫిఫాలో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న అనామక జట్టు కేప్‌వెర్డె 8 స్థానాలు ఎగబాకి 64వ స్థానంలో నిలిచింది. ఈ ఫిఫాలో కేప్‌వెర్డె ప్రిక్వార్టర్స్ వరకు చేరుకున్న సంగతి తెలిసిందే.చదవండి: అర్జెంటీనా ఓటమి.. మెస్సీ భావోద్వేగ లేఖ -
బుడ్డోడా మజాకా.. సవతి సోదరుడైనా తమ్ముడంటే ప్రాణం!
ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్ నిలవడంతో ఆ జట్టు సంబరాలు మాములుగా లేవు. 16 ఏళ్ల తర్వాత రెండోసారి ఫిఫా టైటిల్ గెలవడంతో స్పెయిన్‌లో సంబురాలు అంబరాన్ని అంటాయి. ఇక స్పెయిన్ ఆటగాళ్ల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. అయితే ఈ ఫిఫా టోర్నీలో ఒక బుడ్డోడు మాత్రం యమా క్రేజ్ సంపాదించాడు. ఆ బుడ్డోడు ఎవరో కాదు స్పెయిన్ స్టార్ లామినె యమాల్ చిన్న తమ్ముడు కీన్. సవతి తల్లికి పుట్టినోడయినప్పటికీ కీన్‌ను యమాల్ సొంత తమ్ముడిలా, కొడుకులా భావిస్తుంటాడు. మూడేళ్ల వయసున్న కీన్ 2026 ఫిఫా ప్రపంచకప్‌లో స్పెయిన్ ఆడిన ప్రతీ మ్యాచ్‌కు తన తల్లితో కలిసి హాజరయ్యాడు. ప్రతీ మ్యాచ్‌ను స్టాండ్స్ నుంచి వీక్షించిన కీన్ తన అన్న ఆటను తెగ ఎంజాయ్ చేసేవాడు. Photo Credit: FIFA Twitterఅంతేకాదు స్పెయిన్ తాము ఆడిన ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత యమాల్ తన సోదరుడిని ఒడిలో తీసుకొని ఆడుకోవడం ఆనవాయితీగా చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ తర్వాత కూడా యమాల్ దీనిని కంటిన్యూ చేశాడు. తన అన్న కప్ గెలవడంతో తమ్ముడికి సంతోషం ఆగలేదు. గ్రౌండ్ అంతా తనదే అన్నట్లుగా మైదానం నలుమూలలా పరిగెడుతూ సందడి చేశాడు. Photo Credit: FIFA Twitterఈ సందర్భంగా అన్న లామినె యమాల్‌ను కూడా కాసేపు ఆట పట్టించాడు. ట్రోఫీ సెలబ్రేషన్స్ అనంతరం కప్పు తన చేతిలోకి తీసుకున్న యమాల్ తన కుటుంబం దగ్గరకు వచ్చి తమ్ముడితో కలిసి ఫొటోలుకు ఫోజివ్వడం వైరల్‌గా మారింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫిఫా పైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించి ట్రోఫీని అందుకుంది. Lamine Yamal ve kardeşi. pic.twitter.com/gpcwLCiKvz— Pusholder (@pusholder) July 20, 2026 Lamine Yamal celebrating with his brother 🤗 pic.twitter.com/sd8Jg8smgZ— B/R Football (@brfootball) July 19, 2026 It's Keyne's world and we're just living in it 🤣 pic.twitter.com/Qk4I9BAuX4— B/R Football (@brfootball) July 19, 2026చదవండి: దేశవాళీ టోర్నీ.. సూర్యకుమార్‌కు మరో అవమానం! -
మెస్సీ అలా.. లామినే ఇలా; చివరికి!
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఓటమి బాధను తట్టుకోలేక అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరెడెస్ స్పెయిన్ ఆటగాళ్లతో తగాదా పెట్టుకున్నాడు. చిలికి చిలికి గాలి వానలా మారిన గొడవ తన్నుకునేంత వరకు వెళ్లింది. అయితే ఇంత గొడవ జరుగుతున్నప్పటికీ ఒకవైపు మెస్సీ.. మరోవైపు లామినె యమాల్ మాత్రం తమకేం సంబంధం లేదన్నట్లుగా ఉండిపోయారు. ఓటమి షాక్ నుంచి తేరుకోని మెస్సీ మైదానంలోనే నిరాశతో కూర్చుండిపోయాడు. తనలో తాను కుమిలిపోతు కన్నీటిపర్యంతమయ్యాడు. Photo Credit: FIFA Twitterమరోపక్క యమాల్ కూడా తన పక్కనే అంత పెద్ద గొడవ జరుగుతున్నప్పటికీ తన దేశం గెలిచిందన్న సంతోషంతో అతను ప్రార్థనల్లో మునిగిపోయిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. చుట్టూ ఏం జరుగుతుందో కూడా గ్రహించకుండా యమాల్ తన పనిలో నిమగ్నమై ఉండడం చూస్తే అతడి ఆత్మవిశ్వాసం ఎలాంటిదో అర్థమవుతోంది. ఇంత గొడవలో కూడా మెస్సీ, యమాల్ మధ్య జరిగిన ఒక భావోద్వేగ ఘటన ఆసక్తిగా మారింది.MIENTRAS LAMINE YAMAL REZABA... 😳 pic.twitter.com/9SPl4s4Gep— Diario Olé (@DiarioOle) July 20, 2026Photo Credit: FIFA Twitterఒకరినొకరు ఆలింగనం..లామినే యమాల్ తన ప్రార్థన పూర్తి చేసుకొని లేచిన తర్వాత తన ఎదురుగా పెద్ద గొడవ జరుగుతున్న దృష్ట్యాలను చూశాడు. కానీ దానిని పట్టించుకోకుండా యమాల్ నేరుగా మెస్సీ వద్దకు వచ్చాడు. అప్పటికే నిరాశలో కూరుకుపోయిన మెస్పీని ఓదార్చి పైకి లేపాడు. ఆ తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం కనిపించింది. ఇది చూసిన అభిమానులు.. 'క్యా సీన్‌హై' అనకుండా ఉండలేకపోయారు. వీరిద్దరు ఆలింగనం చేసుకున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. 'నిజమైన క్రీడా స్ఫూర్తికి మెస్సీ, యమాల్ అర్థం చెప్పారంటూ' కామెంట్లు చేశారు.అసలేం జరిగింది?ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత స్పెయిన్ ఆటగాళ్లు సంబరాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఓటమి బాధలో ఉన్న అర్జెంటీనా ఆటగాళ్లవైపు చూస్తూ స్పెయిన్ ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకోవడం వారికి కంటికి ఇంపుగా అనిపించలేదు. దీంతో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరెడెస్ ఒక్కసారిగా స్పెయిన్ ఆటగాళ్లవైపు దూసుకొచ్చాడు. Thank you, Leo. Legends are remembered, but you will never be forgotten. 🐐https://t.co/K8dqX5Tvlo— ketansusuw ✿ (@tansuuuw) July 20, 2026ఈ ఘర్షణలో అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ లియాండ్రో పరేడెస్.. స్పెయిన్ ఆటగాళ్లు గావీ, ఎరిక్ గార్సియాలతో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో పరేడెస్ ప్రత్యర్థి ఆటగాడిని తోసివేయడంతో పాటు చేయి చేసుకున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో అర్జెంటీనా హెడ్ కోచ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆటగాళ్లను విడదీసి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ చాలాసేపు ఉద్రిక్తత కొనసాగింది. Read: మరో ఫిఫా ఆడకపోవచ్చు.. మెస్సీ శకం ముగిసినట్లే! -
మరో ఫిఫా ఆడకపోవచ్చు.. మెస్సీ శకం ముగిసినట్లే!
మెస్సీ ఒక ఉత్పాతం, మౌన ముని. ఎన్ని అడ్డంకులు, వివాదాలు ఎదురైనా తన ఆటతోనే సమాధానం చెప్పాడు తప్ప హద్దులు మీరిన సందర్భాలు చాలా తక్కువ. నిజానికి మెస్సీకి కోపం కూడా ఎక్కువే. కానీ దాని అవసరం ఎంతమేర ఉంటుందో అంతే చూపిస్తుంటాడు. కాబట్టే ఇవాళ ప్రపంచంలో ప్రతీ మూలన అభిమానులను సంపాదించుకున్నాడు. గతంలో ఫుట్‌బాల్ పీలే, మారడోనా సహా ఎందరో దిగ్గజ ఆటగాళ్లను అందించినప్పటికీ ఈ తరంలో మాత్రం మెస్సీనే దిగ్గజ ఆటగాడు. ఇంకా చెప్పాలంటే అతడో ఆరాధ్య దైవం.అలాంటి ఈ తరంలో ఫుట్‌బాల్ తెలిసినోడిని నిద్రలో నుంచి లేపి ఒక ఆటగాడి పేరు చెప్పమంటే మొదట వినిపించే పేరు లియోనల్ మెస్సీ. రెండు దశాబ్దాలుగా తన ఆటతో ఫుట్‌బాల్ అభిమానుల గుండెల్లో గుడి కట్టేసుకున్న మెస్సీ చూడాల్సినవన్నీ చూశాడు. ఎనిమిది సార్లు బాలన్ డీ ఓర్ అవార్డు, ఆరుసార్లు యూరోపియన్ గోల్డెన్ షేస్, ఎనిమిది సార్లు ఫిఫా బెస్ట్ ప్లేయర్, అలాగే 2025లో ఆల్‌టైమ్ బెస్ట్ ప్లేయర్‌గాను నిలిచాడు. తన కెరీర్లో లోటుగా ఉన్న ఫిఫా ప్రపంచకప్‌ను కూడా నాలుగేళ్ల కిందట ఖతార్‌లోనే అందుకున్నాడు. మరి ఇన్ని చూసినా ఈసారి ఫిఫాలో కూడా మెస్సీ నామజపమే ఎందుకు నడిచిందనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు. అదంతా మెస్సీ మాయ.Photo Credit: FIFA Twitterమెస్సీ బరిలో ఉన్నాడంటే చాలు అభిమానులకు ఎక్కడలేని జోష్ వస్తుంది. 2026 ఫిఫా ప్రపంచకప్‌లోనూ అదే రిపీట్ అయింది. ఈసారి ఫిఫాలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనాను మెస్సీనే మరోసారి అన్నీ తానై నడిపించాడు. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో (ప్రి-క్వార్టర్ ఫైనల్ వరకు) కనీసం ఒక్క గోల్ అయినా కొట్టిన మెస్సీ గోల్డెన్ బూట్ రేసులోను దూసుకెళ్లాడు. అయితే అతడి స్పీడుకు ఈసారి ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె (10 గోల్స్, 4 అసిస్ట్‌లు) బ్రేకులు వేశాడు. అయితే క్వార్టర్స్, సెమీస్‌లో గోల్ చేయనప్పటికీ కీలక అసిస్ట్‌లు అందించి జట్టు వెన్నంటే ఉన్నాడు. కానీ కీలకమైన ఫైనల్లో మెస్సీ ఏం చేయలేకపోయాడు. దుర్బేద్యమైన స్పెయిన్ ఫార్వార్డ్ ప్లేయర్లను అడ్డుకోవడంతోనే మెస్సీకి సరిపోయింది. మ్యాచ్‌లో మెస్సీ రెండు క్రాస్‌లతో పాటు ఒక్కసారి మాత్రమే గోల్‌పోస్ట్ వైపు షాట్ ఆడినప్పటికీ స్పెయిన్ గోల్ కీపర్ ఉనైయి సిమోన్ దానిని కూడా సమర్థంగా అడ్డుకున్నాడు. మ్యాచ్‌లో స్పెయిన్ 20 సార్లు తమ ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు చేస్తే.. అర్జెంటీనా మాత్రం రెండుసార్లు మాత్రమే ప్రయత్నం చేయడం గమనార్హం.Photo Credit: FIFA Twitterఇక మ్యాచ్ ముగిసిన తర్వాత మెస్సీ కన్నీటిపర్యంతమవడం వెనుక ఒక కారణముంది. ఈసారి ఫిఫా ఆరంభం నుంచి అర్జెంటీనా ఆటపై వివాదాలు నెలకొన్నప్పటికీ మెస్సీ మాత్రం తన ఆటను చాలా సందర్భాల్లో నిజాయితీగానే ఆడాడు. ఫైనల్లో కూడా తను చేయాల్సిందంతా చేశాడు. కానీ పక్కా ప్రణాళికతో బరిలోకి దిగిన స్పెయిన్ ముందు అర్జెంటీనా పూర్తిగా తేలిపోవడంతో మెస్సీ కూడా చేష్టలుడిగి ఉండిపోయాడు.ఇక 1962 తర్వాత వరుసగా రెండు ఫిఫా ప్రపంచకప్‌లు గెలవాలన్న కల కూడా చెదరడం మెస్సీ కన్నీటికి మరో కారణం. 39 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో పోటీ పడుతూ ఆటను కొనసాగించిన మెస్సీ మరో ఫిఫా ప్రపంచకప్ ఆడడం అనుమానమే. మంచి ఫామ్‌లో ఉన్నందున ఈసారి ఎలాగైనా అర్జెంటీనాకు రెండోసారి ఫిఫా టైటిల్‌ను అందించాలని మెస్సీ కలగన్నాడు. బరిలోకి దిగిందే తడవుగా ప్రత్యర్థులతో పోరాట సింహంలా తలపడ్డాడు. 8 గోల్స్‌తో పాటు 4 అసిస్ట్‌లు చేసిన మెస్సీ సిల్వర్ బూట్‌ను కూడా గెలుచుకున్నాడు. Photo Credit: FIFA Twitterఅవార్డులు కొత్త కానప్పటికీ ఈసారి మెస్సీ ఫిఫా టైటిల్‌ను గెలిచిన మరుక్షణమే ఆటకు వీడ్కోలు పలికేవాడేమో. ప్రస్తుతం తన రిటైర్మెంట్పై మౌనమే వహించినప్పటికీ 2030 ఫిఫాలో మెస్సీ ఆడడం డౌటే. కాబట్టి ఫుట్‌బాల్‌లో ఒక శకం దాదాపు ముగిసినట్లే. Lionel Messi, Arjantin taraftarlarının tezahüratıyla duygulanıyor. pic.twitter.com/FkN2VjlUSm— Messi Anıları (@messianilari) July 19, 2026Lionel Messi gets emotional as Argentina fans shower him with love and support 🥹 pic.twitter.com/kff4YYJBwu— Instablog9ja (@instablog9ja) July 20, 2026 ESTE ULTÚIMO TANGO Una de las cosas más hermosas del fútbol es tener a Lionel Andrés Messi y su participación en todos los Mundiales. Gracias por todo lo que has logrado con la selección: récords, logros y campeonatos Gracias por cada momento de alegría que compartimos con la… pic.twitter.com/6GYfKBKpnz— AR (@ionlylei) July 20, 2026 -
నాలుగేళ్లలో సీన్ రివర్స్.. విలన్‌గా మారిన అర్జెంటీనా!
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత స్పెయిన్ విజయంతో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ మైదానంలో నిరాశతో కూర్చుండిపోయాడు. వరుసగా రెండోసారి అర్జెంటీనాకు ఫిఫా ప్రపంచకప్ అందించాలన్న కల చెదరడంతో ఏం చేయలేక కన్నీటిపర్యంతమయ్యాడు. ఈసారి ఫిఫా టోర్నీ ఆరంభం నుంచి ఫుల్‌జోష్‌లో కనిపించిన అర్జెంటీనా.. ఫైనల్ వరకు హీరోగానే నిలిచినప్పటికీ, మ్యాచ్ ముగిసిన తర్వాత అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరెడెస్ ఓటమి బాధను తట్టుకోలేక స్పెయిన్ ఆటగాళ్లతో గొడవకు దిగడం ఆ జట్టును విలన్‌గా మార్చేసింది. ఫిఫా ఆరంభం నుంచి ఎన్ని వివాదాలు జరిగినా ప్రపంచమంతా అర్జెంటీనా గెలవాలని బలంగా కోరుకుంది. కానీ ఫైనల్ మ్యాచ్ తర్వాత జరిగిన గొడవ అర్జెంటీనాను హీరో నుంచి జీరోకు పడిపోయేలా చేయడమే గాక, టోర్నీ విలన్‌గా మారిపోయింది.Photo Credit: FIFA Twitter2022 ఖతార్ ప్రపంచకప్‌లో తమ ఆటతీరుతో అందరి మన్ననలు పొందిన అర్జెంటీనా నాలుగేళ్ల తర్వాత జరిగిన ఫిఫా 2026లో మాత్రం వారి ప్రయాణం మొత్తం వివాదాలతోనే నడిచింది. ఈజిప్ట్‌పై చివరి నిమిషంలో 3-2 తేడాతో విజయం సాధించినప్పటికీ, ఈ మ్యాచ్ విజయం అర్జెంటీనాను మరింత వివాదంలోకి నెట్టేసింది. అర్జెంటీనా గెలవడానికే ఫిఫా నిర్వహిస్తున్నారని, రిఫరీ ఎవరైనా అర్జెంటీనాకు అనుకూలంగా నిర్ణయాలు ఉంటున్నాయని, అంతమాత్రాన ఫిఫా ప్రపంచకప్ నిర్వహించడం ఎందుకని, టైటిల్‌ను అర్జెంటీనాకు ఇచ్చేయాలనే విమర్శలు వచ్చాయి. ఇలా టోర్నీలో అర్జెంటీనా సాధించిన ప్రతీ విజయం వెనుక ఒక మెలిక ఉండడం పరిపాటిగా మారిపోయింది.Photo Credit: FIFA Twitterఈసారి టోర్నీ అంతటా వివాదాలు, సోషల్ మీడియాలో చర్చలు ఉన్నప్పటికీ, మెస్సీ మాత్రం తన ఆదర్శప్రాయమైన ప్రవర్తనతో జట్టును నడిపించాడు. అంతా చేజారిపోయినట్లు అనిపించిన మ్యాచ్‌ల్లో కూడా తన మ్యాజిక్‌తో అర్జెంటీనావైపు మొగ్గేలా చేశాడు. మెస్సీ మరో ఫిఫా ప్రపంచకప్ ఆడడం అనుమానమే. కాబట్టి తర్వాతి ఫిఫాకు ఈ దిగ్గజం లేకుండానే అర్జెంటీనా ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. మెస్సీకి ఒక పరిపూర్ణమైన ముగింపు కల్పించే అవకాశం అర్జెంటీనాకు లభించినప్పటికీ ఫైనల్ తర్వాత జరిగిన ఒక్క గొడవ ఆ జట్టు ఆటగాళ్లను విలన్లుగా మార్చేసింది.Read: కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. ఏం జరిగింది? -
FIFA World Cup 2026 : ఫిఫా 2026 విశ్వవిజేత స్పెయిన్ (ఫొటోలు)
-
కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. ఏం జరిగింది?
ఫిఫా ప్రపంచకప్ 2026 విజేతగా స్పెయిన్ అవతరించింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించి రెండోసారి ఫిఫా విశ్వవిజేతగా నిలిచింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఓటమి షాక్‌లో ఉన్న అర్జెంటీనా ఆటగాళ్లు సహనం కోల్పోయి స్పెయిన్ ఆటగాళ్లతో గొడవకు దిగారు. చిలికి చిలికి గాలి వానలా మారిన గొడవ తన్నుకునేంత వరకు వెళ్లింది. దీంతో అప్పటివరకు రణరంగంలా కనిపించిన మైదానం యుద్ధభూమిని తలపించింది. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో అర్జెంటీనా హెడ్ కోచ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆటగాళ్లను విడదీసి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ చాలాసేపు ఉద్రిక్తత కొనసాగింది. ఈ ఘర్షణలో అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ లియాండ్రో పరేడెస్.. స్పెయిన్ ఆటగాళ్లు గావీ, ఎరిక్ గార్సియాలతో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో పరేడెస్ ప్రత్యర్థి ఆటగాడిని తోసివేయడంతో పాటు చేయి చేసుకున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ గొడవను ఫిఫా తీవ్రంగా పరిగణించింది. ఘర్షణకు కారణమైన లియాండ్రో పరెడేస్పై రెడ్ కార్డు చూపించి క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. దీంతో ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో రెడ్ కార్డు అందుకున్న రెండో ఆటగాడిగా పరేడెస్ నిలిచాడు. అంతకుముందు మ్యాచ్ జరుగుతున్న సమయంలో అర్జెంటీనా స్టార్ మిడ్‌ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ కూడా రెడ్ కార్డు అందుకున్నాడు. ఈసారి ఫిఫా ప్రపంచకప్‌లో ఆఖరి అంకం దాకా హీరోగా నిలిచిన అర్జెంటీనా ఈ ఒక్క ఘటనతో విలన్‌గా మారిపోయింది. 🚨🥊 Full scenes after final whistle.@MickyJnr__ 🎥 pic.twitter.com/ZXCvAFkHwy— Fabrizio Romano (@FabrizioRomano) July 20, 2026Read: అర్జెంటీనా గెలవదని 14 కోట్లు పందెం.. డ్రేక్ శాపం ఫలిస్తుందా? -
‘ఫిఫా’ రీల్ ఎఫెక్ట్: ఉద్యోగి సెలవు రద్దు చేసిన బాస్
ఫిఫా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల కోసం ముందుగా మంజూరు చేసిన సెలవును ఒక బాస్ రద్దు చేసిన ఘటన సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ‘రెడిట్’లో వైరల్ అయిన ఈ కథనం ప్రకారం, ఒక ఉద్యోగి కుటుంబ వేడుక పేరుతో ఒక నెల ముందే సెలవు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, వీకెండ్లో మేనేజర్ చూసిన ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ ఈ పరిస్థితికి దారితీసింది.ఫిఫా ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు ఉద్యోగులు ‘కుటుంబ వేడుక’ను సాకుగా చూపుతున్నారనే రీల్ చూసిన మేనేజర్, వెంటనే ఆ ఉద్యోగి సెలవును రద్దు చేశారు. అంతేకాకుండా, రైలు టికెట్లు లేదా ఆహ్వాన పత్రిక రూపంలో కుటుంబ వేడుకకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరారు. ఆ ఉద్యోగి సరైన రుజువులు చూపలేకపోవడంతో, ఆ రీల్‌ను షేర్ చేస్తూ ‘ఎవరినైనా వేరే వాళ్లను మూర్ఖులను చేయి’ అని మెసేజ్ పంపారు.ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఉద్యోగి గతంలో ఆలస్యంగా రావడం, ఎక్కువ సెలవులు పెట్టడం వల్ల మేనేజర్ అనుమానించడంలో తప్పులేదని కొందరు వాదించగా, సోషల్ మీడియా రీల్స్ ఆధారంగా ముందుగా ఆమోదించిన సెలవులను రద్దు చేయడం సరికాదని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ ఉదంతం ఉద్యోగుల మధ్య నమ్మకం, కార్యాలయ నిఘాపై చర్చకు తెరలేపింది. -
ఇది బంతి కాదు.. కారు!
హైదరాబాద్, బహదుర్‌పురా చౌరస్తాలో శనివారం ఫుట్‌బాల్ కారు చక్కర్లు కొట్టింది. స్థానికులు దీనిని చూసి.. ఔరా.. అంటూ ఆశ్చర్యచకితులయ్యారు. ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ నేపథ్యంలో సుధాకార్స్ మ్యూజియం సృష్టికర్త కె.సుధాకర్ నాలుగు నెలలు శ్రమించి ఈ చిట్టి కారును రూపొందించారు. 150 సీసీ ఇంజిన్‌తో ఆరు చక్రాలతో తయారు చేసిన ఈ బంతికారు సింగిల్ సీట్‌తో.. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుందని ఆవిష్కర్త సుధాకర్ పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు 250కిపైగా రకాల కార్లను తయారు చేశానని చెప్పారు. -
FIFA World Cup 2026: ఫైనల్ వేడి.. సిటీ రెడీ
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్ అంకాన్ని తప్పకుండా చూసేందుకు సిటీ జనులు సిద్ధమయ్యారు. ఆదివారం అర్ధరాత్రి 12.30కు మొదలయ్యే అర్జెంటీనా–స్పెయిన్ జట్ల తుది సమరాన్ని వీక్షించేందుకు ఉత్సుకతతో ఉన్నారు. ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇచ్చింది ఉత్తర అమెరికా ఖండంలోని దేశాలు కావడంతో ఆయా దేశాల టైమ్ జోన్ మేరకు ఇప్పటికే తమ అలారాల సెట్టింగ్‌ను మార్చుకుని దాదాపు 40 రోజులుగా నగరంలోని ఫుట్‌బాల్ అభిమానులు మ్యాచ్‌ల మజాను ఆస్వాదించారు.ఇప్పుడు ఫైనల్ కోసం మరింత ఉత్సుకతగా ఉన్నారు. పైగా, హైదరాబాదీల అభిమాన ఆటగాడు లయోనల్ మెస్సీ సారథ్యంలో అభిమాన జట్టు అర్జెంటీనా పోటీ పడుతుంటే ఇక తెల్లవారుజాము వరకైనా మేల్కొనేందుకు సిద్ధపడ్డారు. స్పెయిన్ కంటే అర్జెంటీనానే మనవాళ్ల ఫేవరెట్ అని.. మెజారిటీ సిటీజనుల మొగ్గు అర్జెంటీనా వైపే అని హైదరాబాద్‌లోని ఫుట్‌బాల్ కోచ్‌లు, ఆటగాళ్లు పేర్కొంటున్నారు. 2022లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఫ్రాన్స్, అర్జెంటీనా తలపడగా అప్పుడూ మనవాళ్లు అర్జెంటీనాకే మద్దతు పలికిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇక గత కొన్ని మ్యాచ్‌ల ఓపెన్ స్క్రీనింగ్స్‌లో వచ్చిన స్పందన కూడా ఇదే విషయం స్పష్టం చేస్తోంది. - సాక్షి, హైదరాబాద్మెస్సీని తలచుకుంటూ... గత ఏడాది చివర్లో మెస్సీ హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంలో విశేష ప్రజాదరణ దక్కింది. అప్పట్లో కేరళ వంటి ఫుట్‌బాల్‌కు ఆదరణ విపరీతంగా ఉండే రాష్ట్రంలో కాకుండా మెస్సీ భాగ్య నగరానికి రావడం విశేషం. దీన్నిబట్టే.. ఇప్పుడు అతడు వరుసగా రెండోసారి ప్రపంచ కప్ అందుకోవాలని హైదరాబాదీలు బలంగా కోరుకుంటున్నారు.ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకునే, శనివారం అర్ధరాత్రి జరిగిన ఫ్రాన్స్–ఇంగ్లండ్ (మూడో స్థానం కోసం) మ్యాచ్, ఫైనల్ సందర్భంగా బార్లు, క్లబ్‌లు, మైక్రో బ్రూవరీలు రాత్రిళ్లు ఎక్కువసేపు తెరిచి ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కాగా, ఈ నిర్ణయాన్ని ఫుట్‌బాల్ ఫైనల్‌కు తాత్కాలిక సడలింపుగా మాత్రమే కాక నగర నైట్ లైఫ్నకు ఊపునిచ్చే దిశలో తొలి అడుగుగా ఆతిథ్య రంగం భావిస్తోంది. ఈ అనుమతులను సద్వినియోగం చేసుకుని పూర్తి స్థాయి రాత్రి వేళ వ్యాపారాలకు బాటలు వేసుకోవాలని ఆశిస్తోంది. అభివృద్ధిదాయక నైట్‌లైఫ్ నగరంలో సాధ్యమని నిరూపించడానికి ఇదొక సువర్ణావకాశమని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) అభిప్రాయపడుతోంది. అందుకని అవాంతరాలు లేకుండా గడిచేలా చూడాలని ఏఆర్ఏఐ హైదరాబాద్ చాప్టర్ తమ సభ్యులను కోరింది. ‘ప్రతి సంస్థ సొంత బ్రాండ్‌నే కాకుండా, హైదరాబాద్ ఆతిథ్య రంగం ప్రతిష్టను కూడా ఇనుమడింపజేయాలి’ అని చాప్టర్ హెడ్ సందీప్ బాలసుబ్రమణియన్ సూచించారు. -
అర్జెంటీనా గెలవదని 14 కోట్లు పందెం.. డ్రేక్ శాపం ఫలిస్తుందా?
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా, స్పెయిన్ తలపడుతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా భారీ బెట్టింగ్‌లు నమోదవుతున్నాయి. అర్జెంటీనా టైటిల్ నిలబెట్టుకుంటుందంటూ కొంతమంది పందేలు కాస్తుంటే.. మరికొంత మంది మాత్రం ఈసారి స్పెయిన్ టైటిల్ అందుకొని 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతుందంటూ భారీ బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఈ బెట్టింగ్‌ల విలువ కూడా కోట్ల రూపాయల్లో ఉండడం గమనార్హం. ప్రపంచం మొత్తం బెట్టింగ్‌లు వేసినప్పటికీ, కెనడియన్ రాపర్ డ్రేక్ గ్రహమ్ వేసే పందెం మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. గతంలో డ్రేక్ మద్దతు ఇచ్చిన జట్లు లేదా ఆటగాళ్లు ఓడిపోవడం జరిగింది. తాజాగా అర్జెంటీనా ఫిఫా టైటిల్‌ను గెలవదంటూ డ్రేక్ 1.5 అమెరికన్ మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 14.5 కోట్ల రూపాయలు) పందెం కాయడం సంచలనం కలిగించింది. మరి డ్రేక్ శాపం ఫలిస్తుందా అన్నది ఫైనల్ తర్వాత తేలనుంది.'డ్రేక్ శాపం' అంటే?👉డ్రేక్ శాపం అనేది ఒక క్రీడా మూఢనమ్మకం. దీని ప్రకారం, డ్రేక్ బహిరంగంగా మద్దతు ఇచ్చిన అథ్లెట్లు, ఫైటర్లు లేదా జట్లు తరచుగా కీలకమైన మ్యాచ్‌లలో ఓడిపోవడాన్ని అభిమానులు గమనించారు.👉చాలా సందర్భాల్లో, ఆటగాళ్లు కెనడియన్ ర్యాపర్‌తో ఫోటోలు దిగిన తర్వాత ఆయా జట్లు ఓటమిని చవిచూశాయి.👉ఈ మూఢనమ్మకం కారణంగా, చాలా మంది క్రీడాభిమానులు డ్రేక్ మద్దతును అపశకునంగా భావిస్తారు.👉ఇప్పుడు అతను అర్జెంటీనాపై తన పందెం వేయడంతో, ఈ చర్య ప్రపంచ కప్ ఫైనల్‌కు ముందు ఆ జట్టు మద్దతుదారులలో ఆందోళనను రేకెత్తించింది.లెక్కచేయని అర్జెంటీనా ఫ్యాన్స్..అయితే అర్జెంటీనా అభిమానులు మాత్రం డ్రేక్ పందేన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. 2022 ఖతార్ ప్రపంచకప్‌లోనూ ఫైనల్లో ఫ్రాన్స్ చేతిలో అర్జెంటీనా ఓడిపోతుందంటూ డ్రేక్ గ్రహమ్ ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ. 10 కోట్లు) పందెం కాసి చేతులు కాల్చుకున్నాడు. డ్రేక్ శాపానికి తిరుగుండదని బీరాలు పలికాడు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. ఆ ప్రపంచకప్‌లో మెస్సీ సేన ఫిఫా టైటిల్ గెలవడంతో డ్రేక్ అంచనా తప్పి అపఖ్యాతి పాలయ్యాడు. అయితే తాజాగా ఫిఫా 2026 టోర్నీలో అర్జెంటీనా మరోసారి ఫైనల్ చేరిన క్రమంలో డ్రేక్ మరోసారి భారీ పందెం కాసినప్పటికీ ఈసారి కూడా అతడి అంచనా తప్పుతుందని అర్జెంటీనా అభిమానులు బల్లగుద్ది జోస్యం చెబుతున్నారు. ఈసారి కూడా మెస్సీ సేన డ్రేక్ మూడ నమ్మకాన్ని బద్దలుకొట్టి నాలుగోసారి ఫిఫా టైటిల్‌ను ఎగురేసుకుపోతుందని పేర్కొన్నారు.మెస్సీ సేనకు వ్యతిరేకంగా..ఆరంభం నుంచి ఈసారి ఫిఫా టోర్నీలో అర్జెంటీనా గెలవకూడదనే ప్రయత్నాలు కొనసాగుతూ వచ్చాయి. ఆరంభ పోటీల్లో అనామక జట్టు కేప్‌వెర్డె.. అర్జెంటీనాను ఓడిస్తుందంటూ ఒక ఆధ్యాత్మికవేత్త చేసిన ప్రకటన వైరల్‌గా మారింది. కానీ రియాల్టీకి వచ్చేసరికి అర్జెంటీనా సునాయాసంగా కేప్వెర్డెను ఓడించింది. ఈసారి ఫిఫాలో విస్తృతంగా ప్రచారం జరిగిన మరో మూడనమ్మకం ఏంటంటే.. ప్రముఖ యూట్యూబర్ ఐషో స్పీడ్ తాను మద్దతు ఇచ్చిన ప్రతీ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో, అతడికి అపశకునం అనే బిరుదు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్, అర్జెంటీనా మ్యాచ్‌కు ఐషోస్పీడ్ అర్జెంటీనా జెర్సీ ధరించి వారికి మద్దతు ఇచ్చాడు. కానీ మెస్సీ సేన ఐషో స్పీడ్ అపశకునాన్ని సైతం ఛేదించి సెమీస్‌లో అడుగుపెట్టింది. అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరగనున్న ప్రతిష్టాత్మక ఫిఫా ఫైనల్ మ్యాచ్‌కు మెట్‌లైఫ్ స్టేడియం వేదిక కానుంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.Read: ఫిఫా ఫైనల్‌కు ముందు మెస్సీ చివరి సందేశం! -
ఫిఫా ఫైనల్‌కు ముందు మెస్సీ చివరి సందేశం!
ఫిఫా ప్రపంచకప్ చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక ఫిఫా ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో స్పెయిన్ తలపడనుంది. ఈసారి ఫిఫాలో జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన మెస్సీ అన్నీ తానై అర్జెంటీనాను నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫైనల్‌కు ముందు అర్జెంటీనా జట్టు, సహాయక సిబ్బందితో కలిసి దిగిన గ్రూప్ ఫొటోను షేర్ చేసుకున్న మెస్సీ తన చివరి సందేశాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ఫిఫా టోర్నీ ఆద్యంతం తనకు అండగా నిలిచిన సహచర ఆటగాళ్లకు, కోచ్, సహాయక సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక లేఖను రాసుకొచ్చాడు. ఈ ఫిఫాలో ఫైనల్ చేరే క్రమంలో కేవలం విజయాలు మాత్రమే కాకుండా జట్టు ప్రయాణం కూడా తమను గొప్పదిగా నిలబెట్టిందని మెస్సీ తెలిపాడు. 'ఇన్ని సంవత్సరాల మా ప్రయాణంలో అత్యంత ఆనందకరమైన విషయం ఏంటంటే.. మేము టైటిల్స్ గెలవడమే కాదు, ఈ ప్రయాణంలో ఎన్నో అనుభూతులను పొందాము. అర్జెంటీనా జట్టులోని ఆటగాళ్లతో కలిసి రోజువారి పనులను పంచుకోవడం, కలిసి పోటీ పడడం, కష్ట సమయాల్లో అండగా నిలబడడం, ఇలా ప్రతి అడుగును మనస్ఫూర్తిగా ఆస్వాదించాం. నా ప్రయాణంలో అండగా నిలిచిన సహచర ఆటగాళ్లకు, సహాయక, సాంకేతిక సిబ్బంది, అర్జెంటీనా దేశ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఫిఫా టైటిల్ గెలుస్తామా లేదా అన్న సంగతి పక్కనబెడితే ఇప్పటికే జట్టుగా మరిచిపోలేని, చెరిగిపోని జ్ఞాపకాలను చరిత్రగా లిఖించుకున్నాం. కమాన్ అర్జెంటీనా.’ అని భావోద్వేగంతో పేర్కొన్నాడు. అర్జెంటీనా కెప్టెన్ ఇచ్చిన సందేశం ఆ జట్టు ఒక కుటుంబంలా కలిసి నడుస్తూ ధృడమైన బంధాన్ని చాటిచెబుతుంది. స్పెయిన్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా వారసత్వం మాత్రం సురక్షితంగా ఉంటుందని మెస్సీ పరోక్షంగా పేర్కొన్నాడు.ఇక ఫిఫా ఫైనల్ మెస్సీకి చివరి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుందనే ప్రచారం జరుగుతున్న వేళ మెస్సీ ఇచ్చిన తాజా సందేశం వైరల్‌గా మారింది. ఫైనల్‌కు ముందే ఇలాంటి సందేశాన్ని ఇవ్వడం వెనుక మెస్సీ తన రిటైర్మెంట్ విషయాన్ని పరోక్షంగా వెల్లడించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో మెస్సీ ఏడు మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌తో పాటు నాలుగు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె 8 మ్యాచ్‌ల్లో 10 గోల్స్‌తో పాటు 4 అసిస్ట్‌లతో తొలి స్థానంలో ఉన్నాడు. భారత కాలమాన ప్రకారం అర్జెంటీనా, స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలకు మొదలుకానుంది. Excited for finals but Lionel messi will play his last match for argentina pic.twitter.com/clW43BWtQV— `mr. villa (@Luccydevil07) July 19, 2026Read: సింధుదే జపాన్ ఓపెన్.. తొలి భారత షట్లర్‌గా రికార్డు -
ఎంబాపె ప్రపంచ రికార్డు.. మెస్సీకి కష్టమేనా!
ఫిఫా ప్రపంచకప్‌లో మూడో స్థానం కోసం ఇంగ్లండ్‌తో జరిగిన పోరులో ఫ్రాన్స్ ఓటమి పాలైనప్పటికీ, ఆ జట్టు స్టార్ ఆటగాడు కైలియన్ ఎంబాపె మాత్రం ప్రపంచ రికార్డుతో మెరిశాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో మెరిసిన ఎంబాపె ఈ ఫిఫా టోర్నీలో తన గోల్స్ సంఖ్యను పదికి పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో గోల్డెన్ బూట్ రేసులో ఎంబాపె (10 గోల్స్, 4 అసిస్ట్‌లు) మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. మెస్సీ 8 గోల్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇవాళ జరగనున్న ఫిఫా ఫైనల్లో మెస్సీ కనీసం రెండు గోల్స్, ఒక అసిస్ట్ చేస్తే గోల్డెన్ బూట్ అతడి సొంతమవుతోంది. లేదంటే ఎంబాపె దానిని ఎగరేసుకుపోతాడు. Photo Credit: FIFA Twitterఇక ఫిఫాలో అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలోనూ మెస్సీని ఎంబాపె దాటేశాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు 20 గోల్స్‌తో ఉన్న ఎంబాపె మరో రెండు గోల్స్ నమోదు చేయడంతో తన సంఖ్యను 22కు పెంచుకున్నాడు. ఇక అర్జెంటీనా స్టార్ మెస్సీ 21 గోల్స్‌తో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. స్పెయిన్‌తో ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ గోల్ చేయకుంటే మాత్రం ఎంబాపె టాప్‌లో ఉంటాడు. ఈ ఫిఫా అనంతరం ఒకవేళ మెస్సీ రిటైర్ అయితే మాత్రం ఎంబాపె ఫిఫాలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగానూ రికార్డులకెక్కనున్నాడు.స్పెయిన్‌తో సెమీస్‌లో సమన్వయ లోపం వల్ల ఒక్క గోల్ కూడా చేయలేకపోయిన ఫ్రాన్స్ మూడో ప్లేస్ కోసం జరిగిన పోరులో మాత్రం గెలిచేందుకు శాయాశక్తులా ప్రయత్నించింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6-4 తేడాతో ఫ్రాన్స్‌పై విజయం సాధించి బ్రాంజ్ మెడల్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ తరఫున బుకాయో సాకా (37వ, 45+1వ, 87వ నిమిషం) హ్యాట్రిక్ గోల్స్‌తో మెరవగా, డెక్లన్ రైస్ (3వ నిమిషం), ఎరిక్ కోన్సా (18వ నిమిషం), జూడ్ బెల్లింగ్ హమ్ (90+8వ నిమిషం) గోల్స్ సాధించారు. ఫ్రాన్స్ తరఫున కైలియన్ ఎంబాపె (48, 66వ నిమిషం) డబుల్ గోల్స్‌తో మెరవగా, బ్రాడ్లీ బార్కోలా (54వ నిమిషం), ఉస్మాన్ డెంబెలె (90+6వ నిమిషం) గోల్స్ చేశారు.గోల్డెన్ బూట్ రేసులో ఉన్న ఆటగాళ్ల జాబితా:👉కైలియన్ ఎంబాపే: గోల్స్: 10, అసిస్ట్‌లు: 4👉లియోనెల్ మెస్సీ : గోల్స్: 8, అసిస్ట్‌లు: 4👉ఎర్లింగ్ హాలాండ్ : గోల్స్: 7, అసిస్ట్‌లు: 0👉జూడ్ బెల్లింగ్‌హామ్ : గోల్స్: 7, అసిస్ట్‌లు: 1👉హ్యారీ కేన్ : గోల్స్: 6, అసిస్ట్‌లు: 1👉ఉస్మాన్ డెంబెలె : గోల్స్: 6, అసిస్ట్‌లు: 2Kylian Mbappé has now scored the MOST goals in World Cup history with his 22nd 🇫🇷He leads the Golden Boot race with 10 goals this tournament. pic.twitter.com/mVlvHDZvkz— B/R Football (@brfootball) July 18, 2026 Kylian Mbappe now has 14 goal contributions in this World Cup - a record for most in a single tournament ☝️ pic.twitter.com/laTGyeN4IQ— B/R Football (@brfootball) July 18, 2026చదవండి: టీ20 సిరీస్.. జింబాబ్వేకు బయల్దేరి వెళ్లిన టీమిండియా -
గెలవకపోయినా... మనసులు గెలిచి....
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన మెగా ఈవెంట్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. నాలుగేళ్లకోసారి వచ్చే ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ప్రతీసారి ఎన్నో అద్భుత ఘట్టాలను, అనేక చిరస్మరణీయ క్షణాలను మనకు చూపిస్తుంది... అసాధారణ వ్యక్తిగత ప్రదర్శనలు, టీమ్ ఘన విజయాలు... ఇలా సగటు అభిమాని మరచిపోలేని ఎన్నో దృశ్యాలు కనుల ముందు కదలాడుతాయి. 2026 ‘ఫిఫా’ ప్రపంచ కప్‌కు సంబంధించి అలాంటి కొన్ని విశేషాలను చూస్తే...ఖతర్నాక్ కేప్‌వెర్డె ప్రపంచకప్‌లో ఎప్పుడూ చెలరేగే బలమైన టీమ్‌లతో పాటు కొన్ని చిన్న టీమ్‌లు కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. ఈసారి ఆ జాబితాలో కేప్‌వెర్డె అందరికంటే ముందుంది. సుమారు 5 లక్షల జనాభా గల ఈ అతి చిన్న దేశం కూడా అసాధారణ ఆటతో తమదైన ముద్ర వేసింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒక్కటి కూడా ఓడలేదు. తమకంటే ఎంతో బలమైన స్పెయిన్, ఉరుగ్వే, సౌదీ అరేబియాలతో మ్యాచ్‌లను ‘డ్రా’గా ముగించి నాకౌట్‌కు అర్హత సాధించింది. రౌండ్–32లో అర్జెంటీనా చేతిలో ఓడినా 2 గోల్స్ కొట్టి సంతృప్తిగా ముగించింది.అన్నింటికంటే టీమ్ గోల్ కీపర్ జోస్ వొజిన్హా ఆట టోర్నికై హైలైట్‌గా నిలిచింది. 40 ఏళ్ల వయసులో అత్యంత చురుగ్గా ఉంటూ గోల్ పోస్ట్ ముందు అడ్డుగోడగా అతను నిలిచిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది. స్పెయిన్‌లాంటి జట్టు 7 గోల్ ప్రయత్నాలను నిలువరించిన అతను అర్జెంటీనా 8 గోల్ ప్రయత్నాలను కూడా సమర్థంగా అడ్డుకోగలిగాడు. దాంతో ఒక్కసారిగా అతని ప్రజాదరణ పెరిగిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య 50 వేల నుంచి రాత్రికి రాత్రే 1 కోటి 30 లక్షలకు చేరుకోవడం విశేషం. అంతే కాదు...కొత్తగా బయటపడిన సముద్ర జీవికి కేప్‌వెర్డె గోల్ కీపర్ గౌరవంగా ‘అల్డిసా వొజిన్హాయ్’ అని పేరు పెట్టడం విశేషం. ఈజిప్ట్...అర్జెంటీనాను వణికించి...‘ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్’లో ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచినా... ఈజిప్ట్ జట్టు ప్రపంచకప్‌లో తమదైన ముద్ర వేయలేకపోయింది. గతంలో మూడుసార్లు లీగ్ దశకే పరిమితమైన టీమ్ ఈసారి నాకౌట్లోకి అడుగు పెట్టింది. కోచ్ హొసామ్ హసన్ టీమ్‌కు సమర్థంగా దిశానిర్దేశం చేయగా, మైదానంలో స్టార్ ఆటగాడు మొహమ్మద్ సలా తనపై నమ్మకం నిలబెట్టేలా రాణించాడు. ఈ టో ర్నిలో అర్జెంటీనాతో ఆడిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఈజిప్ట్ అద్భుత ఆట కనబర్చింది.ఈ పోరును ఫుట్‌బాల్ అభిమానులెవరూ మర్చిపోలేరు. మెస్సీ కొట్టిన పెనాల్టీ కిక్‌ను గోల్ కీపర్ ముస్తఫా షబీర్ అడ్డుకున్న తీరు సూపర్. 78 నిమిషాలు పాటు కౌంటర్ అటాకింగ్‌తో డిఫెండింగ్ చాంపియన్‌ను ముచ్చెమటలు పట్టించి టీమ్ 2–0తో ముందంజలో నిలిచింది. అయితే అనూహ్యంగా 13 నిమిషాల వ్యవధిలో 3 గోల్స్ ఇచ్చి ఈజిప్ట్ ఓటమిపాలైంది. రిఫరీ పక్షపాతంతో వ్యవహరించాడని, అతని తప్పుడు నిర్ణయాలే తమ ఓటమికి కారణమయ్యామని ఆరోపించిన ఈజిప్ట్... చివరకు నాకౌట్ చేరి సంతృప్తితో సగర్వంగా ని్రష్కమించింది.నార్వేను నడిపించిన హాలాండ్...ప్రపంచ కప్‌కు సంబంధించిన నార్వే బలమైన జట్టేమీ కాదు. చివరిసారిగా ఆ జట్టు ఈ మెగా టో ర్నికి అర్హత సాధించినప్పుడు (1998) ప్రస్తుత జట్టులోని సగం మంది పుట్టనే లేదు. ఈసారి మాత్రం నార్వే టీమ్ క్వార్టర్ ఫైనల్ దశకు చేరి అందరి దృష్టినీ ఆకర్షించింది. టాప్ ప్లేయర్ ఎర్లింగ్ హాలాండ్ అందుకు ఒక కారణం కాగా... ప్రిక్వార్టర్స్‌లో ఆ జట్టు చేసిన సంచలన ప్రదర్శన, ఆపై ఆటగాళ్ల ప్రత్యేక సంబరాలు మరో కారణం. అద్భుతమైన ఆట, మైదానంలో చురుకుదనంతో పాటు తనదైన సరదా శైలితో హాలాండ్ సహచరులకంటే భిన్నంగా నిలిచాడు.ముఖ్యంగా బ్రెజిల్‌తో జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో హాలాండ్ చేసిన రెండు గోల్స్ అతడిని గ్లోబల్ హీరోగా మార్చాయి. ఆ తర్వాత నార్వే ఆటగాళ్లందరూ కలిసి రోయింగ్ తరహాలో చేసే ‘వైకింగ్ రో సెలబ్రేషన్’ అయితే ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. క్వార్టర్స్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా... స్వదేశంలో ఆ జట్టుకు లభించిన ఘన స్వాగతం, భారీ తరహాలో సాగిన ఓపెన్ పరేడ్ ఈ టో ర్నిలో జట్టు విజయాల విలువను చూపించాయి. -
ఇజ్రాయెల్ సెటిలర్ల దాడి.. పాలస్తీనా ఫుట్‌బాల్ ప్లేయర్ మృతి
పాలస్తీనా క్రీడా రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆక్రమిత పశ్చిమ తీరం (వెస్ట్ బ్యాంక్)లో ఇజ్రాయెల్ సెటిలర్లు, సైన్యం జరిపిన దాడిలో గాయపడిన పాలస్తీనా యువ ఫుట్‌బాల్ ప్లేయర్ ఫాదీ హమ్దల్లా అల్-నస్సాన్ (17) శనివారం రాత్రి మరణించాడు. ఫాదీ తీవ్రమైన గాయాలతో వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయినట్లు అధికారులు ప్రకటించారు.ఏమి జరిగిందంటే?జూలై 11న వెస్ట్ బ్యాంక్‌లోని ఫాదీ హమ్దల్లా గ్రామంపై ఇజ్రాయెల్ సెటిలర్లు, బలగాలు దాడులు జరిపాయి. ఈ దాడిలో మహిళల అరుపులు విని వారిని రక్షించడానికి వెళ్లిన ఫాదీపై ఇజ్రాయెల్ బలగాలు కాల్పులు జరిపాయి. తీవ్రంగా గాయపడిన ఫాదీని అస్పత్రికి తరలించారు.గాయం తీవ్రమవడంతో వైద్యులు అతడి కాలును తొలగించాల్సి వచ్చింది, అయినప్పటికీ పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. ఈ ఘటనపై పాలస్తీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించింది.2023 నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో 568 ఫుట్‌బాల్ ప్లేయర్లు మరణించినట్లు పీఫ్ఎ అధికారికంగా తెలిపింది. కాగా ఫాదీ అల్-నస్సాన్ స్థానిక 'అల్-ముఘయ్యిర్' క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు, పాలస్తీనా జాతీయ యువ ఫుట్‌బాల్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. -
‘మన’ ఆట ఎప్పుడో?
మరో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ వచ్చింది... ఆదివారంతో ముగిసిపోతోంది కూడా! మెస్సీ మాయలో తరించాం... ఎంబాపె, హాలాండ్, డెంబెలె, మార్టినెజ్ మెరుపులకు జేజేలు పలికాం... మిగతా ఆటగాళ్ల విన్యాసాలను కూడా ఓహో అంటూ చప్పట్లు కొట్టాం... కానీ ఇలా ఎప్పటి వరకు? పరాయి దేశపు ఆటగాడికి అభిమాన ప్రేక్షకుడిలా ఆటను ఆస్వాదిస్తున్నాం తప్ప ‘మనోడు’ అంటూ ఒక్కడూ మైదానంలో కనిపించడం లేదు. ‘ఫిఫా’ వరల్డ్ కప్ మొదలై 96 ఏళ్లు అయినా భారత జట్టుకు ప్రాతినిధ్యమే లేదు. మైదానంలో దిగేందుకు కనీసం ఒక్కసారి కూడా అవకాశం రాలేదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జరిగిన 1950 వరల్డ్ కప్‌లో మాత్రం భారత్‌గా నేరుగా అవకాశం లభించింది. వేర్వేరు రాజకీయ కారణాలతో పలు జట్లు తప్పుకోవడంతో ఆడేందుకు భారత్‌ను కూడా ‘ఫిఫా’ ఎంపిక చేసింది. అయితే తగిన ప్రాక్టీస్ లేక, జట్టు ఎంపికలో గందరగోళవంటి సమస్యలతో చివరి నిమిషంలో జట్టును పంపడం లేదని భారత ఫుట్‌బాల్ సమాఖ్య ప్రకటించింది. ఆ తర్వాత మన అడుగులు ఒక్కసారి కూడా అటు వైపు పడలేదు. 2026 టోర్నీలో ప్రపంచ కప్‌ను 32 నుంచి 48 జట్లకు పెంచినా... అర్హతా ప్రమాణాలకు మనం దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాం. మన దేశంలో ఫుట్‌బాల్ స్థాయి నానాటీకీ పడిపోతున్న ఈ స్థితిలో వరల్డ్ కప్‌లో ఆటను కోరుకోవడం అత్యాశే కావచ్చు. ప్రస్తుతం ‘ఫిఫా’ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ 138వ స్థానంలో ఉంది. ఆసియా ఖండంలోనైతే ఈ ర్యాంక్ 27గా ఉంది. వరల్డ్ కప్‌కు అర్హత సాధించే ప్రయత్నంలో 1986, 1994, 1998లలో... ఆ తర్వాత 2002 నుంచి 2026 వరకు భారత జట్టు వరుసగా ఆసియా ఖండం నుంచి అర్హత సాధించే లక్ష్యంతో క్వాలిఫయింగ్ టోర్నమెంట్లు ఆడింది. అయితే ఒక్కసారి కూడా జట్టు కావాల్సిన విజయాలు సాధించి ముందంజ వేయలేకపోయింది. ఇన్నేళ్లలో ఆసియాలోని 22 జట్లతో తలపడిన భారత్ వరల్డ్ కప్ కోరిక మాత్రం తీరలేదు. 2026 టోర్నీలో ఆసియా నుంచి 9 జట్లకు చాన్స్ లభించినా భారత్ మాత్రం వీటిలో లేదు. ఈ ఖండం నుంచి ఇరాన్, ఇరాక్, జపాన్, జోర్డాన్, ఖతర్, సౌదీ అరేబియా, కొరియా, ఉజ్బెకిస్తాన్, ఆ్రస్టేలియా బరిలోకి దిగాయి. క్వాలిఫయింగ్ టోర్నీలో ఖతర్, కువైట్, అఫ్గానిస్తాన్‌లపై మొత్తం 6 మ్యాచ్‌లు ఆడిన భారత్ ఒకటే మ్యాచ్ గెలిచి అర్హత సాధించే అవకాశాలు చేజార్చుకుంది. మరోవైపు ఒలింపిక్స్‌లో మాత్రం భారత్‌కు అవకాశం దక్కింది. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు చేరడం మన జట్టు అత్యుత్తమ ప్రదర్శన. అయితే 1992 నుంచి నిబంధనలు మార్చి అండర్–23 టీమ్‌లను మాత్రమే ఒలింపిక్స్‌కు పంపాలని నిర్ణయించగా...ఆ తర్వాత భారత్ ఒక్కసారి కూడా అర్హత సాధించలేకపోయింది. ప్రస్తుతం మన దేశంలో ఫుట్‌బాల్ క్రీడకు అసలు ఏమాత్రం ఆదరణ లేని స్థితి, కనీస సౌకర్యాలు లేకపోవడం, నాసిరకం ప్రమాణాలకు తోడు ఏమాత్రం ముందు చూపు లేని జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) చేతగానితనం వెరసి వరల్డ్ కప్‌లో మన జట్టు గురించి కనీసం ఆలోచించకుండా చేస్తోంది. జట్టుగా కాకున్నా కొందరు ఆటగాళ్లయినా కనీసం తమ వ్యక్తిగత సామర్థ్యంతో విదేశీ లీగ్‌లలో ఆడటం, స్థాయిని పెంచుకోవడం లాంటివి కూడా కనిపించడం లేదు. 2030లో జరిగే వరల్డ్ కప్‌లో మళ్లీ జట్ల సంఖ్యను 64కు పెంచాలని ‘ఫిఫా’ యోచిస్తోంది. దాని కోసమైనా ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధమై క్వాలిఫయింగ్ కోసం ఒక ప్రయత్నం చేయవచ్చు. తాజా స్థితిలో మాత్రం ప్రపంచకప్‌లో మన హాజరు ఇంకా సుదూర స్వప్నమే! -
ఫిఫా ఫైనల్ ఆఖరిదా?.. రిటైర్మెంట్పై మెస్సీ స్పందన!
ఫిఫా ప్రపంచకప్ 2026 తర్వాత అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడా? ఆదివారం స్పెయిన్‌తో జరగనున్న ఫిఫా ఫైనల్ మెస్సీ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే లియోనల్ మెస్సీ తన రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ ముగిసిన తర్వాత ప్రెస్‌మీట్‌కు హాజరైన మెస్సీకి తన రిటైర్మెంట్పై ఒక ప్రశ్న ఎదురైంది. అదేంటంటే.. ‘మీ జర్నీ ఒక వీడియో గేమ్‌లా ఉంది. ఫిఫా ఫైనల్ మీకు చివరిది కానుందా’ అని ప్రశ్నించారు. దీనిపై మెస్సీ స్పందిస్తూ.. ‘నేను నా చివరి మ్యాచ్‌ను గత వరల్డ్‌కప్ (ఖతార్ 2022)లోనే ఆడేశాను. అక్కడ ఫిఫా టైటిల్ గెలవడంతోనే నా కెరీర్లో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాను. ఇప్పుడు నా ఆట ముగిసిపోయింది’అని అర్ధంకాని రీతిలో జవాబివ్వడంతో రిపోర్టర్లు తలలు పట్టుకోవడం గమనార్హం. దీంతో మెస్సీ రిటైర్మెంట్పై మరోసారి గందరగోళం నెలకొంది. అయితే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత మెస్సీ ఆటకు వీడ్కోలు పలుకుతాడా లేదా అన్నది ఆదివారమే తేలనుంది. ఇదే విషయమై అర్జెంటీనా జట్టు కోచ్, మేనేజర్ లియోనల్ స్కలోనిని కూడా అడిగారు.ఆయన కూడా ‘నాకైతే ఏ సమాచారం లేదు. నిజాయితీగా చెప్పాలంటే మెస్సీ తన నిర్ణయంతో మమ్మల్ని సర్ప్రైజ్ చేయొచ్చు.. చేయకపోవచ్చు. రిటైర్మెంట్ అంశం పూర్తిగా అతడికే వదిలేశాం’ అని తెలివిగా సమాధానం చెప్పుకొచ్చారు. ఇక ఫిఫా ప్రపంచకప్ 2026లో మెస్సీ అత్యున్నత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఏడు మ్యాచ్‌ల్లోనే 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో దూసుకెళ్తున్నాడు. అయితే ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె (7 మ్యాచ్‌ల్లో 8 గోల్స్, 3 అసిస్ట్‌లు) మెస్సీతో సమానంగా ఉన్నాడు. స్పెయిన్‌తో ఫైనల్లో మెస్సీ గోల్ చేస్తే గోల్డెన్ బూట్ అతడి సొంతమవుతుంది. ఒకవేళ మెస్సీ గోల్ చేయకుంటే ఎంబాపెకు గోల్డెన్ బూట్ దక్కే అవకాశముంది. రికార్డు స్థాయిలో ఆరోసారి ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ ఓవరాల్‌గా 21 గోల్స్‌తో ఫిఫాలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. మెస్సీ వెనుకే ఎంబాపె (ఫ్రాన్స్, 20 గోల్స్) రెండో స్థానంలో ఉన్నాడు. 🗣️ “Your career is like a video game, you keep unlocking new levels until you reach the final”.😬🇦🇷 Leo Messi: “I already completed the game at the last World Cup in Qatar”. pic.twitter.com/CD2eZLhlv0— Fabrizio Romano (@FabrizioRomano) July 18, 2026Read: ఫిఫా ఫైనల్ మ్యాచ్.. ఒక్క టికెట్ ధర 27 లక్షలు! -
ఫిఫా ఫైనల్ మ్యాచ్.. ఒక్క టికెట్ ధర 27 లక్షలు!
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. ప్రతిష్టాత్మక ఫిఫా ఫైనల్లో అర్జెంటీనా, స్పెయిన్ తలపడుతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా వరుసగా రెండోసారి ఫిఫా ఫైనల్లో అడుగుపెట్టడం వల్ల భారీ క్రేజ్ నెలకొంది. అటు 16 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టిన స్పెయిన్ కూడా కప్ కొట్టాలనే కసితో ఉంది. మరి కొదమసింహాల్లా లాంటి ప్రత్యర్థుల మధ్య పోటీ జరుగుతున్న వేళ టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటకుండా ఉంటాయా చెప్పండి. ఫైనల్ మ్యాచ్‌కు ముందే టికెట్ల ధరల రూపంలో ఫిఫా రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. ఫిఫా ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి ఒక్క టికెట్ ధర ఏకంగా రూ.27 లక్షలు పలికింది. 96 ఏళ్ల ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర కావడం విశేషం. ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన అత్యున్నత శ్రేణి (హాస్పిటాలిటీ) టికెట్ ధర ఏకంగా రూ. 27 లక్షలు పలుకుతోంది. ఈ ప్రీమియం హాస్పిటాలిటీ ప్యాకేజీలు కేవలం మ్యాచ్ వీక్షణకే పరిమితం కావు. విదేశీ వీఐపీలు, కార్పొరేట్ దిగ్గజాలను ఆకర్షించేలా స్టేడియంలో ప్రత్యేక విలాసవంతమైన లాంజ్‌లు, ఫైన్ డైనింగ్, విభిన్న లగ్జరీ సేవలను ఫిఫా అందిస్తోంది. అయితే, ఇది కేవలం వీఐపీ ప్యాకేజీ ధర మాత్రమేనని, సామాన్య అభిమానుల కోసం అందుబాటులో ఉండే సాధారణ మ్యాచ్ టికెట్ల ధరలు దీనికంటే చాలా తక్కువగా ఉంటాయని నిర్వాహకులు స్పష్టం చేశారు.అమెరికా క్రీడా చరిత్రలో 2024లో జరిగిన ‘సూపర్‌బౌల్’ చాంపియన్‌షిప్‌లో శాన్ ఫ్రాన్సిస్కో 49ఈఆర్ఎస్ వర్సెస్ కాన్సాస్ సిటీ అత్యంత ఖరీదైన మ్యాచ్‌గా నిలిచింది. అప్పట్లో దీని సగటు టికెట్ ధర రూ. 9.6 లక్షలుగా నమోదైంది. ఇప్పుడు ఫిఫా ఫైనల్ టికెట్ ధర ఆ రికార్డును దాదాపు మూడు రెట్లు అధిగమించి సరికొత్త సంచలనం సృష్టించింది. ఇక ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ కనిష్ట ధర 6,943 డాలర్లు (సుమారు రూ.6 లక్షలు)గా ఉంది. యావరేజ్ టికెట్ ధర 11,327 డాలర్లు (సుమారు రూ. 10 లక్షలు)గా ఉంది. అర్జెంటీనా, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ టికెట్ కనిష్ట ధర 7,200 డాలర్లు ( సుమారు రూ. 6.93 లక్షలు)గా ఉంది. సెమీస్‌తో పోలిస్తే ఫైనల్ మ్యాచ్ టికెట్ కనిష్ట ధర 93 వేలు తక్కువగా ఉండడం గమనార్హం. మొత్తం మీద ఈసారి ప్రపంచవ్యాప్తంగానూ ఫిఫా ప్రపంచకప్ వీక్షకుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఎన్నడూ లేనంతగా ఫిఫా చరిత్రలో టీఆర్పీ రేట్లన్నీ బద్దలయ్యాయి.Read: ఫిఫా కీలక నిర్ణయం.. 96 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి! -
ఫిఫా ఫైనల్‌కు రిఫరీగా అతడే.. అర్జెంటీనాకు పీడకల!
అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్‌కు రిఫరీగా స్లోవేనియాకు చెందిన స్లావో విన్సిచ్ ఎంపికయ్యాడు. తాజా నిర్ణయం అర్జెంటీనా అభిమానుల్లో ఆందోళనను రేకెత్తించింది. ఎందుకంటే, విన్సిచ్ గత రిఫరీ అనుభవాలు అర్జెంటీనాకు పీడకలను మిగిల్చింది. విషయంలోకి వెళితే.. 2022 ఖతార్ ప్రపంచ కప్‌లో అర్జెంటీనా, సౌదీ అరేబియా మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్‌కు విన్సిచ్ రిఫరీగా వ్యవహరించారు. ఎనిమిదో నిమిషంలో అర్జెంటీనాకు విన్సిచ్ పెనాల్టీని ఇచ్చ్చాడు. ఆ పెనాల్టీని మెస్సీ గోల్‌గా మలిచాడు. అంతేకాదు విన్సిచ్ సౌదీ ఆటగాళ్లకు ఆరు యెల్లోకార్డులు చూపించాడు. అయితే, రెండో అర్ధభాగంలో అర్జెంటీనా సౌదీ అరేబియా చేతిలో 1-2 తేడాతో అనూహ్య ఓటమిని చవిచూసింది. ఫిఫాలో విన్సిచ్ రిఫరీగా వ్యవహరించిన మ్యాచ్‌ల్లో అర్జెంటీనా ఓటమి చవిచూసిన ఏకైక మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.స్పెయిన్‌తో అనుబంధం..అయితే విన్సిచ్కు స్పెయిన్‌తో మంచి అనుబంధముంది. స్పెయిన్ ఆడిన చాలా మ్యాచ్‌లకు విన్సిచ్ రిఫరీగా వ్యవహరించాడు. 2017లో కొలంబియాతో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌కు, యూరో 2020లో స్వీడన్, స్పెయిన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు, 2023 UEFA నేషన్స్ లీగ్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించాడు. యువ ఆటగాడు లామిన్ యమాల్ జట్టులో స్థిరమైన ఆటగాడిగా మారిన తర్వాత, యూరో 2024లో ఇటలీపై స్పెయిన్ 1-0తో గెలిచిన మ్యాచ్‌తో పాటు, ఫిఫా 2026లో ఫ్రాన్స్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌కు కూడా విన్సిచ్ రిఫరీగా వ్యవహరించాడు.అపఖ్యాతిఇక ప్రస్తుత ఫిఫా ప్రపంచ కప్‌లో మూడు మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించిన విన్సిచ్, మెక్సికో-ఈక్వెడార్ మ్యాచ్‌లో ఈక్వెడార్ ఆటగాడు పియరో హింకాపీకి రెడ్ కార్డ్ చూపించి అపఖ్యాతి పాలయ్యాడు. దీంతో ఆదివారం న్యూయార్క్ వేదికగా అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో విన్సిచ్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా వీఏఆర్ ద్వారా ఫిఫా నిశితంగా పరిశీలించనుంది. -
అర్జెంటీనా ఫ్యాన్స్ దుశ్చర్య.. ఇంగ్లండ్‌కు అవమానం!
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఫైనల్ చేరిన తర్వాత ఆ దేశ అభిమానుల సంబురాలు శ్రుతిమించాయి. ఆట వరకు గెలుపోటములు సహజమైనప్పటికీ అర్జెంటీనా ఫ్యాన్స్ మాత్రం ఇంగ్లండ్ జాతీయ జెండాను కిందపడేసి కాళ్లతో తొక్కి ఓవరాక్షన్‌కు పాల్పడ్డారు. విషయంలోకి వెళితే.. అర్జెంటీనా సెమీస్ గెలిచిన తర్వాత ఆ దేశంలో అభిమానుల సంబురాలు మిన్నంటాయి. అర్జెంటీనా రాజధాని బ్రూనస్ ఎయిర్స్ వీధుల్లోకి భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్.. నృత్యాలు, అరుపులతో చెవుల మోత మోగించారు. ఈ నేపథ్యంలో వేడుకల్లో కొంతమంది అభిమానులు హద్దు మీరారు. ఇంగ్లండ్ జాతీయ జెండాను పోలిన ఒక పప్పెట్‌ను కిందపడేసి, దానిపై ఇంగ్లండ్ జాతీయ జెండాను ఉంచారు. ఇంగ్లండ్ జెండాపై ఉమ్మివేయడంతో పాటు చాలా మంది ఆ జెండాను కాళ్ల కిందేసి తొక్కిన దృశ్యాలు, వీడియోలు బయటికి వచ్చాయి. దీంతో అర్జెంటీనా ఫుట్‌బాల్ అభిమానుల చర్య పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఏర్పడుతోంది. ‘అభిమానం ఉండడం మంచిదే కానీ అది హద్దుమీరకూడదు’ అని కామెంట్లు చేస్తున్నారు. ఫిఫా సెమీస్‌లో విజయం తర్వాత మెస్సీ బృందం సంబరాల్లో తేలిపోగా.. ఇంగ్లండ్ జట్టు తీవ్ర నిరాశలో మునిగిపోయింది. సెలబ్రేషన్స్ సమయంలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ గియోవని లో సెల్సో అత్యుత్సాహం ప్రదర్శించాడు. ‘ఫాక్‌ల్యాండ్స్ అర్జెంటీనా’దే అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించాడు. అతడితో పాటు కెప్టెన్ లియోనల్ మెస్సీ సహా మిగతా ఆటగాళ్లు ఆ బ్యానర్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో అర్జెంటీనా ఆటగాళ్ల చర్య వివాదానికి దారితీసింది.అసలు వివాదం ఏమిటి?అర్జెంటీనా తూర్పు తీర ప్రాంతానికి దాదాపుగా 480 కిలోమీటర్ల దూరంలో ఫాక్లాండ్ దీవులు ఉన్నాయి. ఈ దీవులను 1774లో అప్పటి బ్రిటన్ ప్రభుత్వం తమవిగా చెప్పుకొంది. ఇక 1832లో వీటిని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. అయితే, 1982లో అర్జెంటీనాలోని సైనిక ప్రభుత్వం ఫాక్లాండ్ దీవుల కోసం ఘర్షణకు దిగింది.దీంతో ఇంగ్లండ్- అర్జెంటీనా మధ్య నాడు ఏప్రిల్ నుంచి జూన్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది. అయితే, ఇంగ్లండ్ ధాటికి తాళలేక ఆఖరికి అర్జెంటీనా బలగాలు లొంగిపోవడంతో ఉద్రిక్తతలకు తెరపడింది. ఈ ఘర్షణలో దాదాపు 649 మంది అర్జెంటీనా సైనికులు బలైపోయారు. అదే విధంగా 255 మంది బ్రిటిష్ సైనికులు, ముగ్గురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.మ్యాచ్ విషయానికొస్తే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 తేడాతో ఇంగ్లండ్‌పై విజయాన్ని అందుకొని వరుసగా రెండో ఫిఫాలో ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో స్పెయిన్‌తో అర్జెంటీనా తలపడనుంది. Argentina fans spat on and trampled the England flag under their feet. pic.twitter.com/pfPzzgZkIV— The Resonance (@Partisan_12) July 16, 2026చదవండి: ‘రోహిత్ రిటైర్మెంట్పై కోహ్లి రియాక్షన్ వైరల్!’ -
అపశకునం ముద్ర.. ఫైనల్‌కు దూరంగా అర్జెంటీనా అధ్యక్షుడు!
ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ ఆదివారం అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరగనుంది. ఏ టోర్నీలో అయినా తమ దేశం ఫైనల్ మ్యాచ్ ఆడుతుంటే సదరు దేశాధ్యక్షుడు లైవ్‌లో చూడాలని ఆశించడం సహజం. కానీ అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తున్నారు. మూడ నమ్మకాల నెపంతో అర్జెంటీనా ఆడనున్న ఫిఫా పైనల్ మ్యాచ్‌ను లైవ్‌లో కాకుండా ఇంట్లోనే టీవీలో వీక్షించాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఒక అర్జెంటీనా అధ్యక్షుడు లైవ్‌లో ఫిఫా మ్యాచ్ చూడడం వల్ల అర్జెంటీనా ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో సదరు అధ్యక్షుడిపై ‘అపశకునం’ ముద్ర వేశారు. దీంతో ఆ సెంటిమెంట్‌కు భయపడి తాజా ఫిఫా ఫైనల్‌కు జావియర్ మిలే దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ఇక ఫిఫా ఫైనల్‌కు జావియర్ మిలే దూరమవ్వడం వెనుక మరో బలమైన కారణం కూడా ఉంది. మూడనమ్మకమా లేదా సెంటిమెంట్.. ఇలా ఏది అనుకున్నా తాను మాత్రం ఫైనల్ మ్యాచ్‌ను మాత్రం టీవీలోనే వీక్షిస్తానని అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే అధికారులకు తెగేసి చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది. మెస్సీకి వీరాభిమాని అయిన అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా ఆడిన ఏడు మ్యాచ్‌లను తన ఇంటిలోనే వీక్షించారు. ఈ ఏడింటిలో ఒక్క ఓటమి, డ్రా కానీ చేసుకోని అర్జెంటీనా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో వరుసగా రెండోసారి ఫిఫా ఫైనల్లో అడుగుపెట్టింది. మరో విశేషమేమిటంటే జావియర్ మిలే తన హెవి జాకెట్‌ను ధరించి ఈ మ్యాచ్‌లన్నింటిని వీక్షించారట. కాబట్టి ఫైనల్ మ్యాచ్‌కు కూడా అదే హెవీ జాకెట్‌ను ధరించనున్నట్లు అర్జెంటీనా అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్‌లో మూడ నమ్మకాలు కొత్తవేమి కావు. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ సందర్భంగా అర్జెంటీనా అభిమానులు మూడ నమ్మకాల పేరిట కాబాలస్ (ప్రీజర్‌లో ప్రత్యర్థి ఆటగాళ్ల ఫొటోలు ఉంచడం) సహా చాలా మంది అభిమానులు అర్జెంటీనా గెలవాలంటూ తాము నమ్మే దైవాన్ని ప్రార్థించడం వైరల్‌గా మారింది.తాజాగా ఒక దేశాధ్యక్షుడే ఇవాళ మూడ నమ్మకం పేరుతో ఫైనల్ మ్యాచ్‌ను లైవ్‌లో కాకుండా ఇంట్లోనే చూస్తానని చెప్పడం ఆసక్తికర విషయంగా మారిపోయింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడు కావడంతో జావియర్ మిలేకు ఫైనల్ మ్యాచ్‌కు ప్రత్యేక ఆహ్వానం కూడా వచ్చింది. 'మీ స్నేహితుడు ట్రంప్, ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినోలతో కలిసి ఆదివారం ఫిఫా పైనల్ చూసేందుకు న్యూజెర్సీ వెళ్తున్నారా' అని అడిగితే.. 'లేదు అస్సుల వెళ్లను.. ఒలివోస్లోని నా ఇంటి నుంచే ఫైనల్ మ్యాచ్ వీక్షిస్తాను' అని అర్జెంటీనా అధ్యక్షుడు బదులివ్వడం విశేషం.అధ్యక్షుడిపై అపశకునం ముద్రతమ జట్లకు దురదృష్టం వెంటాడుతుందేమోనని అర్జెంటీనా అధ్యక్షులు చాలా కాలంగా కీలకమైన ప్రపంచకప్ మ్యాచ్‌లకు హాజరయ్యే విషయంలో జాగ్రత్త వహిస్తూ వస్తున్నారు. ఈ మూఢనమ్మకం 1990 టోర్నమెంట్ నాటిది. అప్పుడు అర్జెంటీనా అధ్యక్షుడిగా ఉన్న కార్లోస్ మెనెమ్.. ఆనాటి ప్రపంచకప్‌లో కామెరూన్, అర్జెంటీనా మ్యాచ్‌కు హాజరయ్యారు. అయితే ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా జట్టు కామెరున్ జట్టుతో పోరులో అనూహ్యంగా ఓటమి చవిచూసింది. దీంతో అధ్యక్షుడు మెనెమ్పై “ముఫా (అపశకునం) అని ముద్ర వేశారు. అప్పటి నుంచి ఫిఫా ప్రపంచకప్ ఎక్కడ జరిగినప్పటికీ ఏ అర్జెంటీనా అధ్యక్షుడు కూడా జాతీయ జట్టు మ్యాచ్‌కు హాజరుకాకపోవడం విశేషం.చదవండి: అర్జెంటీనాతో ఫైనల్.. స్పెయిన్‌ను వణికిస్తున్న గాయం! -
అర్జెంటీనాతో ఫైనల్.. స్పెయిన్‌ను వణికిస్తున్న గాయం!
ఫిఫా ప్రపంచకప్ 2026 చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో స్పెయిన్ అమీతుమీకి సిద్ధమైంది. అయితే 16 ఏళ్ల తర్వాత ఫిఫా ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలని కలలు కంటున్న స్పెయిన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు లామినె యమాల్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. స్పెయిన్ ప్రాక్టీస్ సమయంలో లామినె తొడకు పెద్ద కట్టు వేసుకున్న ఫొటోలు బయటికి వచ్చాయి. తొడ నొప్పితో బాధపడుతున్న యమాల్‌కు ఫిజియో చికిత్స చేస్తున్న వీడియో బయటికి వచ్చింది. నొప్పితో బాధపడిన యామినే లమాల్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉండిపోయాడు. ఫ్రాన్స్‌తో జరిగిన సెమీస్‌లో ఆట 22వ నిమిషంలో లుకాస్ డిగ్నే పెనాల్టీ బాక్స్ వద్ద లామినె యమాల్‌ను కిందపడేయడంతో అతని ఎడమ తొడకు తీవ్ర గాయమైంది. అయితే నొప్పిని భరిస్తూనే యమాల్ మ్యాచ్ మొత్తం కొనసాగాడు. స్పెయిన్ విజయం తర్వాత హోటల్ రూమ్‌కు చేరిన అనంతరం లామినె తొడనొప్పి మరింత తీవ్రతరమైనట్లు సమాచారం.దీంతో స్పెయిన్ జట్టు బస చేస్తున్న డల్లాస్‌లోని హోటల్‌కే వైద్య సిబ్బందిని పిలిపించి లమాల్కు చికిత్స అందించారు. ఈ నేపథ్యంలోనే అతడి ఎడమ తొడకు భారీ కట్టు కట్టినట్లు తెలుస్తోంది. తొడ గాయంతో ప్రాక్టీస్‌కు దూరంగా ఉండిపోయిన లామినె యమాల్ అర్జెంటీనాతో ఫైనల్ మ్యాచ్ ఆడుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. 19 ఏళ్ల లామినె యమాల్ స్పెయిన్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ మాత్రమే చేసినప్పటికీ జట్టుపై అతడి ప్రభావం చాలానే ఉంటుంది. 🚨 BREAKING: Lamine Yamal is not training with Spain due to discomfort. pic.twitter.com/jv8d9OsnIr— barcacentre (@barcacentre) July 16, 2026Read: టీ20లపై మోజు.. వన్డేలు ఆడడం మరిచిన విండీస్! -
ఫిఫా ఫైనల్లో స్పెయిన్.. ఆ జట్టును మాత్రం ఓడించలేకపోయింది!
ఫిఫా ప్రపంచకప్ 2026లో స్పెయిన్ జట్టు 16 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్ దశ నుంచి సెమీస్ దాకా తాను తలపడిన అన్ని జట్లను చిత్తు చేసిన స్పెయిన్ కేప్వెర్డెను మాత్రం ఓడించకలేకపోయింది. గ్రూప్ దశలో కేప్‌వెర్డెతో మ్యాచ్‌ను స్పెయిన్ 0-0తో డ్రా చేసుకోవడం గమనార్హం. దీంతో అనామక జట్టుగా ఫిఫాలో ఎంట్రీ ఇచ్చిన కేప్‌వెర్డె టోర్నీ నుంచి నిష్క్రమించే సమయంలో హీరోలా మారిపోయింది. తన గోల్ కీపింగ్ నైపుణ్యంతో వోజిన్హా స్పెయిన్‌ను నిలువరించడంలో కీలకపాత్ర పోషించాడు. స్పెయిన్ ఆటగాళ్లు 27 సార్లు గోల్‌పోస్టుపై దాడులు చేసినప్పటికీ వాటన్నింటిని సమర్థంగా అడ్డుకొని 40 ఏళ్ల వయసులో వోజిన్హా సూపర్‌హీరోగా నిలిచాడు.Photo Credit: FIFA Twitterతాజాగా సెమీస్‌లో ఫ్రాన్స్‌పై గెలిచిన తర్వాత స్పెయిన్ ఫుట్‌బాల్ టీం ఒక కామెంట్ చేసింది. ‘ఈ ఫిఫాలో మేము అందరిని నిలువరిస్తే.. మమ్నల్ని మాత్రం కేప్‌వెర్డె నిలువరించింది. ఫ్రాన్స్‌తో సెమీస్ మ్యాచ్ కంటే కేప్‌వెర్డెతో మ్యాచ్ మాకు చాలా కష్టమనిపించింది’ అని పేర్కొనడం ఆసక్తి కలిగించింది. తాజాగా స్పెయిన్ టీం చేసిన వ్యాఖ్యలతో కేప్‌వెర్డె మరోసారి వార్తల్లో నిలిచింది.స్పెయిన్ ప్రయాణం సాగింది ఇలా..ఫిఫా ప్రపంచకప్‌లో లీగ్ దశలో గ్రూప్-హెచ్లో స్పెయిన్ తొలి మ్యాచ్‌ను కేప్‌వెర్డెతో డ్రా చేసుకుంది. ఆ తర్వాత సౌదీ అరేబియాను 4-0తో చిత్తు చేసింది. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో ఉరుగ్వేను 0-1తో ఓడించిన స్పెయిన్ టేబుల్ టాపర్‌గా రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించింది. రెండో రౌండ్లో ఆస్ట్రియాను 0-3తో ఓడించి స్పెయిన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో పోర్చుగల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి వరకు గోల్ చేయడంలో స్పెయిన్ విఫలమైంది. అయితే సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మైకెల్ మిరినో స్టాపేజీ టైం (91వ నిమిషం)లో గోల్ చేసి పోర్చుగల్‌కు పీడకలను మిగిల్చాడు. పోర్చుగల్‌పై 1-0తో విజయం సాధించిన స్పెయిన్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇక క్వార్టర్స్‌లో స్పెయిన్ బెల్జియంతో తలపడింది. తొలి హాఫ్ ముగిసేసరికి 1-1తో సమంగా నిలిచాయి. అయితే రెండో హాఫ్‌లో బెల్జియం గోల్‌కీపర్ సన్నె లామిన్స్ చేసిన చిన్ప తప్పిదం బెల్జియం కొంపముంచింది. స్పెయిన్ ఆటగాడు కుబార్సి కొట్టిన బంతిని ఆపే ప్రయత్నంలో లామిన్స్ మిస్ చేయడం, ఇదే అదనుగా భావించిన మికెల్ మెరినో బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి తరలించి మరోసారి హీరోగా నిలిచాడు. ఫలితంగా స్పెయిన్ సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత జరిగిదంతా ఒక చరిత్రే. మంగళవారం అర్ధరాత్రి జరిగిన సెమీఫైనల్లో స్పెయిన్ 2-0 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించి తుది పోరుకు అర్హత సాధించింది. 🚨FACT: Cape Verde are the only team Spain faced at the 2026 World Cup that they DIDN’T beat pic.twitter.com/51p0mFj8ip— Polymarket Sports (@PolymarketSport) July 14, 2026Read: బుమ్రా గురించి ప్రశ్న... ఇంగ్లండ్ కెప్టెన్ అసహనం! -
ఫిఫా వీఏఆర్పై ప్రపంచవ్యాప్త నిరసనలు.. ఆ దేశంలో మాత్రం!
2026 ఫిఫా వరల్డ్‌కప్‌లో వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) నిర్ణయాలు వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నాయి. టెక్నాలజీ వినియోగంలో ఏకపక్ష నిర్ణయాలు, ఫౌల్స్ విషయంలో కొత్త నిబంధనలు, గోల్స్‌ను రద్దు చేయడంపై జట్ల ఆటగాళ్లు, కోచ్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్‌ల ఫలితాలను మార్చేస్తున్న వీఏఆర్ వివాదం ఫిఫాలో పెద్ద రచ్చగా మారిపోయింది. ‘#Good Bye VAR’ అనేది ఇప్పుడు ట్రెండింగ్‌గా మారిపోయింది.ఫిఫా ప్రవేశపెట్టిన వీఏఆర్‌ను చాలా దేశాలు వ్యతిరేకించడంతో పాటు దానిని బ్యాన్ చేయాలని కోరుతున్నాయి. కానీ స్వీడన్ ఇదే వీఏఆర్‌ను టెక్నాలజీని ఐదేళ్ల క్రితమే బ్యాన్ చేసిందన్న విషయం మీకు తెలుసా. కోవిడ్ సమయంలో స్వీడన్లో దేశీయంగా చాలా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లో వీఏఆర్ టెక్నాలజీని వాడారు. కానీ దీనిపై అప్పట్లో ఆటగాళ్లు సహా అభిమానులు తిరుగుబాటు చేశారు. దీంతో వీఏఆర్‌ను బ్యాన్ చేయాలని ఆ దేశ ఫుట్‌బాల్ అసోసియేషన్ అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేసింది.Photo Credit: FIFA Twitterఇప్పటికీ స్వీడన్లో సంప్రదాయ అంపైరింగ్కే అక్కడి ఫుట్‌బాల్ లీగ్‌లు కట్టుబడి ఉన్నాయి. అయితే ఇవాళ ఫిఫాలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వీఏఆర్ వల్ల మేలు జరగకపోగా కీడే ఎక్కువ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఈ వీఏఆర్ టెక్నాలజీ అర్జెంటీనాకు వరంలా మారిపోయిందని, రిఫరీలు కూడా అర్జెంటీనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు పెరిగిపోయాయి.ప్రపంచకప్‌లో ముఖ్యంగా అర్జెంటీనా–ఈజిప్ట్, స్విట్జర్లాండ్–అర్జెంటీనా వంటి మ్యాచ్‌ల్లో VAR జోక్యంతో తీసుకున్న నిర్ణయాలు పెద్ద వివాదంగా మారాయి. ఈజిప్ట్‌కు లభించిన గోల్‌ను రద్దు చేయడం, పెనాల్టీపై వచ్చిన వివాదం, స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలోకు సిమ్యులేషన్ పేరుతో ఎర్రకార్డు చూపించడం వంటి ఘటనలు అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం రేపాయి. సోషల్ మీడియాలో అర్జెంటీనాను వ్యంగ్యంగా "VARgentina" అని పిలుస్తూ విమర్శలు వెల్లువెత్తాయి.వీఏఆర్ వివాదాలకు కారణాలు:👉నిబంధనల మార్పు: ఈ టోర్నీలో ఫౌల్స్, డైవింగ్ (తప్పుడు ప్రయత్నాలు) వంటి వాటిపై వీఏఆర్ కఠినంగా వ్యవహరిస్తోంది. స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలో డైవింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారించి, అతనికి రెడ్ కార్డ్ ఇవ్వడం వివాదానికి దారి తీసింది. ఇది ఎంతదాకా వెళ్లిందంటే అర్జెంటీనా కోసమే ఫిఫాను నిర్వహిస్తే సరిపోతుందని.. కప్‌ను అర్జెంటీనాకే ఇచ్చేయాలని మైదానంలోని బహిరంగ నిరసనకు దిగడం చర్చనీయాంశమైంది.👉గోల్స్ రద్దు: మైదానంలో ఆటగాళ్లు కష్టపడి చేస్తున్న గోల్స్‌ను రిఫరీలు వీఏఆర్ స్క్రీనింగ్ ద్వారా (బాల్ సెన్సార్ టచ్) పేరుతో రద్దు చేయడం అభిమానులను నిరాశపరిచింది.👉ఆటకు ఆటంకం: టెక్నాలజీ జోక్యం వల్ల ఆట సమయం వృథా అవుతోందని కొందరు, సరైన నిర్ణయాలు రావడం వల్ల వీఏఆర్ వల్ల ఉపయోగం ఎవరికి ఉంటుందనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.Photo Credit: FIFA Twitterఫిఫా ఏమందంటే?వీఏఆర్ నిర్ణయాలపై ఫిర్యాదులు పెరిగిపోవడంతో ఫిఫా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. గతంలో వీఏఆర్ నిర్ణయాలు రిమోట్ కంట్రోల్ (అంతర్జాతీయ బ్రాడ్‌కాస్టింగ్ కేంద్రం) ద్వారా జరిగేవి. కానీ వీఏఆర్పై రచ్చ పెరిగిపోవడంతో, క్వార్టర్ ఫైనల్స్ నుంచి స్టేడియంలోనే ప్రత్యేకంగా వీఏఆర్ అధికారులను (VAR Team) ఫిఫా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినా కూడా వీఏఆర్ వివాదాలకు మాత్రం తెరపడడం లేదు.చదవండి: ఎంబాపె అయిపోయాడు.. ఇప్పుడిక మెస్సీ వంతు! -
ఓం భీమ్ బుష్.. 'కబాలాస్'ను నమ్ముకున్న అర్జెంటీనా ఫ్యాన్స్
ఫుట్‌బాల్ అంటే కేవలం ఆట కాదు.. కోట్లాది మంది అభిమానుల భావోద్వేగం. మైదానంలో ఆటగాళ్ల ప్రతిభ, వ్యూహాలు, ఫిట్నెస్ ఎంత ముఖ్యమో.. కొంతమంది అభిమానుల నమ్మకాల్లో అదృష్టం కూడా అంతే కీలకం. ఇప్పుడు ఫిఫా ప్రపంచకప్-2026 సెమీఫైనల్ ముందు అర్జెంటీనా అభిమానులు తమ జట్టు విజయం కోసం ఆసక్తికరమైన ‘కబాలాస్’ను ఆశ్రయిస్తున్నారు.ఇంగ్లండ్‌తో కీలక పోరుకు ముందు.. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు హ్యారీ కేన్, జూడ్ బెల్లింగ్‌హామ్ పేర్లను కాగితాలపై రాసి ఫ్రీజర్‌లో పెట్టడం అర్జెంటీనాలో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థి ఆటగాళ్లు చల్లబడిపోవాలని, మైదానంలో తమ ప్రభావం చూపలేకపోవాలని ఇలా చేస్తున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. కొందరు అభిమానులు ఏఐ సాయంతో ఇంగ్లండ్ ఆటగాళ్లను మంచులో బంధించినట్లుగా చిత్రాలు రూపొందించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.అసలు ‘కబాలాస్’ అంటే ఏమిటి?అర్జెంటీనా ఫుట్‌బాల్ సంస్కృతిలో ‘కబాలాస్ (Cábalas)’ అనేది చాలా కాలంగా కొనసాగుతున్న నమ్మకం. జట్టు గెలవాలంటే ఒకే టీ-షర్ట్ ధరించడం, మ్యాచ్ చూస్తున్నప్పుడు ఎప్పుడూ ఒకే చోట కూర్చోవడం, ఒకే ఆహారం తినడం వంటి అలవాట్లను అభిమానులు అదృష్ట సూచికలుగా భావిస్తారు. కొంతమంది అభిమానుల నమ్మకం ప్రకారం.. ఒకసారి చేసిన పని జట్టుకు విజయం తెచ్చిపెడితే, తదుపరి మ్యాచ్‌ల్లో కూడా అదే విధానాన్ని కొనసాగిస్తే అదృష్టం కలిసి వస్తుందట. శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా.. అర్జెంటీనా ఫుట్‌బాల్‌లో ఈ సంప్రదాయం భావోద్వేగంగా కొనసాగుతోంది.Photo Credit: FIFA Twitterకేన్, బెల్లింగ్హామ్లకు ‘ఫ్రీజర్ ట్రీట్మెంట్’ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ పోరు కావడంతో ఈసారి అర్జెంటీనా అభిమానుల కబాలాస్ మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రత్యర్థి జట్టు కీలక ఆటగాళ్లను "ఐస్‌లో పెట్టడం" ద్వారా వారి ఆటను నిలువరించవచ్చని కొందరు నమ్ముతున్నారు. హ్యారీ కేన్ ఇంగ్లండ్ ప్రధాన గోల్ ఆయుధం కాగా.. జూడ్ బెల్లింగ్‌హామ్ మిడ్‌ఫీల్డ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అందుకే వీరిద్దరినీ టార్గెట్‌గా చేసుకుని అభిమానులు ఈ ప్రతీకాత్మక చర్యలకు దిగారు.కోచ్‌లకూ ఉన్న నమ్మకాలుఅర్జెంటీనా ఫుట్‌బాల్‌లో ఇలాంటి నమ్మకాలు అభిమానులకే పరిమితం కాదు. మాజీ కోచ్ Carlos Bilardo కూడా ప్రత్యేక అలవాట్లు, నమ్మకాలతో ప్రసిద్ధి చెందారు. ప్రస్తుత కోచ్ Lionel Scaloni కూడా కొన్ని వ్యక్తిగత అలవాట్లను పాటిస్తారని చెబుతారు. మైదానంలోకి అడుగుపెట్టే విధానం, మ్యాచ్‌కు ముందు చేసే కొన్ని ఆచారాలు ఆయనకు అదృష్టాన్ని తెస్తాయని అభిమానులు భావిస్తుంటారు.అర్జెంటీనా-ఇంగ్లండ్.. ఆ మాత్రం ఉంటదిఅర్జెంటీనా-ఇంగ్లండ్ మ్యాచ్ అంటే కేవలం ఫుట్‌బాల్ పోటీ కాదు.. దానికి చరిత్ర, భావోద్వేగాలు కూడా జతకట్టాయి. 1986 ప్రపంచకప్‌లో Diego Maradona చేసిన ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ నుంచి ఈ రెండు దేశాల మధ్య పోటీ మరింత ప్రత్యేకంగా మారింది. ప్రపంచకప్ వేదికపై ఈ రెండు జట్లు ఎదురుపడితే అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరుగుతుంది. ఈసారి కూడా సెమీఫైనల్‌కు ముందు అర్జెంటీనా అభిమానులు తమ కబాలాస్పై నమ్మకం పెట్టుకున్నారు.మైదానంలో విజయం మాత్రం ఆటగాళ్ల ప్రదర్శన, వ్యూహాలపైనే ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ.. ఫుట్‌బాల్‌లో అభిమానుల విశ్వాసాలు, సంప్రదాయాలు, భావోద్వేగాలు ఎంత లోతుగా పాతుకుపోయాయో అర్జెంటీనా ఫ్యాన్స్ ‘ఫ్రీజర్ కబాలా’ మరోసారి చూపించింది.Concuerdo, las cábalas NO se comparten.En lo personal, yo soy bien supersticioso en el deporte y tengo un buen.¿Ustedes tienen? https://t.co/DLQ6MvhLBt— Iván Jacob (@ivanjacobvg) July 15, 2026 -
ఫిఫా చరిత్రలో తొలిసారి.. సెంటిమెంట్‌తో బరిలోకి అర్జెంటీనా!
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా, ఇంగ్లండ్ మధ్య జూన్ 16న అట్లాంటా వేదికగా రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. అయితే ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో అర్జెంటీనా ప్రత్యేక జెర్సీ కిట్‌తో బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేవీ బ్లూ జెర్సీతోనే అర్జెంటీనా ఫిఫా చరిత్రలో రెండు అద్భుతాలకు నాంది పలికిందిఇంగ్లండ్పై మానసికంగా పైచేయి సాధించాలనే ఉద్దేశంతో సెమీస్ రోజున అర్జెంటీనా ఆటగాళ్లు నేవీ బ్లూ జెర్సీని ధరించనున్నారు.దీనికి సంబంధించి ఇప్పటికే అర్జెంటీనా ఫిఫా నుంచి అనుమతి కూడా పొందింది. ప్రతీ ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఒక మ్యాచ్‌ను నేవీ బ్లూ జెర్సీతో ఆడడం ఆనవాయితీగా చేసుకుంది. ఈ ఫిఫాలో ఇప్పటికే జోర్డాన్‌తో మ్యాచ్‌లో అర్జెంటీనా ఆటగాళ్లు నేవీ బ్లూ జెర్సీతో బరిలోకి దిగారు. Photo Credit: FIFA Twitterఇంగ్లండ్‌తో సెమీస్ సందర్భంగా తమకు రెండోసారి నేవీ బ్లూ జెర్సీ ధరించే అవకాశం ఇవ్వాలని అర్జెంటీనా ఫిఫాను అభ్యర్థించింది. తాజాగా ఫిఫా నుంచి అనుమతి రావడంతో అర్జెంటీనా నేవీ బ్లూ జెర్సీకి లైన్ క్లియర్ అయింది. సెమీస్‌లో అర్జెంటీనా ఆటగాళ్లు నేవీ బ్లూ జెర్సీ, నల్లరంగు షార్ట్‌ను ధరించనుండగా.. ఇంగ్లండ్ వైట్ అండ్ వైట్‌లో బరిలోకి దిగనుంది.జెర్సీ వెనుక పెద్ద కథే..అర్జెంటీనా ప్రతి ఫిఫాలో నేవీ బ్లూ జెర్సీతో ఒక మ్యాచ్ ఆడడం వెనుక పెద్ద కథే దాగుంది. 1986 ఫిఫా ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా, ఇంగ్లండ్ తలపడ్డాయి. అప్పట్లో ఇద్దరి జెర్సీ రంగు దాదాపు ఒకే విధంగా ఉండడంతో జట్ల మధ్య తేడా ఉండాలని అర్జెంటీనా నేవీ బ్లూ కలర్ జెర్సీతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-1 తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. మెక్సికో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లోనే మారడోనా 'హ్యాండ్ ఆఫ్ గాడ్' తో పాటు 'గోల్ ఆఫ్ ది సెంచరీ' నమోదు చేశాడు.Photo Credit: FIFA Twitterఆ మ్యాచ్‌కు గుర్తుగా తాజా ఫిఫాలో సెమీస్‌లో మరోసారి ఇంగ్లండ్‌తో తలపడుతున్న వేళ అర్జెంటీనా నేవీ బ్లూ జెర్సీతో ఆడాలని నిర్ణయించుకుంది. ఇది మానసికంగా ఇంగ్లండ్‌పై తమకు విజయం సాధించినట్లవుతుందని అర్జెంటీనా అభిప్రాయపడుతుంది. 1986 ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో రెండుసార్లు అర్జెంటీనా, ఇంగ్లండ్‌లు తలపడ్డాయి. ఈ రెండుసార్లు కూడా అర్జెంటీనా నేవీ బ్లూ జెర్సీతోనే బరిలోకి దిగడం విశేషం. 1998 ఫిఫాలో పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా 4-3తో ఇంగ్లండ్‌పై విజయాన్ని అందుకుంది. ఇక 2002 ఫిఫాలో డేవిడ్ బెక్‌హమ్ మెరుపులతో ఇంగ్లండ్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇరుజట్లు నాకౌట్ మ్యాచ్‌లో తలపడనుండడంతో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిగా మారింది.Photo Credit: FIFA Twitterహ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్'హ్యాండ్ ఆఫ్ గాడ్' అనేది 1986 ఫిఫా ప్రపంచ కప్ క్వార్టర్-ఫైనల్లో అర్జెంటీనా ఆటగాడు డియెగో మారడోనా ఇంగ్లాండ్‌పై చేసిన వివాదాస్పద గోల్. అతను ఇంగ్లాండ్ గోల్ కీపర్ కంటే ఎత్తున ఎగిరి, బంతిని తన ఎడమ చేతితో గోల్ పోస్ట్‌లోకి నెట్టాడు. రిఫరీలు దీన్ని గమనించకపోవడంతో గోల్ చెల్లుబాటయింది. ఆ తర్వాత మారడోనా కొట్టిన గోల్‌ను హ్యాండ్ ఆఫ్ గాడ్‌గా అభివర్ణించారు.Photo Credit: FIFA Twitterగోల్ ఆఫ్ ది సెంచరీఫుట్బాల్ చరిత్రలో అత్యుత్తమమైన గోల్‌గా పేరొందిన "గోల్ ఆఫ్ ది సెంచరీ"ని 1986 జూన్ 22న అర్జెంటీనా ఆటగాడు డిగో మారడోనా సాధించాడు. మెక్సికోలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, మారడోనా దాదాపు 60 మీటర్ల దూరం నుంచి ఐదుగురు ఇంగ్లాండ్ ఆటగాళ్లను దాటుకుంటూ వెళ్లి ఈ అద్భుతమైన గోల్ చేయడం చరిత్రలో నిలిచిపోయింది. అందుకే దీనిని గోల్ ఆఫ్ ది సెంచరీగా అభివర్ణించారు.చదవండి: చెన్నై వేదికగా తొలి మ్యాచ్.. బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల -
ఫిఫా టీమ్ నుంచి తొలగింపు.. రిఫరీ అనుమానాస్పద మృతి!
ప్రపంచం మొత్తం ఫిఫా ప్రపంచకప్ మాయలో పడిపోయిన వేళ ఒక ఊహించని సంఘటన చోటుచేసుకుంది. నెదర్లాండ్స్ రిఫరీ రాబ్ డిపెరింక్ (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిజానికి 2026 ఫిఫా ప్రపంచకప్ టీమ్‌లో రాబ్ డిపెరింక్ సభ్యుడిగా ఉండాల్సింది. వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) టీమ్‌లో రాబ్ విధులు నిర్వర్తించాల్సింది. కానీ అతడిపై లైంగిక ఆరోపణలు రావడంతో ఫిఫా టీమ్ నుంచి తప్పించారు. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో కేసును క్లోజ్ చేసినప్పటికీ, తాజాగా డచ్ రిఫరీ మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. తనపై అకారణంగా ఆరోపణలు చేశారనే కారణంతో ఆత్యహత్మకు పాల్పడ్డాడా లేక వేరే ఏదైనా కారణం ఉందా అనేది పోలీసులు విచారిస్తున్నారు. ఇక రాబ్ డిపెరింక్ మృతి విషయాన్ని డచ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధికారికంగా ధ్రువీకరించింది. 2017 నుంచి రాబ్ డిపెరింక్ నెదర్లాండ్స్ రిఫరీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2024 యూరో చాంపియన్‌షిప్‌లో రాబ్ వీఏఆర్ బృందంలో పనిచేశాడు. ఈ నేపథ్యంలోనే 2026 ఫిఫా ప్రపంచకప్ రోస్టర్‌లో వీఏఆర్ టీమ్‌లో రిఫరీగా పేరును చేర్చడం జరిగింది. ఈలోగా అతడిపై లైంగిక ఆరోపణలు రావడంతో లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు రాబ్ డిపెరింక్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాబ్‌ను ఫిఫా టీమ్ నుంచి తొలగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తనపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలని, అకారణంగా తనను అరెస్టు చేశారని, ఫలితంగా ఫిఫా 2026లో వీఏఆర్ టీమ్‌లో రిఫరీగా విధులు నిర్వర్తించే సువర్ణావకాశాన్ని కోల్పోయినట్లు తన గోడును వెల్లబోసుకున్నాడు.చదవండి: ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య తొలి సెమీస్.. ఫైనల్ చేరేదెవరు? -
ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య తొలి సెమీస్.. ఫైనల్ చేరేదెవరు?
ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. 16 ఏళ్ల తర్వాత ఫిఫాలో ఫైనల్ చేరాలని స్పెయిన్ భావిస్తుంటే.. మరోవైపు వరుసగా మూడో ఫిఫాలోనూ ఫైనల్ చేరాలనే పట్టుదలతో ఫ్రాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదనిపిస్తోంది. భారత కాలమాన ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గతంలో జర్మనీ (1982, 1986, 1990), బ్రెజిల్ (1994, 1998, 2002) జట్ల తర్వాత వరుసగా మూడు ప్రపంచకప్ టోర్నీల్లో ఫైనల్ చేరాయి. తాజాగా వరుసగా మూడోసారి ఫిఫా ఫైనల్ చేరడం ద్వారా మూడో జట్టుగా గుర్తింపు పొందాలని ఫ్రాన్స్ ఉబలాటపడుతోంది. టైటిల్ ఫేవరెట్‌గా అడుగుపెట్టిన ఫ్రాన్స్ అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ అజేయంగా సెమీఫైనల్‌కు దూసుకొచ్చింది.కెప్టెన్ ఎంబాపె (8 గోల్స్), డెంబెలె (5 గోల్స్), బార్కోలా (2 గోల్స్), డిజైర్ డుయి (1 గోల్) అద్భుత ఆటతీరుకు ప్రత్యర్థి జట్లు ఓటమివైపు నిలవాల్సి వస్తోంది. మరోవైపు స్పెయిన్ కూడా ఓటమి లేకుండానే సెమీఫైనల్‌కు చేరుకుంది. ఫ్రాన్స్ మాదిరిగానే స్పెయిన్ ఏ ఒకరిద్దరి ఆటతీరుపైనే ఆధార పడటం లేదు. మికెల్ ఒయర్జబాల్ (4 గోల్స్), మికెల్ మెరీనో (2 గోల్స్), బయేనా (1 గోల్), రూయిజ్ (1 గోల్), పెడ్రో (1 గోల్), లమీన్ యమాల్ (1 గోల్) సమష్టి ప్రదర్శనతో స్పెయిన్ అనూహ్యంగా టైటిల్ రేసులోకి వచ్చింది. Photo Credit: FIFA Twitterముఖాముఖి పోరులో ఫ్రాన్స్‌పై స్పెయిన్‌దే పైచేయిగా ఉంది. రెండు జట్లు ఇప్పటి వరకు 38 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 18 మ్యాచ్‌ల్లో స్పెయిన్, 13 మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ గెలిచాయి. ఏడు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రపంచకప్‌లో మాత్రం ఫ్రాన్స్, స్పెయిన్ ఒక్కసారే ప్రత్యర్థులుగా నిలిచాయి. 2006 ప్రపంచకప్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 3–1తో స్పెయిన్‌ను ఓడించింది. చదవండి: సీఎస్కే హెడ్‌కోచ్ పదవి.. రేసులో ఊహించని పేర్లు! -
సెమీస్ సమరం.. ఎవరి బలమెంత?
ఫిఫా ప్రపంచకప్‌లో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. ఈసారి గ్రూప్ దశలో 48 జట్లు పాల్గొన్నాయి. రౌండ్ ఆఫ్ 32, ప్రిక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్‌లో వడపోత తర్వాత నాలుగు జట్లు మిగిలాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అర్జెంటీనా దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టగా, 2022 ఫిఫా రన్నరప్ ఫ్రాన్స్ కూడా వరుసగా మూడోసారి (2018, 2022, 2026) సెమీస్‌కు దూసుకొచ్చింది. ఇక 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ (2010 విజేత) సెమీస్‌లో అడుగుపెడితే, అటు మాజీ చాంపియన్ ఇంగ్లండ్ కూడా తన దూకుడైన ఆటతీరుతో సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇప్పటిదాకా తమకు ఎదురైన ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ వచ్చిన ఈ నాలుగు జట్లు నువ్వా నేనా అన్న రీతిలో సెమీస్‌లో తలపడనున్నాయి. గత ఫిఫా ప్రపంచకప్ లాగే ఈసారి ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ పోరును చూస్తామా లేక స్పెయిన్, ఇంగ్లండ్ ఆట చూస్తామా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో సెమీస్‌లో ఎవరితో ఎవరు తలపడనున్నారనేది ఒకసారి పరిశీలిద్దాం. ఒస్మోన్ డెంబ్లీ, ఫ్రాన్స్ (Phot Credit: FIFA Twitter)జట్ల బలాబలాలు👉ఫ్రాన్స్ తరఫున ఎంబాపె అన్నీ తానై జట్టును నడిపిస్తున్నాడు. ఈసారి ఫిఫాలో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 8 గోల్స్, మూడు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఎంబాపె తర్వాత ఒస్మోన్ డెంబ్లీ కూడా ఫ్రాన్స్‌కు బలమైన ఆటగాడు. ఫార్వార్డ్ ప్లేయర్ అయిన డెంబ్లీ ఆరు మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్, రెండు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో ఉన్నాడు.👉ఇక స్పెయిన్ తరఫున కెప్టెన్ రొడ్రితో పాటు యామినే లమాల్ కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. వీరిద్దరితో పాటు మైకెల్ ఒయర్జబాల్ (ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు గోల్స్), గోల్ కీపర్ ఉనైయి సిమోన్లు కూడా తమదైన ఆటతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.మైకెల్ ఒయర్జబాల్, స్పెయిన్ (Phot Credit: FIFA Twitter)👉ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ హ్యారీకేన్ ఈసారి ఎలాగైనా ఫిఫా ప్రపంచకప్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తరఫున ఈసారి ఫిఫాలో ఆరు మ్యాచ్‌ల్లో ఆరు గోల్స్‌తో పాటు ఒక అసిస్ట్ చేసి ఆ జట్టు తరఫున గోల్డెన్ బూట్ రేసులో ఉన్నాడు. హ్యారికేన్కు తోడుగా జూడ్ బెల్లింగ్హమ్ కూడా కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. బెల్లింగ్హమ్ కూడా ఆరు గోల్స్ చేసి హ్యారికేన్తో సమానంగా ఉన్నాడు.👉డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాకు కర్త, కర్మ, క్రియ.. లియోనల్ మెస్సీ. మెస్సీ ఆరు మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. మెస్సీతో పాటు ఎమిలో మార్టినేజ్, జులియన్ అల్వరెజ్, అలెక్సిస్ మాక్ అలిస్టర్‌లు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.జూడ్ బెల్లింగ్హమ్, ఇంగ్లండ్ (Phot Credit: FIFA Twitter)తొలి సెమీస్: ఫ్రాన్స్ వర్సెస్ స్పెయిన్ఫ్రాన్స్, స్పెయిన్ జట్ల మధ్య తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం జులై 15న (బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు) జరగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం 38 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా.. స్పెయిన్‌దే పైచేయి. 38 మ్యాచ్‌ల్లో స్పెయిన్ 18 గెలవగా.. ఫ్రాన్స్ 13 గెలిచింది. 7 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అయితే ఫిఫా ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు కేవలం ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. 2016 ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్స్‌లో ఫ్రాన్స్ 3-1 తేడాతో స్పెయిన్‌ను ఓడించింది.అలెక్సిస్ మాక్ అలిస్టర్, అర్జెంటీనా (Phot Credit: FIFA Twitter)రెండో సెమీస్: అర్జెంటీనా వర్సెస్ ఇంగ్లండ్ఫిఫాలో రెండో సెమీ-ఫైనల్లో అర్జెంటీనా, ఇంగ్లండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ జులై 16 (భారత కాలమాన ప్రకారం గురువారం అర్ధరాత్రి 12.30 గంటలు) అట్లాంటా వేదికగా జరగనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌ల రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐదు ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడగా.. వీటిలో ఇంగ్లండ్ మూడు, అర్జెంటీనా రెండు గెలిచాయి. 40 ఏళ్ల క్రితం (1986 ఫిఫా) ఇరుజట్ల మధ్య జరిగిన సెమీస్‌లో అర్జెంటీనా పైచేయి సాధించింది.సెమీఫైనల్ షెడ్యూల్:👉తొలి సెమీస్: ఫ్రాన్స్ వర్సెస్ స్పెయిన్, బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు, వేదిక: అర్లింగ్టన్, టెక్సస్👉రెండో సెమీస్: అర్జెంటీనా వర్సెస్ ఇంగ్లండ్, గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు, వేదిక: అట్లాంటాSemi-final match-ups 👀#FIFAWorldCup pic.twitter.com/2WWvIw4E06— FIFA World Cup (@FIFAWorldCup) July 12, 2026చదవండి: శతకంతో ప్రపంచ రికార్డు.. తొలి మహిళా క్రికెటర్‌గా యస్తిక భాటియా -
‘అంతా ఫిక్సింగ్.. వాళ్లను గెలిపించడం కోసమే ఇదంతా’
ఫిఫా ప్రపంచకప్‌లో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్‌తో స్పెయిన్, రెండో సెమీస్‌లో అర్జెంటీనాతో ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈజిప్ట్ ఫార్వార్డ్ ప్లేయర్ మొస్తాఫా జీకో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫిఫా టోర్నీ ముందే ఫిక్స్ అయిందని, అర్జెంటీనాను గెలిపించడం కోసమే టోర్నీ నిర్వహిస్తున్నట్లుగా తనకు అనిపిస్తోందని పేర్కొన్నాడు. అర్జెంటీనాతో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ఈజిప్ట్ 2-3 తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు సంబంధించి మెస్సీపై కూడా జీకో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బహుశా మెస్సీ గొప్ప ఆటగాడే కావొచ్చు, కానీ తాను ప్రధానంగా పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో నుంచి స్ఫూర్తి పొందుతానని పేర్కొన్నాడు.ఇక ప్రిక్వార్టర్స్‌లో ఓటమి అనంతరం ఈజిప్ట్ జట్టు అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు చేసింది. మ్యాచ్ మొత్తం రిఫరీ అంపైరింగ్‌ను నిష్పక్షపాతంగా నిర్వహించలేదని, తమ జట్టుకు అన్యాయం జరిగిందని జీకో ఆరోపించాడు. తాము మెరుగైన ప్రదర్శన చేశామని, కానీ విజయం అనేది తమ చేతుల్లో లేదన్నాడు. టోర్నీ మొత్తం ముందే ఫిక్స్ అయిందని, రిఫరీ చేతుల మీదుగా ఫిక్సింగ్ నడుస్తోందని తెలిపాడు. అర్జెంటీనా కోసమే ఫిఫా నిర్వహిస్తున్నట్లు అందరికీ స్పష్టంగా అర్థమవుతోందని జీకో పేర్కొన్నాడు. 😂🏆 The Swiss players looked completely stunned, almost as if they were saying:"Just hand the trophy to Argentina already!" 🤣The reactions on their faces said it all — a mix of disbelief, frustration, and pure shock. Football always delivers these priceless moments! 😅⚽…— KUMAR (@MyCric101) July 13, 2026చదవండి: ‘మర్యాదగా మాట్లాడండి’.. మెస్సీ మాస్ వార్నింగ్! -
‘మర్యాదగా మాట్లాడండి’.. మెస్సీ మాస్ వార్నింగ్!
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ ఫిఫా ప్రపంచకప్‌లో తొలిసారి ఆగ్రహం ప్రదర్శించాడు. ఎదుటివారు ఎంత రెచ్చగొట్టినా తన చిరునవ్వుతోనే సమాధానం చెప్పే మెస్సీ తొలిసారి కంట్రోల్ తప్పాడు. స్విట్జర్లాండ్‌తో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా ‘మర్యాదగా మాట్లాడండి’ అంటూ మ్యాచ్ రిఫరీకి మెస్సీ వార్నింగ్ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. స్విట్జర్లాండ్ ఫ్రీ కిక్కు సిద్ధమవుతున్న సమయంలో అర్జెంటీనా ఆటగాళ్లు డిఫెన్సివ్ వాల్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మెస్సీని నిబంధనల ప్రకారం కొంత వెనక్కి వెళ్లాలని పోర్చుగల్ రిఫరీ జోవో పిన్హీరో సూచించారు. అయితే రిఫరీ మాట్లాడిన తీరు నచ్చకపోవడంతో మెస్సీ అసహనం వ్యక్తం చేశాడు. ‘నాతో మర్యాదగా మాట్లాడండి. నన్ను అగౌరవపరచొద్దు. నేను మీతో గౌరవంగా మాట్లాడాను.. మీరు కూడా అలాగే మాట్లాడండి’ అంటూ మెస్సీ రిఫరీకి చెబుతున్నట్లు మైక్‌లో రికార్డయ్యాయి. ఈ ఫిఫాలో ప్రతీ మ్యాచ్‌లోనూ కనీసం ఒక్క గోల్ అయినా కొట్టిన మెస్సీ స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో మాత్రం గోల్ సాధించలేదు. అయితే ఒక అసిస్ట్‌తో మెస్సీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ విషయానికొస్తే స్విట్జర్లాండ్‌పై విజయంతో అర్జెంటీనా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్‌పై విజయం సాధించింది. ఆట అదనపు సమయంలో రెండు గోల్స్ చేసిన అర్జెంటీనా స్విట్జర్లాండ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అర్జెంటీనా తరఫున అలెక్సిస్ మాక్ అలిస్టర్ (10వ నిమిషం), జులియన్ అల్వరెజ్ (112వ నిమిషం), లుటారో మార్టినేజ్ (121వ నిమిషం) అదనపు సమయంలో గోల్ చేశాడు. స్విట్జర్లాండ్ తరఫున డాన్ నోయే (67వ నిమిషంలో) గోల్ కొట్టాడు. “HABLÁ BIEN, NO FALTES EL RESPETO. A MÍ HÁBLAME BIEN”.Lionel #Messi, al árbitro portugués. 🤬🇦🇷 pic.twitter.com/fxMHSPMvLe— treintaytres (@GRUPOTRESTRES) July 12, 2026చదవండి: అర్జెంటీనా దిగ్గజం కన్నుమూత.. విషాదంలో మెస్సీ సేన -
అర్జెంటీనా దిగ్గజం కన్నుమూత.. విషాదంలో మెస్సీ సేన
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ ఆంటోనియో ఉబాల్డో రాటిన్ (89) భారత కాలమన ప్రకారం ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఫుట్‌బాల్‌లో ఎల్లో, రెడ్ కార్డుల వ్యవస్థను ప్రవేశపెట్టడంలో ఆంటోనియో రాటిన్ కీలక పాత్ర పోషించారు. ఆదివారం ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపె ట్టింది. ఆంటోనియో మృతి పట్ల అర్జెంటీనా జట్టు సంఘీభావం ప్రకటించి ఆయన మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించింది. స్విస్‌తో మ్యాచ్‌కు అర్జెంటీనా ఆటగాళ్లు నల్లరిబ్బన్లతో బరిలోకి దిగారు.రెడ్, యెల్లో కార్డులకు ఆద్యుడు1966లో ఇంగ్లండ్‌లో జరిగిన ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఆంటోనియో రాటిన్‌ను జర్మన్ రెఫరీ రుడాల్ఫ్ క్రీట్‌లీన్ బలవంతంగా మైదానం నుంచి బయటకు పంపడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఆ సమయంలో కార్డుల విధానం లేకపోవడంతో ఆంటోనియో మైదానం వీడకుండా తనకు అన్యాయం చేశారంటూ మైదానంలోనే కూర్చొని నిరసనకు దిగారు. ఈ సంఘటన ఫుట్‌బాల్ చరిత్రలో ఒక మలుపు తీసుకువచ్చింది. బ్రిటన్ రాణి కోసం ప్రత్యేకంగా పరిచిన రెడ్ కార్పెట్‌పై కూర్చొని నిరసన తెలపడంతో పెద్ద చర్చకు దారితీసింది.దెబ్బకు దిగొచ్చిన ఫిఫాదీంతో మరుసటి (1970) ప్రపంచకప్ నుంచి రెడ్, ఎల్లో కార్డుల విధానాన్ని ఫిఫా అధికారికంగా ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ఆటగాళ్లకు రెఫరీ నిర్ణయాలు స్పష్టంగా తెలియజేయబడటానికి మార్గం సుగమం అయ్యింది. ఇక రాటిన్ తన కెరీర్‌ను 'బోకా జూనియర్స్' క్లబ్‌కు అంకితం చేశారు, అక్కడ 1956 నుంచి 1970 వరకు 382 మ్యాచ్‌లు ఆడి, నాలుగు లీగ్ టైటిళ్లను గెలుచుకున్నారు. 1962, 1966 ప్రపంచకప్పుల్లో అర్జెంటీనా తరఫున ప్రాతినిధ్యం వహించారు.ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత ఆంటోనియో రాటిన్ కోచ్‌గా, రాజకీయ నాయకుడిగా కూడా ఆయన తన ప్రతిభను ప్రదర్శించారు. మైదానంలో తన అంకితభావం, దేశం పట్ల గర్వంతో ఆడిన గొప్ప ఆటగాడిగా ఫుట్‌బాల్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన మృతితో, ఫుట్‌బాల్ ప్రపంచం ఒక గొప్ప ఆటగాడిని కోల్పోయింది. రాటిన్ క్రీడా ప్రస్థానం, ఆయన చేసిన మార్పులు, ఫుట్‌బాల్‌కు ఆయన అందించిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయనడంలో సందేహం లేదు. 🇦🇷 Argentina wearing black armbands vs Switzerland today Rest in peace, Antonio Rattín The Albiceleste are honouring the Boca Juniors and Argentina legend, who passed away yesterday at 89.Captain of the 1966 World Cup team, his famous sending-off vs England helped inspire… pic.twitter.com/DAbbwUI0qc— Sports Freak (@OfficialSfreak) July 12, 2026 A los 89 años falleció Antonio Rattin símbolo del fútbol argentino y de Boca. Un 5 con garra, capitán de la Selección en el Mundial 66 donde lo expulsaron vs Inglaterra en Wembley y al retirarse estrujo el banderin del corner con la bandera británica. Respetado x rivales. QEPD pic.twitter.com/yQpmU34Aex— Archivo Dany Páez⚪️🔴⚪️ (@DanyPaez1975) July 11, 2026 Falleció Antonio Rattín a los 89 años ⚫👉 Recordamos el día que humilló a los ingleses: estrujó la bandera británica y se sentó en la alfombra real en las semifinales del mundial de 1966 ⚽ pic.twitter.com/w5RHTRyaYX— El Destape (@eldestapeweb) July 11, 2026Read: చరిత్ర సృష్టించిన మెస్సీ.. మారడోనా రికార్డు బద్దలు -
చరిత్ర సృష్టించిన మెస్సీ.. మారడోనా రికార్డు బద్దలు
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇప్పటికే 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో దూసుకుపోతున్న మెస్సీ తాజాగా స్విట్జర్లాండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో మరో ప్రపంచ రికార్డు అందుకున్నాడు. స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో గోల్ చేయనప్పటికీ మెస్సీ అరుదైన ఫీట్ సాధించాడు. అలెక్సిస్ మాక్ అలిస్టర్‌కు 10వ నిమిషంలో పిన్‌పాయింట్ కార్నర్ నుంచి అసిస్ట్ అందించాడు. ఈ నేపథ్యంలో ఫిఫా చరిత్రలో అత్యధిక అసిస్ట్‌లు అందించిన ఆటగాడిగా మెస్సీ రికార్డులకెక్కాడు. అలిస్టర్‌కు అందించిన అసిస్ట్ మెస్సీకి పదోది కావడం విశేషం. ఈ నేపథ్యంలో అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా (8 అసిస్ట్‌లు) రికార్డును బద్దలు కొట్టిన మెస్సీ 10 అసిస్ట్‌లతో తొలి స్థానంలో నిలిచాడు. 1966 ఫిఫా ప్రపంచకప్ నుంచి చూసుకుంటే మారడోనా (1982, 1986, 1990, 1994 ఫిఫా వరల్డ్‌కప్స్) కలిపి 8 అసిస్ట్‌లు సాధించాడు. తాజాగా 32 ఏళ్ల తర్వాత మారడోనా రికార్డును మెస్సీ బద్దలుకొట్టడం విశేషం. మారడోనా 8 అసిస్ట్‌లతో రెండో స్థానంలో, ఇక మూడో స్థానంలో జర్మనీ ప్లేయర్ పియెర్రె లిట్బార్స్కీ, పోలండ్ ప్లేయర్ జార్జ్ లాటో చెరో ఏడు అసిస్ట్‌లతో సంయుక్తంగా ఉన్నారు. ఆరు అసిస్ట్‌లతో డేవిడ్ బెక్‌హమ్ (ఇంగ్లండ్), పీలే (బ్రెజిల్), థామస్ ముల్లర్ (జర్మనీ) నాలుగో స్థానంలో నిలిచారు. ఇక 1962లో వరుసగా రెండోసారి చాంపియన్స్‌గా నిలిచిన బ్రెజిల్ సరసన చేరేందుకు అర్జెంటీనా మరో రెండు అడుగుల దూరంలో ఉంది. 2022 ఫిఫా ప్రపంచకప్‌లో పెనాల్టీ షూటౌట్లో ఫ్రాన్స్‌ను చిత్తు చేసిన అర్జెంటీనా మూడోసారి ఫిఫా ట్రోఫీ అందుకుంది. ఇక నాలుగోసారి ఫిఫా టైటిల్‌ను అందుకోవాలనే దృడ సంకల్పంతో ఉంది. జూలై 14న తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్‌తో స్పెయిన్, జూలై 16న రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో అర్జెంటీనా తలపడనున్నాయి. జూలై 20న ఫిఫా పైనల్ జరగనుంది.Lionel Messi reaction to Julian Alvarez goal, what a moment 🥹🩵 pic.twitter.com/D977815flQ— MC (@CrewsMat10) July 12, 2026Argentina keep on getting it done 🇦🇷 pic.twitter.com/JHfpxUNlWt— B/R Football (@brfootball) July 12, 2026 -
స్విట్జర్లాండ్ ప్లేయర్ హైడ్రామా.. మరో వివాదంలో అర్జెంటీనా!
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా మరోసారి వివాదంలో చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రిఫరీ తప్పుడు నిర్ణయాలతో అర్జెంటీనా విజయాలు సాధిస్తుందని ప్రత్యర్థి జట్లు ఆరోపణలు గుప్పించాయి. తాజాగా క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలో రెడ్‌కార్డ్‌కు గురయ్యి మైదానం నుంచి బహిష్కరణకు గురి కావడం అర్జెంటీనాను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. నిజానికి ఇక్కడ స్విట్జర్లాండ్ ప్లేయర్ బ్రీల్ ఎంబోలో నటనను అద్భుతంగా పండించాడు. కానీ డ్రామా పండకపోవడంతో పాటు తప్పిదానికి మూల్యంగా రెడ్‌కార్డ్‌కు గురవ్వడంతో స్విట్జర్లాండ్ 10 మందికే పరిమితమై ఓటమిని మూటగట్టుకుంది.ఎంబోలోకు రెడ్‌కార్డ్ ఎందుకంటే?విషయంలోకి వెళితే.. ఆట రెండవ అర్ధభాగంలో స్విట్జర్లాండ్‌కు చెందిన బ్రీల్ ఎంబోలో రెడ్‌కార్డ్‌కు గురయ్యాడు. ఎంబోలోపై అర్జెంటీనా ఆటగాడు లియాండ్రో పరేడెస్ అనాలోచిత ఫౌల్ చేసిన కారణంగా మొదట అతడికి యెల్లో కార్డ్ చూపించాడు. అయితే, వీఏఆర్ బృందం జోక్యం చేసుకుని, అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్‌కు యెల్లో కార్డు ఇవ్వడం అన్యాయమని, దానిని రద్దు చేయాలని సూచించింది. దీంతో రిఫరీ జోవో పిన్హీరో మైదానం డగౌడ్‌లో ఉన్న మానిటర్‌లోని ఫుటేజీని సమీక్షించారు. ఫుటేజీలో పరేడెస్ ఎలాంటి తప్పిదం చేయలేదని, పరేడెస్ రాకముందే ఎంబోలో కిందపడినట్లుగా నటించినట్లు తేలింది. దీంతో పరేడెస్ యెల్లో కార్డ్ రద్దు చేసిన రిఫరీ ఆ తర్వాత ఎంబోలోకు రెడ్ కార్డ్ చూపించాడు. ఆటలో అంతకముందే ఒక ఫౌల్ చేసిన కారణంగా ఎంబోలో యెల్లో కార్డుకు గురయ్యాడు. తాజాగా తనను కిందపడేశాడంటూ ఆరోపించడం, ఆ తర్వాత ఫుటేజీలో అదంతా నటన అని తేలడంతో ఎంబోలోకు రిఫరీ రెడ్‌కార్డ్ చూపించాడు. ఈ సమయంలో మైదానంలో ఒక్కసారిగా హైడ్రామా చోటుచేసుకుంది. రిఫరీ నిర్ణయాన్ని తప్పుబ్టటిన స్విస్ జట్టు నిరసనకు దిగింది. అయితే అదే సమయంలో ఎంబోలో తాను తప్పు చేశానని అంగీకరించడంతో, మ్యాచ్ రిఫరీ అనవసరంగా సీన్ చేయొద్దని, మైదానం నుంచి బయటకు వెళ్లాలని హెచ్చరించాడు. దీంతో చేసేదేం లేక ఎంబోలో ఏడుస్తూ మైదానం వీడాడు. ఈసారి ఫిఫా మొదలైనప్పటి నుంచి వీఏఆర్ సమీక్షలపై వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. IFAB (అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డ్) ఆట నియమాల ప్రకారం, అనుకరణ అనేది ఖచ్చితంగా క్రీడాస్ఫూర్తికి విరుద్ధమైన ప్రవర్తన వర్గంలోకి వస్తుంది. మ్యాచ్ అధికారులను మోసం చేయడానికి ప్రయత్నించినట్లు రుజువైతే, ఆటగాడికి తప్పనిసరిగా హెచ్చరిక (పసుపు కార్డు) ఇవ్వాలని నియమావళి నిర్దేశిస్తుంది. Breel Embolo crying after receiving the RED CARD in Argentina vs Switzerland FIFA World Cup Quarterfinal game pic.twitter.com/1vpcl43Xod— Daily Foot Vibes (@dailyfootvibes) July 12, 2026Read: చిత్తుగా ఓడిన స్విట్జర్లాండ్.. సెమీఫైనల్లో అర్జెంటీనా -
చిత్తుగా ఓడిన స్విట్జర్లాండ్.. సెమీఫైనల్లో అర్జెంటీనా
ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్‌పై ఘన విజయాన్ని సాధించింది. నిర్ణీత సమయంలో ఒక గోల్ చేసిన అర్జెంటీనా ఆట అదనపు సమయంలో మరో రెండు గోల్స్ చేసి స్విట్జర్లాండ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.అర్జెంటీనా తరఫున అలెక్సిస్ మాక్ అలిస్టర్ (10వ నిమిషం), జులియన్ అల్వరెజ్ (112వ నిమిషం), లుటారో మార్టినేజ్ (121వ నిమిషం) ఆట అదనపు సమయంలో గోల్ చేశాడు. స్విట్జర్లాండ్ తరఫున డాన్ నోయే (67వ నిమిషంలో) గోల్ కొట్టాడు. ఇక ఆట 72వ నిమిషంలో బ్రీల్ ఎంబోలో రెడ్‌కార్డ్‌కు గురయ్యాడు. దీంతో స్విట్జర్లాండ్ 10 మంది ఆటగాళ్లతోనే మిగతా మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.ఉత్కంఠభరితంగా సాగిన పోరులో తొలి హాఫ్‌లో ఆట ప్రారంభమైన కాసేపటికే అర్జెంటీనా గోల్ చేసింది. మెస్సీ నుంచి పాస్ అందుకున్న అలిస్టర్ బంతిని నేరుగా గోల్ పోస్ట్‌లోకి పంపించి 1-0తో అర్జెంటీనాకు ఆధిక్యం అందించాడు. తొలి అర్ధభాగంలో విఫలమైన స్విట్జర్లాండ్ రెండో హాఫ్‌లో మాత్రం ఫుంజుకొని అర్జెంటీనాకు గట్టి పోటీనిచ్చింది.ఈ నేపథ్యంలోనే 67వ నిమిషంలో డాన్ నోయె గోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత నిర్ణీత సమయంతో పాటు స్టాపేజీ టైంలోనూ ఇరుజట్లు మరో గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో మ్యాచ్ అదనపు సమయానికి దారి తీసింది. ఎక్స్ట్రా టైమ్‌లో అర్జెంటీనా తరఫున జులియన్ అల్వరెజ్ 112వ నిమిషంలో మెరిసి అర్జెంటీనాకు రెండో గోల్ అందించాడు. మరో నాలుగు నిమిషాల్లో ఎక్స్ట్రా టైమ్ ముగుస్తుందనగా, 121వ నిమిషంలో లుటారో మార్టినేజ్ గోల్ చేసి ఆధిక్యాన్ని మూడుకు పెంచాడు. 2022 ఫిఫా వరల్డ్‌కప్‌లో చాంపియన్‌గా నిలిచిన అర్జెంటీనా సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఎదుర్కోనుంది. మరో సెమీస్‌లో స్పెయిన్‌తో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. అన్నీ కుదిరితే 2022 ఫిఫా ఫైనల్ మరోసారి రిపీటయ్యే అవకాశముంది. 2022 ఫిఫా ఫైనల్లో ఫ్రాన్స్‌ను పెనాల్టీ షూటౌట్లో మట్టికరిపించిన అర్జెంటీనా మూడోసారి ఫిఫా టైటిల్‌ను గెలుచుకుంది. I want this Julian Alvarez in this World Cup 😃🙏🏻pic.twitter.com/IwHW5ORAyL— Messi¹⁰ (@LaPulgaZone) July 11, 2026 Breel Embolo crying after receiving the RED CARD in Argentina vs Switzerland FIFA World Cup Quarterfinal game pic.twitter.com/1vpcl43Xod— Daily Foot Vibes (@dailyfootvibes) July 12, 2026చదవండి: 25 ఏళ్లకే స్టార్ ఫుట్‌బాలర్ కన్నుమూత -
25 ఏళ్లకే సౌతాఫ్రికా స్టార్ ఫుట్‌బాలర్ కన్నుమూత
ప్రపంచం మొత్తం సాకర్ ఫీవర్ (FIFA World Cup 2026)తో ఊగిపోతున్న వేళ ఫుట్‌బాల్ ఆటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాసేపట్లో ఫిఫా 2026 క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్, నార్వే ఆట మొదలవుతుందనగా, స్టేడియంలోని బిగ్ స్క్రీన్‌పై సౌతాఫ్రికా ఫుట్‌బాల్ ప్లేయర్ జేడన్ ఆడమ్స్ (25) కన్నుమూసినట్లు ప్రత్యక్షమవ్వడం అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్, నార్వే ఆటగాళ్లు సహా అభిమానులంతా జేడన్ ఆడమ్స్ ఆకస్మిక మృతి పట్ల రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.మౌనం పాటిస్తున్న ఇంగ్లండ్, నార్వే ఆటగాళ్లుసౌతాఫ్రికా మిడ్ ఫీల్డర్ అయిన జేడన్స్ ఆడమ్స్ 25 ఏళ్ల వయసులోనే తనువు చాలించాడు. అతడి ఆకస్మిక మృతి వెనుక కారణాలు ఏంటనేది తెలియదని పోలీసులు వెల్లడించారు. అయితే జేడన్ ఆడమ్స్ ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించినట్టు కొందరు అనుమానిస్తుంటే, వ్యక్తిగత కారణాలతో అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు మరికొందరు పేర్కొంటున్నారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో జేడన్ ఆడమ్స్సౌతాఫ్రికా ఫుట్‌బాల్ జట్టులో స్టార్ ఆటగాడిగా పేరు పొందిన జేడన్ ఆడమ్స ఇటీవలే ఫిఫా ప్రపంచకప్‌లో కూడా జట్టు తరఫున ఆడాడు. సౌతాఫ్రికా గ్రూప్ దశకే పరిమితమైనప్పటికీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ జేడన్ ఆడమ్స్ ఆడాడు. మెక్సికోతో మ్యాచ్‌కు ముందు తన అమ్మమ్మ మరియానా ఆడమ్స్ మరణించిందన్న వార్తను దిగమింగుకొని బరిలోకి దిగిన జేడన్ ఆడమ్స్ మంచి ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్‌లో మెక్సికో 2-0తో విజయం సాధించింది. ఆ తర్వాత చెక్ రిపబ్లిక్‌తో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న సౌతాఫ్రికా.. తమ చివరి మ్యాచ్‌లో దక్షిణ కొరియాపై 0-1తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జేడన్ ఆడమ్స్సబ్స్టిట్యూట్గా వచ్చాడు. ఆడమ్స్ మృతి పట్ల ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ ఫాంటినో, దక్షిణాఫ్రికా క్రీడా మంత్రి గాయటన్ మెకెంజీలతో పాటు ఆటగాళ్లు సంతాపం ప్రకటించారు. సౌతాఫ్రికా తరపున 9 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జేడన్ ఆడమ్స్ రెండు గోల్స్ చేశాడు. This video of Jayden Adams breaks my heart even more. This guy was going through the most 💔💔💔💔. pic.twitter.com/b4ot1fBvLK— Mpho Alex⭐⭐ (@mphoalex11) July 11, 2026 Rest in peace, Jayden Adams, Grootman. 🕊️💔 pic.twitter.com/ERSkw8oCwv— T. (@__T_touch) July 11, 2026A moment of silence was held before Norway and England in honor of South Africa midfielder Jayden Adams who died at the age of 25 ❤️ pic.twitter.com/vlOrxzgSSg— ESPN FC (@ESPNFC) July 11, 2026 Read: టీ20 సిరీస్ ఓటమి.. నంబర్‌వన్ ర్యాంక్ గోవిందా -
ఫిక్సింగ్ ఆరోపణలు.. కప్పు గెలవొద్దనే ఇలాంటి కుట్రలు!
ఫిఫా ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రేపు జరగనున్న క్వార్టర్ ఫైనల్లో మెస్సీ సేన స్విట్జర్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. స్విట్జర్లాండ్‌పై విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లాలని అర్జెంటీనా జట్టు భావిస్తోంది. ఈ సంగతి పక్కనబెడితే క్వార్టర్స్‌లో రిఫరీ సానుకూల నిర్ణయాలతో తమను చీట్ చేసి గెలిచిందని ఈజిప్ట్ ఫిఫాకు ఫిర్యాదు చేసింది. ఇది ఫిక్సింగ్ కిందకు వస్తుందని, దీనిపై విచారణ చేపట్టాలని కూడా ఈజిప్ట్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఫిఫాను కోరింది. ఈ నేపథ్యంలోనే అర్జెంటీనా కోచ్ లియోనల్ స్కలోని తమ జట్టుపై వస్తున్న ఆరోపణలపై తొలిసారి స్పందించాడు. ఇప్పటిదాకా బయటే వినిపించిన ఇలాంటి ఆరోపణలు ఇప్పుడు ఆటగాళ్ల దాకా కూడా వచ్చాయని తెలిపాడు. అర్జెంటీనా వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ గెలవకూడదనే ఉద్దేశంతోనే కొందరు గిట్టనివాళ్లు చేస్తున్న తప్పుడు ఆరోపణలను తాము పట్టించుకోమని కుండబద్దలు కొట్టాడు. లియోనల్ స్కలోని మాట్లాడుతూ.. ‘అర్జెంటీనా గెలవకూడదని కోరుకోవడం ఇదేమి కొత్త కాదు. 1986 ఫిఫా ప్రపంచకప్ సమయంలోనూ అర్జెంటీనాపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. కానీ అప్పటి మారడోనా బృందం ఇలాంటి వాటిని బేఖాతరు చేయకుండా ఒక చాంపియన్ ఆటను ప్రదర్శించి రెండోసారి టైటిల్‌ను గెలుచుకుంది. ఈజిప్ట్ ఆరోపిస్తున్నట్లుగా రెండో అర్ధభాగంలో వాళ్లు కొట్టిన గోల్‌ను రద్దు చేయడానికి ముందే వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) ఫుటేజీని క్లియర్‌గా పరిశీలించారు. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే నిర్దేశించిన నియమాలను మాత్రమే వీఏఆర్ బృందం పాటిస్తోందని' లియోనల్ స్కలోని పేర్కొన్నాడు. ఇక ఫిఫా 2026లో అర్జెంటీనా చాంపియన్ ఆటతీరును ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ అన్నీ తానై జట్టును నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 8 గోల్స్, ఒక అసిస్ట్‌తో గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.చదవండి: కోహ్లి రహస్య సంభాషణ బట్టబయలు! -
మొన్న పోర్చుగల్, ఇవాళ బెల్జియం.. చావుదెబ్బ కొట్టాడు
ఫిఫా ప్రపంచకప్ నుంచి బెల్జియం జట్టు నిష్క్రమించింది. శనివారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ జట్టు 2-1 తేడాతో బెల్జియంను ఓడించింది. అయితే బెల్జియం ఓటమికి పరోక్ష కారణం ఆ జట్టు గోల్ కీపర్ సెన్నే లామెన్స్ అయితే, ప్రత్యక్ష కారణం మాత్రం స్పెయిన్ సంచలనం మైకెల్ మెరినో.మొన్న పోర్చుగల్‌తో జరిగిన క్వారర్ ఫైనల్ పోరులో స్టాపేజ్ టైం (90+ నిమిషాల్లో) గోల్ కొట్టి మ్యాచ్‌ను లాగేసుకున్న మెరినో.. తాజాగా బెల్జియంతో మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ బరిలోకి దిగిన మెరినో మరోసారి మెరిసి స్పెయిన్‌కు గోల్ అందించాడు. తన లక్కీ హ్యాండ్‌తో స్పెయిన్‌కు విజయాన్ని కట్టబెట్టి 16 ఏళ్ల తర్వాత సెమీస్ చేర్చాడు.గాయం నుంచి కోలుకొనిఈసారి ఫిఫాలో స్పెయిన్‌కు లక్కీ హ్యాండ్‌గా మారిపోయిన మైకెల్ మెరినో తొలుత ప్రపంచకప్ ఆడతాడా లేదా అన్న అనుమానం ఉండేది. ఈ ఏడాది జనవరిలో అతడి పాదానికి గాయమైంది. స్ట్రెస్ ఫ్రాక్చర్‌తో రెండు నెలల పాటు పాదాన్ని కింద ఆనించడంలోనూ ఇబ్బంది పడ్డాడు. తన రెగ్యులర్ ఫుట్‌బాల్ క్లబ్ ఆర్సెనల్ తరఫున కూడా బరిలోకి దిగకపోవడంతో ఫిఫా ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ స్పెయిన్ జట్టులో చోటు సంపాదించుకోవడమే గాక, ఆ జట్టు సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించిన మైకెల్ మెరినో స్పెయిన్ జట్టుకు గోల్డెన్ హ్యాండ్‌గా మారిపోయాడు.ఆ తప్పు చేయకపోయి ఉంటే..70వ నిమిషంలో బెల్జియం రెగ్యులర్ గోల్‌కీపర్ కోర్టోయిస్ గాయపడి గ్రౌండ్ ను వీడాడు. దీంతో ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అరంగేట్రం చేయని యువ గోల్‌కీపర్ సెన్నే లామెన్స్ అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితుల మధ్య బరిలో దిగాల్సి వచ్చింది. లామెన్స్ చేసిన ఓ చిన్న పొరపాటే చివరకు బెల్జియం పరాజయానికి దారితీసింది. పావ్ కుబార్సి కొట్టిన లాంగ్ షాట్‌ను లామెన్స్ కంట్రోల్ చేయలేకపోయాడు. అదే బంతిని మెరెనో గోల్‌పోస్ట్‌లోకి నెట్టాడు. దీంతో స్పెయిన్ జట్టు ఆనందానికి అవధుల్లేకపోయింది. ఆఖరి నిమిషాల్లో స్కోర్ సమం చేయడానికి బెల్జియం తీవ్రంగా ప్రయత్నించింది. జెరెమీ డోకు వంటి ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ స్పెయిన్ డిఫెన్స్ ను చేధించలేకపోయారు. అలెక్సిస్ సేల్మేకర్స్ అందించిన చక్కటి క్రాసు రొమేలు లుకాకు సరిగ్గా అందుకోలేకపోవడంతో బెల్జియం ఆశలు అడియాశలయ్యాయి. 🚨🚨Thibaut Courtois: "Senne Lammens is a fantastic goalkeeper with a bright future. This moment will make him STRONGER."pic.twitter.com/9wnru8QUml— 🇵🇸 TP_KATSRK (@TP_Katsrk) July 10, 2026Read: ‘ఎంబాపె కాస్కో.. 2024 సెమీస్‌ను రిపీట్ చేస్తాం’ -
‘ఎంబాపె కాస్కో.. 2024 సెమీస్‌ను రిపీట్ చేస్తాం’
ఫిఫా ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ స్పెయిన్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 తేడాతో బెల్జియంను చిత్తు చేసింది. మ్యాచ్‌లో స్పెయిర్ రెండు గోల్స్ చేయడంలో కీలకపాత్ర పోషించిన ఆ జట్టు స్టార్ ఆటగాడు లామినే యమాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 18 ఏళ్ల లామినే యమాల్ ఈ ఫిపాలో పెద్దగా గోల్స్ కొట్టకపోయినప్పటికీ కీలక సమయాల్లో తన సహచరులకు అసిస్ట్‌లు, పాస్‌లు అందిస్తూ స్పెయిన్ విజయాల్లో ముఖ్యపాత్ర వహిస్తున్నాడు. ఇక వరుసగా మూడో ఫిఫా ప్రపంచకప్‌లోనూ సెమీస్ చేరి సూపర్ ఫామ్‌లో ఉన్న ఫ్రాన్స్‌ను స్పెయిన్ ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలోనే లామినే యమాల్ ఫ్రాన్స్ జట్టుకు వార్నింగ్ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. బెల్జియంతో క్వార్టర్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత లామినే యమాల్ మాట్లాడాడు. ‘టోర్నీని చాలా ఉత్సాహంగా ప్రారంభించాం. మా ప్రయాణంలో సెమీస్ దశలో అడుగుపెట్టాం. ఫ్రాన్స్ అంటే మాకు భయం లేదు. నిజానికి మేము కాదు వాళ్లే మాకు భయపడతారేమో. ఎందుకంటే 2024 యూరోకప్ సెమీస్‌లో మా చేతిలోనే ఫ్రాన్స్ ఓడిపోయింది. ఆ తర్వాత మేము కప్‌ను కూడా ఎగరేసుకుపోయాం. ఇప్పుడు మళ్లీ 2024 నాటి యూరోకప్ సెమీస్నే రిపీట్ చేయబోతున్నాం. ఒత్తిడి మాకంటే ఫ్రాన్స్‌పైనే ఎక్కువ ఉంటుంది. మేము గెలుస్తామా లేదా అన్న సంగతి పక్కనబెడితే మాత్రం ఈసారి మా మధ్య జరగబోయే మ్యాచ్ మాత్రం ఫిఫా చరిత్రలో అత్యుత్తమ మ్యాచ్‌ల్లో ఒకటిగా నిలిచిపోనుంది.’ అని చెప్పుకొచ్చాడు.ఇక యూఈఎఫ్ఏ యూరో 2024 కప్‌లో సెమీస్‌లో స్పెయిన్ 2-1తో ఫ్రాన్స్‌ను ఓడించింది. అప్పటికి 16 ఏళ్ల వయసున్న లామినే యమాల్ లాంగ్ రేంజ్ స్ట్రైక్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి తరలించడం ఇప్పటికీ రికార్డుగా నిలిచిపోయింది. ఇదే మ్యాచ్‌లో డాని ఓల్మో మరో గోల్ సాధించాడు. ఇక ఫైనల్లో ఇంగ్లండ్‌ను 1-2తో చిత్తు చేసిన స్పెయిన్ యూరో చాంపియన్స్‌గా నిలిచింది. ఫిఫా ప్రపంచకప్‌లో జూలై 14న జరగనున్న సెమీఫైనల్లో ఫ్రాన్స్, స్పెయిన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.🚨 𝐎𝐅𝐅𝐈𝐂𝐈𝐀𝐋: 𝐅𝐑𝐀𝐍𝐂𝐄 🇫🇷 𝐕𝐒 🇪🇸 𝐒𝐏𝐀𝐈𝐍 𝐈𝐍 𝐓𝐇𝐄 𝐒𝐄𝐌𝐈-𝐅𝐈𝐍𝐀𝐋𝐒 𝐎𝐅 𝐓𝐇𝐄 𝟐𝟎𝟐𝟔 𝐖𝐎𝐑𝐋𝐃 𝐂𝐔𝐏 🍿 pic.twitter.com/Ob8JJatAmd— 433 (@433) July 10, 2026 🚨⭐️ OFFICIAL: Lamine Yamal, FIFA Man of the Match for Spain-Belgium. pic.twitter.com/hbDaRMT6sn— Fabrizio Romano (@FabrizioRomano) July 10, 2026Read: సచిన్, కోహ్లి సరసన గిల్.. టీమిండియా కెప్టెన్‌గా రికార్డు -
అరుదైన ఫీట్‌తో ఫిఫా చరిత్రను తిరగరాసిన ఎంబాపె
ఫిపా ప్రపంచకప్ 2026లో ఫ్రాన్స్ సంచలనం కైలియన్ ఎంబాపె గోల్స్ వర్షం కురిపిస్తున్నాడు. 30 ఏళ్లు కూడా నిండని ఎంబాపె ఈ ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌ల్లో 8 గోల్స్, మూడు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో మెస్సీతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఒకవేళ అర్జెంటీనా, ఫ్రాన్స్‌లు మరోసారి ఫైనల్లో తలపడితే ఎవరికి గోల్డెన్ బూట్ అందుతుందనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్లో మొరాకోను చిత్తు చేసిన ఫ్రాన్స్ సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక 27 ఏళ్ల ఎంబాపెకు ఫిఫా ప్రపంచకప్పుల్లో ఇది 20వ గోల్ కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఎంబాపె ఒక అరుదైన ఫీట్ సాధించి ఫిఫా చరిత్రను తిరగరాశాడు. 30 ఏళ్ల లోపే ఫిఫాలో 20 గోల్స్ కొట్టిన తొలి ఆటగాడిగా కైలియన్ ఎంబాపె రికార్డు సృష్టించాడు.ఇక ఫిఫా ప్రపంచకప్పుల్లో అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలో ఎంబాపె రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి స్థానంలో అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ (21 గోల్స్) ఉన్నాడు. మెస్సీ రికార్డును అధిగమించేందుకు ఎంబాపె రెండు గోల్స్ దూరంలో నిలిచాడు. ఇక మొరాకోతో మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2-0తో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తొలి అర్ధభాగంలో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచడంలో విఫలమైన ఎంబాపె రెండో అర్ధభాగంలో మాత్రం 60వ నిమిషంలో గోల్‌తో మెరిశాడు. ఈ ఫిఫాలో ఎంబాపెకు ఇది 8వ గోల్ కావడం విశేషం. ఆ తర్వాత 66వ నిమిషంలో డెంబ్లీకి పాస్ అందించి అతడు రెండో గోల్ కొట్టడంలో సహాయపడ్డాడు. 2018లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టు 2022లో రన్నరప్‌గా నిలిచింది. ఇక వరుసగా మూడోసారి సెమీస్ చేరిన ఫ్రాన్స్ టైటిల్ అందుకునేందుకు రెండు అడుగుల దూరంలో ఉంది. -
వింబుల్డన్‌లో మారథాన్ గేమ్.. మెస్సీపై జకోవిచ్ జోకులు
వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ సెమీఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే సెమీస్ చేరేందుకు జకోవిచ్ చెమటోడ్చాల్సి వచ్చింది. మంగళవారం రాత్రి పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఐదు గంటల 15 నిమిషాల పాటు సాగిన మారథాన్ మ్యాచ్‌లో జకోవిచ్ 7-6 (12/10), 3-6, 6-3, 6-7 (4/7), 7-6 (10/4)తో కెనడా స్టార్ ఫెలిక్స్ అలియసిమెపై కష్టపడి గెలిచాడు. ఇక సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సినర్‌ను ఎదుర్కోనున్న జకోవిచ్ క్వార్టర్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత మెస్సీ విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన మ్యాచ్‌తో పాటే ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా, ఈజిప్ట్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమయింది. ఆ మ్యాచ్ 90 నిమిషాల్లో ముగియగా, జకోవిచ్ మాత్రం తన మ్యాచ్‌ను నెగ్గడానికి ఐదు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈజిప్ట్‌పై థ్రిల్లింగ్ విజయాన్ని అందుకున్న అర్జెంటీనా జట్టుపై, ముఖ్యంగా మెస్సీ ప్రదర్శనపై జకోవిచ్ స్పందించాడు. 'మెస్సీ లాగే నాకు 90 నిమిషాల మ్యాచ్ ఆడడం చాలా బాగుంటుంది. అవకాశమొస్తే మెస్సీతో స్వాప్ చేసుకుని అతడి 90 నిమిషాలు నేను.. నా ఐదు గంటల 15 నిమిషాలు అతడు తీసుకుంటే బాగుండేదేమో' అని నవ్వుతూ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక జకోవిచ్ తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంటూ వింబుల్డన్‌లో 15వ సారి సెమీస్‌లో అడుగుపెట్టి స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌ను అధిగమించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్ నాలుగు మేజర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో జకోవిచ్ సెమీస్ చేరడం ఇది 55వ సారి కావడం విశేషం. 1974లో కెన్ రోజ్‌వాల్ తర్వాత ఓపెన్ శకంలో 39 లేదా అంతకంటే ఎక్కువ వయసులో వింబుల్డన్ సెమీస్ చేరిన రెండో ఆటగాడిగా జకోవిచ్ నిలిచాడు.39 years old. @DjokerNole things. #Wimbledon pic.twitter.com/W5GMGr6V0r— Wimbledon (@Wimbledon) July 7, 2026 -
‘రిఫరీ చీటింగ్‌తోనే అర్జెంటీనాకు విజయం’
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం రాత్రి ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా 3-2తో ఈజిప్ట్‌ను ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. అయితే మ్యాచ్‌లో ఓడినప్పటికీ ఈజిప్ట్ మాత్రం అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించింది. ఒక దశలో 2-0తో ఆధిక్యంలో నిలిచిన ఈజిప్ట్ అర్జెంటీనాను ఓడించినంత పని చేసింది. అయితే చివరి నిమిషాల్లో మూడు గోల్స్ కొట్టిన అర్జెంటీనా విజయం సాధించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఈజిప్ట్ జట్టు రిఫరీపై ఫిఫాకు ఫిర్యాదు చేయడం ఆసక్తి కలిగించింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు రిఫరీ అర్జెంటీనాకు అనుకూలంగా చాలా నిర్ణయాలు తీసుకున్నారని, అతడిని వెంటనే తొలగించాలని ఫిఫాకు రాసిన ఫిర్యాదు లేఖలో పేర్కొంది.వీఏఆర్ సమీక్ష తర్వాత గోల్‌ను తిరస్కరించడమే గాక, అర్జెంటీనా విజయానికి దారి తీసిన చివరి గోల్ పెనాల్టీ అప్పీల్‌ను సమీక్షించకపోవడం సహా చాలా నిర్ణయాలు ఈజిప్ట్‌కు వ్యతిరేకంగా రావడంపై ఆ జట్టు శిబిరం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈజిప్ట్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు హనీ అబో రిడా.. ఫ్రెంచ్ రిఫరీ ఫ్రాంకోయిస్ లెటెక్సియర్, మిగిలిన బృందంపై ఫిఫాకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. తప్పుడు నిర్ణయాలతో ఈజిప్ట్ విజయాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం కిందకు వస్తుందని తెలిపిన హనీ అబో, విచారణ చేపట్టాలని కోరారు. ఫ్రెంచ్ రిఫరీ బృందాన్ని మిగిలిన టోర్నీ మ్యాచ్‌ల్లో పాల్గొనకుండా తొలగించాలని హనీ అబో ఫిఫాను అభ్యర్థించారు. మ్యాచ్ విషయానికొస్తే.. రౌండ్ ఆఫ్ 16లో అర్జెంటీనా 3-2తో ఈజిప్ట్‌ను మట్టికరిపించింది. అర్జెంటీనా తరఫున క్రిస్టియన్ రోమెరో (79వ నిమిషం), లియోనల్ మెస్సీ (83వ నిమిషం), యెంజో ఫెర్నాండేజ్ (90+3వ నిమిషం) ఆట ఆఖరి నిమిషంలో మూడు గోల్స్ కొట్టారు. మరోవైపు ఈజిప్ట్ తరఫున యాసర్ ఇబ్రహీం (15వ నిమిషం), మొస్తాఫా జికో (67వ నిమిషం) గోల్స్ సాధించారు. ఇక క్వార్టర్ ఫైనల్లో మెస్సీ బృందం జూలై 12న ఉదయం 6.30 గంటలకు స్విట్జర్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.#Missi asks Egypt's coach: «What's wrong with you?» pic.twitter.com/yQ6tml5Prw— WardaNews (@warda_news1) July 7, 2026#Missi asks Egypt's coach: «What's wrong with you?» pic.twitter.com/yQ6tml5Prw— WardaNews (@warda_news1) July 7, 2026Read: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. గాయంతో కీలక ప్లేయర్ దూరం! -
ఎనిమిది జట్ల సయ్యాట.. ఫిఫా క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదే
ఫిఫా ప్రపంచకప్ 2026 క్వార్టర్ ఫైనల్ దశకు చేరింది. ఇక్కడి నుంచి మ్యాచ్‌లు మరింత రసవత్తరంగా మారనున్నాయి. లీగ్ దశలో 48 జట్లు పోటీపడితే అందులో నుంచి 32 జట్లు రౌండ్ ఆఫ్ 32కు చేరాయి. అక్కడి నుంచి 16 జట్లు ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాయి. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్లో 8 జట్లు (అర్జెంటీనా, ఫ్రాన్స్, స్పెయిన్, నార్వే, బెల్జియం, ఇంగ్లండ్, మొరాకో, స్విట్జర్లాండ్) అమీతుమీకి సిద్ధమ వుతున్నాయి. ఎంబాపె (ఫ్రాన్స్), మెస్సీ (అర్జెంటీనా)ఈ ఫిఫాలో భారీ అంచనాలు పెట్టుకున్న పెద్ద జట్లలో చాలా వరకు నిష్క్రమించడం గమనార్హం. జర్మనీ, పోర్చుగల్, నెదర్లాండ్స్, క్రొయేషియా లాంటి జట్లు ప్రిక్వార్టర్స్‌లోనే తమ ఆటను ముగించాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా తమ స్థాయికి తగ్గట్లే వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆ జట్టు స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ 5 మ్యాచ్‌ల్లో 8 గోల్స్, ఒక అసిస్ట్‌తో గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2022 ఫిఫా రన్నరప్ ఫ్రాన్స్ కూడా తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు యువ సంచలనం కైలియన్ ఎంబాపె 5 మ్యాచ్‌ల్లో ఏడు గోల్స్‌తో మెస్సీని అనుసరిస్తున్నాడు. ఎర్లింగ్ హాలండ్ (నార్వే), లామినే యమాల్ (స్పెయిన్)అన్నీ కుదిరితే 2022 ఫిఫాలో ఫైనల్లో తలపడిన అర్జెంటీనా, ఫ్రాన్స్‌లు ఈసారి సెమీస్ లేదా మరోసారి ఫైనల్లో తలపడే అవకాశముంది. మరోవైపు మాజీ చాంపియన్లు స్పెయిన్, ఇంగ్లండ్‌తో పాటు బెల్జియం తమ స్థాయి ఆటతీరుతో క్వార్టర్స్‌లో అడుగుపెట్టాయి. ఇక ఎవరూ ఊహించని రీతిలో మొరాకో నార్వే, స్విట్జర్లాండ్ కూడా ప్రిక్వార్టర్స్‌లో అదరగొట్టి క్వార్టర్స్‌లో ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో క్వార్టర్ ఫైనల్ దశలో ఏ జట్టు ఎవరితో తలపడనుంది, ఏ సమయానికి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి అనేది ఒకసారి పరిశీలిద్దాం.లుకాకు (బెల్జియం), హ్యారీకేన్ (ఇంగ్లండ్)క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్:👉ఫ్రాన్స్ వర్సెస్ మొరాకో, జూలై 10, తెల్లవారుజామున 1.30 గంటలకు, వేదిక: బోస్టన్👉స్పెయిన్ వర్సెస్ బెల్జియం, జూలై 11, అర్ధరాత్రి 12.30 గంటలకు, వేదిక: లాస్ ఏంజెలెస్👉నార్వే వర్సెస్ ఇంగ్లండ్, జూలై 12, తెల్లవారుజామున 2.30 గంటలకు, వేదిక: మియామి స్టేడియం👉అర్జెంటీనా వర్సెస్ స్విట్జర్లాండ్, జూలై 12, ఉదయం 6.30 గంటలకు, వేదిక: కాన్సాస్ సిటీక్వార్టర్ ఫైనల్లో గెలిచిన నాలుగు జట్లు జూలై 15, 16వ తేదీల్లో జరగనున్న సెమీఫైనల్స్‌లో తలపడనున్నాయి. ఇక ప్రతిష్టాత్మక ఫిఫా ఫైనల్ జూలై 19 (ఆదివారం) తెల్లవారుజామున 2.30 గంటలకు జరగనుంది.Read: టీమిండియాకు ఆర్చర్ చురకలు.. ‘వైభవ్‌కు ఇదే నా సవాల్’ -
కప్ గెలవకపోయినా... ప్రపంచాన్ని గెలిచాడు
ఐదుసార్లు ప్రతిష్టాత్మక బాలన్ డియోర్ అవార్డు... ఐదుసార్లు ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా ‘ఫిఫా’ ఎంపిక... యూరోపియన్ యూనియన్ అత్యుత్తమ ఆటగాడిగా మూడుసార్లు ఘనత... నాలుగుసార్లు యూరోపియన్ యూనియన్ ‘గోల్డెన్షూ’ విజేత... చాంపియన్స్ లీగ్, నేషన్స్ లీగ్, యూరోపియన్ చాంపియన్‌షిప్‌లలో కలిపి ఏకంగా 35 ట్రోఫీ విజయాల్లో సభ్యుడిగా అసాధారణ రికార్డు...ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక గోల్స్...మొత్తంగా ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లో 1300కు పైగా మ్యాచ్‌లు... దాదాపు 1000 గోల్స్... ఇంతటి అత్యద్భుత కెరీర్ అతని సొంతం!అయితే ఇన్ని సాధించినా ఆ ఒక్కటి మాత్రం అతనికి దక్కలేదు.చివరకు వరల్డ్‌కప్ మాత్రం లేకుండానే క్రిస్టియానో రొనాల్డో నిష్క్రమించాల్సి వచ్చింది. అయితేనేమి... ప్రపంచకప్ గెలవలేకపోయినా క్రిస్టియానో రొనాల్డో స్థాయి ఏమాత్రం తగ్గదు. వరల్డ్‌కప్ విజయంలో భాగం కాలేకపోయినా... ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, అతని ఆటతో ఉర్రూతలూగిపోయిన మైదానాలు రొనాల్డో స్థాయిని చూపించాయి. ఆటపై అతను వేసిన ముద్ర అభిమానుల మనసుల్లో కలకాలం నిలిచిపోతుంది. – సాక్షి క్రీడా విభాగం ఫుట్‌బాలర్ కాకపోయి ఉంటే నా కొడుకు ఇటుకలు మోసేవాడు, తాపీ మేస్త్రీ పని చేసేవాడు... రొనాల్డో గురించి అతని తల్లి చెప్పిన మాట ఇది. నిజంగానే అతని నేపథ్యం అలాంటిది. పేరుకే సైనికుడు అయిన అతని తండ్రి తాగుబోతుగా మారి.. రొనాల్డో పుట్టే సమయానికే ఇంటిని పట్టించుకోవడం మానేశాడు. ఆర్మీ నుంచి తప్పుకున్న తర్వాత స్థానికంగా ఒక గార్డెన్లో పని చేసినా ఆదాయం చాలా స్వల్పం. దాంతో తల్లి వేర్వేరు ఇళ్లల్లో, హోటల్లలో పని మనిషిగా చేస్తూ ఇంటిని నడపాల్సి వచ్చింది. అప్పటికే ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్న తల్లి ఈ పేదరికం కారణంగానే తన నాలుగో గర్భాన్ని తొలగించుకోవాలని చూసింది. అయితే ప్రమాదం అంటూ డాక్టర్లు తిరస్కరించడంతో వెనకడుగు వేసింది. కానీ ఆ పుట్టే నాలుగోవాడు చరిత్ర సృష్టిస్తాడని, ప్రపంచ క్రీడారంగంలోనే శిఖరానికి చేరతాడని ఆమె ఊహించలేదు. మొదటి నుంచీ రొనాల్డోకు చదువు అబ్బలేదు. ఒకసారి స్కూల్లో టీచర్‌పై కుర్చీ కూడా విసరడంతో అతడిని బయటకు పంపించారు. అంతే ఆరో తరగతితోనే చదువు ముగిసిపోయింది. అయితేనేమి ఫుట్‌బాల్‌లో మాత్రం అతను రారాజుగా వెలిగాడు.తాను ప్రాణంగా, పిచ్చిగా ప్రేమించిన ఫుట్‌బాల్‌లో మాత్రం అతను కఠోర శ్రమకు వెనుకాడలేదు. ప్రాణం పెట్టి పట్టుదలగా ఆడటమే రొనాల్డోను చాంపియన్ ప్లేయర్‌గా మార్చింది. అతను బాగా పేరు సంపాదించుకున్న తర్వాత పోర్చుగల్‌లో మ్యాగీలాంటి కంపెనీలు, సూపర్ మార్కెట్లకు అతని తల్లి ప్రచారకర్తగా వ్యవహరించడం విశేషం. అయితే రొనాల్డోకు 20 ఏళ్ల వయసులో ఇంకా స్టార్ కాకముందే మద్యం కారణంగా వచ్చిన అనారోగ్యంతో అతని తండ్రి చనిపోయాడు. అసాధారణ ప్రతిభతో... ఏడేళ్ల వయసులో క్రిస్టియానో రొనాల్డో ఆట మొదలైంది. ఆ వయసులోనే స్థానిక క్లబ్ ఆండోరిన్హాకు అతను ఆడటం మొదలు పెట్టాడు. అక్కడే అతనిలో అపార ప్రతిభ ఉందని గుర్తించిన కోచ్‌లు ప్రోత్సహించారు. చదువు అబ్బదని తెలిసిన క్షణాన పూర్తి సమయం ఆటకే కేటాయిస్తే అద్భుతాలు సాధ్యమని కోచ్ ఇచ్చిన సలహాతో రొనాల్డో తల్లి ఏకీభవించడంతో అతనికి మరో లోకం లేకుండా పోయింది. ఫుట్‌బాల్, ఫుట్‌బాల్... ఎప్పుడు చూసినా గ్రౌండ్‌లోనే... ఎక్కడైనా అదే ధ్యాస. అప్పటికే బ్రెజిల్ దిగ్గజాలు రొనాల్డో నజారియో, రొనాల్డిన్హోలను అభిమానించడం మొదలు పెట్టిన ఈ కుర్రాడు ఒక్కసారిగా దూసుకుపోయాడు. తన ఆటతో ప్రమోషన్ సాధిస్తూ జూనియర్ ఆటగాడిగా పదేళ్లపాటు మూడు వేర్వేరు క్లబ్‌లకు ఆడి రొనాల్డో తన విలువేంటో చూపించాడు. ఆ తర్వాత 17 ఏళ్ల వయసులో సీనియర్ ఆటగాడిగా తొలిసారి లిస్బన్లో స్పోర్టింగ్ క్లబ్ పోర్చుగల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అక్కడితో మొదలైన అతడి ప్రస్థానం ఆ తర్వాత ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసించే స్థాయికి తీసుకెళ్లింది. గత 24 ఏళ్లుగా రొనాల్డో అభిమానులను ఉర్రూతలూగిస్తూనే ఉన్నాడు.అరుదైన వ్యాధిని దాటి... మైదానంలో చిరుతలా ఇప్పుడు దూసుకుపోతున్న రొనాల్డో ఫుట్‌బాల్ ప్రపంచం చిన్నప్పుడే ముగిసిపోయేది. అతను నిమిషానికి 100 సార్లకు పైగా గుండె కొట్టుకునే అరుదైన వ్యాధి టాకీకార్డియా బారిన పడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ అతను బతికిపోయాడు. గుండెకు ప్రత్యేక శస్త్రచికిత్స జరిపిన తర్వాత అతను కోలుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అతను మళ్లీ ఫుట్‌బాల్ మైదానంలోకి వచ్చి తన ఆటను చూపించడం విశేషం. పోర్చుగల్‌ను గెలిపించి...జాతీయ జట్టు తరఫున రొనాల్డో వరల్డ్ కప్ గెలవకపోయినా... ఈ టోర్నీలో అతని ప్రభావం తక్కువగా కనిపించినా.. 23 ఏళ్లుగా పోర్చుగల్ సీనియర్ టీమ్‌కు స్టార్ అట్రాక్షన్ అతడే. ఫలితాలు ఎలా వచ్చినా అతని చుట్టే టీమ్ భ్రమించింది. రొనాల్డోను మినహాయిస్తే మరో ఆటగాడి గురించి ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఆలోచించలేని పరిస్థితి ఉంది. క్లబ్ ఫుట్‌బాల్‌లో చూపిన అద్భుత ప్రదర్శనలు ఇక్కడ పునరావృతం చేయలేదనే విమర్శలు వచ్చినా... సహచరుల అండ లేకుండా ఒంటి కాలితో అతను అందించిన విజయాలు ఎన్నో. అసలు రొనాల్డో వల్లనే పోర్చుగల్ టీమ్ గెలవాలని కోరుకునే అభిమానులే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. 233 మ్యాచ్‌లలో టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన అతను 2016 యూరోలో జట్టును చాంపియన్‌గా నిలిపాడు. రెండుసార్లు అతని సారథ్యంలోనే టీమ్ నేషన్స్ లీగ్ విజేతగా నిలిచింది. 2006 నుంచి 2026 వరకు ఆరు వరల్డ్ కప్‌లు ఆడిన రొనాల్డో 27 మ్యాచ్‌లు ఆడి 11 గోల్స్ కొట్టాడు. 2006లో టీమ్ అత్యుత్తమంగా సెమీఫైనల్ చేరింది.ఈతరం ఆటగాళ్ళలో అర్జెంటీనా స్టార్ మెస్సీతో ఇన్నేళ్లుగా అతడిని పోల్చడం రివాజుగా మారిపోయింది. ఇతర ఘనతలను పక్కన పెడితే 2022లో వరల్డ్ కప్ గెలవడంతో రొనాల్డో కంటే మెస్సీ ఒక మెట్టు పైకి కనిపిస్తున్నా... ప్రజాదరణ, ఆటపరంగా రొనాల్డో ఎవరికంటే తక్కువ కాదు. వ్యక్తిగత ఘనతలు, సాధించిన రికార్డులు, రివార్డులు చూస్తే అతని స్థాయి కూడా శిఖరాన ఉందంటే అతిశయోక్తి లేదు.క్లబ్‌లతో కనకాభిషేకం... 18 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌కు చెందిన ప్రఖ్యాత మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో రొనాల్డో జత కట్టడంతో అతని కెరీర్ మలుపు తిరిగింది. ఈ క్లబ్‌కు ఆరేళ్లు, ఆ తర్వాత రియల్ మాడ్రిడ్‌తో తొమ్మిదేళ్లు అతని ఆటలో అత్యుత్తమ స్థాయిని చూపించాయి. బంతి డ్రిబ్లింగ్‌తో మొదలు పెడితే ఎదురు లేకుండా గోల్‌పోస్ట్ వరకు దూసుకుపోయే తత్వం, మెరుపు వేగంతో ప్రత్యర్థి డిఫెండర్లను ఏమార్చే వైనం, తనకే సాధ్యమైన అరుదైన విన్యాసాలతో రొనాల్డో ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఐకాన్‌గా మారిపోయాడు. ఈ పదిహేనేళ్లు అతని నామస్మరణతో అసంఖ్యాక ఫ్యాన్స్ ఊగిపోయారు. దాంతో సహజంగానే వాణిజ్యపరంగా అతని విలువ అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది. ఆటపరంగా ఒప్పందాల మొత్తం రికార్డులు సృష్టిస్తుండగా, బ్రాండింగ్ పరంగా కూడా అసాధారణ ఆర్జన అతని ఖాతాలో చేరింది. అత్యధిక మొత్తం అందుకున్న ఫుట్‌బాలర్‌గా ఫోర్బ్స్ జాబితాలో ఎప్పుడు చూసినా అతని పేరు కనిపించింది. ఆరేళ్ల క్రితమే కేవలం ఆటతోనే బిలియన్ డాలర్లు సంపాదించిన తొలి ఫుట్‌బాలర్‌గా రొనాల్డో గుర్తింపు పొందాడు. సీఆర్ 7 బ్రాండింగ్‌తో అతను ఏ వ్యాపారం మొదలు పెట్టినా కనకవర్షం కురిసింది. రియల్ మాడ్రిడ్‌తో విభేదాలతో ఇటలీలోని యువెంటస్ క్లబ్‌కు చేరినప్పుడు కూడా రికార్డు మొత్తంలో ట్రాన్స్ఫర్ జరిగింది. 100 మిలియన్ యూరోలు చెల్లించి యువెంటస్ సొంతం చేసుకోగా... తొలి రోజు కేవలం ఆ టీమ్‌లో రొనాల్డో జెర్సీ అమ్మకాల ద్వారానే 62.4 మిలియన్ డాలర్లు రావడం అతని స్థాయి ఏమిటో చూపించింది. గోల్ సాధించినప్పుడల్లా అతను తనదైన శైలిలో సుయ్య్య్... అంటూ ప్రదర్శించే ప్రత్యేక విన్యాసం ప్రతీ యువ ఫుట్‌బాల్ మదిలోసిగ్నేచర్గా నిలిచిపోయింది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న ఆటగాడిగా రొనాల్డో అందనంత ఎత్తులో నిలిచాడు. సొంత దేశంలోనైతే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కే అతని పేరు పెట్టి ప్రభుత్వం గౌరవించింది. ప్రస్థానం ఎప్పటి వరకు...జొహాన్న్క్రఫ్, ఫెరెన్స్ పుస్కాస్, పావోలో మాల్డిని, మైకేల్ ప్లాటిని, ఆల్ఫ్రెడో డి స్టిఫానో, డేవిడ్ బెక్‌హామ్, వేన్ రూనీ, ఒలివార్ కాన్, నెమార్... తమ అద్భుత ఆటతో ఫుట్‌బాల్‌లో ఎన్నో ఘనతలు సాధించినా వరల్డ్ కప్‌ను మాత్రం ముద్దాడని ఆటగాళ్లుగా నిలిచిపోయారు. ఈ జాబితాలో ఇప్పుడు రొనాల్డో కూడా చేరాడు. అతని ప్రస్తుత వయసు 41 ఏళ్లు. అయితే ఆటలో పదును, చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. కొత్తగా వచ్చిన కుర్రాళ్లు కూడా అతని జోరు ముందు దిగదుడుపే. చివరి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడేసినా... పోర్చుగల్‌కు మున్ముందు కూడా ప్రాతినిధ్యం వహిస్తానని అతను చెబుతున్నాడు. అందుకే అధికారికంగా రిటైర్మెంట్ కూడా ప్రకటించలేదు. అయితే జాతీయ జట్టు తక్కువ సంఖ్యలో ఆడే మ్యాచ్‌లు, మార్పు కోరుకునే ఫెడరేషన్ వంటి కారణాలతో పోర్చుగల్ తరఫున మిగిలింది చాలా తక్కువ కెరీరే కావచ్చు. అయితే క్లబ్ ఫుట్‌బాల్‌లో మాత్రం అతని క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సౌదీ అరేబియాకు చెందిన అల్ నాసర్ క్లబ్‌కు అతను ఆడుతున్నాడు. ఎంత డబ్బు ఇచ్చి అయినా సరే ఇప్పట్లో అతడిని వదిలేసేందుకు క్లబ్ ఇష్టపడటం లేదు. ఒకవేళ తప్పుకున్నా మరో క్లబ్ కచ్చితంగా ఈ సూపర్ స్టార్ కోసం వేచి చూస్తుందనడంలో సందేహం లేదు. వరల్డ్ కప్‌లో అతని స్థాయికి తగిన మెరుపులు కనిపించకపోయినా ... మరికొంత కాలం రొనాల్డో విన్యాసాలకు లోటు ఉండకపోవచ్చు. 1 వరుసగా ఆరు ప్రపంచకప్‌లలో గోల్ చేసిన ఏకైక ప్లేయర్146 జాతీయ జట్టు తరఫున ప్రపంచంలో అత్యధికగోల్స్ చేసిన ఆటగాడు 233 జాతీయ జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లుఆడిన ఏకైక ప్లేయర్ 4 రొనాల్డో నెగ్గిన క్లబ్ ఫుట్‌బాల్ వరల్డ్ కప్ టైటిల్స్. రియల్ మాడ్రిడ్ తరఫున మూడుసార్లు (2015, 2017, 2018), మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరఫున ఒకసారి (2009) రొనాల్డో ఈ ఘనత సాధించాడు.35 కెరీర్లో రొనాల్డో గెలిచిన మొత్తం ట్రోఫీలు100కోట్లు సోషల్ మీడియాలో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య -
ఆఖరి నిమిషాల్లో మూడు గోల్స్.. క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా
ఫిఫా ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో అర్జెంటీనా 3-2తో ఈజిప్ట్‌ను మట్టికరిపించింది. అర్జెంటీనా తరఫున క్రిస్టియన్ రోమెరో (79వ నిమిషం), లియోనల్ మెస్సీ (83వ నిమిషం), యెంజో ఫెర్నాండేజ్ (90+3వ నిమిషం) ఆట ఆఖరి నిమిషంలో మూడు గోల్స్ కొట్టారు. మరోవైపు ఈజిప్ట్ తరఫున యాసర్ ఇబ్రహీం (15వ నిమిషం), మొస్తాఫా జికో (67వ నిమిషం) గోల్స్ సాధించారు. ఇక మెస్సీకి ఈ ఫిఫాలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఇది 8వ గోల్ కావడం విశేషం. ప్రస్తుతం ఎంబాపెను దాటిన మెస్సీ 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అర్జెంటీనాకు ఈజిప్ట్ చుక్కలుఇక మ్యాచ్‌లో అర్జెంటీనాకు ఈజిప్ట్ ముచ్చెమటలు పట్టించింది. తొలి హాఫ్ ముగిసేసరికి ఈజిప్ట్ ఒక గోల్ కొట్టి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో హాఫ్లోనూ 67వ నిమిషంలో ముస్తాఫా జీకో రెండో గోల్ కొట్టడంతో ఈజిప్ట్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక మ్యాచ్‌లో అర్జెంటీనా ఓడిపోతుందా? విజయం ఈజిప్ట్దేనా అనే అనుమానాలు రేకెత్తాయి.ఆఖర్లో హైడ్రామా అర్జెంటీనా మ్యాచ్ ఓడిపోతుందా అన్న సమయంలో అసలు డ్రామా మొదలైంది. మరో 15 నిమిషాల్లో ఫుల్‌టైమ్ ముగుస్తుందనగా, అర్జెంటీనా స్ట్రైకర్ క్రిస్టియన్ రొమెరో తొలి గోల్‌తో మెరిశాడు. రైట్ కార్నర్ నుంచి మెస్సీ అందించిన బంతిని బులెట్ హెడర్‌తో క్రిస్టియన్ రొమెరో నేరుగా గోల్ పోస్ట్‌లోకి తరలించాడు. ఇక 83వ నిమిషంలో మెస్సీ బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి తరలించి స్కోరును 2-2తో సమం చేశాడు. 90 నిమిషాలు ముగియడంతో ఇంజ్యూరీ టైమ్ మొదలైంది. 90+3వ నిమిషంలో ఈసారి యెంజో ఫెర్నాండేజ్ హెడర్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించడంతో 3-2తో అర్జెంటీనా ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత ఈజిప్ట్ పలుమార్లు గోల్‌పోస్ట్‌పై దాడులు చేసినప్పటికీ లాభం లేకపోయింది.🚨 GOAL ARGENTINA!LIONEL MESSI EQUALIZES IN THE 83RD MINUTE! 🇦🇷⚽ pic.twitter.com/U0jkSMkgsT— FIFA World Cup 2026 (@FIFAWC26Updates) July 7, 2026 THIS IS WHAT IT MEANS! 💙🥺pic.twitter.com/tvg4ujENTt— BarçaTimes (@BarcaTimes) July 7, 2026 -
వివాదంలో ఎంబాపె.. ‘క్షమాపణ చెప్పకపోతే కోర్టుకీడుస్తా!’
ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు కైలియన్ ఎంబాపె వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ తరఫున అదరగొడుతున్న ఎంబాపె.. పరాగ్వేతో మ్యాచ్ అనంతరం ఆ దేశానికి చెందిన మహిళా సెనెటర్ సెలెస్టే అమరిల్లాను ఉద్దేశించి ‘నీచమైన మహిళ’ అని ఉద్దేశిస్తూ ఎంబాపె తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు పెట్టడం అగ్గిని రాజేసింది. ఎంబాపె తనకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని సెలెస్టే డిమాండ్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఎంబాపె చేసిన వ్యాఖ్యలు జాతి వివక్షపూరితంగా ఉన్నాయని, అతడు క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమని హెచ్చరించడం ఇక్కడ కొసమెరుపు.అసలేం జరిగిందంటే?ఫిఫాలో ప్రిక్వార్టర్స్‌లో ఫ్రాన్స్, పరాగ్వే తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 1-0తో పరాగ్వేను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే మ్యాచ్ పూర్తయ్యాక ఎంబాపే ‘ఎక్స్’లో సెలిస్టే అమరిల్లాను నీచమైన మహిళగా పేర్కొంటూ పోస్ట్ పెట్టాడు. ‘మేడం సెలెస్టీ.. మీరు ఒక నీచమైన మహిళ. సెనేటర్ పదవికి మీరు అనర్హులు. మీరు పరాగ్వే ప్రతినిధులు కారు. ఫిఫా వరల్డ్‌కప్‌లో పరాగ్వే జట్టు అద్భుత ప్రదర్శనతో మీ నిర్లక్ష్య ధోరణిని, మీరు చూపిన జాతి వివక్షను అందరూ మరిచిపోయారు. మీరు అశక్తులు. దేశ ప్రతినిధిగా మిమ్మల్ని చూపడానికి అనర్హులు. విద్వేషాన్ని, జాతివివక్షను ప్రపంచమంతా వ్యాపింప జేయాలనుకునే ఆమెలాంటి వాళ్లను నేను అనుమతించను’ అని ఎంబాపె సంచలన పోస్టు పెట్టాడు.ఎంబాపె పెట్టిన పోస్ట్ చూసి సెలెస్టీ కోపంతో ఉగిపోయింది. తనను నీచమైన మహిళ అనేందుకు, సెనెటర్ పదవికి అనర్హురాలు అనడానికి ఎంబాపెకు అర్హత లేదని మండిపడ్డారు. ‘సమస్య నీకు, నాకు మధ్య. ఫ్రాన్స్‌ను ఉద్దేశించి నేను ఏమీ అనలేదు. నేను ఫ్రాన్స్‌లోని స్కూల్లో చదివాను. పదిహేడేళ్లు వచ్చేవరకూ ఇక్కడే చదివా. ఫ్రెంచ్ మాట్లాడుతా. ఫ్రాన్స్ రావడం అంటే నాకు ఇష్టం. నాకు ఫ్రాన్స్‌తో ఏ సమస్యా లేదు. నీతోనే సమస్య. మ్యాచ్ అనంతరం ఎంబాపే తన కోపాన్ని, ధిక్కార స్వభావాన్ని చూపాడు. పరాగ్వే ఆటగాళ్లు, గోల్ కీపర్ పట్ల అతడు ప్రవర్తించిన తీరు నా దేశాన్ని గాయపరిచింది. కాబట్టి ఎంబాపే తన పోస్ట్ పట్ల బహిరంగ క్షమాపణలు చెప్పాలి. లేదంటే అతడిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటా’ అని సెలెస్టీ పేర్కొంది. గోల్డెన్ బూట్ రేసులో ఎంబాపెఇక ఫిఫా ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్లో మొరాకోతో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. టోర్నీలో ఐదు మ్యాచ్‌లాడిన ఎంబాపె ఏడు గోల్స్, రెండు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో దూసుకుపోతున్నాడు. ఎంబాపెకు పోటీగా అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ కూడా ఉన్నాడు. మెస్సీ 4 మ్యాచ్‌ల్లోనే ఏడు గోల్స్ చేయడం విశేషం. నేడు జరగనున్న ప్రిక్వార్టర్స్‌లో ఈజిప్ట్‌తో అర్జెంటీనా తలపడనున్న నేపథ్యంలో మెస్సీ ఎన్ని గోల్స్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. -
క్రిస్టియానో రొనాల్డో ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
ఫిఫా ప్రపంచకప్ 2026లో పోర్చుగల్ కథ ముగిసింది. టెక్సస్‌లోని డల్లాస్ స్టేడియం వేదికగా జరిగిన రౌండ్ ఆఫ్ 16 (ప్రిక్వార్టర్స్)లో స్పెయిన్ చేతిలో 1-0తో పోర్చుగల్ ఓటమి చవిచూసింది. ఆఖరి నిమిషంలో స్పెయిన్ తరఫున మైకెల్ మెరినో గోల్ కొట్టడంతో పోర్చుగల్‌కు నిరాశే ఎదురైంది. ఇప్పటికే 2026 ఫిఫా ప్రపంచకప్ తనకు చివరిదని ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో మ్యాచ్ ఓటమి తర్వాత రిటైర్మెంట్ ఇస్తాడని అంతా భావించారు. ఇది తన చివరి వరల్డ్‌కప్ అన్న మాట వాస్తవమేనని, కానీ రిటైర్మెంట్కు ఇంకా సమయం ఉందంటూ ఆసక్తికరంగా పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత క్రిస్టియానో రొనాల్డో భావోద్వేగానికి లోనయ్యాడు. ‘ఓటమితో వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడం బాధగా ఉంది. జట్టు కోసం నా శక్తిమేర పోరాడాను. నా వంతు కృషి చేశాననే సంతృప్తితోనే ఉన్నాను. ఇది నా చివరి ప్రపంచ కప్ అన్నది వాస్తవం. కానీ ఇప్పుడే రిటైర్మెంట్ ఇచ్చేసే ఆలోచన లేదు. ఇక నా కుటుంబంతో కొంత సమయం గడిపి.. ఆ తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను. భావోద్వేగంలో తొందరపడి ఎలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోను. క్రిస్టియానో రొనాల్డోకు ముందు కూడా పోర్చుగల్ ఒక్క టైటిల్ గెలవలేదు. నా కెరీర్లో దేశానికి మూడు టైటిళ్లు అందించా. 2016లో గెలిచిన యూరోపియన్ ఛాంపియన్షిప్ నాకు వరల్డ్ కప్‌తో సమానమైన గొప్ప విజయంగా భావిస్తాను. అలాగే రెండు యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ టైటిళ్లు కూడా మా దేశ ఫుట్‌బాల్ చరిత్రలో ప్రత్యేకమైనవే’ అని రొనాల్డో చెప్పుకొచ్చాడు.రొనాల్డో నెట్‌వర్త్ ఎంతంటే?ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటగాళ్ల జాబితాలో క్రిస్టియానో రొనాల్డో నంబర్‌వన్ స్థానంలో ఉంటాడు. ఈ ఏడాది మే నెలలో విడుదలైన జాబితా ప్రకారం క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రీడాకారుడిగా నిలిచాడు. 2026 వరకు చూసుకుంటే అతడి నెట్‌వర్త్ 1.2 బిలియన్ డాలర్ల నుంచి 1.4 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 10 వేల నుంచి 13 వేల కోట్ల మధ్య) వరకు ఉండొచ్చు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ రొనాల్డో ఆస్తలు విలువ దాదాపు 1.4 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. 2025 జూన్‌లో ఒక బిలియన్ మార్క్ దాటిన తొలి ఫుట్‌బాలర్‌గా రొనాల్డో చరిత్రకెక్కాడు.ఆ ఏడాది అల్ నసర్ క్లబ్‌తో ఒప్పందం రొనాల్డో నెట్‌వర్త్ విలువను అమాంతం పెంచేసింది. అల్ నసర్ క్లబ్‌తో రెండేళ్ల కాలానికి గానూ రొనాల్డో చేసుకున్న ఒప్పందం విలువ దాదాపు 400 మిలియన్ డాలర్ల నుంచి 620 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3వేల నుంచి ఆరు వేల కోట్ల మధ్య) మధ్య ఉంటుంది. ఇక క్లబ్ తరఫున ఆడుతూ రొనాల్డో ఏడాదికి వార్షిక వేతనం కింద 200 నుంచి 235 మిలియన్ డాలర్ల (సుమారు 1800 నుంచి 2వేల కోట్ల రూపాయల మధ్య)ను పారితోషికంగా అందుకుంటున్నాడు. 2003లో రొనాల్డో ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా మారిన తర్వాత మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, జూవెంటస్, అల్నసర్ క్లబ్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ దాదాపు 550 మిలియన్ డాలర్లకు పైగా ఉండేది. ఇక నైక్‌తో చాలా ఏళ్ల క్రితమే కుదుర్చుకున్న ఒప్పందంతో ఒక బిలియన్ డాలర్ల విలువను దాటేశాడు. ఇది జీవితకాలం ఒప్పందం కావడంతో అతడు ఆడుతున్నా, ఆడకపోయినా ఆదాయం వస్తూనే ఉంటుంది. ఇక రొనాల్డో బ్రాండ్ హోటల్స్, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, జిమ్ వరకు విస్తరించి ఉంది. రొనాల్డోకు చెందిన హోటళ్లు లిస్బన్, మదీరా, మాడ్రిడ్, న్యూయార్క్, మారకేశ్లలో కోట్లలో ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. ఎండార్స్మెంట్లలో భాగమైన హెర్బ్లైఫ్, క్లియర్, ఆర్మానీ ప్రొడక్ట్‌ల ద్వారా 50 నుంచి 60 మిలియన్ల డాలర్లు పొందుతున్నాడు. సోషల్ మీడియా ఖాతాలో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ఆటగాడిగా రొనాల్డో తొలి స్థానంలో ఉన్నాడు. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచే రొనాల్డో ఏడాదికి 125 నుంచి 175 మిలియన్ డాలర్ల (సుమారు వెయ్యి నుంచి 1600 కోట్ల రూపాయల మధ్య)ను సంపాదిస్తున్నాడు.Cristiano Ronaldo: 🗣️ "I've won three titles with Portugal. Before Cristiano, Portugal hadn't won anything.The biggest title I won with the National Team was Euro 2016. FOR ME, IT HAS THE SAME DIMENSION AS A WORLD CUP." 😳🇵🇹 pic.twitter.com/kqDd3Oo5Qf— World Cup HQ (@WorldCup26HQ) July 6, 2026 -
పదేళ్ల క్రితమే భారత్‌ను దెబ్బకొట్టిన ఎర్లింగ్ హాలండ్
ఫిఫా ప్రపంచకప్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎర్లింగ్ హాలండ్ పేరే వినిపిస్తోంది. ఐదుసార్లు ఫిఫా చాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్‌ను నార్వే రౌండ్ ఆఫ్ 16 (ప్రిక్వార్టర్స్)లోనే నాకౌట్ చేయడం వెనుక ఎర్లింగ్ హాలండ్ కొట్టిన రెండు గోల్స్ ప్రధాన కారణంగా నిలిచాయి. అయితే 1998లో తొలిసారి నార్వే ఫిఫా ప్రపంచకప్‌లో పాల్గొంది.అప్పటి నుంచి నాలుగుసార్లు మాత్రమే ఫిఫా ప్రపంచకప్‌లు ఆడిన నార్వే ఏనాడు నాకౌట్ దశలో అడుగుపెట్టలేదు. కానీ ఈసారి మాత్రం ప్రిక్వార్టర్లో బలమైన బ్రెజిల్‌ను ఓడించిన నార్వే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్స్‌లో నార్వే మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఎదుర్కోనుంది. అయితే 1998లో తొలిసారి ఫిఫా ఆడినప్పుడు ఎర్లింగ్ హాలండ్ ఇంకా పుట్టనే లేదు. కట్‌చేస్తే నాలుగోసారి ఫిఫా ఆడుతున్న నార్వే జట్టులో ఎర్లింగ్ హాలండ్ ఒక సూపర్‌స్టార్. అలాంటి ఎర్లింగ్ హాలండ్.. ఒకప్పుడు నార్వే అండర్-17 టీమ్ తరఫున భారత జట్టుతో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడడం ఇప్పడు వైరల్‌గా మారింది. ఆనాటి మ్యాచ్‌లో నార్వే 2-0తో భారత్‌పై విజయం సాధించింది. మ్యాచ్‌లో ఎర్లింగ్ హాలండ్ 57వ నిమిషంలో తొలి గోల్ కొట్టగా, 80వ నిమిషంలో ఎరిక్ బోథీమ్ మరో గోల్ కొట్టాడు. అయితే మొదటి హాఫ్ ముగిసిన తర్వాత భారత ఆటగాడు సంజీవ్ దురుసు ప్రవర్తనతో రెండోసారి యెల్లో కార్డ్‌కు గురవ్వడంతో భారత జట్టు పది మందితోనే ఆడాల్సి వచ్చింది. కాగా ఎర్లింగ్ హాలండ్ గోల్ కొడుతున్న అప్పటి ఫొటో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. అయితే 2017 ఫిఫా అండర్-17 ప్రపంచకప్‌కు కేవలం ఏడాది సమయం మాత్రమే ఉండడంతో అన్ని జట్లు తమ మ్యాచ్‌ల్లో మునిగితేలాయి. అప్పుడు ఎర్లింగ్ హాలండ్ నార్వే అండర్-17 తరఫున, బ్రెజిల్ అండర్-17 తరఫున వినిసియస్ జూనియర్ ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు తమ జట్ల తరఫున 2026 ఫిఫా ప్రపంచకప్‌లో సోమవారం ప్రత్యర్థులుగా తలపడడం విశేషం. ఎర్లింగ్ హాలాండ్ సారథ్యంలోని నార్వే ఫీఫా ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్స్‌కు సన్నద్ధమవుతుంది. మరోవైపు భారత ఫుట్‌బాల్ జట్టు మాత్రం ఇప్పటివరకు ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది. ఫిఫాలోని 211 సభ్య దేశాల్లో భారతదేశం 138వ ర్యాంకులో కొనసాగుతోంది.By the way, I won that ball. Just saying 😉 https://t.co/c6A5pZ7vBy— Suresh Wangjam (@SureshWangjam) June 16, 2022చదవండి: బంగ్లాదేశ్‌పై జింబాబ్వే సంచలన విజయం -
పెనాల్టీ షూటౌట్లో విజయం.. తొలిసారి ప్రిక్వార్టర్స్‌కు ఈజిప్ట్
ఫిఫా ప్రపంచకప్‌లో ఈజిప్ట్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 32లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఈజిప్ట్ పెనాల్టీ షూటౌట్లో 4-2తో విజయం సాధించింది. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 1-1తో సమంగా ఉండడంతో మ్యాచ్ డ్రా అయింది. దీంతో మ్యాచ్‌లో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఫలితంగా పెనాల్టీ షూటౌట్ ద్వారా ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్‌లో ఈజిప్ట్ తరఫున ఇమామ్ అశోర్ (13వ నిమిషం) గోల్ కొట్టగా.. 55వ నిమిషంలో మొహమ్మద్ హనీ సెల్ఫ్ గోల్ కొట్టడంతో అది ఆస్ట్రేలియా ఖాతాలోకి వెళ్లిపోయింది. ఎక్స్ట్రా టైమ్‌లోనూ ఇరుజట్లు మరో గోల్కొట్టడంలో విఫలమయ్యాయి. అయితే పెనాల్టీ షూటౌట్లో తొలి కిక్‌లో ఆస్ట్రేలియా తరఫున హారి సౌట్టర్ బంతిని కిక్ చేయగా అది క్రాస్‌బార్‌ను తాకుతూ వెళ్లిపోయింది. ఈజిప్ట్ తరఫున మహ్మూద్ సాబెర్ స్కోర్ చేశాడు. ఇక రెండో కిక్‌లో ఆస్ట్రేలియా తరఫున జాక్సన్ ఇర్విన్, ఈజిప్ట్ తరఫున రామి రబియా స్కోర్ చేశారు. మూడో కిక్‌లో ఈజిప్ట్ తరఫున మహ్మద్ సాలా, ఆసీస్ తరఫున అవర్ మాబిల్ స్కోర్ చేయడంతో ఆధిక్యం 3-2కు తగ్గింది. కీలకమైన నాలుగో కిక్‌లో ఆస్ట్రేలియా మిస్ చేయగా, ఈజిప్ట్ తరఫున అబ్దెల్మిగుడ్ స్కోర్ చేయడంతో 4-2తో ఈజిప్ట్ జయకేతనం ఎగురవేసింది. ఆస్ట్రేలియాపై విజయంతో ఫిఫా చరిత్రలో ఈజిప్ట్ తొలిసారి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. అంతేకాదు ఆఫ్రికా నుంచి ఫిఫాలో రౌండ్-16కు అర్హత సాధించిన రెండో దేశంగా ఈజిప్ట్ నిలిచింది. ఇక రౌండ్-16లో అర్జెంటీనా, కేప్‌వెర్డె మధ్య విజేతతో ఈజిప్ట్ తలపడనుంది.సెల్ఫ్ గోల్స్ రికార్డుఈసారి ఫిఫా ప్రపంచకప్‌లో సెల్ఫ్ గోల్స్ విషయంలో ఒక చెత్త రికార్డు నమోదయ్యింది. ఈ టోర్నీలో ఈజిప్ట్ ఆటగాడు మొహ్మద్ హనీ కొట్టిన సెల్ఫ్ గోల్ 13వది కాగా.. గతంలో ఫిఫా టోర్నీలో నమోదైన 12 సెల్ఫ్ గోల్స్ రికార్డు బద్దలయ్యింది. 13 సెల్ఫ్ గోల్స్‌తో ఫిఫా ప్రపంచకప్ 2026 కొత్త రికార్డు సృష్టించింది. 2018లో రష్యాలో జరిగిన ఫిఫా టోర్నీలో 12 సెల్ఫ్ గోల్స్ నమోదవ్వగా, 1998లో ఫ్రాన్స్ వేదికగా జరిగిన ఫిఫాలో ఆరు గోల్స్, 2014లో బ్రెజిల్ వేదికగా జరిగిన ఫిఫాలో ఐదు సెల్ఫ్ గోల్స్ నమోదయ్యాయి.Egypt won their first ever knockout match at worldcup, i loved their celebration. But in whole match Mo salah has been carried by mostafa ziko and Emam ashour, he showed his mediocrity today at global level. One penalty is enough to satisfy his dumbass fans😭 pic.twitter.com/Mhmraf5Vy0— shaurya nirjhar (@Shaurya_Nirjhar) July 3, 2026 -
గోల్ నుంచి కొనుగోలు దాకా...
భారతదేశంలో అత్యంత వ్యయప్రయాసలతో నిర్మించిన ‘రామాయణ్’ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడు కావచ్చు కానీ మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న సాకర్ మ్యాచ్‌లు చూస్తూ కేరింతలు కొట్టే ఫుట్‌బాల్ క్రీడాభిమాని కూడా. నిరుపేద పిల్లలను ఆదుకునేందుకు నిధుల సేకరణకోసం ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన 18 మంది బాలీవుడ్ ప్రముఖులతో కూడిన ఆల్ స్టార్ ఫుట్‌బాల్ క్లబ్లో సభ్యుడు. అయితే ఫుట్‌బాల్‌పై అభిమానం అంతటితో ఆగిపోలేదు.జీవితంలో ఓ భాగం‘రణబీర్ ఎంత పెద్ద ఫుట్‌బాల్ అభిమాని అంటే... కేవలం ఒక మ్యాచ్ చూడటం కోసమే ఆయన ఒక్కరోజులో బార్సిలోనా దాకా ప్రయాణించేవాడు’’ అంటూ ఆ క్లబ్ భాగస్వామి బిమల్ పరేఖ్ గుర్తు చేసుకుంటారు. ఫుట్‌బాల్‌పై అమితమైన ఆసక్తి ఉన్న రణబీర్ కపూర్, గత 2014లో ‘ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్’ను కొనుగోలు చేశారు. ఒకే సీజన్ లో ‘లీగ్ విన్నర్స్ షీల్డ్’’ఐఎస్ఎల్ కప్’ టైటిల్ రెండింటినీ గెలుచుకున్న మొదటి క్లబ్‌గా ఆయన క్లబ్ నిలిచింది. ఆ తర్వాత, కూడా రెండుసార్లు ఐఎస్ఎల్ లీగ్ విన్నర్స్ షీల్డ్‌ను కైవసం చేసుకుంది.‘చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్ నా జీవితంలో ఒక భాగం, ఇప్పుడు ఇండియన్ సూపర్ లీగ్‌లో ముంబై నగరానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం. నాకున్న ఆసక్తిని ఈ క్రీడ అభివృద్ధికి వినియోగించడం సంతోషం కలిగిస్తోంది’’ అంటారు రణబీర్.నటుడిగా కన్నా ఆటగాడిగానే...తన బిజీ షూటింగ్ షెడ్యూల్లో కాస్త తీరిక దొరికితే చాలు... రణబీర్ ముంబైలోని ఒక ఫుట్‌బాల్ మైదానంలో సినీ పరిశ్రమకు చెందిన తన స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ ఆడటానికి వెళ్లిపోతాడు. ‘ప్రతి రాత్రి పడుకునే ముందు, నటుడిగానో లేదా స్టార్‌గానో సినిమా సెట్లో ఉన్నట్టు అనుకోను. ఫుట్‌బాల్ మైదానంలో 8వ నంబర్ జెర్సీ ధరించిన ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా మాత్రమే నన్ను నేను ఊహించుకుంటాను. దిగ్గజ క్రీడాకారులు మెస్సీ ఇనియెస్టాలకు బంతిని పాస్ చేస్తున్నట్లు కలలు కంటాను’’ అని చెప్పడాన్ని బట్టి రణబీర్ క్రీడాసక్తిని అర్థం చేసుకోవచ్చు.‘‘దేశానికి గర్వకారణంగా నిలిచిన ఏ క్రీడాకారుడిపైనైనా భవిష్యత్తులో క్రీడా నేపథ్యం ఉన్న సినిమా చేయాలని కోరుకుంటున్నాను,’’ అని కూడా రణబీర్ చెప్పాడు. ’‘ఫుట్‌బాల్ ఆట ఆడటం వల్ల అడ్రినలిన్ పెరుగుతుంది, ఇది ప్రేక్షకులను అత్యంత లీనమయ్యేలా చేసే ఆట. దీనిలోని ప్రతి నిమిషం, ప్రతి సెకను ఆటగాళ్లకు, ప్రేక్షకులకు ఉత్సాహాన్నిస్తూనే ఉంటుంది’’ అని అంటారాయన. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులైన ప్రేక్షకులతోపాటు ఆయన కూడా ఆ ఉత్సాహాన్ని అనుభవిస్తున్నారు.– సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
ఫిఫా నుంచి జట్టు నిష్క్రమణ.. స్టార్ ఫుట్‌బాలర్ వీడ్కోలు
ఫిఫా ప్రపంచకప్ నుంచి అల్జీరియా నిష్క్రమించిన తర్వాత ఆ జట్టు స్టార్ ఫుట్‌బాలర్ రియాద్ మహ్రెజ్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఫిఫా టోర్నీలో రౌండ్ ఆఫ్-32లో స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్జీరియా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు రియాద్ మెహ్రెజ్ తెలిపాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అల్జీరియా తరఫున 119 మ్యాచ్‌లాడిన 35 ఏళ్ల ఫార్వార్డ్ ప్లేయర్ రియాద్ మహ్రెజ్ 40 గోల్స్ సాధించి జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 2019లో ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ (ఆఫ్కన్) టైటిల్ అందించడంలో రియాద్ మహ్రెజ్ది కీలకపాత్ర. అయితే రియాద్ మహ్రెజ్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌కు దూరమైనప్పటికీ, సౌదీ ప్రో లీగ్ క్లబ్ @అల్ అహ్లీ తరఫున ఫ్రొఫెషనల్ క్లబ్ కెరీర్‌ను కొనసాగించనున్నాడు. ఇక క్లబ్ స్థాయిలో రియాద్ మహ్రెజ్ లీసెస్టర్ సిటీతో ఒక ప్రీమియర్ లీగ్ టైటిల్, మాంచెస్టర్ సిటీతో నాలుగు టైటిళ్లు , అలాగే సిటీతో ఒక ఛాంపియన్స్ లీగ్ టైటిల్‌ను సాధించాడు. 2026 ఫిఫా ప్రపంచకప్‌లో 4 మ్యాచ్‌లాడిన రియాద్ మహ్రెజ్ 2 గోల్స్‌తో పాటు ఒక అసిస్ట్ అందించాడు. 'నా రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం. సహజంగానే అందరి కెరీర్లో ఎత్తుపల్లాలు ఉన్నట్లే నా కెరీర్లోనే అన్ని కష్టాలు, సంతోషాలు అనుభవించాను. చిన్నప్పటి నుంచి అల్జీరియాకు ప్రాతినిధ్యం వహించడం, నాదేశం కోసం ఆడడమనేది నా కల. ఇది నాకు లభించిన అపారమైన గౌరవం, గర్వకారణం. ఇక ఇప్పుడు కొత్త తరం ఆడాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే వీడ్కోలుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. గుడ్‌బై' అని పోస్టు పెట్టాడు.🇩🇿 Riyad Mahrez : "C'était un match à notre portée."👀 Il annonce son dernier match avec la sélection #beINFWC2026 #FIFAWorldCup pic.twitter.com/y0C908Rsxx— beIN SPORTS (@beinsports_FR) July 3, 2026Read: గోల్‌కీపర్ ప్రపంచ రికార్డు.. ప్రిక్వార్టర్స్‌కు స్పెయిన్ -
గోల్‌కీపర్ ప్రపంచ రికార్డు.. ప్రిక్వార్టర్స్‌కు స్పెయిన్
ఫిఫా ప్రపంచకప్‌లో స్పెయిన్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 32లో భాగంగా లాస్ ఏంజిల్స్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ 3-0తో ఆస్ట్రియాను చిత్తు చేసింది. స్పెయిన్ తరఫున మికెల్ ఒజర్బయాల్ (37, 89వ నిమిషం) డబుల్ గోల్స్ చేయగా, పెడ్రో పోరో (66వ నిమిషం) మరో గోల్ సాధించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. స్పెయిన్ తొలి గోల్ 37వ నిమిషంలో నమోదైంది. ఎడమ వైపు నుంచి వచ్చిన లో క్రాస్‌ను బాక్స్ మధ్యలో నుంచి మికెల్ బంతిని గోల్‌పోస్టులోకి పంపించాడు. ఆ తర్వాత ఆట 89వ నిమిషంలో మరో గోల్ సాధించాడు. ఇది కూడా మొదటి గోల్‌ను పోలి ఉంటుంది. లో క్రాస్ నుంచి వచ్చిన బంతిని అందుకున్న మికెల్ నేరుగా నెట్లోకి పంపించాడు. దీంతో ఫిఫా 2026లో మికెల్ తన గోల్స్ సంఖ్యను నాలుగుకు పెంచుకున్నాడు. ఇక డిఫెండర్ పెడ్రో పోరో రైఫిల్ హెడర్ షాట్‌తో బంతిని గోల్‌పోస్టులోకి పంపించి ఆధిక్యాన్ని మూడుకు పెంచాడు. ఇక ప్రత్యర్థి ఆస్ట్రియాను స్పెయిన్ ఉక్కిరిబిక్కిరి చేసింది. పటిష్టమైన డిఫెన్స్‌తో ఆస్ట్రియాను కేవలం ఐదుషాట్స్కే పరిమితం చేశారు. మొత్తం 90 నిమిషాల ఆటలో ఆస్ట్రియా ఒక్కసారి కూడా లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది.ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో స్పెయిన్ ఒకటి కంటే ఎక్కువ గోల్స్ సాధించడం 1994 తర్వాత ఇదే తొలిసారి. 1994 ఫిఫా వరల్డ్‌కప్‌లో స్పెయిన్ నాకౌట్ దశలో స్విట్జర్లాండ్‌పై 3-0తో గెలిచింది. లామినే యమాల్, పౌకుబార్సీ వంటి ఇద్దరు టీనేజర్లు ఉన్న ఏకైక జట్టుగా స్పెయిన్ నిలిచింది. ఈ ద్వయం గతంలో బ్రెజిల్ దిగ్గజం పీలే, జోస్ అల్టాఫిని పేరిట ఉన్న 68 ఏళ్ల ప్రపంచరికార్డును బద్దలుకొట్టింది. ఇక ప్రిక్వార్టర్స్‌లో స్పెయిన్.. క్రొయేషియా, పోర్చుగల్ మధ్య విజేతతో తలపడనుంది. స్పెయిన్ గోల్ కీపర్ గిన్నిస్ రికార్డుఈ క్రమంలో స్పెయిన్ గోల్ కీపర్ ఉనై సైమన్ ప్రపంచ రికార్డు సాధించాడు. ఫిఫా టోర్నమెంట్లో 519 నిమిషాల పాటు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా, సైమన్ తొలి గోల్ కీపర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును లిఖించుకున్నాడు. ఫిఫా 2026 టోర్నీ గ్రూప్ దశ నుంచి తాజాగా లాస్ ఏంజెల్స్‌లో ఆస్ట్రియాతో జరిగిన నాకౌట్ మ్యాచ్ వరకు ఉనై సైమన్ తన ప్రత్యర్థులకు ఒక్క గోల్ కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో 1990 ఫీఫా ప్రపంచ కప్ సమయంలో ఇటలీ దిగ్గజ గోల్ కీపర్ వాల్టర్ జెంగా నెలకొల్పిన 517 నిమిషాల మునుపటి రికార్డును సైమన్ బద్దలుకొట్టాడు. Unai Simón has now gone the longest time in World Cup history without conceding a goal beating Walter Zenga's record from 1990 🧤🤯🔝 pic.twitter.com/RC57OFSjCq— OneFootball (@OneFootball) July 2, 20261 - Con #España 🇪🇸, Unai Simón (519 minutos) se ha convertido en el portero con el mayor récord de imbatibilidad en la historia del #Mundial.Ha superado los 517 de Walter Zenga.Histórico. https://t.co/bq6usGgiDX— OptaJose (@OptaJose) July 2, 2026 -
నాకౌట్ అయిన సెనెగల్.. బెల్జియంను వరించిన అదృష్టం
ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. సెనెగల్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో బెల్జియం 3-2 తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. దీంతో సెనెగల్ ఫిఫా నుంచి నాకౌట్ అయింది. బెల్జియం తరఫున రొమెలు లుకాకు (86వ నిమిషం), కెప్టెన్ యురి టిలేమన్స్ (89, 120+5వ నిమిషం)లో డబుల్ గోల్స్‌తో మెరిశాడు. ఇక సెనెగల్ తరఫున హబిబ్ డియారా (24వ నిమిషం), ఇస్మాయిలా సర్ (51వ నిమిషం) గోల్స్ సాధించారు. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 2-2తో సమానంగా నిలిచాయి. ఇంజ్యూరీ టైమ్‌లోనూ గోల్ కొట్టలేదు. అయితే ఎక్స్ట్రా టైమ్‌లో టిలేమన్స్ను బంతిని కొట్టకుండా సెనెగల్ ఆటగాడు లామినే కమారా ఉద్దేశపూర్వకంగా కింద పడేసినట్లు తేలడంతో రిఫరీ బెల్జియంకు పెనాల్టీ కిక్ అవకాశమిచ్చారు.దీంతో తనకు లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచడంలో టిలేమన్స్ సక్సెస్ అయ్యాడు. దీంతో బెల్జియం విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ఇక బెల్జియం.. ప్రిక్వార్టర్స్‌లో అమెరికా, బోస్నియా అండ్ హెర్జెగొవినా మధ్య మ్యాచ్ విజేతతో తలపడనుంది.🚨 FULL-TIME 🚨A contentious late penalty sees #Tielemans fire Belgium into the Round of 16, completing a remarkable comeback from 2-0 down against Senegal.Follow #BELvsSEN LIVE👇https://t.co/bwW66t0MyP pic.twitter.com/4I1OfCUhrd— India Today Sports (@ITGDsports) July 1, 2026 Youri Tielemans has cemented his place in my hate watchlist with this absolutely shambolic piece of sportsmanship tonight. And that dive to get the penaltt is not even the only stuff he pulled.Here's how he scored the equalizer! #BELvsSEN pic.twitter.com/ifiYZvCeZw— দীপজিৎ (@BeingDeepjit) July 1, 2026 -
హ్యారికేన్ విధ్వంసం.. ప్రిక్వార్టర్స్‌లో ఇంగ్లండ్
ఫిఫా ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి డీఆర్ కాంగోతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-1 తేడాతో విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారికేన్ డబుల్ గోల్స్ (75, 86వ నిమిషం) చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక కాంగో తరఫున 7వ నిమిషంలో బ్రియాన్ సిపెంగా గోల్ కొట్టాడు. మ్యాచ్ తొలి అర్ధభాగంలో ఇంగ్లండ్‌పై కాంగో ఆధిపత్యం ప్రదర్శించడం విశేషం. మ్యాచ్ మొదలైన కాసేపటికే కాంగో తరఫున బ్రియాన్ గోల్ చేయడం ఇంగ్లండ్ జట్టును షాక్‌కు గురి చేసింది. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంగ్లండ్ గోల్ కొట్టడంలో సఫలం కాలేకపోయింది. అయితే రెండో అర్ధభాగంలోనూ మూడో క్వార్టర్ వరకు ఇంగ్లండ్ గోల్ చేయకపోవడం గమనార్హం. ఇక ఓటమి తప్పదనుకున్న దశలో హ్యారికేన్ విజృంభించాడు. తనలోని విన్యాసాలను బయటకు తీసిన హ్యారికేన్ 75వ నిమిషంలో గోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత మరో 11 నిమిషాల వ్యవధిలో రెండో గోల్ కొట్టి ఇంగ్లండ్‌ను 2-1తో ఆధిక్యంలో నిలిపాడు. తద్వారా నిర్ణీత సమయంలో కాంగో మరో గోల్ కొట్టడంలో విఫలం కావడంతో ఇంగ్లండ్ ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది.ఇక హ్యారికేన్ టోర్నీలో ఐదు గోల్స్ కొట్టడం ద్వారా గోల్డెన్ బూట్ రేసులో కొనసాగుతున్నాడు. మెస్సీ, ఎంబాపె చెరో ఆరు గోల్స్‌తో సంయుక్తంగా ఉండగా, హాలండ్, హ్యారికేన్లు చెరో 5 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నారు.🌎🏴 ENGLAND BEAT RD CONGO AND FLY TO WORLD CUP ROUND 16!Brace for Harry Kane beating Pele’s goals record with 12 👑Proud Congo performance once again 👏🏽🇨🇩 pic.twitter.com/4GALURPta8— Fabrizio Romano (@FabrizioRomano) July 1, 2026 -
మెస్సీని దాటేసిన ఎంబాపె.. ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లిన ఫ్రాన్స్
ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ దూసుకుపోతోంది. టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ జట్టు రౌండ్ ఆఫ్ 32లో స్వీడన్‌ను 3-0తో చిత్తు చేసింది. కైలియన్ ఎంబాపె మరోసారి డబుల్ గోల్స్ (45, 74వ నిమిషం)తో మెరవగా, బ్రాడ్లీ బార్కోలా (53వ నిమిషం) మరో గోల్ సాధించాడు. ఫ్రాన్స్ దూకుడుకు స్వీడన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఎక్కువసేపు బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకోవడంతో స్వీడన్‌కు గోల్‌పోస్టుపై దాడులు చేసే అవకాశాలు కూడా తక్కువగానే వచ్చాయి. నిర్ణీత సమయం ముగిసేలోపే ఫ్రాన్స్ విజయం ఖరారు అయిపోయింది. ఇక ప్రీ క్వార్టర్స్‌లో పరాగ్వేతో ఫ్రాన్స్ తలపడనుంది.ఆమడదూరంలో మెస్సీఫిఫా చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌ల్లో కైలియన్ ఎంబాపె సరికొత్త రికార్డు సృష్టించాడు. మెస్సీకి కూడా సాధ్యం కాని రికార్డును ఎంబాపె తన పేరిట లిఖించుకున్నాడు. అదేంటంటే ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా ఎంబాపె (10 గోల్స్) తొలి స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో బ్రెజిల్ దిగ్గజ ఆటగాళ్లు లియోనిదాస్, రొనాల్డో ఫిఫా నాకౌట్ దశలో (8 గోల్స్) సమానంగా ఉన్నారు. వీరి తర్వాత జస్ట్ ఫౌంటైన్, వావా, ఒల్డ్రిచ్, పీలే (7 గోల్స్) ఉన్నారు. ఇక అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ (5 గోల్స్) 12వ స్థానంలో నిలిచి ఎంబాపెకు ఆమడ దూరంలో నిలిచాడు. ఇక ఎంబాపె ఆడిన మూడు వరల్డ్‌కప్స్ (2018, 2022, 2026) నాకౌట్ దశలు కలిపి 10 గోల్స్ కొట్టగా.. ఇందులో 2018లో నాకౌట్ దశలో మూడు గోల్స్, 2022 ఫిఫా నాకౌట్ దశల్లో ఐదు గోల్స్, తాజాగా 2026 ఫిఫాలో నాకౌట్ దశలో ఇప్పటికే రెండు గోల్స్ సాధించాడు. ఈ ప్రపంచకప్ ముగిసేసరికి నాకౌట్ దశలో ఇంకెన్ని గోల్స్ చేస్తాడో చూడాలి. ఈ లెక్కన 27 ఏళ్ల ఎంబాపె వచ్చే ఫిఫా ప్రపంచకప్ (2030) నాటికి ఎవరికీ అందనంత ఎత్తులో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.మెస్సీ రికార్డుకు అడుగు దూరంలోఇక ఫ్రాన్స్ సంచలనం కైలియన్ ఎంబాపె రికార్డుల మీద రికార్డులు సాధిస్తూనే వస్తున్నాడు. తాజాగా స్వీడన్‌తో మ్యాచ్‌లో రెండు గోల్స్ చేయడం ద్వారా ఎంబాపె (18 గోల్స్) ఫిఫాలో అత్యధిక గోల్స్ చేసిన ఆల్‌టైమ్ ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో జర్మనీ దిగ్గజం మిరాస్లావ్ క్లోజ్ (16 గోల్స్) రికార్డును బద్దలుకొట్టాడు. ఇక అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ 19 గోల్స్‌తో తొలి స్థానంలో ఉన్నాడు. మెస్సీ రికార్డును సమం చేయడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్న ఎంబాపె అత్యధిక గోల్స్ తన పేరిట లిఖించుకోవడానికి మాత్రం ప్రస్తుతానికైతే రెండు గోల్స్ దూరంలో నిలిచాడు. కేప్‌వెర్డెతో జరగనున్న మ్యాచ్‌లో మెస్సీ గోల్స్ చేస్తే మాత్రం ఎంబాపె ఆ రికార్డును అందుకోవడానికి సమయం పడుతుంది. ఏది ఏమైనా ఎంబాపె మాత్రం మెస్సీ రికార్డును ఈ ఫిఫాలోనే అధిగమించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఫిఫాలో అత్యధిక గోల్స్ జాబితాలియోనల్ మెస్సీ (అర్జెంటీనా)- 19 గోల్స్కైలియన్ ఎంబాపె (ఫ్రాన్స్)- 18 గోల్స్మిరాస్లావ్ క్లోజ్ (జర్మనీ)- 17 గోల్స్రొనాల్డో (బ్రెజిల్)- 16 గోల్స్గెర్డ్ ముల్లర్ (జర్మనీ)- 14 గోల్స్జస్ట్ ఫౌంటైన్ (ఫ్రాన్స్)- 13 గోల్స్పీలే (బ్రెజిల్)- 12 గోల్స్Kylian Mbappé scores his NINTH goal in the World Cup knockouts. The most of any men's player ever 😲🇫🇷 pic.twitter.com/mq0JT61eJz— B/R Football (@brfootball) June 30, 2026 -
హాలండ్ ప్రపంచ రికార్డు.. ప్రిక్వార్టర్స్‌కు నార్వే
ఫిఫా ప్రపంచకప్‌లో 28 ఏళ్ల తర్వాత నార్వే జట్టు ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 32లో భాగంగా మంగళవారం రాత్రి ఐవరీ కోస్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్వే 2-1 తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. నార్వే తరఫున ఆంటోనియో నుసా (39వ నిమిషం), ఎర్లింగ్ హాలండ్ (86వ నిమిషం) గోల్స్ చేశారు. ఇక ఐవరీ కోస్ట్ తరఫున అమడ్ డియాల్లో (74వ నిమిషం) గోల్ సాధించాడు. ప్రిక్వార్టర్స్‌లో బ్రెజిల్‌తో నార్వే అమీతుమీ తేల్చుకోనుంది. ఆట మొదలైన తర్వాత తొలి హాఫ్‌కు ముందు నార్వేకు ఆంటోనియో గోల్ అందించాడు. రెండో అర్ధభాగంలో ఐవరీ కోస్ట్ తరఫున అమడ్ డియాల్లో గోల్ చేసి ఆ జట్టు తరఫున నాకౌట్లో తొలి గోల్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక మ్యాచ్ డ్రా దిశగా నడుస్తున్న సమయంలో నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలండ్ 82వ నిమిషంలో తన సహచరుడు అందించిన పాస్‌ను ఏమాత్రం తప్పు చేయకుండా సింపుల్‌గా గోల్‌పోస్ట్‌లోకి పంపించి ఆధిక్యాన్ని 2-1కి పెంచాడు. ఆ తర్వాత నిర్ణీత సమయం ముగిసిన తర్వాత ఇంజ్యూరీ టైమ్‌లో ఐవరీ కోస్ట్ గోల్ చేయడంలో విఫలం కావడంతో నార్వే విజయాన్ని సాధించింది.ఇక నార్వే స్టార్ ఎర్లింగ్ హాలండ్ ఐవరీ కోస్ట్‌తో మ్యాచ్‌లో గోల్ చేయడం ద్వారా అరుదైన రికార్డు సాధించాడు. తొలి ప్రపంచకప్ ఆడుతున్న ఎర్లింగ్ హాలండ్ తాను ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ గోల్ కొట్టడం విశేషం. ఈ నేపథ్యంలో తన తొలి ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గోల్స్ సాధించిన హాలండ్.. గెర్డ్ ముల్లర్ (జర్మనీ), యూసెబియో (పోర్చుగల్), జస్ట్ ఫాంటైన్ (ఫ్రాన్స్) వంటి దిగ్గజ స్ట్రైకర్ల సరసన చోటు సంపాదించాడు. మొత్తం మీద నాలుగు మ్యాచ్‌ల్లో హాలండ్ ఆరు గోల్స్ చేశాడు. మరోవైపు తొలిసారి నాకౌట్ మ్యాచ్ ఆడిన ఐవరీ కోస్ట్ తన స్థాయిని మించి ప్రదర్శన చేసిందని చెప్పొచ్చు. Well done, Norway! 🇳🇴 Congratulations on the victory!You rowed hard throughout the entire match! pic.twitter.com/6m8IueBJ0r— Orla Joelsen (@OJoelsen) June 30, 2026 👽🇳🇴 3 starts, 5 goals. Erling Haaland has scored in every single World Cup game he’s played in his career.Absolute machine. pic.twitter.com/XIMg3UJQbP— Fabrizio Romano (@FabrizioRomano) June 30, 2026 -
ఫిఫాలో సంచలనం.. పెనాల్టీ షూటౌట్లో జర్మనీ ఓటమి
ఫిఫా ప్రపంచకప్ 2026లో మాజీ చాంపియన్ జర్మనీ ఆట ముగిసింది. రౌండ్ ఆఫ్ 32లో పరాగ్వేతో జరిగిన పోరులో పెనాల్టీ షూటౌట్లో 4-3తో జర్మనీ ఓటమి చవిచూసింది. ఐదోసారి ఫిఫా చాంపియన్‌గా నిలవాలని భావించిన జర్మనీకి పరాగ్వే చెక్ పెట్టింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో నిర్ణీత సమయం ముగిసేలోపు ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. జర్మనీ తరఫున ఆట 54వ నిమిషంలో కాయ్ హావెర్ట్జ్ గోల్ చేయగా, పరాగ్వే తరఫున ఆట 42వ నిమిషంలో జులియో ఎన్సియో గోల్ సాధించాడు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఇంజ్యూరీ టైమ్‌తో పాటు ఎక్స్ట్రా టైమ్ (మరో 30 నిమిషాలు) అదనంగా కేటాయించినప్పటికీ జర్మనీ, పరాగ్వే గోల్ కొట్టడంలో విఫలమయ్యాయి. దీంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. 2018, 2022 ఫిఫా ప్రపంచకప్పుల్లో గ్రూప్ దశలోనే వెనుదిరిగిన జర్మనీ ఈసారి మాత్రం గ్రూప్ దశను దాటినప్పటికీ రౌండ్ ఆఫ్ 16ను దాటడంలో విఫలమయ్యింది. ఇక నాకౌట్ దశను దాటి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టిన పరాగ్వే జట్టు అత్యుత్తమ ప్రదర్శన 2010 ఫిఫాలో వచ్చింది. ఆ ఏడాది ప్రపంచకప్‌లో పరాగ్వే క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. THE FOUR-TIME WORLD CUP WINNERS, GERMANY, ARE ELIMINATED IN THE ROUND OF 32 BY PARAGUAY ON PENALTIES.The first upset of the knockout stage 🤯 pic.twitter.com/axPr7fNdEN— ESPN (@espn) June 29, 2026🚨🚨💣 QUEL ÉNORME COUP DE TONNERRE : LE PARAGUAY 🇵🇾 ÉLIMINE L'ALLEMAGNE 🇩🇪 DÈS LES SEIZIÈMES DE FINALE DU MONDIAL !!! 🤯⚡️CONTRE TOUTE ATTENTE, LES PARAGUAYENS S'IMPOSENT AUX TIRS AU BUT CONTRE LES QUADRUPLES CHAMPIONS DU MONDE !!!C'EST UNE FOLIE, LES ALLEMANDS N'ONT PLUS… pic.twitter.com/pOz2lRnZi9— Actu Foot (@ActuFoot_) June 29, 2026 -
ఆఖరి నిమిషంలో గోల్.. ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లిన బ్రెజిల్
ఫిఫా ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ బ్రెజిల్ ప్రిక్వార్టర్స్ (రౌండ్ ఆఫ్ 16)లో అడుగుపెట్టింది. సోమవారం రాత్రి రౌండ్ ఆఫ్ 32లో భాగంగా జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 2-1 తేడాతో విజయం సాధించింది. బ్రెజిల్ తరఫున కేస్మిరో (56వ నిమిషం), గాబ్రియెల్ మార్టినెల్లి (90+6వ నిమిషం) గోల్స్ కొట్టారు. ఇక జపాన్ తరఫున కైషూ సానో 29వ నిమిషంలో గోల్ సాధించాడు. ఆట తొలి అర్ధభాగంలో జపాన్ పూర్తి ఆధిప్యతం కనబరిచింది. గాయంతో బ్రెజిల్ స్టార్ నెయ్మర్ జూనియర్ జపాన్‌తో మ్యాచ్‌కు కూడా దూరంగానే ఉన్నాడు. దీంతో ఆరంభం నుంచి బ్రెజిల్ కాస్త తడబడింది. అయితే జపాన్ మాత్రం బ్రెజిల్‌పై పదే పదే దాడులు చేసింది. ఈ నేపథ్యంలో 29వ నిమిషంలో కైషూ సానో జపాన్‌కు గోల్ అందించాడు. దీంతో హాఫ్ టైమ్ ముగిసేసరికి జపాన్ 1-0తో బ్రెజిల్‌పై ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్ధభాగంలో బ్రెజిల్ డిఫెన్స్ మోడ్ నుంచి బయటకు వచ్చి దూకుడును ప్రదర్శించింది. దీంతో ఆట మొదలైన కాసేపటికే 56వ నిమిషంలో కేస్మిరో బ్యాక్ హెడర్ షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించి 1-1తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత బ్రెజిల్ పలుమార్లు జపాన్ గోల్ పోస్టుపై దాడులు చేసినప్పటికీ సమర్థంగా అడ్డుకుంది. దీంతో నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరుజట్లు 1-1తో సమంగా ఉండడంతో స్టాపేజీ టైమ్ (ఇంజ్యూరీ టైమ్) ఇచ్చారు. స్టాపేజీ టైమ్ బ్రెజిల్‌కు కలిసి వచ్చింది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన గాబ్రియెల్ మార్టినెల్లి గుమెరాస్ నుంచి పాస్ అందుకొని డీప్ నుంచి బంతిని గోల్‌పోస్ట్‌కు తరలించి బ్రెజిల్‌కు రెండో గోల్ అందించడంతో పాటు విజయాన్ని సాధించి పెట్టాడు. ఇప్పటి వరకు జరిగిన 23 ప్రపంచకప్‌లలో ఆడిన బ్రెజిల్ జట్టు 20వసారి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ఇక రౌండ్ ఆఫ్ 16లో బ్రెజిల్.. ఐవరీ కోస్ట్, నార్వే మధ్య విజేతతో తలపడనుంది.🚨🌎 GABRIEL MARTINELLI HAS WON IT IN THE 95TH MINUTE FOR BRAZIL! 🤯🤯Brazil 2-1 Japan.pic.twitter.com/JUQ8WZsa2v— Tekkers Foot (@tekkersfoot) June 29, 2026 -
ఫిఫా చరిత్రలో అరుదైన ఘట్టం.. ఆ 9 దేశాలు నాకౌట్‌కు!
ఫిఫా ప్రపంచకప్ 2026లో ఒక అరుదైన ఫీట్ నమోదయ్యింది. ఆఫ్రికాకు చెందిన 10 దేశాలు ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొంటే అందులో 9 దేశాలు నాకౌట్‌కు అర్హత సాధించడం విశేషం. ఆదివారం ఉజ్బెకిస్తాన్‌పై కాంగో 3-1తో విజయం, అల్జీరియా-ఆస్ట్రియా మధ్య మ్యాచ్ (3-3) డ్రా కావడంతో ఆఫ్రికాకు చెందిన తొమ్మిది దేశాలు రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించినట్లయింది. గతంలో ఒక ఫిఫా ప్రపంచకప్‌లో రెండుమార్లు (2014, 2022లో) ఆరు ఆఫ్రికా దేశాలు నాకౌట్ చేరడమే ఇప్పటికీ రికార్డుగా ఉంది. తాజాగా మాత్రం మొరాకో, సౌతాప్రికా, సెనెగల్, ఐవరీ కోస్ట్, ఘనా, కేప్‌వెర్డె, ఈజిప్ట్, కాంగో, అల్జీరియా నాకౌట్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించాయి. అయితే ఈసారి ప్రపంచకప్‌లో మాత్రం ఆఫ్రికా సాకర్ బలం మరింత పెరిగింది. కేప్‌వెర్డె, కాంగో లాంటి చిన్నజట్లు తదుపరి రౌండ్‌కు అర్హత సాధించడం చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఫుట్‌బాల్‌లో మంచి రికార్డు కలిగిన ఇరాన్ లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.కేప్‌వెర్డె ఫుట్‌బాల్ జట్టుఇక 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో సెమీస్ చేరిన మొదటి ఆఫ్రికా దేశంగా మొరాకో చరిత్ర సృష్టించింది. ఈ ప్రపంచకప్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసిన మొరాకో బలమైన బ్రెజిల్‌తో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఈసారి కూడా మొరాకో సెమీస్ చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాంగో ఫుట్‌బాల్ టీం2030 ఫిఫా ప్రపంచకప్‌కు మొరాకో సహ ఆతిథ్య దేశంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కాంగో, కేప్‌వెర్డె తదుపరి రౌండ్లో బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోనున్నాయి. లీగ్ దశలో సంచనలన ప్రదర్శన చేసిన కేప్‌వెర్డె రౌండ్ ఆఫ్ 32లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను, మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌ను కాంగో ఎదుర్కోనున్నాయి.రౌండ్ ఆఫ్ 32 పోరు ఇలా..'రౌండ్ 32'కు అర్హత సాధించిన జట్ల మధ్య సోమవారం నుంచి మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. మొత్తం 16 మ్యాచ్‌ల్లో విజేతలుగా నిలిచిన టీమ్‌లు రౌండ్ 16 లేదా ప్రిక్వార్టర్స్‌లో తలపడతాయి. ఓడిన టీమ్ ఇంటిముఖం పట్టాల్సిందే. ఇక్కడ డ్రా అనే మాటే ఉండదు. నిర్ణీత సమయం, అదనపు సమయంలోగా ఎవరూ గోల్స్ చేయకపోతే.. పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.జూన్ 29: బ్రెజిల్ వర్సెస్ జపాన్, దక్షిణాఫ్రికా వర్సెస్ కెనడాజూన్ 30: ఐవరీ కోస్ట్ వర్సెస్ నార్వే, జర్మనీ వర్సెస్ పరాగ్వే, నెదర్లాండ్స్ వర్సెస్ మొరాకోజులై 1: ఫ్రాన్స్ వర్సెస్ స్వీడన్, మెక్సికో వర్సెస్ ఈక్వెడార్, ఇంగ్లాండ్ వర్సెస్ డీఆర్ కాంగోజులై 2: యూఎస్ఏ వర్సెస్ బోస్నియా, బెల్జియం వర్సెస్ సెనెగల్జులై 3: స్పెయిన్ వర్సస్ ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ వర్సెస్ అల్జీరియా, పోర్చుగల్ వర్సెస్ క్రొయేషియా, ఆస్ట్రేలియా వర్సెస్ ఈజిప్ట్జులై 4: అర్జెంటీనా వర్సెస్ కేప్ వెర్డె, కొలంబియా వర్సెస్ ఘనాRead: ఆఖరి బంతికి సిక్స్.. గెలిపించిన భారత సంతతి క్రికెటర్ -
ఓటమి ఎరుగని అర్జెంటీనా.. మెస్సీ ప్రపంచ రికార్డు
ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా లీగ్ దశను ఓటమన్నదే లేకుండా అజేయంగా ముగించింది. గ్రూప్-జెలో భాగంగా జోర్డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-1 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అర్జెంటీనా తరఫున గివాని సెల్సో (19వ నిమిషం), లుటారో మార్టినేజ్ (31వ నిమిషం), లియోనల్ మెస్సీ (80వ నిమిషం)లో గోల్స్ సాధించగా, జోర్డాన్ తరఫున ముసా అల్ తమారీ (55వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన అర్జెంటీనా 9 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నాకౌట్‌కు అర్హత సాధించింది. అర్జెంటీనాతో పాటు ఆస్ట్రియా, అల్జీరియా కూడా తదుపరి రౌండ్‌కు చేరుకోగా, ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన జోర్డాన్ ఇంటిబాట పట్టింది. ఇక నాకౌట్లో మెస్సీ సేన తొలిసారి ఫిఫా ప్రపంచకప్‌లో రౌండ్ ఆఫ్ 32కు చేరిన కేప్ వెర్డెతో పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ ద్వారా లియోనల్ మెస్సీ మరో రికార్డు సాధించాడు. జోర్డాన్‌తో మ్యాచ్‌లో గోల్ కొట్టడం ద్వారా మెస్సీ వరుసగా ఏడు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ ప్రపంచకప్‌లో మెస్సీకి ఇది ఆరో గోల్ కావడం విశేషం. ఆరు గోల్స్‌తో మెస్సీ గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఫ్రాన్స్ సంచలనం ఎంబాపె 4 గోల్స్‌తో అతడిని అనుసరిస్తున్నాడు. తాజా గోల్‌తో మెస్సీ ఫిఫా గోల్స్ సంఖ్య 19కి చేరుకుంది. ఆట 60వ నిమిషంలో మైదానంలోకి అడుగుపెట్టిన మెస్సీ 83వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకున్నాడు. జోర్డాన్ జట్టుతో పాటు గోల్ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ మెస్సీ కొట్టిన గోల్ హైలైట్‌గా నిలిచింది. మెస్సీ కొట్టిన గోల్‌ను చూసి జోర్డాన్ గోల్‌కీపర్ ఆశ్చర్యపోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Messi free kick from that angle is nuts. Alien. pic.twitter.com/8g333O2h8M— Geronimo Morgans (@GeronimoMorgans) June 28, 2026💥🇦🇷 Lionel Messi breaks another record as he becomes the FIRST PLAYER EVER to score in 7 consecutive World Cup games.Perfect free kick. 🎨 pic.twitter.com/vgWxKSV6CW— Fabrizio Romano (@FabrizioRomano) June 28, 2026చదవండి: భూకంప విలయం.. కన్నపేగు కోసం ఫుట్‌బాలర్ భార్య ప్రాణత్యాగం -
భూకంప విలయం.. కన్నపేగు కోసం ఫుట్‌బాలర్ భార్య ప్రాణత్యాగం
వెనెజువెలాను అతలాకుతలం చేసిన జంట భూకంపాలు స్టార్ ఫుట్‌బాలర్ భార్యను బలి తీసుకుంది. ఏడాది వయసున్న కూతురును కాపాడుకునే క్రమంలో శిథిలాల కింద చిక్కుకొని ఆమె చనిపోయింది. అయితే తల్లిప్రేమను చాటుతూ తన ఒడిలో భద్రంగా దాచుకున్న కూతురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. కన్నపేగును కాపాడుకునే క్రమంలో ప్రాణాలొదిలి మాతృప్రేమను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. తన భార్య మరణం విషయాన్ని ఆమె భర్త విషణ్ణవదనంతో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడం అందరి హృదయాలను కలిచివేసింది.వెనెజువెలాకు చెందిన హెక్టర్ బెల్లో మార్టియో లా గ్వాయిర్ క్లబ్ తరఫున ఆడుతున్నాడు. అయితే జూన్ 24న సంభవించిన జంట భూకంపాల ధాటికి భారీ భవనాలు సైతం నేలకొరిగాయి. భూకంపం సంభవించిన సమయంలో హెక్టర్ బెల్లో భార్య ఆండ్రియా ఇంట్లోనే ఉంది. అయితే భూకంపం ధాటికి వాళ్లు నివసిస్తున్న భవనం క్షణాల్లోనే నేలమట్టమయింది. అంత పెద్ద ఉత్పాతంలోనూ ఏడాది వయసున్న తన కూతురు అలానాను కాపాడుకోవాలని ఆండ్రియా భావించింది. అందుకే వారిపై దూసుకొస్తున్న మృత్యు శకలాలను తన బిడ్డకు ఏ అపాయం చేయకుండా ఆమె శరీరాన్ని అడ్డుపెట్టింది. భవన శిథిలాలు ఆమె శరీరంపై పడడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. కానీ తాను అనుకున్న ప్రకారమే కూతురును తన పొత్తిళ్లలో భద్రంగా దాచుకొని ఆమెను రక్షించుకుంది. సహాయక చర్యల్లో భాగంగా ఆండ్రియా శవాన్ని శిథిలాల కింద నుంచి తీస్తున్న క్రమంలో పాప ఏడుపు వినిపించింది. దీంతో ఆండ్రియా శవాన్ని బయటకు తీసి చూడగా ఆమె చేతుల్లో అలానా మృత్యుంజయురాలిగా ఉంది. దీంతో విషయాన్ని వెంటనే హెక్టర్‌కు చేరవేయడంతో ఆయన వచ్చి భార్య ఆండ్రియా మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యాడు. తమ కూతురును కాపాడుకోవడం కోసం ప్రాణాలకు తెగించిన భార్య ఆండ్రియాను గట్టిగా హత్తుకొని ఏడ్వడం అందరిని కలచివేసింది. ‘అమ్మ చనిపోయిందన్న విషయం నా కూతురుకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నా భార్య ప్రాణాలకు తెగించి కాపాడిన నా బిడ్డను జాగ్రత్తగా పెంచుకుంటాను. తల్లి వీరత్వాన్ని ఆమెకు అర్థమయ్యేలా వివరిస్తాను’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు. ఇక వెనెజువెలాలో సంభవించిన జంట భూకంపాల విషాదంలో మృతుల సంఖ్య 1500 దాటింది. కనీసం 70వేల మంది గల్లంతయినట్లు తెలిపిన ప్రభుత్వం సహాయక చర్యలు సాగుతున్నట్లు పేర్కొంది.చదవండి: ఓటమి ఎరుగని అర్జెంటీనా.. మెస్సీ మరో రికార్డు -
నాకౌట్‌కు కొలంబియా.. ప్రత్యేక ఆకర్షణ మాత్రం అతడే!
ఫిపా ప్రపంచకప్‌లో కొలంబియా నాకౌట్లో అడుగుపెట్టింది. గ్రూప్-కెలో భాగంగా బుధవారం కాంగతో జరిగిన మ్యాచ్‌లో కొలంబియా 1-0తో విజయాన్ని సాధించింది. కొలంబియా తరఫున 74వ నిమిషంలో డానియెల్ మునోజ్ గోల్ చేశాడు. దీంతో గ్రూప్‌లో రెండు విజయాలు అందుకున్న కొలంబియా రౌండ్ ఆఫ్-32కు అర్హత సాధించింది. అయితే మ్యాచ్‌లో కొలంబియా పదే పదే కాంగో గోల్ పోస్టులపై దాడి చేసినప్పటికీ, ఆ జట్టు గోల్ కీపర్ లియోనల్ పాసి అద్భుత ప్రదర్శన కనబరిచి చాలా సేవ్స్ చేశాడు. ఇక మ్యాచ్ డ్రా అనుకున్న తరుణంలో మునోజ్ గోల్కీపర్ను తెలివిగా బోల్తా కొట్టించి బంతిని గోల్ పోస్టులోకి తరలించాడు. దీంతో కొలంబియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే తర్వాత కూడా గోల్ చేసే అవకాశాలు వచ్చినప్పటికీ కాంగో గోల్ కీపర్ సమర్థంగా అడ్డుకోవడం జరిగింది.మొత్తం పసుపుమయం.. అతడే ప్రత్యేక ఆకర్షణమ్యాచ్ జరిగిన స్టేడియంలో 90 శాతానికి పైగా అభిమానులు కొలంబియాకు చెందినవారే ఉన్నారు. అయితే వీరిలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం కాంగోకు చెందిన మిచెల్ కుకా మ్బోలాడింగా. తమ జాతీయ జెండా రంగులను సూట్ రూపంలో ధరించిన మిచెల్, మ్యాచ్ జరిగినంత సేపు స్టాండ్‌లో ఒక కుర్చీపై ఇంచు కూడా కదలకుండా కుడి చేతిచేతిని పైకెత్తి 90 నిమిషాల పాటు శిలా విగ్రహంలా నిలబడ్డాడు. ఇదంతా ఎందుకా అని ఆరా తీస్తే.. వీసా సమస్య కారణంగా కాంగో ఆడిన మొదటి మ్యాచ్ చూసే అవకాశం మిచెల్ కుకాకు లభించలేదు. వీసా క్లియరెన్స్ రావడంతో అమెరికాలో అడుగుపెట్టిన అతడి విచిత్ర వేషదారణ చూసి కొలంబియన్ అభిమానులు భారీ కేరింతలతో స్టేడియంలోకి స్వాగతించడం విశేషం.ఇదే గ్రూప్‌లో ఉన్న పోర్చుగల్ అంతకముందు ఉజ్బెకిస్తాన్‌పై 5-0తో విజయం సాధించిన సంగతి తెలిసిందే. పోర్చుగల్‌తో జరిగే చివరి గేమ్‌ను డ్రా చేసుకుంటే టాపర్‌గా నాకౌట్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం నాకౌట్లో ఇంగ్లండ్ ఉన్న గ్రూప్‌లో రన్నరప్‌తో కొలంబియా తలపడనుంది.One of the World Cup's most iconic supporters was back at it again.Michel Kuka Mboladinga, better known as "Lumumba Vea," attended DR Congo's match against Colombia and, true to form, stood completely motionless for the entire 90 minutes.#DRCongopic.twitter.com/RJOoljIESo— Zo World (@ZoWorldd1) June 24, 2026Este é Michel Kuka Mboladinga, torcedor da República Democrática do Congo, que fica imóvel e com braço erguido durante toda a partida da seleção congolesa para homenagear Patrice Lumumba, líder da independência do país africano. 📽️@ubctvuganda pic.twitter.com/zh0cUSG6qi— LIBERTA DEPRE (@liberta___depre) June 17, 2026Read: మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఇంట్లో విషాదం -
‘మెస్సీ గురించి ప్రశ్నలెందుకు’.. రొనాల్డో అసహనం!
ఫిఫా ప్రపంచకప్ 2026లో పోర్చుగల్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఉజ్బెకిస్తాన్‌పై 0-5 తేడాతో పోర్చుగల్ విక్టరీ అందుకుంది. మ్యాచ్‌లో రెండు గోల్స్ కొట్టిన క్రిస్టియానో రొనాల్డో ఫిఫా ప్రపంచకప్‌లో తన గోల్స్ ఖాతాను ప్రారంభించాడు. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలు రొనాల్డోకు చిరాకు తెప్పించాయి. మ్యాచ్ ప్రదర్శనపై ప్రశ్నలు అడగాల్సింది పోయి.. ఇప్పుడు కూడా తన చిరకాల ప్రత్యర్థి లియోనల్ మెస్సీపై ప్రశ్నల వర్షం కురిపించడం పట్ల రొనాల్డో అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాదు రిపోర్టర్లు అడిగిన చాలా ప్రశ్నలను దాటవేసే ప్రయత్నం చేసిన రొనాల్డో ముక్తసరిగానే సమాధానమిచ్చాడు. 'రికార్డు స్థాయిలో ఇద్దరు (మెస్సీ, రొనాల్డో) ఆరోసారి ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్నారు? దీనిపై స్పందనేంటి' అని రిపోర్టర్ అడిగాడు. దీనికి రొనాల్డో 'నో కామెంట్' అని సమాధానమిచ్చాడు. 'ఫిఫా ప్రపంచకప్‌లో వరుస రెండు మ్యాచ్‌లు కలిపి మెస్సీ ఐదు గోల్స్ కొట్టాడు. ఇంకా ఎంబాపె కూడా* అని అడుగుతుండగానే'.. రొనాల్డో తలను పక్కకు తిప్పి 'వేరే ప్రశ్న అడగండి' అని రిపోర్టర్‌కు చురకలు అంటించాడు. 'ముందు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి' అని మరో రిపోర్టర్ పేర్కొనగా.. దానికి వెంటనే రొనాల్డో.. 'మీరు అడిగే ప్రశ్నపై నా జవాబు ఆదారపడి ఉంటుంది. అనవసర ప్రశ్నలకు సమాధానం చెప్పను' అని ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఇక చివరిగా టోర్నీలో రాబోయే రోజుల్లో మెస్సీతో మ్యాచ్ ఆడాల్సి వస్తే ఎలా ఫీలవుతారు అని అడిగారు. 'ఈ ప్రశ్నకు ఏం చెప్పాలో తెలియడం లేదు. నాకు తెలిసి ఇదొక అర్థం కాని ప్రశ్న. కానీ ఎదురుపడితే పోటీ అద్భుతంగా ఉంటుంది' అని సమాధానమిచ్చాడు. రిపోర్టర్ల ప్రశ్నలకు రొనాల్డో సమాధానం ఇచ్చిన తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పోర్చుగల్ మంగళవారం ఉజ్బెకిస్తాన్ జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో 5-0తో గెలుపొందింది. కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో (ఆట 6వ, 38వ నిమిషంలో) రెండు గోల్స్ చేయగా.... నూనో మెండెస్ (17వ నిమిషంలో), రాఫెల్ బియో (87వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ ఖుసనోవ్ 60వ నిమిషంలో రెండు గోల్స్ సెల్ఫ్ గోల్ చేయడంతో అవి పోర్చుగల్ ఖాతాలోకి వెళ్లిపోయాయి.Cristiano Ronaldo avoided talking about Lionel Messi when asked about him during the post-match press conference. pic.twitter.com/JCmYdxM0g2— Bolavip US (@bolavipus) June 23, 2026Read: పోర్చుగల్ విజయం.. 60 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన రొనాల్డో -
ఇంగ్లండ్‌కు ఘనా షాక్.. క్రొయేషియా బోణీ
ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్-ఎల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ను ఘనా డ్రా చేసుకోగా, మరో మ్యాచ్‌లో క్రొయేషియా 1-0 తేడాతో పనామాను చిత్తు చేసి టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్, ఘనా మ్యాచ్ విషయానికొస్తే నిర్ణీత సమయంలో ఇరుజట్లు గోల్ కొట్టడంలో విఫలమయ్యాయి. 2024లో నుంచి వరుసగా 12 విజయాలతో అదరగొట్టిన ఇంగ్లండ్ జోరుకు ఘనా డ్రా రూపంలో అడ్డుకట్ట వేసింది. ఘనా గోల్ కీపర్ బెంజమిన్ విన్యాసం2024లో గ్రీస్‌పై విజయం తర్వాత ఇంగ్లండ్ తాను ఆడిన 12 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ గెలుపొందింది. అయితే మ్యాచ్ ఆద్యంతం ఘనాపై ఇంగ్లండ్ ఆధిపత్యం ప్రదర్శించింది. 19 సార్లు ఘనా గోల్ పోస్ట్‌పై దాడులు చేసినప్పటికీ ఆ జట్టు గోల్‌కీపర్ బెంజమిన్ అసారే అడ్డుగోడలో నిలబడి మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు.దీంతో చెరో పాయింట్ దక్కించుకున్న ఇంగ్లండ్, ఘనాలు చెరో 4 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్ పనామాతో, ఘనా క్రొయేషియాతో తమ చివరి మ్యాచ్‌లు ఆడనున్నాయి.ఘనా గోల్ కీపర్ బెంజమిన్ Benjamin Asare is the real Man of the Match 🇬🇭🔥 pic.twitter.com/3pjKrnigHw— ZITO 🇬🇭 (@kwesi_zitojnr) June 23, 2026 లూకా మోడ్రిక్ 200వ మ్యాచ్..తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో చిత్తయిన క్రొయేషియా పనామాపై జూలు విదిల్చింది. నిర్ణీత సమయం ముగిసేసరికి 1-0తో నిలిచింది. క్రొయేషియా తరఫున ఆట 54వ నిమిషంలో ఆంటే బుడిమిర్ గోల్ కొట్టాడు. ఇక క్రొయేషియా కెప్టెన్ లూకా మోడ్రిక్కు ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడిగా లూకా మోడ్రిక్ నిలిచాడు. క్రొయేషియా ఆటగాడు ఆంటే బుడిమిర్, 200వ మ్యాచ్ ఆడుతున్న లూకా మోడ్రిక్గతంలో క్రిస్టియానో రొనాల్డో (230), బాదర్ అహ్మద్ (202), లియోనల్ మెస్సీ (201) ఈ ఫీట్ సాధించారు. ఇక పనామా జట్టు చెత్త రికార్డు మూటగట్టుకుంది. క్రొయేషియా చేతిలో ఓటమితో ఆడిన ఐదే ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసిన జట్టుగా నిలిచింది. ఇంతకముందు ఎల్ సాల్వడార్ జట్టు ఆరు ఫిఫా మ్యాచ్‌లు ఆడితే ఆరింటిలోనూ ఓడిపోయి 100 శాతం ఓటమి రికార్డుతో మొదటి స్థానంలో ఉంది.చదవండి: పోర్చుగల్ విజయం.. 60 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన రొనాల్డో -
పోర్చుగల్ విజయం.. 60 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన రొనాల్డో
ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. గ్రూప్ 'కె'లో భాగంగా కాంగో జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌ను 1-1తో 'డ్రా' చేసుకున్న పోర్చుగల్ మంగళవారం ఉజ్బెకిస్తాన్ జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో 5-0తో గెలుపొందింది. కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో (ఆట 6వ, 38వ నిమిషంలో) రెండు గోల్స్ చేయగా.... నూనో మెండెస్ (17వ నిమిషంలో), రాఫెల్ బియో (87వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ ఖుసనోవ్ 60వ నిమిషంలో రెండు గోల్స్ సెల్ఫ్ గోల్ చేయడంతో అవి పోర్చుగల్ ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఇక తొలి మ్యాచ్‌లో విఫలమైన రొనాల్డో ఈ మ్యాచ్‌లో మాత్రం ఆరంభం నుంచే దుమ్మురేపాడు. మైదానంలో పాదరసంలా కదిలిన రొనాల్డో డబుల్ గోల్స్‌తో మెరిశాడు. ఈ నేపథ్యంలో క్రిస్టియానో రొనాల్డో 60 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టాడు. పోర్చుగల్ తరఫున ఫిఫాలో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఆ జట్టు దిగ్గజం, బ్లాక్ పాంథర్ అని పిలుచుకునే యూసేబియో పేరిట ఉంది. యూసేబియో 1966 ఫిఫా ప్రపంచకప్‌లో తొమ్మిది గోల్స్ కొట్టడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా "బ్లాక్ పాంథర్"గా ప్రసిద్ధి చెందిన యూసేబియో, కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే ఆ ఘనతను సాధించాడు. వాటిలో ఆరు గోల్స్‌ను లివర్‌పూల్‌లోని గూడిసన్ పార్క్ సాధించాడు. అతని తొమ్మిది గోల్స్‌లో నాలుగు పెనాల్టీ స్పాట్ నుండి రాగా, మిగిలిన ఐదు ఓపెన్ ప్లే నుంచి వచ్చాయి. ఆ టోర్నీలో పోర్చుగల్ మూడో స్థానంలో నిలిచింది. 60 ఏళ్లగా ఏ పోర్చుగీసు ఆటగాడికి సాధ్యం కాని రికార్డును రొనాల్డో తాజాగా హ్యూస్టన్‌లో బద్దలుకొట్టాడు. అయితే యూసేబియో ఒకే టోర్నీలో తొమ్మిది గోల్స్ కొడితే.. రొనాల్డో ఆరు ఫిఫా ప్రపంచకప్‌లు కలిపి 10 గోల్స్ కొట్టడం గమనార్హం. అంతేకాదు ఈ మ్యాచ్‌లో గోల్ చేయడం ద్వారా వరుసగా ఆరు ప్రపంచకప్పుల్లో 2006 (1), 2010 (1), 2014 (1), 2018 (4), 2022 (1), 2026 (2) గోల్ చేసిన ఏకైక ప్లేయర్ రొనాల్డో కొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో రెండు గోల్స్ చేసిన అతిపెద్ద వయస్కుడిగానూ రొనాల్డో (41 ఏళ్ల 138 రోజులు) రికార్డు సృష్టించాడు.Cristiano Ronaldo has now scored more World Cup goals for Portugal than any other player:◉ 10 - Cristiano Ronaldo ◎ 9 - Eusebio ◎ 4 - Pauleta Eusebio’s record had stood for 60 YEARS. 👀 pic.twitter.com/iru5UykaFE— Squawka (@Squawka) June 23, 2026Read: మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్.. అల్జీరియా సంచలన విజయం -
కీలక మ్యాచ్.. గెలిస్తేనే నాకౌట్‌కు; కళ్లన్నీ రొనాల్డోపైనే!
ఫిఫా ప్రపంచకప్‌లో 12వ రోజు ముగ్గురు స్టార్ ఆటగాళ్లు అదరగొట్టారు. మెస్సీ (అర్జెంటీనా), ఎంబాపె (ఫ్రాన్స్), ఎర్లింగ్ హాలండ్ (నార్వే) ఇవాళ డబుల్ గోల్స్‌తో మెరిశారు. అంతేకాదు తమ గోల్స్‌తో జట్లు నాకౌట్ చేరడంలోనూ కీలకపాత్ర పోషించారు. అయితే రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచకప్ ఆడుతున్న పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మాత్రం గోల్స్ ఖాతా తెరవలేదు. కాంగోతో మ్యాచ్‌లో గోల్ కొట్టడంలో విఫలమైన రొనాల్డో తన ఆటతోనూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తన సహచరులంతా గోల్స్ వేటలో పోటీ పడుతుండడంతో ప్రపంచంలోనే ఎక్కువ పాపులారిటీ కలిగిన రొనాల్డోపై భారీ అంచనాలుంటాయి. కాంగోతో మ్యాచ్‌లో ఆ మ్యాజిక్ మిస్ అయినప్పటికీ నేడు ఉజ్బెకిస్తాన్‌తో మ్యాచ్‌లో రొనాల్డో గోల్స్ వర్షం కురిపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాదు ఉజ్బెకిస్తాన్‌తో మ్యాచ్ పోర్చుగల్‌కు చాలా కీలకం. చిన్న జట్టు కాంగోతో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న పోర్చుగల్ నాకౌట్ దశకు చేరాలంటే ఉజ్బెకిస్తాన్‌పై విజయం తప్పనిసరి. అయితే మ్యాచ్‌లో పోర్చుగల్ ఫెవరెట్‌గా కనిపిస్తున్నప్పటికీ, ఉజ్బెకిస్తాన్ను తక్కువ అంచనా వేయడం మొదటికే పొరపాటు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి చిన్నజట్లు సంచలనాలు నమోదు చేస్తున్నాయి. కురాకావో, కేప్ వర్డె వంటి పసికూనలు పెద్ద జట్లను వణికించాయి. Read: ఐర్లాండ్ బయల్దేరిన టీమిండియా.. ప్రత్యేక ఆకర్షణగా వైభవ్! -
మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్.. అల్జీరియా సంచలన విజయం
ఫిఫా ప్రపంచకప్‌లో మరో ఉత్కంఠభరిత పోరు జరిగింది. గ్రూప్-జెలో భాగంగా జోర్డాన్, అల్జీరియా మధ్య మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. మ్యాచ్‌లో ఆఖరి పది నిమిషాల్లో గోల్ కొట్టిన అల్జీరియా 2-1 తేడాతో జోర్డాన్‌పై సంచలన విజయం సాధించింది. అల్జీరియా తరఫున నాధిర్ బెన్బొలి (ఆట 69వ నిమిషం), అమినె గౌరి (ఆట 82వ నిమిషం) రెండు గోల్స్ సాధించగా, జోర్డాన్ తరఫున నిజర్ అల్-రష్దన్ ఆట 36వ నిమిషంలో గోల్ కొట్టాడు. అయితే అల్జీరియా విజయం సాధించినప్పటికీ గోల్ డిఫెరెన్స్లో ఆస్ట్రియాతో పోలిస్తే అల్జీరియా (-2) తక్కువగా ఉంది.మ్యాచ్‌లో ఓటమితో జోర్డాన్ ఆడిన రెండింటిలో పరాజయాలు చవిచూసి ఫిఫా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.దీంతో పట్టికలో మూడో స్థానానికి పరిమితమైంది. తొలి రెండు స్థానాల్లో ఉన్న అర్జెంటీనా రెండు విజయాలతో ఇప్పటికే నాకౌట్ బెర్తును ఖరారు చేసుకోగా, రెండో బెర్తు కోసం ఆస్ట్రియా, అల్జీరియా మధ్య పోటీ నెలకొంది. దీంతో అల్జీరియా, ఆస్ట్రియా మధ్య జరగనున్న మ్యాచ్‌లో గెలిచిన జట్టు నాకౌట్‌కు వెళ్లనుండగా, ఓడిన జట్టు ఇంటిబాట పట్టనుంది.Read: ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచరీ వీరుడికి నో చాన్స్! -
హాలండ్ జోరు.. ఉత్కంఠ పోరులో నార్వే విజయం
ఫిఫా ప్రపంచకప్‌లో నార్వే జట్టు రౌండ్ ఆఫ్ 32 దశకు అర్హత సాధించింది. గ్రూప్-ఐలో భాగంగా మంగళవారం సెనెగల్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో నార్వే 3-2తో విజయాన్ని అందుకుంది. నార్వే తరఫున స్టార్ ఆటగాడు ఎర్లింగ్ హాలండ్ (ఆట 48, 58వ నిమిషం) డబుల్ గోల్స్ కొట్టగా, మార్కస్ పెడెర్సన్ (ఆట 43వ నిమిషం) మరో గోల్ చేశాడు. అటు సెనెగల్ తరఫున ఇస్మాయిల్ సర్ (ఆట 53, 90+3వ నిమిషం) రెండు గోల్స్ కొట్టాడు. ఈ విజయంతో నార్వే నాకౌట్ దశకు చేరుకోగా సెనెగల్ ఆడిన రెండింటిలో ఓడి ఇంటిబాట పట్టింది.ఇక రెండు గోల్స్ సాధించిన ఎర్లింగ్ హాలండ్‌కు 52 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 59 గోల్స్ కావడం విశేషం. అంతేకాదు ఫిఫా ప్రపంచకప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలవడం నార్వేకు ఇదే తొలిసారి. కాగా లీగ్ దశలో నార్వే తన చివరి మ్యాచ్‌ను ఫ్రాన్స్‌తో ఆడనుంది.నార్వే ‘వై కింగ్’ సెలబ్రేషన్ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, ముఖ్యంగా ప్రపంచకప్ (World Cup) లాంటి మెగా టోర్నమెంట్లలో నార్వే దేశ ఫుట్‌బాల్ జట్టు, వారి అభిమానులు "వైకింగ్ రోయింగ్" (Viking rowing) అనే వినూత్నమైన సెలబ్రేషన్ చేసుకుంటారు. ఆటగాళ్లు లేదా అభిమానులు నేలపై వరుసగా కూర్చొని, తెడ్డు వేస్తున్నట్లు (rowing) హావభావాలు ప్రదర్శిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఇది వారి దేశ సంస్కృతికి ప్రతీక.The Norwegian team and fans doing the Row are just beautiful.pic.twitter.com/hi2YqZimUi— World Cup 2026 Daily (@TotalFootball) June 23, 2026Read: వందో మ్యాచ్‌లో ఎంబాపె రికార్డు గోల్స్.. నాకౌట్‌కు ఫ్రాన్స్ -
వందో మ్యాచ్‌లో ఎంబాపె రికార్డు గోల్స్.. నాకౌట్‌కు ఫ్రాన్స్
ఫిఫా ప్రపంచకప్ 2026లో ఫ్రాన్స్ జట్టు నాకౌట్ దశకు చేరుకుంది. గ్రూప్-ఐలో ఇరాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3-0తో విజయాన్ని అందుకుంది. ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు కైలియన్ ఎంబాపె డబుల్ గోల్స్ (ఆట 14, 54వ నిమిషం)తో మెరవగా, ఓస్మన్ డెంబ్లె (ఆట 60వ నిమిషం) మరో గోల్ చేశాడు. ఈ విజయంతో ఫ్రాన్స్ నాకౌట్‌కు అర్హత సాధించింది. వర్షంతో మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది. మ్యాచ్ ఆలస్యంగా మొదలైనప్పటికీ ఎంబాపె తన గోల్స్ కిక్‌తో అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు. ఆట 14వ నిమిషంలో కార్నర్ నుంచి బంతిని గోల్ పోస్టులోకి తరలించిన ఎంబాపె ఫిఫాలో 15 వ గోల్ సాధించాడు. ఆ తర్వాత రెండో హాఫ్‌లో 54వ నిమిషంలో మరోసారి మెరిసిన ఎంబాపె రెండో గోల్ సాధించడంతో పాటు ఫ్రాన్స్‌ను 2-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో బాలన్ డీ ఓర్ అవార్డు విజేత ఓస్మన్ డెంబ్లె 64వ నిమిషంలో గోల్ చేయడంతో ఫ్రాన్స్ ఖాతాలో మూడో గోల్ చేరింది. మరోవైపు 1986 తర్వాత రెండో ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న ఇరాక్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.కాగా ఎంబాపె ఇరాక్‌తో మ్యాచ్ ద్వారా పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఎంబాపెకు ఇది వందో అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. తన వందో అంతర్జాతీయ మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో మెరిసిన ఎంబాపెకు ఫిఫాలో ఇది 16వ గోల్. తద్వారా ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో ఎంబాపె.. జర్మనీ దిగ్గజం మిరాస్లావ్ క్లోస్ (16 గోల్స్) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. అంతకముందు 15వ గోల్ కొట్టి బ్రెజిల్ దిగ్గజం రొనాల్డో రికార్డును సమం చేశాడు. మెస్సీ వెనుకే ఎంబాపె..ఇక ఫిఫా ప్రపంచకప్‌లో ఈసారి మెస్సీ, ఎంబాపె మధ్య నంబర్ గేమ్ నడుస్తోంది. ‘వస్తా నీ వెనుక’ అన్నట్లుగా మెస్సీకి పోటీగా ఎంబాపె వరుస గోల్స్‌తో రెచ్చిపోతున్నాడు. ఆస్ట్రియాతో మ్యాచ్‌లో డబుల్ గోల్స్‌తో మెరిసిన మెస్సీ 18 గోల్స్‌తో ఫిఫా అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా తొలి స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇరాక్‌తో మ్యాచ్‌లో రెండు గోల్స్ కొట్టి తన గోల్స్ సంఖ్యను 16కు పెంచుకున్న ఎంబాపె.. మెస్సీ తర్వాతి స్థానంలో ఉన్నాడు. రాబోయే మ్యాచ్‌లో మిరాస్లావ్ క్లోస్ రికార్డును బద్దలు కొట్టనున్న ఎంబాపె ఆ తర్వాత మెస్సీని దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు.ఫిఫాలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితా👉లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా)-18👉కైలియన్ ఎంబాపె (ఫ్రాన్స్)-16👉మిరోస్లావ్ క్లోజ్ (జర్మనీ)-16👉రొనాల్డో (బ్రెజిల్)- 15👉గెర్డ్ ముల్లర్ (జర్మనీ)-14👉జస్ట్ ఫాంటైన్ (ఫ్రాన్స్)- 13👉పీలే (బ్రెజిల్)-12Read: 90 నిమిషాలు అడ్డుగోడలా.. రోమాలు నిక్కబొడిచే ప్రదర్శన! -
ప్రపంచ రికార్డుకు అడుగుదూరంలో మెస్సీ!
ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా రెండో విజయంపై కన్నేసింది. గ్రూప్-జెలో ఇవాళ రాత్రి ఆస్ట్రియాతో అర్జెంటీనా తలపడుతోంది. ఈసారి ఫిఫా ప్రపంచకప్‌లో తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసిన సంగతి తెలిసిందే. అల్జీరియాతో జరిగిన మ్యాచ్ మెస్సీకి 200వది కావడం గమనార్హం. తన 200వ మ్యాచ్‌ను అద్భుతంగా మలుచుకున్నాడు. అల్జీరియాతో మ్యాచ్‌లో పలు రికార్డు లను బద్దలు కొట్టిన మెస్సీ ఆస్ట్రియాతో మ్యాచ్‌లోనూ పలు రికార్డులు సవరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఒకసారి వాటిని పరిశీలించి చూద్దాం.👉38 ఏళ్ల మెస్సీ వరుసగా ఐదు ఫిఫా ప్రపంచకప్పుల్లో గోల్ చేశాడు. రికార్డు స్థాయిలో ఆరోసారి ఫిఫా ఆడుతున్న మెస్సీ మరొక గోల్ చేస్తే, వరుసగా ఆరు ప్రపంచకప్పుల్లో గోల్స్ చేసిన ఆటగాళ్ల సరసన చేరనున్నాడు. గతంలో ఫ్రాన్స్‌కు చెందిన జస్ట్ ఫోంటైన్, బ్రెజిల్‌కు చెందిన జైర్జిన్హో సంయుక్తంగా ఆరు ప్రపంచకప్పుల్లో ఆరు గోల్స్ చేశారు. ఆల్ టైమ్ రికార్డు అందుకోవడానికి మెస్సీ మరొక గోల్ చేస్తే సరిపోతుంది.👉ఆస్ట్రియాతో మ్యాచ్‌లో మెస్సీ గోల్ కొడితే ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంటాడు. ప్రస్తుతం మెస్సీ 16 గోల్స్‌తో జర్మనీ దిగ్గజం మిరాస్లావ్ క్లోస్‌తో కలిసి తొలి స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రియాతో మ్యాచ్‌లో ఒక్క గోల్ చేసినా మెస్సీ ప్రపంచ రికార్డు సాధించినట్లే.👉ఆస్ట్రియాపై అర్జెంటీనా విజయం సాధిస్తే మెస్సీకి మరో చారిత్రాత్మకం కానుంది. ఇప్పటివరకు 16 ఫిఫా మ్యాచ్‌లు గెలిచిన మెస్సీ, ఇవాళ ఆస్ట్రియాపై గెలుపుతో 17 విజయాలతో జర్మనీ దిగ్గజం మిరాస్లావ్ క్లోస్ రికార్డు సమం చేసే అవకాశముంది.👉అల్జీరియాతో మ్యాచ్‌లో మెస్సీ 38 సంవత్సరాల 357 రోజుల వయస్సులో, అతను 2018 టోర్నమెంట్లో క్రిస్టియానో రొనాల్డో నెలకొల్పిన మునుపటి రికార్డును అధిగమించి, ప్రపంచ కప్ హ్యాట్రిక్ సాధించిన అత్యంత వయస్సు గల ఆటగాడిగా నిలిచాడు. అతను ప్రపంచ కప్‌లో కలిపి చేసిన గోల్స్ మరియు అసిస్ట్‌ల రికార్డును కూడా 24కు (16 గోల్స్, ఎనిమిది అసిస్ట్‌లు) పెంచుకున్నాడు. ఇక అర్జెంటీనా కెప్టెన్ ఇప్పటికే అత్యధిక ప్రపంచ కప్ ప్రదర్శనలు (27), అత్యధిక నిమిషాలు ఆడిన (2,394), అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు (12) ,అత్యధిక విజయవంతమైన డ్రిబుల్స్ (125) రికార్డులను కలిగి ఉన్నాడు.👉అయితే ఆస్ట్రియా జట్టును తక్కువ అంచనా వేసేందుకు లేదు. ఈసారి ఫిఫాలో ఆస్ట్రియా తమ తొలి మ్యాచ్‌లో జోర్డాన్‌ను 3-1తో మట్టికరిపించింది. అంతేకాదు గత 12 మ్యాచ్‌ల్లో ఆస్ట్రియా 10 విజయాలు, ఒక డ్రా సాధించి ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది. దీంతో అర్జెంటీనా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరముంది.Read: హర్మన్ సేనకు మిథాలీరాజ్ కీలక సూచన -
90 నిమిషాలు అడ్డుగోడలా.. రోమాలు నిక్కబొడిచే ప్రదర్శన!
ఫిఫా ప్రపంచకప్‌లో చాలా మ్యాచ్‌లు వన్‌సైడ్‌గా ముగుస్తున్నాయని ఫుట్‌బాల్ అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈసారి ఫిఫా అంత కిక్ ఇవ్వడం లేదని కూడా కొందరు వాపోతున్నారు. కానీ అది తప్పని మరోసారి నిరూపితమైంది. చాలా మ్యాచ్‌లు డ్రాగా ముగుస్తున్నప్పటికీ, పెద్ద జట్లను నిలువరిస్తూ చిన్న జట్లే ఈసారి ఫిఫాలో హైలైట్‌గా మారిపోయాయి. కేప్ వర్డె, కురాకావో వంటి చిన్న దేశాలు టోర్నీలో తమ పోరాటంతో ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ దేశాలు తమ మ్యాచ్‌లను డ్రా చేసుకోవడంలో గోల్ కీపర్లదే కీలకపాత్ర. 40 ఏళ్ల వోజిన్హా (కేప్ వర్డె), 37 ఏళ్ల ఎలోయ్ రూమ్ (కురాకావో) అద్భుత గోల్‌కీపింగ్ విన్యాసాలతో పెద్ద జట్లను నిలువరించి తమ జట్లకు డ్రా రూపంలోనే విజయాలు సాధించి పెట్టారు. తాజాగా వీరి సరసన ఇరాన్ గోల్ కీపర్ అలీరెజా బెయిరాన్వాండ్కు కూడా చోటు కల్పించాల్సిందే.ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం గ్రూప్-జీలో ఫిఫా 9వ ర్యాంకర్ బెల్జియంను ఇరాన్ నిలువరించిందంటే అదంతా అలీరెజా చలువే. మ్యాచ్‌లో బెల్జియం ఒక్క గోల్ కూడా కొట్టకపోవడంలో అలీరెజాదే కీలకపాత్ర. ఇరాన్ గోల్‌పోస్ట్ వద్ద అడ్డుగోడలా నిలబడిన అలీరెజా బెల్జియం పటిష్టమైన డిఫెన్స్‌ను సమర్థంగా ఎదుర్కొని గోడకు కొట్టిన బంతిలా నిలబడ్డాడు. మ్యాచ్‌లో ఏడుసార్లు గోల్ చేసే అవకాశం వచ్చినప్పటికీ ఆరు అడుగులు నాలుగు అంగుళాల పొడవున్న అలీరెజా బెయిరాన్‌వాండ్ తన రెండు చేతులను చాపి బంతిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. మొత్తం ఏడు సేవ్స్ చేసిన అలీరెజానే ‘ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ కూడా వరించింది.అంతేకాదు, క్రీడా నియమాల ప్రకారం ఒక క్లీన్షీట్ను కూడా అలీరెజా సొంతం చేసుకున్నాడు.గొర్రెలకాపరి కుటుంబం నుంచి..అలీరెజా గొర్రెల కాపరి కుటుంబం నుంచి వచ్చాడు. అలీరెజా 12 ఏళ్ల వయసులో యూరోప్ ఉన్నత వర్గాల ఆధిపత్య పోరుకు తట్టుకోలేక అతడి తల్లిదండ్రులు బీరన్వంద్ నుంచి లోరెస్తాన్ కొండల్లోకి పారిపోయారు. ఆ కొండల్లోనే తీవ్ర పేదరికంలో అలీరెజా బాల్యం గడిచింది.చిన్నప్పటి నుంచే ఫుట్‌బాల్ ఆటపై అమితాసక్తి పెంచుకున్న అలీరెజా ఈ విషయంలో ప్రతీరోజు తండ్రితో గొడవపడేవాడు. ఎలాగోలా ఇంట్లో వాళ్లను ఒప్పించి ఆ కొండ ప్రాంతం నుంచి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు చేరుకున్నాడు. టెహ్రాన్ చేరుకున్న సమంలో అలీరెజా జేబులో రూపాయి లేదు. నెలల తరబడి, అతడు స్థానిక ఫుట్‌బాల్ క్లబ్‌ల బయటే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ కాలం గడిపాడు. ఆ క్లబ్లో జరిగే మ్యాచ్‌లను చూస్తూ ఫుట్‌బాల్ ఆటను పూర్తిగా అవగతం చేసుకున్నాడు. కొన్నాళ్లకు ఒక ఫ్యాక్టరీలో అసెంబ్లింగ్ పనులు చేస్తూ స్థానిక ఫుట్‌బాల్ క్లబ్లో మెంబర్షిప్ సాధించాడు. ఆ క్లబ్‌కు డబ్బులు కట్టడం కోసం రాత్రిళ్లు పిజ్జా దుకాణాల్లో పిండిని కలపడం, పిజ్జాలు చేయడం వంటి పనులు కూడా చేశాడు. అయితే కొండ ప్రాంతం నుంచి రావడంతో అలీరెజా బలిష్టంగా ఉండడంతో అతడికి గోల్ కీపింగ్ కరెక్ట్ అని స్థానిక ఫుట్‌బాల్ క్లబ్ కోచ్ నిర్ణయించాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఇరాన్ ఫుట్‌బాల్ జట్టుకు గోల్‌కీపర్‌గా సేవలందిస్తున్నాడు అలీరెజా. రెండు గిన్నిస్ రికార్డులు..ఇక మోడ్రన్ ఫుట్‌బాల్‌లో అలీరెజా బెయిరాన్‌వాండ్ తన పేరిట రెండు గిన్నిస్ రికార్డులు కూడా లిఖించుకున్నాడు. 2016 అక్టోబర్‌లో దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో బంతిని దాదాపు 200.14 అడుగులు (61.002 మీటర్లు) విసిరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత సదూర త్రో రికార్డు ఇప్పటికీ అలీరెజా పేరిటే ఉంది. ఇక ఫుట్‌బాల్‌లో అత్యంత పొడవైన డ్రాప్ కిక్ (255.95 అడుగులు-78.014 మీటర్లు) కూడా అలీరెజాదే కావడం విశేషం. ఇక బెల్జియం, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లను డ్రా చేసుకున్న ఇరాన్ రెండు పాయింట్లు సాధించి నాకౌట్ అర్హత అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇరాన్ తన తర్వాతి మ్యాచ్ జూన్ 27న పటిష్టమైన ఈజిప్ట్‌తో ఆడనుంది. Alireza Beiranvand🧤💚 pic.twitter.com/HlVeDsHoXo— Iman🇵🇹🇫🇷 (@i4emi) June 21, 2026Read: సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే! -
కొంపముంచిన రెడ్‌కార్డ్.. బెల్జియంకు ఇరాన్ షాక్
ఫిఫా ప్రపంచకప్‌లో ఇరాన్, బెల్జియం మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఫిఫాలో 9వ ర్యాంక్‌లో ఉన్న బెల్జియం టోర్నీలో ఇంకా బోణీ చేయలేదు. అయితే బెల్జియం ఆటగాడు నాథన్ ఎంగోయ్ గోల్ ఆట 67వ నిమిషంలో గోల్ కొట్టినప్పటికీ రెడ్‌కార్డ్ అతడి కొంపముంచింది. రిఫరీ చూస్తుండగానే ఎంగోయ్ బంతిని తన చేతులతో వెనుక వైపు నుంచి పాస్ అందించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో గోల్ కొట్టేందుకు వచ్చిన ఇరాన్ ఫార్వార్డ్ ప్లేయర్ మెహ్దీ తరేమీని ఉద్దేశపూర్వకంగా కింద పడేశాడు. దీంతో ఇరాన్‌కు గోల్ వచ్చే చాన్స్ మిస్సయింది. దీంతో రిఫరీ నాథన్ ఎంగోయ్కు రెడ్‌కార్డ్ చూపించడంతో మైదానం వీడాడు. నాథన్ ఎంగోయ్ కొట్టిన గోల్ కూడా చెల్లలేదు. ఆ తర్వాత బెల్జియం పలుమార్లు గోల్ పోస్టులపై దాడి చేసినప్పటికీ ఇరాన్ గోల్ కీపర్ అలీరెజా బెయిరాన్‌వాండ్ సమర్థంగా అడ్డుకొని ఇరాన్ మ్యాచ్ డ్రా చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.వరుసగా రెండు మ్యాచ్‌లు డ్రా చేసుకోవడంతో బెల్జియం నాకౌట్ దశకు అర్హత సాధించడం అనుమానమే. ఎందుకంటే బెల్జియం కంటే ముందు ఈజిప్ట్, ఇరాన్‌లు ఉన్నాయి. న్యూజిలాండ్‌పై గెలుపుతో ఈజిప్ట్ 4 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతుంది. ఒకవేళ ఈజిప్ట్ తన చివరి మ్యాచ్ గెలవడం లేదా డ్రా చేసుకుంటే మాత్రం బెల్జియం ఇంటిబాట పట్టాల్సిందే. ఇక బెల్జియం తన చివరి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో బెల్జియం భారీ తేడాతో గెలిస్తేనే నాకౌట్ దశకు చేరుకునే అవకాశం ఉంటుంది.Read: 33 మ్యాచ్‌ల్లో వంద గోల్స్.. ఆల్‌టైమ్ రికార్డు ఎంతో తెలుసా? -
33 మ్యాచ్‌ల్లో వంద గోల్స్.. ఆల్‌టైమ్ రికార్డు ఎంతో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఫిఫా క్రేజ్ నడుస్తోంది. ఏ దేశం చూసినా ఫుట్‌బాల్ మత్తులోనే తేలియాడుతోంది. గోల్స్ వర్షంలో అభిమానులు తడిసి ముద్దవుతున్న వేళ ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ కొత్త చరిత్ర సృష్టించింది. ఫిఫా చరిత్రలో 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా 100 గోల్స్ నమోదైన ఎడిషన్‌గా 2026 ఫిఫా టోర్నీ నిలిచింది. 1958 ఫిఫా ప్రపంచకప్‌లో 32 లేదా 33 మ్యాచ్‌ల్లో వంద గోల్స్ నమోదైనట్లు రికార్డుల్లో ఉంది.ఈసారి ఫిఫా ప్రపంచకప్‌లో 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ మైలురాయిని చేరుకోవడం విశేషం. కాగా ప్రపంచకప్‌లో ఈసారి తొలి గోల్‌ను సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో మెక్సికో ఆటగాడు జూలియన్ క్వినోనెస్ నమోదు చేయగా.. వందో గోల్‌ను నెదర్లాండ్స్ స్టార్ ఆటగాడు కోడీ గాకో కొట్టాడు. స్వీడన్‌తో మ్యాచ్‌లో కోడీ గోల్ కొట్టడం ద్వారా టోర్నీలో వందో గోల్ వచ్చింది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 5-1 తేడాతో స్వీడన్‌ను చిత్తు చేసింది. కాగా ఫిఫా చరిత్రలో 33 మ్యాచ్‌ల్లో వంద గోల్స్ చేరుకోవడమనేది సరికొత్త రికార్డుగా పేర్కొనవచ్చు. గతంలో 1982, 2014 ప్రపంచకప్పుల్లో వంద గోల్స్ చేరడానికి 36 మ్యాచ్‌లు, 1978, 1994 టోర్నీల్లో 38 మ్యాచ్‌లు అవసరమయ్యాయి.అయితే 1954లో స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో మాత్రం కేవలం 20 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ నమోదవ్వడం ఇప్పటికీ ఆల్‌టైమ్ రికార్డుగా ఉంది. ఈ రికార్డును అందుకోవడం ఇప్పట్లో కష్టతరమే. అంతేకాదు నెదర్లాండ్స్ జట్టు కూడా మరో అరుదైన ఘనత సాధించింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో 100 గోల్స్ క్లబ్లో చేరిన ఎనిమిదో దేశంగా నెదర్లాండ్స్ నిలిచింది. స్వీడన్‌తో మ్యాచ్‌లో బ్రియాన్ బ్రోబ్బే రెండు గోల్స్ సాధించగా.. అతని రెండో గోల్ నెదర్లాండ్‌కు ఫిఫా ప్రపంచకప్‌లలో 100వ గోల్‌గా నిలిచిపోయింది. మొత్తం మీద అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో 48 దేశాలు పాల్గొంటున్నాయి. Read: ఫిఫాలో 1000వ మ్యాచ్.. జపాన్ గర్జనకు ట్యునీషియా చిత్తు -
ఫిఫాలో 1000వ మ్యాచ్.. జపాన్ గర్జనకు ట్యునీషియా చిత్తు
ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆసియా జట్టు జపాన్ బోణీ కొట్టింది. ఆదివారం గ్రూప్-ఎఫ్‌లో ట్యునీషియాతో జరిగిన మ్యాచ్‌లో జపాన్ 4-0తో విజయం సాధించింది. నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న జపాన్.. ట్యునీషియాతో మ్యాచ్‌లో మాత్రం చెలరేగింది. జపాన్ తరఫున అయాసే ఉడా (ఆట 31,83వ నిమిషం) డబుల్ గోల్స్‌తో మెరవగా, దయిచీ కమదా (4వ నిమిషం), జున్యా ఇటో (69వ నిమిషం) గోల్స్ సాధించారు. కాగా ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలో జపాన్, ట్యునీషియాది 1000వ మ్యాచ్ కావడం విశేషం. కాగా మ్యాచ్‌లో ఓటమితో ట్యునీషియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫిఫా ప్రపంచకప్ నుంచి వైదొలిగింది. ఇక జపాన్ తమ తదుపరి మ్యాచ్ స్వీడన్‌తో ఆడనుంది. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న జపాన్ స్వీడన్‌పై గెలిచి గ్రూప్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఇదే గ్రూప్‌లో నెదర్లాండ్స్ 5-1 తేడాతో స్వీడన్‌ను చిత్తు చేసి టాప్‌లో కొనసాగుతోంది.Joy for Japan! 🇯🇵#FIFAWorldCup— FIFA World Cup (@FIFAWorldCup) June 21, 2026Read: కవ్వించి తప్పు చేశారు.. వైభవ్ ప్రతీకారం! -
చిన్న జట్టు సంచలనం.. ఈక్వెడార్‌కు భారీ షాక్
ఫిఫా ప్రపంచకప్‌లో ఈక్వెడార్ ప్రయాణం ముగిసింది. నాకౌట్ దశకు చేరకుండానే ఇంటిబాట పట్టనుంది. టోర్నీలో భాగంగా ఆదివారం గ్రూప్-ఈలో కురాకావోతో జరిగిన మ్యాచ్‌ను ఈక్వెడార్ (0-0)తో డ్రా చేసుకుంది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు గోల్ కొట్టడంలో విఫలమయ్యాయి. దీంతో మ్యాచ్ డ్రా కావడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించాయి. అయితే తొలిసారి ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న కురాకావో జట్టు ఒక పాయింట్ సాధించి టోర్నీలో ఖాతా తెరిచింది. మ్యాచ్ డ్రా చేసుకున్నప్పటికీ తనకంటే ఎన్నో రెట్లు మెరుగైన ఈక్వెడార్‌ను నిలువరించడం వారికి విజయంతో సమానం. మ్యాచ్‌లో ఈక్వెడార్ 15 సార్లు కురాకావో గోల్ పోస్టుపై దాడులు చేసింది. కురాకావో ఫుట్‌బాల్ జట్టుకానీ కురాకావో గోల్ కీపర్ 37 ఏళ్ల ఎలోయ్ రూమ్ వాటిని సమర్థంగా అడ్డుకొని మ్యాచ్ డ్రా కావడంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు ఎలోయ్ తన విన్యాసాలతో ఫిఫా ప్రపంచకప్‌లో కురాకావోకు ఒక పాయింట్ లభించేలా చేశాడు. ఫిఫా ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం చూసుకుంటే ఈక్వెడార్ 29వ ర్యాంక్‌లో ఉంటే, కురాకావో మాత్రం 83వ ర్యాంకులో కొనసాగుతోంది. కేవలం లక్షా 56వేల జనాభా కలిగిన కురాకావో ఆడుతున్న తొలి ఫిఫా ప్రపంచకప్‌లోనే తమ ప్రదర్శనతో అందరి చేత శెభాష్ అనిపించుకుంది. ఒక ఓటమి, ఒక డ్రాతో ఆఖరిస్థానంలో ఉన్న కురాకావో అనధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. టోర్నీలో తమ చివరి మ్యాచ్‌ను జూన్ 26న ఐవరీకోస్ట్‌తో ఆడనుంది. మరోవైపు ఈక్వెడార్ కూడా టోర్నీ నుంచి వైదొలిగినట్లే. తమ చివరి మ్యాచ్‌ను గ్రూప్-ఈలో టాపర్‌గా ఉన్న జర్మనీతో జూన్ 26న ఆడనుంది.Que defesa do goleiro de Curaçao, sobrou até pra jornalista na beira do campo. pic.twitter.com/K2PHSSrHPM— Luiz Carlos Largo (@LARGOESPN) June 21, 2026 Cómo todos van con el portero después del partido Lo que significa para ellos ❤️ pic.twitter.com/8Fp1NNdo8F— Jeff (@JeffFcb14) June 21, 202637-year-old Eloy Room delivers a goalkeeping masterclass to secure Curaçao’s first-ever World Cup point 👏🔥 pic.twitter.com/9SVDhX8Xp2— OneFootball (@OneFootball) June 21, 2026చదవండి: దెబ్బతిన్న పులిలా రొనాల్డో.. ఆ మెరుపులెక్కడ? -
నోరు మూసుకున్నందుకు రెడ్‌కార్డ్.. ఫిఫా చరిత్రలోనే తొలిసారి!
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్న ఫిఫా ప్రపంచకప్ టోర్నీ వివాదాలకు కూడా కేంద్రబిందువుగా మారుతోంది. తాజాగా శనివారం పరాగ్వే, తుర్కియో మ్యాచ్ సందర్భంగా పర్వాగ్వే మిడ్‌ఫీల్డర్ మిగ్యుల్ అల్మిరాన్ చేతితో నోరును మూసుకున్నాడన్న కారణంతో రిఫరీ రెడ్‌కార్డ్ చూపించడం చర్చనీయాంశంగా మారింది.ఫిఫాలో ఈసారే ప్రవేశపెట్టిన ఈ కొత్త రూల్ ఇప్పుడు హైలైట్‌గా నిలిచింది. విషయంలోకి వెళితే.. మ్యాచ్‌లో ఫౌల్ అనంతరం తుర్కియో డిఫెండర్ మెర్ట్ ముల్దర్‌తో పరాగ్వే ఫార్వర్డ్ ఆటగాడు ఇసిడ్కో పిట్టా వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుండగానే ఇరుజట్ల ఆటగాళ్లు గుంపుగా వచ్చేశారు. ఈ సమయంలో జట్టుకు కాస్త దూరంలో ఉన్న అల్మిరాన్ ముల్దర్‌తో మాట్లాడుతూ నోటికి చేతిని అడ్డుపెట్టాడు. అల్మిరాన్ చర్య పట్ల తుర్కియే డిఫెండర్ రిఫరీకి ఫిర్యాదు చేశాడు. వీఏఆర్ (Video Assistant Referee) ద్వారా మ్యాచ్ అధికారులు వీడియోను మరోసారి పరిశీలించారు. రిప్లేలో అల్మిరాన్ తన నోరును మూసుకున్నట్లు తేలడంతో రిఫరీ బార్డన్ వెంటనే అతడికి రెడ్ కార్డ్ చూపించాడు. దీంతో పరాగ్వే జట్టు 10 మందితోనే మిగతా మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.ఫిఫా తెచ్చిన కొత్త రూల్ ఏంటంటే?2026 ఫిఫా ప్రపంచకప్‌లో ఫిఫా కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా మైదానంలోనే దుర్భాషకు దిగడం లేదా వివక్షపూరిత వ్యాఖ్యలు చేయడం నిషేధం. ఇదే నిబంధన ప్రకారం ప్రత్యర్థి జట్టుతో ఘర్షణ జరిగిన సమయంలో సదరు ఆటగాడు చేతితో లేదా భుజంతో లేదా చొక్కాతో నోరు మూసుకుంటే అతడికి రెడ్ కార్డ్ చూపించవచ్చు. మ్యాచ్ అధికారులకు తెలియకుండా ఆటగాళ్లు చేసే వ్యాఖ్యలు దాచిపెట్టకుండా నిరోధించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. అయితే ఈ నిబంధన కేవలం ఫిఫాకు మాత్రమే పరిమితమని, క్లబ్ మ్యాచ్‌లు, స్నేహపూర్వక సంభాషణ సమయంలో ఒక ఆటగాడు ఇలాంటి చర్యలకు పాల్పడితే రెడ్‌కార్డ్ చూపడం జరగదని ఫిఫా నిర్వాహకులు తెలిపారు.బోణీ కొట్టిన పరాగ్వే అల్మిరాన్ రెడ్‌కార్డ్‌కు గురవ్వడంతో పదిమందితోనే ఆడిన పరాగ్వే 1-0తో తుర్కియేపై విజయం సాధించి ఫిఫాలో బోణీ కొట్టింది. అల్మిరాన్ రెడ్‌కార్డ్‌కు గురవ్వడంతో అతడు కొట్టిన గోల్ చెల్లదు. మరో గోల్‌ను మటియస్ గాల్జా (ఆట 2వ నిమిషంలో) జట్టుకు అందించాడు. ఈ క్రమంలో గాల్జా ఫిఫా ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ గోల్ నమోదు చేశాడు. 65 సెకన్ల వ్యవధిలోనే గాల్జా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. ఇవాళ ఉదయం మొరాకో ఆటగాడు ఇస్మాయిల్ సైబారి 72 సెకన్ల వ్యవధిలో కొట్టిన గోల్ రికార్డు గంటల వ్యవధిలోనే బద్దలు కావడం గమనార్హం. 🚨| SHOCKING MOMENT AT THE FIFA WORLD CUP! 🤯🌎Miguel Almirón became the first player ever to be sent off for 𝐂𝐎𝐕𝐄𝐑𝐈𝐍𝐆 his mouth while speaking to an opposition player during a confrontation. 😳🟥 pic.twitter.com/Y8TYL7sISL— FÚTBOL HUB (@futbol_hubX) June 20, 2026 -
మెస్సీపై ఫిఫాకు ఫిర్యాదు.. అర్జెంటీనా చీట్ చేసిందా?
ఫిఫా ప్రపంచకప్‌లో అల్జీరియాపై విజయంతో జోష్ మీదున్న అర్జెంటీనాకు ఊహించని షాక్ ఎదురైంది. రిఫరీ పూర్ అంపైరింగ్ కారణంగా తాము మ్యాచ్ ఓడిపోయామంటూ అల్జీరియా ఫిఫాకు ఫిర్యాదు చేసింది. ఈ మ్యాచ్‌లోనే లియోనల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసిన సంగతి తెలిసిందే. అయితే మెస్సీ మ్యాచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని కూడా అల్జీరియా తన ఫిర్యాదులో పేర్కొంది. తమ జట్టు ఆటగాడిని ఉద్దేశపూర్వకంగానే కిందపడేసినప్పటికీ మెస్సీకి రిఫరీ రెడ్‌కార్డ్ జారీ చేయకపోవడం తమకు ఆశ్చర్యం కలిగించిందని అల్జీరియా పేర్కొంది.రాయిటర్స్ కథనం ప్రకారం మ్యాచ్ సరైన రీతిలో జరగలేదంటూ మ్యాచ్‌లో జరిగిన తప్పిదాలను హైలైట్ చేస్తూ ఫిఫా రిఫరీయింగ్ కమిషన్‌కు ఫిర్యాదు లేఖను అందించింది. లేఖలో పేర్కొన్న ప్రకారం.. ‘ఆట మొదటి అర్ధభాగంలో అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ ఉద్దేశపూర్వకంగానే అల్జీరియా కెప్టెన్ ఐస్సా మాండీ పిక్కపై కాలు వేసి అతడి పడిపోయేటట్లుగా చేయడం కనిపించింది. ఆ తర్వాత వెనక నుంచి మెస్సీ తన కాలి బూటుతో మాండీని తన్నినట్లు కూడా తెలుస్తోంది. మెస్సీకి రెడ్‌కార్డ్ ఇచ్చి మైదానం నుంచి బయటికి పంపాలని తాము డిమాండ్ చేసినప్పటికీ, మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన పోలండ్‌కు చెందిన సైమన్ మార్సినియాక్ మెస్సీపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. ఇక రెండో అర్ధభాగంలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ అలెక్సిస్మాక్ అల్లిస్టర్ తమ జట్టు ఆటగాడు ఇబ్రహీం మజాపై మోచేతితో దాడి చేసినట్లు అల్జీరియా లేఖలో ఆరోపించింది. ఈ దాడి పట్ల కూడా రిఫరీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తమకు ఆశ్చర్యం కలిగించింది. మ్యాచ్ మొత్తంలో రిఫరీ అర్జెంటీనాకు సానుకూలంగా ఉన్నారని, ఆయన తప్పిదాల వల్లే ఇవాళ అర్జెంటీనా మ్యాచ్‌లో విజయం సాధించింది. వెంటనే మెస్సీతో పాటు రిఫరీపై యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం.’ అని ఫిర్యాదులో పేర్కొంది. అయితే అర్జెంటీనా, అల్జీరియా మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన సైమన్ మార్సినియాక్ 2022 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు కూడా రిఫరీగా వ్యవహరించడం గమనార్హం. ఆనాటి ఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో ఫ్రాన్స్‌ను ఓడించి జగజ్జేతగా నిలిచింది. చదవండి: రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ స్పందన! -
ఫిఫా క్రేజ్: చూస్తే కిక్ రాదు.. అసలు మజా అందులోనే!
భారత్‌లో ఫుట్‌బాల్ క్రేజ్ మామూలుగా లేదిప్పుడు. ఫిఫా వరల్డ్‌కప్ నేపథ్యంలో.. ఐపీఎల్ తరహా సందడి వాతావరణం కనిపిస్తోంది. హోటళ్లు, పబ్‌లు, స్పోర్ట్స్ బార్లు అభిమానులతో కిక్కిరిసిపోతున్నాయి. మెస్సీ, రొనాల్డో, ఎంబాప్పే, యమాల్ వంటి స్టార్ ఆటగాళ్ల అభిమానులు తెరపైకి వచ్చేశారు. అయితే మ్యాచ్ జరిగేటప్పుడు కామెంటేటర్లు తరచూ వాడే పదాలకు చాలామందికి అర్థం మాత్రం తెలియదు. క్రికెట్‌ను కామెంటరీతో ఏలాగైతే ఆస్వాదిస్తామో.. ఫుట్‌బాల్‌ను మరింత ఆస్వాదించాలంటే ముందుగా ఆ ఆటలో వాడే కొన్ని పదాలను అర్థం చేసుకోవాల్సిందే.గోల్ (Goal).. ఫుట్‌బాల్‌లో అత్యంత ముఖ్యమైన పదం ఇదే. బంతి పూర్తిగా గోల్‌పోస్టుల మధ్య, క్రాస్‌బార్ కిందుగా గోల్లైన్ను దాటితే గోల్‌గా పరిగణిస్తారు. ఎక్కువ గోల్స్ చేసిన జట్టు విజేతగా నిలుస్తుంది.ఆఫ్‌సైడ్ (Offside).. ఫుట్‌బాల్‌లో అత్యంత క్లిష్టమైన నిబంధనగా దీన్ని భావిస్తారు. ఆటగాడు బంతి అందుకునే సమయంలో ప్రత్యర్థి జట్టు చివరి డిఫెండర్ కంటే ముందుంటే, అలాగే ఆటలో ప్రభావం చూపితే ఆఫ్‌సైడ్‌గా ప్రకటిస్తారు. గోల్ చేసినా అది చెల్లదు. చాలా వివాదాలు, వీఏఆర్ సమీక్షలు ఎక్కువగా ఈ నిబంధన చుట్టూనే తిరుగుతుంటాయి.పెనాల్టీ (Penalty).. పెనాల్టీ బాక్స్‌లో డిఫెండర్ ఫౌల్ చేస్తే రిఫరీ పెనాల్టీ ఇస్తాడు. అప్పుడు బంతిని పెనాల్టీ స్పాట్‌పై ఉంచి ఒక ఆటగాడు నేరుగా గోల్‌పై షాట్ కొట్టే అవకాశం పొందుతాడు. ఫుట్‌బాల్‌లో గోల్ చేసే అత్యుత్తమ అవకాశాల్లో ఇది ఒకటి.ఫ్రీ కిక్ (Free Kick).. ఫౌల్ జరిగినప్పుడు ప్రత్యర్థి జట్టుకు లభించే అవకాశం. డైరెక్ట్ ఫ్రీ కిక్.. నేరుగా గోల్ కొట్టవచ్చు. ఇన్‌డైరెక్ట్ ఫ్రీ కిక్.. మరో ఆటగాడు బంతిని తాకిన తర్వాత మాత్రమే గోల్ చెల్లుతుంది.హ్యాట్రిక్ (Hat-trick).. ఒకే మ్యాచ్‌లో ఒక ఆటగాడు మూడు గోల్స్ చేస్తే దానిని హ్యాట్రిక్ అంటారు. మెస్సీ, రొనాల్డో, హ్యారీ కేన్, ఎర్లింగ్ హాలాండ్ వంటి స్టార్లు అనేక హ్యాట్రిక్‌లు సాధించారు అని తరచూ వింటుటాం కదా!.క్లీన్ షీట్ (Clean Sheet).. గోల్‌కీపర్ లేదా జట్టు ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగిస్తే దాన్ని క్లీన్ షీట్ అంటారు. డిఫెండర్లు, గోల్‌కీపర్లకు ఇది ప్రతిష్టాత్మక గణాంకం.వీఏఆర్ (Video Assistant Referee).. ఫుట్‌బాల్ మ్యాచ్‌కి రివ్యూలాంటిది. మైదానంలో రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని వీడియోల ద్వారా పరిశీలించే వ్యవస్థ. ఇందులో.. గోల్ చెల్లుతుందా?, పెనాల్టీ సరైందా?.. రెడ్ కార్డ్ ఇవ్వాలా? ఈ తరహా కీలక నిర్ణయాల్లో వీఏఆర్ ఉపయోగిస్తారు.యెల్లో కార్డ్ – రెడ్ కార్డ్.. యెల్లో కార్డ్.. ఆటగాడికి హెచ్చరికగా ఇస్తారు. రెడ్ కార్డ్.. ఆటగాడిని వెంటనే మైదానం నుంచి పంపిస్తారు. ఆ జట్టు మిగతా మ్యాచ్‌ను ఒక ఆటగాడు తక్కువతో ఆడాల్సి ఉంటుంది.ఎక్స్ట్రా టైమ్ (Extra Time).. నాకౌట్ మ్యాచ్‌ల్లో నిర్ణీత 90 నిమిషాల తర్వాత స్కోరు సమంగా ఉంటే అదనంగా 30 నిమిషాలు ఆడిస్తారు.పెనాల్టీ షూటౌట్ (Penalty Shootout).. ఎక్స్ట్రా టైమ్ తర్వాత కూడా ఫలితం తేలకపోతే రెండు జట్లు పెనాల్టీల ద్వారా విజేతను నిర్ణయిస్తాయి. వరల్డ్‌కప్‌లలో ఎన్నో చారిత్రక మ్యాచ్‌లు ఇలాగే ముగిశాయి.కార్నర్ కిక్ (Corner Kick).. ప్రత్యర్థి ఆటగాడు బంతిని తన గోల్‌లైన్ దాటి బయటకు పంపితే దాడి చేస్తున్న జట్టుకు కార్నర్ లభిస్తుంది. ఇవి తరచూ గోల్స్‌కు దారితీస్తుంటాయి.థ్రో-ఇన్ (Throw-in).. బంతి సైడ్‌లైన్ దాటి బయటకు వెళ్తే చేతులతో మైదానంలోకి విసిరే విధానాన్ని థ్రో-ఇన్ అంటారు.ఎక్స్‌జీ(xG) అంటే.. Expected Goals (xG) అనే ఆధునిక గణాంకం ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉంది.ఒక షాట్ గోల్‌గా మారే అవకాశాన్ని శాతం రూపంలో కొలుస్తుంది. జట్టు ఎలా ఆడిందో అంచనా వేయడానికి దీనిని ఉపయోగిస్తారు.డర్బీ (Derby).. ఒకే నగరం లేదా ప్రాంతానికి చెందిన రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను డర్బీ అంటారు. ఉదాహరణకు.. రియల్ మాడ్రిడ్-అట్లెటికో మాడ్రిడ్, అలాగే.. ఏసీ మిలాన్ వర్సెస్ ఇంటర్ మిలాన్ ఇలాగన్నమాట.ట్రెబుల్ (Treble).. ఒకే సీజన్లో లీగ్, దేశీయ కప్, ఖండాంతర టోర్నీ గెలిస్తే ట్రెబుల్ అంటారు. ఇది ఫుట్‌బాల్‌లో అత్యంత అరుదైన ఘనతల్లో ఒకటి.ఫుట్‌బాల్ కేవలం 22 మంది ఆటగాళ్లు బంతి వెంట పరుగెత్తే ఆట కాదు. దానికి సొంత భాష, సొంత వ్యూహాలు, సొంత పదజాలం ఉన్నాయి. "ఆఫ్‌సైడ్" ఎందుకు ఇచ్చారు? "వీఏఆర్" ఎందుకు జోక్యం చేసుకుంది? "క్లీన్ షీట్" అంటే ఏమిటి? వంటి విషయాలు అర్థమైతే మ్యాచ్ చూడటంలోనే కాదు.. చర్చల్లో పాల్గొనడంలోనూ మజా పెరుగుతుంది. ప్రపంచ ఫుట్‌బాల్‌ను ప్రేమించే భారతీయులు పెరుగుతున్న ఈ సమయంలో.. ఆ ఆటకు సంబంధించిన భాషను నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. -
బోణీ కొట్టిన బ్రెజిల్.. నాకౌట్‌కు అడుగు దూరంలో!
ఫిఫా ప్రపంచకప్ 2026లో మాజీ చాంపియన్ బ్రెజిల్ బోణీ కొట్టింది. మొరాకోతో జరిగిన తొలి మ్యాచ్‌ను డ్రాగా ముగించిన బ్రెజిల్ శనివారం హైతీతో మ్యాచ్‌లో 3-0తో ఘన విజయాన్ని అందుకుంది. బ్రెజిల్ తరఫున మాథ్యూస్ కుహా (ఆట 23, 36వ నిమిషాలు) గోల్స్ చేయగా, స్టార్ ప్లేయర్ వినిసియస్ జూనియర్ హాఫ్ టైమ్ ముందు (45+3వ నిమిషం) గోల్ చేశాడు. రెండో హాఫ్‌లో ఇరుజట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. అయితే రెండో సగంలో బ్రెజిల్ పలుమార్లు హైతీ గోల్ పోస్టుపై దాడులు చేసినప్పటికీ ఆ జట్టు గోల్ కీపర్ వాటిని సమర్థంగా అడ్డుకున్నాడు. ఈ విజయంతో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకున్న బ్రెజిల్ పట్టికలో తొలి స్థానంలో కొనసాగుతుంది. తదుపరి రౌండ్ (రౌండ్ ఆఫ్ 32)కు అర్హత సాధించేందుకు బ్రెజిల్ అడుగుదూరంలో నిలిచింది.ఇక ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో మూడు గోల్స్ అంతకంటే ఎక్కువ కొట్టడం బ్రెజిల్‌కు ఇది 41వ సారి కావడం విశేషం. బ్రెజిల్ తర్వాత జర్మనీ (36 సార్లు) మాత్రమే అత్యధికంగా మూడు గోల్స్ కొట్టిన సందర్భాలున్నాయి. ఇక బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్మర్ జూనియర్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. గాయంతో బాధపడుతున్న నెయ్మర్ లీగ్ దశలో ఈ నెల 24న స్కాట్లాండ్తో చివరి మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. నెయ్మర్ లేకున్నా తాము విజయం సాధించగలమని బ్రెజిల్ జట్టు నిరూపించింది.FIM DE JOGO NA FILADÉLFIA!🇧🇷3-0🇭🇹⚽️ Cunha⚽️ Cunha⚽️ Vini JrMAIS TRÊS PONTOS PARA O BRASIL! 🇧🇷🏆A Seleção Brasileira vence o Haiti e segue firme na busca pela classificação às oitavas de final da Copa do Mundo FIFA 2026.Próximo desafio: Escócia, na quarta-feira (24),… pic.twitter.com/1O9j8tG5LU— brasil (@CBF_Futebol) June 20, 2026చదవండి: దెబ్బతిన్న పులిలా రొనాల్డో.. ఆ మెరుపులెక్కడ? -
దెబ్బతిన్న పులిలా రొనాల్డో.. ఆ మెరుపులెక్కడ?
రెండు దశాబ్దాలకు పైగా క్రిస్టియానో రొనాల్డో ఫుట్‌బాల్‌ను ఏలుతున్నాడు. తనపై విమర్శలు వచ్చిన ప్రతీసారి అవి తప్పని నిరూపిస్తూ తన కెరీర్‌ను నిర్మించుకుంటూ వచ్చాడు ఈ పోర్చుగల్ స్టార్. విమర్శలు వచ్చిన ప్రతీసారి తన గోల్స్‌తో సమాధానమిచ్చాడు. అతని కెరీర్ సుదీర్ఘకాలం కొనసాగుతుందా అనే సందేహాలు తలెత్తిన ప్రతిసారీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూనే వస్తున్నాడు. మాంచెస్టర్ నుంచి మాడ్రిడ్ వరకు, టురిన్ నుంచి రియాద్ వరకు, తన జాతీయ జట్టు పోర్చుగల్ తరఫున అసాధారణ కెరీర్‌తో రొనాల్డో పదేపదే అంచనాలను తిరగరాశాడు. ఒక్క ఫిఫా ప్రపంచకప్ సాధించలేదన్న వెలితి తప్ప మిగతా రికార్డులన్నీ రొనాల్డో ఎప్పుడో సాధించేశాడు.ఇక అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఫిఫా ప్రపంచకప్‌లో మాత్రం రొనాల్డో అంచనాలు అందుకోలేకపోతున్నాడు. తన సమకాలీన ఆటగాళ్లైన మెస్సీ, ఎంబాపె, ఎర్లింగ్ హాలండ్, లామినే యమాలా, హ్యారీ కేన్ వంటి స్టార్లు తమ దేశాల తరఫున తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టి గోల్స్ కొట్టడంతో జట్టుకు విజయం అందించడంలో సహాయపడ్డారు. కానీ పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో మాత్రం ఇప్పటివరకు ఖాతా తెరవలేదు. ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ తమ తొలి మ్యాచ్ కాంగోతో ఆడింది. ఈ మ్యాచ్‌లో 90 నిమిషాల పాటు మైదానంలో ఉన్న రొనాల్డో ఒక్క గోల్ కొట్టలేకపోయాడు. అంతేకాదు ఇతర ఆటగాళ్లకు కనీసం పాస్ కూడా అందించడంలో విఫలమయ్యాడు. దీంతో రొనాల్డో ఫామ్‌పై ప్రశ్నలు, విమర్శలు మొదలయ్యాయి.ఆ ప్రశ్నలన్నింటికీ రొనాల్డో కూడా సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చేసింది. రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న రొనాల్డో కాంగోతో మ్యాచ్‌లో కేవలం బంతిని 25సార్లు మాత్రమే టచ్ చేశాడు. ప్రతీ ఫిఫాతో పోల్చుకుంటే ఈసారి రొనాల్డో ప్రదర్శన అత్యల్పం. కేవలం మూడు సందర్భాల్లో మాత్రమే షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. మ్యాచ్‌లో మొత్తంగా 25 టచ్‌లు, రెండు ప్రోగ్రెసివ్ క్యారీ, రెండు ప్రోగ్రెసివ్ పాస్‌లు, రెండు ఏరియల్ డ్యూయల్స్ పాస్‌లు ఆడాడు. వయసు కూడా రొనాల్డోకు అడ్డంకిగా మారినట్లు అనిపిస్తోంది. తన కంటే వయసులో రెండేళ్లు చిన్నవాడైన మెస్సీ మాత్రం మైదానంలో పాదరసంలా కదులుతుంటే రొనాల్డో మాత్రం పరిగెత్తడానికి కూడా ఇబ్బంది పడినట్లు కాంగోతో మ్యాచ్‌లో కనిపించింది. 2006లో తొలి ఫిఫా ఆడిన సమయంలో రొనాల్డో వయసు 21 ఏళ్లు. 2026 నాటికి అతడి వయసు 41 ఏళ్లు. ఈ 20 ఏళ్లలో ఆరు ఫిఫా ప్రపంచకప్‌లు ఆడిన రొనాల్డో మొత్తంగా 8 గోల్స్ కొట్టాడు. రష్యా వేదికగా జరిగిన 2018 ఫిఫాలో రొనాల్డో అత్యధికంగా నాలుగు గోల్స్ కొట్టడం విశేషం. పోర్చుగల్ ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లో రొనాల్డో 396 నిమిషాలు మైదానంలో గడిపాడు. కానీ ఆ జట్టు మాత్రం కేవలం ఒక్క గోల్ మాత్రమే చేయడం గమనార్హం. ఈ గణాంకాలు రొనాల్డో ఫామ్‌నే కాదు జట్టును కూడా ఇబ్బందుల్లోకి నెట్టేసినట్లుగా అనిపిస్తోంది. గతంలో తనపై విమర్శలు వచ్చిన ప్రతీసారి ఆటతోనే సమాధానం చెప్పిన రొనాల్డో మరోసారి అదే ఆటతో ప్రపంచం మొత్తం తనను ప్రశంసించేలా చేసుకోవాలని ఆశిద్దాం.Read: ఫిఫా చరిత్రలోనే ఫాస్టెస్ట్ గోల్.. మొరాకోదే విజయం -
ఫిఫా చరిత్రలోనే ఫాస్టెస్ట్ గోల్.. మొరాకోదే విజయం
ఫిఫా ప్రపంచకప్ 2026లో మొరాకో జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. గ్రూప్-సిలో భాగంగా శనివారం స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో మొరాకో 1-0 తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకున్న మొరాకో నాకౌట్ దశకు ఒక అడుగు దూరంలో నిలిచింది. మొరాకో తరఫున ఇస్మాయిల్ సైబారి మ్యాచ్ మొదలైన రెండో నిమిషంలోనే గోల్ కొట్టాడు. అయితే 71 సెకన్ల వ్యవధిలో సైబారి గోల్ కొట్టడం విశేషం. తద్వారా ఫిఫా చరిత్రలో ఇస్మాయిల్ సైబారి కొట్టిన గోల్ అత్యంత వేగవంతమైనదిగా రికార్డులకెక్కింది. బోస్టన్లోని గిల్లెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌కు 64,146 మంది అభిమానుల సమక్షంలో సైబారి కళ్లు మూసి తెరిచేలోపు ఎడ్జ్ నుంచి బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి తరలించడం విశేషం. గత వారం మాజీ చాంపియన్స్ బ్రెజిల్‌తో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న మొరాకో ఇవాళ్టి మ్యాచ్‌లో మాత్రం స్కాట్లాండ్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.ఫిఫా చరిత్రలో అత్యంత ఫాస్టెస్ట్ గోల్స్1) హకాన్ సుకుర్ – 2002లో 11 సెకన్లు2) వాక్లావ్ మాసెక్ – 1962లో 15 సెకన్లు3) ఎర్నెస్ట్ లెహ్నర్ – 1934లో 25 సెకన్లు4) బ్రయాన్ రాబ్సన్ – 1982లో 28 సెకన్లు5) క్లింట్ డెంప్సీ – 2014లో 30 సెకన్లు6) బెర్నార్డ్ లాకోంబే – 1978లో 31 సెకన్లు7) ఆర్నే నైబర్గ్ – 1938లో 35 సెకన్లు7) ఎమిలే వీనాంటే – 1938లో 35 సెకన్లు8) ఫ్లోరియన్ ఆల్బర్ట్ – 1962లో 50 సెకన్లు8) అడాల్బర్ట్ డెసు – 1930లో 50 సెకన్లు8) సెయుంగ్ జిన్ పాక్ – 1966లో 50 సెకన్లు9) సెల్సో అయాలా – 1998లో 52 సెకన్లు10) మథియాస్ జోర్గెన్సెన్ – 2018లో 55 సెకన్లు11) ఇస్మాయిల్ సైబారి- 2026లో 71 సెకన్లు71 SECONDS 🔥 🔥 Ismael Saibari has just scored the fastest goal of the 2026 World Cup.He will cook in Bayern alongside Harry Kane and Olise 🔥 Moroco 1 - 0 Scotland #SCOMAR#FIFAWorldCup pic.twitter.com/071FJBPS5c— JACINTA❤️ (@JacentaAfc) June 19, 2026 -
దక్షిణ కొరియాపై విజయం.. నాకౌట్ దశకు మెక్సికో
ఫిఫా ప్రపంచకప్‌లో మెక్సికో రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించింది. శుక్రవారం గ్రూప్-ఏలో సౌత్‌కొరియాతో జరిగిన మ్యాచ్‌లో మెక్సికో 1-0తో విజయాన్ని అందుకుంది. మెక్సికో తరఫున లూయిస్ రొమో ఆట 50వ నిమిషంలో గోల్ సాధించాడు. ఈ విజయంతో గ్రూప్ దశలో రెండు విజయాలు సాధించిన మెక్సికో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే తర్వాతి రౌండ్ (రౌండ్ ఆఫ్ 32)కు క్వాలిఫై అయింది. కాగా దక్షిణ కొరియా మ్యాచ్ మొత్తంలో రెండుసార్లు మాత్రమే మెక్సికో గోల్‌పోస్టుపై దాడులు చేయడం గమనార్హం. అయితే ఈ రెండుసార్లు కూడా గోల్ కొట్టడంలో విఫలమైన దక్షిణ కొరియా ఓటమి దిశగా సాగింది. ఇక ఆరు పాయింట్లతో మెక్సికో తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించగా, ఇదే గ్రూప్‌లో ఉన్న సౌత్ కొరియా మూడు పాయింట్లు, చెక్ రిపబ్లిక్, సౌతాఫ్రికా ఖాతాలో ఒక్కో పాయింట్ ఉన్నాయి. మెక్సికో తన చివరి మ్యాచ్‌ను చెక్ రిపబ్లిక్‌తో ఆడనుంది. కాగా ప్రతీ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించనున్న సంగతి తెలిసిందే.చదవండి: గంభీర్‌పై నిప్పులు చెరిగిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్! -
కెనడా, ఖతార్ మ్యాచ్.. ఆ ఒక్కడి కోసం తన్నుకున్న ఆటగాళ్లు!
ఫిఫా ప్రపంచకప్‌లో కెనడా, ఖతార్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు తన్నుకోవడం చర్చనీయాంశమైంది. కెనడా 6-0తో ఖతార్‌పై ఘన విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్‌లో కెనడా విజయం సాధించినప్పటికీ ఖతార్ ఆటగాళ్ల వైఖరిని తప్పుబట్టారు. అందుకే ఒక్కసారి మ్యాచ్‌లో ఫైనల్ విజిల్ రాగానే కెనడా ఆటగాళ్లు ఖతార్ జట్టువైపు దూసుకొచ్చారు. ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో మైదానంలోకి వచ్చిన సెక్యూరిటీ ఇరుజట్లను వేరు చేసి అక్కడినుంచి పంపించేశారు. ఈ సమయంలో మైదానంలో గందరగోళం నెలకొంది. ఈ చర్యను ఇరుజట్ల కోచ్‌లు తప్పుబట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మరి కెనడా ఆటగాళ్ల కోపానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే.. ఖతార్ ఆటగాళ్ల తప్పిదాల వల్ల కెనడా మిడ్‌ఫీల్డర్ ఇస్మాయిల్ కోనె కాలు విరిగింది. నడవడానికి కూడా ఇబ్బంది పడడంతో అతడిని స్ట్రెచర్‌పై తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే ఇస్మాయిల్ కోనె కాలు విరగడానికి ప్రధాన కారణం ఖతార్ ఆటగాడు అస్సిమ్ మదిబో. బంతిని పాస్ అందించడానికి ఇస్మాయిల్ ప్రయత్నిస్తున్న సమయంలో అతడికి అడ్డువచ్చిన అస్సిమ్ కావాలనే తను కాలును వెనుక నుంచి అడ్డుపెట్టాడు. దీంతో కోనె కాలు బోన్ విరిగిపోయింది. ఈ దుశ్చర్యతో రిఫరీ ఖతార్ ఆటగాడికి రెడ్‌కార్డ్ జారీ చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే ఆతిథ్య కెనడా.. ఖతార్‌పై పూర్తి ఆధిపత్యం కనబరిచింది. జొనాథన్ డేవిడ్ హ్యాట్రిక్ గోల్స్‌తో కెనడా విజయంలో కీలకపాత్ర పోషించాడు.Tempers flare between Canada and Qatar after the final whistle, leading to a player scuffle to conclude a dramatic match LIVE UPDATES: https://t.co/Hb9FJ14WLh pic.twitter.com/0z5Vqmf50Z— CTV News (@CTVNews) June 19, 2026 -
కెనడా ప్లేయర్‌కు విరిగిన కాలు; కట్‌చేస్తే ఖతార్‌కు చుక్కలు!
ఫిఫా ప్రపంచకప్‌లో ఆతిథ్య కెనడా బోణీ కొట్టింది. గ్రూప్-బిలో ఉన్న కెనడా 6-0తో ఖతార్‌పై భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్ డ్రా చేసుకున్న కెనడాకు ఇదే తొలి విజయం. కెనడా తరఫున జొనాథన్ డేవిడ్ హ్యాట్రిక్ గోల్స్‌తో (ఆట 29వ, 45+3వ, 90+2వ నిమిషంలో) మెరవగా, సైల్ లారిన్ (ఆట 16వ నిమిషం), నాథన్ సలిబా (ఆట 64వ నిమిషం), ఖతార్ ఆటగాడు మొహమ్మద్ మనాయి (ఆట 75వ నిమిషంలో) సెల్ఫ్ గోల్ చేయడంతో అది కెనడా ఖాతాలోకి వెళ్లిపోయింది. అయితే ఖతార్ తరఫున హొమమ్ అహ్మద్ (ఆట 33వ నిమిషం), అస్సిమ్ మదిబొ (ఆట 53వ నిమిషం) గోల్స్ కొట్టినప్పటికీ తప్పిదాలతో రిఫరీ రెడ్ కార్డ్ చూపడంతో ఖతార్ గోల్స్ చెల్లలేదు. దీంతో కెనడా భారీ విజయంతో 4 పాయింట్లతో పట్టికలో తొలి స్థానంలో ఉంది. ఇదే మ్యాచ్‌లో కెనడా స్టార్ మిడ్‌ఫీల్డర్ ఇస్మాయిల్ కొనే ప్రత్యర్థి ఆటగాడి ఫౌల్ కారణంగా తన ఎడమ కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. నొప్పి భరించలేక మైదానంలోనే స్ట్రెచర్‌పై ఆక్సిజన్ మాస్క్‌తో బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఇక మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన జొనాథన్ డేవిడ్ అరుదైన ఫీట్ సాధించాడు. 2026 ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సీ తర్వాత హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. మూడు కీలక గోల్స్‌తో కెనడా విజయంలో కీలకపాత్ర పోషించిన జొనాథన్నే ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.చదవండి: వివాదంలో మెస్సీ.. భగ్గుమన్న అభిమానులు! -
వివాదంలో మెస్సీ.. భగ్గుమన్న అభిమానులు!
పిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా శుభారంభం చేసింది. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా 3-0తో అల్జీరియాను చిత్తు చేసింది. మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే అల్జీరియాతో మ్యాచ్‌లో లియోనల్ మెస్సీ చర్య వివాదానికి దారి తీసింది. మెస్సీ ఫౌల్ చేసినట్లు నిర్థారణ అయినప్పటికీ మ్యాచ్ రిఫరీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. విషయంలోకి వెళితే.. తొలి గోల్ కొట్టిన తర్వాత మెస్సీ అల్జీరియా ప్లేయర్‌ను అడ్డుకునే క్రమంలో వెనుక నుంచి స్టడ్స్-అప్ ఛాలెంజ్ చేశాడు. దీంతో ఆ ప్లేయర్ నొప్పితో నేలపై పడిపోయాడు. ఇది ఫుట్‌బాల్‌లో నిబంధనలకు విరుద్ధం. ఈ చర్య పట్ల మెస్సీకి రిఫరీ రెడ్ కార్డు చూపించాలి. మెస్సీ ఫౌల్ చేసినట్లు రిప్లేలో స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ మ్యాచ్ రిఫరీ సైమన్ మార్సీనియాక్ మెస్సీకి రెడ్ లేదా ఎల్లో కార్డు జారీ చేయాలి. దీంతో రిఫరీ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది. ‘మెస్సీ అయితే రూల్స్ మారిపోతాయా?’ అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మెస్సీకి సంబంధించిన వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అల్జీరియాతో ఆడుతున్న మ్యాచ్ మెస్సీకి 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. కెప్టెన్ లియోనల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ (ఆట 17వ, 60వ, 76వ నిమిషం)తో మెరిశాడు. తద్వారా ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో జర్మనీ దిగ్గజం మిరాస్లోవ్ క్లోస్‌తో కలిసి మెస్సీ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ విజయంతో అర్జెంటీనా మూడు పాయింట్లు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. రికార్డు స్థాయిలో మెస్సీ ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న సంగతి తెలిసిందే. Messi just got away with an absolutely DISGUSTING challenge to an Algeria defenders leg.Red card or not?pic.twitter.com/2ZU2B5j4oH— Banter FC (@FCBanter_) June 17, 2026Read: అల్జీరియాపై గెలుపు.. కంటతడి పెట్టిన మెస్సీ! -
అల్జీరియాపై గెలుపు.. కంటతడి పెట్టిన మెస్సీ!
ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-జెలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో అల్జీరియాను చిత్తుగా ఓడించింది. కెప్టెన్‌గా జట్టును నడిపించడమే గాక హ్యాట్రిక్ గోల్స్‌తో ఒంటిచేత్తో అర్జెంటీనాకు విజయాన్ని అందించడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అయితే తొలి గోల్ కొట్టిన సమయంలో మెస్సీ ఎమోషనల్ అవ్వడం కెమెరా కంటికి చిక్కింది. ఇది చూసిన అతడి అభిమానులు మెస్సీ ఎందుకు ఏడ్చాడో అర్థంగాక ఆందోళన చెందారు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత మెస్సీ తన కంటతడికి కారణం వివరించాడు. అల్జీరియాతో మ్యాచ్‌కు ముందు తాను క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నానని, గోల్ కొట్టిన సంతోషంలో ఒక్కసారిగా ఏడుపు వచ్చేసిందని తెలిపాడు. అయితే తన భావోద్వేగంతో మ్యాచ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నాడు. మెస్సీ మాట్లాడుతూ.. ‘నా కంటతడికి మ్యాచ్‌తో సంబంధం లేదు. అయితే దీనికి ముందు కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా. మ్యాచ్‌లో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. ఫిఫా ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ గోల్స్‌తో మెరుస్తానని ఊహించలేదు. మ్యాచ్ సమయంలో నా సహచరులు అండగా నిలిచారు. సరైన సమయంలో పాస్‌లు అందించి గోల్స్ చేయడంలో సహకరించారు. ఈ విజయం నా ఒక్కడిది ఎంతమాత్రం కాదు. జట్టు అంతా కలిసి ఆడాం. రాబోయే మ్యాచ్‌ల్లోనే ఇదే ప్రదర్శనను పునరావృతం చేయాలని ఆశిస్తున్నా. రికార్డుల గురించి పెద్దగా పట్టించుకోను. ఇవాళ నాది రికార్డు కావొచ్చు.. కానీ రేపు అన్న రోజు నా రికార్డును వేరేవాళ్లు బద్దలు కొడుతారు. మాకు అన్ని వేళల అండగా నిలుస్తూ వస్తోన్న కోచ్ లియోనల్ స్కలోనికి ప్రత్యేక కృతజ్ఞతలు' అని చెప్పుకొచ్చాడు.ఇక ఫిఫా ప్రపంచకప్పుల్లో మెస్సీకి ఇది 16వ గోల్ కావడం విశేషం. తద్వారా ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మెస్సీ జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరో గోల్ కొడితే మెస్సీ క్లోజ్‌ను దాటి టాప్ స్థానాన్ని కైవసం చేసుకోనున్నాడు. తర్వాతి మ్యాచ్‌లోనే ఆ అద్భుతాన్ని చూసే అవకాశం మనకు కలగనుంది.Leo Messi crying after his goal 🥹🥹pic.twitter.com/s4vZvOWIsx— All About Argentina 🛎🇦🇷 (@AlbicelesteTalk) June 17, 2026 Leo Messi: "I can't ask for anything more, God gave me too much, now everything is just to enjoy. "I'm just happy to being considered as one of the best in football history, I'm just grateful to be considered among many great players..." pic.twitter.com/B6flzm2fTX— All About Argentina 🛎🇦🇷 (@AlbicelesteTalk) June 17, 2026Read: మెస్సీ ఖాతాలో అత్యధిక గోల్స్.. గంటల వ్యవధిలో ఎంబాపెకు చెక్! -
200వ మ్యాచ్‌లో గోల్.. చరిత్ర సృష్టించిన మెస్సీ
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా స్టార్ లియోనల్ మోస్సీ గోల్స్ వేటను ప్రారంభించాడు. బుధవారం గ్రూప్-జెలో అల్జీరియాతో ఆడుతున్న మ్యాచ్‌లో మెస్సీ తొలి గోల్‌తో మెరిశాడు. తొలి హాఫ్ ముగిసేసరికి అర్జెంటీనా 1-0తో అల్జీరియాపై ఆధిక్యంలో నిలిచింది. రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీకి ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. మ్యాచ్ ఆరంభం నుంచే హైపర్ యాక్టివ్‌గా కనిపించిన మెస్సీ 38 ఏళ్ల వయసులోనూ మైదానంలో పాదరసంలా పరిగెత్తాడు. 17వ నిమిషంలో ఆఫ్‌సైడ్ దిశగా వచ్చిన బంతిని మెస్సీ నేరుగా గోల్ పోస్ట్‌లోకి తరలించడంతో అర్జెంటీనా ఖాతా తెరిచింది. ఈ నేపథ్యంలో మెస్సీ ఒక అరుదైన రికార్డు సాధించాడు. గోల్ కొడుతున్న మెస్సీఫుట్బాల్ చరిత్రలో ఐదు వేర్వేరు ఫిఫా ప్రపంచకప్పుల్లో గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా మెస్సీ నిలిచాడు. ఇంతకముందు క్రిస్టియానో రొనాల్డో ఈ ఘనత సాధించి తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మెస్సీ.. ఎంబాపె, గెరాల్డ్ ముల్లర్లతో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. బ్రెజిల్ దిగ్గజం రొనాల్డో (15 గోల్స్) రెండో స్థానంలో ఉండగా, జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోస్ (16 గోల్స్) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. -
28 ఏళ్ల తర్వాత బరిలోకి.. ఇరాక్‌ను చిత్తు చేసిన నార్వే
28 ఏళ్ల తర్వాత ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న నార్వే తన ప్రయాణాన్ని ఘనంగా ఆరంభించింది. గ్రూప్-ఐలో భాగంగా ఇరాక్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్వే 4-1 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. నార్వే స్టార్ ఎర్లింగ్ హాలండ్ డబుల్ గోల్స్ (ఆట 29వ, 43వ నిమిషం)తో మెరవగా, లియో గార్డ్ (76వ నిమిషం), ఇరాక్ ఆటగాడు అమెన్ హుస్సెన్ (90+6వ నిమిషం) సెల్ఫ్ గోల్ కొట్టడంతో అది నార్వే ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక ఇరాక్ తరఫున అమెన్ హుస్సేన్ ఆట 39వ నిమిషంలో గోల్ సాధించాడు. ఇక 28 ఏళ్ల తర్వాత ఫిఫా ఆడుతున్న నార్వేకు ఎర్లింగ్ హాలండ్ తన గోల్స్‌తో మరిచిపోలేని విజయాన్ని అందించాడు. క్వాలిఫయర్స్‌లో మాజీ చాంపియన్ ఇటలీని ఓడించి ఫిఫాకు అర్హత సాధించడంలో హాలండ్ కీలకపాత్ర పోషించాడు. గోల్ కొడుతున్న ఎర్లింగ్ హాలండ్ఇప్పుడు అసలు సమరంలోనూ ఈ స్టార్ స్ట్రైకర్ తన మ్యాజిక్‌ను ప్రదర్శించాడు. అంతకముందు ఇదే గ్రూప్‌లో ఫ్రాన్స్ 3-1 తేడాతో సెనెగల్‌ను ఓడించినప్పటికీ, ఇరాక్‌పై నాలుగు గోల్స్‌తో ఆధిపత్యం ప్రదర్శించిన నార్వే గ్రూప్‌లో తొలి స్థానంలో నిలిచింది.క్వాలిఫయర్స్‌లో సత్తా చాటి ఫిఫాకు అర్హత సాధించిన నార్వే.. ఇరాక్‌తో మ్యాచ్‌లో ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట మొదలైన కాసేపటికే ఇరాక్ గోల్‌పోస్టులపై దాడులు మొదలుపెట్టిన నార్వేకు 29వ నిమిషంలో ఎర్లింగ్ హాలండ్ తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత 43వ నిమిషంలో మరో గోల్ సాధించడంతో నార్వే 2-0తో ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత రెండో సగంలో మరో రెండు గోల్స్ రావడం.. అందులో ఒకటి ఇరాక్ ఆటగాడి సెల్ఫ్ గోల్ నార్వే ఖాతాలోకి వెళ్లిపోయింది. నార్వే తన తర్వాతి మ్యాచ్‌లో జూన్ 23న సెనెగల్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఫ్రాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. HAALAND SCORES HIS FIRST WORLD CUP GOAL!!! pic.twitter.com/hOFIEuj8Bd— AzzaTalksFooty (@AzzaTalksFooty) June 16, 2026చదవండి: రేపు అర్జెంటీనా మ్యాచ్.. కేరళలో మెస్సీ మేనియా! -
ఓ విద్యార్థి చేసిన చిలిపి పనే.. ఈ ఆటకి ఆరంభమని తెలుసా?
19వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లోని వివిధ పాఠశాలల్లో ఫుట్‌బాల్ ఆటకు కొన్ని వేర్వేరు నియమాలు ఉండేవి. అయితే ఈ నియామాలనే ఆధారం చేసుకుని.. కాస్త రివర్స్‌లో ఏర్పడిందే ఈ రగ్బీ ఆట.1823వ సంవత్సరంలో రగ్బీ స్కూల్ (Rugby School) అనే పాఠశాలలో ఫుట్‌బాల్ ఆటను నిర్వహించారు. ఆట జరుగుతున్న సమయంలో విలియమ్ వెబ్ ఎల్లిస్(William Webb Ellis) అనే 16 ఏళ్ల విద్యార్థి బంతిని చేతులతో ఎత్తుకుని పరిగెత్తాడు. ఆనాడు ఫుట్‌బాల్ నియమాలకు ఇది పూర్తి వ్యతిరేకం. ఆ రోజుల్లో బంతిని కాలుతో తోయడం(కిక్) మాత్రమే ఉండేది. ఇలా చేతితో తీసుకుని పరిగెత్తిన సంఘటనే రగ్బీ ఆటకు పునాదిగా మారిందని కొందరి అభిప్రాయం. అయితే దీనిపై చరిత్రకారుల నుంచి ఎలాంటి స్పష్టత లేదనే చెప్పవచ్చు. కానీ స్థానికులు మాత్రం ఆ విద్యార్థి కారణంగానే ఈ ఆట పుట్టుకొచ్చిందని విశ్వసిస్తారు. ఆనాడు ఎల్లిస్ చేసిన ఈ కొత్త ప్రయోగం అక్కడి విద్యార్థులకి తెగ నచ్చేసింది. 1845లో రగ్బీ స్కూల్లోనే విద్యార్థులచే ఈ ఆటకు నియమాలు నిర్ణయించారు. 1871 లో రగ్బీ యూనియన్ ఏర్పడి, అధికారిక నియమాలను రూపొందించుకుంది.ఈ ఆట ఇంగ్లాండ్‌లో పుట్టి, రగ్బీ స్కూల్లో మొదలై, ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక టోర్నమెంట్ గా మారింది. ఈ వరల్డ్‌కప్ మొదటిసారిగా 1987లో ఎడిన్‌బర్గ్‌లోని రేబర్న్ ప్లేస్‌లో స్కాట్లాండ్, ఇంగ్లాండ్ మధ్య నిర్వహించారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే? రగ్బీ ప్రపంచకప్ విజేతకు ఇచ్చే ట్రోఫీ పేరు 'విలియమ్ వెబ్ ఎల్లిస్' కప్. అంటే ఈ కథలో మొదటిసారిగా ఫుట్‌బాల్ ఆటకి వ్యతిరేకంగా బంతిని చేతులలో తీసుకుని పరిగెత్తిన విద్యార్థి పేరే గౌరవార్థంగా పెట్టడం విశేషం. -
రేపు అర్జెంటీనా మ్యాచ్.. కేరళలో మెస్సీ మేనియా!
ఫిఫా ప్రపంచకప్-2026లో బుధవారం డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది. గ్రూప్-ఐలో ఉన్న అర్జెంటీనా తమ తొలి మ్యాచ్‌లో అల్జీరియాతో తలపడనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రేపు ఉదయం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. మెస్సీ ఆఖరి ఫిఫా అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అతడి ఆట కోసం ప్రపంచం మొత్తం వెయ్యికళ్లతో ఎదురుచూస్తోంది. భారత్‌లో కూడా మెస్సీకి వీరాభిమానులు ఉన్నారు. కేరళలో మెస్సీ అంటే పడిచచ్చిపోయేవాళ్లు లెక్కలేనంత మంది ఉంటారు. అసలే ఫిఫా ప్రపంచకప్, ఆపై డిఫెండింగ్ చాంపియన్స్ హోదాలో అర్జెంటీనా బరిలోకి దిగుతుండడంతో కేరళలో ఫిఫా కళ వచ్చేసింది. ముఖ్యంగా కేరళలోని పుల్లవూర్ గ్రామంలో మెస్సీ మేనియా మాములుగా లేదు. ఆ ఊర్లో ఎక్కడ చూసినా ఫుట్‌బాల్ ఆటగాళ్ల కటౌట్లే కనిపిస్తాయి. ఇక్కడ మెస్సీ అభిమానులే కాదు రొనాల్డో, నెయ్మర్, ఎంబాపె, సాలా, లామినే యమాల్ వంటి ఆటగాళ్లకు కూడా విపరీతమైన ఆదరణ ఉంది. అక్కడి ఇళ్లకు కూడా ప్రజలు తమకిష్టమైన జట్ల రంగులను పెయింటింగ్ వేసుకోవడం విశేషం. ఇక రేపు అర్జెంటీనా మ్యాచ్ ఉండడంతో ఆ జట్టు అభిమానులు పుల్లవూరు గ్రామంలో ఉన్న నది మధ్యలో ప్లోటింగ్ బోర్డుపై అర్జెంటీనా జట్టు మొత్తాన్ని కటౌట్ల రూపంలో ఉంచడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తం మీద ఫిఫా ప్రపంచకప్ మేనియా ఇప్పుడు భారత్‌లో కూడా టాప్ గేర్‌కు చేరుకున్నట్లయింది. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఫైనల్లో ఫ్రాన్స్‌ను షూటౌట్లో ఓడించి మూడోసారి ఫిఫా టైటిల్‌ను కైవసం చేసుకుంది.Frome Viral Kerala #Argentina pic.twitter.com/PLUUUWK9Fc— FIFAHighlightsTV (@Worldcupcatcher) June 13, 2026అసలు సమరం మొదలు..మరో విషయమేంటంటే.. బుధవారం ఒక్కరోజే ముగ్గురు బిగ్‌స్టార్స్ మ్యాచ్‌లు ఆడనుండడంతో ఫిఫాలో అసలు సమరం మొదలుకానుంది. బుధవారం తెల్లవారుజామున ఫ్రాన్స్, సెనెగల్ మధ్య పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబాపె బరిలోకి దిగనున్నాడు. ఆ తర్వాత ఉదయం 6.30 గంటలకు మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా అల్జీరియాతో తలపడనుంది. ఇక అదే రోజు రాత్రి 10.30 గంటలకు పోర్చుగల్ కాంగో రిపబ్లిక్‌తో తలపడనుంది. ఇలా త్రిమూర్తులు ఒకేరోజు మ్యాచ్ ఆడనుండడంతో అభిమానుల్లో ఎనలేని జోష్ వచ్చింది.చదవండి: కోహ్లి మాట చెవికెక్కించుకోని వైభవ్! -
డ్రాతో ప్రయాణం మొదలు.. తుపాకీ పేల్చిన ఇరాన్ ఆటగాడు!
ఫిఫా ప్రపంచకప్ ప్రయాణాన్ని ఇరాన్ డ్రాతో ఆరంభించింది. గ్రూప్-జిలో భాగంగా లాస్ ఏంజిల్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను ఇరాన్ 2-2తో డ్రా చేసుకుంది. ఇరాన్ తరఫున ఆట 32వ నిమిషంలో రమిన్ రిజెయిన్, ఆట 64వ నిమిషంలో మొహమ్మద్ మొహెబి గోల్ కొట్టగా, న్యూజిలాండ్ తరఫున ఎలిజా జస్ట్ (ఆట 7, 55వనిమిషంలో) డబుల్ గోల్స్‌తో మెరిశాడు. మ్యాచ్ డ్రా కావడంతో ఇరుజట్లు చెరో పాయింట్ గెలుచుకున్నాయి. అంతకముందు ఇదే గ్రూప్‌లో బెల్జియం, ఈజిప్ట్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నో ఉత్కంఠ పరిణామాల నడుమ ఫిఫా ఆడేందుకు అమెరికాలో అడుగుపెట్టిన ఇరాన్ తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించిందని చెప్పొచ్చు. అయితే మ్యాచ్ డ్రా సంగతి పక్కనబెడితే ఇరాన్ ప్లేయర్ మొహమ్మద్ మొహెబి చర్య వివాదాస్పదంగా మారింది. న్యూజిలాండ్ రెండో గోల్ కొట్టి జోష్‌లో ఉంది. ఈ సమయంలో న్యూజిలాండ్ డిఫెన్స్ టీమ్‌ను దాటుకొని ఆట 64వ నిమిషంలో మొహమ్మద్ మొహెబి కార్నర్ నుంచి బంతిని నేరుగా గోల్ పోస్టులోకి తరలించాడు. ఈ సంతోషంలో అతడు తన చేతిని తుపాకీగా మార్చుకొని గాల్లోకి కాల్పులు జరుపుతున్నట్లుగా ఫోజు ఇస్తూ సెలబ్రేషన్ చేసుకున్నాడు. అతడి చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మొహమ్మద్ మొహెబి సెలబ్రేషన్‌పై కొంతమంది ఫుట్‌బాల్ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే స్టేడియంలో అమెరికాకు చెందిన వాళ్లు కూడా ఉండడంతో వాళ్లు వైపు చూస్తూ మొహమ్మద్ ఇలాంటి సంజ్ఞలు చేశాడని.. ఒకవైపు ఆటకు రాజకీయాలతో సంబంధం లేదని ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు పేర్కొంటే.. మరోవైపు ఆ జట్టుకు చెందిన ఆటగాడు ఇలాంటి సెలబ్రేషన్‌ను చేసుకోవడం వివాదానికి దారి తీసింది.మొహమ్మద్‌ను ఫిఫా ప్రపంచకప్‌లో మిగతా మ్యాచ్‌లు ఆడకుండా బ్యాన్ చేయాలని కామెంట్లు కూడా చేస్తున్నారు.Iranian player Mohebi did a gun celebration on US soil 😭😭😭 pic.twitter.com/JkDJKDEjGa— Nყƙιƚα (@NikitaRMFC) June 16, 2026ఆట ప్రారంభానికి ముందు హైడ్రామాఅయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు హైడ్రామా నెలకొంది. ఫిఫా, స్థానిక అధికారులు అనేక ఆంక్షలు విధించినప్పటికీ, ఆట మొత్తం రాజకీయ ఉద్రిక్తంగానే కొనసాగింది. ఇరాన్ మద్దతుదారులు స్టేడియం లోపల విప్లవానికి పూర్వం నాటి ఇరాన్ జెండాను ప్రదర్శించి ఫిఫా నిబంధనలు ఉల్లంఘించారు. మ్యాచ్‌కు తరలివచ్చిన ఇరాన్, న్యూజిలాండ్ అభిమానులు మెటల్ డిటెక్టర్లు, బ్యాగ్ తనిఖీల తర్వాతనే స్టేడియంలోకి అనుమతించారు.అమెరికా వదిలి వెళ్లిపోండిఇక మ్యాచ్ ముగిసిన వెంటనే అమెరికా అధికారులు ఇరాన్ జట్టును తమ దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇరాన్ కోచ్ ఆమీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమెరికాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ తమ బేస్ క్యాంప్‌ను మెక్సికోకు తరలించిన సంగతి తెలిసిందే.చదవండి: స్పెయిన్‌కు చుక్కలు చూపించిన గోల్‌కీపర్.. ఎవరీ వోజిన్హా? -
స్పెయిన్‌ను నిలువరించిన అడ్డుగోడ.. 40 ఏళ్ల వోజిన్హా విన్యాసాలు (ఫోటోలు)
-
స్పెయిన్‌కు చుక్కలు చూపించిన గోల్‌కీపర్.. ఎవరీ వోజిన్హా?
స్టార్డమ్ అనేది ఉన్నపళంగా రాదు. దానికోసం ఎంతో కష్టపడాలి. అందులోనూ అనామక జట్టు నుంచి వచ్చే ఆటగాళ్లకు పెద్దగా గుర్తింపు ఉండదు. ఏదైనా సంచలనాలు నమోదైనప్పుడే అవి వెలుగులోకి వస్తాయి. తాజాగా ఫిఫా ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ స్పెయిన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌ను కేప్ వెర్డె డ్రా చేసుకున్నప్పటికీ సంబరాల్లో మునిగిపోయింది. కానీ ఒక్కడు మాత్రం మ్యాచ్ ముగిసినా అదే పనిగా ఏడుస్తూనే ఉన్నాడు. ఏడుస్తున్న వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తే కేప్‌వెర్డె గోల్ కీపర్, 40 ఏళ్ల వోజిన్హా. వోజిన్హా లేకపోయుంటే మాత్రం ఇవాళ కేప్‌వెర్డె అనామక జట్టుగానే ఉండిపోయేది. 40 ఏళ్ల వయసు అంటే రిటైరయ్యే టైమ్.. కానీ వోజిన్హా మాత్రం 40 ఏళ్ల వయసులో తొలి ఫిఫా వరల్డ్‌కప్ ఆడుతున్నాడు. స్పెయిన్‌తో మ్యాచ్‌కు ముందు వోజిన్హా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 50వేలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 5 మిలియన్లకు చేరడం విశేషం. ఈ నేపథ్యంలో వొజిన్హా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు.ఫిఫా ప్రపంచకప్‌లో అనామక జట్టైన కేప్ వెర్డె మాజీ చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ స్పెయిన్‌ను నిలువరించి పెద్ద సంచలనం నమోదు చేసింది. మ్యాచ్ డ్రా అయినప్పటికీ కేప్ వెర్డె ఖాతాలో ఇది విజయం కిందే లెక్క. మ్యాచ్ డ్రా అయినప్పటికీ నిజమైన హీరో మాత్రం 40 ఏళ్ల గోల్ కీపర్ వోజిన్హానే అని చెప్పొచ్చు. లామినే యమాల్, రోడ్రి,పెడ్రీ వంటి స్టార్ ఆటగాళ్లున్న స్పెయిన్ వంటి బలమైన జట్టును తన గోల్ కీపింగ్ నైపుణ్యంతో నిలువరించి అడ్డుగోడలా నిలబడ్డాడు వోజిన్హా. ఏకంగా ఏడుసార్లు స్పెయిన్ ప్లేయర్లు గోల్ పోస్ట్ లక్ష్యంగా కొట్టిన షాట్లను అతను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. స్పెయిన్ సంచలనం లామినె యామల్ 71వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో స్పెయిన్ ఆటగాళ్లు బంతిని 62 శాతం తమ ఆదీనంలో ఉంచుకున్నా కేప్ వెర్డె గోల్కీపర్ను బోల్తా కొట్టించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయారు. ఫిఫా చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వోజిన్హాకే మ్యాచ్‌లో ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.మ్యాచ్ ముగిసిన అనంతరం కేప్ వెర్డె గోల్‌కీపర్ 40 ఏళ్ల వోజిన్హా ఎమోషనల్ అయ్యాడు. 'ఇవాళ నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. స్టార్ ఆటగాళ్లతో నిండి ఉన్న స్పెయిన్‌ను అడ్డుకోవడం కష్టమైనప్పటికీ నా శాయాశక్తులా కృషి చేశాను. అయితే దురదృష్టవశాత్తూ ఇవాళ నా ప్రదర్శన చూడడానికి మా అమ్మ నా దగ్గర లేదు. వీసా సమస్యల వల్ల ఆమె రాలేకపోయింది. ఇక గేమ్ ముగిసిన తర్వాత అంతలా ఏడ్వడానికి ఒక కారణముంది. నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా మా గ్రాండ్పేరేంట్స్తోనే పెరిగాను. ఇవాళ నా ప్రదర్శన చూడడానికి వారిద్దరూ సజీవంగా లేరు. ఏడాది క్రితమే నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయారు. కనీసం ఈ సమయంలో నా పక్కన మా అమ్మ ఉండుంటే బాగుండేది' అని చెప్పుకొచ్చాడు.ఎవరీ వోజిన్హా?25 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటను ఆడడం ప్రారంభించిన వోజిన్హా మాల్డోవా, సిప్రస్, స్లోవెకియా, పోర్చుగల్‌కు చెందిన ఫుట్‌బాల్ క్లబ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2012లో కేప్ వెర్డె జాతీయ జట్టుకు ఎంపికైన వోజిన్హా ఫిఫా ప్రపంచకప్ ఆడేందుకు 15 ఏళ్లు పట్టింది. ఈ 15 ఏళ్లలో అతడు ఐదు మేజర్ టోర్నీలు ఆడాడు. ఆఫ్రికా కప్ నేషన్స్ టోర్నీలో పాల్గొన్నాడు.🇨🇻😢 Cape Verde goalkeeper Vozinha: "I cried after the game because I grew up with my grandparents when I was a kid, and they could not be there. They passed away a few years ago. My mum could not be here either for a VISA issue, and the money we had to pay for it. We did not… pic.twitter.com/vbMGHPCQez— EuroFoot (@eurofootcom) June 15, 2026 ❤️🇨🇻 Vozinha: “Unfortunately my mum could not be here either for a VISA issue, and the money we had to pay for it”.“We did not manage to do this in time”. pic.twitter.com/zkzDLlDt0l— Fabrizio Romano (@FabrizioRomano) June 15, 2026He said not today🔥🔥🔥what a save pic.twitter.com/cnu6xgpOCn— Luvuyo Afrika (@Teboho2731) June 15, 2026చదవండి: లంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్‌పై నిషేధం తప్పదా! -
ఆఖరి నిమిషంలో గోల్.. ఓటమి తప్పించుకున్న మాజీ చాంపియన్
ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా రెండుసార్లు చాంపియన్స్ అయిన ఉరుగ్వే తృటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. గ్రూప్-హెచ్లో భాగంగా సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్‌ను ఉరుగ్వే 1-1తో డ్రా చేసుకుంది. సౌదీ అరేబియా తరఫున ఆట 41వ నిమిషంలో అబ్దులేలాహ్ అల్ అమ్రి గోల్ చేయగా, ఉరుగ్వే తరఫున ఆట 80వ నిమిషంలో మాక్సీ అరౌజో గోల్ కొట్టడంతో ఉరుగ్వే బతికిపోయింది. లేదంటే సౌదీ అరేబియాకు మరో అద్భుత విజయం ఖాతాలో పడేదే. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను ఓడించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇరుజట్లు మ్యాచ్ డ్రా చేసుకోవడంతో చెరో పాయింట్ పంచుకున్నాయి. మ్యాచ్ ప్రారంభమైన ఐదవ నిమిషంలోనే ఉరుగ్వే గోల్‌కొట్టే అవకాశాన్ని మిస్ చేసుకుంది. బాక్స్ అంచు నుంచి మాక్సీ అరౌజో కొట్టిన షాట్‌ను గోల్ కీపర్ మొహమ్మద్ అలోవైస్ సమర్థంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఉరుగ్వేకు కార్నర్ లభించినా, గోల్ చేయడంలో విఫలమైంది. 18వ నిమిషంలో ఉరుగ్వే కొట్టిన మొదటి షాట్ గోల్‌పోస్టు తగులుకుంటూ వెళ్లిపోయింది తగిలింది. ఆ తర్వాత 30వ నిమిషంలో మరోసారి గోల్‌కొట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఈసారి కూడా సౌదీ గోల్ కీపర్ అడ్డుగోడలా నిలబడ్డాడు. ఆ తర్వాత నుంచి సౌదీ ఆటగాళ్లు ఉరుగ్వే గోల్‌పోస్ట్‌పై దాడులు చేయడం ప్రారంభించారు.అలా మ్యాచ్ 41వ నిమిషంలో మిడ్ ఫీల్డర్ అబ్దుల్లా అల్-అమ్రీ గోల్ కొట్టడంతో తొలి హాఫ్ ముగిసేసరికి సౌదీ ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో హాఫ్లోనూ ఉరుగ్వే పలుమార్లు గోల్‌పోస్ట్‌లపై దాడులు చేసినప్పటికీ సఫలం కాలేకపోయింది. ఇక మ్యాచ్‌లో ఓటమి ఖాయమనుకున్న దశలో 80వ నిమిషంలో మాక్సి అరౌజ్ గోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. -
ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనం.. స్పెయిన్‌కు షాక్
ఫిఫా ప్రపంచకప్ 2026లో సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన స్పెయిన్ జట్టుకు వరల్డ్‌కప్‌లో తొలిసారి అడుగుపెట్టిన 'కేప్ వెర్డే' జట్టు గోల్రహిత డ్రాతో (0-0) నిలువరించి, ఊహించని షాకిచ్చింది. అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ (గ్రూప్-హెచ్) ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత గొప్ప అప్సెట్లలో ఒకటిగా నిలిచింది.కేవలం ఆరు లక్షల జనాభా కలిగిన అట్లాంటిక్ ద్వీప దేశం కేప్ వెర్డే, ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకటైన స్పెయిన్‌ను అడ్డుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. మ్యాచ్ మొత్తం స్పెయిన్ ఆధిపత్యం చెలాయించినప్పటికీ గోల్ మాత్రం సాధించలేకపోయింది.స్పెయిన్ 24 షాట్లు కొట్టినా కేప్ వెర్డే రక్షణ గోడను దాటలేకపోయింది. ముఖ్యంగా 40 ఏళ్ల గోల్‌కీపర్ జోసిమర్ డయాస్ అద్భుత ప్రదర్శనతో స్పెయిన్ దాడులను తిప్పికొట్టాడు. ఫెర్రన్ టోర్రెస్, మిఖెల్ ఒయార్జబాల్, అమెరిక్ లాంపోర్టే ప్రయత్నాలను వరుసగా అడ్డుకుని హీరోగా నిలిచాడు.మ్యాచ్ చివరి నిమిషాల్లో కేప్ వెర్డే ఫుట్‌బాల్ చరిత్రలోనే అతి పెద్ద సంచలనం నమోదు చేసే దిశగా వెళ్లింది. పసికూన చేతిలో స్పెయిన్‌కు పరాభవం తప్పదని అంతా అనుకున్నారు. 90వ నిమిషంలో డినే బోర్జస్ హెడ్డర్‌ను స్పెయిన్ గోల్‌కీపర్ ఉనయ్ సైమన్ అద్భుతంగా అడ్డుకున్నాడు. అనంతరం ర్యాన్ మెండెస్కు కూడా గెలుపు గోల్ చేసే అవకాశం లభించినా అది ఫలించలేదు. -
ట్యునీషియాపై విజయం.. సంబరాలు చేసుకోని స్వీడన్!
ఫిఫా ప్రపంచకప్ 2026లో స్వీడన్ శుభారంభం చేసింది. గ్రూప్-ఎఫ్‌లో భాగంగా సోమవారం స్వీడన్ 5-1 తేడాతో ట్యునీషియాతోను చిత్తు చేసింది. 22 ఏళ్ల మిడ్‌ఫీల్డర్ యాసిన్ అయారి సంచలన ప్రదర్శన కనబరిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆట ప్రారంభమైన ఏడు నిమిషాలకే యాసిన్ అయారి గోల్ కొట్టి స్వీడన్‌కు ఆధిక్యం ఇచ్చాడు. ఆ తర్వాత ఆట 30వ నిమిషంలో అలెగ్జాండర్ ఐసాక్ గోల్ కొట్టడంతో స్వీడన్ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ట్యునీషియా ఆటగాడు ఒమర్ రెకిక్ ఆట 43వ నిమిషంలో గోల్ కొట్టడంతో ట్యునీషియా ఖాతా తెరిచింది. అయితే రెండో హాఫ్‌లో పదే పదే ట్యునీషియా గోల్ పోస్టుపై స్వీడన్ దాడులు చేసింది. ఈ క్రమంలో విక్టోర్ (ఆట 59వ నిమిషం), మాట్టియస్ (ఆట 84వ నిమిషం)లో గోల్స్ కొట్టడంతో స్వీడన్ 4-1తో మరింత ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. మరో ఆరు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా యాసిన్ అయారి మరో గోల్ కొట్టి స్వీడన్‌కు 5-1తో మరిచిపోలేని విజయాన్ని అందించాడు.సంబరాలకు దూరంగా యాసిన్స్వీడన్ మ్యాచ్ గెలిచినప్పటికీ ఆ జట్టు మిడ్‌ఫీల్డర్ యాసిన్ అయారి సంబరాలకు దూరంగా ఉండిపోవడం వెనుక బలమైన కారణముంది. అదేంటంటే యాసిన్ అయారికి ట్యునీషియాతో మంచి సంబంధాలున్నాయి. యాసిన్ స్వీడన్ దేశస్తుడైనప్పటికీ అతడి తండ్రి మాత్రం ట్యునీషియాలోనే పుట్టి పెరిగాడు. తండ్రికి చెందిన దేశంపై గెలిచినందునే తాను సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉన్నట్లు యాసిన్ అయారి మ్యాచ్ ముగిసిన అనంతరం వెల్లడించాడు. 2023లో స్వీడన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైన యాసిన్ అయారి అప్పటినుంచి జట్టు తరఫున సంచలన ప్రదర్శనలు కనబరుస్తూ కీలక ఆటగాడిగా మారిపోయాడు.GOAL Alexander Isak! Sweden 2-0 vs Tunisia 🇸🇪 pic.twitter.com/mEKataxFFz— Swedish Football News (@SwefootballEN) June 15, 2026చదవండి: హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ కైవసం చేసుకున్న విండీస్ -
‘మేము ఆడేందుకు వచ్చాం.. ట్రంప్‌తో మాకు అనవసరం’
అమెరికా, ఇరాన్ మధ్య కొన్ని నెలలుగా సాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఫిఫా ప్రపంచకప్‌కు కూడా పాకిన విషయం తెలిసిందే. ఆటగాళ్ల వీసాల విషయంలో అనిశ్చితి, జట్టు అధికారుల్లో కొందరికీ ఎంట్రీ నిరాకరించడం, ఇరాన్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను అమెరికా రద్దు చేయడం, అమెరికాలో ఏర్పాటు చేసుకున్న తమ బేస్ క్యాంప్‌ను కూడా అరిజోనాలో కాకుండా మెక్సికోలోని టిజువానాకు తరలించుకోవడం చూసి అసలు ఇరాన్ ఫిఫా ప్రపంచకప్ ఆడుతుందా లేదా అనే సందిగ్ధం నెలకొంది. కానీ వాటన్నింటికీ తెర దించుతూ ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు ఫిఫా ప్రపంచకప్ ఆడేందుకు అమెరికాలో ల్యాండ్ అయింది. ఇవాళ రాత్రి లాస్ ఏంజిల్స్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న అమెరికా యుద్ధంలో ఉండడం, అదే యుద్ధంలో ఉన్న ఇరాన్‌కు ఆతిథ్యం ఇవ్వనుండడం చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు. ఇక అమెరికాలో అడుగుపెట్టిన ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఇరాన్ ఫుట్‌బాల్ కోచ్ అమీర్ ఘలేనోయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మేము ఇక్కడికి మ్యాచ్‌లు ఆడేందుకు వచ్చాం. మా చుట్టూ జరుగుతున్న హడావిడి, ఇతర విషయాల గురించి పట్టించుకోము. ట్రంప్‌తో మాకు అనవసరం. ఆ దేశంతో చర్చలు, ఒప్పందాలు అనేవి రాజకీ అంశాలు.ఇప్పుడు మా దృష్టంతా ఫిఫా ప్రపంచకప్‌పైనే ఉంది. సహజంగానే ప్రతీ జట్టుకు వారి దేశంలో అనేక సమస్యలు ఉంటాయి. అంతేకాదు అవి ఆటకు సంబంధం లేకుండా ఉంటాయి. అమెరికా, ఇరాన్ మధ్య సైనిక ఘర్షణ నెలకొని ఉండొచ్చు. కానీ అవి ఆటతో ముడిపెట్టలేం. మేము రాజకీయ వ్యక్తులం కాదు.. ఫుట్‌బాల్ ఆటగాళ్లం.' అని చెప్పుకొచ్చాడు. ఇక ఫిఫా ప్రపంచకప్‌లో ఇరాన్ ఎన్నడూ నాకౌట్ రౌండ్‌కు చేరలేదు. గ్రూప్-జిలో ఉన్న ఇరాన్‌కు న్యూజిలాండ్, బెల్జియం, ఈజిప్ట్ రూపంలో గట్టి ప్రత్యర్థులే ఉన్నాయి. అయితే ఫిఫా ప్రపంచకప్ ప్రారంభానికి ముందు అమెరికా తమపై దాడులు చేస్తున్న కారణంగా తొలుత ఫిఫా ప్రపంచకప్ ఆడబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. ఆ తర్వాత మనసు మార్చుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తమ దేశానికి వస్తే ఆటగాళ్ల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని హెచ్చరించారు. అయితే తాజాగా అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసిందని రెండు దేశాలు అధికారిక ప్రకటన విడుదల చేయడంతో కొంత సానుకూలాంశం. ఇరాన్ స్వేచ్ఛగా మ్యాచ్‌లు ఆడేందుకు ఇది అవకాశం కల్పించనుంది.ఇరాన్ తరఫున ఆ దేశ సుప్రీం మోజ్తబా ఖమేనీ మార్గదర్శకత్వంలో డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. చర్చలను విజయవంతం చేసిన ఖతార్‌కు ఇరు వర్గాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. పాకిస్తాన్ కూడా ఈ పరిణామాన్ని స్వాగతించింది. ఇరు దేశాలకు అభినందనలు తెలిపింది. ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు అధికారిక శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. చదవండి: ‘మ్యాచ్ విజయంలో ఆ ఇద్దరిదే కీలకపాత్ర’ -
చివరి నిమిషంలో గోల్.. ఉత్కంఠ పోరులో ఐవరీ కోస్ట్ విజయం
ఫిఫా ప్రపంచకప్ 2026 సీజన్లో తొలిసారి ఉత్కంఠభరిత పోరుకు వేదికైంది. గ్రూప్-ఈలో భాగంగా ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ 1-0 తేడాతో సంచలన విజయం సాధించింది. ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో ఐవరీ కోస్ట్ మిడ్ ఫీల్డర్ అమడ్ డియాల్లో (ఆట 90వ నిమిషంలో) గోల్ కొట్టడంతో థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది.ఈ నేపథ్యంలో 19 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని ఈక్వెడార్‌కు ఐవరీకోస్ట్ షాక్ ఇచ్చినట్లయింది. 3 పాయింట్లతో ఐవరీ కోస్ట్ టోర్నీలో బోణీ కొట్టగా, ఈక్వెడార్ ఇంకా ఖాతా తెరవలేదు. మ్యాచ్‌లో ఇరుజట్లు కొదమసింహాల్లా తలపడ్డాయి. ముఖ్యంగా ఈక్వెడార్ ఫస్ట్‌హాఫ్‌లో పదే పదే అటాకింగ్ గేమ్ ఆడి ఐవరీకోస్ట్ను హడలెత్తించింది. అంతేకాదు తొలి హాఫ్‌లోనే ఈక్వెడార్ రెండుసార్లు క్రాస్‌బార్‌ను తాకినప్పటికీ ఐవరీకోస్ట్ గోల్ కీపర్ సమర్థంగా అడ్డుకోవడంతో గోల్స్ రాలేదు. రెండో హాఫ్లోనూ చివరిదాకా గోల్‌కోసం ఇరుజట్లు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలం కాలేకపోయాయి. ఇక మ్యాచ్ డ్రాగా ముగుస్తుందన్న సమయంలో ఆట 90వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ అమడ్ డియాల్లో గోల్ కొట్టడంతో ఐవరీ కోస్ట్ బోణీ కొట్టింది. ఆ తర్వాత ఎక్స్ట్రా టైమ్‌లో ఈక్వెడార్ గోల్ కొట్టడంలో విఫలం కావడంతో ఐవరీ కోస్ట్ విజయాన్ని అందుకుంది. ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో జర్మనీ 7-1 తేడాతో కురాకావోపై విజయం సాధించి ఘనంగా తమ అడుగును ప్రారంభించింది.డ్రాతో సరిపెట్టుకున్న నెదర్లాండ్స్మూడుసార్లు రన్నరప్‌గా నిలిచి నెదర్లాండ్స్ ఫిఫా ప్రపంచకప్ 2026 ప్రయాణాన్ని డ్రాతో ప్రారంభించింది. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున గ్రూప్-ఎఫ్‌లో భాగంగా జపాన్‌తో జరిగిన మ్యాచ్‌ను నెదర్లాండ్స్ 2-2తో డ్రా చేసుకుంది. నెదర్లాండ్స్ తరఫున విర్గిల్ వాన్ డిక్ (ఆట 51వ నిమిషంలో), క్రిసెనికో సమ్మర్విల్లె (ఆట 64వ నిమిషంలో) గోల్స్ సాధించగా, జపాన్ తరఫున కీటో నకామురా (ఆట 57వ నిమిషంలో), దైచీ కమదా (ఆట 89వ నిమిషంలో) గోల్స్ సాధించారు. మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఇరుజట్లకు చెరో 2 పాయింట్లు లభించాయి.చదవండి: 90 నిమిషాల్లో 12 గోల్స్.. 71 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు! -
90 నిమిషాల్లో 12 గోల్స్.. 71 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు!
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఫిఫా ప్రపంచకప్ క్రేజ్ నడుస్తోంది. అభిమానులంతా సాకర్ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. అయితే గోల్స్‌తోనే ఫుట్‌బాల్ ఆటలో కిక్ ఉంటుంది. 90 నిమిషాల పాటు సాగే ఆటలో ఎవరెన్ని గోల్స్ చేశారు.. ఏ ఆటగాడు ఎన్ని గోల్స్ కొట్టాడు.. ఇలా అభిమానులు కౌంట్ చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఒక్క గోల్‌తోనే మ్యాచ్‌లు గెలిచిన సందర్భాలున్నాయి. అసలు గోల్ నమోదు కాకుండా డ్రాగా ముగిసిన మ్యాచ్‌లు కోకొల్లలు. ఇక 1930లో ఫిఫా ప్రపంచకప్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 2,700 గోల్స్ చేయడం విశేషం. అయితే ఒకే మ్యాచ్‌లో అత్యధిక గోల్స్ నమోదు అయిన మ్యాచ్‌లు అరుదుగా ఉంటాయి. అయితే ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో 12 గోల్స్ నమోదు కావడం ఇప్పటికీ రికార్డుగా ఉంది. 1954లో ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. అంతేకాదు ఫిఫా చరిత్రలో 71 ఏళ్లుగా ఈ రికార్డు ఇప్పటికీ చెక్కెచెదరలేదు. మూడు సందర్భాల్లో ఈ రికార్డుకు చేరువలోకి వచ్చినప్పటికీ 12 గోల్స్ రికార్డును మాత్రం అందుకోలేకపోయాయి. వాటి వివరాలు ఒకసారి పరిశీలిద్దాం.1954 ఫిఫా ప్రపంచకప్: ఆస్ట్రియా వర్సెస్ స్విట్జర్లాండ్👉ఈ ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌లు తలపడ్డాయి. జూన్ 26న జరిగిన మ్యాచ్‌లో మొదటి 23 నిమిషాల్లో స్విట్జర్లాండ్ మూడు గోల్స్ కొట్టగా, తర్వాతి 25 నిమిషాల్లో ఆస్ట్రియా 5 గోల్స్ కొట్టడం విశేషం. మొదటి హాఫ్ ముగిసేసరికే ఇరుజట్లు కలిపి 9 గోల్స్ కొట్టడం విశేషం. ఆ తర్వాతి హాఫ్ టైమ్‌లో మరో మూడుగోల్స్ నమోదయ్యాయి. ఇందులో ఆస్ట్రియా రెండు, స్విట్జర్లాండ్ ఒకటి ఉన్నాయి. అంతిమంగా 90 నిమిషాల ఆట ముగిసేసరికి ఆస్ట్రియా 7-5తో స్విట్జర్లాండ్‌పై విజయాన్ని అందుకుంది. ఒక ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ నమోదయిన మ్యాచ్‌గా రికార్డులకెక్కింది. అంతేకాదు ఈ రికార్డు ఏడు దశాబ్దాలుగా చెక్కుచెదరలేదు.1982 ఫిఫా ప్రపంచకప్: హంగేరి వర్సెస్ సాల్వడార్👉హంగేరి, సాల్వడార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 11 గోల్స్ నమోదయ్యాయి. అయితే ఇందులో హంగేరి 10 గోల్స్ కొడితే, సాల్వడార్ ఒక గోల్‌కే పరిమితమైంది. అయితే ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో బిగ్ మార్జిన్ (9 గోల్స్ తేడాతో) తో విజయం సాధించిన మ్యాచ్‌గా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఇదే మ్యాచ్‌లో హంగేరి నుంచి సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా వచ్చిన లాజ్లో కిస్ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరవడం విశేషం. ఒక సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ హ్యాట్రిక్ గోల్స్ కొట్టడం ఫిఫా చరిత్రలో అదే తొలిసారి.1938 ఫిఫా ప్రపంచకప్: బ్రెజిల్ వర్సెస్ పోలండ్👉1938 ఫిఫా వరల్డ్‌కప్‌లో పోలండ్, బ్రెజిల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 11 గోల్స్ నమోదయ్యాయి. ఇందులో బ్రెజిల్ ఆరు గోల్స్ కొడితే, పోలండ్ ఐదు గోల్స్ కొట్టింది. నెక్ టూ నెక్ జరిగిన పోరులో బ్రెజిల్ ఒక్క గోల్ తేడాతో విజయం సాధించింది. అయితే పోలండ్ కొట్టిన ఐదు గోల్స్‌లో నాలుగు గోల్స్ ఎర్నెస్ట్ విల్లిమోస్కీవే కావడం విశేషం.👉1954 ఫిఫా ప్రపంచకప్‌లోనే హంగేరి, వెస్ట్ జర్మనీ మధ్య మ్యాచ్‌లో 11 గోల్స్ నమోదయ్యాయి. ఇదే ప్రపంచకప్‌లో ఫ్రాన్స్, పరాగ్వే మధ్య జరిగిన మ్యాచ్‌లో 10 గోల్స్ నమోదయ్యాయి. ఇదే ప్రపంచకప్‌లో 26 మ్యాచ్‌ల్లో 140 గోల్స్ నమోదవ్వడం ఇప్పటికీ ఒక రికార్డుగా ఉంది.👉ఇక 1938 నుంచి 1982 వరకు జరిగిన ఫిఫా ప్రపంచకప్పుల్లో ప్రతీ ఐదు మ్యాచ్‌ల్లో కనీసం 10 గోల్స్ చేసిన దాఖలాలున్నాయి. అయితే నాలుగు దశాబ్దాలుగా మళ్లీ ఆ ఫీట్ నమోదవ్వకపోవడం గమనార్హం.చదవండి: పాక్‌తో మ్యాచ్.. అగ్గి రాజేసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ -
24 ఏళ్ల తర్వాత బరిలోకి.. టర్కీకి షాక్ ఇచ్చిన ఆసీస్!
ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నీలో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. కెనడాలోని వాంకోవర్ వేదికగా జరిగిన గ్రూప్-డి ఆరంభ మ్యాచ్‌లో టర్కీపై 2-0 తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్ బరిలోకి దిగిన టర్కీ జట్టుకు ఆస్ట్రేలియా యువ ఆటగాళ్లు గట్టి షాక్ ఇచ్చారు. మ్యాచ్ ప్రారంభమైన 27వ నిమిషంలోనే ఆస్ట్రేలియా ఫార్వర్డ్ ఆటగాడు నెస్టోరీ ఇరాన్‌కుందా అద్భుతమైన కౌంటర్ ఎటాకింగ్ గోల్‌తో జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ గోల్‌తో ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా తరఫున గోల్ చేసిన అతి పిన్న వయస్కుడిగా ఇరాన్‌కుందా సరికొత్త రికార్డు సృష్టించాడు.ఆ తర్వాత టర్కీ ఆటగాళ్లు మ్యాచ్‌ను డ్రా చేయడానికి తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆస్ట్రేలియా డిఫెన్స్ దాన్ని తిప్పికొట్టింది. ముఖ్యంగా 75వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ కానర్ మెట్కాఫ్ బాక్స్ వెలుపల నుంచి ఒక అద్భుతమైన లో-షాట్‌తో రెండో గోల్ కొట్టి ఆస్ట్రేలియా విజయాన్ని పూర్తిగా ఖాయం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 22 ఏళ్ల యువ గోల్‌కీపర్ పాట్రిక్ బీచ్ అసాధారణ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. టర్కీ జట్టు చేసిన పలు ప్రమాదకరమైన గోల్ ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకుని క్లీన్ షీట్ సాధించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో పరాగ్వేపై 4-1తో గెలిచిన అమెరికా జట్టు అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది.🔥METCALFE PUSO EL SEGUNDO PARA #Australia Ahora se lo ganan 2-0 al #Turquía de Arda Güler y compañía. pic.twitter.com/urOXI5u65W— Facundo Aquino 🎙️ (@FFacundoAquino) June 14, 2026చదవండి: న్యూజిలాండ్‌కు షాకిచ్చిన వెస్టిండీస్! -
ఫిఫా ప్రపంచకప్ 2026 : అందరి కళ్లు వీరిపైనే..(ఫొటోలు)
-
FIFA WC 2026: మెస్సీ వర్సెస్ రొనాల్డో పోరు ఎప్పుడంటే!
ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. నెలరోజులకు పైగా సాగనున్న సాకర్ సంగ్రామంలో ఎన్ని అద్భుతాలు చోటు చేసుకున్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల కళ్లన్నీ ఇద్దరి దిగ్గజాలపైనే ఉంటాయి. ఆ ఇద్దరు బరిలోకి దిగారంటే ప్రపంచం మొత్తం కన్నార్పకుండా చూస్తోంది. మరి అలాంటి ఇద్దరు దిగ్గజాలు ఫిఫా వంటి మేటి టోర్నీలో ప్రత్యర్థులుగా ఎదురుపడితే రికార్డులు బద్దలవ్వాల్సిందే. ఆ ఇద్దరిలో ఒకరు అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ అయితే..మరొకరు పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో. రెండు దశాబ్దాలుగా ఫుట్‌బాల్‌ను ఏలుతున్న ఈ ఇద్దరికి ఇది ఆరో ప్రపంచకప్ కావడం విశేషం. ఈసారి జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ మెస్సీకి, రొనాల్డోకు చివరిదని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఫుట్‌బాల్ క్లబ్స్ తరఫున ఎన్నోసార్లు ఎదురుపడినప్పటికీ, ఫిఫా ప్రపంచకప్‌లో మాత్రం తమ జాతీయ జట్ల తరఫున ఈ ఇద్దరు ఎదురుపడలేదంటే నమ్ముతారా? కానీ ఇది అక్షరాల నిజం.అయితే 2026 ప్రపంచకప్‌లో మాత్రం ఇది సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు గ్రూప్-జెలో అల్జీరి యా, ఆస్ట్రియా, జోర్డాన్లతో కలిసి ఉంది. మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జూన్ 16న అల్జీరియాతో, జూన్ 22న ఆస్ట్రియాతో, జూన్ 27న జోర్డాన్‌తో గ్రూప్ మ్యాచ్‌లు ఆడనుంది. అర్జెంటీనా గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిస్తే జూలై 4న జరిగే రౌండ్ ఆఫ్ 32లో గ్రూప్-హెచ్ రన్నరప్‌తో తలపడుతుంది.ఈసారైనా?మరోవైపు క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ గ్రూప్-కేలో ఉంది. ఇదే గ్రూప్‌లో పోర్చుగల్‌తో పాటు కాంగో, ఉజ్బెకిస్తాన్, కొలంబియా కూడా ఉన్నాయి. పోర్చుగల్ జూన్ 17న కాంగోతో, జూన్ 23న ఉజ్బెకిస్తాన్‌తో, జూన్ 27న కొలంబియాతో తలపడనుంది. గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిస్తే పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 32లో మరో గ్రూప్ నుంచి వచ్చిన జట్టుతో ఆడుతుంది.అన్నీ కుదిరితే క్వార్టర్స్‌లోనే..ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సీ, రొనాల్డోలు ఎదురుపడాలంటే అర్జెంటీనా, పోర్చుగల్ రెండూ తమ తమ గ్రూపుల్లో అగ్రస్థానాల్లో నిలవడంతో పాటు రౌండ్ ఆఫ్ 32, రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లను కూడా గెలవాలి. అలా జరిగితేనే క్వార్టర్ ఫైనల్లో ఈ దిగ్గజాలు ప్రత్యక్ష పోరుకు దిగే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ దిగ్గజాలు ఎదురుపడితే చూడాలని వేచి చూస్తున్న అభిమానుల కల కూడా నెరవేరనుంది. ఇది నిజమైతే మాత్రం ఫిఫా చరిత్రలోనే అద్భుత ఘట్టంగా నిలిచిపోనుండడంతో పాటు టీఆర్పీ రేట్ కూడా పగిలిపోవడం ఖాయం.ఇద్దరూ ఇద్దరే!ఆట పరంగా చూసుకుంటే ఈ ఇద్దరిని ఒకరితో ఒకరిని పోల్చలేం. ఇద్దరు దిగ్గజాలు అభిమానుల గుండెల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ముద్రించుకున్నారు. అయితే 2022లో కోపా అమెరికా కప్‌తో పాటు ఫిఫా ప్రపంచకప్ కైవసం చేసుకున్న అర్జెంటీనాకు మెస్సీ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ విషయంలో మాత్రం రొనాల్డోతో పోలిస్తే మెస్సీ ఒక మెట్టు పైనే ఉంటాడు.రికార్డుల్లో మెస్సీదే పైచేయిరికార్డులు పరిశీలించి చూస్తే.. రొనాల్డోపై మెస్సీదే పైచేయి. ఇప్పటికే ప్రపంచకప్‌లో మెస్సీ 26 మ్యాచ్‌లు (అత్యధిక మ్యాచ్‌లు), అత్యధిక నిమిషాలు (2,314) ఆడిన ఆటగాడిగా నిలిచాడు. అర్జెంటీనా తరఫున మెస్సీ ప్రపంచకప్‌లో అత్యధికంగా 13 గోల్స్ సాధించాడు. ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన మిరోస్లావ్ క్లోజే (16) రికార్డును అధిగమించడానికి మెస్సీకి మరో మూడు గోల్స్ మాత్రమే అవసరం. మరోవైపు రొనాల్డో తాను ఆడిన ఆరు ఫిఫా ప్రపంచకప్‌లు కలిపి 8 గోల్స్ మాత్రమే సాధించాడు. మెస్సీ రికార్డును అధిగమించాలంటే అతడు అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అయితే పోర్చుగల్ టోర్నీలో ఎక్కువ దూరం ప్రయాణిస్తే మాత్రం అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక నిమిషాలు ఆడిన ఆటగాడిగా కొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం రొనాల్డోకు ఉంది. మెస్సీ, రొనాల్డోలు తలపడితే చూడాలని మన భారతీయులు కూడా వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. మైదానంలో కొదమ సింహాల్లా తలపడే ఈ ఇద్దరి విన్యాసాలను వీక్షించాలంటే అన్నీ సక్రమంగా జరగాలని ఆ దేవుడిని ప్రార్థిద్దాం.చదవండి: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. కోహ్లీ విషయంలో కీలక ప్రకటన! -
90 నిమిషాల్లో రూ. 30 కోట్లు : ఈ లెక్కలతో మతిపోవాల్సిందే!
ఫిఫా ప్రపంచకప్ 2026 (fifa world cup 2026) ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రపంచ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. దశాబ్దాలుగా ఫుట్ బాల్ క్రీడకు వన్నె తెచ్చి, ప్రపంచాన్ని ఏలిన దిగ్గజాలకు ఇదే చివరి ప్రపంచకప్ కాబోతోంది. లియోనెల్ మెస్సీ, రొనాల్డో, లూకా మోద్రిచ్, థామస్ ముల్లర్, నెయ్మార్ వీరిలో ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖ పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాడు. ఆతని సంపాదన తీరుతెన్నులపై చర్చ నడుస్తోంది.పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇప్పుడు నిజానికి జీతం ఏమీ సంపాదించడం లేదు. కానీ ఆయన సంపాదన ఒక యుగ కాలంతో సమానం. ఆయన ఫుట్‌బాల్ మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ లెక్కలు పూర్తిగా మారిపోతాయి. 41 ఏళ్ల పోర్చుగీస్ ఫుట్‌బాలర్, కేవలం తన సౌదీ క్లబ్ డీల్ ద్వారానే ఏడాదికి సుమారు 20 కోట్ల డాలర్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఒకే ఏడాదిలో దాదాపు రూ. 1,600 నుండి 1,700 కోట్ల వరకు ఉంటుంది. క్లబ్, దేశం తరఫున ఆయన ఒక సీజన్లో సాధారణంగా 55 మ్యాచ్‌లు ఆడుతారని అనుకుందాం. ఆ వార్షిక సంపాదనను 55తో భాగిస్తే వచ్చే అంకె అద్భుతంగా ఉంటుంది. ఆయన ఆడే ప్రతి మ్యాచ్‌కు దాదాపు రూ. 30 కోట్లు. మరోలా చెప్పాలంటే, 90 నిమిషాల ఫుట్‌బాల్ ఆట (అదనపు సమయంతో కలిపి), అనేక భారతీయ కంపెనీలు తమ ఉద్యోగులందరికీ కలిపి ఏడాది మొత్తానికి కేటాయించే జీతాల బడ్జెట్‌తో సమానమైన డబ్బును ఆయనకు అందిస్తుంది.కళ్లు చెదిరే నెట్‌వర్త్ రొనాల్డో నికర ఆస్తి విలువ ప్రస్తుతం 120 కోట్ల డాలర్లు (సుమారు రూ. 10,000 కోట్లు). ఈ అపారమైన సంపద అనేది కేవలం రాత్రికి రాత్రే వచ్చింది కాదు. రెండు దశాబ్దాలకు పైగా టాప్-క్లాస్ జీతాలు, ఛాంపియన్స్ లీగ్ బోనస్‌లు, ఇమేజ్ రైట్స్, స్పాన్సర్షిప్ డీల్స్, వ్యాపార పెట్టుబడులు, అనేక దేశాల జనాభా కంటే ఎక్కువ ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను డబ్బుగా మార్చుకోవడం ద్వారా ఈ సామ్రాజ్యం సాధ్యమైంది.ఒక మ్యాచ్‌కు రొనాల్డో సంపాదన దాదాపు రూ.30 కోట్లు. వార్షిక జీతం రూ. 12 లక్షలు సంపాదించే భారతీయ ఉద్యోగి 40 ఏళ్ల పాటు కెరీర్‌ను కొనసాగించినా ఈ ఆస్తిలో ఒక చిన్న భాగానికి కూడా సరిపోలదు.. రొనాల్డో నికర ఆస్తికి సమానంగా సంపాదించాలంటే రూ. 12 లక్షల వార్షిక జీతం ఆర్జించే సుమారు 2 వేలమందికి సమానం. ఏడాదికి సుమారు 2,000 ఆఫీసు పని గంటల చొప్పున లెక్కిస్తే, ఇది దాదాపు 16 నుండి 17 కోట్ల గంటల శ్రమతో సమానం. దీనికి బదులు రొనాల్డో మైదానంలో గడిపే ప్రతి మ్యాచ్ గంటకు రూ. 20 కోట్లు సంపాదిస్తున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, ఆధునిక ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యున్నత శిఖరం 90 నిమిషాల ఫుట్‌బాల్. -
ఫుట్‌బాల్ జాతర షురూ.. అట్టహాసంగా ఫిఫా ఆరంభ వేడుకలు (ఫొటోలు)
-
FIFA World Cup 2026: ఆతిథ్య మెక్సికో ఘన విజయం
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించేందుకు ‘ఫిఫా’ ఫుట్‌బాల్ ప్రపంచకప్–2026 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లోనే ఆతిథ్య మెక్సికో జట్టు ఘన విజయాన్ని అందుకుంది. గ్రూప్-A సౌతాఫ్రికా-మెక్సికో మధ్య జరిగిన మ్యాచ్‌లో మెక్సికో 2-0 తేడాతో విజయం సాధించింది.మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన మెక్సికో జట్టు.. తొమ్మిదో నిమిషానికే గోల్ సాధించింది. మెక్సికో ప్లేయర్ జులియన్ క్వినోన్స్ తొలిగోల్ చేసి టీమ్‌కు ముందుకు నడిపాడు. ఇక రెండో అర్ధభాగంలో రావుల్ జిమినెజ్ మరో గోల్ కొట్టి మెక్సికోను మరింత ఆధిక్యంలో తీసుకెళ్లాడు. దీంతో, మెక్సికో విజయం అక్కడే దాదాపు ఖాయమైంది. ఇక, 2010 ప్రపంచకప్ మాదిరిగానే మెక్సికో–దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌తోనే 2026 వరల్డ్‌కప్ ప్రారంభమైంది. మెక్సికో, కెనడా, అమెరికా సంయుక్తంగా ఈ టోర్నీ నిర్వహిస్తోంది. Quiñones scores. #FIFAFanFestival Mexico erupts 🇲🇽#FIFAWorldCup pic.twitter.com/Xt4ePzxUHO— FIFA World Cup (@FIFAWorldCup) June 12, 2026FIFA world cup 2026 opening ceremony. pic.twitter.com/CrbiZ6oVYM— Today I Learned (@TodayiLearrned) June 11, 2026


