కోల్‌కతా, సాక్షి: కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్ బాల్ లెజెండ్ లియెనెల్ మెస్సీ కార్యక్రమం గందరగోళంగా మారింది. తమ అభిమాన క్రీడాకారుడిని చూడటానికి వచ్చేందుకు నిర్వహణా లోంపతో జనం తీవ్ర నిరాశకు లోనయ్యారు. అదీ 20 నిమిషాల్లోనే లియోనెల్ మెస్సీ వేదిక నుండి వెళ్లిపోవడంతో ఆగ్రహించిన అభిమానులు సాల్ట్ లేక్ స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. చివరికి పోలీసుల జోక్యంతోవారిని అదుపు చేశారు. అయితే ఎంతో ఖరీదు పెట్టి టికెట్లను కొని, దూర ప్రాంతాలనుంచి వచ్చినప్పటికీ, కనీసం మెస్సీ ముఖం కూడా చూడలేకపోయామని చాలామంది అభిమానులు ఆగ్రమం వ్యక్తం చేశారు.
టికెట్ డబ్బులు వాపసు
మరోవైపు లియోనెల్ మెస్సీ GOAT ఇండియా టూర్ 2025 నిర్వాహకుడిని అరెస్టు చేశారు. కోల్‌కతాలో విలేకరులతో మాట్లాడుతూ అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) లా అండ్ ఆర్డర్ జావేద్ షమీమ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. అంతేకాదు అభిమాలను టికెట్ రుసుమును నిర్వాహకులు వెనక్కి ఇస్తారని కూడా ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈ రీఫండ్ ఎలా జరుగుతుంది అనేది పరిశీలించాలన్నారు.
చదవండి: రూ. 12వేలు పోసాం...కనీసం ముఖం కూడా చూడలేదు, ఫ్యాన్స్ పైర్
#WATCH | Kolkata: On the Chaos at Messi's Kolkata event, Additional Director General (ADG) Law and Order Jawed Shamim says, "There is normalcy now. The second part is the investigation; the FIR has been lodged, and the chief organiser has been arrested... I'm telling you, they… pic.twitter.com/GRqz03wPvp
— ANI (@ANI) December 13, 2025
దీనిపై స్పందించిన రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ కోల్‌కతా క్రీడాభిమానులకు ఇదొక చీకటి రోజుగా వ్యాఖ్యానించారు. నిర్వాహక లోపం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనీ, దీనికి నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. అలాగే ముందుజాగ్రత్తలు తీసుకోని పోలీసు అధికారును సస్పెండ్ చేయాలని కూడా అన్నారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి, దోషులను అరెస్టు చేయాలన్నారు.ఈ కార్యక్రమానికి టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు వాపసు ఇవ్వాలని, స్టేడియం ,ఇతర బహిరంగ ప్రదేశాలకు జరిగిన నష్టానికి నిర్వాహకులపై ఛార్జీలు విధించాలని, పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని గవర్నర్ అన్నారు.
ఇదీ చదవండి: 90 ఏళ్లకు మించి బతుకుతామా? ఈ ఐదు పరీక్షలు నెగ్గితే!


