ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యకరమైన సుదీర్ఘ జీవితం కావాలని అందరూ కోరుకుంటారు. అయితే ఎంత కాలం జీవించగలం అనేది జెనెటిక్ అంశాలతో పాటు, జీవనశైలి, రోజువారీ అలవాట్ల మీద కూడా ఆధారపడి ఉంటుందని చాలా అధ్యయనాలు ద్వారా తెలుస్తోంది. దీర్ఘాయుష్కులుగా 90 అంతకంటే ఎక్కువ కాలం జీవించ గలమా లేదా అనేది తెలుసుకోవాలంటే 5 అద్భుతమైన పరీక్షలున్నాయి, వీటిల్లో చాలామంది మూడు పరీక్షల్లోనే ఫెయిలవుతున్నారు అంటూ డాన్ గో అనే ఫిట్‌నెస్ కోచ్ ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట ఇంట్రిస్టింగ్ మారింది. మరి ఆ పరీక్షలేంటో ఒకసారి చూసేద్దామా?
సాధారణంగా సుదీర్ఘం కాలం ఆరోగ్యంగా బతకాలంటే ఒత్తిడి లేని జీవితం, సమతుల ఆహారం, చక్కటి వ్యాయామం, ఒక వయసుదాటిన తరువాత కొన్ని ఆరోగ్య పరీక్షలు (ఇతర ప్రమాదకర అనారోగ్య సమస్యలు ఏమీ లేనివారు) చేయించుకుంటూ ఉంటే సరిపోతుంది కదా. మరి 90 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ జీవించగలరా అనేది తెలియాలంటే ఈ అయిదు పరీక్షలు చాలా కీలకమంటూ ఆరోగ్య కోచ్ షేర్ చేశారు.
నడక వేగం
ఎంత వేగంగా నడవ గలరు అనేదాని మీద కూడా మన ఆయుష్షు ఆధారపడి ఉంటుందట. ఇచ్చిన సమయ వ్యవధిలో మీరు ఎంత వేగంగా నడవగలరో చెక్ చేసుకోవాలి. ఇది గుండెలోని నాళాల పనితీరుకు సంకేతం. 1 మీ/సె (2.2 మైళ్ల) కంటే ఎక్కువ వేగం ఎక్కువ ఆయుర్దాయం కలిగిస్తుందని అంచనా. . 2.7 మైళ్ల కంటే ఎక్కువ వేగంగా నడవ గలిగితే మరణం ముప్పు తగ్గుతుందట. వేగంగా నడిచేవారిలో వృద్ధాప్యం లక్షణాలు తొందరగా కనిపించవు.
విశ్రాంతి హృదయ స్పందన రేటు
లో రెస్టింగ్ హాట్ బీట్ రేట్ (ఏ పనీలేదా వ్యాయామం చేయకుండా విశ్రాంతిగా ఉన్నపుడు) మన గండెప నితీరుకు, ఒత్తిడిని తట్టుకునే శక్తికి నిదర్శనం.నిమిషానికి 70 బీట్స్ (బిపిఎం) కంటే తక్కువ కొట్టుకుంటే సాలిడ్‌గా ఉన్నట్టు. 60 బిపిఎం కంటే తక్కువ అంటే ఎలైట్ దీర్ఘాయువు ప్రాంతం.అదే విశ్రాంతి సమయంలో 80-90 బిపిఎం కంటే ఎక్కువ గుండె స్పందన ఉంటే గుండె దృఢత్వానికి సంబందించిన వ్యాయామాలు మొదలు పెట్టాల్సిందే అని సూచన.
కూర్చుని పైకి లేచే ( Sit and Rise) పరీక్ష
డాన్ చెప్పిన దాని ప్రకారం 87 శాతం మంది ఈ పరీక్షలో ఫెయిల్ అవుతున్నారట.ఇది చాలా సులభం అనుకుంటారుగానీ, నేలపై కూర్చుని,చేతుల సాయం లేకుండా తిరిగి నిలబడటం అనేది వయస్సు పెరిగే కొద్దీ బలం, సమతుల్యత, చలనశీలత, సమన్వయానికి నిదర్శనం. 85 సంవత్సరాల వయస్సులో, గాయాలకు సంబంధించిన అన్ని మరణాలలో దాదాపు 2/3 వంతు పడిపోవడంవల్లే సంభవిస్తాయి. 8 మంది పెద్దవారిలో ఒకరు మాత్రమే ఈ ఎక్సర్‌సైజ్ చేయగలరు.
బార్ హ్యాంగ్స్ (గ్రిప్ స్ట్రెంత్)
దీనికి ఆహారం లేదా వ్యాయామంతో సంబంధం లేదు.బలమైన పట్టు గుండె ఆరోగ్యం, కండరాల బలం, ,ఎముక సాంద్రతకు సూచిక. గ్రిప్ స్ట్రెంత్ దీర్ఘాయువును అంచనా వేస్తుంది. అందుకే పరిశోధకులు దీనిని ఆరో ముఖ్యమైన సంకేతం అంటారు. 90 సెకన్లలో బార్ పట్టుకుని వేలాడితే సాధారణం కంటే బెటర్‌గా ఉన్నట్టు.
ఒక మైలు పరుగు సమయం
ఏ వయసులోనైనా 10 నిమిషాల్లో ఒక మైలు పరుగెత్తగలిగితే, హృదయనాళ వ్యవస్థ మంచి స్థితిలో ఉన్నట్టు. 8 నిమిషాల కంటే తక్కువ సమయమైతే దీర్ఘాయుష్షు-అథ్లెట్ స్థాయి ఫిట్‌నెస్‌తో ఉన్నట్టు అర్థం. ఇది ఫిట్‌నెస్ స్థాయికి స్నాప్‌షాట్ లాంటిది. ఎంత ఫిట్‌గా ఉన్నారో అంచనా వేయడానికి శరీర ప్రతిస్పందనలే సూచిక అని డాన్ వెల్లడించారు.
నోట్ : ఆరోగ్య , ఫిట్‌నెస్‌కు సంబంధించి ఇది ఒక సలహా మాత్రమే. ఏదైనా అనారోగ్య సమస్యలున్నవారు సంబంధిత వైద్యుల సలహా తీసుకోవడం సరియైన మార్గం.


