ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలను చూస్తే.. భారత్‌తో అమెరికా దూరం పెరిగిపోయిందనేది కాదనలేని వాస్తవం. ఇందుకు కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరే కారణం. ఏ విషయాన్ని తెగేసి చెప్పకుండా భారత్-పాక్‌ల యుద్ధాన్ని ఆపానని పదే పదే చెప్పుకున్న ట్రంప్.. మద్దతు విషయానికొచ్చేసరికి పాక్‌కే ప్రయారిటీ ఇచ్చారు. ఆ దేశ ఆర్మీ ఛీఫ్ మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్‌లను అమెరికాకు ఆహ్వానించడమే కాకుండా వారితో రాసుకుపూసుకుని తిరిగారు. ఇక్కడ ట్రంప్ ద్వంద్వ వైఖరి బయటపడింది.
భారత్‌పై ఆంక్షలే లక్ష్యంగా..
అదే సమయంలో భారత్ దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించి అక్కసు తీర్చుకున్నారు. దీనిపై అమెరికాలో ఉన్న నిపణులు సైతం ట్రంప్‌ను హెచ్చరించారు కూడా. భారత్‌పై అత్యధిక సుంకాలు విధిస్తే ఆ దేశంలో ఎన్నో దశాబ్దాల నుంచి సాగుతున్న మిత్రత్వం చెడిపోతుందని కూడా వివరించారు. దానివల్ల అమెరికాక ఒరిగేదేమీ లేకపోయినా మనమే దెబ్బతింటామని కూడా చెప్పారు. కేవలం భారత్‌కు ఏదో రకంగా నష్టం చేకూర్చాలని ఒక్క ఒక్క తలంపుతో 50శాతం సుంకాలను విధించారు ట్రంప్.
ఇదిలా ఉంచితే, రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై ఆంక్షలు విధించారు. రష్యా చమురును కొనడం ఆపాలనే భారత్‌ను చాలాసార్లే హెచ్చరించారు. అయితే దాన్న భారత్ పూర్తి సీరియస్‌గా తీసుకోగా పోగా రష్యా నుంచి చమురు కొనడాన్ని మాత్రం ఆపలేదు. ఇటీవల రష్యా అధ్యక్షడు పుతిన్.. భారత్‌కు వచ్చిన నేపథ్యంలో కూడా చమురు సరఫరాపై ఒక్క ముక్కలో తేల్చి పారేశారు. తాము భారత్‌కు సరఫరా చేస్తామని కచ్చితంగా చెప్పేశారు. మరొకవైపు చైనాతో భారత్ సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి. ఇలా వరుస పరిణామాలు ట్రంప్‌కు అసహనం తెప్పిస్తున్నాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా వేరే దేశాలకు భారత్ దగ్గరవ‍్వడాన్ని ట్రంప్ సహించలేకపోతున్నారు.
మెక్సికో సుంకాల వెనుక ట్రంప్ హస్తం?
గత రెండు రోజుల క్రితం భారత దిగుమతులపై మెక్సికో 50 శాతం సుంకాన్ని విధించింది. దీనికి ఏవో కారణాలు చెప్పుకొచ్చింది. తమ దేశంతో పూర్తిస్థాయి వాణిజ్య సంబంధాలు లేని దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తున్నామంటూ స్పష్టం చేసింది. ఈ జాబితాలో భారత్‌తో పాటు చైనా కూడా చేరింది. మెక్సికోతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) లేని దేశాలన్నింటికీ ఈ సుంకాలు వర్తిస్తాయని చెప్పింది.
అయితే వీటి వెనుక ఉన్నది ట్రంప్ అని పలు ఆరోఫలణలు వచ్చాయి.. వస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు ఇప్పటికే మెక్సికో సుంకాలపై స్పందించారు. ఇది ట్రంప్ చర్య కావొచ్చనే అనమానం వ్యక్తం చేశారు. దీన్ని పూర్తిగా కాదనలేం. అమెరికాకు అత్యంత మిత్ర దేశాల్లో మెక్సికో ఒకటి. మెక్సికోను పదే పదే పొగడ్తలతో ముంచెత్తం కూడా ఇందుకు బలం చేకూరుస్తుంది.
ఇరుదేశాల మధ్య బలమైన వాణిజ్య ఒప్పందాలున్నాయి. గతంలో పలు సందర్భాల్లో మెక్సికో అధ్యక్షరాలు క్లాడియా షీన్‌బామ్‌ను అత్యంత సాహసిగా, గొప్ప నాయకురాలిగా అభివర్ణించారు ట్రంప్. ఇక మెక్సికోకు కూడా అమెరికాపై అంతే ప్రేమ ఉంది. ఈ కారణంగానే ట్రంప్ దాగుడు మూతలకు తెరలేపి భారత్‌కు ఏదో రకంగా నష్టం చేకూర్చాలని చూశారనేది నిపుణుల అంచనా.
ఇది ట్రేడ్ డైవర్షన్‌కు అడ్డుకట్టా.. ట్రంప్ అడ్డుకట్టా..?
భారత్, చైనాలపై అమెరికా భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో ఇరు దేశాలు మెక్సికోకు దిగుమతి చేసే వస్తువులను నేరుగా అమెరికాకు పంపకుండా మెక్సికో ద్వారా మళ్లించి ఆ తర్వాత అమెరికాకు పంపే అవకాశం ఉంది. దీన్ని ట్రేడ్ డైవర్షన్ అంటారు.దీనికి అడ్డుకట్టవేయాలనే తలంపుతో మెక్సికో చేసినా, ఇందులో ట్రంప్ హస్తం ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పటికే భారత్‌పై అమెరికా విధించిన సుంకాలపై అక్కడ ఎంపీల నుంచే ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ట్రంప్ ఇలా చేసే ఉంటారనేది మరో కోణంలో విశ్లేషిస్తున్నారు.
ఇదీ చదవండి:
భారత్‌పై మెక్సికో సుంకాల పెంపు.. ఏయే రంగాలపై ప్రభావం


