చెన్నై: ఆతిథ్య భారత జట్టు స్క్వాష్ ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–0తో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. జోష్నా చినప్ప 7–4, 7–4, 7–2తో టీజెన్ రసెల్‌పై గెలుపొందగా, అభయ్ సింగ్ 7–1, 7–6, 7–1తో డెవాల్స్ వాన్ నికెర్క్‌పై గెలిచాడు. అనాహత్ సింగ్ 7–3, 7–3, 7–4తో హేలీ వార్డ్‌ను చిత్తు చేసింది. సెమీస్‌లో ఈజిప్‌్టతో భారత్ తలపడుతుంది. క్వార్టర్స్‌లో ఈజిప్ట్ 3–0తో ఆ్రస్టేలియాపై గెలుపొందింది. లీగ్ దశలో భారత జట్టు స్విట్జర్లాండ్, బ్రెజిల్‌లపై విజయంతో నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఇప్పటివరకు ప్రపంచకప్ చరిత్రలో భారత్ 2023లో గెలిచిన కాంస్య పతకమే అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది.


