ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణలు రెండో రోజుకు చేరుకోగా.. శుక్రవారం సుమారు 80 వేల మంది భవానీలు, భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
తెల్లవారుజామున 1.15 గంటలకు అమ్మవారికి నిత్య పూజల అనంతరం భవానీ దర్శనానికి అనుమతించారు.
భవానీలు గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని, క్యూలైన్‌లోనే వేచి ఉండటం కనిపించింది. వేకువజామునే అమ్మవారి దర్శనం పూర్తి చేసుకున్న భవానీలు, కొండ దిగువకు చేరుకుని ఇరుముడులను సమర్పించారు.


