kanaka durga temple
-
విజయవాడ : భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు (ఫొటోలు)
-
విజయవాడ : వైభవంగా ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు (ఫొటోలు)
-
భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి (ఫోటోలు)
-
ఇంద్రకీలాద్రి : అంగరంగ వైభవంగా దుర్గమ్మకు జ్యోతుల ఉత్సవం (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : కనులపండువగా కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : మహాచండీ దేవి అలంకారంలో దుర్గమ్మ (ఫొటోలు)
-
భక్తిశ్రద్ధలతో ఇంద్రకీలాద్రిపై కుంకుమ పూజలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు (ఫొటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతం (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : రికార్డు స్థాయిలో దుర్గమ్మకు సారె సమర్పణ (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న ఆషాఢ సారె సమర్ఫణలు (ఫొటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వైభవంగా శాకంబరీదేవి ఉత్సవాలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శాకంబరీదేవి ఉత్సవాలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఆషాఢ మాసోత్సవాలు (ఫొటోలు
-
ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఆషాఢ మాస సారె మహోత్సవం (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై ముగిసిన శివరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
విజయవాడ : ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి..ముగిసిన భవానీ దీక్ష విరమణ (ఫొటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ (ఫొటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న భగవంత్ కేసరి చిత్రబృందం (ఫొటోలు)
-
విజయవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన జగన్ (ఫొటోలు)
-
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతీదేవిని దర్శించుకున్న సీఎంకు ఆలయ వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్నిసీఎంకు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అందజేశారు. తొలుత ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం జగన్‌కు పూర్ణకుంభంతో వేద పండితులు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయ చిన్న రాజగోపురం వద్ద సీఎం జగన్‌కు అర్చకులు పరివేష్టం చుట్టారు. శుక్రవారం అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి రూపంలో అమ్మవారు భక్తులకు అనుగ్రహించారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం నాడు దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. రద్దీకి అనుగుణంగా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. -
ఇంద్రకీలాద్రికి సీఎం వైఎస్ జగన్
-
Indrakeeladri : వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
Dasara Navaratri Utsavalu : ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరరాత్రులు (ఫొటోలు)
-
India Famous Durga Temples Images: భారతదేశంలోని ప్రసిద్ధ దుర్గా దేవాలయాలు (ఫొటోలు)
-
ఘనంగా ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు ప్రారంభం
-
శ్రావణ శుక్రవారం.. భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
సాక్షి, విజయవాడ: శ్రావణమాసం శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు భారీగా తరలి రావడంతో ఇంద్రకీలాద్రి దర్దీగా మారింది. ఉదయం నుంచి దర్శనాలు కొనసాగుతున్నాయి. నేడు వరలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా దుర్మమ్మకు ఆలయ అర్చకులు 31 రకాల విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో భ్రమరాంబ ఉదయాన్నే భక్తులు రద్దీని పరిశీలించారు. కాగా దుర్గమ్మ ఆలయంలో సెప్టెంబర్ 8న ఉచితంగా సామూమిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నారు. వరంగల్ భద్రకాళి అమ్మావారికి పోటెత్తిన భక్తులు శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలతో అమ్మవారు ఆలయాలు భక్తులతో కిటకిటలాడున్నాయి. వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారు ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలతో తరిస్తున్నారు. హంటర్ రోడ్‌లోని సంతోషిమాత ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులతో అమ్మవారు ఆలయాలు భక్తజనసంద్రంగా మారాయి. -
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఏపీలో 11 ప్రధానాలయాల్లో దుర్గగుడికి తొలిస్థానం
-
కన్నుల పండువగా కృష్ణవేణి నదివిహారం
-
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు
-
శరన్నవరాత్రి ఉత్సవాలు :భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)
-
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా రేపు (02.10.2022, ఆదివారం) మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దర్శించుకోనున్నారు. అంతేకాదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇక ఇంద్రకీలాద్రిపై దసరా శోభ కనిపిస్తోంది. దసరా నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మూలానక్షత్రం సందర్భంగా భక్తులు భారీగా పోటెత్తుతారని ఆలయ అధికారులు అంచనా వేసి.. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు ప్రారంభం (ఫోటోలు)
-
శ్రావణమాసం చివరి శుక్రవారం : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
Ashada Masam 2022: ముగిసిన ఆషాఢ మాసం ఉత్సవాలు
-
ఇంద్రకీలాద్రిపై శాకంబరీదేవి ఉత్సవాలు (ఫొటోలు)
-
దుర్గ గుడిలో భక్తుల సందడి (ఫొటోలు)
-
దుర్గమ్మకు ‘తెలంగాణ’ బోనం (ఫోటోలు)
-
కాంట్రాక్టర్ చీరవాటం.. ఇంద్రకీలాద్రిపై మరో అవినీతి బాగోతం వెలుగులోకి..
సాక్షి, అమరావతి బ్యూరో: ఇంద్రకీలాద్రిపై అవకతవకలకు అడ్డూ అదుపూ ఉండడం లేదు. రోజుకో అవినీతి వ్యవహారం వెలుగులోకి వస్తున్నా.. దేవస్థానం యంత్రాంగంలో మార్పు కనిపించడం లేదు. ఇప్పటికే దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి వివిధ సరుకుల సరఫరా కాంట్రాక్టులో అక్రమాలు బహిర్గతమయ్యాయి. టెండరు షెడ్యూలులో పేర్కొన్న విధంగా నాణ్యమైన సరుకులకు బదులు నాసిరకం పంపిణీ చేస్తుండడం తెలిసిందే. అలాగే కొబ్బరికాయలు కొట్టే స్థలం వద్ద కాయలు కొట్టినందుకు కొంతమంది కాంట్రాక్టరుకు చెందిన సిబ్బంది భక్తుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్న వైనం కూడా విదితమే. తాజాగా అమ్మ వారికి భక్తులు మొక్కుబడులుగా సమర్పించిన చీరల విక్రయంలోనూ బహిరంగంగా అవినీతికి పాల్పడుతున్నారు. ఇదీ సంగతి.. అమ్మవారికి భక్తులు సమర్పించే చీరలను విక్రయించే కాంట్రాక్టును ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. దేవస్థాన ప్రాంగణంలోనూ, ఘాట్ రోడ్డులో ప్రసాదాలు విక్రయించే కేంద్రాల వద్ద చీరల విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ‘శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల వస్త్ర ప్రసాద విక్రయ కేంద్రం’ పేరిట ఉన్న ఈ కౌంటర్లలో చీరలను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ కౌంటర్లలో కొన్ని చీరలకు మాత్రమే ధరను తెలిపే స్టిక్కర్లను అంటిస్తున్నారు. మిగతా చాలా చీరలను ఆ కౌంటర్లో ఉన్న సిబ్బందే ధర నిర్ణయించి విక్రయిస్తున్నారు. చీరల కొనుగోలుకు వచ్చిన భక్తులను ఎంత ఖరీదువి కావాలని వీరు అడుగుతున్నారు. దాన్ని బట్టి కొన్నింటిని చూపిస్తున్నారు. వాటిపై ఎలాంటి ధర లేకుండానే విక్రయిస్తున్నారు. ఇలా పలు చీరలకు వస్త్ర దుకాణాల్లో ధరల కంటే ఎక్కువ ధర చెప్పి.. కాస్త తగ్గించి ఇస్తున్నారు. ఉదాహరణకు షాపులో రూ.600–700కు మించని (ధర స్టిక్కరు లేని) చీర రూ.వెయ్యి చెప్పి వందో, యాభయ్యో తగ్గిస్తున్నారు. రశీదు కూడా లేకుండా.. వాస్తవానికి భక్తులు అమ్మవారికి చీరలు సమర్పించేటప్పుడు దాని ఖరీదు ఎంతో అడిగి తెలుసుకుని రశీదు ఇస్తారు. వీటిని ఆ ధరపై 20–25 శాతం తక్కువ ధర నిర్ణయించి అమ్మకానికి పెడతారు. ఇలా విక్రయించే చీరలకు విధిగా బిల్లు ఇవ్వాలి. ఇందుకోసం ఈ కౌంటర్లలో ఒక బిల్లింగ్ మిషన్‌ను కూడా అందుబాటులో ఉంది. కానీ ఇక్కడ విక్రయించే చీరలకు బిల్లు కూడా ఇవ్వకపోవడం గమనార్హం.ఇంద్రకీలాద్రిపై అమ్మవారి చీరల విక్రయ కౌంటర్ భక్తుల సెంటిమెంటే ఆయుధం భక్తులు అమ్మ వారి చీర కొనుక్కోవడం అంటే ఎంతో సెంటిమెంటుగా భావిస్తారు. దీంతో చాలామంది చీరలపై ధర లేకపోయినా, బిల్లు ఇవ్వకపోయినా అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ఖరీదు చేసే చీరలను ఎక్కువ ధరకు అమ్మడం, వాటికి బిల్లు ఇవ్వకపోవడం ద్వారా సదరు కాంట్రాక్టరు భక్తుల నుంచి భారీ ఎత్తున దోపిడీ చేస్తున్నారు. కళ్లెదుటే ఇంతటి మోసం జరుగుతున్నా దేవస్థానం అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కాంట్రాక్టరు దోపిడీకి అడ్డుకట్ట వేయడం లేదు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం.. నిబంధనల ప్రకారం అమ్మవారి వస్త్ర ప్రసాదం చీరలపై విధిగా ధర ఉండాలి. విక్రయించిన చీరలకు కచ్చితంగా బిల్లు ఇవ్వాలి. అలా విక్రయించడం తప్పు. వస్త్ర ప్రసాద విక్రయ కౌంటర్లలో అక్రమాలకు తావు లేకుండా చూస్తాం. సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం. – భ్రమరాంబ, ఈవో, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం -
ఇంద్రకీలాద్రి పై భక్తుల కిటకిట
-
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఎన్వీ రమణ దంపతులు
-
ఆది దంపతుల తెప్పోత్సవం.. వైభవోపేతం
-
శరన్నవరాత్రి ఉత్సవాలు: ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం
-
శరన్నవరాత్రి మహోత్సవాలు: దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు
-
శరన్నవరాత్రి మహోత్సవాలు: శ్రీసరస్వతి దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ
-
శ్రీఅన్నపూర్ణాదేవి, శ్రీమహాలక్ష్మీ దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ
-
శరన్నవరాత్రి మహోత్సవాలు: శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా కనక దుర్గమ్మ
-
శరన్నవరాత్రి మహోత్సవాలు: శ్రీగాయత్రీ దేవిగా దుర్గమ్మ దర్శనం
-
శరన్నవరాత్రి మహోత్సవాలు: శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ
-
శ్రావణ శుక్రవారం : భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి
-
భవానీ భక్తులపై కోవిడ్ ఎఫెక్ట్
సాక్షి, విజయవాడ: అమ్మవారి మాల ఎక్కడైతే స్వీకరిస్తారో అక్కడే దీక్ష విరమణ చేయాలని దుర్గగుడి ఈఓ సురేష్ బాబు భక్తులకు విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నదీ స్నానానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. కాగా కోవిడ్ నిబంధనల కారణంగా భవానీ దీక్షా విరమణకు వచ్చే భక్తులకు ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ చేసే గిరి ప్రదక్షిణ బ్రేక్ పడింది. వైరస్ వ్యాప్తి కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు భవానీ దీక్షా విరమణ ఆన్లైన్ స్లాట్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఓ సురేష్ బాబుతో కలిసి విలేకరులతో మాట్లాడిన ఆయన.. జనవరి 5 నుంచి 9 వరకు భవానీ దీక్షా విరమణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కోవిడ్ దృష్ట్యా భవానీ దీక్షకు వచ్చే భక్తులను రోజుకు పది వేల మందిని మాత్రమే అనుమతిస్తున్నామన్నారు. కొండ చుట్టూ గిరి ప్రదక్షణను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ‘‘దీక్షా విరమణ రోజుల్లో రోజుకు 9 వేల మందికి ఉచిత దర్శనం... 100 రూపాయల టిక్కెట్లు 1000 ఆన్లైన్లో అందుబాటులో ఉంచాం. ప్రతిభక్తుడు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సిందే. అమ్మవారి దర్శనానికి వచ్చే సమయంలో ఐడీ తప్పనిసరి. www.kanakadurgamma.org వెబ్సైట్లో టిక్కెట్లు పొందవచ్చు. దీక్షా విరమణ రోజుల్లో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. కాగా రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయంలో కోటి దీపోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 6 గంటలకు ఆలయ సిబ్బందితో కలిసి ఆలయ అధికారులు అమ్మవారి గిరిప్రదక్షిణ చేయనున్నారు.(చదవండి: మూడు బ్యారేజీల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు) -
ఇంద్రకీలాద్రి: గాజుల ఉత్సవం
-
దుర్గమ్మకు గాజుల ఉత్సవం
సాక్షి, ఇంద్రకీలాద్రి : కార్తీక శుద్ధ విదియను పురస్కరించుకుని సోమవారం దుర్గమ్మకు గాజులతో అలంకరించనున్నారు. ప్రస్తుతం నెలకున్న కోవిడ్ నేపధ్యంలో ఈ ఏడాది కేవలం అంతరాలయంలో అమ్మవారికి మాత్రమే గాజుల అలంకారం చేయాలని వైదిక కమిటీ నిర్ణయించింది. అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఈ ఏడాది గాజులతో అలంకరిస్తారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు అమ్మవారి సన్నిధిలో ధనలక్ష్మీ పూజ నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారికి పంచహారతుల సేవ జరిగింది. సేవ అనంతరం ఆలయం చుట్టూ ఉన్న అష్టలక్ష్ముల విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన జ్యోతులను ఆలయ ఈఓ ఎంవీ సురేష్‌బాబు దంపతులు, చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ అర్చకులు వెలిగించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆలయ అధికారులు, సిబ్బంది టపాసులు కాల్చి, మిఠాయిలను పంచుకున్నారు. రాత్రి 7 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేశారు. నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కార్తీక మాసం తొలి రోజు సోమవారం కావడంతో పెద్దఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు భావిస్తున్నారు. దుర్గమ్మకు బంగారు హారం బహూకరణ.. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు నగరానికి చెందిన భక్తులు బంగారపు హారాన్ని కానుకగా అందచేశారు. విజయవాడ కాళేశ్వరరావు రోడ్డుకు చెందిన భార్గవ రాము దంపతులు అమ్మవారి అలంకరణ నిమిత్తం సుమారు 40 గ్రాముల బంగారంతో తయారు చేసిన హారాన్ని ఆలయ ఈఓ ఎంవీ. సురేష్‌బాబుకు అందచేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. -
ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు
-
శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ
సాక్షి, విజయవాడ: దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలలో ఆరో రోజు దుర్గదేవి అమ్మవారు శ్రీ లలితాత్రిపురసుందరిదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారు శ్రీచక్ర అధిష్టానశక్తిగా, పంచదాశాక్షరీ మహామంత్రాధిదేవతగా వేంచేసి తన భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తుంది. శ్రీలక్ష్మీదేవి, శ్రీసరస్వతిదేవీ ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరు మందహాసంతో, వాత్సల్య జితోష్ణలను చిందిస్తూ, చెరుకుగడను చేతపట్టుకుని శివుని వక్షస్ధలంపై కూర్చుని శ్రీ లలితాత్రిపురసుందరీదేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడిగా, అమ్మవారు త్రిపురసుందరీదేవిగా భక్తుల చేత పూజలందుకుంటారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. చదవండి: దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ ఇంద్రకీలాద్రి: ప్రాతస్స్మరామి లలితా వదనారవిందం బింబాధరంపృథుల మౌక్తిక శోభినాసమ్ ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్!! -
దుర్గమ్మకు సారె
-
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ ఫొటోలు
-
దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
-
దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా బుధవారం మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను, పసుపు కుంకుమలను సమర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా సీఎం వైఎస్ జగన్ దుర్గగుడికి చేరుకున్నారు. వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో జగన్‌కు ఘనస్వాగతం పలికారు. కొండమీదకు చేరుకున్న సీఎం జగన్ కొండచరియలు విరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. అనంతరం వస్త్రధారణ పంచెకట్టు, తలపాగా చుట్టి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం జగన్ వెంట మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు పార్థ సారధి, వల్లభనేని వంశీ,అబ్బయ్య చౌదరి, దూలం నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. దుర్గగుడి అభివృద్ధికి రూ.70 కోట్లు దుర్గగుడి అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.70 కోట్లు ప్రకటించారని ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు పేర్కొన్నారు. లడ్డూ పోటు, ఘాట్‌రోడ్ అభివృద్ధి, సోలార్ సిస్టమ్‌తో పాటు అభివృద్ధి పనులకు సీఎం నిధులు ప్రకలించారని తెలిపారు. -
అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం
సాక్షి, ఇంద్రకీలాద్రి: దసరా నవరాత్రులలో నాలుగవ రోజైన చవితి నాడు బెజవాడ కనకదుర్గమ్మ అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తుంది, సృష్టిలోని ప్రతీజీవికి కావలసిన చైతన్యం కలిగించే మహాశక్తి అన్నపూర్ణ. ఒక చేతిలో అక్షయ పాత్రతో, మరియొక చేతిలో గరిటెతో దర్శనమిస్తుంది. సాక్షాత్తూ పరమేశ్వరునికే భిక్షనొసంగిన అన్నపూర్ణ అక్షయ శుభాలను కలిగిస్తుంది. ఈ రోజు అన్నపూర్ణాష్టక పారాయణ శుభదాయకం. అన్నపూర్ణాష్టకమ్ నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ!! అన్నంపరబ్రహ్మ స్వరూపం. అదే సర్వజీవులకు జీవనాధారం. అటువంటి అన్నాన్ని ప్రసాదించేది సాక్షాత్తూ అన్నపూర్ణమ్మ తల్లే. అమ్మవారి దివ్య రూపాల్లో అన్నపూర్ణాదేవి అలంకారం ఒకటి. అన్నపూర్ణాదేవి అలంకారంలో పరమార్ధం.. సాక్షాత్ తన భర్త పరమేశ్వరుడే ఆది భిక్షువుగా యాచనికి వస్తే ఆ తల్లి అన్నపూర్ణాదేవిగా మారి ఆయనకు భిక్షని ప్రసాదిస్తుంది. అలాగే దుర్గమ్మ అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారి వారి ఆకలిని తీరుస్తుంది. అటువంటి అన్నపూర్ణమ్మ రూపంలో ఇవాళ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ భక్తులకు కనువిందు చేయనున్నారు. ఈ విధంగా సాగే అన్నపూర్ణాష్టకం చదివితే సకల మనోభీష్టాలు నెరవేరుతాయి. శ్రీశైలంలోని భ్రమరాంబ కూష్మాండ రూపంలో దర్శనమిస్తుంది. తేజోమయ రూపంతో ఎనిమిది భుజాలతో కనిపించే రూపం కూష్మాండ. అలంకారం, నివేదన: ఈ రోజు పులిహోర, పెసరపప్పు పాయసం నివేదన చేయాలి. ఎరుపురంగు వస్త్రాలను ధరింపచేసి కూరగాయలతో చేసిన కదంబం నివేదన చేయాలి. శ్రీసూక్త పారాయణ శ్రేష్టం.కూష్మాండ శ్లోకంసురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవచ ! దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే !! ఈ చిత్రంలో దుర్గాదేవి వేషధారణలో ఆధ్యాత్మిక ప్రకాశంతో కనిపిస్తున్నది అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో సిన్సినాటి నగరంలో ఉంటున్న శ్రీమతి మద్దూరి సుహాసిని మధుర లాలస! ప్రసిద్ధ నాట్యాచారిణి ‘పద్మశ్రీ’ శోభానాయుడు చేత గజ్జె కట్టించుకుని, ఆమె శిష్యురాలిగా కూచిపూడి నాట్య వైభవాన్ని ప్రచారం చేసే మార్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం తన ప్రదర్శనలో భాగంగా శోభానాయుడు తన శిష్యురాలైన మధుర లాలసకు దుర్గాదేవి వేషాన్ని ధరింపజేసి, ముమ్మూర్తులా అమ్మవారిలా ఉన్నావంటూ నమస్కరిస్తూ ఆశీర్వదించారు. తన గురువైన శోభానాయుడు కూచిపూడి నాట్యకళకు చేసిన సేవ అనితరసాధ్యమనీ, ఆమె తనను అమితంగా ప్రేమించేవారనీ మధుర లాలస కన్నీళ్లతో గుర్తుచేసుకున్నారు. -
ఇంద్రకీలాద్రి : గాయత్రి దేవిగా దుర్గమ్మ దర్శనం
-
దుర్గమ్మకు కనక పుష్యరాగ హారం విరాళం
సాక్షి, విజయవాడ : విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది రూపంలో భక్తులను దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో కనకదుర్గ అమ్మవారి అలంకరణకు వాడే ఏడువారాల నగల్లో మరో మణి హారం వచ్చి చేరింది. ఎన్నారై భక్తుడు తాతినేని శ్రీనివాస్ 40 లక్షల రూపాయలు విలువైన కనకపుష్యరాగ హారాన్ని దుర్గమాతకు సమర్పించారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు. ఈ హారాన్ని ప్రతి గురువారం అమ్మవారికి అలంకరించనున్నట్లు వెల్లడించారు. కనకపుష్యరాగాలు అన్ని ఒకే సైజు కోసం సింగపూర్ నుంచి తెప్పించామన్నారు. చదవండి: గాయత్రి దేవిగా దుర్గమ్మ దర్శనం అలాగే గత 6 నెలల నుంచి అమ్మవారికి 7 వారాల నగలు అలంకరిస్తున్నామని, భక్తులు ఎవరైనా అమ్మవారికి 7 వారాల నగలు సమర్పించాలనుకుంటారో వారు దేవస్థానంలో సంప్రదించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నారై భక్తుడు తాతినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. తాను విజయవాడ స్థానికుడిని అని, కానీ వృత్తి రీత్యా అట్లాంటాలో ఉంటున్నట్లు తెలిపారు. తమ కుమారుడు మొదటి జీతంతో అమ్మవారికి హారం అమ్మవారికి ఇవ్వటం చాలా ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి హారం చేపించి ఇవ్వడం తమ పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: శరన్నవరాత్రి అమ్మవారి అలంకారాలు ఇవే అమ్మవారికి అలంకరించే ఏడు వారాల నగలు.. ► సోమవారం- ముత్యాలు ► మంగళవారం- పగడలు ► బుధవారం- పచ్చల ► గురువారం- కనకపుష్యరాగాలు ► శుక్రవారం-డైమండ్ ► శనివారం-నిలాలు ► ఆదివారం-కెంపులు -
ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రులు
-
గాయత్రి దేవిగా దుర్గమ్మ దర్శనం
సాక్షి, ఇంద్రకీలాద్రి/ శ్రీశైలం : ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. దేవి శరన్నవరాత్రులలో భాగంగా మూడో రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు కనకదుర్గ అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేద మాతగా ప్రసిద్ది పొంది∙ముక్తా, విద్రమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రిదేవి. చదవండి: శరన్నవరాత్రి అమ్మవారి అలంకారాలు ఇవే ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మ, హృదయం నందు విష్ణువు, శిఖయందు రుద్రడు నివసిస్తుండగా త్రిమూర్తత్యంశగా గాయత్రిదేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకీ గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవుళ్లకి అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీమాతగా వేదమాతగా కొలుస్తూ, గాయత్రిమాతను దర్శించుకోవడం వలన మంత్రిసిద్ధి ఫలాన్ని పొందుతారు. చదవండి: నవరాత్రులు.. నవ వర్ణాలు ముక్తా విద్రుడు హేమ నీల దవళచ్ఛాౖయె ర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీం భజే మయూర వాహనంపై ఆది దంపతులు శ్రీశైల మహాక్షేత్రంలో నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజైన ఆదివారం భ్రమరాంబాదేవి అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే స్వామి, అమ్మవార్లను మయూర వాహనంపై కొలువుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలరించిన కేరళ వాయిద్యకారుల ప్రదర్శన ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి ప్రతి నిత్యం ఆలయ ప్రాంగణంలో కళార్చన జరుగుతుంది. కేరళకు చెందిన పలువురు వాయిద్యకారులు డప్పు వాయిద్యాలతో తమ కళను ప్రదర్శిస్తున్నారు. సుమారు రెండు గంటల పాటు సాగుతున్న కళార్చన విశేషంగా ఆకట్టుకుంటుంది. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల అనంతరం గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు నిర్వహిస్తున్న పల్లకీ సేవలో పంచవాయిద్యాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. -
అమ్మవారి దర్శనానికి అన్ని ఏర్పాట్లు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కనకదుర్గ అమ్మవారిని శనివారం దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. కరోన నిబంధనలు పాటిస్తూ 10 వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఆన్లైన్లో ముందుగా టికెట్ బుక్ చేసుకున్న వారు మాత్రమే అమ్మవారి దర్శనానికి రావాలని ఆయన కోరారు. -
స్వర్ణకవచాలంకృత రూపంలో దుర్గాదేవి
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారికి నగర సీపీ బత్తిన శ్రీనివాసులు, దుర్గగుడి ఈవో సురేష్ బాబు దంపతులు తొలి పూజ నిర్వహించారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న 10వేలమంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి, శనివారం నుంచి మల్లేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నారు. అలాగే పదేళ్లలోపు పిల్లలకు, 60ఏళ్లు పైబడిన వారికి దర్శనానికి అనుమతి నిరాకరిస్తున్నారు. అలాగే కేశఖండన, ఘాట్ల వద్ద స్నానాలు నిషేధం విధించారు. (ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శరన్నవరాత్రులు) మూల నక్షత్రం(అక్టోబర్ 21) రోజున తెల్లవారుజమున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. 24వ తేదీ అమ్మవారిని రెండు అలంకారాలలో భక్తులు దర్శంచుకోనున్నారు. ఉదయం దుర్గాదేవిగా, మధ్యాహ్నం నుంచి మహిసాసురమర్ధని దేవిగా అలంకరిస్తారు. 25వ తేదీ (విజయదశమి) రోజున దుర్గాదేవి శ్రీరాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. శరన్నవరాత్రి వైభవం - మొదటి రోజు ఆశ్వయుజు శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శరన్నవరాత్రులుగా మనం జరుపుకునే దసరా ఉత్సవాలలో శక్తి స్వరూపిణి అయిన దుర్గామాతను వివిధ రూపాలలో ప్రత్యేక విధి విధానాలతో పూజిస్తాం. ప్రథమంగా పాడ్యమి నాడు బెజవాడ కనకదుర్గమ్మని స్వర్ణకవచాలంకారంతో షోడశోపచారాలతో పూజిస్తారు. ఆ రోజు చేమంతి పూలను వినియోగిస్తారు. దుర్గా అష్టోత్తర నామాలతో పూజ చేసి, పులిహోరను నివేదించి అమ్మను స్తుతిస్తారు. దేవీస్తుతి: సర్వ మంగళమాంగల్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్య్రమ్బకే దేవి నారాయణి నమోస్తుతే ఈ నవరాత్రి వ్రతం చేయువారు ఉదయం సాయంత్రం విధివిధానాలతో పూజించాలి. నవరాత్రులలో ఇంటికి వచ్చే ముత్తయిదువులకు యధాశక్తి తాంబూలం సమర్పించుకోవాలి. ఈ వేళ శ్రీశైల భ్రమరాంబికను శైలపుత్రిగా అలంకరిస్తారు. శ్లోకం: ప్రథమా శైలపుత్రీచ, ద్వితీయ బ్రహ్మచారిణి, తతీయ చంధ్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకీ, పంచమా స్కంద మాతేతి, షష్టా కాత్యాయనేతిచ, సప్తమా కాళరాత్రీచ, అష్టమాచాతి భైరవీ, నవమా సర్వసిద్ధిశ్చాత్నవదుర్గా ప్రకీర్తితా’’. – డా. దేవులపల్లి పద్మజ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు సర్వం సిద్ధం
-
దేవాలయాలు కూల్చిన ఘనత చంద్రబాబుదే!
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వెండి రథానికి ఉండాల్సిన మూడు సింహం ప్రతిమలు మాయం కావడంపై భక్తుల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. సింహం ప్రతిమలు మాయమైనట్లు ఇప్పుడు బయటపడినప్పటికీ, అవి ఎప్పుడు మాయం అయ్యాయనే అంశంపై విచారణ జరగనుంది. రథంపై అమ్మవారు ఉగాది రోజున, చైత్ర మాసోత్సవాల్లోనూ భక్తులకు దర్శనం ఇస్తారు. 2019 ఏప్రిల్ 6న నిర్వహించిన ఉగాది ఉత్సవాలు తర్వాత ఈ రథాన్ని దేవస్థానం ఉపయోగించలేదు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఉగాది ఉత్సవాలు నిర్వహించలేదు. గతంలో పాలక మండలి హయాంలోనే.. దుర్గగుడికి గత ఏడాది ఉగాది ఉత్సవాల నాటికి చంద్రబాబు ప్రభుత్వం నియమించిన పాలకమండలి ఉంది. ఆ రోజున అమ్మవారి పూజా కార్యక్రమాల్లో టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఆ తర్వాత మల్లికార్జున మహామండపం కింద దాన్ని ఉంచి మొత్తం ప్లాస్టిక్ కవర్‌తో కప్పేశారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత పైలా సోమినాయుడు సారథ్యంలో పాలకమండలి ఏర్పటైంది. రథం యథావిధిగా ఉందని భావించారే తప్ప రథం మీద ఉన్న సింహం బొమ్మలు మాయం అవుతాయని అనుమానించలేదు. రథాన్ని పరిశీలించలేదు. గతంలో పాలకమండలి సభ్యులకు, దేవాలయ ఈఓలకు మధ్య సఖ్యత ఉండేది కాదు. దీంతో వారే ప్రతిదాన్ని వివాదస్పదం చేసుకునేవారు. వారిపై అనుమానాలు.. ఇక దుర్గగుడి పరిసరాల్లో టీడీపీ నేతలు కొంతమంది కొన్నేళ్లుగా పాగా వేశారు. వారు ఇంద్రకీలాద్రిపైనే చిరు వ్యాపారం చేసి తర్వాత రూ.కోట్లకు పడగలెత్తి, రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. అధికార పార్టీని ముఖ్యంగా దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును ఇరకాటంలో పెట్టాలని రథంపై సింహాల ప్రతిమలను మాయం చేసి పాపానికి ఒడికట్టారా.. అనే అనుమానాలు దేవస్థానం సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఒక సంస్థకు గతంలో సెక్యురిటీ బాధ్యతలను అప్పగించారు. ఈ ఏడాది వారి కాంట్రాక్టు పూర్తి కావడంతో తిరిగి వేలం నిర్వహించడంతో మాక్స్ సంస్థ టెండర్ దక్కించుకుంది. అయితే గత సంస్థలో పనిచేసిన అనేక మంది సిబ్బంది మాక్స్ సంస్థలో చేరి ఇక్కడే దుర్గగుడిలో పనిచేస్తున్నారు. తమ ప్రతిష్ట దెబ్బతీయడానికి గత సంస్థలో పనిచేసిన వారు ఎవరైనా ఈ తప్పుడు పని చేశారా? అనే అనుమానం మాక్స్ సెక్యురిటీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాలు కూల్చిన ఘనత చంద్రబాబుదే! టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రార్థనా స్థలాలపై ఏ విధమైన భక్తి భావం లేదు. తన హయాంలో దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయించారు. 2016లో పుష్కరాల సమయంలో కృష్ణానది ఒడ్డున ఉన్న 40 దేవాలయాలను కూల్చి వేయించారు. అప్పట్లో ఈ కూల్చివేతల్లో ఎంపీ కేశినేని నాని, నాటి కలెక్టర్ అహ్మద్ బాబు కీలకపాత్ర పోషించారు. రామవరప్పాడులో ఉన్న మసీదును కూల్చివేయడంతో ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. ఆయన్ను సంతోష పరచడానికే స్థానిక టీడీపీ నాయకులు ఇటువంటి దుశ్చర్యలకు పాలుపడుతున్నారని హిందూ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. రథాన్ని పరిశీలించిన మంత్రి వెలంపల్లి ఇంద్రకీలాద్రికి ఉన్న వెండి రథాన్ని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. పెనుగంచిప్రోలు ఈఓ ఎన్వీఎస్ఎస్ మూర్తిని విచారణాధికారిగా నియమించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
‘అందుకే చంద్రబాబు ఓటమి పాలయ్యాడు’
సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వంలోని దుర్గగుడి పాలకమండలి అవినీతి అక్రమాలతో భక్తులు విసుగెత్తిపోయారని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన సోమవారం దుర్గగుడి నూతన పాలకమండలి, చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రానికి హాజరయ్యారు. దుర్గగుడి ఈఓ సురేష్‌బాబు 16 మంది సభ్యుల చేత ప్రమాణం చేయించారు. దుర్గగుడి పాలక మండిలి చైర్మన్‌గా పైలా సోమినాయుడు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో ఉన్న పాలక మండలి అభివృద్ధిని వదిలేసిందన్నారు. అమ్మవారికి వచ్చే ఆదాయాన్ని సైతం కాజేశారని ఆయన మండిపడ్డారు. చివరికి అమ్మవారికి సమర్పించే చీరలను సైతం వదల్లేదన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు ఓటమిపాలయ్యాడని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. దేవస్థానం అభివృద్ధిలో సభ్యులు కీలక పాత్ర పోషించాలని వెల్లంపల్లి పాలక మండలికి సూచించారు. సభ్యులు చిత్తశుద్ధితో పనిచేసి మంచి పేరు తీసుకురావాలన్నారు. చీరలు దోచేసిన చరిత్ర గత పాలకమండలిదని.. అమ్మవారి ఆదాయాన్ని దోచుకోవడానికే గత ప్రభుత్వం, పాలకమండలి పాకులేడేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బీసీని పాలకమండలి చైర్మన్‌గా చేశారని వెల్లంపల్లి కొనియాడారు. జగన్ మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం పాలకమండలిలో సగం మంది మహిళలకు అవకాశం కల్పించారన తెలిపారు. నూతన కమిటీ భక్తుల మన్ననలు పొందే విధంగా దుర్గగుడిని అభివృద్ధి చేయాలన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు సజావుగా దర్శనం చేసుకునే విధంగా చొరవ చూసుకోవాలని మండలి సభ్యులకు వెల్లంపల్లి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గన్న ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. బలహీన వర్గానికి చెందిన సోమినాయుడుని దుర్గ గుడి చైర్మన్‌గా నియమించడం ఆనందించ దగ్గ విషయమన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ పాలకమండలి ఏర్పాటు అయ్యిందని ఆయన తెలిపారు. గత పాలకమండలి అక్రమాలు చేయటానికి మాత్రమే ఉండేదన్నారు. తమ పాలకమండలి సభ్యులు భక్తుల సౌకర్యాలుకి పెద్ద పీట వేస్తారని తెలిపారు. 50 శాతం మహిళలకు పాలకమండలి సభ్యులుగా సీఎం జగన్ అవకాశం కల్పించారని ఆయన తెలిపారు. -
దుర్గమ్మను దర్శించుకున్న వృద్ధులు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పండగ సందర్భంగా అనాథాశ్రమాల్లోని వృద్ధులు దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ ప్రేమ ఆశ్రమం, వృద్ధుల సంక్షేమాశ్రమం నుంచి సుమారు 150 మంది వృద్ధులు మంగళవారం అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి అమ్మవారి ప్రసాదాలతోపాటు దుర్గమ్మ చీరలను ఆలయ ఈవో ఎంవీ సురేష్‌బాబు దగ్గరుండి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండగ రోజు వృద్ధులకు అమ్మవారి అనుగ్రహం ఉండాలని సంకల్పించామన్నారు. అందులో భాగంగానే అనాధాశ్రమంలోని 150 మంది వృద్ధులకు అమ్మవారి దర్శనం కల్పించడంతోపాటు దుర్గమ్మ చీరలను ఇచ్చామని పేర్కొన్నారు. వారికి దుర్గమ్మ అండగా ఉంటుందన్న భరోసా కల్పించేందుకే అమ్మవారి దర్శనం చేయించామన్నారు. అనంతరం వృద్ధులు మాట్లాడుతూ ‘గతంలో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండగను ఎంతో వైభవంగా జరుపుకునేవాళ్లం. ప్రస్తుతం పిల్లలు, కుటుంబ సభ్యులతో కాకుండా వృద్ధాశ్రమంలోనే సంక్రాంతి జరుపుకోవడం బాధగా ఉన్నా తప్పదు. ఒంటరిగా పండగ జరుపుకున్నప్పటికీ మాకు దుర్గమ్మ అండగా ఉందన్న నమ్మకం కలిగింది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: జీన్స్ వేసుకుంటే అంతరాలయ దర్శనం కల్పించం -
ఆ రోజు విద్యార్థులకు అమ్మవారి ఉచిత దర్శనం
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఈ నెల 14 నుంచి 16 వరకు సంక్రాంతి సంబరాలు జరగనున్నాయని దుర్గగుడి ఈవో ఎంవి సురేష్‌బాబు తెలిపారు. వేడుకల సందర్భంగా ఆలయ సిబ్బంది దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక అలంకరణ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు అమ్మవారి దర్శనం చేయించి అనంతరం వారికి చీరలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. దుర్గమ్మ దర్శనార్థం వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని సూచించారు. ఇకపై జీన్స్ వేసుకున్నా, సంప్రదాయ దుస్తుల్లో రాకున్నా అంతరాలయ దర్శనం కల్పించబోమని స్పష్టం చేశారు. ఇక అమ్మవారిని అంతరాలయం నుంచి దర్శించుకోవాలనుకునే భక్తుల నుంచి రూ.300 చొప్పున టికెట్ వసూలు చేస్తుండగా దీన్ని ఆన్లైన్లో బుక్‌చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 30న శ్రీపంచమిని పురస్కరించుకుని అమ్మవారు సరస్వతి దేవీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆరోజు విద్యార్ధులకు అమ్మవారి ఉచిత దర్శనం కల్పిస్తున్నట్లు ఈవో సురేష్‌బాబు ప్రకటించారు. ఈ నెల 31న సీవీ రెడ్డి వర్ధంతి కావడంతో 100 మందికి స్కాలర్షిప్లు ఇస్తున్నామన్నారు. కొండపై అర్జునుడు ప్రతిష్టించిన ఆలయానికి భక్తులను అనుమతించే మార్గంపై ప్రతిపాదన సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. కేశఖండన శాల, ప్రసాదం పోటు శాశ్వత భవనాలకు త్వరలోనే శంకుస్థాప చేస్తామన్నారు. అమ్మవారి పులిహోర ప్రసాదాన్ని రూ.5 నుంచి రూ.10కి పెంచాలని భావిస్తున్నామని ఆయన వెల్లడించారు. చదవండి: ‘అన్ని దేవాలయాలకు ఒకటే వెబ్సైట్’ -
అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్
సాక్షి, విజయవాడ : టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు శనివారం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, సుబ్బారెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితులు దంపతులకు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మంచి జరగాలని ప్రార్థించానన్నారు. మూడు ప్రాంతాలలో రాజధాని రావడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. టీటీడీలో సామాన్య భక్తులకు దర్శన భాగ్యం అందేవిధంగా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఇప్పటివరకు ఉన్న పద్దతులను ప్రక్షాళన చేసి కొత్త పద్దతులను ప్రారంభిస్తామని తెలిపారు. -
కొండపైకి ప్లాస్టిక్ తీసుకురావద్దు: దుర్గాగుడి ఈవో
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్‌ను నిషేధించామని, భవానీలెవరూ కొండపైకి ప్లాస్టిక్ కవర్లను తీసుకురావద్దని దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్‌బాబు సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణ కార్యక్రమం ఈ నెల 18 నుంచి 22 వరకు జరగనుందని తెలిపారు. దీక్షా విరమణ రోజుల్లో తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కొనసాగుతుందని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనార్థం ఏడు లక్షల మంది భవానీలు వస్తారని అంచనా వేశారు. బుధవారం నాడు జరిగే కలశ జ్యోతి మహోత్సవానికి జ్యోతుల ఊరేగింపులో హాజరయ్యే భక్తులు ఘాట్ రోడ్డు మీదుగా కాకుండా కనకదుర్గా నగర్ మీదుగా రావాలని విజ్ఞప్తి చేశారు. భవానీల కోసం ఘాట్ రోడ్డు మీదుగా క్యూలైన్లతో పాటు గిరి ప్రదక్షిణ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో భవానీల కోసం మూడు హోమగుండాలను ఏర్పాటు చేశామన్నారు. -
ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్ధీ
-
కృష్ణానదిలో కన్నుల పండుగగా తెప్పోత్సవం
సాక్షి, విజయవాడ : విజయదశమి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. విద్యుత్ దీపాలతో అలంకరించిన హంస వాహనంలో ఆదిదంపతులు దుర్గామల్లేశ్వరస్వామివార్లు కృష్ణా నదిలో విహరించారు. ఈ వాహన సేవలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దంపతులు, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ దంపతులు, కలెక్టర్ మాధవి లత, దుర్గ గుడి ఈవో సురేశ్‌బాబు పాల్గొన్నారు. దాదాపు గంటన్నరపాటు తెప్పోత్సవం వైభవంగా సాగింది. ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రకాశం బ్యారేజ్, పున్నమి ఘాట్, భవాని ద్వీపం, పవిత్ర సంగమం వద్ద నుంచి భక్తులు తెప్పోత్సవాన్ని వీక్షించారు. అంతకుముందు దుర్గ గుడి అధికారులు.. స్వామివార్ల ఉత్సవ మూర్తులను ఇంద్రకీలాద్రి నుంచి మేళ తాళాలు, కోలాట ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా దుర్గా ఘాట్‌కు తీసుకువచ్చారు. ముగిసిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. మంగళవారం మధ్యాహ్నం అర్చకులు సంప్రదాయ బద్ధంగా పూర్ణహుతిని నిర్వహించి దసరా ఉత్సవాలను ముగించారు. పూర్ణాహుతిలో ఆలయ ఈవో సురేశ్‌బాబు, ప్రధాన అర్చకుడు శివప్రసాద్, ఇతర అర్చకులు పాల్గొన్నారు. -
తెప్పోత్సవానికి చకచకా ఏర్పాట్లు
సాక్షి, విజయవాడ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా చివరి రోజైనా మంగళవారం నిర్వహించనున్న తెప్పోత్సవానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. విద్యుత్ దీపాలంకరణ చేసిన హంస వాహనంపై ఆదిదంపతులైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వాముల వారు కృష్ణానదిలో విహరించనున్నారు. కృష్ణానదిలో వరద ప్రవాహం ఉండటంతో దుర్గ గుడి అధికారులు తెప్పోత్సవానికి నీటిపారుదల శాఖ అనుమతి తీసుకున్నారు. అనంతరం ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్లో డీసీపీ విజయరావు, దుర్గ గుడి ఈవో సురేశ్‌బాబు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ విజయ్‌రావు మాట్లాడుతూ.. కృష్ణానదిలో 40 నిమిషాల పాటు హంస వాహనం ట్రయల్ రన్ నిర్వహించినట్టు తెలిపారు. తెప్పోత్సవం సందర్భంగా 400 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. హంస వాహనంపై 32 మందికి మాత్రమే అనుమతి ఉందని చెప్పారు. -
భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి
-
మహిషాసురమర్దినిగా దుర్గమ్మ దర్శనం
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిన్న దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు...ఈ రోజు (సోమవారం) మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆ జగన్మాత దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. మహిషుడు అనే రాక్షసుడిని సంహరించింనందుకు జగన్మాతకు మహిషాసురమర్దని అనే పేరు వచ్చింది. తొమ్మిదిరోజులపాటు సాగిన రణంలో రోజుకో రూపంతో అమ్మవారు యుద్ధం చేశారు. సింహ వాహనాన్ని అధిరోహించి, చేతిలో త్రిశూలం ధరించి ఉగ్రరూపంతో తల్లి దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై మహిషాసురమర్దినిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో దుర్గగుడి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చి దుర్గామాత పటాన్ని బహుకరించారు. -
ఎంతైనా ఖర్చు పెట్టమని సీఎం చెప్పారు..
సాక్షి, విజయవాడ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఇబ్బండి కలుగకుండా ఎంత ఖర్చైనా పెట్టి సౌకర్యాలు కల్పించాలని సీఎం వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి ఆదేశించారని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అలాగే ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా చూడాలని కోరారన్నారు. శుక్రవారం ఆయన... దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి దుర్గగుడిలో ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. ఐదవ తారీఖు మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. పోలీస్, శానిటేషన్, గుడి సిబ్బంది, ఫైర్ సిబ్బందితో కలిసి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. 125 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మోడల్ గెస్ట్ హౌస్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ నిబంధనల అమలుతో పాటు వరదనీరు ఎక్కువగా ఉండడంతో ఘాట్లలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేసిన తర్వాతే భక్తులకు ఆహార పదార్ధాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. సామాన్య భక్తుల శీఘ్ర దర్శనం కోసం ఈసారి విఐపి పాసులను కుదించినట్టు కన్నబాబు తెలిపారు. మరోవైపు ఉత్సవాల నాటికి చేస్తున్న పనులన్నీ పూర్తవ్వాలని సోమా కంపెనీని ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ మున్సిపల్ కమీషనర్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దుర్గగుడి ఈవో పాల్గొన్నారు. -
దసరా సంబరానికి ఇంద్రకీలాద్రి ముస్తాబు
-
కొత్త గవర్నర్‌కు ఘన స్వాగతం
సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, అమరావతి/తిరుమల/గన్నవరం/భవానీపురంఔ(విజయవాడ పశ్చిమ): ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్‌కు మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంగళవారం మధ్యాహ్నం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన తన సతీమణి సుప్రభ హరిచందన్‌తో కలసి తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. రన్‌వే వద్ద హరిచందన్‌ను ముఖ్యమంత్రి జగన్ శాలువాతో సత్కరించి.. పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానం పలికారు. తదుపరి ఇంటర్నేషనల్ టెర్మినల్ ఆవరణలో నూతన గవర్నర్ ఏబంపీ పోలీస్ ప్రత్యేకదళం నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు తానేటి వనిత, కొడాలి వెంకటేశ్వరరావు, మోపిదేవి వెంకటరమణ, ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్‌ను, ఉన్నతాధికారులను కొత్త గవర్నర్‌కు సీఎం జగన్ ఈ సందర్భంగా పరిచయం చేశారు. స్వాగత కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, జీఎడీ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా, ఐఏఎస్ అధికారులు సతీష్‌చంద్ర, జేఎస్వీ ప్రసాద్, విజయవాడ సీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, ఇంకా పలువురు అధికారులు పాల్గొన్నారు. అనంతరం విమానాశ్రయం నుంచి విశ్వభూషణ్ దంపతులు విజయవాడ చేరుకుని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తదుపరి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. శ్రీవారి దర్శనం.. కొత్త గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం మధ్యాహ్నం సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హరిచందన్ దంపతులు వయోవృద్ధుల క్యూలో ఆలయంలోనికి ప్రవేశించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి వారిని సాదరంగా ఆహ్వానించి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించుకుని వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత రంగనాయకుల మండపంలో హరిచందన్ దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్, ఈవో, తిరుమల ప్రత్యేకాధికారి కలిసి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. అనంతరం ఆలయం వెలుపల హరిచందన్ మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం దివ్యానుభూతిని కలిగించిందన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ చాలా బాగుందని కితాబిచ్చారు. ముందుగా క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆయన వరాహస్వామివారిని దర్శించుకున్నారు. నేడు ప్రమాణ స్వీకారం.. రాష్ట్ర గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో ఆయనతో రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ పదవీ ప్రమాణం చేయిస్తారు. ఈ వేడుక కోసం రాజ్‌భవన్ ముస్తాబైంది. గవర్నర్ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రవ్యాప్తంగా 461 మంది ప్రముఖుల్ని ఆహ్వానించారు. వీరిలో హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారులు, సీఎంవో కార్యాలయ అధికారులు, గవర్నర్ కార్యాలయ అధికారులు ఉన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. వెయ్యిమంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉంటుందని నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లోకి కేవలం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి వాహనాల్నే అనుమతిస్తామని, ఇతర వీవీఐపీల వాహనాలు రాజ్‌భవన్ ముందే ఆపాలని, అక్కడినుంచి వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాటరీ కార్లలో లోపలికి తీసుకెళతామని తెలిపారు. ఆహ్వానితులందరూ 10.45 గంటల్లోగా ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, గవర్నర్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో విజయవాడలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రి పండుగ శోభను తరించుకుంది. జగతిని కాచే తల్లి మహోత్సవానికి వేళయింది. ఆదివారం నుంచి శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కావడంతో దుర్గగుడి కళకళలాడుతోంది. కూరగాయలు.. ఆకుకూరలు.. ఫలాలతో దుర్గమ్మ సర్వాంగసుందరంగా అలలారుతోంది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పవిత్ర సారెను సమర్పించేందుకు తెలంగాణతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు పోటెత్తారు. ప్రతి ఏడాదిలాగానే తెలంగాణ నుంచి అమ్మవారికి బంగారు బోనం సమర్పించేందుకు సుమారు 200మందితో వివిధ రకాల విన్యాసాలు చేస్తూ దుర్గమ్మకు బోనం సమర్పించేందుకు వచ్చినవారికి దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్ స్వాగతం పలికారు. అంతకు ముందు బ్రాహ్మణవీధిలోని జమ్మిచెట్టు నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమైంది. మేళతాళాలు, మంగలవాద్యాల నడుమ ఊరేగింపు అమ్మవారి ఆలయానికి చేరింది. మూడు రోజుల పాటు జరిగే శాకంబరి ఉత్సవాల్లో తొలిరోజు అమ్మవారి అలంకరణకు ఆకుకూరలు వినియోగించారు. రెండోరోజు పండ్లు, కాయలు, ఫలాలతో అలంకరిస్తారు. మూడోరోజు అయిన మంగళవారం బాదం. జీడిపప్పు, కిస్మిస్, లవంగాలు, యాలకులు, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌తో అలకరించనున్నారు. ఆదివారం ఉదయం ప్రారంభం అయిన ఈ ఉత్సవాలు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తాయి. కాగా మంగళవారం చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారి దర్శానాన్ని నిలిపివేస్తారు. కాయగూరలతో కదంబం ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇక మూడురోజులు కూడా భక్తులు అమ్మవారికి కొబ్బరికాయ, పూలకు బదులుగా కూరగాయలు, ఆకుకూరలను దండగలుగా కూర్చి అమ్మకు కానుకగా సమర్పిస్తారు. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
సీఎం జగన్ నివాసానికి కేసీఆర్
-
వైఎస్ జగన్‌ను కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన కేసీఆర్
-
సీఎం జగన్ నివాసానికి కేసీఆర్
-
సీఎం జగన్ నివాసానికి కేసీఆర్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్‌ను ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించి, దగ్గరుండి లోనికి తీసుకు వెళ్లారు. తాడేపల్లిలోని సీఎం అధికార నివాసానికి వచ్చిన కేసీఆర్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇద్దరు సీఎంలు కలిసి భోజనం చేశారు. కేసీఆర్ వెంట టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, టీఆర్ఎస్ నేత శేరి సుభాష్ రెడ్డి తదితరులు కూడా ఉన్నారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి కూడా భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలంటూ జగన్‌ను ఆహ్వానించారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి రావాలని కేసీఆర్ ఆహ్వాన పత్రిక అందచేశారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించినట్టు తెలుస్తోంది. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని అంశాలను పరిష్కరించేందుకు ఇద్దరు సీఎంలు చొరవ తీసుకుంటున్నారు. గతంలో రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందు సందర్భంగా కూడా హైదరాబాద్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులు విభజన అంశాలపై చర్చించారు. దుర్గమ్మకు కేసీఆర్ పూజలు అంతకు ముందు విజయవాడ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ఇంద్రకీలాద్రికి వచ్చిన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో ఏపీ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ - కేసీఆర్‌కు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్, ఆహ్వాన పత్రికను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకస్వాములు సీఎంకు ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేయగా, అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ అధికారులు బహుకరించారు. దాదాపు అరగంట పాటు కేసీఆర్ ఆలయంలో గడిపారు. -
దుర్గమ్మ కానుకల చోరీ కేసులో ట్విస్ట్
సాక్షి, విజయవాడ : దుర్గమ్మ కానుకల చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. మంగళవారం అమ్మవారి కానుకలు లెక్కించే సమయంలో కానుకలతో పాటు కొంత నగదు కూడా అపహరణకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆలయ ఉద్యోగి సింహాచలంతో పాటు అతడి భార్య దుర్గను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా హుండీలోని కానుకలతో పాటు, రూ. 10 వేల నగదును తీసుకున్న సింహాచలం వాటిని సంచిలో వేసుకున్నట్లు సీసీటీవీలో రికార్డయింది. అయితే ఈ కేసులో మరో ఇద్దరికి కూడా ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. చోరీ చేసిన అనంతరం కొండ దిగువకు వచ్చే క్రమంలో సింహాచలం.. దుర్గారావు వ్యక్తికి కొంత నగదు ఇవ్వడం, ఆ తర్వాత అతడు నేరుగా ప్రసాదం కౌంటర్ దగ్గరకు వెళ్లడం సీసీటీవీలో కనిపించింది. ఈ నేపథ్యంలో సింహాచలం రెండో భార్య రమణకు ఇచ్చేందుకే నగదు అపహరించినట్లుగా పోలీసులు భావించడంతో వారిద్దరిని కూడా అరెస్టు చేశారు. కాగా ఈ వ్యవహారంలో ఆలయ సిబ్బందితో పాటు సెక్యూరిటీ అధికారులపై కూడా ఆలయ ఈవో కోటేశ్వరమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో దుర్గగుడిలో నిఘాను మరింత పటిష్టం చేస్తామని కోటేశ్వరమ్మ తెలిపారు. హుండీల లెక్కింపు సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. రక్షణకు రూ.లక్షలలో వ్యయం.. అమ్మవారి ఆలయంలో భద్రతా విధులు నిర్వహించే సిబ్బంది వేతనాల కోసం దేవస్థానం ప్రతి నెలా రూ.లక్షలలో వెచ్చిస్తుంది. అయితే అమ్మవారి సొమ్మును కాపాడటంతో భద్రతా వ్యవస్థ పూర్తి వైఫల్యం చెందింది. కొద్ది రోజుల కిందట రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మవారి దర్శనానికి వచ్చిన సమయంలో మల్లికార్జునపేటకు చెందిన ఇద్దరు యువకులు కొండపై భాగానికి చేరుకోవడం ఆలయ భద్రత వ్యవస్థ పని తీరుకు అద్దం పడుతుంది. వారు పేకాట కోసమే కొండ ఎక్కారా లేక మరేదైనా అఘాయిత్యానికి పాల్పడేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారా అనేది తేలాల్సి ఉండగా, పోలీసులు ఆ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా మూసేశారు. చేతివాటాన్ని ప్రదర్శించిందిలా.. ఆలయ ప్రాంగణంలోని హుండీలలోని నగదు , బంగారాన్ని ప్లాస్టిక్ సంచులలోకి ఎత్తే క్రమంలో సింహచలం తన చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. హుండీలలో నగదును సంచులకు ఎత్తే క్రమం అంతా ఎస్ఫీఎఫ్ సిబ్బంది , హోంగార్డులు, ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణలో జరుగుతుంది. ఆ సమయంలో భక్తులను గానీ , మీడియా సిబ్బందిని గానీ హుండీల వద్దకు అనుమతించరు. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు, కానుకలు లెక్కించే మహా మండపం ఆరో అంతస్తు అంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది. చుట్టూ కెమెరాలు, ఆలయ అధికారులు, సిబ్బంది, పోలీసు, సెక్యూరిటీ బందోబస్తు ఉన్నా.. సింహచలం ఏ విధంగా బంగారాన్ని, నగదును దారి మళ్లిస్తున్నాడనే విషయం ఇప్పుడు అంతు పట్టడం లేదు. -
విజయవాడ చేరుకున్న వైఎస్ జగన్
-
దుర్గగుడి పాలకమండలి సభ్యుల రాజీనామా
ఇంద్రకీలాద్రి(విజయవాడ): దుర్గగుడి ట్రస్టు బోర్డు చైర్మన్, పాలకవర్గ సభ్యులు తమ పదవులకు శుక్రవారం రాజీనామాలు చేశారు. జూన్ నెలాఖరు వరకు ట్రస్టు బోర్డు పదవీ కాలం ఉన్నప్పటికీ, ఎన్నికలలో టీడీపీ ఘోర పరాభవాన్ని మూటకట్టుకోవడంతో ట్రస్టు బోర్డు సభ్యులు నెల రోజులు ముందుగానే రాజీనామాలు చేశారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలోని చైర్మన్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవం చెందడంతో ఇక పాలక మండలిలో కొనసాగలేమనే అభిప్రాయాన్ని సభ్యులు వ్యక్తం చేశారు. పదవీ కాలం కంటే ముందుగానే రాజీనామాలు చేస్తే కాస్త గౌరవంగా ఉంటుందని మెజారిటీ సభ్యులు చెప్పడంతో సభ్యులందరూ రాజీనామాలకు అంగీకరించారు. సభ్యులందరూ ఒకేసారి రాజీనామాలు చేసి చైర్మన్ గౌరంగబాబుకు అందచేశారు. చైర్మన్ తాను కూడా రాజీనామా చేసి సభ్యుల రాజీనామా పత్రాలతో కలిపి ప్రిన్సిపల్ సెక్రటరీకి సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ముందు మరో ఏడాది పొడిగింపునకు యత్నం... వాస్తవానికి ఎన్నికల ముందు ట్రస్టు బోర్డును మరో ఏడాది పాటు పొడిగించేలా తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. జిల్లా మంత్రితో పాటు ఎంపీల సహకారంతో పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించేలా పాలక మండలి సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించే క్రమంలోనే ఎన్నికల నోటిఫికేషన్ నగారా మోగింది. దీంతో ఆ ప్రయత్నాలకు గండి పడింది. తెలుగుదేశం ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని, తమ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించే అవకాశాలున్నాయని సభ్యులు బహిరంగం గానే ప్రకటించేవారు. అయితే తమ ఊహలకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు రావడం, వైఎస్సార్ సీపీ తిరుగులేని మెజారిటీ సాధించడంతో పాలక మండలి సభ్యుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. చివరకు నెల రోజులు ముందుగానే పాలక మండలి సభ్యులు, చైర్మన్ తమ పదవులకు రాజీనామాలు చేసే పరిస్థితి ఏర్పడింది. తొలి నుంచి వివాదాలే... దుర్గగుడి ట్రస్టు బోర్డు సభ్యుల తీరు తొలి నుంచి వివాదాలే... కేశ ఖండన శాలలో క్షురకులతో వివాదం, అమ్మవారి చీర మాయం, ఆలయ అభివృద్ధి విషయంలో కాకుండా ఆలయ వ్యవహారాలు, పరిపాలనలో జోక్యం, దసరా ఉత్సవాలలో హడావుడి, ఎన్‌ఎంఆర్‌లకు హెచ్‌ఆర్‌ఏడీఏ అమలు చేసేశామని ముందే ప్రచారం చేసుకోవడం వంటి అంశాలతో పాటు ట్రస్టు బోర్డు సమావేశ విషయాలను ఆలయ ఈవోలకు చేరవేయడంతో ట్రస్టు బోర్డు తరుచూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. వాస్తవానికి ట్రస్టు బోర్డు సభ్యులు భక్తులకు ఎటువంటి సదుపాయాలు కల్పించాలనే విషయాలపై దృష్టి పెట్టింది లేదు. -
వైఎస్ జగన్ సీఎం కావాలని..
సాక్షి, నల్గొండ : వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని సతీష్ అనే యువకుడు హైదరాబాద్ నుంచి విజయవాడ కనక దుర్గమ్మ గుడికి పాదయాత్రగా బయలుదేరారు. వైఎస్ జగన్ నివాసమైన లోటస్‌పాండ్ నుంచి మంగళవారం పాదయాత్రగా బయలుదేరి నార్కెట్ పల్లికి చేరుకున్నారు. ప్రస్తుతం కుత్బుల్లాపూర్‌లో నివాసముంటున్న సతీష్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సమయంలో ప్రవేశపెట్టిన పథకాలు పేదలకు ఉపయోగపడుతున్నాయని సతీష్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేయడం లేదని, ఎక్కడ చూసినా అవినీతి ఎక్కువైపోయిందని మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని, పేదలకు పెన్షన్లు, ఇళ్లు వస్తాయని, అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు. -
దుర్గగుడిలో ‘అధికార’ ప్రచారం
సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో ప్రచారానికి అధికార పార్టీ నేతలు తహతహలాడుతున్నారు. దుర్గమ్మ సన్నిధిలోనూ, దుర్గగుడి ఆస్తులపైన అమ్మవారి ప్రచారం తప్ప మరొకటి ఉండకూడదనే నిబంధన ఉంది. అయితే అధికారపార్టీ నేతలు దీన్ని పట్టించుకోవడం లేదు. తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరిగి అధికారంలోకి రావాలంటూ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనందసూర్య ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈ నెల 9వ తేదీన ఆదివారం చేయనున్నారు. దీనికి సంబంధించిన బ్యానర్లు అర్జున వీధిలో వెలిశాయి. వాస్తవంగా గతంలో ఉన్న అర్జున వీధిని విస్తరించినప్పుడు దుర్గగుడికి ప్రత్యేకంగా ఒక రోడ్డు వేసుకున్నారు. అక్కడ పర్గోలా కట్టారు. అలాగే పాత అర్జున వీధిలో అన్నదానం భవనం దుర్గగుడికి చెందింది. ఇంద్రకీలాద్రి కింద దుర్గాఘాట్ ఉన్న ప్రాంతం దుర్గగుడి పరిధిలోకే వస్తుంది. అయితే అక్కడ ఆనందసూర్య అనుచరులు ఆయన గిరి ప్రదక్షణ విజయవంతం కావాలంటూ బ్యానర్లు కట్టారు. నూతనంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌పై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అనుచరులు బ్యానర్లతో నింపేశారు. అధికారులు వారిస్తున్నా.. దుర్గగుడికి చెందిన ఆస్తులపై బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బ్యానర్లు కట్టవద్దంటూ దేవస్థానం ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది వారించారు. పర్గోలాకు కట్టిన బ్యానర్లు తీయించారు. ఆ నేపథ్యంలో వారి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా దుర్గాఘాట్, ఎదురుగానూ, అన్నదాన భవనం గేట్లకు ఉన్న బ్యానర్లు మాత్రం తొలగించలేదు. వాటిని అలాగే ఉంచడం వెనుకు ఎమ్మెల్సీ వత్తిడి ఉందని ప్రచారం జరుగుతోంది. కోటి దీపోత్సవంలోనూ.. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం కోటి దీపోత్సవం జరిగింది. అక్కడ కూడా ఆనందసూర్య అనుచరులు ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణకు చెందిన కరపత్రాలు పంచడంపై మహిళలు చికాకు పడ్డారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయినంత మాత్రాన కోటి దీపోత్సవంలోనూ, దుర్గగుడిపైనా ఆయన పెత్తనం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. నాలుగున్నర ఏళ్లలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు దేవస్థానానికి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాబట్టలేకపోయారు. అయితే ఇక్కడ పెత్తనం మాత్రం జోరుగా చేస్తున్నారు. దేవస్థానంలో ఏ చిన్న వివాదం జరిగినా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తలదూర్చుతారు. ఇక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రతినిధులు కూడా దుర్గగుడిలో హవా నడిపేందుకు తహతహలాడుతూ ఉంటారు. ఇప్పుడు ఏకంగా దేవస్థానం ఆస్తులపై బ్యానర్లు వెలవడం పై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. -
దుర్గఅమ్మను దర్శించుకున్న‘హలో గురు ప్రేమ కోసమే’ యూనిట్
-
దుర్గాఘాట్‌లో ప్రైవేటు దర్జా
సాక్షి, విజయవాడ: పవిత్ర కృష్ణానదీ తీరంలోని ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న దుర్గాఘాట్‌లో ప్రైవేటు వ్యక్తులకు ఆదాయ వనరుగా మారింది. నిర్వహణ వ్యయం దుర్గగుడి భరిస్తుండగా గత కొన్నేళ్లుగా జలవనరుల శాఖ ముసుగులో ప్రైవేటు వ్యక్తులు బోటింగ్ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అన్నీ తెలిసినా ప్రభుత్వ పెద్దలు మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు. వందల ఏళ్లుగా దుర్గగుడి అధీనంలో ఉన్న దుర్గాఘాట్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాల పట్ల భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2015లో ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించే సమయంలో ఈ ఘాట్‌ను జలవనరులశాఖ స్వాధీనం చేసుకుంది. పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు దుర్గాఘాట్‌ను రివర్ ఫ్రంట్‌గా మార్చేసింది. ప్రస్తుతం ఈ ఘాట్ నిర్వహణకు అయ్యే వ్యయాన్ని దుర్గగుడి భరిస్తుండగా.. ఘాట్‌పై ఇరిగేషన్ శాఖ ముసుగులో ప్రైవేటు బోటింగ్ ఆపరేటర్లు పెత్తనం సాగిస్తున్నారు. దుర్గాఘాట్‌లో దేవస్థానానికి చెందిన కేశఖండనశాల ఉండేది. దీన్ని 25ఏళ్ల కిందట సుమారు రూ.కోటి వ్యయంతో నిర్మించారు. భక్తులు ఇక్కడ తలనీలాల మొక్కు చెల్లించి కృష్ణానదిలో పవిత్రస్నానం చేసిన తరువాత అమ్మవార్ని దర్శనం చేసుకునేవారు. ప్రభుత్వం కృష్ణానదీ తీరంలో 40 దేవాలయాలను కూల్చివేసినప్పుడే దీన్నీ కూల్చివేసింది. ఘాట్‌లోని మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు, రూమ్‌ను, పిండప్రదానాల షెడ్లనూ తొలగించింది. దీంతో భక్తులకు కనీస సౌకర్యాలు లేక అగచాట్లు పడుతున్నారు. కనీసం షెల్టర్స్ లేకపోవడంతో ఘాట్‌లోనే మహిళలు కళ్లు తిరిగిపడిపోతున్నారు. నదిలో స్నానం చేసిన తరువాత దుస్తులు మార్చుకునేందుకు సౌకర్యాలు లేకపోయినా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ప్రైవేటు బోటింగ్ ఆపరేటర్లు ఆక్రమించుకుని యథేచ్ఛగా తమ బోటింగ్ పార్కింగ్‌లను ఏర్పాటు చేసుకుని భక్తుల్ని అడ్డంగా దోచుకుంటున్నారు. ఖర్చులు మాత్రం దుర్గగుడి ఖాతాలోనే... దుర్గాఘాట్‌లో మూడు షిప్టులలో క్లీనింగ్ చేయిస్తున్నారు. ఘాట్‌లో అత్యంత ఖరీదైన సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. వీటి అంతటికి ఏడాదికి రూ.15లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చంతా దుర్గగుడి ఖాతా నుంచే చెల్లించమని ప్రభుత్వం ఆదేశించింది. దుర్గా ఘాట్‌ను తమకు అప్పగిస్తే భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. దుర్గగుడికి కోనేరు లేనందున దుర్గాఘాట్నే కోనేరుగా అభివృద్ధి చేస్తే కోనేరు లోటు తీరుతుందని అంటున్నారు. మంత్రి ఉమాకి అంతా ఎరుకే.... దుర్గగుడిలో జరిగే ప్రతి విషయం జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టికి వెళుతుంది. ఆయన కనుసన్నల్లోనే దుర్గాఘాట్‌ను జలవనరులశాఖ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం కృష్ణానదిలో స్నానాలు చేసే భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయనకు తెలుసు. ఆయనతోపాటు స్థానికంగా ఉన్న కొంతమంది తెలుగుదేశం నాయకులు ఘాట్‌ను దుర్గగుడికి అప్పగించేందుకు ఆసక్తి చూపడం లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇక్కడ ప్రైవేటు బోటింగ్ ఆపరేటర్లతోపాటు వ్యాపారస్తుల నుంచి ప్రతినెలా వచ్చే వాటాలు కోల్పోవాల్సి వస్తుందనే ఘాట్‌ను జలవనరులశాఖ ఆధీనంలో ఉంచుకున్నారని పేర్కొంటున్నారు. -
భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
-
కిటకిటలాడుతున్న దేవాలయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల్లో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఆఖరి రోజుకు చేరాయి. మహర్నవమి, విజయదశమి ఒకే రోజు రావడంతో అమ్మవారు రెండు అవతారాలలో దర్శనమివ్వనున్నారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మహిషాసురమర్ధని అవతారంలో, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ రాజరాజేశ్వరీ దేవీ అవతారంలో కనిపించనున్నారు. వినాయక ఆలయం నుంచి క్యూలైన్లు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అంతరాలయ దర్శనం నిలిపివేశారు. అలాగే 100, 300 రూపాయల టికెట్ల విక్రయం రద్దు చేశారు. భక్తులను సాధారణ క్యూలైన్లతో పాటు ముఖ మండప దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఇంద్రకీలాద్రి పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దసరా సందర్భంగా కొండగట్టుపై భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులకు అంజన్న దర్శనమిచ్చారు. దసరా సందర్భంగా తమ వాహనాలకు పూజలు చేయించడానకి వాహనదారులంతా కొండగట్టుకు క్యూ కట్టారు. పోలీసులు ట్రాఫిక్ అంక్షలు విధించారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అదేవిధంగా నిజరూప అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి దర్శనానికి ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. భక్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే పోలీసుల ట్రాఫిక్ అంక్షలు విధించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహా శతచండీయాగం జరిగింది. సిద్దిరాత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. బలిహరణ, పూర్ణాహుతి కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. దసర సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సాయంత్రం శమీపూజకు యోగా, ఉగ్ర వెంకటేశ్వర స్వామి రానున్నారు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన జోగులాంబ అమ్మవారి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం వెంకటేశ్వరస్వామి శేషవాహనసేవను నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు శమీపూజ, 6.30కు తుంగభద్ర నదీ హారతి ఉండనుంది. రాత్రి 7 గంటలకు జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి వాళ్లకు తెప్పోత్సవం జరగనుంది. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సిద్దిదా(మహాలక్ష్మీ) అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సాయంత్రం పూర్ణాహుతితో నవరాత్రి వేడుకలు ముగియనున్నాయి. బాసరలో మహర్నవమి సందర్భంగా సరస్వతీ యాగం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి మహాభిషేకం, అలంకరణ చేశారు. దసర సందర్భంగా అమ్మవారి దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మహా మంగళ హారతి నివేదన ఉండనుంది. సాయంత్రం 4 గంటల నుంచి పురవీధుల్లో అమ్మవారి రథోత్సవం, సాయంత్రం 6.30 కు ఆలయం ముందు శమీ పూజ ఉండనుంది. -
రెండు అవతారాల్లో దర్శనమివ్వనున్న దుర్గమ్మ
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఆఖరి రోజుకు చేరాయి. మహర్నవమి, విజయదశమి ఒకే రోజు రావడంతో అమ్మవారు రెండు అవతారాలలో దర్శనమివ్వనున్నారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మహిషాసురమర్ధని అవతారంలో, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ రాజరాజేశ్వరీ దేవీ అవతారంలో కనిపించనున్నారు. మధ్యాహ్నాం 1.30 గంటలకు యాగశాలలో పూర్ణాహుతితో దసరా ఉత్సవాల ముగింపు ఉంటుంది. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ దృష్ట్యా అమ్మవారి అంతరాలయ దర్శనం, ఆశీర్వచనాలు నిలిపేశారు. ఆలయంలో భక్తులకు లఘు దర్శనానికి మాత్రం అనుమతి ఇచ్చారు. గురువారం సాయంత్రం గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామివార్లకు హంస వాహనంపై ఊరేగించనున్నారు. విజయదశమి సందర్భంగా ఇంద్రకీలాద్రిని భారీ సంఖ్యలో భవానీ దీక్ష చేసే వారు దర్శించుకుంటున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం కొండ కింద దీక్షలు విరమిస్తున్నారు. భవానీల కోసం ప్రత్యేకంగా హోమ గుండాలు ఏర్పాటు చేశారు. ఐదు రాష్ట్రాల నుంచి భవానీలు వస్తున్నట్లు సమాచారం. -
గుణం ఆయుధం
ఆయుధ పూజనాడు అందరూ ఆయుధాలకు పూజలు చేస్తారు.అమ్మవారి చేతిలో ఉండే ఆయుధాలు ఏ గుణాలకు సంకేతమో తెలుసా? వాటిని పూజించడం వల్ల ఏ దుర్గుణాలను రూపుమాపుకోవచ్చో తెలుసా? మనలోని సద్గుణమే ఆయుధం. ఆ సద్గుణానికి పదును పెట్టుకోవలసిన తరుణమే దసరా.అమ్మవారికి చేసే పూజల్లో ఆయుధపూజని కూడా చేయడం సంప్రదాయం. ఆయుధమనగానే ఎవరినో వధించడానికో లేక మనని రక్షించుకోవడానికో సిద్ధంగా ఉంచుకున్న ఓ పరికరం అని మనసులో ఆలోచన వస్తుంది. కాని అమ్మ ధరించిన ఆయుధాల ఉద్దేశ్యం వేరు. వారి అంతరార్థం వేరు. అమ్మవారి చేతిలో కనిపించే ప్రతి ఆయుధానికీ మనం చేయాల్సిన పూజే ఆయుధపూజ. క్రమంగా చూద్దాం. పాశ పూజ ‘ధృతపాశాంకుశ పుష్ప బాణ చాపామ్’ అని కనిపిస్తుంది అమ్మవారి స్తోత్రంలో. ఓ చేతిలో పాశాన్ని, మరో చేతిలో అంకుశాన్ని, ఇంకొక చేతిలో పుష్పాలు ఐదింటినీ కలిపి బాణంగా చేసుకుని, మరో చేతిలో వింటిని ధరించి ఉంటుందని దీని భావం. ముందుగా పాశానికి అర్థాన్ని చెప్పుకుందాం. పాశం అంటే తాడు అని అర్థం. తాడుతో కట్టబడేది పశువు. నాలోని పశుత్వాన్ని తొలగించు లేదా నాలో పశుత్వం అసలు ప్రవేశించకుండా రక్షిస్తూ ఉండు అని ప్రార్థించడమే పాశానికి పూజ చేయడంలోని అంతరార్థం.ఉదాహరణకి ఓ అరటిగెల ఎక్కడైనా బాగా కనిపిస్తూంటే మనమైతే ఆ అంగడికి వెళ్తాం. కొంటాం. అదే మరి పశువైతే వెళ్తూనే నోటితో ఆ గెలని పట్టుకుంటుంది. ఆ యజమాని కర్రదెబ్బల్ని తిని వెనక్కి వెళ్లిపోతుంది. అభిమానం లేకుండా ప్రవర్తించడమే పశుత్వం. జరిగిన అవమానాన్ని మళ్లీ జరిగేలా బుద్ధిహీనతతో చేసుకోవడమే పశుత్వం. ఒక్క తప్పుని చేసి అవమానాన్ని పొంది, మళ్లీ అదే తప్పుని చేసి మరో అవమానానికి సిద్ధపడే ఎందరినో చూస్తుంటాం. అదే పశుత్వం. కొన్ని తెలిసిన పశుత్వాలూ, కొన్ని మనకి తెలియకుండా చేసే పశుత్వాలూ మనలో దాగుంటాయి. అందుకని ఆ పశుత్వాన్ని నా నుండి తొలగించవలసిందని ప్రార్థిస్తూ చేసే పాశానికి సంబంధించిన పూజ పాశ ఆయుధపూజ. అమ్మ పాశంతో మనని కట్టేసి తన వాళ్లలో ఒకరినిగా మనని చేసుకుంటుంది కాబట్టి పాశమనేది మన రక్షణకి ఉపయోగించే రక్షక వస్తువే. శ్రీకృష్ణుణ్ణి యశోద రోటికి కట్టేస్తే, ఆ రోటిని రెండు చెట్ల మధ్యగా ఈడ్చుకు వెళ్లిన బాలకృష్ణుడు ఇద్దరు రాక్షసులకి రాక్షసత్వం నుండి విముక్తి కలిగించాడు కదా! ఆ పాశం ఈ ఇద్దరి రక్షక వస్తువు కాలేదూ! అదే మరి దుర్యోధనుడేం చేశాడు? తమ దగ్గరికి కృష్ణుడు రాయబారిగా వచ్చి విశ్వరూపాన్ని చూపిస్తే, ఆ రూపం ఎంత ఎత్తుందో అంత తాటితో అతణ్ణి కట్టేద్దామని భావించి తాళ్లని తెప్పించాడు కదా! ఎంతటి పశుత్వం దుర్యోధనునిది! అన్ని తాళ్ల సమూహాన్ని తెచ్చినా కట్టుబడని శ్రీకృష్ణుడు యశోదమ్మ మూరెడు తాటికి బంధిపబడ్డాడా? లేదా? కాబట్టి ‘అమ్మా! నీ అనురాగ పాశంతో నన్ను కట్టేసి నీ ఆయుధాన్ని నా రక్షణకి ఉపయోగించవలసింద’ని ప్రార్థిస్తూ పాశానికి చేసే పూజ పాశ ఆయుధపూజ. అంకుశ పూజ అంకుశమంటే చివర కూసుగా వంకీ తిరగబడి ఉండే ఒక పరికరం. ఆ అంకుశం ఎప్పుడూ ఏ మృగాన్ని, జంతువుని చంపదు – చంపలేదు. అయితే బాగా మందమైన చర్మం కలదీ, మరింత గట్టిగా ఉండేదీ అయిన ఏనుగు కుంభస్థలం మీద గుచ్చి, దాన్ని అదుపు చేసేందుకు వాడబడే వస్తువు ఇది. లౌకికంగా ఇది దీనర్థం. అంతరార్థం అది కాదు. ఏనుగు నల్లగా ఉంటుంది. అది తమోగుణానికి (గర్వం, దర్పం, అహంకారం, మదం... అన్నీ కలిపిన గుణం) సంకేతం. వ్యక్తుల్లో అలాంటి లక్షణాలున్న ఎవరైనా ఏనుగుతో సమానం. ‘అమ్మా! నాలో ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే నా ఏనుగుని (నా లోపలి తమోగుణాన్ని) నీ చేతితో అంకుశంతో ఒక్కసారి గట్టిగా పొడిచి నన్ను సరైన తోవలో, సరైన బుద్ధితో నడిచేలా రక్షించవలసిందని ఆ అంకుశానికి చేయాల్సిన పూజ అంకుశ పూజ. రావణుడు తమోగుణానికి ప్రతీక. సీతమ్మ ఎదురుగా నిలబడి ‘మమ శయాన మారోహా’ (నా పక్కమీదికి రా) అని అన్నంతటి అహంకార స్థితి నిండిన శరీరం రావణుడిది. అమ్మ అంది– నీకు బుద్ధి లేదా? లేక నీకు మంచిచెడుల తేడాని చెప్పేవారూ చెప్పగలవారూ లంకలో లేరా? – అని. అదిగో అవే మాటల్ని మనమూ మననం చేసుకుంటూ – అమ్మా! నాలో ఏదైనా వినని లక్షణముంటే వినిపించుకునేతనాన్ని కలిగించవలసిందని పూజ చేయడమే అంకుశపూజలోని పరమార్థం. అలా చేస్తే ఆ అంకుశమే మనకి రక్షక వస్తువుగా మన పాలిట నిలిచి ఉంటుంది ఎప్పటికీ. పుష్పబాణాలు అమ్మ చేతిలో ఉండే 5 బాణాలూ ‘పృథివి అప్ తేజస్ వాయు ఆకాశాల’కి సంకేతం. ‘అమ్మా! పృథివి ద్వారా వచ్చే భూకంపానికి నేనూ నా కుటుంబం లోను కాకుండా, అప్ (నీరు) ద్వారా వచ్చే వరదలూ తద్వారా కలిగే నిరాశ్రయ విధానానికి నేనూ నా కుటుంబమూ గురికాకుండా ఉండేలా, ఉష్ణ రోగాలు రాకుండా తేజస్సు ద్వారా, వాతరోగాలు తాకకుండా ఉండేలా వాయువు ద్వారా, ఏ పిడుగులూ రాహు కేతు గ్రహాల అననుకూల పరివర్తనల ద్వారా కష్టం కలగకుండా ఆకాశం ద్వారా మమ్మల్ని రక్షిస్తూనే ఉండవలసిందని ప్రార్థించడం పంచ పుష్పబాణ పూజలోని అంతరార్థం. ఈ పుష్పబాణ పూజ మరోవిధంగా మన శరీరంలో ఉండే ఆరు దుర్గుణాలూ అయిన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని తొలగించవలసిందని కూడా ప్రార్థించడానికి సరిపోతుంది. చాపం చాపమంటే విల్లు. అమ్మ చేతిలోని వింటికి పూజ చేయడం మరింత గొప్ప ఆయుధపూజ. నమక మంత్రంలోని మొదటి మంత్రం శంకరుణ్ని స్తుతిస్తూ – ‘శంకరా! నీ కోపానికి నమస్కారం (రుద్ర మన్యవే) – ఆ కోపంతో అమ్ములపొదిలో నుండి తీసిన బాణానికి నమస్కారం (ఉతోత ఇషవే నమః) – ఆ బాణాన్ని వింటిలో పెట్టి బాణాన్ని విడవడానికి సిద్ధంగా ఉన్నావే! ఆ వింటికి నమస్కారం (నమస్తే అస్తు ధన్వనే) – ఆ వింటినీ దానిలో ఎక్కుపెట్టిన నారినీ ఆ వింటినారిలో బిగించేలా చేసిన నీ రెండు బాహువులనీ ప్రార్థిస్తూ నాకు ఏ తీరు అపకారాన్ని సకుటుంబంగా కలిగించకుండా ఉండవలసింది (బాహుభ్యాముత తే నమః)’ – అంటూ చేసే ఈ నమస్కారాలన్నీ ఆయుధ పూజే. అలా అమ్మని ప్రార్థిస్తే అమ్మ తన చేతిలోని వింటితో మన శత్రువులని భయపెడుతూ తప్పక రక్షనిస్తుంది. చక్రం శ్రీమహావిష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రాన్ని అమ్మ తన దుర్గారూపంలో ధరిస్తుంది. చక్రమనగానే అందరి తలలనీ నరికేసేదే అని మన అభిప్రాయం. ఏ శిశుపాలుడు వంటివాళ్లని సంహరించవలసి వచ్చినా ముందుగా హెచ్చరించి మాత్రమే చంపాడు శ్రీహరి. చక్రం అకస్మాత్తుగా వధించలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. శ్రీహరి తన చేతి చక్రాన్ని – నిత్య భక్తుడైన అంబరీషునికి ఇస్తూ ఏ కష్టం వచ్చినా ఇది నీకు రక్షక చక్రంగా ఉపయోగపడుతుందని ఇచ్చాడు. (ప్రదత్తో నిత్య రక్షయామ్). అదుగో ఆ చక్రాన్ని గనుక మనం పూజిస్తే అది మనని వధించదు సరికదా మన మనసుకి గాయం చేయబోయేవారిని తన అంచుల కాంతులతో హెచ్చరిస్తుంది – జాగ్రత్త అని. ఇదే తీరుగా అమ్మ రాక్షస వధ చేయడానికి విఘ్నేశ్వరుని నుండి అంకుశాన్నీ, కుమారస్వామి నుండి భల్లాన్నీ (బల్లెం), శంకరుని నుండి త్రిశూలాన్నీ, శ్రీహరి నుండి చక్రాన్నీ... ఇలా ఎవరెవరు తమ తపశ్శక్తిని ఏయే ఆయుధాల్లో దాచి ఉంచారో ఆయా తపశ్శక్తి దాగిన ఆయుధాలన్నింటినీ తన చేతుల్లో ఉంచుకుని మరీ – సిద్ధపడింది తప్ప, తనకున్న ఆయుధాలు సరిపోతాయని భావించనే లేదు. అలా తీసుకోవడం ఆమె అసమర్థతకి నిదర్శనం కాదు.శత్రువనేవాడు లేకుండా ప్రవర్తించడం – తన ప్రవర్తనని సరిదిద్దుకోవడం ఉత్తమం. మనం అలా ప్రవర్తించినా, నిష్కారణంగా వశిష్ఠుని మీదికి దండెత్తిన విశ్వామిత్రునిలా కొందరు మన మీద శత్రుత్వంలో ఉండి తీరుతారు కాబట్టి వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండడం అత్యవసరం. అందుకని అమ్మ అంటుంది గదా – శత్రుత్వంరాకుండా చూసుకో! ఒకవేళ శత్రువు మనతో పోరాడేంత స్థాయిలో గనుక వస్తే – తగిన జవాబు చెప్పడానికి ఇందరి సహకారంతో పోరాడి గెలుపొందడం అత్యుత్తమం అని. అందుకని ఇన్ని ఆయుధాలకీ రక్షణని కోరుతూ ప్రార్థించడమే ఆయుధపూజలోని అంతరార్థం. తన్నోదేవీ ప్రచోదయాత్. శత్రువనేవాడు లేకుండా ప్రవర్తించడం – తన ప్రవర్తనని సరిదిద్దుకోవడం ఉత్తమం. మనం అలా ప్రవర్తించినా, నిష్కారణంగా వశిష్ఠుని మీదికి దండెత్తిన విశ్వామిత్రునిలా కొందరు మన మీద శత్రుత్వంలో ఉండి తీరతారు కాబట్టి వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండడం అత్యవసరం. అందుకని అమ్మ అంటుంది గదా – శత్రుత్వం రాకుండా చూసుకో! ఒకవేళ శత్రువు మనతో పోరాడేంత స్థాయిలో వస్తే – తగిన జవాబు చెప్పడానికి ఇందరి సహకారంతో పోరాడి గెలుపొందడం అత్యుత్తమం అని. ∙ డా. మైలవరపు శ్రీనివాసరావు -
శ్రీ మహాలక్ష్మిదేవిగా విజయవాడ కనకదుర్గ
-
ఇంద్రకీలాద్రిపై ఎమ్మెల్యే బోండాగిరి
-
ఇంద్రకీలాద్రిపై ‘బొండా’ హల్చల్
సాక్షి, అమరావతి బ్యూరో: టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఆయన అనుచరులు బెజవాడ ఇంద్రకీలాద్రిపై రెచ్చిపోయారు. అధికారులపై ఆగ్రహావేశాలు ప్రదర్శించి.. వీరంగం వేశారు. బొండా అనుచరులు ఒకానొక దశలో దుర్గగుడి సూపరింటెండెంట్ చొక్కా పట్టుకొని ‘బయటకు రా.. నీ అంతుచూస్తాం’ అంటూ బెదిరించారు. వివరాలు.. మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరఫున కనదుర్గమ్మకు టీటీడీ ఏఈవో సాయిలు పట్టువస్త్రాలు సమర్పించారు. దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ ఆయనకు ఆలయమర్యాదలతో స్వాగతం పలికి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయితే టీటీడీ బోర్డు సభ్యుడినైన తనతో కాకుండా ఏఈవోతో అమ్మవారికి పట్టువస్త్రాలు ఎలా సమర్పింపజేస్తారంటూ దుర్గ గుడి ఈవోపై బొండా ఉమా ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ఉండగా అధికారులకు ఎలా ప్రాధాన్యమిస్తారని ఆమెపై చిందులు తొక్కారు. సంగతి చూస్తానని హెచ్చరించారు. టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకున్నామని చెప్పినా వినకుండా.. రుసరుసలాడుతూ బొండా వెళ్లిపోయారు. నీ అంతు చూస్తాం.. ఇదేసమయంలో బొండా ఉమా అనుచరులు సైతం అధికారులపై విరుచుకుపడ్డారు. పట్టువస్త్రాలు సమర్పించేందుకు నిబంధనల ప్రకారం టీటీడీ ఏఈవో, బొండా ఉమా కుటుంబసభ్యులనే అనుమతిస్తామని.. అనుచరులు క్యూ లైన్లలో రావాలంటూ ఆలయ సూపరింటెండెంట్ చందూ శ్రీనివాస్ వారిని అడ్డుకున్నారు. దీంతో బొండా అనుచరులు ఆవేశంతో ఊగిపోయారు. సూపరింటెండెంట్ చొక్కా పట్టుకుని ‘బయటకు రా.. నీ అంతూ చూస్తాం’ అంటూ బెదిరింపులకు దిగారు. మా ప్రతాపం చూపిస్తామంటూ రెచ్చిపోయారు. దీంతో వారి తీరు చూసి భక్తులు నోరెళ్లబెట్టారు. ఆలయాల్లో కూడా రౌడీయిజం చేస్తారా అంటూ విస్మయం వ్యక్తం చేశారు. దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ మీడియాతో మాట్లాడుతూ.. ఏఈవో సాయిలు పట్టువస్త్రాలు సమర్పిస్తారని మాత్రమే తమకు టీటీడీ ఈవో నుంచి సమాచారం వచ్చిందని చెప్పారు. టీటీడీ ఏఈవో సాయిలు మాట్లాడుతూ.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించాలని ఉన్నతాధికారులే తనకు ఆదేశాలిచ్చారని తెలిపారు. చైర్మన్‌ను అడ్డుకున్న దుర్గగుడి ఈవో.. అమ్మవారిని దర్శించుకునేందుకు కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన దుర్గగుడి చైర్మన్ గౌరంగబాబును ఈవో కోటేశ్వరమ్మ అడ్డుకుని.. క్యూలైన్లలో రావాలని సూచించారు. దీంతో ఆగ్రహించిన చైర్మన్ గుడిలోనే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఈవో కలుగజేసుకుని నేరుగా ఆలయంలోకి అనుమతిస్తామని చెప్పడంతో నిరసన విరమించారు. మహాలక్ష్మీ నమోస్తుతే! మంగళవారం బెజవాడ కనకదుర్గమ్మ శ్రీ మహాలక్షీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మిలుగా వరాలు ప్రసాదించే అష్టలకు‡్ష్మల సమష్టి రూపమైన మహాలక్ష్మీదేవిగా కనకదుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారని విశ్వాసం. లక్ష్మీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. సాయంత్రం ఏడు వరకు 90 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. ఉన్నతాధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, కె.సంధ్యారాణి, బిగ్‌బాస్ విజేత కౌశల్, వైఎస్సార్సీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ తదితరులు అమ్మవారి సేవలో పాల్గొన్నారు. -
దుర్గగుడిలో పోలీసుల అత్యుత్సాహం
విజయవాడ: దుర్గగుడిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇంద్రకీలాద్రిపై ధర్మకర్తల మండలి చైర్మన్ గౌరంగబాబుకు అవమానం జరిగింది. కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వచ్చిన గౌరంబాబును పోలీసులు అడ్డుకున్నారు. ;పోలీసుల చర్య వల్ల ఆయన కుటుంబంతో సహా అరగంటపాటు గేటు ముందు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆలయ అధికారుల జోక్యంతో పోలీసులు లోనికి అనుమతించారు. కొండపైన ఉన్న తన కార్యాలయానికి వెళ్తుండగా మరోసారి పోలీసులు చైర్మన్‌ను అడ్డుకున్నారు.దీంతో మనస్తాపానికి గురైన చైర్మన్ వెనుదిరిగి పోయారు. ఈ ఘటనపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని చైర్మన్ తెలిపారు. పోలీసుల వల్ల సామాన్య భక్తులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల కోసం తాత్కాలిక డార్మెటరీల ఏర్పాటు దుర్గమ్మ దర్శనం కోసం వస్తున్న భక్తులను మున్సిపల్ కార్యాలయం వద్ద దశల వారీగా పోలీసులు అనుమతిస్తున్నారు. భక్తులు వేచి ఉండేందుకు తాత్కాలిక డార్మెటరీలను ఏర్పాటు చేశారు. ఒకేసారి భక్తులు క్యూలైన్లలోకి వెళ్లకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో క్యూలైన్లు, భక్తుల రద్దీని పర్యవేక్షిస్తున్నారు. ఆ అధికారిని గుర్తించాం: సీపీ మూలా నక్షత్రం సందర్భంగా కొండపైకి వాహనాలను అనుమతించటం లేదని సీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. పాలక మండలి సభ్యులకు చెందిన నాలుగు వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చామని వెల్లడించారు. గత రాత్రి చైర్మన్ గౌరంగ్ బాబును ఆపేసిన పోలీసు అధికారిని గుర్తించామని, బందోబస్తు నుంచి ఆ అధికారిని తప్పించామని చెప్పారు. జరిగిన దానికి చింతిస్తున్నామని వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు లక్షా అరవై వేల మంది ఉదయం 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకున్నారని వెల్లడించారు. -
దుర్గమ్మ చెంత రాజకీయ ప్రచారం
సాక్షి, అమరావతి బ్యూరో: నిబంధనల ప్రకారం దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి రాజకీయ, అన్యమత ప్రచారం చేయకూడదు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ అధికార తెలుగుదేశం నాయకులు మాత్రం విపరీత ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఎక్కడ వీలైతే అక్కడ తమ స్వామి భక్తిని చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు వారందరూ ఎంతో భక్తిప్రవత్తులతో జరుపుకునే విజయవాడ శ్రీ కనకదుర్గా అమ్మ వార్ల దసరా మహోత్సవాల్లోనూ తెలుగు తమ్ముళ్లు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం దుర్గ గుడి, కొండ ప్రాంతం, గుడి టోల్గేట్, వినాయక టెంపుల్ వంటి ఆలయానికి సంబంధించిన ప్రాంతాల్లో ఎటువంటి రాజకీయ, అన్యమత ప్రచారానికి సంబంధించిన ప్రచారాలు, ప్లె్లక్సీలు, కరపత్రాలు పంచడం వంటి కార్యక్రమాలు చేయకూడదు. కానీ దసరా ఉత్సవాల్లో భాగంగా భక్తులు దర్శనానికి వెళ్లే మార్గాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలంగా ప్లె్లక్సీలు వెలిశాయి. మళ్లీ మీరే రావాలి..అంటూ చంద్రబాబు నాయుడు ఫోటోతో ప్లెక్సీలు కట్టారు. పాలకమండలి సభ్యుడే ఇలా చేస్తే.. ఆలయ పాలకమండలి సభ్యుడిగా బాధ్యతలు తీసుకుని ముందు గుడి ప్రతిష్టతను కాపాడుతామని, ధార్మిక వాతావరణానికి ఇబ్బందులు రాకుండా క్రమశిక్షణతో పనిచేస్తామని ప్రమాణం చేసిన వ్యక్తే గీత దాటాడు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు వెలగపూడి శంకరబాబు పేరు మీద వినాయక టెంపుల్ నుంచి టోల్ గేట్ రాజగోపురం వరకు ఫ్లెక్సీలు వెలిశాయి. మళ్లీ మీరే రావాలి..అంటూ చంద్రబాబు ఫోటో కింద పాలకమండలి సభ్యుడి ఫోటోతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిబంధనలు అమలు చేయాల్సిన సభ్యుడే వాటిని అతిక్రమించడంపై భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పట్టించుకోని యంత్రాంగం భక్తులు అమ్మవారి దర్శనానికి వెళ్లే క్యూలైన్లకు నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ ప్రచార ఫ్లెక్సీలు కట్టినప్పటికీ దేవస్థాన యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అధికారం పక్షానికి సంబంధించిన వ్యక్తి కావడం, పైగా ముఖ్యమంత్రికి అనుకూలంగా ఫ్లెక్సీ పెట్టడం చేతనో ఏమోగాని యంత్రాంగం ఆ ఫ్లెక్సీలను చూసీచూడనట్లు వదిలేశారు. ఇలా ఆలయ ప్రతిష్టను మంటగలిపే కార్యక్రమాలు జరుగుతున్నా యంత్రాంగం మిన్నుకుండటంపై ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భక్తుల ఆగ్రహం ప్రతి పనిని ప్రచారానికి వాడుకోవడం టీడీపీ నేతలకు అలవాటైపోయింది. గ్రామదర్శిని, జన్మభూమి, జ్ఞానభేరి వంటి ప్రభుత్వ కార్యక్రమం ఏది జరిగినా దాన్ని ప్రచారానికి వాడుకోవడం అధి కారపార్టీ నేతలకు సర్వసాధారణమైంది. కానీ ధార్మిక విషయాల్లో కూడా పార్టీ ప్రచారానికి వాడుకోవడం మాత్రం భక్తులకు తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. ఇటువంటి నీచ రాజకీయాలు కనీసం పండుగ సమయాల్లోనైనా మానుకోవా లని హితవుపలికారు. పాలకమండలిలో ఉంటూ ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తిని వెంటనే పదవిలోంచి తీసేయాలని కోరుతున్నారు. దేవస్థానం ఈవో వెంటనే స్పందించి వాటిని తొలగించాలని భక్తులు కోరుతున్నారు. -
అన్నం పరమాన్నం
నవరాత్రి పండుగ అంటే తొమ్మిదిరోజుల పాటు శక్తిని ఆరాధించడం. నవ అనే పదానికి తొమ్మిది అని అర్థం. తొమ్మిది రాత్రులు ఆ తల్లిని పూజించి పదో రోజు విజయ దశమి రోజున వేడుకగా, భక్తిశ్రద్ధలతో ఆచరించడం. మన అభివృద్ధికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా, మనసును ఆధ్యాత్మికత వైపుకు మళ్లించమని, భగవంతుని ముందు దీపం వెలిగించి ఆ తల్లిని ప్రార్థించడం ఈ పండుగ ప్రాధాన్యత. 1. గుడాన్నప్రీత మానసా: ఈపండుగలో గుడాన్న నివేదనకు అత్యధిక ప్రాధాన్యం ఉంది. గుడము అంటే బెల్లం, అన్నం అంటే బియ్యంతో వండినది అని అర్థం. గుడాన్నం అంటే బెల్లం, బియ్యం కలిపి చేసే వంట. లలితామ్మవారికి గుడాన్నం అంటే ప్రీతి. అందుకే లలితా సహస్రంలో గుడాన్నప్రీత మానసా అని అర్చిస్తారు. 2. స్నిగ్ధౌదన ప్రియా: స్నిగ్ధ అంటే తెల్లని, ఓదనము అంటే అన్నం, ప్రియా అంటే ఇష్టపడటం. తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి అని లౌకికార్థం. తెల్లటి అన్నం అనగానే తెలుపు వర్ణమని కాదు, స్వచ్ఛమైన పదార్థాన్ని ఇష్టపడే తల్లి అని పారమార్థికార్థం. తెలుపు స్వచ్ఛతకు, పరిశుభ్రతకు, నిర్మలమైన అంతరంగానికి మారుపేరు. మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటే చేసే పనులు అంత స్వచ్ఛంగా ఉంటాయని పండితులు చెబుతారు. పని పట్ల నిబద్ధత, భక్తిభావం కలిగి ఉండాలని, అమ్మవారిలాగే మనం ఆచరించే కర్మలు స్వచ్ఛంగా ఉండాలని ఈ ప్రసాదం సూచిస్తుంది. అందుకే స్నిగ్ధౌదన ప్రియా అని ఆ తల్లిని అర్చిస్తారు. 3. పాయసాన్నప్రియా: పయః అంటే పాలు, అన్నం అంటే వండబడిన బియ్యం. పాలు, బియ్యానికి మధుర పదార్థం జత చేసి వండిన వంట. ఆ తల్లికి ఈ వంటకం మీద ప్రీతి ఎక్కువ. మనం మాట్లాడే మాటలు, చేసే పనులు ఇతరులకు మధురంగా అనిపించాలి. మధురపదార్థం జిహ్వను తాకగానే మనసు ఆనంద తరంగాలలో డోలలూగుతుంది. మధురమైన సంభాషణలు పలికితే ఇతరుల మనసులు కూడా ఆనందసాగరంలో తేలియాడుతాయి. అందువల్లే ఆ తల్లి పాయసాన్నప్రియా నామం ద్వారా తియ్యని మాటలను పలుకమని బోధిస్తోంది. 4. మధుప్రీతా: మధు అంటే తేనె అనే అర్థం కూడా ఉంది. ప్రీతా అంటే ఇష్టపడటం. తేనె వంటిపదార్థాలను ఇష్టపడటం అని బాహ్యార్థం. తేనె సకల వ్యాధులకు నివారణోపాయం. తేనెను స్వీకరించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చుననే అంతరార్థంతో ఆ తల్లిని మధుప్రీతా అని అర్చిస్తాం. 5. దద్ధ్యన్నాసక్త హృదయా: దధి అంటే పెరుగు, అన్నం అంటే బియ్యంతో వండినది. ఆసక్త అంటే అభీష్టాన్ని చూపడం, హృదయా అంటే అంతటి మనస్సు కలిగినది. పెరుగుతో వండిన అన్నం పట్ల ఆసక్తి కలిగిన హృదయం కలిగిన తల్లి అని అర్థం. పాలను కాచి, తోడు వేస్తే కాని పెరుగు లభించదు. పెరుగుకు అన్నం జోడించి తయారుచేసేదే దద్ధ్యోదనం. కార్యంలో విజయం సులువుగా లభించదని, లక్ష్యసాధనకు ఓర్పు, పట్టుదల, దీక్ష అవసరమని ఈ నైవేద్యం ద్వారా ఆ తల్లి చెబుతోంది. ఎంతో కొంత శ్రమకోర్చితేనే పెరుగు లభిస్తుంది. కాని సాధించిన తర్వాత లభించే రుచి వర్ణనాతీతం అని ఈ మంత్రం తెలియచేస్తోంది. 6. ముద్గౌదనాసక్త హృదయా: ముద్గ అంటే పెసలు, ఓదనం అంటే అన్నం, ఆసక్త అంటే అభిరుచి కలిగిన, హృదయా అంటే మనసు కలిగిన అని అర్థం. ఆ తల్లికి పెసలతో వండిన అన్నమంటే ప్రీతి. నిత్యం గుప్పెడు పెసలు తింటే ఆరోగ్యం అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఈ పదార్థాలను తిని ఆరోగ్యంగా జీవించమని ఆ తల్లి చెబుతోంది. అందుకే ఆమెను ముద్గౌదనాసక్త హృదయా అని ఆరాధిస్తున్నాం 7. హరిద్రాన్నైక రసికా: హరిద్రం అంటే పసుపు, అన్నం అంటే బియ్యంతో వండినది. మనం మన పరిభాషలో పులిహోరగా పిల్చుకుంటాం. పసుపు శుభానికి సూచిక. సర్వ సూక్ష్మజీవులను హరించే శక్తి కలిగి ఉన్న పదార్థం. పసుపుతో తయారయిన అన్నం కడుపులోని అనారోగ్యాలను దూరం చేస్తుందని అంతరార్థం. ఆ తల్లికి హరిద్రాన్నం మీద ప్రీతి ఎక్కువ. అందుకే హరిద్రాన్న + ఏక అంటున్నాం. ఈ హరిద్రాన్నాన్ని అత్యంత ప్రీతిగా సేవిస్తుంది ఆ తల్లి అని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. 8. సర్వౌదనప్రీతచిత్తా: సర్వ అంటే అన్నిరకాల, ఓదనం అంటే అన్నం, ప్రీత అంటే ఇష్టపడటం, చిత్తా అంటే మనసు కలిగి ఉండటం. అన్నిరకాల ఆహార పదార్థాలను ఇష్టపడే చిత్తం కలిగినది తల్లి అని అర్థం. ఆశ్వీయుజ మాసంలో వరి పంట ఇంటికి చేరుతుంది. కాయగూరలు తాజాగా ఉంటాయి. కొత్తబియ్యం, కొత్త బెల్లం, ఆవు పాడి... వీటితో ఈ తొమ్మిదినాళ్లు తొమ్మిది రకాల నైవేద్యాలను నివేదన చేస్తారు. లలితా సహస్రంలో నైవేద్యాలు లలితా సహస్రంలో చెప్పిన ఈ నైవేద్యాలన్నీ అతి సులువుగా జీర్ణమై ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. నవరాత్రులలో చాలామంది ఏకభుక్తం ఉంటారు. ఆ ఒక్కపూట కూడా సులువుగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే స్వీకరిస్తారు. అలా ఆ తల్లిని తొమ్మిది రోజులు ధ్యానించి, తేలికపాటి నైవేద్యాలను ఆ శక్తికి నివేదించి, స్వీకరించి ఆరోగ్యాన్ని వరంగా పొందాలన్నదే ఈ నామాల పరమార్థం అని పండితులు చెబుతున్నారు. -
ఇంద్రకీలాద్రి అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం
-
ఒకేరోజు రెండు అలంకారాల్లో అమ్మవారు
సాక్షి, అమరావతి: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఈ ఏడాది దసరా ఉత్సవాల సందర్భంగా ఒక ప్రత్యేకత సంతరించుకోనుంది. ఆ రోజు ఉదయం మహిషాసుర మర్ధినిగా, మధ్యాహ్నం రాజరాజేశ్వరీ దేవిగా రెండు అలంకాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలంకరణ మార్చే సమయంలో ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు దర్శనం నిలిపివేసే అంశంపై దేవదాయ శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దుర్గ గుడి ఈవో కోటేశ్వరమ్మ మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తిని కలసి ఈ విషయంపై చర్చించారు. దసరాతోపాటు ఒకే రోజు అమ్మవారికి రెండు అలంకారాలు, దర్శనం నిలిపివేత వంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భక్తులు రెండు సార్లు దర్శనానికి వచ్చే అవకాశం ఉందని కేఈ కృష్ణమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే భక్తులు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత ప్రసాదాలకు అదనంగా అప్పం ప్రసాదంగా భక్తులకు అందజేయాలని నిర్ణయించినట్టు ఈవో కేఈకి వివరించారు. దసరా ఉత్సవాల్లో ఆలయానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా కదంబం పంపిణీ చేయనున్నట్టు ఆమె తెలిపారు. అనంతరం కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అమ్మవారి అలంకరణ మార్చే సమయంలో దర్శనం నిలిపివేస్తున్న విషయాన్ని సామాన్య భక్తులకు తెలిసేలా విస్త్రతంగా ప్రచారం చేయాలన్నారు. -
దుర్గగుడి ట్రస్ట్ బోర్డుపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: దుర్గగుడి ట్రస్ట్ బోర్డుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో చీరపోయినందుకు ట్రస్ట్ బోర్డు మెంబర్‌గా తీసివేయడాన్ని సవాలు చేస్తూ ట్రస్టు బోర్డు మెంబర్ కోడెల సూర్యలతా కుమారి పిటిషన్ వేసింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, దుర్గ గుడి ఈవో, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోన్మెంట్, ట్రస్ట్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ధర్మాసం కోరింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. -
హైకోర్టును ఆశ్రయించిన కొడెల సూర్యలతాకుమారి
-
‘గుడిలో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులు’
సాక్షి, విజయవాడ: బెజవాడ కనకదుర్గ చీర దొంగతనం కేసుకు సంబంధించి సస్పెన్షన్‌కు గురైన మాజీ పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత సంచలన ఆరోపణలు చేశారు. దుర్గగుడిలో ఓపీడిఎస్‌కు చెందిన మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. పాలక మండలి సభ్యులు వెలగపూడి శంకరబాబు గుడిలో పనిచేసే మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. గతంలో బాధిత మహిళలు శంకరబాబుపై ఫిర్యాదు చేసినా చైర్మన్ గౌరంబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఫిర్యాదులను గౌరంబాబు పట్టించుకోకపోవడమే కాకుండా శంకరబాబును వెనకేసుకొచ్చేవాడని మండిపడ్డారు. ఆలయంలో అక్రమాలు ఆలయ అభివృద్ది పనుల్లో భాగంగా సీసీ రోడ్, ఘాట్‌రోడ్ టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. చైర్మన్ అక్రమాలను వ్యతిరేకించినందుకే తనపై కక్ష్య కట్టారని పేర్కొన్నారు. చీరల విషయంలో లక్షల అక్రమాలు జరిగాయని, వాటిని ప్రశ్నించినందుకు తనను చీరల దొంగగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక దర్యాప్తు జరపకుండానే తనను తొలిగించారని, తాను ఏ తప్పు చేయలేదని సూర్యలత స్పష్టంచేశారు. -
ఉద్దేశపూర్వకంగానే నన్ను బలి చేశారు
-
వివాదాల్లో బెజవాడ దుర్గగుడి ఈవోలు
-
దుర్గగుడి ఈవోగా ఐఆర్ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మ
-
దుర్గ గుడి చీర మాయం.. కోడెల సూర్యలత సస్పెండ్
-
చీర మాయం : సూర్యలత సస్పెండ్
సాక్షి, విజయవాడ : బెజవాడ కనకదుర్గ చీర దొంగతనం ఆరోపణలతో ఆలయ పాలకమండలి సభ్యురాలు సూర్యలత సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఆయన చైర్మన్ గౌరంగబాబు సూర్యలతపై చర్యలు తీసుకున్నారు. చీర మాయం ఘటనపై ఆలయ ఈవో పద్మ నివేదిక సిద్ధం చేశారు. ఆలయ ట్రస్టు బోర్డులోని సభ్యురాలు సూర్యలత దుర్గమ్మ చీరను తీసినట్లు రిపోర్టులో స్పష్టం చేశారని తెలిసింది. చీర మాయం విషయంపై ప్రభుత్వం కూడా సీరియస్ అయిన నేపథ్యంలో కదిలిన ఈవో నివేదికను రూపొందించారు. అయితే, నివేదికను ప్రభుత్వానికి పంపే ముందు ఈవో పద్మ వన్‌టౌన్ పోలీసులతో మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. సీసీ టీవీ ఫుటేజి లేకపోయినా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం నమోదు చేసినట్లు ఈవోకు పోలీసులు తెలిపారు. దీంతో వాంగ్మూల నమోదు ప్రతిని తనకు ఇవ్వాలని ఈవో పద్మ పోలీసులను కోరారు. చీర తీసిన పాలకమండలి సభ్యురాలిపై కేసు నమోదు అయితే ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుంది కనుక కేవలం చర్యలు మాత్రమే తీసుకోవాలని ఈవో నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. నాది తప్పు ఎలా అవుతుంది : సూర్యలత చీర వివాదంపై ఆలయ పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత మాట్లాడారు. ఆలయ చైర్మన్, ఈఓలు భక్తుల నుంచి సన్మానాలు స్వీకరిస్తే తప్పు కానిది, తాను భక్తులు సన్మానించిన చీరను తీసుకుంటే తప్పు ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. చైర్మన్ నుంచి తనకు ఇంకా సస్పెన్షన్ ఆర్డర్ రాలేదని చెప్పారు. ఆలయంలోని కొందరు కుట్రపూరితంగానే ఇలా చేశారని అన్నారు. ఆలయ అర్చకుడు శాండిల్య చేసిన ఆరోపణలతో తనను ఎలా సస్పెండ్ చేస్తారని నిలదీశారు. భక్తుల నుండి నేను చీరలు ప్రసాదంగా తీసుకున్నానని చైర్మన్ అనడం సరికాదని చెప్పారు. పాలకమండలిలో తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. -
అమ్మవారిని దర్శించుకున్న పరిపూర్ణానంద
-
దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించిన కేసీఆర్
-
రేపు విజయవాడకు సీఎం కేసీఆర్
-
మహిళలు దుస్తులు మార్చుకునే చోట కెమెరాలు
-
అమ్మవారి సన్నిధిలో ఇంత అపచారమా!
ఇంద్రకీలాద్రి/చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత లేదన్న విషయం మరోసారి రుజువైంది. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో మహిళలకు తీరని అవమానం జరిగింది. ఓ డార్మిటరీలో దుస్తులు మార్చుకునే చోట సీసీ కెమెరా ఏర్పాటు చేసి రికార్డ్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. మూడు నెలలుగా జరుగుతున్న ఈ తంతు సోమవారం వెలుగులోకి వచ్చింది. గతంలో దీనిపై సిబ్బందే ఫిర్యాదుచేసినా అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. వారి వైఖరి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అధికారుల నిర్వాకం చూసి భక్తులంతా అవాక్కవుతున్నారు. మహిళలు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు రికార్డ్ చేయడం దారుణమంటున్నారు. దీనిపై మహిళాలోకం భగ్గుమంటోంది. అమ్మవారి సన్నిధిలోనే తమకు రక్షణలేక పోవడంపై మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డార్మిటరీలో సీసీ కెమెరా.. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో పాడి వీధిలో సీవీ రెడ్డి చారిటీస్ పేరిట కాటేజీ నిర్వహిస్తోంది. ఈ కాటేజీ మెయిన్ హాల్లో లక్ష్మి పేరిట మహిళలకు ప్రత్యేకమైన ఏసీ డార్మిటరీని ఏర్పాటు చేశారు. ఆ డార్మిటరీలో 8 మంచాలు ఉండగా, కొంత ఖాళీ స్థలం కూడా ఉంది. కాటేజీలో వివాహాలు తదితర శుభకార్యాలు జరుపుకొనే సమయంలో మహిళలకు ఏసీ డార్మిటరీని అద్దెకు ఇస్తారు. అక్కడే వారు స్నానాలు చేసి దుస్తులు మార్చుకుంటూ ఉంటారు. ఆ డార్మిటరీ మొత్తం కనిపించేలా మూడు నెలల కిందట సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం కాటేజీలో ఓ వివాహం జరగగా, డార్మిటరీలో పెళ్లి కుమార్తెతో పాటు మరి కొంతమంది ఆమె బంధువులు విశ్రాంతి తీసుకున్నారు. పెళ్లి కుమార్తెతో పాటు మిగిలిన మహిళలందరూ అక్కడే దుస్తులు మార్చుకున్నారు. పెళ్లి తంతు అంతా అయిపోయిన తర్వాత తిరిగి వెళ్లే క్రమంలో మగవారు లగేజీని తీసుకువెళ్లేందుకు డార్మిటరీలోకి వచ్చారు. ఆ సమయంలో అక్కడ గోడకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను గుర్తించారు. సీసీ కెమెరా పని చేస్తున్నట్లుగా చిన్న లైటు వెలుగుతుండటంతో అనుమానం వచ్చి కాటేజీ కామన్ హాల్లో ఉన్న ఆలయ సిబ్బంది కార్యాలయంలోకి సదరు వ్యక్తులు వెళ్లి చూడగా అక్కడ సీసీ కెమెరా ఫుటేజీ స్పష్టంగా కనిపించింది. దీంతో పెళ్లి వారి బంధువులు ఆలయ సిబ్బందితో పాటు సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డింగ్‌పై నిలదీశారు. బుకాయిస్తున్న అధికారులు.. సీసీ కెమెరాల రికార్డు అంశం విషయం రచ్చకెక్కడంతో తప్పు సరిదిద్దుకునే ప్రయత్నాలు ఆలయ అధికారులు ప్రారంభించారు. ఈలోగా విషయం తెలిసి మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లి పరిశీలించగా కార్యాలయంలోని టీవీలో రెండు కెమెరాలు పని చేస్తున్నట్లు విజవల్స్ కనిపించాయి. దీంతో ఆలయ అధికారుల తీరుపై ఇతర భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆలయ ఈఈ భాస్కర్ ఘటనా స్థలానికి వచ్చి మహిళల డార్మిటరీలో సీసీ కెమెరాలు పని చేస్తున్నప్పటికీ ఫుటేజీ రికార్డు కావడం లేదని సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం పెల్లుబుకుతున్న సమయంలో కెమెరాలను ఆఫ్‌లైన్‌లోకి మార్చి వెళ్లిపోయారు. మూడు నెలలుగా ఇదే తీరు... మహిళలు ఉండే కాటేజీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం సరికాదని పలు మార్లు ఇంజనీరింగ్ సిబ్బందిని హెచ్చరించినట్లు సీవీరెడ్డి చారిటీస్ నిర్వహణ చూస్తున్న ఆలయ ఉద్యోగి మేరీ స్వరూప తెలిపారు. కెమెరాలపై ఫిర్యాదులను ఆలయ ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోలేదని, మూడు నెలలుగా సీసీ కెమెరాలు పని చేస్తున్నాయని కాటేజీలో పని చేసే సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే సీసీ కెమెరాల్లో రికార్డు అయిన విజవల్స్ బయటకు వస్తే తమ పరిస్థితి ఏంటని మహిళా భక్తులు ఆందోళన చెందుతున్నారు. భక్తుల మనోభావాలతో ఆటలా.. డార్మిటరీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆలయ అధికారులు భక్తుల మనోభావాలతో ఆటలాడుతున్నారు. డార్మిటరీలో అనుమానితులు ప్రవేశకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామంటున్నారు. లోపలకు ప్రవేశించే మార్గంలో ఏర్పాటు చేస్తే సరిపోతుంది కదా! లోపల ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏంటి?. ఇలాంటి ఘటనలు దురదృష్టం దుర్గగుడి పాలనాధికారిగా మహిళ ఉన్న సమయంలో ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. జరిగిన దానిని సమర్థించుకునే కన్నా బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఇంత మంది అధికారులు, పాలక మండలి సభ్యులు ఉన్నా ఆలయంలో ఏం జరుగుతోందో భక్తులు చెబితే గాని తెలుసుకోకపోవడం సరికాదు. మహిళలకు రక్షణ లేదు ఆలయాల్లోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇంత వరకు షాపింగ్‌మాల్స్, హోటల్స్‌లోనే ఇటువంటి ఘటనలు జరిగినట్లు విన్నాం. ఇప్పుడు ఆలయాల్లోనూ... కాటేజీల్లోనూ ఇదే తంతు అంటే ఆడవారికి రక్షణ ఎక్కడ ఉంది? అధికారులు తీరు సరిగా లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. విశ్రాంతి కోసమే డార్మిటరీలు: ఎం.పద్మ, దుర్గగుడి ఈవో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు విశ్రాంతి కోసమే డార్మిటరీలు ఏర్పాటు చేశాం. డార్మిటరీలో బెడ్డు అద్దె ప్రాతిపదికన ఇస్తున్నాం. కేవలం విశ్రాంతి కోసమే వాటిని వినియోగిస్తున్నాం తప్ప.. దుస్తులు మార్చుకునే స్థలంలా కాదు. మహిళల భద్రత కోసమే డార్మిటరీ అంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. -
ఇంద్రకీలాద్రి: మహిళల గదిలో కెమెరాలు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిలో అధికారుల నిర్వాకం బయటపడింది. సి.వి.రెడ్డి ఛారిటీస్ ట్రస్టు డార్మిటరీలో మహిళలు దుస్తులు మార్చుకునే రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సోమవారం వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలలుగా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. మహిళలు ఉండే గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు ఓ పెళ్లి బృందం సీసీ కెమెరాలను గుర్తించి బయటపెట్టింది. అయితే ఈ సంఘటనపై ఆలయ సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. కెమెరాలకు కనెక్షన్ ఇవ్వలేదని, అంతేకాకుండా మూడు రోజుల నుంచి పనిచేయడం లేదని అంటున్నారు. ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. -
మహిళల డ్రెస్సింగ్‌రూంలో కెమెరాలు
-
కనకదుర్గా ఆలయంలో నిరసన..
సాక్షి, విజయవాడ: కనకదుర్గా అమ్మవారి ఆలయంలో గందరగోళం నెలకొంది. దేవస్థాన పాలకమండలి సభ్యుడికి, కేశఖండన చేసే క్షురకులకు మధ్య వివాదం రాజుకుంది. వివరాలు.. కేశ ఖండన చేసే సమయంలో భక్తుల నుంచి ఎటువంటి కానుకలు, డబ్బులు తీసుకోకూడదనే నిబంధన పాలకమండలి అమలు చేస్తోంది. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఓ భక్తుడి నుంచి క్షురకుడొకరు పది రూపాయలు తీసుకున్నాడనే ఫిర్యాదు అందడంతో పాలకమండలి సభ్యుడు పెంచలయ్య సదరు క్షురకుడితో వాగ్వాదానికి దిగారు. అది కాస్తా శృతి మించింది. పెంచలయ్య క్షురకుడి చొక్కా పట్టుకున్నారనీ ఆరోపిస్తూ.. పాలక మండలి సభ్యుడి చర్యలకు నిరసనగా వారు విధులు బహిష్కరించారు. వివాదం సద్దుమణగక పోవడంతో కేఖ ఖండన చేయించుకునే భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. -
దుర్గమ్మను దర్శించుకున్న వేమిరెడ్డి
సాక్షి, విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేయనున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం ఉదయం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వచనం పొందారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి...ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
మసకబారుతున్న దుర్గగుడి ప్రతిష్ట!
సాక్షి, విజయవాడ : శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (దుర్గగుడి) ప్రతిష్ట రోజురోజుకూ మసకబారుతోంది. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న అవినీతిని విజిలెన్స్ ఇప్పటికే పలుమార్లు వెలుగులోకి తెచ్చింది. ఇంకోవైపు అమ్మవారి మూలనిధి తరిగిపోతోంది. తాజాగా ఆలయంలో జరిగిన తాంత్రిక పూజలు వెలుగుచూడటంతో భక్తులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. మూలధనం నేలచూపులు ఒకప్పుడు ఆలయానికి వచ్చిన అధికారులు అమ్మవారి మూలధనం పెంచేందుకు, భక్తులు అధిక సంఖ్యలో అమ్మని దర్శించుకునేలా కృషి చేసేవారు. మూడేళ్లుగా ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఆలయంలో అభివృద్ధి పేరుతో నిధులు ఖర్చు చేయడం మినహా భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు ప్రత్యేకంగా ఏమీ లేవు. మరో వైపు అమ్మవారి మూలధనం తరిగిపోతోంది. అభివృద్ధిపేరుతో ఇంద్రకీలాద్రిపై ఉన్న పరిపాలన, అన్నదాన భవనాలను కూల్చివేశారు. భవానీ మండపాలను తొలగించారు. కొండదిగువున భూములు తీసుకునేందుకు అమ్మవారి డిపాజిట్లు వినియోగించడంతో మూలధనం తరగిపోయింది. ఒక్కప్పుడు రూ.120 కోట్లు వరకు ఉన్న మూలధనం ఇప్పుడు కేవలం రూ.40 కోట్లకు పడిపోయింది. ప్రస్తుతం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను తీస్తే తప్ప సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మరో వైపు దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింటూ ఉండటంతో విరాళాలు ఇచ్చే దాతలు కరువయ్యారు. భక్తులకు సౌకర్యాలు కోసం నిర్మించిన ఇంద్రకీలాద్రి గెస్ట్ హౌస్‌ను కార్యాలయంగా మార్చడం, సీతానగరంలో కాటేజీని దేవాదాయశాఖకు ఇవ్వడంతో భక్తులకు కనీసం సౌకర్యాలు కరువయ్యాయి. రూ.20 కోట్లు ఖర్చు చేసిన సీసీ రెడ్డి చారిటీస్‌లో నిర్మించిన కాటేజీలు ఐదారు వందల మందికి మాత్రమే సరిపోతాయి. తాంత్రిక పూజలు వెలుగులోకి.. అమ్మవారి సన్నిధిలో తాంత్రిక పూజలు చేయడం దేవాలయం ప్రతిష్ట మాత్రం మసకబారింది. ప్రభుత్వంలోని ఒక కీలకవ్యక్తి కోసం, నిన్నమొన్నటి వరకూ ఆలయ ఈఓగా బాధ్యతలు నిర్వర్తించిన సూర్యకుమారి ఆదేశాలతోనే పూజలు చేశామని ఆర్చకులు చెబుతున్నారు. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా అర్ధరాత్రి పూట పూజలు చేయడాన్ని అర్చకులు విభేదించాలి. అయితే దేవస్థానంలో దీర్ఘకాలంగా పాతుకుపోయిన కొంతమంది అధికారులు ఉన్నతాధికారులు చెప్పిన విధంగా శాస్త్రాలనే మార్చివేస్తూవారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు సీనియర్ అర్చకులు ఆగమశాస్త్రానానికి విరుద్ధంగా చేయొద్దని చెప్పినా.. వారిని పక్కన పెట్టేస్తున్నారనే తప్ప వారి సూచనలను పరిగణలోకి తీసుకోవడం లేదు. గత అనేక దశాబ్దాలుగా దేవాలయంలో లేని అనేక పూజలను ఐదారేళ్లలో ప్రవేశపెట్టారు. దీనికి కొంతమంది అర్చకుల వత్తాసు ఉంది. ఈ క్రమంలోనే తాంత్రిక పూజలు జరిగాయి. భవిష్యత్తులోనైనా ఆగమశాస్త్రానికి విరుద్ధంగా దేవాలయంలో ఏ కార్యాక్రమాలు నిర్వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అవినీతిపై విజిలెన్స్ డేగకన్ను దుర్గమ్మసన్నిధిలో జరుగుతున్న అవినీతిపై విజిలెన్స్ ఇప్పటికే పలుమార్లు నివేదికలు ఇచ్చింది. ఇటీవల ఇచ్చిన నివేదికల్లో గత రెండేళ్లలో జరిగిన అవినీతిపై ఎండగట్టింది. అకౌంటింగ్ విభాగంలో జవాబు లేనితనం నుంచి, ఇంజినీరింగ్‌లో క్యూలైన్లు ఏర్పాటుకు నిధులు దుర్వినియోగం, అన్నదానంలో భక్తులు సంఖ్య ఎక్కువగా చూపించడం, అన్నదానికి కొనుగోలుచేసే సరుకుల్లో అవకతవకులు, లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీలో కూలీల సంఖ్యను ఎక్కువ చూపిం చడం, ప్రసాదాలు దెబ్బతినండం తదితర అంశాలను విజిలెన్స్ అధికారులు కడిగిపారేశారు. ఇప్పుడు దేవస్థానం అధికారులు వాటికి వివరణ ఇచ్చుకునే పనిలో ఉన్నారు. కొత్తగా వచ్చే అధికారులైనా ఆలయ ప్రతిష్టను పెంచేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
ఎవరి కోసం ఈ తంత్రం?
సాక్షి, అమరావతి / అమరావతి బ్యూరో : విజయవాడ కనకదుర్గ ఆలయంలో నియమ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి పూట తాంత్రిక పూజలు జరిగి 12 రోజులైంది. హైందవ సాంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిన ఈ అపచారంపై ఇప్పటికీ గోప్యత కొనసాగుతోంది. తాంత్రిక పూజలు ఎందుకు జరిగాయి? ఎవరి కోసం జరిగాయన్న అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ విచారణను సాగదీసేందుకు యత్నిస్తున్నారు. అన్నీ జవాబులేని ప్రశ్నలే.. - పవిత్రమైన కనకదుర్గ గర్భగుడి చుట్టూ ప్రత్యేక భద్రతా వలయం ఉంటుంది. 24 గంటలూ సుశిక్షితులైన పోలీసు సిబ్బంది కాపలాగా ఉంటారు. అయినా ఏం జరిగిందో ,ఎవరు చేశారో తెలుసుకోవడానికి ఇన్ని రోజులు పడుతుందా? - ఆలయమంతటా 24 గంటలూ సీసీ కెమెరాల నిఘా ఉంది. గర్భగుడి చుట్టూ కూడా సీసీ కెమెరాలున్నాయి. ఆ ఫుటేజిలను పరిశీలిస్తే దోషులెవరో తేలిపోతుంది కదా. అందులో ముఖ్యమైన క్లిప్పింగులు ఎందుకు బైటపెట్టడం లేదు. హా అర్ధరాత్రి పూట గర్భగుడిని తెరవాలంటే కొన్ని సాంప్రదా యాలు పాటించాలి. నియమనిబంధనలను అనుసరించాలి అవేవీ ఎందుకు పాటించలేదు. - అర్ధరాత్రి తాంత్రిక పూజలు జరిగాయని అంగీకరిస్తూ ఈవోను బదిలీ చేశారు. కేవలం బదిలీతోనే ఎందుకు సరిపెడుతున్నారు? ఈ వ్యవహారంలో కేసు ఎందుకు నమోదు చేసి విచారణ ఎందుకు ప్రారంభించలేదు? - ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నవారి కోసమే ఈ తాంత్రిక పూజలు జరిగినట్లు అనేక ఆరోపణలున్నాయి. దానికి బలం చేకూర్చే విధంగానే ఈ పరిణామాలన్నీ ఉండడం నిజం కాదా? హా మహిషాసురమర్థిని అలంకరణలో ఉన్న అమ్మవారిని అర్చకులు ఫొటో కూడా తీసి ఈవోకు పంపించారు. కానీ ఆమె ఆ ఫొటోను ఎవరికి పంపించారు? - ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి లోకేష్ కోసమే తాము దుర్గగుడిలో తాంత్రికపూజలు చేశామని సన్నిహితుల వద్ద చెప్పాడంటున్న అర్చకుడు సృజన్ ఇంతకీ ఎక్కడ ఉన్నారు? ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా ఎందుకు పోయారు? చంద్రబాబు కోసం గతేడాది ప్రత్యేక పూజలు చంద్రబాబు క్షేమాన్ని కోరుతూ సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో అర్చకు లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీకి అనుకూలంగా ఉండే కొందరు అర్చక ప్రతిని ధుల పిలుపు మేరకు ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో రాష్ట్రంలోని దాదాపు అన్ని ఆల యాల్లో బాబు కుటుంబం ప్రయోజ నాలను ఉద్దేశించి పూజలు జరిగాయి. ఈ ఏడాది కూడా అలా ప్రత్యే క పూజలు జరిపాలని కార్యాచరణ రూపొందించారన్న ప్రచారం సాగుతోంది. తాంత్రిక పూజలపై అనేక ఆధారాలు.. తాంత్రిక పూజల అంశాన్ని ప్రభుత్వం మొద ట్లో తీవ్రంగా బుకాయించింది. తాంత్రిక పూజ లు జరిగాయన్న ఆలయ పాలకమండలి సభ్యులపై సీఎం తీవ్రంగా మండిపడ్డారు. పాలకమండలిని రద్దు చేస్తానని హెచ్చరించా రు. తాంత్రిక పూజలు జరిగాయని తేలడంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. స్మార్థ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అమ్మవారి కవచం తొలగించి మరీ పూజలు చేశారని నిర్ధారణైంది. దీంతో ప్రభుత్వం అంగీకరించక తప్పలేదు. కమిషనర్‌కే ఈవో బాధ్యతలు విజయవాడ దుర్గగుడి ఈవో సూర్యకుమారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ)లో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధనే దుర్గ గుడి ఈవోగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతల్లో నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘పెద్దల’ ఆదేశాలతోనేనా..? విచారణ పేరుతో దుర్గగుడి తాం త్రిక పూజల అంశాన్ని కొంతకాలం సాగదీసి.. ఆ పూజలు ఎవరి కోసం జరిగాయన్న అంశాన్ని మరుగు పరచాలన్నదే ప్రభుత్వ ‘పెద్దల’ ఉద్దేశమని వినిపిస్తోంది. ఈవో సూర్యకుమారిని దుర్గ గు డి బాధ్యతల నుంచి తప్పిస్తే ఇక ఆ విషయం మరుగున పడిపోతుందని సర్కారు పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలయ మూసివే యాల్సిన సమయం తర్వాత కూడా తెరిచి ఉంచితే ఆలయ భద్రతలో విధుల్లో ఉన్న ఎస్టీ ఎఫ్ సిబ్బంది నిబంధనల ప్రకారం వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయాలి. అలాంటిది డిసెంబర్ 26న అర్ధరాత్రి బయట వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించినా ఎస్టీఎఫ్ పోలీసులతో సహా అధికారులు, అర్చకులు మౌనం వహిస్తున్నారు. కేసు ఎందుకు నమోదు చేయలేదంటే..!? తాంత్రిక పూజల ఉదంతంలో ఇంతవరకు పోలీసు కేసు నమోదు చేయనే లేదు. దీన్ని శాఖాపరమైన వైఫల్యంగానే చూపిస్తూ కప్పిపుచ్చాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది. ‘ప్రాథమిక విచారణ చేయాలని మాత్రమే మాకు చెప్పారు. అంతటితో తమ పని పూర్తయ్యింది’అని ఓ అధికారి ‘సాక్షి’కి చెప్పడం గమనార్హం. అంటే తాంత్రిక పూజలు చేయడంపై కేసు నమోదు చేసి దోషులను శిక్షించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది. అలా చేస్తే విషయం న్యాయస్థానం పరిధికి వెళ్తుంది. దాంతో అసలు తాంత్రిక పూజలు ఎవరి కోసం చేశారన్నది వెల్లడించాలి. అందుకే కేసు నమోదు చేయించడం ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదన్నది స్పష్టమవుతోంది. -
లోకేశ్ కోసమే తాంత్రిక పూజలు ?
-
బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అలజడి
-
అవినీతిపై ఆగ్రహం
సాక్షి, విజయవాడ: దుర్గగుడి అధికారులు, సిబ్బంది అవినీతిపై పాలకమండలి సభ్యులు త్రీవ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కారణంగా దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింటోందంటూ కొంతమంది సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం సుమారు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా పాలకమండలి సమావేశం జరిగింది. చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో విజిలెన్స్ నివేదికపై ఈవో సూర్యకుమారిపై పాలకమండలి సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. సిబ్బందిపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నించారు. దీనిపై ఈవో స్పందిస్తూ దేవస్థానంలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందికి నోటీసులు ఇచ్చామని, వారు వివరణ ఇచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని సర్దిచెప్పారు. టికెట్ రిసైక్లింగ్పై గరంగరం ఈనెల 18న దర్శనానికి వచ్చిన 13 మంది అయ్యప్ప భక్తులకు రీసైక్లింగ్ టికెట్లు విక్రయించడంపై పాలకమండలి సభ్యులు ప్రశ్నించారు. ఇందులో కేవలం అటెండర్ చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకొంటే సరిపోదని, అతని వెనుక ఉన్న అధికారుల వివరాలు చెప్పాలంటూ పట్టుబట్టారు. దీనిపైనా విచారణ చేయిస్తున్నట్లు ఈవో వివరణ ఇచ్చారు. అర్ధరాత్రి పూజలేంటి? రాత్రి 10 గంటలకు అమ్మవారి ఆలయం మూసివేస్తారు. అయితే, 11.30 గంటలకు దేవాలయాన్ని తెరిచి ఉంచడమే కాకుండా దేవస్థానానికి చెందని అర్చకుడు వచ్చి అమ్మవారికి పూజలు చేయడంపై పాలకమండలి సభ్యులు ప్రశ్నించారు. నవమి రోజు మహిషాసురమర్దినీదేవికి పూజలు చేయించినట్లుగా తమకు సమాచారం వచ్చిందని, ఇప్పుడు ఆ పూజలు ఎందుకు చేయించాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు. అయితే, అటువంటి పూజలు ఏమీ జరగలేదని, అవసరమైతే విచారణ చేయిస్తామని చెప్పారు. చీరల ఆక్షన్, క్లోక్‌రూమ్, చెప్పుల స్టాండ్ నిర్వహణ దేవస్థానానికే.. అమ్మవారికి సమర్పించే చీరలు గతంలో తరహాలోనే దేవస్థానం ఆధ్వర్యంలోనే ఆక్షన్ నిర్వహించాలని నిర్ణయించారు. క్లోక్‌రూమ్, చెప్పుల స్టాండ్‌కు ఆక్షన్ నిర్వహించి కాంట్రాక్టర్లకు ఇచ్చే బదులుగా దేవస్థానమే నిర్వహించాలని పాలకమండలి నిర్ణయించింది. తలనీలాలకు, స్పాట్ ఫొటోలు, కొబ్బరిచెక్కలు, సీతానగరంలోని దుకాణాలకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. సమావేశంలో ప్రధాన అర్చకుడు ఎల్.దుర్గాప్రసాద్‌తో పాటు, పాలకమండలి సభ్యులు వెలగపూడి శంకరబాబు, పద్మశేఖర్, బీరక పూర్ణ మల్లికారమ ప్రసాద్, సాంబసుశీల, సూర్యలత, పాప, విజయశేఖర్, బడేటి ధర్మారావు, లక్ష్మి నరసింహారావు, రామనాధం, మోహన్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఎర్రముక్కల విక్రయాలు ఆగేనా? దుర్గగుడికి వచ్చే భక్తులను మోసంచేస్తూ పలు దుకాణాల వారు ఎర్రముక్కలు, అట్టలు పెట్టి చీరలు అమ్ముతున్నారు. వీటిని వేలంలో సేకరించి భక్తులకు తిరిగి అమ్ముతున్నారు. దీనిపై పాలకమండలి చర్చించి వచ్చేనెల 13వ తేదీ తరువాత తిరిగి వేలం వేయకూడదని నిర్ణయించారు. వీటిని దుకాణాల్లో విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. అయితే, ఈ నిర్ణయం ఎంతమేరకు అమలు జరుగుతుందో వేచి చూడాలి. ఆమోదించిన అంశాలు ► శ్రీశృంగేరీ శారదా పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామి నిర్ణయించిన విధంగానే మార్చిలో శ్రీమల్లేశ్వరస్వామి దేవాలయాన్ని పునః ప్రతిష్ట, కుంభాభిషేకం నిర్వహిస్తారు. ►హంసలదీవిలోని శ్రీరుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయాన్ని శృంగేరి శారదా పీఠానికి కాకుండా దేవస్థానమే నిర్వహించాలని నిర్ణయించారు. ►రాయబార మండపాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ►శ్రీప్రత్యేక శనైశ్చరస్వామి ఆలయం, సీతమ్మ వారి పాదాల నిర్మాణం పనిని దాతల సొంత ఖర్చులతో నిర్మించేందుకు ఆమోదించారు. ►పోరంకి వేద పాఠశాల, గొల్లపూడి, అర్జున వీధిలో గోశాలలు ఏర్పాటుచేసి ఆవులు పెంచాలని నిర్ణయించారు. -
దుర్గ గుడిలో సిబ్బంది చేతివాటం
సాక్షి, విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోని సిబ్బంది చేతివాటం మరోసారి బయటపడింది. భక్తులు వినియోగించిన టిక్కెట్లను సోమవారం తిరిగి మరోసారి భక్తులకు ఇచ్చి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని గమనించిన భక్తులు ఆలయ సిబ్బందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇంద్రకీలాద్రిపై సిబ్బంది చేతివాటం ఇది తొలిసారి కాదు. అనేక విషయాల్లో ఆలయంలో పనిచేస్తున్న కొందరు అక్రమంగా డబ్బులను సంపాదిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. తరుచుగా జరుగుతున్న ఇలాంటి ఘటనపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. -
ఇంద్రకీలాద్రిపై భక్తుల ఆందోళన
-
ఇంద్రకీలాద్రిపై భక్తుల ఆందోళన
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీగా తరలివచ్చిన భక్తులకు ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. ఎంతకూ అమ్మవారి దర్శనం లభించకపోవడంతో భక్తులు ఆందోళనకు దిగారు. ఆలయ అధికారులు వీఐపీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, దుర్గమ్మ దర్శనానికి తమను అనుమతించడం లేదని భక్తులు మండిపడుతున్నారు. రూ. 3వేలు పెట్టి టికెట్ కొనుకున్నా.. దర్శనం కోసం బారులు తీరడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంకుమపూజ కోసం భక్తులు మండుటెండలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా అందుబాటులోకి లేకపోవడంతో ఆలయ ఈవోను నిలదీశారు. దీంతో భక్తులకు సమాధానం చెప్పకుండానే ఈవో సూర్యకుమారి వెళ్లిపోయారు. శరన్నవరాత్రి వేడుకలు ఇంద్రకిలాద్రిపై వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మవారు ఆదివారం అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దుర్గమ్మ దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. -
శరన్నవరాత్రులకు విజయవాడ ముస్తాబు
-
దుర్గమ్మ సన్నిధిలో శాతకర్ణి బృందం
-
ఇంద్రకీలాద్రిపై శాతకర్ణి బృందం
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను సినీ నటుడు బాలకృష్ణ, హీరోయిన్ శ్రీయ, దర్శకుడు క్రిష్ లు దర్శించుకున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విడుదల సందర్భంగా నిన్న చిత్ర ప్రముఖులు విజయవాడకు విచ్చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం బాలకృష్ణ బృందం అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని బాలకృష్ణ, హీరోయిన్ శ్రేయ, దర్శకుడు క్రిష్ లకు అందచేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈ పండుగను తమ సొంత ఊరిలో బంధువుల మధ్య జరుపుకుంటానని అన్నారు. తెలుగు పౌరుషాన్ని దేశానికి చాటిచెప్పిన శాతకర్ణి సినిమాలో నటించడం, దానిని ప్రేక్షకులు ఆదరించడం ఆనందంగా వుందని అన్నారు -
డూప్లి‘కేటుగాడి’ పై అంత ప్రేమా?
ఇంద్రకీలాద్రిపై నకిలీ డ్యూటీ కార్డుల బాగోతం... ఔట్సోర్సింగ్ ఉద్యోగే సూత్రధారి అయినా చర్యలకు మీనమేషాలు ఇంద్రకీలాద్రి: దసరా ఉత్సవాలలో దుర్గగుడిలో రట్టయిన నకిలీ డ్యూటీ కార్డుల కుంభకోణంలో బాధ్యులైన సిబ్బందిపై చర్యలకు ఉన్నతాధికారులు నీళ్లునములుతున్నట్లు విమర్శలున్నాయి. ఈ బాగోతంతో ఆలయ పాలకవర్గం పరువుపోయినంత పనైంది. పరిపాలనా విభాగంలో అవుట్‌సోర్సింగ్‌లో పని చేసే ఒక ఉద్యోగే ఈ వ్యవహారంలో చక్రం తిప్పినట్లు సమాచారం. అంగ, అర్ధ బలాలు దండిగా ఉన్న అతడు సుదీర్ఘ సెలవుపై ఉంటూ కొద్ది రోజుల కిందటే డ్యూటీకి తిరిగి వచ్చినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఈ డ్యూటీ కార్డులను ఈ వ్యక్తి తమ అనుకూల వర్గానికి ఇష్టానుసారంగా జారీ చేసినట్లు ఆలయ సిబ్బంది బహిరంగంగానే చెబుతుండగా, అధికారుల విచారణలోనూ ఇదే వెల్లడైంది. అధికారులు డ్యూటీ కార్డులు జారీ చేసింది కొందరికే అయితే, ఆ కార్డులను కలర్ జిరాక్స్‌లు, పేర్లు, ఫోటోల మార్పిడితో ఇబ్బడిముబ్బడిగా నకిలీ కార్డులను పుట్టించారు. ఇలా పెద్దసంఖ్యలో అమ్మవారి దర్శనానికి రాజమార్గంలో చేరుకున్నారు. ఈ వ్యవహారం అనూహ్యంగా బయటకు రావడంతో రెండు రోజులలో సుమారు ఆరు వందలకు పైగా డ్యూటీ కార్డులను ఆలయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నచ్చినవారికి పంచిపెట్టారు వన్‌టౌన్‌లోని పలు దుకాణాల యజమానులకు, గుమస్తాలతో పాటు తమకు అనుకూలంగా వ్యవహరించిన వారికి ఈ నకిలీ కార్డులు పంచినట్లు తెలుస్తుంది. వాస్తవానికి డ్యూటీ కార్డులు జారీ చేసే సమయంలో కార్డులు ఎవరికి కార్డులు జారీ చేస్తున్నారని అంతా ఓ ప్రణాళిక ప్రకారం కొంత మంది సిబ్బందిని నియమించి మంజూరు చేశారు. ఉద్యోగి వివరాలను నమోదు చేసుకున్న తర్వాతే కార్డులను మంజూరు చేశారు. డ్యూటీ కార్డుల దుర్వినియోగానికి కారణమైన వ్యక్తిని ఆలయ అధికారులు గుర్తించినా అతనిపై ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవస్థానానికి లక్షలాది రూపాయలు నష్టంతో పాటు పరువుకు భంగం కలిగినా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోకపోవడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. -
దుర్గమ్మ గుడిలో పిడుగుపాటు
-
నాల్గోరోజు అన్నపూర్ణదేవిగా దుర్గమ్మ దర్శనం
-
ఈ నెల 14న దుర్గమ్మ దర్శనం నిలిపివేత
ఇంద్రకీలాద్రి : భాద్రపద శుద్ధ త్రయోదశి 14వ తేదీ నుంచి 17వ తేదీ బహుళ పాడ్యమి వరకు విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన మహానివేదన అనంతరం ఆలయ తలుపులు మూసివేస్తారు. ఆలయంలో అన్ని దర్శనాలు నిలిపివేస్తారు. తిరిగి15వ తేదీ తెల్లవారుజామున స్నపనాభిషేకం, అలంకరణ, నిత్యపూజల తర్వాత ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. -
వీఐపీలేనా భక్తులు ?
సాధారణ భక్తుల పరిస్థితి ఏమిటంటూ ఆగ్రహం కాటేజీలను పరిశీలించిన బీజేపీ కమిటీ విజయవాడ : దుర్గగుడి మాస్టర్ ప్లాన్ పేరుతో అమ్మవారి మూల ధనాన్ని వృథా చేయడంతో పాటు సాధారణ భక్తులకు వసతి లేకుండా చేస్తున్నారని బీజేపీ నిజ నిర్దారణ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో మాస్టర్‌ప్లాన్ పేరుతో జరుగుతున్న పలు పనులను బుధవారం నిజ నిర్దారణ కమిటీ సభ్యులు, బీజేపీ నగర నాయకులు శివకుమార్ పట్నాయక్, నగర ప్రధాన కార్యదర్శి బబ్బూరి శ్రీరామ్, నగర ఉపాధ్యక్షులు కొరగంజి భాస్కరరావు, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ పదిలం రాజశేఖర్, 31, 39వ డివిజన్ అధ్యక్షులు మానేపల్లి మల్లేశ్వరరావు, బచ్చు రమేష్ పరిశీలించారు. ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్, మాడపాటి సత్రాలు, అన్నదాన సత్రం తదితర ప్రాంతాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇష్టానుసారంగా పనులు దుర్గగుడికి ఏ అధికారి వచ్చినా ఆ అధికారి సొంత నిర్ణయాల మేరకే పనులు చేయిస్తున్నారని, దీని వల్ల భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని కమిటీ సభ్యులు శివకుమార్ పట్నాయక్ తెలిపారు. ఇదే పరిస్థితి మరి కొంత కాలం కొనసాగితే అమ్మవారి దర్శనంతో పాటు వసతి వీఐపీలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. సత్రాలలో ఉన్న గదులను తొలగించి వీఐపీలకు మాత్రమే గదులను నిర్మించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. పుష్కరాలకు అమ్మవారి ఆలయానికి ప్రభుత్వం ఎటువంటి నిధులను కేటాయించకుండా అమ్మవారి మూలధనం నుంచి డబ్బులు డ్రా చేసి పనులు చేయడం సరికాదన్నారు. రాష్ర్టంలో అన్ని దేవాలయాలకు కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం దుర్గగుడికి కమిటీని ఏర్పాటు చేయకపోవడం వల్లే అధికారులు ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారని, దీనికి అడ్డుకట్ట వేసి సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనంతో పాటు వసతి కల్పించేలా దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి ఈ వ్యవహారాలను తీసుకు వెళతామని కమిటీ సభ్యులు వివరించారు. -
దుర్గమ్మ సన్నిధిలో శ్రీజ దంపతులు
చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజ దంపతులు విజయవాడ కనకదుర్గమ్మను మంగళవారం సందర్శించుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్నారై కళ్యాణ్‌తో శ్రీజ పెళ్లి మార్చి 28న జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి అయిన తర్వాత తొలిసారిగా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధికి వచ్చిన ఈ కొత్త దంపతులు అమ్మవారిని, స్వామిని కూడా దర్శించుకున్నారు. -
'అమ్మ ఆశీర్వాదం కోసం వచ్చా'
విజయవాడ : భార్యాభర్తల మధ్య అనుబంధాలు, కోపతాపాలను చక్కగా తెరపై చూపిన చిత్రం 'పెళ్లిపుస్తకం' అని మా అధ్యక్షుడు, టాలీవుడ్ ప్రముఖ నటుడు జి.రాజేంద్రప్రసాద్ తెలిపారు. శుక్రవారం విజయవాడలో రాజేంద్రప్రసాద్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల రాజేంద్రప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ... బాపు, రమణలు చక్కగా తెరకెక్కించిన పెళ్లి పుస్తకం చిత్రం విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకుందని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్బంగా అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చినట్లు రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. మా తరపున సినిమా కళాకారులందరికీ ఆరోగ్య కార్డులు జారీ చేసినట్లు చిత్ర పరిశ్రమలోని వారి కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్బంగా రాజేంద్రప్రసాద్ వివరించారు. అంతకుముందు అధికారులు రాజేంద్రప్రసాద్‌కు ఆలయంలో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు రాజేంద్రప్రసాద్‌కు అందజేశారు. -
దుర్గగుడి కొత్త ఈవో బాధ్యతల స్వీకరణ
ఇంద్రకీలాద్రి : విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా చంద్రశేఖర్ ఆజాద్ శుక్రవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే కృష్ణా పుష్కరాలు విజయవంతం చేసేందుకు కృషి చేస్తానని, దేవస్థానం ఉద్యోగుల ఆందోళనలను త్వరలోనే సమసిపోతాయన్నారు. ఇప్పటివరకు ఉన్న ఈవో నరసింగరావుపై అర్చకులు ఆరోపణలు చేయడం, ఆందోళనకు దిగడంతో గతంలో ఈవో వ్యవహరించిన ఆజాద్‌కు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఆందోళన విరమించిన అర్చకులు దేవస్థానం అర్చకులు శుక్రవారం తమ ఆందోళన విరమించారు. నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ ఆజాద్, దేవాదాయ శాఖ అధికారులు అర్చకులతో చర్చలు జరిపారు. ఇప్పటి వరకు ఈవోగా వ్యవహరించిన నరసింగరావు వేధింపుల కారణంగా ఆస్పత్రి పాలైన అర్చకుడు సుబ్బారావు వైద్యానికి అయ్యే ఖర్చును దేవస్థానమే భరించాలని, అలాగే నరసింగరావును మాతృవిభాగమైన రెవెన్యూ విభాగానికి సరెండర్ చేసి సస్పెండ్ చేయాలని అర్చకులు పలు డిమాండ్లు వినిపించారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని ఈవో ఆజాద్ చెప్పడంతో... భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆందోళనను విరమిస్తున్నట్టు అర్చకులు ప్రకటించారు. -
బెజవాడ కనకదుర్గ ఆలయానికి పోటెత్తిన భక్తులు
విజయవాడ : విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. శ్రీ పంచమి నేపథ్యంలో అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిపోయింది. అమ్మవారు సరస్వతి అవతారంలో దర్శనమిస్తున్నారు. అయితే శ్రీపంచమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై విజయిభవ మహాసరస్వతియాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగానికి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అమ్మవారి ఆశీస్సులు అందించేందుకు ఈ యాగం నిర్వహిస్తున్నారు. -
నేటి నుంచి భవానీ దీక్షల విరమణ