అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్

సాక్షి, విజయవాడ : టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు శనివారం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, సుబ్బారెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితులు దంపతులకు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మంచి జరగాలని ప్రార్థించానన్నారు. మూడు ప్రాంతాలలో రాజధాని రావడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. టీటీడీలో సామాన్య భక్తులకు దర్శన భాగ్యం అందేవిధంగా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఇప్పటివరకు ఉన్న పద్దతులను ప్రక్షాళన చేసి కొత్త పద్దతులను ప్రారంభిస్తామని తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి