నా కూతుర్ని సినిమాల్లో ఊహించలేదు.. నాగార్జున వల్లే.. | Priyadarshan Reveals Because of Nagarjuna Phone Call Kalyani Eners into Cinema | Sakshi
Sakshi News home page

కలలో కూడా అనుకోలేదు.. నాగార్జున ఫోన్‌ చేయడం వల్లే..

Mar 15 2026 4:03 PM | Updated on Mar 15 2026 4:57 PM

Priyadarshan Reveals Because of Nagarjuna Phone Call Kalyani Eners into Cinema

మలయాళ టాప్‌ డైరెక్టర్‌ ప్రియదర్శన్‌ కూతురు కల్యాణి తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. 2017లో తెలుగు సినిమా హలోతో ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కొద్దికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ సినిమాలు చేసింది. గతేడాది లోక చాప్టర్‌ 1 చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించింది.

కలలో కూడా అనుకోలే
అయితే ఆమె హీరోయిన్‌ అవడానికి కింగ్‌ నాగార్జునే ప్రధాన కారణం అంటున్నాడు ప్రియదర్శన్‌. పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నా కూతురు కెమెరా ముందుకు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే సినిమా సెట్‌కు రావడానికి తనెప్పుడూ ఇష్టపడలేదు. తను ఆర్కిటెక్చర్‌ చదివింది. ఆ‍ర్కిటెక్ట్‌ అవ్వాలనుకుంది. 

నాగార్జున ఫోన్‌ చేయడంతో..
కానీ, సడన్‌గా ఒకసారి నాగార్జున ఫోన్‌ చేసి కల్యాణిని సినిమాలో తీసుకోవాలనుకుంటున్నాం అన్నాడు. తనకు నటించడం రాదని చెప్పాను. కానీ నా కూతురు ఒకసారి ట్రై చేస్తే పోలా అంది. ఇక్కడ నేను కోల్పోయేదేం లేదు, నాకు సినిమాలు సెట్టవకపోతే మళ్లీ ఆర్కిటెక్చర్‌ వైపు వెళ్లిపోతానంది. అలా తను సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తండ్రిగా తన సినీజర్నీ చూస్తుంటే సంతోషంగా ఉంది. కాకపోతే నా సినిమాల గురించి తనతో మాట్లాడను. తను చేసే ప్రాజెక్టుల గురించి నాతో చర్చించదు. 

సినిమా తప్ప..
ఎందుకంటే తను ఇప్పటి జెనరేషన్‌ అమ్మాయి. ఈతరం వాళ్లు సినిమాను ఒకలా చూస్తారు. నేనేమో పాత స్కూల్‌కు చెందినవాడిని. మేమిద్దరం సినిమా తప్ప అన్నింటిగురించి మాట్లాడుకుంటాం అని ప్రియదర్శన్‌  చెప్పుకొచ్చాడు. కాగా హలో మూవీతో కింగ్‌ నాగార్జున చిన్న కుమారుడు అఖిల్‌ హీరోగా పరిచయమయ్యాడు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతోనే కల్యాణి ప్రియదర్శన్‌ కూడా కథానాయికగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.

చదవండి: దేవుడు నాకిలా రాసిపెట్టాడు: డిమాన్‌ పవన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement