దేవుడు నాకిలా రాసిపెట్టాడు: పవన్‌ ఎమోషనల్‌ | Bigg Boss Demon Pavan About his First Flight, shares Post | Sakshi
Sakshi News home page

Demon Pavan: తొలిసారి విమానం ఎక్కిన పవన్‌.. నాన్న కోసం ఇలా..

Mar 15 2026 2:35 PM | Updated on Mar 15 2026 4:01 PM

Bigg Boss Demon Pavan About his First Flight, shares Post

బిగ్‌బాస్‌ షోలో కొందరు ఎంత బాగా ఆడినా సరే ఎక్కువ హైలైట్‌ అవరు. అండర్‌ రేటెడ్‌ కంటెస్టెంట్‌గానే మిగిలిపోతారు. డిమాన్‌ పవన్‌ కూడా అదే కోవకి చెందుతాడు. అగ్నిపరీక్షను నెగ్గి తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌లో సామాన్యుడిగా అడుగుపెట్టాడు. కానీ రీతూతో ఫ్రెండ్‌షిప్‌ కాస్త హద్దులు దాటడంతో అతడిపై విమర్శలు వచ్చాయి. 

బిగ్‌బాస్‌తో గుర్తింపు
వీరి లవ్‌ ట్రాక్‌ను కొందరు ఇష్టపడితే మరికొందరు అసహ్యించుకున్నారు. ఫలితంగా అతడి లవ్‌ ట్రాక్‌ తన కష్టాన్ని కప్పేసింది. మాటల్లో మెచ్యూరిటీ చూపించే అతడు రీతూ ఎలిమినేట్‌ అయ్యాక ఫుల్‌ హుషారుగా ఆడటం మొదలుపెట్టాడు. దీంతో సీజన్‌ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచాడు. తన తండ్రి టంగ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పటికీ, ఎన్నడూ అది చెప్పి సింపతీ సాధించాలనుకోలేదు.

తొలిసారి విమానం
ఫైనల్స్‌లో మాత్రం తండ్రి చికిత్స కోసం రూ. 15 లక్షల క్యాష్‌ప్రైజ్‌ అందుకుని బయటకు వచ్చాడు. కానీ పవన్‌ ఆశలు అడియాసలయ్యాయి. ఇటీవలే పవన్‌ తండ్రి దుర్గాప్రసాద్‌ కన్నుమూశారు. ఈ క్రమంలో తాజాగా ఓ పోస్ట్‌ పెట్టాడు. జీవితంలో తొలిసారి విమానం ఎక్కుతున్నట్లు తెలిపాడు. ఇది నా జీవితంలో ఫస్ట్‌ ఫ్లైట్‌.. అమ్మానాన్నతో లేదా బెస్ట్‌ఫ్రెండ్స్‌తో లేదంటే ఏదైనా ముఖ్యమైన కారణముంటేనే విమానం ఎక్కాలనుకున్నాను. 

దేవుడు నాకిలా రాసిపెట్టాడు
ఎందుకంటే అది నాకు జీవితాంతం గుర్తుండిపోవాలి. దురదృష్టవశాత్తూ మా నాన్నతో నేనెప్పటికీ విమానం ఎక్కలేను. దేవుడు నాకిలా రాసిపెట్టాడు.. మా నాన్న కోసం నేను తొలిసారి ఫ్లైట్‌ ఎక్కి కాశీ వెళ్లబోతున్నాను. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన జ్ఞాపకం అని పవన్‌ పేర్కొన్నాడు.

 

 

చదవండి: పురుషులే బాధితులా? హీరో భార్య కౌంటర్‌

Advertisement
 
Advertisement
Advertisement