breaking news
Demon Pavan
-
నిజాలు చెప్పిన నాగ్.. రీతూ-పవన్‌ని రెచ్చగొట్టి
ఎప్పటిలానే వీకెండ్ ఎపిసోడ్ కాస్త సందడిగానే జరిగింది. ఆదివారం బిగ్‌బాస్ హౌస్‌లో దసరా సెలబ్రేషన్స్ చేశారు. దీంతో ఆటపాటలతో సందడి సందడిగా కనిపించింది. అయితే ఇదే ఎపిసోడ్లో హౌస్మేట్స్ ఫేకే గేమ్ ఆడుతున్న కొందరికి నాగ్ చీవాట్లు పెట్టాడు. రీతూ-పవన్‌ని నాగార్జున తెగ రెచ్చగొట్టాడు. మరోవైపు అనుకున్నట్లు ప్రియ ఎలిమినేట్ అయిపోయింది. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏమేం జరిగింది? కొత్త కెప్టెన్ ఎవరయ్యారు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు.. ఆ మూడు మాత్రం)హౌస్‌లో ఉన్నవాళ్లని రెండు జట్లుగా విడగొట్టిన నాగార్జున ఓవరాల్‌గా ఐదు గేమ్స్ పెట్టాడు. వీటిలో గెలిచిన టీమ్‌కి ఒక్కో ఆయుధాన్ని ఇచ్చారు. అలా ఇమ్మాన్యుయేల్‌కి సంబంధించిన టీమ్ రెడ్ విజేతగా నిలిచింది. ప్రతి పోటీలో గెలిచినప్పుడు ఒక్కొక్కరికి చొప్పున హరీశ్, రీతూ, సంజన, పవన్, రాముకు వాళ్ల ఇంటి నుంచి మెసేజ్ లేదా వాయిస్ నోట్ లేదా ఫొటోస్ వచ్చాయి. చివరగా వీళ్లు ఐదుగురే కెప్టెన్సీ రేసులో ఉన్నారని చెప్పి నాగ్ షాకిచ్చాడు. వీళ్ల ఐదుగురికి బుట్టబొమ్మ అని ఓ పోటీ పెట్టగా అందులో నెగ్గిన పవన్.. రెండోసారి కెప్టెన్ అయిపోయాడు.ఇకపోతే బిగ్‌బాస్ 9వ సీజన్ మొదలైపోయి మూడు వారాలు పూర్తయింది. అయినా సరే ఇప్పటికీ హౌస్‌లో జోష్ లేదు. దీనికి కారణం హౌస్‌మేట్సే. ఎందుకంటే వచ్చిందే ఎంటర్టైన్ చేయడానికి, అది మానేసి చేయాల్సిన అతి అంతా చేస్తున్నారు. దీంతో 'ఆస్క్ బీబీ టీమ్' పేరుతో హోస్ట్ నాగార్జున.. ఒక్కొక్కరికి గట్టిగానే కౌంటర్స్ వేశాడు. అయితే నాగ్ అడిగిన ప్రశ్నలన్నీ ఆడియెన్స్ నుంచి వచ్చినవే. దీనికి సదరు కంటెస్టెంట్స్ నుంచి సమాధానాలు నిజమా అబద్ధమా అనేది కూడా ఆడియెన్సే నిర్ణయించారు. వీళ్లలో సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, సంజన, ఫ్లోరా తదితరలు మాత్రమే జెన్యూన్ అని షో చూస్తున్న ప్రేక్షకులు కుండబద్ధలు కొట్టేశారు. తద్వారా షోలో అస్సలు జోష్ లేదని చెప్పకనే చెప్పినట్లయింది. మరి ఇప్పటికైనా మిగిలిన హౌస్మేట్స్ తమ గేమ్‌ని బయటపెడతారా అనేది చూడాలి?హౌసులో మొన్నటివరకు జంటగా తిరిగిన రీతూ-పవన్ మధ్య గతవారం మనస్పర్థలు వచ్చాయి. అలానే రీతూతో కల్యాణ్ కూడా కాస్త క్లోజ్‌గా ఉంటూ వస్తున్నాడు. గతవారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చిన దివ్య.. వీళ్ల ముగ్గురిని చూసి ట్రయాంగిల్ అనే పదం ఉపయోగించింది. ఆదివారం ఎపిసోడ్లో హౌస్ట్ నాగార్జున అయితే పదేపదే ఈ పదాన్ని ఉపయోగిస్తూ రీతూ-పవన్‌ని రెచ్చగొట్టాడు. వచ్చిన సెలబ్రిటీలకు కూడా వీళ్ల గురించి చెప్పారు. దీంతో వివరణ ఇచ్చిన పవన్.. నాగార్జునకు క్లారిటీ ఇస్తూనే మరోవైపు రీతూతోనూ ఉన్న మనస్పర్థల్ని క్లియర్ చేసుకున్నాడు.ఎలిమినేషన్ విషయానికొస్తే.. శనివారం ఎపిసోడ్లో ఇమ్యూనిటీ దక్కించుకుని ఫ్లోరా సేవ్ అయిపోయింది. మిగిలిన ఐదుగురు హరీశ్, ప్రియ, రీతూ, కల్యాణ్, రాములలో ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చారు. చివరగా కల్యాణ్, ప్రియ మిగిలారు. అయితే తాను ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానో అని ముందే కల్యాణ్ గట్టిగా ఏడ్చేశాడు. ప్రియ ఎలిమినేట్ అయింది గానీ కల్యాణ్ గుక్కపెట్టి ఏడ్చాడు. ఆమెని పట్టుకుని కాసేపు వదల్లేదు. చివరగా ప్రియని హౌస్ నుంచి బయటకు పంపించేశారు. ఆమె వెళ్తూవెళ్తూ హరీశ్, తనూజ, భరణి డెవిల్ ట్యాగ్స్ ఇచ్చింది.(ఇదీ చదవండి: Bigg Boss 9: ప్రియ ఎలిమినేట్.. ఎంత సంపాదించిందంటే?) -
హౌస్‌మేట్స్‌ను వెర్రిపప్పలను చేసిన బిగ్‌బాస్.. ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలు!
మీరు పొడిచిందేమీ లేదు, మీ వల్ల షోకి మజా కూడా లేదు అనుకున్నాడో ఏమోకానీ వైల్డ్‌కార్డులను దింపబోతున్నాడు బిగ్‌బాస్ (Bigg Boss 9 Telugu). ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్లో అగ్నిపరీక్ష నుంచి నలుగురు కంటెస్టెంట్లను హౌస్‌కి పంపించాడు. అందులో ఎవరు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోమని కంటెస్టెంట్లకు బాధ్యత అప్పగించాడు. ముందుగా వచ్చిన నలుగురు.. షాకిబ్, నాగ ప్రశాంత్, దివ్య నిఖిత, అనూష రత్నం తామెందుకు అర్హులనేది పాయింట్స్ చెప్పారు. శ్రీజ, కల్యాణ్‌కు కౌంటర్లుఇంకా ఎవరైనా ప్రశ్నలు అడగొచ్చనగానే శ్రీజ (Srija Dammu) పైకి లేచింది. హౌస్‌లోకి రావాలనుకుంటే ఎవర్ని స్వాప్ చేసుకుంటావ్? అని అడిగింది. అందుకు అనూష.. నీతోనే స్వాప్ చేసుకుంటా.. నీ ఇగో సంతృప్తి చెందకపోతే పుండు మీద పిన్నీస్ పెట్టి పొడుస్తూనే ఉంటావ్.. నీ అంత నెగెటివిటీ ఎవరి దగ్గరా లేదు అని చెప్పింది. అటు దివ్య కూడా.. శ్రీజతోనే స్వాప్ చేసుకుంటానంది. షాకిబ్, నాగ.. పవన్ కల్యాణ్‌తో స్వాప్ చేసుకుంటామన్నారు. అగ్నిపరీక్షలో ఉన్న ఫైర్ ఇక్కడ లేదన్నారు.వీడికి ఇంకో అమ్మాయి కావాలట! ఈ చర్చలయ్యాక బిగ్‌బాస్ వారిని బయటకు పంపించాడు. దివ్య ఓవర్ కాన్ఫిడెన్స్, అనూష ఓవర్ స్మార్ట్.. నాగ, షాకిబ్లో ఎవరైనా ఓకే అని రీతూ అంది. డిమాన్ మాత్రం.. దివ్య అయితే బాగుంటుందన్నాడు. పక్కనే ఉన్న సంజనా.. వీడికి ఇంకో అమ్మాయి కావాలట.. అంటూ ఏడిపించింది. అనంతరం బిగ్‌బాస్.. ఏ కంటెస్టెంట్ కావాలన్నది హౌస్‌మేట్స్‌తో ఓటింగ్ వేయించాడు. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ ఇచ్చాడు. ట్రయాంగిల్ కాస్తా..ఈ ఆటలో మీ పావు మీరు కదిపారు. ఇప్పుడు నేను అసలైన ఆట ఆడతా అన్నట్లుగా అందరికీ దిమ్మతిరిగిపోయే షాకిచ్చాడు. హౌస్‌మేట్స్‌ను ఆటలో అరటిపళ్లను చేస్తూ తక్కువ ఓట్లు వచ్చిన దివ్య నిఖితను హౌస్‌లోకి పంపించాడు. ఈ దెబ్బకు హౌస్మేట్స్ షాకై చూస్తుండిపోయారు. ఇక రావడంతోనే దివ్య.. హౌస్‌లో ట్రయాంగిల్ నడుస్తోంది.. అది దాదాపు స్క్వేర్ యాంగిల్ అవుతుందేమోనని చెప్పింది.అందరూ షేకయ్యారుఆ ఒక్క మాటతో అందరూ వణికిపోయారు. ఇద్దరు పవనాలు (డిమాన్ పవన్, పవన్ కల్యాణ్) మధ్యలో రీతూ అన్న విషయం అందరికీ తెలిసిందే! స్క్వేర్ అన్నదంటే కల్యాణ్.. తనూజను లింక్ చేస్తోందని అర్థం. దివ్య కావాలనే ఈ లవ్ ట్రాక్ గురించి బయటపెట్టింది. నేను ఒక్క మాట చెప్తే దానికి నలుగురు షేక్ అయ్యారు. ఇప్పుడు వాళ్లు ఎలా ఉంటారో చూస్తానుద! ఏది నిజమైన లవ్ ట్రాక్? ఏది డ్రామా? తెలిసిపోతుంది అని కెమెరాలతో మాట్లాడింది. మళ్లీ దొంగతనం గోలఇక సంజనా.. రానురానూ గజదొంగలా మారిపోతోంది. దొంగతనం తప్ప ఏదీ చేయను అన్నట్లుగా ప్రవర్తిస్తోంది. తనూజ కాఫీ పౌడర్, సుమన్ సిగరెట్స్ దాచేసిన ఆమె.. ఇప్పుడు దివ్య నిఖిత మేకప్ సామాన్ కొట్టేయాలని పథకం రచించింది. దొంగతనం ఒకసారి చేస్తూ క్యూట్ ఏమో కానీ, ఇలా పదేపదే చేస్తుంటే అది చూసేవారికి రోత పుట్టిస్తుంది. ఈ విషయంలో ఈసారైనా నాగ్.. సంజనాకు క్లాస్ పీకుతాడేమో చూడాలి!చదవండి: నాకు పిల్లలు కావాలి: సల్మాన్ ఖాన్ -
రీతూ వల్ల కెప్టెన్సీ పాయే.. కానీ మళ్లీ గెలిచి సాధించిన పవన్
నువ్వు అనుకుంటే అయిపోద్ది సామీ! అన్నది సినిమా డైలాగ్.. అయితే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9)లోనూ రీతూ బలంగా కోరుకుంటే అది జరిగి తీరాల్సిందే! డిమాన్ పవన్ కెప్టెన్ అవాలని ఆశపడింది. తాను సగం చాక్లెట్ తిని.. ఎంగిలి చేసిన చాక్లెట్‌ను పవన్‌కు ఇస్తూ నువ్వే కెప్టెన్ అవాలి అని కళ్లతోనే ఆర్డరేసింది. తీరా సంచాలక్ పదవి తన చేతికే రావడంతో పవన్‌ను కెప్టెన్ చేసేసింది.మళ్లీ కెప్టెన్ అయిన పవన్‌కానీ నాగార్జున ఈ వ్యవహారాన్నంతా వీడియో వేసి మరీ చూపించాడు. సంచాలక్‌గా రీతూ.. భరణిని అవుట్ చేయడం తప్పని చెప్పాడు. పవన్‌ను కావాలనే గెలిపించిందన్నాడు. దీంతో పవన్.. నిజాయితీగా కెప్టెన్సీ గెలుస్తాను, ఇది నాకొద్దంటూ కెప్టెన్సీ బ్యాడ్జ్ తిరిగిచ్చేశాడు. దీంతో హౌస్‌లో మరోసారి కంటెండర్లు భరణి, మనీష్, ఇమ్మాన్యుయేల్, పవన్ మధ్య గేమ్ పెట్టారు. ఈ గేమ్‌లో పవన్ గెలిచి మళ్లీ కెప్టెన్సీ సాధించాడని తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ పవన్ కెప్టెన్సీ బ్యాడ్జ్‌తో కనిపించాడు. చదవండి: నాగార్జుననే ఎదిరించిన శ్రీజ, ప్రియ.. ఉతికారేసిన హోస్ట్ -
నాగార్జుననే ఎదిరించిన శ్రీజ, ప్రియ.. ఉతికారేసిన హోస్ట్
జింతాత జితా జితా.. జింతాత తా.. శనివారం ఎపిసోడ్ చూశాక ఈ పాట కచ్చితంగా వేసుకోవాల్సిందే! ఆ రేంజ్లో ఉంది నాగార్జున హోస్టింగ్. మేమే తోపు, ఇల్లంతా మాదే అన్న భ్రమలో బతికేస్తున్న సామాన్యుల మబ్బులు విడిపోయేలా క్లాస్ పీకాడు. ముఖ్యంగా ప్రతిదానికీ గొడవపడటం ఒక్కటే మార్గం అన్నట్లుగా నోరేసుకుని పడిపోతున్న ప్రియ, శ్రీజల నోటికి తాళం వేసేలా మాట్లాడాడు. అసలు ఎపిసోడ్లో ఏం జరిగిందో వివరంగా చూసేద్దాం..ఒళ్లంతా కళ్లు లేవునాగార్జున (Nagarjuna Akkineni) వచ్చీరావడంతోనే రీతూ చౌదరి సంచాలక్‌గా ఫెయిలైందని వీడియో ఆధారాలతో సహా బయటపెట్టాడు. భరణిని కావాలనే గేమ్‌లో ఎలిమినేట్ చేసిందని చూపించాడు. పవన్ కెప్టెన్ అవాలని ముందునుంచే నిర్ణయించుకున్న ఆమె అనుకున్న ప్రకారం అతడిని కెప్టెన్ చేసిందన్నాడు. రీతూ మాత్రం.. నాకున్నవి రెండే కళ్లు, బాడీ మొత్తం లేవు కదా.. టాస్క్‌లో పవన్ వేరేవాళ్లకు రంగు పూసింది కనిపించలేదు. నాకతడిపై సాఫ్ట్ కార్నర్ లేదు. కావాలని గెలిపించలేదు అని కహానీలు చెప్పింది. సారీ చెప్పిన రీతూకానీ స్టూడియోలో ఉన్న ఆడియన్స్ రీతూ (Rithu Chowdary) తప్పు నిర్ణయం తీసుకుంది సార్. ప్రియ, శ్రీజ, మనీష్ శాడిస్టులుగా ప్రవర్తించారు. టెనెంట్స్‌కు అన్యాయం జరిగింది అన్నారు. దాంతో రీతూ చేసేదేంలేక సారీ చెప్పింది. అయితే ప్రియ, శ్రీజ మాత్రం మేమేం తప్పు చేశాం? అని ఏమీ ఎరగనట్లే మాట్లాడారు. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నాం, అందులో తప్పేముంది? అని ప్రశ్నించింది. ప్రియ, శ్రీజలకు ఇచ్చిపడేసిన నాగ్దీనికి నాగ్.. షోకి వెళ్లేవరకు మాత్రమే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. ఇప్పుడు ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ మాత్రమే అని క్లాస్ పీకాడు. ఎంతసేపూ తుత్తుత్తు అంటూ మాట్లాడతారు. ఇద్దరూ కాదు, ఎవరో ఒకరే మాట్లాడండి అని ప్రియ, శ్రీజలను హెచ్చరించాడు. అలాగే ప్రియ సంచాలక్‌గా ఫెయిలైన వీడియో (చక్రం టాస్క్‌లో పవన్ కల్యాణ్ ఫౌల్ గేమ్) కూడా ప్లే చేశాడు. మొదట తనది తప్పేనని ఒప్పుకున్న ఆమె.. తర్వాత తనసలు తప్పు చేయలేదు, అంతా కరెక్ట్‌గానే ఉందని నాగార్జునతోనే వాదించింది.ఇది కరెక్ట్ కాదు సార్ఇక మరోవైపు డిమాన్ పవన్ కెప్టెన్సీ రద్దు చేసిన నాగ్ మళ్లీ కెప్టెన్సీ టాస్క్ పెడతానని ప్రకటించాడు. ఈసారి కూడా రీతూ చౌదని సంచాలక్‌గా ఉంటుందని వెల్లడించాడు. ఇది నచ్చని శ్రీజ.. ఇది కరెక్ట్ కాదు సార్.. అంటూ నాగార్జుననే ఎదిరించింది. సంచాలక్ చేసిన తప్పుకి ప్లేయర్‌ను తీసేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడింది. పవనే ఈ కెప్టెన్సీ వద్దనుకుంటున్నాడు. ఫెయిర్‌గా ఆడి గెలవాలనుకుంటున్నాడు. నీకేంటి సమస్య? ప్రతి విషయంలో తుత్తుత్తు అని వస్తావ్ అని శ్రీజ దుమ్ము దులిపేశాడు. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లంటే ఇదే!అలా నెత్తికెక్కిన కామనర్ల కళ్లు కిందకు వచ్చేలా చేశాడు. నాగార్జున కామనర్లపై విరుచుకుపడినప్పుడల్లా ప్రేక్షకుల చప్పట్లతో స్టూడియో దద్దరిల్లిపోయింది. ఇక మరో ట్విస్ట్ ఏంటంటే.. ఓనర్లను టెనెంట్లుగా, టెనెంట్లను ఓనర్లుగా మార్చేశాడు. ఓనర్షిప్ గెలిచి సాధించుకున్న రాము, భరణి ఓనర్లుగానే కొనసాగుతారన్నాడు. మరి టెనెంట్లయ్యాకైనా కామనర్ల గర్వం అణుగుతుందేమో చూడాలి!చదవండి: బిగ్‌బాస్ 9 రెండో ఎలిమినేషన్.. సామాన్యుడు ఔట్! -
రీతూ బండారం బట్టబయలు.. పవన్ కెప్టెన్సీ ఫసక్
బిగ్‌బాస్ ఆడియెన్స్ ఎదురుచూసిన ప్రోమో రానే వచ్చేసింది. ఎందుకంటే ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్ట్రాంగ్ ప్లేయర్లు అయిన భరణి, ఇమ్మాన్యుయేల్‌లని కాదని సంచాలక్ రీతూ.. పవన్ కెప్టెన్ అయ్యేలా చేసింది. ఎప్పుడు వీకెండ్ వస్తుందా? ఎప్పుడు నాగార్జున ఈ విషయం గురించి రీతూని కడిగేస్తాడా అని చూశారు. ఇప్పుడు శనివారం ఎపిసోడ్లో అదే జరగబోతుంది. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు'.. టాక్ ఏంటి?)ప్రోమోలో చూపించినట్లు వస్తూవస్తూనే నాగార్జున.. కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడాడు. రీతూ చౌదరి దొంగబుద్ధి చూపించడం, సంచాలక్‌గా ఫేవరిజం చూపించి పవన్ కెప్టెన్ అయ్యేలా చేయడం, దీని గురించి నాగార్జున కౌంటర్స్ వేశారు. అన్యాయంగా భరణిని ఎలిమినేట్ చేయడం, పవన్‌కి కెప్టెన్సీ ఇచ్చేయడం లాంటి విషయాల గురించి అడిగి కడిగిపారేశారు. అలానే రీతూ-పవన్ ముందస్తుగానే మాట్లాడుకుని ఇదంతా చేసినట్లు ఓ వీడియోని హౌస్ అంతా చూపించి రీతూ బండారం బట్టబయలు చేశారు.అలానే తప్పు పద్ధతిలో కెప్టెన్ అయిన పవన్ నుంచి ఆ పవర్ తీసేసుకున్నారు. ఇలా ప్రోమో ఎండ్ అయింది. మరి పవన్ నుంచి తీసుకున్న కెప్టెన్సీ వేరే ఎవరికైనా ఇస్తారా లేదంటే ఈ వారం కెప్టెన్ లేకుండా హౌస్ నడవబోతుందా అనేది చూడాలి. మరోవైపు ఈ వీక్ నామినేషన్స్‌లో ఏడుగురు ఉన్నారు. వీళ్లలో సుమన్ శెట్టి, భరణి, ఫ్లోరా, హరీష్, మనీష్, పవన్, ప్రియ ఉన్నారు. గతవారం శ్రష్ఠి వర్మ ఎలిమినేట్ అయింది. మరి ఈసారి ఎవరి వికెట్ పడుతుందో చూడాలి?(ఇదీ చదవండి: కొంపముంచిన కామెడీ స్పూఫ్.. ఏకంగా రూ.25 కోట్ల దావా) -
కెప్టెన్‌గా డిమాన్ పవన్.. దగ్గరుండి గెలిపించిన రీతూ చౌదరి
బిగ్‌బాస్ 9.. ఈసారి డబల్ హౌస్ అంటూ ఊదరగొట్టారు. ఇదేదో కొత్త కాన్సెప్ట్‌లా ఉందే అని అందరూ తెగ ఎగ్జైట్ అయ్యారు. పైగా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అనగానే బుల్లితెర ప్రేక్షకులు ఈసారి షో హిట్టవడం ఖాయం అని ముందుగానే ఫిక్సయిపోయారు. కానీ కంటెస్టెంట్ల ఎంపిక చూశాక నీరసించారు, అయినా అగ్నిపరీక్ష నెగ్గొచ్చిన కామనర్లున్నారుగా.. వాళ్లు ఆటతో రఫ్ఫాడిస్తారులే అనుకున్నారు.విసుగు తెప్పిస్తున్న కామనర్లుకట్ చేస్తే రఫ్ఫాడించడం దేవుడెరుగు.. షో చూడాలంటేనే విసుగొచ్చేలా ప్రవర్తిస్తున్నారు. బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌కు ఓనర్లు అన్నందుకు నిజంగానే యజమానుల్లా ఫీలైపోతున్నారు. సెలబ్రిటీలపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఛాన్స్ దొరికితే చాలు గొడవలకు సై అంటూ నోరేసుకుని మీద పడిపోతున్నారు. వాళ్ల ఓవరాక్షన్‌తో ప్రేక్షకులకు షో చూడాలంటేనే విసుగు పుడుతోంది. దీంతో ఆ వైల్డ్ కార్డులు ఎప్పుడొస్తాయా? అని జనం ఎదురు చూస్తున్నారు.కెప్టెన్సీకి ఎవరు అనర్హులు?నిన్న (సెప్టెంబర్ 18) ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఓనర్లలో ఎవరు కెప్టెన్సీకి అనర్హులు? ఎవరు అర్హులో చెప్పాలని టెనెంట్లను ఆదేశించాడు బిగ్‌బాస్. దీంతో వాళ్లు ప్రియ, శ్రీజ, పవన్ కల్యాణ్, హరీశ్‌ను అనర్హులుగా తేల్చారు. దాంతో వాళ్లు కాసేపు గొడవపడ్డారు. ఇక అర్హులుగా భరణి, మనీష్, డిమాన్ పవన్ (Demon Pavan)ను ఎంపిక చేశారు. ఈ ముగ్గురూ టెనెంట్స్‌లో ఒకరిని కెప్టెన్సీ కంటెండర్‌గా సెలక్ట్ చేయాలన్నారు.రీతూ కోరిక పవన్ కాదంటాడా?దాంతో వాళ్లు పెద్దగా చర్చలు పెట్టకుండా ఏకాభిప్రాయంతో ఇమ్మాన్యుయేల్ పేరు చెప్పారు. అలా భరణి, మనీష్, డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్ రంగుపడుద్ది అనే టాస్క్‌లో పాల్గొన్నారు. అయితే దీనికంటే ముందు.. ఓ ఆసక్తికర చర్చ జరిగింది. నాకోసం ఈవారం కెప్టెన్ అవ్వాలని రీతూ (Rithu Chowdary) కోరడం.. నీకోసం ట్రై చేస్తా అని డిమాన్ పవన్ కళ్లలోకి కళ్లు పెట్టి మాటివ్వడం జరిగింది. మీ కోరికకు నేనెందుకు కాదంటాను అనుకున్నాడో ఏమో కానీ బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్‌కు రీతూను సంచాలక్‌గా పెట్టాడు.మొదట టార్గెట్ చేసిందెవరు?ఇంకేముంది, గేమ్‌ను తనకు నచ్చినట్లు మార్చేసింది. మొదటి రౌండ్లో మనీష్.. భరణిని టార్గెట్ చేసి అతడి ప్లేటు కింద పడేశాడు. దీంతో భరణి మనీష్‌కు రంగు పూశాడు. అలా మనీష్ ఔట్ అయ్యాడు. రెండో రౌండ్లో భరణి, ఇమ్మూ కలిసి డిమాన్‌ను టార్గెట్ చేశారు. దీంతో కామనర్స్.. కామనర్లు వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్లే టాస్క్ జరుగుతోంది. ఇద్దరూ కలిసి ఒక్కడిని టార్గెట్ చేస్తున్నారంటూ అరిచారు. ఈ గేమ్‌లో డిమాన్ ఔటవ్వాల్సింది. కానీ రీతూ అలా ఎలా చేస్తుంది? తాను ఆపమన్నా సరే, భరణి మూడుసార్లు పక్కవాళ్లపై రంగు పూశాడంటూ అతడిని గేమ్ నుంచి తీసేసింది. తర్వాతి రౌండ్లో ఇమ్మాన్యుయేల్ పోరాడి ఓడిపోయాడు. దీంతో విన్నర్ డిమాన్ పవన్.. హౌస్‌లో రెండో కెప్టెన్‌గా నిలిచాడు.చదవండి: ఒక్క ఏడాదిలోనే రూ.140 కోట్ల నష్టం: మిరాయ్ నిర్మాత -
ఎలిమినేషన్: కామనర్ల ఓవరాక్షన్.. ఆ కంటెస్టెంట్‌కు మూడినట్లే!
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కెప్టెన్సీ కోసం పోరు మొదలైంది. ఓనర్స్‌లో ఏ నలుగురికి కెప్టెన్ అయ్యే అర్హత లేదో టెనెంట్స్ చెప్పాలన్నాడు. దీంతో సెలబ్రిటీలందరూ చర్చించుకుని ప్రియ, శ్రీజ, హరీశ్, పవన్ కల్యాణ్‌లను పక్కన పెట్టేశారు. భరణి, డిమాన్ పవన్, మర్యాద మనీష్‌లను కెప్టెన్సీ కంటెండర్లుగా సెలక్ట్ చేశారు. రేసులో లేకుండా పోయిన కామనర్లు సెలబ్రిటీలపై విరుచుకుపడ్డారు. మీరు కావాలనే చేశారు, ఫేవరిటిజం చూపించారంటూ నోరేసుకుని పడిపోయారు. వీళ్ల ఓవరాక్షన్ వల్ల వారికే చేటు రానుంది. ఈ వారం కామనర్స్‌లో ఒకరు ఇంటి నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.నామినేషన్స్‌లో ఏడుగురుఈ వారం మనీష్, హరీశ్, సుమన్ శెట్టి, ప్రియ, డిమాన్ పవన్, ఫ్లోరా, భరణి నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో ఎక్కువగా భరణి, సుమన్ శెట్టి (Suman Shetty)కే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. హరీశ్, ఫ్లోరా సైనీకి పర్వాలేదనిపించేలా ఓట్లు పడుతున్నాయి. ఫ్లోరాకు ఓట్లు పడటానికి బలమైన కారణమే ఉంది. కామనర్స్ ఓవరాక్షన్‌తో ప్రేక్షకుల తల బొప్పి కడుతోంది. దీంతో వారిలో ఒకరిని పంపిస్తే కానీ వీళ్ల నోటికి తాళం పడేలా లేదని జనం ఫీలవుతున్నారు. అందుకే కామనర్స్‌లో ఒకరిని ఎలిమినేట్ చేయాలన్న కసితో ఫ్లోరాకు ఓట్లేసి మరీ ఆమెను సేవ్ చేస్తున్నారు. డేంజర్ జోన్లో ముగ్గురుదీంతో మనీష్, ప్రియ, డిమాన్ పవన్ డేంజర్ జోన్లో ఉన్నారు. డిమాన్ పవన్.. తన గేమ్ కన్నా రీతూ చుట్టూ తిరగడంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ప్రియ.. తను చెప్పిందే రైట్ అంటూ వాగుతూనే ఉంటుంది. మనీష్.. వరస్ట్ కామనర్స్ అంటూ తన టీమ్‌నే తిడతాడు, మళ్లీ వాళ్లనే సపోర్ట్ చేస్తాడు. ఒక మాట మీద నిలబడడు. అందుకే వీళ్లలో ఒకర్ని బయటకు పంపించాలన్నది బుల్లితెర ప్రేక్షకుల ఆలోచన. ముఖ్యంగా మనీష్, పవన్‌లపైనే ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి! చదవండి: ఓనర్స్ ఆర్ టెనెంట్స్.. కెప్టెన్సీ ఎవరికీ దక్కింది..! -
డేంజర్ జోన్లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు?
గంపెడాశలతో బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చిన కంటెస్టెంట్లలో ఒకర్ని బయటకు పంపించే తరుణం ఆసన్నమైంది. బిగ్‌బాస్ తెలుగు తొమ్మిదో సీజన్లో మొదటి ఎలిమినేషన్ జరగనుంది. ఈ వారం సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, శ్రష్టి వర్మ, రాము రాథోడ్, డిమాన్ పవన్, తనూజ, ఇమ్మాన్యుయేల్ నామినేషన్స్‌లో ఉన్నారు.వీళ్లంతా కనిపించారువీరిలో అందరికంటే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ కామెడీ చేస్తూ అందరినీ నవ్విస్తున్నాడు ఇమ్మాన్యుయేల్ (Emmanuel). ఓనర్ల (కామన్‌మ్యాన్)కు నచ్చిన వంటలు చేస్తూ కడుపునిండా భోజనం పెడుతోంది తనూజ. కెప్టెన్సీ టాస్క్‌లో ఇరగదీశాడు రాము రాథోడ్. ఒక్క గుడ్డు దొంగిలించి హౌస్‌ను షేక్ చేసింది సంజనా. చివరకు తనను వ్యతిరేకించిన 14 మందిపై అజమాయిషీ చూపించే కెప్టెన్‌గా నిలించింది. గ్లామరస్ కంటెంట్నిచ్చే రీతూకు ఎలాగో బయట మంచి ఫాలోయింగ్ ఉంది. ఎపిసోడ్లో జాడ లేని కంటెస్టెంట్లుమిగిలిందల్లా డిమాన్ పవన్, శ్రష్టి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ (Flora Saini). సోషల్ మీడియా పోల్స్ ప్రకారం సుమన్ శెట్టికి కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. అగ్నిపరీక్ష నుంచి వచ్చిన పవన్ హౌస్‌లో అప్పుడప్పుడు పులిహోర కలుపుతూ కనిపిస్తున్నాడు. కాబట్టి కొన్నాళ్లు అతడిని ఉంచే అవకాశం లేకపోలేదు. ఇక శ్రష్టి, ఫ్లోరా ఎపిసోడ్లో పెద్దగా కనిపించడమే లేదు. ఫ్లోరా అయితే సంజనాతో గొడవైనప్పటి నుంచి అదే మనసులో పెట్టుకుని అక్కడే ఆగిపోయింది. బాత్రూమ్ క్లీన్ చేసే పని అప్పజెప్పడంతో రోజులో ఎక్కువభాగం ఆ వాషింగ్ ఏరియా దగ్గరే గడుపుతోంది.ఇలాగైతే ఎలిమినేషన్ ఖాయంఆమె నుంచి పాజిటివ్ లేదా నెగెటివ్.. ఎటువంటి వైబ్స్ రాకపోయేసరికి జనాలు తనను పెద్దగా పట్టించుకోనట్లే కనిపిస్తోంది. ఈ లెక్కన ఈ వారం ఫ్లోరా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లేదంటే అప్పుడే ఎలిమినేషన్ ఎందుకని నాగ్ (Nagarjuna Akkineni) కనికరించాడంటే మాత్రం ఈ వారం ఫ్లోరాకు గండం గడిచినట్లే! మరి నాగార్జున కనికరిస్తాడా? లేదంటే ఎవర్ని ఎలిమినేట్ చేస్తాడనేది వేచి చూడాలి!చదవండి: ఇమ్మాన్యుయేల్‌పై మాస్క్ మ్యాన్ దారుణ కామెంట్స్.. బాడీ షేమింగ్


