
గంపెడాశలతో బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చిన కంటెస్టెంట్లలో ఒకర్ని బయటకు పంపించే తరుణం ఆసన్నమైంది. బిగ్‌బాస్ తెలుగు తొమ్మిదో సీజన్‌లో మొదటి ఎలిమినేషన్ జరగనుంది. ఈ వారం సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, శ్రష్టి వర్మ, రాము రాథోడ్, డిమాన్ పవన్, తనూజ, ఇమ్మాన్యుయేల్ నామినేషన్స్‌లో ఉన్నారు.
వీళ్లంతా కనిపించారు
వీరిలో అందరికంటే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ కామెడీ చేస్తూ అందరినీ నవ్విస్తున్నాడు ఇమ్మాన్యుయేల్ (Emmanuel). ఓనర్ల (కామన్‌మ్యాన్)కు నచ్చిన వంటలు చేస్తూ కడుపునిండా భోజనం పెడుతోంది తనూజ. కెప్టెన్సీ టాస్క్‌లో ఇరగదీశాడు రాము రాథోడ్. ఒక్క గుడ్డు దొంగిలించి హౌస్‌ను షేక్ చేసింది సంజనా. చివరకు తనను వ్యతిరేకించిన 14 మందిపై అజమాయిషీ చూపించే కెప్టెన్‌గా నిలించింది. గ్లామరస్ కంటెంట్‌నిచ్చే రీతూకు ఎలాగో బయట మంచి ఫాలోయింగ్ ఉంది.
ఎపిసోడ్‌లో జాడ లేని కంటెస్టెంట్లు
మిగిలిందల్లా డిమాన్ పవన్, శ్రష్టి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ (Flora Saini). సోషల్ మీడియా పోల్స్ ప్రకారం సుమన్ శెట్టికి కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. అగ్నిపరీక్ష నుంచి వచ్చిన పవన్ హౌస్‌లో అప్పుడప్పుడు పులిహోర కలుపుతూ కనిపిస్తున్నాడు. కాబట్టి కొన్నాళ్లు అతడిని ఉంచే అవకాశం లేకపోలేదు. ఇక శ్రష్టి, ఫ్లోరా ఎపిసోడ్‌లో పెద్దగా కనిపించడమే లేదు. ఫ్లోరా అయితే సంజనాతో గొడవైనప్పటి నుంచి అదే మనసులో పెట్టుకుని అక్కడే ఆగిపోయింది. బాత్రూమ్ క్లీన్ చేసే పని అప్పజెప్పడంతో రోజులో ఎక్కువభాగం ఆ వాషింగ్ ఏరియా దగ్గరే గడుపుతోంది.
ఇలాగైతే ఎలిమినేషన్ ఖాయం
ఆమె నుంచి పాజిటివ్ లేదా నెగెటివ్.. ఎటువంటి వైబ్స్ రాకపోయేసరికి జనాలు తనను పెద్దగా పట్టించుకోనట్లే కనిపిస్తోంది. ఈ లెక్కన ఈ వారం ఫ్లోరా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లేదంటే అప్పుడే ఎలిమినేషన్ ఎందుకని నాగ్ (Nagarjuna Akkineni) కనికరించాడంటే మాత్రం ఈ వారం ఫ్లోరాకు గండం గడిచినట్లే! మరి నాగార్జున కనికరిస్తాడా? లేదంటే ఎవర్ని ఎలిమినేట్ చేస్తాడనేది వేచి చూడాలి!
చదవండి: ఇమ్మాన్యుయేల్‌పై మాస్క్ మ్యాన్ దారుణ కామెంట్స్.. బాడీ షేమింగ్