'బిగ్‌బాస్‌ తెలుగు 9' ప్రైజ్‌ మనీ ప్రకటించిన నాగార్జున | Bigg Boss 9 Winner Prize Money Revealed By Nagarjuna, Watch Today Episode Promo Video Inside | Sakshi
Sakshi News home page

'బిగ్‌బాస్‌ తెలుగు 9' ప్రైజ్‌ మనీ ప్రకటించిన నాగార్జున

Dec 14 2025 12:45 PM | Updated on Dec 14 2025 3:13 PM

Bigg Boss 9 Winner Prize money revealed by nagarjuna

బిగ్‌బాస్‌ తెలుగు 9 ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్‌ 21న ఫైనల్‌ ఎపిసోడ్‌ జరగనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్‌ ఉన్నారు. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ కానున్నారని నాగర్జాన ప్రకటించారు. భరణి ఎలిమినేట్‌ కావచ్చని వార్తలు వస్తున్నాయి. అప్పుడు రేసులో తనూజ, కల్యాణ్‌, ఇమ్మాన్యుయేల్‌, పవన్‌, సంజన మాత్రమే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా విడుదలైన బిగ్‌బాస్‌ ప్రోమోలో విజేతకు అందే ప్రైజ్‌ మనీని నాగార్జున రివీల్‌ చేశారు.

బిగ్‌బాస్‌ గత సీజన్ల మాదిరే ఈసారి కూడా విజేతకు రూ. 50 లక్షలు అందుతాయని హౌస్ట్‌ నాగార్జున ప్రకటించారు. అయితే, అందులో నుంచి ఎక్కువగా ట్యాక్స్‌ రూపంలో కట్‌ అవుతుందని అందరికీ తెలిసిందే. గెలుచుకున్న ప్రైజ్‌ మనీ ఎవరికైనా ఇవ్వాలని అనుకుంటే హౌస్‌లో ఎవరికి ఎంత ఇస్తావని భరణిని నాగార్జున అడిగారు.  తాను గెలుచుకున్న డబ్బు ఎవరికైనా ఇవ్వాలనిపిస్తే ఆ లిస్ట్‌లో ఇమ్మాన్యుయేల్‌, పవన్‌లు ఉంటారని భరణి అన్నారు. తాను గెలిస్తే రీతూ కోసం  రూ. 5 లక్షలతో గిఫ్ట్‌ కొంటానని పవన్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement