కాపీరైట్స్‌ కేసులలో 'ఇళయరాజా'ది తప్పేనా.. వారికి మాత్రమే నోటీసులు ఎందుకు? | Ilaiyaraaja Vs Film Industry, He Stand Against Using His Music Without Permission, Ongoing Legal Struggles | Sakshi
Sakshi News home page

కాపీరైట్స్‌ విషయంలో 'ఇళయరాజా' చేస్తుంది తప్పేనా.. వారికి మాత్రమే నోటీసులు ఎందుకు?

Dec 14 2025 2:20 PM | Updated on Dec 14 2025 4:09 PM

Why Ilaiyaraaja frequently his Songs Copyright Issue

ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా తరచుగా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. అనుమతి లేకుండానే తన పాటలను నేటి సినిమాల్లో వినియోగించడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తగిన చర్యలు తీసుకోవాలంటూనే నష్టపరిహారం కూడా చెల్లించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ అంశంలో ఆయన్ను సమర్ధించే వారు ఉన్నారు. మరికొందరు వ్యతిరేఖిస్తున్నారు.

ఇళయరాజా సంగీతం అందించిన 5వేల పాటలను సోని మ్యూజిక్ కంపెనీ కొనుగోలు చేసింది. దీంతో నేటి తరం సినిమా నిర్మాతలు అందరూ సోని మ్యూజిక్‌తో ఒప్పందం చేసుకుని రైట్స్‌ కొనుగోలు చేస్తున్నారు. రీసెంట్‌గా డ్యూడ్‌, గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ విషయంలో అదే జరిగింది. మైత్రీ మూవీస్‌ కూడా ఇదే పేర్కొంది.

ఇళయరాజాకు కౌంటర్‌ ఇస్తున్న లాయర్లు
ఒక సినిమా కోసం ఇళయరాజా పాటలు స్వరపరిచినందుకు నిర్మాత డబ్బులు చెల్లిస్తారు. అదే పాటను ఆ సంగీత దర్శకుడు మరో పది సినిమాలకు అమ్ముకోలేరని కౌంటర్‌ వేశారు.  ఒక సంగీత దర్శకుడు అందించిన పాటను తమ సినిమాలో ఉపయోగించాలా వద్దా  అనేది పూర్తిగా దర్శకుడు, నిర్మాత ఇష్టంపైనే ఉంటుందని గుర్తుచేశారు. సంగీతమనేది తన కష్టానికి ఫలితమైనప్పటికీ.. ఒక సినిమా కోసం దానిని అమ్మేసిన తరువాత యాజమాన్య హక్కులు ఎట్టిపరిస్థితిలోనూ కోరలేడని న్యాయవాదుల పేర్కొన్నారు. ఒక సంగీత దర్శకుడు అందించిన పాటను ఎవరైన నిర్మాత ఉపయోగించకుండా ఉన్నప్పటికీ కూడా ఆ పాటను మరో సినిమాకు సంగీత దర్శకుడు అమ్మలేరని తెలిపారు.

తన పాటలను వేదికలపై పాడొద్దని ఎస్పీబాలు, చిత్ర, ఎస్పీ చరణ్‌లకు కూడా గతంలో ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారనే విషయం తెలిసిందే.. నోటీసులు అందుకోగానే  ఇళయరాజా పాటలు పాడటం ఆపేస్తున్నట్లు బాలు ప్రకటించారు. చట్టం గురించి తనకు తెలియకపోవడం వల్ల కచేరీలలో ఇళయరాజా పాటలు పాడానని బాలు చెప్పారు. ఇకపై షోలలో ఆయన పాటలు పాడలేనని సోషల్‌మీడియాలో ప్రకటించారు.

1980 కాలంలో ఇళయరాజా టైమ్‌ కొనసాగుతుంది. ఆ సమయంలో ఆయన ఆడియో కంపెనీ కూడా ప్రారంభించారు. తనకు ఏదైనా సినిమా ఆఫర్‌ వస్తే దాని ఆడియో హక్కులు కూడా సొంత కంపెనీకే ఇవ్వాలని షరతు పెట్టేవారు. ఇలాంటి డీలింగ్స్‌ అన్నీ కూడా తన మేనేజర్ కల్యాణం చూసుకునేవారు. కనీసం తన ఫైనాన్స్‌ విషయంలో కూడా ఆయన వేలు పెట్టరు.  ఇళయరాజా చాలా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి. తనకు టాలెంట్‌తో పాటు డబ్బు విలువ బాగా తెలుసు. ఇళయరాజా వల్లనే ఎన్నో సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఈ విషయం ఆయనకు తెలుసు కాబట్టి ముందే కాపీ రైట్స్‌ తన కంపెనీ చేతిలో పెట్టుకున్నారు.

ఇళయరాజా అందరికీ నోటీసులు పంపారా..?
తన పాటల కాపీ రైట్స్‌ విషయంలో ఇశయరాజా అందరికీ నోటీసులు పంపలేదు. చాలామంది సరదాగా ఆయన పాటలు పాడుతుంటారు. సినిమా పాట అంటేనే ఇలాంటివి సహజం. ఆయన ఎప్పడూ కూడా మామూలు జనాలకు  నోటీసులు ఇవ్వలేదు. చిన్నాచితక ఆర్కెస్ట్రా వారికి కూడా ఇవ్వలేదు. తన పాట ఎక్కడా కూడా వినిపించకూడదనే కండీషన్‌ పెట్టలేదు. ఆయన అభ్యంతరం చేసింది కేవలం సినిమా వాళ్లనే.. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర వంటి వారు సామాజిక ప్రయోజనాల కోసం ఇళయరాజా పాటలు పాడలేదు. వారు కూడా కమర్షియల్ కార్యక్రమంలోనే పాడారు. తద్వారా  ఈవెంట్‌ నిర్వాహుకులకు డబ్బు వస్తుంది కదా అనేది ఇళయరాజా పాయింట్‌.. భారీ బడ్జెట్‌ సినిమాల్లో కూడా తన పాటలను ఉపయోగించుకుని  డబ్బు సంపాదించడం ఏమిటి అని ఇళయరాజా భావించి ఉండొచ్చు. అందుకే ఆయన నోటీసులు జారీ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement