ఫుట్‌బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన మెస్సీ షో గ్రాండ్ సక్సెస్ అయింది. శనివారం నాడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంకి వచ్చిన ఫుట్‌బాల్ దిగ్గజాన్ని చూసి అభిమానులు ఆనందంతో గెంతులేశారు. మెస్సీ మైదానంలో సరదాగా ఆడుతూ గోల్స్ చేస్తుంటే అది చూసి ఫ్యాన్స్ ముచ్చటపడ్డారు. ఈ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిల్లలు అర్హ, అయాన్ సైతం వెళ్లారు.
అర్హ, అయాన్ వీడియో వైరల్
మెస్సీ కోసం వచ్చావా? అని ఓ విలేఖరి అడిగితే.. కేవలం ఎక్స్‌పీరియన్స్ కోసం వచ్చానని ఆన్సరిచ్చాడు అయాన్. ఫుట్‌బాల్‌లో ఫేవరెట్ ప్లేయర్ ఎవరంటే రొనాల్డో అని చెప్పాడు. తర్వాత అర్హను ప్రశ్నలడిగారు. మెస్సీ అంటే ఇష్టమా? అని అడగ్గా.. తనకు ఇష్టం లేదని అర్హ నిర్మొహమాటంగా బదులిచ్చింది. మెస్సీ మ్యాచ్‌కు వచ్చి మెస్సీ అంటేనే ఇష్టం లేదని చెప్పిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Ayaan bhAAi asalu vere unnadu😂🤣
Yela ra asalu ila 😭💯📈
Entertainer "Ayaan" bolthe 💥🥁#ayaan #alluarjun pic.twitter.com/ekWkTYEHe6— sai (@nenupapinii) December 14, 2025
చదవండి: థియేటర్‌లో సుమ కన్నీళ్లు


