టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మౌగ్లీ. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. అఖండ-2 రావడంతో ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.
అయితే ఈ మూవీని యాంకర్ సుమ తన కుమారుడితో కలిసి వీక్షించింది. తెరపై కొడుకు నటనను చూసి తీవ్ర భావోద్వేగానికి గురైంది. థియేటర్లోనే తన కుమారుడు రోషన్‌ను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ అమ్మ ప్రేమ అంటే ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్ నటులు బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రలో మెప్పించారు.
మోగ్లీ కథేంటంటే..
తన ప్రేమకోసం మోగ్లీ ఏం చేయడానికైనా రెడీగా ఉంటాడు. మరి... మోగ్లీ ప్రేమ కథకు వచ్చిన అడ్డంకులు ఏంటి? క్రిస్టోఫర్ నోలన్ (ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్‌పాత్ర పేరు) నుంచి మోగ్లీకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనే అంశాలతో తెరకెక్కించిన కథే మౌగ్లీ.
కొడుకు @RoshanKanakala విజయం చూసి తల్లి @ItsSumaKanakala ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.. #Mowgli 👋 pic.twitter.com/qUcMowK03Z
— Milagro Movies (@MilagroMovies) December 13, 2025


