మహా నగరం మెస్సీ మంత్రం జపించింది.
గజగజ వణికే చలిలో వేడి రగిల్చింది.
దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడి నామ జపంతో ఉప్పల్ స్టేడియం ఉర్రూతలూగింది.
మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ దిగ్విజయంగా ముగిసింది.
ఫుట్‌బాల్ ఆటతో ఈ ద్వయం అలరించింది.
ప్రేక్షకుల ఉత్సాహంతో ఆద్యంతం కోలాహలం నెలకొంది.
అభిమానుల కేరింతలతో స్టేడియం హోరెత్తింది.


