Economy
-
‘ఏటీఎంల్లో రూ.100, 200 నోట్లను పెంచండి’
ప్రజలకు రూ.100, రూ.200 నోట్లు మరింతగా అందుబాటులో ఉండేలా ఏటీఎంలలో ఆయా డినామినేషన్ నోట్ల లభ్యతను మరింతగా పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. దశలవారీగా ఈ ఆదేశాలను అమలు చేయాలని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు ఒక సర్క్యులర్‌లో సూచించింది. 2025 సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం ఏటీఎంలలో కనీసం ఒక్క క్యాసెట్(ఏటీఎంలో డబ్బు స్టోర్ చేసే కంటైనర్)లోనైనా రూ.100 లేదా రూ.200 నోట్లు ఉండేలా చూడాలని తెలిపింది. 2026 మార్చి 31 నాటికి దీన్ని 90 శాతం ఏటీఎంలకు పెంచాలని పేర్కొంది.డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ ఫిజికల్ క్యాష్ వినియోగం తగ్గుతుందని కొందరు భావిస్తున్నారు. కానీ నిత్యం ఫిజికల్ క్యాష్ అవసరాలు ప్రత్యేకంగా ఉంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో డబ్బు లభ్యతకు పెద్దపీట వేయాలని ఆర్బీఐ ఇటీవల బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటీవల ఏటీఎంల్లో నగదు లభ్యత తగ్గడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: ప్రముఖ ఆర్థిక సంస్థల పనితీరు ఇలా..దేశంలో ప్రధాన ఏటీఎం సర్వీస్ ప్రొవైడర్ అయిన ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ పతనం అనేక బ్యాంకులకు నగదు రీఫిల్లింగ్ సేవలకు అంతరాయం కలిగించింది. యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఎక్కువగా అవలంబించడం వల్ల నగదుకు డిమాండ్ తగ్గింది. ఇది బ్యాంకులు తమ ఏటీఎం నెట్‌వర్క్‌లను ఆప్టిమైజ్ చేయడానికి దారితీసింది. కొత్త ఆర్బీఐ నిబంధనలు, ఇంటర్‌ఛేంజ్ ఫీజు స్ట్రక్చర్లు ఏటీఎం మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకట్ట వేస్తున్నాయి. నగదు భర్తీలో లాజిస్టిక్ సమస్యలు కూడా తాత్కాలిక కొరతకు కారణం అవుతున్నాయి. -
పరిశ్రమలు డీలా..
దేశీ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి స్థిరంగా కొనసాగుతోంది. ఫిబ్రవరిలో నమోదైన 2.7 శాతంతో పోలిస్తే మార్చిలో పెద్దగా మార్పులు లేకుండా 3 శాతంగా నమోదైంది. తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాల పేలవ పనితీరు కారణంగా గత ఆర్థిక సంవత్సరం మార్చిలో నమోదైన 5.5 శాతం పోలిస్తే మాత్రం తగ్గింది. ఇక 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఐఐపీ వృద్ధి నాలుగేళ్ల కనిష్టమైన 4 శాతానికి నెమ్మదించింది.2023–24లో ఇది 5.9 శాతంగా, 2020–21లో ఏకంగా మైనస్ 8.4 శాతంగా నమోదైంది.2021–22లో 11.4 శాతంగా, 2022–23లో 5.2 శాతంగా ఉంది.ఇదీ చదవండి: వ్యాపార ‘పద్మా’లు..జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) ప్రకారం ఈ ఏడాది మార్చిలో తయారీ రంగ వృద్ధి 5.9 శాతం నుంచి (వార్షికంగా) 3 శాతానికి, మైనింగ్ ఉత్పత్తి 1.3 శాతం నుంచి 0.4 శాతానికి, విద్యుదుత్పత్తి 8.6 శాతం నుంచి 6.3 శాతానికి నెమ్మదించింది.ఐఐపీ గణాంకాలను 28వ తారీఖున విడుదల చేయడం ఇదే ప్రథమం.ఇప్పటివరకు నెల ముగిసిన ఆరు వారాల తర్వాత ప్రతి నెల 12వ తారీఖున విడుదల చేసేవారు. ఇకపై నాలుగు వారాల తేడాతో ప్రకటిస్తారు. -
భారత్‌లో తగ్గిన పేదరికం! ఎలాగంటే..
భారత్‌లో గడిచిన దశాబ్దకాలంలో పేదరికం తగ్గుతుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచబ్యాంకు ఇటీవల విడుదల చేసిన ‘పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ ఆన్ ఇండియా’ రిపోర్ట్‌లో పేదరిక నిర్మూలనలో దేశం సాధించిన పురోగతిని హైలైట్ చేసింది. 2017 పీపీపీ(పర్చేజింగ్ పవర్ పారీటీ-కొనుగోలు శక్తి సమానత్వ సూచీ) నిబంధనల ప్రకారం రోజుకు 2.15 డాలర్ల కంటే తక్కువ ఆదాయం సంపాదిస్తున్నవారు ‘తీవ్ర పేదరికం’లో ఉన్నట్లు భావిస్తున్నారు. ఇటీవల ఆ సూచీని భారత్ గణనీయంగా అధిగమించినట్లు నివేదిక తెలుపుతుంది. 2011-12లో 16.2%గా ఉన్న తీవ్ర పేదరికం 2022-23 నాటికి కేవలం 2.3%కు పడిపోయిందని పేర్కొంది. ఈ మార్పు 17.1 కోట్ల మందిని తీవ్రమైన పేదరికం నుంచి దూరం చేసింది.పేదరిక నిర్మూలనకు కొన్ని ప్రధాన కారణాలుదేశంలో 80 కోట్లకు పైగా లబ్ధిదారులకు ఆహార ధాన్యాలను విస్తృతంగా పంపిణీ చేయడం వంటి ఆహార భద్రత కార్యక్రమాలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. జన్ ధన్ యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, రాష్ట్ర స్థాయి సంక్షేమ పథకాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్స్ (డీబీటీలు) ద్వారా ప్రజలకు సహాయం అందింది. 2022-23, 2023-24 సంవత్సరాలకుగాను గృహ వినియోగదారుల వ్యయ సర్వేల్లో (హెచ్సీఈఎస్) ఉపయోగించిన కొత్త పద్ధతులు పేదరిక గణాంకాలను మరింత కచ్చితంగా తెలియజేశాయి.తీవ్ర పేదరికానికి అతీతంగా..తక్కువ, మధ్య ఆదాయ దేశంలో పేదరికాన్ని కొలిచేందుకు రోజుకు 3.65 డాలర్ల (పీపీపీ) సంపాదనను బెంచ్‌మార్క్‌గా తీసుకుంటారు. దీన్ని పరిగణలోకి తీసుకుంటే భారత్‌లో 2011-12లో 61.8 శాతంగా ఉన్న పేదరికం 2022-23 నాటికి 28.1 శాతానికి పడిపోయింది. ఈ దశాబ్దంలో 37.8 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.అసమానతలు..వినియోగ ఆధారిత అసమానతలు తగ్గినప్పటికీ, దేశంలో ఆదాయ అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2023-24లో సంపాదనలో దిగువన ఉన్న 10% ప్రజల కంటే టాప్‌లో నిలిచిన 10% మంది 13 రెట్లు అధికంగా సొమ్ము కూడగట్టుకున్నారు. పట్టణ-గ్రామీణ వినియోగంలో వ్యత్యాసం 2011-12లో 84% నుంచి 2023-24 నాటికి 70%కి తగ్గింది. అయినప్పటికీ గణనీయమైన అసమానతలు కొనసాగుతున్నాయి. దేశంలో పేదరికాన్ని కట్టడి చేసేందుకు ‘ఉచితాలు’ లేదా సంక్షేమ పథకాల్లోని అంశాలను మరింత విశ్లేషించాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపు.. లాభామా? నష్టమా?పరిష్కారాలుదేశంలో పేదరికాన్ని తగ్గించడానికి సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే ఆర్థిక అసమానతల మూల కారణాలను పరిష్కరించాలని నిపుణులు చెబుతున్నారు. అందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటి ప్రకారం.. తయారీ, వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానం వంటి పరిశ్రమలను ప్రోత్సహించి మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించాలి. రుణాలు, సబ్సిడీలు, టెక్నాలజీ అప్గ్రేడ్ల ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ ఎంఈ) మద్దతు ఇవ్వాలి. నాణ్యమైన విద్యను విస్తరించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వేతనంతో కూడిన ఉద్యోగాల కోసం వ్యక్తులకు తగిన నైపుణ్యాలు అందించాలి. శిశుసంరక్షణ సౌకర్యాలు, సురక్షితమైన పనివాతావరణాలు, ఆర్థిక స్వాతంత్ర్య కార్యక్రమాలను అందించడం ద్వారా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. -
వడ్డీ రేట్ల తగ్గింపు.. లాభామా? నష్టమా?
భారతీయ బ్యాంకులు ఇటీవల పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు తగ్గించడంతో ఈమేరకు బ్యాంకులు కూడా కీలక వడ్డీ రేట్లను కుదించాయి. ప్రపంచ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితుల మధ్య వృద్ధిని ఉత్తేజపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థలోని కొన్ని అంశాలపై ప్రతికూల ప్రభావం కూడా ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.రుణాలు, పెట్టుబడులకు ప్రోత్సాహంతక్కువ వడ్డీ రేట్లు వ్యక్తులు, వ్యాపారాలకు రుణాలు చౌకగా అందేలా చేస్తాయి. ఇది మౌలిక సదుపాయాలు, తయారీ, ఇతర రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఉద్యోగాల సృష్టికి ఊతం ఇస్తుంది. ఆర్థిక విస్తరణకు దారితీస్తుంది. తగ్గిన రుణ ఈఎంఐలు డిస్పోజబుల్ ఆదాయాన్ని(నెలవారీ ఖర్చులుపోను మిగిలిన డబ్బు) పెంచుతాయి. వినియోగదారుల వ్యయాన్ని అధికం చేస్తాయి.పొదుపుపై ప్రభావంమరోవైపు పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గుతుండడంతో సంప్రదాయ పొదుపు తగ్గిపోతుంది. దాంతో ఖాతాదారులు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లేదా రియల్ ఎస్టేట్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులవైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇవి అధిక నష్టాలను కలిగి ఉంటాయి కానీ, మంచి రాబడిని అందిస్తాయి. ఫైనాన్షియల్ మార్కెట్లను మరింత బలోపేతం చేయగలిగినప్పటికీ, ఇది మార్కెట్ అస్థిరతకు దారి తీయవచ్చు. బ్యాంకుల్లో పొదుపు డబ్బును ఇలా ఇతర మార్గాలవైపు మళ్లించడం బ్యాంకులకు కొంతమేరకు సవాలుగా మారుతుంది.ఇదీ చదవండి: ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్ఏం చేయాలంటే..భారతీయ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం రెండువైపులా పదునున్న కత్తితో సమానం. ఇది ఆర్థిక వృద్ధిని, పెట్టుబడులను ప్రేరేపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, పొదుపుదారులకు, బ్యాంకింగ్ రంగానికి సవాళ్లను మిగులుస్తుంది. ఆర్థిక స్థిరత్వంతో వృద్ధిని సమతుల్యం చేయడానికి ఈ మార్పులు ఎంత సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయనే దానిపై దీర్ఘకాలిక ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఈమేరకు వ్యవస్థలు సమర్థ విధానాలు రూపొందించి అమలు చేయాల్సి ఉంటుంది. -
భారత్-పాక్ వాణిజ్య సంబంధాలు ఎలా ఉన్నాయంటే..
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి భారత్-పాక్‌ల మధ్య ఇప్పటికే దెబ్బతిన్న వాణిజ్య సంబంధాలను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 ఏప్రిల్ 22న జరిగిన ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలను నిలిపివేయడంతో సహా కఠిన చర్యలు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు భారత్ ఇప్పటికే కొన్ని చర్యలు అమలు చేసింది.అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ మూసివేతచారిత్రాత్మకంగా భారత్-పాకిస్థాన్ మధ్య వాణిజ్యం సవాళ్లతో కూడుకున్నది. 2019లో పుల్వామా దాడి తరువాత పాక్ వస్తువులపై భారతదేశం 200% సుంకాన్ని విధించింది. ఇది ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయం దెబ్బతినేందుకు దారితీసింది. ఇటీవల జరిగిన పహల్గాం దాడి ఈ వాణజ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలకు కీలకంగా ఉన్న అట్టారి వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను మూసివేసేందుకు కారణమైంది. ఈ మూసివేతతో సుమారు రూ.3,800 కోట్ల విలువైన సీమాంతర వాణిజ్యం నిలిచిపోనుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రెండు ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అయితే భారత్ శత్రదేశంతో ఎలాగో విభేదాలు తలెత్తుతాయనే ఉద్దేశంలో కొన్నేళ్లుగా క్రమంగా వాణిజ్యాన్ని తగ్గించుకుంటూ వస్తోంది. దీంతో ఇరుదేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోవడం భారత్‌పై పెద్దగా ప్రభావం చూపదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.పరోక్ష వాణిజ్యంఅధికారిక ఆంక్షలు ఉన్నప్పటికీ భారత వస్తువులు దుబాయ్, సింగపూర్ వంటి థర్డ్ పార్టీ మార్గాల ద్వారా పాకిస్థాన్‌కు చేరుకుంటూనే ఉన్నాయి. ఇది వాణిజ్య నెట్‌వర్క్‌ల భద్రతను హైలైట్ చేస్తుంది. ఏదేమైనా అటువంటి పరోక్ష వాణిజ్యం నైతిక, రాజకీయ చిక్కులకు కారణమవుతుందనే వాదనలున్నాయి. పహల్గాం దాడి దౌత్యపరమైన విభేదాలకు కూడా దారితీసింది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన భారత్.. పాక్ పౌరులకు వీసాలను రద్దు చేసింది. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌పై చర్యలు తీసుకోవాలని భారత్ సంకల్సిస్తోంది.ఇదీ చదవండి: వాట్సప్ యూజర్లే లక్ష్యంగా కొత్త మోసం!భారత్ నుంచి పాకిస్థాన్‌కు జరిగే ఎగుమతులు ప్రధానంగా..సేంద్రీయ రసాయనాలుఫార్మాస్యూటికల్ ఉత్పత్తులుచక్కెర, మిఠాయిలుయంత్రాలు, వస్త్రాలుకాఫీ, టీ, మసాలా దినుసులు2023లో పాకిస్థాన్‌కు భారతదేశ ఎగుమతుల విలువ సుమారు 523.22 మిలియన్ డాలర్లు.సేంద్రీయ రసాయనాలు, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు ఇందులో గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నాయి.పాకిస్థాన్ నుంచి భారత్‌కు దిగుమతులుఉప్పు, సల్ఫర్, సున్నంసిమెంట్జౌళి ఉత్పత్తులు2023లో పాకిస్థాన్ నుంచి దిగుమతుల విలువ 2.27 మిలియన్ డాలర్లు. -
వర్షాకాల సమావేశాల్లోనే బీమా సవరణ బిల్లు
న్యూఢిల్లీ: బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) వీలు కల్పించే సవరణ బిల్లును వచ్చే వర్షకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుంచనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముసాయిదా బిల్లు సిద్ధమైందని, త్వరలోనే కేబినెట్ ఆమోదం తీసుకోనున్నట్టు తెలిపాయి. కేబినెట్ ఆమోదం అనంతరం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టే ప్రక్రియను ఆర్థిక వ్యవహారాల విభాగం మొదలు పెడుతుందని పేర్కొన్నాయి. పార్లమెంటు వర్షకాల సమావేశాలు సాధారణంగా జూలైలో ఆరంభం అవుతుంటాయి. ప్రస్తుతం బీమా రంగంలో 74 శాతం మేర ఎఫ్‌డీఐలకు అనుమతి ఉండగా, 100 శాతానికి పెంచే ప్రతిపాదనను 2025–26 బడ్జెట్లో ప్రతిపాదించడం గమనార్హం. బీమా సవరణ చట్టంలో ఎఫ్‌డీఐ పెంపుతోపాటు మూలధన నిధుల అవసరాలను తగ్గించడం, కాంపోజిట్ లైసెన్స్ తదితర ప్రతిపాదనలు చోటుచేసుకోనున్నాయి. బ్రోకర్లు సైతం ఒకటికి మించిన బీమా కంపెనీల ఉత్పత్తుల విక్రయానికి అవకాశం లభించనుంది. -
ప్రపంచంలోని 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు: లేటెస్ట్ రిపోర్ట్
భారత ఆర్ధిక వ్యవస్థ దినదినాభివృద్ధి చెందుతోంది. ఇండియా.. జర్మనీ, జపాన్‌లను అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పలువురు నిపుణులు చెబుతూనే ఉన్నారు.భారతదేశం ప్రపంచానికి విద్యా కేంద్రంగా మారగలదని, మిగతావన్నీ పక్కన పెడితే మన దేశంలోని ప్రజాస్వామ్యమే మనకు అతిపెద్ద ప్రయోజనమని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తన అభిప్రాయాన్ని ఇటీవలే వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదవ అతిపెద్దది. వచ్చే ఏడాది చివరి నాటికి మనం నాల్గవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉండబోతున్నాము. ఆ తర్వాత ఏడాది మూడవ అతిపెద్దదిగా ఉంటామని ఆయన వివరించారు.ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ GDPకి గణనీయంగా దోహదపడతాయి. అంతే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక విధానాలపై కూడా బలమైన ప్రభావాన్ని చూపుతాయి. వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదిక ప్రకారం.. టాప్ 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఇలా..➤యునైటెడ్ స్టేట్స్ (యూఎస్): 30.507 ట్రిలియన్ డాలర్లు➤చైనా: 19.231 ట్రిలియన్ డాలర్లు➤జర్మనీ: 4.744 ట్రిలియన్ డాలర్లు➤భారతదేశం: 4.187 ట్రిలియన్ డాలర్లు➤జపాన్: 4.186 ట్రిలియన్ డాలర్లు➤యునైటెడ్ కింగ్డమ్ (యూకే): 3.839 ట్రిలియన్ డాలర్లు➤ఫ్రాన్స్: 3.211 ట్రిలియన్ డాలర్లు➤ఇటలీ: 2.422 ట్రిలియన్ డాలర్లు➤కెనడా: 2.225 ట్రిలియన్ డాలర్లు➤బ్రెజిల్: 2.125 ట్రిలియన్ డాలర్లు -
భారత్ వృద్ధికి క్రూడాయిల్ దన్ను
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్నప్పటికీ తగ్గిన క్రూడాయిల్ రేట్లతో దేశీయంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు నెమ్మదించడం, దేశీయంగా వినియోగం పెరగడం లాంటి దేశ వృద్ధికి సానుకూలంగా దోహదపడనున్నాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండొచ్చని కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఒక నివేదికలో పేర్కొంది. ఎగుమతుల క్షీణత, గ్లోబల్ మందగమనం, ముడిచమురు ధరల తగ్గుదల, అంతర్జాతీయంగా ఉత్పత్తి సామర్థ్యాలు పెరిగిపోవడం వంటి అంశాలు భారత వృద్ధిపై ప్రభావం చూపనున్నాయని వివరించింది. సముచిత ఆర్థిక, ద్రవ్య విధానాలతో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లోపునకు కట్టడి చేస్తూ, 2026 ఆర్థిక సంవత్సరంలోను, అలాగే మధ్యకాలికంగాను భారత్ 6.5 శాతం వృద్ధి రేటు నమోదు చేయొచ్చని ఈవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీవాస్తవ చెప్పారు. ‘అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు బ్యారెల్‌కు 60–65 డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని, ఇది భారత్‌కు సానుకూలంగా పరిణమించగలదని అంచనా వేస్తున్నాం‘ అని వివరించారు. వివిధ అంతర్జాతీయ సంస్థలు అంచనా వేసిన 6.2–6.7 శాతం వృద్ధి రేటు శ్రేణిలోనే ఈవై అంచనాలు ఉండటం గమనార్హం. టారిఫ్‌ల యుద్ధం, అమెరికా వాణిజ్య విధానంపై అనిశ్చితి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధిరేటు 6.2 శాతం ఉంటుందని ఐఎంఎఫ్, 6.3 శాతం ఉంటుందని వరల్డ్ బ్యాంక్ పేర్కొన్నాయి. ఇక ఆర్బీఐ, ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ 6.5 శాతంగా ఉంటుందని, ఓఈసీడీ, ఫిచ్ రేటింగ్స్ 6.4 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేశాయి. నివేదికలో మరిన్ని విశేషాలు.. → అధిక టారిఫ్‌లు, అంతర్జాతీయంగా బలహీన డిమాండ్ కారణంగా ఎగుమతులు నెమ్మదించవచ్చు. అయితే, స్థూల దేశీయోత్పత్తిపై ప్రభావం ఒక మోస్తరుగానే ఉండొచ్చు. → గ్లోబల్ మందగమనంతో ప్రపంచవ్యాప్తంగా వృద్ధి నెమ్మదించినా, పటిష్టమైన ఆర్థిక, ద్రవ్య విధానాల వల్ల భారత్ కాస్త మెరుగైన స్థితిలో ఉండొచ్చు. → ప్రధాన ఎగుమతి దేశాల్లో ఉత్పత్తి సామర్థ్యాలు పెరగడం వల్ల డంపింగ్ రిస్కులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భారత్ యాంటీ–డంపింగ్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. → గ్లోబల్ అవాంతరాలపై భారత్ వ్యూహాత్మకంగా స్పందించాల్సి ఉంటుంది. వృద్ధికి ఊతమిచ్చే ఆర్థిక విధానాలు, ఉదార ద్రవ్య విధానాల ద్వారా భారత్ ఈ పరిస్థితుల నుంచి పటిష్టంగా బైటపడొచ్చు. → స్వల్పకాలికంగా అమెరికా నుంచి కొంత క్రూడాయిల్ దిగుమతులను పెంచుకోవడం ద్వారా ఆ దేశంతో వాణిజ్య లోటును భర్తీ చేసుకోవడంతో పాటు ప్రతీకార టారిఫ్ రేట్లను కూడా తగ్గిస్తే భారత్‌కు శ్రేయస్కరంగా ఉంటుంది. → 2025 సెపె్టంబర్–అక్టోబర్ నాటికి సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే అమెరికాతో వాణిజ్యంలో కాస్త స్థిరత్వం వస్తుంది. → స్వల్పకాలికం నుంచి దీర్ఘకాలిక దృష్టికోణంలో చూస్తే భూ, కార్మిక చట్టాల్లో సంస్కరణలు వేగవంతం చేయాలి. విద్య, ఏఐ.. జెన్‌ఏఐలాంటి కొత్త నైపుణ్యాల్లో శిక్షణపై మరింతగా ఇన్వెస్ట్ చేయాలి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల స్కీము పరిధిని విస్తరించాలి. -
ప్రత్యక్ష పన్నులపై రిఫండ్ ఎఫెక్ట్
న్యూఢిల్లీ: భారీ స్థాయిలో రిఫండ్లు జారీ చేయడంతో గత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు నిర్దేశించుకున్న లక్ష్యం స్థాయిలో వసూలు కాలేదు. 2024–25లో నికరంగా రూ. 22.37 లక్షల కోట్లు టార్గెట్‌గా పెట్టుకోగా నికరంగా రూ. 22.26 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 13.57 శాతం అధికమే అయినప్పటికీ నిర్దేశిత లక్ష్యానికి మాత్రం చేరలేదు. గతేడాది జూలై నాటి బడ్జెట్లో రూ. 22,07,000 కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు నిర్దేశించుకోగా, దాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 22,37,000 కోట్లకు సవరించారు. సాధారణంగా కార్పొరేట్ ట్యాక్సులు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ), నాన్–కార్పొరేట్ ట్యాక్సులు (గతంలో వ్యక్తిగత ఆదాయ పన్ను) మొదలైనవి ప్రత్యక్ష పన్నుల పరిధిలోకి వస్తాయి. వ్యక్తులు, సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌లు) మొదలైన వర్గాలు కట్టే పన్నులు నాన్–కార్పొరేట్ ట్యాక్సుల పరిధిలోకి వస్తాయి. స్థూల వసూళ్లు 16 శాతం అప్.. అధికారిక డేటా ప్రకారం మార్చి 31తో ముగిసిన 2024–25 ఆర్థిక సంవత్సరంలో స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు (రిఫండ్లకు ముందు) 15.59 శాతం పెరిగి రూ. 27.02 లక్షల కోట్లకు చేరాయి. అంతక్రితం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ. 23.37 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక, రిఫండ్ల జారీ తర్వాత నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్ల ప్రొవిజనల్ గణాంకాలు రూ. 22.26 లక్షల కోట్లుగా నమోదైయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 19.60 లక్షల కోట్లతో పోలిస్తే 13.57 శాతం పెరిగాయి. – ఇవన్నీ ప్రొవిజనల్ గణాంకాలు మాత్రమే. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తుది దశ రీకన్సిలియేషన్, సర్దుబాట్లు జరుగుతున్నందున నికర వసూళ్లు మరికాస్త పెరగొచ్చని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు.. → ఎస్టీటీ నుంచి రెవెన్యూ రూ.34,192 కోట్ల నుంచి రూ. 53,296 కోట్లకు పెరిగింది. → ప్రొవిజనల్ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు, జులై బడ్జెట్ లక్ష్యంతో పోలిస్తే (రూ. 22.07 లక్షల కోట్లు) 100.78 శాతం పెరగ్గా, ఫిబ్రవరిలో సవరించిన అంచనాలతో పోలిస్తే (రూ. 22.37 లక్షల కోట్లు) 99.51 శాతం పెరిగాయి. → 2024–25లో ట్యాక్స్ డిపార్ట్మెంట్ అత్యధిక స్థాయిలో రూ. 4,76,743 కోట్లు రిఫండ్ జారీ చేసింది. 2023–24లో నమోదైన రూ. 3,78,255 కోట్లతో పోలిస్తే ఇది 26.04 శాతం అధికం. → రికార్డు స్థాయిలో రూ. 4.76 లక్షల కోట్లు రిఫండ్లు జారీ చేసినప్పటికీ స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు బడ్జెట్లో నిర్దేశించుకున్న రూ. 22.37 లక్షల కోట్ల స్థాయిని మించి నమోదైనట్లు అధికారులు తెలిపారు. సిసలైన క్లెయిమ్‌లను పారదర్శమైన, సముచితమైన విధంగా తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని ట్యాక్స్‌పేయర్లకు ఇచ్చిన హామీకి డిపార్టుమెంట్ కట్టుబడి ఉండటం ఇందుకు కారణమని వివరించారు. → సమీక్షాకాలంలో నికర కార్పొరేట్ ట్యాక్సుల వసూళ్లు (ప్రొవిజనల్) 8.30 శాతం పెరిగి రూ. 9,86,719 కోట్లకు చేరాయి. స్థూల కార్పొరేట్ వసూళ్లు 12.41 శాతం వృద్ధితో రూ. 12,72,516 కోట్లుగా నమోదయ్యాయి. -
భారత ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఎంతంటే..
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో భారతదేశం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గణనీయమైన వృద్ధిని సాధించింది. స్థూల వసూళ్లు 15.59% పెరిగి రూ.27.02 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అధిక కార్పొరేట్, నాన్-కార్పొరేట్ పన్ను ఆదాయాలు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్టీటీ) రాబడుల్లో పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల దేశం బలమైన ఆర్థిక కార్యకలాపాలు, మెరుగైన పన్ను విధానాన్ని ప్రతిబింబిస్తుంది.కార్పొరేట్ ట్యాక్స్ రాబడులు: కార్పొరేట్ పన్ను వసూళ్లు 2024-25లో రూ.12.72 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందకు ఏడాది ఇది రూ.11.31 లక్షల కోట్లుగా ఉంది.నాన్ కార్పొరేట్ ట్యాక్స్ రెవెన్యూ: నాన్ కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.11.68 లక్షల కోట్ల నుంచి 2024-25లో రూ.13.73 లక్షల కోట్లకు పెరిగాయి.సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ): క్యాపిటల్ మార్కెట్లలో కార్యకలాపాలు పెరగడంతో ఎస్టీటీ రాబడులు రూ.34,192 కోట్ల నుంచి రూ.53,296 కోట్లకు పెరిగాయి.నికర పన్ను వసూళ్లు, రీఫండ్లురిఫండ్లను పరిగణనలోకి తీసుకుంటే నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.22.26 లక్షల కోట్లలో 26.04 శాతం పెరిగి రూ.4.76 లక్షల కోట్లకు చేరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.19.60 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 13.57% పెరుగుదలను సూచిస్తుంది. ఇది ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ చట్టబద్ధమైన రీఫండ్ క్లెయిమ్‌లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తుంది.ఇదీ చదవండి: ఏడాదిలో రూ.21.16 లక్షల కోట్లు గీకారు!వృద్ధికి సంకేతంప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరగడం భారత ఆర్థిక వృద్ధికి సానుకూల సంకేతం. ప్రభుత్వ ఆదాయాన్ని బలోపేతం చేయడం, రుణాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది. అధిక పన్ను ఆదాయాలు మౌలిక సదుపాయాలు, సాంఘిక సంక్షేమం, ఇతర కీలక రంగాలపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచడానికి వీలు కల్పిస్తాయి. -
ఏడాదిలో రూ.21.16 లక్షల కోట్లు గీకారు!
క్రెడిట్ కార్డు వ్యయం 2025 ఆర్థిక సంవత్సరంలో అనూహ్యంగా పెరిగి రికార్డు స్థాయిలో రూ.21.16 లక్షల కోట్లకు చేరుకుంది. వినియోగదారుల డిమాండ్, డిజిటల్ లావాదేవీలకు పెరుగుతున్న ప్రాధాన్యత కారణంగా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 15% పెరుగుదలను నమోదు చేసింది. రుణ ఆధారిత వినియోగం అధికం అవుతుండడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.పట్టణ, డిజిటల్ పరిజ్ఞానం ఉన్న వినియోగదారులు విచక్షణా వ్యయం కోసం క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. ముఖ్యంగా ఈ-కామర్స్, ట్రావెల్, డైనింగ్ వంటి రంగాల్లో దీన్ని అధికంగా ఉపయోగిస్తున్నారు.ఆన్లైన్ చెల్లింపులపై ఆసక్తి చూపడం క్రెడిట్ కార్డు వినియోగానికి ఆజ్యం పోసింది. మూడింట రెండొంతుల లావాదేవీలు డిజిటల్ రూపంలో జరుగుతున్నాయి.వ్యయాల పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై స్థిరమైన విశ్వాసాన్ని సూచిస్తుంది.ఇదీ చదవండి: లేటరల్ ఎంట్రీ నియామకాలకు నోటిఫికేషన్2025 మార్చి నాటికి చలామణిలో ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య 10.98 కోట్లకు చేరింది. ఇది ఏడాది క్రితం 10.18 కోట్లుగా ఉండేది. కొత్త కార్డుల జారీ బ్యాంకుల వారీగా భిన్నంగా ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్ వంటి ప్రముఖ సంస్థలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేయగా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ వంటి ఇతర సంస్థలు రెగ్యులేటరీ సవాళ్లు, భాగస్వామ్యాల్లో మార్పుల కారణంగా కార్డుల జారీలో క్షీణతను ఎదుర్కొన్నాయి. అన్ సెక్యూర్డ్ రుణాలకు సంబంధించిన రిస్క్‌లను తగ్గించడానికి బ్యాంకులు క్రెడిట్ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. బ్యాంకులు ఇప్పటికే ఉన్న వినియోగదారులకు ఆర్థిక ఉత్పత్తులను క్రాస్-సెల్లింగ్ చేయడంపై దృష్టి పెడుతున్నాయి. -
బంగారం.. కొనేదెలా..?
న్యూఢిల్లీ: బంగారం ధర రూ.లక్షలకు పెరిగిపోవడం వినియోగదారులు, ముఖ్యంగా మహిళల ఆకాంక్షలపై నీళ్లు చల్లినట్లయింది. భారతీయ మహిళలకు బంగారంతో విడదీయలేని అనుబంధమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్య కుటుంబాలకు చెందిన వారు సైతం బంగారు ఆభరణాల కోసమని చెప్పి తమకు తోచినంత పొదుపు చేస్తుంటారు. ఇటీవలి కాలంలో ధరలు అసాధారణంగా పెరిగిపోవడాన్ని వారు ఇప్పుడు జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఏటా వైశాఖమాసంలో వచ్చే అక్షయ తృతీయ(మొదటి తదియ), వివాహాల సందర్భంగా బంగారం ఆభరణాల కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ ఏడాది ఇప్పటికే బంగారం ధరలు 22 శాతం పెరిగిపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జవవరి 1న 10 గ్రాముల బంగారం ధర రూ.79,390గా ఉండగా, అక్కడి నుంచి చూస్తే రూ.1.01 లక్షల వరకు వెళ్లి ప్రస్తుతం రూ.98వేల స్థాయిలో ఉంది. ఇలా అయితా ఎలా కొనగలం? ‘‘వచ్చే నవంబర్‌లో నా కుమార్తె వివాహం ఉంది. ఈలోపే బంగారం ధర గణనీయంగా పెరిగింది. ఇప్పుడు వివాహం కోసం బంగారం ఎలా కొనుగోలు చేయాలి?’’ అన్నది నోయిడాకు చెందిన రూప అభిప్రాయం. పండగలు, వివాహాల సమయంలో బంగారం కొనుగోలు చేయకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుందని ఢిల్లీ మయూర్ విహార్‌కు చెందిన సుశీలా దేవి మనోగతం. గతంలో 10 గ్రాములు కొనేవాళ్లం కాస్తా.. ఇప్పుడు 5 గ్రాములతో సరిపెట్టుకోవడమేనని నిర్వేదం వ్యక్తం చేశారు. ‘‘నాకు బంగారం ఆభరణాలంటే ఎంతో ఇష్టం. అందుకే ఏటా ఒకసారి కొనుగోలు చేస్తుంటా. ధర రూ.లక్షకు చేరడం నన్ను కలచివేస్తోంది’’అని ఛత్తీస్‌గఢ్‌లోని కోబ్రా జిల్లా వాసి సీతా సాహు తెలిపారు. మరోవైపు చెప్పుకోతగ్గ స్థాయిలో బంగారం ఆభరణాలను సమకూర్చుకున్నవారు.. ధరలు భారీగా పెరిగిపోవడం పట్ల ఒకింత ఆనందాన్నీ వ్యక్తం చేస్తున్నారు. ‘‘నా భర్త ఏటా బంగారం కొనిపెడుతుండేవారు. కానీ, నేడు ఆయన లేకపోయినప్పటికీ.. ఆభరణాలు మాత్రం నాకు గౌరవంతోపాటు, మద్దతుగా నిలుస్తున్నాయి’’అని పుణెకు చెందిన అర్చనా దేశ్‌ముఖ్ (65) చెప్పారు. అమ్మకాలపై ప్రభావం.. ధరల పెరుగుదలతో అమ్మకాలు తగ్గుతున్నట్టు ఆభ రణాల వర్తకులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న వర్తకులపై దీని ప్రభావం ఎక్కువగా కనిపి స్తోంది. ‘‘దశాబ్దాల నుంచి ఇదే వ్యాపారంలో ఉ న్నాం. మొదటిసారి కస్టమర్ల మొహాల్లో అయోమయాన్ని చూస్తున్నాం. గతంలో కస్టమర్లు ఆభరణాల డిజైన్లను ఎన్నింటినో చూసేవారు. ఇప్పుడు వాటిని చూసి వెనక్కి ఇచ్చేస్తున్నారు. ధరలు ఇలాగే పెరిగితే చిన్న వర్తకులు కొనసాగడం కష్టమే’’అని ఢిల్లీ మ యూర్ విహార్‌కు ‘ఊరి్మళా జ్యుయలర్స్’ స్వర్ణకారి ణి సోనూసోని తెలిపారు. కానీ మహిళలు బంగా రం తప్పకుండా పొదుపు చేసి, ఆభరణాలను కొనుగోలు చేస్తూనే ఉంటారని రాధేశ్యామ్ జ్యుయలర్స్‌కు చెందిన కరణ్ సోని అభిప్రాయపడ్డారు. లైట్ వెయిట్ జ్యుయలరీకి డిమాండ్? బంగారం ధరలు పెరిగిపోవడంతో ఈ నెల 30న అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లు తేలికపాటి ఆభరణాలను కొనుగోలు చేయొచ్చని జ్యుయలర్లు అంచనా వేస్తున్నారు. ‘‘అక్షయ తృతీయకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ సమయంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతుంటాయి. ఈ ఏడాది ధరలు పెరిగినప్పటికీ లైట్ వెయిట్ ఆభరణాల రూపంలో మంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నాం’’అని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోక్డే తెలిపారు. ధరల పెరుగుదల పట్ల కస్టమర్లు అసహనం వ్యక్తం చేసినప్పటికీ.. సురక్షిత సాధనంగా, మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగం కావడంతో క్రమంగా అమ్మకాలు సానుకూల స్థితికి చేరుకుంటాయన్నారు. ధరల పెరుగుదల నేపథ్యంలో విక్రయాలను పెంచుకునేందుకు వర్తకులు అన్ని రకాల ధరల్లో ఆభరణాలను అందుబాటులో ఉంచడంపై దృష్టి సారించినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అధిక ధరలతో అమ్మకాల పరిమాణం క్రితం ఏడాది స్థాయిలోనే ఉండొచ్చని లేదా 10 శాతం వరకు తగ్గొచ్చని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ వైస్ చైర్మన్ అవినాష్ గుప్తా అభిప్రాయపడ్డారు. అక్షయ తృతీయ, వివాహాల సీజన్ కావడంతో విక్రయాల పట్ల ఆశావహంగా ఉన్నట్టు పీఎన్జీ జ్యుయలర్స్ చైర్మన్ సౌరభ్ గాడ్గిల్ పేర్కొన్నారు. -
ఫెమా పెనాల్టీ ఫ్రేమ్‌వర్క్‌ను సడలించిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) పెనాల్టీ నిబంధనలను సవరించింది. ఇందులో భాగంగా ఆర్బీఐ తాజాగా ఫెమా నిర్దిష్ట ఉల్లంఘనలకు జరిమానాలను రూ.2 లక్షలకు పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. ఇది విదేశీ మారకద్రవ్య లావాదేవీలతో సంబంధం ఉన్న వ్యక్తులు, వ్యాపారాలకు కీలకం కానుంది.గతంలోని నిబంధనల ప్రకారం ఉల్లంఘనల మొత్తంలో కొంత శాతంగా ఈ జరిమానాలను వసూలు చేసేవారు. దీని స్థానంలో రూ.2 లక్షలు స్థిరమైన జరిమానా నిబంధనను తీసుకొచ్చారు. గతంలోని విధానం ద్వారా తరచుగా భారీ ఆర్థిక జరిమానాలు చెల్లించాల్సి వచ్చేది. ఫెమా పెనాల్టీ ఫ్రేమ్‌వర్క్ కింద లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) రాబడులు, ఎగుమతి కాలపరిమితిలో జాప్యం, అధిక విలువ కలిగిన షేర్లను బహుమతిగా ఇవ్వడం వంటి అంశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. పెనాల్టీలో భాగంగా ఫిక్స్డ్ క్యాప్‌ను ప్రవేశపెట్టడం ద్వారా జరిమానాల ప్రక్రియను సరళతరం చేసినట్లయిందని కొందరు భావిస్తున్నారు. ఇటువంటి నియంత్రణ ఉల్లంఘనల సమయంలో వ్యక్తులు, వ్యాపారాలు ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా ఆర్బీఐ ఈ మార్పులు చేసినట్లు చెప్పింది.ఇదీ చదవండి: ‘పహల్గాం బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిస్తాం’ఈ చర్య వాటాదారులపై భారాన్ని తగ్గించి ఫెమా మార్గదర్శకాలను మరింత మెరుగ్గా పాటించేలా చేస్తుందని కొందరు చెబుతున్నారు. జరిమానాలు నిష్పాక్షికంగా ఉండేలా చూడటం ద్వారా దేశంలో మరింత స్నేహపూర్వక వ్యాపార వాతావరణాన్ని పెంపొందించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
మార్కెట్లోకి నకిలీ రూ.500 నోట్లు: హోం శాఖ హెచ్చరిక
నకిలీ 500 రూపాయల నోట్లు చలామణిలోకి రావడంతో.. హోం మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. టెక్నాలజీ సాయంతో తయారు చేసిన ఈ నకిలీ నోట్లు చూడటానికి నిజమైనవి మాదిరిగా అనిపించడం వల్ల చాలా మంది మోసపోయే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది.నకిలీ రూ. 500 నోట్లను గుర్తించడం కొంత కష్టతరంగా ఉండటంతో.. చాలామంది మోసపోతున్నారు. అయితే నిజమైన రూ. 500 నోటుకు, నకిలీ నోటుకు ఓ చిన్న తేడా ఉంది. దీనిని గమనిస్తే.. ఏది నకిలీ నోటు అనేది సులభంగా తెలుసుకోవచ్చు.ఒరిజినల్ రూ. 500 నోట్ల మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RESERVE BANK OF INDIA) అని అక్షరాలు ఉండటం గమనించే ఉంటారు. అయితే నకిలీ నోటు మీద కూడా RESERVE BANK OF INDIA అని ఉంటుంది. కానీ RESERVE అనే పదంలోని.. చివరి E స్థానంలో A ఉంటుందని అధికారులు వెల్లడించారు.నకిలీ నోట్లు మార్కెట్లోకి రావడంతో.. ప్రజలు, వ్యాపార సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు. నకిలీ నోట్లను గురించికపోతే నష్టపోతారని హెచ్చరించారు. నకిలీ నోట్లను చలామణీ చేసే ముఠాలను పట్టుకోవడానికి, వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. -
దిగ్గజ బ్యాంక్ కీలక నిర్ణయం: మారిన ఏటీఎం ఛార్జీలు
దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన.. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల అనుగుణంగానే ఈ ఛార్జీలను పెంచడం జరిగిందని స్పష్టం చేసింది. కొత్త ఛార్జీలు 2025 మే 1నుంచి అమలులోకి వస్తాయి.మే 1 నుంచి ప్రతి లావాదేవీకి రూ.23 వసూలు చేయనున్నట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. గతంలో ఈ ఛార్జ్ రూ. 21గా ఉండేది. ఈ ఛార్జీలు నెలవారీ ఫ్రీ విత్‌డ్రా లిమిట్ పూర్తయిన తరువాత మాత్రమే వర్తిస్తుంది. ఛార్జీల పెరుగుదల విషయాన్ని బ్యాంక్ ఇప్పటికే.. కస్టమర్లకు మెయిల్స్ ద్వారా పంపింది.ఏటీఎంలలో నిర్వహించే ఆర్ధిక లావాదేవీలకు, ఆర్థికేతర లావాదేవీళ్లకులకు & కోటక్ మహీంద్రా బ్యాంక్ మెషీన్లలో అయినా లేదా ఇతర బ్యాంకులకు సంబంధించిన మెషీన్లలో అయినా.. ఫ్రీ ఏటీఎం లావాదేవీల లిమిట్ దాటితే.. ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్మెంట్ వంటి వాటికోసం వరుసగా రూ. 8.50, రూ. 10 ఛార్జీలు వసూలు చేయనున్నారు.ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం నుంచి కస్టమర్ రోజుకు గరిష్టంగా రూ. 1,00,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ సదుపాయం కోటక్ ఎడ్జ్, ప్రో, ఏస్ ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈజీ పే ఖాతాదారుడు రూ. 25,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మరికొన్ని డెబిట్ కార్డులను కలిగి ఉన్న కస్టమర్లు రూ. 50వేలు వరకు విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది. -
కొత్త పన్ను విధానం 'మార్పు' మంచిదే !
మధ్యతరగతి వారికి గుడ్‌న్యూస్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి చాలా మందికి ఆదాయపన్ను పన్ను భారం తొలగిపోయింది. 2025 బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో చేసిన మార్పులతో వేతన జీవులు, పెన్షనర్లకు రూ.12.75 లక్షలు, ఇతరులకు రూ.12 లక్షల వరకు ఆదాయం మించనప్పుడు ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఆదాయం ఈ పరిమితి దాటినప్పుడే వారు తమ మొత్తం ఆదాయంపై నిర్ణీత శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.7–7.75 లక్షలుగా ఉన్న పరిమితులను ప్రభుత్వం గణనీయంగా పెంచేసింది. పాత విధానంలో పన్ను ఆదా కోసం ఎన్నో రకాల పెట్టుబడులు పెట్టాల్సి వచ్చేది. వీటికితోడు బీమా ప్రీమియం, ఇంటి రుణం చెల్లింపులు ఇలా ఎన్నో క్లెయిమ్ చేసుకుంటే గానీ పన్ను భారం గణనీయంగా తగ్గేది కాదు. ఇప్పుడు కొత్త పన్ను విధానంలో ఈ తలనొప్పులేవీ లేకుండానే గణనీయమైన ప్రయోజనం కల్పించారు. 2025–26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో కొత్త పన్ను విధానంలోకి మారడం, లేదంటే పాత విధానాన్ని కొనసాగించడం వల్ల కలిగే లాభనష్టాలపై అవగాహన కల్పించే కథనమిది... ‘‘మన దేశంలో పన్ను రిటర్నులు వేస్తున్న వారిలో 90 శాతం మంది ఆదాయం రూ.13 లక్షల కంటే తక్కువే ఉంది. అంటే 140 కోట్ల మంది ప్రజల్లో కేవలం కోటి మందే 2025–26 ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లించనున్నారు. భారత్‌ను ఆదాయపన్ను రహితంగా మార్చడమే ఇది’’ అంటూ షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై చేసిన విమర్శనాత్మక పోస్ట్ తాజా పరిస్థితులకు అద్దం పడుతోంది. 2023–24 సంవత్సరం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం మన దేశంలో వేతన జీవుల సగటు ఆదాయం రూ.20,039గా ఉంది. కనుక మెజారిటీ వేతన జీవులే కాదు, స్వయం ఉపాధిలో ఉన్న వారిలోనూ అధిక శాతం మంది ఆదాయం రూ.12 లక్షల్లోపే ఉంటుంది. కనుక వారికి కొత్త పన్ను విధానమే లాభదాయకం. లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టుబడులు అన్నవి ఎప్పుడూ తమ లక్ష్యాలు, ఆశించే రాబడి, రిస్క్ సామర్థ్యం వీటన్నింటికీ సరిపోయే సాధనాలతో ఉండాలి. అంతే కానీ పన్ను ఆదా కోసమని చెప్పి మెరుగైన రాబడుల్లేని చోట ఇన్వెస్ట్ చేస్తే లక్ష్యాలకు కావాల్సినంత సమకూర్చుకోవడం కఠినతరం అవుతుంది. పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదా కోసం పిల్లల ట్యూషన్ ఫీజులు మొదలు కొని జీవిత బీమా ప్రీమియం, పీపీఎఫ్, ఎన్సీఎస్, ఐదేళ్ల బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇలా ఎన్నో సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. పైగా పన్ను ఆదా పెట్టుబడులకు మూడు నుంచి ఐదేళ్ల లాకిన్ పీరియడ్ (అప్పటి వరకు ఉపసంహరణ కుదరదు) కూడా ఉంటుందని మర్చిపోవద్దు. పీపీఎఫ్ అయితే 15 ఏళ్లు. కొత్త పన్ను విధానంలో ఇలాంటి షరతులేవి లేకుండా రూ.12 లక్షలకు మించని ఆదాయం ఉన్న అందరికీ సెక్షన్ 87ఏ కింద పన్ను రాయితీ కల్పించారు. కనుక తమకు నచ్చిన చోట పెట్టుబడులు పెట్టుకునే స్వేచ్ఛ కొత్త విధానం కల్పిస్తోంది. దీర్ఘకాల లక్ష్యాలకు ఇతర సాధనాల కంటే ఈక్విటీలే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మించి మెరుగైన రాబడిని అందిస్తాయని చరిత్ర చెబుతోంది. కనుక మెజారిటీ పెట్టుబడులు ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. పాత పన్ను విధానంలో పన్ను ఆదా కోసం ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదే కొత్త పన్ను విధానంలో అయితే పన్ను ఆదా కోసం చూడకుండా ప్యాసివ్ ఫండ్స్, ఫ్లెక్సీక్యాప్, ఈక్విటీ–డెట్ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్, బంగారంలోనూ పెట్టుబడులకు వీలు కల్పించే మల్టీ అస్సెట్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లు, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు ఇలా ఎన్నో విభాగాల నుంచి తమకు అనుకూలమైన వాటిని నిపుణుల సూచనల మేరకు ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొందరికి కొత్త.. కొందరికి పాత పాత పన్ను విధానంలో వివిధ రకాల పన్ను పెట్టుబడులు, మినహాయింపుల రూపంలో రూ.5,75,000.. వేతనంలో 30 శాతాన్ని హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) కింద క్లెయిమ్ చేసుకున్నప్పటికీ.. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి (వేతన జీవులకు రూ.12.75 లక్షల వరకు) నూతన పన్ను విధనామే మెరుగైనది. ఈ కింది టేబుల్లో దీన్ని గుర్తించొచ్చు. ఒకవేళ ఆదాయం రూ.12 లక్షలు మించితే (వేతన జీవులకు రూ.12.75 లక్షల ఆదాయం దాటితే).. పాత పన్ను విధానంలో అన్ని మినహాయింపులు, రాయితీలను క్లెయిమ్ చేసుకునేట్టు అయితే.. కొత్త విధానం కంటే పాత విధానంలోనే కొంత అదనంగా ఆదా అవుతుంది. ఉదాహరణబ్యాంక్ ఉద్యోగి మోనాలీ దేవ్ ఆదాయం రూ.20.5 లక్షలు. ఆఫీసుకు వెళ్లి వచ్చేందుకు ఆమె కారు లేదా ట్యాక్సీ వినియోగించడం లేదు. దీంతో రూ.1.2 లక్షల ట్రాన్స్పోర్ట్ అలవెన్స్‌పై పూర్తి పన్ను చెల్లించాల్సి వస్తోంది. నెలల శిశువు కారణంగా ఎలాంటి పర్యటనలకూ వెళ్లే వీలు లేకపోవడంతో రూ.30,000 ఎల్‌టీఏ ప్రయోజనాన్ని కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు. కేవలం ఎన్పీఎస్, సెక్షన్ 80సీ, గృహ రుణం చెల్లింపులు రూ.1.6 లక్షలు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.11,500 చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో తన ఆదాయంపై ఈ మినహాయింపులు క్లెయిమ్ చేసుకున్న తర్వాత పాత విధానంలో ఆమె 2023–24 సంవత్సరానికి రూ.3.15 లక్షల ఆదాయం చెల్లించాల్సి వచి్చంది. నిపుణుల సూచనలతో కొత్త విధానంలో మదింపు చేయగా చెల్లించాల్సిన పన్ను రూ.2.86 లక్షలుగా తేలింది. ఒకవేళ సెక్షన్ 80సీసీడీ (2) కింద కార్పొరేట్ ఎన్‌పీఎస్‌లో.. మూలవేతనంలో 14 శాతం చొప్పున ప్రతి నెలా రూ.15,156ను పనిచేసే సంస్థ నుంచి జమ చేయించుకుంటే అప్పుడు మోనాలీ దేవ్‌కు పన్ను భారం మరో రూ.57,000 తగ్గిపోతుంది. 2025–26 సంవత్సరం నుంచి అమల్లోకి వచి్చన కొత్త పన్ను విధానం శ్లాబుల ప్రకారం అయితే మోనాలీదేవ్ చెల్లించాల్సిన పన్ను (ఎన్పీఎస్ లేకుండా) కేవలం రూ.1.98 లక్షలే. ముందటి ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే రూ.88 వేలు ఆదా అవుతోంది. పనిచేసే సంస్థ నుంచి ఎన్పీఎస్ (కార్పొరేట్ ఎన్పీఎస్) జమ కూడా చేయించుకుంటే ఈ పన్ను ఇంకా తగ్గిపోనుంది. కనుక అధిక ఆదాయం పరిధిలోని వారు పాత–కొత్త విధానంలో మదింపు చేసుకుని తుదిగా తమకు ఏ విధానం లాభదాయకమో నిర్ణయించుకోవాలి. పన్ను చెల్లింపుదారుల్లో చాలా మంది గృహ రుణం తీసుకుని ఉండపోవచ్చు. అలాంటి వారు కేవలం హెచ్ఆర్ఏ మినహాయింపునకే పరిమితం కావాల్సి ఉంటుంది.ఆదాయాన్ని బట్టి మార్పు.. ‘‘కొత్త విధానం ఆకర్షణీయంగా అనిపించొచ్చు. కానీ, అన్ని ప్రయోజనాలను వినియోగించుకుంటే పాత విధానంలో పన్ను తక్కువ. రూ.60 లక్షలు ఆర్జించే వారు రూ.8.5 లక్షల మినహాయింపు/రాయితీలను క్లెయిమ్ చేసుకునేట్టు అయితే పాత విధానంలోనే రిటర్నులు వేసుకోవచ్చు’’ అని ట్యాక్స్‌స్పానర్ డాట్ కామ్ సీఈవో సు«దీర్ కౌశిక్ సూచించారు. → రూ.13.75 లక్షల ఆదాయం కలిగి కేవలం రూ.5.25 లక్షల పన్ను మినహాయింపుల వరకే క్లెయిమ్ చేసుకున్నా సరే పాత విధానంలో రూ.57,500 చెల్లించాల్సి వస్తే, కొత్త విధానంలో రూ.75,000 పన్ను పడుతోంది. → రూ.15.75 లక్షల ఆదాయం ఉంటే హెచ్ఆర్ఏ ప్రయోజనం లేకుండా మిగిలిన మినహాయింపులను క్లెయిమ్ చేసుకుంటే పాత విధానంలోనే పన్ను తక్కువ. → రూ.20 లక్షల ఆదాయం ఉన్న వారి విషయంలో (వేతన జీవులు అయితే రూ.20.75 లక్షలు) మళ్లీ ఇది మార్పునకు గురవుతుంది. హెచ్ఆర్ఏను పక్కన పెట్టి చూస్తే పాత విధానంలో రూ.5.25 లక్షల మొత్తాన్ని క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు చెల్లించాల్సిన పన్ను రూ.2,40,000 కాగా, కొత్త విధానంలో రూ.2 లక్షలే కావడం గమనించొచ్చు. అలాగే రూ.24 లక్షల ఆదాయంపై కొత్త విధానంలో రూ.60 వేలు ఆదా చేసుకోవచ్చు. → రూ.24.75 లక్షలపైన ఆదాయం కలిగిన వారు, మొత్తం మినహాయింపులు/తగ్గింపులు/రాయితీలు అన్నీ రూ.7.75 లక్షలకు మించితే అప్పుడు పాత విధానాన్ని పరిశీలించొచ్చు. → గ్రాంట్ థార్న్టన్ అంచనా ప్రకారం రూ.1.5 కోట్ల ఆదాయం కలిగిన వారు పాత విధానంలో స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 80సీ ప్రయోజనాలను వినియోగించుకుంటే చెల్లించాల్సిన పన్ను రూ.40.09 లక్షలు కాగా, కొత్త విధానంలో రూ.48.52 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. → పన్నుకు అదనంగా సెస్సు చెల్లించాలి. రూ.50లక్షల ఆదాయం మించిన వారు సర్‌చార్జీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. హెచ్ఆర్ఏ విషయంలో షరతులు గృహ రుణం ఈఎంఐలో అసలు మొత్తాన్ని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు, వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల వరకు సెక్షన్ 24బీ కింద పాత విధానంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే సమయంలో హెచ్ఆర్ఏ రాయితీని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చా? అంటే అందరికీ అని చెప్పలేం. ఇక్కడ కొన్ని షరతులు వర్తిస్తాయి. → వేతనంలో హెచ్ఆర్ఏ ప్రయోజనం తప్పకుండా ఉండాలి. పనిచేసే ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తూ అద్దె చెల్లించాలి. → తన పేరు లేదా తన జీవిత భాగస్వామితో కలసి ఉమ్మడిగా రుణం తీసుకుని పనిచేసే చోట కాకుండా వేరే ప్రాంతంలో ఇల్లు సమకూర్చుకుని చెల్లింపులు చేస్తుండాలి. → రుణంపై ఇల్లు సమకూర్చుకుని అందులోనే నివసిస్తూ.. వేతనంలో భాగంగా హెచ్ఆర్ఏ ప్రయోజనం తీసుకుంటున్న వారు.. గృహ రుణానికి చెల్లిస్తున్న అసలు, వడ్డీపైనే మినహాయింపును క్లెయిమ్ చేసుకోగలరు. అద్దె చెల్లించడం లేదు కనుక హెచ్ఆర్ఏ క్లెయిమ్‌కు అవకాశం లేదు. → ఒకవేళ మీరు పనిచేసే పట్టణంలోనే ఇంటి కొనుగోలుకు రుణం తీసుకున్నారు. కానీ, ఆ ఇంటిలో కాకుండా, అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఇలాంటప్పుడు హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయలేరు. ఒకవేళ కార్యాలయానికి, రుణంపై సమకూర్చుకున్న ఇల్లు మరీ దూరంగా ఉంటే తప్పించి హెచ్ఆర్ఏ క్లెయిమ్‌కు అర్హులు కారు. కనుక హెచ్ఆర్ఏతోపాటు గృహ రుణంపై గరిష్ట ప్రయోజనం పొందాలంటే పనిచేసే ప్రాంతంలో కాకుండా దూరంగా సొంతిల్లును సమకూర్చుకోవడం ఒక మార్గం. హెచ్ఆర్ఏ సూత్రం → యాజమాన్యం నుంచి స్వీకరించిన వాస్తవ హెచ్ఆర్ఏ → ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన మొత్తం ఇంటి అద్దె నుంచి.. ఏడాదిలో స్వీకరించిన మూలవేతనం, డీఏలో 10 శాతాన్ని తీసివేయగా మిగిలినది. → మూలవేతనం, డీఏలో 40 శాతం (నాన్ మెట్రోలు)/50 శాతం (మెట్రోల్లో నివసించే వారు) → ఈ మూడింటిలో తక్కువ మొత్తాన్ని హెచ్ఆర్ఏ కింద క్లెయిమ్ చేసుకుని పన్ను చెల్లించక్కర్లేదు. కొత్త విధానంలోనూ కొన్ని మినహాయింపులు పాత విధానంతో పోల్చి చూస్తే నూతన పన్ను విధానంలో చాలా వరకు మినహాయింపులు, రాయితీల్లేవు. హెచ్ఆర్ఏ, ఎల్టీసీ, టెలిఫోన్, ఇంటర్నెట్ వ్యయాలను క్లెయిమ్ చేసుకోలేరు. పన్ను ఆదా పెట్టుబడులూ లేవు. గృహ, విద్యా రుణాలపై అసలు, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన ప్రయోజనాలు, లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులకూ ఎలాంటి పన్ను మినహాయింపులు లేవన్న విషయాన్ని గుర్తించాలి. అదే సమయంలో వేతన జీవులకు కొన్ని ప్రయోజనాలు కల్పించారు. కార్పొరేట్ ఎన్పీఎస్: సెక్షన్ 80సీసీడీ(2) కింద కార్పొరేట్ ఎన్పీఎస్ ప్రయోజనం ఉంది. ఉద్యోగి తరఫున ఎన్పీఎస్ ఖాతాకు యాజమాన్యం జమ చేయాల్సి ఉంటుంది. మూల వేతనం, డీఏ మొత్తంలో 14 శాతం చొప్పున యాజమాన్యం జమలపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. గరిష్ట జమ రూ.7.5 లక్షలకే ఇది వర్తిస్తుంది. సర్‌చార్జ్: రూ.5 కోట్లకు పైన ఆదాయం కలిగిన వారికి పాత విధానంలో చెల్లించాల్సిన పన్ను మొత్తంపై 37 శాతం సర్‌చార్జ్ చెల్లించాల్సి వస్తుంది. కొత్త విధానంలో ఇది 25 శాతమే. అలవెన్స్‌లు: దివ్యాంగులకు రవాణా భత్యం, ఉద్యోగులకు అధికారిక ప్రయాణాలు లేదా బదిలీ కోసం చెల్లించే అలవెన్స్, ఆఫీస్‌కు దూరంగా వేరే ప్రాంతంలో డ్యూటీ చేయాల్సి వస్తే చెల్లించే అలవెన్స్‌లకు పన్ను మినహాయింపులున్నాయి. సెక్షన్ 80సీసీహెచ్: అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపు ఉంది.ఏటా మారిపోవచ్చు..!రెండు పన్ను విధానాల్లోనూ తమకు అనుకూలమైన దాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వేతన జీవులకు ఉంది. ఒక విధానం నుంచి మరో విధానానికి ఏటా మారిపోవచ్చు కూడా. వేతనం/పింఛనుతోపాటు వ్యాపార ఆదాయం ఉంటే మాత్రం ఈ సదుపాయం లేదు. వ్యాపార ఆదాయం, వృత్తిపరమైన ఆదాయం కలిగిన వారు ఒక్కసారి నూతన విధానంలోకి మారితే.. తిరిగి పాత విధానంలోకి మళ్లేందుకు ఒక్కసారే అవకాశం ఉంటుంది. ఇక వేతన జీవులు, పెన్షనర్లు సైతం గడువులోపు (జూలై 31) ఐటీఆర్‌లు దాఖలు చేసినట్టయితేనే పాత, కొత్త విధానాల్లో తమకు నచ్చింది ఎంపిక చేసుకోగలరు. గడువు దాటిన తర్వాత సమర్పించే బీలేటెడ్ రిటర్నులు కొత్త విధానంలోనే సమర్పించడానికి అనుమతి ఉంటుంది. ఐటీఆర్ దాఖలు సమయంలో ‘వెదర్ ఆప్టింగ్ అవుట్ న్యూ ట్యాక్స్ రెజిమ్ ఆఫ్ సెక్షన్ 115బీఏసీ?’’ అని అడుగుతుంది. యస్ అని క్లిక్ చేస్తే పాత విధానంలో పన్ను రిటర్నులు దాఖలవుతాయి. నో అని క్లిక్ చేస్తే ఐటీఆర్ నూతన విధానం కింద సమరి్పంచినట్టు అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మార్చిలో జోరుగా పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు మార్చిలో గణనీయంగా పెరిగాయి. ఏకంగా 192 శాతం అధికంగా 4.47 బిలియన్ డాలర్ల (రూ.38వేల కోట్లు సుమారు) విలువైన పసిడి దిగుమతి అయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024 మార్చి నెలలో దిగుమతులు 1.53 బిలియన్ డాలర్లుగానే ఉండడం గమనార్హం. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద చూస్తే బంగారం దిగుమతుల్లో మిశ్రమ ధోరణి కనిపించింది. విలువ పరంగా వృద్ధి కనిపించగా, పరిమాణం పరంగా పసిడి దిగుమతులు తగ్గాయి. బంగారం దిగుమతులు 2023–24తో పోల్చి చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో విలువ పరంగా 27 శాతం ఎగసి 58 బిలియన్ డాలర్లకు (రూ.4.99 లక్షల కోట్లు సుమారు) చేరాయి. 2023–24 సంవత్సరంలో పసిడి దిగుమతులు 45.54 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. పరిమాణం పరంగా 757.15 టన్నుల బంగారం గత ఆర్థిక సంవత్సరంలో దిగుమతి అయింది.2023–24లో ఇది 795.32 టన్నులుగా ఉండడం గమనించొచ్చు. దిగుమతి పరిమాణం తగ్గినప్పటికీ ధరల పెరుగుదలతో విలువ పరంగా వృద్ధి నమోదైంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో పసిడి దిగుమతులు అంతకుముందు ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 62 శాతం తగ్గగా (విలువ పరంగా), జనవరిలో 41 శాతం, 2024 డిసెంబర్లో 55 శాతం చొప్పున పెరిగాయి. సురక్షిత సాధనంగా బంగారాన్ని పరిగణిస్తూ పెట్టుబడులు పెట్టే ధోరణి పెరగడం దిగుమతులకు మద్దతుగా నిలిచినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలతో అనిశ్చితులు పెరిగిపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. వాణిజ్య లోటుకు ఆజ్యం బంగారం దిగుమతుల విలువ పెరగడం దేశ వాణిజ్య లోటు పెరిగేందుకు దారితీసింది. మార్చి నెలలో వాణిజ్య లోటు 21.54 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 283 బిలియన్ డాలర్ల లోటుతో ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకడం గమనార్హం. -
జాబ్ ఆఫర్ లేకుండానే యూఎస్‌లో పని
అమెరికా వెళ్లడం చాలామంది కల. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోని నిపుణులకు యూఎస్ తమ కెరియర్ పురోగతికి అంతిమ గమ్యంగా తోస్తుంది. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు, మెరుగైన వేతనాలు, శాశ్వత నివాసానికి అవకాశాలు ఉండటంతో అమెరికాలో పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. అయితే యూఎస్ వెళ్లేందుకు వర్కింగ్ వీసా పొందడం కష్టమే. దీనికి సాధారణంగా యూఎస్ కంపెనీ యజమాని నుంచి ఉద్యోగ ఆఫర్ అవసరం అవుతుంది. కానీ జాబ్ ఆఫర్ లేకుండానే అమెరికాలో పని చేయగలిగితే ఎలా ఉంటుంది? ఇందుకోసం కింది రెండు వీసాలు ఎంతో ఉపయోగపడుతాయి.ఈబీ-2ఈబీ-2 నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ (ఎన్ఐడబ్ల్యూ) అనేది ఉపాధి ఆధారిత వీసా. దీనికి జాబ్ ఆఫర్ లేదా ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ అవసరం లేదు. ఇది శాశ్వత నివాసానికి (గ్రీన్ కార్డ్) కూడా వెసులుబాటు కల్పిస్తుంది. ఈ వీసా అధునాతన డిగ్రీలు (మాస్టర్స్ లేదా పీహెచ్డీ వంటివి) లేదా యునైటెడ్ స్టేట్స్ జాతీయ ప్రయోజనాలకు గణనీయంగా ప్రయోజనం చేకూర్చే రంగాల్లో అసాధారణ సామర్థ్యాలు ఉన్న వ్యక్తుల కోసం రూపొందించారు.ఈబీ-2కు ఎవరు అర్హులు?సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (స్టెమ్) నిపుణులు, కళలు, వ్యాపారంలో అద్భుతమైన సహకారంతో నిపుణులు, జాతీయ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు దీనికి అర్హులు. యజమానిపై ఆధారపడే హెచ్ -1బీ మాదిరిగా కాకుండా ఈబీ-2 కోసం ప్రాయోజిత సంస్థ అవసరం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆమోదం లభిస్తే అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉంటూ పనిచేయవచ్చు.ఓ-1 వీసాఓ-1 వీసా అనేది ఒకే యజమాని నుంచి స్పాన్సర్షిప్ అవసరం లేని వీసా. ఇది అసాధారణ సామర్థ్యాలు ఉన్నవారికి ఇస్తారు. ఇది నిపుణులు విభిన్న సంస్థల్లో పనిచేయడానికి లేదా స్వయం ఉపాధి పొందడానికి అనుమతిస్తుంది. ఆయా రంగాల్లో అసాధారణ సామర్థ్యాలున్న వ్యక్తుల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు.ఇదీ చదవండి: బెంగళూరు, హైదరాబాద్‌లోని ఉద్యోగులు ఔట్..?సైన్స్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, బిజినెస్ లేదా అథ్లెటిక్స్‌లో అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. వీరి పేరుపై ఆయా రంగాల్లో రికార్టులుండాలి. ఆ విజయాలకు జాతీయ లేదా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వ్యక్తులకు ఓ-1 నాన్ ఇమ్మిగ్రేషన్ వీసా లభిస్తుంది. -
పది రోజుల్లో కొత్త టోలింగ్ వ్యవస్థ..?
శాటిలైట్ ఆధారిత టోలింగ్ వ్యవస్థను మే 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. శాటిలైట్ ఆధారిత టోలింగ్ సిస్టమ్ ఫాస్టాగ్ ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థను భర్తీ చేస్తుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేస్తూ, 2025 మే 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ సర్వీసుల అమలుకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.టోల్ ప్లాజాలగుండా వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా సులువైన ప్రయాణం కోసం భవిష్యత్తులో టోల్ ప్లాజాల వద్ద ‘ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏఎన్పీఆర్)-ఫాస్టాగ్ టోలింగ్ సిస్టమ్’ను అమలు చేయనున్నట్లు తెలిపింది. ఇది వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేసి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ)ను ఉపయోగించే ప్రస్తుత ఫాస్టాగ్ సిస్టమ్ ద్వారా పని చేస్తుందని పేర్కొంది. ఇది అమలులోకి వస్తే టోల్ ప్లాజాల అధిక సమయం ఆగాల్సిన అవసరం లేకుండా హై పెర్ఫార్మెన్స్ ఏఎన్పీఆర్ కెమెరాలు, ఫాస్టాగ్ రీడర్ల ద్వారా వెంటనే టోల్ ఛార్జీలు కట్ అయ్యేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ-నోటీసులు జారీ చేస్తామని, వాటిని చెల్లించకపోతే ఫాస్టాగ్, ఇతర వాహన సంబంధిత సదుపాయాలను నిలిపివేయాల్సి వస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.ఇదీ చదవండి: ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్ల కోత..ఎంపిక చేసిన టోల్ ప్లాజాల వద్ద ‘ఏఎన్పీఆర్-ఫాస్టాగ్ టోలింగ్ సిస్టమ్’ అమలుకు ఎన్హెచ్ఏఐ ఇప్పటికే బిడ్లను ఆహ్వానించింది. ఈ వ్యవస్థ పనితీరు, సామర్థ్యం, వినియోగదారుల స్పందన ఆధారంగా దేశవ్యాప్తంగా దీని అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు. భారతదేశ జాతీయ రహదారి నెట్‌వర్క్‌లో సుమారు 855 ప్లాజాలు ఉన్నాయి. వీటిలో 675 ప్రభుత్వ నిధులతో, మిగతావి ప్రైవేట్ ఆపరేటర్లతో నిర్వహిస్తున్నారు.శాటిలైట్ ఆధారిత టోలింగ్గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమలులోకి వచ్చిన తరువాత టోల్ ఫీజు చెల్లించడానికి ప్రత్యేకంగా.. వాహనాలను ఆపాల్సిన అవసరం లేదు. వాహనం ప్రయాణించిన దూరాన్ని శాటిలైట్ పరిగణించి వాహనదారుల ఈ-వ్యాలెట్ నుంచి టోల్ ఛార్జీ కట్ అవుతుంది. అయితే దీనికోసం వాహనదారులు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ కలిగిన ఫాస్టాగ్‌ను వాహనానికి అతికించాల్సి ఉంటుంది. లేదా ఇతర ఆన్ బోర్డ్ యూనిట్ (OBU) లేదా ట్రాకింగ్ పరికరాలను అమర్చి.. టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్ల కోత..
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు కట్ చేసిన నేపథ్యంలో ప్రముఖ బ్యాంకులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాయి. లాభాలను దృష్టిలో ఉంచుకుని హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో సహా ప్రధాన భారతీయ బ్యాంకులు ఇటీవల సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించాయి. కాసా (కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్) ఖాతాలు క్షీణించడం, డిపాజిట్ వృద్ధి మందగించడంతో బ్యాంకులు తమ నిధుల వ్యయాన్ని నియంత్రించడానికి, నికర వడ్డీ మార్జిన్లను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.ప్రధాన బ్యాంకుల్లో రేట్ల సవరణలుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.50 లక్షల లోపు సేవింగ్స్ ఖాతా బ్యాలెన్స్‌పై వడ్డీ రేటును 2.75 శాతానికి, దానికంటే అధిక బ్యాలెన్స్‌పై 3.25 శాతానికి చేర్చింది.రూ.10 కోట్ల కంటే తక్కువ పొదుపు ఖాతా డిపాజిట్లపై 2.7% వడ్డీ రేటును ఎస్బీఐ అందిస్తుంది. ఇందులో అక్టోబర్ 2022 నుంచి ఎలాంటి మార్పులేదు.ఐసీఐసీఐ బ్యాంక్ రూ.50 లక్షల లోపు పొదుపు ఖాతాలోని బ్యాలెన్స్‌పై 2.75 శాతం, దాని కంటే అధిక మొత్తాలకు 3.25 శాతం వడ్డీ రేట్లను సవరించింది.డిపాజిట్ వ్యయాలను తగ్గించడానికి యాక్సిస్ బ్యాంక్ కూడా ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ మాదిరిగానే వడ్డీ రేట్లను సర్దుబాటు చేసింది.రేట్ల కోతకు కారణంమారుతున్న ఆర్థిక పరిణామాలకు అనుగుణంగా బ్యాంకులు ఈ చర్యలు తీసుకున్నాయి. బ్యాంకుల్లో కాసా(కరెంట్ ఖాతా సేవింగ్స్ ఖాతా) నిష్పత్తులు తగ్గుతున్నాయి. ఉన్న పొదుపు ఖాతాల్లో నగదు జమ భారీగా క్షీణిస్తోంది. ఇది బ్యాంకులకు తక్కువ ఖర్చుతో కూడిన నిధులను నిర్వహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఖాతాదారులు అధిక వడ్డీ రేట్లతో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లను ఎక్కువగా ఎంచుకోవడంతో సేవింగ్స్ ఖాతాల వృద్ధి తగ్గిపోయింది. వీటికితోడు ఆర్బీఐ ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు కట్ చేసింది. దీనికి ప్రతిస్పందనగా బ్యాంకులు డిపాజిట్ రేట్లను తగ్గించాయి.ఇదీ చదవండి: రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లుడిపాజిటర్లకు మార్గాలు..బ్యాంకుల వడ్డీ తగ్గింపు నిర్ణయాలతో పొదుపు ఖాతాదారులు తమ డిపాజిట్లపై తక్కువ రాబడిని పొందుతారు. అయితే అధిక రాబడినిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లలో నగదు మళ్లించడం మంచి రాబడిని ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. డిపాజిటర్లు తమ నగదును దీర్ఘకాలంలో అధిక రాబడినిచ్చే ఈక్విటీ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, రియల్ ఎస్టేట్, బంగారం.. వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయవచ్చని చెబుతున్నారు. మంచి ఆర్థిక నిపుణులను సంప్రదించి పెట్టుబడికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. -
మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా: భారీ జరిమానా..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ & పంజాబ్ నేషనల్ బ్యాంకులకు జరిమానా విధించింది. వినియోగదారులకు అందించే సేవలలో లోపం, నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆర్బీఐ ఈ జరిమానా విధించినట్లు తెలుస్తోంది.కోటక్ మహీంద్రా బ్యాంక్: లోన్ సిస్టమ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను పాటించకపోవడం, ఇతర చట్టబద్ధమైన పరిమితులకు సంబంధించిన ఉల్లంఘనల కారణంగా ఆర్బీఐ.. కోటక్ మహీంద్రా బ్యాంకుకు రూ. 61.4 లక్షల జరిమానా విధించింది.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్: కేవైసీ నిబంధనలను పాటించకపోవడం వల్ల ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకుకు.. ఆర్బీఐ రూ. 38.6 లక్షల జరిమానా విధించింది.పంజాబ్ నేషనల్ బ్యాంక్: కస్టమర్ సర్వీస్ నిబంధనలను పాటించడంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా విఫలమైంది. ఈ కారణంగా ఆర్బీఐ రూ. 29.6 లక్షల జరిమానా విధించింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంకులకు జరిమానాలు విధించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా బ్యాంకులకు భారీ మొత్తంలో జరిమానాలు విధించింది. నియమాలను అనుసరించడంలో.. బ్యాంకులు విఫలమైతే ఆర్బీఐ జరిమానా విధించడానికి సిద్ధంగా ఉంటుంది.ఇదీ చదవండి: 'ఇన్ఫోసిస్‌లో 20వేల ఉద్యోగాలు': క్లారిటీ ఇచ్చిన సీఎఫ్ఓ -
అమెరికాతో భాగస్వామ్యానికి భారత్ సిద్ధం
సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల్లో అమెరికాతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. టెస్లా సీఈఓ ఎలాన్‌మస్క్‌తో ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించినట్లు మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధానంగా టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో భారత్-అమెరికాల మధ్య సహకారానికి అపారమైన అవకాశాలున్నాయని మోదీ తన పోస్టులో నొక్కిచెప్పారు. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు. భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న కీలక సమయంలో ఈ పోస్టు చేయడం గమనార్హం.టెస్లా త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి కంపెనీ ఇక్కడ కార్యకలాపాలు సాగించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈమేరకు ముంబయిలో ఉద్యోగుల నియామకాలు, షోరూమ్ కోసం స్థల పరిశీలన చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి.ఇదీ చదవండి: రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లుమస్క్కు చెందిన శాటిలైట్ కమ్యునికేషన్ సిస్టమ్ స్టార్‌లింక్ కూడా భారత్‌లోకి ప్రవేశించనుంది. స్థానికంగా ఉన్న రిలయన్స్, ఎయిర్టెల్ వంటి టెలికాం కంపెనీలు ముందుగా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించినా తర్వాత ఆ కంపెనీతోనే భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. -
ఫెడ్ ఛైర్మన్‌ను తొలగిస్తామని ట్రంప్ హెచ్చరిక
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ తొలగింపు త్వరగా జరగకూడదని భావిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. పావెల్ పనితీరుపట్ల ట్రంప్ మండిపడ్డారు. ఇతర సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తున్నా తాను అనుకున్న విధంగా అమెరికా వేగంగా వాటిని తగ్గించడంలేదని అభిప్రాయపడ్డారు.తీవ్ర అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి అడుగుపెట్టొచ్చని ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ఇటీవల ఓ సమావేశంలో తెలిపారు. వినియోగదారుల వ్యయంలో మందగమనం సంభవించే అవకాశముందని, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులపై తీవ్ర అనిశ్చితి కొనసాగుతోందని వ్యాపార వర్గాల్లో అంచనాలు నెలకొన్న సమయంలో ఫెడ్ ఛైర్మన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ప్రభుత్వ విధానాలు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న అంశంపై స్పష్టత వచ్చే వరకు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంలో ఏ మాత్రం తొందరపడబోమని పావెల్ స్పష్టం చేశారు. కానీ ట్రంప్ త్వరగా వడ్డీరేట్ల కోతను కోరుకుంటున్నారు.ఇదీ చదవండి: గ్రిడ్ స్థిరీకరణకు స్టోరేజ్ సిస్టమ్ఇమిగ్రేషన్, టాక్సేషన్, నియంత్రణలు, టారిఫ్ వంటి విధానపరమైన మార్పుల వల్ల ఆర్థిక వ్యవస్థపై కలిగే ప్రభావంపట్ల ఫెడరల్ రిజర్వ్ స్పష్టత కోరుతోందని పావెల్ పేర్కొన్న మరుసటి రోజే ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) ఎప్పుడో రేట్లు తగ్గించిందని ట్రంప్ అన్నారు. ఇకనైనా పావెల్ రేట్ల కోతకు పూనుకోవాలని సూచించారు. ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్‌గా జెరోమ్ పావెల్ తొలగింపు త్వరగా జరగకూడదని భావిస్తున్నట్లు ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. పావెల్ పదవీ కాలం 2026 చివరి వరకు ఉంది. ఆయనను 2017లో ట్రంప్ ప్రతిపాదించారు. తర్వాత 2022లో బైడెన్ మరో నాలుగేళ్ల పాటు ఫెడ్ ఛైర్మన్‌గా కొనసాగించారు. -
రైతన్నపై ప్రకృతి ప్రకోపం
ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ రంగానికి చాలాకాలంగా సవాలుగా మారుతున్నాయి. ఉత్పత్తి, సరఫరా గొలుసులు, మార్కెట్ స్థిరత్వానికి విఘాతం కలిగిస్తున్నాయి. వరదలు, తుపానులు, ఈదురుగాలులు, కరువులు, హారికేన్లు, కార్చిచ్చులు.. వంటి సంఘటనలు అన్నదాతలపాలిట శాపంగా మారుతున్నాయి. ఇటీవల తీవ్ర ఈదురుగాలులు, ఆకాల వర్షాలతో తెలంగాణ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో భారీగా పంటనష్టం వాటిల్లింది. నిత్యం దేశవ్యాప్తంగా ఎక్కడోచోట ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. దేశ జీడీపీలో సింహభాగాన్ని ఆక్రమించిన వ్యవసాయంలో అనిశ్చితుల వల్ల ఆర్థిక పరిస్థితి కుంటుపడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు ఆర్థికంగా వ్యవసాయాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఉత్పాదకత తగ్గుదలవ్యవసాయం స్థిరమైన వాతావరణ పరిస్థితులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఏదైనా అంతరాయం కలిగినప్పుడు గణనీయమైన ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. పంట వైఫల్యాలు, పశువుల మరణాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతినడం.. వంటివి ఉత్పాదకతను తగ్గిస్తాయి. ఇది రైతులు, వ్యవసాయ ఆధారిత వ్యాపారాల ఆదాయ మార్గాలను నేరుగా ప్రభావితం చేస్తుంది.సరఫరా గొలుసు అంతరాయాలుప్రకృతి వైపరీత్యాలు రవాణా నెట్‌వర్క్‌లను నిర్వీర్యం చేస్తాయి. ఈదురుగాలులు, తుపానులు.. వంటివి సంభవించినప్పుడు వ్యవసాయ రవాణా కష్టతరమవుతుంది. దాంతో పంట ఉత్పత్తులను పొలాల నుంచి మార్కెట్లకు తరలించడం సాధ్యం కాదు. నీట మునిగిన రోడ్లు, దెబ్బతిన్న ఓడరేవులు, లాజిస్టిక్స్ నష్టపోవడం వల్ల జాప్యం జరుగుతుంది. ఫలితంగా మార్కెట్లో కొరత ఏర్పడే అవకాశం ఉంది.మార్కెట్ అస్థిరత.. ధరల హెచ్చుతగ్గులువ్యవసాయ ఉత్పత్తుల్లో సరఫరా అంతరాయాలు తరచుగా ధరల హెచ్చుతగ్గులకు దారితీస్తాయి. నిత్యావసర పంటల ఆకస్మిక కొరత ధరలను పెంచుతుంది. ఇది వినియోగదారులు, వ్యవసాయ ముడి పదార్థాలపై ఆధారపడిన వ్యాపారాలను ప్రభావితం చేస్తుంది.దీర్ఘకాలిక ఆర్థిక పరిణామాలుతక్షణ నష్టాలకు మించి ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతాయి. నేల క్షీణత, వ్యవసాయ యోగ్యమైన భూమి కోల్పోవడం, వ్యవసాయంలో పెట్టుబడి తగ్గడం ప్రధాన సమస్యలుగా మారుతాయి. తిరిగి ఈ వ్యవస్థ రికవరీకి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ‘ఐటీ’ ఫలితాలు నేలచూపులు.. అందుకు కారణాలు..ఏం చేయాలంటే..ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించడానికి క్లైమేట్-స్మార్ట్ అగ్రికల్చర్(వాతావరణ అనుకూల వ్యవసాయం), సుస్థిర పద్ధతుల్లో వ్యవసాయం చేసేలా రైతుల్లో అవగాహన కల్పించాలి. ఎలివేటెడ్ షెడ్ల నిర్మాణం వల్ల ఇలాంటి వైపరీత్యాలను కొంతవరకు కట్టడి చేయవచ్చు. కానీ ఇది పరిమితమైన కమతాలకే ఉపయోగపడుతుంది. దీనిపై మరింత పరిశోధనలు జరిగాలి. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా సప్లై-చెయిన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి. విపత్తును ముందుగానే గుర్తించేందుకు, తగిన ప్రతిస్పందన చర్యల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. -
అమెరికా టారిఫ్‌లతో డిఫాల్ట్ రిస్కులు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌ల వల్ల రుణాలకు సంబంధించిన పరిస్థితులు మరింతగా దిగజారవచ్చని, తక్కువ రేటింగ్, స్పెక్యులేటివ్ రేటింగ్ ఉన్న కార్పొరేట్లు డిఫాల్ట్ అయ్యే రిస్కులు పెరగవచ్చని మూడీస్ రేటింగ్స్ వెల్లడించింది. గ్లోబల్ వృద్ధి నెమ్మదించి, మాంద్యం వచ్చే అవకాశాలు పెరగవచ్చని ఓ నివేదికలో వివరించింది.‘ఫైనాన్షియల్ మార్కెట్లను టారిఫ్‌లు షాక్‌కు గురిచేశాయి. దీంతో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం వచ్చే రిస్కులు పెరుగుతున్నాయి. అనిశ్చితి కొనసాగడం వల్ల వ్యాపార ప్రణాళికలకు అవరోధంగా మారుతుంది. పెట్టుబడులు నిల్చిపోతాయి. వినియోగదారుల విశ్వాసం సన్నగిల్లుతుంది‘ అని మూడీస్ రేటింగ్స్ తెలిపింది.టారిఫ్‌ల అమలుకు తాత్కాలికంగా విరామం ఇవ్వడం వల్ల వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తి, కొనుగోళ్లను సర్దుబాటు చేసుకోవడానికి కాస్త సమయం లభించినప్పటికీ, 90 రోజుల తర్వాత టారిఫ్‌ల పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో వ్యాపార ప్రణాళికలకు సమస్యలు తలెత్తవచ్చని వివరించింది. గత నెల రోజులుగా రుణ సంబంధ పరిస్థితులు (రుణాల లభ్యత, వడ్డీ రేట్లు, రుణ గ్రహీతలు చెల్లించే సామర్థ్యాలు మొదలైనవి) గణనీయంగా దిగజారినట్లు మూడీస్ రేటింగ్స్ వివరించింది. అమెరికా జీడీపీపైనా ప్రభావం.. ఇక అమెరికా ఎకానమీ మీద కూడా టారిఫ్‌ల ప్రభావం ఉంటుందని మూడీస్ రేటింగ్స్ పేర్కొంది. అగ్రరాజ్యం జీడీపీ వృద్ధి కనీసం ఒక పర్సెంటేజీ పాయింట్ మేర తగ్గొచ్చని, అమెరికన్ వినియోగదారులు.. వ్యాపార సంస్థలకు ధరలు గణనీయంగా పెరిగిపోవచ్చని మూడీస్ తెలిపింది. టారిఫ్‌ల భారాన్ని నెమ్మదిగా బదలాయించినా, అంతిమంగా దాన్ని మోయాల్సింది అమెరికన్ వినియోగదారులేనని తెలిపింది.సుంకాల వల్ల కొనుగోలు శక్తి తగ్గుతుందని, పలు సంస్థల లాభాల మార్జిన్లు పడిపోతాయని వివరించింది. అటు చైనా విషయానికొస్తే వాణిజ్య యుద్ధంపరమైన ఉద్రిక్తతలు, గ్లోబల్ ఎకానమీ మందగమనం వల్ల ఎగుమతుల రంగంతో పాటు మొత్తం ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొనాల్సి వస్తుందని మూడీస్ రేటింగ్స్ పేర్కొంది.ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టినా అమెరికా–చైనా సంబంధాలు వివాదాస్పదంగానే కొనసాగవచ్చని, దీనితో వ్యాపారవర్గాలు.. వినియోగదారుల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వివరించింది. ఫలితంగా దేశీయంగా వినియోగాన్ని పెంచేందుకు, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అవరోధాలు ఏర్పడొచ్చని తెలిపింది. -
ఇకపై ప్రతి నెలా 28న ఐఐపీ డేటా
న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలను వెల్లడించే వ్యవధిని రెండు వారాల పాటు తగ్గిస్తూ కేంద్ర స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ (ఎంవోఎస్పీఐ) గురువారం నిర్ణయం తీసుకుంది. ఇకపై 42 రోజుల తర్వాత కాకుండా ప్రతి నెలా 28న ఈ డేటాను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఒకవేళ 28వ తారీఖు గానీ సెలవు రోజు అయితే, మరుసటి పనిదినం నాడు డేటాను ప్రకటిస్తారు. ఇది ఈ నెల (ఏప్రిల్) నుంచే అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఎంవోఎస్పీఐ ఐఐపీ డేటాను రిఫరెన్స్ నెల ముగిసిన ఆరు వారాల తర్వాత ప్రతి నెలా 12న విడుదల చేస్తోంది. సాధారణంగా ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ రికమండేషన్స్ ఫర్ ఐఐపీ (ఐఆర్ఐఐపీ)–2010 ప్రకారం పారిశ్రామికోత్పత్తి తీరుతెన్నులను తెలియజేసే నెలవారీ ఐఐపీ గణాంకాలను రిఫరెన్స్ నెల ముగిసిన 45 రోజుల్లోగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకారం ఆరు వారాల్లోగా ప్రకటించాల్సి ఉంటుంది. వాటికి అనుగుణంగానే ఎంవోఎస్పీఐ 42 రోజుల్లోగా వెల్లడిస్తోంది. -
'భారత్ మూడేళ్ళలో ఆ దేశాలను అధిగమిస్తుంది'
రాబోయే మూడేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ.. జర్మనీ, జపాన్ కంటే పెద్దదిగా ఉంటుంది. 2047 నాటికి రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని నీతి ఆయోగ్ సీఈఓ 'బీవీఆర్ సుబ్రహ్మణ్యం' న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు.భారతదేశం ప్రపంచానికి విద్యా కేంద్రంగా మారగలదని, మిగతావన్నీ పక్కన పెడితే మన దేశంలోని ప్రజాస్వామ్యమే మనకు అతిపెద్ద ప్రయోజనమని బీవీఆర్ సుబ్రహ్మణ్యం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదవ అతిపెద్దది. వచ్చే ఏడాది చివరి నాటికి మనం నాల్గవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉండబోతున్నాము. ఆ తర్వాత ఏడాది మూడవ అతిపెద్దదిగా ఉంటామని ఆయన వివరించారు.తాజా ఐఎంఎఫ్ డేటా ప్రకారం, ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లతో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటామని సుబ్రహ్మణ్యం అన్నారు. అయితే దీనికోసం న్యాయ సంస్థలు, అకౌంటింగ్ కంపెనీలతో పాటు.. దేశీయ కంపెనీలు ప్రపంచ అగ్రగాములుగా ఎదగడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: పెట్టుబడి రంగంలో మార్పులు: భారీగా పెరిగిన కొత్త డీమ్యాట్ అకౌంట్స్మధ్య-ఆదాయ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు.. తక్కువ-ఆదాయ దేశాల సమస్యలకు చాలా తేడా ఉందని నీతి ఆయోగ్ సీఈఓ వెల్లడించారు. జపాన్ 15,000 మంది నర్సులను, జర్మనీ 20,000 మంది ఆరోగ్య కార్యకర్తలను భారతదేశం నుంచి తీసుకుంది. అంటే.. ఆ దేశాల్లో అవసరమైన స్థాయిలో పనిచేసేవారు లేదు. కుటుంబ వ్యవస్థ విచ్చిన్నమైంది. భారతదేశం మాత్రం ప్రపంచానికి పనిచేసేవారిని అందిస్తోంది. ఇది మనదేశానికి ఉన్న అతిపెద్ద బలం అని ఆయన అన్నారు. -
త్వరలో ఆర్థిక మాంద్యం!
అమెరికా సుంకాలు ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని ప్రేరేపిస్తే కెనడాలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, దేశం తీవ్ర మాంద్యంలోకి వెళ్తుందని బ్యాంక్ ఆఫ్ కెనడా తెలిపింది. తీవ్ర అనిశ్చితి కారణంగా సెంట్రల్ బ్యాంక్ తన సాధారణ త్రైమాసిక ఆర్థిక అంచనాలను విడుదల చేయలేదు. దానికి బదులుగా భవిష్యత్తులో యూఎస్ ఆర్థిక వైఖరి కెనడాపై ఎలా ప్రభావం చూపుతుందో అంచనా వేసింది.బ్యాంక్ ఆఫ్ కెనడా తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి సందర్భంలో, చాలా సుంకాలు రద్దు చేస్తారు. కెనడాతోపాటు ప్రపంచ వృద్ధి తాత్కాలికంగా బలహీనపడుతుంది. కెనడా ద్రవ్యోల్బణం సంవత్సరానికి 1.5%కు పడిపోతుంది. తరువాత 2%కు చేరుతుంది. రెండో సందర్భంలో, సుంకాలు దీర్ఘకాలిక ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయి. కెనడా భారీ మాంద్యంలోకి ప్రవేశిస్తుంది. ద్రవ్యోల్బణం 2026 మధ్యలో 3% కంటే ఎక్కువ పెరిగి 2% కు తిరిగి వస్తుంది. ఇంకా ఇతర పరిస్థితులు సాధ్యమేనని నొక్కిచెప్పిన బ్యాంక్ వార్షిక మొదటి త్రైమాసిక జీడీపీ 1.8%గా అంచనా వేసింది. ఇది జనవరి చివరిలో అంచనా వేసిన 2.0% కంటే తక్కువ.ఇదీ చదవండి: ‘చౌకైన కార్లు కనుమరుగయ్యే ప్రమాదం’ద్వితీయార్ధంలో ఆర్థిక మాంద్యం..?వాణిజ్య ఉద్రిక్తతలు, ద్రవ్య సర్దుబాట్ల పర్యవసానాలతో ఇన్వెస్టర్లు, విధాన నిర్ణేతలు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో రానున్న రోజుల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఆర్థిక మాంద్యం ప్రమాదాలు పెరగవచ్చని చెబుతున్నారు. అందుకోసం ప్రభుత్వ వ్యూహాత్మక ఆర్థిక జోక్యాలు అవసరమని సూచిస్తున్నారు. -
భారత్‌లోకి వెల్లువలా చైనా ఉత్పత్తులు?
న్యూఢిల్లీ: అమెరికాలో టారిఫ్‌ల విధింపుతో చైనా ఉత్పత్తులు భారత్‌లోకి వెల్లువెత్తే అవకాశాలున్న నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి అంతర్–మంత్రిత్వ శాఖల మానిటరింగ్ సెల్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటు అగ్రరాజ్యంపై చైనా ప్రతీకార టారిఫ్‌ల వల్ల అమెరికా వ్యవసాయోత్పత్తులు కూడా భారత్‌లోకి భారీగా వచ్చి పడే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో దిగుమతుల్లో అసాధారణ ధోరణులేమైనా కనిపించిన పక్షంలో దేశీ పరిశ్రమల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా యాంటీ–డంపింగ్ సుంకాల్లాంటివి విధించవచ్చని వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి ఎల్ సత్య శ్రీనివాస్ చెప్పారు. కమోడిటీలు, దేశాలవారీగా ట్రెండ్స్‌ను మానిటరింగ్ గ్రూప్ ప్రతి వారం సమీక్షిస్తున్నట్లు తెలిపారు.ఇందులో వాణిజ్య శాఖ, డీజీఎఫ్టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్), సీబీఐసీ (పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్రీయ బోర్డు), పరిశ్రమలు .. అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) మొదలైన విభాగాల నుంచి ప్రతినిధులు ఉన్నారు. -
భారత్‌లో పత్తి పండుతున్నా దిగుమతులెందుకు?
ప్రపంచ వాణిజ్య సంఘర్షణలు, పెరిగిన సుంకాల అనిశ్చితులు, యూఎస్‌లో ధరలు తగ్గడం కారణంగా భారత్‌కు అమెరికా మెట్ట ప్రాంత పత్తి ఎగుమతులు అధికమయ్యాయి. ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య ఎగుమతులు గణనీయంగా పెరిగి 2.5 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. భారతదేశం ఉత్పత్తి లోటుతో ఇతర పరిస్థితులు యూఎస్ పత్తిని దిగుమతి చేసుకోవడానికి కారణమవుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.అమెరికా వ్యవసాయ శాఖ (యూఎస్డీఏ) గణాంకాల ప్రకారం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు భారత్‌కు పత్తి ఎగుమతులు 25,901 బేళ్ల నుంచి 1,55,260 బేళ్లకు పెరిగాయి. ఫిబ్రవరి మూడో వారం నుంచి ఎగుమతులు రెండున్నరేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. యూఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడంతో పాటు చైనాకు అమెరికా పత్తి ఎగుమతులు తగ్గుముఖం పట్టడంతో ఈ పెరుగుదల చోటు చేసుకుందని నిపుణులు చెబుతున్నారు. అసలు భారత్‌లో పత్తి గణనీయంగా పండిస్తున్నా యూఎస్ నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారో కొన్ని కారణాలు తెలుసుకుందాం.పొడవైన పత్తి పీజలుచైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుగా, అత్యధిక పత్తి నూలు ప్రాసెసర్లు, ఎగుమతిదారుల్లో భారత్ ఒకటిగా ఉంది. కానీ ఇటీవల కాలంలో భారత్‌తో పత్తి దిగుబడి తగ్గుతుంది. దాంతో దేశం పత్తి నికర ఎగుమతిదారు నుంచి దిగుమతిదారుగా మారింది. స్థానికంగా పండుతున్న పత్తి నాణ్యత అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోలేకపోతుంది. మెరుగైన నాణ్యతతో యూఎస్ మెట్ట ప్రాంతాల్లోని పత్తికి గిరాకీ అధికంగా ఉంది. యూఎస్ పత్తి ముఖ్యంగా ఎక్స్ట్రాలాంగ్ స్టేపుల్ (ఈఎల్ఎస్)ను కలిగి ఉంటుంది. అంటే పీజల(పత్తి పువ్వులోని రెక్కల్లాంటి భాగాలు) పొడువు ఎక్కువగా ఉంటుంది. ఇది నాణ్యమైన వస్త్రాలకు అనువైనది.అధిక జిన్నింగ్ సామర్థ్యంయూఎస్ పత్తి అధిక జిన్నింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. యూఎస్‌లో భారత్‌లో మాదిరి కూలీల ద్వారా పత్తిని సేకరించరు. యంత్రాలతోనే దీన్ని ప్రాసెస్ చేస్తారు. దాంతో నాణ్యమైన పత్తి సమకూరుతుంది. భారత్‌లో పత్తి పంటకు అధికంగా రసయనాలు వాడుతారు. ఇది ఎక్కువ మలినాలకు దారితీస్తుంది. వస్త్ర తయారీ కంపెనీలు దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంలేదు.ఇదీ చదవండి: మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్ 5 మొబైళ్లుధరలు క్షీణతయూఎస్ పత్తి ధరలు ఇటీవల క్షీణించాయి. ఇది భారతీయ కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది. భారత పత్తి ధరలు సాపేక్షంగా అధికంగా ఉన్నాయి. దాంతో దిగుమతులు పెరగడానికి దారితీసింది. దీనికితోడు చైనా కూడా అమెరికా దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఫలితంగా యూఎస్ పత్తిని భారత్‌లో మార్కెట్ చేసుకుంటున్నారు. -
చైనా నడ్డి విరిచేలా అమెరికా కొత్త సుంకాలు
చైనా దిగుమతులపై 245 శాతం వరకు కొత్త సుంకాలను విధిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధాన్ని మరింత పెంచినట్లయింది. ఇప్పటివరకు అమెరికా చైనాపై 145 శాతం సుంకాలు అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. కానీ ఇటీవల ఆ టారిఫ్‌లకు ప్రతిస్పందనగా 125 శాతం సుంకాలతో చైనా పావులు కదపడంతో అమెరికా తీవ్రంగా స్పందించింది. దాంతోపాటు చైనా ఎగుమతి చేసే అరుదైనా ఖనిజాలు, ఇతర వస్తువులపై ఆంక్షలు విధించడం యూఎస్ జీర్ణించుకోలేకపోతుంది. బీజింగ్ ఎగుమతి ఆంక్షలు, ప్రతీకార సుంకాలకు సమాధానం చెబుతూ వైట్‌హౌజ్ తాజాగా విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్లో 245 శాతం సుంకాలు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది.చైనా తాజా చర్యలు..చైనా నుంచి అమెరికా వెళ్లే అరుదైన ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇత్రియం, డైస్పోరియం, లుటేటియం వంటివి నిలిపివేత జాబితాలో ఉన్నాయి. దాంతో అమెరికాను చైనా నేరుగా కుంభస్థలంపైనే కొట్టిందని పరిశీలకులు అంటున్నారు. దీని ప్రభావం అమెరికా రక్షణ శాఖపై భారీగా ఉండనుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫైటర్ జెట్లు తదితరాల తయారీని ఇది తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న మొత్తం అరుదైన ఖనిజాల్లో ఏకంగా 70 శాతం వాటా చైనాదే! అమెరికా వాటా 11.4 శాతమే ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: లకారానికి దగ్గర్లో పసిడిఆర్థిక పరిణామాలుఅమెరికా సుంకాలు చైనా ఎగుమతిదారులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. లాభాల మార్జిన్లను గణనీయంగా తగ్గించాయి. కొన్ని సంస్థలు పూర్తిగా ఎగుమతులను నిలిపేశాయి. టెక్స్టైల్ కంపెనీలు యూఎస్‌కు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. సుంకాల ప్రభావం వల్ల లాభాలు భారీగా క్షీణించాయని పేర్కొన్నాయి. మరోవైపు వియత్నాం వంటి దేశాలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ఎగుమతి ఆదాయాలు చైనా ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన తయారీ రంగాన్ని బలహీనపరుస్తాయి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలతో కుదేలైన పారిశ్రామికోత్పత్తి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆర్డర్లు తగ్గడంతో కొన్ని కర్మాగారాలు పరికరాలను విక్రయిస్తున్నాయి. -
యూఎస్‌తో వాణిజ్య ఒప్పందానికి చాన్స్
యూఎస్ టారిఫ్‌లతో తలెత్తే సంక్షోభాలను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలదని ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి పేర్కొన్నారు. త్వరలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇందుకు వేగంగా చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఇటీవల భారత్‌సహా పలు దేశాలపై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లకు తెరతీసిన నేపథ్యంలో పురి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఏర్పడింది.చైనా మినహా మిగిలిన దేశాలపై విధించిన టారిఫ్‌లను ట్రంప్ 90 రోజులపాటు నిలిపివేసేందుకు నిర్ణయించిన విషయం విదితమే. చైనాపై 145 శాతం సుంకాలు ప్రకటించినప్పటికీ కంప్యూటర్ చిప్స్, మొబైల్స్, ల్యాప్‌టాప్ తదితర కొన్ని ఎల్రక్టానిక్ ప్రొడక్టులను మినహాయించారు. ప్రతీకార టారిఫ్‌ల అమలు జులై 9 వరకూ వాయిదా పడినప్పటికీ యూఎస్ ఎగుమతులపై 10 శాతం అదనపు సుంకాలు అమలుకానున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ పరిశ్రమపై టారిఫ్‌ల ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయడం కష్టమని పురి పేర్కొన్నారు. అయితే భారత్ వీటిని పటిష్టస్థాయిలో ఎదుర్కోగలదని అంచనా వేశారు. పలు దేశాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు(ఎఫ్‌టీఏలు) కుదుర్చుకునేందుకు అవకాశాలున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాదిలోనే ఈయూ, యూకేతోపాటు యూఎస్‌తోనూ ఒప్పందాలపై సంతకాలకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.మార్చిలోనే చర్చలు మొదలుయూఎస్, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి(బీటీఏ) మార్చిలోనే చర్చలు మొదలయ్యాయి. ఒప్పందం తొలి దశను సెప్టెంబర్–అక్టోబర్‌కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2030కల్లా 500 బిలియన్ డాలర్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించే లక్ష్యంతో ఇందుకు శ్రీకారం చుట్టాయి. అంతర్జాతీయంగా చూస్తే ఎఫ్‌టీఏ, సమీకృత ఆర్థిక సహకార ఒప్పందం(సీఈసీఏ), సమీకృత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ), బీటీఏలుగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. తద్వారా భాగస్వామ్య దేశాలు గరిష్ట సంఖ్యలో వస్తుసంబంధ వాణిజ్యంపై దిగుమతి సుంకాలు భారీగా తగ్గించుకోవడం లేదా ఎత్తివేయడం చేస్తాయి.ఇదీ చదవండి: ప్రతి నెలా కొత్త బీమా ప్లాన్స్వల్ప కాలానికి అనిశ్చితులువినియోగ ఆధారిత దేశ ఆర్థిక వ్యవస్థ స్వల్ప కాలానికి అనిశ్చితులను ఎదుర్కోవలసి ఉంటుందని పురి తెలియజేశారు. అయితే పోటీతత్వం, డిజిటైజేషన్, ఫ్యూచర్ రెడీ పోర్ట్‌ఫోలియో తదితరాల ద్వారా భారత్ నిలదొక్కుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. స్వల్పకాల అనిశ్చితి, అంచనాలకు అందని పరిస్థితులు ప్రపంచ వృద్ధిపై ప్రభావాన్ని చూపవచ్చునని, దీంతో భారత్‌పై కొంతమేర ప్రతికూల ప్రభావానికి చాన్స్ ఉందని విశ్లేషించారు. -
ఎగుమతులు మళ్లీ ప్లస్
న్యూఢిల్లీ: వస్తు ఎగుమతులు నాలుగు నెలల తర్వాత సానుకూలంగా మారాయి. మార్చి నెలలో 0.7 శాతం వృద్ధితో 41.97 బిలియన్ డాలర్లకు (రూ.3.6 లక్షల కోట్లు సుమారు) చేరాయి. వాణిజ్య లోటు 21.54 బిలియన్ డాలర్లకు విస్తరించినట్టు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద వస్తు ఎగుమతులు 0.08 శాతం పెరిగి 437.42 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.దిగుమతులు 6.67 శాతం పెరిగి 720.24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 283 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాణిజ్య లోటు 14.05 బిలియన్ డాలర్లు కాగా.. గతేడాది మార్చిలో 15.33 బిలియన్ డాలర్ల చొప్పున ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు 241 బిలియన్ డాలర్లుగా ఉండడాన్ని గమనించొచ్చు. దిగుమతులు ఈ ఏడాది మార్చిలో నాలుగు నెలల గరిష్టానికి చేరి 63.51 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. సేవల్లో వృద్ధి.. ఇక 2024–25 సంవత్సరంలో వస్తు, సేవల ఎగుమతులు అన్నీ కలసి 821 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2023–24లో నమోదైన 778 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే 5.5 శాతం వృద్ధి నమోదైనట్టు తెలుస్తోంది. 2023–24లో సేవల ఎగుమతులు 341 బిలియన్ డాలర్లు కాగా, 2024–25లో 383.51 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు అంచనా. 2023–24తో పోల్చితే 2024–25లో ఇంజనీరింగ్ ఎగుమతులు 109.3 బిలియన్ డాలర్ల నుంచి 117 బిలియన్ డాలర్లకు, ఎల్రక్టానిక్స్ ఎగుమతులు 29 బిలియన్ డాలర్ల నుంచి 38 బిలియన్ డాలర్లకు, ఫార్మా ఎగుమతులు 28 బిలియన్ డాలర్ల నుంచి 30.47 బిలియన్ డాలర్లకు పెరిగాయి. పెట్రోలియం ఉత్పత్తులు (63.34 బిలియన్ డాలర్లు) కెమికల్స్ రంగాల్లో (28.7 బిలియన్ డాలర్లు) ఎగుమతులు క్షీణించాయి. -
ధరలు దిగొచ్చాయ్!
న్యూఢిల్లీ: కూరగాయలు, గుడ్లు తదితర ఉత్పత్తుల ధరలు శాంతించడంతో రిటైల్ ద్రవ్యోల్బణం మరింత కిందకు దిగొచ్చింది. మార్చి నెలకు వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ) 3.34 శాతంగా నమోదైంది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. మధ్య కాలానికి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి మించకుండా చూడాలన్నది ఆర్బీఐ ముందున్న లక్ష్యం. అంతకంటే దిగువకే వచ్చినందున ఆర్బీఐ మరో విడత వడ్డీ రేట్ల కోతను చేపడుతుందన్న అంచనాలు బలపడుతున్నాయి. మరోవైపు టోకు ద్రవ్యల్బణం సైతం ఆరు నెలల కనిష్ట స్థాయి 2.05 శాతానికి తగ్గింది. రిటైల్ ద్రవ్యోల్బణం చివరిగా 2019 ఆగస్ట్‌లో 3.28 శాతంగా నమోదు కావడం గమనార్హం. రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఫిబ్రవరిలో 3.61 శాతం కాగా, 2024 మార్చిలో 4.85 శాతంగా ఉంది. ప్రధానంగా కూరగాయలు, గుడ్లు, పప్పు ధాన్యాలు, మీట్, చేపలు, తృణ ధాన్యాల ధరలు తగ్గడం ద్రవ్యోల్బణం కనిష్టానికి చేరినట్టు ఎన్ఎస్వో తెలిపింది. ⇒ రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం మార్చి నెలలో 2.69%కి తగ్గింది. ఫిబ్రవరిలో ఇది 3.75% కాగా, గతేడాది మార్చిలో 8.52%గా ఉంది. ⇒ 2.73%, దినుసులకు సంబంధించి మైనస్ 4.92%గా నమోదు కావడం అనుకూలించింది. 0.50 శాతం రేట్లు తగ్గొచ్చు.. ‘ఆహారోత్పత్తుల ధరలు క్షీణించడం వల్లే రిటైల్ ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో దిగొచ్చింది. వచ్చే 3 పాలసీ సమీక్షల్లో 0.50% మేర పాలసీ రేట్లను తగ్గించేందుకు అవకాశాలున్నాయి’అని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. టోకు ద్రవ్యోల్బణం 2.05 శాతం టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) సైతం మార్చి నెలకు 2.05%కి పరిమితమైంది. ఫిబ్రవరిలో ఇది 2.38%గా ఉంటే, 2024 మార్చిలో 0.26%గా ఉండడం గమనార్హం. ప్రధానంగా కూరగాయలు, బంగాళాదుంపలు, ఇతర ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడం ఇందుకు దోహదం చేసింది. -
ట్రైన్ రిజర్వేషన్: టికెట్‌పై ఈ పదాలు కనిపిస్తే బెర్త్ కన్ఫర్మ్!
ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన.. ఇండియన్ రైల్వే దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యాలకు చేరుస్తుంది. ప్రస్తుతం భారతీయ రైల్వే ప్రతిరోజూ 13,000 ప్యాసింజర్ రైళ్లను నడుపుతోంది. ట్రైన్ల సంఖ్య భారీగా ఉన్నప్పటికీ.. పండుగల సీజన్లో టికెట్ బుక్ చేసుకోవడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ సాహసించి టికెట్ బుక్ చేసుకుంటే.. టికెట్‌పై WL, PQWL, GNWL, RSWL వంటి పదాలు కనిపించే ఉంటాయి. ఇవి మీ బుకింగ్ స్థితిని సూచిస్తాయి. అంతే కాకుండా రైలులో మీకు సీటు లభిస్తుందో లేదో నిర్ణయిస్తాయి. ఈ పదాల అర్థం ఏమిటో మనం ఇక్కడ తెలుసుకుందాం.డబ్ల్యుఎల్ (WL): డబ్ల్యుఎల్ అంటే వెయిటింగ్ లిస్ట్ అని అర్థం. అంటే మీరు వెయిటింగ్ టిస్టులో ఉన్నారని ఈ పదం సూచిస్తుంది. టికెట్స్ కన్ఫర్మ్ అయిన వారు ఎవరైనా వారి టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే.. మీకు సీటు లభించే అవకాశం ఉంటుంది.జీఎన్‌డబ్ల్యూఎల్ (GNWL): GNWL అంటే జనరల్ వెయిటింగ్ లిస్ట్. ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న సమయంలో ఇలా ఉంటే.. మీకు బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. జనరల్ వెయిటింగ్ లిస్ట్.. అనేది ప్రారంభ స్టేషన్ లేదా సమీపంలోని ఏదైనా ఇతర ప్రధాన స్టేషన్ నుండి బుక్ చేసుకున్న టిక్కెట్లకు వర్తిస్తుంది. ఇతర వెయిటింగ్ లిస్ట్ బుకింగ్‌లతో పోలిస్తే GNWL టిక్కెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఇదీ చదవండి: టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!పీక్యూడబ్ల్యుఎల్ (PQWL): PQWL అంటే పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్ అని అర్థం. అంటే ఇలాంటి టికెట్లకు సీటు కన్ఫర్మ్ అవకాశం చాలా తక్కువ. రైలు నిలిచిపోయే స్టేషన్‌కు ఒకటి రెండు స్టేషన్ల ముందు వరకు కూడా వీటిని ఇస్తారు. కొన్ని సందర్భాల్లో మార్గమధ్యలో ఉన్న రెండు స్టేషన్లకు ఈ లిస్టును చూపిస్తారు.ఆర్ఎస్డబ్ల్యుఎల్ (RSWL): RSWL అంటే రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్ అని అర్థం. ఇందులో కూడా సీటు కన్ఫర్మ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. -
‘బ్యాడ్ బ్యాంక్’ గుడ్..!?
సాధారణంగా వాణిజ్య బ్యాంకులు వాటి రుణాలపై సమకూరే వడ్డీ ఆధారంగా మనుగడ సాగిస్తుంటాయి. బ్యాంకులు ఇచ్చే రుణాల ఫలితంగా కొత్త పరిశ్రమలు పుట్టుకొచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఒకవేళ అవే రుణాలు నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)గా అంటే.. వసూలుకాని మొండి బకాయిలుగా మారితే బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో బ్యాడ్ బ్యాంక్‌ల పేరిట ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. వివిధ వాణిజ్య బ్యాంకుల్లో ఎటూ తేలకుండా ఉండిపోయిన ఎన్పీఏలను దీనికి బదిలీ చేస్తారు.ఆర్బీఐ ఇటీవల రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు క్రమంగా వడ్డీరేట్లు తగ్గిస్తున్నాయి. దాంతో చాలామంది అప్పు తీసుకోవాలని చూస్తున్నారు. తిరిగి చెల్లించే ఆర్థిక స్థోమత ఉంటేనే అప్పు తీసుకోవాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. లేదంటే అప్పులు ఎన్పీఏలు మారితే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో బ్యాడ్ బ్యాంకుల ప్రస్తావన మళ్లీ తెరపైకి వస్తుంది.ఏమిటి లాభం..బ్యాడ్ బ్యాంకుల ఏర్పాటు వల్ల ఎన్పీఏ ఖాతాల నుంచి రుణాలను రికవరీ చేయడం, రుణాలు తీసుకున్న సంస్థలతో చర్చలు జరపడం, లేదా ఈ మొండి బకాయిలను ఎలా తిరిగి రాబట్టాలో వంటి అంశాలపై బ్యాడ్ బ్యాంక్ దృష్టి సారిస్తుంది. ఎన్పీఏ ఖాతాలు బ్యాడ్ బ్యాంక్‌కు వెళ్లడంతో వాణిజ్య బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లో వాటి ప్రస్తావన ఉండదు. ఫలితంగా బ్యాంకు పనితీరు మెరుగుపడుతుంది. బ్యాంకు మూలధనం, డిపాజిట్లు పెరిగి బ్యాంకు అభివృద్ధికి బాటలు పడతాయి.ఏఆర్సీ ఉండగా బ్యాడ్ బ్యాంక్ ఎందుకు?బ్యాంకులు తమ వద్ద ఉన్న ఎన్పీఏలను క్లియర్ చేసుకునేందుకు ‘అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్సీ)’లను ఆశ్రయిస్తుంటాయి. ఏఆర్‌సీలు బ్యాంకుల వద్ద చౌకగా ఎన్పీఏలను కొని వాటి రికవరీ కార్యకలాపాలు సాగిస్తుంటాయి. అలా బ్యాంకులు ఏఆర్సీలకు ఎంతో కొంతకు ఎన్పీఏలను అమ్మడం వల్ల నష్టాలను మూటగట్టుకుంటాయి. బ్యాడ్ బ్యాంకు కూడా దాదాపు ఏఆర్సీ లాంటిదే. కానీ, బ్యాడ్ బ్యాంక్‌లకు వాణిజ్య బ్యాంకులు ఎన్పీఏలను విక్రయించవు. కేవలం బదిలీ మాత్రమే చేస్తాయి. తద్వారా సాధారణ బ్యాంకులు వాటి ప్రధాన కార్యకలాపాలపై దృష్టి సారించే అవకాశం ఏర్పడుతుంది. ఇక బ్యాడ్ బ్యాంకు ఎన్పీఏలపై పనిచేసి తిరిగి వాటిని ఎలా రాబట్టాలి... అందుకు ఉన్న వెసులుబాట్లపై దృష్టి సారిస్తుంది. రుణగ్రహీతల చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేసి వీలైనంత మొత్తాన్ని రాబట్టేందుకు కృషి చేస్తాయి.ఇదీ చదవండి: ఈ అవకాశం మళ్లీ రాదేమో.. తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..దీని ఏర్పాటుపై ప్రతిపాదనలుఎన్పీఏల సమస్యను పరిష్కరించేందుకు 2017 ఆర్థిక సర్వే ‘పబ్లిక్ సెక్టార్ అసెట్ రిహాబిలిటేషన్ ఏజెన్సీ(పారా)’ను ఏర్పాటు చేయాలని అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్‌కు ప్రతిపాదించింది. దీనికి ప్రతిరూపమే బ్యాడ్ బ్యాంక్. అప్పటి నుంచి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో పేరుకుపోయిన నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) ప్రభావం బ్యాంకులపై పడకుండా ఉండాలంటే ప్రభుత్వం చాలా బ్యాడ్ బ్యాంకుల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. -
డీజిల్‌కు తగ్గిన డిమాండ్.. ఎందుకంటే..
పర్యావరణహిత ఇంధనాల వైపు మళ్లే ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో గతేడాది (2024–25) డీజిల్ డిమాండ్ నెమ్మదించింది. డీజిల్ వినియోగం 2 శాతమే పెరిగి 91.4 మిలియన్ టన్నులకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇది ఏకంగా 12.1%. దేశీయంగా వినియోగించే ఇంధనాల్లో డీజిల్ వాటా దాదాపు 40% ఉంటుంది. డీజిల్ వినియోగం నెమ్మదించినప్పటికీ దేశీయంగా రవాణా రంగంలో నాలుగింట మూడొంతుల వాటా ఈ ఇంధనానిదే ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతుండటంతో డీజిల్ డిమాండ్‌పై ప్రభావం పడుతోందని వివరించాయి. డీజిల్ వినియోగం తగ్గడానికిగల మరిన్ని కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఆర్థిక మందగమనంఅంతర్జాతీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణం కారణంగా ఆర్థిక వృద్ధి క్షీణిస్తుండడం డీజిల్ వినియోగ కార్యకలాపాలతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ముఖ్యంగా రవాణా, నిర్మాణం, వ్యవసాయం వంటి రంగాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విభాగాల్లో వృద్ధి నెమ్మదించడంతో డీజిల్ వినియోగం పడిపోయింది.ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పెరుగుదలపర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వాలు ఈవీ పాలసీను తీసుకొస్తున్నాయి. దాంతో చాలా మంది వినియోగదారులు సంప్రదాయ శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాల కంటే విద్యుత్‌తో నడిచే వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు, ఆటో రిక్షాలతో సహా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్ వంటి వంటి క్విక్‌కామర్స్ కంపెనీలు తమ లాజిస్టిక్స్ ఫ్లీట్లను ఎలక్ట్రిక్ వాహనాలకు మారుస్తున్నాయి.వినియోగదారుల ప్రాధాన్యతల్లో మార్పుడీజిల్ వాహనాలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన 10 సంవత్సరాల పరిమితితో సహా అనేక భారతీయ నగరాలు డీజిల్ వాహనాలపై కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు పెట్రోల్, సీఎన్జీ వాహనాల వైపు మొగ్గుచూపడంతో డీజిల్ అమ్మకాలపై మరింత ప్రభావం పడింది.ఇదీ చదవండి: కళను దొంగలిస్తున్న ఏఐప్రభుత్వ విధానాలుభారత ప్రభుత్వం సీఎన్జీ, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాలతో సహా స్వచ్ఛమైన ఇంధన ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్ మొబిలిటీకి సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తుండడంతో డీజిల్ వాహనాలపై పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. -
ఎస్బీఐ వడ్డీ రేట్లూ తగ్గాయ్
న్యూఢిల్లీ: ఎస్బీఐ డిపాజిట్లు, రుణ రేట్లను తగ్గిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయంతో డిపాజిట్లపై రాబడి తగ్గనుండగా.. రుణ గ్రహీతలకు వెసులుబాటు లభించనుంది. రెపో అనుసంధానిత లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.25 శాతానికి దిగొచ్చింది. ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారత రుణ రేటు (ఈబీఎల్ఆర్)ను సైతం 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.65 శాతం చేసింది. ఏప్రిల్ 15 నుంచి ఈ రేట్లు అమల్లోకి రానున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఆర్బీఐ గత వారం రెపో రేటును పావు శాతం తగ్గించడం తెలిసిందే. దీంతో ఈ మేరకు ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు ఎస్బీఐ బదిలీ చేయడం గమనార్హం. అదే సమయంలో వివిధ కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపైనా 10–25 బేసిస్ పాయింట్లు (0.1–0.25 శాతం) మేర వడ్డీ రేట్లను ఎస్బీఐ తగ్గించింది. ఇవి కూడా ఈ నెల 15 నుంచే అమల్లోకి రానున్నాయి. → రూ.3 కోట్ల వరకు ఎఫ్డీలపై 1–2 ఏళ్ల కాల వ్యవధికి ఇక మీదట వడ్డీ రేటు 6.70 శాతంగా ఉంటుంది. 10 బేసిస్ పాయింట్లు తగ్గింది. → 2 ఏళ్ల నుంచి మూడేళ్లలోపు డిపాజిట్లపై 7 శాతం రేటు కాస్తా 6.90 శాతానికి దిగొచ్చింది. → రూ.3 కోట్లకు మించిన 180–210 రోజుల కాలవ్యవధి డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్లు తగ్గి 6.40 శాతానికి పరిమితం అయింది. అదే 211 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లపై 25 బేసి స్ పాయింట్లు తగ్గడంతో 6.50 శాతంగా ఉంది. → ఎస్బీఐ గ్రీన్ టర్మ్ డిపాజిట్లపైనా 10 బేసిస్ పాయింట్ల వరకు రేటు తగ్గింది. → 444 రోజుల డిపాజిట్‌పై 7.05 శాతం రేటు అమలు కానుంది. → హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సైతం సేవింగ్స్ డిపాజిట్ల రేటును 0.25 శాతం తగ్గించి 2.75 శాతం చేయడం గమనార్హం. రూ.50 లక్షలకు మించిన మొత్తంపై రేటు 3.5 శాతం నుంచి 3.25 శాతానికి దిగొచ్చింది. -
2000 కంటైనర్లలో రొయ్యలు.. ఎక్కడకు వెళ్తున్నాయంటే..
అమెరికాకు రొయ్యలు సరఫరా చేసేందుకు భారత సీఫుడ్ ఎగుమతిదారులు సిద్ధమవుతున్నారు. అమెరికా ప్రతీకార సుంకాల విధింపునకు బ్రేక్ పడడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. టారిఫ్‌లను 90 రోజులపాటు నిలిపేస్తున్నట్ల ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎగుమతిదారులకు ఉపశమనం కలిగించినట్లయింది. దాంతో సుమారు రెండు వేల కంటైనర్ల రొయ్యలు ఎగుమతికి సిద్ధంగా ఉన్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన పరస్పర సుంకాలను కొంతకాలంపాటు నిలిపేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. భారత్‌పై విధించిన 26 శాతం పరస్పర సుంకాన్ని నిలిపివేసి గతంలో ఉన్న 10 శాతాన్ని అమలు చేస్తుండడంతో ఎగుమతులు ఊపందుకున్నాయి. ప్రధానంగా భారత సీఫుడ్ ఎగుమతిదారులు 35,000-40,000 టన్నుల రొయ్యలను అమెరికాకు ఎగుమతి చేయడానికి సిద్ధమవుతున్నారని పరిశ్రమ అధికారులు సోమవారం తెలిపారు. సుంకాల భయాలతో నిలిపివేసిన ఎగుమతులను ప్రాసెస్ చేస్తున్నట్లు సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ కేఎన్ రాఘవన్ తెలిపారు. సుమారు 2,000 కంటైనర్ల రొయ్యలు ఇప్పుడు ఎగుమతికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.ఇదీ చదవండి: సుంకాల యుద్ధంలో విజేతలుండరుఅమెరికా దాటికి 145 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్న చైనా మినహా అన్ని దేశాలపై ప్రతీకార టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపేశారు. దాంతో భారత్‌పై 10 శాతం సుంకాలు అమలవుతుండడంతో ప్రస్తుతం ఎగమతులు ఊపందుకున్నాయి. అమెరికాకు భారత రొయ్యల ఎగుమతులపై 17.7 శాతం కస్టమ్స్ సుంకం ఉండగా, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ 5.7 శాతం, యాంటీ డంపింగ్ డ్యూటీ 1.8 శాతంగా ఉంది. పరిమాణం, విలువ రెండింటిలోనూ యూఎస్‌కు భారతదేశం అతిపెద్ద రొయ్యల మార్కెట్‌గా ఉంది. సుంకాల భయాలున్నా ఆర్డర్లు తగ్గలేదని అసోసియేషన్ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 2.7 బిలియన్ డాలర్ల విలువైన రొయ్యలను అమెరికాకు ఎగుమతి చేసింది. -
విజేతలుండని యుద్ధం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల చర్యలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇతర దేశాల సహకారం కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆగ్నేయాసియాలో పర్యటనలో భాగంగా సోమవారం వియత్నాం వెళ్లిన ఆయన వాణిజ్య, సుంకాల యుద్ధంలో విజేతలుండరని వ్యాఖ్యానించారు.ప్రపంచంలోనే భారీగా ఎగుమతులు చేస్తున్న దేశాల సరసన ఉన్న చైనాకు ట్రంప్ సుంకాల ప్రభావం అధికంగా ఉంటుంది. తాజాగా ట్రంప్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి కొన్ని వస్తువులను సుంకాల నుంచి మినహాయించినప్పటికీ, రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాపై సుంకాలు తీవ్ర పరిణామాలను చూపుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. యూఎస్ చైనాపై 145% సుంకాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో చైనా కూడా వెనక్కి తగ్గకుండా యూఎస్‌పై 125 శాతం సుంకాలు ప్రకటించింది.సూపర్ పవర్‌గా చైనాఈ నేపథ్యంలో ఆగ్నేయాసియాలోని వియత్నాంలో షీ జిన్‌పింగ్ పర్యటన ఆసక్తికరంగా మారింది. వియత్నాంపై కూడా యూఎస్ అధిక సుంకాలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ‘ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రపంచంపై అమలు చేస్తున్న విధానానికి విరుద్ధంగా బాధ్యతాయుతమైన సూపర్ పవర్‌గా చైనా అవతరిస్తుంది’ అని సింగపూర్‌కు చెందిన ఐఎస్ఈఏఎస్-యూసోఫ్ ఇషాక్ ఇన్స్టిట్యూట్ విజిటింగ్ ఫెలో గుయెన్ ఖాక్ గియాంగ్ అన్నారు.వాణిజ్య విధానాలు కాపాడుకోవాలి..ఎగుమతులపై అమెరికా వాణిజ్య విధానాల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసుకోవడానికి చైనా ఇతర దేశాల సహకారాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. వియత్నాం, చైనా అధికారిక మీడియాలో సంయుక్తంగా ప్రచురితమైన సంపాదకీయంలో షీ జిన్‌పింగ్ ‘వాణిజ్య యుద్ధం లేదా సుంకాల యుద్ధంలో విజేతలు ఉండరు’ అని రాశారు. ఇరు దేశాలు బహుళ వాణిజ్య వ్యవస్థను, స్థిరమైన ప్రపంచ పారిశ్రామిక, సరఫరా గొలుసులను కాపాడుకోవాలని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా రెండు రోజుల పాటు వియత్నాంలోనే జిన్‌పింగ్ ఉండనున్నారు.ఇదీ చదవండి: మా దగ్గర ఉంది.. మీకు ఇస్తామండి..ఎలా తప్పించుకోవాలి..జిన్‌పింగ్ పర్యటనను టారిఫ్‌ల ప్రకటన కంటే ముందుగానే ప్లాన్ చేసినప్పటికీ ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, అమెరికా మధ్య సుంకాల పోరు కారణంగా ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. జిన్‌పింగ్ వియత్నాం, మలేషియా, కంబోడియా పర్యటన ట్రంప్ నుంచి చైనా ఎలా తప్పించుకోగలుగుతుందనే అంశంపైనే సాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2013లో జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వియత్నాంలో కేవలం రెండుసార్లు మాత్రమే పర్యటించారు. 2023 డిసెంబర్లో చివరిసారిగా సందర్శించిన ఆయన వియత్నాంకు వెళ్లడం ఇది మూడోసారి. -
మా దగ్గర ఉంది.. మీకు ఇస్తామండి..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన వద్ద ఉన్న మిగులును కేంద్రానికి బదిలీ చేయడం పరిపాటిగా మారింది. 2025 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వానికి భారీగానే ఆర్బీఐ డివిడెండ్ రూపంలో ముట్టజెప్పిందని ఆర్థికవేత్తలు తెలుపుతున్నారు. గడిచిన ఏడాదిలో ఆర్బీఐ కేంద్రానికి ఇచ్చిన మొత్తం ఏకంగా రూ.2.5 లక్షల కోట్లకు మించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది రికార్డు చెల్లింపులతో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరంలోనూ అంతకుమించి సుమారు రూ.3.5 లక్షల కోట్లు ఇచ్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. అసలు ఆర్బీఐకి ప్రధాన ఆదాయవనరుగా ఉన్న మార్గాలేమిటో తెలుసుకుందాం. లిక్విడిటీ ఆపరేషన్స్పెద్ద ఎత్తున లిక్విడిటీ కార్యకలాపాల ద్వారా వచ్చే వడ్డీ రిజర్వ్ బ్యాంక్‌కు ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ (ఎల్ఏఎఫ్) కింద రెపో ఆపరేషన్ల ద్వారా బ్యాంకులకు నిధులు ఇస్తుంది. బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీలను తాకట్టు పెట్టి ఆర్బీఐ నుంచి అప్పు తీసుకుంటాయి. ఆర్బీఐ ఈ రుణాలపై వడ్డీని సంపాదిస్తుంది. ఎల్ఏఎఫ్ మాదిరిగానే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) ద్వారా బ్యాంకులు ఆర్బీఐ నుంచి కొంచెం అధిక వడ్డీ రేటుతో అదనపు నిధులను పొందడానికి అనుమతిస్తుంది. లిక్విడిటీ నిర్వహణ కోసం ఆర్బీఐ బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేసి విక్రయిస్తుంది. దీన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) అంటారు. లిక్విడిటీ నియంత్రణ దీని ప్రాథమిక లక్ష్యం అయితే, ఈ లావాదేవీలు వడ్డీని సమకూరుస్తాయి.ఇదీ చదవండి: కళను దొంగలిస్తున్న ఏఐమితిమీరిన నగదు బదిలీతో నష్టాలేంటి..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి ప్రభుత్వానికి మిగులు బదిలీ అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తుంది.మిగులు బదిలీ కోసం ఆర్బీఐ తన ఆకస్మిక నిల్వలను(కంటింజెన్సీ రిజర్వులు) వాడుకునే ప్రమాదం ఉంది. ఇది ఆర్థిక సంక్షోభాలకు సమర్థవంతంగా స్పందించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.ప్రతిసారి పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి మిగులు బదిలీ చేస్తుంటే కేంద్రం డిమాండ్‌కు ఆర్బీఐ ప్రభావితమవుతుందనే భావన కలుగుతుంది. ఇది దాని స్వయంప్రతిపత్తి, విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.మిగులు బదిలీలు తక్షణ ఆర్థిక ఉపశమనాన్ని అందించినప్పటికీ అవి స్థిరమైన ఆదాయ-ఉత్పాదక చర్యలను అమలు చేయకుండా ప్రభుత్వాన్ని నిరుత్సాహపరుస్తాయి. ఇది దీర్ఘకాలిక ఆర్థిక సవాళ్లకు దారితీస్తుంది.ప్రభుత్వ వ్యయానికి అధికంగా నిధులు సమకూర్చడానికి నగదు బదిలీలను ఉపయోగిస్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దారితీస్తుంది. -
పట్టణాల్లో అధిక ఖర్చు వీటికే..
నెలవారీ సంపాదనను నిత్యావసర ఖర్చులు, విలాసాలు, ఆన్లైన్ షాపింగ్.. వంటి వాటికి వెచ్చిస్తుంటారు. అయితే గ్రామీణ వినియోగదారుల ఖర్చులు పట్టణ వినియోగదారులతో పోలిస్తే కాస్తా భిన్నంగా ఉండవచ్చు. ఎందుకంటే అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులు వేరుగా ఉంటాయి. కానీ పట్టణాల్లో వినియోగదారుల ఖర్చులు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఆర్థిక స్తోమత మెరుగ్గా ఉన్న కొందరు మరింత లగ్జరీ వస్తువులు, హోటళ్లు, రెస్టారెంట్లకు ఖర్చు చేస్తారు. సాధారణంగా పట్టణ వినియోగదారులు ఎలాంటి వాటికి అధికంగా ఖర్చు చేస్తున్నారో నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఫుడ్ అండ్ బేవరేజెస్నెలవారీ బడ్జెట్లో గణనీయమైన భాగం అంటే సుమారు 20-30% ఆహార పదార్థాలకు కేటాయిస్తున్నారు. బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పాల ఉత్పత్తులు వంటి నిత్యావసరాలు ఇందులో ఉన్నాయి. బ్రాండెడ్, ప్యాకేజ్డ్ ఆహారాలు, తినడానికి సిద్ధంగా ఉన్న భోజనం, ప్రాసెస్ చేసిన స్నాక్స్‌కు కూడా ప్రాధాన్యత పెరుగుతోంది.హౌసింగ్, యుటిలిటీస్అద్దె లేదా ఇంటి కోసం ఈఎంఐలకు అధికంగా చెల్లింపులు చేస్తున్నారు. గృహ ఖర్చులు బడ్జెట్లో 25-35% వరకు ఉంటున్నాయి. సొంతంగా ఇళ్లు ఉన్న పట్టణ వినియోగదారులు తరచుగా తమ ఇంటి సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రిన్యువేషన్, అలంకరణలు, స్మార్ట్ హోమ్ గాడ్జెట్ల కోసం వెచ్చిస్తున్నారు.హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్గత దశాబ్ద కాలంలో హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ వంటి సేవలపై ఖర్చు గణనీయంగా పెరిగింది. ఈ విభాగాల్లో వరుసగా 8.2 శాతం, 7.5 శాతం వృద్ధిరేటు నమోదైంది. దాంతో వీటికి చేసే ఖర్చు భారీ మొత్తంలో ఉంటుంది. ఆరోగ్య బీమా తీసుకోని వారి పరిస్థితులు దారుణంగా ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతిఒక్కరు తమ కనీస బాధ్యతగా తప్పకుండా ఆరోగ్యబీమా తీసుకోవాలని సూచిస్తున్నారు. విద్యార్థుల ఫీజుల విషయంలో ప్రభుత్వాలు స్పందించి విచ్చలవిడిగా యాజమాన్యాలు వాటిని పెంచకుండా కట్టడి చేయాలని కోరుతున్నారు.రవాణాప్రజా రవాణా, వ్యక్తిగత వాహనాలు, ఇంధనం, నిర్వహణ.. వంటి ఖర్చులు బడ్జెట్లో 10-15% ఉంటున్నాయి. ఇది వినియోగదారుల వ్యయ సరళితోపాటు ఆటోమొబైల్ పరిశ్రమ వృద్ధిని సూచిస్తుంది. చాలా మంది రవాణా కోసం కార్లు, ద్విచక్ర వాహనాలను ఎంచుకుంటున్నారు.వినోదంసినిమాలు, కచేరీలు, థీమ్ పార్కులు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వంటి ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో ఖర్చు చేస్తున్నారు. ఇది సాధారణంగా బడ్జెట్లో 5-10% వాటాను కలిగి ఉంటుంది. కొవిడ్ సమయంలో ఆన్లైన్ గేమింగ్ల కోసం పట్టణ వినియోగదారులు అధికంగా ఖర్చు చేశారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: ఆదాయం చారెడు.. ఖర్చు బారెడు!పొదుపు విషయంలో చాలా మందికి సాధారణంగా ఖర్చు తర్వాత మిగిలింది జాగ్రత్తగా పొదుపు చేద్దామనే ఆలోచన ఉంటుంది. కానీ ముందు పొదుపు తర్వాతే ఖర్చు అనే ధోరణి అలవరుచుకుంటే తప్పకుండా దీర్ఘకాలంలో మంచి రాబడిని సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఖర్చులు ఎలాగో ఉంటాయి. తర్కంతో ఆలోచించి తక్కువ ఖర్చు చేస్తూ పొదుపునకు పెద్దపీట వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఆదాయం చారెడు.. ఖర్చు బారెడు!
భారతదేశంలోని పట్టణ వినియోగదారుల ఆదాయాలకు, వారి ఖర్చులకు పొంతన లేకుండా ఉంది. ఖర్చులకు అనుగుణంగా తమ ఆదాయం పెరగకుండా స్తబ్దుగా ఉండటంపై ఆందోళన చెందుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వేలో వెల్లడైంది. అందులోని వివరాల ప్రకారం 55% పట్టణ నివాసితులు మునుపటి సంవత్సరంతో పోలిస్తే తమ ఆదాయంలో ఎటువంటి మార్పు లేదని తెలిపారు. ఇది దాదాపు 11 సంవత్సరాల్లో అత్యధిక వాటాను సూచిస్తుంది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ 80% మంది పట్టణ వినియోగదారులు నిత్యావసర వస్తువులపై చేస్తున్న ఖర్చు అధికంగా ఉందని పేర్కొన్నారు.భవిష్యత్తు పొదుపు ప్రశ్నార్థకంఈ పరిస్థితి పట్టణ కుటుంబాలకు ఆదాయం-ఖర్చు మధ్య సమతుల్యతను హైలైట్ చేస్తుంది. ఆదాయం స్తబ్దుగా ఉండి ఖర్చులు పెరుగుతుండడంతో క్రమంగా అప్పుల్లో కురుకుపోతున్నారు. ద్రవ్యోల్బణ రేట్లు తగ్గినప్పటికీ నిత్యావసర ఖర్చులు నిరంతరం పెరుగుతుండడం గమనార్హం. దాంతో చాలా మంది వినియోగదారులు తమ ఆర్థిక బడ్జెట్‌ను పునఃసమీక్షించుకోవలసి వస్తుంది. ఇది ప్రజల విచక్షణ వ్యయాన్ని(డిసిక్రీషనరీ స్పెండింగ్) తగ్గిస్తుంది. భవిష్యత్తు అవసరాలకు పెద్దగా పొదుపు చేయలేని పరిస్థితి నెలకొంటుంది.వేతన పెంపు లేదుఈ ధోరణికి అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితి, ఉద్యోగ మార్కెట్లలో హెచ్చుతగ్గులు, రంగాలవారీగా నెలకొన్న మందగమనాలు చాలా మంది వ్యక్తుల ఆదాయ వృద్ధిని దెబ్బతీస్తున్నాయి. తరచుగా పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా వేతన ఉద్యోగులకు, సాలరీ ఇంక్రిమెంట్లు లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంటుంది. ఫ్రీలాన్సర్లు, చిన్న వ్యాపార యజమానులు సైతం స్థిరమైన ఆదాయ మార్గాలను నిర్వహించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు.దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావంఈ ఆర్థిక ఒత్తిడి కేవలం వ్యక్తిగతంగా కొన్ని ఇళ్లకు మాత్రమే పరిమితం కాదు. డిస్పోజబుల్ ఆదాయం(నెలవారీ ఖర్చుల అనంతరం మిగులు డబ్బు) తగ్గడంతో పట్టణ వినియోగదారులు నిత్యావసర వస్తువులు, ఇతర సేవలపై ఖర్చును నియంత్రించే అవకాశం ఉంది. ఇది రిటైల్, ఎంటర్టైన్మెంట్, టూరిజం.. వంటి రంగాలను ప్రభావితం చేస్తుంది. అంతేకాక, వినియోగదారుల్లో ఖర్చుకు సంబంధించిన అప్రమత్తత వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది.ఇదీ చదవండి: అప్పుపై వడ్డీ తగ్గించిన ప్రముఖ బ్యాంక్వ్యూహాత్మక చర్యలు అవసరంఈ ఆందోళనలను పరిష్కరించడానికి విధానకర్తలు ప్రధానంగా పట్టణ, గ్రామీణ వినియోగదారులకు మద్దతుగా నిలిచేందుకు వారితో కలిసి పనిచేయాలి. ఉపాధి అవకాశాలను పెంచడం, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించే చర్యలను ప్రవేశపెట్టడం వంటి వ్యూహాత్మక చర్యల్లో కొత్త విధానాలు రూపొందించి పక్కాగా అమలు చేయాలి. ఇవి వినియోగదారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించడానికి, అవసరమైన ఆర్థిక ఉపశమనానికి సహాయపడతాయి. -
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
'అంబేద్కర్ జయంతి'ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14ను జాతీయ సెలవు దినంగా అధికారికంగా ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా సోమవారం దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు దినంగా పేర్కొంది. అంటే అన్ని బ్యాంకులు మూసి ఉంటాయన్నమాట.బ్యాంకులు అన్నీ క్లోజ్ అయినప్పటికీ.. ఆన్లైన్ బ్యాంకింగ్ (ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్ మొదలైనవి) సేవలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. బ్యాంకులకు వెళ్లి చేసుకోవలసిన పనులన్నీ ఎల్లుండికి (మంగళవారం) వాయిదా వేసుకోవాలి.ఇతర సెలవు దినాలు➤15 ఏప్రిల్: బెంగాలీ నూతన సంవత్సరం, భోగ్ బిహు (అసోం, పశ్చిమ్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లోని బ్యాంక్‌లకు సెలవు)➤18 ఏప్రిల్: గుడ్ ఫ్రైడే (ఛండీగఢ్, త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ము, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లోని బ్యాంక్‌లకు సెలవు)➤20 ఏప్రిల్: ఆదివారం➤21 ఏప్రిల్: గరియా పూజ (త్రిపురలోని బ్యాంక్‌లకు సెలవు)➤26 ఏప్రిల్: నాల్గవ శనివారం➤27 ఏప్రిల్: ఆదివారం➤29 ఏప్రిల్: పరశురామ జయంతి (హిమాచల్ ప్రదేశ్‌లోని బ్యాంక్‌లకు సెలవు)➤30 ఏప్రిల్: బసవ జయంతి, అక్షయ తృతీయ (కర్ణాటకలోని బ్యాంక్‌లకు సెలవు) -
కొత్తగా 34 బ్యాంకింగ్ సర్వీసులు ప్రారంభం
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) 131వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని 34 వినూత్న ఉత్పత్తులు, సర్వీసులను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్(ఆర్థిక సమ్మేళనం), కస్టమర్లకు సాధికారత కల్పించడం, డిజిటల్ పరివర్తనను స్వీకరించడం.. వంటి లక్ష్యాలతో కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టినట్లు బ్యాంకు తెలిపింది.పీఎన్బీ ప్రవేశపెట్టిన సర్వీసుల్లో 12 ప్రత్యేక డిపాజిట్ పథకాలు ఉన్నాయి. ఇవి విభిన్న శ్రేణి కస్టమర్లను ఆకర్షించడానికి రూపొందించినట్లు అధికారులు తెలిపారు. వేతన జీవులు, మహిళలు, రక్షణ సిబ్బంది, రైతులు, ఎన్ఆర్ఐలు, సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు వంటి సమూహాలను లక్ష్యంగా చేసుకుని ఈ పథకాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రతి సమూహం ప్రత్యేక అవసరాలను పరిష్కరించడం ద్వారా బ్యాంక్ ఆర్థిక భద్రతను పెంచాలని, సౌకర్యవంతమైన బ్యాంకింగ్ పరిష్కారాలను అందించాలని భావిస్తోంది.డిజిటల్ పరివర్తనసాంకేతిక పరిజ్ఞానంలో అగ్రగామిగా నిలిచేందుకు పీఎన్బీ 10 డిజిటల్ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. వీటిలో ‘పిహు’ అనే లైవ్ చాట్ అసిస్టెంట్ ఉంది. ఇది కస్టమర్లు అడిగే ప్రశ్నలకు సమగ్రంగా సమాధానం ఇస్తుందని బ్యాంకు పేర్కొంది. అదనంగా బ్యాంక్ తన ఖాతాదారులతో ఇంటరాక్టివ్ అవ్వడానికి యూజర్ ఫ్రెండ్లీ కమ్యూనికేషన్‌ను అందిస్తూ క్యూఆర్ కోడ్ ఆధారిత కస్టమర్ ఫీడ్‌బ్యాక్ యంత్రాంగాన్ని ప్రారంభించింది.వాట్సాప్ సేవలు అప్డేట్వాట్సాప్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్లను బుక్ చేసుకునే వెసులుబాటు, రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ కోసం రుణ సౌకర్యాలను అందించడం, సుస్థిర ఇంధన స్వీకరణను ప్రోత్సహించడం వంటి డిజిటల్ ఆవిష్కరణలు ప్రవేశపెట్టింది. వినియోగదారులకు మొబైల్ ద్వారా అందించే బ్యాంకింగ్ సేవలను సులభతరం చేస్తూ కొత్త యాప్ ఫీచర్లను అప్డేట్ చేసింది. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పీఎన్బీ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ థీమ్‌తో ‘సైబర్ రన్’ మారథాన్‌ను నిర్వహించింది. ఇది సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతుల ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.ఇదీ చదవండి: యూఎస్‌లో ఐఫోన్లు ఎందుకు తయారు చేయరంటే..వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా..పీఎన్బీ ఎండీ, సీఈఓ అశోక్ చంద్ర మాట్లాడుతూ..‘నిరుపేదలు, పౌరుల సాధికారత, యువతకు విద్యాబుద్ధులు నేర్పడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడంలో ఈ బ్యాంకు కార్యక్రమాలు ఎంతో తోడ్పడుతాయి. ఇవన్నీ 2047 నాటికి కేంద్రం తలపెట్టిన వికసిత్ భారత్ విజన్‌కు అనుగుణంగా ఉన్నాయి. మేము మా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను నిరంతరం మెరుగుపరుస్తున్నాం. కాల్ సెంటర్ కార్యకలాపాలను మరింత అభివృద్ధి చెస్తున్నాం. సేవా నాణ్యతను పెంచడానికి సమర్థవంతమైన కస్టమర్ ఫీడ్ బ్యాక్ కోసం క్యూఆర్ కోడ్లను ఉపయోగిస్తున్నాం’ అని చెప్పారు. -
టారిఫ్‌లకు బ్రేక్‌తో భారీ ఊరట
న్యూఢిల్లీ: ప్రతీకార టారిఫ్‌లను 90 రోజుల పాటు వాయిదా వేయాలన్న అమెరికా నిర్ణయంతో దేశీ ఎగుమతిదార్లకు భారీగా ఊరట లభించింది. దీనితో భారత్–అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) చర్చల పురోగతికి మరికాస్త వెసులుబాటు లభిస్తుందని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. ఒప్పందంపై దౌత్యపరంగా సంప్రదింపులు జరపడం, చర్చలను వేగవంతం చేయడం ద్వారా టారిఫ్‌లను ఎదుర్కొనేందుకు భారత్‌కు వీలవుతుందని వివరించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచుకునే దిశగా ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తొలి విడత చర్చలు ఈ ఏడాది సెపె్టంబర్–అక్టోబర్‌లో ముగిసే అవకాశం ఉంది. మరోవైపు, అమెరికాతో సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో దేశీ పరిశ్రమలకు రిసు్కలు ఉన్నందున దీన్ని కుదుర్చుకునే విషయంలో భారత్ పునరాలోచన చేయాలని భారత్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) సూచించింది. ఒప్పందం ప్రకారం భారత్‌లో రైతులకు కనీస మద్దతు ధరను తొలగించడం, జన్యుపరమైన మార్పులు చేసిన ఆహార పదార్థాలను దిగుమతి చేసుకోవడం, వ్యవసాయ టారిఫ్‌లను తగ్గించడం మొదలైన గొంతెమ్మ కోర్కెలన్నీ అమెరికా కోరుతోందని పేర్కొంది. ఇలాంటివి అమలు చేస్తే రైతుల ఆదాయాలకు, ఆ హార భద్రతకు, జీవవైవిధ్యానికి, చిన్న రిటైలర్ల మనుగడకు రిస్కులు తప్పవని అభిప్రాయపడింది. కార్లులాంటివి మినహాయించి 90% దిగుమతులపై ఇరువైపులా సున్నా స్థాయి టారిఫ్‌లతో డీల్‌ను భారత్ ప్రతిపాదించవచ్చని పేర్కొంది. -
అమెరికా దెబ్బకు చైనా ఔట్?
అమెరికా, చైనాల మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, వరుస ప్రతీకార సుంకాలు ప్రపంచ వాణిజ్య ముఖచిత్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా వస్తువులపై అమెరికా 145 శాతం వరకు సుంకాలు విధించడంతో ఆ దేశ ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సుంకాలు చైనా ఎగుమతులను ఎలా ప్రభావితం చేస్తాయో, అక్కడి ఎగుమతిదారులు అనుసరిస్తున్న వ్యూహాలేమిటో తెలుసుకుందాం.145 శాతం వరకు సుంకాలుచైనా ఆర్థిక వ్యవస్థ చాలా కాలంగా ఎగుమతులపై ఆధారపడి ఉంది. చైనా అతిపెద్ద మార్కెట్ల్లో యూఎస్ కీలకం. 2024లో యూఎస్‌కు చైనా సుమారు 440 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది. ఇది ఆ దేశం మొత్తం ఎగుమతుల్లో 14%, జీడీపీలో సుమారు 3%గా ఉంది. చైనా దిగుమతులను కట్టడి చేయడమే లక్ష్యంగా ఇటీవల వివిధ వస్తువులపై 10 శాతం నుంచి 145 శాతానికి అమెరికా సుంకాలు పెంచింది. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, మెషినరీ సహా పలు రకాల ఉత్పత్తులను లక్ష్యంగా చేసుకుంది.ఎగుమతులపై తీవ్ర ప్రభావంసుంకాల తక్షణ ప్రభావం కింద చైనా వస్తువులకు అమెరికాలో డిమాండ్ గణనీయంగా తగ్గింది. టారిఫ్‌ల పెంపు వల్ల వచ్చే రెండేళ్లలో అమెరికాకు చైనా ఎగుమతులు 80 శాతం వరకు పడిపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు, చైనా నుంచి యూఎస్ దిగుమతుల్లో 9% ఉన్న స్మార్ట్ఫోన్లు వంటి ఉత్పత్తులు తీవ్రమైన ధరల పెరుగుదలను ఎదుర్కొంటాయి. దాంతో వాటిని మార్కెట్ నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. దాంతోపాటు మిలియన్ల మంది చైనా కార్మికుల జీవనోపాధికి ముప్పు కలిగిస్తుంది. చైనాలో సుమారు రెండు కోట్ల ఉద్యోగాలు యూఎస్ సంబంధిత ఎగుమతులపై ఆధారపడి ఉన్నాయి.ఆర్థిక పరిణామాలుఅమెరికా సుంకాలు చైనా ఎగుమతిదారులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. లాభాల మార్జిన్లను గణనీయంగా తగ్గించాయి. కొన్ని సంస్థలు పూర్తిగా ఎగుమతులను నిలిపేశాయి. టెక్స్టైల్ కంపెనీలు యూఎస్‌కు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. సుంకాల ప్రభావం వల్ల లాభాలు భారీగా క్షీణించాయని పేర్కొన్నాయి. మరోవైపు వియత్నాం వంటి దేశాలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ఎగుమతి ఆదాయాలు చైనా ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన తయారీ రంగాన్ని బలహీనపరుస్తాయి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలతో కుదేలైన పారిశ్రామికోత్పత్తి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆర్డర్లు తగ్గడంతో కొన్ని కర్మాగారాలు పరికరాలను విక్రయిస్తున్నాయి.తగ్గిన జీడీపీ అంచనాఅమెరికా సుంకాలు పెంపు, అంతర్జాతీయంగా డిమాండ్ మందగించడం వంటి కారణాలతో గోల్డ్ మన్ శాక్స్ 2025లో చైనా జీడీపీ వృద్ధి అంచనాను 4 శాతానికి సవరించింది. చైనా జీడీపీలో అమెరికాకు చేసే ఎగుమతుల వాటా తక్కువే అయినప్పటికీ, తగ్గిన పెట్టుబడులు, వినియోగదారుల సామర్థ్యం వల్ల మరింత ఆర్థిక ఒత్తిడి ఎందురవుతుంది.చైనా ప్రతిస్పందనచైనా యూఎస్ సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి చైనా బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఆగ్నేయాసియా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఎగుమతిదారులు అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. 2019 నుంచి ఆగ్నేయాసియా చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. తాజా సుంకాలతో ఈ వాణిజ్య పరిమాణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు, టెక్స్టైల్ సంస్థలు తక్కువ వాణిజ్య అవరోధాలు ఉన్న మార్కెట్లకు తమ ఎగుమతులను మళ్లిస్తున్నాయి. అయినప్పటికీ ఈ మార్కెట్లు తరచుగా తక్కువ మార్జిన్లను అందిస్తాయి.ఇదీ చదవండి: థియేటర్ల పంట పండుతుందిలా..యూఎస్‌పై చైనా రివర్స్ సుంకాలుఅమెరికా వస్తువులపై చైనా సుంకాలను 125 శాతానికి పెంచుతున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇది సోయాబీన్స్, పంది మాంసం వంటి వాటితోపాటు ఇంధనాలు, యంత్రాలు లక్ష్యంగా చేసుకుంది. యూఎస్ ఉత్పత్తిదారులపై ఒత్తిడి తీసుకురావాలని ఉద్దేశంతో ఈమేరకు చైనా ప్రతీకార సుంకాలను విధించింది. -
తత్కాల్ బుకింగ్ టైమింగ్స్‌లో మార్పు లేదు: ఐఆర్సీటీసీ క్లారిటీ
ఆంగ్ల మీడియా కథనాలు ఐఆర్సీటీసీ (IRCTC) తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో మార్పులు చేసినట్లు వెల్లడించాయి. వీటిని ఆధారంగా చేసుకుని మేము కూడా కథనం అందించాము. అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి మార్పు లేదని ఐఆర్సీటీసీ స్పష్టం చేస్తూ అధికారికంగా వెల్లడించింది.ఏప్రిల్ 15 నుంచి కూడా తత్కాల్ టికెట్స్ బుకింగ్స్ సమయంలో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి టైమింగ్ యథావిధిగానే ఉంటాయి. టికెట్స్ బుక్ చేసుకోవాలనుకునే వారు ఇప్పటి వరకు ఉన్న సమయాన్నే పాటించాలి. ఆ సమయాల్లోని టికెట్స్ అందుబాటులో ఉంటాయి.Some posts are circulating on Social Media channels mentioning about different timings for Tatkal and Premium Tatkal tickets. No such change in timings is currently proposed in the Tatkal or Premium Tatkal booking timings for AC or Non-AC classes. The permitted booking… pic.twitter.com/bTsgpMVFEZ— IRCTC (@IRCTCofficial) April 11, 2025 -
డాలర్‌కు ట్రంప్ గండం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు ప్రపంచంలోని వివిధ దేశాలతో పాటు యూఎస్‌కు ప్రతికూలంగా మారుతున్నాయి. ఇది అమెరికా వాణిజ్య విధానంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. దేశీయ పరిశ్రమలను రక్షించడం, వాణిజ్య లోటును తగ్గించాలనే ఉద్దేశంతో వీటిని ప్రవేశపెట్టినప్పటికీ ఈ సుంకాల అనాలోచిత నిర్ణయాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. ఇందులో యూఎస్ డాలర్ క్షీణించడం కీలకంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో డాలర్ క్షీణతకు కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.వాణిజ్య అసమతుల్యతసుంకాలు దిగుమతి చేసుకునే వస్తువుల ఖర్చును పెంచుతాయి. ఇతర దేశాలు కూడా ఇందుకు అనుగుణంగా తమ సొంత సుంకాలతో ప్రతీకారం తీర్చుకుంటాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్యం క్షీణించడానికి దారితీస్తుంది. చైనా, కెనడా వంటి వాణిజ్య భాగస్వాములు ప్రతిచర్యలకు పూనుకోవడంతో అమెరికా ఎగుమతులకు డిమాండ్ తగ్గింది. ఫలితంగా వాణిజ్య అసమతుల్యతలు ప్రపంచ మార్కెట్లలో డాలర్ స్థానాన్ని బలహీనపరుస్తున్నాయి.దెబ్బతింటున్న ఇన్వెస్టర్ల ఆత్మవిశ్వాసంఫైనాన్షియల్ మార్కెట్లు ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్తు అంచనాలపై వృద్ధి చెందుతాయి. సుంకాలను ప్రవేశపెట్టడం అనిశ్చితిని సృష్టించింది. ఇది అమెరికా విదేశీ పెట్టుబడులకు ఆకర్షించడంలో వెనుకపడేలా చేసింది. ఇన్వెస్టర్లు సురక్షితమైన మార్కెట్లను కోరుకోవడంతో డాలర్‌కు డిమాండ్ తగ్గింది.గ్లోబల్ కరెన్సీ సర్దుబాట్లుయూఎస్ సుంకాల ప్రభావానికి గురైన దేశాలు అంతర్జాతీయ మార్కెట్లో తమ వస్తువులకు పోటీని కొనసాగించడానికి తరచుగా వారి కరెన్సీ విధానాలను సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు, ప్రధాన వాణిజ్య భాగస్వామి అయిన చైనా యువాన్‌ను స్థిరీకరించడానికి చర్యలు తీసుకుంది. గ్లోబల్ కరెన్సీ విధానాల్లో ఇలాంటి సర్దుబాట్లు పరోక్షంగా అమెరికా డాలర్ విలువను ప్రభావితం చేశాయి.ఇదీ చదవండి: టారిఫ్ పాజ్.. మార్కెట్ జోష్ఆర్థిక వృద్ధి ఆందోళనలుసుంకాలు రెండు వైపులా పదునున్న కత్తిలా పనిచేస్తాయి. అవి దేశీయ పరిశ్రమలను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అవి స్థానిక వ్యాపారాలు, వినియోగదారులకు ఖర్చులను పెంచుతాయి. దాంతో ఆర్థిక వృద్ధిని నెమ్మదిస్తుంది. ఇది యూఎస్ ఆర్థిక వ్యవస్థ పట్ల భవిష్యత్తు అంచనాలను తగ్గిస్తుంది. -
జోరుగా గ్యాస్ వినియోగం
న్యూఢిల్లీ: వాహనాలు, గృహాలు, పరిశ్రమల అవసరాల కోసం సహజ వాయువును విరివిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో 2030 నాటికి గ్యాస్ వినియోగం 60 శాతం పెరగనుంది. 2023–24లో రోజుకు 188 మిలియన్ ఘనపు మీటర్లుగా (ఎంసీఎండీ) ఉన్న వినియోగం, 2030 నాటికి 297 ఎంసీఎండీకి చేరనుంది. వివిధ పరిస్థితుల్లో గ్యాస్ వినియోగ ధోరణులను విశ్లేషిస్తూ చమురు నియంత్రణ సంస్థ పీఎన్జీఆర్బీ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఒక మోస్తరు వృద్ధి, సానుకూల పరిణామాలతో కూడుకున్న ’గుడ్ టు గో’ పరిస్థితుల్లో గ్యాస్ వినియోగం 2030 నాటికి 297 ఎంసీఎండీకీ, 2040 నాటికి 496 ఎంసీఎండీకి కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక వృద్ధి వేగవంతమై, పాలసీలు సానుకూలంగా అమలవుతూ, భారీగా పెట్టుబడులు వచ్చే ’గుడ్ టు బెస్ట్’ పరిస్థితుల్లో 2030 నాటికి 365 ఎంసీఎండీకి, 2040 నాటికి 630 ఎంసీఎండీకి వినియోగం పెరగవచ్చు. ఈ రెండు సందర్భాల్లోనూ కొత్తగా ఏర్పడే డిమాండ్‌లో సిటీ గ్యాస్ డిస్టిబ్యూషన్ (సీజీడీ) సంస్థల వాటా గణనీయంగా ఉండనుంది. ‘గ్యాస్ వినియోగ వృద్ధికి సీజీడీ రంగం కీలక చోదకంగా నిలుస్తుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 37 ఎంసీఎండీ స్థాయి నుంచి 2030 నాటికి 2.5–3.5 రెట్లు, 2040 నాటికి 6–7 రెట్ల వరకు ఇది పెరిగే అవకాశం ఉంది‘ అని నివేదిక పేర్కొంది. పీఎన్జీఆర్బీ ఇటీవల 307 భౌగోళిక ప్రాంతాల్లో సిటీ గ్యాస్ లైసెన్సులు ఇచ్చింది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → రిఫైనరీ, పెట్రోకెమికల్స్ కార్యకలాపాలు జోరందుకోవడం కూడా సహజ వాయువు వినియోగానికి దోహదపడనుంది. 2030 నాటికి పెరిగే అదనపు వినియోగంలో ఈ విభాగం వాటా 21 ఎంసీఎండీగా, 2040 నాటికి మరో 10 ఎంసీఎండీగా ఉండనుంది. → విద్యుదుత్పత్తి, ఎరువుల రంగంలో గ్యాస్ వినియోగం ఒక మోస్తరుగా పెరగనుంది. → డిమాండ్ పెరిగే కొద్దీ ద్రవీకృత సహజ వాయువు దిగుమతులు కూడా పెరగనున్నాయి. సుదూర ప్రాంతాలకు రవాణాకు సంబంధించి డీజిల్ స్థానాన్ని ఎల్ఎన్జీ భర్తీ చేసే అవకాశం ఉంది. 2030 తర్వాత, చైనా తరహాలో డీజిల్‌పై ఆధారపడటం తగ్గి ఎల్ఎన్జీ వినియోగం పెరగవచ్చు. డిమాండ్ దన్ను, దేశీయంగా ఉత్పత్తి నెమ్మదించే పరిస్థితుల కారణంగా అప్పటికి ఎల్ఎన్జీ దిగుమతులు రెట్టింపు కావచ్చు. 2030–2040 నాటికి గ్యాస్ వినియోగం అనేక రెట్లు పెరగనుండటంతో, డిమాండ్–సరఫరా మధ్య వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు ఎల్ఎన్జీపై ఆధారపడటమూ భారీగా పెరగనుంది. అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ లభ్యత మెరుగ్గా ఉండటం వల్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. → 2030, 2040 నాటికి భారత్ నిర్దేశించుకున్న సహజ వాయువు లక్ష్యాలను సాధించాలంటే మౌలిక సదుపాయాల విస్తరణ, ఎల్ఎన్జీ ధరలు.. విధానాలు సానుకూలంగా ఉండాలి. అయితే, భౌగోళిక–రాజకీయ పరిస్థితులు, పాలసీపరంగా అనిశ్చితి మొదలైన అంశాల కారణంగా గ్యాస్ ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలూ ఉన్నాయి. 2015–16 నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో సహజ వాయువు వినియోగం 45 శాతం వృద్ధి చెంది 131 ఎంసీఎండీ నుంచి 188 ఎంసీఎండీకి పెరిగింది. -
ఈ ఏడాది వృద్ధి 6.1 శాతమే
న్యూఢిల్లీ: అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో భారత జీడీపీ వృద్ధి అంచనాలను ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మూడీస్ అనలైటిక్స్ 0.3 శాతం తగ్గించింది. 2025లో జీడీపీ 6.4 శాతం వృద్ధి చెందుతుందంటూ ఈ ఏడాది మార్చిలో వేసిన అంచనాను 6.1 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా ప్రతీకార సుంకాల వల్ల పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని అంచనాలను సవరించింది. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో అమెరికాను ఒకటిగా పేర్కొంటూ.. భారత ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్‌లు వాణిజ్యానికి అవరోధాలు కల్పిస్తాయని తెలిపింది. రత్నాభరణాలు, వైద్య పరికరాలు, టెక్స్టైల్స్ పరిశ్రమలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. ఎగుమతులు భారత జీడీపీలో అతి స్వల్ప వాటాను కలిగి ఉన్నందున.. మొత్తం మీద భారత వృద్ధి రేటు వెలుపలి రిస్‌్కలకు పెద్దగా ప్రభావితం కాబోదని. స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నందున ఆర్బీఐ రెపో రేటును మరో పావు శాతం మేర తగ్గించొచ్చని.. ఈ ఏడాది చివరికి ఇది 5.75 శాతానికి చేరుకుంటుందని తెలిపింది. దీనికితోడు బడ్జెట్లో ప్రకటించిన పన్ను మినహాయింపులు దేశీ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తాయని.. దీంతో మొత్తం మీద వృద్ధిపై సుంకాల ప్రతికూల ప్రభావం తక్కువకు పరిమితం అవుతుందని మూడీస్ అనలైటిక్స్ అంచనా వేసింది. అనిశ్చితులు కొనసాగుతాయి.. చైనా మినహా భారత్ సహా ఇతర దేశాలపై ప్రతీకార సుంకాల అమలును 90 రోజుల పాటు అమెరికా వాయిదా వేయడం గమనార్హం. అయినప్పటికీ అనిశ్చితి కొనసాగుతుందని, ఈక్విటీల్లో ఆటుపోట్లు కొనసాగొచ్చని మూడీస్ అనలైటిక్స్ తెలిపింది. ‘‘పెరుగుతున్న అనిశి్చతిని తక్కువగా అంచనా వేయరాదు. గృహ, వ్యాపార సెంటిమెంట్ తగ్గిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మానిటరీ పాలసీ సులభతరం వల్ల ఒనగూరే ప్రయోజనాల ఫలితం తగ్గొచ్చు. అనిశి్చతుల్లో మరింత ఖర్చుకు గృహస్థులు వెనుకాడొచ్చు. వ్యాపార సంస్థలు సైతం అదనపు పెట్టుబడుల విషయంలో వెనక్కి తగ్గొచ్చు’’అని మూడీస్ అనలైటిక్స్ తన నివేదికలో వివరించింది. టారిఫ్‌లతో వాణిజ్య వ్యయాలు పెరిగిపోతాయని, అది అంతర్జాతీయ వృద్ధిని బలహీనపరుస్తుందని అంచనా వేసింది. -
మన ప్రయోజనాలకే ప్రాధాన్యం
న్యూఢిల్లీ: అమెరికాతో ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో (బీటీఏ) దేశ ప్రజల ప్రయోజనాల పరిరక్షణకే అత్యంత ప్రాధాన్యం ఉంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ స్పష్టం చేశారు. ఆ దిశగా చర్చలు సానుకూల ధోరణిలో జరుగుతున్నాయని చెప్పారు. ఈ అంశంలో తొందరపాటుతనంతో వ్యవహరించడం శ్రేయస్కరం కాదని ఆయన వివరించారు. ప్రస్తుతం 191 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచుకునే దిశగా ఇరు దేశాలు బీటీఏపై చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తొలి విడత ఈ ఏడాది సెపె్టంబర్–అక్టోబర్ నాటికి ముగియవచ్చని అంచనాలు ఉన్నాయి. భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య ఆర్థిక బంధాలు మరింత పటిష్టమయ్యేలా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియ వేగవంతమయ్యేందుకు నిర్మాణాత్మకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. భారత్–ఇటలీ సంబంధాలు మరింత బలపడేందుకు ఐఎంఈసీ (భారత్–మధ్యప్రాచ్యం–యూరప్ కారిడార్) తోడ్పడగలదని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు పెరిగే దిశగా అవరోధాలను తొలగించడంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని ఆయన చెప్పారు. ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉండే పక్షంలో 90 రోజుల్లోపే అమెరికాతో తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. -
టారిఫ్ ‘రిలీఫ్’ ర్యాలీ..!
న్యూఢిల్లీ: చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాలు 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. బుధవారం రాత్రి అమెరికా నాస్డాక్ ఇండెక్స్ 12.16%, ఎస్అండ్పీ సూచీ 9.52%, డోజోన్స్ ఇండెక్స్ 8% లాభపడ్డాయి. యూఎస్ నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న ఆసియా, యూరప్ మార్కెట్లు గురువారం రాణించాయి. జపాన్ నికాయ్ 9%, దక్షిణ కొరియా కోస్పీ 7%, సింగపూర్ స్ట్రెయిట్ టైమ్స్ 5%, హాంగ్‌కాంగ్ హాంగ్ సెంగ్ 2%, చైనా షాంఘై ఒకశాతం పెరిగాయి. యూరప్‌లో జర్మనీ డాక్స్ 5%, ఫ్రాన్స్ సీఏసీ 5%, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ నాలుగు శాతం పెరిగాయి. కాగా బుధవారం భారీగా ర్యాలీ చేసిన అమెరికా మార్కెట్లో గురువారం లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో అమెరికా మార్కెట్లు మళ్లీ భారీ గా పడ్డాయి. నాస్డాక్ 5% క్షీణించి 16,292 వద్ద, డోజోన్స్ 3% పడి 39,184 వద్ద, ఎస్అండ్పీ 4% నష్టంతో 5,243 వద్ద ట్రేడవుతోంది. భారత మార్కెట్ భారీ గ్యాప్‌అప్..? అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతల కారణంగా శుక్రవారం దేశీయ మార్కెట్ భారీ గ్యాప్‌అప్‌తో ప్రారంభం కావచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నాయి. ఇందుకు సంకేతంగా దలాల్ స్ట్రీట్‌ను ప్రతిబింబించే గిఫ్ట్ నిఫ్టీ 3% (680 పాయింట్లు) పెరిగింది. శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా భారత మార్కెట్ గురువారం పనిచేయలేదు. భారత్‌తో సహా 60 దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై ఏప్రిల్ 2 నుంచి ట్రంప్ భారీగా పన్నులు వడ్డించారు. దీంతో అంతర్జాతీయంగా ప్రపంచ వాణిజ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. నాటి (ఏప్రిల్ 2)నుంచి సెన్సెక్స్ 2,770 పాయింట్లు(3.61%), నిఫ్టీ 933 పాయింట్లు(4%) క్షీణించాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.19.15 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయి రూ.393.82 లక్షల కోట్లకు దిగివచి్చంది.మన మార్కెట్లోనూ దూకుడు...! నిఫ్టీ సుమారు 700 పాయింట్లు లాభంతో ట్రేడింగ్ ప్రారంభించవచ్చు. షార్ట్ కవరింగ్‌తో మార్కెట్ భారీగా పెరిగే అవకాశం ఉంది. విస్తృత స్థాయిలో కొనుగోళ్ల పర్వం కొనసాగొచ్చు. ఐటీ షేర్లు బౌన్స్‌బ్యాక్ అయ్యే వీలుంది. ఫార్మా షేర్లు డిమాండ్ లభించవచ్చు. లార్జ్ క్యాప్ బ్యాంకులు, ఫైనాన్షియల్స్ షేర్లు ర్యాలీ చేయొచ్చు. అమెరికా–చైనా ట్రేడ్ వార్ ముదరడంతో విదేశీ ఇన్వెస్టర్లు త్వరలో భారత ఈక్విటీల కొనుగోళ్లకు ఆసక్తి చూపొచ్చు. – వీకే విజయ్‌కుమార్, జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ స్ట్రాటజిస్ట్ -
తొందరపాటు లేదు.. అమెరికాతో ఒప్పందంపై పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో వస్తు, సేవల ఎగుమతులు 820 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6 శాతం పెరిగినట్లు తెలిపింది. 2023 - 24లో ఎగుమతులు 778 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం.. 2024–25 ఏప్రిల్ - ఫిబ్రవరి మధ్య కాలంలో ఉత్పత్తుల ఎగుమతులు 395.38 బిలియన్ డాలర్ల నుంచి 395.63 బిలియన్ డాలర్లుకు చేరాయి. అలాగే సర్వీసుల ఎగుమతులు 311.05 బిలియన్ డాలర్ల నుంచి 354.90 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఎగుమతులు, దిగుమతుల పూర్తి వివరాలను వాణిజ్య శాఖ ఏప్రిల్ 15న విడుదల చేయనుంది.పరిశ్రమకు మంత్రి గోయల్ భరోసా..అమెరికా టారిఫ్‌ల విధింపు నేపథ్యంలో ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, పరిశ్రమ వర్గాలతో వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు. అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితుల్లో ఇటీవల తలెత్తిన సవాళ్లను అధిగమించడంలో ఎగుమతి సంస్థలకు తోడ్పాటు అందించేందుకు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి భరోసా ఇచ్చినట్లు వాణిజ్య శాఖ తెలిపింది.ఎర్ర సముద్రం సంక్షోభం, ఇజ్రాయెల్-హమాస్ ఉద్రిక్తతలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, కొన్ని సంపన్న ఎకానమీల్లో వృద్ధి నెమ్మదించడం తదితర సవాళ్లు నెలకొన్నప్పటికీ ఎగుమతులు వృద్ధి చెందడం సానుకూలాంశమని ఎగుమతిదారులు, పరిశ్రమను మంత్రి అభినందించారు. వివిధ రంగాలకు ప్రాతినిధ్యం వహించే ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు ఈ సమావేశంలో తమ అభిప్రాయాలు, అంచనాలను తెలిపాయి. కష్టకాలంలో ఎగుమతి సంస్థలను ఆదుకునేందుకు ప్రభుత్వం క్రియాశీలక చర్యలు తీసుకోవాలని కోరాయి.అమెరికాతో ఒప్పందంపై కసరత్తు..అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం విషయంలో సమతుల్యత సాధించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి చెప్పారు. దేశానికి ప్రయోజనం కలిగే విధంగా సరైన ఫలితాలను రాబట్టేందుకు ప్రభుత్వం ’వేగంగా’ పనిచేస్తోందని, ’అనవసర తొందరపాటు’ చర్యలు తీసుకోవడం లేదని మంత్రి పేర్కొన్నారు. టారిఫ్‌లపై ఇతర దేశాలు వివిధ రకాలుగా స్పందిస్తున్నాయని ఆయన చెప్పారు. ‘విశ్వసనీయమైన భాగస్వామిగా భారత్ ఎదిగింది.ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలో భారత్ పెద్ద సంస్థలను ఆకర్షించే స్థితిలో ఉంది. కాబట్టి తయారీని పెంచుకునేందుకు, మరిన్ని ఉద్యోగాలను కల్పించేందుకు మనకు అవకాశాలు ఉన్నాయి‘ అని మంత్రి వివరించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని భారత్, అమెరికా నిర్దేశించుకున్నాయి. ఆ దిశగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కసరత్తు చేస్తున్నాయి. చర్చల తొలి దశ ఈ ఏడాది సెప్టెంబర్ - అక్టోబర్‌లో ముగుస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 191 బిలియన్ డాలర్లుగా ఉంది. -
భారత్‌లో పెట్టుబడులకు భారీ అవకాశాలు
లండన్: భారత్‌లో వివిధ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టడానికి అపార అవకాశాలు ఉన్నాయని బ్రిటన్ ఇన్వెస్టర్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. బ్యాంకింగ్ తదితర రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ఆమె పేర్కొన్నారు.లండన్‌లో జరిగిన భారత్-బ్రిటన్ ఇన్వెస్టర్ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. వివిధ పెన్షన్ ఫండ్స్, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక సంస్థలకు చెందిన 60 పైచిలుకు ఇన్వెస్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రకటన ప్రకారం.. సుస్థిర ఆర్థిక వృద్ధి సాధన, పెట్టుబడులకు అనుకూల పరిస్థితులను ఏర్పర్చేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధా న్యం ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. నిబంధనల భారాన్ని తగ్గించి, వ్యాపారాలు.. పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు పలు సంస్కరణలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘బ్యాంకింగ్ రంగంలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో విదేశీ బ్యాంకులు మరింతగా విస్తరించేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయి‘ అని మంత్రి చెప్పారు.పటిష్టమైన పాలసీల దన్ను..మధ్య తరగతి ప్రజల సంఖ్య పెరుగుతుండటం, స్థిరమైన..పటిష్టమైన పాలసీలు అమలవుతుండటం తదితర అంశాల ఊతంతో 2024–2028 మధ్య కాలంలో భారత బీమా మార్కెట్ వార్షికంగా 7.1 శాతం మేర వృద్ధి చెందనున్నట్లు ఆమె వివరించారు. 2032 నాటికి ఆరో అతి పెద్ద ఇన్సూరెన్స్ మార్కెట్‌గా ఎదగనున్నట్లు తెలిపారు.ఇక టీప్లస్1 సెటిల్మెంట్ను 2023లోనే ప్రవేశపెట్టడం ద్వారా ఈ విధానాన్ని అమలు చేసిన అతి కొద్ది బడా సెక్యూరిటీస్ మార్కెట్లలో భారత్ కూడా ఒకటని ఇన్వెస్టర్లకు వివరించారు. 4.6 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో భారత సెక్యూరిటీస్ మార్కెట్ అంతర్జాతీయంగా నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (గిఫ్ట్–ఐఎఫ్ఎస్సీ) గురించి కూడా మంత్రి వివరించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.2025 మార్చి నాటికి బ్యాంకులు, బీమా, ఫిన్‌టెక్, ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్, షిప్ లీజింగ్ మొదలైన రంగాలకు చెందిన 800 పైచిలుకు సంస్థలు గిఫ్ట్ సిటీలో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు మంత్రి వివరించారు. స్థూల దేశీయోత్పత్తికి డిజిటల్ ఎకానమీ దన్నుగా నిలుస్తున్న తీరును తెలిపారు. ప్రభుత్వ సానుకూల విధానాలు, వినూత్నమైన స్టార్టప్‌ల తోడ్పాటుతో దేశీయంగా ఫిన్‌టెక్ వ్యవస్థ పటిష్టంగా మారిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. గత అయిదేళ్లలో ఫిన్‌టెక్‌ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు చెప్పారు. దేశీ యూనికార్న్‌ల సంఖ్యపరంగా అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు సీతారామన్ చెప్పారు. -
ఇక రుణాలు మరింత చౌక!
రుణగ్రహీతలకు మరోసారి ఆర్బీఐ శుభవార్త చెప్పింది. గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలు మరింత చౌకగా లభించేలా.. ఈఎంఐల భారం ఇంకాస్త దిగొచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఒకపక్క ముదురుతున్న ట్రంప్ టారిఫ్ వార్.. మరోపక్క దిగజారుతున్న వృద్ధి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలుస్తూ... వరుసగా రెండోసారి కీలక పాలసీ రేట్లను తగ్గించింది. అంతేకాదు, సమీప భవిష్యత్తులో మరిన్ని రేట్ల కోతలు ఉంటాయన్న సంకేతాలివ్వడం విశేషం! ఆర్బీఐ చర్యలకు అనుగుణంగా కొన్ని బ్యాంకులు కూడా తక్షణం రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పరపతి సమీక్షలోనూ వడ్డీ రేట్ల కోతకు ఓకే చెప్పింది. అమెరికా టారిఫ్‌ల దెబ్బకు ఆర్థిక వ్యవస్థకు గట్టిగానే సెగ తగిలే అవకాశం ఉండటంతో కీలక పాలసీ రేటు.. రెపోను వరుసగా రెండోసారి తగ్గించింది. దీంతో రెపో రేటు ఇప్పుడున్న 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గనుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సారథ్యంలోని పరిపతి విధాన కమీటీ (ఎంపీసీ) సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయానికి ఓటేశారు. దీంతో బ్యాంకుల రుణ రేట్లు కూడా దిగిరానున్నాయి. ప్రతీకార సుంకాల్లో భాగంగా దాదాపు 60 దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు విధించడం తెలిసిందే. భారత్‌పై కూడా 26 శాతం సుంకాలు వడ్డించారు. మరోపక్క, అమెరికాతో అమీతుమీ అంటూ చైనా కూడా దీటుగా సుంకాలతో విరుచుపడుతుండటంతో వాణిజ్య యుద్ధం అంతకంతకూ తీవ్రతరం అవుతోంది. ఈ నేపథ్యంలో నేపథ్యంలో వృద్ధికి మరింత దన్నుగా నిలిచేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు బాటలో కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి సమీక్షలో దాదాపు ఐదేళ్ల తర్వాత (2020 మే) తొలిసారి రెపో రేటును పావు శాతం తగ్గించింది. ఇప్పుడు మరో పావు శాతం కోతతో రెపో రేటు 2022 నవంబర్ స్థాయికి దిగొచ్చింది.వృద్ధి రేటు అంచనాలు డౌన్... ట్రేడ్ వార్, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశి్చతుల ప్రభావంతో మన ఎగుమతులు, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) జీడీపీ వృద్ధి అంచనాలను 6.7 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మరోపక్క, మాంద్యం ఆందోళనలు, ఆర్థిక మందగమనం కారణంగా అంతర్జాతీయంగా చమురు రేటు దిగొస్తుండటంతో ద్రవ్యోల్బణం అంచనాలను కూడా 4.5 శాతానికి కుదించింది. ఇతర ముఖ్యాంశాలు... → పరపతి విధాన స్థితిని ఇప్పుడున్న ‘తటస్థం’ నుంచి ‘సానుకూలానికి’ తగ్గించింది. అంటే, ఎలాంటి తీవ్ర ప్రతికూలాంశాలు లేకపోతే, రాబోయే సమీక్షల్లో రేట్ల తగ్గింపు లేదా యథాతథ స్థితిని కొనసాగించడం జరుగుతుంది. → పర్సన్–టు–మర్చంట్ (పీ2ఎం) పేమెంట్లకు సంబంధించి యూపీఐ లావాదేవీ పరిమితిని పెంచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కి అనుమతించింది. ప్రస్తుతం పర్సన్–టు–పర్సన్ (పీ2పీ), పీ2ఎం పరిమితి రెండూ రూ. లక్షగా ఉంది. అయితే, పీ2ఎంలో కొన్ని నిర్దిష్ట వినియోగాలకు రూ. 2 లక్షలు, రూ. 5 లక్షలు ఇలా అధిక పరిమితులకు మినహాయింపు ఉంటోంది. అయితే, ఇప్పుడు ఆర్బీఐ అనుమతితో పీ2ఎంపై ఉన్న రూ. లక్ష పరిమితిని యూజర్ల అవసరాలకు అనుగుణంగా పెంచడానికి ఎన్‌పీసీఐకి అవకాశం లభిస్తుంది. పీ2పీ పరిమితి మాత్రం రూ. లక్షగానే కొనసాగుతుంది. → బంగారు రుణాలపై నిబంధనలను కఠిన తరం చేస్తూ ముసాయిదా మార్గదర్శకాలను ఆర్బీఐ విడుదల చేసింది. రుణాల మంజూరు సమయంలో తనఖాగా పెట్టే పసిడి స్వచ్ఛత, బరువు లెక్కింపు ఇతరత్రా పద్ధతులకు సంబంధించి గోల్డ్ లోన్ పరిశ్రమలోని రుణదాతలంతా ఇకపై ఒకే విధమైన డాక్యుమెంటేషన్‌ను అనుసరించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. అన్ని బ్రాంచీల్లోనూ ఒకే ప్రామాణిక విధానం అమలు చేయాలని ముసాయిదాలో పేర్కొంది. → తదుపరి పాలసీ సమీక్ష 2025 జూన్ 4 నుంచి 6 వరకు జరుగుతుంది.4 బ్యాంకులు బోణీ...ఆర్బీఐ రెండోసారి రెపో తగ్గింపు ప్రకటనతో నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు బోణీ చేశాయి. ఇందులో ఇండియన్ బ్యాంక్ అత్యధికంగా రెపో ఆధారిత రుణ రేటు (ఆర్బీఎల్ఆర్)ను 35 బేసిస్ పాయింట్లు (0.35%) తగ్గింంచి 8.7%కి చేర్చింది. శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఎల్‌ఆర్‌లో పావు శాతం కోతతో ఇప్పుడున్న 9.1% నుంచి 8.85 శాతానికి తగ్గించాయి. ఇవి వెంటనే అమల్లోకి వచ్చాయి. యూకో బ్యాంక్ గురువారం నుంచి అమలయ్యేలా ఆర్‌బీఎల్‌ఆర్‌ను 8.8%కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుత, కొత్త రుణ గ్రహీతలకు వడ్డీ రేట్లు తగ్గను న్నాయి. ఇతర బ్యాంకులు కూడా త్వరలోనే ఇదే బాట పట్టే అవకాశం ఉంది.నేను భారతంలో సంజయుడిని కాదు... వడ్డీ రేట్లు ఏ స్థాయికి చేరుతాయో చెప్పలేను. నేను భారతంలో సంజయుడిని కాదు. సంజయ్‌ని మాత్రమే. నాకు అలాంటి దివ్య దృష్టి ఏదీ లేదు. పాలసీ నిర్ణయం కస్టమర్లకు బదిలీ అయ్యేందుకు తగినంత ద్రవ్య సరఫరా (లిక్విడిటీ)ను అందిస్తాం. తాజా ప్రతీకార సుంకాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది. ప్రపంచ వృద్ధి, ద్రవ్యోల్బణంపై ఇది ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు తీవ్రంగా దిద్దుబాటుకు గురవుతున్నాయి. ముడిచమురు ధరలు దిగొస్తున్నాయి. దీంతో సెంట్రల్ బ్యాంకులు తమ దేశీ ప్రాధాన్యతలను అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. – సంజయ్ మల్హోత్రా, ఆర్బీఐ గవర్నర్గృహ రుణాలపై ఊరట ఇలా... ఆర్బీఐ వరుసగా రెండో సారీ రెపో రేటును పావు శాతం తగ్గించడంతో గృహ రుణగ్రహీతలకు మరింత ఊరట లభించనుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తాజా రెపో రేటు కోతకు ముందు రూ.50 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి 8.75% వడ్డీ రేటుతో తీసుకున్నారనుకుందాం. అతనికి ప్రస్తుతం రూ.44,186 చొప్పు న నెలవారీ వాయిదా(ఈఎంఐ) పడు తుంది. బ్యాంకులు ఈ పావు శాతం కోతను నేరు గా కస్టమర్లకు బదలాయిస్తే... వడ్డీ రేటు 8.5 శాతానికి తగ్గు తుంది. దీని ప్రకారం ఈఎంఐ రూ. 43,391కి దిగొస్తుంది. అంటే నెలకు రూ.795 చొప్పున మిగిలినట్లు లెక్క. మిగతా రుణ కాల వ్యవధిలో ఎలాంటి మార్పులు జరగకుండా అదే వడ్డీ రేటు కొనసాగితే మొత్తం వడ్డీ రూ. 1,90,649 ఆదా అవుతుంది. అయితే, రుణ కాల వ్యవధిలో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ నెలవారీ చెల్లించే ఈఎంఐని ఇంతకుముందు లాగే (రూ.44,186 చొప్పున) కొనసాగిస్తే.. రుణ కాల వ్యవధి 10 నెలలు తగ్గుతుంది.ఎకానమీకి దన్ను... రెపో రేటు తగ్గింపుతో పాటు పరపతి విధాన స్థితిని తటస్థం నుంచి సానుకూలానికి మార్చడం అనేది దేశీ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తుంది. టారిఫ్ ప్రభావం నుంచి ఎకానమీకి చేదోడుగా నిలిచేందుకు ఈ చర్యలు తోడ్పడతాయి. – సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్వాహన పరిశ్రమకు సానుకూలం... ఆర్బీఐ రెపో తగ్గింపుతో వాహన కొనుగోలుదారులపై భారం తగ్గుతుంది. దీనివల్ల మళ్లీ అమ్మకాలు పుంజుకుని ఆటోమొబైల్ రంగంలో సానుకూల సెంటిమెంట్ నెలకొంటుంది. – శైలేష్ చంద్ర, సియామ్ ప్రెసిడెంట్వృద్ధికి ఊతం... ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో రెపో కోతతో పాటు పరపతి విధానాన్ని సానుకూలానికి మార్చడం మన ఆర్థిక వ్యవస్థకు చాలా పెద్ద ప్లస్. దీనికి ప్రభుత్వ సానుకూల ఆర్థిక విధానం కూడా తోడవ్వడంతో వృద్ధి పుంజుకుంటుంది. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ఇళ్ల అమ్మకాలు పుంజుకుంటాయ్... రియల్టీ రంగంలో వినియోగదారుల సెంటిమెంట్‌కు జోష్ నింపేలా సరైన సమయంలో రేట్ల కోత నిర్ణయం వెలువడింది. దీనివల్ల గృహ రుణాలపై వడ్డీ రేట్లు దిగొచి్చ... మధ్య ఆదాయ, అందుబాటు ధర ఇళ్ల విభాగాల్లో అమ్మకాలు పుంజుకుంటాయి. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు -
వడ్డీరేట్ల తగ్గింపు ప్రభావం ఎప్పటి నుంచంటే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం కీలక వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. ఆర్థిక పరిస్థితులను సులభతరం చేయడానికి, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే లక్ష్యంతో ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. దాంతో ప్రస్తుతం 6.25 శాతంగా ఉన్న రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6 శాతానికి చేర్చారు. ఈ నిర్ణయం రెపో రేటుతో అనుసంధానమయ్యే రుణగ్రహీతలకు తక్షణ ఉపశమనం కలిగించినప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థపై, ముఖ్యంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR), డిపాజిట్లతో ముడిపడి ఉన్న రుణాలపై విస్తృత ప్రభావాలు చూపడానికి కొంత సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.రెపో ఆధారిత రుణాలపై ప్రభావంఆర్బీఐ రేట్ల తగ్గింపు వల్ల రెపో రేటుతో ముడిపడి ఉన్న రుణాలతో రుణగ్రహీతలకు తక్షణ ప్రయోజనం చేకూరుతుంది. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై విధించే వడ్డీని రెపో రేటు అంటారు. రెపో రేటును తగ్గించడం వల్ల ఈ రుణగ్రహీతలకు వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఎందుకంటే బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని వెంటనే లబ్ధిదారులకు బదిలీ చేస్తాయి. ఇది చాలా మంది రుణగ్రహీతలకు సమాన నెలవారీ వాయిదాలను (EMI) తగ్గించడానికి దారితీస్తుంది.ఎంసీఎల్ఆర్ రుణాలపై ప్రభావం ఇలా..ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎంసీఎల్ఆర్తో ముడిపడి ఉన్న రుణాలపై ప్రభావం వెంటనే కనిపించదు. ఎంసీఎల్ఆర్ అనేది గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఇతర రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి బ్యాంకులు ఉపయోగించే బెంచ్‌మార్క్ వడ్డీ రేటు. రెపో రేటు మాదిరిగా కాకుండా బ్యాంకులకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు.. వంటి వాటిపై ఆధారపడి ఎంసీఎల్ఆర్లో మార్పులు ఉంటాయి. రేట్ల కోత ప్రభావం ఎంసీఎల్ఆర్లో పూర్తిగా ప్రతిబింబించడానికి కనీసం రెండు త్రైమాసికాలు పట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకులు తమ వ్యయాలను సర్దుబాటు చేయడానికి, రేట్ల తగ్గింపు ప్రయోజనాలను రుణగ్రహీతలకు బదిలీ చేయడానికి కొంత సమయం వేచిచూడాల్సి ఉంటుంది. ఫలితంగా ఎంసీఎల్ఆర్ లింక్డ్ లోన్లు తీసుకున్నవారు తమ ఈఎంఐలు తగ్గాలంటే మరికొంత కాలం ఆగాలి.ఇదీ చదవండి: త్వరలో ఫార్మా ఉత్పత్తులపై ట్రంప్ సుంకాలుడిపాజిట్లకు సవాల్..వడ్డీరేట్ల తగ్గింపు డిపాజిట్ల పరంగా బ్యాంకులకు సవాలుగా మారుతుంది. రుణ రేట్లు తగ్గుతాయని భావిస్తున్నప్పటికీ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను కూడా బ్యాంకులు నిర్వహించాల్సి ఉంటుంది. డిపాజిట్ రేట్లను వెంటనే తగ్గించడం వల్ల బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించడం, వారిని నిలుపుకోవడం కష్టతరం అవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు తమ పొదుపుపై మంచి రాబడిని కోరుకునే ఇతర మార్గాలను ఎంచుకుంటారని విశ్లేషిస్తున్నారు. -
ఫార్మా ఉత్పత్తులపై ట్రంప్ సుంకాలు?
ఔషధాల దిగుమతులపై అమెరికా త్వరలోనే భారీ సుంకం విధించనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ట్రంప్ ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఔషధ కంపెనీలు తమ కార్యకలాపాలను అమెరికాకు మార్చుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో ట్రంప్ ప్రభుత్వం ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లను పరస్పర టారిఫ్ పాలసీ నుంచి మినహాయించింది. కానీ తాజాగా ప్రకటనతో తిరిగి ఈ విభాగాల్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.‘మేము త్వరలోనే ఫార్మాస్యూటికల్స్‌పై సుంకాన్ని ప్రకటించబోతున్నాం. వివిధ దేశాల్లో తయారీ కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు తిరిగి అమెరికా వచ్చేందుకు ఈ చర్యలు ఉపయోగపడుతాయి. ఈ విభాగంలో యూఎస్ అతిపెద్ద మార్కెట్’ అని ట్రంప్ అన్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక దిగుమతి సుంకాలను ఉదహరిస్తూ అమెరికా ఇటీవల భారతీయ వస్తువులపై 26 శాతం ప్రతీకార సుంకాలను ప్రకటించింది.దేశంలో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి లేకపోవడంపై ట్రంప్ చాలా కాలంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించిన సమయంలో ఫార్మా రంగాన్ని అందులో నుంచి మినహాయించారు. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో ఫార్మాస్యూటికల్స్‌పై సుంకాలు ప్రకటిస్తామని ట్రంప్ మార్చి 24న చెప్పారు. యుద్ధాలు, మరేదైనా అనిశ్చితులు తలెత్తినప్పుడు ఉక్కు, ఫార్మాస్యూటికల్స్ అవసరం ఉందన్నారు. స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్స్‌పై ఇప్పటికే 25 శాతం సెక్టోరల్ టారిఫ్‌లను వర్తింపజేసిన ట్రంప్ రాగిపై కూడా వీటిని అమలు చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఫార్మాస్యూటికల్ ఔషధాలతో పాటు కలప, సెమీకండక్టర్ చిప్‌లతో సహా అదనపు సెక్టోరల్ లెవీలను ఆయన ప్రభుత్వం విడిగా పరిశీలించనుంది. అయితే వీటి అమలుకు ఎంత సమయం పడుతుందో మాత్రం స్పష్టతనివ్వలేదు.భారత్‌పై ప్రభావంఫార్మా దిగుమతులపై ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటిస్తే అమెరికాకు అత్యధికంగా ఔషధాలను సరఫరా చేసే దేశాల్లో ఒకటైన భారత్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. 2024లో దేశం ఔషధ ఎగుమతుల విలువ 12.72 బిలియన్ డాలర్లు. ఇది దేశంలో అతిపెద్ద పారిశ్రామిక ఎగుమతి రంగంగా మారింది. అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో భారత ఫార్మా కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2022లో కొన్ని సర్వేల ప్రకారం యూఎస్‌లోని వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్‌తో దాదాపు 40 శాతం మందులు ఇండియాకు చెందినవే కావడం గమనార్హం.ఇదీ చదవండి: మళ్లీ బంగారం ధరలు పైకి! తులం ఎంతంటే..ఇదిలావుండగా, తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (టీఎస్ఎంసీ) అమెరికాలో ప్లాంట్లను నిర్మించకపోతే 100% వరకు పన్ను విధిస్తామని ట్రంప్ బెదిరించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనను తప్పుబట్టిన ట్రంప్ అరిజోనాలోని ఫీనిక్స్‌లో ఉన్న సెమీకండక్టర్ ప్లాంట్ కోసం టీఎస్ఎంసీ యూఎస్ యూనిట్‌కు 6.6 బిలియన్ డాలర్ల గ్రాంట్ ఇవ్వడాన్ని ఖండించారు. -
ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లపై కీలక నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్కెట్ వర్గాలు ఊహించిన విధంగానే మరోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇది 6 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఫిబ్రవరి తర్వాత తాజాగా ఇలా రేటు తగ్గింపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) ఏప్రిల్ 7న మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది. బుధవారం వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ ప్రకటన చేశారు. పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత, సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది రెండో ద్రవ్య విధాన కమిటీ సమావేశం. అంతకుముందు ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో భాగంగా రెపోరేటును గడిచిన ఐదేళ్లలో తొలిసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. తాజాగా మరోసారి అందరూ అంచనా వేసినట్లుగానే ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బెంచ్‌మార్క్ రుణ రేటు ప్రస్తుతం 6.25 శాతం నుంచి తాజాగా 6 శాతానికి తగ్గింది.సుస్థిర వృద్ధికి ఊతమిచ్చేలా..‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అసాధారణ అనిశ్చితిలో ఉంది. దీంతో విధానాల రూపకల్పనకు సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ ఉన్న వనరులను వినియోగించుకుని మెరుగైన ఆర్థిక వ్యవస్థను రూపొందించేందుకు కట్టుబడి ఉన్నాం. నేను గతంలో చెప్పినట్లుగానే దేశీయ వృద్ధి, ద్రవ్యోల్బణం విషయంలో అప్రమత్తంగా ఉంటున్నాం. అదే సమయంలో ప్రధాన వృద్ధికి మద్దతు ఇచ్చే ద్రవ్య విధానాన్ని పాటిస్తున్నాం. మెరుగైన డిమాండ్, సరఫరాలు, సుస్థిర స్థూల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేలా ద్రవ్యోల్బణేతర వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాం. గతంలోలాగే స్పష్టమైన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల కోసం విధానాలను అమలు చేస్తాం’ అని మల్హోత్రా అన్నారు.రెపో రేటు అంటే..రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్‌పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది.కస్టమర్లకు ఊరటవాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు కూడా కస్టమర్లకు ఇచ్చే రీటైల్ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను ఆ మేరకు సవరించే అవకాశం ఉంటుంది. దీంతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నవారికి ఊరట కలుగుతుంది. -
ఒక రాష్ట్రం.. ఒకే ఆర్ఆర్బీ అమలుకు డేట్ ఫిక్స్
న్యూఢిల్లీ: ఒక రాష్ట్రం–ఒకే ఆర్ఆర్బీ విధానం మే నెల 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను (ఆర్ఆర్బీ) కన్సాలిడేట్ చేయనున్నారు. దీంతో నాలుగో విడత కన్సాలిడేషన్‌లో భాగంగా మొత్తం ఆర్ఆర్బీల సంఖ్య ప్రస్తుతమున్న 43 నుంచి 28కి తగ్గుతుంది.విలీన జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర 11 రాష్ట్రాల్లోని ఆర్ఆర్బీలు ఉన్నాయి. విలీనం అమల్లోకి వచ్చే తేదీని మే 1గా నిర్ణయించారు. ఉదాహరణకు, వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు స్పాన్సర్ చేస్తున్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మొదలైన వాటిని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కింద ఏకీకృతం చేస్తారు. కొత్త బ్యాంకు ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉంటుంది. దీన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేస్తుంది. వ్యయాలను క్రమబద్ధీకరించేందుకు, సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు 10 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలోని ఆర్ఆర్బీలను విలీనం చేస్తున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఇదీ చదవండి: నాలుగు ఐపీవోలకు సెబీ ఓకేగ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, కళాకారులకు రుణాలు, ఇతరత్రా బ్యాంకింగ్ సదుపాయాలను కల్పించే ఉద్దేశంతో ఆర్ఆర్బీ యాక్ట్ 1976 కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. వీటిలో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం, స్పాన్సర్ బ్యాంకులకు 35 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలకు 15 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం 26 రాష్ట్రాల్లో, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 43 ఆర్ఆర్బీలు ఉన్నాయి. విలీనానంతరం ఈ సంఖ్య 28 ఆర్ఆర్బీలకు తగ్గుతుంది. వీటికి 700 జిల్లాల్లో 22,000 శాఖలు ఉంటాయి. ఆర్ఆర్బీల విలీన ప్రక్రియలో ఇది నాలుగో దశ. 2006–2010 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో తొలి విడతగా 196 ఆర్ఆర్బీలను 82కి తగ్గించారు. -
రూపాయికి ట్రేడ్ వార్ సెగ
డాలర్ మారకంలో రూపాయి విలువ మరో 50 పైసలు బలహీనపడి 86.26 వద్ద ముగిసింది. వాణిజ్య యుద్ధాలతో మాంద్యం పరిస్థితులు తలెత్తవచ్చనే భయాలు దేశీయ కరెన్సీ కోతకు ప్రధాన కారణమయ్యాయి. యువాన్ క్షీణత, క్రూడాయిల్ రికవరీ, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు మరింత ఒత్తిడి పెంచాయి. జనవరి 13 (66 పైసలు క్షీణత) తర్వాత భారత కరెన్సీకిదే అతిపెద్ద పతనం. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 85.89 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 85.82 వద్ద గరిష్టాన్ని, 86.29 వద్ద కనిష్టాన్ని తాకింది. ‘అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావం ఫారెక్స్ మార్కెట్‌కు ప్రతికూలంగా మారింది. ఆర్బీఐ పాలసీ వెల్లడి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. రానున్న రోజుల్లో 85.90 – 86.50 శ్రేణిలో ట్రేడవొచ్చు’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ నిపుణులు దిలీప్ పార్మర్ తెలిపారు. -
IRCTC గ్రూప్ టికెట్ బుకింగ్ గురించి తెలుసా: రూల్స్ ఇవే..
ట్రైన్ జర్నీ అనగానే.. ఐఆర్సీటీసీ లేదా ఇతర యాప్‌లలో టికెట్ బుక్ చేసేస్తారు. ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ వచ్చిన తరువాత.. టికెట్ బుకింగ్ సెంటర్లకు వెళ్లడమే తగ్గిపోయింది. అయితే ఆన్లైన్లో ఒకసారికి ఆరుమంది కంటే ఎక్కువ బుక్ చేసుకోవడానికి వీలు కాదు. అలాంటప్పుడు చాలామంది వివాహ వేడుకలకు లేదా పాఠశాల విహారయాత్రలకు వెళ్లాలంటే.. అప్పుడు ఎలా బుక్ చేసుకోవాలనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.ఆన్లైన్లో మళ్ళీ మళ్ళీ బుక్ చేసుకుంటే.. ఎక్కువ మందికి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అయితే అందరికి ఒకేదగ్గర లేదా ఒకే బోగీలో సీట్లు దొరుకుతాయని మాత్రం చెప్పలేము. కాబట్టి ఎక్కువ మందికి టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఉత్తమమైన మార్గం.. బుకింగ్ సెంటర్లకు వెళ్లడమే.ఆఫీస్, మతపరమైన యాత్రలు, వివాహం లేదా కుటుంబ సమూహాలతో కలిసి ట్రైన్ జర్నీ చేయాలనుకునే వారికి IRCTC గ్రూప్ బుకింగ్ సౌకర్యం అందిస్తోంది.ప్రస్తుత ఒకేసారి 50 నుంచి 100 మంది ప్రయాణికులకు బల్క్ బుకింగ్‌ను ఐఆర్సీటీసీ అనుమతిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. అన్ని రైల్వే స్టేషన్లలోనూ ఈ బల్క్ బుకింగ్ ఆప్షన్స్ అందుబాటులో ఉండదు. బల్క్ బుకింగ్ చేసుకోవాలనుకువారు ముందుగా.. సమీపంలోని స్టేషన్‌లోని చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్ లేదా కంట్రోలింగ్ ఆఫీసర్‌ను సంప్రదించి తెలుసుకోవాల్సి ఉంటుంది.సాధారణంగా ఈ బల్క్ బుకింగ్స్ అనేది న్యూఢిల్లీలో బల్క్ బుకింగ్ రిజర్వేషన్ కాంప్లెక్స్, IRCA భవనంలో జరుగుతుంది. ఇది కూడా నామినేటెడ్ కౌంటర్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి దీని గురించి ముందుగానే తెలుసుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: మీ ప్రాంతంలో ఏ నెట్వర్క్ వేగంగా ఉంది?: ఇలా తెలుసుకోండి..బల్క్ బుకింగ్ సర్వీస్ కింద టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి సంబంధిత అధికారులకు అభ్యర్థన లేఖను సమర్పించడం తప్పనిసరి. ఒక పాఠశాల / సంస్థ / విభాగం ఈ యాత్రను స్పాన్సర్ చేస్తుంటే.. వారికి సంబంధించిన సర్టిఫికేట్‌ను అభ్యర్థన లేఖతో పాటు అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. వివాహ వేడుకలకు సంబంధించిన వారు అయితే.. వెడ్డింగ్ కార్డు లేదా నోటరీ చేసిన అఫిడవిట్‌ను అభ్యర్థన లేఖతో ఇవ్వాలి.డాక్యుమెంట్స్ మాత్రమే కాకుండా.. ప్రయాణించే వ్యక్తుల పేర్లు, వయసు, లింగం, ఇతర వివరాలతో ప్రయాణీకుల జాబితాను అందించాలి. టిక్కెట్లను బుక్ చేసుకునే వ్యక్తి తన ఐడీ కార్డు ఫోటోకాపీని ఇవ్వాలి. బల్క్ టికెట్ బుకింగ్ చేసుకోవాలనుకునే వారు.. ఉదయం 8:00 గంటల నుంచి 9:00 వరకు మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. -
చమురు ధరలు తగ్గాయ్.. కానీ ఏం లాభం!
ప్రపంచ ముడి చమురు ధరలు ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ 2025 ప్రారంభంలో బ్యారెల్‌కు 70 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇది 2021 డిసెంబర్ తర్వాత కనిష్ట స్థాయికి చేరింది. ముడి చమురు అవసరాల్లో 87 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటున్న భారత్‌కు ఈ తగ్గుదల సైద్ధాంతికంగా ఇంధన ధరలను సైతం తగ్గించాలి. కానీ అందుకు భిన్నంగా తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పెంచుతున్నట్లు ప్రకటించింది.అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ తగ్గుదల కనిపిస్తున్నా ఏప్రిల్ 7, 2025 నాటికి ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.94.77, డీజిల్ లీటరుకు రూ.87.67 వద్దే కొనసాగుతుంది. మార్చి నుంచి ఇదే ధరలు అమలవుతున్నాయి. 2024 నుంచి ముడి చమురు ధరలు 20 శాతానికి పైగా పడిపోయినప్పటికీ ఇంధన ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. పైగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 చొప్పున కేంద్రం సోమవారం పెంచుతున్నట్లు తెలిపింది. ప్రపంచ చమురు ధరలలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు, ట్రంప్ సుంకాల మధ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు.క్రూడ్ డిమాండ్ అంచనాలు సవరణఅంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 2024 మధ్య నుంచి తగ్గుముఖం పట్టాయి. అమెరికా, చైనా వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థిక వృద్ధి మందగించడంపై నెలకొన్న ఆందోళనలు డిమాండ్ అంచనాలను దెబ్బతీశాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) ఇటీవల 2024, 2025 సంవత్సరాలకు చమురు డిమాండ్ వృద్ధి అంచనాను రోజుకు 2.11 మిలియన్ బ్యారెల్స్ నుంచి 2.03 మిలియన్లకు సవరించింది. ఇది బలహీనమైన ప్రపంచ వినియోగాన్ని ప్రతిబింబిస్తుంది. అదనంగా యునైటెడ్ స్టేట్స్ వంటి ఒపెక్ యేతర ఉత్పత్తిదారుల నుంచి బలమైన సరఫరా, చైనా వంటి మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరగడం క్రూడ్ ధరలు మరింత తగ్గేలా చేశాయి.పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) ప్రకారం, సెప్టెంబర్ 2024 నాటికి దుబాయ్, ఒమన్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 71 డాలర్లకు పడిపోయింది. రాయిటర్స్ డేటా ప్రకారం, 2025 ప్రారంభంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 76.58 డాలర్ల వద్ద, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) ప్రకారం జనవరి చివరి నాటికి బ్యారెల్ 72.62 డాలర్ల వద్ద స్థిరపడింది. 2024 సెప్టెంబరులో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతల తరువాత హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ముడి చమురు ధరలు 2025 ప్రారంభం నుంచి 14.94% పడిపోయాయి.భారీ పన్నుల వ్యవస్థభారతదేశంలో ఇంధన ధరలు క్రూడాయిల్ క్షీణతకు అనుగుణంగా ఉండకపోవడానికి ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న భారీ పన్నుల వ్యవస్థ అని నిపుణులు చెబుతున్నారు. దేశంలో రిటైల్ ఇంధన ధరలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) నిర్ణయించిన బేస్ ధర, ఎక్సైజ్ సుంకం, విలువ ఆధారిత పన్ను (వ్యాట్), డీలర్ కమిషన్లపై ఇంధన ధరలు ఉంటాయి. ఇంధనం రిటైల్ ధరలో పన్నులే సుమారు 50-60% వాటాను కలిగి ఉంటాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ వినియోగదారులకు పెద్దగా ఫలితం లేకుండా పోతుంది.ఇదీ చదవండి: ‘మైక్రోసాఫ్ట్‌లో డిజిటల్ ఆయుధాల తయారీ’చమురు బాండ్లు2005-2010 మధ్య కాలంలో ముడిచమురు ధరలు అధికంగా ఉన్న సమయంలో ఇంధన ధరలను కట్టడి చేసేందుకు ఓఎంసీలకు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో ప్రభుత్వం చమురు బాండ్లను జారీ చేసింది. అందుకు వెచ్చించిన సుమారు రూ.1.3 లక్షల కోట్లు 2025-26 నాటికి తిరిగి చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం అధిక ఇంధన పన్నులను కొనసాగిస్తోంది. క్రూడాయిల్ బ్యారెల్‌కు 62-64 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నప్పటికీ ఆర్థిక అవసరాలతో ఇంధన ధరలను స్థిరంగా ఉంచుతోంది. -
ఎగుమతిదార్లకు బాసటగా కేంద్రం చర్యలు
అమెరికా టారిఫ్‌ల దెబ్బతో ఆందోళన చెందుతున్న ఎగుమతి సంస్థలకు బాసటగా నిల్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. కొత్త మార్కెట్లను అన్వేషించడంలో వాటికి మరింత తోడ్పాటు అందించనుంది. అలాగే, తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందేలా చూడటం, యూరోపియన్ యూనియన్‌తో పాటు బ్రిటన్, న్యూజిల్యాండ్ తదితర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై చర్చలను వేగవంతం చేయడం తదితర చర్యలు తీసుకుంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.భారత్ నుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఆ్రస్టేలియా, బ్రెజిల్ లాంటి 20 దేశాలతో వరుసగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలందినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎగుమతి సంస్థలకు (ఎంఎస్ఎంఈ) సులభంగా రుణాలు లభించేలా చూడటం, ఇతర దేశాలు అమలు చేసే టారిఫ్యేతర చర్యలను ఎదుర్కొనడంలో సహాయాన్ని అందించడం మొదలైన వాటి కోసం ప్రభుత్వం ప్రత్యేక స్కీములను రూపొందిస్తోంది. 2023–24లో 119.71 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో భారత్‌కు అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచిన అమెరికా, మన దేశంపై 26 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. భారత్ మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 18 శాతంగా ఉంటుంది.ఎల్రక్టానిక్స్ సంస్థల్లో ‘అతి’గా ఆందోళన లేదు..అమెరికా టారిఫ్‌లపై దేశీయ ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగ తయారీ సంస్థల్లో ప్రస్తుతానికైతే ‘అతి’గా ఆందోళనేమీ లేదని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ చెప్పారు. అయితే, మారిపోతున్న పరిస్థితుల మీదే అంతా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. తయారీ కంపెనీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని కృష్ణన్ వివరించారు. ఎల్రక్టానిక్స్ విభాగంలో పోటీదేశాలతో పోలిస్తే తాము కొంత మెరుగైన స్థితిలోనే ఉన్నట్లు దేశీ కంపెనీలు భావిస్తున్నాయి. టారిఫ్‌ల వల్ల అమెరికాకు హార్డ్‌వేర్ ఎగుమతులపై ప్రభావం పడినా, ఆసియాలోని మిగతా తయారీ హబ్‌లతో పోలిస్తే సుంకాల భారం తక్కువే ఉండటం మనకు కొంత సానుకూలాంశమని టెలికం పరికరాల తయారీ సంస్థ జీఎక్స్ గ్రూప్ సీఈవో పరితోష్ ప్రజాపతి తెలిపారు.దిగుమతులపై ఫోకస్..సుంకాల మోతతో ఇతర దేశాల నుంచి భారత్‌లోకి దిగుమతులు వెల్లువెత్తే అవకాశాలను కూడా ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. అమెరికాలో టారిఫ్‌ల కారణంగా అక్కడికి ఎగుమతి చేయాల్సిన ఉత్పత్తులన్నింటినీ చైనా తదితర దేశాలు భారత్‌కు మళ్లించవచ్చని భావిస్తున్నారు. వీటిని సమీక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో వాణిజ్య శాఖ, రెవెన్యూ శాఖ, పారిశ్రామిక ప్రోత్సాహం..అంతర్గత వాణిజ్య విభాగానికి (డీపీఐఐటీ) చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారు. జూన్, జులై నుంచి దిగుమతులు ఒక్కసారిగా పెరగవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఇదీ చదవండి: టాయ్ పరిశ్రమకు ‘టారిఫ్’ల ప్రయోజనం!కన్జ్యూమర్ గూడ్స్, ఎల్రక్టానిక్స్, రసాయనాలు, ఉక్కు మొదలైనవి వెల్లువెత్తవచ్చని భావిస్తున్నారు. దిగుమతులు పెరుగుదల, దేశీ పరిశ్రమ మీద వాటి ప్రభావాలపై తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయా శాఖలు, పరిశ్రమ వర్గాలకు ప్రభుత్వం సూచించింది. భారత్ నుంచి మొత్తం ఎగుమతుల్లో చైనా వాటా 4 శాతమే అయినప్పటికీ దిగుమతుల్లో మాత్రం 15 శాతంగా ఉంటోంది. 2023–24లో చైనాకు భారత్ ఎగుమతులు 16.65 బిలియన్ డాలర్లుగా ఉండగా దిగుమతులు 101.73 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అమెరికాతో మనకు వాణిజ్య మిగులు ఉంటే, చైనాతో మాత్రం ఏకంగా 85 బిలియన్ డాలర్ల లోటు ఉంది. -
‘నా అప్పు 6 వేల కోట్లు.. వసూలు చేసింది14 వేల కోట్లు’
న్యూఢిల్లీ: భారతీయ బ్యాంకులు తన ఆస్తులను అటాచ్ చేయడం ద్వారా తాను కట్టాల్సిన దానికంటే రెట్టింపు మొత్తాన్ని రాబట్టుకున్నాయని పరారీలో ఉన్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ చీఫ్ విజయ్ మాల్యా వ్యాఖ్యానించారు. ఇందుకు 2024–25 ఆర్థిక శాఖ వార్షిక నివేదికలోని గణాంకాలే సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో నేను రూ.6వేల కోట్లు బకాయి పడితే, భారతీయ బ్యాంకులు నా నుంచి రూ.14వేల కోట్లు వసూలు చేశాయి. ఇది నేను చెల్లించాల్సిన మొత్తం కంటే 2 రెట్లు ఎక్కువ’ అని విజయ్ మాల్యా అన్నారు. Finally against a DRT judgement debt of Rs 6203 crores, admitted recovery of Rs 14,131.8 crores which will be evidence in my UK Bankruptcy annulment application. Wonder what Banks will say in an English Court. pic.twitter.com/oRSMhm4nx2— Vijay Mallya (@TheVijayMallya) April 6, 2025ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నుంచి రాబట్టిన మొత్తాన్ని ప్రస్తావిస్తూ, మాల్యా కేసులో రూ. 14,131.8 కోట్లు రికవర్ అయ్యిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ నివేదికలో పేర్కొన్నట్లు మాల్యా వివరించారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశించిన రూ. 6,203 కోట్ల రికవరీకి ఇది రెట్టింపు మొత్తం అని ఆయన చెప్పారు. తనను భారత్‌కు అప్పగించాలంటూ బ్రిటన్ కోర్టులో నడుస్తున్న కేసులో ఇది కీలక సాక్ష్యంగా ఉండబోతోందన్నారు.బ్యాంకులు దీన్ని ఏ విధంగా కోర్టులో సమర్థించుకుంటాయో చూడాలని వ్యాఖ్యానించారు. వివిధ బ్యాంకులకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ. 9,000 కోట్లు బాకీపడిన కేసుకు సంబంధించి 2016 మార్చిలో మాల్యా బ్రిటన్‌కు పారిపోయారు. దీంతో మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా పరిగణిస్తున్నారు. ఆయన్ను స్వదేశం రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
అప్పుల కుప్పలుగా రాష్ట్రాలు
పెరుగుతున్న ఆదాయ వ్యయాన్ని భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు రుణాలే దిక్కవుతున్నాయి. స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) ఆధారంగా దేశంలోని 15 అతిపెద్ద రాష్ట్రాలు 2026 ఆర్థిక సంవత్సరంలో అధిక రుణాలు తీసుకునే అవకాశాలున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ రాయితీలు, స్థిరంగా పన్ను ఆదాయ వృద్ధి, సాధారణ కార్యకలాపాలకు పెరిగిన వ్యయం ఇందుకు కారణమని చెబుతున్నారు. దాంతో రాష్ట్రాలు అప్పులకే పెద్దపీట వేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు. పెరుగుతున్న ఈ అప్పుల కుప్పను నియంత్రించకపోతే వాటి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి ఇది ఆటంకం కలిగిస్తుందని చెబుతున్నారు.రుణ పెరుగుదలకొవిడ్ అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు ఖర్చుల కోసం రుణాలు తీసుకోవడం పెంచాయి. తదనంతరం ఆర్థిక రికవరీ ద్రవ్యలోటును కొంతవరకు కట్టడి చేస్తున్నప్పటికీ, రాష్ట్రాలు మళ్లీ అప్పులవైపే మొగ్గు చూపుతున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరానికి కొన్ని పెద్ద రాష్ట్రాలు మార్కెట్ రుణాలను పెంచాలని యోచిస్తున్నాయి. ఇందులో తమిళనాడు అగ్రస్థానంలో ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. తర్వాత వరుసలో మహారాష్ట్ర, కర్ణాటకలున్నాయి.జీతాలు, పింఛన్లు, సబ్సిడీలు, వడ్డీ చెల్లింపులపై ఖర్చు గణనీయంగా పెరుగుతోంది. దాంతో రుణాలు తప్పని పరిస్థితి నెలకొంది. ఇది అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. ఉన్న అప్పులకుతోడు ఉన్నికలవేళ నగదు బదిలీ, ఉచిత సౌకర్యాలు, సంక్షేమ పథకాలు.. వంటి రాజకీయ రాయితీలు ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి.రుణం-జీఎస్డీపీ నిష్పత్తులుఆర్థిక వృద్ధికి కీలకమైన కొలమానం రుణం-జీఎస్డీపీ నిష్పత్తి. ఇది ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత ప్రభావవంతంగా ఉందో సూచిస్తుంది. ఇది 25 శాతం వరకు ఉంటే ఆరోగ్యకరమైన నిష్పత్తిగా లెక్కిస్తారు. కానీ చాలా రాష్ట్రాలు ఈ పరిమితిని మించి ఉన్నాయి. ఈ నిష్పత్తిలో 52.3 శాతంతో బిహార్ అగ్రస్థానంలో ఉండగా, పంజాబ్ 47.3 శాతం, పశ్చిమ బెంగాల్ 38.9 శాతం, ఆంధ్రప్రదేశ్ 35.1 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సాపేక్షంగా 26.07% నిష్పత్తి ఉన్నప్పటికీ తమిళనాడు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చిన హామీల వల్ల ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుంది.పెరుగుతున్న వడ్డీ వ్యయాలురాష్ట్ర బడ్జెట్లపై పెరుగుతున్న వడ్డీ భారంలో ఈ రుణాల చెల్లింపులు కీలకంగా మారుతున్నాయి. కొన్ని రాష్టాలపై విధిస్తున్న వడ్డీలు వాటి ఆదాయాల్లో కోతలకు దారిస్తున్నాయి. పంజాబ్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు అతి తక్కువ వడ్డీ కవరేజీని కలిగి ఉన్నాయి. ఇది 4% నుంచి 6% మధ్య ఉంది. దీనికి విరుద్ధంగా ఒడిశా అత్యధికంగా 35.7% వడ్డీ కవరేజీని కలిగి ఉంది. బిహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలు 10% నుంచి 12% మధ్య వడ్డీ కలిగి ఉన్నాయి.కష్టంగా క్యాపెక్స్ లక్ష్యాలుఆదాయ వ్యయాలు పెరుగుతున్నకొద్దీ మౌలిక సదుపాయాల కల్పనపై పెట్టుబడులు(క్యాపెక్స్) తగ్గుతున్నాయి. ఇటీవలి కాలంలో అనేక రాష్ట్రాలు బడ్జెట్లో కేటాయింయిన క్యాపెక్స్ లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడుతున్నాయి. ఉదాహరణకు, తమిళనాడు తన 2025 ఆర్థిక సంవత్సరం క్యాపెక్స్ అంచనాను రూ.47,681 కోట్ల నుంచి రూ.46,766 కోట్లకు సవరించింది. మహారాష్ట్ర మినహా చాలా పెద్ద రాష్ట్రాలు క్యాపెక్స్‌లో గణనీయంగా 12% నుంచి 69% వరకు పెంచుతున్నట్లు చూపించాయి. కానీ వాటి అమలు ప్రశ్నార్థకంగా మారుతుంది.నిధుల వినియోగంమూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణాలు ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ వ్యూహానికి అనుగుణంగా క్యాపెక్స్ కేటాయింపులు చేస్తున్నారు. అయినప్పటికీ దీని అమలు సవాలుగా మారింది. రాష్ట్రాలు అవసరమైన సంస్కరణలను అమలు చేయలేకపోవడం, వ్యయ లక్ష్యాలను చేరుకోవడంలో అసమర్థత కారణంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2025 ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి రుణాలకు కేటాయింపులను రూ.1.5 లక్షల కోట్ల నుంచి రూ.1.25 లక్షల కోట్లకు తగ్గించింది. రాష్ట్రాలు ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించుకోలేకపోతే వృద్ధి కుంటుపడుతుంది.ఇదీ చదవండి: వడ్డీ రేట్ల కోతపై ఆశలుపరిష్కారం లేదా..?ఆర్థిక వ్యయాలు పెరిగేకొద్దీ దీర్ఘకాలిక వృద్ధికి కీలకంగా ఉన్న రాష్ట్రాల మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ పెట్టుబడులపై ప్రభావం పడుతుంది. రెవెన్యూ వ్యయాలపై పటిష్ట నియంత్రణ లేకపోతే ఆర్థిక క్రమశిక్షణ మరింత క్షీణించి రాష్ట్రాలు సవాళ్లు ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పార్టీలకు అతీతంగా దీనిపై మేధావులు, ఆర్థిక రంగ నిపుణులు, ఇతరులతో చర్చించి అప్పులు తగ్గేలా మెరుగైన పద్ధతులను సిద్ధం చేసి అమలు చేయాలని సూచిస్తున్నారు. -
వడ్డీ రేట్ల కోతపై ఆశలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన నేడు(7న) ప్రారంభంకానున్న మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) పరపతి సమీక్షా సమావేశాల తుది నిర్ణయాలు బుధవారం(9న) వెలువడనున్నాయి. గత పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 0.25 శాతం తగ్గించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజా సమావేశంలో మరో పావు శాతం కోతకు వీలున్నట్లు కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.కాగా.. 9వ తేదీనే యూఎస్ ఫెడ్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) గత పాలసీ వివరాల మినిట్స్ విడుదలకానున్నాయి. ఫెడ్ ఫండ్స్ రేట్లను 4.25–4.5 శాతంవద్ద యథాతథంగా కొనసాగించేందుకే కట్టుబడింది. 10న మార్చి నెలకు యూఎస్, చైనా కన్జూమర్ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదలకానున్నాయి. ఇక వారాంతాన(11న) దేశీయంగా ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), మార్చి రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. జనవరిలో ఐఐపీ 5 శాతం పుంజుకోగా.. ఫిబ్రవరిలో సీపీఐ 3.62 శాతంగా నమోదైంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తన మూడు రోజుల సమావేశంలో రెపో రేటు 25 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) తగ్గింపును ప్రకటించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సానుకూల స్థూల ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న ప్రపంచ ఆర్థిక సవాళ్ల మధ్య రెపో రేటును ప్రస్తుత 6.25 శాతం నుంచి 6.00 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. దేశీయ వృద్ధికి ఊతమిస్తూనే భారత ఆర్థిక వ్యవస్థను బాహ్య ఒత్తిళ్ల నుంచి కాపాడేందుకు ఈ చర్య వ్యూహాత్మకంగా పని చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇప్పుడు కోత ఎందుకు?దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దేశీయంగా వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్వారా కొలిచే భారత రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. శీతాకాల పంటల రాకతో ఆహార ధరలు తగ్గడం వల్ల 2025 ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 4.3 శాతం నుంచి ఏడు నెలల కనిష్ఠ స్థాయి 3.6 శాతానికి పడిపోయింది. ఇది మోడరేషన్ ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ లక్ష్య పరిధి 2-6% పరిధిలో ఉంచుతుంది. ద్రవ్యోల్బణ నియంత్రణ కంటే ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఎంపీసీకి ఈ గణాంకాలు అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: ష్.. ఈ విషయాలు ఎవరికీ చెప్పకండి!సుంకాల ప్రభావం..అమెరికా ముఖచిత్రం మార్చేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పరస్పర సుంకాలు విధించడం ప్రపంచ వాణిజ్యం మందగమనంపై ఆందోళనలను రేకెత్తిస్తుంది. కీలక ఎగుమతిదారు అయిన భారత్‌కు ఈ సుంకాలు బాహ్య డిమాండ్‌ను తగ్గిస్తాయి. ఇవి ఆర్థిక వృద్ధిపై ఒత్తిడిని పెంచుతాయి. ఈ పతనాన్ని ఎదుర్కోవడానికి, దేశీయ వినియోగం, పెట్టుబడులు బలంగా ఉండేలా చూసేందుకు ఆర్బీఐ రేట్ల కోత ముందస్తు చర్యగా భావిస్తున్నారు. -
చక్కని ఆర్థిక ప్రణాళిక.. అందరికి ఆదర్శం
ట్యాక్స్ కాలంలో ఎన్టీఆర్ ఉమ్మడి కుటుంబం, ఏఎన్నార్ మంచి కుటుంబం ప్రస్తావన ఎందుకొచ్చింది.. అంటే ఒకే గూడు కింద ఉమ్మడిగా ఉంటూ, వ్యాపారం చేస్తూ, పన్ను భారం పడకుండా, చట్టం దృష్టిలో ‘మంచి కుటుంబం’గా పేరు పడ్డ అయ్యర్ కథే.. ట్యాక్స్ ప్లానింగ్‌కి ప్రేరణ.పాల్ఘాట్ నుంచి పావలా పట్టుకుని పారిపోయినప్పుడు పరమేశ్వరన్ అయ్యర్ వయస్సు 10 ఏళ్లు. 1960లో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వేళ అయ్యర్‌కి తన స్వశక్తితో పాటు కృషి కూడా తోడు కావడంతో అదృష్టం కలిసి వచ్చింది. ఇడ్లీ, సాంబార్, దోశలు అమ్ముతూ బాగా సంపాదించాడు. ఎకరం పైగా జాగా కొన్నాడు. పెళ్లి, పిల్లలు, అందరూ ఒకే చోట నివాసం.. ఒకే పొయ్యి.. ఒకే వంట. ముగ్గురు మగపిల్లలు పిల్లలు తండ్రి మాట విని, వారికి చేదోడు వాదోడుగా ఉంటూ అదే వ్యాపారం కొనసాగిస్తున్నారు. అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు అయ్యర్. అప్పు సొప్పు లేకుండా తనకో ఇల్లు, ముగ్గురు పిల్లలకు తలా ఇల్లు కట్టించాడు. నాలుగు ఇళ్లు.. మెయిన్ రోడ్డుకు పక్కనే వ్యాపారానికి అనువుగా మల్గీలు. అందరివీ క్యాంటీన్లే. ఒక్కొక్కరు ఒక్కో రకం వంటకాలతో ఒకరికొకరు పోటీ కాకుండా, సమిష్టి కృషితో, పాతిక మంది పనివాళ్లతో వ్యాపారం సాగిస్తున్నారు.ఎవరి వ్యాపారం వారిదే, ఎవరి బ్యాంక్ అకౌంటు, ఎవరి లెక్కలు వారివే. అందరికీ పెళ్లిళ్లయి, చదువుకుంటున్న పిల్లలున్నారు. కార్లు, స్కూటర్లు ఉన్నాయి. అయ్యర్ భార్య పేరు మీద ఆస్తి ఉంది. ఓనర్ గారికి అయ్యర్, కొడుకులు నెలవారీగా అద్దె ఇస్తుంటారు. ఆవిడదో ప్రత్యేక ఇన్‌కం ట్యాక్స్ అసెస్మెంట్. అందరూ బాగానే సంపాదిస్తున్నారు. జీఎస్టీ పరిధిలో లేరు. నామమాత్రంగా పన్ను కడతారు. పాత పద్ధతి ప్రకారం అవకాశం ఉన్నన్ని రాయితీలు, తగ్గింపులు, మినహాయింపులు పొందేవారు. ఇప్పుడు కొత్త పన్ను విధానం వైపు మొగ్గు చూపుతున్నారు.అనుకోని ఆదా ఏమిటంటే, తిండి మీద ఖర్చులు, కుటుంబ పోషణ అంతా క్యాంటీన్ల ఖర్చుతో వెళ్లిపోతుంది. చుట్టాలు పక్కాలకు మర్యాదలకు లోటు ఉండదు. మిగతా ఖర్చులు మాత్రమే చూసుకోవాల్సి ఉంటోంది. కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 50 లక్షలు దాటుతున్నా పన్నుభారం సున్నా.. లేదా అత్యంత కనిష్ట స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నారు. వాళ్ల ఎకరం జాగా, ఇళ్ల విలువ ప్రస్తుతం వంద కోట్లు దాటుతుంది. స్థిరాస్తి చెక్కు చెదరదు. ఆదాయం నిత్య పంట. పుష్కలంగా ఉంటుంది. ఇలా అయ్యర్ కుటుంబం ఉమ్మడిగా ఉంటూ, పన్ను భారం భారీగా పడకుండా చక్కని ఆర్థిక ప్రణాళికలతో మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తోంది.ట్యాక్సేషన్ నిపుణులుకె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి కె.వి.ఎన్ లావణ్య -
బ్యాంక్ ఖాతాలు వారివే ఎక్కువ: డేటా విడుదల
న్యూఢిల్లీ: దేశీయంగా బ్యాంక్ ఖాతాల్లో మహిళల వాటా 39.2 శాతమని ఒక నివేదికలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలలో అయితే మరింత అధికంగా 42.2 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది. ‘ఉమన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024: సెలెక్టెడ్ ఇండికేటర్స్, డేటా’ పేరుతో గణాంకాలు, పథకాల అమలు శాఖ నివేదిక విడుదల చేసింది.దీని ప్రకారం మహిళల ఖాతాల ద్వారా మొత్తం బ్యాంక్ డిపాజిట్లలో 39.7 శాతం లభిస్తున్నాయి. ఇక కొన్నేళ్లుగా స్టాక్ మార్కెట్లో ప్రజల పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీంతో డీమ్యాట్ ఖాతాల సంఖ్య బలపడుతూ వస్తోంది. 2021 మార్చి 31లో నమోదైన 33.26 మిలియన్ డీమ్యా ట్ ఖాతాలు 2024 నవంబర్ 30కల్లా 143.02 మిలియన్లకు చేరాయి. వెరసి నాలుగు రెట్లుపైగా ఎగశాయి. వీటిలో పురుషుల ఖాతాలు భారీగా 26.59 మిలియన్ల నుంచి 115.31 మిలియన్లకు జంప్‌చేశాయి. అయితే మహిళల ఖాతాలు సైతం 6.67 మిలియన్ల నుంచి 27.71 మిలియన్లకు ఎగశాయి.1952లో 17.32 కోట్లుగా నమోదైన మహిళా ఓటర్ల సంఖ్య 2024 కల్లా 97.8 కోట్లకు జంప్‌చేసింది. కనీసం ఒక మహిళా డైరెక్టర్గల.. డీపీఐఐటీ గుర్తింపు పొందిన స్టార్టప్‌లలోనూ పురోగతి కనిపిస్తోంది. 2017లో ఈ తరహా స్టార్టప్‌లు 1,943 నమోదుకాగా.. 2024కల్లా 17,405కు ఎగశాయి. వెరసి మహిళా ఎంటర్‌ప్రెన్సూర్స్ సంఖ్య బలపడుతోంది. -
ఇక ఒక రాష్ట్రం–ఒక ఆర్ఆర్బీ!
దేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్ఆర్బీ) నిర్వహణ పనితీరును మెరుగుపరిచేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. త్వరలోనే ‘ఒక రాష్ట్రం–ఒక ఆర్ఆర్బీ’ ప్రణాళికను ఆర్థిక మంత్రిత్వ శాఖ అమలు చేయనుంది. ఈ మేరకు విలీన కార్యాచరణ (రోడ్‌మ్యాప్)ను రూపొందిస్తోంది. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 43 ఆర్ఆర్బీల సంఖ్య 28కి పరిమితం కానుంది.విలీనాలకు సంబంధించిన సమస్యలన్నీ దాదాపు కొలిక్కి వచ్చినట్టేనని, నాలుగో విడత త్వరలోనే పూర్తవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ రోడ్‌మ్యాప్ ప్రకారం వివిధ రాష్ట్రల్లో ఒకటి కంటే ఎక్కువగా ఉన్న 15 ఆర్ఆర్బీలు వేరే వాటిలో విలీనమవుతాయి. ఇలా ఆర్ఆర్బీల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ (4), ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ (3 చొప్పున), బీహార్, గుజరాత్, జమ్ము కాశ్మీర్, కర్నాటక, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ (2 చొప్పున) ఉన్నాయి. తెలంగాణ విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాశ్ బ్యాంక్ (ఏపీజీవీబీ)కి చెందిన ఆస్తులు, అప్పులను ఏపీజీవీబీ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మధ్య విభజించేందుకు సంబంధించిన సమస్యలన్నీ కొలిక్కి వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: మార్కెట్లు పతనబాటలో..మూలధనం దన్ను...విలీనానాలకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఆర్ఆర్బీలకు కేంద్రం ఇప్పటికే రూ.5,445 కోట్ల మూల ధనాన్ని సమకూర్చింది. దీంతో 2024 మార్చితో ముగిసిన ఆరి్థక సంవత్సరంలో వాటి క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఆల్‌టైమ్ గరిష్టానికి (14.2 శాతం) చేరింది. 2023–24లో మొత్తం ఆర్ఆర్ఆర్బీల కన్సాలిడేటెడ్ నికర లాభం కూడా అత్యధిక స్థాయిలో రూ.7,571 కోట్లకు ఎగబాకింది. స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 10 కనిష్టా స్థాయిలో 6.1 శాతానికి దిగిరావడం గమనార్హం. 2024 మార్చి నాటికి దేశంలో 26 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 43 ఆర్ఆర్బీలు 22,069 శాఖల నెట్‌వర్క్‌తో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. -
టారిఫ్ టెర్రర్... ఇన్వెస్టర్లకు ఫీవర్!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేల్చిన ‘లిబరేషన్ డే’ టారిఫ్ బాంబ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అల్లకల్లోలం మొదలైంది. ప్రధానంగా భారత్, చైనా వంటి కీలక దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత మందగమనంలోకి జారిపోవచ్చని, దీంతో ప్రపంచ ఎకానమీ గాడి తప్పుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోపక్క, చైనా కూడా 34% ప్రతీకార సుంకాలతో విరుచుకుపడింది. ఇతర దేశాలూ ఇదే బాట పట్టి వాణిజ్య యుద్ధం ముదిరితే, అమెరికాతో పాటు యూరప్ కూడా మాంద్యంలోకి జారే ప్రమాదం ఉంది. దీంతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లతో పాటు కమోడిటీలు (బంగారం, వెండి, కాపర్, క్రూడ్ ఇతరత్రా) కూడా కుప్పకూలుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం మేలని విశ్లేషకులు సూచిస్తున్నారు. భారత్‌ను పదే పదే టారిఫ్ కింగ్‌గా పేర్కొంటూ వస్తున్న ట్రంప్.. కాస్త కనికరించి 27 శాతం ప్రతీకార సుంకాలతో సరిపెడుతున్నట్లు ప్రకటించారు. కనీసం 10 శాతం నుంచి గరిష్టంగా 50 శాతం దాకా టారిఫ్‌లను వడ్డించడంతో ప్రపంచ దేశాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. అమెరికాకు కీలక వాణిజ్య భాగస్వామిగా ఉన్న భారత్ ఎగుమతులపై సుంకాల పోటు కచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అసలే వృద్ధి మందగమనంలో ఉన్న మన జీడీపీకి ఇది మరింత ప్రతికూలాంశంగా చెబుతున్నారు. వృద్ధి రేటుపై కనీసం అర శాతం ప్రభావం ఉండొచ్చనేది (ఈ ఆర్థిక సంవత్సరం 6 శాతానికి పరిమితం కావచ్చు) ఆర్థిక నిపుణుల అభిప్రాయం. మరోపక్క, వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైతే రూపాయి బలహీనపడొచ్చని.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా పడిపోయే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. అయితే, ఇతర వర్ధమాన దేశాలు, ముఖ్యంగా ఆసియాలో మనకు ప్రధాన పోటీదారులైన చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలపై మన కంటే అధిక సుంకాలు విధించడం అనేది మనకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ‘ట్రంప్ లిబరేషన్ డే టారిఫ్‌లపై సంబంధిత దేశాలన్నీ ప్రతీకార సుంకాలతో విరుచుకుపడితే, 2008 ఆర్థిక సంక్షోభం, కోవిడ్ తర్వాత అతిపెద్ద ఆర్థిక కుదుపు తప్పదు. టారిఫ్ ప్రభావిత తీవ్ర ఆటుపోట్లు కొన్నాళ్ల పాటు స్టాక్ మార్కెట్లలో కొనసాగవచ్చు’ అని వెస్టెడ్ ఫైనాన్స్ ఫౌండర్, సీఈఓ విరమ్ షా పేర్కొన్నారు. మార్కెట్లో మరింత కరెక్షన్ తప్పదు... టారిఫ్ వార్ దెబ్బకు అమెరికా, యూరప్, ఆసియా వ్యాప్తంగా సూచీలు లిబరేషన్ డే రోజున 3–6% కుప్పకూలగా.. వారాంతంలో మరో 5–6% క్రాష్ అయ్యాయి. వాల్‌స్ట్రీట్‌లో ఇన్వెస్టర్ల సంపద రెండు రోజుల్లో 4 ట్రిలియన్ డాలర్లకు పైగా తుడిచిపెట్టుకుపోవడం సుంకాల సునామీకి నిదర్శనం! ట్రేడ్ వార్తో ఎగుమతులు మందగిస్తే, వృద్ధి రేటుకు మరింత సెగ తగులుతుందని, స్వల్పకాలికంగా మార్కెట్లో కరెక్షన్ కొనసాగే అవకాశం ఉందని యాక్సిస్ సెక్యూరిటీస్ పేర్కొంది. ‘టారిఫ్‌ల దెబ్బతో ద్రవ్యోల్బణం ఎగబాకే ముప్పు పొంచి ఉంది. దీంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఇకపై సాధ్యపడకపోవచ్చు. అంతేకాకుండా వాణిజ్యపరమైన అడ్డంకులతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారే రిస్క్ పెరుగుతుంది. అంతిమంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కకావికలం అవుతుంది’ అని అభిప్రాయపడింది. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ పోటీపరంగా కాస్త మెరుగైన స్థితిలోనే ఉన్నప్పటికీ, అమెరికాలో మాంద్యం ముప్పు మన మార్కెట్లకు ప్రతికూలాంశమని ఎడెలీ్వజ్ ఎంఎఫ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (ఈక్విటీస్) త్రిదీప్ భట్టాచార్య పేర్కొన్నారు.ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ‘ట్రంప్ టారిఫ్‌లపై ఇతర దేశాల ప్రతీకార సుంకాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనించాలి. ముఖ్యంగా రక్షణాత్మక రంగాలైన ఎఫ్ఎంసీజీ, యుటిలిటీస్ షేర్లు కాస్త మెరుగైన పనితీరు ప్రదర్శించవచ్చు. సైక్లికల్ రంగాల (ఆటో, మెటల్స్) షేర్లకు ప్రతికూలం. టారిఫ్‌లపై కుదిరే వాణిజ్య ఒప్పందాల ఫలితాలే దీర్ఘకాలింగా మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయి. స్వల్పకాలానికి మాత్రం మన మార్కెట్లలో తీవ్ర ఆటుపోట్లు తప్పవు. పెట్టుబడుల విషయాలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని స్టాక్సా్కర్ట్ సీఈఓ ప్రణయ్ అగర్వాల్ సూచించారు. మార్కెట్లో స్వల్పకాలిక సెంటిమెంట్ చాలా బలహీనంగా ఉన్నప్పటికీ.. దీర్ఘకాలికంగా మన ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని ఆనంద్ రాఠీ గ్రూప్ చీఫ్ ఎకనమిస్ట్ సుజన్ హజ్రా చెప్పారు. టారిఫ్‌ల దెబ్బతో తక్షణం మార్కెట్లో తీవ్ర కుదుపులు ఉన్నప్పటికీ.. మధ్య, దీర్ఘకాల దృక్పథంతో భారీగా కరెక్షన్కు గురైనప్పుడల్లా పటిష్ట ఫండమెంటల్స్ ఉన్న నాణ్యమైన స్టాక్స్‌లో క్రమానుగతంగా పొజిషన్లను పెంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు. నిఫ్టీ గతేడాది సెప్టెంబర్‌లో 26,277 పాయిట్ల గరిష్టాన్ని తాకగా.. 2025 మార్చిలో 21,964 పాయిట్లకు (దాదాపు 16.6 శాతం) క్షీణించింది. ఎఫ్‌పీఐల దన్నుతో ఆ తర్వాత 7 శాతం బౌన్స్ అయ్యింది. అయితే, ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటన తర్వాత ప్రపంచ మార్కెట్ల క్రాష్‌తో పాటు మన సూచీలు కూడా మళ్లీ రివర్స్ గేర్ వేశాయి. ఈ వారంలో 2.5 శాతం పడ్డాయి.డెట్ ఫండ్స్‌కు దన్ను... జీడీపీ వృద్ధి మందగమనానికి తోడు ఇప్పుడు టారిఫ్‌ల పిడుగుతో ఎకానమీకి దన్నుగా ఆర్బీఐ సరళతర పాలసీని కొనసాగించే అవకాశం ఉంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా గత పాలసీ సమీక్షలో రెపో రేటును పావు శాతం తగ్గించడం (6.25 శాతానికి) సంగతి తెలిసిందే. దీంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య సరఫరా (లిక్విడిటీ) పెంచేందుకు కూడా పలు చర్యలు ప్రకటించింది. ‘వాణిజ్య యుద్ధాలతో పాటు ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల నుంచి దేశీ ఫైనాన్షియల్ మార్కెట్లకు రక్షణ కల్పించేందుకు ఆర్బీఐ రానున్న రోజుల్లో వడ్డీరేట్లను మరింత తగ్గించడంతో పాటు సానుకూల లిక్విడిటీ చర్యలను చేపట్టవచ్చు. దీనివల్ల వడ్డీ రేట్లు దిగిరావడం వల్ల ఇప్పటికే ట్రేడవుతున్న అధిక కూపన్ (వడ్డీ) రేటు బాండ్ ధరలు పెరుగుతాయి. ఫలితంగా డెట్ మ్యూచువల్ ఫండ్స్ నికర అసెట్ విలువ (ఎన్ఏవీ) ఎగబాకేందుకు దోహదం చేస్తుంది. డెట్ ఫండ్సో్ల పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లకు ఇది సానుకూలాంశమని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
సిబ్బంది సేవలపై జీఎస్టీ తగ్గింపుతో ఆర్థిక వృద్ధి పెంపు
సిబ్బంది సేవలపై జీఎస్టీని తగ్గించడం అధికారిక ఉపాధికి, ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తోందని అభిప్రాయపడుతోంది ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్. మన దేశం తన విస్తారమైన శ్రామికశక్తి సామర్థ్యాన్ని నిజంగా ఉపయోగించుకోవాలంటే, ముఖ్యమైన విధాన సంస్కరణలు చాలా కీలకమైనవి. కాంట్రాక్ట్ సిబ్బంది వంటి మెరిట్ ఆధారిత సేవలపై వస్తువులు సేవల పన్ను (జీఎస్టీ)ని తగ్గించడం అటువంటి ఒక సంస్కరణ అని స్పష్టం చేస్తోంది.కాంట్రాక్ట్ సిబ్బంది, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సెక్యూరిటీ సర్వీసెస్ వంటి లేబర్–ఇంటెన్సివ్ సెక్టార్లు ఉపాధిని సృష్టిలో కీలక పాత్ర పోషిస్తాయి, మిలియన్ల మందికి స్థిరమైన ఉద్యోగాలను అందిస్తూ వ్యాపారాలకు ఉపయుక్తంగా ఉండేలా చూసుకుంటాయి. అయితే, ఈ వీటికి ఒక ముఖ్యమైన అడ్డంకిని ఎదుర్కొంటున్నాయి అదే జీఎస్టీ. సిబ్బంది సేవలపై 18% వస్తు సేవల పన్ను (జిఎస్టీ) సంస్థలు ఉద్యోగులను అధికారికంగా నియమించుకోకుండా ఉండేందుకు కారణమవుతోంది. తద్వారాకార్మిక చట్టాలకి కట్టుబడి ఉండకుండా సామాజిక భద్రతా ప్రయోజనాలు అనధికారిక నియామక పద్ధతులను అవి ఎంచుకోవడానికి దారి తీస్తోంది.ఈ జీఎస్టీ రేటును 5 శాతానికికి తగ్గించడం వలన నియామక ఖర్చులు తగ్గుతాయి.. అంతేకాకుండా ఇది అధికారిక ఉపాధిని కూడా ప్రోత్సహిస్తుంది. చిన్న మధ్య తరహా పరిశ్రమలు(ఎస్‌ఎమ్‌ఇలు) ప్రభావంతంగా పనిచేసేందుకు ఆర్థిక వృద్ధికి దారితీస్తూ మరింత దోహదం చేస్తుంది. ఈ మార్పు ఉద్యోగ కల్పనకు, ఉపాధిని క్రమబద్ధీకరించడానికి కార్మిక చట్టాలను నిజాయితీగా పాటించడానికి శక్తివంతమైన ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. వ్యాపారాలకు తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది, మరింత నిర్మాణాత్మకమైన జవాబుదారీతనం గల లేబర్ మార్కెట్‌ను ప్రోత్సహిస్తుంది.భారత స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా అభిప్రాయం ప్రకారం,. కాంట్రాక్టు సిబ్బంది సేవలపై జీఎస్టీ రేటును తగ్గించడం అనే సంస్కరణ ద్వారా అనధికారిక రంగంలోని కార్మికులు సామాజిక భద్రత, న్యాయమైన వేతనాలు మెరుగైన పని పరిస్థితుల వంటి ప్రయోజనాలు పొందుతారు. ఈ సంస్కరణ భారతదేశంలో విస్తృత దృష్టితో స్థిరమైన సమగ్ర ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తుంది. ఆర్థిక వృద్ధి కార్మికుల హక్కులతో సమతుల్యం అవుతుంది. -
ఆర్బీఐ గవర్నర్ సంతకంతో కొత్త నోట్లు
ముంబై: ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం చేసిన మహాత్మాగాంధీ సిరీస్‌తో నూతన రూ.10, రూ.500 నోట్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని ఆర్బీఐ స్వయంగా ప్రకటించింది. రూ.10, రూ.500 నోట్ల డిజైన్ గత సిరీస్ నోట్ల మాదిరే ఉంటుందని స్పష్టం చేసింది. గతంలో ఆర్బీఐ జారీ చేసిన రూ.10 నోట్లు అన్నీ చెల్లుతాయని పేర్కొంది. అలాగే, మహాత్మాగాంధీ చిత్రంలో గతంలో జారీ చేసిన రూ.500 నోట్ల చెల్లింపు కొనసాగుతుందని వెల్లడించింది. గవర్నర్ మల్హోత్రా సంతకం చేసిన కొత్త రూ.100, రూ.200 నోట్లను విడుదల చేయనున్నట్టు ఆర్బీఐ గత నెలలో ప్రకటించడం గమనార్హం. ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంతదాస్ స్థానంలో మల్హోత్రా 2024 డిసెంబర్లో బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. -
చర్చనీయాంశంగా సుంకాల హేతుబద్ధత
న్యూఢిల్లీ: వివిధ దేశాలపై అమెరికా వడ్డించిన భారీ టారిఫ్‌ల వెనుక హేతుబద్ధత ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు ఏ ప్రాతిపదికన ఈ టారిఫ్‌లను నిర్ణయించారనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. మిగతా దేశాలు తమపై ఎంత టారిఫ్‌లు విధిస్తున్నాయో అదే స్థాయిలో తామూ సుంకాలు విధించామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నప్పటికీ వాస్తవానికి లెక్కలు వేరేగా ఉన్నాయి. మిగతా దేశాలతో వాణిజ్య లోటును భర్తీ చేసుకునే విధంగా టారిఫ్‌లను నిర్ణయించినట్లుగా పరిశీలకులు చెబుతున్నారు. సాధారణంగా పైకి కనిపించే టారిఫ్‌లే కాకుండా తమ ఉత్పత్తులకు నియంత్రణ సంస్థలపరమైన అడ్డంకులు, సాంకేతిక అవరోధాలు, కరెన్సీ హెచ్చుతగ్గులు తదితర టారిఫ్యేతర అంశాలు కూడా వాణిజ్య లోటుకు కారణమవుతున్నాయని అగ్రరాజ్యం భావిస్తోంది. కాబట్టి వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత రేటును నిర్ణయించింది. ఉదాహరణకు భారత్‌తో అమెరికాకు 46 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉందంటే.. దాన్ని సున్నా స్థాయికి తీసుకొచ్చేలా సుంకాలను నిర్ణయించినట్లు పరిశీలకులు పేర్కొన్నారు. అంటే ప్రస్తుతం భారత్‌పై విధించిన 26% రేటు ద్వారా మన దేశంతో ఉన్న వాణిజ్య లోటును పూర్తిగా భర్తీ చేసుకోవచ్చని అమెరికా భావిస్తోంది. ఈ సుంకాల వల్ల భారతీయ ఉత్పత్తుల ధరలు పెరిగి, అమెరికన్లు మన దగ్గర నుంచి దిగుమతులు తగ్గించుకుంటారని, తద్వారా వాణిజ్య లోటు తగ్గుతుందని అమెరికా అభిప్రాయం. లోపభూయిష్టమైన విధానం.. అయితే, ఇది తప్పుల తడక విధానమని విమర్శలు వస్తున్నాయి. వాణిజ్య లోటుకు లేదా మిగులుకు టారిఫ్‌లు, టారిఫ్యేతర అడ్డంకులు, కరెన్సీ హెచ్చుతగ్గుల్లాంటివి కారణమే అయినప్పటికీ.. కేవలం సుంకాల విధింపు ద్వారా దీన్ని పరిష్కరించుకోవడం సాధ్యపడదని విశ్లేషకులు చెబుతున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య లోటుకు కారణాలు అనేకం ఉంటాయని తెలిపారు. ఉదాహరణకు బియ్యం ప్రధాన ఆహారంగా ఉండే దేశానికి .. గోధుమలను భారీగా పండించి, ఎగుమతి చేసే మరో దేశం నుంచి ఎక్కువగా దిగుమతులు ఉండకపోవచ్చు. కానీ తాము దేశీయంగా ఉత్పత్తి చేసుకోలేని పరికరాలు, కంప్యూటర్లను ఎగుమతి చేసే ఇంకో దేశంతో వాణిజ్య లోటు ఉండొచ్చు. అలాగని ఈ వాణిజ్య లోటేమీ అవాంఛనీయమైన లేదా అనుచితమైనదేమీ కాదు. ప్రస్తుతం అమెరికా పాటిస్తున్న విధానాన్ని బట్టి చూస్తే ఏప్రిల్ 2 నాటి టారిఫ్‌లే అంతిమం కాదని భావించాలి. రేప్పొద్దున్న డాలరు మారకం విలువ పెరిగి, అమెరికాలో మన ఉత్పత్తుల ధరలు పెరగకపోయి, అక్కడి వారు దిగుమతులు చేసుకోవడం కొనసాగిస్తే.. వాణిజ్య లోటు యథాప్రకారం కొనసాగుతుంది. అప్పుడు మళ్లీ వాణిజ్య లోటును భర్తీ చేసుకోవడానికి మళ్లీ టారిఫ్‌లు పెంచాల్సి వస్తుంది. ఆ విధంగా సుంకాల వడ్డింపు నిరంతర ప్రక్రియగా కొనసాగే అవకాశం ఉంది. -
టారిఫ్‌లతో ద్రవ్యోల్బణం ముప్పు..
ఆర్లింగ్టన్ (అమెరికా): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా టారిఫ్‌లను విధించడం దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తుందని ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పావెల్ హెచ్చరించారు. దీనితో ఆర్థిక వృద్ధి కూడా నెమ్మదించే ముప్పు ఉందన్నారు. ఎకానమీ, ద్రవ్యోల్బణంపై టారిఫ్‌ల ప్రభావాలు ఊహించిన దానికంటే గణనీయంగా ఎక్కువగానే ఉండబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు. భారీ దిగుమతి సుంకాలు తాత్కాలికంగా ధరల పెరుగుదలకు దారి తీయొచ్చని, దాని ప్రభావాలు దీర్ఘకాలికంగా కొనసాగే అవకాశం ఉందని పావెల్ చెప్పారు. ఒక దఫా ధరల పెరుగుదల అనేది దీర్ఘకాలికంగా ద్రవ్యోల్బణ సమస్యగా మారకుండా చూడటం తన బాధ్యతని వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణంపై ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో కీలక వడ్డీ రేట్లు యథాతథంగా 4.3 శాతం స్థాయిలోనే కొనసాగించవచ్చని భావిస్తున్నారు. ఫెడ్ రిజర్వ్ ఈ ఏడాది వడ్డీ రేట్లను అయిదు విడతల్లో తగ్గిస్తుందని ఆశిస్తున్న ఇన్వెస్టర్లను ఇది నిరాశపర్చే అవకాశం ఉంది. పావెల్ వ్యాఖ్యలు బట్టి చూస్తే ఆయన ద్రవ్యోల్బణంపైనే దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. -
పోటీ దేశాలపై టారిఫ్‌లు.. మనకు మరిన్ని అవకాశాలు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌లతో భారత ఎగుమతులకు సవాళ్లు ఉన్నప్పటికీ, పోటీ దేశాలపై మరింత అధిక స్థాయిలో సుంకాలు విధించడం వల్ల, మన వ్యాపారాన్ని పెంచుకునేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఎలక్ట్రానిక్స్, ఐటీ హార్డ్‌వేర్ సంస్థల సమాఖ్య ఎంఏఐటీ తెలిపింది. భారత్‌తో పోలిస్తే చైనా, వియత్నాంలపై భారీగా సుంకాలు విధించడమనేది మన ఎగుమతులకు సానుకూలాంశమని వివరించింది. ‘భౌగోళిక, రాజకీయ రిస్కులను అధిగమించేందుకు గ్లోబల్ కంపెనీలు తమ తయారీ కార్యకలాపాలను భారత్‌కు మళ్లించే అవకాశం ఉంది. దీంతో మన ఎగుమతులు మరింత పెరగవచ్చు. పోటీ దేశాలతో వ్యాపారం భారీ వ్యయాలతో కూడుకున్నది కావడంతో అంతర్జాతీయంగా కొనుగోలుదారులు భారత ఎగుమతులవైపు మొగ్గు చూపవచ్చు. గ్లోబల్ బ్రాండ్లు తమ తయారీ కేంద్రాలను ఇతర దేశాలకు మళ్లించడంపై దృష్టి పెడతాయి కనుక సరఫరా వ్యవస్థకు సంబంధించి భారత్‌కు మరిన్ని అవకాశాలు లభించవచ్చు‘ అని ఎంఏఐటీ పేర్కొంది. భారత్‌పై 27 శాతం సుంకాలు ప్రకటించిన అమెరికా, మనకు పోటీ దేశాలైన చైనాపై 54 శాతం, వియత్నాంపై 46 శాతం, థాయ్‌లాండ్‌పై 36 శాతం విధించింది. దీనితో ఎల్రక్టానిక్స్, టెలికాం పరికరాలు, ఐటీ హార్డ్‌వేర్ విషయంలో ఆయా దేశాలు మనతో పోటీపడే పరిస్థితి తగ్గుతుందని, మన ఎగుమతులకు డిమాండ్ మెరుగుపడవచ్చని ఎంఏఐటీ తెలిపింది. అమెరికాకు భారత్ సుమారు 7 బిలియన్ డాలర్ల స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేస్తోంది. టారిఫ్‌ల వల్ల వీటిపై ప్రభావం పడనుంది. స్థిరమైన పాలసీలు కావాలి.. పోటీ దేశాలపై టారిఫ్‌లను మనకు అనుకూలంగా మల్చుకోవాలంటే వ్యాపారాల నిర్వహణ సులభతరం చేయడానికి మరింత ప్రాధాన్యతనివ్వాల్సి ఉంటుందని ఎంఏఐటీ తెలిపింది. అలాగే పాలసీలపరంగా స్థిరత్వం ఉండేలా చూడాలని, లాజిస్టిక్స్.. ఇన్ఫ్రాపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఇవన్నీ చేయగలిగితే రాబోయే రోజుల్లో ప్రపంచానికి తయారీ, ఎగుమతుల హబ్‌గా భారత్ ఎదగవచ్చని వివరించింది. 2021–22 నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో భారత్‌కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిల్చింది. మొత్తం భారత్ ఎగుమతుల్లో అమెరికా వాటా సుమారు 18 శాతం, దిగుమతుల్లో 6.22 శాతం, ద్వైపాక్షిక వాణిజ్యంలో 10.73 శాతంగా ఉంది. అమెరికాతో మనకు వాణిజ్య మిగులు 2019–20లో 17.26 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2023–24లో ఇది 35.32 బిలియన్ డాలర్లకు చేరింది. ఎలక్ట్రానిక్స్ విషయానికొస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ ఎగుమతులు 10 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 3.17 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
టారిఫ్‌ల భారంపై బేరసారాలు
న్యూఢిల్లీ: భారీ టారిఫ్‌ల విధింపుతో ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై ప్రభావం పడనున్న నేపథ్యంలో అమెరికా సంస్థలతో భారతీయ ఎగుమతిదారులు సంప్రదింపులు ప్రారంభించారు. ఈ అసాధారణ పరిస్థితిని ఎదుర్కొనే మార్గాలపై వారితో చర్చలు జరుపుతున్నట్లు ఎగుమతిదారుల సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. దేశీయంగా ఉక్కు రేట్లు ఇప్పటికే భారీగా ఉన్న తరుణంలో అధిక సుంకాల భారాన్ని ఇంజినీరింగ్ ఉత్పత్తుల పరిశ్రమ భరించే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, టారిఫ్‌లతో అమెరికాలో మన లెదర్ ఉత్పత్తులకు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని ఫుట్‌వేర్ ఎగుమతి సంస్థ ఫరీదా గ్రూప్ చైర్మన్ రఫీక్ అహ్మద్ చెప్పారు. అమెరికాలోని లెదర్ ఉత్పత్తుల దిగుమతిదారులు, టారిఫ్లపరమైన నష్టాల్లో కొంత భరించాలని తమను కోరుతున్నారని తెలిపారు. కొన్నాళ్ల పాటు ఉత్పత్తిని నిలిపివేయాలని కూడా వారు అడిగినట్లు వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే దీర్ఘకాలంలో మన ఎగుమతులకు అమెరికాలో మార్కెట్ గణనీయంగా కుదించుకుపోవచ్చని పేర్కొన్నారు. ఇక, అమెరికా అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా ఉన్నందున అక్కడి నుంచి కొన్ని దిగుమతులపై సుంకాలను తగ్గించడం మనకు కూడా శ్రేయస్కరమని ఎఫ్ఐఈవో వైస్ ప్రెసిడెంట్ రవికాంత్ కపూర్ తెలిపారు. కార్పెట్లు, హోమ్ ఫరి్న షింగ్ ఉత్పత్తులపై అధిక టారిఫ్‌ల వల్ల పరిశ్రమలో గణనీయంగా ఉద్యోగాలు పోయే ముప్పు ఉందని వివరించారు. బియ్యంపై ప్రభావం తాత్కాలికమే.. దీర్ఘకాలికంగా చూస్తే బియ్యం ఎగుమతులపై సుంకాల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తాత్కాలికంగా ధరలు పెరిగినా, రెండు–మూడు నెలల్లో అంతా సర్దుకోగలదని ఇండియన్ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ఫెడరేషన్ (ఐఆర్ఈఎఫ్) జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ గర్గ్ తెలిపారు. వ్యూహాత్మక ప్రణాళికలతో మన పరిశ్రమలను కాపాడుకోవడంతో పాటు అమెరికాలో కార్యకలాపాలను కూడా విస్తరించవచ్చని ఆయన చెప్పారు. టారిఫ్‌లు పెంచినప్పటికీ మిగతా పోటీ దేశాలతో పోలిస్తే ఇప్పటికీ భారత్ వైపే మొగ్గు ఉంటుందని వివరించారు. మరోవైపు, ప్రస్తుత కాంట్రాక్టులను సమీక్షించుకోవాల్సి రావచ్చని, అమెరికా దిగుమతిదారులు మరింత ఎక్కువ కాలం క్రెడిట్ ఇవ్వాలని కోరవచ్చని వ్యాపారవర్గాలు చెప్పాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ 52.4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి చేయగా అందులో 2.34 లక్షల టన్నులను అమెరికాకు పంపింది. 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో 42 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతుల్లో అమెరికా వాటా 2.04 లక్షల టన్నులుగా ఉంది. బియ్యం ఎగుమతులకు పశి్చమాసియా ప్రధాన గమ్యస్థానంగా ఉంటోంది.టారిఫ్‌ల ఎఫెక్ట్ స్వల్పమే నితి ఆయోగ్ సభ్యులు విర్మాణీ న్యూఢిల్లీ: యూఎస్ విధించిన ప్రతీకార టారిఫ్‌ల ప్రభావం భారత్‌పై స్వల్పమేనని నితి ఆయోగ్ సభ్యులు అరవింద్ విర్మాణీ పేర్కొన్నారు. దేశీ ఆర్థిక వ్యవస్థ విదేశీ వాణిజ్యంపై అతితక్కువగా ఆధారపడుతుండటమే దీనికి కారణమని తెలియజేశారు. మధ్యకాలానికి టారిఫ్‌లతో తలెత్తనున్న ప్రతికూలతలు ప్రతిపాదిత యూఎస్ భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(బీటీఏ) తొలి దశ అమలుతో తొలగిపోనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇక దీర్ఘకాలంలో చూస్తే తుది బీటీఏ కారణంగా రానున్న 5–10ఏళ్లలో లబ్ది పొందేందుకు వీలున్నట్లు తెలియజేశారు. అమెరికా వస్తువులపై అధిక సుంకాలు విధిస్తున్నట్లు పేర్కొంటూ భారత్‌పై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా 26 శాతం ప్రతీకార టారిఫ్‌లకు తెరతీసిన విషయం విదితమే. అయితే ఆయా దేశాల వాణిజ్య లోటుతోపాటు.. దిగుమతులను పరిగణించి చేసిన మదింపు ద్వారా టారిఫ్‌లు అమలుకానున్నట్లు వివరించారు. -
దోస రైతులపై సుంకాల పిడుగు
భారత ఎగుమతులపై ఇటీవల అమెరికా విధించిన 26 శాతం సుంకాలు రైతుల పాలిట శాపంగా మారనున్నాయి. ఊరగాయ దోసకాయలు(జెర్కిన్స్) భారత్ నుంచి అమెరికాకు పెద్దమొత్తంలో ఎగుమతి అవుతున్నాయి. భారత్ దిగుమతులపై యూఎస్ విధించిన టారిఫ్‌లతో ఈ పంట రైతులకు నష్టం వాటిల్లనుందని నిపుణులు చెబుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 256.58 మిలియన్ డాలర్ల(రూ.2,124 కోట్లు) విలువైన 2.44 లక్షల టన్నుల జెర్కిన్స్ను అమెరికాకు ఎగుమతి చేసింది. 2019-2020 ఏడాదిలో ఇది 1.89 లక్షల టన్నులతో రూ.173 మిలియన్ డాలర్లు(రూ.1,400 కోట్లు)గా ఉండేది.ఇప్పటికే అమెరికాలో 9 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్న భారత పారిశ్రామిక రంగానికి ఈ సుంకాల పెంపు పెద్ద దెబ్బే. పెరిగిన టారిఫ్‌ల వల్ల మెక్సికో, కెనడా, టర్కీ వంటి దేశాలతో పోలిస్తే భారత జెర్కిన్స్కు పోటీ తక్కువగా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. జెర్కిన్స్కు సంబంధించి యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందం (యూఎస్ఎంసీఏ) కింద మెక్సికో, కెనడా సుంకం మినహాయింపుల నుంచి ప్రయోజనం పొందుతాయని ఇండియన్ జెర్కిన్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ పూవయ్య తెలిపారు. టర్కీపై భారత్ కంటే సుమారు 10 శాతం తక్కువ సుంకాన్ని విధించినట్లు చెప్పారు.99 శాతం ఎగుమతులే..భారతదేశంలో జెర్కిన్ ఉత్పత్తి దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అధికంగా ఉంది. వీటిపై అమెరికా లెవీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ విధానాలపై ఆధారపడిన వేలాది మంది చిన్న, సన్నకారు రైతులు దీనివల్ల ప్రభావితం చెందే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే జెర్కిన్స్లో 99% పైగా ఎగుమతి అవుతున్నవే కావడం గమనార్హం.ఇదీ చదవండి: రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చు?అమెరికా మార్కెట్లో ఇండియా ఉత్పత్తులు పోటీతత్వాన్ని కోల్పోవడంపై పూవయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాలను మునుపటి స్థాయికి పునరుద్ధరించడానికి ద్వైపాక్షిక చర్చలు జరపాలన్నారు. ఇరు దేశాలకు అనువైన విధానాలు అమలయ్యేలా పరిష్కారాలు ఆలోచించాలన్నారు. -
ప్రతీకార సుంకాల ప్రభావంపై అధ్యయనం
అమెరికా ప్రతీకార సుంకాలతో భారత్‌పై ప్రడే ప్రభావాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖతోపాటు, ఆర్థిక శాఖ ప్రకటించాయి. దేశీ పరిశ్రమ, ఎగుమతిదారులు సహా భాగస్వాములు అందరితో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు, వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్టు వాణిజ్య శాఖ తెలిపింది. అమెరికా కొత్త వాణిజ్య విధానం ఫలితంగా ఏర్పడే కొత్త అవకాశాలపైనా అధ్యయనం చేస్తున్నట్టు ప్రకటించింది.పరస్పర ప్రయోజనకరమైన, బహుళ రంగాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) త్వరగా అంగీకారానికి వచ్చేందుకు భారత్–అమెరికా వాణిజ్య బృందాలు చర్చిస్తున్నట్టు తెలిపింది. అమెరికాతో సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని భారత్ గౌరవిస్తుందని.. రెండు దేశాల ప్రయోజనాల విషయంలో అమెరికాతో కలసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్టు వాణిజ్య శాఖ పేర్కొంది. ఢిల్లీలో ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. ‘ట్రంప్‌నకు అమెరికాయే ప్రథమం. మోదీకి భారతే ప్రథమం. అమెరికా మోపిన ప్రతీకార సుంకాల ప్రభావాన్ని అంచనా వేస్తున్నాం’ అని చెప్పారు. భారత్ నుంచి వచ్చే ఫార్మా, సెమీకండక్టర్, ఇంధన ఉత్పత్తుల దిగుమతులను టారిఫ్‌ల నుంచి అమెరికా మినహాయించగా, మిగిలిన దిగుమతులపై 10 శాతం బేసిక్ డ్యూటీకి అదనంగా 26 శాతం సుంకాలు మోపింది.ఇదీ చదవండి: రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చు?భారత్‌పై సుంకాల మోతఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. అనుకున్నట్లుగా విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వియత్నాం ఉత్పత్తులపై 46 శాతం, చైనాపై 34 శాతం, యూరోపియన్ యూనియన్(ఈయూ)పై 20 శాతం, స్విట్జర్లాండ్‌పై 31, తైవాన్‌పై 32, జపాన్‌పై 24, యూకేపై 10 శాతం సుంకాలను ఖరారు చేశారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఏప్రిల్ 2వ తేదీని ‘విముక్తి దినం’గా ట్రంప్ ప్రకటించారు. -
మారిన రూల్స్: ఆ టికెట్‌తో ట్రైన్ జర్నీ కుదరదు!
భారతదేశంలో సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారిలో చాలామంది రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. తమ ప్రయాణాలకు అనుగుణంగా దాదాపు అందరూ ముందుగానే టికెట్స్ రిజర్వేషన్ చేసుకుంటారు. కొన్నిసార్లు అవి కన్ఫర్మ్ అవ్వొచ్చు, కొన్ని సార్లు వెయిటింగ్ లిస్టులో ఉండొచ్చు. ప్రయాణికుల సౌకర్యార్థం.. ఇండియన్ రైల్వే వెయిటింగ్ లిస్ట్ టికెట్ల విషయంలో కొన్ని నియమాలను ప్రవేశపెట్టింది. వీటిని అతిక్రమిస్తే.. జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.ఇండియన్ రైల్వే కొత్త నియమాల ప్రకారం.. రిజర్వేషన్ చేసుకుని టికెట్ కన్ఫర్మ్ కానీ ప్రయాణికులు, రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లలో ఎక్కకూడదు. ఈ రూల్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే కాకుండా.. కౌంటర్లో కొనుగోలు చేసిన టికెట్లకు వర్తిస్తుంది. ఈ నియమం మార్చి 1 నుంచి అమలులోకి వచ్చింది.ఇదీ చదవండి: రూ.1740 తగ్గిన బంగారం ధర: నేటి ధరలు చూశారా?వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్స్ లేదా కన్ఫర్మ్ కానీ టికెట్ కలిగిన ప్రయాణికుడు స్లీపర్ కోచ్ ఎక్కితే రూ. 250 జరిమానా, ఏసీ కోచ్ ఎక్కితే రూ. 400 జరిమానా (బోర్డింగ్ స్టేషన్ నుంచి తరువాత స్టేషన్‌కు) చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లలో రద్దీని తగ్గించడానికి ఇండియన్ రైల్వే కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.రైల్వే స్టేషన్ కౌంటర్ నుంచి కొనుగోలు చేసిన వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణించవచ్చు. ఇండియన్ రైల్వే ఇప్పుడు టికెట్ బుకింగ్స్ కోసం 'ఏఐ'ను ఉపయోగిస్తోంది. దీని సాయంతోనే ప్రయాణికులకు టికెట్స్ కూడా కేటాయిస్తోంది. -
రూ.44 కోట్ల విలువైన గోల్డ్ కార్డు ప్రదర్శించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఐదు మిలియన్ డాలర్ల(సుమారు రూ.44 కోట్లు) విలువైన కొత్త గోల్డ్ కార్డును ప్రదర్శించారు. ఇది మరో రెండు వారాల్లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దాని మొదటి కొనుగోలుదారు ఎవరని విలేకరుల సమావేశంలో రిపోర్టర్ అడిగిన సమాధానానికి బదులిస్తూ ట్రంప్ తానేనన్నారు. ఐదు మిలియన్ డాలర్లు వెచ్చిస్తే గోల్డెన్ కార్డు మీది కూడా అవ్వొచ్చని చెప్పారు.సంపన్న విదేశీయులకు గోల్డ్ కార్డులను అందించడానికి ట్రంప్ ఈ కొత్త ప్రణాళికను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. ఇది వారికి యూఎస్ రెసిడెన్సీ, పౌరసత్వానికి అవకాశం కల్పిస్తుంది. దాంతోపాటు అమెరికా ఖజానాకు ట్రిలియన్ల ఆదాయాన్ని సృష్టించగలదని, ఇది దేశ రుణాన్ని తగ్గించడానికి దోహదం చేస్తుందని గతంలో తెలిపారు. కొత్త గోల్డెన్ కార్డు కొంత వరకు గ్రీన్ కార్డు మాదిరి వెసులుబాటు అందిస్తున్నా ప్రధానంగా సంపన్నులపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది.గోల్డెన్ కార్డులుఅమెరికాలో పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన వీసా(ఈబీ-5 వీసా) పాలసీని ట్రంప్ మార్చాలని యోచించారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు ‘గోల్డ్ కార్డ్’ వీసాను మంజూరు చేశారు. ఈ వీసాను ఐదు మిలియన్ డాలర్లను వెచ్చించి పొందాల్సి ఉంటుంది. ఈ వీసాను పొందే వ్యక్తులు అమెరికాలో ధనవంతులై ప్రభుత్వానికి పన్నులు చెల్లించే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేశారు. ఇది గ్రీన్ కార్డు తరహా సౌలభ్యాలను ఇస్తుందని, ఇది అమెరికన్ పౌరసత్వానికి ఒక మార్గం కాబోతుందన్నారు. ఈ కార్డును కొనుగోలు చేయడం ద్వారా సంపన్నులు తన దేశంలోకి వస్తారని ఆయన అన్నారు.ఈ తరహా ‘గోల్డెన్ వీసా’లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు జారీ చేస్తున్నాయి. యూకే, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సంపన్నులకు ఈ వీసాలు ఇస్తున్నాయి. తాజాగా ట్రంప్ కూడా ఇదే తరహా విధానాన్ని అమలు చేస్తున్నారు.ఈబీ-5 వీసాలుయూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెబ్సైట్ ప్రకారం, ఈబీ-5 వీసా విధానాన్ని.. ఉద్యోగ కల్పన-విదేశీ పెట్టుబడిదారుల మూలధన పెట్టుబడుల ద్వారా యూఎస్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి 1990లో కాంగ్రెస్ ఆమోదించింది. 2021 సెప్టెంబరు నుంచి 2022 సెప్టెంబరు 30వ తేదీ వరకు దాదాపు 8వేల మంది ఈ వీసాలను పొందారు.ఈబీ-5 ద్వారా పెట్టుబడిదారులు, వారి జీవిత భాగస్వాములు.. 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అవివాహిత పిల్లలు నాన్-టార్గెటెడ్ ఎంప్లాయిమెంట్ ఏరియా (టీఈఏ) ప్రాజెక్టులో 1.8 మిలియన్ డాలర్లు లేదా టీఈఏ ప్రాజెక్టులో కనీసం 8,00,000 డాలర్లు పెట్టుబడి పెడితే శాశ్వత నివాసానికి అర్హులు. అయితే, ఈ వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని అధికారులు గుర్తించారు.ఇదీ చదవండి: వజ్రాల వ్యాపారం గతి తప్పుతుందా..?రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత జన్మతః పౌరసత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారులకు, తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చిన వారికి పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించబోదని ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పటి నుంచి ఈ జన్మతః పౌరసత్వ విధానం కొనసాగుతోంది. -
కొనసాగుతున్న సూక్ష్మ రుణ రంగం సంక్షోభం
ముంబై: సూక్ష్మ రుణ రంగంలో సంక్షోభం కొనసాగుతోంది. డిసెంబర్ త్రైమాసికంలో రుణ వితరణ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు 42 శాతం మేర తగ్గిపోయినట్టు క్రిఫ్ హైమార్క్ నివేదిక తెలిపింది. మొత్తం 1.19 కోట్ల రుణ దరఖాస్తులకు ఆమోదం లభించినట్టు.. వీటి ద్వారా రూ.63,400 కోట్ల రుణాలు జారీ చేసినట్టు తెలిపింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రుణ వితరణ రూ.97,400 కోట్లుగా ఉంది. పేదలు, తక్కువ ఆదాయ వర్గాలు సూక్ష్మ రుణ ఖాతాదారులుగా ఉండడం గమనార్హం. 31–180 రోజుల వరకు చెల్లింపుల్లేని రుణాలు (మొండి బాకీలు) మొత్తం రుణాల్లో 6.4 శాతానికి పెరిగాయి. 2023 డిసెంబర్ చివరికి ఇవి 2 శాతంగానే ఉన్నాయి. ఈ ప్రకారం సూక్ష్మ రుణ రంగంలో తీవ్ర ఒత్తిళ్లు నెలకొన్నట్టు తెలుస్తోంది. సూక్ష్మ రుణ సంస్థల నిర్వహణలోని మొత్తం రుణ ఆస్తులు 2023 డిసెంబర్‌తో పోల్చి చూస్తే 4 శాతం మేర, 2024 సెపె్టంబర్ త్రైమాసికంతో పోల్చి చూస్తే 5.4 శాతం క్షీణించి రూ.3.91 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఒక్కో వ్యక్తికి గరిష్టంగా కొన్ని సంస్థల పరిధిలోనే రుణాల మంజూరు పరిమితులు ప్రభావం చూపించినట్టు ఈ నివేదిక తెలిపింది. యాక్టివ్ రుణాలు (లావాదేవీలు కలిగిన) డిసెంబర్ చివరికి 14.6 కోట్లకు తగ్గాయి. ఏడాది క్రితం ఇవి 15.7 కోట్లుగా ఉన్నాయి. అత్యధికంగా కేరళలో 15.8 శాతం, రాజస్థాన్‌లో 11.6 శాతం, ఒడిశాలో 9 శాతం, తమిళనాడులో 8.3 శాతం చొప్పున సూక్ష్మ రుణ వితరణ తగ్గింది. యూపీలో మాత్రం 1.2 శాతం వృద్ధి నమోదైంది. -
ఆర్థికానికి కుంభమేళా బూస్ట్
ముంబై: ప్రయాగ్‌రాజ్ వేదికగా నెల రోజులకు పైగా జరిగిన మహా కుంభమేళా కార్యక్రమం దేశ ఆర్థిక రంగానికి మంచి బూస్ట్ (బలం) ఇచ్చినట్టయిందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నివేదిక పేర్కొంది. రూ.2.8 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలు మహా కుంభమేళా సందర్భంగా జరిగినట్టు తెలిపింది. ప్రత్యక్ష, పరోక్ష వినియోగం రూపంలో ఈ మేరకు ఆర్థిక రంగానికి ఉత్పాదకత సమకూరినట్టు వివరించింది. డేటా ఆధారంగా ఈ అంచనాలకు వచ్చినట్టు తెలిపింది. మేళాకు హాజరైన వారు రవాణా, వసతి, ఆహారం, పర్యాటక సేవలు, స్థానిక కొనుగోళ్ల రూపంలో రూ.90,000 కోట్లు ప్రత్యక్షంగా ఆర్థిక వ్యవస్థకు సమకూరినట్టు నివేదికలో పేర్కొంది. పరోక్ష రూపంలో ఎయిర్‌లైన్స్, హోటల్స్ తదితర రంగాలకు రూ.80,000 కోట్ల వ్యాపారం లభించినట్టు వివరించింది. మహాకుంభ మేళా సందర్భంగా చోటుచేసుకున్న వ్యాపార లావాదేవీలు ఆర్థిక వ్యవస్థపై ఎంతో సానుకూల ప్రభావం చూపిస్తాయని తెలిపింది. ఈ సందర్భంగా ఆదాయం సంపాదించుకున్న వర్గాలు ఇళ్లు, విద్య, ఆరోగ్యం, రోజువారీ అవసరాల కోసం చేసే ఖర్చులతో ఆర్థిక వ్యవస్థకు రూ.1.1 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించింది. మొత్తం రూ.2.8 లక్షల కోట్ల కార్యకలాపాల్లో రూ.2.3 లక్షల కోట్లు వినియోగ వ్యయంగాను, మిగిలిన రూ.50,000 కోట్లు మౌలిక సదుపాయాలపై చేసిన వ్యయాల రూపంలోను ఉన్నట్టు పేర్కొంది. మహా కుంభమేళా సందర్భంగా రూ.2 లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు చోటుచేసుకుని ఉండొచ్చని ఇప్పటికే పలు అంచనాలు వ్యక్తం కావడం గమనార్హం. రవాణా కోసమే రూ.37వేల కోట్లు మొత్తం వినియోగ వ్యయంలో రవాణా కోసం చేసింది సగం మేర ఉంటుందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నివేదిక తెలిపింది. రూ.37,000 కోట్లు రవాణా కోసం వ్యయం చేయగా, ఇందులో రూ.17,700 కోట్లు రైల్వేకు సమకూరినట్టు అంచనా వేసింది. హెలీకాప్టర్ జాయ్ రైడ్స్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్, అమ్యూజ్మెంట్పార్క్ ప్రవేశాలు, యోగ తదితర వాటి కోసమే భక్తులు రూ.10,000 కోట్ల వరకు వ్యయం చేసినట్టు వివరించింది. 2 లక్షల మంది రిటైల్ వర్తకులు కుంభమేళా సందర్భంగా రూ.7,000 కోట్ల వ్యాపారం నిర్వహించినట్టు తెలిపింది. ఆహార సేవలకు రూ.6,500 కోట్లు సమకూరినట్టు పేర్కొంది. టీ స్టాళ్ల యజమానులు ఒక్కొక్కరు రోజుకు రూ. 30,000 సంపాదించుకున్నారని వెల్లడించింది. -
టారిఫ్‌ల పెంపు అమెరికా సెల్ఫ్‌గోల్
న్యూఢిల్లీ: అమెరికా 60 దేశాలపై ప్రతీకార సుంకాలు మోపడం అన్నది తనకు తాను నష్టం చేసుకోవడమేనని (సెల్ఫ్ గోల్) ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. వీటి కారణంగా భారత్‌పై స్వల్ప ప్రభావమే ఉంటుందన్నారు. ‘‘స్వల్పకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడనుంది. ఫుట్‌బాల్ ఆటగాళ్లు చెప్పినట్టు ఇదొక సెల్ఫ్ గోల్ (తన చర్యతో ప్రత్యర్థి టీమ్‌కు పాయింట్ వచ్చేలా చేసేవాడు). భారత ఎగుమతులపై అమెరికా ప్రత్యక్ష టారిఫ్‌లు ప్రభావం చూపిస్తే అది యూఎస్‌లో ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దాంతో డిమాండ్ తగ్గుతుంది. అప్పుడు భారత వృద్ధిపైనా ప్రభావం పడుతుంది. అయితే ఇతర దేశాలపైనా అమెరికా టారిఫ్‌లు మోపింది. కనుక ఆయా దేశాల ఉత్పత్తిదారులతో భారత్ పోటీపడుతుంది. కేవలం భారత్‌కు మాత్రమే విధించే టారిఫ్‌లతో పోల్చి చూస్తే ప్రస్తుత నిర్ణయం కారణంగా పడే ప్రభావం తక్కువే’’అని రఘురామ్ రాజన్ వివరించారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో రాజన్ ప్రస్తుతం ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమెరికా ఉత్పత్తిని పెంచాలన్నది ట్రంప్ దీర్ఘకాల ఉద్దేశ్యమని, దీని ఫలితం ఏదైనా దీర్ఘకాలంలోనే కనిపిస్తుందన్నారు. దేశీ వినియోగంతో పోల్చితే ఎగుమతులు తక్కువగానే ఉన్నందున.. అమెరికా ప్రతి సుంకాలు భారత్‌లో ప్రతిద్రవ్యోల్బణాన్ని కలిగించొచ్చన్నారు. అమెరికా మార్కెట్‌కు దారులు మూసుకుపోవడంతో భారత మార్కెట్‌కు ఎగుమతులకు చైనా ప్రయతి్నంచొచ్చని రాజన్ అంచనా వేశారు. ప్రపంచం మరింత రక్షణాత్మకంగా మారుతుండడంతో వాణిజ్యం విషయంలో తెలివిగా వ్యవహరించాలని సూచించారు. చైనాతో మరింత తటస్థ సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. సార్క్, పొరుగు దేశాలతోనూ బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. -
అభివృద్ధి చెందిన దేశంగా భారత్
న్యూఢిల్లీ: స్టార్టప్ ఎకోసిస్టమ్ ద్వారా సంస్కరణ, ఆచరణ, పరివర్తనకు భారత్ సంసిద్ధంగా ఉన్నట్లు కేంద్ర సహాయమంత్రి జితిన్ ప్రసాద పేర్కొన్నారు. 2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా లేదా వికసిత్ భారత్‌గా ఆవిర్భవించడంలో సామాన్యుడు సైతం కీలక పాత్ర పోషించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రజలు సుస్థిర, పటిష్ట ప్రభుత్వానికి ఓటు వేయడంతో దేశం ధృడంగా ఉన్నట్లు స్టార్టప్ మహాకుంభ్ సందర్భంగా వాణిజ్యం, పరిశ్రమలు, ఎల్రక్టానిక్స్, ఐటీ పరిశ్రమల సహాయ మంత్రి ప్రసాద వ్యాఖ్యానించారు. నూతన ఆవిష్కరణల స్టార్టప్ కమ్యూనిటీ, కొత్త ఆలోచనలతో ప్రధాని మోడీ లక్ష్యాలైన సంస్కరణ, ఆచరణ, పరివర్తనా భారత్‌కు మద్దతుగా నిలుస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. సామర్థ్యం, నైపుణ్యాలు గల భారత్ సవాళ్లకు సిద్ధమని ప్రపంచానికి చాటాలని సూచించారు. 7 ట్రిలియన్ డాలర్లకు భారత్ 2030కల్లా భారత్ 7 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే వీలున్నట్లు స్టార్టప్ మహాకుంభ్ సందర్భంగా ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేష్ నంబియార్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ రంగం జీడీపీలో ట్రిలియన్ డాలర్లను సమకూర్చడం ద్వారా ఇందుకు కీలక పాత్ర పోషించనున్నట్లు పేర్కొన్నారు. ఆవిష్కరణలతో దేశ, విదేశీ సమస్యల పరిష్కారంలో టెక్నాలజీ రంగం ప్రాధాన్యత వహించనున్నట్లు తెలియజేశారు. దేశ భవిష్యత్ మార్పులలో టెక్నాలజీదే ప్రధాన పాత్రగా నిలవనున్నట్లు వ్యాఖ్యానించారు. డీప్ టెక్ ద్వారా హెల్త్‌కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ తదితర రంగాల పరివర్తనలో ఐటీ నాయకత్వం వహించనున్నట్లు అంచనా వేశారు. 2047కల్లా వికసిత్ భారత్‌గా ఆవిర్భవించే ప్రణాళికల్లో ఆర్థిక వృద్ధితోపాటు.. సాంకేతిక ఆవిష్కరణలు సైతం కీలక పాత్ర పోషించనున్నట్లు వివరించారు.గ్రోసరీ డెలివరీలు, ఐస్‌క్రీమ్ తయారీకాదు!స్టార్టప్‌లు హైటెక్పై దృష్టి పెట్టాలి వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలుదేశీ స్టార్టప్ కమ్యూనిటీ గ్రోసరీ డెలివరీలు, ఐస్‌క్రీమ్, చిప్స్ తయారీ నుంచి దృష్టి మరల్చాలని వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. సెమీకండక్టర్, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఏఐ తదితర హైటెక్ రంగాలపై దృష్టి పెట్టాలని స్టార్టప్ మహాకుంభ్ సందర్భంగా సూచించారు. నిజానికి మరింతమంది దేశీ ఇన్వెస్టర్లు స్టార్టప్ ఎకోసిస్టమ్‌లోకి ప్రవేశించవలసిన అవసరం ఉన్నట్లు పేర్కొన్నారు. ‘డెలివరీ బాయ్‌లతో మనం సంతోషంగా ఉన్నామా? ఇదేనా భారత్ భవిష్యత్’ అంటూ ప్రశ్నించారు. ఇది స్టార్టప్కాదని, ఇది ఎంట్రప్రెన్యూర్షిప్ అని వ్యాఖ్యానించారు. మరోపక్క రోబోటిక్స్, మెషీన్ లెర్నింగ్, 3డీ మ్యాన్యుఫాక్చరింగ్, తదుపరి తరం ఫ్యాక్టరీలు తయారవుతున్నట్లు తెలియజేశారు. కొత్త స్టార్టప్‌లు దేశ భవిష్యత్‌వైపు దృష్టి పెట్టాలని సూచించారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ, టెక్నలాజికల్ వృద్ధికి స్టార్టప్‌లు దోహదపడుతున్నట్లు తెలియజేశారు. -
కొన్నింటికి మోదం.. కొన్నింటికి ఖేదం
న్యూఢిల్లీ/ముంబై: భారత ఎగుమతులపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు కొన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం చూపించనుండగా.. అదే సమయంలో కొన్ని రంగాలకు ఎగుమతి అవకాశాలను విస్తృతం చేయనుంది. ముఖ్యంగా భారత ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లు, ఇంధన ఉత్పత్తులు, అమెరికాలో లభించని కొన్ని రకాల అరుదైన ఖనిజాలకు ట్రంప్ సర్కారు టారిఫ్‌ల నుంచి మినహాయింపు కల్పించింది. మిగిలిన అన్ని ఉత్పత్తులపైనా 27 శాతం అదనపు సుంకాన్ని మోపింది. దీంతో ఆటోమొబైల్ వాహనాలు, వాటి విడిభాగాలు, వైద్య పరికరాలు, రత్నాభరణాల ఎగుమతులపై ఎక్కువ ప్రభావం పడుతుందన్న అంచనాలు నెలకొన్నాయి.రత్నాభరణాల ఎగుమతులకు ఎదురుదెబ్బ: జీజేఈపీసీ అమెరికా విధించిన 27 శాతం ప్రతీకార సుంకాలు భారత జెమ్స్ అండ్ జ్యుయలరీ (రత్నాలు, ఆభరణాలు) ఎగుమతులకు పెద్ద ఎదురుదెబ్బగా జెమ్స్ అండ్ జ్యుయలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) పేర్కొంది. అమెరికాకు భారత్ నుంచి ఏటా 10 బిలియన్ డాలర్ల రత్నాభరణాల ఎగుమతులు జరుగుతుండగా, వీటికి సవాళ్లు ఎదురుకానున్నట్టు పేర్కొంది. ‘‘భారత్–అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా పురోగతికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. టారిఫ్‌లను అధిగమించేందుకు ఇది కీలకం’’అని జీజేఈపీసీ పేర్కొంది. భారత్ నుంచి అమెరికా ఏటా 11.58 బిలియన్ డాలర్ల మేర జెమ్స్, జ్యుయలరీని దిగుమతి చేసుకుంటుంటే.. అదే సమయంలో భారత్‌కు అమెరికా 5.31 బిలియన్ డాలర్ల రత్నాభరణాలను ఎగుమతి చేస్తోంది. వైద్య పరికరాలకు ప్రతికూలం.. ప్రతీకార టారిఫ్‌లతో మెడికల్ డివైజ్‌ల ఎగుమతులపై ప్రభావం పడనుందని, పరిశ్రమ వృద్ధికి సవాలుగా మారుతుందని ఇండియన్ మెడికల్ డివైజ్ ఇండస్ట్రీ అసోసియేషన్ (ఏఐఎంఈడీ) ఫోరం కోఆర్డినేటర్ రాజీవ్ నాథ్ తెలిపారు. 2023–24లో భారత్ నుంచి అమెరికాకు 714.38 మిలియన్ డా లర్ల విలువైన పరికరాలు ఎగుమతయ్యాయి.ఫార్మాకు ఊరట చౌకగా ఔషధాలు అందిస్తున్న భారత ఫార్మాకి ప్రతీకార టారిఫ్‌ల నుంచి ట్రంప్ సర్కార్ మినహాయింపునిచ్చింది. అమెరికాకు భారత ఫార్మా ఎగుమతులు 9 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. 2022లో అక్కడి ప్రతి పది ప్రి్రస్కిప్షన్లలో నాలుగు ప్రిస్క్రిప్షన్లకు సంబంధించిన ఔషధాలు మన కంపెనీలు సరఫరా చేసినవే.జీడీపీ వృద్ధికి నష్టం ట్రంప్ ప్రతీకార సుంకాలతో భారత జీడీపీ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అర శాతం తగ్గిపోయి 6%కి పరిమితం కావొచ్చని ఈవై చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీవాస్తవ తెలిపారు. అదనపు సుంకాలు విధించడం వల్ల భారత జీడీపీపై గరిష్టంగా 35–40 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం పడుతుందని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇండియా హెడ్ అనుభూతి సహాయ్ అభిప్రాయపడ్డారు. టెక్స్టైల్స్ ఎగుమతులకు సానుకూలం అమెరికా సుంకాల మోత భారత టెక్స్టైల్స్ ఎగుమతులకు సానుకూలమేనని పరిశ్రమ అభిప్రాయపడుతోంది. అమెరికాకు టెక్స్‌టైల్స్‌ను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్న పోటీ దేశాలు చైనాపై 34%, వియత్నాంపై 46%, బంగ్లాదేశ్‌పై 37% సుంకాల విధింపు భారత్ కంటే అధికంగా ఉండడాన్ని ప్రస్తావించింది. ‘మా వద్ద మిగిలి ఉన్న ఖాళీ సామర్థ్యం గురించి ఇప్పటికే అమెరికా కస్టమర్ల నుంచి విచారణలు మొదలయ్యాయి’అని రేమండ్ గ్రూప్ సీఎఫ్‌వో అమిత్ అగర్వాల్ తెలిపారు. భారత్ నుంచి అమెరికా ఏటా 36 బిలియన్ డాలర్ల (రూ.3 లక్షల కోట్లు) టెక్స్‌టైల్స్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఐటీ సేవలపై పరోక్ష ప్రభావం ఎగుమతి ఆధారిత దేశీ ఐటీ సేవల రంగంపై టారిఫ్‌ల ప్రభావం ప్రత్యక్షంగా పడకపోయినా, తదనంతర పరిమాణాల వల్ల పరోక్ష ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో మందగమనం వస్తే తయారీ, లాజిస్టిక్స్, రిటైల్ తదితర రంగాల్లో డిమాండ్ పడిపోవచ్చని ఆందోళన నెలకొంది. దీంతో ఆ రంగాల్లోని సంస్థలకు సరీ్వసులు అందించే భారత ఐటీ కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకావొచ్చని విశ్లేషకులు చెప్పారు. 2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఐటీ సేవల కంపెనీలు ఆర్జించిన 193 బిలియన్ డాలర్ల ఆదాయాల్లో అమెరికా వాటా 57 శాతంగా నమోదైంది.వాహనాలపై ప్రభావం కొంతే.. ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం వాహన రంగంపై పెద్దగా ఉండకపోవచ్చని ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ తెలిపింది. మార్చి 26 నాటి ఆదేశాల ప్రకారం ఇప్పటికే 25 శాతం సుంకాలు అమలవుతుండడాన్ని ప్రస్తావించింది. అమెరికా మార్కెట్లో చెప్పుకోతగ్గ విక్రయాలు కలిగిన టాటా మోటర్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్, రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థలకు మాత్రం.. ఎగుమతుల వృద్ధి నెమ్మదించే అవకాశం ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ నుంచి ఆటో విడిభాగాల ఎగుమతులు 6.79 బిలియన్ డాలర్లుగా ఉండగా, అక్కడినుంచి దిగుమతులు 1.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
ప్రపంచానికి ట్రంప్ టారిఫ్ షాక్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ప్రకటించిన టారిఫ్‌ల యుద్ధం .. అంతర్జాతీయంగా వాణిజ్యం, సరఫరా వ్యవస్థల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేయనుంది. ఇకపై అమెరికా భవిష్యత్ వాణిజ్య విధానాలన్నీ, చైనా ఆర్థిక ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడం, దేశీయంగా పరిశ్రమలను పటిష్టపర్చుకోవడం, సరఫరా వ్యవస్థలను మెరుగుపర్చుకోవడం లాంటి అంశాలపైనే ఆధారపడి ఉంటాయని అంచనాలు నెలకొన్నాయి. రాబోయే రోజుల్లో ఒకవేళ కొన్ని రంగాల విషయంలో టారిఫ్‌లను సడలించినప్పటికీ కీలక పరిశ్రమలపై మాత్రం సుంకాల మోత యథాప్రకారం కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ టారిఫ్‌లతో ఇప్పటికే ప్రపంచ ఎకానమీలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాబోయే రోజుల్లోనూ దేశాలు, పరిశ్రమలు, అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రపంచంపై టారిఫ్‌ల ప్రభావాలు రకరకాలుగా ఉండబోతున్నాయి. ట్రంప్ హయాంలో చైనాపై విధించిన టారిఫ్‌లు వాణిజ్య యుద్ధానికి దారి తీశాయి. అంతర్జాతీయంగా వాణిజ్యానికి భారీగా అవరోధాలు ఏర్పడ్డాయి. సుంకాల భారాన్ని తప్పించుకునేందుకు చాలా మటుకు కంపెనీలు చైనా నుంచి తయారీ కార్యకలాపాలను వేరే దేశాలకు మళ్లించాయి. దీంతో భారత్, వియత్నాం, మెక్సికోలాంటివి ప్రత్యామ్నాయ తయారీ హబ్‌లుగా మారాయి. సరఫరా వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ .. టారిఫ్‌ల ధాటితో ప్రపంచ దేశాలు .. అమెరికా, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, ఉత్పత్తులు, సేవల సరఫరా కోసం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టే ధోరణి మరింత వేగవంతమైంది. ఫలితంగా ఆగ్నేయాసియా, ఉత్తర అమెరికా లాంటి ప్రాంతాల్లో పెట్టుబడులు మరింత పెరుగుతున్నాయి. ఈ మార్పులకు అలవాటుపడే వరకు కంపెనీలు కాస్త వ్యయాల భారాన్ని మోయక తప్పని పరిస్థితి ఉంటోంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు.. సుంకాల వల్ల సాధారణంగా దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల రేటు పెరుగుతుంది. దీనితో ద్రవ్యోల్బణమూ పెరుగుతుంది. కంపెనీలు సుంకాల భారాన్ని కొంత తాము భరించి, కొంత బదలాయించినా ఆ ప్రభావం వ్యాపారాల మీద, వినియోగదారుల మీద పడుతుంది. ప్రతీకార టారిఫ్‌లు .. అమెరికా టారిఫ్‌ల బారిన పడ్డ యూరోపియన్ యూనియన్, చైనా వంటి దేశాలు.. ప్రతీకార సుంకాలకు శ్రీకారం చుట్టాయి. అమెరికా ఎగుమతులపై ఇప్పటికే దీని ప్రభావం కనిపించడం మొదలైంది. ముఖ్యంగా వ్యవసాయం, తయారీ, టెక్నాలజీలాంటి రంగాలపై ఇది ఎక్కువగా ఉంటోంది. పెట్టుబడి ధోరణుల్లో మార్పులు.. సుంకాల భారం ఉండని ప్రాంతాలకు వ్యాపార సంస్థలు తమ పెట్టుబడులు మళ్లిస్తున్నాయి. చైనాలాంటి దేశాలు ఎగుమతులకు కొత్త మార్కెట్లను అన్వేíÙస్తున్నాయి. ప్రాంతీయంగా వాణిజ్య బంధాలను బలపర్చుకుంటున్నాయి. గ్లోబల్ వృద్ధిపై ప్రభావం.. టారిఫ్లపరమైన అనిశ్చితి అనేది ప్రపంచ ఆర్థిక వృద్ధి నెమ్మదించడానికి కారణమవుతోంది. వాణిజ్య ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగడం వల్ల పెట్టుబడులతో పాటు వ్యాపార విశ్వాసం తగ్గిపోయి, ప్రపంచ జీడీపీ వృద్ధి మరింత మందగించవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి, (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తున్నాయి.భవిష్యత్తులో అమెరికా పాలసీ ఎలా మారొచ్చంటే..చైనాపై కఠిన వైఖరి కొనసాగొచ్చు.. భవిష్యత్తులో అమెరికాలో ప్రభుత్వం మారినా కూడా చైనాపై టారిఫ్‌లను పూర్తిగా వెనక్కి తీసుకోకపోవచ్చు. మేధోహక్కులు, జాతీ య భద్రత, వాణిజ్య అసమానతల్లాంటి అంశాలపై ఆందోళన వల్ల ఇరు దేశాల సంబంధాల్లో టారిఫ్‌లు ఇకపైనా కీలకాస్త్రంగా కొనసాగే అవకాశం ఉంది. మిత్రదేశాలకు మరింత చేరువ .. ముఖ్యమైన ఉత్పత్తుల కోసం ప్రత్యర్థి దేశాలపై ఆధారపడటం కాకుండా అమెరికా తన మిత్ర దేశాలతో ఆర్థిక సంబంధాలను మరింతగా పటిష్టపర్చుకోవడంపై దృష్టి పెట్టొచ్చు. యూరప్, భారత్, దక్షిణ కొరియాలాంటి దేశాలపై టారిఫ్‌లు తగ్గించడం, కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి పరిణామాలకు అవకాశం ఉంది. హరిత పరిశ్రమలపై సుంకాలు.. దేశీయంగా పరిశ్రమలకు మద్దతునిచ్చేందుకు, చైనా ప్రభుత్వ దన్ను ఉన్న కంపెనీలతో పోటీపడేందుకు స్వచ్ఛ ఇంధనం, సెమీకండక్టర్లు, ఇతరత్రా పర్యావరణహిత రంగాలపై అమెరికా కొత్తగా టారిఫ్‌లు విధించవచ్చు. ద్వైపాక్షిక, ప్రాంతీయ ఒప్పందాలు అన్ని దేశాలతో విస్తృతస్థాయి వాణిజ్య ఒప్పందాలకు బదులుగా అమెరికా.. ఏవో కొన్ని దేశాలతోను, ప్రాంతీయంగాను వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంపై మొగ్గుచూపొచ్చు. ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలు ఈ జాబితాలో ఉండొచ్చు. ఈయూపై మరిన్ని టారిఫ్‌లు.. ఎలక్ట్రిక్ వాహనాల్లాంటి వాటి మీద సబ్సిడీలపై వివాదాల కారణంగా యూరోపియన్ యూనియన్‌లోని మిత్రదేశాలపైనా కొత్త టారిఫ్‌లు పడొచ్చు. దీంతో అంతర్జాతీయంగా వాణిజ్య సంబంధాలు మరింత సంక్లిష్టంగా మారొచ్చు.భారత్‌పై ప్రభావం స్వల్పమే...కనీసం 10 శాతం సుంకాలకు అదనంగా 27 శాతం విధించడంతో.. టారిఫ్‌ల పరంగా భారత్ మధ్యస్థ స్థితిలో ఉంది. నికరంగా చూస్తే అమెరికా మార్కెట్‌కు సంబంధించి భారత ఎగుమతుల పోటీతత్వంపై తక్కువ ప్రభావమే పడనున్నట్టు తెలుస్తోంది. ఎగుమతుల సామర్థ్యాన్ని, విలువ జోడింపును పెంచేందుకు, టారిఫ్‌ల ప్రభావాన్ని అధిగమించేందుకు పరిశ్రమ సమిష్టి కృషి చేయాల్సి ఉంటుంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ద్వారా అమెరికాతో సహకారాన్ని ఇతోధికం చేసుకోవచ్చు. – సంజయ్ నాయర్, అసోచామ్ ప్రెసిడెంట్ జీడీపీపై 0.1 శాతం ఎఫెక్ట్ భారత పరిశ్రమలకు ఉన్న బలమైన పోటీతత్వం అమెరికా టారిఫ్‌ల ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది. స్వల్పకాలంలో జీడీపీపై 0.1 శాతం ప్రభావం పడొచ్చు. మధ్యకాలంలో విధానాలు పూర్తిగా అమల్లోకి వచ్చే నాటికి ఈ లోటును అధిగమించగలం’’ – హేమంత్ జైన్, పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ ఎగుమతులకు సవాళ్లు... టారిఫ్‌ల పెరుగుదలతో భారత ఎగుమతుల రంగం సవాళ్లను ఎదుర్కోవాల్సి రావొచ్చు. అమెరికాకు ఎగుమతుల ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్న టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమోటివ్ విడిభాగాలు స్వల్పకాలంలో డిమాండ్ క్షీణతను ఎదుర్కోవచ్చు. ఇది ఉత్పత్తి, ఉపాధిపై ప్రభావం చూపిస్తుంది’’ – బజాజ్ బ్రోకింగ్ రీసెర్చ్ పోటీతత్వం బలపడుతుంది... అమెరికా విధించిన 27% టారి ఫ్లు భారత ఎగుమతులకు అవరోధాలే అయినప్పటికీ తయారీ లో బలంగా ఉన్న ఇతర ఆసియా దేశాలతో పోలి్చతే మనపై టారిఫ్‌లు తక్కువగా ఉండడం వల్ల భారత్ ఎగుమతుల పోటీతత్వం నిలబడుతుంది.– పరితోష్ ప్రజాపతి, జీఎక్స్ గ్రూప్ సీఈవో ద్వైపాక్షిక ఒప్పందమే మేలు.. స్వల్పకాలంలో అమెరికాకు భారత్ నుంచి 10 బిలియన్ డాలర్ల రత్నాభరణాల ఎగుమతులకు సవాళ్లు ఎదురుకానున్నాయి. భారత్–అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా పురోగతికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి -
వడ్డీ రేట్లను సవరించిన ప్రముఖ బ్యాంక్
న్యూఢిల్లీ: రెపో ఆధారిత రుణాల రేట్లను 0.10 శాతం మేర పెంచుతున్నట్టు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. రెపో రేటును ఆర్బీఐ ఇటీవలే పావు శాతం తగ్గించినప్పటికీ ప్రభుత్వరంగ ఇండియన్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్), ట్రెజరీ బిల్లుల ఆధారిత రుణ రేటు (టీబీఎల్ఆర్), బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్ఆర్), రెపో లింక్డ్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (ఆర్బీఎల్ఆర్)పై బ్యాంక్ అస్సెట్ లయబులిటీ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలను ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది.ఇదీ చదవండి: పీపీఎఫ్ నామినీ మార్పునకు ఛార్జీలు లేవు: నిర్మలా సీతారామన్రెపో లింక్డ్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (రెపో ఆధారితం/ఆర్బీఎల్ఆర్)ను 0.10 శాతం పెంచడంతో 8.95 శాతం నుంచి 9.05 శాతానికి చేరింది. 6 నెలల నుంచి మూడేళ్లలో కాలం తీరిపోయే రుణాలకు అమలు చేసే టీబీఎల్ఆర్ రేటును 0.05 శాతం తగ్గించడంతో 6.5 శాతానికి దిగొచ్చింది. బేస్ రేటును సైతం 0.05 శాతం తగ్గించగా, 9.80 శాతానికి చేరింది. సవరించిన రేట్లు ఏప్రిల్ 3 నుంచి అమల్లోకి వస్తాయని ఇండియన్ బ్యాంక్ వెల్లడించింది. -
భారత్‌కు స్టీల్ దిగుమతుల ముప్పు
అమెరికా దిగుమతి సుంకాలతో అంతర్జాతీయ వాణిజ్యం మార్పులకు లోనుకానుందని సెయిల్ ఛైర్మన్ అమరేందు ప్రకాశ్ పేర్కొన్నారు. యూఎస్‌లో కీలకమైన స్టీల్ ఉత్పత్తుల తయారీ రాత్రికి రాత్రి సాధ్యపడదన్నారు. సుంకాల నేపథ్యంలో భారత్‌కు చౌక స్టీల్ దిగుమతుల ముప్పు ఎదురుకావొచ్చని చెప్పారు. అన్ని స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లను యూఎస్ ఇప్పటికే అమలు చేస్తుండగా, ఈ నెల 2 నుంచి అన్ని రకాల దిగుమతులపైనా ప్రతీకార సుంకాల విధింపును ప్రకటించడం గమనార్హం.‘సంప్రదాయంగా స్టీల్ ఆసియా దేశాల నుంచి యూఎస్, యూరప్‌కు ఎగుమతి అవుతుంటుంది. కొంత స్టీల్ యూరప్ నుంచి యూఎస్‌కు వెళుతుంటుంది. ప్రతీకార సుంకాలు అమల్లోకి వస్తే ఆయా ఎగుమతులు లాభసాటి కావు. దాంతో యూరప్‌కు చైనా, దక్షిణ కొరియా, జపాన్ ఎగుమతి చేసే స్టీల్ ప్రపంచ దేశాలను ముంచెత్తుతుంది. ఇది భారత్‌కు కూడా రావొచ్చు’ అని సెయిల్ ఛైర్మన్ తన అభిప్రాయాన్ని తెలిపారు. అమెరికాకు భారత్ స్టీల్ ఎగుమతులు పెద్దగా లేకపోవడంతో టారిఫ్‌ల ప్రభావం మనపై తక్కువే ఉంటుందన్నారు.ఇదీ చదవండి: భారత్‌లోకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు‘అమెరికాలో కీలకమైన స్టీల్ ఉత్పత్తుల తయారీ రాత్రికి రాత్రి సాధ్యపడదు. దీంతో తాము ఉత్పత్తి చేయలేని వాటి దిగుమతులను అమెరికా కొనసాగిస్తుంది. అక్కడ తయారీ యూనిట్ల ఏర్పాటుకు కొంత సమయం తీసుకుంటుంది’ అని వివరించారు. దేశీ స్టీల్ పరిశ్రమను చౌక దిగుమతుల నుంచి కాపాడేందుకు సుంకాల విధింపు అవసరమని అభిప్రాయపడ్డారు. స్టీల్ ఉత్పత్తుల దిగుమతులపై 12 శాతం సేఫ్‌గార్డ్ డ్యూటీని వాణిజ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ గత నెలలో సిఫారసు చేయడం గమనార్హం. దీనిపై ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
అమెరికాపై ప్రతిచర్యలు తప్పవు: చైనా
ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలను ప్రకటించిన నేపథ్యంలో చైనా స్పందించింది. యూఎస్ తన సుంకాల విధానాలను వెంటనే రద్దు చేయాలని కోరింది. దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు ప్రతిచర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.కొన్నేళ్లుగా ఇరుదేశాలతో వాణిజ్య చర్చల్లో కుదిరిన ప్రయోజనాలను, అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా చాలా కాలంగా ఎంతో లాభం పొందిందనే వాస్తవాన్ని అమెరికా విస్మరించిందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సరఫరా గొలుసులను దెబ్బతీసే వాణిజ్య యుద్ధానికి దిగుతున్న నేపథ్యంలో చైనా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పింది. తన హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు ప్రతిచర్యలు తప్పవని హెచ్చరించింది.ఇదీ చదవండి: ప్రతీకార సుంకాలపై భారత ఫార్మాకు ఊరట!ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్‌పై చైనా విధించిన 20% సుంకాల కంటే అదనంగా చైనాపై 34% సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ బుధవారం ప్రకటించారు. దాంతో మొత్తం సుంకాలు 54%కు పెరిగినట్లయింది. అమెరికా ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ ప్రచారం చేసినట్టుగానే చైనాపై 60% సుంకాలు విధింపునకు సమీపంలోకి చేరింది. చైనా, హాంకాంగ్ నుంచి వచ్చే తక్కువ విలువ కలిగిన ‘డ్యూటీ ఫ్రీ(సుంకాలు మినహాయింపు)’ వస్తువులను అమెరికాలోకి అనుమతించే వాణిజ్య విధానాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. -
ప్రతీకార సుంకాలపై భారత ఫార్మాకు ఊరట!
అమెరికా తాజాగా విధించిన ప్రతీకార సుంకాల నుంచి భారత ఫార్మా పరిశ్రమకు మినహాయింపు ఇస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మొత్తం యూఎస్‌లో వినియోగించే జనరిక్ ఔషధాల్లో 40 శాతం కంటే ఎక్కువగా భారత్‌లో తయారవుతున్న ఉత్పత్తులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాల విధింపు నిర్ణయం అమెరికాలోనూ ఔషధాల సంక్షోభాన్ని తీసుకొస్తుందేమోననే ఆందోళనలతో ఈమేరకు వెనక్కి తగ్గుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో భారతదేశం తయారు చేస్తున్న జనరిక్ మందుల పాత్రను నొక్కి చెబుతుంది.ఈ సుంకాల మినహాయింపు భారత ఔషధ ఎగుమతులకు ప్రయోజనం చేకూరుస్తుండగా, ఇతర రంగాల్లో అమెరికా ఎగుమతులు పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా సుంకాలకు అనుగుణంగా భారత్ యూఎస్ వస్తువులపై సుంకాల్లో మార్పులు చేస్తే వాణిజ్య అడ్డంకులు తొలగిపోయి దేశంలో అగ్రరాజ్య ఎగుమతులు ఏటా 5.3 బిలియన్ డాలర్లు పెరుగుతాయనే అంచనాలున్నాయి. ఇది రెండు దేశాల మధ్య మరింత సమతుల్య వాణిజ్య సంబంధాలను పెంపొందిస్తుందనే వాదనలూ లేకపోలేదు.భారత్‌పై సుంకాల మోతఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. అనుకున్నట్లుగా విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వియత్నాం ఉత్పత్తులపై 46 శాతం, చైనాపై 34 శాతం, యూరోపియన్ యూనియన్(ఈయూ)పై 20 శాతం, స్విట్జర్లాండ్‌పై 31, తైవాన్‌పై 32, జపాన్‌పై 24, యూకేపై 10 శాతం సుంకాలను ఖరారు చేశారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఏప్రిల్ 2వ తేదీని ‘విముక్తి దినం’గా ట్రంప్ ప్రకటించారు.ఇదీ చదవండి: యూఎస్ సుంకాలు.. భారత్‌పై ప్రభావం ఎంత?టారిఫ్‌లపై కంట్రోల్ రూమ్ ఏర్పాటుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించే టారిఫ్‌ల సంబంధ పరిణామాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖతో పాటు వివిధ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఇందులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతీకార టారిఫ్‌ల పరిణామాలను ఎదుర్కొనే వ్యూహాలపై వాణిజ్య, పరిశ్రమల శాఖ కసరత్తు చేసినట్లు వివరించాయి. -
యూఎస్ సుంకాలు.. భారత్‌పై ప్రభావం ఎంత?
అమెరికా తాజాగా భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై 26 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ఇరుదేశాల వాణిజ్య సంబంధాలు గణనీయంగా ప్రభావితం చెందుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా వస్తువులపై భారత్ అధిక సుంకాలు విధించడంపై ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఇదివరకే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కొత్త టారిఫ్‌లు ప్రధానంగా భారతీయ ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, ఐటీ సర్వీసులు వంటి కీలక రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ప్రభావం ఎలాగంటే..ఆటోమొబైల్స్: దేశం మొత్తం వాహన ఎగుమతుల్లో గణనీయమైన భాగం అమెరికాకు వెళ్తోంది. దాంతో ప్రస్తుత సుంకాల వల్ల భారతీయ ఆటోమొబైల్ ఎగుమతులు సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. అధిక సుంకాలతో భారతీయ వాహనాలు యూఎస్‌లో ఇతర కంపెనీ ఉత్పత్తులతో పోటీపడే అవకాశం తగ్గుతుంది. దాంతో దేశీ తయారీదారులు ఇతర ప్రాంతాల్లో తమ ఉత్పత్తులు విక్రయించేందుకు మార్గాలను అన్వేషించాల్సి వస్తుంది.ఫార్మాస్యూటికల్స్: జనరిక్ ఔషధాల ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న భారత ఫార్మాస్యూటికల్స్‌కు యూఎస్ సుంకాలు అవరోధంగా నిలుస్తాయి. భారత్ ఫార్మా రంగానికి అమెరికాలో గణనీయ మార్కెట్ ఉంది. అలాంటిది ఈ ప్రతీకార సుంకాలతో భారత ఎగుమతులు తగ్గి ఫార్మా కంపెనీల లాభాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అమెరికాకు ఎగుమతి చేసే జనరిక్ ఔషధాల ధరలు పెంచేందుకు ఈ సుంకాలు అవకాశం కల్పిస్తాయి. దాంతో యూఎస్‌లో స్థానికంగా పోటీపడే వీలుండదని నిపుణులు చెబుతున్నారు.ఐటీ సేవలు: ప్రధానంగా అమెరికాలో భారత ఐటీ సర్వీసులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. యూఎస్ ఆధారిత కాంట్రాక్టులే ఇండియన్ ఐటీ కంపెనీలను అధికంగా ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. కరోనా తర్వాత చాలా మంది ఐటీ సిబ్బందికి లేఆఫ్స్ ప్రకటించిన కంపెనీలు ఇటీవలే పుంజుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేసేలా ట్రంప్ సుంకాలతో కంపెనీల రెవెన్యూ తగ్గే అవకాశం ఉంటుంది. దాంతో మళ్లీ లేఆఫ్స్ తప్పవని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: టారిఫ్‌లపై కంట్రోల్ రూమ్..విస్తృతంగా, విచ్చలవిడిగా విధించే సుంకాలు వాణిజ్య అసమతుల్యతకు దారితీయవచ్చు. ఇవి భారతదేశ ఎగుమతి ఆదాయాలను తగ్గిస్తాయి. వాణిజ్య లోటును పెంచుతాయి. పూర్తిగా అమెరికాపైనే ఆధారపడి పని చేస్తున్న భారతీయ కంపెనీలు ఆర్థిక అనిశ్చితిలోకి వెళ్లవచ్చు. సుంకాల తీవ్రతను తగ్గించేందుకు, పరస్పర ప్రయోజనాలను పొందడానికి భారత్ ఇప్పటికే అమెరికాతో వాణిజ్య చర్చలు ప్రారంభించింది. సమతుల్య వాణిజ్య సంబంధాలను పెంపొందిస్తూ, ఆర్థిక అంతరాయాలను తగ్గించేలా ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి. -
తయారీ రంగం.. 8 నెలల గరిష్టం
తయారీ రంగం మార్చిలో బలంగా పుంజుకుంది. ఇది ఈ ఏడాది ఫిబ్రవరిలో 14 నెలల కనిష్ట స్థాయికి పడిపోగా.. తిరిగి మార్చిలో ఎనిమిది నెలల గరిష్టానికి పెరిగింది. ఫిబ్రవరిలో హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ పర్చేజింగ్ మనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 56.3గా ఉంటే, మార్చి నెలలో 58.1కు చేరుకుంది. కొత్త ఆర్డర్లు ఈ స్థాయి రికవరీకి తోడ్పడినట్టు హెచ్ఎస్బీసీ ఇండియా తెలిపింది.పీఎంఐ సాధారణంగా 50కి పైన నమోదు అయితే తయారీ విస్తరణగాను, ఆలోపు వస్తే క్షీణతగాను పరిగణిస్తుంటారు. ‘మార్చిలో అమ్మకాలు 2024 జులై తర్వాత గణనీయంగా నమోదయ్యాయి. సానుకూల డిమాండ్ పరిస్థితులు, కస్టమర్ల ఆసక్తి, విజయవంతమైన మార్కెటింగ్ చర్యలు దోహదపడ్డాయి’ అని హెచ్ఎస్బీసీ ఇండియా సర్వే తెలిపింది. ముఖ్యంగా 2024–25 ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో కంపెనీలు తయారీని గణనీయంగా పెంచినట్టు పేర్కొంది. చారిత్రక సగటు కంటే తయారీ అధికంగా నమోదైనట్టు వివరించింది.ఇదీ చదవండి: టారిఫ్‌లపై కంట్రోల్ రూమ్..‘అంతర్జాతీయ ఆర్డర్లు కాస్తంత నిదానించాయి. అయినప్పటికీ డిమాండ్ బలంగా ఉంది. కొత్త ఆర్డర్ల సూచీ ఎనిమిది నెలల గరిష్టం అయిన 61.5కు చేరుకుంది’ అని హెచ్ఎస్బీసీ భారత ముఖ్య ఆర్థిక వేత్త ప్రంజల్ భండారీ పేర్కొన్నారు. పెరిగిన డిమాండ్‌ను అందుకునేందుకు కంపెనీలు తమ నిల్వలను వినియోగించుకున్నాయని.. దీంతో ఫినిష్డ్ గూడ్స్ నిల్వలు 2022 జనవరి తర్వాత కనిష్టానికి చేరుకున్నాయని సర్వే నివేదిక వివరించింది. సుమారు 400 తయారీ కంపెనీల అభిప్రాయాల ఆధారంగా హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ పీఎంఐ గణాంకాలను ప్రతి నెలా విడుదల చేస్తుంటుంది. -
వర్ధమాన దేశాల్లో భారత్ భేష్
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ అత్యధిక వృద్ధిరేటును నమోదు చేస్తుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. బడ్జెట్లో ఆదాయపన్ను పరంగా భారీగా కల్పించిన పన్ను మినహాయింపు ప్రయోజనాలు, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపును ప్రస్తావించింది. ఈ చర్యలతో భారత్ మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా వేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.5% వృద్ది రేటును సాధించొచ్చన్న అంచనాలను ప్రకటించింది. 2024–25 సంవత్సరానికి మూడీస్ వృద్ధి అంచనాలు 6.7%తో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం. ద్రవ్యోల్బ ణం గత ఆర్థిక సంవత్సరంలో సగటున 4.9 శాతంగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో (2025–26) 4.5 శాతానికి దిగొస్తుందని తెలిపింది.భారత్ నిలబడుతుంది.. వర్ధమాన దేశాల్లోకి పెట్టుబడుల ప్రవాహం, సరఫరా వ్యవస్థలు, భౌగోళిక రాజకీయాలను యూఎస్ వాణిజ్య విధానాలు మార్చివేయనున్నట్టు మూడీస్ పేర్కొంది. అయితే, భారత్ మాదిరి పెద్ద స్థాయి వర్ధమాన దేశాలు ఈ అల్లకల్లోల పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన వనరులు కలిగి ఉన్నట్టు మూడీస్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా అమెరికా విధానాలతో వర్ధమాన దేశాల నుంచి పెట్టుబడులు బయటకు తరలిపోయే రిస్క్‌ను ప్రస్తావించింది.ఇదీ చదవండి: టారిఫ్‌లపై కంట్రోల్ రూమ్..భారత్, బ్రెజిల్ మాత్రం పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు, వాటిని కాపాడుకునేందుకు మెరుగైన స్థితిలో ఉన్నట్టు తెలిపింది. ఈ రెండూ దేశీ వినియోగంపై ఆధారపడిన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కావడం, బలమైన దేశీ క్యాపిటల్ మార్కెట్లకు తోడు స్థిరమైన విదేశీ మారకం నిల్వలు కలిగి ఉన్నాయని గుర్తు చేసింది. దేశీ కరెన్సీ ఆధారిత విదేశీ రుణ భారం ఎక్కువగా కలిగి ఉన్నందున.. విదేశీ మారకం రిస్క్‌లను భారత్ బలంగా ఎదుర్కోగలదని అంచనా వేసింది. ఈ సానుకూలతలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని కలిగించగలవని పేర్కొంది. భారత్ వృద్ధి రేటు 2025–26లో నిదానించినప్పటికీ బలంగానే కొనసాగుతుందని, ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే అధిక వృద్ధి రేటును నమోదు చేస్తుందని వివరించింది. -
టారిఫ్‌లపై కంట్రోల్ రూమ్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించే టారిఫ్‌ల సంబంధ పరిణామాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖతో పాటు వివిధ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఇందులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతీకార టారిఫ్‌ల పరిణామాలను ఎదుర్కొనే వ్యూహాలపై వాణిజ్య, పరిశ్రమల శాఖ కసరత్తు చేసినట్లు వివరించాయి.ప్రస్తుతం భారత్‌లో అమెరికా దిగుమతులపై సగటున టారిఫ్‌లు 7.7%గా ఉండగా, ఆ దేశానికి మన ఎగుమతులపై సగటున సుమారు 2.8 శాతమే. ప్రస్తుతం 190 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలనేది ఇరు దేశాల లక్ష్యం. ఈ దిశగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చిస్తున్నాయి.ఇదీ చదవండి: ఏడాదిలో రూ.1.33 లక్షల కోట్ల సమీకరణభారత్పై సుంకాల మోతఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. అనుకున్నట్లుగా విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వియత్నాం ఉత్పత్తులపై 46 శాతం, చైనాపై 34 శాతం, యూరోపియన్ యూనియన్(ఈయూ)పై 20 శాతం, స్విట్జర్లాండ్‌పై 31, తైవాన్‌పై 32, జపాన్‌పై 24, యూకేపై 10 శాతం సుంకాలను ఖరారు చేశారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఏప్రిల్ 2వ తేదీని ‘విముక్తి దినం’గా ట్రంప్ ప్రకటించారు. -
యూపీఐ.. రయ్
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ ఆధిపత్యమే కొనసాగుతోంది. చెల్లింపుల్లో ఉన్న సౌకర్యంతో యూపీఐ లావాదేవీలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. 2024 ద్వితీయార్ధంలో (జూలై–డిసెంబర్) 9,323 కోట్ల యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. 2023 సంవత్సరం ద్వితీయార్ధంలోని 6,577 కోట్ల లావాదేవీలతో పోల్చి చూస్తే 42 శాతం పెరిగాయి. విలువ పరంగా పోల్చి చూసినప్పుడు 2023 ద్వితీయ ఆరు నెలల్లో రూ.99.68 లక్షల కోట్ల లావాదేవీలు జరిగితే.. 2024 ద్వితీయార్ధంలో రూ.130.19 లక్షల కోట్లకు చేరాయి. ఈ వివరాలతో వరల్డ్‌లైన్ ఇండియా సంస్థ ‘డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్’ను విడుదల చేసింది. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం ఈ మూడు సంస్థలు యూపీఐ లావాదేవీల్లో అధిక వాటాను కాపాడుకుంటున్నాయి. గత డిసెంబర్ నెల యూపీఐ లావాదేవీల్లో 93 శాతం ఈ మూడు సంస్థల ప్లాట్‌ఫామ్‌ల నుంచే జరిగాయి. విలువ పరంగా 92 శాతంగా ఉంది. యూపీఐ కాకుండా ఇతర డిజిటల్ చెల్లింపుల్లో క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు ఉన్నాయి. మర్చంట్ చెల్లింపుల్లో అధిక వృద్ధి.. యూపీఐ చెల్లింపులను వ్యక్తుల నుంచి వ్యక్తులకు (పీ2పీ), వ్యక్తుల నుంచి వ్యాపారస్థులకు (పీ2ఎం) అని రెండు విభాగాలుగా వర్గీకరిస్తారు. ఇందులో పీ2పీ లావాదేవీల సంఖ్య 2023 ద్వితీయ ఆరు నెలల్లో 2704 కోట్లుగా ఉంటే, 2024 ద్వితీయ ఆరు నెలల్లో 3,521 కోట్లకు పెరిగాయి. అంటే 30 శాతం వృద్ధి కనిపించింది. ఇదే కాలంలో పీ2పీ లావాదేవీల విలువ 26 శాతం పెరిగింది. పీ2ఎం లావాదేవీల సంఖ్య 3,873 కోట్ల నుంచి 5,803 కోట్లకు పెరగ్గా (50 శాతం వృద్ధి).. విలువ పరంగా 43 శాతం వృద్ధి చెందింది. 2024 ద్వితీయ ఆరు నెలల్లో ఒక్కో యూపీఐ లావాదేవీ సగటు విలువ రూ.1,396గా ఉంది. 2023 ద్వితీయ ఆరు నెలల్లో ఉన్న రూ.1,515తో పోల్చితే 8% తగ్గింది. ‘‘భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అసాధారణ వృద్ధిని చూస్తోంది. ఎక్కువ మంది యూపీఐ వినియోగానికి మొగ్గు చూపిస్తున్నారు. పీవోఎస్ సదుపాయాల విస్తరణతోపాటు, మొబైల్ లావాదేవీలకు ప్రాధాన్యం పెరుగుతోంది’’అని వరల్డ్‌లైన్ ఇండియా సీఈవో రమేష్ నరసింహన్ తెలిపారు. -
ఆర్బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్.. ఎవరీ పూనమ్ గుప్తా?
ఢిల్లీ : కేంద్రం మరో మహిళా అధికారిణికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఇటీవల 2014 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారిణి నిధి తివారీని ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నియమించింది. తాజాగా, పూనమ్ గుప్తా అనే అధికారిణిని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 7 నుంచి 9 మధ్య మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముందు ప్రస్తుతం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకానమిక్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ పూనమ్ గుప్తాను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆమె ఈ ఏడాది జనవరిలో రిటైరైన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకల్ పత్రా స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తా మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. పూనమ్ గుప్తా ఎవరు?కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ పూనమ్ గుప్తా నియామకాన్ని ఆమోదించింది. ఆమె ప్రస్తుతానికి ప్రధానమంత్రికి ఆర్థిక సలహా కౌన్సిల్ సభ్యురాలు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకానమిక్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా బాధత్యలు స్వీకరించే ముందు ఆమె ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్లో గ్లోబల్ మాక్రో, మార్కెట్ రీసర్చ్ లీడ్ ఎకానమిస్ట్‌గా పనిచేశారు. భారత అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల పరిశోధనా మండలిలో ప్రొఫెసర్‌గా, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ బోధించడంతో పాటు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌లో పరిశోధకురాలిగా పనిచేశారు. ఆమె 16వ ఫైనాన్స్ కమిషన్ సలహా మండలిలో సభ్యురాలిగా ఉన్నారు.ఇక ఆమె చదువు విషయానికి వస్తే ఎకానమిక్స్‌లో పీహెచ్డీ : యూనివర్శిటీ ఆఫ్ మారీల్యాండ్, కాలేజ్ పార్క్ (1998)స్పెషలైజేషన్: మాక్రో ఎకానమిక్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ,ఇంటర్నేషనల్ ట్రేడ్ఎం.ఎ ఎకానమిక్స్ : యూనివర్శిటీ ఆఫ్ మారీల్యాండ్, కాలేజ్ పార్క్ (1995)ఎం.ఎ ఎకానమిక్స్ : ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ (1991)బీఏ ఎకానమిక్స్ : హిందూ కాలేజ్, ఢిల్లీ యూనివర్శిటీ (1989)ఆమె 1998లో అంతర్జాతీయ ఆర్థికశాస్త్రంపై చేసిన పీహెచ్‌డీకి EXIM బ్యాంక్ అవార్ను గెలిచారు -
భారత్ విదేశీ రుణాల లెక్కలివే..
భారత్ విదేశీ రుణాలు (అంతర్జాతీయ మార్కెట్ నుంచి రుణాలు, ఇతర రూపాల్లో సమీకరించినవి) 2024 డిసెంబర్ చివరికి 717.9 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.61.74 లక్షల కోట్లు) చేరాయి. 2023 డిసెంబర్ చివరికి ఇవి 648.7 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ‘క్వార్టర్లీ ఎక్స్టర్నల్ డెట్’ నివేదికలోని గణాంకాలు కింది విధంగా ఉన్నాయి.2024 సెప్టెంబర్ చివరికి ఇవి 712.7 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. అంటే అంతక్రితం త్రైమాసికంతో పోల్చి చూస్తే 0.7 శాతం.. ఏడాది క్రితం ఇదే కాలంతో పోల్చి చూస్తే 10 శాతం అధికమయ్యాయి. జీడీపీలో విదేశీ రుణాలు డిసెంబర్ చివరికి 19.1 శాతానికి చేరాయి. 2024 సెప్టెంబర్ చివరికి 19 శాతంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా రూపాయితోపాటు ఇతర ప్రధాన కరెన్సీలతో డాలర్ బలపడడం విదేశీ రుణ భారం విలువ పెరిగేందుకు దారితీసింది.ఇదీ చదవండి: మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..డాలర్ మారకంలో 54.8 శాతం..యూఎస్ డాలర్ మారకంలోని బకాయిలు మొత్తం విదేశీ రుణాల్లో 54.8 శాతంగా ఉన్నాయి. ఆ తర్వాత రూపాయి మారకంలో విదేశీ రుణాలు 30.6 శాతంగా ఉంటే, జపాన్ యెన్ మారకంలో 6.1 శాతం, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) రూపంలో 4.7 శాతం, యూరో మారకంలో 3 శాతం చొప్పున ఉన్నాయి. మొత్తం విదేశీ రుణాల్లో నాన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్‌కు సంబంధించి 36.5 శాతం మేర ఉన్నాయి. ఆ తర్వాత డిపాజిట్ స్వీకరించే కార్పొరేషన్లకు సంబంధించి 27.8 శాతం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 22.1 శాతం, ఇతర ఆర్థిక సంస్థలకు సంబంధించి 8.7 శాతం చొప్పున ఉన్నాయి. విదేశీ మారకంలో చెల్లించాల్సిన మొత్తం బకాయిల్లో రుణాల రూపంలో 33.6 శాతం ఉంటే, కరెన్సీ, డిపాజిట్ల రూపంలో 23.1 శాతం, ట్రేడ్ క్రెడిట్, అడ్వాన్స్‌ల రూపంలో 18.8 శాతం, డెట్ సెక్యూరిటీల రూపంలో 16.8 శాతం చొప్పున ఉన్నాయి. -
జీఎస్టీ వసూళ్ల రికార్డు
న్యూఢిల్లీ: మార్చి నెలకు జీఎస్టీ వసూళ్లు బలంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూస్తే 10 శాతం పెరిగి రూ.1.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. జీఎస్టీ మొదలైన తర్వాత రెండో నెలవారీ గరిష్ట ఆదాయం ఇదే కావడం గమనార్హం. 2024 ఏప్రిల్ నెలలో వసూలైన రూ.2.10 లక్షల కోట్లు ఇప్పటి వరకు నెలవారీ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిగా ఉంది.ఇదీ చదవండి: చాట్‌జీపీటీ యూజర్లకు గుడ్న్యూస్దేశీ విక్రయ లావాదేవీల రూపంలో ఆదాయం 8.8 శాతం పెరిగి రూ.1.49 లక్షల కోట్లుగా ఉంది. దిగుమతి చేసుకున్న ఉత్పత్తులపై జీఎస్టీ 13.56 శాతం వృద్థితో రూ.46,919 కోట్లకు చేరింది. స్థూలంగా చూస్తే సెంట్రల్ జీఎస్టీ కింద రూ.38,145 కోట్లు, స్టేట్ జీఎస్టీ కింద రూ.49,891 కోట్లు, ఇంటెగ్రేటెడ్ జీఎస్టీ కింద రూ.95,853 కోట్లు, సెస్సు రూపంలో రూ.12,253 కోట్లు చొప్పన మార్చిలో వసూలైంది. ఇక మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.22.08 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023–24తో గణాంకాలతో పోల్చి చూస్తే 9.4 శాతం పెరిగింది. -
యూపీఐ లావాదేవీలు @ రూ.24.77 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: యూపీఐ లావాదేవీలు ఎప్పటికప్పుడు సరికొత్త గరిష్టాలకు చేరుతున్నాయి. మార్చి నెలలో రూ.24.77 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు నమోదైనట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకటించింది. విలువ పరంగా ఇది సరికొత్త నెలవారీ గరిష్ట రికార్డు.ఫిబ్రవరిలో నమోదైన రూ.21.96 లక్షల కోట్లతో పోల్చితే విలువ పరంగా 12.7% వృద్ధి నమోదైంది. 2024 మార్చిలో యూపీఐ లావాదేవీల విలువ రూ.19.78 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. మార్చి నెలలో రోజువారీ సగటు యూపీఐ లావాదేవీల విలువ రూ.79,903 కోట్లుగా నమోదైంది. -
తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ఏప్రిల్ 1, 2025 నుంచి 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.41 తగ్గించాయి. సవరించిన రిటైల్ సేల్ ధర వల్ల ఢిల్లీలో దీని రేటు రూ.1,762గా ఉంది. ఈ తగ్గింపుతో హోటళ్లు, రెస్టారెంట్లతో సహా ఎల్పీజీపై ఆధారపడే వ్యాపారాలకు కొంత ఉపశమనం కలిగినట్లయింది. అంతర్జాతీయ ముడిచమురు రేట్లలో హెచ్చుతగ్గులు, ఇతర ఆర్థిక అంశాల ప్రభావంతో ఈ ధరలను సవరిస్తుంటారు. కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించినా, గృహాల్లో ఉపయోగించే ఎల్పీజీ ధరలను మాత్రం మార్చలేదు.ధరల హెచ్చుతగ్గులుగత నెలలో మార్చి 1, 2025న ఓఎంసీలు ప్రధాన నగరాల్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.6 పెంచాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ ఇండేన్ ప్రకారం.. ఫిబ్రవరిలో అంతకుముందు నెలతో పోలిస్తే 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.7 తగ్గించారు. మార్చి నెలలో రూ.1,797 నుంచి రూ.1,803కు పెరిగింది. తాజాగా రూ.41 తగ్గించారు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో మార్పులకు అనుగుణంగా ఇంధన ధరల్లో అస్థిరత నెలకొంటుంది.ఇదీ చదవండి: రెండేళ్లలో తొలిసారి ధరలు పెంపునగరాల వారీగా ధరలుఢిల్లీ-రూ.1,762 (రూ.1,803 నుంచి తగ్గింది)కోల్‌కతా-రూ.1,872 (రూ.1,913 నుంచి తగ్గింది)ముంబయి-రూ.1,714.50 (రూ.1,755.50 నుంచి తగ్గింది)చెన్నై-రూ.1,924.50 (రూ.1,965.50 నుంచి తగ్గింది) -
రెండేళ్లలో తొలిసారి ధరలు పెంపు
దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజవాయువు ధరలను భారత్ రెండేళ్లలో తొలిసారిగా పెంచింది. ఏప్రిల్ 1 నుంచి ఏపీఎం(అడ్మినిస్ట్రేటెడ్ ప్రైసింగ్ మెకానిజం) గ్యాస్ ధరను 10 లక్షల థర్మల్ యూనిట్లకు 6.50 డాలర్ల నుంచి 6.75 డాలర్లకు పెంచినట్లు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ విభాగం నోటిఫికేషన్లో పేర్కొంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ), ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లు నామినేషన్ ప్రాతిపదికన కేటాయించిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువును ఏపీఎం గ్యాస్ అంటారు. ఈ గ్యాస్‌ను ‘అడ్మినిస్ట్రేటెడ్ ప్రైసింగ్ మెకానిజం’ వద్ద వినియోగదారులకు విక్రయిస్తారు.ఇంట్లో వంట అవసరాలకు పైపుల ద్వారా సహజ వాయువుగా ఈ గ్యాస్‌ను సరఫరా చేస్తారు. ఆటోమొబైల్స్ అవసరాల కోసం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌గా మారుస్తారు. ప్రభుత్వం రూపొందించిన రోడ్ మ్యాప్‌కు అనుగుణంగా రెండేళ్లలో తొలిసారి ధరల పెంపును అమలు చేశారు. 2023 ఏప్రిల్‌లో దేశీయంగా ఉత్పత్తి అయిన సహజ వాయువు ధరలను మిలియన్ థర్మల్ యూనిట్లకు 4 డాలర్లు నుంచి గరిష్టంగా 6.5 డాలర్లుగా పరిమితిని విధించారు. ధరల పెంపుకు సంబంధించి నిపుణుల కమిటీ నివేదికను గతంలో కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 2027 వరకు 0.5 డాలర్లు పెంచాలని సూచించింది. 2023 నుంచి రెండేళ్లపాటు ఎలాంటి పెంపు తీసుకోలేదు. ఈ గడువు ముగియడంతో తాజాగా 0.25 డాలర్ల పెంపు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే రెండేళ్ల పాటు రేట్లు మారవని, ఆ తర్వాత మరో 0.25 డాలర్లు పెంచాలని కేంద్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది.ఇదీ చదవండి: నేటి నుంచి అమల్లోకి కొత్త ఆర్థిక మార్పులుకంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) అనేది అధిక పీడనం వద్ద నిల్వ చేసి ఉపయోగించేందుకు వీలైన గ్యాస్. దీన్ని ప్రధానంగా మీథేన్, గ్యాసోలిన్, డీజిల్ లేదా బొగ్గు వంటి సాంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వినియోగాస్తున్నారు. కార్లు, బస్సులు, ట్రక్కులు, ఆటోరిక్షాలు సహా ఆటోమొబైల్స్‌కు ప్రత్యామ్నాయ ఇంధనంగా సీఎన్జీని విస్తృతంగా వాడుతున్నారు. గ్యాసోలిన్ లేదా డీజిల్, పెట్రోల్‌తో పోలిస్తే తక్కువ ఉద్గారాలు విడుదల చేస్తుంది. -
ఫిబ్రవరిలో క్రెడిట్ కార్డుల జారీ ఎలా ఉందంటే..
దేశంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలు జారీ చేసే క్రెడిట్ కార్డుల వృద్ధి ఫిబ్రవరిలో మందగించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌తో సహా ప్రముఖ ఆర్థిక సంస్థలు కొత్తగా జారీ చేసే కార్డుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ వంటి ఇతర ప్రముఖ బ్యాంకులు కూడా తమ క్రెడిట్ కార్డుల జారీ తగ్గిపోయిందని ఆర్బీఐ తెలిపింది.భారతదేశ క్రెడిట్ కార్డ్ విభాగంలో అధికంగా వినియోగదారులున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫిబ్రవరిలో 1,78,000 కార్డులను జోడించింది. దాంతో మొత్తం కార్డుల సంఖ్య 23.6 మిలియన్ల(2.36 కోట్లు)కు చేరంది. ఇది దేశంలో అతిపెద్ద క్రెడిట్ కార్డు జారీదారుగా తన స్థానాన్ని సుస్థిరం చేసినప్పటికీ, వృద్ధి గత నెలతో పోలిస్తే క్షీణించింది. జనవరిలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3,00,000 కొత్త కార్డులను జారీ చేసింది. ఫిబ్రవరిలో జారీ చేసిన కార్డుల కంటే జనవరిలో ఇష్యూ చేసిన కార్డులు చాలా ఎక్కువ. ఎస్బీఐ కార్డ్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు కూడా ఫిబ్రవరిలో మందకొడిగానే కార్డులను జారీ చేశాయి. ఆర్బీఐ డేటాలో సదరు బ్యాంకుల నెలవారీ కార్డుల చేర్పులకు సంబంధించిన కచ్చితమైన గణాంకాలు వివరించనప్పటికీ రెండు సంస్థలు గతంలో కంటే తక్కువ కార్డులనే జోడించాయని పేర్కొంది.ఇదీ చదవండి: కొత్త లోన్ రూల్.. రేపటి నుంచే..కార్డుల జారీ మందగించడానికి కారణాలు..దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకులు జారీ చేసే క్రెడిట్ కార్డులతో సహా అన్సెక్యూర్డ్ రుణాలు పెరుగుతుండడంపై ఆర్బీఐ ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. ఇది బ్యాంకులు మరింత అప్రమత్తంగా వ్యవహరించేందుకు కారణమైంది. దాంతో కార్డుల సంఖ్య తగ్గిందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అధిక ప్రొవిజనింగ్ అవసరాలు లేదా కఠినమైన నో-యువర్-కస్టమర్ (కేవైసీ) నిబంధనలు వంటి నియంత్రణ చర్యలు కూడా కార్డుల జారీని ప్రభావితం చేసిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, విచక్షణా వ్యయం(డిసిక్రీషనరీ స్పెండింగ్)లో మందగమనం వంటి ఆర్థిక ప్రతికూలతలు కూడా కార్డుల వినియోగాన్ని తగ్గిస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. -
ఐటీ నోటీసు వస్తే ‘రాజీ’ చేసుకోండి..
ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వస్తే, వెంటనే వారితో ‘సంధి’ లేదా రాజీ చేసుకోవచ్చు. దీనికి ఎవరి రాయబారమూ అక్కర్లేదు. మీరే స్వయంగా ఒప్పందంలాంటిది చేసుకోవచ్చు. 2025 మార్చి 17న ఓ సర్క్యులర్ ద్వారా డిపార్టుమెంటు వారు సులువుగా రాజీ చేసుకోమని మార్గదర్శకాలు ఇచ్చారు. దీన్నే ఇంగ్లీషులో COMPOUNDING అంటారు.ఎన్నో సందర్భాల్లో డిపార్టుమెంటు వారు నోటీసులు ఇస్తారు. వాటికి బదులివ్వకపోతే వారు కోర్టుకు వెళ్తారు. కొన్ని సీరియస్ కేసుల్లో జైలుకి పంపిస్తారు. అంతవరకు వెళ్లడం అవసరమా! పరువు గంగపాలై, బతుకు హాస్పిటల్ పాలై, కృష్ణ జన్మస్థానంలో గడపడమెందుకు?ఈ పథకం .. లేదా ఒప్పందం.. లేదా రాజీ మార్గం ప్రకారం.. 1 కోర్టుకు వెళ్లక్కర్లేదు. లీగల్ ప్రాసిక్యూషన్ ఉండదు. 2. టైం కలిసి వస్తుంది. 3. మానసిక ఒత్తిడి ఉండదు 4. ఆర్థిక ప్రమాదం ఉండదు 5. బ్యాంకు అకౌంటు అటాచ్మెంట్ ఉండదు 6. వ్యాపారం సజావుగా చేసుకోవచ్చు 7. నలుగురికీ తెలియకుండా గొడవ సమసిపోతుంది 8. ఇది అతి పెద్ద ఉపశమనంవివరాల్లోకి వెళ్తే.. అన్ని రకాల నేరాలకు ఇది వర్తిస్తుంది. ఎన్ని సార్లయినా ఈ స్కీమ్‌తో ప్రయోజనం పొందవచ్చు. కాల వ్యవధులు లేవు. వ్యాపార నిర్వహణలో ఉన్నప్పుడు తెలిసో, తెలియకో ఎన్నో నేరాలు, ఇన్‌కంట్యాక్స్ చట్టం ప్రకారం జరుగుతుంటాయి. వీటన్నింటి మీద సమయం వెచ్చించలేము. కోర్టు చుట్టూ తిరగలేము. తిరిగినా జడ్జిమెంటు ఎలా ఉంటుందో చెప్పలేము.ఇన్ని కష్టాలతో, ఇబ్బందులతో వ్యాపారం చేయలేము. వ్యాపారం కుంటుపడుతుంది. బైటి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారు. వీటన్నింటిని అధిగమించేందుకు కల్పిస్తున్న ఈ వెసులుబాటు, పాత కేసులకూ వర్తిస్తుంది. పాత కేసులను తిరస్కరించినా ఈ ఒప్పందంలో చేరి, రాజీపడొచ్చు. మరీ మోసపూరితమైన కేసుల్లో తప్ప మిగతా అన్నింటికీ ఈ ‘‘రాజీ’’లో ఉపశమనం ఉంది.చాలా త్వరగా పరిష్కారం దొరుకుతుంది. ఒక దరఖాస్తు చేసుకోగానే మార్గం సుగమం అవుతుంది. హై–ప్రొఫైల్ కేసుల్లో ముందుగా స్పెషల్ పర్మిషన్ తీసుకుని గానీ రిలీఫ్ ఇవ్వరు. ఉదాహరణకు జైలు శిక్ష 2 సంవత్సరాలు దాటినా .. సీబీఐ, ఈడీ మొదలైన సంస్థలతో సమస్యలు ఉన్నా, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ పర్మిషన్ అవసరం. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు.. 👉 బిజినెస్ వ్యక్తులు 👉 టీడీఎస్ విషయంలో ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్నవారు 👉 పన్నుభారాన్ని కోర్టుకు వెళ్లకుండా సెటిల్ చేసుకునే వారు 👉 గతంలో రాజీకి వెళ్లి తిరస్కరణకు గురైన వారు 👉 అనేక నేరాలు చేసి బైటికి రానివాళ్లుఎలా చేయాలి: వంద రూపాయల స్టాంపు పేపరు మీద అన్ని వివరాలను మీ సంబంధిత అధికారికి సబ్మిట్ చేయాలి. దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లించాలి. ఎంత చెల్లించాలో డిపార్టుమెంటు నిర్ణయిస్తుంది. రాజీపత్రం రాగానే ఉపశమనం వచ్చినట్లే. ప్రాసిక్యూషన్ ఆగిపోతుంది. మీరు మాత్రం అప్పీలులో ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలి.రాజీకి వెళ్లకపోతేషరా మామూలే. లీగల్ ప్రాసిక్యూషన్ కొనసాగుతుంది. ఫైన్ పడుతుంది. జైలు శిక్ష పడొచ్చు. కోర్టు ఖర్చులు భరించాలి. రికార్డుల్లో అలాగే ఉండిపోతే ఉత్తరోత్తరా డిపార్టుమెంటు వారి దృష్టిలో చెడుగా.. అంటే డిఫాల్టరుగా ఉండిపోతారు. కాబట్టి వెంటనే రాజీమార్గంలో వెళ్లి, రాజీపడి అన్ని కష్టాల్లో నుంచి బైటపడండి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
రాబడిపై పన్ను సున్నా...
కొత్త బడ్జెట్లో ఆదాయపన్ను మినహాయింపు రాయితీలను గణనీయంగా పెంచడంతో మధ్యతరగతికి పెద్ద ఊరట లభించింది. వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్‌తో కలుపుకుని రూ.12.75 లక్షలు, ఇతరులకు రూ.12 లక్షల ఆదాయం ఉన్నా కానీ కొత్త విధానంలో రూపాయి పన్ను లేకుండా చేశారు ఆర్థిక మంత్రి. ఇప్పటికీ అధిక ఆదాయ పరిధిలో ఉండి, పన్ను ఆదా పెట్టుబడుల కోసం అన్వేషించే వారికి మెరుగైన మార్గం ఒకటి ఉంది. పన్ను ఆదా చేసే ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవడమే. వీటి నుంచి వచ్చే రాబడిపై ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఇందులో ఉండే ప్రయోజనాలు, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? తదితర వివరాలతో కూడిన కథనమే ఇది... బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు), చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులపై వచ్చే రాబడికి ఎలాంటి పన్ను ఆదా ప్రయోజనం లేదు. దీంతో రూ.12 లక్షలకు పైన ఆదాయం ఉన్న వారికి పన్ను ప్రయోజనం పరంగా ఇలాంటివి మెరుగైన సాధనాలు కాబోవు. ఎందుకంటే వీటిపై వచ్చే రాబడి పన్ను చెల్లింపుదారు వార్షిక ఆదాయానికి కలుస్తుంది. దాంతో చెల్లించాల్సిన పన్ను భారం పెరిగిపోతుంది. ఫలితంగా నికర ఆదాయం రూ.12.75 లక్షలకు మించిపోవచ్చు. దీనివల్ల పన్ను ఆదా రాయితీని కోల్పోవాల్సి వస్తుంది. కనుక అధిక ఆదాయం పరిధిలో ఉన్న వారికి అందుబాటులో ఉన్న మెరుగైన సాధనం ట్యాక్స్ ఫ్రీ బాండ్లే. ఎందుకంటే ఈ బాండ్లపై వచ్చే రాబడి ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలవదు. దీంతో ఈ మేరకు ప్రయోజనం పొందొచ్చు. ముఖ్యంగా రూ.12 లక్షల స్థాయిలో ఆదాయం కలిగిన వృద్ధులు (సీనియర్ సిటిజన్లు/60 ఏళ్లు నిండిన వారు) తమ రిటైర్మెంట్ నిధిలో కొంత మొత్తాన్ని ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయమే అవుతుంది. తద్వారా వారి పన్ను వర్తించే ఆదాయం రూ.12 లక్షలకు మించకుండా చూసుకోవచ్చు. పలు సంస్థల నుంచి బాండ్లు.. గతంలో పలు ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన ట్యాక్స్ ఫ్రీ బాండ్లు ప్రస్తుతం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో క్యాష్ విభాగంలో ట్రేడ్ అవుతున్నాయి. వీటిల్లో కొన్నింటిలో మెరుగైన లిక్విడిటీ (కొనుగోళ్లు, అమ్మకాల పరిమాణం)ని గమనించొచ్చు. ఇంకా 11 ఏళ్ల కాల వ్యవధితో బాండ్లు లభిస్తున్నాయి. ప్రస్తుతం వీటిల్లో పన్ను రహిత రాబడి రేట్లు 5.5–5.9 శాతం మధ్య ఉన్నాయి. పెట్టుబడికి రక్షణ, అదే సమయంలో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇవి మెరుగైన ఆప్షన్ అని విశ్లేషకులు చెబుతున్నారు. 2012 నుంచి 2016 మధ్య కాలంలో 14 ప్రభుత్వరంగ ఇన్ఫ్రా ఫైనాన్స్ కంపెనీలు (ఎన్హెచ్ఏఐ, ఐఆర్ఎఫ్సీ, పీఎఫ్సీ తదితర) సెక్యూర్డ్ (రక్షణతో కూడిన) ట్యాక్స్ ఫ్రీ బాండ్లను జారీ చేశాయి. వీటి కాల వ్యవధి 10, 15, 20 ఏళ్ల చొప్పున ఉంది. ఈ బాండ్లలో పెట్టుబడులపై రాబడి చెల్లింపులు ఏడాదికోసారి చేస్తారు. వీటికి అధిక భద్రతను సూచించే ‘ఏఏఏ’ రేటింగ్‌ను క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చాయి. గతంలో జారీ చేసిన అన్ని ట్యాక్స్ ఫ్రీ బాండ్ల సిరీస్‌లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ అయి ఉన్నాయి. ఇప్పటి వరకు 193 ఇష్యూలు రాగా, అందులో 57 బాండ్ల మెచ్యూరిటీ (కాలవ్యవధి) ముగిసిపోయింది. మిగిలిన ట్యాక్స్ ఫ్రీ బాండ్లు ప్రస్తుతం స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడ్ అవుతున్నాయి. వీటి మెచ్యూరిటీ సగటున 11 ఏళ్ల వరకు ఉంది. ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన ఈ బాండ్లలో రిస్క్ చాలా చాలా తక్కువ. ఒక విధంగా ఉండదనే చెప్పుకోవాలి. దీనికితోడు పన్ను ప్రయోజనం కూడా ఉండడం అదనపు ఆకర్షణ. తక్కువ ఆదాయం ఉన్న వారికి..? ఆదాయపన్ను పరిధిలో లేకుండా.. ఆదాయం తక్కువగా ఉన్న వారు ప్రత్యామ్నాయాలను పరిశీలించొచ్చు. ‘ఏఏఏ’ రేటెడ్ కార్పొరేట్ బాండ్లలో రిస్క్ కొంత తక్కువగా ఉంటుంది. వీటిల్లో ఈల్డ్స్ 7.4 శాతం మేర ఉన్నాయి. అలాగే, వృద్ధులకు బ్యాంక్ ఎఫ్డీలపై 8 శాతం వరకు వడ్డీ రేటు ప్రస్తుతం లభిస్తోంది. కానీ, కార్పొరేట్ బాండ్లు, బ్యాంక్ ఎఫ్డీలపై వచ్చే రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. మెచ్యూరిటీతో సంబంధం లేకుండా ఆయా పెట్టుబడులపై ఏటా వచ్చే రాబడిని ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అధిక ఆదాయపన్ను శ్లాబు రేటులో ఉన్న వారికి పన్ను చెల్లింపులు పోగా మిగులు నికర రాబడి 4.6–5.1 శాతం మించదు. అయితే, తక్కువ ఆదాయ శ్లాబుల్లో ఉన్న వారు, పన్ను వర్తించేంత ఆదాయం లేని వారికి.. కార్పొరేట్ బాండ్లు, బ్యాంక్ ఎఫ్డీలు తదితర సాధనాలను పరిశీలించొచ్చు. ఎందుకంటే వీటి నుంచి వచ్చే వడ్డీ రాబడి కలిసిన తర్వాత కూడా వారి ఆదాయం పన్ను పరిధిలోకి రాదు. ఎంపిక ఎలా..? ఈ బాండ్ల ఎంపిక అంత కష్టమైన విషయం కాదు. ముఖ్యంగా చూడాల్సింది లిక్విడిటీయే. అంటే ఆయా బాండ్లు రోజువారీగా ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్ అవ్వడంతోపాటు, తగినంత ట్రేడింగ్ వ్యాల్యూమ్ కూడా ఉండాలి. దీనివల్ల కొనుగోలు, విక్రయం సులభంగా మారుతుంది. ఆ తర్వాత చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం బాండ్ ఈల్డ్స్ టు మెచ్యూరిటీ (వైటీఎం). అంటే ఆయా బాండ్‌పై మిగిలి ఉన్న కాలానికి ఎంత రాబడి వస్తుందో ఇది తెలియజేస్తుంది. అధిక లిక్విడిటీ ఉన్న బాండ్‌ను మెరుగైన ధరపై కొనుగోలు చేసుకోవచ్చు. అదే లిక్విడిటీ తగినంత లేని చోట (అమ్మకాలకు ఎక్కువ మంది లేనప్పుడు) బాండ్ కొనుగోలు వ్యయం పెరిగిపోతుంది. దీనివల్ల ఈల్డ్ తగ్గిపోతుంది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ డేటా ప్రకారం ప్రస్తుతం స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడ్ అవుతున్న వాటిల్లో 20 బాండ్లలో మెరుగైన లిక్విడిటీ ఉంటోంది. ఉదాహరణకు ‘ఆర్ఈసీ బాండ్ ‘871ఆర్ఈసీ28’ను 2014లో 8.71 శాతం వార్షిక రేటుపై జారీ చేయగా.. గత నెలరోజులుగా రోజువారీ ట్రేడింగ్ వ్యాల్యూమ్ ఇందులో 1,534గా ఉంటోంది. ఈ బాండ్లో ఇటీవలి వైటీఎం 5.9 శాతంగా ఉంది. ఇది అనుకూల తరుణం.. ఆర్బీఐ ఇటీవలే రెపో రేటును పావు శాతం తగ్గించింది. రానున్న రోజుల్లో మరో 50 బేసిస్ పాయింట్ల వరకు (0.50 శాతం) రేట్లు తగ్గుతాయని విశ్లేషకుల అంచనాగా ఉంది. ఇప్పటికీ దీర్ఘకాల డెట్ సాధనాలపై రాబడులు మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కనుక డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే వారికి ప్రస్తుతం అనుకూల సమయం. పన్ను లేకపోవడం, పెట్టుబడులపై గరిష్ట పరిమితి లేకపోవడంతో ట్యాక్స్ ఫ్రీ బాండ్లు అధిక ఆదాయ వర్గాలకు మెరుగైన సాధనం అవుతుంది. పైగా ట్యాక్స్ ఫ్రీ బాండ్ల జారీ నిలిచిపోయింది. అంటే కొత్తగా బాండ్ల ఇష్యూలు రావడం లేదు. కనుక వీటిల్లో పెట్టుబడులు పెట్టుకోవాలంటే సెకండరీ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న వాటి నుంచే ఎంపిక చేసుకోవాలి. ఇన్వెస్టర్లు ఇక్కడి నుంచి ఎంత కాలానికి పెట్టుబడులు పెట్టుకోవాలని అనుకుంటున్నారో.. అంత కాలంలో మెచ్యూరిటీ తీరిపోయే ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. రిటర్నులు ఆకర్షణీయం సెకండరీ మార్కెట్లో ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో పెట్టుబడులు పెట్టే వారు మార్కెట్ రేటు కంటే ప్రధానంగా ఈల్డ్స్ టు మెచ్యూరిటీ (వైటీఎం)పైనే దృష్టి సారించాలి. ఇన్వెస్టర్ ఒక బాండ్‌ను కొనుగోలు చేసిన దగ్గర్నుంచి, అది మెచ్యూరిటీ అయ్యే వరకు ఏటా వచ్చే రాబడిని వైటీఎం సూచిస్తుంది. 15 ట్యాక్స్ ఫ్రీ బాండ్ల సిరీసీస్లలో ప్రస్తుతం వైటీఎం 5.5 శాతం నుంచి 5.9 శాతం మధ్య ఉంది. ఇవి గమనించాలి.. → 30 శాతం ఆదాయపన్ను పరిధిలో ఉన్న వారికి 6 శాతం పన్ను రహిత రాబడి నిజంగా ఎంతో మెరుగైనది. పన్ను ప్రయోజనం కూడా కలుపుకుంటే 8.5 శాతం రాబడి వచి్చనట్టు. → 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి సైతం 7.5 శాతం రాబడి వచి్చనట్టు అవుతుంది. → 10 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి దక్కే ప్రయోజనం తక్కువే. → కార్పొరేట్ బాండ్లతో పోల్చితే ట్యాక్స్ ఫ్రీ బాండ్లు అధిక రేటింగ్ కలిగినవి. ఈ బాండ్లను జారీ చేసేవి ప్రభుత్వరంగ సంస్థలే కనుక డిఫాల్ట్ దాదాపుగా ఉండదు. → ఇన్వెస్టర్ తనకు వీలైనంత ఇందులో పెట్టుబడి పెట్టుకోవచ్చు. గరిష్ట పరిమితి ఉండదు. → స్వల్పకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులకు వీటిని ఎంపిక చేసుకోవడం సరికాదు. → వీటిల్లో ఒక్కోసారి లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కనుక కాల వ్యవధి ముగిసేంత వరకు కొనసాగే వెసులుబాటు ఉన్న వారే వీటిని ఎంపిక చేసుకోవాలి. → కేవలం పన్ను ప్రయోజనం కోసమే వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం అనిపించుకోదు. రిస్క్ తీసుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇంతకంటే ఎక్కువ రాబడినే (పన్ను పోను) ఇస్తాయి. పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడుల వైవిధ్యం కోసం డెట్ విభాగం కింద ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవచ్చు. → అధిక లిక్విడిటీ, మెరుగైన వైటీఎం ఉన్న వాటికే పరిమితం కావాలి. –సాక్షి, బిజినెస్‌డెస్క్ -
ఇండియన్ రైల్వే ఒకరోజు సంపాదన ఎంతో తెలుసా?
రోజుకు లక్షలమందిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేస్తున్న ఇండియన్ రైల్వే గురించి దాదాపు అందరికీ తెలిసిందే. లెక్కకు మించిన ట్రైన్స్ దేశంలోని ప్రధాన భూభాగాలను కలుపుతూ ముందుకు సాగిపోతాయి. అయితే ఇంత పెద్ద నెట్వర్క్ కలిగిన భారతీయ రైల్వే రోజుకు ఎంత సంపాదిస్తుందో.. బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను తెలుసుకుందాం.భారతీయ రైల్వే తమ సేవలను అప్డేట్ చేయడానికి మాత్రమే కాకుండా.. ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం.. రవాణా కోసం ప్రత్యేక కారిడార్ల నిర్మాణం చేపట్టడం వంటివి చేస్తోంది.ఇండియన్ రైల్వే రోజుకు ఎంత ఆదాయం గడిస్తుంది అన్న ప్రశ్నకు.. రూ. 400 కోట్లు అని సమాధానం వస్తోంది. అంటే భారతీయ రైల్వే నెలకు రూ. 12వేల కోట్లు సంపాదిస్తున్నమాట. రైల్వేలు కేవలం ప్రజా రవాణాకు మాత్రమే కాకుండా.. సరుకు రవాణా చేయడానికి కూడా విరివిగా ఉపయోగపడుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం సరుకును పంపించాలనుకునే కస్టమర్లు ట్రైన్ల ద్వారానే సరుకు రవాణా చేస్తారు.ఇదీ చదవండి: పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లు ప్రకటించిన కేంద్రంసరుకు రవాణా రైళ్ల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు, ప్యాసింజర్ రైళ్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా రైల్వేలకు చాలా ముఖ్యమైనది. రైల్వేలు ప్రతిరోజూ వేలాది ప్యాసింజర్ రైళ్లను నడుపుతున్నాయి. రైల్వేలు స్క్రాప్ అమ్మకాలు వంటి ఇతర వనరుల నుంచి కూడా ఆదాయాన్ని సంపాదిస్తాయి. పీఐబీ డేటా ప్రకారం, 22-23 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేలు సరుకు రవాణా ద్వారా రూ.1,60,158 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది.భారతీయ రైల్వేలు ప్రపంచంలోని టాప్ 5 అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ఇండియన్ రైల్వే 7,308 కంటే ఎక్కువ స్టేషన్లను కలిగి.. రోజుకు 20 మిలియన్లకు పైగా ప్రయాణికులను తరలిస్తోంది. ప్రకటనలు, ప్లాట్‌ఫామ్ టికెట్స్ ద్వారా కూడా ఇండియన్ రైల్వే డబ్బు సంపాదిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది. -
రూ.5.91 లక్షల కోట్లు బాకీ.. కట్టాల్సినవారు మాయం!
న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపుదారులకు సంబంధించి ఆశ్చర్యపరిచే గణాంకాలను ప్రభుత్వం పార్లమెంట్‌కు అందించింది. ప్రత్యక్ష పన్నుల్లో 47,674 మంది పన్ను ఎగవేతదారుల జాడ తెలియడం లేదని.. వీరు చెల్లించాల్సిన బకాయిలు రూ.5.91 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపింది.అదే పరోక్ష పన్నుల్లో 60,853 మంది ఎగవేతదారుల ఆచూకీ లభించడం లేదని.. వీరు రూ.43,525 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉందని వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఈ వివరాలు తెలియజేశారు. పన్ను వసూళ్లకు సంబంధించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తీసుకున్న చర్యలను సైతం వివరించారు.వ్యక్తిగత లావాదేవీల సమాచారాన్ని అందుబాటులో ఉంచడం, 360 డిగ్రీల కోణంలో ప్రొఫైల్‌ను ఫీల్డ్ యూనిట్లకు పంపించి.. పన్ను చెల్లింపుదారులను గుర్తించి, పన్ను వసూలు చర్యలకు వీలు కల్పించినట్టు చెప్పారు. పరోక్ష పన్నుల కేంద్ర మండలి పన్ను ఎగవేతదారుల నుంచి వసూలుకు గాను బ్యాంక్ ఖాతాల స్తంభన వంటి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. -
రెస్టారెంట్ సర్వీసుల్లో జీఎస్టీపై స్పష్టత
న్యూఢిల్లీ: రెస్టారెంట్ల సర్వీసులపై విధించే జీఎస్టీపై కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) స్పష్టతనిచ్చింది. రోజుకు రూ.7,500 పైగా గది అద్దెను వసూలు చేసే హోటళ్లలో, రెస్టారెంటు సర్వీసులపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో (ఐటీసీ) 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని తెలిపింది. అంతకన్నా తక్కువ అద్దె ఉండే హోటళ్లలో ఐటీసీ లేకుండా 5 శాతం జీఎస్టీ యథాతథంగా కొనసాగుతుందని వివరించింది. దీనికి క్రితం ఆర్థిక సంవత్సరం వసూలు చేసిన అద్దె ప్రాతిపదికగా ఉంటుంది. -
ఎఫ్ఎంసీజీ దిగ్గజాల షాపింగ్
ముంబై: ఇటీవల కొద్ది నెలలుగా ఎఫ్ఎంసీజీ రంగ దిగ్గజాలు షాపింగ్‌లో బిజీగా కనిపిస్తున్నాయి. ఇతర సంస్థల కొనుగోళ్లకు తెరతీస్తున్నాయి. ప్రధానంగా ఆధునికతరం డిజిటల్ బ్రాండ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న చిన్నతరహా కంపెనీలు లక్ష్యంగా షాపింగ్‌ను చేపడుతున్నాయి. జెన్‌జెడ్ వినియోగదారులకు చేరువ అవుతున్నాయి. డైరెక్ట్‌టు కన్జ్యూమర్ బ్రాండ్స్ సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వినియోగదారులను వేగంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే పరిమిత పంపిణీ వ్యవస్థ, నిధులలేమి కారణంగా పలు కంపెనీలు కార్యకలాపాలను విస్తరించలేకపోతున్నాయి. కొనుగోళ్ల బాటలో దీంతో ఎఫ్ఎంసీజీ కంపెనీలు హెచ్‌యూఎల్, గోద్రెజ్ ఆగ్రోవెట్, ఐటీసీ చిన్న సంస్థలను సొంతం చేసుకుంటున్నాయి. దీంతో చిన్నతరహా సంస్థలు తమ ప్రొడక్టులను విస్తారిత మార్కెట్లో పరిచయం చేసేందుకు వీలు కలుగుతోంది. ఇటీవల స్కిన్‌కేర్ బ్రాండ్ మినిమలిస్ట్‌ను హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) సొంతం చేసుకోగా.. గోద్రెజ్ ఆగ్రోవెట్.. క్రీమ్‌లైన్ డెయిరీను కొనుగోలు చేసింది. హెచ్‌యూఎల్ తెలంగాణలో పామాయిల్ క్షేత్రాన్ని కొనుగోలు చేసింది. తద్వారా సబ్బులు తదితర ప్రొడక్టుల తయారీలో పామాయిల్ అవసరాలను సర్దుబాటుచేసుకోనుంది. ఈ బాటలో తాజా గా ప్లాస్టిక్ రీసైక్లింగ్ సంస్థ.. లుక్రో ప్లాస్టిసైకిల్లో వాటా కొనుగోలు చేసింది. తద్వారా భవిష్యత్‌లో ఎఫ్ఎంసీజీ కంపెనీలకు తప్పనిసరికానున్న ప్లాస్టిక్ రీసైక్లింగ్ నిబంధనల అమలుకు హెచ్‌యూఎల్ దారి ఏర్పాటు చేసుకుంటున్నట్లు విశ్లేషకులు వివరించారు. మామాఎర్త్ లిస్టింగ్.. దశలవారీగా 100 శాతం వాటా కొనుగోలు చేస్తున్న డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ గూటికి.. ఫ్రోజెన్, రెడీటు ఈట్ ఆహార ప్రొడక్టుల కంపెనీ ప్రసుమ చేరనుంది. తొలుత 43.8 శాతం వాటాతో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి వాటాను ఐటీసీ సొంతం చేసుకోనుంది. ఇప్పటికే మరో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామీ.. పురుషుల సౌందర్య పోషక సంస్థ హీలియోస్ లైఫ్‌స్టైల్(ద మ్యాన్ కంపెనీ)ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇదేవిధంగా చింగ్స్ సీక్రెట్, స్మిత్ అండ్ జోన్స్ బ్రాండ్ల కంపెనీ క్యాపిటల్ ఫుడ్స్‌ను టాటా గ్రూప్ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ చేజిక్కించుకుంది. తద్వారా ఆర్గానిక్, హెల్త్ ఫుడ్ విభాగంలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. కాగా.. మామాఎర్త్ బ్రాండ్ ప్రొడక్టుల డీటూసీ కంపెనీ హోనసా కన్జ్యూమర్ డిజిటల్ మార్గంలో వినియోగదారులను ఆకట్టుకుంటున్నప్పటికీ ఆఫ్‌లైన్‌లో విస్తరించడంలో సవాళ్ల కారణంగా వృద్ధి పరిమితమవుతున్నట్లు విశ్లేషకులు వివరించారు. వెరసి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ కంటే ఎఫ్ఎంసీజీ దిగ్గజాల ద్వారా అధిక నిధులు, విస్తరణకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రీమియం ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ బ్రాండ్ ఇందులేఖను హెచ్‌యూఎల్ కొనుగోలు చేయడంతో పరిమితస్థాయి నుంచి బయటపడి భారీస్థాయిలో అమ్మకాలు సాధిస్తుండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ బాటలో మినిమలిస్ట్ ప్రొడక్టులు సైతం వేగవంత వృద్ధి సాధించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు కొంతకాలంగా ప్రత్యేక తరహా చిన్నకంపెనీలపై దృష్టి పెట్టాయి. డిజిటల్ బ్రాండ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న సంస్థల కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నాయి. తద్వారా జెన్‌జెడ్ వినియోగదారులకూ చేరువ అవుతున్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. అదనపు 2 శాతం డీఏ పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.దీంతో ప్రస్తుతం ఉన్న డియర్నెస్ అలవెన్స్ (డీఏ) 53 శాతం నుంచి 55 శాతానికి పెరిగినట్లైంది. రెండు శాతం డీఏ పెంపు ద్వారా 48.56 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 66.55 లక్షల మంది పెన్షనర్లకు లాభం చేకూరనుంది. తాజా కేబినెట్ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై రూ.6వేల 614 కోట్ల భారం పడనుండగా.. పెరిగిన డీఏ జనవరి 2025 నుంచి అమల్లోకి రానుంది. రైతులపై భారం తగ్గించేందుకు రైతులపై భారం తగ్గించేందుకు పోషక ఆధారిత ఎరువులపై సబ్సిడీ ఇస్తున్న కేంద్రం ఇస్తుంది. అయితే, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పోషక ఆధారిత పీఅండ్‌కే ఎరువులకు సబ్సిడీ (రూ. 37,216 కోట్లు) మంజూరు చేసింది. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సీడీ పథకం కింద 28 రకాల పోషక ఆధారిత ఎరువుల గరిష్ట చిల్లర ధరను తయారీదారులు/దిగుమతిదారులు తగినంత స్థాయిలో నిర్ణయించేందుకు అనుమతి ఇచ్చింది. కోవిడ్ సంవత్సరాల నుండి, అంతర్జాతీయ మార్కెట్లో అధిక స్థాయికి డీఏపీ ధరలు పెరిగాయి. తాజాగా, కేబినెట్లో రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు, ధరల అస్థిరత ప్రభావాన్ని తగ్గించేందుకు డీఏపీ గరిష్ట చిల్లర ధర 50 కిలోల బ్యాగ్‌కు రూ.1,350 కు పరిమితం చేసింది. -
ఆర్థిక తారతమ్యాల భారతం!
భారత్‌తోపాటు అనేక దేశాల్లో ఆర్థిక అసమానతలు అధికం అవుతున్నాయి. ఏటా కుబేరుల సంపద కోట్ల రూపాయలు పెరుగుతుంది.. పేదవారు మరింత పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. దేశంలో సరిపోను డబ్బులేక చాలామంది ఆకలి చావులు చస్తుంటే.. ఇంకొందరు రాజభోగాలు అనుభవిస్తున్నారు. అయితే ఇలా భోగాలు పొందుతున్నవారి సంఖ్య మాత్రం చాలా తక్కువే. కానీ వారు విధానాలను శాసించే స్థాయికి చేరుతున్నారు. భారత్‌లో కేవలం 284 మంది చేతిలో మొత్తం దేశ జీడీపీలో మూడొంతుల డబ్బు మూలుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల విడుదలైన హురున్ రిచ్ లిస్ట్‌లోని వివరాల ప్రకారం.. 284 మంది కుబేరులకు భారత్ నిలయంగా ఉంది. వీరి మొత్తం సంపద విలువ గతేడాది 10 శాతం పెరిగి రూ.98 లక్షల కోట్లకు చేరింది. భారత దేశ మొత్తం జీడీపీలో (దాదాపు రూ.350 లక్షల కోట్ల) ఇది మూడోవంతు కావడం విశేషం.అత్యంత ధనవంతులపై పన్నులుకొద్ది మంది చేతిలోనే ఇలా అపార సంపద పోగైతే భవిష్యత్తులో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తారతమ్యాలు మరింత పెరిగితే సామాజిక అశాంతి నెలకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అంతరాలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అత్యంత ధనవంతులపై పన్నులు(సూపర్‌రిచ్ ట్యాక్స్) విధించాలంటున్నారు. కుబేరులకు వారసత్వంగా వచ్చే సంపదపై పన్ను విధించాలని సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు.. ఇందుకు సహకరించాలని కోరుతున్నారు.దురదృష్టవశాత్తు పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలను పరోక్షంగా నడిపించేది ధనవంతులే. దాంతో చట్ట సభల్లో వారి సంపదను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే ధైర్యం చేయడానికి ప్రజా ప్రతినిధులు సహకరించడం లేదు. కానీ ఆర్థిక అసమానతల వల్ల భవిష్యత్తులో రాబోయే సామాజిక అశాంతిని దృష్టిలో ఉంచుకుని పటిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉంది.అంతరాన్ని పూడ్చడం ఎలా..భారతదేశ ఆర్థిక అసమతుల్యతను పరిష్కరించడానికి సాహసోపేతమైన చర్యలు అవసరం. సంపద సృష్టి ఒక్కటే సరిపోదనే విషయాన్ని హురున్ రిచ్ లిస్ట్ గుర్తుచేస్తుంది. దానికి అనుగుణంగా సంపదను సమర్థమైన మార్గాల ద్వారా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆక్స్‌ఫామ్, వరల్డ్ ఇన్ఇక్వాలిటీ ల్యాబ్ ప్రతిపాదించిన విధంగా బిలియనీర్లపై సంపద పన్నును అమలు చేయడం వల్ల ఆరోగ్యం, విద్య, పోషకాహార కార్యక్రమాలకు నిధులను సమకూర్చవచ్చు. కేవలం 167 సంపన్న కుటుంబాలపై అదనంగా 2 శాతం పన్ను విధించడం వల్ల జాతీయ ఖజానాలో 0.5 శాతం రాబడి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింపజేయడం, శ్రమ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం వల్ల పేదలకు ఉద్యోగాలు లభిస్తాయని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఉచిత ఆరోగ్య సంరక్షణ, సార్వత్రిక విద్య వంటి ప్రజా సేవలపై పెరిగిన వ్యయం పేదలకు గుదిబండలా మారుతుంది. దీన్ని తగ్గించేలా విధానాలు రూపొందించాలరని చెబుతున్నారు.ఇదీ చదవండి: 29–31 తేదీల్లో ఐటీ ఆఫీస్‌లు ఓపెన్ఏం చేయాలంటే..భారతదేశం 2027 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆకాంక్షిస్తుంది. అయితే ఇలా కుబేరుల సంఖ్య పెంచుకుంటూ, వారి సంపదను లెక్కల్లో చూపుతూ ఈ గణత సాధించడంలో అర్థం లేదు. సామాజిక శైలి, సమగ్ర జీవన ప్రమాణాల్లో మార్పు వస్తూ సంపద సృష్టించగలితేనే మేలు జరుగుతుంది. ఈమేరకు విధానాలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. అటువంటి ప్రయత్నాలు చేయకపోతే కొందరి చేతిల్లోనే సంపద చేరి దేశంలో సామాజిక అశాంతి పెరిగే ప్రమాదం ఉంది. -
29–31 తేదీల్లో ఐటీ ఆఫీస్‌లు ఓపెన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ కార్యాలయాలు మార్చి 29 నుంచి 31వ తేదీ వరకు (సెలవు రోజుల్లోనూ) తెరిచే ఉంటాయని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ముగింపు రోజుల్లో ఆదాయపన్నుకు సంబంధించి పెండింగ్ పనులను పూర్తి చేసుకునేందుకు వీలుగా కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.ఇదీ చదవండి: నెలకు రూ.25,432 స్టైపెండ్‌తో ఇంటర్న్షిప్మార్చి 30న ఉగాది ఆదివారం, 31న రంజాన్ కారణంగా సెలవు కావడం తెలిసిందే. ఆదాయపన్ను శాఖకు సంబంధించి మిగిలిపోయిన పనులను పూర్తి చేసుకునేందుకు కార్యాలయాలను తెరిచి ఉంచుతున్నట్టు సీబీడీటీ తెలిపింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజు అయిన మార్చి 31న ప్రభుత్వ చెల్లింపులను పూర్తి చేయాల్సి ఉంటుంది. 2023–24 అసెస్మెంట్ సంవత్సరం అప్డేటెడ్ ఐటీఆర్‌లు దాఖలు చేసే గడువు కూడా మార్చి 31తో ముగియనుంది. ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే అన్ని బ్యాంక్‌లు మార్చి 31న కార్యకలాపాలు నిర్వహించాలంటూ ఆర్బీఐ సైతం ఆదేశించడం గమనార్హం. -
అనిశ్చితులున్నా ఎగుమతులు మిన్న
ప్రపంచ వాణిజ్యం, టారిఫ్‌లపై అనిశ్చితులున్నప్పటికీ రానున్న కాలంలో భారత్ నుంచి ఎగుమతులు వృద్ధి పథంలోనే సాగనున్నట్లు విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ సంతోష్ కుమార్ సారంగి పేర్కొన్నారు. అయితే ఇందుకు ఎగుమతిదారులు వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకుని వ్యూహాత్మకంగా విచక్షణతో వ్యవహరించవలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత వాతావరణం భారత్‌కు బంగారంలాంటి అవకాశాలను కల్పిస్తుందని తెలియజేశారు.తయారీలో పోటీతత్వాన్ని పెంచుకోవడంతోపాటు.. ఎగుమతులు పుంజుకునేందుకు వైవిధ్యాన్ని చూపవలసి ఉంటుందని దేశీ ఎగుమతి సంస్థల సమాఖ్య(ఎఫ్ఐఈవో) ఏర్పాటు చేసిన సోర్సెక్స్ ఇండియా 2025 షోలో సంతోష్ వివరించారు. చైనా తదితర దేశాలపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లకు తెరతీసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 2 నుంచి వీటిని భారత్‌కు సైతం వర్తింపచేయనున్నారు. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న అమెరికా టారిఫ్‌ల విధింపు నేపథ్యంలో కొన్ని ఎగుమతి సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. యూఎస్‌కు ప్రధానంగా ఇంజినీరింగ్, ఫార్మా ఎగుమతులు దెబ్బతినవచ్చని కొన్ని కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: భాగ్యనగరంలో రియల్టీ ఎలా ఉందంటే..ప్రస్తుత ఏడాదిలో భారత్ వస్తు, సేవల ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను దాటనున్నట్లు సంతోష్ పేర్కొన్నారు. గతేడాది ఇవి 778 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు తెలియజేశారు. ఇటీవల కొద్ది నెలలుగా ఎగుమతుల్లో మందగమనం నెలకొన్నప్పటికీ దీర్ఘకాలంలో పుంజుకోగలవని అభిప్రాయపడ్డారు. ఆర్డర్లపై పెరుగుతున్న విచారణలు సానుకూల అంచనాలకు దారి చూపుతున్నట్లు తెలియజేశారు. వెరసి భవిష్యత్‌లో ఎగుమతులు వృద్ధి బాటలో సాగగలవని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. -
కొత్త ఏడాదిలో ఎంపీసీ సమావేశం షెడ్యుల్ విడుదల
కొత్త ఆర్థిక సంవత్సరం(2025-26) ఏప్రిల్ 1, 2025 నుంచి ప్రారంభం అవుతుంది. వచ్చే ఏడాదికి సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశ షెడ్యూల్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. ఎంపీసీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటారు. దేశ ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ధరల స్థిరత్వాన్ని కొనసాగించడానికి, ద్రవ్య విధానాన్ని రూపొందించేందుకు ఇందులో నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎంపీసీ సమావేశం జరిగే తేదీలు కింది విధంగా ఉన్నాయి.ఆర్బీఐ వచ్చే ఏడాదిలో ఆరుసార్లు ఎంపీసీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. మొదటి సమావేశం 2025 ఏప్రిల్ 7-9 తేదీల్లో జరగనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చివరి ఎంపీసీ సమావేశం 2025 ఫిబ్రవరిలో కొత్త ఆర్బీఐ బాస్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరిగింది. ఇందులో చాలాకాలం తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి చేర్చారు.2025-26లో ఎంపీసీ సమావేశాల తేదీలు2025 ఏప్రిల్ 7, 8, 92025 జూన్ 4, 5, 62025 ఆగస్టు 5, 6, 72025 సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 12025 డిసెంబర్ 3, 4, 52026 ఫిబ్రవరి 4, 5, 6ఆర్థిక వ్యవస్థ అంతటా రుణాలు, డిపాజిట్ రేట్లను ప్రభావితం చేసే రెపో రేటును నిర్ణయించడానికి ఎంపీసీ ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశమవుతుంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, కరెన్సీని స్థిరీకరించడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి దాని నిర్ణయాలు కీలకంగా మారుతాయి.ఇదీ చదవండి: ప్రభుత్వ ట్యాక్సీలు వస్తున్నాయ్..ఆర్బీఐ ఎంపీసీ సభ్యులు వీరే..ఎంపీసీ సమావేశాల్లో మొత్తం ఆరుగురు సభ్యులుంటారు. అందులో ముగ్గురు సభ్యులు సెంట్రల్ బ్యాంక్‌కు చెందినవారు ఉంటారు. అందులో గవర్నర్ మానిటరీ పాలసీ సమావేశానికి ఇన్ఛార్జీగా, డిప్యూటీ గవర్నర్, ఆర్బీఐ బోర్డు ఎంపిక చేసిన మరొక అధికారి ఉంటారు. మరో ముగ్గురిని ప్రభుత్వం నియమిస్తుంది. ఈ కమిటీకి ఆర్బీఐ గవర్నర్ నేతృత్వం వహిస్తారు. ప్రస్తుతం ఉన్న సభ్యులు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ రంజన్, డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వర్ రావు, నగేష్ కుమార్, సౌగతా భట్టాచార్య, ప్రొఫెసర్ రామ్ సింగ్ ఉన్నారు. -
భారత్‌పై యూఎస్ దూకుడుగా వ్యవహరిస్తుందా..?
ప్రతిపాదిత అమెరికా సుంకాల నుంచి భారత్‌కు కొంతమేర ఉపశమనం లభించవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలపై యూఎస్ విధిస్తున్న సుంకాల మాదిరిగా కాకుండా కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అమెరికా-ఇండియా మధ్య వాణిజ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని, ప్రతిష్టంభన ఏర్పడే సూచనలు కనిపించడం లేదన్నారు.కొత్త వాణిజ్య చర్యలను దశలవారీగా అమలు చేయడానికి వీలుగా అనువైన విధానాన్ని అధికారులు అన్వేషిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. ఈ ఒప్పందంలో భాగంగా గణనీయమైన వాణిజ్య పరిమాణాలు కలిగిన అధిక డిమాండ్ ఉన్న వస్తువులపై ఒక మోస్తరు సుంకం పెరుగుదలనే చూడవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. దీంతో అమెరికాకు భారత ఎగుమతులపై సుంకాల ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు.మరిన్ని రాయితీలు కావాలని ఒత్తిడిఅమెరికాకు అధిక పరిమాణంలో ఎగుమతి చేసే కొన్ని కీలక రంగాలపై సుంకాలను తగ్గించాలని భారత వాణిజ్య అధికారులు యూఎస్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. మరో మూడు రోజుల్లో కొత్త వాణిజ్య ఒప్పంద వివరాలను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యూఎస్‌తో చర్చలు సానుకూలంగా ఉన్నప్పటికీ అమెరికా భారత్ నుంచి మరిన్ని రాయితీలు కావాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.616 కోట్లు ఎగనామంఇతర దేశాల మాదిరి కాదు..ప్రపంచ వాణిజ్య పునర్వ్యవస్థీకరణల మధ్య అమెరికా తన టారిఫ్ వ్యూహాన్ని సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. చైనా, మెక్సికో, కెనడాల మాదిరిగా కాకుండా భారత్‌ను ప్రత్యేకంగా చూస్తూ కొంతమేర సుంకాల్లో వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది అమెరికాతో భారత్‌కు ఉన్న ప్రత్యేక వాణిజ్య సంబంధాలను హైలైట్ చేస్తుంది. దీంతో భారీగా టారిఫ్ పెంపుపై ఆందోళన చెందుతున్న భారత ఎగుమతిదారులకు ఉపశమనం లభించనుందనే వాదనలున్నాయి. -
బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.616 కోట్లు ఎగనామం
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) రోల్టా ఇండియా లిమిటెడ్‌కు ఇచ్చిన రూ.616.30 కోట్ల రుణాలను తిరిగి చెల్లించకుండా మోసం చేసిందని ప్రకటించింది. ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన రోల్టా 2023 జనవరిలో దివాలా ప్రకటించి వివిధ రుణదాతలకు సుమారు రూ.14,000 కోట్లు బకాయి పడింది. ఈ కేసును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నివేదించారు.రోల్టా ఇండియా లిమిటెడ్ చేసిన రూ.616.30 కోట్ల రుణాల మోసం వివరాలను బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి నివేదించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. సెబీ (ఎల్ఓడీఆర్) రెగ్యులేషన్స్, 2015 కింద బ్యాంక్ రెగ్యులేటరీ కాంప్లయన్స్, అంతర్గత వివరాల వెల్లడి విధానాల్లో భాగంగా బీఓఐ ఈ విషయాన్ని పేర్కొంది. మే 2024 కొన్ని సంస్థల నివేదిక ప్రకారం రోల్టా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నేతృత్వంలోని సంస్థలకు రూ.7,100 కోట్లు, సిటీ గ్రూప్ నేతృత్వంలోని అన్ సెక్యూర్డ్ విదేశీ బాండ్ హోల్డర్లకు మరో రూ.6,699 కోట్లు బకాయి పడింది.ఇదీ చదవండి: మనదే విని‘యోగం’!కార్యకలాపాలు ప్రభావితం కాకుండా చర్యలుబ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.616.30 కోట్ల మొత్తాన్ని పూర్తిగా సమకూర్చినట్లు ఆర్బీఐకి తెలిపిన వివరాల్లో పేర్కొంది. ఈ వర్గీకరణ వల్ల దాని ఆర్థిక పరిస్థితి ప్రభావితం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది. పారదర్శకతను కొనసాగించడానికి, నియంత్రణ నిబంధనలకు కట్టుబడి ఉండటానికి బ్యాంక్ నిబద్ధతతో ఉందని పేర్కొంది. ఏదేమైనా, భారత బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) సమస్యను ఈ పరిణామాలు హైలైట్ చేస్తున్నాయి. ఇది ఆర్థిక సంస్థలకు సవాలుగా మారుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులు తమ రుణ విధానాల్లో తగిన శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. -
మనదే విని‘యోగం’!
శరవేగంగా పెరుగుతున్న వినియోగదారుల సంఖ్య, అధికమవుతున్న చిన్న కుటుంబాలు.. వెరసి ప్రపంచ వినియోగ రాజధానిగా భారత్ అవతరించనుందని ఏంజిల్ వన్ నివేదిక వెల్లడించింది. 2034 నాటికి దేశంలో వినియోగం రెట్టింపు అవుతుందని.. ప్రధాన ఆర్థిక వ్యవస్థలను భారత్ అధిగమిస్తుందని అంచనా వేసింది. వినియోగానికి జనరేషన్ జెడ్ ఆజ్యం పోయనుందని.. అదే సమయంలో పొదుపులు కూడా దూసుకెళ్లనున్నాయని వెల్లడించింది. అంటే కావాల్సిన వస్తుసేవల కోసం పొదుపు చేసుకున్న సొమ్మునే విరివిగా వెచ్చించనున్నారని తెలిపింది. దేశంలో వినియోగం స్థూల దేశీయ ఉత్పత్తిలో (జీడీపీ) 56 శాతం వాటా కలిగి ఉందని పేర్కొంది. ఏంజెల్ వన్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం..అనవసరపు ఖర్చుల పెరుగుదల వైపు..ఇటీవలి కేంద్ర బడ్జెట్లో పన్ను ఊరట కారణంగా ప్రజల చేతుల్లోకి రూ.లక్ష కోట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయని అంచనా. దీంతో వినియోగం రూ.3.3 లక్షల కోట్లు పెరుగుతుందని.. ఇది దేశ జీడీపీని 1% పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, చైనాలో అనవసర ఖర్చులు అవసరాలను అధిగమించాయి. సగటు ఆదాయం పెరగనుండటంతో భారతదేశంలోనూ ఆ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. అమెరికాలో గతంలో తలసరి ఆదాయం బాగా పెరిగిన సమయంలో.. వినియోగ వ్యయం 10 రెట్లు పెరగడం గమనార్హం. తలసరి ఆదాయం పెరిగే కొద్దీ భారత వినియోగంలో కూడా ఇదే విధమైన వృద్ధిని చూడవచ్చని ఏంజెల్ వన్ నివేదిక పేర్కొంది.జెనరేషన్ జెడ్ తరంతో..కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఉపకరణాలు (ఆభరణాలు సహా), ఎక్స్‌పీరియెన్స్ కోసం వినియోగదారులు అధికంగా ఖర్చు చేయనున్నారని నివేదిక పేర్కొంది. దేశంలో ఇప్పటికీ 92శాతం రిటైల్ వ్యాపారం కిరాణా దుకాణాల ద్వారానే జరుగుతోందని... మార్కెట్ వాటాను పెంచుకోవడానికి ఆధునిక రిటైల్‌కు భారీ అవకాశం ఉందని తెలిపింది. యూఎస్ మొత్తం జనాభాను మించి భారత్‌లో జనరేషన్ జెడ్ తరం (1996–2012 మధ్య పుట్టినవారు) ఉంది. 2035 నాటికి భారత్‌లో చేసే ఖర్చులో సగం జనరేషన్ జెడ్ తరం నుంచే ఉంటుందని.. భారత వినియోగ వృద్ధి పథానికి ఇది తోడ్పడుతుందని నివేదిక తెలిపింది.ఇదీ చదవండి: ‘ఆర్థిక సేవలకు నియంత్రణలు అడ్డు కారాదు’103 ట్రిలియన్ డాలర్లకు..మన దేశంలో చిన్న కుటుంబ ధోరణుల కారణంగా.. జనాభా పెరుగుదల కంటే ఇళ్ల సంఖ్యలో వృద్ధి ఎక్కు వగా ఉంటోంది. ఇది అధిక వినియోగానికి కీలక చోదకంగా మారుతోంది. ప్రపంచ శ్రామిక శక్తి వృద్ధిలో కూడా భారత్ ముందుండబోతోంది. రాబో యే 25 ఏళ్లలో భారత్‌లో పొదుపులు (సేవింగ్స్) గత 25 సంవత్సరాల మొత్తం పొదుపు కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటాయి. 1997 నుంచి 2023ఆర్థిక సంవత్సరం మధ్య దేశంలో మొత్తం సేవింగ్స్ 12 ట్రిలియన్ డాలర్లు (రూ.10,32,00,000 కోట్లు) అయితే.. 2047 నాటికి 103 ట్రిలియన్ డాలర్లకు (రూ.88,58,00,000 కోట్లు) చేరుకుంటాయని అంచనా. వినియోగం భారీ స్థాయిలో పెరిగేందుకు ఇది దోహదం చేయనుంది. -
ప్రైవేటు పెట్టుబడులపై ఆర్థిక శాఖ కామెంట్
అంతర్జాతీయ అనిశ్చితుల నుంచి తట్టుకుని, బలమైన వృద్ధితో ముందుకెళ్లేందుకు దేశంలో ప్రైవేటు పెట్టుబడులు పెరగాల్సిన అవసరాన్ని ఆర్థిక శాఖ ప్రస్తావించింది. బలమైన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ వల్ల ప్రైవేటు రంగం ప్రయోజనం పొందాలని సూచించింది. తమ పెట్టుబడుల వ్యయాలు–వినియోగ డిమాండ్ మధ్య ఉండే సంబంధాన్ని పరిశ్రమ గుర్తించడం అవసరమని పేర్కొంది. ఈ మేరకు ఫిబ్రవరి నెల ఆర్థిక సమీక్షా నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది.బడ్జెట్లో ఆదాయపన్ను పరంగా కల్పించిన ఉపశమనం, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపుతో వినియోగం పుంజుకుంటుందని అంచనా వేసింది. ఈ సంకేతాలను ప్రైవేటు రంగం గుర్తించి సామర్థ్య విస్తరణపై పెట్టుబడులతో ముందుకు రావాలని పిలుపునిచ్చింది. అప్పుడు 2025–26లో బలమైన ఆర్థిక వృద్ధి సాధ్యపడుతుందని అంచనా వేసింది. ‘వ్యక్తిగత ఆదాయపన్ను నిర్మాణంలో చేసిన మార్పులతో మధ్యతరగతి ప్రజల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయం మిగులు పెరుగుతుంది. ఇది వినియోగాన్ని పెంచుతుంది. ఫిబ్రవరిలో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం, మెరుగైన లిక్విడిటీ పరిస్థితులు వృద్ధిని ఊతమిస్తాయి’ అని ఆర్థిక శాఖ తన అభిప్రాయాలను పేర్కొంది. దీర్ఘకాల చర్యలు ఫలితమిస్తాయి..దీర్ఘకాల అభివృద్ధికి సంబంధించి చేపట్టిన చర్యలు, సంస్కరణలు, వికసిత్ భారత్ ఆకాంక్ష.. అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం విశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆర్థిక శాఖ నివేదిక పేర్కొంది. ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో ఏడు నెలల కనిష్టానికి తగ్గడాన్ని ప్రస్తావించింది. 2024–25లో రికార్డు స్థాయి పంటల దిగుబడి రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగొచ్చేందుకు సాయపడుతుందని అంచనా వేసింది. ప్రధాన వస్తు ఎగుమతులు 2024–25లో 8.2 శాతం పెరగడాన్ని గుర్తు చేసింది. అదే ఏడాది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 12.4 శాతం వృద్ధి చెందినట్టు పేర్కొంది. ప్రస్తుతమున్న విదేశీ మారకం నిల్వలు 11 నెలల దిగుమతి అవసరాలకు సరిపోతాయని తెలిపింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య విధానాల్లో మార్పులను (టారిఫ్‌లు) ప్రస్తావిస్తూ.. అలాంటి తరుణంలోనూ 2024–25లో డిసెంబర్ (క్యూ3) త్రైమాసికంలో జీడీపీ వృద్ధి కోలుకోవడాన్ని ఈ నివేదిక గుర్తు చేసింది. ప్రైవేటు వినియోగం పుంజుకోవడం, కీలక వస్తు ఎగుమతులు పెరగడం మేలు చేసినట్టు తెలిపింది. ‘‘బలమైన వ్యవసాయ కార్యకలాపాలు గ్రామీణ డిమాండ్‌కు మద్దతునిస్తాయి. 2024–25 చివరి త్రైమాసికంలోనూ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నట్టు ముఖ్యమైన సంకేతాలు సూచిస్తున్నాయి’’అని వివరించింది.ఇదీ చదవండి: ‘ఆర్థిక సేవలకు నియంత్రణలు అడ్డు కారాదు’ఎగుమతులు మెరుగుపడడం, ప్రభుత్వ మూలధన వ్యయాలను పెంచడం ఇందుకు మద్దతునిస్తాయని అభిప్రాయపడింది. సేవల రంగం పనితీరు సైతం బలంగా ఉన్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా అనిశి్చతులు ఉన్నప్పటికీ 2024–25లో 6.5 శాతం వృద్ధి నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. వృద్ధి రేటు సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన 5.6 శాతం నుంచి డిసెంబర్ క్వార్టర్లో 6.2 శాతానికి పెరగడాన్ని గుర్తు చేసింది. ద్రవ్య స్థిరీకరణ, సంక్షేమం, వృద్ధి పరంగా ఆర్థిక వ్యవస్థలో చక్కని సమతుల్యత కొనసాగుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. -
‘ఆర్థిక సేవలకు నియంత్రణలు అడ్డు కారాదు’
ముంబై: అందరికీ ఆర్థిక సేవలను మరింత చేరువ చేసే విషయమై నియంత్రణలు అనవసర అడ్డంకులు కల్పించరాదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యాఖ్యానించారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) కార్యక్రమంలో భాగంగా మల్హోత్రా మాట్లాడారు. విధాన నిర్ణేతలు సైతం తమ చర్యల్లో అత్యుత్సాహం లేకుండా జాగ్రత్త వహించాలని.. చట్టబద్దమైన కార్యక్రమాలను అణచివేసేలా ఉండకూడదన్నారు. కస్టమర్ల హక్కులు, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యహరించాలని సూచించారు.ఆర్థిక సేవల చేరువలో భారత్ ఎంతో ప్రగతి సాధించిందంటూ.. వయోజనుల్లో 94 శాతం మందికి నేడు బ్యాంక్ ఖాతా ఉన్న విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు. చట్టాలు, నిబంధనలు కేవలం చట్టవిరుద్ధమైన వాటినే లక్ష్యంగా చేసుకోవాలన్నారు. అంతేకానీ, నిజాయితీ పరులను ఇబ్బంది పెట్టకూడదన్నారు. మనీలాండరింగ్ (నల్లధన చలామణి), ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆర్థిక వ్యవస్థను భద్రంగా కొనసాగించేందుకు వీలుగా.. విధాన నిర్ణేతలు అత్యుత్సాహ చర్యలకు దూరంగా ఉండాలన్నారు.ఇదీ చదవండి: ఐటీ షేర్లకు ఏమైంది?రిస్క్ తీసుకునే ధోరణి ఆర్థిక వ్యవస్థకు ఫలితాన్నిస్తుందంటూ.. అదే సమయంలో ప్రజలు, వ్యాపారాలపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కస్టమర్లను అదే పనిగా మళ్లీ మళ్లీ కేవైసీ అప్డేషన్ కోసం ఒత్తిడి చేయొద్దని సూచించారు. టెక్నాలజీతో వ్యాపార సులభతర నిర్వహణ మెరుగుపడడమే కాకుండా.. మనీలాండరింగ్, అక్రమ రుణ వ్యాపార మార్గాలకు దారితీసినట్టు చెప్పారు. అక్రమ ఆర్థిక కార్యకలాపాలను అడ్డుకునేందుకు వీలుగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. -
9 కోట్లకు ఎంఎస్ఎంఈలు
న్యూఢిల్లీ: దేశీయంగా రిజిస్టర్డ్ చిన్న, మధ్య తరహా సంస్థల సంఖ్య 2029 నాటికి 9 కోట్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నట్లు ఎంఎస్ఎంఈ శాఖ సంయుక్త కార్యదర్శి మెర్సీ ఇపావో తెలిపారు. ప్రస్తుతం ఉద్యమ్, ఉద్యమ్ అసిస్ట్ పోర్టల్స్‌లో నమోదు చేసుకున్న ఎంఎస్ఎంఈల సంఖ్య 6 కోట్ల పైగా ఉన్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా చిన్న సంస్థలను సంఘటితం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పరిశ్రమల సమాఖ్య అసోచాం కార్యక్రంలో పాల్గొన్న సందర్భంగా మెర్సీ వివరించారు. పెద్ద సంస్థలతో పోలిస్తే వీటికి బ్యాంకు రుణాల వితరణ వేగంగా పెరుగుతోందని ఆమె వివరించారు. స్థూల దేశీయోత్పత్తిలో ఎంఎస్ఎంఈల వాటా 30 శాతంపైగా, తయారీలో 36 శాతం, ఎగుమతుల్లో 45% పైగా ఉంటోంది. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ .. అంతర్జాతీయంగా ఉత్పత్తుల తయారీ వ్యవస్థలో దేశీ ఎంఎస్ఎంఈలు మరింతగా భాగం అయ్యేలా చూడటంపై కసరత్తు చేస్తున్నట్లు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం మరో కార్యక్రమంలో తెలిపారు. సాధారణంగా పెద్ద కంపెనీలతో పోలిస్తే చిన్న సంస్థలపైనే నియంత్రణల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నియంత్రణలను సరళతరం చేయడంపై క్యాబినెట్ కార్యదర్శి సారథ్యంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటైనట్లు వివరించారు. ఎంఎస్ఎంఈల కోసం డీఎక్స్ఎడ్జ్ (డిజిటల్ ఎక్సలెన్స్ ఫర్ గ్రోత్ అండ్ ఎంటర్ప్రైజ్) ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా సుబ్రహ్మణ్యం ఈ విషయాలు చెప్పారు. చిన్న సంస్థలు పోటీతత్వాన్ని పెంచుకునేందుకు, భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా పటిష్టమయ్యేందుకు ఉపయోగపడే వనరులు ఇందులో ఉంటాయని వివరించారు. -
ఈ దేశాన్ని విడిచి వెళ్లిపోతాం..
ముంబై: దేశంలోని అత్యంత ధనవంతుల్లో 22 శాతం మంది ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. విదేశాల్లో మెరుగైన జీవన పరిస్థితులు, వ్యాపార అనుకూల వాతావరణం వారిని ఆకర్షిస్తున్నాయి. 150 మంది అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (అల్ట్రా హెచ్ఎన్ఐలు) అభిప్రాయాలను కోటక్ ప్రైవేటు (వెల్త్ మేనేజర్), ఈవై ఇండియా సర్వే చేశాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, యూఏఈ దేశాల్లో స్థిరపడేందుకు ఎక్కువ మంది అల్ట్రా హెచ్ఎన్ఐ భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా దేశాలు ఆఫర్ చేస్తున్న గోల్డెన్ వీసా పథకం అనుకూలంగా ఉన్నట్టు కోటక్–ఈవై నివేదిక తెలిపింది. ఏటా 25 లక్షల మంది విదేశాలకు వలసపోతున్న గణాంకాలను ప్రస్తావించింది. సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురు అల్ట్రా హెచ్ఎన్ఐలలో ఒకరు విదేశాలకు వలసపోయే ప్రణాళికతో ఉన్నట్టు తెలిసింది. వీలైతే అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని, అదే సమయంలో భారతీయ పౌరసత్వాన్ని కొనసాగించుకునే ఆలోచనతో ఉన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు, ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలు, విద్య, జీవనశైలి ఇలా అన్నింటా విదేశాల్లో మెరుగైన ప్రమాణాలను వారు కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రతి ముగ్గురిలో ఒకరు విదేశాల్లో వ్యా పార నిర్వహణలో ఉండే సౌలభ్యం తమను ఆకర్షిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్యం, శ్రేయ స్సుకు వీరు ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. పిల్లల విద్యకూడా కారణమే.. విదేశాలకు వలసపోవాలన్న నిర్ణయాన్ని భవిష్యత్ పెట్టుబడిగా ఈ సర్వే నివేదిక అభివర్ణించింది. వారి పిల్లలకు అత్యుత్తమ ఉన్నత విద్య సదుపాయం సైతం వారిని ఆ దిశగా నడిపించొచ్చని పేర్కొంది. ‘‘విదేశాలకు వలసపోవాలన్న నిర్ణయాన్ని పెట్టబడులు తరలిపోవడంగా చూడరాదు. ఈ తరహా కార్యకలాపాలపై పరిమితులు విధించడం ద్వారా పౌరసత్వ హోదా మారినప్పటికీ వారి పెట్టుబడులు తరలిపోకుండా చూడొచ్చు. భారత్‌లో నివసించే పౌరుడు ఏడాదికి ఇంటికి తీసుకెళుతున్నది సగటున 2,50,000 డాలర్లే. అదే విధంగా నాన్ రెసిడెంట్‌ను సైతం ఏటా మిలియన్ డాలర్లనే తీసుకెళ్లేందుకు అనుమతించడం వల్ల పెట్టుబడులు తరలిపోవు’’అని కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రెసిడెంట్ గౌతమి గవంకర్ అభిప్రాయపడ్డారు. వ్యాపారవేత్తల కంటే వృత్తి నిపుణులే ఎక్కువగా విదేశాలకు వలసపోయే ఉద్దేశంతో ఉన్నారు. అది కూడా అల్ట్రా హెచ్ఎన్ఐలలో 36–40 ఏళ్ల వయసులోని వారు, 61 ఏళ్లపైన వయసువారు వలసవెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2.83 లక్షల అల్ట్రా హెచ్ఎన్ఐలు 2023 నాటికి మన దేశంలో 2.83 లక్షల మంది అల్ట్రా హెచ్ఎన్ఐలు ఉన్నారు. ఒక్కొక్కరి నెట్‌వర్త్ (నికర సంపద విలువ) రూ.25 కోట్లకు పైన ఉండడాన్ని ప్రామాణికంగా తీసుకుని, వీర జనాభా లెక్కగట్టారు. వీరందరి ఉమ్మడి సంపద విలువ రూ.2.83 లక్షల కోట్లుగా ఉంది. 2028 నాటికి అల్ట్రా హెచ్ఎన్ఐల సంఖ్య 4.3 లక్షలకు పెరుగుతుందని, వీరి నిర్వహణలోని సంపద రూ.359 లక్షల కోట్లకు విస్తరిస్తుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. బలమైన ఆర్థిక వృద్ధి, అధిక వినియోగం, పనిచేయతగిన యువ జనాభా ఎక్కువగా ఉండడం అల్ట్రా హెచ్ఎన్ఐల విభాగం వృద్ధికి అనుకూలిస్తాయని తెలిపింది. -
పీఎస్‌యూల్లో వాటా విక్రయం వాయిదా
ప్రస్తుత మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా రాబోయే నెలల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్ఈ) వాటాల విక్రయం విషయంపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనలు ఉన్నప్పటికీ మార్కెట్ పరిస్థితులను బట్టి ప్రణాళికాబద్ధమైన ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్-లిస్టెడ్ కంపెనీల్లో వాటా విక్రయం)ను ఒకటి నుంచి రెండు నెలలు వాయిదా వేయవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను చేరుకోవాలని గతంలోనే నిర్ణయించుకున్నారు. అయితే చాలా కంపెనీల షేర్లు 2024 నమోదైన గరిష్ట స్థాయులతో పోలిస్తే 30 శాతం నుంచి 60 శాతం వరకు క్షీణించాయి. ప్రస్తుతం యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో కొంత వాటాను తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సంస్థాగత వాటా విక్రయ ప్రక్రియ ద్వారా రూ.1,436 కోట్లు సమీకరించగా, మిగిలిన మూడు బ్యాంకుల్లో వాటా విక్రయాలకు సిద్ధంగా ఉంది. మార్కెట్ ఒడిదొడుకుల నేపథ్యంలో అందుకు మరో రెండు నెలల వరకు సమయం పట్టవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: భారత ఆర్థిక వ్యవస్థ భేష్డివిడెండ్ల రూపంలో రూ.1.4 లక్షల కోట్లువాటాల అమ్మకాలు మందగించినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీఎస్ఈ డివిడెండ్ల నుంచి గణనీయమైన రాబడిని సమకూర్చడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. సీపీఎస్ఈలు 2025 మార్చి 31 నాటికి మేజర్ వాటాదారుగా ఉన్న ప్రభుత్వంతోపాటు ఇతర పెట్టుబడిదారులకు సుమారు రూ.1.40 లక్షల కోట్ల విలువైన డివిడెండ్లను పంపిణీ చేస్తాయని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రభుత్వానికి సీపీఎస్ఈల నుంచి డివిడెండ్ల రూపంలో రూ.70,000 కోట్లు, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.9,300 కోట్లు సమకూరినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. -
భారత ఆర్థిక వ్యవస్థ భేష్
భారత ఆర్థిక వ్యవస్థ వైవిధ్యంతో ఎంతో బలంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజా నివేదిక తెలిపింది. వేగవంతమైన ఆర్థిక వృద్ధితో విపత్తును (కరోనా) తట్టుకుని నిలబడిందని పేర్కొంది. ప్రపంచబ్యాంక్‌తో కలసి ఐఎంఎఫ్ భారత ఆర్థిక వ్యవస్థపై సమగ్ర విశ్లేషణ చేసింది. ఈ నివేదికను విడుదల చేయగా ఆర్బీఐ దీన్ని స్వాగతిస్తున్నట్టు ప్రకటించింది.‘భారత ఆర్థిక వ్యవస్థ 2010 తర్వాత ఎన్నో కష్టాలను అధిగమించింది. మహమ్మారిని తట్టుకుని నిలబడింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల రుణ వితరణ పెరిగింది’ అని ఈ నివేదిక వివరించింది. తీవ్రమైన స్థూల ఆర్థిక వాతావరణంలోనూ మోస్తరు రుణ వితరణకు మద్దతుగా బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల వద్ద తగినన్ని నిధులున్నట్టు పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీలకు సైతం బ్యాంకుల మాదిరే లిక్విడిటీ కవరేజీ రేషియో (ఎల్‌సీఆర్)ను అమలు చేయడాన్ని ప్రశంసించింది. రిస్క్‌ల నివారణ, నిర్వహణ పరంగా అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా సెక్యూరిటీల మార్కెట్ నియంత్రణలు మెరుగుపడినట్టు పేర్కొంది. భారత బీమా రంగం సైతం బలంగా వృద్ధి చెందుతున్నట్టు తన నివేదికలో ప్రస్తావించింది.ఇదీ చదవండి: ఎన్పీఏల వేలానికి ప్రత్యేక పోర్టల్ సైబర్ భద్రతా పర్యవేక్షణబ్యాంకుల్లో వ్యవస్థలు, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా భద్రతా చర్యలను సైతం ఐఎంఎఫ్ విశ్లేషించింది. బ్యాంక్‌లకు సంబంధించి అత్యాధునిక సైబర్ భద్రతా పర్యవేక్షణను భారత అధికారులు కలిగి ఉన్నట్టు తెలిపింది. కొన్ని ప్రత్యేకమైన టెస్ట్‌ల నిర్వహణ ద్వారా దీన్ని మరింత బలోపేతం చేయొచ్చని సూచించింది. -
ఎన్పీఏల వేలానికి ప్రత్యేక పోర్టల్
ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌యూ) మొండిబాకీలను (ఎన్పీఏ) వేలం వేసే ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించేందుకు ‘బ్యాంక్‌నెట్’ పేరిట కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. సరికొత్తగా తీర్చిదిద్దిన ఈ–ఆక్షన్ పోర్టల్‌ను ప్రారంభించినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఎన్పీఏ కేసుల పరిష్కార ప్రక్రియను పారదర్శకమైన విధంగా, వేగవంతం చేసేందుకు ఇది తోడ్పడుతుందని మంత్రి వివరించారు.ఆటోమేటెడ్ కేవైసీ సాధనాలు, సురక్షితమైన పేమెంట్ గేట్వేలు, బ్యాంకు ధ్రువీకరించిన ప్రాపర్టీ టైటిల్స్ మొదలైన వాటిని అనుసంధానించడంతో పాటు అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తూ ప్రాపర్టీ వేలం ప్రక్రియ ఆసాంతం అత్యంత పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు, 15 ప్రభుత్వ ప్రాయోజిత రుణాలు, సబ్సిడీ పథకాలను ఒకే చోట అనుసంధానించేందుకు ‘జన సమర్థ్ పోర్టల్’ ఉపయోగపడుతోందని మంత్రి తెలిపారు. దరఖాస్తుదారు డేటాను డిజిటల్‌గా మదింపు చేసే ఈ ప్రక్రియతో రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడం, అనుమతులను పొందడం మరింత సులభతరం అయ్యిందని వివరించారు. ఇదీ చదవండి: టెస్లాను వెనక్కి నెట్టిన బీవైడీ28న ఇండస్‌ఇండ్‌పై నివేదికఇండస్ఇండ్ బ్యాంక్ డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో అకౌంటింగ్ లోపాలను పరిశీలిస్తున్న ఎక్స్టర్నల్ ఆడిటింగ్ సంస్థ పీడబ్ల్యూసీ మార్చి 28న బ్యాంకు బోర్డుకు తమ నివేదికను సమరి్పంచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అకౌంటింగ్ సమస్యలు, వివిధ స్థాయుల్లో లోపాలు, తీసుకోతగిన దిద్దుబాటు చర్యలతో పాటు బ్యాంకునకు వాస్తవంగా ఎత మేర నష్టం వాటిల్లినది కూడా పీడబ్ల్యూసీ తన నివేదికలో పొందుపర్చే అవకాశం ఉన్నట్లు వివరించాయి. దాదాపు రూ. 2,100 కోట్ల అకౌంటింగ్ లోపాల వల్ల సంస్థ నికర విలువపై 2.35 శాతం మేర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ అంచనా వేసింది. అవసరమైన వివరాలన్నీ వెల్లడించి, ప్రస్తుత త్రైమాసికంలోనే దిద్దుబాటు చర్యలు కూడా తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. -
జీడీపీ వృద్ధికి ఎస్అండ్పీ కోత
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తగ్గించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) 6.7 శాతం వృద్ధి నమోదవుతుందన్న గత అంచనాలను తాజాగా 6.5 శాతానికి సవరించింది. 2024–25 సంవత్సరం మాదిరే వృద్ధి అంచనాలను ఇస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే రుతుపవనకాలం సాధారణంగా ఉంటుందని, కమోడిటీ, చమురు ధరలు కనిష్ట స్థాయిల్లోనే ఉంటాయన్న అంచనాల ఆధారంగా ఈ వృద్ధి రేటును ఇస్తున్నట్టు ఎస్అండ్పీ తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గడం, బడ్జెట్లో ప్రకటించిన పన్ను ప్రయోజనాలు, తక్కువ రుణ వ్యయాలు ఇవన్నీ భారత్‌లో విచక్షణారహిత వినియోగాన్ని పెంచుతాయని అంచనా వేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంపై అమెరికా టారిఫ్‌ల పెంపు ప్రభావం, ప్రపంచీకరణ నుంచి వెనక్కి తగ్గడం వంటి సవాళ్లను ప్రస్తావించింది. అయినప్పటికీ వర్ధమాన దేశాల్లో చాలా వాటిల్లో దేశీ డిమాండ్ బలంగా కొనసాగుతుందని అంచనా వేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సెంట్రల్ బ్యాంక్‌లు ఈ ఏడాది అంతటా వడ్డీ రేట్లను తగ్గించొచ్చని పేర్కొంది. ఒక శాతం వరకు రేట్ల తగ్గింపు.. ‘‘ఆర్బీఐ వడ్డీ రేట్లను మరో 0.75 శాతం నుంచి 1 శాతం వరకు ప్రస్తుత సైకిల్లో తగ్గించొచ్చు. ద్రవ్యోల్బణం తగ్గడం, తక్కువ చమురు రేట్ల ఫలితంగా ద్రవ్యోల్బణం ఆర్బీఐ లకి‡్ష్యత స్థాయి 4 శాతానికి సమీపంలో 2025–26లో ఉండొచ్చు’’అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తన నివేదికలో వెల్లడించింది. బలమైన దేశీ డిమాండ్‌తో వర్ధమాన దేశాలు నిలదొక్కుకుంటాయని పేర్కొంది. దిగుమతులపై టారిఫ్‌లతో అమెరికా వృద్ధి తగ్గడమే కాకుండా, ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనా వేసింది. దీంతో 2025లో యూఎస్ ఫెడ్ మరొక్కసారే 25 బేసిస్ పాయింట్ల మేర రేటు తగ్గించే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రోడ్డు ప్రమాదాలతో జీడీపీకి నష్టంఏటా 3 శాతం కోల్పోవాల్సి వస్తోంది: గడ్కరీ న్యూఢిల్లీ: దేశంలో ఏటా 5 లక్షల వరకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.. వీటి కారణంగా 3 శాతం జీడీపీని నష్టపోవాల్సి వస్తోందని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. యూఎస్–భారత్ భాగస్వామ్యంతో ఢిల్లీలో రహదారి భద్రతపై ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా మంత్రి మాట్లాడారు. దేశానికి రహదారి ప్రమాదాలు అతి ముఖ్యమైన సమస్యగా ఉన్నట్టు చెప్పారు. ఏటా 4.80 లక్షల రహదారి ప్రమాదాల్లో 1.88 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలిపారు. ఇందులో 10,000 మంది 18 ఏళ్లలోపు ఉంటుండడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.ఇదొక ప్రధానమైన ప్రజారోగ్య సమస్యే కాకుండా, ఏటా 3 శాతం జీడీపీని నష్టపోవాల్సి వస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బలహీన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు) రహదారి ప్రమాదాలకు కారణాల్లో ఒకటిగా పేర్కొన్నారు. ఖర్చు ఆదా చేసుకోవడం, ప్రాజెక్టు నిర్మాణాలను సీరియస్‌గా తీసుకోకపోవడం కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణమవుతన్నట్టు చెప్పారు. రహదారి ప్రమాద బాధితులకు సాయాన్ని ప్రోత్సహించేందుకు నగదు బహుమతి ఇవ్వనున్నట్టు చెప్పారు. ‘‘ప్రమాద బాధితుల సాయానికి ముందుకు వచ్చే మూడో పక్ష వ్యక్తికి రూ.25,000 బహుమతి ఇవ్వాలని నిర్ణయించాం. ప్రమాదం లేదా ప్రమాదం అనంతరం ఎవరైనా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే గరిష్టంగా రూ.1,50,000 లేదా ఏడేళ్ల పాటు చికిత్స వ్యయాలకు చెల్లింపులు చేయనున్నాం’’అని మంత్రి గడ్కరీ వెల్లడించారు. -
ట్రంప్ ఎఫెక్ట్.. కేంద్రం ‘గూగుల్ ట్యాక్స్’ రద్దు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ నిర్ణయాల వల్ల చాలా దేశాలు తమ విధానాలను సమీక్షించుకోవాల్సి వస్తుంది. భారతదేశం కూడా దీనికి మినహాయింపేమీ కాదు. టారిఫ్ బెదిరింపులు చాలా దేశాలు అమలు చేస్తున్న విధానాల్లో మార్పులకు దారితీస్తున్నాయి. అందులో భాగంగా భారత్ తాజాగా 6 శాతం ‘గూగుల్ ట్యాక్స్’ను రద్దు చేయాలని యోచిస్తున్నట్లు నేషనల్ మీడియాలో వార్తాకథనాలు ప్రచురితమయ్యాయి.గూగుల్, మెటా.. వంటి విదేశీ టెక్ కంపెనీలు అందించే ఆన్లైన్ అడ్వర్టైజింగ్ సేవలపై ‘గూగుల్ ట్యాక్స్’ అని పిలువబడే 6 శాతం ఈక్వలైజేషన్ లెవీని భారతదేశం తొలగించే అవకాశం ఉంది. ఫైనాన్స్ బిల్లులో సవరణల నేపథ్యంలో 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ పన్నును రద్దు చేయనున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. 2016లో ప్రవేశపెట్టిన ఈ లెవీ భారత మార్కెట్‌కు గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించే సాధనంగా ఉండేది. విదేశీ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల ఉనికి భారత్‌లో భౌతికంగా లేకపోయినా కేంద్ర ఖజానాకు తమ వాటాను అందించేలా ప్రత్యేకంగా ఈ లెవీని రూపొందించినట్లు సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్టనర్ తుషార్ కుమార్ తెలిపారు. ఆదాయపు పన్నుకు లోబడి ఉన్న దేశీయ సంస్థలు, సంప్రదాయ అంతర్జాతీయ పన్ను నిబంధనలకు లోబడి ఉన్న విదేశీ సాంకేతిక సంస్థల కార్యకలాపాలను సమతుల్యం చేయడమే ఈ లెవీ ప్రాథమిక లక్ష్యమని వివరించారు.గూగుల్ ట్యాక్స్‌ను కేంద్రం ఎందుకు తొలగిస్తుంది?ఈ లెవీ తొలగింపు భారతదేశం డిజిటల్ పన్నుల చట్రంలో మార్పును సూచిస్తుంది. గూగుల్, మెటా వంటి అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలపై పన్ను వివక్షాపూరితంగా ఉందని నిరంతరం అభ్యంతరం వ్యక్తం చేసిన యూఎస్‌తో వాణిజ్య ఘర్షణలను తగ్గించడానికి ఇది వ్యూహాత్మక చర్యగా పరిగణిస్తుందని కుమార్ అన్నారు. గతంలో ఈ లెవీ విదేశీ డిజిటల్ కంపెనీలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపిందనే వాదనలున్నాయి. భారతీయ వ్యాపారాలకు అందించే ఆన్లైన్ అడ్వర్టైజింగ్ సేవల ద్వారా వచ్చే ఆదాయంపై 6 శాతం పన్నును ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చేది. పర్యవసానంగా, ఈ ఖర్చుల భారం ప్రకటనదారులపైనే పడేది. తద్వారా భారతీయ సంస్థలకు డిజిటల్ మార్కెటింగ్ ఖర్చులు పెరిగాయని కుమార్ అన్నారు.ఇదీ చదవండి: రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..టెక్ దిగ్గజాలకు ప్రయోజనం చేకూరుతుందా?ఈక్వలైజేషన్ లెవీ రద్దుతో విదేశీ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లపై పన్ను భారం తగ్గుతుంది. తద్వారా మరింత అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని పెంపొందించవచ్చు. గ్లోబల్ ప్లాట్ఫామ్లో డిజిటల్ అడ్వర్టైజింగ్ సేవలను పొందే భారతీయ వ్యాపారాలపై మార్కెటింగ్ ఖర్చుల భారం తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మరింత డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలను ప్రేరేపిస్తుంది. -
ఆదాయపు పన్ను బిల్లుపై వర్షాకాల సమవేశాల్లో చర్చలు
లోక్‌సభలో కేంద్రబడ్జెట్ 2025-26 సమయంలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లుపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చ జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ట్యాక్సేషన్‌కు సంబంధించి ప్రస్తుతం ఉన్న మదింపు సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం..వంటి నిబంధనలను విలీనం చేస్తూ పన్ను సంవత్సరం అనే ఏకీకృత భావనను ఈ బిల్లులో ప్రవేశపెట్టనున్నారు.ఈ బడ్జెట్ సమావేశాల్లో ఫైనాన్స్ బిల్లు ద్వారా కొన్ని నిబంధనలు, సంస్కరణ చర్యలను ప్రవేశపెట్టామని, వర్షాకాల సమావేశాల్లో ఇవి చర్చకు వస్తాయని ఆశిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చేలా పన్ను వ్యవస్థను హేతుబద్ధీకరించడం ద్వారా భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి, ఆర్థిక బిల్లు వివిధ నిబంధనలను హేతుబద్ధీకరిస్తుంది. వీటిలో పన్ను మినహాయించబడిన మూలం(టీడీఎస్), పన్ను సేకరించిన మూలం(టీసీఎస్) నిబంధనలపై పరిమితులను తగ్గించడం వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: విద్యుత్ వాడుతూ.. మిగిలింది అమ్ముతూ..విలీన కాలాన్ని ఐదేళ్లు పొడిగించడం వల్ల స్టార్టప్‌లు కూడా ప్రయోజనం పొందుతాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. విలీన కాలం అనేది ఒక కంపెనీ అధికారికంగా స్థాపించబడి చట్టబద్ధ సంస్థగా నమోదు చేసేందుకు పట్టే సమయాన్ని సూచిస్తుంది. ఫైనాన్స్ బిల్లు 2025 సవరణలలో భాగంగా ఆన్లైన్ ప్రకటనలపై 6 శాతం ఈక్వలైజేషన్ లెవీని తొలగించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని మంత్రి తెలిపారు. దేశీయ ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన కస్టమ్ డ్యూటీ నిర్మాణాల హేతుబద్ధీకరణ, కోతలను ఆమె పునరుద్ఘాటించారు. కస్టమ్స్ హేతుబద్ధీకరణ వల్ల దిగుమతిదారులకు కూడా ప్రయోజనం కలుగుతుందన్నారు. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4న ముగియనున్నాయి. -
అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల రికవరీ సులభతరం
భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఎవరూ క్లెయిమ్ చేయని డబ్బును తిరిగి చెల్లించేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నాయి. బ్యాంకు ఖాతాదారులు, వారి నామినీలు రూ.78,213 కోట్లకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్లను తిరిగి పొందడంలో సహాయపడటానికి ఒక క్రమబద్ధమైన ప్రక్రియను అవలంబించేందుకు బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సాధారణ దరఖాస్తు ఫారాలు, డాక్యుమెంటేషన్ ప్రక్రియను 2026 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తిగా ఆన్లైన్లో అమలులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నాయి. ఇది భారతీయ బ్యాంకింగ్ రంగంలో మరింత పారదర్శకతను పెంచేందుకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.రాష్ట్రాల బడ్జెట్‌తో సమానంక్లెయిమ్ చేయని డిపాజిట్లు భారత ఆర్థిక వ్యవస్థకు నిరంతర సవాలుగా మారుతున్నాయి. సేవింగ్స్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ఇతర బ్యాంకింగ్ సాధనాల్లో తరచుగా నిధులు పేరుకుపోతున్నాయి. ఖాతాదారులు తమ డబ్బును ఉపసంహరించుకోవడంలో విఫలమైనప్పుడు లేదా నామినీలకు వారి అర్హతల గురించి తెలియనప్పుడు ఇది మరింతగా పెరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరూ క్లెయిమ్ చేయని రూ.78,213 కోట్ల డబ్బు బ్యాంకుల వద్ద మూలుగుతుంది. ఈ మొత్తం కొన్ని రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌తో సమానం ఉండడం గమనార్హం.డిజిటలైజేషన్ వల్ల లాభాలు..ప్రస్తుత నిబంధనల ప్రకారం అన్క్లెయిమ్డ్ నగదును క్లెయిమ్ చేయాలంటే విస్తృతమైన పేపర్ వర్క్, వ్యక్తిగత విజిట్లు ఉంటున్నాయి. దాంతో చాలామంది వీటిని క్లెయిమ్ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. అయితే దీన్ని సరళతరం చేస్తూ కొన్ని కామన్ అప్లికేషన్ ఫారాలను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలున్నాయి. ఇది కార్యరూపం దాలిస్తే బ్యాంకులకు అతీతంగా ఆన్లైన్లో కామన్ వివరాలు నమోదు చేసేందుకు వీలవుతుంది. ఇది ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. దీనితో పాటు అవసరమైన డాక్యుమెంట్ల ప్రామాణీకరణ గందరగోళం, జాప్యాన్ని తగ్గిస్తుంది. నామినీలు లేదా ఖాతాదారులు ఇకపై బ్యాంక్ నిర్దిష్ట పేపర్ వర్క్ కోసం కష్టపడాల్సిన అవసరం ఉండదు.ఇదీ చదవండి: బంగారు ఆభరణాలు అమ్మితే పన్ను చెల్లించాలా?ఇంటర్నెట్ వాడుతున్న వారికి ప్రయోజనం2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ మొత్తం పునరుద్ధరణ ప్రక్రియ ఆన్లైన్లో అందుబాటులోకి రానుంది. ఈ మార్పు దరఖాస్తుదారులు అప్లికేషన్ సమర్పించడానికి, పత్రాలను అప్లోడ్ చేయడానికి, వారి అభ్యర్థనలను తాము ఉన్న ప్రదేశంలో నుంచే ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇటీవలి అంచనాల ప్రకారం 80 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులన్న దేశంలో ఇలా ఆన్లైన్లో క్లెయిమ్ సేవలందించడం ఎంతో తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి ఇది కీలకంగా మారనుందని చెబుతున్నారు. -
యూఎస్ జీడీపీ వృద్ధి అంచనా తగ్గుదల
ఆర్థిక కార్యకలాపాలు మందగించడాన్ని ఎత్తి చూపుతూ 2025 మొదటి త్రైమాసికంలో అమెరికా జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్థికవేత్తలు సవరించారు. వాణిజ్యలోటు పెరగడం, వినియోగదారుల వ్యయం మందగించడం, శీతాకాల కార్యకలాపాలు ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా మారడం ఇందుకు కారణమని చెబుతున్నారు. దిగుమతులు పెరగడం, ఎగుమతులు స్తంభించడంతో వాణిజ్యలోటు రికార్డు స్థాయికి చేరుకుంది. ఒక్క జనవరి 2025లోనే వస్తు, సేవల లోటు 131.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ అసమతుల్యత విదేశీ వస్తువులకు పెరిగిన డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది. పాక్షికంగా సంభావ్య సుంకాల వల్ల వస్తువుల ఎగుమతులు సవాలుగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వినియోగ వ్యయం కూడా బలహీనత సంకేతాలను సూచిస్తుంది. విచక్షణతో ఆలోచించి చేసే ఖర్చు(discretionary categories)పైనే దృష్టి పెడుతున్నారు. చాలా కుటుంబాలు అత్యవసరం కాని కొనుగోళ్ల కంటే అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ద్రవ్యోల్బణ ఆందోళనలు, నిర్దిష్ట జనాభాలో ఆర్థిక ఒత్తిడి వంటి అంశాలు ఈ వైఖరికి దోహదం చేస్తున్నాయి. బ్లూమ్‌బర్గ్ వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ఫోర్కాస్ట్ అంచనాల ప్రకారం ఈ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 1.4% వార్షిక వృద్ధి కనబరిచినప్పటికీ 2024 చివరి మూడు నెలల్లో వృద్ధి 2.3%తో పోలిస్తే చాలా మందగించింది.ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్ల కోత..ఆర్థిక అనిశ్చితి, తీవ్రమైన శీతాకాల వాతావరణం, అసాధారణంగా ఉండే ఫ్లూ సీజన్ వల్ల అనేక ప్రాంతాల్లో రిటైల్ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుంది. అమెరికా సుంకాలు సహా వాణిజ్య విధానాలు ఆర్థిక పరిస్థితులపై కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం, వృద్ధి అనే ద్వంద్వ సవాళ్లను యూఎస్ సెంట్రల్ బ్యాంకు నిశితంగా పరిశీలిస్తూ ద్రవ్య విధాన నిర్ణయాలపై దృష్టి సారిస్తోంది. ఇటీవల ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను ప్రస్తుత స్థాయిలోనే కొనసాగించినప్పటికీ, ఈ ఏడాది చివర్లో వడ్డీరేట్ల కోత ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.ఇదీ చదవండి: బంగారు ఆభరణాలు అమ్మితే పన్ను చెల్లించాలా?ద్వితీయార్ధంలో ఆర్థిక మాంద్యం..?వాణిజ్య ఉద్రిక్తతలు, ద్రవ్య సర్దుబాట్ల పర్యవసానాలతో ఇన్వెస్టర్లు, విధాన నిర్ణేతలు సతమతమవుతున్న నేపథ్యంలో మార్కెట్లో రానున్న రోజుల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఆర్థిక మాంద్యం ప్రమాదాలు పెరగవచ్చని చెబుతున్నారు. అందుకోసం ప్రభుత్వ వ్యూహాత్మక ఆర్థిక జోక్యాలు అవసరమని సూచిస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల డివిడెండ్ అప్
గత ఆర్థిక సంవత్సరం(2023–24) ప్రభుత్వ రంగ బ్యాంకుల డివిడెండ్ చెల్లింపులు 33 శాతం ఎగశాయి. ఉమ్మడిగా రూ.27,830 కోట్లు చెల్లించాయి. ఇది పీఎస్‌యూ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి భారీగా మెరుగుపడినట్లు తెలియజేస్తోంది. అంతక్రితం ఏడాది(2022–23) ప్రభుత్వ బ్యాంకులు డివిడెండ్ రూపేణా రూ.20,694 కోట్లు అందించాయి. వీటితో పోలిస్తే గతేడాది చెల్లింపులు 33 శాతం బలపడ్డాయి. కాగా.. వీటిలో 65 శాతం అంటే రూ.27,830 కోట్లు వాటా ప్రకారం ప్రభుత్వానికి అందించాయి.ఇదేవిధంగా 2022–23లో ప్రభుత్వ వాటాకు పీఎస్‌యూ బ్యాంకులు ఉమ్మడిగా రూ.13,804 కోట్లు చెల్లించాయి. గతేడాది ఎస్బీఐసహా 12 ప్రభుత్వ బ్యాంకులు పీఎస్‌యూ బ్యాంకింగ్ చరిత్రలోనే అత్యధికంగా రూ.1.41 లక్షల కోట్లకుపైగా నికర లాభం ఆర్జించాయి. దీనిలో ఎస్బీఐ వాటా విడిగా 40 శాతంకావడం గమనార్హం! 2022–23లో రూ.1.05 లక్షల కోట్ల నికర లాభం ప్రకటించాయి. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) రూ.1.29 లక్షల కోట్ల నికర లాభం సాధించిన విషయం విదితమే. ఇదీ చదవండి: చైనా ఆర్మీలోకి ‘డీప్‌సీక్’!ఎస్బీఐ 22 శాతం జూమ్గతేడాది ఎస్బీఐ రూ. 61,077 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది సాధించిన రూ. 50,232 కోట్లతో పోలిస్తే 22 శాతం అధికం! పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభం అత్యధికంగా 228 శాతం దూసుకెళ్లి రూ. 8,245 కోట్లను తాకింది. ఈ బాటలో యూనియన్ బ్యాంక్ లాభం 62 శాతం వృద్ధితో రూ. 13,249 కోట్లకు చేరగా.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం 61 శాతం ఎగసి రూ. 2,549 కోట్లయ్యింది. ఇతర సంస్థల లాభాలలో బ్యాంక్ ఆఫ్ ఇండియా 57 శాతం వృద్ధితో రూ. 6,318 కోట్లకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 56 శాతం ఎగసి రూ. 4,055 కోట్లకు, ఇండియన్ బ్యాంక్ 53 శాతం అధికంగా రూ. 2,549 కోట్లకు చేరాయి. 2017–18లో పీఎస్‌బీలు ఉమ్మడిగా రూ. 85,390 కోట్ల నష్టాలు నమోదుచేయగా.. 2023–24కల్లా ఏకంగా రూ. 1,41,203 కోట్ల నికర లాభం ఆర్జించి సరికొత్త రికార్డ్ సాధించడం కొసమెరుపు!! -
రూపాయి రయ్ రయ్
ఏడో రోజూ ర్యాలీతో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఈ ఏడాది నష్టాలన్నీ పూడ్చుకోగలిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ వరుస లాభాల పరంపర, ఎఫ్ఐఐల పునరాగమనంతో దేశీయ కరెన్సీ వరుస ఏడు ట్రేడింగ్ సెషన్లలో 154 పైసలు బలపడింది. క్రూడాయిల్ ధరలు దిగిరావడం, డాలర్ ఇండెక్సు బలహీనత అంశాలు కలిసొచ్చాయి. తాజాగా సోమవారం డాలర్ మారకంలో 37 పైసలు బలపడిన రూపాయి 85.61 వద్ద ముగిసింది. కాగా, 2024 డిసెంబర్ 31న 85.64 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 85.93 వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇంట్రాడేలో 85.49 వద్ద గరిష్టాన్ని, 86.01 వద్ద కనిష్టాన్ని తాకింది.ఇదీ చదవండి: చైనా ఆర్మీలోకి ‘డీప్‌సీక్’!‘ఆర్థిక సంవత్సరం ముగింపు సర్దుబాటులో భాగంగా విదేశీ బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఏప్రిల్ 2 నుంచి అమెరికా ప్రతీకార సుంకాలు అమల్లోకి రాకముందే చర్చలు జరుపుతామని భారత ప్రతినిధుల ప్రకటన ఇన్వెస్టర్లకు భరోసానిచ్చింది’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ విశ్లేషకుడు దిలీప్ పర్మార్ తెలిపారు. -
ఆన్లైన్ ప్రకటనలపై డిజిటల్ ట్యాక్స్ తొలగింపు
న్యూఢిల్లీ: ఆన్లైన్ ప్రకటనలపై విధిస్తున్న ఈక్వలైజేషన్ లెవీని (డిజిటల్ ట్యాక్స్) తొలగించేలా ఆర్థిక బిల్లులో కేంద్రం సవరణ చేసింది. దీనితో గూగుల్, ఎక్స్, మెటాలాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై అడ్వర్టైజ్మెంట్ సర్వీసులు అందించే సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లులో ప్రతిపాదిత 59 సవరణల్లో ఇది కూడా ఒకటి. ఈ సవరణ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. 2016 జూన్ 1న ఈ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార పన్నులు విధిస్తామంటూ హెచ్చరించిన అమెరికాను ప్రసన్నం చేసుకునేందుకే ఆన్లైన్ ప్రకటనలపై డిజిటల్ ట్యాక్స్‌ను భారత్ తొలగించి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఆదాయ పన్ను చట్టాలను సరళతరం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి కూడా ఇది దోహదపడుతుందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ సుమీత్ సింఘానియా చెప్పారు. -
నవీకరించిన ఐటీఆర్‌లతో ఖజానాకు రూ.9,118 కోట్లు
గడిచిన నాలుగేళ్లలో 90 లక్షలకు పైగా నవీకరించిన(అప్డేట్) ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు అయ్యాయి. వీటి ద్వారా కేంద్ర ఖజానాకు రూ.9,118 కోట్లు సమకూరినట్లు సోమవారం ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పన్నుదారులు స్వచ్ఛందంగా వివరాలు దాఖలు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహించినట్లు తెలిపారు. 2022లో అదనపు ఆదాయ పన్ను చెల్లించడం ద్వారా సంబంధిత మదింపు సంవత్సరం నుంచి రెండేళ్ల వరకు నవీకరించిన ఐటీ రిటర్న్‌లు(ఐటీఆర్-యూ) దాఖలు చేసే అవకాశాన్ని ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు.ఫైనాన్స్ బిల్లు, 2025 ద్వారా అప్డేటెడ్ రిటర్న్స్ దాఖలు చేయడానికి కాలపరిమితిని సంబంధిత మదింపు సంవత్సరం నుండి నాలుగు సంవత్సరాల వరకు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత మదింపు సంవత్సరంలో (2024-25) ఫిబ్రవరి 28 వరకు 4.64 లక్షల అప్డేటెడ్ ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయని, అందుకు రూ.431.20 కోట్ల పన్నులు చెల్లించామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో తెలిపారు.ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి కార్ల ధరలు అప్ఆయన తెలిపిన వివరాల ప్రకారం..2023-24 ఆర్థిక సంవత్సరంలో 29.79 లక్షల ఐటీఆర్-యూలు దాఖలు కాగా రూ.2,947 కోట్ల అదనపు పన్నులు చెల్లించారు. 2022-23, ఏవై(అసెస్మెంట్ ఇయర్-మదింపు సంవత్సరం) 2021-22 సంవత్సరాల్లో వరుసగా 40.07 లక్షలు, 17.24 లక్షల అప్డేటెడ్ ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయి. వాటిల్లో అదనంగా రూ.3,940 కోట్లు, రూ.1,799.76 కోట్ల పన్నులు చెల్లించారు. 2021-22 నుంచి 2024-25 మధ్య కాలంలో 91.76 లక్షల ఐటీఆర్-యూలు దాఖలు కాగా, ప్రభుత్వానికి రూ.9,118 కోట్ల అదనపు పన్నులు వచ్చాయి. -
వస్తు ఎగుమతులను సేవలు అధిగమించాలి
న్యూఢిల్లీ: సేవల రంగం ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025–26) 450 బిలియన్ డాలర్లను (సుమారు రూ.39లక్షల కోట్లు) చేరుకోవాలని.. తద్వారా వస్తు ఎగుమతుల విలువను అధిగమించాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈ లక్ష్యంతో పనిచేయాలని పరిశ్రమకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో వస్తు ఎగుమతులు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. కనుక సేవల రంగం ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్న 385–390 బిలియన్ డాలర్ల నుంచి 2025–26లో 450 బిలియన్ డాలర్లను చేర్చేందుకు పరిశ్రమ కృషి చేయాలని కోరారు.2023–24లో సేవల ఎగుమతులు 341 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 5 శాతం పెరిగాయి. 2024 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో సేవల ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే 14 శాతం పెరిగి 355 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో వస్తు ఎగుమతులు 3.1 శాతం క్షీణించి 437 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో మరింత పెద్ద లక్ష్యాలతో పనిచేయాలంటూ ‘నాస్కామ్ గ్లోబల్ కన్ఫ్లూయెన్స్’ ఆరంభ సమావేశంలో భాగంగా మంత్రి పరిశ్రమకు పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: ఐపీవోకు ఫిజిక్స్వాలాజీసీసీల తోడ్పాటు..దేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) పెద్ద ఎత్తున ఏర్పాటవుతుండడం, కొత్త టెక్నాలజీలతో సేవల ఎగుమతుల్లో ఏటా 15–18 శాతం వృద్ధి సాధించగలమన్నారు. దేశంలో 1,650 జీసీసీలు పనిచేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. పర్యాటకం, ఫైనాన్షియల్ రంగాల్లో అవకాశాలు దేశ సేవల ఎగుమతుల్లో 200 బిలియన్ డాలర్ల మేర ఐటీ, ఐటీ సంబంధిత సేవలే ఉన్నట్టు మంత్రి గోయల్ తెలిపారు. అదే సమయంలో పర్యాటకం, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లోనూ సేవల ఎగుమతుల వృద్ధికి పెద్ద మొత్తంలో అవకాశాలు రానున్నట్టు చెప్పారు. అయినప్పటికీ సేవల ఎగుమతుల్లో ఐటీ, ఐటీఈఎస్ ముందుంటాయన్నారు. క్లయింట్ లొకేషన్ నుంచి కాకుండా, మారుమూల ప్రాంతాల నుంచి మరిన్ని సేవలను అందించడంపై ఐటీ పరిశ్రమ దృష్టి పెట్టాలని కోరారు. దీనివల్ల పోటీతత్వం పెరిగి, వ్యయాలు తగ్గుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే, భారత్‌లో వేతనాలు చెల్లించడం ఇందులో ఉన్న మరో ప్రయోజనంగా పేర్కొన్నారు. -
ఏప్రిల్ నుంచి బ్యాంకులు పని చేసేది ఐదురోజులేనా?
బ్యాంకుల పనిదినాలు వారానికి ఐదు రోజులు ఉంటాయనే కొన్ని వార్తలు గత కొంతకాలంగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా మరోమారు ఈ విషయం తెరపైకి వచ్చింది. భారతదేశం అంతటా బ్యాంకులు ఏప్రిల్ 2025 నుంచి వారానికి 5 రోజుల పని దినాలను అనుసరిస్తాయని ఊహాగానాలు చెలరేగాయి. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పందించింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.బ్యాంకులు వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేస్తాయని.. శని, ఆదివారాల్లో మూసి ఉంటాయనే వార్తలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందిస్తూ.. ఇందులో నిజం ఏ మాత్రం లేదు. మరింత సమాచారం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ చెక్ చేయండి అని వెల్లడించింది.బ్యాంకులు వారానికి ఐదు రోజుల పని దినాలకు మారుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నెలలో మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో పనిచేయడం ఇప్పటికీ ప్రస్తుత బ్యాంకింగ్ పని విధానంలో భాగం. అయితే బ్యాంకింగ్ పనివేళలు తగ్గించాలని కూడా సంబంధింత యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: ఉన్నట్టుండి తగ్గిన బంగారం ధరలుజాతీయ, ప్రాంతీయ సెలవు దినాలు కాకుండా.. ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాల్లో బ్యాంకు శాఖలు పనిచేయవు. అయితే నెలలో మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో బ్యాంకు శాఖలు తెరిచి ఉంటాయి. ఆదివారాలు అన్ని బ్యాంకులకు సెలవు దినం.A news report by Lokmat Times claims that starting from April, banks across the country would operate 5 days a week, following a new regulation issued by @RBI #PIBFactCheck ▶️This claim is #Fake ▶️For official information related with Reserve Bank of India, visit :… pic.twitter.com/MrZHhMQ0dK— PIB Fact Check (@PIBFactCheck) March 20, 2025 -
రూ.10 లక్షల కోట్ల దివాలా పరిష్కారాలు
న్యూఢిల్లీ: దివాలా చట్టం (ఐబీసీ) కింద ఇప్పటి వరకు 28,818 దరఖాస్తులకు పరిష్కారం లభించినట్టు కేంద్ర కార్పొరేట్ శాఖ సహాయ మంత్రి మర్ష మల్హోత్రా ప్రకటించారు. వీటి మొత్తం రూ.10 లక్షల కోట్లుగా ఉంటుందని లోక్‌సభకు తెలియజేశారు. ‘మొత్తం 40,943 దరఖాస్తులు ఐబీసీ కింద దాఖలయ్యాయి. ఇందులో 28,818 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. ఇదొక గొప్ప విజయం’ అని మంత్రి పేర్కొన్నారు.2016లో ఐబీసీని తీసుకురావడం భారత్‌కు ఎంతో మేలు చేసిందని మంత్రి అన్నారు. అంతర్జాతీయంగా వ్యాపార సులభతర సూచీలో భారత్ ర్యాంక్ 2018లో 108గా ఉంటే, 2019లో 52కు మెరుగుపడినట్టు తెలిపారు. గృహ కొనుగోలుదారుల కోసం ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చిన విషయాన్ని సైతం ప్రస్తావించారు. ‘ఏదైనా బిల్డర్ లేదా వినియోగదారుడు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించినట్టయితే.. ప్రత్యేక పరిష్కార చర్యలు ఉండేలా చర్యలు తీసుకున్నాం’ అని వివరించారు. ఇదీ చదవండి: 2026లో నిధుల సమీకరణకు జోష్అపరిష్కృతానికి కారణాలు2024 డిసెంబర్ చివరికి కంపెనీల చట్టం కింద 8,133 కేసులు, ఐబీసీ కింద 12,351 కేసులు ఎన్సీఎల్టీ వద్ద అపరిష్కృతంగా ఉన్నట్టు సహాయ మంత్రి హర్ష మల్హోత్ర తెలిపారు. ఒక్కో కేసులో ఉండే సంక్లిష్టతలు, సాక్ష్యాల తీరు, ఉన్నత న్యాయస్థానాల్లో స్టేలు, భాగస్వాముల మధ్య సహకార లేమి, వాయిదాలు ఇవన్నీ పరిష్కారంలో జాప్యానికి కారణాలుగా పేర్కొన్నారు. ‘కేసులను వేగంగా పరిష్కరించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ–కోర్టు, హైబ్రిడ్ కోర్టు ప్రాజెక్ట్, సామర్థ్యాన్ని పెంచడానికి తరచూ చర్చలు, ఖాళీల భర్తీ, సదుపాయాల కల్పన ఇందులో ఉన్నాయి’ అని మంత్రి వివరించారు. సులభతర వ్యాపార నిర్వహణకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకోవడంతో 2019 ప్రపంచబ్యాంక్ నివేదికలో భారత్ 52వ స్థానం దక్కించుకున్నట్టు చెప్పారు. ఆ తర్వాత నుంచి ప్రంపచబ్యాంక్ ఈ సూచీని ప్రకటించడం లేదన్నారు. -
చమురుపై ఇక విండ్‌ఫాల్ ట్యాక్స్‌లు ఉండవు
న్యూఢిల్లీ: ఆయిల్‌ఫీల్డ్స్ (నియంత్రణ, అభివృద్ధి) బిల్లు అమల్లోకి వచ్చాక చమురు, గ్యాస్ కంపెనీల అసాధారణ లాభాలపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ల్లాంటి కొత్త పన్ను ల విధింపు బాదరబందీ ఉండదని కేంద్ర పెట్రోలి యం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేయడాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయం చెప్పారు. ఇన్వెస్టర్లకు ఆర్థిక విధానాల స్థిరత్వంపై కొత్త చట్టం భరోసా కల్పిస్తుందని పురి వివరించారు.అంతర్జాతీయంగా పలు ఆయిల్ దిగ్గజాలు భారత్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగ ఆయిల్ ఇండియాతో బ్రెజిల్‌కి చెందిన పెట్రోబ్రస్, ఓఎన్జీసీతో ఎక్సాన్‌మొబిల్, ఈక్వినార్ వంటి సంస్థలు చర్చలు జరుపుతున్నట్లు మంత్రి వివరించారు. ఇతర దేశాల తరహాలోనే, ఇంధన కంపెనీలకు వచ్చే అసాధా రణ లాభాలపై 2022 జూలై 1 నుంచి భారత్ విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యా క్స్లు విధించడం మొదలుపెట్టింది.పెట్రోల్.. ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 6 చొప్పున, డీజిల్‌పై లీటరుకు రూ. 13 చొప్పున ఎగుమతి సుంకాలు విధించింది. దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తిపైనా టన్నుకు రూ. 23,250 చొప్పున విధించింది. పలుమార్లు సవరించిన ఈ ట్యాక్స్‌లను 30 నెలల తర్వాత గతేడాది డిసెంబర్లో నిలిపివేసింది. -
కేవైసీ కోసం కస్టమర్లను వేధించొద్దు
ముంబై: ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బ్యాంక్‌లకు కీలక సూచన చేశారు. నో యువర్ కస్టమర్ (కేవైసీ/నీ కస్టమర్ గురించి తెలుసుకో) డాక్యుమెంట్ల కోసం కస్టమర్లకు అదేపనిగా తరచూ కాల్ చేస్తూ వేదించొద్దన్నారు. ఆర్బీఐ అంబుడ్స్‌మన్ వార్షిక సదస్సులో భాగంగా ఆయన మాట్లాడారు. ఏదేనీ ఆర్థిక నియంత్రణ సంస్థ పరిధిలో ఒక కస్టమర్ ఒక చోట (బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ తదితర) సమర్పించిన కేవైసీ డాక్యుమెంట్లను.. ఇతర సంస్థలు సైతం పొందడానికి అవకాశం ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.కస్టమర్ ఒకసారి ఒక ఆర్థిక సంస్థకు పత్రాలను సమర్పించినట్టయితే, అవే పత్రాలను మళ్లీ, మళ్లీ సమర్పించాలంటూ కోరకుండా చూడాలన్నారు. తరచూ కేవైసీ డాక్యుమెంట్లను బ్యాంకులు కోరుతుండడం పట్ల సోషల్ మీడియాపై చాలా మంది నిరసన వ్యక్తం చేస్తుండడంతో, ఆర్బీఐ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.కస్టమర్ల ఫిర్యాదుల సంఖ్యను బ్యాంకులు తగ్గించి చూపించరాదని, అలా చేయడం నిబంధనలను ఉల్లంఘించినట్టు అవుతుందని బ్యాంకులను ఆర్బీఐ గవర్నర్ హెచ్చరించారు. బ్యాంకులు తమ సేవలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారానికి బ్యాంక్ మేనేజర్ల నుంచి మేనేజింగ్ డైరెక్టర్ల వరకు సమయం కేటాయించాలన్నారు. -
ఈపీఎఫ్‌వోలోకి 17.89 లక్షల కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కిందకు జనవరిలో 17.89 లక్షల మంది కొత్తగా చేరారు. క్రితం ఏడాది జనవరి నెల గణాంకాలతో పోల్చి చూస్తే 11.67 శాతం మందికి అదనంగా ఉపాధి లభించింది. 2024 డిసెంబర్ నెల గణాంకాలతో పోల్చి చూసినా ఉపాధి కల్పనలో 11.48 శాతం వృద్ధి నమోదైంది. ఇక ఈపీఎఫ్‌వో పరిధిలోకి మొదటిసారి 8.23 లక్షల మంది వచ్చి చేరారు. క్రితం ఏడాది జనవరితో పోల్చి చూస్తే 1.87 శాతం మందికి అదనంగా మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది.మొదటిసారి సభ్యుల్లో 4.70 లక్షల మంది (57 శాతం) 18.25 ఏళ్ల వయసులోని వారున్నారు. వార్షికంగా చూస్తే ఈ వయసులోని వారు 3% అధికంగా ఉపాధి పొందారు. జనవరిలో 15.03 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో ఉద్యోగం మానేసి, మరో సంస్థలో చేరారు. క్రితం ఏడాది జనవరితో పోల్చి చూసినప్పుడు 23 శాతం పెరుగుదల కనిపించింది. అంటే ఉద్యోగ వలసలు అధికమైనట్టు కనిపిస్తోంది. వీరంతా పూర్వపు సంస్థ నుంచి కొత్త సంస్థకు ఈపీఎఫ్‌వో ఖాతా బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. 2.17 లక్షల మంది మహిళలు కొత్త సభ్యుల్లో 2.17 లక్షల మంది మహిళలు ఉన్నారు. క్రితం ఏడాది జనవరితో పోల్చి చూస్తే 6 శాతం పెరుగుదల నమోదైంది. జనవరిలో 60 శాతం మేర సభ్యుల చేరిక ఐదు రాష్ట్రాల నుంచే ఉండడం గమనార్హం. అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 22.77 శాతం మంది ఈపీఎఫ్‌వోలో చేరారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, హర్యానా, ఢిల్లీ, యూపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి సభ్యుల చేరిక విడిగా 5 శాతానికి పైన ఉంది. నైపుణ్య సేవలు, రోడ్డు మోటారు రవాణా తదితర రంగాలు ఎక్కువ మందికి ఉపాధి కలి్పంచాయి. ఇందులో 40 శాతం మందికి నైపుణ్య సేవల్లో ఉపాధి లభించింది. -
స్టీల్ ప్రొడక్టులపై 12శాతం సుంకాలు
న్యూఢిల్లీ: కొన్ని రకాల స్టీల్ ప్రొడక్టులపై 12 శాతం రక్షణాత్మక సుంకాలను విధించమంటూ వాణిజ్య శాఖ దర్యాప్తు విభాగం ట్రేడ్ రెమిడీస్ డైరెక్టరేట్ జనరల్(డీజీటీఆర్) తాజాగా ప్రతిపాదించింది. పెరుగుతున్న దిగుమతుల నుంచి దేశీ సంస్థలకు రక్షణ కల్పించేందుకు వీలుగా 200 రోజులవరకూ సుంకాల అమలుకు సూచించింది.ఉన్నట్టుండి ఊపందుకున్న అలాయ్, నాన్అలాయ్ స్టీల్ ఫ్లాట్ ప్రొడక్టుల దిగుమతులపై గతేడాది డిసెంబర్లో డీజీటీఆర్ దర్యాప్తు చేపట్టింది. వీటిని ఫ్యాబ్రికేషన్, పైప్ మేకింగ్, నిర్మాణం, క్యాపిటల్ గూడ్స్, ఆటో, ట్రాక్టర్లు, సైకిళ్లు, ఎలక్ట్రికల్ ప్యానెళ్లు తదితర వివిధ పరిశ్రమలలో వినియోగిస్తారు. దేశీ స్టీల్ అసోసియేషన్ ఫిర్యాదుమేరకు దర్యాప్తు నిర్వహించింది. ఈ జాబితాలో ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కోటెడ్ ప్రొడక్ట్స్, భూషణ్ పవర్ అండ్ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, సెయిల్ తదితర దిగ్గజాలున్నాయి.విలువ ఆధారితంగా..ఇటీవల కొన్ని స్టీల్ ప్రొడక్టుల దిగుమతులు ఉన్నట్టుండి భారీగా పెరిగినట్లు దర్యాప్తులో డీజీటీఆర్ ప్రాథమికంగా గుర్తించింది. దీంతో విలువ ఆధారిత సుంకాల విధింపునకు ఈ నెల 18న నోటిఫికేషన్ ద్వారా సిఫారసు చేసింది. వెరసి 200 రోజులకు 12 శాతం ప్రొవిజనల్ సేఫ్‌గార్డ్ డ్యూటీలను విధించేందుకు ఆర్థిక శాఖకు నివేదించింది. వీటిపై ఆర్థిక శాఖ తుది నిర్ణయాన్ని తీసుకోవలసి ఉంది.ప్రధానంగా చైనా, జపాన్, కొరియా, వియత్నాం నుంచి దిగుమతులు పెరిగినట్లు తెలుస్తోంది. పరిశ్రమ వర్గాల వివరాల ప్రకారం ఆయా దేశాలలో స్థానిక డిమాండుకు మించి భారీస్థాయిలో సరఫరాలు జరుగుతున్నాయి. దీంతో 2021–22లో 2.293 మిలియన్ టన్నుల ప్రొడక్టులు దిగుమతికాగా.. దర్యాప్తు జరిపిన అక్టోబర్ 2023 సెప్టెంబర్ 2024సహా గత మూడేళ్ల(2021–24)లో 6.612 మిలియన్ టన్నులకు పెరిగాయి. -
ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథం
తాజా పాలసీ సమీక్షలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే నిర్ణయించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు మరోసారి 4.25–4.5 శాతంవద్దే కొనసాగనున్నాయి. ఛైర్మన్ జెరోమ్ పావెల్ అధ్యక్షతన రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) గత సమీక్షలోనూ యథాతథ పాలసీ అమలుకే ఓటు వేసిన సంగతి తెలిసిందే.వివిధ దేశాలపై ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతీకార టారిఫ్‌ల విధింపు, వీటి కారణంగా యూఎస్‌లో స్టాగ్ఫ్లేషన్ పరిస్థితులు తలెత్తనున్నట్లు ఆర్థికవేత్తల అంచనాల నడుమ ఎఫ్‌వోఎంసీ ఆచితూచి అడుగేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఫెడ్ నిర్ణయాల తదుపరి చైర్మన్ పావెల్ ప్రసంగంపై ప్రపంచ కేంద్ర బ్యాంకులు దృష్టిపెట్టనున్నట్లు తెలియజేశారు. అయితే ఆర్థికవేత్తలు ఊహిస్తున్నట్లు 2025లో వడ్డీ రేట్ల కోతలపై ఫెడ్ నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడకపోవచ్చని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: అక్కడ సంపాదించి ఇక్కడకు పంపిస్తున్నారు!భారతదేశంలో ఆర్బీఐ గత మానిటరీ పాలసీ సమావేశంలో ఐదేళ్లలో మొదటిసారి రేటు తగ్గింపును అమలు చేసింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి చేర్చింది. ద్రవ్యోల్బణాన్ని ఆర్థిక వృద్ధితో సమతుల్యం చేయడమే ఈ చర్య లక్ష్యంగా తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్య విధానాలు తరచూ భారత్ వంటి వర్ధమాన మార్కెట్లపై ఒత్తిడి పెంచుతున్నా స్థానికంగా ఆర్బీఐ నిర్ణయాలు కీలకంగా మారుతున్నాయి. ఫెడ్ తాజా నిర్ణయాల నేపథ్యంలో ఏప్రిల్ 7-9 వరకు జరిగే ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో ఏమేరకు వడ్డీరేట్లపై చర్యలు తీసుకొంటారో మార్కెట్ వర్గాలు పరిశీలించే అవకాశం ఉంది. -
అక్కడ సంపాదించి ఇక్కడకు పంపిస్తున్నారు!
ముంబై: అభివృద్ధి చెందిన దేశాల నుంచి ప్రవాస భారతీయులు మాతృదేశానికి పంపిస్తున్న రెమిటెన్స్‌లు (నిధుల బదిలీ) గణనీయంగా పెరుగుతున్నాయి. 2023–24లో 118.7 బిలియన్ డాలర్లను (రూ.10.32 లక్షల కోట్లు) ప్రవాసులు భారత్‌కు పంపించారు. 2010–11లో 55.6 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌లతో పోల్చి చూస్తే రెట్టింపయ్యాయి. యూఎస్, యూకే తదితర దేశాల్లో స్థిరపడిన భారతీయులు 2023–24లో భారత్‌కు పంపించిన రెమిటెన్స్‌లు గల్ఫ్ దేశాలను మించిపోయినట్టు మార్చి నెలకు సంబంధించి విడుదలైన ఆర్బీఐ బులెటిన్ వెల్లడించింది.భారతీయ నిపుణుల వలసల్లో మార్పులను ఇది ప్రతిఫలిస్తున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ పాలసీ రీసెర్చ్ విభాగం ఈ నివేదికను రూపొందించింది. అయితే ఇందులోని అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమే కానీ, ఆర్బీఐ అభిప్రాయాలను ప్రతిఫలించవని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. నివేదికలోని అంశాలు..అంతర్జాతీయ వలసదారుల్లో భారత్‌కు చెందిన వారు 1990లో 66 లక్షలుగా ఉంటే, 2024 నాటికి 1.85 కోట్లకు పెరిగారు. అంతర్జాతీయ వలసదారుల్లో భారత్ వాటా 4.3 శాతం నుంచి 6 శాతానికి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రవాస భారతీయుల్లో సగం మందికి గల్ఫ్ సహకార సమాఖ్య (జీసీసీ) కేంద్రంగా ఉంది. ఇంత కాలం భారత్‌కు రెమిటెన్స్‌ల్లో జీసీసీ దేశాల ఆధిపత్యం కొనసాగగా, క్రమంగా ఇది అభివృద్ధి చెందిన దేశాలైన యూఎస్, యూకే, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల వైపు మొగ్గుతోంది. 2023–24లో భారత్‌కు వచ్చిన మొత్తం రెమిటెన్స్‌ల్లో సగంపైన ఈ దేశాల నుంచే ఉంది. పనిచేసే వయసులోని అధిక జనాభాతో 2048 నాటికి భారత్ మానవ వనరులను సరఫరా చేసే కీలక దేశం కానుంది.8.1 శాతం తెలంగాణకు..2023–24లో మొత్తం రెమిటెన్స్‌ల్లో 8.1 శాతం తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది.అత్యధికంగా 20.5 శాతం మహారాష్ట్రకు వెళ్లింది. 2020–21లో ఇదే రాష్ట్రం వాటా 35.2 శాతంతో పోల్చి చూస్తే గణనీయంగా తగ్గింది. రెమిటెన్స్‌ల్లో కేరళ వాటా 10 శాతం నుంచి 19.7 శాతానికి పెరిగింది. తమిళనాడు 10.4 శాతం, కర్ణాటక 7.7% సొంతం చేసుకున్నాయి. 2023–24 రెమిటెన్స్‌ల్లో రూ.5లక్షలు అంతకుమించిన లావాదేవీలు 29 శాతంగా ఉన్నాయి. భారత్‌కు గత ఆర్థిక సంవత్సరం వచ్చిన రెమిటెన్స్‌ల్లో యూఎస్ వాటా 27.7 శాతానికి చేరింది. 2020–21లో ఇది 23.4 శాతంగా ఉంది. అలాగే యూకే నుంచి వచ్చిన రెమిటెన్స్‌లు ఇదే కాలంలో 6.8% నుంచి 10.8 శాతానికి పెరిగాయి. యూఏఈ 19 శాతంతో రెమిటెన్స్‌లకు రెండో అతిపెద్ద కేంద్రంగా ఉంది. 2020–21 రెమిటెన్స్‌ల్లో యూఏఈ వాటా 18 శాతంగా ఉండడం గమనార్హం. నిర్మాణ రంగం, హెల్త్‌కేర్, ఆతిథ్యం, పర్యాటకం తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలతో భారత కార్మికులకు యూఏఈ ఆశ్రయమిస్తుంటే.. భారత నిపుణులకు యూఎస్ కీలక ఉపాధి కేంద్రంగా ఉంది. మహారాష్ట్ర, తెలంగాణ, పంజాబ్ నుంచి ఎక్కువ మంది విదేశీ విద్యకు వెళుతున్నారు. దీంతో దేశ రెమిటెన్స్‌ల్లో ఈ రాష్ట్రాల వాటా క్రమంగా పెరుగుతోంది. ఇదీ చదవండి: మరో టెలికాం కంపెనీ 5జీ సేవలు షురూ..వృద్ధికి పటిష్ట మూలాలుబలమైన ద్రవ్య విధానాలు, మెరుగైన సమన్వయంతో కూడిన పరపతి విధాన కార్యాచరణ, డిజిటల్ వైపు మళ్లేందుకు తీసుకుంటున్న చర్యలు దీర్ఘకాలం పాటు స్థిరమైన ఆర్థిక వృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తాయని ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని, బలమైన దేశీ డిమాండ్, స్థిరమైన పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ మూలధన వ్యయాల పెంపు ఇవన్నీ కూడా నిలకడైన ఆర్థిక వృద్ధికి మద్దతునిస్తాయని తెలిపింది. ‘అంతర్జాతీయంగా నెలకొన్న సవాళ్ల వాతావరణలోనూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడింది. వ్యవసాయ రంగం పటిష్ట పనితీరుకు తోడు వినియోగం మెరుగుపడడం ఇందుకు సానుకూలించింది’ అని వివరించింది. టారిఫ్‌ల తీవ్రత, వాటి అమలుపై అనిశ్చితి నెలకొన్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశి్చత పరిస్థితుల వల్లే విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు స్థిరంగా బయటకు వెళ్లిపోతున్నట్టు తెలిపింది. 2024–25 చివరి త్రైమాసికంలో (2025 జనవరి–మార్చి) డిమాండ్ బలంగా ఉంటుందని కీలక సూచికలు తెలియజేస్తున్నట్టు పేర్కొంది. -
పెరుగుతున్న చేపల ధరలు
బెంగళూరులో చేపల ధరలు గతంలో ఎప్పుడూ లేనివిధంగా స్వల్పకాలంలో గణనీయంగా దాదాపు 30 శాతం పెరిగాయి. బర్డ్ ఫ్లూపై ఆందోళనలు, మటన్ ధర పెరగడం సహా పలు కారణాలతో చేపలకు డిమాండ్ ఊపందుకోవడమే ఈ ఆకస్మిక పెరుగుదలకు కారణమని కొన్ని సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. పరిమిత సరఫరా, పంపిణీ అంతరాయాలు, సముద్రంలో చేపల వేటలో సవాళ్లు వంటివి ధరల్లో మార్పులకు కారణంగా నిలుస్తున్నాయి.పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా చేపల సరఫరా నిలిచిపోయిందని, ఫలితంగా కొరత ఏర్పడిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బర్డ్ ఫ్లూ వ్యాప్తి వల్ల చికెన్ వినియోగం గణనీయంగా తగ్గడానికి దారితీసింది. ఈ సమయంలో చికెన్ తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో చికెన్ కొనుగోలుపై ఆసక్తి తగ్గిపోయింది. ప్రత్యామ్నాయంగా ప్రోటీన్లు అధికంగా ఉండే చేపల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. దాంతో ఒక్కసారిగా వీటికి డిమాండ్ పెరిగేందుకు కారణమైంది.సరఫరాలో అంతరాయంపెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు అధికమయ్యాయి. కీలకమైన సీఫుడ్ హబ్‌గా ఉన్న బెంగళూరులోని రస్సెల్ మార్కెట్లో చేపల రాక తగ్గింది. మంగళూరు, చెన్నై, కేరళ, ఆంధ్రప్రదేశ్ వంటి ముఖ్యమైన తీర ప్రాంతాల నుంచి వచ్చే చేపల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం కొనసాగుతున్న వేసవి తాపం పరిస్థితిని మరింత జటిలం చేసిందని నగరంలోని మార్కెట్లలో చేపల లభ్యత తగ్గిందని మత్స్యకారులు, సీఫుడ్ వ్యాపారులు పేర్కొన్నారు.వలస వెళ్లి సంతానోత్పత్తివిశాఖపట్నం, మాల్పే నుంచి వచ్చే బంగుడే (మాకేరెల్) రకం చేపల సరఫరా అస్థిరంగా ఉందని ఓషన్ సీఫుడ్స్ వ్యాపారి లతీఫ్ కె తెలిపారు. చేపల పరిమాణం తగ్గడం, మంగళూరు, తమిళనాడు నుంచి పరిమిత సరఫరా కారణంగా అంజల్ (సీర్ ఫిష్) ధరలు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు. వచ్చే నెలలో చేపల ధరలు మరింత పెరుగుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా వేసవి సమయంలో చేపలు వలస వెళ్లి సంతానోత్పత్తి సీజన్ ప్రారంభమవుతుంది. దాంతో చేపల వేటను పరిమితం చేస్తారు. ఫలితంగా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.ఇదీ చదవండి: త్వరలో బంగారం ధర లకారం! తులం ఎంతంటే..పెరుగుతున్న జలాల ఉష్ణోగ్రతలుమత్స్య పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో తీరప్రాంత జలాల ఉష్ణోగ్రత పెరగడం ఒకటిగా ఉంది. కర్ణాటక తీరం వెంబడి పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు చేపల లభ్యతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు అంచనా చెబుతున్నారు. సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, చేపలు లోతైన, చల్లని జలాలకు వలస వెళతాయి. దాంతో చేపల వేట కష్టతరంగా మారుతుంది. ఇది సాంప్రదాయ చేపల వేట పద్ధతులకు విఘాతం కలిగిస్తుంది. మత్స్యకారులకు దిగుబడిని తగ్గిస్తుంది. -
స్వల్పంగా పెరిగిన టోకు ద్రవ్యోల్బణం
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో కాస్తంత ఎగసి 2.38 శాతానికి చేరింది. జనవరి నెలకు ఇది 2.31 శాతంగా ఉంది. ఆహార వస్తువుల ధరలు, తయారీ, వెజిటబుల్ ఆయిల్, పానీయాల ధరలు పెరగడం ద్రవ్యోల్బణం పెరిగేలా చేసింది. దీంతో మూడు నెలల వరుస క్షీణతకు బ్రేక్ పడింది. ఆహారోత్పత్తుల ధరల ద్రవ్యోల్బణం 11.06 శాతానికి పెరిగింది.వెజిటబుల్ ఆయిల్ ద్రవ్యోల్బణం 33.59 శాతానికి చేరింది. ఇక పానీయాలకు సంబంధించి 1.66 శాతానికి ఎగిసింది. తయారీ ఉత్పత్తుల టోకు ధరల సూచీ ఫిబ్రవరిలో 0.42 శాతం మేర పెరిగింది. కూరగాయల ధరల (బంగాళాదుంప సహా) ద్రవ్యోల్బణం జనవరిలో ఉన్న 74.28 శాతం నుంచి ఫిబ్రవరిలో 27.54 శాతానికి తగ్గింది. పాల ధరలకు సంబంధించి 5.40 శాతం నుంచి 1.58 శాతానికి దిగొచ్చింది. పండ్లకు సంబంధించి 20 శాతం, ఉల్లిపాయలకు సంబంధించి ద్రవ్యోల్బణం 48.05 శాతం చొప్పున ఇప్పటికీ గరిష్ట స్థాయిల వద్దే కొనసాగుతోంది.ఇదీ చదవండి: మ్యూచువల్ ఫండ్స్‌లో అమ్మకాల సెగఇంధనం, విద్యుత్ విభాగంలో ప్రతి ద్రవ్యోల్బణం (మైనస్ 0.71 శాతం) నమోదైంది. జనవరిలోనూ మైనస్ 2.78 శాతంగా ఉండడం గమనార్హం. రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో ఏడు నెలల కనిష్ట స్థాయి అయిన 3.61 శాతానికి తగ్గిపోవడం తెలిసిందే. పంటల దిగుబడి మెరుగ్గా ఉండడానికి తోడు, అధిక బేస్‌తో సమీప కాలంలో టోకు ద్రవ్యోల్బణం మరింత దిగొస్తుందన్న అభిప్రాయాన్ని ఇక్రా సీనియర్ ఆర్థికవేత్త రాహుల్ అగర్వాల్ వ్యక్తం చేశారు. 2025–26లో టోకు ద్రవ్యోల్బణం 2.5–3 శాతం మధ్య ఉండొచ్చన్నది ఇక్రా అంచనాగా ఉంది. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో జోరు
ప్రత్యక్ష పన్నుల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా జోరు కనబరుస్తోంది. మార్చి 16 వరకు రూ.21.26 లక్షల కోట్లు నికరంగా వసూలైనట్టు ప్రభుత్వ డేటా వెల్లడిస్తోంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 13 శాతానికి పైగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులకు చివరి తేదీ మార్చి 15తో ముగిసింది. కార్పొరేట్ పన్ను విభాగంలో అడ్వాన్స్ ట్యాక్స్ 12 శాతానికి పైగా పెరిగి రూ.7.57 లక్షల కోట్లుగా ఉంది. నికర నాన్ కార్పొరేట్ ట్యాక్స్ (ఇందులో వ్యక్తిగత ఆదాయపన్ను ప్రధానమైనది) క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 17 శాతం ఎగిసి రూ.11.01 లక్షల కోట్లుగా ఉంది. నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన పన్ను రూ.10,000 మించితే వారు ముందస్తు పన్నును ఆర్థిక సంవత్సరం ముగింపులోపే చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు వాయిదాల్లో (జూన్ 15, సెప్టెంబర్ 15, డిసెంబర్ 15, మార్చి15) దీన్ని చెల్లించొచ్చు. ఇదీ చదవండి: 13 రోజుల్లో కార్ల ధరలు పెంపు..భారీగా పెరిగిన ఎస్టీటీ ఆదాయం సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్టీటీ) 56 శాతం వృద్ధితో రూ.53,095 కోట్లుగా నమోదైంది. రిఫండ్లు సైతం రూ.3.60 లక్షల కోట్లకు పెరిగాయి. మార్చి 16 నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు (రిఫండ్లు సహా) 16 శాతం పెరిగి రూ.25.86 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.22.07 లక్షల కోట్ల ఆదాయపన్ను వసూళ్లను ప్రభుత్వం తొలుత అంచనా వేయగా, తర్వాత రూ.22.37 లక్షల కోట్లకు సవరించడం గమనార్హం. -
జీడీపీలో ఎంఎస్ఎంఈ వాటా పెంపునకు ఏఐ తోడ్పాటు
రాంచి: స్థూల ఉత్పాదకతలోనూ, ఉపాధి కల్పనలోనూ కీలక భూమిక పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) పాత్రను కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) మరింత ఇనుమడింపజేస్తాయని ‘ఆఫ్‌బిజినెస్’ తెలిపింది. ప్రస్తుతం జీడీపీలో 30 శాతం ఎంఎస్ఎంఈ రంగం నుంచే సమకూరుతుండగా.. ఏఐ, ఎంఎల్(మెషిన్ లెర్నింగ్) సాయంతో వీటి ఉత్పాదకత వాటాను 50 శాతానికి చేర్చొచ్చని అంచనా వేసింది.ఈ రంగంలో ప్రస్తుతం 11 కోట్లుగా ఉన్న ఉపాధి అవకాశాలను 17.5 కోట్లకు పెంచొచ్చని బీ2బీ ఈ కామర్స్ సంస్థ అయిన ఆఫ్‌బిజినెస్ తన తాజా నివేదికలో తెలిపింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేయగలదని పేర్కొంది. ఎస్ఎంఈల్లో చాలా వరకు తమ ఉత్పత్తిని పెంచుకునేందుకు ఏఐ, ఎంఎల్ అప్లికేషన్లను తమ కార్యకలాపాల్లో అమలు చేయాలని అనుకుంటున్నట్టు తెలిపింది. ముడి సరుకుల కొనుగోళ్లు, అనుసంధానత, పంపిణీ నెట్వర్క్, వినూత్నమైన ఉత్పత్తులు, సిబ్బందికి శిక్షణ, వ్యర్థాల నిర్వహణ, మరీ ముఖ్యంగా సమయ నిర్వహణలో ఏఐ, ఎంఎల్ ఎంఎస్ఎంఈలకు సాయపడతాయని వెల్లడించింది. ఇదీ చదవండి: బ్యాంకింగ్ సమ్మె సైరన్ఏఐ ప్లాట్‌ఫామ్‌ల సాయం..ఎస్ఎంఈలకు ‘బిడ్అసిస్ట్’ తరహా ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లు అవసరమని.. ఇది వివిధ ప్రభుత్వ విభాగాల్లో 50 లక్షల మేర టెండర్ల సమాచారాన్ని అందిస్తుందని ఆఫ్‌బిజినెస్ నివేదిక తెలిపింది. అలాగే ‘నెక్సిజో.ఏఐ’ అన్నది ఎప్పటికప్పుడు తాజా కమోడిటీ ధరల పమాచారాన్ని, ఆయా వ్యాపారాలకు అనుగుణమైన టెండర్ల గురించి తెలియజేస్తుందని పేర్కొంది. ఎస్ఎంఈలు తమ మెటీరియల్స్‌ను దేశవ్యాప్తంగానే కాకుండా, విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా అనుసంధానత కీలకమని తెలిపింది. ఎంఎస్ఎంఈలు కీలక విభాగాల్లో ఎదుర్కొంటున్న ఆందోళనల పరిష్కారానికి వీలుగా ఇంజినీరింగ్ కాలేజీలు, మేనేజ్మెంట్ కాలేజీలు, మానవ వనరుల సంస్థలను వీటితో అనుసంధానించాలని సూచించింది. -
ఫిబ్రవరిలో ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దేశ ఎగుమతులు వరుసగా నాలుగో నెలలోనూ క్షీణతను చవిచూశాయి. ఫిబ్రవరిలో 36.91 బిలియన్ డాలర్ల ఎగుమతులు (రూ.3.21 లక్షల కోట్లు) నమోదయ్యాయి. క్రితం ఏడాది ఫిబ్రవరిలో ఎగుమతులు 41.41 బిలియన్ డాలర్లతో (రూ.3.60 లక్షల కోట్లు) పోల్చి చూస్తే 11 శాతం తగ్గిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఎగుమతులు 36.43 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో దిగుమతులు సైతం 50.96 బిలియన్ డాలర్లకు (రూ.4.43 లక్షల కోట్లు) తగ్గుముఖం పట్టాయి. 2024 ఫిబ్రవరిలో దిగుమతులు 60.92 బిలియన్ డాలర్లుగా (రూ.5.30 లక్షల కోట్లు) ఉంటే, ఈ ఏడాది జనవరి నెలలో 59.42 బిలియన్ డాలర్ల మేర ఉండడం గమనార్హం. దీంతో వాణిజ్య లోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం) 14.05 బిలియన్ డాలర్లకు తగ్గుముఖం పట్టింది. 2021 ఆగస్ట్ తర్వాత అత్యంత కనిష్ట వాణిజ్య లోటు ఇదేనని వాణిజ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒక నెలలో కనిష్ట దిగుమతులు 2023 ఏప్రిల్ తర్వాత మళ్లీ 2025 ఫిబ్రవరిలోనే నమోదు కావడం గమనించొచ్చు. స్వల్పంగా తగ్గిన పసిడి దిగుమతులు → ఫిబ్రవరి నెలలో బంగారం దిగుమతుల విలువ 2.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది జనవరిలో 2.68 బిలియన్ డాలర్ల విలువైన పసిడి దిగుమతి అయింది. → జెమ్స్ అండ్ జ్యుయలరీ ఎగుమతులు 21 శాతం తగ్గి 2.53 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. → జనవరితో పోల్చి చూస్తే చమురు దిగుమతులు 13.4 బిలియన్ డాలర్ల నుంచి 11.8 బిలియన్ డాలర్లకు తగ్గాయి. → ఫిబ్రవరి నెలకు సేవల ఎగుమతులు 35 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జనవరిలో ఈ మొత్తం 38.55 బిలియన్ డాలర్లుగా ఉంది. → ఫిబ్రవరిలో సేవల దిగుమతుల విలువ 16.55 బిలియన్ డాలర్లుగా ఉంది. జనవరిలో ఈ మొత్తం 18.22 బిలియన్ డాలర్లుగా నమోదైంది.800 బిలియన్ డాలర్ల ఎగుమతులు..2024–25లో సవాళ్లు నెలకొన్నప్పటికీ 800 బిలియన్ డాలర్ల విలువైన వస్తు, సేవల ఎగుమతులు సాధిస్తామన్న విశ్వాసాన్ని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భత్వాల్ వ్యక్తం చేశారు. వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టడం అన్నది ప్రధానంగా చమురు, బంగారం, వెండి దిగుమతుల క్షీణతవల్లేనని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. -
బ్యాంకింగ్ సమ్మె సైరన్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా బ్యాంక్ సంఘాల ఐక్య సమాఖ్య (యూఎఫ్‌బీయూ) సారథ్యంలో ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి 25 అర్ధరాత్రి వరకు రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నట్లు యూనియన్లు ప్రకటించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, కో–ఆపరేటివ్ బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులకు సంబంధించిన 9 బ్యాంకు యూనియన్లకు యూఎఫ్‌బీయూ ప్రాతినిధ్యం వహిస్తోంది. మొత్తం 8 లక్షల మందికి పైగా ఉద్యోగులు, అధికారులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. కాగా, సమ్మె సందర్భంగా రెండు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని యూనియన్ వర్గాలు పేర్కొన్నాయి. దీనివల్ల బ్యాంకు సేవలకు తీవ్ర విఘాతం కలిగి అవకాశం ఉంది. నియామకాలు పెంచాలి... పెరుగుతున్న ఖాతాదారులకు అనుగుణంగా బ్యాంకుల్లో తగినంత మంది సిబ్బందిని నియమించాలని యూనియన్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. గడిచిన దశాబ్దకాలానికి పైగా నియామకాలు సరిగ్గా జరగకపోవడంతో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని అంటున్నాయి. దీంతో ప్రస్తుత ఉద్యోగులపై తీవ్ర పనిభారం పడుతోందని, కస్టమర్లకు సరిగ్గా సేవలు అందించలేకపోతున్నామనేది యూనియన్ల వాదన. అనేక సర్కారీ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)లకు ఇప్పుడున్న అరకొర సిబ్బంది ఏమాత్రం సరిపోరని, అన్ని క్యాడర్లలో నియామకాలు చేపట్టాలని బ్యాంకు సంఘాలు స్పష్టం చేశాయి. 2013లో 3,98,801 మంది క్లర్కులు ఉండగా.. 2024 నాటికి వారి సంఖ్య 2,46,965 మందికి పడిపోయిందని, అంటే ఏకంగా 1,51,836 మంది తగ్గిపోయారని వారు లెక్కలతో సహా చెబుతున్నారు. ఇక మొత్తం సిబ్బంది సంఖ్య 2013లో 8,86,490 మంది ఉంటే, 2024 నాటికి 7,46,679 మందికి (1,39,811 తగ్గుదల) చేరిందని యూఎఫ్‌బీయూ పేర్కొంది.ఇతర ప్రధాన డిమాండ్లు ఇవీ... → బ్యాంకింగ్ పరిశ్రమ అంతటికీ వారానికి 5 రోజుల పని దినాల డిమాండ్‌కు ఏడాది క్రితం బ్యాంకు యాజమాన్యాలు అంగీకరించి, ప్రభుత్వానికి సిఫార్సు చేసినప్పటికీ అమలుకు మాత్రం నోచుకోలేదు, ఇక ఏమాత్రం జాప్యం లేకుండా దీన్ని అమలు చేయాలి. → సిబ్బంది పనితీరుకు సంబంధించి నెలవారీ సమీక్ష విషయంలో ప్రభుత్వ ఆదేశాలను, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల్లో మార్పులను తక్షణం ఉపసంహరించుకోవాలి. → బ్యాంకు అధికారులు/సిబ్బందిపై దాడులను అరికట్టేలా తగిన రక్షణ కల్పించాలి. → గ్రాట్యుటీ పరిమితిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుగుణంగా రూ.25 లక్షలకు పెంచడంతో పాటు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చేలా గ్రాట్యుటీ చట్టాన్ని సవరించాలి. → తాత్కాలిక సిబ్బందిని పర్మనెంట్ చేయడంతో పాటు పర్మనెంట్ ఉద్యోగాలకు అవుట్‌సోర్సింగ్‌ను నిలిపివేయాలి. → ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం కనీసం 51% వాటాను కొనసాగించాలి. -
జీతాల కోసం రూ.4 వేల కోట్లు అప్పు
అప్పుల భారం, ఇతర కారణాలతో తమ ప్రభుత్వం నగదు కొరతను ఎదుర్కొంటోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్బీఐ నుంచి రూ.4,000 కోట్ల లోన్ తీసుకుని ఉద్యోగులకు జీతాలు చెల్లించగలిగామని తెలిపారు. ఇటీవల శాసనమండలిలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని, నగదు కొరత దృష్ట్యా డియర్నెస్ అలవెన్స్ (డీఏ), ఇతర చెల్లింపులు ఆలస్యమైతే ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగులదేనని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అన్ని వాస్తవాలు, గణాంకాలను వారి ముందు ఉంచుతామని, తద్వారా చెల్లింపులపై తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని చెప్పారు. డీఏ, ఇతర ప్రయోజనాలు ఉద్యోగుల హక్కు అన్నారు.సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కరవుఈ నెల 12న ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయంలో సింహభాగం ప్రతినెలా జీతాలు, పింఛన్లు, గత బీఆర్ఎస్ పాలనలో చేసిన భారీ అప్పులను తీర్చడానికి వెచ్చిస్తున్నామని తెలిపారు. దాంతో సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించడం సవాలుగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినెలా రూ.18 వేల కోట్ల నుంచి రూ.18,500 కోట్ల ఆదాయం సమకూరుతుండగా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ల కోసం రూ.6,500 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. మరో రూ.6,500 కోట్లు బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులను తీర్చడానికి వినియోగిస్తున్నామని తెలిపారు. దాంతో ప్రభుత్వం వద్ద రూ.5,000 కోట్ల నుంచి రూ.5,500 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. సుమారు 30 ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రతినెలా నిధులు అవసరమవుతాయని, వీటితో పాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ఆర్థిక అవసరాలు కూడా ఉన్నాయన్నారు.రాష్ట్రాలకు ఆర్బీఐ అప్పులు ఇలా..దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు చెల్లించడం వంటి ఆర్థిక బాధ్యతలను నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి రుణాలు పొందవచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు రుణ పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులను రాష్ట్ర ఆర్థిక స్థితిని ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నిత్యం రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిన అవసరాలకు సంబంధించి నగదు తాత్కాలిక అసమానతలను నిర్వహించడంలో ఆర్బీఐ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ (డబ్ల్యూఎంఏ) ద్వారా స్వల్పకాలిక రుణాలను అందిస్తుంది. ఈ అడ్వాన్సులు రాష్ట్ర ఆదాయ, వ్యయ నమూనాల ఆధారంగా పరిమితులకు లోబడి ఉంటాయి.ఇదీ చదవండి: ఏఐ తోడుంటే.. విజయం మీవెంటే..బాండ్ల జారీతో మార్కెట్ రుణాలు..ఒక రాష్ట్రం తన డబ్ల్యూఎంఏ పరిమితిని దాటితే, అది ఆర్బీఐ నుంచి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే, దీనికి కఠినమైన షరతులు ఉంటాయి. ఆర్బీఐ ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తూ బాండ్ల జారీ వంటి మార్కెట్ రుణాల ద్వారా కూడా రాష్ట్రాలు నిధులను సమీకరించుకోవచ్చు. ఏదైనా రుణం తీసుకోవాలంటే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఆర్బీఐ రుణాలపై వడ్డీ రేట్లను క్రమంగా చెల్లించాల్సి ఉంటుంది. కాలపరిమితితో సహా నిర్దిష్ట రీపేమెంట్ నిబంధనలు వర్తిస్తాయి. వీటిని రాష్ట్రాలు పాటించాల్సి ఉంటుంది.