రూపాయి రయ్‌.. రయ్‌..! | Rupee Rallies 117 Paise to 90. 32 Per Dollar on India-US Trade Deal | Sakshi
Sakshi News home page

రూపాయి రయ్‌.. రయ్‌..!

Feb 4 2026 3:50 AM | Updated on Feb 4 2026 8:45 AM

Rupee Rallies 117 Paise to 90. 32 Per Dollar on India-US Trade Deal

117 పైసలు అప్‌ 

90.32 వద్ద ముగింపు

ముంబై: భారత్‌–అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో మంగళవారం రూపాయి విలువ భారీ ర్యాలీ చేసింది. డాలర్‌ మారకంలో ఏకంగా 117 పైసలు బలపడి రెండున్నర వారాల గరిష్టం 90.32 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ 2.50% పెరగడం, అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల అంశాలు దేశీయ కరెన్సీ ర్యాలీకి సహకరించాయి.

ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 90.30 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 144 పైసలు ర్యాలీ చేసి 90.05 గరిష్టాన్ని తాకింది. అలాగే 90.52 స్థాయి కనిష్టానికి దిగివచి్చంది. ‘‘అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరడం ద్వారా విదేశీ ఇన్వెస్టర్ల పునరాగమనం మొదలవుతుంది. దేశీయ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల రాకతో రూపాయిపై ఒత్తిడి తగ్గుతుంది’’ అని ఫారెక్స్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement