breaking news
Rupee rallies sharply
-
రూపాయి రయ్.. రయ్..!
ముంబై: భారత్–అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో మంగళవారం రూపాయి విలువ భారీ ర్యాలీ చేసింది. డాలర్ మారకంలో ఏకంగా 117 పైసలు బలపడి రెండున్నర వారాల గరిష్టం 90.32 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ 2.50% పెరగడం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల అంశాలు దేశీయ కరెన్సీ ర్యాలీకి సహకరించాయి.ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 90.30 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 144 పైసలు ర్యాలీ చేసి 90.05 గరిష్టాన్ని తాకింది. అలాగే 90.52 స్థాయి కనిష్టానికి దిగివచి్చంది. ‘‘అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరడం ద్వారా విదేశీ ఇన్వెస్టర్ల పునరాగమనం మొదలవుతుంది. దేశీయ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల రాకతో రూపాయిపై ఒత్తిడి తగ్గుతుంది’’ అని ఫారెక్స్ నిపుణులు అభిప్రాయపడ్డారు. -
ఎట్టకేలకు తేరుకుంటున్న రూపాయి
ముంబయి : భారీగా పతనం అయిన రూపాయి ఎట్టకేలకు తేరుకుంటోంది. ప్రారంభంలో రూపీ రెండు రూపాయిలతో ప్రారంభమైంది. 154 పైసలు లాభపడింది. అలాగే దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 170 పాయింట్లతో, నిఫ్టీ 40 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.67.20 పైసలుగా ఉంది. మరోవైపు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు ఈవాళ మిశ్రమంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లు ఓ మాదిరిగా లాభపడ్డాయి. యూరోప్ మార్కెట్లు 1 శాతం దాకా నష్టపోయాయి. ఈ ఉదయం ఆసియా మార్కెట్లు కూడా చాలా వరకు లాభాల్లో ఉన్నాయి. ఒక్క షాంఘై సూచీ మాత్రమే స్వల్పంగా నష్టపోతోంది. సింగపూర్ నిఫ్టీ 40 పాయింట్ల దాకా లాభపడుతూ 5,300లకు సమీపంలో ట్రేడవుతోంది.


