భారతీయ చీరకు ఎప్పటికీ వన్నెతరగని గౌరవం ఉందని మరోసారి రుజువైంది. బ్రిటన్‌లో ప్రతిష్టాత్మకమైన రాయల్ కార్యక్రమంలో తప్పనిసరిగా డ్రెస్‌లు, టోపీలే ధరించాలి..కానీ ఆమె భారత సంప్రదాయ చీరనే ఎంచుకుని అందర్నీ ఆకర్షించడమే కాదు..అందురూ పనిగట్టుకుని ఆమెను పలకరించడం విశేషం. ఎవరామె అంటే..
ఆ మహిళే భారత సంతతి రచయిత్రి కామిని బంగా. స్వతహాగా బ్రిటన్ పౌరురాలే అయినా..ఆమె భారత సాంప్రదాయ చీరలోనే ఆ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరవ్వడం విశేషం. పైగా తన మూలాలతో ఉన్న బంధాలు ఎన్నటికీ మారవని సగర్వంగా చెబుతోందామె. రాయల్ ఆస్కాట్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తప్పనిసరిగా డ్రెస్ కోడ్ ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా ఈ రచయిత్రి ఇలా సాంప్రదాయ చందేరి చీరలో తళక్కుమంది. ఇంతకీ ఏంటి రాయల్ ఆస్కట్ అంటే..
రాయల్ ఆస్కట్ అంటే..
రాయల్ ఆస్కట్ అనేది యూకేలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్రపు పందెం కార్యక్రమాలలో ఒకటి. ఇది ప్రతి ఏడాది బెర్క్‌షైర్‌లోని ఆస్కట్ రేస్‌కోర్స్‌లో జరుగుతుంది. బ్రిటిష్ రాజకుటుంబంతో ఉన్న అనుబంధానికి ప్రసిద్ధి చెందిన ఐదు రోజుల కార్యక్రమం ఇది. దీనికి హాజరయ్యే వారంతా ఆడంబరమైన దుస్తుల, ప్రత్యేమైన టోపీలు ధరించి వస్తారు.
సింపుల్‌గా చెప్పాలంటే రాయల్ ఎన్‌క్లోజర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి కఠినమైన డ్రెస్ కోడ్ ఉంటుంది. అక్కడ మహిళలు ఫార్మల్ దుస్తులతో పాటు టోపీలు లేదా ఫ్యాసినేటర్‌లను ధరించాలి, లేదా తగిన జాతీయ దుస్తులను ఎంచుకోవాల్సి ఉంటుంది. కానీ రచయిత్రి కామిని బంగా సాంప్రదాయ చీరనే ఎంచుకున్నారు.
చీరనే ఎందుకంటే..
తాను ఆస్కట్‌లో సాధారణంగా కనిపించే ఆకర్షణీయమైన దుస్తులే ధరించాలనుకుందట. తనకు రాయల్ ఆస్కట్ ఆహ్వానం అందగానే..తన బ్రిటన్ స్నేహతులతో షాపింగ్ కూడా చేశారట. ఆస్కట్ కోసం అందమైన మహిళలు ధరించే వేసవి దుస్తులు ప్రయత్నించి చూశానని, కానీ అవి తనకు సహజంగా అనిపించలేదన్నారు. తనెందుకో ఇంగ్లీష్ డ్రెస్, టోపీ తనకు ఎప్పటికీ సరిపోవని అనిపించిందన్నారు.
తన స్నేహితులు ఆ డ్రెస్ తనకు బాగానే ఉందని చెప్పినా.. తనకే ఎందుకో సహజంగా అనిపించలేదన్నారు. చివరికి ఇలా బంగా రాయల్ ఆస్కట్‌కు వింటేజ్ ఆభరణాలతో కూడిన చందేరి చీరలో హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాను 20 ఏళ్లుగా యూకేలో నివశిస్తున్నానని, ఐనా ఈ దేశ పౌరురాలిగా కొన్ని విషయాల్లో మాత్రం ఎప్పటికీ మారవని అంటోంది. అ
దీగాక తన వారసత్వాన్ని స్వీకరించడం వల్లే ఆస్కాట్‌లో ప్రత్యేకంగా కనిపిస్తావని స్నేహితులు కూడా అనడంతో ఇలా ఈ ఆహార్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యానని అన్నారు. అయితే అక్కడకు వచ్చిన వారిందరి నుంచి, అలాగే భద్రతా సిబ్బంది, అక్కడున్న యువతుల నుంచి విశేషస్పందన వచ్చిందని లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో రాసుకొచ్చారామె. పైగా ప్రతి ఒక్కరూ తనను ఆపి మరి అభినందించారని చెప్పుకొచ్చింది. ఎక్కడైన భారతీయ చీరకు మించిన ఫ్యాషన్ లేదు కదా..!.
(చదవండి: Janhvi Kapoor: అత్యంత అరుదైన బనారసి కడియల్ నేత చీరలో జాన్వీ కపూర్..! మత్స్యకారుల..)


