ముంబైలో మార్మోగుతున్న ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలు | Mumbai Gears Up For Ganesh Chaturthi 2026 As Grand Ganesh Aagman Celebrations Begin, More Details | Sakshi
Sakshi News home page

ముంబైలో మార్మోగుతున్న ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలు

Aug 9 2026 1:23 PM | Updated on Aug 9 2026 2:31 PM

Mumbai Ganesh Aagman 2026 Celebrations Begin In Parel

ముంబై : మహారాష్ట్రలోని ముంబై నగరంలో వినాయక చవితి వేడుకలకు రంగం సిద్ధమైంది. గణేష్ ఆగమన్ వేడుకల ప్రారంభంతో ముంబై వీధులు భక్తిభావంతో నిండిపోతున్నాయి. 2026 సెప్టెంబర్ 14న ఘనంగా గణేష్ చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ముంబైలోని ప్రముఖ లాల్‌బాగ్‌-పరేల్ ప్రాంతంలో ఘన స్వాగత వేడుకలతో నగరమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది.

సంప్రదాయ వాయిద్యాలు, కాషాయ పతాకాలు, ‘గణపతి బప్పా మోరియా’ నినాదాల మధ్య భక్తులు తొలి ప్రతిమలను అత్యంత వైభవంగా స్వాగతించారు. ఈ ఏడాది ముంబైలో తయారైన పలు వినాయక ప్రతిమలు గుజరాత్‌కు తరలివెళ్తుండటం విశేషం. గుజరాత్‌లోని సూరత్, భరూచ్ తదితర ప్రాంతాలకు చెందిన మండపాల నిర్వాహకులు ముంబై నుంచి విగ్రహాలను తీసుకెళుతుంటారు. ఆగస్టులోని ప్రతి వారాంతంలో ఇలాంటి భారీ ఊరేగింపులు జరుగుతుంటాయి.

ఇది కూడా  చదవండి: హరిద్వార్-ఢిల్లీ మార్గంలో కన్వర్ యాత్రికుల కోలాహలం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement