యాక్షన్‌కి సై | Salman Khan set to begin the next scheduleMumbai | Sakshi
Sakshi News home page

యాక్షన్‌కి సై

Aug 6 2026 4:22 AM | Updated on Aug 6 2026 4:22 AM

Salman Khan set to begin the next scheduleMumbai

యాక్షన్‌ సీక్వెన్స్‌కు సిద్ధం అవుతున్నారట సల్మాన్‌ ఖాన్‌. ఆయన హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఓ కీలక పాత్రలో మాధవన్‌ నటిస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. కాగా, ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ ఈ వారంలో ముంబైలో ప్రారంభం కానుందని సమాచారం. 

ఈ సినిమా చిత్రీకరణ కోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ సెట్‌ రెడీ చేయిస్తున్నారని, ఈ సెట్‌లోనే సల్మాన్‌ ఖాన్‌–నయనతార పాల్గొనగా ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తీసేందుకు మేకర్స్‌ రెడీ అవుతున్నారని తెలిసింది. 

యాక్షన్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలనూ తెరకెక్కించనున్నారట. ఇక ఈ చిత్రం కోసం దాదాపు 16 కేజీల బరువు తగ్గారట సల్మాన్‌ ఖాన్‌. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌ సందర్భంగా రిలీజ్‌ కానుందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మరోవైపు సల్మాన్‌ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘మాతృభూమి’ విడుదలకు సిద్ధం అవుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement