బిగ్‌బాస్‌ రియాలిటీ షో.. ముహుర్తం ఫిక్స్ | Bigg Boss Season 20 Release Date Announced: Teaser Featuring Salman Khan Released | Sakshi
Sakshi News home page

Bigg Boss: బిగ్‌బాస్‌ రియాలిటీ షో.. ముహుర్తం ఫిక్స్

Aug 4 2026 3:40 PM | Updated on Aug 4 2026 3:45 PM

Famous Reality Show Bigg Boss 20 release date out now

బుల్లితెరపై ఫుల్ క్రేజ్ ఉన్న రియాలిటీ షో బిగ్‌బాస్. ఏ భాషలోనైనా ఈ షోకు ఆడియన్స్‌ ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి బుల్లితెర ప్రియులను అలరించేందుకు రియాలిటీ షో వచ్చేస్తోంది. హిందీలో ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా ఈ షో 19 సీజన్స్‌ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది  బిగ్ బాస్ సీజన్- 20కి కౌంట్‌డౌన్ మొదలైంది. రాబోయే సీజన్‌కు సంబంధించి తాజాగా టీజర్‌ రిలీజ్ చేశారు మేకర్స్.  ఈ సారి కూడాహోస్ట్‌గా సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

ఈ తాజా సీజన్ సెప్టెంబర్ 6 నుంచి మొదలు కానుందని మేకర్స్ రివీల్ చేశారు. ఈ టీజర్‌లో గుర్రంతో పాటు సల్మాన్ ఖాన్‌ ఎంట్రీ ఇచ్చారు. టీజర్ చూస్తుంటే ఈ సారి సరికొత్తగా సీజన్ ప్లాన్ ‍చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ టీజర్‌లో కంటెస్టెంట్ల వివరాలు మాత్రం రివీల్ చేయలేదు. ఈ సీజన్‌లో కొత్త ట్విస్ట్‌లను ప్రేక్షకులను పరిచయం చేస్తుందని..అంతే కాకుండా సీజన్-20 మధ్యలో ఒక మిస్టరీ ఉంటుందని సల్మాన్ ఖాన్‌ టీజర్‌లో ప్రస్తావించారు. ఈ టీజర్ కేవలం ఆరంభం మాత్రమేనన్నారు.

బిగ్ బాస్-20 స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్- 20 సెప్టెంబర్ 6న ప్రారంభం కానుందని వెల్లడించారు.  ఈ రియాలిటీ షో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా కలర్స్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే ఈ ఏడాది అన్ని భాషల్లోనూ ఓకేసారి ఈ షో ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అదే జరిగితే తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ అదో రోజు నుంచే షో మొదలు కానుంది. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement