మోదీని దూషించి.. మూడు సార్లు మకాం మార్చిన బాలిక! | Leak of FIR Details Forces Teenager in PM Modi Abuse Case to Relocate Thrice | Sakshi
Sakshi News home page

మోదీని దూషించి.. మూడు సార్లు మకాం మార్చిన బాలిక!

Aug 4 2026 10:19 AM | Updated on Aug 4 2026 10:32 AM

Leak of FIR Details Forces Teenager in PM Modi Abuse Case to Relocate Thrice

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని దూషించిన కేసులో నోయిడాకు చెందిన 15 ఏళ్ల బాలిక రుచికా సింగ్ ఎదుర్కొంటున్న కష్టాలు ఇంకా తొలగలేదు. బహిరంగంగా క్షమాపణ కోరినప్పటికీ, సోషల్ మీడియా వేదికగా ఆమెకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఎఫ్‌ఐఆర్ ద్వారా చిరునామా లీక్ కావడంతో ఆమె తల్లితో పాటు మూడు సార్లు ఇల్లు మార్చాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో జరిగిన విద్యార్థి ఆందోళన సందర్భంగా ప్రధాని మోదీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో  రుచికా సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రధాని మోదీ ఆమెను క్షమిస్తూ సందేశం ఇవ్వడంతో ఢిల్లీ పోలీసులు ఆమెపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేశారు. ఈ క్రమంలోనే రుచికా కూడా తన తప్పును మన్నించాలని దేశ ప్రజలను కోరుతూ, ఒక వీడియో విడుదల చేశారు. అయినప్పటికీ ఆమెకు కష్టాలు తప్పలేదు.

రుచికా సింగ్ తరఫు న్యాయవాది అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఎఫ్‌ఐఆర్ నమోదు సమయంలో ఆమె వయసు కేవలం 14 ఏళ్లని, ఆగస్టు 1 నాటికి ఆమెకు 15 ఏళ్లు నిండాయని తెలిపారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లో చిరునామా లీక్ కావడంతో కొందరు ఆమె ఇంటికి వెళ్లి అత్యాచార హెచ్చరికలు, ప్రాణహాని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. దీంతో ప్రాణభయంతో వారు ఫరీదాబాద్‌లోని బంధువుల ఇంట ఆశ్రయం పొంది, ఆ తర్వాత మరో అజ్ఞాత ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని న్యాయవాది ఖండించారు. రుచికా సెలూన్ వర్కర్ కాదని, ఢిల్లీ పాఠశాలలో ఓపెన్ స్కూలింగ్ విధానంలో పదవ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థి అని తెలిపారు. ఆమె తల్లి సింగిల్ పేరెంట్ అని, ప్రైవేట్ ట్యూషన్లు చెబుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారన్నారు.  ఈ వేధింపులు ఆ తల్లీకూతుళ్ల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: అభిజీత్ దీప్కే అరెస్ట్‌కు రంగం సిద్ధం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement