న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైజాన్ అన్సారీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై ఢిల్లీ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. పూణె, ఔరంగాబాద్‌లలో తనపై జరిగిన దాడి వెనుక అభిజీత్ దీప్కే మనుషుల ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించి, దీప్కేను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఫైజాన్ అన్సారీ మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయని తెలిపారు. అభిజీత్ దీప్కే తన స్వార్థ ప్రయోజనాల కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఎవరూ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇవ్వకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. సరైన సమయంలో సోనమ్ వాంగ్‌చుక్‌ను అదుపులోకి తీసుకుని, ఢిల్లీలో ఉద్రిక్తతలు తలెత్తకుండా అడ్డుకున్న ఢిల్లీ సీఎం, పోలీసుల చొరవను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.
మరోవైపు, అభిజీత్ దీప్కే ఈ ఆరోపణలను ఖండించారు. తమ సంస్థ ఏ ఒక్క ప్రత్యేక రాజకీయ పార్టీని విమర్శించడానికి లేదా సమర్థించడానికి మాత్రమే పనిచేయదని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ తమ సంస్థ విద్యార్థుల గొంతుకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి లేదా విద్యాశాఖ మంత్రి ఏ పార్టీకి చెందినవారైనా విద్యార్థుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.
ఇది కూడా చదవండి: గేదె లేదని పులులకు మేక మాంసం.. షాకిచ్చిన ఖర్చు!


