breaking news
arrest
-
18 ఏళ్ల వేట
కాలం మారినా.. చట్టం మాత్రం నిద్రపోలేదు. తన వేటను ఆపలేదు. సరిగ్గా పద్దెనిమిదేళ్ల క్రితం.. అంటే 2007లో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి, అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారైన నిందితుడి కోసం పోలీసులు సాగించిన సుదీర్ఘ వేట ఎట్టకేలకు ముగిసింది. చిన్నారిపై ‘హత్యాచారం’ తరువాత, నిందితుడు సరిహద్దులు దాటి అదృశ్యమయ్యాడు. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. నేపాల్ అడవుల్లోని అజ్ఞాతం.. యూపీలోని ఇటుక బట్టీలో దాక్కున్న రహస్యం.. ఇవేవీ చట్టం కళ్లుగప్పలేకపోయాయి. ఎట్టకేలకు మీరా భయందర్–వసాయ్ విరార్ (ఎంబీవీవీ) పోలీసులకు కీచకుడు పట్టుబడ్డాడు. క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మదన్ బల్లాల్ తెలిపిన వివరాలివి. అది కాళరాత్రి మాణిక్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ అమానుష ఘటన. 2007 మార్చి 31 రాత్రి, 22 ఏళ్ల నంద్లాల్ అలియాస్ నందు రాందాస్ విశ్వకర్మ అనే యువకుడు ఒక చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి లోబరుచుకున్నాడు. మర్నాడు తెల్లవారుజామున బాలిక ఉసురు తీశాడు. అత్యాచారం, హింసతో పాటు, చివరకు ఉరితాడు బిగించి ఆమెను హత్య చేశాడు. నేపాల్‌కు పరారైన హంతకుడు నేరం చేసిన వెంటనే, నందు విశ్వకర్మ అంతర్జాతీయ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయాడు. అతను చాలా ఏళ్లు అక్కడే అజ్ఞాతంలో గడిపాడు. ఆ కేసు ఫైల్ మాణిక్పూర్ పోలీసుల దగ్గర దుమ్ము పట్టి ఉన్నా, దర్యాప్తు అధికారులు మాత్రం వదిలేయలేదు. అతి ముఖ్యమైన క్లూ.. వేట మొదలు అయితే.. ఇటీవల కేసును మళ్లీ తిరగదోడిన క్రైమ్ డిటెక్షన్ సెల్–2, వసాయ్ బృందానికి ఊహించని క్లూ దొరికింది. నిందితుడు పాత జీవితాన్ని వదిలి, యూపీకి తిరిగి వచి్చ, సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని స్వగ్రామం ఖర్దౌరీలో ఇటుక బట్టీలో కూలీగా దాక్కుని ఉన్నాడని తెలిసింది. దీంతో ఏసీపీ మదన్ బల్లాల్ నాయకత్వంలో, సీనియర్ ఇన్స్పెక్టర్ అవిరాజ్ కుర్హాడే బృందం తక్షణమే కదిలింది. పట్టుబడిన క్షణం నిందితుడి ఆచూకీ పక్కాగా ధ్రువీకరించుకున్నాక.. డిసెంబర్ 10న యూపీలోని ఖర్దౌరీకి చేరుకున్న పోలీసు బృందం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 18 ఏళ్లుగా స్వేచ్ఛా జీవితం గడిపిన విశ్వకర్మ, తన చుట్టూ ఉచ్చు బిగుస్తోందని ఊహించలేకపోయాడు. చివరకు నంద్లాల్ అలియాస్ నందు రాందాస్ విశ్వకర్మను డిసెంబర్ 10న అతని స్వగ్రామం ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని ఖర్దౌరీలో అరెస్టు చేసి మహారాష్ట్రకు తరలించారు. నిజం నిప్పులాంటిది ఎంతకాలం దాచినా, పాపం పండక తప్పదు. న్యాయం ఆలస్యమై ఉండవచ్చు.. కానీ జరిగి తీరుతుంది. చాక్లెట్ ఆశ చూపించి చిన్నారిని చిదిమేసిన హంతకుడికి పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ అజ్ఞాతం తరువాత సంకెళ్లు పడటమే దీనికి నిదర్శనం. చట్టంపై విశ్వాసాన్ని నిలబెడుతూ పోలీసులు సాగించిన వేట నేటితో ముగిసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం
బంజారాహిల్స్: ట్యూషన్లో చదవడం లేదనే కారణంతో ఓ కసాయి ట్యూషన్ టీచర్ ఒకటో తరగతి విద్యార్థికి గరిటెతో కాల్చి వాతలు పెట్టింది. చిన్నారికి నాలుగు చోట్ల వాతలు పెట్టడంతో తీవ్ర గాయాలుకాగా ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. షేక్‌పేట ఓయూ కాలనీలో నివసించే వి.మానస ఎథిక్ సొల్యూషన్స్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఆరు నెలల క్రితం నుంచి ఆమె ఇంట్లో కళ్యాణి, సత్యబాబు దంపతులు పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కొడుకులు. మానస రోజూ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఉచితంగా ట్యూషన్లు చెబుతోంది. ఇందుకోసం ఇంట్లో పనిచేస్తున్న వారికి జీతం ఇవ్వకుండా ట్యూషన్లు చెబుతున్నానంటూ ఎగ్గొట్టేది. సమీపంలోని కాకతీయ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న తేజానందన్ (6) గురువారం సాయంత్రం అన్నతోపాటు మానస వద్దకు ట్యూషన్‌కు వెళ్లాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తేజానందన్ అన్న ఇంటికి వెళ్లిపోగా, తేజానందన్ చదువుకుంటున్నాడు. అయితే ట్యూషన్లో సరిగా చదవడం లేదంటూ ఆగ్రహానికి గురైన మానస గరిటె కాల్చి చేతులు, తొడలు, వీపుపై వాతలు పెట్టింది. గాయాలతో విలవిల్లాడుతూ చిన్నారి ఏడుస్తుండగా తల్లిదండ్రులు పరిగెత్తుకొచ్చారు. చిన్నారికి గరిటెతో కాల్చినట్లుగా ఒళ్లంతా ఎర్రగా బొబ్బలెక్కింది. దీంతో బాధిత తల్లిదండ్రులు తేజానందన్ను తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మానసపై ఫిర్యాదుచేశారు. పోలీసులు మానసపై బీఎన్ఎస్ సెక్షన్ 324, 75 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాలుడిని చికిత్స నిమిత్తం గోల్కొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.నాకేమీ పశ్చాత్తాపం లేదు: మానస తేజానందన్ సరిగ్గా చదవడం లేదని భయపెట్టడానికే గరిటె కాల్చి వాతలు పెట్టినట్లు మానస వెల్లడించింది. గతంలో రెండుసార్లు ఇలాగే భయపెట్టానని, ఈసారి మాత్రం వాతలు పెట్టానని చెప్పింది. అయితే, తానేమీ పశ్చాత్తాపం చెందడంలేదంది. -
లెంగిక వేధింపుల కేసులో ఇద్దరు అధ్యాపకుల అరెస్ట్
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో ఇటీవల సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో మరో ముందడుగు పడింది. బాధితురాలు స్వరాష్ట్రం ఒడిశాకు తిరుపతి పోలీసుల బృందం మంగళవారం చేరుకుంది. ఒడిశా జార్హ్పూర్లో బాధితురాలిని మహిళా ఎస్ఐ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టి వివరాలను సేకరించారు. యువతి స్టేట్మెంట్ను వీడియో రికార్డ్ చేసి భద్రపరిచారు. ఇప్పటికే ఈ కేసు విషయంపై తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి పార్లమెంట్ వేదికగా ప్రస్తావించడంతో ఇటు పోలీసులు, అటు వర్సిటీ అధికారులలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. అధ్యాపకుడు లక్ష్మణ్ కుమార్ తనను పలు మార్లు లైంగికంగా వేధించారని, మరో అధ్యాపకుడు శేఖర్‌రెడ్డితో ఏకాంతంగా గడిపిన వీడియోలు ఉన్నాయంటూ లక్ష్మణ్ కుమార్ పలుమార్లు బెదిరింపులకు దిగారని బాధితురాలు తెలిపినట్లు సమాచారం. దీంతో ఈ స్టేట్మెంట్లను ఆధారం చేసుకొని, పోలీసులు ఆ ఇద్దరి అధ్యాపకులను అరెస్ట్ చేశారు. అనంతరం ఈస్ట్ పోలీసులు స్థానిక డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. విచారణ అనంతరం అధ్యాపకులకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది. -
రూ.29 కోట్ల డ్రగ్స్ పట్టివేత
బెంగళూరు(బనశంకరి): బెంగళూరులో డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు విదేశీయులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.29 కోట్ల విలువ చేసే 10.36 కేజీల ఎండీఎంఏ క్రిస్టల్, 8 కేజీల హైడ్రో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చామరాజపేటేలోని పోస్టాఫీస్‌లో డ్రగ్స్ పార్శిల్స్ వచ్చినట్లు తెలిసి పోలీసులు సోదాలు చేయగా 8 కిలోల హైడ్రో గంజాయి లభించింది. మరోఘటన.. బెంగళూరు విమానాశ్రయంలో ఓ ప్రయాణికుని నుంచి కోట్ల రూపాయల విలువైన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
Film Nagar: అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డి పై కేసు నమోదు
-
ఢిల్లీ.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రసంస్థతో సంబంధాలున్న ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. అరెస్టైన ముగ్గురు తీవ్రవాదులు నార్త్ ఇండియాకు చెందిన వారని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ లలో వీరిని అదుపులోికి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల గురుదాస్ పూర పోలీస్ స్టేషన్ పై బాంబుతో దాడి చేసింది ఈ టెర్రరిస్టులేనని స్పెషల్ సెల్ అడిషనల్ సీపీ ప్రమోద్ కుమార్ కుశ్వాహా పేర్కొన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో హార్గున్ ప్రీత్ సింగ్ (పంజాబ్), వికాస్ ప్రజాపతి (మధ్యప్రదేశ్) ఆరిఫ్ (ఉత్తరప్రదేశ్) రాష్ట్రాలకు చెందిన వారని తెలిపారు. వీరు కొన్ని ప్రదేశాలను టార్గెట్ చేసుకున్నారని ఆ ప్రాంతాలలో రెక్కీ నిర్వహించి పలు వీడియోలు చిత్రీకరించారని పేర్కొన్నారు. వీరందరిని షాబాద్ బట్టి అనే వ్యక్తి బయిటి నుండి ఆదేశాలు ఇచ్చేవాడని సీపీ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ టెర్రరిస్ట్ గ్యాంగ్ లకు ఆయన స్వయంగా గాని ఆయన అనుచరుల ద్వారా గాని నడిపించేవారన్నారు.టెర్రరిస్ట్ గ్రూప్ రిక్రూట్ మెంట్ కోసం సామాజిక మాధ్యమాలను వాడారని వాటి ద్వారానే యువకులను ఉగ్రవాదులుగా నియమించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న టెర్రరిస్టులు ఉగ్రవాదుల విషయంలో కొంత సమాచారం ఇచ్చారని త్వరలో వాటి ఆధారంగా మరిన్ని అరెస్టులు జరుగుతాయని సీపీ ప్రమోద్ కుమార్ కుశ్వాహ పేర్కొన్నారు. -
దొంగ ఆఫీసర్.. ఉదయం IAS.. రాత్రి IPS
-
ఢిల్లీ పేలుడు: ఎన్ఐఏ చేతికి కీలక ఆధారం
న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి మరో కీలక ఆధారం లభ్యమయ్యింది. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట వెలుపల కారు బాంబు దాడికి పాల్పడిన కేసులో మరో ముందడుగు పడింది. ఈ ఘటనలో కీలకంగా ఉన్న సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి ఆశ్రయం కల్పించిన హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన సోయాబ్‌ను తాజాగా ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.ఇండియా టీవీ అందించిన కథనం ప్రకారం సోయాబ్ ఉగ్రవాది ఉమర్‌కు లాజిస్టికల్(రవాణా) సాయాన్ని అందించాడు. ఈ పేలుడులో 15 మంది మృతిచెందగా, 20 మందికి పైగా జనం గాయపడ్డారు. ఇది యావత్ దేశాన్నీ భయభ్రాంతులకు గురిచేసింది. కాగా సోయాబ్ అరెస్టుతో ఈ కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన నిందితుల సంఖ్య ఏడుకు చేరింది. షోయబ్.. జమ్ముకశ్మీర్ పోలీసులు గతంలో ఛేదించిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో భాగమని విచారణలో తేలింది. అలాగే ఈ కేసులో సోయాబ్ పాత్ర ఉగ్రవాది ఉమర్‌కు బస కల్పించడం వరకూ మాత్రమే పరిమితం కాలేదని తేలింది.ఫరీదాబాద్‌లోని అల్ఫాలా విశ్వవిద్యాలయంలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేసిన సోయాబ్, ఆ విశ్వవిద్యాలయ ప్రయోగశాల నుండి పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన రసాయనాలను సేకరించేందుకు ఉమర్‌కు సహాయం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే సోయాబ్.. హర్యానాలోని నుహ్‌లోని హిదాయత్ కాలనీలో ఉమర్ కోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఈ ఇంటిని ఉమర్ తాను తప్పించుకునే సమయంలో ఉపయోగించాడు. అలాగే ఇక్కడే పేలుడు పదార్థాలను కూడా నిల్వ చేశాడని అధికారులు వెల్లడించారు.ఈ అద్దె ఇంటిని హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) నవంబర్ 16న తనిఖీ చేసి, ఆ తర్వాత సీలు చేసింది. ఇక్కడి నుంచే ఉమర్ కారులో ప్రయాణించాడు. ఈ ప్రయాణ మార్గాన్ని కూడా అధికారులు గుర్తించారు. ఫిరోజ్‌పూర్ ఝిర్కాలో ఏటీఎం నుండి డబ్బు విత్‌డ్రా చేసుకున్న తరువాత, ఉమర్ ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పైనుంచి బాదర్పూర్ మీదుగా ఐ20 కారులో ఢిల్లీలోకి ప్రవేశించాడు. తరువాత ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో ఆ కారు పేలిపోయింది. దీంతో మంటలు చెలరేగి సమీపంలోని ఇతర వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. ఈ దాడిని కేంద్ర మంత్రివర్గం ఉగ్రవాద ఘటనగా పేర్కొంది. దీని వెనుక ఉన్న కుట్రను ఛేదించేందుకు దర్యాప్తు సంస్థలు కృషి చేయాలని ఆదేశించింది. ఎన్ఐఏ ప్రస్తుతం ఆత్మాహుతి బాంబు దాడికి సంబంధించిన వివిధ ఆధారాలను సేకరిస్తోంది. ఈ దాడిలో భాగస్వామ్యమున్న ఇతరులను గుర్తించేందుకు పోలీసు బలగాలతో సమన్వయంతో వివిధ రాష్ట్రాలలో సోదాలు కొనసాగుతున్నాయి.ఇది కూడా చదవండి: కమ్రా టీ షర్టు వివాదం: ఉతికి ఆరేసిన బీజేపీ, శివసేన -
ఢిల్లీలో వాయు కాలుష్యంపై నిరసన
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రమాదస్థాయిలను మించిన వాయు కాలుష్యంపై చేపట్టిన ఆందోళన తీవ్ర గందరగోళానికి, ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇండియా గేట్ వద్ద సోమవారం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన ఆందోళకారులు అడ్డుకోబోయిన పోలీసులపై పెప్పర్ స్ప్రేతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన ఘటనలపై పోలీసులు 22 మంది అరెస్ట్ చేశారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా అక్కడా పోలీసు అధికారులపై దాడికి దిగారు. దీంతో, విధులకు ఆటంకం కలిగించడంతోపాటు మహిళల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారంటూ వీరిపై సన్సద్ మార్గ్ పోలీస్ స్టేషన్‌తోపాటు, కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిరసనకారులు పోలీసులపై పెప్పర్ స్ప్రేతో దాడికి దిగడం తామెన్నడూ చూడలేదని ఓ అధికారి తెలిపారు. ‘ఇండియా గేట్ వద్ద నిరసనలకు అనుమతి లేదు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరాము. జంతర్‌మంతర్ వద్ద ముందుగా అనుమతి తీసుకుని ఎవరైనా ఆందోళనకు దిగొచ్చని చెప్పాం. వినకుండా, బారికేడ్లపై నుంచి దూకి వెళ్లి రోడ్డుపై బైటాయించి, ట్రాఫిక్‌కు అవరోధం కలిగించారు. వాహనదారులు కోరినా అక్కడి నుంచి వారు కదల్లేదు’ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘పైపెచ్చు, దురుసుగా ప్రవర్తించారు. మాపై దాడికి దిగారు. పెప్పర్ స్ప్రేను వాడారు. నిరసనకారుల దాడిలో గాయపడిన పోలీసులకు చికిత్స చేయించాం. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇందుకు కారకులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి, చర్యలు తీసుకుంటాం’అని ఆయన వివరించారు. ఇటీవల ఏపీలో ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టు నేత హిడ్మాను, అమర్ రహే హిడ్డా, లాంగ్ లివ్ హిడ్మా అంటూ పోస్టర్లతో కొందరు నినాదాలు చేయడం పైనా దృష్టి సారించామన్నారు. కాగా, ఇండియా గేట్ వద్ద పోలీసులపై దాడికి దిగిన 22 మందికి సోమవారం ఢిల్లీ కోర్టు మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మరో వ్యక్తిని, అతడి వయస్సు నిర్ధారణ అయ్యేంత వరకు అబ్జర్వేషన్ హోంకు తరలించాలని ఆదేశించింది. కాగా, గాలి కాలుష్యంపై నిరసన చేపట్టిన ఢిల్లీ కోఆర్డినేషన్ కమిటీ ఫర్ క్లీన్ ఎయిర్ అనంతరం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజారోగ్యానికి కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా మారిందని, ప్రభుత్వం మాత్రం నీళ్లు చల్లడం, క్లౌడ్ సీడింగ్ అంటూ కంటితుడుపు చర్యలు చేపడుతోందని ఆరోపించింది. -
పెళ్లయ్యి ఏడాది కాలేదు, డెంటిస్ట్ అత్మహత్య : మంత్రి సన్నిహితుడు అరెస్ట్
Dentist Suicide case ముంబై: హత్యారోపణల కింద మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే (Pankaja Munde) ముఖ్య సన్నిహితుడిని పోలీసలు అరెస్టు చేయడం కలకలం రేపింది. పంకజ ముండే వ్యక్తిగత సహాయకుడు అనంత్ గార్జేని ముంబైలోని వర్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన భార్య గౌరీ గార్జే ఆత్మహత్య కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. అనంత్ భార్య గౌరీ శనివారం సాయంత్రం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే భర్త ఆమెపై వేధింపులకు పాల్పడి, తీవ్రంగా హింసించాడని, అవి భరించలేకే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందన్న గౌరీ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. గార్జేకు వివాహేతర సంబంధం ఉందని మరొక మహిళతో మొబైల్ ఫోన్లో చాట్ చేస్తుండగా పట్టుబట్టాడని, దీంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇన్-కెమెరా పోస్ట్‌మార్టం ,సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ద్వారా కేసు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసిన పోలీసులు సోమవారం తెల్లవారు జామున వర్లీ పోలీసులు గార్జేను అరెస్టు చేసి, కోర్టులో హాజరపర్చారు.గౌరీ ప్రభుత్వ కెఇఎం ఆసుపత్రిలో దంత వైద్యురాలిగా పని చేస్తున్నారు. అనంత్, గౌరీ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరి 7న జరింది. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రి పంకజ ముండే, మాజీ ఎంపీ ప్రీతమ్ ముండే సహా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అయితే పెళ్లి అయ్యి ఇంకా ఏడాది కూడా నిండకుండానే ఆమె బలవన్మరణానికి పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదీ చదవండి: బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి తీవ్ర అస్వస్థత, ఐసీయూలో చికిత్స -
టాయిలెట్లో వీడియో రికార్డింగ్.. వ్యక్తి అరెస్టు
చెన్నై: బాత్రూం, టాయిలెట్లో సెల్‌ఫోన్ కెమెరాలు ఏర్పాటు చేసి మహిళల వీడియోలను తీసిన టీ దుకాణం యజమానిని అరెస్టు చేశారు. వివరాలు.. తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని రాసిపురం సమీపం ఆండకలూర్ గేట్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ కాంప్లెక్స్‌లో ఒక టీ దుకాణం ఉంది. ఐదు రూపాయలకే టీ అమ్ముతూండటంతో ఈ దుకాణం దగ్గర రద్దీ ఎక్కువ. వెన్నండూరుకు చెందిన నాగరాజ్ (27) ఇక్కడ టీ చేస్తూంటాడు.నాగరాజ్ టాయిలెట్‌కు వెళ్లి తన సెల్‌ఫోన్ వీడియో ఆన్ చేసి వచ్చాడు. ఆ తర్వాత టాయిలెట్‌కు వెళ్లిన ఒక మహిళ దృశ్యాలు ఆ వీడియో రికార్డ్ అయిందని తెలుసుకుని దిగ్భ్రాంతి చెంది కేకలు వేసింది. అక్కడున్న వారు వెళ్లి తనిఖీ చేసి సెల్‌ఫోన్ తీసుకున్నారు. వారు ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సెల్ ఫోన్‌ను స్వాదీనం చేసుకున్న నాగరాజ్‌పై కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశారు. అతని సెల్ ఫోన్ లో అనేక అశ్లీల చిత్రాలు ఉన్నట్లు తేలింది. -
ఐ బొమ్మ రవికి ఏమి శిక్ష పడబోతుందో తెలుసా? షాక్ అయ్యే విషయాలు!
-
యూనిఫామ్ వేసి బందోబస్తు డ్యూటీ చేసిన యువతి
హైదరాబాద్: పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమైన ఓ యువతి.. తానే పోలీస్ అని తప్పుదోవ పట్టించింది. విషయం తెలియడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. షాపూర్‌నగర్‌కు చెందిన ఓ యువతి (22) పోలీస్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. ఉద్యోగం రాకపోవడంతో తాను పోలీస్ అని అందరిని నమ్మించాలని అనుకుంది. అందుకు తగ్గట్టుగానే యూనిఫామ్ ధరించి పలుచోట్ల ఎవరికీ అనుమానం రాకుండా బందోబస్తు డ్యూటీ సైతం చేసింది. ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి వద్ద కూడా 10 రోజుల బందోబస్తు డ్యూటీ చేసిందట. ఈ విషయం మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులకు తెలియడంతో వారు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ దీనిపై విచారించి..ఆ యువతిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
బొల్సనారో ముందే అరెస్ట్
సావొ పౌలొ: దేశంలో తిరుగుబాటు లేవదీసేందుకు ప్రయత్నించిన ఆరోపణలపై గృహ నిర్బంధంలో ఉన్న బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జయిర్ బొల్సనారోను అధికారులు ముందుగానే అరెస్ట్ చేశారు. మరో రెండు వారాల్లో ఆయనపై విధించిన 27 ఏళ్ల కారాగార శిక్ష అమల్లోకి రానుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. 2019–2022 సంవత్సరాల మధ్య దేశాధ్యక్షుడిగా ఉన్న బొల్సనారో.. 2022 ఎన్నికల్లో లులా డసిల్వా చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం, 2023లో దేశంలో తిరుగుబాటుకు, అధ్యక్షుడు లులా డ సిల్వా హత్యకు కుట్ర పన్నారంటూ వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. బొల్సనారోకు 27 ఏళ్ల కారాగారంతోపాటు 2030 వరకు అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనరాదంటూ నిషేధం విధించింది. ప్రస్తుతం ఆయన విలాసవంతమైన జర్దిప్ బొటనాకో ప్రాంతంలోని సొంతింట్లో గృహ నిర్బంధంలో ఉన్నారు. కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా వేసి ఉంచేందుకు ఎల్రక్టానిక్ మానిటర్‌ను జూలై 18వ తేదీన ఆయన కాలికి అమర్చారు. శనివారం వేకువజామున ఆ పరికరాన్ని పగులగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని ప్రకటించిన సుప్రీంకోర్టు జడ్జి అలెగ్జాండర్ డి మోరెస్..బొల్సనారోను వెంటనే గృహ నిర్బంధం నుంచి రాజధాని బ్రెసిలియాలో ఫెడరల్ పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించాల్సిందిగా ఆదేశాలివ్వడం కలకలం రేపింది. బొల్సనారో దేశాన్ని విడిచి దొంగచాటుగా పరారయ్యే ప్రమాదముందని, నివాసం పొరుగునున్న రాయబార కార్యాలయాల్లో ఆశ్రయం కోరే అవకాశముందని అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. ఇదంతా ముందు జాగ్రత్త మాత్రమేనని, మాజీ అధ్యక్షుడిని అవమానించే ఉద్దేశం తమకు లేదన్నారు. ఆయనకు బేడీలు వేయడం, బహిరంగంగా జైలుకు తరలించడం వంటివి చేపట్టబోమన్నారు. -
నిందితులపై ఎన్ఐఏ ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: ఎర్రకోట వద్ద బాంబుపేలుడు ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణను మరింత వేగవంతంచేసింది. జమ్మూకశ్మీర్ పోలీసులు కస్టడీలో ఉన్న నిందితులు డాక్టర్ ముజామిల్ ఘనీ, అదీల్ రాఠర్, వైద్యురాలు షాహీనా సయీద్, మత బోధకుడు ఇర్ఫాన్ అహ్మద్ వగాయ్లను ఎన్ఐఏ గురువారం తమ కస్టడీలోకి తీసుకుంది. వారిని రహస్య ప్రదేశంలో ఉంచి ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఫరీదాబాద్ ఉగ్రమాడ్యూల్ సభ్యులు ఎలా అఫ్గాన్, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్, తుర్కియేలోని హ్యాండ్లర్లతో సత్సంబంధాలు పెట్టుకున్నారు? నిధులు ఏఏ మార్గాల్లో సంపాదించారు? విధ్వంసకర రచన చేసిందెవరు? వైద్యుల ముసుగులో ఉన్న ఉగ్రమాడ్యూల్లో వాస్తవంగా ఎంత మంది సభ్యులు ఉన్నారు? అంటూ ప్రశ్నలవర్షం కురిపించి వారి నుంచి సమాధానాలు రాబడుతున్నారు. ‘‘ ఈ నలుగురు మొత్తం ఉగ్రమాడ్యూల్లో అత్యంత కీలకమైన సభ్యులు. వీళ్ల వద్ద చాలా సమాచారం ఉంటుంది’’ అని జాతీయ దర్యాప్తు సంస్థ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఢిల్లీ పోలీసుల నుంచి నవంబర్ 11న అధికారికంగా కేసు తమ చెంతకు వచ్చాక ఎన్ఐఏ అమీర్ రషీద్ అలీ, జసీర్ బిలాల్ వానీ అలియాస్ డ్యానిష్లను అరెస్ట్‌చేసింది. గురువారం ఈ నలుగురిని తమ అదుపులోకి తీసుకోవడంతో ఎన్ఐఏ అరెస్ట్‌ల సంఖ్య ఆరుకు పెరిగింది. గురువారం ముజామిల్, అదీల్, షాహీనా, ఇర్ఫాన్ వగాయ్లను ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుల ప్రాంగణంలోని కోర్టులో ఎన్ఐఏ ప్రవేశపెట్టింది. కేసు దర్యాప్తు నిమిత్తం వీళ్లందర్నీ తమకు అప్పగించాలని కోర్టును కోరగా 10 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ప్రధాన జిల్లా, సెషన్స్ జడ్జి అంజూ బజాజ్ ఛాంద్నా ఉత్తర్వులు జారీచేశారు. -
అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్.. కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్
-
త్వరగా అరెస్ట్ చేయండంటూ పోలీసులకు ఫోన్ ల మీద ఫోన్ లు.. వెంకట్ రెడ్డి సంచలన నిజాలు
-
మావోయిస్టులూ... లొంగిపోండి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మావోయిస్టులు లొంగిపోవడం మంచిదని, లేకపోతే చర్యలు తప్పవని ఏపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేశ్‌చంద్ర లడ్హా హెచ్చరించారు. విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు హిడ్మా, మరో ఐదుగురు మృతిచెందారని చెప్పారు. ఘటనాస్థలంలో లభించిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారనే విషయంపై వెంటనే దృష్టి పెట్టామని వెల్లడించారు. ఆ తర్వాత పక్కా సమాచారంతో ఎన్టీఆర్, కృష్ణా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని వివరించారు. హిడ్మా దళానికి చెందిన 27 మందితోపాటు సౌత్ బస్తర్ ఏరియా కమిటీ, స్థానిక కేడర్‌తో సహా అరెస్టయిన వారందరూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారని చెప్పారు.మావోయిస్టు కీలక నేత దేవ్‌జీ లొంగిపోలేదని తెలిపారు. ఎక్కడా ఎవరికీ ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది మావోయిస్టులను పట్టుకోవడం తొలిసారి అని వివరించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోయారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయన్నారు. షెల్టర్ కోసమే వచ్చారు... ఇటీవల తెలంగాణలో కొంతమంది మావోయిస్టులు సరెండర్ అయ్యారని, వారి ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని మావోయిస్టులు భావించారని లడ్హా తెలిపారు. అదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌లో చాలాచోట్ల ముమ్మరంగా దాడులు జరుగుతున్నాయన్నారు. అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఏపీని ఎంచుకున్నారని చెప్పారు. మళ్లీ సమయం చూసి తమ ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. అయితే, మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం ఉందని, వారి ప్రణాళికలపై మాత్రం సమాచారం లేదన్నారు. మావోయిస్టుల ప్లాన్ ఎమిటి? కానూరులో ఎందుకు ఉన్నారు? వారికి ఎవరు షెల్టర్ ఇచ్చారు? అసలు ఇక్కడికి ఎలా వచ్చారు? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. జర్నలిస్టులకు హిడ్మా లేఖ రాయడం గురించి తమకు తెలియదన్నారు. ఎదురు కాల్పుల్లోనే హిడ్మా మృతిచెందారని, పట్టుకుని చంపారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అప్రమత్తంగా ఉండాలని ఏజెన్సీలోని ప్రజాప్రతినిధులకు సూచించినట్లు తెలిపారు.మారేడుమిల్లి ప్రాంతంలో మరో ఎన్కౌంటర్..మారేడుమిల్లి ఏజెన్సీ ఏరియాలో మంగళవారం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి 5 కిలో మీటర్ల దూరంలోనే బుధవారం ఉదయం 7 గంటలకు మరోసారి భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు లడ్హా తెలిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారని, వారిలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారన్నారు. చనిపోయినవారిలో జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఒక్కరినే గుర్తించామన్నారు. శ్రీకాకుళానికి చెందిన జోగారావు పదేళ్లుగా మావోయిస్టు పారీ్టలో కొనసాగుతున్నారని తెలిపారు.ఆయుధాలు, రూ.12.72లక్షల నగదు స్వాధీనంఅరెస్ట్ చేసిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఒక పిస్టల్, రెండు రివాల్వర్లు, రెండు డీబీబీఎల్ఎస్, 31 దేశీయ తయారీ తుపాకులు, చెక్కతో తయారు చేసిన 8ఎంఎం తపంచాలు ఉన్నాయి. వాటితోపాటుగా 302 రౌండ్ల బుల్లెట్లు, రెండు మేగజైన్లు తూటలు, నాలుగు కత్తులు, కోర్డిటెక్స్ వైర్ 750 గ్రాములు, రూ.12.72 లక్షల నగదుతోపాటుగా 64 మెమొరీ కార్డులను, ఒక రేడియో సెట్‌ను స్వా«దీనం చేసుకున్నారు. విజయవాడకు మావోయిస్టులు ఏలూరు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అరెస్ట్ చేసిన 50 మంది మావోయిస్టులను భారీ భద్రత మధ్య విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తరలించారు. వీరిలో మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ముగ్గురు, డివిజనల్ కమిటీ సభ్యులు ఐదుగురు, ఏరియా కమిటీ సభ్యులు 19 మంది, పార్టీ సభ్యులు 23 మంది ఉన్నారు. వారి నుంచి స్వా«దీనం చేసుకున్న రైఫిల్స్, పిస్టల్స్, డిటోనేటర్లు, మేగజైన్స్, మొబైల్స్, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్‌లు, విప్లవ సాహిత్యం, హిడ్మా ఫొటోలను కూడా విజయవాడ తీసుకొచ్చారు. మీడియా సమావేశం అనంతరం మళ్లీ ఏ జిల్లాలో దొరికిన మావోయిస్టులను ఆ జిల్లాకు తరలించారు. మీడియా సమావేశంలో ఎస్ఐబీ ఐజీ పీహెచ్డీ రామకృష్ణ, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్, ఐదు జిల్లాల ఎస్పీలు విద్యాసాగర్ నాయుడు, ప్రతాప్ శివకిశోర్, రాహుల్‌మీనా, బిందుమాదవ్, విజయవాడ సీపీ రాజశేఖరబాబు, డీసీపీలు కేజీవీ సరిత, కృష్ణప్రసన్న, లక్ష్మీనారాయణ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.అరెస్ట్ చేసిన మావోయిస్టుల వివరాలు కృష్ణా జిల్లాలో...1) ఉద్దె రఘు (స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు) 2) మదకం దివాకర్ అలియాస్ మిట్టు (ఏరియా కమిటీ సభ్యుడు) 3) వెట్టి నందె (ఏరియా కమిటీ సభ్యుడు) 4) ఓయం సంబట్టి అలియాస్ సమిత (ఏరియా కమిటీ సభ్యురాలు) 5) కొర్సా సోమ్ల్ అలియాస్ పరిమిళ (ఏరియా కమిటీ సభ్యురాలు) 6) కుంజం రాంబు (పార్టీ సభ్యుడు), 7) దొడి నీలేష్ (పార్టీ సభ్యుడు) 8) మదకం గంగి (పార్టీ సభ్యులు) 9) హేమల్ల రమే (పార్టీ సభ్యులు) 10) మదకం హైమ (పార్టీ సభ్యులు) 11) సోడి అర్జున్ అలియాస్ సంజు (పార్టీ సభ్యులు) 12) కర్టం బండి (పార్టీ సభ్యులు) 13) మదకం బుజ్జి అలియాస్ మంగ్లీ (పార్టీ సభ్యురాలు) 14) మదకం నవ్య అలియాస్ యుగి (పార్టీ సభ్యురాలు) 15) మండ్వీ లక్ష్మి (పార్టీ సభ్యురాలు) 16) మదకం పుజీ అలియాస్ రితిక (పార్టీ సభ్యురాలు) 17) హేమ్ల హిడ్మీ అలియాస్ నిర్మల (పార్టీ సభ్యురాలు) 18) పుణెం ఇష్టు అలియాస్ సరీనా (పార్టీ సభ్యులు) 19) మదకం హంగు అలియాస్ రోహన్ (పార్టీ సభ్యులు) 20) పుల్సు లక్ష్మణ్ (పార్టీ సభ్యులు)21) మడ్వీ జోగి (పార్టీ సభ్యులు)22) తాతి లక్ష్మి (పార్టీ సభ్యురాలు) 23) నుప్పు కోసి (పార్టీ సభ్యురాలు)24) ఓయం జ్యోతి (పార్టీ సభ్యురాలు) 25) కోర్స శాంతి (పార్టీ సభ్యురాలు) 26) కుంజం భీమి (పార్టీ సభ్యురాలు)27) ఎం.జోగి (పార్టీ సభ్యులు)28) మడ్వీ మహిణి (పార్టీ సభ్యురాలు)ఏలూరు జిల్లాలో...1) సోదె లచ్చు అలియాస్ గోపాల్ (స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు) 2) సోదె లక్మా అలియాస్ భీమ (డివిజనల్ కమిటీ సభ్యుడు) 3) గంగి లక్ష్మి అలియాస్ మాదే (డివిజనల్ కమిటీ సభ్యుడు) 4) వెంటి వెంకట్ (ఏరియా కమిటీ సభ్యుడు) 5) మదకం వాగా (ఏరియా కమిటీ సభ్యుడు) 6) కశ్యప్ భీమా అలియాస్ యోగేష్ (ఏరియా కమిటీ సభ్యుడు) 7) పుడియం ఆనంద్ అలియాస్ దన్ను (ఏరియా కమిటీ సభ్యుడు) 8) మదకం లక్ష్మణ్ అలియాస్ కోసా (ఏరియా కమిటీ సభ్యుడు) 9) కుంజం బుజ్జి (ఏరియా కమిటీ సభ్యుడు) 10) తాతీ కమల (ఏరియా కమిటీ సభ్యురాలు) 11) దాది ఆద్మా అలియస్ మల్లేష్ (ఏరియా కమిటీ సభ్యుడు) 12) మడ్వీ జోగా (ఏరియా కమిటీ సభ్యుడు) 13) మడ్వీ సునీత, 14) కుంజం నందిని (ఏరియా కమిటీ సభ్యులు) 15) బాడిశ రాజు (ఏరియా కమిటీ సభ్యుడు)ఎన్టీఆర్ జిల్లాలో..1) పోడియం రెన్గు (స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు) 2) సోడి మనల్ల (డివిజనల్ కమిటీ సభ్యుడు) 3) మదకం మదన్ అలియాస్ మధన్న (డివిజన్ కమిటీ సభ్యుడు ) 4) సోడి మంగీ (ఏరియా కమిటీ సభ్యురాలు) కాకినాడ జిల్లాలో... 1) పోట్టం కాంతి (ఏరియా కమిటీ సభ్యురాలు) 2) మడ్వీ కోసి (ఏరియా కమిటీ సభ్యురాలు) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో... 1) మడ్వీ హంధా (డివిజనల్ కమిటీ సభ్యులు) -
ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నా.. పోలీసులకు చిక్కాడు
రావులపాలెం: మరో మావోయిస్టు కీలకనేత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పోలీసులకు చిక్కారు. ఆ వివరాలను రావులపాలెం సీఐ శేఖర్‌బాబు బుధవారం విలేకరులకు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన సరోజ్ మడవి (అలియాస్) మడ్వీ హంధాను రావులపాలెం గౌతమి గోదావరి డంపింగ్ యార్డ్ వద్ద మంగళవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బుంద్లేలంక కిష్ట్రారం పోలీస్ స్టేషన్ పరిధిలో సుక్మా జిల్లాకు చెందిన సరోజ్ మడవి ఐదో తరగతి వరకు చదివారు. 12 ఏళ్ల వయసులో మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై దళంలో చేరారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా ఎటపాక మావోయిస్టుల సౌత్ డివిజన్ కమాండర్ ఇన్చార్జిగా ఉన్న ముచాకీ ఎర్రా అలియాస్ ఎర్ర దాదా వద్ద కమ్యూనికేషన్ కమాండర్‌గా ఉన్నారు. 2021 నుంచి వివిధ దాడుల్లో సీఆర్పీఎఫ్ జవాన్లను అంతమొందించడంలో కీలక పాత్ర పోషించారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుని కోనసీమకు రాగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఒక గన్, పది తూటాలు స్వాదీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం కొత్తపేట కోర్టులో హాజరుపరచారు. కాగా మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు సరోజ్ మడవి సన్నిహితుడు. హిడ్మాకు అనుంగు అనుచరుడు కోనసీమను తలదాచుకోవడానికి సురక్షిత ప్రాంతంగా మావోయిస్టులు ఎంచుకున్నట్టు తెలుస్తోంది. సరోజ్ మడవి కొంత కాలం క్రితం సఖినేటిపల్లి వచ్చి అక్కడ ఆక్వా చెరువు వద్ద గుమస్తాగా చేరి జీవనం సాగిస్తున్నట్టు సమాచారం. కోనసీమలో ఎవ్వరికీ అనుమానం రాకుండా అతను మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్టు, పోలీసులు అతని సెల్ సిగ్నల్ ట్రాక్ చేయడం ద్వారా కనిపెట్టారు. హిడ్మాకు అనుంగు అనుచరుడు. ఎన్‌కౌంటర్‌కు ముందే హిడ్మా వద్దకు వెళ్లిన సరోజ్.. ఎన్కౌంటర్లో హిడ్మా హతమవడంతో అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి కోనసీమలో తలదాచుకోవడానికి వస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. -
ఇది పక్కా ప్లాన్.. త్వరలో మరో ఎన్ కౌంటర్..
-
మేజిస్ట్రేట్ ముందు CI సిగ్గుతో తలదించుకున్నాడు
-
హిడ్మా.. ది మోస్ట్ వాంటెడ్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏపీలోని మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ జరిగినట్లు మంగళవారం ఉదయం 8 గంటలకు బయటకు తెలిసింది. 9 గంటలకల్లా ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత చనిపోయినట్టుగా ప్రచారం మొదలైంది. ఆ తర్వాత గంటకే చనిపోయింది హిడ్మా అంటూ ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. అయితే, చనిపోయింది భీకర దాడులతో భద్రతా దళాలను ముప్పు తిప్పలు పెట్టిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మడ్వి హిడ్మానా? మరొకరా? అనే చర్చ మొదలైంది. ఓ వైపు మీడియాలో హిడ్మా మరణంపై కథనాలు వస్తున్నా, గెరిల్లా వార్ఫేర్లో ఆరితేరిన హిడ్మా చనిపోయే అవకాశమే లేదని మావోయిస్టుల సానుభూతిపరులు అభిప్రాయపడుతూ వచ్చారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్ పోలీసు వర్గాల నుంచీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎన్కౌంటర్లో చనిపోయింది హిడ్మానే అంటూ ఏపీ ఇంటెలిజెన్స్ డిప్యూటీ చీఫ్ మహేశ్‌చంద్ర లడ్డా అధికారికంగా ప్రకటించారు. దీంతో విప్లవ శ్రేణులు విస్తుపోగా.. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ కోసం ఏళ్ల తరబడి దండకారణ్యంలో అడవులను జల్లెడ పడుతున్న భద్రతా దళాలు సంబరాలు చేసుకున్నాయి. భద్రన్న, చలపతి అడుగుజాడల్లో.. ఆదివాసీల్లో మురియా తెగకు చెందిన మడ్వి హిడ్మా సొంతూరు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామం. బాలల సంఘం ద్వారా మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన హిడ్మా ఆ తర్వాత చేతన నాట్య మంచ్ ద్వారా విప్లవ బాటలో నడిచారు. కిషన్ జీ అలియాస్ భద్రన్న నేతృత్వంలో సాయుధపోరులో తొలి పాఠాలు నేర్చుకుంటే, మరో అగ్రనేత చలపతి హిడ్మాను మరింత సాన పట్టారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా 2009లో పార్టీ హిడ్మాకు సుక్మా జిల్లాలోని జేగురుగొండ ఏరియా దళ కమాండర్‌గా నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. ఆ సమయంలోనే అగ్రనేత నంబాల కేశవరావు డైరెక్షన్లో 2010 ఏప్రిల్ 7న సుక్మా జిల్లా చింతల్నార్ – టేక్మెట్ల అంబూష్ దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఇప్పటివరకు మావోయిస్టులు జరిపిన దాడుల్లో ఇదే అతి పెద్దది. భీకర దాడులకు కేరాఫ్ » 2013 ఏప్రిల్‌లో సుక్మా జిల్లా కంచాల దగ్గర కూంబింగ్ చేస్తున్న పోలీసులపై మావోయిస్టులు మెరుపుదాడికి దిగారు. దీంతో కూంబింగ్‌ను అర్ధంతరంగా ఆపి హెలికాప్టర్ ఎక్కుతున్న ఆర్ఎస్సై పైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో చనిపోయిన ఆర్ఎస్సై మృతదేహం అప్పగింత విషయంలో మూడు రోజుల పాటు హైడ్రామా నెలకొంది. ఈ సమయంలోనే తొలిసారిగా హిడ్మా పేరు బయటి ప్రపంచానికి తెలిసింది. » 2013 మే 25న సుక్మా జిల్లాలోని దర్బా లోయలో సల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మ టార్గెట్‌గా ఝిరామ్ఘాటీ దగ్గర మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో కాంగ్రెస్ అగ్రనేతలు నందకుమార్ పటేల్‌తో పాటు 27 మంది చనిపోయారు. దీంతో భీకర దాడులకు కేరాఫ్ అడ్రస్ హిడ్మా అనే పేరు స్థిరపడిపోయింది. » 2021 ఏప్రిల్‌లో బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అంబూష్లో 22 మంది జవాన్లు చనిపోయారు. ఈ ఘటన భద్రతా దళాల వెన్నులో వణుకు పుట్టించింది. » 2023 ఏప్రిల్ 26న బీజాపూర్ జిల్లా ఆరాన్పూర్ దగ్గర ఐఈడీ బాంబు పేల్చిన ఘటనలో 10 మంది డీఆర్జీ జవాన్లు చనిపోయారు. అప్పటి నుంచి భద్రతా దళాలపై ఏ భారీ దాడి జరిగినా దాని వెనుక హిడ్మా ఉన్నాడనే ప్రచారం జరగడం సర్వసాధారణమైంది.కోలుకోలేని ఎదురుదెబ్బ!హిడ్మా ఎన్కౌంటర్తోమావోయిస్టు కేడర్‌లో ఆందోళన శత్రువును దెబ్బ కొట్టే వ్యూహాల్లో హిడ్మా దిట్ట ఇప్పటివరకు జరిగిన కీలకఆపరేషన్లన్నింటి మాస్టర్ మైండ్ అతనేసాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు మూలాలపై కీలక దెబ్బ పడింది. కీలక నేత హిడ్మా భద్రత బలగాల ఎదురు కాల్పుల్లో మరణించడంతో..వారిలో భవిష్యత్తు గురించిన ఆందోళన మొదలైంది. శత్రువును వ్యూహాత్మకంగా దెబ్బతీయడంలో దిట్టగా పేరు పొందిన హిడ్మా సైతం ఎన్కౌంటర్లో మరణించడాన్ని ఆ పార్టీ కేడర్ జీర్ణించుకోలేక పోతోంది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) కంపెనీ వన్ కమాండర్ హిడ్మాను హతమార్చేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సాయుధ పోలీసు బలగాలకు డెడ్‌లైన్ విధించారంటేనే హిడ్మా ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి 2023లో దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయినట్టు ప్రచారం జరిగింది. కానీ మావోయిస్టు కమిటీ హిడ్మా ఫొటోలు రిలీజ్ చేయడంతో ఆ ప్రచారానికి తెరపడింది. కానీ హిడ్మా భద్రత బలగాలకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. గిరిజనుడు కావడంతో స్థానికంగా బలం..: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన హిడ్మా స్థానికుడు కావడంతో గిరిజన ప్రాంతాల్లో పూర్తి పట్టుంది. ఈ నేపథ్యంలో హిడ్మా దళంలోనూ చాలా వరకు గిరిజనులే ఉంటారని సమాచారం. కాగా హిడ్మా బృందం అత్యంత శక్తివంతమైనదిగా మావోయిస్టులలో పేరుంది. చాలా తక్కువ మాట్లాడే హిడ్మా..శత్రువును దెబ్బకొట్టే వ్యూహాల రచనలో దిట్టగా పేరుపొందాడు. చిన్న వయస్సులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. హిడ్మాకు గోండి, కోయ, హిందీ, తెలుగు, బెంగాలీ భాషలపై పట్టుండడంతో స్థానికులతో బాగా కలిసిపోయేవాడని, ఇంగ్లిష్‌లోనూ మాట్లాడే వాడని సమాచారం. అతడి నెట్వర్క్ సైతం ఎంతో బలంగా ఉండేదని చెబుతారు. హిడ్మా కోసం కొన్నేళ్ల పాటు ఛత్తీస్‌గఢ్ పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు, ఏపీ, తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు సెర్చ్ ఆపరేషన్లు చేశాయి. అయితే ఎప్పటికప్పుడు స్థావరాలు మార్చే హిడ్మా..అదే క్రమంలో వేరే ప్రాంతానికి వెళుతూ ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడు. డిఫెన్స్‌లో పట్టుండడంతోపాటు ఎంతో పక్కాగా వ్యూహ రచన చేసే యువ నాయకత్వం లేకపోవడం ఇప్పుడు మావోయిస్టు కేడర్‌లో నైరాశ్యం నింపిందని మాజీ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హిడ్మాలా ముందుండి భద్రతా బలగాలను ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకత్వం లేదని ఆయన అన్నారు. 50 మంది మావోయిస్టుల అరెస్ట్! బెజవాడ కానూరులో 28.. ఏలూరులో 15.. సామర్లకోట సమీపంలో ఇద్దరు ప్రసాదంపాడులో మరో నలుగురు, గన్నవరంలో ఒకరు.. ఎక్కడికక్కడ వారున్న భవనాలను చుట్టుముట్టి పట్టుకున్న పోలీసులు ఎలాంటి ప్రతిఘటన లేకుండానే లొంగిపోయిన వైనం అందరూ హిడ్మా బృంద సభ్యులే అంటున్న పోలీసులుపెనమలూరు/ఏలూరు టౌన్/సామర్లకోట: విజయవాడ సమీపంలోని కానూరులో, ప్రసాదంపాడులో, ఏలూరు గ్రీన్ సిటీలో, కాకినాడ జిల్లా సామర్లకోట మండలం కొప్పవరంలో తల దాచుకున్న 50 మంది మావోయిస్టులు మంగళవారం పోలీసులకు పట్టుబడ్డారు. కానూరు ఆటోనగర్‌లోని ఓ భవనంలో 28 మంది, ప్రసాదంపాడు రైల్వే గేటు వద్ద నలుగురు, గన్నవరంలో ఒకరు, ఏలూరు గ్రీన్ సిటీలో 15 మంది, సామర్లకోట మండలం కొప్పవరం సమీపంలో ఇద్దరు మావోయిస్టులు పోలీసులకు పట్టుబడ్డారు. ముందస్తు సమాచారంతో ఆక్టోపస్, ఇంటిలిజెన్స్, స్థానిక పోలీసులు ఒక్కసారిగా ఆయా ప్రాంతాల్లోని భవనాలపై మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో కానూరు వద్ద ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 28 మంది పట్టుబడగా, వీరిలో 21 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి (దేవ్‌జీ) అంగరక్షకులు తొమ్మిది మంది ఉన్నారు. వీరిలో నలుగురు కీలక హోదాల్లో ఉన్నట్లు సమాచారం. అయితే దేవోజీ దొరికాడా.. లేదా.. అనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. వీరు పట్టుబడిన భవనంలోనే కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కానూరు ఆటోనగర్‌లో మూడు అంతస్తుల భవనం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రైవేటు వ్యక్తికి చెందిన టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన గోడౌన్ ఉంది. భవనంలో పైన మూడు అంతస్తులు ఉన్నాయి. జర్మనీలో ఉంటున్న భవన యజమాని, ప్లానర్, బిల్డర్ స్వామినాయుడు తన భవనం అద్దెకు ఉందని ఆన్లైన్లో పెట్టాడని సమాచారం. విశాఖపట్నంకు చెందిన ఈయనకు విజయవాడ బెంజి సర్కిల్ వద్ద కార్యాలయం ఉంది. అద్దెకు ఎవరూ రాక పోవటంతో ఆన్లైన్లో వివరాలు పెట్టారు. దీంతో మావోయిస్టులు కూలీ పనులు చేసుకోవటానికి వచ్చామని, భవనం కావాలని ఓ మహిళ ద్వారా సంప్రదించారు. దీంతో 20 రోజుల క్రితం ఆయన వీరికి భవనాన్ని అద్దెకు ఇచ్చారు. భవనాన్ని చుట్టుముట్టి.. మావోయిస్టులు భవనంలో ఉన్నారన్న పక్కా సమాచారంతో కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఆక్టోపస్, స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున భవనాన్ని చుట్టుమట్టారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న వివిధ రకాల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. భవనంలో పెద్ద ఎత్తున సోదాలు చేశారు. ఇతరత్రా సామగ్రి ఉండటంతో క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్‌లు భవనాన్ని అణువణువు పరిశీలించాయి. అనంతరం భవనాన్ని సీజ్ చేశారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగారులో భాగంగా చాలా మంది మావోయిస్టులు కేంద్ర బలగాల చేతిలో మరణించారు. అగ్రనేతలు సైతం చనిపోయారు. దీంతో మావోయిస్టులు అడవులు వదిలి నగరాలు, పట్టణాల బాట పట్టారు.ఇందులో భాగంగానే 20 రోజుల క్రితం కానూరు ఆటోనగర్‌లో భవనం తీసుకుని ఉంటున్నారు. ఆటోనగర్‌లో బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిస్సా, తదితర రాష్ట్రలకు చెందిన కారి్మకులు వివిధ పనులు చేస్తుండటంతో మావోయిస్టులకు ఇక్కడ షెల్టర్ తీసుకోవటానికి వాతావరణం అనుకూలంగా మారింది. పక్కా సమాచారంతో దాడులు : ఎస్పీ మావోయిస్టులు కానూరు ఆటోనగర్‌లోని ఓ భవనంలో ఉన్నారన్న పక్కా సమాచారంతోనే దాడులు చేసి, 28 మందిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ విద్యాగర్నాయుడు మీడియాకు వెల్లడించారు. విజయవాడ ప్రాంతంలో వ్యూహాత్మకంగా దాడులు చేసేందుకే వారు వచ్చారన్నారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సెక్రటరీ తిప్పిరి తిరుపతి బృందాన్ని పట్టుకున్నామని, హిడ్మా బృందానికి చెందిన వారే ఇక్కడ షెల్టర్ తీసుకున్నారని తెలిపారు. -
YSRCP Shyamala: ఎలాంటి నోటీసులు లేకుండా బెదిరించి అరెస్ట్ చేస్తారా?
-
మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ.. పోలీసుల అదుపులో తిరుపతి?
సాక్షి,అమరావతి: మావోయిస్టు ఉద్యమంలో కీలక నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ పోలీసుల ఎదుట లొంగిపోయారనే ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు దీనిపై అధికారికంగా ఏపీ పోలీస్ శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు.తిప్పిరి తిరుపతి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన ఈయన, 1983లో మావోయిస్టు ఉద్యమంలో చేరి దశలవారీగా ఎదిగి, కేంద్ర కమిటీ కార్యదర్శి స్థాయికి చేరుకున్నారు. గత మేలో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్లో మృతి చెందడంతో, తిరుపతిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు తెలుస్తోంది. ఇటీవల లొంగుబాట్ల పరంపరలో మావోయిస్టులు కీలక నేతలు, కమాండర్లు పోలీసుల ఎదుట లొంగిపోతుండటంతో తిరుపతి సైతం లొంగిపోయినట్లు జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టు పార్టీలో ‘అభయ్’ అనే పేరుతో లేఖలు విడుదల చేసిన నేతగా తిరుపతిని గుర్తించారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే, తిరుపతి ప్రస్తుతం ఏపీ పోలీసుల అదుపులో ఉన్నారా? లేదంటే అజ్ఞాతంలోనే ఉన్నారా? అనే అంశంపై స్పష్టత లేదు. మావోయిస్టు వర్గాలు ఈ విషయంపై మౌనం పాటిస్తుండగా, పోలీసు వర్గాలు కూడా అధికారికంగా స్పందించలేదు.ఆర్ఎస్యూ నేపథ్యమే..కోరుట్లలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన తిరుపతి 1983లో డిగ్రీ చదువుతున్న క్రమంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. ఆ సమయంలో ఏబీవీపీ, ఆర్ఎస్యూ విద్యార్థి సంఘాల మధ్య గొడవలు సాధారణంగా జరుగుతున్న క్రమంలో పోలీసు కేసులు నమోదు అయ్యాయి. 1983 చివరలో తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. దళ సభ్యుడి స్థాయి నుంచి కమాండర్‌గా పనిచేసి అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్‌గా, మిలిషియా దాడుల్లో వ్యూహకర్తగా సెకండ్ క్యాడర్ హోదాలో పనిచేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఏరియాల్లో తిప్పిరి తిరుపతిని దేవ్‌జీగా పిలుచుకుంటారు. మిలి షియా దాడులు జరిపి నిమిషాల్లో అక్కడి నుంచి తప్పించుకోవడం తిరుపతికి వెన్నతో పెట్టిన విద్యగా చెబుతారు. తిరుపతి సమీపంలోని అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడి ఘటనలో నంబాల కేశవరావుతో పాటు తిప్పిరి తిరుపతి పాత్ర ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. 2010లో దంతెవాడ సమీపంలో సెంట్రల్ రిజర్వ్ జవాన్లపై దాడి జరిపి 74 మంది మృతి చెందిన ఘటనకు సారథ్యం వహించింది ఇతడేనని పోలీసు వర్గాలు చెబుతాయి. ఆయన తలకు ఎన్ఐఏ రూ. కోటి రివార్డు ప్రకటించినట్లు సమాచారం.ఎక్కడున్నడో ఏమో? ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఏరియాల్లో మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్లో కీలకంగా వ్యవహరించడంతోపాటు మిలటరీ శిక్షణ కేంద్రం నిర్వహణలోనూ తిరుపతి పాలుపంచుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో తి రుపతి తన స్థావరాలు మార్చుకుంటున్నట్లు పో లీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల కొంత మంది మా వోయిస్టు కీలక నేతలు పశ్చిమ బెంగాల్ సరి హద్దు ప్రాంతాల్లోకి వెళ్లి షెల్టర్ తీసుకుంటున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ భావించింది. కొద్ది నెలల క్రితం మెట్పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు కోరుట్లలోని తిరుపతి ఇంటికి వెళ్లి అజ్ఞాతంలో ఉన్న అతడిని లొంగిపోయేలా చూడాలని ఆయన బంధువులను సైతం కోరారు. ఈ క్రమంలో తిరుపుతి అడవిని వదిలి ఏపీ పోలీసులకు లొంగిపోయినట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
Ambati: కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు
-
జ్యూస్ తాగించి మహిళపై గ్యాంగ్ రేప్
సాక్షి, బళ్లారి/రాయచూరు రూరల్: ఓ మహిళకు జ్యూస్ తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. కొప్పళ జిల్లా యలబుర్గా తాలూకా మడ్లూరు గ్రామానికి చెందిన మహిళ (39)ను బాగా పరిచయం ఉన్న వ్యక్తులు నమ్మించి, మాయ మాటలు చెప్పి ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లి జ్యూస్ తాగించారు. ఆమెపై నలుగురు అత్యాచారం చేయడంతో బాధితురాలు యలబుర్గా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేసి అత్యాచారానికి పాల్పడిన లక్ష్మణ కెంచప్ప, బసవరాజ్ సక్రప్ప, భీమప్ప, శశికుమార్ అనే నలుగురిని అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం హొసపేటె నుంచి కొప్పళకు బకాయి డబ్బులిస్తామని చెప్పిన యువకుడి మాటలు నమ్మి బాధిత మహిళ వచ్చింది. ఆమె తనకు పరిచయం ఉన్న లక్ష్మణ్‌కు అప్పు ఇచ్చింది. దానిని పొందడానికి ఆ మహిళను కుష్టిగికి పిలిపించారు. లక్ష్మణ్, మరో ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంలో ఆమెను యలబుర్గా తాలూకా మడ్లూరుకు తీసుకెళ్లారు. అక్కడ జ్యూస్‌లో మత్తు మందు కలిపి తాగించి అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలు కొప్పళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
వైఎస్సార్సీపీ నేత వెంకటరెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఆయన నివాసానికి వచ్చిన తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని ఏపీకి తరలిస్తున్నారు. ఆ సమయంలో వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్ట్ చేయడంపై వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో వాళ్ల ఫోన్లు లాక్కున్న పోలీసులు.. భయబ్రాంతులకు గురి చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుపై వెంకటరెడ్డి భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటరెడ్డి సతీమణి హరిత సాక్షితో మాట్లాడుతూ.. నా భర్తకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని పోలీసులు చెప్పారు. వాటిని మాకు కనీసం చూపించలేదు. పోలీసులు మా ఫోన్లు బలవంతంగా లాక్కున్నారు. నా భర్తను తమ వెంట తీసుకెళ్లారు. ప్రశ్నించిన వారి నోరు మూయించడం సరికాదు అని అన్నారు. కేసు ఏంటంటే.. టీటీడీ విజిలెన్స్ మాజీ అధికారి సీఐ సతీష్ కుమార్ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణంపై సోషల్ మీడియాలో ప్రచారం చేశారంటూ వెంకటరెడ్డిపై చర్యలకు దిగారు. తాడిపత్రి రూరల్ పోలీసులు 352, 353(1)(2), 196(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడి అరెస్ట్
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుళ్లు కేసులో మరో ముందడుగు పడింది. బాంబు పేలుడికి సంబంధించి కారు బాంబు తయారు చేసిన జసీర్ బిలాల్ వని అలియాస్ డానిష్ ని ఎన్ఐఏ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. బాంబు తయారికి సంబంధించిన సాంకేతిక అంశాలు బిలాల్ అందించాడని ప్రధాన నిందితుడు ఉమర్ ఉన్ నబీతో కలిసి పనిచేశాడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఎర్రకోట బాంబు పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జాసిర్ బిలాల్ వని అలియాస్ (డానిష్)ను ఎన్ఐఏ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. బిలాల్ బాంబుదాడి జరగడానికి ముందు ఉగ్రవాదులకు సాంకేతిక సహాయం అందించాడని డ్రోన్ల ఆధునీకరణ, రాకెట్ లాంఛర్ల తయారీ వంటి విషయాలలో సహాయం అందించాడని పేర్కొంది. అంతేకాకుండా కారు బాంబు దాడికి ముందు ప్రధాన నిందితుడు ఉమర్‌కు ఎంతో సన్నిహితంగా మెదిలేవాడని పేలుళ్ల కేసులో సహా కుట్రదారుగా బిలాల్ వ్యవహరించాడని తెలిపింది.జాసిర్ బిలాల్ జమ్మూకశ్మీర్ అనంతనాగ్ జిల్లాకు చెందిన వాడని ఎన్ఐఏ తెలిపింది. కాగా ఎర్రకోట బాంబు పేలుళ్ల కేసులో ఇదివరకే షహీన్ సయీద్, మజమ్మిల్ షకీల్, ఆదిల్ రాథర్ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ పేలుళ్లపై లోతైన విచారణ జరుపుతున్నామని వివిధ రాష్ట్రాలలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపడుతున్నాయని త్వరలోనే ఢిల్లీ బాంబుపేలుళ్ల కుట్ర కేసును చేధిస్తామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. -
ఐ బొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్.. వచ్చింది విడాకుల కోసం కాదు!
ఐ బొమ్మ రవి అరెస్ట్ తర్వాత ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు బయటికొస్తున్నాయి. విదేశాల నుంచి ఇండియాకు వస్తున్న రవిని పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇది కాస్తా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రవి అరెస్ట్‌తో సినీ ఇండస్ట్రీతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. అయితే తన భార్యతో విడాకుల కేసు కోసమే ఇండియాకు వస్తుండగా రవి అదుపులోకి తీసుకున్నారని వార్తలొచ్చాయి. అందరూ అదే నిజమనుకున్నారు.కానీ తీరా చూస్తే ఈ విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు రవి విడాకుల కోసం ఇండియాకు రాలేదని తెలుస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్న ఆస్తుల విక్రయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆయన ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారని టాక్. అంతేకాకుండా అతను 2022లోనే ఓ ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. భారత పౌరసత్వాన్ని వదులుకొని రూ.80 లక్షలు చెల్లించి కరేబియన్ సిటిజన్‌షిప్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా.. 2022 నుంచి కరేబియన్ దీవుల్లోనే నివాముంటున్నారు. అయితే టెక్నాలజీని వాడుకోవడంలో కింగ్ అయిన ఇమ్మడి రవి.. పైరసీ సైట్ ఐ బొమ్మను స్థాపించాడు. దాదాపు కొన్ని వేల సినిమాలను ఐ బొమ్మ ద్వారా అందుబాటులో ఉంచాడు. ఓటీటీ కంటెంట్‌ను డీఆర్ఎం టెక్నాలజీ ద్వారా హ్యాక్ చేసి అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. మూవీరూల్జ్ ద్వారా కంటెంట్ తీసుకుని హెచ్డీ ఫార్మాట్లోకి మార్చి ఐబొమ్మ సైట్లో అప్లోడ్ చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. -
ఐబొమ్మ నిర్వాహకుడు వందలాది మంది కష్టాన్ని దోచుకున్నాడు
-
ఐబొమ్మ పూర్తిగా క్లోజ్! సజ్జనార్ సంచలన ప్రెస్ మీట్
-
iBOMMA రవి అరెస్ట్ వెనుక మహిళ..!
-
నిర్మాతలకు శుభవార్త.. ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్
-
ఢిల్లీ పేలుళ్లు: ఉగ్రవాది షహీన్.. ఆమె భర్త ఏమన్నారంటే?
ఢిల్లీ: ఫరీదాబాద్ పేలుడు పదార్థాల అక్రమ రవాణ కేసులో అరెస్టయిన డాక్టర్ షహీన్ సయీద్ విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనకు మతపిచ్చి లేదని, మతపరమైన కట్టుబాట్లు లేకుండా స్వేచ్ఛగా జీవించాలని ఉండేదని సయీద్ మాజీ భర్త డాక్టర్ హయత్ జాఫర్ తెలిపారు. అంతే కాకుండా 2012లో తమ పిల్లలతో కలిసి యూరప్ లేదా ఆస్ట్రేలియాలలో సెటిల్ అవుదామని షహీన్ సయీద్ భావించినట్లు పేర్కొన్నారు.డాక్టర్ షహీన్ సయీద్ ఫరీదాబాద్ పేలుడు పదార్థాల కేసులో అరెస్టయిన ఈ ఉగ్రవాది గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. భారత్‌లో నిషేదిత ఉగ్రవాద సంస్థ జైషే మెుహమ్మద్ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయడానికి షహీన్ సయీద్ ప్రయత్నించింది. ఎర్రకోట పేలుళ్ల తర్వాత ఢిల్లీ పోలీసుల విచారణ తేలింది. షహీన్ వ్యవహారమై జాతియమీడియా ప్రతినిధులు ఆమె మాజీ భర్త హయాత్‌ను సంప్రదించారు. షహీన్ 2006లో పల్మనాలజీ పూర్తి చేసిందని వారిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహమని హయత్ తెలిపారు. తనతో ఉన్న సమయంలో మతం విషయంలో కట్టుబాట్లు లేకుండా స్వేచ్చగా ఉండేదన్నారు. వారిద్దరు యూరప్, ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వాలని భావించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యే విషయంలో వారిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు చెప్పారు. ఆ తర్వాత 2012లో విడాకులు తీసుకున్నామని, నాటి నుంచి తనకు షహీస్కు మధ్య మాటల్లేవని తెలిపారు. షహీన్ ఉగ్రవాద కార్యక్రమాల్లో భాగం పంచుకోవడాన్ని తాను నమ్మలేకపోతున్నామని ఆమె తండ్రి అహ్మద్ అన్సారి అన్నారు. ‘నాకు ముగ్గురు పిల్లలు. నా రెండో సంతానమే షహీన్. వైద్యవిద్యను అభ్యసించింది. అలాంటి హషీన్ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటుందని నమ్మలేకపోతున్నా. తనని కలిసి ఏడాది కాలమైంది. చివరి సారిగా గతనెలలో మాట్లాడాను’అని చెప్పుకొచ్చారు. షహీన్ సయీద్ అరెస్టయిన మరుసటి రోజే ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందగా పలువురు గాయపడ్డారు. ఈనేపథ్యంలో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. -
Delhi 10/11 Blast: అనుమానితుడి మొదటి ఫొటో..
న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుడు కేసులో ఆత్మాహుతి బాంబర్‌గా అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ మొహమ్మద్ మొదటి ఫొటో బయటకు వచ్చింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో పేలిని తెల్లని హ్యుందాయ్ ఐ20 కారు డాక్టర్ ఉమర్‌కు చెందినది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుమానిత ఆత్మాహుతి బాంబర్ మొదటి చిత్రాన్ని ‘ఎన్డీటీవీ’ యాక్సెస్ చేసింది. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో 1989, ఫిబ్రవరి 24న జన్మించిన ఉమర్.. అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. జమ్ముకశ్మీర్, హర్యానా పోలీసు బృందాలు అరెస్టు చేసిన వైద్యులు డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌లకు డాక్టర్ ఉమర్ అత్యంత సన్నిహితుడు.దర్యాప్తు అధికారులు మాడ్యూల్‌లోని ఇద్దరు కీలక సభ్యులను అరెస్టు చేశారని, 2,900 కిలోల అనుమానిత పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారని తెలుసుకున్న డాక్టర్ ఉమర్ ఫరీదాబాద్ నుండి పారిపోయాడు. తరువాత అతను భయాందోళనకు గురై పేలుడుకు పాల్పడ్డాడని సమాచారం. ఉమర్ మొహమ్మద్, అతని సహచరులు దాడి చేయడానికి అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ (ఏఎన్‌ఎఫ్‌ఓ)ఉపయోగించారు. వారు కారులో డిటోనేటర్‌ను ఉంచి ఎర్రకోట సమీపంలోని రద్దీ ప్రాంతంలో దాడికి పాల్పడ్డారని దర్యాప్తు వర్గాలు తెలిపాయి.ఎర్రకోట సమీపంలో పేలిన తెల్లని హ్యుందాయ్ ఐ20 కారు బదర్పూర్ సరిహద్దు నుండి ఢిల్లీలోకి ప్రవేశించినట్లు సీసీటీవీ వీడియో, ఫొటోలలో కనిపిస్తోంది. కారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి పాత ఢిల్లీకి వచ్చింది. HR 26CE7674 నంబర్ ప్లేట్‌తో ఉన్న ఈ వాహనం ఎర్ర కోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో మూడు గంటల పాటు నిలిపి ఉంచారు. మధ్యాహ్నం 3:19 గంటలకు ప్రవేశించి సాయంత్రం 6:30 గంటలకు కారు బయలుదేరిందని భద్రతా వర్గాలు తెలిపాయి. అనుమానిత ఆత్మాహుతి దళ సభ్యుడు కారును ఒక్క నిమిషం కూడా వదిలి వెళ్లలేదని సమాచారం. -
కశ్మీర్లో కలకలం.. ఉగ్రవాదులతో వైద్యుల దోస్తీ?
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ పోలీసులు చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో పలు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కశ్మీర్ లోయలో ఒక వైద్యుని నుంచి పోలీసులు ఏకే-47 రైఫిల్‌తో పాటు కొంత మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న దరిమిలా అతనిని అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు. అరెస్టు అయిన వైద్యుడు వెల్లడించిన వివరాల ఆధారంగా జమ్ముకశ్మీర్ పోలీసులు ఫరీదాబాద్‌లో 300 కిలోల ఆర్డీఎక్స్, ఏకే-47 రైఫిల్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న ఆయనను.. ఆయుధాలు, పేలుడు పదార్థాలు నిల్వ చేయడంలో, రవాణా చేయడంలో అతని ప్రమేయంపై ఉన్నతాధికారులు ప్రశ్నించారు. పోలీసులు ఆ వైద్యుడిని పుల్వామా జిల్లాలోని కోయిల్ నివాసి ముజామిల్ షకీల్‌గా గుర్తించారు. ఈ వ్యవహారంలో మరో వైద్యుని ప్రమేయం ఉన్నట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఆయుధాలను నిల్వ చేయడంలో షకీల్ సహాయం చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారని ‘ఇండియా టుడే’ తన కథనంలో పేర్కొంది. ఈ కేసులో ఇద్దరు వైద్యుల ప్రమేయం ఉండటంతో జమ్ముకశ్మీర్ పోలీసులు ఈ ప్రాంతానికి చెందిన అందరు వైద్యులపై దృష్టి సారించారు. వారికి జైష్ ఎ మొహమ్మద్, ఘజ్వత్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని జేకే పోలీసులతో పాటు భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. పోలీసులకు పట్టుబడిన ఇద్దరు వైద్యులపై ఆయుధ చట్టంలోని సెక్షన్లు 7/25, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ)లోని సెక్షన్లు 13, 28, 38, 39 కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
‘శ్వాస చంపేస్తోంది’.. ఢిల్లీలో భారీ నిరసనలు
న్యూఢిల్లీ: ‘పొగమంచు నుంచి మమ్మల్ని విముక్తులను చేయండి’.. ‘శ్వాస మమ్మల్ని చంపేస్తోంది’ అనే ప్లకార్డులు చూపిస్తూ, పిల్లాపెద్దా అనే బేధభావం లేకుండా వందలాదిమంది ఢిల్లీవాసులు ఆదివారం ఇండియా గేట్ సమీపంలోని మాన్ సింగ్ రోడ్లో ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలిపారు. ఢిల్లీ గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) ‘చాలా పేలవమైన’ విభాగంలో 370ని తాకిన తరుణంలో, ఢిల్లీ ప్రజలు ఊపిరి తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.‘ఇది ఆరోగ్య అత్యవసర పరిస్థితి. ప్రభుత్వం ఇప్పుడే క్లీన్ ఎయిర్ పాలసీని అందించాలి’ అని ఒక నిరసనకారుడు నినదించగా ‘ధనవంతులు ఎయిర్ ప్యూరిఫైయర్లను కొనుగోలు చేసుకుంటారు లేదా పచ్చని కొండ ప్రాంతాలకు పారిపోతారు. కానీ మా సంగతేంటి? ప్రతి శీతాకాలంలో శ్వాస తీసుకునేందుకు పోరాటం చేస్తున్నాం’ అని ఒక నిరసనకారుడు అన్నాడు. ‘గాలి ప్రభుత్వ ఆస్తి కాదు. అది అందరికీ చెందుతుంది’ అని నినదించాడు.మరో నిరసనకారురాలు జ్యోత్స్న సింగ్ ‘ఎన్డీటీవీ’తో మాట్లాడుతూ ‘పేదలు, వీధి వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, ప్రభుత్వ బస్సులు, ఆటోల నుంచి వచ్చే ఉద్గారాలతో జనం బాధపడుతున్నారు. ఇవి కాలుష్యానికి 80 శాతం దోహదం చేస్తాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు రావాలి’ అని అన్నారు. ‘ప్రతి శీతాకాలంలో నాకు రక్తం పడేలా దగ్గువస్తుంది. ఛాతీలో నొప్పి వస్తుంది. ప్రభుత్వం ఇలాంటివాటిని పట్టించుకోదు. పంజాబ్ రైతులను లేదా గత పాలనను నిందిస్తూనే ఉంటుంది’ అంటూ డీయూ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.అని మరో నిరసనకారిణి ప్రేరణ మెహ్రా ‘కాలుష్యం పెరిగిన తరుణంలో ఏక్యూఐ పర్యవేక్షణ కేంద్రాల దగ్గర నీటిని చల్లుతున్న వీడియోలను చూసిన తర్వాత నేను ఒక దానిని నమ్మలేకపోతున్నాను. ఎవరైనా సంఖ్యలను తప్పుదారి పట్టిస్తున్నారా? లేదా నీటిని వ్యర్థం చేస్తున్నారా?’ అని ప్రశ్నించారు. వసంత్ కుంజ్‌కు చెందిన 76 వృద్ధుడు మాట్లాడుతూ ‘ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ప్రజలు అవే బాధలను ఎదుర్కొంటున్నారు. నా మనవళ్ల కోసం నేను ఆందోళన చెందుతున్నాను. ప్రతిచోటా నిర్మాణాలు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. పచ్చదనం కనుమరుగవుతోంది’ అని అన్నారు.నిరసనలు తీవ్రతరం కావడంతో ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ దళాలు సంయుక్తంగా పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. పర్యావరణ కార్యకర్త విమ్లేందు ఝా ఈ అణిచివేతను ఖండించారు. 15 రోజులుగా లాక్డౌన్ లేదు, షట్‌డౌన్ లేదు కేవలం క్లౌడ్ సీడింగ్ లాంటి పనులు చేస్తున్నారు. ఇది దురదృష్టకరం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. డీసీపీ మహలా మాట్లాడుతూ తాము భద్రతను కాపాడేందుకు కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇది కూడా చదవండి: ‘మరిన్ని రాష్ట్రాల్లో..’ మళ్లీ ‘బాంబు’ పేల్చిన రాహుల్ -
ఆన్లైన్ ఉగ్ర నెట్‌వర్క్‌లపై కొరడా
శ్రీనగర్: ఆన్లైన్ ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై ఉక్కుపాదం మోపుతూ.. కౌంటర్–ఇంటెలిజెన్స్ కాశ్మీర్ ఆదివారం లోయవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఒక మహిళతో సహా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుంది. ఉగ్రవాదాన్ని ఆన్లైన్లో కీర్తించడం, యువకులను ప్రభావితం చేయడంపై అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, కౌంటర్–ఇంటెలిజెన్స్ కాశ్మీర్ బృందాలు శ్రీనగర్, కుల్గామ్, బారాముల్లా, షోపియాన్, పుల్వామాలోని 10 ప్రత్యేక ప్రాంతాలపై దాడులు చేశాయని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.‘ఆన్లైన్ ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టడంలో భాగంగా కాశ్మీర్ లోయవ్యాప్తంగా సమన్వయంతో దాడులు నిర్వహించాం.. ఇది తీవ్రవాదం, సైబర్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక సందేశాన్ని పంపింది’.. అని ఆ ప్రతినిధి స్పష్టం చేశారు. అదుపులోకి తీసుకున్న తొమ్మిది మంది అనుమానితుల్లో ఒక మహిళ కూడా ఉన్నారని అధికారి తెలిపారు. ఈ సందర్భంగా సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, పలు రకాల డిజిటల్ పరికరాలు మొదలుకొని నేరారోపణకు సంబంధించిన కీలక సాక్ష్యాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం స్వా«దీనం చేసుకున్నట్లు వెల్లడించారు. -
అమెరికాలో ఇద్దరు భారత గ్యాంగ్స్టర్లు అరెస్ట్
న్యూఢిల్లీ: విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత దేశానికి చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లలో ఇద్దరిని అరెస్టు చేయడంలో భారత భద్రతా సంస్థలు విజయాన్ని సాధించాయి. హర్యానా పోలీసులతోపాటు భద్రతా సంస్థ అధికారులు జార్జియాలో వెంకటేష్ గార్గ్‌ను అరెస్టు చేయగా, భాను రాణాను అమెరికాలో అరెస్టు చేశారు.ప్రస్తుతం భారతదేశానికి చెందిన 25 మందికి పైగా గ్యాంగ్స్టర్లు దేశం వెలుపల ఉన్నారు. వీరు క్రిమినల్ సిండికేట్లను నడుపుతున్నారని ‘ఎన్డీటీవీ’ తన కథనంలో పేర్కొంది. గార్గ్, రాణాలను అరెస్టు చేయడానికి సాగించిన ఆపరేషన్‌లో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయని సమాచారం. గార్గ్.. హర్యానాలోని నారాయణ్‌గఢ్ నివాసి. ప్రస్తుతం జార్జియాలో ఉంటున్న గార్గ్‌పై భారతదేశంలో 10 కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతను హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, తదితర రాష్ట్రాలకు చెందిన యువతను ప్రలోభపెట్టిన తన బృందంలో నియమించుకుంటాడు. గురుగ్రామ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నేత హత్య తరువాత అతను జార్జియాకు పారిపోయాడు.గార్గ్ ప్రస్తుతం విదేశాలలో ఉంటున్న గ్యాంగ్‌స్టర్ కపిల్ సంగ్వాన్‌తో కలిసి దోపిడీ సిండికేట్‌ను నడుపుతున్నాడు. కాగా భాను రాణా .. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం కలిగి ఉంటూ, చాలా కాలంగా అమెరికాలో నివసిస్తున్నాడు. కర్నాల్ నివాసి అయిన రాణా చాలా కాలంగా నేర ప్రపంచంలో చురుగ్గా ఉన్నాడు. అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. రాణా నేర నెట్వర్క్ హర్యానా, పంజాబ్, ఢిల్లీ వరకు విస్తరించి ఉంది. పంజాబ్‌లో జరిగిన గ్రెనేడ్ దాడి దర్యాప్తులో అతని పేరు బయటకు వచ్చింది.ఇది కూడా చదవండి: 11న భూటాన్‌కు ప్రధాని మోదీ -
హక్కులకు ‘సుప్రీం’ ఛత్రం
‘మన పోలీసులకు తగినంత సామర్థ్యం లేదు. సంస్థాగతంగా, శిక్షణపరంగా ఎన్నో లోపాలున్నాయి. పోలీసు వ్యవస్థపై తగిన పర్యవేక్షణ కూడా లేదు’– ఇవి ఇటీవల ఏదో ఉదంతంలో ఎవరో చేసిన వ్యాఖ్యలు కాదు. సరిగ్గా నూట ఇరవై మూడేళ్ల క్రితం బ్రిటిష్ వలస పాలకుల హయాంలో ఫ్రేజర్ నేతృత్వంలోని రెండో పోలీస్ కమిషన్ నివేదికలోని మాటలు. దేశంలో తరచుగా జరిగే ఉదంతాలు వింటుంటే అప్పటికీ, ఇప్పటికీ పెద్దగా మారిందేమీ లేదని అర్థమవుతుంది. మిగిలినవాటి మాటెలా ఉన్నా పౌరుల్ని అరెస్టు చేయటం విషయంలో నిబంధనలు సక్రమంగా పాటించే సంస్కృతి పోలీసులకు అలవడ లేదు. అందుకే ఎవరినైనా అరెస్టు చేయదల్చుకున్నప్పుడు నిందితులకు అర్థమయ్యే భాషలో అందుకు గల కారణాలను వెంటనే తెలియజెప్పాలని, వారిని ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో... ఎందుకు చేస్తున్నారో... ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయో లిఖిత పూర్వకంగా చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఏజీ మసీహ్‌ల ధర్మాసనం గురువారం తేల్చిచెప్పింది. ఒకవేళ అందుకు వ్యవధి లేకపోతే కోర్టులో హాజరు పరచటానికి రెండు గంటల ముందైనా నెరవేర్చాలని నిర్దేశించింది. అలా చేయకపోతే ఆ అరెస్టూ, రిమాండ్ కూడా చట్టవిరుద్ధమే అవుతాయని స్పష్టం చేసింది.మన దేశంలో దాదాపు 40 శాతం అరెస్టులు స్వల్ప కారణాలపైనే జరుగుతాయి. వీరిలో అత్యధికులు అట్టడుగు వర్గాలవారు కనుక తమను ఎందుకు అరెస్టు చేశారో కూడా తెలియదు. పోలీసులు చెప్పరు. ‘కామన్ కాజ్’ సంస్థ ఇటీవల విడుదల చేసిన ‘స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా’ నివేదిక అరెస్టుల విషయంలో కులం, మతం, రాజకీయ అనుబంధాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పింది. 17 రాష్ట్రాల్లో కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్‌ల వరకూ వేలాది మందితో మాట్లాడి ఈ నివేదిక రూపొందించారు. అరెస్టుల విషయంలో నిబంధనలన్నీ తు.చ. తప్పకుండా పాటిస్తామని కేవలం 41 శాతం మంది చెప్పారు. ఒక మతం లేదా కులానికి చెందినవారు సహజంగా నేరగాళ్లన్న భావన నిలువెల్లా పాతుకుపోయింది. ఇలాంటివారి విషయంలో ఇక నిబంధనలేం పాటిస్తారు? ఈ నేపథ్యంలో తాజా తీర్పు ఒక ఊరట. నిజానికి సుప్రీంకోర్టు ఇలా చెప్పటం మొదటి సారేమీ కాదు. గత ఫిబ్రవరిలో జస్టిస్ అభయ్ ఎస్. ఓకా, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం సైతం విహాన్ కుమార్ కేసులో పోలీసులకు రాజ్యాంగం నిబంధనలను గుర్తు చేయాల్సి వచ్చింది. నిరుడు పంకజ్ బన్సాల్, ప్రబీర్ పురకాయస్థల కేసుల్లోనూ సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఈ సంగతే చెప్పాయి. అరెస్టులకు సంబంధించి రాజ్యాంగం 22వ అధికరణంలోని నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏకపక్ష అరెస్టు లేదా నిర్బంధం నుంచి పౌరులకు రక్షణనిస్తున్నాయి. మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచటానికి ముందే అరెస్టుకు దారితీసిన కారణాలేమిటో నిందితులకు తెలియాలనీ, న్యాయవాదిని నియమించుకుని సమర్థించుకునే అవకాశం ఉండాలనీ, బెయిల్ కోరవచ్చనీ ఆ అధికరణం చెబుతోంది. గతంలో సీఆర్పీసీ (ఇప్పుడు బీఎన్ఎస్ఎస్)లోని సెక్షన్ 57, అరెస్టయినవారిని 24 గంటల్లోగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని నిర్దేశిస్తోంది. కానీ 22వ అధికరణానికి అనుగుణమైన చట్టాలు కొరవడటం పోలీసుల ఇష్టారాజ్యానికి దారితీస్తోంది. మన దేశంలో అరెస్టు చేయటానికి ‘సహేతుకమైన అనుమానం’ ఉంటే సరిపోతుంది. అమెరికాలో ‘సంభావ్యమైన కారణం’ చూపాలి. ఈ వ్యత్యాసం వల్లే అక్రమ అరెస్టులు రివాజవుతున్నాయి. ఫలితంగా ‘చట్టం నిర్దేశించిన విధానంలో తప్ప పౌరుల జీవితాన్నీ, వారి వ్యక్తిగత స్వేచ్ఛనూ హరించ రాద’ని చెప్పే రాజ్యాంగంలోని 21వ అధికరణం కూడా ఉల్లంఘనకు గురవుతోంది. అక్రమ అరెస్టు ఆ వ్యక్తిపైన మాత్రమేకాక అతనితో సంబంధం ఉన్న వారందరిపైనా ప్రభావం చూపుతుందనీ, వారి మానసిక సమతౌల్యాన్నీ, సామాజిక సంక్షేమాన్నీ దెబ్బతీస్తుందనీ సుప్రీంకోర్టు చేసిన తాజా హెచ్చరిక పాలకులకు కనువిప్పు కావాలి. నేరాలు పెరిగాయనో, చట్టాలంటే భయం లేకుండా పోయిందనో పోలీసులు చట్ట బాహ్యతను ఆశ్రయించటం నీతిమాలినతనం. పాలకులు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు. -
కర్నూలు బస్సు ప్రమాదం కేసులో కీలక పరిణామం
సాక్షి, కర్నూలు: కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వేమూరి వినోద్ కుమార్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వినోద్‌కు సొంత పూచికత్తుపై స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం ఘటనలో 19 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాద ఘటనపై బస్సు డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా ఉన్న డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్టు చేశారు.చిన్న టేకూరు వద్ద జరిగిన కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాద ఘటనపై ఉలిందికొండ పోలీస్ స్టేషన్లో యజమాని, డ్రైవర్‌పై కేసు నమోదైంది. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేటకు చెందిన ప్రయాణికుడు రమేష్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. డ్రైవర్‌తో పాటు యజమానిపై రెండు సెక్షన్ల కింద BNS 125(a), 106(1) సెక్షన్లు పోలీసులు నమోదు చేశారు.కాగా, 19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అర్హత లేకున్నప్పటికీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ప్రమాదం నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుటుంబ నేపథ్యం, ప్రవర్తన, అలవాట్లపై అధికారులు ఆరా తీశారు. ఈయన 5వ తరగతి వరకే చదువుకున్నాడని, అయితే టెన్త్ ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్ ఇచ్చి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని గుర్తించారు. -
NRI భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్.. పోలీసుల ఓవరాక్షన్!
NRI భాస్కర్ రెడ్డి అరెస్ట్ అప్డేట్స్...విజయవాడ..విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఎన్నారై భాస్కర్ రెడ్డి, అతని సోదరుడు ఓబుల్ రెడ్డికి ముగిసిన వైద్య పరీక్షలువైద్య పరీక్షల అనంతరం విజయవాడ ప్రభుత్వాసుపత్రి నుంచి కోర్టుకు తరలింపుకోర్టుకు తీసుకొచ్చిన సమయంలో నడవలేని స్థితిలో భాస్కర్ రెడ్డితనను పోలీసులు తీవ్రంగా కొట్టారంటున్న భాస్కర్ రెడ్డిసోషల్ మీడియా పోస్టుల కేసుతో పాటు భాస్కర్ రెడ్డిపై మరో అక్రమ కేసు నమోదు చేసిన పోలీసులు.సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టానని ఒప్పుకోవాలంటూ కోర్టు ప్రాంగణంలో భాస్కర్ రెడ్డిపై పోలీసుల ఒత్తిడిపోలీసుల బెదిరింపులపై ఆగ్రహం వ్యక్తం చేసిన భాస్కర్ రెడ్డి👉కూటమి ప్రభుత్వం ఎన్నారైలపై కూడా కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఎన్నారైలపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వేధింపులకు గురిచేస్తోంది. తాజాగా వైఎస్సార్సీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఓ ఎన్నారైను అక్రమంగా అరెస్ట్ చేసింది. దీంతో, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.👉వివరాల ప్రకారం.. మాలపాటి భాస్కర్ రెడ్డి లండన్‌లో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. భాస్కర్ రెడ్డి స్వగ్రామం కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలోని చోడవరం. అయితే, భాస్కర్ రెడ్డి సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతుంటారు. ఈ నేపథ్యంలో భాస్కర్ రెడ్డిని టార్గెట్ చేసిన కూటమి సర్కార్ ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఈనెల ఒకటో తేదీన తన తండ్రి మరణంతో భాస్కర్ రెడ్డి.. లండన్ నుంచి స్వగ్రామం చోడవరం చేరుకున్నారు.👉అనంతరం, వైద్య పరీక్షల కోసం తాడిగడపలోని కామినేని ఆసుపత్రికి భాస్కర్ రెడ్డి వెళ్లారు. ఈ క్రమంలో మఫ్టీలో వచ్చిన పోలీసులు.. భాస్కర్ రెడ్డితో పాటు అతని సోదరుడు ఓబుల్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. అయితే, ఏ కేసులో తనను అరెస్ట్ చేశారో.. ఎక్కడికి తీసుకువెళ్లారో అనే కనీస సమాచారం కూడా భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు పోలీసులు ఇవ్వలేదు. అరెస్ట్‌పై ప్రశ్నిస్తే పెనమలూరు పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. ఇక, తాజాగా వారిద్దరినీ వైద్య పరీక్ష నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తీసుకువచ్చారు. -
Srinagar: భారీ ఉగ్రదాడి విఫలం
శ్రీనగర్: భారీ ఉగ్రదాడి కుట్రను జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ పోలీసులు భగ్నం చేశారు. దీంతో దేశంలో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శ్రీనగర్ పోలీసులు కోనఖాన్లోని మమతా చౌక్ సమీపంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రయత్నిస్తున్న సాయుధులైన ముగ్గురిని అదుపులోనికి తీసుకున్నారు.‘ఇండియా టీవీ’ తెలిపిన వివరాల ప్రకారం సాధారణ వాహన తనిఖీల సమయంలో రిజిస్ట్రేషన్ నంబర్ లేని ఒక నల్లని రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిల్ పోలీసులలో అనుమానాలను రేకెత్తించింది. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని ఆపాలంటూ సిగ్నల్ ఇవ్వగానే, రైడర్‌తో పాటు మరో ఇద్దరు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అయితే అప్రమత్తంగా ఉన్న అధికారులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు అనుమానితులను షా ముతైబ్, కమ్రాన్ హసన్ షా,మొహమ్మద్ నదీమ్‌గా గుర్తించారు. వీరంతా ఖన్యార్‌లోని కావా మొహల్లాలో ఉంటున్నారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి ఒక కంట్రీ-మేడ్ పిస్టల్, తొమ్మిది లైవ్ రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. వారు ఒక ప్రణాళిక ప్రకారం ఉగ్రదాడులకు పాల్పడేవారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఖన్యార్ పోలీస్ స్టేషన్లో వీరిపై ఆయుధ చట్టం, యూఏపీఏ అండ్ మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ ముగ్గురూ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఉపయోగించి ఉగ్ర దాడికి కుట్ర పన్నారని తేలింది. అనుమానితుల నెట్‌వర్క్‌ను కనుగొనేందుకు పోలీసు అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనగర్ పోలీసుల అప్రమత్తత కారణంగా భారీ ఉగ్రదాడి తప్పిందని ఉన్నతాధికారులు తెలిపారు. భారత భద్రతా దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దరిమిలా కొంతకాలం వెనుకకు తగ్గిన ఉగ్రవాదులు.. ఇప్పుడు తిరిగి సంఘటితం అవుతున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. దీంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.ఇది కూడా చదవండి: పని ఒత్తిడి: 10 మందిని చంపిన నర్స్ -
అరెస్టుకు కారణాలను తక్షణం చెప్పాలి
న్యూఢిల్లీ: ఆగమేఘాల మీద అరెస్ట్‌లు జరిగిపోయే భారత్‌లో ఇకమీదట నిందితులకు అరెస్ట్ కారణాలు, కేసులో పొందుపరిచిన చట్టాల చిట్టాను విడమర్చి చెప్పాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అరెస్ట్ అయిన ప్రతి ఒక్క వ్యక్తికి తనను ఎందుకు అరెస్ట్ చేశారో, ఆ కేసులో ఏమేం రాశారో, ఎలాంటి చట్టాలను పేర్కొన్నారో, ఏ నేరాలను పొందుపరిచారో అతనికి అరెస్ట్ సమయంలోగానీ అరెస్ట్ చేసిన తక్షణంగానీ తెలియజేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువర్చింది. గత ఏడాది ముంబైలో జూలైలో ఢీకొట్టి ఖరీదైన బీఎండబ్ల్యూతో పారిపోయిన ఘటనలో నమోదైన ఉదంతానికి సంబంధించి మిహిర్ రాజేశ్ షా, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య నడిచిన కేసులో తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసీహ్ల ధర్మాసనం ఈ కీలక తీర్పును ఇచ్చింది. వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాథమిక రక్ష ఇది ధర్మాసనం తరఫున 52 పేజీల తీర్పును జస్టిస్ అగస్టీన్ రాశారు. ‘‘రాజ్యాంగంలోని 22(1) అధికరణం ప్రకారం ఎవరినైతే పోలీసులు లేదా దర్యాప్తు సంస్థలు అరెస్ట్చేస్తాయో వాళ్లకు వీలైనంత త్వరగా అరెస్ట్‌కు కారణాలను వివరించాలి. ఇది ఇన్నాళ్లూ తప్పనిసరిగా అవలంభించాల్సిన విధానం కాదుగానీ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక రక్షణగా నిలుస్తుంది. అరెస్ట్ అయిన నిందితునికి అతను అర్థంచేసుకునే భాషలో రాతపూర్వకంగా కేసు వివరాలను తెలియజేయాలి. ఏ నేరానికిగాను ఏ చట్ట నిబంధనల మేరకు అరెస్ట్చేయాల్సి వచ్చిందో నిందితునికి వెంటనే చెప్పాలి. అయితే అరెస్ట్ చేసిన రెండు గంటల్లోపే అతడిని రిమాండ్ నిమిత్తం మేజి్రస్టేట్ ఎదుట హాజరుపర్చగలిగితే మాత్రం నిందితునికి ముందే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మేజి్రస్టేట్ ముందుకు తీసుకెళ్లలేని సందర్భాల్లో ఇవన్నీ చెప్పకపోతే మాత్రం అతని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లినట్లే. ఒక నిందితుడిని ఒకటి కంటే ఎక్కువ కేసుల్లో అరెస్ట్‌చేస్తే ఆ అన్ని కేసుల్లో పొందుపరిచిన చట్టాలు, సెక్షన్లు, నేరాల చిట్టాను అతనికి వివరించాలి. వాటిని నిందితునికి అర్థమయ్యే భాషలో రాతపూర్వకంగా అందివ్వాలి. పాత భారతశిక్షా స్మృతి 1860 లేదా కొత్త భారతీయ న్యాయసంహిత,2023 చట్టం ప్రకారం చూసినా అరెస్ట్ అయిన వ్యక్తికి అరెస్ట్‌కు కారణాలను వెల్లడించాలని రాజ్యాంగమే ఉద్భోధిస్తోంది’’ అని ధర్మాసనం వివరించింది. కనీసం మౌఖికంగానైనా వివరించాలి ‘‘అరెస్ట్ చేసిన ప్రాంతంలో ఇలా అరెస్ట్‌కు కారణాలు లిఖితపూర్వకంగా వెల్లడించేందుకు పెన్ను, పేపర్ లాంటి ఏర్పాట్లు లేకపోతే సంబంధిత దర్యాపు అధికారి/పోలీసు కనీసం మౌఖికంగా నిందితునికి అరెస్ట్ కారణాలను తెలపాలి. మేజి్రస్టేట్ వద్దకు తీసుకెళ్లని పక్షంలో అతనికి వివరాలు చెప్పకపోతే అలాంటి అరెస్ట్/రిమాండ్‌కు చట్టబద్ధత లేదని భావించాలి. అప్పుడు నిందితుడిని వదిలేయడమే ఉత్తమం. మా తీర్పు ప్రతిని అన్ని రాష్ట్రాల హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్‌కు, అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించండి’’ అని రిజిస్ట్రీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ‘‘ అసాధారణ కేసుల్లోనూ తప్పనిసరిగా కేసు వివరాలను నిందితునికి చెప్పాల్సిందే. లేదంటే ఆ అరెస్ట్‌కు చట్టబద్ధత లేనట్లే భావించాలి. అరెస్ట్ వేళ రాతపూర్వకంగా అతనికి ఇచి్చన సమాచారాన్ని అతను అర్థంచేసుకోలేకపోతున్నాడంటే అతని రాజ్యాంగంలోని 22వ అధికరణం ఉల్లంఘనకు గురైనట్లే. అతనికి అర్థంకాని భాషలో సమాచారం ఇచ్చినా అది అతనికున్న రాజ్యాంగబద్ధ రక్షణను ఊహాత్మకంగా మార్చినట్లే. అది రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21, 22ల్లోని వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లే’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అరెస్ట్ చేసినప్పుడు తనకు కారణాలను చెప్పలేదంటూ నిందితుడు మిహిర్ బాంబే హైకోర్టులో కేసు వేశాడు. అయితే కారణాలను తెలపకపోవడం అనేది విధానపర తప్పిదమని ఒప్పుకున్న హైకోర్టు.. ఆ కేసు తీవ్రత దృష్ట్యా అరెస్ట్ సహేతుకమేనని తీర్పు చెప్పిన విషయం విదితమే. -
బంగారం చోరీ కేసుల్లో TDP ఎమ్మెల్యే అనుచరుడు అరెస్ట్
-
తెలుగు సీరియల్ నటికి అసభ్య వీడియోలు.. వ్యక్తి అరెస్ట్
తెలుగు, కన్నడ భాషల్లో సీరియల్స్ చేస్తున్న ఓ నటి.. నెలలుగా ఇబ్బంది పడుతోంది. ఇక తట్టుకోలేక ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. దీంతో ఈ నటిని వేధిస్తున్న వ్యక్తిని బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: భరణితో ట్రోల్స్.. ఫైర్ అయిన మాధురి)ఏం జరిగింది?స్వతహాగా బెంగళూరుకి చెందిన ఓ నటి.. కన్నడతోపాటు తెలుగులోనూ సీరియల్స్ చేస్తోంది. ఈమెకు ఓ రోజు నవీన్ అనే వ్యక్తి నుంచి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. కానీ ఈమె దీన్ని తిరస్కరించింది. పలుమార్లు ఇలానే చేసింది. దీంతో కక్ష పెంచుకున్న ఇతడు.. అభ్యంతరకర వీడియోలు పంపించడం మొదలుపెట్టాడు. బ్లాక్ చేయడంతో పలు ఫేక్ అకౌంట్స్ సృష్టించి మరీ సదరు నటికి మెసేజులు, వీడియోలు పంపిస్తూనే ఉన్నాడు.దాదాపు మూడు నెలల పాటు నవీన్ వల్ల మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్న సదరు నటి.. ఇక తట్టుకోలేక వ్యక్తిగతంగా అతడిని కలిసి సమస్యని పరిష్కరించుకోవాలని అనుకుంది. ఈ క్రమంలోనే నాగభైరవి ప్రాంతంలోని నందన్ ప్యాలెస్‌లో నవీన్‌ని కలిసింది. ఇవన్నీ ఆపేయాలని కోరింది. అయినా సరే అతడిలో మార్పు రాకపోవడంతో పోలీసులని ఆశ్రయించింది. దీంతో నటి ఫిర్యాదు మేరకు నవీన్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు సాగుతోంది.(ఇదీ చదవండి: ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ) -
కోయంబత్తూరు ఘటన: సినీ ఫక్కీలో నిందితుల అరెస్ట్
కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో కళాశాల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను సినీ ఫక్కీలో పోలీసులు అరెస్ట్ చేశారు. కోయంబత్తూరు నగర పోలీసు కమిషనర్ శరవణ సుందర్ నిందితుల అరెస్టును ధృవీకరించారు. అరెస్టు సమయంలో పారిపోవడానికి ప్రయత్నించిన ముగ్గురు నిందితుల కాళ్లపై పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని శరవణ సుందర్ పేర్కొన్నారు. కోయంబత్తూరు నగర శివార్లలోని వెల్లకినారులో పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా, వారు అక్కడి నుంచి తప్పించుకోబోయారు. ఈ నేపధ్యంలో పోలీసులు వారి కాళ్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గాయపడిన నిందితులు గుణ, కరుప్పసామి, కార్తీక్ అలియాస్ కాళీశ్వరన్లను కోయంబత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఎన్కౌంటర్లో ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా గాయపడ్డారని శరవణ సుందర్ ‘ఏఎన్ఐ’కి తెలిపారు.కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో ఆదివారం సాయంత్రం ఒక విద్యార్థినిని ముగ్గురు మువకులు అపహరించి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. దాడి జరిగిన సమయంలో ఆ విద్యార్థిని తన స్నేహితునితోపాటు కారులో ఉన్నారని ‘హిందుస్తాన్ టైమ్స్’ గతంలో నివేదించింది. ఆ సమయంలో ముగ్గురు నిందితులు కలిసి కారు అద్దాలు పగలగొట్టి, ఆ యువతిని, అతని స్నేహితుడిని కొట్టి, గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారం చేశారని తెలియవచ్చింది.ఈ ఘటన దరిమిలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై తమిళనాడులో క్షీణిస్తున్న శాంతిభద్రతలను, మహిళలు, పిల్లలపై పెరుగుతున్న లైంగిక నేరాలపై ‘ఎక్స్’ పోస్టులో ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకె అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇలాంటి సంఘటనలు పెరిగిపోయాయని, సామాజిక వ్యతిరేక శక్తులు అటు చట్టానికి, ఇటు పోలీసులకు భయపడటం లేదని అన్నామలై ఆరోపించారు. డీఎంకే మంత్రుల నుండి పోలీసు అధికారుల వరకు అందరూ న్యాయాన్ని కాపాడే బదులు నేరస్తులను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లున్నదని అన్నామలై అన్నారు. ఇది కూడా చదవండి: భారత ట్రక్కు డ్రైవర్ కేసులో మరో మలుపు -
కన్నీటి పర్యంతం అయిన జోగి రమేష్ భార్య.. వడ్డీతో సహా చెల్లిస్తాం...
-
ఉద్యోగం కోసం ఎమ్మెల్యేపై దాడి?.. యువకుడు అరెస్ట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌పై దాడి జరిగింది. సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఎమ్మెల్యే నివాసంలోకి చొరబడిన ఒక యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పోలీసులు ఆ యువకుడిని అభిషేక్ దాస్‌గా గుర్తించిన దరిమిలా అరెస్ట్ చేశారు.ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే జ్యోతిప్రియ మల్లిక్‌ను వెంబడించిన ఆ యువకుడు అతని ఇంటిలోనికి చొరబడి, హఠాత్తుగా ఎమ్మెల్యేపైకి దూసుకెళ్లి, అతని పొత్తికడుపుపై బలంగా కొట్టాడు. దీంతో ఎమ్మెల్యే షాక్‌నకు గురయ్యారు. వెంటనే తేరుకుని, కేకలు వేయడంతో అతని భద్రతా సిబ్బందితో పాటు సమీపంలోని ఇతరులంతా ఆ యువకుడిని పట్టుకుని, బిధాన్నగర్ పోలీసులకు అప్పగించారు.పోలీసులు విచారణలో ఆ యువకుడు తాను ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హబ్రా ప్రాంతానికి చెందినవాడినని, ఉద్యోగం కోసం మల్లిక్‌తో మాట్లాడాలనుకున్నానని చెప్పాడు. మల్లిక్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో హబ్రా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా ఆ యువకుడు నగరంలోని ఒక ఆసుపత్రిలో మానసిక వైద్య చికిత్స పొందుతున్నాడని, సాల్ట్ లేక్‌లోని మల్లిక్ ఇంటికి పలుమార్లు వెళ్లాడని పోలీసు అధికారి తెలిపారు.ఎమ్మెల్యే మల్లిక్ విలేకరులతో మాట్లాడుతూ, ఆ యువకుడు ఇతర సందర్శకుల మాదిరిగానే తనను కలుసుకునేందుకు వచ్చాడని, అయితే అకస్మాత్తుగా ముందుకు దూకి, తనను కొట్టడంతో ఆశ్చర్యపోయానన్నారు. అతను మద్యం మత్తులో ఉన్నాడో లేదో తనకు తెలియదని, గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. మల్లిక్ రెండేళ్ల క్రితం అటవీ మంత్రిగా పనిచేసినప్పుడు అవినీతి కేసులో కేంద్ర సంస్థలు ఆయనను అరెస్టు చేశాయి. ఇది కూడా చదవండి: ‘ట్రంప్ ఏం చేస్తారో..’: ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు -
‘డబ్బులు చెల్లిస్తా.. నన్ను వదిలేయండి సార్’..అమెరికాలో భారత యువతి
వాషింగ్టన్: అమెరికాలో మరో భారత యువతి దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికింది. పైగా తాను దొంగతనం చేయలేదని బుకాయించింది. తీసుకున్న వస్తువులకు డబ్బులు చెల్లించడం మరిచిపోయానంటూ ప్రాధేయపడింది. కావాలంటే ఇప్పుడు తీసుకున్న వస్తువులకు డబ్బులు చెల్లిస్తా. నన్ను వదిలేయండి’ అంటూ చేతులు జోడించి అక్కడి పోలీసుల్ని వేడుకుంది. ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన ఓ యువతి టూరిస్ట్ వీసాతో అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సమయంలో అమెరికాకు చెందిన ఓ రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ ఓ షాప్‌లో తనకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు. అనంతరం, అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేయగా.. సదరు షాపు యజమాని ..తన షాపులో ఓ యువతి దొంగతనం చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తు వీడియోలో.. ఆ యువతి ఎలా శిక్ష విధించకుండా వదిలేయమని కోరింది. తాను షాపులు వస్తువుల్ని కొనుగోలు చేశానే తప్పా.. దొంగతనం చేయలేదని, కొనుగోలు చేసిన వస్తువులకు ఇప్పుడే డబ్బులు చెల్లిస్తానని చెప్పడం ఆవీడియోలో చూడొచ్చు. కాగా, ఆ యువతి వివరాలు, ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు తెలియాల్సి ఉంది. 👉ఇదీ చదవండి: చేతివాటం చేసే చేటు ఇంతింతకాదయా?కొద్దిరోజుల క్రితం కొద్దిరోజుల క్రితం మనదేశానికే చెందిన ఓ మహిళ అమెరికాలోని ఇల్లినాయిస్లో డిపార్టుమెంటల్ స్టోర్సుకు వెళ్లి.. ఏకంగా 1300 డాలర్ల విలువైన వస్తువులను తస్కరించడానికి ప్రయత్నించిందట. బిల్లు ఎగ్గొట్టి జారుకోవాలని చూస్తే.. చివరికి పోలీసుల పాలైంది. దొరికి పోయిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు? ‘సారీ సర్.. ప్లీజ్ సర్, ఫస్ట్ టైం సర్, క్షమించండి సర్..’ అని కోరినప్పటికీ పోలీసులు ఆమెను కటకటాల వెనక్కు పంపారు. -
‘చంద్రబాబు సర్కార్ మరో డైవర్షన్ డ్రామా’
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున, పేర్ని వెంకట్రామయ్య (నాని), అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మార్గాని భరత్, టీజేఆర్ సుధాకర్‌బాబు సంయుక్త ప్రకటన విడుదల చేశారు‘‘మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమం. ఇది కేవలం కక్ష సాధింపు చర్య. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌ను దురుద్దేశంతోనే ఇరికించారు. కస్టడీలో ఉన్న కేసులో ఏ–1 నిందితుడు జనార్థన్‌రావు ద్వారా జోగి రమేష్ పేరు చెప్పించారు. దానిపై జోగి రమేష్ చేసిన సవాల్, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సాక్షిగా ఆయన చేసిప ప్రమాణంపై ఇప్పటి వరకు టీడీపీ నేతలు స్పందించలేదు. జోగి రమేష్ కుటుంబాన్ని ఇంకా వెఎస్సార్‌సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లు’’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘లేని లిక్కర్ స్కామ్‌లు సృష్టించారు. కల్తీ మద్యం తయారుచేస్తూ టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోవడంతో, ఆ బురదను వైఎస్సార్సీపీకి అంటించే కుట్ర చేస్తున్నారు. కల్తీ మద్యం కేసులో సీబీఐ దర్యాప్తు జోగి రమేష్ కోరారు. దానిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. అది విచారణకు రాకముందే జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొక్కిసలాట.. పలువురి దుర్మరణం. మోంథా తుపాన్ సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యం. రెండింటి నుంచి డైవర్షన్ కోసమే జోగి రమేష్ అరెస్ట్. కల్తీ మద్యం కేసులో పక్కా ఆధారాలున్నా, కొందరు టీడీపీ నాయకులు అరెస్ట్ లేదు. కేవలం కక్ష సాధింపు కోసమే జోగి రమేష్‌ను ఇరికించి అరెస్టు చేశారు. ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం’’ అని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. -
Bihar Elections: ‘బాహుబలి’ నేత అరెస్ట్.. మోకామాలో కలకలకం
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు మోకామా నియోజకవర్గంలో కలకలం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే, బాహుబలి నేతగా పేరొందిన అనంత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జన్ సురాజ్ పార్టీ కార్యకర్త, ఆర్జేడీ మాజీ నేత దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో అనంత్ సింగ్‌ను బార్హ్‌లోని అతని నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ అరెస్టును పట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) కార్తికేయ శర్మ, పట్నా జిల్లా మేజిస్ట్రేట్ త్యాగరాజన్ ఎస్ఎమ్ మీడియా ముందు ధృవీకరించారు. అనంత్ సింగ్‌తో పాటు ఈ కేసులో ప్రమేయం ఉన్న మణికాంత్ ఠాకూర్, రంజీత్ రాహలను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.అసలేం జరిగింది?గ్యాంగ్‌స్టర్ నుండి రాజకీయ నేతగా మారిన దులార్ చంద్ యాదవ్, గురువారం నాడు మోకామాలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా హత్యకు గురయ్యారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్న తన మేనల్లుడు ప్రియదర్శి పియూష్ తరపున యాదవ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉన్న సమయంలో ప్రత్యర్థి పార్టీకి చెందిన నేత హత్యకు గురికావడం మోకామాలో ఉద్రిక్తతకు దారితీసింది.పోస్ట్‌మార్టం నివేదికపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దులార్ చంద్ యాదవ్ మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. యాదవ్ మరణానికి కారణం అతని గుండె, ఊపిరితిత్తులకు గట్టి గాయాలు కావడం. ఫలితంగా కార్డియో-శ్వాసకోశ వైఫల్యం ఏర్పడింది. పోస్ట్‌మార్టం నివేదిక, ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఇది హత్య అని స్పష్టంగా తెలుస్తున్నదని ఎస్ఎస్పీ కార్తికేయ శర్మ తెలిపారు.అనంత్ సింగ్.. రాజకీయ వివాదాలుఅనంత్ సింగ్ బీహార్ రాజకీయాల్లో ‘బాహుబలి’నేతగా పేరొందారు. గతంలో ఆర్జేడీతో సంబంధాలు ఉన్న సింగ్, అనేక నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. 2020 ఎన్నికల్లో ఆర్జేడీ తరపున మోకామా నుండి గెలిచినప్పటికీ, ఆయుధాల అక్రమ నిల్వ కేసులో దోషిగా తేలడంతో 2022లో ఆయన శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు. ప్రస్తుతం ఆయన భార్య నీలం దేవి మోకామా అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంత్ సింగ్ అరెస్టు రాబోయే బీహార్ ఎన్నికల పైన, ముఖ్యంగా మోకామాలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.ఇది కూడా చదవండి: ‘అది అసాధ్యం’.. ఖర్గేకు అమిత్‌షా కౌంటర్ -
జనసేన నేత సత్య వెంకటకృష్ణ అరెస్ట్
సాక్షి, కోనసీమ జిల్లా: ఐ.పోలవరంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన జనసేన నాయకుడు సత్య వెంకట కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజులుగా పరారీ లో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికపై నిందితుడు ఆరు సార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలికతో పాటు మరికొందరిపై కూడా నిందితుడు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.బాలిక తల్లి తప్ప.. ఫిర్యాదు చేయడానికి మిగిలిన బాధితులు ముందుకు రావడం లేదు. అత్యాచార ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. నిందితుడికి నేర చరిత్ర ఉందని.. మోటారు సైకిళ్ల దొంగతనం, దొంగ నోట్ల మార్పిడి కేసులు నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో సత్య కృష్ణపై సస్పెక్ట్ షీట్ ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐ.పోలవరం హైస్కూల్లో విద్యా కమిటీ కో-ఆప్షన్ సభ్యుడిగా కొనసాగుతున్న సత్య కృష్ణ.. దుర్మార్గానికి ఒడికట్టాడు. నేరం రుజువైతే నిందితుడికి జీవిత ఖైదు పడుతుందని డీఎస్పీ తెలిపారు. -
Sabarimala Theft Case.. మాజీ అధికారి అరెస్ట్
తిరువనంతపురం: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో బంగారం చోరీ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తాజాగా ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధీష్ కుమార్‌ను ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)అధికారులు.. సుధీష్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని, విచారించిన దరిమిలా ఈ అరెస్ట్ జరిగింది.ఆలయ ద్వారం వద్దనున్న శిల్పాలకు పూత పూసిన పొరలు బంగారంతో తయారు చేసినవని తెలిసినప్పటికీ, సుధీష్ కుమార్ అధికారిక పత్రాలలో వాటిని రాగి పొరలుగా తప్పుగా నమోదు చేసినట్లు దర్యాప్తు అధికారులు కనుగొన్నారని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి మహసర్ (అధికారిక రికార్డు)ను ట్యాంపరింగ్ చేసి, బంగారాన్ని దొంగిలించేందుకు సుధీష్ కుమార్ సహాయం చేశాడని సిట్ నిర్ధారించింది. 2019లో శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరించిన సుధీష్ నాడు ఉన్నికృష్ణన్ పొట్టిని దాతగా ఆమోదించారు. దీనికితోడు దేవస్వం బోర్డు ఆ బంగారు పొరలను రాగి పలకలుగా చెప్పాలంటూ ఉన్నికృష్ణన్ పొట్టిని కోరిందని సిట్ గుర్తించింది. అధికారులు శిల్పాలను ట్యాంపరింగ్ చేసినప్పుడు కూడా, సుధీష్ వాటిని రికార్డులలో రాగి పొరలుగా పేర్కొన్నారు.అయితే పొట్టికి ఆ షీట్లు అందకపోయినా, సుధీష్ అతని పేరును రికార్డులలో రాశారని చూపించే ఆధారాలను సిట్ స్వాధీనం చేసుకుంది. సుధీష్ మరో నిందితుడు మురారి బాబుకు ఈ బంగారం చోరీలో సహాయం చేశాడని కూడా దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. సుధీష్ కుమార్‌ను అధికారులు (ఈరోజు) శనివారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. తదుపరి విచారణ కోసం అతనిని తిరిగి కస్టడీకి కోరే అవకాశం ఉందని సమాచారం. -
సినిమా ఆడిషన్స్ పేరుతో.. 20మంది పిల్లల కిడ్నాప్!
ముంబై: ముంబైలో 20మంది పిల్లల కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఆడిషన్స్ పేరుతో కిడ్నాప్‌కు గురైన 20మంది పిల్లల్ని పోలీసులు కాపాడారు. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. గన్‌తో పాటు పలు రసాయనాల్ని స్వాధీనం చేసుకున్నారు. మీరు పేపర్లు,టీవీలు,సోషల్ మీడియాలో కొన్ని ప్రకటనలు చూస్తూనే ఉంటారు. వాటిలో మనల్ని ఎక్కువగా ‘మా సంస్థ నిర్మిస్తున్న సీరియల్స్‌లో నటినటులు కావాలని, లేదంటే మా సినిమాలో హీరోయిన్ చెల్లెలి పాత్రకు బాలనటులు కావాలంటూ వచ్చే ప్రకటనలు ఆకర్షిస్తుంటాయి. అదిగో అలాంటి ప్రకటనే ఇచ్చిన ఓ కిడ్నాపర్ ఓ 20మంది పిల్లల్ని కిడ్నాప్ చేశాడు.సినిమా,డైలీ సీరియల్స్,వెబ్ సిరీస్‌లో బాల నటీనటులు కావాలంటూ కిడ్నాపర్ రోహిత్ ఆర్య ఓ యాడ్ ఇచ్చాడు. ఆ యాడ్ చూసిన 100 మంది పిల్లలు మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉన్న ప్రముఖ నివాస ప్రాంతం ‘పోవై’ ఆర్ఏ స్టూడియోకు తరలివచ్చారు. ఆడిషన్స్ ఇచ్చేందుకు వచ్చిన 100 మంది పిల్లలో 20మంది పిల్లల్ని కిడ్నాప్ చేశాడు. వీరి వయస్సు 15లోపే ఉంటుందని సమాచారం. అయితే పిల్లల్ని బంధించిన అనంతరం ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో కిడ్నాపర్ రోహిత్ ఆర్య మాట్లాడుతూ.. ‘నావి మామూలు డిమాండ్లే. నేను కొంతమందిని ప్రశ్నించాలని అనుకుంటున్నాను. వాళ్ల నుంచి నాకు జవాబు కావాలి. నేను ముందుగా సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. కానీ ప్లాన్ మార్చి పిల్లల్ని కిడ్నాప్ చేశా. ఈ వీడియో చూసిన తర్వాత పిల్లల్ని రక్షించాలని పోలీసులు ఏదైనా ప్రయోగం చేస్తే ఈ ప్రదేశాన్ని తగలబెడతా. డబ్బును ఆశించడం లేదు. అలాగని ఉగ్రవాదిని కూడా కాదు’ అంటూ బెదిరింపులకు దిగాడు.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. స్టూడియో పరిసర ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితుడి చెరలో ఉన్న పిల్లలకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చాకచక్యంగా వ్యహరించారు. స్టూడియోలోకి ప్రవేశించి పిల్లల్ని రక్షించారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో రోహిత్ ఆర్య మానస్థిక స్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.Man holds 15–20 children hostage at a studio in Mumbai’s Powai and released a video saying he wants to speak with specific people and be allowed to meet them.In the video, he threatened that if he’s not permitted to do so, he will set the studio on fire and harm himself and the… pic.twitter.com/UWG6Th95n9— The Tatva (@thetatvaindia) October 30, 2025 -
’బార్క్’లో నకిలీ శాస్త్రవేత్త.. న్యూక్లియర్ డేటా చోరీ?
ముంబై: దేశంలోని ప్రముఖ అణు పరిశోధనా విభాగం భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఈ కేంద్రంలో పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్న ఒక నకిలీ శాస్త్రవేత్తను అరెస్టు చేయడానికి తోడు, అతని నుంచి అనుమానిత న్యూక్లియర్ డేటా, 14 మ్యాప్‌లను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాలలో ఏదైనా గోప్యమైన న్యూక్లియర్ డేటా ఉన్నదీ లేనిదీ తెలుసుకునే దిశగా దర్యాప్తు ప్రారంభించారు.అక్తర్ కుతుబుద్దీన్ హుస్సేని అనే నకిలీ శాస్త్రవేత గత వారం ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో అరెస్టు అయ్యాడు. అతను వివిధ పేర్లతో శాస్త్రవేత్తగా నటిస్తూ వస్తున్నాడు. అతని నుండి పోలీసులు పలు నకిలీ పాస్‌పోర్ట్‌లు, ఆధార్, పాన్ కార్డులు, నకిలీ బార్క్ ఐడీలు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఐడీలో అతను అలీ రజా హుస్సేన్‌గా, మరొక దానిలో అతని పేరు అలెగ్జాండర్ పామర్ అని ఉందని పోలీసులు గుర్తించారు. హుస్సేని గత కొన్ని నెలలుగా పలు అంతర్జాతీయ కాల్స్ చేశాడని, అతని కాల్ రికార్డులను గుర్తించామని పోలీసు వర్గాలు తెలిపాయి. అనుమానిత న్యూక్లియర్ డేటాతో ముడిపడిన విదేశీ నెట్‌వర్క్‌లతో హుస్సేని సంబంధం కలిగి ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది.హుస్సేని తన గుర్తింపును మార్చుకుని మారువేషంలో చాలాకాలంగా ఉంటున్నాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 2004లో రహస్య పత్రాలు కలిగిన శాస్త్రవేత్తగా గుర్తించి, అతనిని దుబాయ్ నుండి బహిష్కరించారు. అయితే ఆ తర్వాత కూడా అతను నకిలీ పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి దుబాయ్, టెహ్రాన్ తదితర దేశాలలో ప్రయాణాలు సాగించాడు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన అఖ్తర్ హుస్సేని 1996లో తన పూర్వీకుల ఇంటిని విక్రయించాడు. అయితే తన పాత పరిచయాల సహాయంతో నకిలీ పత్రాలను రూపొందించాడని పోలీసులు తెలిపారు. ఈ నేపధ్యంలోనే అతను హుస్సేని మొహమ్మద్ ఆదిల్, నసీముద్దీన్ సయ్యద్ ఆదిల్ హుస్సేని పేర్లతో రెండు నకిలీ పాస్‌పోర్ట్‌లను పొందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జంషెడ్పూర్ చిరునామాతో ఈ పాస్‌పోర్టులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: Madhya Pradesh: రహస్య కెమెరాలో పోలీసు అధికారిణి.. ఏం చేస్తూ దొరికారంటే.. -
లాటరీలో భారీ జాక్‌పాట్.. కట్‌చేస్తే మృతదేహం అలా..
కోల్కత్తా: లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మాజీ తృణముల్ కాంగ్రెస్ నాయకుడు సహా మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగాల్‌లోని కుల్తీ అసెంబ్లీ నియోజకవర్గంలోని లఖియాబాద్ అప్పర్ పారా ప్రాంతంలో కార్తీక్ బౌరి కుటుంబం నివసిస్తోంది. ఈ మధ్యే కార్తీక్ బౌరికి కోటి రూపాయల లాటరీ తగిలింది. ఇంతలోనే అతడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో, కార్తీక్ బౌరి తల్లి పోలీసులను ఆశ్రయించింది. తన ఫిర్యాదులో మాజీ టీఎంసీ నాయకుడు బేబీ బౌరి, అమర్దీప్ బౌరి, సందీప్ బౌరి, జ్యోత్స్న బౌరిలే కార్తీక్‌ను హత్య చేసినట్లు ఆరోపించారు.అక్కడ మృతదేహాం.. కార్తీక్ బౌరి అచేతనంగా బేబీ బౌరి ఇంటి బయట ఉన్న మెట్లపై కనిపించాడు. అనంతరం, అతడి కుటుంబం అక్కడికి చేరుకుని వెంటనే కార్తీక్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే కార్తీక్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో బేబీ బౌరిని కార్తీక్ కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. కార్తీక్ తన ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించాడని తెలిపారు. దొంగతనానికి వచ్చి ఇంటి గోడ దూకి పారిపోతుండగా కిందపడి మృతి చెందినట్టు చెప్పుకొచ్చాడు.అయితే, బేబీ బౌరి వ్యాఖ్యలను కార్తిక్ తల్లి తిరస్కరించింది. ఇటీవలే తన కొడుకు లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నాడని, దొంగతనం చేయడానికి ఎటువంటి కారణం లేదని చెప్పింది. కార్తీక్‌ను ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్టు ఆరోపించారు. దీంతో, కార్తీక్ మృతి కేసులో మాజీ తృణమూల్ నాయకుడు బేబీ బౌరి, అమర్దీప్ బౌరిలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మిగిలిన ఇద్దరు నిందితులు సందీప్ బౌరి, జ్యోత్స్న బౌరి పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు. అరెస్టు చేసిన ఇద్దరినీ అసన్సోల్ కోర్టు ముందు హాజరుపరిచినట్టు వెల్లడించారు. -
కర్నూలు కావేరి బస్సు డ్రైవర్ లక్ష్మయ్య అరెస్ట్
కర్నూలులో వి కావేరి బస్సు ప్రమాదం కేసు డ్రైవర్ లక్ష్మయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు. బస్సు ప్రమాద కేసులో ఏ1గా ఉన్న మిరియాల లక్ష్మయ్య ఏ2 బస్సు యజమాని కోసం పోలీసుల గాలింపు.కర్నూలు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అర్హత లేకున్నప్పటికీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ప్రమాదం నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుటుంబ నేపథ్యం, ప్రవర్తన, అలవాట్లపై అధికారులు ఆరా తీశారు. ఈయన 5వ తరగతి వరకే చదువుకున్నాడని, అయితే టెన్త్ ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్ ఇచ్చి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని గుర్తించారు.మొదట లారీ క్లీనర్‌గా, తర్వాత డ్రైవర్‌గా పని చేశాడు. 2004లో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టుకు ఢీకొనడంతో అప్పట్లో లారీ క్లీనర్ మృతి చెందాడు. ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా మానేసి కొన్నాళ్లు ట్రాక్టర్ కొని స్వగ్రామంలో వ్యవసాయం చేశాడు. తర్వాత ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా ఏడెనిమిదేళ్ల నుంచి వెళ్తున్నాడని తెలిసింది. లక్ష్మయ్య తండ్రి రాములు రెండు నెలల కిందట మృతి చెందాడు. ఇతనికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె, ఒక సోదరుడు, ఇద్దరు అక్కలు ఉన్నారు. లక్ష్మయ్యకు అప్పుడప్పుడు మద్యం సేవించే అలవాటు ఉందని సమాచారం. -
Delhi: గొంతు కోసి.. సిలిండర్ పేల్చి.. యువతి చేతిలో ‘పార్ట్నర్’ హతం
న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో మరో దారుణం వెలుగుచూసింది. తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటన గాంధీ విహార్‌లో కలకలం రేపింది. ఇక్కడి ఒక ఫ్లాట్‌లో ఉంటున్న 32 ఏళ్ల యూపీఎస్సీ అభ్యర్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.కాలిపోయిన స్థితిలో..అతని మృతదేహం కాలిపోయిన స్థితిలో పోలీసులకు లభ్యమయ్యింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతుని లివ్ ఇన్ పార్ట్నర్తో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఫోరెన్సిక్ సైన్స్‌లో బీఎస్సీ చదువుతున్న 21 ఏళ్ల మహిళ, ఆమె మాజీ ప్రియుడు, వారి స్నేహితుడు ఉన్నారు. వీరంతా ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నివాసితులని పోలీసులు తెలిపారు. మృతునితో గతంలో సహజీవనం చేసిన ఒక యువతి తన ఇద్దరు పురుష స్నేహితులతో కలసి తన భాగస్వామిని హత్య చేసింది. ఆ తరువాత దానిని ప్రమాదవశాత్తూ జరిగినదిగా చూపించేందుకు అతని శరీరానికి నిప్పంటించారని పోలీసులు పేర్కొన్నారు.ఏసీ పేలిందంటూ ఫోన్..మృతుడిని రామ్కేష్ మీనాగా పోలీసులు గుర్తించారు. అతను గాంధీ విహార్‌లోని ఒక భవనంలోని నాల్గవ అంతస్తులో నివసిస్తున్నాడని తెలిపారు. అక్టోబర్ 6న, ఏసీ పేలుడు కారణంగా అతని ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసి, గది నుండి తీవ్రంగా కాలిపోయిన ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే అక్టోబర్ 5- 6 తేదీల మధ్యరాత్రిలో ముఖానికి ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఫ్లాట్‌లోకి ప్రవేశించారని, తెల్లవారుజామున 2.57 గంటల ప్రాంతంలో, ఒక మహిళతో పాటు వారంతా బయటకు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. వారు వెళ్లిన కొద్దిసేపటికే మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.అశ్లీల వీడియోలే కారణం?దర్యాప్తు సమయంలో నేరం జరిగిన ప్రదేశానికి సమీపంలో మహిళ ఉన్నట్లు చూపించే కాల్ వివరాల రికార్డులు పోలీసులలో అనుమానాన్ని రేకెత్తించాయి. మొరాదాబాద్‌లో అక్టోబర్ 18న ఆమెను అరెస్టు చేశారు. ఆమె నేరాన్ని అంగీకరించడంతో పాటు తనకు సహకరించిన ఇద్దరు సహచరుల పేర్లను వెల్లడించిందని పోలీసులు పేర్కొన్నారు. కాగా మృతుడు రామ్కేష్ మీనా తన అశ్లీల వీడియోలను రికార్డ్ చేశాడని, అయితే వాటిని తొలగించడానికి నిరాకరించాడని ఆ యువతి పోలీసుల విచారణలో తెలిపింది. అందుకే ఆమె రామ్కేష్ మీనా చంపాలని నిర్ణయించుకున్నదని పోలీసులు తెలిపారు.ఎల్పీజీ పంపిణీదారు సహకారంతో..నిందితులు ముగ్గురూ తొలుత రామ్కేష్ మీనా గొంతు కోసి హత్య చేశారు. తరువాత అతని శరీరంపై నూనె, నెయ్యి మద్యం పోశారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఎల్పీజీ పంపిణీదారుగా పనిచేసే ఆ యువతి మాజీ ప్రియుడు గ్యాస్ సిలిండర్ వాల్వ్ తెరిచి నిప్పంటించాడు. దీంతో పేలుడు సంభవించింది. ఆ తర్వాత వారు రామ్కేష్ మీనాకు సంబంధించిన కంప్యూటర్ హార్డ్ డిస్క్, ల్యాప్‌టాప్‌లు, ఇతర వస్తువులు తీసుకుని పారిపోయారు. కాగా నిందితుల నుండి పోలీసులు హార్డ్ డిస్క్, ట్రాలీ బ్యాగ్, మృతుని షర్టు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వర్గాలు తెలిపాయి.ఇది కూడా చదవండి: ‘ఇది సంస్థాగత హత్య’.. ‘మహారాష్ట్ర’ ఘటనపై రాహుల్ విమర్శలు -
మద్యం కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
ములకలచెరువు: నకిలీ మద్యం కేసులో ఇద్దరు నిందితులను అన్నమయ్య జిల్లా ములకలచెరువు ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం పెద్దపాళ్యం క్రాస్ వద్ద తనిఖీల సందర్భంగా రెండు కార్లలో వేగంగా వెళుతున్న ఏ 15 బాలాజీ, ఏ 20 సుదర్శన్‌ను ఎక్సైజ్ పోలీసులు అడ్డగించి పట్టుకున్నారు. తండ్రి, కుమారులైన వీరినుంచి 8స్మార్ట్ ఫోన్లు, 4 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుని ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించారు. ఈ కేసులో నిందితుడైన జనార్దన్‌రావు అతని స్నేహితులు ములకలచెరువులో మద్యం దుకాణాలు నడుపుతున్నారని, అక్కడ అక్రమ మద్యం తయారు చేయాలని 2025 ఏప్రిల్‌లో కోరినట్లు విచారణలో బాలాజీ వెల్లడించాడు. -
మరో సోషల్ మీడియా యాక్టివిస్టు అక్రమ అరెస్టు..
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామానికి చెందిన అంబోజి వినయ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నందుకు వినయ్‌పై కూటమి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పోలీసులు అంబోజి వినయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.వినయ్‌పై డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు.డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదుతో హైదరాబాద్‌లో ఉన్న వినయ్‌ను ఆదివారం తెల్లవారుజామున ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.వినయ్ అక్రమ అరెస్టును ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ , జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఖండించారు. వినయ్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
‘మహారాష్ట్ర డాక్టర్’ కేసులో కీలక పరిణామం
పుణే/సతారా: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మహిళా ప్రభుత్వ వైద్యురాలి ఆత్మహత్య కేసులో నిందితుడైన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బదానేను శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. అతని సహ నిందితుడు పట్టుబడిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఫల్తాన్ పోలీసుల బృందం పూణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్‌ను అరెస్టు చేసింది. వైద్యురాలు రాసిన సూసైడ్ నోట్లో పేర్కొన్న ఇద్దరు ఆరోపితులలో ప్రశాంత్ బంకర్ ఒకరు.సతారా ఎస్పీ తుషార్ దోషి తెలిపిన వివరాల ప్రకారం ఎస్ఐ బదానే ఫల్తాన్ గ్రామీణ పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. మరోవైపు బాధితురాలిని మానసికంగా వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రశాంత్ బంకర్‌ను సతారా జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనిని నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. మహారాష్ట్రలోని మరాఠ్వాడ పరిధిలోని బీడ్ జిల్లాకు చెందిన వైద్యురాలు గురువారం రాత్రి ఫల్తాన్ పట్టణంలోని ఒక హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలు తన అరచేతిపై రాసుకున్న సూసైడ్ నోట్లో, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ బదానే తనపై పలుమార్టు అత్యాచారం చేశాడని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన బంకర్ తనను మానసికంగా వేధించాడని ఆరోపించారు. ఈ నేపధ్యంలో వీరిద్దరిపై కేసు నమోదైంది.పోలీసుల కథనం ప్రకారం ప్రశాంత్ బంకర్.. ఆ వైద్యురాలు ఉంటున్న ఇంటి యజమాని కుమారుడు. కేసు దర్యాప్తులో సబ్-ఇన్స్పెక్టర్ బదానే పేరు బయటకు రాగానే ఉన్నతాధికారులు ఆయనను సర్వీసు నుండి సస్పెండ్ చేశారు. కాగా ఈ కేసులో నిందితులకు మరణశిక్ష విధించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఈ వేధింపులపై పలుమార్టు ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఆమె బంధువు మీడియా ముందు ఆరోపించారు. మహిళా వైద్యురాలిని వేధించిన ఎంపీని ఈ కేసులో నిందితునిగా చేర్చాలని బీజేపీ ఎమ్మెల్యే సురేష్ ధాస్ డిమాండ్ చేశారు. కాగా మృతురాలు తన ఎంబీబీఎస్ చదువు కోసం తీసుకున్న మూడు లక్షల రూపాయల రుణం ఇంకా తిరిగి చెల్లించలేదని ఆమె మామ మీడియాకు తెలిపారు.ఇది కూడా చదవండి: Singapore: విజిటర్‌ను వేధించిన భారత నర్సుకు జైలు -
ఎన్బీఏలో బెట్టింగ్ కలకలం
న్యూయార్క్: అమెరికాలో ఎప్పుడూ ఆటతోనే పతాక శీర్షికలకెక్కే నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) తాజాగా అవినీతి మకిలీతో పత్రికలకెక్కింది. ఇన్సైడ్ ఇన్ఫర్మెషన్ (జట్టు అంతర్గత సమాచారం) లీక్ చేసి బెట్టింగ్‌కు పాల్పడటం, మాఫియా కుటుంబాలతో కలిసి క్రీడా పందెంల రిగ్గింగ్, పోకర్ గేమ్‌ల అనుచిత కార్యకలాపాలు ఎన్బీఏకు మచ్చతెచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) పోర్ట్లాండ్ ట్రెయిల్ బ్లేజర్స్ జట్టు హెడ్ కోచ్ చౌన్సే బిలప్స్, మయామి హీట్ జట్టు ప్లేయర్ టెర్రీ రోజియెర్ సహా 30 మందికి పైగా అరెస్టు చేసింది. దీనిపై ముమ్మర దర్యాప్తు చేపట్టినట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కశ్యప్ పటేల్ వెల్లడించారు. భారత సంతతికి చెందిన కశ్యప్ ప్రమోద్ పటేల్ ఆధ్వర్యంలోనే ఈ కేసు విచారణ జరుగుతోంది. గత కొన్నేళ్లుగా భారీఎత్తున ఈ బెట్టింగ్ మాఫియా మిలియన్ డాలర్లను ఆర్జించినట్లు ఎఫ్‌బీఐ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పెద్ద ఎత్తున జరిగిన నేరపూరిత కుట్రలో ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఉన్న కోచ్ బిలప్స్ ఉండటం ఎన్బీఏ వర్గాలను విస్మయపరిచింది. అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఫిక్సింగ్ కార్యకలాపాల్లో బిలప్స్ హస్తముండగా, మయామి హీట్ ప్లేయర్ రోజియెర్ జట్టు గోప్యతకు భంగం కలిగేలా అంతర్గత సమాచారం లీక్ చేసి స్పాట్ బెట్టింగ్ తరహా మోసాలకు పాల్పడినట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కశ్యప్ తెలిపారు. బిలప్స్, రోజియెర్లవి రెండు వేర్వేరు కేసులు కాగా, ఈ రెండు కేసుల్లోనూ మాజీ ఎన్బీఏ సహాయ కోచ్, మాజీ ఆటగాడు డామన్ జోన్స్ నిందితుడని ఎఫ్‌బీఐ అధికారులు తెలిపారు. మరి ఎన్బీఏ ఏం చేసింది ఎన్బీఏ ప్రతిష్టకే మచ్చతెచ్చిన వ్యవహారంపై ఎన్‌బీఐ యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. రిగ్గింగ్, బెట్టింగ్, ఫిక్సింగ్ ఆరోపణల్లో అరెస్టయిన బిలప్స్, రోజియెర్, డామన్ జోన్స్లపై వేటు వేసింది. ఎన్బీఏ క్రీడా సమగ్రతను కాపాడేందుకు ఎఫ్‌బీఐ అధికారులు, పోలీసులు చేసే విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఎన్బీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. గతంలో 2007లో కూడా ఎన్‌బీఏను బెట్టింగ్ ఉదంతం ఉక్కిరిబిక్కిరి చేసింది. అప్పుడు రిఫరీ టిమ్ డొనగే మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లతో ఎన్బీఏకు మచ్చ తెచ్చారు. ఆ తర్వాత కూడా బ్రాడ్‌కాస్టింగ్ ఒప్పందంలో అనివీతి ఆరోపణలతో ఎన్‌బీఐ ప్రతిష్ట మసకబారింది. -
పెళ్లి పేరుతో మోసం : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సంగీత దర్శకుడు, సచిన్ సంఘ్వి (Sachin Sanghvi) పై లైంగిక ఆరోపణలు సంచలనం రేపాయి. మ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని నమ్మిం,ఇ వివాహం హామీ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.సచిన్-జిగర్ జంటలోని సంగీత దర్శకుడు, తమ్మా, స్త్రీ 2, భేదియా , జరా హట్కే, జరా బచ్కే వంటి చిత్రాలకు హిట్ పాటలతో పాపులర్ అయిన సంఘ్విని లైంగిక ఆరోపణల కింద అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. అయితే అనంతరం బెయిల్‌పై విడుదలైనారు. తన 20 ఏళ్ల వయస్సులో, ఫిబ్రవరి 2024లో సచిన్ సంఘ్వితో పరిచయం ఏర్పడిందని, అతను ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం పంపాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తనమ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారని, వారు ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తరువాత ఆమెను తన స్టూడియోకు పిలిపించి, పెళ్లి ప్రపోజ్ చేశాడని, తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ మహిళ ఆరోపించిందని పోలీసు అధికారి తెలిపారు. చదవండి: వైద్యురాలిపై పోలీసుల అఘాయిత్యం, అరచేతిలో సూసైడ్ నోట్ కలకలంఇది ఇలా ఉంటే ఈ కేసులో సచిన్ సంఘ్వి తరపున వాదిస్తున్న న్యాయవాది ఆదిత్య మిథే తన క్లయింట్‌పై ఉన్న అన్ని ఆరోపణలను ఖండించారు. సంఘ్వీ అరెస్ట్ చట్టవిరుద్ధం అన్నారు. ఈ విషయంపై సచిన్ ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అతని అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా @soulfulsachin ఇన్‌యాక్టివ్‌గా ఉంది. అటు జిగర్ కూడా ఈ విషయంపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.కాగా రష్మిక మందన్న , ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించి , దీపావళికి విడుదలైన థమ్మాకి సచిన్ అండ్ జిగర్ సంగీతం అందించారు. గత ఏడాది స్త్రీ 2 కోసం ఈ ద్వయం స్వర పర్చిన చేసిన "ఆజ్ కీ రాత్" బాగా హిట్అయిన సంగతి తెలిసిందే.చదవండి: కేరళలో పెళ్లి వైరల్ : ఎన్ఆర్ఐలకు పండగే! -
అమెరికాలో ట్రక్కు బీభత్సం.. భారతీయుడి అరెస్ట్
కాలిఫోర్నియా: అమెరికాలో ఓ భారతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు మృతికి కారణమయ్యాడంటూ జశన్‌ప్రీత్ సింగ్ (21) అనే యవకుడిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికా వార్తా కథనాల ప్రకారం.. అతడు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడని.. డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు వెల్లడైంది.2022 మార్చిలో సింగ్.. అమెరికా దక్షిణ సరిహద్దును అక్రమంగా దాటినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని బోర్డర్ పెట్రోల్(Border Patrol) ఏజెంట్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద చట్టబద్ధమైన ప్రతాలు లేవని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్’ విధానం కారణంగా కొన్ని రోజుల్లోనే అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.కాలిఫోర్నియాలో జరిగిన ట్రక్కు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో జశన్‌ప్రీత్ సింగ్ కూడా గాయపడ్డాడు. ట్రక్ నడుపుతోన్న సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్న అతడు.. ట్రాఫిక్‌లో కూడా బ్రేక్స్ వేయలేదని పోలీసు అధికారులు తెలిపారు. అక్రమ వలసదారులైన ట్రక్ డ్రైవర్లు అమెరికాలో ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనల్లో ఇది తాజాది. గత ఆగస్టులోనూ ఇదే తరహా ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 2018లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన హర్జిందర్ సింగ్ ఆ ఘటనకు కారకుడు. 🚨 SHOCKING: ICE sources confirm Jashanpreet Singh, the semi-truck driver behind the deadly DUI crash on CA’s I-10 freeway, is an Indian illegal alien caught & released by the Biden admin at the border in March 2022. Police say Singh was speeding, under the influence, and never… pic.twitter.com/bc1n5vEC9p— Svilen Georgiev (@siscostwo) October 23, 2025 -
టీడీపీ నేత అరాచకం బాలికపై లైంగిక దాడికి యత్నం
తుని రూరల్ : తాతయ్యా అని పిలిపించుకుంటూనే మనవరాలి వయసున్న 13 ఏళ్ల బాలికపై టీడీపీ నాయకుడు లైంగిక దాడికి యత్నించాడు. దీనిని అడ్డుకున్న యువకుడిపై ‘నేను కౌన్సిలర్‌ను. మేం ఎస్సీలం’ అంటూ బెదిరింపులకు దిగాడు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న స్థానికులు ఆ టీడీపీ నేతకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం శివారులో జరిగిన ఈ సంఘటన వివరాలివీ.. జగన్నాథగిరిలోని ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో తుని పట్టణానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది.తండ్రి లేడు. సెలవులకు తల్లి వద్దకు వెళ్లి, వస్తుంటుంది. అదే ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు (62) మంగళవారం 11 గంటలకు పాఠశాలకు వెళ్లి ఇంజక్షన్ చేయించాలని ఉపాధ్యాయులకు చెప్పి ఆ బాలికను తుని మండలం హంసవరం శివారున నిర్మానుష్యంగా ఉన్న తోటలోకి తీసుకెళ్లాడు. అదే సమయంలో కాపలాదారుడు తోటకు వచ్చాడు. బాలిక వస్త్రాలను నారాయణరావు విప్పడాన్ని గమనించి మందలించాడు.దీంతో.. ఆవేశం కట్టలు తెంచుకున్న నారాయణరావు ‘నేను ఎవరినో తెలుసా? కౌన్సిలర్‌ను. ఎస్సీలం. మాది వీరవరపుపేట’ అంటూ కాపలాదారుడిని బెదిరించాడు. వాస్తవానికి నారాయణరావుది కొండవారపేట అయినప్పటికీ, తప్పించుకునేందుకు వీరవరపుపేట అని తప్పుగా చెప్పాడు. ఈ విషయం పోలీసులకు తెలియజేస్తానని, తన తోటలోకి ఎందుకు వచ్చారంటూ నారాయణరావును, బాలికను ఆ కాపలాదారు నిలదీశాడు.బహిర్భూమికి వచ్చామని నమ్మబలికే ప్రయత్నం చేసూ్తనే నారాయణరావు బెదిరింపులకు దిగాడు. దీంతో, బాలికకు న్యాయంచేయాలనే ఉద్దేశంతో ఆమె కుటుంబ సభ్యులకు తెలిసున్న వ్యక్తుల ద్వారా కాపలాదారు సమాచారం అందించాడు. ఈలోపు బాలికను గురుకుల పాఠశాలలో దించి, నారాయణరావు కొండవారపేట వెళ్లిపోయాడు. అప్పటికే విషయం తెలియడంతో స్థానికులు నారాయణరావును మంగళవారం రాత్రి పటు్టకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.నాలుగైదుసార్లు ఇలాగే..తాతయ్యనంటూ చెప్పి, గతంలో నాలుగైదుసార్లు ఆ బాలికను నారాయణరావు బయటకు తీసుకువెళ్లినట్లు ఉపాధ్యాయులు చెప్పారు. తాజాగా, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐసీడీఎస్, పోలీస్, విద్యాశాఖ అధికారులు బుధవారం గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. బాలిక నుంచి వివరాలు సేకరించారు. గురుకుల పాఠశాల నుంచి తీసుకెళ్లినందుకు కిడ్నాప్ కేసు, లైంగిక దాడికి యత్నించడంపై పోక్సో చట్టం కింద నారాయణరావుపై కఠినమైన కేసులు నమోదుచేస్తున్నామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు, పెద్ద సంఖ్యలో దళిత సంఘాల నేతలు, యువకులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. బాలికకు న్యాయం చేయాలని, నిందితుడిని అరెస్టుచేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.విచారణకు మూడు బృందాలు..బాలికపై లైంగిక దాడికి యత్నించిన నారాయణరావును అరెస్టు చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు తెలిపారు. తల్లి అనుమతిలేకుండా పాఠశాల నుంచి తీసుకెళ్లడం, లైంగిక దాడికి యత్నించడం, తరచూ బాలికను బయటకు తీసుకెళ్లడంపై వేర్వేరుగా మూడు కఠినమైన కేసులు నమోదుచేశామని చెప్పారు. ఈ కేసులలో నిందితుడికి 30 ఏళ్లకు పైగా శిక్ష పడుతుందన్నారు. 15 రోజుల్లో చార్‌్జషీట్ దాఖలు చేస్తామన్నారు. విచారణకు ప్రత్యేక బృందాలను నియమించామని డీఎస్పీ తెలిపారు. -
టీడీపీ జోలికొస్తే.. జనసేన నేతలైనా వదిలేదెలే..
-
చైనాకు గూఢచర్యం?? .. భారత సంతతి అధికారి అరెస్ట్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా రక్షణ నిపుణుడు ఆష్లీ జె టెలిస్(Ashley Tellis) అరెస్ట్ అయ్యారు. అమెరికా రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక పత్రాలను అక్రమంగా కలిగి ఉన్నారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకుని అక్కడి అధికారులు విచారిస్తున్నారు. అదే సమయంలో.. చైనాకు గూఢచర్యం చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు జరుగుతుండడం గమనార్హం. Who Is Ashley Tellis.. ఆష్లీ జె టెలిస్ ముంబైలో జన్మించారు. బాంబే వర్సిటీ పరిధిలోని సెయింట్ జెవియర్స్ కాలేజీలో బీఏ, ఎంఏ చదివారు. తరువాత యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో పీహెచ్డీ పూర్తి చేశారు. అక్కడే అమెరికాలోని పలు ప్రభుత్వ విభాగాల్లో కీలక పదవుల్లో పని చేసి.. విదేశీ విధాన నిపుణుడిగా ఎదిగారు. ముఖ్యంగా.. అమెరికా విదేశాంగ శాఖలో సీనియర్ అడ్వైజర్‌గా పనిచేస్తూ.. అమెరికా-భారత్ అణు ఒప్పందంలో కీలక పాత్ర(US-India Civil Nuclear Agreement) పోషించారు. అంతేకాదు విదేశీ విధాన పరిశోధకుడిగా ఇరు దేశాల సంబంధాలపైనా ఆయన ఎన్నో రచనలు చేశారు. ప్రస్తుతం ఆయన కార్నెగీ ఎండౌమెంట్లో సీనియర్ ఫెలోగా పనిచేస్తున్నారు. అయితే..జాతీయ రక్షణ సమాచారంతో కూడిన డాక్యుమెంట్లను ఆయన అనుమతి లేకుండా తన వెంట తీసుకెళ్లారనే అభియోగం నమోదైంది. 18 యూఎస్సీ సెక్షన్ 793(ఈ) ప్రకారం.. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారంగా కేసు నమోదు అయింది. ప్రస్తుతం.. రహస్య ప్రాంతంలో టెలిస్ను విచారణ జరుపుతున్నారు. తూర్పు వర్జినీయా అటార్నీ ఆఫీస్ కార్యాలయం ఆయన అరెస్ట్, విచారణను ధృవీకరించింది.ఫెడరల్ అధికారులు ఏమన్నారంటే.. 64 ఏళ్ల వయసున్న టెలిస్.. దేశభద్రతకు సంబంధించిన గోప్యమైన పత్రాలను తన వెంట తీసుకెళ్లడం చట్ట ప్రకారం తీవ్ర నేరమే. తన సహ ఉద్యోగినిని రహస్య పత్రాలకు సంబంధించి ప్రింట్లు తనకివ్వమని ఆయన కోరారు. యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లోని సైనిక సామర్థ్యాలకు సంబంధించిన పత్రాలను ప్రింట్ చేశారు. అలాగే.. చైనా అధికారులతోనూ ఆయన సమావేశమైనట్లూ ఆధారాలు ఉన్నాయి. 2022తో పాటు 2023 ఏప్రిల్ 11న బీజింగ్ అధికారులతో జరిగిన విందులోను పాల్గొన్నారు. ఈ మధ్యే చైనా అధికారులు ఆయనకు ఓ కాస్ట్లీ బ్యాగును కూడా గిఫ్ట్‌గా అందించారు అని అన్నారు. అయితే చైనా అధికారులతో భేటీ .. అకడమిక్‌కు సంబంధించినదని ఆయన అసిస్టెంట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి.. గూఢచర్యం ఆరోపణలు ఇప్పటికైతే నిర్ధారణ కాలేదు. అలాంటి అభియోగాన్ని నమోదు చేయలేదు. అయితే కీలక పత్రాలకు సంబంధించిన నేరం రుజువైతే మాత్రం 10 సంవత్సరాల జైలు శిక్ష, $250,000(మన కరెన్సీలో రూ. 2 కోట్ల 21 లక్షల) జరిమానా విధించవచ్చు. కేసు విచారణ దశలో ఉన్నందున కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు దక్కే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏఐ గురించి గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు -
న్యాయం గెలిచింది!
సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌లో ఎట్టకేలకు న్యాయమే గెలిచింది. కూటమి ప్రభుత్వానికి కోర్టు తీర్పు చెంపపెట్టులా మారింది. పోలీసులను అడ్డుపెట్టుకుని సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలను యావత్ ప్రజానీకం తప్పుపడుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడం ప్రజాస్వామ్యంలో సరికాదని సూచిస్తోంది. సంక్షేమం విస్మరించి వేధింపులకు దిగడం పద్ధతి కాదని స్పష్టం చేస్తోంది. సర్కారు విధానాలను ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్క పౌరుడికీ ఉంటుందని వెల్లడిస్తోంది.సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టును తిరుపతి మూడో అదనపు జూనియర్ జడ్జి తిరస్కరించారు. 41 నోటీసులు సరిపోతాయని వెల్లడించారు. న్యాయస్థానం తీర్పుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వైఖరిపై తిరుపతి వాసులు మండిపడుతున్నారు. అధికారాన్ని ఉపయోగించి సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 41 నోటీసులు ఇచ్చి విడిచి పెట్టాల్సిన కేసులో సోషల్ మీడియా కార్యకర్తలు నవీన్, చంద్రశేఖర వెంకటేష్‌ని టెర్రరిస్ట్‌లను అరెస్ట్ చేసినట్టు ముసుగులేసి, రోడ్లపై నడిపిస్తూ కోర్టులో హాజరుపరచంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వారిద్దరి రిమాండ్‌ను న్యాయస్థానం మంగళవారం రాత్రి తిరస్కరించింది. అణగదొక్కడం సరికాదు ప్రభుత్వ విధానాలు సక్రమంగా లేకుంటే ప్రతిపక్ష పార్టీ ఎండగడితేనే ప్రజలకు మేలు జరుగుతుందని పలువురు స్పష్టం చేస్తున్నారు. విమర్శలను పాలకులు సానుకూలంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలా కాకుండా తప్పులను ఎత్తి చూపిన వారిని కేసులతో వేధించడం, ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కేందుకు యతి్నంచడం సరికాదని వెల్లడిస్తున్నారు. బెల్ట్ షాపులను అరికట్టడం వదలేసి ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వ్యక్తిగత పూచీ కత్తుపై విడుదల తిరుపతి లీగల్: తిరుపతి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా నాయకుడు బృంగి నవీన్ అలియాస్ నాని, తిరుపతి, ఎంఆర్ పల్లి, శాంతినగర్‌కు చెందిన సి.వెంకటేష్ పై ఈస్ట్ పోలీసులు నమోదు చేసిన కేసులో వ్యక్తిగత పూచీ కత్తుపై ఇద్దరినీ విడుదల చేస్తూ తిరుపతి మూడవ అదనపు జూనియర్ జడ్జి సంధ్యారాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు యుగంధర్ రెడ్డి, కొత్తపల్లి విజయ్‌కుమార్, ఐ.చంద్రశేఖర్ రెడ్డిలు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వు ప్రకారం ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో 41 ఏ నోటీసు ఇవ్వాలని తీర్పు ఉండగా పోలీసులు రిమాండ్‌కు తీసుకురావడం చట్టవిరుద్ధమన్నారు. వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అసలేం జరిగిందంటే! తిరుపతిలో మద్యం ఏరులై పారుతోంది. మద్యం సేవించిన కొందరు రోడ్డుపై పడి ఉండడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలు వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి చెందిన నవీన్, చంద్రశేఖర్ వెంకటేష్ వైరల్ చేశారని కూటమి నేతలు ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి చేశారు. కూటమి నేతల ఒత్తిడితో సోమవారం వారిద్దరిపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం రాత్రి రిమాండ్‌కు తరలించారు. రిమాండ్‌ను సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. దీంతో రిమాండ్‌ను తిరస్కరిస్తూ మూడో అదనపు జూనియర్ జడ్జి తీర్పు ఇచ్చారు.రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిరంకుశంగా రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే తిరుపతిలో ప్రతిపక్ష పార్టీ నేతలను వేధిస్తున్నారని, అక్రమంగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారని వెల్లడిస్తున్నారు. పోలీసులు సైతం కూటమి నేతల కళ్లలో ఆనందం చూసేందుకు ౖవైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా సభ్యులు బృంగి నవీన్, చంద్రశేఖర్ వెంకటే‹Ùను అదుపులోకి అవమానించారని వివరిస్తున్నారు. ఐటీ కేసులో అరెస్ట్ చేసిన వ్యక్తిని టెర్రరిస్టు మాదిరిగా ముసుగు వేసి మీడియా ముందు హాజరుపరిచారని విమర్శిస్తున్నారు. -
గ్యాంగ్ రేప్ కేసు.. స్నేహితుడి పనే?! అరెస్ట్
తీవ్ర చర్చనీయాంశమైన దుర్గాపూర్ గ్యాంగ్‌రేప్ ఉదంతం కొత్త మలుపు తీసుకుంది. తనను ఐదుగురు గ్యాంగ్‌రేప్ చేశారని బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో షేక్ సఫీఖుల్, షేక్ నసీరుద్దీన్, అబూ బౌరీ, ఫిర్దౌస్ షేక్, షేక్ రియాజుద్దీన్‌లను అరెస్ట్‌చేసిన పోలీసులు తాజాగా బాధితురాలి స్నేహితుడిని అరెస్ట్ చేశారు. దుర్గాపూర్/కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో తీవ్ర చర్చనీయాంశమైన దుర్గాపూర్ గ్యాంగ్‌రేప్ ఉదంతం(Durgapur Gang Rape Case) కొత్త మలుపు తీసుకుంది. తనను ఐదుగురు గ్యాంగ్‌రేప్ చేశారని బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో షేక్ సఫీఖుల్, షేక్ నసీరుద్దీన్, అబూ బౌరీ, ఫిర్దౌస్ షేక్, షేక్ రియాజుద్దీన్‌లను అరెస్ట్‌చేసిన పోలీసులు తాజాగా బాధితురాలి స్నేహితుడిని అరెస్ట్‌చేశారు. ఘటన జరిగిన తీరుపై బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలానికి, స్నేహితుడు ఇచ్చిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో అతడిని మంగళవారం సాయంత్రం బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని(No Gang Rape), క్లాస్మేట్ అయిన ఈ స్నేహితుడు మాత్రమే రేప్ చేశాడని ప్రాథమిక అంచనాకు వచ్చామని పోలీసులు చెప్పారు. నిందితులందరి దుస్తులు, ఘటనాస్థలిలో లభించిన ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించామని నివేదిక వచ్చాకే కేసులో స్పష్టత వస్తుందని అసన్సోల్–దుర్గాపూర్ పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ చౌద్రీ చెప్పారు. చౌద్రీ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఘటన జరిగిన రోజు గంటన్నర ఆలస్యంగా తమ కూతురి స్నేహితుడు తమకు సమాచారం ఇచ్చాడని, అతనిపైనా తమకు అనుమానం ఉందని బాధితు రాలి తండ్రి అక్టోబర్ 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చివరకు ఆ స్నేహితుడు సైతం అరెస్ట్‌కావడం గమనార్హం. దుర్గాపూర్ పట్ణణ శివారులోని ప్రైవేట్ ఎంబీబీఎస్ కళాశాల హాస్టల్ నుంచి దూరంగా ఉన్న ధాబాలో భోజనం చేసేందుకు ఈ స్నేహితుడే బాధితురాలిని బయటకు తీసుకెళ్లగా గ్యాంగ్‌రేప్ జరిగిందని కేసు నమోద వడం తెల్సిందే. డిప్యూటీ పోలీస్ కమిషనర్ అభిషేక్ గుప్తా సారథ్యంలోని బృందం సీన్ రీక్రియేషన్ కోసం ఐదుగురు నిందితులను మంగళవారం మధ్యాహ్నం ఘటనాస్థలికి తీసుకెళ్లి ప్రశ్నించింది. ఈ మొత్తం ప్రక్రియను వీడియోలో చిత్రించారు. ఈ సందర్భంగా ఐదుగురు నిందితులు విడివిడిగా చెప్పిన సమాధానాలకు పొంతన కుదరలేదు. దీనికితోడు బాధితురాలు ముగ్గురిలో కేవలం ఒక్కరే రేప్ చేశారని తొలుత వాంగ్మూలం ఇవ్వడం, తర్వాత ఐదుగురు రేప్ చేశారని మరోలా వాంగ్మూలం ఇవ్వడం, స్నేహితుడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానంతో ఆ స్నేహితుడిని అరెస్ట్చేశామని కమిషనర్ చెప్పారు. ‘‘బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలాలు, లభించిన ఆధారాలు, నిందితుల స్టేట్మెంట్లను గమనిస్తే ఇది గ్యాంగ్‌రేప్ కాదని అర్థమవుతోంది. ఒక్కరు మాత్రమే అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలుస్తోంది’’ అని కమిషనర్ వ్యాఖ్యానించారు.వాంగ్మూలాలకు, సీసీటీవీ ఫుటేజీకి కుదరని లంకెనిందితులు, బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలా లకు, సీసీటీవీలో ఉన్న దృశ్యాలకు సైతం పొంతన కుదరకపోవడం ఈ కేసులో సంక్లిష్టతను మరింత పెంచుతోంది. ఐదుగురు నిందితులు తనను లాక్కెళ్లినప్పుడు స్నేహితుడు పారిపో యాడని బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది. కానీ బాధితురాలు, స్నేహితుడు అసలేం జరగనట్లు, ముఖాల్లో ఎలాంటి ఆందోళన, బాధ లేకుండా హాస్టల్‌కు తిరిగొచ్చినట్లు ఘటన తర్వాత హాస్టల్ గేటు దగ్గరి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. రేప్ వేళ పెనుగులాటలో బాధితురాలి దుస్తులు చిరిగిపోవడమో, జుట్టు చిందరవందరగా ఉండటమో లాంటివి లేకుండా బాధితురాలు ఆ వీడియోలో మా మూలుగానే కనిపించింది. తనకు హాని జరిగిందని బాధితురాలు హాస్టల్ గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఫిర్యాదుచేసినట్లు ఫుటేజీలో కనిపించలేదు. వాళ్ల సాయం కోరిన ట్లుగా కూడా లేదు. ‘‘ఘటన తర్వాత బాధితు రాలి ఫోన్ నుంచి స్నేహితునికి ఆగంతకులు ఫోన్ చేసి రమ్మన్నారు. ఫోన్ తిరిగి ఇవ్వాలంటే రూ.3,000 ఇవ్వాలని బాధితురాలిని డిమాండ్‌చేశారు. ఆమె వద్ద ఉన్న రూ. 200 లాగేసుకున్నారు’’ అని కమిషనర్ వెల్లడించారు. ఇదీ చదవండి: బస్సులో.. క్షణాల్లోనే కాలి బుగ్గైన 20 మంది -
నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అరెస్ట్
మదనపల్లె: అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేసులో ఎక్సైజ్ పోలీసులు శనివారం మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అయిన ములకలచెరువు నల్లగుట్టకు చెందిన సయ్యద్ కలీం అష్రఫ్ (23)ను అరెస్ట్ చేసి తంబళ్లపల్లె తహసీల్దార్ శ్రీనివాసులు ఎదుట హాజరుపరచగా, ఏడు రోజులు రిమాండ్ విధించారు. అనంతరం నిందితుడిని మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు.తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డికి చెందిన స్కారి్పయో వాహనంలో సయ్యద్ కలీం అష్రఫ్ నకిలీ మద్యాన్ని బెల్టుషాపులకు సరఫరా చేసినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ నకిలీ మద్యం కేసులో 23 మందిని నిందితులుగా పేర్కొనగా, ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేశారు. కాగా, అరెస్ట్ చేసిన నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం కోర్టులో విచారణ జరగనుంది. నకిలీ మద్యం కేసులో అద్దేపల్లి జనార్దన్‌కు రిమాండ్రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడిగాందీనగర్ (విజయవాడసెంట్రల్): నకిలీ మద్యం కేసులో ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దన్‌కు ఈనెల 17వరకు విజయవాడలోని 6వ ఏజేఎం ఫస్ట్ క్లాస్ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న అద్దేపల్లిని శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సాయంత్రం జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ నుంచి కోర్టుకు, ఆ తర్వాత న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లి ఆయన ముందు హాజరు పరిచారు. కోర్డు రిమాండ్ విధించడంతో అద్దేపల్లి జనార్దన్‌ను నెల్లూరు జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు జనార్దన్ రిమాండ్ రిపోర్టులో తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. ఆయనతోపాటు కట్టా సురేంద్ర నాయుడుతో తనకు లిక్కర్ వ్యాపారంలో సంబంధాలు ఉన్నట్లు అంగీకరించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరూ అధిక సంఖ్యలో వైన్‌షాపులు దక్కించుకున్నారని పేర్కొంటూ, రాజకీయ పలుకుబడి ఉన్నప్పటికీ వ్యాపార అనుభవం లేని కారణంగా నష్టాలు రావడంతో తనను సంప్రదించారని తెలిపాడు. వీరికి చెందిన ములకలచెరువులోని రాక్ స్టార్ వైన్స్, చంద్రాయునిపల్లిలోని ఆంధ్రవైన్స్ తానే నిర్వహించినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. 2025 మే, జూన్ నెలల నుంచి ములకలచెరువులో అద్దేపల్లి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.అదే సమయంలో ఇబ్రహీంపట్నంలోనూ నకిలీ మద్యం తయారు చేసి ఏఎన్నార్ బార్‌తోపాటు శ్రీనివాస వైన్స్‌లో విక్రయించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం నకిలీ మద్యం తయారీకి కావాల్సిన స్పిరిట్, హీల్స్ బాలాజీ సరఫరా చేసేవాడని, అలాగే లేబుల్స్, బ్రాండ్ స్టిక్కర్స్ రవి సరఫరా చేసినట్లు ఎక్సైజ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. హైదరాబాద్‌లో ఈ–7 అనే బార్లో పార్టనర్‌గా చేరి అక్కడ చీప్ లిక్కర్‌ను ఇబ్రహీంపట్నం తీసుకొని వచ్చి అమ్మకాలు జరిపాడు. బిజినెస్ పార్టనర్స్‌తో గోవా వెళ్లి.. అప్పటికే లిక్కర్ బిజినెస్‌లో ఉన్న బాలాజీతో చేతులు కలిపి అతని ద్వారా నకిలీ మద్యం తయారీకి అవసరమైన స్పిరిట్, హీల్స్, క్యాప్‌లు, క్యారేమిల్, ఎసెన్స్ తీసుకొని వచ్చి, తయారీ తర్వాత బార్లో విక్రయించాడు.నకిలీ మద్యం తయారీకి ముంబై, బెంగళూరు, ఢిల్లీ నుంచి ఐషర్ వాహనాల్లో ఇబ్రహీంపట్నంకు స్పిరిట్‌ను తరలించేవారు. అలా వచ్చిన మెటీరియల్‌ను ఉపయోగించి తన సోదరుడు జగన్మోహన్రావుతో కలిసి జనార్దన్ నకిలీ మద్యం తయారు చేసి విక్రయించినట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. జయచంద్రారెడ్డి ఎన్నికల అఫిడవిట్లో లిక్కర్ వ్యాపారం ఉన్న ట్లు గుర్తించారు. ఈ కేసు నుంచి ఆయనను తప్పించేందుకు ముఖ్యనేత యత్నించడం గమనార్హం. -
అనిల్ అంబానీ సహయకుడి అరెస్ట్
అనిల్ అంబానీ సహాయకుడు.. రిలయన్స్ పవర్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) అయిన 'అశోక్ కుమార్ పాల్'ను ఫేక్ బ్యాంక్ గ్యారెంటీ కేసుకు సంబంధించి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌కు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై ఈడీ తన దర్యాప్తును విస్తృతం చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.రిలయన్స్ పవర్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్న అశోక్ పాల్‌కు.. రూ. 68.2 కోట్ల విలువైన నకిలీ బ్యాంక్ గ్యారెంటీలకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపైనే ఆయనను ఢిల్లీ కార్యాలయంలో ప్రశ్నించిన ఈడీ.. గురువారం రాత్రి అరెస్టు చేసినట్లు, శనివారం కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్ కోరనున్నట్లు సమాచారం.చార్టర్డ్ అకౌంటెంట్ అయిన పాల్.. 2023 జనవరి 29న కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా నియమితులయ్యారు. ఆయనకు సుమారు ఏడు సంవత్సరాలకు పైగా రిలయన్స్ పవర్‌తో అనుబంధం ఉంది. అయితే భువనేశ్వర్, కోల్‌కతాతో సహా పలు ప్రాంతాల్లో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ సోదాలు ప్రారంభించిన చాలా రోజుల తరువాత ఈ అరెస్టు చేయడం జరిగింది.ఏమిటి ఈడీ కేసురిలయన్స్ పవర్‌తో పాటు.. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలపైన రూ. 17వేల కోట్ల బ్యాంకు లోన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే అనిల్ అంబానీ ఈడీ ముందు హాజరయ్యారు. ఇందులో భాగంగానే ఆగస్టులో ముంబైలోని 35 ప్రదేశాలలో సోదాలు నిర్వహించిన తర్వాత ED దర్యాప్తు చేపట్టింది. అక్రమ నగదు బదిలీ నిరోధక చట్టం.. కింద 50 కంపెనీలు, గ్రూప్‌తో సంబంధం ఉన్న 25 మంది వ్యక్తులను కవర్ చేసింది. తాజాగా సీఎఫ్ఓ అరెస్ట్ కేసులో మరింత కీలకంగా మారిందని తెలుస్తోంది.ఇదీ చదవండి: అరట్టై ప్రైవసీపై సందేహం: శ్రీధర్ వెంబు రిప్లై ఇలా.. -
Rajasthan: పాక్‌కు రహస్యాల చేరవేత.. యువకుడి అరెస్ట్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) తరపున గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో అల్వార్‌లోని గోవింద్గఢ్ నివాసి మంగత్ సింగ్‌ను రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. రాజస్థాన్ పోలీసుల సీఐడీ ఇంటెలిజెన్స్ దర్యాప్తు అనంతరం మంగత్ సింగ్‌ను అధికారిక రహస్యాల చట్టం కింద అరెస్టు చేశారు.సీఐడీ అధికారులు అల్వార్ కంటోన్మెంట్ ప్రాంతంలో నిఘా సారించినప్పుడు మంగత్ సింగ్ కార్యకలాపాలను గుర్తించారు. సింగ్ కొంతకాలంగా అనుమానాస్పద చర్యలకు పాల్పడుతున్నాడని అధికారులు గమనించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగ్ పాకిస్తాన్ నిఘా సంస్థకు చెందిన హ్యాండ్లర్లతో తరచూ సంప్రదింపులు జరుపుతున్నాడని దర్యాప్తులో తేలింది. ఇషా శర్మ అనే మారుపేరుతో పనిచేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన ఒక మహిళా హ్యాండ్లర్ సింగ్‌ను హనీ-ట్రాప్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గూఢచర్య కార్యకలాపాలలో సహకరించినందుకు ప్రతిగా ఆ హ్యాండ్లర్.. సింగ్‌కు ఆర్థికసాయం అందించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో సింగ్ భారతదేశ జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు అందజేసినట్లు తెలుస్తోంది.సింగ్ గత రెండేళ్లుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్నాడని, గూఢచర్య కార్యకలాపాలలో అతని ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. మంగత్ సింగ్ అరెస్టు ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా జరిగింది. రాజస్థాన్ ఇంటెలిజెన్స్ ఈ ప్రాంతంలో నిఘా సారించింది. కంటోన్మెంట్ ప్రాంతంలో అనుమానాస్పద కార్యకలాపాలపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గూఢచర్యాన్ని అరికట్టేందుకు, భారతదేశ జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఈ అరెస్టు జరిగిందని పోలీసులు తెలిపారు.గూఢచర్య కార్యకలాపాలలో పాల్గొన్నవారిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు అక్టోబర్ 10న జైసల్మేర్‌లో అనుమానిత గూఢచారి మహేంద్ర ప్రసాద్(32)ను అరెస్టు చేశారు. అతను డీఆర్డీఓ గెస్ట్‌హౌస్ మేనేజర్‌గా పనిచేస్తూ, సున్నితమైన రక్షణ సంబంధిత సమాచారాన్ని పాక్‌కు లీక్ చేశాడని తేలింది. 32 ఏళ్ల ప్రసాద్ పాకిస్తాన్ నిఘా నిర్వాహకునితో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదేవిధంగా జైసల్మేర్‌కు చెందిన హనీఫ్ ఖాన్‌ను ఐఎస్ఐ కార్యకర్తలకు రహస్య సైనిక సమాచారాన్ని చేరవేస్తున్నాడనే ఆరోపణలతో ఇటీవల అరెస్టు చేశారు. -
Fake Liquor Case: నువ్వు వెళ్లి లొంగిపో.. నేను చూసుకుంటా..!
-
లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు అరెస్ట్
-
కల్తీ దగ్గు మందు కేసులో కీలక పరిణామం
చెన్నై: కల్తీ దగ్గు మందు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 మంది చిన్నారుల మరణాలకు కారణంగా భావిస్తున్న కోల్డ్రిఫ్ సిరప్ తయారు చేసిన శ్రేసన్ ఫార్మాసూటికల్స్ కంపెనీ యాజమాని జి.రంగనాథన్(73)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జి. రంగనాథన్(G Ranganathan) మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి ఫార్మసీ గ్రాడ్యుయేట్. గత 40 ఏళ్లుగా ఔషధ తయారీ రంగంలో ఉన్నారు. 80వ దశకంలో ప్రోనిట్(Pronit) అనే పోషక సిరప్‌ను తయారు చేసి చెన్నైలో ప్రసిద్ధి పొందారు. ఆ తర్వాత లిక్విడ్ నాసల్ ప్రొడక్ట్స్(ముక్కు డ్రాప్స్), చిన్న స్థాయి తయారీ యూనిట్లను చెన్నై పరిసరాల్లో స్థాపించారు. శ్రేసన్తో పాటు సీగో ల్యాబస్, ఇవెన్ హెల్త్‌కేర్ సంస్థలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా పలు ఔషధ సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. ఎందరో యువ పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశకుడిగా నిలిచారు కూడా. అయితే మధ్యప్రదేశ్ చిన్నారుల మరణాల నేపథ్యంలో.. శ్రేసన్ సంస్థపై కేసు నమోదు అయ్యింది. కోడంబాక్కంలోని రంగనాథన్ కార్యాలయాన్ని సైతం అధికారులు సీజ్ చేశారు. ఆయన అరెస్టును పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. ఇదిలా ఉంటే..తమిళనాడు కాంచీపురం శ్రేసన్ ఫార్మాసూటికల్స్ యూనిట్ నుంచి మే నెలలో కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ (Cough Syrup) బ్యాచ్‌ను పలు రాష్ట్రాలకు పంపింది. ఈ క్రమంలో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య కాలంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కలిపి 20 మంది చిన్నారులు మరణించారు. ఈ నేపథ్యంలో కోల్డ్రిఫ్ను నిషేధించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. మరణాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఏర్పాటు చేసింది. పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. అయితే.. కోల్డ్రిఫ్లో డైఈథిలీన్ గ్లైకాల్ (DEG) అనే పదార్థం మోతాదుకు మించి(500 రేట్లు) 48.6% స్థాయిలో ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఇదే పిల్లల్లో కిడ్నీలను కరాబు చేసి.. వాళ్ల మరణాలకు దారి తీసింది. తమిళనాడు ప్రభుత్వ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్ట్మెంట్ తనిఖీల అనంతరం తీవ్ర ఉల్లంఘనలను గుర్తించి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న శ్రేసన్ యూనిట్‌ను మూసేసింది. 2011లో ఏర్పాటైన ఈ యూనిట్.. ఆ తర్వాతి కాలంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోలేదు. అలాగే అక్కడి అపరిశ్రుభ వాతావరణం, నిబంధనలకు పాటించకుండా కెమికల్స్ కొనుగోలు నేపథ్యంతో ఉత్పత్తి లైసెన్స్‌నూ రద్దు చేసింది. ఈ క్రమంలో క్రిమినల్ కేసు నమోదైనట్లు సమాచారం.ఇదీ చదవండి: కోల్డ్రిఫ్.. తయారీ.. యాక్ ఛీ! -
జుబీన్ గార్గ్ మృతిలో మరో ట్విస్ట్ : డీఎస్పీ అరెస్ట్
ప్రఖ్యాత అసోం గాయకుడు జుబీన్ గార్గ్ అకాలమరణం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తొలుత స్కూబా డైవింగ్ ప్రమదంలో చనిపోయాడని భావించిన ఈ కేసులో ఆ తర్వాత అనేక అనుమానాలు తలెత్తాయి. విషప్రయోగం కారణంగా చనిపోయాడని మరోవార్త వెలుగులోకి వచ్చింది. దీంతో జుబీన్గార్గ్కు సంబంధించిన వారిని అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు. తాజాగా జుబీన్ మరణానికి ఆయన సమీప బంధువు, పోలీసు అధికారిని అరెస్ట్ చేశారు.ఈ కేసుకు సంబంధించి గతంలో అరెస్టయిన మరో నలుగురు ఇప్పటికేఈ పోలీసు కస్టడీలో ఉన్నారు. గత నెలలో సింగపూర్‌లో జుబీన్మరణానికి సంబంధించి జుబీన్ గార్గ్ బంధువు , అస్సాం పోలీసు DSP సందీపన్ గార్గ్‌ను బుధవారం అరెస్టు చేసినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ కేసులో ఇది ఐదో అరెస్టు.VIDEO | Guwahati: Zubeen Garg's cousin and Assam Police DSP Sandipan Garg arrested in connection with singer's death.#ZubeenGarg #AssamNews(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/BdAfazODSz— Press Trust of India (@PTI_News) October 8, 2025గత నెలలో సింగపూర్‌లో గాయకుడి మరణంపై పట్టుబడిన పోలీసు అధికారిని గత కొన్ని రోజులుగా అనేకసార్లు విచారించారు. ఈ సంఘటనలో డిప్యూటీ ఎస్పీ, సందీపన్ గార్గ్ అతనితో ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. సందీపన్ రిమాండ్ కోరుతామని మరొక సీనియర్ అధికారి తెలిపారు. కాగా ఈ కేసులో నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్కాను మహంత, గాయకుడి మేనేజర్ సిద్ధార్థ్ శర్మతో పాటు, ఇద్దరు బ్యాండ్ సభ్యులు శేఖర్ జ్యోతి గోస్వామి ,అమృత్ ప్రభా మహంతాలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
‘రష్యా.. పచ్చి అబద్ధం’: ఉక్రెయిన్ అదుపులో భారతీయుడు!?
ఉక్రెయిన్ సైన్యం సంచలన ప్రకటన చేసింది. రష్యా తరపున పోరాడుతున్న ఓ సైనికుడ్ని అదుపులోకి తీసుకున్నామని, అయితే అతను భారతీయుడని తెలిపింది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ధృవీకరించాల్సి ఉంది(Is Indian Captured By Ukraine Army). ది కీవ్ ఇండిపెండెంట్ కథనం ప్రకారం.. పట్టుబడిన యువకుడి పేరు మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్(22). స్వస్థలం గుజరాత్ మోర్బీ. ఉన్నత విద్య కోసం రష్యాకు వెళ్లి.. ఇప్పుడు యుద్ధ సైనికుడిగా ఉక్రెయిన్‌కు పట్టుబడ్డాడు. ఈ మేరకు అతని స్టేట్మెంట్తో సదరు మీడియా సంస్థ ఓ వీడియో విడుదల చేసింది. ఉన్నత విద్య కోసం రష్యా వెళ్లిన మజోత్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడట. ఏడేళ్ల శిక్ష పడడంతో జైలు జీవితం అనుభవిస్తున్నాడట. అయితే.. యుద్ధంలో పోరాడితే శిక్షా కాలం తగ్గిస్తామని, ఆర్థికంగా కూడా సాయం అందిస్తామని మజోత్కు రష్యా అధికారులు ఆఫర్ చేశారట. జైల్లో ఉండడం ఇష్టం లేక అందుకు అంగీకరించానని, అయితే ఆ ఒప్పందంపై సంతకం చేసింది అక్కడి నుంచి బయటపడేందుకేనని ఆ యువకుడు వీడియోలో చెప్పాడు. రష్యాలో అంతా పచ్చి అబద్ధం. నాకు ఆర్థిక సాయం అందలేదు. తగ్గిస్తామని అధికారులు చెప్పడం, జైల్లో ఉండడం ఇష్టం లేకనే ఆ ఒప్పందం కుదుర్చుకుని రష్యా తరఫున స్పెషల్ మిలిటరీ ఆపరేషన్(Special Military Operation)లో పాల్గొన్నానంటూ అతను చెప్పడం ఆ వీడియోలో ఉంది. ఉక్రెయిన్ స్థావరాన్ని చూడగానే తాను తన రైఫిల్‌ను పక్కన పెట్టి సాయం కోసం అర్థించానని చెప్పాడతను. తనకు రష్యాకు తిరిగి వెళ్లడం ఇష్టం లేదని.. రష్యా జైల్లో మగిపోవడం కంటే ఇక్కడ ఉక్రెయిన్ జైల్లో శిక్ష అనుభవించడం ఎంతో నయంగా భావిస్తున్నట్లు చెప్పాడతను. Ukraine's military says they have captured an Indian national who was fighting alongside Russian forces.Majoti Sahil Mohamed Hussein is a 22-year-old student from Morbi, Gujarat, India & came to Russia to study at a university pic.twitter.com/Kzi5F4EDR4— Sidhant Sibal (@sidhant) October 7, 2025మరోవైపు ఈ కథనం తమ దృష్టికీ వచ్చిందని, అయితే ఉక్రెయిన్ నుంచి అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని భారత విదేశాంగ చెబుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన రష్యా.. ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దురాక్రమణను మొదలుపెట్టింది. అయితే ఈ యుద్ధంలో ఇతర దేశాల యువకులకు గాలం వేసి రష్యా సైన్యం ఉపయోగించుకుంటోందని.. ఉత్తర కొరియా, భారత్.. ఇలా పలు దేశాలకు చెందిన యువకులకు ఉద్యోగాలు, ఆర్థిక సాయం ఆఫర్ చేస్తుందనే విమర్శ తొలి నుంచి వినిపిస్తోంది. ఉక్రెయిన్ సైన్యం ఇప్పటికే 48 దేశాలకు చెందిన 1,500 మందికి పైగా విదేశీయులను పట్టుకున్నట్లు(Foreigners Caught in Ukraine War) నివేదికలు చెబుతున్నాయి.ఇదిలా ఉంటే.. ఈ యుద్ధంలో భారతీయులు చిక్కుకుపోవడం పట్ల భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం అవుతోంది. రష్యాలో ఉన్న భారతీయుల్లో 126 మందిని ఉక్రెయిన్ యుద్ధంలో దించారని, అందులో 12 మంది మరణించగా.. మరో 16 మంది ఆచూకీ లేకుండా పోయారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. ఇదే విషయాన్ని మాస్కో వర్గాల దృష్టికి తీసుకెళ్లిన భారత్.. ఈ యుద్దంలో చిక్కుకున్న తన పౌరులకు విముక్తి కల్పించాలని కోరింది కూడా. ప్రధాని మోదీ సైతం జోక్యం చేసుకున్న నేపథ్యంలో 96 మందిని రష్యా విడుదల చేసింది. అయితే ఇలాంటి నియామకాలు ఆపేసినట్లు రష్యా చెబుతున్నప్పటికీ.. ఆ నియామకాలు మాత్రం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ట్రంప్ సుంకాలపై గీతా గోపినాథ్ షాకింగ్ రియాక్షన్ -
పెర్ఫ్యూమ్ తెచ్చిన తంటా....తీవ్ర ఆందోళనలో ఎన్ఆర్ఐ ఫ్యామిలీ
ఒక చిన్న పొరపాటుతో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఇబ్బందులు పాలయ్యాడు. అమెరికాలోని బెంటన్లో తన అమెరికన్ భార్యతో నివసిస్తున్న కపిల్ రఘును పెర్ఫ్యూమ్ బాటిల్ కారణంగా అర్కాన్సాస్లో అరెస్ట్ చేశారు. వీసాను రద్దు చేశారు. దీంతో అతని దేశ బహిష్కరణ తప్పదేమో అనే ఆందోళనలో కుటుంబం ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి.ఫుడ్ డెలివరీ డ్రైవర్‌గా పనిచేసే రఘు అనే 32 ఏళ్ల వ్యక్తిని మే 3న బెంటన్ పోలీసులు చిన్న ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా చేసిన తనిఖీల్లో దొరికిన పెర్ఫ్యూమ్ బాటిల్ పెద్ద దుమారాన్నే రేపింది. రఘు కారు సెంటర్ కన్సోల్‌లో "ఓపియం" (నల్లమందు) అని రాసి ఉన్న పెర్ఫ్యూమ్ బాటిల్‌ను కనుగొన్నారు. అందులో డ్రగ్స్ ఉన్నాయని పోలీసులు అనుమానించారు. అది కేవలం పెర్ఫ్యూమ్ అని రఘు పదే పదే వివరణ ఇచ్చినా, పోలీసులు విశ్వసించలేదు. చివరికి రఘుని అరెస్టు చేశారు. అప్పటినుంచి అతనికి కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. చట్టపరమైన, ఇమ్మిగ్రేషన్ సంక్షోభానికి దారితీసింది. వీసాను రద్దు చేయడంతో మరింత ఆందోళన నెలకొంది.చదవండి: నో అన్న రెండేళ్లకే గూగుల్ ఇండియా కీలక బాధ్యతలు, ఎవరీ రాగిణీ?మరోవైపు అర్కాన్సాస్ స్టేట్ క్రైమ్ ల్యాబ్ తదుపరి పరీక్షలో ఆ పదార్థం హానికరం కాదని , మాదకద్రవ్యాలు లేవని నిర్ధారించారు. అయినప్పటికీ, రఘు ఇప్పటికే మూడు రోజులు సెలైన్ కౌంటీ జైలులో గడిపాడు.మే 20న జిల్లా కోర్టు మాదకద్రవ్యాల కేసును కొట్టివేసిన తర్వాత ,ఈలోపు రఘు వీసా గడువు ముగిసిందంటూ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని, లూసియానాలోని ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి తరలించి, 30 రోజుల పాటు నిర్బంధించారని రఘు న్యాయవాది మైక్ లాక్స్ వెల్లడించారు.దీనిపై బాధితుడు రఘు తీవ్ర ఆందోళన వ్యక్తంచే శారు. తన భార్య యాష్లీ మేస్, మొత్తం భారాన్ని మోస్తోందని, కోర్టు ఖర్చులు, భరించడం కష్టం మారిందని వాపోయారు. ఈ జంటకు ఈ ఏప్రిల్‌లో వివాహం అయింది. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కార్యాలయానికి రాసిన లేఖలో, రఘు తన వీసాను తిరిగి పొందాలని విజ్ఞప్తి చేశాడు. కపిల్ రఘు విడుదల అయినప్పటికీ, @బహిష్కరణ' (deportation) స్టేటస్‌లో ఉంటాడని, మరింత ముఖ్యంగా, ఇది అతను పని చేయకుండా ,డబ్బు సంపాదించకుండా నిరోధిస్తుందని ఇది మరింత ఆందోళన కరమని న్యాయవాది వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉంటే తన భర్తను నిర్దోషిగా బయటకొచ్చే క్రమలో అయ్యే ఖర్చుల కోసం భార్య ఆన్లైన్లో విరాళాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్‌లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో -
వాంగ్‌చుక్ అరెస్ట్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసు
న్యూఢిల్లీ: లద్దాఖ్‌కు చెందిన ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌పై సుప్రీంకోర్టు సోమవారం కేంద్రంతోపాటు లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం యంత్రాంగానికి నోటీసులు జారీ చేసింది. జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ)కింద అరెస్ట్ చేసిన వాంగ్చుక్ను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన భార్య గీతాంజలి అంగ్మో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం విచారణ చేపట్టింది. వాంగ్‌చుక్ అరెస్ట్‌కు కారణాలు తెలిపాలని ఆయన భార్య గీతాంజలి కోరుతున్నారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ధర్మాసనానికి నివేదించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జోక్యం చేసుకుని, ఇప్పటికే వాంగ్చుక్కు ఈ మేరకు అధికారులు వివరాలు అందజేసినట్లు వివరించారు. నిర్బంధానికిగల కారణాలను భార్యకు తెలపాలనే నిబంధనేదీ లేదని కూడా ఆయన చెప్పారు. అయితే, ఈ సమయంలో తామేమీ చెప్పలేమని ధర్మాసనం పేర్కొంది. అరెస్ట్‌కు కారణాలను తెలిపే విషయం పరిశీలించాలని సొలిసిటర్ జనరల్‌ను కోరింది. అదే సమయంలో, వాంగ్‌చుక్ వైద్య అవసరాలను జైలు నిబంధనలకు లోబడి తీర్చాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్‌తో రెండు రోజులపాటు కొనసాగిన ఆందోళనల్లో నలుగురు చనిపోగా 90 మంది గాయపడ్డారు. హింసకు వాంగ్‌చుక్ ప్రేరేపించారంటూ అధికారులు సెప్టెంబర్ 26న అదుపులోకి తీసుకుని, ఆ వెంటనే రాజస్తాన్‌లోని జోథ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఎన్ఎస్ఏ కింద అరెస్టయితే గరిష్టంగా 12 నెలలపాటు నిర్బంధంలో ఉంచొచ్చు. -
Fake Liquor: టీడీపీ నేత సురేంద్ర నాయుడు అరెస్ట్
-
లద్దాఖ్ కోసం పోరాటం ఆగదు
లేహ్: కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వటంతోపాటు రాష్ట్రాన్ని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్‌తో శాంతియుత పోరాటం కొనసాగిద్దామని లద్ధాఖ్ ప్రజలకు సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు. గత నెల 24న లేహ్‌లో నిర్వహించిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారటంతో నలుగురు వ్యక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు కారకుడిగా పేర్కొంటూ జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద సోనమ్ వాంగ్చుక్ను అరెస్టు చేసి రాజస్తాన్‌లోని జో«ద్‌పూర్ జైల్లో నిర్బంధించారు. వాంగ్‌చుక్ సోదరుడు క సెతన్ దోర్జీ లేతో కలిసి న్యాయవాది హాజీ ముస్తఫా శనివారం జైల్లో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ముస్తఫా ద్వారా లద్ధాఖ్ ప్రజలకు వాంగ్‌చుక్ సందేశం పంపారు. ‘నేను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగానే ఉన్నాను. నాకోసం ప్రారి్థంచినవారందరికీ ధన్యవాదాలు. లేహ్ ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని, అరెస్టయినవారు ధైర్యంగా ఉండాలని ప్రారి్థస్తున్నాను. గత నెల 24న జరిగిన ఘర్షణపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నా. అలా విచారణ జరగని పక్షంలో నేను జైల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నా. లద్దాఖ్‌కు రాష్ట్రహోదా ఇచ్చి ఆరో షెడ్యూల్ చేర్చాలన్న లేహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ), కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ (కేడీఏ)కు నేను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా. డిమాండ్ల సాధన కోసం ప్రజలంతా శాంతియుతంగా, ఐకమత్యంతో సంపూర్ణంగా గాంధీ మార్గంలో పోరాటం చేయండి’అని వాంగ్‌చుక్ ఇచ్చిన సందేశాన్ని ముస్తఫా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. లేహ్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. నిరసనకారులను సోమవారం చర్చలకు ఆహా్వనించింది. అయితే, వాంగ్‌చుక్‌తోపాటు పోలీసులు అరెస్టు చేసినవారందరినీ విడుదల చేసి, లేహ్ ఘటనపై జ్యుడీíÙయల్ విచారణకు ఆదేశించేంతవరకు చర్చల్లో పాల్గొనబోమని ఎల్ఏబీ, కేడీఏ తేల్చి చెప్పాయి. -
Magazine Story: నకిలీ మద్యం.. కోట్ల డీల్.. నాయుడు అరెస్ట్..
-
Cough Syrup Row: వైద్యుడు అరెస్ట్.. కంపెనీపై కేసు నమోదు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో పిల్లలకు ప్రమాదకర దగ్గు సిరప్‌ను సూచించిన వైద్యుడిని ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. డాక్టర్ ప్రవీణ్ సోని సూచించిన దగ్గు సిరప్ తీసుకున్న 11 మంది చిన్నారులు మరణించిన ఉదంతం వివాదాస్పదంగా మారింది. పరాసియాకు చెందిన డాక్టర్ ప్రవీణ్ సోని తన క్లినిక్‌లో పలువురు చిన్నారులకు చికిత్స అందించిన దరిమిలా ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోల్డ్రిఫ్ సిరప్‌ను తయారు చేసిన శ్రీసాన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీపై కేసు నమోదు చేసింది.ప్రభుత్వం ఇప్పటికే కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను నిషేధించింది. ఈ ఔషధ నమూనాలలో 48.6శాతం డైథిలిన్ గ్లైకాల్ ఉంది. ఇది అత్యంత విషపూరితమైన పదార్థమని అధికారులు తెలిపారు. చెన్నైలోని డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీలో ప్రభుత్వ ఔషధ విశ్లేషకులు ఈ సిరప్ నమూనాను పరీక్షించిన దరిమిలా తమిళనాడు డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ ‘కోల్డ్రిఫ్’ప్రామాణిక నాణ్యత లేనిదని ప్రకటించింది. ఈ నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తమిళనాడు ప్రభుత్వం మరొక దగ్గు సిరప్ ‘నెక్స్ట్రో-డిఎస్’ అమ్మకాలను కూడా నిషేధించింది. కోల్డ్రిఫ్ పరీక్ష రిపోర్టు శనివారమే బయటకు రాగా, నెక్స్ట్రో-డిఎస్ నివేదిక రావాల్సివుంది.బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వారి చిన్నారులు తొలుత జలుబు, తేలికపాటి జ్వరంతో బాధపడ్డారు. ఈ సమయంలో వైద్యులు వారికి దగ్గు సిరప్‌తో సహా సాధారణ మందులు సూచించారు. ఆ తర్వాత వారు కోలుకున్నట్లు కనిపించినా, తిరిగి అవే అనారోగ్య లక్షణాలు కనిపించాయి. మూత్ర విసర్జనలో తేడా కూడా కనిపించింది. పరిస్థితి మరింతగా దిగజారి అది, కిడ్నీ ఇన్ఫెక్షన్గా మారింది. ఆ తరువాత వారు మృతిచెందారు. మృతుల కిడ్నీ బయాప్సీలో విషపూరిత డైథిలిన్ గ్లైకాల్ పదార్థం ఉన్నట్లు వెల్లడైంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ మరణాలు చాలా విషాదకరమైనవని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సిరప్ అమ్మకాలను మధ్యప్రదేశ్ అంతటా నిషేధించారని, సిరప్ తయారీ కంపెనీ ఇతర ఉత్పత్తులపై కూడా నిషేధం విధించనున్నామని ఆయన తెలిపారు. -
జుబీన్ గార్గ్ మేనేజర్ సహా ఇద్దరి అరెస్ట్
గౌహతి: సింగపూర్‌లో సెప్టెంబర్ 19వ తేదీన అనుమానాస్పద స్థితిలో చనిపోయిన గాయకుడు జుబీన్ గార్గ్ ఉదంతంపై దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఘటనపై అసోం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం జుబీన్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యాంకను మహంతాను బుధవారం ఉదయం ఢిల్లీలో అరెస్ట్ చేసింది. వీరిద్దరిపై నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి జుబీన్ మరణానికి కారణమయ్యారన్న ఆరోప ణలపై కేసులు నమోదు చేసింది. వీరిని వెంటనే గౌహతికి తరలించి కామ్రూప్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపర్చగా 14 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. దసరా సెలవులు కావడంతో జడ్జి ఇంటి వద్దే వీరిని హాజరు పర్చామని సిట్ చీఫ్ సీఐడీ స్పెషల్ డీజీపీ మున్నా ప్రసాద్ గుప్తా చెప్పారు. శర్మ, మహంతాలపై ఇప్పటికే ఇంటర్‌పోల్ ద్వారా లుకౌట్ నోటీసు జారీ అయ్యిందని, ఈ నెల 6వ తేదీలోగా వీరిని తమ ఎదుట హాజరు కావాలని కోరామని ఆయన తెలిపారు. దీంతో, సింగపూర్ నుంచి మహంతా ఢిల్లీకి చేరుకోగానే ఎయిర్‌పోర్టు అధికారులు అదు పులోకి తీసుకుని సమాచారమిచ్చారన్నారు. గుప్తా జాడ కోసం ఢిల్లీ, రాజస్తాన్ పోలీసులను అప్రమత్తం చేశామని, చివరికి ఢిల్లీ–హరియాణా సరిహద్దుల్లో ఉండగా గుర్తించి, అరెస్ట్ చేశామన్నారు. ఇద్దరి మొబైల్ ఫోన్లతోపాటు, జుబీన్ ఫోన్‌ను కూడా వీరి నుంచి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కేసు విచారణ చట్ట ప్రకారం సాగుతుందని స్పష్టం చేశారు. సీఐడీ కార్యాలయంలో కటకటాల వెనుక మహంతా, శర్మలు చేతులకు బేడీలతో ఉన్న ఫొటో లను సిట్ ఆన్లైన్లో షేర్ చేసింది. గౌహతి విమానాశ్రయం నుంచి జడ్జి ఇంటికి వీరిని తరలించే సమయంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాక్ష న్ ఫోర్స్ కూడా కాన్వాయ్‌ను అనుసరించింది. సింగపూర్‌లో జరిగిన నార్త్ ఈస్ట్ ఫెస్టివ ల్కు మహంతా మేనేజర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి జుబీన్ హాజర య్యారు. అప్పుడే, సింగపూర్‌లో సముద్రంలో ఈత కొడుతూ అనుమానాస్పద స్థితిలో జుబీన్ గార్గ్ చనిపోయారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం అసోం ప్రభుత్వం 10 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. తాజాగా మహంతాపై అసోం ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్రంలో ఎటువంటి ఉత్సవాలు, కార్యక్రమాలు నిర్వహించరాదని ఆదేశించింది. మహంతా, శర్మల అరెస్ట్‌పై జుబీన్ భార్య గరిమా సైకియా గర్గ్ సంతృప్తి వ్యక్తం చేశారు. జుబీన్ మరణానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకోవాలని తామంతా ఎదురు చూస్తున్నామన్నారు. ఈ మేరకు దర్యాప్తు సజావుగా సాగుతుందన్న విశ్వాసం గరిమా వ్యక్తం చేశారు. -
రూ.40 కోట్ల మాదక ద్రవ్యాలు.. అదుపులో బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దొరికిపోయారు. ఈ మాదకద్రవ్యాల రాకెట్ వెనుక నైజీరియా గ్యాంగ్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అతని వద్ద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.కాగా.. అస్సాంకు చెందిన నటుడు విశాల్ బ్రహ్మ ఇండస్ట్రీలో అవకాశాల్లేక ఆర్థిక సమస్యల వల్లే ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బుల కోసం కొందరు స్నేహితుల నైజీరియా ముఠాతో పరిచయాలు ఏర్పడినట్లు సమాచారం. విశాల్ బ్రహ్మను కాంబోడియా ట్రిప్‌కు వెళ్లమని.. భారత్‌కు మాదకద్రవ్యాలు చేరవేసేందుకు కొంత నగదు ఇస్తామని ఆశ చూపినట్టు దర్యాప్తులో వెల్లడైంది. కాగా.. రెండు వారాల క్రితమే ఢిల్లీ నుంచి కాంబోడియా వెళ్లాడు. రిటన్ జర్నీలో ఓ నైజీరియన్ అతడికి ట్రాలీ బ్యాగ్ ఇచ్చాడని, అందులోనే డ్రగ్స్ ఉన్నట్టు సమాచారం. సింగపూర్ మీదుగా కాంబోడియా.. అక్కడి నుంచి చెన్నై.. చెన్నై నుంచి ఢిల్లీకి రైల్లో వెళ్లాలని నైజీరియా ముఠా అతనితో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. విశాల్ బ్రహ్మ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో నటించారు. -
కేవలం పైశాచిక ఆనందం కోసమే YSRCP నేతలపై కేసులు
-
మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు నమోదు
-
కరూర్ తొక్కిసలాట ఘటనలో తొలి అరెస్ట్
చెన్నై: కరూర్‌లో తమిళగ వెట్రికళగం(TVK) అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్(Vijay) ప్రచారం తొక్కిసలాట ఘటనలో తొలి అరెస్ట్ జరిగింది. టీవీకే జిల్లా సెక్రటరీ మతియఝగన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నేతల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, విజయ్ ప్రచారం తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది.కరూర్ ఘటన గురించి రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్ విచారణను వేగవంతం చేసింది. రెండోరోజూ ఆమె ఘటనా స్థలిని పరిశీలించారు. ఆ పరిసర వాసులతో మాట్లాడారు. అలాగే ఐదుగురు మరణించిన ఏలురు పుదురు, ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించిన విశ్వనాధపురి గ్రామానికి వెళ్లి అక్కడి బాధితులతో మాట్లాడారు. మరణించిన 41 మంది కుటుంబాలను కలిసి వారివద్ద వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.ఈ కమిషన్ విచారణ ఓ వైపు జరుగుతుంటే, మరోవైపు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. ఈ కేసు విచారణ అధికారిగా ఇది వరకు నియమితులైన డీఎస్పీ సెల్వరాజ్‌ను తప్పించారు. ఆయన స్థానంలో ఏడీఎస్పీ ప్రేమానంద్‌ను సోమవారం రంగంలోకి దించారు.ఘటనా స్థలంలో భద్రతా విధులలో ఉన్న మణివణ్ణన్ అనే ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరూర్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీకే కరూర్ జిల్లా కార్యదర్శి ∙మది అళగన్, రాష్ట్ర కార్యదర్శి భుస్సీ ఆనంద్, సంయుక్త కార్యదర్శి నిర్మల్‌కుమార్‌తో పాటూ ఇతరులు అంటూ మొత్తం నలుగురిపై ఐదు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అలాగే తనపై దాడి చేశారంటూ అంబులెన్స్ డ్రైవర్ ఈశ్వర్ ఇచ్చిన ఫిర్యాదుతో 10 మంది గుర్తు తెలియని టీవీకే వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఐదు సెక్షన్లతో నమోదైన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో సమగ్ర వివరాలను పొందు పరిచారు. ఇందులో పేర్కొన్న అంశాలు విజయ్ మెడకు సైతం మున్ముందు ఉచ్చు పడేనా? అన్న చర్చ ఊపందుకుంది. -
ఢిల్లీ బాబా ఆగ్రాలో అరెస్ట్
న్యూఢిల్లీ/ఆగ్రా: ఢిల్లీలోని ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన 17 మంది విద్యార్థినులను వేధించిన ఆరోపణలను ఎదుర్కొంటున్న బాబా చైతన్యానంద సరస్వతి(62) జాడను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు కనిపెట్టారు. ఆగ్రాలోని ఓ హోటల్లో బస చేసిన అతడిని ఆదివారం వేకువజామున అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఒక ఐపాడ్, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఫోన్లో ఢిల్లీలోని విద్యాసంస్థ క్యాంపస్, హాస్టల్లోని సీసీటీవీ ఫుటేజీని యాక్సెస్ చేసే సౌకర్యం ఉండటం గమనార్హం. ఈ ఫోన్ ద్వారానే విద్యార్థినుల కదలికలను చైతన్యానంద గమనించేవాడని పోలీసులు తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయంలో తనకు పరిచయస్తులున్నారని చెప్పుకుంటూ చైతన్యానంద, అతడి శిష్యులు అరెస్టుల నుంచి తప్పించుకుంటున్నారని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. కేసు నమోదు కావడంతో అరెస్ట్ భయంతో ఆగస్ట్ 4వ తేదీన ఢిల్లీని దొంగచాటుగా వదిలిన చైతన్యానంద, ఇతడి శిష్యులు పోలీసుల కళ్లలో పడకుండా ట్యాక్సీల్లో ప్రయాణిస్తూ, చౌక హోటళ్లలో బస చేస్తూ బృందావన్, ఆగ్రా, మథుర తదితర ప్రాంతాల్లో తిరుగుతున్నారన్నారు. చైతన్యానంద వద్ద ఐక్యరాజ్యసమితి రాయబారిని, బ్రిక్స్ కమిషన్ సభ్యుడని చెప్పుకుంటూ ముద్రించిన రకరకాల నకిలీ విజిటింగ్ కార్డులు ఇతడి వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఆగ్రా హోటల్లో ఈ నెల 27వ తేదీన సాయంత్రం 4 గంటలకు పార్థసారథి అనే పేరుతో చైతన్యానంద గది తీసుకున్నాడన్నారు. వేర్వేరు పేర్లతో ఇతడు తీసుకున్న రూ.8 కోట్ల బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లను పోలీసులు స్తంభింపజేశారు. ఢిల్లీలోని మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కు గతంలో చైర్మన్‌గా ఉన్న చైతన్యానంద మహిళా విద్యార్థినులను రాత్రి వేళ గత క్వార్టర్‌కు పిలిపించుకునే వాడు. రాత్రిళ్లు వారికి అసభ్యకర సందేశాలను పంపించేవాడు. తన ఫోన్లో వారి కదలికలను గమనించేవాడు. కేసు నమోదైనట్లు తెలిసిన తర్వాత బ్యాంకు నుంచి రూ.50 లక్షలను విత్‌డ్రా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.ఐదు రోజుల పోలీస్ కస్టడీచైతన్యానంద సరస్వతిని ఢిల్లీ కోర్టు ఆదివారం ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. చైతన్యానంద పలువురు విద్యార్థినులను వేధించాడని, తన కోరిక తీర్చాలని ఒత్తిడి చేసేవాడని పలువురు బాధితులకు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో ఆరోపించారు. విద్యార్థినుల బాత్‌రూంలలోనూ ఇతడు సీసీటీవీ కెమెరాలను అమర్చాడని బాధితుల తరఫు లాయర్లు ఆరోపించారు. సుమారు 16 మంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇతడి బారిన 16 నుంచి 20 మంది విద్యార్థినులు పడ్డారన్నారు. వీరందరి స్టేట్మెంట్లు పోలీసులు రికార్డు చేశారని తెలిపారు. పోలీసుల విచారణకు సహకరించడం లేదని, ఐపాడ్, ఐక్లౌడ్ పాస్‌వర్డులను వెల్లడించడం లేదని ఆరోపించారు. అయితే, పోలీసులు తనను వేధించేందుకే కస్టడీ కోరుతున్నారని, నిజంగా తనతో ప్రమాదముంటే జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని చైతన్యానంద తరపు లాయర్ వాదించారు. వాదనలు విన్న డ్యూటీ మేజిస్ట్రేట్ రవి ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
బారాబంకీ, మౌ జిల్లాల్లోనూ ఉద్రిక్తతలు
బరేలీ/బారాబంకీ/వారణాసి: ఉత్తరప్రదేశ్‌లో ‘ఐ లవ్ మహ్మద్’కార్యక్రమంపై తలెత్తిన వివాదం ముదిరింది. శుక్రవారం బరేలీలో ఆందోళనకారులు పోలీసులతో తలపడటం తెల్సిందే. ఈ నేపథ్యంలో పోలీసులు శుక్రవారం రాత్రి ఇల్లిల్లూ సోదాలు జరిపి గొడవలకు కారణమైన వారిని అరెస్ట్ చేశారు. పొలీసులపై రాళ్లు రువ్వడం, దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టిన ఘటనల్లో పాలుపంచుకున్న 500 మందిని గర్తించామని ఉన్నతాధికారులు తెలిపారు. ఇదంతా కుట్ర ప్రకారమే జరిగిందంటూ 8 మందిపై కేసులు నమోదు చేశారు. అయితే, పొరుగునున్న బారాబంకీలోని ఫైజుల్లాగంజ్లో ‘ఐ లవ్ మహ్మద్’అని ఉన్న బ్యానర్‌ను తొలగించారన్న వార్తలు రావడంతో శనివారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బ్యానర్ చించినట్లు ఆరోపణలున్న ధన్ని అనే వాచ్‌మన్ ఇంటిని కొందరు ధ్వంసం చేశారు. అక్కడికి సమీపంలోని మసీదు వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలో ఇదంతా రికార్డయ్యింది. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ఫైజుల్లాగంజ్లో శాంతియుత వాతావరణం నెలకొందని ఎస్పీ అజయ్ సింగ్ చెప్పారు. అదేవిధంగా, మౌ జిల్లా నయీ బజార్ ప్రాంతంలో శుక్రవారం ప్రార్థనల అనంతరం కొందరు ‘ఐ లవ్ మహ్మద్’అని నినాదాలు చేస్తూ ఊరేగింపు చేపట్టారు. ఈ ఘటన వీడియో ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని మౌ ఎస్పీ ఇలమారన్ చెప్పారు. వారణాసిలోని సిగ్రాలో ఈ నెల 22వ తేదీన ‘ఐ లవ్ మహ్మద్’పోస్టర్లు, బ్యానర్లు చేబూని, నినాదాలతో ర్యాలీ చేపట్టిన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర వర్గాల ప్రజల్లో తమ ఆధిపత్యం ప్రదర్శించుకునేందుకు కొందరు ఈ కొత్త ఒరవడిని మొదలుపెట్టారని పోలీసులు అంటున్నారు.మత పెద్ద రజా అరెస్ట్బరేలీలో ఘర్షణలకు ప్రేరేపించారనే ఆరోపణలపై ఇత్తెహాద్–ఇ– మిల్లత్ పరిషత్ ప్రెసిడెంట్ మౌలానా తౌకీర్ రజాను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ఐ లవ్ మహ్మద్’కు మద్దతుగా రజా ర్యాలీకి పిలుపునివ్వడం ఉద్రిక్తతకు దారి తీసిందని, ప్రణాళిక ప్రకారం జరిగిన గొడవలకు ప్రధాన సూత్రధారి ఈయనేనని ఉన్నతాధికారులు తెలిపారు. రజా సహా 8 మందిని స్థానిక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. వీడియో ఫుటేజీలో గుర్తించిన మరో 36 మంది వ్యక్తులను నిర్బంధంలోకి తీసుకుని విచారణ చేపట్టామన్నారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించారనే ఆరోపణలపై రజా, మరో 25 మందితోపాటు గుర్తు తెలియని మరో 200 మందిపై ప్రేమ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఆందోళనకారులు ఒక పోలీస్ కానిస్టేబుల్ యూనిఫాంను చించివేశారన్నారు. బరేలీలో శనివారం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, స్కూళ్లు, దుకాణాలు యథావిథిగా పనిచేశాయని డీఐజీ అజయ్ కుమార్ సాహ్ని తెలిపారు. ఘర్షణలపై దర్యాప్తులో కొందరు రాజకీయ నేతల పేర్లు కూడా బయటకు వచ్చాయన్నారు. శాంతియుత పరిస్థితులకు భంగం కలిగించాలని చూసే వారిపై గూండా చట్టం, జాతీయ భద్రతా చట్టాలను ప్రయోగిస్తామని హెచ్చరించారు. బరేలీ నగరంలో 8 వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని మోహరించామని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వీరు ఇక్కడే ఉంటారని పేర్కొన్నారు. -
సోనమ్ వాంగ్‌చుక్ అరెస్టు
లేహ్/శ్రీనగర్: లద్దాఖ్ పర్యావరణ ఉద్యమకారుడు, సామాజికవేత్త సోనమ్ వాంగ్‌చుక్(59)ను పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు అరెస్టు చేశారు. లద్దాఖ్ రాజధాని లేహ్‌లో బుధవారం జరిగిన హింసాకాండలో నలుగురు మరణించగా, 70 మంది గాయపడిన సంగతి తెలిసిందే. యువతను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాడన్న కారణంతో జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద డీజీపీ ఎస్.డి.సింగ్ జమ్వాల్ ఆధ్వర్యంలో సోనమ్ వాంగ్చుక్ను ఆయన సొంత గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. లేహ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను రంగంలోకి దించారు. వాంగ్చుక్ను లద్దాఖ్ నుంచి రాజస్థాన్‌లోని జో«థ్పూర్కు తరలించారు. ఆయనపై ఏయే అభియోగాలు మోపారన్న దానిపై పోలీసుల ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ)గా ఉన్న లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆయన కొన్నేళ్లుగా పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ నెల 10న నిరాహార దీక్ష ప్రారంభించారు. డిమాండ్ల సాధన కోసం ఉద్యమకారులు బుధవారం ఇచి్చన బంద్ పిలుపు హింసాత్మకంగా మారింది. లేహ్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కర్ఫ్యూ విధించారు. హింస నేపథ్యంలో వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమించారు. లద్దాఖ్‌లో అశాంతి, ఉద్రిక్తతలకు వాంగ్‌చుక్ కారణమని కేంద్ర హోంశాఖ గురువారం ఆరోపించింది. అరబ్ వసంతం, నేపాల్ జెన్–జెడ్ ఉద్యమాల గురించి యువతకు నూరిపోస్తూ, వారిని రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తూ హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడింది. నన్ను బలిపశువును చేయడానికి కుట్ర: వాంగ్‌చుక్ కేంద్ర ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను వాంగ్‌చుక్ గురువారం ఖండించారు. హింస వెనుక తన ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. ప్రజల డిమాండ్లను నెరవేర్చకుండా వారి దృష్టిని మళ్లించడానికే తనపై నిందలు వేస్తోందని ఆరోపించారు. తనను బలిపశువుగా మార్చడం పక్కనపెట్టి జనం ఆకాంక్షలు నెరవేర్చాలని హితవు పలికారు. మరోవైపు వాంగుచుక్ అరెస్టును కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఆరోపణలు నిరూపించగలరా?: గీతాంజలిసోనమ్ వాంగ్చుక్ను నేరçస్తుడిలా పరిగణిస్తున్నారని ఆయన భార్య గీతాంజలి అంగ్మో మండిపడ్డారు. వాంగ్‌చుక్ ప్రతిష్టను దెబ్బతీయడానికి కేంద్రం తప్పుడు ప్రచారానికి తెరతీసిందని విమర్శించారు. పోలీసులు తమ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. తన భర్తను జాతివ్యతిరేక శక్తిగా చిత్రీకరిస్తున్నారని ఆక్షేపించారు. ఎలాంటి విచారణ గానీ, కారణంగా గానీ లేకుండా ఆయనను బలవంతంగా లాక్కెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా జరడం దారుణమని అన్నారు. తన భర్త ఐదేళ్లుగా శాంతియుతంగా పోరాడుతున్నారని, ఏనాడూ హింసను ప్రేరేపించలేదని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, విద్యావ్యాప్తి కోసం కృషి చేస్తూ ఎన్నో పురస్కారాలు పొందారని గుర్తుచేశారు. మేధావులకు, విద్యావేత్తలకు ఇచ్చే మర్యాద అదేనా? అని ప్రశ్నించారు. తన భర్తపై చేస్తున్న ఆరోపణలు నిరూపించగలరా? టీవీలో చర్చకు సిద్ధమా? అని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు గీతాంజలి అంగ్మో సవాలు విసిరారు. అరెస్టు దురదృష్టకరంసోనమ్ వాంగ్చుక్ను పోలీసులు అరెస్టు చేయడం దురదృష్టకరమని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. లద్దాఖ్ ప్రజలకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, అందుకే ప్రజలు పోరుబాట పట్టారని చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్రం హామీ ఇచి్చందని, ఇప్పటికీ నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
సాయిభార్గవ్‌ను ఎలా అరెస్ట్ చేస్తారు..?
గుంటూరు లీగల్: సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారన్న నెపంతో అమాయకులను అరెస్ట్ చేయడంలో కూటమి ప్రభుత్వం, పోలీసుల అత్యుత్సాహం మరోసారి బహిర్గతమైంది. ఇలాంటి అరెస్ట్ విషయంలో గుంటూరు సీబీసీఐడీ కోర్టు నుంచి పోలీసులు తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కొనాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యూరియాపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఫ్యాబ్రికేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని నమోదుచేసిన అక్రమ కేసులో ఆరో నిందితుడిగా చేర్చిన సాయిభార్గవ్‌ను గురువారం సీబీసీఐడీ కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు తనను తీవ్రంగా కొట్టినట్లు సాయిభార్గవ్ న్యాయమూర్తికి తెలిపారు. దీంతో సాయిభార్గవ్‌ను వైద్య పరీక్షలకు పంపాల్సిందిగా జడ్జి ఆదేశించారు. గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గురువారం అర్ధరాత్రి సీబీసీఐడీ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా సాయిభార్గవ్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. కేవలం సెల్‌ఫోన్ ఆధారంగా సాయిభార్గవ్‌ను నేరంలోకి లాగడం సరికాదన్నారు. పోలీసులు ఆరోపించిన విధంగా నిందితునికి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వాదనలు విన్న జడ్జి ఈ అరెస్ట్ విషయంలో పోలీసుల పనితీరును తీవ్రంగా తప్పు పట్టారు. సాయిభార్గవ్‌ను అరెస్ట్ చేసిన విధానంలో పోలీసుల విధి నిర్వహణ సక్రమంగా లేదన్నారు. పోలీసుల తప్పిదాన్ని ఎత్తి చూపిస్తూ, సాయిభార్గవ్‌ను ఏ విధంగా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. తగిన ఆధారం లేకుండా కేవలం అధికారంతో అమాయకులను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. కేవలం సెల్‌ఫోన్ ఆధారంగా సాయిభార్గవ్‌ను నేరంలోకి ఎలా లాగుతారని నిలదీశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కారాదని హెచ్చరించారు. సాయిభార్గవ్‌ను రూ. 25 వేల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఉత్తర్వులు జారీచేశారు. అక్టోబర్ 8వ తేదీలోపు రూ. 25 వేలతో ఇద్దరి జామీను సమర్పించాలని ఆదేశించారు. అనంతరం సాయిభార్గవ్ వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు. మంగళగిరిలో నమోదయిన ఇదే కేసులో సోషల్ మీడియా యాక్టివిస్ట్ వజ్రాల తారక్ ప్రతాప్ రెడ్డికి కోర్టు గురువారం 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం తారక్‌ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. -
అరెస్ట్ చేసుకుంటారా.. ఏం చేసుకుంటారో చేసుకోండి: కేటీఆర్
-
లద్దాఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్
ఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) లద్దాఖ్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఉద్యమకారుడు, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk)ను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం లద్దాఖ్‌లో జరిగిన అల్లర్లకు కారణం వాంగ్చుక్గా కారణంగా భావిస్తూ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హింసను రెచ్చగొట్టినట్టు వాంగ్చుక్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వాంగ్‌చుక్ ఎన్జీవో లైసెన్స్‌ను సైతం కేంద్రం రద్దు చేసింది.కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఆయన స్థాపించినస్వచ్ఛంద సంస్థ( SECMOL)కు విదేశీ నిధులు స్వీకరించే హక్కును కూడా రద్దు చేసింది. అరెస్టుకు ముందు వాంగ్‌చుక్ వ్యాఖ్యానిస్తూ.. ఈ ఉద్యమం కోసం అరెస్టయితే సంతోషంగా స్వీకరిస్తానన్నారు. లద్దాఖ్ రాష్ట్ర హక్కుల కోసం ప్రజలు చేపట్టిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించించిన సంగతి తెలిసిందే. దీంతో వాంగ్‌చుక్.. తాను చేపట్టిన రెండు వారాల దీక్షను కూడా ఆయన ముగించిన సంగతి తెలిసిందే.లద్దాఖ్‌కు తక్షణమే రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజధాని లేహ్‌లో జనం బుధవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా హింస ప్రజ్వరిల్లింది. ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. సీఆర్పీఎఫ్ వ్యాన్ సహా పలు వాహనాలను దహనం చేశారు. వీధుల్లో విధ్వంసం సృష్టించారు.ఇళ్లు, దుకాణాలపై దాడులకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీలకు పనిచెప్పారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. 70 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పదుల సంఖ్యలో పోలీసులు సైతం ఉన్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్‌లో కర్ఫ్యూ విధించింది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడొద్దని ఆదేశించింది. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, జనం ఇళ్ల నుంచి బయటకు రావొద్దని స్పష్టంచేసింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వారు కాల్పులు జరిపినట్లు మండిపడ్డారు. -
అడ్డంగా దొరికిన పోలీసులు.. హైకోర్టు ఆగ్రహం..
-
Pahalgam Attack Probe: ఉగ్రవాదులకు సహకరించిన కీలక వ్యక్తి అరెస్ట్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి కేసులో ఉగ్రవాదులకు సహకరించిన కీలక వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. గత ఏప్రిల్ 22న పహల్గామ్ పరిధిలోని బైసాన్ లోయలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు హతమార్చారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది.ఈ ఘటనపై దర్యాప్తు సంస్థల విచారణలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా కార్యకర్తను తాజాగా జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ మహాదేవ్ సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఉగ్రవాదుల ఆయుధాలు, ఇతర సామగ్రిని విశ్లేషించిన దరిమిలా ఇతని అరెస్టు జరిగింది. ఉగ్రవాదుల కదలికను సులభతరం చేయడంలో ఇతను కీలకంగా వ్యవహరించాడని పోలీసులు తెలిపారు.నిందితుడిని కుల్గాం జిల్లాకు చెందిన 26 ఏళ్ల మహ్మద్ యూసుఫ్ కటారియాగా పోలీసులు గుర్తించారు. అతను టీచర్‌గా పనిచేస్తున్నాడని అధికారిక వర్గాలు తెలిపాయి. అతని సహచరులను గుర్తించేందుకు, సంబందిత నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేసేందుకు తదుపరి దర్యాప్తు జరుగుతున్నదని పోలీసులు తెలిపారు. -
చికెన్ ముక్కలు తక్కువ ఉన్నాయని..!
సాక్షి, హైదరాబాద్: చిన్న కారణం నేపథ్యంలో మహారాష్ట్రలోని నవీ ముంబైలో భార్యను చంపి, పరారై వచ్చిన మనోహర్ సరోదే (50) ఆరేళ్ల తర్వాత నగరంలో పట్టుబడ్డాడు. 2019లో ఈ ఘాతుకానికి పాల్పడిన అతగాడు హైదరాబాద్ వచ్చి తలదాచుకున్నాడు. కాటేదాన్ ప్రాంతంలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. సాంకేతిక ఆధారాలను బట్టి మనోహర్ ఆచూకీ కనిపెట్టిన నవీ ముంబై పోలీసులు గత వారం అతడు నివసిస్తున్న గదిపై దాడి చేసి అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. చికెన్ ముక్కల విషయంలో వివాదం... నవీ ముంబైలోని కమోథే ప్రాంతానికి చెందిన మనోహర్‌కు నాందేడ్‌కు చెందిన పల్లవితో 2007లో వివాహమైంది. పల్లవి గృహిణి కాగా... మనోహర్ స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసే వాడు. మద్యానికి బానిసైన ఇతగాడు నిత్యం భార్యతో గొడవ పడేవాడు. ఓ దశలో మానసికంగానూ దెబ్బతిన్న వ్యక్తిలా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. 2019 డిసెంబరు 4న రాత్రి మనోహర్ తన విధులు ముగించుకుని, ఇంటికి వెళ్తూ చికెన్ తీసుకువెళ్లాడు. మార్గమధ్యంలోనే పూటుగా మద్యం సేవించిన అతగాడు ఇంటికి వెళ్లిన తర్వాత చికెన్‌ను భార్యకు అప్పగించి వండమని చెప్పాడు. అప్పటికే ఇద్దరు పిల్లల ఆలనాపాలనా చూస్తున్న ఆమె వంట చేయడం కాస్త ఆలస్యమైంది. విచక్షణ కోల్పోయి కిరోసిన్ పోసి... దీంతో దాదాపు గంట పాటు ఆమెతో వాగ్వాదం చేస్తూనే ఉన్నాడు. వంట పూర్తయిన తర్వాత భార్యకు భోజనం వడ్డించిన పల్లవి తన పిల్లల వద్దకు వెళ్లింది. తనకు వడ్డించిన కూరలో చికెన్ ముక్కలు తక్కువ ఉన్నాయని, పిల్లలతో కలిసి తినడానికి దాచుకున్నావా? అంటూ మనోహర్ భార్యను దూషించడం మొదలుపెట్టాడు. ఆమె వారించడానికి ప్రయతి్నంచడంతో మరింత రెచి్చపోయిన అతగాడు తీవ్రంగా దాడి చేశాడు. స్ఫృహ తప్పి పడిపోయిన పల్లవిపై ఇంట్లో ఉన్న కిరోసిన్ పోసిన మనోహర్ నిప్పంటించి పారిపోయాడు. ఈ ఘోరాన్ని చూసిన వారి సంతానం నిశ్ఛేష్టులై ఉండిపోయారు. పల్లవి ఆర్తనాదాలు విన్న చుట్టపక్కల వాళ్లు ఆమెను ముంబైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దాదాపు 45 శాతం కాలిన గాయాలైన ఆమె మూడు రోజుల చికిత్స తర్వాత చనిపోయింది. కాటేదాన్ వచ్చి కూలీగా మారి... దీంతో మనోహర్‌పై నమోదైన హత్యాయత్నం కేసును కమోథే పోలీసుస్టేషన్ అధికారులు హత్యగా మార్చారు. నవీ ముంబై నుంచి పరారైన మనోహర్ రెండేళ్ల పాటు వివిధ ప్రాంతాల్లో సంచరించాడు. 2021లో నగరానికి వచి్చన ఇతగాడు కాటేదాన్ ప్రాంతంలో ఓ గది అద్దెకు తీసుకున్నాడు. బతుకుతెరువు కోసం ఓ కంపెనీలో దినసరి కూలీగా చేరాడు. నవీ ముంబైతో పాటు తన కుటుంబీకులు, బంధువులతో సంబంధాలు తెంచుకున్నాడు. దీంతో ఇతడి ఆచూకీ కనిపెట్టడం కమోథే పోలీసులకు సవాల్‌గా మారింది. ఇటీవల మనోహర్ నవీ ముంబైలో ఉన్న తన స్నేహితుడిని సంప్రదించాడు. సాంకేతిక ఆధారాలను బట్టి ఈ విషయం గుర్తించిన కమోథే అధికారులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. సిటీకి వచి్చన ఆ టీమ్ మనోహర్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్లింది. -
United States: గుజరాతీ మహిళ హత్యకేసులో యువకుని అరెస్ట్
దక్షిణ కరోలినా: దక్షిణ కరోలినాలో గుజరాతీ మహిళ హత్య కేసులో ఒక అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 16న గుజరాతీ మహిళ కిరణ్ పటేల్ మరణానికి దారితీసిన కాల్పుల సంఘటనతో సహా రెండు కాల్పుల సంఘటనలలో ప్రమేయం ఉన్న జైడాన్ మాక్ హిల్ (21)ను పోలీసులు అరెస్టు చేశారు.సెప్టెంబర్ 16న దక్షిణ కరోలినాలోని యూనియన్ కౌంటీలోని సౌత్ మౌంటైన్ స్ట్రీట్‌లోని ఒక యార్డ్‌లో చార్లెస్ నాథన్ క్రాస్బీ(67) అనే వృద్దుడిని మృతిచెందిన స్థితిలో పోలీసులు గుర్తించారు. ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం అదే రోజు సాయంత్రం, కిరణ్ పటేల్ (49) పై డీడీస్ ఫుడ్ మార్ట్ పార్కింగ్ స్థలంలో కాల్పులు జరిగాయి. ఆమె తీవ్రంగా గాయపడి మృతిచెందింది. గో ఫండ్‌మీ పేజీలోని వివరాల ప్రకారం ఈ ఘటన సెప్టెంబర్ 16న రాత్రి 10:30 గంటలకు జరిగింది. ఆ సమయంలో కిరణ్ పటేల్ యూనియన్ కౌంటీలో గ్యాస్ స్టేషన్-కమ్-కన్వీనియన్స్ స్టోర్ రిజిస్టర్ వద్ద నగదు లెక్కిస్తున్నారు. హిల్ ఆమె వద్దకు వచ్చి, క్యాష్ రిజిస్టర్ లాక్కున్నాడు. ఆమె అతనికి నగదు ఇచ్చేలోపుగానే అతను కిరణ్ పటేల్‌పై కాల్పులు జరిపాడు.అతనిని అడ్డుకునేందుకు కిరణ్ పటేల్ అతనిపైకి ప్లాస్టిక్ బాటిల్ విసిరి పరిగెత్తింది. హిల్ కూడా ఆమె వెంట పరిగెత్తాడు. ప్రాణాలను కాపాడుకునేందుకు పార్కింగ్ స్థలం వైపు పరిగెత్తిన కిరణ్ పటేల్ పై హిల్ కాల్పులు కొనసాగించాడు. ఆమెకు బుల్లెట్ తగిలి, తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయింది. తరువాత అతను ఆమె దగ్గరకు వచ్చి మరోమారు కాల్పులు జరిపాడు. కేసు దర్యాప్తు చేపట్టిన సౌత్ కరోలినా లా ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ అధికారులు అరెస్ట్ వారెంట్‌తో సౌత్ చర్చి స్ట్రీట్‌లోని హిల్ ఇంటికి చేరుకున్నారు. అయితే హిల్ వారిని ప్రతిఘటించాడు. ఎట్టకేలకు పోలీసులు హిల్‌ను అరెస్ట్ చేసి, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొందరు రైతులనైనా జైలుకు పంపండి
సాక్షి, న్యూఢిల్లీ: పంట వ్యర్థాలను తగలబెడుతూ వాయుకాలుష్యానికి కారణమవుతున్న రైతులను ఎందుకు అరెస్ట్ చేయట్లేదని పంజాబ్ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది. కొందరు రైతులను కటకటాల వెనక్కి నెడితేనే ఇతర రైతుల్లో భయం ఉంటుందని, వ్యర్థాలను తగలబెట్టే రైతులకు గట్టి సందేశం ఇచ్చిన వాళ్లమవుతామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్తాన్, పంజాబ్‌లలో రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లలో పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల ధర్మాసనం పై విధంగా స్పందించింది. ‘రైతులు నిజంగా ప్రత్యేకమైనవాళ్లే. వాళ్ల కారణంగానే మనం ఆహారం తినగల్గుతున్నాం. అంతమాత్రాన మనం పర్యావరణాన్ని కాపాడకుండా మౌనంగా కూర్చోలేం కదా. పంట వ్యర్థాలను తగలబెడుతున్న రైతులను శిక్షించే సెక్షన్లు ఉన్నాయి కదా? వాయుకాలుష్యంతో పర్యావరణానికి హాని తలపెడుతున్న కొందరు రైతులను అరెస్ట్చేస్తేనే మిగతా వాళ్లకు గట్టి సందేశం వెళుతుంది. తప్పు చేసిన రైతులను శిక్షించేందుకు చట్టంలో నిబంధనలు ఉన్నాయని మీకు తెలియదా? పర్యావ రణాన్ని కాపాడాలనే సత్సంకల్పం మీకు ఉంటే రైతులను అరెస్ట్‌చేయడానికి ఎందుకు జంకుతున్నారు?’’ అని న్యాయస్థానం నిలదీసింది. ‘‘పంట వ్యర్థ్యాలను జీవఇంధనంగా ఉపయోగంచవచ్చన్న వార్తలను మేం కూడా వార్తాపత్రికల్లో చదివాం. ఇలా సద్వినియోగం చేసుకోండి అని మేం పదేపదే చెప్పలేం’’ అని సీజేఐ గవాయ్ అసహనం వ్యక్తంచేశారు. ‘సీఏక్యూఎం, సీపీసీబీల్లో పోస్ట్‌లను మూడు నెలల్లోపు భర్తీచేయండి. పదోన్నతి పోస్ట్‌లను ఆరు నెలల్లోపు భర్తీచేయండి’ అని కోర్టు ఆదేశించింది. రైతులు కథలు చెబుతున్నారుఈ కేసులో పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా, అమికస్ క్యూరీ(కోర్టు సహాయకురాలు)గా అపరంజిత హాజరయ్యారు. గతేడాదితో పోల్చితే పంట వ్యర్థాల దహనం తగ్గుముఖం పట్టిందని మెహ్రా న్యాయస్థానానికి తెలిపారు. ఈ ఏడాది వ్యర్థాల దహనాలను మరింతగా అడ్డుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ వాదనలతో అమికస్ క్యూరీ అపరంజిత విభేదించారు. రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ఉండటానికి ప్రభుత్వం రైతులకు నగదు ప్రోత్సాహకాలు, ఇతర పరికరాలు అందిస్తున్నప్పటికీ పెద్దగా మార్పు లేదని ఆమె న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఉపగ్రహాలు తమ పంటపొలాల మీదుగా వెళ్లిన సమయాల్లో పంట వ్యర్థాలకు నిప్పు పెట్టొద్దని వ్యవసాయశాఖ అధికారులే తమకు ఉప్పందించారని రైతులు అవే కథలు మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆమె కోర్టుకు వివరించారు. పంట వ్యర్థాల దహనంపై 2018లోనే సుప్రీంకోర్టు విస్తృతమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. అయినప్పటికీ మరోసారి రాష్ట్ర ప్రభుత్వాలు నిస్సహాయ స్థితిలో కోర్టు ముందు నిలిచాయని వ్యాఖ్యానించారు.లేదంటే మేమే నిర్ణయం తీసుకుంటాం‘పర్యావరణానికి నష్టం కలిగించే రైతులపై చర్యలు తీసుకోవాలి. ఒక వేళ కఠిన చర్యలు తీసుకోవడానికి మీకు మనసురాకపోతే ఆ విషయాన్ని అయినా లిఖితపూర్వకంగా మాకు తెలపండి. మీరు ఒక నిర్ణయం తీసుకోండి. లేకుంటే మేమే తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని సీజేఐ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ముందుగా అరెస్టులు, చర్యలు తీసుకున్నాం. కానీ వీరిలో హెక్టార్ సాగుభూమి ఉన్న రైతులే ఎక్కువ. వీళ్లను జైల్లో పెడితే, వీళ్లపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి ఏంటి? గడిచిన సంవత్సరాల్లో పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన ఘటనలు 77,000 జరిగితే అవి ఏకంగా 10,000 స్థాయికి దిగొచ్చాయి’ అని రాహుల్ మెహ్రా కోర్టుకు నివేదించారు. దీనిపై సీజేఐ స్పందించారు. ‘ఎప్పట్లాగా రోటీన్‌గా రైతులకు సూచనలు చేయడం మానేసి ఈసారి అరెస్టులు, జైలుకు పంపడానికి కూడా మేం వెనకాడము అనే గట్టి సందేశాన్ని ఇవ్వండి. వచ్చే పంటకాలంలోపు పొలాల్లో వ్యర్థాలు పర్యావరణహితంగా తొలగించాలి’ అని ఆయా రాష్ట్రాలకు సీజేఐ సూచించారు. -
హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై కాల్పులు.. నిందితుల ఎన్కౌంటర్
సాక్షి,న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై కాల్పుల ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిశాపఠానీ ఇంటిపైకి కాల్పులకు తెగబడ్డ నిందితుల్ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ప్రముఖ అంతర్జాతీయ నేరస్థుల ముఠా సభ్యులైన ఈ ఇద్దరిని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.సెప్టెంబర్ 12న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ నగర సివిల్ లైన్స్ ఏరియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆ రోజు తెల్లవారు జామున సరిగ్గా 3.45 నిమిషాలకు గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా ముఠాకు చెందిన రవీంద్ర, అరుణ్‌లు ఈ కాల్పులు జరిపారు. అయితే, ఈ కాల్పుల ఘటనను యూపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నిందితులు ఎక్కడున్నా వారిని పట్టుకుని తీరుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు.ఆ మరుసటి రోజే ఘాజియాబాద్‌లోని ట్రోనికా సిటీలో ఎస్టీఎఫ్ నోయిడా యూనిట్, ఢిల్లీ పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. సంఘటనా స్థలం నుంచి తుపాకీ,బుల్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు లా అండ్ ఆర్డర్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఎడిజి) అమితాబ్ యష్ తెలిపారు. ఇటీవల,దిశా పటానీ సోదరి,మాజీ ఆర్మీ అధికారిణి ఖుష్బూ పటానీ ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారనే కారణంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని గోల్డీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించింది. -
అస్సాం సివిల్ సర్వీసు అధికారిణి నూపుర్ బోరా అరెస్టు
గౌహతి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అస్సాం సివిల్ సర్వీసు(ఏసీఎస్) అధికారిణి నూపుర్ బోరాను ప్రత్యేక నిఘా విభాగం అధికారులు అరెస్టు చేశారు. భూకుంభకోణంలో ఆమె పాత్రపై ఆరోపణలు రావడంతో అదుపులోకి తీసుకున్నారు. రాజధాని గౌహతిలోని ఇమె ఇంటితోపాటు మరో మూడు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో దాదాపు రూ.2 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు లభించినట్లు తెలిసింది. ప్రభుత్వ భూమిని అక్రమ వలసదార్ల పేరిట రిజి్రస్టేషన్‌కు చేయడానికి సహకరించి, లంచాలు తీసుకున్నట్లు నూపుర్ బోరాపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమెపై దర్యాప్తు కొనసాగుతోందని అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ చెప్పారు.ఎవరీ అధికారిణి?: నూపుర్ బోరా 1989 మార్చి 31న అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో జన్మించారు. తొలుత డీఐఈటీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. 2019లో ఏసీఎస్ అధికారిణిగా విధుల్లో చేరారు. 2019 నుంచి 2023 దాకా అసిస్టెంట్ కమిషనర్‌గా, తర్వాత సర్కిల్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు సోమవారం అరె స్టు చేశారు. సోదాల్లో రూ.90 లక్షల నగదు, రూ.కోటికిపైగా విలువైన ఆభరణాలు స్వా ధీనం చేసుకున్నట్లు సమాచారం. వివాదాస్పద భూముల రిజిస్ర్టేషన్ వ్యవహారంలో ఆమెపై గత ఆరు నెలలుగా తనకు ఫిర్యాదులు వచ్చాయని సీఎం హి మంత బిశ్వ శర్మ చెప్పారు. ఆమెపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. బార్పేట జిల్లాలో సర్కిల్ ఆఫీసర్‌గా పనిచేసిన సమయంలో ప్రభుత్వ భూములను ప్రభుత్వ, సాత్ర భూములను ఆక్రమ వలసదార్ల పరం చేసేందుకు సహకరించారని పేర్కొన్నా రు.ప్రతి పనికీ రేటుకార్డు!: ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ నేతృత్వంలోని కృషాక్ ముక్తి సంగ్రామ్ సమితి(కేఎంఎస్ఎస్) అనే సంస్థ నూపుర్ బోరాపై ఫిర్యాదు చేసింది. భూముల లావాదేవీలకు సంబంధించిన ప్రతి పనికీ లంచాలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. భూముల మ్యాప్‌నకు రూ.1,500, ల్యాండ్ రికార్డుల్లో పేరు చేర్చడానికి లేదా తొలగించడానికి రూ. 2 లక్షలు తీసుకున్నారని స్పష్టంచేసింది. నూపుర్ బోరా సహాయకుడు, బార్పేట రెవెన్యూ సర్కిల్ ఆఫీసర్ సురాజిత్ డేకా ఇంట్లోనూ సోదాలు జరిగా యి. నూపర్ బోరా అండతో అతడు పలు భూము లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. -
విజయనగరం ఐసిస్ కేసులో కదలిక
సాక్షి హైదరాబాద్/కొత్తగూడెం టౌన్: ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)ల ద్వారా విధ్వంసాలకు పాల్పడడానికి కుట్రపన్నిన విజయనగరం ఐసిస్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, ఢిల్లీలోని 16 ప్రాంతాల్లో మంగళవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ మేరకు ఎన్ఐఏ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. విజయనగరం కేంద్రంగా ఐసిస్ ఉగ్రవాది సిరాజ్–ఉర్–రెహమాన్‌ను జులైలో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఐఈడీల తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలను సిరాజ్ కలిగి ఉండటంతో ఉగ్రవాద నెట్‌వర్క్‌పై ఎన్ఐఏ స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 27న సౌదీ అరేబియాలోని రియాద్‌కు పారిపోవడానికి ప్రయత్నించిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్‌ను అరెస్ట్ చేసింది. సిరాజ్‌తో కలిసి నేపాల్ సరిహద్దు ద్వారా ఆయుధాల సరఫరాకు ఏర్పాట్లు చేయడానికి కుట్ర చేసినట్లు గుర్తించింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్ర పన్నినట్లు సిరాజ్ విచారణలో వెల్లడించాడు. దీని ఫలితంగా మరో నిందితుడు సయ్యద్ సమీర్‌ను కూడా ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఈ సోదాల్లో డిజిటల్ వివైజులు, డాక్యుమెంట్లు, నగదు సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఉగ్రవాదం వైపు యువత రిక్రూట్‌మెంటుకు సంబంధించిన ఆధారాలు సేకరించింది. కాగా, ఈ కేసుకు సంబంధించిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఐదు నెలల క్రితం పెట్టిన మతపరమైన పోస్టులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొందరు లైక్ కొట్టిన నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. కొత్తగూడెం బస్టాండ్ సమీపాన మధురబస్తీలోని ఓ ఇంటికి తెల్లవారుజామున 4 గంటలకు దాదాపు పది వాహనాలతో వచ్చిన అధికారులు ఉదయం 6 గంటల వరకు సోదాలు నిర్వహించి వివరాలు సేకరించారు. అనంతరం కొత్తగూడెం పాలకేంద్రం సమీపాన మరొకరి ఇంట్లోనూ చేపట్టిన తనిఖీలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగాయి. -
రూ. 15 వేలు లంచం తీసుకుంటూ సివిల్ సర్వీస్ టాపర్ అరెస్టు
సంబల్పూర్: ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలోని బమ్రా తహశీల్దార్‌గా పనిచేస్తున్న రాష్ట్ర సివిల్ సర్వీస్ పరీక్ష టాపర్ అశ్విని కుమార్ పాండా అవినీతికి పాల్పడుతూ ఒడిశా విజిలెన్స్ అధికారులకు దొరికిపోయారు. వ్యవసాయ భూమిని ఇంటి భూమిగా మార్చేందుకు ఒక వ్యక్తి నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగావిజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.నెల రోజుల క్రితం ఫిర్యాదుదారు తహశీల్దార్ కార్యాలయంలో భూమి మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ‘పాండా రూ. 20,000 లంచం డిమాండ్ చేసి, ఫిర్యాదుదారునికి అనుకూలంగా హక్కు రికార్డు (ఆఓఆర్)జారీ చేశాడు. అయితే అంత మొత్తాన్ని చెల్లించలేనని ఆ వ్యక్తి తహశీల్దార్ పాండాకు తెలిపారు. దీంతో పాండా లంచం మొత్తాన్ని రూ. 15,000 కు తగ్గిస్తూ, ఇది కూడా చెల్లించకుంటే మ్యుటేషన్ కేసులో ఈ మార్పిడిని అనుమతించబోనని పాండా బెదిరించాడని విజిలెన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.దీనిపై ఫిర్యాదుదారు విజిలెన్స్ అధికారులను తెలియజేశాడు.దీంతో ఒక పథకం ప్రకారం అధికారులు శుక్రవారం వల వేసి, అశ్విని కుమార్ పాండాను పట్టుకున్నారు. అనంతరం పాండాకు చెందిన భువనేశ్వర్‌లోని ఇంటిలో తనిఖీలు చేపట్టి, రూ.4,73,000 విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయన డ్రైవర్ పి ప్రవీణ్ కుమార్‌ను కూడా అవినీతి నిరోధక చట్టం కింద విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ చేసిన పాండా 2019లో ఒడిశా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచారు. 2021, డిసెంబర్లో జూనియర్ ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఓఏఎస్)లో చేరి, ట్రైనింగ్ రిజర్వ్ ఆఫీసర్ (టీఆర్ఓ)గా ప్రభుత్వ సేవలో ప్రవేశించారు. -
కిర్క్ కిల్లర్ దొరికాడు
వాషింగ్టన్: అమెరికా డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడైన చార్లీ కిర్క్‌ను కాల్చి చంపిన హంతకుడు ఎట్టకేలకు దొరికిపోయాడు. 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్ ఈ హత్యకు పాల్పడ్డాడని, అతడిని అరెస్టు చేశామని ఎఫ్‌బీఐ అధికారులు శుక్రవారం ప్రకటించారు. హంతకుడిని బంధించినట్లు యూటా రాష్ట్ర గవర్నర్ స్పెన్సర్ కాక్స్ ధ్రువీకరించారు. చార్లీ కిర్క్‌ను హత్య చేసింది టైలర్ రాబిన్సన్ అనే విషయం అతడి కుటుంబ సభ్యులకు తెలిసిన వెంటనే వారు ఆ విషయాన్ని తమ కుటుంబ మిత్రుడికి చేరవేశాడు. ఆ మిత్రుడు పోలీసు అధికారులను సంప్రదించి సమాచారం అందించాడు. పోలీసులు రంగంలోకి దిగి రాబిన్సన్ను అరెస్టు చేశారు. తాను ఈ నేరం చేశానని అతడు ఒప్పుకున్నట్లు సమాచారం. రాబిన్సన్ ఈ మధ్య కాలంలో రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలో ట్రంప్ మిత్రుడైన చార్లీ కిర్క్ వ్యవహార శైలి అతడికి నచ్చలేదు. అందుకే హత్య చేసినట్లు తెలుస్తోంది. -
ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసు.. నిందితుడి మగ్‌షాట్ విడుదల
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్(31) హత్య కేసులో ఎఫ్‌బీఐ అధికారులు పురోగతి సాధించారు. 48గంటల్లో నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఎఫ్‌బీఐ నిందితుడు టైలర్ రాబిన్సన్ మగ్‌షాట్ (అరెస్టు సమయంలో తీసిన ఫోటో)ను విడుదల చేసింది. టైలర్ రాబిన్సన్ అనే 22 ఏళ్ల యువకుడు. యుటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో చార్లీ కిర్క్‌ను కాల్చి చంపాడు.ఈ ఘటన పట్టపగలు 3వేల మంది ప్రజల సమక్షంలో జరిగింది. రాబిన్సన్ అరెస్ట్ అనంతరం, అతని ఫోటోను ఎఫ్‌బీఐ అధికారికంగా విడుదల చేయడం ద్వారా ప్రజలకు సమాచారం ఇవ్వడమే కాకుండా,కేసు విచారణలో పారదర్శకతను పెంచే ప్రయత్నం చేస్తున్నారు.ఎఫ్‌బీఐ స్థానిక పోలీసు శాఖలతో కలిసి ఈ కేసును విచారిస్తోంది. చార్లీ కిర్క్‌ను హత్య చేయడానికి నిందితుడి మోటివ్, తుపాకీని ఎక్కడి నుంచి సేకరించారు. సంఘటనకు ముందు జరిగిన పరిణామాలపై దృష్టి పెట్టారు. రాబిన్సన్ను ఇప్పటికే విచారిస్తున్నట్లు సమాచారం. -
దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణలో టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని బోధనలో ఒకరిని అరెస్ట్ చేశారు. పాక్ హ్యాండ్లర్లతో కలసి టెర్రరిస్టులు దాడులకు కుట్రలు పన్నుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయినవారిలో కెమికల్ బాంబుల తయారీ ఎక్స్పర్ట్ డానిష్ ఉన్నాడు. భారీ టెర్రర్ మాడ్యుల్‌ను ఢిల్లీ పోలీసులు గుట్టురట్టు చేశారు.దేశవ్యాప్తంగా దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో టెర్రరిస్టులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. టెర్రరిస్టుల నుంచి భారీగా తుపాకీలు, బుల్లెట్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.ముంబైకి చెందిన అఫ్తాబ్, అబు సుఫియాన్‌లను ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు. ఆషర్ డానిష్‌ను రాంచీలో, కమ్రాన్ ఖురేషీని మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో, హుజైఫ్ యెమెన్‌ను తెలంగాణలో అరెస్టు చేశారు. ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోని తమ హ్యాండ్లర్లతో సోషల్ మీడియా ద్వారా నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారని అధికారులు వెల్లడించారు. #WATCH | Delhi Police Special Cell busted a Pan-India terror module and arrested five terrorists identified as Ashhar Danish, Sufiyan Abubakar Khan, Aaftab Ansari, Huzaifa Yaman and Kamran Qureshi A large quantity of materials and precursors for making IED have been seized from… https://t.co/uAcHkQ8r58 pic.twitter.com/zoCOqCkCJK— ANI (@ANI) September 11, 2025 -
బోధన్‌లో ఉగ్రకలకలం
సాక్షి,బోధన్: నిజామాబాద్‌లో ఉగ్ర కలకలం రేపుతోంది. బోధన్ పట్టణంలో మహమ్మద్ ఉజైఫా యమాన్ అనే అనుమానిత ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.ఇటీవల ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా కేంద్రదర్యాప్తు సంస్థలు ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో రాంచీలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్న హషన్ డ్యానిష్‌ను అరెస్ట్ చేశాయి. అయితే డ్యానిష్ ఇచ్చిన సమాచారంతో నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న హుజైఫా ఎమన్‌ను అదుపులోకి తీసుకున్నారు. బోధన్ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం పీటీ వారెంట్‌పై ఢిల్లీకి తరలించారు. నిందితుడి నుంచి ఎయిర్ పిస్తోల్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కాగా, యామన్.. బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్నట్లు ఎన్ఐఏ సోదాల్లో తేలింది. -
ఐఎస్ఐకి భారత సిమ్ కార్డుల సరఫరా .. నేపాలీ జాతీయుడి అరెస్టు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఏజెన్సీకి భారత సిమ్ కార్డులను సరఫరా చేశాడనే ఆరోపణలపై ఒక నేపాలీ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ప్రభాత్ చౌరాసియా(43) బీఎస్సీ చదువుకున్నాడని, మహారాష్ట్ర, ఢిల్లీలో ఫార్మాస్యూటికల్ కంపెనీలలో పనిచేశాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు.మహారాష్ట్రలోని లాతూర్‌లో నమోదైన తన ఆధార్ కార్డును ఉపయోగించి బీహార్, మహారాష్ట్రల నుండి 16 సిమ్ కార్డులను కొనుగోలు చేశాడని పోలీసులు పేర్కొన్నారు. తరువాత వాటిని గూఢచర్యంతో సంబంధం ఉన్న కార్యకలాపాలను నిర్వహించడానికి ఉపయోగించాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిందితుడిని ఆగస్టు 28న స్పెషల్ పోలీసు బృందం లక్ష్మీ నగర్‌లోని విజయ్ బ్లాక్‌లో అరెస్టు చేసినట్లు తెలిపారు. లాహోర్, బహవల్పూర్, పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల నుండి ఐఎస్ఐ ఆపరేటర్లు పదకొండు సిమ్‌లను ఆపరేట్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. నిందితుడు 2024లో నేపాలీ మధ్యవర్తి ద్వారా ఐఎస్ఐ హ్యాండ్లర్లను సంప్రదించాడని దర్యాప్తులో తేలింది. అమెరికా వీసా, విదేశాల్లో జర్నలిజంలో అవకాశాల హామీతో అతన్ని ఐఎస్ఐ ఏజెంట్లు ఆకర్షించారు. డీఆర్డీఓ, ఆర్మీ సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిని అతనిని అప్పగించారని స్పెషల్ సెల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమిత్ కౌశిక్ తెలిపారు.నిందితుడు సిమ్ కార్డులను భారతదేశం నుండి ఖాఠ్మండుకు అక్రమంగా రవాణా చేసి, తరువాత ఐఎస్ ఐహ్యాండ్లర్లకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. 2017లో ప్రభాత్ చౌరాసియా ఖాఠ్మండులో ఒక లాజిస్టిక్స్ కంపెనీని ప్రారంభించాడు. అది ఆర్థిక నష్టాల కారణంగా మూతబడింది. దీంతో సంపాదన కోసం ఐఎస్ఐ హ్యాండ్లర్లతో పరిచయం పెంచుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా నిందితుని నుంచి పలు డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రభాత్ చౌరాసియాపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇంటి అటక మీద దాక్కున్న మాజీ ఎంపీ.. ఆటకట్టించిన పోలీసులు
లక్నో:నెల పాటు పరారీలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ కైష్ ఖాన్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. దాదాపూ నెల రోజు పాటు పరారీలో ఉన్న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఉత్తరప్రదేశ్ ఎస్పీ అధ్యక్షుడు,మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సన్నిహితుడు కైష్ఖాన్పై ఐదు కేసులు నమోదయ్యాయి. వాటిల్లో పురావస్తు శాఖకు చెందిన భూమిని అక్రమంగా ఆక్రమించారనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గతంలో అనేక వివాదాలకు కైష్‌ఖాన్ కేంద్ర బిందువుగా నిలిచారు. దీంతో చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు. నిబంధనల మేరకు.. కైష్‌ఖాన్ సొంత జిల్లాలో ఉండకూడు. అయినప్పటికీ పోలీసుల కళ్ళు గప్పి తన సొంత జిల్లాలో ఉంటున్నారు. ఈ క్రమంలో నెల రోజుల నుంచి కైష్‌ఖాన్ గురించి పోలీసులు అన్వేషిస్తున్నారు.తాజాగా కైష్‌ఖాన్ ఆచూకీపై సమాచారం అందడంతో ఆయన ఇంట్లోనే పోలీసులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో అటకపై పరుపును అడ్డుగా పెట్టుకుని దాక్కున్న కైష్ఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ప్రజలలో చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకులు ఇలా పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Caught inside a mattress, watch how ex-Samajwadi Party leader was nabbed by police… pic.twitter.com/zoYpexcvt2— Brut India (@BrutIndia) September 4, 2025 -
సొంత ఖాతాలోకి రూ. 232 కోట్లు బదిలీ
జైపూర్: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగి ఒకరు రూ.232 కోట్లు స్వాహా చేశారు. జైపూర్ విమానాశ్రయంలో ఫైనాన్స్ ఇన్చార్జ్గా పనిచేస్తున్న రాహుల్ విజయ్.. గతంలో డెహ్రడూన్ విమానాశ్రయంలో సీనియర్ మేనేజర్‌గా పనిచేశాడు. 2019–20, 2022–23 మధ్య కాలంలో అధికారిక, ఎలక్ట్రానిక్ రికార్డులను తారుమారు చేస్తూ పథకం ప్రకారం మోసానికి పాల్పడ్డాడు. నకిలీ, కల్పిత ఆస్తులను సృష్టించి, వాటి విలువలను పెంచి, కొన్నిసార్లు ఎంట్రీలకు సున్నాలను జోడించి రికార్డులను తారుమారు చేశాడు.ఆ రికార్డుల నుంచి దాదాపు రూ.232 కోట్ల ప్రజా నిధులను తన వ్యక్తిగత ఖాతాలకు మళ్లించాడు. ఆ తర్వాత నిందితుడు ఆ డబ్బును ట్రేడింగ్ ఖాతాల్లోకి బదిలీ చేశాడు. ఈ మోసాన్ని గుర్తించి సీబీఐకి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచి్చంది. సీబీఐ అధికారులు ఆగస్టు 28న, జైపూర్‌లోని విజయ్ అధికారిక, నివాస ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడిలో స్థిరాస్తులు, విలువైన సెక్యూరిటీలకు సంబంధించిన పత్రాలు స్వా«దీనం చేసుకున్నారు. ప్రజా నిధుల దురి్వనియోగం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. -
అత్యాచారం కేసులో ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్
సనౌర్: పంజాబ్‌లోని సనౌర్ ఎమ్మెల్యే హర్మిత్ సింగ్ పఠాన్మజ్రాను అత్యాచారం ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. హర్మిత్ సింగ్ మాజీ భార్య ఆయనపై అత్యచార ఆరోపణలు చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి ఈ అత్యాచారం ఆరోపణలపై కేసు నమోదుకాగా, మంగళవారం ఉదయం హర్యానాలోని కర్నాల్‌లో పంజాబ్‌లోని కర్నాల్‌లో ఎమ్మెల్యే హర్మిత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్, జల వనరుల ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్‌పై సనూర్ ఎమ్మెల్యే విమర్శలు చేసిన దరిమిలా ఈ పరిణామం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి 10.17 గంటలకు పఠాన్మజ్రా మాజీ భార్య.. పటియాలాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశారు. ఆమె పేర్కొన్నా వివరాల ప్రకారం 2014,ఫిబ్రవరి 12 నుంచి 2024 జూన్ 12 వరకు ఈ నేరం జరిగిందని ఆరోపించారు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యేపై భారతీయ శిక్షాస్మృతిలోని 376, 420,506 సెక్షన్ల కింద అత్యాచారం, మోసం, క్రిమినల్ బెదిరింపుల అభియోగాలపై కేసు నమోదు చేశారు.పఠాన్మజ్రాను అతని బంధువుల గ్రామమైన దబ్రీలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పఠన్‌మజ్రా.. ఢిల్లీకి చెందిన ఆప్ నేతల లైంగిక కార్యకలాపాల వీడియోలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. వారు తనపై అత్యాచారం కేసు పెట్టారని, తాను కోర్టులో దానిని ఎదుర్కొంటానని అన్నారు. ఇప్పుడు ఢిల్లీ-పంజాబ్ మధ్య కబడ్డీ ఆట జరుగుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. -
‘డేట్’కు పిలిచి.. రూ. 9 లక్షల బిల్లు ఎగ్గొట్టి..
హాంకాంగ్: హాంకాంగ్‌లో విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. రూ. 9 లక్షల డిన్నర్ బిల్లుతో పాటు‘డేట్’ను కూడా అక్కడే వదిలి వెళ్లిన హాంకాంగ్ ‘లాయర్’ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హాంకాంగ్‌లో న్యాయవాదిగా చలామణీ అవుతూ, లగ్జరీ డిన్నర్‌కు భారీగా ఆర్డర్ ఇచ్చి, ఆ మొత్తాన్ని ఎగ్గొట్టడమే కాకుండా, డేట్‌ను కూడా అక్కడే వదిలి వెళ్లిన 23 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.అతనితో డేట్‌కు వచ్చిన యువతి అతని పేరు వాంగ్ అని మాత్రమే తెలుసని పోలీసులకు వివరించింది. తనను ఒక విలాసవంతమైన రెస్టారెంట్లో వదిలివేసి, 80 వేల అమెరికన్ డాలర్లు (రూ.9 లక్షలు) చెల్లించకుండా వెళ్లిపోయాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఉదంతంలో పోలీసులు వాంగ్‌ను ట్సుంగ్ క్వాన్ ఓలో అదుపులోకి తీసుకున్నారు. ఘటన సమయంలో అతను ధరించినట్లు భావిస్తున్న దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ‘ది స్టాండర్డ్’ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు సెంట్రల్ డిస్ట్రిక్ట్ క్రైమ్ యూనిట్ దర్యాప్తులో ఉన్నాడు. సెంట్రల్‌లోని మాండరిన్ ఓరియంటల్ హోటల్లో విందు కోసం ఒక యువతిని డేట్ కు వాంగ్ ఆహ్వానించాడు. ఆ సమయంలో వాంగ్ ఆమెకు తాను న్యాయవాదినని పరిచయం చేసుకున్నాడు. డిన్నర్ సమయంలో వారు అత్యంత ఖరీదైన షాంపైన్ బాటిల్‌ను ఆర్డర్ చేశారు. మొత్తం బిల్లు రూ. 9లక్షలకు పైగానే వచ్చింది.అయితే, ఆ బిల్లు చెల్లించే సమయానికి ‘న్యాయవాది’ వాష్‌రూమ్‌కు వెళ్లాలని ‘డేట్’కు చెప్పి, అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. ఆమె ఫోనులో అతన్ని సంప్రదించేందుకు ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. దీంతో ఆమె ఈ విషయాన్ని పోలీసులకు తెలిపింది. తరువాత ఆమె స్నేహితుల సహాయం కోరగా, వారు డిన్నర్ బిల్లు చెల్లించారు. ‘డేట్’ బాధితురాలి ఫిర్యాదు దరిమిలా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, విచారిస్తున్నారు. -
విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో కీలక నిందితుడు అరెస్ట్
సాక్షి, ఢిల్లీ: విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో కీలక నిందితుడిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆరిఫ్ హుస్సేన్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. రేపు(శుక్రవారం) విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో ఆరిఫ్ హుస్సేన్‌ను హాజరుపర్చనున్నారు.వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేసేందుకు ఆయుధాలను సమకూర్చుతున్న ఆరిఫ్.. దేశంలో ఉంటూ జిహాదీ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు ఎన్ఐఏ గుర్తించింది. సిరాజ్, సమీర్ అరెస్టుల తర్వాత దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఇవాళ(గురువారం) ఆరిఫ్‌ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఉగ్ర వాదులు సిరాజ్, సమీర్లతో కలిసి పని చేసిన ఆరిఫ్.. ఐడీల ద్వారా ఉగ్రదాడులు చేసేందుకు కెమికల్స్‌ను తీసుకెళ్తుండగా సమీర్, సిరాజులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యాసంస్థల్లోకి మత్తు భూతం చొరబడిపోయింది. బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. డ్రగ్స్ తీసుకుంటున్న విద్యార్థులను ఈగల్ టీం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇద్దరు విద్యార్థులతో సహా మొత్తం నలుగురిని నార్కోటిక్ బ్యూరో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మత్తుకు బానిసలైన మరో 50 మంది విద్యార్థులను విచారించేందుకు సిద్ధమైంది. బహదూర్‌పల్లి బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్, గంజాయి దందా నడుస్తోంది. ఈ సమాచారంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్ విభాగం మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. గంజాయి సేవిస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ క్రమంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మణిపూర్‌కు చెందిన ఓ విద్యార్థిని ఢిల్లీకి చెందిన ఓ ముఠా నుంచి కొరియర్ ద్వారా ఓజీ కుష్ డ్రగ్‌ను తెప్పించుకుంటున్నాడు. దానిని గంజాయితో కలిపి సిగరెట్లు తయారు చేసి మిగతా స్టూడెంట్స్‌కు విక్రయిస్తున్నాడు. దీంతో సదరు విద్యార్థిని మరో విద్యార్థితో పాటు ఇద్దరు డగ్ర్ పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల నుంచి కిలోకి పైగా గంజాయి, 47 ఓజీ కుష్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు వీటికి బానిసలైనట్లు గుర్తించారు. ఈ పరిణామంపై కాలేజీ యాజమాన్యం స్పందించాల్సి ఉంది. -
గోడ దూకి పారిపోయిన ఎమ్మెల్యే
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహాను ఈడీ అధికారులు అనూహ్యరీతిలో అరెస్ట్‌చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తన ఇంట్లో, తనకు సంబంధించిన స్థలాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారన్న సమాచారంతో అప్పటికప్పుడు ఎమ్మెల్యే తన ఇంటి మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి, తర్వాత ఎత్తయిన గోడ ఎక్కి బయటకు ఎలాగోలా దూకి పారిపోయారు. రెప్పపాటులో ఈ విషయం కనిపెట్టిన ఈడీ అధికారులు, సీఆర్పీఎఫ్ బలగాలు వెంటనే ఆయన వెంటబడిమరీ సమీప పొలంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆలోపే ఎమ్మెల్యే తన స్మార్ట్ఫోన్లను సమీపంలోని బురదకుంటలో పడేశారు. అయినాసరే పోలీసులు వాటిని వెలికితీసి స్వాధీనంచేసుకున్నారు. మొబైల్లో కీలక సమాచారం ఉందని భావిస్తున్నారు. బురదకొట్టుకుపోయిన ఎమ్మెల్యేను పొలం గట్టు వెంట పోలీసులు అరెస్ట్‌చేసి తీసుకొస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ముర్షీదాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఈ నాటకీయ పరిణామం జరిగింది. అరెస్ట్ తర్వాత సాహాను ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్ట ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆగస్ట్ 30వ తేదీదాకా ఈడీ రిమాండ్‌కు తరలిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. ఎమ్మెల్యే సాహా సంబంధ స్థలాలతోపాట రఘునాథ్‌గంజ్‌లోని సాహా కుటుంబసభ్యులు, బంధువులు, అనుచరుల నివాసాల్లోనూ ఈడీ సోదాలుచేసి కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనంచేసుకుంది. ఇదే టీచర్లు, స్టాఫ్ నియామక కేసులో 2023 ఏప్రిల్‌లో సాహాను సీబీఐ అధికారులు అరెస్ట్‌చేశారు. ఇటీవల ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఇదే కేసు విచారణలో భాగంగా ఆయనను ప్రశ్నించగా ఏమాత్రం సహకరించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో అరెస్ట్చేయాల్సి వచ్చిందని న్యాయస్థానంలో హాజరుపర్చిన సందర్భంగా ఈడీ వాదించింది. పశ్చిమబెంగాల్లో ప్రైమరీ టీచర్లతోపాటు 9, 10వ తరగతులు బోధించే అసిస్టెంట్ టీచర్లు, గ్రూప్–సి, డి సిబ్బంది నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని సీబీఐ తొలుత కేసు నమోదుచేసింది. ఇందులోని వివరాలతో తర్వాత ఈడీ ఎఫ్ఐఆర్ నమోదుచేసి దర్యాప్తును మనీలాండరింగ్ కోణంలో విస్తృతస్థాయిలో దర్యాప్తుచేసింది. ఈ కుంభకోణంలో కీలకసూత్రధారిగా భావిస్తున్న నాటి విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సహాయకురాలు అర్పితా ముఖర్జీ, మాజీ టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యలను కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే అరెస్ట్‌చేశాయి. #Breaking: #TMC MLA from Burwan, Murshidabad district, Jiban Krishna Saha arrested by ED in connection with SSC scam. Sources in ED say, Jiban Krishna Saha tried to jump the boundary wall of the house & flee when ED officials reached his residence this morning. This apart, he… pic.twitter.com/ff5MBD21Yq— Pooja Mehta (@pooja_news) August 25, 2025 -
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ రైడ్స్.. నోట్ల కట్టలు.. నగల గుట్టలు
కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) శనివారం అరెస్ట్ చేసింది. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై గ్యాంగ్‌టక్‌లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. వీరేంద్ర పలు అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లు నడుపుతున్నట్లు ఈడీ గుర్తించింది. ఆయన సోదరుడు కేసీ తిప్పేస్వామి దుబాయ్‌లో మూడు సంస్థలు ద్వారా గేమింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. గ్యాంగ్టాక్లో కాసినో స్థలాన్ని లీజుకు తీసుకునే ప్రయత్నంలో ఉన్న సమయంలో వీరేంద్రను అరెస్ట్ చేశారు.ఈ బెట్టింగ్ రాకెట్ కార్యకలాపాలు దుబాయ్ కేంద్రంగా సాగుతున్నట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ అరెస్టు క్రమంలో ముందుగా దేశవ్యాప్తంగా వీరేంద్రకు సంబంధించిన 30 ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో దాడులు జరిపింది. 22, 23(శుక్ర, శని) తేదీల్లో సిక్కిం, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవాతో సహా పలు రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. గోవాలోని ఐదు ప్రముఖ కాసినోలపై కూడా దాడులు జరిగాయి. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని భారీ మొత్తంలో నగదు, బంగారం బయటపడ్డాయి. ఈడీ సోదాల్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.తనిఖీల్లో సుమారు రూ. 12 కోట్ల నగదు, రూ. 6 కోట్ల విలువైన గోల్డ్ ఆభరణాలు, 10 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన నగదులో దాదాపు కోటి రూపాయల విలువైన విదేశీ కరెన్సీని కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. నాలుగు ఖరీదైన వాహనాలను సీజ్ చేయడంతో పాటు వీరేంద్రకు చెందిన 17 బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు స్తంభింపజేశారు. రెండు బ్యాంక్ లాకర్లను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. -
Dharmasthala Case: మరో ట్విస్ట్.. ముసుగు వ్యక్తి అరెస్ట్
ధర్మస్థళ: కర్ణాటకలోని ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ వ్యవహారంలో తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించిన ముసుగు వ్యక్తి భీమాను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ధర్మస్థళకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేశాడనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు.లభించని మృతదేహాల ఆనవాళ్లుఇటీవలి కాలంలో ధర్మస్థళ వ్యవహారం జాతీయ స్థాయిలో దుమారం రేపింది. ధర్మస్థళ ప్రాంతంలో వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా అధికారులకు తెలిపాడు. ఆ మృతదేహాల్లో ఎక్కువగా అత్యాచారం, హత్యలకు గురైన మహిళలవే ఉన్నాయన్నాడు. దీంతో అతను చెప్పిన విషయాన్ని సీరియస్‌గా తీసుకుని రంగంలోకి దిగిన సిట్ అధికారులు అతను చెప్పిన ప్రాంతాల్లో తవ్వకాలు ప్రారంభించారు. అయితే మృతదేహాలకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు అధికారులకు లభించలేదు.మాయమాటలతో వ్యవస్థను నమ్మించి..మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమాను శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సిట్ ప్రధాన అధికారి అయిన ప్రణబ్ మహంతి మరోమారు విచారించారు. ఈ నేపధ్యంలో అతను మాయమాటల చెప్పి వ్యవస్థను నమ్మించి, ఇప్పుడు తనకు ఏమీ తెలియదని అంటున్నాడని విచారణలో గుర్తించారు. ఈ నేపద్యంలోనే అధికారులు భీమాను అరెస్టు చేశారు. నేడు (శనివారం) అతనిని కోర్టుకు హాజరుపరచనున్నారు. దీనికి ముందు భీమా.. తనకు ఒకరు పుర్రె ఇచ్చి, సిట్ అధికారులకు ఇవ్వాలని చెప్పారని.. కోర్టులో కేసు కూడా వారే చేయించారని చెప్పాడు.సుజాత భట్ చెప్పిందీ కట్టుకథే..మరోవైపు సుజాత భట్ తాను గతంలో ధర్మస్థళకు వెళ్లినప్పుడు తన కూతురు మిస్ అయిందని తాను చెప్పినవన్నీ కట్టుకథలే అని సిట్ అధికారులమందు నిజం వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛాన్‌ల్‌తో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని చెప్పారు. తనకు అసలు అనన్య భట్ అనే కూతురే లేదని.. ధర్మస్థళ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులు తనతో అలా చెప్పించినట్లు ఆమె పేర్కొంది. అనన్య మిస్ అయినట్లు వచ్చిన ఫొటోలు కూడా కొత్తగా సృష్టించినవేనన్నారు. విచారణకు రాలేను: యూట్యూబర్ సమీర్ ధర్మస్థళ గురించి అపప్రచారం చేసిన ఆరోపణల కేసులో అరెస్ట్ భయాన్ని ఎదుర్కొంటున్న యూట్యూబర్ సమీర్‌కు మంగళూరులో జిల్లా సెషన్స్ న్యాయస్థానం గురువారం ముందస్తు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం సమీర్‌కు వ్యతిరేకంగా చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. అరెస్ట్ భయంతో యూట్యూబర్ ఎండీ.సమీర్ బెళ్తంగడి సర్కిల్ ఇన్స్పెక్టర్కు లేఖ రాశాడు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్కు సంబంధించి లేఖ రాస్తున్నానని, తాను ధర్మస్థల స్టేషన్‌కు రావటానికి సాధ్యం కాదని తెలిపాడు. తన స్నేహితునిపై దాడి జరిగిందని తెలిపాడు. తనకు ప్రాణ హాని ఉందని భావించి, సెషన్ న్యాయస్థానంలో బెయిల్‌కు దరఖాస్తు చేశానని సమీర్ తెలిపాడు. ఒకవేళ తాను ధర్మస్థళ పోలీస్ స్టేషన్‌కు వస్తే, తనకు భద్రత కల్పించాలని కోరాడు. 15 రోజులలోగా విచారణకు హాజరవుతానని, దయచేసి తనకు భద్రత కల్పించాలని ఆ లేఖలో సమీర్ కోరాడు. -
శ్రీలంక మాజీ అధ్యక్షుడు విక్రమసింఘే అరెస్ట్
కొలంబో: అధికారంలో ఉండగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే(76)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొలంబోలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్(సీఐడీ)ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న అధికారులు ఆ వెంటనే అరెస్ట్ చేశారు. మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. శ్రీలంక అధ్యక్షుడిగా 2022–24 సంవత్సరాల్లో విక్రమసింఘే శ్రీలంక అధ్యక్షుడిగా పనిచేశారు. 2023 సెప్టెంబర్‌లో తన భార్య ప్రొఫెసర్ మైత్రి పాల్గొన్న కార్యక్రమానికి హాజరయ్యేందుకు లండన్ వెళ్లిన విక్రమసింఘే ప్రభుత్వ నిధులను వాడుకున్నట్లు ఆరోపణలు న్నాయి. లాయర్, సీనియర్ రాజకీయ నేత అయిన విక్రమసింఘే ఐదు దశాబ్దాలకు పైగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. వేర్వేరు సమయాల్లో ఆరు సార్లు ప్రధానిగా పనిచేశారు. గొటబయ రాజపక్స రాజీనామాతో 2022లో అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ఆయన దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటప డేశారన్న ప్రతిష్టను సంపాదించుకున్నారు. అనంతరం ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అధ్యక్షుడిగా ఆయన చేపట్టిన 23 విదేశీ పర్యటనల ఖర్చు రూ.17.50 కోట్లని మీడియా తెలిపింది. కాగా, అరెస్టయిన ఏౖMðక శ్రీలంక మాజీ అధ్యక్షుడిగా విక్రమ సింఘే నిలిచిపోయారు. -
కూర వండాడు.. జైలు పాలయ్యాడు
భువనేశ్వర్: ఏం చేసైనా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి.పెట్టిన పోస్టుకు లైక్స్ లక్షల్లో రావాలి. వీడియోకు మిలియన్ల వ్యూస్ రావాలి. నేటి తరం యువతలో ఈ తపన రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ అత్యుత్సాహంతో, చట్టం, నైతికత, సమాజం పట్ల బాధ్యతను విస్మరించి విస్మరించి ప్రవర్తిస్తున్నారు. ఇలా ప్రవర్తించిన ఓ యూట్యూబర్ జైలు పాలయ్యాడు. సాంస్కృతికంగా, చారిత్రికంగా, ప్రకృతి సోయగాలతో అలరారుతున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన రూప్ నాయక్ అనే యూట్యూబర్ ఓ వీడియో కారణంగా జైలు పాలయ్యాడు. మయూర్భంజ్ జిల్లాకు చెందిన రూప్ నాయక్ తన అత్తింటి నుండి తిరిగి వస్తున్నాడు. మార్గం మధ్యలో అతడికి రోడ్డు పక్కన మానిటర్ లిజర్డ్ (Monitor Lizard ఉడుము) దొరికింది. దానిని ఇంటికి తీసుకెళ్లి, మాంసం వండాడు.అంతేకాదు, ఉడుము మాంసం కూర ఎలా వండాలి? ఎలాంటి దినుసులు వేయాలో మొత్తం సవివరంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే, ఈ వీడియో ఒక్కసారిగా వైరలైంది. వైరలైన వీడియో గురించి అటవీ శాఖకు సమాచారం అందింది.ఇంకేం జంతు సంరక్షణ యాక్ట్ 1972 కింద అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో తాను చేసిన తప్పు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం అతడికి కోర్టు రిమాండ్ విధించింది. కాగా, అటవీ జంతువులను వేటాడటం, చంపడం, లేదా తినడం చట్టపరంగా తీవ్రమైన నేరం. దీనికి జైలు శిక్ష, జరిమానా సైతం చెల్లించాల్సి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. -
సినీ నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్
సాక్షి, విజయవాడ: హైదరాబాద్‌లో సినీ నిర్మాత దాసరి కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాసరి కిరణ్‌పై ఆయన సమీప బంధువు గాజుల మహేష్ ఫిర్యాదు చేశారు.గాజుల మహేష్ వద్ద దాసరి కిరణ్ నాలుగున్నర కోట్లు అప్పుతీసుకోగా.. డబ్బులు అడిగేందుకు ఆయన ఆఫీస్‌కు వస్తే.. 15 మంది తమపై దాడి చేశారంటూ గాజుల మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాజుల మహేష్ ఫిర్యాదు మేరకు దాసరి కిరణ్‌ను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. -
జీవిత ఖైదీ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ అరెస్ట్
-
‘సృష్టి’ ఉచ్చులో చిక్కుకున్నారిలా..!
సాక్షి, హైదరాబాద్: సంతాన సాఫల్య కేంద్రం ముసుగు వేసుకుని, సరోగసి పేరుతో శిశువుల అక్రమ రవాణా, క్రయవిక్రయాలు చేపట్టిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తులో కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో సూత్రధారిగా ఉన్న డాక్టర్ నమ్రత ఉచ్చులో మిగిలిన నిందితులు ఎలా చిక్కుకున్నారనేది దర్యాప్తు అధికారులు గుర్తిస్తున్నారు. ఈ నేరాలకు సంబంధించి ఇప్పటివర కు 9 కేసులు నమోదు కాగా... 25 మంది నిందితులను అరెస్టు చేశారు. ‘సృష్టి’కేంద్రంగా సాగించిన వ్యవహారాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తున్న నగర పోలీసు విభాగం, ఈ కేసులో అత్యంత కఠినమైన బీఎన్ఎస్లోని సెక్షన్ 111ను జోడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన ఎం.నందిని ఘట్కేసర్ సమీపంలోని రాంపల్లిలో నివాసం ఉండేది. ఈమె 2010లో కొన్నాళ్లపాటు జీడిమెట్లకు చెందిన తన స్నేహితురాలి తల్లి వద్ద నివసించింది. ఆమె తరచూ క్లినికల్ ట్రయల్స్ కోసం ల్యాబ్‌లకు వెళుతుండేది. అప్పుడప్పుడు నందినిని తనతో తీసుకువెళ్లేది. ఇలా డబ్బు సంపాదించడం కోసం నందిని కూడా క్లినికల్ ట్రయల్స్‌కు క్లయింట్‌గా మారింది. 2017లో బెంగళూరులో క్లినికల్ ట్రయల్‌కు హాజరవుతున్న సమయంలో సంజయ్ అనే వ్యక్తిని కలిశారు. 2018లో వీళ్లు వివాహం చేసుకుని మౌలాలీలో కాపు రం పెట్టారు. 2025 జనవరిలో నందిని తన అండాన్ని దానం చేయడానికి బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడే ఈమెకు మరో నిందితురాలు హర్ష రాయ్‌తో పరిచయమైంది. అప్పటినుంచి స్నేహితులుగా మారిన వీళ్లు అండాలను దానం చేసే వారి వివరాలు మారి్పడి చేసుకునే వాళ్లు. ఈ నేపథ్యంలోనే వీరికి మరో నిందితురాలు ధనశ్రీ సంతోషితో పరిచయం ఏర్పడింది. సంతోషి ద్వారా నందిని, హర్షరాయ్ నమ్రత ఉచ్చులో చిక్కారు. ఈ నేపథ్యంలో అసోంకు చెందిన భార్యాభర్తలు తమకు పుట్టిన చిన్నారిని డాక్టర్ నమ్రతకు విక్రయించారు. ఆమె ఈ చిన్నారిని రాజస్తాన్‌కు చెందిన దంపతులకు అమ్మింది. ఈ దంపతుల ఫిర్యాదుతోనే సృష్టి విష యం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. సంతో షి, హర్ష రాయ్‌లపై మహారాష్ట్రలోని విఖ్రోలి పోలీసుస్టేషన్‌లోనూ చిన్నారుల అక్రమ రవాణా కేసు ఉంది. డ్రైవర్‌గా వచ్చి.. కీలకంగా మారి.. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన ఎం.పవన్ మోహన్ కృష్ణ నగరానికి వలసవచ్చి పద్మారావు నగర్‌లోని ఓ బాలుర హాస్టల్లో ఉండేవాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఇచ్చిన యాడ్ అతడిని ఆకర్షించింది. డ్రైవర్ పోస్టుకు సంబంధించిన ఆ ప్రకటన చూసిన పవన్ మోహన్ ఆ సెంటర్లో సంప్రదించాడు. అయితే డ్రైవర్ పోస్టు కోసం వెళ్లిన మోహన్ని ఆస్పత్రి నిర్వాహకులు సూపర్వైజర్గా చేర్చుకున్నారు. ఆ ఉద్యోగంలో చేరడంతోనే డా.నమ్రతతో పరిచయం ఏర్పడి, ఈ కేసులో నిందితుడిగా మారాడు. ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని సరోగసికి ఒప్పించడం విధిగా మార్చుకున్న ఇతడికి, నమ్రత ఒక్కో క్లైంట్కు రూ.10 వేల నుంచి రూ.15 వేల కమీషన్ ఇచ్చేది. అలా కొన్నాళ్లకు సికింద్రాబాద్‌లోని సృష్టి సెంటర్ నిర్వహణలో ఇతడు కీలకంగా మారాడు. -
‘యుపిక్స్’ చీటింగ్ కేసులో నిందితుల అరెస్టు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించాలని కొందరు వ్యక్తులు గ్రూప్‌గా ఏర్పడి 183 మంది నుంచి దాదాపు రూ.353 కోట్లు దండుకుని మోసగించిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టుచేసినట్లు విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు శనివారం మీడియాకు వెల్లడించారు. వీరు యుపిక్స్ క్రియేషన్ అనే యానిమేషన్ సంస్థను చూపి, హాలీవుడ్ సినిమాలకు వర్క్‌చేసే ఈ సంస్థలో పెట్టుబడి పెడితే ఏడాదిలోనే రెట్టింపు డబ్బులు పొందొచ్చని అమాయకులకు ఆశ చూపి క్రమేణా రూ.కోట్లలో పెట్టుబడులు రాబట్టారని ఆయన చెప్పారు. మోసం చేసిందిలా.. నిడుమోలు వెంకట సత్యలక్ష్మీకిరణ్ అనే వ్యక్తి విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆదిశేషయ్య వీధిలో యుపిక్స్ అనే యానిమేషన్ కంపెనీని 2014లో ఏర్పాటుచేశారు. అనంతరం.. లక్ష్మీకిరణ్‌కు పేరం మాల్యాద్రి, అతని కొడుకు పేరం మహేశ్వరరెడ్డి, కొత్తూరి వేణుగోపాలరావు, మిట్టపల్లి రాజేంద్రబాబు అతని కొడుకు మిట్టపల్లి రాజీవ్‌కృష్ణ తోడయ్యారు. వీరంతా 2018లో ఒక గ్రూప్‌గా ఏర్పడి అమాయకులకు వల వేశారు. తొలుత లాభాలు వచ్చినట్లు చూపించి వారి బంధువులు, స్నేహితులకు సక్రమంగా కమీషన్లు చెల్లిస్తూ మరిన్ని డిపాజిట్లు చేయించేలా వారిని ప్రోత్సహించారు. అలా వచ్చిన మొత్తాలను వారి సొంత ఖాతాల్లోకి మళ్లించేవారు. ఇలా దాదాపు 183 మంది నుంచి రూ.353 కోట్లు సేకరించారు. ఇందులో రూ.194 కోట్ల వరకూ వారి సొంత ఖాతాలకు మళ్లించారు.వెలుగు చూసిందిలా.. ఈ సంస్థలో రూ.20 కోట్లు పెట్టుబడి పెడితే మోసం చేశారంటూ ఈ ఏడాది ఏప్రిల్ 14న పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన త్రిపురమల్లు శ్రీనివాసరావు, కలవకొల్లు దిలీప్‌కుమార్ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో.. డీసీపీ కె. తిరుమలేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విచారణ అధికారిగా ఏసీపీ డాక్టర్ స్రవంతి రాయ్‌తో పాటు మరో నలుగురు ఇన్స్పెక్టర్లు, సిబ్బందితో కమిషనర్ రాజశేఖరబాబు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు. దర్యాప్తులో ముఠా మోసాలు బయటపడ్డాయి. అనంతరం.. పక్కా సమాచారంతో ప్రధాన నిందితులు నిడుమోలు వెంకట సత్యలక్ష్మీకిరణ్ (33)ను విజయవాడలో, మిట్టపల్లి రాజేంద్రబాబు (63), మిట్టపల్లి రాజీవ్‌కృష్ణ (30)ను నరసరావుపేటలో పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి రూ.90 లక్షల విలువైన 354 గ్రాముల బంగారు ఆభరణాలు, 21 కేజీల వెండి ఆభరణాలు, ఒక కారు, బీఎండబ్ల్యూ బైక్, కంప్యూటర్లు స్వాదీనం చేసుకున్నారు. వారి బ్యాంకు ఖాతాలనూ ఫ్రీజ్ చేశారు. నిందితులకు సంబంధించిన సుమారు రూ.23 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంట్‌కు పెట్టినట్లు సీపీ తెలిపారు. కేసును ఛేదించిన దర్యాప్తు అధికారులు, సిబ్బందిని సీపీ రాజశేఖరబాబు నగదు రివార్డులతో సత్కరించి అభినందించారు. -
ధర్మవరం: జైషే మహ్మద్‌తో నూర్‌కు లింకులు!
సాక్షి, అనంతపురం: సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కదలికల వ్యవహారంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దర్యాప్తు సంస్థల అదుపులో ఉన్న నూర్ మహమ్మద్ షేక్(40)కు జైషే మహ్మద్ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది. జైషే మహ్మద్ సంస్థకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో నూర్ మెంబర్‌గా ఉన్నాడని, అందులోని నెంబర్లకు ఇతని నుంచి వాట్సాప్ కాల్స్ వెళ్లాయని.. ముస్లిం యువతను ఉగ్ర సంస్థ వైపు మళ్లించేలా అందులో వ్యాఖ్యలు సైతం చేశాడని నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ క్రమంలో.. అతని వ్యక్తిగత వివరాల గురించి ఐబీ, ఎన్ఐఏ వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే.. నూర్ వ్యవహారంపై డీఎస్పీ నరసింగప్పకు మీడియాకు కొన్ని విషయాలు తెలియజేశారు. ‘‘నూర్‌ను లోకల్ పోలీసులే మొదట అరెస్ట్ చేశారు. నిషేధిత ఉగ్రసంస్థలకు చెందిన గ్రూపుల్లో అతను సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించాం. కొన్ని సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నాం. అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నాం’’ అని అన్నారాయన. ధర్మవరంలో ఉగ్రకదలికలు వెలుగు చూడడంతో స్థానికంగా కలకలం రేగింది. కోట ఏరియాలో ఉంటున్న నూర్(40) నివాసంలో ఎన్ఐఏ సోదాలతో అంతా ఉలిక్కిపడ్డారు. ఓ హోటల్లో అతను వంట మనిషిగా పని చేస్తున్నట్లు సమాచారం. నూర్ నివాసంలోనూ సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు.. 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతన్ని రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నారు.జైషే మహ్మద్ గురించి..జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) .. 2000లో మౌలానా మసూద్ అజహర్ స్థాపించిన పాకిస్తాన్ కేంద్రిత ఉగ్రవాద సంస్థ. భారత్‌పై ఉగ్రదాడులు చేయడం లక్ష్యంగా పనిచేస్తోంది. 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్‌కోట్ దాడి, 2019 పుల్వామా దాడి వంటి భారీ ఉగ్రదాడులకు పాల్పడింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. భారత్‌లో అతనిపై వారెంట్లు ఉన్నాయ్. -
బర్త్ డే వేడుకల్లో భారీగా డ్రగ్స్ .. నైజీరియన్లు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బర్త్ డే పార్టీలో ఉగాండా, నైజీరియాకు చెందిన వారిని పోలీసులు పట్టుకున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో గుట్టుగా నిర్వహిస్తున్న బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 51 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిలో 37 మంది మహిళలు, 14 అబ్బాయిలు ఉన్నారు. డ్రగ్స్ పరీక్షల్లో కొంత మందికి పాజిటివ్ వచ్చినట్లు నిర్థారణ అయ్యింది.ఉగాండాకు చెందిన మమస్ బర్త్ డే పార్టీలో భారీగా మద్యం, మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్స్ పాస్‌పోర్టులు, వీసాలను ఇమ్మిగ్రేషన్ అధికారులు చెక్ చేస్తున్నారు. ఎక్సైజ్ అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ జరుపుతున్నట్లు తేలింది. మొయినాబాద్ ఫామ్‌కు చేరుకున్న డీసీపీ శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టారు.డ్రగ్ డీటెక్షన్ పరికరాలతో 51మందికి పోలీసులు పరీక్షలు..బర్త్ డే పార్టీలో ఉన్నవారు డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి 11గంటలకు ఎస్వోటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నైజీరియన్స్, పోలీసులు మధ్య రాత్రి వాగ్వాదం జరిగింది. 100 మంది పోలీసులతో ఫామ్‌హౌస్ ముందు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తం 51 మంది వీసాలు పరిశీలించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు.. వీసా గడువు ముగిసినా పలువురు అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించారు. అక్రమంగా నివాసం ఉంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
రూ.40 కోట్ల లాండరింగ్ కేసులో ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ అరెస్ట్
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో లక్షల ఫాలోవర్స్ కలిగిన కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఏదో ఒక ఆరోపణలతో వార్తల్లో టాప్‌లో నిలవడం పరిపాటిగా మారింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 12 లక్షల ఫాలోవర్స్ కలిగిన సందీపా విర్క్ రూ.40 కోట్ల లాండరింగ్ కేసులో అరెస్టయ్యారు.ఇన్స్టాగ్రామ్ అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్ కలిగిన సందీప విర్క్ ఎఫ్‌డీఏ ఆమోదించిన బ్యూటీ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు చెప్పుకుంటారు. అలాగే హైబూకేర్.కామ్ అనే వ్యాపార సంబంధిత వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు. మరోవైపు ఆమెకు రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్‌తో కూడా సంబంధాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విర్క్ తన బయోలో తాను వ్యాపారవేత్త, నటి అని చెప్పుకున్నారు.తాజాగా విర్క్‌ను రూ. 40 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఆమెపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 406 (నేరపూరిత నమ్మక ద్రోహం, 420 (మోసం) కింద మొహాలీలోని ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)మంగళవారం, బుధవారం ఢిల్లీ, ముంబైలోని పలు ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించింది.సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ విర్క్ మోసపూరిత మార్గాల ద్వారా లెక్కకుమించిన స్థిరాస్తులను సంపాదించారనే ఆరోపణలున్నాయి. కాగా ఆమె సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, అవి ఉనికిలో లేవని తెలుస్తోంది. ఆమె వెబ్సైట్లో యూజర్ రిజిస్ట్రేషన్ ఫీచర్లు లేవనే ఆరోపణలున్నాయి. రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ అంగరై నటరాజన్ సేతురామన్‌తో విర్క్‌కు ఉన్న సంబంధాలపై కూడా ఈడీ ఆరా తీస్తోంది.2018లో రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్ఎల్)నుండి సుమారు రూ. 18 కోట్ల విలువైన నిధులను సేతురామన్ దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఆయన తనకు విర్క్‌తో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాజాగా విర్క్‌ను పీఎంఎల్ఏ నిబంధనల కింద ఈడీ అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచింది. కోర్టు ఆమెను శుక్రవారం వరకు ఈడీ కస్టడీకి పంపింది. ఈ కేసులో ఇతరుల ప్రమేయంపై కూడా దర్యాప్తు జరుగుతోందని సమాచారం. -
మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అరెస్ట్
-
జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అరెస్ట్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. యర్రగుంట్లలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సుధీర్‌రెడ్డితో పాటు 30 మందిపై కేసులు నమోదు చేశారు. నిన్న(మంగళవారం) వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అక్రమ అరెస్ట్‌ను సుధీర్‌రెడ్డి అడ్డుకున్నారు. కూటమి అరాచకాలకు వ్యతిరేకంగా నిన్న ఆయన ర్యాలీ నిర్వహించారు.కాగా, పులివెందులలో నిన్న (మంగళవారం) సూర్యోదయానికి ముందే పచ్చ ఖాకీలు గూండాగిరీకి తెరతీసిన సంగతి తెలిసిందే. భారీగా పోలీసు అధికారులు, సిబ్బంది వేకువజామునే ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి నివాసంపై దండెత్తారు. దురాక్రమణదారుల మాదిరిగా ఇంట్లోకి దూసుకెళ్లారు. ఎంపీని అక్రమంగా అరెస్టు చేశారు. ఎంపీగా తన నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీ ఉప ఎన్నికలను పర్యవేక్షించడం ఆయన హక్కు, బాధ్యత. కానీ, దీన్ని పోలీసులు కాలరాశారు. ఆయనను అక్రమంగా అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు.పోలీసుల దౌర్జన్యంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరసన తెలపగా వారిని ఈడ్చి పడేశారు. ఎంపీని తమ వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని ముద్దనూరు వైపు తీసుకువెళ్లారు. నిడిజివ్వి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇంటి వద్ద దింపి ఇక్కడే ఉండాలని ఆదేశించారు. అక్కడికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.పోలీసుల అరాచకాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు యర్రగుంట్ల వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. -
Rajasthan: డీఆర్డీఓలో ఉంటూ పాక్‌కు రహస్యాలు.. గెస్ట్‌హౌస్ మేనేజర్ అరెస్ట్
జైసల్మేర్: డీఆర్డీఓ శాస్త్రవేత్తల, భారత ఆర్మీ అధికారుల రహస్య వివరాలను పాకిస్తాన్ నిఘా సంస్థతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఆర్డీఓ ఉద్యోగిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో గల డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) గెస్ట్ హౌస్‌లో కాంట్రాక్టు మేనేజర్‌గా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్‌ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేశాడనే ఆరోపణలతో మహేంద్ర ప్రసాద్‌ను రాజస్థాన్ సీఐడీ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది.మహేంద్ర ప్రసాద్ భారతదేశానికి సంబంధించిన రహస్య, వ్యూహాత్మక సమాచారాన్ని పాకిస్తాన్‌కు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. బుధవారం అతనిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. తరువాత తదుపరి విచారణ కోసం రిమాండ్‌కు తీసుకువెళ్లనున్నారు. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు, రాజస్థాన్ సీఐడీ ఇంటెలిజెన్స్ రాష్ట్రంలోని భద్రతను చురుకుగా పర్యవేక్షిస్తోందని రాజస్థాన్, జైపూర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి (సెక్యూరిటీ), డాక్టర్ విష్ణుకాంత్ మీడియాకు తెలిపారు.ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు చెందిన కాంట్రాక్టు మేనేజర్ మహేంద్ర ప్రసాద్ పాకిస్తాన్ నిఘా సంస్థతో సోషల్ మీడియా ద్వారా సంభాషిస్తున్నట్లు సీఐడీ నిఘా సమయంలో వెల్లడయ్యింది. క్షిపణి, ఆయుధ పరీక్షల కోసం ఫైరింగ్ రేంజ్‌ను సందర్శించే డీఆర్డీఓ శాస్త్రవేత్తలు, భారత ఆర్మీ అధికారుల కదలిక గురించి అతను పాకిస్తాన్‌లోని హ్యాండ్లర్లకు రహస్య సమాచారాన్ని అందిస్తున్నట్లు సీఐడీ పోలీసులు అనుమానిస్తున్నారు.జైపూర్‌లోని సెంట్రల్ ఇంటరాగేషన్ సెంటర్లో వివిధ నిఘా సంస్థలు నిందితుడిని సంయుక్తంగా విచారించాయి. మహేంద్ర ప్రసాద్ మొబైల్ ఫోన్‌ను సాంకేతికంగా పరీక్షించగా, అతను డీఆర్డీఓతో పాటు భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ నిర్వాహకులతో పంచుకుంటున్నాడని స్పష్టమయ్యింది. ఈ నేపధ్యంలో అధికారిక రహస్యాల చట్టం, 1923 కింద మహేంద్ర ప్రసాద్‌పై కేసు నమోదు చేశారు. -
‘చెత్త ఎన్నికలు’.. అవినాష్ రెడ్డిని తరలిస్తున్న వాహనం అడ్డగింత
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఉదయం ఆయన్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఎక్కడికి తరలించాలనుకుంటున్నారో ఓ స్పష్టత లేకుండా ముందుకు సాగారు. తొలుత కడపకు తరలించి.. అక్కడి నుంచి అంతా తిప్పుతూ ఉన్నారు. ఈ క్రమంలో యర్రగుంట్ల వద్ద పోలీసుల వాహనాన్ని అడ్డుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు.. ఆయన్ని విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగారు.ఎలాంటి నోటీసులు, వారెంట్ లేకుండా అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయన అధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆ వాహానాన్ని ముందుకు కదలనీయలేదు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సుధీర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు.. ‘‘మీరు ఎక్కడికి తీసుకురమ్మంటే అక్కడ అవినాష్‌ను దించేస్తాం’’ అంటూ పోలీసులు చెప్పడంతో.. తన నివాసానికి తీసుకెళ్లాలంటూ సుధీర్‌రెడ్డి అదే వాహనం ఎక్కారు. అధికార టీడీపీతో పోలీసులు కుమ్మక్కు అయ్యారని.. పులివెందుల ఉప ఎన్నికకు అవినాష్ రెడ్డిని దూరం చేయాలనే కుట్రలో భాగంగానే ఇలా ప్రవర్తిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.ఇదీ చదవండి: బలవంతంగా ఇంట్లోంచి ఈడ్చుకొచ్చి.. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్యర్రగుంట్లలో పోలీస్ వాహనంలోనే ఉండి సాక్షితో ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడారు. ‘‘పులివెందులలో బయటివాళ్లను అనుమతించి.. ఇంట్లో ఉన్న నన్ను బలవంతంగా తరలిస్తున్నారు. ఇది అధికార దుర్వినియోగమే. బీహార్‌లోనూ ఇంతదారుణమైన పరిస్థితులు ఉండవేమో. దేశానికి స్వాతంత్రం వచ్చాక ఇంత ఘోరమైన.. చెత్త ఎన్నికలు ఎప్పుడూ జరిగి ఉండవు. అసలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉందా? లేదా?. దున్నపోతు మీద వర్షం పడినట్లు ఉంది ఈసీ తీరు. పది రోజుల నుంచి మొత్తుకుంటున్నా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వేల మందిని బయటకు తీసుకొచ్చారు. వాళ్లతో మాపై దాడులు చేయించారు’’ అని మండిపడ్డారాయన. -
Pulivendula: వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ.. పోలీసులు దాష్టీకానికి దిగారు. కడప వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ వేకువ జామున ఆయన నివాసానికి వచ్చిన పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి మరీ తమ వాహనంలో ఎక్కించి తరలించారు. ఆయన్ని కడప పీఎస్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.అరెస్ట్ సమయంలో పోలీసులతో వైఎస్ అవినాష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. తాను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నానని, ఇంట్లోనే ఉంటానంటూ చెప్పినా పోలీసులు వినలేదు. సిట్టింగ్ ఎంపీ అని కూడా చూడకుండా పోలీసులు అవినాష్ రెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చారు. ఈ క్రమంలో ఇంటి బయటే ఆయన బైఠాయించగా.. అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. అవినాష్ అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వాళ్లనూ లాగి పడేశారు. ఈ క్రమంలో ఆయన ఇంటి ఆవరణలో బీభత్సం సృష్టించారు. ఆపై చెప్పులు కూడా వేసుకోనివ్వకుండా అవినాష్ రెడ్డిని బలవంతంగా వాహనంలో ఎక్కించారు. అరెస్ట్ సమయంలో అక్కడే ఉన్న మీడియాతో ఆయన మాట్లాడారు.. ‘‘ఎన్నికలు జరిపే విధానం ఇదేనా?. కేవలం వైఎస్సార్సీపీ ఏజెంట్లను టార్గెట్ చేసి టీడీపీ వాళ్లు దాడులు చేస్తున్నారు. మా కార్యకర్తలను వదలడం లేదు. పోలీసులు గూండాల్లాగా వ్యవహరిస్తున్నారు. దాడులు ఆపాల్సిన పోలీసులు నన్ను అడ్డుకుంటున్నారు. ఇంతదారుణమైన పరిస్థితి మునుపెన్నడూ చూడలేదు’’ అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. టీడీపీ దాడులను ఖండిస్తూ గాయపడ్డ తమ నేతలకు సంఘీభావంగా ఈ నెల 5వ తేదీన వైఎస్సార్సీపీ ర్యాలీ నిర్వహించింది. ఇందుకుగానూ అవినాష్ రెడ్డి సహా 150 మందిపై కేసు పెట్టారు. అయితే ఈ కేసుల్లో ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని, ఎవరీని అరెస్ట్ చేయొద్దని ఏపీ హైకోర్టు సోమవారం పులివెందుల పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా పోలింగ్ టైంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయగా.. మరోవైపు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిని వేంపల్లిలో హౌజ్ అరెస్ట్ చేశారు. -
ఢిల్లీలో ఇండియా కూటమి MPల ర్యాలీలో ఉద్రిక్తత
-
‘మదురో అరెస్టు’ బహుమతి రెట్టింపు
వాషింగ్టన్: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టుకు సమాచారం ఇచ్చిన వారికి రూ.438 కోట్లు బహుమానంగా ఇస్తామని అమెరికా ప్రకటించింది. మదురోను ప్రపంచంలోనే అతి పెద్ద డ్రగ్ స్మగ్లర్‌గా అభివర్ణించింది. గతంలో రూ.250 కోట్లుగా ఉన్న బహుమతిని మళ్లీ పెంచినట్లు అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ ప్రకటించారు. మదురోకి డ్రగ్స్ స్మగ్లర్లతో నేరుగా సంబంధాలున్నాయని ఆమె ఆరోపించారు. మదురో, అతని సహచరులతో సంబంధం ఉన్న 30 టన్నుల కొకైన్‌ను డ్రగ్ ఎన్పోర్స్మెంట్ అడ్మిని్రస్టేషన్ (డీఈఏ) స్వా«దీనం చేసుకుందని, అందులో 7 టన్నులు మదురోకి చెందినవని అన్నారు. ఈ ఆరోపణలను వెనిజులా విదేశంగ మంత్రి ఇవాన్ గిల్ ఖండించారు. బహుమతి ప్రకటనను రాజకీయ ప్రచారంగా అభివరి్ణంచారు. తమ దేశ గౌరవం అమ్మకానికి లేదన్నారు. జెఫ్రీ ఎపిస్టీన్ కేసు వ్యవహారంలో విమర్శల నుంచి దృష్టి మళ్లించేందుకే బోండీ ఈ చర్య తీసుకున్నారని ఆయన ఆరోపించారు. మొదటి పదవీకాలం నుంచే.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మదురోపై చాలాకాలంగా విమర్శలు చేస్తున్నారు. తన తొలి పదవీకాలంలోనే మదురో, పలువురు ఉన్నతాధికారులపై డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో టెర్రరిజం, అవినీతి ఆరోపణలు మోపారు. మదురో కొలంబియా రెబెల్ గ్రూప్ ‘ఫార్క్’తో కలిసి కొకైన్‌ను అమెరికాకు పంపేందుకు ప్రయతి్నంచారని ఆరోపించారు. ఆ సమయంలో మదురో అరెస్టుకు రూ.150 కోట్ల బహుమతిని ప్రకటించారు. బైడెన్ పాలనలో ఆ మొత్తాన్ని 250 కోట్లకు పెంచింది. 2024 జూలై 29న వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మదురో గెలిచారు. ప్రతిపక్ష అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌పై విజయం సాధించారు. మూడోసారి అధ్యక్షపీఠాన్ని అధిష్టించారు. బస్సు డ్రైవర్ నుంచి రాజకీయవేత్తగా ఎదిగిన మదురో వివాదాస్పదంగా నిలిచారు. హ్యూగో చావెజ్ మరణం తరువాత 2013లో యునైటెడ్ సోషలిస్టు పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో అమెరికా వెనిజులాపై ఆంక్షలు విధించింది. మదురోను అధ్యక్షుడిగా తిరస్కరించింది. అమెరికాతోపాటు యురోపియన్ యూనియన్, యూకే కూడా వెనిజులా చర్యలను ఖండించాయి. తమ దేశంలో తవ్వకాలు జరిపేందుకు అమెరికా చమురు దిగ్గజం చెవ్రాన్ను అనుమతించడంతో వెనిజులాపై కొన్ని ఆంక్షలను సడలించింది. -
విద్యుత్ కాంట్రాక్టు కార్మికులపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి/గుణదల (విజయవాడ తూర్పు): విద్యుత్ కాంట్రాక్టు కార్మికులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్కో ప్రధాన కార్యాలయాల ముట్టడికి ఛలో విద్యుత్‌సౌధ కార్యక్రమాన్ని చేపట్టిన కార్మికుల్ని నిరంకుశంగా అడ్డుకుని అణచివేసింది. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (యూఈసీడబ్ల్యూయూ) ఆధ్వర్యంలో శాంతియుతంగా చేపట్టిన ఈ ఆందోళనలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్మికులు, నాయకులు గురువారం విజయవాడ తరలివచ్చారు. కార్మికుల ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు ఉదయం 8 గంటల నుంచే అత్యుత్సాహంగా వ్యవహరించారు. రామవరప్పాడు రింగ్, విద్యుత్‌సౌధ, గుణదల వంతెన, గుణదల సెంటర్ నుంచి పడవలరేవు వరకు తనిఖీలు చేపట్టారు. కార్మికులను, నాయకులను మార్గంమధ్యలోనే అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. 200 మందికిపైగా కార్మికులను అరెస్టుచేసి బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ఈ నేపథ్యంలో విజయవాడ గుణదలలోని విద్యుత్‌సౌధ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వాలు మారుతున్నా మా గతి మారదా? విద్యుత్ సంస్థలైన ట్రాన్స్‌కో, జెన్కో, పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల్ని క్రమబద్ధీకరించాలని (రెగ్యులరైజ్), తెలంగాణ తరహాలో సంస్థలో విలీనం చేసి వేతనాలు పెంచాలని కార్మికులు కోరుతున్నారు. పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, వేతన వ్యత్యాసాలు లేకుండా సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని అడుగుతున్నారు. రూ.కోటి బీమా సౌకర్యం కల్పించాలని, హెల్త్‌కార్డులు ఇవ్వాలని, పీస్ రేట్ కార్మికులకు ఉద్యోగభద్రత కల్పించి కనీస వేతనాలు చెల్లించాలని అభ్యర్థిస్తున్నారు. చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ రూ.10 లక్షలు చెల్లించాలని.. తదితర సమస్యలపై తరబడి వినతిపత్రాలు ఇసూ్తనే ఉన్నారు. తమ సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఛలో విద్యుత్‌సౌధకు కార్మిక, ఉద్యోగసంఘాలు పిలుపునిచ్చాయి. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అక్రమంగా కార్మికుల్ని, నాయకుల్ని అరెస్టు చేసి, నిర్భంధించటం, ఉక్కుపాదం మోపడం అన్యాయమని యూఈసీడబ్ల్యూయూ రాష్ట్ర అధ్యక్షుడు జల్లెడ రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు విద్యుత్‌సౌధ ఆవరణలోని ఏపీ ట్రాన్స్‌కో అడిషనల్ సెక్రెటరీ పెద్ది రోజాకు తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. తక్షణమే కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, లేదంటే ఈ పోరాటం మరింత తీవ్రతరమవుతుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యూనియన్ నాయకులు డి.సూరిబాబు, బి.సుమన్, ఎన్.విజయరావు, ఎ.వి.నాగేశ్వరరావు, ముజఫర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. కాగా, విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం కోరుతూ విద్యుత్ సౌధ వద్ద గురువారం ఆందోళన చేపట్టిన కార్మికులు, నాయకులను అరెస్టు చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ఖండించారు. -
తురకా కిషోర్ అరెస్టుపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ నేత, మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ అరెస్టుపై ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తురకా కిషోర్‌ను వెంటనే విడుదల చేయాలని న్యాయ స్థానం ఆదేశించింది. కిషోర్ రిమాండ్ రిపోర్టును సస్పెండ్ చేసింది.తురకా సురేఖ హెబియస్ కార్పస్ పిటిషన్గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురకా కిషోర్‌ను పల్నాడు జిల్లా, రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్భంధించారని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ గతవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై హైకోర్టు వరుసగా విచారణ చేపట్టింది. ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు కిషోర్ అరెస్టుపై తీవ్రంగా స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా తురకా కిషోర్‌ను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన సమయంలో పాటించాల్సిన నిబంధనల్ని పూర్తిగా తుంగలోకి తొక్కారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్‌ను కూడా పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తురకా కిషోర్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రెంటచింతల పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం తురకా కిషోర్‌పై నమోదు చేసిన కేసుకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని రెంటచింతల పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే.బెయిల్ పిటిషన్ వేయకుంటే రిమాండ్ విధించేస్తారా..? బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, తురకా కిషోర్‌పై నమోదు చేసిన కేసుకు సంబంధించిన రికార్డులను పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) టి.విష్ణుతేజ ధర్మాసనం ముందుంచారు. వీటిని ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. అలాగే కిషోర్‌ను రిమాండ్‌కు పంపుతూ మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులనూ మరోసారి పరిశీలించింది. అరెస్టయిన కిషోర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు కాబట్టి, తాను రిమాండ్ విధిస్తున్నట్లు మేజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారని తెలిపింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేయకుంటే, రిమాండ్ విధించేస్తారా? మిగిలిన అంశాలను పరిగణనలోకి తీసుకోరా? అంటూ మేజిస్ట్రేట్ తీరును ప్రశ్నించింది.పరస్పర విరుద్ధమైన వాదనలేంటి..? ‘రిమాండ్ రిపోర్ట్ తీసుకునేందుకు కిషోర్ తిరస్కరించారని మీరు (పోలీసులు) చెబుతున్నారు. కానీ మేజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో దీని గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. మీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింది కోర్టులో కిషోర్ ఏ కాగితాలను తీసుకోలేదని చెబుతారు. మరోవైపు తీసుకున్నట్లు కిషోర్ సంతకం చేసినట్లు చెబుతారు. ఏంటీ పరస్పర విరుద్ధమైన వాదనలు? నేరాంగీకార వాంగ్మూలంపై కిషోర్ సంతకం చేయలేదని అంటున్నారు. మీరు చెబుతున్నట్లు అతను కరడుగట్టిన నేరస్తుడే అనుకున్నా, అన్ని నేరాలూ చేసేశానంటూ ఒప్పేసుకుని సంతకం చేస్తారా?’ అని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.నిర్బంధం అక్రమమైనప్పుడు ఆ వ్యక్తిని ఒక్క క్షణం కూడా జైల్లో ఉంచకూడదు ఒక వ్యక్తి నిర్బంధం అక్రమమైనప్పుడు ఆ వ్యక్తి ఒక్క క్షణం కూడా జైల్లో ఉండటానికి వీల్లేదు.. అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని, విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ఎస్‌జీపీ విష్ణుతేజ కోరగా.. ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది. అప్పటి వరకు కిషోర్‌ను జైల్లోనే ఉంచమంటారా?అప్పటి వరకు కిషోర్‌ను జైల్లోనే ఉంచమంటారా? అంటూ ఘాటుగా ప్రశ్నించింది. పలు కేసుల్లో కిషోర్‌ను అరెస్ట్ చేయాల్సి ఉందని విష్ణుతేజ చెప్పగా, వాటితో తమకు సంబంధం లేదని, తమ ముందున్న కేసుతోనే తమకు సంబంధమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎప్పుడో ఆరేళ్ల క్రితం ఘటన జరిగితే, ఇప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా.. అంటూ ప్రశ్నించింది.అలాగే రెండు, మూడేళ్ల క్రితం ఘటనలు జరిగితే ఇప్పుడు అరెస్ట్‌లు చూపారంది. కిషోర్ అరెస్ట్, రిమాండ్ విషయంలో చట్ట నిబంధనలను అనుసరించలేదనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అందువల్ల కిషోర్ విడుదలకు ఆదేశాలిస్తామంది. విష్ణుతేజ జోక్యం చేసుకుంటూ, పిటిషనర్ రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేయలేదని తెలిపారు.అలా అయితే రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రధాన పిటిషన్లో సవరణ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డికి సూచించింది. దీంతో కిషోర్ అరెస్ట్‌ను, రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ తురకా సురేఖ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అనుబంధ పిటిషన్ మధ్యాహ్నం విచారణకు రాగా, దీనిపై గురువారం విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేస్తూ ఆ మేర విచారణను వాయిదా వేసింది.జైలు నుంచి విడుదల కానున్న తురకా కిషోర్ అయితే ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు తురకా కిషోర్ అరెస్టులో పోలీసుల వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం నిబంధనల్ని సైతం తుంగలో తొక్కారని వ్యాఖ్యానిస్తూ కిషోర్‌ను తక్షణమే విడుదల చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక హైకోర్టు ఆదేశాలతో తురకా కిషోర్ జైలు నుంచి విడుదల కానున్నారు. -
అన్సారీ ఆస్తుల కోసం కుమారుని దొంగ పత్రాలు.. కోర్టులో బెడిసికొట్టిన ప్లాన్
లక్నో: ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ ఆస్తులను తిరిగి దక్కించుకునేందుకు అతని కుమారుడు ఉమర్ అన్సారీ చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. ఇందుకోసం నకిలీ పత్రాలను ఆధారాలుగా చూపిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఉదంతంపై ఘాజీపూర్ పోలీసు సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో.. ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని తెలిపారు. ఈ ఏడాది మార్చిలో యూపీలోని బండాలో గల ఒక ఆస్పత్రిలో గుండెపోటుతో ముక్తార్ అన్సారీ కన్నుమూశాడు. తాజాగా తన తండ్రి ఆస్తులను విడుదల చేయాలని కోరుతూ అతని కుమారుడు ఉమర్ అన్సారీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఇందుకోసం అతను తన తల్లి అఫ్షాన్ అన్సారీ నకిలీ సంతకాలు కలిగిన నకిలీ పత్రాలను కోర్టులో సమర్పించాడని సూపరింటెండెంట్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.కాగా పరారీలో ఉన్న ఉమర్ అన్సారీపై రూ.50 వేల రివార్డు ఉంది. ఉమర్ అన్సారీ మోసపూరిత చర్యలు బయటపడిన దరిమిలా అతనిపై మొహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. తాజాగా ఘాజీపూర్ పోలీసుల బృందం లక్నో నుండి ఉమర్ అన్సారీని అరెస్టు చేసింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. -
కూకట్ పల్లిలో ఇరానీ గ్యాంగ్ అరెస్ట్
-
ఢీ కొరియోగ్రాఫర్ కృష్ణపై పోక్సో కేసు నమోదు
-
రేయ్.. ఎవరురా మీరంతా?
ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న నగరం.. బెంగళూరు(కర్ణాటక). వర్షాలు.. వరదలు, ట్రాఫిక్ రద్దీ, లైంగిక వేధింపులు, భాష ప్రతిపాదికన దాడుల ఘటనలు ఏవో ఒకటి నగరాన్ని నిత్యం వార్తల్లో ఉండేలా చేస్తున్నాయి. ఈ తరుణంలో.. మరో తరహా ఘటనలు ప్రపంచవ్యాప్తంగానూ చర్చకు దారి తీస్తున్నాయ్.. నోయెల్ రాబిన్సన్, యూనెస్ జారో.. ఈ ఇద్దరూ ఆషామాషీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కాదు. కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు వీళ్లకి. అయితే తాజాగా ఈ ఇద్దరికీ బెంగళూరులోనే చేదు అనుభవం ఎదురైంది. వేర్వేరు ఘటనలో వీళ్లిద్దరు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సి వచ్చింది.జర్మన్ టిక్‌టాకర్ నోయెల్ రాబిన్సన్.. గుబురు జుట్టేసుకుని జనం మధ్య డ్యాన్సులు వేస్తూ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా సహా పలు నగరాల్లో ఇప్పటికే వీడియోలతో భారతీయులకూ దగ్గరయ్యాడు. అయితే.. బెంగళూరు వీధుల్లో సంప్రదాయ పంచెకట్టులో డాన్స్ చేస్తూ వీడియో చేయబోయాడు. దీంతో జనం భారీగా గుమిగూడారు. కాసేపటికే అక్కడికి చేరుకున్న పోలీసులు పబ్లిక్ న్యూసెన్స్ పేరుతో అతన్ని స్టేషన్‌కు లాక్కెళ్లారు. ఆ సమయంలో అతనితో కాస్త దురుసుగా ప్రవర్తించారు. తీరా పీఎస్‌కు తీసుకెళ్లాక ఓ పావు గంట తర్వాత అతని నుంచి వివరణ తీసుకుని.. జరిమానా విధించి వదిలేశారు. దీనిని అంతే తేలికగా తీసుకున్న నోయెల్.. దానిని ఓ ఫన్నీ వీడియోగా ప్రమోట్ చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Noel Robinson (@noel)మరో ఘటనలో.. పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ యూనస్ జారో నగరంలోని చర్చి స్ట్రీట్ వద్దకు రానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అయితే అతని రాకతో అక్కడ జనం గుమిగూడారు. ఇంతలో సడన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు అతన్ని పీఎస్‌కు తరలించి.. ఫైన్ విధించి పంపించారు. ఆ సమయంలోనూ అతను వాళ్లతో షేక్ హ్యాండ్ ఇస్తూ మరో ఫొటో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Younes Zarou (@youneszarou)ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 9వ తేదీన బ్రిటిష్ మ్యూజీషియన్ ఇద్ షరీన్ రోడ్డు మీద ప్రదర్శన ఇస్తుండగా.. కుబ్బన్ పోలీసులు అంతరాయం కలిగించి అక్కడి నుంచి వెళ్లగొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. అటు ఫ్యాన్స్‌తో పాటు అతిథి దేవోభవకు బెంగళూరు పోలీసులు తూట్లు పొడిచారంటూ ఇటు నెటిజన్లు నగర పోలీసుల తీరుపై మండిపడ్డారు.International artist @edsheeran was stopped playing in #Bangalore at church street. Even though, he had the permission. Literally! The cops pulled the plug. Damn sad! #Karnataka pic.twitter.com/C0F9tdm26g— Imran Khan (@KeypadGuerilla) February 9, 2025 అయితే.. పోలీసులు మాత్రం తమ అనుమతులు లేకుండా రోడ్లపై అలాంటి షోలను అనుమతించమని.. జనం గుమిగూడి జరగరానిది ఏదైనా జరిగితే ఎలాగ? అని ప్రశ్నిస్తున్నారు. జూన్ 4వ తేదీన ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో జరిగిన తొక్కిసలాట ఘటన.. దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో.. కర్ణాటక ప్రభుత్వం క్రౌడ్ కంట్రోల్ బిల్ - 2025 తెర మీదకు తెచ్చింది. ఈ రకమైన ఈవెంట్లు గనుక అనుమతులు లేకుండా నిర్వహిస్తే.. గరిష్ఠంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.50 వేలజరిమానా విధించాలని ఈ చట్టం తేబోతోంది. -
హైదరాబాద్ పబ్‌లో కిలాడీ స్కెచ్
హైదరాబాద్: భర్తతో కలిసి ఓ కిలాడీ లేడీ పక్కా స్కెచ్ వేసి సినీ ఫక్కీలో ఓ నగల దుకాణం ఉద్యోగిని కిడ్నాప్ చేసి నగదు, నగలు దోచుకోవడమేగాకుండా నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది. ఈ ఘటనలో యువతితో సహా నలుగురు కిడ్నాపర్లను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్‌కు చెందిన సచిన్‌దూబే బంజారాహిల్స్ రోడ్డునెంబర్–10లోని తిబారుమల్ జ్యువెలర్స్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. తరచూ పబ్‌లకు వెళ్లే అతడికి కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో బార్ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న డింపుల్‌యాదవ్‌తో పరిచయం ఏర్పడింది.గత శనివారం తమ పబ్‌లో ప్రత్యేక కార్యక్రమం ఉందని సచిన్‌దూబేను ఆహ్వానించింది. దీంతో సచిన్ తన బైక్‌ను నగల దుకాణం వద్దనే పార్కు చేసి క్యాబ్‌లో పబ్‌కు వెళ్లాడు. పథకం ప్రకారం డింపుల్‌యాదవ్ డ్యాన్స్ చేస్తూ సచిన్‌ను రెచ్చగొడుతూ పీకలదాకా మద్యం తాగేలా చేసి మత్తులోకి దింపింది. అర్ధరాత్రి తర్వాత తూలుతూ, తూగుతూ బయటకు వచ్చిన సచిన్‌ను తాను బైక్‌పై దింపుతానంటూ తన స్కూటీ వెనుక ఎక్కించుకుని బంజారాహిల్స్‌కు వచ్చింది. అయితే.. అప్పటికే పథకంలో భాగంగా డింపుల్ భర్త తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో సచిన్, డింపుల్ వెళ్తున్న స్కూటీని అనుసరించాడు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–3లోని టీవీ9 చౌరస్తా వద్దకు రాగానే కిడ్నాపర్లు రోడ్డుకు అడ్డంగా కారును ఆపి ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తన్నారంటూ బెదిరించడమే కాకుండా తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని వెనుక కూర్చొన్న సచిన్‌ను కారులో ఎక్కించుకుని ఫిర్జాదీగూడ వైపు తీసుకెళ్లారు. మార్గమధ్యలో అతడికి నిద్ర మాత్రలు కలిపిన కూల్‌డ్రింక్ తాగించడంతో పూర్తిగా స్పృహ తప్పాడు. అనంతరం.. సచిన్ మెడలో ఉన్న గొలుసు, పర్సులో ఉన్న డబ్బులు లాక్కుని మంచంపై పడుకోబెట్టారు. అక్కడే ఉన్న అపరిచిత యువతితో సచిన్ బట్టలు తొలగించి నగ్న వీడియోలు తీయించారు. ఆపై, ఉదయం 6 గంటల సమయంలో సచిన్‌ను అత్తాపూర్‌లోని ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన గంట తర్వాత సచిన్ భార్యకు ఫోన్ చేసి తాము పోలీసులమని, రాత్రి మద్యం మత్తులో మీ భర్త ఒక మహిళను హత్య చేశాడని, తమ వద్ద వీడియోలు ఉన్నాయని బెదిరించడమే కాకుండా, రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీడియోలు బయటపెడతామని బ్లాక్మెయిల్ చేశారు.అయితే ఆమె భయపడకుండా హత్య చేస్తే ఇంటికి వచ్చి తన భర్తను అరెస్టు చేసుకోవచ్చని చెప్పింది. వారం రోజులుగా కిడ్నాపర్లు ఆమెకు ఫోన్లు చేస్తూ చివరకు రూ.2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూకట్‌పల్లిలోని పబ్ వద్ద విచారణ చేపట్టి బార్ డ్యాన్సర్ డింపుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టయ్యింది.పథకం ప్రకారమే.. కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో బార్ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న డింపుల్ యాదవ్ భర్త పవన్‌కుమార్‌యాదవ్ గతంలో అదే పబ్‌లో బౌన్సర్‌గా పనిచేశాడు. అయితే వీరి స్వస్థలం ఢిల్లీ కాగా హైదరాబాద్‌కు మకాం మార్చి అంబర్‌పేటలో అద్దెకు ఉంటున్నారు. ఈజీ మనీ కోసం అమాయకుడైన సచిన్‌ను మద్యం మత్తులో దింపి కిడ్నాప్ నాటకం ఆడి అడ్డంగా బుక్కయ్యాడు. డింపుల్‌యాదవ్, పవన్‌కుమార్‌యాదవ్‌తో పాటు కిడ్నాప్‌లో పాల్గొన్న సాయిప్రసాద్, హరికిషన్, అంగార సుబ్బారావులను పోలీసులు అరెస్టు చేశారు.కిడ్నాప్‌నకు వాడిన కారుపై లా ఆఫీసర్ ఎయిమ్స్ బీబీనగర్ అని ఉండడంతో పోలీసులు ఎవరూ అనుమానించకూడదనే ఇలా రాసినట్లుగా వెల్లడైంది. నిందితులు వాడిన బైక్‌లతో పాటు సచిన్ నుంచి నుంచి లాక్కున్న బంగారు గొలుసును స్వా«దీనం చేసుకున్నారు. తనను మద్యం మత్తులోకి దింపి పథకం ప్రకారమే కిడ్నాప్ చేసి నగ్న వీడియోలు తీసి రూ.10 లక్షలు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాత బాగోలేదని వాత.. టీచర్ అరెస్ట్
ముంబై: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు కర్కశంగా ప్రవర్తిస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేది ముంబైలో జరిగిన ఒక ఘటన తెలియజేస్తుంది. మలాడ్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ట్యూషన్ టీచర్, ఎనిమిదేళ్ల బాలుని చేతిరాత సరిగా లేదంటూ, అతనిని కఠినంగా శిక్షించింది.ఈ నేపధ్యంలో ఆ ఉపాధ్యాయురాలు అరెస్టయ్యింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోరేగావ్‌లోని ఒక పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న బాలుడు మలాడ్‌లోని ఒక టీచర్ ఇంటికి ట్యూషన్‌కు వెళుతుంటాడు. సంఘటన జరిగిన రోజు, ఆ బాలుని సోదరి అతనిని ట్యూషన్లో దింపి, వెళ్లిపోయింది. ట్యూషన్ ముగిశాక ఆ టీచర్ బాలుని ఇంటికి ఫోన్ చేసి, పిల్లాడిని తీసుకుని వెళ్లాలని చెప్పింది. దీంతో ఆ బాలుని సోదరి ఆ టీచర్ ఇంటికి వచ్చింది. ఆ బాలుడు కన్నీళ్లతో కనిపించేసరికి, ఏం జరిగిందని సోదరి ఆ టీచర్‌ను అడిగింది. పిల్లాడు జరిగిన విషయం చెప్పగా, టీచర్ వాటిని తోసిపుచ్చింది.అయితే ఇంటికి తిరిగి వచ్చిన ఆ బాలుడు తన చేతిరాత సరిగా లేకపోవడంతో టీచర్ మండుతున్న కొవ్వొత్తితో తన చేతిపై వాత పెట్టిందని ఏడుస్తూ చెప్పాడు. వెంటనే పిల్లాడి తండ్రి అతనిని చికిత్స కోసం కాండివాలిలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. తరువాత కురార్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు. బాలునిపై శారీరక, మానసిక క్రూరత్వానికి పాల్పడిన టీచర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. -
‘సృష్టి’ కేసు.. డాక్టర్ నమ్రత అరెస్ట్
సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం: నగరంలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో జరిగిన ఓ దారుణ ఘటన కలకలం రేపుతోంది. పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్ర కణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఈ కేసులో నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఐదుగురు సిబ్బందిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. జడ్జి ముందు ప్రవేశపెట్టారు. కాగా, విజయవాడలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో విజయవాడ సెంటర్ నిర్వహణ సాగిస్తుండగా, పలు కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. వ్యాపార అభివృద్ధి కోసం.. బీహార్ నుంచి పూజారులను పిలిపించిన డాక్టర్ నమ్రత.. 9 రోజుల పాటు.. ఆసుపత్రిలో హోమాలు నిర్వహించినట్లు పోలీసులు నిర్థారించారు.విశాఖపట్నంలోని పలు ఫెర్టిలిటి సెంటర్లలో పోలీసులు సోదాలు జరిపారు. మహారాణిపేట పోలిస్ స్టేషన్ పరిధిలో ఉన్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే మేనేజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రెండు ఫ్లోర్లలో అనధికారంగా ఐవీఎఫ్ సెంటర్లు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 2023లో లైసెన్సు ముగిసినప్పటికీ అనధికారంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.మోసం బయటపడింది ఇలా..నగరానికి చెందిన ఓ జంట పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టక పోవడంతో రెండేళ్ల క్రితం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు. అక్కడ ఐవీఎఫ్ ప్రక్రియ అనంతరం వారికి మగబిడ్డ పుట్టడు. అయితే ఇటీవల బాబు అనారోగ్యానికి గురికావడంతో వైద్యులను సంప్రదించారు. వివిధ రకాల పరీక్షల తర్వాత బాబుకు క్యాన్సర్ ఉందని తేలడంతో ఆ దంపతులు నిర్ఘాంతపోయారు.తమ తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు ఎవరికీ క్యాన్సర్ చరిత్ర లేకపోవడంతో, అనుమానం వచ్చి డాక్టర్ నమ్రతను గట్టిగా నిలదీశారు. ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో బాబుకు డీఎన్ఏ టెస్టులు చేయించగా.. ఆ దంపతుల డీఎన్ఏతో మ్యాచ్ కాలేదు. దీంతో డాక్టర్ నమ్రత తమను మోసం చేసిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలిసి పరారీలో ఉన్న డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విశాఖ కేసులో లైసెన్సు రద్దు చేసినా.. డాక్టర్ నమ్రత హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సంతాన సాఫల్య కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పదేళ్ల క్రితం విశాఖపట్నంలో పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి, పిల్లలు లేని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది.డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్టు చేయడంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమె లైసెన్సును రద్దు చేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఇతర డాక్టర్ల లైసెన్సుల ద్వారా వైద్యం అందిస్తున్నట్లు తెలిసింది. కాగా కేపీహెచ్‌బీలోని టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్లో కూడా ఇలాగే అక్రమ సరోగసీ కేసు నమోదైనట్లు సమాచారం. -
ఏలూరులో టెన్షన్.. వైఎస్సార్సీపీ నేతలు అరెస్ట్
సాక్షి, ఏలూరు: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. వైఎస్సార్సీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులే టార్గెట్‌గా అక్రమ కేసులు నమోదు చేస్తూ.. అరెస్ట్‌లు జరుగుతున్నాయి. తాజాగా దెందులూరు నియోజకవర్గంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సోదరుడు సహా పలువురిని అక్రమ కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి సోదరుడు చల్లగోళ్ళ తేజ, చల్లగోళ్ళ ప్రదీప్‌ని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఏ కేసులో వారిని అరెస్ట్ చేస్తున్నారని పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. పోలీసులు మాత్రం సమాధానం చెప్పలేదు. అనంతరం, వారిని ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన పోలీసులు.ఇక, గతంలోనే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీడియా సమక్షంలోనే కామిరెడ్డి నానిని కచ్చితంగా జైలుకు పంపుతానని సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నానిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్‌పై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అక్రమ కేసులు ఎంత మందిపై పెడతారని ప్రశ్నిస్తున్నారు. -
‘పెద్ద ప్లానే’.. నలుగురు ఉగ్రవాదుల ఆటకట్టించిన ఏటీఎస్
న్యూఢిల్లీ: నకిలీ కరెన్సీ రాకెట్‌ను నడుపుతూ, ప్రపంచ ఉగ్రవాద సంస్థ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు సాయపడుతున్న అల్ ఖైదాతో సంబంధం కలిగిన నలుగురు ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. పట్టుబడిన ఉగ్రవాద నిందితులు మొహమ్మద్ ఫైక్, మొహమ్మద్ ఫర్దీన్, సెఫుల్లా కురేషి, జీషన్ అలీలు అల్ ఖైదా భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను, అనుమానాస్పద యాప్‌లను ఉపయోగించారని ఏటీఎస్ వర్గాలు తెలిపాయి. అలాగే వీరు తమ జాడ తెలియకుండా ఉండేందుకు ఆటో డిలీట్ యాప్‌లను ఉపయోగించారని సమాచారం.ఈ నిందితులు చాలా కాలంగా ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నారని గుజరాత్ ఏటీఎస్ అధికారులు గుర్తించారు. వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అల్-ఖైదాతో సంప్రదింపులు జరిపారని వెల్లడైందన్నారు. వారి చాట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. ఈ నలుగురూ సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు సంప్రదించుకున్నారని, ఢిల్లీ నివాసి ఫైక్.. పాకిస్తాన్ ఇన్స్టాగ్రామ్ యూజర్‌తో పరిచయం పెంచుకుని, భారతదేశంలో జిహాదీ కార్యకలాపాలను వ్యాప్తి చేయడానికి చర్చించారని తమకు తెలిసిందని తెలిసిందని గుజరాత్ ఏటీఎస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సునీల్ జోషి పేర్కొన్నారు.ఈ నలుగురు నిందితుల ప్రధాన ఎజెండా అల్‌ఖైదా భావజాలం వైపు యువతను ఆకర్షించడం. హింస ద్వారా షరియాను స్థాపించడానికి, తద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్మూలించేందుకు యవతను ప్రేరేపించేందుకు వారు పనిచేస్తున్నారని సునీల్ జోషి తెలిపారు. వారి ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లలో అల్‌ఖైదా సాహిత్యం, షరియాను స్థాపించాలని పిలుపునివ్వడం, మత విద్వేషాన్ని సృష్టించే ప్రకటనలు ఉన్నాయని ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి ఒకరు వెల్లడించారు.నిందితుల ప్రవర్తన ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించడానికి, భారతదేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్య నిర్మాణాన్ని అణగదొక్కడానికి ఉపకరించేదిగా ఉందని డీఐజీ తెలిపారు. కాగా ఒసామా బిన్ లాడెన్ గురువు షేక్ అబ్దుల్లా అజ్జాం నెలకొల్పిన మఖ్తబ్ అల్-ఖిదామత్ నుండి అల్-ఖైదా ఉద్భవించింది. ఇది ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే సంస్థగా ఉంది. అల్-ఖైదా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లోని పెషావర్‌లో విస్తరించి ఉంది. 1996 నుండి 2001 చివరి వరకు అల్‌ఖైదాను తాలిబాన్ రక్షణలో బిన్ లాడెన్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులు పర్యవేక్షించారు. -
మిమ్మల్ని పోలీసులు కారణం లేకుండా అరెస్ట్ చేస్తే.. అప్పుడు మీరు ఏం చేయాలంటే
-
హైదరాబాద్ లో బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
-
మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్‌రెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై రాజకీయ విమర్శలు చేశారనే కారణంతో పోలీసులు నమోదు చేసిన ఆక్రమ కేసులో ఆరెస్ట్ అయిన వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్. రెడ్డిని మాజీ సీఎం వైఎస్ జగన్ సోమవారం. ఫోన్లో పరామర్శించారు. ఆయనపై నమోదు చేసిన అక్రమ కేసుల వివరాలు, ఆరెస్ట్ గురించి అడిగి తెలుసుకున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగా అక్రమ కేసులు నమోదు చేయడం, భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించడం బాధాకరమని వైఎస్ జగన్ అన్నారు. పోలీసుల అక్రమ కేసులు, అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిం చారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందుబాటులో ఉండి అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని రమేష్ కుమార్ రెడ్డికి భరోసా ఇచ్చారు.చిన్నమండెం: అక్రమ కేసులో అరెస్టు అయిన మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్‌రెడ్డి సోమవారం విడుదలయ్యారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె నుంచి చిన్నమండెం పోలీస్ స్టేషన్ కు ఆయనను పోలీసులు తీసుకువచ్చారు. రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్, ఎస్ఐఐ సుధాకర్ 41 నోటీసు ఇచ్చి ఆయనను సోమవారం విడుదల చేశారు. అనంతరం రమేష్ కుమార్‌రెడ్డికి వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
బాలీవుడ్ తరహా ఈవెంట్లు, లగ్జరీ లైఫ్ : 100మందికి పైగా ముంచేసిన ఎన్ఆర్ఐ జంట
టెక్సాస్‌లోని ప్లానోకు చెందిన భారతీయ సంతతికిచెందిన దంపతులు రియల్ ఎస్టేట్ స్కామ్‌లో 100 మందికి పైగా వ్యక్తులను మోసం చేసినట్లు తెలుస్తోంది. నకిలీ రియల్ ఎస్టేట్ నకిలీ పత్రాలతో భారీ స్కామ్‌కు పాల్పడ్డారు. రూ. 33 కోట్ల విలువైన పెట్టుబడి స్కాం ఆరోపణలపై వీరిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.ఉత్తర టెక్సాస్‌లోని ఇండియన్-అమెరికన్ సమాజంలో సిద్ధార్థ సామీముఖర్జీ , అతని భార్య సునీత ప్రముఖ వ్యక్తులుగా చలామణి అయ్యారు. రియల్ ఎస్టేట్ ఒప్పందాలు, ఛారిటీలు ,బాలీవుడ్ తరహా ఈవెంట్లతో పాపులారిటీ సంపాదించారు. అలా రూ.33 కోట్లకు నమ్మినవారిని ముంచేశారు. రియల్ ఎస్టేట్ నకిలీ పత్రాలు , మహమ్మారి సహాయ నిధుల దుర్వినియోగం, ఇలా పలు రకాలు ఏళ్ల తరబడి మోసపూరిత ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారనే అభియగాలు నమోదైనాయి.ఈ జంట నకిలీ కంపెనీని ఉపయోగించి, ఫేక్ సాలరీ స్లిప్పుల ద్వారా పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (PPP) రుణాన్ని పొందారని ఆరోపించారు.ఈ జంట 2024లో దివాలా కోసం దాఖలు చేశారు. ఈ జంట 2024లో దివాలా కోసం దాఖలు చేశారు.ఇదీ చదవండి: షార్జాలో మరో విషాదం : బర్త్‌డే రోజే కేరళ మహిళ అనుమానాస్పద మరణంఈ జంట ఇచ్చిన చెక్‌లు బౌన్స్ కావడంతో వీరి బండారం వెలుగులోకి వచ్చింది. కనీసం 20 మంది బాధితులను గుర్తించారు. తొలుత ఈ కేసును విచారించిన డిటెక్టివ్లు ఆ తరువాత ఈ కేసును FBIకి అప్పగించారు. 100 మందికి పైగా వ్యక్తులను మోసంచేశారంటూ అమెరికా ఫెడరల్ దర్యాప్తు సంస్థలు ఈ జంటను అరెస్ట్‌చేశాయి. నిజానికి బాధితుల సంఖ్య 100 దాటవచ్చని అధికారులు భావిస్తున్నారు. తన 23 ఏళ్ల సర్వీసులు ఇంతటి మోసగాడిని చూదడలేదని డిటెక్టివ్ బ్రియాన్ బ్రెన్నాన్ వ్యాఖ్యానించారు. అరెస్టు తర్వాత, సామీ , సునీతా ముఖర్జీ ఇద్దరూ 5 లక్షల డాలర్ల చొప్పున బెయిల్‌ను దాఖలు చేశారు. సామీని తరువాత యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అదుపులోకి తీసుకుంది. డబ్బును క్రిప్టోకరెన్సీ ఖాతాలుగా మార్చారా అనే విషయాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. ముంబైలో ముంబైలో కూడా సామిపై మోసానికి పాల్పడినట్టు ఆరోపలున్నాయట. విషయంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.మరోవైపు ఈ తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, ముఖర్జీ దంపతులు ఈ ఏడాది మేలో అంటే అరెస్టుకు కొన్ని వారాల ముందు, ప్లానోలో ఎన్జీవీ పేరుతో విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ బాలీవుడ్ నటి హేమ మాలిని, ప్లానో మేయర్ సహా ఉన్నత స్థాయి అతిథులు హాజరు కావడం గమనార్హం.చదవండి: -
ట్రంప్ కసి.. ఒబామా అరెస్టు అంటూ ఏఐ వీడియో
సంచలన ఆరోపణల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. ‘చట్టానికి ఎవరూ అతీతులు కాదని’ సందేశంతో ఆయన ఆ పోస్ట్ చేశారు. అయితే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అరెస్ట్ అయిన నేపథ్యంతో ఉన్న ఏఐ వీడియోను తన ట్రూత్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేయడం గమనార్హం. ఓవల్ ఆఫీసులో ట్రంప్‌తో భేటీ అయిన సందర్భంలో మాజీ అధ్యక్షుడు ఒబామాను ఎఫ్‌బీఐ అరెస్టు చేసినట్లుగా ఆ వీడియో ఉంది. ఒబామా చేతుల్ని వెనక్కి విరిచి మరీ అధికారులు బేడీలు వేశారు. ఆ సమయంలో నవ్వుతూ కనిపించారు ట్రంప్. అటుపై ఒబామా కటకటాల్లో ఉన్నట్లు ఆ వీడియోలో ఉంది. అంతకంటే ముందు ఈ వీడియోలో.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పలువురు నేతలు చెప్పిన సందేశాన్ని దానికి జత చేశారు. ఆ నేతల్లో ముందుగా ఉంది ఒబామానే కావడం గమనార్హం. Donald #Trump reposts AI-generated video depicting Barack #Obama being arrested.#MAGA | #USApic.twitter.com/crkL8bew9l— Shivanshi Singh (@Shivansshi) July 21, 2025 అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై సంచలన ఆరోపణలకు దిగారు. 2016లో ట్రంప్ విజయం టైంలో ఒబామా ప్రభుత్వం కుట్రలకు తెర తీసిందని.. రష్యా ఎన్నికల జోక్యంపై కల్పిత ఇంటెలిజెన్స్ నివేదికలు తయారు చేయించారని, తద్వారా ట్రంప్ అధ్యక్ష పదవికి అర్హత లేదని చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారామె. ఈ క్రమంలో ఆమె అమెరికా న్యాయవిభాగానికి US Department of Justiceకి కొన్ని డాక్యుమెంట్లు సమర్పించినట్లు సమాచారం. Treason, Tulsi & Trump! Gabbard has accused #BarackObama of 'weaponizing intelligence' against #DonaldTrunp in 2016 - I explain why timing and intention of this huge claim is being questioned 👇#EpsteinFiles #TulsiGabbard pic.twitter.com/orQbiEICNK— Shreya Upadhyaya (@ShreyaOpines) July 20, 2025 ఈ వ్యవహారంపై రిపబ్లికన్ నేతలు గబ్బార్డ్‌కు మద్దతు తెలుపుతూ.. ఆమెపై ప్రశంసలు గుప్పించారు. అయితే డెమోక్రట్లు మాత్రం ఈ ఆరోపణలను రాజకీయ ప్రేరణతో కూడినవిగా, ఆధారాలు లేనివిగా అభివర్ణించారు. మరోవైపు Obama ఇంకా ఈ ఆరోపణలపై స్పందించలేదు. అయితే ఈ ఆరోపణలు వెల్లువెత్తిన మరుసటిరోజే ట్రంప్ ఇలా ఓ ఏఐ వీడియో తన అధికారిక ఖాతాలో పోస్ట్‌చేయడం గమనార్హం.


