‘చంద్రబాబు సర్కార్‌ మరో డైవర్షన్‌ డ్రామా’ | YSRCP Leaders Reaction On Ex Minister Jogi Ramesh Illegal Arrest In Fake Liquor Case, More Details Inside | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కార్‌ మరో డైవర్షన్‌ డ్రామా: వైఎస్సార్‌సీపీ

Nov 2 2025 9:49 AM | Updated on Nov 2 2025 3:24 PM

Ysrcp Leaders Reaction On Ex Minister Jogi Ramesh Arrest

సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్‌ అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున, పేర్ని వెంకట్రామయ్య (నాని), అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మార్గాని భరత్, టీజేఆర్‌ సుధాకర్‌బాబు సంయుక్త ప్రకటన విడుదల చేశారు

‘‘మాజీ మంత్రి జోగి రమేష్‌ అరెస్ట్‌ పూర్తిగా అక్రమం. ఇది కేవలం కక్ష సాధింపు చర్య. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌ను దురుద్దేశంతోనే ఇరికించారు. కస్టడీలో ఉన్న కేసులో ఏ–1 నిందితుడు జనార్థన్‌రావు ద్వారా జోగి రమేష్‌ పేరు చెప్పించారు. దానిపై జోగి రమేష్‌ చేసిన సవాల్, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సాక్షిగా ఆయన చేసిప ప్రమాణంపై ఇప్పటి వరకు  టీడీపీ నేతలు స్పందించలేదు. జోగి రమేష్‌ కుటుంబాన్ని ఇంకా వెఎస్సార్‌సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లు’’ అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘లేని లిక్కర్‌ స్కామ్‌లు సృష్టించారు. కల్తీ మద్యం తయారుచేస్తూ టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోవడంతో, ఆ బురదను వైఎస్సార్‌సీపీకి అంటించే కుట్ర చేస్తున్నారు. కల్తీ మద్యం కేసులో సీబీఐ దర్యాప్తు జోగి రమేష్‌ కోరారు. దానిపై హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అది విచారణకు రాకముందే జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొక్కిసలాట.. పలువురి దుర్మరణం. మోంథా తుపాన్‌ సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యం. రెండింటి నుంచి డైవర్షన్‌ కోసమే జోగి రమేష్‌ అరెస్ట్‌. కల్తీ మద్యం కేసులో పక్కా ఆధారాలున్నా, కొందరు టీడీపీ నాయకులు అరెస్ట్‌ లేదు. కేవలం కక్ష సాధింపు కోసమే జోగి రమేష్‌ను ఇరికించి అరెస్టు చేశారు. ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం’’ అని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement