breaking news
jogi ramesh
-
చంద్రబాబూ ఇది గుర్తించుకో: చెవిరెడ్డి
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టుల ద్వారా కక్ష సాధించాలనుకుంటే వైఎస్సార్సీపీ నేతలు భయపడరన్నారు. ఇళ్లపై దాడులు చేసే సంస్కృతిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని.. ఇలాంటి సంస్కృతి చాలా ప్రమాదకరమన్నారు.‘‘ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి. ఎన్నికల హామీలను ప్రభుత్వం గాలికివదిలేసింది. ఈ రోజు ఎన్నికలు జరిగినా చంద్రబాబు ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు ఇదే సంస్కృతి కొనసాగిస్తే మనశాంతిగా ఎవరైనా ఉండగలరా?. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పిన ప్రభుత్వం ఇలాంటి సంస్కృతిని తెచ్చింది. ఇలాంటి సంస్కతిని చూశాక ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? అంటూ చెవిరెడ్డి ప్రశ్నించారు.‘‘ప్రజా జీవితంలో ఉన్న నాయకులకు భద్రత లేదు. ఇక పెట్టుడులు పెట్టడానికి వచ్చే వ్యాపారులకు భద్రత ఎక్కడ?. పోరాటాలతో పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ. ఇలాంటి అక్రమ కేసులు, దాడులు, ఇళ్లు తగలబెడితే భయపడతారనుకోవడం అమాయకత్వం’’ అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. -
జోగి రమేష్ కు కన్నబాబు పరామర్శ
-
జోగి రమేష్‌ను పరామర్శించిన బొత్స
-
అడ్డంగా దొరికిపోయిన టీడీపీ ఫుల్ వీడియో ఇదిగో
-
చిప్ పోతేనే కదా ఇలాంటి పనులు చేసేది: బొత్స
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: గతంలో ఎన్నడూ లేని నీచ సంస్కృతి కూటమి పాలనలోనే కనిపిస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని శనివారం పార్టీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘‘ఒక మాజీ మంత్రి నివాసంపై పెట్రోల్ బాంబులు వేయడం ఏంటి?. పెట్రోల్ బాంబులు వేయడాన్ని జై ఆంధ్ర ఉద్యమం సమయంలో చూశా. పోలీసులు ఉంది దేనికి అసలు?. పోలీసులంటే దాడులు ఆపాలి. అదీ పోలీసింగ్ అంటే. కానీ, ఇక్కడ పోలీసులు గూండాలకు ఎస్కార్టులుగా, రక్షణగా ఉంటున్నారు. పోలీసులు, గూండాలు కలిసి దాడికి వస్తారా?. ఇదెక్కడైనా చూశామా?. 30 ఏళ్లలో ఇలాంటివి చూడలేదు. ఇంటిపై దాడి చేస్తే ఏ కేసులు పెట్టాలి?. ఏ సెక్షన్లు పెట్టాలి?. దాడులు చేసిన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇస్తారా?..304 సెక్షన్ ఎందుకు పెట్టలేదు...కారణమేంటి?. .. జోగి రమేష్ ఇంటిపై దాడి హేయమైన చర్య. ఈ దాడి క్షణికావేశంలో జరిగింది కాదు. ఇది పక్కా ఆర్గనైజ్డ్ దాడి. వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. ఏదైనా జరగకూడనిది జరిగితే ఏంటి పరిస్థితి. చంద్రబాబూ.. అసలు మీ ఆలోచన ఏంటి ?. జోగి రమేష్ అన్నదాంట్లో తప్పేముంది?. ఆయన చెప్పినట్లు మంత్రి లోకేష్‌కే కాదు చంద్రబాబుకి కూడా చిప్ పోయినట్లు ఉంది. చిప్ పోతేనే ఇలాంటి పనులు చేస్తారు. రాజకీయాల్లో సంమయనం పాటించాలి కానీ.. ప్రతీకారాలకు పాల్పడకూడదు. జోగి రమేష్ కు కూడా నేను ఇదే సూచించా. ఈ దాడి ఘటనను మనసులో పెట్టుకోవద్దని జోగి రమేష్ చెప్పా. ఈ ప్రభుత్వం చేసిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం....చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు?. రాష్ట్రంలో అసలు పాలన ఉందా?. శాంతి భద్రతలు అసలు ఉన్నాయా?. ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది. ఇలాంటి దాడులు రాజకీయంగా చాలా తప్పు. ప్రజాస్వామ్యం గురించి చెప్పే చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతారు. పెద్ద పెద్ద కబుర్లు చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడేం మాట్లాడతారు?. పవన్ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు. తాను ఏం మాట్లాడుతున్నారో .. తాను చెప్పిన సనాతన ధర్మమేంటో పవన్ తెలుసుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్నా దాడులు ...ఆడపిల్లల పై జరుగుతున్న అఘాయిత్యాలు పవన్‌కు కనిపించడం లేదా?. .. రాజకీయంగా మీరు తప్ప వేరే ఎవరూ బ్రతక కూడదా?. చంద్రబాబూ.. ఏమైంది మీ జ్ఞానం?. మీ తాటాకు చప్పుళ్లకు వైఎస్సార్సీపీ బెదరదు. ఈ దాడుల పై న్యాయపోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గపు ఆలోచనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఇలాంటి దుర్మార్గులకు ఓటేసి గెలిపించడం ధర్మమేనా ఆలోచన చేయాలి. ఇలాంటి ప్రభుత్వాలు ఉండడం ప్రమాదకరం’’ అని బొత్స అన్నారు. ఈ ప్రభుత్వానికి అసలు ఆలోచన ఉందా... ప్రతీదీ డైవర్షన్ చేయడమేనా?. లడ్డూలో కల్తీ లేదని సీబీఐ చెప్పింది. లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసం పెట్రోల్ బాంబులు వేయిస్తారా?. లడ్డూ వ్యవహారం పై సిట్ ఏమి చెప్పిందో మీరెందుకు చెప్పలేకపోతున్నారు. లడ్డూ అంశం పై ఏకసభ్య కమిషన్ వేయడం దేనికి?. పవన్ ,లోకేష్ ,బీజేపీ నేతలను ముగ్గురిని కలిపి ఒక కమిషన్ వేయొచ్చు కదా!. ఆ దేవదేవుడిని ఎందుకు రోజూ కించపరుస్తున్నారు?. దేవుడితో రాజకీయాలెందుకు?.. దేవుడే అన్నీ చూస్తున్నాడు. తప్పు చేస్తే..తప్పు మాట్లాడితే ఆ దేవుడే శిక్షిస్తాడు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది...అంతే కానీ చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు?. జోగి రమేష్ ఇంటి పై దాడి చేసిన వారిని ఎవరినీ వదలం. చట్టముందు దోషులుగా నిలబెడదాం..ఈ ప్రభుత్వం తీరు ఆడలేక మద్దెల ఓడ మాదిరి ఉంది. చంద్రబాబు తనను విశ్వామిత్రుడు, వశిష్టమహర్షిగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు మాట్లాడిందే నిజం అనుకుంటున్నారు. అధికారం తమ చేతుల్లో ఉందని ఎన్ని కేసులైనా పెడుతుంది ఈ దుర్మార్గపు ప్రభుత్వం. మా నేతల పై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోం. రైతులకు యూరియా కూడా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం ఇది. ఇచ్చిన హామీలను అమలు చేయలేని ప్రభుత్వం ఇది అని బొత్స మండిపడ్డారు. -
మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి సర్కార్ కక్షసాధింపు
-
జోగి రమేష్‌పై మరో అక్రమ కేసు
విజయవాడ: వైఎస్సార్సీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇబ్రహీంపట్నం పర్యటనను సక్సెస్ కావడాన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్‌పై మరో అక్రమ కేసు నమోదు చేయడమే ఇందుకు ఉదాహరణ. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని, జన సమూహాన్ని పోగు చేశారంటూ సెక్షన్ 30 యాక్ట్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పీఎస్‌లో జోగి రమేష్‌పై కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నంకు జన సందోహం స్వచ్ఛదంగా తరలివచ్చింది. వేలాదిగా ప్రజలు రోడ్లపైకి వచ్చి వైఎస్ జగన్ ఘనమైన సంఘీభావం తెలిపారు. చివరి నిమిషంలో వైఎస్ జగన్ పర్యటన రూట్ మ్యాప్ మార్చి కూటమి ప్రభుత్వం కుట్రలు చేసినా.. అది ప్రజాభిమానం ముందు నిలవలేకపోయింది. వైఎస్ జగన్ పర్యటన సక్సెస్ కావడంతో అది కూటమి ప్రభుత్వానికి రుచించడం లేదు. దీనిలో భాగంగా వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్‌పై అక్రమ కేసు బనాయించింది. జన సమీకరణ చేశారంటూ ఏవో కథలు చెబుతూ అక్రమ కేసును నమోదు చేయించింది. ఇవీ చదవండి:YS Jagan: రూటు మారినా తగ్గని జన సునామీలడ్డూపై దుష్ప్రచారం ఆపి.. క్షమాపణలు చెప్పాలి -
జోగి రమేశ్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదు చేసిన కేసుల్లో కఠిన చర్యలేవీతీసుకోవద్దని ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీసులతోపాటు, తిరుపతి జిల్లా, తిరుపతి గ్రామీణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఫిర్యాదుదారుకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై అధికార టీడీపీ కూటమి నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారంపై జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యల గురించి న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. జోగి వ్యాఖ్యలు రాజ్యాంగంలోని ఆరి్టకల్ 19(1)(ఏ) ప్రకారం ‘వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ’ పరిధిలోకి వస్తాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అంతేకాక ఆయనపై ఆరోపించిన నేరాలు ఏడేళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడేవేనని తెలిపారు. అందువల్ల ప్రస్తుత దశలో జోగి రమేశ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన తక్షణ అవసరం ఏదీ లేదని ఆమె ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
YS Jagan: రూటు మారినా తగ్గని జన సునామీ
సాక్షి, విజయవాడ : సర్కారు ఎన్ని కుయుక్తులు పన్నినా, రూటు మార్చినా జననేత పర్యటనకు జనం సునామీలా తరలివచ్చారు. 17 కిలోమీటర్ల దూరం 47 కిలోమీటర్లకు పెరిగినా ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు పోటెత్తారు. ఎన్టీఆర్ జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జననేతను దగ్గర్నుంచి చూడాలని, పలకరించాలని, కుదిరితే కరచాలనం చేయాలనే ఆసక్తితో అడుగడుగునా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. దారి పొడవునా పూలు చల్లుతూ ఆత్మీయంగా స్వాగతం పలికారు. సీఎం.. సీఎం.. జై జగన్.. జైజై జగన్ నినాదాలతో పర్యటన ఆద్యంతం మార్మోగింది. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి, బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై ఇటీవల తెలుగుదేశం పార్టీ గూండాలు దాడి చేసి.. పెట్రోల్ బాంబులు విసిరి దగ్ధం చేయటానికి కుట్రలు చేసిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు శుక్రవారం ఉదయం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా, ఉదయమే తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం వద్దకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. వైఎస్ జగన్.. నివాసం నుంచి బయటకు రాగానే అక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు జై జగన్ అంటూ నినదించారు. కాన్వాయ్ భరతమాత సెంటర్ వద్దకు వచ్చేసరికి రోడ్డుపై మహిళలు, అభిమానులు భారీగా ఉండడంతో.. వైఎస్ జగన్ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అక్కడి నుంచి పాతూరు క్రాస్‌రోడ్ వరకు కారులో నుంచి పలుమార్లు బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. భారీగా అభిమానులు రావడంతో అనుకున్న సమయానికి అనుకున్న ప్రదేశానికి చేరుకునే సరికి ఆలస్యమైంది. అయినా ప్రజలు రోడ్డుపై ఉండి ఆయన కోసం ఎదురు చూశారు. కాజ వద్ద గ్రామస్తులు భారీగా స్వాగతం పలికారు. 2029లో జగనే ముఖ్యమంత్రి అంటూ నినాదాలు చేశారు. కాజ టోల్‌గేటు వద్ద కూడా అదే పరిస్థితి. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించి, ప్రజల్ని అడ్డుకున్నా వైఎస్ జగన్‌ను కలిసేందుకు జనం పోటీ పడ్డారు. దారిపొడవునా బస్సుల్లో నుంచి ప్రజలు అభివాదం చేశారు. చినకాకాని వెస్ట్ బైపాస్ ప్రారంభంలో ఒక దివ్యాంగుడు వేచి ఉండటం గమనించి వైఎస్ జగన్ కారు దిగి, అతనితో కరచాలనం చేశారు. వెస్ట్ బైపాస్‌లో ఎక్కడా రోడ్డుపైకి వచ్చేందుకు అవకాశం లేకపోయినా బైపాస్ వెంబడి పలుచోట్ల ప్రజలు జగన్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో బారులుతీరారు. వెంకటపాలెం టోల్ గేటు వద్ద 10 నిమిషాల పాటు జగన్ కాన్వాయ్ ఆపి.. అక్కడికొచ్చిన మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో పాటు అందరినీ ఆప్యాయంగా పలకరించారు. పర్యటనను నీరుగార్చే కుట్ర భగ్నంవైఎస్ జగన్ ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లేందుకు మాజీ ముఖ్యమంత్రి హోదాలో పోలీసు శాఖకు తన పర్యటన వివరాలను ముందుగానే పంపించారు. అయితే ఆయన పర్యటనను నీరుగార్చేందుకు, ప్రజలు ఆయన్ను కలవకుండా చేసేందుకు ప్రభుత్వం పోలీసు శాఖ ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేసింది. ముందు ప్రకటించిన రూట్లో కాకుండా మంగళగిరి మీదుగా కాజ టోల్‌గేటు వద్దకు వెళ్లి.. అక్కడి నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాలని గురువారం రాత్రి నోటీసులు జారీ చేసింది. దాంతో పార్టీ క్యాడర్లో కొంత గందరగోళం నెలకొంది. అయినా శుక్రవారం ఉదయం వైఎస్ జగన్ వస్తున్న రూట్ వివరాలను తెలుసుకొని తదనుగుణంగా పార్టీ శ్రేణులు, ప్రజలు జగన్ పర్యటించే మార్గంలో ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. పోలీసుల కుట్రలను భగ్నం చేసి, పర్యటనను విజయవంతం చేశారు.వాహనాలను అడ్డుకున్న పోలీసులు వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోవటానికి పోలీసు శాఖ తీవ్ర స్థాయిలో ప్రయత్నించింది. ఇందులో భాగంగా అడుగడుగునా ఆంక్షలు విధించింది. పార్టీ నేతలను పోలీసు అధికారులు భయభ్రాంతులకు గురి చేయటమే కాకుండా, పలు చోట్ల వాహనాలను అడ్డుకున్నారు. తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వస్తున్న వాహనాలను ఎక్కడికక్కడ ఆపేశారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌తోపాటు, జిల్లా వ్యాప్తంగా పలువురు నాయకులు ర్యాలీగా వెళ్లకూడదంటూ నోటీసులు జారీ చేశారు. నేతల వెంట జనం ఉండకూడదని హెచ్చరించారు. నోటీసులను ధిక్కరిస్తే కేసులు పెడతామని భయపెట్టేందుకు ప్రయత్నించారు. అయినా పార్టీ శ్రేణులు వేలాదిగా ఎవరికి వారుగా స్వచ్ఛందంగా కార్యక్రమానికి తరలివచ్చారు. వైఎస్ జగన్ అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగారు. ఇలా అడుగడుగునా అభిమానం పోటెత్తడంతో తాడేపల్లి నుంచి ఉదయం 11 గంటలకు బయలు దేరిన జగన్.. ఇబ్రహీంపట్నం చేరుకునే సరికి సాయంత్రం 5 గంటలైంది.ఇలా ఏకంగా ఆరు గంటల సమయం పట్టింది. గొల్లపూడి నుంచి జోగి రమేష్ ఇల్లు చేరుకునేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టిందంటే జనాభిమానం ఏమేరకు ఉందో ఇట్టే తెలుస్తోంది. దారిపొడవునా తన కోసం వేచి ఉన్న ప్రజలకు వైఎస్ జగన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వేలాదిగా బైక్‌లపై తరలివచ్చిన యువతపార్టీ శ్రేణులు, అభిమానులు, యువత వేలాదిగా తరలివచ్చారు. ఉదయమే తాడేపల్లి కార్యాలయానికి చేరుకొని వైఎస్ జగన్‌ను అనుసరించారు. ఎక్కడికక్కడ పోలీసులు వాహనాలను అడ్డుకొని వేరు మార్గాల వైపు తరలించినా, అభిమానులు అంతకంతకూ పెరిగారు. వేలాది మంది ద్విచక్ర వాహనాలపై తరలి వచ్చి, తమ అభిమాన నేత జగన్మోహన్రెడ్డి పర్యటనలో పాల్గొన్నారు. పలువురు న్యాయవాదులు వైఎస్ జగన్‌కు సంఘీభావం తెలిపారు. బైపాస్ నల్లకుంట నుంచి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వరకు రోడ్డుపై జనం ఇసుక వేస్తే రాలనంతగా నిండిపోయారు. జోగి రమేష్ కుటుంబానికి భరోసాఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. దాడి జరిగిన తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఎంతసేపు దాడి జరిగింది.. మారణాయుధాలతో ఎలా భయపెట్టారు.. పెట్రోల్ బాంబులు ఎలా విసిరారు.. తదితర విషయాలను జోగి రమేష్ కుటుంబ సభ్యులు వివరించారు. దాడి జరిగిన సమయంలో వారు ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను జననేతకు చెప్పుకున్నారు. ఇలాంటి దాడులకు భయపడొద్దని, తాను అండగా ఉంటానని వారికి జగన్ భరోసా కల్పించారు. పార్టీ అండగా ఉంటుందన్నారు. రానున్న కాలంలో దాడి చేసిన వారిని చట్టపరంగా న్యాయస్థానంలో నిలబెడతామని చెప్పారు. కాగా, వైఎస్ జగన్‌తో పాటు పలువురు నేతలు జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్రావు, కైలే అనిల్‌కుమార్, అన్నాబత్తుల శివకుమార్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, ఎండి రుహుల్లా, వరుదు కళ్యాణి, జగ్గయ్యపేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు, తిరువూరు ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాసు, పెనమలూరు ఇన్చార్జి దేవభక్తుని చక్రవర్తి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, డిప్యూటీ మేయర్ అవుతు శైలజ రెడ్డి, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్, నాయకులు ఏ రవిచంద్ర, పుణ్యశీల, వేముల తిరుపతిరావు, వంగవీటి నరేంద్ర తదితరులు జోగి రమేష్‌ను కలిశారు. గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:జగన్ రాకతో జన జాతరను చూశారా? -
పవిత్ర లడ్డూపై దుష్ప్రచారం ఆపి.. క్షమాపణ చెప్పాలి
సీబీఐ సిట్ చార్జ్‌షీట్ వేసిన తర్వాత అయినా చంద్రబాబు చేయాల్సిన పని ఏంటంటే.. శ్రీ వేంకటేశ్వరస్వామి ముందు లెంపలేసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కనీసం మానవత్వం ఉన్న మనిషైతే చంద్రబాబు అలాంటి పని ఎందుకు చేయడం లేదు?సీబీఐ సిట్ చార్జ్‌షీట్‌లో పొందుపరిచిన వాస్తవాలను చూపించి ఎవరైనా చంద్రబాబుని ప్రశ్నిస్తే.. ఆయన అసహనంతో మా నాయకుల మీద దాడులు చేయించే నీచ స్థాయికి దిగజారిపోయాడు. అందులో భాగంగానే వరుసపెట్టి మా నాయకులు విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకరరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీద దాడి చేయడమే కాకుండా అంబటి రాంబాబు ఇంటి మీద కూడా దాడి చేశారు.అసలు చంద్రబాబుకు చిప్ సరిగ్గా ఉంటే ఇలాంటి పనులు చేయిస్తారా? తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా.. ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్‌లు ఎలాంటి జంతు కొవ్వు లేదని ధ్రువీకరించినా.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్,లోకేశ్ తమ తీరు అస్సలు మార్చుకోవడం లేదు.తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న కూటమి నేతల ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు వక్రబుద్ధి, అబద్ధాలపై వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ సిట్‌ను ఏర్పాటు చేసింది. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఎవరూ తప్పుపట్టలేరు. సుప్రీంకోర్టు కన్నా చంద్రబాబు పదవి పెద్దది కాదు. ఇవాళ చంద్రబాబు తన స్వార్థం కోసం వన్‌మ్యాన్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వాటికి ఎలాంటి ప్రామాణికత ఉండదు. తనకు అనుకూలంగా రిపోర్టు రాకపోవడంతో మళ్లీ కొత్త కమిషన్ ఏర్పాటు చేసుకుని, తనకు అనుకూలమైన రిపోర్టు కోసం కుట్ర చేస్తున్నాడు. - వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని సీబీఐ చార్జ్‌షీట్‌లో తేల్చి చెప్పింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ కలవలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ చంద్రబాబు అన్యాయంగా ఇంకా దుష్ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. చంద్రబాబు సీఎం కాక ముందు వరకు ఎవరైనా తిరుమల ప్రసాదం ఇస్తే కళ్లకు అద్దుకుని తినేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రసాదం పవిత్రతను చంద్రబాబు దిగజార్చాడు. ఒక అబద్ధాన్ని సృష్టించి రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకున్న దుర్మార్గుడు చంద్రబాబే. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు లేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్‌ల నివేదికలు స్పష్టం చేసినా చంద్రబాబు ఇంకా ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం దారుణం..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అబద్ధాన్ని సృష్టించి రెక్కలు కట్టి దుష్ప్రచారం చేశారని, కానీ చంద్రబాబువి అబద్ధాలని సీబీఐ చార్జ్‌షీట్ తేల్చేసిందని వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో టీడీపీ మూకల దాడిలో దెబ్బతిన్న జోగి రమేష్ ఇంటిని శుక్రవారం వైఎస్ జగన్ పరిశీలించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. కక్షగట్టి దాడులుచంద్రబాబు అబద్ధాలను ప్రశ్నిస్తున్నందుకు చిప్ పని చేయక పోవడం వల్లే కక్షగట్టి దాడులకు దిగుతున్నారు. చేసిన తప్పు ఒప్పుకుని, లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పుడు వన్‌మ్యాన్ కమిషన్ అంటూ అనుకూల నివేదిక కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఆ కమిషన్‌కు ఏ మాత్రం విలువ ఉండదు. టీడీపీ గూండాలు గుంటూరులో అంబటి రాంబాబు ఇంట్లో ఐదు కార్లు «ధ్వంసం చేయడంతోపాటు ఇల్లు, ఆఫీసులో విధ్వంసం సృష్టించి ఆఫీస్‌కు నిప్పుపెట్టారు. ఆ మర్నాడు ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు జోగి రమేష్ ఇంటిపై ఏకంగా యాసిడ్ బాటిళ్లతో, పెట్రోల్ బాంబులతో వి«ధ్వంసం సాగించారు. అక్కడ అంబటి రాంబాబు.. ఇక్కడ జోగి రమేష్ తండ్రిపై హత్యాయత్నం జరిగింది. పోలీసుల సమక్షంలోనే రెండు చోట్లా దాడులు జరిగాయి. టీడీపీ గూండాలకు వారు అండగా ఉంటున్నారు. నాగరిక సమాజం తల దించుకునేలా చంద్రబాబు రాష్ట్రంలో జంగిల్‌రాజ్ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తున్నారు. నాగరిక సమాజం తల దించుకునేలా చంద్రబాబు సర్కారు చర్యలు ఉన్నాయి. తప్పులు చేస్తున్న ఎవరినీ వదిలిపెట్టబోం. సుప్రీంకోర్టు తలుపు కూడా తడతాం. మరో మూడేళ్లలో వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఇప్పుడు తప్పులు చేస్తున్న అందరినీ బోనులో నిలబెడతాం. వారికి శిక్ష తప్పదు. నాగరిక సమాజం తలదించుకునేలా.. రాష్ట్రంలో జంగిల్‌రాజ్ పరిపాలన సాగుతోంది. నాగరిక ప్రపంచం తలవంచుకునేలా చంద్రబాబునాయుడు చేశారు. గుంటూరులో అంబటి రాంబాబు ఇంట్లో 5 కార్లను ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడ్డారు. అద్దాలను పగలగొట్టారు. ఇంట్లో ఆడవాళ్లను దుర్భాషలాడారు. ఇంటి పక్కనే ఉన్న ఆఫీసులోకి చొరబడి విధ్వంసానికి దిగి ఆఫీసును తగలబెట్టారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరగటాన్ని అంతా చూశాం. అక్కడ సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దహనకాండ జరిగింది. ఆ మర్నాడే ఇక్కడ కూడా సాయంత్రం అదే పరంపర కొనసాగింది. జోగి రమేష్ ఇంటిపైనా దారుణంగా దాడి చేశారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని సీబీఐ తేల్చింది చంద్రబాబునాయుడు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నాడని, ప్రజలను తప్పుదోవ పట్టించాడని సాక్షాత్తూ సీబీఐయే తేటతెల్లం చేస్తూ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడు ఆరోపించినట్లుగా తిరుమలలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ, పందికొవ్వు కానీ, చేప నూనె కానీ కలపలేదని సీబీఐ స్పష్టం చేసింది. శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు దు్రష్పచారం చేశాడు. ప్రతిష్టాత్మక ల్యాబ్‌లూ అదే నిర్ధారించాయి తిరుమలలో వాడిన నెయ్యిపై చంద్రబాబు చెబుతున్నవి అబద్ధాలని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ), నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ల్యాబ్‌లు నిర్ధారించాయి. ఆ మేరకు నివేదికలు ఇచ్చాయి. అవి రెండూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు. వారు పరీక్షించిన నెయ్యి శాంపిల్స్ అన్నీ కూడా చంద్రబాబు సీఎంగా ఉండగా, ఆయన మనిషి టీటీడీ ఈవోగా ఉండగా సేకరించినవే. సీబీఐ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీకి ఆ శాంపిల్స్ పంపారు. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, గొడ్డు కొవ్వు లేదని, పందికొవ్వూ లేదని, ఎలాంటి చేపనూనె కూడా కలవలేదని ఆ ల్యాబ్‌లు ధ్రువీకరించాయి. ఆ రిపోర్టులను సీబీఐ కూడా సరి్టఫై చేసింది. సీబీఐ సిట్ ఆ మేరకు చార్జ్‌షీట్ దాఖలు చేసింది. భూమన, వైవీకి సీబీఐ క్లీన్చిట్.. ఆ చార్జ్‌షీట్‌లో సీబీఐ మరో విషయం కూడా చెప్పింది... గతంలో టీటీడీ చైర్మన్లుగా వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి ఉన్నప్పుడు వాళ్లు ఎలాంటి తప్పూ చేయలేదని, అన్యాయమైన పనులు చేయలేదని స్పష్టం చేసింది. అందుకే వారి పేర్లు చార్జ్‌షీట్‌లో పెట్టలేదు. వారిలో ఎవరినీ అరెస్టు చేయలేదు. అంటే సీబీఐ వారికి క్లీన్చిట్ కూడా ఇచ్చింది. ఇదొక్కటే కాదు.. ఆ చార్జ్‌షీట్‌లో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. (పేజీ నెం 62 ప్రస్తావించారు) చంద్రబాబు సీఎం అయిన తర్వాత 2024 జూలై 25న నెయ్యిలో నాణ్యత లేదని టీటీడీ 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేసింది (ఆ రిపోర్టు చదివి వినిపించారు. చార్జ్‌షీట్‌లోని పేజీ నెం 64, 44 అంశాలను చదివి వినిపించారు). కానీ ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్లీ ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే దొడ్డిదారిన వేరేవాళ్ల పేరుతో తిరిగి వస్తే వాటిని టీటీడీ ఆమోదించింది. అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సీబీఐ వెల్లడించింది. అలా చంద్రబాబు ప్రభుత్వం మీద, వాళ్లు చేసిన తప్పుల మీద, వాళ్లు చేసిన అన్యాయంపై చార్జ్‌షీట్‌లో రాశారు. పాపం చేసింది ఎవరు బాబూ..? ఏకంగా సీబీఐనే చంద్రబాబు ప్రభుత్వం మీద ఈ మాదిరిగా చార్జిషీట్లో రాసిన తర్వాత అసలు పాపం చేసిన వాళ్లు ఎవరు? అని చంద్రబాబును, ఆయన కుమారుడిని, కూటమిలో ఉన్న పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నిస్తున్నా. టీటీడీ నెయ్యిలో చేప నూనె, గొడ్డు కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని ఎవరు చెప్పారు..? సీబీఐ చెప్పిందా..? ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టులు చెప్పాయా..? చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్‌తో పాటు రోజూ వారి పల్లకి మోస్తున్న ఎల్లో మీడియా (ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5) ప్రచారం చేయడం మినహా ఎవరైనా చెప్పారా? ఒక అబద్ధానికి రెక్కలు కట్టి దు్రష్పచారం చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం కన్నా హేయమైన చర్య ఇంకోటి ఉంటుందా? చంద్రబాబుకు ఇకనైనా బుద్ధి రావాలి.. అనిల్ సింఘాల్‌ను చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే టీటీడీ ఈవోగా నియమించారు. మా ప్రభుత్వం ఆయన్ను కొనసాగించింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన్నే తెచ్చారు. శ్యామలరావును టీటీడీ ప్రక్షాళన కోసం తెచ్చానని చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక చెప్పారు. ప్రక్షాళనకు ముందే ఆయన్ను ఎందుకు టీటీడీ ఈవోగా తొలగించారు? శ్యామలరావు ఈవోగా ఉన్నప్పుడు కొన్ని నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి. అవే ట్యాంకర్లు.. మళ్లీ టీటీడీకి మరో డెయిరీ పేరుతో తిరిగి వచ్చినట్లు సీబీఐ సిట్ ధ్రువీకరించింది. మరి పాపం చేసింది ఎవరు చంద్రబాబూ? చంద్రబాబుకు ఇకనైనా బుద్ధి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. పూజలు చేయడం తప్పా..? మానవత్వం లేని చంద్రబాబుని ప్రశ్నిస్తూ.. ఆయనకు దేవుడు జ్ఞానోదయం కలిగించాలని ప్రార్థిస్తూ మా నాయకులు ఆలయాల్లో పూజలు చేశారు. ఆయనతోపాటు లోకేశ్, పవన్‌కల్యాణ్‌తో సహా ఇతర నాయకులకు బుద్ధి, జ్ఞానం కలగాలని, వారి చిప్ రిపేర్ చేయాలని మా నాయకులంతా గుళ్లల్లో పూజలు చేశారు. ఒక అబద్ధానికి రెక్కలు కట్టి దు్రష్పచారం చేస్తూ శ్రీవారి ప్రతిష్టను మంట కలిపేస్తుంటే మావాళ్లు గుళ్లలో పూజలు చేయడం తప్పా? ఇది హత్యాయత్నం కాదా..? లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఆరోపణలు పచ్చి అబద్ధమని అంత స్పష్టంగా, అన్ని విధాలుగా తేలిన తర్వాత కూడా ఈ పెద్ద మనిషి ఫ్లెక్సీలు కట్టి తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా దు్రష్పచారం చేయడం ధర్మమేనా? ఆ ఫ్లెక్సీల్లో అన్యాయమైన మాటలు రాసి దు్రష్పచారం చేయడం న్యాయమేనా? చంద్రబాబు, లోకేశ్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రశ్నిస్తూ మా నాయకుడు జోగి రమేష్.. మీ చిప్ రిపేర్ చేసుకోమని సలహా ఇచ్చాడు. దానికి ఇంత అన్యాయమైన పని చేయడం ధర్మమేనా? సలహా ఇవ్వడం మినహా జోగి రమేష్ ఏమీ చేయలేదు. దానికే చంద్రబాబుకి అసహనం ఏస్థాయిలో వచ్చింది అంటే.. ఏకంగా యాసిడ్ బాటిల్స్, పెట్రోల్ బాంబులతో జోగి రమేష్ ఇంటి మీద దాడులు చేయించాడు. ఆ యాసిడ్ పడిన ప్రాంతంలో బండలు తీవ్రంగా కాలిపోయాయి. గోడల నిండా యాసిడ్ మరకలు కనిపిస్తున్నాయి. యాసిడ్ పడి డోర్లు కాలిపోయాయి. ఆ పక్కనే ఉన్న స్విచ్ బోర్డుల మీద పడి షార్ట్ సర్క్యూట్ అయితే పెద్ద ఘోరం జరిగి ఉండేది. ఇంట్లో ఉన్న కర్టెన్లు, ఉడెన్ ఫర్నీచర్లు కాలిపోతే పరిస్థితి తీవ్రరూపం దాల్చేది. ఇంట్లో 80 ఏళ్ల వయసున్న జోగి రమేష్ నాన్న నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇది హత్యాయత్నం కాదా? బీసీ నాయకుడిగా జోగి రమేష్ ఎదుగుతుంటే, ప్రభుత్వ తప్పులపై ఆయన వాయిస్ బలంగా వినిపిస్తుంటే.. ఆ గొంతు నొక్కే కుట్రలో భాగంగానే చంద్రబాబు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలతో దాడులు చేయిస్తున్నాడు. పోలీసులతో కలిసి టీడీపీ కుట్ర..జోగి రమేష్ ఇంటి మీద సాయంత్రం ఐదు గంటలకు దాడి జరిగితే.. ఆ దాడికి సంబంధించి పోలీసులు, తెలుగుదేశం పార్టీ వ్యక్తులు ఏ రకంగా కుట్రలు చేశారనే దానికి ఈ ఫొటోనే సాక్ష్యం (పోలీసులతో టీడీపీ నాయకులు మంతనాలు జరుపుతున్న ఫొటోను చూపారు). ఇదే సర్కిల్లో డీసీపీ రామకృష్ణ, ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్‌తో టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు దాడులకు సంబంధించి వ్యూహరచన చేశాడు. జోగి రమేష్‌ను హత్య చేసి, ఇంటి మీద దాడి చేసి వారి ఆస్తులను ధ్వంసం చేసే కుట్రలకు ఇక్కడే పోలీసులతో టీడీపీ నాయకుడు మంతనాలు జరిపాడని క్లియర్‌గా తెలిసిపోతోంది. హత్యా యత్నం ఎలా చేయాలి? ఆ దాడికి పోలీసులు ఎలా సహకరించాలో పథక రచన చేశారు. ఏకంగా పోలీసులే టీడీపీ నాయకులతో కలిసి మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంతనాలు జరిపారు. ఆ తర్వాత టీడీపీ నాయకులు ఏకంగా పోలీసులనే వెంటబెట్టుకుని కలసికట్టుగా జోగి రమేష్ ఇంటిపై దాడికి దిగారు.ఈ పాపాలు ఎవరివి బాబూ?» నాలుగు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసి.. మళ్లీ అదే నెయ్యి ట్యాంకర్లు మరో పేరుతో వస్తే ఆమోదించింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కదా.» అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సీబీఐ చెప్పింది. » చంద్రబాబు ప్రభుత్వం తప్పులు, వాళ్లు చేసిన అన్యాయాన్ని చార్జ్‌షీట్‌లో సీబీఐ రాసింది » టీటీడీ ఈవోగా అనిల్ సింఘాల్‌ను తీసుకొచ్చింది ఎవరు? » ప్రక్షాళన కోసం తెచ్చామన్న శ్యామలరావును తప్పించింది ఎవరు?ఇవిగో పచ్చి నిజాలు... సాక్ష్యాలుటీడీపీ నాయకుడు ఫతావుల్లా ఏకంగా యాసిడ్ బాటిల్, పెట్రోల్ బాంబులతో దాడి చేశాడు. దాడికి ముందు వాటితో ఉన్న ఫొటోల్లో క్లియర్‌గా చూడవచ్చు. పోలీసుల సమక్షంలోనే జోగి ఇంటిపైకి పెట్రోల్ బాంబులు విసిరి నిప్పంటించాడు. ఫతావుల్లాతోపాటు ఆశా అనే టీడీపీ కార్యకర్త కూడా జోగి రమేష్ ఇంటి మీద పోలీసుల సమక్షంలోనే రాళ్ల దాడి చేసింది. ఆశా కుమార్తె పెళ్లికి చంద్రబాబు కూడా హాజరయ్యాడు. (చంద్రబాబు, లోకేశ్, హోంమంత్రితో వారు దిగిన ఫొటోలు, ఆశా కుమార్తె పెళ్లికి హాజరైన చంద్రబాబు ఫొటోలు చూపించారు. పోలీసులతోనే కలసి వచ్చి వారి సమక్షంలోనే టీడీపీ నాయకులు దాడికి దిగిన వీడియోలు కూడా చూపారు). టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు, డీసీపీ, సీఐ మంతనాలు జరుపుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులతో కలిసి టీడీపీ శ్రేణులు వస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. (టీడీపీ నాయకుడు బాటిల్ ఎగరేస్తూ పోలీసులతో కలిసి జోగి రమేష్ ఇంటి వద్దకు వచ్చిన వీడియో క్లిప్పింగ్స్‌ను మీడియాకు చూపారు). మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా? లేక జంగిల్ రాజ్‌లో ఉన్నామో చెప్పేందుకు ఈ వీడియోలే సాక్ష్యం. కల్తీ లిక్కర్ కేసుకు సంబంధించి తంబళ్లపల్లె కోర్టుకు హాజరయ్యేందుకు జోగి రమేష్ వెళ్తుండగా ఇక్కడ ఇబ్రహీంపట్నంలోని తన ఇంటిపై దాడి జరిగినట్లు ఆయనకు సమాచారం వచ్చింది. ఈ విషయంపై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసేందుకు జోగి రమేష్ ఫోన్ చేసినా స్పందించలేదు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి సమయంలోనూ ఇలాగే జరిగింది. అన్ని ఆధారాలున్నాయ్.. ఎవరినీ వదిలిపెట్టం.. దాడులు, విధ్వంసాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఎన్హెచ్ఆర్సీ నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి గడప తొక్కుతాం. న్యాయ పోరాటం చేస్తాం. రాష్ట్రంలో సాగుతున్న జంగిల్‌రాజ్ పాలనను దేశానికి తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వానికి ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యాయి. ఇక మిగిలింది మూడేళ్లే. ఆ తరువాత వచ్చేది మా ప్రభుత్వమే. ఇవాళ మా పార్టీ నాయకుల ఇళ్లపై గూండాగిరీ చేసిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతాం. ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదు.బీసీలంటే చంద్రబాబుకు చులకన.. తంబళ్లపల్లిలో టీడీపీ తరఫున పోటీ చేసిన వ్యక్తి నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాడు. కమీషన్ల పంపకాల్లో తేడా రావడంతో ఆ వ్యవహారం బయటపడింది. ఆ కేసులో జయచంద్రారెడ్డిని అరెస్టు చేయాల్సింది పోయి సంబంధం లేని జోగి రమేష్‌ను కేసులో చేర్చారు. చంద్రబాబు రాజ్యంలో జోగి రమేష్ లాంటి వ్యక్తి నకిలీ లిక్కర్ తయారు చేయగలడా? ఆ లిక్కర్‌ను బెల్ట్ షాపుల్లోకి సరఫరా చేయగలరా? జోగి రమేష్ పై చంద్రబాబు ప్రభుత్వం 12 కేసులు పెట్టింది. చేయని నేరానికి 83 రోజులు జైలులో పెట్టారు. ఆయన కుమారుడు రాజకీయంగా యాక్టివ్ అవుతున్నాడని చిన్న పిల్లాడిపై ఏడు కేసులు పెట్టారు. జోగి రమేష్ భార్యపై పోలీసులే దౌర్జన్యం చేసి తిరిగి ఆమెపైనే కేసులు పెట్టారు. బీసీలపై చంద్రబాబుకు ఉన్న చులకన భావానికి జోగి రమేష్‌పై నమోదైన కేసులే నిదర్శనం. -
అబద్ధాన్ని సృష్టించి.. దానికి రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం చేశారు: వైఎస్ జగన్
విజయవాడ: వరుసగా వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ గూండాలు చేస్తున్న దాడులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు.అక్కడ(గుంటూరులో) అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడి విధ్వంసం.. ఇక్కడ జోగి రమేష్( విజయవాడ, ఇబ్రహీంపట్నం) ఇంటిపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిళ్లతో దాడులు చేయడం కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు నిదర్శనమంటూ మండిపడ్డారు వైఎస్ జగన్. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 06) జోగి రమేష్ ఇంట్లో దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన వైఎస్ జగన్.. ఆపై కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం,వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అంబటి రాంబాబు ఇంట్లో కొనసాగించిన జంగిల్ రాజ్ పరంపరను జోగి రమేష్ విషయంలో కూడా కొనసాగించారని ధ్వజమెత్తారు. ‘గుంటూరులో అంబటి రాంబాబు అన్న ఇంటిని.. ఇక్కడ జోగి రమేష్ అన్న ఇంటిని ధ్వంసం చేశారు. అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడ్డారు.. విధ్వంసం సృష్టించారు. అంబటి కుటుంబ సభ్యులపై దుర్భాషలాడారు. పక్కనున్న అంబటి ఆఫీస్‌ను కూడా తగలబెట్టారు. అంబటి ఇంట్లో, ఆఫీస్‌లో జరిగిన జంగిల్ రాజ్‌ను.. జోగి రమేష్ విషయంలో కూడా కొనసాగించారు. అసత్య ప్రచారం చేస్తున్న మీ చిప్ సరి చేసుకోమన్నందుకే జోగిరమేష్‌పై దాడి చేశారు. చిప్ సరిగ్గా లేకనే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు. చిప్ సరిగ్గా లేకనే సీబీఐ రిపోర్టుపై అసత్య ప్రచారం చేశారు’ అంటూ వైఎస్ జగన్ విమర్శించారు.రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం...చంద్రబాబు అబద్ధాలను సీబీఐయే తేటతెల్లం చేసింది. తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని సీబీఐ స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కానీ ఎటువంటి పంది కొవ్వు కలపలేదని సీబీఐ రిపోర్ట్‌లో పేర్కొంది. శ్రీ వెంకటేశ్వరస్వామిని అగౌరపరిచిన, అవమానపరిచిన వ్యక్తి చంద్రబాబు. ఒక అబద్ధాన్ని సృష్టించి.. దానికి రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు అంటూ విష ప్రచారం చేశారు. చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు హయాంలో సేకరించిన నమూలను కేంద్ర సంస్థలైన ఎన్డీడీబీకి, ఎన్డీఆర్ఐకి పంపింది. ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పాయి. సీబీఐ ఇంకొకటి కూడా చెప్పింది. టీటీడీ చైర్మన్లుగా పని చేసిన తమ నేతలు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డిలు సమయంలో ఎటువంటి తప్పు జరగలేదని సీబీఐ క్లీన్చిట్ కూడా ఇచ్చింది. సీబీఐ ఇచ్చిన చార్జ్‌షీట్‌లో.. పేజ్ నం 62లో వాళ్లు మెన్షన్ చేసింది ఏమిటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా జూలైలో టీటీడీ వాళ్లు నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. అవే ట్యాంకర్లను దొడ్డిదారిని మళ్లీ టీటీడీకి రప్పించి, వాటినే వాడారని సీబీఐ చెప్పింది. మరి ఇప్పుడు పాపం చేసింది ఎవరు అనేది ప్రశ్నిస్తున్న చంద్రబాబుని. కూటమి నేతల్ని కూడా ప్రశ్నిస్తున్న తప్పు ఎవరు చేశారు? పాపం ఎవరు చేశారు? అని, జంతువుల కొవ్వు ఉందని గొడ్డుమాంసం ఉందని ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పాయి. ఎవరూ చెప్పలేదు. అది చంద్రబాబు సృష్టి. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబే సృష్టించారు’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అరాచకాన్ని నిలదీస్తే.. దాడులు చేస్తారా? ఒక అబద్ధాన్ని స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు సృష్టిస్తే.. దానికి ఆయన తనయుడు లోకేష్, పవన్ కళ్యాణ్‌లు వంత పాడారు. వీరికి ఎల్లో మీడియానే ఈ విషయాన్ని పదే పదే విష ప్రచారం చేశాయి. దుష్ప్రచారం చేసి దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు. ఆ దుష్ప్రచారం తప్పు అని చెప్పినప్పుడు.. చంద్రబాబు ఏం చేయాలి. క్షమించమని లెంపలు వేసుకోవాలి. తప్పుడు ప్రచారం చేశారు కాబట్టి వారి చిప్‌లు బాగు చేయమని గుడుల్లోకి పూజలు చేయడం తప్పా?, సీబీఐ క్లీన్చిట్ ఇచ్చినప్పడు.. తప్పుడు ఫ్లెక్సీలు కట్టి దుష్ప్రచారం మొదలుపెట్టారు. దాన్ని నిలదీస్తే.. ఈ అరాచకం మొదలుపెట్టారు. ఈ జంగిల్ రాజ్ పరిపాలన ఆరంభించారు’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.పోలీసులతో కలిసి టీడీపీ గూండాలు స్కెచ్దీన్ని ప్రశ్నించే వారిపై ఎటాక్ చేశారు. అంబటి రాంబాబు ఇంటిపై ఆపై జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారు. రమేష్ ఇంటిపై పెట్రోల్, యాసిడ్లతో దాడులు చేశారు. ఓ పెద్దాయన(జోగి రమేష్ తండ్రి) ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేయడం హత్యాయత్నం కాదా? అని అడుగుతున్నా. జోగి రమేష్ ఇంటిపై దాడిక జరగకమునుపు.. కుట్ర చేశారు. నాలుగు గంటల ప్రాంతంలో దాడి జరిగితే.. రెండు గంటలకు ఓ స్కెచ్ వేశారు. పోలీసులే.. టీడీపీ నాయకులతో కలిసి స్కెచ్ వేశారు( జోగి రమేష్ ఇంటిపై దాడికి ముందస్తు పన్నాగం ఎలా చేశారో పలు దృశ్యాలను చూపిస్తూ) వైఎస్ జగన్ తూర్పూరాబట్టారు.. ఆశ. ఫతుల్లా, సుబ్బారావులు కలిసి పెట్రోల్ బాంబులతో జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వీరంతా టీడీపీ నేతలే అనడానికి ఇవే రుజువులు అంటూ కొన్ని క్లిప్పింగ్స్ చూపించారు వైఎస్ జగన్. ఆశ కూతురు పెళ్లికి చంద్రబాబు వెళ్లడం, ఫతుల్లాకి లోకేష్‌కి సన్నిహిత సంబంధాలను వైఎస్ జగన్ మీడియా సాక్షిగా చూపించారు. దాడులకు సంబంధించి అన్నిఆధారాలున్నాయని, దీనిపై ఎన్హెచ్ఆర్సీ, సుప్రీంకోర్టులను ఆశ్రయిస్తామన్నారు వైఎస్ జగన్. మీకు చిత్తశుద్ధి లేదనడానికి ఇది నిదర్శనం కాదా?తాము తప్పు చేసి ఉంటే, తమ హయాంలో పని చేసిన అనిల్ సింఘాల్‌ను మళ్లీ టీటీడీ ఈవోగా ఎందుకు తెచ్చావ్ చంద్రబాబూ అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ‘ గత చంద్రబాబు హయాంలో అనిల్ సింఘాల్ టీటీడీ ఈవోగా పని చేశారు. మేము ఆయన్ను మా హయాంలో కూడా కొనసాగించాము. ఇప్పుడు అదే అనిల్ సింఘాల్‌ను మళ్లీ టీటీడీ ఈవోగా చంద్రబాబు తెచ్చుకున్నారు. మరి ఇందులో అర్థమేమిటి చంద్రబాబు. అంటే చంద్రబాబు చేసే ఆరోపణలకు చిత్తశుద్ధి లేదు అనడానికి ఇది నిదర్శనం కాదా? అని అడుగుతున్నా. అదే సమయంలో టీటీడీ ఈవోగా చేసిన శ్యామలరావును తొలగించడానికి కారణాలను కూడా వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘ మీరు అధికారంలోకి రాగానే టీటీడీ ప్రక్షాళన అంటూ శ్యామలరావును తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఆయన్ను తీసేశారు. టీటీడీ ప్రక్షాళన జరిగిందా చంద్రబాబు?అని వైఎస్ జగన్ నిలదీశారు. అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, అదే శ్యామలరావు టీటీడీ ఈవో ఉండగానే నాలుగు నెయ్యి ట్యాంకర్లు తిరుమలకు వచ్చాయని, వాటిని రిజెక్ట్ చేసి పంపితే మళ్లీ దొడ్డిదారిన అవి మళ్లీ అక్కడకే వచ్చాయనేది సీబీఐ చెబుతున్న నేపథ్యంలో ఇది చంద్రబాబు ప్రభుత్వానికి మచ్చ కాదా? అని ప్రశ్నించారు జగన్. -
జోగి రమేష్ ఇంటి వద్ద వైఎస్ జగన్ ప్రెస్ మీట్
-
జగన్ రాకతో జన జాతరను చూశారా? (ఫొటోలు)
-
జోగి రమేష్ ఇంటికి బయల్దేరిన జగన్ కాన్వాయ్...
-
రాత్రికిరాత్రే అన్నీ మార్చేశాడు.. భయంతో వణికిపోతున్నాడు
-
జోగి రమేష్ ఇంటికి YS జగన్
-
బాబు, పవన్‌ను వేంకటేశ్వరస్వామి క్షమించడు: ఆర్కే రోజా
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని.. పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడమే అందుకు తార్కాణం అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఇబ్రహీంపట్నంలో టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని రోజా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పలువురు నేతలు శుక్రవారం పరిశీలించారు. జోగి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. ‘‘ఏకంగా మాజీ మంత్రి ఇంటిపైనే దాడులకు తెగబడ్డారు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. పోలీసుల సమక్షంలోనే దాడులకు తెగబడుతున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం గురించి చంద్రబాబు, పవన్ నీచంగా మాట్లాడారు. వాళ్ల పార్టీకి వాళ్లే సమాధి కట్టుకున్నారు. రాష్ట్ర ప్రజలను ఈ ఇద్దరూ క్షమాపణలు కోరాలి. కానీ, అలాంటి వాళ్లను వేంకటేశ్వరస్వామి మాత్రం క్షమించడు’’ అని రోజా కామెంట్ చేశారు. జగన్ పర్యటనకు జనం రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. కానీ జనం జగన్ వెంటే ఉన్నారని వాళ్లు గుర్తించాలి అని రోజా అన్నారు.ఏపీలో ఇలాంటి పరిస్థితి ఎన్నాడూ చూడలేదని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంతో దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి తలెత్తిందని అన్నారామె. -
సుప్రీం కోర్టు కన్నా చంద్రబాబు గొప్పేంకాదు: వైఎస్ జగన్
వైఎస్ జగన్ పర్యటనపై చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. అకస్మాత్తుగా రూట్ మార్చాలంటూ పోలీసుల నోటీసులు ఇచ్చారు. గుంటూరు జన ప్రభంజనం దెబ్బకి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. నేడు జోగి రమేష్ నివాసానికి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. కనకదుర్గ వారధి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లనున్నారు. రెండు రోజుల కిందటే వైఎస్సార్సీపీ.. రూట్ మ్యాప్ ఇవ్వగా.. హఠాత్తుగా వైఎస్ జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. విజయవాడలోకి జగన్‌ని రానీయకుండా కుట్రలు పన్నుతున్నారు. -
నేడు జోగి రమేష్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారు. టీడీపీ గూండాలు దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించి, జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం వైఎస్ జగన్ తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
వైఎస్ జగన్ పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్ర
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రకు తెరలేపింది.వైఎస్ జగన్ శుక్రవారం విజయవాడ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్నారు. జోగిరమేష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే ఇందుకోసం అవసరమైన అనుమతులు తీసుకున్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా రూట్ మార్చాలని పోలీసుల నోటీసులు జారీ జారీ చేశారు. విజయవాడ సీపీ స్వయంగా వైఎస్ జగన్‌కు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. టీడీపీ గూండాల దాడితో భయాందోళనకు గురవుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబసభ్యుల్ని బుధవారం వైఎస్ జగన్ పరామర్శించారు. ఇందుకోసం తాడేపల్లి నివాసం నుంచి గుంటూరు పట్టాభిపురంలో అంబటి నివాసానికి వైఎస్ జగన్ వెళ్లారు. నిన్నటి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనకు కదలి వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి కూటమి ప్రభుత్వ కుట్రకు తెరలేపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేపు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్న జగన్.. కనకదుర్గ వారధి మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోనున్నారు. రెండు రోజుల కిందటే పార్టీ రూట్ మ్యాప్ ఇచ్చినా, హఠాత్తుగా పోలీసులు ఆంక్షలు విధించడంతో పర్యటనపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయి. -
రేపు జోగి రమేష్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, అమరావతి: టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన మాజీమంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 6న పరామర్శించనున్నారు. ఆ రోజు ఉ.10.30 కు తాడేపల్లి నివాసం నుంచి జగన్ ఇబ్రహీంపట్నం బయల్దేరుతారు.కనకదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండ్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మలపాలెం మీదుగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. వైఎస్ జగన్ మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జోగి రమేష్ ను పరామర్శించిన తానేటి వనిత
-
కరకట్ట ప్యాలెస్ కిరాతకం.. దాడికి సహకరించిన ఓ పోలీసు అధికారి
-
కరకట్ట ప్యాలెస్ కిరాతకమే
సాక్షి, టాస్క్ ఫోర్స్: కరకట్ట ప్యాలెస్ కేంద్రంగానే వైఎస్సార్ సీపీ నేత జోగి రమేశ్ ఇంటిపై దాడికి వ్యూహ రచన జరిగినట్లు స్పష్టమైంది. పెదబాబు, చినబాబు ఆదేశాల మేరకే ఓ పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్య నేత ఈ ధ్వంస రచన చేశారని విశ్వసనీయ సమాచారం. శనివారం గుంటూరులో అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరగ్గానే.. అదే రోజు రాత్రి పొద్దుపోయాక టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతకు చినబాబు కాల్ చేసినట్లు సమాచారం. ఆ మరుసటి రోజే.. అంటే ఆదివారం జోగి రమేశ్ ఇంటిపై దాడి చేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. దీంతో ఆ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్యనేత.. విజయవాడ పశి్చమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఫతావుల్లాతోపాటు, మైనార్టీ మహిళా నేత ఆషా, గొల్లపూడికి చెందిన టీడీపీ నేతలు, విజయవాడ, మైలవరం నియోజకవర్గానికి చెందిన నేతలకు ఈ దాడి బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది. దాడిలో కీలకంగా పాల్లొన్న షేక్ ఆషా, ఫతావుల్లాలిద్దరూ చంద్రబాబు, లోకేశ్, హోంమంత్రి అనితకు బాగా తెలుసని.. దాడులు చేయడానికి రౌడీ మూకలను కూడగట్టడంలో వారిది అందెవేసిన చేయి అని సమాచారం. ముఖ్య నేతల ఆదేశాలు కావడంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి పెట్రో బాంబులు విసిరే వారిని ఆగమేఘాలపై రప్పించి.. దాడికి పురిగొలిపినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కొందరు టీడీపీ కార్యకర్తలే బహిరంగంగా వెల్లడిస్తుండడం గమనార్హం. ‘అధికారంలో ఉన్నది మేమే.. మళ్లీ ఎన్నికలొచి్చనా గెలిచేది మేమే.. ఎలా గెలవాలో పెదబాబు, చినబాబుకు తెలుసు. అందువల్ల మాకేం భయం లేదు. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకోక పోతే ఆయనకు పట్టిన గతే పడుతుంది’ అని ఆషా, ఫతావుల్లాలతోపాటు, గొల్లపూడి, మైలవరానికి చెందిన నేతలు రౌడీలను సిద్ధం చేసి దాడికి పురమాయించారు. ఈ ఇద్దరు నేతలకు ఇదివరకే ‘మీకు మంచి భవిష్యత్ ఉంటుంది. పార్టీ సూచనల మేరకు నడుచుకోండి’ అని చినబాబు దిశానిర్దేశం చేశారని.. అందువల్లే వారు, పార్టీనేతలతో కలిసి, రెచి్చపోయి ధ్వంసరచన చేసినట్లు తెలిసింది. పోలీసులకు ముందే తెలిసినా.. మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై దాడి జరుగుతుందని ముందస్తు సమాచారం ఉన్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినట్లు స్పష్టం అవుతోంది. దాడికి వెళ్తున్న పచ్చ మూకలకు రక్షణగా పోలీసులు వెళ్లినట్లు ఘటనా స్థలంలో పరిస్థితులను చూస్తే స్పష్టమవుతోంది. ఈ దాడుల స్కెచ్‌లో ఓ పోలీసు అధికారి కీలక భూమిక పోషించినట్లు తెలుస్తోంది. దాడులు జరుగుతున్న సమయంలో సమీప సెంటర్లో టీడీపీ నేతలతో కలిసి ఉండి , ప్రోత్సహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చేసిన విమర్శల్లో నిజం లేదని సీబీఐ సిట్ చార్జిషీట్ తేల్చడంతో డైవర్షన్ పాలిటిక్స్‌ల్లో భాగంగానే మాజీ మంత్రుల ఇళ్లపై దాడులకు టీడీపీ ముఖ్యనేతలు కుట్ర పన్నినట్టు స్పష్టమవుతోంది. మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరుగుతున్న సమయంలో స్పందించని పోలీసులు, ప్రభుత్వం దాడుల తంతంగమం ముగిశాక తాపీగా సీఎం చంద్రబాబు నాయుడు తాను ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితులను సహించబోనని, శాంతి భద్రతల విషయంలో రాజీపడబోనని నీతి వచనాలు వల్లెవేస్తూ సన్నాయి నొక్కులు నొక్కడంపై సర్వతా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరామర్శకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై కేసులు దాడులకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులుదాడులు జరిగిన తర్వాత మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి పరామర్శకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహనరావును అడ్డుకొని, అన్యాయంగా అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేసి విజయవాడలోని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అలానే బాధితుడైన మాజీ మంత్రి జోగి రమేష్ పైనా అన్యాయంగా అక్రమ కేసులు నమోదు చేయడం గమనార్హం. టీడీపీ మూకల దాడులపై అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నామమాత్రం కేసులతో చేతులు దులుపుకున్నారు. -
‘ప్రశ్నిస్తానన్న పవన్ ఎమైపోయాడు’
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వ ఎక్స్పైరీ డేట్ దగ్గరలో పడిందని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాలు పెట్రోల్ బాంబులు,మారణాలయుధాలతో దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై జోగి రమేష్ కుటుంబాన్ని అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు.ఈ సందర్భంగా జోగి రమేష్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ కుమార్ మాట్లాడారు.‘కూటమి ప్రభుత్వంలో రాక్షస పాలన సాగుతోంది. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని తప్పుడు ప్రచారం చేశారు. తాను చేసింది అసత్య ప్రచారం అని తెలిసి పశ్చాత్తాపం పడకుండా దాడులు చేయిస్తున్నాడు.ప్రశ్నించిన వారి పై కేసులు పెట్టడం దాడులు చేయించడమే చంద్రబాబు పని. అంబటి రాంబాబు,జోగి రమేష్ ఇళ్ల పై వందల మంది గూండాలతో దాడి చేయించారు.జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేయించారు. దాడి సమయంలో జోగి రమేష్ తండ్రి, భార్య,కుమారుడు ఇంటిలోనే ఉన్నారు.ఇంట్లో ఉన్న మహిళలకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత.మీ పార్టీలో ఉన్నవారే మహిళలా. మీ పార్టీలో ఉన్నవారే బిసిలు,కాపులా. ప్రశ్నిస్తాననేపై పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనం వహిస్తున్నాడు.జగన్ ఐదేళ్ల పాలనపై ఫ్యాక్షన్ ముద్ర వేశారు. నిజంగా మీరు చెప్పినట్లు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే ఏపీలో మీరు తిరగ గలిగేవారా. ప్రజలు మీకు ఓటేసింది ప్రజలకు మంచి చేయమని. ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు చేయడానికి కాదు.ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో తిరుగుబాటు తప్పదు.టీడీపీ వాళ్లు ఏమైనా చేస్తామని బెదిరిస్తున్నారు. జగన్ ఐదేళ్లలో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడలేదు.మీరు రెచ్చగొట్టే కొద్దీ వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు వస్తారు.ప్రతీ ఒక్కరికీ ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. మీ ప్రభుత్వానికి మరో మూడేళ్లే ఎక్స్ పైరీ డేట్.అన్నారో లేదో తెలియని మాటకు చంద్రబాబు రాష్ట్రమంతా తిరిగి ఏడ్చారు.జోగి రమేష్ ఇంటి పై దాడి చేసిన సమయంలో వాళ్లింట్లో ఉన్నది కూడా మహిళలే. వెనక నుంచి దాడి చేయడం ..వెన్నుపోటు రాజకీయం చంద్రబాబుకి అలవాటు. చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దాడి చేయలేదు. కేవలం జోగి రమేష్ నిరసన తెలియజేశారు.జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన టీడీపీ నేతలెవరో, వారి వివరాలు ఉన్నాయని హెచ్చరించారు. -
High Court: జోగి రమేష్ ఇంటికి భద్రత..
-
అంబటి, జోగి రమేష్ లను పరామర్శించనున్న వైఎస్ జగన్
-
జంగిల్‌రాజ్‌పై జనాగ్రహం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో జంగిల్‌రాజ్ అరాచకాలను... అధికార మదంతో టీడీపీ గూండాలు, అల్లరి మూకలు సాగిస్తున్న విధ్వంస కాండను... తమ పార్టీ నేతలపై టీడీపీ గూండాలు, పచ్చ మూకలు చేస్తున్న దాడులను, చంద్రబాబు ప్రభుత్వ అక్రమ అరెస్టులను వైఎస్సార్సీపీ తీవ్రంగా పరిగణించింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీ గూండాల చేతిలో హత్యాయత్నానికి గురైన అంబటి రాంబాబు కుటుంబాన్ని బుధవారం పరామర్శించనున్నారు. అలాగే టీడీపీ పచ్చ మూకలు శుక్రవారం నిప్పు పెట్టిన జోగి రమేశ్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మరోవైపు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశమై టీడీపీ మూక దాడులపై మండిపడ్డారు. జంగిల్ రాజ్యాధిపతి చంద్రబాబు అరాచకాలు, ఆ పార్టీ నేతల గూండాగిరిని జాతీయ స్థాయిలో ఎండగడతామని స్పష్టం చేశారు. అంతేకాకుండా న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయడంతోపాటు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇంకోవైపు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీ అరాచకాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు, బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌లపై జరిగిన దాడులను ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, కాపు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జంగిల్ రాజ్‌కు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు బీసీ, ప్రజా సంఘాలు, కాపు నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి చంద్రబాబు ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. వెంటనే చంద్రబాబు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఉత్తరాంధ్రలో నిరసనల వెల్లువ.. టీడీపీ జంగిల్‌రాజ్‌కు వ్యతిరేకంగా, తిరుమల లడ్డూపై పచ్చ మూక చేస్తున్న దు్రష్పచారానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పార్టీ నేతలు, ప్రజా సంఘాలు, బీసీ నేతలు నిరసనకు దిగారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అండ్ కో సాగిస్తున్న అసత్య ప్రచారం... బాబు అబద్ధాలకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ నేతలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణకు సోమవారం వినతిపత్రమిచ్చారు. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై ఆరోపణలన్నీ అవాస్తవమని సీబీఐ సిట్ నివేదిక ఇచ్చినా ఇంకా టీడీపీ నేతలు అసత్యాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ దు్రష్పచారం సాగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నెల్లూరు నగరంలోని వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. కర్నూలు, నంద్యాలలో టీడీపీ నాయకులపై కేసు నమోదు చేయాలని పోలీసులకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్‌బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పోలీసు స్టేషన్లో సీఐ వీరా నాయక్‌కు పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వారం రోజులుగా ఆటవిక, రాక్షస పాలనను తలపించేలా కూటమి ప్రభుత్వ పాలన ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ విమర్శించారు. దాడులు అరికట్టాలని పామర్రు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రకాశం జిల్లాలో మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ఒంగోలులో ఇన్చార్జి చుండూరి రవిబాబు, కనిగిరిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌లపై టీడీపీ గూండాలు చేసిన దాడులకు నిరసనగా సోమవారం అనంతపురం జిల్లా పరిషత్ ప్రాంగణంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేశారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే దాడులతో అరాచకం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అన్నారు. వివాదాస్పద ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విజయవాడలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, తదితరులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంతకుముందు నేతలు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. రెడ్‌బుక్ పాలనే... ప్రజా పాలన లేదుతిరుపతిలో జ్యోతిరావ్‌పూలే విగ్రహం వద్ద బీసీ సంఘ నాయకులు ఆందోళన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్షతో రెడ్‌బుక్ పాలనే తప్ప, ప్రజా పాలన సాగించడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ నాయకుడు తొండమల్ల పుల్లయ్య, జిల్లా అధ్యక్షులు చిన్నియాదవ్, వాసుయాదవ్ ఆరోపించారు. మాజీ మంత్రులు జోగి రమేశ్, అంబటి రాంబాబు ఇళ్లపై కూటమి గూండాలు చేసిన దాడులను ఖండిస్తూ సోమవారం తిరుపతి బాలాజీకాలనీలోని జ్యోతిరావ్‌పూలే విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా రాజకీయ కక్షలు మానడంలేదని, రెడ్‌బుక్ పాలన సాగిస్తూ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొవ్వు ఉందంటూ చేసిన ఆరోపణలు సీబీఐ నివేదికతో పటాపంచలయ్యాయన్నారు. అందువల్లే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. -
అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలను కలవనున్నారు. బుధవారం అంబటి రాంబాబు కుటుంబాన్ని, శుక్రవారం జోగి రమేష్ కుటుంబాన్ని కలిసి పరామర్శించనున్నారు. ఇటీవల అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ గూండాలు దాడి చేసి నిప్పు పెట్టిన ఘటన పెద్ద కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలతో చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు వైఎస్ జగన్ ఈ పరామర్శలు చేయనున్నారు. -
జోగి ఇంటిపై దాడి కేసులో 11 మంది అరెస్ట్.. వెంటనే రిలీజ్
-
జోగి ఇంటిపై దాడి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
-
జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి.. పోలీసుల హైడ్రామా
సాక్షి,ఎన్టీఆర్: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై బాంబు దాడి ఘటనలో పోలీసులు హైడ్రామా క్రియేట్ చేశారు. జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన వారిపై పోలీసులు డమ్మీ కేసులు నమోదు నమోదు చేశారు. వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై వందలాది టీడీపీ గూండాలు దాడికి దిగారు. పెట్రోల్ బాంబులు విసిరారు. మారణాయుధాలు, రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. అయితే, జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టి, దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలు ఫతావుల్లా, మాధవ్, ఆశ సహా పలువురి అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం, వారిపై బెయిల్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జోగి రమేష్ ఇంటిపై దాడి చేసేందుకు విజయవాడ నుంచి టీడీపీ గూండాలు వెళ్లడం,వారిని అరెస్టు చేసి బెయిల్ ఇవ్వడంపై పోలీసులు క్రియేట్ చేసి హైడ్రామాను చూసి నవ్వుకోవడం ప్రజల వంతైంది. -
Jogi Ramesh: నువ్వు పెద్ద పుడింగిలా ఫీల్ అవ్వకు నీ రెడ్ బుక్ మడిచి పెట్టుకో..
-
తగిన మూల్యం చెల్లిస్తారు..అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడి తమ్మినేని సీతారాం సీరియస్ రియాక్షన్
-
జోగి రమేష్ ఇంటిపై దాడి.. హైకోర్టు కీలక ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకులు జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాల దాడి నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జోగి రమేష్ ఇంటికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. జోగి రమేష్ ఇంటి వద్ద ఎలాంటి దాడులు జరిగినా పోలీసులలే బాధ్యత అని తెలిపింది.కాగా, తమకు భద్రత కల్పించాలని జోగి రమేష్ కుమారుడు.. ఏపీలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. జోగి రమేష్ ఇంటి వద్ద భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ దాడులు జరిగితే పోలీసులదే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటనలో ఇబ్రహీంపట్నం పోలీసుల హై డ్రామాకు తెరలేపారు. దాడికి పాల్పడిన వారిపై డమ్మీ కేసులు నమోదు చేసి 11 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం, వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి వారిని ఇబ్రహీంపట్నం పోలీసులు వదిలేశారు. 11 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను విడుదల చేశారు. టీడీపీ నేతలు ఫతావుల్లా, మాధవ్, ఆశ సహా పలువురిని అరెస్ట్ చేసి వదిలిపెట్టారు. వీరంతా విజయవాడ నుండి దాడికి వెళ్లిన టీడీపీ నేతలు కావడం గమనార్హం. -
అరాచక పాలన.. ఇంట్లోకి వచ్చి దాడులు
-
‘కూటమి నేతల అరాచకాల్ని ఎదుర్కొంటాం’
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనలో టీడీపీ గూండాలకు పోలీసులకు రక్షణగా నిలిచారని వైఎస్సార్సీపీ సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదుగంటల పాటు పోలీసుల సమక్షంలో అరాచకం రాజ్యమేలిందని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై టీడీపీ గూండాల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిపై పరామర్శించేందుకు జోగి రమేష్ ఇంటికి సజ్జలతో పాటు ఇతర వైఎస్సార్సీపీ నేతలు వెళ్లారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. గుంటూరు పోలీసుల సమక్షంలో అంబటి రాంబాబు ఇంటిపై దాడులు చేశారు. గుంటూరులో టీడీపీ గూండాలు ఏం చేశారో రాష్ట్రప్రజలు చూశారు. టీడీపీ గూండాలకు పోలీసులు రక్షణగా ఉన్నారు. అంబటిని కలిసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు యత్నించారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన పార్టీ నేతల్ని అడ్డుకున్నారు. మాజీ హోంమంత్రి ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదు. బాధితుడినే పోలీసులు అరెస్టు చేశాను. మా నేతలను ఎస్పీ కార్యాలయంలో ఎదుట గంట సేపు ఎదురు చేయించారు. ప్లాన్ ప్రకారం అంబటి రాంబాబు,జోగి రమేష్ కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. టీడీపీ గూండాలను పోలీసులు కంట్రోల్ చేస్తున్నట్లు యాక్ట్ చేశారు. జోగి రమేష్ కుటుంబానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు?’. అంబటి,జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేసిన గూండాలపై కేసులు పెట్టలేదు. దాడి ఘటనపై పోలీసులు విచారణ చేపట్టలేదు. కూటమి నేతల అరాచకాల్ని ఎదుర్కొంటాం. కూటమి అరాచకాల్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. చంద్రబాబు వైఎస్సార్సీపీ శ్రేణులు,నేతల్ని బెదిరింపులు, దాడులు చేసి బెదిరించాలని అనుకోవద్దు. అలా అనుకుంటే భ్రమే అవుతుంది’అని వ్యాఖ్యానించారు. -
Jogi Ramesh: నన్ను చంపాలనే ప్లాన్
-
Botsa : రాష్ట్రంలో హింసాకాండ జరుగుతుంటే జనసేన, బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు?
-
అది దాడి కాదు.. నన్ను చంపాలనే ప్లాన్: జోగి రమేష్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే తన ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు మాజీ మంత్రి జోగి రమేష్. తనపై ఎటువంటి దాడి జరిగినా లోకేష్‌దే బాధ్యత అని చెప్పుకొచ్చారు. తన ఇంటిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై దాడే అని అన్నారు. తనను మట్టుబెట్టాలనే ఆలోచనే లేకపోతే దాడి ఎందుకు చేస్తారు? అని ప్రశ్నించారు. 83 రోజులు జైలులో పెట్టినా కడుపు చల్లబడలేదా చంద్రబాబు అని మండిపడ్డారు.తన ఇంటిపై టీడీపీ నేతల దాడి అనంతరం మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రేరేపిత కుట్రతోనే మా ఇంటిపై దాడి చేశారు. తప్పుడు కేసులో అకారణంగా నన్ను, నా తమ్ముడిని 83 రోజులు జైలులో పెట్టారు. మమ్మల్ని వేధించి, హింసించి రక్షసానందం పొందుతున్నారా?. ప్రజా వ్యతిరేక విధానాలపై నా గొంతుక వినిపించడం తప్పా?. మీరు బూతులు మాట్లాడితే తప్పు లేదు కానీ.. మేం ప్రశ్నిస్తే తప్పా?. మా ఇంటిపై జరిగిన దాడి బడుగు బలహీన వర్గాలపై జరిగిన దాడి అని ఘాటు విమర్శలు చేశారు.ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలోనే గంజాయి, బ్లేడ్ బ్యాచ్ దాడికి దిగింది. నన్ను, నాకుటుంబాన్ని నాశనం చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారా?. మీ బుర్రలు పాడు కాకపోతే మా ఇంటిపైకి దాడులు చేయిస్తారా?. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరీ గూండాలను రప్పించారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలోనే మా ఇంటిపై దాడి చేశారు. పోలీసు అధికారులు, టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే మా ఇంటిపై కుట్ర జరిగింది. టీడీపీ గూండాలకు పోలీసులే రక్షణ ఇచ్చారు. పోలీసుల చేతుల్లో కనీసం లాఠీలు కూడా లేవు. పోలీసుల సమక్షంలోనే.. పోలీసుల సాక్షిగా మా ఇంటిపై దాడి జరిగింది. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే శిక్షిస్తారు. లోకేష్ నీ రెడ్‌బుక్ తీసి మడిచిపెట్టుకో. నాపై ఎటువంటి దాడి జరిగినా లోకేష్‌దే బాధ్యత. నేను నిన్న మాట్లాడినందుకు మళ్లీ నాపై కేసులు పెట్టారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలవలేదని సెంట్రల్ ల్యాబ్‌లే నిర్ధారించాయి. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని అన్నారు. నాకు అండగా జగనన్న, వైఎస్సార్సీపీ సైన్యం ఉంది. ఏడాదిన్నర కాలంలోనే ప్రభుత్వం అసమర్ధత బయటపడింది. జోగి రమేష్ ఎక్కడికీ పారిపోడు.. ఇక్కడే ఉంటాడు. విద్యార్ధి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నా. తప్పుడు కేసులకు, అరెస్టులకు భయపడేది లేదు. నా ఇల్లు తగలబెట్టి లోకేష్ దగ్గర మార్కులు కొట్టేద్దామని కొంతమంది సంబరపడుతున్నారు. గుర్తుంచుకోండి.. ఎవరినీ విడిచిపెట్టేది లేదు. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో.. నీ ఇంటికి నా ఇల్లు కూడా అంతేదూరమని లోకేష్ గుర్తుంచుకోవాలి’ అని హెచ్చరించారు. -
చంద్రబాబుకు బిగ్ షాక్.. ఏపీ హైకోర్టులో జోగి రమేష్ కొడుకు పిటిషన్
-
Jogi: ఇంట్లో మా నాన్న, భార్య, పిల్లలు ఉన్నారు.. లోకేష్ గుర్తుపెట్టుకో..
-
జోగి రమేష్‌పై ప్రభుత్వం మరో కక్ష సాధింపు
విజయవాడ:జోగి రమేష్‌పై ప్రభుత్వం మరో కక్ష సాధింపుజోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము బెయిల్ రద్దు చేయాలి అని పిటీషన్ఎక్సైజ్ కోర్టులో పిటీషన్ వేసిన సిట్జోగి రమేష్ ఇంటికి నిన్న నిప్పు పెట్టిన టీడీపీ నేతలు, గుండాలుఓ వైపు జోగి ఇంటిపై దాడి చేసి..మరో వైపు జోగి సోదరులు సాక్ష్యాలు ధ్వంసం చేస్తారంటూ పిటిషన్ వేయించిన టీడీపీ గుంటూరు: లకారాలతో మా గురించి మాట్లాడారు : అంబటి రాంబాబు కామార్తె అంబటి మౌనికరెండు రోజులుగా మాపై దాడి జరుగుతుందిలడ్డుపై వేసిన పోస్టర్లు చింపడానికి రాంబాబు వెళ్ళలేదువెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ కోసం వెళ్లారుగుడి నుంచి ఇంటికి వస్తుంటే రాంబాబు పై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.అసభ్యకరమైనపై భాషతో రాంబాబు కారుపై దాడి చేశారుఒక మహిళ మాట్లాడిన మాటలు చూడండి ఆయన్ను రెచ్చగొట్టారు.దీంతో రాంబాబు మాట్లాడిన మాటలు తప్పు అని ఆయనే మీడియా సమావేశం పెట్టి చెప్పారుఅంత దమ్ము ఎవరికి ఉంటుందిఇక్కడే ఉంటాను అని చెప్పిన తర్వాత ఆయనపై దాడి చేశారుఎమ్మెల్యే గల్లా మాధవిని అడుగుతున్నానుఏ నైతిక విలువలతో ఎమ్మెల్యే గల్లా మాధవి క్షమాపణ అడుగుతున్నారునేను రాంబాబు వ్యాఖ్యలను సమర్థించడం లేదుఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయన సమాధానం చెప్పారుకేవలం ఆడవాళ్ళు మాత్రమే ఉన్న ఇంటిపై ఎలా దాడి చేస్తారుహోంమంత్రి అనిత సమాధానం చెప్పాలికాపు కులస్తులు వాళ్ళ వెంటే ఉన్నారని మాపై దాడి చేశారుపవన్ కళ్యాణ్ వైపే కాపు కులస్తులు ఉన్నారని ఆయన బలం చూసి మాపై దాడి చేశారులకారాలతో మా గురించి మాట్లాడారుకాపుల్లో పుట్టినందుకు మేము గర్విస్తున్నాంమనల్ని అడ్డం పెట్టుకుని మన కంటిలో మన వేలుతో పొడుస్తున్నాంవైఎస్ జగన్ పుట్టక గురించి గురించి చంద్రబాబునాయుడు కామెంట్స్ చేయడం తప్పు కాదామేము వైఎస్సార్సీపీ అని, అధికారంలో లేమని మాపై దాడి చేశారుదేవుడి లడ్డూ గురించి మాట్లాడారని మా ఇంటిపై దాడి చేశారుగల్లా మాధవికి కుటుంబం ఉందిమీకు కుటుంబం ఉంది కదాకొంతమంది మిమ్మల్ని పావుగా పావుగా వాడుకుంటున్నారుమిమ్మల్ని బలి పశువును చేస్తున్నారుమీ అత్మసాక్షికే వదిలేస్తున్నాను.పవన్ కళ్యాణ్ మహిళల రక్షణ గురించి చాలా సార్లు చెప్పారు.మరి ఇప్పుడే సమాధానం చెబుతారు చెప్పండిరాంబాబు దేని గురించి భయపడరుమహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలను ఉపయోగించి, మహిళలపై దాడి చేస్తున్నారురాంబాబుని స్టేషన్ లో చాలా ఇబ్బంది పెట్టారుఇంకా ఆటవికంగా ఉన్నామని నిరూపించారుపోలీసులు అల్లరి మూకలను కంట్రోల్ చేయలేదుదాడి చేసిన వారికి పోలీసులు రక్షణగా ఉన్నారురాంబాబు 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారుఆయన గొంతు నొక్కడానికే దాడి చేశారుకేంద్రమంత్రి పెమ్మసాని ఒక డాక్టర్ ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నానుసినిమా చూపించడం అంటే మహిళలపై దాడి చేయడమేదీనికి పెమ్మసాని భార్య అను సమాధానం చెప్పాలిఅంబటి రాంబాబు నిజానికి భయపడతారుఇటువంటి దాడులకు పాల్పడరుమా భద్రత గురించి మా నాన్న ఆందోళన చెంది ఉంటారుగల్లా మాధవి డైరెక్షన్ తోనే మాపై దాడి చేశారువిజయవాడ: జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర పార్టీ నేతలుజోగి రమేష్ ఇంటిని పెట్రోల్ బాంబులతో తగల బెట్టిన టీడీపీ గూండాలుటీడీపీ గూండాల దాడిని సజ్జలకు వివరించిన జోగి రమేష్విజయవాడ: టీడీపీ దాడులపై మాజీ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం ఇది ప్రజాస్వామ్యం,బలహీన వర్గాలపై జరిగిన దాడిమేం రాజకీయాల్లో ఉండకూడదాదాడులు పేరుతో నన్ను మట్టుబెట్టాలని చూశారు. నాకేమైనా జరిగితే లోకేషే కారణంనన్నుమళ్లీ అరెస్టు చేయాలని పోలీసులు చూస్తున్నారు. నా ఇంటిపై వందల మంది టీడీపీ గూండాలు దాడులు చేశారుమీ అరాచకాలు ప్రశ్నించడం తప్పా లోకేష్ ఆదేశాలతో ఎంపీ కేసినేని చిన్నీ నాపై దాడులు చేశారుకూటమి ప్రభుత్వాన్ని ప్రజలే శిక్షిస్తారుకూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందినాకు అండగా జగనన్న ఉన్నారు. వైఎస్సార్ సైన్యం ఉందితాడేపల్లి :సీబిఐ తేల్చిన నిజాల కన్నా చంద్రబాబు చెప్పే అబద్దాలే నమ్మాలా? : బొత్సరాష్ట్రంలో దారుణమైన పరిపాలన సాగుతోందిఅంబటి, జోగి ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేయటానికా చంద్రబాబుకు అధికారం ఇచ్చింది?ధర్మాన్ని కాపాడాల్సిన పోలీసులు రాజకీయ పార్టీల నేతల అడుగులకు మడుగులు ఎత్తుతారా?చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్న వారిపై న్యాయ పోరాటం చేస్తాంఅధినేత వైఎస్ జగన్‌తో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తాంఏ ప్రభుత్వం ఐనా రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాలికానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రత్యర్థులపై ఎలా దాడులు చేయాలా అని చూస్తున్నారుజోగి రమేష్ ఇంటి మీద పెట్రోలు బాంబులు వేయటం దుర్మార్గంజోగి రమేష్ ఇంటిని తగల పెట్టారుఇంత జరుగుతుంటే డీజీపి ఏం చేస్తున్నారు?చంద్రబాబు దగ్గర డీజీపి ఊడిగం చేస్తున్నారా?డీజీపీ.. వ్యవస్థ మీద గౌరవాన్ని పోగొట్టవద్దుతనమీద దాడి చేయటానికి వచ్చిన వారినే అంబటి రాంబాబు దూషించారుతర్వాత దానిని కూడా వెనక్కు తీసుకున్నారుకానీ పోలీసులే దగ్గరుండి దాడులు చేయించటం భావ్యం కాదులడ్డూ ఇష్యూ మీద సీబిఐ నిజాలు తేల్చాక కూడా ఇంకా ఎందుకు విష ప్రచారం చేస్తున్నారు?సీబిఐ తేల్చిన నిజాల కన్నా చంద్రబాబు చెప్పే అబద్దాలే నమ్మాలా?దీనిపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు?అంబటి రాంబాబు ఎప్పుడూ లైన్ దాటి మాట్లాడరుఆయనా మనిషే. తనని బూతులు తిడితే ఒకమాట అన్నారువెంటనే వెనక్కు తీసుకున్నారు కూడాఐతే ఐదారు గంటలపాటు ఇంటిపై దాడి చేయిస్తారా?చంద్రబాబుకు చేతనైతే మంచి పాలన చేసి పేరు తెచ్చుకోవాలిఅంతేగానీ దాడులకు పురిగొల్పవద్దుసంపద సృష్టి పేరుతో వైజాగ్ లో ఐదువేల కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టారురాష్ట్ర సంపదను కాకుండా తన ఇంటి సంపదను పెంచుకుంటున్నారుఅంబటి, జోగి ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేయటానికా మీకు అధికారం ఇచ్చింది?పోలీసులు ధర్మాన్ని కాపాడాలిరాజకీయ నాయకుల అడుగులకు మడుగులు వద్దవద్దువెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగవద్దుభక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దుమమ్మల్ని అవమాన పరిచేలా ఫ్లెక్సీలు పెడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నదే ప్రభుత్వం వైఎస్సార్ కడప జిల్లా:వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టులపై ఫిర్యాదువైఎస్సార్సీపీ నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి మన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో పిర్యాదువైఎస్సార్సీపీ నాయకులను పదజాలాలతో దూషించిన కూటమి నాయకురాలను వెంటనే అరెస్ట్ చేయాలిఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డిరాష్ట్రంలో రెడ్‌బుక్ పాలనలో రావణ కాష్టం జరుగుతున్నది. ఇండ్లను పెట్రొల్ బాంబులతో తగలబెడుతున్నారు-.ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి జోగి రోహిత్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణఏపీ హైకోర్టులో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రోహిత్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలుతమ ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయడం లేదుదీనిని చట్ట విరుద్ధంగా ప్రకటించండి ఇంటి వద్ద తగిన భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్లో కోరిన రోహిత్రోహిత్ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ జరుపనున్న హైకోర్టునెల్లూరు:ఏపి రాష్ట్ర ఇమేజ్ను మంటగలిపారు:చంద్రశేఖర్ రెడ్డిలడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు జుగుబ్సాకరమైన వ్యాఖ్యలు చేశారుచంద్రబాబు, పవన్ చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదని ఎన్డిడిబీ రిపోర్ట్ ఇచ్చిందినేటికి ఆ అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టడానికి ఫ్లెక్స్ లు ఏర్పాటు చేయడం ఎంత వరకు సబబుమాజీ మంత్రుల ఇండ్లపై కుటుంబ సభ్యులు లోపల వుండగానే దాడులకు తెగబడ్డారునెల్లూరు:నెల్లూరు వేదాయపాళెం పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ ఫిర్యాదుశ్రీవారి లడ్డూ వ్యవహారంలో అబద్దపు, అభ్యంతకర పోస్టర్లు ఏర్పాటు పై పిర్యాదుమాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్, ఆనం విజయకుమార్ ఆధ్వర్యంలో పిర్యాదుకాకాణి కామెంట్స్రాష్ట్రంలో ఆటవిక పాలన రాజ్యం ఏలుతుందిసీఎం, డిసిఎం లు శ్రీవారి లడ్డూ పై నిరాధారమైన ఆరోపణలు చేశారుప్రపంచ వ్యాప్తంగా వున్న హిందువుల మనోభావాలు దెబ్బతీశారులడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వం పై నిందలు వేసే ప్రయత్నాలు చేశారు విజయవాడ:మాజీ మంత్రి జోగి రమేష్‌ను కలిసిన ఎమ్మెల్సీ తలశిల రఘురాంవిశాఖ:తిరుపతి లడ్డుపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ చేసిన తప్పుడు ప్రచారంపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు..ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సిపి నాయకులు కేకే రాజు, వరుదు కళ్యాణి, మోల్లి అప్పారావు డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్..తిరుపతిమాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గుండాలు దాడి నిరసిస్తూ బాలాజీ కాలనీ పూలే విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బిసి విభాగం ఆధ్వర్యంలో నిరసనరాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందన్న బిసి నాయకులుప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఏపీ రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన విధించాలి-గీత యాదవ్. వైఎస్సార్సీపీ,మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనంతపురం::చంద్రబాబు హింసా రాజకీయాలపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు నిరసనగా ఆందోళన చేపట్టారు. అనంతపురం జెడ్పీ కార్యాలయంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అరాచకాలపై నల్ల కండువాలతో నిరసన తెలిపారు వైఎస్సార్సీపీ నేతలు. ‘ చంద్రబాబు పాలన.. ఆటవిక రాజ్యం’ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు బీసీ వ్యతిరేకి అంటూ నిరసన వ్యక్తం చేశారు.మొన్న(శనివారం), నిన్న(ఆదివారం) టీడీపీ గూండాలు రెచ్చిపోయి మరీ విధ్వంసం సృష్టించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు దిగారు. అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేసేందుకు యత్నించారు. ఆ క్రమంలోనే అంబటి రాంబాబు ఇంటిపై రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడులకు దిగారు. జోగి రమేష్ ఇంటికి నిప్పుపెట్టారు టీడీపీ గూండాలు. పెట్రోల్ బాంబుతో ఇంటిని ధ్వంసం చేసే యత్నం చేశారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రశ్నిస్తున్న వారికి సమాధానం చెప్పలేక ఆటవిక పాలనను ఎంచుకున్నారు. తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబుదే తప్పు అన్న విషయం సీబీఐ సిట్ సాక్షిగా బట్టబయలు కావడంతో ప్రజల దృష్టిలో చులకనై, వారి దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్ సీపీ నేతలపై దాడులకు తన రౌడీలను పురమాయిస్తున్నారు. శనివారం గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై గూండాల దాడిని మరచిపోక ముందే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై విధ్వంసానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పెట్రోల్ బాంబులతో బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు, టీడీపీ మూకలు రమేష్ ఇంటిపై విరుచుపడి విధ్వంసం సృష్టించారు. వందలాది మంది రౌడీలు విధ్వంసం సృష్టిస్తుంటే నిలువరించాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తుండటం విస్తుగొలుపుతోంది. వెళ్లిపోండి.. వెళ్లిపోండి.. అంటూ వారిని బతిమిలాడటం పోలీసు వ్యవస్థ దీన స్థితిని తెలియజేస్తోంది. రాష్ట్రంలో సాగుతున్నది ప్రజాస్వామ్యమా.. లేక ఆటవిక రాజ్యమా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. పైగా ఈ విధ్వంసకాండను చంద్రబాబు తనయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, సదరు టీడీపీ శ్రేణులు చెప్పుకుంటుండటం దారుణమని, ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలహీన వర్గాల గొంతు నులిమి రాక్షసానందం పొందుతూ ప్రశ్నించే తత్వాన్ని చంపేయడమే టీడీపీ పెద్దల లక్ష్యమనే భావన అత్యధికుల్లో వ్యక్తం అవుతోంది. దీనిపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తుందని వైఎస్సార్సీపీ మండిపడతోంది. -
జోగి రమేష్ ఇంటిపై దాడికి వాట్సాప్ గ్రూప్ లో ప్లాన్ చంపడానికి TDP కుట్ర!
-
మానవత్వం మర్చిపోయారు.. పోలీసులు బాగా నటించారు
-
దాడి తర్వాత.. ఇంటిని పరిశీలించిన జోగి రమేష్
-
జోగి రమేష్ ఇంటికి నిప్పు.. చోద్యం చూస్తున్న పోలీసులు
-
దాడి కాదు.. భారీ కుట్ర..!
-
కొనసాగుతున్న జంగిల్‌రాజ్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో జంగిల్ రాజ్ విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రశ్నిస్తున్న వారికి సమాధానం చెప్పలేక ఆటవిక పాలనను ఎంచుకున్నారు. తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబుదే తప్పు అన్న విషయం సీబీఐ సిట్ సాక్షిగా బట్టబయలు కావడంతో ప్రజల దృష్టిలో చులకనై, వారి దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్ సీపీ నేతలపై దాడులకు తన రౌడీలను పురమాయిస్తున్నారు. శనివారం గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై గూండాల దాడిని మరచిపోక ముందే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై విధ్వంసానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పెట్రోల్ బాంబులతో బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు, టీడీపీ మూకలు రమేష్ ఇంటిపై విరుచుపడి విధ్వంసం సృష్టించారు. వందలాది మంది రౌడీలు విధ్వంసం సృష్టిస్తుంటే నిలువరించాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తుండటం విస్తుగొలుపుతోంది. వెళ్లిపోండి.. వెళ్లిపోండి.. అంటూ వారిని బతిమిలాడటం పోలీసు వ్యవస్థ దీన స్థితిని తెలియజేస్తోంది. రాష్ట్రంలో సాగుతున్నది ప్రజాస్వామ్యమా.. లేక ఆటవిక రాజ్యమా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. పైగా ఈ విధ్వంసకాండను చంద్రబాబు తనయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, సదరు టీడీపీ శ్రేణులు చెప్పుకుంటుండటం దారుణమని, ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలహీన వర్గాల గొంతు నులిమి రాక్షసానందం పొందుతూ ప్రశ్నించే తత్వాన్ని చంపేయడమే టీడీపీ పెద్దల లక్ష్యమనే భావన అత్యధికుల్లో వ్యక్తం అవుతోంది.పక్కా ప్లాన్‌తోనే దాడిఆదివారం ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై దాడి చినబాబు డైరెక్షన్లో పక్కా ప్లాన్‌తో జరిగింది. బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై దాడికి ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాలు.. ప్రధానంగా విజయవాడలోని కృష్ణలంక, అజిత్‌సింగ్ నగర్, భవానీపురం ప్రాంతాలకు చెందిన బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లు, కిరాయి రౌడీలు, రౌడీ షీటర్లను భారీగా టీడీపీ నేతల డైరెక్షన్లో ఇబ్రహీంపట్నం తరలించారు. వీరు పెట్రోలు బాంబులు, బాటిళ్లతో దాడి చేసి, ఇంటికి నిప్పు పెట్టారు. ఇంట్లో సామగ్రి కాలి బూడిదైంది. ఇల్లంతా దట్టమైన పొగ కమ్ముకుంది. పెట్రోల్ బాంబులతో దాడి చేయడంతో తగలబడుతున్న జోగి రమేష్ ఇల్లు ఇదే సమయంలో భారీగా గుమికూడిన టీడీపీ మూకలు.. కత్తులు, కర్రలు, బండరాళ్లతో సైర్వ విహారం చేసి ఇంటిపైన రాళ్ల వర్షం కురిపించాయి. గేటును పగలగొట్టే యత్నం చేశారు. రాళ్ల దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడి సమయంలో జోగి రమేష్ తండ్రి జగన్మోహన్రావు, కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. జోగి కుటుంబ సభ్యులను అంత మొందించాలనే కుట్రతో, పక్కా ప్రణాళికతో ఈ దాడి చేసినట్లు స్పష్టం అవుతోంది. కాగా, జోగి రమేష్ రాత్రి 11 గంటలకు ఆయన ఇంటికి వచ్చి టీడీపీ మూకలు దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు.రోడ్డుపై బైఠాయింపుజోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావును జూపూడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పరామర్శకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని దేవినేని అవినాష్ పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్టు చేసి, విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలియడంతో అక్కడికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు చేరుకుంటుండంతో, ఆయన్ను అక్కడి నుంచి సత్యనారాయణపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని ఎమ్మెల్సీ తలశిల రఘురాం, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఖండించారు. ఇలాంటి దాడులకు వైఎస్సార్సీపీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ వద్దకు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, పార్టీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.పోలీసుల ప్రేక్షక పాత్రటీడీపీ గూండాలు జోగి రమేష్ ఇంటిపై దాడికి వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నామ మాత్రంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల కనుసన్నల్లోనే టీడీపీ, బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు రెచ్చిపోయి దాడులు చేస్తున్నా చేష్టలుడిగి చూస్తు్తండిపోయారు. కనీసం వారిని నిలువరించ లేక, ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు. మధ్యాహ్నం నుంచే జోగి రమేష్ ఇంటి వైపు వెళ్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులను నిలువరించిన పోలీసులు, టీడీపీ గూండాలకు మాత్రం పచ్చ జెండా ఊపారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు, ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
అదే నిప్పు మీ ప్రభుత్వాన్ని దహించేస్తుంది
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి శనివారం రాత్రి.. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి ఆదివారం టీడీపీ గూండాలు, అసాంఘిక శక్తులు నిప్పు పెట్టడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఇళ్లకు పెట్టిన నిప్పు జంగిల్‌రాజ్‌కు ప్రతీక అన్నారు. ఈ నిప్పు ద్వారా ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటలతో పుట్టిన వేడి.. మీ సర్కార్‌ను దహించి వేయక మానదని సీఎం చంద్రబాబును హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘ప్రజాస్వామ్యంలో, మీరు చేసిన ఆరోపణలు తప్పు అని, ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబులు ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నిర్ధారణ చేసిన తర్వాత, మీరు చేసిన ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశి్నస్తే, జీరి్ణంచుకోలేక అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లకు మీరు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని కలిగించానని మీరు అనుకోవడం, చంద్రబాబు గారూ అది మీ భ్రమే. ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరు పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లకు పెట్టిన నిప్పు అరాచకానికి, ఆటవిక పాలనకు, జంగిల్‌రాజ్‌కు ప్రతీక. ఈ నిప్పు మీ సర్కార్‌ను దహించి వేయక మానదని గుర్తుంచుకోండి. రానున్న కాలంలో మీకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసే ప్రజాగ్రహ జ్వాలలు, మీ ప్రభుత్వాన్ని పూర్తిగా దహనం చేసి, బూడిద చేయక మానదనీ గుర్తుంచుకోండి. ప్రజాస్వామ్యంలో హింసా జ్వాలను రేపే చేయీ కాలక తప్పదు. అరాచక, ఆటవిక పాలన అంతం కాక తప్పదు. మీరు సృష్టించిన జంగిల్ రాజ్ భూ స్థాపితం కాక తప్పదు. ఇది చరిత్ర చెప్పే సత్యం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
‘చంద్రబాబూ గుర్తుంచుకోండి.. చరిత్ర చెప్పే సత్యం ఇది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు సర్కార్ అరాచకాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘‘ప్రజాస్వామ్యంలో మీరు చేసిన తప్పుడు ఆరోపణలు తప్పు అని.. ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్‌లు ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నిర్ధారణ చేశాయి. తర్వాత మీరు చేసిన ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశ్నిస్తే.. జీర్ణించుకోలేక అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లకు మీరు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని కలిగించానని మీరు అనుకోవడం.. చంద్రబాబూ అది మీ భ్రమే. ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరు పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి చంద్రబాబూ’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ హెచ్చరించారు.‘‘అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లకు పెట్టిన నిప్పు అరాచకానికి, ఆటవిక పాలనకు ‘జంగిల్‌రాజ్’కు ప్రతీక. కానీ ఈ నిప్పు ద్వారా ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటలతో పుట్టిన వేడి.. చంద్రబాబూ మీ సర్కార్‌ను దహించివేయక మానదు. రానున్న కాలంలో మీకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసే ప్రజాగ్రహ జ్వాలలు.. మీ ప్రభుత్వాన్ని పూర్తిగా దహనం చేసి, బూడిద చేయకమానదు...చంద్రబాబూ గుర్తుంచుకోండి.. ప్రజాస్వామ్యంలో హింసా జ్వాలలను రేపే చేయి కాలక తప్పదు. అరాచక, ఆటవిక పాలన అంతం కాక తప్పదు! మీరు సృష్టించిన ‘జంగిల్ రాజ్’’ భూస్థాపితం కాక తప్పదు. చరిత్ర చెప్పే సత్యం ఇది.’’ అంటూ వైఎస్ జగన్ హెచ్చరించారు.ప్రజాస్వామ్యంలో, మీరు చేసిన తప్పుడు ఆరోపణలు తప్పు అని, ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబులు NDDB, NDRI నిర్ధారణ చేసిన తర్వాత, మీరుచేసిన ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశ్నిస్తే, జీర్ణించుకోలేక అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లకు మీరు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని… pic.twitter.com/pA288I5ZIL— YS Jagan Mohan Reddy (@ysjagan) February 1, 2026 -
మాజీ మంత్రి జోగి రమేష్‌కు వైఎస్ జగన్ ఫోన్
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి జోగి రమేష్‌కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ చేశారు. జోగి రమేష్‌ను పరామర్శించిన వైఎస్ జగన్.. జోగి రమేష్ ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న ఆయన.. ప్రశ్నించేవారిని భయపెట్టడానికే చంద్రబాబు హింసాజ్వాలను రాజేస్తున్నారని మండిపడ్డారు. అవే మంటలు చంద్రబాబు సర్కార్‌ను దహించి వేయక తప్పదన్నారు. పార్టీ మొత్తం అండగా ఉంటుందంటూ జోగి రమేష్‌కు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు.ఏపీలో టీడీపీ గూండాల అరాచకం కొనసాగుతోంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాల దాడికి పాల్పడారు. ఇంట్లోకి వెళ్లేందుకు టీడీపీ గూండాల యత్నించారు. జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు. జోగి రమేష్ నివాసంపై దాడి వెనుక కుట్ర బట్టబయలైంది. మాజీ మంత్రి నివాసంపై టీడీపీ పథకం ప్రకారం దాడికి పురిగొల్పింది. జోగి నివాసంపై దాడికి పిలుపునిచ్చిన టీడీపీ.. ఆదివారం సాయంత్రం 4 గంటలకు నిరసన పేరుతో ప్లాన్ అమలు చేసింది.అధికారికంగా పత్రికా ప్రకటన ఇచ్చిన ఇబ్రహీంపట్నం టీడీపీ అధ్యక్షుడు.. ఆందోళనకు పిలుపునిచ్చారు. అదే సమయంలో జోగి రమేష్ ఇంటివద్దకు చేరిన టీడీపీ నేతలు, గూండాలు.. ఆయన నివాసంపై కర్రలు, రాడ్లు, కత్తులు, పెట్రోల్ బాంబ్‌లతో దాడి చేశారు. -
‘ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి’
విజయవాడ: వరుసగా వైఎస్సార్సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేకే టీడీపీ ఈ దాడులకు పాల్పడుతుందని మండిపడ్డారు. నిన్న(శనివారం) అంబటి రాంబాబు ఇంటిపై దాడి, ఈరోజు(ఆదివారం) జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడులను పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని అంబటి ధ్వజమెత్తారు. ‘ఇంటెలిజెన్స్ చీఫ్ కిందస్థాయి సిబ్బందిని నిర్వీర్యం చేస్తున్నారు. టీడీపీ చేస్తున్న దాడులను అడ్డుకోవద్దని పైస్థాయి అధికారుల నంచి ఆదేశాలున్నాయని కింద స్థాయి సిబ్బంది చెబుతున్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని అరాచకం చేస్తున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి.. లేకంటే వేలాది మంది ప్రాణాలకు ముప్పు. టీడీపీ దాడులను పోలీసులు అడ్డుకోవడం లేదు. ప్రశ్నించే వాళ్లను టార్గెట్ చేస్తున్నారు. ఏపీ రాష్ట్రానికి కేంద్ర బలగాలను పంపాలి’ అని పేర్కొన్నారు. -
జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాల దాడి
సాక్షి,విజయవాడ: ఏపీలో టీడీపీ గూండాల అరాచకం కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటికి వందలాది టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. పెట్రోల్ బాంబులు, కర్రలు, రాళ్లతో దాడికి చేశారు. ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో జోగి రమేష్ నివాసం అగ్నిప్రమాదం చోటు చేసుకుని మంటలు, పొగలు ఎగిసి పడుతున్నాయి. జోగి ఇంటి ముందు టీడీపీ గూండాలు ఫ్లెక్సీలు పీకి పడేశారు. టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డా పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్పా ఎలాంటి చర్యలు తీసుకోకకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగే సమయంలో జోగి రమేష్ తండ్రి, ఆయన సతీమణి, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. జోగి రమేష్ తిరుపతిలోని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాసంలో ఉన్నారు. నా కుటుంబం హత్యకు కుట్ర పెట్రోల్ బాంబులు వేసిన తన కుటుంబాన్ని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడులకు తెగబడ్డారు.అయితే,ఈ దాడుల్ని జోగి రమేష్ ఖండించారు. ఘటన జరిగే సమయంలో తిరుపతిలోని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాసంలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు,లోకేష్ నన్ను మట్టు బెట్టాలనుకున్నారా?ఏపీలో విధ్వంసకాండ జరుగుతోంది. నా ఇంటిపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. చంద్రబాబు సారధ్యం.. లోకేష్ నేతృత్వంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రీతిలో దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు,లోకేష్ నన్ను మట్టు బెట్టాలనుకున్నారా?.నన్ను,నా పిల్లలను దహనం చేయాలని అనుకున్నారా?. పెట్రోల్ బాంబులు వేసి నా కుటుంబాన్ని హత్య చేసే కుట్ర.గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను దించి దాడులు చేస్తున్నారు. ప్రభుత్వమే పెట్రోల్ బాంబులు వేయిస్తోంది.మా ఇళ్లపై దాడులు చేస్తే వైఎస్సార్సీపీ జెండాను వీడుతామా?. వైఎస్సార్,వైఎస్ జగన్ అడుగుజాడల్లో నడిచేవాళ్లం మేం. ప్రజాగొంతుకలపై దాడి చేస్తారా?. మీ దాడులను ప్రజలు క్షమించరు. ఇప్పటికే మీరు హద్దు మీరిపోయారు. వైఎస్సార్సీపీ నేతలు జైల్లో పెట్టి రాక్షసానందం పొందుతున్నారు. ఏడాది కాలంలోనే ప్రభుత్వం ప్రజల్లో అసహ్యం పెరిగింది. లోకేష్ నీ పిల్ల చేష్టలు, రాక్షసానందం మానుకో. ఈ దాడులను రాష్ట్ర ప్రజలు ఖండించాలి. అకారణంగా జైలు జీవితం కూడా అనుభవించాం. ప్రజల్లోనే ఉంటాం. ప్రజలతో మమేకం అవుతాం. దాడులు జరుగుతుంటే పోలీసులు కళ్లప్పగించి చూస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. -
జోగి రమేష్ ను పరామర్శించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, నాగమల్లేశ్వరి
-
జోగి రమేష్ కు కేతిరెడ్డి పరామర్శ.. కూటమికి దిమ్మతిరిగే వార్నింగ్
-
జోగి సోదరులను తప్పుడు కేసులతో అరెస్ట్ చేశారు: కేతిరెడ్డి
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జోగి రమేష్, జోగి రామును తప్పుడు కేసులతో అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాజీ మంత్రి జోగి రమేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపుతున్నందుకు 83 రోజులు జైల్లో పెట్టారని.. చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెట్టి అందరినీ ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు.‘‘జోగి రమేష్‌ను కలిసేందుకు ఆసుపత్రికి వెళ్లిన కుటుంబ సభ్యుల పైనా కేసు పెట్టారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో అంతా చూస్తున్నారు. మర్డర్లు చేసిన వారిపై కేసులు పెట్టడం లేదు. కోడిని, గొర్రెలను కోసిన వారి పై తప్పుడు కేసులు పెడుతున్నారు. అక్రమంగా జైళ్లకు పంపిస్తే రెట్టించిన ఉత్సాహంతో మావాళ్లు పనిచేస్తారు. కూటమి ప్రభుత్వం తప్పిదాల పై జోగి రమేష్ పోరాటం చేస్తూనే ఉంటారు.చంద్రబాబుకు కేతిరెడ్డి సవాల్..‘‘ధర్మవరంలో 70 శాతం కల్తీ మద్యం దొరుకుతోంది. కల్తీ మద్యం తయారు చేసేది నీ జిల్లా నుంచే చంద్రబాబు. బెల్టుషాపులు లేకుండా చేస్తానన్నావ్. కానీ ఇప్పుడు ఊరికి నాలుగు బెల్టు షాపులు ఉన్నాయి. వేలంపాటలో బెల్ట్ షాపులు పాడుకుంటున్నారు. గిట్టుబాటు కావడం కోసం కల్తీ మద్యం అమ్ముతున్నారు. కొద్ది రోజుల క్రితం కడప జిల్లాలో ఇద్దరు చనిపోయారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద తన పై ఉన్న కేసును కొట్టేయించుకోవాలని చంద్రబాబు చూస్తున్నాడు. కేసు పెట్టిన వాసుదేవ రెడ్డి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్. అదే వాసుదేవ రెడ్డి మరో కేసులో అప్రూవర్ అవుతాడు. ఇది కేసును ప్రభావితం చేయడం కాదా?. చంద్రబాబుపై ఉన్న కేసులను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని ఎలా తొలగిస్తున్నారు?..కేసులు పెట్టిన మీరే ఆ కేసులు తీసేయాలని కలెక్టర్లు, ఎస్పీల మీటింగ్‌లో లోకేష్ చెప్పాడు. లా అండ్ ఆర్డర్ ఎంత వరస్ట్‌గా ఉందో ఇంతకంటే నిదర్శనం ఏముంది?. మీరు ఎంతమందిని జైల్లో వేస్తారో.. అంతకు పదింతలు ప్రశ్నిస్తాం. కేసులు.. అరెస్టులు.. జైళ్లు మాకు కొత్త కాదు...ఇలాంటివి మేం చాలా చూశాం. తప్పుడు కేసులు కట్టే అధికారులు ఆలోచన చేయండి. మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. సన్నిహితులుగా ఉన్నారు.. ఫోటోలు ఉన్నాయని కేసులు పెట్టడం కాదు. అత్యాచారాలు చేసిన వారు లోకేష్‌తో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు లోకేష్‌ను కూడా ముద్దాయిగా చేరుస్తారా?. చట్టం అందరికీ ఒకటే..కేసులు తీయించుకోవాలని చూస్తున్న ప్రయత్నంపై అప్పీల్‌కు వెళతాం. నాయకులు చెప్పారని అధికారులు అక్రమ కేసులు పెడితే ఇబ్బంది పడతారు. మీకు చేతనైతే నకిలీ మద్యం ఎక్కడ దొరుకుతుందో అరికట్టండి. తిరుపతి లడ్డూలో పందికొవ్వు కలిపారని సీఎం, డిప్యూటీ సీఎం ప్రచారం చేశారు. ఈ రోజు లడ్డూలో అలాంటిదేమీ లేదని తేలింది. తాము ఒకటి చేయాలనుకుంటే మరొకటి జరిగిందని కూటమి నేతలు బాధపడుతున్నారు. ఇలాంటి దుష్ప్రచారాలు చేసేవాడు హిందూమతాన్ని కాపాడతాడా?. నకిలీ మద్యం విషయంలో తప్పుడు ఆధారాలతో బురదజల్లారు. దీని పై లీగల్ గా ఫైట్ చేస్తాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టినవారిని ఎవరినీ వదలం..మద్యం సీసాలపై క్యూఆర్ కోడ్ మేం అధికారంలో ఉన్నప్పుడే తెచ్చాం. మంచి మద్యం ఇస్తానని చంద్రబాబు చెబితే అందరూ ఈలలు వేశారు. మంచి విద్య, వైద్యం ఇస్తామని జగన్ చెబితే ఎవరూ చప్పట్లు కొట్టలేదు. మా ధర్మవరంలో ఇవాళ తనిఖీ చేసినా 70 శాతం నకిలీ మద్యం దొరుకుతుంది. జనం దగ్గరకు వెళ్లాంటే గట్స్ ఉండాలి. నేను ఇది చేశానని చెప్పి గడప గడపకు వెళ్లాలంటే ధైర్యం కావాలి. వైఎస్ జగన్ ఎమ్మెల్యేలందరినీ ప్రజల ఇళ్లకే పంపించారు. వాళ్లచేతిలోనే కదా ప్రభుత్వం ఉంది. నా పై ఆరోపణలకు ఎందుకు ఆధారాలు చూపలేకపోతున్నారు. ఈ ప్రభుత్వంలోని నేతలకు దమ్ముంటే గడపగడపకు వెళ్లమని చెప్పండి. నేను ఎక్కడ భూ కబ్జాలు చేశానో చూపించమనండి. చేతనైతే వాటిపై చర్యలు తీసుకోమనండి’’ అంటూ కేతిరెడ్డి సవాల్ విసిరారు. -
జోగి రమేష్ ను కలిసిన YSRCP నేతలు
-
జోగి రమేష్ విడుదలపై YSRCP నేతల రియాక్షన్
-
వారం రోజులు టైమ్ ఇస్తున్నా.. లోకేష్ కు జోగి రమేష్ మాస్ వార్నింగ్
-
NTR జిల్లాలో జోగి రమేష్ కు ఘన స్వాగతం..
-
‘కూటమిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?’
సాక్షి, ఇబ్రహీంపట్నం: కూటమి ప్రభుత్వ అక్రమ అరెస్ట్‌లకు వైఎస్సార్సీపీ కార్యకర్త ఒక్కరూ కూడా భయపడరని వైఎస్సార్సీపీ తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలే కాకుండా వారి కుటుంబ సభ్యులపై కూడా అక్రమ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. జోగి రమేష్ ఎంత ధైర్యంగా లోపలకు వెళ్ళారో.. అంతే ధైర్యంగా బయటకి వచ్చారని చెప్పుకొచ్చారు.జైలు నుంచి విడుదలైన జోగి రమేష్‌ను ఆయన నివాసంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కలిశారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ..‘కూటమి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక అంశాలపై ప్రశ్నించినందుకు జోగి రమేష్ అరెస్ట్ చేశారు.83 రోజులు జోగి రమేష్, అతని సోదరుడిని జైలు పెట్టారు. జోగి రమేష్ కడిగిన ముత్యంలా వస్తారని ఆ రోజే చెప్పం. కోర్ట్ కూడా నమ్మింది బెయిల్ ఇచ్చింది. కూటమి అరెస్ట్ చేసి జైలు పాలు చేసిన కూటమి అన్యాయాన్ని జోగి ప్రశ్నిస్తున్నాడు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినా, జోగి రమేష్‌ను అరెస్ట్ చేసినా ఎవరిని బయపెట్టలేరు. అరెస్టులకు ఏ ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్త భయపడరు. వైఎస్ జగన్ నాయకత్వంలో మరింత చురుగ్గా పాల్గొంటారు. జోగి రమేష్ భార్య, కుమారులపై కక్ష పూరితంగా కేసులు పెట్టారు. వ్యక్తుల మీదనే కాకుండా కుటుంబంపైన కేసులు పెడుతున్నారు. 2029లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నాయకులను ఇబ్బంది పెట్టిన వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ మాట్లాడుతూ..‘చేయని తప్పులకు 83 రోజులు జోగి రమేష్‌ను జైలులో పెట్టారు. జైలులో పెట్టడం తప్ప కూటమి నేతలు ఏమీ చేయలేరు. కూటమి చర్యలు చూసి ఆంధ్రప్రదేశ్ అంతా నవ్వుతుంది. జోగి రమేష్ మీదనే కాదు.. కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టారు. ఈరోజు మీరు నాటిన విత్తనం రేపు చెట్టు అవుతుంది. మా నాయకులను ఇబ్బంది పెట్టిన వాళ్లపై 2029లో చట్టబద్దంగా చర్యలు తీసుకుంటాం. జోగి రమేష్ ఎంత ధైర్యంగా లోపలకు వెళ్ళారో.. అంతే ధైర్యంగా బయటకి వచ్చారు. రెట్టించిన ఉత్సాహంతో జోగి రమేష్ కూటమి పాలనపై పోరాటం చేస్తారు అని తెలిపారు. -
జైలు నుంచి జోగి రమేష్ విడుదల.. బాబు, లోకేష్‌కు సవాల్
సాక్షి, విజయవాడ: ఏపీలో నకిలీ మద్యం అక్రమ అరెస్ట్ కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులకు ఊరట లభించింది. జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు తంబళ్లపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో, జోగి రమేష్ సోదరులు జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం, జైలు వద్ద జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. నన్ను 83 రోజులు జైలులో పెట్టారు. జైలులో సామన్య ఖైదీగా ఇబ్బంది పెట్టారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశాను అని చెప్పుకొచ్చారు. నెల్లూరు, మదనపల్లి, విజయవాడ జైళ్ల చుట్టూ తిప్పారు. నార్కో అనాలసిస్, లైడిటెక్ట్ టెస్టులకు సిద్దమని చెప్పాను అని అన్నారు. రాక్షసానందం కోసం నన్ను, నా సోదరుడిని అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్ట్‌లకు భయపడేది ప్రసక్తే లేదు అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఒక ఫేక్ సీఎం. సంబంధం లేని కేసులో ఇరికించారు. అక్రమ కేసులు పెట్టి నన్ను, నా సోదరుడిని 83 రోజులు జైల్లో పెట్టారు. నాతో పాటు నా కుటుంబాన్ని సైతం ఇబ్బంది పెట్టారు. నా భార్య, పిల్లలపై కూడా కేసులు పెట్టారు. కేసులు, అరెస్టులతో మమ్మల్ని భయపెట్టలేరు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తా. ఇకపై పూర్తిగా ప్రజల్లోనే ఉంటాం. ప్రభుత్వ మోసాలను ఎండగడతాను. లోకేష్ నీ రెడ్‌బుక్‌ను మడిచిపెట్టుకో. మీ బెదిరింపులకు భయపడే వారెవరూ లేరు. మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చే వరకూ పోరాడతాం. వైఎస్ జగన్‌ని సీఎంగా చేసుకుని తీరుతాం. చంద్రబాబు, లోకేష్‌కు మరోమారు సవాల్ చేస్తున్నా. వారం రోజులు టైమ్ ఇస్తున్నా. మీకు దమ్ముంటే బెజవాడ దుర్గమ్మ సాక్షిగా సత్య ప్రమాణం చేద్దాం రండి. దావోస్ వెళ్లి సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఆసుపత్రుల్లో మందులు లేక జనం ప్రాణాలు పోతున్నాయి. రైతులు గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతున్నారు. విద్యార్ధులు ఫీజు రీయింబర్స్మెంట్ అందక అవస్థలు పడుతున్నారు అని వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నం..ఇబ్రహీంపట్నం సర్కిల్‌కి భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు.మరికొద్దిసేపట్లో ఇబ్రహీంపట్నం చేరుకోనున్న జోగి రమేష్..జోగి రమేష్‌కి స్వాగతం పలికేందుకు భారీగా చేరుకున్న అభిమానులున్యాయం గెలిచింది అంటూ నినాదాలు చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులుఇదిలా ఉండగా.. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. నకిలీ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు అన్నీ అధికార టీడీపీ నేతల కనుసన్నల్లోనే సాగినట్లు బట్టబయలైనా, డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా అద్దేపల్లె జనార్దనరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్‌ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. అనంతరం, జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము పోలీసులు అరెస్టు చేశారు. -
ఖబర్దార్ బాబు... ఎన్ని కేసులు పెట్టినా నిలదీస్తూనే ఉంటాం....
-
విజయవాడ జైలులో జోగి రమేష్ తో YSRCP నేతల ములాఖత్
-
జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు
-
కొనసాగుతున్న కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు
విజయవాడ: వైఎస్సార్సీపీ శ్రేణులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన ఘటనపై తాజాగా కేసులు నమోదు కావడం కూటమి సర్కార్ వేధింపులు కొనసాగింపునకు మరొక ఉదాహరణ. అక్టోబర్ 7వ తేదీన ఇబ్రహీంపట్నంలో జనార్థన్‌రావుకు చెందిన గోడౌన్లో నకిలీ మద్యం డంప్‌ను ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తర్వాత వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కలిసి డంప్‌ను పరిశీలించారు జోగి రమేష్. దీనిపై ఇప్పుడు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ రోజు తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఇప్పుడు అక్రమ కేసులు నమోదుఉ చేశారు పోలీసులు. విచారణకు రావాలని 20 మంది వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులిచ్చారు. దీనిపై వైఎస్సార్సీపీ మండిపడింది. ఎప్పుడో రెండు నెలల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు కేసులు నమోద చేయడం కక్ష సాధింపు చర్య కాకపోతే ఏంటని ప్రశ్నించింది. -
సిట్ విచారణపై జోగి రమేష్ కొడుకు సంచలన కామెంట్స్
-
జోగి రమేష్ కుటుంబంపై చంద్రబాబుకు తీరని కక్ష..
-
జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
విజయవాడ: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తుంది. జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్‌కు ఎక్సైజ్ అధికారులు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలంటూ భవానీపురం ఎక్సైజ్ అధికారులు నోటీసులిచ్చారు. డిసెంబర్ 3వ తేదీన విచారణకు రావాలంటూ నోటీసులిచ్చారు. గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయానికి డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 1:30 లోపు హాజరుకావాలని నోటీసులు అందజేశారు. -
Kakani: జైల్లో జోగి రమేష్ మాతో ఏం చెప్పాడంటే
-
చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్!
సాక్షి,అమరావతి: నకిలీ మద్యం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు, ఈ నెల 26లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం, హోంశాఖ, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.విచారణ సందర్భంగా జోగి రమేష్ తరఫున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. నకిలీ మద్యం కేసులో సిట్ విచారణ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో దారి తప్పుతోందని ఆయన ఆరోపించారు. సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ వేసిన వ్యక్తినే నిందితుడిగా అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు..‘సిట్ విచారణ ఎలా జరుగుతోంది? సీబీఐకి కేసు అప్పగించాలా?’ అనే అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరిణామాలతో చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లైంది. -
Devineni Avinash: అక్రమ కేసులు పెట్టి జోగి రమేష్‌ను అరెస్ట్ చేస్తారా?
-
జోగి రమేష్, భాస్కర్ రెడ్డి తో ములాఖత్
-
జోగి రమేష్ త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారు
-
నకిలీ మద్యం కేసు.. హోంశాఖకు కొత్త టెన్షన్!
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం కేసు విషయమై హోంశాఖకు టెన్షన్ పట్టుకుంది. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలంటూ హైకోర్టులో మాజీ మంత్రి జోగి రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.నకిలీ మద్యం కేసు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ నుంచి సీబీఐకి వెళ్తే.. టీడీపీ నాయకుల పేర్లు బయటకి వస్తాయని పచ్చ పార్టీ పెద్దలు తీవ్ర ఆలోచనలో పడినట్టు సమాచారం. మరోవైపు.. కౌంటర్ దాఖలు చేస్తే సీబీఐ విచారణ ఎందుకు వద్దు అంటున్నారు అనేది హైకోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. అయితే, నకిలీ మద్యం కేసు వెలుగులోకి వచ్చిన నాటి నుంచి సీబీఐ విచారణకి ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్న విషయం తెలిసిందే.దీనికి ముందు జోగి రమేష్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేసును రాజకీయ కక్ష సాధింపులు, రాజకీయ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ‘‘నకిలీ మద్యం కేసులో ప్రభుత్వ దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదు. అందుకే సీబీఐకి ఇవ్వాలని కోరుతున్నాం. మొదటి నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు అరెస్ట్ కాకముందు ఎన్నడూ జోగి రమేష్ గురించి మాట్లాడలేదు. పోలీస్ కస్టడీలోకి వెళ్లాక... నకిలీ మద్యం మొత్తానికి జోగి ప్రధాన సూత్రధారి అని చెబుతున్నట్లు ఓ వీడియోను రికార్డ్ చేసి విడుదల చేశారు. ఇది బలవంతంగా తీసినట్లు కనిపిస్తోంది. దీనివెనుక జోగి రమేష్‌ను ఇరికించే పెద్ద కుట్ర ఉంది. జనార్దనరావు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేసిన తరువాత పిటిషనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు’’ అని పేర్కొన్నారు.మొత్తం వ్యవహారంలో స్థానిక పోలీసులు, సిట్ అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ పిటిషనర్ ఇప్పటికే అరెస్టయ్యారని, ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తెలిపారు. నిందితుడికి దర్యాప్తు సంస్థను ఎంచుకునే అవకాశం లేదని, ఇదే విషయాన్ని న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పాయన్నారు.దర్యాప్తు పక్షపాతంతో ఉంటే సీబీఐ విచారణ కోరవచ్చు ఏజీ వాదనను పొన్నవోలు తోసిపుచ్చారు. ఏకపక్షంగా, పక్షపాతంతో, విశ్వసనీయత లేకుండా కేసును దర్యాప్తు చేస్తుంటే నిందితుడు సీబీఐకి అప్పగించాలని హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తు పౌరుడి ప్రాథమిక హక్కు అని, దీనికి భంగం కలుగుతుంటే తప్పనిసరిగా సీబీఐకి ఇవ్వాలని కోరవచ్చన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. -
బాబుకు హైకోర్టు బిగ్ షాక్.. జోగి రమేష్ దెబ్బ అదుర్స్..!
-
నకిలీ మద్యం కేసు దర్యాప్తు... ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి నోటీసులిస్తూ... న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జోగి అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు వెసులుబాటునిస్తూ విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు. దీనికిముందు జోగి రమేష్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేసును రాజకీయ కక్ష సాధింపులు, రాజకీయ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ‘‘నకిలీ మద్యం కేసులో ప్రభుత్వ దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదు. అందుకే సీబీఐకి ఇవ్వాలని కోరుతున్నాం. మొదటి నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు అరెస్ట్ కాకముందు ఎన్నడూ జోగి రమేష్ గురించి మాట్లాడలేదు. పోలీస్ కస్టడీలోకి వెళ్లాక... నకిలీ మద్యం మొత్తానికి జోగి ప్రధాన సూత్రధారి అని చెబుతున్నట్లు ఓ వీడియోను రికార్డ్ చేసి విడుదల చేశారు. ఇది బలవంతంగా తీసినట్లు కనిపిస్తోంది. దీనివెనుక జోగి రమేష్‌ను ఇరికించే పెద్ద కుట్ర ఉంది. జనార్దనరావు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేసిన తరువాత పిటిషనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు’’ అని పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంలో స్థానిక పోలీసులు, సిట్ అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ పిటిషనర్ ఇప్పటికే అరెస్టయ్యారని, , ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తెలిపారు. నిందితుడికి దర్యాప్తు సంస్థను ఎంచుకునే అవకాశం లేదని, ఇదే విషయాన్ని న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పాయన్నారు.దర్యాప్తు పక్షపాతంతో ఉంటే సీబీఐ విచారణ కోరవచ్చు ఏజీ వాదనను పొన్నవోలు తోసిపుచ్చారు. ఏకపక్షంగా, పక్షపాతంతో, విశ్వసనీయత లేకుండా కేసును దర్యాప్తు చేస్తుంటే నిందితుడు సీబీఐకి అప్పగించాలని హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తు పౌరుడి ప్రాథమిక హక్కు అని, దీనికి భంగం కలుగుతుంటే తప్పనిసరిగా సీబీఐకి ఇవ్వాలని కోరవచ్చన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. -
అకస్మాత్తుగా జోగి రమేష్ జైలు మార్పు..
జోగి రమేష్ అరెస్ట్.. అప్డేట్స్విజయవాడ:కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నిన్న( ఆదివారం, నవంబర్ 2 వతేదీ) నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్టు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో ఆయన్ను అరెస్టు చేశారు. ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నారుజోగి రమేష్ అరెస్టును ఖండించిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ నేతలుమాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గరికిపాటి శ్రీదేవి, జిల్లా అధికార ప్రతినిధి గుంజ శ్రీనివాస్, మైలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేతలుఎటువంటి ఆధారాలు లేకుండా జోగి రమేష్ పై అక్రమ కేసులు పెట్టారుఇది ప్రభుత్వ పైశాచిక ఆనందంజోగి రమేష్ ను అరెస్ట్ చేసి ప్రశ్నించే గొంతు నొక్కాలని చూస్తున్నారు.మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై కూడా కేసులు పెడుతున్నారు.. ఇది దుర్మార్గ పాలన కాదా?ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి వేల మంది వైఎస్సార్సీపీ సైనికుల గొంతుకలు సిద్ధంగా ఉన్నాయి.నెల్లూరు జైలుకు జోగి రమేష్జైలు మార్పుతో జోగి రమేష్ కుటుంబ సభ్యుల్లో ఆందోళనవిజయవాడ నుంచి ఆకస్మాత్తుగా నెల్లూరు తరలింపునెల్లూరు జైలుకు జోగి రమేష్.. ఆయన సోదరుడు జోగి రాముజోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు.జోగి రమేష్ భార్య, కుమారులపై కేసు నమోదు చేసింది. జోగి రమేష్ అరెస్ట్ సమయంలో వైద్య పరీక్షలకు వచ్చినపుడు జీజీహెచ్‌లో దౌర్జన్యం చేసి అద్దాలు పగులకొట్టినట్టు ఫిర్యాదు మాచవరం పోలీసులకు డ్యూటీ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఫిర్యాదుగుణదల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా శ్రీనివాసరావు విధులు శ్రీనివాసరావు ఫిర్యాదుతో మాచవరం పోలీసులు కేసు నమోదు ఏ1 గా జోగి రమేష్ భార్య శకుంతల దేవి , ఏ2 గా జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్ , ఏ3గా జోగి రమేష్ చిన్న కుమారుడు రోహిత్‌లపై కేసు నమోదు నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఆదివారం(నవంబర్ 2వ తేదీ) ఉదయం అక్రమంగా అరెస్టు చేసింది. కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా అద్దేపల్లె జనార్దనరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్‌ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ , ఆయన సోదరుడు జోగి రాము నివాసాల వద్దకు ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు సిట్, ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు చేరుకున్నారు.జోగి రమేష్ ఇంట్లో ఉండటంతో తలుపులు తోసుకొని లోపలికి ప్రవేశించే యత్నం చేశారు. మూడున్నర గంటలపాటు హడావుడి చేశారు. ఉదయం 8గంటలకు జోగి రమేష్ బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. -
జోగి రమేష్ అరెస్ట్ అంబటి రాంబాబు రియాక్షన్
-
డైవర్షన్ రాజకీయాలకు ఇది పరాకాష్ట!
ప్రజలను పక్కదారి పట్టించడంలో చంద్రబాబుది అందెవేసిన చేయి. ఈ విషయం తెలియని వారంటూ లేరు కానీ.. తాజా ప్రయత్నం మాత్రం పరాకాష్ట అని చెప్పక తప్పదు. రాష్ట్ర పాలన యంత్రాంగం ఘోర వైఫల్యం కారణంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది మరణిస్తే.. దాన్ని కప్పిపుచ్చేందుకు, పక్కదోవ పట్టించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్టుండి నకిలీ మద్యం కేసును తెరపైకి తెచ్చింది. కుట్ర రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంలా వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్ట్ చేయించింది.వాస్తవానికి కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం పెల్లుబికేలా చేసింది. ఇందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం ఆ ఘటనతో తమకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడింది. అయినప్పటికీ ప్రజల ఆగ్రహం ఏమాత్రం తగ్గలేదని కూటమి పెద్దలు అంచనాకు వచ్చారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా జరిగిన గోదావరి పుష్కరాల తొక్కిసలాట మొదలుకొని అధికారంలోకి వచ్చిన తరువాత తిరుపతి, సింహాచలం వంటి పవిత్ర పుణ్యక్షేత్రాల్లోనూ ఇటీవలి కాలంలో తొక్కిసలాటలు జరిగి పలువురు మరణించిన నేపథ్యంలో కాశీబుగ్గ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి ఘటనలు జరగడంతో దైవానికి ఏదో అపచారం జరిగిందన్న సెంటిమెంట్ ప్రజల్లో ఏర్పడుతోంది. ఇది అరిష్టం అన్న భావనకు భక్తులు వస్తున్నారు. పుణ్యక్షేత్రాల్లో మాత్రమే కాదు.. చంద్రబాబు విపక్షంలో ఉండగా కందుకూరు, గుంటూరు సభలలో జరిగిన తొక్కిసలాటల్లోనూ ప్రాణ నష్టం జరగడం గమనార్హం.కుల, మత రాజకీయాలు నడపడంలో ఆరితేరిన తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వానికి ఈ తొక్కిసలాటల ఘటనలు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. కాశీబుగ్గ ఆలయం ప్రైవేటుదని చెప్పి తప్పించుకోవాలని మంత్రులు ప్రయత్నించారు. ‘మనం నిమిత్త మాత్రులం’ అంటూ చంద్రబాబు పెదవి విరిచేసినట్లు వార్తలు వచ్చాయి. తుపానులను సైతం వెనక్కి నెట్టేయగల శక్తి సామర్థ్యాలు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ల సొంతమని టీడీపీ మీడియా బిల్డప్ ఇచ్చిన రెండు రోజులకే కాశీబుగ్గ ఘటన జరిగింది. తమకు టెక్నాలజీ వెన్నతో పెట్టిన విద్యని గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వం ఏకాదశి రోజున ఆ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున రావచ్చునన్న కనీస అవగాహన లేకపోయింది. పట్టణాల్లో ఏ వీధి దీపం ఆరిపోయినా రాజధానిలో కూర్చుని గుర్తిస్తామని చెప్పుకున్న చంద్రబాబు ఆలయ రద్దీని మాత్రం నియంత్రించలేకపోయారన్న విమర్శలు వచ్చాయి.కాశీబుగ్గలో పాండా అనే వ్యక్తి తన సొంత జాగా 12 ఎకరాలలో ఈ ఆలయం నిర్మించారట. ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిందీ ఆలయం. ఆ విషయం స్థానిక పోలీసులకు, అధికారులకు తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించడంపై ఉన్న శ్రద్ధ ప్రజలను కాపాడే విషయంలో లేకుండా పోయిందని విమర్శించారు.ఈ పరిస్థితుల్లో.. ప్రభుత్వ ప్రతిష్ట మరింత దెబ్బతిన్నదని భావించిన చంద్రబాబు ప్రభుత్వం వెంటనే డైవర్షన్ రాజకీయాల్లోకి దిగినట్లు కనిపిస్తోంది. ఆకస్మికంగా నకిలీ మద్యం కేసును తెరపైకి తెచ్చి మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఆదివారం ఉదయాన్నే అరెస్ట్ చేసింది. ఎల్లో మీడియా పుణ్యమా అని కాశీబుగ్గ ఘటన కాస్తా మరుగునపడి.. ఈ అరెస్ట్ అంశం మీడియాలో ప్రముఖంగా కనిపించింది. పోలీసులు కూడా ముందస్తు విచారణ లాంటివేవీ లేకుండానే ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నట్లు ఈ అరెస్ట్ స్పష్టం చేస్తోంది. నకిలీ మద్యం తయారీ ప్లాంట్ నిర్వాహకుడు జనార్దనరావు ఇచ్చిన ఒక ప్రకటన ఆధారంగా జోగిని నిర్భందించారు. జోగి దైవ సన్నిధిలో ప్రమాణం చేయడానికి అయినా సిద్దమేనని సవాల్ చేయడమే కాకుండా, ఆ ప్రకారం కనకదుర్గమ్మ గుడి వద్ద చేతిలో కర్పూర హారతి వెలిగించి ప్రమాణం చేశారు. ఇదే పని చంద్రబాబు లేదా లోకేష్ చేయగలరా అని ప్రశ్నించారు. వీటిని వారు ఎటూ పట్టించుకోరు.ఇక్కడ చిత్రం ఏమిటంటే నకిలీ మద్యం ప్లాంట్ నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డిని, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డిని పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఎల్లో మీడియాలోనే వచ్చిన రిపోర్టు ప్రకారం వేలాది బెల్ట్ షాపులకు ఈ నకిలీ మద్యం సరఫరా అయింది. ఒక్క తంబళ్ళపల్లె నియోజకవర్గంలోనే వెయ్యి బెల్ట్ షాపులు ఉన్నాయని ఈనాడు మీడియా పేర్కొంది. నకిలీ మద్యం ప్లాంట్‌ను పట్టుకున్న సందర్భంలోనే ఒక డైరీ దొరికిందని, అందులో ఈ మద్యం సరఫరా అయిన 78 మంది పేర్లు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఆ బెల్టు షాపుల జోలికి ఏపీ పోలీసుల మాత్రం పోలేదు. కానీ, నకిలీ మద్యం ప్లాంట్, అక్కడ ఒక పొలంలో ఉన్న మద్యం డంప్ కనుక్కున్న అధికారిని బదిలీ చేశారట. కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి మద్యం తాగి మోటార్ సైకిల్ నడిపి బస్ ప్రమాదానికి కారణమయ్యారు. ఆ ఘటనలో 19 మంది మరణించారు. నకిలీ మద్యమే కారణం అని ప్రకటనలు చేసిన, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 27 మందిపై కేసులు పెట్టారు. అక్కడ బెల్ట్ షాపుపై చర్య తీసుకోలేదు. ఆ షాపులలో నకిలీ మద్యం లేదని ఎక్కడా నిరూపించలేదు.రెండు రోజుల క్రితం సాక్షి టీవీ నెల్లూరు జిల్లా ఆత్మకూరు వద్ద బెల్ట్ షాపులలో అది మంచి మద్యమో, కాదో తెలియని రీతిలో విక్రయిస్తున్న వైనాన్ని సాక్ష్యాధారాలతో సహా వార్తా కథనాలను ప్రసారం చేసింది. అందులో ఒక వ్యక్తి టీడీపీ ఐడీ కార్డు వేసుకుని మరీ బెల్ట్ షాపు నడుపుతున్న వైనం బహిర్గతమైంది. ప్రభుత్వం వీటికి సమాధానం ఇవ్వలేకపోయింది. ఇబ్రహీంపట్నం వద్ద కూడా నకిలీ మద్యం డంప్ ఉందని వార్తలు వచ్చాక, అక్కడకు వెళ్లి దానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటపెట్టిన వ్యక్తి జోగి రమేష్. జనార్దనరావు దక్షిణాఫ్రికా నుంచి పంపిన వీడియోలో ఎక్కడా జోగి పేరు ప్రస్తావించలేదు. ఎవరితో ముందస్తు ఒప్పందం అయ్యారో కానీ, సడన్‌గా ఏపీకి వచ్చి ఆయన లొంగిపోయారు. ఆ క్రమంలో ఆయన మొబైల్ ఫోన్ ముంబై విమానాశ్రయంలో పోయిందని పోలీసులకు చెప్పినా, దానిని కనుక్కునేందుకు ఏమైనా ప్రయత్నాలు చేశారో, లేదో తెలియదు. పోలీసు రిమాండ్‌లో ఉండగా జోగి రమేష్ చెబితేనే నకిలీ మద్యం ప్లాంట్ పెట్టానని జనార్దనరావు ఇచ్చిన వీడియో ప్రకటనను బయటకు రిలీజ్ చేశారు. దానిని బట్టే ఇదంతా కుమ్మక్కు రాజకీయం అని, వైఎస్సార్సీపీ నేతను ఎలాగోలా ఇరికించి ఈ కేసును డైవర్ట్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నమని జనం అందరికీ తెలిసిపోయింది.ఇలా డైవర్షన్ చేయడంలో చంద్రబాబుకు చాలానే చరిత్ర ఉంది.. ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నప్పుడు దానిని డైవర్ట్ చేయడానికి తన ఫోన్ ఎలా ట్యాప్ చేస్తారంటూ ఎదురు కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీలో కేసులు నమోదు చేయించడం ద్వారా అసలు అంశాన్ని డైవర్ట్ చేశారు. మరోవైపు ఢిల్లీలోని తన సన్నిహితులతో రాజీ మంతనాలు జరిపించి కేసు లేకుండా చేసుకున్నారు. గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట ఘటనలో 29 మంది చనిపోయినా, ఒక్క అధికారిపై కూడా చర్య తీసుకోలేదు. పైగా సీసీటీవీ ఫుటేజీ కూడా మాయమైందన్న వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా ఒక కమిషన్ వేసి ఆయన తప్పేమి లేదన్నట్లు, భక్తులదే తప్పన్నట్లుగా చిత్రీకరించగలిగారని చెబుతారు. విజయవాడలో బుడమేరు వరదలతో వేలాది మంది అల్లాడుతుంటే ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల కుట్ర అంటూ వైఎస్సార్సీపీపై నెట్టే యత్నం చేశారు. మొత్తమ్మీద చంద్రబాబు ప్రభుత్వం తీరు చూస్తే ప్రజాస్వామ్యంలో కాకుండా రాచరికంలో ఉన్నామా అనిపిస్తోంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారల వ్యాఖ్యాత. -
కన్నీటి పర్యంతం అయిన జోగి రమేష్ భార్య.. వడ్డీతో సహా చెల్లిస్తాం...
-
విజయవాడ సబ్ జైలుకు జోగి రమేష్
-
Fake Liquor Scam Case: జోగి రమేష్‌కు 10 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
-
రిమాండ్ రిపోర్ట్ లో ఒక్క ఆధారం కూడా చూపించలేక పోయిన సెట్
-
బాబు కుతంత్రాలు.. పక్క ప్లాన్‌తో జోగి రమేష్ అరెస్ట్
-
జోగి అరెస్ట్ పై YS జగన్ ఫైర్
-
బాబు సర్కార్ ప్లాన్ అదేనా?
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం కేసులో సిట్ రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్ట్ చేసినట్లు తేటతెల్లమైంది. ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారు ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అధికారులు. నకిలీ మద్యం కేసులో దర్యాప్తు కంటే.. అక్రమ అరెస్టులపైనే సిట్ శ్రద్ధ పెట్టినట్లు జోగి రమేష్ వ్యవహారంతో స్పష్టమవుతోంది. నాటకీయ పరిణామాల నడుమ ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టారు అధికారులు. ఆ సమయంలోనూ ఈ కేసు ప్రధాన నిందితుడు(ఏ1) అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పిన కట్టుకథనే సిట్ వల్లేవేయడం గమనార్హం. అలాగే రిమాండ్ రిపోర్టులో జనార్దన్‌తో నమోదు చేయించిన వాంగ్మూలాన్నే వినిపించిన అధికారులు.. రమేష్‌కు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. జనార్దన్‌రావు-జోగి రమేష్‌కు మధ్య జరిగిన లావాదేవీలను సైతం నిరూపించలేక చతికిపలడ్డారు. జనార్దన్ పోయిందని చెబుతున్న ఫోన్ తాలుకా స్క్రీన్ షాట్లనే మళ్లీ ప్రస్తావనకు తెచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన టీడీపీ నేత జయచంద్రారెడ్డిపై ఇంతదాకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అలాగే నకిలీ మద్యం అమ్మకాలు జరిపిన శ్రీనివాస వైన్స్ ఓనర్ మహంకాళి పూర్ణ చంద్ర రావుపై ఇప్పటిదాకా కేసు నమోదు చేయలేదు కూడా. అంతేకాదు ఫేక్ లిక్కర్ డైరీలో పలువురు బడా నేతలు పేర్లున్నాయని దర్యాప్తు తొలినాళ్లలో ప్రకటించిన సిట్.. ఇప్పుడు గమ్మున ఉండిపోవడమూ పలు అనుమానాలను తావిస్తోంది. దీంతో.. సీఎం చంద్రబాబు డైరెక్షన్‌తోనే టీడీపీ నాయకులని తప్పించేందుకు అధికారులు నకిలీ మద్యం కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోందని వైఎస్సార్సీపీ అంటోంది. పదిరోజుల రిమాండ్నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పేరును ఏ-18 గా, ఆయన సోదరుడు జోగి రామును ఏ-19 గా ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. ఆరవ ఏజెఎంఎఫ్‌సీ న్యాయస్థానం ఈ ఇద్దరికీ 10రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది . దీంతో ఇరువురిని విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ జోగి రమేష్ వేసిన పిటిషన్ మంగళవారం(రేపు, నవంబర్ 12) విచారణ జరగాల్సి ఉంది. ఈలోపే ఆయన్ని అరెస్ట్ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: దుర్గమ్మ చెంత సత్యప్రమాణం.. బాబు, లోకేష్‌కు ఆ దమ్ముందా? -
ఒక్క ఆధారం ఉంటే ఒట్టు!
సాక్షి, అమరావతి: జోగి రమేష్‌కు వ్యతిరేకంగా సిట్ అధికారులు ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా రిమాండ్ నివేదికలో చూపించలేక పోయారు. వారు బెదిరించి జనార్దనరావుతో నమోదు చేయించిన అబద్దపు వాంగ్మూలం ఆధారంగానే న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. జోగి రమేష్, జనార్దనరావు మధ్య.. జోగి రమేష్, జయచంద్రారెడ్డిలమధ్య వ్యాపార లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒక్క ఆధారం కూడా చూపలేదు. అదే సమయంలో జయచంద్రారెడ్డి, జనార్దనరావు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.జయచంద్రారెడ్డికి టీడీపీ అధిష్టానానికి మధ్య రాజకీయ బంధం, అనుబంధం ఉందని సిట్ అధికారులు పేర్కొన్నారు. మరి నకిలీ మద్యం మాఫియాలో పాత్రధారి అయిన జయచంద్రారెడ్డి వెనక సూత్రదారులుగా ఉన్న టీడీపీ పెద్దలపై విచారణ ఎందుకు చేపట్టలేదో సిట్ అధికారులకే తెలియాలి. ఈ రిమాండ్ నివేదికలో జోగి రమేష్ వాంగ్మూలం ఇచ్చినట్టు, ఆయన సంతకం చేసినట్టు సిట్ ప్రస్తావించక పోవడం గమనార్హం. అంటే సిట్ అధికారుల నిరాధార ప్రశ్నలతో కూడిన కుట్రను విచారణ సందర్భంగా ఆయన తిప్పికొట్టినట్టు స్పష్టమవుతుంది. అంతా కట్టుకథ అని తెలుస్తోంది.కాగా, జోగి రమేష్æ ఏ–18, జోగి రాము ఏ–19గా చూపించారు. ఈ కేసులో మరో నలుగురిని ఏ–20గా మనోజ్ కొఠారి, ఏ–21గా సుదర్శన్, ఏ–22గా సింథిల్, ఏ–23గా ప్రసాద్‌ను తాజాగా చేర్చారు. ఇప్పటి వరకు మొత్తం 23 మందిపై కేసు నమోదైంది. టీడీపీ పెద్దలే కర్త, కర్మ, క్రియగా సాగిన నకిలీ మద్యం మాఫియా కేసును పక్కదారి పట్టిస్తూ సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టును రూపొందించడం విస్మయ పరుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో జోగి రమేష్‌ను హాజరు పరిచిన నేపథ్యంలో సమర్పించిన రిమాండ్ నివేదిక ప్రభుత్వ కుట్రను స్పష్టం చేసింది. కేసులో వాదనలు అర్ధరాత్రి 1.30 గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి.⇒ జయచంద్రారెడ్డి 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది టీడీపీయే. ఆయనకు మద్యం దుకాణాలు మంజూరైంది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం తయారుచేసి విక్రయించిందీ ఆ మద్యం దుకాణాల ద్వారానే. అంటే ఆయన రాజకీయ జీవితం, వ్యాపార వ్యవహారాలన్నీ టీడీపీతోనే ముడిపడ్డాయి. ఈ విషయాలన్నింటినీ సిట్ రిమాండ్ నివేదిలో పేర్కొంది. కానీ టీడీపీ నేత జయచంద్రారెడ్డి, ఆయన సన్నిహితుడు అద్దేపల్లి జనార్దనరావు ఈ నకిలీ మద్యం దందా అంతా వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ చెబితే చేశారట! వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా న్యాయస్థానాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రభుత్వం ఇలా బరితెగించి సిట్‌తో కుతంత్రాలు చేయించింది. ⇒ ఈ కేసులో ఏ1గా అద్దేపల్లి జనార్దనరావును కేంద్రబిందువుగా చేసుకుని సిట్.. జోగి రమేష్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నిందని స్పష్టమవుతోంది. టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జి జయచంద్రారెడ్డి, జనార్దనరావు వ్యాపార భాగస్వాములు, సన్నిహితులని సిట్ చెబుతోంది. కానీ జనార్దనరావు.. జోగి రమేష్‌కు సన్నిహితుడని నమ్మించేందుకు సిట్ కట్టుకథలు అల్లింది. ⇒ జోగి రమేష్ చెబితేనే జనార్దనరావు నకిలీ మద్యం తయారీకి సిద్ధపడ్డారని సిట్ చెప్పడం విడ్డూరంగా ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ చెబితే ఆయన ఎందుకు చేస్తారనే కనీస అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. వారిద్దరూ (జనార్దనరావు, జయచంద్రారెడ్డి) ఎన్నో ఏళ్లుగా ఆఫ్రికాలో ఇదే తరహా నకిలీ మద్యం వ్యాపారం నిర్వహించారని అదే నివేదికలో సిట్ పేర్కొంది. అటువంటి చరిత్ర ఉన్న జయచంద్రారెడ్డికి టీడీపీ ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్న విషయాన్ని సిట్ అధికారులు ఉద్దేశ పూర్వకంగానే పట్టించుకోలేదు. ఎందుకంటే రాష్ట్రంలో నకిలీ మద్యం దందాకు పాల్పడాలనే కుట్రతోనే ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చింది. అందుకే ఆ అంశాన్ని సిట్ రిమాండ్ రిపోర్ట్‌లో పొందుపర్చలేదు.నేను ఏ తప్పూ చేయలేదున్యాయమూర్తి ఎదుట జోగి రమేష్తాను ఏ తప్పు చేయలేదని, నకిలీ మద్యం వ్యవహారంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని జోగి రమేష్ న్యాయమూర్తి ఎదుట స్పష్టం చేశారు. పాత విషయాలను దృష్టిలో పెట్టుకుని తనపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని వాపోయారు. సీఎం చంద్రబాబు తనను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని ఆవేదన వ్యక్తంచేశారు. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు చనిపోవడం, తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం వైఫల్యం చెందడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనను అరెస్టు చేశారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలు గమనిస్తున్నారని, పైన దేవుడు కూడా చూస్తున్నాడన్నారు. -
జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికీ అక్రమమే
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్టును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి.. దాని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ తమ పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారంటూ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికీ అక్రమమేనని స్పష్టం చేశారు. బాబు డైవర్షన్ పాలిటిక్స్ హ్యాష్ ట్యాగ్‌తో ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ⇒ ‘చంద్రబాబు గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగి రమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ⇒ గత 18 నెలలుగా ప్రభుత్వం మీది.. పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డ వారిలో మీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు.. మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. ⇒ మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అమ్మేది మీరు తీసుకు వచ్చిన మీ ప్రైవేటు లిక్కర్ షాపుల్లో.. మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టు షాపులు, పరి్మట్ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీ వారు, అమ్మేదీ మీ వారే.. కానీ బురదజల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లని. ⇒ నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, మోంథా తుపాను కారణంగా కుదేలైన రైతుల గోడును పక్కదోవ పట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి, దుర్మార్గానికి ఒడిగట్టారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటి రోజే అరెస్టుకు దిగారంటే మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోంది చంద్రబాబు గారూ.. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు గారూ? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెబితే అది చేస్తుంది. మీరు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలం!?. -
జోగి రమేష్ అక్రమ అరెస్ట్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం అక్రమంగా అరెస్టు చేసింది. నకిలీ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు అన్నీ అధికార టీడీపీ నేతల కనుసన్నల్లోనే సాగినట్లు బట్టబయలైనా, డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా అద్దేపల్లె జనార్దనరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్‌ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ , ఆయన సోదరుడు జోగి రాము నివాసాల వద్దకు ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు సిట్, ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు చేరుకున్నారు.జోగి రమేష్ ఇంట్లో ఉండటంతో తలుపులు తోసుకొని లోపలికి ప్రవేశించే యత్నం చేశారు. మూడున్నర గంటలపాటు హడావుడి చేశారు. ఉదయం 8గంటలకు జోగి రమేష్ బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను పోలీస్ వ్యాన్‌లో బలవంతంగా ఎక్కించి, విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్న తూర్పు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జోగి రమేష్ సోదరుడు రాము, జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును కూడా అరెస్టు చేసి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రమేష్ ను అరెస్ట్ చేయొద్దని ఆందోళన జోగి రమేష్ ఇంటికి పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. జోగి రమేష్ ను అక్రమంగా అరెస్ట్ చేస్తుండటాన్ని నిరసిస్తూ ప్రధాన గేటు ముందు బైఠాయించారు. సీఎం చంద్రబాబు డౌన్ డౌన్.. నారా వారి సారా రాజ్యం నశించాలి.. అంటూ నినాదాలు చేశారు. ఈ దశలో పోలీసులు, నాయకుల మధ్య తీవ్ర∙వాగ్వాదం జరిగింది. ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన జోగి రమేష్‌ను అరెస్ట్ చేసి విజయవాడలోని తూర్పు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని తెలియడంతో పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. ఆయన అక్రమ ఆరెస్టును నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు పేర్ని నాని, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, లేళ్ల అప్పిరెడ్డి, రుహూల్లా, నియోజకవర్గ ఇన్చార్జులు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, ఉప్పాల రాము, తన్నీరు నాగేశ్వరరావు, దేవభక్తుని చక్రవర్తి, పార్టీ నేతలు నాగార్జున, తిరుపతిరావు, రవిచంద్ర, అవుతు శ్రీనివాసరెడ్డి, పోతిన మహేష్ , జెడ్పీ వైస్ చైర్మన్ జి.శ్రీదేవి, కొండపల్లి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ జి.శ్రీనివాస్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. కాగా, రాత్రి జోగి రమేష్‌ను వైద్య పరీక్షల నిమిత్తం ఎక్సైజ్ పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాత్రి పొద్దుపోయే వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్సైజ్ కార్యాలయం వద్దే ఉన్నారు. చంద్రబాబు పిచ్చకి పరాకాష్ట – జోగి రమేష్ , మాజీ మంత్రి చంద్రబాబునాయుడు నా మీద కక్ష కట్టాడని 20 రోజులుగా చెబుతున్నాను. అందులో భాగమే ఈ అక్రమ అరెస్టు. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య, బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను.. కనకదుర్గమ్మ వారి దగ్గరకు తీసుకువెళ్లాను.. ప్రమాణం చేసి చెప్పాను. అయినా చంద్రబాబునాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు దుర్మార్గానికి, పిచ్చికి ఇది పరాకాష్ట. కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది మృతి చెందిన సంఘటనను డైవర్షన్ చేసేందుకు కుట్ర పన్నారు. నన్ను అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబునాయుడు, లోకేశ్.. ఖబడ్దార్.. మీకు భార్య, పిల్లలు ఉన్నారు. మీకు కుటుంబం ఉంది. నన్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. జోగి సోదరుల ఇళ్లల్లో క్లూస్ టీమ్ తనిఖీ జోగి రమేష్ , జోగి రాముల అరెస్ట్ అనంతరం వారి నివాసాల్లో సిట్ సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో సిట్, ఎక్సైజ్, పోలీస్, క్లూస్ టీమ్ బృందాల్లోని సభ్యులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. సీసీ టీవీ పుటేజీలు, హార్డ్ డిస్‌్కలు, సెల్ఫోన్లు, కంప్యూటర్లు పరిశీలించారు. పలు ఎల్రక్టానిక్స్ వస్తువులను రెండు బాక్సుల్లో ప్యాక్ చేసి వారితోపాటు తీసుకెళ్లారు. బీసీల ఎదుగుదల ఓర్చుకోలేకే అక్రమ అరెస్టుజోగి రమేష్ సతీమణి శకుంతలమ్మ ఆవేదన సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘బీసీ సామాజికవర్గానికి చెందిన వాళ్లం కాబట్టి మా రాజకీయ ఎదుగుదలను చూసి తట్టుకోలేక చంద్రబాబునాయుడు, లోకేశ్ మాపై కక్షగట్టారు. ఒక బీసీ నాయకుడు నా ఇంటి దగ్గరకు రావడమేంటని కక్ష పెంచుకొని నా భర్త జోగి రమేష్‌ను అణిచివేయాలని చూస్తున్నారు’ అని ఆయన సతీమణి జోగి శకుంతలమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ అరెస్టు అనంతరం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గతంలో తన కొడుకు జోగి రాజీవ్‌ను, ఇప్పుడు తన భర్త జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేశారు.గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పించేందుకే తన భర్త.. చంద్రబాబు ఇంటి దగ్గరకు వెళ్లారన్నారు. ఆ సమయంలో టీడీపీ నాయకులే తన భర్త కారుపై దాడి చేశారని గుర్తు చేశారు. కానీ ఆ సంఘటనను చంద్రబాబు ఇంటి మీద దాడిగా చిత్రీకరించారని ఆమె వాపోయారు. అది మనసులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లు పరిపాలన గాలికొదిలేసి తమ కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. చంద్రబాబు నాయుడుకు మనస్సాక్షి అనేది ఉంటే కొంచెం అయినా ఆలోచించాలని హితవు పలికారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ప్రశ్నిస్తున్నందుకే తన భర్తను అణిచివేసేందుకు పూనుకున్నారని ఆమె మండిపడ్డారు. హక్కులను కాలరాస్తూ... రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ పోలీసులు తమ ఇంటి వద్ద ప్రవర్తించిన తీరు భయాందోళన కలిగించిందని జోగి శకుంతలమ్మ చెప్పారు. నిద్రపోతున్న సమయంలో ఇంటి మీదకు వచ్చి.. డోర్లు కొట్టి.. భయానక వాతావరణాన్ని సృష్టించారని ఆందోళన వ్యక్తంచేశారు. డోర్లు తెరవకపోతే పగలకొడతాం అని వాచ్‌మెన్‌ను బెదిరించారన్నారు. తాను నిర్దోషి అని తన భర్త కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర కుటుంబ సభ్యులందరి సమక్షంలో ప్రమాణం చేశారని గుర్తు చేశారు.తన భర్త మీద ఎవరైతే నకిలీ మద్యం కేసులో అసత్య ఆరోపణలు చేస్తున్నారో వారంతా ఆయన తప్పు చేశాడని ప్రమాణం చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని ఆమె సవాల్ విసిరారు. తప్పు చేసి ఉంటే ఎటువంటి శిక్షకైనా సిద్ధంగా ఉంటామన్నారు. కానీ, ఏ తప్పు చేయకుండా తమ కుటుంబ సభ్యులను ఈ రకంగా హింస పెట్టడాన్ని చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. దేవుడు అన్నీ చూస్తున్నాడని, తన భర్త జోగి రమేష్ , మరిది జోగి రాము కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆమె ధీమా వ్యక్తంచేశారు. -
ఏమార్చే తంత్రం.. పక్కా కుతంత్రం
సాక్షి, అమరావతి: పంచ పాండవులు ఎంత మంది అని అడిగితే... మంచం కోళ్లలా ముగ్గురు ఉంటారని రెండు వేళ్లు చూపించాడట వెనకటికి ఒకరు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ తీరు కూడా అంత అధ్వానంగా, అస్తవ్యస్థంగా తయారైంది. ఎన్నికల మేనిఫెస్టో ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు నిలదీస్తుంటే.. ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం దాటవేసేందుకు ఎప్పటికప్పుడు డైవర్షన్ కుతంత్రాలు పన్నుతోంది. ఇందులో భాగంగానే తాజాగా వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్ అని స్పష్టమవుతోంది. ఏమాత్రం సంబంధం లేని విషయాలను సృష్టించి, ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందనేందుకు నకిలీ మద్యం రాకెట్లో జోగి రమేశ్‌ను ఇరికించడమే నిదర్శనం. 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ కూటమి ప్రభుత్వం శకుని తరహాలో కుయుక్తి పాచికలను మళ్లీ మళ్లీ విసురుతోంది. తాను ఏం చెప్పినా భుజానికెత్తుకునే ఎల్లో మీడియా ఉండటంతో చంద్రబాబు తన కుట్రలకు మరింత పదును పెడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం చెందడంతో ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. మోంథా తుపానుతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనకు ఉద్యుక్తులవుతున్నారు. తమ చేతగానితనం మరోసారి బట్టబయలు కాగానే చంద్రబాబులోని డైవర్షన్ చంద్రముఖి వెంటనే నిద్ర లేచింది. ఫలితంగా కరకట్ట ప్యాలస్ డైరెక్షన్లో టీడీపీ వీర విధేయ పోలీసులతో కూడిన సిట్ తక్షణం రంగంలోకి దిగింది. జోగి రమేశ్ అరెస్ట్.. ఎల్లో మీడియాలో భారీగా కవరేజీ.. ప్రజల దృష్టి అటువైపు మళ్లించే పన్నాగం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యంతోనే భక్తుల దుర్మరణం టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలే సూత్రధారులు, టీడీపీ నేతలే పాత్రధారులుగా సాగుతున్న నకిలీ మద్యం దందా కేసును ఉద్దేశ పూర్వకంగా పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం బరితెగించింది. అందుకు ఎంచుకున్న సమయం కూడా ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యంతోనే కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొమ్మిది మంది భక్తుల దుర్మరణం రాష్ట్రాన్నే కాదు యావత్ దేశాన్ని తీవ్రంగా కలచి వేసింది. ఎంతో ప్రాశస్య్తమైన కార్తీక ఏకాదశి అదీ శనివారం రోజున వచ్చిందనే కనీస స్పృహ కూడా ప్రభుత్వానికి లేకపోవడం విడ్డూరంగా ఉంది. ఉత్తరాంధ్రలో చిన్న తిరుపతిగా గుర్తింపు పొందిన కాశీబుగ్గు వేంకటేశ్వర స్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు తరలి వస్తారన్నది అందరికీ తెలిసినా సరే ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్టు వ్యవహరించింది. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయక పోవడం వల్లే ఆలయంలో శనివారం తీవ్ర తొక్కిసలాట సంభవించి భక్తులు మృత్యువాత పడ్డారు. హృదయ విదారకంగా ఉన్న ఆ దృశ్యాలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ వైఫల్యం బట్టబయలైంది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తుల దుర్మరణం.. సింహాచలంలో చందనోత్సవం రోజున గోడ కూలి ఏడుగురు బలి.. తాజాగా కాశీబుగ్గ దుర్ఘటనలు ప్రభుత్వ చేతగానితనాన్ని ఎత్తిచూపాయి. హిందూ పండుగలకు కనీస స్థాయిలో ఏర్పాట్లు చేయలేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వ అసమర్థ, నిర్లక్ష్య వైఖరిపై యావత్ భక్తకోటి మండిపడుతోంది. భక్తుల ప్రశ్నలకు ప్రభుత్వం శనివారం రాత్రి వరకు సరైన సమాధానం చెప్పలేకపోయింది. ఫలితంగానే డైవర్షన్ పాలిటిక్స్. తుపాను బాధిత రైతులను పట్టించుకోని ప్రభుత్వం మోంథా తుపాను దెబ్బకు రాష్ట్రంలో రైతులు కుదేలయ్యా రు. 15 లక్షల ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నా, ప్రభుత్వ పెద్దలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం పంటల నష్టాన్ని అంచనా వేయకుండా తుపాన్‌ను జయించామని బాకాలు ఊదుతుండటం విస్మయానికి గురి చేస్తోంది. క్షేత్ర స్థాయిలో రైతులను పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. దెబ్బతిన్న పంటలను కొనేందుకు ప్రభుత్వమే ఆంక్షలు విధిస్తుండటం విడ్డూరంగా ఉంది. ఇన్పుట్ సబ్సిడీ కావాలా.. ధాన్యం కొనాలా.. ఏదో ఒకటే తేల్చుకోవాలని షరతు విధిస్తుండటం ప్రభుత్వ దుర్మార్గానికి తార్కాణం. కనీసం సంచులు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై తుపాను బాధిత ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ఆందోళనకు సిద్ధపడుతున్నారు. చంద్రబాబు లండన్ షికారు.. చినబాబు క్రికెట్ జోరు ఓ వైపు భక్తుల దుర్మరణం.. మరోవైపు తుపానుతో తీవ్రంగా నష్టపోయిన రైతుల ఆవేదన యావత్ రాష్ట్రాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. కానీ ధృతరాష్ట్ర పాలన సాగిస్తున్న చంద్రబాబు, లోకేశ్ మాత్రం ఇవేవీ పట్టించుకుండా ఉడాయించారు. చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్లిపోయారు. ఆయన లండన్ పర్యటన ఎందుకు? అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. వ్యక్తిగత పర్యటనా.. లేక అధికారిక పర్యటనా అన్నది స్పష్టం చేయలేదు. చంద్రబాబు వ్యక్తిగతంగానే లండన్ పర్యటనను ఆస్వాదిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. ఇక చినబాబు లోకేశ్ తీరు మరింత విస్మయానికి గురి చేసింది. ఆయన ముంబయిలో క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లిపోయారు. దుర్మరణం చెందిన భక్తుల కుటుంబాల ఆవేదననుగానీ, తీవ్రంగా నష్టపోయిన రైతుల బాధను గానీ తండ్రీ కొడుకులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారన్నది పత్తా లేదు. అదీ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రస్తుత పరిస్థితి. అందుకే డైవర్షన్ డ్రామా.. జోగి రమేశ్ అక్రమ అరెస్టు కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో చంద్రబాబు బేంబేలెత్తారు. వెంటనే తనదైన శైలిలో డైవర్షన్ డ్రామాకు తెరతీశారు. శనివారం రాత్రి కూటమి ప్రభుత్వ పెద్దలు తమ పన్నాగానికి పదును పెట్టారు. నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్‌ను అక్రమ అరెస్టు చేయాలని సిట్ అధికారులను ఆదేశించారు. దాంతో మీడియా, ప్రజల దృష్టి అంతా ఆ వ్యవహారం వైపు మళ్లించాలన్నది ఎత్తుగడ. ప్రభుత్వ పెద్దల కుట్రకు టీడీపీ వీర విధేయ పోలీసులు వత్తాసు పలికారు. ఆదివారం తెల్లవారుజామునే విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఆయన్ని బలవంతంగా అరెస్టు చేశారు. నకిలీ మద్యం వ్యవహారంతో తనకేం సంబంధమని ఆయన అడిగిన ప్రశ్నలకు పోలీసులు కనీస సమాధానం కూడా చెప్పలేకపోవడం గమనార్హం. కేవలం కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనలో ప్రభుత్వ వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ హైడ్రామా నడిపించారన్నది సుస్పష్టం. మళ్లీ మళ్లీ అదే డైవర్షన్ కుతంత్రం 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం ఇదే తరహాలో డైవర్షన్ డ్రామాలతోనే ప్రజల్ని మభ్యపెడుతోంది. ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలని ఎవరు డిమాండ్ చేసినా.. పరిపాలనలో ప్రభుత్వ వైఫల్యం ఎప్పుడు బయటపడినా.. రెడ్‌బుక్ అరాచకాలపై ప్రజాగ్రహం వెల్లువెత్తిన ప్రతిసారి.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ, పునరావాస చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ చేతగానితనం బటయపడగానే.. ఇలా కూటమి ప్రభుత్వ ప్రతి వైఫల్యంలోనూ వెంటనే ప్రజల దృష్టి మళ్లించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త కుట్రలకు తెరతీస్తునే ఉంది. -
అసలు సూత్రధారి టీడీపీ నేత.. అతను జోగి రమేష్ మాట వింటాడా?
-
ఇల్లు చూపించమని పిలిచి.. పోలీసుల కుట్ర బయటపెట్టిన జోగి రమేష్ PA
-
జోగి రమేష్ అరెస్ట్ పై YS జగన్ ఆగ్రహం
-
తిరుపతి లడ్డు నుండి కాశీబుగ్గ వరకు.. బాబు డైవర్షన్ పాలిటిక్స్
-
లోకేష్ కుట్రే.. పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు: జోగి శకుంతల
సాక్షి, విజయవాడ: ఏపీలో నకిలీ మద్యం వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఏమీ లేదన్నారు ఆయన సతీమణి శకుంతల. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కావాలనే జోగి రమేష్‌ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేసినా దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.మాజీ మంత్రి జోగి రమేష్ సతీమణి శకుంతల సాక్షితో మాట్లాడుతూ..‘చంద్రబాబు ఇంటికి వెళ్లినప్పటి నుంచి ఆయన, నారా లోకేష్ కక్ష పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధిస్తున్నారు. గతంలో అగ్రిగోల్డ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఏమీ లేదు. కావాలనే ఈ కేసులో పోలీసులు ఇరికించారు. దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేశాం. ఇవాళ ఉదయాన్నే మా ఇంటిని వచ్చిన పోలీసులు.. తలుపులు మూసేసి దౌర్జన్యంగా వ్యవహరించారు. పైన దేవుడు ఉన్నాడు.. అందరికీ కుటుంబాలు ఉన్నాయి. దేవుడు అన్నీ చూసుకుంటాడు. మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ మాట్లాడుతూ..‘పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదు. మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య. నకిలీ మద్యం కేసుపై సీబీఐ విచారణ జరపాలి. మా నాన్నకు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సహా ఆయన సోదరుడు జోగి రాము, ఆయన సహచరుడు రామును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. -
నీకు భార్య, పిల్లలు ఉన్నారు కదా.. జోగి రమేష్ అరెస్ట్ పై భార్య ఎమోషనల్..
-
అరెస్ట్ పై జోగి రమేష్ స్ట్రాంగ్ రియాక్షన్
-
చంద్రబాబు.. అంత భయమెందుకు?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడానికి, నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ జోగి రమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. నకిలీ మద్యం కేసులో టీడీపీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగిరమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.గత 18 నెలలుగా ప్రభుత్వం మీది.. పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డవారిలో మీ పార్టీనుంచి ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు, మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ, అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అంతా అమ్మేది, మీరు తీసుకు వచ్చిన మీ ప్రైవేటు లిక్కర్ షాపుల్లోనే, మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టుషాపుల్లోనే, పర్మిట్ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీవారు, అమ్మేదీ మీరే, కాని బురదజల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లని..@ncbn గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగిరమేష్… pic.twitter.com/ros9R1o0xY— YS Jagan Mohan Reddy (@ysjagan) November 2, 2025నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడానికి, మోంథా తుపాను కారణంగా కుదేలైన రైతు గోడును పక్కదోవపట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి, దుర్మార్గానికి ఒడిగట్టారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటిరోజే అరెస్టుకు దిగారంటే చంద్రబాబుగారు.. మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోంది. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబుగారూ? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెప్తే అది చేస్తుంది. మీరు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలం’ అని విమర్శలు చేశారు. -
కాశీబుగ్గ ఘటన డైవర్షన్ కోసమే జోగి రమేష్ అక్రమ అరెస్ట్..
-
సీబీఐ ఎంక్వయిరీ వేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి.. బాబు ప్రభుత్వానికి జోగి రాజీవ్ ఛాలెంజ్
-
‘చంద్రబాబు సర్కార్ మరో డైవర్షన్ డ్రామా’
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున, పేర్ని వెంకట్రామయ్య (నాని), అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మార్గాని భరత్, టీజేఆర్ సుధాకర్‌బాబు సంయుక్త ప్రకటన విడుదల చేశారు‘‘మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమం. ఇది కేవలం కక్ష సాధింపు చర్య. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌ను దురుద్దేశంతోనే ఇరికించారు. కస్టడీలో ఉన్న కేసులో ఏ–1 నిందితుడు జనార్థన్‌రావు ద్వారా జోగి రమేష్ పేరు చెప్పించారు. దానిపై జోగి రమేష్ చేసిన సవాల్, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సాక్షిగా ఆయన చేసిప ప్రమాణంపై ఇప్పటి వరకు టీడీపీ నేతలు స్పందించలేదు. జోగి రమేష్ కుటుంబాన్ని ఇంకా వెఎస్సార్‌సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లు’’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘లేని లిక్కర్ స్కామ్‌లు సృష్టించారు. కల్తీ మద్యం తయారుచేస్తూ టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోవడంతో, ఆ బురదను వైఎస్సార్సీపీకి అంటించే కుట్ర చేస్తున్నారు. కల్తీ మద్యం కేసులో సీబీఐ దర్యాప్తు జోగి రమేష్ కోరారు. దానిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. అది విచారణకు రాకముందే జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొక్కిసలాట.. పలువురి దుర్మరణం. మోంథా తుపాన్ సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యం. రెండింటి నుంచి డైవర్షన్ కోసమే జోగి రమేష్ అరెస్ట్. కల్తీ మద్యం కేసులో పక్కా ఆధారాలున్నా, కొందరు టీడీపీ నాయకులు అరెస్ట్ లేదు. కేవలం కక్ష సాధింపు కోసమే జోగి రమేష్‌ను ఇరికించి అరెస్టు చేశారు. ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం’’ అని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. -
బాబు డైవర్షన్ డ్రామా.. 18 నెలల్లో ఎన్ని కథలంటే?
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ మరో డైవర్షన్ డ్రామాకు తెరలేపింది. శ్రీకాకుళంలోని కాశీబుగ్గ తొక్కిసలాట డైవర్ట్ కోసం మాజీ మంత్రి జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్ట్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిందని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రజల ఆగ్రహాన్ని తప్పించుకునేందుకు కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. గతంలో పలుమార్లు కూటమి సర్కార్‌పై ప్రజాగ్రహం వచ్చిన ప్రతీసారి బాబు డైవర్షన్ డ్రామాలకు తెరలేపారు. దీంతో, డైవర్షన్ పాలిటిక్స్‌లో మాస్టర్‌గా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారని సోషల్ మీడియాలో పలువురు సెటైర్లు వేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు వైఫల్యం చెందినా చంద్రబాబు డైవర్షన్ డ్రామాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీ నేతలపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసిన టీడీపీ నేతలను వదిలేసి వైఎస్సార్సీపీ నేతలను వేధింపులకు గురిచేస్తున్నారు. నకిలీ మద్యం కేసులో ప్లాన్ ప్రకారం మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేశారు. టీడీపీ పెద్దల ప్లాన్ ప్రకారం జోగి రమేష్ అరెస్ట్ జరిగింది. జోగి రమేష్‌ను అరెస్ట్ చేస్తామని మంత్రులు ఇప్పటికే చాలాసార్లు పలు మీడియా సమావేశాల్లో చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు కాశీబుగ్గ ఘటనను డైవర్ట్ చేసేందుకు జోగి రమేష్‌ను అరెస్ట్ చేశారు. 18 నెలల కాలంలో బాబు డైవర్షన్లు..2024లో విజయవాడ వరదల్ని డైవర్ట్ చేసేందుకు బ్యారేజీని బోట్లతో ఢీకొట్టబోయారంటూ చంద్రబాబు డ్రామా.వంద రోజుల పాలన పూర్తి అయిన సమయంలో తిరుమల లడ్డు కల్తీ డ్రామా.ఉచిత గ్యాస్‌పై ప్రజలు ప్రశ్నిస్తున్నారనగానే రూ.14 లక్షల కోట్ల అప్పు అంటూ ప్రచారం.గత డిసెంబర్ తుపాను సమయంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేషన్ తనిఖీల పేరుతో హడావుడి.తిరుపతి తొక్కిసలాటకు బాధ్యులైన టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో, ఎస్పీని వదిలేసి సంబంధం లేని అధికారులపై చర్యలు.చంద్రబాబు దావోస్ పర్యటన ఫెయిల్యూర్‌ను డైవర్ట్ చేసేందుకు నీతి ఆయోగ్ రిపోర్టు పేరుతో నాటకాలు.ఫిబ్రవరిలో ఏపీలో రిజిస్ట్రేషన్ల బాదుడు నుంచి డైవర్ట్ కోసం వంశీ అరెస్ట్.కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయంపై దృష్టి మరల్చేందుకు పోసాని అక్రమ అరెస్ట్.ఏపీ బడ్జెట్లో సూపర్ సిక్స్‌కు గుండుసున్నా పెట్టారు. దాన్ని డైవర్ట్ చేసేందుకు లిక్కర్ కేసును తెర మీదకు తెచ్చారు.సింహాచలం చందనోత్సవం వైఫల్యం నుంచి తప్పించుకునేందుకు మిథున్ రెడ్డిపై కేసు. డైవర్షన్‌లో భాగంగా కాకాణి గోవర్థన్పై అక్రమ కేసు. ఇప్పుడు కాశీబుగ్గ ఘటనను డైవర్ట్ చేసేందుకు జోగి రమేష్ అరెస్ట్‌తో డైవర్షన్. కక్ష సాధింపులో భాగంగా..మరోవైపు నకిలీ మద్యం కేసుకు సంబంధించిన ప్రశ్నలు గుప్పిస్తున్న, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని నేతల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. ఇందులో మేడపాటి నాగిరెడ్డితో పాటు బీసీ సెల్ అధ్యక్షుడు కుంచం జయరాజు కూడా ఉన్నారు. వాళ్ల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే.. మంత్రి లోకేష్, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టారని, టీడీపీ నేతలు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారని, అందుకే విచారణ జరుపుతున్నామని పోలీసులు అంటున్నారు. -
వైఎస్ఆర్ సీపీ నేత జోగి రమేష్ అక్రమ అరెస్ట్
-
మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్
జోగి రమేష్ అరెస్ట్ అప్డేట్స్.. 6వ అడిషనల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో జోగి రమేష్‌ను హాజరు పరిచిన ఎక్సైజ్ పోలీసులుజీజీహెచ్ ఆసుపత్రిలో జోగి రమేష్, రాముకు వైద్య పరీక్షలు పూర్తి, ఆసుపత్రి నుంచి కోర్టుకు తరలింపుఆసుపత్రి వద్ద కన్నీటి పర్యంతమైన జోగి రమేష్ సతీమణి శకుంతలాదేవివైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్న పోలీసులుజీజీహెచ్ ఆసుపత్రికి భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, నాయకులుపోలీసులు, ప్రభుత్వ తీరుపై వైసీపీ కార్యకర్తలు ఫైర్జోగి రమేష్‌కు అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలువైఎస్ఆర్సిపి కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులుకాసేపట్లో జోగి రమేష్‌కు వైద్య పరీక్షలుజీజీహెచ్లో జోగి రమేష్, జోగి రాములకు వైద్య పరీక్షలుజోగి రమేష్ ఇంట్లో ముగిసిన సోదాలు..ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో ముగిసిన APFSL EVIDENCE RESPONSE TEAM సోదాలుసీసీ కెమెరాలు , ల్యాప్ టాప్‌లు పరిశీలించిన ఫోరెన్సిక్ టీమ్రెండు గంటలకు పైగా కొనసాగిన తనిఖీలుజోగి రమేష్ మొబైల్స్, ఆయన సతీమణి ఫోన్, ఇద్దరు కుమారులకు చెందిన ల్యాప్ ట్యాప్‌లు, సీసీకెమెరా ఫుటేజ్ హార్డ్ డిస్క్ స్వాధీనంజోగి రమేష్ ఇంట్లో తనిఖీల అనంతరం జోగి రమేష్ సోదరుడు రాము ఇంటికి వెళ్లిన తనిఖీల బృందంజోగి రమేష్ సహా మరో ఇద్దరు అరెస్ట్..విజయవాడ..మాజీ మంత్రి జోగి రమేష్ సహా మరో ఇద్దరిని అక్రమ అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు.జోగి రమేష్‌తో పాటు అతని సోదరుడు జోగి రాము అక్రమ అరెస్ట్జోగి రమేష్ ప్రధాన అనుచరుడు అరేపల్లి రాము అరెస్ట్భవానిపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్న అధికారులుమాజీ మంత్రి జోగి రమేష్ కామెంట్స్..చంద్రబాబు రాక్షసానందం పొందడానికే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు.తప్పు చేయలేదని నా భార్య, పిల్లల మీద ప్రమాణం చేశాను.అయినా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు.కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనను డైవర్ట్ చేసేందుకు కుట్ర ఇది.అందుకే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ కార్యాలయానికి జోగి రమేష్ తరలింపు..మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేసిన సిట్ అధికారులుజోగి రమేష్‌కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన సిట్‌విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలింపుజోగి రమేష్ సోదరుడు రామును సైతం అరెస్ట్ చేసిన పోలీసులు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని జోగి రమేష్ ఆగ్రహం.జోగి రమేష్ అరెస్ట్‌పై వైఎస్సార్సీపీ నేతల ఆందోళనప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని నిరసనజోగి రమేష్ అరెస్ట్..మాజీ మంత్రి జోగి రమేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. జోగి రమేష్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు.మాజీ మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును అదుపులోకి తీసుకున్న పోలీసులుఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ సోదరుడు జోగి రాము ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు. జోగి రమేష్ అరెస్ట్‌ను నిరసిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆందోళన. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ కామెంట్స్..పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదు.మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు.చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య.నకిలీ మద్యం కేసుపై సీబీఐ విచారణ జరపాలి.మా నాన్నకు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి. 👉మాజీ మంత్రి జోగి రమేష్‌పై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌ను ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్దకు తెల్లవారుజామునే భారీగా పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో జోగి రమేష్ ఇంటి వద్దకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. 👉మాజీ మంత్రి జోగి రమేష్‌పై కూటమి ప్రభుత్వం ఓవరాక్షన్‌కు దిగింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌ను ఇరికించే కుట్రకు తెరలేపింది. ఏ1 జనార్థనరావు స్టేట్మెంట్ ఆధారంగా ఆయనను ఇరికించేందుకు ప్లాన్ చేశారు. నకిలీ మద్యం మాఫియా నడిపిన టీడీపీ నేతలను పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేశారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంప్ కేసులో జోగి రమేష్‌పై అక్రమ కేసు పెట్టింది.👉అయితే, ఇప్పటికే నకిలీ మద్యం విషయంలో సీబీఐ విచారణ జరపాలని జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ వేసిన వెంటనే జోగి రమేష్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకోవడం విశేషం. కాగా, ఏ1 జనార్థనరావు రిమాండ్ రిపోర్టులో జోగి రమేష్ ప్రస్తావన లేకపోవడం ఈ కేసులో కీలక పరిణామం. జనార్థనరావు జైలుకి వెళ్లాక కుట్ర పూరితంగా ఓ వీడియో విడుదల చేశారు. పోలీసుల అదుపులో ఉన్నప్పుడు వీడియో రికార్డింగ్ చేసి ఎల్లో మీడియా, టీడీపీ ఆఫీస్ ద్వారా వీడియోను బయటకు వదిలారు.👉కాగా, నకిలీ లిక్కర్ డాన్ జనార్థనరావు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. జనార్థనరావుతో టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఆయన బావమరిదికి సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో టీడీపీ ఎమ్మెల్యే వసంతను జనార్థనరావు కలిశారు. జనార్థనరావు సమక్షంలోనే తంబళ్లపల్లె జయచంద్రారెడ్డికి చంద్రబాబు బీఫామ్ కూడా ఇచ్చారు. చంద్రబాబుతో ఏ1 జనార్థనరావు దిగిన ఫొటోలు సైతం బయటకు వచ్చాయి. కాగా, నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతలను తప్పించి కూటమి సర్కార్ వైఎస్సార్సీపీ నేతలపైకి కేసు డైవర్షన్ చేసింది. సీఎం చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టిన తర్వాత జోగి రమేష్ పేరు తెరపైకి తెచ్చారు. సిట్ వేసిన వెంటనే జనార్థనరావు వీడియోను విడుదల చేశారు. ఎల్లో స్క్రిప్ట్ ప్రకారం నకిలీ లిక్కర్ విచారణ కట్టుకథను అమలు చేస్తున్నారు. ఇక, మద్యం ఫ్యాక్టరీ పెట్టిన టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని, ఆయన బావ మరది గిరిధర్ రెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. -
Jogi Ramesh: లోకేష్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు
-
‘చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకో’
సాక్షి,అమరావతి: చంద్రబాబు,నారా లోకేష్‌ను ప్రశ్నిస్తే తనపై దుష్ప్రచారం చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. కూటమి సర్కార్ తనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. శుక్రవారం (అక్టోబర్31) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీని బాహ్య ప్రపంచానికి చూపించాను.చంద్రబాబు,నారా లోకేష్‌ను ప్రశ్నిస్తే తనపై దుష్ప్రచారం చేశారు. కల్తీ మద్యం కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాను. నార్కో ఆనాలసిస్ టెస్ట్‌కు సిద్ధమే. నేను ఏ తప్పు చేయలేదని దుర్గమ్మ సాక్షిగా కుటుంబసభ్యులతో కలిసి ప్రమాణం చేశా. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చట్టాన్ని, వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకుంటారా? గన్నవరం ఎయిర్‌పోర్టులో జనార్ధన్ రావుకు రెడ్‌కార్పెట్ వేసి స్వాగతం పలికారు. రిమాండ్‌లో ఉన్న జనార్ధన్‌రావు వీడియోని ఎవరు విడుదల చేశారని ప్రశ్నించారు. -
చంద్రబాబూ, లోకేశ్ ప్రమాణానికి మీరు సిద్ధమా?
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): నకిలీ మద్యంతో తనకు ఎలాంటి సంబంధం లేదని దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని.. ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ సిద్ధమా అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ సవాల్ విసిరారు. పది రోజుల కిందటే సత్య ప్రమాణానికి రావాలని చంద్రబాబు, లోకేశ్‌ను కోరినా రాలేదని ఎద్దేవా చేశారు. భగవద్గీతపై ప్రమాణం చేయాలని కోరినా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా వారు సత్యప్రమాణానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. నకిలీ మద్యంతో తనకు ఎలాంటి సంబంధం లేదని నార్కోఎనాలసిస్, లైడిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు.‘బెజవాడ దుర్గమ్మ, కృష్ణమ్మ సాక్షిగా చెబుతున్నా. నిబద్ధత, నిజాయితీ, నిండు మనస్సుతో చెబుతున్నా. నకిలీ మద్యం కేసులో నా ప్రమేయం లేదు. నేను ఏ తప్పూ చేయలేదు. నాపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం’ అని జోగి రమేష్ స్పష్టం చేశారు. కనకదుర్గమ్మ కొలువుదీరిన ఇంద్రకీలాద్రికి జోగి రమేష్ సోమవారం కుటుంబ సమేతంగా వచ్చారు. తొలుత దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఘాట్‌రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్దకు వచ్చారు. అక్కడ జోగి రమేష్ తన చేతిలో కర్పూరం వెలిగించుకుని నకిలీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని సత్యప్రమాణం చేశారు. ‘నకిలీ మద్యం కేసులో ఆరోపణలు నా హృదయాన్ని గాయపరిచాయి. నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. నా వ్యక్తిత్వాన్ని కించపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నా. నాపై సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ కక్షగట్టారు. ఎక్కడో జరిగిన అంశాన్ని నాకు అంటగడుతున్నారు’ అని జోగి రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి సంబంధం ఉందో ఆ మంత్రికే తెలుసు ‘ఎవడో ఇబ్రహీంపట్నంలో పుట్టినవాడు చెప్పింది విని నకిలీ మద్యం కేసులో నన్ను దోషి అంటున్నారు. కానీ రిమాండ్ రిపోర్టులో నా పేరు లేదు. నకిలీ మద్యం వ్యవహారంతో ఎవరికి సంబంధం ఉందో జనార్దనరావుకు ఎయిర్‌పోర్టులో రెడ్ కార్పెట్ వేసిన మంత్రికి తెలుసు. నేను తప్పు చేశానని సిట్ అధికారులు నిరూపిస్తే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా. నన్ను రాజకీయంగా దెబ్బకొట్టండి. కానీ నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయవద్దు. ఎంత బెదిరించినా రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో చంద్రబాబుపై పోరాటాన్ని ఆపేది లేదు’ అని జోగి రమేష్ స్పష్టం చేశారు -
తప్పు చేసానని నిరూపిస్తే.. చావడానికైనా సిద్ధం
-
దుర్గమ్మ సాక్షిగా జోగి రమేష్ ప్రమాణం
-
దుర్గమ్మ సన్నిధిలో జోగి రమేష్ సత్యప్రమాణం
సాక్షి, విజయవాడ: నకిలీ మద్యం కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అన్నంత పని చేశారు. విజయవాడ కననదుర్గమ్మ అమ్మవారి ఎదుట సత్యప్రమాణం చేశారు. సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి చేరుకున్న ఆయన.. ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద చేతిలో దివ్వెను వెలిగించుకుని ఈ వ్యవహారంలో తనకే సంబంధం లేదని అన్నారు.నా వ్యక్తిత్వంపై నింద వేశారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూశారు. నా మనసును బాధ పెట్టారు. అందుకే కుటుంబంతో సహా వచ్చా. నేను ఏ తప్పు చేయలేదని నిండు మనసుతో అమ్మవారి ఎదుట ప్రమాణం చేశా. నా కుటుంబాన్ని అవమానపరిచి నా హృదయాన్ని గాయపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మని కోరుకున్నా. నేను ఏ తప్పు చేయను చేయలేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి బెజవాడ దుర్గమ్మ పై ప్రమాణానికి నేను సిద్ధమని నేను చెప్పాను. ఆ సవాలకు కట్టుబడి నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేశారు. నకిలీ మద్యం కేసులో నార్కో అనాలసిస్ టెస్ట్ , లై డిటెక్టర్ టెస్ట్ కు నేను సిద్ధం అని అన్నారాయన. ‘‘నకిలీ మద్యం కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఏం చెబుతారు?. నాపై తప్పుడు ఆరోపణలు చేసినవాళ్లు సత్యప్రమాణానికి సిద్ధమా?. పోనీ.. లైడిటెక్టర్ టెస్టుకైనా వచ్చే దమ్ముందా?. కనక దుర్గమ్మ సాక్షిగా వాళ్లు నేను తప్పు చేసినట్లు నిరూపించాలి’’ అని జోగి రమేష్ మరోమారు సవాల్ విసిరారు. -
కొలికపూడి, కేశినేని చిన్ని గొడవపై జోగి రమేష్ రియాక్షన్
-
పవన్ కళ్యాణ్ సిగ్గుపడు.. జగన్ గొప్పతనం గురించి మీ అన్నను అడుగు చెప్తాడు
-
మైలవరం లోనే ఉంటా.. మీకు దమ్ముంటే.. కూటమిపై జోగి రమేష్ ఫైర్
-
నీ రాక్షసానందం కోసం ఎంతకు దిగజారిపోయావు బాబు..
-
‘లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధం.. ఎక్కడికి రమ్మన్నా వస్తా’
హైదరాబాద్: నకిలీ మద్యం, నకిలీ సారాలో చంద్రబాబు సర్కార్ మునిగిపోయిందని విమర్శించారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్. ఫేక్ ప్రభుత్వం,. ఫేక్ బాబు, ఫేక్ లోకేష్.. కట్టు కథలు, పచ్చి అబద్ధాలు ఇవే టీడీపీ ప్రభుత్వం చేస్తుందని ధ్వజమెత్తారు. ఈరోజు(ఆదివారం, అక్టోబర్ 19వ తేదీ) హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్మీట్లో మాట్లాడిన జోగి రమేష్.. చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘బాబు చేసిన కల్తీని వైఎస్సార్సీపీపై రుద్దే యత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం చేసే ఐవిఆర్ఎస్ కాల్స్ ను నకిలీ మద్యం కోసం టీడీపీ వాడుతుంది. నకిలీ మద్యం ఎక్కడ తయారయింది... ఎక్కడకు సరఫరా అయిందో ఎందుకు ఎంక్వరీ చేయడం లేదు.డైవర్షన్ కోసం చంద్రబాబు ప్రభుత్వం మాపై విమర్శలు చేస్తుంది. అద్దెపల్లి జనార్థన్‌కు రెడ్ కార్పెట్ వేసింది టీడీపీ ప్రభుత్వమే. అద్దెపల్లి జనార్థన్, టీడీపీ కుమ్మక్కయ్యాయి. ఏ విచారణకైనా సిద్ధమని చెప్పినా ప్రభుత్వం నంచి స్పందనలేదు. జైలుకు పంపించి రాక్షసానందం పొందడం బాబుకు అలవాటు. దమ్ముంటే నాకు లై డిటెక్టర్ టెస్ట్ చేయండి. ప్రభుత్వం ఎక్కడికి రమ్మన్నా.. వస్తా. ఏపీలో మంచినీటి ుకుళాయిల కన్నా.. బెల్ట్ షాపులే ఎక్కువ. నారా వారి సారా పాలనను డోర్ డెలివరీ చేస్తున్నారు’ అని మండిపడ్డారు. -
నకిలీ మద్యం కేసులో ఉన్నది లోకేష్, ఎంపీ: దేవినేని అవినాష్
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకులు దేవినేని అవినాష్. తప్పుడు కేసులతో బీసీ నాయకుడు జోగి రమేష్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంటూ ఆరోపించారు. నకిలీ మద్యంలో ఉన్నదంతా టీడీపీ పార్టీ నేతలే అని చెప్పుకొచ్చారు. నకిలీ మద్యం వ్యవహారంలో లోకేష్, మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.జోగి రమేష్ ను కలిసిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్(Devineni Avinash) గురువారం ఉదయం జోగి రమేష్‌ను(Jogi Ramesh) కలిశారు. ఈ క్రమంలో ఆయనపై టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. అనంతరం, దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో 15 నెలలుగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులతో జోగి రమేష్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వ నీచ రాజకీయాలను జోగి రమేష్ ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. జోగి రమేష్‌కు వైఎస్సార్సీపీ పూర్తి అండగా ఉంటుంది. నకిలీ మద్యం వ్యవహారంలో సీబీఐ ఎంక్వైరీ వేయాలని జోగి రమేష్ ధైర్యంగా అడిగారు. తనపై వస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. నకిలీ మద్యంలో ఉన్నదంతా టీడీపీ నేతలే. నకిలీ మద్యం వ్యవహారంలో లోకేష్(Nara Lokesh), మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ ఉన్నారు. జయచంద్రారెడ్డి, జనార్ధన్ రావు నెలనెలా మామూళ్లు చినబాబు, వసంత కృష్ణప్రసాద్, ఎంపీ చిన్నికి పంపించారు. టీడీపీ నేతలు దొరికిపోవడంతో వైఎస్సార్సీపీపై నీచ రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ పెట్టిన తప్పుడు కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటాం.పోలీసులు కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ సెక్షన్లను వైఎస్సార్సీపీ(YSRCP) నేతలపై పెడుతున్నారు. టీడీపీ తప్పుడు ప్రచారాలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీస్ కమిషనర్ కలవలేదు. అదే టీడీపీ నుంచి చోటా మోటా నేతలు వెళితే సీపీ వారిని కలిశాడు. పోలీస్ కమిషనర్ ప్రజల కోసం పనిచేస్తున్నారా? టీడీపీ నేతల కోసం పనిచేస్తున్నారా?. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదవుల కోసం బుద్ధా వెంకన్న ఆరాటపడుతున్నాడు. వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు చేస్తే పదవులు వస్తాయని బుద్ధా వెంకన్న అనుకుంటున్నాడు అని ెసెటైరికల్ కామెంట్స్ చేశారు. -
Jogi: సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న అసత్య వార్తలపై YSRCP ఫిర్యాదు
-
చంద్రబాబు, లోకేష్‌కు జోగి రమేష్ సవాల్
సాక్షి, విజయవాడ: తనపై వస్తున్న ఫేక్ వార్తలపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఆయన వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జనార్థన్‌తో బలవంతంగా తన పేరు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘లై డిటెక్టర్ టెస్టుకు రెడీ అని సవాల్ చేసి రెండ్రోజులవుతోంది. మళ్లీ చెబుతున్నా లై డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ.. చంద్రబాబు, లోకేష్ రెడీనా?. చంద్రబాబు మరి ఇంత దారుణంగా దిగజారిపోయాడు. రిమాండ్‌లో ఉన్న జనార్థన్‌రావుతో వీడియో రికార్డ్ చేశారు. బలహీనవర్గానికి చెందిన నన్ను జైల్లో వేయాలని చూస్తున్నారు. నేను ఎక్కడికి పారిపోలేదు. ఇబ్రహీంపట్నం నడిబొడ్డున ఉండి మాట్లాడుతున్నా.. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు’’ అని జోగి రమేష్ నిప్పులు చెరిగారు. -
ఫేక్ గాళ్ల కుట్రలు.. లై డిటెక్టర్ టెస్టుకి రెడీ: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడు జనార్దన్‌రావుతో తనకు సంబంధాలు ఉన్నట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ సీఎం చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. ఈ విషయంలో చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన విషయం తనకు లేదని.. అయితే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో లై డిటెక్టర్ పరీక్షలకు కూడా తాను సిద్ధమని అన్నారాయన. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నారావారి సారాను చంద్రబాబు ఏరులై పారిస్తున్నారు. టీడీపీ నేతలు నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమల్లా నడిపిస్తున్నారు. టీడీపీ నేత జనార్దన్‌రావుతో నేను ఎలాంటి చాటింగ్ చేయలేదు. అది నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని జోగి రమేష్ అన్నారు. తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గమ్మ మీద కూడా ప్రమాణం చేస్తా. చంద్రబాబు ఇంట్లో కూడా ప్రమాణానికి నేను సిద్ధం. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయడానికి వస్తారా?. అవసరమైతే సత్య శోధన పరీక్ష(లై డిటెక్టర్)కు నేను సిద్ధం. నా సవాల్‌ను చంద్రబాబు స్వీకరిస్తారా? అని జోగి రమేష్ నిలదీశారు.నా ఫోన్ ఇస్తా చంద్రబాబు, లోకేష్ చెక్ చేస్కోండి. ఓ గౌడ కులస్థుడి మీద దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. నీది ఓ బతుకేనా చంద్రబాబు?నా పేరు రిమాండ్ రిపోర్టులో ఉందా?.. ఫేక్ గాళ్లు కుట్రలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారాయన.ఇదీ చదవండి: బాబు డైరెక్షన్.. జనార్దన్ యాక్షన్! -
నా భార్య పిల్లలతో నీ ఇంటికి వస్తా.. నువ్వు, నీ కొడుకు సిద్ధమా..?
-
Jogi Ramesh: నాపై దాడికి ప్లాన్..!
-
జోగి రమేషే ఎందుకు? అనలిస్ట్ పాషా సంచలన నిజాలు
-
చంద్రబాబు డైరెక్షన్‌తోనే జనార్దనరావుతో వీడియో రికార్డింగ్
రాజమహేంద్రవరం రూరల్: నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఇందులో భాగంగానే ఈ కేసులో అరెస్టయి, రిమాండులో ఉన్న నిందితుడు అద్దేపల్లి జనార్దనరావుతో వైఎస్సార్సీపీ నేత, మాజీమంత్రి జోగి రమేష్ పేరును చెప్పిస్తూ వీడియో లీక్ చేయించారని అన్నారు. సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.మంగళవారం రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో వేణు మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ మద్యం కేసులో టీడీపీ నాయకులు వరుసగా అరెస్టవుతున్నా, సిగ్గు లేకుండా వైఎస్సార్సీపీకి ఈ బురద అంటించాలనే కుట్రతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారని, దీంతో భయపడ్డ చంద్రబాబు దీనిని డైవర్ట్ చేయడానికే జోగి రమేష్ పేరును తెరపైకి తీసుకువచ్చారన్నారు. హడావుడిగా మీడియా సమావేశం నిర్వహించి ‘దీనిలో కుట్రకోణం ఉంది.దాని కోసం సిట్ వేశాను. కొత్త పాత్రలను ప్రజలకు చూపిస్తాను’ అన్నట్టుగా చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ వెంటనే జనార్దనరావు వీడియో విడుదలైందన్నారు. జోగి రమేష్ చెప్తేనే తాను నకిలీ మద్యం రాకెట్ నడిపించానంటూ ఈ వీడియోలో అతడు ఆరోపించాడన్నారు. సీఎం తన అనుకూల అధికారులతో వేసిన సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరగదని స్పష్టం చేశారు. ఈ సందేహాలకు బాబే జవాబు చెప్పాలి ‘జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జనార్దనరావు వీడియో ఎలా రికార్డ్ చేశాడు? అంతకుముందే ఆయన తన ఫోన్ పోయిందని పోలీసులకు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఫోన్‌లేని వ్యక్తి వీడియో ఎలా రికార్డ్ చేశాడు? జుడీషియల్ రిమాండ్‌లో ఉండే ఈ వీడియో రికార్డ్ చేశాడని భావించినా, ఆయనను విచారించే అధికారులు చుట్టూ ఉంటారు. ఆయన నిలబడి, వినమ్రతతో మాట్లాడతాడు. కానీ.. ఈ వీడియో చూస్తే ఆయన చాలా స్వేచ్ఛగా కుర్చీలో కూర్చుని ఉన్నట్టు, పక్కనుంచి ప్రాంప్టింగ్ తీసుకుంటూ మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రికార్డ్ చేసిన వీడియోగా కూడా దీనిని భావించే పరిస్థితి కనిపించడం లేదు.అందువల్ల జనార్దనరావుతో ఉద్దేశపూర్వకంగానే కావాల్సిన విధంగా చెప్పించి, వీడియో చిత్రీకరించినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సందేహాలకు చంద్రబాబే సమాధానం చెప్పాలి’ అని వేణు అన్నారు. జైలులో రిమాండులో ఉన్న వ్యక్తి వీడియో రికార్డ్ చేసి, బయటకు విడుదల చేశారంటే, దీనికి ఏ అధికారి బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. జోగి రమేష్ కు జనార్దనరావు సన్నిహితుడంటూ ఓ కట్టుకథ అల్లారన్నారు. 2024లో తంబళ్లపల్లి టీడీపీ అభ్యరి్థగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు బి–ఫామ్ ఇచ్చిన సమయంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బదులు జనార్దనరావు ఉన్నాడన్నారు.ఈ ఫొటోలు కూడా అన్ని పత్రికల్లోనూ వచ్చాయన్నారు. దీనినిబట్టి జనార్దనరావు ఎవరికి అత్యంత సన్నిహితుడో ప్రజలే అర్థం చేసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వ పెద్దల అండ, భరోసా లేకపోతే అంత ధీమాగా ఒక కేసులో నిందితుడు ఆఫ్రికా నుంచి ఆవిధంగా వస్తాడా అని ప్రశ్నించారు. తొలుత ఆయన ఆఫ్రికా నుంచి విడుదల చేసిన వీడియోలో నకిలీ మద్యం వ్యవహారంలో ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదని చెప్పాడన్నారు. రిమాండ్‌కు వెళ్లిన తరువాత జనార్దనరావు మాట ఎలా మారిందని ప్రశ్నించారు. -
ఈ ప్రశ్నలకు జవాబేది?
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా కలకలం రేపిన నకిలీ మద్యం రాకెట్ వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే విషయం బట్టబయలు కావడంతో ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే యత్నాలు ముమ్మరమయ్యాయి. ప్రభుత్వ పెద్దలు, పోలీసులు.. ఇద్దరూ కలిసిపోయి సాగిస్తున్న నాటకాలు, కుతంత్రాలే అసలు కుట్రను బట్టబయలు చేస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి అందరి చూపులు.. అన్ని వేళ్లూ టీడీపీ వైపే చూపుతున్న నేపథ్యంలో పలు కీలక ప్రశ్నలకు సమాధానం కరువైంది. నకిలీ మద్యం మాఫియాపై ప్రభుత్వంగానీ, పోలీసులుగానీ సూటిగా సమాధానం చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ కేసు దర్యాప్తులో ప్రధానంగా కింది ప్రశ్నలకు పోలీసులు, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ⇒ ఏ1 జనార్దన్‌రావును అరెస్టు చేసి విచారించిన తరువాతే న్యాయ స్థానంలో హాజరు పరిచారు. పోలీసులు తమ విచారణలో వెల్లడైన విషయాలతో రిమాండ్ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. ఆ రిమాండ్ నివేదికలో ఎక్కడా వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ పేరును ప్రస్తావించనే లేదు. జనార్దన్‌రావుకు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు. మరి 24 గంటల తరువాత జోగి రమేష్ పేరు చెబుతూ జనార్దన్‌రావు వీడియో బయటకు రావడం వెనుక దాగిన గుట్టు ఏమిటి? నిజంగా జోగి రమేష్ పేరును ఆయన చెప్పి ఉంటే ఆ విషయాన్ని న్యాయ స్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలోనే వెల్లడించే వారు కదా! మరి ఆ వీడియో కుట్ర వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? ⇒ ప్రభుత్వ ఆదేశాలతోనే ఎక్సైజ్ అధికారులు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం గోడౌన్లో సోదాలు చేసి జప్తు చేశారని సీఎం చంద్రబాబు చెప్పారు. తమ ప్రభుత్వమే చేయించిందని ఆయన గొప్పగా చెప్పుకున్నారు. కానీ జనార్దన్‌రావుతో చెప్పించిన వీడియోలో అందుకు పూర్తి విరుద్ధంగా ఎందుకు ఉంది? టీడీపీ కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే జోగి రమేష్ ఆదేశాలతో నకిలీ మద్యాన్ని తెప్పించి.. అనంతరం ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చి దాడులు చేయించారని జనార్దన్‌రావుతో ఎందుకు చెప్పించారు? నకిలీ మద్యం దందాలో టీడీపీ పెద్దల పాత్రను కప్పిపుచ్చేందుకే ఈ కట్టు కథలతో అడ్డంగా దొరికారన్నది నిజం కాదా? ⇒ విదేశాలకు వెళ్లిపోతే తనకు రూ.3 కోట్లు ఇస్తామని వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ఆఫర్ ఇచ్చారంటూ ఏ1 జనార్దన్‌రావుతో ప్రభుత్వ పెద్దలు వీడియో ద్వారా చెప్పించారు. మరి అంతలోనే ఆయన ఎందుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు? తన తమ్ముడిని పట్టించుకోవడం లేదని మరో కట్టు కథ ఎందుకు చెబుతున్నారు? అంటే జోగి రమేష్ రూ.3 కోట్లు ఇస్తానన్నట్లు వీడియోలో ఆయన చెప్పింది పూర్తిగా అవాస్తవమే కదా.. ఈ లెక్కన ప్రభుత్వ పెద్దల పన్నాగంలో భాగంగానే ఆయన రాష్ట్రానికి వచ్చి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నది వాస్తవం కాదా? ⇒ ములకలచెరువు నకిలీ మద్యం కేసులో అరెస్టు చేసిన వారిని 24 గంటల్లోనే పోలీసులు కస్టడీలో విచారించేందుకు న్యాయస్థానాన్ని అనుమతి కోరారు. మరి ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్దన్‌రావును కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు ఎందుకు భావించడం లేదు? ⇒ ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న జనార్దన్‌రావును విదేశాల నుంచి రాష్ట్రానికి రప్పించిన ప్రభుత్వ పెద్దలు.. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డిని ఎందుకు రాష్ట్రానికి రప్పించడం లేదు? లుక్ అవుట్ నోటీసు జారీలో తాత్సారం ఎందుకు? ఆయన అరెస్టుకు ఎందుకు యత్నించడం లేదు? ⇒ అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం యూనిట్ నుంచి నకిలీ మద్యాన్ని పాల వ్యానుల ద్వారా సరఫరా చేసినట్టు వెల్లడైంది. ఆ వ్యానులు టీడీపీ నేతలవే. ఎనీ్టఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, అనకాపల్లి జిల్లా రాంబిల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి కూడా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక వాహనాల్లో నకిలీ మద్యాన్ని సరఫరా చేశారు. ఆ వాహనాలు ఎవరివి అన్నది పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు? వాటిని జప్తు చేయకుండా పోలీసులను అడ్డుకుంటున్న పెద్దలు ఎవరు? ⇒ నకిలీ మద్యం దందా బయటపడిన తరువాత కూడా రాష్ట్రంలో దాదాపు 75 వేల బెల్టు దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు ఎందుకు దాడులు చేయడం లేదు? బెల్ట్ దుకాణాల్లో విక్రయిస్తున్న మద్యాన్ని ఎందుకు జప్తు చేయడం లేదు? దాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌లకు ఎందుకు పంపడం లేదు? ⇒ రాష్ట్రంలో అసలు నకిలీ మద్యమే లేదని.. మద్యం దుకాణాల్లో నకిలీ సరుకు అమ్మడమే లేదని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మరి అంతలోనే ఎందుకు ‘ఏపీ ఎక్సైజ్ యాప్’ను ప్రవేశ పెట్టారు? నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఆ యాప్‌పై అవగాహన కల్పించాలని ఎందుకు చెబుతున్నారు? అంటే టీడీపీ సిండికేట్ మద్యం దుకాణాల్లో నకిలీ మద్యం విక్రయిస్తున్నారని అధికారికంగా అంగీకరించినట్లే కదా? ⇒ టీడీపీ నేతల కుటుంబాలకు చెందిన డిస్టిలరీలు, టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న మద్యం దుకాణాలు, బార్లలో ఎందుకు తనిఖీలు చేయడం లేదు? అంటే నకిలీ మద్యం కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి ప్రభుత్వ పెద్దలు తప్పించుకోవాలని యతి్నస్తున్నట్లు కాదా? ⇒ నకిలీ మద్యం దందాతో ప్రభుత్వ పెద్దలకు సంబంధం లేకపోతే డైవర్షన్ డ్రామాలు ఎందుకు? ఏ1 జనార్దనరావుతో గుర్తు తెలియని ప్రదేశంలో ఓ వీడియో షూట్ చేయించడం ఎందుకు? కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో ఆ వీడియో గురించి ఎందుకు ప్రస్తావించ లేదు? ఆ వీడియో డ్రామా బెడిసి కొట్టగానే.. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి నివాసంలో సిట్ సోదాలతో హడావుడి ఎందుకు? ఇవన్నీ ఈ కేసు దర్యాప్తు నుంచి ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడలు కావా? -
డైవర్షన్ డ్రామా అట్టర్ ఫ్లాప్
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం అవినీతి కూపంలో నిలువెల్లా కూరుకుపోయిన టీడీపీ పెద్దలు సరికొత్త డైవర్షన్ కుతంత్రాలకు పదును పెడుతున్నారు. బరి తెగించి నకిలీ మద్యం దందాకు పాల్పడిన వారే ఆ బురదను అందరికీ అంటించే కుట్రలు పన్నుతున్నారు. అందుకోసం టీడీపీ పెద్దల డైరెక్షన్లో చిత్రీకరించిన ‘పొలిటికల్ సోషియో ఫాంటసీ’ కుట్ర ఇప్పటికే బెడిసికొట్టింది. వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్‌పై దు్రష్పచారం చేసేందుకు పన్నిన కుతంత్రం ఫలించ లేదు. దాంతో మరోసారి టీడీపీ వీర విధేయ సిట్‌ను రంగంలోకి దించి తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి నివాసం, కార్యాలయాల్లో సోదాల పేరిట హడావుడి చేయించారు. టీడీపీ సిండికేట్ కల్తీ మద్యం మాఫియా బాగోతం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ చౌకబారు ఎత్తుగడ వేసినట్లు స్పష్టమవుతోంది. తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి ద్వారా వైఎస్సార్ సీపీ నేత పెద్దిరెడ్డి ఇదంతా చేయించారంటూ తొలుత ఎల్లో మీడియా రంకెలేసింది! అయితే తమ దాడులతోనే నకిలీ మద్యం రాకెట్ బయట పడిందని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఇక ఇప్పుడు వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ఇదంతా చేయించారంటూ జనార్ధన్రావుతో ప్రభుత్వ పెద్దలు చిలుక పలుకులు వల్లె వేయించారు. నిజానికి పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో జోగి రమేష్ పేరు ఎక్కడా లేదు. మరి 24 గంటల తరువాత జోగి రమేష్ పేరు చెబుతూ జనార్ధన్‌రావు వీడియో బయటకు రావడం వెనుక లోగుట్టు ఏమిటి? ఆ వీడియో కుట్ర వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాగా నకిలీ మద్యం పాపం వైఎస్సార్‌సీపీదేనని ప్రచారం చేయాలంటూ కూటమి ఎంపీలతో ఢిల్లీలో సమావేశం సందర్భంగా చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. సోషియో ఫాంటసీ కుట్ర అట్టర్ ఫ్లాప్ టీడీపీ పెద్దలే సూత్రధారులుగా పచ్చ సిండికేట్ సాగిస్తున్న నకిలీ మద్యం రాకెట్ కేసును పక్కదారి పట్టించేందుకు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. అడ్డంగా దొరికిపోయిన ప్రతిసారీ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడే ప్రభుత్వ పెద్దలు ఈసారి మరీ చౌకబారు ఎత్తుగడ వేసి నవ్వుల పాలయ్యారు. డైవర్షన్ కుట్రలో భాగంగానే ఈ కేసులో ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్‌రావుతో చెప్పించిన వీడియో టీడీపీ పెద్దల నేలబారు రాజకీయాన్ని బయటపెట్టింది. ఏం చెప్పాలో పోలీసులే పక్కనుంచి ప్రాంప్టింగ్ అందిస్తుండగా.. జనార్దన్‌రావు వల్లె వేసిన మాటలను చిన్నపిల్లలు కూడా నమ్మడం లేదన్నది స్పష్టమైంది. ఎల్లో మీడియా ద్వారా విడుదల చేసిన వీడియో డ్రామా టీడీపీ పెద్దల దిగజారుడుతనాన్ని బయటపెట్టింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు జనార్దన్‌రావుతో నిబంధనలకు విరుద్ధంగా వీడియో రికార్డ్ చేయించి విడుదల చేశారన్నది నిగ్గు తేలింది. అంతేకాదు.. ములకలచెరువులో బయటపడిన నకిలీ మద్యం మాఫియా రాష్ట్రమంతా విస్తరించిందన్నది తేటతెల్లమైంది. టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, జనార్దన్ కేవలం పాత్రధారులేనని, ఈ వ్యవస్థీకృత దోపిడీకి కర్త, కర్మ, క్రియ అంతా ప్రభుత్వ పెద్దలేనన్నది రూఢీ అయ్యింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జనార్దన్ ఏర్పాటు చేసిన నకిలీ మద్యం ప్లాంట్‌లో యంత్రాలు, క్యాన్లు (ఫైల్) సిట్ ద్వారా మరో డైవర్షన్ డ్రామా... ఏ 1 జనార్దన్‌రావు వీడియో డ్రామా ఎపిసోడ్ బెడిసికొట్టడంతో ప్రభుత్వ పెద్దలు వెంటనే మరో కుట్రకు పదును పెట్టారు. ఏడాదికిపైగా రెడ్‌బుక్ రాజ్యాంగ కుట్రలు అమలు చేస్తున్న తన సిట్‌ను రంగంలోకి దింపారు. వీడియో డ్రామా ద్వారా జోగి రమేష్‌ను లక్ష్యంగా చేసుకుని భంగపడ్డ టీడీపీ పెద్దలు.. ఈసారి సిట్ ద్వారా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై గురి పెట్టారు. ఐక్యరాజ్య సమితి సదస్సుల్లో పాల్గొనే భారత పార్లమెంటరీ బృందంలో సభ్యుడిగా మిథున్‌రెడ్డి అమెరికాలో పర్యటించేందుకు అనుమతి కోరుతూ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రానున్న తరుణంలో డైవర్షన్‌తో మరోసారి కుట్రలకు తెర తీశారు. మిథున్‌రెడ్డి కుటుంబానికి చెందిన తిరుపతి, హైదరాబాద్‌లలోని నివాసాలు, కార్యాలయాల్లో సిట్ అధికారులు మంగళవారం సోదాలతో హడావుడి చేశారు. ఆయన కుటుంబ సభ్యులు, కంపెనీ ప్రతినిధులను విచారించారు. వాస్తవానికి మద్యం విధానంపై అక్రమ కేసులో ఆయన్ను గతంలోనే అరెస్టు చేసి కస్టడీకి కూడా తీసుకుని విచారించారు. ఆ అక్రమ కేసులో సిట్ అధికారులు ఎటువంటి ఆధారాలు సాధించలేకపోయారు. ఈ నేపథ్యంలో మిథున్‌రెడ్డికి న్యాయస్థానం బెయిల్ కూడా మంజూరు చేసింది. ఇక ఈ కేసులో ఆయన్నుగానీ పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రతినిధులనుగానీ విచారించేందుకు ఏమీ లేదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. డిస్టిలరీల మాటున నకిలీ దందా.. ఆధారాలతో సహా బట్టబయలైన నకిలీ మద్యం మాఫియాకు ప్రభుత్వ పెద్దలు వత్తాసు పలుకుతూ పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయకుండా కట్టడి చేస్తున్నారు. అసలు నకిలీ మద్యం తయారీకి అవసరమైన ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్) ఎక్కడి నుంచి సరఫరా అయిందన్న అంశంపై పోలీసులు దృష్టి పెట్టకపోవడమే అందుకు నిదర్శనం. ఎందుకంటే.. అత్యంత ప్రమాదకరమైన ఆ స్పిరిట్‌ను కొనుగోలు చేసేందుకు మద్యం డిస్టిలరీలు, రసాయన పరిశ్రమలకే అనుమతి ఉంది. ఆ స్పిరిట్‌లో 100 శాతం ఉండే ఆల్కహాల్‌ను 42 శాతం లోపు తగ్గించి మనుషులు వినియోగించే మద్యాన్ని తయారు చేసే సామర్థ్యం డిస్టిలరీలకే ఉంటుంది. మరి టీడీపీ సిండికేట్ ములకలచెరువుతోపాటు అనకాపల్లి, పాలకొల్లు, ఇతర ప్రాంతాల్లో నెలకొల్పిన నకిలీ మద్యం యూనిట్లకు స్పిరిట్ ఎక్కడ నుంచి సరఫరా జరిగింది? అనేది అత్యంత కీలకంగా మారింది. అంటే.. డిస్టిలరీలే ఆ స్పిరిట్‌ను కొనుగోలు చేసి అక్రమంగా నకిలీ మద్యం యూనిట్లకు సరఫరా చేశాయని ఎక్సైజ్ వర్గాలే అనధికారికంగా వెల్లడిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో డిస్టిలరీలన్నీ టీడీపీ సీనియర్ నేతల కుటుంబాలకు చెందినవే. వాటిలో తనిఖీ చేసి రికార్డులు పరిశీలిస్తే మొత్తం బండారం బయటపడుతుంది. అందుకే ఆ డిస్టిలరీలవైపు కన్నెత్తి చూడవద్దని ప్రభుత్వ పెద్దలు పోలీసు, ఎక్సైజ్ శాఖలను ఆదేశించినట్లు తెలుస్తోంది. తద్వారా నకిలీ మద్యం మాఫియా వెనుక ఉన్న టీడీపీ బడా బాబుల బండారం బయటపడకుండా అడ్డుకట్ట వేస్తున్నారన్నది సుస్పష్టం. నకిలీ మద్యం దందాతో అమాయకుల ప్రాణాలను హరిస్తుండటంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతున్న నేపథ్యంలో టీడీపీ పెద్దలు ఇలా డైవర్షన్ డ్రామాలతో కుట్రలకు తెర తీస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనార్దన్‌రావు ఇంట్లో సోదాలు ఇబ్రహీంపట్నం : నకిలీ మద్యం నిందితుడు జనార్దనరావు, ఆయన సోదరుడు జగన్మోహనరావు ఇళ్లల్లో పోలీసులు మంగళవారం రాత్రి సోదాలు నిర్వహించారు. పోలీసులను వారి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. గంటపాటు మంతనాల తర్వాత లోపలకు అనుమతించారు. మూడు గంటలపాటు పోలీసులు సోదాలు చేశారు.ఎంపీ మిథున్‌రెడ్డిపై మళ్లీ కక్ష సాధింపుసాక్షి, అమరావతి/తిరుపతి : మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ వేధింపులు కొనసాగిస్తోంది. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కుటుంబ వ్యాపార సంస్థ పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కార్యాలయాల్లో సిట్ అధికారులు మంగళవారం హల్చల్ చేశారు. హైదరాబాద్, తిరుపతిలోని ఆయన నివాసం, కార్యాలయాలకు వెళ్లిన సిట్ బృందాలు ఎంపీ మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులు, కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించారు. పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాలకు సంబంధించిన వివరాలు చెప్పాలంటూ పదే పదే అడిగినట్లు సమాచారం. తిరుపతిలోని ఎంపీ మిథున్‌రెడ్డి నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయన తల్లి పెద్దిరెడ్డి స్వర్ణలత వాంగ్మూలం నమోదు చేశారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు ఇప్పటికే అనేకసార్లు విచారించారు. జుడీషియల్ రిమాండ్‌లో ఉన్నప్పుడు కూడా కస్టడీకి తీసుకుని సిట్ విచారించింది. ఆయనపై అభియోగాలకు ఆధారాలు లేవని న్యాయస్థానం అభిప్రాయపడి బెయిల్ మంజూరు చేసింది. కానీ ఎంపీ మిథున్ రెడ్డిపై కక్ష సాధింపుతోనే సిట్ మళ్లీ సోదాలు, విచారణ పేరుతో హడావుడి చేస్తోంది. కూటమి ప్రభుత్వ పెద్దల అండతో సాగుతున్న నకిలీ మద్యం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆయన కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారు. అందుకే మిథున్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. అమెరికా పర్యటనకు అనుమతి కోరుతూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్‌పై తీర్పు ఇచ్చే సమయంలో సిట్ సోదాలు చేపట్టడం సందేహాస్పదంగా మారింది. కాగా, ఎంపీ మిథున్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో సోదాలు, విచారణపై సిట్ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇంత జరిగినా.. ‘బెల్టు’ తీయరా..? జయచంద్రారెడ్డిని అరెస్టు చేయరా?రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నకిలీ మద్యం 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాతే మొదలైంది. ఏడాదిన్నరగా సాగుతున్న ఈ దోపిడీపై ఎక్సైజ్ శాఖ ఉదాసీనంగా వ్యవహరించడం అసలు గుట్టును బయటపెట్టింది. టీడీపీ పెద్దల కనుసన్నల్లో టీడీపీ సీనియర్ నేతలు ప్రాంతాలవారీ పర్యవేక్షకులుగా మారి పక్కాగా దోపిడీని వ్యవస్థీకరించిన తీరే అందుకు నిదర్శనం. ఇక ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాను రాష్ట్రానికి స్వయంగా తెచ్చింది తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి, టీడీపీ నేతలు సురేంద్ర నాయుడు, అద్దేపల్లి జనార్దన్రావులే కావడం గమనార్హం. ములకలచెరువు కేంద్రంగా మొదలైన ఈ మాఫియా ఏడాదిలో రాష్ట్రం అంతటా విస్తరించడం విస్మయపరుస్తోంది. అడ్డంగా దొరికిన తరువాత ఏ1 జనార్దన్‌రావుతో వీడియో డ్రామాకు యత్నించడం ప్రభుత్వ పెద్దల కుట్రను బట్టబయలు చేసింది. నకిలీ మద్యం మాఫియా కుట్రదారు, అంతిమ లబ్ధిదారు టీడీపీ పెద్దలేనన్న వాస్తవాన్ని ఎంతగా దాచాలని యత్నిస్తే.. అంతగా ఆ అవినీతి బాగోతం బట్టబయలవుతోంది. జనార్దన్‌రావును విదేశాల నుంచి ఆగమేఘాలపై రాష్ట్రానికి రప్పించిన టీడీపీ పెద్దలు.. జయచంద్రారెడ్డిని ఎందుకు రప్పించడం లేదు? ఆయన్ను అరెస్టు చేసేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు? అని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. నకిలీ మద్యం దందా బయటపడిన తరువాత కూడా రాష్ట్రంలో ఊరూరా విస్తరించిన దాదాపు 75 వేల బెల్టు షాపులను నిర్మూలించకపోవడం.. ప్రజల ప్రాణాలను హరిస్తూ అక్కడ విక్రయిస్తున్న నకిలీ మద్యాన్ని జప్తు చేయకపోవడం.. పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపకపోవటాన్ని బట్టి టీడీపీ పెద్దల అండదండలతోనే పచ్చముఠాలు నకిలీ దందాతో చెలరేగుతున్నట్లు స్పష్టమైందని పేర్కొంటున్నారు. -
‘కూటమి కల్తీ బురదను జోగి రమేష్‌కు పూయాలని చూస్తున్నారు’
ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ నేతల నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌పై చేస్తున్న కుట్రలపై వైఎస్సార్సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణులు ధ్వజమెత్తారు. కూటమి కత్తీ బురదను జోగి రమేష్‌కు పూయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం, అక్టోబర్ 14వ తేదీ) జోగి రమేష్‌ను వెల్లంపల్లి, మల్లాది విష్ణులు కలిశారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ.. ‘ రాష్ట్రప్రభుత్వం ప్రజలను కల్తీ మద్యంతో వేధిస్తోంది. 16 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది. చిత్తూరు నుంచి వెస్ట్ గోదావరి వరకూ ఎక్కడ చూసినా కల్తీ మద్యమే. టిడిపి అవినీతిని ప్రశ్నిస్తున్నారని తప్పుడు కేసులు పెడుతున్నారు. జోగి రమేష్‌ను ఇరికించాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కల్తీ మద్యంలో టిడిపి నేతల పాత్ర ఉంది. అఫిడవిట్లోనే డిస్టిలరీలు ఉన్నాయని జయచంద్రారెడ్డి చెప్పినప్పుడు మీ కళ్లు మూసుకుపోయాయా?’ అని ప్రశ్నించారు.మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘ కూటమి నేతల అసత్యాలను ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. బీసీ నేత పైన కావాలని కక్ష సాధిస్తున్నారు. కల్తీ మద్యానికి జోగి రమేష్‌కు ఏం సంబంధం?, జనార్ధన్ రావుతో వీడియో చేయించి జోగిరమేష్ పైన తోసేశారు. జోగి రమేష్ పై కక్షసాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కచ్చితంగా ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది’ అని విమర్శించారు. ‘ఎప్పటికీ చంద్రబాబుకు మంచి బుద్ధి రాదని అర్థమైంది’ -
Fake Liquor Case: జోగిరమేష్ ఉగ్రరూపం.. బాబు, లోకేష్ కు ఓపెన్ ఛాలెంజ్
-
లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా?
ఇబ్రహీంపట్నం: నకిలీ మద్యం కేసు పూర్తిగా తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకోవడంతో సీఎం చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలపై లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని.. మరి చంద్రబాబు, లోకేశ్‌లు కూడా సిద్ధమా.. అని సవాల్ విసిరారు. ఇబ్రహీంపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో నిందితుడు అద్దేపల్లి జనార్దన్‌రావుతో తన పేరు చెప్పించడం ద్వారా చంద్రబాబు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అసలు ఈ కేసులో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అంతా చంద్రబాబేనని స్పష్టం చేశారు. ‘వారం రోజులుగా నకిలీ మద్యం కేసులో సీబీఐ విచారణ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ సీఎం చంద్రబాబు మాత్రం సిట్ విచారణకు ఆదేశించారు. బాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్.. అనేలా సాగేది విచారణ కాదు. నకిలీ మద్యం రాకెట్ బట్టబయలు కావడంతో దిక్కుతోచక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర లేపారు. ఇందులో భాగంగానే నా పేరు తీసుకొచ్చారు. ఈ కేసులో నా పాత్ర ఉంటే నేను ఏ శిక్షకైనా సిద్ధమే’ అని తెలిపారు. ఈ సందర్భంగా జోగి రమేష్ ఇంకా ఏమన్నారంటే.. రిమాండ్ రిపోర్టులో నా పేరు లేదు ‘నకిలీ లిక్కర్ కేసులో నా ప్రమేయం లేదని నేను దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. నేను నా భార్యా బిడ్డలతో వస్తాను. చంద్రబాబు, లోకేశ్‌లకు దమ్ముంటే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధికి వచ్చి ప్రమాణం చేయగలరా? పోనీ విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం చేస్తారా? ఈ ఛాలెంజ్‌కు మీరు సిద్ధమా? కల్తీ మద్యం కేసుతో నాకు ఏ రకమైన సంబంధం లేదు. నారా వారి సారాను రాష్ట్రంలో ఏరులై పారిస్తున్నారు. ప్రతి మద్యం షాపులో, బెల్టు షాపుల్లో.. చివరకు ఇంటింటికీ రేషన్ పంపిణీలా నకిలీ మద్యాన్ని పంపిస్తున్నారు.ఇదంతా బయట పడటంతో డైవర్షన్ కోసం జనార్దన్‌తో వీడియో విడుదల చేయించారు. వాస్తవానికి రిమాండ్ రిపోర్టులో నా పేరు ఎక్కడా లేదు. అయినా పోలీసు కస్టడీలో ఉన్న అతనితో నా పేరు చెప్పించడం ద్వారా అత్యంత దిగజారుడు రాజకీయాలకు దిగారు. మీ దుర్మార్గాలను ఎండగడుతున్నానన్న అక్కసుతో ఈ కేసులో నన్ను అక్రమంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు దుష్ట ప్రయత్నం రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది.గతంలో చంద్రబాబు ఇంటి దగ్గరకు నేను ప్రశ్నించడానికి బయలుదేరానని, కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజూ నన్ను ఏదో ఒక కేసులో అరెస్టు చేస్తామని బెదిరిస్తూనే ఉన్నారు. నెలో రెండు నెలలో నన్ను జైలులో పెట్టి మీ క్షణికానందం తీర్చుకున్నంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టరు. లోకేశ్.. ఎల్లకాలం అధికారంలో ఉంటామని భ్రమల్లో ఉండొద్దు. మీరు సీటు ఇచ్చి తంబళ్లపల్లెలో పోటీకి నిలబెట్టిన జయచంద్రారెడ్డే కల్తీ మద్యానికి ఆద్యుడు. తప్పుడు కేసులకు భయపడేది లేదు ఒక తప్పుడు వీడియోను సృష్టించి, నన్ను జైల్లో పెట్టడం ద్వారా మీ రాక్షసానందం తీరవచ్చు. కానీ రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. దమ్ముంటే ధైర్యంగా నేరుగా ఎదుర్కోండి. మీరు ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు.. భయపడేదీ లేదు. మీ దుర్మార్గాలను ఎండగడుతూనే ఉంటాం. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు అత్యంత చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు. మీ రెడ్ బుక్కు ఫైర్ పుట్టించడం ఖాయం. దమ్ముంటే నా సవాలుకు స్పందించండి.కల్తీ లిక్కర్ స్కామ్‌లో అక్రమ మద్యం నిల్వలను స్వయంగా నేను మీడియాకు.. ‘ఇదే నారా వారి సారా’ అని చూపిస్తే, ఈ కేసులో నిందితుడైన జనార్దన్‌ను అడ్డుపెట్టుకుని నా పేరు మీద వీడియో విడుదల చేయించారు. జనార్దన్‌తో నాకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. ఇది కేవలం చంద్రబాబు సృష్టించిన కట్టు కథ మాత్రమే. ప్రజలంతా గమనిస్తున్నారు’ అని స్పష్టం చేశారు. -
‘చంద్రబాబూ.. కృష్ణా జిల్లా నా అడ్డా.. నేను ఇక్కడే ఉంటా’
విజయవాడ: టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్న నకిలీ మద్యం కేసులో తన పేరును ఆ కేసులో నిందితుడితో చెప్పించడంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. కస్టడీలో ఉన్న జనార్థన్‌రావుతో తన పేరును చెప్పిస్తారా? అంటూ ప్రశ్నించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు(సోమవారం, అక్టోబర్ 13వ తేదీ) విజయవాడ నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన జోగి రమేష్.. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్యా బిడ్డల సాక్షిగా ఏ తప్పూ చేయలేదని, నకిలీ మద్యం కేసుతో అసలు తనకు సంబంధమే లేదని స్పష్టం చేశారు. ఈ కథ మొత్తం చంద్రబాబుదేనని, సిట్ చీఫ్‌కు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా చంద్రబాబే అందిస్తున్నారని మండిపడ్డారు. ‘జనార్ధన్ పిల్లల్ని వేధించి నాపై తప్పుడు కేసులు పెట్టించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్పుడు కేసుల్లో ఇరికించారు.లైడిటెక్టర్ పరీక్షలకు నేను రెడీ.. చంద్రబాబు మరి నువ్వు?. నకిలీ లిక్కర్ స్కాం కేసులో నా ప్రమేయం లేదు. నాకు సంబంధం ఉందని నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధమే. నా భార్య,పిల్లలతో తిరుమలకు వస్తా. చంద్రబాబు కూడా కుటుంబంతో తిరుమలకు రావాలి. అక్కడ నేను తప్పు చేశానని నువ్వు చెబితే నేను ఏ శిక్షకైనా సిద్దమే. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా జనార్ధన్‌తో నా పేరు చెప్పించారు. రిమాండ్ రిపోర్టులో నా పేరు లేదు. కృష్ణాజిల్లా నా అడ్డా. నేను ఇక్కడే ఉంటా. నాపై చేస్తున్న ఆరోపణల్ని మీ ఇంట్లో వాళ్లు కూడా నమ్మరు’ అని జోగి రమేష్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: అడ్డంగా దొరికిన టీడీపీ.. నకిలీ మద్యం కేసులో బలవంతపు వీడియో డ్రామా -
Jogi: సుబ్బారెడ్డి అన్న జగన్ దమ్ము ఏంటో చెప్పిన వాళ్ళిద్దరికీ సన్మానం చేద్దాం
-
జోగి రమేష్ పై మరో అక్రమ కేసు
-
మాజీ మంత్రి జోగి రమేష్‌పై మరో అక్రమ కేసు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్‌పై చంద్రబాబు సర్కార్ మరో అక్రమ కేసు నమోదైంది. టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని ప్రశ్నించినందుకు చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం కేసులో ఏ1 టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధనరావుకు చెందిన గోడౌన్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు నిర్వహించగా.. భారీ కల్తీ మద్యం తయారీ డెన్ బయటపడింది.పచ్చ నేత కల్తీ మద్యం డెన్‌ను పరిశీలించిన మాజీ మంత్రి జోగి రమేష్.. టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని ప్రశ్నించడంతో ఆయనపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. తమ విధులకు అడ్డంకి కలిగించడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం స్టేషన్లో ఎక్సైజ్ ఎస్ఐ పెద్దిరాజు ఫిర్యాదు చేశారు. జోగి రమేష్‌తో పాటు మరో 25 మందిపై కేసు నమోదైంది. -
ప్రజల ప్రాణాలంటే లెక్క లేదు.. ఇది మన MLA వసంత కృష్ణ ప్రసాద్ బాగోతం
-
మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు నమోదు
-
జగన్ మంచితనం గురించి చిరంజీవిని అడగండి.. పవన్ ను ఏకిపారేసిన జోగి రమేష్
-
ప్రశ్నిస్తే అణచివేస్తారా?.. మైలవరం పీఎస్ ముందు వైఎస్సార్సీపీ ధర్నా
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అభివృద్ధిపై ప్రశ్నించినందుకు మైలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ మున్సిపాలిటీ విభాగం అధ్యక్షుడు కోమటి కోటేశ్వరరావును అక్రమంగా అరెస్ట్ చేశారు. టీడీపీ నాయకుల ఫిర్యాదుతో కోటేశ్వరరావును అరెస్ట్ చేసిన పోలీసులు.. మైలవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.వైఎస్సార్సీపీ నేత అక్రమ అరెస్ట్‌పై మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఆయనతో పాటు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. మైలవరం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన కోటేశ్వరరావును వెంటనే విడుదల చేయాలంటూ జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఆయన్ని మైలవరం సీఐ కార్యాలయం ఎదుట పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పీఎస్ ఎదుట వైఎస్సార్సీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. -
Jogi: చంద్రబాబుకు వెన్నుపోటు, కుట్రలు, కుతంత్రాలు చేయడం అలవాటే
-
Jogi Ramesh: అప్పుగా ఇచ్చిన డబ్బులు అడిగితే.. మహిళపై దాడి చేసిన టిడిపి గూండాలు
-
‘అప్పుగా ఇచ్చిన డబ్బులు అడిగితే దాడి చేస్తారా?’
ఎన్టీఆర్ జిల్లా: అప్పుగా ఇచ్చిన డబ్బును అడిగినందుకు మాధవి అనే మహిళపై టీడీపీ గూండాలు చేసిన దాడిని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. అప్పుగా ఇచ్చిన డబ్బలను అడిగితే దాడి చేస్తారా అంటూ నిలదీశారు. టిడిపి నేతల దాడిలో గాయపడిన మాధవిని జోగి రమేష్ పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ కూటమిపాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు అడిగితే దాడి చేస్తారా?, మాధవి పై దాడి చేసిన టిడిపి గూండాలు వరికూటి రాము , పవన్ పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. బాధితురాలికి న్యాయం చేయాలి. బాధితురాలికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’ అని తెలిపారు. -
Jogi Ramesh: TDP నేతల అక్రమ బూడిద - తరలింపునకు వ్యతిరేకంగా ధర్నా
-
జోగి రమేష్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు
-
మరో ఉద్దానంగా ఇబ్రహీంపట్నం.. మా పోరాటం ఆగదు: జోగి రమేష్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు హయాంలో గాలి, నీరు.. మొత్తం కలుషితం అయిపోతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మూలపాడు డంప్ నుంచి టీడీపీ నేతల బూడిద అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ఆందోళన చేపట్టిన ఆయన్ని మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. భవానిపురం పీఎస్ నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వస్తే ఏ సంస్థ అయిన ప్రవేట్ అవ్వాల్సిందే. బూడిద(ఫ్లై యాష్) టెండర్ ఒక వింగ్‌గా చేసి లోకేష్ కనుసన్నల్లో ప్రవేట్ చేసేశారు. ఇబ్రహీంపట్నంలో ఇప్పుడు నీరు, గాలి మొత్తం కలుషితం అయ్యింది. ప్రజలు, థర్మల్ ప్లాంట్లలో లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిడ్నీ సమస్యల బారిన పడుతున్నారు. వెరసి.. ఇబ్రహీంపట్నం మరో ఉద్దానం గా మారింది. అందుకే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.ఇబ్రహీంపట్నం నుంచి అక్రమంగా బూడిద నిలువ చేసి హైదరాబాద్‌కి తరలిస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని కోరితే.. అధికారులు మమ్మల్నే అరెస్ట్ చేస్తున్నారు. కనీసం చంద్రబాబైనా స్థానిక ఎమ్మెల్యేపై చర్యలు తీసుకొంటారా?. వీటీపీఎస్‌లో బూడిద టెండర్లు తక్షణమే రద్దు చేయాలి. కాలుష్యం భరితంగా మారిగా గ్రామాలను ఆదుకోవాలి. మొక్కలు నాటించి.. చెట్ల సంరక్షణ కొనసాగించాలి. అక్రమ డంప్‌ని ప్రభుత్వం చేసుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తాం అని జోగి రమేష్ అన్నారు. ఇదిలా ఉంటే.. బూడిద రాజకీయాలు ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. టీడీపీ నేతల అక్రమ బూడిద రవాణాను(Ash Mafia) అడ్డుకునేందుకు జోగి రమేష్ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో.. బుధవారం మూలపాడులో బూడిద డంప్‌ను పరిశీలించేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే ఆయన పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు దిగింది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో భారీగా పోలీసులు మోహరింపజేసింది. మరోవైపు.. మూలపాడుకు వెళ్లకుండా జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్ అమల్లోకి తెచ్చిన పోలీసులు.. అటువైపుగా గుంపులుగా వెళ్లేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. తమను అనుమతించాలంటూ పోలీసుల కాళ్లు మొక్కుతూ నిరసనలు తెలియజేశారు. ఈ పరిణామాలతో జోగి రమేష్ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. ఆందోళనకు సిద్ధమైన జోగి రమేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.బూడిద రవాణా ద్వారా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అక్రమార్జన చేశారన్నది జోగి రమేష్ చెబుతోంది. అంతేకాదు అక్రమ బూడిద నిల్వలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారాయన. అయితే.. జోగి రమేష్ వ్యాఖ్యలపై వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. జోగి రమేష్ ఇల్లు నేలమట్టం చేస్తా అంటూ అనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో అక్కడ రాజకీయ అలజడి రేగింది. -
బూడిద ద్వారా దోచుకున్న అక్రమ డబ్బు మీకా..? వసంత కృష్ణ ప్రసాద్ పై జోగి రమేష్ ఫైర్
-
Jogi Ramesh: అన్నం పెట్టే రైతన్నలను ఆదుకోవడం చేతకాక పనికిరాని మాటలు
-
గణపతి మహోత్సవాల్లో జోగి రమేష్
-
Perni Nani: ఉపఎన్నికలో ఓటుకు పదివేలు.. బాబు పాపపు సొమ్ము వద్దని ఎదురు తిరిగితే
-
Jogi Ramesh: ఇక్కడున్న YSRCP కార్యకర్తలకి మాట ఇస్తున్న..
-
పనికిమాలిన వెధవ.. గుర్తుపెట్టుకో నీకు దమ్ముంటే..


