‘ప్రశ్నిస్తానన్న పవన్‌ ఎమైపోయాడు’ | Anil Kumar Yadav fired on Chandrababu over the attack on Jogi Ramesh house | Sakshi
Sakshi News home page

‘ప్రశ్నిస్తానన్న పవన్‌ ఎమైపోయాడు’

Feb 3 2026 3:59 PM | Updated on Feb 3 2026 4:19 PM

Anil Kumar Yadav fired on Chandrababu over the attack on Jogi Ramesh house

సాక్షి,ఎన్టీఆర్‌ జిల్లా: కూటమి ప్రభుత్వ ఎక్స్‌పైరీ డేట్ దగ్గరలో పడిందని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు, మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు.ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై టీడీపీ గూండాలు పెట్రోల్‌ బాంబులు,మారణాలయుధాలతో దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై జోగి రమేష్‌ కుటుంబాన్ని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పరామర్శించారు.

ఈ సందర్భంగా జోగి రమేష్‌ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్‌ కుమార్‌ మాట్లాడారు.‘కూటమి ప్రభుత్వంలో రాక్షస పాలన సాగుతోంది. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని తప్పుడు ప్రచారం చేశారు. తాను చేసింది అసత్య ప్రచారం అని తెలిసి పశ్చాత్తాపం పడకుండా దాడులు చేయిస్తున్నాడు.

ప్రశ్నించిన వారి పై కేసులు పెట్టడం దాడులు చేయించడమే చంద్రబాబు పని. అంబటి రాంబాబు,జోగి రమేష్ ఇళ్ల పై వందల మంది గూండాలతో  దాడి చేయించారు.జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేయించారు. దాడి సమయంలో జోగి రమేష్ తండ్రి, భార్య,కుమారుడు ఇంటిలోనే ఉన్నారు.ఇంట్లో ఉన్న మహిళలకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత.

మీ పార్టీలో ఉన్నవారే మహిళలా. మీ పార్టీలో ఉన్నవారే బిసిలు,కాపులా. ప్రశ్నిస్తాననేపై పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనం వహిస్తున్నాడు.జగన్ ఐదేళ్ల పాలనపై ఫ్యాక్షన్ ముద్ర వేశారు. నిజంగా మీరు చెప్పినట్లు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే ఏపీలో మీరు తిరగ గలిగేవారా. ప్రజలు మీకు ఓటేసింది ప్రజలకు మంచి చేయమని. ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు చేయడానికి కాదు.

ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో తిరుగుబాటు తప్పదు.టీడీపీ వాళ్లు ఏమైనా చేస్తామని బెదిరిస్తున్నారు. జగన్ ఐదేళ్లలో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడలేదు.మీరు రెచ్చగొట్టే కొద్దీ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు వస్తారు.ప్రతీ ఒక్కరికీ ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. మీ ప్రభుత్వానికి మరో మూడేళ్లే ఎక్స్ పైరీ డేట్.

పోలీసులు లేకుండా రండి ఎవడి బలం ఏంటో తెలుస్తుంది

అన్నారో లేదో తెలియని మాటకు చంద్రబాబు రాష్ట్రమంతా తిరిగి ఏడ్చారు.జోగి రమేష్ ఇంటి పై దాడి చేసిన సమయంలో వాళ్లింట్లో ఉన్నది కూడా మహిళలే. వెనక నుంచి దాడి చేయడం ..వెన్నుపోటు రాజకీయం చంద్రబాబుకి అలవాటు. చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దాడి చేయలేదు. కేవలం జోగి రమేష్ నిరసన తెలియజేశారు.జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన టీడీపీ నేతలెవరో, వారి వివరాలు ఉన్నాయని హెచ్చరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement