TDP
-
విలువే లేకుండా పోయింది.. ఎందుకీ ఊడిగం!
కూటమి విజయానికి మనమే కారణం అయ్యాం... మనం లేకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయ్యేనా.. ఆయన సీఎం అయ్యేనా.. కాపులంతా గంపగుత్తగా ఓట్లేయకపోతే కూటమికి ఇంత మెజారిటీ ఎలా వస్తుంది.. ఇన్ని సీట్లు ఎలా వస్తాయి..ఈ కూటమి ప్రభుత్వ రథానికి మనమే చక్రాలం..మనమే ఇరుసు..మనమే ఇంధనం కానీ ఇప్పుడు మనం కరివేపాకులం అయిపోయాం. పులుసులో ముక్కలం అయిపోయాం .. మనకు ఎక్కడ విలువ గౌరవం దక్కడం లేదు.దేనికోసం ఇంత త్యాగాలు చేయాలి అంటూ జనసేన ఎమ్మెల్యేలు మదన పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామి.. అందులో 21 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. వారిలో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఈ ముగ్గురికి క్యాబినెట్లో స్థానం దక్కింది.. మిగతా 18 మంది వట్టి ఎమ్మెల్యేలు గానే ఉన్నారు. అయితే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోతుందని జనసేన బాధపడుతుంది.జనసేన ఎమ్మెల్యే కన్నా టిడిపి ఇంచార్జీ మిన్నతాము ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీని ఆ నియోజకవర్గాల్లో టిడిపి ఇన్చార్జిలకే అధికారులు గౌరవిస్తున్నారని వారి మాట వింటున్నారని తమకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందని జనసేన ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతూ కాసేపటి క్రితం విజయవాడలోని హోటల్లో సమావేశం అయ్యారు. దీనికి నాదెండ్ల మనోహర్ కొందరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మనోహర్ తో ఎమ్మెల్యేలంతా ఈ విషయాన్ని మొరపెట్టుకున్నట్లు తెలిసింది. స్థానికంగా తమ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీని తమ మాటను పోలీసులు రెవెన్యూ పంచాయతీ అధికారులు ఎవరూ వినడం లేదని తెలుగుదేశం వారు చెబితేనే అక్కడ మాట చెల్లుబాటు అవుతుందని మనోహర్ ఎదుట వాపోయారు.మంత్రులుగా ఉన్న ఆ ముగ్గురికి నియోజకవర్గంలో కాస్త గౌరవం ఉన్నప్పటికీ మిగతా ఎమ్మెల్యేలు ఎవరికి ఇండిపెండెంట్‌గా పని చేసే అవకాశం దక్కడం లేదు. నియోజకవర్గాల పెద్ద పని ఏదైనా ఉంటే ఆ జిల్లా మంత్రి వద్దకు వెళ్లాల్సి వస్తుంది. పైగా ఆ మంత్రి కూడా లోకేష్ కంట్రోల్లో పనిచేస్తున్నారు. లోకేష్ కూడా జనసేన ను పెద్దగా పట్టించుకోకుండా జిల్లాల తన సొంత టీం ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నారు. దీంతో అనివార్యంగా జనసేన నాయకులకు ప్రాధాన్యం తగ్గిపోతుంది. పలుచోట్ల వ్యాపారాల్లోనూ అక్రమ ఆదాయం తెలుగుదేశం జనసేన మధ్య పోటీ నెలకొన్న తరుణంలో తెలుగుదేశం వారు పలువురు జనసేన కార్యకర్తలను వెంటాడి కొట్టిన ఘటనలు ఉన్నాయి.ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్లు తెలుగుదేశానికి ఊడిగించేయడం కోసమే తమ పార్టీ ఉందా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని తెలుగుదేశం ఇన్చార్జిలకు అధికారులు గౌరవం ఇవ్వడం దానికి ఎంత అవమానం అన్నది ఈ సమావేశంలో వారంతా నాదెండ్ల మనోహర్ కు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పెద్దలతో మాట్లాడి సెటిల్ చేస్తే జిల్లాలో తమ గౌరవం నిలబడుతుందని అంతిమంగా పార్టీ కూడా బలపడే అవకాశం ఉంటుందని వారు చెప్పుకున్నారు.కానీ జనసేన బలపడాలని తెలుగుదేశం ఏ కోశానా కోరుకోదు. జనసేన బలం తమకు బలం కావాలని తెలుగుదేశం భావిస్తుంది తప్పితే జనసేన సొంతంగా తన కాళ్లపై తన నిలబడి పోటీ చేసే పరిస్థితి వస్తే తెలుగుదేశానికి ఎంత ఇబ్బంది అన్నది చంద్రబాబు లోకేష్ లకు తెలుసు. అందుకే ఎక్కడికి అక్కడ జనసేన నాయకులను కార్యకర్తలను తమ కాళ్ళ కింద పెట్టి ఉంచుతూ ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం క్యాడర్‌ను మాత్రమే గుర్తిస్తూ పనులు పథకాలు పైరవీలు అని వాళ్ల ద్వారా జరిగేలా చూస్తున్నారు.నియోజకవర్గాల్లో పనులు అంటూ జరిగితే తెలుగుదేశం వారి ద్వారానే జరగాలి లేదంటే లేదు. అంతేతప్ప జనసేన నాయకుడికి ఎక్కడా మర్యాద దక్కకూడదు అనే సింగల్ పాయింట్ ఏజెండాతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇదంతా తమకు అవమానంగా భావిస్తున్న జనసేన ఎమ్మెల్యేలు తమ గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత మీదే అంటూ మనోహర్ మీద ఒత్తిడి తెచ్చారు. మరోవైపు లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ శాఖను సైతం హైజాక్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదంతా జనసేన మనుగడకు.. భవిష్యత్తుకు ముప్పుగా మారుతుందని వారు కలవరపడుతూ దిద్దుబాటు చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఏ స్థాయి ఫలితాలు ఇస్తుందో చూడాలి.-సిమ్మాదిరప్పన్న -
విలువలు వదిలేసి.. మేయర్ పదవిపై కన్నేసి
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో సంఖ్యా బలం లేనప్పటికీ.. బలవంతంగా మేయర్ పీఠాన్ని లాక్కునేందుకు కూటమి కుటిల యత్నాలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడుతూ.. ప్రలోభాలకు గురిచేస్తూ బరితెగిస్తున్నారు. అందులో భాగంగానే జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి కూటమి పార్టీల కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర్ ప్రసాద్‌కు నోటీసు ఇచ్చారు..డబ్బు ఎర.. లొంగనివారికి బెదిరింపులుకూటమిలో చేరితే దాదాపు రూ.25 లక్షలు ఇస్తామంటూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు ఎర వేస్తున్నట్టు తెలిసింది. అక్కడికీ లొంగకపోతే మరింత ఎక్కువ ఇస్తామంటూ నమ్మబలుకుతున్నారు. మీ వార్డుల్లో పెద్దఎత్తున పనులకు సహకరిస్తాం.. అని ప్రలోభ పెడుతున్నారు. ఈ ఆఫర్లకు ఒప్పుకోని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు. అవిశ్వాసానికి 64 మంది కార్పొరేటర్లు అవసరం..2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మొత్తం 98 కార్పొరేటర్ల స్థానాలకు గాను వైఎస్సార్సీపీ 58 కైవసం చేసుకుని మేయర్ పదవిని చేజిక్కించుకుంది. టీడీపీ(30), జనసేన (3), సీపీఐ, సీపీఎం, బీజేపీ ఒక్కొక్కటి నెగ్గాయి. స్వతంత్రులు 4 స్థానాల్లో గెలిచారు. ఇద్దరు టీడీపీ కార్పొరేటర్లు మరణించగా జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపొందింది. దీంతో వైఎస్సార్సీపీ బలం 60కి చేరింది. 21వ వార్డు కార్పొరేటర్ వంశీకృష్ణ శ్రీనివాస్ తొలుత ఎమ్మెల్సీగా తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ వార్డుకు ఉప ఎన్నిక జరగక ఖాళీగా ఉంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల సంఖ్య 59, టీడీపీ సభ్యుల సంఖ్య 28కి తగ్గింది.స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ నుంచి 12 మంది టీడీపీలో, ఏడుగురు జనసేనలో చేరారు. స్వతంత్రులు నలుగురు జనసేనకు మద్దతు తెలపడంతో ఆ పార్టీ బలం 14కి చేరింది. ప్రస్తుతం కూటమికి 55 మంది, వైఎస్సార్సీపీకి 40, సీపీఐ, సీపీఎంలకు ఒక్కో సభ్యుడు ఉన్నారు. అవిశ్వాసం పెట్టాలంటే 2/3 మెజార్టీ కార్పొరేటర్లు (64) ఉండాలి. -
‘లావు శ్రీకృష్ణదేవరాయలు.. నా కాల్ డేటాను తీశారు’
సాక్షి, పల్నాడు జిల్లా: తనపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన వారిని తాను ఎప్పుడూ చూడలేదని.. కూటమి నేతల డైరెక్షన్లోనే తనపై ఏసీబీ కేసు నమోదు చేసిందని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం ఆమె చిలకలూరిపేటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదేశాలతోనే ఏసీబీ కేసు పెట్టారని మండిపడ్డారు. ‘‘నన్ను, నా కుటుంబాన్ని ఎంపీ కృష్ణదేవరాయులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నా కాల్ డేటాను తీశారు. ఆయన ఒత్తిడితోనే కాల్‌డేటా తీసినట్లు పోలీసులు ఒప్పుకున్నారు. ఫిర్యాదు చేసిన వారితో నాకెలాంటి సంబంధం లేదు’’ అని విడదల రజిని స్పష్టం చేశారు.రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచకాలు తారాస్థాయికి చేరాయి. నాపై ఏసీబీ అక్రమంగా కేసు నమోదు చేసింది. కూటమి నేతల బెదిరింపులకు నేను భయపడను. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. రెడ్ బుక్ పాలనలో నన్ను టార్గెట్ చేశారు. అక్రమ కేసులు పెడుతున్నారు. అదిగో రజిని.. ఇదిగో రజిని అంటూ ఆవు కథలు చెబుతున్నారు. ఏసీబీ కేసులో ఫిర్యాదుదారులను ఇంతవరకూ నేను కలవ లేదు. రెడ్ బుక్ పాలనకు పరాకాష్టే ఈ ఏసీబీ కేసు’’ అని రజిని మండిపడ్డారు.‘‘ఏసీబీ కేసులో ఫిర్యాదుదారుడు టీడీపీ వ్యక్తి. మార్కెట్ ఏజెన్సిని పెట్టి నాపై కేసులను పెట్టిస్తున్నారు. ఈ కథకు మొత్తం డైరెక్టర్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు. అక్రమంగా వ్యాపారం చేసుకోవడానికి ఫిర్యాదు దారులకు సహకరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. నేనంటే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు ఎక్కువ కోపమే. 2020లో గురజాల డీఎస్పీ, సీఐలకు లంచం ఇచ్చి నాతో పాటు నా కుటుంబ సభ్యుల కాల్ డేటాను తీయించారు. బీసీ మహిళ, ఎమ్మెల్యే అయిన నా కాల్ డేటాను తీయించారు. నా వ్యక్తి గత జీవితంలో ఎందుకు రావాలనుకున్నారో తెలియదు. మీ ఇంటిలో ఉన్న ఆడపిల్లల కాల్ డేటా తీస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అంతటి నీచుడు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు’’ అని విడదల రజిని ధ్వజమెత్తారు.వైఎస్ జగన్ ఎంపీని ప్రశ్నించారు. అప్పుడే ఆయన మనసులో శ్రీకృష్ణదేవరాయలు నమ్మకాన్ని కోల్పోయారు. అప్పటి నుండి ఎంపీ నాపై కక్ష పెంచుకున్నాడు. పది నెలల నుండి ఒకే ఫిర్యాదును పదేపదే అందరికి ఇప్పించారు. ప్రస్తుతం విజిలెన్స్ ఎస్పీగా ఉన్న శ్రావణ్ టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు కొడుకు. ఆ ఎస్పీ ఇచ్చే విజిలెన్స్ నివేదిక ఏవిధంగా ఉంటుందో ఆలోచించండి. ఆయన ఇచ్చిన రిపోర్ట్ తెలుగుదేశం రిపోర్ట్. అవినీతి ఘనాపాటి ప్రత్తిపాటి... నా మీద, జర్మనీలో ఉండే నా మరిది మీద అక్రమ కేసులు పెట్టించారు. నా మామ కారుపై దాడి చేయించారు. ఎవరూ ఎటువంటి వారో అందరికి తెలుసు. నా కళ్లలో భయం చూద్దామనుకుంటున్నారు. ఇటువంటి వాళ్లను చూస్తే నాకు భయమనిపించదు’’ అని విడదల రజిని చెప్పారు.లావు రత్తయ్య అంటే నాకు గౌరవం. శ్రీకృష్ణదేవరాయలు వైజాగ్‌లో చెరువు భూములను కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోసానిని రాష్ట్రమంతా తిప్పి ఇబ్బందిపెట్టారు. వడ్లమూడి యూనివర్సిటీ నుంచి చిలకలూరిపేట ఎంత దూరమో? చిలకలూరిపేట నుంచి వడ్లమూడి యూనివర్సిటీ అంతే దూరం. శ్రీకృష్ణదేవరాయలు ఇది గుర్తుపెట్టుకోవాలి’’ అని విడదల రజిని హెచ్చరించారు. -
పోలీసుల సమక్షంలోనే టీడీపీ కవ్వింపు చర్యలు: పేర్ని నాని
-
Gunshot: జగన్ పై TDP ఎమ్మెల్యేల కామెడీ తేల్చేద్దాం... అన్నీ తేల్చేద్దాం
-
ప్రేమ వివాహం చేసుకున్నారంటూ వరుడి ఇంటిపై దాడి
-
మా పొలం కబ్జా చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు
-
టీడీపీ నేత కుమార్తెతో ప్రేమ.. పెళ్లి చేసుకున్నాడనే కారణంతో..
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ నేత కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడనే కారణంగా వరుడి ఇంటిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేత సుంకర వెంకటరమణ కుమార్తె శివలీల, అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వీరి ప్రేమను పెద్దలు కాదనడంతో వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో వరుడు వెంకటేశ్వర్లుపై వెంకటరమణ, ఆయన మద్దతు దారులు కక్ష పెంచుకున్నారు. దీంతో, వెంకటేశ్వర్లు ఇంటిపై కర్రలు, రాడ్లతో టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. టీడీపీ నేతల దాడిలో ఇంట్లోని ఫర్నీచర్ పూర్తిగా ధ్వంసమైంది. -
కేతిరెడ్డి ఇంటిని కూల్చేస్తా.. జేసీ ప్రభాకర్ బరితెగింపు
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉన్నారనే కారణంగా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు తాజాగా తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఓవరాక్షన్‌కు దిగారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో, ఆయన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బరితెగింపు చర్యలకు దిగారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేస్తానని వార్నింగ్ ఇవ్వడం తీవ్ర కలకలం సృష్టించింది. తాడిపత్రిలో వైఎస్సార్సీపీకి చెందిన ఆరుగురు నేతల ఇళ్లను స్వయంగా తానే కూల్చివేస్తానని జేసీ ప్రభాకర్ హెచ్చరించారు. స్వయంగా ఆర్డీవో కేశవ్ నాయుడు ఎదుటే జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే, పోలీసుల వైఫల్యం వల్లే తాడిపత్రిలో రాళ్ల దాడి జరిగిందని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాను అంటూ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దీంతో, జేసీ వ్యాఖ్యలు, ఆయన తీరు తీవ్ర దుమారం రేపుతోంది. ఇంతా జరిగినా పోలీసులు స్పందించకపోవడం విశేషం. -
‘పచ్చ’ బంధాలతో ‘రొచ్చు’ బిజినెస్
అప్పట్లో టీడీపీ పాలనలో కాల్‌మనీ కాలనాగులు.. ఇప్పుడు కూటమి సర్కారులో స్పా సెంటర్ల విష సర్పాలు..! నాడు మహిళలకు అధిక వడ్డీకి అప్పులిచ్చి.. తీర్చలేనివారిని వ్యభిచార రొంపిలోకి దించింది పచ్చ మూక..! నేడు స్పా సెంటర్ల ముసుగులోనూ అదే తీరున గలీజు దందా..! దాదాపు పదేళ్ల కిందట రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ రాకెట్ కొత్త అవతారంలో పుట్టుకొచ్చిందా అన్నట్లు.. ప్రస్తుతం స్పా రాకెట్ సాగుతోంది..! అప్పుడు.. ఇప్పుడు ఈ అరాచకానికి బలవుతున్నది మహిళలే కాగా.. అడ్డా విజయవాడనే కావడం.. గమనార్హం..! సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పైకి మసాజ్ కేంద్రాలు.. లోపల వ్యభిచార దందా..! అధికార కూటమి పార్టీలలోని ముఖ్య, ద్వితీయ స్థాయి నేతలతో ఉన్న సత్సంబంధాలే పునాది.. సమాజంలో ఉన్న పలుకుబడేపెట్టుబడి..! వాటితోనే కోట్లాది రూపా యల దందా..! కాల్ మనీ–సెక్స్ రాకెట్ వ్యవహారాల్లో మునిగితేలిన టీడీపీ నాయకుల బాగోతాలు ఇదివరకే బట్టబయలయ్యాయి. ఇప్పుడు ‘స్పా’ (మసాజ్) సెంర్ల వంతు వచ్చింది. విజయవాడ నగరంలోని స్పా సెంటర్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మాచవరం పోలీసులు గత నెలలో దాడిచేసి పది మంది మహిళలు, 13 మంది విటులను అరెస్టు చేశారు. ఆ తర్వాత స్పాలలోని లోగుట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్పాల నిర్వాహకులతో ‘క్రిడ్ ప్రోకో’ సంబంధాలున్న నాయకులు, పోలీసులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. కూటమి వచ్చాక పట్టపగ్గాల్లేకుండా.. ఆరేడు నెలల్లో ‘స్పా’లలో వ్యభిచార, ఇతర జుగుప్సాకర వ్యవహారాలు పెరిగాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రస్థాయిలోని కొందరు కూటమి ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నాయకుల సహకారంతోనే నిర్వాహకులు నిర్భయంగా కార్యకలాపాలు సాగిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా ధనికులు నివసించే కాలనీలు, కాస్త చాటుగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుని స్పాలను నెలకొల్పుతూ, ప్రాచుర్యం పొందిన తర్వాత అక్కడినుంచి మార్చేస్తూ కొత్త పేర్లతో నెలకొల్పుతూ దందా నడిపిస్తున్నారు. అబ్బో భార్గవ్.. అతడే సూత్రధారి చలసాని ప్రసన్నభార్గవ్.. విజయవాడ స్పా సెంటర్ల దందాలో ఇతడే కింగ్ పిన్. స్టూడియో 09, ఏపీ22 పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ అదే భవనం పైన స్పా సెంటర్ ముసుగులో వ్యభిచార గృహం నడిపిస్తున్నాడు. గత నెలలో పోలీసులు దాడి చేసింది ఇతడి స్పా సెంటర్ పైనే. అయితే, పోలీసుల రాకపై నిర్వాహకుల హెచ్చరికలతో పలువురు తప్పించుకున్నారు. కాగా, ఏలూరుకు చెందిన భార్గవ్ తనకు కూటమి పార్టీల్లోని పలువురు ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో దగ్గరి సంబంధాలు ఉన్నాయంటూ వేర్వేరు సందర్భాల్లో వారితో కలిసి దిగిన ఫొటోలను చూపుతూ హల్చల్ చేస్తున్నాడు. విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ తదితరులతో కలిసి దిగిన ఫొటోలను అవసరమైన చోట ప్రదర్శిస్తూ ఫలానా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే తమ బంధువులని, ప్రభుత్వమూ తమవాళ్లదేనంటూ హడావుడి చేస్తున్నాడు. దీనికోసం యూట్యూబ్ చానల్‌నూ అడ్డుపెట్టుకుంటున్నాడు. నల్ల అద్దాలతో కూడిన ఖరీదైన వాహనాలకు కూటమి పార్టీల లోగోలు ఏర్పాటు చేసుకుని అమ్మాయిల తరలింపునకు వాడుతున్నారు. విజయవాడ కేంద్రంగా పోలీసు అధికారులు, ముఖ్య నాయకులతో ఉన్న సంబంధాలతో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాద్ తదితర నగరాల్లోనూ స్పాల మాటున వ్యభిచార గృహాలను నడుపుతున్నాడనే ఫిర్యాదులు ఉన్నాయి. భార్గవ్.. తెలుగు రాష్ట్రాల్లోని స్పా సెంటర్లకు అధ్యక్షుడిగా, ఆర్గనైజర్గానూ వ్యవహరిస్తుండడం గమనార్హం. విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో స్పాల ముసుగులో నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచార కేంద్రాలకు అమ్మాయిల సరఫరాను భార్గవ్ విజయవాడ నుంచి మార్గదర్శనం చేస్తుంటాడు. ఈ నెట్‌వర్క్‌ను పూర్తిగా ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ద్వారానే సాగిస్తున్నాడు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడికి వెళ్లాలి? ఏ అకౌంట్లో ఎంత మొత్తం జమ చేయాలి? ఏయే ఖాతాలకు బదిలీ చేయాలి? డెన్ల చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను ఎప్పటికప్పుడు పరిశీలించడం.. అంతా ఫోన్‌తోనే. దీంతో ప్రసన్న భార్గవ్ వేర్వేరుచోట్ల ఉన్నా రాకెట్‌ను పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నాడు. రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు డిపాజిట్ స్పా సెంటర్లకు.. ఇదివరకే పరిచయాలున్న, వృత్తికి అలవాటుపడిన ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలను, వారి ద్వారా కొత్తవారిని పిలిపిస్తుంటారు. వారినుంచి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు డిపాజిట్ చేయించుకుంటారు. ఈ డబ్బు తిరిగివ్వరు. కొందరినైతే రెండు, మూడు నెలలు కాంట్రాక్టు పద్ధతిన నిర్ణీత మొత్తానికి కుదుర్చుకుంటారు. వీరిని బృందాలుగా విభజించి ఇతర స్పాలకూ పంపుతుంటారు. డిపాజిట్ మొత్తాన్ని బట్టి సౌకర్యాలున్న రూంలను వారం, పది, పదిహేను రోజుల చొప్పున కేటాయిస్తారు. భార్గవ్ బృంద సభ్యులు సమాచారం ఇచ్చి విటులను రప్పిస్తుంటారు. వారి నుంచి రూ.5 వేలు–రూ.25 వేలు, అవగాహనను బట్టి ఇంకా ఎక్కువ యువతులు వసూలు చేసుకుంటారు. తమ డిపాజిట్‌ను మించి సంపాదించుకుని స్వస్థలాలకు, లేదా నిర్వాహకులు సూచించిన ఇతర ప్రాంతాల్లోని స్పా సెంటర్లకు వెళ్లిపోతారు.అదే సమయంలో స్పా నిర్వాహకులు కౌంటర్ ఫీజు కింద విటుల నుంచి రూ.2,500–రూ.6,500, ఒక్కో యువతి నుంచి టిప్ కింద రూ.1,500–రూ.2 వేల వరకు లాగేసుకుంటున్నారు. మొత్తంమీద నెలకు 80 నుంచి 90 మంది యువతుల ద్వారా డిపాజిట్లు, టిప్స్, కౌంటర్ ఫీజు తదితరాల రూపంలో భార్గవ్ ముఠా నెలకు రూ.రెండున్నర నుంచి రూ.3 కోట్లు పోగేసుకుంటోంది. ఇందులో పోలీసులతో పాటు ఎవరి వాటా వారికి చేరుతుంది. అనుచర బృందంతో వ్యవహారాలు చలసాని ప్రసన్న భార్గవ్‌కు అత్యంత నమ్మకమైన సహచర బృందం ఉంది. వీరిలో మహిళలే అధికం. భార్గవ్ వ్యక్తిగత అనుచరుడు కుమార్ తన సోదరి పేరిట స్పాలు, సెలూన్లు నిర్వహిస్తున్నారు. సతీష్ యువతుల సరఫరా మొదలు ఇతర పనులు చేస్తుంటాడు. గోపీచౌదరి వ్యాపార భాగస్వామి. పోలీసులు, మీడియా వ్యవహారాలను చక్కబెట్టడంతో పాటు యువతుల సరఫరాలో ప్రధాన బాధ్యత ఇతడిదే. నాలుగు నెలల కిందటే ఫిర్యాదు చేసినా‘నాలుగైదు నెలల కిందటే పై విషయాలన్నింటినీ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మహిళా సంఘాల వారికీ వివరించాం. వారు ఉన్నతా«ధికారులకు చెప్పారు. ఏసీపీ స్థాయి అధికారి ఒకరు ఒకటి, రెండు స్పా సెంటర్లకు వెళ్లి భారీఎత్తున బేరం కుదుర్చుకున్నారు. హెచ్చరికలు చేసినట్లు కలరింగ్ ఇచ్చారు. మొక్కుబడిగా స్పా ముసుగులోని ఓ వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఇలాంటివి విజయవాడలో ఎన్ని ఉన్నాయో పోలీసులకు బాగానే తెలుసు. –భార్గవ్ బాధితురాలు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ ప్రెసిడెంట్‌గా.. చలసాని ప్రసన్న భార్గవ్ ‘హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా– ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్’ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. 2024 నవంబరు 28 నుంచి 2025 నవంబరు 27 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్లు సర్టిఫికెట్ ఉంది.కోడ్ పేర్లతో ఎర.. రాష్ట్రంలోని తన స్పాలకు వచ్చే యువతులు, విటులతో పాటు ఇతర స్పాలకు క్లయింట్లుగా వెళ్లి సమాచారాన్ని రాబట్టడం, ఆ తరువాత బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం భార్గవ్ బృందం దందాలో మరో కోణం. టెలిగ్రామ్, సీక్రెట్ నంబర్ల ద్వారా స్పాకు కొత్త యువతులు వచ్చారంటూ విటులకు సమాచారం చేరవేస్తుంటారు. ‘ఫ్రెషర్స్, ఓన్లీ ఫ్యూ ఫ్లవర్స్ అవైలబుల్, ఫ్రెష్ లుక్స్, హాయ్ ఫ్రెండ్స్, న్యూ చాక్లెట్ అవైలబుల్’ వంటివి వారి కోడ్ పదాలు. ఆటో లిఫ్ట్, పిక్ అప్ మి లాంటి యాప్స్ ద్వారా అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా ఆహ్వానాలు ఉంటాయని సమాచారం. దాదాపు ఎనిమిది మంది సిబ్బందికి అదే పని. స్పాలలో డిజిటల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. స్టాఫ్‌కు కూడా వీటి వివరాలు తెలియవు. స్పాల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ స్థానిక పేద విద్యార్థినులు, యువతులను కూడా రొంపిలోకి దింపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారాల ముసుగులో.. చలసాని ప్రసన్న భార్గవ్.. చలసాని కన్స్ట్రక్షన్స్, చలసాని మీడియా, పాంపరింగ్ రిసార్ట్స్ అండ్ స్పా, ఏపీ23 న్యూస్, స్టూడియో 9 సెలూన్ అండ్ స్పా, కోజి 9 సెలూన్ అండ్ స్పా, సిగ్నేచర్ సెలూన్ అండ్ స్పాతో పాటు మరికొన్నింటిలో వ్యాపార భాగస్వామి. ఇతరుల వ్యాపారాల గురించి తెలుసుకోవడం, పెట్టుబడిదారుగా చేరడం, కొంతకాలానికి వారిని దెబ్బతీయడం అతడి నైజమని బా«ధితులు వాపోతున్నారు. విజయవాడతో పాటు ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఆయన చేతిలో మోసపోయినవారున్నారని గుర్తు చేస్తున్నారు. కాగా, భార్గవ్ తన బృందంలోని ముఖ్యులకు ఏరోజుకారోజు రాబడిలో పది నుంచి ముప్పయి శాతం వాటా ఇస్తున్నాడు. దీంతో యువతుల రాకపోకల నుంచి విటులకు ఆహ్వానాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. భిన్న రకాల మీడియా మాటున ఏ రంగం వారినైనా బ్లాక్ మెయిల్ చేయడానికి వెనుకాడడని, తనకు సమాచారం ఇచి్చనవారికి దండిగానే ముట్టజెబుతాడని సమాచారం. -
చెప్పింది చేయాల్సిందే
సాక్షి, అమరావతి: అడ్డగోలు వ్యవహారాలకు చిరునామాగా మారిన కూటమి ప్రభుత్వంలో పలువురు ఎమ్మెల్యేలు సామాన్య ప్రజలనే కాకుండా, ఉన్నతాధికారులను సైతం బెంబేలెత్తిస్తున్నారు. తాము చెప్పిన ఎలాంటి పని అయినా నిబంధనలతో నిమిత్తం లేకుండా చేసేయాలని ఒత్తిడి చేస్తున్నారు. చేయకపోయినా, ఆ పని ఆలస్యమైనా వారిపై విరుచుకు పడుతున్నారు. ఏ స్థాయి అధికారి అయినా సరే బెదిరించడానికి, ఇష్టం వచ్చినట్లు తిట్టడానికి వెనుకాడడం లేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రెవెన్యూ ఉన్నతాధికారులపై వీరంగం వేసిన వ్యవహారం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఇళ్ల స్థలాల క్రమబద్ధికరణకు సంబంధించి ప్రశ్నోత్తరాల్లో ఒక ప్రశ్న అడిగిన ఆయన.. మంత్రి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఆ తర్వాత అసెంబ్లీలో అధికారులు ఉండే రూమ్‌లోకి వెళ్లి రెచ్చిపోయారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జయలక్మిని తన పని ఎందుకు చేయలేదంటూ ఇష్టానుసారం తిట్టిపోశారు. అరుపులు, కేకలతో వారిపైకి దూసుకెళ్లారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకుని సర్ది చెప్పినా వినిపించుకోలేదు. సీనియర్ ఐఏఎస్ అధికారులను ఏకవచనంతో సంబోధిస్తూ తిట్టడం చూసిన మిగిలిన అధికారులు బిత్తరపోయారు.పలువురు ఎమ్మెల్యేలు ఆయన్ను బలవంతంగా బయటకు తీసుకెళుతుండగా.. మీ సంగతి తేలుస్తానంటూ అధికారులను బెదిరించడం గమనార్హం. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు (2014–19) కూడా బొండా ఉమ... విజయవాడలో అప్పటి రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను అందరి ముందు తిట్టి రభస సృష్టించడం సంచలనం రేకెత్తించింది. ఎక్సైజ్ కమిషనరేట్‌లో నరసరావుపేట ఎమ్మెల్యే వీరంగం ఇటీవల నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబు ఎక్సైజ్ శాఖ కమిషనరేట్‌కు వెళ్లి నానా బీభత్సం సృష్టించడం అధికార వర్గాల్లో కలకలం రేపింది. నరసరావుపేటలోని మద్యం డిపోలో తాను సిఫారసు చేసిన 10 మందిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించలేదంటూ డైరెక్టర్ నిషాంత్‌కుమార్ ఛాంబర్లోకి వెళ్లి ఆయన్ను కదలనీయకుండా అడ్డుకున్నారు. అసభ్య పదజాలంతో మాట్లాడుతూ తాను రాసిన లేఖను ఎందుకు పట్టించుకోలేదంటూ నిలదీశారు. ఇప్పటికిప్పుడు తాను చెప్పిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లనని బీభత్సం సృష్టించారు.ఛాంబర్‌లోనే ఉన్న సోఫాలో పడుకుని హడావుడి చేయడంతో డైరెక్టర్.. సంబంధిత మంత్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. మంత్రి వెంటనే.. ఎమ్మెల్యేకు ఫోన్ చేసి వెనక్కు వచ్చేయాలని, తాను ఆ పని అయ్యేలా మాట్లాడతానని చెప్పినా ఆయన వినలేదు. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా అరవింద్‌బాబు పట్టించుకోలేదు. రెండున్నర గంటలపాటు ఛాంబర్‌లోనే ఉండడంతో గత్యంతరం లేక డైరెక్టర్ ఆయన చెప్పిన వారికి పోస్టింగ్‌లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారికి ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాతే అరవింద్‌బాబు అక్కడి నుంచి బయటకు వచ్చారు. మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్‌పై జనసేన ఎమ్మెల్యే దాడి కొద్ది రోజుల క్రితం కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై జనసేనకు చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేయడం కలకలం సృష్టించింది. విద్యార్థులు ఆడుకోవాల్సిన కాలేజీలో బయట వ్యక్తులకు అనుమతి లేదని చెప్పడంతో రెచ్చిపోయిన నానాజీ అనుచరులు వెంటనే ఆయన్ను పిలుచుకుని వచ్చి డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేశారు. ఎమ్మెల్యే నానాజీ సైతం బూతులు తిడుతూ డాక్టర్ మాస్క్‌ని లాగిపడేశారు.⇒ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్థానిక అధికారులను బెదిరించడం, తిట్టడం సర్వసాధారణం కావడం అందరికీ తెలిసిందే. తన వద్దకు వచ్చే అధికారులను ఎలా పడితే అలా మాట్లాడుతుండడంతో వారు బెంబేలెత్తుతున్నారు. అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేగా ఇప్పటికే ఆయన పేరుగాంచారు. ⇒ శ్రీకాళహస్తి, తాడిపత్రి, ఆమదాలవలస, దెందులూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్‌రెడ్డి, కూన రవికుమార్, చింతమనేని ప్రభాకర్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి (ఈయన కుమారుడు ఎమ్మెల్యే), తదితరులు అధికారులను బూతులు తిట్టడం పరిపాటిగా మారింది. ⇒ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో తనకు ఇష్టం లేని అధికారిని మున్సిపల్ కమిషనర్‌గా నియమించారని అక్కడి టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ దుర్భాషలాడుతూ ఆయన్ను కార్యాలయంలోనికి రానీయకుండా అడ్డుకుని రభస చేశారు. చంద్రబాబు అండతో రుబాబు విధి నిర్వహణలో ఉన్న తమను బెదిరించడం, అసభ్యంగా తిడుతుండడాన్ని ఐఏఎస్ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసెంబ్లీలో బొండా ఉమ, ఎక్సైజ్ కమిషనరేట్‌లో అరవింద్‌బాబు సృష్టించిన రభస ఉన్నతాధికారుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇలాగైతే పని చేయడం కష్టమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోతున్నారు. దీంతో ఇదంతా సీఎం ప్రోత్సాహంతోనే జరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమావేశాల్లో తనది పొలిటికల్ గవర్నెన్స్ అని సీఎం చెప్పడం, ఆ క్రమంలోనే అధికారులపై ఎమ్మెల్యేలు విరుచుకు పడడం జరుగుతుండడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే అధికారులు.. ఎమ్మెల్యేల దగ్గర కుక్కిన పేనుల్లా పడి ఉండి, వారు చెప్పిన తప్పుడు పనులు చేయడమేనా.. అనే చర్చ జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలని ఒత్తిడి చేయడం, చేయకపోతే దాడులు, దౌర్జన్యాలు చేసే సంస్కృతి రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేదని ఉన్నతాధికారులు చర్చించుకుంటున్నారు.ఇప్పుడు కూటమి పాలనలోనే ఆ సంస్కృతి కొత్తగా మొదలైందని, ఉన్నతాధికారులపై దాడులు జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయని వాపోతున్నారు. సీఎం చంద్రబాబు ఇలాంటి సీరియస్ అంశాలపై కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండడం, ఊరికే వారిపై సీరియస్ అయినట్లు, విచారణ జరుపుతున్నట్లు మీడియాకు లీకులిచ్చి, తర్వాత వదిలేయడం పొలిటికల్ గవర్నెన్స్‌లో భాగంగానే జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. -
‘రెడ్ బుక్’ రచయిత ఫోన్ కాల్ వలనే పోసాని విడుదల ఆలస్యం’
సాక్షి, గుంటూరు: రెండు ప్రెస్ మీట్లు పెట్టినందుకు పోసాని కృష్ణమురళిపై 18 కేసులు పెట్టారని.. 24 రోజులు జైలు పాలు చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన పోసానిని అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీటీ వారెంట్ల పేరుతో రాష్ట్రమంతటా తిప్పారని.. ఆ వయసులో పోసానిని అలా తిప్పటం కన్నా శిక్ష ఇంకేం ఉంటుంది?’’ అని అంబటి పేర్కొన్నారు.‘‘రెడ్ బుక్ రచయిత నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ అక్రమ కేసులు నమోదయ్యాయి. పోసాని హాస్య నటుడు కాబట్టి కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు. అంతమాత్రానికే కేసులు పెడతారా?. వినుకొండ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని పోలీసులు ఎత్తుకుపోయారు. మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబు మీద వ్యంగ్యంగా మాట్లాడారు కదా?. మరి ఆయనపై ఎందుకు కేసులు ఎట్టలేదు?. అక్రమ కేసులు పెట్టిన ఎవరినీ వదలేదిలేదు’’ అని అంబటి స్పష్టం చేశారు.పోలీసుల కన్నా మా న్యాయ వాదులు డబుల్ ఉన్నారు. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా మేము వస్తాం. పోలీసులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కోర్టుల్లో ఇబ్బంది పడతారు జాగ్రత్త. మా లీగల్ టీమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎవరినీ వదిలే ప్రసక్తి లేదు. శవాలు దొరకట్లేదుగానీ లేకపోతే అన్యాయంగా మర్డర్ కేసు కూడా పెట్టేవారు. నారా లోకేష్ కాల్ చేయటం వలనే పోసాని విడుదల ఆలస్యం అయింది. లేకపోతే మధ్యాహ్నానికే పోసాని బయటకు వచ్చేవారు. ఇలాంటి కుట్ర రాజకీయాలు ఎంతోకాలం నడవవు’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
‘జబర్దస్త్ స్కిట్లు.. బాబు, పవన్ వెకిలి నవ్వులు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వెటకారంగా నిర్వహించారని.. కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా, వెటకారంగా నిర్వహించారు అనేది ప్రజలందరూ చూశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన కడప వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జబర్దస్త్ కార్యక్రమంలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారంటూ దుయ్యబట్టారు.‘‘జీవితంలో ఎప్పుడు నవ్వని చంద్రబాబు వెకిలి నవ్వులు నవ్వారు. కనీస సంస్కారం లేకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వెకిలి నవ్వులు ఎందుకు?. కేవలం జగన్‌ను హేళన చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారా?. ఇవన్నీ మానుకుంటే చంద్రబాబుకు బాగుంటుంది. సిగ్గు లేకుండా, హుందాతనం లేకుండా ప్రవర్తించిన గ్రీష్మ అనే మహిళకు ఏ విధంగా ఎమ్మెల్సీ ఇచ్చావో స్పష్టం చేయాలి. టీడీపీలో ఎంతో మంది సీనియర్లు, నాయకులను కాదని రౌడీలకు పదవులా?’’ అంటూ సతీష్‌రెడ్డి నిలదీశారు.‘‘పులివెందుల నియోజకవర్గం నుంచి పవన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హత్య సినిమాపై ట్రోల్ చేశారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలోని సన్నివేశాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అదుపులోకి తీసుకుంటారా?. వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు చేస్తే పోలిసులు స్పందించడం దారుణం. టీడీపీ, జనసేన నాయకులకు సిగ్గు లేదు. వైఎస్సార్సీపీ నాయకులు హుందాతనంతో ప్రవర్తిస్తారు. సనాతన ధర్మం గురించి పవన్ కల్యాణ్ మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అపహస్యం చేశారు’’అని సతీష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అక్రమ కేసులతో అణచివేయలేరు: వైఎస్సార్సీపీ
సాక్షి, కృష్ణాజిల్లా: మచిలీపట్నం సబ్ జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను మాజీ మంత్రి పేర్ని నాని పరామర్శించారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో జరిగిన ఘర్షణలో 16 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టై రిమాండ్‌లో ఉన్న కార్యకర్తలను కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఆ పార్టీ అధ్యక్షులు పేర్ని నాని, దేవినేని అవినాష్, జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు పరామర్శించారు.పరామర్శ అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, పెనుగంచిప్రోలు తిరునాళ్లలో పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని.. విద్వేషపూరితంగా మాట్లాడుతూ రెచ్చగొట్టారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభల పై రాళ్లు, కర్రలు విసిరేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులను నోటికొచ్చినట్లు తిట్టారు. టీడీపీ వాళ్లు రెచ్చగొడుతున్నా పోలీసులు కనీసం కట్టడిచేయలేదు. టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసురుతుంటే ఆత్మరక్షణలో భాగంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు’’ అని పేర్ని నాని వివరించారు.‘‘టీడీపీ కార్యకర్తలు నానా గొడవ చేస్తుంటే పోలీసులు కనీసం స్పందించలేదు. తిరునాళ్లలో గొడవ జరిగినపుడు లేని వాళ్లను పోలీసులు ముద్ధాయిలుగా చేర్చారు. జాతరలో ప్రభలకు పూజలు చేస్తున్న పూజారి కుమారుడిని కూడా అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారిపై పోలీసులు అన్యాయంగా అక్రమ కేసులు పెట్టారు. అసలు ఈ రాష్ట్రంలో చట్టం, ధర్మం, న్యాయం ఉందా?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘పోలీసులు పసుపు పచ్చ కండువా వేసుకున్న వారిలా ఉద్యోగం చేస్తున్నారు. కిరాయి మూకలు, రౌడీ మూకలకు పోలీసులు వత్తాసు పలకడం దురదృష్టకరం. టీడీపీ వాళ్లు విసిరిన రాళ్లతో దెబ్బలు తగిలితే వైఎస్సార్సీపీ వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాకీ చొక్కాలేసుకున్న పోలీసులకు ఇది ధర్మమేనా?. చట్టాన్ని టీడీపీకి చుట్టంలా మార్చేసిన ఖాకీలను న్యాయం ముందు నిలబెడతాం. టీడీపీ పార్టీ ఖాజానా నుంచి మీకు జీతాలివ్వడం లేదని పోలీసులు గుర్తుంచుకోవాలి. అమాయకుల పై హత్యాయత్నం కేసుల్లో ఇరికించడం దుర్మార్గం’’ అని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.వారిని చట్టం ముందు నిలబెడతాం.. దేవినేని అవినాష్దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభ కంటే ముందు టీడీపీ ప్రభ వెళ్లాలని పెనుగంచిప్రోలులో పోలీసులు ఆపేశారు. టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో పోలీసులు గాయపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారు. వైఎస్సార్సీపీలో యాక్టివ్‌గా ఉండే కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసు పెట్టి 16 మందిని జైల్లో పెట్టారు. జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను పరామర్శించాం. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో వారికి ధైర్యం చెప్పాం. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులు తస్మాత్ జాగ్రత్త. అలాంటి వారిని చట్టం ముందు నిలబెడతాం’’ అని ఆయన హెచ్చరించారు.టీడీపీ ఆఫీస్ నుంచి పేర్లు.. వారిపై కేసులు: తన్నీరు నాగేశ్వరరావుజగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తిరుపతమ్మకు పసుపు కుంకుమ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. టీడీపీ పార్టీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనంగా ఉన్నప్పటికీ టీడీపీ పార్టీ కార్యర్తలు రాళ్లు, బాటిల్స్ విసిరారు. ఈ ఘటనలో పోలీసులు ఏకపక్షంగా 25 మందికి పైగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. చదువుకున్న యువకులను కావాలని కేసుల్లో ఇరికించారు. టీడీపీ ఆఫీస్ నుంచి పేర్లు పంపించిన వారిపై కేసులు పెట్టారు. గత యాభై ఏళ్లలో ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై న్యాయ పోరాటం చేస్తాం. తప్పుడు కేసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను అణచివేయలేరు -
YSRCP కార్యకర్త సుధాకర్ రెడ్డి దారుణ హత్య
-
కూటమి నేతలు ఇలాంటి చర్యలు మానుకోవాలి: మల్లాది విష్ణు
-
జగన్ పై టీడీపీ నేతల వేషాలు.. కట్టలు తెంచుకున్న కారుమూరు ఆగ్రహం
-
ఆ ఐపీఎస్ అధికారిని ఏపీకి పంపాల్సిందే!
సాక్షి, అమరావతి : ఓ ఐపీఎస్ అధికారిని డిప్యుటేషన్‌పై యూపీ నుంచి ఏపీకి పంపాల్సిందేనని చంద్రబాబు ప్రభుత్వం పట్టుపడుతోంది. నిబంధనలకు విరుద్ధమని కేంద్ర హోం శాఖ స్పష్టం చేస్తున్నా, తమకు ఆయన కావాల్సిందేనని తేల్చి చెబుతోంది. ప్రస్తుతం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆయన కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అంతగా పట్టుపడుతోందంటే..అనకాపల్లి జిల్లాకు చెందిన కె.సత్యనారాయణ 1998 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో రహదారి భద్రత విభాగం అదనపు డీజీగా ఉన్నారు. ఆయన టీడీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబానికి సమీప బంధువు కూడా. అందుకే 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన్ను ప్రత్యేకంగా డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చారు. అప్పట్లో ఆయన సీఐడీ విభాగంలో ఐజీగా విధులు నిర్వహించారు. డిప్యుటేషన్ కాలం ముగిసిన తర్వాత తిరిగి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిపోయారు. చెప్పింది చెప్పినట్లు చేస్తారని.. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రభుత్వ పెద్దలు సత్యనారాయణపై దృష్టి సారించారు. రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు, కక్షసాధింపు చర్యలతో విరుచుకు పడేందుకు అస్మదీయుడైన అధికారి కావాలని భావించారు. దాంతో ప్రభుత్వ ముఖ్య నేత దృష్టి సత్యనారాయణపై పడింది. అందుకే ఆయన్ను రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై పంపాలని కేంద్ర హోం శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే.. ..ఐజీ లేదా అంతకంటే ఉన్నత స్థాయి పోలీస్ అధికారులను డిప్యుటేషన్‌పై ఇతర రాష్ట్రాలకు పంపేందుకు నిబంధనలు సమ్మతించవు. అదే విషయాన్ని ఆ మధ్య కేంద్ర హోం శాఖ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సత్యనారాయణను డిప్యుటేషన్‌పై ఏపీకి పంపేందుకు నిరాకరించింది. దీనిపై కొన్ని నెలలు మౌనంగా ఉన్న ప్రభుత్వ పెద్దలు ఇటీవల మరోసారి కేంద్రంపై ఒత్తిడి తెస్తోందని సమాచారం. ఈ ప్రయత్నాలన్నీ రెడ్‌బుక్ రాజ్యాంగం వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసుల బాధ్యతలను సత్యనారాయణకు అప్పగించేందుకేనని పోలీస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేత ఇంటిపై టీడీపీ నేతల దాడి
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా, వైఎస్సార్సీపీ నేత ఫయాజ్ బాషా ఇంటిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దాడి చేయించారు.వైఎస్సార్ సీపీ నేత ఫయాజ్ బాషా.. తాడిపత్రిలో నూతనంగా ఇంటిని నిర్మించుకోగా, అన్ని అనుమతులు ఉన్నా కానీ టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వందలాది మంది అనుచరులతో ఫయాజ్ బాషా ఇంటిపై దాడికి తెగబడ్డారు. వైఎస్సార్ సీపీ నేత ఫయాజ్ బాషా ఇంటిపై జేసీ.. రాళ్లతో దాడి చేయించారు. టీడీపీ నేతలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. -
‘ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం’
సాక్షి, తాడేపల్లి: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉందా? అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. శుక్రవారం ఆయన తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మొండితోక అరుణ్ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. దళిత సమాజాన్ని అయోమయంలో పెట్టి రాజకీయంగా ప్రయోజనాలు పొందేందుకు నాటకాలు ఆడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనేక సందేహాలు కలుగుతున్నాయన్న ఆదిమూలపు.. ఈ అంశంపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.‘‘అసలు ఒక చట్టం చేయాలంటే దానికి అనుసరించాల్సిన విధి విధానాలు చంద్రబాబుకు తెలియదా? ఒక బిల్లును పకడ్బందీగా తయారు చేయాలి. దానిని సంబంధిత మంత్రి చేత సభలో ప్రవేశపెట్టాలి. దానిపైన సమగ్ర చర్చ జరగాలి. దానిలో మార్పులు చేర్పులు ఉంటే వాటిని ఆమోదించి, తరువాత దానిని గవర్నర్‌కు పంపుతారు. దానిని గవర్నర్ ఆమోదిస్తారా లేక కేంద్రానికి పంపుతారా అనేది ఉంటుంది. ఇది ఒక చట్టం విషయంలో ఏ ప్రభుత్వం అయినా పాటించాల్సిన విధానం ఇది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ విధానాన్ని ఎక్కడా అనుసరించినట్లు కనిపించడం లేదు’’ అంటూ ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు...గవర్నర్ ద్వారా తీసుకువచ్చే ఆర్డినెన్స్‌కు కేవలం కొన్ని నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. శాసనసభ సమావేశాలు లేని సమయంలో చట్టం చేయడం కుదరదు కాబట్టి ఆర్డినెన్స్‌ను తీసుకువస్తారు. బడ్జెట్ సమావేశాలు నెల రోజుల పాటు జరుగుతున్నా ఎందుకు ఈ సమావేశాలను వినియోగించుకోలేక పోయారు? అంటే దీని అర్థం ఇంకా రాజకీయం చేయాలన్న చంద్రబాబు ఉద్దేశం బయటపడినట్లే కదా?. ఆర్డినెన్స్ అనేది ఒక తాత్కాలిక వెసులుబాటు. అసెంబ్లీలో ఇంత పెద్ద అంశాన్ని ఆఖరిరోజు లఘు చర్చకు పెట్టడంపైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో చిత్తశుద్ది లోపించినట్లు, స్పష్టత లేకుండా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఏరకంగా దళితులకు న్యాయం జరుగుతుందనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది...ప్రభుత్వం వేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను మార్చి 10న కేబినెట్లో పెట్టారు. ఈ రిపోర్ట్ ను ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. అలా పెట్టి ఉంటే అందరూ దీనిపై చర్చించేవారు. ఏదైనా సందేహాలు ఉంటే దానిపై అందరూ కలిసి ఒక స్పష్టత వచ్చేలా చూసేవారు. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు కొన్ని విషయాలు మాట్లాడారు. ఆయన చెబుతున్నది ఏమిటో ఎవ్వరికీ అర్థం కాలేదు. రోస్టర్ విధానం మీద చంద్రబాబు చేసిన ప్రకటనలు పూర్తి అయోమయానికి దారి తీసేలా ఉన్నాయి. ఉద్యోగసంఘాలు కూడా ఇలాంటి రోస్టర్ విధానాన్ని ఎప్పుడు చూడలేదని చెబుతున్నారు...రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటమని చెబుతున్నారు. అలాగే 2026 జనాభా లెక్కలు జరిగిన తరువాత మళ్ళీ మార్పులు ఉంటాయని చెబుతున్నారు. అంటే సమస్యను మళ్ళీ మొదటికి తీసుకువస్తున్నారనే అనుమానాలు కలిగిస్తున్నారు. చంద్రబాబు చిత్తశుద్దితో కాకుండా మోసపూరితంగా వ్యవహరించడం, సమస్యను పరిష్కారం చేయడంకుండా దానిపైన మంటలు రేపడం, దానిపైన తన్నుకుంటూ ఉంటే రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడం కనిపిస్తోంది. తెలంగాణలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. అసెంబ్లీలో బిల్లు పెట్టారు. చట్టం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని పకడ్బందీగా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇలా ఎందుకు చేయలేదు?...ఎస్సీ వర్గీకరణ సమస్యకు ప్రభుత్వ సరైన పరిష్కారం చూపుతుందా? లేదా? లేక సమస్యను ఇలాగే ఉంచి వివాదాన్ని రాజకీయంగా రగిల్చి, ఎప్పటికీ ఆరని మంటలా చేసి, దానిలో చలి కాచుకోవాలని అనుకుంటోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వర్గీకరణ సమస్యను డోలాయమానంలో పెట్టి అణగారిన వర్గాలకు రావాల్సిన ఫలాలను రాకుండా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం రాష్ట్రప్రజలు అనుమానిస్తున్నట్లుగా రాజకీయంగా దీనిని వాడుకునేట్లుగానే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కూటమి పాలనలో మా చదువులు ముందుకు సాగనివ్వకుండా, మా ఆరోగ్యాలకు భద్రత లేకుండా, ఏదైనా భూమిని సాగుచేసుకుంటే కౌలురైతులుగా ఉన్న మా రైతులకు ఎలాంటి సహాయం లేకుండా ఇలా అన్ని రకాలుగా మాకు తీరని ద్రోహం చేస్తున్నారు...ఒకపక్క వర్గీకరణ సమస్యను అలాగే ఉంచి, మరోవైపు దళితుల అభ్యున్నతికి ఉపయోగపడే అన్ని పథకాలను అందకుండా చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం, పాఠశాలల్లో నాడు-నేడు ఇలా అన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు. ఉద్యోగాల కల్పన లేదు, చేయూత లేదు, రైతుభరోసా లేదు ఇలా గతంలో వైయస్ జగన్ గారు మా వర్గాలకు భరోసా కల్పించేందుకు అమలు చేసిన వెన్నుముక లాంటి పథకాలు, కార్యక్రమాలు లేనే లేవు. వర్గీకరణను అయోమయంలో నెట్టారు. 2026 జనాభా ప్రకారం జిల్లాను ఒక యూనిట్ అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఒక యూనిట్ అంటున్నారు. రాష్ట్రం ఒక యూనిట్ అంటే నష్టపోతాం. కోస్తా ప్రాంతంలో మాల సామాజికవర్గం, రాయలసీమ ప్రాంతంలో మాదిగ సామాజికవర్గం ఎక్కువగా ఉంది. స్టేట్ ఒక యూనిట్ తీసుకుంటే నష్టం జరుగుతుంది. న్యాయం జరగదు. జిల్లాను ఒక యూనిట్ గా చూడాలంటే 2026 జనాభా లెక్కలు తీసుకోవాలని చెబుతున్నారు. ఈ అయోమయం ఎందుకు? ..ముందుగానే కూటమి ప్రభుత్వ వైఖరిపై అనుమానాలు ఉన్నాయి. మనసా వాచా కర్మేణ అందరికీ న్యాయం జరగాలి. దళితుల్లో ఉపకులాలను విడగొట్టకుండా, దళితుల్లో ఐక్యతను పెంచడానికి, వారిని బలోపేతం చేయడానికి వైయస్ జగన్ గారి ప్రభుత్వం కృషి చేసిందో, సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ను ముందుకు తీసుకుపోవాలని మేం స్పష్టంగా ఆనాడే చెప్పాం. దానికీ ఈరోజుకూ కట్టుబడి ఉన్నాం. కానీ దీనికి విరుద్దంగా కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో వ్యవహరించింది. ఈ అంశంపై ఎల్లో మీడియా సమస్యను పక్కదోవ పట్టించేలా తప్పుడు రాతలు రాస్తోంది. ఈ అంశాన్ని అవకాశవాద, స్వార్థపూరిత రాజకీయాలకు వాడుకోకుండా, దీనిని పరిష్కారం లేని సమస్యగా మారుస్తే ప్రజలు తగిన విధంగా గుణపాఠం నేర్పుతారు.’’ అని ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. -
‘చంద్రబాబు ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు’
హైదరాబాద్: ఏపీలోని కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలముందు సూపర్ సిక్స్ అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వంలోకి వచ్చాక ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదంటూ మండిపడ్డారు. ఈరోజు(శుక్రవారం) సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన హర్షకుమార్.. ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల ఊసేలేదని విమర్శించారు.‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేదు , తల్లికి వందనం లేదు. పెన్షన్ పెంపు లేదు. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. ఏపీలో ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు. అమరావతి , పోలవరం అంటూ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది కూటమి ప్రభుత్వం. అసెంబ్లీలో ఒకరిపై ఒకరు పొగడ్డలకే సరిపోయింది. తిరుపతిలో తలపెట్టిన మాలల సభను చంద్రబాబు అడ్డుకున్నారు. ఏపీలో పాశవిక పాలన సాగుతోంది. మాలలను, మాదిగలను వేరు చేసి రాజకీయాలకు వాడుకుంటున్నారు. మాలల సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి ఓటమి రుచి చూపించారు. ప్రజల్లో పూర్తీ వ్యతిరేఖతను కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటోంది’ అని మండిపడ్డారు. -
Malladi Vishnu: రకరకాల వేశాలు వేయడం కాదు ఆలయాలు కూల్చి వేస్తుంటే ఏంచేస్తున్నావ్
-
గణపతి ఆలయం కూల్చివేత.. కూటమి సర్కార్‌పై వైఎస్సార్సీపీ ఫైర్
సాక్షి, విజయవాడ: దేవి నగర్ ట్రెండ్ సెట్ గేటెడ్ కమ్యూనిటీ కామన్ సైట్లో స్థానికులు నిర్మించుకుంటున్న గణపతి ఆలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. నిర్మాణం పూర్తవుతున్న సమయంలో బుల్డోజర్లతో కూల్చేశారు. వీఎంసీ కూల్చి వేసిన గణపతి ఆలయాన్ని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు.ఈ సందర్భంగా మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, వీఎంసీ అధికారులపై మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని కాపాడతామంటూ కూటమి నేతలు వేషాలేస్తున్నారని.. కూటమి పాలనలో దేవుడికే రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో వైకుంఠద్వార దర్శనం క్యూలైన్లలో తొక్కిసలాట జరిగి భక్తుల ప్రాణాలు పోయాయి’’ అని మల్లాది ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆలయాల కూల్చివేతలే. గతంలో విజయవాడలో ఆలయాలను కూల్చివేశారు. ఇటీవల కాశీనాయన ఆశ్రమాన్ని, జ్యోతిక్షేత్రంలోని అన్నదాన సత్రాలను కూల్చివేశారు. హిందూధర్మం అని వేషాలేసుకునే పవన్ కల్యాణ్‌కు తన పోర్టుపోలియోలో ఏం జరుగుతుందో తెలియదా?. నిన్న కాక మొన్న వివినరసరాజు వీధిలో గోశాలను కూల్చేశారు. ఈ రోజుకీ గోవులు ఎండలో మాడిపోతున్నాయి.ట్రెండ్ సెట్ గేటెడ్ కమ్యూనిటీ స్థానికులు ఏడాది క్రితం ఆలయ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ప్రారంభ దశలో అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడెలా కూల్చుతారు. ఆలయ గర్భగుడిని బుల్డోజర్లతో కూల్చివేశారు. ఎవరి ఆదేశాల మేరకు వీఎంసీ అధికారులు గణపతి ఆలయాన్ని కూల్చివేశారు. కూల్చివేతలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. -
విశాఖ స్టేడియంకు వైఎస్సార్ పేరును కొనసాగించాలి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రచేసి స్టేడియం ఆధునీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటుచేసిన ఎంట్రన్స్ ఆర్చ్పై, స్టేడియానికి చెందిన ఫసాట్లలో వైఎస్సార్ పేరు తొలగించినందుకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీమంత్రి, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో మేయర్ గొలగాని హరివెంకటకుమారి, జెడ్పీ చైర్పర్సన్ జె. సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు తొలుత స్టేడియం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పాలతో ఆభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నల్ల రిబ్బన్లతో పెద్దఎత్తున నిరసన చేపట్టారు. తొలగించిన వైఎస్సార్ పేరును యథావిధిగా పెట్టాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. విశాఖ ఉత్తర సమన్వయకర్త కేకే రాజు హౌస్ అరెస్ట్..మరోవైపు.. ఈనెల 19న విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్సార్సీపీ ఆందోళన చేపడుతుందని పిలుపునిచ్చిన మరుక్షణం నుంచి టీడీపీ కూటమి ప్రభుత్వం కుయుక్తులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నుంచే వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు, కార్పొరేటర్లకు పోలీసులు ఫోన్లుచేసి బెదిరించారు. నిరసన కార్యక్రమానికి ఎవరినైనా తీసుకెళ్తే అరెస్టుచేస్తామని హెచ్చరించారు. విశాఖ నార్త్ నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు వైఎస్సార్సీపీ ముఖ్యనేతల ఇళ్లకు వెళ్లి మరీ వార్నింగ్‌లు ఇచ్చారు.ఐపీఎల్ మ్యాచ్లవల్లే శాంతియుత నిరసనమాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ఈనెల 24, 30 తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో విశాఖ బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలన్న ఉద్దేశంతో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేశామని మాజీమంత్రి, విశాఖజిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. టీడీపీ కూటమి పార్టీల ఎంపీలు ఏసీఏలో సభ్యులుగా ఉండడంతోనే కుట్రపూరితంగా డాక్టర్ వైఎస్సార్ క్రికెట్ స్టేడియం ఆర్చ్పై వైఎస్సార్ పేరు తొలగించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్ మార్క్, ఆయన బ్రాండ్ కనబడకూడదనే వైఎస్సార్ పేరును తొలగించేందుకు కుట్ర చేశారని అమర్నాథ్ మండిపడ్డారు. గతంలో విశాఖ అభివృద్ధిలో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీతకొండ వ్యూ పాయింట్‌కు వైఎస్సార్ పేరు పెడితే దాన్ని తొలగించారని ఆక్షేపించారు.అలాగే, విశాఖ ఫిలింనగర్ క్లబ్ లాన్‌కు వైఎస్సార్ పేరు తొలగించారని, ఇవేకాక.. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేకచోట్ల వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వైఎస్సార్ పేరును ఏసీఏ తొలగించిందా..? లేదంటే కూటమి ప్రభుత్వం ఒత్తిడితో తొలగించారా..? 48 గంటల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమాధానం చెప్పాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. -
వాటిపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?.. పుత్తా శివశంకర్‌రెడ్డి సవాల్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులపై పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం, మరోసారి అదే పని చేసి, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపించారు. ఆ దిశలోనే మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో ఈ తొమ్మిది నెలల్లో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 4 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉందంటూ ప్రగల్భాలు పలికారని దుయ్యబట్టారు. ఈ విషయంలో ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక, రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందులో అన్ని వివరాలు పొందుపర్చాలని పుత్తా శివశంకర్‌రెడ్డి కోరారు.ఆయన ఇంకా ఏమన్నారంటే..శ్వేతపత్రం విడుదల చేస్తారా?:కూటమి ప్రభుత్వ ఈ 9 నెలల పాలనలో రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి నారా లోకేష్ ఆర్భాటంగా చెప్పారు. దాదాపు నెల రోజుల క్రితం, గత నెల 24న గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రంలో అప్పటి వరకు రూ. 6.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా 4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయని చెప్పుకున్నారు. నెల కూడా గడవక ముందే, రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారు.ఈ వ్యవధిలోనే రూ.50 వేల కోట్లు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి!. నిజానికి గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా రాష్ట్రంలో రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులపై మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీస్తే, సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. అలాగే ఉద్యోగాలు కల్పించామని చెప్పలేదని, అన్ని ఉద్యోగాలకు అవకాశం ఉందని చెప్పామని, పచ్చి అబద్ధం చెప్పారు. ప్రభుత్వానికి నిజంగా ఈ విషయంపై చిత్తశుద్ధి ఉంటే, వారు చెబుతున్నట్లుగా రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులపై పూర్తి వివరాలతో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎక్కడెక్కడ, ఎంతెంత పెట్టుబడులతో ఏయే పరిశ్రమలు ఏర్పాటయ్యాయి? వాటి ద్వారా ఎంత మందికి ఉపా«ధి లభించింది? అన్న పూర్తి వివరాలు ప్రకటించాలి.ఆ ధైర్యం మీకుందా?:గత మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించే వాళ్లం. ఎందుకంటే అంత పారదర్శకంగా ఎక్కడా ఏ లోపం లేకుండా, అర్హతే ప్రామాణికంగా అన్నింటినీ అమలు చేశాం. ఇప్పుడు మీరు కూడా అలా, మీ పనులను, పథకాల అమలును.. ముఖ్యంగా రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల వివరాలను ఆయా ప్రాంతాల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించగలరా? ఆ ధైర్యం మీకుందా?. నిజానికి కూటమి ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి నెలకొంది. దాడులు, కమీషన్ల వేధింపులకు పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ. కూటమి ప్రభుత్వ వేధింపులతో జిందాల్ స్టీల్ ప్లాంట్ మహారాష్ట్రకు పారిపోయింది. మీడియాను అడ్డం పెట్టుకుని దావోస్ పర్యటనలో హడావుడి చేయడం తప్ప, మీరు సాధించిందేమీ లేదు. దావోస్ పర్యటనను పెయిడ్ హాలిడేగా వాడుకున్నారు.2018కి పూర్వమే ఆ యూనిట్:విజయవాడ సమీపంలోని ఏపీఐఐసీ కారిడార్‌లో 2018కి పూర్వమే అశోక్ లీలాండ్ యూనిట్ ప్రారంభం కాగా, ఆ తర్వాత కోవిడ్ కారణంగా డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తి కూడా తగ్గింది. కానీ నిన్న (19వ తేదీ, బుధవారం) అక్కడ నారా లోకేష్ చేసిన అతి చూస్తే 2024లో తాము అధికారంలోకి వచ్చాకే, ఆ యూనిట్ ఏర్పాటైనంత బిల్డప్ ఇచ్చారు. ఆ యూనిట్‌కు తామే అనుమతి ఇచ్చినట్లు, దాన్ని తామే తెచ్చినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం. ఎప్పుడో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లో ఇప్పుడు 600 ఉద్యోగాలు రాబోతున్నట్టు ప్రచారం చేసుకోవడం మరీ విడ్డూరం.లోకేష్.. మంత్రిగా మీరు అశోక్ లీలాండ్ బస్పు ఎక్కడం కాదు.. ఎన్నికల్లో సూపర్‌సిక్స్ హామీల్లో మీరిచ్చిన మహిళలకు ఉచిత బస్సు హామీని అమలు చేసి టికెట్లు లేకుండా వారిని బస్సుల్లో తిప్పండి. తన శాఖ తప్ప, అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్న మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారు. గవర్నమెంట్ స్కూళ్లలో డ్రాపవుట్స్ పెరుగుతున్నా, విద్యాశాఖను సరిగ్గా నిర్వహించలేకపోతున్న లోకేష్, తనది కాని పరిశ్రమల శాఖలో వేలు పెట్టి హడావుడి చేశాడని పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపించారు. -
లిక్కర్ స్కాం పేరుతో 'కూటమి' భారీ కుట్ర: మనోహర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులపై కక్షసాధింపులో భాగంగా లేని లిక్కర్ స్కాంను ఒక పథకం ప్రకారం సృష్టించిందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ స్కాం పేరుతో కూటమి ప్రభుత్వమే ఒక భారీ కుట్రకు శ్రీకారం చుట్టి, వైఎస్సార్సీపీ నేతలను దానికి బాధ్యులుగా చూపించేందుకు దుర్మార్గమైన ప్రణాళికను అమలు చేస్తోందని మండిపడ్డారు. ఈ స్కాం పేరుతో జరుగుతున్న హంగామాను పరిశీలిస్తే కూటమి ప్రభుత్వం ఎంత నిస్సిగ్గుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నం చేస్తోందో తెలుస్తుందన్నారు.ఇంకా ఆయన ఏమన్నారంటే..ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని, సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లను తప్పుడు కేసులు బనాయించి వేధించిన ప్రభుత్వం, తాజా మరో భారీ కుట్రకు తెరతీసింది. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో రూ.4వేల కోట్ల లిక్కర్‌స్కాం జరిగిందంటూ ఒక ప్రణాళిక ప్రకారం కూటమి ప్రభుత్వం ఈ కుట్రను అమలు చేస్తోంది. 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన మద్యం పాలసీలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి. డెబ్బైశాతం బ్రాండ్లను ఎంపిక చేసిన నాలుగు కంపెనీలకే ఇచ్చారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని తగ్గించాయి. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. వీటిపై వైయస్ఆర్సీపీ ప్రభుత్వం 2023లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అధికారులపై వత్తిడి తెచ్చి ఆ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ను పక్కకు పెట్టేయించారు. ఈ కేసుల్లోంచి ఇప్పుడు బయటపడేందుకు వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మద్యం పాలసీపై ఎదురుకేసులు నమోదు చేయించేందుకు కూటమి ప్రభుత్వం తెగబడిందికూటమి పెద్దల డైరెక్షన్లోనే ఫిర్యాదువైఎస్సార్సీపీ ప్రభుత్వంపై లిక్కర్ స్కాం పేరుతో కేసులు నమోదు చేసి కక్షసాధించేందుకు కూటమి పెద్దల డైరెక్షన్లోనే శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా 9.9.2024న వై.వెంకటేశ్వర శ్రీనివాస్ అనే వ్యక్తి రిజిస్టర్ పోస్ట్ ద్వారా రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక లేఖ రాశారు. ఈ వ్యక్తి తన లేఖలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ పాలసీలో అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని, ఢిల్లీ లిక్కర్ స్కాం కన్నా పెద్ద స్కాం జరిగిందని ఆరోపణలు చేశారు. ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు చేశారో, ఈ వ్యక్తికి ఉన్న విశ్వసనీతయ ఏమిటో కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు.ఈ లేఖను కోట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో అంతర్గత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఆగమేఘాల మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఒక మెమోను జారీ చేశారు. తొమ్మిది రోజుల్లోనే ఈ మెమోను ఆధారం చేసుకుని బేవరేజెస్ కార్పోరేషన్ నుంచి వచ్చిన నివేదికలో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని నిర్ధారిస్తూ, దీనిపై విచారణ జరపాలంటూ ముఖేష్ కుమార్ మీనా 20.9.2024న సీఐడీకి ఫిర్యాదు చేశారు.వెంటనే సీఐడీ అధికారులు దీనిపై 23.09.2024న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే దీనిలో ఎవరిని విచారించారు, ఏ అంశాలను పరిశీలించారు, ఎటువంటి ఫైళ్ళను తనిఖీ చేశారు అనే కనీస సమాచారం కూడా లేదు. అంతేకాకుండా ఈ ఎఫ్ఐఆర్ నెం.21/2024లోని కాలమ్ నెంబర్ 7లో ముద్దాయిలు అని ఉన్న చోట 'గుర్తు తెలియని వ్యక్తులు' అని కోట్ చేశారు. అలాగే మొత్తం రూ.4000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇంత మొత్తం ఎలా అవినీతి జరిగిందో దానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు.తెలుగుదేశం వీర విధేయులతో సిట్ ఏర్పాటుసాధారణంగా ఏదైనా భారీ అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత అంశాలపై ఆడిట్ రిపోర్ట్‌లను పరిశీలిస్తారు. విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తారు. అటువంటివి ఏమీ లేకుండా ఒక సాధారణ వ్యక్తి లేఖ రాస్తే, దానిపై తొమ్మిది రోజుల్లో నివేదిక తెప్పించుకుని, తక్షణం సీఐడీకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదు చేయడం, రెండు రోజుల్లో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చూస్తేనే దీని వెనుక కూటమి ప్రభుత్వ పెద్దలు నడిపిస్తున్న నాటకం అర్థమవుతుంది. అంతేకాదు సీఐడీ ఏకంగా అయిదుగురు అధికారులతో ఈ కేసుపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి వీరవిధేయులుగా ఉన్న ఆఫీసర్లను ఏరికోరీ మరీ ఈ సిట్‌లో నియమించారు.సిట్‌ను నియమించే సందర్బంలో సుప్రీంకోర్టు సూచించిన ఏ మార్గదర్శకాలను కూడా పాటించలేదు. సిట్‌కు సంబంధించిన పోలీస్‌స్టేషన్‌ను పేర్కొనలేదు. అందులో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, స్టేట్మెంట్లు రికార్డు చేసే సమయంలో దానిని చిత్రీకరించాలన్న నిబంధనలను పట్టించుకోలేదు. బేవరేజెస్ కార్పోరేషన్‌కు సంబంధించిన ఫైళ్ల రూటింగ్‌ను పరిగణలోకి తీసుకోలేదు. కార్పోరేషన్ ఉద్యోగులను బెదిరించి, భయపట్టి సిట్ తాము రాసుకున్న స్టేట్మెంట్లపై సంతకాలు చేయించుకుంది. తాము చెప్పినట్లు కొందరి పేర్లు లిక్కర్ స్కాంలో ఉన్నాయని చెప్పకపోతే మీ ఉద్యోగాలు ఉండవు, ఈ కేసులో జైలుకు వెళ్ళాల్సి వస్తుందంటూ బెదిరించారు. సంతకాలు పెట్టిన ఉద్యోగులు తాము సాక్ష్యులమా, లేక ముద్దాయిలమా అని భయాందోళనలు చెందుతున్నారు. అలాగే డిస్టలరీ కంపెనీలను సిట్ అధికారులు బెదిరించి తమకు అనుకూలమైన స్టేట్మెంట్లపై సంతకాలు చేయించుకుంటున్నారు.ముందు బురదచల్లడం... తరువాత ముద్దాయిలుగా చూపడంలిక్కర్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ముద్దాయిల కాలమ్‌లో ఎవరి పేర్లు లేకపోయినప్పటికీ వైఎస్సార్సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి పేరు ఉన్నట్లు ఎల్లో మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఎల్లో మీడియాలో దీనిపై బుదరచల్లేలా ప్రముఖంగా వార్తలు రాయించారు. దర్యాప్తునకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు ఎల్లో మీడియాకు లీకులు ఇస్తూ, తాము ఎవరినైతే ఈ కేసులో ఇరికించాలని భావిస్తున్నారో వారిపై తప్పుడు కథనాలను రాయిస్తూ, ఆ తరువాత వారిని ముద్దాయిలుగా చూపే కుట్ర జరుగుతోంది.లిక్కర్ పాలసీ ప్రకారమే బేవరేజెస్ కార్పోరేషన్ పనిచేసింది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్తగా ఏ డిస్టలరీకి అనుమతులు ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో అనుమతులు పొందిన డిస్టలరీల నుంచే కొనుగోళ్ళు చేసింది. మద్యంను నియంత్రించేందుకు ఒక పారదర్శక విధానాన్ని అమలు చేసింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మద్యంపై అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తప్పుడు కేసులతో వేధింపులకు పాల్పడాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. -
కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ తొలగింపు
-
విశాఖ గురించి అన్ని చెప్పి ప్రపోజల్స్ ఏమీ లేవు: రవీంద్రబాబు
-
పల్నాడు జిల్లా ఈపూరులో YSRCP నేత కొండ వర్ణి నాగేశ్వరరావు అరెస్ట్
-
రోజూ ఆవు కథ చెబితే ఎలా?.. కూటమి సర్కార్‌పై బొత్స ఫైర్
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్‌కు నిధులు కేటాయించకుండా కూటమి సర్కార్ కాలక్షేపం చేస్తోందని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదంటూ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన శాసన మండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారానికి ప్రయత్నం చేశామని.. కానీ ప్రభుత్వం.. మార్షల్స్‌ను తెచ్చి మమ్మల్ని సభ నుంచి బయటికి పంపించేందుకు చూసిందని మండిపడ్డారు.‘‘ఓటేశారు.. మేం గెలిచాం...ఇక దోచుకుంటే సరిపోతుందనే భావనలో ప్రభుత్వం ఉంది. 15 రోజుల సభలో ప్రభుత్వ తీరును మేం ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లోనైనా ప్రజలకు మంచి చేస్తారని మేం ఆశిస్తున్నాం. ప్రజల ఆంకాంక్షకు తగ్గట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం లేదు. వర్గీకరణ కోసం షెడ్యూల్ కులాలు పోరాడుతున్నాయి. వర్గీకరణ కోసం పోరాడిన వారిపై టీడీపీ కేసులు పెట్టింది. ఆ కేసులను ఎత్తేసిన ఘనత వైఎస్ జగన్‌ది. అన్ని కులాల వారికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’’ అని బొత్స పేర్కొన్నారు.ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్టుపై చర్చ లేకుండా ప్రకటన ఇచ్చారు. అసలు వర్గీకరణ ఎలా చేశారు? ఏ విధంగా చేశారో కనీస చర్చలేదు. ప్రభుత్వం అన్ని వర్గాలను కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. వైఎస్ జగన్ అన్ని కులాలను గౌరవించారు. పదవుల్లోనూ అందరికీ న్యాయం చేశారు. అంబేద్కర్ స్మృతివనం పెడితే ఈ ప్రభుత్వానికి కన్ను కుట్టింది. అట్టడుగు వర్గాల వారికి గౌరవం ఇవ్వడం ఈ ప్రభుత్వానికి నచ్చదు. అట్టడుగు వర్గాలపై ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ద్వేషం. ఈ ప్రభుత్వం తీరును మేం తప్పుపడుతున్నాం’’ అని బొత్స దుయ్యబట్టారు.గౌరవంగా అన్ని వర్గాలు జీవించేలా ప్రభుత్వం చొరవతీసుకోవాలి. అందరికీ మంచి చేయాలనే మేం కోరుతున్నాం. అధికార పార్టీ సభ్యులు రోజూ చెప్పిందే చెబుతున్నారు. రోజూ ఆవుకథ చెబితే ఎలా?. ఎన్నికల ముందు చేసిన ప్రచారాలు, హామీలు మర్చిపోయారా?. కూటమి మాదిరి మోసం దగా వైఎస్సార్సీపీకి అలవాటు లేదు. అదే అలవాటు వైఎస్సార్సీపీకి ఉంటే మేం కూడా 100 అబద్ధాలు చెప్పేవాళ్లం’’ అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. -
దావోస్.. టైమ్ పాస్? నిజం ఒప్పుకున్న టీడీపీ
-
అపరిచితుడికి నెక్ట్స్ లెవల్లో జనసేనాని!
రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సభలు సాధారణంగా తాము సాధించిన విజయాల గురించి లేదా.. చేయబోయే పనుల గురించి కార్యకర్తలకు, అభిమానులకూ వివరించే వేదికలుగా ఉపయోగించుకోవడం కద్దు. అయితే ఇటీవలే పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భవ సభలో పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ద్వారా ఏం చెప్పదలచుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. పవన్.. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి చెప్పిందేమిటి? పది నెలలుగా అధికారంలో ఉన్న తరువాత ఇప్పుడు చేస్తున్నదేమిటి? ఒకరకంగా చూస్తే పవన్ మాట మార్చడంలో రికార్డు సృష్టిస్తున్నారనే చెప్పొచ్చు. జనసేన వార్షికోత్సవ సభలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బోలెడన్ని అబద్ధాలు చెప్పుకొచ్చారు. స్వోత్కర్ష, ఇతరులు పొగడం బాగానే ఉన్నా.. తన సినిమా గబ్బర్‌సింగ్‌లోని డైలాగ్ మాదిరి ఎవరి డబ్బు వారే కొట్టుకున్నట్లుగా ఈ సభ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ను దూషించడం కోసం కూడా ఈ సభను ఏర్పాటు చేసుకున్నారు. అన్నిటిలోకి కీలకమైన పాయింట్ ఒకటి మాత్రం ఉంది. నలభై ఏళ్ల తెలుగుదేశం పార్టీని తానే నిలబెట్టానని పవన్ ప్రకటించడం. ఇందులో కొంత వాస్తవం, మరికొంత అవాస్తవం ఉంది. పవన్ కళ్యాణ్‌ను మేనేజ్ చేసి తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోగలిగింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ సపోర్టు పొందగలిగింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో(Pithapuram Public meeting) చేసిన వ్యాఖ్య టీడీపీ శ్రేణులలో మంట పుట్టించింది. కొందరు టీడీపీ, అభిమానులు పవన్‌ను ఎద్దేవా చేస్తూ, దూషిస్తూ కామెంట్లు కూడా పెట్టారు. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏకంగా.. ‘‘క్వింటాల్ వడ్లు తూగడానికి ఒక్కోసారి కొన్ని వడ్లు అవసరం అవుతాయి. కాని ఆ కొన్ని వడ్లవల్లనే మొత్తం కాటా తూగింది అనుకుంటే ఎలా.. సేనాధిపతి?’’ అని ఎద్దేవా చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ లేదా ఆయన సోదరుడు నాగబాబు సమాధానం చెబుతారా? 👉.. అదే సమయంలో టీడీపీ(TDP) లేకుండా అసలు పవన్‌కు గెలిచే పరిస్థితి లేదని టీడీపీ శ్రేణులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నాయి. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ విజయం సాధించారంటే అది టీడీపీ పుణ్యమే అనే సంగతి గుర్తుంచుకోవాలని వారు చెబుతున్నారు. పవన్ లేకపోతే చంద్రబాబు సీఎం అయ్యేవారే కాదని జనసేన వారి వాదన. ఈ రకంగా ఒకరినొకరు దుయ్యబట్టుకుంటున్నా, ఇద్దరూ కలిసి సాగడానికి పెద్ద ఇబ్బంది పడడం లేదు. పవన్ కేవలం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కే కాకుండా ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌కు కూడా విధేయత కనబరుస్తున్నట్లు అనిపిస్తుంది. రెండు వైపులా ఆత్మాభిమానం అన్నది పెద్ద సమస్య కాకపోవడం కూడా వీరికి కలసి వచ్చే పాయింట్. 👉పవన్ కళ్యాణ్ ఈ సభలో సూపర్ సిక్స్ గురించి కాని, ఎన్నికల ప్రణాళికలోని అంశాల గురించి కాని ప్రస్తావించకుండా తన గొప్ప గురించి, తన కుటుంబం గొప్ప గురించి చెబితే ఆయన అభిమానులు అమాయకంగా చప్పట్లు కొట్టవచ్చు. ప్రజలకు ఒరిగేదీ ఉండదు. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఎక్కాలు చదివి మరీ ప్రచారం చేశారే! వలంటీర్ల కడుపు కొట్టనంటూ, రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని కథలు చెప్పారే. నిరుద్యోగ భృతి రూ.మూడు వేలు ఇస్తామని, ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని అన్నారే. పవన్ కళ్యాణ్ అయితే ప్రతి నియోజకవర్గంలో 500 మందికి రూ.పది లక్షల చొప్పున ఇచ్చి వారందరిని అభివృద్ది చేసేస్తామని గప్పాలు కొట్టారే. వీటి గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా తాను గెలవడమే గొప్ప అనుకోండని అంటున్నారు. జనసేనకు సిద్దాంత బలం ఉందని చెబుతుంటే నవ్వు వస్తుంది. ఏ సిద్దాంతం ఉందో ఎవరికి అర్థం కాదు. చెగువేరా నుంచి సనాతని వరకు రకరకాల వేషాలు మార్చి నట జీవితంలోనే కాదు.. రాజకీయ జీవితంలో కూడా బహురూపి అన్న విధంగా వ్యవహరించిన పవన్ సిద్దాంతం ఎలాగైనా అధికారంలోకి రావడమే అన్నది అర్థమవుతూనే ఉంది. పిఠాపురంలో వర్మే తనను గెలిపించాలని చేతులు పట్టుకుని అర్థించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వర్మను ఎంతలా అవమానిస్తున్నారు? నాగబాబు సభలో అంతగా వర్మను అవమానించవలసిన అవసరం ఉందా? దానిని పవన్ కూడా సమర్థిస్తున్నట్లే కదా! ఈ ఒక్కటి చాలదా! పవన్ నైజం ఏమిటో తెలుసుకోవడానికి. సనాతన ధర్మం తన రక్తంలోనే ఉందని చెప్పి ప్రజలను మాయ చేసే యత్నం చేస్తున్నారు. అంత సనాతని అయితే తన ఇంటిలోనే అన్య మతాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారన్నది హిందూ ధర్మవాదుల ప్రశ్న. ఒకసారి కులం లేదు.. మతం లేదు.. అంటూ గంభీర ప్రసంగాలు చేసి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి సనాతని అంటూ కల్లబొల్లి కబుర్లు చెబితే జనం నమ్మాలన్నమాట. నిజంగానే ధర్మం, సత్యం ఆచరించేవారైతే ఇప్పుడు కూడా నిత్యం అసత్యాలే చెబుతున్నారే? అదేనా ధర్మం చెప్పేది. తిరుమల లడ్డూ పట్ల అపచారం చేసిన పవన్ దానిని బుకాయించి నిందితులు అరెస్టు అయ్యారని అంటున్నారే. పవన్ ఆనాడు చెప్పిందేమిటి? తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన పిచ్చి ఆరోపణను భుజాన వేసుకుని హడావుడి చేశారే. దానికి తోడు అయోధ్యకు కల్తీ నెయ్యి వాడిన లడ్డూలు పంపారని నింద మోపారే! లడ్డూలలో కల్తీ నెయ్యి వాడినట్లు ఎక్కడా ఆధారాలు దొరకలేదే! కల్తీ నెయ్యి ఉండడం వేరు. కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేయడం వేరు. తగు ప్రమాణాలు లేని నెయ్యిని టీటీడీ వెనక్కి పంపించింది కదా! అయినా పవన్ అబద్దం ఆడుతున్నారంటే ఆయనకు సనాతన ధర్మం మీద ఎంత నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు. 👉రాజకీయం కోసం ఏ వేషం అయినా కట్టవచ్చన్నది ఆయన నమ్మిన ధర్మం అన్న భావన కలగదా! దీపారాధన చేసే దీపంతో తన తండ్రి సిగెరెట్ వెలిగించుకునేవారని గతంలో చెప్పి.. ఇప్పుడు తమ ఇంటిలో అంతా రామ జపమే చేస్తారని చెబితే వినేవాళ్లను వెర్రివాళ్లను చేయడం కాదా! అసలు ఆయన తండ్రి గురించి ఎవరు అడిగారు. ఆ విషయాలతో జనానికి ఏమి సంబంధం. ఇన్నేళ్ల రాజకీయంలో తాను ఎక్కడ పుట్టింది, ఎక్కడ చదవింది అన్న విషయంలో ఎన్ని రకాలుగా మాట్లాడారో వీడియో సహితంగా కనిపిస్తుంటాయి. 👉వైఎస్ జగన్(YS Jagan) పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పనులు చేసింది, ఎవరెవరిని ఎలా ఇబ్బంది పెట్టింది ఆయన మనసుకు తెలియదా! గతంలో ఉత్తరాది, దక్షిణాది అంటూ గొంతు చించుకుని అరచి మరీ మాట్లాడిన పవన్ కు సడన్ గా జ్ఞానోదయం అయిందని అనుకోవాలా? హిందీ గురించి కూడా మాట్లాడారు. దానికి ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బదులు ఇస్తూ ‘‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి’’, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please అని కామెంట్ చేశారు. ఏపీలో ఆంగ్ల మీడియం ను వ్యతిరేకించే పవన్ కళ్యాణ్ బీజేపీ వారి మెప్పుకోసం హిందీ గాత్రం అందుకున్నారు. సమాజంపై అవగాహన లేకుండానే పార్టీ పెట్టేస్తామా అని ఆయన ప్రశ్నించారు. నిజమే.. అసలు సమాజం పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా, సినీ నటుడుగా ప్రజలను ఆకర్షించి, ఈ పదేళ్లలో అనేక మార్లు మాట మార్చి, రంగులు మార్చి ఎలాగైతే ఉప ముఖ్యమంత్రి కాగలిగిన పవన్ కళ్యాణ్ నిలిచి గెలిచారన్నంత వరకు ఓకే గాని, మిగిలినవాటిలో అసత్యాలు, అసంబద్ధ విషయాలే ఉన్నాయని చెప్పాలి. ప్రజలను ఏమార్చడం వరకు సఫలం అయ్యారని ఒప్పుకోవచ్చు. దానికి ఆయన సోదరుడు ,మెగాస్టార్ చిరంజీవి మనసు ఉప్పొంగిపోవచ్చు. చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ చేసిన బాసలు మర్చిపోవడమే కాకుండా నిత్యం కలుషిత రాజకీయాలు చేస్తున్న తీరు మాత్రం మాత్రం ప్రజల మనసులను కకావికలం చేస్తుంది. కొసమెరుపు ఏమిటంటే.. ఏ దేశమేగినా..అన్న గేయం రాసింది గురజాడ అప్పారావు అని చెప్పడం. అది రాసింది రాయప్రోలు సుబ్బారావు అన్న సంగతి వేల పుస్తకాలు చదివిన విజ్ఞాని పవన్‌కు తెలియదా? లేక ఆయన ఉపన్యాసం రాసిన వ్యక్తికి తెలియదా! శ్రీ శ్రీ నవ సమాజం కోసం రాసిన గేయాన్ని సనాతన ధర్మానికి వాడుకోవడం కూడా హైలైటే!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దేశంలోనే టిడిపి నెంబర్ వన్
-
గూగుల్, గేట్స్ ముసుగులో నడుస్తున్నదంతా మాయేనా?
‘గోరంతను కొండంతలుగా చేసి చెప్పడం’ అని తెలుగులో ఒక సామెత ఉంటుంది. ఫరెగ్జాంపుల్ ‘ఒక పని’ చేయడం వల్ల వాస్తవంగా దక్కే ప్రయోజనం పది రూపాయలు ఉన్నదనుకోండి.. అక్కడ ఓ వెయ్యిరూపాయల లాభం రాబోతున్నట్టుగా పదేపదే టముకు వేయడం, ప్రచారం చేసుకోవడం లాంటిదన్నమాట. వాస్తవం ఏంటంటే.. ఆ పని ఇంకా మొదలు కాదు కూడా! కానీ, ఆ పని చేయగానే వెయ్యి రూపాయలు లాభం తనకు రాబోతున్నట్టుగా.. ఒక వ్యక్తి బీభత్సంగా ప్రచారం చేసుకుని.. లాభాలను ప్రొజెక్టు చేసి, ఓ అయిదువందల రూపాయల అప్పులు పుట్టించాడనుకోండి. ఆ అయిదువందల రూపాయలతో చిన్న వ్యాపారం చేసి ఓ రెండొందల లాభాలు ఆర్జించాడనుకోండి. అతనివద్ద నికరంగా రెండొందల రూపాయలైతే ఉంటాయి. కానీ, దీనంతటికీ మూలం అయిన ‘ఒక పని’ అనేది జరిగిందో లేదో, అన్నట్టుగా వెయ్యిరూపాయల లాభం వచ్చిందో లేదో ఎవ్వరికీ తెలియదు. ఇలాంటి మేధావిని, ఈ టెక్నిక్కులను ఏమనాలి? వీటినే గజకర్ణ, గోకర్ణ టక్కుటమార విద్యలు అని అంటారు. కేవలం మార్కెటింగ్ మాయాజాలంతో బాహ్య ప్రపంచాన్నంతా ఒక మాయలో ఉంచి.. నడిపించే దందా అన్నమాట. వాస్తవాలు వేరే ఉంటాయి.. వాటి ద్వారా పొందే ప్రయోజనాలు వేరే ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో అనుసరిస్తున్న వైఖరి.. ఈ గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలనే తలపిస్తోంది. కాస్త లోతుగా గమనించండి. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు వస్తోన్నదంటే.. వారు పెట్టే పెట్టుబడుల గురించి, కల్పించబోయే ఉద్యోగావకాశాల గురించి గోరంతలను కొండంతలుగా పెంచి చూపిస్తూ.. కొన్ని వందలసార్లు తమ అనుకూల మీడియాలో వార్తలు వేయించుకుంటూ.. తప్పుడు ప్రచారాలు సాగించడం చంద్రబాబు స్టయిల్! చిన్న సంస్థ వస్తున్నా సరే.. ఇన్ని వందల కోట్లు పెడుతున్నారు.. ఇన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అని నారా తండ్రీ కొడుకులు పదేపదే చెబుతూ ప్రజల్ని మాయ చేస్తుంటారు. రెండు ఉదాహరణలు తీసుకుందాం. విశాఖలో గూగుల్ ఇన్నోవేషన్ హబ్ అంటున్నారు. దీనిద్వారా రాష్ట్ర యువతరానికి స్కిల్ డెవలప్మెంట్ కోసం శిక్షణలు అందుతాయని అంటున్నారు. అలా జరిగితే మంచిదే. అయితే గూగుల్‌ను తీసుకురావడం.. ఓ మహాద్భుతం అని చెప్పుకునే పాలకులు.. గూగుల్ మన రాష్ట్రంతో వ్యాపారం చేస్తున్నదని, మన డబ్బులనే వారికి చెల్లిస్తున్నాం తప్ప.. వారు తమ సంస్థ డబ్బు ఒక్క రూపాయి కూడా ఇక్కడ పెట్టుబడి రూపంలో పెట్టడం లేదు.. ఇక్కడ వారేమీ వందల వేల ఉద్యోగాలు ఇవ్వబోవడం లేదు.. అనేది దాచిపెడుతున్నారు. అయితే యువతరానికి నైపుణ్యాల ముసుగులో.. ఖజానా నుంచి రాచమార్గంలో దోచిపెడతారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అవసరమే. కానీ.. వాటిని పరిమితంగా ప్రారంభించి.. గూగుల్ కు దోచిపెట్టే డబ్బును.. సొంత నైపుణ్యాలు, సొంత ఆలోచనలు కలిగి ఉన్న యువతరానికి ఉచితంగా పెట్టుబడులుగా సమకూరిస్తే యువతరం మరింతగా బాగుపడుతుంది కదా.. అనే ఆలోచన ప్రభుత్వం వారు చేయరు. యువతరం కోసం అంటూ గూగుల్ కు వందల కోట్ల రూపాయలు సమర్పించుకోడానికి సిద్ధపడతారే తప్ప.. నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీని పట్టించుకోరు. ఇదంతా వంచన కాక మరేమిటి?.బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో ఒప్పందాలు కూడా ఇంచుమించు ఇలాంటివే. గేట్స్‌తో నలభై నిమిషాలు కూర్చోవడమే తన జీవితానికి అత్యున్నత విజయం అయినట్టుగా చాటుకుంటున్నారు చంద్రబాబునాయుడు. కానీ ఏం సాధించారు. ఈ ఒప్పందాల మర్మం ఏమిటి? అనేక రంగాలను జాబితాగా ప్రకటించి.. గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తుంది అని చెప్పేశారు. ఎన్ని వేల కోట్లు గేట్స్ ఫౌండేషన్ ఏపీకి ఇవ్వనున్నదో స్పష్టంగా చెప్పరు ఎందుకు? ఎందుకంటే.. వారు ఒక్కరూపాయి కూడా ఇవ్వడం లేదు. వారు ఆల్రెడీ తయారు చేసుకుని ఉన్న సాంకేతికతలను ఏపీ కోసం వాడుకోవడానికి వారికి రాష్ట్రప్రభుత్వమే వందల కోట్లు ముట్టజెప్పడానికి సిద్ధపడుతూ ఒప్పందాలు చేసుకుంటున్నదేమోనని ప్రజల అనుమానంగా ఉంది. ఆధునికత, సాంకేతికత, ఏఐ వంటి మాయాపూరితమైన పదాల ముసుగులో పది రూపాయల ఖర్చయ్యే వ్యవహారాలకు పదివేల రూపాయలు ముట్జజెప్పినా.. అది సామాన్యులకు బోధపడేసరికి పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. పాలన అవకాశం దక్కింది కదా అని ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా, తాను ఏ హామీలతో ప్రజలను బురిడీ కొట్టించారో వాటిని పట్టించుకోకుండా.. ఇలాంటి దొంగ చాటు దందాలు నడిపించడం ప్రజలను మోసం చేయడమేనని, ఇవే సంస్థల నుంచి పెట్టుబడుల రూపంలో, ఉద్యోగాల రూపంలో రాష్ట్రానికి ఏమైనా సాధిస్తే మాత్రమే చంద్రబాబు తన విజయంగా చెప్పుకోవాలని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు...ఎం. రాజేశ్వరి -
అన్నదాన క్షేత్రంలో అరాచక పర్వం!
కాశినాయన క్షేత్రం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పెద్దలు తొలుత తిరుమల లడ్డూ నాణ్యతపై లేనిపోని విమర్శలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ఆపై అదే తిరుమలలో ఎలాంటి జాగ్రత్త తీసుకోకపోవడంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మరణించారు. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు మరో హిందూ వ్యతిరేక చర్యకు నడుం బిగించారు. ఇందుకు కాశీనాయన క్షేత్రం వేదికైంది. దీనులకు దేవాలయం.. అన్నార్తులను ఆదరించి అక్కున చేర్చుకునే అపర అన్నపూర్ణ నిలయంగా భాసిల్లుతున్న ఈ క్షేత్రంలో కనిపించేదల్లా.. నిత్యాన్నదానం, స్వచ్ఛంద విరాళాల తత్వం, లాభాపేక్షలేని సేవా భావం! పచ్చటి నేలలోని ఆ ప్రశాంత క్షేత్రంలో ఒక్కసారిగా కల్లోలం చెలరేగింది. కూటమి సర్కారు వరుసగా కూల్చివేతలు కొనసాగించింది. కాశీనాయన క్షేత్రంలో పలు నిర్మాణాలను కూల్చివేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాషాయ వ్రస్తాలు ధరించి దక్షిణాది రాష్ట్రాలలో పర్యటిస్తూ పలు ఆలయాలు దర్శించిన, సనాతన ధర్మానికి పరిరక్షకునిగా చెప్పుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిధిలోని అటవీశాఖ కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు చేపట్టడం గమనార్హం. ఆయన మాత్రం దీనిపై నోరుమెదపడంలేదు. ఎన్నో ఏళ్లుగా పేదల కడుపునింపుతున్న ఓ ధార్మీక క్షేత్రంపై కూటమి ప్రభుత్వం ఇలా కత్తిగట్టినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నదో ఎవరికీ అంతుబట్టడం లేదు. నిత్యాన్నదానం, గో సంరక్షణ నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బెడుసు పల్లి గ్రామానికి చెందిన మున్నెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మల రెండో సంతానమైన కాశిరెడ్డి యవ్వనంలోనే ఇంటిని వదిలి ఆథ్యాత్మికత వైపు అడుగులు వేశారు. వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ గరుడాద్రి వద్ద తపస్సులో నిమగ్నమయ్యారని, ఆయనకు జ్యోతిలక్ష్మీనరసింహస్వామి ప్రత్యక్షమై మార్గ నిర్దేశం చేశారని ప్రతీతి. తన గురువు అతిరాస గురవయ్య ఉపదేశం మేరకు ఆలయాల జీర్ణోద్ధరణకు పూనుకున్నారు. నిత్యాన్నదానం, గో సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. 1995 డిసెంబరు ఆరో తేదీ దత్తపౌర్ణమి రోజు మహాసమాధి అయ్యారు. ఆయన సేవలకు గుర్తుగా 1999లో కలసపాడు, బి.కోడూరు పరిధిలోని పలు పంచాయతీలతో శ్రీ అవధూత కాశినాయన (ఎస్‌ఎకేఎన్) మండలం ఏర్పాటైంది. ఎంతో పవిత్రమైన కాశినాయన క్షేత్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక కూల్చివేతలు మొదలయ్యాయి. గతేడాది డిసెంబరు, ఈ ఏడాది జనవరి, మార్చి 7వతేదీన జ్యోతి క్షేత్రంలోని కుమ్మరి అన్నదాన సత్రం, విశ్వ బ్రాహ్మణ అన్నదాన సత్రం, గోవుల దాణా షెడ్డు, గోశాల షెడ్డు, మరుగుదొడ్లను కూల్చి వేశారు. జ్యోతిలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొద్దిదూరంలో శివరంగారెడ్డి నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను కూలగొట్టారు. ఓ వర్గానికి చెందిన వారు ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌కళ్యాణ్ ద్వారా ఈ పని చేయించారనే అనుమానాలు కాశినాయన భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎండలో అలమటిస్తున్న గోవులు వందకు పైగా అన్నదాన సత్రాలురాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన కాశిరెడ్డి అవధూత కాశీనాయనగా పూజలు అందుకున్నారు. స్థానిక ప్రజలు ఆయనకు నిత్యం పూజలు నిర్వహిస్తూ 13 హెక్టార్ల పరి«ధిలో గుడి, గోశాల, అన్నదాన సత్రాలు, వసతి గృహాలు నిర్మించారు. పలు నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. కాశీనాయన క్షేత్రాన్ని నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. రాయలసీమతో పాటు వివిధ ప్రాంతాల్లో కాశీనాయన పేరిట వందకు పైగా అన్నదాన సత్రాలు కొనసాగుతున్నాయి. అటవీశాఖకు 50 ఎకరాలు..నల్లమల అటవీ ప్రాంతంలో వందల ఏళ్లుగా జ్యోతిలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఆ గుడి వద్ద అన్నదానం ఏర్పాటుకు చేరుకున్న కాశీనాయన అక్కడే శివైక్యం చెందారు. 1997 నుంచి క్షేత్రం దినదిన ప్రవర్థమానంగా వెలుగొందుతోంది. అటవీశాఖ తొలుత అటవీప్రాంతంగా, ఆ తరువాత రిజర్వు ఫారెస్టుగా 2000–2003 నుంచి చెబుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలంలోని 50 ఎకరాలను క్షేత్రం నిర్వాహకులు అటవీశాఖకు కేటాయింపజేశారు. గతంలో రాష్ట్ర, కేంద్ర అటవీశాఖ ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగాయి. విషయం కోర్టు వరకు కూడా వెళ్లింది. దానిపై అటవీశాఖ సానుకూల దృక్పథంతో ఉన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.అన్నదానసత్రంలో భోజనం చేస్తున్న భక్తులు కొసమెరుపేమిటంటే.. తిరుమల తొక్కిసలాటఘటనపై పవన్ కళ్యాణ్ హడావిడి చేయగా ఇపుడు కాశీనాయన క్షేత్రం కూల్చివేతలపై నారాలోకేష్ తాపీగా రంగంలోకి దిగారు. క్షమాపణలు చెబుతున్నానని, కూల్చిన నిర్మాణాలను పునరి్నర్మీస్తామని చెబుతుండడం ఏదో డ్రామాలా కనిపిస్తున్నదని పలు హిందూ ధార్మీక సంస్థలు విమర్శిస్తున్నాయి.దాతల సహకారం అపూర్వంఎక్కడి నుంచి వస్తాయో.. ఎలా వస్తాయో మాకే అంతుబట్టదు. దాతల సహకారం మేం ఊహించిన దానికన్నా ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది. వెయ్యి మందికి అన్నదానం చేస్తున్నామంటే పదివేల మందికి సరిపడా సరుకులు స్వచ్ఛందంగా క్షేత్రానికి చేరుతుంటాయి. ఆలయ నిర్మాణానికి కూడా అదేవిధంగా సాయం అందుతోంది. వారి తోడ్పాటుతోనే మహత్తర క్షేత్రం నిర్మితమవుతోంది. ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భక్త కోటి కోరుకుంటోంది. – బి.చెన్నారెడ్డి, ఆలయ ప్రధాన నిర్వాహకులుధర్మానికి అండగా నిలవండి ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్న ధార్మిక ఆశ్రమాలను సాకులు చెబుతూ కూల్చడం అభ్యంతరకరం. ఇలాంటి వందలాది ఆశ్రమాలను, ధార్మికవేత్తలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వ చర్యలుండాలి. ధర్మ ప్రచారానికి అండగా నిలవాలి.– శ్రీనివాసానందస్వామి, కాశీనాయన క్షేత్రం50 ఎకరాలు ఇచ్చాం..కాశీనాయన క్షేత్రం సుమారు 13 హెక్టార్లలో విస్తరించింది. అభివృద్ధి పనులు కొన్నేళ్లుగా ఆగిపోయాయి. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అటవీభూమికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే 50 ఎకరాలను పెనగలూరు మండలంలో ఇచ్చాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశిస్తున్నాం.– జీరయ్య, ఆలయ ప్రధాన అర్చకుడు -
ఫ్రీ బస్సు ‘బాబూ’
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణంపై తిరుపతి మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. బుధవారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ నుంచి పీలేరు వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కిన మహిళలు.. తమకు చంద్రబాబు ఇచ్చిన హామీని కండక్టర్‌కు గుర్తుచేశారు. ప్రయాణికులకు టికెట్లు కొట్టుకుంటూ వచ్చిన కండక్టర్.. మహిళలను కూడా టికెట్ అడిగారు. ఈ సందర్భంగా వారు.. ‘చంద్రబాబు చెప్పారు. బస్సులో ప్రయాణం ఉచితమని. టికెట్ అడిగితే చంద్రబాబు గారు ఆయన పేరు చెప్పమన్నారు’ అని సమాధానమిచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీకి సంబంధించిన వీడియోను కూడా ప్రదర్శించారు. అదేవిధంగా చంద్రబాబు వేషధారణలో ఓ వ్యక్తి కండక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు. ‘‘నేను చెబుతున్నాను.. నా ఆడబిడ్డలందరికీ బస్సులో ఉచితంగా ప్రయాణం చెయ్యవచ్చు’’ అని చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక కండక్టర్.. బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని సమాధానం ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం అమలులో లేదంటూ స్పష్టం చేశారు. దీంతో కండక్టర్, మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కండక్టర్ పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచనల మేరకు డ్రైవర్ బస్సును నేరుగా ఎస్వీ యూనివర్సిటీ స్టేషన్‌కు తరలించారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు 35 మందిపై కేసు నమోదు చేశారు. వీరికి వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్సార్సీపీ నగర, మహిళా విభాగం అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, గీతాయాదవ్ సంఘీభావం తెలిపారు. -
ఏం అమ్మి తీరస్తారు సామీ.. అప్పులన్నీ..?
సెంద్రబాబునాయుడు ఓ పక్కన కుర్సీ యెక్కిన కాణ్నించీ యెడాపెడా అప్పులు జేస్తానే వుండారు గదా..! అప్పు పుట్టించడాన్ని గూడా ఏదో యెవరెస్టు యెక్కిన మాదిర్తో టముకు యేసుకుంటా.. పోటోలకు పోజులిస్తావుంటారు గదా..! కానీ ‘యేంది సామీ.. రాజదాని కడతండావు సరే.. ఇన్నేసి డబ్బులు గుమ్మరిస్తండావేంది’ అని అడిగినామే అనుకో.. ‘ఓరి పిచ్చోడా యిది సెల్ఫ సస్టయినబుల్ ప్రోజెక్టురా.. అంటా వుంటాడు. అదేందో పలకడానికే నాకు నోరు తిరగడం లేదుగానీ.. ‘అంటే యేందిరా సామీ’ అని యింకో సావాసగాణ్ని అడిగినా. యేం జెప్పినాడో తెలుసునా...‘‘వోరి యెర్రోడా.. మన యెసుట్లోకి మనమే బియ్యం సంపాయించాల.. మన డప్పు మనమే గొట్టుకోవాల.. యిట్టాగానే.. ఆ అమరావతి గూడా దాన్ని కట్టడానికి కావాల్సిన డబ్బులంతా అదే సంపాదించుకుంటాదంట’’ అని జెప్పినాడు.యేడరా సామీ.. యాబయి వేల కోట్ల రూపాయలు ఇప్పుటికే అప్పులు తెస్తిరి.. తీరా జూడబోతే యిప్పుడు కట్టబొయ్యే కతలన్నీ కలిపి నలబై వేల కోట్ల కూడా లేకపాయె.. కొండంత అప్పులు దెచ్చినారు గదా.. యెట్టా తీర్చబోతారు అని కలవరం పుట్టింది నాకు. మా మినిస్టరు నారాయణ మాటలు యింటే మాత్రం సమ్మగా అనిపిస్తండాయి.. కలవరం మొత్తం మాయమైపోతాందంటే నమ్మాల! యింతకీ ఆయనేం అంటండారో తెలుసునా?యీ అప్పులతో ఇప్పునడు మొదులు బెడుతున్న బిల్డింగులు అన్నీ కట్టేయంగా యింకా నాలుగువేల యెకరాలు మిగల్తాయంట.. సిటీ మొత్తం దూందాంగా అయిపోయుంటాది గాబట్టి.. అప్పుడు బూముల రేట్లు ఆకాసెంలో వుంటాయంట. ఆ యేళకి గవుర్మెంటు కాడ నాలుగువేల యెకరాల బూమి వుంటాదంట.. దాన్నంతా అమ్మితే.. ఈ అప్పులు యేపాటివి.. వుఫ్ మని వూది పారేస్తాను గదా.. అంటాండారు. మాట యిన్నప్పుడు సమ్మగానే వుంటంది గానీ.. తలుసుకున్నప్పుడు మాత్రం గుబులు గుబులుగానే వుంటాండాది సామీ.. యిన్నేసి అప్పులు తెచ్చి గుప్పెడు బిల్డింగులు గట్టంగానే అమరావతి సిటీ మొత్తం పూర్తయిపోయినట్టేనా? ఇల్లలికితే పండగ అయిపోతందా? యిదిగూడా అట్నే గదా అని నా బయ్యిం.తీరా ఈ యాబైవేల కోట్లు తగలేసి ఏదో ఓ కాడికి పనులు అయినాయని అనుకున్నాక.. యిప్పుటిదాకా అయిందంతా.. కాయితం మీద గుర్రం బొమ్మ గీసినట్టే.. ఈ బొమ్మ పెకారం మంచి గ్రానైటు రాయిని దెచ్చి బొమ్మని చెక్కాల అని.. బొమ్మను చెక్కినాక, అయ్యో బొమ్మ నల్లగా ఉండాది గదా.. దీనికి బంగారం తాపడం జేయిస్తే బెమ్మాండంగా వుంటాది అనీ.. యిట్టా రకరకాల మాటలు జెప్తా.. అరలచ్చ కోట్లు నగరానికి యింకో లచ్చన్నర కోట్లు తగలెయ్యాల్సిందే.. అని కొత్త పాటలు పాడకుండానే వుంటారా? అనేది అనుమానంగా వుండాది సామీ..!యినుకుంటా వుండారా? ఒక్కో రోడ్డు యెయ్యాలంటే కిలోమీటరుకి యాబై మూడు కోట్ల రూపాయిలా..? నోట్లేమయినా అచ్చేస్తండామా సామీ..! ఈ దేసెంలో ఎంత పెద్ద రాచబాట యేసినా.. సెంట్రలు గవుర్మెంటోల్లు కిలోమీటరుకి 20 కోట్ల దుడ్లు పెడితే చానా జాస్తి అంటాండారే.. మనోళ్లేమైనా కొండల్ని పగలదీసి యేస్తండారా.. ఆకాసానికి అద్దాల నిచ్చెనేసి ఆ పైన రోడ్డేస్తండారా.. యేం జేస్తండారని.. కిలోమీటరుకి అన్నేసి కోట్లు తగలేస్తండారో వొక యితరణ వుండాల గదా? యిట్టా తగలేస్తే యింకో అరలచ్చ కోట్లు అప్పులు దెచ్చినా ఆరతి కర్పూరం అయిపోకుండా వుంటాయా అని నాకు బయం సామీ!యెనకటికి ఇద్దరు సావాసగాళ్లు వున్నారంట. వొకడు ‘తిందాం తిందాం’ అంటే.. ‘ఏం చేసి తిందాం’ అని రెండోవాడు అన్నాట్ట. ‘అప్పుజేసి తిందాం’ అంటే.. ‘అప్పెట్ట తీర్చాల’ అన్నాట్ట. ‘అప్పుజేద్దాం.. వూరొదిలి పారిపోదాం’ అన్నాట్ట మొదటి పెద్దమనిషి. ఆ మాదిర్తో జనం గుండెల మీద బండరాయి పడకుండా వుండాలంటే ఈ అప్పులకి యీడ పుల్ స్టాపు పెడతాండాం అని ఓ మాట జెప్పండి సామీ. లేపోతే అయ్యన్నీ తీర్చడానికి అమరావతిలోనూ అడుగు బూమీ మిగలదు.. మా బోటోళ్ల బతుకులన్నింటినీ వుడ్డగా అమ్మేస్తే తప్ప ఆ అప్పు తీరదు. కొంచిం దయపెట్టండి... ఎం.రాజేశ్వరి -
విజయవాడలో అప్కాస్ ఉద్యోగుల ఆందోళన
-
‘వైఎస్సార్’ను జనం గుండెల్లో నుంచి తొలగించలేరు
తాడేపల్లి : కూటమి ప్రభుత్వంలో విధ్వంసం తప్ప మరేమీ లేదని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే , పార్టీ అధికార ప్రతినిధి కోరముట్ల శ్రీనివాసులు. స్వయంగా చంద్రబాబు కుమారుడే లోకేష్ కవ్వింపు చర్యలకు దిగుతున్నాడని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన కోరుమట్లు.. కోడుమూరులో నిన్న వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని, నాగార్జున యూనివర్శిటీ సహా అనేక ప్రాంతాల్లో వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. చివరికి విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారన్నారు. జనం రావటంతో ఆ ముష్కరులు పారిపోయారన్నారు.‘రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంస కారులు వైఎస్ఆర్ విగ్రహాలపై పడ్డారు. విగ్రహాలను తొలగించ గలరేమోగానీ జనం గుండెల్లో నుండి వైఎస్సార్ ని తొలగించలేరు. తన తెచ్చిన సంక్షేమ పథకాలతో వైఎస్సార్ దేవుడయ్యాడు. ఎవరు ఎలాంటి వారో ప్రజలకు అన్నీ తెలుసు. రాయలసీమకు వైఎస్సార్ ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు తెచ్చారు. వైఎస్ జగన్ నేరుగా ఎన్టీఆర్ పేరుతో జిల్లానే ఏర్పాటు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం వైఎస్సార్ పేరును తొలగిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయటం లేదు. ఇప్పటికే 4 లక్షల మంది పెన్షన్‌దారులకు పెన్షన్ కట్ చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. కూటమి నేతలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదువిశాఖపట్నంలో స్టేడియం పేరు తొలగించటం దారుణం. ఇందుకేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? , కూటమి నేతలు చేసిన పాపాలకు తగిన మూల్యం చెల్లుంచుకునే రోజు దగ్గర్లోనే ఉంది’ అని హెచ్చరించారు. -
వాకౌట్ చేయడానికి మాకేమైనా సరదానా బొత్స స్ట్రాంగ్ కౌంటర్
-
మీ బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరు.. కన్నబాబు స్ట్రాంగ్ కౌంటర్
-
బరితెగించిన టీడీపీ నేతలు .. బాలకృష్ణ ఇలాకాలో రికార్డింగ్ డాన్స్ లు
-
టీడీపీ నేతల హల్చల్.. బ్రహ్మోత్సవాల్లో అసభ్యకరంగా నృత్యాలు
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో పచ్చ నేతల బరితెగింపు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అసభ్యకర నృత్యాలు చేస్తూ టీడీపీ నేతలు హల్చల్ చేశారు.వివరాల ప్రకారం.. హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం సోమగట్ట గ్రామం శ్రీ మధుగిరి లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ సందర్బంగా టీడీపీ నేతలు హల్చల్ చేశారు. బ్రహ్మోత్సవాల్లో టీడీపీ నేతలు అసభ్యకరంగా నృత్యాలు చేశారు. రికార్డింగ్ డాన్సర్లతో కలిసి టీడీపీ నేత తిప్పారెడ్డి స్టెప్పులు వేశారు. దీంతో, టీడీపీ నేత తీరుపై భక్తులు మండిపడుతున్నారు. దేవుడి బ్రహ్మోత్సవాల్లో ఇలాంటి పనులేంటని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతల ఓవరాక్షన్ డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మండలి చైర్మన్‌కు తీవ్ర అవమానం
సాక్షి, అమరావతి: శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజుకు తీవ్ర అవమానం జరిగింది. శాసన సభ, శాసన మండలి సభ్యులకు నిర్వ హిస్తున్న క్రీడల పోటీల సాక్షిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మోషేన్ రాజుపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపించింది. శాసన మండలి చైర్మన్‌గా ఆయనకు ప్రొటోకాల్‌లో అగ్ర ప్రాధా న్యం కల్పించాల్సి ఉండగా, ఆ విషయాన్ని ప్రభు త్వం విస్మరించింది.క్రీడా పోటీల ప్రాంగణంలో ఎక్కడా మండలి చైర్మన్ ఫొటో, పేరు కూడా లేకుండా అగౌరవ పరిచింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మండలి చైర్మన్ పేరు కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనతో ఎస్సీ నేతలపై అధికార టీడీపీ కూటమి నిరంకుశ, అప్రజాస్వామిక వైఖరి మరోసారి బయటపడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర అత్యున్నత సభను నడిపించే వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీస్తున్నారు. -
ఇంత అవమానమా?
సాక్షి, అమరావతి : రాజకీయాల నుంచి తనకు బలవంతంగా, అదీ.. అవమానకరంగా రిటైర్మెంట్ ఇవ్వడంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహంతో ఉన్నట్లు వెల్లడైంది. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా సేవలందిస్తున్న యనమల మరికొన్నాళ్లు ప్రజాప్రతినిధిగా కొనసాగాలని భావించారు. ఇటీవలే ఆయన తన రాజకీయ భవితవ్యం గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు అవకాశమిస్తే రాజ్యసభకు వెళతానని, లేకపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పారు. అయితే, ఆయనకు ఎమ్మెల్సీ పదవినే రెన్యువల్ చేయలేదు. దీంతో చంద్రబాబు తనను అవమానించినట్లు యనమల భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు తనను వాడుకుని చివరి దశలో అవమానకర పరిస్థితుల్లో రాజకీయాల నుంచి నిష్క్రమించేలా చేశారని ఆయన బాధపడుతున్నట్లు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. దీంతో శాసన మండలిలో తన సభ్యత్వానికి ఆఖరి రోజు అయిన మంగళవారం ఆయన సభకు గైర్హాజరయ్యారు. ఏడుగురు సభ్యుల పదవీకాలం మంగళవారంతో ముగియడంతో మండలిలో వారికి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయాన్ని ఎజెండాలో పెట్టి వారికి ముందే సమాచారం ఇచ్చినా, యనమల మాత్రం వీడ్కోలు కార్యక్రమానికి రాకుండా నిరసన తెలిపినట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. అలాగే సీఎం, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంగళవారం గ్రూప్ ఫొటో కార్యక్రమం ఉందని ముందే చెప్పినా, యనమల దానికీ రాకపోవడం గమనార్హం. చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలతో గ్రూప్ ఫొటో దిగేందుకు ఆయన ఇష్టపడలేదని తెలుస్తోంది. ప్రాధాన్యత లేకుండా చేసి.. చంద్రబాబు కుమారుడు లోకేశ్ పార్టీలో సీనియర్ నాయకులందరికీ పొగ పెడుతున్న విషయం తెలిసిందే. ఆ జాబితాలో యనమల పేరునూ చాలారోజుల క్రితమే చేర్చారు. పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేశారు. 2019– 24 మధ్యలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు అప్పగించి, పని చేయించుకున్నప్పటికీ, గత ఏడాది తిరిగి అధికారంలోకి రాగా నే ఆయన్ని పక్కన పెట్టేశారు. ప్రభుత్వంలో, పార్టీలోనూ అస్సలు ప్రాధాన్యత లేకుండా చేశారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం కాకినాడ పోర్టు, సెజ్ వ్యవహారంలో ప్రభుత్వ తీరును తప్పు పడుతూ ఆయన ఏకంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. దీంతో చంద్రబాబు ఆయనపై సోషల్ మీడియాలో ఎదురు దాడి చేయించి మరింతగా అవమానించారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం ఇవ్వకపోవడమే కాకుండా పలు అవమానాలకు గురి చేసినట్లు చర్చ జరుగుతోంది. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి వీడ్కోలు కార్యక్రమానికి, గ్రూప్ ఫొటోకు రాలేదని చెబుతున్నారు. -
కూటమి ప్రభుత్వంలో అంతే.. లక్షా 90వేలకు ఆశా వర్కర్ పోస్టుకు వేలం
సాక్షి,శ్రీకాకుళం : కూటమి ప్రభుత్వంలో రోజురోజుకూ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా,సంతబొమ్మాళి మండలం లక్కవరం గద్దెలపాడులో దారుణం జరిగింది. ఆశ వర్కర్ పోస్టుకు కూటమి నేతలు రూ.లక్షా 90వేలకు వేలం వేశారు.అయితే, డబ్బులు కట్టేందుకు నిరాకరించడంతో ఆశావర్కర్ చంద్రమ్మను గ్రామ పెద్దలు సంఘ బహిష్కరణ చేశారు. బాధితురాలి కుటుంబంతో ఎవరూ మాట్లాడవద్దంటూ గ్రామంలో దండోరా వేయించారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధిత ఆశావర్కర్ చంద్రమ్మ,యూనియన్ నేతలు డీఎంహెచ్ఓను కలిశారు. -
చంద్రబాబుకు యనమల బిగ్ షాక్
-
Varudu Kalyani: రెన్యువల్ లేనప్పుడు విజయవాడ వరదల్లో వాలంటీర్లను ఎందుకు వాడుకున్నారు
-
ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం కాదని, వాటిపై విచారణ జరిపిస్తే ఆ నివేదికతో సభలో చర్చించాలే తప్ప.. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిరాధార ఆరోపణలతో ప్రతిపక్షంపై బురదజల్లేందుకు ప్రభుత్వం సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ చర్చించాలని ప్రభుత్వం అనుకొంటే 2014 నుంచి ఇప్పటివరకు చర్చించాలని మరోసారి స్పష్టం చేశారు.సోమవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత గురువారం వాయిదా వేసిన ‘2019–24 మధ్య జరిగిన కుంభ కోణాలపై’ లఘు చర్చలో ప్రభుత్వ సమాధానానికి చైర్మన్ మోషేన్ రాజు అనుమతించారు. దీనిపై ప్రతిపక్ష నేత అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం ఒక పక్కన విచారణకు ఆదేశించామంటూనే, సభలో ఎలా మాట్లాడుతుందని ప్రశ్నించారు. ఇదే లఘు చర్చపై మంత్రి సమాధానానికి గత వారం అవకాశం ఇచ్చారని, 2014 నుంచి చర్చిద్దామని తాము అప్పుడే చెప్పామని అన్నారు. ప్రతిపక్షంపై బురద జల్లేందుకే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.పైగా విచారణ అని చెప్పి దాన్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మరో 6 నుంచి 10 నెలల్లో విచారణ నివేదికలు తీసుకొచ్చి సభలో చర్చించాలని చెప్పారు. 2014–19 మధ్య జరిగిన కుంభకోణాల మీద కేసుల దర్యాప్తు పూర్తయిందని, నివేదికలూ వచ్చాయని, వాటి మీదా చర్చ జరగాలని స్పష్టంచేశారు. అయినప్పటికీ మంత్రి సమాధానం ఇవ్వాలనుకొంటే.. ఇలాంటి ఏకపక్ష చర్చలో మేము పాల్గొనలేమని స్పష్టం చేశారు. సభ నుంచి వెళ్లిపోతున్నాం అంటూ వాకౌట్ చేశారు. తెలుగుదేశం పార్టీ పాలనలో పలు కుంభకోణాలు జరిగాయని, వాటిపై కేసులు నమోదయ్యాయని, దర్యాప్తు కూడా పూర్తయిందని తెలిపారు. వాటిపై మాత్రం చర్చకు ప్రభుత్వం అంగీకరించడం లేదని బొత్స మీడియా పాయింట్ వద్ద విమర్శించారు. ఇది కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరి కాదా అని నిలదీశారు. చీఫ్ విప్‌పై చైర్మన్ ఆగ్రహం ప్రతిపక్ష నేత మాట్లాడుతున్న సమయంలో చీఫ్ విప్ అనురాధ సమాధానం చెబుతానంటూ లేచి నిల్చోగా చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి ఉండగా మీరు క్లారిఫికేషన్ ఎలా ఇస్తారని, మీకు సంబంధం లేదు కూర్చోవాలని చెప్పారు. ఇలాంటి సంప్రదాయాలు తీసుకొచ్చి మంత్రులు సభను తప్పుదోవ పట్టించొద్దని హితవుపలికారు. మార్షల్స్‌తో సభ్యులను సభలోకి తీసుకురండి! ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేసి వెళ్లిపోవడంపై మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో కుంభకోణాలపై చర్చకు బీఏసీలో ప్రతిపక్షం ఆమోదించిందని, కానీ సభలో 2014–19 ప్రభుత్వ పాలనపై ఆరోపణలు చేసి వాకౌట్ చేసిందని అన్నారు. చర్చకు సిద్ధంగా ఉంటే రమ్మనండని అన్నారు. గతంలో మార్షల్స్‌ను పెట్టుకుని సభను అవమానించారని, ఇప్పుడు మార్షల్స్‌కు చెప్పి బయట ఉన్న సభ్యులను లోపలికి తీసుకురావాలని అన్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ, అటవీ భూములను కబ్జా చేశారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. లఘు చర్చపై ప్రభుత్వం తరఫున సమాధానమిస్తూ.. సుమారు 1.70లక్షల ఎకరాల్లో భూములు అన్యాక్రాంతం అయినట్టు గుర్తించామన్నారు. వీటిపై సీఐడీ విచారణ చేస్తున్నట్టు చెప్పారు. -
వలంటీర్లు అప్పుడెలా గుర్తొచ్చారు?
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థే లేదని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. అదే వాస్తవమైతే విజయవాడ వరద బాధితులకు సహాయ, సహకారాలు అందించేందుకు వలంటీర్లు కావాలని అధికారిక ఉత్తర్వులిచ్చి.. వలంటీర్ల సేవలు ఏవిధంగా వినియోగించుకున్నారు’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు వేతనాలు రూ.10 వేలకు పెంచుతామని నమ్మించి, 2.56 లక్షల మందిని కూటమి ప్రభుత్వం దగా చేసిందని మండిపడ్డారు.వలంటీర్లకు గౌరవ వేతనాల పెంపు అంశంపై వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్న సోమవారం మండలిలో చర్చకు వచ్చింది. సంబంధిత మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వలంటీర్లు ఎవరూ లేరని, ఈ నేపథ్యంలో వేతనాల పెంపు అంశమే ఉత్పన్నం కాదన్నారు. మంత్రి సమాధానంపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వరదల్లో వారిని ఎలా వినియోగించుకున్నారు?వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వలంటీర్లే లేకపోతే విజయవాడ వరదల్లో వారి సేవలను ప్రభుత్వం ఎందుకు వినియోగించుకుందని నిలదీశారు. వరదల సమయంలో ప్రభుత్వం జారీ చేసిన మెమో నంబర్, తేదీలతో సహా సభలో చదివి వినిపించారు. వరద సహాయ చర్యల్లో పాల్గొనకపోతే వలంటీర్లపై మీద చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం హెచ్చరించిందని గుర్తు చేశారు. వలంటీర్లతో అవసరం తీరాక ఆ వ్యవస్థే లేదని చెప్పడం సమంజసం కాదన్నారు.‘గత ప్రభుత్వంలో వలంటీర్లకు ఇచ్చిన రూ.5 వేలు సరిపోదు.. మేం వస్తే రూ.10 వేలు చెల్లిస్తాం’ అని టీడీపీ నాయకులు ప్రచారం చేశారన్నారు. పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వీరికి నెలకు రూ.10 వేలకు వేతనం పెంచుతామని ప్రస్తుత సీఎం, మంత్రులు హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సేవాభావంతో ముందుకు వచ్చి ప్రజల మన్ననలు పొందిన వలంటీర్లను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ప్రభుత్వం తలచుకుంటే వలంటీర్లను రెన్యూవల్ చేయడం పెద్ద సమస్య కాదన్నారు. వలంటీర్లకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి డోలా మాట్లాడుతూ.. వలంటీర్ వ్యవస్థ మనుగడలో ఉందనే భ్రమలో తాము విజయవాడ వరదల్లో వారి సేవలు వినియోగించుకోవడానికి ఉత్తర్వులు ఇచ్చామన్నారు. మనుగడలో లేని వారిని ఎలా కొనసాగించాలని ప్రశ్నించారు. నిమ్మల ముసిముసి నవ్వులు‘మా ప్రభుత్వం వస్తేనే వలంటీర్ల వేతనాలు రూ.10 వేలకు పెంచుతాం. వేతనం పెరిగిన వెంటనే నాకు పూతరేకులు, స్వీట్ బాక్స్, జున్ను ఇవ్వాలి’ అని వలంటీర్లకు చెబుతూ ఎన్నికల ముందు ప్రస్తుత మంత్రి ఒకరు ప్రచారం చేశారని రమేశ్‌యాదవ్ గుర్తు చేశారు. వేతనాలు పెంచితే మంత్రికి పూతరేకులు, జున్ను ఇద్దామని వలంటీర్లు అందరూ రెడీగా ఉన్నారన్నారు. దీంతో వెంటనే సభలోని వారంతా మంత్రి నిమ్మల రామానాయుడు వైపు చూశారు. ఈ క్రమంలో ఆయన పేపర్లో ఏదో చదువుతున్నట్టు తల దించుకుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. -
‘తప్పుమీది కాదు.. తప్పు ఈవీఎంలదే’
నగిరి: ఏపీలో కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ నేత , మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. ‘కూటమి’ పాలనలో ఒక్కొక్క దానికి చరమగీతం పాడేస్తున్నారంటూ మండిపడ్డారు. మెడికల్ కాలేజీలకు మంగళం పాడేసిన కూటమి ప్రభుత్వం, భరోసా కేంద్రాలకు కూడా ఎత్తేస్తుందని, ఇప్పుడు ఇక బడుల వంతు అంటూ రోజా విమర్శించారు.‘మెడికల్ కాలేజీలకు మంగళం పాడేశారు, రైతు భరోసా కేంద్రాలను ఎత్తేస్తున్నారు.. ఇప్పుడు బడుల వంతు. అయినా..... ‘విద్య ప్రభుత్వ బాధ్యత కాదు’ అని ముందే మీరు చెప్పారు లెండి... తప్పు మీది కాదు.. తప్పంతా #EVM లదే !, ఐదు కిలోమీటర్ల పరిధిలో గ్రామంలో ఒకే పాఠశాల ఉండాలా..?, గ్రామంలో ఎన్ని బ్రాందీ షాపులైనా... ఎన్ని బెల్ట్ షాపులైనా ఉండవచ్చా...?, బాగుందాయ్యా ... బాగుంది !అని... ఊరంతా గుసగుసలాడుకుంటున్నారని తెలుస్తోంది!!’ అని రోజా ఎద్దేవా చేశారు.మెడికల్ కాలేజీలకు మంగళం పాడేశారు, రైతు భరోసా కేంద్రాలను ఎత్తేస్తున్నారు.. ఇప్పుడు బడుల వంతు !అయినా..... "విద్య ప్రభుత్వ బాధ్యత కాదు" అని ముందే మీరు చెప్పారు లెండి... తప్పు మీది కాదు.. తప్పంతా #EVM లదే !ఐదు కిలోమీటర్ల పరిధిలో గ్రామంలో ఒకే పాఠశాల ఉండాలా..?గ్రామంలో ఎన్ని…— Roja Selvamani (@RojaSelvamaniRK) March 17, 2025 నగిరిలో పరామర్శ కార్యక్రమాల్లో మాజీ మంత్రి రోజాఆర్కే రోజా నగిరి పర్యటనలో భాగంగా వైఎస్సార్‌సీపీబాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈరోజు(సోమవారం) విజయపురం మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీబాధిత కుటుంబాలను రోజా పరామర్శించారు. ఆయా గ్రామాల్లో అనారోగ్యంతో చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న నాయకులకు రోజా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఆయా బాధిత కుటుంబాలను రోజా పరామర్శించారు. -
వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మీ మేనిఫెస్టోలో ఎలా పెట్టారు
-
కూటమి ప్రభుత్వం ఉద్యోగుల అంశంపై చర్చను పక్కదారి పట్టిస్తోంది: బొత్స
-
‘తెలంగాణలో జనసేన, టీడీపీతో పొత్తు బీజేపీకే నష్టం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేన, టీడీపీతో పొత్తు కడితే బీజేపీకి నష్టం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరుతుందన్నారు. ఇదే సమయంలో రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తెలంగాణ ప్రజలకు పాత ఇనుప సామాను అంటే ఎవరో బాగా తెలుసు అంటూ వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీ సమావేశాల సందర్బంగా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మీడియాతో చిట్బాట్ మాట్లాడుతూ.. తెలంగాణలో కూటమి గురించి బీజేపీ హైకమాండ్ ఆలోచన చేయవద్దు. జనసేన, టీడీపీతో కలిసి వెళ్తే బీజేపీ నష్టం జరుగుతుంది. అంతరాష్ట్ర వ్యవహారాల్లో ఇబ్బంది అవుతుంది. బీఆర్ఎస్ లాంటి పార్టీలకు లబ్ధి జరుగుతోంది. కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరుతోందన్నారు.రాజాసింగ్ కామెంట్స్ స్పందిస్తూ..‘తెలంగాణ ప్రజలకు పాత ఇనుప సామాను అంటే అందరికీ తెలుసు. పార్టీ అంతర్గత వ్యవహారాలు వేదికలపై కాకుండా ఎవరికి చెప్పాలో వారికి చెప్పాలి. రాజాసింగ్ తెలంగాణ బీజేపీకి ఆస్తి వంటి నాయకులు. ప్రధాని మోదీకి ఇక్కడ ఏం జరుగుతుందో పిన్ టూ పిన్ రిపోర్ట్ వెళ్తుంది. అధిష్ఠానం అంతా గమనిస్తోంది. పార్టీకి మంచి జరిగేది నలుగురిలో చెప్పాలి.. చెడు జరిగేది అధిష్ఠానం చెవిలో చెప్పాలి.పార్టీ ప్రెసిడెంట్‌గా ఈటల, అరవింద్, రామచందర్ రావు, డీకే అరుణ, రఘునందన్ రావు ఎవరో ఒకరు అవుతారు. అధ్యక్షుడితో పాటు ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు పెడితే బాగుంటుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం ప్రత్యేకంగా ఇంచార్జ్‌లను పెట్టాలి. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రక్షాళన చేస్తారని వినిపిస్తోంది. అదే జరిగితే కొండా సురేఖ, తుమ్మల, జూపల్లి మంత్రి పదవులు పోతాయి అంటున్నారు అని ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాదయాత్ర వెంకటేశ్వర్ రెడ్డి అరెస్టు
సాక్షి గుంటూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వేదింపుల పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాదయాత్ర వెంకటేశ్వర్ రెడ్డిని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం, పెదకాకాని స్టేషన్‌కి తీసుకుని వెళ్లకుండా గుంటూరు చుట్టూ తిప్పుతున్నారునోటీసు ఇవ్వకుండా ,కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా పోలీసుల అరెస్టు చేసి గుంటూరు చుట్టూ తిప్పుతూ పాదయాత్ర వెంకటేశ్వర్ రెడ్డిని పెదకాకాని పోలీసులు హింసిస్తున్నారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులు మండిపడుతున్నారు. పాదయాత్ర వెంకటేశ్వర్ రెడ్డికి 35(3) నోటీస్ ఇవ్వాలి ....లేకపోతే వెంటనే కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేస్తున్నారు. -
‘ప్రతిసారి అలగడం, ఏడవడమే బాలినేని చరిత్ర’
సాక్షి, ప్రకాశం జిల్లా: వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి బాలినేనికి మాట్లాడే అర్హత లేదంటూ జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైవీ, వైస్సార్ కుటుంబం లేకపోతే నువ్వెవరవి అంటూ బాలినేనిని ప్రశ్నించారు. ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిసారి ఏదో ఒక సాకుపెట్టు కొని మా మీద ఏడుస్తావు. గతంలో కూడా మా కుటుంబం మీద కుట్రలు చేశావ్. ఇప్పటికీ నీ బుద్ధిమారలేదు’’ అంటూ వెంకాయమ్మ మండిపడ్డారు.‘‘బూచేపల్లి కుటుంబంపై కుట్రలు చేసి.. ఇవాళ నువ్వే రోడ్డున పడ్డావు. వైఎస్ జగన్‌ను ఓడిస్తావా..? నీ తరం కాదు. 2024 ఎన్నికలో నా కుమారుడు బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి గెలవకూడదని కుట్ర పన్నావ్...? నువ్వే ఓడిపోయావు. నన్ను చైర్ పర్సన్ పదవి నుంచి దించుతావా..? నా కుర్చి టచ్ చేసి చూడు.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగనే సీఎం.. ఎవరూ అడ్డుకోలేరు.?...2004 నుంచి రాజకీయాల్లో ఉండి.. నీతిగా రాజకీయాలు చేస్తున్నాం. మా ప్రాణాలు పోయే వరకు వైఎస్ జగన్‌తోనే ప్రయాణం. మా కుటుంబం మీద అభిమానంతో వైఎస్ జగన్ నన్ను జడ్పి చైర్ పర్సన్‌ని చేశాడు. నీకు దమ్ముంటే... నా కుర్చీ జోలికిరా..? చూస్తా.. ప్రతీ సారి వైఎస్ జగన్ మీద అలగడం.. ఎడవడమే.. బాలినేని చరిత్ర?. జిల్లాలో పార్టీ నేతల దగ్గర డబ్బు దోచుకున్న అవినీతి పరుడు బాలినేని’’ అంట వెంకాయమ్మ ధ్వజమెత్తారు. -
‘దాచుకో.. దోచుకో.. పంచుకో.. చంద్రబాబు పాలన ఇదే’
సాక్షి, ఏలూరు జిల్లా: రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో చెత్త కుప్పలు పేరుకుపోయి.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన ఏలూరులోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్వచ్ఛతలో రాష్ట్రంలో కింద నుంచి మూడో స్థానంలో ఉందన్నారు.వైఎస్ జగన్ హయాంలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధంగా క్లాప్ వెహికల్స్ పెట్టారని. నీతి ఆయోగ్ సైతం ప్రశంసించిందని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో స్వచ్ఛభారత్‌ను వైఎస్ జగన్ సమర్థవంతంగా అమలు చేశారన్నారు. స్వచ్ఛ భారత్ క్లాప్ వ్యాన్లను చంద్రబాబు ప్రభుత్వం మూలన పడేసిందని.. వాటిని తొలగించడంతో ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.‘‘చంద్రబాబు పర్యటనలో తణుకును దిగ్బంధం చేశారు. తేతలిలో పశువధ కర్మాగారం అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. పశువుల కర్మాగారం పక్కనున్న ఎఫ్‌సీఐ గోడౌన్లు సైతం ఖాళీ చేస్తున్నారు. కోర్టు స్టే ఇచ్చినా కానీ.. పశువధ కర్మాగారం వారికి ప్రభుత్వం కొమ్ము కాస్తుంది. పశువధ కర్మాగారం ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. టీడీపీ, జనసేన కార్యాలయాల చుట్టూ పశువధ కర్మాగారం బాధితులు తిరిగిన వారికి న్యాయం జరగలేదు. పశువధ దుర్గంధంతో తణుకు ప్రజలు అల్లాడిపోతున్నారు’’ అని కారుమూరి పేర్కొన్నారు.‘‘ఆరుమిల్లి రాధాకృష్ణకు పావలా ఎమ్మెల్యే అని పేరు వచ్చింది. లిక్కర్, గంజాయిలో దాచుకో.. దోచుకో.. పంచుకో అన్న రీతిలో పాలన సాగుతుంది. వైఎస్ జగన్ బస్సులో వెళ్లేటప్పుడు ఎవరైనా వినతిపత్రం చూపిస్తే వెంటనే స్పందించేవారు. నిన్న స్వచ్ఛ ఆంధ్ర సభలో చంద్రబాబు భజనే సరిపోయింది. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారు అందులో ఐదు పూర్తయ్యాయి. 750 మెడికల్ సీట్లు మాకు వద్దు అని కేంద్రానికి లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు. ప్రతి గ్రామంలో వైఎస్ జగన్ తీసుకొచ్చిన సచివాలయాలు రైతుభరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు దర్శనమిస్తాయి. 9 నెలలోనే చంద్రబాబు 1,50,000 కోట్లు అప్పు చేశాడు. వైఎస్ జగన్ పథకాలు కొనసాగించక పోగా మీరు ఇస్తానన్న సూపర్ సిక్స్ ఇవ్వలేదు.17 లక్షల రైతులు వద్ద రెండు కోట్ల మెట్రిక్ టన్నులు ధాన్యం మీరు గతంలో కొంటే వైఎస్ జగన్ హయాంలో 37 లక్షల మంది రైతుల వద్ద మూడు కోట్ల 40 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొన్నాము. ఈ-క్రాప్, ఇన్సూరెన్స్ విధానాలు ఎత్తేశారు. చంద్రబాబు రైతుల నడ్డి విరిచేశారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు ఒక్క హామీ నెరవేర్చలేదు. రాష్ట్రంలో ప్రజలు బాధలతో అల్లాడిపోతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, తల్లికి వందనం ఊసే లేదు.. నీకు 15000 నీకు 18000 అన్నారు వాటి ఇప్పుడు ఆ 15 లేదు 18 లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గతంలో మీ హయాంలోనే వచ్చింది. పయ్యావుల కేశవ్ గతంలో ఇది చాలా మంచిదని అనలేదా..?. మేము దాన్ని అమలు చేస్తే బురదజల్లారురూ.75,000 ఉండే మెడికల్ కాలేజీ ఫీజు లక్ష ఇరవై వేలకు పెంచేశారు. ఫీజులు కట్టలేక విద్యార్థులు పొలం బాట పడుతున్నారు. వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తే ఆ పథకాలన్నీ నిలిపివేశారు. పేద ప్రజలు చదువుకోవడం మీకు ఇష్టం లేదా?. సూపర్ సిక్స్ అని ఊదరకొట్టారు. గతంలో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్నారు. ఇప్పుడు ఒక్క హామీ అమలు చేయలేకపోతున్నారు’’ అని కారుమూరి నాగేశ్వరరావు దుయ్యబట్టారు. -
‘కాశీనాయన’ కూల్చివేత వెనుక దుష్టశక్తులు ఎవరు?: భూమన
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో మహిమాన్వితమైన కాశీనాయన క్షేత్రం కూల్చివేతల వెనుక ఉన్న దుష్టశక్తులు ఎవరో బయట పెట్టాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల మధ్య ఉన్న వైరుధ్యాలతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు నలిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీనాయన క్షేత్రం కూల్చివేతలు ఈ రాష్ట్రంలో హిందూధర్మం గుండెలను బుల్డోజర్లతో బద్దలుకొట్టడమేనని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...సనాతనధర్మ పరిరక్షణ అంటే ఇదేనా పవన్?సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ కూల్చివేతలపై ఎక్కడా స్పందించలేదు. పాశవికంగా, దుర్మార్గంగా జరిగిన ఈ దాడిపై ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఈ కూల్చివేతలు చేపట్టిన అటవీశాఖ సనాతన ధర్మ పరిరక్షకుడుగా తనకు తాను చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలో, ఆయన పర్యవేక్షణలో పనిచేస్తోంది. సనాతన ధర్మంపై దాడి చేస్తే, వారి తలలు తీస్తాను అంటూ భీకర ప్రతిజ్ఞలు చేసే పవనానందుల గొంతుక ఇప్పుడు మాత్రం మూగబోయింది. ఆయన దీనిపై స్పందించాల్సిన అవసరం లేదా? గతంలో తిరుపతిలో ఆరుగురు చనిపోయినప్పుడు నేరుగా ఇక్కడికి వచ్చి క్షమాపణలు చెప్పారు.ఈ రోజు కాశీనాయన క్షేత్రాన్ని పవన్ పరిధిలోని శాఖకు చెందిన అధికారులే కూల్చేవేస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు? మీకు బదులుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు క్షమాపణలు చెప్పారు? తిరుపతి విషయంలో సారీలు చెప్పడం మా పార్టీ విధానం కాదు అంటూ ఆనాడు మంత్రి లోకేష్ వ్యాఖ్యలు చేయడం నిజం కాదా? ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆధీనంలోని అటవీశాఖ అధికారులు చేసిన దానికి విద్యాశాఖ మంత్రిగా క్షమాపణలు చెప్పడం, తానే కాశీనాయన క్షేత్రంను నిర్మించి ఇస్తానని ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. నారా లోకేష్, పవన్ కల్యాణ్‌ల మధ్య ఉన్న వైరుధ్యాల వల్ల పవిత్ర క్షేత్రాలు నలిగిపోవాలా?సోషల్ మీడియా సాక్షిగా వీరిద్దరి మధ్య ఉన్న గొడవలు అందరికీ తెలిసినవే. రెడ్‌బుక్ గుడ్డితనం కమ్మి గతంలో ఆలయాలను కూల్చిన వారు నేడు కాశీనాయన క్షేత్రంపై విరుచుకుపడ్డారు. ఎవరు కూల్చారో తెలియదు, ఉత్తర్వులు ఎవరో గుడ్డిగా ఇచ్చారంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇది సమర్థించుకోవడం కాదు? మీకు తెలియకుండానే ఆలయాలు నేలమట్టం అవుతాయా? ఆశ్రమాలు కూలతాయా? ప్రసాదంలో విషాలు కలుస్తాయా? కాషాయం కింద విషం చిమ్ముతున్నది మీది కాదా? పార్టీ మీటింగ్‌లకు ప్రభుత్వ సొమ్ముతో గాలిలో ఎగిరి ప్రయాణాలు చేసే పవన్ కళ్యాణ్ హెలికాఫ్టర్‌కు కాశీనాయన క్షేత్రంకు దారి కనిపించడం లేదా?మా ఇంట్లోనే సనాతన ధర్మం పుట్టింది అంటూ గతంలో పవన్ చెప్పారు. ఆయనే మా తండ్రి పూజ గదిలో వెలిగే దీపారాదనతో సిగరెట్ వెలిగించుకునేవారు అని కూడా అన్నారు. ఇవ్వన్నీ కూడా సనాతన ధర్మం కిందకు వస్తాయా అని కూడా పవనానంద స్వామీ చెప్పాలి. శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చివేస్తారా?కాశీనాయన క్షేత్రం కూల్చివేతలపై దేవాదాయశాఖ మంత్రి స్పందిస్తూ ఈ క్షేత్రం టైగర్‌జోన్ పరిధిలో ఉన్నందునే కూల్చివేశారు అంటూ ప్రకటన చేశారు. టైగర్‌జోన్ పరిధిలోనే ఉన్న శ్రీశైలంను కూడా కూల్చివేస్తామనే ఉద్దేశం ఆ శాఖ మంత్రి మాటల్లో అర్థమవుతోంది. టైగర్‌జోన్ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాలను కూల్చివేయాలన్నదే ఈ కూటమి ప్రభుత్వ అసలు లక్ష్యం. కూటమి పాలనలో హిందూ దేవాలయాలకు దిక్కులేకుండా పోయింది.ఆలయాల పరిరక్షణకు ఎటువంటి చర్యలు లేవు. రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న కాశీనాయన క్షేత్రంకు ఉన్న ఆధ్యాత్మిక విలువల దృష్ట్యా దీనిని అటవీ చట్టాల పరిధి నుంచి మినహాయించాలని ఆనాడే సీఎం హోదాలో వైఎస్ జగన్ కేంద్ర అటవీశాఖకు లేఖ రాశారు. ఇప్పుడు సనాతన సారధి పవన్ కళ్యాణ్ పరిధిలోని అటవీశాఖ అధికారులు కేంద్ర అటవీశాఖ నుంచి ఎటువంటి ఉత్తర్వులు, ఆదేశాలు లేకుండానే ఈ క్షేత్రంలోని నిర్మాణాలను కూల్చివేశారు.పవన్ కళ్యాణ్ ఆదేశాలు లేకుండానే ఈ కూల్చివేతలు జరిగాయా? వీటిని కూల్చివేస్తున్నారని తెలిసి కూడా ఎందుకు పవన్ దానిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎంతసేపు బీజేపీకి కొమ్ముగాయడం, మోయడంలో తనమునకలు అయ్యి ఉండటం వల్లే ఇటువంటి ఘోరమైన సంఘటనను పట్టించుకోలేదా? బొట్లు పెట్టడం, మెట్లు కడగడం మినహా ఆలయాలను పరిరక్షించాలనే విషయాన్ని విస్మరించారు. బీజేపీ కూడా ఎందుకు స్పందించడం లేదు. కాశీనాయన క్షేత్రంను కులం కోణంలో చూస్తున్నారా అనే అనుమానాలు, అది అసలు ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు అనే భావనను కలిగిస్తున్నారా అనుమానం భక్తుల్లో కలుగుతోంది.కూటమి పాలనలో హిందూధర్మంకు గడ్డుకాలంకూటమి పాలనలో హిందూధర్మంకు గడ్డుకాలం దాపురించింది. కూటమి ప్రభుత్వానికి వైయస్ఆర్సీపీపై అభాండాలు మోపి పబ్బం గడుపుకోవడమే తెలుసు. తిరుయల లడ్డూలో కల్తీనెయ్యి అంటూ ఒక పచ్చి అబద్దాన్ని తెరమీదికి తీసుకువచ్చి ఆనాడు వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై దుర్మార్గమైన నిందలు మోపారు. ఆవుకొవ్వు, పందికొవ్వు కలిపారంటే సాక్షాత్తూ సీఎం ఒక ప్రకటన చేయడం, వారి రాజకీయం కోసం ఎంత దూరమైన సరే దిగజారిపోతారనడానికి నిదర్శనం.జనం దీనిని నిజమని నమ్మేలా శతవిధాల ప్రయత్నించారు. దీనిపై సుప్రీంకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక అత్యున్నత పదవిలో ఉన్నవారు బాధ్యతారహితంగా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. ఇదంతా ఒక కుట్ర అంటూ వైఎస్సార్సీపీ ధైర్యంగా ఎదుర్కోవడంతో ఈ కూటమి ప్రభుత్వం సిగ్గుతో వెనక్కి తగ్గింది.అలాగే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యం కారణంగా తొక్కిసాలకు గురై ఆరుగురు మృతి చెందడం, 45 మందికి పైగా గాయపడ్డారు. వైఎస్సార్సీపీ పాలనలో చిన్నచిన్న పొరపాట్లను కూడా అత్యంత దారుణంగా చిత్రీకరించారు. అదే కూటమి పాలనలో జరుగుతున్న అరాచకాలను ఏదో పొరపాటున జరిగిన చిన్న అంశంగా సమర్థించుకుంటున్నారు. తాజాగా ఒక తాగుబోతు నేరుగా శ్రీవారి ఆలయ ప్రాంగణం బయట మద్యం మత్తులో పెద్ద ఎత్తున గొడవ చేశాడు. శ్రీవారి కొండపై మద్యం ఎంతైనా దొరుకుతుందంటూ వీరంగం సృష్టించారు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఎర్రచందనం కొండపై పట్టుబడింది. దానిపై ఎటువంటి చర్యలు లేవు. ఎన్టీఆర్‌ను మానసికంగా చంపి పుట్టిన పార్టీ టీడీపీమంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శవాలపైన పుట్టిన పార్టీ అంటూ మాట్లాడారు. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఎన్టీఆర్‌ను మానసికంగా చంపి, ఆయన శవాన్ని అడ్డం పెట్టుకుని, అధికారాన్ని లాక్కుని అనే విషయం లోకేష్ గుర్తించాలి. తెలుగుదేశం అధికారపీఠం కింద విగతజీవులైన పింగళి దశరథ్‌రామ్, వంగవీటి మోహనరంగా వంటి వారు ఉన్నారని లోకేష్ తెలుసుకోవాలి.గిల్లి జోల పాడటం, చంపి మాలవేయడం, వెన్నుపోటు పొడిచి పీఠమెక్కడం టీడీపీ లక్షణం. కూటమి ప్రభుత్వంలో కూర్చున్నందుకే కాషాయదళం నోరువిప్పడం మానేసింది. ఏపీలో సనాతన ధర్మానికి జరుగుతున్న అన్యాయం, ఆలయాల విధ్వంసం, శ్రీవారి క్షేత్రంలో జరుగుతున్న అనాచారం, దళారీల మయంగా మారిన పవిత్రక్షేత్రం కాషాయదళానికి కనిపించడం లేదు. అమరావతిలో శ్రీవారి కళ్యాణం జరిపామంటూ ఎంతో ఆర్భాటంగా ప్రకటించుకున్న సీఎం చంద్రబాబు.. గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు స్వామివారి కళ్యాణాలను గ్రామాల్లోకి తీసుకువచ్చాం. 2004 డిసెంబర్ నుంచే నేను టీటీడీ బోర్డ్ సభ్యుడగా ఉన్నప్పుడే మొట్టమొదటి సూళ్ళూరిపేట దళితవాడలో స్వామివారి కళ్యాణంను అద్భుతంగా నిర్వహించాం. తరువాత కొన్ని పదుల సంఖ్యలో శ్రీవారి కళ్యాణాలు చేయించాం’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. -
నాగబాబు VS వర్మ.. పవన్ అహంకారం.. రగులుతున్న టీడీపీ
-
ఆర్బీకేల ఆక్రమణ
సాక్షి, అమరావతి: గ్రామ స్థాయిలో పౌరులకు సేవలందించిన సచివాలయాలను నీరుగార్చడంతో పాటు వలంటీర్ల వ్యవస్థకు ఉద్వాసన పలికిన టీడీపీ కూటమి సర్కారు... డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల భవనాలను (రైతు సేవా కేంద్రాలు) సైతం ఆక్రమిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో విత్తు నుంచి విక్రయం వరకు అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచి పల్లె దాటాల్సిన అవసరం లేకుండా భరోసా కల్పించిన ఆర్బీకేలను దర్జాగా కబ్జా చేస్తోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒత్తిడితో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఉండి, కాళ్ల, ఆకివీడు ఆర్బీకేలను ఇప్పటికే పోలీస్స్టేషన్లుగా మార్చేశారు. ఇదే రీతిలో మిగిలిన జిల్లాల్లోనూ కూటమి నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేసిన సీఎం చంద్రబాబు.. వాటి ఉనికే లేకుండా చేయాలనే కుట్రతో ఆ భవనాలను వివిధ శాఖలకు కేటాయిస్తుండటంపై రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.జగన్ ముద్ర చెరిపేయడమే లక్ష్యం..!సచివాలయాలు.. వలంటీర్లు... ఆర్బీకేల పేరు చెబితే చాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తుకొస్తారు! ప్రజల ముంగిటే పౌరసేవలు అందించాలన్న సంకల్పంతో ప్రతి రెండువేల జనాభాకు ఓ సచివాలయం.. వాటికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఒకేసారి 10,778 ఆర్బీకేలను నెలకొల్పి వాటి ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు సేవలందించేందుకు పట్టభద్రులైన 15,667 మంది వ్యవసాయ, ఉద్యాన, పట్టు, మత్స్య, వెటర్నరీ సçహాయకులను నియమించారు. రైతులకు ఎనలేని సేవలందిస్తున్న వీటిని నిర్వీర్యం చేయడం ద్వారా వైఎస్ జగన్ ముద్రను చెరిపేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరతీసింది. రైతన్న ఇక ఎటు వెళ్లాలి..?గతంలో రైతన్నలు గ్రామ చావిడి, కూడలి లేదా కాలువ గట్లపై కూర్చొని కష్టసుఖాలు చెప్పుకునే వారు. ఆర్బీకేల ఏర్పాటుతో అన్నదాతలు వాటిని తమ సొంత ఇంటి మాదిరిగా భావించారు. తమ కోసం ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవస్థను ఎంతో ఆదరించారు. రైతన్నలు ఉదయం పొలానికి వెళ్లే ముందు.. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు ఆర్బీకేలో అడుగు పెట్టడం ఆనవాయితీగా మారింది. విత్తనాలు, ఎరువులు, ఈ–క్రాప్, రైతు భరోసా, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ.. ఇలా ప్రతి ఒక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నిశ్చింతగా పొలం పనుల్లో నిమగ్నమయ్యేవారు. వివిధ రకాల వ్యవసాయ సంబంధిత మేగజైన్స్తోపాటు స్మార్ట్ టీవీ ద్వారా పంటల సాగులో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు అందేవి. డిజిటల్ కియోస్క్‌ల ద్వారా తమకు కావాల్సిన ఉత్పాదకాలను బుక్ చేసుకుని వాతావరణ, మార్కెట్ ధరల సమాచారాన్ని తెలుసుకునేవారు. అన్నదాతలకు గ్రామాల్లో సేవలందించేందుకు రూ.2,260 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో 10,252 ఆర్బీకేల నూతన భవన నిర్మాణాలను కూడా గత ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే రూ.1,165 కోట్ల వ్యయంతో 4,865 భవనాలు పూర్తయి కొన్ని చోట్ల ఆర్బీకేల కార్యకలాపాలు కొనసాగుతుండగా, మరికొన్ని భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 5,387 భవనాల్లో నిర్మాణాలు దాదాపు 80 – 90 శాతం పూర్తి అయ్యాయి. కొద్దిపాటి నిధులిస్తే చాలు పూర్తయ్యే దశలో ఉండగా కూటమి ప్రభుత్వం రావడంతో నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
సీమ హక్కులు 'కృష్ణా'ర్పణం
రాయలసీమకు హక్కుగా కేటాయించిన కృష్ణా జలాలను వాడుకునే విషయంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేతకానితనంతో చోద్యం చూస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ యథేచ్ఛగా అనుమతి లేకుండా నీటిని తరలించుకుపోతున్నా, ఇంకా అదనంగా దండుకోవడానికి ప్రాజెక్టులు నిర్మిస్తున్నా... ఏమాత్రం అడ్డు చెప్పక పోవడం విస్తుగొలుపుతోంది. మాకు కేటాయించిన నీటిని మేము తీసుకెళ్లే ప్రయత్నం చేయడం ఎలా తప్పవుతుందని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఎదుట గట్టిగా నోరు విప్పి వాదించలేదు. ఎవరి మేలు కోసం.. ఎందుకీ ఈ బేలతనం? ‘సీమ’పై కోపమా? లేక వైఎస్ జగన్‌కు పేరొస్తుందని కుళ్లా..?సాక్షి, అమరావతి: రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీరు.. చెన్నై తాగు నీటి అవసరాలు తీర్చే లక్ష్యంతో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం భవితవ్యం కూటమి సర్కారు తీరుతో ప్రశ్నార్థకంగా మారింది. పది నెలలుగా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మన రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటున్నామని వాదించలేకపోయింది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 798 అడుగులు ఉన్నప్పటి నుంచే పొరుగు రాష్ట్రం తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని తరలిస్తున్నా, 800 అడుగుల నుంచే ప్రాజెక్టులకు నీటిని తీసుకుంటున్నా.. కొత్తగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిస్తున్నా అడ్డుచెప్పలేక పోతోంది. 880 అడుగులకు నీళ్లొచ్చినప్పుడు మాత్రమే మనం పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా గరిష్టంగా హక్కుగా దక్కిన 44 వేల క్యూసెక్కులు తరలించాలంటే ఎన్ని రోజులు ఆగాలని, ఆ మేరకు వరద ఎన్ని రోజులు ఉంటుందని.. ఇలాగైతే ఆ మేరకు నీటిని తరలించడం ఎలా సాధ్యమని గట్టిగా వాదించలేదు. కోటా మేరకు నీటిని వాడుకునేలా గత వైఎస్ జగన్ ప్రభుత్వం రూపొందించిన రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని నోరు విప్పి చెప్పలేదు. పర్యావరణ అనుమతులు వచ్చేలోగా తాగునీటి పనులు కొనసాగించడంలో ఏమాత్రం తప్పులేదని కూడా వాదించలేదు. ఫలితంగా ఈ ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం.. చేసిన పనులను తొలగించి, యథాస్థితికి తేవాలని గత నెల 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ) ఆదేశించింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తుపై ఆ రోజు ఈఏసీ 25వ సమావేశంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ చర్చించింది. ఆ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం పైన పేర్కొన్న విధంగా సమర్థవంతంగా వాదనలు వినిపించక పోవడం వల్లే రాయలసీమ ఎత్తిపోతలకు శరాఘాతంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాలను తుంగలో తొక్కి తెలంగాణ సర్కార్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులను కొనసాగిస్తూ.. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను హరిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2014–19 మధ్య నాటి చంద్రబాబు సర్కార్ రెండు కళ్ల సిద్ధాంతంతో రాజకీయ, ఓటుకు నోటు కేసుతో వ్యక్తిగత ప్రయోజనాలు పొందేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన తరహాలోనే ఇప్పుడూ వ్యవహరిస్తోందంటూ రైతులు మండిపడుతున్నారు. తాగునీటి పనులకూ బ్రేక్చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగుగంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించాలని ప్రభుత్వానికి జల వనరుల శాఖ అధికారులు ప్రతిపాదన పంపారు. రాయలసీమ ఎత్తిపోతలలో తాగు నీటి కోసం తరలించడానికి అవసరమైన పనులను చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పనులను ఏమాత్రం పట్టించుకోలేదు. పది నెలలుగా తీవ్ర నిర్లక్ష్యం చేయడం ద్వారా రాయలసీమకు తీరని ద్రోహం చేసింది. ఇదే సమయంలో ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పించలేదు. దీంతో రాయలసీమ ఎత్తిపోతల తొలి దశ పనులకు బ్రేక్ పడినట్లయింది. ‘బనకచర్ల’ ప్రాజెక్టుపైనా డ్రామాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బనకచర్ల ప్రాజెక్టుపైనా నాటకాలాడుతున్నారని స్పష్టమవుతోంది. పోలవరం నీళ్లు బనకచర్లకు తీసుకెళ్తామని, సముద్రంలోకి పోయే వృథా నీటిని సీమకు తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దని ఓవైపు చెబుతూనే.. మరోవైపు తన శిష్యుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ద్వారా అభ్యంతరాలు లేవనెత్తేలా కుట్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాటలే ఇందుకు నిదర్శనం. కేవలం ప్రచారం కోసం మాత్రమే చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఉపయోగించుకుంటున్నారని ఇట్టే అర్థమవుతోంది. నిర్విఘ్నంగా పాలమూరు– రంగారెడ్డి పనులు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలు తరలించేలా రూ.35,200 కోట్ల వ్యయంతో పాలమూరు–రంగారెడ్డి, రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలు తరలించేలా డిండి ఎత్తిపోతలను రూ.6,190 కోట్ల వ్యయంతో 2015 జూన్10న తెలంగాణ సర్కార్ చేపట్టింది. మన రాష్ట్ర హక్కులకు విఘాతం కలిగించే ఈ ప్రాజెక్టులపై అప్పటి చంద్రబాబు సర్కార్ అభ్యంతరం చెప్పలేదు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన జలాలు దక్కవని.. ఏపీకి చెందిన రైతులు 2021లో ఎన్జీటీ (చెన్నె బెంచ్)ని ఆశ్రయించారు. ఈ కేసులో రైతులతో నాటి వైఎస్సార్సీపీ సర్కార్ జత కలిసింది. ఆ రెండు ఎత్తిపోతలకు నీటి కేటాయింపులే లేవని.. వాటి వల్ల శ్రీశైలం, సాగర్‌పై ఆధారపడ్డ ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టా కూడా నీటి కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతుందని వాదించింది. దీంతో ఏకీభవించిన ఎన్జీటీ తక్షణమే పనులు నిలుపుదల చేయాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశిస్తూ 2021 అక్టోబర్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పనులు చేస్తుండటంతో 2022 డిసెంబర్ 22న తెలంగాణ సర్కార్‌కు రూ.920.85 కోట్ల జరిమానా సైతం విధించింది. అయినప్పటికీ వాటిని తుంగలో తొక్కి తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా పనులు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. హక్కులను కాపాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల⇒ ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగు గంగకు 29, గాలేరు–నగరికి 38.. మొత్తంగా 101 టీఎంసీలు సరఫరా చేయాలి.⇒ రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకు శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం తమ భూభాగంలో ఉందని తెలంగాణ సర్కార్ దాన్ని తన అధీనంలోకి తీసుకున్నా.. ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం నాటి చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. ఫలితంగా కృష్ణా బోర్డు కేటాయింపులు చేయకున్నా, దిగువన నీటి అవసరాలు లేకున్నా తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా శ్రీశైలం జలాశయంలో 798 అడుగుల నుంచే ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తూ వస్తోంది. 800 అడుగుల నుంచే నీటిని తరలించేలా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది.⇒ తెలంగాణ సర్కార్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా 2015లో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టినా నాటి చంద్రబాబు సర్కార్ అడ్డుకోలేదు. ఇలా తెలంగాణ సర్కార్ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తుండటం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాడుకోలేని దుస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగు నీటి మాట దేవుడెరుగు గుక్కెడు తాగు నీటికి సైతం తల్లడిల్లాల్సిన దయనీయ పరిస్థితి.⇒ తడారిన గొంతులను తడిపేందుకు.. హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికే తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తద్వారా చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా చేయడం, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం.⇒ ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎక్కడ మంచి పేరొస్తుందోననే ఈర్షతో.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్‌లో తెలంగాణ ప్రాంతంలోని రైతులతో టీడీపీ నేతలు అప్పట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ పర్యావరణ అనుమతి తీసుకుని, ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది. -
‘కూటమి’ వేధింపులు.. గుంటూరు మేయర్ రాజీనామా
సాక్షి, గుంటూరు: గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. కూటమి సర్కార్ తనను ఎంతగానో అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాజీనామా పత్రాన్ని కలెక్టర్‌కు పంపా. నా ప్రమేయం లేకుండా స్టాండింగ్ కమిటీ పెడుతున్నారు. నా ఛాంబర్‌కు కూడా తాళం వేశారు. నెలరోజుల క్రితం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం టీడీపీ నేతలు మా కార్పొరేటర్లను కొనుగోలు చేశారు. కార్పొరేటర్ల ఇంటికెళ్లి బెదిరించారు’’ అని మనోహర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఈ నెల 17 తేదిన స్టాండింగ్ కమిటి సమావేశం నిర్వహిస్తున్నామని అధికారులు నాకు సమాచారం ఇచ్చారు. స్టాండింగ్ కమిటికి నేనే ఛైర్మన్‌ను. స్టాండింగ్ కమిటీలో ఏం ప్రతిపాదనలు ఉండాలి. ఎక్కడ పెట్టాలి. ఎప్పుడు పెట్టాలి అనేది నేను నిర్ణయించాలి. కానీ నాకు తెలియకుండా. నా ప్రమేయం లేకుండా స్టాండింగ్ పెడుతున్నారు. నా ఛాంబర్‌కు తాళం వేశారు. నేను ఛాంబర్‌కు వెళ్తే అధికారులు డ్రామాలు ఆడుతున్నారు.‘‘గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నాటినుంచి ఇంత దారుణమైన అవమానం ఏ మేయర్‌కు జరగలేదు. నాపై కూడా కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్ జగన్ దయవల్లే నేను మేయర్ అయ్యాను. పీవీకే కూరగాయలు మార్కెట్ పేరు మార్చితే చూస్తూ ఊరుకోం’’ అని మనోహర్ నాయుడు హెచ్చరించారు. -
పరిటాల సునీతపై మైనారిటీలు ఫైర్..
-
పాలిటిక్స్‌లో బిల్డప్ బాబాయ్ అవతారమెత్తిన పీకే!
-
ఏరు దాటాక తెప్పతో పనేంటి?
కాకినాడ, సాక్షి: ఏరు దాటాక తెప్పతో పనేముంటుంది?.. తగలెట్టేయడమే!.. కాబోయే జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు(Konidela Naga babu) ఇప్పుడు ఇదే తరహా రాజకీయం చూపించారు. తన సోదరుడు, జనసేన అధినేత అయిన పవన్ కల్యాణ్ కోసం సీటును.. ఆపై ఆత్మాభిమానం చంపేసుకుని మరీ ప్రచారం చేసి గెలిపించారు పిఠాపురం టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. అంతటి త్యాగాన్ని చేసిన వ్యక్తిని ఉద్దేశించి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో చర్చతో రచ్చ కూడా చేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే... అది వారి ‘ఖర్మ’ అంటూ కొణిదెల నాగబాబు పిఠాపురం ఆవిర్భావ సభలో అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విజయం ఎన్నికలకు ముందే ఖాయమైందని, ఆ విజయం వెనుక వర్మ చేసిందేమీ లేదన్నట్లుగా మాట్లాడారాయన. ఎన్నికల సమయంలో తనకు, తన బృందానికి పవన్ కళ్యాణ్ బాధ్యతలు అప్పగించారని, అది కేవలం తమ సంతృప్తి కోసం అప్పగించిన బాధ్యతలే అన్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలని ఎన్నికలకు ముందే నిశ్చయించుకున్నారని చెప్పారు. ఈ పరిస్థితిలో ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పని చేశామని కానీ, విజయానికి తామే కారణమని కానీ అనుకుంటే అది వారి ‘ఖర్మ’ అని స్పష్టం చేశారు. కాగా, నాగబాబు వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపుతున్నాయి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయానికి తాను ఎంతో కష్టపడి పని చేశానని వర్మ అనేక సందర్భాల్లో చెప్పారు. అయినా మొన్న ఎమ్మెల్సీ సీటు ఆయనకు దక్కలేదు. పైగా నాగబాబుకు టికెట్ దక్కింది. అయితే ఎమ్మెల్సీ రాకపోయినా తాను సర్దుకుపోతానని వర్మ ఒక మాట అన్నారు. దీంతో ఇటు టీడీపీలోనే కాదు.. అటు జనసేనలోనూ ఆయనపై సింపథీ ఏర్పడింది. ఇలాంటి తరుణంలోనూ నాగబాబు పిఠాపురం సభలో చేసిన వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదని సోషల్ మీడియా వేదికగా టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు. పిఠాపురంలో వ్యూహాత్మకంగా టీడీపీని, వర్మను నిర్వీర్యం చేయడానికే నాగబాబు ఇలా మాట్లాడారని, ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక ఇలా నాలుక మడతెయ్యడం తగదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. -
ఉర్దూ అకాడమీలో అలజడి
సాక్షి, అమరావతి: ఏపీ ఉర్దూ అకాడమీ నిధుల గోల్మాల్ వ్యవహారంలో విస్తుపోయే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రూ.కోట్లాది నిధుల అవకతవకల వ్యవహారం ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని ఇంటి దొంగల్లో కలవరం తీవ్రమైంది. ‘‘ఉర్దూ అకాడమీలో అంతులేని అక్రమాలు’’ శీర్షికన ‘‘సాక్షి’’ ప్రచురించిన కథనంతో అకాడమీలో అలజడి మొదలైంది. తాజాగా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌తో కొందరు అకాడమీ ఉద్యోగులు టీడీపీకి చెందిన మైనార్టీ నాయకుడి మధ్యవర్తిత్వంలో మంత్రాంగం సాగించడం చర్చనీయాంశమైంది.త్వరలో విచారణ గత టీడీపీ హయాం(2016–17)లో రూ.3.15 కోట్లు తెలంగాణ ఉర్దూ అకాడమీకి అప్పుగా ఇచ్చినట్టు ఏపీ ఉర్దూ అకాడమీ ఆడిట్ రిపోర్టులో లెక్కలు చూపించారు. దీనిపై ఏపీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగుల్‌మీరా తెలంగాణ ఉర్దూ అకాడమీని సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా తాము ఏపీ నుంచి ఎలాంటి అప్పు తీసుకోలేదని తేల్చిచెప్పింది. దీంతో చర్యలు తీసుకోవాలని నాగుల్‌మీరా లోకాయుక్తను ఆశ్రయించారు. ఫిర్యాదును క్షుణ్నంగా పరిశీలించి విచారణకు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్త రిజిస్ట్రార్ గతేడాది నవంబర్ 26న ఏపీ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శికి నోటీసు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం జనవరి 6న విచారణ కమిషన్‌ను నియమించింది. రూ.3.15 కోట్ల గోల్‌మాల్‌పై రహస్యంగా విచారణ చేసి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తాను ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో ఉన్నందున.. విచారణ పూర్తికి మరికొంత గడువు కావాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ సీహెచ్ శ్రీధర్ ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో విచారణ ప్రారంభించే అకాశం ఉంది.దూకుడు తగ్గేలా చూడండి..మరోవైపు 2018–19 మధ్య టీడీపీ హయాంలో దాదాపు రూ.4 కోట్లు ఉర్దూ అకాడమీ నిధులను 67 మంది వ్యక్తిగత ఖాతాలకు మళ్లించిన వ్యవహారంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2021లో సీఐడీ కేసు నమోదు చేసి.. నలుగురిని అరెస్టు చేసింది. ఐపీసీ సెక్షన్ 420, 409 రెడ్ విత్ 120(బి) కేసులో ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ వలీ (ప్రస్తుతం రిటైర్డ్), సూపరింటెండెంట్ జాఫర్ (ప్రస్తుతం తెలంగాణ ఉర్దూ అకాడమీలో పనిచేస్తున్నారు)లను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ అనంతరం బెయిల్‌పై వచ్చారు. తాజాగా ఏపీకి చెందిన ఉర్దూ అకాడమీ ఉద్యోగితో పాటు బయటి వ్యక్తిని సీఐడీ అరెస్టు చేసింది. మరో 11 మందిని సీఐడీ అరెస్టు చేస్తుందనే లీకులు ఇవ్వడంతో వారంతా టీడీపీ మైనార్టీ నేత మధ్యవర్తిత్వంతో ప్రభుత్వ పెద్దల శరణు కోరుతున్నారు. ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని కలవరపడుతున్నారు. సీఐడీ దూకుడుకు కళ్లెం వేసి తమను కాపాడాలని మంత్రిని కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాగా, గత టీడీపీ హయాంలో ఉర్దూ అకాడమీని హద్దులేని అక్రమాలకు అడ్డాగా మార్చేశారని, రూ.30కోట్ల నిధులు ఎవరెవరు కొల్లగొట్టారో తేల్సాలని ముస్లిం సమాజం కోరుతోంది. -
ఉత్తరాంధ్ర జలాలు ఉత్తి మాటే
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు సాగు నీటితోపాటు 1,200 గ్రామాల్లో 30 లక్షల మంది దాహార్తిని తీర్చే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి గ్రహణం పట్టింది. తొమ్మిది నెలలుగా తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ఈ పథకం పనులకు 2024–25 బడ్జెట్లో రూ.79.97 కోట్లు కేటాయించినా, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. పోలవరం ఎడమ కాలువలో 162.409 కి.మీ నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున 63.2 టీఎంసీల గోదావరి జలాలను తరలించి ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి 2009 జనవరి 2న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అంకురార్పణ చేశారు. ఈ పథకాన్ని వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో అప్పట్లో టెండర్లు కూడా పిలిచారు. కానీ.. వైఎస్సార్ హఠాన్మరణంతో ఆ పథకం పనులు ముందుకు సాగలేదు. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. 2019 ఎన్నికలకు ముందు ఈ పథకం తొలి దశ పనులను రూ.2020.20 కోట్లతో చేపట్టి, 4.85 శాతం అధిక ధరకు కాంట్రాక్టర్లకు అప్పగించింది. కానీ.. తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. 2022లో నాటి సీఎం వైఎస్ జగన్ రూ.17,411 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు అనుమతి ఇచ్చారు. తొలి దశలో పోలవరం ఎడమ కాలువలో 162.40 కి.మీ నుంచి 23 కి.మీల పొడవున కాలువ తవ్వకం, రెండు ఎత్తిపోతలు, పెదపూడి రిజర్వాయర్ నిర్మాణం, ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీ పనులను రూ.954.09 కోట్లతో, రెండో దశలో పాపయ్యపాలెం ఎత్తిపోతల, 121.62 కి.మీల పొడవున ప్రధాన కాలువ, ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీ పనులను రూ.5,134 కోట్లతో కాంట్రాక్టర్లకు అప్పగించారు. వీటికి అనుబంధంగా నిర్మించాల్సిన భూదేవి, వీరనారాయణపురం, తాడిపూడి రిజర్వాయర్ల నిర్మాణాన్ని దశల వారీగా చేపట్టాలని నిర్ణయించారు. తొలి దశ, రెండో దశ పనులు చేపట్టడానికి అవసరమైన డిజైన్లు అన్నింటినీ 2023 నాటికే ప్రభుత్వం ఆమోదించింది. దాంతో కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు. తొలి దశ పనులు చేపట్టేందుకు 3,822 ఎకరాలు, రెండో దశ పనులు చేపట్టేందుకు 12,214.36 ఎకరాల సేకరణ ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. ఆ తర్వాత ఎక్కడి పనులు అక్కడే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు నిలిచిపోయాయి. 2025 జూన్ నాటికే ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలిస్తామని అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లా పర్యటనలో ప్రకటించారు. 2024–25 బడ్జెట్లో ఈ పథకానికి రూ.63.02 కోట్లు తొలుత కేటాయించారు. ఆ తర్వాత సవరించిన బడ్జెట్లో ఆ పథకానికి రూ.79.97 కోట్లు కేటాయించారు. కానీ.. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. తొమ్మిది నెలలుగా తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. 2025–26 బడ్జెట్లో ఆ పథకానికి రూ.605.75 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో ఒక్క పైసా కూడా ఖర్చు చేయని నేపథ్యంలో.. ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన నిధులను ఖర్చు చేస్తారా.. లేదా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాంధ్రకు గోదావరి జలాభిషేకం ఇలా.. » వెనుకబడిన ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించి, సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో పోలవరం ఎడమ కాలువను 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో 2004లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. 162.409 కి.మీ నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున అనకాపల్లి జిల్లా పాపయ్యపాలెం వరకు 23 కి.మీల పొడవున తవ్వే కాలువ ద్వారా తరలిస్తారు. ఈ కాలువలో 4.5 కి.మీ నుంచి మరో లింక్ కెనాల్ తవ్వి జామద్దులగూడెం నుంచి కొత్తగా 3.16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పెదపూడి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. » పాపయ్యపాలెం నుంచి 45 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి, 106 కి.మీల పొడవున విజయనగరం జిల్లా గాదిగెడ్డ రిజర్వాయర్ వరకు తవ్వే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువ ద్వారా తరలిస్తారు. ఈ కాలువలో 14 కి.మీ నుంచి తవ్వే లింక్ కెనాల్ ద్వారా నీటిని మళ్లించి.. కొత్తగా 6.2 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మంచే భూదేవి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. » ప్రధాన కాలువలో 49.50 కి.మీ నుంచి తవ్వే మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి, వీఎన్ (వీరనారాయణ) పురం వద్ద ఎత్తిపోతల ద్వారా కొత్తగా 6.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే వీఎన్ పురం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. » ప్రధాన కాలువలో 73 కి.మీ నుంచి తవ్వే మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి.. తాడిపూడి ఎత్తిపోతల ద్వారా కొత్తగా 3.80 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే తాడిపూడి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. » ప్రధాన కాలువలో 102 కి.మీ నుంచి తవ్వే మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి.. కొండగండరేడు నుంచి 60 కి.మీల పొడవున తవ్వే కాలువలోకి నీటిని ఎత్తిపోస్తారు. ఈ కాలువ నుంచి బీఎన్ వలస బ్రాంచ్ కెనాల్, జి.మర్రివలస లిఫ్ట్ కెనాల్, బూర్జువలస లిఫ్ట్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు నీళ్లందిస్తారు. మొత్తంమీద ఈ పథకం ద్వారా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 3.21 లక్షలు, విజయనగరం జిల్లాలో 3.94 లక్షలు, శ్రీకాకుళం జిల్లాలో 85 వేల ఎకరాలకు నీళ్లందిస్తారు. -
జనసేన టీడీపీ మధ్య ఇసుక వేస్తే భగ్గుమనేలా..!
కృష్ణా, సాక్షి: ఏపీలో కూటమి నేతల మధ్య ‘ఇసుక మాఫియా’ కోసం ఆధిపత్య పోరు నడుస్తోంది. అయితే ఈ విషయంలోనూ టీడీపీనే పైచేయి సాధిస్తోంది. తాజాగా అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ-జనసేన ఇసుక పంచాయతీ కొట్టుకునేదాకా తీసుకెళ్లింది. ఆ వీడియోలు ఏకంగా సోషల్ మీడియాకు ఎక్కి వైరల్ అవుతున్నాయి. ఘంటసాల మండలం శ్రీకాకుళం ఇసుక క్వారీపై టీడీపీ నేతల ఆధిపత్యం కొనసాగుతోంది. పగలూ రాత్రీ తేడాలేకుండా ఇసుక తరలిస్తూ.. పార్టీకి చెందిన వాళ్లకు ఉచితంగా అందిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన తరఫు వాళ్లకు మాత్రం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. విషయం తెలిసి రేటు విషయంలో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జనసేనవాళ్లను అసభ్యంగా తిట్టడంతో అది బాహాబాహీకి దారి తీసింది. ఇరు పార్టీల వాళ్లు అర్ధరాత్రి రోడ్డునపడి కొట్టుకున్నారు. ఈ ఘటనలో క్వారీ క్యాష్ కౌంటర్ సూపర్ వైజర్ అఖిల్‌కు గాయాలయ్యాయి. అనంతరం గొడవ.. ఘంటసాల పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీసులు కాంప్రమైజ్‌కు ప్రయత్నించినా లాభం లేకపోయింది. దీంతో కేసు నమోదు చేసి లారీ, జేసీబీని సీజ్ చేశారు. అయితే విషయం తెలిసిన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు , అల్లుడు రంగంలోకి దిగారు. కేసు లేకుండా రాజీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు ఘర్షణ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
వైఎస్సార్సీపీ యాక్టివిస్టుల కన్నీటి కథ..
-
గంటా కొడుకు.. ‘అధికార’ దర్జా
మధురవాడ: అధికారంలోకి వచ్చిందే పెత్తనం చెలాయించడానికన్నట్లు టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ప్రజా ప్రతినిధి కాకపోయినా తండ్రి హోదాను అడ్డుపెట్టుకుని భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ రెచ్చిపోయారు.గురువారం సాయంత్రం మధురవాడ చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ఆయన హెచ్ఎం కుర్చీలో కూర్చుని లా అండ్ ఆర్డర్‌పై సమీక్ష నిర్వహించారు. హైస్కూల్ ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ, జీవీఎంసీ జోనల్ కమిషనర్, పీఎం పాలెం లా అండ్ ఆర్డర్ పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం వారంతా ఇది కూటమి మహిమ అంటూ గుసగుసలుపోయారు. -
మహిళా ఎస్ఐ జుట్టు పట్టుకుని జులుం..
తప్పతాగండి.. ఇష్టానుసారం వ్యవహరించండంటూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఊరూరా, వీధి వీధిన మద్యం వరద పారిస్తోంది. 24/7 మద్యం లభిస్తుండటంతో అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి. ఎదుట ఉన్న వారు ఎవరన్న కనీస విచక్షణ లేకుండా దాడులకు తెగబడుతుండటం పరిపాటిగా మారింది. విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడలో మంగళవారం రాత్రి వేణుగోపాలస్వామి తీర్థం సందర్భంగా ఏర్పాటు చేసిన రికార్డింగ్ డ్యాన్స్‌లో తప్పతాగిన యువకులు కొందరు డ్యాన్సర్లతో అసభ్యంగా ప్రవర్తించారు. బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్ఐ దేవి ఇలా చేయడం తగదంటూ వారిని వారించారు.దీంతో మాకే అడ్డుచెబుతావా.. అంటూ ఆ యువకులు ఆమె జుట్టు పట్టుకుని పక్కకు ఈడ్చేశారు. ఫోన్ లాక్కుని.. ఆమె చేతులు లాగుతూ, దుర్భాషలాడుతూ దాడి చేశారు. ఆమె భయంతో పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అప్పటికీ శాంతించని ఆ యువకులు గేట్లు లాగుతూ, పూల కుండీలు విసిరేసి బీభత్సం సృష్టించారు. ఆమె ఫోన్ చేసి పరిస్థితి చెప్పడంతో అదనంగా పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ మాయదారి మద్యం వల్లే ఇలా జరిగిందంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. – సాక్షి నెట్వర్క్ -
వెరిఫికేషన్ పేరిట లక్షలాది పింఛన్ల తొలగింపు
సాక్షి, అమరావతి : పది నెలల కూటమి పాలనలో కొత్తగా ఒక్క సామాజిక భద్రతా పింఛన్ కూడా మంజూరు చేయకపోగా, ఏకంగా లక్షల మంది ఫించన్లను తొలగించారని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. అభాగ్యులకు పింఛన్లు తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేసింది. సామాజిక భద్రతా పింఛన్లపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్న గురువారం మండలిలో చర్చకు వచ్చిoది. ఈ సందర్భంగా సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 2024 జూన్ నాటికి రాష్ట్రంలో 65,18,496 మంది పింఛన్ లబ్దిదారులుండగా, ఈ ఏడాది ఫిబ్రవరికి ఆ సంఖ్య 63,59,907కు తగ్గిందని.. గత ఏడాది జూన్ నుంచి 14,967 పింఛన్లు మాత్రమే తొలగించామన్నారు. మంత్రి సమాధానం పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏకంగా 1.58 లక్షల పింఛన్లు తగ్గడం కళ్లెదుటే కనిపిస్తుంటే కేవలం 14 వేలే తొలగించామని మంత్రి చెప్పడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. వెరిఫికేషన్ పేరిట ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్న వారి పింఛన్లు తొలగించడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ వారికి ఎలాంటి మేలు చేయొద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెబుతుండటంతో ఇష్టానుసారం పింఛన్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. మరో ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మాట్లాడుతూ.. కూటమికి ఓటు వేయలేదన్న కక్షతో గ్రామాల్లో పింఛన్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చామన్నారు. 2019 నాటికి 53,85,776 పింఛన్ లబి్ధదారులు ఉంటే, 2024 నాటికి 65,18,496కు పెరిగినట్టు వివరించారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. గతంలో పింఛన్ అర్హతకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఉండేదని, ఇప్పుడు దాన్ని 13–స్టెప్ వెరిఫికేషన్‌గా మార్చారన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి జోక్యం చేసుకుంటూ 13–స్టెప్ వెరిఫికేషన్ లేదన్నారు. దీంతో పింఛన్ వెరిఫికేషన్ కోసం ప్రభుత్వం రూపొందించిన 13 అంశాలను మొండితోక అరుణ్‌కుమార్ సభలో చదివి వినిపించారు. సదరం సరి్టఫికెట్‌కు 15 రోజుల గడువు పెట్టారని, అయితే స్లాట్ దొరకడానికే నెలలు పడుతోందన్నారు. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి మంజూరు చేస్తారని అడిగారు. కార్యాచరణ రూపొందిస్తున్నామని, త్వరలో దరఖాస్తుల స్వీకరిస్తామని మంత్రి కొండపల్లి తెలిపారు. ‘ఆడ బిడ్డ నిధి’ అంతేనా? ‘ఆడ బిడ్డ నిధి’ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, టి.కల్పలత ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ పథకం అమలుపై నిర్దిష్ట కాల పరిమితిపై స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో వారు మాట్లాడుతూ.. ఆడబిడ్డలకు తమ ప్రభుత్వం రాగానే నెలకు రూ.1500 ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఒక ఇంట్లో ఎంత మంది మహిళలలుంటే అంతమందికీ వర్తింపజేస్తామని ప్రచారం చేశారన్నారు. పది నెలలైనా పథకం ఊసే లేదని, కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని, ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని నిలదీశారు. దీనిపై మంత్రి శ్రీనివాస్ స్పందిస్తూ మరికొంత సమయం పడుతుందంటూ సమాధానం దాటవేశారు. -
మాది స్కీమ్.. మీది స్కామ్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశ పెడితే, వాటిని స్కాములుగా చిత్రీకరించేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోందని శాసన మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు మండిపడ్డారు. స్కాములన్నీ చేసింది టీడీపీ ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. ధైర్యం ఉంటే 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై వేసిన సిట్ నివేదికలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గురువారం శాసనన మండలిలో ‘2019–24 మధ్య జరిగిన కుంభకోణాలు’పై లఘు చర్చ జరిగింది. టీడీపీ సభ్యురాలు అనురాధ చర్చను ప్రారంభిస్తూ గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో విపక్ష సభ్యులు అడ్డుపడి.. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే విచారణ చేసి, మాట్లాడాలని అనడంతో ఆమె నీళ్లు నమిలారు. విశాఖలో విజయసాయిరెడ్డి బినామీ పేర్లతో భూములు కొన్నారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూములను ఆక్రమించారంటూ ఆమె విమర్శలకు దిగారు. సభలో లేని వ్యక్తుల పేర్లు ఎలా ప్రస్తావిస్తారంటూ వైఎస్సార్సీపీ సభ్యులు అరుణ్‌కుమార్, రమేష్‌యాదవ్ మండిపడ్డారు. అవి ఆక్రమించిన భూమలు కాదని స్థానిక కలెక్టర్లు నివేదిక కూడా ఇచ్చారని స్పష్టం చేశారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది.. వైఎస్సార్సీపీ సభ్యుడు కుంభా రవిబాబు మాట్లాడుతూ.. కుంభకోణాలపై టీడీపీ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని అన్నారు. ఆనాడు ఓటుకు కోట్లు కుంభకోణంలో చిక్కుకుని రాత్రికి రాత్రే సర్దుకుని విజయవాడకు వచ్చేశారని చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అప్పటి నుంచి ఏపీలో స్కాములపర్వం మొదలెట్టి, రాష్ట్రాన్ని అవినీతిలో నంబర్ 1గా నిలబెట్టారని మండిపడ్డారు. రాజధాని పేరుతో అంతర్జాతీయ స్థాయిలో రియల్ ఎస్టేట్ స్కామ్ చేశారని దుయ్యబట్టారు. నైపుణ్యాభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దోచేసిన కేసులో చంద్రబాబును న్యాయస్థానం జైల్లో పెట్టిందన్నారు. విచారణకు సహకరించకుండా ఆయన పీఏను దేశాలు దాటించేశారని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రకటనకంటే ముందే టీడీపీ నాయకులు బినామీ పేర్లతో దళితులు, నిరుపేదల అసైన్డ్ భూములను చౌకగా కొట్టేశారన్నారు.హెరిటేజ్ పేరిట కూడా 14 ఎకరాలు కొన్నారన్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీనే చెప్పారని అన్నారు. రూ.150 కోట్లు కూడా ఖర్చవ్వని తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలకు రూ.1,115 కోట్లు వెచ్చి0చారంటే ఎంత అవినీతి జరిగిందో స్పష్టమవుతోందని అన్నారు. 23 సీట్లకు ఎందుకు పడిపోయింది? రాజధానిలో అవినీతికి పాల్పడకపోతే 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకు ఎందుకు పడిపోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ప్రశ్ని0చారు. పోర్టులు, స్కిల్ కాలేజీలు, వర్సిటీల నిర్మాణం, భారీగా కంపెనీలను తేవడం స్కాములు ఎలా అవుతాయని అన్నారు. 2019–24 మధ్య కుంభకోణాలపై చర్చకు నోటిసిస్తే పాతవన్నీ తోడటం సరికాదంటూ మంత్రి అచ్చెన్నాయుడు అడ్డుపడ్డారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్చిట్ ఇచ్చేసినట్టు చెప్పుకొచ్చారు. దీనిపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. అధికారపక్ష సభ్యులు పేపర్ల కథనాలు చూపించి కుంభకోణాలు అంటున్నారని, ఒక్క దానిపైనైనా రుజువులు చూపారా అని నిలదీశారు. విశాఖ భూములపై సిట్ నివేదిక బయటపెట్టండిటీడీపీ ప్రభుత్వం 2016లో విశాఖ భూములపై వేసిన సిట్ నివేదికను బయట పెట్టాలని బొత్స డిమాండ్ చేశారు. అందులోని వ్యక్తులు ఎవరైనా రాజకీయాలకు అతీతంగా శిక్షించాలని అన్నారు. అందులో విలువైన దసపల్లా భూములున్నాయని, ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని అధికారపక్షాన్ని నిలదీశారు. గత ప్రభుత్వాధినేత భూ బకాసురుడిగా మారి అనుయాయులతో కలిపి దోపిడీ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అనడంతో బొత్స తీవ్రంగా స్పందించారు. ఇలాంటి దుష్ట సంప్రదాయాన్ని ప్రదర్శిస్తున్న సభలో ఉండలేం అంటూ వాకౌట్ చేశారు. ఆధారాల్లేకుండా బురదజల్లుడా? మండలిలో ఇవాళ జరిగిన ప్రశ్నోత్తరాల్లోగానీ, స్వల్పకాలిక చర్చలోగానీ ప్రభుత్వం నుంచి నిర్దిష్ట సమాధానాలు రాలేదని బొత్స చెప్పారు. మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ మీద, తమ నాయకుడి మీద ఆధారాల్లేకుండా ఆరోపణలు చేసినందునే సభ నుంచి వాకౌట్ చేశామన్నారు. మేము భారత్‌లో అడుగుపెట్టిన తర్వాత బీహార్‌లో వ్యాపారం చేయాలంటే దుర్భర పరిస్థితులు ఉంటాయని వినిపించింది. అన్ని విమానాశ్రయాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ 1 అని చూశాం. కానీ, ఐదేళ్లలో మాకు బీహార్ చక్కటి ప్రణాళిక, సుపరిపాలనతో దూసుకెళ్తుండగా, ఏపీ పూర్తి అయోమయంగా, అవగాహన లేకుండా ఉంది. ఏపీలో అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా మాకు వచ్చిన రాజధాని డిజైన్ ప్రతిపాదనలను విరమించుకుని బయటకు వెళ్లిపోయాం.. –జపాన్ ఆర్కిటెక్చర్ సంస్థ సీఈవో వారి మేగజైన్లో ఏప్రిల్ 2017 సంచికలో రాసిన వ్యాసంలో చెప్పిన ఈ వివరాలను మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుడు కుంభా రవిబాబు ప్రస్తావించారు. -
ఖాకీ రాజ్యం కళ్లు తెరవదా!
వ్యక్తి హక్కును తృణీకరించి అరాచకం రాజ్యమేలేచోట వ్యక్తికిగానీ, సమాజానికిగానీ రక్షణ ఉండ దంటాడు ఆఫ్రో–అమెరికన్ రచయిత ఫ్రెడరిక్ డగ్లస్. జనాన్ని అన్ని విధాలా ఏమార్చి తొమ్మిది నెలల క్రితం అందలం ఎక్కిన కూటమి సర్కారు వల్ల ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాలా ఆ పరిస్థితే కొన సాగుతోంది. ఎన్నికల్లో అడ్డూ ఆపూ లేకుండా ఇచ్చిన హామీలేమయ్యాయని అడిగితే... వరస వైఫ ల్యాలను ఎండగడితే... తప్పుడు ప్రచారాలను నిలదీస్తే... జైళ్లు నోళ్లు తెరుచుకుంటున్నాయి. ప్రాథ మిక హక్కయిన భావప్రకటనా స్వేచ్ఛ బందీ అవుతోంది. అడుగడుగునా పౌరుల హక్కులను హరి స్తున్న పోలీసుల తీరును సహించబోమని రాష్ట్ర హైకోర్టు ఇప్పటికి మూడు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ఈ తోలు మందం ప్రభుత్వానికి వివేకం కలిగినట్టు లేదు. అందుకే మంగళ వారం జస్టిస్ రావు రఘునందన్ రావు, జస్టిస్ మన్మథరావులతో కూడిన ధర్మాసనం మరో రెండు కేసుల్లో పోలీసులకు అక్షింతలు వేయాల్సివచ్చింది. పోలీసులైనాసరే చట్టానికి లోబడే వ్యవహరించాలని చీవాట్లుపెట్టింది. ఊహల ఆధారంగా కేసులు పెట్టడం, బెయిల్ రాకుండా తప్పుడు సెక్షన్లు బనాయించటం సహించబోమంది. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే రేపు కోర్టుల్లోకొచ్చి కూడా అరెస్టు చేస్తారంది. ఈ వ్యాఖ్యలు చాలు... ఏపీలో పాలన ఎంత నిరంకుశంగా ఉందో చెప్పడానికి! మనసంటే తెలియని, మనుషులంటే లక్ష్యంలేని కూటమి నాయకులకూ, కార్యకర్తలకూ మూడు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటున్నాయి! అంటురోగం ప్రబలినట్టు, ఊరంతా ఒకేసారి పూన కాలు వ్యాపించినట్టు వీరంతా ఉన్నట్టుండి ఫిర్యాదులు చేస్తున్నారు. ఏమైంది వీళ్లకు? ఇదే తీరు కొనసాగిస్తే చట్టాన్ని సవరించి ఇలాంటి కేసుల్లో మొదటగా ఫిర్యాదీదారులను సైకియా ట్రిస్టుల దగ్గరకు పంపాలని... ఎన్నాళ్లుగా మనోభావాలు దెబ్బతిని వున్నాయో, పర్యవసానంగా వారిలో కనబడిన వైపరీత్యాలేమిటో కుటుంబసభ్యుల నుంచి తెలుసుకోవాలనీ నిబంధనలు చేర్చాలన్న డిమాండ్ బయల్దేరినా ఆశ్చర్యం లేదు. ఆ పనిచేస్తే ఇలాంటివారి రోగం కుదురుతుంది. అధికారంలో ఉన్నవారి మెప్పు పొందేందుకు ఫిర్యాదు అందిందే తడవుగా వెనకా ముందూ చూడకుండా పోలీసులు అరెస్టులకు దిగుతున్నారు. గొలుసు కేసులతో వందలాది కిలోమీటర్ల దూరంలోవుండే పోలీస్ స్టేషన్లకు మార్చి మార్చి తిప్పుతున్నారు. ఎవరిపై ఎన్ని కేసులు పెడుతున్నారో గమనిస్తే ఎవ రంటే పాలకులు వణుకుతున్నారో అర్థమవుతుంది. ప్రముఖ సినీ రచయిత పోసాని కృష్ణమురళి సంగతే తీసుకుంటే, 67 ఏళ్ల ఆ పెద్దమనిషిపై లెక్కకు మిక్కిలి కేసులు పెట్టారు. ఒకటి రెండు కేసుల్లో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు తగిలించి అరెస్టు చేస్తున్నారు. గుండెకు శస్త్ర చికిత్స చేయించుకుని పలు అనారోగ్య సమస్యలతో ఉన్న పోసానిని కేసుల పేరుతో వందల మైళ్లు తిప్పుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్త అవుతు శ్రీధర్ రెడ్డిపై పెట్టిన కేసు గమనిస్తే పోలీసుల అత్యుత్సాహం అర్థమవుతుంది. ఒక కేసులో మేజిస్ట్రేట్ ఆయన రిమాండ్‌ను తిరస్కరించి విడుదల చేయాలని ఆదేశించిన వెంటనే పోలీసులు అతి తెలివి ప్రదర్శించి తిరిగి అవే ఆరోపణలతో ఆయనను మరో సారి అరెస్టు చే శారు. ఈసారి న్యాయస్థానం ఆయన్ను రిమాండ్‌కు తరలించింది. ఈ విషయంలో పోలీసుల పనితీరును హైకోర్టు ధర్మాసనం నిశితంగా విమర్శించింది. ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇష్టానుసారం అరెస్టు చేయటం, చట్టనిబంధనలను తుంగలో తొక్కడం చెల్లదని పేర్కొంది. ఈ విషయంలో యాంత్రికంగా వ్యవహరించినందుకు మేజిస్ట్రేట్‌ను తప్పుబట్టింది. తాచెడ్డ కోతి వనమంతా చెరచినట్టు పోలీసుల తీరు వల్ల కిందిస్థాయి న్యాయస్థానాలకు సైతం మందలింపులు తప్పటం లేదు. నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తికి ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పరు. ఆయన బంధువులకు సమాచారం ఇవ్వరు. అసలు ఆయనపై వున్న కేసులేమిటో చెప్పరు. ఇవి పాటించలేదని తెలిశాక కూడా యాంత్రికంగా రిమాండ్‌కు పంపుతున్న వైనాన్ని ధర్మాసనం ప్రత్యేకించి ప్రస్తావించింది. ఈ ధోరణి సరికాదని మందలించింది. మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ అరెస్టు విషయంలో కూడా న్యాయమూర్తులు ఈ విధంగానే స్పందించారు. వ్యంగ్యంగా, ప్రతీకాత్మకంగా రూపొందించిన ఒక చిన్న రూపకం పోలీసులకు అభ్యంతర కరంగా తోచింది. అంతే... నిరుడు డిసెంబర్లో అర్ధరాత్రి దాటాక రెండున్నర గంటలకు కర్నూలు పోలీసులు తలు పులు బద్దలుకొట్టి ప్రేమ్‌కుమార్ భార్యాపిల్లలను వేరే గదిలో బంధించి ఆయన్ను ఈడ్చుకెళ్లారు. హాస్యాస్పదమైన విషయమేమంటే వినయ్‌కుమార్ దగ్గర దొరికిన రూ. 300 అక్రమ వసూళ్లట! పైగా సంఘటిత నేరాలకు పాల్పడ్డారంటూ ఆరోపించి బీఎన్ఎస్లోని సెక్షన్ 111 బనాయించారు. ఈ రెండు కేసుల విషయంలో మాత్రమే కాదు... ఇంతకు మునుపు మరో మూడు కేసుల్లో కూడా పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. డీజీపీని రప్పించాల్సివస్తుందని హెచ్చరించింది. అయినా పోలీసుల తీరు మారడం లేదు. ఈ తెలివితక్కువ చర్యల్ని ఘనకార్యాలుగా భావిస్తూ పాలకులు సిగ్గువిడిచి ఊరేగుతున్నారు. తమకు ఎదురులేదని విర్రవీగుతున్నారు. అలవిమాలిన హామీలిచ్చి, ఈవీఎంలను నమ్ముకుని, డబ్బు సంచులు గుమ్మరించి అందలం ఎక్కిన కూటమి ఇకముందూ ఇదే దోవలో అధికారాన్ని శాశ్వతం చేసుకోవచ్చని కలలు కంటోంది. తప్పు మీద తప్పు చేస్తూ పోతోంది. ఈ క్రమంలో పోలీసులను ఉపయోగించుకుని సంఘటిత నేరాలకు పాల్పడుతోంది. ఎల్లకాలమూ ఈ వ్యవహారం సాగదు. జనం నిజం గ్రహించారు. కీలెరిగి వాత పెట్టే రోజు ఎంతో దూరంలో లేదు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటా: వైఎస్ జగన్
సాక్షి అమరావతి, సాక్షి ప్రతినిధి, గుంటూరు: టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, మద్దతుదారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం పల్నాడు జిల్లాలో గ్రామ బహిష్కరణకు గురైన దళిత, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన దాదాపు 400 కుటుంబాలకు చెందిన బాధితులు వైఎస్ జగన్‌ను గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కలుసుకున్నారు. మాచవరం మండలం పిన్నెల్లి, తురకపాలెం, మాదినపాడు, చెన్నాయపాలెం, కొత్తగణేశునిపాడు గ్రామాలకు చెందిన వారంతా మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌ను కలిశారు. టీడీపీ నేతలు ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్సీపీ సానుభూతి పరులపై, ఇళ్లపై దాడులకు తెగబడి అక్రమ కేసులు బనాయించి పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని తెలిపారు. ఈ అకృత్యాలను భరించలేక గ్రామాలు విడిచి ఇతర ప్రాంతాల్లో తల దాచుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. స్వగ్రామాలకు దూరంగా గడుపుతుండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే కారణంతో తమను ఊరి నుంచి బహిష్కరించారని, గ్రామంలోకి వస్తే చంపేస్తామని టీడీపీ కూటమి నేతలు బెదిరిస్తున్నారని పిన్నెల్లి గ్రామానికి చెందిన బాధిత కుటుంబాల సభ్యులు వైఎస్ జగన్ ఎదుట వాపోయారు. ‘అధైర్యపడొద్దు.. మీకు అన్ని విధాలా అండగా ఉంటాం..’ అని వారికి వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచి వారికి పూర్తి న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. కాగా, వచ్చే రెండు నెలల్లో ‘చలో పిన్నెల్లి’ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ సిద్ధమవుతోంది. గ్రామ బహిష్కరణపై న్యాయపరంగా కూడా హైకోర్టులో పోరాడుతోంది.గురజాల నియోజకవర్గ నాయకులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ దహన సంస్కారాలకూ నోచుకోని దుస్థితిటీడీపీ శ్రేణుల దురాగతాలతో గ్రామం విడిచి వెళ్లి వేరే ప్రాంతంలో ఉంటున్నాం. మా కుటుంబ సభ్యుడు మృతి చెందినా స్వగ్రామానికి వెళ్లే పరిస్థితి లేక మేం తలదాచుకుంటున్న ప్రాంతంలోనే దహన సంస్కారాలు పూర్తి చేశాం. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట పడేదెప్పుడో తెలియడం లేదు. మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నా. – అమరావతి హసన్ (బుజ్జి), పిన్నెల్లి, వైఎస్సార్సీపీ నాయకుడుమహిళలపైనా దాడులు..ఎన్నికల ఫలితాలు వెలువడ్డ వెంటనే టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీ సానుభూతి పరుల నివాసాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డాయి. ఇంట్లో ఉన్న మహిళలను సైతం దౌర్జన్యంగా లాక్కొచ్చి దాడి చేశారు. టీడీపీ శ్రేణుల అఘాయిత్యాలతో ఆర్థికంగా, శారీరకంగా నష్టపోయాం. బంధువుల నివాసాల్లో కుటుంబ సభ్యులతో తలదాచుకుంటున్నాం. మాకు రక్షణ కల్పించండి.– రత్తయ్య, కొత్తగణేశునిపాడు, వైఎస్సార్సీపీ నాయకుడుఆర్థికంగా నష్టపోయాం టీడీపీ శ్రేణుల అఘాయిత్యాలతో కుటుంబంతో సహా గ్రామాన్ని విడిచి వేరే ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. మా పొలాలు సాగు చేసుకోలేక నష్టపోతున్నాం. మాకు న్యాయం చేయాలి. – పిక్కిలి కొండలు, పిన్నెల్లి గ్రామం, వైఎస్సార్సీపీ నాయకుడు -
‘కూటమి’ కుట్రలు.. గవర్నర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం రాజ్‌భవన్‌లో కలిసి వినతిపత్రం సమర్పించింది. రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతున్న నేపథ్యంలో తక్షణం గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరింది. అనంతరం రాజ్‌భవన్ బయట పలువురు మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలతో కలిసి శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.ఇటీవల గంగాధర నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అన్ని పనులు తెలుగుదేశం వారికే చేయాలి.. వైఎస్సార్సీపీ వారికి ఏ పనీ చేయకూడదు.. అలా చేస్తే పాముకు పాలుపోసినట్లేనంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ఎటువంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ సమదృష్టితో పాలనను అందిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన చంద్రబాబు, దానికి విరుద్దంగా చేసిన వ్యాఖ్యలపై తక్షణం గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజాస్వామిక స్పూర్తికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలో సంక్షేమాన్ని అందుకునే లబ్దిదారులకు పార్టీలు, వర్గాలు ఉండవని అన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాలతో అర్హతను బట్టి పథకాలను వర్తింపచేస్తారని, కానీ చంద్రబాబు మాత్రం ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలని, కొందరి పట్ల వివక్ష చూపించాలంటూ చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చంద్రబాబులా మాట్లాడలేదన్నారు.రాష్ట్రంలోని ఏ రాజకీయపార్టీ అయినా వారి సిద్ధాంతాలు, విధానాల ప్రకారం పనిచేస్తుందని, రాష్ట్రంలోని మొత్తం ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలన్నదే వారి లక్ష్యంగా పెట్టుకుంటారని అన్నారు. ఏ పార్టీ అయినా వ్యక్తిగత ఏజెండాతో పనిచేయవని, కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు దానికి భిన్నంగా చేసిన వ్యాఖ్యలు, ఆయన అనుసరిస్తున్న విధానాలపై తక్షణం స్పందించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. సామాన్యుల అవసరాలకు కూడా రాజకీయ పార్టీ రంగు పులమడం దారుణమన్నారు.ప్రతిపక్ష పార్టీగా ప్రజల ప్రయోజనాల కోసమే వైఎస్సార్సీపీ.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వ మెడలు వంచి ప్రజలకు ప్రయోజనాలు కలిగించేలా వ్యవహరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లు, చివరికి జర్నలిస్ట్‌లపైన కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామని బొత్స సత్యనారాయణ తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేరుగు నాగార్జున, విడదల రజనీ, కారుమూరు వెంకట నాగేశ్వరరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు వున్నారు. -
టీడీపీ రౌడీ రాజకీయం.. YSRCP సర్పంచ్‌పై హత్యాయత్నం
నంద్యాల, సాక్షి: కూటమి పాలనలో అరాచకాలు ఆగడం లేదు. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అనుచరులు.. కోవెలకుంట్ల మండలం కంపమల్లలోచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ లోకేశ్వర్ రెడ్డి(Lokeshwar Reddy)పై దాడికి పాల్పడగా.. ఆయన తీవ్ర గాయాలతో ఐసీయూలో చేరారు. టీడీపీ గుండాల హల్చల్తో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లోకేశ్వర్ రెడ్డిని అదే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. ఆయన ఇంట్లో చొరబడి లోకేశ్వర్‌తో పాటు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ప్రాణ భయంతో పరిగెడుతున్న లోకేశ్వర్ రెడ్డిని పొలంలో పడేసి కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తండ్రి వెంకట్రామిరెడ్డి,తమ్ముడు వెంకటేశ్వర రెడ్డికి కూడా గాయాలైనట్లు సమాచారం.ప్రాణాపాయ స్థితిలో.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న లోకేశ్వర్ రెడ్డిని.. స్థానికంగా నంద్యాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. గ్రామంలో వైఎస్సార్సీపీకి పట్టు ఉండడంతో.. రాజకీయంగా ఎదుర్కొనలేకే ఆయన్ని అడ్డుతొలగించుకోవాలని టీడీపీ ఈ దాడికి పాల్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పవన్, లోకేశ్ క్షమాపణ రాజకీయాలపై ఆసక్తికర చర్చ
సాక్షి, అమరావతి : కాశినాయన ఆశ్రమానికి చెందిన అన్నదాన సత్రాలను అటవీ శాఖ అధికారులు కూల్చివేయడంపై మంత్రి లోకేశ్ ఎక్స్‌లో పోస్టు చేసిన ట్వీట్ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్ మధ్య నడుస్తున్న అధిపత్య పోరుకు నిదర్శనమనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అటవీ శాఖ అధికారులు అన్నదాన సత్రాలను కూల్చివేయడాన్ని తప్పుబట్టిన లోకేశ్ కూల్చివేతలకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నట్టు ట్వీట్లో పేర్కొన్నారు. గతంలో తిరుపతిలో టీటీడీ టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను పవన్‌కళ్యాణ్ తప్పుబట్టారు. ప్రభుత్వం తరఫున క్షమాపణ చెబుతున్నట్టు అప్పట్లో పవన్ ప్రకటించారు. ఇప్పుడు పవన్‌కళ్యాణ్ మంత్రిత్వ శాఖ పరిధిలో కూల్చివేతలను లోకేశ్ తప్పుబట్టడం, ప్రభుత్వం తరఫున క్షమాపణ చెబుతున్నట్టు ట్వీట్ చేయడం ద్వారా పవన్‌కు టిట్ ఫర్ టాట్‌గా సమాధానమిచ్చారనే చర్చ నడుస్తోంది. అప్పట్లో టీటీడీ చైర్మన్ రేసులో పవన్ సోదరుడు నాగబాబు కూడా ఉన్నారనే వార్తలు రాగా.. లోకేశ్ ఏరికోరి బీఆర్ నాయుడిని చైర్మన్‌గా ఎంపిక చేయించారని.. దీనిపై పవన్‌కళ్యాణ్ అసంతృప్తికి లోనయ్యారన్న చర్చ అప్పట్లో సాగింది. ఈ నేపథ్యంలోనే తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ సైతం క్షమాపణ చెప్పాలంటూ పవన్ అప్పట్లో డిమాండ్ చేశారు. తాజాగా ఇప్పుడు పవన్ పర్యవేక్షణలోని అటవీ శాఖ అధికారులు కాశినాయన అన్నదాన సత్రాలను కూల్చివేయడాన్ని అందివచ్చిన అవకాశంగా మలుచుకున్న లోకేశ్ ఈ ఘటనపై ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని, సొంత నిధులతో ఆ సత్రాలను నిర్మిస్తానని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పట్లో టీటీడీ వ్యవహరంలో పవన్‌కళ్యాణ్ వ్యహరించిన తీరుకు ప్రతిగా ఇప్పుడు లోకేశ్ గట్టిగా చురకలు వేసినట్టయ్యింని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కూటమిలో నెలకొన్న లుకలుకలకు ఇదో ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
‘మండలి’లో టీడీపీ సెల్ఫ్‌గోల్
సాక్షి, అమరావతి: గత వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయ భవనాలను తాకట్టు పెట్టేసిందంటూ ‘మండలి’లో టీడీపీ ప్రశ్న వేసి సెల్ఫ్‌గోల్ చేసుకుంది. 2019–24 మధ్య రాష్ట్ర సచివాలయ భవనాలు తాకట్టు పెట్టిన విషయం వాస్తవమేనా అని టీడీపీ ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, పరుచూరి అశోక్‌బాబు, దువ్వారపు రామారావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి.. సీఎం చంద్రబాబు తరఫున మంత్రులు బుధవారం ‘మండలి’లో సమాధానం ఇవ్వాల్సి ఉండగా, సభ్యులు ప్రశ్నను ఉపసంహరించుకున్నారని ప్రకటించారు. పరువుపోతుందని విత్‌డ్రా ‘మండలి’లో బుధవారం ఈ ప్రశ్న పోస్ట్ అవడంతో ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఆధారంగా అనుబంధ ప్రశ్నలు వేయడంతో పాటు, గత ప్రభుత్వంపై బురద జల్లడానికి వీలుగా టీడీపీ ఎమ్మెల్సీలు సిద్ధమైనట్లు తెలిసింది. పైగా ఆ పత్రికలో ప్రచురించిన తప్పుడు కథనం తాలూకు ప్రతులను సైతం వెంటబెట్టుకుని వచ్చారు. అయితే, ఈ ఆరోపణలు అవాస్తవమని ప్రభుత్వం ‘మండలి’కి సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. టీడీపీ నేతలు, ప్రభుత్వ పెద్దల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. ఈ అంశంపై యథావిధిగా సమాధానమిస్తే తమ పరువే పోతుందని ప్రభుత్వ పెద్దలు భావించారో ఏమో.. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, సభ్యులే ప్రశ్నను విరమించుకున్నారని ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే.. రూ.370 కోట్లకు రాష్ట్ర సచివాలయ భవనాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ‘తాకట్టులో సచివాలయం’ అంటూ గతేడాది మార్చి 3న బూతు పత్రిక ఓ తప్పుడు కథనం ప్రచురించింది. ఈ కథనం అవాస్తమని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రతినిధులు అప్పట్లోనే కొట్టిపారేశారు. అయినా, ఇదే అంశంపై శాసన మండలిలో టీడీపీ ప్రశ్నవేసి తోక ముడిచింది. -
చంద్రబాబూ.. తొలి హెచ్చరిక ఇది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కుట్రలను ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. ‘‘పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా “యువత పోరు’’ ద్వారా గళమెత్తిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.‘‘పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా వాటన్నింటినీ అధిగమించి ఈ సంవత్సర కాలంగా మీ ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై నిలదీశారు. నిరుద్యోగులు, విద్యార్థులు మీకు పంపిన తొలి హెచ్చరిక ఇది.. చంద్రబాబు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘‘పేదరికం వల్ల పెద్ద చదువులకు ఎవ్వరూ దూరం కాకూడదన్న దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం విద్యాదీవెన ద్వారా సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను, వసతి దీవెన ద్వారా హాస్టల్, మెస్ ఛార్జీలను నేరుగా వారి తల్లులు, ఆ పిల్లల ఖాతాలకే జమచేస్తూ, అమలు చేసిన ఈ పథకాలను మీ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. చంద్రబాబూ… మీ గత పాలనలోని ఆ చీకటి రోజులనే మళ్లీ మీరు తీసుకు వచ్చారు’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘2024 జనవరి - మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బును ఏప్రిల్‌లో వెరిఫై చేసి, మేలో చెల్లించాల్సి ఉంది. అక్కడ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,800 కోట్లు ఇవ్వాలి. వసతి దీవెన కింద హాస్టల్ ఖర్చులకు మరో రూ.1,100 కోట్లు ఇవ్వాలి. ప్రతి ఏడాదికి ఈ రెండు పథకాలకు రూ.3,900 కోట్లు ఖర్చు చేయాలి. కానీ చంద్రబాబుగారూ, మీరిచ్చింది కేవలం రూ. 700 కోట్లు. అదికూడా ఇప్పటికీ పూర్తిగా పిల్లలందరికీ చేరలేదు...అంటే గతేడాది పిల్లలకు బాకీ పెట్టిన రూ.3,200 కోట్లు, అదీ కాక ఈ ఏడాది ఖర్చుచేయాల్సిన మరో రూ. 3,900 కోట్లు, రెండూ కలిపితే రూ.7,100 కోట్లు ఈ సంవత్సరం ఖర్చుపెట్టాలి. అయితే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే. దీని అర్థం పేద విద్యార్థుల చదువులు, వారి బాధ్యత విషయంలో మీరు తప్పించుకుంటున్నట్టే కదా ? ఆ పిల్లల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నట్టే కదా? చదువుకుంటున్న పిల్లలకు మీరు చేస్తున్న ద్రోహం కాదా? విద్యార్థులను ఇంతగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబూ....అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు లేదా అందాక నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వడం లేదు కదా వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను ఊడపీకుతున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ప్రతి ఏటా రూ.7,200 కోట్లు ఖర్చు చేయాలి. కాని, గత ఏడాది బడ్జెట్లో ఒక్కపైసా కేటాయింపూ లేదు. ఈ ఏడాదికి కూడా ఒక్కపైసా కేటాయించలేదు. ఈ రెండేళ్లలోనే ప్రతి నిరుద్యోగికీ రూ.72వేల చొప్పున బకాయి పడ్డారు. అలాగే వైయస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేస్తూ, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందనీయకుండా అడ్డుకోవడమే కాదు, పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేస్తున్నారు. ..కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదికూడా కాకముందే మిమ్మల్ని ప్రశ్నిస్తూ, నిరుద్యోగులు, ఇంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కడం ఎప్పుడైనా చూశారా చంద్రబాబూ? ప్రజల పక్షాన నిలుస్తూ, విద్యార్థుల సమస్యలపై, వారికోసం చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ “యువత పోరు’’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పిల్లలు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలందర్నీ అభినందిస్తున్నాను. అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థుల సహా అన్నివర్గాలకూ పార్టీ ఎప్పుడూ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.1. @ncbn గారూ పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రపై వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా “యువత పోరు’’ ద్వారా గళమెత్తిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని… pic.twitter.com/dn2LslNZzI— YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2025 -
చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: వరుదు కళ్యాణి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు మహిళల గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందంటూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక మహిళలను నిలువునా మోసం చేశారని నిలదీశారు. ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయటంలేదని దుయ్యబట్టారు.‘‘ఉచిత బస్సు తెలంగాణలో కొనసాగుతున్నా ఏపీలో ఇంకా ప్రవేశ పెట్టలేదు. ఆడబిడ్డ నిధి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఉచిత గ్యాస్ సిలిండర్ ఒకటికే పరిమితం చేశారు. అది కూడా సగం మందికే ఇచ్చి మరో మోసం చేశారు. టీడీపీ అంటే తెలుగింటి ఆడపిల్లలను మోసం చేసే పార్టీ. 2014-19లో కూడా డ్వాక్రా మహిళలను మోసం చేశారు. జగన్ తెచ్చిన దిశ యాప్‌ని కాపీ కొట్టి.. శక్తియాప్ అని పెట్టారు. జగన్ తెచ్చిన వ్యవస్థలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు’’ అని వరుదు కల్యాణి మండిపడ్డారు.‘‘జగన్ మహిళలకు రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థానం కల్పించారు. మహిళాభ్యుదయం జగన్ వలనే సాధ్యమైంది. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చంద్రబాబు చెప్పకుండా జగన్ గురించి విమర్శలు చేయటం బాధాకరం. చంద్రబాబు తన ఆస్తిలో చెల్లెళ్లకు ఎంత ఇచ్చారో సమాధానం చెప్పాలి. తల్లికి ఏం ఇచ్చారో చెప్పాలి. చంద్రబాబు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి వ్యక్తిగత ఆరోపణలు చేయటం సిగ్గుచేటు’’ అంటూ వరుదు కల్యాణి దుయ్యబట్టారు. -
ఇష్టానుసారం మాటలు కాదు.. దమ్ముంటే నిరూపించండి: మిథున్ రెడ్డి సవాల్
సాక్షి, ఢిల్లీ: ఏపీలో టీడీపీ మరో కొత్త నాటకానికి తెర లేపిందన్నారు వైఎస్సార్సీపీ లోక్‌సభపక్షనేత, ఎంపీ మిథున్‌రెడ్డి. తప్పుడు ఆరోపణలతో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. టీడీపీకి దమ్ముంటే ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు.వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసింది. క్షక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. తప్పుడు ఆరోపణలతో మా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. టీడీపీ మళ్లీ కొత్త నాటకానికి తెరలేపింది. లిక్కర్ స్కాం చేశామని ఆరోపణలు చేస్తున్నారు.. దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయండి. మొదట 50వేల కోట్ల రూపాయల స్కాం అని ప్రచారం చేశారు. ఇప్పుడు మూడువేల కోట్ల రూపాయల స్కాం అని ఆరోపణలు చేస్తున్నారు. మూడువేల కోట్ల రూపాయలు మడిచి జేబులో పెట్టుకుంటారా?.ఢిల్లీలో ప్రభుత్వ దుకాణాలను ప్రైవేటులో నడిపారు. కానీ, మా ప్రభుత్వంలో పారదర్శకంగా ప్రభుత్వమే దుకాణాలను నిర్వహించింది. మేము భూములు కబ్జా చేశామని తప్పుడు ఆరోపణలు చేశారు. అఫిడవిట్లో కాకుండా, అదనపు భూమి మాకు ఏమైనా ఉంటే చూపించండి. అరెస్టు చేసిన గౌతమ్ తేజ్ వ్యక్తికి పాలీ గ్రాఫ్ టెస్ట్ చేశారు. అందులో కూడా ఆయన నేరం చేయలేదని తేటతెల్లమైంది. వందల మైన్ కాదు ఒక్క మైన్‌లో కూడా అక్రమాలు చూపండి. ఒక్క ఆరోపణకైనా సాక్ష్యం చూపించారా?. మీకు దమ్ముంటే ఆరోపణలను రుజువు చేసి చూపించండి.ఎర్రచందనం విషయంలోను ఇలాగే తప్పుడు ఆరోపణలు చేశారు. మాపై బురద కొట్టి పారిపోతున్నారు. పసలేని ఆరోపణలు చేస్తున్నారు. అటవీ భూములు కబ్జా చేశారని తప్పుడు ఆరోపణలు చేశారు. మా కుటుంబంపైనే 75 ఎకరాల భూమి ఉందని కలెక్టర్ రిపోర్టు ఇచ్చారు. కలెక్టర్ చేసిన దర్యాప్తులో కూడా టీడీపీ ఆరోపణలు రుజువు కాలేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
మొత్తం చినబాబే చేశారు! రెడ్‌బుక్ ఎఫెక్ట్‌తో అంతా..
ఇచ్చిన మాటను గాలికి వదిలేయడం ఎలాగో తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూడాల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు ఈ విషయంలో పోటీ పడుతున్నారు. అందుకు తాజా ఉదాహరణే.. శాసనమండలి ఎన్నికలు!. మొత్తం ఐదు సీట్లలో.. టీడీపీ మూడు స్థానాలు, జనసేన, బీజేపీ చెరో స్థానంలో పోటీ చేస్తున్నాయి. వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. అయితే ఈ ఎంపికలన్నీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ సొంత టీమ్ కోసమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీడీపీకి జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడే అయినప్పటికీ.. జాతీయ కార్యదర్శి అయిన లోకేష్ మాటకే పార్టీలో ఎక్కువ చెల్లుబాటు అవుతున్నట్లు సమాచారం. సీనియర్లను పూర్తిగా పక్కనబెట్టి, గతంలో తాము చేసిన బాసలకు తిలోదకాలు ఇచ్చి ఈ ఎంపికలు జరిపారన్న భావన టీడీపీ వర్గాలలో వ్యక్తం అవుతోంది. ఉన్నవి మూడు సీట్లే. కాబట్టి అందరిని సంతృప్తి పరచడం కష్టమే. కాని ఎంపిక చేసిన వారిని ఇతర ఆశావహులతో పోల్చి చూసినప్పుడు విమర్శలు వస్తున్నాయా? ప్రశంసలు వస్తున్నాయా? అనేది పరిశీలనకు వస్తుంది. ఆ రకంగా చూస్తే ఈ ఎంపికలు అంత సంతృప్తి కలిగించలేదని అంటున్నారు. 👉పార్టీలో 42 ఏళ్లు వేర్వేరు పదవులు నిర్వహించిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు టీడీపీ రిటైర్మెంట్ ఇచ్చినట్లే కనిపిస్తుంది. 1995లో యనమల స్పీకర్‌గా ఉండడం వల్లే.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తోసేసి చంద్రబాబు తేలికగా సీఎం అయ్యారని అంటారు. చంద్రబాబుకు రాజకీయ సలహాలు ఇస్తుంటారని కూడా ప్రచారం ఉంది. లోకేష్ నాయకత్వం వచ్చాక ఈయనను మెల్లగా పక్కన పెట్టారు. అయితే యనమల కుమార్తెకు మాత్రం ఎమ్మెల్యే పదవి వచ్చింది. ఇంకో కూతురి భర్త ఎంపీ అయ్యారు. వియ్యంకుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది కూడా మైనస్ కావచ్చు. అయితే.. టీడీపీలో ఆయా కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వలేదా అన్న చర్చ రావచ్చు. అది వేరే సంగతి. 👉ఇక అందరి దృష్టిని ఆకర్షించేది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహారం. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయాలనుకున్నప్పుడు వర్మ సీటు వదలుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం రాగానే తొలి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా ఆయన(వర్మ) ఎమ్మెల్సీ అయిపోయినట్లేనని ప్రచారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా.. రెండుసార్లు ఎమ్మెల్సీ పదవులు భర్తీ అయ్యాయి. కాని వర్మకు అవకాశం ఇవ్వకుండా హామీని గాలికి వదలివేసి అవమాన భారం మిగిల్చారు. ఇప్పుడు వర్మ కక్కలేక, మింగలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వర్మకు పదవి ఇస్తే పిఠాపురంలో పోటీ కేంద్రం అవుతారన్నది పవన్ భయమట. ఏది ఏమైనా మాట ఇచ్చి ఎలా తప్పవచ్చో చెప్పడానికి వర్మ వ్యవహారం ఉదాహరణ అవుతుంది. కొంతకాలం క్రితం వరకు కనీసం తన వాయిస్ వినిపించే వారు. కాని ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ భయమో, మరేదైనా కారణంతోనో వర్మ కనీసం నిరసన కూడా చెప్పలేని నిస్సహాయ స్థితిలో పడ్డారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. 👉వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణను ఎలా ప్రలోభ పెట్టారో.. ఏకంగా ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అన్నారు. కాని ఆయనకు పదవి హుళక్కి అయింది. పలువురు ఇతర ప్రముఖులు దేవినేని ఉమ, ప్రభాకర చౌదరి, బుద్దా వెంకన్న, వంగవీటి రాధాకృష్ణ మొదలైన వారంతా గత ఎన్నికలలో టిక్కెట్లు ఆశించి భంగపడ్డారు. అప్పుడు వారిని ఓదార్చడానికి ఎమ్మెల్సీ, ఇతర పదవులు ఇస్తామన్నారు. కాని వారికి ఏ పదవి ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా రాలేదు. వైఎస్సార్సీపీ నుంచి పార్టీ మారిన జంగా కృష్ణమూర్తి పరిస్థితి అంతే. 👉ఒక్క బీటీ నాయుడుకు మాత్రం ఎమ్మెల్సీ పదవి తిరిగి వచ్చారు. చంద్రబాబుకు బాగా ఉపయోగపడ్డారని టీడీపీ మీడియా ఒక ప్రచారం చేస్తోంది కాని, ఆయనను మించి ఎవరూ లేరా? అనే సందేహం కూడా వస్తుంది. బీదా రవిచంద్రకు పదవి ఇవ్వడం మామూలుగా అయితే అభ్యంతరం ఉండదు. కాని, వైఎస్సార్సీపీ నుంచి ఆయన సోదరుడు టీడీపీలోకి వచ్చి మళ్లీ రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఇప్పుడు రవిచంద్రకు కూడా పదవి దక్కింది. ఇక కావలి గ్రీష్మకు ఇప్పటికే ఒక కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పదవి ఉంది. ఆమెను ఎమ్మెల్సీ చేయడం విశేషం. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తెగా కన్నా, ఆమె మహానాడులో చంద్రబాబు సమక్షంలోనే వేలాది మంది చూస్తుండగా, తొడలు గొట్టడం, అభ్యంతరక భాషలో వైఎస్సార్సీపీ వారిని దూషించడం వంటి కారణాలే ప్రామాణికతగా పదవి వచ్చిందన్న ప్రచారం సాగుతోంది. మరి ఆమె మండలిలో ఇంకెలాంటి బూతులకు దిగుతారోనన్న వ్యాఖ్యలు టీడీపీలో వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బూతులను ఎంకరేజ్ చేసినట్లు వ్యవహరించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక సుద్దులు చెబుతున్నారు. ఎల్లోమీడియా మాత్రం సహజంగానే ఈ టీడీపీ ఎమ్మెల్సీ ఎంపికలకు బిల్డప్ ఇస్తూ బలహీనవర్గాలకు పెద్ద పీట అని రాసి ప్రచారం చేశాయి. జనసేన అభ్యర్దిగా పవన్ సోదరుడు, నటుడు నాగబాబును ఎంపిక చేశారు. కొద్ది నెలల క్రితమే ఆయనకు మంత్రి పదవి ఇస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. కాని ఎందువల్లో ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ అవుతున్నందున ఇవ్వకతప్పదేమో!. 👉ఎల్లో మీడియా నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడం లేదని, కార్పొరేషన్ చైర్మన్ పదవి మాత్రమే ఇస్తారంటూ కథనాలు రాసింది. అందుకు పవన్ కూడా ఓకే అన్నట్లు చెప్పాయి. కాని ఏమైందో కాని, మరుసటి రోజు నాగబాబు ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ వేయబోతున్నారని జనసేన ప్రకటించింది. విశేషం ఏమిటంటే గతంలో పవన్ తన బంధువులకు పదవులు ఇవ్వడం కోసం పార్టీని పెట్టడం లేదని గొంతెత్తి మరీ చెప్పారు. అంతేకాక కుల రాజకీయాలపై ఒక్కోసారి ఒక్కోరకంగా మాట్లాడారు. ఇప్పుడు జనసేన అంటే ఒక సామాజిక వర్గ పార్టీనే అన్న భావన కలిగించేలా పదవులు కేటాయిస్తున్నారు. ఇంతకుముందు ఒక ఎమ్మెల్సీ పదవిని కూడా అదే వర్గానికి ఇచ్చారు. ఇప్పుడు తన సోదరుడు నాగబాబుకు ఇచ్చుకున్నారు. తనతో పాటు కందుల దుర్గేష్ కూడా అదే వర్గం వారు కావడం గమనార్హం. నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఉన్నారు. దీంతో జనసేనలో ఇతర సామాజిక వర్గాలకు అసలు ప్రాధాన్యత లేదన్న భావన ఆయన అభిమానులలో ఏర్పడడానికి ఆస్కారం కలిగింది. 👉గతంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు మరోసారి ఎమ్మెల్సీ అవుతున్నారు. వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇవ్వడంపై బీజేపీ లో ఆక్షేపణ ఉండకపోవచ్చు. కాని ఈ పదవిని ఆశిస్తున్న ఇతర సీనియర్ లు కొందరికి ఆశాభంగం అవుతుంది. వీర్రాజుకు పదవి రావడం పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంతగా ఇష్టం ఉండకపోవచ్చు. కాని బీజేపీ అధిష్టానాన్ని కాదనే పరిస్థితి వీరికి లేదు. వీర్రాజు నామినేషన్ చివరి క్షణంలో వేసిన తీరును బట్టి హైకమాండ్ కావాలనే ఆయనకు పదవి ఇచ్చిందని, తద్వారా టీడీపీకి, పురందేశ్వరికి చెక్ పెట్టే ఆలోచన చేసి ఉండవచ్చన్నది కొందరి విశ్లేషణ. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. గతంలో వీర్రాజు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 2014-19 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై ఎక్కడకక్కడ కడిగి పారేసేవారు. నీరు-చెట్టు స్కీమ్ కింద తెలుగు తమ్ముళ్లు రూ.13 వేల కోట్లు దోచేశారని సంచలన ఆరోపణ కూడా చేశారు.ఇప్పుడు వాటన్నిటిని మరచి పోయి టీడీపీతో స్నేహం చేయకతప్పదు. ప్రధాని మోదీనే టీడీపీ పెద్దలు దారుణంగా దూషించినా పొత్తు పెట్టుకోగా లేనిది, వీర్రాజుది ఏముందిలే అనేవారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఎంపికల వల్ల టీడీపీ, జనసేనలలో కొంతమేర అంతర్గతంగా లుకలుకలు రావచ్చు. తెలంగాణలో ప్రముఖ నటి విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అధిష్టానం ఆమెను ఎంపిక చేసిందని చెబుతున్నారు. మరో నేత అద్దంకి దయాకర్ గతసారి ఎన్నికలలో తన సీటును వదలుకుని ప్రచారానికి పరిమితం అయ్యారు. అయినా టిక్కెట్ వస్తుందా? రాదా? అనే టెన్షన్ ఉన్నప్పటికీ ఎట్టకేలకు సాధించగలిగారు. మరో సీటును శంకర్ నాయక్ అనే నేతకు కేటాయించారు.ఇంకో స్థానం సిపిఐకి కేటాయించారు. కాగా బీఆర్ఎస్ పక్షాన దాసోజు శ్రావణ్ కు ఇవ్వడం ద్వారా గతంలో ఆయనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసినట్లయింది. అప్పట్లో కేసీఆర్ నామినేట్ చేసినా, గవర్నర్ ఆమోదం జాప్యం అవడం, ఇంతలో ఎన్నికలు రావడం ,కాంగ్రెస్ గెలవడం వంటి కారణాలతో ఆయన ఎమ్మెల్సీ కాలేకపోయారు. ఇప్పటికి ఆయనకు పదవి లభించింది. తెలంగాణలో ఈ ఎంపికలు.. ఏపీతో పోల్చితే కాస్త బెటర్ గా ఉన్నట్లే కావచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బడుగు బతుకులపై పచ్చ జేసీబీలు
శాంతిపురం: టీడీపీకి ఓటు వేయలేదనే అనుమానంతో ఆ పార్టీ నేతలు పన్నిన కుట్రను అధికారులు పకడ్బందీగా అమలు చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఇళ్లు కట్టారంటూ 9 ఇళ్లను కూల్చివేసి, ఆయా కుటుంబాలను నిర్వాసితులను చేశారు. బాధితుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సంతూరు సమీపంలోని చెల్దిగాని చెరువు పక్కన మిట్టపై 9 కుటుంబాలు ఇళ్లు కట్టుకుని పాతికేళ్లుగా నివసిస్తున్నాయి. వీరిలో దళితులైన గణేష్, అశ్వత్, సోమశేఖర్, మంగమ్మ, భవానీ కుటుంబాలతో పాటు బీసీలైన నారాయణప్ప, కనకమ్మ, కావలి నారాయణప్ప, నరసింహులు కుటుంబాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వీరి ఎక్కువ మంది వైఎస్సార్సీపీకి ఓటు వేశారనే అనుమానంతో అధికార పార్టీ నాయకులు వీరిని టార్గెట్ చేశారు. వారి ఇళ్లకు కరెంటు, నీటి సదుపాయాలను ఇప్పటికే తొలగించారు. బాధితులు కలెక్టర్, కడ పీడీ, శాంతిపురం తహసీల్దార్, ఎంపీడీవోలను కలిసి గోడును వెళ్లబోసుకున్నారు. మరోచోట ఇంటి స్థలాలు కేటాయిస్తే అక్కడికి వెళ్లిపోతామని మొరపెట్టుకున్నారు. కానీ 48 గంటల్లో ఇళ్లను ఖాళీ చేయాలని నోటీసులిచ్చిన అధికారులు గడువు తీరగానే కూల్చివేతలకు పూనుకున్నారు. పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో పోలీసుల భద్రత నడుమ రెండు జేసీబీలు తెచ్చి పేదల ఇళ్లు కూల్చేశారు. ఇళ్లలోని వస్తువులు, ధాన్యం అంతా మట్టి పాలు చేశారు. దీంతో రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు పిల్లాపాపలు, వృద్ధులతో సహా వీధిన పడ్డాయి. సీఎం నియోజకవర్గంలో ఇంత దౌర్జన్యమా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో దళితులు, పేదలపై అధికారుల జరిపిన దౌర్జన్యకాండను వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షడు కోదండరెడ్డి, మండల కన్వినర్ బుల్లెట్ దండపాణి, రెస్కో మాజీ చైర్మన్ చక్రపాణిరెడ్డి, నాయకులు సైపుల్లా, కావలి వెంకటరమణ, గజ్జల రమేష్, చలపతి ఖండించారు. బాధితులను పరామర్శించిన అనంతరం అక్రమ నిర్మాణం పేరుతో ఇళ్లను కూల్చిన అధికారులు మండల, నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే చర్యను కొనసాగించగలరా అని ప్రశ్నించారు. పిల్లలు, వృద్ధులకు నిలువ నీడ లేకుండా చేసి రాక్షసత్వం చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, అప్పటివరకూ పునరావాస ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు తక్షణ సాయం అందించారు. ఎలా బతకాలి రోడ్డు ప్రమాదంలో భర్త, నాన్న చనిపోయారు. ముసలి వాళ్లైన అమ్మ మంగమ్మ, అమ్మమ్మ, వికలాంగుడైన కొడుకుతో కుటుంబాన్ని లాక్కొస్తున్నాను. రోజూ కూలికి పోతేనే ఇల్లు గడుస్తుంది. పైసా పైసా కూడబెట్టుకుని రేకుల ఇల్లు కట్టుకుంటే దిక్కులేని వాళ్లమనే కనికరం లేకుండా కూల్చేశారు. ఇప్పుడు మేం ఎలా బతకాలి?. ఎక్కడ తలదాచుకోవాలి?. – అశ్వని, బాధితురాలు అడవుల పాల్జేశారు ఓటు వేయలేదనే అనుమానంతో మా ఇంటిని కూలదోసి ఏమీ లేకుండా చేశారు. మతిస్థిమితం లేకుండా తన లోకాన తాను తిరిగే భర్త. స్కూల్‌కు వెళుతున్న ఇద్దరు బిడ్డలతో బతుకుతున్నా. కూలి పనులు చేస్తూ బతుకు వెళ్లదీస్తుంటే మా నోట్లో మట్టి కొట్టారు. మమ్మల్ని అడవుల పాలు చేశారు. – శారదమ్మ, బాధితురాలు -
పోసానిపై పైశాచికం!
సాక్షి, అమరావతి: సినిమాల్లో విలన్లు.. వృద్ధులు, మహిళలను వేధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నట్లు చూపిస్తారు..! అక్రమ కేసులతో వేధిస్తున్న చంద్రబాబు సర్కారు అదే రీతిలో రెడ్‌బుక్ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది!! తాము బనాయిస్తున్న అక్రమ కేసులు ఎలాగూ న్యాయస్థానాల్లో నిలబడవు కాబట్టి విచారణ పేరుతో వేధించాలని పోలీసులను పురిగొల్పుతోంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై లెక్కకు మించి అక్రమ కేసులు బనాయించింది. రోజుకో కేసులో అరెస్ట్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, జైళ్ల చుట్టూ రోడ్డు మార్గంలో ఏకంగా 2,501 కి.మీ. తిప్పి రాక్షసత్వాన్ని ప్రదర్శించింది! 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణ మురళికి కొంతకాలం క్రితమే గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకు ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలున్నాయి. దీంతో చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రలను ఆపలేదు. టీడీపీ, జనసేన పార్టీల నేతలు పక్కా పన్నాగంతో పోసాని కృష్ణ మురళిపై వివిధ జిల్లాల్లో అక్రమ కేసులు పెట్టారు. అనంతరం వరుస అరెస్టులతో దాష్టీకానికి తెగించారు. జనసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు మొదట అరెస్ట్ చేయగా అక్కడ నుంచి రాష్ట్రమంతా తిప్పుతూ వరుసగా అరెస్ట్‌ల పర్వం కొనసాగించారు. 17 అక్రమ కేసులు బనాయించగా నాలుగు కేసుల్లో అరెస్టు చేశారు. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లోని పోసాని కృష్ణ మురళి నివాసంపై పోలీసులు దండెత్తారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసులో పోసానిని అరెస్ట్ చేశారు. రాత్రంతా వాహనంలో తిప్పి ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 12 గంటలకు ఓబులవారిపల్లెకు తీసుకువచ్చారు. జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు పోసానిని ఏకంగా 9 గంటల పాటు విచారించడం గమనార్హం.ఫలించిన న్యాయ పోరాటం..నేడు జైలు నుంచి పోసాని విడుదలయ్యే అవకాశంవిశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు తదితర పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన అక్రమ కేసుల్లో పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసి ఆ జిల్లాలకు వరసగా తరలించాలని పోలీసులు భావించారు. అయితే పోసాని న్యాయ పోరాటం ఫలించింది. ఆయనపై బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేసింది. ఇక పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి. విశాఖ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసులో విచారణను నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కర్నూలు మొదటి అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, ఆదోని ఇన్చార్జి అపర్ణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్నూలు జిల్లా జైలులో ఉన్న పోసాని కృష్ణ మురళి బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది. -
హోం మంత్రి ఇలాకాలో.. అశ్లీల నృత్యాలు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో అశీల్ల నృత్యాలు అంబరాన్నంటాయి. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న పవిత్రమైన ఉపమాక వెంకన్న కల్యాణ్సోతవం కార్యక్రమంలో వెగటు పుట్టించే పాటలతో అమ్మాయిల డ్యాన్స్‌లతో అపచారానికి ఒడిగట్టారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా డీజే పేరుతో రికార్డింగ్ డ్యాన్సులను యథేచ్ఛగా నిర్వహించారు. సాక్షాత్తూ హోం మంత్రి నియోజకవర్గంలోనే ఈ కార్యక్రమం జరుగుతుండడంతో.. టీటీడీ అధికారులు గానీ, పోలీసులు గానీ ఈ రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డుచెప్పే ధైర్యం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ పెత్తనంతో.. నక్కపల్లి మండలం ఉపమాపకలో ఆరో శతాబ్ధానికి చెందిన వెంకన్న ఆలయానికి ఘన చరిత్ర ఉంది. 2017 సంవత్సరం వరకు దేవదాయ శాఖ ఆధీనంలో ఉండే ఈ ఆలయాన్ని తెలుగుదేశం ప్రభుత్వమే టీటీడీకి అప్పగించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు, ధనుర్మాసోత్సవాలు, కల్యాణోత్సవాలు తిరుపతిలో మాదిరిగానే నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక పర్వదినాల్లో కేవలం ఆధ్యాత్మికమైన సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే ఇప్పటి వరకు టీటీడీ అధికారులు నిర్వహిస్తూ వచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత జరుగుతున్న ఈ ఉపమాక వెంకన్న కల్యాణోత్సవంలో టీడీపీ నేతల పెత్తనం పెచ్చుమీరింది. హోం మంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టిన తరువాత ఉపమాక దేవస్థానంలో తెలుగుదేశం నేతల జోక్యం ఎక్కువైందన్న ఆరోపణలున్నాయి. టీటీడీ సంప్రదాయానికి తూట్లు.. వెంకన్న కల్యాణోత్సవ కార్యక్రమాన్ని అపవిత్రం చేసేలా టీడీపీ నేతలు రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడంపై భక్తులు మండిపడుతున్నారు. కల్యాణోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి డీజే పేరుతో రికార్డింగ్ డ్యాన్స్‌ను ఏర్పాటు చేశారు. ఒకవైపు స్వామి వారి కల్యాణోత్సవం జరుగుతుండగా మరోవైపు ఆలయానికి ఆనుకుని వెనుక ప్రాంతంలో డీజే స్టేజ్ ఏర్పాటు చేసి అమ్మాయిలు, అబ్బాయిలతో అశ్లీల నృత్యాలు చేయించడం గమనార్హం. పైగా ఈ డ్యాన్స్ ప్రోగ్రాం కారణంగానే రాత్రి 9 గంటలకు పూర్తి కావాల్సిన ఎదురు సన్నాహక మహోత్సవంతో పాటు రథోత్సవం అర్థరాత్రి 12 వరకు ప్రారంభం కాలేదు. ఇక స్వామి వారి కల్యాణం అర్థరాత్రి 2 గంటల తర్వాత హోం మంత్రి అనిత వచ్చాక ప్రారంభించారు. ఇటువంటి రికార్డింగ్ డ్యాన్సుల కార్యక్రమానికి టీటీడీ అధికారులు ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. కానీ ఈసారి మాత్రం కల్యాణోత్సవం సందర్భంగా హోం మంత్రి అనిత సోమవారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ఉపమాకలోనే తిష్టవేశారు. కల్యాణం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు, కల్పించిన సదుపాయాలు, ఇలా అన్నింటినీ ఆమె స్వయంగా పర్యవేక్షించారు. హోం మంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ప్రాచీన పుణ్య క్షేత్రంలో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడంపై భక్తులు దుమ్మెత్తి పోస్తున్నారు. -
పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే.. చూస్తూ ఊరుకోం
ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను విమర్శించడం.. నిరసించడాన్ని నేరం అంటే ప్రజాస్వామ్య మనుగడే సాధ్యం కాదు.స్వేచ్ఛగా మాట్లాడటం, భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి మన పోలీసు యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. అలాగే ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కూడా కలిగించాలి. స్వేచ్ఛగా మాట్లాడటం, భావవ్యక్తీకరణపై ఎంత వరకు సహేతుక నియంత్రణ విధించాలన్న దానిపై అవగాహన కల్పించాలి. రాజ్యాంగం మనకందించిన ప్రజాస్వామ్య విలువల గురించి కూడా వారికి అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చింది.– ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజమ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలురెడ్ బుక్ రాజ్యాంగంలో.. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో.. చట్టాలను కాలరాస్తూ.. ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ.. పౌరుల స్వేచ్ఛను హరిస్తూ ఎడాపెడా అక్రమ అరెస్టులకు బరి తెగిస్తున్న ఖాకీలపై హైకోర్టు కన్నెర్ర చేసింది..! ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీల అధినేతలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు అడ్డగోలుగా కేసులు బనాయించడంపై నిప్పులు చెరిగింది. సోషల్ మీడియా యాక్టివిస్టులకు బెయిల్ రాకుండా చేసేందుకు ఉద్దేశపూర్వకంగా బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసులు బనాయించటాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బలవంతపు వసూళ్ల కిందకు వస్తుందా? అని పోలీసులను నిలదీసింది. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్‌లు చేస్తున్నా... మేజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్ విధిస్తుండటాన్ని కూడా తప్పుబట్టింది. పోలీసులు చట్టం కంటే ఎక్కువ అనుకుంటున్నారని, ప్రతీ ఒక్కరూ చట్టానికి లోబడే నడుచుకోవాలని మందలించింది. ఊహల ఆధారంగా ఇష్టానుసారంగా అరెస్టులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే.. రేపు కోర్టులోకి వచ్చి అరెస్టులు చేయడానికి కూడా వెనుకాడరని ఘాటుగా వ్యాఖ్యానించింది.భిన్నాభిప్రాయం, అసమ్మతి తెలియచేయడం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అంతర్భాగం. ప్రతి పౌరుడు కూడా ఇతరులు వ్యక్తం చేసే భిన్నాభిప్రాయాన్ని గౌరవించాలి.ప్రభుత్వ నిర్ణయాలపై శాంతియుతంగా నిరసన తెలియచేసే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి. – ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజమ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుసాక్షి, అమరావతి: టీడీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతు శ్రీధర్‌రెడ్డికి కింది కోర్టు రిమాండ్ విధించడం చట్ట విరుద్ధమని హైకోర్టు ప్రకటించింది. ఈమేరకు రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. తీర్పు కాపీ అందిన వెంటనే శ్రీధర్‌రెడ్డిని విడుదల చేయాలని నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్‌ను ధర్మాసనం ఆదేశించింది. న్యాయమా?.. అన్యాయమా? అన్నదే ముఖ్యం...ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అవుతు శ్రీధర్‌రెడ్డి అరెస్ట్ విషయంలో పోలీసులు అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఎలాంటి రుజువులు లేకుండా పోలీసులు తమ ఊహ ఆధారంగా అరెస్ట్‌లు చేస్తామంటే కుదరదని పేర్కొంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఆరెస్టులు చేస్తూ పౌరుల స్వేచ్ఛను హరిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. మేజిస్ట్రేట్లు సైతం ఏమీ చూడకుండా యాంత్రికంగా వ్యవహరిస్తున్నారని ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. వ్యక్తులు ఎవరన్నది తమకు ముఖ్యం కాదని, పోలీసులు చర్యలు న్యాయమా? అన్యాయమా? అన్నదే ముఖ్యమని తేల్చి చెప్పింది. పోలీసులు చట్టం కంటే ఎక్కువ అనుకుంటున్నారని, ప్రతీ ఒక్కరూ చట్టానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పౌరుల హక్కులను, స్వేచ్ఛను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందంది. పౌరుల స్వేచ్ఛను తేలిగ్గా తీసుకునే చర్యలను తాము ఎంత మాత్రం అనుమతించబోమంది. చట్టాన్ని ఉల్లంఘిస్తామంటే కుదరదని పోలీసులకు తేల్చి చెప్పింది. ఎలా పడితే అలా అరెస్టులు చేసి మేజిస్ట్రేట్ల ముందు హాజరుపరుస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదంది. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే, రేపు కోర్టులోకి వచ్చి అరెస్టులు చేయడానికి కూడా వెనుకాడరని వ్యాఖ్యానించింది. అంతా బాగుందని చెప్పేస్తే, తాము మౌనంగా ఉండిపోతామని అనుకోవద్దని పోలీసులకు తేల్చి చెప్పింది. శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ చేసి హాజరుపరిచినప్పుడు మొదట మేజిస్ట్రేట్ రిమాండ్ తిరస్కరించారని, దీంతో ఆయన్ను స్వేచ్ఛగా వదిలేయాల్సిన పోలీసులు మళ్లీ అరెస్ట్ చూపారని పేర్కొంది. మేజిస్ట్రేట్ సైతం రిమాండ్ రిపోర్ట్‌లోని అంశాలను లోతుగా పరిశీలించకుండా శ్రీధర్‌రెడ్డికి రిమాండ్ విధించారని ధర్మాసనం ఆక్షేపించింది. ప్రతీ దశలోనూ పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారంది. శ్రీధర్‌రెడ్డి అరెస్ట్ విషయాన్ని సైతం సరైన పద్ధతిలో సంబంధీకులకు తెలియచేయలేదని ప్రస్తావించింది. రిమాండ్ రిపోర్టును పరిశీలిస్తే బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 47(1) కింద అరెస్ట్ విషయాన్ని తెలియచేయలేదని తెలిపింది. అందువల్ల శ్రీధర్‌రెడ్డి నిర్భంధం అక్రమమని ధర్మాసనం తేల్చి చెప్పింది. సెక్షన్ 47(1) ప్రకారం అరెస్ట్ విషయాన్ని నిర్భంధంలో ఉన్న వ్యక్తికి వెంటనే తెలియచేసి తీరాల్సి ఉంటుందని పేర్కొంది. శ్రీధర్‌రెడ్డిని హాజరుపరిచినప్పుడు సెక్షన్ 47(1) ప్రకారం అరెస్ట్‌కు గల కారణాలను నిందితునికి తెలియచేయలేదన్న కారణంతో మేజిస్ట్రేట్ రిమాండ్‌ను తోసిపుచ్చారు. సెక్షన్ 47(1) పోలీసులు చట్టం నిర్ధేశించిన విధి విధానాలను పాటించని పక్షంలో నిందితుడిని స్వేచ్ఛగా వదిలేయాలని చట్టం చెబుతోంది. ఈ కేసు విషయానికి వస్తే పోలీసులు చట్టపరమైన విధి విధానాలను పాటించకపోయినా కూడా నిందితుడికి మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. తద్వారా మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించారు. అందువల్ల శ్రీధర్‌రెడ్డి రిమాండ్ చట్ట విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టు రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే శ్రీధర్‌రెడ్డిపై నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించుకోవచ్చునని పోలీసులకు సూచించింది.రిమాండ్‌పై భార్య న్యాయ పోరాటంతన భర్త అవుతు శ్రీధర్‌రెడ్డికి రిమాండ్ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమంటూ ఎం.ఝాన్సీ వాణిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున పాపిడిప్పు శశిధర్‌రెడ్డి వాదనలు వినిపించగా ప్రభుత్వం తరఫున యతీంద్ర దేవ్ వాదనలు వినిపించారు.రీల్ పోస్టు చేయడం.. బలవంతపు వసూలా?సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టులకు బెయిల్ రాకుండా చేసేందుకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసులు బనాయించటాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ తీరును వ్యంగ్యంగా చిత్రీకరించి ఫేస్బుక్లో సదరు రీల్‌ను పోస్ట్ చేసిన మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్‌కుమార్‌పై బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కేసు పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బలవంతపు వసూళ్ల కిందకు వస్తుందా? అని పోలీసులను నిలదీసింది. ప్రేమ్ కుమార్ పోస్ట్ చేసిన రీల్‌కు, బలవంతపు వసూళ్లకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించింది. ఆయన బలవంతపు వసూళ్లకు పాల్పడటంతో పాటు తరచూ నేరాలు చేసే వ్యక్తి అని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొనడంపై మండిపడింది. దేని ఆధారంగా ఇలా రాశారంటూ నిలదీసింది. అరెస్ట్ సమయంలో ఆయన వద్ద రూ.300 దొరికాయి కాబట్టి వాటిని బలవంతపు వసూళ్లుగా చెబుతున్నారా? అంటూ మండిపడింది. మేజిస్ట్రేట్లు కూడా యాంత్రికంగా రిమాండ్ విధించేస్తున్నారంది. రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ఏం పేర్కొన్నారు? అందులో పేర్కొన్న సెక్షన్లు నిందితునికి వర్తిస్తాయా? లాంటి విషయాలను లోతుగా పరిశీలించకుండానే రిమాండ్ విధించేస్తున్నారని పేర్కొంది. రొటీన్‌గా రిమాండ్ ఉత్తర్వులు..తమ ముందుకు వస్తున్న కేసులను పరిశీలిస్తే మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోందని హైకోర్టు పేర్కొంది. మేజిస్ట్రేట్లు రొటీన్‌గా రిమాండ్ ఉత్తర్వులిచ్చేస్తున్నారంది. మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తున్నా, తాము మాత్రం బుర్రలు ఉపయోగించే విచారణ జరుపుతున్నామని వ్యాఖ్యానించింది. నిందితుడిని అరెస్ట్ చేసే సమయంలో అతడు ఎక్కడ ఉంటే అక్కడి పంచాయితీదారుల సమక్షంలోనే జరగాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ప్రేమ్‌కుమార్ అరెస్ట్ విషయంలో కర్నూలు పోలీసులు అక్కడ పంచాయతీదారులను గుంటూరుకి తీసుకురావడంపై హైకోర్టు ఒకింత విస్మయం వ్యక్తం చేసింది. ఇలా చేయడానికి చట్టం అనుమతిస్తోందా? అని నిలదీసింది. ప్రేమ్‌కుమార్ వ్యంగ్యంగా నాటక రూపంలో ఓ రీల్ చేసి పోస్టు చేశారని, ఇందులో బలవంతపు వసూళ్ల అంశం ఎక్కడ ఉందని ప్రశ్నించింది. ఇలాంటి తీరును ఎంత మాత్రం సహించేది లేదని, ప్రేమ్‌కుమార్ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కేసు పెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారో పోలీసులు చెప్పి తీరాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కర్నూలు త్రీ టౌన్ ఎస్‌హెచ్‌వో అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటు తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి జోక్యం చేసుకుంటూ, జిల్లా ఎస్పీని సైతం అఫిడవిట్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, మిగిలిన ప్రతివాదులు కూడా కౌంటర్లు దాఖలు చేయాలనుకుంటే చేయవచ్చని పేర్కొంటూ విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన తండ్రి ప్రేమ్‌కుమార్‌ను కర్నూలు పోలీసులు అక్రమంగా నిర్భంధించారని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ కొరిటిపాటి అభియన్ గత ఏడాది హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం తాజాగా మరోసారి విచారించింది.సెక్షన్ 111 ఏ సందర్భంలో పెట్టొచ్చంటే...కిడ్నాపింగ్, దొంగతనం, వాహన దొంగతనం, బలవంతపు వసూళ్లకు పాల్పడం, కాంట్రాక్ట్ కిల్లింగ్, ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, ఇతర అక్రమ వస్తువులను కొనుగోలు చేయడం, అమ్మడం వంటి వాటికి పాల్పడిన వారికి మాత్రమే సెక్షన్ 111 వర్తిస్తుంది. ఈ నేరాలు రుజువైతే మరణశిక్ష, జీవితఖైధు, రూ.10 లక్షలకు తగ్గకుండా జరిమానా విధించవచ్చు. సోషల్ మీడియా పోస్టులు ఈ నేరాల కిందకు రాకపోయినప్పటికీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఆ పోస్టులను వ్యవస్థీకృత నేరంగా చూపుతూ సోషల్ మీడియా యాక్టివిస్టులపై సెక్షన్ 111 కింద కేసులు బనాయిస్తున్నారు. బెయిల్ రాకుండా చేసేందుకే ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారు. ప్రస్తుత కేసులో కూడా పోలీసులు ప్రేమ్‌కుమార్‌పై బలవంతపు వసూళ్ల కింద కేసు పెట్టారు. -
లోకేశ్ ‘లెక్కే’ వేరు..!
సాక్షి, అమరావతి: టీడీపీలో పదవులు ఒకప్పుడు చంద్రబాబు (Chandrababu) ఇష్ట ప్రకారం లభించేవి. రకరకాల సమీకరణలు, ప్రాధాన్యతలు, ఆర్థిక వ్యవహారాలను బట్టి పదవులను కట్టబెట్టేవారు. కానీ ఇప్పుడు ఆయన తనయుడు లోకేశ్ (Lokesh) ఆశీస్సులు ఉంటేనే పదవులు వస్తాయని టీడీపీలో కింది స్థాయి కార్యకర్తలు సైతం చెబుతున్నారు. ఆయన ఆశీస్సులు ఉండాలంటే ఆర్థికంగా బలవంతులై ఉండాలనే సూత్రం చాలాకాలం నుంచి అమలవుతోంది. గత ఎన్నికల్లో సీట్లు డబ్బు మూటలిచ్చిన వాళ్లకే ఇచ్చారని ఆ పార్టీలోనే బహిరంగంగానే ఆరోపణలు వినిపించాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక మంత్రి పదవులకూ అదే సూత్రాన్ని పాటించినట్లు పార్టీ సీనియర్ నేతలు వాపోయారు.ఆయన కోటరీకే ఎమ్మెల్సీ పదవులు ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులోనూ అదే పరిస్థితి నెలకొన్నట్లు చెబుతున్నారు. టీడీపీకి మూడు పదవులు దక్కితే మూడు లోకేశ్‌కి అత్యంత విధేయులుగా ఉన్న వారికే లభించాయి. నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర లోకేశ్ కోటరీలో కీలక వ్యక్తి కావడంతోపాటు ఆర్థికంగా బలమైన వ్యక్తి. ఈ నేపథ్యంలోనే రవిచంద్రకు ఎమ్మెల్సీ పదవి వెతుక్కుంటూ వచ్చినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. బీటీ నాయుడు (BT Naidu) కూడా లోకేశ్‌కు దగ్గరి వ్యక్తి కావడంతోపాటు ఆర్థిక పరిపుష్టి కలిగిన నాయకుడే. కావలి గ్రీష్మ (Kavali Greeshma) లోకేశ్ కోటరీకి చెందిన నేతే. మహానాడులో బూతులు తిడుతూ తొడ కొట్టిన నాయకురాలు కావడంతో ఆమెకు ఎమ్మెల్సీ సీటు కేటాయించారు. ఉత్తరాంధ్రలో అనేక మంది సీనియర్ నేతలు, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన నేతలుంటే అంత చురుగ్గా పని చేయని గ్రీష్మకు ఎమ్మెల్సీ పదవి దక్కడానికి చినబాబు ఆశీస్సులు ఉండడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.రాజ్యసభ స్థానాల్లోనూ అంతేమూడు రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి రెండు దక్కగా ఆ రెండింటినీ ధన బలం ఉన్నా సానా సతీష్‌బాబు, బీద మస్తాన్‌రావుకి ఇచ్చారు. సానా సతీష్‌బాబు.. లోకేశ్ కోటరీలో ప్రస్తుతం అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చారు. బీద మస్తాన్‌రావు కూడా డబ్బు మూటలతో వచ్చిన వ్యక్తేనని టీడీపీ నేతలే చెబుతున్నారు. అధికారం కోసం పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు.చదవండి: యనమలకు బాబు 'షాక్' హ్యాండ్చినబాబు ఆశీస్సులు ఉంటే.. చింత అక్కర్లేదు..మరోవైపు నామినేటెడ్ పదవుల విషయంలోనూ లోకేశ్ చెప్పిన వారికే పదవులు వచ్చాయి. కార్పొరేషన్ చైర్మన్లు, సభ్యులు, ఇతర పదవులను ఆయన ఇచ్చిన జాబితా ప్రకారమే కేటాయించారు. పదవుల కోసం ఎవరైనా చంద్రబాబు వద్దకు వెళితే ఆయన తన కొడుకును కలవమని చాలామంది నేతలకు చెప్పినట్లు సమాచారం. దీంతో సీనియర్లు చంద్రబాబు మారిపోయాడని, ఆయన కొడుకును కలవాల్సిన అవసరం ఏమిటని భావించి వెళ్లలేదు. కొందరు వెళ్లి కలిసినా, ప్రయోజనం లేదని చెబుతున్నారు. మొత్తంమీద ఈ పరిణామాలు పార్టీలో సీనియర్లకు ఆందోళన కలిగిస్తున్నాయని సమాచారం. -
వైఎస్సార్సీపీ ‘యువత పోరు’కు అంతా సిద్ధం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగులు తరఫున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. రేపు(బుధవారం) ‘‘యువత పోరు’’ పేరుతో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జెండావిష్కరణలు చేయనున్నారు. అనంతరం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రభుత్వ మోసాలపై విద్యార్థులు, నిరుద్యోగులు నినదించనున్నారు. ధర్నాలు నిర్వహించనున్నారు.16,347 పోస్టులతో డీఎస్సీ పేరుతో చంద్రబాబు చేసిన తొలి సంతకం అభాసుపాలైంది. 9 నెలలు కావొస్తున్నా డీఎస్సీ నోటిఫికేషన్ అతీగతీలేదు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ ప్రైవేటుపరం చేసింది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను కూడా కూటమి ప్రభుత్వం దూరం చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మూడు త్రైమాసికాల నుండి ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను చంద్రబాబు వేధిస్తున్నారు. నిరుద్యోగ భృతి విషయంలో కూటమి ప్రభుత్వం మాట తప్పింది. నిరుద్యోగ భృతి పేరుతో నెలకు రూ.3 వేలు ఇస్తామంటూ యువతను మోసం చేశారు. ఉద్యోగాల్లేక యువత అల్లలాడిపోతోంది.విద్యార్థుల జీవితాలతో కూటమి సర్కార్ ఆటలు: కన్నబాబుకాకినాడ జిల్లా: పేద విద్యార్ధుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోందని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన యువత పోరు పోస్టర్‌ను ఆవిష్కరించారు. రూ.4,800 కోట్లు ఫిజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూటమి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని ధ్వజమెత్తారు.‘‘ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన ఘనత దివంగత మహానేత వైఎస్సార్‌దే. ఆయన తనయుడిగా నాలుగు అడుగులు ముందుకు వేసి ఈ పథకాన్ని వైఎస్ జగన్ విస్తృతంగా అమలు చేశారు. ప్రతి వర్గాన్ని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదే. మోసపోయిన ప్రజలకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుంది. చంద్రబాబు సర్కార్‌ను నిలదీయడానికి వైఎస్సార్సీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’’ అని కన్నబాబు పేర్కొన్నారు. -
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక ధర పెరిగింది: బొత్స
-
TDP: చెరువు దగ్గరకొస్తే.. తేల్చుకుందాం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: విజయనగరం జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి సంధ్యా గజపతిని తోటి టీడీపీ నాయకుడు, నీటి సంఘం అధ్యక్షుడు, చౌదరి బాబ్జీ అనుచరుడు సంపతిరావు గణపతి ఫోన్ చేసి బెదిరించారు. పల్లవాని చెరువు భూమిని ఆనుకుని ఆక్రమించారని చెరువుల పరిరక్షణ పేరుతో ఫిర్యాదు చేయడమేంటని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ‘సత్తా ఉంటే.. చెరువు దగ్గరకొస్తే తేల్చుకుందాం. అది చెరువు అని ఉందా. నీకు జ్ఞానం ఉందా?’ అని రాత్రి 9.20గంటల సమయంలో ఫోన్ చేసి ఇష్టారీతిన మాట్లాడారు. దీంతో ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలోని పలుచోట్ల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, ఆక్రమణలు తొలగించాలని కోరుతూ ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఆ సంఘం ప్రతినిధులు కృష్ణమూర్తినాయుడు, సంధ్యా గజపతి తదితరులు ఫిర్యాదు చేశారు.ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు, నీటి సంఘం అధ్యక్షుడు సంపతిరావు గణపతి నేరుగా సంధ్యా గజపతికి రాత్రి 9.20గంటల సమయంలో ఫోన్ చేసి బెదిరిస్తూ మాట్లాడారు. డీ పట్టాయే కొన్నానని ఒప్పుకుంటూనే.. ‘ఇంకా ఏమీ చెరువులు కనిపించలేదా? బాబ్జీ చెరువును జన్మలో తీయించగలవా? ఊర్లో పెద్ద చెరువు 165ఎకరాలు ఉంటే 60ఎకరాలకు వస్తే అప్పుడెక్కడికి వెళ్లిపోయావు? చెరువులన్నీ తీయడానికి పోటుగెత్తివా...మండలంలో అన్నీ తీయ్...రాష్ట్రంలో ఉన్న చెరువులన్నింటిని తీయ్. అప్పుడు ఇక్కడికి రా...సత్తా ఉంటే చెరువు దగ్గరికి రా..’ అని బెదిరించారు. ‘రికార్డు చేసుకో...ఎవరికిచ్చినా నష్టం లేదు’ అని వార్నింగ్ ఇచ్చారు.ఫిర్యాదులో పేర్కొన్న చెరువు వివరాలివి ఎచ్చెర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1బీలోని ఎకరా 58సెంట్లు మేర భూమిని 1971లో మొహమ్మద్ ఫజుల్లాత్ అనే వ్యక్తికి డీ పట్టా కింద ఇచ్చారు. అయితే, ఈ భూమిని తర్వాత సంపతిరావు గణపతితో పాటు మరో నలుగురు కొనుగోలు చేశారు. రికార్డుల్లో కూడా అనుభవ స్వభావం కొనుగోలు అని నమోదు చేశారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లాయి. సుధాసాగర్ అనే తహసీఉన్నప్పుడు డీ పట్టా భూమిని కొనుగోలు చేయడం కుదరదని, నిబంధనల ప్రాప్తికి అమ్మకం, కొనుగోలు చేయకూడదని, దీన్ని స్వాధీన పర్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని విచారణలో నిగ్గు తేల్చడమే కాకుండా దాన్ని ప్రభుత్వ భూమిగా మార్చేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పల్లవాని చెరువుకు ఆనుకుని ఉన్న ఈ భూమిలో ఉన్న వాటిని తొలగించాలని ఆదేశాలిచ్చారు. అప్పట్లో సదరు ఉత్తర్వుల మేరకు తొలగింపులు జరిగాయి. కానీ మళ్లీ అక్కడే కట్టడాలు జరిగాయి. వాటిని తొలగించాలని కోరుతూ మళ్లీ సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి «ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వారిలో సంధ్యా గజపతి కూడా ఉండటంతో ఆమెకు సంపతిరావు గణపతి అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. ఈ ఫోన్ సంభాషణను సంధ్యా గజపతి రికార్డు చేశారు. దీన్ని పట్టుకుని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని సోమవారం రాత్రి మీడియాను ఆశ్రయించి జరిగిందంతా వివరించారు. దీనిపై గణపతిని ‘సాక్షి’ వివరణ కోరగా.. తాను మాట్లాడానని, తన భూమి విషయంలో ఫిర్యాదులు చేస్తున్నారని, ఆమె రికార్డు చేస్తుందని తెలిసినా కూడా మాట్లాడానని, తానేమీ బెదిరించలేదని, ఆమే తిరిగి బెదిరించిందని తెలిపారు. -
మండలి: మేం అనుసరించిన విధానాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది: బొత్స
మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు తీవ్ర నిరాశను కలిగించాయి : వరుదు కళ్యాణి👉పెట్టుబడి సాయం 20 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు👉ఇప్పుడు కేంద్రం సాయంతో కలిపి 20 వేలు ఇస్తామంటున్నారు👉మండలి సాక్షిగా రైతుకి వెన్నుపోటు పొడిచారు👉ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసింది👉అన్నమో రామచంద్రా అనే పరిస్థితికి రైతును తీసుకొచ్చారు👉జగన్ మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయం పండుగలా సాగింది👉కూటమి పాలనలో సాగు విస్తీర్ణం తగ్గిపోయిందిఅచ్చెన్నాయుడు మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు : బొత్స👉2016లో రుణమాఫీకి బాండ్ ఇచ్చారు👉రుణమాఫీ చేయకుండా 2019 వరకూ ఏం చేశారు👉మిర్చి ఒక్క టన్నైనా 11,700 రూపాయలకి కొన్నారా👉గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలని కోరుతున్నాం60% శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారు: బొత్స👉గత ప్రభుత్వంలో రైతులను సకాలంలో ఆదుకున్నాం👉విపత్తు వస్తే సీజన్ ముగిసేలోపు పరిహారం అందించాం👉విత్తనాలు...ఎరువులు రైతుల వద్దకే తీసుకెళ్లి అందించాం👉మా ప్రభుత్వంలో అనుసరించిన వ్యవసాయ విధానాలను నీతిఆయోగ్ కూడా ప్రశంసించింది👉మేం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేశాం👉వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేనాటికి సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ చెల్లించాల్సిన బకాయిలు 5286 కోట్లు👉వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకుంటే రైతుల పేరుతో డబ్బులు తీసుకున్నారనడం కరెక్ట్ కాదు👉ఇలా మాట్లాడటం రైతులను అవమానపరచడమేమంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ అభ్యంతరం👉తప్పు జరిగితే విచారణ జరిపించుకోవడం ఆయా ప్రభుత్వాల విధానం👉తాడేపల్లి ప్యాలెస్‌లో రికార్డులు తగలబెట్టేశారనడం సరికాదు👉రికార్డుల నుంచి మంత్రి వ్యాఖ్యలు తొలగించాలి👉ఆధారాలుంటే రుజువుచేయండి👉బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదు👉తగలబెట్టినట్లు ఆధారాలుంటే కేసు ఫైల్స్‌లో ఎంక్వైరీ బైండింగ్స్‌లో చేర్చుకోండిబుడమేరు వరద సాయంపై మండలిలో చర్చ👉వరద బాధితుల్లో అనేకమందికి ఇంకా పరిహారం అందలేదు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్👉వరద సహాయం విషయంలో ప్రభుత్వం విఫలమైంది👉ఆపరేషన్ బుడమేరు అన్నారు.. ఇప్పటివరకు ఏం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి👉బుడమేరు గేట్లను ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రుహుల్లా👉వరదల తర్వాత బుడమేరును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు👉ఇప్పటికీ అనేకమంది బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు👉ఒక ఇంటికి పరిహారం ఇచ్చి 10 ఇళ్లకు ఇచ్చినట్లు రాసుకున్నారు👉అందరికీ సాయం అందిందని చెప్పడం పచ్చి అబద్ధం👉కూటమి ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు: బొత్స సత్యనారాయణ👉వైఎస్ జగన్ ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించాం👉నేనే అందుకు బాధ్యత తీసుకున్నా👉కూటమి సర్కార్ సాయం అందించడంలో విఫలమైంది👉ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు👉అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించాంఏపీ శాసనమండలిలో ఉచిత ఇసుకపై వాడివేడిగా చర్చ 👉కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక ధర పెరిగింది: బొత్స సత్యనారాయణ👉విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇసుక ధర తగ్గలేదు👉ప్రభుత్వం చెప్పినట్లు ఇసుక ఇవ్వడం లేదు👉గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఎంతకిస్తున్నారో వెరిఫై చేయాలి👉కూటమి నేతలు చెప్పే లెక్కలు తప్పుగా ఉన్నాయి.👉కూటమి నేతలు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు👉ఉచిత ఇసుక, ఇసుక అక్రమ అమ్మకాలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల స్టాక్‌ను కొత్త ప్రభుత్వానికి అప్పగించిందని.. దానిలో ఎంత స్టాక్ రికార్డెడ్‌గా జమ చేశారు?. ఎంత ఆదాయం వచ్చిందని ప్రశ్నించారు. రీచ్‌లలో ట్రాక్టర్ల నుంచి లారీల్లోకి ఇసుక వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొత్తం మెషినరీల ద్వారానే ఇసుకను తీసి లారీలకు లోడు చేస్తున్నారు. రాత్రి, పగలూ తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది’’ అని తోట త్రిమూర్తులు మండిపడ్డారు.👉‘‘ఒక్కొక్క లారీకి సుమారు 11 నుంచి 12 వేల వరకు వసూలు చేస్తున్నారు. గత ప్రభుత్వం అప్పగించిన ఇసుకకు, చెబుతున్న లెక్కలకు తేడాలు ఉన్నాయి. మెషినరీల ద్వారా ఇసుకను మొత్తం తోడేస్తున్నారు. గత 2016లో తెచ్చిన పాలసీనే ఇప్పుడు కూడా ఉంది. పేద ప్రజలకు ఇసుక అందే పరిస్థితి లేదని తోట త్రిమూర్తులు ధ్వజమెత్తారు.👉శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో లారీ ఇసుక ఎంతకు దొరికేది?.. ఈ రోజు ఎంతకు దొరుకుతుందంటూ కూటమి సర్కార్‌ని నిలదీశారు. ఉచిత ఇసుక అంటే టన్నుకు కనీసం 400 రూపాయలు తగ్గాలి. సామాన్యులకు ఉచిత ఇసుక అందే పరిస్థితి లేదని మండిపడ్డారు. -
జగనన్న కాలనీ కబ్జా.. పల్నాడులో బరితెగించిన టీడీపీ గూండాలు
సాక్షి, పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను సైతం వదలడం లేదు. టీడీపీ నాయకులు యథేచ్ఛగా సాగిస్తున్న భూ దందా సాగిస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో టీడీపీ నాయకులు మరింత రెచ్చిపోతున్నారు.గురజాల మండలంలోని పులిపాడు గ్రామంలో జగనన్న కాలనీని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు కబ్జా చేసేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పులిపాడులో 70 సెంట్ల లో 40 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ భూములంటూ యరపతినేని అనుచరులు నకిలీ సర్టిఫికెట్ సృష్టించారు. పొజిషన్ సర్టిఫికెట్ జారీ చేయడంలో వీఆర్వో జ్యోతి కీలక పాత్ర పోషించారు.పొజిషన్ సర్టిఫికెట్ ఆధారంగా 70 సెంట్లు జగనన్న కాలనీని తొమ్మిది మంది టీడీపీ నేతలు తమ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎవరైనా గొడవ చేస్తే చంపేస్తామంటూ టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. -
యనమలకు బాబు ‘షాక్’ హ్యాండ్
సాక్షి, అమరావతి: తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ముఖ్య నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు రాజకీయాల నుంచి అవమానకరంగా పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన సమకాలీకుడు, ఎన్టీఆర్ నుంచి టీడీపీని లాక్కునేందుకు స్పీకర్‌గా అన్ని విధాలా సహకరించిన సహచరుడు.. యనమలను పట్టించుకోకుండా చంద్రబాబు చివరి దశలో వదిలేశారనే చర్చ నడుస్తోంది. ఈ నెలాఖరుతో యనమల ఎమ్మెల్సీ పదవికి గడువు ముగియనుండగా, ఆయన సభ్యత్వాన్ని రెన్యువల్ చేయలేదు. ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలే ఆయన పాల్గొంటున్న చివరి సమావేశాలుగా చెబుతున్నారు. చంద్రబాబు తనయుడు లోకేశ్‌తో పొసగకపోవడం, ఆయన కోటరీని వ్యతిరేకించడం వల్లే యనమలను పూర్తిగా పక్కనపెట్టేసినట్లు తెలుస్తోంది. మున్ముందు రాజకీయంగా ఆయనకు ఎటువంటి పదవులు ఇచ్చే అవకాశం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆయన రిటైర్ అయినట్లేనని స్పష్టం చేస్తున్నాయి. పార్టీ కోసం సుదీర్ఘకాలం పని చేసిన వ్యక్తికి ఇంత అవమానకరంగా రాజకీయ ముగింపు ఉంటుందని ఎవరూ ఊహించలేదంటున్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయకపోవడంపై యనమల స్పందించకపోయినా తనను కావాలని అవమానించినట్లు సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. కూతురు, అల్లుడికి పదవులు ఉన్నాయనే కారణంతో పక్కకు.. టీడీపీలో ప్రస్తుతం లోకేశ్ మాటే శాసనంగా నడుస్తుండడంతో ఎమ్మెల్సీ స్థానాల్లో యనమల పేరును కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఆయన కుమార్తె తుని ఎమ్మెల్యేగా, అల్లుడు ఏలూరు ఎంపీగా ఉండడంతో ఇక ఆయనకు ఎలాంటి పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు సైతం భావించినట్లు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా లేకపోయినా చంద్రబాబు ఆయన్ను ఎమ్మెల్సీగా చేసి ఆర్థిక మంత్రి పదవి ఇచ్చారు. అప్పట్లో తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని కోరినా ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంటానని మంత్రి పదవి ఇచ్చారు. 2019లో టీడీపీ ఓడిపోవడంతో శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. అయితే అంతకుముందు నుంచే పార్టీలో లోకేశ్ పెత్తనం పెరిగిపోవడం, దాన్ని యనమల వంటి పలువురు సీనియర్లు వ్యతిరేకించడంతో చినబాబు ఆగ్రహానికి గురై, వారి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇప్పుడు అధికారంలో ఉండడంతో యనమలకు పూర్తిగా చెక్ పెట్టి రాజకీయాల నుంచే అనివార్యంగా రిటైర్మెంట్ ఇప్పించారనే చర్చ జరుగుతోంది.పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే ఇటీవల ఆయన కాకినాడ పోర్టు, సెజ్ వ్యవహారంలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ఏకంగా చంద్రబాబుకు లేఖ రాశారు. కాకినాడ పోర్టు యజమానిగా ఉన్న కేవీ రావు పేదల భూములు తీసుకుని అక్రమంగా సంపాదించారని, అలాంటి వారిని వెనకేసుకురావడం ఏమిటని ప్రశ్నిoచారు. యనమల స్థాయి నాయకుడు ఏకంగా సీఎంని ప్రశ్నిస్తూ లేఖ రాయడం కలకలం రేపింది. అయితే చంద్రబాబు తన మార్కు రాజకీయంతో పార్టీలోనే యనమల వ్యతిరేకుల్ని, సోషల్ మీడియాను ప్రోత్సహించి ఆయనపై ఎదురుదాడి చేయించడంతోపాటు అసభ్యంగా తిట్లు కూడా తిట్టించారు. అప్పటి నుంచి టీడీపీకి, యనమలకు మధ్య దూరం ఇంకా పెరిగిపోయింది. వాడుకుని వదిలేయడం బాబుకు అలవాటే ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి సమావేశాల్లోనూ యనమలకు కనీస ప్రాధాన్యం లభించడంలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మండలిలో లోకేశ్ ఉన్నప్పుడు ఆయన చూస్తుండగా యనమల దగ్గరికి వెళ్లి మాట్లాడేందుకు సైతం టీడీపీ సభ్యులు జంకుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయంగా అవసరానికి వాడుకుని ఆ తర్వాత పూచికపుల్లలా తీసిపడేయడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటైన విద్యే. కాబట్టి యనమలకు అదే తరహా ట్రీట్మెంట్ లభించిందని విశ్లేషకులు చెబుతున్నారు. -
ఆశపెట్టి హ్యాండిచ్చారు
సాక్షి, అమరావతి: అవసరానికి వాడుకుని, ఆ తర్వాత వదిలేయడం చంద్రబాబు నైజం. ఇది అందరికీ తెలిసిన నిజం. ఎన్నోసార్లు ఎంతోమంది నేతలు కూడా ఈ విషయం విస్పష్టంగా చెప్పారు. ఆయన సొంత బావమరిది నందమూరి హరికృష్ణ కూడా చంద్రబాబుది ‘యూజ్ అండ్ త్రో పాలసీ’ అని ఓ సందర్భంగా గట్టిగానే చెప్పారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల విషయంలోనూ చాలామందికి చంద్రబాబు ఏమిటో తెలిసొచ్చింది. ఎన్నికల సమయంలో పని చేసేందుకు అనేక మందికి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవులను ఎరగా వేశారు. సీట్లు సర్దుబాటు చేయలేని వారికి, నియోజకవర్గాల్లో పని చేయించుకోవాల్సిన వారికి, ఆరి్థకంగా ఆసరాగా ఉన్న వారికి ఆయన ఎడాపెడా హామీ ఇచ్చేశారు. అధికారంలోకి వచ్చాక మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఎన్నికల్లో పని చేయించుకున్నారు. కొందరికైతే ఆ నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లోనే ప్రకటన కూడా చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక.. వారితో చంద్రబాబుకి పని లేకపోయింది. పదవులు, ఎమ్మెల్సీల ఎంపికలో పక్కన పెట్టేశారు. మారిన మనిషినంటూ చంద్రబాబు చేసిన ప్రకటనలతో కచ్చితంగా ఎమ్మెల్సీ వస్తుందని ఎదురుచూసిన నేతలంతా ఇప్పుడు హతాశులయ్యారు. చంద్రబాబు మాట ఇచ్చారంటే అది తప్పకుండా నెరవేర్చే అవకాశం ఉండదని తెలిసి వచ్చిందని వాపోతున్నారు.ఎమ్మెల్సీ స్థానం కోసం ఆశగా ఎదురుచూసి, బాబు కొట్టిన దెబ్బకు తెల్లమొహాలు వేసిన టీడీపీ ఆశావహుల జాబితాశ్రీకాకుళం జిల్లా 1. పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ 2. టీడీపీ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జి అల్లూరి సీతారామరాజు జిల్లా 1. మత్స్యరాస మణికుమారి కాకినాడ జిల్లా 1. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పశ్చిమ గోదావరి జిల్లా 1. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు 2. తాడేపల్లిగూడెం నియోజకవర్గ్గ ఇన్చార్జి వలవల బాబ్జి 3. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి 4. నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు 5. మాజీ మంత్రి పీతల సుజాత 6. ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఏలూరు జిల్లా 1. పోలవరం మాజీ ఎమ్మెల్యే బొరగం శ్రీనివాస్ ఎన్టీఆర్ జిల్లా 1. దేవినేని ఉమామహేశ్వరరావు 2. నెట్టెం రఘురాం 3. వంగవీటి రాధాకృష్ణ 4. బుద్ధా వెంకన్న 5. నాగుల్ మీరా పల్నాడు జిల్లా 1. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ చిత్తూరు జిల్లా 1. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ 2. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు 3. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అనంతపురం జిల్లా 1. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి 2. మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ 3. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప 4. గుండుమల తిప్పేస్వామి కర్నూలు జిల్లా 1. డోన్‌కు చెందిన ధర్మవరపు సుబ్బారావు 2. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మనందరెడ్డి -
అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య
నకరికల్లు: టీడీపీ, జనసేన నాయకుల బెదిరింపులు భరించలేక ఒక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలేనికి చెందిన షేక్ ఫాతిమాబేగం (35) అదే గ్రామంలో 11 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెను అంగన్వాడీ టీచర్ పోస్టు నుంచి తొలగించి, తమవారిని నియమించుకుంటామని గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు బెదిరిస్తున్నారని ఫాతిమాబేగం కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 9 నెలలుగా ఆమెను బెదిరిస్తూనే ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఫాతిమాబేగాన్ని అంగన్వాడీ టీచర్ ఉద్యోగం నుంచి తొలగిస్తారని టీడీపీ, జనసేన నాయకులు ప్రచారం చేస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె ఆదివారం తమ ఇంట్లోనే గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే బంధువులు నరసరావుపేటలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. ఫాతిమాబేగం భర్త సైదావలి గుంటూరులో మెకానిక్‌గా పని చేస్తున్నారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తన భార్య మృతిపై సైదావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నాడు మా వర్మ... నేడు నీ ఖర్మ!
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో అడుగు పెట్టడమే కలగా మారిన పవన్ కళ్యాణ్‌కు సహకరించి.. ఆ కల నెరవేరేలా చేసిన పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను ఆయనే రాజకీయంగా దెబ్బకొట్టారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ సీటు రాకుండా పవన్ అడ్డుపడ్డారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురంలో తనకు ఇబ్బందులు వస్తాయని ఆయన చంద్రబాబుకు చెప్పడం వల్లే పక్కన పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు. తనకు ప్రొటోకాల్ సమస్యలు వస్తాయని, వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వవద్దని స్వయంగా పవనే .. చంద్రబాబుకు చెప్పారని రెండు పార్టీల్లోనూ చర్చించుకుంటున్నారు. అలాగే వర్మకు పదవి లభిస్తే పిఠాపురంలో ఆయన ప్రాధాన్యత పెరిగి రెండు అధికార కేంద్రాలు ఏర్పాటవుతాయనే ఆందోళనలోనూ పవన్ కళ్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ తాను అక్కడి నుంచి పోటీ చేయడం కష్టమవుతుందనే భావనలో ఆయన ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వర్మ ఎమ్మెల్సీ అయితే నియోజక వర్గానికి చెందిన కూటమి నేతలు ఆయన వద్దకే వెళతారని, ఇది రాజకీయంగా తమకు నష్టమని పవన్ అంచనా వేస్తున్నట్లు సమాచారం. సీటు త్యాగం చేసిన వ్యక్తికి వెన్నుపోటా!ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మకు ఇది తీరని అన్యాయమని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి ఒక్క చోట కూడా పవన్ కళ్యాణ్ గెలవలేకపోయిన విషయం తెలిసిందే. పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో అధినేత ఓడిపోవడం అప్పట్లో జనసేన వర్గాలు జీర్ణించుకోలేకపోయాయి. పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని పలు సభల్లో చెప్పి బాధపడేవారు. దీంతో 2024 ఎన్నికల్లోనూ ఆయనను ఓటమి భయం వెంటాడింది. అందుకే చివరి వరకూ ఎక్కడ పోటీ చేయాలో తేల్చుకోలేకపోయారు. రకరకాల సమీకరణాల తర్వాత పిఠాపురం అయితే బాగుంటుందని పొత్తులో ఆ సీటును తీసుకున్నారు. కానీ టీడీపీ శ్రేణులు మొదట దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. టీడీపీ సీటును జనసేనకు ఎలా ఇస్తారని భారీ ఎత్తున ఆందోళనకు దిగాయి. టీడీపీ తరఫున ఆ సీటు దాదాపు ఖరారైన ఎస్వీఎస్ఎన్ వర్మ అయితే రాజీనామాకు సైతం సిద్ధపడ్డారు. కానీ, చంద్రబాబు పలుమార్లు బుజ్జగించడంతో శాంతించి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పని చేశారు. అధికారంలోకి వచ్చాక ఆయనను ఎమ్మెల్సీ చేస్తామని చంద్రబాబు గట్టిగా హామీ ఇవ్వడంతోనే ఆయన పవన్ కోసం తన సీటు త్యాగం చేశారు. పిఠాపురం టీడీపీ శ్రేణుల్ని బ్రతిమిలాడి ఆయన పవన్ కోసం పని చేయించారు. పవన్ అసెంబ్లీకి వెళ్లడంలో వర్మది కీలక పాత్ర పవన్ కూడా వర్మ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తానని అంతర్గతంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో పవన్‌ను గెలిపించేందుకు వర్మ అహర్నిశలు పనిచేశారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆయనను తిట్టినా లెక్క చేయకుండా తిరిగి పవన్‌ను గెలిపించారు. రెండుచోట్ల ఓడిపోయిన వ్యక్తికి తన సీటును త్యాగం చేసి గెలిపించి అసెంబ్లీకి పంపడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనకే పవన్ అడ్డుపడడం ఏమిటని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వర్మను పవన్ దెబ్బకొట్టడం దారుణమని వాపోతున్నాయి. ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో ఆయనకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నాయి. -
నామినేషన్లు వేసిన కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటాలోని నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులు సోమవారం నామినేషన్లు వేశారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక దానికి ఇంతకుముందే జనసేన అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. నామినేషన్ల దాఖలుకు సోమవారం ఆఖరి రోజు కావడంతో మిగిలిన నాలుగు స్థానాలకు టీడీపీ తరఫున ముగ్గురు, బీజేపీ తరఫున ఒకరు నామినేషన్లు వేశారు. తొలుత టీడీపీకి చెందిన బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ నామినేషన్లు దాఖలు చేయగా, ఆ తర్వాత బీజేపీకి చెందిన సోము వీర్రాజు నామినేషన్ వేశారు. టీడీపీ అభ్యర్థుల వెంట మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు తదితరులు వచ్చారు. బీజెపీ అభ్యర్థి వీర్రాజు వెంట మంత్రులు సత్యకుమార్, టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. వీరంతా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, శాసన మండలి ఉప కార్యదర్శి వనితారాణికి సమర్పించారు. సహాయ రిటర్నింగ్ అధికారులుగా ఉన్న అసెంబ్లీ సహాయ కార్యదర్శులు ఆర్.శ్రీనివాసరావు, ఈశ్వరరావు ఆ పత్రాలను పరిశీలించారు. నామినేషన్ అనంతరం బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి, మంత్రి సత్యకుమార్ తదితరులతో కలిసి సీఎం చంద్రబాబును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పేరును ఆ పార్టీ జాతీయ నాయకత్వం సోమవారం ఉదయం ప్రకటించింది. సోము వీర్రాజు 2015–21 మధ్య బీజేపీ తరఫున ఎమ్మెల్సీగా కొనసాగారు. 2020–23 మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఎమ్మెల్సీగా తనను ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు సోము వీర్రాజు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు ఆధ్వర్యంలో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఏకగ్రీవమే.. ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండటంతో ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే కానుంది. టీడీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు జనసేన నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 11న నామినేషన్ల పరిశీలన తర్వాత 13 వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంది. నామినేషన్ ఉపసంహరణ తేదీ తర్వాత ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచినట్టు అధికారికంగా ప్రకటిస్తారు. -
అంగన్వాడీ ఆగ్రహ వేడి..
వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల, కొండాపురం రైల్వేస్టేషన్ల వద్ద మహాధర్నాకు వెళ్లనివ్వకుండా అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. కైకలూరు, ఏలూరు రైల్వే స్టేషన్లు, చేబ్రోలు పోలీస్ స్టేషన్ వద్ద అంగన్వాడీలను నిర్బంధించగా, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన అంగన్వాడీలను అశ్వారావుపేట బోర్డర్లో పోలీసులు అడ్డగించారు. కలపర్రు టోల్ గేట్ వద్ద ప్రైవేట్ వాహనాల్లో పెద్ద సంఖ్యలో తరలివెళుతున్న వారిని అడ్డుకుని కిందకు దించేశారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: మాట తప్పి మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై అంగన్వాడీలు కన్నెర్ర చేశారు. చంద్రబాబూ.. డౌన్‌డౌన్! కూటమి సర్కారుకు మా సత్తా చూపిస్తాం..! అంటూ కదం తొక్కారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్ గేట్ల వద్ద పోలీసు నిర్బంధాలు.. గృహ నిర్బంధాలు.. నోటీసులు.. రెడ్‌బుక్ రాజ్యాంగంలో సర్కారు అణచివేతలకు వెరవకుండా తరలివచ్చి ఉప్పెనలా విరుచుకుపడ్డారు. విజయవాడ ధర్నా చౌక్‌లో అంగన్వాడీల ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. ఆంక్షలు, అడ్డంకులను దాటుకుని రాష్ట్రవ్యాప్తంగా భారీగా తరలివచ్చిన అంగన్వాడీలతో సోమవారం విజయవాడలో నిర్వహించిన ‘మహాధర్నా’ దద్ధరిల్లింది. కాగా, పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో 11 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తున్న ఓ మహిళను ఉద్యోగం నుంచి తొలగిస్తామని టీడీపీ –జనసేన కూటమి నేతలు బెదిరించడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన ఆమె పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సర్కారు నిర్బంధకాండ.. అంగన్వాడీల మహాధర్నా నేపథ్యంలో కూటమి సర్కారు ఆదేశాలతో ఆదివారం రాత్రి నుంచి వారిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసు నిర్బంధకాండ కొనసాగింది. అంగన్వాడీలను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు సోమవారం రోజు శిక్షణ, రికార్డుల పరిశీలనకు హాజరు కావాలంటూ ప్రభుత్వ యంత్రాంగం హుకుం జారీ చేసింది. అయినప్పటికీ అంగన్వాడీలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులను రంగంలోకి దించింది. వైఎస్సార్, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, నంద్యాల, తిరుపతి, చిత్తూరు, విజయనగరం తదితర జిల్లాల్లో అంగన్వాడీలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. విజయవాడ మహాధర్నాకు వెళ్లడానికి వీల్లేదంటూ నోటీసులు ఇచ్చారు. కైకలూరు, ఏలూరు రైల్వే స్టేషన్లు, చేబ్రోలు పోలీస్ స్టేషన్ వద్ద అంగన్వాడీలను నిర్బంధించారు. జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన అంగన్వాడీలను అశ్వారావుపేట బోర్డర్లో పోలీసులు అడ్డగించారు. కలపర్రు టోల్ గేట్ వద్ద ప్రైవేట్ వాహనాల్లో వెళుతున్న వారిని అడ్డగించి కిందకు దించేశారు. నాడు న్యాయబద్ధమేనన్న లోకేశ్ గతంలో ఆందోళన నిర్వహించిన సమయంలో అంగన్వాడీలను కలసిన నారా లోకేశ్ వారు అడుగుతున్నవి న్యాయబద్ధమైనవని, కూటమి ప్రభుత్వం రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ గుర్తు చేశారు. సమస్యల పరిష్కారం కోసం గతంలో 42 రోజులపాటు సమ్మె చేయడంతో వైఎస్సార్సీపీ హయాంలో ఆరు జీవోలు ఇచ్చిందన్నారు. ఒప్పందం ప్రకారం గతేడాది జూన్‌లోనే వేతనాలు పెంచాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీల డిమాండ్లను అమలు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికారంలోకి రాగానే అన్యాయమైపోతాయా? గత ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచి్చన అనేక హామీలను అమలు చేసిందని ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. అయితే మిగిలిన ఒప్పందాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం దగా చేస్తోందని ధ్వజమెత్తారు. గ్రాట్యుటీ, మట్టి ఖర్చులు వంటి అనేక హామీలకు కోతలు పెట్టి మభ్య పెడుతోందన్నారు. ప్రతిపక్షంలో ఉండగా అంగన్వాడీల డిమాండ్లు న్యాయమేనని అనిపించిన కూటమి నేతలకు అధికారంలోకి రాగానే అన్యాయమైపోతాయా? అని నిలదీశారు. నాడొక మాట.. నేడొక మాట కాకుండా హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. నెలాఖరులో జరిగే రివ్యూలు ఆగమేఘాలపై..అంగన్వాడీలు విజయవాడలో మహాధర్నాకు హాజరుకాకుండా కుట్రలకు తెరతీసిన కూటమి ప్రభుత్వం నెలాఖరులో జరిగే సమీక్ష కార్యక్రమాలను అప్పటికప్పుడు తెరపైకి తెచ్చింది. అయినా కడప, బద్వేలులోని ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు కదం తొక్కారు. 2022లో సుప్రీం కోర్టు గ్రాట్యుటీ విషయంలో అంగన్వాడీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా అమలు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. మైదుకూరులోని తహసీల్దార్ కార్యాలయం, ప్రొద్దుటూరులోని అర్బన్ సీడీపీవో కార్యాలయం, జమ్మలమడుగు ఐసీడీఎస్ కార్యాలయం, ఎర్రగుంట్ల, కమలాపురం తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంగన్వాడీలు విజయవాడలో మహాధర్నాకు హాజరు కాకుండా ఉయ్యూరు రూరల్ మండలంలో ఐసీడీఎస్ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అంగన్వాడీలకు శిక్షణ, రివ్యూ పేరుతో సోమవారం పెదవోగిరాల ఎంపీపీ పాఠశాలలో సమావేశం నిర్వహించి మమ అనిపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆకునూరు సెక్టర్ రివ్యూ నిర్వహించినట్టు కంకిపాడు ప్రాజెక్టు సీడీపీవో బేబీ సుకన్య తెలిపారు. అంగన్వాడీలను అడ్డుకోవడమే లక్ష్యంగా రివ్యూ నిర్వహించారని ట్రేడ్ యూనియన్ నాయకులు విమర్శించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసుల నిర్బంధకాండను ప్రజా సంఘాలు ఖండించాయి. అక్రమ అరెస్టులపై అంగన్వాడీలు విజయనగరం కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.ఇవీ ప్రధాన డిమాండ్లు...» అంగన్వాడీలకు నెల వేతనం రూ.26 వేలకు పెంచాలి. » గ్రాట్యుటీ చెల్లింపు హామీని అమలు చేయాలి. » మినీ అంగన్వాడీలను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ వెంటనే జీవో ఇవ్వాలి. » రాజకీయ జోక్యాన్ని అరికట్టి హెల్పర్ల పదోన్నతులపై నిర్దిష్ట మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలి. » సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదం తొలగించి సంక్షేమ పథకాలను అంగన్వాడీలకు వర్తింపచేయాలి. » సర్వీసులో ఉంటూ చనిపోయిన వారికి మట్టి ఖర్చులకు రూ.20 వేలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. సమ్మెకాలంలో మృతి చెందిన వారికి కూడా ఇవి వర్తింపజేయాలి. » పెండింగ్‌లో ఉన్న అంగన్వాడీల అద్దెలు, టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి. అన్ని యాప్‌లను కలిపి ఒకే యాప్‌గా మార్పు చేయాలి. » పెండింగ్‌లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. » మెనూ చార్జీలను పెంచాలి. » ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలి. » వేతనంతో కూడిన మెడికల్ లీవ్ కనీసం మూడు నెలలు ఇవ్వాలి. » ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి. ఐదు సంవత్సరాల పిల్లలందరూ అంగన్వాడీ కేంద్రాలలో ఉండేలా జీవో ఇవ్వాలి. ప్రీ స్కూల్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలనే డిమాండ్‌ను తక్షణం అమోదించి అమలు చేయాలి. రెడ్ బుక్ పాలనపై కళ్లకు గంతలతో నిరసన» రెడ్‌బుక్ పాలన నశించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అంబేడ్కర్ సెంటర్లో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. హామీలను వెంటనే అమలు చేయాలని నినదించారు. » అంగన్వాడీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ.. కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులో తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. » తొమ్మిది నెలలుగా హామీలను అమలు చేయకపోవడం, పోలీస్ నిర్బంధాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏలూరు జిల్లా చింతలపూడిలో అంగన్వాడీలు ప్రదర్శన చేపట్టారు. బోసు బొమ్మ సెంటర్లో రాస్తా రోకో చేశారు. -
పోలీసులే ఫిర్యాదు చేసి.. పోలీసులే కేసు నమోదు!
ఏలూరు: టీడీపీ ఆదేశాలతో అక్రమ కేసుల పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ శ్రేణులే లక్ష్యంగా టీడీపీ చెలరేగిపోతోంది. తాజాగా దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసింది కూటమి ప్రభుత్వం. ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై అక్రమ కేసులు బనాయించారు దెందులూరు పోలీసులు. తన నివాసం వద్ద ఉన్న కామిరెడ్డి నాని.. తమ విధులకు ఆటంకం కల్గించారంటూ రివర్స్ కేసులు పెట్టారు ఏపీ పోలీసులు. ఈ కేసులో పోలీసులే ఫిర్యాదు చేసి.. వాళ్లే కేసు నమోదు చేయడం గమనార్హం. కామిరెడ్డి నానిపై హెడ్ కానిస్టేబుల్ హమిద్ ఫిర్యాదు చేయగా, ఎస్పై శివాజీ కేసు నమోదు చేశారు. 132R/w 3(5)bns సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.ఏపీలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తువారిపై, కూటమిలో ఉన్న పార్టీలపై గతంలో విమర్శలు చేసిన వారిపై టీడీపీ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారసుడు నారా లోకేష్ ‘రెడ్ బుక్’ రాజ్యాంగం రాసుకుంటున్నానని గతంలో ఏదైతే చెప్పారో అదే అమలు చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తూ.. వైఎస్సార్సీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఏదొక అక్రమ కేసును వారిపై మోపి.. బెదిరింపు చర్యలకు పాల్పడుతోంది. ఇందుకు రాష్ట్ర పోలీసులు కూడా సహకరిస్తూ ఉండటంతో అక్రమ కేసుల పరంపరంకు అడ్డుకట్టలేకుండా పోతోంది. కూటమి ప్రభుత్వం అరాచకపాలను ప్రశ్నిస్తే చాలు ఏదొక అక్రమ కేసును చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ప్రశ్నిస్తేనే తప్పు అన్నట్లుగా ఏపీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. -
నంద్యాల జిల్లా బనగానపల్లెలో రెడ్ బుక్ రాజ్యాంగం
-
YSRCPలో చేరిన టీడీపీ కౌన్సిలర్లు
-
టీడీపీ సీనియర్లకు చంద్రబాబు హ్యాండ్
-
‘ప్రైవేట్’ నోట.. ‘డీమ్డ్’ పాట!
సాక్షి, అమరావతి: ప్రతిభ ఆధారంగా నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు దక్కే ఎంబీబీఎస్, బీడీఎస్, మెడికల్ పీజీ, ఎండీఎస్ సీట్లకు గండికొడుతూ ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలు డీమ్డ్ (స్వయం ప్రతిపత్తి) బాట పట్టడానికి పోటీపడుతున్నాయి. ప్రైవేట్ యాజమాన్యాలకు అనుకూలమైన పార్టీ టీడీపీ అధికారంలో ఉండటంతో ఇదే అనువైన సమయంగా భావించిన యాజమాన్యాలు స్వయం ప్రతిపత్తి సాధించుకోవడానికి తెగ ఆరాటపడుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా చంద్రబాబు సీఎం అయ్యాక యూజీసీ నుంచి డీమ్డ్ వర్సిటీ హోదా పొందడానికి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (ఎన్ఓసీ) మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తుల తాకిడి పెరిగింది. అపోలో, కిమ్స్, జీఎస్ఎల్, జెమ్స్, మరికొన్ని వైద్య కళాశాలల యజమానులు ఎన్ఓసీ కోరినట్లు తెలుస్తోంది. విశాఖలోని హోమి బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ పీజీ సీట్లున్నాయి. ఈ సంస్థ సైతం ఆరోగ్య విశ్వవిద్యాలయం అఫిలియేషన్ నుంచి బయటపడి, వేరే రాష్ట్రంలోని మాతృ సంస్థ అఫిలియేషన్ కింద పనిచేయడానికి ఎన్ఓసీ కోరింది.ఎంబీబీఎస్, పీజీ కోర్సుల ఫీజుల్లో వ్యత్యాసం ఇలా..ప్రస్తుతం ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ ఫీజులు కన్వీనర్ 16,500బీ కేటగిరి 13,20,000ప్రస్తుతం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మెడికల్ పీజీ ఫీజులుకన్వీనర్4,96,800బీ కేటగిరి 9,93,600ఎన్ఓసీ ఇవ్వాలంటే చట్ట సవరణ చేయాల్సిందేడీమ్డ్ బాట పట్టేందుకు కళాశాలలు పెట్టుకున్న ఎన్ఓసీ దరఖాస్తులపై సీఎం చంద్రబాబు స్థాయిలో కొద్ది రోజుల క్రితం చర్చలు నడిచినట్టు తెలిసింది. ఎన్ఓసీ ఇవ్వడానికి సా«ధ్యాసాధ్యాలపై చర్చించినట్టు సమాచారం. అయితే, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం చట్టం 1986లోని సెక్షన్6 ప్రకారం రాష్ట్రంలోని వైద్య కళాశాలలు ఇతర యూనివర్సిటీల కింద పనిచేయడానికి వీల్లేదు. రాష్ట్రంలోని వైద్య విద్య కళాశాలలన్నీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోనే కార్యకలాపాలు నిర్వహించాలని చట్టం చెబుతోంది. ఎన్ఓసీ మంజూరు అంశంపై ప్రభుత్వం న్యాయ శాఖ అభిప్రాయాన్ని కోరగా.. ఏ ఒక్కరికి ఎన్ఓసీ ఇవ్వాలన్నా వర్సిటీ చట్టానికి సవరణ తప్పనిసరని సూచించినట్టు తెలిసింది. కాగా, 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు, మంత్రి లోకేశ్ తోడల్లుడైన విశాఖ ఎంపీ భరత్ కుటుంబానికి చెందిన ‘గీతం’ సంస్థ డీమ్డ్ హోదా దక్కించుకుంది. అధికారం అండతో అడ్డదారుల్లో వైద్య కళాశాలలకు డీమ్డ్ హోదా సాధించుకున్నారన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. అదే తరహాలోనే ఇప్పుడు కూడా సొంత సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడం కోసం ప్రభుత్వ పెద్దల అస్మదీయ ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి.చెప్పిందే ఫీజు.. పెట్టిందే నిబంధనరాష్ట్రంలోని గీతం మినహా మిగిలిన ప్రైవేట్ వైద్య కళాశాలలన్నీ హెల్త్ వర్సిటీ చట్టం ప్రకారం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 18 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 50 శాతం ఎంబీబీఎస్ సీట్లు కన్వీనర్, 35 శాతం బీ కేటగిరీ, 15 శాతం ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేస్తున్నారు. సీట్లన్నింటినీ ఆరోగ్య విశ్వవిద్యాలయమే భర్తీ చేస్తోంది. మొత్తం సీట్లలో 50 శాతానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తింపజేస్తున్నారు. అదేవిధంగా కన్వీనర్ కోటా సీట్లలో 85 శాతం సీట్లను స్థానిక విద్యార్థులకే అవకాశం ఉంటోంది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఈ కళాశాలల్లో ఫీజులు ఉంటున్నాయి. అడ్మిషన్లతో పాటు, పరీక్షలను వర్సిటీయే నిర్వహిస్తోంది. అదే డీమ్డ్ హోదా వస్తే ఆయా కళాశాలలపై హెల్త్ వర్సిటీ అజమాయిషీ ఉండదు. వారు చెప్పిందే ఫీజు, పెట్టిందే నిబంధనగా మారిపోతుంది. ఎంబీబీఎస్, పీజీ సీట్లన్నీ యాజమాన్య కోటాగా మారిపోతాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, ఎండీఎస్, మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలన్నింటినీ జాతీయ ర్యాంకుల ఆధారంగా మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ, డీజీహెచ్ఎస్, కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తాయి. స్థానిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి రిజర్వేషన్లు ఉండవు. దీంతో మన విద్యార్థులు పెద్దఎత్తున సీట్లను నష్టపోతారు. మన విద్యార్థులకు తీరని నష్టం..నిజానికి.. కొత్త వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయంతో డాక్టర్ కావాలన్న మన విద్యార్థుల కలలను చంద్రబాబు ప్రభుత్వం చిదిమేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మించ తలపెట్టిన కొత్త వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. 17 కళాశాలల్లో ఐదింటిని 2023–24 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చింది. మిగిలిన కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టాలన్న పక్కా వ్యూహంతో రెండు, మూడు దశల్లోని పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం మెడికల్ కళాశాలల నిర్మాణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. వాస్తవానికి.. పులివెందుల వైద్య కళాశాలకు 50 ఎంబీబీఎస్ సీట్లతో తరగతుల ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులిచ్చినా ప్రభుత్వం వద్దని లేఖ రాసి విద్యార్థులకు తీరని ద్రోహం తలపెట్టింది. ఇలా కూటమి ప్రభుత్వ దుర్మార్గపు నిర్ణయాలతో రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు నష్టపోతున్నారు. దీనికితోడు.. ప్రస్తుతమున్న ప్రైవేట్ వైద్య కళాశాలలు డీమ్డ్ హోదా సాధించుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. -
సీనియర్లకు బాబు ఝలక్!
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో టీడీపీ సీనియర్ నేతలు, గత ఎన్నికల్లో సీటు దక్కని ముఖ్య నేతలు, సిట్టింగ్‌లకు మొండిచేయే మిగిలింది. చివరి వరకు నమ్మించి, మరోమారు దగాకు గురిచేశారనే చర్చ ఆ పార్టీలో మొదలైంది. యనమల రామకృష్ణుడి స్థానాన్ని ఆయనకివ్వకుండా పూర్తిగా పక్కన పెట్టేశారు. పార్టీ కార్యాలయంలోనే ఉండి చంద్రబాబు చెప్పిన పనులన్నీ చేసిన మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు సైతం అవకాశం ఇవ్వలేదు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా పని చేసిన మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుదీ అదే పరిస్థితి. మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామంటూ ఆశ చూపించి, రాజీనామా చేయించి టీడీపీలో చేర్చుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి చంద్రబాబు దెబ్బ కొట్టారు. మరో వైపు ఈసారి శాసన మండలిలో అడుగు పెట్టడం ఖాయమనుకున్న ఎస్వీఎస్ఎన్ వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావుకు అవకాశం దక్కలేదు. దళిత నేత కేఎస్ జవహర్, బీసీ నేత బుద్ధా వెంకన్నతో పాటు ఈ సీట్లపై ఆశలు పెట్టుకున్న చాలా మంది నేతలను చంద్రబాబు పక్కన పెట్టారు. ఎమ్మెల్సీ స్థానాలపై ఆశలు పెట్టుకున్న నేతలకు ఆదివారం సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఫోన్ చేయించి ఈసారి అవకాశం ఇవ్వలేకపోతున్నామని చెప్పించారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. వారు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పవన్ అడ్డుకోవడం వల్లే...పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ స్థానం దక్కకపోవడంపై టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ అడ్డుకున్నారనే ప్రచారం జరుగుతోంది. వర్మను ఎమ్మెల్సీ చేస్తే పిఠాపురం నియోజకవర్గంలో రెండో అధికార కేంద్రం తయారు చేసినట్లవుతుందని పవన్ భావించారని, అందుకే వర్మకు సీటు ససేమిరా అన్నారని చెబుతున్నారు. పవన్ అడ్డు చెప్పడం వల్లే వర్మకు చంద్రబాబు సీటు ఇవ్వలేదని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పిఠాపురం పూర్తిగా తన చేతిలో ఉండాలంటే.. అక్కడ తాను తప్ప మరో నాయకుడు ఉండకూడదని పవన్ భావించడం వల్లే వర్మను పక్కన పెట్టారని నియోజకవర్గంలో చర్చ మొదలైంది. ఇదివరకు రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మకు ఇది తీరని అన్యాయమని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హామీ ఇచ్చి.. చివరకు మోసంగత ఎన్నికల్లో పొత్తులో భాగంగా తన సీటును పవన్ కళ్యాణ్‌కు కేటాయించినప్పుడు వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక దశలో టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు తన వద్దకు పిలిపించుకుని బుజ్జగించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి దఫాలోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని, మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని హామీ ఇచ్చారు. వర్మ రాజకీయ భవితవ్యానికి ఢోకా లేకుండా చేస్తానని నియోజకవర్గ నేతలకు సైతం మధ్యవర్తుల ద్వారా చెప్పించారు. పవన్ గెలుపు కోసం పని చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో పార్టీ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడంతోపాటు పవన్ పక్కనే నిలబడి ఆయన్ను గెలిపించేందుకు నియోజకవర్గం అంతా తిరిగారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆందోళనలు చేసినా, ఎవరి కోసమో పని చేయడం ఏమిటని తిట్టినా పట్టించుకోకుండా పవన్ కోసం పని చేశారు. ఆయన ఎటువంటి ఇబ్బందులు సృష్టించకుండా పని చేయడం వల్లే శాసనసభలో అడుగుపెట్టాలనే పవన్ కల నెరవేరింది. తన కలను నెరవేర్చడానికి పని చేసిన వర్మను పవన్ రాజకీయంగా పూర్తిగా తొక్కేయాలనుకోవడం, ఇందుకు చంద్రబాబు సహకరించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పార్టీ కోసం పని చేసిన వారిని పట్టించుకోకుండా పక్క పార్టీ కోసం పని చేయడం తమ వల్ల కాదని టీడీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. పవన్‌కళ్యాణ్ తన రాజకీయ భవితవ్యం కోసం వర్మ అవకాశాలను దెబ్బ తీయడం, ఇదే సమయంలో తన సోదరుడు నాగబాబుకు మాత్రం పదవి ఇప్పించుకోవడం దారుణమని వాపోతున్నారు.టీడీపీ అభ్యర్థులు వీళ్లే..టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఒకరైన బీద రవిచంద్ర మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన పేరు ఖరారు చేశారు. లోకేశ్ పాదయాత్రతో పాటు గత ఎన్నికల్లో ఆయన వ్యవహారాల్లో రవిచంద్ర కీలకంగా వ్యవహరించారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఒక్కరికైనా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సిట్టింగ్ ఎమ్మెల్సీ బీటీ నాయుడుకు అవకాశం ఇచ్చారు. మూడో స్థానాన్ని టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మను ఎంపిక చేశారు. ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి అవకాశం ఇచ్చినట్లు టీడీపీ నేతలు తెలిపారు. జనసేన తరఫున నాగబాబుకు ఒక స్థానం, బీజేపీకి ఇంకో స్థానం కేటాయించారు. కాగా, బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, పార్టీ నేతలు పాకా వెంకటసత్యనారాయణ, గారపాటి సీతారామాంజనేయచౌదరి, మాలతీరాణి పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి. -
మహానాడులో తొడకొట్టిన గ్రీష్మకు జాక్‌పాట్
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల్లో కావలి గ్రీష్మ (kavali greeshma) బూతులకు పెట్టింది పేరు. 2022లో టీడీపీ నిర్వహించిన మహానాడులో ప్రసంగించిన ఆమె పార్టీ అధినేత చంద్రబాబు, వందల మంది పార్టీ సీనియర్ నేతలు, వేలాది మంది కార్యకర్తల సమక్షంలోనే తొడ కొడుతూ రాయలేని భాషలో బూతులు లంకించుకున్నారు. ‘ఎవడైనా సరే జగన్మోహన్రెడ్డి అంటూ ఇంటికొచ్చినా.. బస్సు యాత్రలో వచ్చినా.. బస్సులోంచి ఈడ్చి ఈడ్చి తంతాం.. నా కొ... ల్లారా.. రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు. సిగ్గూ, శరం లేకుండా బస్సులో వెళతారా? బస్సులోంచి ఈడ్చి తన్నకపోతే (తొడ కొడుతూ).. తెలుగుదేశం గడ్డలో పుట్టినవాళ్లమే కాదు’ అంటూ చంద్రబాబు (Chandrababu) సమక్షంలోనే వైఎస్సార్సీపీ నేతలపై బూతుల దండకం ఎత్తుకున్నారు. అంతేకాకుండా.. ‘మీరే మాకు అండ.. మీరే మాకు ధైర్యం.. మీరే మాకు స్ఫూర్తి (చంద్రబాబును చూస్తూ).. లోకేశ్ అన్న కోసం అందరం ఉంటామని గట్టిగా చెప్పండి తమ్ముళ్లూ.. జై తెలుగుదేశం’ అంటూ కావలి గ్రీష్మ టీడీపీ మహానాడులో వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, వందల మంది సీనియర్ పార్టీ నేతల సమక్షంలోనే గ్రీష్మ అసభ్య వ్యాఖ్యలు చేస్తూ.. తొడ కొడుతూ బూతులతో విరుచుకుపడ్డా చంద్రబాబు కనీసం ఇదేంటని ఆమెను వారించలేదు. వైఎస్సార్సీపీ నేతలు... ఆయన భార్యను ఏమీ అనకపోయినా.. అన్నారంటూ నానా యాగీ చేసిన చంద్రబాబు తాజాగా ఎమ్మెల్సీ స్థానానికి కావలి గ్రీష్మను ఎంపిక చేసి తన మనస్తత్వం ఎలాంటిదో చాటుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: పోలీసుల కట్టుకథకు ఇవిగో ఆధారాలు.. విడదల రజనిఆమె బూతులకు మెచ్చే టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్‌గా గ్రీష్మను నియమించారని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకు ఎమ్మెల్సీగానూ అవకాశం ఇవ్వడం ద్వారా ఎదుటివారికి నీతులు చెప్పడమే కానీ తాను పాటించనని సీఎం చంద్రబాబు నిరూపించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి చంద్రబాబు షాక్
అమరావతి: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన వర్మ.. మరోసారి దానికి గురి కాకతప్పలేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు.పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే సీటును వర్మ వదులుకున్న క్రమంలో ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు తీరా చూస్తే వర్మ కి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు చంద్రబాబు. దాంతో చంద్రబాబు తీరుపై వర్మ వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరొకవైపు వర్మ రాజకీయ భవిష్యత్ ముగిసిందనే ప్రచారం కూడా సాగుతోంది. చంద్రబాబు ఇచ్చిన షాక్ తో వర్మ వర్గం అయోమయంలో పడింది. తమనేత రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఏం చేయాలనే దానిపై వారు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. -
నంద్యాల జిల్లాలో ఆగని పచ్చ మూకల అరాచకాలు
-
నంద్యాల జిల్లాలో టీడీపీ నేతల అరాచక పర్వం.. వంతపాడుతున్న పోలీసులు
సాక్షి,నంద్యాల జిల్లా : నంద్యాల జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు తారస్థాయికి చేరుకున్నాయి. కొలిమిగుండ్ల మండలం చింత లాయపల్లె గ్రామంలో టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు దిగారు. చీనితోటను జేసీబీతో నాశనం చేశారు. అయితే, చీనితోటను నాశనం చేయొద్దంటూ అడ్డుపడిన మహిళలపై కట్టెలు, రాళ్లతో దాడులకు దిగారు. ఈ దాడుల్లో ముగ్గురు మహిళలు,ఓ బాలిక తీవ్రంగా గాయపడ్డారు.అయితే, ఈ చీనితోట పంటవేసిన మూడు ఎకరాల పొలంపై కోర్టులో కేసు నడుస్తోంది. కేసు విచారణ కొనసాగుతుండగా సివిల్ కేసులో కొలిమిగుండ్ల సీఐ రమేష్ జోక్యం చేసుకున్నారు. ఆ పొలాన్ని టీడీపీ వర్గీయులకు అప్పగించాలంటూ సదరు పొలం యజమానిపై ఒత్తిడి తెచ్చారు. అయినా బాధితులు తలొగ్గక పోవడంతో కొలిమిగుండ్ల పోలీసులు దాడికి ఉసిగొల్పాడు.ఇక టీడీపీ నేతల దాడిలో బనగానపల్లె ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాదితుల్ని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరామర్శించారు. బాధితులకు వైఎస్సార్సీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ ద్రోహం: భూమన
సాక్షి, తిరుపతి జిల్లా: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తీరును ఎండగట్టారు. కూటమి ప్రభుత్వ మోసాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘యువత పోరు’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్‌రెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, హర్షిత్ రెడ్డి, నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు.ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, నిరుద్యోగ భృతి ఇస్తామంటూ నిరుద్యోగులను చంద్రబాబు సర్కార్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను, ప్రజలను అడ్డగోలుగా మోసగించారని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ యువతకు, ప్రజలకు ప్రాధాన్యతనిచ్చి ఇచ్చిన ప్రతి హామిని నేరవేర్చారని భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. -
చంద్రబాబు క్షుద్ర రాజకీయం
సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచార కుట్రకు టీడీపీ కూటమి ప్రభుత్వం మరోమారు తెరతీసింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న వాచ్‌మేన్ రంగన్న అనారోగ్యంతో మరణిస్తే, ఆ ఉదంతాన్ని వక్రీకరిస్తూ కుతంత్రం పన్నుతోంది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసు పరిధిలోకి రాష్ట్ర పోలీసులను జొప్పించడం ద్వారా చంద్రబాబు తన కుయుక్తులను చాటుకున్నారు. ఇందుకోసం ఏకంగా రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని వేదికగా చేసుకోవడం కూటమి ప్రభుత్వ పన్నాగానికి నిదర్శనం. నాడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 2019 మార్చి 14న వైఎస్ వివేకా హత్యకు గురవ్వగా, ప్రస్తుతం అదే చంద్రబాబు ప్రభుత్వంలో రంగన్న మరణించారన్న వాస్తవాలను కప్పిపుచ్చుతూ తిమ్మిని బమ్మి చేసేందుకు బరి తెగిస్తున్నారు. వాస్తవంగా ఇందుకు బాధ్యత వహించాల్సింది టీడీపీ ప్రభుత్వం. కానీ అందుకు విరుద్ధంగా వివేకా హత్య వెనుక ఉన్న కుట్రను కప్పి పుచ్చేందుకే ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న రంగన్నను తొలుత పులివెందుల ఆసుపత్రికి, అనంతరం కడపలోని రిమ్స్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. ఈ సహజ మరణానికి రాజకీయ రంగు పులమాలన్న ఆలోచన రావడం ఒక్క చంద్రబాబు ముఠాకే సాధ్యమైంది. ఎవరికైనా, ఏమైనా సందేహాలు ఉంటే ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి నివేదించాలి. ఇంకోవైపు న్యాయస్థానంలో విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రంగన్నతోపాటు గత ఐదేళ్లలో సంభవించిన మరికొన్ని సహజ మరణాలపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించారు. తద్వారా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పరోక్షంగానైనా సరే రాష్ట్ర పోలీసులకు అప్పగించాలన్నది చంద్రబాబు కుతంత్రమని స్పష్టమవుతోంది. తద్వారా తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వైఎస్సార్సీపీపై దు్రష్పచారం చేసే కుట్రను అమలు చేయాలన్నది అసలు ఉద్దేశం. అందుకే కుట్ర పూరితంగా గురువారం బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డితో అసెంబ్లీలో మాట్లాడించి, ఆ రాత్రికే సిట్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. రెడ్‌బుక్ కుట్రలను అమలు చేసేందుకే ప్రత్యేకంగా వైఎస్సార్ జిల్లా ఎస్పీగా నియమించిన ఇ.జి.అశోక్కుమార్తోనూ అదే రాత్రి హడావుడిగా మాట్లాడించారు. మంత్రివర్గ సమావేశం వేదికగా కుట్ర సచివాలయంలో శుక్రవారం మంత్రి మండలి సమావేశంలో అజెండా అంశాలపై చర్చ అనంతరం.. ముందస్తు పన్నాగం ప్రకారం రంగన్న మృతిపై చర్చకు తెరతీశారు. ఏకంగా డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను మంత్రి మండలి సమావేశ మందిరంలోకి పిలిపించి రంగన్న మృతిపై ఆరా తీసినట్టు హైడ్రామా నడిపారు. ముందు ఇచి్చన స్క్రిప్టు ప్రకారమే డీజీపీ తన పాత్రలో నటించారు. రంగన్నది అనుమానాస్పద మృతేనని ప్రాథమిక దర్యాప్తు పూర్తి కాకుండానే, పోస్టుమార్టం నివేదిక రాకుండానే ఆయన ఏకపక్షంగా ప్రకటించడం విడ్డూరం. బాబు గూటిలో చిలుకే దస్తగిరి స్వయంగా వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేశానని అంగీకరించిన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం న్యాయ నిపుణులను విభ్రాంతికి గురి చేసింది. తద్వారా తాము లక్ష్యంగా చేసుకున్న వారి పేర్లను అతనితో వాంగ్మూలం ద్వారా చెప్పించడం అన్నది టీడీపీ పకడ్బందీ కుట్రకు తార్కాణం. అప్రూవర్‌గా మారక ముందు అతను ఇచ్చిన వాంగ్మూలం, అప్రూవర్‌గా మారిన తర్వాత ఇచ్చిన వాంగ్మూలం పూర్తి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అత్యంత నేర చరిత్ర కలిగిన దస్తగిరి వైఎస్ వివేకా హత్యకు కొన్ని రోజుల ముందు వరకు రూ.500 కోసం కూడా అప్పులు చేసే దయనీయ స్థితిలో ఉండేవాడు. స్నేహితుడు సునీల్ యాదవ్‌తో అతని వాట్సాప్ చాటింగులే ఆ విషయాన్ని నిర్ధారించాయి. అటువంటి దస్తగిరి అప్రూవర్‌గా మారిపోగానే... అతని వద్దకు కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయన్నది ఈ కేసులో అత్యంత కీలకం. ఇతను బహిరంగంగా సాగిస్తున్న దందాగిరీ అంతా ఇంతా కాదు. ఇలాంటి కిరాయి రౌడీకి సిద్ధార్థ లూథ్రా వంటి ఢిల్లీ స్థాయి లాయర్లు కేసు వాదిస్తుండటం గమనార్హం. గురువారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు లూథ్రాతో రహస్యంగా భేటీ కావడం గమనార్హం. అనంతరమే రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను నియమించింది.వివేకా రెండో భార్య వాంగ్మూలాన్ని పట్టించుకోరా? వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్య షమీమ్ ఆవేదనతో ఇచి్చన వాంగ్మూలాన్ని అటు సీబీఐ, ఇటు చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్నాయి. ఆమెతో రెండో వివాహంతోనే వివేకా కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయి. షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇస్తానని చెప్పడంతోపాటు ఆమె కుమారుడిని తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని వివేకా చెప్పడాన్ని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. షమీమ్‌ను సునీత తీవ్రంగా దూషిస్తూ అవమానించారు. వారిద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్‌లు ఆ విషయాన్ని బయట పెట్టాయి. వివేకా హత్య వెనుక ఆయన సొంత కుటుంబ సభ్యులు.. అంటే కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి పాత్ర ఉందని షమీమ్ వాంగ్మూలం ఇచ్చారు. మరి ఆ అంశానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. తద్వారా వైఎస్ వివేకా హత్య వెనుక కారణాలను కప్పిపుచ్చి, తమ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకెళ్లాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోందనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టంసిట్ పర్యవేక్షణలో 4 గంటలపాటు నిర్వహణపులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మేన్ రంగన్న మృతదేహానికి శనివారం రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఉబ్బసం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో తీవ్ర అనారోగ్యానికి గురైన రంగన్న కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహానికి గురువారం కడప రిమ్స్‌లో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని పులివెందులలోని భాకరాపురం శ్మశానవాటికలో ఖననం చేశారు. అయితే, రంగన్న మృతి పట్ల సీఎం చంద్రబాబు శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనుమానం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో సిట్, వైద్య బృందం సభ్యులు కలిసి భాకరాపురం శ్మశానంలో పూడ్చిపెట్టిన రంగన్న మృతదేహాన్ని వెలికితీయించారు. శ్రీకాకుళం జిల్లా ఏఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో కడపకు చెందిన వైద్య బృందం, తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ బృందం సభ్యులు.. రెవెన్యూ అధికారుల సమక్షంలో 4గంటలపాటు రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. ముఖ్యమైన శరీర భాగాలను సేకరించి తిరుపతి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. -
ఐదుగురు సిట్టింగ్‌లూ కరివేపాకులు!
సాక్షి, అమరావతి: ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో సిట్టింగ్‌లకు అవకాశం లేనట్లేనని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఉంటే వారిలో ఒక్కరికి కూడా సభ్యత్వాన్ని తిరిగి రెన్యువల్ చేసే పరిస్థితి లేదని నేతలు చర్చించుకుంటున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్‌బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావుల పదవీ కాలం ఈ నెలాఖరులో పూర్తి కానుండగా, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన జంగా కృష్ణమూర్తి గతంలోనే రాజీనామా చేశారు. ఈ ఐదు స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ ఐదింటిలో ఒకటి జనసేనకు కేటాయించగా, మిగిలిన నాలుగింటిలో ఒకటి బీజేపీకి ఇచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. అయితే బీజేపీ అగ్ర నాయకత్వం రాజ్యసభ స్థానాలపైనే ఆసక్తి చూపుతూ, ఎమ్మెల్సీ స్థానాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఒక స్థానం తమకివ్వాలని కోరుతున్నా, జాతీయ నాయకత్వం ఆ దిశగా టీడీపీకి ఎటువంటి సూచనలు చేయలేదని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం బీజేపీ నుంచి ఎవరికీ అవకాశం దక్కే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నాలుగు స్థానాలు టీడీపీ ఖాతాలోకే వెళతాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఇందులో ప్రస్తుతం ఆ స్థానాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారిలో ఒక్కరిని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. యనమలకు అవమానం!పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడిని అవమానకరమైన రీతిలో పక్కన పెడుతున్నట్లు టీడీపీలో చర్చ నడుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ స్థానాన్ని రెన్యువల్ చేయకపోగా, పార్టీలోనూ ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉండడంతోపాటు పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ, చంద్రబాబుతో అత్యంత సాన్నిహిత్యం ఉన్నా ఆయన్ను పట్టించుకోక పోవడం వెనుక లోకేశ్ ఉన్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. సీనియర్లను పూర్తిగా పక్కనపెట్టి, సొంత మనుషులతో కోటరీ నిర్మించుకుంటున్నారని పార్టీలో గుప్పుమంటోంది. ఈ క్రమంలోనే చాలా కాలంగా యనమల సహా చాలా మంది సీనియర్లకు అవమానాలు ఎదురవుతున్నాయి. ఈ కోపంతోనే కొద్ది రోజుల క్రితం కాకినాడ పోర్టు, సెజ్ వ్యవహారంలో చంద్రబాబు తీరును తప్పు పడుతూ యనమల లేఖ రాయడం ద్వారా కలకలం సృష్టించారు. అప్పటి నుంచి పార్టీలో ఆయన ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీతో సహా మరే పదవులు ఆయనకు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మిగిలిన నలుగురికీ నిరాశేఉద్యోగ సంఘాల నేతగా ఉండి టీడీపీలో చేరి, పార్టీ కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అశోక్‌బాబు, ఉత్తరాంధ్ర నుంచి గతంలో శాసన మండలికి వెళ్లిన దువ్వారపు రామారావు, రాయలసీమ కోటాలో మండలిలో ఉన్న బీటీ నాయుడి పేర్లను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ముగ్గురు మండలిలో చురుగ్గా ఉండి లోకేశ్‌తో కలిసి పని చేసినా, మారిన పరిస్థితుల్లో వారి అవసరం లేదని భావిస్తున్నట్లు సమాచారం. వారివల్ల అంత ఉపయోగం లేదనే కారణంతో ఎమ్మెల్సీ సభ్యత్వం రెన్యువల్ కోసం పరిగణనలోకి తీసుకోలేదని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు జంగా కృష్ణమూర్తి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించినప్పుడు మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయనొకరు ఉన్నారనే విషయమే టీడీపీ అధిష్టానం గుర్తించడం లేదంటున్నారు. -
సహజ మరణాలపై సిట్ కుట్ర: వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి
పులివెందుల: వైఎస్సార్సీపీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందితే, దానిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని, దానికి ప్రభుత్వ పెద్దలు కూడా వంతపాడుతున్నారని అభిషేక్ రెడ్డి తండ్రి, వైఎస్సార్సీపీ నేత వైఎస్ మదన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులంతా ఒక్కొక్కరుగా చనిపోతున్నారంటూ ఎల్లో మీడియా విషపూరిత కథనాలు ప్రచురించడాన్ని ఖండించారు.తమ కుమారుడు అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయారని చెప్పారు. తమ కుమారుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శక్తివంచన లేకుండా ప్రయత్నించారని, కోమా నుంచి బయటపడతాడని ఆశించామని, దేవుడు చిన్న చూపు చూడటంతో మృతి చెందాడని తెలిపారు. ఎంతో భవిష్యత్ ఉన్న అభిషేక్‌రెడ్డి చిన్న వయస్సులో చనిపోవడం ఈ ప్రాంతంలో అందరినీ కలచివేసిందని చెప్పారు. అభిషేక్‌రెడ్డి పిల్లలను చూస్తే కడపు తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు.అభిషేక్ మృతి తమకు తీరని లోటని, ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నామని తెలిపారు. ఇలాంటి తీవ్ర విషాద పరిస్థితుల్లో తాముంటే.. చిన్నాన్న వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారని, అందులో కుట్ర ఉందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పెడర్థాలు తీయడం, ప్రభుత్వ పెద్దలూ ఇదే విధంగా మాట్లాడటం దారుణమని అన్నారు. మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కరోనా వైరస్, అనారోగ్యంతో దీర్ఘ కాలం చికిత్స పొందుతూ చనిపోయారని తెలిపారు.మొన్న వాచ్‌మేన్ రంగన్న కూడా అనారోగ్యంతో చనిపోయాడని చెప్పారు. రంగన్నకు ఆయాసం ఉందని ఆయన కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారని, అతని అనారోగ్యం ఇక్కడి అందరికీ తెలుసునని చెప్పారు. వీరందరి సహజ మరణాలను అసహజ మరణాలుగా చిత్రీకరించేందుకు ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియా పనిచేస్తోందని అన్నారు. బయటి ప్రపంచానికి పులివెందులలో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని తెలియజెప్పేందుకు ఎల్లో మీడియా విశ్వప్రయత్నం చేస్తోందని, ప్రభుత్వ పెద్దల చర్యలూ ఇదే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు.సిట్ కాదు.. జ్యుడీషియల్ విచారణ జరిపించండిచిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్న వారు మృతి చెందిన వ్యవహారంపై ప్రభుత్వ సిట్ దర్యాప్తు అంటేనే ఏదో కుట్ర దాగి ఉందన్న అనుమానం వస్తోందని వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక మందిపై పెడుతున్న అడ్డగోలు కేసులు, చేపడుతున్న ఏకపక్ష విచారణ అందరమూ కళ్లారా చూస్తున్నామని, అందువల్లే సిట్‌పై నమ్మకం లేదని చెప్పారు. -
నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదు: పోసాని
సాక్షి, విజయవాడ: పోసాని కృష్ణమురళీపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపును కొనసాగిస్తూనే ఉంది. వరుస కేసుల్లో అరెస్ట్ చేస్తూ స్టేషన్ల చుట్టూ పోలీసులు తిప్పుతున్నారు. ఇవాళ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసానిని పోలీసులు హాజరుపరిచారు. ఈ నెల 20 వరకు కోర్టు రిమాండ్ విధించింది. తనకు ఆనారోగ్య సమస్యలున్నాయని న్యాయమూర్తికి పోసాని చెప్పారు. గుండె ఆపరేషన్ అయ్యిందని.. పక్షవాతం కూడా వచ్చిందని ఆయన తెలిపారు. ‘‘నాపై అక్రమ కేసులు పెట్టారు. నన్ను ఎక్కడికి తీసుకెళుతున్నారో కూడా తెలియడం లేదు’’ అంటూ పోసాని ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసు వాహనంలో గంటల తరబడి కూర్చోలేకపోతున్నానని.. తనను ఒకే జైలులో ఉంచేలా ఆదేశాలివ్వాలని పోసాని కోరగా, పిటి వారెంట్‌పై వచ్చినందున తాను ఎలాంటి ఆదేశాలివ్వలేనని న్యాయమూర్తి తెలిపారు. పోసాని కృష్ణమురళికి ఈనెల 20 వరకూ న్యాయమూర్తి రిమాండ్ విధించారు. పోసానిని కర్నూలు జైలుకి తరలించారు.కాగా, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు. -
చంద్రబాబు తప్పుడు మాటలు.. ఈనాడు రోత రాతలు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఈనాడు రోత రాతలపై వైఎస్సార్సీపీ మండిపడింది. వైఎస్ జగన్ లక్ష్యంగా ఈనాడు విషపు రాతలు రాస్తోందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో నారాయణ సాక్షిగా ఉన్నారని ఈనాడు రోత రాతలు రాసింది. కేబినెట్లో చంద్రబాబు ఏదో మాట్లాడితే.. ఈనాడు తప్పుడు వార్తలు వండి వార్చింది. వివేకా వాచ్మెన్ రంగయ్య మృతిని కూడా వైఎస్ జగన్‌కు ఆపాదించే యత్నం చేసింది. హామీలు అమలు గురించి తప్పించుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్’’ అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు.‘‘డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు.. ఎన్నికలయ్యాక చేతులెత్తేశారు. రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు వార్తలు రాయించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్టీఆర్ పరపతిని కూడా ఈనాడును అడ్డంపెట్టకుని బాబు దెబ్బతీశాడు. గతంలో లక్ష్మీపార్వతిపై కూడా ఈనాడులో ఇలాగే తప్పుడు రాతలు రాయించారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఈనాడును చంద్రబాబు వాడుతున్నారు. వైఎస్ వివేకా హత్యతో వైఎస్ జగన్‌కు ఏం సంబంధం?. వ్యవస్థలను ప్రభావితం చేసి వైఎస్సార్సీపీ నేతలను బాబు ఇబ్బంది పెట్టాలని చూశారు’’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘వైఎస్ జగన్, వైఎస్ అవినాష్‌రెడ్డిలపై విషం చిమ్మడమే చంద్రబాబు లక్ష్యం. న్యాయ వ్యవస్థలను కూడా ప్రభావితం చేసేలా ఈనాడులో వార్తలురాస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా రంగన్న మృతిని కేబినెట్లో చర్చించారు. నారాయణ యాదవ్ అనారోగ్యంతో మృతి చెందారు. గంగాధర్‌రెడ్డిది సహజ మరణమని పోస్టుమార్టం రిపోర్ట్ చెప్తుంది. గంగాధర్‌రెడ్డి మరణం అనుమానం అంటూ బాబు డైరెక్షన్లో ఈనాడు తప్పుడు రాతలు రాసింది. గన్మెన్లు ఉండగా రంగన్న మృతిపై చంద్రబాబుకు సందేహం ఏంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు ఇచ్చిన గన్మెన్లు ఉండగా.. రంగన్న మృతి ఎలా అనుమానాస్పదం?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘పరిటాల మృతి తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు. 2014- 2019 మధ్య పరిటాల సునీత కూడా మంత్రిగా ఉన్నారు. పరిటాల రవి హత్యపై ఎందుకు విచారణ చేయలేదు. వివేకా హత్య కేసులో నారాయణ సాక్షి కాదని రికార్డులు చెప్తూ ఉంటే.. నారాయణ సాక్షి అని ఈనాడు ఎలా రాస్తోంది?’’ పేర్ని నాని నిలదీశారు.‘‘వివేకా హత్య కేసులో ఈనాడు తప్పుడు వార్తలు రాసింది. సుగాలి ప్రీతి హత్య కేసు గురించి తీవ్రంగా పరిగణించరుగానీ రంగయ్య మృతిపై మాత్రం తీవ్రంగా స్పందిస్తారంట. జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఆ కేసులో సాక్షి అంటూ తప్పుడు కథనాలు రాశారు. జగన్ లక్ష్యంగా విషపు రాతలు రాసింది. చంద్రబాబువి.. తప్పుడు మాటలు, ఈనాడువి తప్పుడు రాతలు. కేబినెట్లో ప్రజలకు చేయాల్సిన మేలు గురించి చర్చించలేదు. ఎన్నికలలో ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తారు. అధికారంలోకి వచ్చాక తన తప్పుడు హామీల నుండి బయట పడటానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. హామీలకు పంగనామాలు పెట్టారు...రాజకీయ ప్రత్యర్థులపై ఈనాడులో విషం కక్కించటం చంద్రబాబుకు అలవాటే. ఎన్టీఆర్ కు వెన్నుపోటు నుండి అనేక అంశాలలో ఇదే జరిగింది. లక్ష్మీ పార్వతి విషయంలో కూడా అప్పట్లో ఇలాగే రాయించారు. అవినాష్ కు సంబంధం లేకపోయినా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేసేలాగ పెద్దపెద్ద అక్షరాలతో వార్తలు రాయిస్తున్నారు. నారాయణకు వివేకా కేసుకు ఎలాంటి సంబంధం లేదు. బ్రెయిన్ ట్యూమర్ తో నారాయణ చనిపోయారు. కల్లూరి గంగాధరరెడ్డిని 243వ సాక్షిగా ఉన్నాడు. దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో మృతి చెందారు. ఆయనది సహజ మరణం అని పోస్టుమార్టం రిపోర్టు కూడా ఉంది. శ్రీనివాసరెడ్డి 2018 సెప్టెంబరు లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపుల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాశారు..వైఎస్ అభిషేక్‌రెడ్డి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. జగన్, సునీతమ్మ ఇద్దరికీ అభిషేక్ బంధువే. మల్టీ ఆర్గన్స్ డేమేజ్ వలన అభిషేక్ మృతి చెందిన సంగతి అందరికీ తెలిసినా ఈనాడు విషపు రాతలు రాసింది. వాచ్మెన్ రంగన్నకు పోస్టుమార్టం అయ్యాక ఖననం చేశారు. రంగన్న గురించి కేబినెట్లో చర్చించారు. డీజీపీతో పాటు కడప నుండి పోలీసు అధికారులు వచ్చి ప్రభుత్వ పెద్దల సందేశం తీసుకుని వెళ్లారు. రంగన్నకు 2+2 గన్ మెన్లతో జగన్ ప్రభుత్వం భద్రత కల్పించారు. చంద్రబాబు వచ్చాక 1+1 భద్రతకు తగ్గించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్ ఉండగా ఎలా అనుమానాస్పదంగా రంగన్న మృతి చెందారు?. ఖననం చేసిన రంగన్న మృతదేహాన్ని మళ్ళీ బయటకు తీసి రీపోస్టుమార్టం చేస్తున్నారు. ఆ నివేదికలు రాకముందే ఈనాడులో తప్పుడు కథనాలు ఎలా రాశారు?..పరిటాల రవి హత్యలో సాక్షుల మృతిపై చంద్రబాబు ఎందుకు విచారణ జరపలేదు?. ఎప్పుడో చనిపోయిన నారాయణ యాదవ్ మృతితో సహా అందరిపై విచారణ చేస్తారట, ఎవరిని ఇరికించటానికి విచారణల పేరుతో వ్యవస్థలను నాశనం చేస్తారు?. ఎన్నికల హామీలను డైవర్షన్ చేయటానికి ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు విచారణలు చేయిస్తున్నారు. రంగన్న ఇచ్చిన 164 స్టేట్మెంటులో అవినాష్ రెడ్డి పేరు లేదు. అసలు ఏ సాక్షి కూడా అవినాష్ పేరు చెప్పలేదు. ఇలాంటి తప్పుడు కథనాలు రాసే విష సంస్కృతి మానుకోవాలి’’ అని పేర్ని నాని హితవు పలికారు. -
TDP: అదృష్టంతో ఎమ్మెల్యే అయ్యావ్!
శ్రీకాళహస్తి: ‘అదృష్టం వల్లో.. పూర్వజన్మ సుకృతం వల్లో ఎమ్మెల్యే అయ్యావు. నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. హేయమైన నీ మాట తీరు మార్చుకో’ అంటూ టీడీపీ నాయకుడు, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఓటేరు కాలువపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు శుక్రవారం తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాటల్లోనే.. ‘ఓటేరు కాలువ భూముల గురించి క్షుణంగా విలేకరుల సమావేశంలో తెలిపాను.అయినా సుధీర్‌రెడ్డి రైతులు కడుపుకొట్టే విధంగా అసెంబ్లీలో ప్రసంగించడం బాధ కలిగించింది. మాపై సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్‌కు ఏదో ఒకటి చెప్పి కలరింగ్ ఇచ్చుకుంటున్నావని తెలిసింది. మొత్తం వివరాలతో వెళ్లి నువ్వు చేస్తున్న ఆగడాలను బయటపెడుతా. నీ కుటుంబానికి మూడు తరాలుగా అండగా నిలిచాను. నీకు అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే అయ్యావు. అహంకార ధోరణితో తొమ్మిది నెలల్లో నువ్వు చేసిన అరాచకాలపై వంద పేజీల నివేదిక సీఎంకు అందజేస్తా. ఓటేరు భూముల విషయంలో రైతుల కడుపు కొట్టేవిధంగా నువ్వు చేస్తున్న దుష్పష్ప్రాన్ని మేము పక్కా ఆధారాలతో నిరూపిస్తాం.డొనేషన్లు తీసుకుని గెలిచి ఎవరినీ పట్టించుకోవడం లేదు. నీ కుటుంబం పరువు, పేరు చెడగొడుతున్నావు. ఒకసారికే నీకు తోక వచ్చేస్తే నీ కుటుంబం కంటే ముందు 1982లో నేను పార్టీలో చేరాను. 9 నెలల నీ పాలన చూసిన తర్వాత బియ్యపు మధుసూదన్‌రెడ్డి వెయ్యి రెట్లు మేలు అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ విధంగా పార్టీని భ్రష్టు పట్టిస్తున్నావు. ఇక ప్రతి వారం పార్టీని, నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నీ బాగోతాలు కడిగేస్తా’. అంటూ విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య, గురుదశరథన్, ప్రసాద్‌నాయుడు పాల్గొన్నారు. -
కోడిగుడ్డుపై ఈకల కోసం.. షాడో సీఎం పాకులాట
తమకు గిట్టనివారిపై కక్ష ఎలా తీర్చుకోవాలో, తమకు కావల్సిన వారిని ఎలా అందలం ఎక్కించాలో తెలుసుకోవాలంటే ఏపీకి వెళ్లాలి. అక్కడ జరుగుతున్న పరిణామాలు కచ్చితంగా కేస్ స్టడీ అవుతాయి. సాధారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థను వ్యతిరేకించే తీవ్రవాద పార్టీలు రాజ్యంపై దాడులు చేస్తుంటాయి. కానీ, చిత్రంగా ఏపీలో అధికారంలో ఉన్న రాజకీయ కూటమి ప్రజలపై, ప్రతిపక్షంపైన ఇలాంటి దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో వారు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, సినిమా కళాకారులను సైతం వదలడం లేదు. కూటమి ప్రభుత్వం ఏదో ఒక అక్రమ కేసు పెట్టి వేధింపులకు దిగుతోంది.షాడో సీఎంగా భావిస్తున్న నారా లోకేష్ తీసుకు వచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. కొద్దిరోజుల క్రితం సీనియర్ ఐపీఎస్ అధికారి, గతంలో సీఐడీ అధిపతిగా పనిచేసిన దళిత అధికారి పీవీ సునీల్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం శోచనీయం. దానికి ప్రభుత్వం చెప్పిన కారణం వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన గత ప్రభుత్వ సమయంలో అనధికారికంగా విదేశాలకు వెళ్లి వచ్చారట. ఆయన అలా టూర్ చేసినప్పుడు సున్నితమైన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉందట. బహుశా ఇలాంటి పిచ్చి కారణంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ.. ఏ అధికారిపైనా ఇలాంటి చర్య తీసుకుని ఉండకపోవచ్చు. ఎందుకంటే సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లడం, రావడం కూడా జరిగి కొన్నేళ్లు అయింది. ఎప్పుడూ ఆయనపై ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఆయన వల్ల దేశానికి, లేదా రాష్ట్రానికి సంబంధించిన కీలక సమాచారం ఏదీ బయటకు వెళ్లినట్లు ఆరోపణలు రాలేదు.కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విషయాలలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. నిజంగా మన దేశ ప్రముఖులు ఎవరైనా కీలక సమాచారం లీక్ చేసే అవకాశం ఉందనుకున్నా, అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానం ఉంటే వెంటనే చర్య తీసుకుంటుంది. అలాంటిది ఏమీ జరగలేదు. పైగా రాష్ట్రాలలో అంత ప్రమాదకరమైన సున్నిత సమాచారం ఏదీ ఉండదు. బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న సునీల్ కుమార్‌కు ఆ మాత్రం తెలియకుండా ఉండదు. అసలు కారణం ఏమిటంటే 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన పలు స్కాంలను పరిశోధించి, సాక్ష్యాధారాలతో సహా పలు కేసులు పెట్టడంలో సునీల్ కుమార్ ముఖ్య భూమిక పోషించారన్నది టీడీపీ పెద్దలకు ఉన్న కోపం. ఆ కేసులలో పనిచేసిన అప్పటి అధికారులు పలువురిపై ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కొందరికి పోస్టింగ్‌లు కూడా ఇవ్వలేదు. అంతేకాక డీజీపీ ఆఫీసుకు వచ్చి రిపోర్టు చేసి కూర్చోవాలని ఆదేశించింది. దీనిని రిటైర్డ్ ఐపీఎస్‌లు ఖండించారు కూడా. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.ఇక సునీల్ కుమార్‌పై ఏవైనా ఆరోపణలు చేసి కేసులు పెట్టాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసి ఉంటుంది. ఇందుకోసం ఇద్దరు, ముగ్గురు రిటైర్డ్ పోలీసు అధికారులకు బాధ్యత అప్పగించిందని కూడా వార్తలు వచ్చాయి. అయినా సునీల్ కుమార్‌పై స్కాంల ఆరోపణలు చేయడానికి అవకాశం వచ్చినట్లు లేదు. దాంతో రెడ్ బుక్ సృష్టికర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తెచ్చి దళిత ఐపీఎస్ అధికారిని ఈ రకంగా సస్పెండ్ చేయించి ఉండవచ్చన్న అభిప్రాయం వస్తోంది. తీరా చూస్తే సునీల్ కుమార్ అనధికారంగా విదేశీ యాత్రలు చేయలేదని వెల్లడవుతోంది. ఆయన ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు తీసుకునే విదేశీ టూర్‌కు వెళ్లారు. ఆయన వ్యక్తిగత హోదాలోనే వెళ్లారు. అందుకు సొంతంగానే ఖర్చు పెట్టుకున్నారు. ప్రభుత్వం వద్ద ఏదైనా నిర్దిష్ట సమాచారం ఉంటే దానికి సంబంధించి ముందుగా సునీల్ కుమార్‌కు నోటీసు ఇవ్వాలి. కానీ, ఆ పని చేయకుండా సస్పెండ్ చేశారంటేనే అందులోని దురుద్దేశం అవగతమవుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.సీనియారిటీ, ట్రాక్ రికార్డు రీత్యా ఏపీకి డీజీపీ అయ్యే అవకాశం ఉన్నందున, కేంద్రానికి తప్పుడు నివేదిక పంపేందుకు ఇలా సస్పెండ్ చేసి ఉండవచ్చని కొందరు రిటైర్డ్ ఐపీఎస్‌లు అభిప్రాయపడుతున్నారు. డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి పట్ల ఇంత ఘోరంగా వ్యవహరించిన ప్రభుత్వం, ఒక చిన్నస్థాయి అధికారి పట్ల ఎంత ఉదారంగా వ్యవహరించిందో చూడండి. గతంలో చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిపై స్కిల్ స్కాం కేసులో అభియోగాలు వచ్చాయి. ఆయనను విచారించాలని అప్పట్లో సీఐడీ తలపెట్టింది. దానిని గమనించిన తెలుగుదేశం పెద్దలు అతనిని ఢిల్లీ నుంచి చెప్పా పెట్టకుండా అమెరికాకు పంపించేశారని అంటారు. దాంతో విచారణకు ఆయన అందుబాటులోకి రాకపోవడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కానీ, కూటమి అధికారంలోకి రావడంతోనే ఆ సస్పెన్షన్ ఎత్తివేయడమే కాకుండా మొత్తం జీతభత్యాలను చెల్లించేశారని మీడియాలో కథనాలు వచ్చాయి.అంతేకాదు, ఈయన ఇంటిపై కేంద్ర ప్రభుత్వ ఆదాయపన్ను శాఖ దాడులు చేసి సుమారు రెండువేల కోట్ల అక్రమాలకు సంబంధించిన ఆధారాలు కనుగొన్నట్లు అప్పట్లో సీబీడీటీ ప్రకటించింది. ఆ తర్వాత కేసును విజయవంతంగా మేనేజ్ చేసుకున్నారు. అది వేరే సంగతి. అలాంటి వ్యక్తిపై ప్రభుత్వం సస్పెన్షన్ ఎలా ఎత్తివేస్తుందంటే ఏమి చెబుతాం. అదంతే.. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి భాస్కర భూషణ్ అనే అధికారి టీడీపీ హయాంలో 2018లో అనుమతులు లేకుండానే విదేశాలకు వెళ్లి వచ్చారట. తదుపరి ఏడాదికి ఆయన తిరిగి వస్తే, అప్పటి ప్రభుత్వం విదేశీ యాత్రలకు ఆమోదం తెలిపిందంట. దీనిపై ఎవరు వివరణ ఇవ్వాలి?. గతంలో ఒక డాక్టర్ రోడ్డుపై నానా రచ్చగా వ్యవహరించి, పోలీసుల మాట వినకుండా ప్రవర్తిస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ అతని చేతులు కట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఆ ఉదంతాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ, దళితులకు ఇంత అవమానం చేస్తారా అంటూ దుష్ప్రచారం చేశారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మరీ నీచంగా ఆనాటి ప్రభుత్వంపై విష ప్రచారం సాగించింది.ఇప్పుడేమో ఒక దళిత సీనియర్ ఐపీఎస్ అధికారిపై మాత్రం ఇంత దారుణంగా కక్ష కట్టారు. దీనిపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. మంచి పేరున్న ఒక దళిత అధికారిని విద్వేషపూరితంగా సస్పెండ్ చేయడం ఏ మాత్రం సమంజసం కాదని ఆయన అన్నారు. ఇది కేవలం కోడిగుడ్డుపై ఈకలు పీకడమేనని అన్నారు. సునీల్ కుమార్ ఏమైనా గూఢచారి విభాగంలో ఉన్నారా, ఆయన ప్రతీ మూమెంట్ చెప్పడానికి అని ప్రశ్నించారు. ఆయనకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వమే కదా అని వ్యాఖ్యానించారు. సునీల్ ప్రజల ధనంతో టూర్ కు వెళ్లలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ప్రజల సొమ్ముతో ఎలా విదేశాలు తిరిగి వస్తున్నారని, వారిద్దరి టూర్ షెడ్యూల్ వెల్లడించాలని, ఎన్ని ఉల్లంఘనలు జరిగాయో తెలుస్తుందని కూడా ప్రవీణ్ సవాల్ చేశారు.దళిత వర్గాల వారి పిల్లలు విదేశాలలో చదువుకోవద్దా?. ఆ పిల్లలను చూడడానికి దళితులు వెళ్లవద్దా?. ఆధిపత్య వర్గాలే విదేశాలకు వెళ్లాలా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రవీణ్ కుమార్ అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద జవాబు ఉండదు. గూఢచర్య పరికరాల కొనుగోలు కేసులో ఆరోపణలు ఉన్న ఒక అధికారిని గత ప్రభుత్వం సస్పెండ్ చేస్తే, కూటమి ప్రభుత్వం దానిని ఎత్తివేయడమే కాకుండా, మొత్తం జీతం కూడా చెల్లించింది. అంత పెద్ద ఆరోపణ ఉన్నా తమకు మద్దతు ఇస్తున్నందున ఆ అధికారిపై కేసు ఎత్తివేయడం ఒకవైపు చేస్తూ, తమకు గిట్టని మరో అధికారిపై ఏదో ఒక పిచ్చి కారణం చూపి కేసులు పెట్టడం ద్వారా కూటమి ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతోంది. దళిత సంఘాలు ఈ పరిణామాలపై మండిపడుతున్నాయి. తెలుగుదేశం నేతలకు గత హయాంలో తప్పుడు కేసులు పెట్టారన్న సందేహం వస్తే దానిపై విచారణ చేయవచ్చు. ఆ స్కాంల ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఇలా రెడ్ బుక్ ప్రయోగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్నవారి కుంభకోణాలను సమర్ధంగా వెలుగులోకి తీసుకువస్తే ఇలాంటి కక్షలు ఎదుర్కోవలసి వస్తుందన్న భయం అధికారవర్గంలో ఏర్పడితే అది ప్రజాస్వామ్యానికి, సమాజానికి, అధికార వ్యవస్థకు ఎంత ప్రమాదమో ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కోటి మంది డ్వాక్రా మహిళలకు ధోకా
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. యావత్ ప్రపంచం మహిళల హక్కులు, ఆర్థిక స్వావలంబన, ఉన్నతి కోసం మాట్లాడుకుంటున్న తరుణంలో చంద్రబాబు సర్కారు ఏకంగా మహిళా దినోత్సవం రోజే వారి సాధికారతకు తూట్లు పొడిచింది! అక్కచెల్లెమ్మల అభ్యున్నతి కోసం ఏర్పాటైన స్త్రీ నిధి బ్యాంకును పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అడుగులు వేస్తోంది. కూటమి సర్కారు కొత్త పథకాలు విద్యాలక్ష్మి, కల్యాణలక్ష్మి కోసం ఇచ్చే రుణాలను స్త్రీ నిధి బ్యాంకు నుంచి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో బ్యాంకు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది.అదే అంతకు ముందు గత ఐదేళ్లూ మహిళా సాధికారతే ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రతి అడుగూ వేశారు. అన్ని పథకాలను మహిళల పేరిటే అమలు చేసి ఆర్థిక ఆసరా కల్పించారు. ప్రతి పథకానికి బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించి చిత్తశుద్ధిని చాటుకున్నారు. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా ఏకంగా రూ.427.27 కోట్ల మొత్తాన్ని అర్హులకు పారదర్శకంగా అందించారు.సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలకు స్త్రీ నిధి బ్యాంకు ఇచ్చే రూ.4 వేల కోట్ల రుణాల్లో రూ.1,000 కోట్ల చొప్పున కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మీ పథకాలకు నాలుగు శాతం వడ్డీకి రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మొత్తం రుణాల్లో నాలుగో వంతు రుణాలను తక్కువ వడ్డీకి ఇవ్వడం వల్ల స్త్రీ నిధి సంస్థ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోనుంది. గత ఐదేళ్లలో స్త్రీ నిధికి సంబంధించి దాదాపు రూ.4 వేల కోట్లు నిరంతరం పొదుపు సంఘాల మహిళల వద్ద రుణాలు రూపంలో ఉన్నాయి. పథకాల అమలుకు చిత్తశుద్ధితో బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఇలా అడ్డదారిలో మళ్లించడం వల్ల పొదుపు సంఘాల వ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళన మహిళల్లో వ్యక్తమవుతోంది. కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా మహిళలను మోసం చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ‘స్త్రీ నిధి’ నిధులను వాడుకోవాలని నిర్ణయించింది. కోటి మందికి పైగా ఉన్న పొదుపు మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే సంస్థ నిధులను వాడుకోవడం అంటే.. ఆ మేరకు డ్వాక్రా మహిళల రుణాల లభ్యత తగ్గించడమేననే ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యవసర సమయాల్లో ఆర్థిక తోడ్పాటు అందించే స్త్రీ నిధి బ్యాంకును నష్టాల ఊబిలోకి గెంటేస్తోందని, సర్కారు నిర్వాకాలతో సంస్థ మూతపడితే పేద మహిళల ఆర్థిక అవసరాలకు తోడ్పాటు కరువై దిక్కుతోచని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పథకాల అమలుకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేకుండా.. స్త్రీ నిధి ద్వారా రుణాలు ఇప్పించాలన్న కూటమి సర్కారు యోచనపై అధికారులు విస్తుపోతున్నారు. 7 శాతం వడ్డీకి అప్పులు తెచ్చి... 4 శాతం వడ్డీకి రుణాలివ్వాలట! సొంత నిధులు తక్కువగా ఉండే స్త్రీ నిధి బ్యాంకు ఇతర బ్యాంకుల నుంచి ఏడు శాతం వడ్డీకి తీసుకొచ్చిన డబ్బులనే 11 శాతం వడ్డీకి పొదుపు మహిళలకు రుణంగా ఇస్తూ ఉంటుంది. ఏడు శాతానికి పైన తీసుకొనే నాలుగు శాతం వడ్డీలో రెండు శాతం వడ్డీ డబ్బులను తిరిగి గ్రామ, మండల సమాఖ్యలకు, మిగిలిన 2 శాతం వడ్డీ డబ్బులను స్త్రీ నిధి సిబ్బంది జీతాలు, సంస్థ నిర్వహణకు వినియోగిస్తుంటారు. స్త్రీ నిధి సంస్థ ఏడు శాతం వడ్డీకి తెచ్చుకుంటున్న నిధులను ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఆలోచన చేస్తున్న కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మీ పథకాల లబ్దిదారులకు నాలుగు శాతం వడ్డీకే రుణాలు ఇప్పించేలా కసరత్తు చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించి ప్రణాళిక ఇప్పటికే దాదాపు కొలిక్కి వచ్చింది. అంటే మూడు శాతం చొప్పున వడ్డీ డబ్బులను స్త్రీ నిధి బ్యాంకు నష్టపోవాల్సి ఉంటుంది. ఈ పథకాలు అమలు చేయడం వల్ల స్త్రీ నిధి సంస్థకు ఆర్థికంగా వాటిల్లే నష్టానికి సంబంధించి తిరిగి చెల్లింపులు, అదనపు సాయం అందించడం గురించి ఇప్పటిదాకా ప్రభుత్వ స్థాయిలో జరిగిన కసరత్తులో ఎక్కడా కనీసం చర్చ జరగలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. పూర్తిగా స్త్రీ నిధి సంస్థ నిధులతోనే ఈ పథకాలను అమలు చేసేలా అడుగులు పడుతున్నాయి. ఒకవైపు వడ్డీకి తెచ్చుకునే డబ్బులను మరోవైపు అంతకంటే తక్కువ వడ్డీకి రుణాలుగా ఇవ్వడం ద్వారా స్త్రీ నిధి సంస్థ నష్టాల ఊబిలోకి వెళ్లి మూతపడే అవకాశం ఉంటుందని మహిళా సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. స్త్రీ నిధి బ్యాంకు నిబంధనలివీ..స్త్రీ నిధి బ్యాంకు అందించే రుణాలను పేద మహిళల కుటుంబాల జీవనోపాధుల పెంపు లేదా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసమే వెచ్చించాలి. రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళల ఆదాయం పెరిగేలా తోడ్పాటునివ్వాలి. స్త్రీ నిధి నిబంధనలు గాలికి.. సాధారణంగా పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళలు బ్యాంకు లింకేజీ కార్యక్రమంలో కమర్షియల్ బ్యాంకు ద్వారా రుణాలు పొందుతుంటారు. బ్యాంకు లింకేజీ ద్వారా మహిళలు పొందే రుణాలను మూడు నాలుగేళ్ల కాల పరిమితితో నెలవారీ కిస్తీ రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం క్యాష్ అండ్ క్రెడిట్ విధానం అమలులో ఉన్నా.. ఒక్కో సంఘం మూడు నాలుగేళ్లకు ఒకసారే బ్యాంకు లింకేజీ లోన్లు తీసుకుంటాయి. పొదుపు సంఘం ద్వారా మహిళలు ఒకసారి బ్యాంకు లింకేజీ రుణం పొందిన తర్వాత అత్యవసర సమయాల్లో స్త్రీ నిధి ద్వారా అదనపు ఆర్థిక రుణాన్ని పొందుతుంటారు. పొదుపు మహిళలకు బ్యాంకు లింకేజీ కార్యక్రమంలో రుణాలిచ్చినా, స్త్రీ నిధి ద్వారా రుణాలిచ్చినా నిబంధనల ప్రకారం ఆయా కుటుంబాల జీవనోపాధుల పెంపు లేదా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసమే వెచ్చించాలి. ఆ రుణాలను ఉపయోగించుకొని తమ ఆదాయం పెంచుకోవాలి. అయితే కూటమి సర్కారు ఆలోచన దీనికి భిన్నంగా ఉంది. స్త్రీ నిధి బ్యాంకు నిబంధనలను తుంగలో తొక్కి కొత్త పథకాలకు మళ్లిస్తోంది. జగన్ హయాంలో ప్రభుత్వమే నేరుగా సాయం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పాటు పేద కుటుంబాల పిల్లల చదువులకు అండగా నిలుస్తూ అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యాదీవెన పథకాల ద్వారా తిరిగి చెల్లించే అవసరం లేకుండా నేరుగా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసింది. కళ్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా రూ.427.27 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని విధానంలో అర్హులకు అందించింది. ఎన్నికల ముందు ఎడాపెడా హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు లబ్ధిదారులంతా తప్పనిసరిగా తిరిగి చెల్లించాల్సిన రుణాల రూపంలో విద్యాలక్ష్మీ, కళ్యాణలక్ష్మీ పథకాల అమలుకు సిద్ధమైంది. ఇందుకోసం 12 ఏళ్లుగా కోటి మందికి పైగా పొదుపు మహిళల ఆర్థిక అవసరాలు తీర్చిన స్త్రీ నిధి సంస్థను బలి పెడుతోంది. స్త్రీ నిధిని నష్టాల్లోకి నెట్టి నిర్వీర్యం చేసేలా అడుగులు వేయటాన్ని మహిళా సంఘాలు, రాజకీయ వర్గాలు తప్పుబడుతున్నాయి. నిధులు మళ్లిస్తే ఊరుకోం స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాదులను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన స్త్రీ నిధి నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తే ఊరుకునేది లేదు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ప్రకటించిన కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి. ఆ పథకాల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం అన్యాయం. పొదుపు మహిళల అభ్యున్నతికి ఉద్దేశించిన స్త్రీ నిధిని మళ్లించేందుకు యత్నిస్తుండటం దారుణం. దీనివల్ల పొదుపు మహిళల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలి. – పి.నిర్మలమ్మ, ఐద్వా సీనియర్ నాయకురాలు, కర్నూలుస్త్రీ నిధిని మళ్లించడం దారుణం టీడీపీ కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమ పథకాలకు గండికొడుతోంది. మహిళా సాధికారిత గురించి గొప్పలు చెబుతూ కల్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవటాన్ని బట్టి పాలకులకు చిత్తశుద్ధి లేదని రుజువవుతోంది. స్త్రీ నిధి బ్యాంకు రుణాలను ఇతర పథకాలకు మళ్లించే యత్నాలు సిగ్గుచేటు. ప్రభుత్వ మోసపూరిత విధానాలను మహిళలు గమనిస్తున్నారు. – ఎం.విజయ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రకాశం జిల్లా అధ్యక్షురాలు ఊరుకునేది లేదు.. కూటమి ప్రభుత్వం స్త్రీ నిధిని ఇతర పథకాలకు మళ్లిస్తే ఊరుకునేది లేదు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో డ్వాక్రా మహిళలకు రుణాలు తగ్గే ప్రమాదం ఉంది. బ్యాంకు నిబంధనలను తుంగలో తొక్కి అసంబద్ధ నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. – చిట్టెమ్మ, డ్వాక్రా సంఘం సభ్యురాలు, చిత్తూరు జిల్లా.నిధులు కేటాయించకపోవడం దారుణం కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణం. డ్వాక్రా మహిళల సాధికారతకు రుణాలు సమకూరుస్తున్న స్త్రీ నిధి బ్యాంకు నిధులను ఈ పథకాలకు మళ్లిస్తే డ్వాక్రా మహిళలకు సమస్యలు తప్పవు. డ్వాక్రా నిధులతో కుటుంబాలను నెట్టుకొస్తున్న పేద వర్గాల మహిళలు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పిస్తోంది. డ్వాక్రా మహిళలకు స్త్రీ నిధి రుణాలు అందని పరిస్థితి ఉత్పన్నం కానుంది. డ్వాక్రా మహిళలకు ద్రోహం తలపెట్టే యత్నాలను విరమించుకోవాలి. కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలి. డ్వాక్రా మహిళలకు ఇబ్బంది లేకుండా బ్యాంకు రుణాలను సక్రమంగా అందించి ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – ఇ.చంద్రావతి, శ్రామిక మహిళా సంఘాల ప్రతినిధి, కాకినాడ జిల్లా -
అబద్ధాల్లో చంద్రబాబు డబుల్ పీహెచ్డీ: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: అబద్దాలు చెప్పటంలో చంద్రబాబు డబుల్ పీహెచ్డీ చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ దుయ్యబట్టారు. అధికారంలోకి రావటానికీ, వచ్చాక కూడా అబద్ధాలు ఆడటం చంద్రబాబుకు అలవాటు అంటూ మండిపడ్డారు. రాష్ట్రం శ్రీలంకలాగ మారుతోందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి పదేపదే విష ప్రచారం చేశారు. రూ.14 లక్షల కోట్ల అప్పు రాష్ట్రానికి ఉన్నట్టు ప్రచారం చేశారు.. వాస్తవానికి చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న అప్పులతో అల్లాడిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న అప్పుల కేకలు పవన్ కళ్యాణ్‌కి వినపడటం లేదా?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు.‘‘గవర్నర్ స్పీచ్‌లో కూడా అబద్దాలు చెప్పారు. వైఎస్సార్సీపీ సభ్యులు అసెంబ్లీలో అప్పుల గురించి అడిగితే వాస్తవాలు బయట పడ్డాయి. ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏకంగా శ్రీలంకని మించి అప్పులు చేశారన్నారు. బీజేపీ నేత పురంధేశ్వరి కూడా రూ.12 లక్షల అప్పు ఉందన్నారు. ప్రజలను మోసం చేయటానికి వీరంతా కలిసి వ్యవస్థీకృత నేరం చేశారు. అప్పటి జగన్ ప్రభుత్వంపై ఒక ప్రణాళికాబద్ధంగా దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు ఈ 9 నెలలకే లక్షా 47 వేల కోట్ల అప్పు చేశారు. ఈ తెచ్చిన అప్పంతా ఎవరికి ఇచ్చారు?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.‘‘ప్రజలకు ఇచ్చారా? పెద్దవాళ్లే పంచుకున్నారా?. సంపద సృష్టిస్తామని చెప్పి అప్పులు చేస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలన్నిటినీ వెంటనే అమలు చేయాలి. అప్పులు తెచ్చి రాజధానిని కడుతున్నారు. అన్ని ప్రాంతాల ప్రజల సొమ్మును రాజధానిలో పెడుతున్నారు. కేంద్రం ఇస్తానన్న రూ.20 వేల కోట్లు తెచ్చి రాజధాని నిర్మాణం చేయాలి’’ అని సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. -
కూటమి నేతల్లో క్రెడిబులిటీ లేదు : శ్యామల
సాక్షి,తాడేపల్లి : రాష్ట్రంలో మహిళలకు భయం తప్ప భరోసా లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. శుక్రవారం (మార్చి7) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.‘వైఎస్సార్సీపీ తరుఫున మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కూటమి నేతలకు క్రెడిబులిటీ లేదు. వైఎస్సార్సీపీ హయాంలో మహిళలకు అగ్రతాంబూలం కల్పించారు. నవరత్నాల్లో కూడా 90 శాతం మహిళలకే నిధులు కేటాయించింది. దిశ యాప్‌తో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రక్షణ కల్పించారు. జాతీయ స్థాయిలో 19 అవార్డులు వచ్చిన దిశ యాప్‌ను కూటమి ప్రభుత్వం నిర్విర్యం చేసింది. దిశ ప్రతులను ఇప్పటి హోమంత్రి అనిత తగల బెట్టారు.కూటమి ప్రభుత్వంలో మహిళలపై 16,809 కేసులు నమోదయ్యాయని హోంమంత్రి ప్రకటించారు. వాటిల్లో ఎన్ని కేసుల్లో బాధితులకు న్యాయం చేశారు?. మచ్చుమర్రి, గుడ్లవల్లేరు ఘటనలు ప్రభుత్వ ఉదాసీనకు అద్దం పట్టాయి.పుంగనూరులో చిన్నారి హత్య జరిగితే హోంమంత్రి రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటు.ఆడపిల్లలు, మహిళలకు రక్షణ కలిగింది కేవలం వైఎస్ జగన్ పాలనలోనే. ఒక సోదరుడిగా, బిడ్డగా ముందుండి వైఎస్ జగన్ నడిపించారు. నవరత్నాల పథకంతో మహిళలకు గౌరవం పెరిగింది. ఎవరూ అడగకుండానే జగన్ మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించారు.జడ్పీ ఛైర్మన్లు, డిప్యూటీ ఛైర్మన్లు, మేయర్లు ఇలా సగానికిపైగా మహిళలకే కేటాయించారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ చోద్యం చూస్తున్నారా?.సూపర్ సిక్స్ హామీలన్నీ మోసం మోసం. ఉచిత బస్సు పథకంపై నిలువునా మోసం చేశారు. రాష్ట్రం అంతా ఉచిత బస్సు ద్వారా తిరగవచ్చని చంద్రబాబు చెబితే జిల్లాలకే పరిమితం చేస్తున్నట్టు మంత్రి సంధ్యారాణి ప్రకటించారు’అని అన్నారు. -
మహిళలకు టోకరా.. ఉచిత బస్సుపై చంద్రబాబు సర్కార్ యూటర్న్
సాక్షి, విజయవాడ: మహిళ దినోత్సవం ముందే మహిళలకు కూటమి సర్కార్ టోకరా వేసేసింది. ఉచిత బస్సుపై చంద్రబాబు ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. శాసన మండలి సాక్షిగా కేవలం జిల్లా పరిధిలో మాత్రమే మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం అంటూ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించింది. ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడనుంచైనా ఉచిత బస్ ప్రయాణం అంటూ ప్రకటనలు హోరెత్తించారు. ప్రతి సభలో ఎక్కడ నుండి ఎక్కడవరకైనా ఉచితం అంటూ చంద్రబాబు ప్రచారం చేసింది. అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం మాట మార్చేసింది. దీంతో సోషల్ మీడియాలో మహిళలు తీవ్రంగా మండి పడుతున్నారు.ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజల్ని బురిడీ కొట్టించడంలో తన ట్రేడ్ మార్క్ మోసాన్ని ప్రదర్శించిన చంద్రబాబు తాను బురిడీ బాబునని మరోసారి నిరూపించుకున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు డబ్బా కొట్టారు.అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విషయాన్ని విస్మరించారు. కర్ణాటక, తెలంగాణలలో ఉచిత బస్ పథకం అమలు తీరుపై అధ్యయనం అంటూ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారు. ఆ తర్వాత 2025 జనవరి 1 నుంచి అన్నారు... కాదు కాదు... ఈ ఏడాది ఉగాది నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఖాయమన్నారు. తీరా బడ్జెట్లో అసలు ఆ పథకం ప్రస్తావనే లేదు.. చివరికి జిల్లా పరిధిలో మాత్రమే మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం అంటూ శాసనమండలిలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి సెలవిచ్చారు. -
వెలిగొండ ప్రాజెక్ట్‌పై కూటమి సర్కార్ కుట్ర: ఎమ్మెల్యే తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: మూడు జిల్లాలకు వరప్రదాయినిగా నిలుస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేవలం రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే వెలిగొండ ప్రాజెక్ట్‌కు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.359 కోట్లు మాత్రమే కేటాయించడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. ఏకంగా 53 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.ప్రెస్మీట్లో ఎమ్యెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఇంకా ఏమన్నారంటే..:నాడు చిత్తశుద్దితో పనులు:ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం ప్రాంతంలో నెలకొన్న నీటి ఎద్దడి, కరవు పరిస్థితులను ఐక్యరాజ్యసమతి వంటి అంతర్జాతీయ సంస్థలే గుర్తించాయి. ఈ కరవు పరిస్థితులను మార్చేందుకు నిర్దేశించిన వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించింది. ఈ ప్రాజక్ట్ పనులు శరవేగంతో చేయడం వల్ల శ్రీశైలం నుంచి నీటిని తీసుకురావడానికి నిర్మించిన రెండు టన్నెల్స్ పనులు పూర్తయ్యాయి. దానిలోని మట్టిని మాత్రం తొలగించాల్సి ఉంటుంది. అలాగే స్టోరేజీ చేసే కొండల మధ్య ఉన్న గ్యాప్‌లను పూడ్చడం జరిగింది. పునరావాసానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.గతంలో పునరాసానికి రూ.1.80 లక్షలు ప్రకటిస్తే, జగన్‌గారు వచ్చిన తరువాత రూ.12.5 లక్షలు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి వరకు ఎవరికైతే 18 ఏళ్ళు నిండి ఉంటాయో వారికి పరిహారం ఇచ్చి, ముంపు ప్రాంతాల నుంచి తరలించాల్సి ఉంది. ఇదే జరిగితే 53 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయిలో నీరందుతుంది. శ్రీశైలంలో 45 రోజుల పాటు వచ్చే నీటిని ఇక్కడికి తీసుకువచ్చి, కరవును దాదాపు రూపుమాపవచ్చు.పాదయాత్ర. ప్రభుత్వాన్ని నిలదీస్తాం:వెలిగొండ ప్రాజెక్ట్‌లో గత బడ్జెట్లో అరకొర నిధులను మాత్రమే కేటాయించారు. ఈ నిధుల కేటాయింపుతోనే అసలు వెలిగొండను పూర్తి చేసే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదని అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న కుటిల ప్రయత్నాలను తిప్పికొడతాం. వెలిగొండ ప్రాజెక్ట్‌కు నిధులు సాధించేందుకు మేం చేపట్టే పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు అవుతారు.ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు కూడా రాజకీయాలను పక్కకుపెట్టి ఈ ప్రాజెక్ట్ సాధనకు ముందుకు రావాలి. తప్పుడు రాజకీయాలు చేస్తున్న నేతలను నిలదీయాలి. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఇప్పటికే ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రాముఖ్యత ఈ ప్రాంత ప్రజలకు తెలుసు కాబట్టి, తనను నిలదీస్తారనే భయంతోనే చంద్రబాబు తన పర్యటనను ప్రాజెక్ట్ వద్ద కాకుండా దూరంగా పెట్టుకుంటున్నారు. తన కుమారుడు నారా లోకేష్ కోసం ఆయన నియోజకవర్గంలో వందల కోట్లు కేటాయించుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘ఆస్తులు అమరావతికి.. పస్తులు ప్రకాశానికి’ అన్నట్లుగా వీరి వ్యవహారం ఉంది. -
ప్రజలకు వాస్తవాలన్నీ తెలిశాయి: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి నోటికొచ్చినట్టు అబద్దాలు చెప్పారని.. రూ.14 లక్షల కోట్ల అప్పులంటూ.. రాష్ట్రం శ్రీలంక అయిందంటూ విష ప్రచారం చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎల్లోమీడియాలో అడ్డమైన కూతలు కూశారని.. దారుణమైన రాతలు రాశారని ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగంలో అప్పుల గురించి తప్పించి మాట్లాడించారు.’’ అని పేర్కొన్నారు.‘‘ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆమోదంతో రాతపూర్వకంగా సమాధానం చెప్పక తప్పలేదు. నవ రత్నాల అమలు, డీబీడీ ద్వారా వేసిన నిధులు అన్నీ కలిపిన అప్పులు అవి. మరి చంద్రబాబు బ్యాచ్, ఎల్లోమీడియా ఎందుకు తప్పుడు కూతలు కూశారు?. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులు భారీగా ఉన్నాయి. ఆ లెక్కలు జనానికి తెలియకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కారు కూతలు కూసిన చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని శివశంకర్ డిమాండ్ చేశారు.‘‘ఓట్ల కోసం తప్పుడు సమాచారం చెప్పామని జనం ఎదుట ఒప్పుకోవాలి. ఇక సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టడానికి వీల్లేదు. వైఎస్ జగన్ చాలా చక్కగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని కాపాడారని తేలింది. ప్రజలకు వాస్తవాలన్నీ తెలిశాయి’’ అని శివశంకర్ తెలిపారు. -
నేను గాంధీ గారి బాటలో నడిచేవాణ్ణి.. జగన్ గురించి ఒక్కటే చెప్తున్నా
-
అసెంబ్లీ సాక్షిగా అప్పు లపై టీడీపీ అబద్ధాలు బట్టబయలు
-
రియల్ ఎస్టేట్ ఢమాల్.. కొనేది లేదు... అమ్మేది లేదు
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తోంది.. ఎక్కడా ప్లాట్లు.. సైట్ల అమ్మకాలు లేవు.. కొందామంటే కొరివి. అమ్ముదాము అంటే అడవిలా ఉంది పరిస్థితి.. రియల్ వ్యాపారాలు రేట్లు పెంచడం మాట అటుంచి వైఎస్ జగన్ అధికారంలోంచి దిగిపోయాక ఖజానాకు ఆదాయం దారుణంగా తగ్గిపోయింది. ఖజానాకు ప్రతినెలా బోలెడు లోటు కనిపిస్తోంది దాన్ని నింపుకోవడానికి ప్రజలపై భారం వేయడం.. కుదిరినన్నిచోట్ల నుంచి పన్నులు పిండుకోవడమే మార్గంగా భావించిన చంద్రబాబు రియల్ ఎస్టేట్ రంగాన్ని టార్గెట్ చేసారు. భూముల ధరలు పెంచేశారు.. దీంతో పదివేలున్న గజం భూమి ఒకేసారి పదిహేను వేలు అయింది.. దానిమీద జరిగే క్రయవిక్రయాలమీద ప్రభుత్వానికి పన్ను ఆదాయం సమకూరుతుంది. బాబు ఆలోచన బాగానే ఉంది కానీ ఇప్పుడు పెరిగిన ఈ ధరలు చూసి జాగాలు కొనేందుకు జనం భయపడుతున్నారు. భూమి కొనడం మాట అటుంచి ఈ రిజిస్ట్రేషన్ చార్జీలు.. ఆఫీసు మామూళ్లు చూసి జనం భీతిల్లుతున్నారు.ఇసుక ధరలు.. గుండెలు గుభేల్ఇదిలా ఉండగా ఉచిత ఇసుక అంటూ ఊదరగొట్టిన తెలుగుదేశం ప్రభుత్వం గెలిచాక ప్రజలకళ్ళలో ఇసుక పోసింది. మారాజా అంటే మరి రెండు తన్నండి అన్నట్లుగా.. వైఎస్ జగన్ హయాంలో ఇసుక ధరలు ఎక్కువ ఉన్నాయ్.. మేమొస్తే ఫ్రీ ఇసుక అని నమ్మించి గెలిచాక కూటమి నేతలు ఇసుకను ఆదాయవనరుగా మార్చుకున్నారు. దేశంలో ఎక్కడా లేని ధరకు ఇసుక అమ్ముతున్నారు. ఒక లారీ ఇసుక తెచ్చుకోవడం అంటే శేషాచలం కొండలనుంచి ఎర్రచందనం తెచ్చుకోవడం కన్నా ఎక్కువ ప్రయాస ఐంది. దీన్ని తెలుగుదేశం వాళ్ళు అక్రమంగా తరలిస్తూ ప్రజలకు అందకుండా చేస్తున్నారు. ఇదంతా కలిసి ప్రజలకు ఇసుక అనేది మహాప్రసాదం ఐంది. దీంతో ఇసుక సంపాదించి ఇల్లు కట్టి.. వ్యాపారం చేయడం గగనం అయిపోతోంది.వెంచర్లమీద వాలుతున్న పచ్చ రాబందులురాష్ట్రంలో వ్యాపారం చేసేందుకు వాతావరణం సరిగా లేదు. మొన్నటికిమొన్న మద్యం వ్యాపారం మోసం లక్షల్లో అప్పులుచేసి లైసెన్సులు తీసుకుని షాప్ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే టీడీపీ ఎమ్మెల్యేలు వాలిపోయారు.. మాకు పావలా వాటా ఇస్తావా.. షాప్ మూసుకుని వెళ్ళిపోతావా అని బెదిరించారు. అనంతపురం.. తాడిపత్రి ప్రాంతాల్లో జెసి బ్రదర్స్ అయితే లైసెన్స్ దారులమీద చేసిన రుబాబు రాష్ట్రంమొత్తం చూసింది. ఇప్పుడు ఇదే సంస్కృతి రియల్ ఎస్టేట్ లోకి కూడా పాకింది. ఎక్కడ ఎవరు ప్లాట్లు అమ్మడానికి.. అపార్టుమెంట్లు నిర్మించడానికి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే చాలు టిడిపి నేతలు వాలిపోతున్నారు. మాకు రౌడీ మామూలు కడితే సరేసరి.. లేదంటే ఆ భూములు వివాదాస్పదం అంటూ రెవెన్యూ అధికారులతో దాడులు చేయిస్తూ ఆ భూములు ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో కోట్లు పెట్టి వ్యాపారం చేసేది తెలుగుదేశం వాళ్లకు సమర్పించుకోవడానికా అని రియల్టర్లు బెంబేలెత్తుతున్నారు. ఈ తొమ్మిదినెలలుగా ఇంటి స్థలాలు.. అపార్టుమెంట్ల అమ్మకాలు ఘోరంగా పడిపోయాయి. దీంతో కోట్లు పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు వడ్డీలు కట్టలేక.. వ్యాపారం సాగక సతమతమైపోతున్నారు. ఇదేకాదు చిన్నాచితకా పరిశ్రమలు నడిపేవారిపైనా తెలుగుదేశం నేతలు రుబాబు చేస్తున్నారు. దీంతో డబ్బున్న వాళ్ళు కూడా పరిశ్రమలు పెట్టడం కన్నా బ్యాంకులో వేసుకుంటే భద్రంగా ఉంటుందని ఊరుకుంటున్నారు - సిమ్మాదిరప్పన్న -
పూర్తిగా అమ్మేసి కాష్ చేసుకుంటున్నారు.. ఏపీ అసైన్డ్ భూములపై షాకింగ్ నిజాలు
-
టీడీపీ కుట్రపూరితంగా PV సునీల్ ని సస్పెండ్ చేసింది
-
భీమవరంలో రోడ్డెక్కిన ఆక్వా రైతులు..
-
గురువుకే పంగనామాలు పెట్టే పనిలో వర్మ..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరూ గురుశిష్యులని గొప్పగా చెప్పుకునే వారు. రాజకీయాల్లో విడదీయలేని దశాబ్దాల బంధం వారిది. గురువు చెప్పినట్టు శిష్యుడు నడుచుకోవడమే తప్ప ఎదురు ప్రశ్నించిన రోజే లేదు. అటువంటి గురుశిష్యులు పెద్దల సభలో చోటు కోసం తలోదారి వెతుక్కుంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికై న ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసిపోతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ స్థానాల ఎన్నికకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫలితంగా కూటమిలో ఎమ్మెల్సీ ఆశావహులు పైరవీలకు తెరతీశారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాలలో(MLC Elections) ఉమ్మడి తూర్పుగోదావరికి ఒక్క స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల నుంచి ఆశావహులు క్యూలో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నాయకుడైన యనమల రామకృష్ణుడు(Yanamala Rama Krishnudu)తన స్థానాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలనే ప్రయత్నాలు షురూ చేశారు. ఖాళీ అవుతోన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో యనమల ఖాళీ చేసే స్థానం కూడా ఒకటి కావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీలో పార్టీ సీనియర్ అయిన యనమల రామకృష్ణుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ(SVSN Varma), పిల్లి అనంతలక్ష్మి, బీజేపీ నుంచి రాజమహేంద్రవరానికి చెందిన సోము వీర్రాజు తదితరులు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్(Pawan Kalyan) సోదరుడైన నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తారంటున్నారు. ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటామని నెలన్నర క్రితం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే(Chandrababu Naidu) ప్రకటించారు. ఫలితంగా నాగబాబుకు ఎమ్మెల్సీ, మంత్రి కావడం ఖాయమనుకుని సామాజిక మాధ్యమాల్లో జనసేన శ్రేణులు హల్చల్ చేశాయి. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీలో నాగబాబుకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తాజాగా తెరమీదకు వచ్చిన సమాచారం. ఇదే విషయం టీడీపీ అనుకూల మీడియాలో విస్తృతంగా జరుగుతోన్న ప్రచారంతో నాగబాబుకు ఇక ఎమ్మెల్సీ లేదనే నిర్ధారణకు పార్టీ వర్గాలు వచ్చేశాయి.ఈ పరిస్థితుల్లో ఉమ్మడి తూర్పున తెలుగుదేశంపార్టీ(TDP) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కోసం గట్టి పట్టుబడుతోంది. ఈ స్థానం కోసం నిన్నమొన్నటి వరకు చెట్టపట్టాలేసుకు తిరిగిన గురు, శిష్యులు యనమల, వర్మ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. చంద్రబాబు తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన నేతగా టీడీపీలో రామకృష్ణుడుకు పేరుంది. జనసేన, కమలనాధులతో కలిసి కూటమిగా టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతోంది. అయినా వీసమెత్తు గుర్తింపు, హోదా దక్కలేదని టీడీపీ సీనియర్ నేత యనమల అంతర్మథనం చెందుతున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో పార్టీలో ఇంతలా ప్రాధాన్యం లేని రోజులు ఎప్పుడూ చూడలేదనే ఆవేదన అనుచరవర్గం బాహాటంగానే వ్యక్తం చేస్తోంది. తునిలో వరుస పరాజయాలతో ప్రజాక్షేత్రానికి దూరమైన యనమలను పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీని చేసింది. కూటమి గద్దె నెక్కడంతో సీనియర్‌గా తన సేవలు కేబినెట్లో వినియోగించుకుంటారను కున్నా ఆ ఆశలు కూడా ఆవిరైపోయిన సంగతి విదితమే. వాస్తవానికి ఇవేమీ కాకున్నా రాజ్యసభకు వెళ్లాలనేది యనమల చిరకాల వాంఛ. సీనియర్‌నైన తనను పక్కనబెట్టి ఎవరెవరినో రాజ్యసభకు పంపిన దగ్గర నుంచి యనమల తీవ్ర అంతర్మథనం చెందుతున్నారని పార్టీ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో పదవీకాలం ముగిసిపోతున్న ఎమ్మెల్సీ స్థానాన్ని పునరుద్ధరిస్తారని యనమల అనుచరవర్గం లెక్కలేసుకుంటోంది. కుమార్తె దివ్యకు తుని అసెంబ్లీ, వియ్యంకుడైన పుట్టా సుధాకర్‌యాదవ్‌కు మైదుకూరు అసెంబ్లీ, ఒక అల్లుడు పుట్టా మహేష్‌కుమార్‌కు ఏలూరు ఎంపీ..ఇలా యనమల కుటుంబంలో మూడు కీలక పదవులు అనుభవిస్తున్న పరిస్థితుల్లో రామకృష్ణుడును ఎమ్మెల్సీ కొనసాగించడం కష్టమేనంటున్నారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన యనమల ఎమ్మెల్సీ చాన్స్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారంటున్నారు. కానీ చాన్స్ మాత్రం తక్కువనే ప్రచారం పార్టీలో జరుగుతోంది.టీడీపీలో యనమల శిష్యుడిగా చెప్పుకునే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ఈసారి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. యనమల మాట జవదాటరని పార్టీ నేతలు చెప్పుకునే దానికి భిన్నంగా గురువుకే పంగనామాలు పెట్టే పనిలో వర్మ ఉన్నారంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేయడమే కాకుండా గెలుపు కోసం అనుచరులంతా పడ్డ కష్టానికి తగిన ఫలం దక్కలేదనేది వర్మ ఆవేదన. పిఠాపురం సీటు త్యాగం చేసినందుకు కూటమి అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ వర్మకేనని చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రకటించారు. కూటమి గద్దె నెక్కాక వచ్చిన తొలి ఎమ్మెల్సీ అవకాశాన్ని రాకుండా పవన్ అండ్ కో మోకాలడ్డిందని వర్మ అనుచరులు బాహాటంగానే ప్రచారం చేశారు. రెండు పర్యాయాలు వచ్చిన అవకాశాన్ని ఎగరేసుకుపోయిన పరిస్థితుల్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదనే ప్రయత్నాల్లో వర్మ ఉన్నారు. ఈసారి ఎమ్మెల్సీ దక్కించుకోకపోతే జిల్లాలోనే కాకుండా చివరకు పిఠాపురంలో అనుచరుల వద్ద తలెత్తుకు తిరిగే పరిస్థితి ఉండదనే ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే చినబాబు ద్వారా వర్మ గట్టి లాబీయింగ్ చేస్తున్నారని అనుచరులు చెబుతున్నారు. పదవుల పందేరంలో చాణక్య నీతిని ప్రదర్శించే టీడీపీలో ఉద్దండుడైన గురువు యనమలకు కాకుండా వర్మకు అవకాశం దక్కుతుందా అని కొందర సందేహం వ్యక్తం చేస్తున్నారు. గురుశిష్యుల్లో చివరకు చాన్స్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే! -
అన్నదమ్ముల మధ్య ముదిరిన వివాదం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తొమ్మిదేళ్లుగా స్వగ్రామం తూర్పునాయుడుపాలెంలో జరుపుకుంటున్న పుట్టిన రోజు వేడుకలను ఈ దఫా ఒంగోలు నగరంలో నిర్వహించడం చర్చనీయంగా మారింది. తన సోదరుడు, ఎమ్మెల్యే జనార్దన్‌తో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా సత్య నగర రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనార్దన్, సత్యల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. తాజాగా ఫ్లెక్సీల వివాదం రాజుకోవడంతో సత్య తన పుట్టిన రోజు వేడుకలను పట్టుబట్టి ఒంగోలు నగరంలో నిర్వహించుకున్నారు.భాగ్యనగర్‌లో జరుపుకున్న ఈ వేడుకలకు కొండపి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదిక మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జనార్దన్ ఫొటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో ఇక్కడే క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్న ఆయన ఇకనుంచి ఒంగోలు కేంద్రంగా పార్టీ కార్యకలాపాలను నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు చాలా మందిని ఈ వేడుకలకు ఆహ్వానించినప్పటికీ హాజరుకాలేదు. అసెంబ్లీ జరుగుతుందన్న సాకుతో డుమ్మా కొట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద జిల్లా కేంద్రమైన ఒంగోలులో టీడీపీకి ఇప్పటికే రెండు కార్యాలయాలు ఉన్నాయి. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం ఒకటి భాగ్యనగర్‌లో ఉండగా, గుంటూరు రోడ్డులో జనార్దన్ ఆధ్వర్యంలోని మరో కార్యాలయం ఉంది. తాజాగా సత్య రంగ ప్రవేశంతో మూడో కార్యాలయం సిద్ధమవుతోంది. -
శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో టీడీపీ నేతల అవినీతి బాగోతం
-
శాసనమండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీ
👉బడ్జెట్‌పై చర్చలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రులు👉రెండున్నర కోట్ల మంది మహిళలు మోసపోయారు👉తల్లికివందనం లబ్ధిదారులను వంచన చేశారు👉అన్నదాతలకు వెన్నుపోటు పొడిచారు👉నిరుద్యోగ భ్రుతిని భ్రాంతికి కలిగించారు👉మహిళల మాన ప్రాణాల్ని పణంగా పెట్టి ఈ బడ్జెట్ ని రూపొందించారు👉ఇది బాహుబలి బడ్జెట్ కాదు.. కట్టప్ప బడ్జెట్👉హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలను కట్టప్పలా వెన్నుపోటు పొడిచారు👉మేడిపండులా ఈ బడ్జెట్ ఉంది👉టీడీపీ నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన బాండ్లను ఇప్పుడు ప్రజల్లోకి తీసుకుని వెళ్లగలరా..?👉ఎన్నికల్లో వచ్చేది బాబే...ఇచ్చేది బాబే అన్నారు...👉బాబు వచ్చారు.. ఏమిచ్చారు..👉మద్యం అమ్మకాలను పెంచుతామని బడ్జెట్ లో చెప్పడం దారుణం👉ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రులు బాల వీరాంజనేయ స్వామి, అనిత👉మద్యం కోసం మాట్లాడే అర్హత లేదంటూ మంత్రి బాలవీరాంజనేయులు వ్యాఖ్యలు👉ఎన్టీఆర్ తెచ్చిన మద్య నిషేధం ఎత్తేసింది చంద్రబాబు కాదా..? అంటూ కౌంటర్ ఇచ్చిన వరుదు కళ్యాణి👉మద్యం అమ్మకాలను పెంచి ఆదాయం పెంచుతామని చెప్పడం దారుణం👉25 శాతం అమ్మకాలు పెంచి ఆదాయం పెంచుతామనడం దారుణం కాదా..?👉మద్యం ద్వారా 27 వేల కోట్ల ఆదాయం పెంచుతామనడం సమంజస మేనా..?👉ఆడబిడ్డ నిధి, , ఉచిత బస్సు , తల్లికివందనం, 50 ఏళ్లకే పెన్షన్ పథకానికి నిధులు ఎగనామం పెట్టారు👉తొమ్మిది నెలల్లోనే 1.35 లక్షల కోట్ల అప్పు చేసిన ఈ ప్రభుత్వానిదే ఆర్థిక విధ్వంసం👉మండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ వాయిదా తీర్మానం👉ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు హామీపై చర్చించాలని వాయిదా తీర్మానం👉చంద్రబాబు మోసాలను శాసన మండలిలో ఎండగడుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు 👉మండలి సాక్షిగా ఆడుదాం ఆంధ్రాపై టీడీపీ అబద్ధపు ప్రచారం గుట్టురట్టు👉ఆడుదాం ఆంధ్రాలో ఎలాంటి అక్రమాలు జరగలేదని శాసన మండలిలో కూటమి సర్కార్ ప్రకటన👉తల్లికి వందనంపై పచ్చి దగా.. మండలి సాక్షిగా అడ్డంగా దొరికిపోయిన లోకేష్👉వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నతో తల్లికి వందనంపై మంత్రి నారా లోకేష్ తప్పుడు లెక్కలు విడుదల చేసి అడ్డంగా దొరికిపోయారు👉అన్నదాతలను పట్టించుకోని కూటమి సర్కార్..👉పంటలు పండక, పండినవాటికి మద్దతు ధర లేక అన్నదాతలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ ఆగ్రహం👉నిన్న (బుధవారం) అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ నడిచింది.👉2014–19 మధ్య రైతులను రుణమాఫీ పేరిట వంచించారు👉అన్నదాత సుఖీభవను అర్హులైన అందరికీ అందించాలి👉సర్కారు వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ వాకౌట్ -
టీడీపీ నేతల అవినీతి బాగోతం బట్టబయలు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కదిరిలో టీడీపీ నేతల అవినీతి బాగోతం బయటపడింది. ఒక్కో ఇంటి పట్టాకు రూ. 50 వేలు టీడీపీ నేతలు వసూలు చేస్తున్నారు. కదిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ దందా సాగిస్తున్నారు. టీడీపీ నేతలు పబ్లిగ్గా డబ్బు వసూలు చేస్తున్నా కానీ రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. టీడీపీ నేతల వసూళ్ల పర్వం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.స్టోర్ డీలర్‌పై టీడీపీ నేత దాడిమరోవైపు, టీడీపీ నేతల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతోంది. తాము హెచ్చరించినా రేషన్ దుకాణం వదులుకోలేదన్న కోపంతో టీడీపీ నాయకుడు అంజినప్ప దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ రేషన్ షాపు డీలర్‌పై దాడి చేశాడు. ఈ ఘటన బుధవారం హిందూపురం మండలం కగ్గల్లు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... దళిత సామాజిక వర్గానికి చెందిన ఆదినారాయణ దివ్యాంగుడు. 2006 నుంచి గ్రామ (ఎఫ్ఫీ షాప్‌నంబర్ 1257060) డీలర్‌గా పనిచేçసూŠత్ జీవనం సాగిస్తున్నాడు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే డీలర్ షిప్ వదులుకోవాలని టీడీపీ నేతలు ఆదినారాయణను బెదిరించారు. దీని గురించి గ్రామ సర్పంచ్ హనుమంతు రాయప్పకు బాధితుడు చెప్పుకోగా.. సర్పంచ్ కూడా టీడీపీ నేతలకే వత్తాసు పలుకుతూ రేషన్ డీలర్ షిప్ వదులుకోవాలని బెదిరించాడు. దీంతో ఆదినారాయణ తప్పనిసరి పరిస్థితిలో కోర్టును ఆశ్రయించి డీలర్‌గా కొనసాగేలా అనుమతులు తెచ్చుకున్నాడు.దీంతో రెవెన్యూ అధికారులు ఆదినారాయణ ఎఫ్‌సీ షాపునకు నెలసరి రేషన్ బియ్యం కోటాను మంజూరు చేశారు. ఈ క్రమంలో ఆదినారాయణ బుధవారం బియ్యం బస్తాలను లారీ నుంచి దించుకుంటుండగా.. టీడీపీ నాయకుడు అంజినప్ప అక్కడికి వచ్చి పరుష పదజాలంతో దూషించాడు. అంతేకాకుండా భౌతికదాడి చేయడంతో పాటు అందరి ముందు చెప్పుకాలితో తన్నాడు. తనకు కోర్టు అనుమతి ఉందని ఆదినారాయణ చెబుతున్నా ‘ప్రభుత్వం మాది... మాదే జరుగుతుంది... కోర్టు గీర్టు జాన్తా నై.. నీ ఇష్టం వచ్చిన వాడికి చెప్పుకో’’ అంటూ అందరి ముందు దుషించాడు. దీనిపై బాధితుడు బుధవారం హిందూపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంజినప్పపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘ఇవాళ అసెంబ్లీలో ఉన్నవి రెండే పక్షాలు. ఒకటి అధికార పక్షం. రెండోది ప్రతిపక్షం. సభా నాయకుడికి సభలో మాట్లాడేందుకు ఎంత సమయం ఇస్తే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడటానికీ అంతే సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ప్రజల గొంతుకను ప్రతిపక్షం వినిపించగలుగుతుంది. కానీ, ప్రజల గొంతుక వినిపించకూడదని మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘‘గవర్నర్ ప్రసంగం, బడ్జెట్లో లోపాలను సాక్ష్యాధారాలతో ఎండగడుతూ ప్రజలకు వివరించడానికి ఇప్పుడు మీడియా సమావేశంలో రెండు గంటలు పట్టింది. ప్రతిపక్ష హోదా కల్పించినప్పుడే అసెంబ్లీ వేదికగా ఈ తరహాలో ప్రజలకు వివరించడానికి అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష హోదా కల్పించలేదు కాబట్టే మీడియా ద్వారా ప్రజల గొంతుక వినిపిస్తున్నాం’’ అని పునరుద్ఘాటించారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు వైఎస్ జగన్ జవాబిచ్చారు. ఇంత మంది సభ్యుల బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న నిబంధన ఎక్కడా లేదన్నారు.ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ అసెంబ్లీలో ముగ్గురు సభ్యులే ఉన్న బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని గుర్తు చేశారు. ‘‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. టీడీపీకి 23 మంది సభ్యులే ఉన్నప్పుడు.. వారిలో ఐదుగురు ఎమ్మెల్యేలు పక్కన కూర్చున్నారు. మరో పదిమందిని లాగేద్దాం.. సభలో టీడీపీ బలం తగ్గిద్దామని మావాళ్లు చెబితే నాడు నేను వద్దని వారించా. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చాం. అసెంబ్లీలో ఎంత సమయం మాట్లాడతావో మాట్లాడు అంటూ చంద్రబాబుకు మైక్ ఇచ్చాం. ఇప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. ఇదీ.. చంద్రబాబుకు మాకు ఉన్న తేడా’’ అని చెప్పారు. ‘‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేయడం ఎప్పుడైనా చూశామా? ఇక్కడ చంద్రబాబు చేశాడు.. అయినా ఉత్తరాంధ్ర టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలో మాస్టార్లు కూటమి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పారు కదా? ఎందుకంటే, అక్కడ రిగ్గింగ్ సాధ్యం కాదు. కారణం.. టీచర్లే ఓటర్లు, ఏజెంట్లు కాబట్టి’’ అని మరో ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానం పేర్కొన్నారు. ‘‘పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ. జీవితకాలంలో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు’’ అంటూ ఇంకో ప్రశ్నకు బదులిచ్చారు.అప్పులపైఅవే అబద్ధాలు..» మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు..!»మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీలు, రీసెర్చ్‌లు చేస్తున్నారు : వైఎస్ జగన్ »అమరావతి పేరిట ఇంతింత అప్పులు చేస్తూ సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్టు అని ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు?»బాబు వచ్చాక రెవెన్యూ తగ్గిందని ప్రస్ఫుటంగా కనిపిస్తోంది»రాష్ట్రానికి సొంత ఆదాయాలు పెరగలేదు»మూలధన వ్యయంలో గణనీయంగా తగ్గుదల కనిపిస్తోంది» మరి చంద్రబాబు చెబుతున్నట్లు జీఎస్డీపీ 12.94 శాతానికి ఎలా పెరుగుతుంది? ‘‘చంద్రబాబు మోసాలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు బహిరంగ సభలో రాష్ట్ర అప్పులు రూ.పది లక్షల కోట్లు అని అబద్ధాలు చెప్పాడు. ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్లన్నారు. ఆ తర్వాత రూ.12 లక్షల కోట్లన్నారు. గతేడాది బడ్జెట్లో గవర్నర్ ప్రసంగంలో రూ.10 లక్షల కోట్లని చెప్పించారు. రాష్ట్రానికి అప్పులుఎంత ఉన్నాయన్నది కాగ్ రిపోర్టులో ఉంది. 2023–24లో కాగ్ అకౌంట్స్‌లో అప్పులు రూ.4,91,734.11 కోట్లు, ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పు రూ.1,54,797.11 కోట్లు. రెండు కలిపితే మొత్తం అప్పులు రూ.6,46,531 కోట్లు’’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. – సాక్షి, అమరావతి 2018–19 నాటికి అంటే.. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు రూ.2,57,509 కోట్లు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు రూ.55,508 కోట్లు. రెండు కలిపి రూ.3.13 లక్షల కోట్ల అప్పులున్నాయని తన తొలి బడ్జెట్లోనే చంద్రబాబు ప్రకటించారు. ఆ అప్పులు మా ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ.6.46 లక్షల కోట్లకు చేరాయి. వాస్తవాలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా ఇంకా దుష్ఫ్రచారం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు ఎంత దుర్మార్గుడు, అన్యాయస్తుడు అంటే.. మొన్న చిత్తూరులో గంగాధర నెల్లూరు పబ్లిక్ మీటింగ్‌లో రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లు అని చెప్పాడు. ఆయన మనిషి రూపంలో ఉన్న రాక్షసుడా కాదా? అబద్ధాన్ని ఇంతలా దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? ఒక అబద్ధాన్ని చెప్పిందే చెప్పి.. అదే నిజమని నమ్మిస్తూ.. అందుకే సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అమలు చేయడం లేదని ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు.ప్రజల ముందు లెంపలేసుకుని గుంజీలు తీయి. అప్పుడు ప్రజలేమైనా క్షమిస్తారేమో.. అలాంటివి చేయకుండా అబద్ధాలు చెప్పడం, మళ్లీ మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీలు, రీసెర్చ్‌లు చేస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్‌లో అప్పుల ప్రస్తావన కనపడకుండా మాయ చేసేందుకు ప్రయత్నించారు. బడ్జెట్ డాక్యుమెంట్ లోతుల్లోకి వెళ్లి వాల్యూమ్ 5లో బడ్జెట్ డాక్యుమెంట్ డెట్ అండ్ గ్యారంటీస్, వాల్యూమ్ 2 బడ్జెట్ డాక్యుమెంట్లో రెవెన్యూ అండ్ రిసీప్ట్స, వాల్యూమ్ 3/5 ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్టుమెంట్.. ఇలా ఇన్ని డాక్యుమెంట్లు క్రోడీకరించి రాష్ట్రానికి చెందిన అప్పులు ఎంత ఉన్నాయని మేం ప్రజెంటేషన్ చేయగలుగుతున్నాం. రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ విషయాలు, వివరాలు సామాన్యులకు అర్ధం కాకూడదన్న దుర్బుద్ధితో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. చంద్రబాబు ఎంత దారుణమైన వ్యక్తో చెప్పడానికి ఇదొక నిదర్శనం. మా ప్రభుత్వంతో పోలిస్తే.. చంద్రబాబు ఎడాపెడా అప్పులు చేస్తున్నారు. 2023–24లో రూ.62,207 కోట్లు అప్పు చేస్తే,. ఈ పెద్దమనిషి 2024–25లో రివైజ్డ్ ఎస్టిమేట్స్‌లో రూ.73,362 కోట్లు అప్పు చేసినట్లు చూపించారు. రూ.93 వేల కోట్లు అప్పులు చేసి, దాన్ని ఎడ్జెస్ట్‌మెంట్ చేసి రివైజ్డ్ ఫైనల్ ఎస్టిమేట్స్‌లో రూ.73 వేల కోట్లుగా చూపించారు. అయినా సరే మా హయాంతో పోలిస్తే ఏ మేరకు ఎక్కువగా అప్పులు చేశారో కనిపిస్తోంది. ఈ అప్పులకు తోడు అమరావతి పేరుతో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ రుణాలు రూ.15 వేలు, హుడ్కో రుణం రూ.11 వేల కోట్లు, మార్క్‌ఫెడ్ ద్వారా రూ.8 వేల కోట్లు, సివిల్ సప్లయిస్ ద్వారా మరో రూ.5 వేల కోట్లు అప్పులు తెచ్చారు. కేఎఫ్‌డబ్ల్యూ రుణం మరో రూ.5 వేల కోట్లు ప్రాసెస్‌లో ఉంది. ఈ విధంగా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ బడ్జెట్ డాక్యుమెంట్లో ఒక మాదిరిగా, స్పీచ్‌లో మరో మాదిరిగా ఉంటుంది. అమరావతి కన్స్ట్రక్షన్స్ కింద రూ.6 వేల కోట్లు చూపించారు. అమరావతి పేరిట ఇంతింత అప్పులు చేస్తూ సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్టు అని ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు?బడ్జెట్ మొత్తం అంకెల గారడీ..రాష్ట్రానికి సొంత ఆదాయం 2023ృ24లో రూ.93,084 కోట్లు వస్తే.. 2024-25లో రూ.1,01,985 కోట్లకు పెరిగిందని, 9.56 శాతం పెరుగుదల నమోదైందని బడ్జెట్లో చూపారు. కానీ కాగ్ ఆడిటెడ్ ఫిగర్స్ చూస్తే.. 2023-24లో రాష్ట్రాదాయం పది నెలల్లో రూ.72,866 కోట్లు ఉంటే 2024-25లో పది నెలల్లో రూ.72,873 కోట్లుగా చూపించారు. అంటే మైనస్ 0.01 శాతం తక్కువగా నమోదైనట్టు కనిపిస్తోంది. రెండు నెలల్లో ఏకంగా రూ.1,01,985 కోట్లకు పోతుందని చూపిస్తున్నారు. 2025-26లో 25.63 శాతం పెరుగుదల చూపిస్తూ రూ.1,28,125.82 కోట్లకు పెరుగుతుందని చూపిస్తున్నారు. ఎందుకింత అబద్ధాలు ఆడుతున్నారు. ఎందుకింత మోసాలు చేస్తున్నారు? ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి, ఖజానాకు రావడంలేదు. ఇసుక మద్యం, క్వార్ట్స్, సిలికా ఏదైనా సరే చంద్రబాబు మనుషులజేబుల్లోకి వెళ్లిపోతున్నాయి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద మిస్లీనియస్ జనరల్ సర్వీస్ కింద ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఉంది. 2024-25 రివైజ్డ్ బడ్జెట్లో రూ.226.43 కోట్లు చూపిస్తే 2025-26 బడ్జెట్‌కు సంబంధించి రూ.7,916.60 కోట్లుగా చూపిస్తున్నారు. మిస్లీనియస్ జనరల్ సర్వీస్ అంటే ఏమిటి? ఏ విధంగా బాదబోతున్నారో, ఏం చేయబోతున్నారో ఆర్థిక వేత్తలకు కూడా అర్ధం కావడం లేదు. ల్యాండ్ రెవెన్యూస్ కింద రివైజ్డ్ ఎస్టిమేట్స్ రూ.1,342 కోట్లు చూపిస్తున్నారు. ఈ పది నెలల కాలానికి వచ్చింది రూ.196 కోట్లు. అంటే రైతులను సిస్తు, నీటి తీరువాతో ఈ రెండు నెలల్లో బాదుతారా? ఏ విధంగా వసూలు చేయబోతున్నారు?2023-24లో మూలధన వ్యయం రూ.23,330 కోట్లుగా ఉంది. 2023-24లో పది నెలలతో ఇప్పుడు గత పది నెలల కాలాన్ని పోల్చి చూస్తే.. నాడు మేం రూ.20,942 కోట్లు ఖర్చు చేస్తే చంద్రబాబు ఇప్పుడు రూ.10,854 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. మాకంటే 3.18 శాతం ఎక్కువ ఖర్చు చేశామని చూపించేందుకు రివైజ్డ్ ఎస్టిమెట్స్లో రూ.15 వేలు కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు చూపించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2025ృ26లో మూలధన వ్యయం రూ.40 వేల కోట్లుగా చూపిస్తున్నారు. ఇంత దారుణంగా లెక్కలు చెబుతూ, మోసాలు చేస్తుంటే ఏమనాలి ఈ మనిషిని?ఈ లెక్కలన్నీ చూస్తే చంద్రబాబు వచ్చాక రెవెన్యూ తగ్గిందని ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాష్ట్రానికి సొంత ఆదాయాలు పెరగలేదు. మూలధన వ్యయంలో గణనీయంగా తగ్గుదల కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు జీఎస్డీపీ 12.94 శాతానికి పెరుగుతుందంటున్నారు. ఎలా పెరుగుతాయి? రెవెన్యూ తగ్గుముఖంలో ఉన్నప్పుడు జీఎ‹స్‌డీపీ ఏ విధంగా పెరుగుతుంది? మూలధనం వ్యయం ఎస్క్లేట్ చేసి 2023-24 కంటే 318 శాతం అధికంగా పెంచి చేసినట్టు చూపిస్తున్నారు. ఎస్ఓపీ 2023-24 కన్నా 9.5 శాతం ఎక్కువ పెంచి చూపిస్తున్నారు. వీటన్నింటిని పెంచి జీఎస్డీపీని కూడా పెంచి 12.94 శాతం పెరుగుతుందని తప్పుడు లెక్కలు చూపుతున్నారు. 2025-26లో రూ.3,22,359 కోట్ల బడ్జెట్ అంకెల గారడి కాదా? ఇవన్నీ మోసంకాదా ? దీన్ని బాహుభళీ బడ్జెట్ అనడం మీకు మాత్రమే చెల్లుతుంది!! -
వ్యవస్థలు ధ్వంసం: వైఎస్ జగన్
‘‘ఆ 143 ఎన్నికల హామీలు కాకుండా చంద్రబాబు ఇంకా ఏమన్నాడో తెలుసా..? జగన్మోహన్రెడ్డి తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలేవీ ఆగిపోవని, ఇంకా మెరుగ్గా ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతా అని హామీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో మాత్రం సూపర్ సిక్స్ చూస్తే భయమేస్తోందంటాడు. ఆదాయం వచ్చే మార్గం ఏదైనా ఉంటే తన చెవిలో చెప్పమంటాడు. ఈ రోజు ప్రతి ఇంట్లో జరుగుతున్న చర్చ ఏమిటంటే.. జగన్ పలావ్ పెట్టాడు..! చంద్రబాబు బిర్యానీ అన్నాడు..! ఇవాళ పలావ్ పోయింది.. బిర్యానీ మోసంగా మారింది!!’’ - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ప్రతి వ్యవస్థను నీరుగార్చి పిల్లల నుంచి పెద్దల దాకా రైతుల నుంచి ఉద్యోగుల వరకు మోసగించిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు–నేడు, కొత్త మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా.. ఈ పథకాలన్నీ ధ్వంసం చేశారు. రూ.25 లక్షలున్న ఆరోగ్యశ్రీని రూ.2.5 లక్షలకు తగ్గిస్తున్నారు. నిజంగా వీరు మనుషులేనా? ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీలో భాగంగా నాడు విప్లవాత్మక చర్యలు తీసుకున్నాం. జాతీయ స్థాయిలో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61 శాతం ఉంటే మన హయాంలో రాష్ట్రంలో 4 శాతం మాత్రమే ఉంది’ అని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..వ్యవసాయం నాశనం..వ్యవసాయాన్ని నాశనం చేశారు. రైతులకు సున్నా వడ్డీ పంట రుణాలు, ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, ఆర్బీకేలు, ఈక్రాప్, దళారీలు లేకుండా పంటల కొనుగోలు, పాలవెల్లువ ద్వారా సహకార రంగంలో విప్లవం లాంటివన్నీ నీరుగార్చారు. నాడు అమూల్ రాకతో పాల సేకరణ రేట్లు ఏడుసార్లు పెరిగాయి. గేదె పాలు రూ.18.29 పెరిగితే, ఆవుపాలు రూ.9.49 పెరిగింది. ఇప్పుడు హెరిటేజ్ లాభాల కోసం అమూల్‌ను లేకుండా చేస్తున్నారు. పాడి రైతుల బతుకులను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. మిర్చిపై గారడీలు.మిర్చి రైతుల విషయంలోనూ గారడీ, మోసాలే కనిపిస్తున్నాయి. 40 రోజులుగా మిర్చి రైతుల అవస్థలు మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. రైతులు గిట్టుబాటు ధరలు లేక పంట అమ్ముకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి దాకా ఒక్క రైతు నుంచి ఒక్క కేజీ మిర్చిని కూడా చంద్రబాబు కొనుగోలు చేయలేదు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంలో చంద్రబాబు మాట్లాడుతూ మిర్చి విషయంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ లేదంటారు. అదే బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయశాఖ మంత్రి మాట్లాడుతూ.. మార్కెట్లో జోక్యం చేసుకుని పరిష్కారం చూపించేశామంటారు. ఎవరికి పరిష్కారం చూపించారు? ఎవరి దగ్గర కొనుగోలు చేశారు? ఈ బడ్జెట్లో ధరల స్థిరీకరణ కోసం రూ.300 కోట్లు ప్రతిపాదించారు. మా ప్రభుత్వ హయాంలో ఏకంగా రూ.3 వేల కోట్లు ధరల స్థిరీకరణ నిధికి కేటాయించాం. సీఎం యాప్ ద్వారా ధరలపై నిరంతరం పర్యవేక్షించాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో ధాన్యం రైతుకు గిట్టుబాటు ధర రాలేదు. క్వింటాకు రూ.300 తక్కువ రేటుకు రైతులు అమ్ముకోవల్సిన పరిస్థితి వచ్చింది. మిర్చి, టమాటా, పత్తి, మినుము, కందులు పెసలు.. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. సంక్షేమ పాలన...వైఎస్సార్సీపీ పాలనలో దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో బడ్జెట్‌తోపాటే సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసి లంచాలు, వివక్ష లేకుండా డీబీటీ ద్వారా నేరుగా రూ.2.73 లక్షల కోట్లు పారదర్శకంగా అందచేశాం. మరోవైపు నాలుగు పోర్టులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాం. రామాయపట్నం పోర్టు 70 శాతం పూర్తి కాగా మచిలీపట్నం, మూలపేట 30 శాతం పూర్తయ్యాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టాం. మా హయాంలోనే ఐదు వైద్య కళాశాలలను ప్రారంభించాం. 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు చేపట్టాం. పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ ప్రతి అవసరంలోనూ తోడుగా నిలిచాం. అమ్మ ఒడి, ఆరోగ్య ఆసరా, వైఎస్సార్ చేయూత, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, కల్యాణమస్తు, షాదీ తోఫాతో అండగా నిలిచాం.ఐటీసీ, ప్రాక్టర్ గ్యాంబుల్, అమూల్ లాంటి సంస్థలను తీసుకొచ్చి మహిళల ఆదాయాన్ని పెంచేలా తోడుగా ఉన్నాం. చంద్రబాబు హయాంలో రూ.వెయ్యిగ ఉన్న పెన్షన్‌ను రూ.3 వేల వరకు పెంచుకుంటూ వెళ్లాం. పిల్లల చదువుకు పేదరికం అడ్డురాకూడదనే సంకల్పంతో ఎప్పుడూ చూడని సంస్కరణలు తెచ్చాం. నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలన్నీ మారాయి. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చాం. సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణానికి బాటలు పడ్డాయి. 3వ తరగతి నుంచి టోఫెల్ శిక్షణ, సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. బైలింగ్వుల్ పాఠ్య పుస్తకాలను అందచేశాం. 6వ తరగతి నుంచి ప్రతి తరగతి డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్, 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్‌లు అందించాం. పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తూ విద్యాదీవెన, బోర్డింగ్, లాడ్జింగ్‌కు ఇబ్బంది లేకుండా వసతి దీవెన అందించాం. ఈరోజు విద్యావ్యవస్థ పూర్తిగా నాశనమైపోయింది. పిల్లలను ప్రోత్సహిస్తూ అమ్మఒడి మొదలు పెడితే అన్ని కార్యక్రమాలు ధ్వంసమైపోయాయి.ఉద్యోగులకు తీవ్ర మోసంఉద్యోగులను చంద్రబాబు తీవ్రంగా మోసం చేశాడు. అధికారంలోకి రాగానే సీపీఎస్, జీపీఎస్ పునః సమీక్షిస్తామన్నారు. మెరుగైన పీఆర్సీ అన్నాడు. మా ప్రభుత్వం నియమించిన పీఆర్సీ చైర్మన్‌ను తొలగించాడు. కొత్త పీఆర్సీ వేయలేదు. 10 నెలలు గడిచినా ఐఆర్ ప్రకటించలేదు. 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఒకటో తేదీన జీతాలు ఒకే ఒక్క నెల ఇచ్చారు. ఈరోజుకు కూడా జీతాల కోసం ఉద్యోగస్తుల ఎదురు చూపులే! ఉద్యోగుల జీపీఎఫ్, జీఎల్ఐ డబ్బులను వీళ్ల అవసరాల కోసం వాడుకుంటూనే ఉన్నారు. డీఏలు, జీపీఎఫ్‌లు, సరండర్ లీవ్‌లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈహెచ్ఎస్ బకాయిలు వేల కోట్లు పెండింగ్‌లో పెట్టారు. మా హయాంలో కాంట్రాక్టు ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. 3 వేల మందిని రెగ్యులరైజ్ కూడా చేశాం. మిగిలిన 7 వేల మందికి డిపార్టుమెంటల్ రివ్యూ పూర్తయింది. ఎన్నికల కోడ్ కారణంగా పూర్తి చేయలేకపోయాం. రోస్టర్, రిజర్వేషన్, లెంత్ ఆఫ్ సర్వీస్ అన్నీ సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం పూర్తి చేశాం. ఆ 7 వేల మందిని రెగ్యులరైజ్ చేస్తూ ఎందుకు ఆర్డర్స్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వాళ్ల జీవితాలతో ఆటలాడుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వకపోయినా కూడా ఏటా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు 9–10 శాతం జీతాలు పెరుగుతాయి. రెండు డీఏలు, ఒక ఇంక్రిమెంట్ రూపేణా పెరుగుతాయి. కానీ.. జీతాలు పెరగని పరిస్థితి ఒక్క చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే నెలకొంది. పైగా బడ్జెట్లో దీనికి సంబంధించి కేటాయింపులు ఆశ్చర్యకరంగా తగ్గించారు. బేసిక్ పే రివైజ్డ్ ఎస్టిమేట్స్‌లో రూ.35,439 కోట్లు అయితే పెరగాల్సింది పోయి రూ.35,431 కోట్లకు తగ్గాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ శాలరీస్ (యూనివర్సీటీల్లో పనిచేసే వారికి ఇచ్చే జీతాలు) 2023–24లో రూ.3,927 కోట్లు కాగా 2025–26లో రూ.2,944 కోట్లు మాత్రమే. అంటే కొత్త వీసీలను నియమించింది ఉన్న ఉద్యోగస్తులను తొలగించేందుకేనా? రిటైర్డ్ ఉద్యోగులకూ కేటాయింపులు పెరగకపోగా తగ్గాయి. బాబు బకాయిలు మేం చెల్లించలేదా?బడ్జెట్ స్పీచ్ చూస్తే.. ఆర్థిక శాఖ మంత్రి బకాయిలు తీర్చామని, అదొక ఘన కార్యంగా చెబుతున్నారు. బకాయిలు చెల్లింపు ఏటా జరిగే ప్రక్రియ. చంద్రబాబు వదిలేసిన బకాయిలు రూ.42,187 కోట్లు మేము చెల్లించాం. డిస్కంలకు పవర్ సరఫరా చేసిన సంస్థలకు మరో రూ.21,541 కోట్లు.. ఈ రెండు కలిపితే రూ.63,724 కోట్లు. చంద్రబాబు వదిలి పెట్టిన ఈ బకాయిలు మేం చెల్లించలేదా? 12న ఫీజులపై కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలుఈ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా పిల్లలను చదువులకు దూరం చేస్తోంది. విద్యా దీవెన, వసతి దీవెనకింద గతేడాది రూ.3,900 కోట్లు చెల్లించాల్సి ఉండగా చంద్రబాబు రూ.3,200 కోట్లు బకాయి పెట్టారు. ఈ సంవత్సరం మరో రూ.3,900 కోట్లు చెల్లించాలి. ఈ రెండూ కలిపితే రూ.7,100 కోట్లు కావాలి. మరి బడ్జెట్లో ఆయన పెట్టింది కేవలం రూ.2,600 కోట్లు. ఇప్పటికే ఆన్లైన్ వర్టికల్స్ ఎడెక్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం గాలికి ఎగిరిపోయింది. వారికి కట్టాల్సిన డబ్బులు కట్టక వారు వెళ్లిపోయారు. మరోవైపు విద్యా దీవెన ఇవ్వకపోవడంతో ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేసే పరిస్థితి దాపురించింది. విద్యాదీవెన, వసతి దీవెన కోసం పిల్లల తరఫున, తల్లిదండ్రుల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. మార్చి 12న జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపడతాం. -
సచివాలయానికి ‘పచ్చ’ రంగు
‘ఎదుటివాడికి చెప్పేందుకే నీతులు’ అన్నట్టు... వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పంచాయతీలకు, సచివాలయాలకు పార్టీ రంగు వేశారంటూ గగ్గోలుపెట్టిన తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) తాము అధికారంలోకి వచ్చిన తరువాత.. వరుసపెట్టి ప్రభుత్వ భవనాలకు ‘పచ్చ’రంగు పులుముతోంది. తాజాగా కృష్ణాజిల్లా, యనమలకుదురు గ్రామ పంచాయతీ పరిధిలోని పలు సచివాలయాలకు పసుపు రంగులు వేస్తోంది. దీంతో జనాలంతా పై విధంగా విమర్శిస్తున్నారు.– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడనాన్నా... సాధించా..!గుంటూరు వైద్య కళాశాల గ్రాడ్యుయేషన్ డే (Graduation Day) వేడుకలు మంగళవారం గుంటూరు వైద్య కళాశాలలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్డి.ఎస్.వి.ఎల్. నరసింహం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు ఎంబీబీఎస్ డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఓ విద్యార్థి డిగ్రీ సాధించిన క్రమంలో తన ఉత్సాహాన్ని తండ్రితో ఈ విధంగా పంచుకుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరుఆకర్షిస్తున్న అడుగు ఎత్తు పుంగనూరు గిత్త దూడ పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం పట్టణం, గునుపూడిలోని పురోహితుడు వేలూరి రామకృష్ణ గోశాలలో నందిని అనే ఆవుకు అడుగు ఎత్తు ఉన్న పుంగనూరు గిత్త దూడ పుట్టింది. ఒక్క అడుగు ఎత్తుతో చూడముచ్చటగా కనిపిస్తోంది. సాధారణంగా పుంగనూరు ఆవు ఎత్తు సుమారు 1.5 నుంచి 3 అడుగుల మధ్య ఉంటుంది. ప్రపంచంలోనే అతి చిన్న ఆవుగా పుంగనూరు ఆవు గుర్తింపు పొందింది. – భీమవరం (ప్రకాశంచౌక్) నేలపై నింగి నీలిముద్ర పరిశీలించి చూస్తే ప్రకృతిలో ప్రతిదీ ఓ సుందర దృశ్యమే. మండుటెండలో ఈ నీలినీడ చూపరులను ఆకట్టుకుంది. కడప నగరంలోని చెమ్ముమియాపేట–రాయచోటి వంతెనపై మంగళవారం మధ్యాహ్నం ఈ నీలి నీడలను సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్ కడపవేసవితాపం.. వీటితో దూరం వేసవి వచ్చిందంటే రోడ్లపై ఎక్కడికక్కడ పుచ్చకాయలు కుప్పలుపోసి అమ్ముతుంటారు. వేసవితాపం నుంచి సేదతీరేందుకు ప్రజలు కూడా వీటినే ఎక్కువగా తీసుకుంటారు. నెల్లూరు మినీ బైపాస్‌లో అమ్మకం కోసం పెట్టిన పసుపు రంగు పుచ్చకాయలను సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరుపిలవని అతిథి విరిసిన పూలపైకి పిలవని అతిథిగా వచ్చి ఊటలూరే మకరందాన్ని ఒడుపుగా సేకరిస్తుంది తేనెటీగ. ఇలా మైళ్లకొద్ది ప్రయాణించి సేకరించిన మకరందాన్ని తేనెపట్టులో భద్రపరుస్తుంది. గుంటూరు జిల్లా ఈపూరు సమీపంలో తేనెటీగ (Honey Bee) పూల నుంచి మకరందాన్ని సేకరిస్తున్న దృశ్యాన్ని సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు -
ఆడుదాం ఆంధ్రాపై టీడీపీ అబద్ధపు ప్రచారం గుట్టురట్టు
సాక్షి,విజయవాడ: ఆడుదాం ఆంధ్రాలో ఎలాంటి అక్రమాలు జరగలేదని శాసన మండలిలో కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగులోకి తీసేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా క్రీడా టోర్నమెంట్ ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలను నిర్వహించింది. అయితే ప్రస్తుత శాసన మండలి సమావేశాల్లో ‘ఆడుదాం ఆంధ్ర’ నిర్వహణలో అక్రమాలు జరిగాయా? అని టీడీపీ ఎమ్మెల్సీలు రామారావు, రాంభూపాల్‌రెడ్డి ప్రశ్నించారు.అందుకు రాష్ట్ర ప్రభుత్వం తన సమాధానంలో అవినితీ జరిగిందని చెప్పలేదు. క్రీడా మంత్రి రాం ప్రసాద్ జవాబులోనూ అవినీతి జరిగిందని ఎక్కడా చెప్పలేదు. దీంతో మండలి సాక్షిగా టీడీపీ అబద్ధపు ప్రచారం గుట్టురట్టయ్యింది. -
బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ..!
-
బాబు పాలన.. ప్రతీ నిరుద్యోగికి 72,000 ఎగనామం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల ముందు చెప్పినట్టుగా బాబు ష్యూరిటీ,, మోసం గ్యారెంటీ అన్నట్టుగా కూటమి సర్కార్ పాలన సాగుతోందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలకు అరకొర కేటాయింపులే చేశారు. ప్రతి నిరుద్యోగికి ఇప్పటికే రూ.72వేలు ఎగనామం పెట్టారని చెప్పుకొచ్చారు.వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో చంద్రబాబు నిరుద్యోగులకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక దానికి ఎగనామం పెట్టారు. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని గవర్నర్ స్పీచ్‌లో అబద్దాలు చెప్పించారు. బడ్జెట్లో ప్రతిపాదించకుండా లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు. ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు?. 2024-25 సోషియో ఎకనమిక్ సర్వేలో ఎంఎస్ఎంఈ సెక్టార్లో 27 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు అబద్దాలు చెప్పారు. ఇవ్వన్నీ ఎక్కడ ఇచ్చారు?. ప్రతి నిరుద్యోగికి ఇప్పటికే రూ.72వేలు ఎగనామం పెట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లో 40 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. లెక్కలు, ఆధార్ కార్డులతో సహా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మరి మీరు ఇచ్చిన ఉద్యోగులు, ఉద్యోగాలు ఎక్కడ?. చంద్రబాబు అనే వ్యక్తి చేసేదంతా మోసమే.. చెప్పేవన్నీ అబద్దాలే’ అని తెలిపారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి, పేరాబత్తుల, గాదె గెలుపు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు: రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ముగిసింది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ మద్దతు తెలిపిన పేరాబత్తుల రాజశేఖరం, ఉమ్మడి కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందిన విషయం తెలిసిందే. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తికావడంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను ఎత్తేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికలు జరుగుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు రెండో రోజు మంగళవారం కూడా ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. -
రిగ్గింగ్.. బూత్ క్యాప్చరింగ్.. దొంగ ఓట్లతో గెలిచారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్, దొంగ ఓట్లతో గెలిచిందని ఆ ఎన్నికలో ఓటమి పాలైన పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. ఒక సీటు కోసం ఈ స్థాయికి టీడీపీ దిగజారిపోతుందని ఊహించలేదన్నారు. మంగళవారం ‘సాక్షి ప్రతినిధి’తో లక్ష్మణరావు మాట్లాడుతూ.. దొంగ ఓట్లు గణనీయంగా పని చేశాయన్నారు. ఆలపాటి పేరుకు ముందు వేసిన ఒకటి అనే అంకె దాదాపు 50కిపైగా బ్యాలెట్ పత్రాలపై ఒకేలా కనబడిందని, ఈ ఓట్లన్నీ ఒక్కరే వేసినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. పల్నాడు జిల్లా కారంపూడిలో 91 శాతం, దాచేపల్లిలో 88 శాతం, వినుకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 80% కంటే ఎక్కువ ఓట్ల శాతం నమోదయ్యాయన్నారు. గుంటూరు జిల్లా తెనాలి, కృష్ణా జిల్లాలోని పలుచోట్ల, ఏలూరు జిల్లాలోని కైకలూరు, నూజివీడులలో దొంగ ఓట్లు, బ్యూత్ క్యాప్చరింగ్‌లు జరిగాయని ఆరోపించారు. నూజివీడులో ముందు రోజున ఓటర్లకు వాల్‌క్లాక్‌లు పంపిణీ చేసిన సంగతి గుర్తు చేశారు. రిగ్గింగ్‌కు పాల్పడ్డారుపలు పోలింగ్ బూత్‌లలో టీడీపీ అభ్యర్థి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని లక్ష్మణరావు ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తిలో పీడీఎఫ్ తరఫున ఏజెంట్‌ను కూడా కూర్చొనివ్వలేదని చెప్పారు. దుర్గిలో గంటలోపే ఏజెంట్‌ను బయటకు నెట్టేశారన్నారు. బెల్లంకొండలో ఏజెంట్‌ను బయటకు లాక్కొచ్చి అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారని, తాను అమరావతి పోలింగ్ కేంద్రానికి వెళ్లినప్పుడు ఆ కేంద్రం గేటు వద్ద 200 మంది టీడీపీ నేతలు టెంట్లో ఉన్నారని, వారంతా యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారని పేర్కొన్నారు. అనేకచోట్ల ఎమ్మెల్యేలు బూత్‌లలోకి వెళ్లి అక్కడ చాలా సమయం గడిపి ఓటింగ్‌ను ప్రభావితం చేశారన్నారు. ఎన్నికలు సజావుగా జరగలేదని, అధికార పార్టీ తన పరపతిని ఉపయోగించి ఓటింగ్‌ను ప్రభావితం చేసిందన్నారు. జరిగిన అక్రమాలపై ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు చెప్పారు. ఎన్నికల సంఘం స్పందించలేదన్నారు. డిగ్రీ చదవని వారిని కూడా పెద్దఎత్తున ఓటర్లుగా నమోదు చేయించారన్నారు. భారీ ఎత్తున దొంగ ఓట్లు సైతం వేయించారన్నారు. ఓటువేసే సమయంలో గుర్తింపు కార్డు చూపించకుండానే ఓటర్లను లోపలికి అనుమతించారని ఆరోపించారు. పెనమలూరు వద్ద ఒకే పేరుతో 42 ఓట్లు, మరోచోట ఒకే పేరుతో 10 ఓట్లు నమోదయ్యాయని గుర్తు చేశారు. తెనాలిలోని కోగంటి శివయ్య స్కూల్ వద్ద కూడా ఇదేవిధంగా జరిగిందని, దీనిపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారనన్నారు. ఒక ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రానికి వెళితే ఓ సీఐ ‘సర్.. మీరు వెళ్లండి. ఇక్కడ అంతా మేం చూసుకుంటాం’ అని చెప్పిన విషయాన్ని రికార్డు చేసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. అనైతికంగా సోషల్ మీడియాలో చివరి నాలుగు రోజులు విపరీతమైన దుష్ప్రచారం చేశారని లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
కూటమి శ్రేణులకే పనులు చేయాలి
సాక్షి, అమరావతి : కూటమి పార్టీల నేతలకు, కార్యకర్తలకు మాత్రమే పనులు చేయాలని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. కొందరు టీడీపీ, కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు వైఎస్సార్సీపీ శ్రేణులకు మేలు చేస్తున్నట్లు తెలుస్తోందని, అలా చేయొద్దని తేల్చి చెప్పారు. మొన్న చిత్తూరు జిల్లాలో ఈ మాట చెప్పినందుకు వైఎస్సార్సీపీ నేతలు గుంజుకుంటున్నారని అన్నారు. ఆ పార్టీ నేతలు లంచాలు ఇచ్చి, అవినీతి పనులు చేసుకోవాలని చూస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. వారిని దగ్గరకు రానివ్వొద్దని స్పష్టం చేశారు. కూటమిలోని మూడు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజల్లో ఉంటే భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉండదని, శాశ్వతంగా ఎన్డీయేనే గెలుస్తుందని అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం రాత్రి విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కలిసి పని చేస్తే కూటమికి తిరుగుండదన్నారు. అధికారంలోకి వచ్చాక విజయం కోసం పని చేసిన వారిని విస్మరించకూడదన్నారు. తమపై చాలా బాధ్యతలు ఉన్నాయని, నాలుగవసారి సీఎం అయ్యానని, అన్ని విధాలా దోపిడీకీ గురైన రాష్ట్ర పరిస్థితి తలుచుకుంటే నిద్ర పట్టడం లేదని చెప్పారు. ప్రజలకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చామని, ఖజానా చూస్తే దిక్కుతోచడం లేదన్నారు. గత ఎన్నికల్లో 57 శాతం ఓట్లు వస్తే ఇప్పుడు 63 శాతానికి ఓటు శాతం పెరిగిందని తెలిపారు.బనకచర్లపై అభ్యంతరం చెప్పొద్దుపోలవరం నీళ్లు బనకచర్లకు తీసుకెళ్తామని, సముద్రంలోకి పోయే వృథా నీటిని సీమకు తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దని తెలంగాణను కోరారు. సముద్రంలోకి వెళ్లే నీటిని తీసుకెళ్తామంటే హక్కు లేదంటున్నారని, తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును నేను ఎక్కడా, ఎప్పుడూ వ్యతిరేకించలేదని, పైగా స్వాగతించానని తెలిపారు. ఏటా 1000 టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, రాజకీయ నేతలు పాజిటివ్‌గా ఆలోచించాలని సూచించారు. మోదీ దేశాన్ని నడిపిస్తే తాను తెలుగుజాతిని అగ్ర జాతిగా చేయాలనుకుంటున్నానని చెప్పారు. తెలంగాణలో వర్షం నీటిని వారు నిలబెట్టుకోలేక పోవడం వల్లే ఆనీరొచ్చి పడి విజయవాడ మునిగిందన్నారు. ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్ మాట్లాడుతూ రెడ్ బుక్ పని మొదలైందని, దాని పని అది చేసుకుంటూ పోతోందన్నారు. రెడ్ బుక్ గురించి గతంలో చేసిన వాగ్దానాలు నెరవేర్చే కార్యక్రమం మొదలైందన్నారు. తప్పు చేసిన వారెవరినీ వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రతి ఎన్నికల్లో కూటమిదే విజయం అన్నారు. సీఎం నోట ఆ మాటలేంటి?రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు చేయాల్సిన అవసరం లేదని, కేవలం టీడీపీ, బీజేపీ, జనసేన వారికి మాత్రమే లబ్ధి చేకూర్చాలని సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు పదే పదే చెప్పడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. బాబు మాటలపై కూటమి పార్టీల నేతలే విస్తుపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అందరి బాగోగులు చూడాల్సిన బాధ్యత తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిదని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో కులం, మతం, పార్టీ, ప్రాంతం.. ఇవేవీ చూడకుండా కేవలం అర్హత ప్రాతిపదికగా సంక్షేమ పథకాలు అందాయని ముక్త కంఠంతో జనం చెబుతుంటే, చంద్రబాబు మాత్రం పూర్తిగా కక్ష సాధింపుతో ముందుకెళ్తుండటం దారుణం అని రాజకీయ విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అంతా తన వాళ్లేనని గత సీఎం వైఎస్ జగన్ పదే పదే చెప్పడమే కాకుండా ఆచరించి చూపారని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు మొన్న చిత్తూరు జిల్లాలో ఈ వ్యాఖ్యలను పొరపాటున చేశారనుకుంటే.. ఈ రోజు వాటిని మరీ గుర్తు చేయడం కక్ష సాధింపునకు నిదర్శనమని తేలిపోయిందంటున్నారు. బాబు తీరుతో రాజకీయాలు మరింత భ్రష్టు పట్టడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీకి రెండేనా!.. కూటమి మల్లగుల్లాలు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలపై కూటమి నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నెలాఖరులో ఖాళీ అవుతున్న ఐదు సీట్లను భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ స్థానాలను ఆశిస్తున్న నేతలు.. బడ్జెట్ సమావేశాలు జరుగుతుండడంతో అసెంబ్లీకి చేరుకుని ముఖ్యులను కలిసి తమ వాదన వినిపిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సోమవారం సభ ముగిసిన తర్వాత ఇదే అంశంపై చర్చించిన విషయం బయటకు పొక్కడంతో ఆశావహుల్లో ఉత్కంఠత పెరిగింది. ఇప్పటికే ఒక స్థానం పవన్ సోదరుడు నాగబాబుకు దాదాపు ఖరారైంది. ఆయన్ను ఎమ్మెల్సీ చేసి వెంటనే మంత్రివర్గంలోకి తీసుకోవడం లాంఛనమే.కూటమిలో రెండు నెలల క్రితం జరిగిన ఒప్పందం ప్రకారం నాగబాబుకు ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇస్తున్నారు. అయితే, జనసేన కోసం పనిచేసిన చాలామంది పదవులు కోరుతున్నారని వారికోసం మరో ఎమ్మెల్సీ స్థానాన్ని తమకు కేటాయించాలని చంద్రబాబును పవన్‌కళ్యాణ్ కోరినట్లు జనసేన వర్గాలు చర్చించుకుంటున్నాయి.ఒక స్థానం కోసం బీజేపీ పట్టు..బీజేపీ కూడా కచ్చితంగా ఒక స్థానం ఇవ్వాలని పట్టుబడుతోంది. సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, పీఎన్వీ మాధవ్‌ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. న్యాయంగా అయితే సోము వీర్రాజుకు అవకాశం దక్కాల్సివున్నా.. టీడీపీ పట్ల ఆయన వైఖరి కారణంగా చంద్రబాబు సుముఖంగా లేరనే వాదన వినిపిస్తోంది. బీజేపీకి ఒక స్థానం ఇస్తే మాధవ్, విష్ణువర్ధన్‌రెడ్డిల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చని చెబుతున్నారు. టీడీపీలో ఆశావహుల జాబితా చాంతాడంత..జనసేన, బీజేపీ కోరిక మేరకు మూడు స్థానాలు వారికి పోతే టీడీపీకి మిగిలేది రెండే. ఆ పార్టీలో ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. చంద్రబాబు సమకాలీకులు, ఆయనతో కలిసి సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నవారితో పాటు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు దక్కని నేతలు గట్టిగా అడుగుతున్నారు. ఈ జాబితాలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ నేత బుద్ధా వెంకన్న, నెల్లూరుకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, జి.మాడుగుల నాయకుడు పైలా ప్రసాదరావు, నెల్లిమర్ల నేత, మార్క్‌ఫెడ్ ఛైర్మన్ బంగార్రాజు తదితరులు గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు. మంగళవారం అసెంబ్లీలో చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, బుద్ధా, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, మల్లెల లింగారెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం, సిట్టింగ్ ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, అశోక్‌బాబు తదితరులు కలిశారు. కొద్దిరోజులుగా పలువురు నేతలు చంద్రబాబు, లోకేశ్‌ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలాంటివారు 25 మందికిపైగా ఉన్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది లోకేశ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయన పరిశీలనలో విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలినవారి పేర్లు ఇంకా బయటకు రాలేదు. ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
డీఎస్సీపై సర్కారు డ్రామాలు..
మేం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టు లను భర్తీ చేస్తాం. సీఎంగా తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలు పైనే చేస్తా..!– ఎన్నికల సభల్లో టీచర్ పోస్టుల ఆశావహులకు చంద్రబాబు హామీ16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తాం. త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం నియామక ప్రక్రియను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం..– గతేడాది జూన్‌లో సీఎంగా చంద్రబాబు ప్రకటన!మెగా డీఎస్సీకి మేం కట్టుబడి ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టులు భర్తీ చేస్తాం..– తాజాగా శాసనసభలో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల మాట! గతేడాది అసెంబ్లీ సమావేశాల్లోనూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇదే మాట చెప్పారు!సాక్షి, అమరావతి: ఎప్పటి మాదిరిగానే సీఎం చంద్రబాబు ఇచ్చిన మరో హామీ నీరుగారింది! అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక.. త్వరలో.. త్వరలో... అంటూ తొమ్మిది నెలలు గడిచిపోయినా డీఎస్సీపై అతీగతీ లేకుండా ఉపాధ్యాయ అభ్యర్థులను వంచించిన టీడీపీ కూటమి సర్కారు టీచర్ పోస్టుల సంఖ్యలోనూ భారీగా కోత పెట్టింది! ఏకంగా 11 వేలకుపైగా పోస్టులను దాచిపెట్టి నిరుద్యోగులతో ఆడుకుంటోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలి సంతకం చేసిన డీఎస్సీ ఫైలుకు ఇప్పటికీ మోక్షం కలగకపోవడం ఒక ఎత్తయితే.. టీచర్ పోస్టుల ఖాళీలకు తూట్లు పొడవడం మరోఎత్తు! రాష్ట్రంలో మొత్తం 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు స్వయంగా విద్యాశాఖే వెల్లడించగా.. కేవలం 16,347 మాత్రమే భర్తీ చేస్తామని చెప్పుకొస్తూ నెలల తరబడి కాలయాపన చేయడం గమనార్హం. డీఎస్సీ నిర్వహణ, ఉపాధ్యాయ ఖాళీలపై టీడీపీ కూటమి సర్కారు డ్రామాలపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఖాళీలపై విద్యాశాఖ వివరాలు.. రాష్ట్రంలోని పాఠశాలలు, ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై వివరాలు ఇవ్వాలని ‘హెల్ప్ ద పీపుల్’ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గురుతేజ ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా పాఠశాల విద్యాశాఖను కోరారు. దీనిపై విద్యాశాఖ స్పందిస్తూ.. రాష్ట్రంలో 34,245 ప్రాథమిక పాఠశాలలు, 3,206 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయని తెలిపింది. వీటితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల్లో 2,06,393 టీచర్ పోస్టులు మంజూరైనట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం 1,78,984 మంది మాత్రమే పనిచేస్తున్నారని, 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. ఈ వివరాలతో హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్)ను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ పాఠశాల విద్యాశాఖ అందచేసిన వివరాలను సమర్పించారు. దీనిపై స్పందించిన ఎన్సీపీసీఆర్.. పాఠశాల విద్య డైరెక్టర్‌కు లేఖ రాసింది. నోటిఫికేషనే లేకుండా భర్తీపై హామీలా? రాష్ట్రంలో 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఖాళీలను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ప్రకటించారు. పైగా గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. మెగా డీఎస్సీ ఇస్తామంటూ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించారు. అధికారం చేపట్టాక 16,347 డీఎస్సీ పోస్టుల భర్తీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతేడాది డిసెంబర్ నాటికే పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ తొమ్మిది నెలలు గడిచినా నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు. తాజాగా శాసన సభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. అసలు ఇంతవరకూ నోటిఫికేషన్ ప్రక్రియే చేపట్టకుండా భర్తీపై మాట్లాడడం ఏమిటని ఉపాధ్యాయ అభ్యర్థులు వాపోతున్నారు. రాష్ట్రంలో 13.28 శాతం టీచర్ పోస్టులు ఖాళీగా ఉండటం విద్యాహక్కు చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని హెచ్చరిస్తూ ఫిబ్రవరి 19వ తేదీన పాఠశాల విద్య డైరెక్టర్‌కు ఎన్సీపీసీఆర్ రాసిన లేఖ నోరు విప్పని సర్కారు ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేస్తోంది. టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోంది. పాఠశాలల్లో 25 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. మేం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తాం. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తాం’ అని ఎన్నికల వేళ చంద్రబాబుతో పాటు కూటమి నేతలు నమ్మబలికారు. తీరా అధికారంలోకి రాగానే 25 వేల ఖాళీలు కాదు.. 16,347 పోస్టులే అంటూ మాట మార్చి కనీసం వాటిని కూడా భర్తీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. అంతేకాకుండా వైఎస్సార్ సీపీ హయాంలో 6,100 పోస్టుతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను సైతం సరిగ్గా పరీక్షల ముందు రద్దు చేశారు. కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం కల్పిస్తామంటూ గతేడాది జూలై 2న టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో ఆ పరీక్షలంటూ ప్రచారం చేశారు. అనంతరం టెట్, డీఎస్సీకి మధ్య 90 రోజులు గడువు ఉండాలంటూ టెట్ షెడ్యూల్‌ను తొలుత సెప్టెంబర్‌కు తర్వాత అక్టోబర్‌కు మార్చారు. టెట్ ఫలితాలు వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. జాతీయ బాలల హక్కుల కమిషన్ సీరియస్.. రాష్ట్రంలో వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయకపోవడాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) తీవ్రంగా పరిగణిస్తోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనూ 10 శాతానికి మించి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉండకూడదని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏకంగా 27,409 టీచర్ పోస్టులు (13.28 శాతం) ఖాళీగా ఉన్నాయని, వీటిని ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీసింది. ఇన్ని ఖాళీలు ఉన్నా డీఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదో వెల్లడించాలని పేర్కొంటూ పాఠశాల విద్య డైరెక్టర్‌కు లేఖ రాసింది. ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా... మంజూరైన ఉపాధ్యాయ పోస్టుల్లో 10 శాతానికి మించి ఖాళీలు ఉండడం పిల్లల విద్యపై తీవ్ర ప్రభావం చూపుతుందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పాఠశాల విద్య డైరెక్టర్‌కు సూచించింది. పది లక్షల మంది పడిగాపులు..దాదాపు 10 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు ఆర్ధికంగా నలిగిపోతూ డీఎస్సీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా విద్యాశాఖ మంత్రి కనీసం ఫలానా రోజు డీఎస్సీ షెడ్యూల్ ఇస్తామని చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఏళ్ల తరబడి శిక్షణ పొందుతున్న అభ్యర్థులంతా డీఎస్సీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సాక్షాత్తూ పాఠశాల విద్యాశాఖే చెబుతుండగా ఏకంగా 11 వేలకుపైగా పోస్టులను కుదించడం.. నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆటలాడటంపై రగిలిపోతున్నారు.10 లక్షల మంది పిల్లలపై ప్రభావం..రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి 1 : 40 ప్రకారం బోధనకు 2,06,393 మంది టీచర్లు అవసరం కాగా, ప్రస్తుతం 1,78,984 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అంటే 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా రాష్ట్రంలో 10,96,360 మంది విద్యార్థుల బోధనపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంత భారీగా టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నా ప్రభుత్వం డీఎస్సీలో పోస్టులు తగ్గించి చూపడంతో పాటు అసలు నోటిఫికేషన్ ఎప్పుడిస్తుందో కూడా చెప్పడం లేదు. -
రేపు వైఎస్ జగన్ ప్రెస్ మీట్
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం) ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న తీరును మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ఎండగట్టనున్నారు.అంకెలగారడీగా మారిన రాష్ట్ర బడ్జెట్, సూపర్ సిక్స్ హామీల అమలులో మోసం, అన్నదాతల కష్టాలు, అక్రమ అరెస్టులు సహా అనేక అంశాలపై వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. -
‘చంద్రబాబు మీద కూడా అవే సెక్షన్లు పెట్టవచ్చు’
తాడేపల్లి: ఉత్తారంధ్ర టీచర్స్ ఎమ్మెల్నీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రఘువర్మ ఓటమికి ప్రభుత్వ పనితీరే నిదర్శనమన్నారు , వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి,. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ నిర్వహించిన సతీష్ రెడ్డి.. కూటమి సానుకూలే వర్గాలే ఆ పార్టీని ఓడించాయన్నారు. అవతల వాళ్ల మీది బురదజల్లడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య అని, వాటిని అవతల వాళ్లు కడుక్కునే లోపేలే నీవు చేసే పనులు నువ్వు తెలివిగా చక్కబెట్టుకుంటావంటూ సతీస్ రెడ్డి మండిపడ్డారు.చంద్రబాబుపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేస్తాం‘చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21 ని వయిలెట్ చేశారు. ఆయనపై అనర్హతా వేటు వేయాలని గవర్నరుని కోరతాం. త్వరలోనే గవర్నరుని కలుస్తాం. గవర్నరు న్యాయం చేయకపోతే కోర్టుకు వెళతాం. చంద్రబాబు సీఎం పదవికి అనర్హుడు. సీఎం గా ఉన్న వ్యక్తి హేట్ స్పీచ్ చేయటం కరెక్టు కాదు. పోసాని మీద పెట్టిన సెక్షన్లే చంద్రబాబు మీద కూడా పెట్టవచ్చు. దాని ప్రకారం చంద్రబాబుపై అనర్హతా వేటు చేయవచ్చు. చంద్రబాబుపై అనర్హతా వేటు వేయాలని కోర్టులో పిటిషన్ వేస్తాం.అప్పుడు వారి వల్లే గెలిచారు.. ఇప్పుడు వారి వల్లే ఓడిపోయారు..2024లో ఉద్యోగుల మద్దతుతో కూటమి గెలిచింది. కానీ అదే ఉద్యోగుల చేతిలో 9 నెలలకే కూటమి ఘోరంగా ఓడిపోయింది. ఐఆర్, పిఆర్సీతో సహా ఏ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించలేదు. పిఆర్సీ కమీషన్ ని కూడా వేయలేదంటే ఉద్యోగులపై ప్రభుత్వానికి ఏం ప్రేమ ఉన్నట్టు?, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. తెలంగాణ నుండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని తీసుకురాలేకపోయారు.ఈ సంవత్సరం ఒక్క అడ్మిషన్ ని కూడా ఏపీ నుంచి అంబేద్కర్ యూనివర్సిటీ తీసుకోలేదు. దీంతో 33 వేలమంది విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ సమస్య అడిగినా తప్పించుకునేలా ప్రభుత్వం మాటలు చెప్తోంది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమికి జనం వాతలు పెట్టే పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు వైసీపి మీద చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. రాగద్వేషం, పక్షపాతం లేకుండా పరిపాలన చేస్తానని చేసిన ప్రతిజ్ఞ ఏం అయింది. వైఎస్సార్ సీపీ వారికి పనులు చేయొద్దని ఎలా మాట్లాడతారు?, నీ 40 ఏళ్ల అనుభవం ఇదేనా?పోసాని మీద పెట్టిన సెక్షన్లే చంద్రబాబు మీద కూడా పెట్టవచ్చుపోసాని మీద పెట్టిన సెక్షన్లే చంద్రబాబు మీద కూడా పెట్టవచ్చు. చంద్రబాబు వేసిన విషబీజం ఆయన కార్యకర్తలకు నష్టం చేస్తుంది. రేపు అధికారం కోల్పోతే మీవారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఏం గొప్ప జరిగినా అదేనని చెప్పుకోవటం చంద్రబాబు నైజం. విధ్వంసం అనే చంద్రబాబు స్కూళ్లను జగన్ బాగుచేయటం విధ్వంసంలాగా కనిపిస్తుందా?, వైద్యాన్ని ఇంటి దగ్గరే చేయించటం విధ్వంసమా?, చంద్రబాబు చేసే హేట్ స్పీచ్ వలన విధ్వంసం జరుగుతోంది. పోసాని కృష్ణమురళి మాటల వలన రాష్ట్రంలో గొడవలు జరిగాయని కేసులు పెట్టారు. మరి అవే మాటలు మాట్లాడిన చంద్రబాబు మీద ఎందుకు కేసులు పెట్టటం లేదు? -
అక్రమ కేసులు.. కుట్ర రాజకీయాలు.. కూటమి నేతలపై రోజా ఫైర్
సాక్షి, చిత్తూరు జిల్లా: చిత్తూరు సబ్ జైలులో ఉన్న నగరి మండలం దేసురు అగరం టీడీపీ నాయకుల అక్రమ కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్సీపీ నేతలను మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోందన్నారు. ‘‘వైఎస్సార్సీపీ నాయకులకు బెయిల్ వచ్చే లోపే.. మరో కేసు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పక్కన పెట్టి పీటీ వారెంట్, కేసులు అన్ని ఒకే చోట విచారించాలని చెప్తున్నా పట్టించుకోవడం లేదు. అధికారులు.. కూటమి నేతలు చెప్పినట్లు ప్రవర్తిస్తే కచ్చితంగా తగిన మూల్యం చెల్లించక తప్పదు. రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలో వస్తుంది. 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంగా మారిపోయింది’’ అని రోజా దుయ్యబట్టారు.‘‘ఉత్తరాంధ్రలో ఉద్యోగ ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వం అభ్యర్ధిని ఓడించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం, వీధి వీధిలో బెల్ట్ షాపులు ఎక్కువై పోయాయి. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి సాగు చేస్తుంటే నిద్ర పోతున్నారా అని అడుగుతున్నా. హోం మంత్రి ఇంటికి సమీపంలో గంజాయి సాగు చేస్తున్నారు. రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారిపోయింది’’ అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధారాలు ఇచ్చాం.. ‘కూటమి’ తోక ముడిచింది: బొత్స
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల బలవంతపు రాజీనామాలపై విచారణకు సవాల్ చేసిన ప్రభుత్వం తీరా మండలిలో ఆధారాలు చూపగానే తోకముడిచిందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీ బయట మీడియా పాయింట్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన మాట్లాడుతూ వీసీలతో బలవతంగా రాజీనామాలు చేయించారనే ఆరోపణలపై విచారణకు సిద్దమంటూ సవాల్ చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధారాలు చూపగానే ఎందుకు వెనక్కివెళ్ళారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో స్వాతంత్రం వచ్చిన తరువాత ఎక్కడా, ఎప్పుడూ ఇలా వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించిన ఘటనలు లేవని అన్నారు.బొత్స ఇంకా ఆయన ఏమన్నారంటే..గవర్నర్ నియమించిన విసిలని ఉన్నత విద్యా శాఖ మండలి చైర్మన్, కార్యదర్శులు ఏ విధంగా రాజీనామాలు చేయమని ఆదేశిస్తారు? ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామా చేయడంపై జ్యుడీషియల్ విచారణ జరపాలని కోరాం. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధారాలు చూపాలంటూ సవాల్ విసిరారు. తీరా సభలో అన్ని వివరాలను ముందుంచడంతో, దానిపై సమాధానం చెప్పలేక దబాయింపులు, బుకాయింపులకు దిగారు. పరుష పదజాలంతో దూషణలకు తెగబడ్డారు. వీసీలు తప్పు చేస్తే విచారించండి, వారిపై చర్యలు తీసుకోండి, ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం మారగానే వైస్ ఛాన్సలర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం దారుణం. ఇది మొత్తం విద్యా వ్యవస్థకే కళంకంపోలవరం ఎత్తు తగ్గింపుపై వివరణ ఇవ్వాలిపోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రానికి జీవనాడి. ఈ ప్రాజెక్ట్ పేరు చెప్పగానే వైఎస్సార్ గుర్తుకు వస్తారు. ఈ ప్రాజెక్ట్‌ను 45.72 మీటర్లతో నిర్మించిప్పుడే విద్యుత్ ఉత్పత్తి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నీరు, ఉత్తరాంధ్రకు తాగునీరు అందుతాయి. కానీ ప్రభుత్వం పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రమే నిర్మించి ఇవ్వాలి. కానీ చంద్రబాబు మాత్రం తన స్వలాభం కోసం కాంట్రాక్టర్ల కోసం తామే నిర్మిస్తామని బాధ్యత తీసుకున్నారు. చివరికి పోలవరం ఎత్తుపైన కూడా చంద్రబాబు రాజీ పడుతున్నారు. రికార్డులను పరిశీలిస్తే ఇందులో వాస్తవాలు బయటపడతాయి. దీనిపై వివరణ ఇవ్వాలని మండలిలో ప్రభుత్వాన్ని నిలదీశాం. కానీ ప్రభుత్వం నుంచి దీనిపై సూటిగా సమాధానం రాలేదు. పోలవరం ఎత్తును తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని అర్థమవుతోంది. వైఎస్సార్సీపీగా దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం.చేనేత కార్మికులను మోసం చేస్తున్నారుకూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో చేనేత కార్మికులను గాలికి వదిలేసింది. దీనిపై మండలిలో ప్రశ్నిస్తే శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారంటూ మాపై ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. బీసీల గురించి మాట్లాడితే ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తారా? చేనేత కార్మికుల కోసం రూ.వెయ్యి కోట్ల నిధిని పెడతానని మోసం చేసిన ఘనత చంద్రబాబుది. 2019-24 మధ్య వైయస్ఆర్ నేతన్న నేస్తం కింద రూ.960 కోట్లు నేతన్నలకు ఇచ్చాం. రూ.1396 కోట్లు వారి పెన్షన్ల కోసం ఖర్చు చేశాం. కానీ కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం అంటూ అంకెల గారడీతో ప్రచారం చేసుకుంటోంది. తమకు అనుకూలమైన మాధ్యమాల్లో లేనిది ఉన్నట్లుగా చాటుకుంటోంది. బలహీనవర్గాల విషయంలో న్యాయం చేయకపోగా వారిని కించపరిచేలా మాట్లాడుతున్నారు.మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..సంక్షోభంలో ఉన్న విద్యుత్ డిస్కామ్ లు వాటిని కాపాడటానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ. 47వేల కోట్లు ఖర్చు పెట్టింది. ట్రూఅప్ చార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలపై వేసిన రూ.15 వేల కోట్ల ప్రభారాన్ని ప్రభుత్వమే భరించాలి. 2014-19 లో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పుల్లో కనీసం మూడోవంతు కూడా మా హయాంలో చేయలేదు. రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడా మా పార్టీ అభ్యర్థులు పోటీ చేయలేదు. కూటమి నిలబెట్టిన అభ్యర్ధులకు మేం వ్యతిరేకమని మాత్రమే చెప్పాం. ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. రిగ్గింగ్‌లు, డబ్బు పంపిణీ, అధికార దుర్వినియోగంతో కూటమి అభ్యర్ధులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. ఉత్తరాంధ్రలో రఘువర్మ తమ అభ్యర్థి అంటూ కూటమి నేతలు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఆయనక బదులు గెలిచిన శ్రీనివాసులు నాయుడిని తమ అభ్యర్థి అంటూ చెప్పుకోవడం దారుణం. ఎవరికో పుట్టిన పిల్లవాడిని తమ కొడుకు అని చెప్పుకుంటున్నట్లుగా ఉంది. -
మండలిలో లోకేష్‌ను ఏకిపారేసిన బొత్స
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో మంత్రి నారా లోకేష్‌కు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చుక్కలు చూపించారు. ఏపీలో 17 మంది యూనివర్శిటీల వీసీల బలవంతపు రాజీనామాలపై సభలో చర్చ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. వీసీల బలవంతపు రాజీనామాలపై ఆధారాలతో సహా ప్రశ్నించడంతో మంత్రి లోకేష్ సైలెంట్ అయ్యారు. శాసనమండలి వేదికగా ఏపీలో 17 మంది యూనివర్శిటీల వీసీల బలవంతపు రాజీనామాలపై నేడు సభలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా వీసీల బలవంతపు రాజీనామాలకు సంబంధించిన ఆధారాలను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సమర్పించారు. ఈ సందర్బంగా బొత్స మాట్లాడుతూ..‘వీసీల రాజీనామాలపై ప్రభుత్వం తప్పు లేకపోతే విచారణ జరిపించండి. 17 మంది వీసాలతో బలవంతంగా రాజీనామా చేయించారు. వీసీలను గవర్నర్ నియమిస్తే ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు.మరోవైపు.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..‘మూకుమ్మడిగా నాలుగు రోజుల్లో 17 మంది ఎందుకు రాజీనామా చేశారు. ఒకే సారి అంత మంది రాజీనామా చేస్తే ఎందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీనికి ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదు. వీసీల విషయంలో ప్రభుత్వం జోక్యం ఎందుకు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి నారా లోకేష్ ఎదురుదాడికి దిగారు. దీంతో, మండలి చైర్మన్ సభకు కొద్దిసేపు విరామం ప్రకటించారు.