ముగిసిన అంబటి రాంబాబు విచారణ | YSRCP Ambati Rambabu Arrest Live Updates And Top News Headlines In Telugu, Political Tensions Peak In AP | Sakshi
Sakshi News home page

ముగిసిన అంబటి రాంబాబు విచారణ

Feb 1 2026 7:45 AM | Updated on Feb 2 2026 1:16 AM

YSRCP Ambati Rambabu Arrest Live Updates

అంబటి రాంబాబుపై హత్యాయత్నం.. అరెస్ట్‌.. అప్‌డేట్స్‌

అంబటి రాంబాబుకు రిమాండ్     

  • మరో కేసులో 41ఏ నోటీసులిచ్చి విచారించాలన్న కోర్టు
    ఈ సందర్భంగా కోర్టులో పోలీసులకు న్యాయవాదులకు మధ్య వాగ్వాదం
  • మాకోర్టులోకి మమ్మల్ని రానివ్వరా అంటూ న్యాయవాదుల ఆగ్రహాం
  • మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 
  • అనంతరం ఆయనను రాజమండ్రి జైలుకు తరలించనున్నారు.
  • ఆయనపై రెండు కేసులు నమోదు కాగా, ఒక కేసులో రిమాండ్ విధించింది

పోలీసుల తీరును జడ్జికి వివరించిన అంబటి

  • అంబటి ఆవేదనను రికార్డు చేసిన జడ్జి
  • శారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టారు
  • నా రెండు కాళ్లు వెడల్పుగా చేసి నన్ను ఇబ్బంది పెట్టారు
  • నా కాళ్లు నొప్పి పెడుతున్నాయి
  • మేం చేసే పని తప్పని సీఐ నాకు చెప్పారు
  • నల్లపాడు సీఐతో పాటు మరో ఇద్దర సీఐలు వేధించారు
  • నాపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేస్తే తీసుకోలేదు

 

  • అంబటిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

  • వైద్య పరీక్షల అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కోర్టుకు తరలింపు

  • గుంటూరు నల్లపాడు పీఎస్‌ నుంచి అంబటి తరలింపు
  • వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి అంబటి తరలింపు
  • వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు..


 

గుంటూరు స్పెషల్‌ మొబైల్‌ కోర్టు వద్ద ఉ‍ద్రిక్తత

  • మాజీ మంత్రి విడదల రజినిని అడ్డుకున్న పోలీసులు
  • లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
  • కోర్టులో పోలీసుల రూల్స్‌ ఏంటి అంటూ లాయర్ల ఫైర్‌
  • కోర్టులో పోలీసుల పెత్తనమేంటని మండిపడ్డ లాయర్లు
  • పోలీసులతో న్యాయవాదుల వాగ్వాదం
     
  •  జూపూడి వద్ద తీవ్ర ఉద్రిక్తత

  • జోగి రమేష్ ఇంటికి వెళ్లకుండా వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

  • రోడ్డుమీద బైటాయించిన దేవినేని అవినాష్, మొండితోక జగన్‌మోహన్ రావు, తన్నీరు నాగేశ్వరరావు

  • వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

  • పోలీసులకు, వైసీపీ నాయకులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత

  • జోగి రమేష్ ఇంటికి వెళ్లడానికి వీళ్లేదని పోలీసుల అరెస్ట్‌లు

  • వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్

  • హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్

  • అంబటి ఇంటిపై దాడికేసులో హైకోర్టు సీరియస్‌

  • శాంతిభద్రతలు అదుపులోకి వచ్చేంతవరకూ 24 గంటల భద్రత ఇవ్వాలని ఆదేశం

  • అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి వేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై తీర్పు

 

జోగి రమేష్‌ ఇంటిపై దాడి

  • ఏపీలో కొనసాగుతున్న టీడీపీ గూండాల అరాచకం

  • ఇబ్రహీం పట్నంలో తీవ్ర ఉద్రిక్తత

  • మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై టీడీపీ గూండాల దాడి

  • రాళ్లు వేస్తున్నా చోద్యం చూస్తున్న పోలీసులు

  • ఇంట్లోకి వెళ్లేందుకు టీడీపీ గూండాల యత్నం

  • జోగి రమేష్‌ ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు.. నివాసం నుంచి భారీగా పొగలు

  • జోగి రమేష్‌ ఇంటిని ధ్వంసం చేసేందుకు టీడీపీ శ్రేణుల యత్నం

 

ధైర్యంగా ఉండండి.. రజిని, బ్రహ్మనాయుడికి వైఎస్‌ జగన్‌ ఫోన్‌

  • టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
  • ఇద్దరినీ ఫోన్‌లో పరామర్శించిన పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌
  • ధైర్యంగా ఉండాలన్న వైఎస్‌ జగన్‌
  • రాష్ట్రంలో జంగిల్‌ రాజ్‌ నడుస్తోంది: వైఎస్‌ జగన్‌
  • చంద్రబాబు ఆటవిక పాలన చేస్తున్నారు : వైఎస్‌ జగన్‌
  • శాంతిభద్రతలు కుప్పకూలిపోయాయి : వైఎస్‌ జగన్‌
  • పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారు : వైఎస్‌ జగన్‌
  • ఎవరూ ప్రశ్నించకుండా దాడులు చేస్తున్నారు : వైఎస్‌ జగన్‌
  • పార్టీ అండగా ఉంటుంది : వైఎస్‌ జగన్‌

ఏపీలో కూటమి తాలిబన్‌ పాలన: సీదిరి అప్పల రాజు

  • ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఎదో ఒక రూపంలో దాడులు చెయ్యడం, తప్పుడు కేసులు పెట్టడం జరుగుతుంది
  • రాష్ట్రంలో మహిళలకు చిన్నారులకు రక్షణ ఉందా?
  • అంబటి రాంబాబుపై జరిగిన హత్య ప్రయత్నం దారుణం
  • చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల అనుభవంతో ఆంద్ర ప్రదేశ్ ని ఆటవిక ప్రదేశ్ గా మార్చారు..
  • తిరుమల లడ్డులో యానిమల్ ఫ్యాట్ లేదు అని సీబీఐ రిపోర్టు ఇచ్చింది
  • ఇప్పుడు కూటమి నేతలు సిబిఐ రిపోర్ట్ తప్పు అంటూ మాట్లాడుతున్నారు
  • హోం మంత్రి సైతం సిట్ రిపోర్ట్ తప్పు అంటుంది. అంటే సిబిఐ అయితే తప్పు మీ సిట్ అయితేనే కరేక్టా.. ఎంత దౌర్భాగ్యం
  • చంద్రబాబు  కళ్లల్లో ఆనందం చూడడం కోసమే మంత్రులు ఇలా మాట్లాడుతున్నారు
  • ఆరోపణ చేసేది, కేసు పెట్టేది, దర్యాప్తు చేసేది  వాదించేది, తీర్పు చెప్పేది చంద్రబాబు ఏనా..
  • టీడీపీ అబద్దపు ప్రచారాలతో ఫ్లెక్సీలు కట్టారు
  • పోలీసులు నేతలకు భయపడి ఫోన్ లు లిఫ్ట్ చేయడం లేదు
  • కర్రలతో తిరుగుతుంటే.. కనీసం పోలీసులు  అడ్డుకోలేకపోయారు... తాలిబాన్ పాలనలా ఉంది
  • పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.. 
  • పలాస ఎమ్మెల్యే శిరీష  ‘బాస్టర్డ్స్’ అంటున్నారు.. మరి అవి తప్పుకాదా?
  • ప్రజలకు రాష్ట్రంలో స్వేచ్చ లేదు.. రాష్ట్ర భవిష్యత్ ని అందకారంలోకి నెడుతున్నారు

:::మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు కామెంట్స్

మా నాన్నతోపాటు మమ్మల్ని చంపాలనుకున్నారు: అంబటి కుమార్తె

  • మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ

  • టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి నివాసం

  • మీడియాతో మాట్లాడిన అంబటి కుమార్తె మౌనిక

  • మా నాన్నపై హత్యాయత్నం జరిగింది

  • మా నాన్నను రాడ్లతో చంపేందుకు ప్రయత్నించారు

  • టీడీపీ మహిళా ఎమ్మెల్యే దగ్గరుండి దాడులు చేయించారు

  • ఇంట్లో మహిళలు, పిల్లలు మాత్రమే ఉన్నారని తెలిసి మా ఇంట్లోకి చొరబడి దారుణంగా దాడులు చేశారు

  • మాపై కూడా హత్యాయత్నం జరిగింది

 

అంబటి నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన సజ్జల

  • రాష్ట్రంలో అసలేం జరుగుతోంది
  • ప్రజలు మీకు(చంద్రబాబును ఉద్దేశించి..) అధికారం కట్టబెట్టింది దేనికి?
  • ప్రశ్నించే గొంతులను వేధించడానికా?
  • అంబటి ఇంట్లో టీడీపీ గూండాల విధ్వంసంపై సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం

సజ్జల మాట్లాడుతూ..

  • లడ్డూలో కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు చెప్పారు
  • కానీ దర్యాప్తులో అలాంటిదేం లేదని తేలింది
  • అలాంటప్పుడు సీఎం హోదాలో అంత బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారు?
  • పైగా నెయ్యి కల్తీ నిజమని ఫ్లెక్సీలు పెట్టారు
  • ఆ తప్పుడు ఫ్లెక్సీలను మా నేతలు ప్రశ్నించారు
  • అంత మాత్రానికే వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు దిగారు

సజ్జల మాట్లాడుతూ..

  • దాడులకు దిగిన టీడీపీ నేతలను పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు
  • పోలీస్‌ ఉన్నతాధికారులకు మా పార్టీ నేత బొత్స ఫోన్‌ చేసినా స్పందన లేదు

  • దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులు పెట్టాలి

  • మా పోరాటం అహింసాయుతంగా ఉంటుంది

  • కోర్టును ఆశ్రయిస్తాం.. గవర్నర్‌ను కూడా కలుస్తాం

     

సజ్జల మాట్లాడుతూ..

  • అంబటితో పాటు విడదల రజని, భూమన, బ్రహ్మనాయుడిపై కూడా దాడి చేశారు

  • మా పార్టీ నేతలకు ప్రాణాపాయం జరిగితే ఎవరిది బాధ్యత?

  • డీజీపీ, హోం మంత్రి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి

  • చట్టం గూండాలను, అరాచక శక్తుల్ని రక్షించింది

  • గతంలో టీడీపీ నేత పట్టాభి ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు

  • చంద్రబాబు లక్షణం హింసను క్రియేట్‌ చేయడమే

  • ఎమ్మెల్యే గల్లా మాధవి దగ్గరుండి దాడి చేయించారు

  • మాజీ హోం మంత్రిని ఎస్పీ గేటు బయట వెయిట్‌ చేయించారు

  • టీడీపీ అరాచకాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం

  • మేం అధికారంలోకి వచ్చాక అరాచకవాదులకు శిక్ష తప్పదు


అంబటి నివాసంలో..

  • అంబటి ఇంటికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు

  • నిన్న అంబటి నివాసంలో విధ్వంసం సృష్టించిన టీడీపీ గూండాలు

  • అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన సజ్జల,ఇతర పార్టీ నేతలు

అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు

  • అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు

  • వైఎస్సార్‌సీపీ  నేతలతో పాటు వచ్చిన కార్యకర్తలు

  • వైఎస్సార్‌సీపీ నేతల వెంట వచ్చిన కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు

  • బారికేడ్లు పెట్టి అడ్డుకున్న పోలీసులు

  • అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు

  • టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి ఇంటిని పరిశీలించనున్న వైఎస్సార్‌సీపీ నేతలు  

  • అంబటి ఇంటికి వైఎస్సార్‌సీపీ పార్టీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, పల్నాడు జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎంపీ మోదుగుల, మాజీ ఎంపీ నందిగం సురేష్‌, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ, నియెజకవర్గ ఇన్‌ఛార్జిలు నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, బాలసాని కిరణ్‌, డైమండ్‌ బాబు, గజ్జల భార్గవ్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌తో పాటు ఇతర పార్టీ నేతలు  

అంబటి నివాసం వద్ద ఉద్రిక్తత

  • మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

  • వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు 

  • సజ్జల,అప్పిరెడ్డి ఇతర పార్టీ నేతల్ని అడ్డుకున్న పోలీసులు 

అంబటి ఇంటికి వైఎస్సార్‌సీపీ నేతలు 

  • అంబటి రాంబాబు నివాసానికి వైయస్సార్‌సీపీ ముఖ్యనేతలు 

  • పార్టీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న నేతలు

  • పల్నాడు జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎంపీ మోదుగుల, మాజీ ఎంపీ నందిగం సురేష్‌, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ, నియెజకవర్గ ఇన్‌ఛార్జిలు నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, బాలసాని కిరణ్‌, డైమండ్‌ బాబు, గజ్జల భార్గవ్‌రెడ్డి,  ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌, ఎమ్మెల్సీ రూహుల్లా, గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన మహేష్‌ ఇతర ముఖ్యనేతలు.

  • నిన్న అంబటి రాంబాబు నివాసంపై దాడి జరిపి.. బీభత్సం సృష్టించిన టీడీపీ గూండాలు

  • అడ్డుకోకుండా చోద్యం చూసిన పోలీసులు

  • ఖాకీల తీరుపై వైఎస్సార్‌సీపీ నేతల మండిపాటు

  • కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ

  • అమిత్‌ షాను కలిసి పరిస్థితి వివరించే అవకాశం

ఢిల్లీ

  • అంబటి రాంబాబు పై హత్యాయత్నం పై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నాం

  • ఫస్ట్ టీడీపీ వాళ్ళే అంబటి రాంబాబు పై దాడి చేసి పచ్చి బూతులు తిట్టారు

  • ఇది వరకు నాపై దాడి చేసినప్పుడు ఒక్క కేసు పెట్టలేదు

-ఎంపీ మిథున్ రెడ్డి

తిరుపతి

  • అత్యంత దారుణంగా ఈ ప్రభుత్వం సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అంబటిపై దాడి చేయించింది

  • ఇంత దారుణమైన కూటమి ప్రభుత్వం పరిపాలన పక్కన‌పెట్టి, రెడ్ బుక్ ద్తౌర్జన్యాలను అమలు చేస్తుంది

  • ప్రజలు అందరు గమనిస్తున్నారు

  • రాబోయో రోజుల్లో ప్రజా వ్యతిరేకత ఉప్పెనమారి తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేస్తుంది

  • అతిగర్వంతో ఒళ్లు మరిచి కూటమి ప్రభుత్వం ఇలాంటి దారుణాలు పాల్పడుతుంది
    :::పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

ఇదీ చదవండి: అంబటిపై హత్యాయత్నం.. వైఎస్సార్‌సీపీ నేతల రియాక్షన్‌ ఇది

నల్లపాడు స్టేషన్‌ వద్ద ఆంక్షలు..

  • మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్‌.

  • అంబటిని అరెస్ట్‌ చేసి తీసుకెళ్లిన పోలీసులు.

  • నల్లపాడు పీఎస్‌కు తరలింపు.

  • నల్లపాడు స్టేషన్‌ వద్ద పోలీసుల ఆంక్షలు.

  • మీడియాకు సైతం అనుమతి నిరాకరణ. 

జక్కంపూడి రాజా హౌజ్‌ అరెస్ట్‌.. తూగోలో టెన్షన్‌.. 

  • రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అనధికారిక హౌస్ అరెస్ట్

  • ఇంటిముందు పోలీసుల మోహరింపు

  • అంబటి రాంబాబుకి సంఘీభావం తెలిపేందుకు జక్కంపూడి ప్రయత్నం

  • బయటికి వెళ్లేందుకు రాజా అనుమతించని పోలీసులు

  • తనను ఎందుకు నిర్బంధిస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించిన జక్కంపూడి రాజా..

  • ఇరు వర్గాలకు వాగ్వాదం

👉ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. టీడీపీ కార్యకర్తల దిగ్బంధనంలో ఉన్న అంబటి రాంబాబు కార్యాలయంపై శనివారం రాత్రి 10 గంటల తర్వాత రెండోసారి దాడికి తెగబడ్డారు. సుత్తులతో గోడలు బద్ధలు కొట్టే ప్రయత్నం చేశారు.

👉పెద్ద పెద్ద దుంగలను తీసుకు వచ్చి కిటికీలను పగు­లగొట్టారు. నాపరాయి ముక్కలతోపాటు, పెద్ద పెద్ద రాళ్లను అంబటి రాంబాబు ఉన్న పార్టీ కార్యా­లయంపై విసురుతున్నారు. కవరేజ్‌ చేస్తున్న మీడియాపై కూడా దాడులకు తెగబడ్డారు. ఆర్‌ టీవీ కెమెరామెన్‌తో పాటు పలువురు విలేకరులపై దాడికి ప్రయత్నించారు.

👉టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు మేరకు ఒక కేసు.. సుమోటోగా మరో కేసు నమోదు చేసి, రాత్రి 10.35 గంటలకు అరెస్టు చేశారు. ఆయనపై 126(2), 132, 196(1), 352, 351(2), 292 రెడ్‌ విత్‌ 3(5) బీఎన్‌ఎస్‌  సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయన్ను పోలీసులు తీసుకువెళ్లిన తర్వాత తెలుగుదేశం గూండాలు పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి పూనుకున్నారు.

👉కార్యాలయానికి నిప్పు పెట్టారు. పార్టీ కార్యాలయంలో చిక్కుకుపోయిన ఇతర నేతలు, మీడియా ప్రతినిధులు అతి కష్టంగా బయటకు వచ్చారు. అంబటి ఇంటి వద్ద సాగిన దారుణకాండ యావత్తు ప్రతి నిమిషాన్ని మంత్రి లోకేశ్‌ పర్యవేక్షించారని టీడీపీ శ్రేణులు బహిరంగంగా చెప్పుకోవడం గమనార్హం. 

కర్రలు, రాడ్లతో దాడి చేస్తూ బీభత్సం
అప్పటికే పథకం ప్రకారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, అమె భర్త గల్లా రామచంద్రరావు నేతృత్వంలో వందలాది మంది కర్రలు, ఇనుప రాడ్లు పట్టుకుని అంబటి రాంబాబు ఇంటి చుట్టూ చేరుకున్నారు. అప్పటికే పోలీసులు భారీ సంఖ్యలో మోహరించినా, టీడీపీ గూండాలు నేరుగా అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయం మీద విరుచుకుపడ్డారు. 

👉కార్యాలయంలో ఉన్న అంబటి రాంబాబుపై తెలుగుదేశం నేతలు అబ్బూరి మల్లి, కనపర్తి శ్రీనివాసరావు, రాయపాటి అమృతరావు, నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు, మహిళా నాయకులు దాడికి దిగారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఫర్నీచర్‌ పగలగొట్టారు. ఇంటిపై దాడి చేసి తలుపులు, కిటికీలు పగులగొట్టారు.

👉అంబటి రాంబాబు భార్య, కూతురు ప్రాణభయంతో ఇంట్లోని ఓ గదిలో దాక్కున్నారు. టీడీపీ గూండాలు ఇంటి ఆవరణ, పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న వాహనాలను రాళ్లు, కర్రలతో ధ్వంసం చేశారు. కోడిగుడ్లు విసిరారు. ఈ విధ్వంసకాండ అంతా పూర్తవుతుండగా అప్పుడు పోలీసులు టీడీపీ గూండాలను బతిమాలి బయటకు పంపారు. అప్పటి వరకూ అక్కడే ఉండి ఎవరిని అడ్డుకోకుండా చోద్యం చూశారు. 

👉ఈ దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. అంబటి రాంబాబు బయటకు రావాలని సవాలు విసిరారు. మీ ఇంటి కుక్క భయపడదేమో, మీరు భయపడేలా చేస్తామంటూ దాడులను ప్రోత్సహించారు. అంబటి దిష్టి బొమ్మను దహనం చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement